Breaking News

కరీంనగర్‌: అతివేగంతో పాటు, కర్ణకఠోర శబ్ధాలతో దూసుకెళ్తున్న ద్విచక్రవాహనాలకు పోలీసులు కళ్లెం వేశారు. పరిమితికి మించిన వేగంతో ప్రయాణిస్తూ తోటి వాహనదారులను భయబ్రాంతులకు గురిచేయడంతో పాటు విపరీతమైన శబ్ధ కాలుష్యానికి కారణమవుతున్న 16 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకొని వాహనదారులకు జరిమానాలు విధించారు. * * బెల‍్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల‍్లంపల్లిలోని సివిల్‌ కోర్టు ముఖద్వారం ఎదుట హోంగార్డు నారాయణ మంగళవారం ఉదయం ఆత‍్మహత్యాయత‍్నం చేశాడు. ఏడు సంవత‍్సరాలుగా హోంగార్డులకు పోస్టింగ్‌ ఇవ‍్వలేదని, విధుల‍్లోకి తీసుకోకుండా పోలీసు విభాగం అన్యాయం చేస్తోందని ఆవేదన వ‍్యక‍్తం చేస్తూ తెలంగాణ హోంగార్డుల సంఘం అధ‍్యక్షుడు నారాయణ మంగళవారం ఆత‍్మహత్యాయత‍్నం చేశాడు. * * చర‍్ల: ఖమ‍్మం జిల్లా చర‍్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు వద్ద మంగళవారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు ఆ ఇద్దరిని అరెస్టుచేశారు. తనిఖీ చేయగా వారి వద్ద మెడికల్ కిట్లు ఉన్నట్లు గుర్తించారు. వారు మావోయిస్టు మిలీషియా సభ‍్యులని తేలడంతో వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కోర్టులో హాజరుపరిచేందుకు తరలించామని చర్ల పోలీసులు వెల్లడించారు. * * వరంగల్‌: వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని నర్సంపేటలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తె దుర‍్మరణం చెందారు. తండ్రి, కుమార్తె వెళుతున‍్న ద్విచక్రవాహనాన్ని వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో వారు అక‍్కడికక‍్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు సేకరిస‍్తున్నారు * * కురవి: తేనెటీగల దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లిలో సోమవారం వెలుగుచూసింది. స్థానిక మామిడి తోటలో కాయలు కోయడానికి వచ్చిన కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామానికి చెందిన వారిగా తెలుస్తోంది. * * కరీంనగర్‌: జిల్లా కేంద్రంలోని బుట్టిరాజారాం కాలనీలో శనివారం వేకువజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలో ప్రతీ ఇంటిని తనిఖీ చేశారు. 31 బైక్‌లు, 8 ఆటోలు, 9 సిలిండర్లు, 3 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా పలువురు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. * * హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం గత నెల 22న నిర్వహించిన పాలిసెట్ - 2017 ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని కాలేజీ, రూసా కార్యాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వాణిప్రసాద్ పాల్గొన్నారు. ఏప్రిల్ 22న జరిగిన ప‌రీక్ష‌కు 1,28,118 మంది విద్యార్థులు హాజరయ్యారు. * * నిజామాబాద్‌ జిల్లా వర్నిలో వింత చోరీ వెలుగుచూసింది. పట్టణ శివారులోని భారత్‌ గ్యాస్‌ గోడౌన్‌లో దొంగలుపడి సిలిండర్లు ఎత్తుకెళ్లారు. నిన్న సాయంత్రమే గోడౌన్‌కు వచ్చిన 250 గ్యాస్‌ సిలిండర్లలో శుక్రవారం రాత్రి 204 సిలిండర్లు చోరీకి గురయ్యాయి. శనివారం ఉదయం గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ శేఖర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. * * హైదరాబాద్‌: మిర్చి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కపట ప్రేమను చూపుతున్నాయని లోక్‌సత్తా పార్టీ తెలంగాణ ధ్వజ మెత్తింది. కేంద్రం తాజాగా ప్రకటించిన రూ.5వేలు ఏ మూలకూ సరిపోవని, అదనంగా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మరో రూ.5వేలు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈమేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జన్నేపల్లి శ్రీనివాసరెడ్డి గురువారం ప్రకటన విడుదల చేశారు. * * కడెం: నిర్మల్‌ జిల్లా కడెం మండల కేంద్రంలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, అక్రమంగా నిల్వ ఉంచిన రూ.20 వేల విలువ గల గుట్కా, మద్యం ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నల్లబెల్లం, దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అజార్, రమేష్ అనే ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. * * నారాయణపూర్‌: యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్‌ మండల కేంద్రంలో మావోయిస్టు పోస్టుర్లు కలకలం రేపుతున్నాయి. మండల కేంద్రంతో పాటు వావిళ్లపల్లి, జనాగం గ్రామాల్లో పోస్టర్లు వెలవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కేసీఆర్‌ నియంత పాలన నశించాలి, లంచగొండి ఎమ్మెల్యే ఖబడ్దార్‌ అంటూ పోస్లర్లపై రాసి ఉంది. * * రంగారెడ్డి: బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాయల్‌ కాలనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్‌ వేస్టేజ్‌ గోదాములో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. * * అమెరికాలో ఓ చిన్న విమానం నాటకీయరీతిలో నడిరోడ్డుపై కూలిపోయింది. వాషింగ్టన్‌ లోని ముకిల్‌టియోలో మంగళవారం ఓ చిన్న విమానం రద్దీగా ఉన్న నడిరోడ్డుపై కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు ఎగిశాయి. అదృష్టం బాగుండి ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. విమానం ఇంజన్‌లో సాంకేతికలోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్‌ సురక్షితంగా తప్పించుకున్నాడు. * * యాదగిరిగుట్ట మండలం బాహుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈస్ట్‌ మారెడ్‌పల్లికి చెందిన వల్లపు ఎల్లయ్య బైక్‌పై వరంగల్‌ వైపు వెళ్తున్నారు. బాహుపేట వద్దకు రాగానే ఎల్లయ్య వాహనాన్ని గుర్తు తెలియని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో పుల్లయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ రెండు ప్రమాదాలు జరిగిన ప్రదేశాలను యాదగిరిగుట్ట పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ–2 నాగిరెడ్డి తెలిపారు. * * టేకులపల్లి: మహిళా సర్పంచ్ కుమారుడు ఓ విద్యార్థినిని ప్రేమ పేరుతో నమ్మించి, వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తే ముఖం చాటేస్తున్న ప్రియుడి ఇంటి ముందు బాధితురాలు ఆందోళనకు దిగింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడులో బుధవారం వెలుగుచూసింది. * * హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సాయంత్రం 4 గంటలకు పదోతరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 14 నుంచి 30 వరకు ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 5.35 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తులు చేసుకోగా దాదాపు ఐదు లక్షల మంది హాజరయ్యారు. ఈ నెల 5న ఫలితాలు విడుదల చేయాలనుకున్నా రెండు రోజుల ముందుగానే ఫలితాలు వెల్లడిస్తున్నారు. * * హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని శ్రీకర్‌ ఆస్పత్రిలో సోమవారం అర్థరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రోగులు, ఆస్పత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలార్పడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదం సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదని పలువురు వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని అధికారులు వేరువేరు ఆస్పత్రులకు తరలించారు. * * కరీంనగర్‌: అదిలాబాద్‌ వన్‌టౌన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సీఐ, ఎస్సై, ఏఎస్సైలను సస్పెండ్‌ చేస్తూ.. కరీంనగర్‌ రేంజ్‌ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్‌ తగాదాలో తలదూర్చారనే సమాచారంతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు జిల్లా ఎస్పీ ఎం. శ్రీనివాస్‌ నివేదిక ఆధారంగా సీఐ సత్యనారాయణ, ఎస్సై బి. అనిల్, ఏఎస్సై జి. అప్పారావులను సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం కరీంనగర్‌ రేంజ్‌ డీఐజీ సి. రవివర్మ ఆదేశాలు జారీచేశారు. * * కోదాడ: ఐపీఎల్‌ -10 సందర్భంగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ. 25 వేల నగదుతో పాటు ఓ బైక్‌, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. * * తిప్పర్తి(నల్లగొండ): వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో.. బస్సులో ఉన్న 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. * * బోధన్‌ మండలం తెగడపల్లి గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి(12) ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. దీంతో గట్టిగ కేకలు వేస్తూ బాలిక అక్కడే కుప్పకూలిపోయింది. ఇది గుర్తించిన చుట్టుపక్కల వారు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ నుంచి హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం బాలిక మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. * * కామేపల్లి: ప్రమాదవశాత్తు బావిలోపడి ఓ కానిస్టేబుల్‌ మృతిచెందిన సంఘటన ఖమ్మం జిల్లా కామేపల్లిలో జరిగింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో గుగులోతు రామకృష్ణ (39) కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గ్రామ శివారులోని వ్యవసాయ బావి వైపు మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందాడు. ఈయన స్వగ్రామం తల్లాడ. రెండున్నరేళ్లుగా కామేపల్లిలో పనిచేస్తున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. * * మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా సింగరేణి ఉపరితల బొగ్గుగని కేంద్రంలో మంగళవారం మధ్యాహ‍్నం బంకర్‌ కూలి ఇద్దరు కార్మికులు మృతిచెందారు. లారీలో బొగ్గు నింపుతుండగా.. అక్కడే పనులు చేస్తున్న పవన్‌ (31), రఘుపాల్‌రెడ్డి(32) అనే కార్మికులపై బంకర్‌ కూలింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తోటి కార్మికులు వెంటనే స్పందించి మృతదేహాలను వెలికి తీశారు. * * సూర్యాపేట: ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సూర్యాపేట మండలం రాజానాయక్‌తండా శివారులో శనివారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో వారిని అంబులెన్స్‌ల సాయంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. * * భువనగిరి: వేగంగా వెళ్తున్న కారులో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్‌ వాహనాన్ని వదిలి బయటకు దూకేశాడు. ఈ ప్రమాదంలో సాంట్రో కారు పూర్తిగా కాలిబూడిదైంది. ఈ సంఘటన యాదాద్రి జిల్లా భువనగిరి శివారులోని నల్లగొండ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడానికి యత్నించే లోపే కారు పూర్తిగా కాలిపోయింది. * * మహబూబ్‌నగర్‌: జిల్లాలోని దేవరకద్ర మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు చేపట్టిన దాడుల్లో పెద్దఎత్తున రేషన్‌ బియ్యం పట్టుబడ్డాయి. లబ్దిదారులకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయనే సమచారంతో రగంలోకి దిగిన అధికారులు మండల కేంద్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న 620 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఓ లారీ, బొలెరో వాహానాలను సీజ్‌ చేశారు. * * పెద్దపల్లి: ఇద్దరు భార్యలు కలిసి భర్తను హతమార్చిన సంఘటన జిల్లాలోని కమాన్‌పూర్‌లో గురువారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగి తిరుమలయ్య(65)ను ఆయన ఇద్దరు భార్యలు గొడ్డలితో నరికి చంపారు. తిరుమలయ్య అతని ఇద్దరు భార్యలు మదునమ్మ, ఐలమ్మలను గత కొన్నేళ్లుగా తీవ్రంగా హింసిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. * * హైదరాబాద్: ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓంకార్ నగర్‌లోని ఓ సెల్‌ఫోన్‌ దుకాణంలో గురువారం రాత్రి దొంగతనం జరిగింది. స్థానిక శ్రీనివాస్ మొబైల్ షాప్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి క్యాష్‌ బాక్స్‌లో ఉన్న రూ.50 వేల నగదుతోపాటు లక్ష రూపాయల విలువ చేసే ఫోన్లు ఎత్తుకెళ్లారు. దుకాణంలో అమర్చిన సీసీ కెమెరాలో చోరీ చిత్రాలు నమోదయ్యాయి. బాధితుడు ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. * * యాదాద్రి: పక్కింటి వారు తిట్టారనే మనస్థాపంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన యాదాద్రి జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో మంగళవారం జరిగింది. స్థానికంగా ఉండే లక్ష్మమ్మ అనే మహిళకు పక్కింటి వారికి విబేధాలు వచ్చాయి. దీంతో పక్కింటి వారు తిట్టడంతో ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. * * నిజామాబాద్ : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి యాసంగి పంటకు నీటిని విడుదల చేశారు. ఇరిగేషన్ అధికారులు గురువారం ఉదయం నీటిని విడుదల చేశారు. కాకతీయ కెనాల్ ద్వారా 6 వేల క్యూసెక్కులు, లక్ష్మీ కెనాల్ ద్వారా 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీటి విడుదలతో రైతులు నారుమడులు పోసేందుకు సిద్ధమవుతున్నారు. * * హుజూర్‌నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పోలీసులు బైక్ దొంగల ముఠాను పట్టుకున్నారు. గురువారం ఉదయం సీఐ వి. నర్సింహారెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు చెందిన 8 మంది సభ్యుల ముఠా గత కొంతకాలంగా ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతోంది. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు గురువారం ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 22 బైక్‌లను స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు పంపారు. * * భువనగిరి: యాదాద్రి జిల్లా భువనగిరిలోని బ్యాంకుల వద్ద పింఛనుదారులు నిరసన తెలిపారు. స్థానిక ఆంధ్రా బ్యాంకు వద్ద ప్రభుత్వ పింఛను దారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు రూ. 10 వేలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయగా రూ. 4 వేలే ఇస్తున్నారని నిరసన తెలిపారు. గంటలకొద్దీ క్యూలైన్లలో తాము నిలబడలేమని, ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. * * వరంగల్: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 226 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి గురువారం కోర్టుకు హాజరు పరిచారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిలో 12 మందికి 2 రోజుల జైలుశిక్ష విధిస్తూ.. న్యాయస్థానం తీర్పు నిచ్చింది. దీంతో పాటు మద్యం రాయుళ్లకు రూ. 3.52 లక్షల జరిమానాలు విధించింది. * * మిర్యాలగూడ: గ్యాంగ్ స్టర్ నయీం కేసుకు సంబంధించి 25 మంది నిందితులను పోలీసులు ఈరోజు మిర్యాలగూడ కోర్టు ఎదుట హాజరుపరిచారు. చర్లపల్లి జైల్లో ఉన్న నిందితులను పలు కేసుల్లో విచారణ నిమిత్తం ఈ రోజు మిర్యాలగూడ కోర్టుకు తీసుకొచ్చారు. వారిలో నయీం భార్య, సోదరి, అత్త ఉన్నారు. విచారణ అనంతరం తిరిగి వారిని చర్లపల్లికి తరలించారు. * * కాఠ్మాండు: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరానికి దగ్గర్లోని ఒక హిమనీనద సరస్సులోని నీటిని గణనీయంగా తగ్గించామని నేపాల్‌ ప్రకటించింది. వాతావరణంలో మార్పుల వల్ల హిమనీనదాలు వేగంగా కరుగుతున్నాయి. ఆ నీరంతా కట్టలు తెంచుకుని కిందకు ప్రవహిస్తే మహావిపత్తు సంభవిస్తుంది. * * మేడ్చెల్‌: మేడ్చల్ జిల్లా కీసర మండలం కుందన్‌పల్లి చౌరస్తాలో మంగళవారం ఉదయం ఒక లారీ బీభత్సం సష్టించింది. వేగంగా వెళుతున్న లారీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడమే కాక ఎదురుగా వెళుతున్న స్కూటర్‌ను డీకొని పక్కనున్న ఎన్‌వీఆర్‌ పెట్రోల్‌ బంక్‌లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో స్కూటర్‌పై వెళుతున్న యూనస్, ఖాజా అనే యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వారిని 108లో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. * * నిజామాబాద్‌: బోధన్‌లోని నిజాం దక్కన్‌ సుగర్స్‌ కంపెనీ కార్మికులు, అఖిలపక్షం నేతలు మంగళవారం బోధన్‌ బంద్‌ నిర్వహిస్తున్నారు. దక్కన్‌ సుగర్స్‌ లే ఆఫ్‌ ఎత్తివేయాలని, కంపెనీని పునరుద్ధరించాలని కోరుతూ కంపెనీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ బంద్‌ చేపట్టారు. బంద్‌లో అన్ని కార్మిక సంఘాల వారు, కంపెనీ కార్మికులు, టీడీపీ, సీపీఐ, సీపీఎం తదితర పక్షాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. * * శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం తప్పింది. ఫ్లయిట్‌లో పంపించేందుకు ఓ ఏజెంట్ కార్గో ఏరియాకు తీసుకువచ్చిన కెమికల్స్ బాక్సు నుంచి పొగలు వెలువడ్డాయి. గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. * * జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో శుక్రవారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీస్ కమీషనర్ కమల్‌హాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో 100 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. అనుమానం ఉన్న ప్రతి ఇంటినీ జల్లెడ పట్టారు. సరైన పత్రాలు లేని 8 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. * * చేర్యాల(సిద్ధిపేట జిల్లా): చేర్యాల సమీపంలో దూల్మిట్ట క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో మద్దూరు సాక్షి విలేకరి సత్యం గౌడ్(28) మృతిచెందాడు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న సత్యంను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. * * హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖ పరిధిలో పోలీస్ కానిస్టేబుల్ (సివిల్/ఏఆర్/ఎస్‌ఏఆర్/టీఎస్‌ఎస్‌పీ), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్)లో కానిస్టేబుల్ (పురుష), అగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్ పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రం బుక్‌లెట్లు, ప్రాథమిక కీను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) మంగళవారం విడుదల చేసింది. www.tslprb.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని బోర్డు చైర్మన్ డాక్టర్ జె.పూర్ణచంద్రరావు తెలిపారు. * * నారాయణపూర్: యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలకేంద్రంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు ఇళ్లు, ఒక నగల దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనాస్థలానికి క్లూస్ టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. * * కారేపల్లి: కల్తీ మద్యం తయారు చేస్తున్న వారిని తీసుకెళ్తున్న ఆటో బోల్తా పడటంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఆ సమయంలో ఆటోను నడుపుతున్నది పోలీస్ కానిస్టేబుల్ కావటం గమనార్హం. వివరాలివీ.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పోలీసులు సోమవారం ఉదయం రేలకాయలపల్లి జైత్రాం తండా, జీత్యా తండాలపై దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా కల్తీ మద్యం తయారు చేస్తున్నారనే ఆరోపణలతో ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. * * యదాద్రి: భువనగిరిలో శనివారం తెల్లవారుజామున లారీ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌ చౌరస్తాలోని బస్టాండ్‌ వద్ద జనంపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీలో శనివారం తెల్లవారుజామున నుంచి పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సౌత్‌జోన్‌ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో కామటిపుర, బార్కాస్‌, వట్టేపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 21 మంది రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు, నాలుగు ఆయుధాలు, 65 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. * * హైదరాబాద్‌: నగరంలోని ఇందిరాపార్క్‌ వద్ద రేపు (ఆదివారం) ఉదయం 10 గంటలకు రైతు దీక్ష చేపట్టనున్నారు. ఈ రైతు దీక్షలో తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌, రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొననున్నారు. తెలంగాణ ఏర్పాడ్డాక తొలిసారి కోదండరామ్‌ దీక్షకు దిగుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం రైతు సమస్యలు పట్టించుకోవడం లేదని కోదండరామ్‌ దీక్షకు దిగుతున్నట్టు సమాచారం. * * వాజేడు: స్కూల్ పిల్లలను తరలిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వాజేడు మండలం జగన్నాథపురంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామం నుంచి వాజేడు పాఠశాలకు వెళ్తున్న స్కూల్ పిల్లల ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. * * పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎన్టీపీసీ(నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్) 7 యూనిట్‌ లో ఉత్పత్తి నిలిచి పోనుంది. ఈ అంశాన్ని అధికారులు తెలిపారు. ఏడో యూనిట్ వార్షిక మరమ్మత్తుల కోసం శుక్రవారం నుంచి ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీని వల్ల 500ల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచి పోనుంది. * * మునగాల(నల్గొండ): మునగాల మండలం ఇంద్రానగర్ వద్ద జాతీయ రహదారిపై గురువారం ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బీభ్సతం సృష్టించింది. వడ్ల లోడుతో ముందుగా సూర్యాపేట వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను గౌతమి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ మీద ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * కరీంనగర్ జిల్లా: రేణికుంట బ్రిడ్జి సమీపంలో రాజీవ్ రహదారిపై బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఓ బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో బైక్‌లో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనతో ఆ మార్గంలో ఒక కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * మిర్యాలగూడ (నల్గొండ జిల్లా): మిర్యాలగూడ పట్టణంలోని ఓ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణానికి చెందిన మారం శ్రీనివాస్(45) అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. భార్యాబిడ్డలతో కలిసి హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. రియల్‌ ఎస్టేట్‌లో నష్టాలు రావడంతో అప్పులపాలై బలవన్మరణానికి పాల్పడ్డాడు. * * శాన్ ఫ్రాన్సిస్కో : అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేగింది. శాన్ ఫ్రాన్సిస్కోలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు విద్యార్థులు గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా పలువురు విద్యార్థులు కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈక్విటీ జూన్ జోర్డాన్ స్కూల్ సిటీ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీ హైస్కూల్ బయట ఈ కాల్పులు జరిగాయి. * * గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజేష్(14) అనే విద్యార్థి మృతి చెందాడు. స్కూలుకు వెళ్లటానికి రోడ్డు పక్కన నిల్చున్న సమయంలో అటుగా వస్తున్న టాటా ఏస్ వాహనం అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలైన రాజేష్‌ను నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. మార్గమధ్యంలోనే ప్రాణాలొదిలాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. * * కరీంనగర్‌: హుజారాబాద్‌లో మంగళవారం తెల్లవారుజామున నుంచి పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరానగర్‌, బుడగ జంగాల కాలనీల్లో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ జరిపారు. కార్డెన్‌ సర్చ్‌లో భాగంగా సరైన పత్రాలు లేని వాహనాలను ఆపి తనిఖీలు చేపట్టారు. * * అబ్దుల్లాపూర్‌మెట్ : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాచారం గ్రామంలోని సాయిప్రియ కెమికల్ పరిశ్రమలో మంగళవారం ఓ బాయిలర్ పేలి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. మృతుడు బిహార్‌కు చెందిన శివ చాంద్‌బీన్(31)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. * * మరిపెడ(వరంగల్‌): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన వరంగల్‌ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్‌ సాయంతో ఆస్పత్రికి తరలించగా అందులో ఒకరి పరిస్థతి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. * * నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో ఆదివారం అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో ఒక లారీ కాలిపోయింది. ఆదిలాబాద్ వైపు నుంచి నిర్మల్ వెళ్తున్న నిమ్మకాయల లోడ్ లారీలో నేరడిగొండ వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.అవి వేగంగా లారీ అంతటా వ్యాపించటంతో అప్రమత్తమైన లారీ డ్రైవర్, క్లీనర్ కిందికి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు.అనంతరం లారీ అగ్నికి ఆహుతయింది. కారణాలు తెలియాల్సి ఉంది. లారీడ్రైవర్ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. * * చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సుమారు రెండు వారాలుగా ఆసుపత్రికే పరిమితమయ్యారు. ఆమె చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రి డాక్టర్లు ముఖ్యమంత్రి కోలుకుంటున్నారని.. మరికొంత కాలం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పాలన కుంటుపడకుండా తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయచర్యలపై ఏఐఏడీఎంకే నేతలు దృష్టి పెట్టినట్లు సమాచారం. * * హైదరాబాద్: నాంపల్లిలో అన్ని ఆధునిక హంగులతో పోలీస్స్టేషన్ నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నరసింహరెడ్డి తెలిపారు. శనివారం ఉదయం పోలీస్స్టేషన్ కొత్త భవనానికి నాయిని నర్సింహారెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతోపాటు నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి, ఇతర పోలీసులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. * * ఐక్యరాజ్యసమితి: కర్బన ఉద్గారాలను తగ్గించుకునే ఒప్పందంపై మెజారిటీ దేశాలు సంతకాలు చేయడంతో నవంబర్‌ 4 నుంచి ప్యారిస్‌ ఒప్పందం అమల్లోకి వస్తుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ బాన్‌ కీ మూన్‌ వెల్లడించారు. దీన్నోక చిరస్మరణీయ ఘటనగా అవర్ణించారు. * * హైదరాబాద్ : మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురిని మల్కాజిగిరి సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా కీసరకు చెందిన యు.బలరాం, కృష్ణ, నర్సింహ అనే వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బొమ్మ పిస్టళ్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. * * కథలాపూర్(కరీంనగర్) : ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు అక్కడే ఉన్న హుండీని ఎత్తుకుపోయారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం కలిగోట గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం అర్థరాత్రి సత్యనారాయణ స్వామి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు గర్భగుడిలో విలువైన వస్తువులు ఏమీ లేకపోవటంతో హుండీని పెకిలించుకు పోయారు. శుక్రవారం ఉదయం గమనించిన పూజారి గ్రామ పెద్దలకు సమాచారం అందించారు. ఈ మేరకు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. * * కౌడిపల్లి: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారం గేటు వద్ద రాస్తారోకో జరిగింది. సలబాత్తపూర్ పంచాయతీని కొత్తగా ఏర్పాటు చేస్తున్న చిలిప్‌చేడ్ మండలంలో కాకుండా కౌడిపల్లి మండలలోనే కొనసాగించాలని ఆ పంచాయతీ ప్రజలు డిమాండ్ చేశారు. సుమారు 30 నిమిషాల పాటు రాస్తారోకో జరగడంతో మెదక్-నర్సాపూర్ రహదారిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. * * సిద్ధిపేట(మెదక్ జిల్లా) : సిద్ధిపేట మండలకేంద్రం గణేశ్ నగర్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికంగా నివాసముంటున్న శ్రీశైలం, పదయ్య, నర్సింహులు అనే ముగ్గురి ళ్లలో చోరీకి పాల్పడ్డారు. మూడిళ్లలో కలిపి 2 తులాల బంగారం, రూ.10 వేల నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. * * కొణిజర్ల(ఖమ్మం జిల్లా) : కొణిజర్ల మండలకేంద్రంలోని ఎండీఓ ఆఫీసు వద్ద గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. అదే సమయంలో అటుగా వచ్చిన మరో లారీ వచ్చి ఈ రెండు లారీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురికి గాయాలయ్యాయి. ఇదేవిధంగా కొణిజర్ల పోలీస్‌స్టేషన్ సమీపంలో లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఖమ్మం తరలించారు. * * కొత్తకోట(మహబూబ్‌నగర్) : మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటలో ఓ మహిళ దారుణంగా హత్యకు గురైంది. మండల కేంద్రంలోని వడ్డెవాడ సమీపంలోని ముళ్ల పొదల్లో ఓ మహిళ(50) మృత దేహం పడి ఉండగా గురువారం ఉదయం స్థానికులు కనుగొన్నారు. ఎక్కడో చంపి ఇక్కడ పడేసి ఉంటారని భావిస్తున్నారు. ఆమె స్థానికురాలు కాదని చెబుతున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవాల్సి ఉంది. * * హైదరాబాద్ : ముగ్గురు యువకులు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన ఘటనలో గాయపడిన చిన్నారి సంజన బ్రెయిన్ డెడ్ కాలేదని కామినేని ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రసాదరావు వెల్లడించారు. అయితే ఆమె పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. బుధవారం హైదరాబాద్లో ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రసాదరావు విలేకర్లతో మాట్లాడుతూ... చిన్నారి సంజన పరిస్థితి విషమంగానే ఉందన్నారు. * * శంషాబాద్(రంగారెడ్డి) : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆరేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడింది. హైదరాబాద్ కొత్తపేటకు చెందిన అరవింద్‌రావు దంపతులు తమ కూతురు నవ్య(6)తో కలసి బంధువులకు వీడ్కోలు చెప్పేందుకు మంగళవారం రాత్రి ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో చిన్నారి నవ్య డిపార్చర్ రైలింగ్ పైనుంచి కిందపడి పోయింది. తలకు తీవ్ర గాయాలుకాగా చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. వెంటనే జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. * * కీసర(రంగారెడ్డి) : డంపింగ్ యార్డు కారణంగా చెరువు నీరు కలుషితం అవుతోందంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వివరాలివీ.. రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాల సమీపంలో జీహెచ్‌ఎంసీ డంపింగ్ యార్డు ఉంది. ఈ యార్డు నుంచి వెలువడే వ్యర్థ జలాలు పక్కనే ఉన్న చెరువులో కలుస్తున్నాయి. సాగు నీరు కలుషితమవుతోందంటూ కొన్ని రోజులుగా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ఇదే విషయమై ఒక్కటైన గ్రామస్తులు బుధవారం ఉదయం చెత్తను తీసుకువచ్చే జీహెచ్‌ఎంసీ వాహనాలను అడ్డుకున్నారు. * * హైదరాబాద్ : కూకట్‌పల్లి జేఎన్‌టీయూ పరిపాలన విభాగంలో భారీగా మార్పులు, చేర్పులు చేస్తూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారు. డెరైక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్‌గా ఉన్న ఈశ్వరప్రసాద్‌ను సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూ ప్రిన్సిపాల్‌గా నియమించారు. అడ్మిషన్స్ డెరైక్టర్‌గా మంజూర్ హుస్సేన్‌ను, ఎగ్జామినేషన్స్ కంట్రోలర్‌గా తార కల్యాణి, బిక్స్ డెరైక్టర్‌గా లక్ష్మణరావు, డీయూఎఫ్‌ఆర్‌గా చెన్నకేశవరెడ్డిని నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. * * బాల్కొండ(నిజామాబాద్ జిల్లా) : ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 2 లక్షల 4 వేల 939 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్ధ్యం 90.313 టీఎంసీలు కాగా ప్రస్తుతం 89.763 టీఎంసీల నీరు ఉంది. కాకతీయ కెనాల్‌కు 5 వేల క్యూసెక్కులు, సరస్వతీ కెనాల్‌ఖు 1000 క్యూసెక్కులు, లక్ష్మీ కెనాల్‌కు 300 క్యూసెక్కులు, ఎస్కేప్ రెగులేటర్‌కు 3 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. మొత్తం 74,939 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. * * కరీంనగర్ : ప్రమాదవశాత్తు మూడు ఎలుగు బంట్లు వ్యవసాయ బావిలో పడి మరణించాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం శ్రీరాములపేటలో సోమవారం చోటు చేసుకుంది. ఆ విషయాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించారు. దీంతో గ్రామస్తులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని... ఎలుగు బంట్లను బావిలో నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. * * హైదరాబాద్ : పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్న ఓ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. కుషాయిగూడ నాగార్జుననగర్ కాలనీకి చెందిన ఇందుభార్గవి(19), చాంద్ అలీ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారి వివాహానికి పెద్దలు అంగీకరించకపోవటంతో రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. అనంతరం తమకు ప్రాణాహాని ఉందని, బంధువుల నుంచి రక్షణ కల్పించాలంటూ మంగళవారం కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు. * * కెరామెరి(ఆదిలాబాద్ జిల్లా) : కెరామెరి మండలం కెలికే గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గౌరూభాయ్(60), బ్యీసన్(30) అనే తల్లీ కొడుకులు ప్రమాదవశాత్తూ తమ పొలంలో కరెంటు షాక్ తగిలి మృతిచెందారు. ఈ సంఘటన నిన్ననే జరిగినా ఆలస్యంగా బయటపడింది. తల్లీకొడుకు మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. * * హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు కనిపించటం కలకలం రేపింది. లక్నో వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడి లగేజిని తనిఖీ చేయగా మూడు బుల్లెట్లు బయటపడ్డాయి. దీంతో భద్రతా సిబ్బంది అతడిని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. * * మహబూబ్‌ నగర్: మహబూబ్‌ నగర్ జిల్లా మరికల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృత్యువాతపడ్డారు. శనివారం ఉదయం రెండు లారీలు వేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో రెండు లారీల డ్రైవర్లు క్యాబిన్‌లోనే ప్రాణాలు విడిచారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో రాయిచూర్ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని వాహనాలను పక్కకు తొలగించేందుకు యత్నిస్తున్నారు. క్షతగాత్రులను మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. * * ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బాసరలో వేంచేసి ఉన్న సరస్వతీ మాత సన్నిధిలో దసరా ఉత్సవాలు మొదలయ్యాయి. మొదటిరోజు శైలిపుత్రిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తోంది. శనివారం వేకువజాము నుంచి భక్తులు దర్శనం కోసం క్యూకట్టారు. భైంసాపట్టణానికి చెందిన వ్యాపారవేత్త జి.రమేష్ కుటుంబసభ్యులు అమ్మవారికి రెండు తులాల బంగారు గొలుసును సమర్పించుకున్నారు * * కరీంనగర్ : ఎగువ ప్రాంతాల నుంచి వరదతో కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు జలాశయం పూర్తిస్థాయిలో నిండింది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 920 అడుగులు కాగా.. ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం కొనసాగుతోంది. జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి 16,000 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో.. 8 గేట్లు ఎత్తి 16,000 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. కాకతీయ కాలువకు మరో 2, 000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. * * డిచ్‌పల్లి: వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టిన ఘటనలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టడంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జాం అయింది. * * కరీంనగర్ : లోయర్ మానేరు డ్యామ్‌కు వరద తగ్గుముఖం పట్టింది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 920 అడుగులు, నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా గురువారం ఉదయం ఎనిమిది గంటలకు 919.40 అడుగులు, 23.51 టీఏంసీల నీరు ఉంది. డ్యామ్‌కు ఇన్‌ఫ్లో 10,800 క్యూసెక్కులు ఉండగా.. కాకతీయ కెనాల్ ద్వారా 5,000 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. * * శంషాబాద్ : పిల్లర్ కోసం తీసిన గుంటలో పడి బాలుడు మృతిచెందిన సంఘటన శంషాబాద్ మిషన్‌కంపౌడ్ సమీపంలోని శీనయ్య వెంచర్‌లో గురువారం వెలుగుచూసింది. స్థానిక శీనయ్య వెంచర్‌లో కార్మికులుగా పనిచేస్తున్న హరీష్, యాదమ్మ దంపతుల ఆరేళ్ల కుమారుడు బాలు పిల్లర్ గుంటలో పడి మృతిచెందాడు. శ్రీనయ్య వెంచర్‌లో పిల్లర్‌ల కోసం గుంటలు తవ్వారు. అందలో వర్షపు నీరు చేరడంతో ప్రమాదవశాత్తు బాలుడు అందులో పడి మృతిచెందాడు. * * ధర్మసాగర్(వరంగల్) : వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ధర్మసాగర్ సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న కేశబోయిన దేవేందర్(34) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో రాత్రి ప్యాసింజర్‌ను దించి ఇంటికి తిరిగి వస్తుండగా.. ఆటో బోల్తా కొట్టడంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటాన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. * * పెద్దమందడి(మహబూబ్‌నగర్) : వేగంగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన ఘటనలో బస్సు డ్రైవర్, క్లీనర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా పెద్దమందడి మండలం మోజెర్ల స్టేజీ సమీపంలో 44వ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. * * హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లి మూసాపేటలో బుధవారం వేకువజామున దారుణం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు స్నేహితులను వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో బైక్ వెనుక కూర్చున్న హరికృష్ణ(28) అనే యువకుడు మృతిచెందాడు. స్నేహితుని మరణాన్ని జీర్ణించుకోలేని రమేష్(28) భరత్‌నగర్ రైలు పట్టాలపై ఆత్మహత్యచేసుకున్నారు. హరికృష్ణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాగా రమేష్ శ్రీశ్రీ హోలిస్టిక్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. * * హైదరాబాద్ : భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని నీటి ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తింది. