Breaking News

కరీంనగర్‌: అతివేగంతో పాటు, కర్ణకఠోర శబ్ధాలతో దూసుకెళ్తున్న ద్విచక్రవాహనాలకు పోలీసులు కళ్లెం వేశారు. పరిమితికి మించిన వేగంతో ప్రయాణిస్తూ తోటి వాహనదారులను భయబ్రాంతులకు గురిచేయడంతో పాటు విపరీతమైన శబ్ధ కాలుష్యానికి కారణమవుతున్న 16 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకొని వాహనదారులకు జరిమానాలు విధించారు. * * బెల‍్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల‍్లంపల్లిలోని సివిల్‌ కోర్టు ముఖద్వారం ఎదుట హోంగార్డు నారాయణ మంగళవారం ఉదయం ఆత‍్మహత్యాయత‍్నం చేశాడు. ఏడు సంవత‍్సరాలుగా హోంగార్డులకు పోస్టింగ్‌ ఇవ‍్వలేదని, విధుల‍్లోకి తీసుకోకుండా పోలీసు విభాగం అన్యాయం చేస్తోందని ఆవేదన వ‍్యక‍్తం చేస్తూ తెలంగాణ హోంగార్డుల సంఘం అధ‍్యక్షుడు నారాయణ మంగళవారం ఆత‍్మహత్యాయత‍్నం చేశాడు. * * చర‍్ల: ఖమ‍్మం జిల్లా చర‍్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు వద్ద మంగళవారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు ఆ ఇద్దరిని అరెస్టుచేశారు. తనిఖీ చేయగా వారి వద్ద మెడికల్ కిట్లు ఉన్నట్లు గుర్తించారు. వారు మావోయిస్టు మిలీషియా సభ‍్యులని తేలడంతో వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కోర్టులో హాజరుపరిచేందుకు తరలించామని చర్ల పోలీసులు వెల్లడించారు. * * వరంగల్‌: వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని నర్సంపేటలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తె దుర‍్మరణం చెందారు. తండ్రి, కుమార్తె వెళుతున‍్న ద్విచక్రవాహనాన్ని వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో వారు అక‍్కడికక‍్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు సేకరిస‍్తున్నారు * * కురవి: తేనెటీగల దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లిలో సోమవారం వెలుగుచూసింది. స్థానిక మామిడి తోటలో కాయలు కోయడానికి వచ్చిన కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామానికి చెందిన వారిగా తెలుస్తోంది. * * కరీంనగర్‌: జిల్లా కేంద్రంలోని బుట్టిరాజారాం కాలనీలో శనివారం వేకువజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలో ప్రతీ ఇంటిని తనిఖీ చేశారు. 31 బైక్‌లు, 8 ఆటోలు, 9 సిలిండర్లు, 3 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా పలువురు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. * * హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం గత నెల 22న నిర్వహించిన పాలిసెట్ - 2017 ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని కాలేజీ, రూసా కార్యాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వాణిప్రసాద్ పాల్గొన్నారు. ఏప్రిల్ 22న జరిగిన ప‌రీక్ష‌కు 1,28,118 మంది విద్యార్థులు హాజరయ్యారు. * * నిజామాబాద్‌ జిల్లా వర్నిలో వింత చోరీ వెలుగుచూసింది. పట్టణ శివారులోని భారత్‌ గ్యాస్‌ గోడౌన్‌లో దొంగలుపడి సిలిండర్లు ఎత్తుకెళ్లారు. నిన్న సాయంత్రమే గోడౌన్‌కు వచ్చిన 250 గ్యాస్‌ సిలిండర్లలో శుక్రవారం రాత్రి 204 సిలిండర్లు చోరీకి గురయ్యాయి. శనివారం ఉదయం గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ శేఖర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. * * హైదరాబాద్‌: మిర్చి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కపట ప్రేమను చూపుతున్నాయని లోక్‌సత్తా పార్టీ తెలంగాణ ధ్వజ మెత్తింది. కేంద్రం తాజాగా ప్రకటించిన రూ.5వేలు ఏ మూలకూ సరిపోవని, అదనంగా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మరో రూ.5వేలు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈమేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జన్నేపల్లి శ్రీనివాసరెడ్డి గురువారం ప్రకటన విడుదల చేశారు. * * కడెం: నిర్మల్‌ జిల్లా కడెం మండల కేంద్రంలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, అక్రమంగా నిల్వ ఉంచిన రూ.20 వేల విలువ గల గుట్కా, మద్యం ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నల్లబెల్లం, దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అజార్, రమేష్ అనే ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. * * నారాయణపూర్‌: యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్‌ మండల కేంద్రంలో మావోయిస్టు పోస్టుర్లు కలకలం రేపుతున్నాయి. మండల కేంద్రంతో పాటు వావిళ్లపల్లి, జనాగం గ్రామాల్లో పోస్టర్లు వెలవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కేసీఆర్‌ నియంత పాలన నశించాలి, లంచగొండి ఎమ్మెల్యే ఖబడ్దార్‌ అంటూ పోస్లర్లపై రాసి ఉంది. * * రంగారెడ్డి: బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాయల్‌ కాలనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్‌ వేస్టేజ్‌ గోదాములో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. * * అమెరికాలో ఓ చిన్న విమానం నాటకీయరీతిలో నడిరోడ్డుపై కూలిపోయింది. వాషింగ్టన్‌ లోని ముకిల్‌టియోలో మంగళవారం ఓ చిన్న విమానం రద్దీగా ఉన్న నడిరోడ్డుపై కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు ఎగిశాయి. అదృష్టం బాగుండి ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. విమానం ఇంజన్‌లో సాంకేతికలోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్‌ సురక్షితంగా తప్పించుకున్నాడు. * * యాదగిరిగుట్ట మండలం బాహుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈస్ట్‌ మారెడ్‌పల్లికి చెందిన వల్లపు ఎల్లయ్య బైక్‌పై వరంగల్‌ వైపు వెళ్తున్నారు. బాహుపేట వద్దకు రాగానే ఎల్లయ్య వాహనాన్ని గుర్తు తెలియని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో పుల్లయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ రెండు ప్రమాదాలు జరిగిన ప్రదేశాలను యాదగిరిగుట్ట పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ–2 నాగిరెడ్డి తెలిపారు. * * టేకులపల్లి: మహిళా సర్పంచ్ కుమారుడు ఓ విద్యార్థినిని ప్రేమ పేరుతో నమ్మించి, వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తే ముఖం చాటేస్తున్న ప్రియుడి ఇంటి ముందు బాధితురాలు ఆందోళనకు దిగింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడులో బుధవారం వెలుగుచూసింది. * * హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సాయంత్రం 4 గంటలకు పదోతరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 14 నుంచి 30 వరకు ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 5.35 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తులు చేసుకోగా దాదాపు ఐదు లక్షల మంది హాజరయ్యారు. ఈ నెల 5న ఫలితాలు విడుదల చేయాలనుకున్నా రెండు రోజుల ముందుగానే ఫలితాలు వెల్లడిస్తున్నారు. * * హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని శ్రీకర్‌ ఆస్పత్రిలో సోమవారం అర్థరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రోగులు, ఆస్పత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలార్పడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదం సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదని పలువురు వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని అధికారులు వేరువేరు ఆస్పత్రులకు తరలించారు. * * కరీంనగర్‌: అదిలాబాద్‌ వన్‌టౌన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సీఐ, ఎస్సై, ఏఎస్సైలను సస్పెండ్‌ చేస్తూ.. కరీంనగర్‌ రేంజ్‌ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్‌ తగాదాలో తలదూర్చారనే సమాచారంతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు జిల్లా ఎస్పీ ఎం. శ్రీనివాస్‌ నివేదిక ఆధారంగా సీఐ సత్యనారాయణ, ఎస్సై బి. అనిల్, ఏఎస్సై జి. అప్పారావులను సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం కరీంనగర్‌ రేంజ్‌ డీఐజీ సి. రవివర్మ ఆదేశాలు జారీచేశారు. * * కోదాడ: ఐపీఎల్‌ -10 సందర్భంగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ. 25 వేల నగదుతో పాటు ఓ బైక్‌, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. * * తిప్పర్తి(నల్లగొండ): వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో.. బస్సులో ఉన్న 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. * * బోధన్‌ మండలం తెగడపల్లి గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి(12) ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. దీంతో గట్టిగ కేకలు వేస్తూ బాలిక అక్కడే కుప్పకూలిపోయింది. ఇది గుర్తించిన చుట్టుపక్కల వారు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ నుంచి హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం బాలిక మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. * * కామేపల్లి: ప్రమాదవశాత్తు బావిలోపడి ఓ కానిస్టేబుల్‌ మృతిచెందిన సంఘటన ఖమ్మం జిల్లా కామేపల్లిలో జరిగింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో గుగులోతు రామకృష్ణ (39) కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గ్రామ శివారులోని వ్యవసాయ బావి వైపు మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందాడు. ఈయన స్వగ్రామం తల్లాడ. రెండున్నరేళ్లుగా కామేపల్లిలో పనిచేస్తున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. * * మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా సింగరేణి ఉపరితల బొగ్గుగని కేంద్రంలో మంగళవారం మధ్యాహ‍్నం బంకర్‌ కూలి ఇద్దరు కార్మికులు మృతిచెందారు. లారీలో బొగ్గు నింపుతుండగా.. అక్కడే పనులు చేస్తున్న పవన్‌ (31), రఘుపాల్‌రెడ్డి(32) అనే కార్మికులపై బంకర్‌ కూలింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తోటి కార్మికులు వెంటనే స్పందించి మృతదేహాలను వెలికి తీశారు. * * సూర్యాపేట: ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సూర్యాపేట మండలం రాజానాయక్‌తండా శివారులో శనివారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో వారిని అంబులెన్స్‌ల సాయంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. * * భువనగిరి: వేగంగా వెళ్తున్న కారులో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్‌ వాహనాన్ని వదిలి బయటకు దూకేశాడు. ఈ ప్రమాదంలో సాంట్రో కారు పూర్తిగా కాలిబూడిదైంది. ఈ సంఘటన యాదాద్రి జిల్లా భువనగిరి శివారులోని నల్లగొండ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడానికి యత్నించే లోపే కారు పూర్తిగా కాలిపోయింది. * * మహబూబ్‌నగర్‌: జిల్లాలోని దేవరకద్ర మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు చేపట్టిన దాడుల్లో పెద్దఎత్తున రేషన్‌ బియ్యం పట్టుబడ్డాయి. లబ్దిదారులకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయనే సమచారంతో రగంలోకి దిగిన అధికారులు మండల కేంద్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న 620 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఓ లారీ, బొలెరో వాహానాలను సీజ్‌ చేశారు. * * పెద్దపల్లి: ఇద్దరు భార్యలు కలిసి భర్తను హతమార్చిన సంఘటన జిల్లాలోని కమాన్‌పూర్‌లో గురువారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగి తిరుమలయ్య(65)ను ఆయన ఇద్దరు భార్యలు గొడ్డలితో నరికి చంపారు. తిరుమలయ్య అతని ఇద్దరు భార్యలు మదునమ్మ, ఐలమ్మలను గత కొన్నేళ్లుగా తీవ్రంగా హింసిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. * * హైదరాబాద్: ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓంకార్ నగర్‌లోని ఓ సెల్‌ఫోన్‌ దుకాణంలో గురువారం రాత్రి దొంగతనం జరిగింది. స్థానిక శ్రీనివాస్ మొబైల్ షాప్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి క్యాష్‌ బాక్స్‌లో ఉన్న రూ.50 వేల నగదుతోపాటు లక్ష రూపాయల విలువ చేసే ఫోన్లు ఎత్తుకెళ్లారు. దుకాణంలో అమర్చిన సీసీ కెమెరాలో చోరీ చిత్రాలు నమోదయ్యాయి. బాధితుడు ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. * * యాదాద్రి: పక్కింటి వారు తిట్టారనే మనస్థాపంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన యాదాద్రి జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో మంగళవారం జరిగింది. స్థానికంగా ఉండే లక్ష్మమ్మ అనే మహిళకు పక్కింటి వారికి విబేధాలు వచ్చాయి. దీంతో పక్కింటి వారు తిట్టడంతో ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. * * నిజామాబాద్ : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి యాసంగి పంటకు నీటిని విడుదల చేశారు. ఇరిగేషన్ అధికారులు గురువారం ఉదయం నీటిని విడుదల చేశారు. కాకతీయ కెనాల్ ద్వారా 6 వేల క్యూసెక్కులు, లక్ష్మీ కెనాల్ ద్వారా 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీటి విడుదలతో రైతులు నారుమడులు పోసేందుకు సిద్ధమవుతున్నారు. * * హుజూర్‌నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పోలీసులు బైక్ దొంగల ముఠాను పట్టుకున్నారు. గురువారం ఉదయం సీఐ వి. నర్సింహారెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు చెందిన 8 మంది సభ్యుల ముఠా గత కొంతకాలంగా ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతోంది. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు గురువారం ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 22 బైక్‌లను స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు పంపారు. * * భువనగిరి: యాదాద్రి జిల్లా భువనగిరిలోని బ్యాంకుల వద్ద పింఛనుదారులు నిరసన తెలిపారు. స్థానిక ఆంధ్రా బ్యాంకు వద్ద ప్రభుత్వ పింఛను దారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు రూ. 10 వేలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయగా రూ. 4 వేలే ఇస్తున్నారని నిరసన తెలిపారు. గంటలకొద్దీ క్యూలైన్లలో తాము నిలబడలేమని, ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. * * వరంగల్: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 226 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి గురువారం కోర్టుకు హాజరు పరిచారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిలో 12 మందికి 2 రోజుల జైలుశిక్ష విధిస్తూ.. న్యాయస్థానం తీర్పు నిచ్చింది. దీంతో పాటు మద్యం రాయుళ్లకు రూ. 3.52 లక్షల జరిమానాలు విధించింది. * * మిర్యాలగూడ: గ్యాంగ్ స్టర్ నయీం కేసుకు సంబంధించి 25 మంది నిందితులను పోలీసులు ఈరోజు మిర్యాలగూడ కోర్టు ఎదుట హాజరుపరిచారు. చర్లపల్లి జైల్లో ఉన్న నిందితులను పలు కేసుల్లో విచారణ నిమిత్తం ఈ రోజు మిర్యాలగూడ కోర్టుకు తీసుకొచ్చారు. వారిలో నయీం భార్య, సోదరి, అత్త ఉన్నారు. విచారణ అనంతరం తిరిగి వారిని చర్లపల్లికి తరలించారు. * * కాఠ్మాండు: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరానికి దగ్గర్లోని ఒక హిమనీనద సరస్సులోని నీటిని గణనీయంగా తగ్గించామని నేపాల్‌ ప్రకటించింది. వాతావరణంలో మార్పుల వల్ల హిమనీనదాలు వేగంగా కరుగుతున్నాయి. ఆ నీరంతా కట్టలు తెంచుకుని కిందకు ప్రవహిస్తే మహావిపత్తు సంభవిస్తుంది. * * మేడ్చెల్‌: మేడ్చల్ జిల్లా కీసర మండలం కుందన్‌పల్లి చౌరస్తాలో మంగళవారం ఉదయం ఒక లారీ బీభత్సం సష్టించింది. వేగంగా వెళుతున్న లారీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడమే కాక ఎదురుగా వెళుతున్న స్కూటర్‌ను డీకొని పక్కనున్న ఎన్‌వీఆర్‌ పెట్రోల్‌ బంక్‌లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో స్కూటర్‌పై వెళుతున్న యూనస్, ఖాజా అనే యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వారిని 108లో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. * * నిజామాబాద్‌: బోధన్‌లోని నిజాం దక్కన్‌ సుగర్స్‌ కంపెనీ కార్మికులు, అఖిలపక్షం నేతలు మంగళవారం బోధన్‌ బంద్‌ నిర్వహిస్తున్నారు. దక్కన్‌ సుగర్స్‌ లే ఆఫ్‌ ఎత్తివేయాలని, కంపెనీని పునరుద్ధరించాలని కోరుతూ కంపెనీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ బంద్‌ చేపట్టారు. బంద్‌లో అన్ని కార్మిక సంఘాల వారు, కంపెనీ కార్మికులు, టీడీపీ, సీపీఐ, సీపీఎం తదితర పక్షాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. * * శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం తప్పింది. ఫ్లయిట్‌లో పంపించేందుకు ఓ ఏజెంట్ కార్గో ఏరియాకు తీసుకువచ్చిన కెమికల్స్ బాక్సు నుంచి పొగలు వెలువడ్డాయి. గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. * * జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో శుక్రవారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీస్ కమీషనర్ కమల్‌హాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో 100 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. అనుమానం ఉన్న ప్రతి ఇంటినీ జల్లెడ పట్టారు. సరైన పత్రాలు లేని 8 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. * * చేర్యాల(సిద్ధిపేట జిల్లా): చేర్యాల సమీపంలో దూల్మిట్ట క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో మద్దూరు సాక్షి విలేకరి సత్యం గౌడ్(28) మృతిచెందాడు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న సత్యంను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. * * హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖ పరిధిలో పోలీస్ కానిస్టేబుల్ (సివిల్/ఏఆర్/ఎస్‌ఏఆర్/టీఎస్‌ఎస్‌పీ), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్)లో కానిస్టేబుల్ (పురుష), అగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్ పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రం బుక్‌లెట్లు, ప్రాథమిక కీను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) మంగళవారం విడుదల చేసింది. www.tslprb.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని బోర్డు చైర్మన్ డాక్టర్ జె.పూర్ణచంద్రరావు తెలిపారు. * * నారాయణపూర్: యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలకేంద్రంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు ఇళ్లు, ఒక నగల దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనాస్థలానికి క్లూస్ టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. * * కారేపల్లి: కల్తీ మద్యం తయారు చేస్తున్న వారిని తీసుకెళ్తున్న ఆటో బోల్తా పడటంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఆ సమయంలో ఆటోను నడుపుతున్నది పోలీస్ కానిస్టేబుల్ కావటం గమనార్హం. వివరాలివీ.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పోలీసులు సోమవారం ఉదయం రేలకాయలపల్లి జైత్రాం తండా, జీత్యా తండాలపై దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా కల్తీ మద్యం తయారు చేస్తున్నారనే ఆరోపణలతో ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. * * యదాద్రి: భువనగిరిలో శనివారం తెల్లవారుజామున లారీ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌ చౌరస్తాలోని బస్టాండ్‌ వద్ద జనంపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీలో శనివారం తెల్లవారుజామున నుంచి పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సౌత్‌జోన్‌ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో కామటిపుర, బార్కాస్‌, వట్టేపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 21 మంది రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు, నాలుగు ఆయుధాలు, 65 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. * * హైదరాబాద్‌: నగరంలోని ఇందిరాపార్క్‌ వద్ద రేపు (ఆదివారం) ఉదయం 10 గంటలకు రైతు దీక్ష చేపట్టనున్నారు. ఈ రైతు దీక్షలో తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌, రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొననున్నారు. తెలంగాణ ఏర్పాడ్డాక తొలిసారి కోదండరామ్‌ దీక్షకు దిగుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం రైతు సమస్యలు పట్టించుకోవడం లేదని కోదండరామ్‌ దీక్షకు దిగుతున్నట్టు సమాచారం. * * వాజేడు: స్కూల్ పిల్లలను తరలిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వాజేడు మండలం జగన్నాథపురంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామం నుంచి వాజేడు పాఠశాలకు వెళ్తున్న స్కూల్ పిల్లల ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. * * పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎన్టీపీసీ(నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్) 7 యూనిట్‌ లో ఉత్పత్తి నిలిచి పోనుంది. ఈ అంశాన్ని అధికారులు తెలిపారు. ఏడో యూనిట్ వార్షిక మరమ్మత్తుల కోసం శుక్రవారం నుంచి ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీని వల్ల 500ల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచి పోనుంది. * * మునగాల(నల్గొండ): మునగాల మండలం ఇంద్రానగర్ వద్ద జాతీయ రహదారిపై గురువారం ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బీభ్సతం సృష్టించింది. వడ్ల లోడుతో ముందుగా సూర్యాపేట వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను గౌతమి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ మీద ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * కరీంనగర్ జిల్లా: రేణికుంట బ్రిడ్జి సమీపంలో రాజీవ్ రహదారిపై బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఓ బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో బైక్‌లో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనతో ఆ మార్గంలో ఒక కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * మిర్యాలగూడ (నల్గొండ జిల్లా): మిర్యాలగూడ పట్టణంలోని ఓ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణానికి చెందిన మారం శ్రీనివాస్(45) అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. భార్యాబిడ్డలతో కలిసి హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. రియల్‌ ఎస్టేట్‌లో నష్టాలు రావడంతో అప్పులపాలై బలవన్మరణానికి పాల్పడ్డాడు. * * శాన్ ఫ్రాన్సిస్కో : అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేగింది. శాన్ ఫ్రాన్సిస్కోలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు విద్యార్థులు గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా పలువురు విద్యార్థులు కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈక్విటీ జూన్ జోర్డాన్ స్కూల్ సిటీ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీ హైస్కూల్ బయట ఈ కాల్పులు జరిగాయి. * * గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజేష్(14) అనే విద్యార్థి మృతి చెందాడు. స్కూలుకు వెళ్లటానికి రోడ్డు పక్కన నిల్చున్న సమయంలో అటుగా వస్తున్న టాటా ఏస్ వాహనం అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలైన రాజేష్‌ను నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. మార్గమధ్యంలోనే ప్రాణాలొదిలాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. * * కరీంనగర్‌: హుజారాబాద్‌లో మంగళవారం తెల్లవారుజామున నుంచి పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరానగర్‌, బుడగ జంగాల కాలనీల్లో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ జరిపారు. కార్డెన్‌ సర్చ్‌లో భాగంగా సరైన పత్రాలు లేని వాహనాలను ఆపి తనిఖీలు చేపట్టారు. * * అబ్దుల్లాపూర్‌మెట్ : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాచారం గ్రామంలోని సాయిప్రియ కెమికల్ పరిశ్రమలో మంగళవారం ఓ బాయిలర్ పేలి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. మృతుడు బిహార్‌కు చెందిన శివ చాంద్‌బీన్(31)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. * * మరిపెడ(వరంగల్‌): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన వరంగల్‌ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్‌ సాయంతో ఆస్పత్రికి తరలించగా అందులో ఒకరి పరిస్థతి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. * * నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో ఆదివారం అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో ఒక లారీ కాలిపోయింది. ఆదిలాబాద్ వైపు నుంచి నిర్మల్ వెళ్తున్న నిమ్మకాయల లోడ్ లారీలో నేరడిగొండ వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.అవి వేగంగా లారీ అంతటా వ్యాపించటంతో అప్రమత్తమైన లారీ డ్రైవర్, క్లీనర్ కిందికి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు.అనంతరం లారీ అగ్నికి ఆహుతయింది. కారణాలు తెలియాల్సి ఉంది. లారీడ్రైవర్ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. * * చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సుమారు రెండు వారాలుగా ఆసుపత్రికే పరిమితమయ్యారు. ఆమె చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రి డాక్టర్లు ముఖ్యమంత్రి కోలుకుంటున్నారని.. మరికొంత కాలం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పాలన కుంటుపడకుండా తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయచర్యలపై ఏఐఏడీఎంకే నేతలు దృష్టి పెట్టినట్లు సమాచారం. * * హైదరాబాద్: నాంపల్లిలో అన్ని ఆధునిక హంగులతో పోలీస్స్టేషన్ నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నరసింహరెడ్డి తెలిపారు. శనివారం ఉదయం పోలీస్స్టేషన్ కొత్త భవనానికి నాయిని నర్సింహారెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతోపాటు నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి, ఇతర పోలీసులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. * * ఐక్యరాజ్యసమితి: కర్బన ఉద్గారాలను తగ్గించుకునే ఒప్పందంపై మెజారిటీ దేశాలు సంతకాలు చేయడంతో నవంబర్‌ 4 నుంచి ప్యారిస్‌ ఒప్పందం అమల్లోకి వస్తుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ బాన్‌ కీ మూన్‌ వెల్లడించారు. దీన్నోక చిరస్మరణీయ ఘటనగా అవర్ణించారు. * * హైదరాబాద్ : మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురిని మల్కాజిగిరి సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా కీసరకు చెందిన యు.బలరాం, కృష్ణ, నర్సింహ అనే వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బొమ్మ పిస్టళ్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. * * కథలాపూర్(కరీంనగర్) : ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు అక్కడే ఉన్న హుండీని ఎత్తుకుపోయారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం కలిగోట గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం అర్థరాత్రి సత్యనారాయణ స్వామి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు గర్భగుడిలో విలువైన వస్తువులు ఏమీ లేకపోవటంతో హుండీని పెకిలించుకు పోయారు. శుక్రవారం ఉదయం గమనించిన పూజారి గ్రామ పెద్దలకు సమాచారం అందించారు. ఈ మేరకు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. * * కౌడిపల్లి: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారం గేటు వద్ద రాస్తారోకో జరిగింది. సలబాత్తపూర్ పంచాయతీని కొత్తగా ఏర్పాటు చేస్తున్న చిలిప్‌చేడ్ మండలంలో కాకుండా కౌడిపల్లి మండలలోనే కొనసాగించాలని ఆ పంచాయతీ ప్రజలు డిమాండ్ చేశారు. సుమారు 30 నిమిషాల పాటు రాస్తారోకో జరగడంతో మెదక్-నర్సాపూర్ రహదారిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. * * సిద్ధిపేట(మెదక్ జిల్లా) : సిద్ధిపేట మండలకేంద్రం గణేశ్ నగర్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికంగా నివాసముంటున్న శ్రీశైలం, పదయ్య, నర్సింహులు అనే ముగ్గురి ళ్లలో చోరీకి పాల్పడ్డారు. మూడిళ్లలో కలిపి 2 తులాల బంగారం, రూ.10 వేల నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. * * కొణిజర్ల(ఖమ్మం జిల్లా) : కొణిజర్ల మండలకేంద్రంలోని ఎండీఓ ఆఫీసు వద్ద గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. అదే సమయంలో అటుగా వచ్చిన మరో లారీ వచ్చి ఈ రెండు లారీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురికి గాయాలయ్యాయి. ఇదేవిధంగా కొణిజర్ల పోలీస్‌స్టేషన్ సమీపంలో లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఖమ్మం తరలించారు. * * కొత్తకోట(మహబూబ్‌నగర్) : మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటలో ఓ మహిళ దారుణంగా హత్యకు గురైంది. మండల కేంద్రంలోని వడ్డెవాడ సమీపంలోని ముళ్ల పొదల్లో ఓ మహిళ(50) మృత దేహం పడి ఉండగా గురువారం ఉదయం స్థానికులు కనుగొన్నారు. ఎక్కడో చంపి ఇక్కడ పడేసి ఉంటారని భావిస్తున్నారు. ఆమె స్థానికురాలు కాదని చెబుతున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవాల్సి ఉంది. * * హైదరాబాద్ : ముగ్గురు యువకులు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన ఘటనలో గాయపడిన చిన్నారి సంజన బ్రెయిన్ డెడ్ కాలేదని కామినేని ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రసాదరావు వెల్లడించారు. అయితే ఆమె పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. బుధవారం హైదరాబాద్లో ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రసాదరావు విలేకర్లతో మాట్లాడుతూ... చిన్నారి సంజన పరిస్థితి విషమంగానే ఉందన్నారు. * * శంషాబాద్(రంగారెడ్డి) : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆరేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడింది. హైదరాబాద్ కొత్తపేటకు చెందిన అరవింద్‌రావు దంపతులు తమ కూతురు నవ్య(6)తో కలసి బంధువులకు వీడ్కోలు చెప్పేందుకు మంగళవారం రాత్రి ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో చిన్నారి నవ్య డిపార్చర్ రైలింగ్ పైనుంచి కిందపడి పోయింది. తలకు తీవ్ర గాయాలుకాగా చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. వెంటనే జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. * * కీసర(రంగారెడ్డి) : డంపింగ్ యార్డు కారణంగా చెరువు నీరు కలుషితం అవుతోందంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వివరాలివీ.. రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాల సమీపంలో జీహెచ్‌ఎంసీ డంపింగ్ యార్డు ఉంది. ఈ యార్డు నుంచి వెలువడే వ్యర్థ జలాలు పక్కనే ఉన్న చెరువులో కలుస్తున్నాయి. సాగు నీరు కలుషితమవుతోందంటూ కొన్ని రోజులుగా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ఇదే విషయమై ఒక్కటైన గ్రామస్తులు బుధవారం ఉదయం చెత్తను తీసుకువచ్చే జీహెచ్‌ఎంసీ వాహనాలను అడ్డుకున్నారు. * * హైదరాబాద్ : కూకట్‌పల్లి జేఎన్‌టీయూ పరిపాలన విభాగంలో భారీగా మార్పులు, చేర్పులు చేస్తూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారు. డెరైక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్‌గా ఉన్న ఈశ్వరప్రసాద్‌ను సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూ ప్రిన్సిపాల్‌గా నియమించారు. అడ్మిషన్స్ డెరైక్టర్‌గా మంజూర్ హుస్సేన్‌ను, ఎగ్జామినేషన్స్ కంట్రోలర్‌గా తార కల్యాణి, బిక్స్ డెరైక్టర్‌గా లక్ష్మణరావు, డీయూఎఫ్‌ఆర్‌గా చెన్నకేశవరెడ్డిని నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. * * బాల్కొండ(నిజామాబాద్ జిల్లా) : ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 2 లక్షల 4 వేల 939 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్ధ్యం 90.313 టీఎంసీలు కాగా ప్రస్తుతం 89.763 టీఎంసీల నీరు ఉంది. కాకతీయ కెనాల్‌కు 5 వేల క్యూసెక్కులు, సరస్వతీ కెనాల్‌ఖు 1000 క్యూసెక్కులు, లక్ష్మీ కెనాల్‌కు 300 క్యూసెక్కులు, ఎస్కేప్ రెగులేటర్‌కు 3 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. మొత్తం 74,939 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. * * కరీంనగర్ : ప్రమాదవశాత్తు మూడు ఎలుగు బంట్లు వ్యవసాయ బావిలో పడి మరణించాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం శ్రీరాములపేటలో సోమవారం చోటు చేసుకుంది. ఆ విషయాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించారు. దీంతో గ్రామస్తులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని... ఎలుగు బంట్లను బావిలో నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. * * హైదరాబాద్ : పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్న ఓ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. కుషాయిగూడ నాగార్జుననగర్ కాలనీకి చెందిన ఇందుభార్గవి(19), చాంద్ అలీ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారి వివాహానికి పెద్దలు అంగీకరించకపోవటంతో రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. అనంతరం తమకు ప్రాణాహాని ఉందని, బంధువుల నుంచి రక్షణ కల్పించాలంటూ మంగళవారం కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు. * * కెరామెరి(ఆదిలాబాద్ జిల్లా) : కెరామెరి మండలం కెలికే గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గౌరూభాయ్(60), బ్యీసన్(30) అనే తల్లీ కొడుకులు ప్రమాదవశాత్తూ తమ పొలంలో కరెంటు షాక్ తగిలి మృతిచెందారు. ఈ సంఘటన నిన్ననే జరిగినా ఆలస్యంగా బయటపడింది. తల్లీకొడుకు మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. * * హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు కనిపించటం కలకలం రేపింది. లక్నో వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడి లగేజిని తనిఖీ చేయగా మూడు బుల్లెట్లు బయటపడ్డాయి. దీంతో భద్రతా సిబ్బంది అతడిని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. * * మహబూబ్‌ నగర్: మహబూబ్‌ నగర్ జిల్లా మరికల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృత్యువాతపడ్డారు. శనివారం ఉదయం రెండు లారీలు వేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో రెండు లారీల డ్రైవర్లు క్యాబిన్‌లోనే ప్రాణాలు విడిచారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో రాయిచూర్ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని వాహనాలను పక్కకు తొలగించేందుకు యత్నిస్తున్నారు. క్షతగాత్రులను మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. * * ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బాసరలో వేంచేసి ఉన్న సరస్వతీ మాత సన్నిధిలో దసరా ఉత్సవాలు మొదలయ్యాయి. మొదటిరోజు శైలిపుత్రిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తోంది. శనివారం వేకువజాము నుంచి భక్తులు దర్శనం కోసం క్యూకట్టారు. భైంసాపట్టణానికి చెందిన వ్యాపారవేత్త జి.రమేష్ కుటుంబసభ్యులు అమ్మవారికి రెండు తులాల బంగారు గొలుసును సమర్పించుకున్నారు * * కరీంనగర్ : ఎగువ ప్రాంతాల నుంచి వరదతో కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు జలాశయం పూర్తిస్థాయిలో నిండింది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 920 అడుగులు కాగా.. ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం కొనసాగుతోంది. జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి 16,000 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో.. 8 గేట్లు ఎత్తి 16,000 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. కాకతీయ కాలువకు మరో 2, 000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. * * డిచ్‌పల్లి: వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టిన ఘటనలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టడంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జాం అయింది. * * కరీంనగర్ : లోయర్ మానేరు డ్యామ్‌కు వరద తగ్గుముఖం పట్టింది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 920 అడుగులు, నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా గురువారం ఉదయం ఎనిమిది గంటలకు 919.40 అడుగులు, 23.51 టీఏంసీల నీరు ఉంది. డ్యామ్‌కు ఇన్‌ఫ్లో 10,800 క్యూసెక్కులు ఉండగా.. కాకతీయ కెనాల్ ద్వారా 5,000 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. * * శంషాబాద్ : పిల్లర్ కోసం తీసిన గుంటలో పడి బాలుడు మృతిచెందిన సంఘటన శంషాబాద్ మిషన్‌కంపౌడ్ సమీపంలోని శీనయ్య వెంచర్‌లో గురువారం వెలుగుచూసింది. స్థానిక శీనయ్య వెంచర్‌లో కార్మికులుగా పనిచేస్తున్న హరీష్, యాదమ్మ దంపతుల ఆరేళ్ల కుమారుడు బాలు పిల్లర్ గుంటలో పడి మృతిచెందాడు. శ్రీనయ్య వెంచర్‌లో పిల్లర్‌ల కోసం గుంటలు తవ్వారు. అందలో వర్షపు నీరు చేరడంతో ప్రమాదవశాత్తు బాలుడు అందులో పడి మృతిచెందాడు. * * ధర్మసాగర్(వరంగల్) : వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ధర్మసాగర్ సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న కేశబోయిన దేవేందర్(34) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో రాత్రి ప్యాసింజర్‌ను దించి ఇంటికి తిరిగి వస్తుండగా.. ఆటో బోల్తా కొట్టడంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటాన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. * * పెద్దమందడి(మహబూబ్‌నగర్) : వేగంగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన ఘటనలో బస్సు డ్రైవర్, క్లీనర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా పెద్దమందడి మండలం మోజెర్ల స్టేజీ సమీపంలో 44వ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. * * హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లి మూసాపేటలో బుధవారం వేకువజామున దారుణం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు స్నేహితులను వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో బైక్ వెనుక కూర్చున్న హరికృష్ణ(28) అనే యువకుడు మృతిచెందాడు. స్నేహితుని మరణాన్ని జీర్ణించుకోలేని రమేష్(28) భరత్‌నగర్ రైలు పట్టాలపై ఆత్మహత్యచేసుకున్నారు. హరికృష్ణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాగా రమేష్ శ్రీశ్రీ హోలిస్టిక్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. * * హైదరాబాద్ : భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని నీటి ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తింది. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.30 అడుగులకు వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 200.658 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు బుధవారం వెల్లడించారు. * * నిజాంసాగర్(నిజామాబాద్ జిల్లా) : నిజామాబాద్ జిల్లాలోని నిజామ్‌సాగర్‌కు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి నిజాంసాగర్‌కు 1.16లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 19 గేట్లు ఎత్తివేసి 1.03 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. * * మెదక్ : మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం చిల్వర వద్ద మంగళవారం రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. * * చెన్నై: చెన్నైలో ఓలా క్యాబ్ డ్రైవర్ ఓ మహిళా డాక్టర్పై లైంగికదాడికి ప్రయత్నించాడు. మరో ఇద్దరితో కలసి ఆమెను బలవంతంగా కారులో తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కారు వెనుక వాహనంలో వెళ్తున్న ఓ వ్యక్తి డాక్టర్ అరుపులు విని చేజ్ చేసి స్థానికులతో కలసి ఆమెను రక్షించాడు. * * శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 200 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా(ఏఐ-559) విమానం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నిలిపేశారు. ఉదయం 6.40 వెళ్లాల్సిన విమానం ఇప్పటికీ బయలుదేరకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఇంత జరుగుతున్నా ఎయిర్ ఇండియా అధికారులు మాత్రం తమకేం బాద్యత లేనట్లు వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. * * ఖమ్మం : రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. దాదాపు అన్ని చెరువులు, కుంటల్లో నీరు ప్రమాదస్థాయికి చేరుకుంది. ఖమ్మం జిల్లా చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు బుధవారం ఉదయం ప్రాజెక్ట్ పదిగేట్లను ఎత్తివేసి... 23,730 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. * * కరీంనగర్ : ఎస్సారెస్సీ ప్రధాన కాలువకు గండిపడటంతో.. వందల ఎకరాల్లో పంట నీట మునిగింది. కరీంనగర్ జిల్లా మానాల సమీపంలో గల ఎస్సారెస్సీ ప్రధాన కాలువకు మంగళవారం రాత్రి భారీ గండి పడింది. దీంతో పెగడపల్లి, గొల్లపల్లి మండలాల పరిధిలోని చెరువులన్ని నిండిపోయాయి. సుద్దపల్లిలోని కొయ్యచెరువు, రాఘవపట్నంలోని మొగుళ్ల చెరువుకు గండి పడటంతో.. వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. * * హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాల్లో కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్న ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య విద్య సీట్లకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకూ వెబ్ ఆప్షన్ల నమోదుకు గడువు ఉంటుందని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ కరుణాకరరెడ్డి తెలిపారు. * * శంషాబాద్ : దుబాయ్ వెళుతున్న అహ్మద్ అనే వ్యక్తి నుంచి మంగళవారం ఉదయం భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహించగా అహ్మద్ వద్ద భారీగా విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. నిందితుని అదుపులోకి తీసుకుని విచారణచేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * హైదరాబాద్ : ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేసంలో ఆయన పాల్గొనున్నారు. ముఖ్యమంత్రి తోపాటు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కూడా ముఖ్యమంత్రి బృందంతో పర్యటించనున్నారు. * * హైదరాబాద్‌: నాంపల్లిలోని టీఎన్‌జీవో కార్యాలయంలో సోమవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీలో పనిచేస్తున్న సుమారు 700 మంది నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగులను తెలంగాణకు బదిలీ చేయాలంటూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పెట్రోల్‌ డబ్బాలతో టీఎన్‌జీవో కార్యాలయంలోకి ఉద్యోగులు వెళ్లడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. * * దుగ్గొండి(వరంగల్) : ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో.. బైక్‌పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. * * తిర్యాని: స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఆశ్రమ పాఠశాల విద్యార్థి వాగులో మునిగి మృతి చెందాడు. అదిలాబాద్ జిల్లా తిర్యాని మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న కె. లక్ష్మణ్‌రాహూల్(12) ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి సమీపంలోని వాగులో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. * * చొప్పదండి: కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలంలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. భూపాలపట్నంకు చెందిన మునిగాల అంజయ్య (48) అప్పులబాధతో గ్రామశివారులోని పశువుల కొట్టం వద్ద ఉరివేసుకొని బలవన్మరణం చెందాడు. స్థానిక రైతులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. గ్రామంలో 4.38 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా గత కొన్నేళ్లుగా వ్యవసాయంలో నష్టాలు రావడంతో రూ.5లక్షలకు పైగా అప్పులయ్యాయి. వాటిని తీర్చే మార్గం లేక మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. * * హైదరాబాద్ : తెలంగాణ విమోచన దినం నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో జాతీయ జెండా ఎగరేసేందుకు బీజేపీ ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి యత్నించారు. అందులోభాగంగా ఆయన వాహనంలో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే కిషన్రెడ్డి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు... కిషన్రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. * * మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తిని రేవెన్యూ డివిజన్ చేయాలంటూ కల్వకుర్తి MLA అయిన చల్లా వంశీచంద్ రెడ్డి చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి అరెస్ట్ చేసారు. * * చర్ల: ఖమ్మం జిల్లా తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉదృతి పెరిగింది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన 9 గేట్లను 2 అడుగుల మేర ఎత్తారు. 8400 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు నుంచి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 73.6 మీటర్లుగా ఉంది. * * నల్గొండ : నల్గొండ జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టులో నీటి మట్టం బుధవారం 47.59 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టులోకి 29,373 క్యూసెక్కుల నీరు వస్తుండగా..9,929 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు నుంచి అధికారులు బయటికి వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 21.30 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు. * * నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా దోమకొండలో ఓ బాలుడు ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ తగిలి మరణించాడు. వివరాలు ఇలా ఉన్నాయి... వివేక్ (16) అనే బాలుడు బుధవారం వేకువజామున ప్రమాదవశాత్తూ కరెంటు షాక్‌కు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని రుద్ర ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాద్దిసేపటికే మరణించాడు. * * నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్ర శివారులో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఇద్దరికి మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డారు. బస్సు ముందు భాగం మాత్రం దెబ్బతిన్నది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. * * యాలాల: రంగారెడ్డి జిల్లా యాలాల శివారులో ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ మండలం హుస్నాపూర్ గ్రామానికి చెందిన వెంకటయ్య, యోగి జీవనోపాధి కోసం వచ్చి రంగారెడ్డి జిల్లాలో స్థిరపడ్డారు. * * కరీంనగర్: కరీంనగర్ జైలు నుంచి ఇద్దరు దొంగలు పరారీ అయ్యారు. వీరి కోసం కరీంనగర్ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జైలు నుంచి పరారైన వారు మహారాష్ట్ర పార్సీ గ్యాంగ్కు చెందిన జితేందర్, యోగేశ్లుగా గుర్తించారు. * * హైదరాబాద్: పాతబస్తీ భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తలాబ్‌కట్ట, అమన్ నగర్ ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్‌నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన దృవపత్రాలు లేని 83 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. * * శంషాబాద్ (హైదరాబాద్‌): శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రంయలో తనిఖీలు నిర్వహిస్తున్న కస్టమ్స్ అధికారులు అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 320 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద అక్రమ బంగారం గుర్తించిన ఎయిర్‌పోర్ట్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. * * నార్కెట్‌పల్లి(నల్లగొండ): వేగంగా వెళ్తున్న కారు, లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి శివారులోని 65వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. * * ములుగు: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు నీటిగుంటలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ములుగు మండలం బండారుపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏడాదిన్నర చిన్నారి తల్లిదండ్రులు పనులు చూసుకుంటుండగా.. చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందు ఉన్న నీటిగుంటలో పడి మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. * * కోరుట్ల: మోటర్ పెట్టడానికి వ్యవసాయ బావి దగ్గరకు వెళ్లిన రైతు ప్రమాదవశాత్తు విద్యుధ్ఘాతానికి గురై మృతి చెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాంరెడ్డి(45) ఈ రోజు ఉదయం మోటర్ ఆన్ చేయడానికి వెళ్లాడు. అయితే షార్ట్ సర్క్యూట్ కావడంతో కరెంట్ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. * * పంజగుట్ట: మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ నిమ్స్‌ ఆసుపత్రి ఓపీలో రెప్పపాటులో రూ. 40 వేలు చోరీ చేసింది. అక్కడే విధుల్లో ఉన్న ఓ మహిళా గార్డు ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం ... నాంపల్లికి చెందిన గౌసియా బేగం (32) బుధవారం మధ్యాహ్నం నిమ్స్‌ ఆసుపత్రి ఓపీ వద్దకు వచ్చింది. * * మహేశ్వరం: వేగంగా వెళ్తున్న లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టిన ఘటనలో క్లీనర్ మృతిచెందగా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం రావిర్యాల ఔటర్ రింగ్‌ రోడ్డుపై గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పెద్ద అంబర్‌పేట్ నుంచి వస్తున్న లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టింది. * * తాండూరు(రంగారెడ్డి): కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ఎం. మాణిక్‌రావు(86) నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాణిక్‌రావును కుటుంబ సభ్యులు నిమ్స్ ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందారు. * * దమ్మపేట: దుక్కి దున్నుతున్న ట్రాక్టర్‌పై విద్యుత్ స్తంభం విరిగిపడటంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లిలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లకావత్ చిట్టయ్య(35), ధారావత్ మహేష్(22)లు ట్రాక్టర్ సాయంతో దుక్కిదున్నతున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం విరిగిపడింది. దీంతో ట్రాక్టర్ పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. * * హైదరాబాద్: జిల్లాల పునర్విభజన విషయంలో అధికార టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను కలసి తమ అభ్యంతరాలను తెలిపారు. మంగళవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిలు సచివాలయంలో సీఎస్‌ను కలసి వినతి పత్రం అందజేశారు. * * హైదరాబాద్ : దసరా నుంచి కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు అన్నీ ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. జిల్లా కలెక్టర్లతో ఆయన ఈ విషయమై సమావేశమయ్యారు. కొత్త జిల్లాల్లో పనిభారాన్ని బట్టి పరిపాలనా విభాగాలు ఉండాలని తెలిపారు. అధికారుల సర్దుబాట్లు, కొత్త ఉద్యోగుల నియామకాలు జరగాలని సూచించారు. * * సంగారెడ్డి: మెదక్ జిల్లా పటాన్‌చెరు ఇస్నాపూర్ వద్ద సోమవారం అర్థరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. వేగంగా వచ్చిన ట్యాంకర్ లారీ ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో బైక్‌పై వెళుతున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. * * మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సివిల్ జడ్జి నాగరాజు ఇంట్లో దొంగలు పడి బీభత్పం సృష్టించారు. జడ్జి కుటుంబసభ్యులు ఊరు వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగింది. ఇరుగుపొరుగువారు ఇచ్చిన సమాచారం మేరకు మిర్యాలగూడ పోలీసులు క్లూస్ టీమ్‌తో చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. జడ్జికి సమాచారం ఇచ్చారు. * * నల్గొండ : భువనగిరిలో గ్యాంగ్స్టర్ నయీం అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై స్థానిక ఆర్డీవో శనివారం విచారణ జరపనున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 1700 మంది బాధితులు ఇప్పటికే ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. నల్గొండ జిల్లా బొమ్మాయిపల్లిలోని లక్ష్మీనరసింహ వెంచర్లో 1700 మందికి చెందిన ప్లాట్లను నయీం తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. * * హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-2 రాత పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2015 డిసెంబర్ 30న 439 పోస్టుల భర్తీకి జారీ అయిన నోటిఫికేషన్ కింద ఇప్పటికే 5,64,431 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, మరో 593 పోస్టుల భర్తీకి ప్రస్తుత అనుబంధ నోటిఫికేషన్ కింద మరో లక్షన్నర మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. * * హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య మరో వివాదం తలెత్తింది. సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న 21 మంది తెలంగాణ ఇంజినీర్లు తమను ఏపీ జెన్ కో అధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమపై జెన్ కో అధికారులు పరిమితికి మించిన పనిభారం మోపుతున్నారని పేర్కొటూ.. మూడు రోజులుగా తెలంగాణ ఇంజనీర్లు విధులకు హాజరవడం మానేశారు. * * వరంగల్ ఎంజీఎం: వరంగల్ జిల్లా కేంద్రంలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. స్థానిక లేబర్ కాలనీకి చెందిన సంధ్య అనే మహిళకు మొదటికాన్పులో ముగ్గురు ఆడ శిశువులు పుట్టారు. ఈ సంఘటన వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో శనివారం చోటుచేసుకుంది. శనివారం ఉదయం 8 గంటల సమయంలో ఆసుపత్రి వైద్యులు మహిళకు సర్జరీ చేసి ముగ్గురు శిశువులను బయటకు తీశారు. ముగ్గురూ ఆరోగ్యంగా ఉన్నారు. * * హైదరాబాద్: ఇటీవల పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన గ్యాంగ్‌స్టర్ నయీం ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. శేషన్న ప్రధాన అనుచరుడు సోమన్నఇచ్చిన సమాచారం మేరకు నగరంలోని కుషాయిగూడలో సిట్ అధికారులు గురువారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నయీం అనుచరులు శ్రీనివాస్, లక్ష్మణ్‌లను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని తమ కార్యాలయానికి తరలించారు. నయీంకు సంబంధించిన మరింత అదనపు సమాచారం కోసం సిట్ అధికారులు వారిని విచారిస్తున్నారు. * * కరీంనగర్: నేడు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె కరీంనగర్ జిల్లాలో సంపూర్ణంగా కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాలయాలు సంపూర్ణంగా బంద్ పాటిస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జిల్లాలో 11 డిపోలలో మొత్తం 980 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. * * నల్లగొండ: దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నేపథ్యంలో యాదగిరిగుట్టలో కార్మిక సంఘాలు సమ్మెలో పాల్పంచుకున్నాయి. ఆర్టీసీ కార్మకులు కూడా ఈ సమ్మెలో పాల్గొనడంతో.. యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోకు చెందిన 105 బస్సులు డిపోలోపలే ఉండిపోయాయి. దీంతో యాదగిరిగుట్టకు వచ్చే భక్తులు, ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ వాహనదారులు తమకు ఇష్టం వచ్చిన రీతిలో ప్రయాణికుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. * * యాదగిరిగుట్ట : నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని సాయిబాబా మందిరంలో వినాయకుడి రూపంలో అల్లం దర్శనమివ్వడంతో.. స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలకు ముందు ఇలా జరగడం శుభ పరిణామమని భక్తులు భావిస్తున్నారు. స్థానిక సాయి ఆలయంలో అన్నదానం కోసం కొనుగోలు చేసిన అల్లంలో పార్వతి పుత్రుడి ప్రతిమ రూపంలో ఉన్న అల్లం లభించిందని ఆలయ సిబ్బంది తెలిపారు. ఈ వార్త తెలిసిన ప్రజులు పెద్ద ఎత్తున అల్లం వినాయకుడిని దర్శించుకోవడానికి తరలి వస్తున్నారు. * * నల్లగొండ: నల్లగొండ జిల్లా దామరచర్లలో దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు గురువారం రట్టు చేశారు. అందుకు సంబంధించి నలుగురు వ్యక్తులకు పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక కిరాణా దుకాణంలో నకిలీ నోట్లు మారుస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని... తమదైన శైలిలో విచారించారు. * * హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురంలో సుష్మా థియేటర్ వద్ద బ్లాక్లో టికెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 50 సినిమా టికెట్లతోపాటు రూ. 2 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీసుస్టేషన్కు తరలించారు. * * హైదరాబాద్‌ జిల్లాలో 49,903 పింఛన్లకు కోత పడనుంది. ప్రభుత్వం చేపట్టిన లెఫ్‌ ఎవిడెన్స్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ బుధవారంతో ముగియడం నిజమైన పింఛన్‌దారుల లెక్కతేల నుంది. 36,512మంది వెరిఫికేషన్‌ చేయించుకోకపోగా, వెరిఫికేషన్‌ ప్రక్రియలో పాల్గొన్నా వేలిముద్రలు సరిపోలకపోవడం, ఆధార్‌తో లింకు కలువని 11,392 మందికి పింఛన్లు నిలిచిపోనున్నాయి. ఆధార్‌ లింకు మ్యాచ్‌ కాని వా రు మళ్లీ కొత్తగా ఆధార్‌ నమోదు చేసుకోవాల్సి ఉంది. * * మెదక్ : మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ వద్ద గురువారం వ్యాన్ను స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి... వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. * * ఖమ్మం: జిల్లాలో భారీగా ఎస్సైలు బదిలీ అయ్యారు. జిల్లాలోని దాదాపు 58 మంది ఎస్సైలకు స్థానచలనం కల్పిస్తూ జిల్లా ఎస్పీ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఎస్సైలుగా విధులు నిర్వహిస్తున్నవారితోపాటు... కొత్తగా ఎస్సై ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి కూడా ఈ బదిలీల్లో పోస్టింగ్ ఇస్తున్నట్లు ఎస్పీ ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. * * హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన బాట చేపట్టాయి. అందులోభాగంగా గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు కళాశాలల బంద్కు సదరు యాజమాన్యం పిలుపు నిచ్చింది. * * లాస్‌ఏంజిలెస్: అంగారక గ్రహం ఉపరితలంపై ఉన్న పరిస్థితులను భూభాగంపై సృష్టించి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా జరిపిన అరుదైన ప్రయోగం విజయవంతంగా ముగిసింది. ఈ మేరకు నాసా అమెరికాలోని హవాయి రాష్ట్రంలో అంగారక గ్రహం పరిస్థితుల్లో మానవుడి మనుగడ సాధ్యమా అన్న అంశంపై పరిశోధన నిర్వహించింది. ఆరుగురి బృందంతో ఏడాది క్రితం ప్రారంభించిన ఈ ప్రయోగం సోమవారం ముగిసింది. * * నేడు ఐసెట్ ప్రవేశాలకు కొనసాగుతున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ - 50,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు నేడు వెరిఫికేషన్ - ఎన్సీసీ కేటగిరిలో 30,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ * * హైదరాబాద్: స్విస్ ఛాలెంజ్ పై నేడు హైకోర్టులో విచారణ * * హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ కోసం 1969లో జరిగిన ఉద్యమంలో పాల్గొని పోలీస్ కాల్పుల్లో గాయపడ్డ హైదరాబాద్ వాసి పగడాల పరంధామకు రూ.10 లక్షల ఆర్థికసాయం అందించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. 1969 ఏప్రిల్ 4న సికింద్రాబాద్ జనరల్ బజార్‌లో జరిగిన కాల్పుల్లో పరంధామ ఛాతిలో, కుడి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. * * లాస్ ఎంజెల్స్: లాస్ ఎంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎలాంటి కాల్పుల ఘటనలు చోటుచేసుకోలేదని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఒక పెద్ద శబ్దం మాత్రమే వచ్చి దాన్ని ఎయిర్ పోర్ట్ సిబ్బంది కాల్పులుగా భ్రమపడ్డారని చెప్పారు. అమెరికాలోని లాస్ ఎంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాల్పులు చోటుచేసుకున్నాయని తొలుత కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. * * విశాఖపట్నం: రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం సూచించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని వెల్లడించింది. * * హైదరాబాద్: తమ డిమాండ్లను తీర్చి, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఎన్‌ఎంలూ మంత్రి నివాసం ముట్టడికి యత్నించారు. సోమవారం ఉదయం మణికొండలోని మంత్రి లక్ష్మారెడ్డి ఇంటి వద్దకు భారి ఎత్తున చేరుకున్న ఏఎన్‌ఎంలు ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి సమ్మె విరమించి వస్తే సమస్య సరిష్కారానికి కృషి చేస్తానని హామి ఇచ్చారు. * * బిర్కూర్ : నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండల కేంద్రంలోని తిరుమల దేవస్థానంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు శనివారం ఉదయం వరుణయాగం నిర్వహించారు. దేవస్థానం ఆవరణంలోని గణపతి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. * * న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో 118 మందితో కూడిన భారీ బృందాన్ని పంపిస్తే కేవలం రెండు పతకాలు మాత్రమే దక్కడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది. వచ్చే మూడు ఒలింపిక్స్‌లలో పతకాలు కొల్లగొట్టేందుకు సమగ్ర కార్యాచరణ పథకాన్ని అమలు చేసేందుకు టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. * * హైదరాబాద్‌సిటీ: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపించారు. రాజేంద్రనగర్ పరిధిలోని గగన్‌పహాడ్ వద్ద హైదరాబాద్-బెంగుళూరు జాతీయరహదారిపై రవాణాశాఖాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 10 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. తనిఖీలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. * * మియామి: అతను చెవిటి వ్యక్తి. సంకేత భాషలోనే ఎవరితోనైనా ముచ్చటిస్తాడు. వేగంగా వాహనాన్ని నడుపుతున్నాడనే సాకుతో అతన్ని ఓ జవాను వెంబడించాడు. ఇద్దరి మధ్య 13 కిలోమీటర్ల పాటు హోరాహోరీగా ఛేజింగ్ జరిగింది. చివరకు అతను తన ఇంటికి సమీపంలో వాహనాన్ని ఆపాడు. వాహనం దిగిన అతన్ని జవాను తుపాకీతో కాల్చాడు. సంఘటనా స్థలంలోనే అతను కుప్పకూలాడు. అమెరికాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దుమారం రేపుతోంది. * * అహ్మదాబాద్: ఓ సీనియర్ జర్నలిస్టు ఏకంగా పత్రికా కార్యాలయంలోనే దారుణంగా హత్యకు గురయ్యాడు. కార్యాలయంలో కూర్చుని వార్తాకథనం రాస్తుండగా దుండగులు ఆయనను కిరాతకంగా పొడిచి చంపారు. నెత్తుటి మడుగులో ఉన్న ఆయన మృతదేహాన్ని మంగళవారం పోలీసులు గుర్తించారు. గుజరాత్ సౌరాష్ట్ర ప్రాంతంలోని జునాగఢ్ పట్టణంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. * * హిమాయత్‌నగర్‌: రోడ్డు, రవాణా భద్రతా బిల్లు, ఆర్టీఏ, ట్రాఫిక్‌ పోలీసుల వేధింపులకు నిర సనగా సెప్టెంబర్‌ 2న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఆటోడ్రైవర్ల సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నాయకులు తెలిపారు. హిమాయత్‌నగర్‌లోని ఎఐటియుసి భవన్‌లో సోమవారం బంద్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో లక్ష్మయ్య పాల్గొన్నారు. * * పంజగుట్ట: గణేష్‌ ఉత్సవాలను గతంలో మాదిరిగానే నిర్వహించుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసినా పోలీసు అధికారులు నిబంధనల పేరుతో వేధించడం తగదని భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ప్రతినిధులు అన్నారు. గణేష్‌ నిమజ్జనంతో కాలుష్యం వెలువడటం లేదని పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు నివేదిక ఇచ్చిందని, ఎత్తు విషయంలో జోక్యం చేసుకోబోమని హైకోర్టు పేర్కొన్నా ఎత్తు తగ్గించాలని ఒత్తిడి చేయడం దారుణమన్నారు. * * హైదరాబాద్: మాజీ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డిని కరీంనగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మావోయిస్టు, గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీమ్ తరహాలోనే మోహన్‌రెడ్డి అరాచకాలకు పాల్పడేవాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గ్యాంగ్‌స్టార్‌ నయీం ముఠాతో సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు. నిన్న రాత్రి (సోమవారం) 8 గంటలకు మోహన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. * * ఇస్తాంబుల్ : ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన 12 ఏళ్ల ఆత్మాహుతి బాంబర్.. టర్కీలో ఉగ్రవాద దాడి చేసి, 51 మంది ప్రాణాలు బలిగొన్నాడు. ఓ పెళ్లిని లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 69 మంది గాయపడ్డారు. వారిలో 17 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ దాడికి పాల్పడింది 12 ఏళ్ల కుర్రాడేనని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తెలిపారు. * * ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేసినిరోడ్డు రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇది గుర్తించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. * * కోయంబత్తూర్: తన ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను హతమార్చింది. తొలి ప్రయత్నంలో పాముల ద్వారా కాటు వేయించాలని ప్రయత్నించి అది విఫలం కావడంతో సుఫారీ ఇచ్చి అతడిని హత్య చేయించింది. ఈ ఘటన తమిళనాడులోని పట్టనంపుదూర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళకు కృష్ణ అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉంది. * * దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా మొదటి స్థానానికి చేరుకుంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో కోహ్లి సేన టాప్ ర్యాంకులో నిలిచింది. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ లో ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోవడంతో టీమిండియా మొదటి ర్యాంకు సొంతం చేసుకుంది. 3-0తో సిరీస్ ను శ్రీలంక క్లీన్ స్వీప్ చేయడంతో మొదటి ర్యాంకులో ఉన్న ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది. * * హైదరాబాద్: స్థానికేతర ఉద్యోగులు తమను ఇబ్బంది పెడుతున్నారంటూ తెలంగాణ సచివాలయంలో రెండో రోజు ఆర్థిక శాఖ ఉద్యోగులు బుధవారం తమ నిరసనలు తెలిపారు. ఉన్నతాధికారుల వద్ద పీఎస్లుగా పని చేస్తున్నవారిని తప్పించాలని వారు డిమాండ్ చేశారు. అందులోభాగంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును టీ. ఉద్యోగుల సంఘం నేతలు కలిశారు. * * హైదరాబాద్‌: హయత్‌నగర్ మండలం పసుమాముల బీసీ హాస్టల్ విద్యార్థి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి... సదరు బీసీ హాస్టల్లో ఉంటూ రాకేశ్ అనే విద్యార్థి కలుషిత నీరు తాగి తీవ్ర అనారోగ్యం పాలైయ్యాడు. దీంతో హాస్టల్ సిబ్బంది అతడిని ఎల్బీ నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రెండు రోజులుగా చికిత్స పొందుతు బుధవారం రాత్రి మరణించాడు. * * నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం దుర్కి గ్రామంలో డయేరియాతో గంగవ్వ (50) అనే మహిళ గురువారం మృతి చెందింది. గ్రామంలో డయేరియా ప్రబలింది. దీంతో సమాచారం అందుకున్న జిల్లా వైద్యాధికారులు గ్రామంలో మూడు రోజులు వైద్యశిబిరం నిర్వహించారు.అయితే గంగవ్వ ఈ రోజు మరణించింది. దాంతో బోధన్ ఆర్డీవో సుధాకర్ రెడ్డి గురువారం దుర్కి గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులకు అందుతున్నసేవలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. * * హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం మహముద్ అలీ అధ్యక్షతన మంత్రులు కడియం శ్రీహరి, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. జిల్లాల ఏర్పాటుపై అన్ని వర్గాల నుంచి వచ్చే ప్రతిపాదనలు చర్చించి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. * * హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీం కేసు దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. సిట్ అధికారిగా ఐజీ నాగిరెడ్డిని ప్రభుత్వం నియమించింది. అడిషనల్ ఎస్పీ, ఇద్దరు డీఎస్సీలు సహా 8మందితో ఏర్పాటు అయిన సిట్ బృందానికి నాగిరెడ్డి నేతృత్వం వహిస్తారు. * * పంజగుట్ట: న్యాయస్థానంలోనే న్యాయవాదిపై దాడి చేసిన వ్యక్తిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు... నగరానికి చెందిన దీక్ష అమోల్, బాలకృష్ణ అమోల్‌ భార్యాభర్తలు. దీక్ష తన భర్త అయిన బాలకృష్ణపై గృహహింస కేసు పెట్టగా ఎర్రమంజిల్‌ కోర్టులో మంగళవారం కేసు విచారణకు వచ్చింది. కూకట్‌పల్లికి చెందిన న్యాయవాది వసంత్‌రావు దేశ్‌పాండే కేసు వాదిస్తుండగా, తీవ్ర ఆగ్రహానికి గురైన బాలకృష్ణ న్యాయవాదిని చొక్కా పట్టుకుని బయటకు లాక్కొచ్చి దాడి చేశాడు. * * కరీంనగర్(పెద్దపల్లి) : కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో చేరాలనుకునే విద్యార్థుల కోసం రెండో విడత కౌన్సెలింగ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు పెద్దపల్లి ఐటీఐ ప్రిన్సిపాల్‌ సురేందర్‌ తెలిపారు. 11 నుంచి 20 తేదీల్లో అభ్యర్థులు దరఖాస్తులు అందజేయాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో దరఖాస్తు ఫారాలు లభిస్తాయన్నారు. అభ్యర్థులకు ఈ నెల 24, 28, 30 తేదీల్లో కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు. * * గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరులు, బంధువుల నివాసాల్లో రెండో రోజు కొనసాగుతున్న పోలీసుల సోదాలు * * నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఈ నేపథ్యంలో నేటి మధ్యాహ్నాం 2.00 గంటలకు అరకులోని ఎన్టీఆర్ గ్రౌండ్స్లో ఆదివాసీ దినోత్సవం జరగనుంది.ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి రావెల కిషోర్ బాబు పాల్గొనున్నారు. * * మెదక్: మెదక్ జిల్లా ఆంధోల్ మండలం కిచ్చన్నపల్లి వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. క్రూజర్ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వాసుపత్రిలో ప్రాధమిక చికిత్స తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. * * నల్గొండ: చిట్యాల మండలo వేలిమినేడు గ్రామ శివార్లో గుర్తు తెలియని మహిళ మ్రుతదేహము లభ్యమైంది. ఈ మహిళ చనిపోయి 2 రోజులు అయి ఉండవచ్చని ఎస్.ఐ. శివకుమార్ అనుమానము వ్యక్తము చేశారు. * * కరీంనగర్(పెద్దపల్లి): కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామంలోని VRO గౌస్ పాషా అక్కడి రైతు నుండి 20 వేలు లంచం తీసుకుంటుండగా ACB కి పట్టుబడ్డాడు. * * హైదరాబాద్ : జీవో 123పై సోమవారం హైకోర్టు డివిజన్ బెంచ్లో విచారణ జరిగింది. భూ నిర్వాసితులు, రైతు కూలీల రక్షణ కోసం తీసుకునే చర్యలను తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ ద్వారా కోర్టుకు సమర్పించింది. నిబంధనల ప్రకారమే నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తున్నామని... వ్యవసాయ కూలీలను ఆదుకుంటామని అడ్వకేట్ జనరల్ (ఏజీ) ఆ అఫిడవిట్లో విన్నవించారు. * * ఇస్లామాబాద్ లో జరిగిన సార్క్ హోంమంత్రుల సదస్సుకు భారత జర్నలిస్టులను అనుమతించని పాకిస్తాన్ వారిని కనీసం ప్రవేశ ద్వారం వద్ద కూడా ఉండనివ్వలేదని వెల్లడైంది. సార్క్ దేశాల ప్రముఖులను పాక్ హోంమంత్రి నిసార్ ప్రవేశ ద్వారం వద్ద ఆహ్వానిస్తున్నపుడు భారత జర్నలిస్టులు అక్కడే ఉన్నారు. భారత హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ రాగానే పాక్ జర్నలిస్టులు ఫోటోలు తీసేందుకు సన్నద్ధమవుతుండగా వీరూ వెళ్లారు. అయితే అక్కడ నుండి వెళ్లిపోవాలని, గేటు బయట నిలబడేందుకూ కూడా భారత్ జర్నలిస్టులకు అనుమతి లేదని పాక్ అధికారులు తేల్చి చెప్పారు. * * నేడు ఆగష్టు 6న తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జయంతి * * ఇవాళ ఇస్రో, తెలంగాణ ఇరిగేషన్ శాఖ మధ్య ఎంవోయూ అత్యాధునిక టెక్నాలజీతో తెలంగాణ జలవనరుల సమాచార వ్యవస్థ జలాశయాల్లో నీటి నిల్వలను ఉపగ్రహంతో విశ్లేషించనున్న తెలంగాణ * * శంషాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో శనివారం ఉన్నతాధికారులు హైఅలెర్ట్ ప్రకటించారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకులు నేపథ్యంలో నిఘా వర్గాలు ఎయిర్ పోర్టు అధికారులను అప్రమత్తం చేశారు. * * పెబ్బేరు(మహబూబ్‌నగర్): రైతులు పెట్టిన విషం గుళికలు తిని దాదాపు 40 జింకలు చనిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొందరు రైతులు కృష్ణా నదిలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. పంటను పురుగుల బారి నుంచి రక్షించుకునేందుకు మొదళ్ల వద్ద శుక్రవారం రాత్రి విషం గుళికలను చల్లారు. సమీపంలోని అటవీప్రాంతం నుంచి వచ్చిన జింకలు గడ్డి మేసుకుంటూ వచ్చి గడ్డితోపాటు గుళికలను కూడా తినేశాయి. దీంతో అ విష ప్రభావానికి లోనై దాదాపు నలబై జింకలు చనిపోయాయి. * * వాయువ్య బంగాళఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఉ.ఒడిశా, ప.బెంగాల్, జార్ఖండ్ తీరాలను ఆనుకుని అల్పపీడనం అల్పపీడన ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఒడిశా, కోస్తాంధ్ర మీదుగా ద.తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కోస్తా తీరం వెంబడి గంటకు 45-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక: వాతావరణ కేంద్రం * * మ్మం: ఛత్తీస్‌గఢ్ దంతేవాడ జిల్లాలో శుక్రవారం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. దంతేవాడ - బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన సర్సఫాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఆ విషయాన్ని పసిగట్టిన మావోయిస్టులు... పోలీసులపై కాల్పులకు దిగారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులకు దిగారు. * * ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లెందులోని ఓపెన్‌కాస్టు సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇల్లెందు పట్టణంలోని ప్రధాన రహదారిపై అధిక వేగంతో వెళ్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ లారీ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోగా మరో లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. * * కరీంనగర్ : ఎస్సీ వర్గీకరణ బిల్లు వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అందులోభాగంగా శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైల్వేస్టేషన్లో వారు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్లో ఆగి ఉన్న సింగరేణి ప్యాసింజర్ రైలును వారు నిలిపివేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో భారీగా ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. * * హైదరాబాద్: ఈ నెల 8 నుంచి తెలంగాణలోని 11 విశ్వవిద్యాలయాల్లో నిరవధికంగా బంద్ పాటించనున్నట్లు తెలంగాణ వర్సిటీ నాన్ టీచింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కంచి మనోహర్, సెక్రెటరీ జనరల్ మహిపాల్ రెడ్డి బుధవారం పేర్కొన్నారు. రాష్ట్ర్రంలో అతిపెద్దదై ఉస్మానియాతో పాటు ఇతర వర్సిటీల్లో ప్రతి నెల 1న వేతనాలు, ఫించన్లు రావడం లేదన్నారు. సీమాంధ్రుల పాలనలో కూడా వేతనాలకు ఇలాంటి దుస్థితి ఎన్నడూ ఏర్పడలేదన్నారు. * * హైదరాబాద్: ప్రత్యేక హైకోర్టు ఉద్యమంలో పాల్గొన్న న్యాయవాదులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు నోటీసులివ్వడానికి నిరసనగా గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయాలని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నిర్ణయించింది. జేఏసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి నేతృత్వంలో న్యాయవాదులు బుధవారం సమావేశమయ్యారు. * * వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 48 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు... అలాగే తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. * * కరీంనగర్: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కాన్వాయ్‌కి బుధవారం తృటిలో ప్రమాదం తప్పింది. కాన్వాయ్‌లోని ఓ వాహన డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేయడంతో వెనకున్న టీఆర్‌ఎస్ నాయకుల వాహనాలు ఒకదానివెంట మరొకటి వరసగా ఢీకొన్నాయి. దీంతో సదరు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి ఈటల రాజేందర్ బుధవారం మెట్‌పల్లి వచ్చారు. * * కరీంనగర్(ముకరంపుర): జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ప్రభుత్వ నిర్ణయం ఊరటనిచ్చింది. పదేళ్లుగా కీలకంగా పనిచేస్తున్న ఫీల్డ్‌అసిస్టెంట్లను రెగ్యులరైజ్‌ చేయాలని, వేతనాలు పెంచాలన్న డిమాండ్‌తో చేపట్టిన ఆందోళనలకు సర్కార్‌ ఎట్టకేలకు దిగివచ్చింది. ప్రస్తుతం నెలవారీగా ఇస్తున్న వేతనం రూ.6240నుంచి రూ.10 వేలకు పెంచింది. * * మణుగూరు :ఖమ్మం జిల్లా మణుగూరు సమీపంలో మంగళవారం స్కూలు బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. విప్పల సింగారం నుంచి జీఎం ఆఫీసు రోడ్డులో వస్తున్న హోలీ ఫ్యామిలీ స్కూల్ బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోయి... అదుపుతప్పి బస్సు కాల్వలోకి దూసుకెళ్ల్లింది. అందులోని ఐదుగురు విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. * * చండీగఢ్: వాళ్లంతా దివ్యాంగులు. కొందరికి చూపులేదు, ఇంకొందరు బుద్ధిమాంద్యులు.. అందరూ చిన్నపిల్లలే. అంతసేపు హాయిగా ఆడుకున్నవాళ్లుకాస్తా మధ్యాహ్నం భోజనం తిన్నతర్వాత వాంతులు చేసుకోవడం మొదలుపెట్టారు. నిమిషాల్లోనే పరిస్థితి చేయిదాటిపోయింది. పిల్లలు ఒకొక్కరిగా రాలిపోయారు. పంజాబ్ లోని కపుర్తలా జిల్లా కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం కనిపించిన దృశ్యాలివి. * * పురవి: వరంగల్‌ జిల్లా పురవి మండల కేంద్రంలో ఉన్న ఆంధ్రాబ్యాంకులో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. రాత్రి సమయంలో బ్యాంకు తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దుండగులు కౌంటర్‌ గదిలో సీసీ కెమెరాలను కత్తిరించారు. సోమవారం ఉదయం సిబ్బంది బ్యాంకును తెరవడంతో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పురవి సీఐ శ్రీనివాస్‌, ఎస్సై రామకృష్ణ అక్కడకు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. * * నేడు ఎంసెట్-3 షెడ్యూల్ విడుదల చేసే అవకాశం జేఎన్టీయూ వీసీ లేదా రిజిస్ట్రార్కు కన్వీనర్ బాధ్యతలు ఎంసెట్-2 విద్యార్థులకు పాత రిజిస్ట్రేషన్ పై కొత్త హాల్టికెట్లు * * ఇవాళ ప్రారంభంకానున్న రూపాయికే నల్లా కనెక్షన్ పథకం గ్రేటర్ హైదరాబాద్లో పేదలకు రూపాయికే వాటర్ కనెక్షన్ * * వరంగల్: వరంగల్ జిల్లా ధర్మాసాగర్ జలాశయంలో ఆదివారం గల్లంతైన కానిస్టేబుల్ పొలిమారి సృజన్(25)మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు. ఆదివారం మిత్రులతో కలిసి ఈతకు వెళ్లిన సృజన్ ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. * * మహారాష్ట్ర: పుణెలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిపోవడంతో తొమ్మిది మంది కార్మికులు మృతిచెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు యత్నిస్తున్నారు. * * వరంగల్ : వరంగల్ నగరంలోని ఆర్టీఏ జంక్షన్లో బస్సు... ముందు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను నగరంలోని ఆసుపత్రికి తరలించారు. * * హైదరాబాద్ : ఎంసెట్ - 2 పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ... మంత్రులు కడియం, లక్ష్మారెడ్డి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. శుక్రవారం మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి విద్యార్థి సంఘాలు యత్నించాయి. ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. * * న్యూఢిల్లీ: పార్లమెంటులో ఓ కోతి హల్ చల్ చేసింది. అరగంటపాటు అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది. దాన్ని బందించేందుకు ప్రయత్నం చేసిన చివరకు వారికి దొరకకుండా దానంతట అదే దర్జాగా ప్రధాన ద్వారం గుండా బయటకు వెళ్లింది. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం ఎంపీలు, జర్నలిస్టులు చదువుకునేందుకు ఏర్పాటుచేసిన పార్లమెంటు రీడింగ్ హాల్ లోకి ఓ కోతి ప్రవేశించింది. * * కరీంనగర్‌: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో ఏఈకికు రెండేళ్ల జైలుశిక్ష, రూ.పదివేల జరిమానా విధిస్తూ బుధవారం ఏసీబీ కోర్టు తీర్పు వెలువరిచింది. 2008లో గంగాధరలో విద్యుత్‌ శాఖ ఏఈగా పనిచేస్తున్న బండారు అజయ్‌కుమార్‌ గంగాధరకు చెందిన అంకం శంకరయ్య అనే పవర్‌లూం కార్మికుడికి విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు అదే ఏడాది జనవరి 18న రూ.6వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. * * వరంగల్ : వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా కేసముద్రం మండలం రాజీవ్ నగర్ తండా సమీపంలో గురువారం చోటుచేసుకుంది. తండా నుంచి కేసముద్రం వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో.. కారు నడుపుతున్న రమేష్ పండిట్ రాథోడ్ (42) అక్కడికక్కడే మృతి చెందాడు. * * హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన కేసు విచారణను డివిజన్ బెంచ్ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. హైకోర్టు విభజనపై తెలంగాణ ప్రభుత్వ రివ్యూ పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది. హైదరాబాద్లోనే రెండు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయాలని టీ.సర్కార్ తన పిటిషన్లో కోరింది. గత తీర్పును పునసమీక్షించాలన్న పిటిషన్పై తీర్పును ఉమ్మడి హైకోర్టు రిజర్వ్లో ఉంచిన విషయం తెలిసిందే. దాంతో కేసును విచారించిన డివిజన్ బెంచ్.. తాను తీర్పును ప్రకటించలేనని, విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు ప్రకటన * * నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం కోమలంచ గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భూమా రమేశ్ (35) అనే రైతు కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. పొలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు ఫ్యూజు అమరుస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గ్రామస్తుల సహాయంతో అతడి మృతదేహాన్ని ఇంటికి తరలించారు. * * కరీంనగర్: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం జిల్లెల క్రాసింగ్ వద్ద ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిమ్మాపూర్ మండలానికి చెందిన మహ్మద్ రిజ్వాన్ (32) అక్కడికక్కడే మృతిచెందగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడ్ని సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. * * తిమ్మాపూర్‌ : రవాణాశాఖకు సంబంధించిన ఆన్‌లైన్‌ సేవలపై మీ సేవా కేంద్రాలు, ఈ సేవా కేంద్రాల నిర్వాహకులు, ఉద్యోగులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు కరీంనగర్‌ డీటీసీ వినోద్‌కుమార్‌ తెలిపారు. రోజుకు మూడు బ్యాచ్‌ల చొప్పున జిల్లాలోని నిర్వాహకులకు బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఆన్‌లైన్‌ సేవలకు దరఖాస్తు చేసుకునే వి«ధానం నేర్చుకునేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. * * హైదరాబాద్ : హెచ్ఎండీఏ పనులపై ఉన్నతాధికారులతో నేడు కేటీఆర్ భేటీ. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, సుందరీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష * * హైదరాబాద్ : నేడు, రేపు ఏఎఫ్ఆర్సీ భేటీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరహాలో వైద్య ఫీజుల పెంపుపై చర్చ * * కీసర : రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాలలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కమాన్ వద్ద పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోలో తరలిస్తున్న 9 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోతోపాటు ఎస్కార్ట్గా బైకుపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. * * నారాయణపేట: అన్నం పెట్టే రైతులపై దాడి చేసిన ఏ ప్రభుత్వం నిలబడలేదని, మల్లన్న సాగర్ నిర్వాసితులపై లాఠీచార్జి జరిపించిన కేసీఆర్ ప్రభుత్వానికి పోయేకాలం దాపురించిందని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం అప్పంపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. * * మెదక్‌: మల్లన్నసాగర్‌ నిర్వాసితులపై ఆదివారం జరిగిన పోలీసుల లాఠీచార్జీకి నిరసనగా అఖిలపక్షం ఈరోజు మెదక్‌ జిల్లా బంద్‌ చేపట్టింది. ఉదయాన్నే కాంగ్రెస్‌, తెదేపా, భాజపా, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన నేతలు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై నేతలు మండిపడ్డారు. జనజీవనంపై బంద్‌ ప్రభావం పాక్షికంగా ఉంది. చాలా చోట్ల ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. బంద్‌ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. * * హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో జాతీయ రహదారిపై ఏబీవీపీ రాస్తారోకో చేపట్టింది. ఎన్నికల సందర్భంగా తెరాస ఇచ్చిన కేజీ టు పీజీ ఉచిత విద్య హామీని వెంటనే నెరవేర్చాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళనతో జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. * * లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రైలుప్రమాదం సంభవించింది. భదోహిలో కాపలా లేని రైల్వేగేట్‌ వద్ద ఈరోజు ఉదయం పట్టాలు దాటుతున్న స్కూల్‌ బస్సును రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 19 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. * * విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఛత్తీస్గఢ్ నుంచి తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయిని చెప్పింది. తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. * * ఇబ్రహీంపట్నం: కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్‌లోని ఆలయంలో చోరీ జరిగింది. స్థానిక పెద్దమ్మ ఆలయంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి అమ్మవారి నగలను అపహరించుకు పోయారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. నాలుగు తులాల బంగారు ఆభరణాలతో పాటు వెండి సామాగ్రి చోరీకి గురైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. * * తాండూరు : రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా తాండూరు - వికారాబాద్‌ల మధ్యలో ఉన్న కందమెల్లి వాగు పొంగిపొర్లుతుంది. దాంతో తాండూరు - హైదరాబాద్‌ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గురువారం అర్ధరాత్రి నుంచి వాగు పొంగిపొర్లుతుంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. * * నల్లగొండ: స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఆటో ఢీకొన్ని చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కేతెబోయిన కావ్య (3) ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో కావ్య తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. * * కరీంనగర్‌ క్రైం: బెజ్జంకి ఏఎస్సై వహిద్‌ పాషాపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ ఎస్పీ జోయల్‌డేవిస్‌ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని పేర్కొంటూ బెజ్జంకి పీఎస్‌లో పనిచేస్తున్న ఓ మహిళ హోంగార్డ్‌ ఫిర్యాదుచేసింది. ఈమేరకు విచారించిన ఎస్పీ వాహిద్‌ పాషాను సస్పెండ్‌చేశారు. * * కరీంనగర్‌ జిల్లా మద్యం డిపో పరిధిలో ఉన్న 41 మద్యం దుకాణాలు, 5 బార్లను మెదక్‌ జిల్లా సిద్దిపేటలో కొత్తగా ప్రారంభంకానున్న మద్యం డిపోకు బదిలీచేస్తూ బుధవారం రాత్రి ఎకైసజ్‌శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గంభీరావుపేట మండలం పరిధిలోని 9 దుకాణాలు, సిరిసిల్ల ఎకై ్సజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని 15 మద్యం దుకాణాలు, 3 బార్లు, వేములవాడ ఎకై ్సజ్‌ ఠాణా పరిధిలోని 17 మద్యం దుకాణాలు, 2 బార్లను బదిలీ చేశారు. ఆగస్టు 1 నుంచి వీటికి సిద్దిపేట డిపో నుంచి మద్యం సరఫరా చేస్తారు. ఈ మేరకు జగిత్యాల ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌క * * జమ్ము: అమర్నాథ్ యాత్రకు వెళుతున్న యాత్రికులకు కష్టాలు కొనసాగుతునే ఉన్నాయి. జమ్మూకశ్మీర్ లో అశాంతికర పరిస్థితుల నేపథ్యంలో మరోసారి యాత్రికులను అధికారులు అడుగు కూడా వేయనివ్వడం లేదు. * * సిరిసిల్ల: సిరిసిల్ల మండలం సర్ధాపూర్‌ శివారులో 7వ పోలీస్‌ బెటాలియన్‌ ఏర్పాటుకు 120 ఎకరాల భూమిని కేటాయించారు. ఈమేరకు సిరిసిల్ల ఆర్డీవో ఆఫీస్‌లో సోమవారం డివిజన్‌ సర్వేయర్‌ శ్రీనివాస్‌తో సంబంధించిన హద్దులను నిర్ధారించారు. ఇప్పటికే పోలీస్‌ బెటాలియన్‌ కోసం 120 ఎకరాల స్థలాన్ని శాటిలైట్‌ ద్వారా సర్వే నిర్వహించి కేటాయించారు. క్షేత్రస్థాయిలో భూమి కేటాయింపులను కలెక్టర్‌ నీతుప్రసాద్‌ పరిశీలించారు. * * పార్లమెంట్లో మోదీ, రాజ్‌నాథ్, జైట్లీతో విడివిడిగా భేటీకానున్న కేసీఆర్ * * ఢిల్లీ: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు పార్లమెంటు ముందుకు రానున్న 16 బిల్లులు వచ్చే నెల 12 వరకు జరగనున్న వర్షాకాల సమావేశాలు * * వరంగల్: బైక్ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలోని నార్లాపూర్ వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. మేడారానికి చెందిన సిద్ధబోయిన ఆనందరావు (35) బైక్ పై వెళ్తుండగా.. నార్లాపూర్ వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆనందరావు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. * * కరీంనగర్: ఆలయంలోకి చొరబడిన దుండగులు స్వామివారి విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేటలో శనివారం వెలుగు చూసింది. గ్రామ శివారులోని సీతారామ ఆలయంలో ఉన్న స్వామివారి విగ్రహాన్ని గత రాత్రి కొందరు దుండగులు ధ్వంసం చేశారు. శనివారం ఉదయం ఆ విషయాన్ని గమనించిన స్థానికులు 63వ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. * * తిమ్మాపూర్ (కరీంనగర్) : పురుగులమందు తాగి భార్యాభర్తలు మృతిచెందిన సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గురువారం చోటుచేసుకుంది. కాల్వ శ్రీరాంపుర్ మండలానికి చెందిన ప్రభాకర్(37), తేజస్వి(34) దంపతులు కరీంనగర్‌లోని మారుతీనగర్‌లో నివాసముంటూ.. బంగారం పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో గురువారం తిమ్మాపూర్‌కు వెళ్లిన దంపతులు ఆలయ సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. * * హైదరాబాద్: వీధి కుక్కల దాడిలో నలుగురు చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన హైదరాబాద్ లోని ఎల్బీనగర్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న చిన్నారుల పై వీధికుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు కాగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు కుక్కలను తరిమికొట్టి చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. * * కరీంనగర్ జిల్లా జమ్మికుంట్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తి ధర క్వింటాలుకు రిఆకర్డుస్థాయిలో రూ.6,470 పలికింది. దాంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంట దిగుబడి తగ్గినందువల్ల ధర పెరిగిందని రైతులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం ఈ ధర పలికిందని వారంటున్నారు. * * హైదరాబాద్: ప్రైవేటు విద్యాసంస్థల దోపడీ విధానాన్ని వ్యతిరేకిస్తూ గురువారం తెలంగాణ విద్యాసంస్థల బంద్‌ కొనసాగుతుంది. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్‌ కొనసాగతుంది. ఈ సందర్భంగా విద్యా రంగంలో ప్రైవేటు విద్య నానాటికీ పెరిగిపోతోందని, అది సామాన్యుడికి అందుబాటులో లేదని సంఘాలు ఆరోపించాయి. విద్యారంగంలో ప్రభుత్వ ప్రాధాన్యాన్ని బలోపేతం చేయాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీ అమలు చేయాలని డిమాండ్‌ చేశాయి. * * హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కెన్యాకు చెందిన దంపతుల నుంచి కేజీన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా దుబాయి నుంచి ఈ రోజు ఉదయం హైదరాబాద్ వచ్చిన వీరి వద్ద బంగారం ఉండటాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అయితే వారి వద్ద బంగారానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో దంపతులను అదుపులోకి తీసకుని, బంగారాన్ని సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం.12 లో గురువారం ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంటిని నిర్మించేందుకు రాళ్లను బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * హైదరాబాద్: హైదరాబాద్ కూకట్ పల్లిలో తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆకస్మిక పర్యటన నిర్వహించారు. రోడ్లు, నీటి సరఫరా, బస్టాండ్ తదితర ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. రాత్రి 11 గంటలనుంచి 2:30 గంటల వరకు కేటీఆర్ తనిఖీలు కొనసాగాయి. ఈ సందర్భంగా రోడ్లపై వాననీరు నిల్వ ఉండటం పట్ల జీహెచ్ఎంసీ సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి రమ‍్య మృతికి కారణమైన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు. * * భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కాస్త తగ్గింది. నీటిమట్టం బుధవారం ఉదయం 49.5 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. మంగళవారం సాయంత్రం నీటిమట్టం 52.4 అడుగులకు చేరిన విషయం తెలిసిందే. రాత్రికి రాత్రి నీటి మట్టం తగ్గడంతో అధికారులు, ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. * * కేంద్ర ప్రభుత్వ నైపుణ్యం, మెలకువల శిక్షణలో భాగంగా నిరుద్యోగ దళిత యువతకు అడ్వాన్స్‌ కంప్యూటర్‌ హర్డ్‌వేర్‌, కోర్‌ నెట్‌వర్కింగ్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఎంసీపీ ఎడ్యూకేషన్‌ సోసైటీ డైరెక్టర్‌ ఎంఆర్‌ చెన్నప్ప తెలిపారు. డిప్లొమా లేదా బిటెక్‌, పీజీ పూర్తి చేసి, 18 నుంచి 45 లోపు వయసున్నవారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు లక్డికాపూల్‌లోని జెన్‌ వొకేషనల్‌ కాలేజీలో ఈ నెల 14న నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు. * * చండీగఢ్‌: ప్రొ కబడ్డీని ఆస్వాదిస్తున్న అభిమానులను అలరించేందుకు మరో మెగా ఈవెంట్‌ రాబోతోంది. నవంబర్‌ 3న చండీగఢ్‌ వేదికగా ప్రపంచకప్‌ కబడ్డీ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలు 3 నుంచి 17 వరకు జరుగుతాయి. చండీగఢ్‌లోని 14 వేదికల్లో ఈ పోటీలు నిర్వహిస్తామని పంజాబ్‌ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ చెప్పారు. 14 దేశాలు పోటీపడే ఈ ప్రపంచకప్‌లో పురుషులు, మహిళలు విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. పురుషుల విభాగంలో విజేతగా నిలిచిన జట్టుకు రూ.2 కోట్లు, రన్నరప్‌కు రూ.కోటి నగదు బహుమతిగా ఇస్తారు. మహిళల్లో * * కరీంనగర్ : జిల్లావ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. మహదేవ్‌పూర్ మండలంలో పెద్దంపేట, సర్వాయిపేట, వంకెన వాగులు పొంగిపొర్లుతుండడంతో 17 గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ధర్మపురి వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. సింగరేణి రామగుండం రీజియన్‌లో నాలుగు ఓపెన్ కాస్ట్ బొగ్గుపనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. * * హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు మంగళవారం ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి కోల్కతా వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కోల్కతా వెళ్లే 120మంది ప్రయాణికులు ఉదయం అయిదు గంటల నుంచి పడిగాపులు పడుతున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా విమానాల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులు గంటల కొద్ది విమానాశ్రయంలో తిప్పలు పడాల్సి వస్తున్న విషయం తెలిసిందే. * * హైదరాబాద్ : హైదరాబాద్లోని నాగ్పూర్ జాతీయ రహదారిపరై ఆర్టీఏ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఏడు ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేశారు. అలాగే సరైన పత్రాలు లేని రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. * * హైదరాబాద్ : నగరంలోని గోల్కొండ సక్కుబాయినగర్ ప్రాంతంలో మంగళవారం మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సదరు మహిళను దుండగులు అత్యాచారం చేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పరిసర ప్రాంతాల్లోని స్థానికులను పోలీసులు విచారిస్తున్నారు. * * హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం ఓ విమానాన్ని ఎయిర్ పోర్ట్ అధికారులు అత్యవసరంగా ల్యాండ్ చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి సౌదీ అరేబియా బయల్దేరిన విమానంలో ఓ ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఆ ప్రయాణికుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. * * హైదరాబాద్ సిటీ : డీసీఎం వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 22.45 క్వింటాళ్ల గంజాయిని హయాత్‌నగర్ పోలీసులు సోమవారం ఉదయం పట్టుకున్నారు. ఈ సంధర్భంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి నగరానికి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ముందస్తు సమాచారంతో హయాత్‌నగర్ పోలీసులు అబ్దుల్లామెట్ వద్ద కాపు కాశారు. గంజాయి లోడుతో వచ్చిన డీసీఎం వ్యానును ఆపి అందులోని 22.45 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంధర్భంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. * * సికింద్రాబాద్ : నగరంలోని తుకారంగేటు పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్తీలో సోమవారం ఉదయం చిన్న గొడవ జరగడంతో ఆగ్రహించిన మల్లేష్ అనే వ్యక్తి చంద్రకళ అనే మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ప్రయత్నించి మంటలను ఆర్పారు. అప్పటికే ఆమె శరీరం చాలావరకూ కాలిపోయింది. వెంటనే ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మల్లేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. చంద్రకళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. * * కరాచి: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ సిరీస్ నిర్వహణకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ మేరకు ఇరు క్రికెట్ బోర్డుల మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. ఎడిన్‌బర్గ్‌లో ఐసీసీ సభ్య దేశాల సమావేశం సందర్భంగా పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్, బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ముఖాముఖి సిరీస్ గురించి చర్చించినట్లు తెలిసింది. రెండు దేశాల ప్రభుత్వాల అనుమతి లభిస్తే ఈ సీజన్‌లోనే తటస్థ వేదికల్లో సిరీస్ నిర్వహించాలని బోర్డు పెద్దలు యోచిస్తున్నారు. * * హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా పి.సర్దార్‌సింగ్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మెదక్‌జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన ఈయన గతంలో మహారాష్ట్రలోని మహాత్మగాంధీ అంతరాష్ట్రీయ విశ్వవిద్యాలయంలో ఫైనాన్స్‌ ఆఫీసర్‌గా, జాయింట్‌ రిజిస్ట్రార్‌, డిప్యూటీ రిజిస్ట్రార్‌గా పనిచేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఇందిర కళా సంగీత విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌గా సేవలందించారు. * * దామరచర్ల: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం ఇర్కిగూడెం వద్ద కృష్ణాతీరంలో పార్వతీదేవి ఆలయ నిర్మాణానికి గాను తవ్వకాలు నిర్వహిస్తుండగా పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది. కృష్ణానదీ తీరంలో పార్వతీదేవి ఆలయ నిర్మాణానికి తెలంగాణ సర్కార్ రూ. 5లక్షలు మంజూరు చేసింది. దాంతో ఈ రోజు ఉదయం నిర్మాణ పనులు ప్రారంభించారు. * * నల్లగొండ: నల్లగొండ జిల్లాలో శుక్రవారం రాత్రి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఓ వ్యక్తి నుంచి రూ.6.30 లక్షలను దొంగలు దోచుకెళ్లిన ఘటన వేములపల్లి మండలం అన్నపురెడ్డిగూడెంలో చోటుచేసుకుంది. స్థానిక పెట్రోల్ బంక్లో క్యాషియర్గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి శుక్రవారం రాత్రి క్యాష్ తీసుకుని ఇంటికెళ్తుండగా దొంగలు దాడికి పాల్పడ్డారు. వెంకటేశ్వర్లును తీవ్రంగా గాయపరచిన దొంగలు అతని వద్ద ఉన్న రూ.6.30 లక్షలను తీసుకుని ఉడాయించారు. దీంతో బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు * * కరీంనగర్ : నేదునూరులో జెన్కో పవర్ప్లాంట్ పనులు వెంటనే చేపట్టి నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. లేకుంటే భూములును తిరిగి రైతులకు అప్పగించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. గురువారం కోదండరామ్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరులో జెన్కో పవర్ ప్లాంట్ కోసం సేకరించిన భూములను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక రైతులతో కోదండరామ్ సమావేశమయ్యారు. * * మేడ్చల్: ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ.. ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మేడ్చల్ చెక్‌పోస్ట్ వద్ద శుక్రవారం జరిగింది. చెక్‌పోస్ట్ వద్ద ఉన్న సెల్‌టవర్ ఎక్కిన యువకుడు తన ప్రియురాలితో పెళ్లి జరిపించాలని లేకపోతే ఇక్కడి నుంచి దూకేస్తానని బెదిరిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతన్ని కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. * * హైదరాబాద్: జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ స్ప్రింట్స్‌లో తెలంగాణ కుర్రాడు అబ్దుల్ నజీబ్ ఖురేషీ మెరిశాడు. గురువారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన 100 మీటర్ల పరుగులో నజీబ్ రజత పతకం గెలుచుకున్నాడు. 10.63 సెకన్లతో అతను రెండో స్థానంలో నిలిచాడు. షమీర్ మోన్ (మణిపూర్-10.60 సె.) స్వర్ణ పతకం సాధించగా, అనిరుధ గుంజాయ్ (మహారాష్ట్ర-10.66 సె.)కు కాంస్యం దక్కింది. * * హైదరాబాద్ : తెలంగాణ అడ్వకేట్ల మహాధర్నా ఇందిరాపార్క్ వద్ద శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఈ మహాధర్నాలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా అడ్వకేట్లు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అయితే ఈ ధర్నాలో పాల్గొనేందుకు వెయ్యి మంది అడ్వకేట్లకు మాత్రమే అనుమతి ఉందని పోలీసులు తెలిపారు. ఈ మహాధర్నా నేటి సాయంత్రం 4.30 గంటలకు ముగియనుంది. * * రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండల పరిధిలోని జవహర్‌నగర్‌ సీఆర్‌పీఎఫ్‌ గ్రూప్‌ సెంటర్‌లో జులై 1వ తేదీ నుంచి నిర్వహించనున్న మినిస్టీరియల్‌ హెడ్‌కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 27 వేల మంది హాజరవుతారు. జవహర్‌నగర్‌ గ్రూప్‌ సెంటర్‌కు వచ్చే అభ్యర్థులకు ప్రత్యేకంగా బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు సీఆర్‌పీఎఫ్‌ డీఐజీపీ జి.వి.ఎన్‌.గిరిప్రసాద్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ 10వ నంబర * * హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగుల విభజనపై ఏర్పాటుచేసిన కమల్నాథన్ కమిటీ గురువారం మరోసారి సమావేశమైంది. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ఉద్యోగుల విభజన అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది. * * ఖమ్మం: ఎగువ నుంచి వస్తున్న వరదతో ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 9 అడుగులకు చేరుకుంది. అశ్వారావుపేట వద్ద పెద్దవాగు ప్రాజెక్టు నిండింది. దీంతో రెండు గేట్లు ఎత్తి 14,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే, అశ్వాపురం మండలంలో విడువని వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కిన్నెరసాని ప్రాజెక్టు కూడా జలకళను సంతరించుకుంది. కొత్తగూడెం, మణుగూరు, సత్తుపల్లిల్లోని ఓపెన్‌కాస్ట్ గనుల్లో వర్షం కారణంగా ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. * * హైదరాబాద్‌: నగరంలోని హుమాయన్‌నగర్‌లో విషాదం నెలకొంది. ఐదేళ్ల చిన్నారి ఆడుకుంటూ విద్యుత్‌ తీగ తగిలి మృతి చెందింది. శ్రీకాకుళంకు చెందిన హరిత భర్త చనిపోవడంతో కుమార్తె తనుజతో పాటు నగరానికి వచ్చి హుమాయన్‌ నగర్‌లో ఉంటోంది. తనుజ తల్లితో వెళ్తుండగా తెగిపడిన విద్యుత్‌ తీగ తగిలి అక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు బాలికను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. * * నల్లగొండ: ఎగువ నుంచి వస్తున్న మూసీ వరదతో నల్లగొండ జిల్లా భువనగిరి-పోచంపల్లి మధ్య మంగళవారం ఉదయం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఆ మార్గంలో ఉన్న బీబీనగర్ మండలం బట్టుగూడెం వంతెనపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. * * హైదరాబాద్: ఏఐసీసీ పరిశీలకుడు శ్రీనివాసన్ నేతృత్వంలో గాంధీభవన్లో కాంగ్రెస్ వర్క్షాప్ సోమవారం ప్రారంభమైంది. ఈ వర్క్షాప్లో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, నేతల వలసలను అడ్డుకోవడంతో పాటు ప్రచార కార్యక్రమాలపై నేతలు ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ముఖ్యనేతలు హాజరయ్యారు. * * బూర్గంపాడు: అప్పుల బాధ తాళలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గాదె సైదిరెడ్డి(41) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత రెండేళ్లుగా పంట దిగుబడి సరిగ్గా లేకపోవడంతో.. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోయాయి. అప్పులు తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. * * మిర్యాలగూడ: ముందు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వస్తున్న క్రేన్ ఢీకొట్టిన ఘటనలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం జస్తి వీరప్పగూడెం పరిధిలోని భల్లునాయక్‌తాండాలో సోమవారం చోటుచేసుకుంది. తాండా నుంచి మిర్యాలగూడ వెళ్తున్న ఆటోను బావులు తీయడానికి ఉపయోగించే క్రేన్ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న 8 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు 108 సాయంతో వారిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. * * రామడుగు: ఆర్టీసీ బస్సు చార్జీలు, విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ శనివారం కాంగ్రెస్‌ నాయకులు రామడుగులో ధర్నా నిర్వహించారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు అంజనేయులు గౌడ్‌, శంకర్‌, శ్రీనివాసగౌడ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు. * * జగిత్యాల(కరీంనగర్) : పలు దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉంటూ తప్పించుకు తిరుగుతున్న ఓ పాత నేరస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 20 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ. 2వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజేంద్రప్రసాద్ వివరాలు వెల్లడించారు. * * హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీ పీసీసీ శనివారం నిరసన కార్యక్రమాలకు దిగింది. అందులో భాగంగా హైదరాబాద్ విద్యుత్ సౌధ కార్యాలయాన్ని కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. రోడ్డుపై బైఠాయించి, పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పాడడంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, శ్రీశైలం గౌడ్, ఇతర నేత * * యాదాద్రి జిల్లా: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవాలయం పేరుతో యాదాద్రి జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగా భువనగిరి జిల్లా కేంద్రంగా యాదాద్రిని పేరుతో జిల్లా ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. * * యాదాద్రి జిల్లా: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవాలయం పేరుతో యాదాద్రి జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగా భువనగిరి జిల్లా కేంద్రంగా యాదాద్రిని పేరుతో జిల్లా ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. * * కరీంనగర్‌ విద్యా విభాగం : జిల్లాలో జరుగుతున్న ఎస్సెస్సీ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షల్లో భాగంగా గురువారం జరిగిన సామాన్యశాస్త్రం పేపర్‌-1లో మాల్‌ప్రాక్టీసుకు పాల్పడుతున్న ముగ్గురు విద్యార్థులను డిబార్‌ చేశారు. మొత్తం 42 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఈపరీక్షకు మొత్తం 3962 మంది హాజరుకావాల్సి ఉండగా, 3379 మంది హజరైనట్లు డీఈవో శ్రీనివాస చారి తెలిపారు. * * హైదరాబాద్ : ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దందాను అరికట్టాలంటూ వివిధ విద్యార్థి సంఘాల వారు గురువారం ఆందోళనలు చేపట్టారు. బోడుప్పల్‌లోని భాష్యం స్కూల్‌తోపాటు శంషాబాద్‌లోని ఎస్సార్ డీజీ స్కూల్ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ సంఘాల ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందిపెట్టేలా ఉన్న ఫీజుల మోతను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. * * హైదరాబాద్ : రంగారెడ్డి మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలో ఉన్న అనాథ బాలల ఆశ్రమం కృషిహోంలో ఉండే ఇద్దరు బాలురు కనిపించకుండాపోయారు. అనాథ గృహంలో ఆశ్రయం పొందుతున్న ఎన్.సాయిలు(13), మహేష్(10) అనే బాలురు బుధవారం ఉదయం టిఫిన్ చేసిన అనంతరం నుంచి కనిపించకుండా పోయారు. దీంతో నిర్వాహకులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవటంతో రాత్రి పోలీసులను ఆశ్రయించారు. కృషిహోం ట్యూటర్ ఎండీ సుమేర్ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. * * రెంజల్(నిజామాబాద్) : నిజామాబాద్ జిల్లా రెంజల్‌లో వేటగాళ్ల తుపాకీ తూటాకు జాతీయ జంతువు జింక బలైంది. రెంజల్ మండలం తాడిబిలోలి గ్రామ సమీపంలో బుధవారం రాత్రి గురు తెలియని వ్యక్తులు జింకను కాల్చి చంపారు. గురువారం ఉదయం జింక కళేబరాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఎస్సై ప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. జింకను వేటగాళ్లే చంపి ఉంటారని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. * * హైదరాబాద్: న్యాయమైన పరిహారం ఆందోళన చేస్తున్న మల్లన్నసాగర్ ముంపు బాధితులకు బీజేపీ మద్దతు తెలపనుంది. బుధవారం సాయంత్రం తొగుట మండలం ఏటిగడ్డకిష్టాపూర్, వేములగట్టు గ్రామాల్లో ఆ పార్టీ నాయకులు ధర్నా చేపట్టనున్నారు. ఈ ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్తోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు. ప్రాజెక్టు ముంపు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తగినంత సాయం అందించాలని బీజేపీ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేయనున్నారు. * * ధారూర్ : రంగారెడ్డి జిల్లా ధారూర్ మండలంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఎడతేరపి లేకుండా వాన కురుస్తుంది. దీంతో జిల్లాలోనే కొటిపల్లి జలాశయం నీటి మట్టం ఒక్క రోజులోనే ఏడడుగులు పెరిగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 24 అడుగులు కాగా మంగళవారం ఉదయం 5 అడుగుల నీరు మాత్రమే ఉంది. రాత్రి కురిసిన వర్షానికి 12 అడుగులకు చేరుకుంది. ధారూర్ మండల కేంద్రంలో 72.50 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. ఈ నీరుతో పంట సాగు చేసుకోవచ్చని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. * *
bottomleft17.jpg

