Breaking News

కరీంనగర్‌: అతివేగంతో పాటు, కర్ణకఠోర శబ్ధాలతో దూసుకెళ్తున్న ద్విచక్రవాహనాలకు పోలీసులు కళ్లెం వేశారు. పరిమితికి మించిన వేగంతో ప్రయాణిస్తూ తోటి వాహనదారులను భయబ్రాంతులకు గురిచేయడంతో పాటు విపరీతమైన శబ్ధ కాలుష్యానికి కారణమవుతున్న 16 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకొని వాహనదారులకు జరిమానాలు విధించారు. * * బెల‍్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల‍్లంపల్లిలోని సివిల్‌ కోర్టు ముఖద్వారం ఎదుట హోంగార్డు నారాయణ మంగళవారం ఉదయం ఆత‍్మహత్యాయత‍్నం చేశాడు. ఏడు సంవత‍్సరాలుగా హోంగార్డులకు పోస్టింగ్‌ ఇవ‍్వలేదని, విధుల‍్లోకి తీసుకోకుండా పోలీసు విభాగం అన్యాయం చేస్తోందని ఆవేదన వ‍్యక‍్తం చేస్తూ తెలంగాణ హోంగార్డుల సంఘం అధ‍్యక్షుడు నారాయణ మంగళవారం ఆత‍్మహత్యాయత‍్నం చేశాడు. * * చర‍్ల: ఖమ‍్మం జిల్లా చర‍్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు వద్ద మంగళవారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు ఆ ఇద్దరిని అరెస్టుచేశారు. తనిఖీ చేయగా వారి వద్ద మెడికల్ కిట్లు ఉన్నట్లు గుర్తించారు. వారు మావోయిస్టు మిలీషియా సభ‍్యులని తేలడంతో వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కోర్టులో హాజరుపరిచేందుకు తరలించామని చర్ల పోలీసులు వెల్లడించారు. * * వరంగల్‌: వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని నర్సంపేటలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తె దుర‍్మరణం చెందారు. తండ్రి, కుమార్తె వెళుతున‍్న ద్విచక్రవాహనాన్ని వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో వారు అక‍్కడికక‍్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు సేకరిస‍్తున్నారు * * కురవి: తేనెటీగల దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లిలో సోమవారం వెలుగుచూసింది. స్థానిక మామిడి తోటలో కాయలు కోయడానికి వచ్చిన కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామానికి చెందిన వారిగా తెలుస్తోంది. * * కరీంనగర్‌: జిల్లా కేంద్రంలోని బుట్టిరాజారాం కాలనీలో శనివారం వేకువజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలో ప్రతీ ఇంటిని తనిఖీ చేశారు. 31 బైక్‌లు, 8 ఆటోలు, 9 సిలిండర్లు, 3 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా పలువురు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. * * హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం గత నెల 22న నిర్వహించిన పాలిసెట్ - 2017 ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని కాలేజీ, రూసా కార్యాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వాణిప్రసాద్ పాల్గొన్నారు. ఏప్రిల్ 22న జరిగిన ప‌రీక్ష‌కు 1,28,118 మంది విద్యార్థులు హాజరయ్యారు. * * నిజామాబాద్‌ జిల్లా వర్నిలో వింత చోరీ వెలుగుచూసింది. పట్టణ శివారులోని భారత్‌ గ్యాస్‌ గోడౌన్‌లో దొంగలుపడి సిలిండర్లు ఎత్తుకెళ్లారు. నిన్న సాయంత్రమే గోడౌన్‌కు వచ్చిన 250 గ్యాస్‌ సిలిండర్లలో శుక్రవారం రాత్రి 204 సిలిండర్లు చోరీకి గురయ్యాయి. శనివారం ఉదయం గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ శేఖర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. * * హైదరాబాద్‌: మిర్చి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కపట ప్రేమను చూపుతున్నాయని లోక్‌సత్తా పార్టీ తెలంగాణ ధ్వజ మెత్తింది. కేంద్రం తాజాగా ప్రకటించిన రూ.5వేలు ఏ మూలకూ సరిపోవని, అదనంగా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మరో రూ.5వేలు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈమేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జన్నేపల్లి శ్రీనివాసరెడ్డి గురువారం ప్రకటన విడుదల చేశారు. * * కడెం: నిర్మల్‌ జిల్లా కడెం మండల కేంద్రంలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, అక్రమంగా నిల్వ ఉంచిన రూ.20 వేల విలువ గల గుట్కా, మద్యం ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నల్లబెల్లం, దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అజార్, రమేష్ అనే ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. * * నారాయణపూర్‌: యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్‌ మండల కేంద్రంలో మావోయిస్టు పోస్టుర్లు కలకలం రేపుతున్నాయి. మండల కేంద్రంతో పాటు వావిళ్లపల్లి, జనాగం గ్రామాల్లో పోస్టర్లు వెలవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కేసీఆర్‌ నియంత పాలన నశించాలి, లంచగొండి ఎమ్మెల్యే ఖబడ్దార్‌ అంటూ పోస్లర్లపై రాసి ఉంది. * * రంగారెడ్డి: బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాయల్‌ కాలనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్‌ వేస్టేజ్‌ గోదాములో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. * * అమెరికాలో ఓ చిన్న విమానం నాటకీయరీతిలో నడిరోడ్డుపై కూలిపోయింది. వాషింగ్టన్‌ లోని ముకిల్‌టియోలో మంగళవారం ఓ చిన్న విమానం రద్దీగా ఉన్న నడిరోడ్డుపై కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు ఎగిశాయి. అదృష్టం బాగుండి ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. విమానం ఇంజన్‌లో సాంకేతికలోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్‌ సురక్షితంగా తప్పించుకున్నాడు. * * యాదగిరిగుట్ట మండలం బాహుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈస్ట్‌ మారెడ్‌పల్లికి చెందిన వల్లపు ఎల్లయ్య బైక్‌పై వరంగల్‌ వైపు వెళ్తున్నారు. బాహుపేట వద్దకు రాగానే ఎల్లయ్య వాహనాన్ని గుర్తు తెలియని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో పుల్లయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ రెండు ప్రమాదాలు జరిగిన ప్రదేశాలను యాదగిరిగుట్ట పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ–2 నాగిరెడ్డి తెలిపారు. * * టేకులపల్లి: మహిళా సర్పంచ్ కుమారుడు ఓ విద్యార్థినిని ప్రేమ పేరుతో నమ్మించి, వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తే ముఖం చాటేస్తున్న ప్రియుడి ఇంటి ముందు బాధితురాలు ఆందోళనకు దిగింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడులో బుధవారం వెలుగుచూసింది. * * హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సాయంత్రం 4 గంటలకు పదోతరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 14 నుంచి 30 వరకు ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 5.35 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తులు చేసుకోగా దాదాపు ఐదు లక్షల మంది హాజరయ్యారు. ఈ నెల 5న ఫలితాలు విడుదల చేయాలనుకున్నా రెండు రోజుల ముందుగానే ఫలితాలు వెల్లడిస్తున్నారు. * * హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని శ్రీకర్‌ ఆస్పత్రిలో సోమవారం అర్థరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రోగులు, ఆస్పత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలార్పడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదం సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదని పలువురు వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని అధికారులు వేరువేరు ఆస్పత్రులకు తరలించారు. * * కరీంనగర్‌: అదిలాబాద్‌ వన్‌టౌన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సీఐ, ఎస్సై, ఏఎస్సైలను సస్పెండ్‌ చేస్తూ.. కరీంనగర్‌ రేంజ్‌ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్‌ తగాదాలో తలదూర్చారనే సమాచారంతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు జిల్లా ఎస్పీ ఎం. శ్రీనివాస్‌ నివేదిక ఆధారంగా సీఐ సత్యనారాయణ, ఎస్సై బి. అనిల్, ఏఎస్సై జి. అప్పారావులను సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం కరీంనగర్‌ రేంజ్‌ డీఐజీ సి. రవివర్మ ఆదేశాలు జారీచేశారు. * * కోదాడ: ఐపీఎల్‌ -10 సందర్భంగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ. 25 వేల నగదుతో పాటు ఓ బైక్‌, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. * * తిప్పర్తి(నల్లగొండ): వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో.. బస్సులో ఉన్న 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. * * బోధన్‌ మండలం తెగడపల్లి గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి(12) ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. దీంతో గట్టిగ కేకలు వేస్తూ బాలిక అక్కడే కుప్పకూలిపోయింది. ఇది గుర్తించిన చుట్టుపక్కల వారు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ నుంచి హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం బాలిక మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. * * కామేపల్లి: ప్రమాదవశాత్తు బావిలోపడి ఓ కానిస్టేబుల్‌ మృతిచెందిన సంఘటన ఖమ్మం జిల్లా కామేపల్లిలో జరిగింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో గుగులోతు రామకృష్ణ (39) కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గ్రామ శివారులోని వ్యవసాయ బావి వైపు మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందాడు. ఈయన స్వగ్రామం తల్లాడ. రెండున్నరేళ్లుగా కామేపల్లిలో పనిచేస్తున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. * * మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా సింగరేణి ఉపరితల బొగ్గుగని కేంద్రంలో మంగళవారం మధ్యాహ‍్నం బంకర్‌ కూలి ఇద్దరు కార్మికులు మృతిచెందారు. లారీలో బొగ్గు నింపుతుండగా.. అక్కడే పనులు చేస్తున్న పవన్‌ (31), రఘుపాల్‌రెడ్డి(32) అనే కార్మికులపై బంకర్‌ కూలింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తోటి కార్మికులు వెంటనే స్పందించి మృతదేహాలను వెలికి తీశారు. * * సూర్యాపేట: ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సూర్యాపేట మండలం రాజానాయక్‌తండా శివారులో శనివారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో వారిని అంబులెన్స్‌ల సాయంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. * * భువనగిరి: వేగంగా వెళ్తున్న కారులో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్‌ వాహనాన్ని వదిలి బయటకు దూకేశాడు. ఈ ప్రమాదంలో సాంట్రో కారు పూర్తిగా కాలిబూడిదైంది. ఈ సంఘటన యాదాద్రి జిల్లా భువనగిరి శివారులోని నల్లగొండ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడానికి యత్నించే లోపే కారు పూర్తిగా కాలిపోయింది. * * మహబూబ్‌నగర్‌: జిల్లాలోని దేవరకద్ర మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు చేపట్టిన దాడుల్లో పెద్దఎత్తున రేషన్‌ బియ్యం పట్టుబడ్డాయి. లబ్దిదారులకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయనే సమచారంతో రగంలోకి దిగిన అధికారులు మండల కేంద్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న 620 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఓ లారీ, బొలెరో వాహానాలను సీజ్‌ చేశారు. * * పెద్దపల్లి: ఇద్దరు భార్యలు కలిసి భర్తను హతమార్చిన సంఘటన జిల్లాలోని కమాన్‌పూర్‌లో గురువారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగి తిరుమలయ్య(65)ను ఆయన ఇద్దరు భార్యలు గొడ్డలితో నరికి చంపారు. తిరుమలయ్య అతని ఇద్దరు భార్యలు మదునమ్మ, ఐలమ్మలను గత కొన్నేళ్లుగా తీవ్రంగా హింసిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. * * హైదరాబాద్: ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓంకార్ నగర్‌లోని ఓ సెల్‌ఫోన్‌ దుకాణంలో గురువారం రాత్రి దొంగతనం జరిగింది. స్థానిక శ్రీనివాస్ మొబైల్ షాప్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి క్యాష్‌ బాక్స్‌లో ఉన్న రూ.50 వేల నగదుతోపాటు లక్ష రూపాయల విలువ చేసే ఫోన్లు ఎత్తుకెళ్లారు. దుకాణంలో అమర్చిన సీసీ కెమెరాలో చోరీ చిత్రాలు నమోదయ్యాయి. బాధితుడు ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. * * యాదాద్రి: పక్కింటి వారు తిట్టారనే మనస్థాపంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన యాదాద్రి జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో మంగళవారం జరిగింది. స్థానికంగా ఉండే లక్ష్మమ్మ అనే మహిళకు పక్కింటి వారికి విబేధాలు వచ్చాయి. దీంతో పక్కింటి వారు తిట్టడంతో ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. * * నిజామాబాద్ : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి యాసంగి పంటకు నీటిని విడుదల చేశారు. ఇరిగేషన్ అధికారులు గురువారం ఉదయం నీటిని విడుదల చేశారు. కాకతీయ కెనాల్ ద్వారా 6 వేల క్యూసెక్కులు, లక్ష్మీ కెనాల్ ద్వారా 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీటి విడుదలతో రైతులు నారుమడులు పోసేందుకు సిద్ధమవుతున్నారు. * * హుజూర్‌నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పోలీసులు బైక్ దొంగల ముఠాను పట్టుకున్నారు. గురువారం ఉదయం సీఐ వి. నర్సింహారెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు చెందిన 8 మంది సభ్యుల ముఠా గత కొంతకాలంగా ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతోంది. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు గురువారం ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 22 బైక్‌లను స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు పంపారు. * * భువనగిరి: యాదాద్రి జిల్లా భువనగిరిలోని బ్యాంకుల వద్ద పింఛనుదారులు నిరసన తెలిపారు. స్థానిక ఆంధ్రా బ్యాంకు వద్ద ప్రభుత్వ పింఛను దారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు రూ. 10 వేలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయగా రూ. 4 వేలే ఇస్తున్నారని నిరసన తెలిపారు. గంటలకొద్దీ క్యూలైన్లలో తాము నిలబడలేమని, ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. * * వరంగల్: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 226 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి గురువారం కోర్టుకు హాజరు పరిచారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిలో 12 మందికి 2 రోజుల జైలుశిక్ష విధిస్తూ.. న్యాయస్థానం తీర్పు నిచ్చింది. దీంతో పాటు మద్యం రాయుళ్లకు రూ. 3.52 లక్షల జరిమానాలు విధించింది. * * మిర్యాలగూడ: గ్యాంగ్ స్టర్ నయీం కేసుకు సంబంధించి 25 మంది నిందితులను పోలీసులు ఈరోజు మిర్యాలగూడ కోర్టు ఎదుట హాజరుపరిచారు. చర్లపల్లి జైల్లో ఉన్న నిందితులను పలు కేసుల్లో విచారణ నిమిత్తం ఈ రోజు మిర్యాలగూడ కోర్టుకు తీసుకొచ్చారు. వారిలో నయీం భార్య, సోదరి, అత్త ఉన్నారు. విచారణ అనంతరం తిరిగి వారిని చర్లపల్లికి తరలించారు. * * కాఠ్మాండు: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరానికి దగ్గర్లోని ఒక హిమనీనద సరస్సులోని నీటిని గణనీయంగా తగ్గించామని నేపాల్‌ ప్రకటించింది. వాతావరణంలో మార్పుల వల్ల హిమనీనదాలు వేగంగా కరుగుతున్నాయి. ఆ నీరంతా కట్టలు తెంచుకుని కిందకు ప్రవహిస్తే మహావిపత్తు సంభవిస్తుంది. * * మేడ్చెల్‌: మేడ్చల్ జిల్లా కీసర మండలం కుందన్‌పల్లి చౌరస్తాలో మంగళవారం ఉదయం ఒక లారీ బీభత్సం సష్టించింది. వేగంగా వెళుతున్న లారీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడమే కాక ఎదురుగా వెళుతున్న స్కూటర్‌ను డీకొని పక్కనున్న ఎన్‌వీఆర్‌ పెట్రోల్‌ బంక్‌లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో స్కూటర్‌పై వెళుతున్న యూనస్, ఖాజా అనే యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వారిని 108లో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. * * నిజామాబాద్‌: బోధన్‌లోని నిజాం దక్కన్‌ సుగర్స్‌ కంపెనీ కార్మికులు, అఖిలపక్షం నేతలు మంగళవారం బోధన్‌ బంద్‌ నిర్వహిస్తున్నారు. దక్కన్‌ సుగర్స్‌ లే ఆఫ్‌ ఎత్తివేయాలని, కంపెనీని పునరుద్ధరించాలని కోరుతూ కంపెనీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ బంద్‌ చేపట్టారు. బంద్‌లో అన్ని కార్మిక సంఘాల వారు, కంపెనీ కార్మికులు, టీడీపీ, సీపీఐ, సీపీఎం తదితర పక్షాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. * * శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం తప్పింది. ఫ్లయిట్‌లో పంపించేందుకు ఓ ఏజెంట్ కార్గో ఏరియాకు తీసుకువచ్చిన కెమికల్స్ బాక్సు నుంచి పొగలు వెలువడ్డాయి. గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. * * జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో శుక్రవారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీస్ కమీషనర్ కమల్‌హాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో 100 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. అనుమానం ఉన్న ప్రతి ఇంటినీ జల్లెడ పట్టారు. సరైన పత్రాలు లేని 8 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. * * చేర్యాల(సిద్ధిపేట జిల్లా): చేర్యాల సమీపంలో దూల్మిట్ట క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో మద్దూరు సాక్షి విలేకరి సత్యం గౌడ్(28) మృతిచెందాడు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న సత్యంను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. * * హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖ పరిధిలో పోలీస్ కానిస్టేబుల్ (సివిల్/ఏఆర్/ఎస్‌ఏఆర్/టీఎస్‌ఎస్‌పీ), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్)లో కానిస్టేబుల్ (పురుష), అగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్ పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రం బుక్‌లెట్లు, ప్రాథమిక కీను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) మంగళవారం విడుదల చేసింది. www.tslprb.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని బోర్డు చైర్మన్ డాక్టర్ జె.పూర్ణచంద్రరావు తెలిపారు. * * నారాయణపూర్: యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలకేంద్రంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు ఇళ్లు, ఒక నగల దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనాస్థలానికి క్లూస్ టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. * * కారేపల్లి: కల్తీ మద్యం తయారు చేస్తున్న వారిని తీసుకెళ్తున్న ఆటో బోల్తా పడటంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఆ సమయంలో ఆటోను నడుపుతున్నది పోలీస్ కానిస్టేబుల్ కావటం గమనార్హం. వివరాలివీ.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పోలీసులు సోమవారం ఉదయం రేలకాయలపల్లి జైత్రాం తండా, జీత్యా తండాలపై దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా కల్తీ మద్యం తయారు చేస్తున్నారనే ఆరోపణలతో ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. * * యదాద్రి: భువనగిరిలో శనివారం తెల్లవారుజామున లారీ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌ చౌరస్తాలోని బస్టాండ్‌ వద్ద జనంపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీలో శనివారం తెల్లవారుజామున నుంచి పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సౌత్‌జోన్‌ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో కామటిపుర, బార్కాస్‌, వట్టేపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 21 మంది రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు, నాలుగు ఆయుధాలు, 65 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. * * హైదరాబాద్‌: నగరంలోని ఇందిరాపార్క్‌ వద్ద రేపు (ఆదివారం) ఉదయం 10 గంటలకు రైతు దీక్ష చేపట్టనున్నారు. ఈ రైతు దీక్షలో తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌, రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొననున్నారు. తెలంగాణ ఏర్పాడ్డాక తొలిసారి కోదండరామ్‌ దీక్షకు దిగుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం రైతు సమస్యలు పట్టించుకోవడం లేదని కోదండరామ్‌ దీక్షకు దిగుతున్నట్టు సమాచారం. * * వాజేడు: స్కూల్ పిల్లలను తరలిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వాజేడు మండలం జగన్నాథపురంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామం నుంచి వాజేడు పాఠశాలకు వెళ్తున్న స్కూల్ పిల్లల ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. * * పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎన్టీపీసీ(నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్) 7 యూనిట్‌ లో ఉత్పత్తి నిలిచి పోనుంది. ఈ అంశాన్ని అధికారులు తెలిపారు. ఏడో యూనిట్ వార్షిక మరమ్మత్తుల కోసం శుక్రవారం నుంచి ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీని వల్ల 500ల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచి పోనుంది. * * మునగాల(నల్గొండ): మునగాల మండలం ఇంద్రానగర్ వద్ద జాతీయ రహదారిపై గురువారం ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బీభ్సతం సృష్టించింది. వడ్ల లోడుతో ముందుగా సూర్యాపేట వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను గౌతమి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ మీద ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * కరీంనగర్ జిల్లా: రేణికుంట బ్రిడ్జి సమీపంలో రాజీవ్ రహదారిపై బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఓ బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో బైక్‌లో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనతో ఆ మార్గంలో ఒక కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * మిర్యాలగూడ (నల్గొండ జిల్లా): మిర్యాలగూడ పట్టణంలోని ఓ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణానికి చెందిన మారం శ్రీనివాస్(45) అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. భార్యాబిడ్డలతో కలిసి హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. రియల్‌ ఎస్టేట్‌లో నష్టాలు రావడంతో అప్పులపాలై బలవన్మరణానికి పాల్పడ్డాడు. * * శాన్ ఫ్రాన్సిస్కో : అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేగింది. శాన్ ఫ్రాన్సిస్కోలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు విద్యార్థులు గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా పలువురు విద్యార్థులు కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈక్విటీ జూన్ జోర్డాన్ స్కూల్ సిటీ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీ హైస్కూల్ బయట ఈ కాల్పులు జరిగాయి. * * గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజేష్(14) అనే విద్యార్థి మృతి చెందాడు. స్కూలుకు వెళ్లటానికి రోడ్డు పక్కన నిల్చున్న సమయంలో అటుగా వస్తున్న టాటా ఏస్ వాహనం అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలైన రాజేష్‌ను నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. మార్గమధ్యంలోనే ప్రాణాలొదిలాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. * * కరీంనగర్‌: హుజారాబాద్‌లో మంగళవారం తెల్లవారుజామున నుంచి పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరానగర్‌, బుడగ జంగాల కాలనీల్లో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ జరిపారు. కార్డెన్‌ సర్చ్‌లో భాగంగా సరైన పత్రాలు లేని వాహనాలను ఆపి తనిఖీలు చేపట్టారు. * * అబ్దుల్లాపూర్‌మెట్ : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాచారం గ్రామంలోని సాయిప్రియ కెమికల్ పరిశ్రమలో మంగళవారం ఓ బాయిలర్ పేలి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. మృతుడు బిహార్‌కు చెందిన శివ చాంద్‌బీన్(31)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. * * మరిపెడ(వరంగల్‌): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన వరంగల్‌ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్‌ సాయంతో ఆస్పత్రికి తరలించగా అందులో ఒకరి పరిస్థతి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. * * నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో ఆదివారం అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో ఒక లారీ కాలిపోయింది. ఆదిలాబాద్ వైపు నుంచి నిర్మల్ వెళ్తున్న నిమ్మకాయల లోడ్ లారీలో నేరడిగొండ వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.అవి వేగంగా లారీ అంతటా వ్యాపించటంతో అప్రమత్తమైన లారీ డ్రైవర్, క్లీనర్ కిందికి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు.అనంతరం లారీ అగ్నికి ఆహుతయింది. కారణాలు తెలియాల్సి ఉంది. లారీడ్రైవర్ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. * * చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సుమారు రెండు వారాలుగా ఆసుపత్రికే పరిమితమయ్యారు. ఆమె చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రి డాక్టర్లు ముఖ్యమంత్రి కోలుకుంటున్నారని.. మరికొంత కాలం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పాలన కుంటుపడకుండా తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయచర్యలపై ఏఐఏడీఎంకే నేతలు దృష్టి పెట్టినట్లు సమాచారం. * * హైదరాబాద్: నాంపల్లిలో అన్ని ఆధునిక హంగులతో పోలీస్స్టేషన్ నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నరసింహరెడ్డి తెలిపారు. శనివారం ఉదయం పోలీస్స్టేషన్ కొత్త భవనానికి నాయిని నర్సింహారెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతోపాటు నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి, ఇతర పోలీసులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. * * ఐక్యరాజ్యసమితి: కర్బన ఉద్గారాలను తగ్గించుకునే ఒప్పందంపై మెజారిటీ దేశాలు సంతకాలు చేయడంతో నవంబర్‌ 4 నుంచి ప్యారిస్‌ ఒప్పందం అమల్లోకి వస్తుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ బాన్‌ కీ మూన్‌ వెల్లడించారు. దీన్నోక చిరస్మరణీయ ఘటనగా అవర్ణించారు. * * హైదరాబాద్ : మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురిని మల్కాజిగిరి సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా కీసరకు చెందిన యు.బలరాం, కృష్ణ, నర్సింహ అనే వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బొమ్మ పిస్టళ్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. * * కథలాపూర్(కరీంనగర్) : ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు అక్కడే ఉన్న హుండీని ఎత్తుకుపోయారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం కలిగోట గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం అర్థరాత్రి సత్యనారాయణ స్వామి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు గర్భగుడిలో విలువైన వస్తువులు ఏమీ లేకపోవటంతో హుండీని పెకిలించుకు పోయారు. శుక్రవారం ఉదయం గమనించిన పూజారి గ్రామ పెద్దలకు సమాచారం అందించారు. ఈ మేరకు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. * * కౌడిపల్లి: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారం గేటు వద్ద రాస్తారోకో జరిగింది. సలబాత్తపూర్ పంచాయతీని కొత్తగా ఏర్పాటు చేస్తున్న చిలిప్‌చేడ్ మండలంలో కాకుండా కౌడిపల్లి మండలలోనే కొనసాగించాలని ఆ పంచాయతీ ప్రజలు డిమాండ్ చేశారు. సుమారు 30 నిమిషాల పాటు రాస్తారోకో జరగడంతో మెదక్-నర్సాపూర్ రహదారిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. * * సిద్ధిపేట(మెదక్ జిల్లా) : సిద్ధిపేట మండలకేంద్రం గణేశ్ నగర్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికంగా నివాసముంటున్న శ్రీశైలం, పదయ్య, నర్సింహులు అనే ముగ్గురి ళ్లలో చోరీకి పాల్పడ్డారు. మూడిళ్లలో కలిపి 2 తులాల బంగారం, రూ.10 వేల నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. * * కొణిజర్ల(ఖమ్మం జిల్లా) : కొణిజర్ల మండలకేంద్రంలోని ఎండీఓ ఆఫీసు వద్ద గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. అదే సమయంలో అటుగా వచ్చిన మరో లారీ వచ్చి ఈ రెండు లారీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురికి గాయాలయ్యాయి. ఇదేవిధంగా కొణిజర్ల పోలీస్‌స్టేషన్ సమీపంలో లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఖమ్మం తరలించారు. * * కొత్తకోట(మహబూబ్‌నగర్) : మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటలో ఓ మహిళ దారుణంగా హత్యకు గురైంది. మండల కేంద్రంలోని వడ్డెవాడ సమీపంలోని ముళ్ల పొదల్లో ఓ మహిళ(50) మృత దేహం పడి ఉండగా గురువారం ఉదయం స్థానికులు కనుగొన్నారు. ఎక్కడో చంపి ఇక్కడ పడేసి ఉంటారని భావిస్తున్నారు. ఆమె స్థానికురాలు కాదని చెబుతున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవాల్సి ఉంది. * * హైదరాబాద్ : ముగ్గురు యువకులు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన ఘటనలో గాయపడిన చిన్నారి సంజన బ్రెయిన్ డెడ్ కాలేదని కామినేని ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రసాదరావు వెల్లడించారు. అయితే ఆమె పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. బుధవారం హైదరాబాద్లో ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రసాదరావు విలేకర్లతో మాట్లాడుతూ... చిన్నారి సంజన పరిస్థితి విషమంగానే ఉందన్నారు. * * శంషాబాద్(రంగారెడ్డి) : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆరేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడింది. హైదరాబాద్ కొత్తపేటకు చెందిన అరవింద్‌రావు దంపతులు తమ కూతురు నవ్య(6)తో కలసి బంధువులకు వీడ్కోలు చెప్పేందుకు మంగళవారం రాత్రి ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో చిన్నారి నవ్య డిపార్చర్ రైలింగ్ పైనుంచి కిందపడి పోయింది. తలకు తీవ్ర గాయాలుకాగా చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. వెంటనే జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. * * కీసర(రంగారెడ్డి) : డంపింగ్ యార్డు కారణంగా చెరువు నీరు కలుషితం అవుతోందంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వివరాలివీ.. రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాల సమీపంలో జీహెచ్‌ఎంసీ డంపింగ్ యార్డు ఉంది. ఈ యార్డు నుంచి వెలువడే వ్యర్థ జలాలు పక్కనే ఉన్న చెరువులో కలుస్తున్నాయి. సాగు నీరు కలుషితమవుతోందంటూ కొన్ని రోజులుగా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ఇదే విషయమై ఒక్కటైన గ్రామస్తులు బుధవారం ఉదయం చెత్తను తీసుకువచ్చే జీహెచ్‌ఎంసీ వాహనాలను అడ్డుకున్నారు. * * హైదరాబాద్ : కూకట్‌పల్లి జేఎన్‌టీయూ పరిపాలన విభాగంలో భారీగా మార్పులు, చేర్పులు చేస్తూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారు. డెరైక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్‌గా ఉన్న ఈశ్వరప్రసాద్‌ను సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూ ప్రిన్సిపాల్‌గా నియమించారు. అడ్మిషన్స్ డెరైక్టర్‌గా మంజూర్ హుస్సేన్‌ను, ఎగ్జామినేషన్స్ కంట్రోలర్‌గా తార కల్యాణి, బిక్స్ డెరైక్టర్‌గా లక్ష్మణరావు, డీయూఎఫ్‌ఆర్‌గా చెన్నకేశవరెడ్డిని నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. * * బాల్కొండ(నిజామాబాద్ జిల్లా) : ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 2 లక్షల 4 వేల 939 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్ధ్యం 90.313 టీఎంసీలు కాగా ప్రస్తుతం 89.763 టీఎంసీల నీరు ఉంది. కాకతీయ కెనాల్‌కు 5 వేల క్యూసెక్కులు, సరస్వతీ కెనాల్‌ఖు 1000 క్యూసెక్కులు, లక్ష్మీ కెనాల్‌కు 300 క్యూసెక్కులు, ఎస్కేప్ రెగులేటర్‌కు 3 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. మొత్తం 74,939 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. * * కరీంనగర్ : ప్రమాదవశాత్తు మూడు ఎలుగు బంట్లు వ్యవసాయ బావిలో పడి మరణించాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం శ్రీరాములపేటలో సోమవారం చోటు చేసుకుంది. ఆ విషయాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించారు. దీంతో గ్రామస్తులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని... ఎలుగు బంట్లను బావిలో నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. * * హైదరాబాద్ : పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్న ఓ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. కుషాయిగూడ నాగార్జుననగర్ కాలనీకి చెందిన ఇందుభార్గవి(19), చాంద్ అలీ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారి వివాహానికి పెద్దలు అంగీకరించకపోవటంతో రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. అనంతరం తమకు ప్రాణాహాని ఉందని, బంధువుల నుంచి రక్షణ కల్పించాలంటూ మంగళవారం కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు. * * కెరామెరి(ఆదిలాబాద్ జిల్లా) : కెరామెరి మండలం కెలికే గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గౌరూభాయ్(60), బ్యీసన్(30) అనే తల్లీ కొడుకులు ప్రమాదవశాత్తూ తమ పొలంలో కరెంటు షాక్ తగిలి మృతిచెందారు. ఈ సంఘటన నిన్ననే జరిగినా ఆలస్యంగా బయటపడింది. తల్లీకొడుకు మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. * * హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు కనిపించటం కలకలం రేపింది. లక్నో వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడి లగేజిని తనిఖీ చేయగా మూడు బుల్లెట్లు బయటపడ్డాయి. దీంతో భద్రతా సిబ్బంది అతడిని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. * * మహబూబ్‌ నగర్: మహబూబ్‌ నగర్ జిల్లా మరికల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృత్యువాతపడ్డారు. శనివారం ఉదయం రెండు లారీలు వేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో రెండు లారీల డ్రైవర్లు క్యాబిన్‌లోనే ప్రాణాలు విడిచారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో రాయిచూర్ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని వాహనాలను పక్కకు తొలగించేందుకు యత్నిస్తున్నారు. క్షతగాత్రులను మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. * * ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బాసరలో వేంచేసి ఉన్న సరస్వతీ మాత సన్నిధిలో దసరా ఉత్సవాలు మొదలయ్యాయి. మొదటిరోజు శైలిపుత్రిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తోంది. శనివారం వేకువజాము నుంచి భక్తులు దర్శనం కోసం క్యూకట్టారు. భైంసాపట్టణానికి చెందిన వ్యాపారవేత్త జి.రమేష్ కుటుంబసభ్యులు అమ్మవారికి రెండు తులాల బంగారు గొలుసును సమర్పించుకున్నారు * * కరీంనగర్ : ఎగువ ప్రాంతాల నుంచి వరదతో కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు జలాశయం పూర్తిస్థాయిలో నిండింది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 920 అడుగులు కాగా.. ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం కొనసాగుతోంది. జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి 16,000 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో.. 8 గేట్లు ఎత్తి 16,000 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. కాకతీయ కాలువకు మరో 2, 000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. * * డిచ్‌పల్లి: వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టిన ఘటనలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టడంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జాం అయింది. * * కరీంనగర్ : లోయర్ మానేరు డ్యామ్‌కు వరద తగ్గుముఖం పట్టింది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 920 అడుగులు, నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా గురువారం ఉదయం ఎనిమిది గంటలకు 919.40 అడుగులు, 23.51 టీఏంసీల నీరు ఉంది. డ్యామ్‌కు ఇన్‌ఫ్లో 10,800 క్యూసెక్కులు ఉండగా.. కాకతీయ కెనాల్ ద్వారా 5,000 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. * * శంషాబాద్ : పిల్లర్ కోసం తీసిన గుంటలో పడి బాలుడు మృతిచెందిన సంఘటన శంషాబాద్ మిషన్‌కంపౌడ్ సమీపంలోని శీనయ్య వెంచర్‌లో గురువారం వెలుగుచూసింది. స్థానిక శీనయ్య వెంచర్‌లో కార్మికులుగా పనిచేస్తున్న హరీష్, యాదమ్మ దంపతుల ఆరేళ్ల కుమారుడు బాలు పిల్లర్ గుంటలో పడి మృతిచెందాడు. శ్రీనయ్య వెంచర్‌లో పిల్లర్‌ల కోసం గుంటలు తవ్వారు. అందలో వర్షపు నీరు చేరడంతో ప్రమాదవశాత్తు బాలుడు అందులో పడి మృతిచెందాడు. * * ధర్మసాగర్(వరంగల్) : వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ధర్మసాగర్ సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న కేశబోయిన దేవేందర్(34) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో రాత్రి ప్యాసింజర్‌ను దించి ఇంటికి తిరిగి వస్తుండగా.. ఆటో బోల్తా కొట్టడంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటాన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. * * పెద్దమందడి(మహబూబ్‌నగర్) : వేగంగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన ఘటనలో బస్సు డ్రైవర్, క్లీనర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా పెద్దమందడి మండలం మోజెర్ల స్టేజీ సమీపంలో 44వ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. * * హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లి మూసాపేటలో బుధవారం వేకువజామున దారుణం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు స్నేహితులను వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో బైక్ వెనుక కూర్చున్న హరికృష్ణ(28) అనే యువకుడు మృతిచెందాడు. స్నేహితుని మరణాన్ని జీర్ణించుకోలేని రమేష్(28) భరత్‌నగర్ రైలు పట్టాలపై ఆత్మహత్యచేసుకున్నారు. హరికృష్ణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాగా రమేష్ శ్రీశ్రీ హోలిస్టిక్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. * * హైదరాబాద్ : భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని నీటి ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తింది. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.30 అడుగులకు వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 200.658 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు బుధవారం వెల్లడించారు. * * నిజాంసాగర్(నిజామాబాద్ జిల్లా) : నిజామాబాద్ జిల్లాలోని నిజామ్‌సాగర్‌కు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి నిజాంసాగర్‌కు 1.16లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 19 గేట్లు ఎత్తివేసి 1.03 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. * * మెదక్ : మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం చిల్వర వద్ద మంగళవారం రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. * * చెన్నై: చెన్నైలో ఓలా క్యాబ్ డ్రైవర్ ఓ మహిళా డాక్టర్పై లైంగికదాడికి ప్రయత్నించాడు. మరో ఇద్దరితో కలసి ఆమెను బలవంతంగా కారులో తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కారు వెనుక వాహనంలో వెళ్తున్న ఓ వ్యక్తి డాక్టర్ అరుపులు విని చేజ్ చేసి స్థానికులతో కలసి ఆమెను రక్షించాడు. * * శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 200 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా(ఏఐ-559) విమానం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నిలిపేశారు. ఉదయం 6.40 వెళ్లాల్సిన విమానం ఇప్పటికీ బయలుదేరకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఇంత జరుగుతున్నా ఎయిర్ ఇండియా అధికారులు మాత్రం తమకేం బాద్యత లేనట్లు వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. * * ఖమ్మం : రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. దాదాపు అన్ని చెరువులు, కుంటల్లో నీరు ప్రమాదస్థాయికి చేరుకుంది. ఖమ్మం జిల్లా చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు బుధవారం ఉదయం ప్రాజెక్ట్ పదిగేట్లను ఎత్తివేసి... 23,730 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. * * కరీంనగర్ : ఎస్సారెస్సీ ప్రధాన కాలువకు గండిపడటంతో.. వందల ఎకరాల్లో పంట నీట మునిగింది. కరీంనగర్ జిల్లా మానాల సమీపంలో గల ఎస్సారెస్సీ ప్రధాన కాలువకు మంగళవారం రాత్రి భారీ గండి పడింది. దీంతో పెగడపల్లి, గొల్లపల్లి మండలాల పరిధిలోని చెరువులన్ని నిండిపోయాయి. సుద్దపల్లిలోని కొయ్యచెరువు, రాఘవపట్నంలోని మొగుళ్ల చెరువుకు గండి పడటంతో.. వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. * * హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాల్లో కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్న ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య విద్య సీట్లకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకూ వెబ్ ఆప్షన్ల నమోదుకు గడువు ఉంటుందని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ కరుణాకరరెడ్డి తెలిపారు. * * శంషాబాద్ : దుబాయ్ వెళుతున్న అహ్మద్ అనే వ్యక్తి నుంచి మంగళవారం ఉదయం భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహించగా అహ్మద్ వద్ద భారీగా విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. నిందితుని అదుపులోకి తీసుకుని విచారణచేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * హైదరాబాద్ : ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేసంలో ఆయన పాల్గొనున్నారు. ముఖ్యమంత్రి తోపాటు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కూడా ముఖ్యమంత్రి బృందంతో పర్యటించనున్నారు. * * హైదరాబాద్‌: నాంపల్లిలోని టీఎన్‌జీవో కార్యాలయంలో సోమవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీలో పనిచేస్తున్న సుమారు 700 మంది నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగులను తెలంగాణకు బదిలీ చేయాలంటూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పెట్రోల్‌ డబ్బాలతో టీఎన్‌జీవో కార్యాలయంలోకి ఉద్యోగులు వెళ్లడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. * * దుగ్గొండి(వరంగల్) : ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో.. బైక్‌పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. * * తిర్యాని: స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఆశ్రమ పాఠశాల విద్యార్థి వాగులో మునిగి మృతి చెందాడు. అదిలాబాద్ జిల్లా తిర్యాని మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న కె. లక్ష్మణ్‌రాహూల్(12) ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి సమీపంలోని వాగులో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. * * చొప్పదండి: కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలంలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. భూపాలపట్నంకు చెందిన మునిగాల అంజయ్య (48) అప్పులబాధతో గ్రామశివారులోని పశువుల కొట్టం వద్ద ఉరివేసుకొని బలవన్మరణం చెందాడు. స్థానిక రైతులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. గ్రామంలో 4.38 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా గత కొన్నేళ్లుగా వ్యవసాయంలో నష్టాలు రావడంతో రూ.5లక్షలకు పైగా అప్పులయ్యాయి. వాటిని తీర్చే మార్గం లేక మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. * * హైదరాబాద్ : తెలంగాణ విమోచన దినం నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో జాతీయ జెండా ఎగరేసేందుకు బీజేపీ ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి యత్నించారు. అందులోభాగంగా ఆయన వాహనంలో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే కిషన్రెడ్డి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు... కిషన్రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. * * మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తిని రేవెన్యూ డివిజన్ చేయాలంటూ కల్వకుర్తి MLA అయిన చల్లా వంశీచంద్ రెడ్డి చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి అరెస్ట్ చేసారు. * * చర్ల: ఖమ్మం జిల్లా తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉదృతి పెరిగింది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన 9 గేట్లను 2 అడుగుల మేర ఎత్తారు. 8400 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు నుంచి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 73.6 మీటర్లుగా ఉంది. * * నల్గొండ : నల్గొండ జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టులో నీటి మట్టం బుధవారం 47.59 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టులోకి 29,373 క్యూసెక్కుల నీరు వస్తుండగా..9,929 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు నుంచి అధికారులు బయటికి వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 21.30 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు. * * నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా దోమకొండలో ఓ బాలుడు ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ తగిలి మరణించాడు. వివరాలు ఇలా ఉన్నాయి... వివేక్ (16) అనే బాలుడు బుధవారం వేకువజామున ప్రమాదవశాత్తూ కరెంటు షాక్‌కు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని రుద్ర ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాద్దిసేపటికే మరణించాడు. * * నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్ర శివారులో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఇద్దరికి మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డారు. బస్సు ముందు భాగం మాత్రం దెబ్బతిన్నది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. * * యాలాల: రంగారెడ్డి జిల్లా యాలాల శివారులో ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ మండలం హుస్నాపూర్ గ్రామానికి చెందిన వెంకటయ్య, యోగి జీవనోపాధి కోసం వచ్చి రంగారెడ్డి జిల్లాలో స్థిరపడ్డారు. * * కరీంనగర్: కరీంనగర్ జైలు నుంచి ఇద్దరు దొంగలు పరారీ అయ్యారు. వీరి కోసం కరీంనగర్ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జైలు నుంచి పరారైన వారు మహారాష్ట్ర పార్సీ గ్యాంగ్కు చెందిన జితేందర్, యోగేశ్లుగా గుర్తించారు. * * హైదరాబాద్: పాతబస్తీ భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తలాబ్‌కట్ట, అమన్ నగర్ ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్‌నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన దృవపత్రాలు లేని 83 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. * * శంషాబాద్ (హైదరాబాద్‌): శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రంయలో తనిఖీలు నిర్వహిస్తున్న కస్టమ్స్ అధికారులు అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 320 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద అక్రమ బంగారం గుర్తించిన ఎయిర్‌పోర్ట్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. * * నార్కెట్‌పల్లి(నల్లగొండ): వేగంగా వెళ్తున్న కారు, లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి శివారులోని 65వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. * * ములుగు: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు నీటిగుంటలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ములుగు మండలం బండారుపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏడాదిన్నర చిన్నారి తల్లిదండ్రులు పనులు చూసుకుంటుండగా.. చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందు ఉన్న నీటిగుంటలో పడి మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. * * కోరుట్ల: మోటర్ పెట్టడానికి వ్యవసాయ బావి దగ్గరకు వెళ్లిన రైతు ప్రమాదవశాత్తు విద్యుధ్ఘాతానికి గురై మృతి చెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాంరెడ్డి(45) ఈ రోజు ఉదయం మోటర్ ఆన్ చేయడానికి వెళ్లాడు. అయితే షార్ట్ సర్క్యూట్ కావడంతో కరెంట్ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. * * పంజగుట్ట: మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ నిమ్స్‌ ఆసుపత్రి ఓపీలో రెప్పపాటులో రూ. 40 వేలు చోరీ చేసింది. అక్కడే విధుల్లో ఉన్న ఓ మహిళా గార్డు ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం ... నాంపల్లికి చెందిన గౌసియా బేగం (32) బుధవారం మధ్యాహ్నం నిమ్స్‌ ఆసుపత్రి ఓపీ వద్దకు వచ్చింది. * * మహేశ్వరం: వేగంగా వెళ్తున్న లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టిన ఘటనలో క్లీనర్ మృతిచెందగా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం రావిర్యాల ఔటర్ రింగ్‌ రోడ్డుపై గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పెద్ద అంబర్‌పేట్ నుంచి వస్తున్న లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టింది. * * తాండూరు(రంగారెడ్డి): కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ఎం. మాణిక్‌రావు(86) నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాణిక్‌రావును కుటుంబ సభ్యులు నిమ్స్ ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందారు. * * దమ్మపేట: దుక్కి దున్నుతున్న ట్రాక్టర్‌పై విద్యుత్ స్తంభం విరిగిపడటంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లిలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లకావత్ చిట్టయ్య(35), ధారావత్ మహేష్(22)లు ట్రాక్టర్ సాయంతో దుక్కిదున్నతున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం విరిగిపడింది. దీంతో ట్రాక్టర్ పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. * * హైదరాబాద్: జిల్లాల పునర్విభజన విషయంలో అధికార టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను కలసి తమ అభ్యంతరాలను తెలిపారు. మంగళవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిలు సచివాలయంలో సీఎస్‌ను కలసి వినతి పత్రం అందజేశారు. * * హైదరాబాద్ : దసరా నుంచి కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు అన్నీ ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. జిల్లా కలెక్టర్లతో ఆయన ఈ విషయమై సమావేశమయ్యారు. కొత్త జిల్లాల్లో పనిభారాన్ని బట్టి పరిపాలనా విభాగాలు ఉండాలని తెలిపారు. అధికారుల సర్దుబాట్లు, కొత్త ఉద్యోగుల నియామకాలు జరగాలని సూచించారు. * * సంగారెడ్డి: మెదక్ జిల్లా పటాన్‌చెరు ఇస్నాపూర్ వద్ద సోమవారం అర్థరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. వేగంగా వచ్చిన ట్యాంకర్ లారీ ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో బైక్‌పై వెళుతున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. * * మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సివిల్ జడ్జి నాగరాజు ఇంట్లో దొంగలు పడి బీభత్పం సృష్టించారు. జడ్జి కుటుంబసభ్యులు ఊరు వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగింది. ఇరుగుపొరుగువారు ఇచ్చిన సమాచారం మేరకు మిర్యాలగూడ పోలీసులు క్లూస్ టీమ్‌తో చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. జడ్జికి సమాచారం ఇచ్చారు. * * నల్గొండ : భువనగిరిలో గ్యాంగ్స్టర్ నయీం అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై స్థానిక ఆర్డీవో శనివారం విచారణ జరపనున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 1700 మంది బాధితులు ఇప్పటికే ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. నల్గొండ జిల్లా బొమ్మాయిపల్లిలోని లక్ష్మీనరసింహ వెంచర్లో 1700 మందికి చెందిన ప్లాట్లను నయీం తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. * * హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-2 రాత పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2015 డిసెంబర్ 30న 439 పోస్టుల భర్తీకి జారీ అయిన నోటిఫికేషన్ కింద ఇప్పటికే 5,64,431 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, మరో 593 పోస్టుల భర్తీకి ప్రస్తుత అనుబంధ నోటిఫికేషన్ కింద మరో లక్షన్నర మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. * * హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య మరో వివాదం తలెత్తింది. సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న 21 మంది తెలంగాణ ఇంజినీర్లు తమను ఏపీ జెన్ కో అధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమపై జెన్ కో అధికారులు పరిమితికి మించిన పనిభారం మోపుతున్నారని పేర్కొటూ.. మూడు రోజులుగా తెలంగాణ ఇంజనీర్లు విధులకు హాజరవడం మానేశారు. * * వరంగల్ ఎంజీఎం: వరంగల్ జిల్లా కేంద్రంలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. స్థానిక లేబర్ కాలనీకి చెందిన సంధ్య అనే మహిళకు మొదటికాన్పులో ముగ్గురు ఆడ శిశువులు పుట్టారు. ఈ సంఘటన వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో శనివారం చోటుచేసుకుంది. శనివారం ఉదయం 8 గంటల సమయంలో ఆసుపత్రి వైద్యులు మహిళకు సర్జరీ చేసి ముగ్గురు శిశువులను బయటకు తీశారు. ముగ్గురూ ఆరోగ్యంగా ఉన్నారు. * * హైదరాబాద్: ఇటీవల పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన గ్యాంగ్‌స్టర్ నయీం ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. శేషన్న ప్రధాన అనుచరుడు సోమన్నఇచ్చిన సమాచారం మేరకు నగరంలోని కుషాయిగూడలో సిట్ అధికారులు గురువారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నయీం అనుచరులు శ్రీనివాస్, లక్ష్మణ్‌లను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని తమ కార్యాలయానికి తరలించారు. నయీంకు సంబంధించిన మరింత అదనపు సమాచారం కోసం సిట్ అధికారులు వారిని విచారిస్తున్నారు. * * కరీంనగర్: నేడు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె కరీంనగర్ జిల్లాలో సంపూర్ణంగా కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాలయాలు సంపూర్ణంగా బంద్ పాటిస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జిల్లాలో 11 డిపోలలో మొత్తం 980 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. * * నల్లగొండ: దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నేపథ్యంలో యాదగిరిగుట్టలో కార్మిక సంఘాలు సమ్మెలో పాల్పంచుకున్నాయి. ఆర్టీసీ కార్మకులు కూడా ఈ సమ్మెలో పాల్గొనడంతో.. యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోకు చెందిన 105 బస్సులు డిపోలోపలే ఉండిపోయాయి. దీంతో యాదగిరిగుట్టకు వచ్చే భక్తులు, ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ వాహనదారులు తమకు ఇష్టం వచ్చిన రీతిలో ప్రయాణికుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. * * యాదగిరిగుట్ట : నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని సాయిబాబా మందిరంలో వినాయకుడి రూపంలో అల్లం దర్శనమివ్వడంతో.. స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలకు ముందు ఇలా జరగడం శుభ పరిణామమని భక్తులు భావిస్తున్నారు. స్థానిక సాయి ఆలయంలో అన్నదానం కోసం కొనుగోలు చేసిన అల్లంలో పార్వతి పుత్రుడి ప్రతిమ రూపంలో ఉన్న అల్లం లభించిందని ఆలయ సిబ్బంది తెలిపారు. ఈ వార్త తెలిసిన ప్రజులు పెద్ద ఎత్తున అల్లం వినాయకుడిని దర్శించుకోవడానికి తరలి వస్తున్నారు. * * నల్లగొండ: నల్లగొండ జిల్లా దామరచర్లలో దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు గురువారం రట్టు చేశారు. అందుకు సంబంధించి నలుగురు వ్యక్తులకు పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక కిరాణా దుకాణంలో నకిలీ నోట్లు మారుస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని... తమదైన శైలిలో విచారించారు. * * హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురంలో సుష్మా థియేటర్ వద్ద బ్లాక్లో టికెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 50 సినిమా టికెట్లతోపాటు రూ. 2 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీసుస్టేషన్కు తరలించారు. * * హైదరాబాద్‌ జిల్లాలో 49,903 పింఛన్లకు కోత పడనుంది. ప్రభుత్వం చేపట్టిన లెఫ్‌ ఎవిడెన్స్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ బుధవారంతో ముగియడం నిజమైన పింఛన్‌దారుల లెక్కతేల నుంది. 36,512మంది వెరిఫికేషన్‌ చేయించుకోకపోగా, వెరిఫికేషన్‌ ప్రక్రియలో పాల్గొన్నా వేలిముద్రలు సరిపోలకపోవడం, ఆధార్‌తో లింకు కలువని 11,392 మందికి పింఛన్లు నిలిచిపోనున్నాయి. ఆధార్‌ లింకు మ్యాచ్‌ కాని వా రు మళ్లీ కొత్తగా ఆధార్‌ నమోదు చేసుకోవాల్సి ఉంది. * * మెదక్ : మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ వద్ద గురువారం వ్యాన్ను స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి... వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. * * ఖమ్మం: జిల్లాలో భారీగా ఎస్సైలు బదిలీ అయ్యారు. జిల్లాలోని దాదాపు 58 మంది ఎస్సైలకు స్థానచలనం కల్పిస్తూ జిల్లా ఎస్పీ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఎస్సైలుగా విధులు నిర్వహిస్తున్నవారితోపాటు... కొత్తగా ఎస్సై ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి కూడా ఈ బదిలీల్లో పోస్టింగ్ ఇస్తున్నట్లు ఎస్పీ ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. * * హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన బాట చేపట్టాయి. అందులోభాగంగా గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు కళాశాలల బంద్కు సదరు యాజమాన్యం పిలుపు నిచ్చింది. * * లాస్‌ఏంజిలెస్: అంగారక గ్రహం ఉపరితలంపై ఉన్న పరిస్థితులను భూభాగంపై సృష్టించి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా జరిపిన అరుదైన ప్రయోగం విజయవంతంగా ముగిసింది. ఈ మేరకు నాసా అమెరికాలోని హవాయి రాష్ట్రంలో అంగారక గ్రహం పరిస్థితుల్లో మానవుడి మనుగడ సాధ్యమా అన్న అంశంపై పరిశోధన నిర్వహించింది. ఆరుగురి బృందంతో ఏడాది క్రితం ప్రారంభించిన ఈ ప్రయోగం సోమవారం ముగిసింది. * * నేడు ఐసెట్ ప్రవేశాలకు కొనసాగుతున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ - 50,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు నేడు వెరిఫికేషన్ - ఎన్సీసీ కేటగిరిలో 30,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ * * హైదరాబాద్: స్విస్ ఛాలెంజ్ పై నేడు హైకోర్టులో విచారణ * * హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ కోసం 1969లో జరిగిన ఉద్యమంలో పాల్గొని పోలీస్ కాల్పుల్లో గాయపడ్డ హైదరాబాద్ వాసి పగడాల పరంధామకు రూ.10 లక్షల ఆర్థికసాయం అందించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. 1969 ఏప్రిల్ 4న సికింద్రాబాద్ జనరల్ బజార్‌లో జరిగిన కాల్పుల్లో పరంధామ ఛాతిలో, కుడి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. * * లాస్ ఎంజెల్స్: లాస్ ఎంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎలాంటి కాల్పుల ఘటనలు చోటుచేసుకోలేదని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఒక పెద్ద శబ్దం మాత్రమే వచ్చి దాన్ని ఎయిర్ పోర్ట్ సిబ్బంది కాల్పులుగా భ్రమపడ్డారని చెప్పారు. అమెరికాలోని లాస్ ఎంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాల్పులు చోటుచేసుకున్నాయని తొలుత కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. * * విశాఖపట్నం: రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం సూచించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని వెల్లడించింది. * * హైదరాబాద్: తమ డిమాండ్లను తీర్చి, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఎన్‌ఎంలూ మంత్రి నివాసం ముట్టడికి యత్నించారు. సోమవారం ఉదయం మణికొండలోని మంత్రి లక్ష్మారెడ్డి ఇంటి వద్దకు భారి ఎత్తున చేరుకున్న ఏఎన్‌ఎంలు ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి సమ్మె విరమించి వస్తే సమస్య సరిష్కారానికి కృషి చేస్తానని హామి ఇచ్చారు. * * బిర్కూర్ : నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండల కేంద్రంలోని తిరుమల దేవస్థానంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు శనివారం ఉదయం వరుణయాగం నిర్వహించారు. దేవస్థానం ఆవరణంలోని గణపతి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. * * న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో 118 మందితో కూడిన భారీ బృందాన్ని పంపిస్తే కేవలం రెండు పతకాలు మాత్రమే దక్కడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది. వచ్చే మూడు ఒలింపిక్స్‌లలో పతకాలు కొల్లగొట్టేందుకు సమగ్ర కార్యాచరణ పథకాన్ని అమలు చేసేందుకు టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. * * హైదరాబాద్‌సిటీ: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపించారు. రాజేంద్రనగర్ పరిధిలోని గగన్‌పహాడ్ వద్ద హైదరాబాద్-బెంగుళూరు జాతీయరహదారిపై రవాణాశాఖాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 10 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. తనిఖీలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. * * మియామి: అతను చెవిటి వ్యక్తి. సంకేత భాషలోనే ఎవరితోనైనా ముచ్చటిస్తాడు. వేగంగా వాహనాన్ని నడుపుతున్నాడనే సాకుతో అతన్ని ఓ జవాను వెంబడించాడు. ఇద్దరి మధ్య 13 కిలోమీటర్ల పాటు హోరాహోరీగా ఛేజింగ్ జరిగింది. చివరకు అతను తన ఇంటికి సమీపంలో వాహనాన్ని ఆపాడు. వాహనం దిగిన అతన్ని జవాను తుపాకీతో కాల్చాడు. సంఘటనా స్థలంలోనే అతను కుప్పకూలాడు. అమెరికాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దుమారం రేపుతోంది. * * అహ్మదాబాద్: ఓ సీనియర్ జర్నలిస్టు ఏకంగా పత్రికా కార్యాలయంలోనే దారుణంగా హత్యకు గురయ్యాడు. కార్యాలయంలో కూర్చుని వార్తాకథనం రాస్తుండగా దుండగులు ఆయనను కిరాతకంగా పొడిచి చంపారు. నెత్తుటి మడుగులో ఉన్న ఆయన మృతదేహాన్ని మంగళవారం పోలీసులు గుర్తించారు. గుజరాత్ సౌరాష్ట్ర ప్రాంతంలోని జునాగఢ్ పట్టణంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. * * హిమాయత్‌నగర్‌: రోడ్డు, రవాణా భద్రతా బిల్లు, ఆర్టీఏ, ట్రాఫిక్‌ పోలీసుల వేధింపులకు నిర సనగా సెప్టెంబర్‌ 2న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఆటోడ్రైవర్ల సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నాయకులు తెలిపారు. హిమాయత్‌నగర్‌లోని ఎఐటియుసి భవన్‌లో సోమవారం బంద్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో లక్ష్మయ్య పాల్గొన్నారు. * * పంజగుట్ట: గణేష్‌ ఉత్సవాలను గతంలో మాదిరిగానే నిర్వహించుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసినా పోలీసు అధికారులు నిబంధనల పేరుతో వేధించడం తగదని భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ప్రతినిధులు అన్నారు. గణేష్‌ నిమజ్జనంతో కాలుష్యం వెలువడటం లేదని పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు నివేదిక ఇచ్చిందని, ఎత్తు విషయంలో జోక్యం చేసుకోబోమని హైకోర్టు పేర్కొన్నా ఎత్తు తగ్గించాలని ఒత్తిడి చేయడం దారుణమన్నారు. * * హైదరాబాద్: మాజీ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డిని కరీంనగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మావోయిస్టు, గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీమ్ తరహాలోనే మోహన్‌రెడ్డి అరాచకాలకు పాల్పడేవాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గ్యాంగ్‌స్టార్‌ నయీం ముఠాతో సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు. నిన్న రాత్రి (సోమవారం) 8 గంటలకు మోహన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. * * ఇస్తాంబుల్ : ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన 12 ఏళ్ల ఆత్మాహుతి బాంబర్.. టర్కీలో ఉగ్రవాద దాడి చేసి, 51 మంది ప్రాణాలు బలిగొన్నాడు. ఓ పెళ్లిని లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 69 మంది గాయపడ్డారు. వారిలో 17 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ దాడికి పాల్పడింది 12 ఏళ్ల కుర్రాడేనని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తెలిపారు. * * ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేసినిరోడ్డు రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇది గుర్తించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. * * కోయంబత్తూర్: తన ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను హతమార్చింది. తొలి ప్రయత్నంలో పాముల ద్వారా కాటు వేయించాలని ప్రయత్నించి అది విఫలం కావడంతో సుఫారీ ఇచ్చి అతడిని హత్య చేయించింది. ఈ ఘటన తమిళనాడులోని పట్టనంపుదూర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళకు కృష్ణ అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉంది. * * దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా మొదటి స్థానానికి చేరుకుంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో కోహ్లి సేన టాప్ ర్యాంకులో నిలిచింది. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ లో ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోవడంతో టీమిండియా మొదటి ర్యాంకు సొంతం చేసుకుంది. 3-0తో సిరీస్ ను శ్రీలంక క్లీన్ స్వీప్ చేయడంతో మొదటి ర్యాంకులో ఉన్న ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది. * * హైదరాబాద్: స్థానికేతర ఉద్యోగులు తమను ఇబ్బంది పెడుతున్నారంటూ తెలంగాణ సచివాలయంలో రెండో రోజు ఆర్థిక శాఖ ఉద్యోగులు బుధవారం తమ నిరసనలు తెలిపారు. ఉన్నతాధికారుల వద్ద పీఎస్లుగా పని చేస్తున్నవారిని తప్పించాలని వారు డిమాండ్ చేశారు. అందులోభాగంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును టీ. ఉద్యోగుల సంఘం నేతలు కలిశారు. * * హైదరాబాద్‌: హయత్‌నగర్ మండలం పసుమాముల బీసీ హాస్టల్ విద్యార్థి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి... సదరు బీసీ హాస్టల్లో ఉంటూ రాకేశ్ అనే విద్యార్థి కలుషిత నీరు తాగి తీవ్ర అనారోగ్యం పాలైయ్యాడు. దీంతో హాస్టల్ సిబ్బంది అతడిని ఎల్బీ నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రెండు రోజులుగా చికిత్స పొందుతు బుధవారం రాత్రి మరణించాడు. * * నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం దుర్కి గ్రామంలో డయేరియాతో గంగవ్వ (50) అనే మహిళ గురువారం మృతి చెందింది. గ్రామంలో డయేరియా ప్రబలింది. దీంతో సమాచారం అందుకున్న జిల్లా వైద్యాధికారులు గ్రామంలో మూడు రోజులు వైద్యశిబిరం నిర్వహించారు.అయితే గంగవ్వ ఈ రోజు మరణించింది. దాంతో బోధన్ ఆర్డీవో సుధాకర్ రెడ్డి గురువారం దుర్కి గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులకు అందుతున్నసేవలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. * * హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం మహముద్ అలీ అధ్యక్షతన మంత్రులు కడియం శ్రీహరి, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. జిల్లాల ఏర్పాటుపై అన్ని వర్గాల నుంచి వచ్చే ప్రతిపాదనలు చర్చించి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. * * హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీం కేసు దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. సిట్ అధికారిగా ఐజీ నాగిరెడ్డిని ప్రభుత్వం నియమించింది. అడిషనల్ ఎస్పీ, ఇద్దరు డీఎస్సీలు సహా 8మందితో ఏర్పాటు అయిన సిట్ బృందానికి నాగిరెడ్డి నేతృత్వం వహిస్తారు. * * పంజగుట్ట: న్యాయస్థానంలోనే న్యాయవాదిపై దాడి చేసిన వ్యక్తిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు... నగరానికి చెందిన దీక్ష అమోల్, బాలకృష్ణ అమోల్‌ భార్యాభర్తలు. దీక్ష తన భర్త అయిన బాలకృష్ణపై గృహహింస కేసు పెట్టగా ఎర్రమంజిల్‌ కోర్టులో మంగళవారం కేసు విచారణకు వచ్చింది. కూకట్‌పల్లికి చెందిన న్యాయవాది వసంత్‌రావు దేశ్‌పాండే కేసు వాదిస్తుండగా, తీవ్ర ఆగ్రహానికి గురైన బాలకృష్ణ న్యాయవాదిని చొక్కా పట్టుకుని బయటకు లాక్కొచ్చి దాడి చేశాడు. * * కరీంనగర్(పెద్దపల్లి) : కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో చేరాలనుకునే విద్యార్థుల కోసం రెండో విడత కౌన్సెలింగ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు పెద్దపల్లి ఐటీఐ ప్రిన్సిపాల్‌ సురేందర్‌ తెలిపారు. 11 నుంచి 20 తేదీల్లో అభ్యర్థులు దరఖాస్తులు అందజేయాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో దరఖాస్తు ఫారాలు లభిస్తాయన్నారు. అభ్యర్థులకు ఈ నెల 24, 28, 30 తేదీల్లో కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు. * * గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరులు, బంధువుల నివాసాల్లో రెండో రోజు కొనసాగుతున్న పోలీసుల సోదాలు * * నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఈ నేపథ్యంలో నేటి మధ్యాహ్నాం 2.00 గంటలకు అరకులోని ఎన్టీఆర్ గ్రౌండ్స్లో ఆదివాసీ దినోత్సవం జరగనుంది.ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి రావెల కిషోర్ బాబు పాల్గొనున్నారు. * * మెదక్: మెదక్ జిల్లా ఆంధోల్ మండలం కిచ్చన్నపల్లి వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. క్రూజర్ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వాసుపత్రిలో ప్రాధమిక చికిత్స తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. * * నల్గొండ: చిట్యాల మండలo వేలిమినేడు గ్రామ శివార్లో గుర్తు తెలియని మహిళ మ్రుతదేహము లభ్యమైంది. ఈ మహిళ చనిపోయి 2 రోజులు అయి ఉండవచ్చని ఎస్.ఐ. శివకుమార్ అనుమానము వ్యక్తము చేశారు. * * కరీంనగర్(పెద్దపల్లి): కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామంలోని VRO గౌస్ పాషా అక్కడి రైతు నుండి 20 వేలు లంచం తీసుకుంటుండగా ACB కి పట్టుబడ్డాడు. * * హైదరాబాద్ : జీవో 123పై సోమవారం హైకోర్టు డివిజన్ బెంచ్లో విచారణ జరిగింది. భూ నిర్వాసితులు, రైతు కూలీల రక్షణ కోసం తీసుకునే చర్యలను తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ ద్వారా కోర్టుకు సమర్పించింది. నిబంధనల ప్రకారమే నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తున్నామని... వ్యవసాయ కూలీలను ఆదుకుంటామని అడ్వకేట్ జనరల్ (ఏజీ) ఆ అఫిడవిట్లో విన్నవించారు. * * ఇస్లామాబాద్ లో జరిగిన సార్క్ హోంమంత్రుల సదస్సుకు భారత జర్నలిస్టులను అనుమతించని పాకిస్తాన్ వారిని కనీసం ప్రవేశ ద్వారం వద్ద కూడా ఉండనివ్వలేదని వెల్లడైంది. సార్క్ దేశాల ప్రముఖులను పాక్ హోంమంత్రి నిసార్ ప్రవేశ ద్వారం వద్ద ఆహ్వానిస్తున్నపుడు భారత జర్నలిస్టులు అక్కడే ఉన్నారు. భారత హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ రాగానే పాక్ జర్నలిస్టులు ఫోటోలు తీసేందుకు సన్నద్ధమవుతుండగా వీరూ వెళ్లారు. అయితే అక్కడ నుండి వెళ్లిపోవాలని, గేటు బయట నిలబడేందుకూ కూడా భారత్ జర్నలిస్టులకు అనుమతి లేదని పాక్ అధికారులు తేల్చి చెప్పారు. * * నేడు ఆగష్టు 6న తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జయంతి * * ఇవాళ ఇస్రో, తెలంగాణ ఇరిగేషన్ శాఖ మధ్య ఎంవోయూ అత్యాధునిక టెక్నాలజీతో తెలంగాణ జలవనరుల సమాచార వ్యవస్థ జలాశయాల్లో నీటి నిల్వలను ఉపగ్రహంతో విశ్లేషించనున్న తెలంగాణ * * శంషాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో శనివారం ఉన్నతాధికారులు హైఅలెర్ట్ ప్రకటించారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకులు నేపథ్యంలో నిఘా వర్గాలు ఎయిర్ పోర్టు అధికారులను అప్రమత్తం చేశారు. * * పెబ్బేరు(మహబూబ్‌నగర్): రైతులు పెట్టిన విషం గుళికలు తిని దాదాపు 40 జింకలు చనిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొందరు రైతులు కృష్ణా నదిలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. పంటను పురుగుల బారి నుంచి రక్షించుకునేందుకు మొదళ్ల వద్ద శుక్రవారం రాత్రి విషం గుళికలను చల్లారు. సమీపంలోని అటవీప్రాంతం నుంచి వచ్చిన జింకలు గడ్డి మేసుకుంటూ వచ్చి గడ్డితోపాటు గుళికలను కూడా తినేశాయి. దీంతో అ విష ప్రభావానికి లోనై దాదాపు నలబై జింకలు చనిపోయాయి. * * వాయువ్య బంగాళఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఉ.ఒడిశా, ప.బెంగాల్, జార్ఖండ్ తీరాలను ఆనుకుని అల్పపీడనం అల్పపీడన ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఒడిశా, కోస్తాంధ్ర మీదుగా ద.తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కోస్తా తీరం వెంబడి గంటకు 45-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక: వాతావరణ కేంద్రం * * మ్మం: ఛత్తీస్‌గఢ్ దంతేవాడ జిల్లాలో శుక్రవారం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. దంతేవాడ - బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన సర్సఫాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఆ విషయాన్ని పసిగట్టిన మావోయిస్టులు... పోలీసులపై కాల్పులకు దిగారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులకు దిగారు. * * ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లెందులోని ఓపెన్‌కాస్టు సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇల్లెందు పట్టణంలోని ప్రధాన రహదారిపై అధిక వేగంతో వెళ్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ లారీ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోగా మరో లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. * * కరీంనగర్ : ఎస్సీ వర్గీకరణ బిల్లు వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అందులోభాగంగా శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైల్వేస్టేషన్లో వారు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్లో ఆగి ఉన్న సింగరేణి ప్యాసింజర్ రైలును వారు నిలిపివేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో భారీగా ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. * * హైదరాబాద్: ఈ నెల 8 నుంచి తెలంగాణలోని 11 విశ్వవిద్యాలయాల్లో నిరవధికంగా బంద్ పాటించనున్నట్లు తెలంగాణ వర్సిటీ నాన్ టీచింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కంచి మనోహర్, సెక్రెటరీ జనరల్ మహిపాల్ రెడ్డి బుధవారం పేర్కొన్నారు. రాష్ట్ర్రంలో అతిపెద్దదై ఉస్మానియాతో పాటు ఇతర వర్సిటీల్లో ప్రతి నెల 1న వేతనాలు, ఫించన్లు రావడం లేదన్నారు. సీమాంధ్రుల పాలనలో కూడా వేతనాలకు ఇలాంటి దుస్థితి ఎన్నడూ ఏర్పడలేదన్నారు. * * హైదరాబాద్: ప్రత్యేక హైకోర్టు ఉద్యమంలో పాల్గొన్న న్యాయవాదులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు నోటీసులివ్వడానికి నిరసనగా గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయాలని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నిర్ణయించింది. జేఏసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి నేతృత్వంలో న్యాయవాదులు బుధవారం సమావేశమయ్యారు. * * వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 48 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు... అలాగే తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. * * కరీంనగర్: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కాన్వాయ్‌కి బుధవారం తృటిలో ప్రమాదం తప్పింది. కాన్వాయ్‌లోని ఓ వాహన డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేయడంతో వెనకున్న టీఆర్‌ఎస్ నాయకుల వాహనాలు ఒకదానివెంట మరొకటి వరసగా ఢీకొన్నాయి. దీంతో సదరు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి ఈటల రాజేందర్ బుధవారం మెట్‌పల్లి వచ్చారు. * * కరీంనగర్(ముకరంపుర): జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ప్రభుత్వ నిర్ణయం ఊరటనిచ్చింది. పదేళ్లుగా కీలకంగా పనిచేస్తున్న ఫీల్డ్‌అసిస్టెంట్లను రెగ్యులరైజ్‌ చేయాలని, వేతనాలు పెంచాలన్న డిమాండ్‌తో చేపట్టిన ఆందోళనలకు సర్కార్‌ ఎట్టకేలకు దిగివచ్చింది. ప్రస్తుతం నెలవారీగా ఇస్తున్న వేతనం రూ.6240నుంచి రూ.10 వేలకు పెంచింది. * * మణుగూరు :ఖమ్మం జిల్లా మణుగూరు సమీపంలో మంగళవారం స్కూలు బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. విప్పల సింగారం నుంచి జీఎం ఆఫీసు రోడ్డులో వస్తున్న హోలీ ఫ్యామిలీ స్కూల్ బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోయి... అదుపుతప్పి బస్సు కాల్వలోకి దూసుకెళ్ల్లింది. అందులోని ఐదుగురు విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. * * చండీగఢ్: వాళ్లంతా దివ్యాంగులు. కొందరికి చూపులేదు, ఇంకొందరు బుద్ధిమాంద్యులు.. అందరూ చిన్నపిల్లలే. అంతసేపు హాయిగా ఆడుకున్నవాళ్లుకాస్తా మధ్యాహ్నం భోజనం తిన్నతర్వాత వాంతులు చేసుకోవడం మొదలుపెట్టారు. నిమిషాల్లోనే పరిస్థితి చేయిదాటిపోయింది. పిల్లలు ఒకొక్కరిగా రాలిపోయారు. పంజాబ్ లోని కపుర్తలా జిల్లా కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం కనిపించిన దృశ్యాలివి. * * పురవి: వరంగల్‌ జిల్లా పురవి మండల కేంద్రంలో ఉన్న ఆంధ్రాబ్యాంకులో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. రాత్రి సమయంలో బ్యాంకు తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దుండగులు కౌంటర్‌ గదిలో సీసీ కెమెరాలను కత్తిరించారు. సోమవారం ఉదయం సిబ్బంది బ్యాంకును తెరవడంతో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పురవి సీఐ శ్రీనివాస్‌, ఎస్సై రామకృష్ణ అక్కడకు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. * * నేడు ఎంసెట్-3 షెడ్యూల్ విడుదల చేసే అవకాశం జేఎన్టీయూ వీసీ లేదా రిజిస్ట్రార్కు కన్వీనర్ బాధ్యతలు ఎంసెట్-2 విద్యార్థులకు పాత రిజిస్ట్రేషన్ పై కొత్త హాల్టికెట్లు * * ఇవాళ ప్రారంభంకానున్న రూపాయికే నల్లా కనెక్షన్ పథకం గ్రేటర్ హైదరాబాద్లో పేదలకు రూపాయికే వాటర్ కనెక్షన్ * * వరంగల్: వరంగల్ జిల్లా ధర్మాసాగర్ జలాశయంలో ఆదివారం గల్లంతైన కానిస్టేబుల్ పొలిమారి సృజన్(25)మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు. ఆదివారం మిత్రులతో కలిసి ఈతకు వెళ్లిన సృజన్ ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. * * మహారాష్ట్ర: పుణెలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిపోవడంతో తొమ్మిది మంది కార్మికులు మృతిచెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు యత్నిస్తున్నారు. * * వరంగల్ : వరంగల్ నగరంలోని ఆర్టీఏ జంక్షన్లో బస్సు... ముందు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను నగరంలోని ఆసుపత్రికి తరలించారు. * * హైదరాబాద్ : ఎంసెట్ - 2 పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ... మంత్రులు కడియం, లక్ష్మారెడ్డి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. శుక్రవారం మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి విద్యార్థి సంఘాలు యత్నించాయి. ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. * * న్యూఢిల్లీ: పార్లమెంటులో ఓ కోతి హల్ చల్ చేసింది. అరగంటపాటు అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది. దాన్ని బందించేందుకు ప్రయత్నం చేసిన చివరకు వారికి దొరకకుండా దానంతట అదే దర్జాగా ప్రధాన ద్వారం గుండా బయటకు వెళ్లింది. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం ఎంపీలు, జర్నలిస్టులు చదువుకునేందుకు ఏర్పాటుచేసిన పార్లమెంటు రీడింగ్ హాల్ లోకి ఓ కోతి ప్రవేశించింది. * * కరీంనగర్‌: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో ఏఈకికు రెండేళ్ల జైలుశిక్ష, రూ.పదివేల జరిమానా విధిస్తూ బుధవారం ఏసీబీ కోర్టు తీర్పు వెలువరిచింది. 2008లో గంగాధరలో విద్యుత్‌ శాఖ ఏఈగా పనిచేస్తున్న బండారు అజయ్‌కుమార్‌ గంగాధరకు చెందిన అంకం శంకరయ్య అనే పవర్‌లూం కార్మికుడికి విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు అదే ఏడాది జనవరి 18న రూ.6వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. * * వరంగల్ : వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా కేసముద్రం మండలం రాజీవ్ నగర్ తండా సమీపంలో గురువారం చోటుచేసుకుంది. తండా నుంచి కేసముద్రం వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో.. కారు నడుపుతున్న రమేష్ పండిట్ రాథోడ్ (42) అక్కడికక్కడే మృతి చెందాడు. * * హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన కేసు విచారణను డివిజన్ బెంచ్ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. హైకోర్టు విభజనపై తెలంగాణ ప్రభుత్వ రివ్యూ పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది. హైదరాబాద్లోనే రెండు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయాలని టీ.సర్కార్ తన పిటిషన్లో కోరింది. గత తీర్పును పునసమీక్షించాలన్న పిటిషన్పై తీర్పును ఉమ్మడి హైకోర్టు రిజర్వ్లో ఉంచిన విషయం తెలిసిందే. దాంతో కేసును విచారించిన డివిజన్ బెంచ్.. తాను తీర్పును ప్రకటించలేనని, విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు ప్రకటన * * నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం కోమలంచ గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భూమా రమేశ్ (35) అనే రైతు కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. పొలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు ఫ్యూజు అమరుస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గ్రామస్తుల సహాయంతో అతడి మృతదేహాన్ని ఇంటికి తరలించారు. * * కరీంనగర్: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం జిల్లెల క్రాసింగ్ వద్ద ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిమ్మాపూర్ మండలానికి చెందిన మహ్మద్ రిజ్వాన్ (32) అక్కడికక్కడే మృతిచెందగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడ్ని సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. * * తిమ్మాపూర్‌ : రవాణాశాఖకు సంబంధించిన ఆన్‌లైన్‌ సేవలపై మీ సేవా కేంద్రాలు, ఈ సేవా కేంద్రాల నిర్వాహకులు, ఉద్యోగులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు కరీంనగర్‌ డీటీసీ వినోద్‌కుమార్‌ తెలిపారు. రోజుకు మూడు బ్యాచ్‌ల చొప్పున జిల్లాలోని నిర్వాహకులకు బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఆన్‌లైన్‌ సేవలకు దరఖాస్తు చేసుకునే వి«ధానం నేర్చుకునేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. * * హైదరాబాద్ : హెచ్ఎండీఏ పనులపై ఉన్నతాధికారులతో నేడు కేటీఆర్ భేటీ. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, సుందరీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష * * హైదరాబాద్ : నేడు, రేపు ఏఎఫ్ఆర్సీ భేటీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరహాలో వైద్య ఫీజుల పెంపుపై చర్చ * * కీసర : రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాలలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కమాన్ వద్ద పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోలో తరలిస్తున్న 9 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోతోపాటు ఎస్కార్ట్గా బైకుపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. * * నారాయణపేట: అన్నం పెట్టే రైతులపై దాడి చేసిన ఏ ప్రభుత్వం నిలబడలేదని, మల్లన్న సాగర్ నిర్వాసితులపై లాఠీచార్జి జరిపించిన కేసీఆర్ ప్రభుత్వానికి పోయేకాలం దాపురించిందని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం అప్పంపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. * * మెదక్‌: మల్లన్నసాగర్‌ నిర్వాసితులపై ఆదివారం జరిగిన పోలీసుల లాఠీచార్జీకి నిరసనగా అఖిలపక్షం ఈరోజు మెదక్‌ జిల్లా బంద్‌ చేపట్టింది. ఉదయాన్నే కాంగ్రెస్‌, తెదేపా, భాజపా, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన నేతలు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై నేతలు మండిపడ్డారు. జనజీవనంపై బంద్‌ ప్రభావం పాక్షికంగా ఉంది. చాలా చోట్ల ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. బంద్‌ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. * * హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో జాతీయ రహదారిపై ఏబీవీపీ రాస్తారోకో చేపట్టింది. ఎన్నికల సందర్భంగా తెరాస ఇచ్చిన కేజీ టు పీజీ ఉచిత విద్య హామీని వెంటనే నెరవేర్చాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళనతో జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. * * లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రైలుప్రమాదం సంభవించింది. భదోహిలో కాపలా లేని రైల్వేగేట్‌ వద్ద ఈరోజు ఉదయం పట్టాలు దాటుతున్న స్కూల్‌ బస్సును రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 19 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. * * విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఛత్తీస్గఢ్ నుంచి తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయిని చెప్పింది. తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. * * ఇబ్రహీంపట్నం: కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్‌లోని ఆలయంలో చోరీ జరిగింది. స్థానిక పెద్దమ్మ ఆలయంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి అమ్మవారి నగలను అపహరించుకు పోయారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. నాలుగు తులాల బంగారు ఆభరణాలతో పాటు వెండి సామాగ్రి చోరీకి గురైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. * * తాండూరు : రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా తాండూరు - వికారాబాద్‌ల మధ్యలో ఉన్న కందమెల్లి వాగు పొంగిపొర్లుతుంది. దాంతో తాండూరు - హైదరాబాద్‌ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గురువారం అర్ధరాత్రి నుంచి వాగు పొంగిపొర్లుతుంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. * * నల్లగొండ: స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఆటో ఢీకొన్ని చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కేతెబోయిన కావ్య (3) ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో కావ్య తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. * * కరీంనగర్‌ క్రైం: బెజ్జంకి ఏఎస్సై వహిద్‌ పాషాపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ ఎస్పీ జోయల్‌డేవిస్‌ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని పేర్కొంటూ బెజ్జంకి పీఎస్‌లో పనిచేస్తున్న ఓ మహిళ హోంగార్డ్‌ ఫిర్యాదుచేసింది. ఈమేరకు విచారించిన ఎస్పీ వాహిద్‌ పాషాను సస్పెండ్‌చేశారు. * * కరీంనగర్‌ జిల్లా మద్యం డిపో పరిధిలో ఉన్న 41 మద్యం దుకాణాలు, 5 బార్లను మెదక్‌ జిల్లా సిద్దిపేటలో కొత్తగా ప్రారంభంకానున్న మద్యం డిపోకు బదిలీచేస్తూ బుధవారం రాత్రి ఎకైసజ్‌శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గంభీరావుపేట మండలం పరిధిలోని 9 దుకాణాలు, సిరిసిల్ల ఎకై ్సజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని 15 మద్యం దుకాణాలు, 3 బార్లు, వేములవాడ ఎకై ్సజ్‌ ఠాణా పరిధిలోని 17 మద్యం దుకాణాలు, 2 బార్లను బదిలీ చేశారు. ఆగస్టు 1 నుంచి వీటికి సిద్దిపేట డిపో నుంచి మద్యం సరఫరా చేస్తారు. ఈ మేరకు జగిత్యాల ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌క * * జమ్ము: అమర్నాథ్ యాత్రకు వెళుతున్న యాత్రికులకు కష్టాలు కొనసాగుతునే ఉన్నాయి. జమ్మూకశ్మీర్ లో అశాంతికర పరిస్థితుల నేపథ్యంలో మరోసారి యాత్రికులను అధికారులు అడుగు కూడా వేయనివ్వడం లేదు. * * సిరిసిల్ల: సిరిసిల్ల మండలం సర్ధాపూర్‌ శివారులో 7వ పోలీస్‌ బెటాలియన్‌ ఏర్పాటుకు 120 ఎకరాల భూమిని కేటాయించారు. ఈమేరకు సిరిసిల్ల ఆర్డీవో ఆఫీస్‌లో సోమవారం డివిజన్‌ సర్వేయర్‌ శ్రీనివాస్‌తో సంబంధించిన హద్దులను నిర్ధారించారు. ఇప్పటికే పోలీస్‌ బెటాలియన్‌ కోసం 120 ఎకరాల స్థలాన్ని శాటిలైట్‌ ద్వారా సర్వే నిర్వహించి కేటాయించారు. క్షేత్రస్థాయిలో భూమి కేటాయింపులను కలెక్టర్‌ నీతుప్రసాద్‌ పరిశీలించారు. * * పార్లమెంట్లో మోదీ, రాజ్‌నాథ్, జైట్లీతో విడివిడిగా భేటీకానున్న కేసీఆర్ * * ఢిల్లీ: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు పార్లమెంటు ముందుకు రానున్న 16 బిల్లులు వచ్చే నెల 12 వరకు జరగనున్న వర్షాకాల సమావేశాలు * * వరంగల్: బైక్ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలోని నార్లాపూర్ వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. మేడారానికి చెందిన సిద్ధబోయిన ఆనందరావు (35) బైక్ పై వెళ్తుండగా.. నార్లాపూర్ వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆనందరావు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. * * కరీంనగర్: ఆలయంలోకి చొరబడిన దుండగులు స్వామివారి విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేటలో శనివారం వెలుగు చూసింది. గ్రామ శివారులోని సీతారామ ఆలయంలో ఉన్న స్వామివారి విగ్రహాన్ని గత రాత్రి కొందరు దుండగులు ధ్వంసం చేశారు. శనివారం ఉదయం ఆ విషయాన్ని గమనించిన స్థానికులు 63వ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. * * తిమ్మాపూర్ (కరీంనగర్) : పురుగులమందు తాగి భార్యాభర్తలు మృతిచెందిన సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గురువారం చోటుచేసుకుంది. కాల్వ శ్రీరాంపుర్ మండలానికి చెందిన ప్రభాకర్(37), తేజస్వి(34) దంపతులు కరీంనగర్‌లోని మారుతీనగర్‌లో నివాసముంటూ.. బంగారం పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో గురువారం తిమ్మాపూర్‌కు వెళ్లిన దంపతులు ఆలయ సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. * * హైదరాబాద్: వీధి కుక్కల దాడిలో నలుగురు చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన హైదరాబాద్ లోని ఎల్బీనగర్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న చిన్నారుల పై వీధికుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు కాగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు కుక్కలను తరిమికొట్టి చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. * * కరీంనగర్ జిల్లా జమ్మికుంట్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తి ధర క్వింటాలుకు రిఆకర్డుస్థాయిలో రూ.6,470 పలికింది. దాంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంట దిగుబడి తగ్గినందువల్ల ధర పెరిగిందని రైతులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం ఈ ధర పలికిందని వారంటున్నారు. * * హైదరాబాద్: ప్రైవేటు విద్యాసంస్థల దోపడీ విధానాన్ని వ్యతిరేకిస్తూ గురువారం తెలంగాణ విద్యాసంస్థల బంద్‌ కొనసాగుతుంది. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్‌ కొనసాగతుంది. ఈ సందర్భంగా విద్యా రంగంలో ప్రైవేటు విద్య నానాటికీ పెరిగిపోతోందని, అది సామాన్యుడికి అందుబాటులో లేదని సంఘాలు ఆరోపించాయి. విద్యారంగంలో ప్రభుత్వ ప్రాధాన్యాన్ని బలోపేతం చేయాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీ అమలు చేయాలని డిమాండ్‌ చేశాయి. * * హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కెన్యాకు చెందిన దంపతుల నుంచి కేజీన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా దుబాయి నుంచి ఈ రోజు ఉదయం హైదరాబాద్ వచ్చిన వీరి వద్ద బంగారం ఉండటాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అయితే వారి వద్ద బంగారానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో దంపతులను అదుపులోకి తీసకుని, బంగారాన్ని సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం.12 లో గురువారం ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంటిని నిర్మించేందుకు రాళ్లను బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * హైదరాబాద్: హైదరాబాద్ కూకట్ పల్లిలో తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆకస్మిక పర్యటన నిర్వహించారు. రోడ్లు, నీటి సరఫరా, బస్టాండ్ తదితర ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. రాత్రి 11 గంటలనుంచి 2:30 గంటల వరకు కేటీఆర్ తనిఖీలు కొనసాగాయి. ఈ సందర్భంగా రోడ్లపై వాననీరు నిల్వ ఉండటం పట్ల జీహెచ్ఎంసీ సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి రమ‍్య మృతికి కారణమైన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు. * * భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కాస్త తగ్గింది. నీటిమట్టం బుధవారం ఉదయం 49.5 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. మంగళవారం సాయంత్రం నీటిమట్టం 52.4 అడుగులకు చేరిన విషయం తెలిసిందే. రాత్రికి రాత్రి నీటి మట్టం తగ్గడంతో అధికారులు, ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. * * కేంద్ర ప్రభుత్వ నైపుణ్యం, మెలకువల శిక్షణలో భాగంగా నిరుద్యోగ దళిత యువతకు అడ్వాన్స్‌ కంప్యూటర్‌ హర్డ్‌వేర్‌, కోర్‌ నెట్‌వర్కింగ్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఎంసీపీ ఎడ్యూకేషన్‌ సోసైటీ డైరెక్టర్‌ ఎంఆర్‌ చెన్నప్ప తెలిపారు. డిప్లొమా లేదా బిటెక్‌, పీజీ పూర్తి చేసి, 18 నుంచి 45 లోపు వయసున్నవారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు లక్డికాపూల్‌లోని జెన్‌ వొకేషనల్‌ కాలేజీలో ఈ నెల 14న నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు. * * చండీగఢ్‌: ప్రొ కబడ్డీని ఆస్వాదిస్తున్న అభిమానులను అలరించేందుకు మరో మెగా ఈవెంట్‌ రాబోతోంది. నవంబర్‌ 3న చండీగఢ్‌ వేదికగా ప్రపంచకప్‌ కబడ్డీ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలు 3 నుంచి 17 వరకు జరుగుతాయి. చండీగఢ్‌లోని 14 వేదికల్లో ఈ పోటీలు నిర్వహిస్తామని పంజాబ్‌ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ చెప్పారు. 14 దేశాలు పోటీపడే ఈ ప్రపంచకప్‌లో పురుషులు, మహిళలు విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. పురుషుల విభాగంలో విజేతగా నిలిచిన జట్టుకు రూ.2 కోట్లు, రన్నరప్‌కు రూ.కోటి నగదు బహుమతిగా ఇస్తారు. మహిళల్లో * * కరీంనగర్ : జిల్లావ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. మహదేవ్‌పూర్ మండలంలో పెద్దంపేట, సర్వాయిపేట, వంకెన వాగులు పొంగిపొర్లుతుండడంతో 17 గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ధర్మపురి వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. సింగరేణి రామగుండం రీజియన్‌లో నాలుగు ఓపెన్ కాస్ట్ బొగ్గుపనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. * * హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు మంగళవారం ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి కోల్కతా వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కోల్కతా వెళ్లే 120మంది ప్రయాణికులు ఉదయం అయిదు గంటల నుంచి పడిగాపులు పడుతున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా విమానాల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులు గంటల కొద్ది విమానాశ్రయంలో తిప్పలు పడాల్సి వస్తున్న విషయం తెలిసిందే. * * హైదరాబాద్ : హైదరాబాద్లోని నాగ్పూర్ జాతీయ రహదారిపరై ఆర్టీఏ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఏడు ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేశారు. అలాగే సరైన పత్రాలు లేని రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. * * హైదరాబాద్ : నగరంలోని గోల్కొండ సక్కుబాయినగర్ ప్రాంతంలో మంగళవారం మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సదరు మహిళను దుండగులు అత్యాచారం చేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పరిసర ప్రాంతాల్లోని స్థానికులను పోలీసులు విచారిస్తున్నారు. * * హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం ఓ విమానాన్ని ఎయిర్ పోర్ట్ అధికారులు అత్యవసరంగా ల్యాండ్ చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి సౌదీ అరేబియా బయల్దేరిన విమానంలో ఓ ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఆ ప్రయాణికుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. * * హైదరాబాద్ సిటీ : డీసీఎం వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 22.45 క్వింటాళ్ల గంజాయిని హయాత్‌నగర్ పోలీసులు సోమవారం ఉదయం పట్టుకున్నారు. ఈ సంధర్భంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి నగరానికి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ముందస్తు సమాచారంతో హయాత్‌నగర్ పోలీసులు అబ్దుల్లామెట్ వద్ద కాపు కాశారు. గంజాయి లోడుతో వచ్చిన డీసీఎం వ్యానును ఆపి అందులోని 22.45 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంధర్భంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. * * సికింద్రాబాద్ : నగరంలోని తుకారంగేటు పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్తీలో సోమవారం ఉదయం చిన్న గొడవ జరగడంతో ఆగ్రహించిన మల్లేష్ అనే వ్యక్తి చంద్రకళ అనే మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ప్రయత్నించి మంటలను ఆర్పారు. అప్పటికే ఆమె శరీరం చాలావరకూ కాలిపోయింది. వెంటనే ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మల్లేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. చంద్రకళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. * * కరాచి: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ సిరీస్ నిర్వహణకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ మేరకు ఇరు క్రికెట్ బోర్డుల మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. ఎడిన్‌బర్గ్‌లో ఐసీసీ సభ్య దేశాల సమావేశం సందర్భంగా పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్, బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ముఖాముఖి సిరీస్ గురించి చర్చించినట్లు తెలిసింది. రెండు దేశాల ప్రభుత్వాల అనుమతి లభిస్తే ఈ సీజన్‌లోనే తటస్థ వేదికల్లో సిరీస్ నిర్వహించాలని బోర్డు పెద్దలు యోచిస్తున్నారు. * * హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా పి.సర్దార్‌సింగ్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మెదక్‌జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన ఈయన గతంలో మహారాష్ట్రలోని మహాత్మగాంధీ అంతరాష్ట్రీయ విశ్వవిద్యాలయంలో ఫైనాన్స్‌ ఆఫీసర్‌గా, జాయింట్‌ రిజిస్ట్రార్‌, డిప్యూటీ రిజిస్ట్రార్‌గా పనిచేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఇందిర కళా సంగీత విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌గా సేవలందించారు. * * దామరచర్ల: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం ఇర్కిగూడెం వద్ద కృష్ణాతీరంలో పార్వతీదేవి ఆలయ నిర్మాణానికి గాను తవ్వకాలు నిర్వహిస్తుండగా పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది. కృష్ణానదీ తీరంలో పార్వతీదేవి ఆలయ నిర్మాణానికి తెలంగాణ సర్కార్ రూ. 5లక్షలు మంజూరు చేసింది. దాంతో ఈ రోజు ఉదయం నిర్మాణ పనులు ప్రారంభించారు. * * నల్లగొండ: నల్లగొండ జిల్లాలో శుక్రవారం రాత్రి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఓ వ్యక్తి నుంచి రూ.6.30 లక్షలను దొంగలు దోచుకెళ్లిన ఘటన వేములపల్లి మండలం అన్నపురెడ్డిగూడెంలో చోటుచేసుకుంది. స్థానిక పెట్రోల్ బంక్లో క్యాషియర్గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి శుక్రవారం రాత్రి క్యాష్ తీసుకుని ఇంటికెళ్తుండగా దొంగలు దాడికి పాల్పడ్డారు. వెంకటేశ్వర్లును తీవ్రంగా గాయపరచిన దొంగలు అతని వద్ద ఉన్న రూ.6.30 లక్షలను తీసుకుని ఉడాయించారు. దీంతో బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు * * కరీంనగర్ : నేదునూరులో జెన్కో పవర్ప్లాంట్ పనులు వెంటనే చేపట్టి నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. లేకుంటే భూములును తిరిగి రైతులకు అప్పగించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. గురువారం కోదండరామ్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరులో జెన్కో పవర్ ప్లాంట్ కోసం సేకరించిన భూములను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక రైతులతో కోదండరామ్ సమావేశమయ్యారు. * * మేడ్చల్: ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ.. ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మేడ్చల్ చెక్‌పోస్ట్ వద్ద శుక్రవారం జరిగింది. చెక్‌పోస్ట్ వద్ద ఉన్న సెల్‌టవర్ ఎక్కిన యువకుడు తన ప్రియురాలితో పెళ్లి జరిపించాలని లేకపోతే ఇక్కడి నుంచి దూకేస్తానని బెదిరిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతన్ని కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. * * హైదరాబాద్: జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ స్ప్రింట్స్‌లో తెలంగాణ కుర్రాడు అబ్దుల్ నజీబ్ ఖురేషీ మెరిశాడు. గురువారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన 100 మీటర్ల పరుగులో నజీబ్ రజత పతకం గెలుచుకున్నాడు. 10.63 సెకన్లతో అతను రెండో స్థానంలో నిలిచాడు. షమీర్ మోన్ (మణిపూర్-10.60 సె.) స్వర్ణ పతకం సాధించగా, అనిరుధ గుంజాయ్ (మహారాష్ట్ర-10.66 సె.)కు కాంస్యం దక్కింది. * * హైదరాబాద్ : తెలంగాణ అడ్వకేట్ల మహాధర్నా ఇందిరాపార్క్ వద్ద శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఈ మహాధర్నాలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా అడ్వకేట్లు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అయితే ఈ ధర్నాలో పాల్గొనేందుకు వెయ్యి మంది అడ్వకేట్లకు మాత్రమే అనుమతి ఉందని పోలీసులు తెలిపారు. ఈ మహాధర్నా నేటి సాయంత్రం 4.30 గంటలకు ముగియనుంది. * * రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండల పరిధిలోని జవహర్‌నగర్‌ సీఆర్‌పీఎఫ్‌ గ్రూప్‌ సెంటర్‌లో జులై 1వ తేదీ నుంచి నిర్వహించనున్న మినిస్టీరియల్‌ హెడ్‌కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 27 వేల మంది హాజరవుతారు. జవహర్‌నగర్‌ గ్రూప్‌ సెంటర్‌కు వచ్చే అభ్యర్థులకు ప్రత్యేకంగా బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు సీఆర్‌పీఎఫ్‌ డీఐజీపీ జి.వి.ఎన్‌.గిరిప్రసాద్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ 10వ నంబర * * హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగుల విభజనపై ఏర్పాటుచేసిన కమల్నాథన్ కమిటీ గురువారం మరోసారి సమావేశమైంది. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ఉద్యోగుల విభజన అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది. * * ఖమ్మం: ఎగువ నుంచి వస్తున్న వరదతో ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 9 అడుగులకు చేరుకుంది. అశ్వారావుపేట వద్ద పెద్దవాగు ప్రాజెక్టు నిండింది. దీంతో రెండు గేట్లు ఎత్తి 14,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే, అశ్వాపురం మండలంలో విడువని వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కిన్నెరసాని ప్రాజెక్టు కూడా జలకళను సంతరించుకుంది. కొత్తగూడెం, మణుగూరు, సత్తుపల్లిల్లోని ఓపెన్‌కాస్ట్ గనుల్లో వర్షం కారణంగా ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. * * హైదరాబాద్‌: నగరంలోని హుమాయన్‌నగర్‌లో విషాదం నెలకొంది. ఐదేళ్ల చిన్నారి ఆడుకుంటూ విద్యుత్‌ తీగ తగిలి మృతి చెందింది. శ్రీకాకుళంకు చెందిన హరిత భర్త చనిపోవడంతో కుమార్తె తనుజతో పాటు నగరానికి వచ్చి హుమాయన్‌ నగర్‌లో ఉంటోంది. తనుజ తల్లితో వెళ్తుండగా తెగిపడిన విద్యుత్‌ తీగ తగిలి అక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు బాలికను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. * * నల్లగొండ: ఎగువ నుంచి వస్తున్న మూసీ వరదతో నల్లగొండ జిల్లా భువనగిరి-పోచంపల్లి మధ్య మంగళవారం ఉదయం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఆ మార్గంలో ఉన్న బీబీనగర్ మండలం బట్టుగూడెం వంతెనపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. * * హైదరాబాద్: ఏఐసీసీ పరిశీలకుడు శ్రీనివాసన్ నేతృత్వంలో గాంధీభవన్లో కాంగ్రెస్ వర్క్షాప్ సోమవారం ప్రారంభమైంది. ఈ వర్క్షాప్లో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, నేతల వలసలను అడ్డుకోవడంతో పాటు ప్రచార కార్యక్రమాలపై నేతలు ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ముఖ్యనేతలు హాజరయ్యారు. * * బూర్గంపాడు: అప్పుల బాధ తాళలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గాదె సైదిరెడ్డి(41) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత రెండేళ్లుగా పంట దిగుబడి సరిగ్గా లేకపోవడంతో.. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోయాయి. అప్పులు తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. * * మిర్యాలగూడ: ముందు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వస్తున్న క్రేన్ ఢీకొట్టిన ఘటనలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం జస్తి వీరప్పగూడెం పరిధిలోని భల్లునాయక్‌తాండాలో సోమవారం చోటుచేసుకుంది. తాండా నుంచి మిర్యాలగూడ వెళ్తున్న ఆటోను బావులు తీయడానికి ఉపయోగించే క్రేన్ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న 8 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు 108 సాయంతో వారిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. * * రామడుగు: ఆర్టీసీ బస్సు చార్జీలు, విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ శనివారం కాంగ్రెస్‌ నాయకులు రామడుగులో ధర్నా నిర్వహించారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు అంజనేయులు గౌడ్‌, శంకర్‌, శ్రీనివాసగౌడ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు. * * జగిత్యాల(కరీంనగర్) : పలు దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉంటూ తప్పించుకు తిరుగుతున్న ఓ పాత నేరస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 20 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ. 2వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజేంద్రప్రసాద్ వివరాలు వెల్లడించారు. * * హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీ పీసీసీ శనివారం నిరసన కార్యక్రమాలకు దిగింది. అందులో భాగంగా హైదరాబాద్ విద్యుత్ సౌధ కార్యాలయాన్ని కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. రోడ్డుపై బైఠాయించి, పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పాడడంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, శ్రీశైలం గౌడ్, ఇతర నేత * * యాదాద్రి జిల్లా: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవాలయం పేరుతో యాదాద్రి జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగా భువనగిరి జిల్లా కేంద్రంగా యాదాద్రిని పేరుతో జిల్లా ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. * * యాదాద్రి జిల్లా: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవాలయం పేరుతో యాదాద్రి జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగా భువనగిరి జిల్లా కేంద్రంగా యాదాద్రిని పేరుతో జిల్లా ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. * * కరీంనగర్‌ విద్యా విభాగం : జిల్లాలో జరుగుతున్న ఎస్సెస్సీ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షల్లో భాగంగా గురువారం జరిగిన సామాన్యశాస్త్రం పేపర్‌-1లో మాల్‌ప్రాక్టీసుకు పాల్పడుతున్న ముగ్గురు విద్యార్థులను డిబార్‌ చేశారు. మొత్తం 42 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఈపరీక్షకు మొత్తం 3962 మంది హాజరుకావాల్సి ఉండగా, 3379 మంది హజరైనట్లు డీఈవో శ్రీనివాస చారి తెలిపారు. * * హైదరాబాద్ : ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దందాను అరికట్టాలంటూ వివిధ విద్యార్థి సంఘాల వారు గురువారం ఆందోళనలు చేపట్టారు. బోడుప్పల్‌లోని భాష్యం స్కూల్‌తోపాటు శంషాబాద్‌లోని ఎస్సార్ డీజీ స్కూల్ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ సంఘాల ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందిపెట్టేలా ఉన్న ఫీజుల మోతను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. * * హైదరాబాద్ : రంగారెడ్డి మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలో ఉన్న అనాథ బాలల ఆశ్రమం కృషిహోంలో ఉండే ఇద్దరు బాలురు కనిపించకుండాపోయారు. అనాథ గృహంలో ఆశ్రయం పొందుతున్న ఎన్.సాయిలు(13), మహేష్(10) అనే బాలురు బుధవారం ఉదయం టిఫిన్ చేసిన అనంతరం నుంచి కనిపించకుండా పోయారు. దీంతో నిర్వాహకులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవటంతో రాత్రి పోలీసులను ఆశ్రయించారు. కృషిహోం ట్యూటర్ ఎండీ సుమేర్ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. * * రెంజల్(నిజామాబాద్) : నిజామాబాద్ జిల్లా రెంజల్‌లో వేటగాళ్ల తుపాకీ తూటాకు జాతీయ జంతువు జింక బలైంది. రెంజల్ మండలం తాడిబిలోలి గ్రామ సమీపంలో బుధవారం రాత్రి గురు తెలియని వ్యక్తులు జింకను కాల్చి చంపారు. గురువారం ఉదయం జింక కళేబరాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఎస్సై ప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. జింకను వేటగాళ్లే చంపి ఉంటారని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. * * హైదరాబాద్: న్యాయమైన పరిహారం ఆందోళన చేస్తున్న మల్లన్నసాగర్ ముంపు బాధితులకు బీజేపీ మద్దతు తెలపనుంది. బుధవారం సాయంత్రం తొగుట మండలం ఏటిగడ్డకిష్టాపూర్, వేములగట్టు గ్రామాల్లో ఆ పార్టీ నాయకులు ధర్నా చేపట్టనున్నారు. ఈ ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్తోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు. ప్రాజెక్టు ముంపు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తగినంత సాయం అందించాలని బీజేపీ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేయనున్నారు. * * ధారూర్ : రంగారెడ్డి జిల్లా ధారూర్ మండలంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఎడతేరపి లేకుండా వాన కురుస్తుంది. దీంతో జిల్లాలోనే కొటిపల్లి జలాశయం నీటి మట్టం ఒక్క రోజులోనే ఏడడుగులు పెరిగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 24 అడుగులు కాగా మంగళవారం ఉదయం 5 అడుగుల నీరు మాత్రమే ఉంది. రాత్రి కురిసిన వర్షానికి 12 అడుగులకు చేరుకుంది. ధారూర్ మండల కేంద్రంలో 72.50 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. ఈ నీరుతో పంట సాగు చేసుకోవచ్చని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. * *
bottomleft17.jpg