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.30 అడుగులకు వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 200.658 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు బుధవారం వెల్లడించారు. * * నిజాంసాగర్(నిజామాబాద్ జిల్లా) : నిజామాబాద్ జిల్లాలోని నిజామ్‌సాగర్‌కు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి నిజాంసాగర్‌కు 1.16లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 19 గేట్లు ఎత్తివేసి 1.03 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. * * మెదక్ : మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం చిల్వర వద్ద మంగళవారం రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. * * చెన్నై: చెన్నైలో ఓలా క్యాబ్ డ్రైవర్ ఓ మహిళా డాక్టర్పై లైంగికదాడికి ప్రయత్నించాడు. మరో ఇద్దరితో కలసి ఆమెను బలవంతంగా కారులో తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కారు వెనుక వాహనంలో వెళ్తున్న ఓ వ్యక్తి డాక్టర్ అరుపులు విని చేజ్ చేసి స్థానికులతో కలసి ఆమెను రక్షించాడు. * * శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 200 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా(ఏఐ-559) విమానం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నిలిపేశారు. ఉదయం 6.40 వెళ్లాల్సిన విమానం ఇప్పటికీ బయలుదేరకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఇంత జరుగుతున్నా ఎయిర్ ఇండియా అధికారులు మాత్రం తమకేం బాద్యత లేనట్లు వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. * * ఖమ్మం : రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. దాదాపు అన్ని చెరువులు, కుంటల్లో నీరు ప్రమాదస్థాయికి చేరుకుంది. ఖమ్మం జిల్లా చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు బుధవారం ఉదయం ప్రాజెక్ట్ పదిగేట్లను ఎత్తివేసి... 23,730 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. * * కరీంనగర్ : ఎస్సారెస్సీ ప్రధాన కాలువకు గండిపడటంతో.. వందల ఎకరాల్లో పంట నీట మునిగింది. కరీంనగర్ జిల్లా మానాల సమీపంలో గల ఎస్సారెస్సీ ప్రధాన కాలువకు మంగళవారం రాత్రి భారీ గండి పడింది. దీంతో పెగడపల్లి, గొల్లపల్లి మండలాల పరిధిలోని చెరువులన్ని నిండిపోయాయి. సుద్దపల్లిలోని కొయ్యచెరువు, రాఘవపట్నంలోని మొగుళ్ల చెరువుకు గండి పడటంతో.. వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. * * హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాల్లో కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్న ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య విద్య సీట్లకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకూ వెబ్ ఆప్షన్ల నమోదుకు గడువు ఉంటుందని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ కరుణాకరరెడ్డి తెలిపారు. * * శంషాబాద్ : దుబాయ్ వెళుతున్న అహ్మద్ అనే వ్యక్తి నుంచి మంగళవారం ఉదయం భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహించగా అహ్మద్ వద్ద భారీగా విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. నిందితుని అదుపులోకి తీసుకుని విచారణచేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * హైదరాబాద్ : ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేసంలో ఆయన పాల్గొనున్నారు. ముఖ్యమంత్రి తోపాటు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కూడా ముఖ్యమంత్రి బృందంతో పర్యటించనున్నారు. * * హైదరాబాద్‌: నాంపల్లిలోని టీఎన్‌జీవో కార్యాలయంలో సోమవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీలో పనిచేస్తున్న సుమారు 700 మంది నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగులను తెలంగాణకు బదిలీ చేయాలంటూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పెట్రోల్‌ డబ్బాలతో టీఎన్‌జీవో కార్యాలయంలోకి ఉద్యోగులు వెళ్లడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. * * దుగ్గొండి(వరంగల్) : ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో.. బైక్‌పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. * * తిర్యాని: స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఆశ్రమ పాఠశాల విద్యార్థి వాగులో మునిగి మృతి చెందాడు. అదిలాబాద్ జిల్లా తిర్యాని మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న కె. లక్ష్మణ్‌రాహూల్(12) ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి సమీపంలోని వాగులో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. * * చొప్పదండి: కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలంలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. భూపాలపట్నంకు చెందిన మునిగాల అంజయ్య (48) అప్పులబాధతో గ్రామశివారులోని పశువుల కొట్టం వద్ద ఉరివేసుకొని బలవన్మరణం చెందాడు. స్థానిక రైతులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. గ్రామంలో 4.38 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా గత కొన్నేళ్లుగా వ్యవసాయంలో నష్టాలు రావడంతో రూ.5లక్షలకు పైగా అప్పులయ్యాయి. వాటిని తీర్చే మార్గం లేక మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. * * హైదరాబాద్ : తెలంగాణ విమోచన దినం నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో జాతీయ జెండా ఎగరేసేందుకు బీజేపీ ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి యత్నించారు. అందులోభాగంగా ఆయన వాహనంలో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే కిషన్రెడ్డి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు... కిషన్రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. * * మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తిని రేవెన్యూ డివిజన్ చేయాలంటూ కల్వకుర్తి MLA అయిన చల్లా వంశీచంద్ రెడ్డి చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి అరెస్ట్ చేసారు. * * చర్ల: ఖమ్మం జిల్లా తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉదృతి పెరిగింది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన 9 గేట్లను 2 అడుగుల మేర ఎత్తారు. 8400 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు నుంచి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 73.6 మీటర్లుగా ఉంది. * * నల్గొండ : నల్గొండ జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టులో నీటి మట్టం బుధవారం 47.59 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టులోకి 29,373 క్యూసెక్కుల నీరు వస్తుండగా..9,929 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు నుంచి అధికారులు బయటికి వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 21.30 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు. * * నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా దోమకొండలో ఓ బాలుడు ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ తగిలి మరణించాడు. వివరాలు ఇలా ఉన్నాయి... వివేక్ (16) అనే బాలుడు బుధవారం వేకువజామున ప్రమాదవశాత్తూ కరెంటు షాక్‌కు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని రుద్ర ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాద్దిసేపటికే మరణించాడు. * * నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్ర శివారులో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఇద్దరికి మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డారు. బస్సు ముందు భాగం మాత్రం దెబ్బతిన్నది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. * * యాలాల: రంగారెడ్డి జిల్లా యాలాల శివారులో ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ మండలం హుస్నాపూర్ గ్రామానికి చెందిన వెంకటయ్య, యోగి జీవనోపాధి కోసం వచ్చి రంగారెడ్డి జిల్లాలో స్థిరపడ్డారు. * * కరీంనగర్: కరీంనగర్ జైలు నుంచి ఇద్దరు దొంగలు పరారీ అయ్యారు. వీరి కోసం కరీంనగర్ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జైలు నుంచి పరారైన వారు మహారాష్ట్ర పార్సీ గ్యాంగ్కు చెందిన జితేందర్, యోగేశ్లుగా గుర్తించారు. * * హైదరాబాద్: పాతబస్తీ భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తలాబ్‌కట్ట, అమన్ నగర్ ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్‌నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన దృవపత్రాలు లేని 83 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. * * శంషాబాద్ (హైదరాబాద్‌): శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రంయలో తనిఖీలు నిర్వహిస్తున్న కస్టమ్స్ అధికారులు అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 320 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద అక్రమ బంగారం గుర్తించిన ఎయిర్‌పోర్ట్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. * * నార్కెట్‌పల్లి(నల్లగొండ): వేగంగా వెళ్తున్న కారు, లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి శివారులోని 65వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. * * ములుగు: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు నీటిగుంటలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ములుగు మండలం బండారుపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏడాదిన్నర చిన్నారి తల్లిదండ్రులు పనులు చూసుకుంటుండగా.. చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందు ఉన్న నీటిగుంటలో పడి మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. * * కోరుట్ల: మోటర్ పెట్టడానికి వ్యవసాయ బావి దగ్గరకు వెళ్లిన రైతు ప్రమాదవశాత్తు విద్యుధ్ఘాతానికి గురై మృతి చెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాంరెడ్డి(45) ఈ రోజు ఉదయం మోటర్ ఆన్ చేయడానికి వెళ్లాడు. అయితే షార్ట్ సర్క్యూట్ కావడంతో కరెంట్ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. * * పంజగుట్ట: మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ నిమ్స్‌ ఆసుపత్రి ఓపీలో రెప్పపాటులో రూ. 40 వేలు చోరీ చేసింది. అక్కడే విధుల్లో ఉన్న ఓ మహిళా గార్డు ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం ... నాంపల్లికి చెందిన గౌసియా బేగం (32) బుధవారం మధ్యాహ్నం నిమ్స్‌ ఆసుపత్రి ఓపీ వద్దకు వచ్చింది. * * మహేశ్వరం: వేగంగా వెళ్తున్న లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టిన ఘటనలో క్లీనర్ మృతిచెందగా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం రావిర్యాల ఔటర్ రింగ్‌ రోడ్డుపై గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పెద్ద అంబర్‌పేట్ నుంచి వస్తున్న లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టింది. * * తాండూరు(రంగారెడ్డి): కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ఎం. మాణిక్‌రావు(86) నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాణిక్‌రావును కుటుంబ సభ్యులు నిమ్స్ ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందారు. * * దమ్మపేట: దుక్కి దున్నుతున్న ట్రాక్టర్‌పై విద్యుత్ స్తంభం విరిగిపడటంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లిలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లకావత్ చిట్టయ్య(35), ధారావత్ మహేష్(22)లు ట్రాక్టర్ సాయంతో దుక్కిదున్నతున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం విరిగిపడింది. దీంతో ట్రాక్టర్ పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. * * హైదరాబాద్: జిల్లాల పునర్విభజన విషయంలో అధికార టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను కలసి తమ అభ్యంతరాలను తెలిపారు. మంగళవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిలు సచివాలయంలో సీఎస్‌ను కలసి వినతి పత్రం అందజేశారు. * * హైదరాబాద్ : దసరా నుంచి కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు అన్నీ ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. జిల్లా కలెక్టర్లతో ఆయన ఈ విషయమై సమావేశమయ్యారు. కొత్త జిల్లాల్లో పనిభారాన్ని బట్టి పరిపాలనా విభాగాలు ఉండాలని తెలిపారు. అధికారుల సర్దుబాట్లు, కొత్త ఉద్యోగుల నియామకాలు జరగాలని సూచించారు. * * సంగారెడ్డి: మెదక్ జిల్లా పటాన్‌చెరు ఇస్నాపూర్ వద్ద సోమవారం అర్థరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. వేగంగా వచ్చిన ట్యాంకర్ లారీ ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో బైక్‌పై వెళుతున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. * * మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సివిల్ జడ్జి నాగరాజు ఇంట్లో దొంగలు పడి బీభత్పం సృష్టించారు. జడ్జి కుటుంబసభ్యులు ఊరు వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగింది. ఇరుగుపొరుగువారు ఇచ్చిన సమాచారం మేరకు మిర్యాలగూడ పోలీసులు క్లూస్ టీమ్‌తో చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. జడ్జికి సమాచారం ఇచ్చారు. * * నల్గొండ : భువనగిరిలో గ్యాంగ్స్టర్ నయీం అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై స్థానిక ఆర్డీవో శనివారం విచారణ జరపనున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 1700 మంది బాధితులు ఇప్పటికే ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. నల్గొండ జిల్లా బొమ్మాయిపల్లిలోని లక్ష్మీనరసింహ వెంచర్లో 1700 మందికి చెందిన ప్లాట్లను నయీం తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. * * హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-2 రాత పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2015 డిసెంబర్ 30న 439 పోస్టుల భర్తీకి జారీ అయిన నోటిఫికేషన్ కింద ఇప్పటికే 5,64,431 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, మరో 593 పోస్టుల భర్తీకి ప్రస్తుత అనుబంధ నోటిఫికేషన్ కింద మరో లక్షన్నర మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. * * హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య మరో వివాదం తలెత్తింది. సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న 21 మంది తెలంగాణ ఇంజినీర్లు తమను ఏపీ జెన్ కో అధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమపై జెన్ కో అధికారులు పరిమితికి మించిన పనిభారం మోపుతున్నారని పేర్కొటూ.. మూడు రోజులుగా తెలంగాణ ఇంజనీర్లు విధులకు హాజరవడం మానేశారు. * * వరంగల్ ఎంజీఎం: వరంగల్ జిల్లా కేంద్రంలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. స్థానిక లేబర్ కాలనీకి చెందిన సంధ్య అనే మహిళకు మొదటికాన్పులో ముగ్గురు ఆడ శిశువులు పుట్టారు. ఈ సంఘటన వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో శనివారం చోటుచేసుకుంది. శనివారం ఉదయం 8 గంటల సమయంలో ఆసుపత్రి వైద్యులు మహిళకు సర్జరీ చేసి ముగ్గురు శిశువులను బయటకు తీశారు. ముగ్గురూ ఆరోగ్యంగా ఉన్నారు. * * హైదరాబాద్: ఇటీవల పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన గ్యాంగ్‌స్టర్ నయీం ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. శేషన్న ప్రధాన అనుచరుడు సోమన్నఇచ్చిన సమాచారం మేరకు నగరంలోని కుషాయిగూడలో సిట్ అధికారులు గురువారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నయీం అనుచరులు శ్రీనివాస్, లక్ష్మణ్‌లను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని తమ కార్యాలయానికి తరలించారు. నయీంకు సంబంధించిన మరింత అదనపు సమాచారం కోసం సిట్ అధికారులు వారిని విచారిస్తున్నారు. * * కరీంనగర్: నేడు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె కరీంనగర్ జిల్లాలో సంపూర్ణంగా కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాలయాలు సంపూర్ణంగా బంద్ పాటిస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జిల్లాలో 11 డిపోలలో మొత్తం 980 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. * * నల్లగొండ: దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నేపథ్యంలో యాదగిరిగుట్టలో కార్మిక సంఘాలు సమ్మెలో పాల్పంచుకున్నాయి. ఆర్టీసీ కార్మకులు కూడా ఈ సమ్మెలో పాల్గొనడంతో.. యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోకు చెందిన 105 బస్సులు డిపోలోపలే ఉండిపోయాయి. దీంతో యాదగిరిగుట్టకు వచ్చే భక్తులు, ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ వాహనదారులు తమకు ఇష్టం వచ్చిన రీతిలో ప్రయాణికుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. * * యాదగిరిగుట్ట : నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని సాయిబాబా మందిరంలో వినాయకుడి రూపంలో అల్లం దర్శనమివ్వడంతో.. స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలకు ముందు ఇలా జరగడం శుభ పరిణామమని భక్తులు భావిస్తున్నారు. స్థానిక సాయి ఆలయంలో అన్నదానం కోసం కొనుగోలు చేసిన అల్లంలో పార్వతి పుత్రుడి ప్రతిమ రూపంలో ఉన్న అల్లం లభించిందని ఆలయ సిబ్బంది తెలిపారు. ఈ వార్త తెలిసిన ప్రజులు పెద్ద ఎత్తున అల్లం వినాయకుడిని దర్శించుకోవడానికి తరలి వస్తున్నారు. * * నల్లగొండ: నల్లగొండ జిల్లా దామరచర్లలో దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు గురువారం రట్టు చేశారు. అందుకు సంబంధించి నలుగురు వ్యక్తులకు పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక కిరాణా దుకాణంలో నకిలీ నోట్లు మారుస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని... తమదైన శైలిలో విచారించారు. * * హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురంలో సుష్మా థియేటర్ వద్ద బ్లాక్లో టికెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 50 సినిమా టికెట్లతోపాటు రూ. 2 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీసుస్టేషన్కు తరలించారు. * * హైదరాబాద్‌ జిల్లాలో 49,903 పింఛన్లకు కోత పడనుంది. ప్రభుత్వం చేపట్టిన లెఫ్‌ ఎవిడెన్స్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ బుధవారంతో ముగియడం నిజమైన పింఛన్‌దారుల లెక్కతేల నుంది. 36,512మంది వెరిఫికేషన్‌ చేయించుకోకపోగా, వెరిఫికేషన్‌ ప్రక్రియలో పాల్గొన్నా వేలిముద్రలు సరిపోలకపోవడం, ఆధార్‌తో లింకు కలువని 11,392 మందికి పింఛన్లు నిలిచిపోనున్నాయి. ఆధార్‌ లింకు మ్యాచ్‌ కాని వా రు మళ్లీ కొత్తగా ఆధార్‌ నమోదు చేసుకోవాల్సి ఉంది. * * మెదక్ : మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ వద్ద గురువారం వ్యాన్ను స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి... వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. * * ఖమ్మం: జిల్లాలో భారీగా ఎస్సైలు బదిలీ అయ్యారు. జిల్లాలోని దాదాపు 58 మంది ఎస్సైలకు స్థానచలనం కల్పిస్తూ జిల్లా ఎస్పీ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఎస్సైలుగా విధులు నిర్వహిస్తున్నవారితోపాటు... కొత్తగా ఎస్సై ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి కూడా ఈ బదిలీల్లో పోస్టింగ్ ఇస్తున్నట్లు ఎస్పీ ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. * * హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన బాట చేపట్టాయి. అందులోభాగంగా గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు కళాశాలల బంద్కు సదరు యాజమాన్యం పిలుపు నిచ్చింది. * * లాస్‌ఏంజిలెస్: అంగారక గ్రహం ఉపరితలంపై ఉన్న పరిస్థితులను భూభాగంపై సృష్టించి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా జరిపిన అరుదైన ప్రయోగం విజయవంతంగా ముగిసింది. ఈ మేరకు నాసా అమెరికాలోని హవాయి రాష్ట్రంలో అంగారక గ్రహం పరిస్థితుల్లో మానవుడి మనుగడ సాధ్యమా అన్న అంశంపై పరిశోధన నిర్వహించింది. ఆరుగురి బృందంతో ఏడాది క్రితం ప్రారంభించిన ఈ ప్రయోగం సోమవారం ముగిసింది. * * నేడు ఐసెట్ ప్రవేశాలకు కొనసాగుతున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ - 50,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు నేడు వెరిఫికేషన్ - ఎన్సీసీ కేటగిరిలో 30,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ * * హైదరాబాద్: స్విస్ ఛాలెంజ్ పై నేడు హైకోర్టులో విచారణ * * హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ కోసం 1969లో జరిగిన ఉద్యమంలో పాల్గొని పోలీస్ కాల్పుల్లో గాయపడ్డ హైదరాబాద్ వాసి పగడాల పరంధామకు రూ.10 లక్షల ఆర్థికసాయం అందించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. 1969 ఏప్రిల్ 4న సికింద్రాబాద్ జనరల్ బజార్‌లో జరిగిన కాల్పుల్లో పరంధామ ఛాతిలో, కుడి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. * * లాస్ ఎంజెల్స్: లాస్ ఎంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎలాంటి కాల్పుల ఘటనలు చోటుచేసుకోలేదని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఒక పెద్ద శబ్దం మాత్రమే వచ్చి దాన్ని ఎయిర్ పోర్ట్ సిబ్బంది కాల్పులుగా భ్రమపడ్డారని చెప్పారు. అమెరికాలోని లాస్ ఎంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాల్పులు చోటుచేసుకున్నాయని తొలుత కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. * * విశాఖపట్నం: రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం సూచించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని వెల్లడించింది. * * హైదరాబాద్: తమ డిమాండ్లను తీర్చి, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఎన్‌ఎంలూ మంత్రి నివాసం ముట్టడికి యత్నించారు. సోమవారం ఉదయం మణికొండలోని మంత్రి లక్ష్మారెడ్డి ఇంటి వద్దకు భారి ఎత్తున చేరుకున్న ఏఎన్‌ఎంలు ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి సమ్మె విరమించి వస్తే సమస్య సరిష్కారానికి కృషి చేస్తానని హామి ఇచ్చారు. * * బిర్కూర్ : నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండల కేంద్రంలోని తిరుమల దేవస్థానంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు శనివారం ఉదయం వరుణయాగం నిర్వహించారు. దేవస్థానం ఆవరణంలోని గణపతి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. * * న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో 118 మందితో కూడిన భారీ బృందాన్ని పంపిస్తే కేవలం రెండు పతకాలు మాత్రమే దక్కడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది. వచ్చే మూడు ఒలింపిక్స్‌లలో పతకాలు కొల్లగొట్టేందుకు సమగ్ర కార్యాచరణ పథకాన్ని అమలు చేసేందుకు టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. * * హైదరాబాద్‌సిటీ: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపించారు. రాజేంద్రనగర్ పరిధిలోని గగన్‌పహాడ్ వద్ద హైదరాబాద్-బెంగుళూరు జాతీయరహదారిపై రవాణాశాఖాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 10 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. తనిఖీలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. * * మియామి: అతను చెవిటి వ్యక్తి. సంకేత భాషలోనే ఎవరితోనైనా ముచ్చటిస్తాడు. వేగంగా వాహనాన్ని నడుపుతున్నాడనే సాకుతో అతన్ని ఓ జవాను వెంబడించాడు. ఇద్దరి మధ్య 13 కిలోమీటర్ల పాటు హోరాహోరీగా ఛేజింగ్ జరిగింది. చివరకు అతను తన ఇంటికి సమీపంలో వాహనాన్ని ఆపాడు. వాహనం దిగిన అతన్ని జవాను తుపాకీతో కాల్చాడు. సంఘటనా స్థలంలోనే అతను కుప్పకూలాడు. అమెరికాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దుమారం రేపుతోంది. * * అహ్మదాబాద్: ఓ సీనియర్ జర్నలిస్టు ఏకంగా పత్రికా కార్యాలయంలోనే దారుణంగా హత్యకు గురయ్యాడు. కార్యాలయంలో కూర్చుని వార్తాకథనం రాస్తుండగా దుండగులు ఆయనను కిరాతకంగా పొడిచి చంపారు. నెత్తుటి మడుగులో ఉన్న ఆయన మృతదేహాన్ని మంగళవారం పోలీసులు గుర్తించారు. గుజరాత్ సౌరాష్ట్ర ప్రాంతంలోని జునాగఢ్ పట్టణంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. * * హిమాయత్‌నగర్‌: రోడ్డు, రవాణా భద్రతా బిల్లు, ఆర్టీఏ, ట్రాఫిక్‌ పోలీసుల వేధింపులకు నిర సనగా సెప్టెంబర్‌ 2న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఆటోడ్రైవర్ల సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నాయకులు తెలిపారు. హిమాయత్‌నగర్‌లోని ఎఐటియుసి భవన్‌లో సోమవారం బంద్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో లక్ష్మయ్య పాల్గొన్నారు. * * పంజగుట్ట: గణేష్‌ ఉత్సవాలను గతంలో మాదిరిగానే నిర్వహించుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసినా పోలీసు అధికారులు నిబంధనల పేరుతో వేధించడం తగదని భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ప్రతినిధులు అన్నారు. గణేష్‌ నిమజ్జనంతో కాలుష్యం వెలువడటం లేదని పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు నివేదిక ఇచ్చిందని, ఎత్తు విషయంలో జోక్యం చేసుకోబోమని హైకోర్టు పేర్కొన్నా ఎత్తు తగ్గించాలని ఒత్తిడి చేయడం దారుణమన్నారు. * * హైదరాబాద్: మాజీ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డిని కరీంనగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మావోయిస్టు, గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీమ్ తరహాలోనే మోహన్‌రెడ్డి అరాచకాలకు పాల్పడేవాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గ్యాంగ్‌స్టార్‌ నయీం ముఠాతో సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు. నిన్న రాత్రి (సోమవారం) 8 గంటలకు మోహన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. * * ఇస్తాంబుల్ : ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన 12 ఏళ్ల ఆత్మాహుతి బాంబర్.. టర్కీలో ఉగ్రవాద దాడి చేసి, 51 మంది ప్రాణాలు బలిగొన్నాడు. ఓ పెళ్లిని లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 69 మంది గాయపడ్డారు. వారిలో 17 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ దాడికి పాల్పడింది 12 ఏళ్ల కుర్రాడేనని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తెలిపారు. * * ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేసినిరోడ్డు రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇది గుర్తించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. * * కోయంబత్తూర్: తన ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను హతమార్చింది. తొలి ప్రయత్నంలో పాముల ద్వారా కాటు వేయించాలని ప్రయత్నించి అది విఫలం కావడంతో సుఫారీ ఇచ్చి అతడిని హత్య చేయించింది. ఈ ఘటన తమిళనాడులోని పట్టనంపుదూర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళకు కృష్ణ అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉంది. * * దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా మొదటి స్థానానికి చేరుకుంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో కోహ్లి సేన టాప్ ర్యాంకులో నిలిచింది. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ లో ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోవడంతో టీమిండియా మొదటి ర్యాంకు సొంతం చేసుకుంది. 3-0తో సిరీస్ ను శ్రీలంక క్లీన్ స్వీప్ చేయడంతో మొదటి ర్యాంకులో ఉన్న ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది. * * హైదరాబాద్: స్థానికేతర ఉద్యోగులు తమను ఇబ్బంది పెడుతున్నారంటూ తెలంగాణ సచివాలయంలో రెండో రోజు ఆర్థిక శాఖ ఉద్యోగులు బుధవారం తమ నిరసనలు తెలిపారు. ఉన్నతాధికారుల వద్ద పీఎస్లుగా పని చేస్తున్నవారిని తప్పించాలని వారు డిమాండ్ చేశారు. అందులోభాగంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును టీ. ఉద్యోగుల సంఘం నేతలు కలిశారు. * * హైదరాబాద్‌: హయత్‌నగర్ మండలం పసుమాముల బీసీ హాస్టల్ విద్యార్థి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి... సదరు బీసీ హాస్టల్లో ఉంటూ రాకేశ్ అనే విద్యార్థి కలుషిత నీరు తాగి తీవ్ర అనారోగ్యం పాలైయ్యాడు. దీంతో హాస్టల్ సిబ్బంది అతడిని ఎల్బీ నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రెండు రోజులుగా చికిత్స పొందుతు బుధవారం రాత్రి మరణించాడు. * * నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం దుర్కి గ్రామంలో డయేరియాతో గంగవ్వ (50) అనే మహిళ గురువారం మృతి చెందింది. గ్రామంలో డయేరియా ప్రబలింది. దీంతో సమాచారం అందుకున్న జిల్లా వైద్యాధికారులు గ్రామంలో మూడు రోజులు వైద్యశిబిరం నిర్వహించారు.అయితే గంగవ్వ ఈ రోజు మరణించింది. దాంతో బోధన్ ఆర్డీవో సుధాకర్ రెడ్డి గురువారం దుర్కి గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులకు అందుతున్నసేవలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. * * హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం మహముద్ అలీ అధ్యక్షతన మంత్రులు కడియం శ్రీహరి, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. జిల్లాల ఏర్పాటుపై అన్ని వర్గాల నుంచి వచ్చే ప్రతిపాదనలు చర్చించి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. * * హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీం కేసు దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. సిట్ అధికారిగా ఐజీ నాగిరెడ్డిని ప్రభుత్వం నియమించింది. అడిషనల్ ఎస్పీ, ఇద్దరు డీఎస్సీలు సహా 8మందితో ఏర్పాటు అయిన సిట్ బృందానికి నాగిరెడ్డి నేతృత్వం వహిస్తారు. * * పంజగుట్ట: న్యాయస్థానంలోనే న్యాయవాదిపై దాడి చేసిన వ్యక్తిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు... నగరానికి చెందిన దీక్ష అమోల్, బాలకృష్ణ అమోల్‌ భార్యాభర్తలు. దీక్ష తన భర్త అయిన బాలకృష్ణపై గృహహింస కేసు పెట్టగా ఎర్రమంజిల్‌ కోర్టులో మంగళవారం కేసు విచారణకు వచ్చింది. కూకట్‌పల్లికి చెందిన న్యాయవాది వసంత్‌రావు దేశ్‌పాండే కేసు వాదిస్తుండగా, తీవ్ర ఆగ్రహానికి గురైన బాలకృష్ణ న్యాయవాదిని చొక్కా పట్టుకుని బయటకు లాక్కొచ్చి దాడి చేశాడు. * * కరీంనగర్(పెద్దపల్లి) : కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో చేరాలనుకునే విద్యార్థుల కోసం రెండో విడత కౌన్సెలింగ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు పెద్దపల్లి ఐటీఐ ప్రిన్సిపాల్‌ సురేందర్‌ తెలిపారు. 11 నుంచి 20 తేదీల్లో అభ్యర్థులు దరఖాస్తులు అందజేయాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో దరఖాస్తు ఫారాలు లభిస్తాయన్నారు. అభ్యర్థులకు ఈ నెల 24, 28, 30 తేదీల్లో కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు. * * గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరులు, బంధువుల నివాసాల్లో రెండో రోజు కొనసాగుతున్న పోలీసుల సోదాలు * * నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఈ నేపథ్యంలో నేటి మధ్యాహ్నాం 2.00 గంటలకు అరకులోని ఎన్టీఆర్ గ్రౌండ్స్లో ఆదివాసీ దినోత్సవం జరగనుంది.ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి రావెల కిషోర్ బాబు పాల్గొనున్నారు. * * మెదక్: మెదక్ జిల్లా ఆంధోల్ మండలం కిచ్చన్నపల్లి వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. క్రూజర్ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వాసుపత్రిలో ప్రాధమిక చికిత్స తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. * * నల్గొండ: చిట్యాల మండలo వేలిమినేడు గ్రామ శివార్లో గుర్తు తెలియని మహిళ మ్రుతదేహము లభ్యమైంది. ఈ మహిళ చనిపోయి 2 రోజులు అయి ఉండవచ్చని ఎస్.ఐ. శివకుమార్ అనుమానము వ్యక్తము చేశారు. * * కరీంనగర్(పెద్దపల్లి): కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామంలోని VRO గౌస్ పాషా అక్కడి రైతు నుండి 20 వేలు లంచం తీసుకుంటుండగా ACB కి పట్టుబడ్డాడు. * * హైదరాబాద్ : జీవో 123పై సోమవారం హైకోర్టు డివిజన్ బెంచ్లో విచారణ జరిగింది. భూ నిర్వాసితులు, రైతు కూలీల రక్షణ కోసం తీసుకునే చర్యలను తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ ద్వారా కోర్టుకు సమర్పించింది. నిబంధనల ప్రకారమే నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తున్నామని... వ్యవసాయ కూలీలను ఆదుకుంటామని అడ్వకేట్ జనరల్ (ఏజీ) ఆ అఫిడవిట్లో విన్నవించారు. * * ఇస్లామాబాద్ లో జరిగిన సార్క్ హోంమంత్రుల సదస్సుకు భారత జర్నలిస్టులను అనుమతించని పాకిస్తాన్ వారిని కనీసం ప్రవేశ ద్వారం వద్ద కూడా ఉండనివ్వలేదని వెల్లడైంది. సార్క్ దేశాల ప్రముఖులను పాక్ హోంమంత్రి నిసార్ ప్రవేశ ద్వారం వద్ద ఆహ్వానిస్తున్నపుడు భారత జర్నలిస్టులు అక్కడే ఉన్నారు. భారత హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ రాగానే పాక్ జర్నలిస్టులు ఫోటోలు తీసేందుకు సన్నద్ధమవుతుండగా వీరూ వెళ్లారు. అయితే అక్కడ నుండి వెళ్లిపోవాలని, గేటు బయట నిలబడేందుకూ కూడా భారత్ జర్నలిస్టులకు అనుమతి లేదని పాక్ అధికారులు తేల్చి చెప్పారు. * * నేడు ఆగష్టు 6న తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జయంతి * * ఇవాళ ఇస్రో, తెలంగాణ ఇరిగేషన్ శాఖ మధ్య ఎంవోయూ అత్యాధునిక టెక్నాలజీతో తెలంగాణ జలవనరుల సమాచార వ్యవస్థ జలాశయాల్లో నీటి నిల్వలను ఉపగ్రహంతో విశ్లేషించనున్న తెలంగాణ * * శంషాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో శనివారం ఉన్నతాధికారులు హైఅలెర్ట్ ప్రకటించారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకులు నేపథ్యంలో నిఘా వర్గాలు ఎయిర్ పోర్టు అధికారులను అప్రమత్తం చేశారు. * * పెబ్బేరు(మహబూబ్‌నగర్): రైతులు పెట్టిన విషం గుళికలు తిని దాదాపు 40 జింకలు చనిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొందరు రైతులు కృష్ణా నదిలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. పంటను పురుగుల బారి నుంచి రక్షించుకునేందుకు మొదళ్ల వద్ద శుక్రవారం రాత్రి విషం గుళికలను చల్లారు. సమీపంలోని అటవీప్రాంతం నుంచి వచ్చిన జింకలు గడ్డి మేసుకుంటూ వచ్చి గడ్డితోపాటు గుళికలను కూడా తినేశాయి. దీంతో అ విష ప్రభావానికి లోనై దాదాపు నలబై జింకలు చనిపోయాయి. * * వాయువ్య బంగాళఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఉ.ఒడిశా, ప.బెంగాల్, జార్ఖండ్ తీరాలను ఆనుకుని అల్పపీడనం అల్పపీడన ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఒడిశా, కోస్తాంధ్ర మీదుగా ద.తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కోస్తా తీరం వెంబడి గంటకు 45-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక: వాతావరణ కేంద్రం * * మ్మం: ఛత్తీస్‌గఢ్ దంతేవాడ జిల్లాలో శుక్రవారం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. దంతేవాడ - బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన సర్సఫాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఆ విషయాన్ని పసిగట్టిన మావోయిస్టులు... పోలీసులపై కాల్పులకు దిగారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులకు దిగారు. * * ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లెందులోని ఓపెన్‌కాస్టు సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇల్లెందు పట్టణంలోని ప్రధాన రహదారిపై అధిక వేగంతో వెళ్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ లారీ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోగా మరో లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. * * కరీంనగర్ : ఎస్సీ వర్గీకరణ బిల్లు వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అందులోభాగంగా శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైల్వేస్టేషన్లో వారు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్లో ఆగి ఉన్న సింగరేణి ప్యాసింజర్ రైలును వారు నిలిపివేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో భారీగా ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. * * హైదరాబాద్: ఈ నెల 8 నుంచి తెలంగాణలోని 11 విశ్వవిద్యాలయాల్లో నిరవధికంగా బంద్ పాటించనున్నట్లు తెలంగాణ వర్సిటీ నాన్ టీచింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కంచి మనోహర్, సెక్రెటరీ జనరల్ మహిపాల్ రెడ్డి బుధవారం పేర్కొన్నారు. రాష్ట్ర్రంలో అతిపెద్దదై ఉస్మానియాతో పాటు ఇతర వర్సిటీల్లో ప్రతి నెల 1న వేతనాలు, ఫించన్లు రావడం లేదన్నారు. సీమాంధ్రుల పాలనలో కూడా వేతనాలకు ఇలాంటి దుస్థితి ఎన్నడూ ఏర్పడలేదన్నారు. * * హైదరాబాద్: ప్రత్యేక హైకోర్టు ఉద్యమంలో పాల్గొన్న న్యాయవాదులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు నోటీసులివ్వడానికి నిరసనగా గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయాలని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నిర్ణయించింది. జేఏసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి నేతృత్వంలో న్యాయవాదులు బుధవారం సమావేశమయ్యారు. * * వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 48 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు... అలాగే తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. * * కరీంనగర్: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కాన్వాయ్‌కి బుధవారం తృటిలో ప్రమాదం తప్పింది. కాన్వాయ్‌లోని ఓ వాహన డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేయడంతో వెనకున్న టీఆర్‌ఎస్ నాయకుల వాహనాలు ఒకదానివెంట మరొకటి వరసగా ఢీకొన్నాయి. దీంతో సదరు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి ఈటల రాజేందర్ బుధవారం మెట్‌పల్లి వచ్చారు. * * కరీంనగర్(ముకరంపుర): జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ప్రభుత్వ నిర్ణయం ఊరటనిచ్చింది. పదేళ్లుగా కీలకంగా పనిచేస్తున్న ఫీల్డ్‌అసిస్టెంట్లను రెగ్యులరైజ్‌ చేయాలని, వేతనాలు పెంచాలన్న డిమాండ్‌తో చేపట్టిన ఆందోళనలకు సర్కార్‌ ఎట్టకేలకు దిగివచ్చింది. ప్రస్తుతం నెలవారీగా ఇస్తున్న వేతనం రూ.6240నుంచి రూ.10 వేలకు పెంచింది. * * మణుగూరు :ఖమ్మం జిల్లా మణుగూరు సమీపంలో మంగళవారం స్కూలు బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. విప్పల సింగారం నుంచి జీఎం ఆఫీసు రోడ్డులో వస్తున్న హోలీ ఫ్యామిలీ స్కూల్ బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోయి... అదుపుతప్పి బస్సు కాల్వలోకి దూసుకెళ్ల్లింది. అందులోని ఐదుగురు విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. * * చండీగఢ్: వాళ్లంతా దివ్యాంగులు. కొందరికి చూపులేదు, ఇంకొందరు బుద్ధిమాంద్యులు.. అందరూ చిన్నపిల్లలే. అంతసేపు హాయిగా ఆడుకున్నవాళ్లుకాస్తా మధ్యాహ్నం భోజనం తిన్నతర్వాత వాంతులు చేసుకోవడం మొదలుపెట్టారు. నిమిషాల్లోనే పరిస్థితి చేయిదాటిపోయింది. పిల్లలు ఒకొక్కరిగా రాలిపోయారు. పంజాబ్ లోని కపుర్తలా జిల్లా కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం కనిపించిన దృశ్యాలివి. * * పురవి: వరంగల్‌ జిల్లా పురవి మండల కేంద్రంలో ఉన్న ఆంధ్రాబ్యాంకులో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. రాత్రి సమయంలో బ్యాంకు తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దుండగులు కౌంటర్‌ గదిలో సీసీ కెమెరాలను కత్తిరించారు. సోమవారం ఉదయం సిబ్బంది బ్యాంకును తెరవడంతో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పురవి సీఐ శ్రీనివాస్‌, ఎస్సై రామకృష్ణ అక్కడకు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. * * నేడు ఎంసెట్-3 షెడ్యూల్ విడుదల చేసే అవకాశం జేఎన్టీయూ వీసీ లేదా రిజిస్ట్రార్కు కన్వీనర్ బాధ్యతలు ఎంసెట్-2 విద్యార్థులకు పాత రిజిస్ట్రేషన్ పై కొత్త హాల్టికెట్లు * * ఇవాళ ప్రారంభంకానున్న రూపాయికే నల్లా కనెక్షన్ పథకం గ్రేటర్ హైదరాబాద్లో పేదలకు రూపాయికే వాటర్ కనెక్షన్ * * వరంగల్: వరంగల్ జిల్లా ధర్మాసాగర్ జలాశయంలో ఆదివారం గల్లంతైన కానిస్టేబుల్ పొలిమారి సృజన్(25)మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు. ఆదివారం మిత్రులతో కలిసి ఈతకు వెళ్లిన సృజన్ ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. * * మహారాష్ట్ర: పుణెలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిపోవడంతో తొమ్మిది మంది కార్మికులు మృతిచెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు యత్నిస్తున్నారు. * * వరంగల్ : వరంగల్ నగరంలోని ఆర్టీఏ జంక్షన్లో బస్సు... ముందు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను నగరంలోని ఆసుపత్రికి తరలించారు. * * హైదరాబాద్ : ఎంసెట్ - 2 పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ... మంత్రులు కడియం, లక్ష్మారెడ్డి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. శుక్రవారం మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి విద్యార్థి సంఘాలు యత్నించాయి. ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. * * న్యూఢిల్లీ: పార్లమెంటులో ఓ కోతి హల్ చల్ చేసింది. అరగంటపాటు అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది. దాన్ని బందించేందుకు ప్రయత్నం చేసిన చివరకు వారికి దొరకకుండా దానంతట అదే దర్జాగా ప్రధాన ద్వారం గుండా బయటకు వెళ్లింది. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం ఎంపీలు, జర్నలిస్టులు చదువుకునేందుకు ఏర్పాటుచేసిన పార్లమెంటు రీడింగ్ హాల్ లోకి ఓ కోతి ప్రవేశించింది. * * కరీంనగర్‌: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో ఏఈకికు రెండేళ్ల జైలుశిక్ష, రూ.పదివేల జరిమానా విధిస్తూ బుధవారం ఏసీబీ కోర్టు తీర్పు వెలువరిచింది. 2008లో గంగాధరలో విద్యుత్‌ శాఖ ఏఈగా పనిచేస్తున్న బండారు అజయ్‌కుమార్‌ గంగాధరకు చెందిన అంకం శంకరయ్య అనే పవర్‌లూం కార్మికుడికి విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు అదే ఏడాది జనవరి 18న రూ.6వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. * * వరంగల్ : వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా కేసముద్రం మండలం రాజీవ్ నగర్ తండా సమీపంలో గురువారం చోటుచేసుకుంది. తండా నుంచి కేసముద్రం వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో.. కారు నడుపుతున్న రమేష్ పండిట్ రాథోడ్ (42) అక్కడికక్కడే మృతి చెందాడు. * * హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన కేసు విచారణను డివిజన్ బెంచ్ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. హైకోర్టు విభజనపై తెలంగాణ ప్రభుత్వ రివ్యూ పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది. హైదరాబాద్లోనే రెండు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయాలని టీ.సర్కార్ తన పిటిషన్లో కోరింది. గత తీర్పును పునసమీక్షించాలన్న పిటిషన్పై తీర్పును ఉమ్మడి హైకోర్టు రిజర్వ్లో ఉంచిన విషయం తెలిసిందే. దాంతో కేసును విచారించిన డివిజన్ బెంచ్.. తాను తీర్పును ప్రకటించలేనని, విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు ప్రకటన * * నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం కోమలంచ గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భూమా రమేశ్ (35) అనే రైతు కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. పొలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు ఫ్యూజు అమరుస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గ్రామస్తుల సహాయంతో అతడి మృతదేహాన్ని ఇంటికి తరలించారు. * * కరీంనగర్: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం జిల్లెల క్రాసింగ్ వద్ద ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిమ్మాపూర్ మండలానికి చెందిన మహ్మద్ రిజ్వాన్ (32) అక్కడికక్కడే మృతిచెందగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడ్ని సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. * * తిమ్మాపూర్‌ : రవాణాశాఖకు సంబంధించిన ఆన్‌లైన్‌ సేవలపై మీ సేవా కేంద్రాలు, ఈ సేవా కేంద్రాల నిర్వాహకులు, ఉద్యోగులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు కరీంనగర్‌ డీటీసీ వినోద్‌కుమార్‌ తెలిపారు. రోజుకు మూడు బ్యాచ్‌ల చొప్పున జిల్లాలోని నిర్వాహకులకు బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఆన్‌లైన్‌ సేవలకు దరఖాస్తు చేసుకునే వి«ధానం నేర్చుకునేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. * * హైదరాబాద్ : హెచ్ఎండీఏ పనులపై ఉన్నతాధికారులతో నేడు కేటీఆర్ భేటీ. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, సుందరీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష * * హైదరాబాద్ : నేడు, రేపు ఏఎఫ్ఆర్సీ భేటీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరహాలో వైద్య ఫీజుల పెంపుపై చర్చ * * కీసర : రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాలలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కమాన్ వద్ద పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోలో తరలిస్తున్న 9 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోతోపాటు ఎస్కార్ట్గా బైకుపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. * * నారాయణపేట: అన్నం పెట్టే రైతులపై దాడి చేసిన ఏ ప్రభుత్వం నిలబడలేదని, మల్లన్న సాగర్ నిర్వాసితులపై లాఠీచార్జి జరిపించిన కేసీఆర్ ప్రభుత్వానికి పోయేకాలం దాపురించిందని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం అప్పంపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. * * మెదక్‌: మల్లన్నసాగర్‌ నిర్వాసితులపై ఆదివారం జరిగిన పోలీసుల లాఠీచార్జీకి నిరసనగా అఖిలపక్షం ఈరోజు మెదక్‌ జిల్లా బంద్‌ చేపట్టింది. ఉదయాన్నే కాంగ్రెస్‌, తెదేపా, భాజపా, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన నేతలు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై నేతలు మండిపడ్డారు. జనజీవనంపై బంద్‌ ప్రభావం పాక్షికంగా ఉంది. చాలా చోట్ల ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. బంద్‌ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. * * హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో జాతీయ రహదారిపై ఏబీవీపీ రాస్తారోకో చేపట్టింది. ఎన్నికల సందర్భంగా తెరాస ఇచ్చిన కేజీ టు పీజీ ఉచిత విద్య హామీని వెంటనే నెరవేర్చాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళనతో జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. * * లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రైలుప్రమాదం సంభవించింది. భదోహిలో కాపలా లేని రైల్వేగేట్‌ వద్ద ఈరోజు ఉదయం పట్టాలు దాటుతున్న స్కూల్‌ బస్సును రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 19 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. * * విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఛత్తీస్గఢ్ నుంచి తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయిని చెప్పింది. తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. * * ఇబ్రహీంపట్నం: కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్‌లోని ఆలయంలో చోరీ జరిగింది. స్థానిక పెద్దమ్మ ఆలయంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి అమ్మవారి నగలను అపహరించుకు పోయారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. నాలుగు తులాల బంగారు ఆభరణాలతో పాటు వెండి సామాగ్రి చోరీకి గురైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. * * తాండూరు : రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా తాండూరు - వికారాబాద్‌ల మధ్యలో ఉన్న కందమెల్లి వాగు పొంగిపొర్లుతుంది. దాంతో తాండూరు - హైదరాబాద్‌ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గురువారం అర్ధరాత్రి నుంచి వాగు పొంగిపొర్లుతుంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. * * నల్లగొండ: స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఆటో ఢీకొన్ని చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కేతెబోయిన కావ్య (3) ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో కావ్య తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. * * కరీంనగర్‌ క్రైం: బెజ్జంకి ఏఎస్సై వహిద్‌ పాషాపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ ఎస్పీ జోయల్‌డేవిస్‌ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని పేర్కొంటూ బెజ్జంకి పీఎస్‌లో పనిచేస్తున్న ఓ మహిళ హోంగార్డ్‌ ఫిర్యాదుచేసింది. ఈమేరకు విచారించిన ఎస్పీ వాహిద్‌ పాషాను సస్పెండ్‌చేశారు. * * కరీంనగర్‌ జిల్లా మద్యం డిపో పరిధిలో ఉన్న 41 మద్యం దుకాణాలు, 5 బార్లను మెదక్‌ జిల్లా సిద్దిపేటలో కొత్తగా ప్రారంభంకానున్న మద్యం డిపోకు బదిలీచేస్తూ బుధవారం రాత్రి ఎకైసజ్‌శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గంభీరావుపేట మండలం పరిధిలోని 9 దుకాణాలు, సిరిసిల్ల ఎకై ్సజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని 15 మద్యం దుకాణాలు, 3 బార్లు, వేములవాడ ఎకై ్సజ్‌ ఠాణా పరిధిలోని 17 మద్యం దుకాణాలు, 2 బార్లను బదిలీ చేశారు. ఆగస్టు 1 నుంచి వీటికి సిద్దిపేట డిపో నుంచి మద్యం సరఫరా చేస్తారు. ఈ మేరకు జగిత్యాల ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌క * * జమ్ము: అమర్నాథ్ యాత్రకు వెళుతున్న యాత్రికులకు కష్టాలు కొనసాగుతునే ఉన్నాయి. జమ్మూకశ్మీర్ లో అశాంతికర పరిస్థితుల నేపథ్యంలో మరోసారి యాత్రికులను అధికారులు అడుగు కూడా వేయనివ్వడం లేదు. * * సిరిసిల్ల: సిరిసిల్ల మండలం సర్ధాపూర్‌ శివారులో 7వ పోలీస్‌ బెటాలియన్‌ ఏర్పాటుకు 120 ఎకరాల భూమిని కేటాయించారు. ఈమేరకు సిరిసిల్ల ఆర్డీవో ఆఫీస్‌లో సోమవారం డివిజన్‌ సర్వేయర్‌ శ్రీనివాస్‌తో సంబంధించిన హద్దులను నిర్ధారించారు. ఇప్పటికే పోలీస్‌ బెటాలియన్‌ కోసం 120 ఎకరాల స్థలాన్ని శాటిలైట్‌ ద్వారా సర్వే నిర్వహించి కేటాయించారు. క్షేత్రస్థాయిలో భూమి కేటాయింపులను కలెక్టర్‌ నీతుప్రసాద్‌ పరిశీలించారు. * * పార్లమెంట్లో మోదీ, రాజ్‌నాథ్, జైట్లీతో విడివిడిగా భేటీకానున్న కేసీఆర్ * * ఢిల్లీ: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు పార్లమెంటు ముందుకు రానున్న 16 బిల్లులు వచ్చే నెల 12 వరకు జరగనున్న వర్షాకాల సమావేశాలు * * వరంగల్: బైక్ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలోని నార్లాపూర్ వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. మేడారానికి చెందిన సిద్ధబోయిన ఆనందరావు (35) బైక్ పై వెళ్తుండగా.. నార్లాపూర్ వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆనందరావు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. * * కరీంనగర్: ఆలయంలోకి చొరబడిన దుండగులు స్వామివారి విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేటలో శనివారం వెలుగు చూసింది. గ్రామ శివారులోని సీతారామ ఆలయంలో ఉన్న స్వామివారి విగ్రహాన్ని గత రాత్రి కొందరు దుండగులు ధ్వంసం చేశారు. శనివారం ఉదయం ఆ విషయాన్ని గమనించిన స్థానికులు 63వ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. * * తిమ్మాపూర్ (కరీంనగర్) : పురుగులమందు తాగి భార్యాభర్తలు మృతిచెందిన సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గురువారం చోటుచేసుకుంది. కాల్వ శ్రీరాంపుర్ మండలానికి చెందిన ప్రభాకర్(37), తేజస్వి(34) దంపతులు కరీంనగర్‌లోని మారుతీనగర్‌లో నివాసముంటూ.. బంగారం పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో గురువారం తిమ్మాపూర్‌కు వెళ్లిన దంపతులు ఆలయ సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. * * హైదరాబాద్: వీధి కుక్కల దాడిలో నలుగురు చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన హైదరాబాద్ లోని ఎల్బీనగర్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న చిన్నారుల పై వీధికుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు కాగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు కుక్కలను తరిమికొట్టి చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. * * కరీంనగర్ జిల్లా జమ్మికుంట్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తి ధర క్వింటాలుకు రిఆకర్డుస్థాయిలో రూ.6,470 పలికింది. దాంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంట దిగుబడి తగ్గినందువల్ల ధర పెరిగిందని రైతులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం ఈ ధర పలికిందని వారంటున్నారు. * * హైదరాబాద్: ప్రైవేటు విద్యాసంస్థల దోపడీ విధానాన్ని వ్యతిరేకిస్తూ గురువారం తెలంగాణ విద్యాసంస్థల బంద్‌ కొనసాగుతుంది. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్‌ కొనసాగతుంది. ఈ సందర్భంగా విద్యా రంగంలో ప్రైవేటు విద్య నానాటికీ పెరిగిపోతోందని, అది సామాన్యుడికి అందుబాటులో లేదని సంఘాలు ఆరోపించాయి. విద్యారంగంలో ప్రభుత్వ ప్రాధాన్యాన్ని బలోపేతం చేయాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీ అమలు చేయాలని డిమాండ్‌ చేశాయి. * * హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కెన్యాకు చెందిన దంపతుల నుంచి కేజీన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా దుబాయి నుంచి ఈ రోజు ఉదయం హైదరాబాద్ వచ్చిన వీరి వద్ద బంగారం ఉండటాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అయితే వారి వద్ద బంగారానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో దంపతులను అదుపులోకి తీసకుని, బంగారాన్ని సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం.12 లో గురువారం ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంటిని నిర్మించేందుకు రాళ్లను బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * హైదరాబాద్: హైదరాబాద్ కూకట్ పల్లిలో తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆకస్మిక పర్యటన నిర్వహించారు. రోడ్లు, నీటి సరఫరా, బస్టాండ్ తదితర ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. రాత్రి 11 గంటలనుంచి 2:30 గంటల వరకు కేటీఆర్ తనిఖీలు కొనసాగాయి. ఈ సందర్భంగా రోడ్లపై వాననీరు నిల్వ ఉండటం పట్ల జీహెచ్ఎంసీ సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి రమ‍్య మృతికి కారణమైన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు. * * భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కాస్త తగ్గింది. నీటిమట్టం బుధవారం ఉదయం 49.5 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. మంగళవారం సాయంత్రం నీటిమట్టం 52.4 అడుగులకు చేరిన విషయం తెలిసిందే. రాత్రికి రాత్రి నీటి మట్టం తగ్గడంతో అధికారులు, ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. * * కేంద్ర ప్రభుత్వ నైపుణ్యం, మెలకువల శిక్షణలో భాగంగా నిరుద్యోగ దళిత యువతకు అడ్వాన్స్‌ కంప్యూటర్‌ హర్డ్‌వేర్‌, కోర్‌ నెట్‌వర్కింగ్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఎంసీపీ ఎడ్యూకేషన్‌ సోసైటీ డైరెక్టర్‌ ఎంఆర్‌ చెన్నప్ప తెలిపారు. డిప్లొమా లేదా బిటెక్‌, పీజీ పూర్తి చేసి, 18 నుంచి 45 లోపు వయసున్నవారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు లక్డికాపూల్‌లోని జెన్‌ వొకేషనల్‌ కాలేజీలో ఈ నెల 14న నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు. * * చండీగఢ్‌: ప్రొ కబడ్డీని ఆస్వాదిస్తున్న అభిమానులను అలరించేందుకు మరో మెగా ఈవెంట్‌ రాబోతోంది. నవంబర్‌ 3న చండీగఢ్‌ వేదికగా ప్రపంచకప్‌ కబడ్డీ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలు 3 నుంచి 17 వరకు జరుగుతాయి. చండీగఢ్‌లోని 14 వేదికల్లో ఈ పోటీలు నిర్వహిస్తామని పంజాబ్‌ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ చెప్పారు. 14 దేశాలు పోటీపడే ఈ ప్రపంచకప్‌లో పురుషులు, మహిళలు విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. పురుషుల విభాగంలో విజేతగా నిలిచిన జట్టుకు రూ.2 కోట్లు, రన్నరప్‌కు రూ.కోటి నగదు బహుమతిగా ఇస్తారు. మహిళల్లో * * కరీంనగర్ : జిల్లావ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. మహదేవ్‌పూర్ మండలంలో పెద్దంపేట, సర్వాయిపేట, వంకెన వాగులు పొంగిపొర్లుతుండడంతో 17 గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ధర్మపురి వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. సింగరేణి రామగుండం రీజియన్‌లో నాలుగు ఓపెన్ కాస్ట్ బొగ్గుపనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. * * హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు మంగళవారం ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి కోల్కతా వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కోల్కతా వెళ్లే 120మంది ప్రయాణికులు ఉదయం అయిదు గంటల నుంచి పడిగాపులు పడుతున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా విమానాల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులు గంటల కొద్ది విమానాశ్రయంలో తిప్పలు పడాల్సి వస్తున్న విషయం తెలిసిందే. * * హైదరాబాద్ : హైదరాబాద్లోని నాగ్పూర్ జాతీయ రహదారిపరై ఆర్టీఏ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఏడు ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేశారు. అలాగే సరైన పత్రాలు లేని రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. * * హైదరాబాద్ : నగరంలోని గోల్కొండ సక్కుబాయినగర్ ప్రాంతంలో మంగళవారం మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సదరు మహిళను దుండగులు అత్యాచారం చేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పరిసర ప్రాంతాల్లోని స్థానికులను పోలీసులు విచారిస్తున్నారు. * * హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం ఓ విమానాన్ని ఎయిర్ పోర్ట్ అధికారులు అత్యవసరంగా ల్యాండ్ చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి సౌదీ అరేబియా బయల్దేరిన విమానంలో ఓ ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఆ ప్రయాణికుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. * * హైదరాబాద్ సిటీ : డీసీఎం వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 22.45 క్వింటాళ్ల గంజాయిని హయాత్‌నగర్ పోలీసులు సోమవారం ఉదయం పట్టుకున్నారు. ఈ సంధర్భంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి నగరానికి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ముందస్తు సమాచారంతో హయాత్‌నగర్ పోలీసులు అబ్దుల్లామెట్ వద్ద కాపు కాశారు. గంజాయి లోడుతో వచ్చిన డీసీఎం వ్యానును ఆపి అందులోని 22.45 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంధర్భంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. * * సికింద్రాబాద్ : నగరంలోని తుకారంగేటు పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్తీలో సోమవారం ఉదయం చిన్న గొడవ జరగడంతో ఆగ్రహించిన మల్లేష్ అనే వ్యక్తి చంద్రకళ అనే మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ప్రయత్నించి మంటలను ఆర్పారు. అప్పటికే ఆమె శరీరం చాలావరకూ కాలిపోయింది. వెంటనే ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మల్లేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. చంద్రకళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. * * కరాచి: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ సిరీస్ నిర్వహణకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ మేరకు ఇరు క్రికెట్ బోర్డుల మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. ఎడిన్‌బర్గ్‌లో ఐసీసీ సభ్య దేశాల సమావేశం సందర్భంగా పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్, బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ముఖాముఖి సిరీస్ గురించి చర్చించినట్లు తెలిసింది. రెండు దేశాల ప్రభుత్వాల అనుమతి లభిస్తే ఈ సీజన్‌లోనే తటస్థ వేదికల్లో సిరీస్ నిర్వహించాలని బోర్డు పెద్దలు యోచిస్తున్నారు. * * హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా పి.సర్దార్‌సింగ్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మెదక్‌జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన ఈయన గతంలో మహారాష్ట్రలోని మహాత్మగాంధీ అంతరాష్ట్రీయ విశ్వవిద్యాలయంలో ఫైనాన్స్‌ ఆఫీసర్‌గా, జాయింట్‌ రిజిస్ట్రార్‌, డిప్యూటీ రిజిస్ట్రార్‌గా పనిచేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఇందిర కళా సంగీత విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌గా సేవలందించారు. * * దామరచర్ల: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం ఇర్కిగూడెం వద్ద కృష్ణాతీరంలో పార్వతీదేవి ఆలయ నిర్మాణానికి గాను తవ్వకాలు నిర్వహిస్తుండగా పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది. కృష్ణానదీ తీరంలో పార్వతీదేవి ఆలయ నిర్మాణానికి తెలంగాణ సర్కార్ రూ. 5లక్షలు మంజూరు చేసింది. దాంతో ఈ రోజు ఉదయం నిర్మాణ పనులు ప్రారంభించారు. * * నల్లగొండ: నల్లగొండ జిల్లాలో శుక్రవారం రాత్రి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఓ వ్యక్తి నుంచి రూ.6.30 లక్షలను దొంగలు దోచుకెళ్లిన ఘటన వేములపల్లి మండలం అన్నపురెడ్డిగూడెంలో చోటుచేసుకుంది. స్థానిక పెట్రోల్ బంక్లో క్యాషియర్గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి శుక్రవారం రాత్రి క్యాష్ తీసుకుని ఇంటికెళ్తుండగా దొంగలు దాడికి పాల్పడ్డారు. వెంకటేశ్వర్లును తీవ్రంగా గాయపరచిన దొంగలు అతని వద్ద ఉన్న రూ.6.30 లక్షలను తీసుకుని ఉడాయించారు. దీంతో బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు * * కరీంనగర్ : నేదునూరులో జెన్కో పవర్ప్లాంట్ పనులు వెంటనే చేపట్టి నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. లేకుంటే భూములును తిరిగి రైతులకు అప్పగించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. గురువారం కోదండరామ్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరులో జెన్కో పవర్ ప్లాంట్ కోసం సేకరించిన భూములను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక రైతులతో కోదండరామ్ సమావేశమయ్యారు. * * మేడ్చల్: ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ.. ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మేడ్చల్ చెక్‌పోస్ట్ వద్ద శుక్రవారం జరిగింది. చెక్‌పోస్ట్ వద్ద ఉన్న సెల్‌టవర్ ఎక్కిన యువకుడు తన ప్రియురాలితో పెళ్లి జరిపించాలని లేకపోతే ఇక్కడి నుంచి దూకేస్తానని బెదిరిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతన్ని కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. * * హైదరాబాద్: జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ స్ప్రింట్స్‌లో తెలంగాణ కుర్రాడు అబ్దుల్ నజీబ్ ఖురేషీ మెరిశాడు. గురువారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన 100 మీటర్ల పరుగులో నజీబ్ రజత పతకం గెలుచుకున్నాడు. 10.63 సెకన్లతో అతను రెండో స్థానంలో నిలిచాడు. షమీర్ మోన్ (మణిపూర్-10.60 సె.) స్వర్ణ పతకం సాధించగా, అనిరుధ గుంజాయ్ (మహారాష్ట్ర-10.66 సె.)కు కాంస్యం దక్కింది. * * హైదరాబాద్ : తెలంగాణ అడ్వకేట్ల మహాధర్నా ఇందిరాపార్క్ వద్ద శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఈ మహాధర్నాలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా అడ్వకేట్లు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అయితే ఈ ధర్నాలో పాల్గొనేందుకు వెయ్యి మంది అడ్వకేట్లకు మాత్రమే అనుమతి ఉందని పోలీసులు తెలిపారు. ఈ మహాధర్నా నేటి సాయంత్రం 4.30 గంటలకు ముగియనుంది. * * రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండల పరిధిలోని జవహర్‌నగర్‌ సీఆర్‌పీఎఫ్‌ గ్రూప్‌ సెంటర్‌లో జులై 1వ తేదీ నుంచి నిర్వహించనున్న మినిస్టీరియల్‌ హెడ్‌కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 27 వేల మంది హాజరవుతారు. జవహర్‌నగర్‌ గ్రూప్‌ సెంటర్‌కు వచ్చే అభ్యర్థులకు ప్రత్యేకంగా బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు సీఆర్‌పీఎఫ్‌ డీఐజీపీ జి.వి.ఎన్‌.గిరిప్రసాద్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ 10వ నంబర * * హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగుల విభజనపై ఏర్పాటుచేసిన కమల్నాథన్ కమిటీ గురువారం మరోసారి సమావేశమైంది. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ఉద్యోగుల విభజన అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది. * * ఖమ్మం: ఎగువ నుంచి వస్తున్న వరదతో ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 9 అడుగులకు చేరుకుంది. అశ్వారావుపేట వద్ద పెద్దవాగు ప్రాజెక్టు నిండింది. దీంతో రెండు గేట్లు ఎత్తి 14,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే, అశ్వాపురం మండలంలో విడువని వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కిన్నెరసాని ప్రాజెక్టు కూడా జలకళను సంతరించుకుంది. కొత్తగూడెం, మణుగూరు, సత్తుపల్లిల్లోని ఓపెన్‌కాస్ట్ గనుల్లో వర్షం కారణంగా ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. * * హైదరాబాద్‌: నగరంలోని హుమాయన్‌నగర్‌లో విషాదం నెలకొంది. ఐదేళ్ల చిన్నారి ఆడుకుంటూ విద్యుత్‌ తీగ తగిలి మృతి చెందింది. శ్రీకాకుళంకు చెందిన హరిత భర్త చనిపోవడంతో కుమార్తె తనుజతో పాటు నగరానికి వచ్చి హుమాయన్‌ నగర్‌లో ఉంటోంది. తనుజ తల్లితో వెళ్తుండగా తెగిపడిన విద్యుత్‌ తీగ తగిలి అక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు బాలికను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. * * నల్లగొండ: ఎగువ నుంచి వస్తున్న మూసీ వరదతో నల్లగొండ జిల్లా భువనగిరి-పోచంపల్లి మధ్య మంగళవారం ఉదయం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఆ మార్గంలో ఉన్న బీబీనగర్ మండలం బట్టుగూడెం వంతెనపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. * * హైదరాబాద్: ఏఐసీసీ పరిశీలకుడు శ్రీనివాసన్ నేతృత్వంలో గాంధీభవన్లో కాంగ్రెస్ వర్క్షాప్ సోమవారం ప్రారంభమైంది. ఈ వర్క్షాప్లో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, నేతల వలసలను అడ్డుకోవడంతో పాటు ప్రచార కార్యక్రమాలపై నేతలు ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ముఖ్యనేతలు హాజరయ్యారు. * * బూర్గంపాడు: అప్పుల బాధ తాళలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గాదె సైదిరెడ్డి(41) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత రెండేళ్లుగా పంట దిగుబడి సరిగ్గా లేకపోవడంతో.. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోయాయి. అప్పులు తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. * * మిర్యాలగూడ: ముందు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వస్తున్న క్రేన్ ఢీకొట్టిన ఘటనలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం జస్తి వీరప్పగూడెం పరిధిలోని భల్లునాయక్‌తాండాలో సోమవారం చోటుచేసుకుంది. తాండా నుంచి మిర్యాలగూడ వెళ్తున్న ఆటోను బావులు తీయడానికి ఉపయోగించే క్రేన్ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న 8 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు 108 సాయంతో వారిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. * * రామడుగు: ఆర్టీసీ బస్సు చార్జీలు, విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ శనివారం కాంగ్రెస్‌ నాయకులు రామడుగులో ధర్నా నిర్వహించారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు అంజనేయులు గౌడ్‌, శంకర్‌, శ్రీనివాసగౌడ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు. * * జగిత్యాల(కరీంనగర్) : పలు దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉంటూ తప్పించుకు తిరుగుతున్న ఓ పాత నేరస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 20 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ. 2వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజేంద్రప్రసాద్ వివరాలు వెల్లడించారు. * * హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీ పీసీసీ శనివారం నిరసన కార్యక్రమాలకు దిగింది. అందులో భాగంగా హైదరాబాద్ విద్యుత్ సౌధ కార్యాలయాన్ని కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. రోడ్డుపై బైఠాయించి, పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పాడడంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, శ్రీశైలం గౌడ్, ఇతర నేత * * యాదాద్రి జిల్లా: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవాలయం పేరుతో యాదాద్రి జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగా భువనగిరి జిల్లా కేంద్రంగా యాదాద్రిని పేరుతో జిల్లా ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. * * యాదాద్రి జిల్లా: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవాలయం పేరుతో యాదాద్రి జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగా భువనగిరి జిల్లా కేంద్రంగా యాదాద్రిని పేరుతో జిల్లా ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. * * కరీంనగర్‌ విద్యా విభాగం : జిల్లాలో జరుగుతున్న ఎస్సెస్సీ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షల్లో భాగంగా గురువారం జరిగిన సామాన్యశాస్త్రం పేపర్‌-1లో మాల్‌ప్రాక్టీసుకు పాల్పడుతున్న ముగ్గురు విద్యార్థులను డిబార్‌ చేశారు. మొత్తం 42 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఈపరీక్షకు మొత్తం 3962 మంది హాజరుకావాల్సి ఉండగా, 3379 మంది హజరైనట్లు డీఈవో శ్రీనివాస చారి తెలిపారు. * * హైదరాబాద్ : ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దందాను అరికట్టాలంటూ వివిధ విద్యార్థి సంఘాల వారు గురువారం ఆందోళనలు చేపట్టారు. బోడుప్పల్‌లోని భాష్యం స్కూల్‌తోపాటు శంషాబాద్‌లోని ఎస్సార్ డీజీ స్కూల్ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ సంఘాల ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందిపెట్టేలా ఉన్న ఫీజుల మోతను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. * * హైదరాబాద్ : రంగారెడ్డి మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలో ఉన్న అనాథ బాలల ఆశ్రమం కృషిహోంలో ఉండే ఇద్దరు బాలురు కనిపించకుండాపోయారు. అనాథ గృహంలో ఆశ్రయం పొందుతున్న ఎన్.సాయిలు(13), మహేష్(10) అనే బాలురు బుధవారం ఉదయం టిఫిన్ చేసిన అనంతరం నుంచి కనిపించకుండా పోయారు. దీంతో నిర్వాహకులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవటంతో రాత్రి పోలీసులను ఆశ్రయించారు. కృషిహోం ట్యూటర్ ఎండీ సుమేర్ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. * * రెంజల్(నిజామాబాద్) : నిజామాబాద్ జిల్లా రెంజల్‌లో వేటగాళ్ల తుపాకీ తూటాకు జాతీయ జంతువు జింక బలైంది. రెంజల్ మండలం తాడిబిలోలి గ్రామ సమీపంలో బుధవారం రాత్రి గురు తెలియని వ్యక్తులు జింకను కాల్చి చంపారు. గురువారం ఉదయం జింక కళేబరాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఎస్సై ప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. జింకను వేటగాళ్లే చంపి ఉంటారని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. * * హైదరాబాద్: న్యాయమైన పరిహారం ఆందోళన చేస్తున్న మల్లన్నసాగర్ ముంపు బాధితులకు బీజేపీ మద్దతు తెలపనుంది. బుధవారం సాయంత్రం తొగుట మండలం ఏటిగడ్డకిష్టాపూర్, వేములగట్టు గ్రామాల్లో ఆ పార్టీ నాయకులు ధర్నా చేపట్టనున్నారు. ఈ ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్తోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు. ప్రాజెక్టు ముంపు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తగినంత సాయం అందించాలని బీజేపీ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేయనున్నారు. * * ధారూర్ : రంగారెడ్డి జిల్లా ధారూర్ మండలంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఎడతేరపి లేకుండా వాన కురుస్తుంది. దీంతో జిల్లాలోనే కొటిపల్లి జలాశయం నీటి మట్టం ఒక్క రోజులోనే ఏడడుగులు పెరిగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 24 అడుగులు కాగా మంగళవారం ఉదయం 5 అడుగుల నీరు మాత్రమే ఉంది. రాత్రి కురిసిన వర్షానికి 12 అడుగులకు చేరుకుంది. ధారూర్ మండల కేంద్రంలో 72.50 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. ఈ నీరుతో పంట సాగు చేసుకోవచ్చని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. * *
bottomleft17.jpg
middletop7.gif