middletop7.gif

ఆటలు

నా సినిమా నన్ను ఆవిష్కరిస్తుంది: సచిన్‌

09/05/2017: లండన్‌: తన జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘సచిన్‌ ఎ బిలి యన్‌ డ్రీమ్స్‌’ చిత్రం తనను ఆవిష్కరిస్తుందని సచిన్‌ టెండూల్కర్‌ చెప్పారు. సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందు కు ఇక్కడికి వచ్చిన సచిన్‌ మాట్లాడుతూ ‘నా జీవితంలోని మధురఘట్టాల్ని నేను తిరిగి చూసుకునేందుకు, నా సుదీర్ఘ పయనంలో నాకు మాత్రమే తెలిసిన విశేషాలను అభిమానులతో పంచుకునేందుకు ఈ బయోపిక్చర్‌ ఉపయోగపడుతుం ది. ఈ సినిమా నా ఇన్నింగ్స్‌ల్లాగే అభిమానుల్ని అలరిస్తుంది. 24 ఏళ్ల కెరీర్‌లో నాపై కురిపించిన ఆదరాభిమానాల్ని ఈ సినిమాపై కూడా చూపిస్తారని ఆశిస్తున్నా’నని అన్నారు. ఈ చిత్రానికి రవి భాగ్‌చంద్క నిర్మాతగా వ్యవహరించగా.. ప్రముఖ డైరెక్టర్‌ జేమ్స్‌ ఎర్స్‌కిన్‌ దర్శకత్వం వహించాడు.

నాలుగో ర్యాంకుకు సింధు

09/05/2017: ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) సోమవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఓ స్థానం కోల్పోయి నాలుగో ర్యాంకులో నిలిచింది. బ్యాడ్మింటన్‌ ఆసియా చాంపియన్‌షిప్‌లో క్వార్టర్స్‌లోనే వెనుదిరగడం సింధు ర్యాంకుపై ప్రభావం చూపింది. మరో భారత షట్లర్‌ సైనా నెహ్వాల్‌ కూడా ఓ స్థానం దిగజారి తొమ్మిది ర్యాంకులో నిలిచింది. పురుషుల సింగిల్స్‌లో అజయ్‌ జయరామ్‌ (13వ ర్యాంకు), బీ సాయిప్రణీత్‌ (22), కిడాంబి శ్రీకాంత్‌ (26), సమీర్‌ వర్మ (27), హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ (30వ ర్యాంకులో) నిలిచారు.

యువరాజ్‌ సింగ్‌కు గాయం

09/05/2017: హైదరాబాద్‌: ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ గాయపడ్డాడు. ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ మైదానంలో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తుండగా యువీ చేతి వేలికి గాయమైంది. రోహిత్‌ శర్మ కొట్టిన బంతిని ఆపే ప్రయత్నంలో అతడు గాయపడ్డాడు. వెంటనే అతడు మైదానాన్ని వీడాడు. యువీకి జట్టు ఫిజియో చికిత్స చేశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగి 9 పరుగులు చేశాడు. అయితే గాయం పెద్దది కాదని, మిగతా మ్యాచుల్లో అతడు ఆడే అవకాశముందని తెలుస్తోంది. 34 ఏళ్ల యువీ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడి 234 పరుగులు చేశాడు. ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఆదరగొట్టాడు. 41 బంతుల్లో 70 పరుగులతో అజేయంగా నిలిచి సత్తా చాటాడు. అయితే తర్వాత చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి నిన్న ప్రకటించిన భారత జట్టులో యువరాజ్‌ సింగ్‌ చోటు సంపాదించాడు.

అజ్లాన్‌ షా కప్‌ హాకీ టోర్నీలో భారత్‌ కు కాంస్యం

08/05/2017: ఇపో (మలేసియా): ఆతిథ్య దేశం మలేసియా చేతిలో చివరి లీగ్‌ మ్యాచ్‌లో అనూహ్య ఓటమితో పసిడి పోరుకు అర్హత పొందలేకపోయిన భారత్‌... సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌ హాకీ టోర్నమెంట్‌లో కాంస్య పతకంతో సంతృప్తి పడింది. న్యూజిలాండ్‌ జట్టుతో శనివారం జరిగిన కాంస్య పతక పోరులో టీమిండియా 4–0 గోల్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్‌ తరఫున రూపిందర్‌ పాల్‌ సింగ్‌ (17వ, 27వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చేయగా... ఎస్‌వీ సునీల్‌ (48వ నిమిషంలో), తల్విందర్‌ సింగ్‌ (60వ నిమిషంలో) ఒక్కో గోల్‌ సాధించారు. 34 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో భారత్‌ కాంస్య పతకం సాధించడం ఇది ఏడోసారి. గతంలో భారత్‌ 1983, 2000, 2006, 2007, 2012, 2015లో కాంస్య పతకాలు గెలిచింది. మరోవైపు ఫైనల్లో బ్రిటన్‌ 4–3తో ప్రపంచ చాంపియన్‌ ఆస్ట్రేలియా జట్టును ఓడించి విజేతగా నిలిచింది. 1994 తర్వాత బ్రిటన్‌ ఈ టోర్నీలో టైటిల్‌ సాధించడం విశేషం. ఐదు, ఆరు స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో మలేసియా 3–1తో జపాన్‌ను ఓడించి ఐదో స్థానాన్ని దక్కించుకుంది. జపాన్‌కు చివరిదైన ఆరో స్థానం లభించింది.

న్యూజిలాండ్‌ పర్యటనకు భారత జట్టు

06/05/2017: న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే హాకీ వరల్డ్‌ లీగ్‌ సెమీఫైనల్‌ టోర్నమెంట్‌కు సన్నాహాల్లో భాగంగా భారత సీనియర్‌ మహిళల హాకీ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈనెల 14 నుంచి 20 వరకు జరిగే ఈ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల్లో ఆడే భారత జట్టును గురువారం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి రజని ఎతిమరపు జట్టులో రెండో గోల్‌కీపర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇటీవలే చిలీలో జరిగిన హాకీ వరల్డ్‌ లీగ్‌ రెండో రౌండ్‌ టోర్నీలో ‘ఉత్తమ గోల్‌కీపర్‌’ పురస్కారాన్ని గెల్చుకున్న సవిత తొలి గోల్‌కీపర్‌గా వ్యవహరించనుంది. 20 మంది సభ్యులుగల జట్టుకు రాణి రాంపాల్‌ సారథ్యం వహించనుంది. సిరీస్‌లోని ఐదు మ్యాచ్‌లు వరుసగా ఈనెల 14, 16, 17, 19, 20వ తేదీల్లో జరుగుతాయి. భారత మహిళల జట్టు: సవిత, రజని ఎతిమరపు (గోల్‌కీపర్లు), రాణి(కెప్టెన్‌), సుశీలా(వైస్‌ కెప్టెన్‌), దీప్‌ గ్రేస్‌ , ఉదిత, సునీతా , గుర్జీత్‌ కౌర్, నమిత, రీతూ రాణి, లిలిమా, నవ్‌జ్యోత్, మోనిక, రేణుక , నిక్కీ , రీనా ఖోకర్, వందన , ప్రీతి దూబే, సోనిక, అనూపా బార్లా.

షట్లర్లకు ‘బాయ్‌’ రూ.1.6 కోట్ల నజరానా

06/05/2017: న్యూఢిల్లీ: గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ ఈవెంట్లలో అద్భుతంగా రాణిస్తున్న ప్రముఖ షట్లర్లకు భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) భారీ నజరానాలను అందించింది. ఇందులో గతేడాది ఆస్ట్రేలియా సూపర్‌ సిరీస్‌ గెలవడంతో పాటు తొలిసారిగా ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన సైనా నెహ్వాల్‌కు రూ.25 లక్షల చెక్‌ను ‘బాయ్‌’ నూతన అధ్యక్షుడు హిమంత బిస్వా శర్మ అందించారు. 2015లో ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయురాలిగా కూడా సైనా రికార్డులకెక్కింది. ఇక మలేసియా మాస్టర్స్‌ (2016), మకావు ఓపెన్‌ (2015), కామన్వెల్త్‌ గేమ్స్‌ (2014)లో కాంస్యం సాధించిన పీవీ సింధుకు రూ.20 లక్షలు ఇచ్చారు. అయితే 2014 గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణంతో పాటు 2015 సయ్యద్‌ మోడి గ్రాండ్‌ప్రి టైటిల్‌ సాధించిన కశ్యప్‌... తనకు రావాల్సిన ప్రైజ్‌మనీ అందలేదని శర్మకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే అతడికి కూడా రూ.30 లక్షల చెక్‌ను అందించారు. ఇదే తరహాలో గురుసాయిదత్‌కు రూ.5 లక్షలు, గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలకు రూ.10 లక్షలు అందించడం జరిగింది. ఇప్పటి నుంచి ఆటగాళ్లకు వెంటవెంటనే ప్రైజ్‌మనీని అందిస్తామని శర్మ స్పష్టం చేశారు.

క్వార్టర్స్‌లో శివ, సుమీత్‌

03/05/2017: తాష్కెంట్‌: ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్లు శివ థాపా, సుమీత్‌ సంగ్వాన్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నారు. 60 కేజీల విభాగంలో మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన శివ..ఒముర్బెక్‌ మలబెకోవ్‌ (కజకిస్తాన్‌)పై గెలుపొందాడు. క్వార్టర్స్‌లో చు ఎన్‌ లాయ్‌ (చైనీస్‌తైపీ)తో శివ తలపడనున్నాడు. మరోవైపు 91 కేజీల విభాగంలో జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సుమీత్‌.. ఎర్దెన్‌బెయర్‌ సందగ్‌సురేన్‌ (మంగోలియా)ను ఓడించాడు. క్వార్టర్స్‌లో మూడోసీడ్‌ ఫెంగ్‌కాయ్‌ యు (చైనా)తో సుమీత్‌ తలపడనున్నాడు. మరోవైపు మనీశ్‌ పాన్వర్‌ (81 కేజీలు), కవీందర్‌ సింగ్‌ బిస్త్‌ (49 కేజీలు) కూడా క్వార్టర్స్‌కు చేరుకున్నారు. ప్రిక్వార్టర్స్‌లో జీ ఆర్‌ గుణరత్నపై మనీశ్‌ గెలుపొందగా.. అల్దోమ్స్‌ సుగురో (ఇండోనేసియా)పై కవీందర్‌ విజయం సాధించాడు. క్వార్టర్స్‌లో జాసుర్బెక్‌ లాతిపోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)తో కవీందర్‌ తలపడుతాడు. వీరితోపాటు వికాస్‌ కృషన్‌ (75 కేజీలు), గౌరవ్‌ బిధురి (56 కేజీలు), అమిత్‌ ఫంగల్‌ (49 కేజీలు), సతీశ్‌ కుమార్‌ (ప్లస్‌ 91 కేజీలు) ఇప్పటికే క్వార్టర్స్‌కు చేరిన సంగతి తెలిసిందే.

యువరాజ్ సింగ్ మెరుపులు

02/05/2017: ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో భాగంగా మంగళవారం ఇక్కడ ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ 186 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సన్ రైజర్స్ ఆటగాళ్లలో యువరాజ్ సింగ్(70 నాటౌట్;41బంతుల్లో11 ఫోర్లు, 1 సిక్స్) ఓ సొగసైన ఇన్నింగ్స్ తో ఆడి అదుర్స్ అనిపించాడు. తొలుత కుదురుగా బ్యాటింగ్ చేసిన యువరాజ్.. చివరి ఓవర్లలో రెచ్చిపోయాడు. ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ బౌండరీల వర్షం కురిపించాడు. ఒక లైఫ్ తో బతికిపోయిన యువరాజ్ దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. క్రిస్ మోరిస్ బౌలింగ్ లో యువీ ఇచ్చిన క్యాచ్ ను సంజూ శాంసన్ వదిలేయడంతో ఢిల్లీ భారీ మూల్యం చెల్లించుకోంది. ప్రధానంగా ఆ క్యాచ్ వదిలేసిన తరువాత యువరాజ్ తనదైన షాట్లతో అలరించాడు. టాస్ ఓడి తొలుతబ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ కు శుభారంభం లభించింది. డేవిడ్ వార్నర్(30; 21 బంతుల్లో 4 ఫోర్లు,1 సిక్స్),శిఖర్ ధావన్(28;17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) దాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు. ఈ జోడి 53 పరుగుల్నిజత చేసిన తరువాత వార్నర్ తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో శిఖర్ తో కలిసి కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్ నడిపించాడు. అయితే జట్టు స్కోరు 75 పరుగుల వద్ద ఉండగా శిఖర్ అవుటయ్యాడు .ఆపై స్వల్ప వ్యవధిలో విలియమ్సన్(24) కూడా పెవిలియన్ చేరడంతో సన్ రైజర్స్ వేగం తగ్గింది. పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 66 పరుగులు చేసిన సన్ రైజర్స్.. 13 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లను కోల్పోయి 98 పరుగులు మాత్రమే చేసింది. ఆ సమయంలో యువరాజ్ సింగ్-హెన్రిక్స్ లు నెమ్మదిగా ఇన్నింగ్స్ ను నిర్మించారు. ముందు ఎటువంటి భారీ షాట్లకు పోకుండా క్రీజ్ లో కుదురుకునే యత్నం చేశారు. ఆ క్రమంలోనే యువరాజ్ ఇచ్చిన క్యాచ్ ను ఢిల్లీ ఫీల్డర్లు జారవిడిచారు. అప్పటికి యువరాజ్ స్కోరు 30 పరుగులు లోపే. ఆ తరువాత యువీ మరింత వేగంగా ఆడి సన్ రైజర్స్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి హెన్రిక్స్(25 నాటౌట్;18 బంతుల్లో 2 ఫోర్లు) చక్కటి సహకారం అందివ్వడంతో సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.

భువీలాంటి బౌలర్‌ ఉండటం మా అదృష్టం!

18/04/2017: హైదరాబాద్‌: బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ మెరుపు బౌలింగ్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు.. అపూర్వమైన విజయాన్ని సొంతం చేసుకుంది. భువీ 19 పరుగులకు ఐదు వికెట్లు తీయడంతో సొంత గడ్డపై పంజాబ్‌ జట్టును చిత్తుచేసింది. నిజానికి పంజాబ్‌ ఆటగాడు మనన్‌ వోహ్రా అద్భుతంగా ఆడి 50 బంతుల్లోనే 95 పరుగులు చేశాడు. దీంతో 160 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా పంజాబ్‌ అందుకుంటుందని అంతా భావించారు. కానీ భువీ మెరుపులతో పంజాబ్‌ లక్ష్యానికి ఐదు పరుగుల దూరంలో ఆగిపోయింది. సన్‌రైజర్స్‌ జట్టును అద్భుతమైన విజయం వరించింది. గొప్పగా రాణించిన భువీని మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ వరించింది. మ్యాచ్‌ అనంతరం అతడు మాట్లాడుతూ.. నా హృదయం ఇప్పటికీ ఉప్పొంగుతోంది. ఊహించలేనిది జరగడమే టీ-20 గేమ్‌ గొప్పతనం. సన్‌రైజర్స్‌ జట్టు కోసం నా శాయశక్తులా కృషి చేస్తున్నా. 19వ ఓవర్‌ నేనే బౌలింగ్‌ చేయాల్సి ఉంటుందని తెలుసు. అప్పటికే పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌ బాగా ఆడుతున్నారు. అయినా నేను ఆందోళన చెందలేదు. కెప్టెన్‌ వార్నర్‌తో చర్చించాను. స్ట్రయిట్‌ యార్కర్లు వేయాలని ఇద్దరం ప్లాన్‌చేశాం. అదే అమలు చేశా. ఫలితం వచ్చింది’ అని చెప్పాడు. ఇక సన్‌రైజర్స్‌ సారథి డేవిడ్‌ వార్నర్‌ మాట్లాడుతూ.. భువీ లాంటి బౌలర్‌ జట్టుకు ఉండటం అదృష్టమని చెప్పాడు. ఇటు మనన్‌, అటు భువీ అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు.

బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రి విజేత వెటెల్‌

17/04/2017: మనామా: ఆద్యంతం ఉత్కంఠభరింగా సాగిన బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్‌ రేసులో ఫెరారీ డ్రైవర్‌ సెబాస్టియన్‌ వెటెల్‌ విజేతగా నిలిచాడు. 57 ల్యాప్‌ల ఈ రేసును వెటెల్‌ గంటా 33 నిమిషాల 53.373 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఈ సీజన్‌లో వెటెల్‌కిది రెండో విజయం. ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించిన బొటాస్‌ (మెర్సిడెస్‌) మూడో స్థానంతో సరిపెట్టుకోగా... హామిల్టన్‌ (మెర్సిడెస్‌) రెండో స్థానంలో నిలిచాడు. భారత్‌కు చెందిన ఫోర్స్‌ ఇండియా డ్రైవర్లు పెరెజ్, ఒకాన్‌ వరుసగా ఎనిమిది, పదో స్థానాల్లో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు రష్యా గ్రాండ్‌ప్రి ఏప్రిల్‌ 30న జరుగుతుంది.

పుణే ‘రైజింగ్‌’ విక్టరీ

17/04/2017: బెంగళూరు: ఐపీఎల్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన తొమ్మిదిసార్లు పుణేకు పరాజయమే ఎదురైంది. అయితే ఈసారి మాత్రం తక్కువ స్కోరు చేసి కూడా మ్యాచ్‌లో గెలవడం విశేషం కాగా... చిన్నస్వామిలాంటి పరుగుల స్టేడియంలో హోమ్‌ టీమ్‌ బెంగళూరును ఓడించడం మరో విశేషం. స్టోక్స్‌ (3/18), శార్దుల్‌ ఠాకూర్‌ (3/35)ల సూపర్‌ బౌలింగ్‌తో రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ మురిసింది. ‘హ్యాట్రిక్‌’ పరాజయాల పరంపరకు ముగింపు పలికింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ను 27 పరుగుల తేడాతో కంగుతినిపించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేపట్టిన రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసి ఓడింది. పుణేకు రహానే (25 బంతుల్లో 30; 5 ఫోర్లు), రాహుల్‌ త్రిపాఠి (23 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్‌) శుభారంభం అందించారు. అయితే తర్వాత వచ్చిన స్మిత్‌ (24 బంతుల్లో 27; 3 ఫోర్లు), ధోని (25 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుగ్గానే ఆడినా... స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోవడంతో స్కోరు వేగం తగ్గింది. చివర్లో మనోజ్‌ తివారి (11 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. అనంతరం బెంగళూరు ఇన్నింగ్స్‌ చప్పగా సాగింది. మన్‌దీప్‌ (0) డకౌట్‌ కాగా... కోహ్లి (19 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్‌), డివిలియర్స్‌ (29 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్సర్లు) ప్రత్యర్థి బౌలింగ్‌కు తలొగ్గారు. బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ ఏకంగా 11 ఓవర్ల పాటు బౌండరీ కొట్టలేకపోవడం గమనార్హం.

కోహ్లి సెన్సేషనల్‌ క్యాచ్‌!

17/04/2017: బెంగళూరు: ఐపీఎల్‌లో రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌తో ఆదివారం చినస్వామి మైదానంలో జరిగిన మ్యాచ్‌ లో బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పట్టిన క్యాచ్‌ హైలెట్‌ గా నిలిచింది. కోహ్లి పట్టిన సెన్సేషనల్‌ క్యాచ్‌ అభిమానులతో సహా పుణె ఆటగాళ్లను విస్మయానికి గురిచేసింది. ఊహించని రీతిలో బంతిని అందుకుని దూకుడుమీదున్న పుణె ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠిని పెవిలియన్‌ దారి పట్టించాడు. 9వ ఓవర్‌ లో పవన్‌ నేగి బౌలింగ్‌ లో త్రిపాఠి కొట్టిన బంతిని ఎడమవైపుకు డైవ్‌ చేసి కోహ్లి ఒంటిచేత్తో క్యాచ్‌ పట్టాడు. బ్యాట్స్‌ మన్‌ అలా షాట్‌ కొట్టాడో లేదో ఆర్సీబీ కెప్టెన్‌ క్యాచ్‌ పట్టడం, వెంటనే బంతిని గాల్లోకి విసిరేయడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. కష్టసాధ్యమైన క్యాచ్‌ ను ఊహించనిరీతిలో పట్టడంతో త్రిపాఠి కొద్ది నిమిషాల పాటు విస్మయానికి గురయ్యాడు. ఆశ్చర్యంగా చూస్తూనే పెవిలియన్‌ కు చేరాడు. మ్యాచ్‌ ఓడినప్పటికీ తనదైన ఆటతీరుతో అభిమానులకు కోహ్లి వినోదం పంచాడు. ‘నేను పట్టిన అరుదైన క్యాచుల్లో ఇది కూడా ఒకటి. ట్రైనింగ్‌ లో నేను తీసుకున్న శిక్షణ ఇక్కడ ప్రతిఫలించింద’ని మ్యాచ్‌ ముగిసిన తర్వాత కోహ్లి అన్నాడు.

సాయిప్రణీత్‌ సంచలనం

15/04/2017: సింగపూర్‌ సిటీ: అంతర్జాతీయస్థాయిలో కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న భారత యువ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ భమిడిపాటి సాయిప్రణీత్‌ కెరీర్‌లో తొలిసారి సూపర్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీలో ఈ హైదరాబాద్‌ ప్లేయర్‌ సంచలన విజయం సాధించాడు. ప్రపంచ 11వ ర్యాంకర్, ఎనిమిదో సీడ్‌ తనోంగ్‌సక్‌ సేన్‌సోమ్‌బూన్‌సుక్‌ (థాయ్‌లాండ్‌)తో జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 30వ ర్యాంకర్‌ సాయిప్రణీత్‌ 15–21, 21–14, 21–19తో గెలుపొందాడు. 71 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో సాయిప్రణీత్‌ నిర్ణాయక మూడో గేమ్‌లో పలుమార్లు వెనుకబడినా ఏదశలోనూ నిరుత్సాహపడకుండా పట్టుదలతో పోరాడి స్కోరును సమం చేశాడు. 15–17తో వెనుకంజలో ఉన్నపుడు సాయిప్రణీత్‌ వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 19–17తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఈ రెండు పాయింట్ల ఆధిక్యాన్ని కాపాడుకొని సాయిప్రణీత్‌ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఈ ఏడాది సయ్యద్‌ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన సాయిప్రణీత్‌ గతేడాది కెనడా ఓపెన్‌ గ్రాండ్‌ప్రి టోర్నీలో విజేతగా నిలిచాడు. శనివారం జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 38వ ర్యాంకర్‌ లీ డాంగ్‌ కెయున్‌ (దక్షిణ కొరియా)తో సాయిప్రణీత్‌ ఆడతాడు. 2015 జపాన్‌ ఓపెన్‌లో వీరిద్దరూ ఏకైకసారి తలపడగా సాయిప్రణీత్‌ ఓడిపోయాడు.

ఇండియాకు ఇంకో షాక్

11/11/2016: మొన్నటి రాత్రి నుంచి ఇండియాకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. 500.. 1000 నోట్ల రద్దు నిర్ణయం భారత జనాలకు మామూలు షాక్ కాదు. దీని వల్ల సామాన్య జనానికి అంతిమంగా మంచే జరిగినా.. ప్రస్తుతానికైతే అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. మరోవైపు అమెరికా ఎన్నికల ఫలితాలు కూడా భారతీయులకు పెద్ద షాకే. మెజారిటీ జనాలు హిల్లరీనే గెలవాలని ఆకాంక్షించారు. ఆమే గెలుస్తుందని కూడా నమ్మారు. ఐతే ఇప్పుడు ఇండియన్స్ కు ఇంకో షాక్ తగిలింది. ఐతే పై రెండు షాకుల్లాగా అది అంత ప్రభావం చూపేది కాదులెండి. ఆ షాక్ ఏంటంటే.. క్రికెట్లో ఇంగ్లాండ్ జట్టు టీమ్ ఇండియాపై భారీ స్కోరు చేయడం. సొంతగడ్డపై టీమ్ ఇండియా గత రెండు మూడేళ్లుగా ఎలాంటి ఫాంలో ఉందో చెప్పాల్సిన పని లేదు. గత ఏడాది నెంబర్ వన్ టెస్టు జట్టు దక్షిణాఫ్రికాను 3-0తో చిత్తు చేసి.. తాజాగా న్యూజిలాండ్ జట్టును కూడా అంతే తేడాతో మట్టి కరిపించి ఇంగ్లాండ్ సిరీస్ కు రెడీ అయింది భారత్. మరోవైపు ఇంగ్లాండ్.. బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్టు చేతిలో పరాభవం చవిచూసి భారత పర్యటనకు వచ్చింది. దీంతో సిరీస్ ఏకపక్షమని.. ఇంగ్లాండ్ భారత్ ధాటికి తట్టుకోలేదని అంతా అంచనా వేశారు. కానీ అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి. తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు ఏకంగా 537 పరుగులు చేసింది. తొలి రోజు జో రూట్ {124} సెంచరీ కొడితే.. రెండో రోజు మొయిన్ అలీ {117}, స్టోక్స్ {128} శతకాలు బాదారు. ఇంగ్లాండ్ జట్టును వణికించేస్తాడనుకున్న అశ్విన్ సహా భారత బౌలర్లందరూ ఫెయిలయ్యారు. రెండో రోజు ఆట ఆఖరుకు భారత్ 63/0తో నిలిచింది. ఇప్పుడిక ఇంగ్లాండ్ ను ఓడించడం గురించి భారత్ ఆలోచించే పరిస్థితే లేదు. ఓటమి తప్పించుకుని.. డ్రా చేయడం మీదే దృష్టిపెట్టాలి భారత్. ఈ మ్యాచ్ ఇలా సాగుతుందని అస్సలు ఊహించని భారత అభిమానులకు ఇది పెద్ద షాకే.

ఛేజ్ చేసి మరీ సెల్ఫీ పట్టేసింది

05/11/2016: తాము అభిమానించే ఐడల్ ను కలుసుకోవడం ఏ అభిమానికైనా అమూల్యమైన సందర్భమే. స్ఫూర్తి ప్రదాతలు అనుకున్నవారిని కలిసిన ఆ క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. ఇలాంటి సందర్భాన్ని అదృష్టంగా భావించి మురిసిపోతుంటారు ఫ్యాన్స్. రాంచీకి చెందిన ఓ కలేజ్ విద్యార్ధిని ఆరాధ్యకూ ఈ తరహా ఛాన్సే దక్కింది. తన అభిమాన క్రికెటర్ ఎంఎస్ ధోనీనితో సెల్ఫీ దిగి తన స్నేహితులకు గర్వంగా చెప్పుకునే అవకాశం దక్కించుకుంది. ఫ్యాన్స్ తో ధోనీ సెల్ఫీలు దిగడం మామూలే కదా. దీంట్లో ఏమంత విశేషముంది? అని తీసిపారేయొద్దు. ఎందుకంటే, ఈ సెల్ఫీ కోసం ఆరాధ్య చాలా కష్టమే పడింది. సూపర్ ఫాస్ట్ గా దూసుకెళ్లిపోతున్న ధోనీ హమర్ వాహనాన్ని స్కూటీపై ఛేజ్ చేసి మరీ కెప్టెన్ కూల్ తో సెల్ఫీ దిగింది. అక్టోబర్ 26న న్యూజిలాండ్ తో ఒన్డే మ్యాచ్ ముగిసిన అనంతరం ధోనీ త లగ్జరీ హమర్ కార్ లో రాంచీ ఎయిర్ పోర్టుకు బయలుదేరాడు. ఇది చూసిన ఆరాధ్య తాను ఎంతగానో అభిమానించే ధోనీతో ఫొటో దిగాలని స్కూటీపైనే అతడి కార్ ను ఫాలో అయింది. వేగంగా దూసుకెళ్లిపోతున్న హమర్ ను అందుకోడానికి చాలా కష్టపడింది. చివరికి ధోనీ ఎయిర్ పోర్టుకు వచ్చేశాడు. టెర్మినల్ లో ప్రవేశించేందుకు రెడీ అయిపోతున్నాడు. దీంతో అతడితో ఫొటో దిగడం సాధ్యం కాదేమోనని ఆరాధ్య బాధపడిపోయింది. ఆవేదన, భయం కలగలసిన గొంతుతో ధోనీని గట్టిగా పిలిచింది. ఆమె ఆశ ఫలించింది. తనవైపు చూసిన ధోనీ వద్దకు పరుగుపరుగున వచ్చి ఒన్ ఫొటో ప్లీజ్ అంటూ ఓ సెల్ఫీ దిగింది. ఈ ఫోటో కోసం ఆరాధ్య తనను స్కూటీపై వెంటాడినట్లు తెలుసుకుని ధోనీ ఆశ్చర్యపోయాడట. ఆమె ఫ్రెండ్స్ కూడా ఈ ఛేజింగ్ సీన్ పై ఆశ్చర్యపోతూ ప్రశంసలు కురిపించేస్తున్నారు.

‘మెక్సికన్’ విజేత హామిల్టన్

01/11/2016: మెక్సికన్ సిటీ: ఫార్ములావన్ మెక్సికన్ గ్రాండ్ ప్రిలో లూరుుస్ హామిల్టన్ (మెర్సిడెస్)విజయం సాధించాడు. 71 ల్యాప్‌ల రేసును ఈ బ్రిటన్ డ్రైవర్ 1 గంట 40 నిమిషాల 31.042 సెకన్లలో పూర్తి చేశాడు. మెర్సిడెస్‌కే చెందిన రోస్‌బర్గ్ రెండు, రెడ్‌బుల్ డ్రైవర్ రికియార్డో మూడో స్థానంలో రేసును పూర్తి చేశారు. హామిల్టన్‌కు ఇది ఈ సీజన్‌లో ఎనిమిదో విజయం కాగా... కెరీర్‌లో 51వ గెలుపు. రెడ్‌బుల్‌కే చెందిన వెర్‌స్టాపెన్, ఫెరారీ రేసర్ వెటెల్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఈ రేసులో అనేక వివాదాలు చోటు చేసుకున్నారుు. వెర్‌స్టాపెన్, వెటెల్ రేసు మధ్యలో ఢీకొట్టుకున్నారు. రేసు ముగిశాక వెర్‌స్టాపెన్ మూడో స్థానంలో నిలిచి పొడియం మీదకు వెళ్లాడు. అరుుతే తనకు ఐదు సెకండ్ల పెనాల్టీ విధించి వెటెల్ మూడోస్థానంలో నిలిచినట్లు ప్రకటించారు. ఆ తర్వాత మూడు గంటలకు రేసు మొత్తాన్ని మరోసారి పరీక్షించాక మరో కొత్త సంఘటన బయటపడింది. రెడ్‌బుల్ డ్రైవర్ రికియార్డోను వెటెల్ ప్రమాదకరంగా అడ్డుకున్నట్లు భావించి తనపై పది సెకండ్లు పెనాల్టీ విధించారు. దీంతో తను మూడు నుంచి ఐదో స్థానానికి పడిపోగా... రికియార్డో మూడు, వెర్‌స్టాపెన్ నాలుగో స్థానంలో నిలిచారు. ఫోర్స్ ఇండియా రేసర్లు హల్కెన్‌బర్గ్ ఏడో స్థానంలో, పెరెజ్ పదో స్థానంలో రేసును పూర్తి చేశారు. డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో ప్రస్తుతం రోస్‌బర్గ్ 349 పారుుంట్లతో, హామిల్టన్ 330 పారుుంట్లతో ఉన్నారు. నవంబరు 13న జరిగే బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిలో రోస్‌బర్గ్ టైటిల్ గెలిస్తే ఈ ఏడాది ఫార్ములావన్ చాంపియన్‌గా నిలుస్తాడు. ఒకవేళ హామిల్టన్ అందులో గెలిస్తే సీజన్‌లో చివరి రేస్ (అబుదాబి, నవంబరు 27) వరకు ఫలితం కోసం ఎదురుచూడాలి. కన్‌స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్‌ను ఇప్పటికే మెర్సిడెస్ (679) గెలుచుకుంది.

వరుసగా రెండో ఏడాది నంబర్‌వన్‌గా ముగింపు

01/11/2016: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా డబ్ల్యూటీఏ డబుల్స్ ర్యాంకింగ్‌‌సలో వరుసగా రెండో ఏడాదిని నంబర్ వన్‌గా ముగించింది. సీజన్ ముగింపు డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో సానియా సెమీస్‌లో ఓడింది. అరుుతే మకరోనా-వెస్నినా జోడీ ఈ టోర్నీలో టైటిల్ గెలవడం సానియాకు కలిసొచ్చింది. ఒకవేళ ఫైనల్లో బెథాని-సఫరోవా జోడీ టైటిల్ గెలిచి ఉంటే సానియా టాప్‌ర్యాంక్ పోరుు ఉండేది. బెథానికి అగ్రస్థానం దక్కేది. ‘వరుసగా రెండో ఏడాది నంబర్‌వన్‌గా నిలవడం సంతోషంగా ఉంది. ఇదో గొప్ప గౌరవం’ అని సానియా పేర్కొంది.

ఇమ్రాన్ కు దిమ్మ తిరిగే మాట చెప్పిన మాజీ భార్య

01/11/2016: పాక్ క్రికెట్ మాజీ కెప్టెన్.. పాకిస్థాన్ కు క్రికెట్ ప్రపంచకప్ ను అందించిన వ్యక్తిగా పాకిస్థానీయుల మనసుల్లో నిలిచిన ఇమ్రాన్ ఖాన్.. కొన్నేళ్ల క్రితం సొంతంగా రాజకీయ పార్టీని పెట్టిన ముచ్చట తెలిసిందే. పాకిస్థాన్ తెహరీక్ ఏ ఇన్సాఫ్ పార్టీని ఏర్పాటు చేసిన ఆయన.. పాక్ అధినేతగా ఎదగాలన్నది ఆయన స్వప్నం. గడిచిన కొద్ది కాలంగా పాక్ లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. పాక్ అధ్యక్షుడు నవాజ్ షరీప్ వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇదే సమయంలో.. భారీ ర్యాలీతో తన సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న ఇమ్రాన్ కు ఊహించని షాక్ తగిలింది. నవాజ్ షరీఫ్ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆయన నవంబరు 2న ఇస్లామాబాద్ లో మహా ర్యాలీని నిర్వహించేందుకు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. పాక్ సర్కారుకు ఇబ్బందికరంగా మారిన వేళ.. మహా ర్యాలీకి సరిగ్గా రెండు రోజుల ముందు..ఇమ్రాన్ రెండో మాజీ భార్య రెహమ్ మీడియా ముందుకు వచ్చారు. బాంబుల్లాంటి మాటల్ని ఆమె తన మాజీ భర్తపై వదిలారు. గతంలో పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలతో..తన సతీమణి కమ్ జర్నలిస్ట్ అయిన రెహమ్ కు ఇమ్రాన్ విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఒక పాకిస్థానీ టీవీ ఛానల్ తో రెహమ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె గతాన్ని.. తన వైవాహిక జీవితం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం తమ వివాహ వార్షికోత్సవం సందర్బంగా ఇమ్రాన్ ను తాను బహుమతి అడిగానని.. అయితే..అందుకు తన మాజీ భర్త.. బహుమతికి బదులు.. విడాకుల్నిఇచ్చినట్లుగా వ్యాఖ్యానించారు. గతంలో తనను చులకన చేసినట్లుగా వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించిన ఆమె.. గత అక్టోబరు 31న తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా బహుమతి గురించి జోక్ చేశానని.. కానీ ఇమ్రాన్ మాత్రం తానేమాత్రం ఊహించని విధంగా విడాకులు ఇచ్చినట్లుగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా కీలక దశలో ఉన్న వేళ.. ఇమ్రాన్ పై ఆయన మాజీ సతీమణి చేసిన ఆరోపణ ఇమ్రాన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేదిగా చెబుతున్నారు.

చైనాను హడలెత్తించిన భారత్ - 9-0తో భారీ విజయం - ఆసియా చాంపియన్‌‌స ట్రోఫీ హాకీ

26/10/2016: క్వాంటన్ (మలేసియా): చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై సాధించిన విజయంతో జోరు మీదున్న భారత్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో మరో భారీ విజయం సొంతం చేసుకొని సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. చైనాతో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 9-0 గోల్స్ తేడాతో అద్భుత విజయం దక్కించుకుంది. ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్ (9వ, 39వ నిమిషంలో), యూసుఫ్ అఫాన్ (18వ, 40వ ని.లో), జస్జీత్ సింగ్ కుమార్ (22వ, 51వ ని.లో)రెండేసి గోల్స్ చేయగా... రూపిందర్ పాల్ సింగ్ (24వ ని.లో), నికిన్ తిమ్మయ్య (33వ ని.లో), లలిత్ ఉపాధ్యాయ్ (36వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఈ గెలుపుతో భారత్ ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో 10 పారుుంట్లతో అగ్రస్థానంలో ఉంది. బుధవారం జరిగే చివరిదైన ఐదో లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య మలేసియా జట్టుతో భారత్ తలపడుతుంది. లీగ్ దశ ముగిశాక తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. గాయం కారణంగా కెప్టెన్, గోల్‌కీపర్ శ్రీజేష్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. అతని స్థానంలో ఆకాశ్ చిక్టే గోల్‌కీపర్‌గా వ్యవహరించగా... రూపిందర్‌పాల్ సింగ్ సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. తొమ్మిదో నిమిషంలో ఆకాశ్‌దీప్ చేసిన గోల్‌తో ఖాతా తెరిచిన భారత్ ఆ తర్వాత చివరి నిమిషం వరకు చైనాపై పూర్తి ఆధిపత్యం చలారుుంచింది. భారత్‌కు రెండు పెనాల్టీ కార్నర్‌లు రాగా... ఒక దానిని సద్వినియోగం చేసుకుంది. చైనాకు రెండు పెనాల్టీ కార్నర్‌లు వచ్చినా భారత గోల్‌కీపర్ ఆకాశ్ అప్రమత్తంగా వ్యవహరించి వాటిని నిర్వీర్యం చేశాడు.

'పోకిరీ' తరహాలో.. కోహ్లీపై సర్ జడేజా ట్వీట్

25/10/2016: న్యూజిలాండ్తో మూడో వన్డేలో భారీ సెంచరీ చేసి టీమిండియాను గెలిపించిన విరాట్ కోహ్లీపై ప్రశంసలు వెల్లువెత్తాయి. భారత క్రికెటర్లు, మాజీలు విరాట్ను అభినందిస్తూ ట్వీట్లు చేశారు. భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తన స్టయిల్లో విరాట్ను ప్రశంసిస్తూనే సరదా ట్వీట్లు చేశాడు. 'చాంపియన్ విరాట్ కోహ్లీ రోజూ చేసే పని ఇదే. నిద్ర లేవడం.. తినడం.. సెంచరీ చేయడం.. పడుకోవడం.. ఇదే పని' అంటూ మహేశ్ బాబు సూపర్ హిట్ సినిమాలో పోకిరీలో షయాజీ షిండే చెప్పిన డైలాగ్ మాదిరిగా సర్ జడేజా ట్వీట్ చేశాడు. 'కోహ్లీ న్యూజిలాండ్ బౌలర్ ట్రెండ్ బౌల్ట్పై సర్జికల్ దాడులు చేశాడు. ఓ ఓవర్లో వరుసగా 4, 2, 4, 6, 2,4 పరుగులు చేశాడు' అంటూ జడేజా మరో ట్వీట్ చేశాడు. టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌.. విరాట్ ఎందుకు స్పెషలో మరోసారి నిరూపించుకున్నాడని కితాబిచ్చాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆల్ టైమ్ గ్రేట్ ఆటగాళ్లలో ఒకరిని చూశామని, ఛేజింగ్లో విరాట్ ఎప్పటిలాగే మరో సెంచరీ చేశాడని కామెంటేటర్ హర్ష భోగ్లే ట్వీట్ చేశాడు. భారత క్రికెటర్లు హర్భజన్, మహ్మద్ కైఫ్తో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీలు, మైఖేల్ వాన్.. విరాట్ ఆటతీరును ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు.

విరాట్ కోహ్లి సెంచరీ తో న్యూజీలాండ్ పై 2-1 ఆధిక్యం

24/10/2016: భారత న్యూజీలాండ్ జట్ల మధ్య జరుగుతున్నా మూడో వన్ డే లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాదించింది. విరాట్ కోహ్లి వీర విహారం చేసి అజేయ సెంచరీ చేయడంతో భారత్ అలవోక విజయం సాదించింది. ధోని మంచి సహకారం అందించాడు. టాస్ గెలిచి మూడోసారి ఫీల్డింగ్ ఎంచుకుంది భారత్. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ జట్టు 49.4 ఓవర్లలో 285 పరుగులకు అంతా ఔటయ్యారు. లాదం 61 పరుగులు చేయగా చివర్లో నీషం కేవలం 47 బంతుల్లో 57 పరుగులు చేసాడు. రాస్ టేలర్ 44 పరుగులు హెన్రీ అజేయంగా 39 పరుగులు చేసాడు. ఉమేష్ యాదవ్ 3 వికెట్లు,కేదార్ జాదవ్ 3 వికెట్లు, బుమ్రా 2 వికెట్లు,మిశ్రా 2 వికెట్లు పడగొట్టారు. ఒక దశలో 199 పరుగులకు 8 వికెట్లు పడి కష్టాల్లో ఉన్న న్యూజీలాండ్ జట్టును నీషం, హేన్రీలు 9 వ వికెట్ కు 84 పరుగులు జోడించారు. 286 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంబించిన భారత్ జట్టు 13 పరుగుల వద్ద రహానే, 41 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఔటయ్యారు. ఈ దశలో జతగూడిన కోహ్లి, ధోనిలు సమయోచితంగా ఆడి లూజ్ బంతులను బౌండరీలకు పంపిస్తూ 3 వ వికెట్ కు 151 పరుగులు జత చేసారు. ధోని 91 బంతుల్లో 80 పరుగులు చేసాడు. ఇందులో 6 ఫోర్లు 3 సిక్సులున్నాయి. అ తారువాత వచ్చిన మనీష్ పాండే కోహ్లికి చక్కని సహకారం అందించాడు. వీరిద్దరూ అభేద్యమైన 4 వ వికెట్ కు 97 పరుగులు జత చేసారు. కోహ్లి వీర విహారం చేసి 134 బంతుల్లో 16 ఫోర్లు 1 సిక్సుతో 154 పరుగులు జట్టును ముందుంది నడిపించాడు. అయితే కోహ్లి 6 పరుగుల వద్ద రా టేలర్ క్యాచ్ వదిలేయడంతో న్యూజీలాండ్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గత మ్యాచ్ లో పొదుపుగా బౌలింగ్ చేసిన ట్రెంట్ బౌల్ట్ 10 ఓవర్లకు 73 పరుగులు సమర్పించుకున్నాడు. అతను వేసిన 48 ఓవర్లో మొత్తం 22 పరుగులు పిండుకున్నారు కోహ్లి, పాండేలు. మాన్ ఆఫ్ డి మ్యాచ్ గా కోహ్లి ని ప్రకటించగా ఈ విజయంతో భారత్ 5 వండే ల సీరీస్ లో 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది.

అందనంత ఎత్తులో ధోనీ..

24/10/2016: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కివీస్ లో మూడో వన్డేలో చెలరేగాడు. వరల్డ్ లోనే బెస్ట్ కీపర్ గా పేరున్న ధోనీ.. కొంతకాలంగా అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. అటు బ్యాటింగ్ లోనూ, ఇటు కీపింగ్ లోనూ పెద్దగా మెరుపుల్లేవు. మొన్నటికి మొన్న ఢిల్లీ వన్డేలో ధోనీ మంచి ఇన్నింగ్స్ ఆడినా.. కీలక సమయంలో అవుటవ్వడంతో.. టీమిండియాకు ఓటమి తప్పలేదు. మూడో వన్డేలో ఎలాగైనా గెలవాలనే కసితో ఆడుతున్న ధోనీ.. కీపర్ గా మునుపటి ఫామ్ చూపిస్తున్నాడు. మెరుపు స్టంపింగ్స్ తో కివీస్ ను బెంబేలెత్తిస్తున్నాడు. లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా బౌలింగ్ లో రాస్ టేలర్ ను, రోంచిని ధోనీ స్టంప్ అవుట్ చేసిన తీరు మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది. వికెట్ల వెనుక చురుగ్గా కదిలే ధోనీ.. ఇరువురు ఆటగాళ్లు ఫ్రంట్ ఫుట్ కు వెళ్లి క్రీజులోకి వచ్చేలోపే వికెట్లు గిరాటేశాడు. ఈ రెండు స్టంపింగ్స్ తో ధోనీ స్టంపింగ్ రికార్డ్ మెరుగు పర్చుకున్నాడు. వన్డే కెరీర్లో మొత్తం 151 స్టంపింగ్ లు చేసిన ధోనీ.. ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. శ్రీలంక ప్లేయర్ కుమార సంగక్కర 139 స్టంపింగ్ లతో రెండో స్థానంలో ఉన్నాడు. అటు క్యాచ్ ల విషయంలో కూడా ధోనీకి తిరుగులేదు. మొత్తం 531 క్యాచ్ లు పట్టిన ధోనీ.. అక్కడా నంబర్ వన్ గానే ఉన్నాడు. రెండో ప్లేస్ లో కుమార సంగక్కర 532 క్యాచ్ లు తీసుకున్నాడు.