middletop7.gif

తెలంగాణ వార్తలు

దిగ్విజయ్‌ క్షమాపణ చెప్పాలి: నాయిని

10/05/2017: భూపాలపల్లి: తెలంగాణ పోలీసులపై అను చిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హెచ్చరించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం పోలీస్‌స్టేషన్‌ నూతన భవనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతూ రాష్ట్ర పోలీసుల పనితీరు బాగుందని ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి ప్రశంసించారన్నారు. ఈ సమ యంలో రాష్ట్ర పోలీసుల ప్రతిష్ట దెబ్బ తీసేలా దిగ్విజయ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని హోంమంత్రి మండిపడ్డారు. హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌ను రద్దు చేయలేదని నాయిని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నూటికి నూరుశాతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందన్నారు.

జలాశయాల్లో అడుగంటుతున్న నీటి మట్టాలు

09/05/2017: వరంగల్‌ అర్బన్‌: గ్రేటర్‌ వరంగల్‌ దాహార్తిని తీర్చే జలాశయాల్లో నీరు తగ్గిపోతోంది. ఎండల తీవ్రతతో ఆయా జలాశయాల్లో నీటి మట్టం పడిపోతోంది. నాలుగైదు రోజులకోమారు అరకొరగా నీరు సరఫరా చేస్తుండటంతో శివారు కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్‌ మహా నగర పాలక సంస్థ పరిధిలో ధర్మసాగర్, వడ్డేపల్లి, భద్రకాళి జలాశయాలున్నాయి. నగర పరిధిలో, విలీన గ్రామాల్లో కలిపి 80వేల నల్లాలకు నీళుసరఫరా చేయాల్సి ఉంది. ఈ దశలో ధర్మసాగర్‌ చెరువు మరో పక్షం రోజుల్లో డెడ్‌ స్టోరేజీకి చేరనుంది. భద్రకాళి, వడ్డేపల్లి చెరువుల్లో కూడా నీటి మట్టాలు అడుగంటిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వతో మరో నెల రోజుల పాటు సరఫరా చేస్తామని ఇంజనీర్లు చెబుతున్నారు. గత ఏడాది రూ.15 కోట్లు వెచ్చించి ప్రత్యామ్నాయంగా దేవాదుల ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా చేపట్టారు. ఈ ఏడాది అటుపై దృష్టిసారించడం లేదు. నీటి సరఫరాలో కోత.. మూడు రిజర్వాయర్‌లలో నీరు అడుగంటిపోవడంతో నీటి సరఫరాలో కోతలు మొదలు పెట్టారు. వరంగల్‌ ప్రాంతంలోని వ్యవసాయ మార్కెట్‌ రోడ్డులోని మధురానగర్‌ కాలనీ, లక్ష్మి గణపతి కాలనీ, మర్రి చెన్నారెడ్డి కాలనీ, వీవర్స్‌ కాలనీ, తుమ్మలకుంట, ఎన్టీఆర్‌ నగర్‌ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, ఎస్‌ఆర్‌టీ, టీఆర్‌టీ, గరీబ్‌ నగర్, ఎస్‌ఆర్‌ నగర్, రైల్వే గేట్‌ ప్రాంతంలోని రంగశాయిపేట, నాగేంద్ర నగర్, ఖిలా వరంగల్, చంద్రవద కాలనీ, కాశికుంట, హన్మకొండలోని న్యూశాయంపేట, పద్మాక్ష్మి కాలనీ, లక్ష్మిపురం, ప్రకాశ్‌రెడ్డి పేట, స్నే హనగర్, పరిమళ కాలనీ, భీమారం, గుండ్ల సింగారం, సమ్మ య్య నగర్, సగర వీధి, కాజీపేటలోని బాపూజీ నగర్, సోమిడి తదితర కాలనీల్లో రెండు, మూడు రోజు లకోసారి నీటి సరఫరా చేస్తున్నారు. మొన్నటి వరకు వర కు నల్లాలకు గంట పాటు నీళ్లు వచ్చేవి. ఇప్పడు అరగంటకు తగ్గించారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రంగుమారుతున్న నీళ్లు.. గత వారం రోజులుగా నల్లాల ద్వారా రంగుమారిన నీళ్లు వస్తున్నాయి. వడ్డేపల్లి, భద్రకాళి చెరువుల్లో ఉన్న నీళ్లు పచ్చరంగుగా మారాయి. వీటిని సరిగ్గా శుద్ధి చేయకపోవడంతో దుర్వాసన వస్తున్నాయని నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా తాగునీటి నిల్వలు తగ్గుతున్నప్పడు నీళ్లు బురదతో వస్తాయని ఇంజనీర్లే అంటున్నాయి. అయినా వాటివల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా, రసాయనాలు వాడుతున్నామని చెబుతున్నారు. కాలనీల్లో ప్రజలు మాత్రం నల్లా నీళ్లను తాగేందుకు జంకుతున్నారు. ఒండ్రు మట్టి, పచ్చరంగు, నాచు వస్తోందని వాపోతున్నారు. దీంతో మినరల్‌ వాటర్‌ కొనుగోలు చేసి దాహర్తిని తీర్చుకుంటున్నారు. ఎల్‌ఎండీ నీళ్లే దిక్కు.. కరీంనగర్‌ జిల్లా లోయర్‌ మానేరు డ్యాం(ఎల్‌ఎండీ) నుంచి కెనాల్‌ ద్వారా గ్రేటర్‌ వరంగల్‌కు నీళ్లు విడుదల చేయాలి. అందుకోసం కమిషనర్, ఇంజనీరింగ్‌ అధికారులు చొరవ చూపాలి. ఎల్‌ఎండీలో నీళ్లు ఆశాజనంగా ఉన్నాయి. సమ్మర్‌ జలశయాలు అడుగంటుతున్నందున ఇంజనీర్లు మేల్కోవాల్సిన అవసరం ఉంది.

నేటి నుంచి పవర్‌లూం కార్మికుల సమ్మె

08/05/2017: సిరిసిల్ల: కూలీ గిట్టుబాటు కోసం నేతన్నలు పోరుబాట పట్టారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి, కార్మికులకు నెలకు రూ.15 వేల కూలీ వచ్చేట్లు చూడాలని చెప్పినా యజమానులు పెడచెవిన పెట్టడంతో కార్మికులు రోడ్డెక్కారు. కార్మికశాఖ అధికారుల సమక్షంలో యజమానులతో కార్మికులు జరిపిన చర్చలు విఫలం కావడంతో 8వ తేదీ నుంచి సమ్మెకు వెళుతున్నట్లు నేత కార్మిక సంఘ నాయకులు ఇప్పటికే ప్రకటించారు. బలవన్మరణాలకు పాల్పడుతున్న నేత కార్మికుల జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ప్రభుత్వం చేపట్టిన ఉపాధి ఆర్డర్లు పెద్దల ఖాతాల్లోకి వెళుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. కేసీఆర్‌ ఆదేశాన్ని అమలు చేయాలి కార్మికులకు నెలకు కనీసం రూ.15 వేల వేతనం వచ్చేట్లు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు ఆందో ళన బాట పట్టారు. అలాగే కార్మికుల ఆత్మహత్యల నివారణకు, శాశ్వత ఉపాధి కల్పనకు ప్రతి కార్మికుడికి నాలుగు సాంచాలు, వర్క్‌షెడ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. స్తంభించనున్న 35 వేల మరమగ్గాలు రాష్ట్రవ్యాప్తంగా మరమగ్గాలు (పవర్‌లూం) సిరిసిల్లలోనే అధికం. ఇక్కడ 45 వేల మరమగ్గాలున్నాయి. ఇందులో 35 వేల మరమగ్గాలపై పాలిస్టర్‌ వస్త్రం ఉత్పత్తి అవుతుంది. మరమగ్గాలకు అనుబంధంగా వార్ఫిన్, ప్రాసెసింగ్‌ యూనిట్లు పనిచేస్తుంటాయి. వీటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 30 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఒక అంచనా ప్రకారం ఏటా సుమారు రూ.350 కోట్ల విలువైన వస్త్రాన్ని పవర్‌లూంలపై తయారు చేస్తుంటారు. సోమవారం నుంచి పవర్‌లూం కార్మికులు సమ్మెలోకి వెళుతుండడంతో 35 వేల మరమగ్గాలు స్తంభించనున్నాయి.

డిండి ఎత్తిపోతలకు విద్యాసాగర్‌ పేరు!

06/05/2017: హైదరాబాద్‌: ఇటీవల అనారోగ్యంతో మరణించిన రాష్ట్ర ప్రభుత్వ సాగునీటి సలహాదారు ఆర్‌.విద్యాసాగర్‌రావు సేవలకు గుర్తింపుగా నల్లగొండ జిల్లాలో చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకానికి ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో పాటే ఆయన కాంస్య విగ్రహాన్ని జలసౌధలో ఏర్పాటు చేయాలని నిశ్చయించింది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం తరఫున ప్రకటన వెలువడనుందని నీటి పారుదల శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత నీటి పారుదల ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్, కొత్త ప్రాజెక్టుల రూపకల్పనతో విద్యాసాగర్‌రావు విశేష సేవలందించారు. ఇందులో భాగంగానే పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకా లను చేపట్టడంలో ఆయన విశేష కృషి చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే గత నెల 29న విద్యాసాగర్‌రావు మరణం తర్వాత రాష్ట్రంలోని ఒక ప్రాజెక్టుకు ఆయన పేరు పెడతామని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన పుట్టిన నల్లగొండ జిల్లాలోని డిండి ఎత్తిపోతల పథకానికి విద్యాసాగర్‌రావు పేరు పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిసింది. దీనిపై శనివారం జరగనున్న ఆయన సంస్మరణ సభలో ప్రభుత్వం ఓ ప్రకటన చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ఆయన కాంస్య విగ్రహాన్ని జలసౌధలో అలీ నవాబ్‌ జంగ్‌ బహదూర్‌ పక్కన ఏర్పాటు చేయాలని సైతం నిర్ణయించినట్లుగా సమాచారం.

కిషన్‌రెడ్డి అరెస్ట్‌

05/05/2017: ఖమ్మం: నగరంలోని మిర్చి మార్కెట్‌కు ర్యాలీగా వెళ్తున్న బీజేపీ శాసనసభా పక్షనేత కిషన్‌రెడ్డిని శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్‌ చేశారు. గురువారం రాత్రే నగరానికి చేరుకున్న ఆయన స్థానిక హోటల్‌లో బస చేశారు. శుక్రవారం ఉదయాన్నే ర్యాలీ ప్రారంభించడంతో పోలీసులు అయనను అదుపులోకి తీసుకున్నారు. నగరంలో 144 సెక్షన్‌ అమల్లో ఉన్నందున కిషన్‌రెడ్డిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ గణేష్‌ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మిర్చి రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయని కిషన్‌ రెడ్డి అన్నారు.

నిలిచిపోయిన డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు

03/05/2017: నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు నిలిచిపోయాయి. ప్రైవేటు డిగ్రీ కాలేజీలు తమ సెంటర్లలో పరీక్షలను బాయ్‌కాట్‌ చేయడంతో పరీక్షలు నిలిచిపోయాయి. సీబీసీఎస్‌ సెమిస్టర్స్‌ విధానంతో డిగ్రీ, పీజీ యాజమాన్యాలపై 30 శాతం అదనపు భారం పడుతుందని తెలంగాణ ప్రైవేట్‌ డిగ్రీ అండ్‌ పీజీ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. డిగ్రీ, పీజీ ఫీజులు పెరగకపోవడంతో సకాలంలో తమకు రీయింబర్స్‌మెంట్‌ అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు పెరిగే వరకు ఆన్‌లైన్‌ అడ్మిషన్‌లలో పాల్గొనబోం అని ప్రైవేట్‌ డిగ్రీ అండ్‌ పీజీ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ స్పష్టం చేసింది.

రైతులపై కుట్ర కేసులా..?

02/05/2016: ఖమ్మం: ‘‘మిర్చిని అమ్ముకోవడానికి రైతులు మార్కెట్‌కు తెచ్చారు.. ధర లేదని ఆవేశంతో రైతులు ఆందోళన చేస్తే ప్రభుత్వా న్ని కూల్చేందుకు కుట్ర చేశారని కేసులు పెడ తారా’’అంటూ కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేత కుందూరు జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఖమ్మం మార్కెట్‌ను సం దర్శించారు. తర్వాత మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆర్‌జేసీ కృష్ణ, కార్యదర్శి ప్రసాదరావుతో ఘటన జరిగిన తీరుపై మాట్లాడారు. ఈ సం దర్భంగా కాంగ్రెస్‌ నేత లు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మధ్య వాగ్వాదం జరిగింది. అనం తరం ఖమ్మం మార్కెట్‌పై దాడి ఘటనలో అరెస్టయి ఖమ్మం జిల్లా జైలులో ఉన్న రైతు లను కాంగ్రెస్‌ నేతలు కె. జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ వి. హనుమంతరావు తదితరు లు సోమవారం పరామర్శించా రు. జానారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం పంట లకు గిట్టుబాటు ధర ఇవ్వా ల్సిందిపోయి రైతులపట్ల అహం కారంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతులను సంఘ వ్యతిరేక శక్తులుగా ముద్రవేసి జైల్లో పెట్టించిందని, తాము బాధిత కుటుంబాలతో మాట్లాడితే వారు రైతులేనని తేలిందన్నారు. రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించు కోవాలని డిమాండ్‌ చేశారు. కొందరు వ్యా పారులు టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత రైతు లను దోచుకుంటున్నారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన: సీతక్క రాష్ట్రంలో రాక్షసపాలన నడుస్తోందని టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సీతక్క అన్నారు. జైలు లో ఉన్న రైతులను ఆమె పరామర్శించారు.

పెళ్లైన ఐదు రోజులకే..

17/04/2017: వనపర్తి: జిల్లాలో విషాద సంఘటన వెలుగుచూసింది. పెళ్లైన ఐదురోజులకే కట్టుకున్న భార్యను కడతేర్చాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన జిల్లాలోని ఖిలాఘనపురం మండలం కేంద్రంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఆంజనేయులుకి ఐదు రోజుల కింద పారిజాతం అనే యువతితో వివాహం జరిగింది. పెళ్లైన రోజు నుంచే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా దంపతుల మధ్య వాగ్వాదం జరగడంతో.. కోపోద్రిక్తుడైన ఆంజనేయులు రోకలిబండతో పారిజాతం తలపై మోదాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు రక్తపు మడుగులో ఉన్న పారిజాతాన్ని మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించడానికి యత్నిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మహిళలకు మీరే భద్రత - డీఐజీ అకున్‌ సబర్వాల్‌

14/04/2017: మహబూబ్‌నగర్‌ : ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలకు భద్రత లేకుండా పోయింది.. ఇంకా మహిళ బస్సులో ఒంటరిగా ప్రయాణించడానికి భయపడుతోంది. మీకు మేమున్నాం అంటూ భరోసా కల్పించాల్సిన బాధ్యత మన పోలీస్‌శాఖదే.. అని హైదరాబాద్‌ రేంజ్‌ డీఐజీ అకున్‌ సబర్వాల్‌ అన్నారు. పోలీస్‌ శాఖ, పీపుల్‌ ఫర్‌ పారిటి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం మహిళల రక్షణ అనే అంశంపై మూడురోజులపాటు నిర్వహించే వర్క్‌షాప్‌నను డీఐజీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదట పోలీస్‌ అతిథిగృహంలో ఎస్పీ రెమారాజేశ్వరి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి చేరుకోగా సిబ్బంది ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో డీఐజీ సూచనలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన సుమారు 480 అత్యాచార కేసులను పరిశీలిస్తే సమాజంలో మహిళల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ఇతర దేశాల్లో ఎక్కడాలేని విధంగా ఇక్కడి మహిళలు ఈవ్‌టీజింగ్‌ బారిన పడుతున్నారని, ఇలాంటి ఘటనలకు ఇక నాంది పలకలన్నారు. లింగ వివక్ష లేని సమాజ నిర్మాణానికై పోలీస్‌శాఖ ప్రధాన భూమిక పోషించాలని ఆదేశించారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, దాడుల గురించి క్లుప్తంగా తెలుసుకుని వాటిని అరికట్టాడానికి మీవంతుగా కృషి చేయాలని సూచించారు. ఈ వర్క్‌షాప్‌ మహబూబ్‌నగర్‌లో విజయవంతమైతే రాష్ట్రంలో అన్ని సబ్‌ డివిజన్‌లలో ప్రారంభిస్తామన్నారు. గ్రామీణపోలీస్‌ వ్యవస్థ బలపడాలి : ఎస్పీ రమారాజేశ్వరి జిల్లాను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంచుకోవడం శుభ పరిణామమని, శిక్షణ ఇక్కడ విజయవంతం చేసి మహిళల్లో మార్పు తీసుకరావడానికి కృషి చేయాలని కోరారు. గ్రామీణ పోలీస్‌ అధికారి వ్యవస్థను బలోపేతం చేస్తే నేరాలను అదుపు చేయడం సులభమన్నారు. అనంతరం ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతినిధులు ఆధిత్య గుప్తా, మనీషాలు మహిళలపై జరుగుతున్న దాడులు, నివారణపై వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీలు భాస్కర్, శ్రీనివాస్‌రెడ్డి, సీఐలు గిరిబాబు, గంగాధర్, రామకృష్ణ, డివిపిరాజు, వై.రామకృష్ణ పాల్గొన్నారు. మొక్కలు నాటిన డీఐజీ మధ్యాహ్నం జిల్లాకేంద్రంలోని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ను డీఐజీ అకున్‌ సబర్వాల్‌ విజిట్‌ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ ఆవరణంలో మొక్కలు నాటారు. పలు రకాల ఫైల్స్, పెండింగ్‌ కేసులను పరిశీలించారు. స్టేషన్‌ పరిసరాలు శుభ్రంగా ఉండటంతో సీఐ సీతయ్యను డీఐజీ అభినందిచారు.

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

14/04/2017: మహబూబ్‌నగర్‌: వేసవి సీజన్‌లో పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ పట్టణ ప్రజలకు భరోసా కల్పించారు. మున్సిపల్‌ కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌ రాధాఅమర్‌తో కలిసి పట్టణంలోని వెంకటేశ్వర్‌ కాలనీలో ఆయన ఆకస్మిక తనిఖీ చేపట్టారు. పట్టణంలో తాగునీటి సరఫరా విధానంపై ఆయన ఆకస్మిక తనిఖీ చేసి అధికారులకు తగు సూచనలు చేశారు. పట్టణంలో గతంలో 15 రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేసిన దాఖాలాలు లేవని, తాము అ ధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే తాగునీటి ఎద్దడిని పూర్తిగా నివారించగలిగామని అన్నా రు. పట్టణంలో డేబైడే నీటిని పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తాగునీటి పంపిణీపై కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. త్వరలో మిషన్‌భగీరథ పథకం పనులను పూర్తి చేసి పట్టణంలో నిత్యం తాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పైపులైన్‌కు నిధులు పట్టణంలో రూ.167కోట్లతో పైపులైను పనులను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే టెండర్‌ ప్రక్రియ పూర్తి అయిందని, త్వరలోనే పనులను ప్రారంభిస్తామన్నారు. పట్టణంలో రూ. 40కోట్లతో రోడ్లు, డ్రైనేజీల పనులను చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రెండు నెలల్లో పట్టణంలో ఎల్‌ఈడీ స్ట్రీట్‌లైట్లను ఏర్పాటు చేసి పట్టణాన్ని సుందరమయంగా చేస్తామన్నారు. ఇకపై పట్టణంలోని వార్డులలో ఆకస్మికంగా తనిఖీలు నీటి సరఫరాపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది ప్రణాళికబద్దంగా పనిచేయాలని ఆయన సూ చించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌ రాధాఅమర్, కౌన్సిలర్‌ గంజి అంజనేయులు, మున్సిపల్‌ డీఈలు బెంజ్‌మెన్, మధు, సానిటరీ ఇన్సిపెక్టర్లు శ్రీమన్‌నారాయణ, వజ్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

"ఎయిడ్స్ ని తరిమెయ్యాలి"

01/12/2016: మహబూబ్ నగర్(కల్వకుర్తి), సలాం తెలంగాణ: కల్వకుర్తి పట్టణానికి చెందిన స్వామివివేకానంద సేవ బృందం ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా స్థానిక సీ.వి రామన్ పాఠశాల విద్యార్థుల చేత పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బృందం ఉపాధ్యక్షుడు మనీష్ మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావుటకు ర్యాలీ నిర్వహించాం అని తెలిపారు. బృందం సభ్యులు మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిని మన దేశం నుంచి తరిమికొట్టాలి తద్వారా అందరు ఆరోగ్యాంగా ఉంటారు అందుకు ప్రజలు తగు జాగ్రత్తలు చెప్పట్టాలి అని వివరించారు.కార్యక్రమంలో బృందం సభ్యులు మహేష్,సాయి,రాజు,రమేష్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఏపీ తెలంగాణల మధ్య టూర్ వార్

07/11/2016: తెలంగాణ, ఏపీల మధ్య వివాదాలకు ఇంకో కొత్త వివాదం చేరింది. తాజాగా నాగార్జునసాగర్‌లో తెలంగాణ, ఆంధ్ర అనే అంశంపై గందరగోళం ఏర్పడింది. శనివారం టూరిజంపరంగా సాగర్ జలాల సాక్షిగా ఆంధ్రా, తెలంగాణ లాంచీల రాకపోకల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదమేర్పడింది. శనివారం నాగార్జునసాగర్‌లోని తెలంగాణ ప్రాంతం నుండి మొదటిసారిగా తెలంగాణ టూరిజం లాంచీలు నాగార్జునకొండకు పర్యాటకులను తీసుకుని వెళ్లాయి. నాగార్జునకొండకు వెళ్లిన తరువాత ఆంధ్రా ప్రాంతానికి చెందిన అటవీ శాఖ అధికారులు ఆంధ్రా కృష్ణా జలాల్లోకి తెలంగాణ ప్రాంత లాంచీలు వచ్చాయంటూ ఆ లాంచీలను, లాంచీల సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. చివరకు సాయంత్రానికి వారిని వదిలిపెట్టారు. గతంలో రాష్ట్రం విడిపోకముందు ఉన్న లాంచీ స్టేషన్ ఆంధ్రాకు వెళ్లిపోవడంతో రెండున్నర సంవత్సరాల తరువాత తెలంగాణ ప్రాంతం నుండి లాంచీల రాకపోకలను ప్రారంభించారు. సాగర్ సందర్శనకు వచ్చే సందర్శకులు ఎక్కువ శాతం తెలంగాణ ప్రాంతం నుండి ఉంటారు. శనివారం పర్యాటకులను తీసుకెళ్లిన లాంచీలను అడ్డుకుని ఆంధ్రా జలాల్లో తెలంగాణ లాంచీలు తిరగకూడదని చెప్పారు. అయితే... నాగార్జునకొండకు వెళ్లిన సందర్శకులు ఆంధ్రా అటవీ శాఖ సిబ్బందిపై ఎదురు తిరగడంతో చివరికి సాయంత్రం 5 గంటల సమయంలో ఒక లాంచీలో పర్యాటకులను ఎక్కించి తెలంగాణ ప్రాంత లాంచీస్టేషన్‌కు పంపించారు. మరికొంతమందిని అక్కడే ఉంచి మరో లాంచీని స్వాదీనంలో పెట్టుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక టిఆర్‌ఎస్ నాయకులు సాగర్‌లోని తెలంగాణ- ఆంధ్రా వారధి కొత్త బ్రిడ్జిపై రాస్తారోకో, ధర్నా నిర్వహించడంతో భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో నాగార్జునకొండలో నిలిచిపోయిన మరోలాంచిని, ప్రయాణీకులను సైతం సాయంత్రం 6:30 గంటలకు వదిలిపెట్టారు. కాగా, రెండు రాష్ట్రాల గొడవ కారణంగా సందర్శకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

చిన్నబోయిన మహబూబ్‌ నగర్‌ డిపో.. - తొమ్మిది నుంచి రెండుకే పాలమూరు పరిమితం

మహబూబ్‌ నగర్‌, నవంబర్‌ 5,2016 (సలాం తెలంగాణ): జిల్లాల విభజన ప్రక్రియతో టీఎస్‌ ఆర్టీసీలోనూ పాలమూరు జిల్లా చిన్నబోయింది. గతంలో 9డిపోలతో రాష్ట్రంలోనే ముందువరసలో ఉన్న పాలమూరు జిల్లాకు విభజన అనంతరం మహబూబ్‌నగర్‌, నారాయణపేట డిపోలు మాత్రమే మిగిలాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాకు మాత్రం నాలుగు డిపో లు ఉన్నాయి. వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల పరిధిలో ఒక్కో డిపో మాత్రమే ఉంది. 14లక్షల పైచిలుకు జనాభా, 26మండలాలు కలిగిన మహబూబ్‌నగర్‌ జిల్లాకు కేవలం 2డిపోలు మాత్రమే ఉండటంతో రవాణా పరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీం తో జిల్లాలోని మక్తల్‌, కోస్గి ప్రాంతాల్లో నూతనంగా డిపోలు ఏర్పాటు చేయాలని ప్రజల్లో డిమాండ్‌ పెరుగుతుంది.మహబూబ్‌నగర్‌ రీజియన్‌ పరిధిలోని 9డిపోలలో ప్రస్తుతం 889 బస్సులతో సేవలందిస్తున్నారు. వీటిలో 245ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు, 579 పల్లెవెలుగు, 25డీలక్స్‌, 18జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, 25సూపర్‌ లగ్జరీ బస్సులు ఉన్నా యి. మహబూబ్‌నగర్‌లో 137, నారాయణపేటలో 110, వనపర్తిలో 111, గద్వాలలో 108, కల్వకుర్తిలో 99, కొల్లాపూర్‌లో 60, షాద్‌నగర్‌లో 112, నాగర్‌కర్నూల్‌లో 74, అచ్చంపేట లో 78బస్సులు ఉన్నాయి. రీజియన్‌ మొత్తంగా చూస్తే 4260మంది కార్మికులు 9డిపోల పరిధిలో విధు ల్లో ఉన్నారు. మహబూబ్‌నగర్‌ డిపోలో 572 మంది కార్మికులు ఉండ గా, నారాయణపేటలో 485మంది, వనపర్తిలో 549మంది, గద్వాలలో 561మంది, కల్వకుర్తిలో 490మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. కొల్లాపూర్‌లో 290 మంది, షాద్‌నగర్‌లో 518మంది, నాగర్‌కర్నూల్‌లో 356 మం ది, అచ్చంపేటలో 384మంది, మహబూబ్‌నగర్‌ ఆర్‌ఎం కార్యాలయం పరిధిలో 54మం ది కార్మికులు ఉన్నారు. పాలమూరు జిల్లాలోని 9డిపోలను జిల్లాల పునర్విభన అనంతరం కూడా మహబూబ్‌నగర్‌ రీజియన్‌లోనే కొనసాగిస్తూ, కొత్తగా డివిజనల్‌ వ్యవస్థను తీసుకువచ్చారు. దీంట్లో భాగంగా మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ డివిజన్‌లను ఏర్పాటుచేస్తూ, డీవీఎంలను నియమించారు. మహబూబ్‌నగర్‌ డీవీఎం పరిధిలో మహబూబ్‌నగర్‌, నారాయణపేట, షాద్‌నగర్‌, గద్వాల, వనపర్తి డిపోలు ఉండగా, నాగర్‌కర్నూల్‌ డీవీఎం పరిధిలో నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌ డిపో లు ఉన్నాయి. మహబూబ్‌నగ ర్‌ డీవీఎం కార్యాలయం ప్రస్తుత ఆర్‌ఎం కార్యాలయం వద్ద ఏర్పా టు చేసి డీవీఎంగా రాజేంద్రప్రసాద్‌ను నియమించారు. అలాగే నాగర్‌కర్నూ ల్‌ డీవీఎం కార్యాలయాన్ని పాలెం బస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసి డీవీఎంగా మహేష్‌కుమార్‌ను నియమించారు. మహబూబ్‌నగర్‌ రీజియన్‌లోని 9డిపోలను ప్రస్తుత ఆర్‌ఎం సి.వినోద్‌కుమార్‌ సమన్వయం చేస్తారు.

7 నుంచి హెల్మెట్‌ ధారణ తప్పని సరి

మెదక్‌, నవంబర్‌ 5,2016 (సలాం తెలంగాణ): బంకులో ఈ నెల 7నుంచి ద్విచక్రవాహనదారులకు హెల్మెట్‌ ఉంటేనే పెట్రో ల్‌ పోస్తామని బంకు యజమాని ఫక్రొద్దీన్‌ స్పష్టం చేశారు. పోలీసుల ఆదేశాల మేరకు ఈ ని ర్ణ యం తీసుకున్నట్లు చెప్పారు. వాహనదారులు త ప్పకుండా హెల్మెట్‌ ధరించి రావాలని కోరారు. ప్రతి ద్విచక్రవాహనదారుడు ఈ నెల 7 నుంచి తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని ఎస్సైలు రాంబాబు, కృష్ణమూర్తి సూచించారు. మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్‌ వాడకంపై విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్‌ ధరించ కుంటే య ము డు విూ వెంటే అంటూ నినాదాలు చేశారు. హెల్మెట్‌పై పోలీసులు చేస్తున్న ప్రచారం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్‌ ధరించాలని కోరారు. రామిరెడ్డి, బల్ల శ్రీనివాస్‌, బత్తుల లక్ష్మీనర్సింలు, వైస్‌ ఎంపీపీ రాజయ్య పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మె ట్‌ లేకుండా వాహనం నడిపితే జరిమానా లు విధిస్తామని సీఐ శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. మూడోసారి హెల్మెట్‌ లేకుండా పట్టుబడితే డ్రైవిం గ్‌ లైసెన్స్‌ను రద్దు చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని పెట్రో లు బంకుల్లో హెల్మెట్‌ వాడకంపై వాహనదారులకు ఆవగాహన కల్పించారు. హెల్మెట్‌ లేకుండా వాహనం నడపడం ప్రమాదకరమన్నారు. హెల్మెట్‌ వాడి వాహనం నడిపితే ప్రమాదం సంభవించినా ప్రాణాల నుం చి బయటపడే అవకాశం ఉం టుందన్నారు. ద్విచక్ర వాహనదారులు హె ల్మెట్‌ ధరించకుండా పెట్రోలుకు వస్తే పోయరాదని బంకు యజమానులకు సూచించారు.

రఘుపతిపేట మండలానికై 24 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు

05/11/2016: మహబూబ్ నగర్(కల్వకుర్తి), సలాం తెలంగాణ: కల్వకుర్తి డివిజన్ లోని రఘుపతిపేట గ్రామాన్ని మండలముగా చేయాలని 24 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ గ్రామానికి ఎక్కువ విస్తీర్ణం, 15 ఊళ్లు చూట్టూ ఉన్నాయి, జనాబా కూడా ఎక్కువ ఉంది. దీన్ని వెంటనే మండలంగా చేయాలని MRPS నాయకులు ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది.

సిద్ధిపేట జిల్లాకు మహర్దశ

మెదక్‌, నవంబర్‌ 4,2016 (సలాం తెలంగాణ): సిద్దిపేట జిల్లాలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్‌డీఎఫ్‌) నుంచి రూ.110 కోట్లను విడుదల చేసింది ప్రభుత్వం. కొత్త జిల్లాల ఆవిర్భావం నాడు సిద్దిపేట జిల్లాను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌ సిద్దిపేట జిల్లా మౌలిక సదుపాయాల కల్పనకు రూ.100 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు 100 కోట్లకు అదనంగా మరో 10 కోట్లు కలుపుకొని 110 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. అదనంగా విడుదల చేసిన నిధులతో మర్కూక్‌ తహశీల్‌ కార్యాలయానికి మౌలిక వసతుల కల్పనకు వినియోగిస్తారు. సీఎం ఆదేశాల మేరకు రూ. 10 కోట్లు విడుదల చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్య ఉత్తర్వులు జారీ చేశారు. మరో వైపు సిద్దిపేటను నేర రహిత జిల్లాగా చేసేందుకు పక్కా ప్రణాళికతో ముం దుకు వెళుతున్నట్లు కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ శివకుమార్‌ తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడతలో 10 గ్రామాలు ఎంపికచేసి అమలు చేస్తామని అన్నారు. నంగునూరు మండలంలోని మూడు గ్రామాల్లో నవంబర్‌-12 వరకు నేరాలు లేకుండా చూస్తామన్నారు. సిద్దిపేట కమిషనరేట్‌ కొత్తగా ఏర్పాటైన సందర్భంగా పోలీస్‌స్టేషన్లు తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. కమిషరేట్‌ పరిధిలో 442 పైగా గ్రామాలు ఉన్నాయని వీటన్నింటిని నేర రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషిచేయడం జరుగుతుందన్నారు. మొదటి విడతగా 10 గ్రామాలు ఎంపిక చేస్తామని తెలిపారు. రాజగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అక్కెనపల్లి, దర్గపల్లి, మైసంపల్లిలో ఈ నెల 12 వరకు నేరాలు లేకుండా చూస్తామన్నారు. ప్రజలు సహకరిస్తే నంగునూరు మండలాన్ని నేరరహితంగా మార్చుతామన్నారు. పో లీసులతో ప్రజలు భాగస్వాములై శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడాలన్నారు. నేర రహిత గ్రామాలకు ప్రభుత్వ పథకాల మంజూరుకు కృషి చేస్తామన్నారు. రాజగోపాల్‌పేటలో స్పీడ్‌ బ్రేకర్లకు రంగులు వేయి స్తామని, రోడ్లకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామాల్లో అసాంఘిక కార్యక్రమాలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. ఎక్కడైనా నేరాలు జరిగితే వెంటనే పోలీసులకు లేదా తనకు సమాచారం ఇవ్వాలని కోరారు.