తాజావార్తలు

ఏపీ మంత్రి నారాయణ కుమారుడి మృతి

10/05/2017: హైదరాబాద్: ఏపీ మంత్రి నారాయణ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నగరంలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రి నారాయణ కుమారుడు నిశిత్‌ నారాయణతో పాటు మరోవ్యక్తి మృతిచెందారు. స్నేహితుడు రాజా రవివర్మతో కలిసి నిశిత్ బెంజ్ కారులో వెళ్తుండగా, జూబ్లీహిల్స్ రోడ్డు నెం.36లో వీరి వాహనం మెట్రో పిల్లర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిశిత్ నారాయణతో పాటు ఆయన స్నేహితుడు రాజా రవివర్మ మృతిచెందాడు. డ్రైవింగ్‌ సీట్లో ఉన్న నిశిత్ అక్కడికక్కడే మృతిచెందగా, రవివర్మను ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. నిశిత్, రవివర్మ మృతదేహాలను అపోలో ఆస్పత్రికి తరలించారు. విషాదవార్త విన్న మంత్రి నారాయణ బంధువులు అపోలోకు చేరుకుంటున్నారు. నిశిత్ ప్రయాణించిన బెంజ్ కారు నెంబర్ టీఎస్ 07 ఎఫ్‌కే 7117 అని సమాచారం. ఈ ఏడాదే నారాయణ గ్రూప్స్ డైరెక్టర్‌గా నిశిత్ బాధ్యతలు చేపట్టారు. మరోవైపు నిశిత్ తండ్రి ఏపీ మంత్రి నారాయణ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. వైఎస్ జగన్‌ దిగ్భ్రాంతి ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ నారాయణ మృతిపట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మంత్రి కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రపంచ భారీకాయుడి ఆపరేషన్ సక్సెస్

10/05/2017: ప్రపంచంలోనే భారీ కాయుడైన జువాన్‌ పెడ్రో ఫ్రాంకో(32)కు మెక్సికో వైద్యులు తొలి సర్జరీ విజయవంతంగా పూర్తిచేశారు. ఆపరేషన్‌కు ఫ్రాంకో శరీరం సహకరించడంలో భాగంగా మూడు నెలలుగా పైగా డాక్టర్ల ఇచ్చిన డైట్‌ను తీసుకున్న భారీకాయుడు దాదాపు 175 కిలోల బరువు తగ్గి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీలో భాగంగా మంగళవారం ఫ్రాంకోకు తొలి ఆపరేషన్ చేసినట్లు సర్జన్ జోస్‌ ఆంటోనియో కాస్టానెడా క్రూజ్ తెలిపారు. సర్జరీ పూర్తయింది కానీ అతడి శరీరం ఎలాంటి మార్పులకు లోనవుతుందో గమనించాల్సి ఉంటుందన్నారు. సగం బరువైనా తగ్గాలని నిర్ణయించుకున్న ఫ్రాంకో ఆన్‌లైన్ యాడ్స్ ద్వారా వైద్యులను సంప్రదించాడు. గత నవంబర్‌లో అతడికి బేరియాట్రిక్ సర్జరీ చేయడానికి మెక్సికో జార్డెన్స్‌ దే గ్వాడలుపే డే జపోపాన్‌ వైద్యులు ముందుకొచ్చారు. ఈ జనవరి నుంచి మార్చి నెల వరకూ స్పెషల్ డైట్ ఇచ్చి 175 కిలోలు తగ్గించారు. మే9న ఆపరేషన్ చేస్తామని ముందస్తుగానే చెప్పినట్లుగా జోస్‌ ఆంటోనియో కాస్టానెడా సర్జరీ చేశారు. ఆహారపు అలవాట్ల సమస్యలతో పాటు మానసికంగానూ అతడిని దృఢంగా చేయాలన్నదే తమ ధ్యేయమని లేనిపక్షంలో పరిస్థితుల్లో తేడాలొచ్చే అవకాశం ఉందని డాక్టర్లు అంటున్నారు. గత ఆరేళ్లుగా బెడ్డుకే పరిమితమైన ఫ్రాంకో త్వరలో లేచి తిరుగుతాడని ధీమా వ్యక్తంచేశారు. 2007లో 597 కిలోల బరువుతో ప్రపంచంలోనే అతిభారీ కాయుడిగా రికార్డు సృష్టించిన మాన్యుఎల్ యురైబ్ గతేడాది చనిపోయిన తర్వాత పెడ్రో ఫ్రాంకో(595 కిలోలు)లో అంతర్మథనం మొదలైంది. అప్పటినుంచీ తన బరువు తగ్గడంపైనే దృష్టిసారించినట్లు స్వయంగా అతడే పలు ఇంటర్వ్యూలలో చెప్పాడు. ప్రస్తుత సర్జరీ తర్వాత బరువు ఎంతమేరకు తగ్గుతాడో డాక్టర్లు వెల్లడించలేదు.

33 ఏళ్ల తర్వాత బీచ్ కనిపించింది!

09/05/2017: ఐర్లాండ్‌: కాలగర్భంలో కలిసిసోయిందనుకున్న ఓ బీచ్ 33 ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించింది. అదేంటి బీచ్ తప్పిపోయిందా అని షాకవుతున్నారు కదూ.. సాధారణంగా మనుషులు, జంతువులు, పక్షులు ఇలా తప్పిపోవడం మళ్లీ కొన్ని రోజులకో, సంవత్సరాలకో మళ్లీ కనిపించడంతో మనం ఆశ్చర్యపోతుంటాం. అయితే ఐర్లాండ్‌లో 1984లో కనుమరుగైన బీచ్‌ 33 ఏళ్ల తర్వాత కనువిందు చేస్తోంది. పశ్చిమ ఐర్లాండ్‌లోని స్థానిక దూగ్ ఏరియాలో అచిల్ ద్వీపంలో మొత్తం ఆరు బీచ్‌లు ఉండేవి. అయితే 33 ఏళ్ల కిందట వరదలు, తుపానులు రావడంతో ఓ బీచ్ అట్లాంటిక్ మహా సముద్రంలో కలిసిపోయింది. బీచ్‌ తీరంలోని ఇసుక సముద్రంలోకి కొట్టుకుపోవడంతో రాళ్లు మాత్రమే ఇక్కడ మిగిలిపోయి రెండూ ఏకమయ్యామని స్థానికులు చెబుతున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు తీరానికి ఇసుక కొట్టుకవచ్చి సముద్రం, బీచ్‌ వేరు పడ్డాయి. ఈ బీచ్‌ను చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. ఐర్లాండ్ లో అచిలీద్వీపమే అతిపెద్దదని అచిల్ పర్యాటకశాఖ అధికారి సీన్ మోల్లాయ్ తెలిపారు. ఈ ప్రసిద్ధ బీచ్‌లో నాలుగు హోటళ్లు అధిక సంఖ్యలో అతిథిగృహాలు ఉన్నాయని చెప్పారు. ఇదివరకూ ఐదు బ్లూ ఫ్లాగ్ బీచ్‌లుండేవని, ఇప్పుడు వీటి సంఖ్య మళ్లీ ఆరుకు చేరిందని అధికారి హర్షం వ్యక్తంచేశారు. పర్యాటకశాఖ అధికారులు ఈ బీచ్‌ను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నారు.

విజయ్‌ మాల్యాపై సుప్రీంకోర్టు ఆగ్రహం

09/05/2017: న్యూఢిల్లీ: ఆస్తుల బదలాయింపుల కేసులో పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్యాకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయన జూలై 10న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాకుండా మాల్యా వ్యవహార శైలిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సమన్లు జారీ చేసింది. ఇంతకు ముందే ఆస్తుల వివరాలను వెల్లడించాలని ఆయనను ఆదేశించినా స్పందించకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఒకవేళ మ్యాలా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాకపోతే ఆయనకు ఆరు నెలలపాటు శిక్ష పడే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే అనేక కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న మాల్యాకు న్యాయస్థానం తాజా ఆదేశాలతో ఆయన చుట్టు ఉచ్చు బిగుస్తోంది. మాల్యా ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. కాగా ఉద్దేశపూర్వక రుణ ఎగవేతపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని అలాగే డియోజీయో సంస్థ నుంచి పొందిన 40 మిలియన్‌ డాలర్లను డిపాజిట్‌ చేసేలా ఆయనపై చర్యలు తీసుకోవాలని దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్‌ చేసిన విషయం తెలిసిందే. వడ్డీసహా దాదాపు రూ.9,000 కోట్ల రుణ బకాయి కేసులో బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్షియం ఈ పిటిషన్లను దాఖలు చేసింది.

జస్టిస్‌ కర్ణన్‌ కు ఆర్నెల్లు జైలుశిక్ష

09/05/2017: న్యూఢిల్లీ: కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్‌ కర్ణన్‌ వివాదం మరో మలుపు తిరిగింది. ఆయన వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం, కోర్టు ధిక్కరణ నేరం కింద కర్ణన్‌కు ఆరు నెలలు పాటు జైలుశిక్ష విధించింది. న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో ఆయన్ని ఈరోజు అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. కాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్‌ ఖేహర్‌, మరో ఏడుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు జస్టిస్‌ కర్ణన్‌ అయిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ ఎనిమిదిమంది ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరాలకు పాల్పడ్డారంటూ కర్ణన్‌ సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సుప్రీంకోర్టు ...జస్టిస్‌ కర్ణన్‌ కోర్టు థిక్కరణకు పాల్పడ్డారంటూ జైలుశిక్ష విధించింది. తోటి హైకోర్టుల జడ్జిలపై ఆరోపణలు చేసినందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహర్‌ నేతృత్వంలో ఏడుగురు జడ్జిల బెంచ్‌ కర్ణన్‌ను విచారించిన విషయం తెలిసిందే. విచారణ అనంతరం జడ్జిలతో కూడిన బెంచ్‌ దళితుడినని తనను అవమానించిందని కర్ణన్‌ ఆరోపించారు. తన కేసును సుమోటోగా తీసుకుని న్యాయపరమైన, చట్టపరమైన ఆదేశాలు జారీ చేసేందుకు అనర్హుడిని చేయడాన్ని ఆయన విమర్శించారు.

బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అరెస్ట్‌

08/05/2017: వరంగల్‌ అర్బన్‌: జిల్లాలోని ఎనుమాముల మార్కెట్‌ యార్డును సందర్శించడానికి వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మార్కెట్‌ యార్డులో రైతుల కష్టాలను తెలుసుకోవడానికి వచ్చిన లక్ష్మణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని నిల్స్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. రాష్ట్ర అధ్యక్షుడు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున మార్కెట్‌ యార్డు వద్దకు చేరుకున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలను కూడా అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

1,000 కోట్ల కలెక్షన్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా బాహుబలి–2 రికార్డు

08/05/2017: హైదరాబాద్‌ 2017 మే 7... 105 సంవత్సరాల చరిత్ర గల భారత సినిమా సింహాసనంపై తెలుగు సినిమా కూర్చున్న రోజు. ఖాన్‌లు, కపూర్‌లు, బచ్చన్‌లకే సాధ్యంకాని రూ.1,000 కోట్ల వసూళ్లను (అన్ని భాషల్లో కలిపి) మన తెలుగు సినిమా బాహుబలి–2 కేవలం పది రోజుల్లోనే సాధించేసింది. ఈ విషయాన్ని ‘బాహుబలి’అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా ధ్రువీకరించారు. విడుదలైన మొదటి రోజు నుంచే ఈ చిత్రరాజం వసూళ్ల ప్రభంజనం ప్రారంభమైంది. మొదటిరోజు దేశంలోని 29 రాష్ట్రాల్లో బాహుబలివే రికార్డు వసూళ్లు(తమిళనాడులో మార్నింగ్‌ షోలు పడకపోవడంతో అక్కడ రికార్డు రాలేదు). రాజమౌళి కల, ప్రభాస్, రానా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల కష్టం, నిర్మాతల ధైర్యానికి భారతీయ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రారంభమే ప్రభంజనం! బాహుబలి ప్రారంభమయ్యే నాటికి తెలుగు సినిమా మార్కెట్‌ రూ.50–70 కోట్లు మాత్రమే. అలాంటిది రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఓ ప్రాంతీయ సినిమా నిర్మాణం అంటే అందరూ నోరెళ్లబెట్టారు. మొదలైన రోజు నుంచే సినిమాకు సంబంధించిన ఏదో ఒక విషయం వార్తల్లో నిలుస్తూ వచ్చింది. మొదటి భాగం విడుదలయ్యే నాటికి ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. వాటన్నిటిని అందుకుంటూ మొదటి భాగమే అద్భుత విజయం సాధించింది. ఆ స్థాయి విజయాన్ని అసలు ఊహించనే లేదని చిత్రబృందం అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చింది. మొదటి భాగం విడిచిపెట్టిన ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’అనే ప్రశ్న రెండేళ్ల పాటు ప్రేక్షకులను రెండో భాగంపై ఆసక్తిని మరింత పెంచింది. రెండో భాగం విడుదలయ్యే నాటికే ఈ చిత్రం అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని తెలిసినా రూ.1,000 కోట్ల క్లబ్‌లో చేరుతుందనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ పది రోజుల్లోనే బాహుబలి ‘మ్యాజిక్‌ ఫిగర్‌’ను చేరింది. సమీప భవిష్యత్తులో మరే చిత్రం అందుకోలేని రికార్డులను బాహుబలి సృష్టిస్తుందని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టింది. మొదటి వారాంతానికే 10 మిలియన్‌ డాలర్లను కొల్లగొట్టిన బాహుబలి, ఆ తర్వాత మూడు రోజులకే దంగల్‌(12.36 మిలియన్లు)ను దాటేసింది. ఈ శనివారానికి బాహుబలి 15.2 మిలియన్లను దాటింది. లాంగ్‌ రన్‌లో 20 మిలియన్ల మార్కును అందుకుంటుందని అంచనా. ఆదివారం హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్‌ వద్ద ప్రభాస్‌ అభిమానుల ‘వెయ్యి కోట్ల’ సంబరాలు ప్రచారంలో సరికొత్త అధ్యాయం సినిమా ప్రచారంలో బాహుబలి కొత్త అధ్యాయానికి తెరతీసింది. ఆదాయానికి వీలున్న ఏ విభాగాన్నీ నిర్మాతలు వదిలిపెట్టలేదు. వర్చువల్‌ రియాలిటీ, టీవీ, యానిమేటెడ్‌ సిరీస్, బాహుబలి ఉత్పత్తులు, నవలలు, కామిక్‌ పుస్తకాలు ఇలా ప్రతి రంగంలోకి బాహుబలి ప్రవేశించింది. మొదటి భాగం ప్రారంభమైన నాటి నుంచి నటీనటుల పుట్టినరోజులకు టీజర్లు, మేకింగ్‌ వీడియోలు, పరీక్షలకు శుభాకాంక్షలు తెలుపుతూ వీడియోలు, కామెడీ స్కిట్‌లు ఇలా కనీసం నెలకొక్క విషయమైనా వార్తల్లో ఉంటూ ప్రజల్లో ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. మొదటి భాగం విడుదల సమయంలో పాత్రల పరిచయం అంటూ మూడు రోజులకో పోస్టర్‌ వదలడం కూడా భారతీయ సినిమా చరిత్రలో తొలిసారి. ఇక రెండో భాగం విషయానికి వస్తే సినిమా కంటే ఇతర అంశాలే ఎక్కువగా వార్తల్లో నిలిచాయి. ప్రతిష్టాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ప్రభాస్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ‘ద రైజ్‌ ఆఫ్‌ శివగామి’పుస్తకం అమెజాన్‌ బెస్ట్‌ సెల్లర్స్‌లో మొదటి స్థానంలో నిలిచింది. ఓ సినిమాకు ఎలా ప్రచారం చేయాలో రాజమౌళిని చూసే నేర్చుకోవాలంటూ ఎంతో మంది కితాబిచ్చారు. బాహుబలిపై బీబీసీ కథనం.. ఈ సినిమాకు లభిస్తున్న ప్రశంసలన్నీ ఓ ఎత్తయితే, దీనిపై ప్రతిష్టాత్మక బీబీసీ చానెల్‌లో కథనం రావడం మరో ఎత్తు. భారతీయ సినిమా రికార్డులన్నీ ఈ చిత్రం బద్దలుగొట్టిందని, అమెరికాలో ఈ వారం విడుదలైన అన్ని చిత్రాల్లో(హాలీవుడ్‌ సహా) బాహుబలి వసూళ్ల పరంగా మూడో స్థానంలో నిలిచిందని ఈ కథనంలో తెలిపారు. ఇందుకోసం వారు రాజమౌళి, అనుష్కను ఇంటర్వూ్య చేశారు. బాలీవుడ్‌ ప్రముఖుల శీతకన్ను... తమ సినిమాలు, సహచర నటుల సినిమాలు, అవార్డులు వచ్చినప్పుడు విపరీతంగా స్పందించే బాలీవుడ్‌ ప్రముఖులు బాహుబలిపై అస్సలు స్పందించలేదు. పెద్ద హీరోలైన ఖాన్‌ త్రయం ఆమిర్, షారుక్, సల్మాన్‌లు స్పందించకపోగా.. ద్వితీయ శ్రేణి హీరోలైన హృతిక్‌ రోషన్, షాహిద్‌ కపూర్, రణ్‌వీర్‌ సింగ్, రణ్‌బీర్‌ కపూర్‌ వంటి హీరోలు కూడా నోరెత్తడం లేదు. వరుణ్‌ ధావన్, కరణ్‌ జోహార్, శేఖర్‌ కపూర్‌ వంటి ప్రముఖులు మాత్రం బాహుబలిని ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు. మరిన్ని భాషల్లోకి... తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ‘బాహుబలి–2’విడుదలైన విషయం తెలిసిందే. మరికొన్ని భాషల్లోకి ఈ చిత్రం అనువాదం అయ్యే అవకాశం ఉంది. ‘‘బాహుబలి సినిమాను మొదట చైనీస్‌ భాషలోకి అనువదించాలనుకుంటున్నాం. చైనీస్‌ మార్కెట్‌ను అంచనా వేసి, స్క్రీన్స్‌ను నిర్ణయిస్తాం. ఆ తర్వాత జపనీస్, కొరియన్, తైవాన్‌ భాషల్లో అనువదించాలనే ఆలోచన ఉంది. అక్కడ కూడా ప్రేక్షకులు ‘బాహుబలి’సినిమాను ఆదరిస్తారన్న నమ్మకంతో ఉన్నాం’’అని ‘బాహుబలి’నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ ఓ ప్రకటనలో తెలిపారు.

ట్రైనీకి విమానం అప్పగించి పైలట్‌ కునుకు

08/05/2017: లాహోర్‌: విమానాన్ని ట్రైనీ పైలట్‌కు అప్పగించి రెండున్నర గంటలపాటు ఓ సీనియర్‌ పైలట్‌ కునుకు తీసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రయాణికుడొకరు ఈ విషయాన్ని గుర్తించి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సదరు పైలట్‌ను విధుల నుంచి తొలగించారు. ఈ ఘటనపై ఎయిర్‌లైన్స్‌ అధికారులు విచారణ ప్రారంభించారు. వివరాల్లోకెళితే పాక్‌కు చెందిన పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌(పీఐఏ) పీకే–785 విమానం 305 మంది ప్రయాణికులతో ఏప్రిల్‌ 26న ఇస్లామాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరింది. వీరిలో 293 మంది ఎకానమీ క్లాస్‌లో, 12 మంది బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణిస్తున్నారు. ట్రైనీ పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు కెప్టెన్‌ అమిర్‌ అక్తర్‌ హష్మీని నియమించుకున్న పీఐఏ, ఆయనకు జీతంగా నెలకు రూ.లక్ష చెల్లిస్తోంది. అయితే లండన్‌కు బయలుదేరిన కాసేపటికే శిక్షణలో ఉన్న పైలట్‌ అసద్‌ అలీకి విమానాన్ని అప్పగించిన ఆయన, చక్కగా బిజినెస్‌ క్లాస్‌లోకి వెళ్లి రెండున్నర గంటలు కునుకు తీశారు. ఈ సమయంలో విమానంలో ఫస్ట్‌ ఆఫీసర్‌గా ఉన్న హసన్‌ యజ్దానీ కాక్‌పిట్‌లో కూర్చుని ఉన్నారు. హష్మీ ఇంతకుముందు పాకిస్తాన్‌ ఎయిర్‌లైన్స్‌ పైలట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. దీంతో తొలుత చర్యలు తీసుకోవడానికి జంకినప్పటికీ, ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆయన్ను విధుల నుంచి తప్పించారు. మరోవైపు సుదూర ప్రయాణాల్లో పైలట్లు నిద్రపోవడం చాలా సాధారణమైన విషయమని హష్మీ మీడియాకు తెలిపారు. తాను విమానంలో రెండున్నర గంటలసేపు నిద్రపోయానన్నది వాస్తవం కాదన్నారు.

ఆశ వర్కర్లకు నెలకు రూ.6 వేల పారితోషికం: కేసీఆర్‌

06/05/2017: హైదరాబాద్‌: ఆశ వర్కర్లకు ప్రతి నెలా అందుతున్న పారితోషికాన్ని రూ.ఆరు వేలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దీనిని ఈ నెల నుంచే అమలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆశ వర్కర్లకు నెలకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు మాత్రమే పారితోషికంగా అందుతున్నాయి. ఇకపై రూ.ఆరు వేలు అందించనున్నారు. అంతేకాదు వచ్చే ఏడాది బడ్జెట్‌ సందర్భంగా మరోసారి ఆశ వర్కర్ల పారితోషికం పెంచుతామని.. ఆశ వర్కర్లను అంగన్‌వాడీ కార్యకర్తల స్థాయికి తీసుకెళతామని సీఎం హామీ ఇచ్చారు. విద్యార్హతలుండి శిక్షణ పొందిన వారికి ఏఎన్‌ఎం ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తామని.. ఇతర కోర్సులు చేసినవారుంటే వైద్య ఆరోగ్య శాఖలో సంబంధిత ఉద్యోగాలిస్తామని తెలిపారు. ఆరోగ్య సంబంధ విధులు తప్ప మరో పని చెప్పకుండా అధికారులకు ఆదేశాలు ఇస్తామని చెప్పారు. శుక్రవారం రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆశ వర్కర్లు ప్రగతి భవన్‌ వచ్చారు. వారందరికీ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయించిన సీఎం కేసీఆర్‌.. అనంతరం జనహితలో వారితో సమావేశమయ్యారు. ఆశ వర్కర్ల సమస్యలు, విజ్ఞప్తులను విన్నారు. క్షేత్రస్థాయిలో తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు తాము అన్ని రకాల సేవలు చేస్తున్నామని ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి వివరించారు. కేవలం ఆరోగ్య సంబంధమైన పనులే కాకుండా, ప్రభుత్వం నిర్వహించే ఇతర కార్యక్రమాల్లో కూడా భాగస్వాములం అవుతున్నామని చెప్పారు. అయినా తమకు నెలకు రూ.వెయ్యి– పదిహేను వందలు మాత్రమే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. వెట్టి చాకిరీ చేయించొద్దు.. ఆశ వర్కర్ల సమస్యలు తీర్చుతామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. అధికారులు ఆశ వర్కర్లతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. ‘‘వారికో జాబ్‌ చార్ట్‌ కూడా లేదు. ఏ పని పడితే ఆ పని చేయిస్తున్నారు. వాస్తవానికి వారి పనులు చేసుకుంటూ రోజులో గంటో రెండు గంటలో మాత్రమే పనిచేయడానికి ఆశ వర్కర్లను ఏర్పాటు చేశారు. కానీ ఆచరణలో రోజంతా పనిచేయిస్తున్నారు. వారికి కేటాయించిన పని మాత్రమే కాకుండా ఇతర పనులు చేయిస్తున్నారు. వాటికి అదనపు పారితోషికం కూడా ఇవ్వడం లేదు. గత పాలకులు ఆశ వర్కర్లను పట్టించుకోలేదు. అంగన్‌వాడీ వర్కర్ల విషయంలోనూ ఇలాగే జరిగింది. రెండు దఫాలుగా జీతాలు పెంచి వారికి న్యాయం చేశాం. ఇప్పుడు ఆశ వర్కర్లకు కూడా సమాజంలో, కుటుంబంలో గౌరవం పెరిగే విధంగా జీతాలు పెంచుతాం. ఈ నెల నుంచే రూ.6 వేలు ఇస్తాం. వచ్చే బడ్జెట్‌ సందర్భంగా మరోసారి పెంచుతాం..’’అని ప్రకటించారు. ఆశ వర్కర్లు ఏం పనిచేయాలి? ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఎవరెవరు ఏ పనిచేయాలనే విషయాల్లో స్పష్టత ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరు కేసీఆర్‌ కావాలి ఆరోగ్య అంశాలపై ప్రజలకు అవగాహన లేదని, అనేక రోగాల బారిన పడుతున్నారని కేసీఆర్‌ పేర్కొన్నారు. పేదరికం కారణంగా నిండు గర్భిణులు కూడా కూలీ పనులకు వెళుతున్నారని, అది ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ బాధలు పోవాలనే గర్భిణులకు రూ.12 వేలు ఆర్థిక సాయం ఇవ్వాలని నిర్ణయించుకున్నామని.. తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు కేసీఆర్‌ కిట్లు అందిస్తున్నామని చెప్పారు. వాటన్నింటా ఆశ వర్కర్లు భాగస్వాములు కావాలని, క్షేత్రస్థాయిలో ఆరోగ్య పరిరక్షకులుగా మారాలని సూచించారు. ప్రతి ఒక్కరు ఒక కేసీఆర్‌ కావాలని వ్యాఖ్యానించారు. ‘మీ అందరి కడుపునిండా జీతం ఇచ్చే బాధ్యత నాది. ప్రజల ఆరోగ్యం బాధ్యత మీది..’అని ఆశ వర్కర్లతో పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు సి.లక్ష్మారెడ్డి, టి.హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు వివేకానంద, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ సలీమ్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ తదితరులు పాల్గొన్నారు. ఆశ వర్కర్ల హర్షం తమకు అందించే పారితోషికాన్ని పెంచడంపై ఆశ వర్కర్లు సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ప్రకటన చేయగానే జనహిత జైతెలంగాణ నినాదాలతో మార్మోగింది. ఆశ వర్కర్ల వేతనాలు పెంచడంపై టీఎన్జీవోల సంఘం గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్, అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.రాజేందర్‌ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతి భవన్‌లో పారితోషికం పెంపు విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్న ఆశ వర్కర్లు

కిమ్‌ హత్యకు సీఐఏ కుట్ర: ఉత్తర కొరియా

06/05/2017: సియోల్‌: తమ అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ను హతమార్చడానికి అమెరికాకు చెందిన సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ(సీఐఏ), దక్షిణ కొరియా నిఘా వర్గాలు పన్నిన కుట్రను భగ్నం చేసినట్లు ఉత్తర కొరియా అంతర్గత భద్రత శాఖ తెలిపింది. జీవరసాయన ఆయుధాలతో కిమ్‌పై దాడి చేయడానికి జరిగిన కుట్రను అడ్డుకున్నట్లు స్పష్టం చేసింది. తమ అధినేత హత్యకు ఉత్తర కొరియాకే చెందిన కిమ్‌ అనే వ్యక్తిని అమెరికా, దక్షిణ కొరియాలు ఎంపిక చేసినట్లు దేశ అధికార వార్తాసంస్థ కొరియా సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. నిందితుడి వద్ద నుంచి 7.40 లక్షల అమెరికన్‌ డాలర్లు, ఓ శాటిలైట్‌ ట్రాన్స్‌రిసీవర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తండ్రి, తాతల సమాధులతో పాటు సైనిక పరేడ్‌లో దాడికి ప్రణాళిక రచించారని అంతర్గత భద్రత శాఖ తెలిపింది. తమవద్ద ఉన్న రేడియోధార్మిక విష పదార్థాలు ప్రయోగించిన 6 నుంచి 12 నెలల తర్వాతే ప్రభావం చూపిస్తాయని నిందితుడికి సీఐఏ చెప్పినట్లు వెల్లడించింది. నిందితుడి వద్ద దక్షిణ కొరియాకు చెందిన పలు ఇంటెలిజెన్స్‌ అధికారుల నెంబర్లు లభించినట్లు తెలిపింది.

బడుగులకు అండ కాంగ్రెస్‌ ఒక్కటే: ఉత్తమ్‌

06/05/2017: హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేష న్లు కల్పిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం గాం ధీభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావే శం జరిగింది. ఏఐసీసీ కార్యదర్శిగా నియుక్తుౖ లెన మధుయాష్కీని అంతకుముందు సన్మా నించారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా, సభ్యత్వ నమో దు బాధ్యుడు సి.జె.శ్రీనివాస్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటూ వారి సంక్షేమానికి పని చేసేది కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటేనన్నారు. మధు యాష్కీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ సామాజిక న్యాయం చేస్తుంటే, బీజేపీ సమాజాన్ని చీల్చుతోందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ దొరల పాలన చేస్తున్నారని, ఒక కులానికే ప్రాధా న్యం దక్కుతున్నదని ఆరోపించారు. తనపై నమ్మకంతో కర్ణాటక బాధ్యతలు కూడా అప్ప గించిన ఏఐసీసీకి ఆయన కృతజ్ఞతలు తెలిపా రు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ పార్టీ కోసం అంకితభావంతో పనిచేసేవారికి తగిన గౌరవం దక్కుతుందనడానికి యాష్కీ నియా మకమే నిదర్శనమన్నారు. పార్టీ నేతలు డి.కె.అరుణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఆకుల లలిత తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15 లోగా సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని ఉత్తమ్‌ సూచించారు.

రాజకీయ దురుద్దేశంతోనే విమర్శలు: కృష్ణసాగర్‌రావు

06/05/2017: హైదరాబాద్‌: రాజకీయ దురుద్దేశంతోనే కేంద్ర ప్రభు త్వంపై మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేస్తు న్నారని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు ధ్వజమెత్తారు. హరీశ్‌ చెప్పిన లెక్కలన్నీ తప్పులతడకగా, కేంద్రంపై అసత్య ప్రచారానికి తెర తీసేవిగా ఉన్నాయని శుక్రవారం విమర్శిం చారు. కేంద్రం ఎఫ్‌ఏక్యూ రకం మాత్రమే కొనుగోలు చేయాలని ఎక్కడా చెప్పలేదని, ఈ పేరుతో హరీశ్‌ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేసిన హరీశ్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మిర్చి దిగుబడి ఫిబ్రవరి, మార్చికల్లా వస్తుండగా, ఆలస్యంగా మార్చి 30న మార్కెట్‌ ఇంటర్వేన్షన్‌ స్కీం (ఎంఐఎస్‌) కింద ఆదుకోవాలని కేంద్రాన్ని కోరిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతులకు రూ.3 వేల బోనస్‌ ప్రకటించాలని, ఎంఐఎస్‌ కింద కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు.

మే7 నుంచి హైదరాబాద్‌-కాకినాడ ప్రత్యేక రైలు

06/05/2017: హైదరాబాద్‌: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్‌ - కాకినాడ మధ్య (07005) స్పెషల్‌ ట్రైన్‌ నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్‌ తెలిపారు. ఈ నెల 7వ తేదీన నాంపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి సాయంత్రం 6.50 గంటలకు, సికింద్రాబాద్‌ నుంచి 7.20 గంటలకి బయలుదేరుతుంది. రాత్రి 12.30 గంటలకు గుంటూరుకు, రాత్రి 1.30 సమయానికి విజయవాడకు చేరుకుంటుంది. 8న ఉదయం 5.35 గంటలకు రైలు కాకినాడ చేరుకుంటుందని సీపీఆర్వో చెప్పారు.

కె.విశ్వనాథ్‌కు మోదీ అభినందన

05/05/2017: న్యూఢిల్లీ: జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీతలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. సినిమారంగ అభివృద్ధికి వీరి సృజనాత్మకత, వీరు చేస్తున్న కృషి మరువలేనివన్నారు. దాదాసాహెబ్‌ అవార్డు అందుకున్న దర్శకుడు కె.విశ్వనాథ్‌పై ప్రత్యేకంగా ప్రశంసల వర్షం కురిపించారు. ‘కె. విశ్వనాథ్‌ ఓ గొప్ప దర్శకుడిగా విశిష్టతను సంపాదించుకున్నారు. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్నందుకు ఆయనకు నా శుభాకాంక్షలు’ అని ట్వీటర్లో మోదీ పేర్కొన్నారు.

వీసా రెన్యువల్‌ కాలేదని ఆత్మహత్య

05/05/2017: హైదరాబాద్‌: హాయిగా సాగుతున్న ఓ కుటుంబంలో అమెరికా అధ్యక్షుడి నిర్ణయాల వల్ల విషాదం నెలకొంది. అమెరికాలో నివసించేందుకు అక్కడి కొత్త నిబంధనలతో వీసా రెన్యువల్‌ కాలేదనే బెంగతో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్‌ శివార్లలోని నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పుప్పాలగూడలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై విజయ్‌ నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌కు చెందిన సంజీవ్‌ శర్మ, రాశ్మీ శర్మ (39) నెలరోజుల కింద అమెరికా నుంచి వచ్చి పుప్పాలగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని ట్విన్‌డైమండ్‌ అపార్ట్‌మెంట్‌లోని సొంత ఫ్లాట్‌లో ఇద్దరు కుమారులతో కలసి నివసిస్తున్నారు. అంతకుముందు సంజీవ్‌శర్మ హైదరాబాద్‌లోని పలు కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూ.. అవకాశం రావటంతో అమెరికా వెళ్లారు. అక్కడ సంజీవ్‌ పనిచేస్తుండగా రాశ్మీశర్మ ఇంట్లోనే ఉండేది. ఇటీవల అమెరికాలో వచ్చిన కొత్త నిబంధనలతో సంజీవ్‌ పనిచేస్తున్న బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సంస్థ వారి వీసా పొడిగించేందుకు నిరాకరించింది. దీంతో చేసేదేమిలేక ఇక్కడికి వచ్చారు. గురువారం ల్యాప్‌టాప్‌ రిపేర్‌ కోసం కుమారులను తీసుకుని సంజీవ్‌ బయటకు వెళ్లాడు. వారు తిరిగొచ్చే సరికి ఇంట్లో రాశీశర్మ చీరతో ఉరి వేసుకుని కనిపించింది. కుటుంబ కలహాలతో పాటు అమెరికాలో భర్త ఉద్యోగం పోవటంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఇక దుబాయి ఆస్పత్రిలో లావాటి మహిళ

05/05/2017: దుబాయి: ముంబయిలో చికిత్స చేయించుకొని వెళ్లిన ఈజిప్టుకు చెందిన స్థూలకాయురాలు ఎమన్‌ అహ్మద్‌ అబుదాబిలోని ఆస్పత్రిలో చేరింది. ఈ ఆస్పత్రిలో ఆమెకు ధీర్ఘకాలంపాటు శారీరక, మానసిక వైద్యాన్ని అందించనున్నారు. దాదాపు అరటన్ను బరువుతో ప్రపంచంలోనే అతి లావాటి మహిళగా రికార్డుల్లోకి ఎక్కిన ఎమన్‌ను ఒక సవాల్‌గా తీసుకొని ముంబయి వైద్యులు ప్రత్యేక శ్రద్ధతో ఆమెను ఈజిప్టు నుంచి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె సర్జరీ చేసి దాదాపు 323 కిలోల బరువు తగ్గించారు. ప్రస్తుతం ఆమె బరువు 176.6కేజీలు. దీంతో తిరిగి ఆమెను పంపించేశారు. ప్రస్తుతం ఏడాదిపాటు చికిత్స పొందేందుకు ఎమన్‌ అబుదాబిలోని వీపీఎస్‌ బుర్జీల్‌ ఆస్పత్రిలో చేరింది. ఈ సందర్భంగా యాసిన్‌ శహత్‌ అనే వైద్యుడు మాట్లాడుతూ తన ప్రయాణం సౌకర్యాంగానే సాగినట్లు ఎమన్‌ తెలిపిందన్నారు. ఆమె కోసం ప్రత్యేకంగా ఇటలీ నుంచి హైడ్రాలిక​ స్ట్రెచర్‌ తీసుకొచ్చామని, 20మంది వైద్యులను ఆమెకు కేటాయించి వైద్యం చేయబోతున్నట్లు ప్రకటించారు.

తదుపరి టార్గెట్.. మెక్ డోనాల్డ్స్!

05/05/2017: హరిద్వార్ : పతంజలి ఆయుర్వేద పేరుతో మార్కెట్లో ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తున్న యోగా గురు బాబా రాందేవ్.. ఇప్పుడు బహుళ జాతీయ ఫుడ్ చైన్ మెక్ డోనాల్డ్స్‌ ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. దాంతోపాటు కేఎఫ్‌సీ, సబ్‌వే రెస్టారెంట్లను కూడా టార్గెట్ చేసేలా ఉన్నారు. కొత్తగా రెస్టారెంటు వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టి.. అసలైన భారతీయ వంటకాలను అందించడం ద్వారా వాటి వ్యాపారాన్ని కొల్లగొట్టాలని చూస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రెస్టారెంట్ల చైన్ ఓపెన్ చేయాలని పతంజలి గ్రూపు తీవ్రంగా ఆలోచిస్తోంది. ఈ విషయాన్ని రాందేవ్ స్వయంగా వెల్లడించారు. ఇప్పటికే టూత్ పేస్టు నుంచి రకరకాల ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చి.. వాటికి మంచి ఆదరణ కూడా పొందిన పతంజలి సంస్థ.. ఇప్పుడు మూలికలు, ప్రత్యేకంగా శరీరానికి మేలుచేసే పదార్థాలతో కూడిన ఆహారాన్ని భారతీయులకు అందించాలని భావిస్తోంది. పతంజలి బిస్కట్ల లాంటి వాటికి ఇప్పటికే చాలామంది అభిమానులు ఉన్నారు. దాంతో ఇప్పుడు ఫుడ్ రీటైలింగ్‌లోకి అడుగుపెడితే కచ్చితంగా మిగిలినవాళ్లకు గట్టి పోటీ ఇవ్వగలమన్న విశ్వాసాన్ని పతంజలి వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో జరుగుతున్న మొత్తం రీటైల్ వ్యాపారంలో 57 శాతం వాటా ఆహార ఉత్పత్తులదే. 2025 నాటికి ఈ మార్కెట్ మూడు రెట్లు పెరిగి దాదాపు రూ. 71 లక్షల కోట్లు అవుతుందని అంచనా. డామినోస్ పిజ్జా లాంటి చాలామంది ఈ రంగంలో ఇప్పటికే పాతుకుపోయి ఉన్నారు. అయినా అవసరమైతే ఎంత పెట్టుబడి అయినా పెట్టి మరీ ఆహార వ్యాపారాన్ని కొల్లగొట్టాలన్నది రాందేవ్ వ్యూహంలా కనిపిస్తోంది. భారతీయులకు అనారోగ్యకరమైన ఆహారాన్ని అందించడం ఎందుకని.. ఆహారంతో పాటే ఆరోగ్యాన్ని కూడా ఇస్తే మంచిది కదా అని ఆయన అంటున్నారు. ఆహార పదార్థాలు, పౌష్టిక పదార్థాలు, సౌందర్య సాధనాలు.. వీటన్నింటికీ ఉన్నట్లే రీటైల్ ఫుడ్ చైన్లకు కూడా మంచి గిరాకీ ఉంటుందని ఆశిస్తున్నారు.

మిర్చిధరలపై కేంద్రం స్పందన పెద్ద జోక్: హరీశ్ రావు

04/05/2017: హైదరాబాద్ : మిర్చి ధరలపై కేంద్రం స్పందించిన తీరు మిలీనియం జోక్ అని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో మొత్తం 7 లక్షల టన్నుల మిర్చి పండితే, కేకవలం 33 వేల టన్నులే కొంటారా అని ఆయన ప్రశ్నించారు. మిర్చికి మద్దతు ధర ప్రకటించాలన్న సోయి కేంద్రానికి లేదని ఆయన అన్నారు. బీజేపీ నేతలు మార్కెట్లలో తిరుగుతూ క్వింటాలుకు రూ. 10 వేల ధర చెల్లించాలని అంటారని, కానీ కేంద్రం మాత్రం రూ. 5వేలకే కొంటామని చెబుతోందని హరీశ్ గుర్తుచేశారు. వాస్తవానికి మంచి నాణ్యత ఉన్న మిర్చికి అంతకంటే ఎక్కువ ధరే వస్తోందని, కానీ అన్ని రకాలకు చెందినది ఉండటంతో ధర తగ్గుతోందని ఆయన తెలిపారు. మిర్చి కొనుగోళ్లపై స్పష్టత లేనిది తమకు కాదు.. బీజేపీకేనని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఇతర బీజేపీ నేతలు రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతున్నారని, రైతులకు న్యాయం జరిగేందుకు కేంద్రానికి మరోసారి లేఖ రాస్తామని హరీశ్ రావు తెలిపారు.