తుంటరి అభిమానికి క్రికెటర్ ఝలక్!

22/10/2016: న్యూఢిల్లీ: క్రికెట్ ఆడినన్ని రోజులు బ్యాట్ తో అలరించిన టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. ఆ తర్వాత ట్విట్టర్ లో తన సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. గత కొన్ని నెలలుగా ట్విట్టర్లో యాక్టివ్ గా ఉంటున్న వీరూ.. తనకు పుట్టినరోజు విషెస్ చెప్పిన ఓ అభిమానికి చురక అంటించాడు. అసలు విషయం ఏంటంటే.. డాషింగ్ బ్యాట్స్ మన్ సెహ్వాగ్ అక్టోబర్ 20న 38 వసంతాలు పూర్తిచేసుకున్నాడు. గత గురువారం పుట్టినరోజు సందర్భంగా #AskSehwag ట్యాగ్ పెట్టి, తనని ఏమైనా ప్రశ్నలు అడగాలని ఉందా అని పోస్ట్ చేశాడు. ట్విట్స్ చేసిన వాళ్లకు ఆ రోజు రిప్లైస్ కూడా ఇచ్చాడు. ఓ అభిమాని సెహ్వాగ్ బర్త్ డే డేట్ మరిచిపోయాడు. దేవరాజన్ అనే వ్యక్తి సెహ్వాగ్ పుట్టినరోజు ముగిసిన రెండు రోజులకు (అక్టోబర్ 22న) హ్యాపీ బర్త్ డే వీరూ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై స్పందించిన సెహ్వాగ్.. అరెరె నా పుట్టినరోజుకు మరో 363 రోజులు ఆగాలి. నువ్వు చాలా తొందపడ్డావు. అయినా సరే అభిమానిని నిరాశకు గురిచేయవద్దని భావించిన వీరూ.. థ్యాంక్యూ అని ట్వీట్ ద్వారా రిప్లై ఇచ్చాడు. మరో విశేషం ఏమంటే.. భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న సిరీస్ లో రేపు(ఆదివారం) జరగనున్న మూడో వన్డేలో సెహ్వాగ్ కామెంటెటర్ గా కనిపించనున్నాడు.

డీఆర్‌ఎస్‌కు బీసీసీఐ ఓకే - ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అమలు

22/10/2016: న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలంగా అంపైర్ నిర్ణయ సమీక్షా పద్దతి (డీఆర్‌ఎస్)ని వ్యతిరేకిస్తున్న బీసీసీఐ ఎట్టకేలకు తమ వైఖరిని మార్చుకుంది. ఈ పద్ధతిపై సానుకూలత వ్యక్తం చేస్తూ ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణరుుంచింది. గతంతో పోలిస్తే డీఆర్‌ఎస్‌లో పలు మార్పులు చోటు చేసుకోవడంతో బీసీసీఐలో అంతర్గతంగా చర్చ జరిగింది. తాజాగా డీఆర్‌ఎస్‌ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దిన విధానాన్ని అంతర్జాతీయ క్రికెట్‌మండలి (ఐసీసీ) భారత క్రికెట్ బోర్డుకు వీడియో ప్రదర్శన ద్వారా చూపింది. ‘బీసీసీఐ సూచించినట్టుగానే హాక్ ఐ పద్ధతిలో పలు మార్పులను చేశారు. అందుకే అప్‌డేట్ చేసిన ఈ డీఆర్‌ఎస్‌ను అమలు చేయాలని నిర్ణరుుంచుకున్నాం. నవంబర్ 9 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తాం. ఇందులో నెలకొన్న నూతన పద్ధతులు ఎంతవరకు సరిగ్గా ఉన్నాయో ఈ సమయంలో తెలుస్తుంది. ముఖ్యంగా డీఆర్‌ఎస్ అనేది ఎల్బీ నిర్ణయాల్లో చాలా కీలక పాత్ర పోషిస్తుంటుంది. అందుకే బంతి ఎంతవరకు బ్యాట్స్‌మన్ ప్యాడ్‌ను తాకిందనే విషయాన్ని నిశితంగా పరిశీలిస్తాం. అలాగే బాల్ ట్రాకింగ్ సాంకేతికతలో అల్ట్రామోషన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. కాబట్టి కచ్చితత్వ నిర్ణయాలు వచ్చే అవకాశాలుంటారుు’ అని బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. గతంలో డీఆర్‌ఎస్‌ను బోర్డుతో పాటు కెప్టెన్ ఎంఎస్ ధోని తీవ్రంగా వ్యతిరేకించారు. అరుుతే కోచ్‌గా కుంబ్లే, కెప్టెన్‌గా కోహ్లి రాకతో పరిస్థితుల్లో మార్పు కనిపించింది. వీరిద్దరు ఈ పద్ధతికి సానుకూలత వ్యక్తం చేశారు. ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న కుంబ్లే గతేడాది ఎంఐటీ లాబొరేటరీని సందర్శించి బాల్ ట్రాకింగ్ సాంకేతికతతో పాటు హాట్ స్పాట్‌ను ఆధునీకరించిన విధానాన్ని పరిశీలించారు. భారత్ చివరిసారిగా 2008లో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో డీఆర్‌ఎస్‌ను ఉపయోగించింది.

రెండో వన్డేలో భారత్ ఓటమి - 6 పరుగులతో కివీస్ విజయం

21/10/2016: మూడు టెస్టుల్లో ఘన విజయం, ఆ తర్వాత తొలి వన్డేలోనూ భారీ తేడాతో గెలుపు... న్యూజిలాండ్ జట్టు మన గడ్డపై అడుగు పెట్టిననాటినుంచి వరుస విజయాలతో పండుగ చేసుకున్న భారత జట్టు జోరుకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. సాధారణ లక్ష్యాన్ని ఛేదించడంలో మన బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో భారత గడ్డపై కివీస్ బోణీ చేసింది. తక్కువ స్కోర్ల మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగినా... చివరకు విలియమ్సన్ సేనదే పైచేరుు అరుుంది. 243 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక దశలో భారత్ స్కోరు 183/8... మిగిలిన 55 బంతుల్లో గెలుపు కోసం 60 పరుగు చేయాలి. ఎలాంటి ఆశలు లేని ఈ దశలో హార్దిక్ పాండ్యా, ఉమేశ్ యాదవ్ 49 పరుగుల భాగస్వామ్యం జట్టును విజయానికి చేరువగా తెచ్చింది. తొలి మ్యాచ్‌లో బౌలింగ్‌తో ఆకట్టుకున్న పాండ్యా ఈ సారి బ్యాట్‌తో మెరిశాడు. మరో 11 పరుగులు చేయాల్సిన సమయంలో అతను వెనుదిరగడంతో భారత్ విజయం వాకిట కుప్పకూలింది. న్యూఢిల్లీ: ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న కేన్ విలియమ్సన్ ఎట్టకేలకు తన క్లాస్ చూపించాడు. సహచరులంతా విఫలమైన వేళ ఒంటరిగా నిలబడి సెంచరీ సాధించాడు. ఆ తర్వాత తన కెప్టెన్సీతో జట్టును గెలిపించాడు. మరో వైపు ప్రధాన బ్యాట్స్‌మెన్ అవుటైన దశలో 19వ ఓవర్లోనే క్రీజ్‌లోకి వచ్చిన ధోని తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించలేకపోయాడు. ఇటీవల తన పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూ జట్టును నడిపించడంలో విఫలమయ్యాడు. మొత్తంగా ఇరు జట్ల కెప్టెన్ల పోరులో విలియమ్సన్ గెలిచాడు. గురువారం ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 6 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (128 బంతుల్లో 118; 14 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్‌లో ఎనిమిదో సెంచరీని సాధించాడు. బుమ్రా, మిశ్రా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 49.3 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. కేదార్ జాదవ్ (37 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... ధోని (65 బంతుల్లో 39; 3 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (32 బంతుల్లో 36; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఈ ఫలితంతో ఐదు వన్డేల సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. మూడో వన్డే ఆదివారం మొహాలీలో జరుగుతుంది. కీలక భాగస్వామ్యం టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా... కివీస్ జట్టులో మూడు మార్పులు జరిగారుు. కివీస్ ఓపెనర్ గప్టిల్ (0) పేలవ ఫామ్ ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. ఇన్నింగ్‌‌స రెండో బంతికే అతడిని బౌల్డ్ చేసి ఉమేశ్ భారత్‌కు శుభారంభం అందించాడు. అరుుతే మరో ఓపెనర్ లాథమ్ (46 బంతుల్లో 46; 6 ఫోర్లు, 1 సిక్స్), విలియమ్సన్ జాగ్రత్తగా ఆడారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వీరు అలవోకగా పరుగులు సాధించడంతో పవర్‌ప్లే ముగిసే సరికి జట్టు స్కోరు 50 పరుగులకు చేరింది. అక్షర్ పటేల్ వేసిన ఒక ఓవర్లో రెండు ఫోర్లు, సిక్సర్ బాది విలియమ్సన్ జోరు ప్రదర్శించాడు. 46 పరుగుల వద్ద విలియమ్సన్ ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్‌ను పాండ్యా వదిలేయడం కివీస్‌కు కలిసొచ్చింది. వీరిద్దరి అటాకింగ్ ఆటతో తర్వాతి పది ఓవర్లలో 65 పరుగులు వచ్చారుు. ఆ వికెట్ తర్వాత... పార్ట్‌టైమర్ జాదవ్ మరోసారి జట్టుకు అదృష్టం తెచ్చాడు. తన తొలి ఓవర్లోనే లాథమ్‌ను అవుట్ చేసి అతని భారీ భాగస్వామ్యానికి తెర దించాడు. ఆ తర్వాత ఒక వైపు విలియమ్సన్ పట్టుదలగా నిలబడ్డా... మరో ఎండ్‌లో కివీస్ పతనం మొదలైంది. క్రీజ్‌లో ఉన్నంత సేపు తీవ్రంగా ఇబ్బంది పడ్డ టేలర్ (21) మిశ్రా బౌలింగ్‌లో స్వీప్‌కు ప్రయత్నించి డీప్ మిడ్‌వికెట్‌లో క్యాచ్ ఇచ్చాడు. బుమ్రా బౌలింగ్‌లో కవర్స్ దిశగా ఆడి రెండు పరుగులు తీయడంతో 109 బంతుల్లో విలియమ్సన్ సెంచరీ పూర్తరుుంది. ఈ పర్యటన మొత్తంలో కివీస్ తరఫున ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఈ దశలో అండర్సన్ (21)ను అవుట్ చేసి మిశ్రా మళ్లీ దెబ్బ తీశాడు. మిశ్రా తన తర్వాతి ఓవర్లోనే చక్కటి బంతితో విలియమ్సన్‌ను కూడా పెవిలియన్ పంపించడంతో ఆ జట్టు కోలుకోలేకపోరుుంది. ఆ తర్వాత మరో 24 పరుగులు మాత్రమే చేసి కివీస్ తర్వాతి ఐదు వికెట్లు కోల్పోరుుంది. ఒక దశలో ఆ జట్టు వరుసగా 11 ఓవర్ల పాటు ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోరుుంది. భారత బౌలర్లలో బుమ్రా ఒక్కడే 37 డాట్ బాల్స్ వేయగా, మొత్తం కలిపి కివీస్ పరుగులు తీయని బంతులు 161 ఉండటం చూస్తే భారత బౌలర్లు ఎంతగా కట్టడి చేశారో అర్థమవుతుంది. కోహ్లి విఫలం ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా భారత జట్టు తక్కువ వ్యవధిలోనే తొలి నాలుగు వికెట్లు కోల్పోరుుంది. టాప్-4 ఆటగాళ్లలో ఎవరూ ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. ముందుగా రోహిత్ (15)ను అవుట్ చేసి బౌల్ట్ కివీస్‌కు తొలి వికెట్ అందించాడు. అరుదైన రీతిలో కోహ్లి (9) కూడా విఫలమయ్యాడు. సాన్‌ట్నర్ బౌలింగ్‌లో లెగ్ సైడ్ ఆడిన బంతిని కీపర్ రోంచీ చక్కగా అందుకోవడంతో కోహ్లి ఇన్నింగ్‌‌స ముగిసింది. చక్కటి షాట్లు ఆడిన రహానే (49 బంతుల్లో 28; 3 ఫోర్లు) కుదురుకుంటున్న దశలో సౌతీ దెబ్బ తీశాడు. ఫైన్ లెగ్ దిశగా రహానే పుల్ షాట్ ఆడగా తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని అండర్సన్ క్యాచ్ పట్టాడు. అరుుతే అతని చేతుల్లో పడే ముందు బంతి నేలకు తగిలినట్లు కని పించింది. పదే పదే రీప్లేలు చూసిన తర్వాత థర్డ్ అంపైర్ రహానేను అవుట్‌గా ధ్రువీకరించారు. ఆ తర్వాతి ఓవర్లోనే మనీశ్ పాండే (19) రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆదుకున్న ధోని, జాదవ్ ఈ దశలో జత కలిసిన ధోని, జాదవ్ దూకుడును ప్రదర్శించారు. ముఖ్యంగా జాదవ్ కెప్టెన్‌ను మించి ధాటిగా ఆడాడు. సాన్‌ట్నర్ వేసిన రెండు వరుస ఓవర్లలో అతను రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. ఐదో వికెట్‌కు 66 పరుగులు జోడించిన అనంతరం హెన్రీ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ ఇచ్చి జాదవ్ నిష్ర్కమించాడు. అనంతరం ధోని, అక్షర్ కలిసి 33 పరుగులు జోడించినా... కివీస్ కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్‌తో పరుగులు నెమ్మదిగా వచ్చారుు. ఈ దశలో సౌతీ అద్భుత రిటర్న్ క్యాచ్‌తో ధోనిని పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత గప్టిల్ తన తొలి ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో భారత్ ఓ

సెమీస్‌ లో భారత్

20/10/2016: అహ్మదాబాద్: కీలకమైన మ్యాచ్‌లో హడలెత్తించిన భారత జట్టు ప్రపంచకప్ కబడ్డీ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఇంగ్లండ్‌తో మంగళవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 69-18తో ఘనవిజయం సాధించింది. ఈ విజ యంతో భారత్ గ్రూప్ ‘ఎ’లో 21 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. 25 పాయింట్లతో దక్షిణ కొరియా గ్రూప్ ‘ఎ’ టాపర్‌గా నిలిచింది. ఇంగ్లండ్‌తో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ఆద్యంతం టీమిండియా ఆధిపత్యం కనిపించింది. ఆరంభంలోనే 12-3తో ముందంజ వేసిన భారత్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ప్రదీప్ నర్వాల్ 13 పాయింట్లు, అజయ్ ఠాకూర్ 11 పాయింట్లు... నితిన్ తోమర్, సందీప్ నర్వాల్ 7 చొప్పున పాయింట్లు సాధించి భారత్ విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. గ్రూప్ ‘బి’ నుంచి ఇప్పటికే ఇరాన్ సెమీస్‌కు చేరగా... రెండో బెర్త్ కోసం థాయ్‌లాండ్, కెన్యా, జపాన్ జట్లు రేసులో ఉన్నాయి. బుధవారం జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్‌తో అర్జెంటీనా.... థాయ్‌లాండ్‌తో జపాన్ తలపడతాయి. భారత్ సెమీస్ ప్రత్యర్థి ఎవరో బుధవా రం లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక ఖరారవుతుంది.

సైనాకు అరుదైన గౌరవం

20/10/2016: హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అథ్లెట్స్ కమిషన్‌లో సభ్యురాలిగా సైనాను నియమించారు. ఈ మేరకు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ నుంచి సైనాకు సోమవారం రాత్రి అధికారిక నియామక పత్రం అందింది. గత ఆగస్టులో రియో ఒలింపిక్స్ సందర్భంగా అథ్లెట్స్ కమిషన్ ఎన్నికలు జరిగాయి. అమెరికా ఐస్ హాకీ క్రీడాకారిణి ఎంజెలో రుజియెరో అధ్యక్షురాలిగా ఉన్న ఈ ఐఓసీ అథ్లెట్స్ కమిషన్‌లో తొమ్మిది మంది ఉపాధ్యక్షులు, 10 మంది సభ్యులు ఉన్నారు. అథ్లెట్స్ కమిషన్ సమావేశం వచ్చేనెల 6న జరుగుతుంది. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న సైనా ఇటీవలే మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించింది. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే నెలలో ఆమె మళ్లీ బరిలోకి దిగొచ్చు.

సచిన్ రికార్డుపై కన్నేసిన ధోనీ!

20/10/2016: ఢిల్లీ: టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. దాంతో పాటు మరిన్ని రికార్డులు ధోనీని ఊరిస్తున్నాయి. నేటి మ్యాచ్ లో ధోనీ బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ నమోదైతే ఆ రికార్డులు సులువగా సాధిస్తాడు. ఆ రికార్డులు ఏంటంటే.. వన్డేల్లో ధోనీ మరో మూడు సిక్స్ లు కొడితే సచిన్(195 సిక్సర్లు) రికార్డును అధిగమిస్తాడు. అదే విధంగా 7 సిక్స్ లు కొడితే వన్డేలలో 200 సిక్సర్ల రికార్డును నమోదు చేసిన భారత తొలి ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ఎంఎస్ ధోనీ మరో 61 పరుగులు సాధిస్తే వన్డేల్లో 9 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. కెరీర్ లో 279 వన్డేలు ఆడిన ధోనీ 8,939 పరుగులు చేశాడు. మరికొంత కాలం వన్డేల్లో కొనసాగే అవకాశం ఉన్నందున పదివేల క్లబ్ లో చేరే అవకాశం ధోనీకి ఉంది. ఇక్కడి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో నేటి మధ్యాహ్నం 1:30 గంటలకు న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో భారత సారథి ధోనీ రికార్డులపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కివీస్ పై విరాట్ కోహ్లీ నేతృత్వంలో టెస్ట్ సిరీస్ ను 3-0తో క్లీన్ స్విప్ చేసిన టీమిండియా, ప్రస్తుతం ధోనీ నాయకత్వంలో తొలి వన్డేలో కివీస్ పై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

రికార్డు సృష్టించిన ఇంగ్లాండ్‌ కెప్టెన్

20/10/2016: చిట్టగాంగ్‌: ఇంగ్లాండ్‌ టెస్టు జట్టు కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ మరో ఘనత సాధించాడు. ఇంగ్లాండ్‌ తరఫున అత్యధిక టెస్టులాడిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పనున్నాడు. బంగ్లాదేశ్ తో గురువారం ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచులో బరిలోకి దిగి అతడు ఈ మైలురాయిని అందుకున్నాడు. 133 టెస్టులాడిన అలెక్‌ స్టివార్ట్‌ రికార్డును అతడు అధిగమించాడు. కుక్‌ 31 ఏళ్లకే ఈ రికార్డు సాధించడం విశేషం. ఇంగ్లాండ్‌ తరఫున టెస్టు క్రికెట్ లో 10 వేల పరుగులు చేసిన తొలి ఆటగాడు కూడా అతడే. 47.31 సగటుతో అతడు ఇప్పటివరకు 10,603 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 51 అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 294. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అత్యధికంగా 200 టెస్టులు ఆడి అందరికంటే ముందున్నాడు. రికీ పాంటింగ్, స్టీవా(168) తర్వాతి స్థానంలో నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టెస్టులు ఆడిన క్రికెటర్ల జాబితాలో కుక్ 11వ స్థానంలో ఉన్నాడు. కాగా, చిట్టగాంగ్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో కుక్ కేవలం 4 పరుగులు చేసి అవుటయ్యాడు.

క్వాలియింగ్‌లో కశ్యప్ ఓటమి

19/10/2016: ఒడెన్‌‌స: డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలియింగ్ తొలి రౌండ్‌లో ప్రపంచ 92వ ర్యాంకర్ కశ్యప్ 13-21, 21-8, 20-22తో ప్రపంచ 47వ ర్యాంకర్ రౌల్ మస్ట్ (ఎస్తోనియా) చేతిలో ఓడిపోయాడు. 59 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కశ్యప్ నిర్ణాయక మూడో గేమ్‌లో మ్యాచ్ పాయింట్లును వృథా చేశాడు. ఒకదశలో 14-19తో వెనుకబడిన కశ్యప్ వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 20-19తో విజయానికి ఒక పాయింట్లు దూరంలో నిలిచాడు. అయితే రౌల్ మస్ట్ పట్టుదలతో ఆడి వరుసగా మూడు పాయింట్లు గెలిచి కశ్యప్ ఓటమిని ఖాయం చేశాడు. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో సింధు, సాయిప్రణీత్, జయరామ్, ప్రణయ్ బరిలోకి దిగనున్నారు.

కోహ్లిపై గంభీర్ ఆస్తకికర కామెంట్లు

19/10/2016: న్యూఢిల్లీ: విరాట్ కోహ్లితో వ్యక్తిగతంగా తనకు ఎటువంటి విభేదాలు లేవని సీనియర్ బ్యాట్స్ మన్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. మైదానంలో తామిద్దరి భావోద్దేగాలు ఒకరకంగా ఉంటాయని చెప్పాడు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్య్వ్యూలో కోహ్లిపై తన అభిప్రాయాలను గంభీర్ వెల్లడించాడు. కోహ్లి నాయకత్వ పటిమను ప్రశంసించాడు. 'ఐపీఎల్ మ్యాచ్ లో కావాలనే కోహ్లితో గొడవ పడలేదు. ఇందులో వ్యక్తిగత విభేదాలు లేవు. విరాట్ కు వ్యతిరేకంగా ఆడాల్సి వస్తే దూకుడుగా ఉండక తప్పద'ని అన్నాడు. 2013 ఐపీఎల్ లో కోహ్లి, గంభీర్ మైదానంలో తిట్టుకున్న సంగతి తెలిసిందే. క్రికెట్ అనేది సీరియస్ క్రీడ అని, మైదానంలో దూకుడుగా ఉండడం తప్పు కాదని గంభీర్ అన్నాడు. 'విరాట్, నేను మైదానంలో దూకుడుగా వ్యవహరిస్తుంటాం. ఆట పట్ల మాకు ఎంతో ప్రేమ ఉంది. మేమిద్దరం ఒక జట్టులో ఉంటే ఒకే లక్ష్యం కోసం ఆడతామ'ని గంభీర్ చెప్పాడు. మార్గదర్శిలా కోహ్లి కెప్టెన్సీ ఉందని కితాబిచ్చాడు. రెండేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన గంభీర్ తొలిసారి కోహ్లి నాయకత్వంలో టెస్టు మ్యాచ్ ఆడాడు. న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో స్థాయికి తగ్గట్టు రాణించి తన సత్తా తగ్గలేదని చాటాడు.

'కోహ్లి ఇన్నింగ్స్ల్లో అదే బెస్ట్'

18/10/2016: ముంబై: విరాట్ కోహ్లి.. భారత క్రికెట్లో స్టార్ ఆటగాడు. ప్రత్యేకంగా లక్ష్య ఛేదనలో కోహ్లి రికార్డు అమోఘం. టీమిండియా క్లిష్టపరిస్థితుల్లో ఉందంటే విరాట్ బ్యాట్ కు పని చెప్పాల్సిందే. ఇప్పటివరకూ కోహ్లి నమోదు చేసిన 25 వన్డే సెంచరీల్లో 15 శతకాలు ఛేజింగ్లో చేశాడు. అయితే ఛేజింగ్లో సెంచరీలు చేసే క్రమంలో టీమిండియాకు 13 విజయాల్ని అందించాడు. ఇలా ఒక్కటి కాదు.. ఏ ఫార్మాట్ చూసినా విరాట్ నిజంగానే ప్రత్యేకం. ప్రస్తుతం టీమిండియా టెస్టు జట్టుకు సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న విరాట్ బ్యాటింగ్ కు హేమాహేమీలు సైతం ముగ్ధులు అవుతున్నారంటే అతనకు ఆటపై ఉన్న నిబద్ధతను అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే విరాట్ వన్డేల్లో నమోదు చేసిన సెంచరీల్లో మాజీ కెప్టెన్, దాదా సౌరవ్ గంగూలీకి అత్యంత ఇష్టమైనది ఒక్కటే ఉందట. 2013లో ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత లక్ష్య ఛేదనకు దిగిన సమయంలో విరాట్ చేసిన 133 పరుగులే తాను చూసిన విరాట్ వన్డే ఇన్నింగ్స్లో అత్యుత్తమం అంటూ గంగూలీ పేర్కొన్నాడు. ఈ రోజుకి శ్రీలంకపై సాధించిన విరాట్ ఆ ఇన్నింగ్సే తనకు అత్యంత ఇష్టమని గంగూలీ పేర్కొన్నాడు. శ్రీలంక 321 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచినప్పుడు విరాట్ ఆడిన తీరు అమోఘమన్నాడు. ఆ మ్యాచ్ లో నాల్గో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన కోహ్లి.. ప్రధానంగా మలింగా అండ్ గ్యాంగ్ ను ఊచకోత చూసిన తీరు అద్భుతమన్నాడు. ఇక్కడ పాకిస్తాన్ పై విరాట్ నమోదు చేసిన 183 వ్యక్తిగత పరుగుల్ని కూడా గంగూలీ పక్కన పెట్టేశాడు. ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లి 86 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 133 పరుగులతో అజేయంగా నిలిచాడు. శ్రీలంక ప్రధాన బౌలర్ మలింగా వేసిన ఒక ఓవర్ లో 24 పరుగులను విరాట్ పిండుకున్నాడు. తొలి బంతికి డబుల్ తీసిన కోహ్లి.. ఆ తరువాత బంతికి సిక్స్ కొట్టాడు. ఆపై మిగతా నాలుగు బంతుల్ని ఫోర్లుగా మలిచాడు. మలింగా వేసిన 15 బంతుల్ని ఎదుర్కొన్న కోహ్లి 44 పరుగులు చేసి పూర్తి పైచేయి సాధించాడు.

వెస్టిండీస్‌ పై పాక్ గెలుపు

18/10/2016: దుబాయ్: పాకిస్తాన్ తమ 400వ టెస్టులో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. డే నైట్ తొలి టెస్టు లో 56 పరుగుల తేడాతో గెలి చింది. డారెన్ బ్రేవో (249 బం తుల్లో 116; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా... జట్టును గట్టెక్కించలేక పోయాడు. 346 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు 95/2 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 109 ఓవర్లలో 289 పరుగుల వద్ద ఆలౌటైంది. రోస్టన్ చేజ్ (35)తో కలిసి ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించిన బ్రేవో... హోల్డర్ (40 నాటౌట్) అండతో సెంచరీ సాధించాడు. పాక్ బౌలర్లలో ఆమిర్ 3, యాసిర్ షా, నవాజ్ చెరో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్‌‌సలో పాకిస్తాన్ 579/3 స్కోరు వద్ద డిక్లేర్ చేయగా, వెస్టిండీస్ 357 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్‌‌సలో పాక్ 123 పరుగులకే ఆలౌటైంది.

రెజ్లర్ సాక్షి నిశ్చితార్థం

17/10/2016: రోహ్‌తక్ (హరియాణా): రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజా మోగనుంది. సహచర రెజ్లర్ సత్యవర్త్ కడియన్‌తో ఆదివారం ఆమె వివాహ నిశ్చితార్థం జరిగింది. సాక్షి స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె సమీప బంధువులు, సన్నిహిత మిత్రులు హాజరయ్యారు. రెజ్లర్ సత్యవర్త్ తన తండ్రికి చెందిన అఖాడాలో శిక్షణ పొందాడు. 97 కేజీల ఫ్రీస్టరుుల్ కేటగిరీలో బరిలోకి దిగిన అతను 2010 యూత్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం నెగ్గాడు.

తొలి వన్డేలో భారత్ ఘనవిజయం - 6 వికెట్లతో న్యూజిలాండ్ చిత్తు

17/10/2016: ఫార్మాట్ మారినా భా రత జోరులో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదు. టెస్టుల్లో ఘన విజయాల తర్వాత రంగు దుస్తుల్లోనూ మన టీమ్ మెరిసింది. అక్కడ సారథిగా ముందుండి నడిపించిన కోహ్లి, ఇక్కడ అలవాటైన రీతిలో ఆటగాడిగా మరో చూడచక్కటి ఇన్నింగ్‌‌స ఆడాడు. అంతకుముందు మన బౌలర్లు కూడా అంచనాలకు మించి రాణించారు. ఫలితంగా వన్డే సిరీస్‌ను ఏకపక్ష గెలుపుతో ప్రారంభించిన టీమిండియా సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తొలి మ్యాచ్ ఆడుతున్న హార్దిక్ పాండ్యాకుతోడు ఉమేశ్, అమిత్ మిశ్రా దెబ్బకు కివీస్ విలవిల్లాడింది. చివరకు పార్ట్‌టైమర్ కేదార్ జాదవ్‌కు కూడా వికెట్లు ఇచ్చేయడంతో ఒక దశలో న్యూజిలాండ్ ఇన్నింగ్‌‌స 100లోపే ముగిసేలా అనిపించింది. అరుుతే లాథమ్, సౌతీ కాస్త పోరాడటంతో ఆ జట్టు పరువు నిలిచింది. అరుుతే తుది స్కోరు మాత్రం భారత్‌ను నిలువరించేందుకు సరిపోలేదు. ఛేదనలో మేటి అరుున విరాట్ ముందు లక్ష్యం చాలా చిన్నదిగా మారిపోరుుంది. ధర్మశాల: సొంతగడ్డ మీద ప్రత్యర్థి న్యూజిలాండ్‌పై భారత్ అప్రతిహత విజయాలు కొనసాగుతున్నారుు. టెస్టుల్లో కివీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన మన జట్టు ఇప్పుడు వన్డేల్లోనూ శుభారంభం చేసింది. ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా మరో 101 బంతులు మిగిలి ఉండగానే అలవోక విజయాన్ని అందుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 43.5 ఓవర్లలో 190 పరుగులకే ఆలౌటైంది. టామ్ లాథమ్ (98 బంతుల్లో 79 నాటౌట్; 7 ఫోర్లు, ఒక సిక్స్), టిమ్ సౌతీ (45 బంతుల్లో 55; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలు సాధించారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (3/31), అమిత్ మిశ్రా (3/49) కివీస్‌ను దెబ్బ తీశారు. అనంతరం భారత్ 33.1 ఓవర్లలో 4 వికెట్లకు 194 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (81 బంతుల్లో 85 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో చివరి వరకు నిలిచాడు. తాజా ఫలితంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే ఈ నెల 20న న్యూఢిల్లీలో జరుగుతుంది. టపటపా... భారత్ తరఫున 16 టి20 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. పిచ్ నుంచి చక్కటి సహకారం లభించడంతో మన పేసర్లు ఆరంభంలోనే పట్టు బిగించారు. తన తొలి ఓవర్లోనే మూడు బౌండరీలు బాదిన గప్టిల్ (12)ను అదే ఓవర్ చివరి బంతికి అవుట్ చేసి పాండ్యా కెరీర్‌లో మొదటి వికెట్ తీశాడు. ఆ తర్వాత ఉమేశ్ ధాటికి కివీస్ కష్టాల్లో పడింది. తన వరుస ఓవర్లలో అతను విలియమ్సన్ (3), టేలర్ (0)లను పెవిలియన్ పంపించాడు. ఒకవైపు సహచరులు వెనుదిరుగుతున్నా, మరో ఎండ్‌లో లాథమ్ పట్టుదలగా నిలబడ్డాడు. అరుుతే పాండ్యా రెండు వికెట్లతో మరోసారి న్యూజిలాండ్‌ను దెబ్బ తీశాడు. మిడాఫ్‌లో ఉమేశ్ అద్భుత క్యాచ్‌కు అండర్సన్ (4) వెనుదిరగ్గా, తర్వాతి ఓవర్లో రోంచీ (0) కూడా ఉమేశ్‌కే క్యాచ్ ఇచ్చాడు. పార్ట్‌టైమర్ కేదార్ జాదవ్ కూడా కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ వరుస బంతుల్లో నీషమ్ (10), సాన్‌ట్నర్ (0)లను అవుట్ చేయడంతో కివీస్ స్కోరు 19 ఓవర్లకే 65/7 వద్ద నిలిచింది. ఆదుకున్న లాథమ్, సౌతీ... ఈ దశలో లాథమ్ పట్టుదల ప్రదర్శిస్తూ చక్కటి షాట్లు ఆడాడు. అతనికి కొద్ది సేపు బ్రేస్‌వెల్ (15) అండగా నిలిచాడు. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 41 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ క్రమంలో 77 బంతుల్లో లాథమ్ అర్ధ సెంచరీ పూర్తరుుంది. మిశ్రా ఈ జోడీని విడదీసిన అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన సౌతీ దూకుడుగా ఆడాడు. 2 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్‌లో అతను ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను ఫైన్‌లెగ్‌లో ఉమేశ్ వదిలేయడం సౌతీకి కలిసొచ్చింది. అదే ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతను పటేల్, మిశ్రా ఓవర్లలో చెరో సిక్సర్ బాదాడు. ఉమేశ్ ఓవర్లో కూడా వరుసగా సిక్స్, ఫోర్ కొట్టిన సౌతీ 40 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 100వ వన్డే ఆడుతున్న అతని కెరీర్ లో ఇదే తొలి అర్ధ సెంచరీ కావడం విశేషం. ఎట్టకేలకు చక్కటి బంతితో సౌతీని వెనక్కి పంపి మిశ్రా తొమ్మిదో వికెట్ భాగస్వామ్యానికి తెర దిం చాడు. లాథమ్, సౌతీ 58 బంతుల్లోనే 71 పరుగులు జోడించడం విశేషం. సోధి (1)ని కూడా మిశ్రా అవుట్ చేయడంతో 37 బంతులు మిగిలి ఉండగానే కివీస్ ఇన్నింగ్‌‌స ముగిసింది. ఓపెనర్‌గా వచ్చిన చివరి వరకు నాటౌట్‌గా ఉన్న తొలి న్యూజిలాండ్ ఆటగాడిగా లాథమ్ నిలిచాడు. అలవోకగా ఛేదన... సాధారణ లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు రహానే (34 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ (14) శుభారంభం ఇచ్చారు. రోహిత్ నెమ్మదిగా ఆడినా, బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో రహానే దూకుడు ప్రదర్శించాడు. అరుుతే పదో ఓవర్లో రోహిత్ అవుట్ కావడంతో జట్టు తొలి వికెట్ కోల్పోరుుంది. ఆ తర్వాత కొద్ది సేపటికే రహానే కూడా వెనుదిరగ్గా, మనీశ్ పాండే (17) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. మరో ఎండ్‌లో కోహ్లి ప్రశాంతంగా తన పని చేసుకుంటూ పోయాడు. ఎక్కడా ఇబ్బంది పడకుండా స్వేచ్ఛగా ఆడిన అతను, తనదైన శైలిలో అలవోకగా పరుగులు సాధించాడు. మరో ఎండ్‌లో ధోని (21)నుంచి అతనికి మద్దతు లభించింది. ఇదే జోరులో 55 బంతుల్లోనే తన కెరీర్‌లో 37వ అర్ధ సెంచరీని అందుకున్నాడు. తన ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అనంతరం కోహ్లి ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను సౌతీ అందుకోవడంలో విఫలం కాగా... మరుసటి ఓవర్లోనే ధోని రనౌటయ్యాడు. సాన్‌ట్నర్ బౌలింగ్‌లో ధోని ముందుకొచ్చి షాట్ ఆడాడు. బంతి అతని కాలికి తగిలి ఫీల్డర్ వైపు వెల్లింది. అరుుతే సింగిల్ తీయడంలో కోహ్లి సందేహించడంతో ధోని వెనక్కి వెళ్లే ప్రయత్నం చేసినా లాభం లేకపోరుుంది. ఆ తర్వాతా తన ధాటిని కొనసాగించిన కోహ్లి 34వ ఓవర్ తొలి బంతికి భారీ సిక్సర్ కొట్టి భారత్ విజయాన్ని ఖాయం చేశాడు.

మీ బలహీనతను దాచేయండి- సచిన్

08/10/2016: న్యూఢిల్లీ:ఏ మనిషికైనా బలం, బలహీనత ఉండటం సాధారణం. అయితే ప్రధానంగా ఆటగాళ్లు తమ బలహీనతల్ని కనబడనీయకుండా చేసినప్పుడే వారు విజయవంతం అవుతారని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. దాంతో పాటు సవాళ్లను, కష్ట నష్టాలను ఎదుర్కొనడానికి ఎప్పుడూ వెనుకడుగు వేయొద్దని యువ క్రికెటర్లకు సచిన్ సూచించాడు. ఫిబ్రవరి 26వ తేదీన నిర్వహించే న్యూఢిల్లీ మారథాన్ ఆరంభ కార్యక్రమానికి విచ్చేసిన సచిన్.. వర్ధమాను క్రికెటర్లకు పలు సూచనలు చేశాడు. 'ఎప్పుడూ మీ బలహీనతను బయటకు కనబడనీయకండి. ఒకసారి ప్రత్యర్థులకు మనం ఎక్కడ దొరికిపోతాయో తెలిసిందటే మళ్లీ మీరు తిరిగి పుంజుకోవడం కష్టమవుతుంది. ఒకసారి నా విషయంలో ఇదే జరిగింది. ఒకానొక సందర్భంలో నా పక్కటెములకు బంతి బలంగా తాకింది. అదే ఆయుధంగా బౌలర్ బంతుల్ని వేయడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో నాకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైంది. అక్కడ తీవ్ర గాయమైంది నాకు తెలుసు. కానీ ఆ విషయాన్ని బయటకు కనబడనీయలేదు. ఎన్నో సవాళ్లను, కష్టాలను ఎదుర్కొనడం అలవాటు చేసుకోండి. ఒకసారి కష్టం వచ్చిందని ముందుకు ధైర్యంగా వెళ్లడం ఆపకండి' అని సచిన్ సూచించాడు. తన ఫిట్ నెస్ లో పరుగు అనేది కీలక పాత్ర పోషించిందని సచిన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

భారత్‌కు కొరియా షాక్ - కబడ్డీ ప్రపంచకప్‌లో పెను సంచలనం - ఆఖరి క్షణాల్లో ఓడిన ఆతిథ్య జట్టు

08/10/2016: అహ్మదాబాద్: తొమ్మిదేళ్ల విరామం తర్వాత జరుగుతున్న కబడ్డీ ప్రపంచకప్ పెను సంచలనంతో ప్రారంభమైంది. ప్రొ కబడ్డీ లీగ్ ద్వారా స్టార్స్‌గా మారిన భారత ఆటగాళ్లు ప్రపంచ వేదికపై మాత్రం షాక్ తిన్నారు. ప్రొ కబడ్డీలో కోల్‌కతా తరఫున ఆడి భారత్‌కు చిరపరిచితుడైన కొరియా ఆటగాడు జాంగ్ కున్ లీ సంచలన ఆటతీరుతో తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. శనివారం జరిగిన టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో కొరియా 34-32తో భారత్‌ను ఓడించింది. తొలి ఐదు నిమిషాల్లో కొరియా 4-2 ఆధిక్యంతో ఉన్నా... భారత జట్టు పుంజుకుని వరుస పాయి0ట్లతో స్టేడియంను హోరెత్తించింది. దీంతో ప్రథమార్ధంలో భారత్ 18-13తో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ద్వితీయార్ధంలోనూ భారత్ ఓ దశలో 27-21తో ఆధిక్యంలో ఉంది. అయి0తే చివరి ఐదు నిమిషాల్లో కొరియా ఆటగాళ్లు చెలరేగిపోయారు. పటిష్టమైన డిఫెన్‌‌సతో టాకిల్ పాయి0ట్లు సాధించారు. మరోవైపు కున్ లీ చివరి మూడు నిమిషాల్లో ఏకంగా ఎనిమిది పాయి0ట్లు తెచ్చాడు. 39వ నిమిషం వరకు 29-27తో ఆధిక్యంలో ఉన్న భారత్... చివరి నిమిషంలో మ్యాచ్‌ను కోల్పోయి0ది. కొరియా తరఫున కున్ లీ మొత్తం పది పాయి0ట్లు సాధించడంతో పాటు మరో ఐదు బోనస్ పాయి0ట్లు కూడా తెచ్చాడు. డాంగ్ జియోన్ లీ ఆరు పాయి0ట్లు సాధించాడు. భారత్ తరఫున కెప్టెన్ అనూప్ కుమార్ 9 పాయి0ట్లు సాధించడంతో పాటు మూడు బోనస్ పాయి0ట్లు తెచ్చాడు. మంజీత్ చిల్లర్ ఐదు పాయి0ట్లు తెచ్చాడు. స్టార్ ఆటగాడు రాహుల్ చౌదరి 9 సార్లు రైడింగ్‌కు వెళ్లి 3 పాయి0ట్లు తెచ్చాడు. కబడ్డీ చరిత్రలో భారత్‌పై కొరియా గెలవడం ఇదే తొలిసారి. మరో మ్యాచ్‌లో ఇరాన్ 52-15 స్కోరుతో అమెరికాపై గెలిచింది. మేరాజ్, ఫాజల్ ఐదేసి పాయింట్లు సాధించారు. వైభవంగా ఆరంభం కబడ్డీ ప్రపంచకప్ కలర్‌ఫుల్‌గా ప్రారంభమైంది. తొలుత కళాకారుల విన్యాసాలు, లేజర్ మెరుపులతో కార్యక్రమం సాగింది. ఆ తర్వాత భారత సంప్రదాయ పద్దతిలో ఒక్కో జట్టు కెప్టెన్‌ను కోర్టులోకి తీసుకొచ్చారు. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ముఖ్య అతిధిగా ప్రసంగించారు.

హర్‌ప్రీత్ సింగ్ డబుల్ సెంచరీ

08/10/2016: హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో ఉత్తరప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ భారీ స్కోరు సాధించింది. హర్‌ప్రీత్ సింగ్ (274 బంతుల్లో 216 నాటౌట్; 25 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్ తో డబుల్ సెంచరీ సాధించగా..... మధ్యప్రదేశ్ 125.5 ఓవర్లలో 465 పరుగులు చేసి ఆలౌటైందిది. అంకిత్ శర్మ (61) రాణించాడు. యూపీ బౌలర్లలో ఇంతియాజ్ మూడు వికెట్లు తీయగా... కుల్‌దీప్, రాజ్‌పుత్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. అనంతరం ఉత్తరప్రదేశ్ తమ తొలి ఇన్నింగ్‌‌సలో 47 ఓవర్లలో 5 వికెట్లకు 131 పరుగులు చేసింది. ఏకలవ్య ద్వివేది 37 పరుగులతో, కుల్‌దీప్ యాదవ్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. సర్ఫరాజ్ ఖాన్ (17) నిరాశపరచగా... పీయూష్ చావ్లా 22 పరుగులు చేశాడు. కెప్టెన్ రైనా ఇంకా బ్యాటింగ్‌కు దిగకపోవడం విశేషం. ఎంపీ బౌలర్ గౌరవ్ యాదవ్ మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు.

సురేశ్ రైనా వచ్చాడు! - యువరాజ్‌కు నిరాశ - కివీస్‌తో వన్డేలకు భారత జట్టు ప్రకటన

07/10/2016: న్యూఢిల్లీ: దాదాపు ఏడాది క్రితం భారత్ తరఫున ఆఖరి వన్డే ఆడిన సురేశ్ రైనా తిరిగి జట్టులోకి ఎంపికయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగే తొలి మూడు వన్డేల కోసం భారత జట్టును గురువారం సెలక్షన్ కమిటీ ప్రకటించింది. వరుస వైఫల్యాలతో ఆస్ట్రేలియా, జింబాబ్వేలతో జరిగిన వన్డే సిరీస్‌లలో స్థానం కోల్పోరుున రైనా, ఇప్పుడు పునరాగమనం చేశాడు. రైనా పార్ట్‌టైమ్ స్పిన్ కూడా అతని ఎంపికకు కారణమని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పారు. మరో వైపు జట్టులో స్థానాన్ని ఆశించిన యువరాజ్ సింగ్‌కు నిరాశే ఎదురైంది. అతని పేరును సెలక్టర్లు పరిశీలించలేదు. సీనియర్లతో పాటు ఇటీవల భారత్ ‘ఎ’ తరఫున నిలకడగా ఆడిన యువ ఆటగాళ్లపై కమిటీ విశ్వాసం ఉంచింది. తాజాగా జట్టులోకి ఎంపికై న మన్‌దీప్ సింగ్, జయంత్ యాదవ్, హార్దిక్ పాండ్యా భారత్ తరఫున టి20లు ఆడినా...ఇప్పటి వరకు వన్డేల్లో అరంగేట్రం చేయలేదు. గాయాల కారణంగా ధావన్, రాహుల్, భువనేశ్వర్ పేర్లను పరిశీలించలేదు. టెస్టు జట్టులో రెగ్యులర్ సభ్యులైన అశ్విన్, జడేజా, షమీలు మున్ముందు చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నందున వారికి వన్డేలనుంచి విశ్రాంతి కల్పిస్తున్నట్లు సెలక్టర్లు ప్రకటించారు. అక్టోబరు 16 నుంచి న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్ జరుగుతుంది. తొలి మూడు వన్డేలకు జట్టు: ధోని (కెప్టెన్), రోహిత్ శర్మ, రహానే, కోహ్లి, మనీశ్ పాండే, రైనా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, అమిత్ మిశ్రా, బుమ్రా, ధావల్ కులకర్ణి, ఉమేశ్ యాదవ్, మన్‌దీప్ సింగ్, కేదార్ జాదవ్.

అలాంటి వారివల్ల ఫిక్సింగ్‌ను ఆపలేం

06/10/2016: డబ్బు ఇస్తే ఏ పనైనా చేసేవారు క్రికెట్‌లోనూ ఉంటారని, అలాంటి వారి వల్ల ఫిక్సింగ్‌ను ఆపడం కష్టమవుతుందని దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. అరుుతే ఇప్పటివరకూ ఎవరూ మ్యాచ్ ఫిక్సింగ్ కోసం తనను సంప్రదించలేదని, అలాంటి సంఘటన ఎదురైతే వెంటనే వారిని అధికారులకు అప్పగిస్తానని చెప్పాడు. ఓ క్రికెటర్‌తో ఆడిన తర్వాత అతను ఫిక్సర్ అని తేలితే అలాంటి వారిని తలచుకోవడానికే తనకు అసహ్యంగా ఉంటుందని డివిలియర్స్ అన్నాడు.

కంగారెత్తిస్తున్న సఫారీలు!

06/10/2016: డర్బన్: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలోనూ సఫారీలు సింహనాదం చేశారు. ఆసీస్ విసిరిన 372 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించారు.. తొలుత డీకాక్, హషీమ్ ఆమ్లాలు స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తే, ఆ తరువాత డేవిడ్ మిల్లర్ వీరవిహారం చేశాడు. మిల్లర్(118 నాటౌట్: 79 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు)తో విజృంభించి అజేయ శతకంతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రత్యేకంగా మిల్లర్ దెబ్బకు ఆసీస్ ఊచకోతకు గురై హ్యాట్రిక్ ఓటమితో సిరీస్ ను చేజార్చుకుంది. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికాకు డీ కాక్ (70;49 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓపెనర్ హషీమ్ ఆమ్లా(45;30 బంతుల్లో 9 ఫోర్లు) శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ దూకుడుగా ఆడి తొలి వికెట్ కు 66 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే ఆమ్లా తొలి వికెట్ గా అవుటైన తరువాత డీ కాక్ మరింత రెచ్చిపోయాడు. గత మ్యాచ్ల్లో శతకంతో కదం తొక్కిన డీ కాక్.. మరోసారి ఆసీస్ బౌలింగ్ను కకావికలం చేశాడు. అతనికి జతగా డు ప్లెసిస్(33;32 బంతుల్లో 4 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. ఈ జోడి ఎప్పుడూ రన్ రేట్ తగ్గకుండా ఆసీస్ పై ఒత్తిడి తెచ్చింది. అయితే డు ప్లెసిస్ అవుటైన స్వల్ప వ్యవధిలో డీకాక్, రస్కో(18) లు పెవిలియన్ చేరడంతో ఆసీస్ ఊపిరి పీల్చుకుంది. ఆ తరుణంలో క్రీజ్ లో కి వచ్చిన మిల్లర్ ఆసీస్ పై ఎదురుదాడికి దిగాడు. బౌండరీలే లక్ష్యంగా విధ్వంసకర ఆట తీరును ప్రదర్శించాడు. ప్రత్యేకంగా ఫెహుల్వాయో(42 నాటౌట్:39 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి స్కోరు బోర్డులో వేగం పెంచాడు. వీరిద్దరూ కలిసి వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో దక్షిణాఫ్రికా ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్లను కోల్పోయి విజయాన్ని అందుకుంది. దాంతో ఐదు వన్డేల సిరీస్ను దక్షిణాఫ్రికా 3-0 తో కైవసం చేసుకుంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 371 పరుగులు చేసింది. ఆసీస్ ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్(117;107 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టీవ్ స్మిత్(108; 107 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో రాణించారు.

షరపోవాపై నిషేధం తగ్గింది

05/10/2016: లాసానే: డోపింగ్ ఆరోపణలతో నిషేధం ఎదుర్కొంటున్న రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవాకు కాస్త ఊరట లభించింది. ప్రస్తుతం తనపై రెండేళ్ల నిషేధం ఉండగా క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సీఏఎస్) 15 నెలలకు తగ్గించింది. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్ 26న తిరిగి షరపోవా బరిలోకి దిగనుంది. సీఏఎస్ నిర్ణయంపై రష్యా టెన్నిస్ సమాఖ్య (ఆర్‌టీఎఫ్) హర్షం వ్యక్తం చేసింది. తనపై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య విధించిన నిషేధంపై షరపోవా జూన్ 9న సీఏఎస్‌లో అప్పీల్ చేసుకుంది. శక్తి సామర్థ్యాలను పెంచే వాడా నిషేధిత ఉత్ప్రేరకం మెల్డోనియమ్ ఆనవాళ్లు తన శాంపిల్‌లో ఉండడంతో ఈ రష్యా స్టార్‌పై వేటు పడింది.

‘వృద్ధి’మాన్‌భవ... - అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం - జట్టులో స్థానం సుస్థిరం

05/10/2016: ఆరేళ్ల క్రితం తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడిన భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా... ఇప్పటివరకూ ఆడిన టెస్టుల సంఖ్య కేవలం 17. ధోని టెస్టు క్రికెట్ నుంచి ఆకస్మికంగా 2014 డిసెంబరులో వైదొలిగే సమయానికి సాహా అనుభవం కేవలం రెండు టెస్టు మ్యాచ్‌లే. 2010లో మూడు వన్డేలు, 2014లో ఆరు వన్డేలు ఆడాడు. కారణం... మహేంద్ర సింగ్ ధోని. భారత వన్డే కెప్టెన్ మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా ఆడటంతో అవకాశాలు లేక ఎదురుచూసిన ఎంతోమంది వికెట్ కీపర్లలో ఒకడు సాహా. నిజానికి ధోనికి గాయమైతే తమకు అవకాశం దొరుకుతుందని ఎంతోమంది ఆశగా ఎదురుచూసిన రోజులవి. అవకాశాలు రాకపోచినా... సాహా నిరాశపడలేదు. తనకు ఏదో ఒక ‘మంచి’రోజు వస్తుందని ఆశగా ఎదురుచూశాడు. ఇంతకాలానికి 32 ఏళ్ల వయసులో అతనికి తగిన గుర్తింపు, గౌరవం లభించాయి. సాక్షి క్రీడావిభాగం సహనం... ఈ పదానికి పర్యాయపదం సాహా. జట్టులో పాతుకుపోయిన ధోని ఓ వైపు... ఒకవేళ ధోని విశ్రాంతి తీసుకున్నా దినేశ్ కార్తీక్, పార్థీవ్ పటేల్‌లాంటి అంతర్జాతీయ అనుభవం ఉన్న వికెట్ కీపర్లతో పోటీ మరోవైపు. నిజానికి గత ఎనిమిదేళ్లలో భారత క్రికెట్‌లో వికెట్ కీపర్ల బాధ మాటల్లో చెప్పడం కష్టం. ఎంత మంచి ఇన్నింగ్‌‌స ఆడినా అవకాశం దొరికేది కాదు. కీపింగ్‌లో ఎంత నైపుణ్యం ఉన్నా ఫలితం దక్కేది లేదు. నిజానికి దీనికి ఎవరినీ తప్పు పట్టడానికి కూడా లేదు. పరిస్థితులు అలా ఉన్నాయి. అయినా సాహా ఓపికగా రంజీ మ్యాచ్‌లు ఆడుతూనే కాలం గడిపాడు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆడాడు. అవకాశం వస్తుందో రాదో తెలియదు, భారత జట్టుకు ఆడతాడో లేదో అనే సందేహం... అయినా ఓపికగా ఎదురు చూశాడు. కీపర్‌గా ఉత్తమం ఓ పెద్ద క్రికెటర్ స్థానంలో మరో ఆటగాడు జట్టులోకి వస్తే కచ్చితంగా ఇద్దరినీ పోల్చి చూస్తారు. ధోని టెస్టుల నుంచి రిటైర్ కావడానికి ముందు లభించిన అరకొర అవకాశాలను సాహా అందిపుచ్చుకోలేకపోయాడు. నాలుగు ఇన్నింగ్‌‌సల్లో కలిపి 74 పరుగులు చేశాడు. నిజానికి ఓ కొత్త క్రికెటర్‌కు ఇది చెత్త ప్రదర్శనేం కాదు. కానీ ధోనితో పోలిక వల్ల ఈ 74 పరుగులు కనిపించలేదు. అయితే కీపర్‌గా మాత్రం సాహా అందరినీ ఆకట్టుకున్నాడు. ధోని కంటే ఎక్కువ వేగంతో వికెట్ల వెనక కదిలాడు. 2014లో కెప్టెన్ ధోని టెస్టుల నుంచి తప్పుకోవడంతో అవకాశం వచ్చినా... ఆస్ట్రేలియాలో ఆడిన రెండు టెస్టుల్లో ఓ మాదిరిగానే ఆడాడు. అయితే కీపర్‌గా మాత్రం వందకు వంద మార్కులు తెచ్చుకున్నాడు. నిజానికి ఉపఖండం బయట కంటే స్వదేశంలో కీపింగ్ చేయడం చాలా కష్టం. స్పిన్నర్లు వేసే బంతులు ఎప్పుడు ఎలా టర్న్, బౌన్‌‌స అవుతాయో తెలియదు. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి. బ్యాట్స్‌మన్‌గా అంతంత మాత్రంగానే ఆడినా వికెట్ కీపింగ్‌లో పేరు తెచ్చుకోవడంతో సాహా జట్టులో కొనసాగాడు. మలుపు తిప్పిన విండీస్ పర్యటన తాజాగా వెస్టిండీస్‌లో భారత పర్యటనలో సాహా పరిస్థితి చాలా భిన్నం. నిజానికి అశ్విన్ బౌలర్, సాహా బ్యాట్స్‌మన్. కానీ బ్యాటింగ్ ఆర్డర్‌లో అశ్విన్ ముందుగా వచ్చేవాడు. కెప్టెన్, కోచ్‌లకు అశ్విన్‌పై ఉన్న నమ్మకం వల్ల ఇలా జరిగి ఉండొచ్చు. కానీ ఇదే సమయంలో సాహా పరిస్థితినీ అర్థం చేసుకోవాలి. అరుుతే ఏమాత్రం నిరాశ చెందని సాహా వెస్టిండీస్ పర్యటనలో చాలా బాగా ఆడాడు. అశ్విన్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు నిర్మించాడు. వరుసగా రెండు టెస్టుల్లో 40, 47 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే సాహా కెరీర్‌ను మలుపు తిప్పిన ఇన్నింగ్‌‌స మూడో టెస్టు (గ్రాస్ ఐలట్)లో వచ్చింది. సాహా క్రీజులోకి వచ్చే సమయానికి భారత్ 126 పరుగులకు ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అశ్విన్‌తో కలిసి ఓపికగా ఇన్నింగ్‌‌సను నిర్మించాడు. అశ్విన్ కంటే మెరుగైన స్టయిక్ రేట్ (45.81)తో సెంచరీ చేశాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ పేసర్లు కొత్త బంతితో విసిరిన సవాళ్లను అలవోకగా అధిగమించాడు. ఈ సెంచరీతో భారత టెస్టు జట్టులో ఒక రకంగా అతను పాతుకుపోయాడు. ఈడెన్‌లో ‘వండర్’ న్యూజిలాండ్‌తో కాన్పూర్ టెస్టు తొలి ఇన్నింగ్‌‌సలో సాహా డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్‌‌సలో బ్యాటింగ్ అవకాశం రాలేదు. ఇక కోల్‌కతాలో తన సొంతగడ్డపై మాత్రం సాహా వరుసగా రెండు ఇన్నింగ్‌‌సలోనూ అద్భుతం చేశాడు. బ్యాటింగ్ చేయడం చాలా క్లిష్టంగా ఉన్న పిచ్‌పై టెయిలెండర్ల సహాయంతో ఇన్నింగ్‌‌సను నిలబెట్టాడు. చివరి నాలుగు వికెట్లకు బౌలర్లతో కలిసి 116 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 200 దగ్గర తడబాటుతో కనిపించిన భారత్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. రెండో ఇన్నింగ్‌‌సలోనూ అర్ధసెంచరీతో భారత ఆధిక్యాన్ని పెంచాడు. భారత ప్రధాన బ్యాట్స్‌మెన్ ఆడటానికి తడబడ్డ పిచ్‌పై అతను అలవోకగా పరుగులు చేయడంతో పాటు రెండు ఇన్నింగ్‌‌సలోనూ నాటౌట్‌గా నిలిచాడు. లోయర్ ఆర్డర్‌లో బౌలర్ల సహకారంతో ఇన్నింగ్‌‌స నడిపే ఆటగాడి పాత్రను తను సమర్థంగా పోషించాడు. నిజానికి సాహా సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అయితే బిహార్, ఉత్తరప్రదేశ్‌ల నుంచి క్రికెట్ అవకాశాల కోసం కోల్‌కతా వచ్చే వందలాదిమందిలో ఒకడిలా అతను కూడా వచ్చేశాడు. చిన్న వయసులోనే కోల్‌కతాలో స్థిరపడటం ద్వారా బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. సాహా కెరీర్ మొత్తం ఎంతో సహనంతో సాగింది. కెరీర్‌లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, అవకాశాలు వచ్చినా రాకపోయినా అతను ప్రశాంతంగానే ఉండేవాడు. ఎందుకంటే అతని పూర్తి పేరు వృద్ధిమాన్ ప్రశాంత సాహా.

పారాలింపిక్ విజేతలకు నజరానా - సచిన్ చేతుల మీదుగా రూ.15 లక్షల చొప్పున అందజేత

04/10/2016: ముంబై: రియో పారాలింపిక్స్‌లో దేశం గర్వించదగ్గ స్థాయిలో రాణించిన నలుగురు విజేతలకు సోమవారం ఘనసన్మానం జరగడంతో పాటు నజరానా అందించారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు ఇందులో పాల్గొన్నారు. స్వర్ణాలు సాధించిన మరియప్పన్ తంగవేలు, దేవేంద్ర జజారియాలతో పాటు రజతం అందుకున్న దీపా మలిక్, కాంస్యం సాధించిన వరుణ్ సింగ్ భటిలకు రూ.15 లక్షల చొప్పున చెక్‌లను అందించారు. అంతేకాకుండా ఇంతకుముందు జరిగిన పారాలింపిక్స్ గేమ్స్‌లో పతకాలు సాధించిన వారికి కూడా ఈ నజరానా అందనుంది. వీరిలో మురళీకాంత్ పేట్కర్ (1972), భీమ్‌రావ్ కేస్కర్, జోగిందర్ సింగ్ బేడి (1984), రాజిందర్ సింగ్ రహేలు (2004), హెచ్‌ఎన్ గిరీష (2012) ఉన్నారు. అలాగే పారాలింపిక్ అథ్లెట్లకు ప్రోత్సాహాన్ని అందిస్తున్న గోస్పోర్‌‌ట్స ఫౌండేషన్‌కు రూ.35 లక్షలను అందించారు. ‘ఇది చాలా ప్రత్యేక సమయం. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. ఓ భారతీయుడిగా మీ నలుగురు విజేతలను చూసి గర్విస్తున్నాను. మొత్తం ప్రపంచమంతా మిమ్మల్ని అంగవైకల్యం ఉన్న వారిగా పిలిచినా నా దృష్టిలో మాత్రం అత్యద్భుతమైన శక్తిసామర్థ్యంగలవారు’ అని సచిన్ కొనియాడారు. అలాగే ప్రతిసారి ఈ గేమ్స్‌ను పారాలింపిక్స్‌గా పిలవడం బాధిస్తోందని, నిజానికి వీటిని ఒలింపిక్స్ పారాలింపిక్స్‌గా పిలవాలని దీపా మలిక్ అభిప్రాయపడింది. ఇవి కూడా ఒలింపిక్ స్థాయి పోటీలేనని గుర్తుచేసింది. ఇక విజేతలకు ఇచ్చిన నజరానాల మొత్తాన్ని సచిన్‌తోపాటు వి.చాముండేశ్వరీనాథ్ (హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు), నిమ్మగడ్డ ప్రసాద్ (కేరళ బ్లాస్టర్స్ సహ యజమాని.. పారిశ్రామికవేత్త), డాక్టర్ ఆజాద్ మూపెన్ (ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ సీఎండీ), సం జయ్ ఘోడవత్ (సంజయ్ ఘోడవత్ గ్రూప్ చైర్మన్), అభయ్ గాడ్గిల్ (అభయ్ గాడ్గిల్ కన్‌స్ట్రక్షన్స్ చైర్మన్) కలిసి నిధిగా ఏర్పాటు చేశారు. రియో పారాలింపిక్స్ విజేతలకు నజరానాలతో పాటు స్మార్ట్రాన్ మొబైల్స్, ల్యాప్‌టాప్‌లను బహూకరించారు. దీంతోపాటు వారికి జీవితకాలం ఆరోగ్య సేవలను అందిస్తామని ఏస్టర్ డీఎం హెల్త్‌కేర్ ప్రకటించింది.

కివీస్ తో సిరీస్ కు ఢోకా లేదు!

04/10/2016: ముంబై:భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి లోధా ప్యానెల్ పలు ప్రతిపాదనలు సూచించిన నేపథ్యంలో ప్రస్తుతం నూజిలాండ్ తో జరుగుతున్న సుదీర్ఘ సిరీస్ పై అనేక అనుమానాలు తలెత్తాయి. ఈ సిరీస్ ను పూర్తిగా రద్దు చేయాల్సి వస్తుందనే సంకేతాలు వెళ్లాయి. ఇందుకు కారణం బీసీసీఐ అకౌంట్లను రద్దు చేయాలంటూ బ్యాంకులకు లోధా కమిటీ సూచించినట్లు వార్తలు రావడమే. దానిలో భాగంగానే రోజువారీ నిధులను కూడా ఆపమని చెప్పలేదని లోధా తాజా ప్రకటనలో పేర్కొంది. అవసరమైతే బ్యాంకులకు రాత పూర్వకంగా వివరణ ఇస్తామని ఈ మేరకు లోధా ప్యానెల్ స్పష్టం చేసింది. గత శుక్రవారం జరిగిన ఎస్ జీఎంలో తన అనుబంధ క్రికెట్ అసోసియేషన్లకు బీసీసీఐ నిధులు మంజూరు చేసింది. అయితే ఇది తమ ప్రతిపాదనలకు వ్యతిరేకం కావడంతో బీసీసీఐ అకౌంట్లను నిలుపుదల చేయాలంటూ లోధా ప్యానెల్ ఆదేశాలు జారీ చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. దాంతో కివీస్-భారత్ ల సిరీస్ అనేక సందేహాలు చోటు చేసుకున్నాయి. దీనిపై బీసీసీఐ వర్గాలు కూడా సిరీస్ రద్దు విషయాన్ని ధృవీకరించినట్లు వార్తలు వచ్చాయి. ప్రతీ రోజూ తాము ఏమీ చేయాలో చెప్పడానికి లోధా కమిటీ ఏర్పడలేదని బీసీసీఐ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా, దీనిపై వెంటనే లోధా కమిటీ స్పందించడంతో సిరీస్ పై అలుముకున్న నీలి నీడలకు ముగింపు దొరికింది. దాంతో పాటు వచ్చే ఏడాది ఇంగ్లండ్ లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్టు పాల్గొనడంపై కూడా సందిగ్ధత ఏర్పడటంతో లోధా కమిటీ వివరణ ఇచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు చాంపియన్స్ ట్రోఫీ కాల వ్యవధి పెద్దగా లేకపోయినా ఇది ముందుస్తు షెడ్యూల్ కాబట్టి ఆ రెండు సిరీస్ ల్లోనూ భారత్ పాల్గొనవచ్చని లోధా తెలిపింది.

మరో వైట్ వాష్ తప్పదా?

03/10/2016: షార్జా: గత కొన్ని నెలల క్రితం భారత్లో జరిగిన టీ 20 ప్రపంచకప్లో వెస్టిండీస్ చాంపియన్ గా నిలిచింది. అయితే అప్పటితో పోల్చి చూస్తే ప్రస్తుతం విండీస్ జట్టు ఘోరంగా విఫలమవుతోంది. పలువురు ప్రధాన ఆటగాళ్లపై వేటు ఒక కారణమైతే, మరికొంతమంది గైర్హాజరీ ఆ జట్టు భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చేసింది. యూఏఈలో పాకిస్తాన్ తో జరుగుతున్న దైపాక్షిక సిరీసే ఇందుకు ఉదాహరణ. ఇరు జట్ల సుదీర్ఘ సిరీస్ లో విండీస్ అత్యంత పేలవంగా ఆడుతోంది. పాకిస్తాన్ తో జరిగిన మూడు టీ 20 ల సిరీస్లో వైట్ వాష్ అయిన వెస్టిండీస్.. మూడు వన్డేల సిరీస్ లో కూడా అదే ఆట తీరును కనబరుస్తోంది. జాసన్ హోల్డర్ నాయకత్వంలో పాక్ తో సిరీస్లు ఆడుతున్న విండీస్ ఇప్పటివరకూ ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు. తాజాగా ఆదివారం రాత్రి జరిగిన రెండో వన్డేలో విండీస్ 59 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. డారెన్ బ్రేవో, మార్లోన్ శ్యామ్యూల్స్ లు హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నా ఆ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. టాస్ గెలిచిన పాకిసాన్ తొలుత బ్యాటింగ్ తీసుకుని 337 పరుగులు చేసింది. ఆ జట్టులో బాబర్ అజామ్(123) సెంచరీ సాధించడంతో పాటు, షోయబ్ మాలిక్ (90), సర్ఫరాజ్ అహ్మద్(60)లు రాణించడంతో పాక్ భారీ స్కోరు నమోదు చేసింది. అయితే అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ 278 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. దీంతో వన్డే సిరీస్ ను కూడా చేజార్చుకున్న విండీస్ మరో వైట్ వాష్ దిశగా కొనసాగుతోంది. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే బుధవారం జరుగనుంది. ఆ మ్యాచ్ లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తున్న విండీస్ ఎంతవరకు రాణిస్తుందో?

నిలబడ్డాడు నిలబెట్టాడు

03/10/2016: రోహిత్ శర్మ అమోఘమైన నైపుణ్యం ఉన్న క్రికెటర్... కానీ ఎర్ర బంతి చూస్తే భయపడతాడు... అంతర్జాతీయ క్రికెట్ ఆడటం మొదలుపెట్టి తొమ్మిది సంవత్సరాలైనా అతడిపై ఈ ముద్ర మాత్రం ఇంకా చెరిగిపోలేదు. టి20ల్లో, వన్డేల్లో 2007లో అరంగేట్రం చేసిన రోహిత్.... 2013లోగానీ తొలి టెస్టు ఆడలేదు. నిజానికి దీనికి కారణాలు వేరు. సచిన్, ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్‌ల శకంలో టెస్టు జట్టులోకి రావడానికి రోహిత్‌కు అవకాశం రాలేదు. నిజానికి ఆ సమయంలో రోహిత్ మాత్రమే కాదు... టెస్టుల్లో ఆడే అవకాశం కోసం చాలామంది యువ క్రికెటర్లు ఎదురు చూశారు. 2013లో సచిన్ ఆఖరి సిరీస్ ద్వారా టెస్టుల్లో రోహిత్ ఈడెన్‌గార్డెన్‌‌సలోనే అరంగేట్రం చేశాడు. ఈ రెండున్నరేళ్ల కాలంలో రోహిత్ ఆడింది 19 టెస్టులు. దాదాపు 35 సగటుతో రెండు సెంచరీలతో 1049 పరుగులు చేశాడు. నిజానికి ఇది అంత చెత్త ప్రదర్శనేం కాదు. కానీ రోహిత్ నుంచి ఇంకా ఎక్కువ ఆశించడం వల్ల విఫలమైన ప్రతిసారీ అతనిపై విమర్శలు వచ్చాయి. వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు... టి20లో సెంచరీ... ఇలా పొట్టి ఫార్మాట్‌లో రికార్డులు రోహిత్‌కు దాసోహం. ఇలా తను భారీగా పరుగులు చేయడంతో టెస్టుల్లో తన ప్రదర్శన చిన్నగా కనిపిస్తోంది. ఈ రెండున్నరేళ్ల కాలంలో రోహిత్ విఫలమైన ప్రతిసారీ ‘టెస్టుకు పనికిరాడు’ అనే విమర్శ పదే పదే వినిపించింది. మీడియాలో, అభిమానుల్లో ఇలాంటి విమర్శలు తరచూ వినిపిస్తున్నా కెప్టెన్లుగా ధోని, కోహ్లి మాత్రం రోహిత్‌పై నమ్మకం ఉంచారు. ఓ అద్భుతమైన ఆటగాడు ఏ ఫార్మాట్‌లో అయినా గంటలో ఆటను మార్చేస్తాడనేది ఎవరూ కాదనలేని వాస్తవం. భారత క్రికెట్‌లో రోహిత్ కూడా మ్యాచ్ విన్నర్. అందుకే ఎన్నిసార్లు ఎన్ని విమర్శలు వచ్చినా... తన కంటే ముందు కెప్టెన్‌లే సరైన సమాధానం ఇచ్చారు. ఒడిదుడుకులు ఉన్నా..: కెరీర్‌లో ఆరంగేట్రంలో వరుసగా రెండు టెస్టుల్లో రెండు సెంచరీలు చేసిన రోహిత్... ఆ తర్వాత మాత్రం ఆ స్థాయి నిలకడ చూపించలేదనేది కూడా కాదనలేని వాస్తవం. ఐదుగురు బౌలర్ల సిద్ధాంతం ఎప్పుడు తెరమీదకు వచ్చినా రోహిత్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. నిజానికి తన స్థాయి క్రికెటర్‌కు ఇది జీర్ణించుకోవడం కష్టం. అడపాదడపా ఒక్కో అవకాశం లభించినా దానిని పూర్తిగా రెండు చేతులతో అందుకోలేకపోయాడు. అరుుతే ‘క్లాస్’ ఆటగాడు సరైన సమయంలో తన పూర్తి ఆటను బయటకు తీస్తాడు. తనకు బాగా కలిసొచ్చిన, ఇష్టమైన మైదానం ఈడెన్‌గార్డెన్‌‌సలో రోహిత్ ఆదివారం ఓ ‘క్లాసిక్’ ఇన్నింగ్‌‌స ఆడాడు. భారత్ రెండో ఇన్నింగ్‌‌సలో 43 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో రోహిత్ క్రీజులోకి వచ్చాడు. గత టెస్టు రెండో ఇన్నింగ్‌‌సలో అజేయంగా 68 పరుగులు చేసినా... కోల్‌కతా తొలి ఇన్నింగ్‌‌సలో తను విఫలమయ్యాడు. రెండో ఎండ్‌లో ఆడుతున్న కోహ్లి కూడా గొప్ప ఫామ్‌లో లేడు. ఈ సమయంలో ఈ ఇద్దరిలో ఎవరు అవుటైనా భారత్ ప్రమాదంలో పడేది. తొలి ఇన్నింగ్‌‌స ఆధిక్యం చేతిలో ఉన్నా... మ్యాచ్ కచ్చితంగా గెలవాలంటే 300పైచిలుకు ఆధిక్యం కచ్చితంగా కావాలి. బంతి ఎలా బౌన్‌‌స అవుతుందో అర్థంకాని స్థితిలో రోహిత్ అద్భుతంగా ఆడాడు. వన్డే స్పెషలిస్ట్ రోహిత్ టెస్టులు కూడా బాగా ఆడగలడని ఈ ఇన్నింగ్‌‌స చూపించింది. ఆరంభంలో బంతి కొత్తగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆడిన అతను, ఆ తర్వాత బంతి పాతబడిపోగానే తనదైన శైలిలో షాట్లు ఆడటం మంచి ఫలితాన్నిచ్చింది. కోహ్లి, సాహాలతో కలిసి రోహిత్ నిర్మించిన రెండు భాగస్వామ్యాలతో మ్యాచ్ పూర్తిగా భారత్ చేతిలోకి వచ్చింది. ఈ ఇన్నింగ్‌‌సలో రోహిత్ స్వీప్, లాఫ్ట్, డ్రైవ్ అన్ని రకాల షాట్లూ ఆడి తనలోని సహజ నైపుణ్యాన్ని మరోసారి బయటపెట్టాడు. చూడచక్కని కవర్‌డ్రైవ్‌లు అభిమానులకు ఆనందం పంచాయి.

పాప కోసం మ్యాచ్‌ ఆపేసిన స్పెయిన్ బుల్

01/10/2016: క్రీడా స్ఫూర్తి అంటే ఇదేనేమో. గల్లంతైన బిడ్డ కోసం ఆవేదనతో వెతుకుతున్న తల్లి కోసం టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ తన ఆటను ఆపేశాడు. తల్లీబిడ్డలు కలుసుకునేందుకు తనవంతు సాయం చేశాడు. వైరల్‌గా మారిన ఈ అంశం వివరాల్లోకి వెళ్తే.. చుట్టూ వందల మంది అభిమానులు. ఎగ్జిబిషన్ మ్యాచే అయినా సీరియస్‌గా సాగుతోంది ఆట. ఓ యువ ఆటగాడు జతగా టెన్నిస్ ఉద్ధండులు జాన్ మెకెన్రో, కార్లోస్ మోయాలతో తలపడుతున్నాడు స్పెయిన్ బుల్. పాయింట్ సాధించిన ఆనందంలో సర్వీస్‌కు సిద్ధమతున్నాడు. అదే సమయంలో తన ఎడమచేతి వైపు ప్రేక్షకుల్లో చిన్నపాటి అలజడి. ఏంటా అని సర్వీస్ ఆపేసి చూస్తుండిపోయాడు. అక్కడో మహిళ తన చిన్నారి ప్రేక్షకుల్లో తప్పిపోందంటూ కన్నీటిపర్యంతమవుతోంది. దీంతో పాప పేరు తెలుసుకున్న వారంతా 'క్లారా' అంటూ పిలవడం ప్రారంభించారు. సెకన్ల వ్యవధిలో క్లారా కనిపించింది. అంతే ఏడుస్తున్న బిడ్డ వద్దకు పరుగుపరుగున వెళ్లి హత్తుకుంది తల్లి. తల్లీ బిడ్డ కలుసుకోవడంతో ప్రేక్షకులంతా చప్పట్లు కొట్టి హర్షం ప్రకటించారు. ఇక నాదల్ ప్రత్యర్థి, ఒకప్పుడు ముక్కోపిగా పేరుగాంచిన మెకన్రో కూడా ఉద్వేగం పట్టలేకపోయాడు. కళ్లల్లో సన్నగా అలముకున్న కన్నీటిని తుడుచుకుని మ్యాచ్ కొనసాగించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నాదల్ క్రీడా స్ఫూర్తిని అంతా పొగిడేస్తున్నారు.