అటు జనమైత్రిలు...ఇటు కార్డెన్‌ సెర్చ్‌ లు..

రామగుండం, నవంబర్‌ 3,2016 (సలాం తెలంగాణ): నూతన జిల్లాలైన పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లకు సంయుక్తంగా రామగుండం కేంద్రంగా ప్రభుత్వం పోలీస్‌ కమిషనరేట్‌ ఏర్పాటుచేసింది. రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో జోన్‌లో ఉన్న డీసీపీలు, ఏసీపీల పరిధిలో కిందిస్థాయి ఉద్యోగులు పనిచేయాల్సి ఉంది. కమిషనర్‌ ఆదేశాల మేరకే ఈ రెండు జిల్లాలకు చెందిన పోలీసులు పనిచేస్తారు. అందులో భాగంగా రెండు జిల్లాలలో గ్రేటర్‌ సిటీల్లో అమలయ్యే పోలీస్‌ యాక్ట్‌ అమలవుతుంది. అయితే ఓవైపు మైత్రి అంటునే, మరోవైపు కార్డెన్‌సెర్చ్‌ పేరుతో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. పోలీసులకు అనుమానం కలిగిన ఏదో ఒక కాలనీ, ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రతీ ఇంటిని సోదా చేస్తున్నారు. తనిఖీలను రామగుండం కమిషనరేట్‌ పరిధిలోని గోదావరిఖనిలో ప్రారంభించారు. గోదావరిఖనిలోని చంద్రశేఖర్‌నగర్‌, విఠల్‌నగర్‌, సంతోష్‌నగర్‌, మల్లికార్జున్‌నగర్‌లో నిర్వహించారు. అప్పటి నుంచి మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మండల కేంద్రాల్లో విస్తృత నిర్వహించారు. మంచిర్యాలజిల్లాలోని రాజీవ్‌నగర్‌, ఎన్టీఆర్‌నగర్‌లో, బెల్లంపల్లిలోని సుభాష్‌నగర్‌ సోదాలు నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షణ్ణంగా సోదా చేస్తూ ఇంట్లో ఉన్నవారి వివరాలు, వాహనాల వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ధృవీకరణ పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. గుడుంబా స్థావరాలు, బెల్ట్‌షాపులపై పంజా విసురుతున్నారు. కానీ పెద్దపల్లి, మంచిర్యాల వంటి జిల్లాల్లో సిటీ తరహాలో పరిస్థితులు లేవు. పెద్దపల్లి, మంచిర్యాలలోని సగం మండలాలు గ్రావిూణ ప్రాంతాలే. అయినప్పటికీ పెద్దపల్లి జిల్లాలో రామగుండం నగరం కావడం, సింగరేణి ప్రాంతం కావడం నేరాల సంఖ్య అధికంగా నమోదు కావడం వల్ల ప్రభుత్వం రామగుండం కేంద్రంగా పోలీస్‌ కమిషనరేట్‌ ఏర్పాటుచేసింది. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని పోలీసులు ఈ కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్నారు. రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో పోలీసులు జనమైత్రి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు అవగాహన సమావేశాలు నిర్వహిస్తూ, పోలీసులు, ప్రజలకు మధ్య సస్సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు. పట్టణ, గ్రావిూణ ప్రాంతాలు అనే తేడా లేకుండా అన్ని మండలాల్లో జనమైత్రి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్‌, సుల్తానాబాద్‌, పెద్దపల్లి, ఓదెల, మంథని, ముత్తారం మండలాల్లో ఇప్పటికే జనమైత్రి కార్యక్రమాలు నిర్వహించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఓవైపు జనమైత్రి కార్యక్రమాలు నిర్వహించి ప్రజలతో స్నేహం పెంచుకుంటున్నప్పటీకీ మరోవైపు కార్డెన్‌సెర్చ్‌ పేరుతో ప్రజలను వణికిస్తున్నారు. కార్డెన్‌సెర్చ్‌ పేరుతో ఇండ్లల్లోకి దూరి పోలీసులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రతి ఇంటిని సోదా చేయడంతో సామాన్య ప్రజలు, రైతులు బెంబేలెత్తుతున్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో అసాంఘీక కార్యక్రమాలేంటని, మట్టిమనుషుల్ని ఇబ్బందులకు గురిచేయడం, వారి ఇండ్లు సోదాలు చేయడంపట్ల సర్వత్ర తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రైతుబజార్‌ లో ఆధునిక సౌకర్యాలు - మంత్రి హరీష్‌ రావు

సిద్దిపేట, నవంబర్‌ 2,2016 (సలాం తెలంగాణ): సిద్దిపేట పట్టణంలో ఆధునిక సౌకర్యాలతో రైతుబజార్‌ ను పునర్మిచటం జరుగుతుందని రాష్ట్ర నీటిపారుదల మార్కెట్‌ శాఖ మంత్రి టి.హరీష్‌ రావు అన్నారు. సిద్దిపేటలో 3కోట్ల పునర్మించనున్న రైతుబజార్‌ కు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రైతు బజార్‌ నిర్మాణ మ్యాపులుగా పరిశీలిస్తూ పాత రైతుబజార్‌ స్థానంలో కొత్త రైతుబజార్‌ ను ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటుచేయటం జరుగుతుందన్నారు. ఇందులో 200 కు పైగా స్టాళ్ళు ఏర్పాటు, ఆర్‌,ఓ. వాటర్‌ ప్లాంట్‌, మరుగుదొడ్లు, సెల్లార్‌ పార్కింగ్‌, లిప్ట్‌ ఉంటాయని పేర్కొన్నారు. పట్టణ ప్రఅజలకు ఈ సేవలు నిర్మాణం పూర్తియిన తర్వాత అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అనంతరం ప్రభుత్వం పాత ఉన్నత పాఠశాలలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రైతుబజార్‌ ను మంత్రి సందర్శించారు.తాత్కాలిక స్టాళ్ళలో కూరగాయలు, పండ్లు అమ్ముతున్న మహిళ రైతులతో ముచ్చటించారు.ఎన్ని ఎకరాలలో కూరగాయల పెంపకం చేపట్టారు. ఎంత పెట్టుబడి ఖర్చు అయినది, ప్రస్తుతం ఎంత లాభం వస్తోందన్నవివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్దిగా కురిసి చెరువులు, కుంటలు నిండినందున నీటి కొరత ఉండదని, కూరగాయలు, పండ్లు, పూల పెంపకం విరివిగా చేపట్టవచ్చునని సూచించారు. ఎమ్యేల్సీ షారూఖ్‌ హుస్సేన్‌, మున్సిపల్‌ చైర్మైన్‌ కె. రాజనర్సు , జాయింట్‌ కలెక్టర్‌ ఎం. హన్మంతరావు, మార్కెటింగ్‌ శాఖ అధికారులు మల్లేషం, సంతోష్‌ కుమార్‌ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణకు రెండో హైద్రాబాద్‌ గా వరంగల్‌

వరంగల్‌, నవంబర్‌ 2,2016 (సలాం తెలంగాణ): హైదరాబాద్‌ తర్వాత తెలంగాణలో రెండో అతిపెద్ద నగరం వరంగల్‌ అని అందుకే దాన్ని అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో సీఎం ఉన్నారని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. జయశంకర్‌, కాళోజీ పుట్టిన గడ్డను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హావిూ ఇచ్చారు. కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా మర్రి యాదవరెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ ప్రసంగించారు. ఈ గడ్గపై పుట్టిన ఆచార్య జయశంకర్‌ కేసీఆర్‌కు అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన కేంద్రం ఆమోదంతో వరంగల్‌ స్మార్ట్‌ సిటీగా ఎంపికైందన్నారు. వరంగల్‌ నగరానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఐదేళ్లలో రూ.2 వేల కోట్ల నిధులు వస్తాయని తెలిపారు. వరంగల్‌ నగర పాలిక సంస్థలో విలీనమైన గ్రామాల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. హైదరాబాద్‌లోని హుడా లాగా కుడా కూడా అభివృద్ది సాధించాలన్నారు. వరంగల్‌ ప్రాధాన్యతను గుర్తించి వరంగల్‌కు ఐటీ, ఇతర పరిశ్రమలు వచ్చేలా చేస్తున్నామన్నారు. హెచ్‌ఎండీఏ లాగా కుడా కూడా అత్యంత కీలక పాత్ర నిర్వహించబోతోందన్నారు..తెలంగాణ ఉద్యమానికి ఓరుగల్లు నగరం ఊపిరిగా నిలిచిందని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. అందుకే సీఎం కేసీఆర్‌కు వరంగల్‌ నగరమంటే ప్రత్యేక అభిమానమని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్‌ వాసులు అగ్రగామిగా నిలిచారన్నారు. అందుకే సీఎం కేసీఆర్‌ వరంగల్‌కు పెద్దపీట వేశారన్నారు. ఇవాళ మర్రి యాదవరెడ్డి కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన సందర్బంగా మంత్రి మాట్లాడారు. ఇక్కడ నుంచి ఎంతో మందికి నామినేటెడ్‌ పోస్టులు ఇచ్చారని తెలిపారు. ఇంకా చాలా మందికి ఇస్తారని తెలిపారు. చాలా మందికి అవకాశాలు వచ్చాయని, ఇంకా కొందరికి అవకాశాలు రావాల్సి ఉందని తెలిపారు. కొందరికి న్యాయం జరిగింది, మరి కొందరికి న్యాయం జరగాల్సి ఉందని పేర్కొన్నారు. ఇంకా కొన్ని నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేసే ఆలోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నారని అపుడు మరి కొందరికి అవకాశాలు వస్తాయని తెలిపారు. నాయకులు కొంత ఓపికగా ఉండాలని కోరారు.వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. టెక్స్‌టైల్‌ పార్క్‌ కోసం 12 వందల ఎకరాల భూసేకరణ చేశామని, ఇతర అవసరాల కోసం మరో మూడు వందల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. త్వరలో కేంద్ర టెక్స్‌టైల్‌ శాఖ మంత్రిని పిలిచి టెక్స్‌టైల్‌ పార్క్‌ను ప్రారంభింపజేస్తామన్నారు. దీంతో స్థానిక యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు దొరుకుతాయన్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు.తెలంగాణలో పండించే పత్తి ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని పేర్కొన్నారు. 60 లక్షల బేళ్ల పత్తి పండిస్తే పది లక్షల బేళ్లు మనం వినియోగించుకుంటున్నామని 50 లక్షల బేళ్లు ఎగుమతి చేస్తున్నామని వివరించారు

సిండికేట్లవుతున్న కాంట్రాక్టర్లు....నాణ్యతకు తిలోదకాలు

వరంగల్‌, నవంబర్‌ 2,2016 (సలాం తెలంగాణ): వరంగల్‌ మహా నగరపాలక సంస్థలో అభివృద్ధి పనులకు నాణ్యత సమస్య పట్టుకుంది. కాంట్రాక్టర్లు ఒక్కటై ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ టెండరు ప్రక్రియను అభాసుపాలు చేస్తున్నారు. ప్రతి పనిలోనూ పోటీ లేకుండా పోతుండడంతో జీడబ్ల్యూఎంసీ నిధులు ఎక్కువగా ఖర్చవుతున్నాయి. జీడబ్ల్యూఎంసీ పనులు చేసే కాంట్రాక్లర్లలో వరంగల్‌ తూర్పు నియోజకవర్గానికి ప్రత్యేకంగా మరో సిండికేట్‌ ఉన్నట్లు ప్రభుత్వ నిఘా వర్గాల నివేదిక చెబుతోంది. చట్టసభకు ప్రాతినిథ్యం వహించే కీలక ప్రజాప్రతినిధి సహకారంతో వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలోని కాంట్రాక్టర్లు ఈ?ప్రొక్యూర్‌మెంట్‌ టెండరు స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారు. మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో కాంట్రాక్టర్లు ఒక్కటై పనులు తీసుకుంటున్నారు. ఈ నాలుగు సెగ్మెంట్లలో ప్రతి పనిలో ఎనిమిది శాతం చొప్పున మొత్తాన్ని పక్కనపెడుతున్నారు. వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలోని పనులకు మాత్రం లెక్క ఇంకా ఎక్కువగా ఉంది. ప్రతి పనిలోనూ 10 శాతం మొత్తాన్ని పక్కనపెడుతున్నారు. జీడబ్ల్యూఎంసీ చేపట్టే అభివృద్ధి పనుల్లో ఎక్కువ శాతం వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలోనే జరుగుతున్నాయి. మిగిలిన నియోజకవర్గాలతో పోల్చితే జనాభా ఎక్కువగా ఉండడం.. మౌలిక వసతుల పరంగా వెనకబడి ఉండడంతో ఎక్కువ నిధులు ఈ సెగ్మెంట్‌లోనే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. దీనిని కొందరు కాంట్రాక్టర్లు అవకాశంగా తీసుకుంటున్నారు. పనుల్లో 10 శాతాన్ని పక్కనపెట్టేందుకు అంగీకరిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు 8 శాతం వరకు ముట్టజెప్పి మిగిలిన రెండు శాతాన్ని సంక్షేమ నిధికి మళ్లిస్తున్నారు. పది శాతం నిబంధన అమలు విషయంలో వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలోనీ కీలక ప్రజాప్రతినిధి తమకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు కొందరు కాంట్రాక్టర్లే చెబుతున్నారు. మిగిలిన నియోజకవర్గాలతో పోల్చితే కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ఎక్కువ శాతం నిధులను పక్కనబెట్టాల్సి రావడంతో పనుల్లో నాణ్యత తగ్గిపోతోందని చెబుతున్నారు. జీడబ్ల్యూఎంసీలో గతంలో ఎప్పుడూ ఇలా లేదని అంటున్నారు. జీడబ్ల్యూఎంసీ నిధులతో చేపట్టే పనుల్లో నాణ్యతాలోపాలపై దృష్టి సారించి చక్కదిద్దాల్సిన ప్రజాప్రతినిధులే కాంట్రాక్టర్లకు శాతాలు నిర్ణయించడం కొత్తగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది

మంచిర్యాల కార్పొరేషన్‌ గా మారుతోందంటూ ప్రచారం

అదిలాబాద్‌, నవంబర్‌ 2,2016 (సలాం తెలంగాణ): మంచిర్యాల జిల్లా కేంద్రంగా మారడంతో ఇక మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌పై ప్రజల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. కార్పొరేషన్‌గా మారితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే నిధులు మూడింతలు అవుతాయి. పథకాలు మరింత చేరువవడంతో సేవలు పెరిగే అవకాశాలుంటాయి. అన్ని అర్హతలూ ఉండడంతో కార్పొరేషన్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. పట్టణం చుట్టూ ఉన్న సవిూప గ్రామాలు ఇప్పటికే మంచిర్యాలతో కలిసి ఉన్నాయి. జనాభా 1.15 లక్షలకు పైగా ఉంది. జిల్లా కేంద్రం కావడంతో మరో 35 వేల వరకు పెరిగే అవకాశం ఉంది. సవిూప గ్రామాలను కలిపితే మరో 1.50 లక్షల జనాభా కలుస్తుంది. కార్పొరేషన్‌గా మారేందుకు మున్సిపాలిటీ జనాభా 3 లక్షలకు సరిపడా పెరుగుతుంది. కార్పొరేషన్‌గా మారి, సవిూప గ్రామాలు పట్టణంలో కలిస్తే, రోడ్లు, డ్రెయినేజీలు, విద్యుత్‌ సౌకర్యం, తాగునీటి వసతి, పారిశుధ్యం మెరుగుపడుతాయి.ఉమ్మడి జిల్లాలో తూర్పు జిల్లా కేంద్రంగా మంచిర్యాల పట్టణం దినదినాభివృద్ధి చెందింది. గ్రేడ్‌-1 మున్సిపాల్టీగా మారిం ది. సింగరేణికి కేంద్రంగా ఉన్న శ్రీరాంపూర్‌లో పని చేసే ఉద్యోగులు, కార్మికులు, వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది మంచిర్యాలలో స్థిరపడ్డారు. దీనికి తోడు దాదాపుగా దేశంలోని అన్ని రాష్ట్రాలను కలుపుతూ రైలు మార్గం కూడా ఉంది. దీంతో ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోంది. మూడో గ్రేడ్‌ మున్సిపాలిటీగా 1952లో ఏర్పడింది. రైలు మార్గం ఉండడం, వేగంగా అభివృద్ధి చెందడం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు ఇక్కడ స్థిరపడడం, బల్దియా ఆదాయం పెరగడంతో 1998లో రెండో గ్రేడ్‌ మున్సిపాలిటీగా మారింది. సింగరేణి ప్రాంతానికి చెందిన వారు మంచిర్యాలలో స్థిరపడడంతో జనాభా పెరిగి.. పట్టణం విస్తరించింది. జీవో ఎంఎస్‌ నంబర్‌ 378 ద్వారా ఏప్రిల్‌ 17, 2004న అప్పటి ప్రభుత్వం గ్రేడ్‌ వన్‌ మున్సిపాల్టీగా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక అప్పటి నుంచి మంచిర్యాల అభివృద్ధి పథంలో దసూకుపోతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండేళ్ల క్రితం రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీ అవార్డు దక్కించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు సైతం పొంది, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అమృత్‌ టౌన్‌గా ఎంపికైంది. కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 87,500 ఉందని, లక్షలోపు జనాభా ఉందన్న కారణంతో అమృత్‌టౌన్‌ పథకం నుంచి తొలగించారు. దీంతో పట్టణ ప్రజల్లో నిరాశే మిగిలింది. అమృత్‌టౌన్‌గా గుర్తింపు పొందితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు, పలు పథకాలు వచ్చే అవకాశం ఉండేది. ప్రస్తుతం పట్టణ జనాభా 1.15 లక్షలకు పైగా ఉన్నా, 2011 జనాభా లెక్కల ప్రకారంగానే ఇంకా గుర్తించడంతో ఓ చక్కటి అవకాశాన్ని చేజార్చుకున్నట్లయింది. కార్పొరేషన్‌గానైనా మారుస్తారన్న ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు. సెంట్రల్‌ డిపార్టుమెంట్‌, అర్బన్‌ డిపార్టుమెంట్‌ నుంచి పలు స్కీంలు, నేషనల్‌ వాటర్‌ ప్రాజెక్టు స్కీంలు వస్తాయి. ప్రస్తుతం గ్రేడ్‌ 1 మున్సిపాలిటీకి వస్తున్న నిధులు మూడు రెట్లకు పైగా పెంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తాయి. స్మార్ట్‌సిటీగా ఆవిర్భవించేందుకు అవకాశం ఉంటుంది. కార్పొరేషన్‌గా మారినా, మున్సిపాలిటీ పరిధిలోని ఇంటి పన్నులే కాకుండా, ఏ ఇతర పన్నుల విషయంలో ప్రజలపై ఎలాంటి అదనపు భారం పడకుండానే, సేవలు పెరిగి ప్రజలకు మేలు కలుగుతుందని మంచిర్యాల మున్సిపల్‌ కమిషనర్‌ తేజావత్‌ వెంకన్న తెలిపారు. సవిూప గ్రామాలు విలీనం చేయడం ద్వారా అక్కడి ప్రజల జీవనశైలి మారడంతో అక్కడి ప్రాంతాలు అభివృద్ధి దిశగా పయనిస్తాయి. ఏదేమైనా జిల్లా కేంద్రంగా మారిన మంచిర్యాల కార్పొరేషన్‌గా మారాలన్న ఇక్కడి ప్రాంత ప్రజల కల నెరవేరేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాల్సిన అవసరం ఉంది.

మాటలకే పరిమితమైన చెల్లింపులు

నల్లగొండ, నవంబర్‌ 2,2016 (సలాం తెలంగాణ): ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ రంగ సంస్థలు ఆలస్యంగానైనా జోరు పెంచాయి. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఐకెపి, పిఏసిఎస్‌ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు జోరు పెంచిన పౌరసరఫరాల సంస్థ రైతులకు ధాన్యం డబ్బుల చెల్లింపుల్లో మాత్రం ఆన్‌లైన్‌తో తంటాలు పడుతోంది. మూడు జిల్లాల పరిధిలో 2 లక్షల 75 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు జరపాలని లక్ష్యంగా నిర్ణయంచింది. మూడు జిల్లాల పరిధిలో 6 కోట్ల 18 లక్షల ధాన్యం కొనుగోలు చేయగా కేవలం 8 లక్షల రూపాయలను మాత్రమే రైతులకు చెల్లించడం గమనార్హం. నల్లగొండ జిల్లా పరిధిలో 55 కేంద్రాల ద్వారా కొనుగోలు జరపాలని నిర్ణయించి ఇప్పటికే 36 కేంద్రాలను తెరిచారు. 14,793 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా 2 కోట్ల 22 లక్షల చెల్లింపులకుగాను ఇప్పటిదాకా కేవలం 4 లక్షల రూపాయలు మాత్రమే రైతుల ఖాతాలకు బదిలీ చేశారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల పరిధిలో పౌరసరఫరాల సంస్థ డిఎంల ఆన్‌లైన్‌ ఖాతాలు తెరవడంలో జాప్యం జరుగుతుండడంతో రైతులకు ధాన్యం డబ్బుల చెల్లింపు సైతం జాప్యం జరుగుతోంది. 48 గంటల చెల్లింపు మరోసారి ప్రకటనకే పరిమతమైంది. మాతృ జిల్లా నల్లగొండ డిఎం ఖాతా నుండే మూడు జిల్లాల రైతుల ధాన్యం డబ్బుల చెల్లింపులు ప్రారంభించాలని నిర్ణయించారు. యాదాద్రి భువనగిరిలో జిల్లాలో 86 కేంద్రాలకు 76 కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభించగా ఇప్పటిదాకా 26 వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయగా 3 కోట్ల 96 లక్షల మేరకు చెల్లింపులు చేయాల్సివుంది. సూర్యాపేట జిల్లాలో సైతం 25 కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించి ఇప్పటిదాకా 13 కేంద్రాలు తెరిచారు. వేయి మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయగా లక్షన్నర రూపాయల బకాయి రైతులకు చెల్లించాల్సివుంది.ఖరీఫ్‌ సీజన్‌ కస్టమ్‌ మిల్లింగ్‌ ఈ దఫా తెలంగాణలోనే తొలుత నల్లగొండ జిల్లా నుండి ఆరంభించారు. గత రబీకి సంబంధించి మిల్లర్ల నుండి రావాల్సిన కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యం లక్షా 64 వేల మెట్రిక్‌ టన్నులను పూర్తిగా రాబట్టి విజయవంతమైంది. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ధాన్యం కొనుగోలు సాగుతుండడంతో మిల్లర్లకు కస్టమ్‌ మిల్లింగ్‌కు ధాన్యాన్ని అప్పగించే ప్రక్రియ ప్రారంభించగా ఇప్పటికే 210 మెట్రిక్‌ టన్నుల బియ్యం పౌరసరఫరాల సంస్థకు చేరడం విశేషం.

రెవిన్యూ డివిజన్‌ కోసం కొనసాగుతున్న రిలే నిరహారదీక్షలు...

01/11/2016: వనపర్తి (ఆత్మకూర్‌), సలాం తెలంగాణ : నూతన వనపర్తి జిల్లాలోని ఆత్మకూర్‌ పట్టణంలో రెవిన్యూ డివిజన్‌ కోసం గతవారం రోజుల నుండి రిలేనిరహారదీక్షలు కొనసాగుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఎలాంటి మార్పులు లేవని తెలియపరిచినా రెవిన్యూ డివిజన్‌కోసం దీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం ఆరవరోజు మాజీ శాసనసభ్యులు స్వర్ణసుధాకర్‌ సందర్శించి మద్దతు తెలిపారు. అదేవిధంగా ఏడవరోజు పట్టణ చిరువ్యాపారస్తులు దీక్షలో కుర్చోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నిర్వహాకులు మాట్లాడుతూ ఆత్మకూర్‌ పట్టణంలో రెవిన్యూ డివిజన్‌కు అవసరమైన అన్నివసతులువున్నాయి. ప్రధానంగా జూనియర్‌ సివిల్‌ కోర్టు మరియు ట్రెజరరీ కార్యాలయం, భూమి రిజిస్ట్రేషన్‌ కార్యాలయం, బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం, అనేక కార్యాలయాలు వున్నందున ఆత్మకూర్‌ను రెవిన్యూ డివిజన్‌ను ఏర్పాటుచేయాని కొరుతున్నారు. ఇదే రోజు ఉదయం వనపర్తి జిల్లా కలెక్టర్‌ శ్వేతమహంతి అకస్మిక తనిఖీ నిమిత్తం మేడపల్లి గ్రామపాఠశాలను సందర్శించి తిరుగు ప్రయాణంలో దీక్ష ప్రాంతానికి చేరుకోగా అక్కడి దీక్షనాయకులు వినతిపత్రాన్ని సమర్పించారు. అదేవిధంగా మాజీ శాసనసభ్యులు కె. దయాకర్‌రెడ్డి సందర్శించి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేధిక నాయకులు ఐ. శ్రీనివాసులు, గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌, యువజన సంఘ నాయకులు,వ్యాపార సంస్థ నాయకులు పాల్గొన్నారు.

కట్టుకున్న భర్తే కాలయముడై..

01/11/2016: గోదావరిఖని(పెద్దపల్లి జిల్లా): కట్టుకున్న భర్తే కాలయముడై అతికిరాతకంగా భార్యను హత్య చేశాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆదివారం జరిగింది. వివరాలు కళ్యాణ్ నగర్లోని ఊర్వశి థియేటర్ సమీపంలో నివాసం ఉంటున్న ప్రవీణ్ గుప్తా, సరిత రాణిల వివాహం 2013 లో జరిగింది. మొదటి నుంచి వీరిరువురికి తరచు గొడవలు జరుగుతూ ఉండేవని స్థానికులు చెబుతున్నారు. కుల పెద్దలు సర్ది చెప్పినా ప్రవీణ్ గుప్తా మారటం లేదని, ఇదే క్రమంలో వీరి గొడవలు ఆదివారం తార స్థాయికి చేరాయి. దీపావళి కావడంతో పూజ చేస్తున్న సరితపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి, గొంతు కోసి హతమార్చాడు. ప్రవీణ్ గుప్తా తన మూడు సంవత్సరాల కుమారున్ని తనకు అప్పచెప్పి.. భార్యను చంపేశాను, పోలీసులకు లొంగి పోతున్నానని వెళ్లిపోయాడని హతుని వదిన తెలిపారు. ఏమి జరిగిందో తెలియక అమాయకంగా చూస్తున్న మృతురాలి బాబుని చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు . సంఘటన స్థలానికి 1వ టౌన్ సి .ఐ .వెంకటేశ్వర్లు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దళారుల దోపిడీని అడ్డుకోవాలి - భట్టి

28/10/2016: ఖమ్మం అగ్రికల్చర్: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో దళారుల దోపిడీని అరికట్టాలని తెలంగాణ కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం అఖిలపక్షాల నాయకులతో కలిసి మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పత్తి రైతులతో మాట్లాడి ఇబ్బందులను తెలుసుకున్నారు. పత్తికి డిమాండ్ తగ్గిందంటూ దళారులు, వ్యాపారులు కలిసి రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. పత్తి క్వింటాలుకు రూ.7,500 చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నేతలు పాల్గొన్నారు.

కరీంనగర్‌లో పోలీసుల కార్డన్‌ సెర్చ్

25/10/2016: కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో పోలీసులు కార్డన్‌ సెర్చ్ చేపట్టారు. మంగళవారం వేకువజామున నుంచి 7.30 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. సీపీ కమలాసన్‌రెడ్డి నేతృత్వంలో 50 మంది పోలీసులు జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ఇల్లిల్లూ సోదా జరిపారు. ఈ సందర్భంగా 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేని 20 బైకులు, 2 కార్లు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా క్వింటాలు సీజ్ చేశారు. సోదాల్లో ఏసీపీ రామారావు, సీఐలు హరిప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి, సదానందం పాల్గొన్నారు.

బిల్డింగ్‌పై నుంచి దూకి మెడికో ఆత్మహత్య

25/10/2016: నల్లగొండ: నల్లగొండ జిల్లాలో వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉస్మానియాలో మంచి ర్యాంకు సాధించి సీటు సంపాదించిన సాయికుమార్‌ రెడ్డి అనే వైద్య విద్యార్థి తన నివాసంలోని బిల్డింగ్‌పై నుంచి దూకేశాడు. దాంతో అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, అతడు అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మెడిసిన్‌ చదవడం ఇష్టం లేకనే సాయికుమార్‌ ఆత్మహత్య పాల్పడినట్టు బంధువులు చెబుతున్నారు. ఘటనా స్థలిలో ఎక్కడా కూడా సూసైడ్‌ నోట్‌ ఎలాంటి సమాచారం లభించలేదు. మెడికో సాయికుమార్‌ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కరీంనగర్‌లో బాంబుల కలకలం

25/10/2016: కరీంనగర్: జిల్లా కేంద్రంలో మంగళవారం బాంబుల కలకలం రేగింది. కరీంనగర్ నడిబొడ్డులోని జ్యోతినగర్‌లో గల ఓ గ్రౌండ్‌లో మంగళవారం ఉదయం మున్సిపాలిటీ సిబ్బందికి చెత్తతీసే సమయంలో రెండు గ్రెనేడ్లు కనిపించాయి. ఈ విషయాన్నిసిబ్బంది పోలీసులకు తెలియజేశారు. సంఘటనాస్థలానికి బాంబ్ స్క్వాడ్‌తో చేరుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించి రెండు గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఏమైనా పేలుడు పదార్ధాలు ఉన్నాయా అనే అనుమానంతో ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.

ఎప్పుడైనా కరెంట్ సరిగా ఇచ్చారా? - కాంగ్రెస్ నేతలపై మంత్రి హరీశ్‌రావు ధ్వజం

25/10/2016: సూర్యాపేట/నకిరేకల్: కాంగ్రెస్ నాయకులకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ట్యాంక్‌బండ్, కూరగాయల మార్కెట్, నకిరేకల్‌లో నిమ్మ మార్కెట్, మినీ ట్యాంక్‌బండ్ పనులను మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఒక్కనాడైనా కరెంటు సరిగా ఇచ్చారా అని ప్రశ్నించారు. రైతులకు ఏనాడూ నాణ్యమైన కరెంటు ఇవ్వలేదని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక దేశానికి అన్నంపెట్టే రైతన్న బాగుండాలని పరిశ్రమలను వదిలి ముందుగా రైతాంగానికి తొమ్మిది గంటలు కరెంటు ఇచ్చారన్నారు. ఈ ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం మీద లేనిపోని అపనిందలు వేస్తున్నారని, ఆయన మంత్రిగా ఉన్న కాలంలో డిండి ఎత్తిపోతల, ఫ్లోరైడ్ గురించి ఏనాడూ పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. అదే ఆయన ఆంధ్రాకు మూడో పంట నీరిచ్చే పులిచింతలను దగ్గరుండి కట్టించారని విమర్శించారు. ఇప్పుడు ప్రాజెక్టులు కడుతుంటే అడ్డుకుంటున్నారని.. భూములు ఇవ్వొద్దని హైకోర్టులో కేసులు వేస్తున్నారని.. ప్రతిపక్షం వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను విస్మరించిన కాంగ్రెస్ నాయకులు ఇన్నాళ్లుగా ఢిల్లీ పెద్దలకు.. ఆంధ్ర నాయకులకు సద్దులు మోయ డంతోనే సరిపెట్టుకున్నారని హరీశ్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి మహారాష్ట్రతో చేసుకున్న చరిత్రాత్మక ఒప్పందంతో మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తవుతుందని.. దీంతో వరంగల్, సూర్యాపేట ప్రాంతాలకు నీరందుతుందన్నారు. కాళేశ్వరం నుంచి మిడ్‌మానేరు.. ఎల్‌ఎండీసీ అక్కడి నుంచి ఎస్సారెస్పీకి నీరొస్తుందని.. దీంతో ఈ ప్రాంతంలోని ప్రతి చెరువును గోదావరి జలాలతో నింపవచ్చన్నారు. ‘విపక్షం గల్లంతు ఖాయం’ కాంగ్రెస్ పెద్ద నాయకులకు ఏమి మాట్లాడాలో అర్థం కావడం లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. పొద్దున ఒక మాట.. సాయంత్రం ఒక మాట మాట్లాడుతూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్ నేతలు బట్టలు చింపుకొని రోడ్లపై తిరగాల్సిన రోజులు రానున్నాయని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తిస్థాయి లో అమలు చేస్తామని.. రానున్న రోజుల్లో అసలు ప్రతి పక్షం మిగలదన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన సభలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, అటవీ శాఖ రాష్ట్ర చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎమ్మెల్సీ రవీందర్ పాల్గొన్నారు.

నయీమ్‌తో శ్రీధర్‌బాబుకు లింకు - పుట్ట మధు

25/10/2016: మంథని: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు సంబంధాలు ఉన్నాయని పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. మంథనిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దీనిపై విచారణ కోసం సీఎం కేసీఆర్, డీజీపీ అనురాగ్‌శర్మకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మాజీ నక్సలైట్ జడల నాగరాజు ఆచూకీ లేకుండా పోయూడనిడన్నారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావు హత్యకేసులో సంబంధాలు ఉన్న వ్యక్తులను హతమార్చేందుకు శ్రీధర్‌బాబు నయీమ్‌తో దోస్తీ చేసినట్లు ఆరోపణలున్నాయని అన్నారు. తాను ఎమ్మెల్యే కాక ముందు హత్యకు కుట్ర జరిగిందని చెప్పారు. ఆరోపణలు సరికాదు : శ్రీధర్‌బాబు గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో తనకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేయడం సరికాదని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. తన తప్పులను కప్పి పుచ్చకోవడానికి ఎమ్మెల్యే పుట్ట మధు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారన్నారు.

మధ్యాహ్న భోజనం పెట్టకుంటే డబ్బులివ్వాలి! - వరుసగా 3 రోజులు పథకం అమలుకాని స్కూళ్లకు వర్తింపు

22/10/2016: హైదరాబాద్: రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం పథకం అమల్లో సంస్కరణలు తెచ్చేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఆహార భద్రత చట్టం నిబంధనలకు అనుగుణంగా పథకం నిబంధనలను మార్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా స్కూ లు విద్యార్థులకు వరుసగా మూడు రోజుల పాటు భోజనం పెట్టకపోతే ఆ పథకాన్ని అమలు చేసే స్కూలు (విద్యాశాఖ) సంబంధిత విద్యార్థులకు ఆ మూడు రోజులకు విద్యార్థులకు అయ్యే ఖర్చును చెల్లించాల్సి ఉంటుంది. అంటే పాఠశాలలో ఒక్కో విద్యార్థిపై ఎంత మొత్తాన్ని ఖర్చు చేస్తారో ఆ మొత్తాన్ని చెల్లించేలా నిబంధనల్లో విద్యాశాఖ మార్పులు చేస్తోంది. రోజూ 200 గ్రాముల చొప్పున బియ్యానికి అయ్యే ఖర్చుతోపాటు ఒక్కో విద్యార్థికి అవసరమయ్యే కూరగాయలు, వండిపెట్టేందు కు రోజుకు ఇస్తున్న రూ. 4.70 చొప్పున మొత్తంగా మూడు రోజులకు రూ. 31కిపైగా సంబంధిత పాఠశాల చెల్లించాల్సి ఉంటుం ది. అలాగే మూడు రోజులపాటు భోజనం ఎందుకు పెట్టలేదన్న విషయంలో తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయట్లేదన్న ఆరోపణలు వస్తుండటంతోపాటు 10 మంది, 20 మంది లోపు విద్యార్థులున్న స్కూళ్లలో ఎక్కువ మంది విద్యార్థులను చూపుతూ ఏజెన్సీలు, సిబ్బంది బిల్లులు కాజేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ ఈ నిర్ణయానికి వచ్చింది. మరోవైపు నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించకపోయినా, తప్పిదాలకు పాల్పడినా మధ్యాహ్న భోజనం వండిపెట్టే ఏజెన్సీలు, సంబంధిత అధికారులపైనా కఠిన చర్యలు చేపట్టేలా విద్యాశాఖ నిబంధనలు రూపొందించింది. మెనూ అమలు చేయకపోయినా, నాణ్యమైన ఆహారాన్ని అందించకపోయినా సంబంధిత ఏజెన్సీని రెండుసార్లు హెచ్చరించనుంది. అయినా తీరు మార్చుకోకపోతే ఆ ఏజెన్సీని రద్దు చేయనుంది. ఈ మేరకు రూపొందించిన నిబంధనల ఆమోదం కోసం విద్యాశాఖ రెండు నెలల కిందటే ప్రభుత్వానికి ఫైలు సమర్పించింది. రాష్ట్రంపై తగ్గనున్న ఆర్థిక భారం దేశవ్యాప్తంగా ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఉన్న ఎలిమెంటరీ పాఠశాలల్లో పథకం అమలుకు అయ్యే ఖర్చులో కేంద్రం 60 శాతం నిధులిస్తుండగా రాష్ట్రం 40 శాతం నిధులను వెచ్చిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్న దాదాపు 20 లక్షల మంది విద్యార్థులకు పథకాన్ని అమలు చేస్తోంది. దీనికి అదనంగా 9, 10 తరగతుల విద్యార్థులు దాదాపు 9 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే 100 శాతం నిధులను వెచ్చించి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఇందుకు దాదాపు రూ. 200 కోట్ల వరకు రాష్ట్రం అదనంగా వెచ్చిస్తోంది. అయితే సెకండరీ స్కూళ్లలోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నియమించిన సుబ్రమణియన్ కమిటీ సిఫారసు చేసింది. సెకండరీ స్కూళ్లలో చదివే విద్యార్థులు, కౌమార బాలికలకు పోషకాహారాన్ని అందించేందుకు దీన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ సిఫారసులను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. నూతన విద్యా విధానంలో దీనిపై తుది నిర్ణయం తీసుకొని చేర్చాలని భావిస్తోంది. ఇది అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వంపై కొంత మేర ఆర్థిక భారం తగ్గనుంది.

యువతి కిడ్నాప్‌ నకు యత్నం - బైక్‌పై వెళ్తుండగా దూకి తప్పించుకున్న వైనం

22/10/2016: పెద్దపల్లి: ఓ యువతికి ఓ యువకుడు ఫోన్‌లో పరిచయమయ్యాడు. ఫోన్‌లో నాలుగు రోజులుగా మాట్లాడుకుంటున్నారు. చివరకు ఆ యువకుడు ‘నువ్వు నాతో మాట్లాడుతున్నావని, మీ ఊరిలో ఈ విషయం అందరికి చెబుతానని’ బ్లాక్‌మెయిల్ చేసి యువతిని పెద్దపల్లికి రమ్మన్నాడు. ఆమె రావడంతో బైక్ ఎక్కించుకున్నాడు. వారిని మరో ఇద్దరు యువకులు వెంబడిస్తుండడం చూసి ఆ యువతి బైక్‌పై నుంచి దూకేసిన సంఘటన పెద్దపల్లిలో శుక్రవారం జరిగింది. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లికి చెందిన 18 ఏళ్ల యువతికి పెద్దపల్లికి చెందిన సాయికుమార్ ఫోన్‌లో నాలుగురోజుల క్రితం పరిచయమయ్యాడు. నిత్యం ఫోన్‌లో సంభాషిస్తున్నారు. శుక్రవారం ఉదయం సాయికుమార్ మరోసారి యువతికి ఫోన్ చేసి పెద్దపల్లికి రమ్మని చెప్పాడు. లేదంటే తనతో ఫోన్‌లో మాట్లాడుతున్న సంభాషణలు రికార్డు చేశానని, మీ ఊరిలో ప్రచారం చేస్తానని బెదిరించాడు. భయపడిన సదరు యువతి అక్క కొడుకుతో పెద్దపల్లికి వచ్చింది. అతణ్ని బస్టాండ్ వద్ద ఉంచి సాయికుమార్ బైక్ ఎక్కింది. బైక్ పై శాంతినగర్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి మీదుగా వెళ్తున్న క్రమంలో సాయికుమార్ మరో ఇద్దరు యువకులకు ఫోన్ చేసి రమ్మన్నాడు. వారు వెంటాడుతున్న విషయాన్ని గమనించిన యువతి బైక్‌పై నుంచి దూకేసింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలుకాగా, యువకుడు పరారయ్యాడు. యువతి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి చికిత్స చేయించుకొని వెళ్లిపోయింది. తనకు సమాచారం తెలియగానే ఆస్పత్రికి కానిస్టేబుల్‌ను పంపించానని, ఆస్పత్రిలో ఎవరూ లేరని, ఫిర్యాదు అందితే తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.

కేసీఆర్ ను ఏమడిగినా చేసేస్తారా?

22/10/2016: రాజ‌కీయాలంటే ఎంత సింపుల్ అనేది మరోమారు క్లారిటీ వ‌చ్చిందంటున్నారు. పాల‌కుల నుంచి నుంచి త‌మ డిమాండ్‌కు ఆమోద ముద్ర ప‌డే వ‌ర‌కు పోరాటం చేయ‌డం, విమ‌ర్శ‌లు చేయ‌డం అనంత‌రం...అది నెర‌వేరేలాగా ఉంటే థ్యాంక్స్ చెప్పేయ‌డంతో ష‌రామామూలు అయిపోయింది. ఇంత‌కీ ఈ వివ‌ర‌ణ ఎందుటే కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే డీకే అరుణ గురించి. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై విరుచుకుప‌డే అతి కొద్ది నేత‌ల్లో అరుణ ఒకర‌నే సంగ‌తి తెలిసిందే. తను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గ‌ద్వాల‌ను జిల్లాగా చేయ‌క‌పోవ‌డంపై అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ కేసీఆర్‌పై దుమ్మెత్తిపోశారు. అనంత‌రం జిల్లా చేయ‌డంతో అరుణ‌మ్మ థ్యాంక్స్ చెప్పేశారు. అదే కోవ‌లో మ‌రో థ్యాంక్స్ చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రి జిల్లా పర్యటన సందర్భంగా ఆ జిల్లా పేరును యాదాద్రి భువనగిరిగా మార్చేందుకు అంగీకరించారు. భువనగిరిలో తెరాస సీనియర్‌ నేత, పార్టీ పోలిట్‌బ్యూరో మాజీ సభ్యుడు ఎలిమినేటి కృష్ణారెడ్డిని ఆయన స్వగృహంలో కేసీఆర్ కలిశారు. యాదాద్రి జిల్లా కేంద్రం భువనగిరిలో ఉన్న నేప‌థ్యంలో భువనగిరి పేరును జిల్లా పేరుకు కలపాలని కృష్ణారెడ్డి కోరగా కేసీఆర్‌ వెంటనే ఆమోదించారు. అక్కణ్నుంచే కలెక్టర్‌కు ఫోన్‌ చేసి అన్ని కార్యాలయాల బోర్డులపైనా యాదాద్రి భువనగిరి అనే పేరు రాయించాలని ఆదేశించారు. ఈ ఎపిసోడ్‌పై డీకే అరుణ స్పందించారు. యాదాద్రి జిల్లాకు భువనగిరి పేరును కలపడాన్ని స్వాగతిస్తున్నామనీ, జోగులాంబ జిల్లాకు గద్వాల పేరును కూడా చేర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరుతున్నట్లు మాజీ మంత్రి డీకే అరుణ చెప్పారు. త‌ద్వారా గ‌ద్వాల ప్ర‌జ‌ల ఆకాంక్ష నెర‌వేరిన‌ట్లు అవుతుంద‌ని పేర్కొన్నారు. తాజా పరిణామాల నేప‌థ్యంలో మిగిలిన జిల్లాల డిమాండ్లపైనా ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా పలు జిల్లాలకు పుణ్యక్షేత్రాలు, ప్రముఖుల పేర్లు పెట్టారు. వీటికి ఆయా జిల్లా కేంద్రాల పేర్లను కూడా కలపాలని ప్రజాప్రతినిధులు, నేతలు, ప్రజల నుంచి వినతులు వస్తున్నాయి. జిల్లా కేంద్రాల పేర్లు ఉండడం వల్ల వాటి ప్రాశస్త్యం తెలుస్తుందని, ప్రజలకు సరైన సమాచారం అందుతుందని కోరారు. రాజన్న జిల్లాకు సిరిసిల్లను చేర్చాలని, జయశంకర్‌ జిల్లాకు భూపాలపల్లిని, జోగులాంబ జిల్లాకు గద్వాల, కుమ్రంభీమ్‌ జిల్లాకు ఆసిఫాబాద్‌, భద్రాద్రికి కొత్తగూడెంను కలపాలనే వినతులు వస్తున్నాయి. కొత్తగూడెం, సిరిసిల్ల, ఆసిఫాబాద్‌ ప్రాంత నేతలు సైతం సీఎంకు ఈ మేరకు విన్నవించారు. కొత్త జిల్లాలపై ఇప్పటికే గెజిట్‌లు జారీ అయ్యాయి. మార్పులు జరిగితే గెజిట్లలోనూ మార్పులు చేస్తారు.

కేసీఆర్ చేతే పదవేం కావాలని అడిగించుకున్నారు?

22/10/2016: కొత్త జిల్లాల ఏర్పాటు చేసి రెండు వారాలు మాత్రమే అయ్యింది. ఆ సందర్భంగా పెట్టిన పేర్లలో.. యాదాద్రి పేరును యాదాద్రి భువనగిరిగా మార్చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవటమే కాదు.. వెనువెంటనే అధికారుల్ని ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఇదంతా ఎలా జరిగిందంటే.. కేసీఆర్ మిత్రుడు చెప్పిన ఒకే ఒక్క మాటకే. ఇంతకీ ఆ మిత్రుడు ఎవరంటే.. ఉద్యమ సమయంలో కేసీఆర్ వెన్నంటే ఉంటూ.. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ఎలిమినేటి కృష్ణా రెడ్డి. ఇటీవల యాదాద్రికి వెళ్లిన కేసీఆర్.. తిరుగు ప్రయాణంతో తన ఇంటికి రావాలంటూ కృష్ణారెడ్డి అభ్యర్థనతో ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా యాదాద్రి పేరు ఓకే అయినా.. ప్రజలు కన్ప్యూజ్ కు గురి అవుతున్నారని.. యాదాద్రికి చారిత్రక భువనగిరి పేరును జత చేస్తే బాగుంటుందన్న సూచన చేయటం.. వెంటనే అందుకు సమ్మతించిన ముఖ్యమంత్రి అధికారులకు పేరు మారుస్తూ ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఇదిలా ఉంటే.. ఈ సందర్భంగా మరో ఆసక్తికర ఘటన జరిగినట్లుగా చెబుతున్నారు. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఘటన చూస్తే.. కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లిన కేసీఆర్.. ఆయన యోగక్షేమాలు అడిగిన అనంతరం.. కాసేపు పలు అంశాల మీద మాట్లాడుకున్నట్లు తెలిసింది. పార్టీ వ్యవహారాల మీద మాటలు జరుగుతున్న వేళ.. కేసీఆర్ కల్పించుకొని.. ''తెలంగాణ ఉద్యమం మొదటి నుంచీ నువ్వు పని చేశావు. ఏదైనా పదవి కావాలా? చెప్పు?"" అని అడిగారట. కేసీఆర్ మాటకు స్పందించిన కృష్ణారెడ్డి .. మీ ఇష్టం.. మీరు ఏ పదవి ఇచ్చినా తీసుకుంటానని చెప్పినట్లుగా తెలిసింది. నిత్యం ముఖ్యంత్రిని కలుసుకొని.. ఆయన కంట్లో పడాలని.. ఆయన మనసును దోచుకోవాలని ప్రయత్నించే వారు ఎందరో. అలాంటిది ముఖ్యమంత్రే స్వయంగా ఇంటికి వెళ్లి.. కులాసాగా కూర్చొని.. నీకేం పదవి కావాలో కోరుకో అనటం చూస్తేనే కృష్ణారెడ్డికి ఇచ్చే ప్రాధాన్యత ఏమిటో అర్థమవుతుంది. మరి.. తన మిత్రుడికి ఎలాంటి పదవిని కేసీఆర్ ఇస్తారో చూడాలి. ఏది ఏమైనా కష్టపడి పార్టీ కోసం పని చేసిన నేతను తన మిత్రుడిగా గుర్తు పెట్టుకున్న కేసీఆర్.. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ విషయాన్ని మరువకపోవడం... కేసీఆర్ కు ప్లస్ పాయింట్లుగా చెప్పొచ్చు.

శ్రీనివాసకాలనీలో అగ్ని ప్రమాదం - ఆర్థిక సహాయం అందించిన తహసీల్దార్, TRS నాయకులు

21/10/2016: ఆమనగల్లు (అక్టోబర్ 20), సలాం తెలంగాణ: ఆమనగల్లు పట్టణంలో శ్రీనివాస కాలనీలో మండలి కృష్ణ ఇంట్లో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. దీనివల్ల 2లక్షల రూపాయలకు పైగ ఆస్తినష్టం జరిగింది. దీనిపై తాసీల్దార్ అనిత గారికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వంకు నివేదిక పంపిస్తామని హామీ ఇచ్చారు. అదే క్రమంలో తహసీల్దార్ అనిత, స్థానిక TRS నాయకులు వస్పుల జంగయ్య 10.000/-రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ వెంకటరమణ,VROలు,చరికొండ సర్పంచ్ నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు రూ.13 వేల కోట్ల పంట రుణాలు - కేంద్ర మంత్రి దత్తాత్రేయ

21/10/2016: హైదరాబాద్: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలోని రైతులకు పంట రుణాల రూపంలో రూ.13వేల కోట్లు పంపిణీ చేసినట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. తాజా రబీ సీజన్లో నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం ఇక్కడ జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో దత్తాత్రేయ మాట్లాడుతూ.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. రైతులు పండించిన పంట దిగుబడులను మార్కెట్‌కు తరలించేందుకు సదుపాయాలు కల్పించడంతో పాటు కనీస మద్దతు ధరపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రైతుకు ప్రయోజనం కలిగించే ఫసల్ బీమా పథకం కింద రాష్ట్రంలో 25 లక్షల మందికిగాను 8 లక్షల మంది మాత్రమే నమోదు చేసుకున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. భూ స్వస్థత కార్డులు 31 శాతం మందికే జారీ అయ్యాయని, ఈ ప్రక్రియపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో నూనెగింజలు, పప్పుధాన్యాలు ఉత్పత్తిని పెంచాలని, ప్రస్తుతం రూ.40 వేల కోట్ల నూనె, పప్పుధాన్యాలను దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు లబ్ధి చేకూర్చే శిశు కేటగిరీలో లక్ష్యాలను పెంచి ఎక్కువ మందికి లాభం చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు సూచించారు.

2,206 కొత్త పోస్టులు - ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ

20/10/2016: హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల పరిధిలో 2,206 కొత్త ఉద్యోగాలను మంజూరు చేసింది. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో రెవెన్యూ, ఆర్ అండ్ బీ, పాఠశాల విద్య శాఖల పరిధిలో కొత్త పోస్టులకు రాష్ట్ర మంత్రివర్గం ఇటీవలే పచ్చజెండా ఊపింది. దాదాపు 4 వేల పైచిలుకు పోస్టులకు ఆమోదం తెలిపింది. అందులో హోంశాఖ మినహా మూడు విభాగాలకు సంబంధించిన పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ బుధవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టుల సంఖ్య, స్కేల్ ఆఫ్ పే వివరాలను ఉత్తర్వుల్లో పొందుపరిచారు. తాజా ఉత్తర్వుల్లో భూపరిపాలన ప్రధాన కమిషనర్ ప్రతిపాదించిన 2,109 పోస్టులు, పాఠశాల విద్య శాఖ పరిధిలో 85 మండల విద్యాధికారి (ఎంఈవో) పోస్టులు, ఆర్ అండ్ బీ శాఖలో 12 ఈఈలు, సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేసే ముందు ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని సంబంధిత విభాగాలకు ప్రభుత్వం సూచించింది. కొత్త జిల్లాలతో తలెత్తిన ఉద్యోగుల కొరతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కొత్త పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేసే అవకాశాలున్నాయి. రెవెన్యూలోనే అత్యధిక పోస్టులు... కొత్త పోస్టుల్లో రెవెన్యూశాఖ పరిధిలోనే అత్యధికంగా 2,109 పోస్టులు ఉన్నాయి. వీటిని జిల్లా కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్లు, రెవెన్యూ మండలాల అవసరాలకు అనుగుణంగా మూడు కేటగిరీలుగా మంజూరు చేశారు. కలెక్టరేట్‌లకు సంబంధించి 12 డీఆర్‌వో పోస్టులు, 98 తహసీల్దార్ కేడర్, 4 డిప్యూటీ తహసీల్దార్, 180 సీనియర్ అసిస్టెంట్, 60 జూనియర్ అసిస్టెంట్, 21 సీనియర్ స్టెనో, 21 జూనియర్ స్టెనో, 42 రికార్డు అసిస్టెంట్, 42 డ్రైవర్, 21 జమేదార్, 139 ఆఫీస్ సబార్డినేట్, 53 చౌకీదార్/వాచ్‌మెన్ పోస్టులున్నాయి. రెవెన్యూ డివిజన్ల పరిధిలో 24 ఆర్‌డీవో (డిప్యూటీ కలెక్టర్), 24 డివిజినల్ అడ్మిన్ ఆఫీసర్, 6 డిప్యూటీ తహసీల్దార్, 12 సీనియర్ అసిస్టెంట్లు, 2 జూనియర్ అసిస్టెంట్‌లు, 24 రికార్డు అసిస్టెంట్లు, 24 డ్రైవర్, 24 డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే, 24 చైన్ మెన్, 24 డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులున్నాయి. వీటితోపాటు రెవెన్యూ మండలాల పరిధిలో 104 తహసీల్దార్ పోస్టులు, 104 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు, 23 మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, 120 జూనియర్ అసిస్టెంట్, 120 మండల సర్వేయర్, 308 ఆఫీస్ సబార్డినేట్, 120 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, 120 చైన్ మెన్ పోస్టులున్నాయి. 85 ఎంఈవో పోస్టులు... కొత్త మండలాల ఏర్పాటు అవసరాల దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ పంపించిన ప్రతిపాదనల మేరకు 85 మండల విద్యాధికారి పోస్టులను ఆర్థికశాఖ మంజూరు చేసింది. అలాగే ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో 4 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, 4 సూపరింటెండెంట్, 4 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఆమోదం తెలిపింది. త్వరలో మరో 300 రెవెన్యూ పోస్టులు? రెవెన్యూ శాఖలో త్వరలో మరో 300 వరకు కొత్త పోస్టులు మంజూరు కానున్నాయి. రెవెన్యూ శాఖకు కొత్తగా 2,109 పోస్టులను ప్రభుత్వం బుధవారం మంజూరు చేయగా ఇవి కాకుండా మరో 300 వరకు పోస్టులు అదనంగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. తొలుత 27 జిల్లాలు ఏర్పాటవుతాయని భావించిన ప్రభుత్వం ఆ మేరకు కేబినెట్ సమావేశంలో రెవెన్యూ శాఖకు 2,109 పోస్టులు అవసరమని భావిస్తూ వాటి మంజూరుకు తీర్మానించింది. కానీ ఆ తర్వాత జిల్లాల సంఖ్య 31కి పెరగడంతో అందుకు తగ్గట్లుగా కొత్త పోస్టులు మంజూరు కావాల్సి ఉంది. అన్ని కేటగిరీలు కలిపి వాటి సంఖ్య 300 వరకు ఉంటుందని భావిస్తున్నారు.

కొత్త జిల్లాల వారీగా అక్షరాస్యత

20/10/2016: హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో జిల్లాల వారీగా అక్షరాస్యత లెక్కలను వయోజన విద్యా శాఖ తేల్చింది. జిల్లా వారీగా స్త్రీ, పురుషుల అక్షరాస్యత వివరాలతో కూడిన నివేదికను రూపొందించింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ లెక్కలు వేసింది. అత్యధికంగా హైదరాబాద్‌లో 83.25% అక్షరాస్యత ఉన్నట్లు తేల్చింది. అందులో పురుషుల్లో 86.99 శాతం, మహిళల్లో 79.35% అక్షరాస్యత ఉన్నట్లు వెల్లడించింది. జోగుళాంబ జిల్లాలో అతి తక్కువగా 49.87% అక్షరాస్యత ఉన్నట్లు తెలిపింది. జోగుళాంబ జిల్లాలోని పురుషుల్లో 60.05%, మహిళల్లో 39.48% అక్షరాస్యత ఉన్నట్లు వివరించింది. జాతీయ అక్షరాస్యత 73% కాగా, రాష్ట్రంలో 66.54% అక్షరాస్యత ఉన్నట్లు తెలిపింది. జిల్లాల వారీగా అక్షరాస్యత వివరాలు (శాతాల్లో).. హైదరాబాద్ 83.25 శాతం, మేడ్చల్ 82.62, వరంగల్ అర్బన్ 76.19, రంగారెడ్డి 71.97, కరీంనగర్ 69.16, భద్రాద్రి 66.40, ఖమ్మం 65.87, పెద్దపల్లి 65.54, యాదాద్రి 65.52, మంచిర్యాల 64.78, సూర్యాపేట 64.11, నిజామాబాద్ 64.11 సంగారెడ్డి 64.04, నల్లగొండ 63.70, ఆదిలాబాద్ 63.29, రాజన్న జిల్లా 62.72, సిద్దిపేట 62.01, జనగాం 61.41, వరంగల్ రూరల్ 61.07, జగిత్యాల 60.58, జయశంకర్ జిల్లా 60.32, వికారాబాద్ 57.86, నిర్మల్ 57.82, మహబూబాబాద్ 57.05, మహబూబ్‌నగర్ 56.79, కుమ్రం భీం 56.70, కామారెడ్డి 56.48, మెదక్ 56.11, వనపర్తి 56.05, నాగర్ కర్నూలు 53.68, జోగుళాంబ 49.87 శాతం.

పంజుగుల UPS స్కూల్ SGT అజిత టీచర్ పై DEO కు నివేదిక పంపిన MEO, ZPTC, గ్రామ సర్పంచ్

19/10/2016: మహబూబ్ నగర్(కల్వకుర్తి), సలాం తెలంగాణ: కల్వకుర్తి మండలం లోని పంజుగుల UPS స్కూల్ లో SGT అజిత టీచర్ విద్యార్థులతో స్కూల్ తన వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకుంటుంది అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, SMC చైర్మన్ బాలగౌడ్, MEO బసునాయాక్ కి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ విషయానికి స్పందించి ZPTC అశోక్ రెడ్డి, MEO బసునాయాక్, గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు ఈరోజు పంజుగుల స్కూల్ లో కమిటీ వేయడం జరిగింది. టీచర్ తప్పు చేసారు అని నిర్ధారించి ఆమెపై DEO గారికి నివేదిక పంపటం జరిగింది.

కొనసాగుతున్న ‘భగీరథ’ యత్నం - 70 శాతం పూర్తయిన ప్రధాన పైప్‌లైన్‌ పనులు

19/10/2016: బాన్సువాడ : మిషన్‌ భగీరథ పనులు సాగుతున్నాయి. మెదక్‌ జిల్లాలోని సింగూరు నుంచి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు తాగునీరు అందించే పథకానికి సంబంధించి ఇప్పటికే ప్రధాన పైప్‌లైన్‌ పనులు 70 శాతం పూర్తయ్యాయి. గ్రామాల్లో పైప్‌లైన్ల విస్తరింపు పనులు ఊపందుకున్నాయి. గ్రామాల్లో పైప్‌లైన్ల ఏర్పాటుకు పొలాలను తవ్వి పైపులు వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్కరికి వంద లీటర్లు, మున్సిపాలిటీల్లో 135 లీటర్లు, కార్పొరేషన్‌లో 150 లీటర్ల నీరు సరఫరా చేయాలన్నది మిషన్‌ భగీరథ ఉద్దేశం. సింగూరు ప్రాజెక్టు వద్దే నీటి శుద్ధి ప్లాంటును ఏర్పాటు చేసి, అక్కడి నుంచి నేరుగా పైప్‌లైన్ల ద్వారా నీరు సరఫరా చేయనున్నారు. మిషన్‌ భగీరథ కోసం సింగూరు నుంచి 1.8 టీఎంసీల నీటిని వినియోగించనున్నారు. జిల్లాలోని బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్, బోధన్‌ నియోజకవర్గాల ప్రజలకు సింగూరు ప్రాజెక్టు ద్వారా నీరందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. నిజామాబాద్‌ రూరల్, నిజామాబాద్‌ అర్బన్, కామారెడ్డి, ఆర్మూర్‌ నియోజకవర్గాల ప్రజలకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ద్వారా నీరందించనున్నారు. సింగూరు పథకానికి రూ. 1,350 కోట్లు, ఎస్సారెస్పీ పథకానికి రూ. 1,400 కోట్లు కేటాయించారు. సింగూరు నుంచి బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి, బోధన్‌ నియోజకవర్గాల్లోని మండలాలకు, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్‌ అర్బన్, నిజామాబాద్‌ రూరల్, కామారెడ్డి నియోజకవర్గాల్లోని మండలాలకు నీరందిస్తారు. సింగూరు ప్రాజెక్టు వద్ద ఫిల్టర్‌బెడ్‌ పనులు పూర్తయ్యాయి. పైప్‌లైన్, ఇంటెక్‌వెల్‌ పనులు జరుగుతున్నాయి. వాస్తవానికి నిజాంసాగర్‌ ప్రాజెక్టు వద్దే హసన్‌పల్లిలో ఫిల్టర్‌ బెడ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ నిజాంసాగర్‌లో నీటి లభ్యత విషయంలో సందేహం ఉండడంతో రూ. 500 కోట్లు అదనంగా వెచ్చించి సింగూరు నుంచి పైప్‌లైన్‌ వేయిస్తున్నారు. కాళేశ్వరం నుంచి మల్లన్నసాగర్‌ ద్వారా నిజాంసాగర్‌కు నీటి మళ్లింపు జరుగనున్నందున.. నిజంసాగర్‌లోకి నీరు పుష్కలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ పనులకు ఇంకా సమయం పడుతుందని భావించిన అధికారులు.. సింగూరు నుంచి పైప్‌లైన్‌ వేయాలని నిర్ణయించారు. సింగూరు ప్రాజెక్టు సమీపంలో డెడ్‌స్టోరేజీ వాటర్‌ అందేవిధంగా కాలువను తవ్వి, పుల్కల్‌ వద్ద నీటి శుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. పైప్‌లైన్ల ద్వారా అక్కడి నుంచి తడ్‌మనూరు వద్ద సముద్ర మట్టానికి సుమారు 590 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రదేశంలో సుమారు వందమీటర్ల ఎత్తులో ట్యాంకులను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి విడుదల చేసే నీరు జిల్లాలోని నర్సింగ్‌రావుపల్లికి చేరుకుంటుం ది. నర్సింగ్‌రావుపల్లి నుంచి నీరు నాలు గు ప్రాంతాలకు వెళ్తుంది. జుక్కల్, బా న్సువాడ, ఎల్లారెడ్డి, బోధన్‌ నియోజకవర్గాల్లో 3 వేల కిలోమీటర్ల వరకు ప్రత్యేక పైప్‌లైన్ల ద్వారా నీరు వెళ్లనుంది. వచ్చే ఏడాది జూన్‌లోపు 235 గ్రామాలకు, అదే ఏడాది డిసెంబర్‌ చివరి నాటికి 572 గ్రామాలకు నీరందించనున్నారు. సింగూరు వద్ద వాల్వ్‌ ఓపెన్‌ చేస్తే నిజామాబాద్‌ జిల్లాలోని ఇంటింటికీ నీరు చేరేవిధంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. సాగుతున్న పైప్‌లైన్‌ పనులు ప్రధాన పైప్‌లైన్ల పనులు పూర్తి కావస్తుండడంతో, ఇక గ్రామాల్లో పైప్‌లైన్ల పనులు జోరందుకున్నాయి. బాన్సువాడ సమీపంలోని దుర్కి ప్రాంతంలో పైప్‌లను డంప్‌ చేశారు. అక్కడి నుంచే అన్ని గ్రామాలకు పైప్‌లైన్లు వేస్తున్నారు. అయితే రైతుల అనుమతి తీసుకోకుండానే కాంట్రాక్టర్లు పంట పొలాల్లో తవ్వుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

భారీ ప్రాజెక్టుల కన్నా వాటర్‌ షెడ్లే మేలు - మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి

19/10/2016: నిజామాబాద్‌ సిటీ : రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులు నిర్మించే బదులు వాటర్‌ షెడ్ల కార్యక్రమాలు చేపడితే రైతులకు మేలు జరుగుతుందని గోదావరి జలాల వినియోగ ఫోరం చైర్మన్, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. నాలుగు సూత్రాల వాటర్‌ షెడ్‌ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. మిగతా రాష్ట్రాల కంటే మహారాష్ట్రలో నీటిపారుదలపై ఎక్కువగా పెట్టుబడి పెట్టారని, ఆ రాష్ట్రంలోని డ్యాంలలో, రిజర్వాయర్లలో ఉన్నంత నీటి స్టోరేజీ దేశంలో మరెక్కడా లేదని చెప్పారు. అయినప్పటికీ అక్కడ 2,218 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. మన రాష్ట్రంలోనూ 2,280 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్న శశిధర్‌రెడ్డి.. నీటి భద్రత అంశం రాబోయే రోజులలో ఎంతో కీలకంగా మారబోతుందని తెలిపారు. నీటిపారుదలశాఖ మాజీ ఇంజినీర్‌ టి హన్మంత్‌రావు చతుర్విద జల ప్రక్రియ విధానాన్ని తీసుకొచ్చారని తెలిపారు. కురిసే వర్షంలో 65 శాతం భూమిలో తేమగా ఉంటుందన్నా విషయం చాలా మందికి తెలియదని, అసలు వాటర్‌ షెడ్‌ అంటే కూడా తెలియదన్నారు. 1973 నుంచి రూ.వేల కోట్లతో చేపట్టిన కార్యక్రమాలతో సత్ఫలితాలు రాలేదని చెప్పారు. వాటర్‌ షెడ్‌ను తీసుకుంటే మూడు పంటలకు నీళ్లు ఇచ్చే విధంగా ఉండాలన్నారు. చతుర్విద జల ప్రక్రియలో ప్రధానంగా ఎలాంటి సిమెంట్‌ ఉపయోగం ఉండదని, కాంట్రాక్టర్లు, చెక్‌డ్యాంలు ఉండవన్నారు. రూ.5 వేలతో ఏడాదికి మూడు పంటలు పండించుకోవడానికి సాధ్యమవుతుందని తెలిపారు. రెండేళ్లు కరువు వచ్చినా జహీరాబాద్‌ సమీపంలోని గొట్టిగారిపల్లిలో చతుర్విద విధానంతో రైతులు రెండు పంటలు పండించుకున్నార ని, తాగునీటికి ఇబ్బంది పడలేదన్నారు. చతుర్విద జల ప్రక్రియ విధానంతో రూ.5 వేల వ్యయంతో ఎకరంలో మూడు పంటలు పండించవచ్చని చెప్పారు. అయినప్పటికీ నాలుగు సూత్రాల ప్రణాళిక విధానాలను ప్రభుత్వాలు ఆచరించలేదన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల రీడిజైన్‌ పేరుతో ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రూ. 5వేల ఖర్చుతో మూడు పంటలకు నీరివ్వడం మంచిదా, లేదా రూ.5 లక్షలతో ఒక పంట గురించి ఆలోచించటం మంచిదా అని ప్రజలే ఆలోచించాలన్నారు. రానున్న రోజులలో నీటి కోసం యుద్ధాలు తప్పవని, ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకోవాలని సూచించారు. మాజీ స్పీకర్‌ కేఆర్‌ సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు మహేశ్‌కుమార్‌గౌడ్, గడుగు గంగాధర్, డీసీసీ అధ్యక్షుడు తాహెర్, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, మాజీ ఎమ్మెల్యే గంగారాం, సుమీర్‌హైమద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇక్కడి వరకు రానివ్వొద్దు..- క్షేత్రస్థాయిలోనే సమస్యలు పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్ పాటిల్‌

18/10/2016: వరంగల్‌ రూరల్‌ : జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన వరంగల్‌ రూరల్‌ జిల్లాలో పరిధిలోని మండలాల ప్రజల సమస్యలను అధికారులు ఎక్కడికక్కడ పరిష్కరించాలని కలెక్టర్‌ జీవన్‌ ప్రశాంత్‌ పాటిల్‌ సూచించారు. తద్వారా గ్రీవెన్స్ సెల్‌కు వచ్చే వారు తగ్గిపోతారని.. ఇందుకోసం అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని ఆదేశించారు. కొత్తగా జిల్లా ఏర్పడిన అనంతరం సోమవారం కలెక్టరేట్‌లో తొలి గ్రీవెన్స్ సెల్‌ జరిగింది. ఈ సందర్భంగా హాజరైన అధికారులను ఉద్దేశించి కలెక్టర్‌ మాట్లాడుతూ పరిపాలనలో చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. పరిధి తక్కువే.. ‘తొలి గ్రీవెన్స్ సెల్‌కు పెద్దసంఖ్యలో దరఖాస్తులు దారులు వచ్చారు... వీరి సంఖ్య ఎప్పటికప్పుడు తగ్గుతుండాలి... అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరిస్తే ఇది సాధ్యమవుతుంది’ అని కలెక్టర్‌ జీవన్ ప్రశాంత్‌ పాటిల్‌ అన్నారు. అలాగే, కలెక్టరేట్‌లో జరిగే గ్రీవెన్స్ సెల్‌కు వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై శ్రద్ధ చూపాలని సూచించారు. జిల్లాలో తక్కువ మండలాలే ఉన్నందున.. అధికారులు వారంలో మూడు రోజులు గ్రామాల్లో పర్యటించి, ప్రజలకు అందుబాటులో ఉండాలని.. తద్వారా వారి సమస్యలు తెలియడంతో పాటు పరిష్కారానికి మార్గం సులువవుతుందని తెలిపారు. ఆన్లైన్ లో ఫిర్యాదులు వచ్చే సోమవారం నుంచి ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను ఆన్లైన్ లో నమోదు చేస్తామని కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్ పాటిల్‌ చెప్పారు. ఆ తర్వాత విభాగాల వారీగా ఫిర్యాదులను ఆయా శాఖల అధికారుల లాగిన్ లో వేస్తామని తెలిపారు. ఇందులో ప్రతీ సమస్యను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని, లేనిపక్షంలో కారణాలను ఫిర్యాదుదారులకు మెసేజ్‌ రూపంలో పంపించాలని సూచించారు. అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు, వాట్సప్‌లో కూడా జిల్లా పరిపాలనా యంత్రాంగానికి అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. గ్రీవెన్స్ సెల్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.హరిత, డీఆర్‌ఓ వెలమపల్లి నాగరాజారావు, రూరల్‌ ఆర్డీఓ సురేందర్‌రావు, ఏఓ పి.సత్యనారాయణరావు, జిల్లా వెనకబడిన తరగతుల, దళిత అభివృద్ధి, మైనార్టీ అభివృద్ధి శాఖ అధికారులు ఎం.నరసింహస్వామి, పి.రవీందర్‌రెడ్డి, ఎం.డీ.సర్వర్‌మియా, జిల్లా ఉపాధి కల్పన అధికారి పి.నిరుపమ, డీఎస్‌ఓ విలియం పీటర్, డీపీఆర్‌ఓ కిరణ్మయి, జిల్లా గిరిజన అభివృద్ది అధికారి టి.నిర్మల, డీఈఓ నారాయణరెడ్డి, డీఎఫ్‌ఓ కె.పురుషోత్తం, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అశోక్‌ ఆనంద్‌ పాల్గొన్నారు. రక్షణ కోసం మొదటి దరఖాస్తు భూమి విషయంలో మాజీ మిలిటెంట్‌ పెండ్లి రఘుతో తనకు ప్రాణభయం ఉందని నల్లబెల్లి మండలం రాంతీర్థం గ్రామానికి చెందిన మనికంటి రాజిరెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పెండ్లి రఘుతో పాటు ఎరుకల సునీత, ఎరుకల మల్లారెడ్డితో ప్రాణభయం ఉన్నందున రక్షణ కల్పించాలని కోరారు. దీనికి స్పందించిన కలెక్టర్‌ తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

చెట్టును ఢీకొన్న బైక్.. ఒకరు మృతి

18/10/2016: బోయినిపల్లి (సిరిసిల్ల రాజన్న జిల్లా): బోయినిపల్లి మండలం శభాష్‌పల్లిలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తోన్న ఒకరు మృతిచెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. మృతుడు వేములవాడ మండలం మర్రిపల్లివాసిగా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని దగ్గరలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా - కృషి చేస్తానన్న కేంద్ర మంత్రి దత్తాత్రేయ

18/10/2016: బెల్లంపల్లి/శ్రీరాంపూర్: కరీంనగర్ జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా కోసం కృషి చేస్తానని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. సోమవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని పద్మశాలి భవన్‌లో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల బీజేపీ కార్యవర్గ సభ్యుల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మాట్లాడతానని హామీని చ్చారు. ప్రభుత్వం ముందుకు వస్తే రాష్ట్రంలో కార్మికవాడలు, వీధులను తయారు చేస్తామన్నారు. బీడీ కార్మికులకు ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించడానికి కేంద్రం రూ.5 వేల కోట్లను మంజూరు చేసిందన్నారు. కోల్‌బెల్ట్ క్షేత్రాన్ని కలుపుతూ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి దత్తాత్రేయ హామీ ఇచ్చారు. సోమవారం ఆయన మంచిర్యాల జిల్లా పరిధిలోని శ్రీరాంపూర్ సింగరేణి ఎస్సార్పీ 3 గనిని సంద ర్శించి కార్మికులతో మాట్లాడారు.