హైదరాబాద్‌ రేడియో జాకీ మృతి.. భర్త అరెస్ట్‌

04/05/2017: హైదరాబాద్‌: నగరంలో కలకలం రేపిన రేడియో జాకీ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె భర్త అయిన ఆర్మీ మేజర్‌ను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బేగంపేట్‌ ఏసీపీ రంగారావు కథనం ప్రకారం.. సంధ్య స్థానికంగా రేడియో జాకీగా జాబ్‌ చేస్తుండేది. ఆర్మీ మేజర్‌ వైభవ్‌ విశాల్‌ తో ఆమె వివాహం జరిగింది. ఈ క్రమంలో గత నెల 18న తన భార్య సంధ్య ఆర్మీ క్వాటర్స్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె భర్త ఆర్మీ మేజర్‌ వైభవ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే మృతురాలు సోదరి ఉమాసింగ్‌ తమ అక్క చాల దైర్యవంతురాలని, భర్త హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మేజర్‌ను అరెస్టు చేసేందుకు ఉన్నతాధికారుల అనుమతి కోరారు. అయితే భార్య అనుమానాస్పద మృతి తర్వాత అతనికి ఆరోగ్యం సరిగా లేదంటూ ఒకసారి, మరోసారి ఆర్మీ అంతర్గత విచారణ జరుగుతోందంటూ అరెస్టు చేయనివ్వలేదు. దీనిపై దేశ వ్యాప్తంగా టీవీ చానళ్లలో వార్త కథనాలు ప్రసారం కావడంతో పాటు మృతురాలు బంధువులు కేంద్ర మంత్రికి సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో ఎట్టకేలకు ఆర్మీ అధికారులు మేజర్‌ విశాల్‌ వైభవ్‌ను ఆరెస్టు చేయడానికి అనుమతించారన్నారు. ఇతనిపై వరకట్న వేధింపుల కేసుతో పాటు ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటి కేసు నమోదు చేసినట్లు ఏసీపీ వివరించారు. 14 రోజుల కస్డడీకి తీసుకున్నట్లు తెలిపారు.

తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల

హైదరాబాద్‌ : తెలంగాణలో పదవ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. సచివాలయంలోని డి బ్లాక్‌ కాన్ఫరెన్స్‌ హాలులో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 84.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. అయితే ఫలితాలలో ఈసారి కూడా విద్యార్థినులే పైచేయిగా నిలిచారు. బాలికలు 85.37 శాతం, బాలురు 82.95 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా టెన్త్‌ ఫలితాలలో జగిత్యాల జిల్లా 97.35 శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా, వనపర్తి జిల్లా 64.84 శాతంతో చివరిస్థానంలో నిలిచింది. అలాగే 2005 స్కూళ్లలో వందశాతం ఫలితాలు వచ్చాయి. జూన్‌ 5వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 14 నుంచి 30వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో తెలుగు మీడియం నుంచి 48 శాతం మంది, ఇంగ్లిష్‌ మీడియం నుంచి 52 శాతం మంది ఉన్నారు. ఈ వెబ్‌సైట్‌లలో ఫలితాలను పొందవచ్చు www. bsetelangana. org, http:// results. cgg. gov.in

అమెరికాకు షాకిచ్చిన ఐసిస్

03/05/2017: కాబుల్: ముప్పేటదాడితో కొన్నాళ్లుగా కామ్ గా ఉన్న ఐసిస్ మళ్లీ పంజా విసిరింది. ఈ సారి ఏకంగా అమెరికన్ ఆర్మీనే టార్గెట్ చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడింది. అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబుల్ లో గల అమెరికన్ ఎంబసీ ఎదుట బుధవారం ఐసిస్ జరిపిన దాడిలో ఎనిమిదిమంది మరణించగా, ముగ్గురు యూఎస్ జవాన్లు తీవ్రంగా గాపడ్డారు. అఫ్ఘాన్ ఆంతరంగిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి నజీబ్ దానిశ్ చెప్పిన వివరాల ప్రకారం.. కాబుల్ లోని యూఎస్ ఎంబసీ ఎదుట ఆర్మీ కాన్వాయ్ పై ఐసిస్ ఉగ్రవాదులు ఆత్మాహుతిదాడి చేశారు. ఉగ్రవాదులు వినియోగించినవి శక్తిమంతమైన బాంబులు కావడంతో పేలుడు ధాటికి ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అఫ్ఘాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. యూఎస్ ఆర్మీకి చెందిన ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు ప్రతినిధులు తెలిపారు. పేలుడు ధాటికి యూఎస్ ఆర్మీకి చెందిన రష్ అవర్ వాహనంతోపాటు పౌరులకు చెందిన మరో 25 వాహనాలు ధ్వంసం అయ్యాయి. దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. అమెరికా, రష్యా, సిరియా, ఇరాన్ జాతీయ బలగాల ముప్పేటదాడితో చావుదెబ్బతిన్న ఐసిస్.. ఇటీవల ఇరాక్, సిరియాలకంటే అఫ్ఘానిస్థాన్ లోనే తన ప్రభావాన్ని చాటుకుంటోంది. అఫ్ఘాన్ యుద్ధం తర్వాత కూడా సుదీర్ఘకాలం పనిచేసిన అమెరికా, నాటో సైన్యాలు 2014 నుంచి తిరుగుముఖం పట్టడం, అదే సమయంలో ఉగ్రసంస్థలు మళ్లీ పుంజుకుంటుండటం తెలిసిందే.

దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారు: దామోదర రాజనర్సింహ

03/05/2017: హైదరాబాద్‌: సుందిళ్ల బ్యారేజీ కోసం గోలివాడలో రైతుల భూములను ప్రభుత్వం దౌర్జన్యంగా సేకరిస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వమే దళారీగా మారిపోయి, రైతుల భూములను దోచుకుంటున్నదన్నారు. రైతుల పట్టా భూములపై ప్రభుత్వ పెత్తనం ఏందని ఆయన ప్రశ్నించారు. ఏ చట్టం ద్వారా తమ భూములు తీసుకుంటున్నారో, రైతులకు ఇస్తున్న పరిహారం ఏమిటో చెప్పాలని అడుగుతుంటే ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు కేసీఆర్‌ ప్రభుత్వం తాబేదారుగా మారిందని దామోదర విమర్శించారు. కేసీఆర్‌ ఒక నియంత అని విమర్శించారు. నియంతలే నిరసనలను జీర్ణించుకోలేరని, అందుకే ధర్నాచౌక్‌ను తరలిస్తున్నారని విమర్శించారు.

12 నిండు ప్రాణాలు.. 14 గంటల పోరాటం

03/05/2017: బీజింగ్: తక్కువ సమయంలో అధ్బుత నిర్మాణాలు చేపట్టడంలో చైనీయులది అందెవేసిన చెయ్యి. అదే సమయంలో పని ప్రదేశాల్లో కార్మికులు ఎక్కువగా చనిపోయే దేశం కూడా చైనాయే. అక్కడే ఏటా సగటున 66 వేల మంది కార్మికులు పని ప్రదేశంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి కొనసాగింపు అన్నట్లు.. నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే టన్నెట్ పేలిపోవడంతో 12 మంది కార్మికులు మరణించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. నైరుతి చైనాలోని గిజావు ఫ్రావిన్స్ లో మంగళవారం చోటుచేసుకుందీ ఘటన. భారీ టన్నెల్ ఒక్కసారిగా పేలిపోవడంతో అక్కడ పనిచేస్తోన్న కార్మికులు నిర్మాణ శిధిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే సుమారు 2వేల మంది సహాయక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. 14 గంటల పోరాటం తర్వాత మొత్తం 12 మృతదేహాలను వెలికితీయగలిగారు. ప్రమాదం ఎలా జరిగిందనే కారణం తెలియాల్సిఉందని, దర్యాప్తు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. స్వల్ప వ్యవధిలోనే చైనా సుమారు 17 వేల కిలోమీటర్ల హైస్పీడ్ రైల్వే ట్రాక్ నిర్మించిన సంగతి తెలిసిందే.

డిలీట్‌ చేస్తే నెలకు రూ.5 లక్షలు

03/05/2017: హైదరాబాద్‌: బోధన్‌ స్కామ్‌కు సంబంధించి వాణిజ్య పన్నుల శాఖ అధికారుల విచారణలో వరుసగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో పోస్టింగ్‌లో ఉన్నంత కాలం డబ్బుకు లోటుండదు. అతిథి సత్కారాలకు అంతరాయం ఉండదు. టూర్లు, షికార్లు, విందులు, వినోదాలకు ఢోకాలేదు. అన్నీ తానై శివరాజు సెటప్‌ చేసి పెట్టాడు. ఏ అధికారి వచ్చినా అక్కడ శివరాజుదే పైచేయి. అతడు చెప్పిందే లెక్క. అతడు కట్టిందే ట్యాక్స్‌. మూడు చలాన్లు, ఆరు కమిషన్లతో హాయిగా సాగిపోయింది. దండుకున్నోళ్లకు.. దండుకున్నంత అన్నట్టుగా ఇన్నాళ్లూ నడిచిపోయింది. ఇలా ఒకటా రెండా.. ఏకంగా రూ.350 కోట్లు అప్పనంగా కొట్టేశారు. సీఐడీ చేస్తున్న దర్యాప్తులో ఒక్కో అధికారి దిగమింగిన లెక్క మెల్లమెల్లగా బయటకు వస్తోంది. డిలీట్‌ చేస్తే నెలకు రూ.5 లక్షలు.. నకిలీ చలాన్లు సృష్టించి ట్యాక్స్‌ క్లయిమ్‌ చేసినందుకు ఏసీటీవో నుంచి డిప్యూటీ కమిషనర్‌ వరకు శివరాజు పక్కాగా లకారాలు అందించాడు. అక్కడ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన శ్రీనివాస్‌రావు విచారణలో సీఐడీ ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది. నిజామాబాద్‌ జిల్లా కింద ఉన్న నాలుగు సర్కి ల్‌ కార్యాలయాల్లో ప్రతీ నెలా ట్యాక్స్‌ అమౌం ట్‌ను కమర్షియల్‌ ట్యాక్స్‌ వెబ్‌పోర్టల్‌లో ఎంట ర్‌ చేస్తారు. అయితే నకిలీ చలాన్ల ద్వారా వచ్చే అమౌంట్, సర్కిల్‌ కార్యాలయాల్లో ఆడిటింగ్‌లో వచ్చిన అమౌంట్‌ సరిపోలాలి. అయితే ప్ర తి నెలా ఈ రెండింటిని పోల్చేందుకు డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాస్‌రావు తన ప్రతిభ ఉపయోగించాడు. పోర్టల్‌లో పొందుపరిచిన వివరాల ను సరిచేయడం, తప్పుగా ఉంటే డిలీట్‌ చేయడం, శివరాజు చెప్పిన లెక్కను యథావిథిగా పోర్టల్‌లో ఎంట్రీ చేయడం శ్రీనివాస్‌రావు చేసేవాడని సీఐడీ ఉన్నతాధికారులు తెలిపారు. ఇందుకుగానూ శివరాజు గ్యాంగ్‌ నుంచి ప్రతి నెలా రూ.5 లక్షలు శ్రీనివాస్‌రావు పుచ్చుకున్నట్టు విచారణలో బయటపడిందన్నారు. అక్రమాలకు తగ్గ రేటు.. ప్యాకేజీలు.. డిప్యూటీ కమిషనర్‌కు నెలకు రూ.5 లక్షలు పక్కాగా 3వ తేదీన శివరాజు అందించేవాడని, సీటీవోకు రూ.2 లక్షల నగదు తీసుకొచ్చి ఇచ్చేవాడని విచారణలో తేలింది. డివిజన్‌ అధికా రికి రూ.2 లక్షలు, ఏసీటీవోకు రూ.లక్ష పక్కాగా అందించాడని సీఐడీ బయటపెట్టింది. ఏటా శివరాజు బంపర్‌ ఆఫర్లు ఇచ్చేవాడు. డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాస్‌రావుకు హోండా అమేజ్‌ కారు.. రిటైర్డ్‌ సీటీవోకు షెవర్లెట్‌ స్పార్క్‌ కారును గిఫ్ట్‌గా ఇచ్చినట్టు సీఐడీ అధికారులు తెలిపారు. ఆరు నెలలకోసారి ప్రతీ సర్కిల్‌ కార్యాలయం బృందానికి గోవా, ఊటీ, కేరళ, అండమాన్‌.. ఇలా టూర్లకు కూడా తిప్పాడని విచారణలో వెల్లడైంది. ప్రతీ నెలా 30న కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులు కోరుకున్న చోట, కోరుకున్న విందు ఏర్పాటు చేశాడని, ప్రతీ ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో ఒక్కో అధికారికి రూ.5 లక్షలు బోనస్‌ కూడా ఇచ్చాడని సీఐడీ ఆధారాలతో బయటపెట్టింది. ఈ లెక్కన జాయింట్‌ కమిషనర్ల నుంచి ఏసీటీవోల వరకు హోదాను బట్టి ఒక్కో అధికారి ఆస్తులు కనీసం రూ.50 కోట్లకు పైమాటే అని సీఐడీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అరెస్టయిన అధికారులపై త్వరలోనే ఏసీబీ యాక్షన్‌ ప్లాన్‌ ఉండే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో పాటు ప్రభుత్వ ఖజానాను దోచుకున్నందుకు పీసీ యాక్ట్‌ కింద కేసులు పెట్టే అవకాశం ఉందని తెలిసింది.

అమిత్‌షాకు అన్నం పెట్టిన దంపతులు మాయం

03/05/2017: కోల్‌కతా: వారం రోజుల కిందట చక్కటి భోజనం పెట్టి స్వాగతించిన పశ్చిమ బెంగాల్‌లోని మహాలీ కుటుంబం రెండు రోజులుగా కనిపించడం లేదు. వారికి ఏమై ఉంటుందని వారి బంధువులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మీడియాకు సైతం ఈ విషయం అంతుపట్టడం లేదు. గత వారం పశ్చిమ బెంగాల్‌లో పర్యటనలో భాగంగా నక్సల్బరీలో భాగమైన కతియజోటే అనే గ్రామానికి అమిత్‌ షా వెళ్లారు. ఆ సమయంలో ఆయనకు మహాలీ తెగకు చెందిన రాజు మహాలీ, ఆయన భార్య గీత భోజనం వడ్డించారు. నేలపై పరిచిన చాపమీద కూర్చుని వారిద్దరు చెరో దిక్కున ఉండగా మధ్యలో కూర్చున్న అమిత్‌ షా పప్పన్నం, సలాడ్‌తో తృప్తిగా భోంచేసి వెళ్లారు. అయితే, ఆయన అలా వెళ్లినప్పటి నుంచి ఆ కుటుం‍బంపై స్థానిక తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఒత్తిడి చేస్తుండటమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని సమాచారం. రాజు పెయింటర్‌గా పనిచేస్తుండగా గీతా మాత్రం పొలం పనులకు వెళుతుంటుంది. ప్రస్తుతం వీరిద్దరు గత రెండు రోజులుగా కనిపించడం లేదు. ఈ విషయం స్థానిక మీడియాకు తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, అంతకుముందే బీజేపీ నేత దిలీప్‌ బారుయి కూడా ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారంట. సిలిగురి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రవీణ్‌ అగర్వాల్‌ స్పందిస్తూ టీఎంసీ నేత గౌతం దేవ్‌ వారిని కిడ్నాప్‌ చేశారంటూ ఆరోపించారు.

ఎంపీలకు వల.. కిలేడీ అరెస్ట్!

02/05/2017: న్యూఢిల్లీ: ఎంపీలను బురిడీ కొట్టించిన కిలేడీని ఉత్తరప్రదేశ్‌లోని ఇందిరాపురంలోని ఆమె ఇంటికి వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేతలను కలిసి వారికి మాయమాటలు చెప్పి ఏదో రకంగా వారితో అసభ్యంగా ఫొటోలు దిగి బ్లాక్ మెయిల్ చేస్తున్న మహిళను ఢిల్లీ పోలీసులు నేడు ప్రశ్నించనున్నారు. ఇటీవల గుజరాత్‌లోని వల్సాద్‌కు చెందిన బీజేపీ ఎంపీ కేసీ పటేల్‌కు మత్తుమందు ఇచ్చి ఆపై ఆయనతో అసభ్యంగా ఫొటోలు దిగిన ఆ మహిళ రూ.5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది. అంతా మోసమని గ్రహించిన ఎంపీ పటేల్ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో.. మార్చి నెలలో డిన్నర్‌కు పిలిచి అత్యాచారం చేశారని, ఆసమయంలో తాను ఎలాగోలా వీడియో తీశానని మహిళ ఆరోపించడం అప్పట్లో కలకలం రేపింది. ఘజియాబాద్ పోలీసుల వద్దకు వెళ్లి తనకు న్యాయం చేయాలని ఆ మహిళ కోరింది, ఢిల్లీ పరిధిలో అన్యాయం జరిగింది కనుక అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. ఢిల్లీ పోలీసుల వద్దకు వెళ్లి ఎంపీ కేసీ పటేల్ పలుమార్లు తనపై అత్యాచారం చేశానని కథలు చెప్పింది. అయితే ఆమె చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేవని అక్కడి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. గతేడాది హర్యానాకు చెందిన ఎంపీ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసిన ఆ మహిళ.. కేసు విచారణ ప్రారంభించగానే కేసు వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఆమె వెనుక పెద్ద ముఠా ఉందని భావించిన ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ముకేష్ మీనా పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. ఎంపీ కేసీ పటేల్ ఈ ఘటనపై మాట్లాడుతూ.. ఓ మహిళ డబ్బు కోసం తనపై లేనిపోని ఆరోపణలు చేసిందన్నారు. సాయం కోసం వచ్చిన మహిళ కూల్ డ్రింకులో మత్తుమందు కలిపిందని, ఆపై తన గ్యాంగుతో కలిసి కొన్ని వీడియోలు తీసిందని ఆరోపించారు. ఘజియాబాద్‌లో ఇల్లు రాసివ్వాలని లేనిపక్షంలో వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిందని తెలిపారు. బ్లాక్ మెయిల్, దోపీడీకి సంబంధించిన విషయాలపై ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని, తాను నిర్దోషినని తేలుతుందని ధీమా వ్యక్తంచేశారు.

పొగతాగే 146 ఏళ్ల ఎంబా కన్నుమూత

02/05/2017: జావా : ప్రపంచంలోనే అత్యధిక వయస్సు కలిగిన శతాధిక వృద్ధుడిగా భావిస్తున్న ఇండోనేసియాలోని జావా నగరానికి చెందిన సమర్పాన్‌ సోడిమెజో అలియాస్‌ ఎంబా ఘోటో సోమవారం మరణించారు. ఆయన వయస్సు 146 ఏళ్లు. ఆయన నలుగురు భార్యలు, పది మంది పిల్లలు ఎప్పుడో మరణించారు. ఆయన వయస్సును నిపుణులు అధికారికంగా ధ్రువీకరించకపోయినా గుర్తింపు కార్డుపై ఆయన పుట్టిన తేదీ డిసెంబర్‌ 30, 1870 అని రాసి ఉంది. స్థానికులు కూడా ఆయనకు అంత వయస్సు ఉంటుందనే చెబుతున్నారు. ఎంబా ఘోటో పుట్టిన తేదీ నిజమే అయితే ఆయన గురించి ఎన్నో విశేషాలు చెప్పవచ్చు. ఆయన రెండు ప్రపంచ యుద్ధాలు చూడడమే కాకుండా డచ్‌ ఈస్ట్‌ ఇండీస్‌పై జపాన్‌ దురాక్రమణను కూడా చూసే ఉంటారు. సోవియట్‌ యూనియన్‌లో కమ్యూనిస్టు విప్లవాన్ని తీసుకొచ్చిన వ్లాదిమీర్‌ ఇల్లిచ్‌ లెనిన్‌ కూడా అదే సంవత్సరంలో పుట్టారు. సూయజ్‌ కెనాల్ ప్రారంభమైన ఏడాదికే ఆయన పుట్టారన్నమాట. అంతేకాదు ఘోటో చావుకు కూడా ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచ కార్మిక దినోత్సవమైన మే డే రోజున ఆయన మరణించారు. ఇంత ఎక్కువ కాలం ఆయన బతకడానికి కారణం ఏమిటని గత ఏడాది ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ని మీడియా ప్రశ్నించగా ఆయన ఇచ్చిన సమాధానం మరీ ఆశ్చర్యం కలిగిస్తుంది. చైన్‌ స్మోకింగ్‌ వల్ల ఎక్కువ కాలం బతికినట్లు ఆయన చెప్పారు. ఆయన పుట్టినరోజు వేడుకలకు ఆయన నలుగురు మనవళ్లు హాజరయ్యారు. వారి కథనం ప్రకారం ఘోటో ముప్పూటలా అంబలి తాగుతారు. ఇప్పటి వరకు అధికారిక రికార్డుల ప్రకారం ప్రపంచంలో ఎక్కువ వయస్సు వరకు బతికినది ఫ్రెంచ్‌ మహిళ జియన్నే కాల్మెట్‌. ఆమె 122వ ఏట మరణించారు. ఇప్పటి వరకు అధికారకంగా ఆమె వయస్సును దాటి ఎవరూ బతికి లేరు. ప్రపంచంలో ఏ మనిషి కూడా 125 ఏళ్లకు మించి బతికే ప్రసక్తే లేదని న్యూయార్క్‌లోని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ మెడికల్‌ కాలేజీ పరిశోధకులు ఇప్పటికే తేల్చిచెప్పారు. అయితే ఘోటో తరహాలోనే నైజీరియాకు చెందిన ఓలో ఫిన్తూయీ 171 ఏళ్లు, ఇథియోపియాకు చెందిన ధాకబో ఎబ్బా 163 ఏళ్లు బతికినట్లు చెబుతారు.

పాఠశాలల్లోకి మినీ అంగన్‌వాడీలు

02/05/2017: ఖమ్మం: ఉమ్మడి జిల్లాల్లోని మినీ అంగన్‌వాడీలు ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం కానున్నాయి. ఈ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కేజీ టూ పీజీ పథకంలో భాగంగా వీటిని పాఠశాలల్లో విలీనం చేయాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మినీ అంగన్‌వాడీ కేంద్రాలు కనుమరుగవుతాయి. ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తల హోదాను కూడా మార్చిన విషయం విదితమే. ఖమ్మం జిల్లాలో 817, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 626 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాలను దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని రాష్ట్ర అధికారుల నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ఐసీడీఎస్‌ అధికారులు ఏయే కేంద్రాలు పాఠశాలలకు దగ్గరగా ఉన్నాయో నివేదికలను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే రెండు జిల్లాల్లో మినీ అంగన్‌వాడీ సెంటర్లను పాఠశాలలకు తరలించే పనిలో పడ్డారు. కొన్ని కేంద్రాలు సమీపంలోని ప్రాథమిక పాఠశాలల్లోకి తరలిపోయాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి చిన్నారులకు ఆ పాఠశాలల్లోనే విద్యాబోధన జరగనుంది. అంగన్‌వాడీల హోదా మార్పు.. మినీ అంగన్‌వాడీ కేంద్రాలను పాఠశాలల్లోకి మార్చే ప్రక్రియ కొనసాగుతుండగా.. ఇప్పటికే ఈ కేంద్రాల్లో పాఠాలు బోధించిన అంగన్‌వాడీల హోదాను మార్పు చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలుగా ఉన్న వీరిని అంగన్‌వాడీ టీచర్లుగా మార్చిన విషయం తెలిసిందే. దీంతో వీరు ఇకనుంచి పాఠశాలల్లో పాఠాలు బోధించాల్సి ఉంటుంది. తప్పని పనిభారం.. ఇప్పటి వరకు మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసిన అంగన్‌వాడీ టీచర్లు పిల్లలకు ఆటపాటలతో కూడిన చదువు చెప్పడం, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం వంటి పనులు చేసేవారు. అయితే ఇప్పుడు వీరిని పాఠశాలల్లో టీచర్లుగా నియమించడంతో.. అటు సమయం ప్రకారం పాఠాలు బోధించడంతోపాటు ఇటు అంగన్‌వాడీ కేంద్రాల్లోని పనులు కూడా చేయాల్సి ఉంటుంది. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం, వారికి పిల్లల పెంపకం, గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. దీంతో వీరికి పనిభారం పడనుంది.

మోదీ రథాన్ని ఆపలేరు - అమిత్‌ షా

26/04/2017: సిలిగురి (పశ్చిమ బెంగాల్‌): మోదీ రథాన్ని ఆపే శక్తి తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ)కు లేదని.. బెంగాల్‌లో ‘కమలం వికసిస్తుంది’అని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం బెంగాల్‌కు వచ్చిన షా నక్సల్బరీలో స్థానిక కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ‘తృణమూల్‌ కాంగ్రెస్‌ మోదీజీ రథాన్ని ఆపగలనని అనుకుంటోంది, కానీ అది దాని తరం కాదు. ఇక్కడ ఎంత ఎక్కువగా మమ్మల్ని ఆపాలని ప్రయత్నిస్తే కమలం అంతలా వికసిస్తుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి అత్యధిక సీట్లు వస్తాయి. ఇందుకు దేశ ప్రజలే సాక్ష్యం’అని షా అన్నారు. ఒకప్పుడు అభివృద్ధిలో ముందుండే బెంగాల్‌ ఇప్పుడు వెనకబడిందని, నిరుద్యోగం ప్రబలిందని షా పేర్కొన్నారు. తృణమూల్‌ ప్రభుత్వం మైనారిటీలను బుజ్జగిస్తోందని ఆయన ఆరోపించారు. మోదీ ‘సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌’నినాదాన్ని పేర్కొంటూ అభివృద్ధి దేశం నలుమూలలకూ చేరుతుందన్నారు.

రూ.కోటి విలువైన స్థలం దానం

26/04/2017: పులివెందుల రూరల్‌: వైఎస్సార్‌ జిల్లా పులివెందుల పట్టణం అంబకపల్లె రోడ్డులోని పాల్‌రెడ్డి ఎంపీయూపీ స్కూలు భవనాన్ని, స్థలాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త వైఎస్‌ ప్రకాష్‌రెడ్డి (వైఎస్‌ రాజారెడ్డి సోదరుడు చినకొండారెడ్డి కుమారుడు) సతీమణి వైఎస్‌ పద్మావతి, కుమారుడు వైఎస్‌ మదన్‌మోహన్‌రెడ్డి (వైఎస్‌ మధు) వైఎస్సార్‌ జిల్లా పరిషత్‌కు దానం చేశారు. మంగళవారం ఎంపీడీవో అక్రమ్‌ బాషా, సూపరింటెండెంట్‌ ముకుందారెడ్డిలను కలసి 454/2 సర్వే నంబరులోని 21 సెంట్ల స్థలాన్ని, అందులోని భవనాన్ని జెడ్పీకి దానపత్రం రాసి ఇచ్చారు. దీనివిలువ ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం రూ.కోటికిపైగా ఉంటుంది. ఇంతటి విలువైన స్థలాన్ని జిల్లా పరిషత్‌కు దానం చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ పద్మావతి, వైఎస్‌ మదన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత వైఎస్‌ పాల్‌ జగన్‌మోహన్‌రెడ్డి (వైఎస్‌ ప్రకాష్‌రెడ్డి కుమారుడు) జ్ఞాపకార్థం ఈ భవనాన్ని, స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించినట్లు చెప్పారు. పేదలకు మెరుగైన విద్యనందించాలన్నదే వైఎస్‌ కుటుంబ లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఈ పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్దడమే తమ ఆశయమని చెప్పారు.

ఒక్క దెబ్బతో ఏడాదికి 15 సెలవులు రద్దు!

26/04/2017: లక్నో : తెలుగు రాష్ట్రాల్లో ఏడాదికి ఎన్ని సెలవులు ఉంటాయి? పండుగలు, ప్రముఖుల పుట్టినరోజులు అన్నీ కలిపినా మహా అయితే 15-20కి మించవు. కానీ ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ఇన్నాళ్ల బట్టి ఏకంగా 42 పబ్లిక్ హాలిడేలు ఉన్నాయి. వాటి మీద ఒక్కసారిగా కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వేటు వేశారు. ఒకేసారి మొత్తం 15 సెలవులు రద్దుచేశారు. ఈ మేరకు యోగి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రముఖుల జయంతులు, వర్ధంతుల సందర్భంగా ఇస్తున్న సెలవుల్లో చాలావరకు రద్దు చేస్తూ నిర్ణయించారు. ఈ రోజులన్నీ ఇన్ని సెలవులు ఉంటే ప్రభుత్వ కార్యాలయాలు ఇక పనిచేసేది ఎప్పుడని సీఎం యోగి మండిపడ్డారు. రోజుకు 18-20 గంటలు పనిచేయగలిగితేనే తనతో ఉండాలని, లేకపోతే ఎవరి దారి వాళ్లు చూసుకోవచ్చని ముందే చెప్పిన యోగి.. ఇప్పుడు సెలవులను కూడా తగ్గించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన సభలోనే సూచనప్రాయంగా ఆయనీ విషయం వెల్లడించారు. ప్రముఖుల జయంతులప్పుడు స్కూళ్లకు సెలవులు ఇవ్వొద్దని, ఆరోజు ప్రత్యేకంగా తరగతులు నిర్వహించి వాళ్ల గొప్పదనం గురించి రెండు గంటల పాటు పిల్లలకు చెప్పాలని అన్నారు. అధికారులు తమ కార్యాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలని, సమయానికి తప్పనిసరిగా ఆఫీసుకు రావాలని ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోను బయోమెట్రిక్ హాజరు పద్ధతిని ప్రవేశపెట్టారు. పబ్లిక్ హాలిడేలలో 15 రద్దు చేస్తున్న విషయాన్ని కేబినెట్ మంత్రి శ్రీకాంత్ శర్మ ప్రకటించారు. ఆయా రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు కూడా పనిచేస్తాయన్నారు. విద్యార్థులకు వాళ్ల గురించి వివిధ కార్యక్రమాల ద్వారా వివరిస్తారన్నారు. ఇలా ఇప్పటికే ఉన్న సెలవులను రద్దుచేసిన మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు 3 పబ్లిక్ హాలిడేలు ఉంటే సరిపోతుందని, లేదా కనీసం వాటిని 17కు తగ్గించాలని వేతన కమిషన్లు పలు సందర్భాల్లో చెప్పాయి. కానీ, ఉద్యోగ సంఘాల ఒత్తిళ్ల కారణంగా ఏ ప్రభుత్వమూ అంతటి సాహసం చేయలేకపోయింది.