క్రికెట్‌ గాడ్‌ కుమారుడు ఇండియన్‌ జస్టిన్‌ బీబర్‌

01/10/2016: క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోడానికి ఏముంటుంది? మైదానంలో ఉన్నా లేకున్నా సచిన్‌ ఫాలోయింగ్‌లో ఏ మార్పూ రాలేదు. మంచి వ్యక్తిత్త్వమే ఆయనకు అంతటి ప్రఖ్యాతి తెచ్చిపెట్టింది. తాజాగా సచిన్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ కూడా తండ్రిలాగే పాపులారిటీ మూటగట్టుకుంటున్నాడు. ఏ రంగంలో అనేగా మీ సందేహం. అక్కడికే వచ్చేస్తున్నాం. అర్జున్‌ ప్రస్తుతం మంచి పర్సనాల్టీ మెయిన్‌టెయన్‌ చేస్తున్నాడు. దీంతో అతడి ఆహార్యం కెనడియన్‌ పాప్‌ స్టార్‌ జస్టిన్‌ బీబర్‌తో కొంత మ్యాచ్‌ అయింది. అంతే.. అర్జున్‌ను ఇండియన్‌ జస్టిన్‌ బీబర్‌గా పేర్కొంటూ ట్విట్టర్‌లో సందడి మొదలైపోయింది. అర్జున్‌-బీబర్‌ల ఫొటోలను పక్కపక్కనే పెడుతూ ఇద్దరికీ పోలికలు కలుస్తున్నాయి కదూ? అంటూ తమదైన మెసేజ్‌లు పోస్ట్‌ చేస్తున్నారు నెటిజన్లు. అర్జున్‌ను బీబర్‌తో పోల్చుతూ కామెంట్స్‌ పెట్టడం వారం క్రితమే ప్రారంభమైంది. 'సర్కిల్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఇండియా' తన ఫేస్‌ బుక్‌ ఖాతాలో సచిన్‌, అర్జున్‌లు క్లోజ్‌గా ఉన్న చిత్రాన్ని ప్రచురించింది. అర్జున్‌ 17వ పుట్టిన రోజు నేపథ్యంలోనే సెప్టెంబర్‌ 24న ఈ పిక్చర్‌ను పబ్లిష్‌ చేసింది. ఇది చూసిన నెటిజన్లు అర్జున్‌కు బర్త్‌ డే విషెష్‌ చెప్పడం మానేసి జస్టిన్‌ బీబర్‌లా ఉన్నావంటూ పోస్ట్‌లు పెట్టారు. కొన్ని నిమిషాలకే అతడికి 'ఇండియన్‌ జస్టిన్‌ బీబర్‌' టైటిల్‌ కట్టబెట్టేస్తూ సోషల్‌ మీడియాలో పలు మెసేజ్‌లు వెల్లువెత్తాయి.

పాక్-విండీస్ ల 'వరల్డ్ కప్' షూటౌట్!

30/09/2016: షార్జా:ఒకవైపు వెస్టిండీస్, మరొకవైపు పాకిస్తాన్. ఇరు జట్లు వన్డే వరల్డ్ కప్ ను గెలిచిన జట్లే. డబ్భైవదశకంలో ప్రపంచ క్రికెట్ ను శాసించిన విండీస్ రెండు సార్లు(1975, 79)వరల్డ్ కప్ ను సాధిస్తే.. 1992లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు ప్రపంచ చాంపియన్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఆ రెండు జట్లు వచ్చే వరల్డ్ కప్ కు అర్హత సాధించే పనిలో పడ్డాయి. ఇటీవల పేలవమైన ఫామ్ లో ఉన్న పాకిస్తాన్ ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్ లో తొమ్మిదో స్థానంలో ఉండగా, విండీస్ మాత్రం ఒక ర్యాంకు మెరుగ్గా ఎనిమిదో స్థానంలో ఉంది. కాగా, 2018 నాటికి ఈ రెండు జట్లు టాప్-8లో ఉంటేనే వన్డే వరల్డ్ కప్ కు నేరుగా అర్హత సాధిస్తాయి. కాని పక్షంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) లో ఉన్న 10 సభ్య దేశాలతో వరల్డ్ కప్ అర్హత టోర్నీ ఆడాల్సి వస్తుంది. అప్పుడు ఇక్కడ అర్హత సాధించి 2019లో ఇంగ్లండ్ లో జరిగే వరల్డ్ కప్ లో అడుగుపెట్టాల్సి ఉంటుంది. అయితే ఇప్పడు పాకిస్తాన్-విండీస్ ల మధ్య యూఏఈలో మూడు వన్డేల సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ ను పాక్ క్లీన్ స్వీప్ చేస్తే ఒక ర్యాంకు మెరుగు పరుచుకుని ఎనిమిదో ర్యాంకుకు చేరుతుంది. ఇదే క్రమంలో విండీస్ కనీసం ఒక మ్యాచ్ లో గెలిచినా తన ఎనిమిదో స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇదిలా ఉంచితే వచ్చే మార్చిలో కరీబియన్ లో ఈ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగనుంది. ఈ రెండు వన్డే టోర్నీలో పైచేయి సాధించిన జట్టే వరల్డ్ కప్ కు నేరుగా అర్ఘత సాధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు మధ్య జరగబోయే ఈ రెండు వన్డేల సిరీస్ ను వరల్డ్ కప్ షూటౌట్ గా పేర్కొనవచ్చు.

వెస్టిండీస్‌పై పాకిస్తాన్ క్లీన్‌స్వీప్

29/09/2016: అబుదాబి: వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను పాకిస్తాన్ క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం అర్ధరాత్రి ముగిసిన చివరి టి20లో పాక్ ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇమద్ వసీమ్ (3/21) మళ్లీ రాణించాడు. ఈ సిరీస్‌లో అతను 9 వికెట్లు తీశాడు. మొదట బ్యాటింగ్ చేపట్టిన విండీస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 103 పరుగులే చేయగలిగింది. శామ్యూల్స్ (59 బంతుల్లో 42 నాటౌట్, 3 ఫోర్లు) ఒక్కడే మెరుగ్గా ఆడాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన పాకిస్తాన్ 15.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసి గెలిచింది. షోయబ్ మాలిక్ (34 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. బాబర్ అజమ్ (27 నాటౌట్), లతీఫ్ (21) ఫర్వాలేదనిపించారు. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ శుక్రవారం నుంచి షార్జాలో జరుగుతుంది.

గాయంతో బాధపడుతున్న అశ్విన్!

29/09/2016: కోల్‌కతా: గాయపడిన పేసర్ ఇషాంత్ శర్మ స్థానంలో రెండో టెస్టు కోసం ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్‌ను ఎంపిక చేయడం ఆశ్చర్యం కలిగించింది. అయితే ప్రధాన స్పిన్నర్ అశ్విన్ చేతి వేలికి గాయంతో బాధపడుతుండటంతో ముందు జాగ్రత్తగా జయంత్‌ను పిలిపించినట్లు తెలిసింది. కుడి చేతి మధ్య వేలుకు గాయంతోనే అశ్విన్ కాన్పూర్ టెస్టులో బౌలింగ్ చేశాడు. టెస్టు ప్రారంభానికి కూడా నొప్పి తగ్గకపోతే జయంత్‌కు అవకాశం దక్కవచ్చు కూడా. బుధవారం జరిగిన ఆప్షనల్ ప్రాక్టీస్‌కు అశ్విన్‌తో పాటు మరికొందరు భారత ఆటగాళ్లు కూడా దూరంగా ఉన్నారు. అనూహ్య బౌన్‌‌సకు అలవాటు పడేందుకు కోహ్లి రబ్బర్ బాల్‌తో సాధన చేశాడు. గంభీర్ జట్టులోకి వచ్చినా... రెండో టెస్టులో ధావన్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నారుు. అతను సుదీర్ఘ సమయం పాటు నెట్స్‌లో పాల్గొన్నాడు. కాన్పూర్ టెస్టు ముగిసిన తర్వాత కూడా ధావన్‌తో కుంబ్లే, బంగర్ ప్రత్యేకంగా సాధన చేయించారు. ప్రాక్టీస్ ముగిశాక కోహ్లి ఓ వాణిజ్య ప్రకటన షూటింగ్‌లో పాల్గొన్నాడు. మరోవైపు న్యూజిలాండ్ ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నారు. వారిలో చాలా మంది కోల్‌కతాలో షాపింగ్‌కు వెళ్లి సరదాగా గడిపారు. అశ్విన్‌కు రెండో ర్యాంక్ దుబాయ్: కాన్పూర్ టెస్టులో పది వికెట్లతో అద్భుతంగా రాణించిన భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (871 పాయింట్లు) ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్‌‌సలో రెండో స్థానానికి ఎగబాకాడు. కోల్‌కతా టెస్టులోనూ రాణిస్తే అశ్విన్ మరోసారి టాప్ ర్యాంకుకు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం 878 పాయింట్లతో డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కేవలం ఒక పాయింట్ తేడాతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో అశ్విన్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టెస్టు బ్యాట్స్‌మెన్ జాబితాలో 906 పాయింట్లతో స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) అగ్రస్థానంలో ఉండగా..జో రూట్ (ఇంగ్లండ్)ను వెనక్కినెట్టి విలియమ్సన్ (న్యూజిలాండ్) రెండో స్థానాన్ని సంపాదించాడు. భారత ఆటగాళ్లలో రవీంద్ర జడేజా 7వ స్థానంలో, విజయ్, రాహుల్ సంయుక్తంగా 16వ ర్యాంకులో, కోహ్లి 20వ ర్యాంకులో ఉన్నారు.

బిగ్ బాష్‌లోకి స్మృతి మందన

28/09/2016: న్యూఢిల్లీ: మహిళల బిగ్ బాష్ లీగ్‌లో మరో భారత బ్యాట్స్‌వుమన్‌కు చోటు దక్కింది. బ్రిస్బేన్ హీట్ ఫ్రాంచైజీ స్మృతి మందనతో ఏడాది పాటు ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే హర్మన్‌ప్రీత్ కౌర్ డిఫెండింగ్ చాంపియన్ సిడ్నీ థండర్ తరపున బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆసీస్‌తో హోబర్ట్‌లో జరిగిన తొలి వన్డేలో స్మృతి తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేసింది. ఆ తర్వాత కూడా తను వరుసగా 55, 55, 46 పరుగులతో రాణించింది. దీంతో హీట్స్ జట్టులోని ఇతర మహిళా క్రికెటర్లు అంతా ఆమె పేరునే సూచించినట్టు ఆ జట్టు కోచ్ ఆండీ రిచర్డ్స్ తెలిపారు.

యువీ ఉన్నాడు.. విరాట్ లేడు!

27/09/2016: కాన్పూర్: భారత క్రికెట్ జట్టు ఐదు వందల టెస్టు మ్యాచ్ను పురస్కరించుకుని ఆటగాళ్ల అరుదైన గౌరవంలో భాగంగా ప్రకటించిన డ్రీమ్ టెస్టు ఎలెవన్ జట్టులో ప్రస్తుత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి స్థానం లభించకపోవడంతో అది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. టెస్టు యావరేజ్లో విరాట్ మెరుగ్గా ఉన్నా స్థానం దక్కకపోవడంపై పలువురు విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, డ్రీమ్ టెస్టు ఎలెవన్ జట్టులో యువరాజ్ సింగ్ కు 12వ ఆటగాడిగా స్థానం కల్పించారు. ఇక్కడ యువరాజ్ కంటే కోహ్లి సగటు బాగుండటమే చర్చకు దారి తీసింది. 2012లో చివరిసారి టెస్టు మ్యాచ్ ఆడిన యువరాజ్ ఈ ఫార్మాట్లో 33.92 యావరేజ్ తో ఉండగా, విరాట్ కోహ్లి టెస్టు యావరేజ్ 45.06 గా ఉంది. దాంతో పాటు ఈ టీమ్లో భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడైన సౌరవ్ గంగూలీకి కూడా చోటు లభించలేదు. భారత జట్టుకు దూకుడు నేర్పిన గంగూలీ తన టెస్టు కెరీర్లో 116 మ్యాచ్లు ఆడటంతో పాటు 16 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అతని టెస్టు యావరేజ్ 42.17 గా ఉంది. దాంతో పాటు 32 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంచితే క్రికెట్ ఆస్ట్రేలియాకు సంబంధించి ఉత్తమ భారత జట్టులో గంగూలీ స్థానం దక్కగా, విరాట్ కు ఇందులో కూడా స్థానం లభించలేదు. ఈ రెండు జట్లకు మహేంద్ర సింగ్ ధోనినే కెప్టెన్ గా ఎంపిక చేశారు. గతవారం డ్రీమ్ టెస్టు జట్టును ప్రకటించిన భారత క్రికెట్ కంట్రలో బోర్డు(బీసీసీఐ).. తాజాగా వారికి ఓటింగ్ను నిర్వహించింది. ఈ మేరకు భారత డ్రీమ్ టెస్టు ఎలెవన్ కు నిర్వహించిన క్రికెట్ అభిమానలు ఓటింగ్లో రాహుల్ ద్రవిడ్ అత్యధికంగా 96శాతాన్ని దక్కించుకున్నాడు. ఆ తరువాత స్థానాల్లో అనిల్ కుంబ్లే(92శాతం), కపిల్ దేవ్(91 శాతం), ఎంఎస్ ధోని(90శాతం)లు ఉన్నారు. కాగా ఈ ఓటింగ్ లో సచిన్ టెండూల్కర్కు 73 శాతం ఓటింగ్ రాగా, వీరేంద్ర సెహ్వాగ్ 86 శాతం సాధించాడు. అయితే స్టైలిష్ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ 58 శాతం ఓటింగ్తో 12వ ఆటగాడిగా ఎంపికైన యువరాజ్ సింగ్(62శాతం) కంటే వెనుక ఉండటం గమనార్హం. భారత జట్టు అత్యుత్తమ డ్రీమ్ టెస్టు జట్టు ఇది: ఎంఎస్ ధోని(కెప్టెన్), సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ, కపిల్ దేవ్, రవి చంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్(12వ ఆటగాడు

ఆ గౌరవం కపిల్ దేవ్ కే!

27/09/2016: కోల్కతా: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం తరహాలో భారత్లోని ఈడెన్ గార్డెన్లో అమర్చిన గంటను ముందుగా కొట్టబోయే గౌరవం మాజీ దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ దక్కనుంది. ఈ మేరకు కపిల్ దేవ్ కు ఆహ్వానం పంపినట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) స్పష్టం చేసింది. న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్లో భాగంగా నగరంలోని ఈడెన్లో జరుగనున్న రెండో టెస్టును గంటను కొట్టిన తరువాత ఆరంభించనున్నట్లు క్యాబ్ జాయింట్ సెక్రటరీ అవిషేక్ దాల్మియా తెలిపారు. 'ఇలా కపిల్ దేవ్ తో గంటను కొట్టించాలనేది క్యాబ్ అధ్యక్షుడు గంగూలీ ఆలోచన. ఈ విషయాన్ని తెలుపుతూ కపిల్ కు ఆహ్వానం కూడా పంపాం. అందుకు ఆయన అంగీకరించారు' అని అవిషేక్ పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో గంట కొట్టిన తరువాత టెస్టు మ్యాచ్ను ప్రారంభించడం ఆనవాయితీ. ఈ మైదానంలో టెస్టు మ్యాచ్ జరిగనన్నీ రోజులూ రెండు దేశాలకు చెందిన క్రికెట్ లెజెండ్స్ గంట కొట్టి మ్యాచ్ను ఆరంభిస్తారు. ఇందుకు పెవిలియన్ కు వెలుపల ఉండే బౌలర్ల బార్లో గంట వేలాడదీసి ఉంటుంది. అయితే ఈ తరహా పద్ధతిపై భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఆసక్తి కనబరచడంతో గత కొన్నేళ్లుగా చేసిన ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పడనుంది. న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య రెండో్ టెస్టు ఈ నెల 30వ తేదీన ఆరంభం కానుంది.

రేప్ కేసులో ఐదుగురు వాలీబాల్ ఆటగాళ్లకు జైలు

22/09/2016: టాంపెరె: ఫిన్లాండ్కు చెందిన ఓ యువతిపై లైంగికదాడి చేసిన కేసులో క్యూబాకు చెందిన ఐదుగురు జాతీయ వాలీబాల్ ఆటగాళ్లకు జైలుశిక్ష పడింది. మంగళవారం ఫిన్లాండ్లోని టాంపెరె కోర్టు వారిని దోషులుగా ప్రకటించింది. నలుగురికి ఐదేళ్ల చొప్పున, మరో ఆటగాడికి మూడున్నరేళ్ల జైలుశిక్ష విధించింది. టాంపెరెలో జరిగిన వాలీబాల్ ప్రపంచ చాంపియన్షిప్ సమయంలో క్యూబా ఆటగాళ్లు ఫిన్లాండ్ యువతిపై దారుణానికి పాల్పడ్డారు. ఓ హోటల్లో వాలీబాల్ ఆటగాళ్లు తనపై లైంగికదాడి చేశారని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూలై 2న టాంపెరె పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మొదట ఎనిమిదిమంది ఆటగాళ్లను అదుపులోకి తీసుకున్నా, విచారణ అనంతరం ఈ కేసులో ప్రమేయంలేని ముగ్గురు ఆటగాళ్లను విడిచిపెట్టారు. క్యూబాకు చెందిన ఐదుగురు ఆటగాళ్లు నేరానికి పాల్పడినట్టు కోర్టులో రుజువైంది. కాగా వీరి పేర్లు, మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

ధోనికి అరుదైన గౌరవం

22/09/2016: కాన్పూర్: టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి అరుదైన గౌరవం లభించింది. భారత క్రికెట్ జట్టు 500 వ టెస్టు ఆడుతున్న నేపథ్యంలో విజ్డన్ ఆల్ టైమ్ భారత్ టెస్టు ఎలెవన్ జట్టుకు ధోని కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఈ మేరకు హేమాహేమీలతో కూడిన భారత విజ్డన్ ఆల్ టైమ్ టెస్టు జట్టును ప్రకటించారు విజ్డన్ ఆల్ టైమ్ భారత్ టెస్టు జట్టుకు ధోని కెప్టెన్గా ఎంపిక కాగా, దిగ్గజ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్లు స్థానం దక్కించుకున్నారు. మరోవైపు క్రికెట్ ఆస్ట్రేలియాకు సంబంధించి ఉత్తమ భారత జట్టుకు కూడా ధోనినే కెప్టెన్ గా ఎంపిక చేయడం విశేషం. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించిన వేర్వేరు రెండు జట్లలో గవాస్కర్, సెహ్వాగ్లను ఓపెనర్లుగా ఎంపిక చేయగా, రాహుల్ ద్రవిడ్ కు ఫస్ట్ డౌన్ కేటాయించారు. ఆ తరువాత సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్లకు వరుస స్థానాలు కేటాయించారు. దాంతో పాటు ఈ రెండు జట్లకు ఆల్ టైమ్ టెస్టు వికెట్ కీపర్గా ధోనినే ఎంపిక చేయడం మరో విశేషం. విజ్డన్ భారత టెస్టు ఎలెవన్: మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్, జహీర్ ఖాన్, బిషన్ సింగ్ బేడీ, మహ్మద్ అజహరుద్దీన్(12వ ఆటగాడు) క్రికెట్ ఆస్ట్రేలియాపై భారత ఎలెవన్ జట్టు: మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్

రోడ్డు ప్రమాదం కేసులో క్రికెటర్ అరెస్టు

21/09/2016: కొలంబో: రోడ్డు ప్రమాదం కేసులో ఒక వ్యక్తి మృతికి కారణమైన శ్రీలంక క్రికెటర్ నువాన్ కులశేఖరను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం కొలంబోలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో కులశేఖర కారులో వెళుతూ ఒక ద్విచక్రవాహనదారున్ని ఢీకొట్టాడు. దాంతో ఆ వ్యక్తి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోవడంతో కులశేఖరను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కులశేఖరకు బెయిల్ మంజూరు కావడంతో అరెస్టైన కాసేపటికే విడుదలయ్యాడు. కొలంబోకు పది మైళ్ల దూరంలోని కదావాతా ఏ-1 హైవేపై కులశేఖర కారులో వెళుతుండగా అతనికి ఎదురుగా వస్తున్న మోటర్సైక్లిస్ట్ ప్రమాదానికి గురయ్యాడు. దాంతో తీవ్రగాయాలు పాలైన ఆ వాహన దారుడు అక్కడిక్కడే మృతిచెందాడు. అయితే ఈ తరహా ప్రమాదాలపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది శ్రీలంకలో రోడ్డు ప్రమాదాల వల్ల 2,700 మంది అసువులు బాసినట్లు పేర్కొన్నారు. వీరిలో ఏ-1 హైపై ప్రమాదానికి గురై ప్రాణాలో కోల్పోయిన ద్విచక్రవాహన దారులు సంఖ్య సగానికి పైగా ఉంది.

ఇషాంత్ శర్మ బ్యాడ్ లక్

21/09/2016: కాన్పూర్: టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ అనారోగ్యం కారణంగా న్యూజిలాండ్ తో జరగనున్న తొలి టెస్టుకు దూరమయ్యాడు. చికెన్ గున్యా బారిన పడడంతో అతడు చరిత్రాక టెస్టులో ఆడే అవకాశం కోల్పోయాడు. అతడి స్థానంలో మరో బౌలర్ కావాలని కోచ్ అనిల్ కుంబ్లే అడగలేదు. భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్ జట్టులో ఉన్నారు. న్యూజిలాండ్ జట్టులోనూ ఆల్ రౌండర్ జేమ్స్ నిషామ్ పక్క ఎముక గాయం కారణంగా కాన్పూర్ టెస్టుకు దూరమయ్యాడు. ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌతీ గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. స్వదేశానికి తిరిగి వెళ్లిపోయిన సౌతీ వన్డే సిరీస్ లో బరిలో దిగే అవకాశముంది. 72 టెస్టులు ఆడిన ఇషాంత్ శర్మ 36.71 సగటుతో 209 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ లో అతడు 8 వికెట్లు తీశాడు. ఈ నెల 22నుంచి న్యూజిలాండ్‌తో కాన్పూర్‌లో జరిగే టెస్టు టీమిండియాకు 500వ మ్యాచ్ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

16 విజయాల రికార్డు సమం!

20/09/2016: బార్సిలోనా: తమ విజయపరంపరను కొనసాగిస్తున్న రియల్ మాడ్రిడ్ జట్టు లా లీగా ఫుట్ బాల్ లీగ్లో వరుస విజయాల రికార్డును సమం చేసింది. ఆదివారం జరిగిన పోరులో రియల్ మాడ్రిడ్ జట్టు 2-0 తేడాతో ఎస్పానెయోల్పై ఘన విజయం సాధించింది. తద్వారా లా లీగాలో 16 వరుస విజయాలు సాధించిన బార్సిలోనా రికార్డును రియల్ మాడ్రిడ్ సమం చేసింది. మ్యాచ్ తొలి హాఫ్లో జేమ్స్ రోడ్రిగ్వెజ్ గోల్ చేయడంతో రియల్ మాడ్రిడ్కు ఆధిక్యం లభించింది. అనంతరం ఆట 70వ నిమిషంలో కరీమ్ బెంజీమా మరో గోల్ చేయడంతో రియల్ మాడ్రిడ్కు స్పష్టమైన పైచేయి సాధించింది. కాగా, ఎస్పానెయోల్ జట్టు గోల్ చేయడానికి చివరకు ప్రయత్నించినా సఫలం కాలేదు. 2010-11 సీజన్లో బార్సిలోనా వరుసగా 16 లా లీగా లీగ్ విజయాలను సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు ఐదు సంవత్సరాల తరువాత ఆ రికార్డును రియల్ మాడ్రిడ్ సమం చేయడం విశేషం.

ఎనిమిదో సీడ్‌ గా శ్రీకాంత్

20/09/2016: టోక్యో: హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ జపాన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. నేడు (మంగళవారం) క్వాలిఫయింగ్ పోటీలు, బుధవారం నుంచి మెయిన్ డ్రా మ్యాచ్‌లు జరుగుతారుు. రియో ఒలింపిక్స్ తర్వాత శ్రీకాంత్ ఆడుతున్న తొలి టోర్నీ ఇదే కాగా... మెయిన్ డ్రా మొదటి రౌండ్లో అతను క్వాలిఫయర్‌తో తలపడనున్నాడు. గాయంతో ఆటకు దూరమై ర్యాంకింగ్‌ను కోల్పోయి పారుపల్లి కశ్యప్ క్వాలిఫయింగ్‌లో తలపడనున్నాడు. తొలిరౌండ్లో అతను డేవిడ్ ఒబెర్నోస్టెర్ (ఆస్ట్రియా)తో పోటీపడతాడు. మహిళల క్వాలిఫయింగ్‌లో తన్వీలాడ్... జపాన్‌కు చెందిన కిసాటో హొషిని ఢీకొంటుంది. పురుషుల సింగిల్స్ మెయిన్ డ్రాలో ప్రపంచ 18వ ర్యాంకర్ అజయ్ జయరామ్... సోని ద్వి కుంకోరోతో (ఇండోనేసియా), సారుు ప్రణీత్... గ క లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో, ప్రణయ్... ఇస్కందర్ జుల్కర్‌నెన్ (మలేసియా)తో తలపడతారు. డబుల్స్, మహిళల సింగిల్స్ మెయిన్ డ్రాలో భారత క్రీడాకారులెవరూ ఆడటం లేదు.

అలా చూడాల్సి రావడం బాధగా ఉంది - సెహ్వాగ్

20/09/2016: న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో యూరి సైనిక స్థావరంపై పాకిస్థాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో సైనికులు కోల్పోవడంపై కలచివేసిందని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. యూరిపై ఉగ్రదాడి గురించి తెలియగానే తన గుండె పగిలినంతపనైందని వ్యాఖ్యానించాడు. దాడికి తెగబడిన వారు తిరుబాటుదారులు కాదని, ఉగ్రవాదులని అన్నాడు. ఉగ్రవాదానికి తగినవిధంగా సమాధానం చెప్పాలని ట్విట్టర్ లో పేర్కొన్నాడు. మాతృభూమికి సేవ చేస్తున్న సైనికులను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకోవడం చాలా బాధకరమని అన్నాడు. సైనికులకు కుటుంబం, పిల్లలు ఉంటారని వారిని ఈ విధంగా చూడాల్సి రావడం కలచివేస్తుందని ట్వీట్ చేశాడు. అమర జవాన్ల మృతదేహాలతో కూడిన శవపేటికల ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

పేస్పై సానియా తీవ్ర వ్యాఖ్యలు

19/09/2016: న్యూఢిల్లీ: భారత టెన్నిస్లో వివాదం ముదురుతోంది. గత రెండు ఒలింపిక్స్కు డబుల్స్ జోడీల ఎంపికపై భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ చేసిన విమర్శలపై హైదరాబాదీ సానియా మీర్జా తీవ్రంగా స్పందించింది. పేస్ పేరును ప్రస్తావించకుండా ఓ విషపురుగు అంటూ విమర్శించింది. సమస్యలు సృష్టించే వ్యక్తులతో కలిసి ఆడకపోవడమే విజయం సాధించడమని పరోక్షంగా పేస్‌ను ఉద్దేశించి సానియా ట్వీట్ చేసింది. గత రెండు ఒలింపిక్స్ క్రీడల్లో డబుల్స్‌లో అత్యుత్తమ జోడీలను పంపలేకపోయామని పేస్ వ్యాఖ్యానించాడు. రియో, గత లండన్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున మేటి డబుల్స్ జంటను పంపలేదని, దీనివల్లే తగిన మూల్యం చెల్లించుకున్నామని చెప్పాడు. ఈ ఒలింపిక్స్‌లో మంచి మిక్స్‌డ్ జోడీని బరిలోకి దించే అవకాశాన్ని కాదనుకున్నామని అన్నాడు. సానియ, రోహన్ బోపన్నను ఎంపిక చేయడాన్ని తప్పుపట్టాడు.

మమ్మల్ని తీవ్రవాదుల్లా చూశారు! - 2007 వరల్డ్ కప్ వైఫల్యంపై ధోని - తన సినిమా వాస్తవంలా ఉంటుందన్న కెప్టెన్

17/09/2016: న్యూయార్క్: వెస్టిండీస్‌లో జరిగిన 2007 వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు ఘోర ఓటమి తర్వాత స్వదేశంలో కనిపించిన స్పందన తన ఆలోచనా ధోరణిని మార్చిందని భారత వన్డే, టి20 క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వ్యాఖ్యానించాడు. దాని ప్రభావం తనపై చాలా ఉందని, తనను తాను తీర్చిదిద్దుకోవడానికి అది కారణమైందని అతను గుర్తు చేసుకున్నాడు. ‘మేం టోర్నీ నుంచి నిష్కమ్రించిన తర్వాత నా ఇంటిపై రాళ్లు పడ్డాయి. ఎయిర్‌పోర్ట్ నుంచి పోలీస్ వ్యాన్‌లో వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో వివిధ టీవీ చానళ్లు తమ కెమెరాలతో మమ్మల్ని వెంబడించాయి. పరిస్థితి చూస్తే మేం హంతకులుగానో, తీవ్రవాదులుగానో కనిపించాము. పోలీస్ స్టేషన్‌లో కూర్చొని ఆ తర్వాత ఇంటికి వెళ్లాం. ఆ ఘటన మానసికంగా నన్ను మరింత దృఢంగా మార్చింది’ అని ధోని చెప్పాడు. తన జీవిత విశేషాలతో తీస్తున్న ‘ఎంఎస్ ధోని- ది అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ధోని ఇక్కడ మీడియాతో ముచ్చటించాడు. ధోని పాత్ర పోషిస్తున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, నిర్మాత అరుణ్ పాండే కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ నెల 30న ఈ చిత్రం విడుదల కానుంది. ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్‌లో టీటీగా పని చేసిన నాటినుంచి 2011 వరల్డ్ కప్ ఫైనల్ వరకు పలు అంశాలు ఇందులో ఉంటాయని ధోని చెప్పాడు. ‘నన్ను అదే పనిగా కీర్తించడం ఈ సినిమాలో ఉండదు. ఇదే విషయాన్ని దర్శకుడికి స్పష్టంగా చెప్పాను. ఇది ఒక ప్రొఫెషనల్ క్రీడాకారుడి ప్రయాణంలాంటిది. ఈ స్థాయికి చేరడంలో ఎదురైన సవాళ్లు, బయటి ప్రపంచానికి తెలియని అంశాలు నా కోణంలో సినిమాలో కనిపిస్తాయి’ అని ధోని చెప్పాడు. సాధారణంగా తాను గతం గురించి ఎప్పుడూ పట్టించుకోనని, అయితే ఈ సినిమా చూస్తున్నప్పుడు అనేక జ్ఞాపకాలు మదిలో మెదిలాయంటూ ఉద్వేగానికి లోనైన ధోని... తన జీవిత చరిత్రను పుస్తకం రూపంలో తీసుకురావడానికి మరింత సమయం పడుతుందని స్పష్టం చేశాడు.

‘అర్జున’ను అందుకున్న రోహిత్, రహానే

17/09/2016: న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానే అర్జున పురస్కారాలను అందుకున్నారు. స్థానిక జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో క్రీడా మంత్రి విజయ్ గోయల్ వారికి ఈ క్రీడా పురస్కారాలను అందించారు. అవార్డు కింద చెరో రూ.5 లక్షల నగదుతో పాటు ప్రతిమను అందించారు. జాతీయ క్రీడా దినోత్సవం రోజున రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో వీరిద్దరు పాల్గొనలేదు. భారత్‌లో క్రికెట్‌కు అమిత ఆదరణ ఉన్నా, ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మిగతా ఆటలకు కూడా ప్రోత్సాహాన్ని అందిస్తోందని మంత్రి గోయల్ తెలిపారు.

విరాట్ కోహ్లి న్యూ లుక్

16/09/2016: ఆటతోనే కాదు.. ఆహార్యంతోనూ యువతను ఆకట్టుకుంటూ ఉంటాడు భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి. ఎప్పటికప్పుడు అవతారం మార్చేస్తూ అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాడతను. తాజాగా చిత్రమైన కేశాలంకరణతో దర్శనమిచ్చాడు విరాట్‌. ఫుట్‌బాలర్ల తరహాలో పక్కల్లో జుత్తు మొత్తం తీయించేసి.. గడ్డం పెంచుకుని కొత్తగా కనిపించాడతను. విరాట్‌. దీనికి సంబంధించిన ఫొటోల్ని తన ట్విటర్‌ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు.

అబ్బాయిలకు నాలుగు.. అమ్మాయిలకు ఐదు - ముగిసిన చెస్ ఒలింపియాడ్

14/09/2016: బాకు (అజర్‌బైజాన్): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో ఈసారి భారత పురుషుల, మహిళల జట్లు ఆకట్టుకునే ప్రదర్శన చేశాయి. అయితే మూడు కాంస్య పతకాలు గెల్చుకునే అవకాశాన్ని భారత క్రీడాకారులు త్రుటిలో చేజార్చుకున్నారు. పురుషుల విభాగంలో పెంటేల హరికృష్ణ, ఆధిబన్, సేతురామన్, విదిత్ సంతోష్ గుజరాతి, మురళీ కార్తికేయన్‌లతో కూడిన భారత జట్టు 16 పాయింట్లతో నాలుగో స్థానాన్ని సంపాదించింది. ద్రోణవల్లి హారిక, తానియా సచ్‌దేవ్, పద్మిని రౌత్, సౌమ్య స్వామినాథన్, బొడ్డ ప్రత్యూషలతో కూడిన భారత మహిళల జట్టు 16 పాయింట్లతో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. టాప్-5లో నిలిచినందున భారత మహిళల జట్టు వచ్చే ఏడాది మేలో రష్యాలో జరిగే ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించింది. 2014లో జరిగిన ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు తొలిసారి కాంస్య పతకాన్ని సాధించింది. కార్ల్‌సన్‌ను నిలువరించిన హరికృష్ణ నార్వే జట్టుతో జరిగిన చివరిదైన 11వ రౌండ్ మ్యాచ్‌ను భారత్ 2-2తో ‘డ్రా’ చేసుకుంది. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌తో జరిగిన గేమ్‌ను హైదరాబాద్ ప్లేయర్ హరికృష్ణ 47 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోవడం విశేషం. హ్యామర్‌తో జరిగిన గేమ్‌ను ఆధిబన్ 43 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించగా... విదిత్ 45 ఎత్తుల్లో ఆర్యన్ తారిని ఓడించాడు. అయితే ఫ్రోడ్ ఉర్కెడాల్‌తో జరిగిన గేమ్‌లో సేతురామన్ 25 ఎత్తుల్లో ఓడిపోవడంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఓవరాల్‌గా భారత పురుషుల జట్టు ఈ టోర్నీలో ఏడు మ్యాచ్‌ల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకొని, మరో రెండింటిలో ఓడిపోయింది. ‘డ్రా’తో ముగించిన అమ్మాయిలు అమెరికా జట్టుతో జరిగిన చివరిదైన 11వ రౌండ్ మ్యాచ్‌ను భారత మహిళల జట్టు 2-2తో ‘డ్రా’గా ముగించింది. ఇరీనా క్రుష్‌తో జరిగిన గేమ్‌ను హారిక 38 ఎత్తుల్లో... కాటరీనా నెమ్‌కోవాతో జరిగిన గేమ్‌ను సౌమ్య 94 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. తానియా 78 ఎత్తుల్లో అనా జటోన్‌స్కీని ఓడించగా... పద్మిని రౌత్ 40 ఎత్తుల్లో నాజి పైకిడ్‌జి చేతిలో ఓడిపోవడంతో భారత్ ‘డ్రా’తో సంతృప్తి పడింది. ఓవరాల్‌గా భారత్ ఈ టోర్నీలో ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి, నాలుగింటిని ‘డ్రా’ చేసుకొని, అజర్‌బైజాన్ చేతిలో మాత్రమే ఏకైక మ్యాచ్‌లో ఓడిపోయింది. చేరువై... దూరమై... ఇక వ్యక్తిగత విభాగాల ప్రదర్శను పరిగణనలోకి తీసుకుంటే... పురుషుల విభాగంలో పెంటేల హరికృష్ణ బోర్డు-1పై 5.5 పాయింట్లతో నాలుగో స్థానంలో, బోర్డు-3పై విదిత్ 8 పాయింట్లతో నాలుగో స్థానంలో... మహిళల విభాగంలో తానియా బోర్డు-3పై 7 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతకాలను త్రుటిలో కోల్పోయారు. టాప్-3లో నిలిచినవారికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలను అందజేస్తారు. అమెరికా, చైనాలకు స్వర్ణాలు పురుషుల విభాగంలో అమెరికా జట్టు 20 పాయింట్లతో స్వర్ణం సాధించగా...ఉక్రెయిన్, రష్యా, రజత కాంస్య పతకాలను గెల్చుకున్నాయి. మహిళల విభాగంలో చైనా 20 పాయింట్లతో పసిడి పతకాన్ని కై వసం చేసుకోగా... పోలాండ్, ఉక్రెయిన్ రజత, కాంస్య పతకాలను సంపాదించాయి. 2018 చెస్ ఒలింపియాడ్‌కు జార్జియా ఆతిథ్యం ఇస్తుంది.

విరాట్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు - న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్

14/09/2016: న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌లో కేన్ విలియమ్సన్‌కు సొగసైన ఆటగాడిగా పేరుంది. అయినా కూడా భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటతీరుపై ఈ కివీస్ కెప్టెన్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు. అతడి బ్యాటింగ్‌ను చూస్తూ ఎంతో నేర్చుకోవచ్చని కొనియాడాడు. ‘విరాట్ ఓ గొప్ప ఆటగాడు. మూడు ఫార్మాట్లలోనూ అతడి ఆధిపత్యం ఎంతో ప్రత్యేకమైంది. అది నన్ను చాలా ప్రభావితుడ్ని చేస్తోంది. అతడు బ్యాటింగ్ చేస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంటుంది. అలాంటి ఆటగాడి నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు’ అని ఐసీసీ టెస్టు ర్యాంకింగ్‌‌సలో మూడో స్థానంలో ఉన్న విలియమ్సన్ చెప్పాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో కోహ్లి, విలియమ్సన్, స్టీవ్ స్మిత్, రూట్‌లను బిగ్ ఫోర్‌గా పరిగణిస్తున్నారు. ‘స్మిత్, రూట్ కూడా నాణ్యమైన ఆటగాళ్లే. మా అందరికీ విభిన్న శైలి ఉంది. ఎవరి సొంత శైలిని బట్టి వారు ఆడడం ఈ గేమ్‌కున్న గొప్ప అందం. అందుకే అందరికీ విజయాలున్నారుు’ అని 26 ఏళ్ల ఈ డాషింగ్ బ్యాట్స్‌మన్ అన్నాడు. ఇక భారత్‌తో జరగబోయే సిరీస్‌లో స్పిన్ కీలక పాత్ర పోషిస్తుందని అంగీకరించాడు. తమ జట్టులోనూ ముగ్గురు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారని అతడు గుర్తుచేశాడు. స్పిన్‌తో పాటు రివర్స్ స్వింగ్ కూడా భారత్‌తో టెస్టు సిరీస్‌లో కీలక పాత్ర పోషిస్తుందని విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. భారత్‌తో ఈ నెల 22 నుంచి జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్ చేరుకుంది.

జోరుమీదుంది ఏంజెలిక్‌ కెర్బర్‌

12/09/2016: ఒకే సీజన్‌.. మూడుసార్లు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్లో ప్రవేశం.. రెండుసార్లు టైటిల్‌ గెలుపు.. ఒలింపిక్స్‌లో పతకం.. ­హించండి ఎవరో! అందరికి గుర్తొచ్చే పేరు సెరెనా విలియమ్స్‌! అమ్మాయిల టెన్నిస్‌పై అంతగా ముద్ర వేసిందీ ఈ అమెరికా స్టార్‌! సెరెనా కాక మరో అమ్మాయి ఈ ఘనత సాధిస్తే! నమ్మశక్యం కాకపోయినా ఇదే నిజం! సెరెనా బరిలో ఉండగా ఒకే ఏడాది రెండు టైటిళ్లు గెలవడం.. అందులోనూ ఒకసారి సెరెనాను ఓడించి ట్రోఫీ అందుకోవడం ఇవన్నీ ఒక భామ చేసి చూపించింది. ఆమే ఏంజెలిక్‌ కెర్బర్‌.. జర్మనీ స్టార్‌. తన దేశ దిగ్గజ స్టెఫీగ్రాఫ్‌ బాటలో నడుస్తున్న సంచలన తార. 2016లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, యూఎస్‌ ఓపెన్‌ టైటిళ్లు గెలవడంతో పాటు వింబుల్డన్‌లోనూ ఫైనల్‌ చేరిన కెర్బర్‌ మహిళల టెన్నిస్‌లో తన శకం మొదలైందని రుజువు చేసింది. రికార్డు స్థాయిలో వారాల తరబడి నెం.1 హోదాను ఆస్వాదిస్తున్న సెరెనాను పక్కకునెట్టి ఆ కిరీటాన్ని అందుకుంది. గ్రాఫ్‌ ఇచ్చిన ప్రోత్సాహంతో సెరెనా కట్టిన దుర్భేద్యమైన నెం.1 గోడను కూల్చడం కెర్బర్‌కు ఒక్కరోజులో సాధ్యం కాలేదు. ఈ ఏడాదికి ముందు ఆమెకన్నీ పరాజయాలే. 2015 ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో తొలి రౌండ్లోనే ఓడిపోయింది. జస్టిన్‌ హెనిన్‌ లాగే టెక్నిక్‌ను నమ్ముకుని ఆడే కెర్బర్‌కు గాడిలో పడడానికి సమయం పట్టింది. ఇండియానావెల్స్‌ టోర్నీలో తన ఆరాధ్యం స్టెఫీగ్రాఫ్‌ ఇచ్చిన సలహాలు ఆమెను ఎంతో మార్చాయి. అంతేకాదు టొర్బెన్‌ బ్లెట్జ్‌ను కోచ్‌గా ఎంచుకున్నాక కెర్బర్‌ ఆటలో మార్పొచ్చింది. కోర్టులో దూకుడుగా ఉండడం నేర్చుకుంది. సర్వీస్‌లోనూ, నెట్‌గేమ్‌లోనూ ఎంతో పరిణతి సాధించింది. ఫలితమే.. 2016 ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో టైటిల్‌. తనపై 5-1తో విజయాల రికార్డు ఉన్న సెరెనాను ఓడించి ట్రోఫీ గెలవడం ఆమె విశ్వాసాన్ని ఎంతో పెంచింది. ఫ్రెంచ్‌ ఓపెన్లో క్వార్టర్స్‌లో ఓడినా.. వింబుల్డన్‌లో ఫైనల్‌కు దూసుకొచ్చింది. ఐతే సెరెనా చేతిలో ఓడినా.. కెర్బర్‌ తగ్గలేదు. ఒలింపిక్స్‌లో స్టార్లందరూ ఓడిన చోట రజతం గెలిచి సత్తా చాటింది. జోరు కొనసాగిస్తుందా! ఈ దశాబ్దంలో అమ్మాయిల టెన్నిస్‌లో ఎందరో భామలు వచ్చారు వెళ్లారు.. కానీ సెరెనా, వీనస్‌ విలియమ్స్‌ సోదరీమణుల ముందు దిగదుడుపే. 35 ఏళ్ల వయసులో సెరెనా ఇప్పటికీ టైటిళ్లు సాధిస్తుంటే.. వీనస్‌ కూడా టాప్‌-10లో కొనసాగుతోంది. విక్టోరియా అజరెంక, రద్వాంస్కా, వోజ్నియాకి, షరపోవా లాంటి వాళ్లు కాస్త పోటీ ఇచ్చినా కొంతకాలమే. ఈ రెండేళ్లలో సెరెనా పవర్‌ను నిలువరించగలిగింది స్పెయిన్‌ స్టార్‌ ముగురుజ మాత్రమే. ఈ నేపథ్యంలో 2016 సీజన్లో సంచలనంగా దూసుకొచ్చిన కెర్బర్‌.. సెరెనాకు బ్రేకులు వేసింది. ఒక టోర్నీలో టైటిల్‌ కూడా దూరం చేసింది. ఈ నేపథ్యంలో ఆమె రాబోయే టోర్నీల్లో ఇదే స్థిరత్వాన్ని ప్రదర్శిస్తుందో లేదో చూడాలి. కెర్బర్‌ వయసు 28 ఏళ్లు. ప్రస్తుతం ఆమె ఫామ్‌, ఫిట్‌నెస్‌ను పరిగణనలోకి తీసుకుంటే మరిన్ని టైటిళ్లు సాధించే సత్తా ఆమెకుంది. ముగురుజ, ప్లిస్‌కోవా, హలెప్‌ లాంటివాళ్లని తట్టుకుని ఈ జర్మనీ భామ నెం.1 నిలబెట్టుకుంటుందోలేదో చూడాలి.

‘షాన్’ దార్ ఇన్నింగ్స్‌ ముగిసింది

10/09/2016: బ్రాడ్‌మన్‌ నుంచి సచిన్ దాకా ఎంతో మంది దిగ్గజాలు తమ అద్భుత ఆటతో క్రికెట్‌ను పరిపూర్ణం చేశారు. కానీ తన పేరుతోనే ఒక షాట్‌కు క్రికెట్‌లో సుస్థిర స్థానం కల్పించడం మాత్రం అసాధారణం. అది తిలకరత్నే దిల్షాన్‌కు మాత్రమే సొంతమైన ఘనత. తలను కాస్త వంచి, ఒక మోకాలుపై కూర్చుంటూ పేసర్ వేసిన గుడ్ లెంగ్‌‌త బంతిని సరిగ్గా వికెట్ కీపర్ తల మీదుగా పంపించడం దిల్షాన్‌కే చెల్లింది. 2009 టి20 ప్రపంచకప్‌లో తొలిసారి అతను ఈ షాట్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు. అంతకు ముందే మారిలియర్ ఇలా కొట్టేవాడని కొందరు చెప్పినా... ఇప్పుడు అందరూ ఆడుతున్న స్కూప్‌కు మాత్రం తానే ఆద్యుడినని అతను గర్వంగా చెప్పుకుంటాడు. అందుకే క్రికెట్ ప్రపంచం కూడా దీనిని గుర్తించి ‘దిల్‌స్కూప్’ అని పేరు పెట్టేసింది. బెస్ట్ ఆల్‌రౌండర్ దిల్షాన్ అంటే ఆ ఒక్క షాట్ మాత్రమే కాదు. పరిపూర్ణమైన క్రికెటర్. బ్యాట్స్‌మన్, బౌలర్, అద్భుత ఫీల్డర్, అవసరమైన సమయాన చక్కటి వికెట్ కీపర్... ఇలా అన్ని పాత్రలను సమర్థంగా పోషించిన అతను సుదీర్ఘ కాలం పాటు శ్రీలంక విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. వన్డేల్లో 10 వేలకు పైగా పరుగులు చేసిన అరుదైన ఆటగాళ్లలో అతనూ ఒకడు. ఆరంభంలో లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్, ఆఫ్‌స్పిన్నర్‌గానే అందరికీ తెలిసిన దిల్షాన్ ఓపెనింగ్‌కు మారటంతో ఒక్కసారిగా మారిపోయాడు. దూకుడైన ఆటతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించి పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. 2009లో మూడు ఫార్మాట్‌లలోనూ ఓపెనర్‌గా అవకాశం వచ్చాక చెలరేగిపోయాడు. ముఖ్యంగా జయసూర్య రిటైర్మెంట్ తర్వాత ఆ లోటు కనిపించకుండా ఆడాడు. కెప్టెన్‌గా ఉంటూ మూడు ఫార్మాట్‌లలో సెంచరీ చేసిన ఏకై క ఆటగాడు అతనే. జయవర్ధనే, సంగక్కరలతో పోలిస్తే చెప్పుకోదగ్గ గుర్తింపు తెచ్చుకోకపోరుునా, లంక క్రికెట్‌పై దిల్షాన్ తనదైన ముద్ర వేశాడు. కొన్ని మెరుపులు ఇటీవలి వరకు వన్డేల్లో రికార్డుగా ఉన్న 443 పరుగుల మ్యాచ్ (నెదర్లాండ్‌‌సపై)లో 78 బంతుల్లో 117 నాటౌట్, 2009లో బంగ్లాదేశ్‌తో టెస్టులో రెండు ఇన్నింగ్‌‌సలలోనూ సెంచరీలు, 2009 టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై 57 బంతుల్లో 96 పరుగులు, టెస్టుల్లో తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగి (కివీస్‌పై) 72 బంతుల్లో 92 పరుగులు చేయడం, భారత్‌పై రాజ్‌కోట్‌లో 415 పరుగుల లక్షాన్ని అందుకునే ప్రయత్నంలో చేసిన 124 బంతుల్లో 160 పరుగులు, 2011లో లార్డ్స్ టెస్టులో చేతికి గాయంతో పోరాడుతూ చేసిన 193 పరుగుల ఇన్నింగ్‌‌స... దిల్షాన్ కెరీర్‌లో గుర్తుండిపోయే మ్యాచ్‌లు. వీటన్నింటికి తోడు గత వన్డే వరల్డ్ కప్‌లో 140 కిలో మీటర్ల వేగంతో బంతులు విసురుతున్న మిషెల్ జాన్సన్ వేసిన ఒకే ఓవర్లో వరుసగా ఆరు ఫోర్లు అలవోకగా కొట్టడం ఎవరు మరచిపోగలరు!

రియోలో భారత్ కు స్వర్ణం, కాంస్యం

10/09/2016: రియో డీ జనీరో : పారాలింపిక్స్‌లో భారత్‌ రెండు పతకాలు కైవసం చేసుకుంది. రియో పారాలింపిక్స్‌లో హైజంప్ విభాగంలో భారత అథ్లెట్లు స్వర్ణ, కాంస్య పతకాలు సాధించారు. పురుషుల హైజంప్‌ టీ-42 విభాగంలో మరియప్పన్ తంగవేలు 1.89 మీటర్లు హైజంప్ చేసి స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకోగా, మరో భారత అథ్లెట్ వరుణ్‌ సింగ్‌ భాటి 1.86 మీటర్లు జంప్ చేసి కాంస్య పతకం నెగ్గాడు. అమెరికాకు చెందిన సామ్ గ్రీవె రెండో స్థానంలో నిలిచి రజతాన్ని సొంతం చేసుకున్నాడు. పారాలింపిక్స్లో హైజంప్ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారత అథ్లెట్ మరియప్పన్. కాగా, వ్యక్తిగత స్వర్ణం నెగ్గిన మూడో భారత అథ్లెట్ గా నిలిచాడు. గతంలో స్విమ్మింగ్, జావెలిన్ త్రో విభాగాలలో భారత్ వ్యక్తిగత స్వర్ణాలు కైవసం చేసుకుంది. పారాలింపిక్స్ లో ఓవరాల్ గా భారత్ పతకాల సంఖ్య 10కి చేరింది.

అందుకే ధోని ఫోన్ లిఫ్ట్ చేయలేదు - యువీ

09/09/2016: ముంబై: టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ స్వచ్ఛంద సంస్థ 'యువీ కెన్' కొత్త వస్త్ర ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో కార్యక్రమానికి చాలా మంది క్రికెటర్లు, పలువురు ప్రముఖులు విచ్చేసినా టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాత్రం దూరంగా ఉన్నాడు. అయితే దీనిపై పలు రకాల ఊహాగానాలు ఊపందుకున్నాయి. యువరాజ్ సింగ్ కార్యక్రమానికి ధోని కావాలనే రాలేదని ప్రధానంగా వినిపించింది. దాంతో పాటు గతంలో ధోనిపై యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ మండిపడటమే ఇందుకు కారణమా?అనే కోణం కూడా చర్చకు వచ్చింది. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నలకు యువరాజ్ తనదైన శైలిలో జవాబిచ్చాడు. 'నాకు తెలిసినంతవరకూ ధోని చాలా బిజీగా ఉన్నాడని అనుకుంటున్నా. దానిలో భాగంగానే నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు.నా ఫోనే కాదు.. చాలా మంది ఫోన్ కాల్ను కూడా ధోని రిసీవ్ చేసుకోవడం లేదు. ఇందుకు కారణం పలు కార్యక్రమాలతో ధోనిబిజీగా ఉండటమే. అంతకుమించి వేరే ఏమీ లేదు ' అని యువరాజ్ తెలిపాడు. అయితే ధోని జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న 'ధోని; అన్ టోల్డ్ స్టోరీ' కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు యువీ పేర్కొన్నాడు. ప్రధానంగా ఆ సినిమాలో తన పాత్ర ఎలా ఉందో అనేది తెలుసుకోవాల నే ఆసక్తి మెండుగా ఉందన్నాడు. కాగా, యువరాజ్ సింగ్ బయోపిక్ను తీయడానికి ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? అన్న ప్రశ్నకు యువీ దాదాపు అవుననే సమాధానం ఇచ్చాడు. ఇందుకు పలువురు ఆసక్తి కనబరుస్తున్నా, అందుకు సంబంధించిన తుది కార్యకచరణపై స్పష్టత రావాల్సి ఉందన్నాడు.

ఏకై క టి20లో పాక్ విజయం

09/09/2016: మాంచెస్టర్: ఇంగ్లండ్ పర్యటనను పాకిస్తాన్ జట్టు విజయంతో ముగించింది. బుధవారం రాత్రి జరిగిన ఏకై క టి20 మ్యాచ్‌లో పాక్ తొమ్మిది వికెట్ల తేడాతో నెగ్గింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 135 పరుగులు చేసింది. అలెక్స్ హేల్స్ (37) టాప్ స్కోరర్. వహాబ్ రియాజ్‌కు మూడు.. ఇమాద్ వాసిం, హసన్ అలీలకు రెండేసి వికెట్లు దక్కాయి. బౌలర్ల ధాటికి చివరి పది ఓవర్లలో ఇంగ్లండ్ కేవలం ఓ బౌండరీ మాత్రమే సాధించింది. అనంతరం స్వల్ప లక్ష్యం కోసం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 14.5 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 139 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు షర్జీల్ ఖాన్ (59), ఖలీద్ లతీఫ్ (59 నాటౌట్) అర్ధ సెంచరీలు చేశారు. ఈ సుదీర్ఘ పర్యటనలో టెస్టు సిరీస్‌ను 2-2తో సమం చేసిన పాక్ వన్డే సిరీస్‌ను మాత్రం 1-4తో కోల్పోయింది.

డిసెంబరు నుంచి బరిలోకి...

09/09/2016: ముంబై: భారత బ్యాడ్మిం టన్ స్టార్ సైనా నెహ్వాల్ తిరిగి డిసెంబరులో కోర్టు లో అడుగుపెట్టనుంది. గాయం కారణంగా మోకాలికి ఆపరేషన్ చేయించుకున్న సైనా... తన పునరాగమనం మరింత బలంగా ఉంటుందని పేర్కొంది. ‘అంతా సవ్యంగా జరిగితే డిసెంబరులో దుబాయ్ వరల్డ్ సూపర్ సిరీస్ ఆడతాను. గత ఐదారేళ్లలో నా ప్రదర్శన కంటే ఆరబోయే మూడేళ్లు మరింత మెరుగ్గా రాణిస్తాననే నమ్మకం ఉంది’ అని సైనా తెలిపింది.

కెర్బర్ ‘నంబర్ వన్’ విన్

09/09/2016: న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళల ఫైనల్లో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ప్లిస్కోవా, జర్మనీ స్టార్ ఏంజెలిక్ కెర్బర్ తలపడనున్నారు. శనివారం టైటిల్ పోరు జరగనుంది. సెమీస్ లో ప్లిస్కోవా, కెర్బర్ తమ ప్రత్యర్థులపై విజయాలు సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టారు. తొలి సెమీస్ లో సెరెనా విలియమ్స్ ను ప్లిస్కోవా ఓడించింది. రెండో సెమీస్ లో వోజ్నియాకిపై కెర్బర్ గెలిచింది. 6-4, 6-3తో ఓడించి టైటిల్ పోరుకు సిద్ధమైంది.1996లో స్టెఫీగ్రాఫ్‌ తర్వాత యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరిన జర్మనీ క్రీడాకారిణిగా కెర్బర్ ఘనత సాధించింది. 28 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండర్ జనవరిలో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ దక్కించుకుంది. యూఎస్ ఓపెన్ లో ఫైనల్లో అడుగుపెట్టడంతో పాటు కెర్బర్ నంబర్ వన్ ర్యాంకు దక్కించుకుంది. తన క్రీడా జీవితంలో ఇదో అద్భుతమైన రోజు అని కెర్బర్ పేర్కొంది.

9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్!

08/09/2016: మంచెస్టర్: పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనను విజయంతో ముగించింది. ఓల్డ్ ట్రాఫర్డ్ లో బుధవారం రాత్రి జరిగిన ఏకైక టీ-20 మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టును తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుచేసింది. నూతన కెప్టెన్ సర్ఫ్ రాజ్ అహ్మద్ నాయకత్వంలో బరిలోకి దిగిన పాక్ జట్టు ఇటు బౌలింగ్ లోనూ, అటు బ్యాటింగ్ లోనూ సత్తా చాటింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 135 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో వాహెబ్ రియాజ్ అద్భుతంగా రాణించి 18 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టగా, స్పిన్నర్ ఇమద్ వసీం 17 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ లో అలెక్స్ హేల్స్ (37 పరుగులు), జాసన్ రాయ్ (21 పరుగులు) తప్ప పెద్దగా ఎవరూ రాణించలేదు. 136 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు ఆడుతూ పాడుతూ గమ్యాన్ని చేరుకుంది. ఓపెనర్లు షర్జీల్ ఖాన్ (59 పరుగులు), ఖలీద్ లతీఫ్ (59 పరుగులు నాటౌట్) అద్భుతంగా ఆడి గొప్ప ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు కలిసి మొదటి వికెట్ కు 107 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. దీంతో 31 బంతులు మిగిలి ఉండగానే ఒక వికెట్ కోల్పోయి.. పాక్ జట్టు 136 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. ఇలా పాకిస్తాన్ టీ 20 చరిత్రలో 9 వికెట్ల తేడాతో గెలవడం ఇదే తొలిసారి. పెద్దగా అంచనాలు లేకుండా ఇంగ్లండ్ పర్యటనకు వచ్చిన పాకిస్థాన్ జట్టు టెస్టు సిరీస్ ను 2-2తో డ్రా చేసుకోగా.. వన్డే సిరీస్ ను మాత్రం 4-1 తేడాతో ఓడిపోయింది.

నాపై బాధ్యత మరింత పెరిగింది! - ఇంకా శ్రమించాల్సి ఉంది - బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు

08/09/2016: ముంబై: ఒలింపిక్స్‌లో పతకం సాధించడంతో తనపై అంచనాలు ఎక్కువయ్యాయని, ఇక ముందు మరింతా బాగా ఆడాల్సి ఉంటుందని స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వ్యాఖ్యానించింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తొలిసారి పతకం సాధించినప్పుడు ప్రపంచం తనను గుర్తించిందని, ఇప్పుడు ఒలింపిక్స్‌తో అందరికీ చేరువయ్యానని ఆమె చెప్పింది. సింధుకు గత ఆరేళ్లుగా అండగా నిలిచిన ఎన్జీఓ ఒలింపిక్ గోల్డ్‌క్వెస్ట్ (ఓజీక్యూ) బుధవారం ఆమెను ఘనంగా సన్మానించింది. ‘భవిష్యత్తులో అందరి దృష్టి నాపైన ఉంటుంది. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది. నా ఘనతల పట్ల సంతోషంగా ఉన్నాను. ప్రపంచ చాంపియన్‌షిప్‌తో పోలిస్తే ఈ పతకం విలువ చాలా ఎక్కువ. ఓజీక్యూ ఇచ్చిన సహకారంతోనే నా తొలి టైటిల్ మాల్దీవ్‌‌స ఇంటర్నేషనల్ గెలవగలిగా‘ అని సింధు చెప్పింది. ఈ కార్యక్రమంలో కోచ్ గోపీచంద్‌తో పాటు సింధు తల్లిదండ్రులు రమణ, విజయలను కూడా సత్కరించారు.

ప్రజ్ఞాన్ ఓజా తలకు గాయం - ఫీల్డింగ్ చేస్తుండగా ఘటన

08/09/2016: గ్రేటర్ నోరుుడా: దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో బుధవారం అపశ్రుతి చోటు చేసుకుంది. ఫీల్డింగ్ చేస్తూ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా గాయ పడ్డాడు. ఇండియా బ్లూ బ్యాట్స్‌మన్ పంక సింగ్ కొట్టిన బంతిని ఆపేందుకు లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఓజా ముందుకు వచ్చాడు. అరుుతే ఒక్కసారిగా అనూహ్యంగా బౌన్‌‌స అరుున బంతి అతని వైపు దూసుకొచ్చింది. దాంతో తప్పించుకునే ప్రయత్నంలో ఓజా వెనక్కి తిరగ్గా... బంతి అతని తల వెనుక భాగంలో బలంగా తగిలింది. వెంటనే అతడిని స్టెచ్రర్‌పై మైదానం బయటికి తీసుకుపోయారు. సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించి సీటీ స్కాన్ తదితర పరీక్షలు నిర్వహించారు. చివరకు అతను మెల్లగా కోలుకున్నాడు. ఓజాకు ప్రమాదమేమీ లేదని, అంతా బాగున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.

ఆట ముఖ్యమా... టీవీలో ప్రసారమా!

07/09/2016: ముంబై: వర్షం లేదు... వెలుతురు కూడా బ్రహ్మాండం... పిచ్ కూడా ఆటకు అనుకూలంగా ఉంది... ఐసీసీ నిబంధనల ప్రకారం అన్నీ బావున్నారుు. అరుునా సరే గత నెల 28న భారత్, వెస్టిండీస్ రెండో టి20 మ్యాచ్ చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. సాంకేతిక కారణాల వల్లే అని వివరణ ఇచ్చుకున్నా... చివర్లో వాన రావడంతో దాని ప్రభావం కనిపించింది. మనం గెలవాల్సిన మ్యాచ్‌ను వర్షం వల్ల రద్దు చేయాల్సి వచ్చింది. సిరీస్‌ను సమం చేసే అవకాశం భారత్ కోల్పోవడం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఆగ్రహం తెప్పించింది. ఈ బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నిస్తూ బీసీసీఐకి ధోని అధికారికంగా ఫిర్యాదు చేశాడు. ఏం జరిగిందంటే... భారత్, విండీస్ మధ్య లాడర్ హిల్ (ఫ్లోరిడా)లో రెండో టి20 మ్యాచ్ జరిగింది. అరుుతే సాంకేతిక కారణాలతో మ్యాచ్ నిర్ణీత సమయంకంటే దాదాపు 50 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌కు ప్రసారకర్త స్టార్ స్పోర్‌‌ట్స అరుునా మ్యాచ్‌ను షూట్ చేసే ప్రొడక్షన్ బాధ్యతలు సన్‌సెట్ అండ్ వైన్ అనే కంపెనీవి. అరుుతే అసలు సమయంలో మ్యాచ్ ఫీడ్‌ను స్టార్‌కు అప్ లింకింగ్ చేయడంలో ఆ కంపెనీ విఫలమైంది. సమస్య ఏమిటంటూ ధోని పదే పదే అడిగిన మీదట టెక్నికల్ సమస్యలు సరి చేస్తున్నామంటూ, కాస్త ఓపిక పట్టాలంటూ వారు జవాబిచ్చారు. ఎలా ఆపుతారు?: ఐసీసీ నిబంధనల ప్రకారం వర్షం, వెలుతురు లేకపోవడం, మైదానం ఆటకు అనుకూలంగా లేకపోవడమనే మూడు కారణాలతో మాత్రమే ఆటను ఆలస్యంగా ప్రారంభించవచ్చు. ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో సాంకేతిక సమస్య కారణంగా ఇలా జరగడం ఇదే మొదటి సారి. ‘నిబంధనల ప్రకారం మ్యాచ్‌ను సరైన సమయంలో ప్రారంభించాల్సింది. శాటిలైట్ సిగ్నల్స్ లేవని ఆటను ఆపుతారా. మరి మైదానంలో ఉన్నవారి పరిస్థితి ఏమిటి. భారీ ధరకు టికెట్ కొని వచ్చినవారికి ఎవరు జవాబు చెప్పాలి. ప్రొడక్షన్ సంస్థ చేసింది క్షమించరాని తప్పు‘ అని ధోని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ధోనిపై కేసు కొట్టివేత విష్ణుమూర్తి అవతారంలో వేర్వేరు ప్రకటనలకు ప్రచారం చేస్తున్నట్లు ఓ పత్రికలో ప్రచురితమైన చిత్రానికి సంబంధించిన కేసులో ధోనికి విముక్తి లభించింది. ధోనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కర్ణాటక హై కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. దిగువ కోర్టు ఉత్తర్వులు న్యాయంగా లేవని జస్టిస్ రంజన్, పీసీ పంత్‌లతో కూడిన బెంచ్ అభిప్రాయ పడింది.

నెంబర్ వన్ నిజంగానే వెరీ లక్కీ!

07/09/2016: న్యూయార్క్ : యూఎస్ ఓపెన్లో అదృష్టవంతుడు ఎవరంటే ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్, సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్ అని చెప్పవచ్చు. అతడు ప్రత్యర్థులను ఎదుర్కోకుండా, వారిపై నెగ్గకుండానే ఒక్కో అడుగు ముందుకెస్తున్నాడు. మూడు వాకోవర్(ఓ వాకోవర్, రెండు రిటైర్డ్ హర్ట్) లతో అతడు సెమిఫైనల్స్ కు చేరుకున్నాడు. క్వార్టర్స్ పోరులో ఫ్రెంచ్ ఆటగాడు జో విల్ఫ్రైడ్ సోంగా ఎడమ మోకాలికి గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. టాప్ సీడెడ్ జొకోవిచ్ 6-3, 6-2తో ఆధిక్యంలతో ఉన్న దశలో ప్రత్యర్థి సోంగా మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. దీంతో జొకోకు మరో వాకోవర్ లభించింది. ఓవరాల్ గా ఈ యూఎస్ ఓపెన్లో జరిగిన ఐదు మ్యాచ్లకుగానూ జొకో కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే నెగ్గడం గమనార్హం. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో అతని ప్రత్యర్థి జిరి వెసెలి (చెక్ రిపబ్లిక్) నుంచి టాప్‌సీడ్ సెర్బియన్ స్టార్‌కు వాకోవర్ లభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాలుగో రౌండ్లో మైఖేల్ యోజ్నీ (రష్యా)కు తొడ కండరాలు పట్టేయడంతో మ్యాచ్ మధ్య నుంచి అర్థాంతరంగా వైదొలిగాడు. తొలి సెట్లో జొకోవిచ్ 4-2 తో ఆధిక్యంలో ఉన్న దశలో యోజ్నీ పోరు నుంచి తప్పుకున్నాడు. సోంగా కూడా రెండో సెట్ మధ్యలోనే వైదొలగండతో ఓ వాకోవర్, రెండు రిటైర్డ్ హర్ట్ లతో జొకో పెద్దగా శ్రమించాల్సిన పనిలేకుండానే సెమిఫైనల్స్ చేరుకున్నాడు. రెండుసార్లు చాంపియన్(2011, 2015 టైటిల్స్) అయిన జొకో మూడో టైటిల్ పై కన్నేశాడు.

బౌలర్ అశ్విన్ సంచలన కామెంట్స్!

07/09/2016: పేలవమైన ఆటతీరుతో లంకతో వన్డేల్లో స్థానం కోల్పోయిన ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ మరోసారి సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. లంకతో జరిగిన తొలి టీ20లో 49 బంతుల్లో సెంచరీ చేసిన మ్యాక్స్ వెల్ (65 బంతుల్లో 145 నాటౌట్; 14 ఫోర్లు, 9 సిక్సర్లు) దూకుడుకు లంక బౌలర్లు బెంబెలెత్తిపోయారు. దీంతో టీ20ల్లో గతంలో లంక పేరిట ఉన్న రికార్డు (కెన్యాపై 260 పరుగులు)ను తిరగరాస్లూ 20 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి ఆసీస్ జట్టు 263 పరుగులు చేసింది. హర్షా బోగ్లే ఈ ఇన్నింగ్స్ పై చేసిన ట్వీట్ పై భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్ పవర్ ప్లేలో రెండు ఓవర్లను టెన్నిస్ బంతితో బౌలింగ్ చేయాలని, మరో రెండు ఓవర్లను బౌలింగ్ మేషిన్ తో వేయాలని అశ్విన్ రీట్వీట్ చేశాడు. బౌలింగ్ మేషిన్ తో మాత్రమే మ్యాక్స్ వెల్ కు బౌలింగ్ చేయగలమని అశ్విన్ తన పోస్ట్ లో అభిప్రాయపడ్డాడు. అంతకుముందు హర్షాబోగ్లే ఆసీస్ ఇన్నింగ్స్ పై ఇలా ట్వీట్ చేశాడు. 10 ఓవర్లలో 153 పరుగులు.. అది కూడా 39 బంతుల్లో సెంచరీ భాగస్వామ్యయా.. మ్యాక్స్ వెల్ 145నాటౌట్(65బంతులు)?.. హెడ్ 263 స్ట్రైక్ రేట్ తో (18 బంతుల్లో 45) చేశాడు. తర్వాత ఏంటి.. ఇంకేవరైనా బౌలర్ సిద్ధంగా ఉన్నాడా అని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

రోస్‌బర్గ్‌దే పైచేయి... - ఇటలీ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం

06/09/2016: మోంజా (ఇటలీ): సహచరుడు లూరుుస్ హామిల్టన్ చేసిన తప్పిదాన్ని పూర్తిస్థారుులో సద్వినియోగం చేసుకున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఈ సీజన్‌లో ఏడో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి రేసులో రోస్‌బర్గ్ 53 ల్యాప్‌లను గంటా 17 నిమిషాల 28.089 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మరోవైపు ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ రేసు మొదలైన రెండో క్షణంలోనే ఆరో స్థానానికి పడిపోయాడు. దాంతో తొలి ల్యాప్‌లోనే రోస్‌బర్గ్ ఆధిక్యంలోకి వెళ్లాడు. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తొలిసారి ఇటలీ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్‌కు మూడో స్థానం దక్కింది. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లకు ఈ రేసు కలిసొచ్చింది. పెరెజ్ ఎనిమిదో స్థానంలో, హుల్కెన్‌బర్గ్ పదో స్థానంలో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు సింగపూర్ గ్రాండ్‌ప్రి ఈనెల 18న జరుగుతుంది.

రెజ్లర్‌ సాక్షి సీక్రెట్ బయటపడింది

06/09/2016: రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత రెజ్లర్‌ సాక్షి మాలిక్ దాచిన సీక్రెట్ బయటపడింది. ఆమెకు కాబోయే వరుడు ఎవరో తెలిసిపోయింది. సాక్షికి కాబోయే భర్త పేరును ఆమె సోదరుడు సచిన్ వెల్లడించాడు. ఆ లక్కీ ఫెలో ఎవరంటే.. ఆమె సొంతూరు రోహ్టక్కు చెందిన అంతర్జాతీయ రెజ్లర్ సత్యవర్త్ కడియన్. సత్యవర్త్ అంతర్జాతీయ స్థాయిలో రాణించి పతకాలు కూడా గెలిచాడు. సత్యవర్త్ (22) వయసు సాక్షి (24) కంటే రెండేళ్లు తక్కువ. రియో ఒలింపిక్స్లో పాల్గొనేందుకు సాక్షి బ్రెజిల్ వెళ్లకుముందే వీరి పెళ్లి నిశ్చయమైనట్టు సచిన్ చెప్పాడు. ఒలింపిక్స్ తర్వాత సాక్షి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తానో సహచర రెజ్లింగ్ ఆటగాడిని పెళ్లి చేసుకోబోతున్నాని, అయితే తనకు కాబోయే భర్త పేరు మాత్రం సీక్రెట్ అంటూ చెప్పిన సంగతి తెలిసిందే. సత్యవర్త్ రెజ్లర్ల కుటుంబం నుంచి వచ్చాడు. అతని తండ్రి సత్యవన్ పేరున్న రెజ్లర్. రోహ్టక్లో ఓ అకాడమీని నడుపుతున్నాడు. సాక్షి, సత్యవర్త్ వివాహం చేసుకుంటారని సత్యవన్ కూడా ధ్రువీకరించాడు. రియో ఒలింపిక్స్లో పతకం గెలిచాక సాక్షి పేరు దేశమంతా మార్మోగిపోయిన సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ ముగిశాక ఓ బెంగాలీ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన సాక్షి.. తన పెళ్లి గురించి మనసులో మాటను చెప్పింది. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించాలన్న తన సన్నాహాలకు పెళ్లి ఏమాత్రం అడ్డు కాబోదని చెప్పింది. 'అతను నా సన్నాహాలకు సహాయంగా నిలుస్తాడు. పెళ్లి తర్వాత రెజ్లింగ్‌ క్రీడను కొనసాగించడం ఏమీ సమస్య కాబోదని నేను అనుకుంటున్నా' అని తెలిపింది.

హర్భజనే నా శత్రువు!

06/09/2016: సిడ్నీ:తనకు ప్రపంచ క్రికెట్ లో అసలైన శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగే అంటున్నాడు ఆసీస్ దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్. క్రికెట్లో తనదైన ముద్రను వేసిన పాంటింగ్కు హర్భజన్ సింగ్ బౌలింగ్ అంటే భయమట. ప్రత్యేకంగా భారత్తో తలపడేటప్పుడు హర్భజన్ బౌలింగ్లో అత్యంత జాగ్రత్తగా ఉండేవాడనని, ఫీల్డ్లో అతనే తన అసలైన శత్రువని పాంటింగ్ వ్యాఖ్యానించాడు. ఇప్పటికీ హర్భజన్ సింగ్ బౌలింగ్ లో అవుటైన క్షణాలు తనను పీడకలలా వెంటాడుతూనే ఉన్నాయన్నాడు. పాంటింగ్ తన టెస్టు కెరీర్లో హర్భజన్ బౌలింగ్ లో అత్యధికంగా 10 సార్లు అవుట్ కావడంతో ఈ దూస్రా స్పెషలిస్టును నంబర్ వన్ శత్రువుగా అభివర్ణించాడు. దాంతో పాటు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. విరాట్ ఒక అసాధారణ టాలెంట్ ఉన్న ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ప్రస్తుతం విరాట్ వయసు పరంగా చూస్తే అతను వన్డేల్లో ఎన్నో ఘనతలను సొంతం చేసుకున్నాడన్నాడు. ప్రధానంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో విరాట్ నాలుగు సెంచరీలు సాధించడం అతనిలోని విశేష ప్రతిభకు అద్దం పడుతుందని పాంటింగ్ కొనియాడాడు. ఇప్పుడు ఏదైతే విరాట్ లో ఉందో అదే టీమిండియాను ముందంజలో నిలపడానికి దోహద పడిందన్నాడు.