విరిగిన పట్టా.. తప్పిన ప్రమాదం

18/10/2016: రఘనాథపల్లి(వరంగల్ జిల్లా): బల్లార్షా-సికింద్రాబాద్ భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. రఘనాథపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టా విరిగింది. పట్టా విరిగిన విషయాన్ని రైల్వే అధికారులకు గ్యాంగ్‌మెన్లు సమాచారం అందించారు. దీంతో భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను రఘనాథపల్లికి సమీపంలో నిలిపివేశారు. రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టారు. గ్యాంగ్‌మెన్ల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. మరమ్మత్తు అనంతరం రైలు బయలు దేరింది.

పోలీస్ జీపు బోల్తా.. ఇద్దరికి గాయాలు

17/10/2016: జగిత్యాల (కరీంనగర్‌): వేగంగా వెళ్తున్న పోలీస్ వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలోని ఘాట్‌రోడ్డులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కొండగట్టుకు వెళ్తున్న పోలీస్ జీప్ ఘాట్‌రోడ్డులో అదుపుతప్పి లోయలోకి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అనంత శర్మ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

చెల్లి ప్రేమ పెళ్లి చేసుకొని అన్నకు షాక్‌!

17/10/2016: తూప్రాన్‌(మెదక్‌): పాతికేళ్లకే కుటుంబానికి పెద్ద దిక్కుగా మారి ఒక్కగానొక్క చెల్లెలికి ఘనంగా పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేసిన అన్నయ్యకు చెల్లి ప్రేమ పెళ్లి చేసుకొని షాక్‌ ఇచ్చింది దీంతో మనస్తాపానికి గురైన అన్న రైలు కిందపడి తనువు చాలించాడు. ఈ సంఘటన మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలంలోని బ్రాహ్మణపల్లి రైల్వే గేట్‌ వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. తూప్రాన్‌కు చెందిన శ్రావణ్‌కుమార్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు భుజానికెత్తుకొని బతకు బండిని లాగిస్తున్నాడు. ఈ క్రమంలో తన ఒక్కగానొక్క చెల్లెలికి ఘనంగా పెళ్లి చేయాలనుకొని మంచి సంబంధం చూశాడు. ఈనెల 20 నిశ్చితార్థానికి ఏర్పాట్లు పూర్తిచేశాడు. ఈ సమయంలో ఆదివారం సాయంత్రం శ్రావణ్‌కుమార్‌ చెల్లెలు తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకొని పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు శ్రావణ్‌ను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. అల్లారుముద్దుగా చూసుకున్న చెల్లెలు తన పరువు తీసిందని భావించిన శ్రావణ్‌ అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఈ రోజు ఉదయం రైల్వే గేట్‌ వద్ద మ​ృతదేహం పడి ఉందనే సమాచారంతో అక్కడికి వెళ్లిన కుటుంబసభ్యులు శ్రావణ్‌ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

శిథిలావస్థలో గ్రంథాలయం

15/10/2016: ధర్మారం(పెద్దపల్లి జిల్లా): ప్రజలకు విజ్ఞానాన్ని అందించాల్సిన గ్రంథాలయం పాలకుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరుకుంది. మరమ్మతుకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవటంతో పాఠకులకు సరైన రీతిలో సేవలందించలేకపోతోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, నిరుద్యోగులకు ఉపయోగపడాల్సిన విలువైన పుస్తకాలు వానకు తడుస్తూ చెదలు పడుతున్న దుస్థితి నెలకొంది. ధర్మారం మండల కేంద్రంలోని గ్రంథాలయం శిథిలావస్థకు చేరుకుంది. గ్రంథాలయానికి పక్కా భవనం నిర్మించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఎన్నిసార్లు కోరినప్పటికి ఫలితం లేదని పాఠకులు ఆరోపిస్తున్నారు. ఈ గ్రంథాలయం శిథిలావస్థకు చేరి æ పైకప్పు నుంచి వర్షపు నీరు వస్తోంది. స్థానిక లైబ్రెరియన్‌ పై కప్పు పెంకుల మీద ప్లాస్టిక్‌ కవర్లు కప్పించారు. అయినా వర్షం పడుతున్నప్పుడు ఉరుస్తోంది. దీంతో విలువైన గ్రంథాలు, దిన, వారపత్రికలు నీటిలో తడుస్తున్నాయి. ఇరుకు గదుల్లో గ్రంథాలయం ఉండటంతో విలువైన పుస్తకాలను భద్రపర్చటానికి స్థలం లేక పుస్తకాలు చిందరవందరగా ఉన్నాయి. పురాతన కాలంనాటి విషయాలను భవిష్యత్‌ తరాలకు అందించేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నా శిథిలావస్థకు చేరిన భవనంతో ఫలితం లేకుండా పోతోందని పాఠకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రంథాలయం గ్రామం చివరలో ఉండటంతో ఎక్కువ మంది రావడం లేదు. ప్రభుత్వ చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గ్రంథాలయానికి పక్క భవనాన్ని నిర్మించుటకు నిధులు మంజూరు చేయించాలని పాఠకులు కోరుతున్నారు. భూమి కేటాయించాలి మండల పరిషత్‌ కార్యాలయం సమీపంలో ప్రభుత్వం భూమిని గ్రంథాలయ భవనం కోసం కేటాయించాలి. ప్రసుత్తం ఉన్న చోట సరైన వసతులు లేక పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ భవనాన్ని నిర్మిస్తే అందరికీ అందుబాటులో ఉంటుంది. -బత్తిని సంతోష్, బొట్లవనపర్తి నిధులు మంజూరు చేయాలి గ్రంథాలయ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించాలి. నిరుద్యోగులకు పోటీపరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను అందుబాటులో ఉంచాలి. సొంత భవనం నిర్మించేలా చూడాలి. - ఎండీ.రఫీ, ధర్మారం అందుబాటులో ఉంచాలి పోటీ పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగులకు గ్రంథాలయాన్ని అందుబాటులో ఉంచాలి. త్వరలో జరగబోయే గ్రూప్‌ పరీక్షలకు అవసరమయ్యో పుస్తకాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. - మోహన్‌నాయక్,

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరణ - లాభాల్లో 23 శాతం వాటా.. నేడు చెల్లింపు

08/10/2016: గోదావరిఖని/యైటింక్లయిన్‌కాలనీ : సింగరేణిలో కొన్నేళ్లుగా కార్మికులు ఎదురుచూస్తున్న వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అలాగే 1997 నుంచి 2001 వరకు వలం టరీ రిటైర్డ్‌మెంట్ స్కీమ్ (వీఆర్‌ఎస్) ద్వారా ఉద్యోగ విరమణ పొందిన కార్మికుల వారసుల నుంచి రూ.2 లక్షలు తీసుకుని వారికి కూడా ఉద్యోగావకాశం క ల్పించనున్నట్లు ప్రకటించారు. 2015 -16లో సాధించిన రూ.1066 కోట్ల లాభాల నుంచి 23 శాతం వాటాను కార్మికులకు చెల్లించేందుకు సీఎం అంగీకరించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవిత, పెద్దపల్లి, మానుకోట ఎంపీలు బాల్క సుమన్, సీతారాంనాయక్, మాజీ ఎంపీ జి.వివేక్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, దివాకర్‌రా వు, కోరం కనకయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావు, నాయకులు కెంగర్ల మల్ల య్య, మిర్యాల రాజిరెడ్డి, ఆకునూరి కనకరాజు, సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 1998 జూన్ 6వ తేదీ నాటికి ఉన్న 1100 మంది డిపెండెంట్లకు ఆనాటి నుంచి మూడేళ్లలో ఉద్యోగాలిస్తామని, రాబోయే కాలంలో వచ్చే కొత్త గనుల కోసం అవసరమైన మే రకు మాత్రమే ఉద్యోగాల్లో డిపెండెం ట్లను భర్తీ చేసే విధానంపై యాజమాన్యానికి, కార్మిక సంఘాలకు మధ్య ఒప్పందం జరిగింది. సీఎండీకి ఆదేశాలు.. గతంలో రెండేళ్ల సర్వీస్‌ను యాజమాన్యానికి వదిలిపెట్టిన కార్మికులు తమ వారసులను సింగరేణిలో ఉద్యోగంలో పెట్టించే వారు. అయితే కొన్నేళ్ల క్రితం జరిగిన ఒప్పందం తర్వాత కేవలం పూర్తిస్థారుు అనారోగ్యానికి గురైన, గని ప్రమాదంలో మరణించిన వారి స్థానంలో మాత్రమే వారసులకే ఉద్యోగాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్నేళ్లుగా వారసత్వ ఉద్యోగాల ను పునరుద్ధరించాలని కార్మికులు చేస్తు న్న డిమాండ్‌కు పరిష్కారం లభించలేదు. తాజాగా గురువారం జరిగిన చర్చల్లో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాలని, ఇందుకు సంబంధించిన విధివిధానాలను తయారు చేయాలని సీఎం కేసీఆర్.. సీఎండీని ఆదేశించారు. ఇదిలా ఉండగా, 2015-16లో సంస్థ సాధించిన సుమారు రూ.1066 కోట్ల లాభాల నుంచి 23 శాతం వాటా అంటే సుమారు రూ.245 కోట్లకు పైగా కార్మికులకు పం పిణీ చేయాలని, ఈ మొత్తాన్ని కూడా శు క్రవారం నాడే చెల్లించాలని సీఎం ఆదేశించారు. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే మాత్రం 10వ తేదీలోగా డబ్బులు బ్యాంకులో జమ చేసేందుకు అధికారులు సంసిద్ధత వ్యక్తం చేశారు. 2014-15లో సంస్థ రూ.490 కోట్లు లాభాలు సాధించగా...అందులో నుంచి 21 శాతం వాటా కింద రూ.103 కోట్లను కార్మికులకు పం పిణీ చేశారు. ఈసారి మాత్రం గతం క న్నా రెండు శాతం పెంచి కార్మికులకు దస రా కానుకగా వాటా డబ్బులు చెల్లించనున్నారు. దీని ప్రకారం ఒక్కో కార్మికుడు కనీసంగా రూ.40 వేలు, గరిష్టంగా రూ. లక్ష వాటా కింద పొందనున్నారు. ఇదిలా ఉండగా సింగరేణి గని కార్మికులకు అనుకూలంగా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై కోల్‌బెల్ట్‌లో సంబురాలు మిన్నంటారుు. కార్మికులు, వారి కుటుం బసభ్యులు టపాసులు కాల్చి ఆనందోత్స వాలు జరుపుకున్నారు. ట్యాంకు ఎక్కి వీఆర్‌ఎస్ డిపెండెంట్ల నిరసన గోదావరిఖని : సింగరేణిలో 1997 నుంచి 2001 వరకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (వీఆర్‌ఎస్) కింద ఉద్యోగ విరమణ పొందిన కార్మికుల వారసులకు ఉద్యోగాలివ్వకుండా ప్రభుత్వం తమ జీవితాలతో దోబూచులాడుతోందని వీఆర్‌ఎస్ డిపెండెంట్లు గురువారం రాత్రి గోదావరిఖనిలో అశోక్‌నగర్‌లోని మున్సిపల్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు. 1997 నుంచి 2001 మధ్య కాలంలో ఉద్యోగ విరమణ పొందిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలిస్తామని ఆశచూపి ట్రెయినింగ్ ఇచ్చి ఆ తర్వాత ఉద్యోగాలు లేవంటూ రూ.2 లక్షలు బలవంతంగా బ్యాంకులో జమచేశారని పేర్కొన్నారు. కాగా, గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.2 లక్షలు తీసుకోని వీఆర్‌ఎస్ డిపెండెంట్లకు మాత్రమే ఉద్యోగావకాశం కల్పిస్తామన డంతో ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న వన్‌టౌన్ ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని ట్యాంకు దిగాలని కోరినా ఆందోళన కొనసాగిస్తున్నారు.

సున్నం రాజయ్య ఆమరణ దీక్ష భగ్నం

08/10/2016: భద్రచలం: భద్రచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆమరణ నిరాహర దీక్షను శనివారం తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేశారు. ఆయన్ని దీక్షాస్థలి నుంచి బలవంతంగా భద్రచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. భద్రచలాన్ని జిల్లాగా ప్రకటించాలని గత రెండు రోజులుగా సున్నం రాజయ్య దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం దసర పండగ రోజున కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తుంది. కొత్త జిల్లాల జాబితాలో భద్రచలం పేరు లేకపోవడంతో సున్నం రాజయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అందులోభాగంగా భద్రచలం ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తు సున్నం రాజయ్య ఆమరణ దీక్షకు దిగారు.

అట్టుడికిన ఇనుగుర్తి... టవర్ దిగని యువకులు

08/10/2016: వరంగల్ :వరంగల్ జిల్లా ఇనుగుర్తి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటిస్తే తప్ప టవర్ దిగేది లేదంటూ యువకులు పట్టుబట్టారు. ఇప్పటికి దాదాపు 22 గంటలుగా ఐదుగురు యువకులు టవర్ మీదే ఉండిపోయారు. అధికారులు నేరుగా ప్రకటన చేస్తేనే తాము కిందికి దిగి వస్తామని వాళ్లు స్పష్టం చేస్తున్నారు.శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇనుగుర్తి బంద్ పాటించారు. వివిధ ప్రాంతాల్లోని సెల్ టవర్, వాటర్ ట్యాంకులపైకి మండల సాధన సమితి సభ్యులతోపాటు యువకులు ఎక్కి ఆందోళన నిర్వహించారు. గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ప్రభుత్వం నూతన మండలాల ప్రకటనలో ఎక్కడా ఇనుగుర్తి ప్రస్తావన లేకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. సీఎం హామీ ఇచ్చారని... ఇనుగుర్తి మండలం వస్తుందని... ఇన్నాళ్లు వేచి ఉన్నామని... ఇప్పుడు తమ ఆశ నిరాశ అయిందని వారు ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టినందుకు నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మను గ్రామస్తులు దహనం చేశారు. అయితే గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించే వరకు తాము దిగేది లేదని... సెల్ టవర్ ఎక్కిన ఆందోళనకారులు భీష్మించుకున్నారు. దీంతో వారు సెల్ టవర్ ఎక్కి 22 గంటలు అయినా కిందకి దిగకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదు.

జిల్లాను నంబర్‌ వన్‌ చేస్తాం - పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు

07/10/2016: జనగామ : అభివృద్ధిలో రాష్ట్రంలోనే జనగామ జిల్లాను నంబర్‌ వన్‌ చేస్తామని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి ఆయన గురువారం హైదరాబాద్‌ నుంచి జనగామకు వచ్చారు. జేఏసీ చైర్మన్‌ ఆరుట్ల దశమంతరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దయాకర్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో జనగామను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. దేవాదుల ద్వారా చెరువులకు నీటిని మళ్లించి 365 రోజులూ మత్తడి దుంకేలా చేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ జనగామ జిల్లా ఇచ్చేందుకు మొదటి నుంచే సుముఖంగా ఉండగా చేర్యాల, మద్దూరు, గుండాల, స్టేషన్‌ ఘన్‌పూర్, జఫర్‌గఢ్‌ మండలాల వారు కలువమంటున్నరు.. జనాభా సరిపోవడం లేదనేవారని తెలిపారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జేఏసీ నాయకులు జనగామ జిల్లా ఇవ్వాల్సిందేనని ఖరాకండిగా చెప్పడంతో మిగతా జిల్లాల సంగతి ఎలా? అని కేసీఆర్‌ ప్రశ్నించారని తెలిపారు. గతంలో జనగామను జిల్లాగా చేస్తానని మాట ఇచ్చారని, మిగతా వాటిపై హామీ ఇవ్వలేదనడంతో గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని వివరించారు. జిల్లా అభివృద్ధికి అందరి సహకరించాలని కాంక్షించారు. ఉద్యమంలో కలిసి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నాగారపు వెంకట్, డాక్టర్లు లక్షి్మనారాయణనాయక్, రాజమౌళి, పజ్జూరి గోపయ్య, పోకల లింగయ్య, మాశెట్టి వెంకన్న బొట్ల శ్రీనివాస్, ఆకుల సతీష్, బండ యాదగిరిరెడ్డి, కారింగుల రఘువీరారెడ్డి, మంగళ్లపల్లి రాజు, ఉడుగుల రమేష్, కొండా కిరణ్, బెడిదె మైసయ్య, కన్నారపు ఉపేందర్, పెట్లోజు సోమేశ్వరాచారి, విజయ్‌ ఉన్నారు.

ప్రాణం తీసిన ఈత సరదా - మానేరులో యువకుడి దుర్మరణం

07/10/2016: సిరిసిల్ల టౌన్‌ : స్నేహితులతో కలిసి సరదాగా ఈతకెళ్లిన ఓ యువకుడు మానేరువాగులో పడి మృతిచెందిన సంఘటన గురువారం పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన గడ్డం శ్రీనివాస్, సారవ్వ కుమారు అజయ్‌(20) హైదరాబాద్‌ రైల్వేలో ప్రై వేటు కూలిగా పనిచేస్తున్నాడు. దసరా పండుగ కోసం నాలుగురోజుల క్రితం ఇంటికొచ్చాడు. మానేరువాగును చూసేందుకు స్నేహితులు వంశీ, అరుణ్‌తో కలిసి వెళ్లాడు. ఈతకొడుతున్న సమయంలో అజయ్‌కి అకస్మాత్తుగా ఫిట్స్‌ రావడంతో మునిగిపోయాడు. స్నేహితులు ఒడ్డుకు చేర్చేలోపే మృతిచెందాడు.

మంత్రులకు జిల్లాలను ప్రారంభించే బాధ్యతలు

06/10/2016: హైదరాబాద్: సిఎం కేసీఆర్ కొత్త జిల్లాలను ప్రరంభిచడానికి ఒక్కో మంత్రికి బాధ్యతలు అప్పగించారు. అవి ఇలా ఉన్నాయి. సిఎం కేసీఆర్ : సిద్దిపేట, మెదక్ ( ఈ కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పాల్గొంటారు. మండలి చైర్మన్ స్వామి గౌడ్ : వరంగల్ రూరల్ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి : భూపాలపల్లి డిప్యూటీ సిఎం మహమూద్ అలీ : జగిత్యాల డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి : జనగామ నాయిని నర్సింహరెడ్డి : యాదాద్రి ఈటెల రాజెందర్ : పెద్దపల్లి పోచారం శ్రీనివాసరెడ్డి : కామారెడ్డి టి. పద్మారావు : మంచిర్యాల పి. మహేందర్ రెడ్డి : శంషాబాద్ కెటి రామారావు : సిరిసిల్ల జోగు రామన్న : ఆసిఫాబాద్ జి.జగదీష్ రెడ్డి : సూర్యాపేట తుమ్మల నాగేశ్వర్ రావు : కొత్తగూడెం ఎ. ఇంద్రకరణ్ రెడ్డి : నిర్మల్ తలసాని శ్రీనివాసయాదవ్ : వనపర్తి సి. లక్ష్మారెడ్డి : నాగర్ కర్నూల్ అజ్మీరా చందూలాల్ : మహబూబాబాద్ జూపల్లి కృష్ణారావు : గద్వాల సి.ఎస్. రాజీవ్ శర్మ : మల్కాజిగిరి (మేడ్చల్)

సింగరేణిపై సీఎం కీలక సమావేశం - తేలనున్న వారసత్వ ఉద్యోగాలు, లాభాల వాటా..? - ఇప్పటికే డైరెక్టర్ తో సీఅండ్‌ఎండీ బేటి

06/10/2016: శ్రీరాంపూర్ : ఎంతో కాలంగా అందరూ ఎదురుచూస్తున్న సింగరేణి కీలక సమావేశం నేడు సీఎం కేసీఆర్ సమక్షంలో జరుగనుంది. కార్మికుల ప్రధాన డిమాండ్లు అయిన వారసత్వ ఉద్యోగాలు, లాభాల వాటా, స్వంతింటి పథకం వంటి వాటిపై ముఖ్యమంత్రి నేడు అటు సింగరేణి యాజమాన్యం, ఇటు గుర్తింపు సంఘం నేతలతో చర్చించనున్నట్లు విశ్వాసనీయం సమాచారం. బుధవారం మధ్యాహ్నమే సీఎం పేషీ నుంచి సింగరేణి సీఅండ్‌ఎండీకి కబురు వచ్చింది. ఆయనకు ఉదయం 10 గంటలకు సీఎం అపాయిమెంట్ ఇచ్చారు. రాత్రికి గుర్తింపు సంఘం నేతలకు కూడా సమాచారం అందనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఎంపీ కవిత, బాల్క సుమన్‌లు టీబీజీకేఎస్ ముఖ్య నేతలను హైదరాబాద్‌కు పిలిపించుకున్నారు. సీఎం ఎప్పుడు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించడంతో వారు రెండు రోజులుగా ఇక్కడే మాకం వేసి ఎప్పుడు కబురు వస్తుందా అని వేచి ఉన్నారు. ఎట్టకేలకే సీఅండ్‌ఎండీ అధికారికంగా అపాయిమెంట్ ఇవ్వడంతో ఇక సమావేశం ఖరారైనట్లు తెలిసింది. ఇదిలా అన్నింటిలోకెళ్లా ముఖ్యమైన వారసత్వ ఉద్యోగాలపై ఇప్పటికే సీఎం తనును కలిసి పలువురు ఎంపీలు, కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నట్లు తెలిసింది. డైరెక్టర్ తో సీఅండ్‌ఎండీ మంతనాలు... ఇదిలా ఉంటే ఇందులో వారసత్వ ఉద్యోగాల పీటముడిపై సీఅండ్‌ఎండీ ఎన్ శ్రీధర్ కంపెనీ డైరెక్టర్ల తో సమావేశమయ్యారు. డైరెక్టర్లంతా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. వారసత్వ ఉద్యోగాలు ఇస్తే కంపెనీ జరిగే లాభ నష్టాలను ప్రత్యేక రిపోర్టు తయారు చేసుకున్నారు. కంపెనీలో ఉన్న ప్రస్తుత క్లిష్ట పరిస్థితులు, ఈసమయంలో వారసత్వం ఇస్తే ప్రభుత్వం నుంచి సింగరేణి అందాల్సిన సహాయ సహకారా లు కూడా చర్చకు పెట్టే అవకాశం ఉంది. సీఎం వారసత్వ ఉద్యోగాలు డిక్లేర్‌చేస్తే దానిలో విధివిధానాలు ఎలా పెట్టాలో ఇప్పటికే యాజమాన్యం డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసిపెట్టుకుంది. మంతనాలు సాగిస్తున్న టీబీజీకేఎస్ నేతలు.. గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ముఖ్యనేతలు సీఎం బేటిలో చర్చించాల్సిన అంశాలపై మంతనాలు సాగిస్తున్నారు. ఇప్పటికే ఆయూనియన్ అధ్యక్షుడు బి వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్యలు రెండు రోజులుగా హైదారాబాద్‌లోనే మకాం వేసి అటు కవిత, ఇటు బాల్క సుమన్‌తో టచ్‌లో ఉన్నారు. కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్‌కు పయనమయ్యారు. వారసత్వ ఉద్యోగాలపై సీఎం సానుకూలత వ్యక్తం చేస్తే దాన్ని యాజమాన్యం చెప్పే అభ్యంతరాలను ఎలా అడ్డుకోవాలి, వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడం వల్లే కలిగే ప్రయోజనాలు, అటు కంపెనీ పరంగా, ఇటు రాజకీయ పరంగా మేలు చేసే అంశాలను కూడా సీఎం వద్ద ప్రజెంట్ చేయడానికి ఈ ఇద్దరు నేతలు సిద్దమయ్యారు. దీనికి సంబంధించిన వారు రిపోర్టును కూడా సిద్ధం చేసుకున్నారు. గతంలో ఉన్న మాదిరిగా కేవలం రెండేళ్ల సర్వీసుతో వారసత్వం కల్పిస్తే కేవలం కొద్ది మందికి మాత్రమే వస్తుంది. చాలా మంది నష్టపోతారు. కాబట్టి వీలైనంత ఎక్కువ మందిని వారసత్వ ఉద్యోగాల పరిదిలో చేర్చాలని నిర్ణయించారు. దీనికి ఇప్పటి వరకు మెడికల్ బోర్డుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు పెట్టుకొన్న వారికి కూడా వారసత్వ అవకాశం కల్పిస్తే ఎక్కువ మంది లబ్ధి పొందుతారని సీఎంకు సూచించనున్నారు.

గవర్నర్తో సీఎం కేసీఆర్ భేటీ

06/10/2016: హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీయ్యారు. రాజ్భవన్లో గురువారం ఉదయం గవర్నర్ను కలిసి దసరా నుంచి ఏర్పడనున్న కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలకు సంబంధించిన వివరాలను సీఎం వివరించారు. బతుకమ్మ ఉత్సవాలకు రావాల్సిందిగా గవర్నర్ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు.

సర్పంచ్‌పై గిరిజనుల దాడి - వ్రగాయాలతో ఆస్పత్రికి తరలింపు - మరో పది మందికి గాయాలు

05/10/2016: కరీంనగర్(ధర్మపురి): భూముల విషయంలో గొడవలుపడి సర్పంచ్‌పై కర్రలతో దాడి చేసిన ఘటన సారంగాపూర్‌ మండలం చిన్నకొల్వాయి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ దాడిలో ధర్మపురి మండలం ఆరెపల్లి సర్పంచ్‌తోపాటు మరో పది మంది గాయపడ్డారు. బాధితుడు సర్పంచ్‌ గడ రాజన్న తెలిపిన వివరాలు. సారంగపూర్‌ మండలంలోని కొల్వాయి, చిన్నకొల్వాయి, ధర్మపురి మండలంలోని ఆరెపెల్లికి చెందిన సర్వే నంబర్‌ 306లో 600 ఎకరాలకు పైగా ముంపు గ్రామాలకు చెందిన భూములు ఉన్నాయి. అందులో సర్పంచ్‌కు 4 ఎకరాలు, ఆరెపెల్లి గ్రామస్తులకు రెండు, మూడెకరాల చొప్పున భూములున్నాయి. గత నలభై ఏళ్లుగా భూములను సాగుచేసుకుంటున్నారు. వాటికి భూమి శిస్తు సైతం చెల్లిస్తున్నారు. ఈ భూముల్లో తమకు హక్కుందంటూ చిన్నకొల్వాయికి చెందిన గిరిజనలు కొందరు దున్నారు. విషయం తెలిసిన ఆరెపెల్లికి చెందిన పట్టాలున్న రైతులు అక్కడికి చేరుకోగా గిరిజనులు కర్రలతో దాడి చేసి కళ్లల్లో కారంపొడి చల్లి పరారయ్యారు. సర్పంచ్‌ గడ రాజన్న, ఉపసర్పంచ్‌ గంగాధరి కిష్టయ్య, సాయిని గంగాధర్, బనికె ఎల్లయ్య, సంగెపు లక్ష్మి, నారాయణ, గంగాధర్‌ గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ సర్పంచ్‌ను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసికోవాలి : జెడ్పీటీసీ ఆరెపెల్లి సర్పంచ్‌తోపాటు పదిమందిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసికోవాలని జెడ్పీటీసీ బాదినేని రాజమణి కోరారు. ఈ దాడిని జెడ్పీటీసీతో పాటు పీఏసీఎస్‌ చైర్మన్‌ బాదినేని రాజేందర్, మండల సర్పంచులు, నాయకులు ఖండించారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

05/10/2016: వరంగల్ : నగరంలోని మామునూరు వద్ద బుధవారం ఉదయం ఆగి ఉన్న టాటా ఏస్ వాహనాన్ని, రికవరీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్ డ్రైవర్లిద్దరూ అక్కడికక్కడే మృతిచెందగా..మరో ముగ్గురు రైతులకు తీవ్రగాయాలయ్యాయి. పత్తిలోడుతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన ఆపి రిపేరు చేస్తున్నారు. అదే సమయంలో ఖమ్మం నుంచి వరంగల్ వైపు వస్తున్న రికవరీ వాహనం అదుపుతప్పి వీరిపై నుంచి దూసుకెళ్లటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు వర్ధన్నపేట మండలం తమ్మడపల్లికి చెందిన తోట రాజు(30)గా గుర్తించారు. మరో డ్రైవర్‌ను గుర్తుపట్టాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బయటకు చెబితే నీ భర్తను చంపేస్తా..- బెదిరించి నీచుడి అత్యాచారం - బ్లాక్‌మెయిల్ చేసి మరొకడి లైంగికదాడి

05/10/2016: ఖమ్మం(కారేపల్లి): ఎవరికైనా చెబితే నీ భర్తను చంపుతానని బెదిరించి ఓ కీచకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఊరుకోకుండా ఈ విషయాన్ని తన స్నేహితుడికి చెప్పాడు. అతడు కూడా అదే తరహాలో బెదిరించడంతో పాటు బ్లాక్ మెయిల్ చేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె విషయాన్ని భర్తకు చెప్పింది. ఈ మేరకు బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడులో సంచారజాతికి చెందిన ఓ మహిళ భర్తతో కలిసి బతుకుదెరువుకు 4 నెలల క్రితం మహారాష్ట్రకు వెళ్లింది. ఏన్కూర్ మండలం రాజలింగాలకు చెందిన వీరి బంధువు నెరసుల నరేశ్ అక్కడే స్థిరపడి ఉన్నాడు. కాగా, నరేశ్ భర్త లేని సమయంలో ఆ మహిళపై అత్యాచారం చేశాడు. ఎవరికై నా చెప్పితే.. నిన్ను, నీ భర్తను చంపుతానని బెదిరించడంతో ఎవరికీ చెప్పలేదు. నెల తర్వాత భర్తతో కలిసి స్వగ్రామానికి చేరుకుంది. భర్తకూలీ పనులు చేస్తుండగా, భార్య మేకలు కాస్తోంది. ఈ క్రమంలోనే నరేశ్.. వరుసకు సోదరుడయ్యే ముదిగొండకు చెందిన నెరసుల బాబుకు జరిగిన విషయాన్ని చెప్పాడు. 4 రోజుల క్రితం చీమలపాడుకు వచ్చిన బాబు మేకలు కాయడానికి అటవీ ప్రాంతానికి వెళ్లిన బాధితురాలిని అటకాయించాడు. ఆమెను బ్లాక్‌మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. నరేశ్ తరహాలోనే మరోసారి బెదిరించాడు. ఇంటికి వచ్చిన ఆమె మహారాష్ట్రలో, ఇక్కడ జరిగిన విషయాన్ని భర్తకు చెప్పింది. దీంతో కులపెద్దలను ఆశ్రరుుంచారు. తర్వాత కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

12 గంటలు.. నరకయాతన - ఇంటర్ సిటీ రైలు నుంచి పడిపోయిన యువకుడు

05/10/2016: చిన్నశంకరంపేట: ఇంటర్‌సిటీ రైలు నుంచి సోమవారం రాత్రి పడిపోయిన యువకుడు వైద్యం అందక 12 గంటల పాటు నరకయాతన అనుభవించాడు. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి-వడియారం రైల్వేస్టేషన్‌ల మధ్య అటవీ ప్రాంతంలో జరిగింది. మల్కాజిగిరికి చెందిన పాటి శివకుమార్ బ్యాంకు పనిపై సోమవారం ఉదయం నిజామాబాద్ వెళ్లాడు. బ్యాంకులో పని కాకపోవడంతో సోమవారం సాయంత్రం ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో మల్కాజిగిరికి బయలుదేరాడు. రాత్రి మిర్జాపల్లి-వడియారం రైల్వేస్టేషన్ ల మధ్య కామారం రైల్వేగేట్ దాటిన తర్వాత రైల్లోంచి కిందపడిపోయాడు. కాగా, తనను ఎవరో తోసివేశారని యువకుడు చెబుతున్నాడు. రక్షించాలని అర్థించినా ఎవరూ పట్టించుకోలేదని ఆపై స్పృహ కోల్పోయానని తెలిపాడు. తర్వాత రోజు ఉదయం నీళ్ల కోసం అరుస్తుండగా అటుగా వెళ్తున్న రైల్వే కీమ్యాన్ గమనించాడు. రైల్వేట్రాక్ పక్కన పొదల్లో యువకుడి కదలికలు గమనించి.. మిర్జాపల్లి రైల్వేస్టేషన్ మాస్టార్‌కు సమాచారం అందించారు. దీంతో ఆయన 108 అంబులెన్సకు సమాచారం అందించగా, వాహనం అక్కడి వరకు వెళ్లే పరిస్థితి లేదు. ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్ వెళ్లే ప్యాసింజర్ ట్రైన్ లో వడియారం వరకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి 108లో గాంధీ ఆస్పత్రికి తరలించారు.

కన్నుల పండుగగా బతుకమ్మ సంబరాలు

04/10/2016: మహబూబ్‌ నగర్‌ (ఆత్మకూర్‌), సలాం తెలంగాణ : మహబూబ్‌ నగర్‌ జిల్లా ఆత్మకూర్‌ పట్టణంలోని మండలపరిషత్‌ లో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు సోమవారం సాయంత్రం నుండి రాత్రి వరకు కన్నుల పండుగగా కొనసాగినాయి. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామప్రజులు, మహిళలు, అంగన్‌వాడి కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు బతుకమ్మను తయారుచేసుకుని వచ్చారు. అదేవిధంగా ఆత్మకూర్‌ పట్టణ గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్లు, సిబ్బంది బతుకమ్మను ఉపసర్పంచు శ్రీమతి సౌజన్యగంగాధర్‌ గ్రామపంచాయతీ నుండి ఊరేగింపుగా మండల పరిషత్‌ ఆవరణలోకి తీసుకువచ్చారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్‌ వసంతరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ జాగృతి మొదట తెలంగాణ ఉద్యమంలో మహిళలను పాల్గొనేందుకు ఏర్పాటుచేయడం జరిగిందని, అదేవిధంగా అనేక కార్యక్రమాలను చేపడుతున్నాట్లు తెలిపారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకురాలు కె. కవిత బతుకమ్మ పండుగ విశిష్టతను వివిధదేశాలో తెలియజేసేందుకు ప్రస్తుతం విదేశాలో బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిప్పుడంపల్లి గ్రామవిద్యార్థులు బతుకమ్మ పండుగ విశిష్టతను తెలిపారు. ఇందులో ముప్పైఐదు బతుకమ్మలు పోటీలో పాల్గొన్నాయి. మొదటి బహుమతిగాను రూ.3వేల16, రెండవ బహుమతి రూ.2వేల16, మూడవ బహుమతిగా రూ.1 వేయి 16ను నిర్వహకులు ప్రకటించారు. మొదటి బహుమతి ఆత్మకూర్‌ పట్టణానికి చెందిన 5 మహిళ సంఘం సభ్యులు గొలుచుకోవడం జరిగింది. సురేష్‌ జానపద కళకారులు ఆట,పాటలతో కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమం అనంతరం బహుమతి ప్రధానోత్సవం, అనంతరం ఆత్మకూర్‌ పట్టణ సమీపంలోగల శ్రీ పరమేశ్వరస్వామి చెరువునందు బతుకమ్మలను వదిలారు. ఈ కార్యక్రమంలో మండలం ఎంపీడీవో పుష్పలీల, ఎంఈవో విష్ణువర్థన్‌రెడ్డి, ఎంపీపీ శ్రీధర్‌గౌడ్‌, జడ్‌పీటీసీ బాలకిష్టన్న, మండల సర్పంచ్, ఎంపీటీసీలు వివిధ గ్రామల నుంచి వచ్చిన ప్రజులు పాల్గొన్నారు.

సిరిసిల్లకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ - పెద్దపల్లి, జగిత్యాల యథాతధం - కమలాపూర్‌ మినహా హుజురాబాద్‌ మనకే

04/10/2016: కరీంనగర్‌ : కరీంనగర్‌ జిల్లా నాలుగు ముక్కలు కానుంది. జిల్లాల విభజన తెరపైకి వచ్చినప్పుడు మూడు జిల్లాలుగానే విభజించిన ప్రభుత్వం నాల్గో జిల్లాకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మొదటి ప్రకటనలో కరీంనగర్‌తో పాటు జగిత్యాల, సిరిసిల్లలను ప్రకటించి, ఆ తర్వాత సిరిసిల్లకు బదులు పెద్దపల్లిని ప్రతిపాదించారు. సిరిసిల్లకు మొండి చేయి చూపడంతో గత 40 రోజులుగా నిరసనలు మిన్నంటాయి. సిరిసిల్లను జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సిందేనంటూ జేఏసీలుగా ఏర్పడి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ప్రభుత్వం తాజాగా సోమవారం జరిగిన జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సమావేశంలో సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేసేందుకు సుముఖత చూపిస్తూ సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. సిరిసిల్లను రాజన్న జిల్లాగా ప్రకటించాలని, పెద్దపల్లి నగరపంచాయితీని మున్సిపాలిటీగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో కరీంనగర్‌ జిల్లా నాలుగు ముక్కలు కానుంది. కరీంనగర్‌ జిల్లా, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. దీంతో గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న జిల్లాల విభజన ప్రక్రియ ఉత్కంఠకు తెరపడినట్లయింది. గత ముసాయిదాలో ప్రతిపాదించిన విధంగా మంథని నియోకవర్గంలోని మహాదేవ్‌పూర్, మల్హార్, కాటారం, మహాముత్తారం మండలాలు కొత్తగా ఏర్పడబోయే భూపాలపల్లి జిల్లాలోకి కలుస్తున్నాయి. హుజురాబాద్‌ నియోజకవర్గం మొత్తాన్ని గతంలో హన్మకొండ రూరల్‌ జిల్లాలో కలిపే విధంగా ప్రతిపాదించినప్పటికీ తాజా పరిణామాలతో కమలాపూర్‌ మండలం మినహా మిగతా మండలాలన్నీ కరీంనగర్‌లోనే కొనసాగే విధంగా నిర్ణయం తీసుకున్నారు. హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని బీమదేవరపల్లి, ఎల్కతుర్తి, హన్మకొండ రూరల్‌ జిల్లాలోకి కలుపనున్నారు. గత కొద్దిరోజులుగా కరీంనగర్‌లోనే కొనసాగించాలనే డిమాండ్‌తో ఆందోళనలు చేస్తున్న హుస్నాబాద్, కోహెడ మండలాలలను ప్రతిపాదిత సిద్దిపేట జిల్లాలోనే ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల విభజన ఇలా.... కరీంనగర్‌ ః కరీంనగర్‌ అర్బన్, కరీంనగర్‌ రూరల్, కొత్తపల్లి, రామడుగు, గంగాధర, చొప్పదండి, మానకొండూర్, తిమ్మాపూర్, చిగురుమామిడి, శంకరపట్నం, వీణవంక, సైదాపూర్, జమ్మికుంట, హుజురాబాద్, ఇల్లందకుంట జగిత్యాల ః జగిత్యాల, మల్యాల, పెగడపల్లి, గొల్లపల్లి, ధర్మపురి, వెల్గటూర్, సారంగపూర్, రాయికల్, మేడిపల్లి, కోరుట్ల, కథలాపూర్, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కొడిమ్యాల. పెద్దపల్లి ః పెద్దపల్లి, ఓదెల, కాల్వశ్రీరాంపూర్, కమాన్‌పూర్, రామగుండం, ముత్తారం, మంథని, సుల్తానాబాద్, ఎలిగేడ్, జూలపల్లి, ధర్మారం. సిరిసిల్ల ః సిరిసిల్ల, సిరిసిల్ల రూరల్, వేములవాడ, వేములవాడ రూరల్, పొత్తూరు, ఇల్లంతకుంట, ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, కోనరావుపేట, రుద్రంగి, చందుర్తి, బోయినపల్లి. ప్రతిపాదిత మండలాలు ః జగిత్యాల అర్భన్, మెట్‌పల్లి అర్భన్, కోరుట్ల అర్భన్, బీర్‌పూర్, బుగ్గారం, ఇల్లందకుంట, పోత్తూరు, రుద్రంగి, వీర్నపల్లి, వేములవాడ రూరల్, అంతర్గాం, కరీంనగర్‌ రూరల్, కొత్తపల్లి, సిరిసిల్ల రూరల్‌ మండలాలు అందుబాటులో ఉన్న జిల్లాలో కలపనున్నారు. ప్రజల కోరిక మేరకే ః ఈటల ప్రజల కోసమే జిల్లాల విభజన తప్ప రాజకీయ నాయకులు, పార్టీల కోసం కాదని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. జిల్లాల పునర్విభనలో భాగంగా జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రులు ఈటల రాజేందర్, కె.తారకరామారావులు సమావేశమయ్యారు. నియోజకవర్గాల వారిగా గ్రామాలు, మండలాల కూర్పుపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మంత్రి ఈటల రాజేందర్‌ మీడియాతో మాట్లాడుతూ... ప్రజల కోరిక మేరకు గ్రామాలను సైతం జిల్లాలుగా మార్చామని చెప్పారు. నాయకులు శాశ్వతం కాదని ప్రజలు శాశ్వతమన్నారు. విభజన వల్ల పది మండలాలు కరీంనగర్‌ జిల్లా నుంచి ఇతర జిల్లాలకు సర్దుబాటు చేయగా, కొత్తగా 15 మండలాలు ఏర్పాటు కాబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. కరీంనగర్‌ 11 లక్షలు, జగిత్యాల 10 లక్షలు, పెద్దపల్లి 8 లక్షలు, సిరిసిల్ల 6 లక్షల జనాభాతో ఏర్పాటు కాబోతున్నట్లు స్పష్టం చేశారు. విభజన పూర్తి శాస్త్రీయంగా ప్రజాభిప్రాయం మేరకే చేసినట్లు తెలిపారు. దేశంలో లక్షలోపు జనాభా గలవి 26 జిల్లాలు, 2 లక్షల జనాభా లోపు 100 జిల్లాలున్నాయని, అరుణాచల్‌ ప్రదేశ్‌లో 8 వేల మందికి ఒక జిల్లా ఉందన్నారు. ఈ రోజు సమావేశంలో ప్రజాప్రతినిధులతో చర్చించి నివేదిక తయారు చేసి మంగళవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు నివేదిక అందజేస్తామని ఈటల వెల్లడించారు. సిఎంకు కతజ్ఞతలు ః ఈద కాల్వశ్రీరాంపూర్‌ మండలాన్ని పెద్దపల్లి రెవెన్యూ డివిజన్‌లో కలపాలని కోరగా సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావుకు సహకరించిన రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి కతజ్ఞతలు తెలిపారు. జిల్లాల పునర్విభనలో భాగంగా సోమవారం జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో సిఎం కెసిఆర్‌ సమావేశమయ్యారు. గతంలో మంథని రెవెన్యూ డివిజన్‌ పరిధిలో కాల్వశ్రీరాంపూర్‌ మండలాన్ని కలుపొద్దని అనేక ఆందోళనలు జరిగిన విషయాన్ని సిఎంకు వివరించానని, ప్రజల కోరిక మేరకు పెద్దపల్లి రెవెన్యూ డివిజన్‌లో కలిపితే రవాణా సౌకర్యంతో పాటు అనుకూలంగా ఉంటుందని తెలుపగా సిఎం సానుకూలంగా స్పందించారని ఈద వెల్లడించారు.

సిటిజన్స్‌ హార్ట్‌ను ఆవిష్కరించిన సిటిజన్స్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌

హైదరాబాద్‌, సలాం తెలంగాణ: హృద్రోగ వ్యాధుకు, అత్యవసర సందర్భాల్లో అత్యుత్తమ చికిత్సకు ఎక్స్‌క్లూజివ్‌ కార్డియాజీ స్పెషాలిటీ హృద్రోగ సంరక్షణపై అవగాహన కల్పించేందుకు, ప్రత్యేక శిక్షణ కోసం పు కార్యక్రమాల నిర్వహణ. సెప్టెంబర్‌ 29న నిర్వహించే వరల్డ్‌ హార్ట్‌ డే సమీపిస్తున్న నేపథ్యంలో సిటిజన్స్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ తన క్యాంపస్‌లో సిటిజన్స్‌ హార్ట్‌ను ఆవిష్కరించింది. గుండె సంబంధిత అత్యవసర పరిస్థితులో తగు చికిత్సను అందించేందుకు మీగా ఈ కేంద్రం అత్యంత వృత్తినిపుణులైన వైద్యును, ప్రత్యేకంగా శిక్షణ పొందిన నర్సును కలిగి ఉంది. ఈ సందర్భంగా హాస్పిటల్‌ సమీప ప్రాంతా వారి కోసం పు ఉచిత ఆరోగ్య శిబిరాు, ప్రత్యేక కార్డియాక్‌ ప్యాకేజీను, గుండె సంబంధిత అత్యవసర పరిస్థితుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పు సీపీఆర్‌ శిక్షణ శిబిరాను కూడా ఏర్పాటు చేసింది.

తల్లి లేని నన్ను కాపాడు నాన్నా.. - తండ్రి ఇంటి ఎదుట కూతురి దీక్ష

03/10/2016: ఖమ్మం: ములకలపల్లి: ‘నాన్నా..! తల్లి లేని నన్ను కాపాడు. నువ్వు ఆదరించకపోతే మరణమే దిక్కు. నన్ను కాపాడే వరకు మంచినీళ్లు కూడా తాగను. నీ కాళ్లు మొక్కుతా నాన్నా.. ఇట్లు.. నీ కూతురు దీపిక’ అని ఫ్లెక్సీ పెట్టి ఓ కూతురు తన తండ్రి ఇంటి ఎదుట దీక్షకు దిగింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా ములకలపల్లి మండలంలోని పూసుగూడెం పంచాయతీ పరిధి సుబ్బనపల్లి లో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన తాటిపల్లి రామచంద్రయ్య ఒడ్డురామవరానికి చెందిన గుగులోత్‌ శారదను 15 ఏళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఓ పాప (దీపిక) జన్మించింది. పాపకు నాలుగేళ్ల వయసున్నప్పుడు శారద అనారోగ్యంతో మృతిచెం దింది. అనంతరం దీపికను వాళ్ల అమ్మమ్మ ఇం ట్లో వదిలేసి రాంచంద్రయ్య మరో మహిళను వివాహం చేసుకున్నాడు. కాగా, దీపికకు థైరాయిడ్‌ ఉందని, ఆపరేషన్‌కు రూ.50 వేలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. ఇన్నాళ్లు బాగోగులు చూసిన అమ్మమ్మ వృద్ధురాలు కావడం తో తనకు భోజనం పెట్టడమే కష్టంగా మారిం దని బాధితురాలు కన్నీటిపర్యంతమైంది. పలుమార్లు గ్రామపెద్దలను ఆశ్రయించి తనను ఆదుకోవాలని వేడుకున్నప్పటికీ ఫలితం లేకుం డా పోయిందని తెలిపింది. కాగా, జగదాంబ గిరిజన సేవా సంఘం దీపికకు సంఘీభావం ప్రకటించారు. దీపికను తండ్రి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఊరంతా కలసి ఊపిరి పోశారు! - వాగులో చిక్కుకున్న 14 మందిని కాపాడిన గ్రామస్తులు - ఆదిలాబాద్ జిల్లా కచికంటిలో ఘటన

03/10/2016: ఆదిలాబాద్ : క్షణక్షణానికి పెరుగుతున్న వరద.. నడివాగులో ఓ బండపై బిక్కుబిక్కుమంటూ 14 మంది.. పది నిమిషాలైనా ఘోరం జరిగిపోయేది! కానీ గ్రామస్తుల సాహసంతో వారంతా బతికి బయటపడ్డారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్‌కు చెందిన ఓ ముస్లిం కుటుంబం కచికంటి పెద్దవాగులో బట్టలు ఉతుక్కోవడానికి వెళ్లింది. వీరిలో నలుగురు వృద్ధులు, ఓ యువతి, మహిళ, ఓ వ్యక్తితో పాటు 7 నుంచి 12 ఏళ్లలోపు ఏడుగురు అబ్బారుులున్నారు. వృద్ధులు ఒడ్డున ఉండి దుస్తులు ఆరేస్తుండగా.. మిగతా వారు వాగులో దిగి బట్టలు ఉతుకుతున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వాగులో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో అందరూ ఆందోళనకు గురై ఒకచోటికి చేరి బండపై నిల్చున్నారు. అదే సమయంలో కచికంటికి చెందిన రైతు కమ్మయ్య తన భార్య కళావతితో కలసి పొలం నుంచి ఇంటికి వస్తున్నాడు. వారిని గమనించిన కమ్మయ్య వెంటనే ఊళ్లోకి పరుగెత్తుకుంటూ వెళ్లి గ్రామస్తులకు సమాచారం అందించాడు. దీంతో వారంతా తాళ్లతో వాగు వద్దకు చేరుకున్నారు. వాగులోకి దిగేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో రైతు కాసారపు శ్రీనివాస్.. ధైర్యం చేసి నీటిలో చిక్కుకున్న వారి వద్దకు తాళ్ల సాయంతో వెళ్లాడు. ఒక చీర తీసుకుని అందరి చుట్టూ కట్టాడు. తాళ్ల సాయంతో ఒక్కొక్కరిని వాగు నుంచి బయటకు పంపించగా.. ఒడ్డున ఉన్న గ్రామస్తులు బయటకు లాగారు. గంటన్నర తర్వాత అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. పది నిమిషాలు ఆలస్యమైతే.. ‘‘వాగు సమీపంలో ఉన్న మా వ్యవసాయ పొలానికి వెళ్లి వస్తున్నాం. అప్పుడే వాగుకు నీళ్లు వచ్చాయి. వాగు మధ్యలో ఉన్న వారు ఏడుస్తున్నరు. నా భార్యను ఉండమని చెప్పి ఉరుకుతా గ్రామంలో ఉన్న వారిని పిల్చుకొని వచ్చాను. పది నిమిషాలు ఆలస్యమైనా గల్లంతయ్యేవారు’’ - కమ్మయ్య, కచికంటి గ్రామస్తుడు ఆరుగురుని కాపాడిన పోలీసులు, గ్రామస్తులు ఆదిలాబాద్ మండలం లాండసాంగ్వి సమీపంలోని బండాళ వాగులో చిక్కుకున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు, గ్రామస్తులు కాపాడారు. ఆదిలాబాద్‌లోని ఖానాపూర్‌కు చెందిన బిర్కుల రాజు(29), లక్ష్మీ(25), ఉమా(28), చరణ్(7), కిరణ్(4), శ్వేత(5) వాగులో బట్టలు ఉతుక్కోవడానికి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు వెళ్లారు. 4 గంటల ప్రాంతంలో వాగులో నీటి ఉధృతి పెరగడంతో వరదలో చిక్కుకుపోయూరు. దీంతో బండపైకి చేరి నిల్చున్నారు. ఓ వ్యక్తి సమాచారంతో గ్రామస్తులు, పోలీసులు అక్కడికి చేరుకొని రాత్రి 8.30 సమయంలో బాధితులను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ధైర్యం చేసి పోయిన ‘‘నీళ్లలో పది మంది వరకు చిక్కుకున్నారని తెలియగానే వెంటనే వాగు వద్దకు పోయిన. అందరు చూస్తున్నారు. నీళ్లు పెరుగుతున్నాయి కానీ ఎవరూ.. నీళ్లలోకి వెళ్లడం లేదు. నేనే ధైర్యం చేసి చొచ్చుకుపోయిన. అందులో ఉన్న ఓ మహిళ చీరను అందరికి చుట్టేసిన. తాళ్ల సాయంతో ఒక్కొక్కరిని బయటకు తీసినా. వాగు ఒడ్డుకు ఉన్న గ్రామ ప్రజల ధైర్యంతోనే వారిని రక్షించా’’ - కాసారపు శ్రీనివాస్

కేతకి ఆలయంలో భారీగా వరద

01/10/2016: మెదక్: శుక్రవారం అర్థరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో మెదక్ జిల్లా ఝరాసంగంలో కేతకి ఆలయంలోకి భారీ వరద చేరుకుంది. నీటితో ప్రధాన ఆలయం నిండిపోయింది. అర్థరాత్రి సమయంలో వర్షం కురవడంతో ఆలయం ముందు భాగంలో ఉన్న దుకాణాలు కొట్టుకుపోయాయి. మరో వైపు జహీరాబాద్ మండలం బొప్పనపల్లి -బోరేగావ్ మధ్య వంతెన తెగిపోయింది. జీర్లపల్లి గ్రామ శివారులో వరద తాకిడికి బ్రిడ్జి కూలింది. అలాగే, సదాశివ్‌పేట్ పట్టణంతోపాటు మండలవ్యాప్తంగా, కంగ్టి మండలంలో కూడా భారీ వర్షం పడింది.

ఏటీఎంలో కాలిన నోటు

01/10/2016: ముత్తారం(కరీంనగర్ జిల్లా): ముత్తారం మండలం కేశనపల్లిలో ఓ ఏటీఎం నుంచి కాలిన వచ్చినట్లు బాధితుడు తెలిపాడు. మండల కేంద్రానికి చెందిన అమ్ముకుమార్‌ ఏటీఎం నుంచి శుక్రవారం రెండు వందలు డ్రా చేయగా ఒక వంద నోటు మధ్యలో రెండు ప్రదేశాల్లో కాలిపోయి ఉంది. దీనిపైన సంబంధిత అధికారులను సంప్రదించగా పట్టించుకోవడం లేదని బాధితుడు తెలిపాడు.

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ రూ.8లక్షలు - ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌

30/09/2016: కరీంనగర్(హుస్నాబాద్‌) : గౌరవెల్లి ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పునరావాసం కోసం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద రూ.8లక్షల పరిహారం అందజేస్తామని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ తెలిపారు. గుడాటిపల్లిలో భూ నిర్వాసితుల దీక్ష శిబిరంను గురువారం సందర్శించి మాట్లాడారు. గతంలో చెప్పినట్లుగానే నిర్వాసితుల కోరినవిధంగా రూ.8లక్షల పరిహారం చెల్లించనున్నట్లు తెలిపారు. 2010 వరకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ప్యాకేజీ వర్తింపజేస్తామన్నారు. 2016 వరకు 18 ఏళ్లు నిండిన వారికి రూ.2లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీపై కోర్టుకెళ్లిన వారు కేసు విత్‌డ్రా చేసుకుంటే గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇప్పించేందుకు కృషి చేస్తాననగా..నిర్వాసితులు అంగీకరించారు. అయితే ప్రాజెక్టు ఎత్తు పెంపున కు వ్యతిరేకంగా దీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఎత్తు పెంచితే 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. జెడ్పీ వైస్‌ చైర్మన్‌ రాయిరెడ్డి రాజిరెడ్డి, సర్పంచ్‌ తాట్ల యాదమ్మ, తహసీల్దార్‌ వాణి, ఎంపీడీవో ఉదయ్‌భాస్కర్, ఈఈ రాములు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఎడబోయిన తిరుపతిరెడ్డి, మాలోతు బీలునాయక్, కొడముంజ రమేశ్, మార్కెట్‌ డైరెక్టర్లు ఇసంపెల్లి రవీందర్, జ్యోతిబస్‌ పాల్గొన్నారు. రైతులకు పరిహారం.. వర్షాలతో పంటనష్టపోయిన రైతులకు పరిహారం అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. మండలంలోని ఎల్లమ్మ చెరవు, నందారం, పోతారం(జె), తుర్కవానికుంట, ధర్మారం వద్ద తెగిన రోడ్లను పరిశీలించారు. పంటనష్టంపై సర్వే చేసి త్వరగా నివేదిక ఇవ్వాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు.

తల్లిదండ్రుల ఆత్మహత్య - కల్వచర్లలో విషాదం

30/09/2016: కరీంనగర్(సెంటినరీకాలనీ): కంటికి రెప్పలా కాపాడుకున్న కూతురే తమను కాదనుకుందని తల్లడిల్లిపోయారా తల్లిదండ్రులు. పెద్ద చదువులు చదివి తమ పెద్దరికాన్ని నిలబెడుతుందనుకుంటే.. కలలు కల్లలు చేసిందనుకుని విలవిల్లాడారు. అల్లారుముద్దుగా చూసుకున్న బంగారు తల్లి మాటైనా చెప్పకుండా పెళ్లి చేసుకోవడం వారికి మింగుడుపడలేదు. కలత చెందిన వారు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఆమెకు జీవితకాలం గుర్తుండే శిక్ష విధించారు. కూతరుపై ఎన్నో ఆశలు పెంచుకన్న తల్లిదండ్రులు ఆమె ప్రేమ వివాహం చేసుకోవడంతో తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. కమాన్‌పూర్‌ మండలం కల్వచర్లలో జరిగిన ఈ ఘటన అందరినీ కలచివేసింది. కమాన్‌పూర్‌ ఎస్సై ఆది మధుసూదన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఒర్రె పర్వతాలు(56) ఆర్జీ–3 డివిజన్‌ పదో గనిలో సపోర్టుమెన్‌గా పనిచేస్తుండగా ఆయన భార్య ఒర్రె లక్ష్మి (ఐలక్క) (50) స్థానికంగా కిరాణం షాపు నిర్వహిస్తోంది. వారి కుమారుడు శ్రావణ్‌కుమార్‌ హైదరాబాద్‌లో ప్రెవేట్‌ ఉద్యోగం చేస్తుండగా కూతురు శ్వేత (19) హైదరాబాద్‌లోనే అగ్రికల్చర్‌ బీఎస్సీ చదువుతోంది. గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించిన శ్వేత రెండ్రోజుల క్రితం అతడిని వివాహం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు తీవ్రమనస్థాపానికి గురై బుధవారం రాత్రి తమ ఇంట్లో క్రిమిసంహారక మందు తాగారు. లక్ష్మి అక్కడికక్కడే మృతిచెందింది. పర్వతాలును స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. అందరితో కలివిడిగా ఉండే వారి హఠాన్మరణంతో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. వారి కుమారుడు శ్రావణ్‌ ఫిర్యాదు మేరకు ఎస్సై మధుసూదన్‌రావ్‌ కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి వచ్చి సానుభూతి వ్యక్తంచేశారు.

రూ.15 లక్షలకు పైసాతగ్గినా భూములివ్వం - స్పష్టం చేసిన కన్నేపల్లి రైతులు

30/09/2016: కాళేశ్వరం : పంప్‌హౌస్‌ నిర్మాణానికి ఇచ్చే భూములకు ఎకరాకు రూ.15 లక్షల పరిహారం ఇవ్వాలని, ఇందుకు ఒక్క రూపాయి తగ్గినా ఇంచు భూమి కూడా ఇవ్వమని కన్నేపల్లి రైతులు స్పష్టం చేశారు. పంప్‌హౌస్‌ నిర్మాణంలో భాగంగా ఇప్పటికే 48 ఎకరాలు సేకరించిన అధికారులు మరో 188 ఎకరాలకు సేకరణకు, పట్టా భూములు, కాస్తు, అసైన్డ్‌ వివరాల కోసం సర్వే చేశారు. ఈ సరే ముగియడంతో గురువారం గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. మంథని ఆర్డీవో శ్రీనివాస్‌ భూసేకరణపై అభ్యంతరాలు తెలుసుకున్నారు. పంప్‌హౌస్‌ కోసం ఎవరెవరి భూమి ఎంత సేకరిస్తున్నారో చదివి వినిపించారు. అనంతరం మహదేవపూర్‌ మండలంలో ప్రభుత్వం స్టాంప్‌ఫీజు ప్రకారం ఎకరం భూమి విలువ రూ.లక్ష ఉందని తెలిపారు. దీని ప్రకారం భూమి కోల్పోయే రైతులకు ఎకరాకు ప్రభుత్వం రూ.3.2 లక్షలు ఇస్తుందని ప్రకటించారు. దీంతో రైతులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. భూములకు ధర ప్రకటించకుండా సర్వేలు చేసి కన్నేపల్లి గ్రామాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మొదట సేకరించిన 48 ఎకరాలకు డబ్బులు ఇచ్చి, తరువాత ధర ఎంత పెంచితే అంత ఇస్తామన్న అధికారులు, ఒక్కసారిగా ఎందుకు మాట మార్చారని ప్రశ్నించారు. ఎకరాకు రూ.15 లక్షలు ఇస్తేనే పంప్‌హౌస్‌ నిర్మాణానికి సహకరిస్తామని తెగేసి చెప్పారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకున్నారు. రైతులకు నచ్చజెప్పే ప్రయత్నంచేసినా వారు శాంతించలేదు. దీంతో ఆర్డీవో, ఇరిగేషన్‌ అధికారులు, పోలీసులు వెనుదిరిగారు. సమావేశంలో సర్పంచ్‌ లోకుల పోశక్క, ఉపసర్పంచ్‌ మల్లారెడ్డి, తహసీల్దార్‌ జయంత్, ఇరిగేషన్‌ ఈఈ ఓంకార్‌సింగ్, డీఈఈ సూర్యప్రకాశ్, ప్రకాశ్, ఏఈ వెంకట్, ఎసై ్స ఉదయ్‌కుమార్, పోలీసులు పాల్గొన్నారు. పంప్‌హౌస్‌ దారిలో ముళ్లకంప వేసి నిరసన తగిన పరిహారం ఇవ్వడంలేదని నిర్వాసితులు పంప్‌హౌస్‌ రోడ్డుకు అడ్డుగా గొయ్య తవ్వి, ముళ్లకంప వేసి నిరసన తెలిపారు. ఏఎసై ్స ముకీద్‌ నిర్వాసితులకు నచ్చజెప్పినా వినలేదు. తమకు న్యాయం జరిగే వరకూ పనులు జరుగనివ్వమని స్పష్టం చేశారు. భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తమకు ఇచ్చిన మాట వట్టిదేనా అని ప్రశ్నించారు. 20 రోజుల క్రితం ఎకరానికి రూ5.5 లక్షలకుపైగా పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కలెక్టర్‌కు నివేదిస్తా – శ్రీనివాస్, ఆర్డీవో కన్నేపల్లిలో 188 ఎకరాల సేకరణకు సర్వే పూర్తిచేశాం. భూములపై అభ్యంతరాలను నివృత్తి చేశాం. ప్రభుత్వం లావోణి, పట్టా భూములకు ఒకే రకమైన పరిహారం ఇవ్వదు. మహదేవపూర్‌ మండలంలో స్టాంప్‌ఫీజు ప్రకారం ఎకరానికి రూ.లక్ష ధర ఉంది. ఈవిధంగానే ఎకరానికి రూ.3.2 లక్షలు ఇవ్వనున్నాం. నిర్వాసితులుతు మాత్రం రూ.15లక్షలు కావాలని కోరుతున్నారు. కొంత మంది మేడిగడ్డ, సూరారం రైతులు ఏవిధంగా పరిహారం ఇస్తే అలాగే మాకు ఇవ్వలన్నరు. ఈవిషయాలన్నీ కలెక్టర్‌కు నివేదిస్తాం.

కల్వకుర్తిలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు

29/09/2016: మహబూబ్ నగర్(కల్వకుర్తి), సలాం తెలంగాణ: కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలంటూ 39 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు ఈ రోజు మైనారిటీ సంఘం సభ్యులు కూడా సంఘీభావం తెలిపారు.