తమిళనాడులో ఉద్రిక్తత: స్టాలిన్ అరెస్టు

25/04/2017: చెన్నై : కరువు నివారణ చర్యలు తీసుకోవాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు మద్దతుగా తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బంద్‌లో భాగంగా తిరువారూరు బంద్‌లో పాల్గొన్న డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. డీఎంకే నేతృత్వంలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్ తదితర పార్టీల పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా బంద్ జరుగుతోంది. దీంతో జనజీవనం స్తంభించింది. రాష్ట్రవ్యాప్తంగా స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతు రుణాలన్నింటినీ మాఫీ చేయాలని, రైతు సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే కావేరీ యాజమాన్య బోర్డును ఏర్పాటుచేయాలని, కావేరీ డెల్టా ప్రాంతాన్ని ప్రత్యేక వ్యవసాయ జోన్‌గా ప్రకటించాలని, హైడ్రో కార్బన్ ప్రాజెక్టు సహా ఇతర ప్రాజెక్టులను రద్దుచేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్టీలకు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, లారీ అసోసియేషన్ సహా అన్ని పక్షాలు బంద్‌కు మద్దతిచ్చాయి. అధికార అన్నాడీఎంకే, ఇంకా బీజేపీ మాత్రం ఇది రాజకీయ స్టంటు అని కొట్టిపారేశాయి.

నిలకడగా విద్యాసాగర్‌ ఆరోగ్యం

25/04/2017: హైదరాబాద్‌: సాగునీటిరంగ నిపుణుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు రామరాజు విద్యాసాగర్‌రావు ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్స కు స్పందిస్తున్నారని కాంటినెంటల్‌ ఆస్పత్రి డాక్టర్లు సోమవారం వెల్లడించారు. ఈ మేరకు ఆస్పత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ గురు ఎన్‌.రెడ్డి మధ్యాహ్నం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. రెండ్రోజులుగా ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని, ఆస్పత్రి ప్రత్యేక డాక్టర్ల బృందం ఆయనను నిరంతరం పరీక్షిస్తోందని చెప్పారు. వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని, ఆరోగ్యం మెరుగైతే 24 గంటల తర్వాత వెంటిలెటర్‌ తొలగిస్తామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారని వివరించారు. కాగా, విద్యాసాగర్‌రావు చనిపోయారంటూ టీవీ చానళ్లు, సోషల్‌ మీడియాలో జరిగిన ప్రచారం నిజం కాదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

తమిళనాడులో స్తంభించిన జనజీవనం

25/04/2017: చెన్నై: రైతులకు మద్దతుగా అఖిలపక్షాల ఆధ్వరంలో జరుగుతున్న రాష్ట్ర బంద్ తో మంగళవారం తమిళనాడులో జనజీవనం స్తంభించింది. దుకాణాలు, హోటళ్లు మూతబడ్డాయి. ఆటో, వ్యాన్, లారీ, ప్రైవేటు వాహనాల సంస్థలు బంద్‌కు మద్దతు ప్రకటించడంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. రాజధాని చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో బంద్‌ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. సినిమా థియేటర్లలో ప్రదర్శనలు, షూటింగ్‌లు ఆగిపోయాయి. రైల్‌ రోకోలు, రాస్తారోకోలకు డీఎంకే నేతృత్వంలోని అఖిల పక్షం సిద్ధమైంది. తమిళ మానిల కాంగ్రెస్, బీజేపీ, పీఎంకేలు బంద్‌కు దూరం అని ప్రకటించగా, ఎండీఎంకే మాత్రం తటస్థంగా వ్యవహరిస్తోంది. డీఎంకే, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకేల అనుబంధ రవాణా సంస్థలు బంద్‌ ప్రకటించడంతో ప్రభుత్వ బస్సుల సేవలు ఆగే అవకాశాలు ఉన్నాయి. ఆటో, వ్యాన్, లారీ, ప్రైవేటు వాహనాల సంస్థలు బంద్‌కు మద్దతు ప్రకటించడంతో ఆ సేవలు ఆగినట్టే. అన్ని రకాల సేవల నిలుపుదలతోపాటుగా, తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేసే విధంగా రైల్‌రోకోలు, రాస్తారోకోలు సాగించేందుకు నేతలు సిద్ధం అయ్యారు. తిరువారూర్‌లో జరిగే నిరసనకు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ నేతృత్వం వహించనున్నారు. అన్ని రకాల సేవలు బంద్‌ కానున్న నేపథ్యంలో అన్నా కార్మిక సంఘం ద్వారా బస్సుల్ని రోడ్డెక్కించేందుకు రవాణా మంత్రి ఎంఆర్‌ విజయ భాస్కర్‌ చర్యలు చేపట్టారు. బస్సుల మీద ప్రతాపం చూపించే యత్నం చేస్తే కఠినంగా వ్యవహరింస్తామని హెచ్చరికలు చేశారు. ఈ బంద్‌ను అడ్డుకునే విధంగా రాష్ట్రవ్యాప్తంగా భద్రతను ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. లక్షల మంది సిబ్బంది భద్రతా విధుల్లో నిమగ్నం అయ్యారు. ఈ బంద్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్‌ వ్యతిరేకించారు. బంద్‌ ముసుగులో శాంతి భద్రతల విఘాతానికి కుట్రలు సాగుతున్నాయని ఆరోపించారు. ఇక, ఢిల్లీలో నిరసనకు విరామం ఇచ్చిన రైతు నాయకుడు అయ్యాకన్ను నేతృత్వంలోని 70 మంది అన్నదాతలు చెన్నైకు తిరుగు పయనం అయ్యారు. మంగళవారం ఉదయం చెన్నైకు చేరుకునే ఈ బృందం రైల్‌ రోకో చేయాలని నిర్ణయించడంతో చెన్నై సెంట్రల్, ఎగ్మూర్‌ స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బంద్‌ నేపథ్యంలో రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉందని చాటుకునే రీతిలో ఆగమేఘాలపై పంట బీమా నష్ట పరిహారం పంపిణీకి సీఎం ఎడపాడి కే పళనిస్వామి చర్యలు తీసుకోవడం గమనార్హం. సోమవారం సాయంత్రం సచివాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పలువురు రైతులకు పరిహారం పంపిణీ చేశారు.

బాహుబలికి రోజుకు 5 షోలు?

24/04/2017: హైదరాబాద్ : బాహుబలి-2 సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండంటంతో ఆ సినిమా నిర్మాతలు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను కలిశారు. రోజుకు 5 షోలు ప్రదర్శించేందుకు అనుమతించాలని ఆయనను కోరారు. ఆ అంశాన్ని తప్పకుండా పరిశీలిస్తామని వారికి తలసాని హామీ ఇచ్చారు. అయితే, మొదటి 15 రోజుల పాటు అన్ని థియేటర్లలోను కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే టికెట్లు విక్రయించాలని, బ్లాక్‌లో టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని బాహుబలి నిర్మాతలకు తెలిపారు.

హెడ్‌కానిస్టేబుల్‌ సెక్స్‌ రాకెట్‌ గుట్టురట్టు

24/04/2017: బెంగళూరు: అతడు ఓ పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌. అది కూడా క్రైం బ్రాంచ్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కానీ, పైకి మాత్రం పోలీసుగా ఉంటూ ఎవరికీ తెలియకుండా నేరప్రవృత్తిని చేస్తూ చివరికి బయటపడ్డాడు. గుట్టుచప్పుడు కాకుండా హైటెక్‌ వ్యభిచారం నడిపిస్తూ ఆఖరికి పట్టుబడ్డాడు. ఈ వ్యవహారం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు అతడు డిజిటల్‌ లావాదేవీలు కొనసాగిస్తుండటం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని పరప్పణ అగ్రహార పోలీస్‌ స్టేషన్‌లో కరిబసప్ప అనే ఓ వ్యక్తి క్రైం బ్రాంచ్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతడు గత కొంత కాలంగా హైటెక్‌ వ్యభిచారం చేయిస్తున్నాడు. గతవారమే ఈ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు. ఓ ఇంటి నుంచి ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకోవడంతోపాటు స్వైపింగ్‌ మిషన్లు, పెద్ద మొత్తంలో డబ్బు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ వ్యవహారానికి తనకు ఎలాంటి సంబంధం లేదని హెడ్‌ కానిస్టబుల్‌ అంటున్నాడు. ప్రస్తుతం అతడిని జ్యూడిషియల్‌ కస్టడీకి పంపించారు.

పవన్‌ మానసిక స్థితి సరిగ్గా లేదు: బీజేపీ

24/04/2017: హైదరాబాద్‌: జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మానసిక సమతుల్యత లేకుండా మాట్లాడుతున్నట్లు ఉందని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌ రావు ఎద్దేవా చేశారు. చిత్ర విచిత్రంగా ప్రవర్తించడానికి రాజకీయాలంటే సినిమా కాదని ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. దేశం మొత్తాన్ని టీం ఇండియాలా నడిపిస్తున్న ప్రధాని పనితీరుపై పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. సమగ్ర జాతీయత అనేది బీజేపీ ప్రాథమిక సిద్ధాంతమని, అంతే తప్ప ఉత్తర, దక్షిణ లాంటి విభేదాలేమీ లేవని చెప్పారు. పవన్‌ తన సినిమాల్లో మాదిరిగా ట్విట్టర్‌లో చిత్ర విచిత్రంగా పోస్టింగ్స్‌ పెడుతున్నారని, పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. మీ అన్న ప్రజారాజ్యం పెట్టి మంచి ధరకు దాన్ని అమ్మేశారని.. మరి మీ పార్టీ పరిస్థితి ఏంటని కృష్ణసాగర్ రావు ప్రశ్నించారు. కేంద్రాన్ని విమర్శించేటప్పుడు దానికి ఆధారాలు ఉండాలని, ఇలాంటి ట్విట్టర్‌ కామెంట్లు రాజకీయ నిరుద్యోగతనానికి నిదర్శనమని విమర్శించారు.

‘ఉత్తమ్‌ అన్నట్లు తెలంగాణ మా జాగీరే’

18/04/2017: కరీంనగర్‌: కాంగ్రెస్‌ పార్టీపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నిప్పులు చెరిగారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నట్లుగా తెలంగాణ జాగీరే తమదే అని, రాజకీయం చేయడం చేతగాని దద్దమ్మలు కాంగ్రెస్‌ వాళ్లంటూ ఆయన విరుచుకుపడ్డారు. మతాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తోందని తలసాని మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. బీజేపీ పుట్టినప్పటి నుంచే మత పిచ్చి ఉందని, దేశంలో నిజమైన హిందువు కేసీఆర్‌ తప్ప మరొకరు లేరని అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందని మంత్రి తలసాని పేర్కొన్నారు.

నగదు పంపాలంటే.. ఎక్కువ చెల్లించాల్సిందే!

18/04/2017: అబుదాబి : పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లి నాలుగురాళ్లు సంపాదించుకుంటున్న వారికి ఎక్స్చేంజ్ హౌజ్ లు షాకిస్తున్నాయి. యూఏఈలో నివసిస్తున్న వారు సంపాదించిన నగదును తమ స్వదేశాలకు పంపుకోవడం కాస్ట్ లీగా మార్చుతున్నాయి. ఈ వారంలో ఎక్స్చేంజ్ ఏజెన్సీలు రెమిటెన్స్ లపై వసూలు చేసే ఛార్జీలను పెంచినట్టు ప్రకటించాయి. ఏప్రిల్ 15 నుంచి బ్యాంకు ట్రాన్స్ ఫర్ల కు డీహెచ్2(రూ.35.12) వరకు వసూలు చేస్తున్నట్టు పేర్కొన్నాయి. అదేవిధంగా కొన్ని ఎక్స్చేంజ్ లపై కూడా ఫీజులను ఏప్రిల్ మొదటివారం నుంచి పెంచినట్టు తెలిపాయి. ఒకవేళ బ్యాంకు ట్రాన్స్ ఫర్లు డీహెచ్1000(సుమారు 17 561 రూపాయలు) దాటితే, కస్టమర్లు డీహెచ్22 (386రూపాయలను)ను చెల్లించాల్సి ఉంటుందని మేజర్ ఎక్స్చేంజ్ లు ప్రకటించాయి. అంతకముందు ఈ రేట్ డీహెచ్20(351రూపాయలు)గానే ఉండేది. ఒక్కో లావాదేవీపై వేసే సర్వీసు ఛార్జీల రేట్లను కూడా పెంచినట్టు ఆ ఏజెన్సీలు తెలిపాయి. ఛార్జీలను పెంచిన లీడింగ్ ఎక్స్చేంజ్ హౌజ్ లన్నీ, ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ రెమిటెన్స్ గ్రూప్ లో సభ్యులు. ఇది యూఏఈలోని మనీ ఎక్స్చేంజ్ హౌజ్ లకు అధికారిక ప్లాట్ ఫామ్. అయితే ఈ నిర్ణయం తమది కాదని ఎఫ్ఈఆర్జీ చైర్మన్ మహ్మద్ అల్ అన్సారీ చెప్పారు. సల్వంగా ఛార్జీలు పెంచుకోమనే సూచించామని, వాటిపై తుది నిర్ణయం సభ్యులే తీసుకున్నట్టు పేర్కొన్నారు.

టెలికాంలో 6000 ఉద్యోగాలు గోవింద

18/04/2017: ముంబై : టెలికాం టవర్ సంస్థల ఉద్యోగాల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఇన్ ఫ్రాక్ట్ర్చర్ సంస్థల్లో రెవెన్యూల దెబ్బ, టెలికాం సర్వీసు ప్రొవైడర్ల నుంచి అద్దెలు రాకపోవడం టవర్ సంస్థల్లో ఉద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుతున్నాయి. దాదాపు 6000 ఉద్యోగాలకు గండి కొట్టనున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. వచ్చే ఐదేళ్లలో టెలికాం టవర్ కంపెనీల్లో పనిచేసే 10 శాతం మందికి ఉద్యోగాలు పోతాయని రిక్రూట్ మెంట్ హెడ్స్ అండ్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ లు పేర్కొన్నారు. ప్రస్తుతం టెలికాం టవర్ సంస్థలు 60వేల మంది ఉద్యోగవకాశాలు కల్పిస్తున్నాయి. వీరిలో చాలామంది కాంట్రాక్ట్ ఉద్యోగులే. టెలికాం ఇండస్ట్రీతో సంబంధమున్న సేల్స్, మార్కెటింగ్, కార్పొరేట్ ఆఫీసు ఉద్యోగులపై కూడా ఈ ప్రభావం చాలా దారుణంగా ఉంటుందని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ లు తెలిపారు. కొత్త వ్యక్తుల నియామకాలు కూడా 50 శాతం మేర తగ్గినట్టు తెలిసింది. అయితే స్వల్పకాలంగా టెలికాం టవర్ ఇండస్ట్రి ఒత్తిడిలో కొనసాగినా.. దీర్ఘకాలంలో ఇది మరింత స్ట్రాంగ్ అవుతుందని ఎగ్జిక్యూటివ్ లు పేర్కొంటున్నారు. కంపెనీల విలీనం ప్రస్తుతం ఇండస్ట్రీ ఉద్యోగులను ఆందోళనలో పడేస్తుందని తెలుపుతున్నారు.

సీఎం కేసీఆర్‌ కూలి పనికి ఏర్పాట్లు

17/04/2017: హైదరాబాద్‌: ‘గులాబీ కూలి దినాలు’లో భాగంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తాను కూలీ చేయడానికి పాలకుర్తి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఈ నెల 27న జరగనున్న టీఆర్‌ఎస్‌ 16వ ఆవిర్భావ బహిరంగ సభ కోసం రాష్ట్ర అధ్యక్షుడు మొదలుకుని కిందిస్థాయి కార్యకర్త దాకా కూలి పనిచేసి ఖర్చుల సొమ్ములు సంపాదించుకోవాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చిన విషయం విధితమే. దీనిలో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులు కూలి పనుల ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్‌ కూడా కూలి పనిచేయడానికి పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరును ఎంచుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశామని, కూలి పనికి కూడా ఏర్పాట్లు చేశామని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఆదివారం అసెంబ్లీ లాబీల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇది వరికోతల సమయం కావడంతో వరికోసే పనిని చూశామని, అయితే ఈ పనికి రైతుల నుంచి ఏమీ తీసుకోబోమని అన్నారు. తొర్రూరు వ్యాపార వర్గాల నుంచి సీఎం కూలి పనికి డబ్బులు ఇప్పించే ఏర్పాట్లు జరిగినట్లు చెప్పారు. కనీసం రూ.20 లక్షల కూలీ సొమ్ము వచ్చేలా చూస్తున్నామన్నారు. కాగా, అదే రోజు సీఎం కేసీఆర్‌ పాలకుర్తి మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పాలకుర్తి, బమ్మెర, రాఘవపురం గ్రామాల్లో ఆయన పర్యటించనున్నారు.

టీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవికి కేసీఆర్‌ తరఫున నామినేషన్లు

17/04/2017: హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవికి సీఎం కేసీఆర్‌ తరఫున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు విడతల వారీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌కు వచ్చిన వీరు.. పార్టీ అధ్యక్ష ఎన్నికకు ప్రిసైడింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి నామినేషన్‌ పత్రాలు అంద జేశారు. డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ.. ఉదయం నామినేషన్‌ పత్రాలు అంద జేశారు. ఆయన వెంట మంత్రులు కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఇంద్రకరణ్‌ రెడ్డి ఉన్నారు. మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి వేర్వేరుగా నామినేషన్ల సెట్లు అందజేశారు. జగదీశ్‌రెడ్డి వెంట మంత్రి చందూలాల్, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌ తదితరులు ఉన్నారు. ఎంపీ జితేందర్‌రెడ్డి నేతృత్వంలో ఎంపీల బృందం మరో సెట్‌ను దాఖలు చేసింది. జితేందర్‌రెడ్డి వెంట ఎంపీలు బాల్క సుమ న్, సీతారాం నాయక్, మల్లారెడ్డి ఉన్నారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లు అందరూ కలసి ఒక సెట్‌ వేశారు. ప్రభుత్వ విప్‌లు కొప్పుల ఈశ్వర్, గొంగిడి సునీత, గంప గోవర్ధన్, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కూడా ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. సీఎం తరఫున మొత్తంగా 6 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి.

మళ్లీ వివాదంలో యూఎస్‌ ఎయిర్‌లైన్స్‌

17/04/2017: న్యూయార్క్‌: అమెరికా విమానయాన సంస్థ మరోసారి వార్తల్లో నిలిచింది. ఎంగేజ్‌మెంట్‌ పూర్తయ్యి త్వరలో వివాహం చేసుకోబోతున్న ఓ జంటను యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో నుంచి దింపేసింది. విమానంలోని సెక్యూరిటీ సిబ్బందితో బలవంతంగా బయటకు తోయించింది. ఈ ఘటన శనివారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతకుముందు వైద్యుడైన ఓ ప్యాసింజర్‌ను రక్తం వచ్చేలాగా కొట్టి విమానంలో నుంచి ఈడ్చి పారేసిన ఘటనతో యూఎస్‌ విమానయాన సంస్థ ఇబ్బందుల్లో పడగా వారం తిరగకుండానే ఇది మరో ఘటన. వివరాల్లోకి వెళితే.. మైఖెల్‌ హాల్‌, అంబర్‌ మ్యాక్స్‌వెల్‌ అనే ఇద్దరికీ ఇటీవలె నిశ్చితార్థం అయింది. వారిద్దరు కలిసి హ్యూస్టన్‌ నుంచి టెక్సాస్‌కు బయలుదేరారు. ఆ క్రమంలో ఇద్దరు యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన కోస్టారికా విమానం ఎక్కారు. అయితే, అనూహ్యంగా వారిద్దరి ప్రవర్తన బాగాలేదని, నిబంధనలు పాటించలేదనే కారణంతో వారిని బలవంతంగా దించివేశారు. దీనిపై విమానయాన సంస్థ వివరణ ఇస్తూ వారిద్దరు తాము తీసుకున్న సీట్లలో కాకుండా వేరే సీట్లలో కూర్చున్నారని, పైగా నిబంధనలు పాటించలేదని చెప్పారు. దీంతో ప్రవర్తన సరిగా లేదని దిగిపోవాలని చెప్పారే తప్ప వారినెవరూ బలవంతంగా దించివేయలేదని అన్నారు. పైగా వారికి రాత్రి పూట ప్రత్యేకంగా బస ఏర్పాటు చేసి మరో విమానం టికెట్లు ఇచ్చి ఉదయాన్నే పంపిచామని వివరణ ఇచ్చారు. అయితే, తమకు అప్‌గ్రేడ్‌ సీట్లు ఇవ్వమన్నా ఇవ్వలేదని, తమ సీట్లలో ఎవరో వ్యక్తి కాళ్లు పెట్టి నిద్రపోయాడని, అందుకే తాము వేరే సీట్లలో కూర్చున్నట్లు చెప్పారు.

మతపరమైన రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం - దత్తాత్రేయ

15/04/2017: మతపరమైన రిజర్వేషన్‌ల అమలుకు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వబోదని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్‌ ఎస్‌డీ రోడ్‌ గ్రాండ్‌మినర్వా ప్రాంతంలో అకీష ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్‌ వాటర్‌ క్యాంపును ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌తో కలసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ల విషయంలో తమిళనాడులో అమలవుతున్న విధానాలను బేరీజు చేసుకుంటూ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. వేసవి కాలంలో బాటసారుల దాహర్తిని తీర్చేందుకు ఇటువంటి కేంద్రాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, నిర్వాహకుడు బండపల్లి సతీష్‌ పాల్గొన్నారు.

‘బీజేపీని ఓడించేందుకు ఎవ్వరితోనైనా సై’

15/04/2017: లక్నో: బీజేపీని ఓడించడమే తన లక్ష్యం అని బీఎస్పీ అదినేత్రి మాయావతి శపథం చేశారు. అందుకోసం ఏ పార్టీతోనైనా తాను చేతులు కలిపేందుకు సిద్ధమని ప్రకటించారు. విషాన్ని(పరోక్షంగా బీజేపీని ఉద్దేశిస్తూ) విషంతోనే దెబ్బకొట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యానించారు. 20 ఏళ్ల కిందట సమాజ్‌వాది పార్టీతో పొత్తుపెట్టుకొని విడిపోయిన ఆమె ఈ వ్యాఖ్యల ద్వారా తొలిసారిగా బహిరంగంగా ఎస్పీతో పొత్తుకు కూడా స్వాగతం అంటూ పరోక్షంగా చెప్పారు. అంబేద్కర్‌ జయంతి మాట్లాడిన ఆమె భవిష్యత్తులో బహుజన ఉద్యమం తీసుకొచ్చేందుకు, మత శక్తులను నిలువరించేందుకు ఇతర పార్టీలతో సత్సంబంధాలు అవసరం అని ఆమె అన్నారు. అంతకుముందు సమాజ్‌వాది పార్టీ నేత రాజేంద్ర చౌదరీ మాట్లాడుతూ దేశంలో లౌకిక రాజకీయాలు రక్షించేందుకు మేం ఏమైనా చేస్తాం. విభజన శక్తులను అడ్డుకోవాలి. మాలాగా ఆలోచించే పార్టీలన్నీ కూడా కలిసి రావాలి. కావాలంటే బీఎస్పీ కూడా’ అని చెప్పారు. అయితే, అలాంటి కూటమి ఒకటి వస్తే దానికి నాయకత్వం ఎవరు వహిస్తారనే దానిపై మాత్రం బదులివ్వలేదు.

పట్టాలు తప్పిన రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్‌

15/04/2017: లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం మీరట్‌- లక్నో రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. రాంపూర్‌, ముందపండా స్టేషన్‌ల మధ్య గల బ్రిడ్జి సమీపంలో రైలు ఎనిమిది బోగీలు పట్టాలు తప్పినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి తీవ్రగాయాలు కాలేదని ఉత్తర రైల్వే సీపీఆర్‌ఓ నీరజ్‌ శర్మ వెల్లడించారు. సహయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రమాదంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైలు ప్రమాదంలో గాయపడిన వారికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నష్టపరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 25 వేలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. రైలు ప్రమాదం ఘటనపై విచారణకు ఆదేశించినట్లు రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గత నవంబర్‌లో ఇండోర్‌- పాట్నా ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పిన ఘటనలో 142 మంది మృతి చెందగా.. 200 మంది గాయపడిన విషయం తెలిసిందే.

మసాయిపేట్ గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 126 వ జయంతి వేడుకలు

14/04/2017: యాదాద్రిభువనగిరి: యాదగిరిగుట్ట మండలం మసాయిపేట్ గ్రామంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డా.. బిఆర్ అంబేద్కర్ 126 వ జయంతి వేడుకలు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలర్పించిన మండల తెరాస నాయకుడు గొట్టిపర్తి బాలరాజు గౌడ్ ,బుడిగే నర్సింగరావు,తెరాస నాయకులు, యువకులు. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు గుర్తుచేసుకున్నారు.

అమెరికా అతిపెద్ద బాంబుకు కేరళవాసి బలి

14/04/2017: కాబూల్‌: నేలమాళిగల్లో దాగిన ఇస్లామిక్‌ తీవ్రవాదులను లక్ష్యంగా చేసుకొని అమెరికా జరిపిన బాంబు దాడిలో కేరళకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’(ఎంఓఏబీ)గా పిలుచుకునే ప్రపంచంలోని అతి పెద్ద బాంబును ఆఫ్గనిస్తాన్‌పై అమెరికా ప్రయోగించిన విషయం తెలిసిందే. కేరళకు చెందిన ముర్షీద్‌ అహ్మద్‌ అనే వ్యక్తి కొంత కాలం క్రితం ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థలో చేరాడు. ఈ మేరకు తాను ఐసీస్‌లో చేరినట్లు తండ్రికి అహ్మద్‌ టెలిగ్రాం చేశాడు. కాగా.. గురువారం అమెరికా ప్రయోగించిన అతిపెద్ద బాంబు దాటికి మొత్తం 36 మంది ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో అహ్మద్‌ కూడా ఉన్నట్లు సమాచారం అందింది. కేరళ నుంచి మొత్తం 21 మంది ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థలో చేరగా.. వీరిలో ఇప్పటికే నలుగురు ఆఫ్గనిస్తాన్‌లో జరిగిన వేరువేరు ఘటనల్లో మృతి చెందారు.

జియో రైస్‌ వచ్చేశాయ్‌..!

14/04/2017: రామగుండం(పెద్దపల్లి): బంపర్ ఆఫర్.. భారీ బొనాంజా.. క్రేజీ సమ్మర్.. ఇలా ఎన్నేన్నే ఆఫర్లతో వినియోగదారుల మనసు దోచుకుంటూ.. ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలు చూపెడుతోంది రిలయన్స్ జియో నెట్ వర్క్! జనంలో జియో పట్ల పెరిగిన ఆసక్తి అంతా ఇంతాకాదు. ఎక్కడ పదిమంది కలిస్తే అక్కడ చర్చ జియోపైనే! సరిగ్గా ఈ క్రేజ్ నే క్యాష్ చేసుకుంటున్నారు రైస్ మిల్లర్లు. పెద్దపల్లి జిల్లా రామగుండం సహా పలు పట్టణాలకు చెందిన కొందరు రైస్ మిల్లర్లు.. 25 కేజీల సంచులపై జియో లోగోను ముద్రించి సన్నరకం బియ్యం షాపులకు సరఫరా చేస్తున్నారు. ఈ పోకడకు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జియో నెట్ వర్క్ లోకి ఒక్కసారి రిజిస్టర్ అయితే మూడు నెలలు ఉచిత కాల్స్, డేటా ఇచ్చిన విధంగా.. 'జియో బియ్యంతో ఒక్కసారి అన్నం తింటే మూడు నెలల దాకా ఆకలి కాదు' అంటూ నెటిజన్లు చవాకులు పేలుస్తున్నారు. బ్రాండ్ ను సొంతం చేసుకునే ఈ తరహా మార్కెటింగ్ ఐడియాలు కొత్తేమీ కావు. సంక్రాంతి, దీపావళి సీజన్లలో హిట్ సినిమాల పేర్లు, హీరోల పేర్లతో పతంగులు, పటాకులు తెలిసినవే. పలు ఉత్పత్తులపై ప్రధాని మోదీ బొమ్మను సైతం ముద్రించి వ్యాపారాలు సాగించిన సందర్భాలను చూశాం.

వికారాబాద్‌లో ప్రధాని సతీమణి

14/04/2017: వికారాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీ సతీమణి యశోదాబెన్‌ శుక్రవారం జిల్లాకు విచ్చేశారు. జిల్లాకేంద్రంలోని నాగదేవత ఆలయానికి విచ్చేసిన ఆమె నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రధాని భార్య ఆలయానికి వచ్చిందనే విషయం తెలుసుకున్న స్థానికులు ఆమెను చూడటానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.