అత్యంత స్ఫూర్తిదాయక మహిళగా దీప

03/09/2016: న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో అందరి హృదయాలను గెలుచుకున్న జిమ్నాస్ట్ దీపా కర్మాకర్.. తాజా సర్వేలో అత్యంత స్ఫూర్తిదాయక భారత మహిళగా పేరు తెచ్చుకుంది. షాదీ.కామ్ నిర్వహించిన దేశవ్యాప్త సర్వేలో ఈ విషయం తేలింది. ‘ఇటీవలి కాలంలో మీలో స్ఫూర్తి పెంచిన భారత మహిళ ఎవరు’ అని అడిగిన ప్రశ్నకు 33.7 శాతం మంది దీపకే ఓటేశారు. ఈ సర్వేలో మొత్తం 12,500 మంది పాల్గొన్నారు. రెండో స్థానంలో 27.4 శాతంతో రెజ్లర్ సాక్షి మలిక్ నిలిచింది. అయితే ఒలింపిక్స్‌లో రజతం సాధించిన తొలి మహిళగా నిలిచి రికార్డు సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వైపు కేవలం 6.2 శాతం మందే మొగ్గు చూపారు. అలాగే సోషల్ మీడియాలో ఎక్కువగా ఆకర్షిస్తున్న మహిళగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ (36.3 శాతం) నిలిచారు. నటి ప్రియాంక చోప్రా (31.2), టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (17.4) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.

ప్రత్యర్థులను 'రఫా'డిస్తున్నాడు!

03/09/2016: న్యూయార్క్ : యూఎస్ ఓపెన్లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ జోరు కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి జరిగిన మూడో రౌండ్లో 3 వరుస సెట్లలో నెగ్గి మ్యాచ్ కైవసం చేసుకున్నాడు. రష్యాకు చెందిన 47వ ర్యాంకర్ ఆండ్రీ కుజ్నెత్సోవ్ పై 6-1, 6-4, 6-2 తేడాతో గెలిచి నాలుగో రౌండ్లోకి సులువుగా ప్రవేశించాడు. 2015 ఫ్రెంచ్ గ్రాండ్ స్లామ్ తర్వాత రఫా నాలుగో రౌండ్లోకి ప్రవేశించిన తొలి గ్రాండ్ స్లామ్ ఇదే. 2013 యూఎస్ ఓపెన్ నెగ్గిన తర్వాత ఈ టోర్నమెంట్లో నాదల్ మరోసారి నాలుగో రౌండ్ చేరుకున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్లో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన నాదల్, ఫ్రెంచ్ ఓపెన్లో మూడో రౌండ్లో గాయపడి టోర్నమెంట్ నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. రియో ఒలింపిక్స్ తో పునరాగమనం చేసిన నాదల్.. పురుషుల డబుల్స్ ఫైనల్ పోరులో మార్క్ లోపెజ్ తో కలిసి 6-2, 3-6, 6-4 తేడాతో ఫ్లోరిన్ మెర్జియా-హోరియా టెకూ(రొమేనియా)పై గెలిచి స్వర్ణం గెలుచుకున్నాడు. నాదల్ మరోసారి అదే స్థాయి ఆటతీరుతో యాఎస్ ఓపెన్లో చెలరేగిపోతున్నాడు. యూఎస్ ఓపెన్ లో నాలుగో రౌండ్ చేరినా ఇప్పటి వరకూ ఒక్క సెట్ కూడా ప్రత్యర్థికి కోల్పోక పోవడం విశేషం.

ఆర్నబ్‌ ఏం అడిగాడు.. సెహ్వాగ్‌ ఏం చెప్పాడు!

03/09/2016: రియో ఒలింపిక్స్‌లో భారత ప్రదర్శనపై చెత్త వ్యాఖ్యలు చేసి బ్రిటిష్‌ జర్నలిస్టు పీర్స్‌ మోర్గాన్‌ వార్తలో నిలిచిన సంగతి తెలిసిందే. ’120 కోట్లమంది జనాభా కలిగిన దేశం కేవలం రెండంటే రెండు పతకాలు సాధించినందుకు సంబరాలు చేసుకుంటోంది. ఎంత చిరాకు కలిగించే విషయమిది’ అని మోర్గాన్‌ నోరు పారేసుకున్నాడు. నోటి దురుసుతనం బాగా ఎక్కువైన ఈ సీఎన్‌ఎన్‌ మాజీ ప్రజెంటర్‌కు ట్విట్టర్‌లో భారతీయులు ఓ రేంజ్‌లో కౌంటరిచ్చారు. మాజీ డ్యాషింగ్‌ క్రికెటర్‌ సెహ్వాగ్‌ కూడా గట్టిగా బదులిచ్చాడు. ఇప్పటివరకు క్రికెట్‌లో వరల్డ్‌ కప్‌ గెలువని మీరా (ఇంగ్లండ్‌) మాగురించి మాట్లాడేదని దెప్పిపొడిచాడు. దీంతో రోషం పొడుచుకొచ్చిన మోర్గాన్‌ ఏకంగా సెహ్వాగ్‌కే సవాల్‌ విసిరాడు. ’హాయ్‌ వీరేంద్ర సెహ్వాగ్‌.. ఇండియా మరో ఒలింపిక్స్‌ మెడల్‌ గెలిచేలోపే ఇంగ్లండ్‌ వన్డే వరల్డ్‌ కప్‌ కొడుతోంది. నాతో రూ. 10 లక్షల బెట్టు కాస్తావా’ అని సవాల్‌ చేశాడు. ఈ సవాల్‌ను లైట్‌ తీసుకున్న సెహ్వాగ్‌.. తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ప్రముఖ జర్నలిస్ట్‌ ఆర్నబ్ గోస్వామి తన షో 'న్యూస్‌ అవర్‌'లో మోర్గాన్‌పై మాట్లాడమని అడిగారని, కానీ, టీవీలో ప్రసారమయ్యేంత సీన్‌ ఆయనకు లేదని తాను తోసిపుచ్చానని సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు. సున్నితమైన హాస్యంతో కూడిన ఈ ట్వీట్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

సెరెనా మరో అరుదైన రికార్డు!

02/09/2016: న్యూయార్క్: ఈ ఏడాది జూలైలో జరిగిన వింబుల్డన్లో విజేతగా నిలవడం ద్వారా 22 గ్రాండ్ స్లామ్ ట్రోఫీలతో స్టెఫీగ్రాఫ్ సరసన నిలిచిన నల్లకలువ, అమెరికా స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ ... తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. యూఎస్ ఓపెన్లో రెండో రౌండ్లో విజయం సాధించిన సెరెనా.. అత్యధికంగా 306 గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ మ్యాచ్ల్లో విజయం సాధించిన మార్టినా నవ్రతిలోవా రికార్డును ను సమం చేసింది. భారతకాలమానం ప్రకారం గురువారం ఆర్థర్ యాష్ స్టేడియంలో అర్దరాత్రి జరిగిన పోరులో సెరెనా 6-3, 6-3 తేడాతో తన సహచర అమెరికా క్రీడాకారిణి వెనియా కింగ్పై విజయం సాధించి మూడో రౌండ్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్లో 13 ఏస్లను సంధించిన సెరెనా, 38 విన్నర్స్ ను సొంతం చేసుకుని విజయం సాధించింది. ఆద్యంత దూకుడుగా ఆడిన సెరెనా ధాటికి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ సాధించిన వెనియా కింగ్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. తొలి సెట్ ను అవలీలగా గెలిచిన సెరెనా.. రెండో సెట్ లో కూడా అదే ఊపును కనబరిచి వరుస సెట్లలో పోరును ముగించింది. ఈ మ్యాచ్కు ముందు పదే పదే వర్షం ఆటంకం కల్గించడంతో స్టేడియంలో రూఫ్ను ఏర్పాటు చేయడం విశేషం. ఇప్పటివరకూ 17 సార్లు యూఎస్ ఓపెన్ లో పాల్గొన్న సెరెనాకు ఇలా రూఫ్ కింద ఆడటం, గెలవడం ఇదే తొలిసారి. ఇప్పటికే ఆరు యూఎస్ ఓపెన్ లు గెలిచిన సెరెనా.. ఏడో టైటిల్ పై కన్నేసింది. ఒకవేళ యూఎస్ గ్రాండ్ స్లామ్ ను సెరెనా సాధిస్తే ఓపెన్ ఎరాలో అత్యధిక టైటిల్స్ గెలిచిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టిస్తుంది.

ఆస్ట్రేలియా కబడ్డీ కోచ్‌గా శ్రీనివాస్ రెడ్డి

01/09/2016: సంగారెడ్డి: ఆస్టేల్రియా కబడ్డీ జట్టుకు తెలుగు వ్యక్తి కోచ్‌గా వ్యవహరించబోతున్నారు. మెదక్ జిల్లా ఉత్తర్‌పల్లికి చెందిన లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఈ అరుదైన ఘనతను దక్కించుకున్నారు. అక్టోబర్‌లో అహ్మదాబాద్‌లో జరిగే కబడ్డీ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు పొల్గొంటుంది. ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్‌‌స జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించిన శ్రీనివాస్ రెడ్డి గతంలో దక్షిణ కొరియా జట్టుకు కూడా అసిస్టెంట్ కోచ్‌గా పని చేశారు. ‘ఈ అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. మరో రెండు రోజుల్లో ఆస్ట్రేలియా వెళుతున్నాను. ఆ దేశంలో కబడ్డీకి ఆదరణ పెంచేందుకు కృషి చేస్తాను’ అని శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.

త్వరలో డివిలియర్స్ ఆటో బయోగ్రఫీ

01/09/2016: దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ జీవిత చరిత్ర త్వరలో పుస్తక రూపంలో రానుంది. చిన్నప్పుడు టెన్నిస్, రగ్బీ, హాకీ ఇలా అనేక క్రీడలు ఆడినా క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న డివిలియర్స్‌కు సంబంధించి ప్రపంచానికి తెలియని అనేక ఆసక్తికర విషయాలతో ఈ పుస్తకం సిద్ధం అవుతోంది. ‘ద స్టోరీ ఆఫ్ ఎ మోడ్రన్ స్పోర్టింగ్ ఫినామినా’ పేరుతో అక్టోబరులో ఇది మార్కెట్లోకి రానుంది.

సింధును సత్కరించిన ఢిల్లీ ప్రభుత్వం

01/09/2016: న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ పతక విజేతలు పి.వి.సింధు, సాక్షి మలిక్‌లను ఢిల్లీ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. బుధవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రజతం నెగ్గిన సింధుకు రూ. 2 కోట్లు, కాంస్యం సాధించిన సాక్షికి రూ. కోటి నజరానాను అందజేశారు. వారిద్దరి కోచ్‌లు గోపీచంద్, మన్‌దీప్ సింగ్‌లకు రూ. 5 లక్షల చొప్పున, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మానిక బాత్రా, అథ్లెట్ లలిత్ మాథూర్‌లకు రూ. 3 లక్షల చొప్పున బహూకరించారు. పతక విజేతల ఫిజియోలు సుబోధ్, కిరణ్‌లను కూడా సీఎం కేజ్రీవాల్ ఘనంగా సత్కరించారు. ‘ఇక్కడేం జరిగిందో తెలుసుకోడానికి రియోలో మా వద్ద ఫోన్లే లేవు. కానీ వచ్చాకే తెలిసింది. మ్యాచ్ జరుగుతున్నంత సేపు రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయని... ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయారని. ఇంతగా మమ్మల్ని ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు’ అని సింధు తెలిపింది. బ్యాడ్మింటన్ ఆటలోని గేమ్ ప్లాన్, వ్యూహాలపై పుస్తకం రాస్తానని కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తదితరులు పాల్గొన్నారు. ‘ఫైనల్’ వీక్షకులు 1.72 కోట్లు ముంబై: సింధు, మారిన్‌ల మధ్య రియోలో జరిగిన పసిడి పతక పోరును టీవీల్లో కోటి 72 లక్షల మంది వీక్షించినట్లు స్టార్ ఇండియా నెట్‌వర్క్ ఒక ప్రకటనలో తెలిపింది. స్టార్ ఇండియా యాప్ ‘హాట్‌స్టార్’లో 50 లక్షల మంది ఈ మ్యాచ్‌ను చూశారని ఆ సంస్థ వెల్లడించింది. భారత్‌లో ఆ రోజు మొత్తం టీవీ కార్యక్రమాల్లో ఇదే అత్యధిక వీక్షణ రికార్డని స్టార్ స్పోర్‌‌ట్స సీఈఓ నితిన్ కుక్రేజా పేర్కొన్నారు. ఒక క్రికెటేతర ఆటను ఈ స్థారుులో వీక్షించడం కూడా ఇదే తొలిసారని ఆయన చెప్పారు.

స్వర్ణం సాధించింది.. వెలుగునిచ్చింది!

01/09/2016: రియో ఒలింపిక్స్ లో దేశానికి రజత, కాంస్య పతకాలను సాధించారని పీవీ సింధు, రెజ్లర్ సాక్షి మాలిక్లపై రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత క్రీడా సంఘాలు నజరానాలు ప్రకటించాయి. వీరితో పాటు వీరి కోచ్, ఇతర సహాయక సిబ్బందికి కూడా ఆర్థిక ప్రోత్సాహకాలు మొదలయ్యాయి. ఇటీవల సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా దీపాకర్మాకర్, సాక్షి మాలిక్, పీవీ సింధు, ఆమె కోచ్ గోపీచంద్ కు బీఎండబ్ల్యూ కార్లు కూడా అందజేసి వారిని సన్మానించారు. అయితే కొన్ని దేశాల్లో పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. కెన్యా అథ్లెట్.. మిడిల్ డిస్టెన్స్ రన్నర్ ఫేత్ కిప్యేగాన్ విషయానికొస్తే ఆమె రియోలో స్వర్ణం సాధించడంతో పాటు తన గ్రామానికి వెలుగులు అందించింది. అదెలా అంటే.. రియోలో1500 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించి గ్రామాని తిరిగి వెళ్లిన ఆమెను అధికారులు కలిశారు. ఈ సందర్భంగా కిప్యేగాన్ అధికారులను ఓ విజ్ఞప్తి చేసింది. 'మా గ్రామానికి మూడున్నర దశాబ్దాలుగా విద్యుత్ సౌకర్యం లేదు. ఈ కారణం చేత నేను పాల్గొన్న ఈవెంట్ ను మా నాన్న టీవీలో చూడలేకపోయారు. దీంతో మరెన్నో సమస్యలను అధికారులకు, దేశాధ్యక్షుడు ఉహురు కెన్యాట్టా దృష్టికి తీసుకెళ్లాను' అని స్వర్ణ విజేత తెలిపింది. వెంటనే అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించి, కొన్ని రోజుల్లోనే అక్కడ విద్యుత్ కాంతులు నింపారు. కిప్యేగాన్ తండ్రి సామ్యూల్ కొయిచ్ కిప్యేగాన్ కూడా రియోకు ముందే కరెంట్ సరఫరా చేసి తన కూతురి రేస్ ను చూడాలని కోరారు. రియోలో కిప్యేగాన్ స్వర్ణాన్ని సాధించిన తర్వాత అధికారులు కేవలం 9 రోజుల్లోనే విద్యుత్ కాంతులతో కళకళలాడుతోంది. ఆమె విజయం కుటుంబానికే కాదు మొత్తం గ్రామానికి వెలుగులు నింపిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

లెక్క తప్పుతోంది! - ధోనికి దూరమవుతున్న ఫినిషింగ్ టచ్

01/09/2016: ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఫినిషర్ ఎవరు..? ఎలాంటి సందేహం లేకుండా ఈ ప్రశ్నకు వినిపించే సమాధానం ధోని. అతను క్రీజులో ఉన్నాడంటే భారత్‌కు విజయం ఖాయమనే ధీమా అందరిలోనూ ఉండేది. చివరి ఓవర్లో ఎన్ని పరుగులు అవసరమైనా... చివరికి రెండు బంతుల్లో 12 పరుగులు కావాలన్నా ధోని ఆడుతున్నాడంటే విజయం ఖాయమనే నమ్మకం ఉండేది. కానీ క్రమంగా ఆ నమ్మకం సన్నగిల్లుతోంది. అదృష్టాన్ని బ్యాగ్‌లో పెట్టుకుని తిరుగుతాడనే పేరున్న ధోనిని... ఇప్పుడు అదే అదృష్టం వెక్కిరిస్తోంది. ఇటీవల కాలంలో తరచుగా అతను ఆఖరి ఓవర్ల ‘మ్యాజిక్’ను మిస్ అవుతున్నాడు. తాజాగా అమెరికాలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో ఆఖరి బంతికి విజయానికి కావాల్సిన రెండు పరుగులను చేయలేక అవుటయ్యాడు. ఎందుకిలా..? రెండో ఎండ్‌లో క్రీజులో ఎంత పేరున్న బ్యాట్స్‌మన్ అరుునా... ధోని సింగిల్స్ తీయకుండా భారీ షాట్‌లతో మ్యాచ్‌లు ముగించడం చాలాసార్లు చూశాం. రెండేళ్ల క్రితం ఇంగ్లండ్‌లో జరిగిన టి20లో రెండో ఎండ్‌లో అంబటి రాయుడు రూపంలో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ ఉన్నా ధోని కనీసం సింగిల్స్ తీయకుండా ఒక్కడే మ్యాచ్‌ను ముగించే ప్రయత్నం చేశాడు. ధోని గత చరిత్ర తెలిసిన వాళ్లకు ఇది కొత్తగా అనిపించలేదు. గతంలో ఇదే తరహాలో మ్యాచ్‌లు గెలిపించినందున... ఒక్క మ్యాచ్ ఓడిపోతే విమర్శలు చేయడం కరెక్ట్ కాదని అందరూ సరిపెట్టుకున్నారు. తర్వాత కాస్త తడబడ్డా మళ్లీ ఈ ఏడాది ఐపీఎల్‌లో వైజాగ్‌లో జరిగిన మ్యాచ్‌లో ధోని చివరి ఓవర్లో తన విశ్వరూపం చూపించాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో చివరి ఓవర్లో విజయానికి 23 పరుగులు అవసరం కాగా... ఒక్కడే బాదేశాడు. ముఖ్యంగా చివరి మూడు బంతులకు 16 పరుగులు అవసరం కాగా... అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఫోర్, సిక్సర్, సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. రెండు నెలల క్రితం జింబాబ్వే సిరీస్‌లో ఆఖరి ఓవర్లో విజయానికి 8 పరుగులు అవసరం కాగా... ధోని క్రీజులో ఉన్నా భారత్ ఓడిపోరుుంది. చివరి బంతికి ఫోర్ కొడితే గెలిచే స్థితిలో ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు. తాజాగా వెస్టిండీస్‌తో టి20 మ్యాచ్‌లో 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ విజయానికి చివరి ఓవర్లో 8 పరుగులు అవసరం అయ్యారుు. ఇంత భారీ స్కోర్ల మ్యాచ్‌లో ఎనిమిది పరుగులు విషయమే కాదు. రెండో ఎండ్‌లో కేఎల్ రాహుల్ అప్పటికే సెంచరీ చేసి సంచలనాత్మకంగా హిట్టింగ్ చేస్తున్నాడు. కాబట్టి ధోని రెండో ఎండ్‌లో ఉన్న రాహుల్‌ను నమ్ముకోవచ్చు. అరుుతే వెస్టిండీస్ బౌలర్ బ్రేవో చాలా తెలివిగా వ్యవహరించాడు. ధోనితో కలిసి చెన్నై తరఫున ఆడిన బ్రేవోకు భారత కెప్టెన్ ఏం చేస్తాడో తెలుసు. ఇలాంటి ఓవర్లలో సహజంగా తొలి బంతిని బౌండరీకి పంపి బౌలర్‌పై ఒత్తిడి పెంచుతాడు. కాబట్టి బ్రేవో తెలివిగా వ్యవహరించడం తొలి నాలుగు బంతులకు నాలుగు సింగిల్స్ మాత్రమే వచ్చారుు. చివరి రెండు బంతుల్లో విజయానికి నాలుగు పరుగులు అవసరం కాగా.. ఐదో బంతికి రెండు పరుగుల తీసి, ఆఖరి బంతికి భారత కెప్టెన్ అవుటయ్యాడు. తన జీవితంలోనే మరచిపోలేని ఇన్నింగ్‌‌స ఆడి సెంచరీ చేసిన రాహుల్ ఆ క్షణంలో పడిన బాధను చూస్తే... ధోని కూడా కచ్చితంగా ఫీలయ్యే ఉంటాడు. బౌలర్లు హోమ్‌వర్క్ చేస్తున్నారు ధోని మంచి ఫినిషర్ అని ప్రపంచంలో ఉన్న బౌలర్లందరికీ తెలుసు. బంతి వేసేది తెలివైన బౌలర్ అరుుతే ధోనిని నియంత్రించవచ్చని గతేడాది దక్షిణాఫ్రికా బౌలర్ రబడ ప్రపంచానికి చూపించాడు. కాన్పూర్‌లో జరిగిన వన్డేలో ఆఖరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా... రబడ భారత్ విజయాన్ని అడ్డుకున్నాడు. ధోని కదలికలను బట్టి బంతుల్లో వైవిధ్యం చూపించాడు. ఈసారి వెస్టిండీస్ బౌలర్ బ్రేవో కూడా అదే చేశాడు. ధోని క్రీజులో కదులుతున్న విషయాన్ని గమనించి స్లో బంతితో బోల్తా కొట్టించాడు. అంటే... అన్ని జట్ల బౌలర్లు హోమ్ వర్క్ చేసే బరిలోకి దిగుతున్నారు. విశ్రాంతి వల్ల ఇబ్బందా? ధోని కెరీర్ ఆరంభం నుంచి ఎప్పుడూ సుదీర్ఘంగా విశ్రాంతి తీసుకోలేదు. అన్ని ఫార్మాట్లలోనూ అలుపెరగకుండా ఆడాడు. దీంతో ఎప్పుడూ ‘టచ్’ కోల్పోలేదు. కానీ ఇప్పుడు ధోని టెస్టులు ఆడటం లేదు. కేవలం వన్డేలు, టి20లకు పరిమితమయ్యాడు. వాస్తవానికి జింబాబ్వే పర్యటన తర్వాత భారత్‌కు అన్నీ టెస్టు మ్యాచ్‌లే ఉన్నారుు. అనుకోకుండా అమెరికాలో రెండు టి20లు ఆడాల్సి రావడం వల్ల ధోని వచ్చాడు. లేదంటే దాదాపు మరో రెండు మూడు నెలలు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగానే ఉండేవాడు. ఎంత ప్రాక్టీస్ చేసినా, ఎంత ఫిట్‌నెస్ కోసం శ్రమించినా మ్యాచ్ ప్రాక్టీస్ ఉన్న ఆటగాళ్లే మెరుగ్గా రాణిస్తారనేది ఎవరూ కాదనలేని వాస్తవం. దీనిని ధోని ఎలా అధిగమిస్తాడో చూడాలి. ఆర్డర్ మారడం మేలేమో..! ప్రస్తుతం జరుగుతున్న చర్చలు, అంచనాల ప్రకారం ధోని ఇంగ్లండ్‌లో వన్డే ప్రపంచకప్ (2019) వరకు కొనసాగాలని అనుకుంటున్నాడు. గతంతో పోలిస్తే ధోనిలో ఫినిషింగ్ పవర్, భారీ హిట్టింగ్ పవర్ తగ్గిందనేదీ వాస్తవం. ఈ నేపథ్యంలో మరో మూడేళ్లు క్రికెట్ ఆడాలంటే ధోని బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకోవడం మేలు. ఆఖరి ఓవర్లలో హిట్టింగ్ చేయగల ఆటగాడిని చూసుకుని ధోని మిడిలార్డర్‌లో నాలుగు, ఐదు స్థానాల్లో ఆడటం వల్ల క్రీజులో కుదురుకోవడానికి సమయం దొరుకుతుంది. వెస్టిండీస్‌తో ఆఖరి బంతికి అవుటైనా ఆ మ్యాచ్‌లో ధోని బాగా ఆడాడు. ఒక్క మ్యాచ్ ఓడినంత మాత్రాన ధోనిని విమర్శించడం కరెక్ట్ కాదు. కానీ గతంలోలాగా ఆఖరి ఓవర్లలో ఒక్కడే షో చేయడం ఇకపై సాధ్యం కాకపోవచ్చు. అదృష్టం కూడా ప్రతిసారీ వెంట ఉండదు. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకుని మార్పులు, చేర్పులు చేసుకుంటే భారత క్రికెట్‌కు మంచి జరుగుతుంది.

రాష్ట్రపతి భవన్‌లో ‘స్పోర్ట్స్ డే’ అవార్డుల ప్రదానం - ఖేల్‌రత్న అందుకున్న సింధు, సాక్షి, దీప, జీతూరాయ్

30/08/2016: న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో భారత్ పరువు నిలబెట్టిన క్రీడారత్నాలకు జాతీయ క్రీడాదినోత్సవాన ఘనంగా సత్కారం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఏడాది ముగ్గురు మహిళలకు రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు దక్కింది. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగిన క్రీడాపురస్కారాల వేడుకలో తెలుగమ్మాయి పి.వి. సింధుతో పాటు రెజ్లర్ సాక్షి మలిక్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్... రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. షూటర్ జీతూరాయ్ కూడా ఈ అవార్డు అందుకున్నాడు. ఇలా ఒకే ఏడాది నలుగురు క్రీడాకారులకు అత్యున్నత క్రీడాపురస్కారం ఇవ్వడం కూడా ఇదే మొదటిసారి. గతంలో బాక్సర్లు విజేందర్ సింగ్, మేరీకోమ్, రెజ్లర్ సుశీల్ కుమార్‌లకు 2009లో రాజీవ్ ఖేల్త్న్ర అందజేశారు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని ప్రతియేటా ఆగస్టు 29న క్రీడాదినోత్సవాన్ని నిర్వహించే సంగతి తెలిసిందే. రియోలో బ్యాడ్మింటన్ సంచలనం పి.వి.సింధు రజతం, రెజ్లింగ్‌లో సాక్షి కాంస్యం గెలిచారు. ఇక దీప జిమ్నాస్టిక్స్‌లో అసాధారణ విన్యాసంతో ఆకట్టుకుంది. తృటిలో కాంస్యం చేజారినా.. ఆమె చేసిన ప్రాణాంతక ప్రొడునోవా విన్యాసానికి గొప్ప గౌరవం లభించింది. ‘ఖేల్త్న్ర’ అవార్డులో భాగంగా పతకంతో పాటు రూ. 7.5 లక్షల నగదు, సర్టిఫికెట్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందజేశారు. మరో 15 మంది క్రీడాకారులు అర్జున అవార్డులు స్వీకరించారు. ఆరుగురు కోచ్‌లు ద్రోణాచార్య అవార్డు అందుకున్నారు. క్రీడల్లో ప్రతిభకు పదునుపెడుతున్న పలు సంస్థలకు ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్’ అవార్డులు ఇచ్చారు. పర్వతారోహకుడు, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) ఇన్‌స్పెక్టర్ జనరల్ హర్భజన్ సింగ్‌కు ‘టెన్సింగ్ నార్కే నేషనల్ అడ్వెంచర్’ అవార్డు లభించింది. అర్జున అవార్డును అందుకోవాల్సిన క్రికెటర్ రహానే అందుబాటులో లేకపోవడం వల్ల కార్యక్రమానికి రాలేదు. తెలుగు వెలుగులు ఈ సారి జాతీయ క్రీడాదినోత్సవ వేదికపై తెలుగువారికి చక్కని గుర్తింపు లభించింది. బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు అత్యున్నత క్రీడాపురస్కారం అందుకుంటే... అథ్లెటిక్స్‌లో అంతర్జాతీయ స్థారుులో పోటీపడే అథ్లెట్లను తయారు చేస్తున్న సీనియర్ కోచ్ నాగపురి రమేశ్‌కు ద్రోణాచార్య అవార్డు లభించింది. మాజీ అథ్లెట్ సత్తి గీత ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకుంది. అవార్డు గ్రహీతలు రాజీవ్ ఖేల్త్న్ర (పతకం, రూ. 7.5 లక్షలు): పి.వి.సింధు (బ్యాడ్మింటన్), సాక్షి మలిక్ (రెజ్లింగ్), దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్), జీతూరాయ్ (షూటింగ్). ద్రోణాచార్య (ట్రోఫీ, రూ. 7 లక్షలు): నాగపురి రమేశ్ (అథ్లెటిక్స్), రాజ్ కుమార్‌శర్మ (క్రికెట్‌లో కోహ్లి కోచ్), విశ్వేశ్వర్‌నంది (జిమ్నాస్టిక్స్‌లో దీప కోచ్), ప్రదీప్ కుమార్ (స్విమ్మింగ్), సాగర్‌మల్ దయాల్ (బాక్సింగ్), మహావీర్ సింగ్ (రెజ్లింగ్). అర్జున అవార్డు (ట్రోఫీ, రూ. 5 లక్షలు): రజత్ చౌహాన్ (ఆర్చరీ), లలితా బబర్ (అథ్లెటిక్స్), సౌరవ్ కొఠారి (బిలియర్డ్స్, స్నూకర్), శివ థాపా (బాక్సింగ్), సుబ్రతా పాల్ (ఫుట్‌బాల్), రాణి రాంపాల్, రఘునాథ్ (హాకీ), గుర్‌ప్రీత్‌సింగ్, అపూర్వి చండీలా (షూటింగ్), సౌమ్యజిత్ ఘోష్ (టేబుల్ టెన్నిస్), వినేశ్ ఫోగట్, అమిత్ కుమార్, వీరేందర్ సింగ్ (రెజ్లింగ్), సందీప్ సింగ్ మన్ (పారా అథ్లెటిక్స్). ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ (మెమెంటో, రూ. 5 లక్షలు): సత్తి గీత (అథ్లెటిక్స్), సిల్వనుస్ డుంగ్ డుంగ్ (హాకీ), రాజేంద్ర ప్రహ్లాద్ షిల్కే (రోరుుంగ్). రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్: యువ ప్రతిభావంతులను ప్రోత్సహించిన కేటగిరీ: హాకీ సిటిజన్ గ్రూప్, దాదర్ పార్సి జొరాస్ట్రియన్ క్రికెట్ క్లబ్, ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్; కార్పొరేట్ సామాజిక బాధ్యత కేటగిరీ: ఇండియా ఇన్‌ఫ్రాస్టక్చ్రర్ ఫైనాన్‌‌స కార్పొరేట్ లిమిటెడ్; క్రీడాకారులకు ఉద్యోగం, సంక్షేమ కేటగిరీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రీడాభివృద్ధి కేటగిరీ: సుబ్రతో ముఖర్జీ స్పోర్‌‌ట్స ఎడ్యుకేషన్ సొసైటీ. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీ: పంజాబ్ యూనివర్సిటీ వీల్‌చెయిర్‌లో... రియో ఒలింపిక్స్‌లో గాయపడిన రెజ్లర్ వినేశ్ ఫోగట్ అర్జున అవార్డును అందుకుంది. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో... వీల్ చెయిర్‌లో వచ్చి పురస్కారం అందుకుంది.

కమాండెంట్ సింధు... - బ్యాడ్మింటన్ స్టార్‌కు సీఆర్‌పీఎఫ్ గౌరవం!

30/08/2016: న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు మరో గౌరవం లభించనుంది. ఈ హైదరాబాద్ అమ్మారుుకి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) కమాండెంట్ గౌరవ హోదా ఇవ్వనుంది. దాంతోపాటు ఆమెను సీఆర్‌పీఎఫ్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించనుంది. ఈ మేరకు సీఆర్‌పీఎఫ్ హోం మంత్రిత్వశాఖకు తమ ప్రతిపాదనలు పంపించింది. లాంఛనాలు పూర్తయ్యాక అధికారిక కార్యక్రమం ఏర్పాటు చేసి సీఆర్‌పీఎఫ్ ఈ నియామక ప్రకటన చేయనుంది. ఈ మేరకు సింధుకు కూడా సమాచారం అందించినట్లు సీఆర్‌పీఎఫ్ వర్గాలు తెలిపాయి. సీఆర్‌పీఎఫ్‌లో కమాండెంట్ ర్యాంక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (ఎస్పీ)తో సమానం. సీఆర్‌పీఎఫ్‌లో కమాండెంట్ ర్యాంక్ ఉన్న వారు వెయ్యిమందితో కూడిన దళానికి నాయకుడిగా ఉంటారు.

యోగేశ్వర్ దత్కు ఒలింపిక్స్ రజత పతకం!

30/08/2016: తాజాగా జరిగిన రియో ఒలింపిక్స్ లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే ఇంటిబాట పట్టిన భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్కు కాస్త ఊరట లభించనుంది. అదేంటీ.. పతకం ఓడిన వ్యక్తికి లాభించే అంశం ఏమిటని ఆలోచిస్తున్నారా..! లండన్ ఒలింపిక్స్లో 60 కేజీ ఫ్రీస్టైల్ విభాగంలో బరిలోకి దిగన యోగేశ్వర్ కాంస్య పతకాన్ని 'పట్టు'కొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ఒలింపిక్స లో రజతం సాధించిన రష్యా రెజ్లర్ బేసిక్ కుదుఖోవ్ శాంపిల్స్ పై తాజాగా జరిపిన డోప్ టెస్టుల్లో అతడి శాంపిల్స్ పాజిటీవ్ అని తేలింది. ఇప్పటివరకూ అధికారికంగా ఈ విషయంపై ఎలాంటి ప్రటకన వెలువడలేదు. 2013లో జరిగిన రోడ్డుప్రమాదంలో కుదుస్కోవ్ మరణించిన విషయం తెలిసిందే. అత్యాధునిక టెక్నాలజీ గత ఒలింపిక్స్ వరకూ లేని కారణంగా దాదాపు అన్ని దేశాల అథ్లెట్ల శాంపిల్స్ పై తాజాగా టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ జరిపిన టెస్టుల్లో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లుగా తేలింది. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన తమ అథ్లెట్ కుదుఖోవ్ డోపింగ్ టెస్టుల్లో విఫలమవడంతో రష్యా అధికారులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. కుదుఖోవ్ తో పాటు ఉజ్బెకిస్తాన్ కు చెందిన రెజ్లర్ తేమజోవ్(120కేజీ) కూడా పాజిటీవ్ అని తేలింది. తేమజోవ్ బీజింగ్ ఒలింపిక్స్ లో స్వర్ణపతకం సాధించాడు. వాడా టెస్టుల ఫలితాలపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయం వెల్లడిస్తే వారి పతకాలు వెనక్కి తీసుకుంటారు. దీంతో లండన్ లో కాంస్యంతో మెరిసిన యోగేశ్వర్ రజత పతక విజేతగా మారి ఆ ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన సుశీల్ కుమార్ సరసన నిలవనున్నాడని అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధికారి ఒకరు వెల్లడించారు.

ఇంతకంటే ఘోరమైన స్థితిలో ఆడాం! - రెండో మ్యాచ్ రద్దుపై ధోని వ్యాఖ్య

30/08/2016: లాడర్‌హిల్ (ఫ్లోరిడా): సిరీస్ సమం చేసే అవకాశం ముందుండగా, వర్షం కారణంగా రెండో టి20 మ్యాచ్ రద్దు కావడం భారత కెప్టెన్ ధోనిని అసహనానికి గురి చేసింది. ఆట కొనసాగించి ఉండాల్సిందని అతను అభిప్రాయ పడ్డాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియా సమావేశంలో ముందుగా విండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్ మాట్లాడుతూ ‘పెవిలియన్‌నుంచి చూస్తే రెండు మూడు చోట్ల మైదానం ప్రమాదకరంగా కనిపించింది. ముఖ్యంగా రనప్ ఏరియా వద్ద పరుగెత్తి బౌలింగ్ చేయడం చాలా కష్టం. అవుట్‌ఫీల్డ్‌లో కూడా బంతి కోసం పరుగెత్తి ఆటగాడు జారి పడితే అతని కెరీర్ ముగిసిపోవచ్చు. అంపైర్లు సరైన నిర్ణయం తీసుకున్నారు‘ అని అన్నాడు. అయితే దీనితో ధోని విభేదించాడు. ‘పదేళ్లుగా ఇంతకంటే ఘోరమైన పరిస్థితుల్లో కూడా మైదానంలోకి దిగి మ్యాచ్‌లు ఆడాం. 2011 ఇంగ్లండ్ సిరీస్ అయితే మొత్తం వర్షంలోనే సాగింది. అయినా నీళ్లు నిలిచిన ప్రాంతం రనప్ ఏరియాకు చాలా దూరం ఉంది. మరీ అంత దూరంనుంచి పరుగెత్తుకు రావడానికి వారి జట్టులో షోయబ్ అక్తర్ లేడు. కాబట్టి అదేమీ పెద్ద సమస్య కాదు. కాకపోతే అంపైర్ల నిర్ణయాన్ని గౌరవించాల్సి వచ్చింది‘ అని అతను వ్యాఖ్యానించాడు. మరో వైపు రాబోయే రోజుల్లో సొంతగడ్డపైనే వరుసగా 13 టెస్టులు ఆడనున్న భారత జట్టు నంబర్‌వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకుంటుందని ధోని ఆశాభావం వ్యక్తం చేశాడు.

జాతీయ క్రీడా అవార్డు విజేతలకు ప్రధాని ఆతిథ్యం - నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం

29/08/2016: న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ విజేతలు పీవీ సింధు, సాక్షి మలిక్‌లతో పాటు జాతీయ క్రీడా పురస్కారాలు పొందిన అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక నివాసం 7, రేస్ కోర్స్ రోడ్‌లో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా సింధు, సాక్షి తాము సాధించిన పతకాలను ఆయనకు చూపించారు. నేడు (సోమవారం) జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా సింధు, సాక్షి, దీప, జీతూ రాయ్‌లు రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర పురస్కారాన్ని అందుకోనున్నారు. అలాగే అర్జున, ద్రోణాచార్య, మేజర్ ధ్యాన్‌చంద్ జీవిత సాఫల్య పురస్కారాలు ఆయా ఆటగాళ్లు స్వీకరించనున్నారు. ‘ప్రధానికి నా రజత పతకాన్ని చూపించాను. దేశం గర్వించదగ్గ స్థాయిలో చాలా బాగా ఆడావు అని ప్రశంసించారు. ఆయనతో సంభాషణ చాలా సంతోషాన్నిచ్చింది’ అని సింధు తెలిపింది. సాక్షి కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ‘నన్ను కొట్టవు కదా’ అని ప్రధాని సరదాగా అన్నట్టు తెలిపింది. రియో ఒలింపిక్స్‌లో దేశ గౌరవాన్ని కాపాడింది మన అమ్మాయిలేనని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. ఈ సందర్భంగా తన ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో ఆయన వీరిని ప్రశంసించారు. ‘మనకు వచ్చిన రెండు పతకాలు ఈ దేశ పుత్రికలు సాధించినవే. ఏ విషయంలోనూ తాము తక్కువ కాదని వారు మరోసారి నిరూపించుకున్నారు. ఉత్తర, దక్షిణ, ఈశాన్య భారతానికి చెందిన ఈ ముగ్గురు మనందరినీ గర్వపడేలా చేశారు. తమ పిల్లలను ఏదో ఒక ఉద్యోగంలో చేరేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ క్రీడలతో సమయం వృథాగా భావిస్తారు. కానీ ఇప్పుడు వారి ఆలోచనాసరళిని మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది’ అని ప్రధాని అన్నారు. ప్రతీ రాష్ట్రం ఏదేని రెండు క్రీడలపై ఫోకస్ పెట్టాలని, క్రీడల అభివృద్ధికి ఓ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. భవిష్యత్‌లో ఆటగాళ్ల ప్రదర్శన మెరుగుపడేందుకు ఇప్పటికే తాము టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మరోవైపు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్‌ను గుర్తుచేసుకున్నారు. క్రీడా స్ఫూర్తి, దేశ భక్తికి ఆయన నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు.

వానొచ్చె... మ్యాచ్ పోయె... - వర్షంతో రెండో టి20 రద్దు - సిరీస్ 1-0తో విండీస్ కైవసం

29/08/2016: తొలి మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో ఓడిన భారత జట్టుకు సిరీస్ సమం చేసేందుకు వచ్చిన అవకాశాన్ని వరుణుడు అడ్డుకున్నాడు. చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే అవుట్ చేసిన ఆనందం అంతా రెండో ఇన్నింగ్స్ ఆరంభం కాగానే ‘నీరు’గారిపోయింది. గెలిచేందుకు అవకాశం ఉన్న మ్యాచ్ వర్షార్పణం కావడంతో టీమిండియాకు నిరాశే ఎదురైంది. సిరీస్ కోల్పోవడంతో పాటు ర్యాంకింగ్స్‌లో కూడా మన జట్టు ఒక మెట్టు దిగజారనుండగా... అభిమానులకూ అమెరికాలో ఆట చూసిన ఆనందం ఒక్క మ్యాచ్‌కే పరిమితమైంది. లాడర్‌హిల్ (ఫ్లోరిడా): భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఆదివారం రెండో టి20 మ్యాచ్ వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దయింది. 144 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 2 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 15 పరుగులు చేసిన దశలో వాన పడింది. దాంతో దాదాపు గంటకు పైగా మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో పాటు సూపర్ సాపర్లు కూడా అందుబాటులో లేకపోవడంతో అవుట్‌ఫీల్డ్ మొత్తం నీటితో నిండిపోయింది. వర్షం ఆగిపోయిన తర్వాత అంపైర్లు మైదానాన్ని పరిశీలించారు. ఎక్కువ భాగం పొడిగా మారినా... పిచ్ సమీపంలో, 30 గజాల వృత్తం లోపల నీరు అలాగే ఉండిపోయింది. దీని వల్ల ఆటగాళ్లకు ప్రమాదమని తేల్చిన అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్ ఆరంభానికి ముందు సాంకేతిక కారణాలతో 40 నిమిషాలు ఆలస్యం కావడం కూడా చివరికి ప్రభావం చూపించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 19.4 ఓవర్లలో 143 పరుగులకే ఆలౌటైంది. జాన్సన్ చార్లెస్ (25 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్సర్లు ) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అమిత్ మిశ్రా 3 వికెట్లు పడగొట్టగా, అశ్విన్, బుమ్రా, షమీ తలా 2 వికెట్లు తీశారు. తొలి మ్యాచ్‌ను నెగ్గిన విండీస్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో సొంతం చేసుకుంది. చార్లెస్ మినహా... 24 గంటల్లోనే ఎంత మార్పు... అడ్డూ అదుపు లేకుండా పరుగుల వరద పారించిన మైదానంలోనే విండీస్ బ్యాట్స్‌మెన్ షాట్లు కొట్టలేక అల్లాడిపోయారు. ముందు రోజు లెక్కకు మిక్కిలి పరుగులిచ్చేసిన మన బౌలర్లు ఈసారి అద్భుత బంతులు వేసి పొదుపు పాటించారు! గత మ్యాచ్ హీరో లూయీస్ (7)ను షమీ చక్కటి బంతితో అవుట్ చేసి జట్టుకు శుభారంభం అందించగా, మరో ఓపెనర్ చార్లెస్ మాత్రం ధాటిని ప్రదర్శించాడు. షమీ ఓవర్లో అతను వరుస బంతుల్లో సిక్స్, రెండు ఫోర్లు బాది మొత్తం 15 పరుగులు రాబట్టాడు. అయితే మిశ్రా తన తొలి బంతికే చార్లెస్‌ను వెనక్కి పంపడంతో విండీస్ పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత ఒక్కరు కూడా క్రీజ్‌లో నిలబడలేకపోయారు. అశ్విన్, జడేజా బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్ పరుగులు తీయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అశ్విన్ వైడ్ బంతిని ఆడబోయి సిమన్స్ (19) స్టంపౌట్ కాగా... తర్వాతి ఓవర్లో శామ్యూల్స్ (5) వెనుదిరిగాడు. అనంతరం వరుస ఓవర్లలో పొలార్డ్ (13), ఫ్లెచర్ (3) కూడా అవుటయ్యారు. బ్రేవో (3), బ్రాత్‌వైట్ (18)లను మిశ్రా డగౌట్ చేర్చగా, రసెల్ (13)ను భువీ అవుట్ చేశాడు. రెండో టి20 కోసం భారత్ బిన్నీ స్థానంలో మిశ్రాకు తుది జట్టులో చోటివ్వగా, విండీస్ మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: చార్లెస్ (సి) రహానే (బి) మిశ్రా 43; లూయీస్ (సి) మిశ్రా (బి) షమీ 7; శామ్యూల్స్ (సి) ధోని (బి) బుమ్రా 5; సిమన్స్ (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 19; ఫ్లెచర్ (బి) బుమ్రా 3; పొ లార్డ్ (ఎల్బీ) (బి) అశ్విన్ 13; రసెల్ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 13; బ్రేవో (బి) మిశ్రా 3; బ్రాత్‌వైట్ (బి) మిశ్రా 18; నరైన్ (నాటౌట్) 9; బద్రీ (బి) షమీ 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 143. వికెట్ల పతనం: 1-24; 2-50; 3-76; 4-76; 5-92; 6-98; 7-111; 8-123; 9-133; 10-143. బౌలింగ్: భువనేశ్వర్ 4-0-36-1; షమీ 2.4-0-31-2; మిశ్రా 4-0-24-3; జడేజా 2-0-11-0; అశ్విన్ 3-0-11-2; బుమ్రా 4-0-26-2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (నాటౌట్) 10; రహానే (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 15. బౌలింగ్: రసెల్ 1-0-7-0; బద్రీ 1-0-7-0.

అతడిని తీసుకుని రిస్క్ చేశాం - ధోని

29/08/2016: లాడర్హిల్: వెస్టిండీస్ తో జరిగిన రెండో టి20లో అమిత్ మిశ్రాను తీసుకుని రిస్క్ చేశామని టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని అన్నాడు. అమిత్ మిశ్రా ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఆదివారం జరిగిన రెండో టి20 వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని మాట్లాడుతూ.. ‘మా బౌలర్లు మంచి ప్రదర్శన చేశారు. 150 ఛేదించదగిన స్కోరు. అయితే మేమే గెలుస్తామని కచ్చితంగా చెప్పలేను. మా బ్యాటింగ్ బలంగా ఉంది. బిన్నీ స్థానంలో అమిత్ మిశ్రాను తీసుకుని కొద్దిగా రిస్క్ చేశాం. ఎందుకంటే మాకు ఒక బ్యాట్స్మన్ తగ్గుతాడు. అయితే ఈ వికెట్ కు లెగ్ స్పిన్నర్ అవసరమని భావించి అమిత్ మిశ్రాను తీసుకున్నాం. అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అశ్విన్ నుంచి అతడికి మంచి సహకారం లభించింది. ఇద్దరూ మంచి ప్రదర్శన చేశారు. అమెరికాలో మరిన్ని మ్యాచ్ లు నిర్వహించాలని కోరుకుంటున్నాన’ని చెప్పాడు.

నన్ను గానీ కొట్టవు కదా - నరేంద్ర మోదీ

29/08/2016: న్యూఢిల్లీ : సాక్షి మాలిక్ రియో ఒలింపిక్స్‌లో దేశానికి తొలి పతకం అందించినప్పటి నుంచి ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్న మాటలను మాత్రం తాను మర్చిపోలేనని సాక్షి అంటోంది. సోమవారం రాష్ట్రపతి చేతుల మీదుగా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అందుకోవడానికి ఒక్క రోజు ముందు.. ఆమె ప్రధానమంత్రి నరేంద్రమోదీని కూడా కలిసింది. అప్పుడాయన.. ''ఇప్పుడు నన్ను గానీ కొట్టవు కదా'' అని సరదాగా అన్నారట. ఈ విషయాన్ని బయటకు వచ్చిన తర్వాత సాక్షి మాలిక్ మీడియాకు చెప్పింది. ప్రధాని మీతో ఏం మాట్లాడారని అడిగినప్పుడు ఈ విషయం వెల్లడించింది. అప్పుడు మీ సమాధానం ఏంటని అడిగితే.. ''సర్, నేను మ్యాట్ మీద ఉన్నప్పుడు మాత్రమే రెజ్లర్‌ని. బయటకు వచ్చాక మామూలు ఆడపిల్లనే'' అని సమాధానం ఇచ్చినట్లు తెలిపింది.

ప్రమోషన్కు సైతం నర్సింగ్ దూరం

27/08/2016: న్యూఢిల్లీ: ఇటీవల కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తీర్పుతో రియో ఒలింపిక్స్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్.. ఇప్పుడు ఆ గేమ్ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనే అంశంపై కూడా సందిగ్ధత నెలకొంది. మరో నాలుగు నెలల్లో భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్యూఎఫ్ఐ) ఆధ్వర్యంలో విశ్వవిజేత గామా రెజ్లింగ్ పేరుతో కొత్తగా నిర్వహించదలచిన వరల్డ్ కప్ పోటీల ప్రమోషన్ కార్యక్రమాలకు నర్సింగ్ దూరం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయాన్ని తాజాగా బ్యూఎఫ్ఐ సెక్రటరీ టీఎన్ ప్రసూద్ ధృవీకరించారు. కోర్టు తీర్పుతో నర్సింగ్ యాదవ్ భవిష్యత్ అంధకారంలో పడిందన్న ప్రసూద్.. ఇక నుంచి గేమ్స్ ప్రమోషన్ కార్యక్రమాలకు సైతం ఆ రెజ్లర్ దూరం అయ్యే అవకాశం ఉందన్నారు. అయితే నర్సింగ్ యాదవ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చా? లేదా అనేది దానిపై వాడా(వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) నుంచి క్లియరెన్స్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ' ఈ పోటీల్లో నర్సింగ్ యాదవ్ పాల్గొనడం లేదనేది కోర్టు తీర్పును బట్టి మనకు తెలుసు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ గేమ్స్ ప్రమోషన్లో కూడా నర్సింగ్ పాల్గొనకపోతే ఆ స్టేజ్కు అందం ఉండదు. ఈ ఈవెంట్ కు సంబంధించి అత్యధిక శాతం క్వాలిఫికేషన్ పోటీలు మహారాష్ట్రలో జరుగనున్నాయి. మహారాష్ట్ర రెజ్లర్ అయిన నర్సింగ్ యాదవ్ కనీసం ప్రమోషన్ లోనైనా ఉంటే ఈ పోటీలకు కొంత ఊపు వస్తుంది. దీనిపై వాడాను ఆశ్రయించాల్సిన అవసరం ఉంది' టీఎన్ ప్రసూద్ తెలిపారు.

యూరోప్ అత్యుత్తమ ఫుట్‌బాలర్‌గా రొనాల్డో

27/08/2016: యూరోప్ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (యూఈఎఫ్‌ఏ) ఉత్తమ ఆటగాడిగా స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఎంపికయ్యాడు. తాజా సీజన్‌లో చాంపియన్‌‌స లీగ్ టైటిల్ గెలుచుకున్న రియల్ మాడ్రిడ్, యూరో కప్ గెలుచున్న పోర్చుగల్ జట్లలో 31 ఏళ్ల రొనాల్డో సభ్యుడు కావడం విశేషం. ఈ రెండు టోర్నీ విజయాల్లో కీలక పాత్ర పోషించినందుకు ఈ అవార్డు దక్కింది. యూఈఎఫ్‌ఏలోని 55 సభ్య దేశాలకు చెందిన జర్నలిస్ట్‌లు ఓటింగ్‌లో పాల్గొని రొనాల్టోను అవార్డుకు ఎంపిక చేశారు. 2013-14 సీజన్‌లో కూడా అతనికి ఈ అవార్డు దక్కింది.

నేడు వెస్టిండీస్‌తో తొలి టి20 - ఉత్సాహంగా ధోని సేన

27/08/2016: దాదాపు ఐదు నెలల క్రితం ‘సొంతగడ్డపై భారత జట్టు టి20 ప్రపంచ కప్ గెలుచుకోవడం ఖాయం’ అని అభిమానులు ఆశలు పెట్టుకున్న స్థితిలో సెమీఫైనల్లో వెస్టిండీస్ చావుదెబ్బ కొట్టింది. 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడమే బాధ కలిగిస్తే... రెండు నోబాల్స్ కారణంగా వారికి అవకాశం లభించడం పుండు మీద కారం చల్లినట్లుగా అనిపించింది. నాటి మ్యాచ్ తర్వాత ఇరు జట్లు ఇప్పుడు మరోసారి పొట్టి ఫార్మాట్‌లో పోరుకు సిద్ధం అయ్యారుు. రెండు జట్లలోనూ ఆ మ్యాచ్‌లో ఆడిన చాలా మంది ఆటగాళ్లు బరిలో ఉన్నారు. గత మ్యాచ్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ ఆశిస్తుండగా... ప్రపంచ చాంపియన్ హోదాలో తమ ఆధిపత్యం నిలబెట్టుకోవాలని విండీస్ భావిస్తోంది. అన్నింటికి మించి తొలిసారి అమెరికాలో భారత స్టార్ క్రికెటర్లు ఆడబోతుండటం ఒక్కసారిగా టి20 సిరీస్‌కు కొత్త ఆకర్షణ తెచ్చి పెట్టింది. గావస్కర్ కాలంనుంచి సచిన్ వరకు ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు చూడటంతోనే సంతృప్తి చెందిన అమెరికన్ భారతీయులకు ఇప్పుడు అసలైన ఇండియన్ ఇంటర్నేషనల్ మ్యాచ్ మజా దక్కనుంది. లాడర్‌హిల్ (ఫ్లోరిడా): టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించిన భారత జట్టు ఇప్పుడు టి20ల్లో సత్తా చాటేందుకు సన్నద్ధమైంది. ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇక్కడి సెంట్రల్ బ్రావర్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో నేడు (శనివారం) తొలి మ్యాచ్ జరగనుంది. జింబాబ్వేపై జూనియర్ జట్టుతో విజయం సాధించిన అనంతరం ధోని మళ్లీ మైదానంలోకి వస్తుండగా... స్యామీ స్థానంలో కెప్టెన్‌గా ఎంపికైన కార్లోస్ బ్రాత్‌వైట్ తొలిసారి నాయకత్వం వహిస్తున్నాడు. టి20 బలాబలాల పరంగా చూస్తే విండీస్ చాలా బలంగా కనిపిస్తోంది కాబట్టి భారత్‌కు గెలుపు అంత సులువు కాదు. ఉత్సాహంగా ధోనిసేన టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం టి20లకు ఎంపిక కాని భారత ఆటగాళ్లంతా స్వదేశం చేరుకోగా... మిగతావారంతా నేరుగా అమెరికాలో అడుగు పెట్టారు. టెస్టుల్లో మెరుగ్గా రాణించిన జట్టు మొత్తం ఆత్మవిశ్వాసంతో ఉంది. ఎప్పటిలాగే టీమిండియా బ్యాటింగ్ భారం విరాట్ కోహ్లిపైనే ఉంది. అతనితో పాటు ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ చెలరేగేందుకు సిద్ధమయ్యారు. మిడిలార్డర్‌లో రహానే కీలకం కానున్నాడు. ప్రపంచకప్ వరకు సుదీర్ఘ కాలంగా భారత టి20 జట్టులో అంతర్భాగంగా ఉన్న సురేశ్ రైనా ఈ సిరీస్‌లో లేకపోవడం ఒక్కటే జట్టులో కొత్తగా కనిపించే మార్పు. జట్టులోకి వచ్చీ రావడంతోనే ఆకట్టుకున్న రాహుల్‌కు ఇప్పుడు సీనియర్ల రాక తో తుది జట్టులో స్థానం దొరుకుతుందా చూడాలి. బౌలర్లలో బుమ్రా ఆరంభ ఓవర్లలో మళ్లీ కీలకం కానున్నాడు. ఇతర పేసర్లుగా షమీ, భువనేశ్వర్ తుది జట్టులో ఉంటారు. టెస్టుల్లో విండీస్ భరతం పట్టిన అశ్విన్ టి20ల్లోనూ సత్తా చూపించాల్సి ఉంది. వరల్డ్ కప్ సెమీస్‌లో నోబాల్‌తో తీవ్ర విమర్శల పాలు కావడం అతడిని ఇప్పటికే వెంటాడుతూనే ఉండవచ్చు. కొత్త కెప్టెన్ నేతృత్వంలో... ప్రపంచ కప్‌ను గెలిపించినా వ్యక్తిగత ప్రదర్శన పేలవంగా ఉందంటూ డారెన్ స్యామీని కెప్టెన్సీతో పాటు జట్టునుంచి కూడా విండీస్ బోర్డు అనూహ్యంగా తప్పించింది. టి20 వరల్డ్ కప్ ఫైనల్లో నాలుగు సిక్సర్లతో హీరోగా మారిపోరుున బ్రాత్‌వైట్ కెప్టెన్‌గా తన తొలి సిరీస్ ఆడుతున్నాడు. అరుుతే అతనికి పెద్దగా అనుభవం లేకపోరుునా... జట్టు మొత్తం టి20 స్టార్లతో నిండి ఉండటం కలిసొచ్చే అంశం. ముఖ్యంగా టెస్టు జట్టులో లేని క్రిస్ గేల్, డ్వేన్ బ్రేవో, ఆండ్రీ రసెల్, సిమన్‌‌సలతో ఆ జట్టు బ్యాటింగ్ దుర్బేధ్యంగా కనిపిస్తోంది. వీరికి బ్రాత్‌వైట్ మెరుపులు కూడా తోడైతే జట్టుకు తిరుగుండదు. ఇక వరల్డ్ కప్ ఆడని పొలార్డ్, నరైన్‌లు కూడా జట్టులోకి తిరిగి రావడంతో విండీస్ తుది జట్టులో స్థానం కోసం కూడా గట్టి పోటీ నెలకొంది.

యూఎస్‌లో తొలిసారి భారత క్రికెట్ జట్టు - శని, ఆదివారాల్లో విండీస్‌తో టి20 మ్యాచ్‌లు

26/08/2016: ఎవరు ఆడితే క్రికెట్ అభిమానులు విరగబడి మ్యాచ్‌లు చూస్తారో... ఎవరి సిక్సర్ల కోసం ఎంత దూరమైనా వచ్చేస్తారో... ఎవరి మెరుపు బ్యాటింగ్ కోసం ఎంత టికెట్ అయినా ఖర్చు చేస్తారో... ఆ ఆటగాళ్లు ఇప్పుడు అమెరికాలో ఆటకు సిద్ధమైపోయారు. యూఎస్‌ఏలో ఉన్న భారతీయులు, ఆసియన్లను ఆకర్షించేందుకు ఐసీసీ వేసిన పెద్ద ఎత్తుగడ ఇది. ఆడితే బేస్ బాల్ లేదంటే బాస్కెట్‌బాల్... అప్పుడప్పుడు ఫుట్‌బాల్, వ్యక్తిగత క్రీడల్లో టెన్నిస్... అగ్రరాజ్యం అమెరికాకు చెందిన అభిమానులు ఆసక్తి చూపించే ఆటలు ఇవే. కామన్వెల్త్ క్రీడ క్రికెట్ ఇప్పుడిప్పుడే అక్కడ నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో భారత జట్టు అడుగు పెట్టడం అమెరికాలో ఆట స్థాయిని పెంచుతుందా... అంతా ఆశిస్తున్నట్లుగా అక్కడ క్రికెట్‌కు కూడా తగిన ఆదరణ లభిస్తుందా! సాక్షి క్రీడా విభాగం : అమెరికాలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో 2010లో న్యూజిలాండ్, శ్రీలంక మధ్య, ఆ తర్వాత 2012లో న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండేసి టి20 మ్యాచ్‌ల సిరీస్‌లు జరిగాయి. ఇటీవల కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆరు మ్యాచ్‌లు కూడా నిర్వహించారు. వీటికి ప్రేక్షకులు అంతంత మాత్రమే ఆసక్తి కనబరిచారు. అమెరికా అభిమానులను ఆకట్టుకోవడంలో మాత్రం అవి పెద్దగా విజయవంతం కాలేదు. అయితే గత ఏడాది నవంబర్‌లో సచిన్-వార్న్ కలిసి నిర్వహించిన ఆల్ స్టార్స్ క్రికెట్ మాత్రం ఒక్కసారిగా యూఎస్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ను చూపించింది. న్యూయార్క్, హోస్టన్, లాస్ ఏంజెల్స్‌లో జరిగిన మూడు టి20 మ్యాచ్‌లకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సచిన్ పేరు ఈ ఆదరణకు కారణమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారత మాజీలు ఆడితేనే ఇలా ఉంటే ఇక ప్రస్తుత భారత జట్టు బరిలోకి దిగితే ఎలా ఉంటుందనే ఆలోచనే అమెరికాలో ఈ సిరీస్‌కు కారణమైంది. సీన్ మారుతోంది లెక్క ప్రకారం చెప్పుకోవడానికి వందకు పైగా దేశాల్లో క్రికెట్ ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నా... ఎక్కువ మంది అమెరికన్ల దృష్టిలో మాత్రం క్రికెట్ ‘మిస్టీరియస్ ఇంగ్లీష్ స్పోర్ట్’ మాత్రమే. అయితే ఆల్‌స్టార్స్ క్రికెట్‌కు సీఎన్‌ఎన్, సీఎన్‌బీసీ చానళ్లు పెద్ద ఎత్తున కవరేజీ ఇవ్వడం మారుతున్న ప్రాధాన్యాలను సూచిస్తోంది. బేస్‌బాల్ నేపథ్యంలో సాగిన ‘మిలియన్ డాలర్ ఆర్మ్’ అనే హాలీవుడ్ చిత్రంలో భారత క్రికెట్ గురించి కూడా చాలా చూపించారు. ఇటీవల బోస్టన్‌లో జరిగిన ప్రతిష్టాత్మక స్లోన్ క్రీడా సదస్సులో తొలిసారి క్రికెట్‌ను కూడా చేర్చడం విశేషం. ఇప్పటి వరకు ఇతర క్రీడలకే పరిమితమైన స్పోర్ట్స్ టెక్నాలజీ కంపెనీలు క్రికెట్‌లోనూ పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. 2013లోనే ఎన్‌బీఏ కమిషనర్ డేవిడ్ స్టెర్న్ ఐపీఎల్ వ్యాపారాన్ని అధ్యయనం చేసేందుకు భారత్‌కు రాగా... ఎన్‌బీఏ, ఎన్‌హెచ్‌ఎల్, ఎంఎల్‌ఎస్‌లాంటి టాప్ లీగ్‌లలో భాగస్వామ్యం ఉన్న ప్రముఖ స్పోర్ట్స్ వ్యాపారవేత్త స్టాన్ క్రోన్‌కే క్రికెట్‌లోనూ అడుగు పెట్టబోతున్నాడనేది తాజా వార్త. అమెరికాలో ఉన్న ఇండియన్స్‌నే కాకుండా అసలు అమెరికన్లను క్రికెట్ వైపు ఆకర్షితులు చేయడమే తమ లక్ష్యమని ఐసీసీ సీఈ డేవ్ రిచర్డ్సన్ చెప్పారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని దీర్ఘకాలిక వ్యవధి లక్ష్యాలతోనే ఈ రెండు టి20లకు ఓకే చెప్పినట్లు ఆయన వెల్లడించారు. అభిమానులు ఆశగా... అమెరికాలో భారత జట్టు ఆడే టి20 మ్యాచ్‌ల కోసం అక్కడి ఫ్యాన్స్ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. దేశంలోని ప్రతీ పెద్ద నగరంనుంచి భారత అభిమానులు ఈ మ్యాచ్‌లు చూసేందుకు ఫ్లోరిడాకు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా భారత జట్టు వెస్టిండీస్‌లో ఆడుతుంటేనే అక్కడికి వచ్చి మద్దతు ఇచ్చే అభిమానుల్లో ఎక్కువ మంది అమెరికన్లే ఉంటారు. యూఎస్‌లో పెద్ద సంఖ్యలో స్థిరపడిన భారతీయులు, ఇతర ఆసియా దేశాలకు చెందిన ఫ్యాన్స్ వల్ల ఈ రెండు టి20 మ్యాచ్‌లు సూపర్ హిట్ కావడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న విలువ, ఇక్కడి మార్కెట్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రపంచానికి పెద్దన్నలాంటి అగ్ర రాజ్యంలో కూడా క్రికెట్‌ను సరిగ్గా మార్కెటింగ్ చేయగలిగితే ఐసీసీకి తిరుగుండదు. ఒక్కసారి అక్కడ నిలదొక్కుకోగలిగితే క్రికెట్ మరింతగా దూసుకు పోవడం ఖాయం. ‘అమెరికాలో ఉన్న క్రికెట్ ఫ్యాన్‌కు ఇంతకంటే మంచి మ్యాచ్‌ను చూసే అవకాశం రాదు’ అని మార్క్ జాన్సన్ అనే ఒక అభిమాని చెప్పగా... ‘క్రికెట్‌లో రాక్‌స్టార్‌లాంటి దేశం ఆడుతుంటే చూడటం అదృష్టం’ అని ఫ్లోరిడాలో స్థిరపడిన రిజ్వాన్ అనే మరో వ్యక్తి చెబుతున్నాడు. ఈ మ్యాచ్‌లకు కనీస టికెట్ ధర 75 డాలర్లు ఉండగా, అత్యధికంగా 150 డాలర్లు ఖరారు చేశారు. అన్ని మ్యాచ్‌లూ అక్కడే లాడర్‌హిల్ నగరం (ఫ్లోరిడా రాష్ట్రం)లోని సెంట్రల్ బ్రోవర్డ్ రీజినల్ పార్క్ స్టేడియం భారత్, విండీస్ టి20 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తోంది. గతంలో నాలుగు అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లూ ఇక్కడే జరిగాయి. అమెరికా మొత్తంలో ఐసీసీ అధికారిక గుర్తింపు ఉన్న క్రీడా మైదానం ఇదొక్కటే. 2007లో నిర్మించిన ఈ స్టేడియంలో అప్పుడప్పుడు కొన్ని ఎగ్జిబిషన్, బెనిఫిట్ క్రికెట్ మ్యాచ్‌లు జరిగాయి. అయితే క్రికెట్ ద్వారా చెప్పుకోదగ్గ ఆదాయం లేదని, నిర్వహణ భారంగా మారిందని చెబుతూ మూడేళ్ల క్రితం సిటీ మేయర్ ఐసీసీకి లేఖ రాసి మరీ దీనిని మల్టీపర్పస్ స్టేడియంగా మార్చేశారు. ఇప్పుడు క్రికెట్‌కంటే కూడా ఫుట్‌బాల్, రగ్బీ పోటీలు ఎక్కువగా జరుగుతుంటాయి. వాస్తవానికి నవంబర్ దాకా క్రికెట్ మ్యాచ్‌లు లేవని అప్పటి వరకు స్టేడియాన్ని బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ క్యాంప్‌ల కోసం అద్దెకు ఇచ్చేశారు. అయితే భారత్, విండీస్ బోర్డుల అభ్యర్థనతో ఆదివారం కార్యక్రమాలను రద్దు చేసి మరీ 20 వేల సామర్థ్యం గల ఈ స్టేడియాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేయాల్సి వచ్చింది. ఆటగాళ్లు 14 మంది... అధికారులు 46 మంది! అమెరికా టి20లకు బీసీసీఐ భారీ బృందం ముంబై: భారత క్రికెట్ జట్టు తొలిసారి అమెరికాలో ఆడుతున్న సందర్భంగా దీనిని చిరస్మరణీయం చేసేందుకు బీసీసీఐ ‘భారీ’గా సిద్ధమైంది. మొత్తం 46 మంది అధికారులను ఈ మ్యాచ్‌లు చూసేందుకు బోర్డు సొంత ఖర్

అథ్లెట్ జైశాకు స్వైన్ ఫ్లూ

26/08/2016: న్యూఢిల్లీ: తనకు రియో ఒలింపిక్స్ మారథాన్ రన్లో కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని అధికారులపై ఆరోపణలు చేసిన భారత మహిళా అథ్లెట్ ఓపీ జైశా స్వ్లైన్ ఫ్లూ బారిన పడింది. రియో ఒలింపిక్స్ ముగిసిన అనంతరం భారత్ కు వచ్చిన జైశా అనారోగ్యానికి గురికావడంతో ఆమెకు బెంగళూరులోని ఆస్పత్రిలో అందిస్తున్నారు. దీనిలో భాగంగా జైశాకు నిర్వహించిన పరీక్షల్లో స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్దారణ అయ్యింది. జైశా ఆరోగ్యంపై స్పోర్ట్స్ అథారిటీ సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ డా. ఎస్ సరళ స్పందించారు. అథ్లెట్ జైశాకు స్వైన్ జాతికి చెందిన హెచ్1ఎన్1 వైరస్ సోకినట్లు పేర్కొన్నారు. జైశా ఆరోగ్యంపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రత్యేక డాక్టర్ల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, రియో ఒలింపిక్స్ అనంతరం పలువుర భారత అథ్లెట్లు అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో కొంతమంది చికిత్స అనంతరం ఇంటికి చేరగా, స్టీపుల్ చేజ్ క్రీడాకారిణి సుధాకు జికా వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సుధాకు బెంగుళూరులోని స్పోర్ట్స్ అథారిటీ హాస్టల్లో చికిత్స అందిస్తున్నారు.

రియో ఒలింపిక్ పతకం వేలానికి పెట్టాడు!

26/08/2016: వార్సా : ఒలింపిక్స్‌లో పతకం సాధించడం అంటే చిన్న విషయం కాదు. క్రీడాకారుల జీవితంలో చాలా అరుదుగా సాధించే విజయం అది. అలాంటి పతకాన్ని చాలా అపురూపంగా చూసుకుంటారు. కానీ, నిన్న కాక మొన్న ముగిసిన రియో ఒలింపిక్స్‌లో తాను సాధించిన రజత పతకాన్ని అప్పుడే వేలానికి పెట్టేశాడో క్రీడాకారుడు. అవును.. పోలండ్‌కు చెందిన డిస్కస్ త్రో క్రీడాకారుడు పియోటర్ మలచోవ్‌స్కీ తాను రియోలో సాధించిన పతకాన్ని వేలానికి పెట్టాడు. కేన్సర్‌తో బాధపడుతున్న మూడేళ్ల అబ్బాయికి చికిత్స చేయించడం కోసం అతడీ పని చేశాడు. ఒలెక్ అనే చిన్నారి.. రెండేళ్లుగా కంటి కేన్సర్‌తో బాధపడుతున్నాడు. అతడికి న్యూయార్క్ ఆస్పత్రిలో చికిత్స చేయించడం ఒక్కటే మార్గమని అన్నారు. నిజానికి తాను రియోలో స్వర్ణపతకం సాధించాలనే చాలా ప్రయత్నించానని, కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ అంతకంటే విలువైన వాటికోసం పోరాడాలని పిలుపునిస్తున్నానని మలచోవ్‌స్కీ తన ఫేస్‌బుక్ పేజిలో రాశాడు. ఇప్పుడు ఎవరైనా సాయం చేస్తే, తన రజత పతకం ఒలెక్‌కు బంగారం కంటే చాలా విలువైనది అవుతుందని చెబుతూ తన పతకాన్ని వేలానికి పెడుతున్నట్లు చెప్పాడు. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం సొమ్మును తాను అతడి చికిత్సకే వెచ్చిస్తానన్నాడు. అది వేలంలో ఎంతకు పోయిందో తెలియదు గానీ.. తర్వాత మాత్రం 'సక్సెస్' అని తన ఫేస్‌బుక్ పేజీలో రాశాడు. అంటే, ఆ చిన్నారికి చికిత్సకు కావల్సిన మొత్తం వచ్చిందనే అనుకోవాలి.

అది అతి పెద్ద సానుకూలాంశం - కోహ్లి

23/08/2016: పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ పర్యటన చాలా సంతృప్తినిచ్చిందని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. చివరి మ్యాచ్ వర్షం వల్ల డ్రాగా ముగిసినా ఈ సిరీస్ ద్వారా వచ్చిన ఫలితంతో చాలా ఆనందంగా ఉన్నట్లు కోహ్లి అభిప్రాయపడ్డాడు. తమ బలాన్ని పరీక్షించుకునేందుకు విండీస్ పర్యటన చాలా చక్కగా ఉపయోగపడిందన్న కోహ్లి.. ఈ సిరీస్లో స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్, వికెట్ కీపర్ వృద్థిమాన్ సాహాలు బ్యాటింగ్లో రాణించడం జట్టుకు సానుకూలాంశమన్నాడు. 'లోయర్ ఆర్డర్లో వచ్చి నిలదొక్కుకోవాలంటే కష్ట సాధ్యం. అయితే ఆ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చిన సాహా, అశ్విన్లు చక్కగా ఆకట్టుకున్నారు. మూడో టెస్టులో భారత కష్టాల్లో ఉన్నప్పుడు ఆ ఇద్దరు సెంచరీలతో ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఇది మాకు అతి పెద్ద సానుకూలాంశం అనడంలో ఎటువంటి సందేహం లేదు. టెస్టు క్రికెట్లో నిలకడ అనేది ప్రధానం. అది మా జట్టు ప్రదర్శనలో పూర్తిగా కనబడింది. ఈ సిరీస్లో విండీస్ కూడా మెరుగైన ప్రదర్శన చేసింది'అని కోహ్లి తెలిపాడు.కాగా, విండీస్ చివరి టెస్టు వర్షం కారణంగా డ్రా ముగియడంతో భారత్ తన నంబర్ వన్ ర్యాంకును కోల్పోయింది. దీనిపై విరాట్ బదులిస్తూ.. తాము ర్యాంకింగ్స్ కోసం ఆడటం లేదనే విషయాన్ని గుర్తించుకోవాలన్నాడు.