బంగారు తెలంగాణ సాధనే ధ్యేయం - గ్రూప్‌–2 అభ్యర్థులతో మంత్రి లక్ష్మారెడ్డి

29/09/2016: మహబూబ్ నగర్(జడ్చర్ల): బంగారు తెలంగాణ సాధనే ద్యేయంగా తమ ప్రభుత్వం చిత్తశుద్దితో కషి చేస్తుందని,ఇందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక పత్తి మార్కెట్‌ యార్డు ఆవరణలో సీఎన్‌ఆర్‌ ఫౌండేషన్,హెటిరో ఫార్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రూప్‌–2 అభ్యర్థుల ఉచిత శిక్షణ కేంద్రం ముగింపు కార్యక్రమానికి మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితెందర్‌రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. మంత్రి లక్ష్మారెడ్డి ప్రసంగిస్తూ సీఎం కేసీఆర్‌ అనేక అభివద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ముఖ్యంగా ప్రజలకు సాగు,తాగు నీటిని అందించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపాదికన చర్యలు తీసుకుంటుందన్నారు. మిషన్‌ భగీరథ ద్వార ఇంటింటికి తాగు నీటిని అందించేందుకు కషి చేస్తున్నామన్నారు. బీదలందరికీ మంచి విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని,అందులో భాగంగానే ఒక్క ఏడాదిలోనే 200 పైగా రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేశామన్నారు. విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.అదేవిధంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తుందన్నారు. ఐదేళ్లలో లక్ష ఉద్యోగాల భర్తీకి చర్యలు తమ ప్రభుత్వం ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ఇటీవలనే కొన్ని ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నామన్నారు. జడ్చర్లలో గ్రూప్‌–2 అభ్యర్థులకు మంచి శిక్షణను ఉచింతంగా అందజేయాలన్న సదుద్దేశ్యంతో తాము సీఎన్‌ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పీజేఆర్‌ కోచింగ్‌ సెంటర్,హెటిరో ఫార్మ పరిశ్రమ సౌజన్యంతో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 62 రోజుల పాటు శిక్షణను పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఆయా పోటీ పరీక్షలలో లక్షసాధనకు కషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ జితెందర్‌రెడ్డి మాట్లాడుతు అభ్యర్థులు పోటీ పరీక్షలలో తమ ప్రతిభను కనబరిచి ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు. ఉద్యోగాల భర్తీలో పైరవీలకు తావిచ్చే ప్రసక్తి లేదని,ప్రతిభను మాత్రమే నమ్ముకోవాలని ఆయన అభ్యర్థులకు సూచించారు. మెటీరియల్‌ పంపిణీ... గ్రూప్‌ సిలబస్‌ శిక్షణ పొందిన 500 మంది అభ్యర్థులకు దాదాపు రూ.12 లక్షల వ్యయంతో హెటిరో ఆధ్వర్యంలో సిలబస్‌ మెటీరియల్‌ను పంపిణీచేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు జయప్రద,ప్రబాకర్‌రెడ్డి,ఎంపీపీలు లక్ష్మి,దీప,శ్రీను,మార్కెట్‌ యార్డు చైర్‌పర్సన్‌ శోభ,టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు శివకుమార్,హెటిరో హెచ్‌ఆర్‌ గ్రూప్స్‌ ఉపాధ్యక్షులు బాస్కర్‌రెడ్డి, హెటిరో ఫైనాన్స్‌ ఏజీఎం చంద్రారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

క్షమాపణతో కష్టాలు తీరవు - సీఎం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి - భూనిర్వాసితులకు డబుల్‌బెడ్‌రూం ఇవ్వాలి - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌

29/09/2016: బోయినపల్లి/వేములవాడరూరల్‌ : మధ్యమానేరు నిర్మాణంతో నిర్వాసితులకు అన్యాయం జరిగిందని, వారి కన్నీళ్లను ఒక్క క్షమాపణ చెప్పి తీర్చలేరని, డబుల్‌ బెడ్‌రూమ్‌ విషయంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట నిలుపుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. బుధవారం ఆయన మధ్యమానేరు గండిని పరిశీలించారు. మండలంలోని కొదురుపాక ఎస్సీ కాలనీలో వరద ముంపునకు గురైన కుటుంబాలను పరామర్శించారు. వేములవాడ మండలం రుద్రవరంలో మానేరు ముంపు బాధితులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూనిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించే వరకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్యాయం చేసిందని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే వీరు కూడా ముంపు గ్రామాలను నట్టేట ముంచుతున్నారని ధ్వజమెత్తారు. 2008లో హామీ ఇచ్చిన ప్రకారం ప్రతి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని, 2016 వరకు 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు పరిహారంతోపాటు ఇళ్ల స్థలం కేటాయించాలని డిమాండ్‌ చేశారు. డబుల్‌బెడ్‌రూమ్‌ హామీపై నాడు అవగాహన లేక మాట్లాడానని, క్షమించాలని సీఎం కోరడం సిగ్గుచేటన్నారు. మిడ్‌మానేరు వరదతో పంటలు దెబ్బతిన్న భూములను సేకరించి ఎకరానికి రూ.20లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, వర్షాలకు ధ్వంసమైన పంటలకు ఎకరానికి రూ.50వేల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. వర్షాలతో పంటలు నష్టపోయి, మానేరు నీటితో రుద్రవరం గ్రామంలో బాధితులు ఆవేదన చెందుతుంటే ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకులు గ్రామంవైపు కన్నెత్తి చూడకపోవడం ప్రజలపై ఉన్న ప్రేమ ఎంతో అర్థమవుతోందని అన్నారు. మానవత్వం ఉన్న ప్రతీ నాయకుడు ఆపదలో ఉన్న ముంపు గ్రామాలను సందర్శించి బాధితులకు ధైర్యం చెప్పాలని సూచించారు. రుద్రవరం సర్పంచ్‌ పిల్లి రేణుక గ్రామంలోని సమస్యలతోపాటు ముంపు బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ లక్ష్మణ్‌కు వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, ప్రధానకార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆది శ్రీనివాస్, ప్రతాప రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు మీస అర్జున్‌రావు, లింగంపల్లి శంకర్, శ్రీధర్, ఆకుల విజయ్, మేకల ప్రభాకర్‌యాదవ్, గుడి రవీందర్‌రెడ్డి, కన్నం అంజయ్య, గంటల రమణారెడ్డి, మహిళామోర్చ జిల్లా అధ్యక్షురాలు గాజుల స్వప్న, సుజాతారెడ్డి తదితరులున్నారు.

కాకతీయ కాల్వపై మినీ రిజర్వాయర్లు - నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించండి - రిటైర్డ్‌ ఇంజనీర్లను కోరిన మంత్రి ఈటల

28/09/2016: కరీంనగర్‌ : దిగువ మానేరు జలాశయం నుంచి మూసీ వరకు దాదాపు రెండు వందల కిలోమీటర్ల పరిధిలో నీటిని నిల్వ చేసే ఒక్క జలాశయాన్ని కూడా గత పాలకులు నిర్మించకపోవడం బాధాకరమని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని దాదాపు 9.5 లక్షల ఎకరాలకు ఎల్‌ఎండీయే ప్రాణాధారమైందన్నారు. డ్యాం నిండితే ఆయా జిల్లాలకు సాగునీరందుతుందని, లేకుంటే లేదని అన్నారు. కాకతీయ కాల్వపై ఒక టీఎంసీ నుంచి 5టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసేలా మినీ రిజర్వాయర్లు నిర్మిస్తే తద్వారా ఆయా జిల్లాల్లోని నిర్దేశిత ఆయకట్టుకు సాగునీందించే అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి సూచనలు చేయాలని రిటైర్డ్‌ ఇంజనీర్స్‌ ఫోరం నేతలను మంత్రి ఈటల రాజేందర్‌ కోరారు. భారీ వర్షాలు, వరదలతో ముంపుకు గురైన మిడ్‌మానేరు, ఎస్సారెస్పీ ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన రిటైర్డ్‌ ఇంజనీర్స్‌ ఫోరం నేత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలోని ఇంజనీర్ల బృందంతో మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్‌ ఎంపీ బి.వినోద్‌కుమార్‌ మంగళవారం ఎల్‌ఎండీ అతిథిగృహంలో సమావేశమయ్యారు. మిడ్‌మానేరు ఆనకట్ట 130 మీటర్ల మేరకు కోతకు గురవడంతోపాటు మానాలవద్ద కాకతీయ కాల్వకు గండిపడిన అంశంపై చర్చించారు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల వద్ద పడిన గండిని గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు పకడ్బందీ సూచనలివ్వాలని కోరారు. మంత్రి సూచనల మేరకు కాకతీయ కాలువపై మరిన్ని రిజర్వాయర్లు నిర్మించే అంశంపై అధ్యయనం చేస్తామని రిటైర్డు ఇంజనీర్ల బృందం నేత శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. అనంతరం వారు భారీ వర్షాలు, వరదలతో గండిపడిన మిడ్‌మానేరు, కాకతీయ కాలువలను సందర్శించారు. మిడ్‌మానేరు ఆనకట్టకు గండిపడటంతోపాటు 130 మీటర్ల మేరకు కోతకు గురికావడాన్ని పరిశీలించారు. మానాల వద్ద కాకతీయ కాలువకు గండిపడటానికి గల కారణాలను లోతుగా విశ్లేషించారు. మానాలవద్ద ఏర్పాటు చేసిన స్లూయీస్‌ను మరో 150 మీటర్ల దిగువన ఏర్పాటు చేస్తే గండిపడే అవకాశం ఉండేది కాదని రిటైర్డు ఇంజనీర్లు అభిప్రాయపడ్డారు. వీటిపై త్వరలోనే తాము ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. 10 లక్షల ఎకరాలకు లాభమైంది : ఈటల భారీ వర్షాలు, వరదల వల్ల జిల్లాలో వెయ్యి ఎకరాలకు నష్టం జరిగితే దాదాపు పది లక్షల ఎకరాలకు లాభం జరిగిందని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. మంగళవారం జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి ఎల్‌ఎండీని సందర్శించారు. వరదలతో డ్యాంలో నీరు చేరి కళకళలాడుతుండటంతో సందర్శకుల తాకిడి ఎక్కువైన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టడం చేయడంతోపాటు డ్యాం పొడువునా విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదవశాత్తు పడిపోయిన వారిని రక్షించేందుకు బోట్స్, లైవ్‌జాకెట్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. 72 గంటలుగా నిరంతరాయంగా పర్యవేక్షించడంవల్ల భారీ నష్టం వాటిల్లకుండా కాపాడగలిగామని తెలిపారు. జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని వెంటనే అంచనాలు వేసి రైతులను ఆదుకుంటామన్నారు. జిల్లాలో 5,500 చెరువులుంటే 132 చెరువులు తెగిపోయాయన్నారు. మిషన్‌ కాకతీయ చెరువులు మాత్రం చాలా పటిష్టంగా ఉన్నాయన్నారు. జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతు చే యాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

కొత్త జిల్లాలపై లీగల్‌ కమిషన్‌ నియమించాలి - టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి

28/09/2016: కరీంనగర్(సిరిసిల్ల) : తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు, విధివిధానాలపై సిట్టింగ్‌ జడ్జితో లీగల్‌ కమిషన్‌ నియమించాలని తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో జరుగుతున్న జిల్లా సాధన ఉద్యమానికి ఆయన మంగళవారం సంఘీభావం తెలిపారు. సిరిసిల్ల ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే కేటీఆర్‌ రాష్ట్ర మంత్రి అయి సమంతతో క్యాట్‌వాక్‌ చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో తండ్రీ కొడుకుల కుట్రలను కళ్లు తెరిచి భగ్నం చేయాలని రేవంత్‌రెడ్డి కోరారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పనుల్లో కోట్ల ముడుపులు దండుకున్నారని ఆరోపించారు. సిరిసిల్ల ప్రజలు జిల్లా కోసం ఉద్యమిస్తుంటే ప్రజల పక్షాన ఉండి జిల్లా ఏర్పాటు చేయాల్సిన మంత్రి పోరాడే బిడ్డలపై లాఠీఛార్జి చేయించడం ఏమిటని ప్రశ్నించారు. అధికార మదంతో కళ్లు మూసుకుపోయి మహిళలపై లాఠీచార్జి చేశారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌ బంధువులకు శంషాబాద్‌లో వందల ఎకరాలున్నాయని జిల్లా చేస్తున్నారని ఆరోపించారు. శంషాబాద్‌ను రద్దు చేసి సిరిసిల్లను జిల్లా చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కావాలని అక్కడ ఎవరూ అడుగడం లేదన్నారు. సిరిసిల్ల ప్రజలకు టీడీపీ పార్టీ అండగా ఉంటుందని, జిల్లా కోసం సిరిసిల్లలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని పార్టీల వారితో సభ నిర్వహించాలని సూచించారు. సిరిసిల్ల జిల్లా కోసం శాసనసభలో గళం విప్పుతానని ఆయన స్పష్టం చేశారు. సిరిసిల్ల జిల్లా ఇవ్వకుంటే టీఆర్‌ఎస్‌ దిమ్మెలు కూల్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ చైర్మన్‌ దరువు ఎల్లన్న, జిల్లా సాధన జేఏసీ నేతలు రమాకాంత్‌రావు, కత్తెర దేవదాస్, అన్నమనేని నర్సింగరావు, మహేశ్‌గౌడ్, జక్కుల యాదగిరి, ఆడెపు రవీందర్, బుస్సా వేణు పాల్గొన్నారు.

ఊడుతున్న ఉద్యోగాలు - యూఏఈలో రాష్ట్ర కార్మికుల పాట్లు.. - ఆదుకోవాలంటూ వినతులు

28/09/2016: ప్రపంచంలో ఆయిల్ ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఆర్థికమాంద్యం మన కార్మికుల మెడకు చుట్టుకుంటోంది. ఆయా కంపెనీల్లో ఉద్యోగాల కల్పనలో అరబ్ దేశాలకు చెందిన వారికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని యూఏఈ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భారత్‌లోని కార్మికులను టార్గెట్ చేసుకొని ఉద్యోగాల నుంచి నిర్ధాక్షిణ్యంగా తొలగింపు చేపట్టారు. యూఏఈలోని దుబాయ్, అబుదాబీ, షార్జా, అజ్మన్, రస్ ఆల్‌ఖైమా, పుజ్‌రాహీ, ఉమా ఆల్ ఉక్వెన్ వంటి దేశాల్లో తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన సుమారు పది లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఆర్థిక సంక్షోభంతో కంపెనీలకు అక్కడి బ్యాంకులు రుణాలు మంజూరు చేయకపోవడంతో పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. వీటిపై ఆధారపడ్డ కార్మికులను హఠాత్తుగా పనిలో నుంచి తొలగిస్తూ ఆయా కంపెనీలు ఉత్తర్వులు జారీ చే శాయి. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు వివిధ కంపెనీల్లో కొంత హోదాలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ జీతాలకు అనుగుణంగా అక్కడి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. ఒక్కసారిగా కంపెనీల నుంచి ఉద్యోగాలు తీసివేయడంతో బ్యాంకుల్లో తీసుకున్న రుణం కట్టలేక ఆందోళనకు గురవుతున్నారు. రుణాలు చెల్లించకుంటే బ్యాంకులు పాస్‌పోర్ట్‌లను బ్లాక్ చేసే అవకాశం ఉండటంతో ఇటు స్వగ్రామానికి రాలేక, అక్కడ ఉపాధి లేక తంటాలు పడుతున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించి భారతీయ, తెలంగాణ కార్మికులకు ఉద్యోగాలు కల్పించేలా చొరవ చూపించాలని దుబాయ్‌లో పనిచేస్తున్న కార్మికులు సాక్షితో తమ ఆవేదనను చెప్పుకొన్నారు. రాష్ట్రానికి చెందిన వారే 5 లక్షలు: యూఏఈలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐదు లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. వీరిలో ఎక్కువ శాతం కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, తదితర జిల్లాలకు చెందినవారే. యూఏఈలోని దుబాయ్, షార్జా, అబుదాబీ వంటి ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఉపాధి పొందుతున్నారు. ఒక్కసారిగా పనిలో నుంచి వీరిని తొలగించడంతో వీరి కుటుంబాలు వీధిన పడే పరిస్థితి నెలకొంది. హఠాత్తుగా కార్మికులను కంపెనీల నుంచి తొలగించడంతో మూడు నెలల వేతనాన్ని కంపెనీ ఇవ్వాల్సి ఉంటుంది. కాని కంపెనీలు 3 నెలల వేత నం కూడా ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దుష్ర్పచారం చేస్తే జరిమానా.. యూఏఈలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, ఇక్కడి దేశాలకు ఎవరూ రావద్దని కార్మికులు ఎవరైనా మాట్లాడినా, ఫోన్‌లో సంభాషించినా వారికి అక్కడి పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. దీంతో అక్కడి విషయాలు ఫోన్‌లో చెప్పడానికి సైతం కార్మికులు వెనుకడుగు వేస్తున్నారు. ఎవరైనా దుష్ర్పచారం చేస్తే జైలుశిక్ష లేదా భారీ మొత్తంలో జరిమానా విధిస్తున్నారని కార్మికులు తెలిపారు. రాత్రికి రాత్రే ఉద్యోగం తొలగించారు అజ్మల్‌లోని దుబాయ్ ఆయిల్ క ంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ఎలాంటి నోటీసు లేకుండా రాత్రికి రాత్రే ఉద్యోగం నుంచి తొలగించారు. ఇక్కడ ఉద్యోగాలు లేకపోవడంతో గత్యంతరం లేక స్వగ్రామానికి తిరిగి వస్తున్నా. - రవి, రాజేశ్వర్‌రావుపేట, ఇబ్రహీంపట్నం, కరీంనగర్ జిల్లా

మిడ్‌మానేరుకు గండి - ముంపు గ్రామాల ప్రజల తరలింపు - గోదావరినదికి పోటెత్తిన వరద - ఎల్లంపల్లి 40 గేట్లు ఎత్తివేత

27/09/2016: కరీంనగర్‌ : జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తుతున్నాయి. జలాశయాలు ఉధృతరూపం దాల్చడంతో అటు అధికారులను అయోమయానికి.. ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మానేరు, మోయతుమ్మద వాగులతో పాటు ఎల్లమ్మవాగు, మూలవాగు, బిక్కవాగు ఉప్పొంగాయి. సిరిసిల్ల డివిజన్‌లో అధిక వర్షాలు కురవడంతోపాటు ఎగువ నుంచి ప్రవాహం పెరుగుతూ మానేరుకు వరద పోటెత్తుతోంది. మధ్యామానేరు స్పిల్‌వేపై నుంచి వరదనీరు అలుగులు దుముకుతోంది. 4.25 టీఎంసీల నీటి నిలువతో మధ్యమానేరు రిజర్వాయర్‌ నిండుకుండలా మారింది. మిడ్‌మానేరు నుంచి 1.41 లక్షల ఇన్‌ఫ్లో, 1.50 లక్షల ఔట్‌ ఫ్లో ఉంది. నీటి ఉధృతి ఎక్కువగా ఉండి స్పిల్‌వేపై నుంచి వరద ఓవర్‌ఫ్లో అవుతోంది. దీంతో స్పిల్‌వే పక్కనే ఉన్న మట్టికట్టపై నుంచి వరద నీరు ప్రవహిస్తూ కోతకు గురయ్యింది. క్రమంగా వరద పెరగడంతో సాయంత్రం స్పిల్‌వే పక్కన 20 మేటర్ల మేరకు గండిపడింది. వంద మీటర్ల వరకు కట్ట కోతకు గురయ్యింది. సమీప కందికట్కూర్‌ గ్రామాన్ని వరదనీరు చట్టుముట్టింది. సుమారు వంద ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. మాన్వాడ, మల్లాపూర్‌ గ్రామస్తులను జాయింట్‌ కలెక్టర్‌ శ్రీదేవసేన అందుబాటులో ఉండి తరలిస్తున్నారు. అంతకుముందే హుటాహుటిన మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు బొడిగె శోభ, గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, ప్రత్యేకాధికారి బీఆర్‌.మీనా, వరంగల్‌ రేంజ్‌ డీఐజీ నాగిరెడ్డి, కలెక్టర్‌ నీతూప్రసాద్, ఎస్పీ జోయల్‌డేవిస్, తదితరులు మిడ్‌మానేరు కట్టను సందర్శించారు. మాన్వాడ, కొదురుపాక, రుద్రవరం గ్రామాల్లోకి వరదనీరు చేరడంతో ముంపు గ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు. కొంతమంది బంధువుల ఇళ్లకు వెళ్లగా, మరికొందరు వెంకట్రావుపల్లి రూసో కళాశాలలో తలదాచుకున్నారు. రూసో కళాశాలలో నిర్వాసితులకు అధికారులు భోజనవసతి కల్పించారు. డ్యాంల వద్దనే ప్రత్యేకాధికారి బీఆర్‌.మీనా బృందం ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. వరదకాల్వ నీటితో శాబాష్‌పల్లి వద్ద రోడ్డు నీటమునగడంతో కరీంనగర్‌–వేములవాడ రూట్‌లో వాహనాలను బోయినపల్లి మీదుగా దారి మళ్లించారు. ఇల్లంతకుంటలో బిక్కవాగు ప్రవాహంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్‌ గ్రామాన్ని ముంపుగా ప్రకటించాలని గ్రామస్తులు మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను అడ్డుకున్నారు. మాన్వాడ గ్రామస్తులకు నష్టపరిహారం అందించాలంటూ కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు, విజయరమణారావు, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు మృత్యుజయం ఆందోళన చేశారు. రోడ్డు నీట మునిగి సిరిసిల్ల–కామారెడ్డి రూట్‌లో రాకపోకలు నిలిచిపోయాయి. నాగంపేట–మల్లుపల్లి గ్రామాల మధ్య బీటీ రోడ్డు తెగిపోయింది. గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్‌లో సింగం చెరువుకు గండిపడడంతో వరద నీరు గ్రామంలోకి రావడంతో ప్రజలు ఖాళీ చేశారు. రోడ్డుపైకి వరద చేరడంతో సిరిసిల్ల–కామారెడ్డి రూట్‌లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముస్తాబాద్‌ మండలం చీకోడు–ముర్రాయిపల్లి మధ్య రోడ్డు కోతకు గురికావడంతో పలుగ్రామాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టులోకి వరద ఉధృతి క్రమంగా తగ్గుతోంది. మెదక్‌జిల్లా కూడెల్లి వాగు, నిజామాబాద్‌ జిల్లా పాల్వంచ వాగుల ద్వారా వరద నీరు వచ్చే నీరు క్రమంగా తగ్గు ముఖం పట్టింది. ఆదివారం సాయంత్రం వరకు ఎగువమానేరులోకి 28వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో ఉంది. కుడికాలువ ద్వారా నీరు దిగువకు విడుదల చేశారు. మంత్రి కేటీఆర్‌ ఎగువమానేరును సందర్శించారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల తిమ్మాపూర్‌లో చెరువు గండిపడడంతో పంటలు నీటమునగగా కేటీఆర్‌ సందర్శించి భరోసానిచ్చారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో 40 గేట్లు ఎత్తారు. 4.30 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టు నుంచి భారీగా వరద వస్తుండడంతో మరిన్ని గేట్లు ఎత్తే అవకాశముంది. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాల్వ ద్వారా 2వేల క్యూసెక్కులను దిగువ మానేరుకు విడుదల చేశారు. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి గేట్లు ఎత్తడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. కాళేశ్వరం వద్ద 10 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. గోదావరి తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి అధికారుల సెలవులన్నింటిని రద్దు చేశారు. మహదేవపూర్‌ మండలం పంకెన శివారులో గోదావరి వరదలో గొర్రెలకాపరి పోశంతోపాటు 150 గొర్రెలు చిక్కుకోగా గ్రామస్తుల సహకారంతో పోలీసులు క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. 24 టీఎంసీల సామర్థ్యమున్న ఎల్‌ఎండీ 14 టీఎంసీలకు చేరింది. 17 టీఎంసీలకు చేరితే గేట్లు ఎత్తివేస్తామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. 5.15 మీటర్ల సగటు వర్షపాతం జిల్లావ్యాప్తంగా సగటున 5.15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. అత్యధికంగా ఎల్లారెడ్డిపేటలో 21.64 సెంటీమీటర్లు, కోనరావుపేటలో 19.44, గంభీరావుపేట 14, ఓదెల 11.44, ముస్తాబాద్‌ 11, మల్యాల 10.3, సిరిసిల్ల 9.21, వీణవంక 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. జిల్లావ్యాప్తంగా దెబ్బతిన్న పంటల సర్వేను అధికారులు కొనసాగిస్తున్నారు. వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగి అన్నదాతల నోటికాడి బుక్క చేజారింది. 1221 చెరువులు మత్తడి దుముకుతున్నట్లు అధికారులు చెప్పారు. రెండువేల పైచిలుకు పూర్తిస్థాయిలో నిండినట్లు తెలిపారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూంకు ఫిర్యాలు వెల్లువెత్తుతున్నాయి.

రెండేళ్లయినా పునరుద్ధరణకు నోచుకోని సిర్పూర్ పేపర్ మిల్లు - ఆవేదనతో తనువు చాలించిన 17 మంది కార్మికులు

27/09/2016: ఆదిలాబాద్: వీరిద్దరే కాదు.. సిర్పూర్ పేపర్ మిల్లు మూతపడడంతో రోడ్డునపడిన దాదాపు ఐదు వేల మంది కార్మికులు, ఉద్యోగుల దుస్థితి ఇది. ఘనచరిత్ర కలిగిన సిర్పూర్ పేపర్ మిల్లు (ఎస్పీఎం) మూతపడి మంగళవారంతో సరిగ్గా రెండేళ్లు గడుస్తోంది. ఈ మిల్లులో ఉత్పత్తి తిరిగి ప్రారంభమవుతుందని, తమకు ఉపాధి లభిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న కార్మికులకు మాత్రం నిరాశే మిగులుతోంది. మిల్లు నడిచినన్ని రోజులు కూడుగుడ్డకు లోటు లేకుండా బతికిన కార్మిక కుటుంబాలు.. ఇప్పుడు ఆర్థికంగా పూర్తిగా చితికిపోయి దీనావస్థలో ఉన్నాయి. కుటుంబ పోషణ భారమై కష్టాల్లో కూరుకుపోయాయి. ఈ ఆవేదనతోనే రెండేళ్లలో 17 మంది ఎస్పీఎం కార్మికులు తనువు చాలించారు. వేతనాలు రాక, అప్పులు పుట్టక కుటుంబాన్ని పోషించే మార్గం లేక.. ఉరి వేసుకుని, కిరోసిన్ పోసుకుని నలుగురు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇక వేతనాలు లేకపోవడంతో కార్మికులకు ఈఎస్‌ఐ కంట్రిబ్యూషన్ చెల్లింపు కూడా నిలిచిపోయింది. దీంతో అనారోగ్యాలకు చికిత్స చేయించుకోలేక మరో నలుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. మిల్లు ప్రారంభమవుతుందని, తిరిగి ఉపాధి లభిస్తుందని పెట్టుకున్న ఆశలు రోజురోజుకు సన్నగిల్లడంతో ఏడుగురు కార్మికులు గుండెపోటుతో మరణించారు. కొన్ని కార్మిక కుటుంబాలు పొట్ట చేతబట్టుకుని వలస బాట పట్టగా.. మరి కొం దరు కార్మికులు భవన నిర్మాణ కూలీలుగా మారా రు. ఉద్యోగులు పలు ప్రైవేటు సంస్థల్లో గుమస్తాలుగా పనిచేస్తూ పొట్టపోసుకుంటున్నారు. మరికొందరు స్థానికంగా పనులు లభించక మంచిర్యాల, చంద్రాపూర్, హైదరాబాద్, వరంగల్ వంటి నగరాలకు వలస వెళ్లిపోయారు. ఆధునీకరణ పేరిట.. యాజమాన్యం మిల్లు ఆధునీకరణ పేరిట బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుంది. తిరిగి చెల్లించలేక చేతులెత్తేసింది. దీంతో సుమారు రూ.420 కోట్ల రుణాలకు సంబంధించి 2016 మార్చి 4న ఐడీబీఐ, కెనరా, ఆంధ్రా బ్యాంక్, ఎస్‌బీఐ తదితర బ్యాంకులు యాజమాన్యానికి నోటీసులు జారీ చేశాయి. అయినా స్పందించకపోవడంతో.. బహిరంగ నోటీసులు జారీ చేసి మిల్లు ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. ఈ మిల్లును టేకోవర్ చేసేందుకు కాగితపు ఉత్పత్తి రంగంలో ఉన్న జేకే ఇండస్ట్రీస్, ఐటీసీ వంటి సంస్థల ప్రతినిధులు వచ్చి పరిశీలించారు. కానీ తర్వాత వెనక్కి తగ్గారు. తాజాగా చెక్‌రిపబ్లిక్ దేశానికి చెందిన పెప్సిల్ అనే కంపెనీ సిర్పూర్ మిల్లును టేకోవర్ చేసుకునే అంశాన్ని పరిశీలిస్తోంది. దీంతో కార్మికుల్లో కొంత ఆశలు రేకెత్తుతున్నాయి. వాస్తవానికి సిర్పూర్ పేపర్‌మిల్లు కార్మికులను ఆదుకుంటామని ప్రజాప్రతినిధులు ఎన్నోసార్లు హామీలిచ్చారు. మిల్లులో ఉత్పత్తి తిరిగి ప్రారంభించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. కానీ రెండేళ్లు గడిచినా.. ఆ దిశగా ఒక్క అడుగుకూడా ముందుకు పడలేదు. రోడ్డున పడ్డ 5 వేల మంది.. ఎస్పీఎంలో సుమారు 1,250 మంది పర్మినెంట్ కార్మికులు, 500 మంది కార్యాలయ ఉద్యోగులు, మరో 1,600 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. మిల్లు నడిచినన్ని రోజులు వీరితో పాటు పరోక్షంగా మరో వెయ్యి మందికి ఉపాధి లభించేది. ఎస్పీఎం యాజమాన్యం 2014 సెప్టెంబర్ 27న షట్‌డౌన్ పేరిట మిల్లులో కాగితం ఉత్పత్తిని నిలిపివేసింది. అప్పటి నుంచి ఉద్యోగులు, పర్మినెం ట్ కార్మికులకు వేతనాలు నిలిచిపోయా యి. వారు ప్రతిరోజు విధులకు హాజరవుతున్నప్పటికీ పనులు లేక ఇంటి ముఖం పడుతున్నారు. వారి పరిస్థితి దయనీయంగా మారింది. సిర్పూర్ పేపర్ మిల్లులో కార్మికుడిగా పనిచేసే ఎం.శంకర్... మిల్లు మూతపడడంతో స్థానిక ఓ ప్రైవేట్ సంస్థలో గుమస్తాగా చేరారు. మిల్లు నడిచేటప్పుడు దర్జాగా గడిపిన ఈయన.. ఇప్పుడు నెలకు వస్తున్న రూ.2,500 జీతం ఎటూ సరిపోక.. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు.. బజ్జీల బండి నడుపుకునే వెంకటేశ్. సిర్పూర్ పేపర్ మిల్లులో కార్మికుడిగా పనిచేసేవారు. మిల్లులో ఉత్పత్తి నిలిచిపోవడంతో ఉపాధి కోల్పోయారు. మిల్లు ప్రారంభమవుతుందని రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం కాగజ్‌నగర్‌లోని రాజీవ్ చౌక్‌లో బజ్జీల బండి పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు.

సర్పంచ్‌ల చేతివాటం - రూ.2.50 కోట్లు దుర్వినియోగం - 75 మందిపై విచారణ

22/09/2016: కరీంనగర్‌ : పల్లెలకు ప్రథమ పౌరులైన సర్పంచ్‌లు కొంతమంది పక్కదారి పడుతున్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ... ప్రజా సంక్షేమానికి వెచ్చించాల్సిన ప్రభుత్వ నిధులను తమ జేబుల్లోకి మళ్లిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఏడాదిన్నర కాలంలో జిల్లావ్యాప్తంగా రూ.2 కోట్ల 50 లక్షల ప్రభుత్వ నిధులను సర్పంచ్‌లు తమ సొంతానికి వాడుకున్నారు. దీనిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు 75S పైగా సర్పంచ్‌లు నిధుల స్వాహాపై విచారణను ఎదుర్కొంటున్నారు. సర్పంచ్‌ల అవినీతి, అక్రమాలకు కళ్లెం వేయడానికి పంచాయతీ అధికారులు సైతం దూకుడు పెంచారు. ఇన్నాళ్లు విచారణతోనే తంతు ముగిసిపోగా, ప్రస్తుతం చర్యలకు సైతం పూనుకుంటుండంతో సర్పంచ్‌లు బెంబేలెత్తుతున్నారు. విచారణ ఎదుర్కొంటున్న వారిలో ఒకరు సస్పెన్షన్‌కు గురికాగా, 15 మంది సర్పంచ్‌ల చెక్‌పవర్‌పై ఫ్రీజింగ్‌ విధించారు. ఇద్దరు సర్పంచ్‌ల నుంచి రూ.2 లక్షల 73 వేలు రికవరీ చేశారు. తమపై చర్యలు తీసుకోరాదంటూ మరికొంతమంది సర్పంచ్‌లు కోర్టును ఆశ్రయించారు. సర్పంచ్‌ల జేబులోకి సర్కారు నిధులు గ్రామాల్లో అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు, పన్నుల రూపంలో వసూలు చేస్తున్న నిధులను కొంతమంది సర్పంచ్‌లు తమ సొంతానికి వాడుకుంటున్నారు. గ్రామంలో సర్పంచ్‌లకు పూర్తిస్థాయి అధికారాలు ఉండడంతో పలువురు తాము ఆడిందే ఆటగా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. చేయని పనులు చేసినట్లు, చేసిన పనులే మళ్లీ మళ్లీ చేసినట్లు, రూపాయి ఖర్చు చేసి వందరూపాయలు చేసినట్లు తప్పుడు లెక్కలతో రికార్డులను సృష్టించి, లక్షలు కాజేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్నాయి. దీనికి క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారులు సహకరించడంతో అక్రమాలు పెరిగిపోతున్నాయి. నిధుల దుర్వినియోగంపై పలువురు గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, ప్రజలు ఫిర్యాదు చేస్తుండడంతో సర్పంచ్‌ల బాగోతాలు బయటపడుతున్నాయి. 75 మందిపై విచారణ గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో ప్రస్తుతం 75 మంది సర్పంచ్‌లు అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కొంటున్నారు. ఇందులో అత్యధికంగా కరీంనగర్‌ డివిజన్‌ నుంచి 31 మంది ఉండగా, జగిత్యాల డివిజన్‌ పరిధిలో 21 మంది, పెద్దపల్లి డివిజన్‌లో 23 మంది ఉన్నారు. ఆయా గ్రామాలకు చెందిన వార్డు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు చేసిన ఆరోపణలపై ఆయా డివిజన్‌లకు, మండలాలకు చెందిన డీఎల్‌పీఓ, ఎంపీడీఓ, ఈఓపీఆర్‌డీ తదితర అధికారులు గ్రామాల్లోకి వెళ్లి విచారణ నిర్వహించారు. ఈ విచారణలో 75 మంది సర్పంచ్‌లు రూ.2కోట్ల 49లక్షల 21వేల 659 దుర్వినియోగానికి పాల్పడినట్లు అధికారులు నిర్ధారించారు. అధికారికంగా 75 మంది సర్పంచ్‌లు ఆరోపణలు ఎదుర్కొంటున్నా, అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుందని సర్పంచ్‌లే పేర్కొంటున్నారు. ఆరోపణలు విచారణ వరకు రాగానే ఫిర్యాదుదారులతో రాజీ పడి, అధికారులను మచ్చిక చేసుకొని గుట్టుచప్పుడు కాకుండా చూసుకున్న వాళ్లు పదుల సంఖ్యలో ఉన్నారు. మరికొంతమంది స్వాహా చేసినట్లు వచ్చిన ఆరోపణల ప్రకారం ఆ నిధులను తిరిగి చెల్లించి విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతున్నారు. కోర్టుకు సర్పంచ్‌లు అవినీతి ఆరోపణలు నిర్ధారణ అయిన పలువురు సర్పంచ్‌లు తమపై చర్య తీసుకోకుండా ఉండేందుకు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల సస్పెన్షన్‌కు గురైన సర్పంచ్‌ కూడా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడు. హుస్నాబాద్‌ మండలానికి చెందిన ఓ సర్పంచ్‌ నుంచి రూ.లక్షా 70 వేల 30 రికవరీ చేయాలని విచారణలో తేలితే, కోర్టుకు అప్పీల్‌ చేసుకోవడంతో అది కాస్తా నిలిచిపోయింది. కరీంనగర్‌ మండలంలోని ఓ గ్రామంలో రూ.లక్షా 66 వేల 588 రికవరీకి ఆదేశిస్తే, సంబంధిత పంచాయతీ కార్యదర్శి హైకోర్టును ఆశ్రయించాడు. సైదాపూర్‌ మండలంలో రూ.4 లక్షల 45 వేల 315 రికవరీ కావాల్సి ఉండగా, సర్పంచ్‌ కోర్టుకు వెళ్లడంతో చర్యలు నిలిచిపోయాయి. అధికారుల అండతోనే... సర్పంచ్‌ల అక్రమాలకు కొంతమంది అధికారుల అండదండలే కారణమనేది బహిరంగ రహస్యం. గతంలో సర్పంచ్‌లపై ఆరోపణలు వస్తే అది విచారణ స్థాయిలోనే అర్ధాంతరంగా ముగిసేది. విచారణకు ఆదేశించినా, ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్పంచ్‌లతో కుమ్మక్కై ఆ విచారణ ముందుకు వెళ్లకుండా కొంతమంది అధికారులు కావాలని పెండింగ్‌లో పెట్టేవాళ్లు. ఫిర్యాదుదారులు అడిగితే విచారణ కొనసాగుతోందని చెబుతూ ఆ ఫైల్‌ను అటకెక్కించిన సందర్భాలున్నాయి. దీంతో యథేచ్చగా డబ్బులు వాడుకున్నా తమను ఎవరూ ఏమీ చేయలేరనే దీమా వారిలో ఏర్పడింది. దూకుడుకు కళ్లెం అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న సర్పంచ్‌ల దూకుడుకు కళ్లెం వేసేందుకు పంచాయతీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులు కాబట్టి సర్పంచ్‌లను పూర్తిస్థాయిలో సస్పెన్షన్‌ చేయడానికి ఉన్నతాధికారులు ఇష్టపడటం లేదు. కాని నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్న సర్పంచ్‌లను నియంత్రించేందుకు మాత్రం చర్యలు చేపడుతున్నారు. విచారణ పూర్తయి, ఆరోపణలు నిర్ధారణ అయిన సర్పంచ్‌ల చెక్‌పవర్‌పై ఫ్రీజింగ్‌ విధిస్తున్నారు. మరికొంతమంది నుంచి నిధులను రికవరీ చేస్తున్నారు. ఇప్పటివరకు ధర్మారం మండలానికి చెందిన ఓ సర్పంచ్‌ రూ.లక్షా 50 వేల 185ను తిరిగి పంచాయతీకి చెల్లించారు. వెల్గటూరు మండలానికి చెందిన ఓ సర్పంచ్‌ కూడా రూ.లక్షా 22 వేల 850 తిరిగి చెల్లించి వేటు నుంచి తప్పుకున్నారు. సర్పంచ్‌ల అధికారాలను హరించే విధంగా జాయింట్‌ చెక్‌పవర్‌ పెడుతున్నారని, దీనిని ఎత్తివేయాలని ఓ వైపు సర్పంచ్‌ల సంఘాలు డిమాండ్‌ చేస్తుంటే, కొంతమంది అవినీతి సర్పంచ్‌ల మూలంగా జాయింట్‌ చెక్‌పవర్‌ను తప్పనిసరిగా పెట్టాల్సి వస్తోందని అధికారులు పేర్కొంటున్నారు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ రసాభాస - ఎంసెట్ 3 ర్యాంక్ కార్డు వచ్చినా..అర్హత లేదన్న అధికారులు

22/09/2016: హైదరాబాద్: నగరంలో ఎంసెట్ 3 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ రసాభాసగా మారింది. ఈస్ట్ మారేడుపల్లి పాలిటెక్నిక్ కాలేజీలో ఎంసెట్ 3 సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతోంది. మంగళవారం ఉదయం 6 గంటల నుంచే వందలాది మంది విద్యార్థులు వెరిఫికేషన్ సెంటర్‌కు వచ్చారు. భారీ వర్షంలో అర్ధరాత్రి 12 వరకూ వేచి ఉన్నవారికి చివరి నిమిషంలో మీరు క్వాలిఫై కాలేదని చెప్పడంతో వారంతా నిర్ఘాంతపోయారు. తమకు ర్యాంక్ కార్డు, వెరిఫికేషన్‌కు రమ్మని మెసేజ్ వచ్చిందని అధికారులతో వాదనకు దిగారు. ఉదయం వచ్చిన తమ నుంచి రూ.2 వేలు ఫీజు కట్టించుకున్నారని, సర్టిఫికెట్లను పరిశీలించకుండా వేచి ఉండమన్నారని విద్యార్థులు చెప్పారు. చివరికి అర్ధరాత్రి క్వాలిఫై మార్కులు రాలేదని పరిశీలనకు అనుమతించకపోవడం ఏంటని ప్రశ్నించా రు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కాలేజీ వద్ద ఆందోళనకు దిగడంతో పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ నాగమణి నోటిఫికేషన్ ప్రకారం ఇంటర్, ఎంసెట్‌లో ఓసీలకు 50%, బీసీలకు 40% మార్కులు వస్తేనే అర్హత సాధించినట్టని విద్యార్థులు, తల్లిదండ్రులకు వివరించారు. ఆ విషయం తమకు తెలియదని, తమతో ఎందుకు డబ్బులు కట్టించారని నిలదీశారు. ప్రిన్సిపాల్ వీసీకి సమాచారమందించ గా.. వారి డబ్బులు తిరిగివ్వమనడంతో రూ.2 వేలను అందించి పంపేశారు. కాగా, మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట వరకూ 36 వేల ర్యాంకు వరకూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగింది.

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి హుండీ లెక్కింపు

21/09/2016: ఆదిలాబాద్(బాసర), సలాం తెలంగాణ: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ 68 రోజుల హుండీ లెక్కింపు జరిగినది. హుండీ ఆదాయం 57 లక్షల 20 వేల 890 రూపాయలు,మిశ్రమ బంగారం 80 గ్రాముల 5 మిల్లి గ్రాములు, మిశ్రమ వెండి 3 కిలోల 680 గ్రాములు, విదేశీ కరెన్సీ 26 డాలర్లు.

అంబేద్కర్‌ స్టేడియం సుందరీకరణకు రూ.10 లక్షలు - పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే

21/09/2016: కరీంనగర్‌ : జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ స్టేడియంలో అక్టోబర్‌ 4, 5 తేదీల్లో జరిగే సౌత్‌ ఇండియా అథ్లెటిక్‌ పోటీలను అట్టహాసంగా నిర్వహించాలని ఎంపీ వినోద్‌ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. జిల్లా కీర్తిని జాతీయస్థాయిలో ఇనుమడింపజేయాలని, స్టేడియం సుందరీకరణకు ఎంపీ, ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.10లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. స్టేడియంలో అథ్లెటిక్‌ పోటీలు జరగనున్న నేపథ్యంలో వారు స్టేడియాన్ని సోమవారం పరిశీలించారు. అథ్లెటిక్‌ ట్రాక్, స్టేడియంలోని మైదానాలు చూశారు. స్టేడియానికి కావాల్సిన వాటిపై నివేదికలు ఇవ్వాలని డీఎస్డీఓకు సూచించారు. మైదానంలో నీరు నిలుస్తున్నందున డ్రెయినేజీ వ్యవస్థను బాగా చేయించుకుని సుందరంగా తీర్చిదిద్దేలా చేయాలన్నారు. సింథటిక్‌ ట్రాక్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. రూ.10లక్షలతో గ్యాలరీలకు రంగులు వేయాలని, మరమ్మతు పనులకు వినియోగించాలని డీఎస్డీఓ శివకుమార్‌కు సూచించారు. అథ్లెటిక్‌ పోటీలను విజయవంతం చేయాలి రాష్ట్ర, జిల్లా అథ్లెటిక్‌ సంఘాల ఆధ్వర్యంలో అక్టోబర్‌ 4,5 తేదీల్లో జరగనున్న దక్షిణ భారతస్థాయి అథ్లెటిక్‌ పోటీలను విజయవంతంచేయాలని పోటీల నిర్వహణ కమిటీ చీఫ్‌ ప్యాట్రన్, ఎంపీ వినోద్‌ కుమార్, చైర్మన్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. స్టేడియం పరిశీలించిన అనంతరం వారు విలేకరులకు పోటీల వివరాలను వెల్లడించారు. అండర్‌ 16, 18, 20, 22 బాలబాలికలకు నిర్వహించే ఈ పోటీలకు 7రాష్ట్రాల నుంచి సుమారు 900 మంది క్రీడాకారులు హాజరుకానున్నారని తెలిపారు. క్రీడాకారులకు ఉచితభోజన వసతిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్‌ మేయర్, పోటీల అధ్యక్షుడు రవీందర్‌ సింగ్, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, జిల్లా అథ్లెటిక్‌ సంఘం అధ్యక్షుడు, పోటీల నిర్వహణ కార్యదర్శి నందెల్లి మహిపాల్, డీఎస్డీవో శివకుమార్, యోగా సంఘం కార్యదర్శి సిద్దారెడ్డి పాల్గొన్నారు.

పత్తి కొనుగోళ్లలో జమ్మికుంట టాప్‌ - 4.65 లక్షల క్వింటాళ్ల క్రయవిక్రయాలు - రెండోస్థానంలో పెద్దపల్లి

21/09/2016: కరీంనగర్(జమ్మికుంట) : ఉత్తర తెలంగాణ జిల్లాలో అతిపెద్ద రెండో వ్యవసాయ పత్తిమార్కెట్‌ జమ్మికుంట ఖరీఫ్‌ కొనుగోళ్లలో టాప్‌గా నిలిచింది. జిల్లాలోని పదది మార్కెట్లో జరిగిన పత్తి కొనుగోళ్లలో జమ్మికుంటనే ఆగ్రగామిగా మార్కెటింగ్‌ శాఖ లెక్కల్లో నమోదైంది. గతేడాది అక్టోబర్‌ 1నుంచి ఈ నెల 16వరకు జరిగిన పత్తి కొనుగోళ్లలో వ్యవసాయ మార్కెట్‌లో 4లక్షల 65వేల క్వింటాళ్ల పత్తికొనుగోళ్లు జరిగాయి. ప్రయివేట్‌ వ్యాపారులు రైతులవద్ద 4.28 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోళ్లు చేయగా.. సీసీఐ 36,497 క్వింటాళ్లనే కొన్నది. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌ పత్తి కొనుగోళ్లలో రెండో స్థానంలో నిలిచింది. ప్రయివేట్‌ వ్యాపారులు లక్షా 37వేల 581 క్వింటాళ్ల పత్తిని కొనుగోళ్లు చేయగా.. సీసీఐ 37,440 క్వింటాళ్లను రైతుల వద్ద సేకరించింది. మూడో స్థానం కరీంనగర్‌ మార్కెట్‌కు దక్కింది. ప్రయివేట్‌ వ్యాపారులు 55,751 క్వింటాళ్ల పత్తిని కొనుగోళ్లు చేయగా.. సీసీఐ 32,417 క్వింటాళ్ల పత్తిని రైతుల వద్ద వ్యాపారం జరిగింది. సీసీఐ సంస్థ మాత్రం సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్‌లో ఎక్కువ పత్తిని కొనుగోళ్లు చేసి టాప్‌లో నిలిచింది. రెండోస్థానంలో హుస్నాబాద్‌ మార్కెట్‌ దక్కించుకుంది. ఇక్కడా 43,755 క్వింటాళ్ల పత్తిని కొనుగోళ్లు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. జిల్లావ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్‌లో ప్రయివేట్‌ వ్యాపారులు 6. 44లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోళ్లు చేయగా.. సీసీఐ 2లక్షల 29,789 క్వింటాళ్ల పత్తిని సేకరించారు. జిల్లాలో ఎక్కడా పత్తి ఉత్పత్తులు అమ్మకాలకు రాకపోవడంతో మార్కెట్‌ యార్డులన్నీ బోసిపోతున్నాయి. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో సాగుచేసిన పత్తి రైతుల చేతికి దిగుబడులు వచ్చిన తర్వాతే మళ్లీ మార్కెట్లు రైతులతో కళకళలాడనున్నాయి.

సిరిసిల్లలో కొనసాగుతున్న బంద్

20/09/2016: కరీంనగర్ : సిరిసిల్ల జిల్లా సాధన కోసం జిల్లా జేఏసీ మంగళవారం స్థానిక డివిజన్లో 48 గంటల బంద్కు పిలుపు నిచ్చింది. అందులోభాగంగా ఆర్టీసీ డిపో ముందు అఖిలపక్షం నాయకులు బైఠాయించారు. డిపో నుంచి బయటకు వస్తున్న బస్సు అద్దాలను ధ్వంసం చేసి.. బస్సులను నిలిపివేశారు. అలాగే స్థానిక పాత బస్టాండ్ వద్ద పెట్రోల్ బంక్పై జేఏసీ సభ్యులు దాడి చేశారు. ఈ ఘటనలో పెట్రోల్ బంక్ అద్దాలు ధ్వంసమైనాయి. సిరిసిల్ల పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇరువైపులా రోడ్లుపై టైర్లు దహనం చేశారు. సిరిసిల్ల జిల్లా కోసం పట్టణంలోని స్థానిక వర్తక, వాణిజ్య సంస్థలు, విద్యాలయాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సెలవు ప్రకటించాయి. అయితే కోరుట్ల రెవెన్యూ డివిజన్లో కూడా 48 గంటల బంద్కు డివిజన్ సాధన కమిటీ మంగళవారం పిలుపు నిచ్చింది.

వేధింపులతో దంపతుల ఆత్మహత్య

20/09/2016: హుజూర్‌నగర్ రూరల్(నల్గొండ జిల్లా) : నా అనుకున్నవారే శత్రువుల్లా మారి వేధించడంతో మనస్థాపంచెందిన దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ రూరల్ మండలం కందికొండ కాలువ గట్టు వద్ద మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ విషాద సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మేళ్లచెరువు గ్రామానికి చెందిన వి. వీరారెడ్డి(24), భవానీ(22)కు రెండేళ్లక్రితం వివాహమైంది. వీరారెడ్డి వ్యవసాయం చేసి జీవనం సాగించేవాడు. వీరికి పిల్లలు లేరు. అయితే వీరారెడ్డి తమ్ముడు, అతని భార్య, తల్లి కామేశ్వరమ్మ అకారణంగా తమను సూటిపోటిమాటలు అంటూ వేధిస్తుండేవారని వీరారెడ్డి దంపతులు రాసిన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. తాను, తన భార్య ఎలాంటి తప్పు చేయకపోయినా రోజూ గొడవపడుతూ తమను మానసికంగా వేధించేవారని అందులో రాశారు. కారణంగా తమను పలు విధాలుగా బాధపెడుతుండడంతో తమకు మరణం తప్ప మరో మార్గం లేక పురుగుల మందు తాగి ఇద్దరం మరణిస్తున్నామని, తమ అనంతరం తనకు చెందిన ఆస్తి మొత్తం తన భార్య భవానీ తల్లిదండ్రులకు చెందాలని వీరారెడ్డి లేఖలో పేర్కొన్నాడు. మోటార్‌బైక్‌లో వచ్చిన వీరారెడ్డి, భవానీ దంపతులు హుజూర్‌నగర్ రూరల్ మండలం వేపలసింగారం వద్ద కందికొండ కాలువ గట్టుపై చెట్టుకింద పురుగుల మందు తాగారు. మంగళవారం ఉదయం మృతదేహాలను గమనించిన స్థానికులు హుజూర్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

బుద్వేల్‌లో మహిళ హత్య

20/09/2016: రాజేంద్రనగర్(రంగారెడ్డి జిల్లా) : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ గ్రామంలోని కల్లు కాంపౌండ్ వద్ద మంగళవారం వేకువజామున కమలమ్మ అనే మహిళను గుర్తుతెలియని దుండగులు హతమార్చారు. బీరు సీసాతో పొడిచి ఆపై బండరాయితో తలపై మోది హతమార్చారు. కల్లు కాంపౌండ్ వద్ద కమలమ్మ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కమలమ్మ భర్త బుచ్చిరాములుపై అనుమానంతో అతనిని అదుపులోనికి తీసుకున్నారు. కమలమ్మ తన ఇద్దరు పిల్లలతో గత కొంతకాలంగా భర్తతో విడిపోయి వేరుగా ఉంటోంది. భర్తే హతమార్చి ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఎస్సారెస్సీ కాలువకు భారీ గండి

20/09/2016: కరీంనగర్ (జగిత్యాల) : కరీంనగర్ జిల్లా మల్యాల మండలం మానాల వద్ద ఎస్సారెస్సీ కాలువకు మంగళవారం ఉదయం భారీ గండి పడింది. నీరంతా వృథాగా పోతోంది. కాలువ నీరు దమ్మక్క చెరువు భారీగా చేరుతుండడంతో దమ్మక్కచెరువుకు గండిపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. గండి ఫలితంగా మ్యాడంపల్లికి రాకపోకలు బంద్ అయ్యాయి. ఎమ్మెల్యే బి.శోభ సంఘటన స్థలానికి చేరుకుని అధికారులను అప్రమత్తం చేశారు. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు నుంచి కాలువకు నీటి విడుదలను నిలిపివేశారు. గత కొద్ది రోజులుగా ఎస్సారెస్సీ నుంచి కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేరు డ్యామ్‌కు 6500 క్యూసెక్కుల నీటిని విడుదలచేస్తున్నారు. కాలువ మరమ్మతు పనులు ల్పోభూయిష్టంగా ఉండడంవల్లే గండి పడిందని స్థానికులు పేర్కొన్నారు.

మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూర్‌ మండలంలో అందోళనలు...

19/09/2016: మహబూబ్‌ నగర్‌ (ఆత్మకూర్‌), సలాం తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్య నిమిత్తం కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్ లు, మండలాల ఏర్పాటు సందర్బంగా మహబూబ్‌ నగర్‌ జిల్లా ఆత్మకూర్‌ మండలంలో అందోళన కార్యక్రమములు ఉదృతమవుతున్నాయి. కొందరు ఆత్మకూర్‌ మండలాన్ని మహబూబ్‌ నగర్‌లో వుంచాలని ఒక వర్గంగా ఏర్పడి అందోళన చేపడుతున్నారు. మరొక వర్గం నూతనంగా ఏర్పడుతున్న వనపర్తి జిల్లాలో ఆత్మకూర్‌, అమరచింత, చిన్న చింతకుంట మండలాలను చేర్చాలని అందోళన కార్యక్రమము చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఆత్మకూర్‌ పట్టణంలోని ఇరువర్గాల వారు అందోళనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆత్మకూర్‌, అమరచింత, చిన్నచింతకుంట మండలాలను మహబూబ్‌ నగర్‌లో చేర్చాలనే వారిది ప్రధాన వాధన. ప్రస్తుత మహబూబ్‌ నగర్‌లో అన్ని కార్యాలయాలున్నాయి. కొత్తగా ఏర్పడేవాటిలో ఎలాంటి ఏర్పాట్లులేవు, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా ఆత్మకూర్‌ పట్టణాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరుచున్నారు. మరొకవర్గం వారి వాదన నూతనంగా ఏర్పడబోతున్న వనపర్తిలో వుంచడం వలన దూరం తగ్గుతుందని తద్వారా అన్ని పనులు త్వరగా చేసుకుని వచ్చేవిధంగా వుంటుందని, ప్రధానంగా రవాణా సౌకర్యాలకి ఎలాంటి ఇబ్బందులు లేవని వాధిస్తున్నారు. గత రెండు రోజుల నుంచి అందోళన కార్యక్రమాల్లో భాగంగా ఆత్మకూర్‌ పట్టణంలో మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఆత్మకూర్‌ మండలాన్ని చేర్చాలని వారు పాఠశాలలను బంద్‌ చేయించి ప్రధాన కూడలి గాంధీ చౌక్‌ నందు రాస్తా రోకో నిర్వహించారు. ర్యాలీగా వెళ్లి స్థానిక తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. వనపర్తిలో ఆత్మకూర్‌, అమరచింత, చిన్నచింతకుంట మండలాలను కలపాలనే వారు అమరచింత పట్టణం నుంచి ట్రాక్టర్ల ర్యాలీతో ఆత్మకూర్‌ మండలానికి వచ్చిన సందర్భంగా తహశీల్దార్‌ కార్యాలయం ప్రధాన రోడ్‌పై ఇరువర్గాల మధ్య నినాధాలతో మాటమాట పెరిగి ఘర్షణ వాతావరణం చోటుచేసుకొవడంతో పోలీసులు జోక్యం చేసుకుని, ఇరువర్గాల వారిని శాంతింపజేశారు. అనంతరం గాంధీ చౌక్‌లో ర్యాలీ కొనసాగేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. సోమవారం రోజు ఆత్మకూర్‌ పట్టణంలో బంద్‌ కొనసాగింది.

కల్వకుర్తిలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు

19/09/2016: మహబూబ్ నగర్(కల్వకుర్తి), సలాం తెలంగాణ: మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి ని రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటి వరకు కొనసాగుతున్నాయి. అయతే దీనికి అన్ని పార్టీ ల మద్దతు తేలిపాయి.

తల్లి మందలించిందని విద్యార్థిని ఆత్మహత్య

19/09/2016: కరీంనగర్(గొల్లపల్లి) : తల్లి మందలించిందని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని రాఘవపట్నం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన కొలగాని కళావతి, జలపతి దంపతులకు కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరిలో భాగ్యశ్రీ(19) డిగ్రీ వరకు చదువకుని కాలేజీ మానేసింది. ఏడాదిగా ఇంటి వద్దే ఉంటూ బీడీలు చేస్తోంది. కొంతకాలంగా రక్తహీనతతో బాధపడుతుండడంతో తల్లిదండ్రులు పలు ఆస్పత్రుల్లో చూపించారు. బలపాలు తినే అలవాటు ఉండడంతో రక్తహీనత వ్యాధి నయం కావడంలేదని తల్లిదండ్రులు తరచూ మందలిస్తున్నారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకుంది. తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై ఉపేంద్రాచారి కేసు నమోదు చేశారు.

రెప్పపాటులో ఘోరం - పోలీసుల బైక్‌ను ఢీకొట్టి బావిలో పడిన ట్రాక్టర్‌ - నలుగురు యువకులు దుర్మరణం

19/09/2016: కరీంనగర్(సైదాపూర్‌/ చిగురుమామిడి) : మద్యం మత్తు... అతివేగం.. ర్యాష్‌ డ్రైవింగ్‌ రెప్పపాటులో నలుగురి ప్రాణాలు తీసింది. ట్రాక్టర్‌ కొనుగోలు చేసిన ఓ యువకుడు మిత్రులకు దావత్‌ ఇచ్చేందుకు వారిని కొత్తవాహనంపై తీసుకెళ్లాడు. అందరూ కలిసి రాత్రి వరకూ మద్యం తాగారు. తిరుగు ప్రయాణంలో రెప్పపాటులో ఘోరం జరిగింది. మద్యం మత్తులో వేగంగా ట్రాక్టర్‌ నడుపుతూ అటుగా వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టారు. ఏం జరిగిందో అని వెనుకకు తిరిగి చూసేలోపు వాటి ట్రాక్టర్‌ రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడింది. ఐదుగురిలో నలుగురు ట్రాక్టర్‌తో సహా బావిలో పడి దుర్మరణం చెందారు. మరో యువకుడు త్రుటిలో తప్పించుకుని పారిపోయాడు. ఈ విషాద సంఘటన సైదాపూర్‌ మండలం దుద్దెనపల్లిలో శుక్రవారం రాత్రి జరిగింది. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన కత్తుల శివకుమార్‌ మంగళవారం కొత్త ట్రాక్టర్‌ కొనుగోలు చేశాడు. ఇంజిన్‌ కూలింగ్‌ కోసం మూడు రోజులుగా ట్రాక్టర్‌ను తిప్పుతున్నాడు. ట్రాక్టర్‌ కొన్నందుకు దావత్‌ ఇచ్చేందుకు తమ మిత్రులు అదే గ్రామానికి చెందిన బొల్లి రాజు(18), కొంకట శ్రీకాంత్‌(22), మాచమల్ల రఘు(22), పిల్లి సంతోష్‌(24)ను తీసుకుని శుక్రవారం ట్రాక్టర్‌పై సైదాపూర్‌కు వెళ్లాడు. అక్కడి వైన్‌షాపులో అందరూ కలిసి మద్యం తాగారు. రాత్రి 10 గంటల వరకూ అక్కడే ఉన్నారు. బయల్దేరే ముందు మరో మద్యం బాటిల్‌ కొనుక్కున్నారు. మత్తులోనే ట్రాక్టర్‌పై స్వగ్రామానికి బయల్దేరారు. దుద్దెనపల్లి వద్ద బ్రిడ్జి దాటిన తర్వాత కోహెడ ఏఎస్సై రాజేందర్, మరో కానిస్టేబుల్‌ వెళ్తున్న బైక్‌ను ట్రాక్టర్‌ డ్రైవర్‌ వేగంగా ఢీకొట్టాడు. ఈ క్రమంలో ఏఎస్సై, కానిస్టేబుల్‌ కిందపడ్డారు. భయంతో వారిని గమనిస్తూనే అంతే వేగంగా ట్రాక్టర్‌ ముందుకు పోనిచ్చాడు. దీంతో ట్రాక్టర్‌ అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గమనించిన ట్రాక్టర్‌ యజమాని శివకుమార్‌ కిందకు దూకాడు. ట్రాక్టర్‌ నలుగురు యువకులతో సహా రెప్పపాటులో చెట్లపొదల్లో ఉన్న వ్యవసాయ బావిలో పడింది. దీంతో శివకుమార్‌ అక్కడి నుంచి పారిపోయాడు. ప్రమాదానికి గురైన ఏఎస్సై వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమిచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై శ్రీధర్‌కు సంఘటన వివరాలన్నీ రాజేందర్‌ వివరించాడు. ఎస్సై క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి తన సిబ్బందితో ప్రమాద స్థలంలో రాత్రంతా బందోబస్తు ఏర్పాటు చేశారు. బావిలో పడిన ట్రాక్టర్, యువకుల కోసం లైట్లు వేసి వెతికినా కనిపించలేదు. దీంతో ఫైరింజన్‌ను రప్పించారు. బావిలోని నీళ్లు తోడేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మరో మోటార్‌ బిగించి బావిలోని నీళ్లు తోడేశారు. దీంతో ట్రాక్టర్, పిల్లి సంతోష్‌ మృతదేహం బయటపడింది. ప్రొక్లెయిన్‌తో శవాన్ని బయటకు తీశారు. ఈలోగా కరీంనగర్‌ ఆర్డీవో చంద్రశేఖర్, కరీంనగర్‌ డీఎస్పీ రామారావు, హుజూరాబాద్‌ రూరల్‌ సీఐ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆర్డీవో టెలిస్కోపిక్‌ క్రేన్‌ తెప్పించి ట్రాక్టర్‌తోపాటు బొల్లి రాజు,కొంకట శ్రీకాంత్, మాచమల్ల రఘు మృతదేహాలను పైకి తీశారు. కత్తుల శివకుమార్‌ కోసం బావిలో మరోసారి వెతికినా కనిపించలేదు. దీంతో అతడు తప్పించుకుని ఉంటాడని భావించారు. మృతదేహాలను హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ట్రాక్టర్‌ యజమాని కనిపించకపోవడంతో మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. హుజూరాబాద్‌ రూరల్, హుస్నాబాద్‌ సీఐలు ఎండీ.గౌస్‌బాబా, దాసరి భూమయ్య వారికి నచ్చజెప్పారు.

కరీంనగర్ జిల్లావ్యాప్తంగా వర్షం - అత్యధికంగా మహాముత్తారంలో 6.9 సెంటీమీటర్లు - సగటున 2సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

17/09/2016: కరీంనగర్(ముకరంపుర) : జిల్లాలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సగటను 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. అత్యధికంగా మహాముత్తారంలో 6.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా జూన్‌ నుంచి ఇప్పటివరకు 746.2 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి 739.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయింది. కాటారంలో 6.3, సుల్తానాబాద్‌ 2.7, ఓదెల 2.3, ఎలిగేడు 2.9, శ్రీరాంపూర్, ఇల్లంతకుంట 4, గంభీరావుపేట 5.4, ఎల్లారెడ్డిపేట 3.2,ముస్తాబాద్‌ 5, మల్లాపూర్‌ 2.7, ఇబ్రహీంపట్నం 2.8, చిగురుమామిడి 3.1, వీణవంక 3.6,చొప్పదండి 4.2, హుజూరాబాద్‌ 2.9, హుస్నాబాద్‌ 4.2, కోహెడ 3.2, ఎల్కతుర్తి 2.4, భీమదేవరపల్లి 2.3, కమలాపూర్‌ 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. మల్హర్, మహదేవపూర్, కమాన్‌పూర్, జూలపల్లి, బోయినపల్లి, చందుర్తి, సిరిసిల్ల, పెగడపల్లి, కొడిమ్యాల, రాయికల్, మెట్‌పల్లి, రామడుగు, కేశవపట్నం, గంగాధర, సైదాపూర్, బెజ్జంకి మండలాల్లో ఒకటి నుంచి 1.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో ఇప్పటివరకు ఎనిమిది మండలాల్లో అధికం, 39 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదయింది. కోనరావుపేట, పెగడపల్లి, కొడిమ్యాల, కథలాపూర్, మేడిపల్లి, గొల్లపల్లి, ధర్మపురి, రామడుగు, మహాముత్తారం, మంథని ముత్తారంలో లోటు వర్షపాతం రికార్డయింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు వరి, పత్తి, ఆరుతడి పంటలకు జీవం పోశాయి. అయితే పలు ప్రాంతాల్లో పొలాలు, చేన్లలో నీళ్లు నిలవడంతో పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.

అవమానం భరించలేక యువతి ఆత్మహత్య

17/09/2016: కరీంనగర్‌(బసంత్‌నగర్‌): చేయని తప్పుకు వీధిలో ఆడవాళ్లు సూటిపోటి మాటలతో మానసికంగా వేధించడంతో మనస్తాపం చెందిన ఓ యువతి శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన రామగుండం మండలం పాలకుర్తిలో జరిగింది. మృతురాలి బంధువులు, బసంత్‌నగర్‌ ఎస్సై విజేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం... పాలకుర్తి గ్రామానికి చెందిన సందవేన ఓదెలు–ఐలమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. కూతురు స్రవంతి(20) పెద్దపల్లిలోని ట్రినిటి డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండియర్‌ చదువుతోంది. రెండు రోజుల క్రితం జరిగిన గణేశ్‌ నిమజ్జనోత్సవ ఊరేగింపులో వీధి యువతులతో కలిసి స్రవంతి నృత్యం చేసింది. అయితే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి యువతులను దుర్భాషలాడాడు. ఈ విషయం వివాదాస్పదమైంది. గురువారం గ్రామానికి చెందిన కొంత మంది అతడిపై దాడిచేశారు. స్రవంతితో అసభ్యకరంగా ప్రవర్తించినందుకే తాము దాడి చేసినట్లు వారు గ్రామంలో ప్రచారం చేశారు. దీంతో కొంత మంది మహిళలు సూటిపోటి మాటలతో స్రవంతిని మానసికంగా వేధించారు. భరించలేకపోయిన యువతి శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకుంది. ఈమేరకు స్రవంతి తల్లి ఐలమ్మ, సోదరుడు రమేశ్‌ బసంత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా స్రవంతి ఆత్మహత్యకు ముందు సూసైడ్‌ నోట్‌ రాసింది. ‘అమ్మనాన్నలు, అన్నయ్యలు దేవుళ్లు.. చేయని తప్పుకు అనవసరంగా కొంత మంది నన్ను బ్లేమ్‌ చేశారు.. దీని మూలంగా మా అమ్మానాన్నల పరువుపోతుంది. అమ్మానాన్నల పరువు తీసిన నాకు జీవితం ఉన్నా, లేకున్నా ఒక్కటే’ అని అందులో పేర్కొంది.

కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలని MLA నిరాహార దీక్ష

16/09/2016: మహబూబ్ నగర్(కల్వకుర్తి), సలాం తెలంగాణ: కల్వకుర్తి ని రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ కల్వకుర్తి MLA వంశీ చంద్ రెడ్డి నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ నిరాహార దీక్ష మూడవ రోజుకి చేరింది.

నూతన కార్యాలయాలకు ఫర్నిచర్‌ కొనుగోలు - ఫైల్స్‌ అప్‌లోడింగ్‌ పూర్తి చేయండి - కలెక్టర్‌ నీతూప్రసాద్‌

16/09/2016: కరీంనగర్(ముకరంపుర) : కొత్త జిల్లాల్లో నూతన ప్రభుత్వ కార్యాలయాలకు కావాల్సిన ఫర్నిచర్, ఏసీ తదితర పరికరాలను జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలోని కమిటీ కొనుగోలు చేస్తుందని కలెక్టర్‌ నీతూప్రసాద్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై సమీక్షించారు. వివిధ శాఖలు జగిత్యాల, పెద్దపల్లిలో తమకు కేటాయించిన కార్యాలయ భవనాలను తనిఖీ చేసుకోవాలని సూచించారు. ప్రతి శాఖ కొత్త జిల్లాకు అవసరమైన ఫర్నిచర్, కంప్యూటర్స్‌ తదితర వివరాలను ఇవ్వాలని కోరారు. తమ వద్దనున్న ఫర్నిచర్‌ను జగిత్యాల, పెద్దపల్లిలకు కేటాయించాలని తెలిపారు. నిధులు ఉన్న శాఖలు నూతన కార్యాలయాలకు అవసరమైన ఫర్నిచర్‌ను కొనుగోలు చేసుకోవాలని సూచించారు. నూతన కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌లో అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. కామన్‌ ఫైల్స్‌ స్కానింగ్‌ వేగవంతం చేయాలన్నారు. అన్ని శాఖలు తమ కార్యాలయంలోని ఫైల్స్‌ను వెంటనే అప్‌లోడింగ్‌ పూర్తి చేయాలన్నారు. జగిత్యాల కలెక్టరేట్‌ భవన మరమ్మతులకు ఇతర సదుపాయాలకు రూ.45 లక్షలు, పెద్దపల్లి భవన మరమ్మత్తు పనులకు రూ.41 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. రెండు ప్రాంతాలలో పంచాయతీరాజ్‌ ఆధ్వర్యంలో మరమ్మతులు చేపడతారన్నారు. సంబంధిత సబ్‌కలెక్టర్లు, ఆర్డీవోలు పర్యవేక్షించాలన్నారు. నూతన భవనాల కేటాయింపు ప్రొసీడింగు జారీ చేయాలని డీఆర్‌వోను ఆదేశించారు. కొత్త జిల్లాలో నూతన బ్యాంకు ఖాతాలు అక్టోబర్‌ 5లోగా తెరవాలని అధికారులను ఆదేశించారు. ఏజేసీ నాగేంద్ర, డీఆర్‌వో వీరబ్రహ్మయ్య, జిల్లా అధికారులున్నారు.

కూలీల అమ్మానాన్నల నిర్బంధం - బాకీ డబ్బుల కోసం ఓ మేస్త్రీ దారుణం

14/09/2016: మహబూబ్ నగర్(పాన్‌గల్): బాకీ డబ్బులు చెల్లించడం లేదని కూలీల తల్లిదండ్రులను ఓ మేస్త్రీ నిర్బంధించాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా పాన్‌గల్ మండలం పుల్గరచర్ల గ్రామంలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కూలీ పనుల నిమిత్తం కొత్తకోట మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన గుంపుమేస్త్రీ మొగులయ్య వద్ద పుల్గరచర్ల గ్రామానికి చెందిన బాలస్వామి, దేవమ్మలు అడ్వాన్సుగా రూ.70 వేలు తీసుకున్నారు. కర్ణాటక రాష్ర్టంలోని యాదగిరిలో అతని వద్ద 8 నెలలు పాటు పనిచేశారు. పనులు చేసే క్రమంలో బాలస్వామి ఎడమ చేతి బొటనవేలు తెగిపోయింది. దీంతో అనారోగ్యంతో భార్యాభర్తలు కలసి ఈనెల 8వ తేదీన పనుల దగ్గర నుంచి సొంత గ్రామానికి వచ్చే క్రమంలో గుంపుమేస్త్రీ తన ఇంటికి రమ్మన్నాడు. దీంతో ఇద్దరూ కలసి రామకృష్ణాపురం వెళ్లారు. డబ్బులు చెల్లించి వెళ్లాలని బెదిరించడమే కాకుండా మేస్త్రీ వారిపై దాడిచేశాడు. ఈ విషయాన్ని బాధితులు గ్రామంలోని తమ తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో వీరితో పాటు తల్లిదండ్రులు మణ్ణెమ్మ, మశన్న 10వ తేదీన రామకృష్ణాపురం గ్రామానికి వెళ్లారు. తల్లిదండ్రులను మేస్త్రీ నిర్బంధించి..డబ్బులు చెల్లించి వీరిని తీసుకెళ్లాలని బెదిరించాడు. ఈ విషయంపై సోమవారం జిల్లా కేంద్రంలో ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. మా తల్లిదండ్రులను విడిపించాలి మొగులయ్యపై చర్యలు తీసుకొని, మా తల్లిదండ్రులను విడిపించాలని అధికారులను కూలీలు అభ్యర్థిస్తున్నారు. పనులు చేసే క్రమంలో బొటనవేలు తెగిపోయి గాయమైనా ఎలాంటి చికిత్స చేయించలేదని, సొంత డబ్బులు రూ.4 వేలు ఖర్చుపెట్టినట్లు బాలస్వామి పేర్కొన్నారు.

పోలీసుల అదుపులో గుట్ట సబ్ రిజిస్ట్రార్ - నయీమ్ అక్రమ రిజిస్ట్రేషన్లలో పాత్రపై విచారణ

14/09/2016: భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు అక్రమ భూ రిజిస్ట్రేషన్లు చేయడానికి సహకరించాడన్న ఆరోపణలతో నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ ఎండీ వహీద్‌ను సిట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందుకు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ నుంచి అనుమతి తీసుకున్నట్టు తెలిసింది. నయీ మ్ అతని అనుచరులకు అనుకూలంగా రిజి స్ట్రేషన్లు చేయడంలో వహీద్ పాత్రపై అనుమానాలున్నారుు. భువనగిరి, మోత్కూరు, యాదగిరిగుట్ట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వహీద్ వివిధ హోదాల్లో పనిచేస్తూ నయీమ్ అనుచరుల అక్రమ రిజిస్ట్రేషన్లకు సహకరించాడని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అతడిపై వచ్చిన అభియోగాల్ని విచారించడానికి సిట్ రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖలు రాసింది. పూర్తి సమాచారంతో విచారణకు రావాలన్న సిట్ ఆదేశంతో రికార్డులను తీసుకుని ఆయన పోలీసులకు లొంగి పోయారు. దీంతో సిట్, స్థానిక పోలీసులు వహీద్‌ను సోమవారం నుంచి విచారిస్తున్నారు. బక్రీద్ పండుగ ప్రార్థనల కోసం మంగళవారం ఉదయం పోలీస్ ఎస్కార్ట్‌తో అతడిని వదిలిపెట్టారు. తిరిగి అదుపులోకి తీసుకుని నల్లగొండకు తరలించారు. వెలుగు చూస్తున్న వాస్తవాలు నయీమ్ ప్రధాన నేరాల్లో ఒకటైన భూ రిజిస్ట్రేషన్లలో పలు అంశాలు వెలుగు చూస్తున్నారుు. విశ్వసనీయంగా తెలిసిన వివరాల ప్రకారం.. డాక్యుమెంట్ రైటర్ సహకారంతో భూముల క్రయవిక్రయ వివరాలను ఎప్పటికప్పుడు నయీమ్ అనుచరులకు తెలపడం, వాటి మార్కెట్ విలువ వివరాలు, ఎకరాల్లో, ప్లాట్లలో కొన్న భూముల యజమానుల వివరాలు అందజేయడం వంటి విషయాలపై ఆరోపణలున్నాయి. దీంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయడంలో వహీద్ సహకరించాడని రికార్డుల్లో తేలినట్లు సమాచారం. ఉన్నతాధికారులు అక్రమ రిజిస్ట్రేషన్లు చేయకుంటే వార్ని నయాన్నో, భయాన్నో బెదిరించి పను లు పూర్తి చేరుుంచినట్టు తెలుస్తోంది. కాగా నయీమ్ కుటుంబసభ్యులను సిట్ పోలీ స్‌లు విచారిస్తున్నారు. భువనగిరి పోలీస్ స్టేషన్‌కు వారిని రప్పించినట్టు తెలుస్తోంది.

రైతులను రెచ్చగొడతారా - ఎంపీ గుత్తా

14/09/2016: నల్లగొండ: సాగునీటి ప్రాజెక్టులను ఆహ్వానిస్తామని చెబుతూనే రైతులను రెచ్చగొట్టడం తగదని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో లోపాలుంటే ప్రభుత్వానికి తెలియజేయూలని కాంగ్రెస్, టీడీపీలకు నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు. మంగళవారం తన నివాసంలో విలేకరులతో గుత్తా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కిరణ్ కేబినెట్‌లో మంత్రి పదవుల కోసం కుక్కిన పేనులా ఉన్న బృందమే ఇప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల గురించి మాట్లాడుతోందన్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు ఒక్కటై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, ప్రాజెక్టులను అడ్డుకున్న నాయకులు భవిష్యత్తులో అభివృద్ధి నిరోధకులుగా మిగిలిపోతారని అన్నారు. గిత్త గాడు.. గత్తగాడితో కలసి మాట్లాడతారా? కేంద్ర మాజీమంత్రి జైపాల్‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల గురించి మాట్లాడడం సరైంది కాదని, ఆయన జాతీయ నాయకుడు కాబట్టి జాతీయ స్థాయిలోనే మాట్లాడితే బాగుంటుందని ఎంపీ గుత్తా వ్యాఖ్యానించారు. ‘మీరు జాతీయ స్థాయిలోనే మాట్లాడాలి. ఎల్లన్న, మల్లన్న.. గిత్తగాడు.. గత్తగాడు... పిట్ట గాండ్లతో కలిసి మాట్లాడితే మాకే సిగ్గేస్తోంది.’ అని ఎద్దేవా చేశారు. ఇక, మంత్రిగా ఎప్పుడు బాధ్యతలు చేపడతారని అడిగిన ప్రశ్నకు గుత్తా బదులిస్తూ ‘నాకు మంత్రి పదవి గురించి ఆలోచనే లేదు. అందుకోసం ప్రయత్నమూ చేయడం లేదు. ముఖ్యమంత్రి ఇష్టం.’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.

భువనగిరి సబ్జైలు సూపరిండెంటెంట్‌ అదృశ్యం

14/09/2016: భువనగిరి : నల్గొండ జిల్లా భువనగిరి సబ్ జైలు సూపరిండెంటెంట్ శ్రీనివాస్ మంగళవారం రాత్రి అదృశ్యమయ్యారు. ప్రస్తుతం ఉన్న స్థానం నుంచి ఆయన్ని జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటకు బదిలీ చేశారు. దీనిపై శ్రీనివాస్ తీవ్ర మనస్తాపం చెందారు. ఉద్యోగానికి వెళ్తున్నానంటూ ఆయన నిన్న రాత్రి ఇంటి నుంచి వెళ్లారు. బుధవారం ఉదయం ఆయన ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆ క్రమంలో శ్రీనివాస్ గదిలో ఆయన రాసిన లేఖను కుటుంబ సభ్యులు గుర్తించారు. తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ వేధింపులు భరించలేకే తాను వెళ్లిపోతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. శ్రీనివాస్ అదృశ్యంపై అతడి కుటుంబ సభ్యులు భువనగిరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్రాన్స్‌కో అధికారుల నిలదీత

12/09/2016: నిజామాబాద్(నిజాంసాగర్‌) : విద్యుత్‌ బిల్లుల వసూలు కోసం వచ్చిన ట్రాన్స్‌కో సిబ్బందిని ఆదివారం నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌పల్లి గ్రామస్తులు నిలదీశారు. విద్యుత్‌ బిల్లులు ఎప్పటికంటే ఎక్కువ వచ్చాయంటూ గ్రామస్తులు బిల్‌ కలెక్టర్‌తో పాటు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కరెంట్‌ మీటర్‌ రీడింగ్‌ ఆధారంగానే బిల్లులు వచ్చాయని, ఎక్కువగా వచ్చినట్లుంటే ట్రాన్స్‌కో కార్యాలయంలో సంప్రదించాలని వారు గ్రామస్తులకు సూచించారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేస్తామని గ్రామస్తులకు ట్రాన్స్‌కో అధికారులు సూచించడంతో వారు శాంతించారు.

రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం

12/09/2016: నల్గొండ జిల్లా : రోడ్డు ప్రమాదంలో ఓ యువతి దుర్మరణం చెందగా, మరో ఎనిమిది మందికి తీవ్ర గాయలయ్యాయి. ఈ ఘటన సంస్థాన్‌ నారాయణపురం మండలం మహ్మదాబాద్‌ శివారులో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వావిళ్లపల్లి గ్రామపరిధి ఆంగోతుతండాకు చెందిన మహింద్ర మాక్స్‌ చౌటుప్పల్‌ నుంచి తొమ్మిది మంది ప్రయాణికులతో చిల్లాపురం వస్తోంది. అతివేగంగా వస్తూ, అదుపు తప్పి మహ్మదాబాద్‌ శివారులో ఫల్టీకొట్టింది. మొదటి ఫల్టీలోనే అందులోని ప్రయాణికురాలు భుక్యా సునిత(19) కిందపడింది. మహింద్ర మాక్స్‌ ఆమె మీద పడి మరో రెండు ఫల్టీలు కొట్టడంతో సునిత అక్కడికక్కడే మృతిచెందింది. డ్రైవర్‌ జాన్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న లక్ష్మీ,కె.లక్ష్మమ్మ, విజయమ్మ, కె.శివ, కె.శ్రీహర్ష, మేడిపల్లి నరేష్, సతీష్‌కుమార్, శివకుమార్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగ్రాతులకు రోడ్డుపైన వెళ్తున్న యువకులు, ఎస్‌ఐ, ఏఎస్‌ శ్రీనివాస్‌రెడ్డి సాయం చేశారు. వారిని చికిత్స నిమిత్తం 108, ఇతర వాహనాల ద్వారా చౌటుప్పల్‌ ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి, హైదరాబాద్‌కు తరలించారు. చిల్లాపురం గ్రామానికి చెందిన సునిత, హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ఉంటూ కంప్యూటర్‌ శిక్షణ నేర్చుకుంటోంది. సునిత తండ్రి రాములుమార్క్స్‌ చర్చి పాస్టర్‌గా పనిచేస్తూ, చిల్లాపురంలో నివాసం ఉంటున్నారు. వీరి సొంత గ్రామం ఖమ్మం జిల్లా గార్ల మండలం సూర్యతండా. తల్లి సరోజ రెండు రోజుల క్రితం సూర్యతండాకు వెళ్లింది. 3రోజులు సెలవు వస్తుండడంతో, సునిత తల్లికి ఫోన్‌ చేసి, చిల్లాపురం రమ్మని చెప్పడంతో ఇదే రోజు వచ్చింది. అరగంట ముందు తల్లి సరోజ చిల్లాపురం గేటు వరకు చేరుకుంది. తన కూతురు వస్తుందని చిల్లాపురం రోడ్డుపైనే తల్లి ఎదురు చూస్తోంది. అరగంట ఆలస్యం కావడంతో, సునిత ప్రమాదానికి గురై మృతి చెందింది. అంతలోనే తల్లికి కూతురు చనిపోయిన చావు కబురు అందింది. సునితకు తమ్ముడు ఉన్నాడు. సునిత చనిపోవడంతో, చిల్లాపురంగ్రామస్తులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి వచ్చారు. మృతదేహాన్ని నిమిత్తం పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ పి.అశోక్‌కుమర్‌ కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్‌టీఓ ఆఫీస్‌లో దళారుల హవా - వారి గుప్పిట్లో కార్యాలయ సిబ్బంది - నిబంధనల పేరుతో ఇబ్బందులు

12/09/2016: వరంగల్(హన్మకొండ) : జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో జోడు గుర్రాల సవారీ నడుస్తోంది. కార్యాలయ సిబ్బంది, దళారులు ‘కలిసి మెలిసి’ పని చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు తు.చ. తప్పకుండా పాటిస్తున్నామని పైకి చెబుతూనే లోపాయికారిగా దళారులకు సహకరిస్తున్నారు. వీరి మధ్య నెలకొన్న అన్యోన్యత కారణంగా డ్రైవింగ్‌ లైసెన్సు, వాహనాల రిజిస్ట్రేషన్, పర్మిట్‌ తదితర పనుల కోసం వెళ్తున్న సామాన్యులు, వాహనదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. తారుమారు ‘జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో దళారులకు ప్రవేశం లేదు. ఎవరైనా కనిపిస్తే నేరుగా పోలీస్‌స్టేçÙన్‌కు పంపిస్తాం. రవాణాశాఖ కార్యాలయానికి కనీసం కిలోమీటరు దూరంలో ఆర్టీఏ ఏజెంట్ల కార్యాలయాలు ఉండాలి’.. ఇది ఏడాది క్రితం రవాణాశాఖ కార్యాలయంలో విధించిన నిబంధన. దీంతో ఇక దళారుల బెడద తప్పినట్టేనని సామాన్యులు, వాహనదారులు ఊపరి పీల్చుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులు చేయించుకున్నారు. అయితే గడిచిన ఆర్నెళ్లలో పరిస్థితి తారుమారైంది. దళారులు మళ్లీ రంగప్రవేశం చేశారు. కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులతో కలిసిమెలిసి తిరుగుతున్నారు. వివిధ పనులపై కార్యాలయానికి వచ్చిన వారికి నిబంధనల పేరుతో చుక్కలు చూపిస్తున్నారు. ఆ ధాటికి తట్టుకోలేక వాహనదారులు దళారులను ఆశ్రయించక తప్పడం లేదు. దళారుల దగ్గరికి వెళ్లిన వాహనదారులు నిరే్ధశించిన ఫీజు కంటే రెండు..మూడు రెట్లు.. అవసరాన్ని బట్టి పది రెట్లు చెల్లించాల్సి వస్తోంది. జీరో నుంచి మొదలు.. లైసెన్స్, రిజిసే్ట్రషన్‌ తదితర సేవలు పొందాలంటే తొలుత ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలి. నిరే్ధశించిన రోజు సంబంధిత ధ్రువపత్రాలతో ఆర్టీఏ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. ఈ దరఖాస్తులను పరిశీలించేందుకు జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో మొత్తం ఎనిమిది కౌంటర్లు ఉన్నాయి. వీటిని జీరో కౌంటర్లు అంటారు. అయితే దళారులను సంప్రదించకుండా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ నేరుగా ఇక్కడికి వచ్చేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. జీరో కౌంటర్లలో పని చేస్తున్న సిబ్బంది ‘ఆధార్‌కార్డు జిరాక్సులో ఫొటో సరిగా కనిపించడం లేదు, చేతిరాత బాగాలేదు, ఇంటి నంబరు కరెక్టుగా లేద’ంటూ వివిధ కారణాలతో దరఖాస్తులను తిరస్కరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దళారుల ద్వారా వచ్చే దరఖాస్తులు చిటికెలో ఆమోదం పొందుతున్నాయి. దీంతో సిబ్బంది తీరుతో వేగలేక దళారులను ఆశ్రయిస్తున్నట్లు వాహనదారులు చెబుతున్నారు. మొత్తం ఎనిమిది జీరో కౌంటర్లు ఉండగా ప్రస్తుతం ఆరు కౌంటర్ల వద్దకు దళారులు నేరుగా వచ్చి దరఖాస్తులు కుప్పలుగా ఇచ్చి పనులు చక్కబెట్టుకుంటున్నారు. కాలక్రమేణా ఒక్కో కౌంటర్‌కు ఒక్కో దళారీగా పర్మినెంట్‌ అయిపోవడం ఇక్కడి నెలకొన్న అవినీతికి నిదర్శనంగా నిలుస్తోంది. ఆఖరిలో చెల్లింపులు.. జీరో కౌంటర్‌ గండం తప్పించుకున్న తర్వాత డ్రైవింగ్‌ టెస్టు, కంప్యూటర్‌ టెస్టు, వాహనం ఫిట్‌నెస్‌ తదితర పరీక్షలకు దరఖాస్తుదారులు హాజరు కావాలి. ఇక్కడ ఉత్తీర్ణులైన తర్వాత తిరిగి అడ్మినిస్ట్రేషన్‌ వింగ్‌కు దరఖాస్తులు చేరుకుంటాయి. అయితే ఇక్కడున్న సిబ్బందిని సైతం దళారులు తమ అజమాయిషీలో పెట్టుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దళారుల ద్వారా వెళ్లిన దరఖాస్తులు ఇక్కడ వెనువెంటనే చివరి దశకు చేరుకుంటాయి. లేని పక్షంలో ఏ కారణం లేకుండానే రోజుల తరబడి పెండింగ్‌లో ఉండిపోతాయనే విమర్శ పరిపానల విభాగంపై ఉంది. దళారులను ఆశ్రయించకుంటే 90 శాతం దరఖాస్తులకు పెండింగ్‌ గతి పడుతుందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తడిసిమోపెడు.. తమకు సహకరించిన రవాణాశాఖ సిబ్బందికి దళారులు పెద్ద మొత్తంలో ముట్టచెబుతున్నట్లు సమాచారం. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. డ్రైవింగ్‌ లైసెన్సుకు ఆమోదముద్ర వేసినందుకు ఒక్కో దరఖాస్తుకు జీరో కౌంటరు సిబ్బందికి రూ.100, పరిపాలన విభాగం సిబ్బందికి రూ. 200 ముట్టచెబుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాహనాల రిజిసే్ట్రషన్‌కైతే ఒక్కో దరఖాస్తుకు జీరో కౌంటరులో రూ. 700, పరిపాలన విభాగంలో రూ. 1500 చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చెల్లింపులకు తమ కమీషన్లు కలుపుకుని దళారులు వాహనదారుల వద్ద నుంచి భారీగా డబ్బు వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం టూ వీలర్‌ లెర్నింగ్‌ లైసెన్సు (సింగిల్‌ కేటగిరి)కు రూ. 60 చెల్లిస్తే సరిపోతుంది. కానీ దళారులు రూ. 2000 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి సగటున ప్రతిరోజు 600 దరఖాస్తులు వస్తున్నాయి. అంటే ఇక్కడ నిత్యం లక్షలాది రూపాయల ప్రజల సొమ్ము లంచాల రూపంలోకి మారుతోంది. రోజు వందల మంది నష్టపోతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు.

ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి

12/09/2016: మహబూబ్ నగర్(పెద్దకొత్తపల్లి): మహాత్మగాంధీ ఎత్తిపోతల పథకం రెండవ లిప్టు రిజర్వాయర్‌ కింద ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేసుకొని లాభాలు గడించాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. శుక్రవారం జొన్నలబొగుడ రిజర్వాయర్‌ కట్ట నుంచి సాతాపూర్‌కు వెళ్లే పాత కాలువలకు షటర్లు తెరచి సాగునీటిని విడుదల చేశారు. షటర్ల వద్ద పూజలు నిర్వహించిన మంత్రి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతులు మండలంలోని సాతాపూర్, జొన్నలబొగుడ, తిర్నాంపల్లి, కల్వకోలు, చెన్నపురావుపల్లి రైతులు 13వేల ఎకరాల్లో వరి పంట వేయకుండ ఆరుతడి పంటలు వేయాలని సూచించారు. వచ్చే ఖరీఫ్‌నాటికి మహాత్మగాంధీ ఎత్తిపోతల పథకం నుంచి పూర్తి స్థాయిలో 3లక్షల 50వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని అన్నారు. మిగిలిపోయిన 30శాతం పనులను త్వరగా పూర్తి చేయించి పది రోజుల్లో రెండవ మోటారును ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. అనంతరం సాతాపూర్‌ పంట కాలువలో వెళ్తున్న నీటిని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ వెంకటేశ్వర్‌రావు, జెడ్పీటీసీ వెంకటయ్య, ఎంపీటీసీలు ధర్మేందర్, నారాయణరావు, వైస్‌ఎంపీపీ రాముడు, సర్పంచ్‌లు వెంకటస్వామి, సురేష్‌రావు, టీఆర్‌ఎస్‌ నాయకులు గోపాల్‌రావు, విష్ణు, రాజేందర్‌గౌడ్, లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు. షట్టర్లు బిగించలేదని ఆగ్రహం ఎంజీఎల్‌ఐ పథకం జొన్నలబొగుడ రిజర్వాయర్‌ నుంచి గుడిపల్లికి వెళ్లే ప్రధాన కాలువకు పస్పుల గ్రామం వద్ద కోడేరు మండలానికి వెళ్లే బ్రాంచ్‌ కెనాల్‌కు షటర్లు బిగించకపోవడంతో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఈఈ రాంచందర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పస్పుల కాలువ నుంచి కోడేరు మండలానికి పంట కాలవకు సాగునీరు అందించేందుకు వెళ్లి మంత్రి షటర్లు బిగించని కాంట్రాక్టర్‌ను బ్లాక్‌ లిస్టులో పెడుతామని హెచ్చరించారు. నీటిని విడుదలచేయకుండ వెనుతిరిగి వెళ్లిపోయారు. సంబంధిత కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకుండ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి వెళ్లిపోయిన తర్వాత కోడేరు ఎంపీపీ రాంమోహన్‌రావు జేసీబీ ఇసుక ట్రాక్టర్లను తొలగించి కోడేరు మండలానికి నీటిని విడుదల చేశారు.

నయీం వ్యవహారంలో మరొకరి అరెస్టు - కోర్టులో హాజరు... 14 రోజుల రిమాండ్‌

12/09/2016: కరీంనగర్(కోరుట్ల) : కరీంనగర్‌ జిల్లా కోరుట్లకు చెందిన బీడీ లీవ్స్‌ వ్యాపారి ఖుర్రంను బెదిరించిన కేసులో జగిత్యాలకు చెందిన కట్ట శివను శనివారం పోలీసులు అరెస్టు చేసి మెట్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు శివకు ఈనెల 23 వరకు జుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. బీడీ లీవ్స్‌వ్యాపారి ఖుర్రంను నయీం అనుచరులు కోరబోయిన రమేష్, నగునూరి గోవర్ధనచారి జూలైలో డబ్బుల కోసం బెదిరించారు. ఈ క్రమంలో కట్ట శివ వీరితో పాటు ఉన్నాడు. నయీం అనుచరులతో శివ రెండుసార్లు ఖుర్రం వద్దకు వచ్చి వెళ్లినట్లు తెలిసింది. రమేష్, గోవర్ధనచారిలను విచారించిన పోలీసులు ఖుర్రంను బెదిరించిన వ్యవహారంలో శివ ప్రమేయం ఉందని గుర్తించారు. అతనిపై 302, 384, 120(బీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గతంలో కట్ట శివ హైదరాబాద్‌ సమీపంలోని ఘట్‌కేసర్‌ వద్ద సుమారు 40 ఎకరాల స్థలం సెటిల్‌మెంట్‌ వ్యవహారంలో నయీంను ఆశ్రయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే నయీం అనుచరుడు కోరబోయిన రమేష్‌తో శివకు పరిచయమైనట్లు తెలిసింది. ఈ స్థల వివాదంపైనా సిట్‌ పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

పెద్దపల్లిలో పట్టుబడ్డ ఇద్దరు ఖైదీలు - సహకరించిన ముత్తారం, గౌరెడ్డిపేట యువకులు

12/09/2016: కరీంనగర్(పెద్దపల్లి) : జిల్లా జైలు నుంచి శుక్రవారం అర్ధరాత్రి పారిపోయిన పార్థీ ముఠాకు చెందిన ఇద్దరు ఖైదీలను పెద్దపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు పట్టుకున్నారు. స్టేషన్‌ సమీపంలోని ముత్తారం, గౌరెడ్డిపేట గ్రామస్తులు ఇద్దరు ఖైదీలను పట్టుకోవడంలో పోలీసులకు సహకరించారు. జిల్లా జైలు నుంచి ఇద్దరు ఖైదీలు తప్పించుకున్నట్లు సమాచారం అందుకున్న పెద్దపల్లి సీఐ మహేశ్‌ వారు రైల్లో పారిపోయే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు పెద్దపల్లి, రాఘవాపూర్, కొత్తపల్లి పోలీసులను అప్రమత్తం చేశారు. రైల్వే స్టేషన్ల వద్ద నిఘా పెట్టారు. పెద్దపల్లి రైల్వే స్టేషన్‌కు వస్తున్న ఖైదీలు యోగేందర్, జితేందర్‌ అక్కడే ఉన్న పోలీసులను గమనించి పరుగందుకున్నారు. పోలీసులు వారిని వెంబడించారు. ఈ క్రమంలో ముత్తారం, గౌరెడ్డిపేటకు చెందిన యువకులు కూడా పోలీసుల వెంట దొంగలను పట్టుకునేందుకు బయల్దేరారు. గ్రామస్తుల సహకారంతో ఖైదీలను అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్తులు, పోలీసులను అభినందించిన ఎస్పీ పార్థీ ముఠా సభ్యులు పెద్దపల్లిలో పోలీసులకు చిక్కిన సమాచారం తెలుసుకున్న ఎస్పీ జోయల్‌ డేవిస్‌ ఇక్కడి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. ప్రజలకు హాని కలిగిస్తున్న దొంగల ముఠాను పట్టుకోవడంలో పోలీసులకు సహకరించిన ముత్తారం, గౌరెడ్డిపేట గ్రామస్తులను స్టేషన్‌కు ఆహ్వానించి సత్కరించారు. మాజీ ఉప సర్పంచ్‌ కొమురయ్య, ఆటో డ్రైవర్లు అస్గర్, ప్రవీణ్, మరో 14 మందిని అభినందించారు. దొంగలను పట్టుకున్న సీఐ మహేశ్, ఎస్సై శ్రీనివాస్‌తోపాటు కానిస్టేబుళ్లను అభినందించారు. ఎస్పీ వెంట గోదావరిఖని ఎఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్‌ ఉన్నారు.

ఎంసెట్‌–3 ప్రశాంతం - 69 శాతం హాజరు నమోదు - పడిపోయిన హాజరు శాతం

12/09/2016: కరీంనగర్(కమాన్‌చౌరస్తా) : ఎంసెట్‌–3 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరిగింది. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో2, ఎస్సారార్‌ కళాశాలలో 2, శాతవాహనలో 2, ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్‌ జూనియర్‌ కళాశాలలో ఒకటి చొప్పున మెుత్తం 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3,361 మంది విద్యార్థులకు 2,320 మంది పరీక్షకు హాజరయ్యారుకాగా 69 శాతం హాజరు నమోదైంది. ఎంసెట్‌–2 పరీక్షకు 91.5 శాతం హాజరు నమోదు కాగా ప్రస్తుతం సుమారు 30 శాతం వరకు తగ్గింది. బయోమెట్రిక్‌ విధానంతో విద్యార్థులు హాజరు నమోదు చేశారు. కొన్ని కేంద్రాల్లో బయోమెట్రిక్‌ యంత్రాలు మెురాయించినా సిబ్బంది సరిచేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమనే అధికారులు ఆదేశాలతో ఎక్కువ మంది అభ్యర్థులు 10 గంటల్లోపే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ‘నిమిషం’ నిబంధనతో కొందరు పరీక్ష రాసే అవకాశం కోల్పోయినట్లు తెలిసింది.

రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య - ఘట్‌కేసర్‌ వద్ద ఘటన - మృతుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

10/09/2016: కరీంనగర్(వీణవంక) : మండలంలోని నర్సింగాపూర్‌ గ్రామానికి చెందిన చంద సాయిచరణ్‌(26) హైదరాబాద్‌ సమీపంలోని ఘట్‌కేసర్‌లో శుక్రవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన పుట్టిన రోజునాడే బలవన్మరణనానికి పాల్పడి తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చాడు. నర్సింగాపూర్‌కు చెందిన చంద మల్లయ్య, జ్యోతి దంపతులకు ముగ్గురు కుమారులు. గ్రామంలో కిరాణాదుకాణం నిర్వహిస్తూ కొడుకులను బాగా చదివించారు. రెండో కుమారుడు సాయిచరణ్‌ బీటెక్‌ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో రెండేళ్లుగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే స్నేహితులతో గదిలో ఉంటున్నాడు. ఇటీవల రాఖీ పండగకు ఇంటికి వచ్చివెళ్లాడు. శుక్రవారం సాయిచరణ్‌ పుట్టినరోజు. కుమారుడికి శుభాకాంక్షలు తెలిపేందుకు తల్లి జ్యోతి ఉదయం ఫోన్‌ చేయగా లిఫ్ట్‌ చేయలేదు. ఇంతలో సాయిచరణ్‌ ఘట్‌కేసర్‌ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం అందడంతో కుటుంబసభ్యులు హతాశులయ్యారు. విషయం తెలిసి బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. మతదేహాన్ని సాయంత్రం స్వగ్రామానికి తీసుకొచ్చారు. సాయిచరణ్‌ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అయితే ప్రేమ వ్యవహారంలోనే మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

లెక్కిస్తానంటూ నొక్కేశాడు..

10/09/2016: వేములవాడ : బ్యాంకు వాళ్లు ఇచ్చిన సొమ్ములో చెడిపోయిన నోట్లు వచ్చాయని, వాటిని లెక్కిస్తామని రైతును మాయలో పడేసి రూ.13వేలు అపహరించిన సంఘటన స్థానిక ఆంధ్రాబ్యాంకులో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితుడు హన్మాజీపేటకు చెందిన రైతు డి.లక్ష్మణ్‌ వ్యవసాయ అవసరాల కోసం శుక్రవారం ఉదయం ఆంధ్య్రాబ్యాంకులోకి వచ్చాడు. తన ఖాతాలోంచి రూ.40 వేలు డ్రా చేసుకున్నాడు. సొమ్మును తన బ్యాగ్‌పై పెట్టి లెక్కిస్తున్నాడు. అక్కడికి చేరుకున్న గుర్తు తెలియని వ్యక్తి రైతుతో మాట కలిపాడు. డబ్బులో చిరిగినవి, చెల్లకుండాపోయినవి ఉన్నాయన్నాడు. సరిచూడాలని రైతు ఆ వ్యక్తికి డబ్బు ఇచ్చాడు. దానిని లెక్కిస్తున్నట్లు నటిస్తూనే కొంత తస్కరించి ఆగంతకుడు బ్యాంకు నుంచి జారుకున్నాడు. కాసేపటి తర్వాత ఆ సొమ్మును రైతు మళ్లీ లెక్కింగా రూ.13 వేలు తక్కువగా వచ్చాయి. ఈ విషయాన్ని బ్యాంకు మేనేజర్‌ రవిశర్మ దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బ్యాంకుకు చేరుకని సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించారు. అందులో నలుగురు అనుమానా స్పదంగా కనిపించడంలో గాలింపు చేపట్టారు.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో 2018 నుంచి ఉత్పత్తి - పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్‌

10/09/2016: గోదావరిఖని : రామగుండం ఫెర్టిలైజర్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌) పనులను 2018 సెప్టెంబర్‌ నాటికి పూర్తి చేసి ఎరువుల ఉత్పత్తి ప్రారంభించేలా చూస్తామని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ అన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో జరుగుతున్న పనులను ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. పనుల పురోగతి గురించి డీజీఎం విజయ్‌కుమార్‌ వివరించారు. అనంతరం ప్లాంట్‌ నిర్మాణం జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత తెలంగాణలో ఎరువుల కొరత ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్లాంట్‌కు అవసరమైన నీటిని, విద్యుత్‌ను అందించేందుకు సహకారం అందిస్తోందన్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ప్లాంట్‌లో పనులు కొంత నెమ్మదిగా సాగుతున్నాయని, వర్షాకాలం తర్వాత వేగంగా పుంజుకుంటాయని ఆయన తెలిపారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు రాష్ట్ర పరిశ్రమల శాఖ నుంచి సంపూర్ణ సహకారం అందించేలా మంత్రి కేటీఆర్‌ను కోరుతామన్నారు. కర్మాగారంలో ఉద్యోగాల కోసం స్థానిక నిరుద్యోగ యువత ఎదురుచూస్తోందన్నారు. ఈ నేపథ్యంలో పనుల కోసం గ్లోబల్‌ టెండర్లను పిలిచినా.. స్థానికంగా ఉన్న వారికి సబ్‌ కాంట్రాక్ట్‌లు అప్పగించాలని అధికారులకు సూచించారు. తెలంగాణ స్టేజ్‌–1లో భాగంగా ఎన్టీపీసీ నిర్మిస్తున్న 1600 మెగావాట్ల ప్లాంట్‌లో కూడా స్థానిక నిరుద్యోగులకే ఉద్యోగావకాశాలు కల్పించాలని ఆయన కోరారు.

కల్వకుర్తి రెండో ఎత్తిపోతల పథకం ప్రారంభించిన హరీష్

09/09/2016: మహబూబ్ నగర్(కల్వకుర్తి), సలాం తెలంగాణ: కల్వకుర్తి రెండో ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర భారీ నీరుపారుదలశాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద ఆయకట్టుకు సాగునీరు అందించే క్రమంలో భాగంగా మంత్రి కోడేరు సమీపంలోని రెండో లిఫ్టు మోటార్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. జొన్నబొగడ జలాశయం నుంచి కాల్వకు నీరును విడుదల చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సభ అనంతరం మంత్రి హరీశ్ రావు నాగర్కర్నూల్ మండలం గుడిపల్లిగట్టుకు వెళ్లనున్నారు. అక్కడ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మూడో లిఫ్టును ప్రారంభించనున్నారు. గుడిపల్లిగట్టు జలాశయం నుంచి కాల్వకు నీరును విడుదల చేయనున్నారు.

రూ.120 కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతులు - మంత్రి ఈటల రాజేందర్‌

09/09/2016: కరీంనగర్‌ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్యను అందించేందుకు రూ.120 కోట్లతో ప్రణాళిక రూపొందించామని, త్వరలో నిధులు విడుదల చేసి అమలుచేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం కరీంనగర్‌ టీఎన్‌జీవో ఫంక్షన్‌హాల్‌లో గురువారం జరిగింది. వివిధ కేటగిరీలకు చెందిన 90 మంది ఉపాధ్యాయులకు మెమెంటోలు, శాలువాలతో జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రానున్న కాలంలో విద్యాలయాలను సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం శాయశక్తుల ప్రయత్నిస్తుందని అన్నారు. ప్రజల బాగోగులే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఎన్‌టీపీసీ వంటి సంస్థల సహకారంతో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఫర్నిచర్, ఇతర వస్తువులు, భవన నిర్మాణాలు చేస్తున్నట్లు వివరించారు. పాఠశాలల్లో మౌలికవసతుల కోసం జిల్లా ప్రజాప్రతినిధులు రూ.40 కోట్లు, మంత్రి కడియం శ్రీహరి రూ.80 కోట్లు ఇస్తానని ఒప్పుకున్నారని, అవి త్వరలోనే నిధులు రానున్నాయని అన్నారు. విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నామని, మౌలిక వసతులను మెరుగుపరుస్తూ నాణ్యమైన విద్య అందించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ §lష్టిసారించారని స్పష్టంచేశారు. సమాజంలో నెలకొన్న రుగ్మతలను పారద్రోలేందుకు విద్య ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్భంద విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు ఉపాధ్యాయులు సహకరించాలని సూచించారు. సమాజంలో నెలకొన్న అసమానతలను రూపుమాపి నాణ్యమైన విద్యను అందించి ఉపాధ్యాయులు నవసమాజ నిర్మాణానికి బాటలు వేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాను విద్యారంగంలో రోల్‌ మోడల్‌గా తయారుచేస్తామని, ఇందుకు ఉపాధ్యాయులు ప్రభుత్వానికి బాసటగా నిలవాలని సూచించారు. సావిత్రిబాయి పూలే, బీఆర్‌.అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని సంపూర్ణ అక్షరాస్యత వైపు ముందుకు సాగాలని కోరారు. – జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ మాట్లాడుతూ ప్రై వేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలని కోరారు. వీర్నపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని సంపూర్ణ అక్షరాస్యతను సాధించేందుకు అందరూ MSషి చేయాలన్నారు. – ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, శాసనమండలి చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజంలో ఉన్న చెడును పారదోలుతూ విద్యార్థులకు ఉత్తములుగా తీర్చిదిద్దాలన్నారు. ప్రై వేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారుచేయాలని సూచించారు. బడీడు పిల్లలను పాఠశాలలో ఉండేలా MSషి చేయాలని కోరారు. – ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే గురుతరమైన బాధ్యత అని అన్నారు. సమాజ మార్పు కోసం, వ్యవస్థ బాగు కోసం పరితపించే ఉపాధ్యాయులు ప్రై వేట్‌ విద్య జడలు విప్పడంపై దృlష్టిపెట్టాలని కోరారు. – కలెక్టర్‌ నీతూప్రసాద్‌ మాట్లాడుతూ నాణ్యమైన విద్యాబోధన చేసి పాఠశాలలను పరిరక్షించుకోవాలని కోరారు. నగర మేయర్‌ రవీందర్‌సింగ్, డీఈవో శ్రీనివాసాచారి, ఏజేసీ నాగేంద్ర, డెప్యూటీ ఈవోలు వెంకటేశ్వర్లు, ఆనందం, ýSష్ణమూర్తి, కిశోర్‌కుమార్, కె.శంకర్, మండల విద్యాధికారులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు నరహరి లక్ష్మారెడ్డి, జాలి మహేందర్‌రెడ్డి, కటుకం రమేశ్, కె.సారయ్య, నూలి మురళీధర్‌రావు, కొమ్ము రమేశ్, చొల్లేటి శ్రీనివాస్, కోహెడ చంద్రమౌళి, మీసాల మల్లిక్, రవినాయక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వరంగల్ లో గణేష్ నిమర్జన ప్రాంతాలను సందర్శించిన కమీషనర్ సుధీర్ బాబు

08/09/2016: వరంగల్, సలాం తెలంగాణ: ఈ నెల14వ తేదీన్ వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో నిర్వహించే గణేశ్ నిమార్జన ప్రాంతాలను వరంగల్ పోలీస్ కమీషనర్ జి.సుధీర్ బాబు బుధవారం పోలీసు లతో పాటు, నగర పాలక అధికారులతో సందర్శించారు. పోలీస్ కమీషనర్ అధికారులతో కల్సీ నగరంలోని చిన్నవడ్డేపల్లి, కోట చెరువు, రంగం చెరువు, సిద్దేశ్వర గుండం, పద్మాక్షి గుండం,బంధం చెరువు, కట్టమైసమ్మ చెరువులను సందర్శింఛారు. ఈ సందర్బంగా నిమర్జన ప్రాంతాలలో ఏర్పాట్లపై కమీషనర్ కు పోలీసు అధికారులతో పాటు నగర పాలక అధికారులు వివరింఛారు. ముఖ్యంగా నిమర్ణనం సమయంలో సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా నిమర్జన ప్రాంతంలో ప్లాట్ ఫారం లను పటిష్టం చేయడంతో పాటు, బారీ కేడ్ల నిర్మాణంతో పాటు విగ్రహాలను నియర్జనానికి కావల్సిన క్రేన్ల సంఖ్యను కమిషనర్ అధికారుల దృష్టికి తీసుకవచ్చారు. ముఖ్యంగా విగ్రహాలను తరలించే వాహనాలను క్రమపద్దతిలో నిమార్జన ప్రాంతానికి తరలించడంతో పాటు , అధే విధంగా నిమర్జన అనంతరం వాహనాలు తిరిగి వెళ్ళే మార్గాలను పరిశీలించడం జరిగింది. నిమర్జన ప్రాంతంలో విధులు నిర్వహించాల్సిన సిబ్బంది సంఖ్యను కమీషనర్ పోలీస్ అధికారులతో చర్చించారు. నిమర్జన ప్రాంతంలో గజ ఈతగాళ్లను నియమించడంతో పాటు నిమర్జన ప్రాంతంలో అంబులెన్స్ ఏర్పాటుకు సంభంధిత అధికారులతో దృష్టికి తీసుకవేళ్లాలని కమిషనర్ సూచించడం పాటు ఆన్ని నిమర్జన ప్రాంతాల్లో సి.సి కెమెరాలను ఏర్పాటు చేయాలను కమీషనర్ పోలీసు అధికారులకు అధెశించారు. కమీషర్ తో పాటు ఏ.సి.పి శోభన్ కుమార్, సురేంధ్రనాధ్, మహేందర్, జనార్ధన్, ఈశ్వర్ రావు, రవీందర్ రావు, నగర పాలక అధికారులు ఎస్.సి రహమాన్, ఈఈ లింగమూర్తి, యం.హెచ్.ఓ సంధ్య, ఇరిగేషన్ ది.ఈ కిరణ్, ఎలక్ట్రిసిటీ ఈఈలక్ష్మారెడ్డితో పాటు ఇన్స్ స్పెక్టర్లు వున్నారు.

కలెక్టరేట్‌ భవనాల కోసం అన్వేషణ - పెద్దపల్లిలో బిల్డింగ్‌లను పరిశీలించిన కలెక్టర్‌ నీతూ ప్రసాద్‌

08/09/2016: కరీంనగర్(పెద్దపల్లి) : పెద్దపల్లిలో కలెక్టరేట్‌ ఏర్పాటు చేసేందుకు అనువైన భవనం కోసం కలెక్టర్‌ నీతూప్రసాద్‌ అన్వేషిస్తున్నారు. భవనం కోసం బుధవారం కలెక్టర్‌ పట్టణంలోని పలు బిల్డింగ్‌లను పరిశీలించారు. పట్టణంలోని ఐటిఐ, ఎస్సారెస్పీ క్యాంపు, కొత్త ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఎంపీడీవో కార్యాలయాన్ని పరిశీలించారు. ఐటిఐ అన్నిటికీ అనుకూలంగా ఉంటుందని చాలారోజులుగా పలువురు అధికారులతోపాటు సామాన్యులూ అభిప్రాయపడుతున్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్‌ కూతవేటు దూరంలో.. రాజీవ్‌ రహదారి పక్కనే ఉండడం ద్వారా కలెక్టరేట్‌కు రావడం.. వెళ్లడం అనుకూలంగా ఉంటుందని స్థానిక అధికారులు నివేదిక సమర్పించారు. దీనిపై కలెక్టర్‌ ఇక్కడికి చేరుకుని ఐటిఐ, ఎస్సారెస్పీ క్యాంపు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఎంపీడీవో బిల్డింగ్‌లను పరిశీలించారు. ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీవో అశోక్‌ కుమార్‌తో ఇక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. కలెక్టర్‌ వెంట ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, సీఐ మహేష్, తహసీల్దార్‌ అనుపమారావు, ఎంపీడీవో మల్లేశం తదితరులున్నారు.

సిరిసిల్ల జిల్లా అసాధ్యం - జిల్లాకేంద్రం స్థాయిలో అభివృద్ధి చేస్తా - సిరిసిల్లకు ప్రత్యేక ప్యాకేజీ సాధిస్తా - టీఆర్‌ఎస్‌ నేతలతో మంత్రి కేటీఆర్‌

08/09/2016: సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా ఏర్పాటుపై స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కె.తారకరామారావు మౌనం వీడారు. సిరిసిల్లను జిల్లా చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు. సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నాయకులు బుధవారం రాత్రి హైదరాబాద్‌లో మంత్రిని కలిసి జిల్లా ఏర్పాటుపై విన్నవించారు. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం... సిరిసిల్ల జిల్లా ఏర్పాటు సాధ్యం కాదని మంత్రి తేల్చి చెప్పినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటులో సిరిసిల్ల జిల్లా సాధ్యాసాధ్యాలను పరిశీలించిందని వివరించారు. ఎవరూ అడగకపోయినా సిరిసిల్ల జిల్లా ఏర్పాటు కోసం ప్రతిపాదించానని అన్నారు. జనాభా, మండలాలు సరిపోలేదని, అందుకే సిరిసిల్ల జిల్లాను పక్కన పెట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంతో పోటీగా అభివృద్ధి.. జిల్లా కేంద్రంతో పోటీగా సిరిసిల్లను అభివృద్ధి చేస్తానని కేటీఆర్‌ తెలిపారు. సిరిసిల్ల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని సాధిస్తానని, ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. సిరిసిల్ల నుంచి ఒక్క డివిజన్‌ ఆఫీస్‌ కూడా తరలిపోదని, ఇంకా కొన్ని ఆఫీసులు కొత్తగా వస్తాయని వివరించారు. సిరిసిల్లకు వచ్చి ఈ విషయాలన్ని ప్రజలకు వివరిస్తానని తెలిపారు. తమను రాజీనామా చేయాలని స్థానికంగా ఒత్తిడి పెరుగుతోందని టీఆర్‌ఎస్‌ నాయకులు వాపోయారు. మనం ఎన్నికల్లో సిరిసిల్లను జిల్లా చేస్తామని హామీ ఇవ్వలేదని, ఎవరేం అన్నా రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు. తాను ఇప్పుడు సిరిసిల్లకు వచ్చి ఈ విషయాలు చెబితే కొందరికి ఇష్టం ఉండదని కేటీఆర్‌ చెప్పినట్లు తెలిసింది. సిరిసిల్లను వీడను.. తాను భవిష్యత్‌లో సిరిసిల్లలో పోటీ చేయనని, మరో చోట నుంచి పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారాన్ని కేటీఆర్‌ ఖండించినట్లు తెలిసింది. రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్ల నుంచే జీవితకాలం పోటీ చేస్తానని చెప్పారు. ఓడినా గెలిచినా సిరిసిల్లను వీడేది లేదని స్పష్టం చేశారు. ముస్తాబాద్‌ మండలం సిద్దిపేటలో కలిసినా అభివృద్ధి విషయంలో ఏ మార్పు ఉండదని మంత్రి వివరించినట్లు సమాచారం. సిరిసిల్ల జిల్లా సాధన కోసం ఉద్యమం బలంగా సాగుతున్న తరుణంలో మంత్రి కేటీఆర్‌ మౌనం వీడి టీఆర్‌ఎస్‌ నేతలతో సుదీర్ఘంగా మాట్లాడినట్లు సమాచారం. మంత్రిని కలిసిన వారిలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సామల పావని, వైస్‌ చైర్మన్‌ తవుటు కనకయ్య, సెస్‌ చైర్మన్‌ దోర్నాల లక్ష్మారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ జిందం చక్రపాణి, వైస్‌ చైర్మన్‌ లగిశెట్టి శ్రీనివాస్, టీఆర్‌ఎస్‌ నాయకులు మల్లుగారి నర్సాగౌడ్, అగ్గిరాములు, పబ్బతి విజయేందర్‌రెడ్డి, గుండ్లపల్లి పూర్ణచందర్, మంచె శ్రీనివాస్, తోట ఆగయ్య, సత్యనారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.

మంత్రిని శాసిస్తున్న గ్రానైట్ మాఫియా ! - కేటీఆర్ సూచనలు గ్రానైట్ మాఫియా బేఖాతర్ - కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్న వైనం

08/09/2016: కరీంనగర్: గ్రానైట్ మాఫియా జిల్లాను శాసిస్తోంది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా గ్రానైట్ మాఫియాదే రాజ్యం అన్నట్లుగా తయారైంది. వందల సంఖ్యలో గుట్టలను ధ్వంసం చేస్తూ పర్యావరణానికి, ప్రజా జీవనానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న గ్రానై ట్ మాఫియా ఓవర్‌లోడ్ పేరుతో సర్కారు ఖజానాకు గండి కొట్టిన మొత్తాన్ని జరిమానాతోసహా రూ.792 కోట్లు చెల్లించాల్సిందేనంటూ మైనింగ్ విజిలెన్సు అధికారులు పలుమార్లు నోటీసులు పంపినా పట్టించుకోలేదు. జరిమానా చెల్లించే వరకు పర్మిట్లు ఇవ్వకూడదని అధికారులు నిర్ణయిస్తే ఉలిక్కిపడ్డ కొందరు గ్రానైట్ వ్యాపారులు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేశారు. రాష్ట్ర మున్సిపల్, ఐటీ, గనుల శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు గ్రానైట్ వ్యాపారులు ప్రయత్నించినట్లు సమాచారం. ఇసుక, గ్రానైట్ అక్రమాలపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు తీసుకుంటున్న కేటీఆర్ తొలుత గ్రానైట్ వ్యాపారులకు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని తెలిసింది. కొంద రు మంత్రులు, అధికార పార్టీకి చెందిన మరికొందరు నేతల విజ్ఞప్తి మేరకు గ్రానైట్ వ్యాపారులకు అపాయిట్‌మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం గ్రానైట్ సంక్షోభం ఏర్పడిందని, విజిలెన్సు అధికారులు నిర్ధారించిన 1+5 జరిమానా చెల్లించలేమని ఆ మొత్తాన్ని తగ్గించాలని గ్రానైట్ వ్యాపారులు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేటీఆర్ జరిమానా మొత్తాన్ని 1+1(సుమారు రూ.262 కోట్లు)కు కుదించారు. ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందేనని కేటీఆర్ స్పష్టం చేశారు. అసలు జరిమానా మొత్తాన్ని చెల్లించేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపని గ్రానైట్ వ్యాపారులు మంత్రి నిర్ణయాన్ని బేఖాతర్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించడంతోపాటు ఏకంగా స్టే తెచ్చుకోవడం విశేషం. ఈ విషయంలో గ్రానైట్ వ్యాపారులకు మైనింగ్ శాఖలోని కొందరు ఉన్నతాధికారులే సహ కరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పట్టపగలే ఓవర్‌లోడ్‌కు రైట్‌రైట్ ! గ్రానైట్ ఓవర్‌లోడ్, ఇసు క అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని మంత్రి కేటీఆర్ చేసిన ఆదేశాలు జిల్లాలో అమలు కావడం లేదు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా కరీంనగర్ పట్టణ నడిబొడ్డునుంచి నిత్యం వందలాది వాహనాలు ఓవర్‌లోడ్‌తో వెళుతున్నా.. అధికారులు పెద్దగా పట్టించుకోవం లేదు. జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు సైతం నామమాత్రంగా మారాయి. ఈ విషయంలో కొందరు అధికారులు గ్రానైట్ వ్యాపారులకు సహకరిస్తున్నట్లు తెలిసింది. అందుకు ప్రతిఫలంగా ఒక్కో లారీకి లక్షలాది రూపాయలు అమ్యామ్యాలు తీసుకున్నట్లు సమాచారం.

ఎందుకు అధికారికంగా జరపాలి? - ‘విమోచనం’పై బీజేపీ నేతలను ప్రశ్నించిన ఎంపీ కవిత

08/09/2016: నాగారం(నిజామాబాద్): తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు డిమాండ్ చేస్తున్నారని.. అసలు విమోచన దినోత్సవాన్ని ఎందుకు అధికారికంగా నిర్వహించాలో చెప్పాలని నిజామాబాద్ ఎంపీ కవిత ప్రశ్నించారు. టీఎన్జీవోస్ ఆవిర్భవించి 70 ఏళ్లు పూర్తయినందున నిజామాబాద్‌లో బుధవారం టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ కవిత మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం 1999లో కాకినాడలో బీజేపీ చేసిన తీర్మానాన్ని ఆ పార్టీ ఎందుకు మార్చుకుందో చెప్పాలన్నారు. ఈ విషయంలో బీజేపీ నాయకులు చేసిన మోసాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడమంటే శ్రీకాంతాచారిలాంటి ఎంతోమంది విద్యార్థులు చేసిన త్యాగాన్ని, కేసీఆర్ చేసిన ఉద్యమాలనుంచి వెనక్కి వెళ్లిపోవడమేనన్నారు. అలాగే, ఉద్యోగుల సమస్యలు అన్నీ సీఎం కేసీఆర్‌కు తెలుసని, వాటిని ఆయన పరిష్కరిస్తారని కవిత పేర్కొన్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు గురించి పార్లమెంట్‌లో మాట్లాడతానన్నారు. సీమాంధ్ర పాలకుల వల్లే ఆరో జోన్‌లో నిజామాబాద్, మెదక్ జిల్లాలు, ఐదో జోన్‌లో ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగిందని టీఎన్జీవోస్ కేంద్ర సంఘం గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, వీజీగౌడ్, టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు హమీద్, జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్ష

07/09/2016: హైదరాబాద్, సలాం తెలంగాణ: యాదాద్రిని అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నందున రాబోయే కాలంలో భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉన్నందున రద్దీకి అనుగుణంగా యాదగిరిగుట్టలో ఏర్పాట్లు చేయాలిని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. యాదాద్రి అభివృద్ధి పనులను క్యాంపు కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రి సమీక్షించారు. మంత్రి జగదీష్ రెడ్డి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, వైటీడీఏ స్పెషల్ ఆఫీసర్ కిషన్‌రావు ఆలయాశిల్పులు ఆనంద్ సాయి, ప్రవీణ్, ఇంజనీరింగ్ అధికారులు వెంకటేశ్వర్ రెడ్డి తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నార. ప్రధాన ఆలయముండే గుట్టకు అభిముఖంగా ఉన్న గుట్టలతో కూడుకున్న ప్రాంతాన్ని టెంపుల్ సిటీగా మార్చేందుకు నిర్ణయించిన నేపథ్యంలో దానికి సంబంధించిన లే-అవుట్లు, డిజైన్లును ముఖ్యమంత్రి పరిశీలించారు. టెంపుల్ సిటీని 850 ఎకరాల విశాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో కాటేజీలు, విశాలమైన రోడ్లు, పార్కింగ్, ఉద్యానవనాలు, పుట్‌పాత్‌లు, ఫుడ్‌కోర్టులు, ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో 250 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టాల్సిన పనుల నమూనాలను ఖరారు చేశారు. 86 ఎకరాల విస్తీర్ణంలో 200 కాటేజీలు, మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఫుడ్‌ కోర్టులు, 7 ఎకరాల విస్తీర్ణంలో మంచినీరు, మరుగు నీటి నిర్వహణ వ్యవస్థ, 12 ఎకరాల్లో గ్రీనరీ, 62 ఎకరాల్లో రహదారులు, 26 ఎకరాల్లో ల్యాండ్ స్కేపింగ్ చేయడంతో పాటు మరో 42 ఎకరాల గుట్ట ప్రాంతాన్ని ప్రకృతి రమణీయంగా తీర్చిదిద్దాలని సిఎం నిర్ణయించారు. యాదాద్రిలో కాటేజీలు నిర్మించడానికి ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి, జెన్‌కో లతో పాటు దేశ వ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలు ముందుకొస్తున్నాయి. వారికి కేటాయించడానికి 1000-1500 గజాల ఓపెన్ ప్లాట్లను వెంటనే సిద్ధం చేయాలని సిఎం చెప్పారు. కాటేజీలు నిర్మించే ప్రాంతంలో రహదారులు, మురుగునీరు, విద్యుత్, మంచినీటి తదితర సౌకర్యాలు కల్పించాలని సూచించార. ప్రధాన ఆలయానికి వెళ్ళడానికి, రావడానికి రెండు వేర్వేరు రహదారులు నిర్మించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న దారిని గుట్ట పైకి వెళ్లడానికి ఉపయోగించాలని, కిందికి రావడానికి మరో రహదారి నిర్మిస్తున్నామని వెల్లడించారు. భక్తులను గుట్టపైకి తీసుకెళ్లడానికి ఆలయం తరుపున ప్రత్యేక రవాణా సదుపాయం కూడా కల్పించే యోచనలో ఉందని సిఎం వెల్లడించారు గుట్టపైన నిర్మాణాలను కూడా సిఎం సమీక్షించారు. యాదాద్రి పూర్తిస్థాయి నిర్మాణాలు పూర్తయిన తర్వాత నిర్వహణ బాధ్యతలు చూసేందుకు అవసరమైన వ్యూహం ఖరారు చేయాలని సిఎం చెప్పారు. యాదాద్రి పనులను నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని సిఎం ఆదేశించారు.

మరోసారి కాంట్రాక్టర్ల సిండికేట్! - ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న కాంట్రాక్టర్లు - ప్రజాప్రతినిధుల మధ్యవర్తిత్వంతో సిండికేట్ - మంచిర్యాలలో రూ.1.29 కోట్ల పనులకు టెండర్లు

07/09/2016: మంచిర్యాల టౌన్ : మంచిర్యాల మున్సిపాలిటీలో మరో అవినీతికి తెరలేచింది. ఎస్సీ ఎస్టీ, టీఎఫ్‌సీ నిధులు రూ.1.29 కోట్ల నిధులతో ఎ స్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పను లు, డ్రెయినేజీల నిర్మాణం, పైప్‌లైన్ల ఏర్పాటు, రోడ్లు వేయడంపై మంగళవారం సాయంత్రం వరకు ఆన్‌లైన్‌లో టెండర్లను ఆహ్వానించారు. టెండర్లు ఆన్‌లైన్‌లోనే ఆహ్వానించినా, పోటీ ఉండడంతో లెస్ అమౌంట్‌కు పోటాపోటీగా టెండర్లు వేసే అవకాశం ఉందని, దీంతో అం దరూ నష్టపోతారన్న ఉద్దేశంతోనే సిండికేట్‌కు తెరలేపినట్లుగా సమాచారం. దీంతో చివరి రోజున కాంట్రాక్టర్లు మున్సిపల్ ప్రజాప్రతినిధి ఇంట్లోనే సమావేశమై సిండికేట్ అయినట్లుగా సమాచారం. మున్సిపల్ పనులు చేపట్టే కాం ట్రాక్టర్ల నుంచి ఎలాంటి పోటీ లేకుండా చేసేం దుకు మున్సిపాలిటీ ముఖ్య ప్రజాప్రతినిధి మధ్యవర్తిత్వం జరిపినట్లు తెలిసింది. ఈ చర్చ లు జరుగుతుండగానే, ఓ సీనియర్ ప్రజాప్రతినిధికి చెందిన ఇద్దరు సోదరుల కుమారులు ఒకరిపై ఒకరు బాహాబాహీ అన్నట్లుగా కొట్టుకున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చివరికి కాంట్రాక్టర్లందరూ రింగై, సిండికేట్‌గా మారినట్లు తెలిసింది. టెండర్లకు నిర్ణయించిన ధరకు కొద్ది తక్కువ లెస్ అమౌంట్‌కు టెండర్లు వేయాలని నిర్ణయించగా, అందులో 11 శాతం పనులు దక్కించుకున్న వెంటనే చెల్లించాలని, 5 శాతం టెండర్లలో పాల్గొనని కాంట్రాక్టర్లకు, మిగిలిన 6 శాతంలో మూడు శాతం పాలకవర్గం ముఖ్య నేతకు, మిగిలిన మూడు శాతం పాలకవర్గ కౌన్సిలర్లకు ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లుగా సమాచారం. ముఖ్య ప్రజాప్రతినిధి ఇంట్లోనే ఈ తతంగం జరగడం, అక్కడి స్థానికుల ద్వారా సమాచారం పట్టణం అంతా వ్యాపించి, పట్టణంలో ఇదో చర్చకు దారితీసింది. ఇప్పటికే మంచిర్యాల మున్సిపాలిటీ అవినీతిలో కూరుకుపోగా, ఇకపై ఈ అవినీతిని ఎవరు ఆపుతారని, సిండికేటుగా మారి పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఏ మేరకు నాణ్యతతో పనులు చేపడతారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నయీం కేసులో ఎవరినీ వదలం - ఎస్సైలకు కౌన్సెలింగ్‌ - రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి

07/09/2016: గోదావరిఖని : గ్యాంగ్‌స్టర్‌ నయీం అక్రమ దందాకు సంబంధించి సిట్‌ విచారణ కొనసాగుతోందని, ఆయనకు అనుకూలంగా ఎవరూ వ్యవహరించినా వదిలిపెట్టేది లేదని రాష్ట్ర హోంశాఖ, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టంచేశారు. కరీంనగర్‌ జిల్లా రామగుండం ఎన్టీపీసీలో ఉద్యోగుల గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. నయీం బాధితులకు భూములిప్పిస్తామని, ఈ విషయంలో ప్రభుత్వం నిష్పక్షపాతంగా పనిచేస్తుందని చెప్పారు. చట్టానికి విరుద్ధంగా ఎవరూ పనిచేసినా వారిని క్షమించబోమని అన్నారు. రాష్ట్రంలో ఇటీవల ఎస్సైలు ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో ఎస్సైలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నామని, వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నామని వివరించారు. ఇప్పటికే జిల్లాల స్థాయిలో ఎస్సైలకు ఎస్పీలు కౌన్సెలింగ్‌ నిర్వహించారని, ఒత్తిడికి లోనుకావద్దని చెప్పారన్నారు. ప్రజల్లో ఉండి పనిచేయాల్సిన వారు మనోధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలోని 550 పోలీస్‌స్టేషన్లకు వాహనాలను సమకూర్చామని, ఎస్సైలకూ వాహనాలు అందజేశామన్నారు. నగరాలలో పెట్రోలింగ్‌ నిర్వహించే వారికి వైర్‌లెస్‌ సెట్లు ఇచ్చామని చెప్పారు. త్వరలోనే హైదరాబాద్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నిర్మాణం జరుగుతుందని, అది పూర్తయితే రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే రాజధానికి సమాచారం చేరుతుందని వివరించారు. జిల్లా కేంద్రాలలో ఉండే పోలీస్‌స్టేషన్లకు రూ.75 వేలు, పట్టణాల పరిధిలో రూ.50 వేలు, గ్రామీణ ప్రాంతాలలో ఉండే పోలీస్‌స్టేషన్లకు రూ.25 వేలు నిర్వహణ ఖర్చుల కింద కేటాయించామని తెలిపారు. ప్రజాభిప్రాయం మేరకే జిల్లాల పునర్విభజన జిల్లాల పునర్విభజన ప్రజాభిప్రాయం మేరకు జరుగుతోందని, అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టంచేశారు. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ప్రజలకు అనుకూలంగా నిర్ణయించాలని ముఖ్యమంత్రి జిల్లాస్థాయి అధికారులను ఆదేశించారన్నారు. ప్రజాప్రతినిధులతో జిల్లాల వారీగా మాట్లాడి, అన్ని అఖిలపక్షం సమావేశంలో చర్చించిన విషయాలు, అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అఖిలపక్ష సమావేశంలో జనగామ, గద్వాలను జిల్లాలుగా చేయాలని కాంగ్రెస్‌ పార్టీ కోరలేదని, ఇప్పుడు మాత్రం వాటిని జిల్లాలుగా చేయాలంటూ నిరాహారదీక్షలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మల్లన్నసాగర్‌పై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తూ అడ్డుతగులుతున్నాయన్నారు. సమావేశంలో ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ, మేయర్‌ కొంకటి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

ప్రాజెక్టులతోనే బంగారు తెలంగాణ - లక్ష్మీనర్సింహ రిజర్వాయర్‌కు నిధులు - మంత్రి ఈటల రాజేందర్‌

07/09/2016: ధర్మారం: ప్రాజెక్టుల నిర్మాణంతోనే బంగారు తెలంగాణ సాధ్యమని, అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఎల్లంపెల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసి 20 టీఎంసీల నీటి నిల్వ చేసిన ఘనత ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. ధర్మారం మండలం పత్తిపాకలోని శ్రీ లక్ష్మీనర్సింహరిజర్వాయర్‌ ప్రతిపాదిత స్థలాన్ని మంగళవారం ప్రభుత్వ చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావుతో కలిసి పరిశీలించారు. రిజర్వాయర్‌ నిర్మాణంపై నీటిపారుదలశాఖ సీఈ వెంకటేశ్వర్‌తో చర్చించారు. పది టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మిస్తే ఎంత ముంపునకు గురవుతుంది, తదితర విషయాలపై చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం ఆదేశాలతోనే లక్ష్మీనర్సింహ రిజర్వాయర్‌ ప్రతిపాదిత స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వచ్చినట్లు వివరించారు. ఎల్లంపెల్లి ప్రాజెక్టు నీటిని పైపులైన్‌ ద్వారా మేడారం చెరువులోకి పంపింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మేడారం చెరువు నుంచి లక్ష్మీనర్సింహ రిజర్వాయర్‌లోకి నీటిని పంపింగ్‌ చేసేందుకు చేస్తున్న సర్వేలు త్వరలోనే పూర్తి చేసి నిధులు మంజూరుచేయిస్తామన్నారు. 1600ఎకరాలు ముంపునకు గురైతే 10 టీఎంసీల రిజర్వాయర్‌గా రూపుదిద్దుకుంటుందన్నారు. అక్టోబర్‌ మొదటి వారంలోనే డీపీఆర్‌ సర్వే పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఎంపీపీ పాక మల్లేశ్వరీ, వైస్‌ ఎంపీపీ నార ప్రభాకర్, సింగిల్‌విండో చైర్మన్‌ పుస్కూరి నర్సింగారావు పాల్గొన్నారు.

కుక్కలున్నాయి జాగ్రత్త - బెంబేలెత్తుతున్న నగర ప్రజలు - నియంత్రణ చర్యలు శూన్యం

07/09/2016: కరీంనగర్‌ కార్పొరేషన్‌ : నగరంలో కుక్కల బెడత తీవ్రంగా ఉంది. గల్లీల్లో ఎక్కడ పడితే అక్కడే ఉంటుండడంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. నిబంధనలు సాకుగా చూపి అధికారులు వీటని అదుపుచేయలేమని చేతులెత్తేస్తున్నారు. అపరిశుభ్ర ప్రాంతాల్లో పందుల బెడద ఉంటే.. అన్నీ గల్లీలో కుక్కలతో జనం అవస్థలు పడుతున్నారు. ఒంటరిగా వెళ్తున్న వారిపై గుంపులుగా దాడి చేస్తుండడంతో ఏమి చేయలేకపోతున్నారు. చీకటి పడిందంటే బయటకు వచ్చేందుకు నగరవాసులు జంకుతున్నారు. పాదాచారులు, వాహనచోదకులను సైతం వెంటపడి మరీ తరుముతున్నాయి. కుక్కలను చూసి జనం పరుగులు పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వెంటాడి మరీ కరుస్తుండడంతో వీటి బారినపడి గాయాలపాలైన వారి సంఖ్య అధికమైంది. ఒకటి కాదు, రెండు కాదు.. వేల సంఖ్యలో కుక్కలు రోడ్లపై స్వైర విహారం చేస్తున్నాయి. అడుగడుగునా జనాలకు తిప్పలు నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఏటా వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది. వీటిని అదుపు చేయడం నగరపాలకసంస్థ యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. ఒకప్పుడు కుక్కలను నియంత్రించేందుకు కాంట్రాక్టు పద్ధతిన పనులు అప్పగించేవారు. కానీ నేడు ఎక్కడ అలాంటి చర్యలు కనిపించడం లేదు. దీంతో నగరంలో నెలకు పదిమందికి పైగా కుక్కకాటుకు గురవుతున్నట్లు సమాచారం. శివారు ప్రాంతాల్లో తీవ్రం నగరంలోని శివారు ప్రాంతాల్లో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. సుభాష్‌నగర్, కిసాన్‌నగర్, దుర్గమ్మగడ్డ, అశోక్‌నగర్, మారుతీనగర్, హౌసింగ్‌బోర్డుకాలనీ, కోతిరాంపూర్, కట్టరాంపూర్, భగత్‌నగర్, రాంచంద్రాపూర్‌కాలనీ, రాంనగర్, హరిహరనగర్‌ ప్రాంతాల్లో ఈ బెడద మరీ తీవ్రంగా ఉంది. ఇళ్లల్లో పెంచుకున్న కుక్కలకు సైతం టీకాలు వేయించడం లేదు. టీకాలు వేసిన ప్రతిసారీ రూ.3వేల వరకు ఖర్చవుతుండడంతో చాలా మంది టీకాలు వేయించడమే మరిచారు. ఇళ్లల్లో పెంచుకునే కుక్కలు కూడా బయటకు వచ్చినప్పుడు పిచ్చికుక్కల్లా ప్రవర్తిస్తున్నాయి. వీటిని కూడా నియంత్రించాల్సి ఉంది. కుక్కను పెంచుకునే యజమాని క్రమం తప్పకుండా టీకాలు వేయించేకార్డును పరీక్షిస్తే ఇది బయపడుతుంది. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు స్పందించి కుక్కలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.