అగ్రరాజ్యం ‘ఆడేసుకుంది’ - ఒలింపిక్స్‌లో తిరుగులేని అమెరికా

23/08/2016: పేరులోనే కాదు.. పతకాల్లోనూ అగ్రరాజ్యమే... ఒలింపిక్స్ పుట్టినప్పటినుంచి వెయ్యి స్వర్ణాలు గెలిచినా.. బరిలో దిగితే కచ్చితంగా పతకం పట్టుకురావడమైనా... అది కేవలం అమెరికాకే చెల్లుతుంది. రియోలోనూ పతకాల సెంచరీ కొట్టిన అగ్రరాజ్యం.. మరోసారి తనకు ఎవరూ పోటీ లేరని నిరూపించుకుంది. బ్రెజిల్‌లో 17 రోజుల పాటు జరిగిన క్రీడోత్సవంలో 207 దేశాలు, 11,544 మంది క్రీడాకారులు పాల్గొన్నా.. పూర్తి ఆధిపత్యం అమెరికాదే. రియోలో మొత్తం 121 పతకాలతో అగ్రరాజ్యం మొదటి స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శనతో.. సరికొత్త రికార్డులతో సత్తాచాటింది. ఈత కొలను రారాజు ఫెల్ప్స్ ఐదు బంగారు, ఒక రజత పతకాన్ని సాధించాడు. కేటీ లెడెకీ, సిమోన్ బైల్స్ వంటి క్రీడాకారిణులూ ఈసారి అమెరికా అగ్రస్థానంలో కీలకపాత్ర పోషించారు. అమెరికా తరపున 552 మంది రియో బరిలో దిగగా.. 213 మందికి పతకాలొచ్చాయి. బ్రిటన్ పునరుత్థానం ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌లో బ్రిటన్ హవా కనిపించింది. అమెరికా తర్వాత 67 పతకాలతో బ్రిటన్ రెండో స్థానంలో నిలించింది. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో కేవలం ఒకే బంగారు పతకం గెలిచాక మొత్తం క్రీడా విధానాన్నే మార్చేసిన బ్రిటన్.. దీని ఫలితంగా చేపట్టిన మార్పుల ద్వారా రియో పతకాల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఒలింపిక్స్‌లో అమెరికాకు కాస్తో కూస్తో పోటీ అనుక్నున చైనా కూడా ఈసారి పతకాల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. 20 ఏళ్లలో చైనాకు ఇదే చెత్త ప్రదర్శన కావడం గమనార్హం.

సింధు, సాక్షిలకు ‘ఖేల్రత్న’

23/08/2016: న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, రెజ్లర్ సాక్షి మలిక్‌లకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్రత్న దక్కింది. అలాగే పట్టువదలని పోరాటంతో అందరి మనస్సులు గెలుచుకున్న షూటర్ జితూ రాయ్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌లను కూడా ఈ పురస్కారం వరించింది. సోమవారం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈమేరకు ప్రకటించింది. దేశం నుంచి తొలిసారి ఒలింపిక్ రజతం సాధించిన మహిళగా సింధు ఘనత సాధించగా... తొలి మహిళా రెజ్లర్‌గా కాంస్యం దక్కించుకున్న సాక్షి ఆకట్టుకుంది. అలాగే కాంస్య పతకాన్ని కేవలం 0.15 పాయింట్ల తేడాతో కోల్పోయిన దీపా కర్మాకర్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి మహిళా జిమ్నాస్ట్‌గా పేరు తెచ్చుకుంది. ఇక గత రెండేళ్లుగా షూటర్ జీతూ రాయ్ ఆరు అంతర్జాతీయ పతకాలు సాధించాడు. వీరికి పురస్కారం కింద రూ.7.5 లక్షల నగదు ఇవ్వనున్నారు. ఒకే ఏడాది నలుగురికి ఖేల్త్న్ర ఇవ్వడం భారత క్రీడల చరిత్రలో ఇదే తొలిసారి. ఎన్.రమేశ్‌కు ద్రోణాచార్య తెలంగాణకు చెందిన అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్‌కు ప్రతిష్టాత్మక ద్రోణాచార్య అవార్డు దక్కింది. ఆంధ్రప్రదేశ్ మాజీ అథ్లెట్ సత్తి గీత (అథ్లెటిక్స్) ధ్యాన్‌చంద్ అవార్డ్‌కు ఎంపికయ్యింది. క్రికెటర్ అజింక్య రహానే, హాకీ క్రీడాకారులు వీఆర్ రఘునాథ్, రాణీ రాంపాల్ అర్జున అవార్డు అందుకోనున్నారు. ఈ పురస్కారాలను ఆగస్ట్ 29న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందిస్తారు. 15ఏళ్ల శ్రమకు గుర్తింపు: రమేశ్ అల్వాల్: శిక్షణలో మానవీయ కోణం జోడిస్తే క్రీడాకారులకు నమ్మకం కలిగి మరింత ప్రోత్సాహం అందుతుందని ద్రోణాచార్య అవార్డుకు ఎంపికైన అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్ అన్నారు. ‘15 సంవత్సరాల పాటు నా శిక్షణ అనుభవానికి తగిన గుర్తింపు లభించింది. నాకు ఈ గౌరవం దక్కుతుందని గోపీచంద్, లక్ష్మణ్ తరచూ చెప్పేవారు’ అని సంతోషం వ్యక్తం చేశారు. అవార్డుల జాబితా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న (రూ.7.5 లక్షలు) పీవీ సింధు (బ్యాడ్మింటన్), సాక్షి మలిక్ (రెజ్లింగ్), దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్), జీతూ రాయ్ (షూటింగ్). అర్జున అవార్డులు (రూ.5 లక్షలు) అజింక్య రహానే (క్రికెట్), రజత్ చౌహాన్ (ఆర్చరీ), లలితా బబర్ (అథ్లెటిక్స్), సౌరవ్ కొఠారి (బిలియర్డ్స్,స్నూకర్), శివ థాపా (బాక్సింగ్), సుబ్రతా పాల్ (ఫుట్‌బాల్), రాణి రాంపాల్ (హాకీ), వి.ఆర్ రఘునాథ్ (హాకీ), గురుప్రీత్ సింగ్ (షూటింగ్), అపూర్వి చండీలా (షూటింగ్), సౌమ్యజిత్ ఘోష్ (టేబుల్ టెన్నిస్), వినేశ్ (రెజ్లింగ్), అమిత్ కుమార్ (రెజ్లింగ్), సందీప్ సింగ్ మాన్ (పారా అథ్లెటిక్స్), వీరేందర్ సింగ్ (రెజ్లింగ్). ద్రోణాచార్య అవార్డు లు(రూ.5 లక్షలు) నాగపురి రమేశ్ (అథ్లెటిక్స్), సాగర్ మాల్ దయాళ్ (బాక్సింగ్), రాజ్‌కుమార్ శర్మ (క్రికెట్), విశ్వేశ్వర్ నంది (జిమ్నాస్టిక్స్), ఎస్. ప్రదీప్ కుమార్ (స్విమింగ్), మహావీర్ సింగ్ (రెజ్లింగ్). ధ్యాన్ చంద్ అవార్డులు (రూ.5 లక్షలు) సత్తి గీత (అథ్లెటిక్స్), సిల్వనస్ డుంగ్ డుంగ్ (హాకీ), రాజేంద్ర ప్రసాద్ షెల్కే ( రోయింగ్).

అమెరికా అమ్మాయిల ‘సిక్సర్’

22/08/2016: మహిళల బాస్కెట్‌బాల్ విభాగంలో అమెరికా జట్టు వరుసగా ఆరోసారి స్వర్ణాన్ని సాధించింది. ఫైనల్లో అమెరికా 101-72 పాయింట్ల తేడాతో స్పెయిన్‌ను ఓడించింది. 1996 అట్లాంటా ఒలింపిక్స్ నుంచి ఇప్పటివరకు అమెరికా జట్టుకు బాస్కెట్‌బాల్ ఫైనల్స్‌లో ఓటమి లేకపోవడం విశేషం. కాంస్య పతక పోరులో సెర్బియా 70-63తో ఫ్రాన్స్‌ను ఓడించింది.

రియోకు బై బై.. టోక్యోకు వెల్కమ్

22/08/2016: రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్ క్రీడలు ముగిసాయి. పదహారు రోజుల పాటు అభిమానుల్ని అలరించిన ఒలింపిక్స్ పోటీలకు సోమవారం(భారతకాలమాన ప్రకారం) తెరపడింది. మారకానా స్టేడియంలో ఒలింపిక్ జ్యోతిని అర్పివేసిన అనంతరం ఈ మెగా ఈవెంట్కు ముగింపు పలుకుతున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) చీఫ్ థామస్ బాచ్ ప్రకటించారు. ఈ సందర్భంగా జరిగిన ముగింపు వేడుకలు చూపరులను ఆకట్టుకున్నాయి. చివర్లో జరిగిన బాణసంచా విన్యాసాలతో ఒలింపిక్స్ కు రియో ఘనంగా వీడ్కోలు పలికింది. రియో మేయర్ ఎడ్యూర్డో పైస్ ఒలింపిక్ పతాకాన్ని 2020 ఒలింపిక్స్ జరిగే టోక్యో గవర్నర్ యురికే కొయికేకు అప్పగించారు. దీంతో రియోకు గుడ్ బై చెబుతూ, టోక్యోకు స్వాగతం పలికారు. ఈ ముగింపు వేడుకలకు జపాన్ ప్రధాని షింజూ అబే హాజరయ్యారు. ఆయన ఎరుపు టోపీ ధరించి సూపర్ మారియా వేష ధారణలో టోక్యో నుంచి రియోకు రావడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రియో ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో బ్రెజిల్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు నుజ్మాన్ కార్లోస్ ప్రసంగించిన అనంతరం థామస్ బాచ్ తన సందేశాన్ని వెల్లడించారు.

కొట్టిందొకడు.. గెలిచిందొకడు!

17/08/2016: రియో: ఒలింపిక్స్ బాంటమ్‌వెయిట్ బాక్సింగ్ క్వార్టర్స్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇరాన్ బాక్సర్ మైకేల్ కోన్లన్‌కు.. రష్యా బాక్సర్ వ్లాదిమిర్ నికితిన్‌కు మధ్య బౌట్ జరిగింది. ప్రత్యర్థిపై మైకేల్ పంచ్‌ల వర్షం కురిపించి రక్తం వచ్చేలా కొట్టాడు. దీంతో మైకేల్ గెలుస్తాడని అందరూ అనుకున్నారు. కానీ జడ్జీలు మాత్రం వ్లాదిమిర్ గెలిచినట్లు ప్రకటించారు. దీంతో చిర్రెత్తిన ఇరాన్ బాక్సన్ అక్కడికక్కడే జడ్జీలను, ఏఐబీఏను బండ బూతులు తిట్టాడు. బంగారు పతకం గెలవాలన్న తన ఆశలపై నీళ్లు చల్లారని, తనను మోసం చేశారని ధ్వజమెత్తాడు.

సూపర్ సింధు - ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌పై గెలుపు - క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశం

17/08/2016: రియో డి జనీరో: ఆద్యంతం అద్భుతంగా ఆడిన భారత షట్లర్ పీవీ సింధు రియో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21-13, 21-15తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. ఈ ఏడాది ఆసియా చాంపియన్‌షిప్ రెండో రౌండ్‌లో తై జు యింగ్ చేతిలో ఎదురైన పరాజయానికి సింధు ఈ విజయంతో ప్రతీకారం తీర్చుకుంది. 41 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సింధు పక్కా ప్రణాళికతో ఆడింది. అవసరమైనపుడు స్మాష్‌లతో చెలరేగి, మరికొన్ని సార్లు సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూ తై జు యింగ్‌కు కుదురుకునే అవకాశం ఇవ్వలేదు. సింధు దూకుడైన ఆటతీరుకు పలుమార్లు ఈ చైనీస్ తైపీ ప్లేయర్ అనవసర తప్పిదాలు చేసింది. బాక్సర్ వికాస్ విఫలం పురుషుల బాక్సింగ్‌లో మిగిలిన ఏకైక ఆశాకిరణం వికాస్ క్రిషన్ యాదవ్ (75 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో చేతులెత్తేశాడు. సెమీస్‌కు చేరితే కనీసం కాంస్యం ఖాయమయ్యే పరిస్థితిలో బరిలోకి దిగిన వికాస్ 0-3 (27-30, 26-30, 26-30)తో గతేడాది ఆసియా చాంపియన్, ప్రపంచ చాంపియన్‌షిప్ రజత పతక విజేత బెక్తెమిర్ మెలుకుజియెవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. బౌట్ మొత్తంలో బెక్తెమిర్ సంధించిన పంచ్‌లకు వికాస్ విలవిలలాడాడు. ఈ బౌట్‌లో వికాస్ ఆటతీరు చూశాక అతను ఏమాత్రం సిద్ధం కాకుండానే బరిలోకి దిగినట్లు అనిపించింది. క్వాలిఫయింగ్‌లోనే సీమా అవుట్ మహిళల డిస్కస్ త్రోలో సీమా పూనియా క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగింది. 2014 ఆసియా క్రీడల చాంపియన్ అయిన సీమా క్వాలిఫయింగ్‌లో డిస్క్‌ను 57.58 మీటర్ల దూరం విసిరి ఓవరాల్‌గా 20వ స్థానంలో నిలిచింది. రెజ్లర్ హర్‌దీప్ ఓటమి గ్రీకో రోమన్ రెజ్లింగ్‌లో భారత్‌కు మళ్లీ నిరాశే మిగిలింది. 98 కేజీల విభాగంలో హర్‌దీప్ తొలి బౌట్‌లోనే ఓడిపోయాడు. నేరుగా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు ‘బై’ పొందిన హర్‌దీప్ 1-2తో ఇల్‌డెమ్ సెంక్ (టర్కీ) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇల్‌డెమ్ సింక్ ఫైనల్‌కు చేరుకోకపోవడంతో హర్‌దీప్ ‘రెప్‌చేజ్’ రౌండ్‌లో పోటీపడే అవకాశం రాలేదు.

ఆగస్టు 15న కడుపులు మాడాయి...

17/08/2016: రియో డి జనీరో: పంద్రాగస్టు సంబరాల సంగతేమో కానీ రియోలో భారత హాకీ క్రీడాకారులు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడి భారత దౌత్య కార్యాలయంలో క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం అథ్లెట్లను ఆహ్వానించారు. హాకీ క్రీడ ముగియడంతో ఇరు జట్ల ఆటగాళ్లు వెళ్లారు. అక్కడ ఎలాగూ విందు ఏర్పాటు చేస్తారని, పసందైన భారత వంటకాల రుచి చూడవచ్చనే కోరికతో ఒలింపిక్ విలేజిలో తమ డిన్నర్‌ను రద్దు చేసుకున్నారు. అయితే కార్యక్రమంలో పరిస్థితి మాత్రం మరోలా ఉంది. వేడుక ముగిశాక కూల్ డ్రింక్స్, కాసిన్ని పల్లి గింజలు పెట్టేసరికి అంతా అవాక్కయ్యారు. దీంతో మాంచి ఆకలి మీదున్న ఆటగాళ్లు అధికారుల తీరుతో తీవ్రంగా నిరుత్సాహపడ్డారు. రెండు బస్సులు మారి ఇంత దూరం వస్తే కనీసం భోజనాలు కూడా పెట్టకపోవడం దారుణమని ఓ ఆటగాడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

టీమిండియా నంబర్ వన్

17/08/2016: దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా మొదటి స్థానానికి చేరుకుంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో కోహ్లి సేన టాప్ ర్యాంకులో నిలిచింది. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ లో ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోవడంతో టీమిండియా మొదటి ర్యాంకు సొంతం చేసుకుంది. 3-0తో సిరీస్ ను శ్రీలంక క్లీన్ స్వీప్ చేయడంతో మొదటి ర్యాంకులో ఉన్న ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది. ఇంగ్లండ్తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను 2-2తో డ్రాగా ముగిసించిన పాకిస్థాన్ రెండో ర్యాంకులో నిలిచింది. ఇంగ్లండ్, న్యూజిలాండ్.. 4,5 స్థానాలు దక్కించుకున్నాయి. శ్రీలంక(6), దక్షిణాఫ్రికా(7), వెస్టిండీస్(8), బంగ్లాదేశ్(9), జింబాబ్వే(10) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ముర్రే జోడిపై బోపన్న జంట విజయం

13/08/2016: రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్లో నాలుగో సీడ్, భారత టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ జోడీ సానియా మీర్జా-రోహన్ బోపన్నలు సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లారు. భారత కాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా జంట 6-4, 6-4 తేడాతో ఆండీ ముర్రే- హీతర్ వాట్సన్ ద్వయం(బ్రిటన్)పై గెలిచి సెమీస్ కు చేరింది. ఈ మ్యాచ్ లో సానియా జోడి ఏమాత్ర తడబాటు లేకుండా విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో సానియా జోడి పతకాన్ని సాధించేందుకు అడుగుదూరంలో నిలిచింది. ఈ ద్వయం ఫైనల్ కు చేరితే కనీసం రజతాన్ని తమ ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ సెమీస్ లో నిష్క్రమిస్తే మాత్రం కాంస్య పతకం కోసం మరో ప్లే ఆఫ్ మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. ఒలింపిక్స్ చరిత్రలో భారత టెన్నిస్ ఈవెంట్లో ఇప్పటివరకూ ఒక పతకాన్ని మాత్రమే చేజిక్కించుకుంది. భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్ 1996 అట్లాంటా ఒలింపిక్స్లో భారత్ కు కాంస్య పతకాన్ని సాధించాడు. దీంతో భారత్ చరిత్రను మరోసారి తిరగరాసేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ విజయంపై లియాండర్ పై బోపన్న జోడికి అభినందలను తెలియజేశాడు.

మళ్లీ బరిలోకి దిగ్గజ ఆటగాడు

13/08/2016: అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాడు లియోనాల్ మెస్సీ మనసు మార్చుకున్నాడు. అర్జెంటీనా తరఫున మరలా బరిలోకి దిగబోతున్నట్లు వెల్లడించాడు. కాగా గత జూన్ నెలలో జరిగిన కోపా అమెరికా కప్ చిలీతో మ్యాచ్ ఓటమి తర్వాత తాను రిటైరవుతున్నట్లు మెస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. మెస్సీ రిటైర్మెంట్ పై పునరాలోచించుకోవాలని అతన్ని కోరిన వాళ్లు చాలా మందే ఉన్నారు. ఎట్టకేలకు వాళ్ల ఆశలు ఫలించాయి. ఫుట్ బాల్ దేశాన్ని ముందుకు నడిపేందుకు మళ్లీ గ్రౌండ్ లోకి దిగబోతున్నట్టు శుక్రవారం మెస్సీ ప్రకటించాడు. ఇప్పటికే అర్జెంటీనా ఫుట్ బాల్ చాలా సమస్యలను ఎదుర్కొంటుందని తానో సమస్యను కాకూడదనే రీ ఎంట్రీ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. 2018 ఫుట్ బాల్ ప్రపంచకప్ టీమ్ లో మెస్సీ చేరనున్నాడు. ప్రపంచకప్ లీగ్ దశలో ఉరుగ్వే, వెనిజులాతో అర్జెంటీనా తలపడనుంది. మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా మొత్తం నాలుగు ఫైనల్లో పరాజయాన్ని చవిచూసింది. 2014 ప్రపంచకప్ తరువాత వరుసగా రెండు కోపా అమెరికా కప్ తుది పోరులో అర్జెంటీనా ఓడిపోవడంతో మెస్సీ తన ఉద్వేగాన్ని ఆపులేక కెరీర్ గుడ్ బై చెప్పాడు. మెస్సీలాంటి మెరుగైన ఆటగాడు మరలా తిరగి జట్టులోకి రావడం అర్జెంటీనాకు కొండత బలమే.

ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన లెడెకీ

13/08/2016: రియో డి జనీరో: మహిళల 800 మీటర్ల ఫ్రీస్టైల్‌లో అమెరికా స్విమ్మర్‌ కెటీ లెడెకీ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. 8.04.79 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని ప్రపంచ రికార్డుతో పాటు, ఒలింపిక్‌ రికార్డును కూడా బద్దలుకొట్టింది. గత రికార్డుకు ప్రస్తుతం లెడికీ నెలకొల్పిన రికార్డుకు రెండు సెకన్లు పైగా తేడా ఉండటం ఆమె వేగాన్ని తెలియజేస్తోంది. బ్రిటన్‌కు చెందిన జార్జ్‌ కార్లిన్‌ ద్వితీయ స్థానంలో నిలిచిచింది. హంగేరియన్‌ స్విమ్మర్‌ కాపస్‌ బొగ్లర్క తృతీయ స్థానంలో నిలిచింది. దీంతో లెడెకీ నాలుగు స్వర్ణాలతో మైకెల్‌ ఫెల్ప్స్‌తో కలిసి అగ్రస్థానంలో కొనసాగుతోంది.

స్విమ్మింగ్‌లో స్పెయిన్‌కు తొలి స్వర్ణం

11/08/2016: రియో డి జనీరో: మహిళల 200 మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో జరిగిన ఫైనల్స్‌లో స్పెయిన్‌కు చెందిన బెల్మాంటే గార్సియా స్వర్ణం సాధించింది. లక్ష్యాన్ని 2.04.85 సెకన్లలో పూర్తి చేసింది. బెల్మాంటేకు ఒలింపిక్స్‌లో ఇది రెండో స్వర్ణం. ఇప్పటికే 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ విభాగంలో కాంస్య పతకం సాధించింది.

ప్రి క్వార్టర్స్కు దీపికా

11/08/2016: రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్లో మరో భారత మహిళా ఆర్చర్ దీపికా కుమారి ప్రి క్వార్టర్స్లోకి ప్రవేశించింది. గురువారం తెల్లవారుజామున జరిగిన తొలి రౌండ్లో క్రిస్టైన్ ఎసెబ్యా(జార్జియా)ను 6-4 తేడాతో ఓడించిన దీపికా.. రెండో రౌండ్లో సర్తోరి గ్వేన్దోలిన్(ఇటలీ)పై 6-2 తేడాతో విజయం సాధించి ప్రి క్వార్టర్స్ కు అర్హత సాధించింది. దీపికా కుమారికి తొలి రౌండ్లో క్రిస్టెన్ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంది. ఇద్దరు క్రీడాకారిణులు చెరో రెండు సెట్లను గెలుచుకోవడంతో నిర్ణయాత్మక ఐదో సెట్ అనివార్యమైంది. ఈ సెట్లో ఆకట్టుకున్న దీపికా.. ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా స్కోరును కాపాడుకుని పైచేయి సాధించింది. ఇక రెండో రౌండ్లో మూడు సెట్లను దీపిక గెలుచుకోగా, ఒక సెట్ను మాత్రమే గ్వేన్దోలిన్ గెలుచుకుంది. అంతకుముందు మహిళల ఆర్చరీ విభాగంలో బొంబాలే దేవి ప్రి క్వార్టర్స్ కు చేరిన సంగతి తెలిసిందే.

మనోజ్ 'పంచ్' పడింది!

11/08/2016: రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్లో భారత బాక్సర్లు పతకంపై ఆశలు పెంచుతున్నారు. ఇప్పటికే బాక్సర్ వికాస్ కృష్ణన్ ప్రి క్వార్టర్స్కు చేరగా, తాజాగా మరో బాక్సర్ మనోజ్ కుమార్ కూడా ప్రి క్వార్టర్స్కు అర్హత సాధించాడు. గురువారం తెల్లవారుజామున జరిగిన బౌట్లో 64 కేజీల వెల్టర్ వెయిట్ విభాగంలో మనోజ్ కుమార్ 2-1 తేడాతో గత ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఎవాల్దాస్ పెట్రాస్కాస్(లూథియానా)పై విజయం సాధించాడు. మూడు రౌండ్ల పాటు జరిగిన పోరులో మనోజ్ కుమార్ పదునైన పంచ్లతో అదరగొట్టాడు. ప్రత్యేకంగా తొలి రెండు రౌండ్లలో పూర్తి ఆధిక్యం కనబరిచిన మనోజ్ కుమార్.. చివరి రౌండ్ లో ఎక్కువగా డిఫెన్స్కే పరిమితమయ్యాడు. దీంతో ముగ్గురు జడ్జిల నిర్ణయంలో కేవలం ఒక పాయింట్ ను (29-28, 29-28, 28-29) మాత్రమే చేజార్చుకుని తదుపరి రౌండ్లో అడుగుపెట్టాడు. రియో ఒలింపిక్స్లో ఆరంభంలోనే మన బాక్సర్లకు కఠినమైన డ్రా ఎదురైనప్పటికీ వారు అంచనాలు మించి రాణించడంతో భారత శిబిరంలో ఆనందం వెల్లివిరుస్తోంది. అంతకుముందు పురుషుల బాక్సింగ్ 75 కేజీల విభాగంలో భారత బాక్సర్ వికాస్ కృష్ణన్ ప్రి-క్వార్టర్స్‌కు చేరిన సంగతి తెలిసిందే. అమెరికన్ చార్లెస్ కాన్వెల్‌తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో 3-0తో వికాస్ గెలిచాడు. ఆరంభం నుంచే దూకుడుగా కనిపించిన వికాస్.. రైట్ స్ట్రయిట్స్, అప్పర్ కట్స్‌తో ప్రత్యర్థిని డిఫెన్స్‌లో పడేసి విజయాన్నికైవసం చేసుకున్నాడు.

జగిత్యాల టైగర్స్‌కు టైటిల్

10/08/2016: హైదరాబాద్: సింగపూర్ తెలంగాణ కల్చరర్ సొసైటీ (టీసీఎస్‌ఎస్) ఆధ్వర్యంలో ఈనెల 7 నుంచి 9 వరకు నిర్వహించిన వార్షిక క్రికెట్ టోర్నమెంట్‌లో జగిత్యాల టైగర్స్ జట్టు విజేతగా నిలిచింది. ఈ జట్టు ఫైనల్లో హీరోయిక్ బుల్స్‌ను ఓడించింది. విజేతలకు బతుకమ్మ సంబరాల్లో బహుమతులు అందించనున్నారు. మొత్తం ఈ టోర్నమెంట్‌లో 8 జట్లు తలపడ్డాయి. గ్రూప్-ఏలో తెలంగాణ లయన్స్, ఇండియన్ రూలర్స్, కరీంనగర్ నైట్ రైడర్స్, భాగ్యనగర్ రైడర్స్ జట్లు ఉండగా... గ్రూప్-బిలో హీరోయిక్ బుల్స్, జగిత్యాల టైగర్స్, 11 స్టార్స్, స్మాషర్స్ యునెటైడ్ జట్లు తలపడ్డాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించడంతో పాటు... తెలంగాణ వారందరినీ ఒకే తాటి మీదకు తెచ్చేందుకు ఏటా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని టీసీఎస్‌ఎస్ అధ్యక్షుడు బండ మాధవరెడ్డి అన్నారు.

అద్వైత్‌ కు టైటిల్ - స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్

10/08/2016: హైదరాబాద్: సెయింట్ పాల్స్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సబ్ జూనియర్ బాలుర విభాగంలో అద్వైత్ చాంపియన్‌గా నిలిచాడు. మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అద్వైత్ 4-1తో వరుణ్ శంకర్‌పై గెలుపొందాడు. యూత్ బాలుర విభాగంలో స్నేహిత్ 4-1తో సరోజ్ సిరిల్‌పై, బాలికల విభాగంలో వరుణి జైశ్వాల్ 4-3తో సస్యపై, జూనియర్ బాలుర విభాగంలో స్నేహిత్ 4-0తో అరవింద్‌పై, బాలికల విభాగంలో నైనా 4-3తో వరుణిపై, సబ్ జూనియర్ బాలికల విభాగంలో ఆయుషి 4-1తో భవితపై, క్యాడెట్ బాలుర విభాగంలో జషన్ సాయి 3-1తో రిత్విక్‌పై, బాలికల విభాగంలో పలక్ 3-1తో ప్రీతిపై నెగ్గారు. ఇంటర్ స్కూల్ బాలుర విభాగంలో బీవీబీ 3-0తో సెయింట్ పాల్ స్కూల్‌పై, బాలికల విభాగంలో గీతాంజలి స్కూల్ 3-0తో గీతాంజలి దేవేశ్రయ్‌పై గెలుపొందాయి.

విండీస్కు పరీక్ష పెట్టిన అశ్విన్, సాహా! - 90ఓవర్లలో భారత్ 234/5

10/08/2016: గ్రాస్‌ఐలట్: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో తొలిసారి భారత బ్యాట్స్‌మెన్ తడబడ్డా.. చివరికి మనదే పైచేయి అనిపించారు. డారెన్ స్యామీ స్టేడియంలో మంగళవారం మొదలైన మూడో టెస్టులో తొలి రోజు టీ విరామ సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 52 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసిన జట్టు రవిచంద్రన్ అశ్విన్ (190 బంతుల్లో 75 నాటౌట్ ; 4 ఫోర్లు), వృద్ధిమాన్ సాహా (122 బంతుల్లో 46 నాటౌట్ ; 4 ఫోర్లు) నిలకడ బ్యాటింగ్ తీరుతో 90 ఓవర్లలో ఆట ముగిసే సమయానికి 234/5తో కోలుకుంది. రెండొందల పరుగుల లోపే ఆలౌటవుతుందనుకున్న టీమిండియాను అశ్విన్, సాహా వికెట్లు కోల్పోకుండా ఉండేందుకు ప్రాధాన్యమిస్తూ పట్టుదలతో క్రీజులో నిలిచి, చివరికి తొలిరోజు భారత్కు మంచి భాగస్వామ్యం అందించారు. టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత బ్యాట్స్ మన్ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఓపెనర్ లోకేశ్ రాహుల్ (65 బంతుల్లో 50; 6 ఫోర్లు) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా రాణించలేదు. రహానే (133 బంతుల్లో 35; 4 ఫోర్లు) సుదీర్ఘ సమయం క్రీజులో నిలిచినా పెద్దగా పరుగులు చేయలేదు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (1), కోహ్లి (3), రోహిత్ శర్మ (9) విఫలమయ్యారు. ఈ మ్యాచ్ ద్వారా టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన జోసెఫ్ రెండు వికెట్లు తీయగా, ఛేజ్‌కూ రెండు వికెట్లు లభించాయి. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. ఉమేశ్ స్థానంలో భువనేశ్వర్, పుజారా స్థానంలో రోహిత్, మిశ్రా స్థానంలో జడేజా తుది జట్టులోకి వచ్చారు. విండీస్ కు చుక్కలు చూపించారు! ఓ దశలో 126/5 తో ఉన్న భారత్ను అశ్విన్, సాహా ఆదుకున్నారు. వికెట్ పడకుండా 40 ఓవర్లకు పైగా బ్యాటింగ్ చేసి వీరిద్దరూ విండీస్ బౌలర్ల సహానాన్ని పరీక్షించారు. చివరి సెషన్లో 38 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఈ జోడీ 104 పరుగులు జత చేసింది. అయితే ఇందులో 46 పరుగులు చివరి 9 ఓవర్లలో వచ్చాయంటేనే ఈ ఇద్దరూ కరీబియన్లను ఎంతగా ఆడుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆరో వికెట్ జోడీని విడదీయడానికి విండీస్ విశ్వప్రయత్నాలు చేసినా విజయం సాధించలేక పోయారు. టాపార్డర్ ను సులువుగా పెవిలియన్ బాట పట్టించిన విండీస్ బౌలర్లు అశ్విన్, సాహాలను ఔట్ చేయలేక నానాతిప్పలు పడ్డారు. దీంతో టీ విరామం వరకూ కరీబియన్ ఆటగాళ్లలో ఉన్న ఆనందం తర్వాతి సెషన్ నుంచి కొంచెం కొంచెంగా దూరమైంది. మ్యాచ్ తొలిరోజు నిలిపివేసే సమయానికి భారత్ మాత్రం తమ ప్రదర్శన పట్ల హ్యాపీగా ఉంది. ఈ జోడీ మరిన్ని పరుగులును జత చేస్తే విండీస్ కష్టాలు రెట్టింపవుతాయి.

దీపా కర్మాకర్ కొత్త చరిత్ర

09/08/2016: రియో డీ జనీరో: భారత్ నుంచి ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి మహిళా జిమ్నాస్ట్గా ఇటీవల రికార్డు సృష్టించిన దీపా కర్మాకర్.. రియో ఒలింపిక్స్ లో కొత్త చరిత్ర సృష్టించింది. వాల్ట్ విభాగంలో ఫైనల్కు చేరి సరికొత్త చరిత్రను లిఖించింది. క్వాలిఫయింగ్ రౌండ్ లో భాగంగా ప్రొడునోవా వాల్ట్ విభాగంలో 14.850 పాయింట్లు సాధించి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇందులో టాప్-8లో ఉన్నవారు మాత్రమే ఫైనల్ కు అర్హత సాధిస్తారు. అయితే దీపా ఏడో స్థానంలో నిలిచే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది. కెనడా జిమ్నాస్ట్ షాలోన్ ఓల్సేన్ 14.950 పాయింట్ల్లు సాధించడంతో దీపా ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. దీంతో ఒలింపిక్స్లో దాదాపు ఐదు దశాబ్దాలుగా భారతీయులకు కలగా మిగిలిన జిమ్నాస్టిక్స్ పతకంపై ఆశలను పెంచుతూ ఆగస్టు 14వ తేదీన జరిగే ఫైనల్లో పోరుకు సిద్ధమైంది. ఈ ఏడాది ఏప్రిల్ లో రియో డీ జెనీరియోలో జరిగిన ఫైనల్ క్వాలిఫయర్ లో 52.698 పాయింట్లు నమోదు చేసిన దీపా కర్మాకర్ రియోకు అర్హత సాధించింది. తద్వారా ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్గా దీప రికార్డు నెలకొల్పింది. త్రిపురకు చెందిన ఈ 22 ఏళ్ల అమ్మాయి.. కామన్వెల్త్ గేమ్స్లో పతకం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్గా రికార్డు సృష్టించడమే కాకుండా, ఆ తర్వాత వరల్డ్ జిమ్నాస్ట్ చాంపియన్షిప్ కు అర్హత సాధించింది. ఒలింపిక్స్లో ఫైనల్ రౌండే లక్ష్యంగా బరిలోకి దిగిన దీపా కర్మాకర్ అంచనాలను అందుకోవడం పతకంపై ఆశలను పెంచుతుంది.

సిరీస్ విజయంపై భారత్ దృష్టి - నేటి నుంచి వెస్టిండీస్‌తో మూడో టెస్టు

09/08/2016: సెయింట్ లూసియా: రెండో టెస్టులో విజయం అంచుల వరకు వచ్చినా డ్రాతో సరిపెట్టుకున్న భారత క్రికెట్ జట్టు నేటి (మంగళవారం)నుంచి వెస్టిండీస్‌తో జరిగే మూడో టెస్టులో బరిలోకి దిగనుంది. ఇప్పటికే తొలి టెస్టును నెగ్గిన కోహ్లి సేన 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌ను నెగ్గి నాలుగు టెస్టుల సిరీస్‌ను దక్కించుకోవాలని చూస్తోంది. అదే జరిగితే వరుసగా హ్యాట్రిక్ సిరీస్‌లను గెల్చినట్టవుతుంది. ఇంతకుముందు శ్రీలంక, దక్షిణాఫ్రికాలపై భారత్ టెస్టు సిరీస్‌లు కైవసం చేసుకుంది. వర్షం అంతరాయం కలిగించిన రెండో టెస్టులో చివరి రోజు రోస్టన్ చేజ్ అనూహ్యంగా శతకంతో అదరగొట్టగా అటు భారత బౌలర్లు ప్రత్యర్థికి మిగిలిన ఆరు వికెట్లను తీయలేకపోవడంతో తమ బౌలింగ్ కూర్పుపై కూడా భారత టీమ్ మేనేజిమెంట్ దృష్టి సారించనుంది. తాజా టెస్టు జరిగే డారెన్ స్యామీ స్టేడియంలో ఇంతకుముందు నాలుగు టెస్టులు మాత్రమే జరగ్గా మూడింటిలో ఫలితం రాలేదు. 2006 పర్యటనలో భారత్ ఇక్కడ ఆడగా ఆ మ్యాచ్ డ్రాగానే ముగిసింది. ఈసారి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండడంతో భారీ స్కోరు నమోదు కానుంది. ఇక ఈ మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జట్టుతో బరిలోకి... రెండో టెస్టు ఆడిన జట్టునే భారత్ ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దించనుంది. ఓపెనర్ మురళీ విజయ్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో అవకాశం దక్కించుకున్న కేఎల్ రాహుల్ ఏకంగా సెంచరీతోనే రాణించాడు. దీంతో జట్టు కూర్పును మార్చే ఆలోచన కనిపించడం లేదు. ఇక ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతోనే మరోసారి ముందుకెళ్లాలని అనుకుంటున్నారు. పేసర్లలో షమీ, ఇషాంత్, ఉమేశ్‌తో పాటు స్పిన్నర్లలో అశ్విన్, మిశ్రా ఈ సిరీస్‌లో ఇప్పటికే తమ సత్తాను చూపిస్తున్నారు. అయితే గత మ్యాచ్ చివరి రోజు మిశ్రా అనుకున్న రీతిలో బౌలింగ్ చేయకపోవడం దెబ్బతీసింది. ఒకవేళ ముగ్గురు స్పిన్నర్లతో వెళ్లాలనుకుంటే యాదవ్ స్థానంలో జడేజా రావచ్చు. బ్యాటింగ్‌లో ధావన్, పుజారాల నుంచి భారీ ఇన్నింగ్స్ రావాల్సి ఉంది. గెలుపే లక్ష్యంగా విండీస్ సొంత గడ్డపై జరుగుతున్న సిరీస్‌లో బోణీ చేయాలనే ఆరాటంలో విండీస్ ఉంది. రెండో టెస్టులో పోరాట పటిమ ఈ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అయితే టాప్ ఆర్డర్ బ్యాటింగ్ బలహీనత తీవ్రంగా ఆందోళనపరిచే అంశం. ఓపెనర్ చంద్రిక స్థానంలో షాయ్ హోప్ ఆడనున్నాడు. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, పుజారా, రహానే, అశ్విన్, సాహా, మిశ్రా, ఇషాంత్, యాదవ్/జడేజా, షమీ. విండీస్: హోల్డర్ (కెప్టెన్), బ్రాత్‌వైట్, డారెన్ బ్రావో, హోప్, శామ్యూల్స్, బ్లాక్‌వుడ్, చేజ్, డోరిచ్, కమిన్స్, బిషూ, గాబ్రియెల్.

జొకోవిచ్ కు మరో షాక్

09/08/2016: రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్లో వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ కు మరో షాక్ తగిలింది. ఆదివారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్ లోనే వెనుదిరిగిన జొకోవిచ్.. రోజు గడవకముందే మరో ఓటమిని ఎదుర్కొన్నాడు. సోమవారం అర్థరాత్రి జరిగిన పురుషుల డబుల్స్లో జొకోవిచ్- నెనాడ్ జిమానిక్ జోడి పరాజయం చవిచూసింది. రెండో రౌండ్ లో భాగంగా జొకోవిచ్ జంట 4-6, 4-6 తేడాతో ఆతిథ్య బ్రెజిల్కు చెందిన నాల్గో సీడ్ మార్సెలో మీలో-బ్రూనో సోర్స్ ద్వయం చేతిలో ఓటమి పాలైంది. గతంలో 2008 ఒలింపిక్స్లో మాత్రమే కాంస్య పతకం సాధించిన జొకోవిచ్.. ఆ తరువాత లండన్ ఒలింపిక్స్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. రియో ఒలింపిక్స్ నుంచి ఆదిలోనే టాప్ సీడ్లు వెనుదిరగడంతో ఆ మెగా ఈవెంట్ లో కాస్త కళ తప్పినట్లు కనబడుతోంది. ఇప్పటికే మహిళల డబుల్స్లో సెరెనా విలియమ్స్-వీనస్ విలియమ్స్ జోడి ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

‘ఫ్లయింగ్ ఫిష్’ కు గోల్డ్ మెడల్

08/08/2016: రియోడీజనీరో: ఈతలో తనకు తిరుగులేదని అమెరికా స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ మరోసారి రుజువు చేశాడు. 23వ ఒలింపిక్ పతకాన్ని గెలిచి తన రికార్డును మరింత పదిలపరుచుకున్నాడు. రియో ఒలింపిక్స్ లో 4X100 ఫ్రిస్టయిల్ ఈత పోటీలో బంగారు పతకం సాధించి బోణి కొట్టాడు. అతడికిది 19వ ఒలింపిక్ గోల్డ్ మెడల్ కావడం విశేషం. 2 రజతాలు, 2 కాంస్యాలు కూడా అతడి ఖాతాలో ఉన్నాయి. ‘ఫ్లయింగ్ ఫిష్’ గా ప్రఖ్యాతి గాంచిన ఈ 6 అడుగుల 4 అంగుళాల ఎత్తున్న స్విమ్మర్ రియో ఒలింపిక్స్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో ఫెల్ప్స్ ఏకంగా 8 స్వర్ణాలు గెలిచి ఒకే ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు నెగ్గిన క్రీడాకారుడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు కూడా తిరగ రాస్తాడేమో చూడాలి.

సీపీల్ టైటిల్ గెలిచిన క్రిస్ గేల్ టీమ్

08/08/2016: సెయింట్ కిట్స్: క్రిస్ గేల్ నాయకత్వంలోని జమైకా తల్వాస్ టీమ్.. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)-2016 విజేతగా నిలిచింది. శనివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గయానా అమెజాన్ వారియర్స్ ను 9 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ దక్కించుకుంది. కెప్టెన్ క్రిస్ తనదైన శైలిలో ఆడి జట్టుకు సునాయాస విజయాన్ని అందించాడు. 94 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని జమైకా టీమ్ 43 బంతులు మిగిలివుండగానే ఛేదించింది. 12.5 ఓవర్లలో వికెట్ నష్టపోయి 95 పరుగులు చేసింది. గేల్ 27 బంతుల్లో 6 సిక్సర్లు, 3 ఫోర్లతో 54 పరుగులు చేసి అవుటయ్యాడు. వాల్టన్(25), సంగక్కర(12) నాటౌట్ గా నిలిచారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన జమైకా 16.1 ఓవరల్లో 93 పరుగులకు ఆలౌటైంది. జమైకా బౌలర్లలో ఇమాద్ వసీం 3, షకీబ్ అల్ హసన్ 2, విలియమ్స్ 2 వికెట్లు పడగొట్టారు. రసెల్, థామస్ చెరో వికెట్ తీశారు. ఇమాద్ వసీం 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు. రసెల్ కు 'మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్' దక్కింది. జమైకా తల్వాస్.. సీపీఎల్ దక్కించుకోవడం ఇది రెండోసారి.

జొకోవిచ్ ఇంటికి..

08/08/2016: రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్లో సంచలనం నమోదైంది. పురుషుల టెన్నిస్ సింగిల్స్ మ్యాచ్ లో వరల్డ్ నంబర్ వన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. ఒలింపిక్స్ రెండో రోజు గేమ్స్లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి జరిగిన పోరులో జొకోవిచ్ 6-7(4/7), 6-7(2/7)తేడాతో డెల్ పాట్రో(అర్జెంటీనా) చేతిలో పరాజయం చవిచూశాడు. ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన పోరులో రెండు సెట్ లూ టై బ్రేక్ కు దారి తీశాయి. అయితే పెట్రో దాటికి జొకోవిచ్ తలవంచతూ ఒలింపిక్స్ నుంచి భారంగా నిష్క్రమించాడు. గత లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతక పోరులో జొకోవిచ్ ను ఓడించిన డెల్ పోట్రో.. మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. దీంతో గోల్డెన్ స్లామ్ సాధించే అవకాశాన్ని జొకోవిచ్ జారవిడుచుకున్నాడు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన అనంతరం కెరీర్ గ్రాండ్ స్లామ్ సాధించిన జొకోవిచ్.. తాజా ఒలింపిక్స్లో స్వర్ణం పతకం గెలిస్తే గోల్డెన్ స్లామ్ అతని సొంతమయ్యేది. కాగా, తొలి రౌండ్లోనే జొకోవిచ్ వెనుదిరగడంతో ఆ అవకాశం కోసం మరో నాలుగు సంవత్సరాల పాటు నిరీక్షించక తప్పదు. ఒలింపిక్స్ నుంచి జొకోవిచ్ నిష్క్రమించడంతో బ్రిటన్ స్టార్ ఆటగాడు ఆండీ ముర్రే మరోసారి పసిడి రేసులో నిలిచే అవకాశం ఉంది. గత లండన్ ఒలింపిక్స్లో ముర్రే స్వర్ణం సాధించగా, రోజర్ ఫెదరర్ కు రజతం, డెల్ పెట్రోకు కాంస్యం దక్కాయి.

ఉత్కంఠ రేపుతోన్న ఆగస్టు 14..

08/08/2016: రియో డి జెనిరో: భారత స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15కు ఒక్కరోజు ముందు జరగబోయే పోటీపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. భారత జిమ్నాస్టిక్స్‌లో కొత్త చరిత్రను లిఖిస్తూ.. 52 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రియో ఒలింపిక్స్ అర్హత సాధించిన జిమ్నస్ట్ దీపా కర్మాకర్.. ఆదివారం రాత్రి జరిగిన వాల్ట్ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చి, ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయురాలు ఆమెనే కావడం విశేషం. ఒలింపిక్స్లో భారత్కు పతకం ఆశలను సజీవంగా నిలిపిన ఆమె.. ఆగస్టు 14న జరగబోయే ఫైనల్స్ లో వివిధ దేశాలకు చెందిన ఏడుగురు జిమ్నాస్ట్ లతో తలపడనుంది. తుదిపోరులోనూ ఆమె మెరిసి పతకం సాధించాలని దేశం యావత్తు కోరుకుంటోంది. (భారత ఆశా'దీపం') ఒక్క హాకీ తప్ప అన్ని క్రీడాంశాల్లోనూ భారత క్రీడాకారులు ఫైఫల్యాల బాట పడుతున్నవేళ.. ఆదివారం జరిగిన మహిళల క్వాలిఫయింగ్‌లో దీపా వాల్ట్ విభాగంలో 14.850 పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. మొదటి ప్రయత్నంలో భాగంగా డిఫికల్టీలో 7.0, ఎగ్జిక్యూషన్ లో 8.1 పాయింట్లు సాధించిన దీపా.. రెండో రౌండ్ డిఫికల్టీలో మాత్రం 6.0 పాయింట్లు మాత్రమే సాధించింది. మొదటి రౌండ్లో వాల్ట్పై ధీమాగా నిలబడగలిగిన ఆమె, రెండో రౌండ్ 'ట్రస్క్ డబుల్ ఫుల్ ట్విస్ట్'ను ప్రదర్శించడంలో కాస్త తడబాటుకులోనైంది. మొత్తానికి 14.850 పాయింట్లు సాధించిన మొదటి ఎనిమిది మందిలో ఒకరిగా ఫైనల్స్ లోకి ప్రవేశించింది. కెనడియన్ జిమ్నాస్ట్ షాలోన్ 14.950 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. (కొండగాలి తిరిగింది) ఇక మిగతా పొజిషన్లను గమనిస్తే మూడు సార్లు ప్రపంచ చాంపియన్, అమెరికన్ జిమ్నాస్ట్ అయిన సిమోనె బైల్స్ 16.050 పాయింట్లతో మొదటిస్థానాన్ని ఆక్రమించింది. ఆమె రెండు రౌండ్లలోనూ ఎగ్జిక్యూషన్ లో 9.700 పాయింట్లు సాధించింది. నార్త్ కొరియాకు చెందిన జాంగ్ ఉన్ హాంగ్ 15.683 పాయింట్లతో రెండో స్థానాన్ని, స్విట్జర్లాండ్ జిమ్నాస్ట్ గులియా స్టెయిన్ బర్గ్ మూడో(15.266 పాయింట్లు) స్థానంలో నిలిచారు. వీరంతా ఆగస్టు 14న జరిగే మహిళల వ్యక్తిగత విభాగ పతకాల కోసం పోటీపడతారు. ఇక మిగతా క్రీడాంశాల్లో భారత టీటీ, షూటర్లు, టెన్నిస్ స్టార్ సానియా మిర్జా, వెయిట్ లిఫ్టర్లు, ఆర్చరీ జట్లు ఓటమిచెందాయి. కాగా, రేపు (ఆగస్టు 9న) దీపాకర్మాకర్ పుట్టినరోజని, పతకం సాధింస్తే అంతకంటే గొప్ప గిఫ్ట్ ఉండబోదని ఆమె తండ్రి దులాల్ కర్మాకర్ అంటున్నారు. (రెండో రోజూ భారత్ కు వైఫల్యాలే)

ఆటగాళ్లతో పాటు పోలీసు కూడా..- చోరీలకు విరుగుడుగా చైనా ఆలోచన

06/08/2016: బీజింగ్: రియో డి జనీరోలో ఎక్కడ చూసినా స్వైరవిహారం చేస్తున్న దొంగల నుంచి తమ ఆటగాళ్లను కాపాడుకునేందుకు చైనా సరికొత్త ఆలోచన చేసింది. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు 416 మంది అథ్లెట్లతో కూడిన భారీ బృందం బ్రెజిల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే వీరిలో కొందరిపై చోరులు తమ హస్తలాఘవాన్ని ప్రదర్శించారు. దీంతో ఓ పోలీసును వారికి రక్షణగా చైనా పంపించింది. షావో వీమిన్ అనే పేరుగల అధికారి ఇప్పటికే రియోకు చేరుకున్నారు. తాత్కాలిక పోలీస్ కమ్యూనికేషన్ అధికారి హోదాలో ఉండే తను స్థానిక పోలీసులతో అనుసంధానంగా వ్యవహరిస్తారు. కానీ నేరుగా పోలీసు విధులు మాత్రం నిర్వహించరు. బ్రెజిల్‌కు రాగానే తన కంప్యూటర్‌ను పోగొట్టుకున్నానని చైనా హర్డిల్ ఆటగాడు షి డొంగ్‌పెంగ్ ఆరోపించగా మిగతా చైనా పర్యాటకులపై కూడా అక్కడి నేరగాళ్లు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. దీంతో గేమ్స్‌ను వీక్షించేందుకు వచ్చే తమ దేశస్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇదివరకే చైనా హెచ్చరించింది. వీధుల్లో నడిచేటప్పుడు ఫోన్లలో మాట్లాడకూడదని, విలువైన సామాన్లను గదిలోనే భద్రపరుచుకోవాలని సూచించింది.

భారత క్రీడాకారులకు ప్రణబ్ శుభాకాంక్షలు

06/08/2016: న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. ఇతర దేశాల క్రీడాకారులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, ప్రపంచ దేశాలకు ఐకమత్యాన్ని చాటి చెప్పాలని భారత ఆటగాళ్లకు ఆయన సూచించారు. ప్రతీ క్రీడాకారుడు తనను తాను నిరూపించుకునే మెరుగైన వేదిక ఒలింపిక్స్ అనీ, ప్రపంచస్థాయి క్రీడాకారులతో తలపడే సమయంలో అద్భుతమైన పోరాటపటిమ కనబరచాలని ప్రణబ్ సూచించారు. భారత్ చెఫ్ డె మిషన్ మిషన్కు చెందిన రాకేష్ గుప్తాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మెగా ఈవెంట్‌లో మనవాళ్లంతా దేశం గర్వించే ప్రదర్శన చేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ఆకాంక్షించారు.

ఒకే రోజు 21 వికెట్లు - హెరాత్ హ్యాట్రిక్ - ఆసీస్‌పై విజయం దిశగా శ్రీలంక

06/08/2016: గాలె : బౌలర్లు రాజ్యమేలుతున్న శ్రీలంక, ఆస్ట్రేలియా రెండో టెస్టులో రెండో రోజు ఏకంగా 21 వికెట్లు నేలకూలాయి. ఇరు జట్ల బౌలర్ల దెబ్బకు శుక్రవారం ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌తో పాటు శ్రీలంక రెండో ఇన్నింగ్స్ కూడా ముగియడం విశేషం. ముందుగా 54/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన ఆసీస్‌ను హెరాత్ (4/35) హ్యాట్రిక్‌తో కట్టడి చేశాడు. అటు దిల్‌రువాన్ పెరీరా (4/29) కూడా విజృంభించడంతో ఆ జట్టు 33.2 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. వార్నర్ (42) టాప్ స్కోరర్. అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన లంక 59.3 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటైంది. దిల్‌రువాన్ పెరీరా (64) రాణించాడు. స్టార్క్ ఆరు, లియోన్ రెండు వికెట్లు తీశారు. ఇక 413 పరుగుల లక్ష్యంతో తమ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్ ఆట ముగిసేసరికి 6 ఓవర్లలో మూడు వికెట్లకు 25 పరుగులు చేసింది. క్రీజులో వార్నర్ (22 బ్యాటింగ్), స్మిత్ (1 బ్యాటింగ్) ఉన్నారు.

నిరాశపరిచిన బ్రెజిల్ సాకర్ స్టార్

06/08/2016: రియోడిజనీరో: బ్రెజిల్ ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ నెయ్‌మార్ ఆశించిన రీతిలో రాణించకపోవడంతో ఒలింపిక్స్‌లో తమ తొలి మ్యాచ్‌ను బ్రెజిల్ జట్టు డ్రా చేసుకుంది. గ్రూప్ ఎ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్ చివరికి 0-0తో ముగిసింది. ఇరు జట్ల నుంచి గోల్స్ కోసం ఆటగాళ్లు ఎంత ప్రయత్నించినా కనీసం ఒక్క గోల్ కూడా చేయలేకపోయారు. ప్రథమార్ధంలో నెయ్‌మార్ రెండు షాట్లను ప్రత్యర్థి గోల్ కీపర్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత బ్రెజిల్ మాత్రమే కాదు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు గోల్ పోస్ట్ లోకి బంతిని ఒక్కసారి కూడా చేర్చలేకపోవడంతో ఎలాంటి గోల్ నమోదు కాకుండా మ్యాచ్ డ్రా అయింది. ఇదే గ్రూపులో ఇరాక్, డెన్మార్క్ మ్యాచ్ కూడా గోల్స్ లేకుండా డ్రాగా ముగిసింది. గ్రూప్ బి లో నైజీరియా 5-4తో జపాన్‌పై గెలవగా, స్వీడన్ 2-2తో కొలంబియాతో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. గ్రూప్ సి లో జర్మనీ, మెక్సికో మ్యాచ్ 2-2తో డ్రా కాగా దక్షిణ కొరియా 8-0తో ఫిజీపై ఘనవిజయం సాధించింది. గ్రూప్ డిలో హోండురస్ 3-2తో అల్జీరియాపై, మరో మ్యాచ్ లో పోర్చుగల్ 2-0తో అర్జెంటీనాపై నెగ్గాయి.

సెమీస్‌లో శ్రీకృష్ణప్రియ

06/08/2016: హైదరాబాద్: వీవీ నాథూ స్మారక అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలంగాణ అమ్మాయిలు శ్రీకృష్ణప్రియ, రుత్విక శివాని, రితూపర్ణ దాస్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. పుణెలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో శ్రీకృష్ణప్రియ 21-13, 20-22, 21-15తో నాలుగో సీడ్ సాయి ఉత్తేజిత రావు (ఆంధ్రప్రదేశ్)పై సంచలన విజయం సాధించగా... రుత్విక శివాని 21-17, 16-21, 23-21తో రెండో సీడ్ నేహా పండిత్ (మహారాష్ట్ర)పై, రితూపర్ణ 21-18, 21-13తో రేష్మా కార్తీక్ (ఎయిరిండియా)పై గెలిచారు. మహిళల డబుల్స్ విభాగంలో మనీషా-సిక్కి రెడ్డి జంట సెమీస్‌లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో మనీషా-సిక్కి రెడ్డి ద్వయం 16-21, 21-9, 21-15తో శ్రుతి-హరిత (కేరళ) జోడీపై గెలిచింది.

డారెన్ స్యామీ ఆవేదన

06/08/2016: డారెన్ స్యామీ ఆవేదన సెయింట్ జాన్స్(ఆంటిగ్వా): వెస్టిండీస్కు రెండు టీ 20 వరల్డ్ కప్లు అందించిన ఏకైక కెప్టెన్ డారెన్ స్యామీ. అయితే స్యామీని టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ వెస్టిండీస్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తన ఫేస్బుక్ అకౌంట్లో అభిమానులకు తెలియజేసిన స్వామీ ఆవేదన వ్యక్తం చేశాడు. కేవలం సెలక్టర్లు తనతో 30 సెకెండ్లపాటు మాత్రమే మాట్లాడి కెప్టెన్సీ తొలిగిస్తున్నట్లు చెప్పడం తీవ్ర వేదనకు గురిచేసిందన్నాడు. 'శుక్రవారం సెలక్టర్ల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ సారాంశ ఏంటంటే నన్ను కెప్టెన్సీ తప్పిస్తున్నట్లు విండీస్ సెలక్షన్ కమిటీ చైర్మన్ తెలిపారు. ఆ విషయాన్ని కూడా 30 సెకెండ్లలోముగించి కాల్ కట్ చేశారు. మా బోర్డు ఇలా చేయడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. టీ 20 కెప్టెన్సీ నియమాకానికి కొత్త వ్యక్తి అన్వేషణలో ఉన్నట్లు మా సెలక్షన్ చైర్మన్ పేర్కొన్నారు. విండీస్ సెలక్టర్లను నా ఆట ఆకట్టుకోలేదట. ఈ కారణం చేతనే కెప్టెన్సీ నుంచి తొలిగిస్తున్నట్లు చెప్పారు. ఇక విండీస్ కు టీ 20 కెప్టెన్ గా ఎంపిక కాలేనేమో' అని స్యామీ ఆందోళన వ్యక్తం చేశాడు.

ఆశల పల్లకిలో...119 మందితో భారత బృందం సిద్ధం

05/08/2016: రియో: గత ఒలింపిక్స్‌ను మించిన ప్రదర్శనతో, మరిన్ని పతకాలు సాధించే లక్ష్యంతో భారత క్రీడాకారులు రియోలో సత్తా చాటేందుకు సన్నద్ధమయ్యారు. ఒలింపిక్స్‌లో తొలి సారి మన దేశంనుంచి వంద మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటుండటం విశేషం. ఈసారి సుమారు 10 పతకాలు వస్తాయని ఆశ. షూటింగ్‌లో బింద్రా, నారంగ్, రెజ్లింగ్‌లో యోగేశ్వర్, బ్యాడ్మింటన్‌లో సైనా, సింధులకు పతకం సాధించే సత్తా ఉంది. మహిళల ఆర్చరీలో దీపికా కుమారి, బాక్సింగ్‌లో శివ థాపా, మనోజ్ కుమార్ మెడల్ అందుకోగల సమర్థులు. ఇటీవల నిలకడగా రాణిస్తున్న పురుషుల హాకీ జట్టునుంచి కూడా అభిమానులు పతకం ఆశిస్తున్నారు. టెన్నిస్‌లో మిక్స్‌డ్ డబుల్స్ జోడి సానియా మీర్జా-రోహన్ బొపన్న పతకం గెలిచేందుకు ఇది సరైన తరుణం. అథ్లెటిక్స్‌లో ఎక్కువ మంది వెళుతున్నా... మెడల్ కోసం ఏదైనా సంచలనం జరగాల్సిందే.

క్వార్టర్‌ఫైనల్లో కృష్ణప్రియ

05/08/2016: హైదరాబాద్: వి.వి.నటూ మెమోరియల్ ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలంగాణ అమ్మాయి కె.శ్రీకృష్ణప్రియ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మహారాష్ట్రలోని పుణేలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆమె ప్రిక్వార్టర్స్‌లో 21-19, 21-8తో వైష్ణవి బాలీ (మహారాష్ట్ర)పై గెలుపొందింది. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందిన కృష్ణప్రియ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో చెన్నై ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తోంది.

మేము ఆడితే లోకమే చూడదా - నేటి నుంచే రియోలో విశ్వక్రీడా సంరంభం

05/08/2016: ప్రపంచాన్ని ఒక్కచోటికి చేర్చే అద్భుత క్రీడా సంబరమిది. చూసేందుకు రెండు కళ్లూ చాలని అరుదైన ఆటల పండుగ ఇది. 206 దేశాలు.. 10,500 మంది క్రీడాకారులు ఒకే వేదికలో పోటీ పడే మహా క్రీడల కుంభమేళా ఇది.నాలుగేళ్లకోసారి ప్రపంచం దృష్టినంతా తనవైపు తిప్పుకునే విశ్వక్రీడా సంబరం మళ్లీ వచ్చేసింది. బ్రెజిల్‌ నగరం రియో డి జెనీరోలో స్థానిక కాలమానం ప్రకారం ఒలింపిక్స్‌ వేడుకలు శుక్రవారం (ఆగస్టు 5న) శ్రీకారం చుట్టుకుంటున్నాయి. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున మారకానా స్టేడియంలో ఆరంభోత్సవం జరుగుతుంది. ఒలింపిక్స్‌ భారతం 26 ఒలింపిక్స్‌లో భారత్‌ గెలిచిన పతకాలు. అందులో 9 స్వర్ణాలు కాగా.. 6 రజతాలు, 11 కాంస్యాలు. 1900 నుంచి ఇప్పటిదాకా 23సార్లు భారత్‌ ఒలింపిక్స్‌లో పోటీ పడింది. 17 సార్లు పతకాలు నెగ్గగా.. ఆరుసార్లు శూన్యహస్తమే. 1 వ్యక్తిగత విభాగంలో భారత్‌కు దక్కిన స్వర్ణం ఒక్కటే. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో షూటర్‌ అభినవ్‌ బింద్రా సాధించాడు. 6 లండన్‌ ఒలింపిక్స్‌ (2012)లో భారత్‌కు దక్కిన పతకాలు. ఒక ఒలింపిక్స్‌లో భారత్‌ సాధించిన అత్యధిక పతకాలివే. అందులో 2 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి. 11 ఒలింపిక్స్‌లో భారత్‌కు అత్యధిక పతకాలు దక్కింది హాకీలో. 8 స్వర్ణాలు సహా 11 పతకాలు సాధించారు హాకీ వీరులు. 1928-1956 మధ్య భారత్‌ వరుసగా ఆరుసార్లు స్వర్ణాలు గెలవడం విశేషం. మన సైన్యం 118 గత ఒలింపిక్స్‌కు 81 మంది క్రీడాకారుల్ని పంపిన భారత్‌.. ఈసారి రికార్డు స్థాయిలో 118 మందిని బరిలోకి దించుతోంది. మన సైన్యం 100 దాటడం ఇదే తొలిసారి. లండన్‌లో 6.. ఈసారి..? 1996, 2000, 2004.. మూడు ఒలింపిక్స్‌లోనూ ఒక్కో పతకంతో సరిపెట్టుకుంటూ వచ్చిన భారత్‌.. బీజింగ్‌లో మూడు పతకాలతో మురిసింది. నాలుగేళ్ల కిందట ఆ సంఖ్యను రెట్టింపు చేస్తూ 6 పతకాలు సాధించింది. ఈసారి పతకాల సంఖ్య మరింత పెరిగి రెండంకెలకు చేరుతుందని ఆశ. తొలిసారి.. దక్షిణ అమెరికాలో నిర్వహిస్తున్న తొలి ఒలింపిక్స్‌ ఇదే. ఉత్తర అమెరికాలో ఆరుసార్లు, ఐరోపాలో పదహారుసార్లు, ఆసియాలో మూడుసార్లు, ఓసియానియాలో రెండుసార్లు క్రీడలు జరిగాయి. తొలి పతక పోటీ ఆరంభోత్సవానికి ముందే బుధవారం ఫుట్‌బాల్‌ పోటీలతో ఒలింపిక్స్‌ మొదలైపోయాయి. ఐతే తొలి పతక పోటీ సైక్లింగ్‌లో ఉంటుంది. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6 గంటలకు ఆ పోటీ జరుగుతుంది. చిహ్నం వినిసియస్‌ ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే దేశం తమ సంస్కృతిని ప్రతిబింబించేలా చిహ్నాల్ని రూపొందించి వాటి ద్వారా క్రీడలకు ప్రచారం కల్పించడం పరిపాటి. రియో ఒలింపిక్స్‌ కోసం బ్రెజిల్‌ ఎంపిక చేసిన చిహ్నం పేరు వినిసియస్‌. బ్రెజిల్‌లో ఎక్కువగా కనిపించే జంతువుల ఉమ్మడి రూపంతో ఈ చిహ్నాన్ని తీర్చిదిద్దారు. ఈసారి కొత్తగా.. ఈ ఒలింపిక్స్‌లో కొత్తగా చేర్చిన క్రీడలు గోల్ఫ్‌, రగ్బీ. వీటిలో గోల్ఫ్‌ 112 ఏళ్ల తర్వాత అర్హత సాధించగా, రగ్బీని నిర్వహించడం ఇదే తొలిసారి.

ఫైనల్లో సాయి దేదీప్య జోడి

04/08/2016: హైదరాబాద్: ఆలిండియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి సాయి దేదీప్య డబుల్స్‌లో తుదిపోరుకు అర్హత సాధించింది. హరియాణాలోని కర్నాల్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో ఆమె సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లో ఓడింది. అయితే డబుల్స్ విభాగంలో బుధవారం జరిగిన సెమీస్‌లో దేదీప్య-హిమానీమోర్ (హరియాణా) జోడి 7-5, 6-0తో రిధి శర్మ (హరియాణా)- ముస్కాన్ గుప్తా (ఢిల్లీ) జంటపై విజయం సాధించింది. గురువారం జరిగే టైటిల్ పోరులో తెలంగాణ-హరియాణా ద్వయం... నీరు-యుబ్రాని బెనర్జీ (బెంగాల్) జంటతో తలపడనుంది. సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయి దేదీప్య 6-7 (5/7), 3-6తో యుబ్రాని బెనర్జీ చేతిలో ఓడింది

రియోలో స్వాగత సందడి

04/08/2016: రియో డి జనీరో : బ్రెజిల్ సంస్కృతిని తెలిపే నృత్యాలతో బుధవారం క్రీడాగ్రామం సందడిగా మారింది. ఆటపాటలతో బ్రెజిల్ కళాకారులు ఒలింపియన్లకు ఘనస్వాగతం పలికారు. భార త బృందంతో పాటు బహమాస్, నార్వే, బర్కినా ఫసో, గాంబియా క్రీడాకారులు కూడా ఈ అధికారిక స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. 45 నిమిషాల పాటు జరిగిన ఈ ఈవెంట్‌లో భారత క్రీడాకారులు ఉల్లాసంగా గడిపారు. తొలుత జాతీయ గీతాలాపనతో ప్రారంభమైన ఈ ఉత్సవంలో గిరిజన నృత్యాలు అలరించాయి. అనంతరం బ్రెజిలియన్ దిగ్గజ సంగీత దర్శకులు రౌల్ సేక్సస్, టిమ్ మైయా స్వరపరిచిన బాణీలతో పాటు లేటెస్ట్ హిట్‌సాంగ్స్, ఫర్, సాంబా నృత్యాలతో కళాకారులు భారత బృందానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారత ఒలింపిక్ సంఘం జత వెండి ఏనుగులు, బంగారు నెమలి ప్రతిమలతో క్రీడాగ్రామం మేయర్ జనేత్ ఆర్కేన్‌ను సత్కరించింది. అనంతరం ఒలింపిక్ క్రీడల ప్రాశస్త్యం గురించి జనేత్ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి షూటర్లు జీతూరాయ్, ప్రకాశ్ నంజప్ప, గుర్‌ప్రీత్ సింగ్, చెయిన్ సింగ్, అథ్లెట్లు కుశ్‌బీర్ కౌర్, మన్‌ప్రీత్ కౌర్, మహిళల హాకీ జట్టు, స్విమ్మర్లు సాజన్, శివానితో పాటు పలువురు కోచ్‌లు, అధికారులు హాజరయ్యారు. ఈసారి భారత్ నుంచి 15 క్రీడాంశాల్లో 120 మంది క్రీడాకారులు రియోలో పోటీపడనున్నారు. ఇప్పటికే రియో చేరుకున్న భారత క్రీడాకారులకు బారా ఒలింపిక్ పార్క్‌కు సమీపంలో ఉన్న 31వ నంబరు భవంతిని కేటాయించారు. కుర్చీలు, టీవీలు కొనే పనిలో... భారత హాకీ జట్టుకు కావాల్సిన టీవీ సెట్లను, కుర్చీలను సమకూర్చడంలో గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ విఫలమైంది. అదనపు కుర్చీలు కావాలని కోరుతూ భారత చెఫ్ డి మిషన్ రాకేశ్ గుప్తా చేసిన విజ్ఞప్తికి నిర్వాహకుల నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో భారత ఎంబసీ ద్వారా రాకేశ్ టీవీలు, కుర్చీలు కొనుగోలు చేయనున్నారు. మరో రెండు రోజుల్లో ఇవి ఆటగాళ్లకు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు.

బ్యాట్స్ మన్ సస్పెన్షన్

04/08/2016: ట్రిబాంగో నైట్ రైడర్స్ బ్యాట్స్మన్ విలియమ్ పెర్కిన్స్ వేటు పడింది. కాంట్రాక్టును ఉల్లఘించినందుకు అతడు సస్పెన్షన్ కు గురయ్యాడు. వెస్టిండీస్ లో జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) మిగతా మ్యాచుల్లో అతడు ఆడకుండా నిషేధం విధించారు. థర్డ్ పార్టీతో చేతులు కలిపినందుకు అతడిపై చర్య తీసుకున్నారు. ప్లేయర్ కాంట్రాక్టు నిబంధనల్లో 10.1.1, 10.1.2లను అతడు ఉల్లంఘించినట్టు నిర్థారించారు. సీపీఎల్ సెక్యురిటీ టీమ్, ఐసీసీ అవినీతి వ్యతిరేక బృందం మేనేజర్ రిచర్డ్ రెనాల్డ్స్ సూచనల మేరకు పెర్కిన్స్ పై వేటు పడింది. తనపై తీసుకున్న చర్యలను అతడు అంగీకరించాడు. సీపీఎల్ తర్వాతి మ్యాచులకు దూరంగా ఉంటానని ప్రకటించాడు. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ ట్రిబాంగో నైట్ రైడర్స్ నేడు జరిగే ప్లేఆఫ్ మ్యాచ్ లో సెయింట్ లూసియా జూక్స్ తో తలపడనుంది.

చివరికి డ్రాగా ముగిసిన రెండో టెస్టు

04/08/2016: కింగ్‌స్టన్‌: వెస్టిండీస్‌తో రెండో టెస్టులో ఇన్నింగ్స్‌ విజయం ఖాయమనుకున్న భారత్‌కు నిరాశే ఎదురైంది. నాలుగోరోజు కురిసిన వర్షంతో విజయం వాయిదా పడుతుందనుకున్న టెస్ట్‌.. చివరికి అనూహ్యంగా మలుపు తిరిగింది. విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఛేజ్‌(137, 269 బంతుల్లో 15*4, 1*6) అజేయ పోరాట ఫలితంగా చివరికి మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. మొదటి నాలుగురోజులు అద్భుతంగా బౌలింగ్‌ చేసిన భారత బౌలర్లు ఆఖరి రోజు చేతులెత్తేయడంతో విజయం వరించినట్లే వరించి చేజారింది. సూపర్‌ ‘ఛేజ్‌’ నాలుగోరోజు 48 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన విండీస్‌ ఐదో రోజు అనూహ్యంగా పుంజుకుంది. అప్పటికే క్రీజులో ఉన్న బ్లాక్‌వుడ్‌ మరోసారి రెచ్చిపోయాడు. వన్డే తరహాలో దూకుడుగా ఆడుతూ స్కోరు వేగాన్ని పెంచాడు. అతడికి ఛేజ్‌ తోడవ్వడంతో కేవలం 41 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తిచేశాడు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 17.4 ఓవర్లలో 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అశ్విన్‌ బౌలింగ్‌లో పుజారాకు క్యాచ్‌ ఇచ్చి బ్లాక్‌వుడ్‌ (63) వెనుదిరిగాడు. ఛేజ్‌ క్రీజులో నిలదొక్కుకోవడం.. అతడికి డౌరిచ్‌ తోడవ్వడంతో స్కోరు మరోసారి వేగం పుంజుకుంది. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 162 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రమాదకరంగా మారిన డౌరిచ్‌(74)ను మిశ్రా పెవిలియన్‌కు పంపాడు. ఇంతలో ఛేజ్‌ తన కెరీర్‌ తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హోల్డర్‌(64 నాటౌట్‌)సైతం దూకుడు ప్రదర్శించడంతో మ్యాచ్‌ ముగిసే సరికి విండీస్‌ 388/6 పరుగులు చేయడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో 196కే విండీస్‌ ఆలౌట్‌ కాగా.. భారత్‌ 500/9 వద్ద డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే. చేతులెత్తేసిన బౌలర్లు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన ప్రతిభను కనబరిచిన భారత బౌలర్లు ఆఖర్లో చేతులెత్తేశారు. నాలుగోరోజు నాలుగు కీలక వికెట్లు తీసి విండీస్‌ను కష్టాల్లోకి నెట్టిన బౌలర్లు.. ఆఖరి రోజు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. చివరి రోజు 88 ఓవర్లు ఆడిన విండీస్‌ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 340 పరుగులు చేసిందంటే భారత బౌలర్ల ప్రదర్శన ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విండీస్‌ బ్యాట్స్‌మెన్లు ఛేజ్‌ శతకం చేయగా.. బ్లాక్‌వుడ్‌, డౌరిచ్‌, హోల్డర్‌ అర్ధ శతకాలు నమోదు చేశారు. ఇన్నింగ్స్‌ విజయం ఖాయమనుకున్న మ్యాచ్‌ చేజారింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 196; భారత్ తొలి ఇన్నింగ్స్ 500/9 డిక్లేర్డ్‌ వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: బ్రాత్‌వైట్ రాహుల్ (సి) మిశ్రా (బి) 23; చంద్రిక (బి) ఇషాంత్ 1; బ‌్రావో రాహుల్ (సి) షమి (బి) 20; శామ్యూల్స్ (బి) అశ్విన్ 0; బ్లాక్‌వుడ్ పుజారా (సి) అశ్విన్ (బి) 63; ఛేజ్ (బ్యాటింగ్) 137; డౌరిచ్ ఎల్బీ (బి) మిశ్రా 74; హోల్డర్ (బ్యాటింగ్) 64; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం 388(104 ఓవర్లలో 6 వికెట్లకు) వికెట్ల పతనం: 1-5, 2-41, 3-41, 4-48, 5-141, 6-285 బౌలింగ్:ఇషాంత్ 18-3-56-1; షమి 19-3-82-2; మిశ్రా 25-6-90-2; ఉమేశ్ 12-2-44-0; అశ్విన్ 30-4-114-1

క్వార్టర్ ఫైనల్లో సాయిదేదీప్య

03/08/2016: హైదరాబాద్: ఆలిండియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి వై. సాయిదేదీప్య రెండు విభాగాల్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. హరియాణాలోని కర్నాల్‌లో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో మంగళవారం జరిగిన బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆమె 6-0, 7-6 (7/5)తో విభశ్రీ గౌడ (కర్ణాటక)ను కంగుతినిపించింది. బుధవారం జరగనున్న క్వార్టర్ ఫైనల్లో దేదీప్య... పశ్చిమ బెంగాల్‌కు చెందిన యుబ్రాని బెనర్జీతో తలపడనుంది. డబుల్స్‌లోనూ దేదీప్య-హిమానీ మోర్ (హరియాణా) జంట క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.

‘క్లీన్‌చిట్’ను సమీక్షిస్తాం - నర్సింగ్ వివాదంపై ‘వాడా’ ప్రకటన

03/08/2016: న్యూఢిల్లీ: డోపింగ్ వివాదంనుంచి బయట పడ్డానని ఆనందంలో ఉన్న రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కు మరో పరీక్ష ఎదురైంది. నర్సింగ్ నిర్దోషి అంటూ జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ఇచ్చిన క్లీన్‌చిట్‌పై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) స్పందించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని తాము మరోసారి సమీక్షిస్తామని ‘వాడా’ ప్రకటించింది. ‘ఈ కేసుకు సంబంధించిన ఫైల్‌కు మాకు పంపమని ‘నాడా’ను కోరాం. మేం దీనిని మరోసారి సమీక్షిస్తాం. ఇప్పుడే ఇంకా ఏమీ చెప్పలేం’ అని వాడా ఉన్నతాధికారి మ్యాగీ డ్యురాంగ్ వెల్లడించారు. మరోవైపు నర్సింగ్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు. ఎలాంటి ఆందోళనా లేకుండా దేశానికి పతకం తెచ్చేలా దృష్టిపెట్టాలని మోదీ సూచించారని చెప్పాడు.

ఒలింపిక్స్ కు వెళ్తానని.. జైలుకు వెళ్లాడు!

03/08/2016: న్యూఢిల్లీ: బాక్సింగ్ కోచ్ అనిల్ మాలిక్ తన మొబైల్ ఫోన్ లో ఉన్న పాత ఫొటోను చూస్తున్నారు. ఫొటో కింద కుడివైపు 2011, ఆగస్టు 28 తేదీ స్టాంపు ఉంది. పుణేలో 2011లో జరిగిన జాతీయ జూనియర్ బాక్సింగ్ టోర్నిలో విజేతలుగా నిలిచిన బాక్సర్ల ఫోటో అది. అందులో ఒక బాక్సర్ మెడలో బంగారు పతకం, ముఖంలో నవ్వుతో వెలిగిపోతున్నాడు. అతడి పేరు దీపక్ పహల్. 'జాతీయ పతకంతో అతడు సంతృప్తి చెందాలనుకోవడం లేదు. ఒలింపిక్స్ కు వెళ్లాలనేది అతడి లక్ష్యం. రియో ఒలింపిక్స్ లో కచ్చితంగా పాల్గొంటానని నాతో అతడు చెప్పాడు. 16 ఏళ్ల కుర్రవాడికి ఇది పెద్ద లక్ష్యమే అయినప్పటికీ అతడిపై నాకు నమ్మకం ఉంద'ని మాలిక్ చెప్పాడు. ఐదేళ్లు గడిచాయి. రియో ఒలింపిక్స్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. కానీ ఒలింపిక్స్ వెళ్తానన్న జూనియర్ బాక్సింగ్ చాంపియన్ దీపక్ పహల్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. జితేందర్ అనే గ్యాంగ్స్టర్ పారిపోవడానికి సహకరించాడన్న ఆరోపణలతో పహల్ ను జూలై 30 హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. జితేందర్ ను ఢిల్లీలోని రోహిణి జైలు నుంచి సోనిపట్ కోర్టుకు తీసుకెళుతుండగా ఓ ముఠా పోలీసుల కళ్లలో కారం కొట్టి అతడిని తప్పించింది. పోలీసులు అరెస్ట్ చేసిన 10 మంది ముఠాలో పహల్ కూడా ఉన్నాడు. జితేందర్ పారిపోవడానికి పహాల్ రెండు కార్లు సమకూర్చాడు. అందులో ఒక కారు చోరీ చేసిందని పోలీసులు గుర్తించారు. మంచి ప్రతిభవున్న పహల్ నేరస్తుడిగా మారడం తాను ఊహించలేదని మాలిక్ పేర్కొన్నాడు.

డివిలియర్స్, మోర్కెల్లకు ఉద్వాసన

03/08/2016: జోహన్నెస్ బర్గ్: న్యూజీలాండ్ తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్కు దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్ మన్ ఏబీ డివిలియర్స్ దూరం కానున్నాడు. దీంతో కెప్టెన్సీ పగ్గాలను టీ20 కెప్టెన్ డుప్లెసిస్ కు అప్పగించినట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడించింది. కివీస్ తో టెస్టు సిరీస్ నుంచి డివిలియర్స్, ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్ లకు సఫారీ క్రికెట్ బోర్డు ఉద్వాసన పలికింది. ఫాస్ట్ బౌలర్ డెల్ స్టెయిన్, వెర్నర్ ఫిలాండర్, ఆల్ రౌండర్ వేన్ పార్నెల్ 15 మంది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ నెల 19న డర్బన్ లో తొలి టెస్టు ప్రారంభంకానుంది. కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో గాయపడ్డ డివిలియర్స్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడని అందుకే కివీస్ టూర్ కు ఎంపిక చేయలేదు. మరోవైపు మోర్నీ మోర్కెల్ వెన్నునొప్పితో సతమతమవుతున్నాడని, అతడికి 4 నుంచి 6 వారాలపాటు విశ్రాంతి కావాలని బోర్డు తెలిపింది. 2004లో టెస్టు అరంగేట్రం చేసినప్పటి నుంచీ గాయాల కారణంగా ఒక్క టెస్టు మ్యాచ్ కూడా మిస్సవ్వని డివిలియర్స్ ప్రస్తుత సిరీస్ కు దూరం కానున్నాడు. గత ఇంగ్లండ్ సిరీస్ మధ్యలోనే హషీం ఆమ్లా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో డివిలియర్స్ ను టెస్టు కెప్టెన్గా నియమించిన విషయం తెలిసిందే.

రియోలో తొలి టెన్నిస్ ప్లేయర్ సానియా !

02/08/2016: రియోడిజనీరో: భారత టెన్నిస్, టేబుల్ టెన్నిస్ బృందాలు రియో ఒలింపిక్ గ్రామానికి చేరుకున్నాయి. ఒలింపిక్ విలేజ్లో అడుగుపెట్టిన తొలి టెన్నిస్ ప్లేయర్ గా సానియా నిలిచింది. మాంట్రియెల్ లో రోజర్స్ కప్ ఆడిన సానియా నేరుగా అక్కడి నుంచే రియోడిజనీరోకు వచ్చింది. సానియాకు ఇది మూడో ఒలింపిక్ గేమ్స్. మహిళల డబుల్స్ లో ప్రార్థనా థోంబరే, మిక్స్డ్ డబుల్స్ లో రోహన్ బోపన్నతో కలిసి సానియా బరిలో దిగనుంది.

టెన్షన్ వదిలేయ్.. పతకం 'పట్టు' : ప్రధాని మోదీ

02/08/2016: న్యూఢిల్లీ : డోపింగ్ వివాదం నుంచి బయటపడి రిలాక్స్ అవుతున్న భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. డోపింగ్ వివాదం, కొన్ని రోజుల ఉత్కంఠకు తెరపడ్డ తర్వాత రియోకు వెళ్లనున్న నేపథ్యంలో ప్రధాని మోదీని నర్సింగ్ మర్యాద పూర్వకంగా కలుసుకుని తన పరిస్థితిని వివరించాడు. మోదీతో భేటీ తర్వాత నర్సింగ్ మీడియాతో మాట్లాడారు. మోదీ తనతో మాట్లాడుతూ... 'ఇక ఉత్సాహంగా ఒలింపిక్స్ లో పొల్గొనాలి. టెన్షన్ పడవద్దు.. కుస్తీలో పట్టుపట్టి ఒలింపిక్స్ లో పతకం పట్టుకురావాలి' అని తనకు ఆల్ ది బెస్ట్ చెప్పారని నర్సింగ్ వెల్లడించాడు. అంతా మంచి జరుగుతుందని, ఎవరికీ అన్యాయం జరగకుండా తాము చూస్తామని మోదీ ఉత్సాహాన్ని నింపారని నర్సింగ్ తెలిపాడు. ఒలింపిక్స్ లో పాల్గొంటానని తాను బలంగా విశ్వసించానని, దేశం కోసం కచ్చితంగా పతకంతో తిరిగొస్తానని ధీమా వ్యక్తంచేశాడు. డోపింగ్‌లో పట్టుబడిన నర్సింగ్ యాదవ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సోమవారం చరిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దీంతో రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు నర్సింగ్‌కు లైన్ క్లియర్ అయింది.

రహానే ఖాతాలో అరుదైన ఫీట్

02/08/2016: కింగ్స్టన్ : వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాట్స్ మన్ అజింక్య రహానే అజేయ సెంచరీ( 237 బంతుల్లో 108; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి తన నిలకడ ఆటతీరును మరోసారి నిరూపించుకున్నాడు. టీమిండియా 2013-14లో చేసిన దక్షిణాఫ్రికా పర్యటన నుంచి ప్రతి టెస్టు సిరీస్ లో నిలకడగా పరుగులు చేస్తున్న ఆటగాడు రహానే. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఫీట్ సొంతం చేసుకున్నాడు. వరుసగా ఎనిమిది టెస్టు సిరీస్ లలో భాగంగా ప్రతి టెస్టులో కనీసం ఒక ఇన్నింగ్స్ లో 90 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక భారత ఆటగాడిగా రహానే నిలిచాడు. రహానే ఏడు టెస్టు సెంచరీలు చేయగా, అందులో 5 ఉపఖండం బయట చేసినవే. దక్షిణాఫ్రికాపై (96), బంగ్లాదేశ్ పై (98) రెండు సెంచరీలను మిస్సయ్యాడు. మరోవైపు విండీస్ బౌలర్ రోస్టన్ ఛేజ్(5/121) చెలరేగుతున్నా మరో ఎండ్ లో పాతుకుపోయిన రహానే, సాహా(47), మిశ్రా(21), ఉమేశ్ యాదవ్(19)లతో కలిసి భాగస్వామ్యాలు నిర్మించి భారత్ను పటిష్టస్థితికి చేర్చాడు. 500 పరుగుల వద్ద 9వ వికెట్ గా ఉమేశ్ యాదవ్ (14 బంతుల్లో 19 పరుగులు; 4 ఫోర్లు) చేజ్ బౌలింగ్‌లో ఔట్‌ కావడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దీంతో భారత్కు 304 పరుగుల ఆధిక్యం లభించింది. వర్షం కారణంగా విండీస్ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించలేదు. విండీస్ తొలి ఇన్నింగ్స్ లో 196 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే.

'కంగారు'లకు హెరాత్ గండం!

02/08/2016: గాలే(శ్రీలంక): ఆస్ట్రేలియాపై 17 ఏళ్ల తర్వాత విజయం సాధించిన శ్రీలంక జట్టు మూడు టెస్టుల సిరీస్ ను నెగ్గేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా పల్లెకెలెలో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ పై విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలిసారి లంక గెలిచినప్పుడు తాను చిన్న పిల్లాడినని కెప్టెన్ మాథ్యూస్ పేర్కొన్నాడు. గాలేలో చివరి టెస్టులో హెరాత్ 10 వికెట్లతో చెలరేగిన విషయాన్ని గుర్తుచేశాడు. బ్యాటింగ్ లో చాలా లోపాలున్నా, గత మ్యాచ్ విజయంతో అదే జట్టుతో బరిలోకి దిగనున్నట్లు తెలిపాడు. స్పిన్నర్ రంగన హెరాత్ (9/103) అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో పాటు యువ సంచలనం కుశాల్ మెండిస్ తొలి టెస్టు భారీ సెంచరీ(176 పరుగులు) లంకకు విజయాన్ని అందించాయి. ఆడుతున్నటి తొలి టెస్టు అయినా లక్షణ్ సందకన్ 7 వికెట్లు తీసి ఆసీస్ పై ఒత్తిడి పెంచాడు. గత మ్యాచులో ఆసీస్ భరతం పట్టిన హెరాత్.. 1999లో ఆసీస్ పై శ్రీలంక గెలిచిన తొలి మ్యాచ్ లోనే టెస్టు అరంగేట్రం చేయడం గమనార్హం. ఆ లెక్కన చూస్తే ఆసీస్ పై నెగ్గిన రెండు పర్యాయాలు జట్టులో ఉన్న ఏకైక ఆటగాడు హెరాత్. గాలేలో తొలి రెండు రోజులు స్పిన్ కు అనుకూలిస్తుందని, ఉపఖండంలో ఎలాగూ స్పిన్నర్లదే హవా అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు ఆసీస్ కూడా బ్యాటింగ్ లో చాలా బలహీనంగా ఉంది. తొలి టెస్టులో కేవలం స్టీవెన్ స్మిత్ ఒక్కడు మాత్రమే హాప్ సెంచరీ చేశాడు.

రాహుల్‌ శతకం.. భారత్‌ 358/5 - విండీస్‌పై 162 పరుగుల ఆధిక్యం

01/08/2016: కింగ్‌స్టన్‌: తొలి టెస్ట్‌ విజయానందంలో ఉన్న భారత ఆటగాళ్లు అదే వూపును కొనసాగిస్తున్నారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో తొలి రోజు బౌలర్లు తమ విశ్వరూపం చూపించగా.. రెండో రోజు బ్యాట్స్‌మెన్లు సైతం తామేమీ తక్కువ కాదని నిరూపించారు. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (158, 303 బంతుల్లో 15x4, 3x6) భారీ శతకంతో చెలరేగడంతో భారత్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 358/5 పరుగులు చేసింది. రహానె (42), సాహా (17) క్రీజులో ఉన్నారు. ఓవర్‌నైట్‌ స్కోరు 126/1తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత బ్యాట్స్‌మెన్లు రాహుల్‌, పుజరా విండీస్‌ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. వికెట్లు కాపాడుకుంటూనే వన్డే తరహాలో దూకుడుగా ఆడారు. లంచ్‌ విరామానికి ముందే ఓపెనర్‌ రాహుల్‌ సెంచరీ పూర్తి చేశాడు. విరామం తర్వాత పుజరా (46) రనౌట్‌ రూపంలో వెనుదిరిగాడు. వీళ్లిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దూకుడుగా ఆడుతున్న రాహుల్‌కు కోహ్లి తోడయ్యాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. స్థిరంగా ఆడుతున్న రాహుల్‌.. గాబ్రియల్‌ బౌలింగ్‌లో డౌరిచ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రహానె, కోహ్లితో కలిసి మరోసారి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పే ప్రయత్నం చేశారు. అయితే కోహ్లి (44) చేజ్‌ బౌలింగ్‌లో రాజేంద్ర చంద్రికకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన అశ్విన్‌(3) నిరాశ పరిచాడు. బిషూ బౌలింగ్‌లో ఎల్బీ రూపంలో ఔటయ్యాడు. దీంతో భారీ స్కోరు దిశగా పయనిస్తున్న భారత్‌ను విండీస్‌ బౌలర్లు కొంత వరకు కట్టడి చేయగలిగారు. రహానె, సాహా ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్‌ 162 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. విండీస్‌ బౌలర్లలో చేజ్‌ రెండు వికెట్లు తీయగా.. గాబ్రియల్‌, బిషూ చెరో వికెట్‌ తీశారు. అంతకుముందు భారత బౌలర్ల ధాటికి 196 పరుగులకే విండీస్‌ ఆలౌట్‌ అయిన సంగతి తెలిసిందే. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: లోకేష్‌ రాహుల్‌ డౌరిచ్‌(సి) గాబ్రియల్‌ (బి) 158; ధావన్‌ బ్రావో (సి) చేజ్‌ (బి) 27; పుజరా రనౌట్‌ 46; కోహ్లి చంద్రిక(సి) చేజ్‌(బి) 44; రహానె బ్యాటింగ్‌ 42; అశ్విన్‌ ఎల్బీ(బి) బిషూ 3; సాహా బ్యాటింగ్‌ 17; ఎక్స్‌ట్రాలు 21, మొత్తం 358(5 వికెట్లకు 125 ఓవర్లలో) వికెట్ల పతనం: 1-87, 2-208, 3-277, 4-310, 5-327 బౌలింగ్‌: గాబ్రియల్‌ 23-8-50-1, కమిన్స్‌ 15.4-3-54-0, హోల్డర్‌ 23.2-9-49-0, చేజ్‌ 29-3-91-2, బిషూ 25-3-79-1, క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ 9-0-26-0 వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: బ్రాత్‌వైట్‌ పుజరా(సి) ఇషాంత్‌(బి) 1; చంద్రిక రాహుల్‌(సి), షమి(బి)5; బ్రావో కోహ్లి (సి), ఇషాంత్‌(బి) 0; శామ్యూల్స్‌ రాహుల్‌(సి) అశ్విన్‌(బి) 37; బ్లాక్‌వుడ్‌ ఎల్బీ (బి)అశ్విన్‌ 62; చేజ్‌ ధావన్‌(సి), షమి (బి) 10; డౌరిచ్‌ సాహా(సి) అశ్విన్‌(బి) 5; జాసన్‌ హోల్డర్‌ రాహుల్‌(సి) అశ్విన్‌(బి) 13; బిషూ ధావన్‌(సి) అశ్విన్‌(బి) 12; కమిన్స్‌ నాటౌట్‌ 24; గాబ్రియల్‌ కోహ్లి(సి) మిశ్రా(బి) 15; ఎక్స్‌ట్రాలు 12, మొత్తం 196(52.3 ఓవర్లకు) వికెట్ల పతనం: 1-4, 2-4, 3-7, 4-88, 5-115, 6-127, 7-131, 8-151, 9-158, 10-196 బౌలింగ్‌:ఇషాంత్‌ 10-1-53-2, షమి 10-3-23-2, అశ్విన్‌ 16-2-52-5, ఉమేశ్‌ యాదవ్‌ 6-1-30-0, అమిత్‌ మిశ్రా 10.3-3-38-1

పైరేట్స్ మళ్లీ కొల్లగొట్టారు...- ప్రొ కబడ్డీ లీగ్ విజేత పట్నా - వరుసగా రెండోసారి టైటిల్ సొంతం

01/08/2016: హైదరాబాద్: ప్రొ కబడ్డీలో వరుసగా రెండో ఏడాది బిహారీ జట్టు హవా కొనసాగింది. సీజన్-4లో ఆది నుంచి తొడగొట్టి ఆధిక్యం ప్రదర్శించిన పట్నా పైరేట్స్ లీగ్ చాంపియన్‌గా నిలిచి సత్తా చాటింది. రెండోసారి టైటిల్ చేజిక్కించుకున్న తొలి జట్టుగా నిలిచింది. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఫైనల్లో పైరేట్స్ 37-29 స్కోరుతో జైపూర్ పింక్ పాంథర్స్‌ను చిత్తు చేసింది. గత సీజన్‌లో విజేతగా నిలిచిన పట్నా డిఫెండింగ్ చాంపియన్‌గా తమ స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చింది. అద్భుత ప్రదర్శన చేసిన పర్‌దీప్ నర్వాల్ 16 రైడింగ్ పాయింట్లతో పట్నా విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాంథర్స్ తరఫున కెప్టెన్ జస్వీర్ (13 పాయింట్లు) పోరాడినా లాభం లేకపోయింది. విజేతగా నిలిచిన పైరేట్స్‌కు రూ. 1 కోటి, రన్నరప్ జైపూర్‌కు రూ. 50 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. సెమీస్ వరకు దూసుకొచ్చిన తెలుగు టైటాన్స్ జట్టు ప్లే ఆఫ్ మ్యాచ్‌లో పుణేరీ పల్టన్ చేతిలో 35-40తో ఓడి నాలుగో స్థానంతోనే సంతృప్తి పడింది. మరోసారి తడబడ్డారు... సొంతగడ్డపై ప్లే ఆఫ్ మ్యాచ్‌లో విజయం సాధించి మూడో స్థానంలో నిలవాలనుకున్న తెలుగు టైటాన్స్ ఆశలు నెరవేరలేదు. హోరాహోరీగా సాగిన పోరులో చివరి క్షణాల్లో టైటాన్స్ పట్టు కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. రాహుల్ చౌదరి (18 రైడింగ్ పాయింట్లు) మరోసారి వీరోచితంగా పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. ఆరంభం నుంచి ఆధిక్యం కనబర్చిన పుణేరీ 10-3తో దూసుకుపోయింది. అయితే రాహుల్ వరుస పాయింట్లు రాబట్టడంతో జట్టు కోలుకుంది. తొలి అర్ధ భాగం ముగిసేసరికి పల్టన్ 17-14తో ముందంజలో నిలిచింది. ఆ వెంటనే పుణేను టైటాన్స్ ఆలౌట్ చేయడంతో స్కోరు సమమైంది. ఆ తర్వాత ఆధిపత్యం కోసం ఇరు జట్లు తీవ్రంగా పోరాడాయి. ఒక దశలో 30-34తో వెనుకబడిన టైటాన్స్ రాహుల్ చలవతో 35-36తో ప్రత్యర్థి స్కోరుకు చేరువగా వచ్చింది. అయితే ఈ దశలో రైడింగ్ వెళ్లిన దీపక్ హుడా ఒకే సారి రాహుల్, విశాల్, రూపేశ్‌లను అవుట్ చేయడంతో 39-35తో ముందుకెళ్లిన పల్టన్, మరో పాయింట్‌ను సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. పుణే ఆటగాళ్లలో దీపక్ హుడా 17 పాయింట్లు సాధించడం విశేషం. 500 ప్రొ కబడ్డీ లీగ్‌లో నాలుగు సీజన్లు కలిపి మొత్తం 500 రైడింగ్ పాయింట్లు సాధించిన తొలి ఆటగాడిగా రాహుల్ చౌదరి నిలిచాడు. విజేత: పట్నా పైరేట్స్... రూ. కోటి రన్నరప్: జైపూర్ పింక్‌పాంథర్స్... రూ. 50 లక్షలు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు: పర్‌దీప్ నర్వాల్ (పట్నా) రూ. 10 లక్షలు డిఫెండర్ ఆఫ్ ది టోర్నీ: ఫజల్ అత్రాచల్ (పట్నా) రూ. 5 లక్షలు రైడర్ ఆఫ్ ది టోర్నీ: రాహుల్ చౌదరి (టైటాన్స్) రూ. 5 లక్షలు రైజింగ్ స్టార్ ఆఫ్ ది టోర్నీ: అజయ్ కుమార్ (జైపూర్) రూ. 1 లక్ష

‘రియో’లో ఎవరైనా పతకాలు గెలవొచ్చు - బ్యాడ్మింటన్ స్టార్ సింధు అభిప్రాయం

01/08/2016: న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో ప్రత్యేకించి ఫేవరెట్లు లేరని... ఎవరైనా పతకాలు గెలవొచ్చని భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అభిప్రాయపడింది. బరిలోకి దిగిన రోజు మన శక్తిమేరకు రాణిస్తే విజయం లభిస్తుందని తెలిపింది. పరిస్థితుల్ని ఆకళింపు చేసుకొని రాణించడం, కోర్టులో అప్పటికి తగిన వ్యూహాన్ని మార్చి ఆడితే గెలుపు ఏమంత కష్టం కాదని 21 ఏళ్ల ఈ హైదరాబాదీ స్టార్ తెలిపింది. ‘రియో పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి వారం రోజుల ముందే అక్కడికి వెళుతున్నాం. మాకు ఈ వారం ప్రాక్టీస్ చాలా కీలకమని భావిస్తున్నా. దీంతో పాటు అక్కడి వాతావరణానికి కూడా మేం అలవాటుపడిపోతాం. పోటీల రోజు పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు ఈ తరహా కసరత్తులు దోహదం చేస్తాయి’ అని సింధు వివరించింది. వరుసగా 2013, 2014 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలు గెలుపొందిన ఆమె ఇప్పుడు ఒలింపిక్స్ పతకమే లక్ష్యంగా ప్రాక్టీసు చేస్తోంది. రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన వారిపై గెలిచిన అనుభవం తనకుందని చెప్పిన ఆమె... ప్రత్యర్థుల ఆటతీరు మనకు తెలిసినట్లే మనం ఆడే షాట్లు వారికి తెలుసని... కోర్టులో అప్పటికప్పుడు ఎవరు అగ్రశ్రేణి ఆటతీరు కనబరిస్తే వారే గెలుస్తారని తెలిపింది. తను ఈ ఏడాది చాలా టోర్నీల్లో ఆడానని, కావాల్సినంత అనుభవం సంపాదించానని చెప్పుకొచ్చింది. ఒత్తిడి ఆటగాళ్ల జీవితంలో ఓ భాగమని దానిపై ఏమాత్రం బెంగలేదని పేర్కొంది. డ్రా ఇదివరకే విడుదలైందని ప్రత్యర్థుల గురించి కంగారు లేదని చెప్పింది. గ్రూప్ ‘ఎమ్’లో ఉన్న ఆమె లీగ్ దశలో మిచెల్లి లి (కెనడా), లౌరా సరోసి (హంగేరి)లతో తలపడుతుంది. ఈ దశను అధిగమిస్తే ఈ భారత క్రీడాకారిణికి నాకౌట్‌లో తై జు యింగ్ (చైనీస్ తైపీ), యిహాన్ వాంగ్ (చైనా) ఎదురవుతారు. వీరిపై గెలిస్తే సెమీస్ చేరుకోవచ్చు. కాగా... రేపు (మంగళవారం) భారత బ్యాడ్మింటన్ బృందం రియోకు పయనమవుతుంది.

ప్రొ కబడ్డీ మహిళల విజేత స్ట్రామ్ క్వీన్స్ - ఫైనల్లో ఫైర్‌బర్డ్స్‌పై సంచలన విజయం

01/08/2016: హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ మహిళల విభాగంలో విజయ ‘తుఫాను’ రేగింది. తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీలో స్ట్రామ్ క్వీన్స్ విజేతగా నిలిచింది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో క్వీన్స్ 24-23 పాయింట్ల తేడాతో ఫైర్ బర్డ్స్‌పై విజయం సాధించింది. చివరి సెకను వరకు గెలుపు ఇరు జట్ల మధ్య దోబూచులాడినా... ఆఖరి క్షణంలో తేజస్వినీ బాయి అద్భుత రైడింగ్‌తో రెండు పాయింట్లు సాధించి క్వీన్స్‌ను గెలిపించింది. స్ట్రామ్ జట్టు తరఫున సాక్షి కుమారి ఆరు రైడింగ్ పాయింట్లు సహా మొత్తం ఎనిమిది పాయింట్లు స్కోర్ చేసింది. బర్డ్స్ మహిళలలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన కె.రింజు ఏడు పాయింట్లతో ఆకట్టుకుంది. ఫైర్ కెప్టెన్ మమతా పుజారి పూర్తిగా విఫలం కావడం ఆ జట్టును దెబ్బ తీసింది. తొలి అర్ధ భాగం ముగిసేసరికి 10-8తో స్వల్ప ఆధిక్యంలో నిలిచిన బర్డ్స్ చివరకు మ్యాచ్ కోల్పోయింది. సెకన్ల వ్యవధిలో....: మహిళల ఫైనల్లో చివరి నిమిషంలో డ్రామా చోటు చేసుకుంది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఒక్కో పాయిట్ కోసం పోరాడుతూ చివరి వరకు సమంగా నిలుస్తూ వచ్చాయి. 29వ నిమిషం ముగిసేసరికి 22-17తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న ఉన్న క్వీన్స్ విజయానికి చేరువైంది. అయితే 30వ నిమిషంలో బర్డ్ రైడర్ రింజు 3 పాయింట్లు కొల్లగొట్టింది. అయితే ఈ దశలోనూ క్వీన్స్ 22-20తో ముందంజలో ఉంది. ఆ వెంటనే బర్డ్స్ కెప్టెన్ మమతా పూజారి తర్వాతి రైడింగ్‌లో మరో 3 పాయింట్లు రాబట్టడంతో జట్టు 23-22తో ఒక పాయింట్ ఆధిక్యంలోకి వెళ్లింది. గెలుపు ఖాయమైందని భావించిన అమ్మాయిలు సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ మరో రెండు సెకన్లలో మ్యాచ్ ముగిసే సమయంలో స్ట్రామ్ కెప్టెన్ తేజస్వినీ బాయి ప్రత్యర్థి కోర్టులోకి దూసుకుపోయింది. బర్డ్స్ కోలుకునే లోపే రెండు పాయింట్లు స్కోర్ చేసి తమ జట్టును విజేతగా నిలిపింది. క్వీన్స్ ఆనందంతో గంతులు వేయగా, బర్డ్స్ మహిళలు నిరాశలో మునిగారు.

దుబాయ్‌ అందాలకు యువీ.. ఫిదా

29/07/2016: ఐపీఎల్‌-9 సీజన్‌ ముగిసిన అనంతరం విదేశీ పర్యటనలతో జాలీగా గడుపుతున్న టీమిండియా ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ తాజాగా దుబాయ్‌లోని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లిన భారత్‌ టెస్టు జట్టులో యువరాజ్‌ సింగ్‌ స్థానం దక్కించుకోలేకపోయిన విషయం తెలిసిందే. దుబాయ్‌లోని పామ్‌ జుమేరియా ద్వీపంలోని విలాసవంతమైన ‘వాల్‌డార్ఫ్‌ అస్టోరియా’ హోటల్‌లో దిగిన యువరాజ్‌ ‘దుబాయ్‌ అందాలను మీరూ చూడండ’ంటూ తన గది బాల్కనీ నుంచి తీసిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

సచిన్‌ సినిమా కోసం ఎదురుచూస్తున్నా - బ్రెట్‌లీ

29/07/2016: ముంబయి: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ బ్రెట్‌లీ అన్నారు. ఆస్ట్రేలియన్‌ సినిమా ‘అన్‌ఇండియన్‌’ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెడుతున్న 39ఏళ్ల బ్రెట్‌లీ సచిన్‌ జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న ‘సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌’ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. జేమ్స్‌ ఎర్క్సిన్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సచినే నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘క్రికెటర్ల ప్రయాణం, వారి జీవితగాథలపై సినిమాలు రావడం చాలా ఆనందంగా ఉంది. సచిన్‌ జీవితకథ చూడడానికి ఆత్రుతగా ఉంది. అది నాకు బాగా నచ్చే అవకాశముంది. ఆయన చాలా గొప్ప ఆటగాడు’ అని బ్రెట్‌లీ అన్నారు. ప్రసుతం బాలీవుడ్‌లో క్రికెటర్ల బయోపిక్‌ల క్రేజ్‌ నడుస్తోంది. ఇమ్రాన్‌ హష్మి ప్రధాన పాత్రలో మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ అజారుద్దీన్‌ జీవిత చరిత్రపై ‘అజహర్‌’ సినిమా, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో ధోనీ జీవితగాథపై ‘ఎం ఎస్‌ ధోనీ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. బ్రెట్‌లీని తన బయోపిక్‌ గురించి ప్రశ్నించగా.. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. కానీ ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం ‘అన్‌ఇండియన్‌’పైనే దృష్టిపెట్టినట్లు చెప్పారు. అనుపమ్‌ శర్మ దర్శకత్వంలో వస్తున్న ‘అన్‌ఇండియన్‌’ ఆగస్టు 19న భారత్‌లో విడుదల కానుంది.

సొంతగడ్డపై అదరగొట్టేనా - ఫైనల్‌ బెర్తు కోసం జైపుర్‌తో టైటాన్స్‌ ఢీ

29/07/2016: ప్రొ కబడ్డీ నాలుగో సీజన్‌లో అంచనాలకు మించి రాణిస్తున్న తెలుగు టైటాన్స్‌.. సొంత గడ్డపై సెమీసమరానికి సిద్ధమైంది. ఫైనల్లో చోటు కోసం శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం వేదికగా జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌ను ఢీకొట్టనుంది. ఇక్కడే మరో సెమీఫైనల్లో పట్నా పైరేట్స్‌.. పుణెరి పల్టాన్‌తో తలపడనుంది. ఈ నాలుగింటిలో ఏ రెండు జట్లు ఆదివారం జరిగే ఫైనల్‌కు అర్హత సాధిస్తాయో చూడాలి. మహిళల ఛాంపియన్‌ ఎవరో కూడా అదే రోజు తేలనుంది. ఈ మ్యాచ్‌లన్నింటికీ హైదరాబాదే వేదిక. ఎన్నడూ లేనంత అత్యుత్తమ ఫామ్‌లో ఇప్పుడుంది తెలుగు టైటాన్స్‌. శుక్రవారం జైపుర్‌తో జరిగే సెమీస్‌లో టైటాన్సే ఫేవరెట్‌. ఈ సీజన్‌ ఆరంభంలో 5 మ్యాచ్‌ల్లో నాలుగు ఓడినా.. ఆ తర్వాత టైటాన్స్‌ తిరుగులేని ప్రదర్శన చేసింది. 7 విజయాలు, 2 టైలతో సెమీస్‌ బెర్తు దక్కించుకుంది. ఈ సీజన్‌లోనూ కెప్టెన్‌ రాహుల్‌ చౌదరి జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. మరో రైడర్‌ నీలేష్‌, ఆల్‌రౌండర్‌ సందీప్‌ నర్వాల్‌, డిఫెండర్లు వినోద్‌, సందీప్‌ ధుల్‌ కూడా రాణిస్తున్నారు. సుకేశ్‌ గాయం నుంచి కోలుకుని అందుబాటులోకొస్తే టైటాన్స్‌కు తిరుగుండదు. రెండో సీజన్‌లో మాత్రమే సెమీస్‌ చేరిన టైటాన్స్‌.. అప్పుడు మూడో స్థానం సాధించగలిగింది. ఈసారి సొంతగడ్డపై అభిమానుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. ఇటు ఆరంభంలో ఆకట్టుకుని.. మధ్యలో తడబడి.. ఆఖర్లో పుంజుకున్న జట్టు జైపుర్‌. ఆ జట్టు ప్రదర్శనలో కెప్టెన్‌ జస్వీర్‌సింగ్‌దే ముఖ్యభూమిక. అతడికి రైడర్‌ రాజేశ్‌ నర్వాల్‌ జతకలిస్తే టైటాన్స్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చు! పట్నా × పుణెరి: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పట్నా పైరేట్స్‌ ఈ సీజన్‌లోనూ జోరు చూపించింది. 14 మ్యాచ్‌ల్లో 10 విజయాలతో మిగతా జట్ల కన్నా ముందే సెమీస్‌ బెర్తు సొంతం చేసుకుందా జట్టు. పుణెరితో సెమీస్‌లోనూ పట్నానే ఫేవరెట్‌. స్టార్‌ రైడర్‌ ప్రదీప్‌ నర్వాల్‌ ఆ జట్టుకు గొప్ప బలం. ఇక ఆల్‌రౌండర్‌ మన్‌జీత్‌ చిల్లర్‌ ఈ సీజన్‌లో పుణెరిని గొప్పగా నడిపించాడు. గాయంతో కొన్ని మ్యాచ్‌లకు అతడు దూరమవడంతో తడబడుతూ సెమీస్‌ చేరిన పుణెరి.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ను ఏమేరకు అడ్డుకుంటుందన్నది చూడాలి. తారల తళుకులు: తెలుగు టైటాన్స్‌ సత్తాచాటుతుండటంతో ప్రొ కబడ్డీపై అభిమానుల ఆసక్తి అమాంతం పెరిగిపోయింది. హైదరాబాద్‌లో జరుగనున్న సెమీస్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు ఎంతగానో ఆసక్తి కనబరుస్తున్నారు. శుక్రవారం జరిగే సెమీస్‌ మ్యాచ్‌లకు టాలీవుడ్‌ హీరో పవన్‌ కల్యాణ్‌ రానున్నట్లు సమాచారం. ఫైనల్‌కు హృతిక్‌ రోషన్‌ వస్తున్నట్లు తెలిసింది.

తెలంగాణ జట్ల శుభారంభం - జాతీయ సబ్-జూనియర్ సెపక్‌తక్రా టోర్నీ

28/07/2016: హైదరాబాద్: జాతీయ సబ్-జూనియర్ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాల, బాలికల జట్లు శుభారంభం చేశాయి. విక్టరీ ప్లేగ్రౌండ్స్‌లోని ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన బాలుర ఈవెంట్‌లో రాష్ట్ర జట్టు (21-8, 21-6), (21-10, 21-11), (21-8, 21-8)తో కేరళపై గెలుపొందింది. బాలికల విభాగంలో తెలంగాణ జట్టు మొదట (18-21, 15-21), (21-16, 18-21, 21-10), (21-12, 21-7)తో ఢిల్లీపై నెగ్గింది. అనంతరం రెండో మ్యాచ్‌లో (11-21, 14-21), (21-17, 21-13), (21-8, 21-10)తో గోవాపై విజయం సాధించింది. మిగతా మ్యాచ్‌ల్లో ఒడిశా (21-17, 17-21, 16-21), (21-6, 21-8), (21-11, 21-4)తో గోవాపై, ఢిల్లీ (3-21, 2-21), (18-21, 21-15, 21-13), (21-15, 21-6)తో గోవాపై గెలుపొందాయి. బాలుర విభాగంలో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ (21-5, 21-13), (21-7, 21-13), (21-13, 21-13)తో తమిళనాడుపై గెలిచింది. ఈవెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి పోటీలను లాంఛనంగా ఆరంభించారు. ఇందులో గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్, భారత సెపక్‌తక్రా సమాఖ్య కార్యదర్శి యోగేందర్ సింగ్ దహియా, గన్‌ఫౌండ్రి కార్పొరేటర్ మమత గుప్తా, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు కె.రంగారావు, ప్రేమ్‌రాజ్, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ బాబయ్య, డి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

19 మంది రష్యా రోయర్లపై నిషేధం

28/07/2016: లుసానే: రియో ఒలింపిక్స్‌కు సమయం దగ్గరపడుతున్నా... రష్యా అథ్లెట్లపై నిషేధం మాత్రం ఆగడం లేదు. తాజాగా 19 మంది రోయర్లను గేమ్స్‌లో పాల్గొనకుండా ప్రపంచ రోయింగ్ సమాఖ్య (ఎఫ్‌ఐఎస్‌ఏ) అడ్డుకుంది. ఐదుగురు కనోయిస్ట్‌లు, ఇద్దరు మోడ్రన్ పెంటాథ్లాన్ అథ్లెట్లతో కలిపి గత ఆదివారం వరకు మొత్తం 41 మందిపై నిషేధం విధించారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లతో కలుపుకుంటే ప్రస్తుతం ఈ సంఖ్య 108కి చేరింది. రష్యా నుంచి 28 మంది రోయర్లు రియోకు అర్హత సాధిం చగా, ఇందులో ఇప్పటివరకు మొత్తం 22 మందిపై అనర్హత వేటు పడిందని ఎఫ్‌ఐఎస్‌ఏ వెల్లడించింది. జూడో, ఈక్వెస్ట్రియాన్, టెన్నిస్, షూటింగ్ క్రీడాకారులు మాత్రం నిషేధం నుంచి తప్పించుకున్నారు.

దుబాయ్ చెస్ టోర్నీలో సత్తాచాటిన రాహుల్

28/07/2016: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన పి. రాహుల్ శ్రీవాస్తవ దుబాయ్ జూనియర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో మెరిశాడు. దుబాయ్‌లో మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో అతను రజత పతకం సాధించాడు. 9 రౌండ్ల పాటు స్విస్ లీగ్ ఫార్మాట్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో అతను 7.5 పాయింట్లు సాధించాడు. ఈ టోర్నీలో హైదరాబాద్ కుర్రాడు... ఒకే ఒక్క మ్యాచ్‌లో మొహమ్మద్ రహమాన్ (బంగ్లాదేశ్) చేతిలో ఓడాడు. రహమాన్ 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఏడున్నర పాయింట్లతో రాహుల్‌తో కలిసి మట్విషెన్ విక్టర్ (ఉక్రెయిన్) ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నప్పటికీ మెరుగైన టైబ్రేక్ స్కోరుతో రాహుల్‌కు రెండు, విక్టర్ మూడో స్థానం దక్కాయి. రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్ కుర్రాడికి పతకంతో పాటు రూ. లక్షా 5వేల (1600 డాలర్లు) ప్రైజ్‌మనీ లభించింది.

వరల్డ్ నంబర్.1ను హడలెత్తించాడు!

28/07/2016: టొరంటో: సెర్బియా సంచలనం, ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ నోవాక్ జొకోవిచ్ కాస్త తడ బడ్డాడు. టొరంటో టెన్నిస్ ఈవెంట్ రోజర్స్ కప్ లో బుధవారం జరిగిన మ్యాచ్ లో లగ్జెంబర్గ్ కు చెందిన ప్రత్యర్థి గిల్స్ ముల్లర్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో ఓ దశలో వెనకంజ వేసినా చివరికి 7-5, 7-6(3) తేడాతో నెగ్గి ఊపిరి పీల్చుకున్నాడు. సెర్బియా యోధుడు టొరంటో టెన్నిస్ టోర్నీ, మాంట్రియల్ 2007, 2011, 2012లలో గెలుపొందాడు. మ్యాచ్ ఓడినప్పటికీ ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. మరోవైపు ఈ ఏడాది మార్చి తర్వాత హార్డ్ కోర్ట్ పై జొకో ఆడిన తొలి మ్యాచ్ కావడం విశేషం. అన్ సీడెడ్ ఆటగాడు ముల్లర్ సర్వీస్ ఎదుర్కోవడానికి వరల్డ్ చాంపియన్ తీవ్రంగా శ్రమించాడు. అయితే ముల్లర్ చేసిన తప్పిదాలను స్కోర్లుగా మలుచుకుని జొకోవిచ్ రెండు సెట్లు కైవసం చేసుకున్నాడు. లేకపోతే అనామకుడి చేతిలో ఓడిపోయి పరాభవం చెందేవాడు. ఓటమి బాధతో రియో ఒలింపిక్స్ లో పాల్గొనాల్సి వచ్చేది. మూడో రౌండ్ లో చెక్ రిపబ్లిక్ కు చెందిన రాడెక్ స్టెఫానెక్ తో తలపడనున్నాడు. మూడో సీడ్ ఆటగాడు నిషికోరి(జపాన్) 6-4, 7-5 తేడాతో అమెరికాకు చెందిన డెన్నిస్ నోవికొవ్ పై నెగ్గాడు. మరో మ్యాచ్ లో నాలుగో సీడెడ్ మిలోస్ రొనిక్(కెనడా) 6-3, 6-3 తో తైవాన్ కు చెందిన లు యెన్సున్ పై గెలుపొందాడు.

అశ్విన్ మరో ఘనత - ఐసీసీ ఆల్‌రౌండర్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్

27/07/2016: దుబాయ్: భారత క్రికెటర్ అశ్విన్ మరో అద్భుత ఘనత సాధించాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. గతంలో వినూ మన్కడ్, కపిల్‌దేవ్ మాత్రమే ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్లు. వెస్టిండీస్‌తో తొలి టెస్టులో బౌలింగ్‌లో రాణించడంతో పాటు బ్యాటింగ్‌లో సెంచరీ సాధించిన అశ్విన్ ఖాతాలో ప్రస్తుతం 427 పాయింట్లు ఉన్నాయి. ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్‌లోనూ అశ్విన్ తిరిగి నంబర్‌వన్ స్థానానికి చేరాడు. గతేడాది చివర్లో నంబర్‌వన్‌గా ఉన్న అశ్విన్... ఆరు నెలల తర్వాత తిరిగి అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్నాడు. రెండో స్థానంలో ఉన్న అండర్సన్ (875పాయింట్లు) అశ్విన్‌కన్నా ఒక్క పాయింట్ తక్కువగా ఉన్నాడు.

టైటాన్స్‌ జైత్రయాత్ర

27/07/2016: దిల్లీ: ప్రొ కబడ్డీ నాలుగో సీజన్లో తెలుగు టైటాన్స్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. సెమీస్‌ చేరిన ఉత్సాహంలో ఆ జట్టు తన చివరి లీగ్‌ మ్యాచ్‌లోనూ భారీ విజయం నమోదు చేసింది. మంగళవారం టైటాన్స్‌ 46-25తో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పట్నా పైరేట్స్‌ను చిత్తు చేసింది. మూడు వరుస ఓటములతో టోర్నీని ఆరంభించిన టైటాన్స్‌కిది వరుసగా ఏడో విజయం కావడం విశేషం. ఓ సీజన్లో అత్యధిక రైడింగ్‌ పాయింట్లు సాధించిన క్రీడాకారుడిగా రికార్డు సృష్టించిన కెప్టెన్‌ రాహుల్‌ చౌదరి తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ ఈ మ్యాచ్‌లో 13 పాయింట్లు కొల్లగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా పట్నా (52 పాయింట్లు) అగ్రస్థానంతో లీగ్‌ దశను ముగించింది. టైటాన్స్‌కు రెండో స్థానం ఖరారైంది. జైపుర్‌ (47) మూడో స్థానంతో సెమీస్‌ చేరింది. ఇక చివరి సెమీస్‌ బెర్తు ఎవరన్నదే తేలాల్సి ఉంది. మంగళవారం తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పుణెరి పల్టాన్‌ 39-34తో దబంగ్‌ దిల్లీని ఓడించి సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది.. ఆ జట్టుతో పాటు యు ముంబా కూడా తలో 37 పాయింట్లతో సెమీస్‌ బెర్తు కోసం పోటీలో ఉన్నాయి. బుధవారం తమ చివరి మ్యాచ్‌ల్లో పుణెరి.. దిల్లీని, పుణెరి బెంగళూరును ఢీకొనబోతున్నాయి.

అభిమానులారా నన్ను క్షమించండీ!

27/07/2016: రియో ఒలింపిక్స్కు ముందు విశ్రాంతి కోసం కెనడా మేజర్ ఈవెంట్ టొరంటో మాస్టర్స్ టైటిల్ నుంచి టాప్ సీడెడ్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా వైదొలిగారు. ఇందులో స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ పెదరర్ కూడా ఉన్నాడు. విశ్రాంతి తీసుకున్నా గాయాల నుంచి ఫెదరర్ కోలుకోలేదు. దీంతో తాను రియోలో తాను పాల్గొనడం లేదని 17 గ్రాండ్ స్లామ్ విజేత ఫెదరర్ తన వ్యక్తిగత ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎఫ్బీ పోస్ట్లో పేర్కొన్నాడు. 'అభిమానులారా ఈ విషయాన్ని చెప్పేందుకు చాలా బాధగా ఉంది. రియో ఒలింపిక్స్ లో స్విట్జర్లాండ్ కు ప్రాతినిధ్యం వహించలేకపోతున్నాను. డాక్టర్లు, ఇతర వ్యక్తిగత సిబ్బందితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఫిబ్రవరిలో సర్జరీ చేయించుకున్నాను. అయితే మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. రియోతో పాటు దాదాపు ఈ ఏడాది ఏ టోర్నీలోనూ పాల్గొనను. వచ్చే ఏడాది నూతన ఉత్సాహంతో రంగంలోకి దిగుతాను. కెరీర్ లో తక్కువ గాయాలతో కేవలం కొన్ని టోర్నమెంట్లకు మాత్రమే దూరమయ్యాను, ఎందుకంటే.. టెన్నిస్పై నాకు ఉన్న ప్రేమ అలాంటిది. అభిమానుల ఆశీర్వాదంతో పూర్తిగా కోలుకుని 2017లో రీ ఎంట్రీ ఇస్తాను' అని స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ ఈ విషయాలను ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించాడు.

కెప్టెన్ గా ఉంటే అలాగే వ్యవహరిస్తాను - కోహ్లీ

26/07/2016: నార్త్ సౌండ్(ఆంటిగ్వా) : మహేంద్ర సింగ్ ధోనీ టెస్టుల నుంచి రిటైరయ్యాక కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్న విరాట్ కోహ్లీ ఇప్పటికే జింబాబ్వే, శ్రీలంకపై సిరీస్ విజయాలను అందించాడు. అయితే కెప్టెన్ అయినప్పటికీ తాను ఓ సాధారణ బ్యాట్స్ మన్ తరహాలోనే ఆలోచిస్తుంటానని కోహ్లీ తెలిపాడు. బ్యాటింగ్ సమయంలోనే కాదు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు తన ఆలోచన తీరు అలాగే ఉంటుందని.. దాంతో ఆటగాళ్లను సరైన స్థానాల్లో ఉంచి ఫీల్డింగ్ చేయించడం సులభమన్నాడు. బ్రాత్ వైట్ ఔట్ విషయంలో అటాకింగ్ ఫీల్డింగ్ సత్ఫలితాన్ని ఇచ్చిందని, బ్యాట్స్ మన్ బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలంటే తాను కూడా బ్యాట్స్ మన్ తరహాలో ఆలోచించడం ఉత్తమమని అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్ పై తొలి టెస్టులో ఇన్నింగ్స్ 92 పరుగుల విజయం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నాడు. 560-70 పరుగులు చేస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి ఉంటుందని, అదే విజయానికి బాటలు వేసిందని విరాట్ చెప్పుకొచ్చాడు. కోచ్ అనిల్ కుంబ్లేను ప్రశంసించాడు. అతడు కోచ్ అయ్యాక.. బెంగళూరులో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాం, కరీబియన్ వచ్చాక హార్స్ రైడింగ్, బీచ్ గేమ్స్ స్విమ్మింగ్, టూరిస్ట్ ప్రదేశాలు సందర్శించాం.. ఇలా అన్నీ చేస్తూనే కుంబ్లే శిక్షణలో నిమగ్నమైనట్లు వివరించాడు. ఈ విజయం ఏ ఒక్కరిదో కాదని, బ్యాట్స్ మన్, బౌలర్లు సమిష్టిగా రాణించడంతో అద్భుత విజయం టీమిండియా సొంతమైందని కోహ్లీ పేర్కొన్నాడు.

ఫైనల్లో శ్రేష్ట, శ్రావ్య - హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్

26/07/2016: హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ బాలికల సింగిల్స్ (అండర్-13) విభాగంలో శ్రేష్ట రెడ్డి, శ్రావ్య ఫైనల్లోకి దూసుకెళ్లారు. సోమవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో శ్రేష్ట 15-11, 11-15, 15-13 తేడాతో కె.వెన్నెలపై విజయం సాధించింది. మరో సెమీస్‌లో శ్రావ్య 17-15, 19-17తో పల్లవి జోషిని ఓడించింది. బాలుర విభాగం (అండర్-13)లో ఉన్నిత్ కృష్ణ, నికశిప్త శౌర్య తుది పోరుకు అర్హత సాధించారు. తొలి సెమీస్‌లో ఉన్నిత్ 15-8, 15-12తో ఎం. శశాంక్ సాయిపై గెలుపొందగా, మరో సెమీస్‌లో నికశిప్త శౌర్య 15-8, 15-13తో శ్రీమాన్ ప్రీతమ్‌ను చిత్తు చేశాడు. అంతకు ముందు జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్ రెడ్డి ఈ పోటీలను ప్రారంభించారు. హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి.చాముండేశ్వరీనాథ్, పాణీరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇంగ్లండ్ ఘనవిజయం - పాకిస్తాన్‌తో రెండో టెస్టు

26/07/2016: మాంచెస్టర్: పాకిస్తాన్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ జట్టు 330 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఆట నాలుగో రోజు సోమవారం 565 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన పాకిస్తాన్ 70.3 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ మొహమ్మద్ హఫీజ్ (72 బంతుల్లో 42; 7 ఫోర్లు; 1 సిక్స్), అసద్ షఫీఖ్ (53 బంతుల్లో 39; 8 ఫోర్లు) మినహా అందరూ విఫలమయ్యారు. పేసర్లు జేమ్స్ అండర్సన్, వోక్స్‌తో పాటు స్పిన్నర్ మొయిన్ అలీ మూడేసి వికెట్లతో పాక్ వెన్నువిరిచారు. అంతకుముందు ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 30 ఓవర్లలో వికెట్ నష్టానికి 173 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్ అలిస్టర్ కుక్ (78 బంతుల్లో 76 నాటౌట్; 9 ఫోర్లు), జో రూట్ (48 బంతుల్లో 71 నాటౌట్; 10 ఫోర్లు) వన్డే తరహాలో ఆడి పాక్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. వచ్చే నెల 3 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో మూడో టెస్టు జరుగుతుంది.

సెమీస్‌లో తెలుగు టైటాన్స్

25/07/2016: న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ సెమీఫైనల్స్‌కు చేరింది. కెప్టెన్ రాహుల్ చౌదరీ తన స్టార్ ప్రదర్శనను కొనసాగించడంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్‌పై 35-23 తేడాతో టైటాన్స్ నెగ్గింది. ఇప్పటికే జైపూర్‌తో పాటు పట్నా సెమీస్‌కు చేరాయి. రాహుల్ 11 రైడింగ్ పాయింట్లతో జట్టు విజయంతో కీలక పాత్ర పోషించాడు. నీలేష్ 5 పాయింట్లు చేశాడు. మరో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ 41-20తో బెంగాల్ వారియర్స్‌పై గెలిచింది.

63 ఏళ్లలో తొలిసారి.. - వెస్టిండీస్‌ గడ్డపై భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌ విజయం

25/07/2016: కోహ్లిసేన చరిత్ర సృష్టించింది. 63 ఏళ్లుగా వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న భారత్‌కు తొలిసారి ఇన్నింగ్స్‌ విజయాన్ని రుచి చూపింది. నాలుగు టెస్టుల సిరీస్‌ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును ఇన్నింగ్స్‌ 92 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 323 పరుగులు వెనుకబడి ఫాలోఆన్‌ ఆడిన విండీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 231 పరుగులకే ఆలౌట్‌ చేసింది. అశ్విన్‌ 7 వికెట్లతో విండీస్‌ పతనాన్ని శాసించాడు. ఆంటిగ్వా: తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకే వెస్టిండీస్‌ను ఆలౌట్‌ చేసి, ఆ జట్టును ఫాలోఆన్‌లోకి నెట్టిన భారత బౌలర్లు.. రెండో ఇన్నింగ్స్‌లో మరింతగా చెలరేగారు. భారత ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌.. బంతితోనూ విజృంభించాడు. అతను 25 ఓవర్లలో 87 పరుగులే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. అతడి ధాటికి విలవిలలాడిన విండీస్‌.. 78 ఓవర్లలో 231 పరుగులకే ఆలౌటైంది. శామ్యూల్స్‌ (50), కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ (51 నాటౌట్‌), బిషూ (45) మాత్రమే కాస్త పోరాడారు. అంతకుముందు మూడో రోజు షమి (4/66), ఉమేశ్‌ యాదవ్‌ (4/41) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ 243 పరుగులు చేసి ఆలౌటైంది. లోయరార్డర్లో డౌరిచ్‌ (57), హోల్డర్‌ (36) పోరాడటంతో విండీస్‌ ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. కోహ్లి వెంటనే విండీస్‌ను ఫాలోఆన్‌ ఆడించాడు. ఆట ఆఖరుకు ఆతిథ్య జట్టు 21/1తో నిలిచింది. ఇషాంత్‌.. క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (2)ను ఔట్‌ చేసి రెండో ఇన్నింగ్స్‌లో విండీస్‌ పతనానికి తెరతీశాడు. నాలుగో రోజు ఇన్నింగ్స్‌ కొనసాగించిన విండీస్‌.. ఆరంభంలో పర్వాలేదనిపించింది. ఓపెనర్‌ చంద్రిక (31), శామ్యూల్స్‌ నిలకడగా ఆడటంతో ఓ దశలో 88/2తో నిలిచింది. ఐతే ఇక్కడే అశ్విన్‌ మాయాజాలం మొదలైంది. అతను చంద్రికను ఔట్‌ చేసి పతనానికి తెరతీశాడు. అశ్విన్‌ ధాటికి విండీస్‌ 44 పరుగుల తేడాలో 6 వికెట్లు కోల్పోయిన విండీస్‌ ఓ దశలో 132/8తో నిలిచింది. ఐతే కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, బిషూ తొమ్మిదో వికెట్‌కు 95 పరుగులు జోడించి భారత విజయాన్ని ఆలస్యం చేశారు. టీ తర్వాత అశ్విన్‌ ఒకే ఓవర్లో బిషూ, గాబ్రియల్‌ (4)ను ఔట్‌ చేసి విండీస్‌ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. భారత్‌ ఇప్పటిదాకా వెస్టిండీస్‌ పర్యటనలో ఇన్నింగ్స్‌ విజయం సాధించలేదు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 566/8 డిక్లేర్డ్‌ వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 243 వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌: క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ ఎల్బీ (బి) ఇషాంత్‌ 2; చంద్రిక (సి) సాహా (బి) అశ్విన్‌ 31; డారెన్‌ బ్రావో (సి) రహానె (బి) ఉమేశ్‌ యాదవ్‌ 10; శామ్యూల్స్‌ (బి) అశ్విన్‌ 50; బ్లాక్‌వుడ్‌ (సి) కోహ్లి (బి) అశ్విన్‌ 0; చేజ్‌ (సి) కేఎల్‌ రాహుల్‌ (బి) అశ్విన్‌ 8; డౌరిచ్‌ ఎల్బీ (బి) మిశ్రా 9; హోల్డర్‌ (బి) అశ్విన్‌ 16; కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ నాటౌట్‌ 51; బిషూ (సి) పుజారా (బి) అశ్విన్‌ 45; గాబ్రియల్‌ (బి) అశ్విన్‌ 4; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (78 ఓవర్లలో ఆలౌట్‌) 231 వికెట్ల పతనం: 1-2, 2-21, 3-88, 4-92, 5-101, 6-106, 7-120, 8-132, 9-227 బౌలింగ్‌: ఇషాంత్‌ 11-2-27-1; షమి 10-3-26-0; ఉమేశ్‌ యాదవ్‌ 13-4-34-1; అశ్విన్‌ 25-8-83-7; మిశ్రా 19-3-61-1

కుక్, రూట్ శతకాల మోత - తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 314/4

23/07/2016: మాంచెస్టర్: పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. జో రూట్ (246 బంతుల్లో 141 బ్యాటింగ్; 18 ఫోర్లు)తో పాటు కెప్టెన్ అలిస్టర్ కుక్ (172 బంతుల్లో 105; 15 ఫోర్లు) సెంచరీలతో చెలరేగడంతో శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 314 పరుగులు సాధించింది. 25 పరుగులకు తొలి వికెట్ పడిన దశలో కుక్, రూట్ కలిసి రెండో వికెట్‌కు 185 పరుగులు జోడించారు. క్రీజులో రూట్‌తో పాటు వోక్స్ (2 బ్యాటింగ్) ఉన్నా డు. ఆమిర్, రాహత్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.

సెమీస్‌లో జైపూర్ పింక్ పాంథర్స్

23/07/2016: ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ నాలుగో సీజన్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం పట్నా పైరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 29-22 తేడాతో నెగ్గి వరుసగా మూడో విజయాన్ని సాధించింది. అజయ్ కుమార్ ఏడు రైడింగ్ పాయింట్లు సాధించగా అమిత్ హూడా ఐదు ట్యాకిల్ పాయింట్లతో అదరగొట్టాడు. పట్నా నుంచి ప్రదీప్ నర్వాల్ కూడా ఏడు పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. 25వ నిమిషం వరకు 13-13తో గట్టి పోటీ ఇచ్చిన పట్నా ఆ తర్వాత వెనకబడి కోలుకోలేకపోయింది. 47 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న జైపూర్ మరో మ్యాచ్ మిగిలుండగానే సెమీస్‌కు చేరింది. మరో మ్యాచ్‌లో జంగ్ కున్ లీ (8 రైడింగ్ పాయింట్లు) సూపర్ షోతో బెంగాల్ వారియర్స్ 31-27 తేడాతో పటిష్ట యు ముంబాను మట్టికరిపించింది.

విరాట్ విశ్వరూపం.. అశ్విన్ అదుర్స్ - కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ చేసిన కోహ్లీ

23/07/2016: నార్త్ సౌండ్ (ఆంటిగ్వా): వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి డబుల్ సెంచరీ (283 బంతుల్లో 200; 24 ఫోర్లు)కి తోడు ఆల్ రౌండర్ అశ్విన్ సెంచరీ (253 బంతుల్లో 113 ; 12 ఫోర్లు) స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించడంతో భారీ స్కోరు చేసింది. దీంతో రెండో రోజు కూడా భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఓవర్ నైట్ స్కోరు 302/4 తో బ్యాటింగ్ కు దిగిన భారత్ 566 పరుగుల వద్ద అమిత్ మిశ్రా(68 బంతుల్లో 53; 6 ఫోర్లు) 8వ వికెట్ గా ఔట్ కాగానే భారత్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన విండీస్ రెండో రోజు మ్యాచ్ ముగిసే సమయానికి వికెట్ కోల్పోయి 31 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోరు 302/4 తో రెండోరోజు బ్యాటింగ్ కు దిగిన కోహ్లీ, అశ్విన్ మొదట డిఫెన్స్కు ప్రాధాన్యమిచ్చారు. విండీస్ పేసర్లు బౌన్సర్లు, పదునైన పేస్ బౌలింగ్తో దాడులు చేసినా వీరు మాత్రం ఒత్తిడికి గురికాలేదు. 43 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ వదిలేయడంతో ఊపిరి పీల్చుకున్న అశ్విన్ 127 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. విరాట్ కూడా జోరు చూపడంతో తొలి సెషన్‌లో భారత్ వికెట్ కోల్పోకుండా 102 పరుగులు చేసింది. కానీ లంచ్ తర్వాత రెండో బంతికే గాబ్రియెల్ బౌలింగ్ లో కోహ్లి అవుట్ కావడంతో ఐదో వికెట్‌కు 168 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. బ్రాత్వైట్కు మూడు వికెట్లు కోహ్లి ఔటయ్యాక క్రీజులోకొచ్చిన సాహా (88 బంతుల్లో 40; 1 ఫోర్, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. అయితే బ్రాత్ వైట్ బౌలింగ్ లో ముందుకొచ్చి ఆడగా సాహా స్టంప్ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మిశ్రా సహకారంలో అశ్విన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బ్రాత్ వైట్ మరోసారి భారత్ను దెబ్బతీశాడు. స్కోరు వేగాన్ని పెంచేందుకు యత్నించిన అశ్విన్ బ్రాత్వైట్ బౌలింగ్ లో గాబ్రియెల్ కు క్యాచ్ ఇచ్చి ఏడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. షమీ(9 బంతుల్లో 17; 2 సిక్సులు) దూకుడుగా ఆడుతుంటే మరోవైపు మిశ్రా హాఫ్ సెంచరీ (53) చేసి బ్రాత్ వైట్ బౌలింగ్ లో హోల్డర్ క్యాచ్ పట్టడంతో భారత్ 8వ వికెట్ కోల్పోయింది. అప్పటికి 161.5 ఓవర్లలో భారత్ స్కోరు 566/8. మిశ్రా ఔట కాగానే కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లెర్ చేశాడు. విండీస్ బౌలర్లలో బిషూ, బ్రాత్వైట్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, గాబ్రియెల్ రెండు వికెట్లు తీశాడు. బ్యాటింగ్ కు దిగిన విండీస్ 16 ఓవర్లలో వికెట్ కోల్పోయి 31 పరుగులు చేసింది. బ్రాత్వైట్ (11), బిషూ(0) క్రీజులో ఉన్నారు. జట్టు స్కోరు 30 పరుగుల వద్ద షమీ బౌలింగ్ లో ఔటయ్యాడు.

రియో వెళ్లనున్న సచిన్‌!

23/07/2016: దిల్లీ: రియో ఒలింపిక్స్‌ క్రీడా సంబరంలో పాల్గొనాలని భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ను అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ(ఐవోసీ) అధ్యక్షుడు థామస్‌ బాక్‌ ఆహ్వానించారు. తెందుల్కర్‌ ప్రస్తుతం భారత ఒలింపిక్‌ సంఘానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌ జరుగనున్న రియోడిజెనిరో నగరానికి ఆగస్టు 2న చేరుకొని గేమ్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారులను సచిన్‌ ఉత్సాహపరచనున్నట్లు సమాచారం. జికా వైరస్‌తో ముప్పున్న బ్రెజిల్‌ లాంటి దేశాలకు వెళ్లాల్సిన వారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఎల్లో ఫీవర్‌ వ్యాక్సిన్‌ను సచిన్‌ ఈ మధ్యే ముంబయిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వేయించుకున్నాడు. గత కొద్ది రోజుల క్రితం లండన్‌లో మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న సచిన్‌ రియో ప్రయాణానికి సంసిద్ధమై అక్కడ భారత క్రీడాకారులకు మద్దతు పలికేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

శతకంతో చెలరేగిన కోహ్లి..

22/07/2016: అంటిగ్వా: విండీస్‌ పర్యటనను టీమ్‌ ఇండియా ధాటిగా ఆరంభించింది. తొలిటెస్టు తొలిరోజు స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించి భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (143 నాటౌట్‌) శతకంతో చెలరేగడంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి భారత్‌ 302/4తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. కోహ్లికి తోడుగా అశ్విన్‌(22) క్రీజులో ఉన్నారు. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఆదిలోనే ఓపెనర్‌ విజయ్‌(7) వికెట్‌ కోల్పోయింది. అనంతరం పుజారా(16) తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో భారత్‌ తడబడింది. అయితే ఈ దశలో ఓపెనర్‌ ధావన్‌(84)కు జత కలిసిన కోహ్లి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. నిలిచిన ధావన్‌-కోహ్లి బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై విండీస్‌ పేస్‌ బౌలర్లు గాబ్రియల్‌, హోల్డర్‌ షార్ట్‌ పిచ్‌ బంతులతో భారత బ్యాట్స్‌మెన్స్‌ను ఇబ్బంది పెట్టారు. దీంతో పరుగులు సాధించేందుకు శ్రమించాల్సివచ్చింది. అయితే విరాట్‌ రాకతో ఇన్నింగ్స్‌కు వూపొచ్చింది. స్ట్రైక్‌ రొటేట్‌ చేయడంతో స్కోరు వేగం పెరిగింది. కోహ్లి క్లాస్‌ ఇన్నింగ్స్‌ ఐపీఎల్‌లో వరుస శతకాలతో క్రికెట్‌ అభిమానులను అలరించిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి టెస్టుల్లోనూ తన జోరు కొనసాగించాడు. కెరీర్‌లో తన 12వ శతకాన్ని సాధించాడు. 197 బంతుల్లో 143 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు టెస్టుల్లో 3000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. జట్టు స్కోరు 74/2 ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన కోహ్లి .. ధావన్‌తో కలసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. వీరిద్దరూ మూడో వికెట్‌ 105 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

విజేందర్ కెరీర్ నాశనం చేస్తాను..

21/07/2016: తనతో భవిష్యత్తులో బాక్సింగ్ రింగ్‌లో పోటీపడేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత బాక్సర్ విజేందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై బ్రిటిష్ బాక్సర్ అమీర్ ఖాన్ మరోసారి తీవ్రంగా స్పందించాడు. 'విజేందర్ నాతో పోటీకి సిద్ధమని చాలెంజ్ చేయడం ఏంటి? అతడికి ఇది చాలా తమాషాగా ఉంది. అసలు విజేందర్కు కెరీర్ లేకుండా చేస్తాను' అని అమీర్ పేర్కొన్నాడు. తనలాంటి స్టార్ ఆటగాళ్లతో పోటీకి రెడీ అని వ్యాఖ్యానించేముందు ఎంతో అనుభవాన్ని సంపాదించాలని విజేందర్కు సూచించాడు. ప్రస్తుతం మిణికట్టు సర్జరీ చేయించుకున్న అమీర్.. విజేందర్ తో పోటీకి తాను సిద్ధమేనని, అయితే ఇంతటి పెద్ద బౌట్లో పాల్గొనాలంటే ఎంతో అనుభవం కావాలని అందుకు కొన్నేళ్ల సమయం పడుతుందన్నాడు. డబ్ల్యూబీఏ లైట్‌వెయిట్ ప్రపంచ చాంపియన్‌గా ఉన్న అమీర్, ఒలింపిక్స్‌లో ఓ రజతం కూడా సాధించాడు. పాకిస్తాన్-భారత్ సంబంధాల తరహాలోనే ఈ బౌట్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని, భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ క్రేజ్ ఉంటుందని అభిప్రాయపడ్డాడు. వచ్చే 10 బౌట్లు విజేందర్కు సవాల్ విసురుతాయన్నాడు. అతడి ఆటను, బౌట్ కెరీర్ గ్రాఫ్ ను తాను గమనిస్తున్నట్లు వెల్లడించాడు. మా ఇద్దరి మధ్య జరిగే బౌట్ బ్లాక్ బస్టర్గా నిలవడం ఖాయమనీ, అలాకాని పక్షంలో విజేందర్కు తానెప్పుడు మద్ధతిస్తానని పేర్కొన్నాడు. వరుస బౌట్లలో విజయాలతో దూసుకెళ్తోన్న విజేందర్‌ను చిన్నపిల్లాడితో పోల్చుతూ అమీర్ ఇదివరకే ట్వీట్ చేశాడు. విజేందర్ తన కోరిక(అమీర్తో బౌట్) విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.

రిటైరయినందుకు బాధపడను - ధోనీ

21/07/2016: వెస్టిండీస్‌తో నేటి(గురువారం) నుంచి ప్రారంభమయ్యే నాలుగు టెస్టుల సిరీస్‌లో స్పిన్నర్లు కీలకపాత్ర పోషిస్తారని భారత పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అభిప్రాయపడ్డాడు. కరీబియన్ గడ్డపై మందకొడి పిచ్‌ల దృష్ట్యా జట్టులో స్పిన్నర్లు చాలా కీలకం కానున్నారని తెలిపాడు. భారత జట్టులో పేసర్లు విరివిగా అందుబాటులో ఉండడంపై ధోని అనందం వ్యక్తం చేశాడు. టెస్టుల నుంచి తాను వైదొలగినందుకు(రిటైర్మెంట్) చింతించడం లేదని పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియాకు తన సేవలు కొనసాగుతున్నాయని చెప్పాడు. గతంలో టెస్టులు, వన్డేలు, టీ20లు అంటూ అన్ని ఫార్మాట్ల మ్యాచ్ లతో బిజీబిజీగా ఉండేవాడిని. అయితే టెస్టులకు గుడ్ బై చెప్పినందున ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సమయంలో కుటుంబంతో గడపడంతో పాటు తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్నట్లు ఎంఎస్ ధోని తెలిపాడు.

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ నేటి నుంచే - ఆత్మవిశ్వాసంతో టీమ్‌ఇండియా

21/07/2016: టీమ్‌ఇండియా సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు పోరుకు సిద్ధమైంది. చివరగా గత ఏడాది డిసెంబర్లో సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో తలపడ్డ భారత్‌.. ఇన్నాళ్లకు మళ్లీ సుదీర్ఘ ఫార్మాట్లోకి అడుగుపెడుతోంది. వెస్టిండీస్‌ను వెస్టిండీస్‌లోనే ఢీకొనబోతోంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ గురువారం ఆరంభమవుతుంది. గత రెండు పర్యటనల్లోనూ కరీబియన్‌ జట్టును మట్టికరిపించిన భారత్‌.. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని పట్టుదలతో ఉంది. అనిల్‌ కుంబ్లే కోచ్‌ అయ్యాక భారత్‌ ఆడుతున్న తొలి సిరీస్‌ ఇదే కావడం విశేషం. ఆంటిగ్వా 2007లో రాహుల్‌ ద్రవిడ్‌ నేతృత్వంలో.. 2011లో మహేంద్రసింగ్‌ ధోని నాయకత్వంలో వెస్టిండీస్‌పై సిరీస్‌ విజయాలు సాధించింది టీమ్‌ఇండియా. ఇక యువ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి శ్రీలంకపై, దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్‌ విజయాలు అందుకున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌ పర్యటనలో టెస్టు సిరీస్‌ గెలిస్తే రెండు రకాలుగా హ్యాట్రిక్కే. సీనియర్ల రిటైర్మెంట్‌ తర్వాత జట్టులోకి వచ్చిన యువ ఆటగాళ్లందరూ గత రెండు మూడేళ్లలో బాగానే అనుభవం సంపాదించారు. జట్టులో కుదరుకున్నారు. గత ఏడాదిలో అన్ని ఫార్మాట్లలోనూ భారత్‌ సత్తా చాటింది. ఈ నేపథ్యంలో బలహీనంగా కనిపిస్తున్న కరీబియన్‌ జట్టును ఓడించడం భారత్‌కు ఏమంత కష్టం కాకపోవచ్చు. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఎలాంటి కూర్పుతో బరిలోకి దిగుతుందన్నది ఆసక్తికరం. తుది జట్టులో ఎవరు: భారత్‌ ఈ మ్యాచ్‌లో ఎలా ఆడుతుందన్నదాని కంటే ముందు తుది జట్టు ఎలా ఉండబోతుందన్నది ఆసక్తి రేపుతున్న అంశం. కోహ్లి ఎప్పట్లాగే ఐదుగురు బౌలర్లతో దిగుతాడా.. ఒక బౌలర్‌ను తగ్గించుకుంటాడా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. ఇద్దరు పేసర్లు ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమి.. ఒక స్పిన్నర్‌ అశ్విన్‌ స్థానాలు ఖాయం. రెండో స్పిన్నర్‌గా మిశ్రా కూడా ఆడే అవకాశముంది. ఐతే ఐదో బౌలర్‌గా ఆల్‌రౌండర్‌ బిన్నీని ఎంచుకుంటారా లేక అతడి బదులు ఒక బ్యాట్స్‌మన్‌నే ఆడిస్తారా అన్నది చూడాలి. ఓపెనర్లుగా విజయ్‌, ధావన్‌లే బరిలోకి దిగే అవకాశముంది. మూడో స్థానంలో అనుభవజ్ఞుడైన పుజారాను దించుతారా.. లేక భీకర ఫామ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌కు అవకాశమిస్తారా అన్నది ఆసక్తికరం. రోహిత్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవచ్చు. విజయ్‌, కోహ్లి, రహానె బ్యాటింగ్‌లో కీలకం. బౌలింగ్‌లో ఇషాంత్‌, అశ్విన్‌లపై ఎక్కువ ఆశలున్నాయి.

సుప్రీంకోర్టులో సచిన్కు భారీ ఊరట! - సచిన్‌పై పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

19/07/2016: న్యూఢిల్లీ: దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు ప్రదానం చేసిన భారతరత్న పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. భారతరత్న పురస్కారాన్ని దుర్వినియోగం చేశారనే అరోపణలతో వీకే నస్వా అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. సచిన్ను భారతరత్నగా కీర్తిస్తూ కొందరు రచయితలు పుస్తకాలు రాశారని, సచిన్ కూడా అలాంటి వాణిజ్య కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారని నస్వా ఆరోపించారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు.. ఈ విషయంలో చర్యలు తీసుకోవడానికి చట్టబద్ధ నియమాలు లేవని పేర్కొంది. 'కొందరు ఇతర వ్యక్తులు మాజీ క్రికెటర్ సచిన్‌పై పుస్తకం రాసి భారతరత్న అని పేరు పెట్టుకున్నారు. అయితే దీనికి సచిన్‌ను బాధ్యులను చేయడం సబబు కాదు' న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

ఆరేళ్లకే వరల్డ్ రికార్డు

18/07/2016: బెంగళూరు: సంకల్పబలం గొప్పదైతే ఎంతటి కార్యాన్నైనా సాధించవచ్చని ఓ బాలుడు మరోసారి నిరూపించాడు. ఆరేళ్లకే ప్రపంచ రికార్డు నెలకొల్పడంతో పాటు గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించాడు స్వరూప్ గౌడ్. ఆదివారం బెంగళూరులో ఆరిన్ మాల్ లో జరిగిన ఈ స్కేటింగ్ ద్వారా స్వరూప్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఒకేసారి 36 కార్ల కింద నుంచి లింబో స్కేటింగ్ చేసి ఔరా అనిపించాడు. ఆ లక్ష్యాన్ని 33. 64 సెకన్లలోనే పూర్తి చేసి అబ్బురపరిచాడు. తొలి ప్రయత్నంలో విఫలమైనా, పట్టువిడకుండా రెండోసారి ప్రయత్నించి విజయవంతమయ్యాడు. స్వరూప్ తన మొదటి ప్రయత్నంలో భాగంగా 10 కార్లకు దూరంలో నిలిచిపోయాడు. దీంతో కాస్త ఆందోళన చెందిన స్వరూప్ ను కోచ్, అతని కుటుంబ సభ్యులు ఉత్సాహపరచడంతో మరోసారి యత్నించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గత రెండున్నర సంవత్సరాల నుంచి ఆర్వీ స్కేటింగ్ క్లబ్లో కోచ్ రాఘవేంద్ర పర్యవేక్షణలో ఆ బాలుడు శిక్షణ పొందుతున్నాడు. తాను స్కేటింగ్ పై మక్కువ పెంచుకోవడానికి స్కూల్లోని సీనియర్లే కారణమని స్వరూప్ గౌడ్ స్పష్టం చేశాడు. ఈ పోటీలో కార్ల మధ్య దూరం 20 సెం.మీ కంటే తక్కువ కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం 35 సెం.మీ మించకుండా చూశారు. కేవలం శరీరాన్ని గ్రౌండ్ కు సమాంతరంగా ఉంచుతూ స్కేటింగ్ చేయాలి. ఇందుకోసం గ్రౌండ్ ను ఎటువంటి ఎత్తుపల్లాలు లేకుండా ముందస్తు జాగ్రత్త తీసుకున్నారు.