కుమార్తెను ప్రభుత్వబడిలో చేర్పించిన ఎంఈవో

07/09/2016: గీసుకొండ: వరంగల్‌ జిల్లా గీసుకొండ ఎంఈవో సుజన్‌తేజ తన కుమార్తెను మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, సర్కారు బడుల్లోనే ఉత్తమ విద్య అందిస్తామంటూ ప్రచారం చేస్తున్నప్పటికీ చాలా మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రైవేటు బడులకే పంపిస్తున్నారు. ఇలాంటి ఆరోపణలను పక్కన పెట్టడానికే ఎంఈవో సుజన్‌తేజ తన కూతురు నవ్యశ్రీని గీసుకొండ జెడ్పీపాఠశాలలో పదవ తరగతి ఇంగ్లి్లష్‌ మీడియంలో మంగళవారం చేర్పించారు.

పోలీస్‌శాఖ విభజన కొలిక్కి

06/09/2016: కరీంనగర్‌ : జిల్లాల పునర్విభజనలో కరీంనగర్‌ మూడు జిల్లాలుగా విడిపోనుంది. ఈ మేరకు ప్రభుత్వం డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పోలీస్‌ శాఖ విభజన కూడా పూర్తయింది. ఈమేరకు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ జోయల్‌డేవిస్‌ విభజన వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని కరీంనగర్‌ 40, జగిత్యాల 30, పెద్దపల్లి 30 శాతం కేటాయించినట్లు తెలిపారు. విభజన నాటికి ప్రస్తుతం ఏ ఠాణాలో పని చేస్తున్న ఎస్సైలు అక్కడే కొనసాగుతారని పేర్కొన్నారు. నోటిఫికేషన్‌ నిబంధనల ప్రకారం సీఐ, ఎస్సైలను విభజించామని ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను వారి స్థానికత ఆధారంగా సొంత జిల్లాలకే కేటాయించే అవకాశం ఉందని వివరించారు. ఒక వేళ తక్కువ సంఖ్యలో ఉంటే పనితీరు ఆధారంగా ఆయా జిల్లాలకు కేటాయిస్తామని తెలిపారు. ఇప్పటికే హోంగార్డ్‌ల విభజన పూర్తయిందన్నారు. వారిని తక్కువగా ఉన్న యూనిట్లలో సమీపంలోని మండలాల నుంచి తీసుకుని భర్తీ చేశామని తెలిపారు. డీపీవో సిబ్బందిలో పనితీరు ఆధారంగా మూడు జిల్లాలకు సమానంగా వచ్చేలా మారుస్తామని, తక్కువగా ఉంటే వివిధ కేటగిరీలుగా మార్చి ఆయా జిల్లాకు కేటాయిస్తామన్నారు. ఏఆర్‌ సిబ్బందిని ఆయా జిల్లాలో అవసరం, జైళ్లు, కోర్టులు, కార్యాలయాలు, బందోబస్తులు, వీఐపీ మూమెంట్, ఆలయాలు తదితర అంశాలను ఆధారంగా చేసుకుని వారిని కేటాయిస్తామని తెలిపారు. కొత్త జిల్లాకు పంపాల్సిన రికార్డులు, ఫర్నిచర్, ఇతర పరికరాలు, అయుధాలు, వాటిని పరికరాలు ఆయుధగారాల పంపకాలు కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. ఏఆర్‌తోపాటు డీసీఆర్‌బీ, ఎస్‌బీ, మినిస్టీరియల్‌ సిబ్బంది విభజన దాదాపు పూర్తి కావచ్చిందని, వారికి నంబరింగ్‌ కూడా పూర్తి చేశామని పేర్కొన్నారు. నివేదికలను రెండు మూడు రోజుల్లో ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. తదుపరి ఉత్తర్వుల ప్రకారం మిగిలి వ్యవహరాలు, కార్యాలయాలు, ఆయా ఠాణాల సిబ్బందిని పరిశీలించి పంపకాలు చేస్తామని చెప్పారు. తర్వాత ఆయా జిల్లాలో తక్కువగా ఉన్న సిబ్బంది ఆయా జిల్లాల పరిపాలన విభాగం చూసుకుంటుదని తెలిపారు.

వారసత్వ ఉద్యోగాలు వచ్చేనా..?

06/09/2016: గోదావరిఖని(కరీంనగర్) : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలని కార్మిక సంఘాలు చేస్తున్న డిమాండ్ నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఆరవ ధపా గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లేనని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో వారసత్వ ఉద్యోగా ల ప్రకటన చేసే అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఈ విషయంలో మిగతా కార్మిక సంఘాల పరిస్థితి ఎలా ఉన్నా.. 2012లో జరిగిన 5వ దఫా గుర్తింపు సంఘం ఎన్నికల్లో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామనే ప్రధాన హామీతో అధికారంలోకి వచ్చిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నా రు. టీబీజీకేఎస్ తన గుర్తింపు కాలపరిమితి నాలుగేళ్లలో ఆ హామీని నెరవేర్చలేకపోయింది. వారసత్వ ఉద్యోగాలు సాధిస్తాం.. ఇదిగో .. అదిగో వస్తున్నాయంటూ నాయకు లు నమ్మబలికారు. ముఖ్యమంత్రిని కలిశామని, ఆయన ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారని గనులపైకి వచ్చిన ప్రతీసారి చెప్పారు. ఆచరణలో మాత్రం పెట్టలేక పోయూరు. నాలుగు జిల్లాల కోల్‌బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధులు సైతం సాధారణ ఎన్నికల్లో ఇదే హామీని వళ్లించారుు. చివరకు పుణ్యకాలం పూర్తరుుంది. తిరిగి ఆరవ దఫా గుర్తింపు సంఘం ఎన్నికల్లోనూ ఆదే హామీతో ముందుకు వస్తోంది. ఈ ప్రభావం టీబీజీకేఎస్ పై తీవ్రంగా పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో.. ఒకప్పుడు బొగ్గుగనుల్లో విధులు నిర్వర్తించి రావడానికి కాలినడకే దిక్కు. భూగర్భంలో కిలోమీటర్ల కొద్ది నడక కారణంగా 50 సంవత్సరాల వయసు పైబడిన కార్మికుల లో ఎక్కువ శాతం మంది మోకాళ్లు, నడుము నొప్పులతో బాధపడేవారు. దీని నుంచి ఉపశమనం పొందడానికి మద్యానికి బానిసయ్యేవారు. ఈ నేపథ్యంలో కార్మికులు విధులకు ఎక్కువగా గైర్హాజరయ్యేవారు. ఆ ప్రభావం బొగ్గు ఉత్పత్తిపై తీవ్రంగా పడేది. ఆలోచించిన యాజమాన్యం ఈ ప్రతికూల పరిస్థితుల్లో అనారోగ్యంతో పనిచేయ ని కార్మికుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగావకాశం కల్పించాలని నిర్ణయించింది. 1981 జూన్ 21వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. 1998 జూన్ 6 వరకు వారసత్వ ఉద్యోగాలను కొనసాగించారు. తర్వాత కాలంలో సింగరేణిలో యాంత్రీకరణ వేగవంతం కావడంతో బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ ఎక్కువగా యంత్రాల తోనే చేపడుతున్నారు. దీంతో కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వారసత్వ ఉద్యోగాలను యాజమాన్యం నిలిపివేసింది. కేవలం మరణించిన, పూర్తిగా పనిచేయలేక అనారోగ్యంతో ఉన్న, గనుల్లో ప్రమాదాలకు గురైన కార్మికుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సంస్థ ముందుకు వచ్చింది. అది కూడా నెలకు 25 ఉద్యోగాల చొప్పున ఇవ్వడానికి నిర్ణయించింది.

ఇసుక అక్రమ రవాణాపై అధికారుల కొరడా - 13 ట్రాక్టర్లను పట్టుకున్న మైనింగ్‌ అధికారులు - సహకరించిన స్థానికులు

03/09/2016: కరీంనగర్(బసంత్‌నగర్‌) : రామగుండం మండలంలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా మైనింగ్, విజిలెన్స్‌ అధికారులు కొరడా∙ఝలిపించారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 13 ట్రాక్టర్లను శుక్రవారం సీజ్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మండల పరిధిలోని గోదావరి పరీవాహాక ప్రాంతమైన ముర్‌మూర్‌ గ్రామానికి చెందిన కొంతమంది ట్రాక్టర్ల యజమానులు కొంతకాలంగా అక్రమంగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈనేపథ్యంలో విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు మైనింగ్, విజిలెన్స్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ పరమేశ్వర్, హెడ్‌ కానిస్టేబుల్‌ ధనుంజయ్, వీఆర్‌ఏ శంకర్‌తో కూడిన బృందం కుక్కలగూడుర్‌ ఎస్సీకాలనీ శివారులో ఇసుక లోడుతో వెళుతున్న 13 ట్రాక్టర్లను పట్టుకున్నారు. అయితే ఇసుక మాఫియా మాత్రం అధికారులతో వాగ్వాదానికి దిగి ట్రాక్టర్లను దారి మళ్లించే ప్రయత్నం చేశారు. దీనిని గమనించిన కుక్కలగూడుర్‌ గ్రామస్తులు వాహనాలకు అడ్డుకుని అధికారులకు మద్దతుగా నిలవడంతో ఇసుక మాఫియా నివ్వెరపోయింది. స్పందించిన అధికారులు ట్రాక్టర్లను దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బసంత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ తరలించి కేసు నమోదు చేశారు. అక్రమ వ్యాపారానికి దారి కొనుగోలు గోదావరినది పరివాహాక ప్రాంతాలైన ముర్‌మూర్, గోలివాడ, అంతర్గాం నుండి మద్దిర్యాల, కుక్కలగూడుర్‌ మీదుగా ధర్మారం, వెల్గటూర్‌ మండలాల పరిధిలోని గ్రామాలకు ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. అయితే ఇటీవల ఎల్లంపల్లి బ్యాక్‌ వాటర్‌ కుక్కలగూడుర్‌ గ్రామ శివారు వరకు చేరుకోవడంతో రహదారిపై రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. దీంతో ఇసుక రవాణాదారులు బసంత్‌నగర్, పాలకుర్తి, ఈసాలతక్కళ్లపల్లి గ్రామాల మీదుగా తమ దందాను కొనసాగించారు. అయితే ఇటీవల ఈసాలతక్కళ్లపల్లి గ్రామస్తులు ట్రాక్టర్లను అడ్డుకున్న నేపథ్యంలో ఇసుక మాఫియా తిరిగి పాత రహదారి మార్గాన్నే ఎంచుకుంది. అయితే ఎల్లంపల్లి బ్యాక్‌ వాటర్‌ ఉన్న నేపథ్యంలో సమీపంలోని పంటపొలాల గుండా ప్రత్యామ్నయ రహదారిని ఎంచుకున్నారు. ఇందుకు ఇసుక మాఫియా సదరు భూమి యజమానులకు రూ.50 వేలు చెల్లించినట్లు తెలిసింది.

నయీం కీలక అనుచరుడు అరెస్టు - దుబాయ్‌ పారిపోయే యత్నం.. - పుణే ఎయిర్‌పోర్టులో పట్టుకున్న పోలీసులు - కోరుట్ల కోర్టులో హాజరు.. 14రోజుల రిమాండ్‌

03/09/2016: కోరుట్ల : దుబాయ్‌కి పారిపోయే యత్నాల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ నయీం ముఖ్య అనుచరుడు మహ్మద్‌ ఆసిఫ్‌ఖాన్‌(45)ను పుణే ఎయిర్‌పోర్టులో గురువారం సిట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోరుట్ల వ్యాపారి రవూఫ్‌ను కిడ్నాప్‌ చేసి రూ.30లక్షలు వసూలు చేసిన కేసులో ఆసిఫ్‌ఖాన్‌ను శుక్రవారం కోరుట్ల కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆసిఫ్‌ఖాన్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించింది. నయీంకు ఆసిఫ్‌ఖాన్‌ అత్యంత సన్నిహితునిగా ఉండి కీలక వ్యవహారాలు చక్కబెట్టేవాడని సమాచారం. కోరుట్ల బీడీ లీవ్స్‌ వ్యాపారి రవూఫ్‌ను బెదిరించి కిడ్నాప్‌ చేసిన అనంతరం అతను ఇచ్చిన రూ.30లక్షలను రమేష్, గోవవర్ధనాచారి ఆసిఫ్‌ఖాన్‌కు అప్పగించారు. ఆ డబ్బులను ఆసిఫ్‌ఖాన్‌ తీసుకెళ్లి నయీంకు అప్పగించాడు. నల్గొండ జిల్లా భవనగిరికి చెందిన ఆసిఫ్‌ఖాన్‌కు సుమారు 15 సంవత్సరాలుగా నయీంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని ముషిరాబాద్‌కు మకాం మార్చిన ఆసిఫ్‌ఖాన్‌... నయీంకు ఫ్యామిలీ ఫ్రెండ్‌గా గుర్తింపు ఉంది. డబ్బుల రికవరీ వంటి కీలక వ్యవహారాలను చూసుకుంటాడని తెలిసింది. భువనగిరి పరిసరాల్లో నయీం నిర్వహించిన అనేక భూ సెటిల్‌మెంట్లలో ఆసిఫ్‌ఖాన్‌ కీలకంగా వ్యవహరించి వ్యూహాత్మకంగా డబ్బులు గుంజేవాడని పోలీసులు విచారణలో తేలింది. ఆయుధాల సరాఫరాలో... నయీం గ్యాంగ్‌కు ఆయుధాలు సరాఫరా చేయడంలోనూ ఆసిఫ్‌ఖాన్‌ పాత్ర ఉందన్న సందేహాలున్నాయి. ఆగస్టు 8న నయీం ఎన్‌కౌంటర్‌ అనంతరం హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో సిట్‌ పోలీసులు నిర్వహించిన దాడిలో ఓ ఇంటి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు స్వా«ధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాలను ఇతర ప్రాంతాల నుంచి అక్కడికి తరలించడంలో ఆసిఫ్‌ఖాన్‌ పాత్ర ప్రధానంగా ఉందని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన నయీం గ్యాంగ్‌కు వివిధ ప్రాంతాల నుంచి ఆయుధాలు తీసుకువచ్చి అప్పగించే పనిలోనూ ఆసిఫ్‌ఖాన్‌ ముఖ్యభూమిక పోషించాడన్న అనుమానాలు ఉన్నాయి. నయీం ఎన్‌కౌంటర్‌ అనంతరం పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న ఆసిఫ్‌ఖాన్‌ను విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్న అనుమానంతో సిట్‌ పోలీసులు అన్ని ఎయిర్‌పోర్టుల్లో అతడిపై లుక్‌అవుట్‌ ప్రకటించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆసిఫ్‌ఖాన్‌ దుబాయ్‌కు వెళ్లేందుకు గురువారం పుణే ఎయిర్‌పోర్టుకు చేరుకోగా అక్కడినుంచి సిట్‌ పోలీసులకు సమాచారం అందినట్లు తెలిసింది. ఈ సమాచారంతో పుణే వెళ్లిన సిట్‌ బృందం ఆసిఫ్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

బీటెక్‌ విద్యార్థి బలవన్మరణం - ఆంగ్ల మాధ్యమం చదవలేక అఘాయిత్యం

03/09/2016: ముస్తాబాద్‌(కరీంనగర్): ఇంగ్లిష్‌ మీడియం చదువు ఆ విద్యార్థిపాలిట శాపమైంది. తల్లిదండ్రుల కోరిక కాదనలేక.. ఇటు చదవలేక తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైనా ఓ బీటెక్‌ విద్యార్థి చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కళాశాలలో ఇమడలేక అందులో చేరిన నాలుగు రోజులకే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఎస్సై ప్రవీణ్, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ముస్తాబాద్‌కు చెందిన సూర నరేశ్‌(18) శుక్రవారం ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించగా అప్పటికే నరేశ్‌ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. సూర కనుకవ్వ, సాయిలు దంపతులకు ఇద్దరు కుమారులు రాజశేఖర్, నరేశ్‌. రాజశేఖర్‌ ఉపాధి నిమిత్తం దుబాయ్‌కు వెళ్లొచ్చాడు. చిన్న కుమారుడు నరేశ్‌ను ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులు భావించారు. గత నెల 27న హైదరాబాద్‌లోని సెయింట్‌ మేరీ ఇంజనీరింగ్‌ కళాశాలలో చేర్పించారు. అక్కడే ఓ హాస్టల్‌ను ఉంచారు. క్లాసులు అర్థం కావడంలేదురా.. నరేశ్‌ హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉండగా.. అక్కడ తనకు ఇంగ్లిష్‌లో చెప్పే పాఠాలు అర్థం కావడం లేదని, జైలులో ఉన్నట్లు అనిపిస్తోంది అని తన స్నేహితులకు వాట్సాప్‌ మెసేజ్‌ పెట్టాడు. కాలేజీకి వెళ్లబుద్ధికావడం పేర్కొన్నాడు. వినాయక చవితి పండుగ కోసమని సెలవు పెట్టి గురువారం స్వగ్రామానికి వచ్చాడు. రాత్రి బాగానే ఉన్న నరేశ్‌ను కాలేజీలో ఎలా ఉందని తల్లి కనుకవ్వ వాకబు చేసింది. అంతా బాగుందని నరేశ్‌ చెప్పాడు. శుక్రవారం ఉదయం పనులపై తల్లిదండ్రులు, సోదరుడు బయటకు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న నరేశ్‌ ఉరేసుకున్నాడు. తమ ఇంట్లో ఎవరూ చదవలేదని, బాగా చదివి ప్రయోజకుడవుతాడని తమ కొడుకును హైదరాబాద్‌లో బీటెక్‌లో చేర్పించామని, కొడుకు మనసు అర్థం చేసుకోలేక పోయామని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, నరేశ్‌ కాలేజీకి కూడా ఒక్క రోజే వెళ్లాడని, హాస్టల్‌లో తనతోపాటు ఉంటున్న నలుగురు స్నేహితులు పేర్కొన్నారు. తనకు క్లాసులు అర్థం కావడం లేదని చెప్పాడని, ఇంతలో ఆత్మహత్య చేసుకోవడం బాధగా ఉందన్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌ తెలిపారు.

కిరోసిన్ తాగిన హోంగార్డు..

03/09/2016: మెదక్ : మెదక్ జిల్లా సిద్ధిపేటలో హోంగార్డు అన్వర్ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. శుక్రవారం రాత్రి అతడు కిరోసిన్ తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. స్థానికులు వెంటనే స్పందించి... అతడిని సిద్ధిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అన్వర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. అన్వర్ ఆత్మహత్యయత్నంపై సమాచారం అందుకున్న డీఎస్పీ షేక్లాల్ అహ్మద్ వెంటనే ఆసుపత్రికి చేరుకుని అతడిని పరామర్శించారు. ట్రాఫిక్ ఎస్ఐ వేధింపుల కారణంగానే అన్వర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.

కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తం - విద్యారంగ సమస్యలపై మండిపాటు - పోలీసులు, విద్యార్థి నాయకుల మధ్య తోపులాట

02/09/2016: కరీంనగర్(ముకరంపుర): విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆ«ధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన నిర్వహించారు. తెలంగాణ చౌక్‌ నుంచి విద్యార్థులు ర్యాలీగా వచ్చి కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. విద్యార్థి సంఘాల నేతలు కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు విధ్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.తిరుపతి, బత్తిని సంతోష్‌లు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా విద్యారంగానికి చేసిందేమీ లేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా విద్యార్థుల మెస్‌చార్జీలు పెంచకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న బోజనం ప్రారంభిస్తామని హామీలిచ్చిన మంత్రులు విస్మరించడం శోచనీయమన్నారు. అధికారుల పర్యవేక్షణ లేక హాస్టళ్లు సమస్యలకు నిలయాలుగా మారాయన్నారు. కార్యక్రమంలో నాయకులు అరుణ్‌కుమార్, మారుతి, రజిత, రవీందర్, నాగరాజు, సంతోష్, ప్రశాంత్, విఘ్నేష్, గణేశ్, వంశీ, మాలతి, పూజ, ఆదిత్య, శ్రావణ్‌కుమార్, సంపత్‌ పాల్గొన్నారు.

రాజన్న శ్రావణమాసం ఆదాయం రూ. 4 కోట్లు

01/09/2016: వేములవాడ : శ్రావణమాసం సందర్భంగా వేములవాడ రాజన్నకు రూ.4 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. నెల రోజులుగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దీంతో హుండీ ద్వారా మరింత ఆదాయం సమకూరే అవకాశముందని అధికారులు తెలిపారు. గురువారంతో శ్రావణమాసం ముగుస్తున్న నేపథ్యంలో బుధవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. చిరుజల్లులు కురుస్తున్నా భక్తులు రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బద్ధి పోచమ్మ ఆలయంలోనూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.

ఎస్సై శ్రీధర్‌ అంత్యక్రియలు

01/09/2016: కరీంనగర్‌(ముస్తాబాద్‌) : ఆదిలాబాద్‌ జిల్లా కెరమెరి ఎస్సై కాశమేని శ్రీధర్‌ ఆత్మహత్యకు పాల్పడగా.. ఆయన స్వగ్రామం కరీంనగర్‌ జిల్లా ముస్తాబాద్‌ మండలం ఆవునూర్‌లో పోలీస్‌ అధికారిక లాంఛనలతో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. శ్రీధర్‌ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించగానే బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. ప్రజల సందర్శనార్థం మృతదేహన్ని ఆయన ఇంటిలో ఉంచారు. కరీంనగర్‌ జిల్లా పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు సురేందర్, సిరిసిల్ల రూరల్‌ సీఐ శ్రీధర్, టౌన్‌ సీఐ విజయ్‌కుమార్, ఎస్సైలు ప్రవీణ్, ఉపేందర్, లక్ష్మారెడ్డి, ఎస్‌బీ ఎస్సై మారుతి, ప్రత్యేక పోలీస్‌ బృందం సెల్యూట్‌ చేశారు. మానేరు వాగులో ఆశ్రునయనాలతో శ్రీధర్‌ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వందలాది మంది తరలివచ్చారు. పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. శ్రీధర్‌ తల్లిదండ్రులు స్వతంత్ర, ధర్మయ్యలను పోలీస్‌ అధికారులు ఓదార్చారు.

టీడీపీ నేతపై గన్ ఎక్కుపెట్టిన సెంట్రీ - కరీంనగర్ జిల్లా జైలు వద్ద ఘటన

01/09/2016: కరీంనగర్: కరీంనగర్ జిల్లా జైలు గేటులోకి వెళ్తున్న చొప్పదండి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిపై డ్యూటీలో ఉన్న సెంట్రీ తుపాకీ ఎక్కు పెట్టాడు. ముందస్తు అనుమతి తీసుకున్నా.. తనను లోనికి వెళ్లకుండా అడ్డుకోవడంతోపాటు గన్ ఎక్కుపెట్టి ‘కాల్చి పారేస్తా’నని సెంట్రీ అన్నా డని టీడీపీ నేత మేడిపల్లి సత్యం ఆరోపించారు. కరీంనగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చింతకుంట విజయరమ ణారావును మంగళవారం కోర్టు రిమాండ్ చేసిన విషయం తెలిసిందే. జిల్లా జైలులో ఉన్న ఆయనను కలిసేందుకు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి బుధవారం వచ్చారు. జైలులో ఉన్న విజయరమణారావును కలిసేందుకు రేవంత్‌తోపాటు పలువురు నాయకులు ముందుగానే అనుమతి తీసుకుని లోనికి వెళ్లారు. పార్టీ చొప్పదండి నియోజకవర్గ ఇన్‌చార్జి మేడిపల్లి సత్యం కూడా లోనికి వెళ్తుండగా సెంట్రీ అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సెంట్రీ తనవద్దనున్న తుపాకీ ఎత్తి కాల్చి వేస్తానని బెదిరించాడు. కార్యకర్తలు, పోలీసులు ఇద్దరిని దూరంగా తీసుకుపోవడంతో వివాదం సద్దుమణిగింది. దీనిని నిరసిస్తూ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. దీనిపై ఇన్‌చార్జి జైలు సూపరింటెండెంట్ సమ్మయ్య మాట్లాడుతూ... జైలు గేట్ వద్ద లోనికి తోసుకుని వెళ్తుండగా వారిని నియంత్రించే క్రమంలో జరిగిన సంఘటన మాత్రమేనని, దీనిపై ఎలాంటి విచారణ చేయడం లేదని అన్నారు. జరిగిన సంఘటన గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కేసీఆర్ పతనం ప్రారంభమవుతుంది: రేవంత్ తెలంగాణ ఉద్యమానికి, టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచిన కరీంనగర్ గడ్డ నుంచే సీఎం కేసీఆర్ పతనం ప్రారంభమవుతుందని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షు డు చింతకుంట విజయరమణారావును బుధవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రజలను, రైతులను చులకనగా చూస్తున్నారన్నారు. సమస్యలు పరి ష్కరించాలని ఉద్యమించిన వారిపై పోలీసులను ఉసిగొల్పి అణగదొక్కాలని చూస్తున్నారని విమర్శించారు. ఎండుతున్న పంటలకు ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయూలని ఆందోళన చేసిన టీడీపీ నాయకులు, రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం తగదన్నారు. ఎస్సారెస్పీ నీటి విడుదలపై మాట తప్పిన మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావులను అరెస్టు చేసి జైల్లో పెట్టాలన్నారు. విజయరమణారావు జైలు నుంచి రావడంతోనే ఎల్లంపల్లి నీటి విడుదలపై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. పలువురు దళితులపై విద్యుత్ దొంగలుగా ముద్రవేసి జైలుకు పంపించారని రేవంత్‌రెడ్డి చెప్పారు. కరీంనగర్ జైలులో ఉన్న దళితులకు బెరుుల్ తీసుకునే స్తోమత కూడా లేదని, టీడీపీ తరఫున న్యాయవాదులను నియమించి వారికి బెరుుల్ వచ్చేలా చూస్తామని అన్నారు. ఆయన వెంట టీడీపీ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు, పార్టీ జిల్లా ఇన్‌చార్జి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి ఉన్నారు.

పన్జుగుల గ్రామములో ఘనంగా బోనాల పండుగ

30/08/2016: మహబూబ్ నగర్(కల్వకుర్తి), సలాం తెలంగాణ: కల్వకుర్తి మండలములోని పన్జుగుల గ్రామములో సోమవారం రోజున బోనాల పండుగను గ్రామ ప్రజలు విజయ వంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువసత్తా జిల్లా అద్యక్షులు డి.గణేష్, ఎస్.శివప్రసాద్, వెంకటాద్రి, శ్రీను పాల్గొన్నారు.

కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలని అఖిల పక్షాల రిలే నిరాహార దీక్షలు

30/08/2016: మహబూబ్ నగర్(కల్వకుర్తి), సలాం తెలంగాణ: కల్వకుర్తి ని రెవెన్యూ డివిజన్ చేయాలని అఖిల పక్షాలు రిలే నిరాహార దీక్షలు చేపట్టాయి. అదే విధంగా ఈ రోజు అఖిల పక్షం నాయకులు కల్వకుర్తి ఎమ్యెల్యే చల్ల వంశీచంద్ రెడ్డి ,మాజీ ఎమ్యెల్యే ఎడ్మ కిష్ట రెడ్డ్డి ,TRS ఇంచార్జి,మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ,బిజేపి ప్రధాన కార్యదర్శి టి.ఆచారి,టీ డి పి కల్వకుర్తి ఇంచార్జి బాల స్వామి ,అఖిలపక్ష జేఏసీ చైర్మన్ సదానందం గౌడ్,ఆనంద్ కుమార్,షాహేద్, గౌడ్,బిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి కనుగుల జంగయ్య ,దుర్గ ప్రసాద్,రాఘవేందర్ గౌడ్,ఎడ్మ సత్యం,మల్లేపల్లి జగన్,రాజేందర్ ,తలసాని జనార్దన్ రెడ్డి,కిశోర్ రెడ్డి,దామోదర్ గౌడ్,పబ్బు జంగయ్య గౌడ్,కండె భాస్కర్,శ్రీనివాస్ రెడ్డి,డేవిడ్,పుస్తకాల రాహుల్,,MRPS కృష్ణ,సాదిక్ లు, తెలంగాణ మంత్రి కృష్ణారావు గారికి హైదరాబాద్ లో కల్వకుర్తి ని రెవెన్యూ డివిజన్ చేయాలంటు వినతి పత్రం అందజేశారు అలాగే మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారిని తన నివాసంలో కలిశారు, ఈ కార్యక్రమములో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

మెదక్లో భూవివాదం - పోలీసులపై దాడి

30/08/2016: మెదక్ : మెదక్ జిల్లాలో పోలీసులపై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. శివంపేట మండలం ధర్మతండాలో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత భూవివాదంతో రెండు వర్గాలు ఘర్షణకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు తండాకు చేరుకుని ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో రెచ్చిపోయిన ఇరువర్గాలు పోలీసులపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో సీఐ, నలుగురు కానిస్టేబుళ్లకు గాయాలు కావడంతో పాటు పోలీస్ వాహనం ధ్వంసమైంది. వెంటనే పోలీస్ సిబ్బందిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. దాడి ఘటనపై మెదక్ జిల్లా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

రివాల్వర్ మిస్ ఫైర్ - ఎస్ఐ మృతి

30/08/2016: ఆదిలాబాద్ : రివాల్వర్ మిస్ ఫైర్ అయి ఎస్ఐ మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కెరమెరి పోలీస్ స్టేషన్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీధర్ మంగళవారం ఉదయం రివాల్వర్‌ మిస్ ఫైర్ అయింది. పోలీస్ క్వార్టర్స్‌లో నివసిస్తున్న ఆయన తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్‌ను శుభ్రం చేస్తున్న క్రమంలో గన్ మిస్ ఫైర్ రెండు బుల్లెట్లు తలలో దూసుకెళ్లాయి. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆసిఫాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎస్‌ఐ మృతిచెందారు. సిరిసిల్ల మండలం అవునూరు గ్రామానికి చెందిన శ్రీధర్ శిక్షణ పూర్తి చేసుకుని రెండు రోజుల కిందటే సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా కెరమెరిలో పోస్టింగ్ పొందారు. సమాచారం అందుకున్న పోలీస్ ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలని మంత్రికి వినతి పత్రం...

29/08/2016: మహబూబ్ నగర్(కల్వకుర్తి), సలాం తెలంగాణ: ఆదివారం రోజున అఖిల పక్షం నాయకులు కల్వకుర్తి ఎమ్యెల్యే చల్ల వంశీచంద్ రెడ్డి ,మాజీ ఎమ్యెల్యే ఎడ్మ కిష్ట రెడ్డి ,TRS ఇంచార్జి,మాజీ ఎమ్యెల్ జైపాల్ యాదవ్ ,బిజేపి ప్రధాన కార్యదర్శి టీ.ఆచారి,JAC అధ్యక్షులు సదానందం గౌడ్ లు తెలంగాణ మంత్రి కృష్ణారావు గారికి హైదరాబాద్ లో కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలంటూ వినతి పత్రం అందజేశారు, అలాగే మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ని తన నివాసంలో కలిశారు. ఈ కార్యక్రమములో వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

పోలీసు అధికారులపై కేసు నమోదు చేయాలి

29/08/2016: మెదక్‌(మఠంపల్లి): మెదక్‌జిల్లా కుక్కునూరుపల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య విషయంలో గజ్వేల్‌డీఎస్పీ, సీఐలపై 306 కేసు నమోదు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో నిర్వహించిన ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి సంతాప సభలో మాట్లాడారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో అధికారుల ఒత్తిడితో పోలీస్‌అధికారి ఆత్మహత్యకు పాల్పడితే పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వెంటనే ఆత్మహత్యకు గల కారణాలను పరిశోధించి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. మృతుని కుటుంబానికి నష్టపరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగమిచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో చిట్యాల అమర్‌నాథరెడ్డి, తన్నీరు మల్లికార్జున్‌ రావు, లక్ష్మీనారాయణరెడ్డి, సీతారాంరెడ్డి, సత్యనారాయణరెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తిండీ తిప్పలూ కరువే -

29/08/2016: మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా): ‘సౌదీలో రోడ్డున పడ్డ కార్మికులను ఆదుకుంటాం.. వారిని సురక్షితంగా ఇళ్లకు రప్పిస్తాం..’ ఇటీవల విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన ప్రకటన ఇది! కానీ కార్మికుల ఆశలు అడియాసలే అవుతున్నాయి. స్వయంగా మంత్రి ఆదేశించినా.. సౌదీలో రాయబార కార్యాలయం అధికారులు కదలడం లేదు. జైళ్లలో మగ్గుతున్నవారికి తాత్కాలిక పాస్‌పోర్టులు(ఔట్ పాస్‌పోర్టులు) ఇవ్వకపోవడంతో వారంతా నరకం అనుభవిస్తున్నారు. సరైన వసతి, భోజన సదుపాయం లేక తెలంగాణకు చెందిన అనేక మంది కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. పట్టించుకునే నాథుడే లేడు.. ఆర్థిక సంక్షోభంతో సౌదీలోని ప్రధాన కంపెనీలు అయిన బిన్‌లాడెన్, సౌదీ ఓజర్ కంపెనీలు మూతపడ్డాయి. అనేక చిన్న కంపెనీలు సైతం లాకౌట్ ప్రకటించాయి. మూతబడిన కంపెనీలు కార్మికులను క్యాంపుల నుంచి గెంటివేయడంతో వారంతా రోడ్డున పడ్డారు. కంపెనీల యాజమాన్యాలు కార్మికుల పాస్‌పోర్టులను ఇస్తే వారంతా స్వదేశాలకు చేరేవారు. కానీ కంపెనీలు పాస్‌పోర్టులు చేతికి ఇవ్వకుండా.. నెలల తరబడి బకాయి పడ్డ వేతనాలు చెల్లించకుండా కార్మికులను బజారున పడేశాయి. దీంతో అనేకమంది తమకు తెలిసిన వారి గదుల్లో ఆశ్రయం పొందుతుండగా మరికొందరు ఎలాంటి దారి లేక పోవడంతో రోడ్లపై బతుకీడుస్తున్నారు. వీరంతా పోలీసుల తనిఖీల్లో పట్టుబడడంతో ఔట్ జైళ్లకు తరలించారు. జైళ్లలో మగ్గుతున్న కార్మికులకు సరైన వసతి, భోజన సదుపాయం లేదు. సౌదీలోని భారత రాయబార కార్యాలయం అధికారులు వీరికి ఔట్ పాస్‌పోర్టులను జారీ చే స్తే స్వదేశానికి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ జెద్దా, రియాద్, హాయ్‌లలో ఉన్న రాయబార కార్యాలయం అధికారులు సకాలంలో ఈ పాస్‌పోర్టులు ఇవ్వడం లేదు. సెలవుల పేరుతో వారంలో మూడు నాలుగు రోజులు కార్యాలయాలను మూసి ఉంచుతున్నారు. ఇప్పటికే ఔట్ పాస్‌పోర్టుల కోసం కార్మికులు చేసుకున్న దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. సెప్టెంబర్ 25లోపు భారత్‌కు వచ్చే కార్మికులకు సౌదీలోని కంపెనీల నుంచి బకాయి పడిన వేతనం సొమ్మును ఇప్పిస్తామని, ఇతర సంరక్షణ చర్యలను తీసుకుంటామని విదేశాంగ మంత్రి ప్రకటించారు. అయితే ఇంకా ఔట్ పాస్‌పోర్టుల ఇవ్వకపోవడంతో వారంతా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు ఎక్కువ సమయం కార్యాలయాన్ని నిర్వహించి ఔట్ పాస్‌పోర్టుల జారీని వేగవంతం చేయాలని కోరుతున్నారు. రాయబార కార్యాలయంలో పట్టించుకోవడం లేదు సౌదీలోని రాయబార కార్యాలయాల్లో సరైన స్పందన లేదు. ఔట్ పాస్‌పోర్టు జారీకి ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. అధికారులు పని వేళలు పాటించడం లేదు. దీనిపై ఎవరికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. - సత్యనారాయణ, ఎలక్ట్రీషియన్, రియాద్

సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్క్‌లో అగ్ని ప్రమాదం - రూ. 10లక్షల ఆస్తినష్టం

29/08/2016: సిరిసిల్ల రూరల్‌ : సిరిసిల్ల మండలం బద్దెనపల్లి టెక్స్‌టైల్‌ పార్క్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తుల్జాభవాని కార్ఖానాలో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రూ.8లక్షల విలువైన యంత్రాలు, రూ.2లక్షల విలువైన వేస్టేజ్‌ కాటన్‌ కాలిబుడిదయ్యాయి. యజమాని నాగారం వెంకటేశం అప్రమత్తమై వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం చేరవేశారు. అప్పటికే యంత్రాలు, కాటన్‌వేస్టేజ్‌ కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఇతర పరిశ్రమలకు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చారు. ఏఎస్సై చీనా నాయక్‌ విచారణ జరుపుతున్నారు. కానరాని ఫైర్‌సేఫ్టీ..? టెక్స్‌టైల్‌ పార్క్‌లో రూ.కోట్లు వెచ్చించి పరిశ్రమలు నెలకొల్పుతున్నారు. అయితే, ఫైసెఫ్టీ నిబంధనలు పాటించడం లేదని, అందుకే ప్రమాదాలు సంభవించకా నష్టాలు అధికంగా ఉంటున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఆస్తినష్టం సంభవించాక లబోదిబోమనడం మినహా యజమానులు చేసేదేమీ ఉండడంలేదు.

ఆర్టీసీ బస్సులు ఢీకొని 20మందికి గాయాలు

29/08/2016: కరీంనగర్(గంభీరావుపేట) : కొత్తపల్లి గ్రామశివారు మూలమలుపు వద్ద ఆదివారం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఇరవై మంది ప్రయాణికులు గాయపడ్డారు. దుబ్బాక డిపోకు చెందిన రెండు బస్సుల్లో ఒకటి కామారెడ్డి నుంచి దుబ్బాకకు వెళ్తుండగా.. మరొకటి దుబ్బాక నుంచి కొత్తపల్లికి వస్తోంది. మూల మలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ఢీకొన్నాయి. ప్రమాదంలో సుమారు 20మందికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని 108 వాహనంలో సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు.

టీఆర్‌ఎస్‌ నాయకులను గృహ నిర్బంధిస్తాం - హుస్నాబాద్‌ పరిరక్షణ సమితి కన్వీనర్‌ కేడం లింగమూర్తి

29/08/2016: హుస్నాబాద్‌ : హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్‌లో కొనసాగించకపోతే టీఆర్‌ఎస్‌ నాయకులను గృహ నిర్బంధిస్తామని హుస్నాబాద్‌ పరిరక్షణ సమితి కన్వీనర్, డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి హెచ్చరించారు. హుస్నాబాద్‌ను సిద్దిపేటలో కలపడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ దిష్టిబొమ్మను ఆదివారం దహనం చేశారు. కరీంనగర్‌లో కొనసాగించాలని గ్రామసభల ద్వారా తీర్మానాలు చేసిన ఎవరి స్వార్థం కోసం సిద్దిపేటలో కలుపుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం మెుండి వైఖరి వీడనాడకుంటే టీఆర్‌ఎస్‌ నేతల ఇళ్ల ఎదుట చావుదప్పులు మోగిస్తామన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ ప్రజాఫ్రంట్‌ జిల్లా అధ్యక్షుడు మేకల వీరన్న, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, సీపీఐ మండల కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్, సింగిల్‌విండో డైరెక్టర్‌ అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు చిత్తారి రవీందర్, అయిలేని శంకర్‌రెడ్డి, లింగంపల్లి మల్లారెడ్డి, అక్కు శ్రీనివాస్, పచ్చిమట్ల రవీందర్, కేడం కనకయ్య, బీజేపీ నాయకులు వేముల ప్రభాకర్‌రెడ్డి, వేముల దేవేందర్‌రెడ్డి, చిట్టి గోపాల్‌రెడ్డి, పెరుమాండ్ల శేఖర్, టీడీపీ నాయకులు ముప్పిడి రాజిరెడ్డి తదితరులున్నారు. స్వార్థ రాజకీయాల కోసమే.. –బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి స్వార్థ రాజకీయాల కోసమే హుస్నాబాద్, కోహెడ మండలాలను సిద్దిపేటలో కలుపుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హుస్నాబాద్‌ను కరీంనగర్‌లో కొనసాగించాలని అఖిలపక్షం చేపట్టిన రిలే నిరహార దీక్ష శిబిరాన్ని ఆదివారం సందర్శించి సంఘీభావం తెలిపారు. అభివృద్ధి చేయలేని ఎమ్మెల్యే సిద్దిపేటలో కలిపేందుకు అంగీకరించడం సిగ్గుచేటన్నారు. సైదాపూర్‌ను హన్మకొండ జిల్లాలో కలపాలని అక్కడి గ్రామాలు తీర్మానాలు చేయడం వెనుక ఎమ్మెల్యే కుట్ర దాగి ఉందన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. దీక్షలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు పెందోట అనిల్‌కుమార్, గుత్తికొండ విద్యాసాగర్, అన్నబోయిన ప్రశాంత్, వరయోగుల అనంతస్వామి, జున్నోజు శ్రీకాంత్, భీమేశ్వర్, చందు, బోనగిరి రవి, ప్రదీప్‌ కూర్చున్నారు.

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

29/08/2016: కరీంనగర్ : వేములవాడ రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో.. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే రాజన్న దర్శనానికి భక్తులు బారులు తీరారు. సోమవారం ఉదయం భారీ వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జగిత్యాల, కరీంనగర్, వేములవాడ, రామగుండంలో సోమవారం ఉదయం కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

డిస్ట్రిబ్యూటరీ కాలువలకు గండి

27/08/2016: కరీంనగర్(తిమ్మాపూర్‌) : లోయర్‌ మానేరు జలాశయం నుంచి దిగువకు కాకతీయ కాలువ ద్వారా నీటిని విడుదల చేయగా చెరువులు నింపేందుకు రైతులు డిస్ట్రిబ్యూటరీలకు గండిపెట్టారు. ఎల్‌ఎండీ రిజర్వాయర్‌కు రెండు కిలోమీటర్ల దూరంలోనే అల్గునూర్‌ గ్రామ శివారులో డీబీఎం 1, డీబీఎం 2 డిస్ట్రిబ్యూటరీ కాలువలున్నాయి. కాలువల ద్వారా నీరు వస్తున్నా బావుల్లో నీటిమట్టం పెరుగడం లేదు. దీంతో చెరువులను నింపాలని గ్రామస్తులంతా నిర్ణయించుకున్నారు. డిస్ట్రిబ్యూటరీ 2 కాలువకు గురువారం రాత్రి, డీబీఎం 1 కాలువకు శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు గండిపెట్టారు. దీంతో నీరు పొలాల మీదుగా మామిడి కుంట చెరువుకు తరలించారు. చెరువులు నింపేందుకు డిస్ట్రిబ్యూటరీలకు గండి పెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. తమకు వచ్చే నీటిని చెరువుల్లోకి మళ్లించుకుంటున్నామని రైతులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం రెండు డీబీఎంలకు అధికారులు నీటిని నిలిపి వేశారు. రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదు లేకున్నా అధికారులు నీటిని ఆపేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి నీటిని అందించాలని రైతులు కోరుతున్నారు. గండి పెట్టడంతో బైరేనికుంట చెరువు, మామిడికుంట చెరువులోకి కొంత మేరకు నీరు చేరుకున్నాయి.

జగిత్యాలకు ఆర్టీవో కార్యాలయం

27/08/2016: జగిత్యాల అర్బన్‌ : ప్రభుత్వం నూతన జిల్లాల ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేయడంతో రవాణా శాఖ ప్రతీ కొత్త జిల్లాలో ఆర్టీవో కార్యాలయాల ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ మేరకు జిల్లా రవాణా శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. దసరా నాటికి కొత్త జిల్లాలు ఆవిర్భవించడంతోపాటు జిల్లా కేంద్రాల నుంచే పాలన సాగాలని ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో ప్రతీ జిల్లాకు ఆర్టీవో కార్యాలయం ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రస్తుతం కరీంనగర్‌లోని డీటీసీ కార్యాలయంతోపాటు పెద్దపల్లిలో ఇప్పటికే ఆర్టీవో కార్యాలయం ఉంది. ఒక జగిత్యాలలో మాత్రమే ఎంవీఐ యూనిట్‌ ఆఫీస్‌ ఉంది. దీంతో జగిత్యాలలో ఎంవీఐ యూనిట్‌ ఆఫీస్‌ పరిధిలో ఆర్టీవో కార్యాలయంగా మార్చనున్నారు. రవాణా శాఖలో ఉన్న సిబ్బందిని, కేటగిరీలకు సిబ్బందిని సైతం కేటాయించనున్నారు. ప్రస్తుతం జగిత్యాల పట్టణంలోని ఎస్సారెస్పీ భూమిలో 5.37 ఎకరాల్లో ఎంవీఐ యూనిట్‌ ఆఫీస్‌ నెలకొల్పారు. దీని పక్కనే మరో క్వార్టర్‌ కూడా ఉంది. దీనిని ఆర్టీవో కార్యాలయంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు క్వార్టర్‌కు మరమ్మతులు సైతం చేపట్టారు. తగ్గనున్న భారం : జగిత్యాల 15 మండలాలతో జిల్లా కానున్న నేపథ్యంలో ప్రతీ కార్యాలయాన్ని ఇక్కడ కేటాయించడంతో ప్రజలకు దూర భారం తగ్గనుంది. ప్రస్తుతం జగిత్యాలలో ఉన్న ఎంవీఐ యూనిట్‌ ఆఫీస్‌లో ప్రజలు నాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు సంబంధించిన పనులను చేస్తుంటారు. కరీంనగర్‌లోని ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి ట్రాన్స్‌పోర్టు సంబంధించిన ఫీజులు కట్టి అనంతరం ఇక్కడికి వచ్చి మళ్లీ అధికారులు పరిశీలిస్తారు. ప్రస్తుతం అలాంటిదేమీ లేకుండా నేరుగా జగిత్యాల కార్యాలయానికి వచ్చి పని చేసుకోవచ్చు. భవనమే అసలు సమస్య : ప్రస్తుతం జగిత్యాల ఎంవీఐ యూనిట్‌ ఆఫీస్‌ సర్వే నంబరు 349/1లో 32 గుంటలు, 350/2లో 3.01 ఎకరాలు, 362/2లో 1.32 ఎకరాలు, 351/2లో 0.06 గుంటలు, 363/2లో 0.32 గుంటలలో ఎంవీఐ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో వీరు మొత్తం 5.37 ఎకరాల ఎస్సారెస్పీ భూమిని ఉపయోగించుకుంటున్నారు. ఈ ఎస్సారెస్పీ భూమి మొత్తం 75 ఎకరాల ఉండటంతో దీనిని కలెక్టర్‌ కాంప్లెక్స్‌ నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు చేశారు. అయితే ఆర్టీవో కార్యాలయం నెలకొల్పడంతో దీనికి సుమారు 10 ఎకరాల భూమి కావాల్సి ఉంటుంది. కలెక్టర్‌ కాంప్లెక్స్‌ కడితే ఆర్టీవో కార్యాలయాన్ని మరో చోటకు తరలించే అవకాశం ఉంది. సబ్‌కలెక్టర్‌కు వినతి : జగిత్యాల యూనిట్‌ ఆఫీస్‌కు మరో చోటకు తరలిస్తే ఇబ్బందులుంటాయని, ప్రస్తుతం ఉన్న కార్యాలయమే ప్రజలకు, అధికారులకు సౌకర్యవంతంగా ఉందని దీనిని మార్చితే ఇబ్బందులుంటాయని ఎంవీఐ కిషన్‌రావు సబ్‌కలెక్టర్‌ శశాంకకు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం కలెక్టరేట్‌ నిర్మాణం ప్రతిపాదనలు చేస్తున్నాం, అప్పటి వరకు ఏదైనా భూమిని చూపించడం లేదా, దానినే కేటాయించడం జరుగుతుందని, ఇబ్బంది లేకుండా చూస్తామని సబ్‌కలెక్టర్‌ హామీ ఇచ్చినట్లు తెలిసింది.

చిట్‌ఫండ్‌ డబ్బుల కోసం మహిళా హోంగార్డు ఆందోళన

27/08/2016: జ్యోతినగర్‌ : తన చిట్‌ డబ్బుల విషయంలో శ్రీరామ్‌ చిట్స్‌ యాజమాన్యం వైఖరికి నిరసనగా ఓ మహిళా హోంగార్డు శుక్రవారం కార్యాలయం బిల్డింగ్‌ ఎక్కి నిరసన వ్యక్తం చేసింది. ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌ పరిధి రాజీవ్‌ రహదారిని ఆనుకుని ఉన్న శ్రీరామ్‌ చిట్స్‌లో పెద్దపల్లికి చెందిన మహిళా హోంగార్డు మామిడి పద్మ తన చిట్‌ వేస్తోంది. దీనికి సంబంధించిన లావాదేవీలు సక్రమంగా లేవని యాజమాన్యాన్ని నిలదీసింది. వారు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో బిల్డింగ్‌పైకి ఎక్కి నిరసన చేపట్టింది. విషయం తెలుసుకున్న రామగుండం సీఐ వాసుదేవారావు, ఎన్టీపీసీ ఎస్సై చంద్రర్‌కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకున్నారు. చిట్స్‌ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారు. బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. పద్మతో మాట్లాడి కిందకు దించారు. నిరసనకు కారణాలు తెలుసుకున్నారు. 2015లో చిట్‌ వేసిన పద్మ తన చిట్‌ను ఆరు నెలల క్రితం లిఫ్ట్‌ చేసింది. ఈ మేరకు దానికి సంబంధించిన జమానత్‌ వ్యక్తుల పత్రాలను సైతం అందించినా తనకు డబ్బులు ఇవ్వలేదు. దీంతో వాటిని వారి దగ్గరనే డిపాజిట్‌ చేసింది. డిపాజిట్‌ చేసిన అనంతరం ప్రతీ నెల డబ్బులు చెల్లించాల్సి ఉండగా తను మూడు నెలలుగా చెల్లించక పోవడంతో చిట్స్‌ నిర్వాహకులు డిపాజిట్‌ క్యాన్సిల్‌ చేస్తున్నట్లు సమచారం ఇచ్చారు. దీంతో మనస్తాపం చెందిన పద్మ ఆందోళనకు దిగింది. చిట్‌ కొనసాగిస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో, ఆమె బకాయి ఉన్న డబ్బులు చెల్లించింది. ఇరువర్గాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.

బిజినెస్‌ గణేశా..

27/08/2016: కరీంనగర్‌ కల్చరల్‌ : బొజ్జ గణపయ్య పండుగొచ్చిందంటే పిల్లల సంబురం చెప్పలేం. ఆడపిల్లలు ఉదయం, సాయంత్రం పూజ కోసం పూలు కోయడం.. మగపిల్లలైతే పొద్దాంత వినాయకుడి మండపం వద్దే ఉండడం.. వృద్ధులైతే తొమ్మిది రోజులు అక్కడే కాలక్షేపం చేయడం కనిపిస్తుంటుంది. మరో పది రోజుల్లో కొలువుదీరనున్న వినాయకుడి విగ్రహాల తయారీదారుల చేతుల్లో తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయి. ఆరు నెలల ముందుగానే ఇక్కడికి వచ్చిన రాజస్థాన్‌కు చెందిన తయారీదారులు విగ్రహాలను చూడముచ్చటగా తయారు చేస్తున్నారు. ఆరు నెలలుగా.. కరీంనగర్‌లోని పలు తయారీకేంద్రాల్లో వినాయక విగ్రహాలు ఇప్పటికే అమ్ముడుపోయాయి. వాటికి తయారీదారులు తుదిమెరుగులు దిద్దుతున్నారు. జ్యోతినగర్‌ శివ థియేటర్, రేకుర్తి ప్రాంతాల్లో నాలుగు నెలల నుంచే రాజస్థాన్‌కు చెందిన కుటుంబాలు భారీ విగ్రహాలను తయారు చేసే పనిలో పడ్డాయి. పండుగ దగ్గర పడుతుండడంతో విగ్రహాల తయారీ ఊపందుకుంది. జిల్లా వ్యాప్తంగా ఏటా దాదాపు 3 వేల విగ్రహాలకు పైగా ప్రతిష్ఠించనున్నారు. ఈ ఏడాది మరిన్ని ఎక్కువ విగ్రహాలు నెలకొల్పుతారని తయారీదారులు భావిస్తున్నారు. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, గోదావరిఖని, సిరిసిల్ల, హుజూరాబాద్, కరీంనగర్, తదితర ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. హైదరాబాద్, నిజామాబాద్‌ ప్రాంతాల నుంచి సైతం గణపయ్య విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు నిర్వాహకులు. నగరంలో ఒక్కో విగ్రహం రూ.6వేలు నుంచి రూ.20వేల వరకు పలుకుతున్నాయి. రూ.33లక్షల వ్యాపారం నగరంలో దాదాపుగా సాధారణ సైజ్‌ నుంచి భారీ స్థాయి విగ్రహాలు దాదాపు 225 వరకు ప్రతిష్ఠించనున్నారు. ఒక్కో విగ్రహానికి రూ.15వేల చొప్పున లెక్కలు వేసుకున్న రూ.33లక్షలు విగ్రహాలతో వ్యాపారం జరుగుతుంది. ఇవి కాకుండా గల్లీల్లో, ఇళ్లల్లో పెట్టే విగ్రహాల వ్యాపారం అదనం. తయారీదారులు పండుగకు ఆరు నెలల ముందుగానే నగరానికి చేరుకుని విగ్రహాల తయారీ పనులు మెుదలు పెడుతుంటారు. అన్ని విగ్రహాలు అమ్ముడుపోతే ఒక్కో విగ్రహంపై రూ.4వేల వరకు లాభం వస్తుందని తయారీదారులు తెలిపారు. ఏమైన విగ్రహాలు మిగిలితే మాత్రం ఏమి మిగలదని పేర్కొన్నారు.

తాడిచర్లలో బొగ్గు వెలికితీతకు కసరత్తు

27/08/2016: మంథని : తాడిచర్లలో బొగ్గుగనులకు అటవీ, పర్యావరణ అనుమతులు రావడంతో జెన్‌కో సంస్థ బొగ్గు వెలికి తీసే ప్రక్రియ ప్రారంభించింది. ఇందుకోసం అవసరమైన సాంకేతిక కసరత్తు మెుదలు పెట్టింది. ఇందు కోసం ఇప్పటికే టెండర్లు ఆహ్వానించగా మూడు కంపెనీలు బిడ్‌ దాఖలు చేసినట్లు తెలిసింది. అయితే నిర్వాసితులకు ఇంకా పరిహారం చెల్లించకపోవడం ప్రాజెక్ట్‌ పనుల ప్రారంభానికి ఆటకంగా మారింది. అటవీ, పర్యావరణ అనుమతుల కోసం 11 ఏళ్లు వేచిచూసిన జెన్‌కో అవి క్లీయరెన్స్‌ ఇవ్వడంతో పనుల వేగం పెంచింది. ఆరు నెలల్లో బొగ్గు ఉత్పత్తి చేసేందుకు వేగంగా పనులు చేపడుతోంది. భూసేకరణకే అడ్డంకి.. వరంగల్‌ జిల్లా భూపాలపల్లి సమీపంలోని చెల్పూరు–2 విద్యుత్‌ ప్లాంటుకు అవసరమైన బొగ్గును సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2005లో కరీంనగర్‌ జిల్లా మంథని డివిజన్‌లోని మల్హర్‌ మండలం తాడిచర్లలో బొగ్గుగనుల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. తాడిచర్లలోని 1, 2 బ్లాక్‌లను జెన్‌కోకు కేటాయించి బొగ్గు తీసుకోవాల్సిందిగా సూచించింది. భూసేకరణ మొదలుకుని బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు జెన్‌కో సుమారు రూ.500 కోట్లు ఈ ప్రాజెక్టుకు వెచ్చించనుంది. ఈ ప్రాజెక్టుల్లో ఉత్పత్తి అయ్యే బొగ్గును సింగరేణి సంస్థ ఇతర అవసరాలకు వినియోగించకుండా జెన్‌కోకే సరఫరా చేయాలి. మొదటి బ్లాక్‌లో 76.77 మిలియన్ల బొగ్గు ఉంది. ఏ గ్రేడ్‌ బొగ్గు అతితక్కువ లోతులో లభిస్తుండటంతో జెన్‌కో ఈ ప్రాజెక్టుపై ఎక్కువగా ఆసక్తి చూపుతుంది. 2006లో భూసేకరణ చేపట్టగా తాడిచర్ల–1 ప్రాజెక్టుకు 2,182 ఎకరాల భూమి అవసరం కావడంతో ఇందులో పట్టాదారులను గుర్తించి 752.33 ఎకరాల పట్టా భూములకు రూ.3.80 లక్షల చొప్పున రూ.32.07 కోట్లను నిర్వాసితులకు అందజేశారు. అయితే మిగతా 1,434 ఎకరాలు అసైన్డ్‌ భూమితోపాటు 400 ఎకరాలు అటవీ భూమి, 798 ఎకరాల అసైన్డ్‌ భూమికి రూ.33.83 కోట్లు విడుదల చేసి మరో 636 ఎకరాలను పెండింగ్‌లో పెట్టింది. అసైన్డ్‌ మిగులు భూములకు పరిహారం రాకపోవడంతో నిర్వాసితులు బొగ్గు గనుల తవ్వకాలను అడ్డుకుంటున్నారు. 2010లో పట్టా భూములకు పరిహారం చెల్లించిన అధికారులు 2013లో అసైన్డ్‌ భూములకు చెల్లింపులు చేశారు. తాడిచర్ల, కాపురం గ్రామాల్లో 1008 గృహలకు పరిహారం చెల్లించాల్సి ఉంది. ఇళ్ల ప్రతిపాదనలో అధికారులు ఇష్టం వచ్చిన రీతిలో సర్వే చేశారని, గెజిట్‌లో దొర్లిన తప్పులను సవరించాలని భూసేకరణ అధికారికి నిర్వాసితులు పెట్టుకున్న అర్జీలకు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రజాభిప్రాయ సేకరణలో ఇచ్చిన హామీల మేరకు డేంజర్‌ జోన్‌లో ఉన్న 1100 ఇళ్లకు నష్టపరిహారం, అన్ని వసతులతో కూడిన పునరావాసం, ప్రాజెక్ట్‌కు అవతలివైపు ఉన్న 650 ఎకరాల భూమిని కూడా జెన్‌కో తీసుకోవడం, నిర్వాసిత నిరుద్యోగులకు ఉద్యోగం తదితర డిమాండ్లను నెరవేర్చాలని నిర్వాసితుల సంఘం డిమాండ్‌ చేస్తోంది. ఈ మేరకు ఉద్యమం కూడా చేస్తున్నారు. ఫిబ్రవరిలో టీఎస్‌ జెన్‌కో డైరెక్టర్‌ కేఆర్‌కే.రెడ్డి బృందం ప్రాజెక్ట్‌ ప్రతిపాదిత ప్రాంత పరిశీలన కోసం తాడిచెర్లకు రాగా నిర్వాసితులు తమ గోడును వెల్లబోసున్నారు. 90 శాతం ప్రక్రియ పూర్తయినా కేవలం భూసేకరణే బొగ్గు వెలికితీతకు అటంకం కలిగిస్తోంది.

‘ఆర్వీఎం’ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించిన సీఎం

27/08/2016: ములుగు: మెదక్ జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలోని ఆర్‌వీఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స అండ్ రీసెర్చ్ సెంటర్‌ను శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో కళాశాల నిర్వాహకులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ముందుగా కేసీఆర్ గణపతి విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం శిలాఫలకం ఆవిష్కరించారు. పలు ల్యాబ్‌లను పరిశీలించారు. అనంతరం ఎలాంటి ప్రసంగం చేయకుండా వెళ్లిపోయారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

సింగరేణిలో సమ్మె మేఘాలు - సెప్టెంబర్‌ 2న విజయవంతం చేసేందుకు సంఘాల ప్రయత్నం

26/08/2016: కరీంనగర్(గోదావరిఖని) : సింగరేణిలో చాలా రోజుల తర్వాత ఒక రోజు సమ్మె జరగనున్నది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు తోడు బొగ్గు పరిశ్రమలో ఎదరవుతున్న సమస్యల పరిష్కారం కోసం జాతీయ కార్మిక సంఘాలు సెప్టెంబర్‌ 2న సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆగస్టు 8న జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్, బీఎంఎస్‌ సంఘాలతో పాటు ప్రాంతీయ సంఘాలైన టీఎన్‌టీయూసీ, ఇప్టూలోని రెండు వర్గాల నాయకులు హైదరాబాద్‌లో సీఎండీకి సమ్మె నోటీస్‌ను అందజేశారు. కాగా సింగరేణిలో ప్రధాన సమస్యలైన వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని, 10వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేసి సత్వరమే ఒప్పందం పూర్తి చేయాలని, సింగరేణి లాభాలపై 30 శాతం స్పెషల్‌ ఇన్సెంటివ్‌ను వెంటనే చెల్లించాలని, ప్రభుత్వరంగ సంస్థల వాటాల ఉపసంహరణను నిలిపివేయాలని కార్మిక సంఘాలు సమ్మె నోటీసులో పేర్కొన్నాయి. నిత్యావసర ధరలను నియంత్రించాలని, కార్మిక చట్టాలను మార్చాలని, పెన్షన్‌ 40 శాతం పెంచాలని, గ్రాట్యూటీపై సీలింగ్‌ను ఎత్తివేయాలని, కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేయాలని, డిస్మిస్‌ కార్మికులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, సింగరేణిలో ఐదు గనులలో బొగ్గును వెలికితీసేందుకు ప్రైవేటు కంపెనీలను ఆహ్వానించే గ్లోబల్‌ టెండర్లను రద్దు చేసి వాటిని సింగరేణి నిర్వహించాలని, 1997 నుండి 2001 వరకు వీఆర్‌ఎస్‌ తీసుకున్న వారి పిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని సమ్మె డిమాండ్లలో పొందుపర్చారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, జేబీసీసీలో జరిగిన ఒప్పందం మేరకు హైపవర్‌ కమిటి వేతనాలు ఇవ్వాలని, మహిళా కార్మికులకు ప్రత్యేక వీఆర్‌ఎస్‌ను అమలు చేయాలన్నారు. సింగరేణిలో సకల జనుల సమ్మెలో పాల్గొన్న అత్యవసర సిబ్బందికి కూడా సమ్మె వేతనాలు చెల్లించాలని కూడా నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. గనులపై సమావేశాలు నిర్వహించి సెప్టెంబర్‌ 2న జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో గని కార్మికులు పాల్గొనాలని కోరేందుకు జాతీయ, ప్రాంతీయ కార్మిక సంఘాల నాయకులు సిద్ధమవుతున్నారు. సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకెఎస్‌ కూడా సెప్టెంబర్‌ 2 సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమ్మె వల్ల సింగరేణిలో దాదాపు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతుందని, ఈ విషయంలో కార్మిక సంఘాలు, కార్మికులు ఆలోచించాలని యాజమాన్యం కోరుతుండడం గమనార్హం.

స్వచ్చభారత్‌ చాంపియన్‌లో కలెక్టర్‌

26/08/2016: కరీంనగర్(ముకరంపుర) : స్వచ్చభారత్‌లో భాగంగా మరుగుదోడ్ల నిర్మాణంలో విశేషకృషి చేసిన కలెక్టర్లకు గురువారం ఢిల్లీలో జరిగిన స్వచ్చభారత్‌ చాంపియన్‌కు ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 20 మంది కలెక్టర్లకు ఆహ్వానం అందగా అందులో తెలంగాణ నుంచి జిల్లా కలెక్టర్‌ నీతూప్రసాద్‌ ఉన్నారు. మరుగుదోడ్ల నిర్మాణం ప్రగతి సాధనలో కలెక్టర్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. జిల్లాలో డిసెంబర్‌ 31లోగా స్వచ్చ కరీంనగర్‌ డిక్లేర్‌ చేసేందుకు కలెక్టర్‌ కృషి చేసేందుకు ముందుకు పోతున్నారు.

ఆహారభద్రత కార్డులొచ్చాయ్‌ - జిల్లాకు చేరిన 10.72 లక్షల కార్డులు తహసీల్దార్‌ కార్యాలయాలకు సీల్డ్‌బాక్సులు - పంపిణీకి విడుదల కాని మార్గదర్శకాలు - మరోసారి పరిశీలన తర్వాతే పంపిణీ

26/08/2016: కరీంనగర్(ముకరంపుర) : ఎట్టకేలకు ఆహారభద్రత కార్డులు జిల్లాకు వచ్చేశాయి. 121 సీల్డ్‌బాక్సుల్లో 10.72 లక్షల కార్డులు గురువారం జిల్లాకు చేరాయి. పౌరసరఫరాల శాఖ ద్వారా వీటిని ఆయా మండలాల తహసీల్దార్‌ కార్యాలయాలకు పంపిణీ చేయనున్నారు. కమిషనరేట్‌ నుంచి మార్గదర్శకాలు విడుదలైన తర్వాత సీల్డ్‌బాక్సులను తెరిచి మరోసారి కార్డులను పరిశీలన అనంతరం వాటిని గ్రామాల్లో పంపిణీ చేయనున్నామని డీఎస్‌వో నాగేశ్వర్‌రావు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో జారీ అయిన రేషన్‌కార్డుల స్థానంలో తెలంగాణ ప్రభుత్వం ఆహారభద్రత కార్డులను జారీ చేసినప్పటికీ ఇప్పటివరకు మీ–సేవలో ముద్రించిన కూపన్‌తోనే సరిపెట్టారు. ఆధార్‌ అనుసంధానం, ఆన్‌లైన్‌లో నమోదు, కార్డుల ముద్రణ వంటి కారణాలతో గత రెండేళ్లుగా కొత్త కార్డుల పంపిణీలో జాప్యం జరిగింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోగో, సీఎం కేసీఆర్‌ ఫొటోతో కార్డులను ముద్రించారు. వాటిని సీల్డ్‌బాక్సుల్లో పంపించడంతో కార్డుల నమూనా బయటికి తెలియడంలేదు. 10.72లక్షల కార్డులు.. గతంలో జిల్లాలో అన్ని రకాల కార్డులు కలిపి 10,93,674 ఉన్నాయి. ఇందులో ఆహారభద్రత కార్డులు 10,25,692, అంత్యోదయ కార్డులు 67,317, అన్నపూర్ణ కార్డులు 665. సింగిల్‌ కార్డులను ఒకే కుటుంబంలో మిళితం చేయడంతో 21,674 కార్డులు తగ్గాయి. బోగస్‌కార్డులు, మరణించిన వారి కార్డులు ఏరివేశారు. దీంతో తాజాగా కార్డుల సంఖ్య 10,72,000లకు చేరింది. ఈ కార్డులను ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ముద్రించి సీల్డ్‌బాక్సుల్లో జిల్లాకు పంపించారు. ఆహారభద్రత కార్డులు రేషన్‌ సరకులకు మాత్రమే ఉపయోగపడుతాయని ప్రభుత్వం ప్రకటించింది. సంక్షేమ పథకాలతో ఆహారభద్రత కార్డుకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే స్పష్టం చేసింది. జిల్లాలో 38 లక్షల జనాభా ఉండగా.. 31,50,935 మంది ఆహారభద్రత కార్డులతో లబ్ధిపొందనున్నారు. కొత్త జిల్లాలో సంబంధం లేకుండానే... ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కరీంనగర్‌ జిల్లా మూడు జిల్లాలుగా మారుతోంది. కరీంనగర్‌తోపాటు కొత్తగా జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కార్డుల జారీకి జిల్లాల విభజనకు సంబంధం లేదంటూ రాష్ట్ర కమిషనరేట్‌ కార్యాలయం తేల్చిందని జిల్లా అధికారులు చెబుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మరోసారి కొత్త కార్డులు ముద్రించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పాత కార్డులు 10,93,674 తొలగించినవి 21,674 కొత్త కార్డులు 10,72,000 ఆహారభద్రత 10,25,692 అంత్యోదయ 67,317 అన్నపూర్ణ 665

ఆందోళనలు ఉధృతం - సిరిసిల్ల జిల్లా, కోరుట్ల డివిజన్‌ కోసం కొనసాగుతున్న పోరు

26/08/2016: కోరుట్ల/సిరిసిల్ల : కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా, సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలని కోరుతూ కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళనలు ఉధతమయ్యాయి. కోరుట్లలో జాతీయ రహదారి దిగ్బంధం సందర్భంగా బుధవారం ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని నిరసిస్తూ గురువారం పట్టణ బంద్‌ నిర్వహించారు. వ్యాపార, వ్యాణిజ్య సంస్థలు, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలు బంద్‌ పాటించి కోరుట్ల డివిజన్‌ కోసం సంఘీభావం ప్రకటించాయి. కోరుట్ల డిపో ఆర్టీసీ బస్సులు నడవలేదు. గురువారం పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం జగిత్యాల డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌ కోరుట్లలో పరిస్థితిని సమీక్షించి నిరసన కార్యక్రమాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని అనవసరమైన ఆందోళనకు దిగవద్దని సూచించారు. ఆగని నిరసనలు.. డివిజన్‌ సాధన సమితి అ«ధ్వర్యంలో జాతీయ రహదారిపై కష్ణాలయం వద్ద మహిళలు రాస్తరోకో నిర్వహించి బతుకమ్మలు ఆడారు. సుమారు గంట సేపు బస్సులు, ఇతర వాహనాలు రాకపోకలు నిలిపోయాయి. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరిన మహిళలు పాత మున్సిపల్‌ కార్యాలయం వద్ద మరోసారి ఆందోళనకు దిగారు. టీడీపీ అధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించి బస్టాండ్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల ముఖచిత్రంతో ఉన్న మాస్క్‌లు ధరించిన కొందరు చెప్పులతో కొట్టుకుని నిరసనలు తెలిపారు. వంటావార్పు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనం పాల్గొన్నారు. సిరిసిల్లలో కాగడాల ప్రదర్శన సిరిసిల్ల జిల్లా కోసం జేఏసీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి కాగడాల ప్రదర్శన నిర్వహించారు. కొత్త బస్టాండు నుంచి అంబేద్కర్‌ విగ్రహం మీదుగా నేతన్న చౌక్‌ వరకు కాగడాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలని అఖిలపక్షం, జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల జిల్లాను ప్రకటించేలా చూడాలని అఖిలపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. జిల్లా సాధించే దాకా పోరాటం సాగిస్తామని ప్రకటించారు. కోర్టు సమీపంలో మంత్రి కేటీఆర్‌ ఫ్లెక్సీని దహనం చేసేందుకు రాగుల రాములు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు జేఏసీ నాయకులకు వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ.. జేఏసీ నాయకులు నేతన్న విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. పోలీస్‌ జులుం నశించాలంటూ నినాదాలు చేశారు. సిరిసిల్ల సీఐని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సిరిసిల్లలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు తీరుపై జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న కాగడాల ప్రదర్శనను పోలీసులు విచ్ఛిన్నం చేసేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. రాత్రి వరకు రాస్తారోకో కొనసాగింది. కేటీఆర్‌ సిరిసిల్ల ద్రోహిగా మారొద్దు – ఓయూ జేఏసీ నేత దరువు ఎల్లన్న మంత్రి కె.తారకరామారావు సిరిసిల్ల ద్రోహిగా మారొద్దని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత దరువు ఎల్లన్న కోరారు. సిరిసిల్లలో గురువారం రాస్తారోకో, ప్రదర్శన నిర్వహించారు. అన్ని అర్హతలు ఉన్న సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరారు. అందరు ఐఖ్యంగా ఉద్యమిస్తే సాధ్యమవుతుందన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను గుర్తించి, ఆత్మగౌరవాన్ని కాపాడాలన్నారు. కాంగ్రెస్‌ నాయకులు కేకే.మహేందర్‌రెడ్డి, జేఏసీ నాయకులు రమాకాంత్‌రావు, కత్తెర దేవదాస్, ఆడెపు రవీందర్, మహేశ్‌గౌడ్, రాగుల రాములు, బుస్సా వేణు, యాదగిరి, సిరిసిల్ల జిల్లా సాధన సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లారీలతో ర్యాలీ నిర్వహించారు.