పండగ చేసుకున్న పాకిస్థాన్ క్రికెటర్లు

18/07/2016: లార్డ్స్: ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన తర్వాత పాకిస్థాన్ క్రికెట్ టీమ్ విభిన్నంగా విజయోత్సవం జరుపుకుంది. లార్డ్స్ మైదానంలో 20 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ లో గెలవడంతో పాక్ క్రికెటర్ల సంబరాలు మిన్నంటాయి. పాకిస్థాన్ ప్లేయర్లు ఐదేసి పుష్-అప్లు తీశారు. జాతీయ గీతం పడుతూ తమ జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. ఆదివారం ఇక్కడ ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో పాక్ 75 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత సీనియర్ బ్యాట్స్మన్ యూనిస్ ఖాన్ ఆటగాళ్లందరినీ ఒక్కచోటుకు చేర్చి ఈ విన్యాసాలు చేయించాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన తర్వాత కెప్టెన్ మిస్బా కూడా పుష్-అప్ లు తీశాడు. లార్డ్స్ మైదానంలో తొలి సెంచరీ సాధించడంతో తన ఆనందాన్ని ఇలా వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్పై సెంచరీ చేసిన ప్రతిసారి పుష్-అప్లు తీస్తానని పాకిస్థాన్ సైన్యానికి ప్రమాణం చేసినట్టు మిస్బా వెల్లడించాడు. మ్యాచ్ లో విజయం సాధించడంతో సహచరులు కూడా అదేవిధంగా హర్షాతిరేకాలు తెలిపారు.

తల్లి కాబోతున్న టెన్నిస్ బ్యూటీ!

16/07/2016: బెలారస్ టెన్నిస్ బ్యూటీ, ప్రపంచ ఆరో ర్యాంకు క్రీడాకారిణి విక్టోరియా అజరెంకా గుర్తుంది కదా.. 2012, 2013 ఆస్ట్రేలియా ఓపెన్ టైటిళ్లు గెలుపొందిన ఈ సుందరి మోకాలి గాయం కారణంగా ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీలో పాల్గొనలేదు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఈ సుందరికి వైద్యులు శుభవార్త తెలిపారు. ప్రస్తుతం ప్రియుడితో సహాజీవనం చేస్తున్న ఆమె త్వరలో తల్లి కాబోతున్నది. ఈ విషయాన్ని అజరెంకా తన ఫేస్‌బుక్‌ పేజీలో వెల్లడించింది. ‘రోలాండ్ గ్యారోస్‌లో అయిన మోకాలి గాయం నుంచి ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. ఈ నేపథ్యంలో మా వైద్యుడు ఓ వార్త తెలిపారు. నేను- నా బాయ్‌ప్రెంఢ్ త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నాం. ఈ ఏడాది చివర్లో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నాం’ అని అజరెంకా తెలిపింది. ఈ నేపథ్యంలో తానే ఎంతగానో ప్రేమించే టెన్నిస్‌కు కొంతకాలం దూరమయ్యే అవకాశముందని పేర్కొంది. అయితే, గతంలో ఎంతోమంది మహిళా ఆథ్లెట్లు పిల్లల్ని కన్న తర్వాత మళ్లీ క్రీడల్లోకి ప్రవేశించి సత్తా చాటారని, వారి నుంచి స్ఫూర్తి పొంది తాను అదే చేయాలనుకుంటున్నానని అజరెంక తెలిపింది.

రాహుల్‌ @‌ 403 - టైటాన్స్‌కు వరుసగా నాలుగో విజయం

16/07/2016: బెంగళూరు: ప్రొ కబడ్డీలో నాలుగు వందల రైడ్‌ పాయింట్లు సాధించిన తొలి ఆటగాడిగా తెలుగు టైటాన్స్‌ కెప్టెన్‌ రాహుల్‌ చౌదరి చరిత్ర సృష్టించాడు. శుక్రవారం అతడు సూపర్‌టెన్‌తో చెలరేగడంతో టైటాన్స్‌ 32-29తో పుణెరి పల్టాన్‌పై విజయం సాధించింది. సందీప్‌ నర్వాల్‌ (7పాయింట్లు) డిఫెన్స్‌లో రాణించి రాహుల్‌కు అండగా నిలిచాడు. మ్యాచ్‌ ఆరంభంలో పుణెరి రైడర్లు విజృంభించి టైటాన్స్‌ను ఆరో నిమిషంలోనే ఆలౌట్‌ చేశారు. ఫలితంగా 10-6తో ఆధిక్యంలోకి వెళ్లిన పుణెరి.. ఆ తర్వాత స్కోరును 16-10కి పెంచుకుంది. ఐతే డిఫెండర్లు రాణించడంతో టైటాన్స్‌ పుంజుకుంది. ప్రథమార్ధాన్ని 15-17తో ముగించింది. ఆ తర్వాత రాహుల్‌, సందీప్‌ విజృంభించడంతో 22-20తో ముందంజ వేసింది. చివరిదాకా అలాగే ఆధిక్యాన్ని కాపాడుకునివరుసగా నాలుగో విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో దబంగ్‌ దిల్లీ 40-20తో బెంగళూరు బుల్స్‌ను చిత్తు చేసింది. దిల్లీ రైడర్‌ కాశీలింగ్‌ (11) రాణించాడు.

విశాఖ టెస్టు నవంబరు 17 నుంచి - ఇంగ్లాండ్‌తో సిరీస్‌ షెడ్యూల్‌ విడుదల

16/07/2016: దిల్లీ: విశాఖపట్నంలో తొలి టెస్టుకు ముహూర్తం ఖరారైంది. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నవంబరు 17న ఆరంభమయ్యే రెండో మ్యాచ్‌తో విశాఖ.. టెస్టు వేదికగా అరంగేట్రం చేయనుంది. నవంబరు 9న రాజ్‌కోట్‌ మ్యాచ్‌తో ఇంగ్లాండ్‌ సిరీస్‌ ఆరంభమవుతుంది. తొలి రెండు టెస్టులు కొత్త వేదికల్లో జరగనుండడం విశేషం. భారత పర్యటనలో ఇంగ్లాండ్‌ ఐదు టెస్టుల సిరీస్‌తో పాటు మూడేసి మ్యాచ్‌ల వన్డే, టీ20ల సిరీస్‌లను ఆడనుంది. వచ్చే ఏడాది జనవరి 15న వన్డే సిరీస్‌, జనవరి 26న టీ20 సిరీస్‌లు ఆరంభమవుతాయి. సుదీర్ఘ పర్యటన కావడంతో టెస్టు సిరీస్‌ ముగిసిన వెంటనే క్రిస్మస్‌ వేడుకల కోసం ఇంగ్లాండ్‌ జట్టు స్వదేశం వెళ్లే అవకాశముంది. బీసీసీఐ శుక్రవారం షెడ్యూల్‌తో పాటు.. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో సవాళ్ల గురించి కోచ్‌ కుంబ్లే, కెప్టెన్‌ కోహ్లి వివరించే వీడియోను విడుదల చేసింది. మ్యాచ్‌ల వివరాలు: తొలి టెస్టు: నవంబరు 9-13 రాజ్‌కోట్‌లో; రెండో టెస్టు: నవంబరు 17-21 విశాఖలో; మూడో టెస్టు: నవంబరు 26-30 మొహాలిలో; నాలుగో టెస్టు: డిసెంబరు 8-12 ముంబయిలో; ఐదో టెస్టు: డిసెంబరు 16-20 చెన్నైలో; తొలి వన్డే: 2017 జనవరి 15న పుణెలో; రెండో వన్డే: జనవరి 19న కటక్‌లో; మూడో వన్డే: జనవరి 22న కోల్‌కతాలో; తొలి టీ20: జనవరి 26న కాన్పూర్‌లో; రెండో టీ20: జనవరి 29న నాగ్‌పూర్‌లో; మూడో టీ20: ఫిబ్రవరి 1న బెంగళూరులో.

సొంతగడ్డపై తొలిసారి - విజేందర్‌ ప్రొఫెషనల్‌ టైటిల్‌ పోరు నేడే

16/07/2016: దిల్లీ: ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా సొంతగడ్డపై తొలి బౌట్‌ ఆడేందుకు విజేందర్‌సింగ్‌ సిద్ధమయ్యాడు. శనివారం ఇక్కడ త్యాగరాజ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరిగే ఆసియా పసిఫిక్‌ సూపర్‌ మిడిల్‌వెయిట్‌ ఛాంపియన్‌షిప్‌ బౌట్‌లో అతడు ఆస్ట్రేలియా బాక్సర్‌ కెర్రీ హోప్‌ను ఢీకొడుతున్నాడు. వరుసగా ఆరు నాకౌట్‌ విజయాలతో ప్రొఫెషనల్‌ కెరీర్‌ను గొప్పగా ఆరంభించిన విజేందర్‌కు.. సొంత దేశంలో ఇదే తొలి ప్రొఫెషనల్‌ బౌట్‌. అతడికిది తొలి టైటిల్‌ పోరు కూడా. విజేందర్‌ ఇప్పటివరకూ ఎదుర్కున్న ప్రత్యర్థుల కన్నా.. కెర్రీ హోప్‌ అనుభవజ్ఞుడు. గతంలో యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌నూ గెలుచుకున్న చరిత్ర హోప్‌ది. ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా 30 బౌట్లలో తలపడిన అతడు 23 విజయాలు సాధించాడు.

జైపూర్ జోరుకు బ్రేక్

15/07/2016: బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో వరుసగా మూడు విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్న జైపూర్ పింక్ పాంథర్స్‌కు ఝలక్ తగిలింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 29-23తో జైపూర్‌పై నెగ్గింది. సురేశ్ కుమార్ (6), కెప్టెన్ అనూప్ కుమార్ (5)ల సూపర్ రైడింగ్‌తో యు ముంబా ప్రత్యర్థిపై ఆధిక్యాన్ని ప్రదర్శించింది. జైపూర్ నుంచి రాజేశ్, జస్వీర్ ఆరేసి రైడింగ్ పాయింట్లతో చెలరేగినా ఇతరుల నుంచి సహకారం కరువైంది. తొలి అర్ధభాగం వరకు 10-8తో జైపూర్ ఆధిక్యంలోనే ఉంది. అయితే ఆ తర్వాత మాత్రం ముంబా ఆటగాళ్ల ధాటికి ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 38-23తో బెంగళూరు బుల్స్‌పై గెలిచింది.

క్రికెట్‌.. బిజినెస్‌.. కోహ్లి

15/07/2016: తక్కువ కాలంలో ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించుకున్న విరాట్‌ కోహ్లి క్రేజ్‌ను తమ బ్రాండ్ల ప్రచార కార్యక్రమాల కోసం ఉపయోగించుకునేందుకు తయారీ సంస్థలు పోటీపడుతున్నాయి. 27 ఏళ్ల విరాట్‌ కోహ్లి ఫార్మాట్‌తో సంబంధం లేకుండా మైమరపించే ఫామ్‌తో రాణిస్తూ అరుదైన రికార్డులను బద్ధలుకొడుతున్నాడు. ఈ క్రేజ్‌నే అదునుగా భావించిన కంపెనీలు కోహ్లి స్టార్‌డమ్‌ను ఉపయోగించి తమ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత అడిడాస్‌, ఆడి, టిస్సోట్‌, పెప్సీలతో పాటు దాదాపు 15 ప్రముఖ బ్రాండ్లకు కోహ్లి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. 2015లో బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా రూ. 100కోట్లు సంపాదించే ఆటగాళ్లలో కోహ్లి స్థానం సంపాదించాడు. భారత మాజీ క్రికెటర్‌ సచిన్‌ తెందుల్కర్‌, వన్డే కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీల సరసన తాజాగా విరాట్‌ కోహ్లి చేరాడు. ప్రపంచవ్యాప్తంగా అతితక్కువ సమయంలో విజయవంతమైన స్పోర్ట్‌మెన్‌గా కోహ్లి పేరు పొందాడు. క్రికెట్‌లోనే కాకుండా తన సొంత వ్యాపారాల్లో తన ముద్రవేయడానికి కోహ్లి పలు కంపెనీల్లో పెట్టుబడి పెడుతున్నాడు. గతేడాది భారత్‌లో ఏర్పాటు చేసిన జిమ్‌ చైన్‌, ఇంటర్నేషనల్‌ ప్రీమియర్‌ టెన్నిస్‌ లీగ్‌లో దుబాయ్‌ టెన్నిస్‌ జట్టు, ఇండియన్‌ సూపర్‌ లీగ్‌లో ఎఫ్‌సీ గోవా ఫ్రాంఛైజీ, ప్రో రెజ్లింగ్‌ లీగ్‌లో బెంగళూరు యోధాస్‌ జట్టు, లండన్‌కు చెందిన సోషల్‌ మీడియా స్పోర్ట్స్‌ స్టార్టప్‌ కంపెనీ కాన్వో, సింగపూర్‌కు చెందిన మరో స్టార్టప్‌ కంపెనీలో పెట్టుబడి పెట్టడంతో పాటు సహ యాజమానికిగా కూడా కోహ్లి ఉన్నాడు. 2013లో స్థాపించిన స్వచ్ఛంద సంస్థ విరాట్‌ కోహ్లి ఫౌండేషన్‌(వీకేఎఫ్‌) ద్వారా పేదపిల్లలకు సాయం కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో తన దైన శైలిలో పలు రికార్డులను బ్రేక్‌ చేస్తూనే బిజినెస్‌ మ్యాన్‌గా ఎదుగుతున్నాడు.

హైదరాబాద్‌ అమ్మాయి ద్రవిడ్‌ ఇంటికొచ్చి..

15/07/2016: ముంబయి: భారత దిగ్గజ బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు అమ్మాయిల్లో ఉన్న ఆదరణ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆటకు ఆట.. అందానికి అందం ఉన్న ద్రవిడ్‌.. లక్షలాది మంది అమ్మాయిల్ని అభిమానులుగా మార్చుకున్నాడు. ఆ అభిమానుల్లో ఓ అమ్మాయి తన ఇంటికి వచ్చి ఓసారి ఎంతగా ఇబ్బంది పెట్టిందో తాజాగా ఓ కార్యక్రమంలో వెల్లడించాడు ద్రవిడ్‌. ‘‘సుదీర్ఘంగా సాగిన ఓ విదేశీ పర్యటన ముగించుకుని ఇంటికి వచ్చిన సమయమది. ఉదయం ఇంటికొచ్చి పడుకుండిపోయాను. మధ్యాహ్నం కూడా లేవలేదు. సాయంత్రం లేవగానే.. నా కోసం ఓ అభిమాని ఎదురుచూస్తోందని అమ్మ చెప్పింది. ఆమె హైదరాబాద్‌ నుంచి వచ్చిందని.. గంట నుంచి నాకోసం ఎదురు చూస్తోందని తెలిసింది. అప్పటికీ మా అమ్మానాన్నా ఆమెకు కాఫీ ఇచ్చి మర్యాద చేశారు. నేనెళ్లి ఆమెకు ఆటోగ్రాఫ్‌ ఇచ్చి ఫొటో దిగాను. ఎలా ఉన్నావని అడిగి.. హైదరాబాద్‌ నుంచి రావడం గొప్ప విషయం అన్నాను. ఐతే నాకోసం తను ఇల్లు వదిలి వచ్చేసినట్లు.. ఇకపై మా ఇంట్లోనే ఉండబోతున్నట్లు చెప్పడంతో షాకయ్యాను. అదెలా సాధ్యం అంటూ ఆమెకు సర్దిచెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డాను’’ అని ద్రవిడ్‌ వెల్లడించాడు.

కోహ్లీ సహా ఆటగాళ్లలో తీవ్ర అసంతృప్తి!

14/07/2016: న్యూఢిల్లీ : టీమిండియా ప్రధాన కోచ్గా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు తనను ఎందుకు ఎంపిక చేయలేదంటూ మాజీ ఆటగాడు, టీమిండియాకు డైరెక్టర్ గా సేవలందించిన రవిశాస్త్రి పరోక్షంగా ప్రశ్నిస్తూనే ఉన్నాడు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఉద్దేశపూర్వకంగానే తనను ఇంటర్వ్యూ చేసే సమయంలో అక్కడ లేవపోవడంపై వ్యాఖ్యలు చేయగా, ఆ సమయంలో అధికారిక మీటింగ్ లో పాల్గొన్నందున హాజరు కాలేదని గంగూలీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం టీమిండియ ఆటగాళ్లు బీసీసీఐ నిర్ణయాలతో ఆందోళన చెందుతున్నారు. బోర్డు నిర్ణయంతో ఆశ్చర్యానికి లోనవుతున్నారు. మినీ ఐపీఎల్, దులీప్ ట్రోఫీని ఏకకాలంలో నిర్ణయించాలని బీసీసీఐ షెడ్యూల్ ఖరారు చేయడంతో అసలు సమస్య మొదలైంది. సరైన ప్రణాళికలు లేకుండా బోర్డు వ్యవహరిస్తోందని, ఏ టోర్నమెంట్లలో పాల్గొనాలో అర్థంకావడం లేదని ఆటగాళ్లు చెబుతున్నారు. వ్యక్తిగతంగా ఆటగాళ్లు తమకు ఉన్న ఒప్పందాల కారణంగా ఆయా జట్లకు కొనసాగాల్సి ఉంటుంది. కానీ, బీసీసీఐ నిర్వహించే మ్యాచ్లు ఏకకాలంలో ఉంటే కాంట్రాక్టుల పరిస్థితి ఏంటని ఆటగాళ్లు ప్రశ్నిస్తున్నారు. అయితే కనీసం నెల రోజుల ముందు తమకు ఈ విషయాన్ని తెలపాలని టీమిండియా టెస్ట్ కెప్టెన్ కోహ్లీతో సహా ఇతర ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు.

గంగూలీని హీరోతో పోల్చిన సెహ్వాగ్

14/07/2016: న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్తో పోల్చాడు. 14 ఏళ్ల క్రితం నార్త్వెస్ట్ వన్డే సిరీస్ నెగ్గినపుడు జరిగిన సంగతులను గుర్తు చేసుకుంటూ ఈ కామెంట్ చేశాడు. నార్త్వెస్ట్ సిరీస్ విజయంతో గంగూలీ అందరి హృదయాలను గెలిచాడని పేర్కొన్నాడు. 2002, జూలై 13న ఇంగ్లండ్తో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించి టీమిండియా సిరీస్ కైవశం చేసుకుంది. అప్పుడు కెప్టెన్ గా ఉన్న గంగూలీ చొక్కా విప్పి విజయోత్సాహంతో సింహనాదం చేశాడు. అంతకుముందు ముంబైలో భారత్తో జరిగిన మ్యాచ్లో తమ టీమ్ నెగ్గినప్పుడు ఇంగ్లండ్ ఆల్రౌండర్ ఫ్లింటాఫ్ మైదానంలో చొక్కా విప్పి గంతులేశాడు. నార్త్వెస్ట్ సిరీస్లో టీమిండియా ప్రతీకారం తీర్చుకోవడంతో గంగూలీ కూడా చొక్కా విప్పి ఇంగ్లీషు ఆటగాళ్లకు షాక్ ఇచ్చాడు. అయితే తీవ్ర భావోద్వేగంతోనే అలా చేశానని తర్వాత గంగూలీ వివరణ ఇచ్చాడు.

ఒలింపిక్స్ కు తొలి బంగ్లాదేశీ అర్హత

13/07/2016: ఢాకా: బంగ్లాదేశ్ కు చెందిన క్రీడాకారుడు తొలిసారి ఒలింపిక్స్ కు అర్హత సాధించి కొత్త చరిత్ర సృష్టించాడు. రియో అర్హత ర్యాంకింగ్స్ లో భాగంగా బంగ్లాదేశ్ కు చెందిన గోల్ఫర్ సిద్దికూర్ రెహ్మాన్ 56వ స్థానంలో నిలిచి ఒలింపిక్స్ కు బెర్తును దక్కించుకున్నాడు. దీంతో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి బంగ్లాదేశీగా ఘనత సాధించాడు. ఈ మేరకు అంతర్జాతీయ గోల్ఫ్ ఫెడరేషన్ విడుదల చేసిన రియో ఒలింపిక్స్ ర్యాంకింగ్స్ లో రెహ్మాన్ చోటు దక్కించుకుని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. కాగా, బంగ్లాదేశ్ నుంచి స్మిమ్మర్లు మహిజుర్ రెహ్మాన్, సోనియా అక్తర్ తింపా, ఆర్చరీ విభాగంలో షైమోలీ రాయ్, అబ్దుల్లాహెల్ బాకీలు రియోలో పాల్గొంటున్నారు. అయితే వీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మాత్రమే రియోకు అర్హత సాధించగా, గోల్ఫర్ సిద్ధికూర్ మాత్రం ర్యాంకింగ్ ఆధారంగా ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి బంగ్లాదేశీగా నిలవడం విశేషం. ఇదిలా ఉంగా, దాదాపు శతాబ్దం తరువాత గోల్ప్ క్రీడను ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టడం మరో విశేషం. ఒలింపిక్స్ లో గోల్ప్ ను ప్రవేశపెట్టడం ఇప్పటికి మూడు సార్లు మాత్రమే జరిగింది. తొలిసారి 1900వ సంవత్సరంలో ఈ ఆటను ప్రవేశపెట్టగా, ఆ తరువాత 1904 ఒలింపిక్స్ లో ఆ క్రీడను చివరిసారి కొనసాగించారు.

టైటాన్స్‌ హ్యాట్రిక్‌

13/07/2016: బెంగళూరు: ప్రొ కబడ్డీ నాలుగో సీజన్లో తెలుగు టైటాన్స్‌ వరుసగా మూడో విజయం నమోదు చేసింది. మంగళవారం ఆ జట్టు 32-24తో బెంగళూరు బుల్స్‌ను మట్టికరిపించి.. సొంతగడ్డపై ఆ జట్టు చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. కెప్టెన్‌ రాహుల్‌ చౌదరి 9 రైడింగ్‌ పాయింట్లతో టైటాన్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. సందీప్‌ నర్వాల్‌ 5 ట్యాకిల్‌ పాయింట్లతో ఆకట్టుకున్నాడు. మ్యాచ్‌ ఆరంభంలోనే ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసి 10-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది టైటాన్స్‌. తర్వాత బెంగళూరు పుంజుకుని ప్రథమార్ధం ముగిసేసరికి టైటాన్స్‌ ఆధిక్యాన్ని 10-16కు తగ్గించినా.. మ్యాచ్‌లో ఒక్కసారీ ఆధిక్యం సాధించలేకపోయింది. 8 మ్యాచ్‌లాడిన తెలుగు జట్టు.. 4 విజయాలతో 24 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. పుణెరి పల్టాన్‌-బంగాల్‌ వారియర్స్‌ మధ్య రసవత్తరంగా సాగిన మరో మ్యాచ్‌ 34-34తో టైగా ముగిసింది.

'ఆడాళ్లతో ఉండడం కష్టం'

12/07/2016: న్యూఢిల్లీ: ఆడాళ్లతో వేగడం కష్టమేనని టీమిండియా బౌలర్ హర్భజన్ సింగ్ సరదాగా వ్యాఖ్యానించాడు. ఆడాళ్లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. 'గర్భంతో ఉన్నా లేదా మామూలుగా ఉన్న ఆడాళ్లతో సమయం గడపడం చాలా కష్టమ'ని పేర్కొన్నాడు. ఆలుమగల మధ్య సదావగాహన ఉంటే సంసారం సాఫీగా సాగిపోతుందని కూడా అన్నాడు. హర్భజన్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ నెలాఖరుకు అతడి భార్య గీతా బస్రా బిడ్డను ప్రసవించనుంది. తన మొదటి సంతానం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చేస్తున్నానని 36 ఏళ్ల భజ్జీ తెలిపాడు. గీత(32)ను గతేడాది అక్టోబర్ లో పెళ్లి చేసుకున్నాడు. పసిబిడ్డను ఎలా పెంచాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి భార్యతో కలిసి ప్రి-నాటల్ క్లాసులకు వెళ్లినట్టు వెల్లడించాడు. తన బిడ్డ ఇంగ్లండ్ లో పుడుతుందని చెప్పాడు. గీత బ్రిటీష్ పౌరురాలని, ఆమె తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారని చెప్పాడు. తమ కుటుంబంలోకి కొత్తగా రానున్న బుజ్జాయి కోసం షాపింగ్ మొదలు పెట్టానని భజ్జీ తెలిపాడు.

కన్నీళ్ల మధ్య... కల నెరవేరింది

12/07/2016: న్నేళ్లుగా అతను దేశం భారం మోశాడు. కొద్ది సేపు మేం అతడిని మోయడం గౌరవంగా భావిస్తున్నాం... ఈ మాట ఎక్కడో విన్నట్లుందా! దశాబ్ద కాలంగా దేశం తరఫున ఒక్కడే పోరాడి నిలిచాడు. ఇప్పుడు అతను నిలబడలేని స్థితిలో ఉంటే మేం చేయి అందించి నడిపించడం మాకు ఎంతో గౌరవం... మళ్లీ ఇప్పుడూ అదే మాట! అవును... మొదటిది క్రికెట్ ప్రపంచ కప్ విజయం సమయంలో సచిన్ గురించి జట్టు సభ్యులు చెబితే, ఇప్పుడు యూరో విజయంతో రొనాల్డో గురించి సహచరులు ఉద్వేగంగా చేసిన వ్యాఖ్య. ఈ రెండు దృశ్యాలు దిగ్గజ క్రీడాకారులు చిరకాలం వేచి చూసిన తర్వాత విజయం దక్కినపుడు కనిపించే భావోద్వేగాలకు అద్దం పడతాయి. యూరో విజయంతో పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అదే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడిగా గుర్తింపు ఉన్నా దేశం తరఫున టైటిల్ గెలవలేకపోయిన లోటును అతను ఇప్పుడు తీర్చుకున్నాడు. సమకాలీన ఫుట్‌బాల్ ప్రపంచంలో మెస్సీ, రొనాల్డో మధ్య పోలికలతో ఎవరు అత్యుత్తమ ఆటగాడు అనే చర్చ సుదీర్ఘంగా సాగుతూనే ఉంది. ఇప్పుడు దానికి స్పష్టత వచ్చేసింది! మెస్సీ ఖాతాలో లేని మేజర్ టోర్నీ రొనాల్డో సాధించేశాడు. ఫలితం గా ఇద్దరి మధ్య అంతరం పెంచేశాడు. 2004 యూ రో ఫైనల్లో 19 ఏళ్ల టీనేజర్‌గా పోర్చుగల్ ఓటమిలో భాగమైన రొనాల్డో, పుష్కర కాలం తర్వాత జట్టు చారిత్రక విజయంలో భాగమయ్యాడు. 25 నిమిషాల్లోనే... టైటిల్ లక్ష్యంగా మైదానంలోకి అడుగు పెట్టిన రొనాల్డోకు ఫైనల్లో 9వ నిమిషంలోనే షాక్ తగిలింది. ఫ్రాన్స్ ఆటగాడు పాయెట్ అడ్డుకోవడంతో మోకాలికి గట్టి దెబ్బ తగిలింది. అయితే చికిత్స తర్వాత మరో 8 నిమిషాలు ఆడినా... నొప్పి భరించలేక ఏడుస్తూ మైదానం వీడాడు. మరో 3 నిమిషాలకు ప్లాస్టర్‌తో తిరిగొచ్చి ఆడే ప్రయత్నం చేసినా అతని వల్ల కాలేదు. ఒక వైపు జట్టును మధ్యలోనే వదిలేసి పోతున్నాననే బాధ వెంటాడుతుండగా, 25వ నిమిషంలో కన్నీళ్లతో స్ట్రెచర్‌పై అతను మళ్లీ నిష్ర్కమించాల్సి వచ్చింది. మైదానం బయటినుంచే... రెండో అర్ధ భాగంలో ఫ్రాన్స్ ఆధిక్యం ప్రదర్శిస్తుండటంతో రొనాల్డో తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఒక దశలో పక్కన కూర్చున్న సహచరుడి తొడపై బలంగా కొట్టి ఆగ్రహం ప్రదర్శించాడు! ఇక ఆగలేనంటూ ఒంటికాలితోనే లేచి వచ్చేసి బయటినుంచే ఆటగాళ్లకు సూచనలు ఇస్తూ మేనేజర్ పాత్ర పోషించాడు. గోల్ కొట్టడానికి నాలుగు నిమిషాల ముందు ఎడెర్‌తో మాట్లాడి నువ్వే గెలిపిస్తున్నావంటూ స్ఫూర్తి నింపాడు. అతని మాటల మంత్రం ఏం అద్భుతం చేసిందో... ఎడెర్ గోల్‌తో పోర్చుగల్‌ను చరిత్రలో నిలిపాడు. ఇక ప్రపంచకప్ మిగిలింది మూడు సార్లు ‘ఫిఫా’ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచిన రొనాల్డో తొలి సారి దేశం తరఫున గర్వపడే ప్రదర్శన కనబర్చాడు. టోర్నీలో పోర్చుగల్‌ను ఫైనల్‌కు చేర్చడంలో అతను కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా హంగేరీ, వేల్స్‌లపై రొనాల్డో అద్భుత ఆట జట్టును గెలిపించింది. ఫైనల్లో గెలుపు తర్వాత హద్దుల్లేని సంబరాల్లో భాగమైన రొనాల్డో తనదైన శైలిలో షర్ట్ విప్పి పోజు ఇవ్వడమే కాదు... ప్రేక్షకుల్లోకి వెళ్లి తనకు ఈ స్థాయి తెచ్చిన మాంచెస్టర్ మాజీ మేనేజర్ అలెక్స్ ఫెర్గూసన్‌ను ఆత్మీయంగా కౌగిలించుకొని కృతజ్ఞతలు చెప్పడం కూడా మరచిపోలేదు. అయితే రొనాల్డోకు ఇంకా ఓ లోటు ఉంది. ఒక్కసారి ప్రపంచకప్‌ను కూడా ముద్దాడితే... ఇక రొనాల్డో దిగ్గజాలకే దిగ్గజంగా ఎదుగుతాడు. నా జీవితంలో ఇదో అత్యుత్తమ క్షణం. అందుకే భావోద్వేగాలు ఆపుకోలేక ఏడ్చేశాను. నేను భవిష్యత్తు చెప్పేవాడిని కాదు. కానీ అదనపు సమయంలో ఎడెర్ ఆట మార్చగలడని నాకు అనిపించింది. అందుకే అతడిపై నమ్మకముంచాం. - రొనాల్డో

'అతడు 300 వికెట్లు పడగొడతాడు'

12/07/2016: బ్రిస్బేన్: మిచెల్ స్టార్క్ గ్రేట్ బౌలర్ గా ఎదుగుతాడని ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కోచ్ డారెన్ లీమన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. అతడు ఫిట్నెస్ కాపాడుకుంటే టెస్టుల్లో 300 వికెట్లు పడగొడతాడని, ఆసీస్ దిగ్గజ బౌలర్ల సరసన చోటు సంపాదిస్తాడని అన్నాడు. మిచెల్ జాన్సన్ రిటైర్ కావడంతో అతడి వారసుడిగా స్టార్క్ ను పేర్కొంటున్నారు. ఇప్పటివరకు 25 టెస్టు మ్యాచ్ లు ఆడిన స్టార్క్ 91 వికెట్లు తీశాడు. మోకాలి ఆపరేషన్ అనంతరం గతనెలలో వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ లో స్టార్క్ సత్తా చాటాడు. మెక్గ్రాత్(563), డెన్నిస్ లిల్లీ(355), జాన్సన్(313), బ్రెట్ లీ(310) ఆస్ట్రేలియా తరపున 300 వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్లుగా ఘనత సాధించారు. ఫిట్నెస్ కాపాడుకుంటూ, ఎక్కువ మ్యాచ్లు ఆడితే స్టార్క్ కూడా 300 టస్టు వికెట్లు సాధిస్తాడని లీమాన్ చెప్పాడు. జూలై 26 నుంచి శ్రీలంకతో జరగనున్న టెస్ట్ మ్యాచ్ లో రివర్స్ స్వింగ్ తో అతడు చెలరేగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఫెడరర్ రికార్డు

05/07/2016: ఏడుసార్లు వింబుల్డన్ చాంపియన్ రోజర్ ఫెడరర్ అలవోకగా క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. ప్రిక్వార్టర్స్‌లో ఫెడరర్ 6-2, 6-3, 7-5తో స్టీవ్ జాన్సన్ (అమెరికా)పై గెలిచాడు. వింబుల్డన్‌లో ఫెడరర్ క్వార్టర్స్‌కు చేరడం ఇది 14వ సారి కాగా... ఓవరాల్‌గా గ్రాండ్‌స్లామ్‌లలో 48వ సారి. గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో అత్యధిక మ్యాచ్‌లు (306) గెలిచిన మార్టినా నవ్రతిలోవా రికార్డును ఫెడరర్ సమం చేశాడు. ఈసారి స్విస్ స్టార్ ఇప్పటివరకూ ఒక్క సెట్ కూడా ఓడిపోకపోవడం విశేషం. మరో ప్రి క్వార్టర్స్ మ్యాచ్‌లో సిలిచ్ (క్రొయేషియా) 6-1, 5-1తో ఆధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి నిషికోరి (జపాన్) గాయంతో వైదొలిగాడు. జొకోవిచ్‌ను ఓడించిన సామ్ క్వారీ (అమెరికా) 6-4, 7-6(5), 6-4తో మహుత్ (ఫ్రాన్స్)పై గెలిచి తొలిసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్‌కు చేరాడు.

ఇంగ్లాండ్‌ రాకపై బంగ్లా ఆశలు!

05/07/2016: ఢాకా: గత శుక్రవారం బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో జరిగిన ఉగ్రదాడి సెగ తాజాగా బంగ్లాదేశ్‌ క్రికెట్‌ను తాకింది. ఉగ్రదాడి జరిగినప్పటికీ ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టు బంగ్లాలో పర్యటిస్తుందని బంగ్లా క్రికెట్‌ బోర్డు భావిస్తోంది. నెల రోజుల పర్యటనలో భాగంగా సెప్టెంబర్‌ 30న ఇంగ్లాండ్‌ జట్టు బంగ్లాదేశ్‌ చేరుకోవలసి ఉంది. ఈ పర్యటనలో ఇంగ్లాండ్‌ మూడు వన్డేలు, రెండు టెస్ట్‌ మ్యాచ్‌లను ఆతిథ్య జట్టుతో ఆడనుంది. అయితే గత శుక్రవారం ఐఎస్‌ ఉగ్రవాదులు దాడులకు తెగబడి 20 మందిని హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లాలా.. వద్దా అని ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) ఆలోచిస్తోంది. ప్రభుత్వ సలహా మేరకే తాము బంగ్లాలో పర్యటించడానికి నిర్ణయించుకున్నట్లు ఈసీబీ అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు. ఆటగాళ్ల భద్రతకే ప్రథమ ప్రాధాన్యమని, బంగ్లాలో పర్యటించడం సురక్షితం కాదని ఇంగ్లాండ్‌ ప్రభుత్వం భావిస్తే పర్యటనను రద్దు చేసుకోవడానికి కూడా వెనుకాడమని ఉగ్రదాడి అనంతరం ఈసీబీ ఉన్నతాధికారులు ఇప్పటికే తెలియజేసిన సంగతి తెలిసిందే. ‘ఉగ్రదాడి బంగ్లాదేశ్‌కు దురదృష్టకర ఘటన, దేశంలో ఇలాంటి దుశ్చర్య జరుగుతుందని ఎప్పుడూ వూహించలేదని’ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు(బీసీబీ) అధ్యక్షుడు నజ్‌ముల్‌ హాసన్‌ అన్నారు. పారిస్‌లో కూడా ఇలాంటి దాడులు జరిగినప్పటికీ అక్కడ ఆటను కొనసాగించారని ఈ సందర్భంగా హాసన్‌ గుర్తు చేశారు. అయితే ఇంగ్లాండ్‌ జట్టు బంగ్లా పర్యటనకు రావడానికి మూడునెలల సమయం ఉందని అప్పటి వరకు పరిస్థితులు అదుపులోకి వస్తాయని ఆయన అన్నారు.

వింబుల్డన్‌ క్వార్టర్స్‌లో సాన్‌టినా

05/07/2016: లండన్‌: వింబుల్డన్‌ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జోడీ సాన్‌టినా క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన మహిళల డబుల్స్‌ మూడో రౌండ్‌లో అమెరికన్‌- లాట్వియా జోడీ మెక్‌హేల్‌-ఒస్తాపెంకోపై 6-1, 6-0తో సానియామీర్జా-మార్టినా హింగిస్‌ జోడీ గెలుపొందింది. దీంతో ఈ టోర్నీలో క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. మరోవైపు పురుషుల డబుల్స్‌లో ప్రీక్వార్టర్స్‌లో బోపన్న జోడి తడబడింది. మూడో రౌండ్లో హెన్రీ-పీర్స్‌ జోడీ చేతిలో 6-2, 3-6, 4-6, 7-6(8-6), 6-8తో ఓటమిపాలై బోపన్న-మెర్జియా జోడీ ఇంటిదారి పట్టింది.

లక్ష్యం ర్యాంకులు కాదు - కోహ్లి

05/07/2016: బెంగళూరు: మంచి క్రికెట్‌ ఆడటంపైనే టీమిండియా దృష్టిసారిస్తుందని జట్టు, ఆటగాళ్ల వ్యక్తిగత ర్యాంకులపై కాదని టెస్ట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పష్టం చేశారు. వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లే ముందు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విరాట్‌ కోహ్లి, కోచ్‌ అనిల్‌ కుంబ్లే పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోహ్లి మాట్లాడుతూ ర్యాంకులు కేవలం ప్రోత్సాహకాలు మాత్రమేనని, వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌ నెగ్గితే టెస్టుల్లో భారత్‌ నెం.1గా నిలుస్తుందన్నాడు. స్వదేశమైనా, విదేశమైనా అద్భుతంగా ఆడి విజయం సాధించడమే ముఖ్య ఉద్దేశమన్నాడు. అయితే టీమిండియా మాత్రం ప్రతి సిరీస్‌కు ఒకే విధంగా ప్రాముఖ్యతనిస్తుందని కోహ్లి పేర్కొన్నాడు. కరీబియన్‌ పర్యటనలో భారత్‌ నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొననుంది. తొలి టెస్ట్‌ మ్యాచ్‌ జులై 21న ఆంటిగ్వాలో ప్రారంభం కానుంది.

మెస్సీ జట్టులోకి తిరిగి రావాలంటూ.. - అర్జెంటీనాలో భారీ ర్యాలీ

04/07/2016: అర్జెంటీనా : కోపా అమెరికా టోర్నీ ఫైనల్‌లో ఓటమితో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించిన అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు లయనిల్‌ మెస్సీ తిరిగి జాతీయ జట్టులోకి రావాలంటూ ఆయన అభిమానులు, ఆ దేశ ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. శనివారం సాయంత్రం ఒబెలిస్కో ప్రాంతానికి చేరుకున్న వందలాది మంది అభిమానులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తమ అభిమాన ఆటగాడికి మద్దతుగా నినాదాలు చేశారు. మూడు సార్లు కోపా అమెరికా ఫైనల్స్‌కు చేరిన అర్జెంటీనా జట్టు రన్నరప్‌ కప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2014 ప్రపంచకప్‌ ఫైనల్‌లో కూడా ఆ జట్టు ఓటమిని చవి చూసింది. అన్ని ఫైనల్స్‌లోనూ ఆడిన మెస్సీ ఎందులోనూ ఒక్క గోల్‌ కూడా చేయలేకపోయాడు. గత వారం జరిగిన కోపా అమెరికా శతకోత్సవ ఫుట్‌బాల్‌ టోర్నీలో అర్జెంటీనా.. డిపెండింగ్‌ ఛాంపియన్‌ చిలీ చేతిలో ఓడిపోయింది. దీంతో తీవ్ర ఉద్వేగానికి గురైన మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

'డీఆర్ఎస్' లో స్వల్ప మార్పు!

04/07/2016: ఎడిన్బర్గ్: ప్రస్తుతం క్రికెట్లో అమల్లో ఉన్న డీఆర్ఎస్( నిర్ణయ సమీక్ష పద్ధతి)లో స్వల్ప మార్పుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆమోద ముద్ర వేసింది. డీఆర్ఎస్లో వందశాతం కచ్చితత్వం లేదని అటు బీసీసీఐతో పాటు, పలు క్రికెట్ బోర్డులు గత కొంతకాలంగా వాదిస్తున్నసంగతి తెలిసిందే. అయితే డీఆర్ఎస్లోని ఎల్బీడబ్యూ నిర్ణయంపై మాత్రమే కొద్దిపాటి మార్పుకు ఐసీసీ శ్రీకారం చుట్టింది. ఆటగాడు ఎల్బీగా అవుటైనప్పుడు బౌలింగ్ జట్టు కెప్టెన్ థర్థ్ అంపైర్ పరిశీలనకు వెళుతుంటాడు. ఇక్కడ ఆఫ్, లెగ్ స్టంప్ల లోపలి భాగాన్ని మాత్రమే ప్రధానంగా పరిశీలిస్తారు. బ్యాట్స్మెన్ బంతిని అడ్డుకున్న క్రమంలో ఆ బంతి వికెట్లను తాకిందా లేదా అనేది గమనిస్తారు. అయితే ఈ డేంజర్ జోన్ పరిధిని ఆఫ్, లెగ్ స్టంప్ల బయటకు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే డీఆర్ఎస్లో ప్రవేశపెట్టనున్న ఈ మార్పు బౌలర్లకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. తాజాగా నిర్ణయం అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు శనివారం రాత్రి ఇక్కడ ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ నేతృత్వంలో ఐడీఐ(ఐసీసీ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్) సభ్యులతో సుదీర్ఘ సమావేశం అనంతరం డీఆర్ఎస్ ఎల్బీడబ్యూల నిర్ణయంపై స్వల్ప మార్పులకు శ్రీకారం చుట్టారు. దీంతో 2022లో కామన్వెల్త్ గేమ్స్లో మహిళా క్రికెట్ను ప్రవేశపెట్టడంపై కూడా ఈ భేటీలో చర్చించారు. డీఆర్ఎస్ గురించి ఒకసారి చూద్దాం.. ప్రస్తుతం మూడు రకాల వేర్వేరు టెక్నాలజీల సహాయంతో డీఆర్‌ఎస్‌ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అటు ఎల్బీలను నిర్ధారించేందుకు హాక్ ఐ(బాల్ ట్రాకింగ్ టెక్నాలజీ), హాట్ స్పాట్, స్నికో మీటర్ టెక్నాలజీలను డీఆర్ఎస్ లో వాడుతున్నారు. బాల్ ట్రాకింగ్ టెక్నాలజీని బంతి దిశను సూచిండానికి వినియోగిస్తున్నారు. బ్యాట్స్‌మన్ బంతిని అడ్డుకోకపోతే అది వికెట్లను తాకేదా లేదా అనే విషయం తెలుస్తుంది. పిచ్ అయిన తర్వాత బంతి ప్రయాణించిన దూరం, వేగం ఇలాంటివన్నీ ఇందులో కలిసి ఉండటంతో చాలా గందరగోళం కనిపిస్తుంది.బంతి గమనం మారితే దానిని గుర్తించలేకపోవడం పెద్ద లోపం. పిచ్‌పై పడ్డ తర్వాత బంతి ఎలా వెళ్లవచ్చనేది నేరుగా నిలబడ్డ అంపైర్‌కు కనిపించినంత స్పష్టత ఇందులో సాధ్యం కాదనేది ఒక వాదన. అందరూ కాస్త విశ్వసించిన రెండో అంశం హాట్‌స్పాట్. బ్యాట్‌కు బంతి ఎడ్జ్ తీసుకుందా లేదా అనేది స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి క్యాచ్‌ల విషయంలో 90 శాతం వరకు సరైన ఫలితాలే వచ్చినా ఇది కూడా కొంత గందరగోళంగానే ఉంది. బంతి బ్యాట్‌కు లేదా ప్యాడ్‌కు తగిలిందా శబ్దం సాయంతో గుర్తించేందుకు స్నికో మీటర్ టెక్నాలజీని వాడుతున్నారు. అయితే నెమ్మదిగా వచ్చే స్పిన్నర్ల బంతులతో పాటు బ్యాట్స్‌మన్ ముందుకు వచ్చి ఆడితే మైక్‌లు ఈ శబ్దాన్ని గుర్తించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో డీఆర్‌ఎస్ పై పూర్తి భరోసా ఏర్పడలేదు. తాజాగా ఐసీసీ తీసుకున్న నిర్ణయం కూడా బంతి దిశపైనే కాబట్టి, డీఆర్ఎస్పై నెలకొన్న అనేక సందేహాలు ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయే అవకాశం ఉంది.

భారత క్రికెటర్లకు ‘బడ్డీ ప్రోగ్రాం’

04/07/2016: బెంగళూరు: భారత్‌ క్రికెట్‌ జట్టుకు కోచ్‌గా ఎంపికైన అనిల్‌ కుంబ్లే తనదైన శైలిలో ఆటగాళ్లకు శిక్షణను ప్రారంభించాడు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడెమీలో భారత క్రికెట్‌ జట్టు శిక్షణ శిబిరంలో పాల్గొంటోంది. కుంబ్లే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సమయంలో అప్పటి కోచ్‌ జాన్‌ రైట్‌ అమలు చేసిన ‘బడ్డీ ప్రోగ్రాం’ను ఇప్పుడు మళ్లీ అమలు చేస్తున్నాడు. ఈ బడ్డీ ప్రోగ్రాంలో ఒక బ్యాట్స్‌మన్‌కి ఒక బౌలర్‌ను జత చేస్తారు.అప్పట్లో వీవీఎస్‌ లక్ష్మణ్‌కు జహీర్‌ఖాన్‌ను జత చేశారు. దీంతో వాళ్లిద్దరూ మంచి స్నేహితులు కావడమే కాకుండా లక్ష్మణ్‌ నుంచి జహీర్‌ చాలా విషయాలు నేర్చుకున్నాడు. దీంతో బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్‌పై బౌలర్‌కు బ్యాటింగ్‌పై అవగాహన వచ్చేందుకు వీలుంది. అనంతరం జాన్‌రైట్‌ పదవి నుంచి వైదొలగడంతో ఈ కార్యక్రమం కూడా మరుగున పడిపోయింది. ప్రస్తుతం బెంగళూరులోని శిక్షణ శిబిరంలో భారత క్రికెటర్లు సాధన చేస్తున్నారు. ఈ సందర్భంగా స్టువర్ట్‌ బిన్నీ మాట్లాడుతూ సీనియర్‌ ఆటగాళ్ల నుంచి అనుభవాలను తెలుసుకునేందుకు ఈ ప్రోగ్రాం ఉపయోగపడుతుందన్నాడు. ఇందులో భాగంగా స్టువర్ట్‌ బిన్నీకి జోడీగా రోహిత్‌శర్మ, పుజారాకు జతగా అమిత్‌ మిశ్రాను ఎంపిక చేశారు. ఈ ప్రోగ్రాం ద్వారా భారత జట్టు నుంచి కుంబ్లే ఎలాంటి ఫలితాలు రాబడతాడో చూడాలి.

యు ముంబా జోరు - దబాంగ్ ఢిల్లీపై విజయం - ప్రొ కబడ్డీ లీగ్

02/07/2016: జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ నాలుగో సీజన్‌లో యు ముంబా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. శుక్రవారం దబాంగ్ ఢిల్లీ కేసీతో జరిగిన ఉత్కంఠ పోరులో 27-25 స్వల్ప తేడాతో యు ముంబా నెగ్గింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఢిల్లీ 14-12తో కాస్త పైచేయిలోనే ఉంది. అయితే ద్వితీయార్ధంలో ముంబా తమ వ్యూహాలను మార్చుకుని సత్తా చాటింది. 28వ నిమిషం వరకు 15-16తో వెనుకబడి ఉన్నా ఆ తర్వాత ఒక్కసారిగా వేగం పెంచింది. ఈ సమయంలో రిషాంక్ దేవడిగ (8 రైడింగ్ పాయింట్లు) సూపర్ రైడ్‌తో మూడు పాయింట్లు తేవడంతో మ్యాచ్ ఒక్కసారిగా ముంబా వైపు తిరిగింది. ఢిల్లీ నుంచి కెప్టెన్ కశిలింగ్ అడికే 6, సెల్వమణి 5 రైడింగ్ పాయింట్లు సాధించారు. దీపక్ నర్వాల్ తన 11 రైడింగ్ ప్రయత్నాల్లో ఒక్క పాయింట్ మాత్రమే తేవడం జట్టు ఫలితాన్ని ప్రభావితం చేసింది. జైపూర్‌దే విజయం: నువ్వా.. నేనా అనే రీతిలో సాగిన మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు 36-33 తేడాతో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. మ్యాచ్ ప్రారంభం నుంచి ఆధిక్యం ఇరు జట్ల మధ్య మారుతూ వచ్చింది. అయితే కెప్టెన్ జస్వీర్ సింగ్ మరోసారి సూపర్ ఆటతో 13 రైడింగ్ పాయింట్లు సాధించి జట్టును గెలిపించాడు. బెంగాల్ నుంచి నితిన్ మదానే, మోను గోయట్ ఎనిమిదేసి పాయింట్లు సాధించారు. ప్రొ కబడ్డీలో నేడు దబాంగ్ ఢిల్లీ కేసీ గీ బెంగళూరు బుల్స్ రాత్రి 8 గంటల నుంచి జైపూర్ పింక్ పాంథర్స్ గీ పుణెరి పల్టాన్ రాత్రి 9 గంటల నుంచి

బోల్ట్కు అనూహ్యంగా ఏమైంది?

02/07/2016: కింగ్స్టన్: పరుగుల చిరుత ఉస్సేన్ బోల్ట్ జమైకాలో నిర్వహిస్తున్న ఒలంపిక్స్ 100మీటర్ల ఫైనల్ ట్రయల్స్ నుంచి అనూహ్యంగా తప్పుకున్నాడు. ఏదో తీవ్ర గాయం కారణంగా అందులో పాల్గొనడం లేదని తెలిసింది. దీంతో మరికొద్ది రోజుల్లో రియోడిజనిరోలో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో అతడు పాల్గొనే అంశంపై అనుమానాలు రేకెత్తాయి. జమైకా నేషనల్ సీనియర్ చాంపియన్ షిప్స్ రియోడిజనిరోకు వెళ్లే వారికోసం ట్రయల్స్ నిర్వహిస్తోంది. శుక్రవారం రాత్రి 100మీటర్ల ఫైనల్కు బోల్ట్ ఎంపికయ్యాడు. మరోపక్క, శని, ఆదివారాల్లో 200 మీటర్ల పోటీ ఉంది. ఈలోగా అనూహ్యంగా ఈ ట్రయల్స్ నుంచి తాను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడని అధికారులు ప్రకటించారు. కాగా, మెడికల్ కారణాలతో మినహాయింపును పొంది రియోకు వెళ్లొచ్చు. ఈ సందర్భంగా బోల్ట్ కూడా అధికారికంగా ప్రకటన చేశాడు. 'గత రాత్రి జరిగిన 100మీటర్ల పరుగుపందెం తర్వాత నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. వైద్యుడిని సంప్రదించగా ఆయన వెంటనే చికిత్స అవసరం అని చెప్పారు. అందుకే 100 మీటర్ల ఫైనల్ కు, మిగితా ఈవెంట్స్ కు మెడికల్ సర్టిఫికెట్ పెట్టి జూలై 22 లండన్ యానివర్సరీ గేమ్స్లో పాల్గొని అర్హత సాధించి రియోకు వెళతాను' అని ఆయన చెప్పారు.

వావ్రింకా ఔట్‌ - డెల్‌పొట్రో సంచలన విజయం - వీనస్‌ ముందంజ

02/07/2016: మూడేళ్ల తర్వాత వింబుల్డన్‌లో పునరాగమనం చేసిన అర్జెంటీనా పొడగరి జువాన్‌ మార్టిన్‌ డెల్‌పొట్రో సంచలన విజయం సాధించాడు. రెండో రౌండ్లో నాలుగో సీడ్‌ స్టానిస్లాస్‌ వావ్రింకాకు షాకిచ్చాడు. మహిళల విభాగంలో అత్యంత పెద్ద వయస్కురాలు వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా) ప్రిక్వార్టర్‌ఫైనల్స్‌లో ప్రవేశించింది. టాప్‌సీడ్‌ సెరెనా విలియమ్స్‌ (అమెరికా) మూడో రౌండ్‌ చేరింది. లండన్‌: వర్షం అంతరాయాలతో సాగిపోతున్న వింబుల్డన్‌లో మరో షాక్‌. ర్యాంకింగ్స్‌లో 167వ స్థానంలోని డెల్‌పొట్రో 3-6, 6-3, 7-6 (7/2), 6-3తో నాలుగో సీడ్‌ స్టానిస్లాస్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌) కథను రెండో రౌండ్లోనే ముగించాడు. సెంట్రల్‌ కోర్టులో జరిగిన ఈ మ్యాచ్‌ ఆరంభంలో వావ్రింకాదే ఆధిపత్యం. తొలి సెట్‌ను అతడే గెలిచాడు. ఐతే రెండో సెట్‌ ఆరంభంలోనే బ్రేక్‌ సాధించిన డెల్‌పొట్రో సెట్‌ గెలవడంలో సఫలమయ్యాడు. మూడో సెట్‌ నువ్వానేనా అన్నట్టుగా సాగింది. వరుసగా నాలుగు గేమ్‌ల పాటు ఇద్దరు ఆటగాళ్ల సర్వీస్‌ బ్రేక్‌ అయ్యింది. టైబ్రేక్‌లో ఈ సెట్‌ను గెలుచుకున్న డెల్‌పొట్రో.. ఆఖరి సెట్లో తిరుగులేని ప్రదర్శన చేశాడు. ఈ విజయంతో డెల్‌పొట్రో 2009 యుఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌ను గుర్తుచేశాడు. అప్పుడు ఫెదరర్‌కు షాకిచ్చిన డెల్‌పోట్రో మణికట్టు గాయాల కారణంగా చాలా కాలం ఆటకు దూరమయ్యాడు. ఓ దశలో కెరీర్‌కు వీడ్కోలు పలుకుదామనుకున్న అతడికి రెండేళ్లలో ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ కావడం విశేషం. ఇతర మ్యాచ్‌ల్లో పదో సీడ్‌ బెర్డిచ్‌ (చెక్‌) 6-4, 6-1, 6-2తో బెంజమిన్‌ బెకర్‌ (జర్మనీ)పై, పన్నెండో సీడ్‌ సోంగా (ఫ్రాన్స్‌) 6-1, 6-4, 6-3తో జువాన్‌ మొనాకో (అర్జెంటీనా)పై, ఐదు సెట్ల హోరాహోరీ పోరులో నిక్‌ కిర్గియోస్‌ (ఆస్ట్రేలియా) 6-7 (3/7), 6-1, 2-6, 6-4, 6-4తో డస్టిన్‌ బ్రౌన్‌ (జర్మనీ)పై గెలిచి మూడో రౌండ్‌ చేరారు. జాన్‌ ఇస్నర్‌ 7-6 (10/8), 7-6 (7/3), 7-6 (10/8)తో బార్టన్‌ (ఆస్ట్రేలియా)ను వరుసగా మూడు టైబ్రేకర్లలో ఓడించడం విశేషం. భారత జోడీలు శుభారంభం: పురుషుల డబుల్స్‌లో లియాండర్‌ పేస్‌, రోహన్‌ బోపన్న జోడీలు శుభారంభం చేశాయి. తొలి రౌండ్లో పేస్‌, మట్కోవ్‌స్కి (పొలెండ్‌) జంట 6-1, 6-3తో తిప్సర్విచ్‌ (సెర్బియా), వై హెచ్‌ లు (తైపీ) జోడీని ఓడించింది. బోపన్న, ఫ్లోరిన్‌ మెర్జియా (రొమేనియా) జంట 7-5, 7-6 (8/6)తో క్రొయేషియా ద్వయం మరీన్‌ డ్రాగంజ, నికోలా మెక్టిక్‌పై పోరాడి గెలిచింది.

పేమ్రలో పడ్డాడిలా...!

01/07/2016: దిల్లీ: భారత క్రికెట్లో ఇప్పుడంతా పెళ్లి సందడే. యువ ఆటగాళ్లంతా ఒక్కొక్కరుగా బ్రహ్మచారి జీవితానికి మంగళం పాడేస్తున్నారు. కొత్తగా ఇషాంత్‌శర్మ కూడా ఈ బాట పట్టాడు. ఇటీవలే దిల్లీకి చెందిన ప్రతిమ సింగ్‌ అనే బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణితో అతడికి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఐతే నిశ్చితార్థం ఇప్పుడయ్యింది కానీ.. అతడి ప్రేమ వ్యవహారం మాత్రం చాన్నాళ్లుగానే సాగుతోందట. ప్రతిమ ప్రస్తుత భారత బాస్కెట్‌బాల్‌ జట్టులో సభ్యురాలు. ఆమె అక్క ఆకాంక్ష జట్టుకు కెప్టెన్‌. 2011లో ఆకాంక్ష.. మహిళల కోసం దిల్లీలో ఓ బాస్కెట్‌బాల్‌ టోర్నీ నిర్వహించింది. అప్పుడు ముఖ్య అతిథిగా ఇషాంత్‌శర్మను పిలిచింది. తన ఎత్తుకు తగ్గ అమ్మాయి దొరుకుతుందని వెళ్లాడో ఏమోగానీ.. ప్రతిమను చూడగానే ప్రేమలో పడిపోయాడట ఇషాంత్‌. స్వతహాగా సిగ్గరి అయిన ఇషాంత్‌.. ప్రేమ విషయంలో మాత్రం ముందు తానే చొరవ తీసుకున్నాడట. ఓసారి బయటికి వెళ్దామంటూ ప్రతిమను అడిగాడట. కానీ ఆ విషయం కాస్త ఆకాంక్షకు చెప్పిందట ప్రతిమ. ఐతే ఇషాంత్‌ మీదున్న నమ్మకంతో ఆకాంక్ష మరేం ఫర్వాలేదని చెల్లెలికి చెప్పి.. పచ్చ జెండా వూపిందట. ఆ తర్వాత ఓ శుభముహుర్తం చూసుకుని.. గులాబీలు, బహుమతులతో నిండిన కారులో ప్రతిమకు తన ప్రేమ విషయం చెప్పాడట ఇషాంత్‌. ఆమె కూడా సంతోషంగా ఒప్పుకుందట. ఇక అప్పట్నుంచి చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ ప్రేమపక్షులు.. ఇన్నాళ్లకు ఓ గూటికి చేరేందుకు సిద్ధమయ్యాయి. ప్రతిమ కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆమెకు నలుగురు అక్కలు. ఈ ఐదుగురు అక్కాచెల్లెళ్లను అందరూ ‘సింగ్‌ సిస్టర్స్‌’ అని పిలుస్తుంటారు. రెజ్లింగ్‌లో ‘ఫోగట్‌ సిస్టర్స్‌’లా.. వీళ్లు బాస్కెట్‌బాల్‌లో ప్రసిద్ధి. మొత్తం ఐదుగురూ దేశం తరఫున బాస్కెట్‌బాల్‌ ఆడారు. ప్రస్తుతం ప్రతిమ అక్క ఆకాంక్ష భారత జట్టుకు కెప్టెన్‌గా ఉంది. మరో అక్క ప్రశాంతి కూడా జట్టులో సభ్యురాలే. మరో ఇద్దరు అక్కలు దివ్య, ప్రియాంక గతంలో దేశానికి ఆడారు. ఇప్పుడు కోచ్‌లుగా ఉన్నారు. ఈ సిస్టర్స్‌కు ఓ తమ్ముడు కూడా ఉన్నాడు. ఐతే అక్కలందరూ బాస్కెట్‌బాల్‌ ఎంచుకుంటే.. అతడు మాత్రం ఫుట్‌బాల్‌ దారి పట్టాడు. ప్రస్తుతం దిల్లీ జట్టుకు ఆడుతున్నాడు.

ఇండియాను కనుగొన్న సచిన్‌!

01/07/2016: ఇంటర్నెట్‌డెస్క్‌: భారతదేశానికి సముద్రమార్గాన్ని కనుగొన్నది వాస్కోడగామా కదా! మరి సచిన్‌ తెందుల్కర్‌ అంటారేంటి? అనుకుంటున్నారా! క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ సచిన్‌ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఓ ఐలాండ్‌కు వెళ్లిన ఆయనకు అక్కడ ఉన్న ఓ చెరువు భారత్‌ మ్యాప్‌ను పోలి ఉండటంతో సచిన్‌ ఆనందంతో ఉబ్బి తబ్బిబైపోయారు. ఇంకేముంది.. దాన్ని ఫొటో తీసి ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘నా ప్రయాణంలో ఓ ఐలాండ్‌కు వెళ్లాను. ఇక్కడి నీటితో నిండి ఓ చెరువు భారతదేశ మ్యాప్‌ను పోలి ఉంది. సారే జహాసె అచ్ఛా హిందుస్థాన్‌ హమారా!’ అంటూ ట్వీట్‌ చేశారు సచిన్‌. గత కొంతకాలంగా విదేశీ పర్యటనలో ఉన్న సచిన్‌ తన పర్యటన విశేషాలను సామాజిక మాధ్యమాల వేదికగా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. చార్లీ చాప్లిన్‌ విగ్రహం వద్ద ఫొటో, చేపలు పట్టడం ఇలా.. అంటూ సరదాగా ఫొటోలను పోస్ట్‌ చేస్తూ అభిమానులను ఉల్లాస పరుస్తున్నారు.

తెలుగు టైటాన్స్‌కు రెండో ఓటమి - జైపూర్ చేతిలో పరాజయం

30/06/2016: జైపూర్: ఆరంభంలో నిలకడగా ఆడినా.. చివర్లో నిరాశపర్చిన తెలుగు టైటాన్స్ జట్టు... ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 28-24తో టైటాన్స్‌పై గెలిచింది. దీంతో టైటాన్స్ జట్టు రెండు పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. జైపూర్ తరఫున రాజేశ్ నర్వాల్ (8 పాయింట్లు) అత్యధిక పాయింట్లు సాధించగా, జస్వీర్ సింగ్, అమిత్ హుడా తలా మూడు పాయింట్లు తెచ్చారు. మహిపాల్ నర్వాల్ రెండు ట్యాకిల్ పాయింట్లతో రాణించాడు. టైటాన్స్ టీమ్‌లో సందీప్ నర్వాల్ (6), వినోత్ కుమార్ (4), నీలేశ్ (4) రాణించగా, వినోద్ (3) ఒక్కడే క్యాచింగ్‌లో ఫర్వాలేదనిపించాడు. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 36-34తో యు ముంబాపై నెగ్గింది. పట్నా ఆటగాడు ప్రదీప్ నర్వాల్ 18 రైడింగ్ పాయింట్లు సాధించగా, కుల్దీప్ సింగ్ (5), బాజీరావ్ (4)లు ట్యాకిల్‌లో అదరగొట్టారు. యు ముంబా తరఫున రిషాంక్ దేవడిగా (11), అనూప్ కుమార్ (6), సుర్జీత్ (3), రాకేశ్ (3), సునీల్ కుమార్ (3)లు ఆకట్టుకున్నారు. గురువారం జరిగే ఏకైక మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో బెంగళూరు బుల్స్ తలపడుతుంది.

సైనా మళ్లీ పతకం గెలవొచ్చు - బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొనే విశ్వాసం

30/06/2016: ముంబై: వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌కు పతకం గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొనే అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సైనా ఆటతీరులో వైవిధ్యం కనిపిస్తోందని... ఇదే తరహా ఆటను ఆమె రియో ఒలింపిక్స్‌లోనూ ప్రదర్శిస్తే పతకం రావడం ఖాయమని ఆయన అన్నారు. లండన్ ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్‌లో కాంస్యం నెగ్గిన సైనా... ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని ఈ మాజీ నంబర్‌వన్ ప్లేయర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ‘సైనా ఆటలో వైవిధ్యం కనిపిస్తోంది. గతంలో ఆమె ఆటతీరును ప్రత్యర్థులు తొందరగానే అంచనా వేసేవారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం నెట్ గేమ్ ఎక్కువగా ఆడుతోంది. ఒక వ్యూహం విఫలమైతే మరో వ్యూహాన్ని అమలు చేస్తూ ఫలితాలు సాధిస్తోంది’ అని ఈ ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్ విశ్లేషించారు. ఇటీవల కాలంలో ఎంత మెరుగ్గా ఆడినా... ఒలింపిక్స్ జరిగే సమయంలో కనబరిచే ఆటతీరే పతకావకాశాలపై ప్రభావం చూపిస్తుందన్నారు. ‘ఒలింపిక్స్‌లో గత ప్రదర్శనను లెక్కలోకి తీసుకోలేం. ఆ రెండు వారాల్లో ఎవరైతే తమ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తారో వారికే పతకాలు వస్తాయి’ అని ప్రకాశ్ పదుకొనే అన్నారు.

టి20 ప్రపంచకప్‌లో సూపర్-12!

30/06/2016: వచ్చే టి20 ప్రపంచ కప్ ప్రధాన రౌండ్‌లో మరో రెండు జట్లను అదనంగా చేర్చాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భావిస్తోంది. సూపర్-10కు బదులుగా సూపర్-12 నిర్వహించాలని శశాంక్ మనోహర్ నేతృత్వంలో ఎడిన్‌బర్గ్‌లో జరిగిన ఐసీసీ సమావేశంలో సభ్యులు ప్రతిపాదించారు. మరోవైపు 2024 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే దిశగా మద్దతు కూడగట్టేందుకు ఐసీసీ... ఇటలీ, ఫ్రాన్స్ దేశాల ఒలింపిక్ సంఘాలతో కూడా చర్చలు జరుపుతోంది.

విశాఖలో భారత్‌-కివీస్‌ వన్డే - షెడ్యూల్‌ ప్రకటించిన ఆటగాళ్లు, కొత్త కోచ్‌ - డే/నైట్‌ టెస్టు లేదు

29/06/2016: దిల్లీ: భారత్‌లో న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 29 వరకు ఈ పర్యటన జరుగుతుంది. మూడు టెస్టులు, ఐదు వన్డేలతో కూడిన ఈ పర్యటన వివరాలను టీమ్‌ఇండియా ఆటగాళ్లు, కొత్త కోచ్‌ అనిల్‌ కుంబ్లే తమ ట్విట్టర్‌ ఖాతాల ద్వారా వెల్లడించడం విశేషం. ఒక్కొక్కరు ఒక్కో మ్యాచ్‌ వివరాలను ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. ‘‘టీమ్‌ఇండియా తన స్వదేశీ సీజన్‌ను దేశంలోని అత్యంత పురాతన వేదికల్లో ఒకటైన కాన్పూర్‌లో ఆరంభిస్తుంది. భారత్‌-న్యూజిలాండ్‌ తొలి టెస్టు సెప్టెంబరు 22న ఆరంభమవుతుంది’’ అని టెస్టు కెప్టెన్‌ కోహ్లి ట్వీట్‌ చేయగా.. రెండో టెస్టు విశేషాల్ని అజింక్య రహానె వెల్లడించాడు. ‘‘సయ్యద్‌ ముస్తాక్‌ అలీ సొంతగడ్డ ఇండోర్‌ తన తొలి టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వబోతోంది. సెప్టెంబరు 30 నుంచి భారత్‌-న్యూజిలాండ్‌ రెండో టెస్టు’’ అని అతను వివరించాడు. అక్టోబరు 8న ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగే మూడో టెస్టు ముచ్చట్లు బంగాల్‌ పేసర్‌ మహ్మద్‌ షమి పంచుకున్నాడు. ఐదు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్‌కు విశాఖపట్నం ఆతిథ్యమివ్వనుండటం విశేషం. ఈ సంగతి టీమ్‌ఇండియా కొత్త కోచ్‌ అనిల్‌ కుంబ్లే వెల్లడించాడు. ‘‘సిరీస్‌లో చివరి వన్డే అక్టోబరు 29న జరుగుతుంది. అభిమానులు విశాఖ స్టేడియానికి వచ్చి భారత్‌కు మద్దతివ్వండి’’ అని కుంబ్లే అన్నాడు. మిగతా నాలుగు వన్డేల వివరాల్ని రిషి ధావన్‌, శిఖర్‌ ధావన్‌, మన్‌దీప్‌ సింగ్‌, అశ్విన్‌ వెల్లడించారు. ఇలా ఆటగాళ్లతో షెడ్యూల్‌ వివరాలు చెప్పించడంపై బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ స్పందిస్తూ.. ‘‘ఆటలో ఆటగాళ్లకే తొలి ప్రాధాన్యం. అందుకే టీమ్‌ఇండియా ఆటగాళ్లతోనే ఆ విశేషాలు చెప్పించాం’’ అన్నాడు. మూడు టెస్టులూ ఉదయం 9.30కే మొదలవుతాయని ప్రకటించిన నేపథ్యంలో ఈ సిరీస్‌లో ఓ మ్యాచ్‌ను ప్రయోగాత్మకంగా డే/నైట్‌లో నిర్వహించొచ్చన్న ప్రచారానికి తెరపడింది.

ఫిట్‌నెస్సే నన్ను మార్చింది

29/06/2016: దిల్లీ: ప్రస్తుత భారత క్రికెట్‌ జట్టులో అత్యంత ఫిట్‌గా కనిపించే ఆటగాడెవరెంటే విరాట్‌ కోహ్లి అనే చెప్పాలి. బ్యాటింగ్‌ చేసేటప్పుడు వికెట్ల మధ్య చిరుతలా పరుగెత్తడమే కాదు.. మెరుపు ఫీల్డింగ్‌తో అలరించే విరాట్‌ విజయ రహస్యం అతని ఫిట్‌నెసే. 2012 ఐపీఎల్‌ తర్వాతే ఫిట్‌నెస్‌ విషయంతో తన దృక్పథం మారిందని.. జీవనశైలిలో చాలా మార్పులొచ్చాయని చెప్పాడు. కోహ్లి కెరీర్‌ను 2012 ముందు.. తర్వాత అని విభజించుకోవచ్చేమో! ఈ ఏడాది ఐపీఎల్‌ తర్వాత తన జీవనశైలిలో ఎన్నో మార్పులొచ్చాయని.. ఫిట్‌నెస్‌ ఎంతో మెరుగైందని కోహ్లి చెప్పాడు. దీని వల్లే బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌లో సత్తా చాటగలిగానని అతను చెప్పాడు. ‘‘గతంలో నా దినచర్య గురించి పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. కానీ 2012 ఐపీఎల్‌ తర్వాత ఫిట్‌నెస్‌పై దృష్టి సారించా. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏం తింటున్నానో.. ఎంత శారీరక శ్రమ పడుతున్నానో ఒక అంచనాకు వచ్చాను. దానికి తగ్గట్టే జిమ్‌లో కష్టపడేవాడిని. అప్పటి నుంచి నా శరీరం నా అదుపులో ఉంది. ఎప్పుడూ సాధారణ ఆటగాడిలా ఉండాలని భావించలేదు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటే ఏదైనా సాధించగలమనే నమ్మకం వస్తుంది. గతంలో నేను మెరుపు ఫీల్డర్‌ని కాను. మైదానంలో అన్ని స్థానాల్లో ఫీల్డింగ్‌ చేయడానికి ఇష్టపడేవాడిని కాదు. వ్యాయామాన్ని నా జీవితంలో భాగంగా చేసుకున్న తర్వాత ఏ స్థానంలోనైనా ఫీల్డింగ్‌ చేయగలగుతున్నా అభిమానులు ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలని కోరుతున్నా. దీని కోసం ఒక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాలనే ఆలోచన కూడా ఉంది’’ విరాట్‌ అన్నాడు.

గంగూలీ తీరు అమర్యాదకరం

29/06/2016: కోల్‌కతా: భారత క్రికెట్‌ ప్రధాన కోచ్‌ పదవి కోసం తనను ఇంటర్వ్యూ చేసిన బృందంలో సౌరభ్‌ గంగూలీ లేకపోవడాన్ని రవిశాస్త్రి తప్పుబట్టాడు. తాను థాయ్‌లాండ్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్న ఇంటర్వ్యూలో సచిన్‌, లక్ష్మణ్‌, సంజయ్‌ జగ్దాలె మాత్రమే ప్రశ్నలు అడిగారని.. అక్కడ గంగూలీ లేనే లేడని శాస్త్రి ఇంతకుముందే వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై మరోసారి స్పందిస్తూ.. ‘‘గంగూలీ అక్కడ లేకపోవడంపై ఆగ్రహం చెందడం కాదు. నిరాశ చెందాను. ఐతే భారత క్రికెట్లో ఏం జరిగినా నేను ఆశ్చర్యపోను. సౌరభ్‌తో నాకు వ్యక్తిగతంగా ఇబ్బందులేమీ లేవు. ఐతే అక్కడతను లేకపోవడం అంటే ఇంటర్వ్యూకు వచ్చిన వ్యక్తిని అగౌరవపరచడమే. అంతే కాదు.. తనకిచ్చిన బాధ్యత పట్ల గౌరవం లేకపోవడమే. ఇలాంటి పెద్ద పదవికి ఇంకోసారి ఇంటర్వ్యూ నిర్వహించేటపుడు సమావేశ మందిరంలో ఉండాలని అతడికి సలహా ఇస్తున్నా’’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు రవిశాస్త్రి. కోచ్‌ పదవి దక్కకపోవడంపై తాను నిరాశ చెందిన మాట వాస్తవమే అని.. ఐతే ఇప్పుడది ముగిసిన అధ్యాయమని రవిశాస్త్రి అన్నాడు. ‘‘ఐదు రోజుల కిందట నేను నిరాశ చెందా. కానీ ఇప్పుడు అదంతా రెండు నెలల కిందట జరిగినట్లుంది. ఇక ఆ సంగతి వదిలేసి ముందుకెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా’’ అని చెప్పాడు. బ్యాటింగ్‌ కోచ్‌గా రవిశాస్త్రి!: ప్రధాన కోచ్‌ అవుదామని రవిశాస్త్రి ఆశపడితే.. అతణ్ని బ్యాటింగ్‌ కోచ్‌ చేద్దామని చూసిందట సచిన్‌, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిన బీసీసీఐ క్రికెట్‌ సలహా కమిటీ. ఐ