పొర్కలపల్లి MPPS లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

25/08/2016: వరంగల్(వెంకటాపూర్), సలాం తెలంగాణ: వరంగల్ జిల్లా వెంకటాపూర్ మండలం పొర్కలపల్లి లోని MPPS లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంతో పాల్గొని వేడుకలని విజయవంతం చేసారని ఉపాధ్యాయుడు సురేష్ తెలిపారు.

చిట్యాలలో రోడ్డు ప్రమాదం - స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణీకులు

25/08/2016: నల్గొండ(చిట్యాల), సలాం తెలంగాణ: నల్గొండ జిల్లా చిట్యాలలో రోడ్ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయానీకులకి ఎలాంటి ప్రాణ హాని కలుగలేదు, వారు స్వల్ప గాయాలతో బయట పడ్డారు.

జగిత్యాలలో పేకాట రాయుళ్ళ అరెస్ట్

25/08/2016: కరీంనగర్(జగిత్యాల), సలాం తెలంగాణ: జగిత్యాల పట్టణంలోని గోత్రాల కాలనీలో పేకాట ఆడుతున్న 7 గురిని పట్టుకొని, వారి నుండి 39,000/- రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ఈ రోజు వారిపై కేసు నమోదు చేసి కోర్టు నందు హాజరు పరిచారు. ఈ టాస్క్ లో సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ (S.I.) తో పాటు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ లు సుమన్, అనిల్ లు పాల్గొన్నారు.

కృష్ణాష్టమి జరుపుకున్న శాంతినికేతన్ విద్యార్థులు

24/08/2016: మహబూబ్ నగర్(కల్వకుర్తి), సలాం తెలంగాణ: కల్వకుర్తి పట్టణంలోని శాంతినికేతన్ స్కూల్ చిన్నారులు నేడు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులు గోపికలు, శ్రీకృష్ణుల వేషధారణలో అందరిని అలరించి వెన్నముద్ద కోసం ఉట్టికుండను పగులగొట్టి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమములో స్కూల్ ప్రిన్సిపాల్ K. భీమేశ్వర్, కౌన్సిలర్ సుజాత, రాములు, పాఠశాల సిబ్బంది, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

పంజుగుల గ్రామంలో కరువుతో రైతన్నల గోస – ప్రభుత్వ స్పందనకై రైతుల ఎదురుచూపు

23/08/2016: మహబూబ్ నగర్(కల్వకుర్తి), సలాం తెలంగాణ: మహబూబ్ నగర్ జిల్లా, కల్వకుర్తి మండలం పంజుగుల గ్రామంలో తీవ్రమైన కరువుతో రైతన్నలు అతలాకుతలం అవుతున్నారు. ఇక్కడి రైతులు ప్రభుత్వం యొక్క స్పందన కోసం, అలాగే రైతులను ఆదుకొని, వారికి భరోసా కల్పించాలని వారు కోరుకుంటున్నారు.

భగ్గుమన్న కోరుట్ల! - రాస్తారోకోలు..నిరసన ర్యాలీలు

23/08/2016: కోరుట్ల : మెట్‌పల్లిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించడంతో కోరుట్లలో నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. సోమవారం ఉదయం నుంచే డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌లో మార్పులు జరుగుతున్నాయని మెట్‌పల్లి రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే మధ్యాహ్నం 2 గంటల సమయంలో మెట్‌పల్లి రెవెన్యూ డివిజన్‌గా మారినట్లు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దీంతో కోరుట్ల డివిజన్‌ సాధన సమితి అధ్యక్ష, కార్యదర్శులు చెన్న విశ్వనాథం, పేట భాస్కర్, ప్రతినిధులు జక్కుల ప్రసాద్, ముల్క ప్రసాద్, వాసాల గణేష్, సనావొద్దీన్‌ తదితరులు ర్యాలీగా బయలుదేరి కొత్త బస్టాండ్‌ వద్ద రాస్తరోకో చేశారు. అనంతరం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరి నిముషంలో ఎమ్మెల్యే, ఎంపీ కోరుట్లకు అన్యాయం చేశారని ఆరోపించారు. అఖిలపక్షం మద్దతు మెట్‌పల్లిని రెవెన్యూ డివిజన్‌గా మార్చుతూ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ కోరుట్ల టీడీపీ అధ్యక్షుడు మానుక ప్రవీణ్, కార్యదర్శులు జిల్లా ధనుంజయ్, తోట నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. కోరుట్లకు అన్యాయం చేస్తే సహించబోమన్నారు. వైస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు నేతి శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. స్వార్థ రాజకీయాలు కోరుట్ల రెవెన్యూ డివిజన్‌కు అడ్డుతగిలాయన్నారు. కాంగ్రెస్‌ పట్టణాధ్యక్షుడు వెగ్యారపు మురళి, నాయకులు అక్బర్, కలాల భూంసాయిలు మాట్లాడుతూ, కోరుట్ల రెవెన్యూ డివిజన్‌పై నాయకుల వివక్ష తగదన్నారు. కోరుట్ల–మెట్‌పల్లిని కలిపి జిల్లా కేంద్రంగా మార్చాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ పట్టణాధ్యక్షులు సదుబత్తుల వేణు, ఇందూరి తిరుమలవాసు మాట్లాడుతూ కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించే వరకు ఆందోళన నిర్వహిస్తామన్నారు. 48 గంటలు బంద్‌ మెట్‌పల్లి రెవెన్యూ డివిజన్‌గా మార్చడాన్ని నిరసిస్తూ 48 గంటల కోరుట్ల బంద్‌కు సాధన సమితి పిలుపునిచ్చింది. కోరుట్ల పట్టణంలోని కిరాణ వర్తక సంఘం, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలల సంఘం ప్రతినిధులు బంద్‌కు సహకరించనున్నట్లు ప్రకటించారు. అమరణ దీక్ష.. తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం నాయకులు వాసం భూమానందం డివిజన్‌ ఏర్పాటులో కోరుట్లకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ అమరణ దీక్షకు దిగారు. ఈ దీక్షను డివిజన్‌ సాధన సమితి ప్రతినిధులు చెన్న విశ్వనాథం , పేట భాస్కర్, వాసాల గణేశ్, మున్సిపల్‌ వైస్‌ ౖచెర్మన్‌ రఫీయోద్దీన్, బీజేపీ మున్సిపల్‌ ప్లోర్‌ లీడర్‌ ఇందూరి సత్యం ప్రారంభించి మద్దతు ప్రకటించారు. వైస్‌ చైర్మన్‌..బీజేపి ఫ్లోర్‌లీడర్ల రాజీనామా కోరుట్లకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కోరుట్ల మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రఫీయోద్దీన్, బీజేపీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఇందూరి సత్యం తమ పదవులకు రాజీనామా ప్రకటించారు. ఈ సందర్భంగా సాధన సమితి ప్రతినిధులు మున్సిపల్‌ చైర్మన్‌తోపాటు పాలకవర్గ సభ్యులు రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఓ దశలో సంఘీబావం తెలిపేందుకు వచ్చిన మున్సిపల్‌ చైర్మన్‌ శీలం వేణు కారును అడ్డుకున్నారు.

ఉత్కంఠకు తెర - మూడుగా చీలుతున్న ఆదిలాబాద్ జిల్లా - డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం

23/08/2016: మంచిర్యాల: ఏళ్ల ఉత్కంఠకు తెరపడింది. కొత్త జిల్లాలు.. రెవెన్యూ డివిజన్లు.. మండలాల ఏర్పాటుపై స్పష్టత వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా.. ఎట్టకేలకు మూడుగా చీలనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి టి-సర్కార్ సోమవారం ముసాయిదాను జారీ చేసింది. పాలన సౌలభ్యం... అన్ని రంగాల అభివృద్ధి కోసం కొత్త జిల్లాలు ఏర్పాటుకు సంబంధించి.. అధికారులు, ప్రజాప్రతినిధులతో సుదీర్ఘంగా నిర్వహించిన సమీక్షలు.. సమావేశాలు.. చర్చలతో పాటు క్షేత్రస్థాయిలో అధికారులిచ్చిన ప్రతిపాదనలు.. ప్రజల డిమాండ్లను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం కొత్తగా.. కొమురంభీమ్, నిర్మల్ జిల్లాలను ఖరారు చేసింది. దీంతో ముచ్చటగా మూడు జిల్లాలు ఏర్పడనున్నారుు. పెద్ద జిల్లాగా కొమురంభీమ్ కొమురంభీమ్ (మంచిర్యాల) జిల్లా.. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల క ంటే ఎక్కువ రెవెన్యూ డివిజన్లు.. మండలాలు కలిగిన జిల్లాగా అవతరించనుంది. మొత్తం 25 మండలాలతో కొత్త జిల్లాగా ఏర్పడనుంది. ప్రస్తుతమున్న మంచిర్యాల, ఆసిఫాబాద్ డివిజన్లతో పాటు కొత్తగా ఏర్పడిన బెల్లంపల్లి కూడా కొమురంభీమ్ పరిధిలోనిదే. ఇప్పటి వరకు మొత్తం 52 మండలాలతో ఉన్న ఆదిలాబాద్ జిల్లా 16 మండలాలకే పరిమితమైంది. ప్రస్తుతం మొత్తం ఐదు రెవెన్యూ డివిజన్లతో కూడిన ఈ జిల్లా కేవలం ఆదిలాబాద్, ఉట్నూరు రెవెన్యూ డివిజన్లతోనే సరిపెట్టుకోనుంది. ఇక.. అనూహ్యంగా తెరపైకొచ్చి కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లా.. కేవలం 13 మండలాలు కలిగిన చిన్న జిల్లాగా అవతరించనుంది. ప్రస్తుతమున్న నిర్మల్ రెవెన్యూ డివిజన్‌తో పాటు కొత్తగా ఏర్పడిన భైంసా రెవెన్యూ డివిజన్ కూడా ఈ జిల్లా పరిధిలో ఉంది. కొత్త మండలాలు రెండే.. జిల్లాల పునర్విభజనలో భాగంగా.. కొత్త మండలాల ఏర్పాటుపై ఉన్న ఉత్కంఠకూ తెరపడింది. పశ్చిమ ప్రాంత పరిధిలోని ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మావల మేజర్ గ్రామ పంచాయతీని కొత్త మండలంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ‘తూర్పు’లో ఉన్న మంచిర్యాల మండల పరిధిలోని నస్పూర్ మేజర్ గ్రామ పంచాయతీని కొత్త మండలంగా చేస్తూ ముసాయిదా విడుదల చేసింది. ఆదిలాబాద్ మండల పరిధిలో ఉన్న 45 గ్రామాల్లో.. మావల (9633), బట్టిసావర్‌గావ్ (7172), వాగాపూర్ (1407), దస్నాపూర్(22,216) నాలుగు గ్రామాలను వేరు చేసి మొత్తం 40,428 జనాభాతో ‘మావల’ మండలం ఏర్పాటు చేయనుంది. అలాగే.. 28 పంచాయతీలున్న మంచిర్యాల మండలం నుంచి 31,244 జనాభా ఉన్న నస్పూర్ , సింగాపూర్ (20,061), తీగల్‌పహాడ్ (12,656) తాళ్లపల్లి (9,656), సీతారాంపల్లి (3,024) గ్రామాలతో కొత్తగా నస్పూర్ మండలం ఏర్పాటు కానుంది. ఈ ఐదు గ్రామాల జనాభా 76,641. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు బెజ్జూర్ మండల పరిధిలో ఉన్న పెంచికల్‌పేట, నిర్మల్ మండల పరిధిలోని సోన్, మంచిర్యాల మండల పరిధిలోని హాజీపూర్ గ్రామ పంచాయతీలనూ మండలాలుగా చేయాలన్న డిమాండ్.. అధికారుల ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరిన విషయం తెలిసిందే. కానీ జిల్లాలో కేవలం రెండు మండలాలు మాత్రమే ఏర్పాటు కానుండడంతో మిగిలిన మండలాల ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. కాగా.. నిర్మల్ మండల పరిధిలోని సోన్‌నూ కొత్త మండలంగా చేయాలని సీఎం కేసీఆర్‌కు నిర్మల్ ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ మంత్రి ఐకే రెడ్డి చేసిన విన్నపం నెరవేరలేదు. అన్నీ పరిగణలోకి తీసుకుని.. ముందు ఇచ్చిన హామి మేరకు.. మంచిర్యాలను కొమురంభీమ్ పేరుతో జిల్లాగా ఏర్పాటు చేసి.. తర్వాత తెరపైకొచ్చిన నిర్మల్ జిల్లా డిమాండ్‌నూ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. నిర్మల్‌నూ జిల్లాగా మారుస్తూ.. కొన్నాళ్లుగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరదించింది. ఆదిలాబాద్ జిల్లాను 16 మండలాలతో పరిమితం చేయగా.. 25 మండలాలతో కొమురంభీమ్.. 13 మండలాలతో నిర్మల్ జిల్లాను ప్రకటించింది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పరిధిల్లో రెండు చొప్పున రెవెన్యూ డివిజన్లు రాగా.. కొమురం భీం జిల్లా కింద మూడు డివిజన్లు రానున్నాయి. జిల్లాలతో పాటు కొత్తగా బెల్లంపల్లి, భైంసానూ రెవిన్యూ డివిజన్లుగా చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో పాటు తూర్పు ప్రాంత పరిధిలోని నస్పూర్, పశ్చిమ ప్రాంతంలోని మావల గ్రామ పంచాయతీలను మండలాలుగా ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

మంచిర్యాలలో జిల్లా ఏర్పాటు సంబురాలు - హాజరైన ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, కోనప్ప

23/08/2016: మంచిర్యాల టౌన్ : జిల్లా కేంద్రానికి 200ల కిలోమీటర్లకు పైగా దూరం ఉండి, సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడ్డ తూర్పు జిల్లా ప్రజల మంచిర్యాల జిల్లా కల నెరవేరుతోందని ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు అన్నారు. తెలంగాణలో నూతన జిల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేయడంపై మంచిర్యాలలో సంబురాలు అంబరాన్నంటాయి. సోమవారం ఉదయం 10 గంటల నుంచే మంచిర్యాల ఐబీ చౌరస్తాలో సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు, సంఘాలు, ప్రజానాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక మంచిర్యాల పట్టణంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అన్ని వర్గాల ప్రజలు, సంస్థలు, పలు సంఘాలు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ర్యాలీ నిర్వహించారో, అదే రీతిలో కొత్తగా ఏర్పడనున్న కొమురంభీం(మంచిర్యాల) జిల్లా ఏర్పాటు ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ సంబరాల శిబిరానికి ర్యాలీగా తరలివచ్చారు. నూతన జిల్లాకు మంచి జరగాలని పండితులు, ముస్లిం మత పెద్దలతో పూజలను నిర్వహించారు. సిర్పూర్(టి) ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ, ఇక ఇక్కడి ప్రజలకు దూర భారం తగ్గిందని, ఇదే పెద్ద ఆనందమని అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ, ఇక్కడి ప్రజల ఎన్నో ఏళ్ల ఆకాంక్ష నెరవేరినట్లేనని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో సీఎం కేసీఆర్‌కు ఎవరూ సాటిరారన్నారు. అనంతరం అక్కడే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మామిడిశెట్టి వసుంధర రమేశ్, జెడ్పీటీసీ రాచకొండ ఆశాలత, మమత సూపర్ బజార్ సొసైటీ చైర్మన్ యై తిరుపతి, కౌన్సిలర్లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.

కల్వకుర్తిలో నేడు బంద్ - MLA వంశీ చందర్ రెడ్డి, BJP నాయకుల అరెస్ట్

22/08/2016: మహబూబ్ నగర్(కల్వకుర్తి), సలాం తెలంగాణ: కల్వకుర్తి ని రెవెన్యూ డివిజన్ చేయాలని అన్ని పార్టీలు మద్దతు పలికి ఈరోజు కల్వకుర్తి బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. అలాగే ఇందులో భాగంగా పలువురు నాయకులు, MLA వంశీ చందర్ రెడ్డి, BJP నేతలు ధర్నా నిర్వహించారు. వెంటనే దాన్ని నివారించేందుకు పోలీస్ లు వారందరినీ అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

సీతమ్మ మంగళ సూత్రాలు మాయం - భద్రాద్రి ఆలయంలో బంగారు నిల్వలపై గందరగోళం

22/08/2016: భద్రాచలం : భద్రాచలం శ్రీసీతా రామచంద్రస్వామి వారి ఆలయం లో సీతమ్మవారి మంగళసూత్రాలు, లక్ష్మణస్వామి మెడలోని బంగారు లాకెట్ మాయమయ్యాయి. ఈ విషయాన్ని దేవస్థానం ఈవో రమేష్‌బాబు ధ్రువీకరించారు. ఆలయంలో 2 ఆభరణాలు మాయమైనట్లు శనివారం ప్రచారం జరగడం.. ఆ విషయాలు పత్రికల్లో రావడంతో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆలయంలోని ఆభరణాలు ఆలయ ప్రధానార్చకుల ఆధ్వర్యంలోని 11 మంది అర్చకుల బృందం పర్యవేక్షణలో ఉంటాయని ఈవో చెప్పారు. ఇందులో రెండు ఆభరణాలు కని పించలేదని అర్చకులు తన దృష్టికి తీసుకు రాగా వాటి లెక్క తేల్చాలని ఆదేశించి నట్లు చెప్పారు. అర్చకులు సోమవారం వరకు గడువు కోరినట్లు, వారు నివేదిక ఇచ్చాక.. తానూ స్వయంగా ఆభరణాలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అర్చకులపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, స్వామివారి ఉత్సవమూర్తులను అమెరికా వారికి అమ్మకానికి పెట్టడం, బంగారు తాపడం చేయించే విషయంలో తీవ్రమైన గోప్యత పాటించటంతో అప్పట్లో రేగిన దుమారం చర్చనీయాంశమైంది. తాజాగా ఆలయంలో ఆభరణాలు మాయం కావడం ఇక్కడి పాలన తీరును ఎత్తిచూపుతోంది. తాజా పరిణామాలతో భద్రతా ప్రమాణలపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

బస్సు ప్రమాదం దురదృష్టకరం: మంత్రి తుమ్మల

22/08/2016: ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద జరిగిన రోడ్డుప్రమాదంపై తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతివేగం, డ్రైవర్‌ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణాలుగా భావిస్తున్నామని చెప్పారు. ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్టు తెలిపారు. ఖమ్మం జిల్లా కలెక్టర్‌ లోకేశ్‌ కుమార్‌, ఖమ్మం ఎస్పీ దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కాగా, ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద ఆదివారం అర్థరాత్రి 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ మియాపూర్‌ నుంచి సూర్యపేట, ఖమ్మం మీదుగా రాజమండ్రి వయా కాకినాడకు వెళుతున్న ప్రైవేటుబస్సు నాయకన్‌ గూడెం వద్ద నాగార్జున సాగర్‌ (ఎన్ఎస్పీ) కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 9 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయాలయ్యాయి. బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. అతివేగంతో వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు నాయకన్‌ గూడెం రోడ్డు మలుపు వద్ద ఒక్కసారిగా కాల్వలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న రిస్య్కూ టీం, పోలీసు అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఘటనా స్థలిని పర్యవేక్షించిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కాల్వలో నాలుగు అడుగుల మేర నీళ్లు ఉండటంతో 2 క్రేన్‌ల సహాయంతో బస్సును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. మూడు 108 వాహనాలలో 18 మంది క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరొకొంతమందిని పాలేరు, నాయకన్‌గూడెం ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

'భద్రాద్రిలో నగల మాయంపై విచారణ చేపట్టాలి'

22/08/2016: హైదరాబాద్: భద్రాచలం శ్రీ సీతా రామచంద్రస్వామి వారి ఆలయం లో సీతమ్మవారి మంగళసూత్రాలు, లక్ష్మణస్వామి మెడలోని బంగారు లాకెట్ మాయమయ్యాయి. ఈ నగల అదృశ్యంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఘటనకు కారకులైన వారిపై కేసు నమోదు చేయాలయాన్నారు. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయమన్నారు. తాను ఈ విషయం మీద తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో మాట్లాడినట్లు తెలిపారు. వెంటనే ఈ అంశంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన తెలిపారు.

వెంకటాపూర్ లో మంత్రి చందూలాల్ 68వ జన్మదిన వేడుక

17/08/2016: వరంగల్(వెంకటాపూర్), సలాం తెలంగాణ: వెంకటాపూర్ మండలం లోని తెరాస పార్టీ కార్యాలయంలో మంత్రి చందూలాల్ 68వ జన్మదినం సందర్భంగా బుధవారం రోజున తెరాస జిల్లా కార్యదర్శి గుమ్మడి తిరుపతి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా గుమ్మడి తిరుపతి మాట్లాడుతూ చందూలాల్ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ పట్టు వదలని విక్రమార్కుడిగా ప్రజల్లో పేరు పొందుతూ కెసిఆర్ చేపట్టే సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లాలని, ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమములో సర్పంచ్ S. రాజమొగిలి, MPTC దగ్గు ప్రభాకర్ రావు, తెరాస నాయకులు అబ్బ గోపాల్ రెడ్డి, పేరుక కోటేశ్వర్ రావు, గడ్డ చిరంజీవి, జాటోతు జాగ్ రాం,దేవేందర్, ఊరుగొండ సుధాకర్, లింగాల రమణారెడ్డి, కారపెల్లి రమణారెడ్డి, పోశాల వీరమల్లు తదితరులు పాల్గొన్నారు.

నయీమ్.. నన్ను బెదిరించాడు

17/08/2016: ఆదిలాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ తనను ఎన్నోసార్లు బెదిరించాడంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నయీమ్ మనుషులు తన దగ్గరకు వచ్చి, పోటీ నుంచి తప్పుకోవాలంటూ హెచ్చరించారన్నారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన రైతు గర్జన బహిరంగ సభలో మాట్లాడుతూ కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే నయీమ్ బెదిరింపులకు తాను బెదరలేదన్నారు. నల్లగొండ జిల్లాలో 99 శాతం టీఆర్‌ఎస్ నాయకులకు నయీమ్‌తో సంబంధాలున్నాయని ఆయన ఆరోపించారు. నయీమ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌పై నమ్మకం లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ‘‘పోలీస్‌స్టేషన్లను, తహసీల్దార్ కార్యాలయాలను టీఆర్‌ఎస్ నేతలు తమ అధీనంలోకి తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన తుమ్మల నాగేశ్వర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి వారికి కేసీఆర్ పదవులు కట్టబెట్టారు. సీఎం చివరికి వయసు సరిపోతే తన మనవడికి కూడా ఎమ్మెల్సీ పదవిచ్చేలా ఉన్నారు. కాంగ్రెస్‌లో ఎన్ని గ్రూపులున్నా అంతా ఏకమై ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నాం’’ అని అన్నారు.

టీబీజీకేఎస్‌కు కొత్త నాయకత్వం..?

17/08/2016: కొత్తగూడెం (ఖమ్మం) : సింగరేణిలో ప్రస్తుతం గుర్తింపు సంఘంగా కొనసాగుతున్న టీబీజీకేఎస్‌ను మరోసారి గెలిపించేందుకు టీఆర్‌ఎస్ పార్టీ వ్యూహం రచిస్తోంది. ఈ మేరకు యూనియన్ నాయకత్వంలో భారీ మార్పులు చేపట్టి ఎన్నికలకు వెళ్లేందుకు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్‌లో కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి యూనియన్‌లో నాయకత్వ మార్పు చేయాలని పార్టీ అధిష్టానం చూస్తున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికల వేడి రాజుకుంటుంది. ఈ మేరకు ఆయా సంఘాలన్నీ బొగ్గు గని కార్మికులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. కాగా, ఇప్పటికే పిట్ మీటిం గ్‌లతో కార్మికుల సమస్యల పరిష్కారం, వారు సాధించిన హక్కులను కార్మికులకు పదే పదే తెలియజేస్తూ ఊదరగొడుతున్నారు. అయితే ప్రస్తుతం గుర్తింపు సంఘంగా కొనసాగుతున్న టీబీజీకేఎస్‌పై కార్మికవర్గం కొంతమేరకు అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో తిరిగి ఎన్నికల్లో దానిని విజయపథంలో నడిపించేందుకు నాయకత్వ మార్పు అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కార్మికుల సొమ్మును పక్కదారి పట్టించారని టీబీజీకేఎస్ అధ్యక్షుడు ఆకునూరి కనకరాజు, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డిపై ఆరోపణలు వచ్చారుు. కాగా, గతంలో కూడా వర్గపోరు కారణంగా అనేక కుమ్ములాటలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై చివరకు కోర్టు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అరుుతే గతంలో గుర్తింపు సంఘంగా గెలిచినప్పటికీ సుమారు ఏడాదిన్నరపాటు కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో టీబీజీకేఎస్ విఫలమైందనే విమర్శలు కూడా ఉన్నారుు. తెరపైకి కొత్త వ్యక్తులు..! టీబీజీకేఎస్‌లో ప్రస్తుతం నాయకత్వలోపం ఉందని భావిస్తున్న పార్టీ అధిష్టానం యూనియన్ నాయకత్వాన్ని కొత్త వ్యక్తులకు అప్ప గించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే టీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతూ ఐఎన్‌టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న వెంకట్రావును యూనియన్‌లోకి తీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే గత గుర్తింపు సంఘం ఎన్ని కల్లో యూనియన్‌ను గెలిపించేందుకు కృషి చేసిన కెంగెర్ల మల్లయ్యను కూడా తిరిగి యూనియన్‌లోకి ఆహ్వానించేందుకు సిద్ధమైనట్లు సమా చారం. వీరితోపాటు మరికొంత మంది ద్వితీయ శ్రేణి నాయకుల పేర్లను కూడా పరిశీలిస్తూ వారితో కొత్తగా కమిటీని నియమించాలని టీఆర్ ఎస్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయూన్ని యూనియన్ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవిత కూడా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి నాయకత్వ మార్పుపై చర్చించినట్లు తెలిసింది. కాగా, త్వరలో జరుగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ యూనియన్ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావును, ప్రధాన కార్యదర్శిగా కెంగెర్ల మల్లయ్యను, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆకునూరి కనకరాజును నిలబెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజిరెడ్డికి ఏ బాధ్యతలు అప్పగిస్తారనేది స్పష్టం కాలేదని సమాచారం. ఈ మేరకు యూనియన్‌లో కూడా ఈ విషయంపై జోరుగా చర్చ సాగుతోంది. రేపు ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ భేటీ...? సెప్టెంబర్ చివరి కల్లా గుర్తింపు సంఘం ఎన్నికలు పూర్తి చేసేందుకు సింగరేణి యాజమాన్యం కసరత్తు ప్రారంభిం చిన నేపథ్యంలో గురువారం సీఎం కేసీఆర్ కోల్‌బెల్ట్ వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలతో భేటీ కానున్నట్లు సమాచా రం. కాగా, ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కార్మికులకు కల్పించిన హక్కులు, లాభాల వాటా, సకలజనుల సమ్మె వేతనం, వివిధ పండుగల అడ్వాన్స్‌ల పెంపు తదితర అంశాలను ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. వీటిని కార్మికుల వద్దకు తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యూహరచన చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, కోల్‌బెల్ట్ ప్రాంతంలోని ఎమ్మెల్యేలను ప్రత్యక్షంగా రంగంలోకి దింపి ఆయా ప్రాంతాల్లోని కార్మికవర్గాన్ని ఆకర్షించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా గుర్తింపు సంఘం ఎన్నికల నాటికి టీబీజీకేఎస్‌లో నాయకత్వ మార్పు తప్పదని తెలుస్తోంది.

కల్వకుర్తి సబ్ జైలు లో రక్షా బంధనం కార్యక్రమము

17/08/2016: మహబూబ్ నగర్(కల్వకుర్తి), సలాం తెలంగాణ: కల్వకుర్తి శాంతినికేతన్ పాఠశాల చిన్నారులు కల్వకుర్తి మున్సిపల్ మేజిస్ట్రేట్ జడ్జ్ P. పద్మావతి గారికి రాఖీ కట్టి ఆమె ద్వారా సబ్ జైలు లోకి వెళ్ళడానికి అనుమతి తీసుకొని జైలు లో ఉన్న 25 మంది ఖైదీలకు కూడా రాఖీ కట్టారు ఈ చిన్నారులు.

శాంతినికేతన్ పాఠశాల విద్యార్థులతో రక్షా బంధనం

17/08/2016: మహబూబ్ నగర్ (కల్వకుర్తి), సలాం తెలంగాణ: కల్వకుర్తిలో గల శాంతినికేతన్ పాఠశాల LKG విద్యార్థులతో రాఖీ కట్టించుకుంటున్న సబ్ ఇన్స్పెక్టర్ జలందర్ రెడ్డి గారు.

కల్వకుర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షనిగా భాస్కర్ నాయక్

16/08/2016: మహబూబ్ నగర్(కల్వకుర్తి), సలాం తెలంగాణ: కల్వకుర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షనిగా నగరపంచాయతీ భగత్ సింగ్ తండాకు చెందిన కొడవత్ భాస్కర్ నాయక్ నియమితులయ్యారు. కల్వకుర్తి ఎమ్యెల్యే చల్ల వంశీ చంద్ రెడ్డి గారు కల్వకుర్తి లోని ఆర్.అండ్ బి అథితి గృహంలో నియామక పత్రం అందజేశారు. తన పై ఉంచిన భాద్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని భాస్కర్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షులు చెన్ రెడ్డి పవన్ కుమార్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రథినిది గంగాధర్,పట్టణ అధ్యక్షులు మిర్యాల శ్రీనివాస్ రెడ్డి ,యువజన కాంగ్రెస్ తాలూకా అధ్యక్షులు పుస్తకాల రాహుల్,కాంగ్రెస్ నాయకులు పురుషుత్తం గాంధీ,మొహమ్మద్ షాకీర్ ,దుర్గయ్య సాగర్, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ ఆరిఫ్ అలీ,నార్య నాయక్,రూప్ సింగ్,లాలూ నాయక్,శ్రీను నాయక్,రంజిత్ రెడ్డి,జహీర్ అజాం,కళ్యాణం వెంకటయ్య ,రాములు, బాల్ రాజ్ పాల్గొన్నారు.

పొర్కలపల్లిలో ఘనంగా జరిగిన స్వతంత్ర్య వేడుకలు

16/08/2016: వరంగల్(పొర్కలపల్లి), సలాం తెలంగాణ: వరంగల్ జిల్లా పొర్కలపల్లి MPPS లో ఘనంగా 70 వ, స్వాతంత్ర్య వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమములో పొర్కలపల్లి గ్రామ సర్పంచ్ K. నర్సింగం, వార్డు సభ్యులు లక్ష్మీ, T. శ్రీనివాస్, చైతన్య యూత్ క్లబ్ అధ్యక్షులు K. బ్రహ్మచారి, సభ్యులు, గ్రామ కమిటీ అధ్యక్షులు K. మధుకర్, అంగన్ వాడి కార్యకర్త S. రామ, ఉపాధ్యాయులు T. సురేష్, D. పూర్ణిమ, S. సందీప్, మహిళా మండలి సభ్యులు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలందరి సమక్షంలో ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ 1000 పిల్లర్స్ అయినటువంటి J. అంజి రెడ్డి, సురేష్, పాము శ్రీనివాస్ లు విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం నిమిత్తం స్టీల్ ప్లేట్లు ఇవ్వడం జరిగింది.

చనిపోయిన వ్యక్తి పేరిట బీమా - పదేళ్ల క్రితమే మృతిచెందిన పాలసీదారు

13/08/2016: చొప్పదండి : డబ్బు కోసం మనిషిని ఎంతటి కక్కుర్తికైనా ఒడిగడతాడనడానికి ఈ సంఘటన ఓ చక్కటి ఉదాహరణ. అక్రమంగా బీమా సొమ్ము పొందేందుకు ఓ వ్యక్తి పదేళ్ల క్రితమే చనిపోయిన తన అన్న పేరిట పాలసీ తీసుకుని బీమా సంస్థను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. చివరకు అడ్డంగా దొరికిపోయాడు. చొప్పదండి గ్రామ పంచాయతీ పరిధిలోని తొగిరిమామిడికుంట ప్రాంతానికి చెందిన ఇరుగురాల శంకరయ్య పదేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పుడు ఆయన వయస్సు 30 ఏళ్లు. ఇతడి సోదరుడు మల్లేశం డబ్బు కోసం శంకరయ్య పేరిట ఏడాది క్రితం ఓ ప్రయివేటు కంపెనీ బీమా పాలసీ తీసుకున్నాడు. రూ.5 లక్షల పాలసీ కోసం రూ.15 వేల ప్రీమియం చెల్లించాడు. గత మే నెలలో శంకరయ్య మృతి చెందినట్లు గ్రామ పంచాయతీ నుంచి తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం తీసుకున్నాడు. కొత్తగా వచ్చిన పంచాయతీ కార్యదర్శికి పూర్తి వివరాలు తెలియకపోవడంతో ఓ వ్యక్తి సాయంతో కార్యాలయ సిబ్బంది సహకారంతో పదేళ్ల క్రితం మృతి చెందిన వ్యక్తి మూడు నెలల క్రితమే మరణిచినట్లు మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. విచారణతో వెలుగులోకి.. బీమా కంపెనీలకు క్లెయిమ్‌లు చేసిన సమయంలో సదరు కంపెనీకి చెందిన అధికారి ఒకరు పాలసీదారు మృతిపై విచారణ జరుపుతారు. పాలసీ తీసుకున్న కంపెనీ ప్రతినిధి శుక్రవారం చొప్పదండికి వచ్చి మృతుడి వివరాలు ఆరా తీశారు. మృతుడి ఇంటి పరిసరాలలోని వారు శంకరయ్య పదేళ్ల క్రితమే చనిపోయినట్లు చెప్పడంతో విచారణ జరుపుతున్న ప్రతినిధికి అనుమానం వచ్చింది. వెంటనే స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి కార్యదర్శి వెంకట రాజశేఖర్‌ను మరణ ధ్రువీకరణ పత్రం జారీ గురించి ఆరా తీశాడు. ఆయన కార్యాలయంలోని ఫైళ్లు పరిశీలించగా పదేళ్ల క్రితమే చనిపోయినట్లు తేలింది. మల్లేశం తప్పుడు దరఖాస్తుతో తమ వద్ద మరణ ధ్రువీకరణ పత్రం పొందాడని, బీమా సంస్థను బురిడీ కొట్టించేందుకు ఎత్తులు వేశాడని గుర్తించారు. శంకరయ్య మృతిపై జారీ చేసిన ధ్రువీకరణ పత్రం రద్దు చేస్తున్నట్లు బీమా కంపెనీ ప్రతినిధికి లేఖ ఇవ్వడంతో ఆయన వెళ్లిపోయాడు. బీమా పాలసీ క్లెయిం కోసం తప్పుడు ధ్రువీకరణ పత్రం పొందడంలో సహకరించిన వారి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. కాగా ఈ వ్యవహారంపై కేసులు నమోదు కాకుండా అప్పుడే మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. సర్టిఫికెటర్‌ రద్దు చేశాం – వెంకట రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి తొగిరిమామిడి కుంటకు చెందిన మల్లేశం సెల్ఫ్‌ డిక్లరేషన్‌తో శంకరయ్య మరణ ధ్రువీకరణ పత్రం పొందాడు. బీమా కంపెనీ ప్రతినిధి సంప్రదించడంతో పూర్తి స్థాయి విచారణ చేసి ఇటీవల జారీ చేసిన ధ్రువీకరణను రద్దు చేశాం. డెత్‌ సర్టిఫికెట్‌ జారీ వెనుక ఎవరెవరి హస్తం ఉందో విచారణ జరపాల్సి ఉంది. తప్పుడు డెత్‌ సర్టిఫికెట్‌ జారీపై విచారణ మెట్‌పల్లి: తప్పుడు డెత్‌ సర్టిఫికెట్‌ జారీ చేసి సస్పెండ్‌ అయిన మున్సిపల్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ భూమానందంను మున్సిపల్‌ కార్యాలయంలో సిరిసిల్ల కమిషనర్, విచారణాధికారి సుమన్‌రావు శుక్రవారం విచారణ చేశారు. బాస రాజేందర్‌ అనే పేరు మీద పట్టణానికి చెందిన నందగిరి దామోదర్‌ ఎల్‌ఐసీ నుంచి రూ.5 లక్షలు, రూ.10 లక్షల పాలసీలు తీసుకున్నాడు. ఆ తర్వాత అతడు మరణించినట్లుగా మున్సిపల్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ సమయంలో భూమానందం ఎలాంటి పరిశీలన జరుపకుండా డెత్‌ సర్టిఫికెట్‌ జారీ చేశాడు. ఈ సర్టిఫికెట్‌తో దామోదర్‌ ఎల్‌ఐసీ నుంచి రూ.5 లక్షలను క్లెయిమ్‌ చేసుకున్నాడు. ‘సాక్షి’ ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తేవడంతో ఎల్‌ఐసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వారు కేసు నమోదు చేసి ఇప్పటి వరకు దామోదర్‌తోపాటు ఇద్దరు ఏజెంట్లు, భూమానందంను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఉన్నతాధికారులు భూమానందంను సస్పెండ్‌ చేసి సుమన్‌రావును విచారణాధికారిగా నియమించారు. ఈ మేరకు ఆయన మెట్‌పల్లికి వచ్చి మున్సిపల్‌ కార్యాలయంలో డెత్‌ సర్టిఫికెట్‌తో పాటు సంబంధిత రికార్డులను పరిశీలించి భూమానందం నుంచి వివరాలు సేకరించారు.

ఇక జగిత్యాల జిల్లా - మారనున్న రూపురేఖలు - దసరాకు ఆవిర్భావం

13/08/2016: జగిత్యాల అర్బన్‌: కొత్త జిల్లాలపై వచ్చేవారమే నోటిఫికేషన్‌ రానుంది. జగిత్యాల ఇక జిల్లా కేంద్రంగా మారనుంది. ప్రభుత్వం 23 జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ ఇప్పటికే సీసీఎల్‌ఏ నోటిఫికేషన్‌ జారీచేసింది. విజయదశమి నుంచి నూతన జిల్లా కేంద్రాల పరిపాలన చేపట్టేందుకు రెవెన్యూ, సీసీఎల్‌ఏ ఇప్పటికే సన్నాహాలు పూర్తిచేసింది. అవసరమైన మౌలిక వసతులు, ప్రత్యావ్నూయ ఏర్పాట్ల బాధ్యతలు కలెక్టర్లకు అప్పగించింది. అధికారులు, ఉద్యోగుల రేషనలైజేషన్‌ కోసం ప్రభుత్వం ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేసింది. కరీంనగర్‌ తర్వాత జిల్లాలో జగిత్యాల అతిపెద్ద పట్టణం. గ్రేడ్‌–1 మున్సిపాలిటీ కూడా. జిల్లా ఏర్పాటుపై ఇప్పటికే సబ్‌కలెక్టర్‌ శశాంక నివేదిక అందజేశారు. ఈ ప్రాంతంలోని 20 మండలాలను కలుపుతూ జిల్లా చేయొచ్చని ప్రతిపాదించారు. జగిత్యాలలో జగిత్యాల అర్బన్, రాయికల్, సారంగాపూర్, గొల్లపల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, ధర్మపురి, పెగడపల్లి, మల్యాల, కొడిమ్యాల, కథలాపూర్, మేడిపల్లి, కోరుట్ల అర్బన్, మెట్‌పల్లి అర్బన్, ధర్మారం, వెల్గటూర్‌తో పాటు కొత్తగా జగిత్యాల రూరల్, కోరుట్ల రూరల్, మెట్‌పల్లి రూరల్, బుగ్గారం మండలాలుగా ఏర్పాటుచేసి కొత్త జిల్లాలో కలపనున్నారు.ప్రస్తుతం జిల్లాల జాబితాలో సిరిసిల్లకు చోటు దక్కకపోవడంతో మరిన్ని మండలాలు జగిత్యాల కలిసే అవకాశాలు ఉన్నాయి. అంతేగాకుండా రెండు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. అందులో ఒకటి జగిత్యాల కాగా, రెండోది కోరుట్లగా అధికారులు నిర్ణయించారు. నూకపల్లిలో కలక్టరేట్‌ జగిత్యాల కలక్టరేట్‌ సముదాయాన్ని పట్టణానికి 10 కి.మీ దూరంలో ఉన్న నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ (న్యాక్‌) భవన ంలో ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదించారు. కానీ.. ఇది దూరంగా ఉండటంతో ప్రస్తుతం ఉన్న సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో కలక్టరేట్‌ ఏర్పాటుచేసే అవకాశాలు ఉన్నాయి. ధరూర్‌లో స్థలఅన్వేషణ జగిత్యాల కలెక్టర్‌ కార్యాలయం కోసం పట్టణంలోని ధరూర్‌ క్యాంపులోని 75 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఇందులో కలక్టరేట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. మారనున్న రూపురేఖలు ప్రస్తుతం టవర్‌సర్కిల్‌ నుంచి ఎటు 3 కి.మీ ప్రాంతంలో విస్తరించి ఉంది. 38 వార్డులు ఉండగా 1,00,863 జనాభా కలిగి ఉంది. ప్రస్తుతం మున్సిపాలిటీలో చుట్టూ గ్రామాలైన మోతె, తిప్పన్నపేట, చల్‌గల్, లింగంపేట, హుస్నాబాద్, పూర్తిస్థాయిలో విలీనం అయ్యే అవకాశాలున్నాయి. దీంతో పట్టణ జనాభా పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా జగిత్యాల రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. జిల్లా కేంద్రం కానుండటంతో విద్య, వైద్య సౌకర్యాలూ పెరిగే అవకాశాలు ఉన్నాయి. చదువుల కోవెలగా.. జగిత్యాల డివిజన్‌ కేంద్రం ఇప్పటికే చదువుల కోవెలగా పేరుగాంచింది. కొండగట్టులోని నాచుపల్లి జేఎన్‌టీయూ కళాశాలతో పాటు పొలాసలో వ్యవసాయ పరిశోధన స్థానం, అగ్రికల్చర్‌ కాలేజీ, బీఎస్సీ నర్సింగ్‌ కళాశాలతో పాటు ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలూ ఉన్నాయి. జిల్లా కేంద్రంగా మారితే మరిన్ని కళాశాలు వచ్చే అవకాశాలున్నాయి. జగిత్యాల జిల్లాలో ప్రముఖ కవులు కేవీ.నరేందర్, బీఎస్‌.రావ¬లు, సంగవేని రవీంద్ర, చరిత్రకారులు జైశెట్టి రమణయ్య వీరు కరీంనగర్‌ జిల్లాలో ప్రాముఖ్యం సంపాదించారు. వీరు జగిత్యాల ప్రాంతానికి చెందిన వారు. పట్టణంలో ముఖ్యంగా ఖిల్లా పర్యాటక కేంద్రంగా మారనుంది. జగిత్యాలలోని చింతకుంట చెరువును సైతం మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చనున్నారు. వ్యవసాయం జగిత్యాల జిల్లా పరిధిలో ముఖ్యంగా వరి ప్రధానమైన పంట. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి నీరు సుమారు 3 లక్షల ఎకరాల్లో సాగునీరు అందుతుంది. ఇక్కడ ప్రధానమైన పంట వరి కావడంతో పాటు పత్తి కూడా ఎక్కువ శాతం పండిస్తుంటారు. ఆరుతడి పంటల్లో మొక్కజొన్న, శెనగ తదితర పంటలు వేస్తుంటారు. ఆలయాలు జగిత్యాల జిల్లాలో ప్రముఖ ఆలయాలైన కొండగట్టుతో పాటు ధర్మపురి దేవస్థానం కూడా ఇందులో వస్తుంది. రెండు దేవాలయాలు ప్రధానమైనవి.

వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ''అక్షరవనం'' కార్యక్రమము

11/08/2016: మహబూబ్ నగర్ (కల్వకుర్తి), సలాం తెలంగాణ: కల్వకుర్తి పట్టణంలోని వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ ,రంగారెడ్డి మరియు నల్గొండ జిల్లాలలో ''అక్షరవనం'' కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా జిల్లాకో 20 ప్రభుత్వ పాఠశాలలు,ఆ పాఠశాలలకు చెందిన ప్రతిభ గల 6 విద్యార్థులను ఎంపిక చేశారు, మొత్తం 430 విద్యార్థులకు అక్షరవనం లో 10 రోజుల పాటు శిక్షణ తరగతుల నిర్వహించారు. అదే విధంగా ఆ జిల్లాలోని మాథ్స్ 60,ఫిజిక్స్ 60,తెలుగు 60 మంది ఉపాథ్యాయులకు కూడా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు, గురువారం రోజున కల్వకుర్తి ఎమ్యెల్యే చల్ల వంశీ చాంద్ రెడ్డి శిక్షణ తరగతులకు హాజరై ,మాట్లాడుతూ ''ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు వందేమాతరం ఫౌండేషన్ వారు శిక్షణ తరగతులు నిర్వహించడం సంతోషకరమైన విషయం. బంగారు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వల్లనే సాధ్యం అవుతుంది. అక్షరవనం ఒక నూతన విద్యా విధానానికి నాంది పలుకుతుంది, ఈనాటి అక్షరవనం ఒక మహా విద్యా వృక్షం అయ్యి విశ్వవిద్యాలయంగా మారాలని ఆశిస్తున్నాను అని అన్నారు ,ఈ కార్యక్రమంలో వందేమాతరం సభ్యులు శ్రీపతి రెడ్డి, వాలంటీర్లు మరియు వివిధ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొన్నారు.

టోల్‌గేట్‌ ఉద్యోగిపై ఎమ్మెల్యే డ్రైవర్‌ దాడి

11/08/2016: కరీంనగర్(తిమ్మాపూర్‌) : మండలంలోని రేణికుంట టోల్‌ప్లాజా వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగిపై మంథని ఎమ్మెల్యే పుట్ట మధు డ్రైవర్‌ చేయిచేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న పుట్ట మధు కారు రేణికుంట టోల్‌ప్లాజా వద్ద మిగిలిన వాహనాలు వెళ్లేదారిలోనే వచ్చింది. టోల్‌ కలెక్షన్‌ సెంటర్‌ వద్ద అప్పటికే వాహనం ఉండడంతో ఎమ్మెల్యే వాహనం ఆగింది. తమlవాహనానికి క్లియరెన్స్‌ ఇవ్వడంలేదని ఎమ్మెల్యే డ్రైవర్‌ ప్రశ్నించాడు. వీఐపీలకు ప్రత్యేక దారి ఉందని, అలా వెళ్లాలని టోల్‌ప్లాజాలో పని చేస్తున్న లేన్‌ అసిస్టెంట్‌ నాగరాజు అన్నాడు. వెంటనే కారు దిగిన డ్రైవర్‌ నాగరాజుపై దాడికి పాల్పడ్డాడు. దీనిపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఎల్‌ఎండీ పోలీసులు తెలిపారు. ఉద్యోగి వసూళ్లపై డీటీసీకి ఫిర్యాదు ఆర్టీఏ ఆఫీసులో ఓ ఉద్యోగి వసూళ్లపర్వంపై ఆర్టీసీ డ్రైవర్లు బుధవారం డీటీసీ వినోద్‌కుమార్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కౌంటర్‌ వద్ద ఉన్న రామ్మూర్తి డబ్బులిస్తేనే పనులు చేస్తున్నాడని, లేకుంటే ఇబ్బంది పెడ్తున్నాడని ఆర్టీసీ డ్రైవర్లు ముల్గు రవీందర్, కోరెపు శంకరయ్య డీటీసీకి వివరించారు. తాను చేయని పని మిగతా కౌంటర్‌లో చేశారని రవీందర్, తన వద్ద ఒక అప్లికేషన్‌కు రూ.100 వసూలు చేశాడని శంకరయ్య తెలిపారు. సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని డ్రైవర్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. డీటీసీ స్పందిస్తూ ఉద్యోగికి వర్క్‌ సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆఫీసులో ఉద్యోగులు దరఖాస్తుదారులను ఇబ్బంది పెట్టకుండా మెరుగైన సేవలు అందించాలని, ఎవరైనా డబ్బులు అడిగితే దరఖాస్తుదారులు తన దృష్టికి తీసుకురావాలని, తప్పకుండా చర్యలు తీసుకుంటానని డీటీసీ తెలిపారు.

జిల్లాలో నయీం భూదందా ! - నగునూరులో సెటిల్‌మెంట్‌ - రూ.4కోట్ల విలువైన రెండు ఎకరాలు కొనుగోలు

11/08/2016: కరీంనగర్‌ : జిల్లాలో గ్యాంగ్‌స్టర్‌ నÄæూమ్, అతడి అనుచరుల భూదందా బాగోతం వెలుగుచూస్తోంది. నయీమ్‌ ఇంట్లో పోలీసులు చేసిన తనిఖీల్లో కరీంనగర్‌ మండలం నగునూరు గ్రామానికి చెందిన భూముల వివరాలు బయటపడ్డాయి. మండలానికి చెందిన ఓ మాజీ సర్పంచ్‌ భర్త నయీమ్‌ పేరుతో బెదిరింపులకు గురిచేసి పెద్ద ఎత్తున భూములను సెటిల్‌మెంట్‌ చేస్తూ అతడితో భాగస్వామిగా ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్న విషయాలు ఇలా ఉన్నాయి. 2002లో రమేశ్‌రావు అనే రియల్టర్‌ నగునూరు గ్రామంలో గూడూరి సదాశివరావుకు చెందిన 23 ఎకరాలను కొనుగోలు చేసి 327 ప్లాట్లుగా చేసి విక్రయించాడు. ఈ వ్యవహారం కోర్టులో నలుగుతున్న క్రమంలోనే 2009లో సాంబశివరావు 23 ఎకరాలను సురేందర్‌ పేరిట జీపీఏ చేయించాడు. అదే ఏడాది జనవరిలో జిల్లా కోర్టులో ఉన్న కేసును హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేయించాడు. జీపీఏ భూములను విక్రయిస్తున్నామని, అభ్యంతరాలుంటే తెలపాలని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ సందర్భంలోనే కరీంనగర్‌ మండలానికి చెందిన ఓ మాజీ సర్పంచ్‌ భర్త నయీమ్‌ అనుచరుడిగా రంగ ప్రవేశం చేశారని పోలీసులు భావిస్తున్నారు. తనతోపాటు మరో నలుగురితో కలిసి జీపీఏ ఆధారంగా ముందుగా ఎకరం విస్తీర్ణంలో ఉన్న దాదాపు 60 ప్లాట్లను కొనుగోలు చేయడంతోపాటు ప్లాట్లను చదును చేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ప్లాట్లను గతంలో కొనుగోలు చేసిన వ్యక్తులు వచ్చి అడిగితే నÄæూమ్‌ పేరుతో బెదిరింపులకు గురిచేశారని, దాదాపు నెలరోజులపాటు ప్లాట్ల వద్దనే ఉంటూ దౌర్జన్యానికి దిగినట్లు తెలిసింది. నయీమ్‌ పేరుతో పలుమార్లు ఫోన్లు చేసి బెదిరించినట్లు సమాచారం. అప్పట్లో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికి సమ్మక్క జాతర పేరిట పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. కోర్టులో కేసు ఉందని, ఈ భూమిని నయీమ్‌ కొన్నాడంటూ మాజీ సర్పంచ్‌ భర్త చెబుతూ గతంలో ప్లాట్లు కొన్న ధరకంటే తక్కువ మొత్తంలో డబ్బులిచ్చి సెటిల్‌మెంట్‌ చేసినట్లు తెలిసింది. ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్లలో అత్యధికులు సింగరేణి ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయులేనని తేలింది. ఉద్యోగులు తమకు వాళ్లతో గొడవ ఎందుకనే కారణంతో విలువైన ప్లాట్లను తక్కువ ధరకే అమ్మేసి వెళ్లిపోయినట్లు సమాచారం. నయీమ్‌ ఇంట్లో దొరికిన పత్రాల్లో నగునూరులోని సర్వే నెంబర్‌ 383 నుంచి 412 వరకు దాదాపు రెండెకరాల మేరకు తన అనుచరుల పేరిట ప్లాట్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీటి విలువ మార్కెట్‌లో రూ. 4కోట్ల వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఇంకా నయీమ్‌ అనుచరులెవరున్నారు, ఎక్కడెక్కడ భూ దందాలు, సెటిల్‌మెంట్లు చేశారనే విషయాలపై లోతుగా ఆరా తీస్తున్నారు.

సిట్‌ సభ్యుడిగా కోరుట్ల సీఐ - నేర దర్యాప్తులో ప్రతిభ చూపుతున్న రాజశేఖర్‌రాజు

11/08/2016: కోరుట్ల : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ ఉదంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ (స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం)లో కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజును సభ్యుడిగా నియమించారు. నయీమ్‌ దురాగతాలు, ఆకృత్యాలపై పూర్తిస్థాయిలో ఆరా తీయడానికి ఐజీ నాగిరెడ్డి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్‌ బృందంలో వరంగల్‌ రేంజ్‌ పరిధిలో రాజశేఖర్‌రాజు ఒక్కరే ఉండటం విశేషం. తాను పనిచేసిన పోలీస్‌స్టేషన్ల పరిధిలో వివిధ కేసుల దర్యాప్తులో ప్రతిభ చూపిన నేపథ్యంలో సిట్‌లో సభ్యుడిగా ఎంపిక చేసినట్లు సమాచారం. రాజశేఖర్‌రాజు 1996లో ఎస్సైగా ఎంపికయ్యారు. 1999లో వరంగల్‌ జిల్లా మంగపేట ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఇన్సూరెన్సు పేరిట వేతనాలు ఇస్తామని రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందిని ఏజంట్లుగా చేర్చుకుని రూ.14కోట్ల మోసగించాడు. ఈ కేసులో విచారణ జరిపి నిందితుడిని పట్టుకోవడం ఆ సమయంలో సంచలనం సృష్టించింది. 2000 సంవత్సరంలో ఆదిలాబాద్‌ జిల్లా వాంకిడిలో ఎస్సైగా పనిచేసిన సమయంలో ఐదేళ్ల క్రితం జరిగిన ఓ హత్యలో కేసులో ఖననం చేసిన మృతదేహాన్ని వెలికితీసి ఆ హత్య కేసులో ఏడుగురిని అరెస్టు చేయడం ఉన్నతాధికారుల దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. 2011లో సీఐగా పదోన్నతి పొందిన రాజశేఖర్‌రాజు 2013లో వరంగల్‌ జిల్లా గూడురులో పనిచేస్తున్న సమయంలో ఓ ఉపాధ్యాయుడితో పాటు మరో వ్యక్తిని న్యూడెమోక్రసీ నక్సల్స్‌ పిస్టల్‌తో కాల్చిచంపితే దళంపై అనుమానం వస్తుందని కత్తులతో నరికి చంపారు. న్యూడెమోక్రసీ దళం అనుమానం రాకుండా ఈ హత్యలను చేసి ఉంటుందన్న సందేహంతో విచారణ సాగించిన రాజశేఖర్‌రాజు వారం రోజుల వ్యవధిలో దళం సభ్యులందరిని అరెస్టు చూపారు. కోరుట్ల సీఐగా పనిచేసిన ఆరునెలల కాలంలోనూ ఇళ్ల తాళాలు పగులకొట్టి లెక్కలేని దొంగతనాలు చేస్తున్న పార్థీ ముఠా సభ్యుడిని అరెస్టు చేశారు. ఈ ముఠా వెనుక మహారాష్ట్రలోని పోలీసు ఇన్స్‌పెక్టర్‌ పాత్ర ఉందని గుర్తించి ఆయన అరెస్టుకు ఉన్నతాధికారులను కోరారు. పదిరోజుల క్రితం బంగారం ఎరవేసి హైదరాబాద్‌తోపాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పలువురిని మోసగించి లక్షల్లో డబ్బులతో ఉడాయించిన ముఠా ఆటకట్టించారు. ఇలా పలు కేసుల దర్యాప్తులో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ప్రతిభ చూపిన క్రమంలోనే నయీమ్‌ ఉదంతంలో ఏర్పాటు చేసిన సిట్‌లో సభ్యునిగా సీఐ రాజశేఖర్‌రాజు ఎంపికయినట్లు సమాచారం.

ఆమరణ దీక్ష భగ్నం.. జగ్గారెడ్డి అరెస్ట్

11/08/2016: సంగారెడ్డి మున్సిపాలిటీ: 2013 భూ సేకరణ చట్టం ప్రకారం మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా సంగారెడ్డిలో బుధవారం దీక్ష తలపెట్టిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. జగ్గారెడ్డిని దీక్షా శిబిరానికి వెళ్తుండగానే అరెస్టు చేయడంతో ఆ ప్రాంతంలో కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తలతో కలిసి శాంతియుతంగా రామ మందిర్ నుంచి ర్యాలీగా వెళ్తుంటే పోలీసులు అరెస్టు చేయడమే కాకుండా తమ కార్యకర్తలపై దాడులు చేశారని ఆరోపించారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం బాధితులకు పరిహారం చెల్లించడమే కాకుండా.. మూడేళ్లపాటు వారికి పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ర్ట ప్రభుత్వం తీసుకొచ్చిన 123, 214 జీవోల ద్వారా రైతులు దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందని, కమీషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2013 చట్టాన్ని పక్కనపెట్టిందని జగ్గారెడ్డి అన్నారు. దీక్ష భగ్నం అప్రజాస్వామికం: ఉత్తమ్ సంగారెడ్డి రూరల్: మల్లన్నసాగర్ భూ బాధితుల కోసం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేపట్టిన దీక్షను భగ్నం చేయడం అప్రజాస్వామికమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. సంగారెడ్డిలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందన్నారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతోందన్నారు.

వెంకటాపూర్ మండల బాలికల హాస్టల్ ను సందర్శించిన MRO రమాదేవి

10/08/2016: వరంగల్(వెంకటాపూర్), సలాం తెలంగాణ: వరంగల్ జిల్లా వెంకటాపూర్ మండలం లోని బాలికల హాస్టల్ ను MRO అల్లోజు రమాదేవి ఈరోజు సందర్శించారు. వారితో పాటు జవహర్ నగర్ సర్పంచ్ విజయ, MEO ఐలయ్య, VRO గోపాల్ రావు, రియాజ్ లు ఉన్నారు.

ఆదివాసీలపై దాడులు ఆపాలి - కలెక్టరేట్‌ ఎదుట సీపీఐ(ఎంఎల్‌) ధర్నా

10/08/2016: కరీంనగర్(ముకరంపుర) : ఆదివాసీలపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపి వారి హక్కులు కాపాడాలని సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. అంతకుముందు తెలంగాణ చౌక్‌నుంచి కలెక్టరేట్‌వరకు ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధికి దూరంగా ఉన్న ఆదివాసీల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. హరితహారం పేరిట ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్న భూములను ఫారెస్ట్‌ అధికారులు పోలీసుల అండతో లాక్కుంటున్నారని పేర్కొన్నారు. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్‌ జిల్లాలో దాడులు సైతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రాంతంలో పోలీసులు ఆదివాసీలను నిర్బంధిస్తున్నారని, అరెస్టులు చేస్తూ.. ఆస్తులు ధ్వంసం చేస్తూ.. పంటలను నాశనం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 10 లక్షల ఎకరాల పోడుభూమి గుర్తించి ఆదివాసీలకు పట్టాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి జేవీ.చలపతిరావు, నాయకులు రాజమ్మ, రాజు, నరేష్, శ్రీనివాస్, భీమేశ్వర్, రాములు తదితరులున్నారు.

ఇంటింటా మరుగుదొడ్డి నిర్మించుకోవాలి - కేంద్ర ప్రతినిధి అంజు ఉప్పల్‌

10/08/2016: బెజ్జంకి/మానకొండూర్‌/హుజూరాబాద్‌ : ప్రజలు తమ ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, అధికారులు ఆ దిశగా అవగాహన కల్పించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, స్వచ్ఛభారత్‌ ప్రతినిధి అంజు ఉప్పల్‌ అన్నారు. మంగళవారం బెజ్జంకి మండలం మాదాపూర్, మానకొండూర్‌ మండలం లలితాపూర్, హుజూరాబాద్‌ మండలం సిర్సపల్లి గ్రామాలను సందర్శించారు. పారిశుధ్య నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు ఇంటింటికీ తిరిగి పరిశీలించారు. మరుగుదొడ్ల నిర్మాణాలు, నిర్వహణ, అక్షరాస్యత, పంటలు సాగు, గ్రంథాలయం తదితర విషయాలపై ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళాసంఘాల సభ్యులు, గ్రామస్తులతో చర్చించారు. ఆరుబయట మల, మూత్ర విసర్జన ఆరోగ్యానికి చేటుచేస్తుందని పేర్కొన్నారు. సిర్సపల్లిలో ఇంకా 77 నిర్మాణాలు జరగాల్సి ఉన్నట్లు అధికారులు నివేధిక ఇచ్చారని, వీటిని 10 రోజుల్లోగా పూర్తి చేయాలని, అంతవరకు బహిరంగ మల విసర్జన చేయకుండా ఉన్నవారివి ఉపయోగించుకోవాలని సూచించారు. మాదాపూర్, లిలితాపూర్‌ గ్రామాల్లో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రోత్సహించిన సర్పంచ్‌లు రవీందర్‌రెడ్డి, మర్రి కవితను అభినందించారు. వారివెంట ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ప్రకాశ్, ఈఈ రాఘవులు, స్వచ్ఛ బారత్‌ కో–ఆర్డినేటర్‌ కిషన్‌స్వామితోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

రౌడీషీటర్లలో గుబులు - భూదందాలు, సెటిల్‌మెంట్లపై పోలీసుల దృష్టి

10/08/2016: గోదావరిఖని : గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ ఎన్‌కౌంటర్‌తో కోల్‌బెల్ట్‌ ప్రాంతంలోని రౌడీషీటర్లలో గుబులు మొదలైంది. భూదందాలు చేస్తూ కోట్లకు పడగలెత్తిన నయీమ్‌ చివరకు పోలీసుల చేతిలోనే హతమవడం గమనార్హం. గోదావరిఖనిలో 2012లో కట్టెకోల సుధీర్‌ అనే రౌడీషీటర్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. ఈ సంఘటన తర్వాత రౌడీషీటర్ల ఆగడాలు తగ్గుముఖం పట్టాయి. అయితే జిల్లాలోనే అతి ఎక్కువగా గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో 47 మంది రౌడీషీటర్లు ఉన్నారు. వారిలో 25 మంది పలు దందాలను కొనసాగిస్తున్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. ఇటీవల గోదావరిఖని మార్కండేయకాలనీ, అడ్డగుంటపల్లితోపాటు పలు ప్రాంతాల్లోని ప్రైవేటు పట్టా భూములపై రౌడీషీటర్లు కన్నేసి సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో గోదావరిఖని ఏఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్‌ ఈ భూదందాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆరు నెలల్లో భూదందాలను అరికడతామని ప్రకటించారు. నÄæూమ్‌కు కోల్‌బెల్ట్‌ ప్రాంతాలైన గోదావరిఖని, మంచిర్యాల, బెల్లంపల్లిలోనూ అనుచరులున్నారు. మంచిర్యాల కొత్త జిల్లా కావడం, అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నడపడం, గోదావరిఖని ప్రాంతానికి చెందిన వారే ఇక్కడ ఎక్కువగా భూములు కొనుగోలు చేయడం, అమ్మడంలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో నయీమ్‌ ముఠా సభ్యులు ఇక్కడి భూముల దందాలో కూడా ప్రవేశించినట్టు సమాచారం. రెండు నెలల క్రితం నయీమ్‌ ముఠా సభ్యుడు, ముఖ్య అనుచరుడు పాశం శ్రీనివాస్‌ గుండెపోటుకు గురికావడంతో ఆయన గోదావరిఖనికి వచ్చినట్టు వెలుగులోకి వచ్చింది. కానీ అంతకుముందు కూడా ఆయన, ఆయన అనుచరులు మంచిర్యాల, గోదావరిఖనితోపాటు మంథని ఏరియాలో కూడా తిరుగుతూ సెటిల్‌మెంట్లు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. గోదావరిఖనికి చెందిన కొందరు రౌడీషీటర్లు పలు కేసులలో జైళ్లలో మగ్గుతుండగా... మరికొందరు భూదందాలు, సెటిల్‌మెంట్లు చేసే పనిలో నిమగ్నమైనట్టు సమాచారం. మాట వినని వారిని బెదిరింపులకు గురిచేస్తున్న క్రమంలో బాధితులు ఎవరికి చెప్పుకోలేని స్థితి ఏర్పడింది. అయితే పలువులు బాధితులు మాత్రం నేరుగా తమకు జరుగుతున్న అన్యాయంపై స్వయంగా ఏఎస్పీని ఆశ్రయిస్తుండగా... ఆయన సదరు రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు తెలిసింది. ఒకవేళ ఎవరైనా రౌడీషీటర్‌ భూదందాలు, సెటిల్‌మెంట్లలో భాగస్వాములుగా ఉన్నట్టు గుర్తిస్తే తమదైన శైలీలో వారికి బుద్ధి చెప్పేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. తాజాగా నయీమ్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపడంతో స్థానిక రౌడీషీటర్లు తమకు ఇదే పరిస్థితి ఏర్పడుతుందనే ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ స్థానిక రౌడీషీటర్లకు గుణపాఠం కావాలని కోల్‌బెల్ట్‌ వాసులు కోరుకుంటున్నారు.

మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణా పుష్కరాలకు సిద్దమైన పుష్కర ఘాట్లు

09/08/2016: మహబూబ్ నగర్(ఆత్మకూర్‌), సలాం తెలంగాణ: దక్షిణ భారతదేశంలో ప్రవహించే నధులలో కృష్ణానది ఒకటి. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక సారి వచ్చే కృష్ణాపుష్కరాలు ఈ నెల 12 నుండి 23 వరకు జరుగుతాయి. కృష్ణాపుష్కరాలలో స్నానం ఆచారించడం వల్ల పాపం పొతాయన్నది ప్రజల నమ్మకం. అందుకుగాను రాష్ట్రప్రభుత్వం కృష్ణానది పరివాహకప్రాంతాలలో పుష్కరఘాట్‌ లను ఏర్పాటుచేసింది. అందులో భాగంగా మఖ్తల్‌ నియోజకవర్గంలో కృష్ణా, వాసునగర్‌, తంగడి, ముడుమల, గడ్డంపల్లి, అనుగొండ, ముస్లాయిపల్లి, నందిమల్ల, మూలమల్ల, జూరాల, ఆరేపల్లి, కత్తెపల్లి మొదగు ప్రాంతాలలో పుష్కర ఘాట్‌లు ఏర్పాటు చేశారు. వీటిలో ప్రాధానంగా నందిమల్ల, జూరాల, ఆరేపల్లి, కత్తెపల్లి పుష్కర ఘాట్‌ లను ఎక్కువగా ప