దేశంలో నోట్ల కొరత.. గుజరాత్ లో నోట్ల వర్షం

28/12/2016: వ్యాపారులంతా అక్కడే ఉంటారు. అంతేనా. కాదు కాదు. ఇంకా చాలా ఉంది. అసలు గుజరాతీయుల రక్తంలోనే వ్యాపారం ఉంది. ఎస్. ఇదీ సరైన పాయింట్. గుజరాతీల రక్తంలో బిజినెస్ ఉంది. అందుకే దేశంలో ఏ మూల చూసినా గుజరాతీ బిజినెస్ మేన్ హవా కనిపిస్తోంది. గుజరాత్ లో ఉద్యోగాలు చేసేవాళ్ల కంటే వ్యాపారులు చేసేవాళ్లకే డిమాండ్ ఎక్కువ. అలాంటి చోట డబ్బుకు లేటేముంది చెప్పండి. సాధారణ రోజుల్లోనే కాదు.. దేశంలో నగదు కష్టాలు ఉన్న సమయంలో కూడా గుజరాత్ లో మాత్రం ఫుల్ క్యాష్ ఉంది. ఎంతగా అంటే గానా బజానాలో సింగర్స్ పై నోట్ల వర్షం కురిపించేంతగా. ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా. పోవాల్సిందే మరి. ఎందుకుంటే ఎంతైనా ఇది గుజరాత్ వింత కదా. విషయమేమిటంటే గుజరాత్ నవ్ సేరిలో ఓ భజన కార్యక్రమం జరిగింది. కానీ సింగర్స్ ఆలపించిన మాటలకు మైమరిచిపోయిన శ్రోతలు.. రెచ్చిపోయి డాన్స్ చేశారు. అంతేనా అంతటితో ఆగకుండా సింగర్స్ పై పది, ఇరవై నోట్లు విసిరారు. ఆ ఏముందిలే అనుకుంటున్నారా. విసిరిన నోట్ల విలువ ఏకంగా 40 లక్షలు. ఇప్పుడిదే దేశంలో హాట్ టాపిక్. అసలు వీళ్ల దగ్గరకు అన్ని డబ్బులు ఎక్కడ్నుంచి వచ్చాయో మనకు అర్థం కాదు లెండి.

దిగితే దంచేవాడినంటున్న ఒబామా

28/12/2016: అమెరికా అధ్యక్ష ఎన్నికలు అయిపోయాయి. రిజల్ట్ కూడా వచ్చేసింది. ట్రంప్ అధ్యక్షుడిగా లాంఛన ప్రాయపు ఎంపిక కూడా ముగిసింది. ఇక కేవలం ట్రంప్ ప్రమాణస్వీకారమే మిగిలింది. ఇప్పటికే అమెరికాలో ట్రంప్ జపం ఎక్కువైంది. చివరకు వైట్ హౌస్ అధికారులు కూడా కొన్ని విషయాల్లో ట్రంప్ ను సంప్రదిస్తున్నట్లు టాక్. ఇలాంటి సమయంలో ఒబామా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు హీటు పుట్టిస్తున్నాయి. తాను బరిలోకి దిగి ఉంటే ట్రంప్ ను ఓడించి ఉండేవాడినని ధీమా వ్యక్తం చేశారు ఒబామా. హిల్లరీ ప్రచారంలో కూడా లోపం లేదని, అయితే కాలం కలిసిరాలేదంటున్నారు ఒబామా. మరోవైపు ఒబామా కామెంట్స్ పై ట్రంప్ ట్విట్టర్లో స్పందించారు. ఒబామాకు అంత సీన్ లేదని, పగటి కలలు కంటున్నారనే అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. ఒబామా కేర్, ఐఎస్ఐఎస్ , ఉద్యోగాల సంక్షోభంతో ఆయనెలా గెలుస్తారో తనకు అర్థం కావడం లేదన్నారు ట్రంప్. మొన్నటిదాకా బాగానే ఉన్న ఒబామా, ట్రంప్.. ఇప్పుడు మళ్లీ మాటల యుద్ధం చేసుకుంటున్నారు. మన దేశంలో మాదిరిగా బజార్న పడి తిట్టుకోపోయినా.. అమెరికాలో ఈ మాత్రం కామెంట్స్ ను కూడా సీరియస్ గానే తీసుకుంటారు. మొత్తం మీద హిల్లరీని ఓడించాడన్న కసి ట్రంప్ మీద ఒబామాకు బాగా ఉన్నట్లుంది.

ట్రావెల్స్ పాలిటిక్స్

28/12/2016: ఉమ్మడి రాష్ట్రంలో బస్సు మాఫియా హవా అంతా ఇంతా కాదు. చివరకు ప్రయాణికుల్ని పొట్టనపెట్టుకున్నా అడిగే నాథుడు ఉండేవాడు కాదు. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపించడంతో కొన్నాళ్లుగా బస్సు మాఫియా స్తబ్ధుగానే ఉంది. కానీ ట్రావెల్స్ పై మరోసారి చర్చ లేవనెత్తారు టీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్. పాలెం బస్సు ప్రమాద ఘటనలో బాధితులకు ఇంకా నష్టపరిహారం ఇవ్వలేదని దివాకర్ ట్రావెల్స్ అధినేత జేసీ ప్రభాకర్ రెడ్డిని టార్గెట్ చేశారు. బాధితులు తన నియోజకవర్గంలోనే ఉండటంతో.. శ్రీనివాస్ గౌడ్ కు స్పందించక తప్పలేదు. విమర్శలతో సరిపెట్టకుండా జేసీకి సవాల్ విసిరి హైదరాబాద్ ఆర్టీఏ ఆఫీస్ కు వచ్చారు శ్రీనివాస్ గౌడ్. శ్రీనివాస్ గౌడ్ సవాల్ ను స్వీకరించిన జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అనంతపురం నుంచి ఖైరతాబాద్ ఆర్డీఏ ఆఫీస్ కు వచ్చారు. అయితే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో గొడవ మొదలైంది. తాను ఆంధ్రా కాబట్టే అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు జేసీ. తానే తప్పు చేయలేదని, అన్ని బస్సులకు ట్యాక్స్ కట్టానని, పర్మిట్ ఉందని చెబుతున్నారు. జేసీ అక్రమాలు చేశారని శ్రీనివాస్ గౌడ్ ఆరోపిస్తుంటే.. జేసీ మాత్రం కొట్టిపారేస్తున్నారు. శ్రీనివాస్ గౌడ్ విషయం తెలియకుండా మాట్లాడుతున్నారని, ఆరెంజ్ ట్రావెల్స్ చెప్పేదంతా నిజం కాదన్న విషయం.. ఆయన అర్థం చేసుకోవాలన్నారు. ఎంతోమంది ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్స్ ఉంటే.. తననే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని నిలదీశారు జేసీ ప్రభాకర్ రెడ్డి.

చెక్కు చెల్లకపోతే.. జైలు కెళ్లాల్సిందే

28/12/2016: చెక్ బౌన్స్ అయితే ఏమౌతుంది. మహా అయితే కేసు పెడతారు. బెయిల్ తెచ్చుకుంటారు. దర్జాగా తిరుగుతారు. కేసు తేలేలోపు ఏళ్ళు పడుతుంది. ఈలోపు ఎవరు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. కానీ ఇప్పట్నుంచీ అలా కుదరదు. బౌన్స్ చెక్ ఇస్తే జైలు కెళ్లాల్సిందేనంటోంది కేంద్రం. అందుకు అనుగుణంగా ప్రస్తుత చట్టంలో మార్పులు తెస్తుంది. కొత్త చట్టం ప్రకారం చెక్ బౌన్స్ అయితే.. రెండు పార్టీలకు నెల రోజులు గడువిస్తారు. ఈలోగా సమస్య పరిష్కరించుకుంటే సరే. అయినా చెక్ క్యాష్ కాకపోతే.. బెనిఫీషియరీకి చెక్ ఇచ్చినవాళ్లను జైలుకు పంపొచ్చు. కేవలం చెక్ బౌన్స్ కేసులే దేశవ్యాప్తంగా 18 లక్షలు పెండింగ్ లో ఉండటంతో.. కేంద్రం వీటిపై దృష్టి సారించింది. ఇంత చిన్న విషయానికి కూడా ఏళ్ల తరబడి విచారణ అవసరం లేదని భావిస్తున్న కేంద్రం.. చట్టం మారుస్తోంది. పైగా క్యాష్ లెస్ ఇండియాలో చెక్కులకే ప్రాధాన్యత ఉంది కాబట్టి..ముందుగానే కఠిన చట్టం తెస్తోంది. అన్నీ అనుకూలిస్తే వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కొత్త చట్టం పార్లమెంట్ ఆమోదం పొందే అవకాశం ఉంది. ఇప్పటికే చెక్కు ఇచ్చినవారికి కాకుండా చెక్కు తీసుకున్నవారికి ప్రయోజనం ఉండేలా కొన్ని నిబంధనలు మార్చిన కేంద్రం.. ఇప్పుడు చెక్కు తీసుకున్నవాళ్లకే మొత్తం ప్రయోజనం కట్టబెట్టే విధంగా చట్టంలో మార్పులు చేస్తోంది.

పట్టపగలే బరితెగించిన దొంగ

28/12/2016: దొంగలు తెలివిమీరారు. ఇది చాలా పాత మాట. దొంగలకు ధైర్యం పెరిగింది. ఇందులో కూడా వింతేమీ లేదు. దొంగ పోలీసుల ముందే దొంగతనం చేయాలని చూశాడు. అదేంటి.. ఇది కొత్తగా ఉంది కదా. ఎస్. జరిగింది ఇదే. కాకపోతే మన దేశంలో కాదు లెండి. చైనాలో. చైనా మీజూ సిటీలో ఆదివారం ఉదయం ఐదున్నరకు అందరూ మంచి నిద్రలో ఉన్నారు. హాలిడే కాబట్టి జాలీమూడ్ తో కలలు కంటున్నారు. అప్పుడే హఠాత్తుగా ప్రొక్లెయిన్ శబ్దాలు వినిపించాయి. ఏదో బిల్డింగ్ కూలగొడుతున్నారనుకున్నారు జనం. వచ్చి చూసినోళ్లు కూడా కొత్త బిల్డింగ్ కడతారని భావించారు. కానీ పోలీసులొచ్చాకే అసలు సీనేంటో తెలిసింది. చైనా కన్ స్ట్రక్షన్ శాఖ భవనాన్ని కూల్చుతున్న సదరు దొంగ గారు.. ఆ పక్కనే ఉన్న ఏటీఎం దోపిడీకి స్కెచ్చేశారు. సైలంట్ గా పని పూర్తిచేస్తే థ్రిల్లేముంది అనుకున్నాడో.. ఏమో.. ఏకంగా తాను పనిచేసే చోట నుంచి ప్రొక్లెయిన్ తెచ్చేసి కూల్చడం మొదలుపెట్టాడు. పోలీసులొచ్చినా కూడా ధైర్యంగా తన పని తాను పూర్తిచేయడం జనాలకు మరింత ఆశ్చర్యం కలిగించింది. పట్టపగలు ఏటీఎంను ప్రొక్లెయిన్ తో కూల్చుతున్న దొంగను చూసి పోలీసులు కూడా బిత్తరపోయారు. అసలు ఇతడు నిజంగా దొంగేనా.. లేదంటే మానసిక రోగా అనే కోణంలో విచారిస్తున్నారు. ప్రస్తుతం సదరు దొంగ గారని డాక్టర్లు పరీక్షిస్తున్నారు. రిపోర్టులు వస్తేగానీ దొంగ బాగోతం బయటపడదు.

రైల్వేస్టేషన్లే కళ్యాణ మండపాలు

28/12/2016: రైల్వేశాఖ నూతన సంవత్సరంలో కొత్తగా మరో పని మొదలుపెడుతోంది. ప్రయాణికుల్ని సుఖంగా గమ్యం చేర్చడమే కాదు.. జీవనగమ్యంలో కూడా సుఖప్రయాణం చేయిస్తామంటోంది. ఖాళీగా ఉన్న రైల్వేస్టేషన్లను కళ్యాణమండపాలుగా మార్చాలని, జనాలకు పెళ్లిళ్లు చేయాలని రైల్వే మంత్రి సురేష్ ప్రభు యోచిస్తున్నారు. ఊరికే ఉండే కంటే.. ఎంతో కొంత ఆదాయం వస్తే మంచిదేగా అనేది సురేష్ ప్రభు ఆలోచన. అలా చేస్తే రైల్వేశాఖకు వెల్లువెలా నిధులు వచ్చి పడతాయని అధికారులు కూడా అంటున్నారు. రైల్వేస్టేషన్లు ఖాళీగా ఉన్నవి చాలా ఉన్నాయి. పైగా అక్కడ కళ్యాణమండపంలో ఉండే కంటే చాలా ఎక్కువ స్థలం ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అందుకే జనం కూడా బాగా ముందుకొస్తారని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. కావాలంటే రైల్వే డిజైన్లో పెళ్లిపందిరిలు కూడా చేస్తామని ప్రకటనలు ఇచ్చేలా కూడా ప్రణాళికలు రచిస్తున్నారు. రైల్వేల అభివృద్ధి కోసం ఏం చేయాలనే విషయంపై ఇటీవలే ఢిల్లీలో ఓ సదస్సు జరిగింది. అక్కడే సురేష్ ప్రభు ఈ ఆలోచన చెప్పారు. అందరికీ బాగా నచ్చింది. కాకపోతే ఒక్కటే సమస్య. రన్నింగ్ లో ఉన్న రైల్వేస్టేషన్లలోనే శుభ్రత చాలా బాగుంటుంది. అలాంటిది షెడ్డుకెళ్లిన స్టేషన్ల గురించి చెప్పేదేముంది. ఆ ఒక్కటి మాత్రం చూసుకోవాలంటున్నారు జనం.

దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో ఐదుగురు ముష్కరులకు ఉరిశిక్ష

20/12/2016: హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లో మారణహోమం సృష్టించిన ఐదుగురు ముష్కరులకు కోర్టు ఉరిశిక్షలను ఖరారు చేసింది. ఈ మేరకు చర్లపల్లి కేంద్ర కారాగారంలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. గత మంగళవారమే వీరిని దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం.. తాజాగా వారందరికీ ఉరిశిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులుగా ఉండగా.. ప్రధాన సూత్రధారి రియాజ్‌ భత్కల్‌ పరారీలో ఉన్నాడు. భారత్‌లో ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) పాల్పడిన ఘాతుకాలకు సంబంధించి విచారణ పూర్తయి, దోషులకు శిక్షలు పడిన తొలి కేసు ఇదే. పాకిస్తాన్‌లో తలదాచుకున్న రియాజ్‌ భత్కల్‌ ఆదేశాల మేరకు ఉగ్రవాదులు 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లకు పాల్పడ్డారు. ఇందులో భత్కల్‌ సోదరుడు మహ్మద్‌ అహ్మద్‌ సిద్ధిబప్ప అలియాస్‌ యాసీన్‌ భత్కల్‌తోపాటు అసదుల్లా అక్తర్‌ అలియాస్‌ హడ్డీ, జియా ఉర్‌ రెహ్మాన్‌ అలియాస్‌ వకాస్‌(పాకిస్తాన్‌), మహ్మద్‌ తెహసీన్‌ అక్తర్‌ అలియాస్‌ మోను, ఎజాజ్‌ షేక్‌ పాలుపంచుకున్నట్టు ఎన్‌ఐఏ తన దర్యాప్తులో తేల్చింది. విధ్వంసంలో నేరుగా పాల్గొనని కారణంగా యాసీన్‌ భత్కల్‌ను ఐదో నిందితుడిగా చేర్చింది. ఆరుగురు ఉగ్రవాదుల్లో ప్రస్తుతం ఐదుగురికి ఉరిశిక్ష పడగా.. పాక్‌లో ఉన్న రియాజ్‌ భత్కల్‌పై ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేసింది. దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్, ఏ–1 మిర్చి సెంటర్‌ వద్ద జరిగిన పేలుళ్లలో గర్భస్థ శిశువు సహా 18 మంది మరణించగా... 131 మంది గాయాలైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని మలక్‌పేట, అప్పటి సైబరాబాద్‌ (ఇప్పటి రాచకొండ) కమిషనరేట్‌లోని సరూర్‌నగర్‌ ఠాణాల్లో నమోదైన ఈ కేసులను ఎన్‌ఐఏకు బదిలీ చేశారు. ఈ రెండు కేసులకు కీలక ప్రాధాన్యం ఇచ్చిన ఎన్‌ఐఏ అధికారులు 157 మంది సాక్షులతో పాటు 502 డాక్యుమెంట్లు, 201 ఆధారాలను కోర్టు ముందు ఉంచారు. ఏ శిక్షకైనా సిద్ధమన్న ఉగ్రవాదులు సోమవారం ఉదయం ఐదుగురు ముష్కరులను పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ ముష్కరులకు ఊరి శిక్షే సరైందని ఎన్‌ఐఏ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఆ సమయంలో కోర్టులోనే ఉన్న ముష్కరులకు వారి వాదన వినిపించుకోవడానికి న్యాయమూర్తి అవకాశం ఇచ్చారు. అయితే ఏమాత్రం పశ్చాత్తాపం కనబర్చని ఆ ముష్కరులు.. తాము ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నామంటూ న్యాయమూర్తికి చెప్పారు. దీంతో అభియోగాలతోపాటు సాక్ష్యాధారాలు, వాదోపదవాదాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఐదుగురికీ ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును హైకోర్టులో సవాల్‌ చేస్తామని, దోషుల బంధువుల నుంచి ఈ మేరకు విజ్ఞప్తి అందిందని డిఫెన్స్‌ లాయర్‌ ప్రకటించారు. రెండు కోణాల్లో ఇదే తొలి కేసులు.. దేశవ్యాప్తంగా విధ్వంసాలకు పాల్పడేందుకు ఆసిఫ్‌ రజా కమాండో ఫోర్స్‌గా (ఏఆర్‌సీఎఫ్‌) ఏర్పడిన ఉగ్రవాద బృందం.. ఆపై రియాజ్‌ భత్కల్‌ నేతృత్వంలో ‘ఉసాబా’గా పేరు మార్చుకుంది. 2002లో ఇండియన్‌ ముజాహిదీన్‌గా (ఐఎం) మారి దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో పేలుళ్లకు పాల్పడింది. 2007 ఆగస్టు 25న హైదరాబాద్‌లోని లుంబినీ పార్క్, గోకుల్‌చాట్‌ల్లోనూ విధ్వంసం సృష్టించింది ఐఎం ఉగ్రవాదులే. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా జరిగిన 26 విధ్వంసాలకు సంబంధించి ఐఎంపై కేసులు నమోదయ్యాయి. పదుల సంఖ్యలో ఉగ్రవాదులు అరెస్టు అయ్యారు. 2007లో హైదరాబాద్‌లో జంట పేలుళ్లతోపాటు అన్ని కేసులూ వివిధ కోర్టుల్లో విచారణ దశల్లోనే ఉన్నాయి. దేశంలో ఐఎం ఘాతుకాలకు సంబంధించి కేసు విచారణ పూర్తయి, నిందితులను దోషులుగా తేల్చి శిక్షలు వేసిన తొలి కేసు దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్లదే కావడం గమనార్హం. నగరంలో 1990ల నుంచీ ఉగ్రవాద ఛాయలు ఉండటంతోపాటు అనేక కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఈ కేసుల్లో ఎవరికీ ఉరి శిక్ష పడిన దాఖలాలు లేవు. దీంతోపాటు ఒకే ఉందంతానికి సంబంధించి దోషులందరికీ ఉరి శిక్షలు వేసిన కేసులు కూడా లేవు. ఈ కేసులో ఐదుగురికి ఉరిశిక్ష పడటంతో ఈ కోణంలోనూ ఇదే తొలి కేసుగా రికార్డులకెక్కింది. 2011 ఏప్రిల్‌ 18న ఎన్‌ఐఏ హైదరాబాద్‌ యూనిట్‌కు పోలీసుస్టేషన్‌ హోదా లభించింది. నాటి నుంచి తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి తదితర ప్రాంతాలకు సంబంధించి ఎన్నో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

ఇంటికి వెళ్లి మరీ బ్యాంక్ ఎండీపై కాల్పులు

19/12/2016: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం ఒక్కసారి ఉలిక్కిపడే సంఘటన తాజాగా చోటు చేసుకుంది. నగరం నడిబొడ్డుగా భావించే మాసబ్ ట్యాంక్ శాంతినగర్ లోని సాయిదుర్గా కానుమిల్లి అపార్ట్ మెంట్స్ లో నివాసం ఉంటుందన్న కేబీఎన్ బ్యాంకు ఎండీ తుపాకీ కాల్పులు జరపటం సంచలనంగా మారింది. ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ కాల్పుల ఉదంతంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒక దుండగుడు ఆదివారం మధ్యాహ్నం కేబీఎన్ బ్యాంకు ఎండీ మన్మత్ దలాల్ ఉండే అపార్ట్ మెంటుకు వచ్చాడు. అక్కడి వాచ్ మెన్ తో బ్యాంకులో పని చేసే వ్యక్తి కావాలని అడగటంతో.. అక్కడ ఎవరూ బ్యాంకులోపని చేసే వారు లేరని వాచ్ మెన్ బదులిచ్చాడు. అక్కడ ఉన్న కారును చూపించిన ఆగంతకుడు.. ఆ కారుకు చెందిన వ్యక్తిని కలవాలని చెప్పటంతో.. వాచ్ మెన్ వెళ్లి ఆ విషయాన్ని మన్మత్ తో చెప్పారు. అనంతరం పైకి తీసుకురమ్మని మన్మత్ చెప్పటంతో ఆ అపరిచిత వ్యక్తి వాచ్ మెన్ పైకి తీసుకెళ్లాడు. అలా తీసుకెళ్లిన తర్వాత వాచ్ మెన్ కిందకు వచ్చేశాడు. కాసేపటికే తుపాకీ కాల్పుల శబ్దం రావటంతో వాచ్ మెన్ పరుగు పరుగున పైకి వెళ్లాడు. అప్పటికే నిందితుడు పరారీ కావటం.. బ్యాంకు ఎండీ గాయాలపాలు కావటంతో.. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన ఆగంతకుడు ఎవరు? బ్యాంకు ఎండీపై ఎందుకు కాల్పులు జరిపారు? అన్న విషయాలపై పోలీసులు విచారిస్తున్నారు. ప్రాధమికంగా అందుతున్న సమాచారం ప్రకారం.. బ్యాంకు ఎండీపై నిందితుడు రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు.బైక్ మీద వచ్చిన దుండగుడు కాల్పుల అనంతరం పారిపోయినట్లుగా తెలుస్తోంది. కాల్పుల్లో గాయపడిన బ్యాంకు ఎండీకి ప్రాణాపాయం లేదని తెలుస్తోంది.

కూలీ ఖాతాలోకి కోటి రూపాయలు ఊడిపడ్డాయి

19/12/2016: దేశంలో జనాలందరూ డబ్బుల్లేక చస్తుంటే.. ఓ కూలీ ఖాతాలోకి ఏకంగా కోటి రూపాయలు ఊడిపడ్డాయి. అదేండి ఊడిపడటానికి అవేమన్నా ఆకాశం నుంచి వచ్చాయా. దాదాపుగా అంతే ఎందుకంటే కూలీ పదివేలు డిపాజిట్ చేస్తే.. బ్యాంకు సిబ్బంది ఉదారతతో అది కాస్తా కోటి పదివేలైంది. మధ్యప్రదేశ్ కు చెందిన విశ్వకర్మ అనే కూలీకి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉంది. నోట్లు రద్దవగానే.. తన వద్ద ఉన్న పదివేలు తీసుకెళ్లి బ్యాంకులో వేశారు. అప్పుడు 500 నోట్లు 20 డిపాజిట్ చేశాడు. కానీ బ్యాంక్ సిబ్బంది మాత్రం పొరపాటు న20వేల 500 నోట్లు డిపాజిట్ చేసినట్లు రికార్డులు రాశారు. అంతే తిరిగి చూసుకుంటే కోటి పదివేల రూపాయలు ఖాతాలోకి వచ్చాయి. విశ్వకర్మకు ఐటీ శాఖ నోటీస్ పంపించింది. నోటీస్ ఇంగ్లీష్ లో ఉండటంతో.. అర్థం కాని విశ్వకర్మ.. స్థానిక టీచర్ ను అడిగి విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. బ్యాంక్ కు వెళ్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు సిబ్బంది పొరపాటు వల్లే కోటి రూపాయలు జమైందని మేనేజర్ వివరణ ఇవ్వడంతో.. విశ్వకర్మ ఊపిరి పీల్చుకున్నాడు. అయితే ఈ వ్యవహారాన్ని ఐటీశాఖ అనుమానంగానే చూస్తోంది. అమాయకులైన కూలీల ఖాతాల్ని అడ్డం పెట్టుకుని బ్యాంకర్లు బ్లాక్ ను వైట్ చేస్తున్నారని కూపీ లాగుతోంది.

స్టూడెంట్ వీసా.. మేడిన్ హైదరాబాద్

19/12/2016: అమెరికాలో ఇప్పుడు కొత్త సామెత మొదలైంది. మీరు ఇండియా నుంచి స్టూడెంట్ వీసాపై అమెరికా వచ్చారా. అయితే ఇంక మీ వివరాలన్నీ మేమే చెప్పేస్తాం అంటున్నాయి అక్కడ కంపెనీలు. మీరు తప్పకుండా హైదరాబాదీలేనని ఢంకా బజాయిస్తున్నాయి. పొరపాటున వేరే స్టేట్ వాళ్లు వెళ్లినా.. మీదీ హైదరాబాదేనని నమ్మించేస్తున్నాయి. అదేంటి.. ఎందుకలా.. అంటే దానికి ఓ కారణముంది. దేశంలో స్టూడెంట్ వీసాల్లో హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ నంబర్ వన్ గా ఉంది. ఇక్కడ్నుంచే ఎక్కువ మంది విద్యార్థులు అమెరికా వెళ్తున్నారు. దీంతో స్టూడెంట్స్ అంటే హైదరాబాదీలేనన్న నమ్మకం అమెరికాలో బలపడింది. హైదరాబాద్ మొదట్నుంచీ ఎడ్యుకేషన్ హబ్ గా ఉంది. ఇక్కడ్నుంచి ఫారిన్ వెళ్లే స్టూడెంట్స్ నంబర్ ఏటా పెరుగుతూనే ఉంది. ఒక్క అమెరికాకే కాదు యూకే, ఆస్ట్రేలియా, ఇలా ఇతర దేశాలకు వెళ్లే విద్యార్థులు ఎక్కువే. అందుకే చాలా ఇంటర్నేషనల్ కంపెనీలు, యూనివర్సిటీలు.. హైదరాబాద్ లో ఆఫీసులు తెరిచాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏఢాది హైదరాబాద్ కాన్సులేట్ 40 శాతం ఎక్కువగా స్టూడెంట్ వీసాలిచ్చింది. ఇక దేశం మొత్తం మీద అమెరికా వెళ్లే విద్యార్థుల్లో.. తెలుగు రాష్ట్రాల విద్యార్థులే ఎక్కువనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ ఏడాది కూడా 15 శాతం ఎక్కువగా విద్యార్థులు అమెరికా వెళ్లి పాత రికార్డును సరిచేశారు.

ముందు పార్టీ.. తర్వాత ప్రభుత్వం

19/12/2016: జయలలిత బతికినంత కాలం ఆమెకు నెచ్చెలిగా అన్నీ తానై వ్యవహరించిన శశికళ.. ఇప్పుడు అమ్మ మరణంతో.. అన్నాడీఎంకేలో తిరుగులేని నేతగా అవతరించారు. ఇప్పటికే పార్టీ సంయుక్త కార్యదర్శి పదవికి శశికళ ఎంపిక లాంఛనమే కాగా.. తాజాగా సీఎం పదవి కూడా ఆమే తీసుకోవాలని నేతలు కోరుతున్నారు. జయ అపోలో ఆస్పత్రిలో చేరినప్పట్నుంచీ శశి తనదైన మంత్రాంగం నెరిపారు. పార్టీలో ఎక్కడా వ్యతిరేకత రాకుండా ప్రభుత్వం వైపు నుంచి కూడా నరుక్కొచ్చారు. మొదట్లో శశకి సంయుక్త కార్యదర్శి పదవిపై సీనియర్లు అబ్జెక్షన్ చెప్పినా తర్వాత సర్దుకుపోయారు. ఇప్పుడు ఏకంగా సీఎం అంటున్నారు. అన్నాడీఎంకేలో ఓ విభాగం జయలలిత పెరవై సీఎం డిమాండ్ తెరపైకి తెచ్చింది. శశికళ పార్టీ పగ్గాలతో పాటు ప్రభుత్వ పగ్గాలూ చేపట్టాలని తమిళనాడు వ్యాప్తంగా ఉన్న జయలలిత పెరవై శాఖలు తీర్మానాలు ఆమోదించాయి. అమ్మ ఇచ్చిన వరమే చిన్నమ్మ అంటూ శశిని ఆకాశానికెత్తేస్తున్నాయి. ఎంజీఆర్ కాలం నుంచి ఉన్న మంత్రులు శశిని వ్యతిరేకించినట్లు మొదట చెప్పినా.. తర్వాత సమాధానపడిపోయారు. మరోవైపు మద్రాస్ హైకోర్టులో పార్టీ బహిష్కృత ఎంపీ శశికళ వేసిన పిటిషన్ విచారణలో ఉంది. ఆ పిటిషన్ పై క్లారిటీ వచ్చాక.. శశి సీఎం పదవి తీసుకుంటారని తెలుస్తోంది.

టీచర్లపై కెసిఆర్ డేరింగ్ డెసిషన్

16/12/2016: ప్రభుత్వ అధినేతలకి, ప్రభుత్వ టీచర్లు అంటే భయం. వారి జోలికి వెళితే ఎన్నికల్లో దెబ్బ వేస్తారని పాలకుల భయం. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీచర్లని బాగా ఇబ్బంది పెట్టారు. బాబు మదిలో మెదిలే ప్రతి ఆలోచనని అమలు చేసే పని టీచర్లమీద రుద్దారు. దీనితో టీచర్లు, పిల్లలకి చదువులు చెప్పడం మానేసి, బోధనేతర పనుల్లో బిజీ అయిపోయారు. చంద్రబాబు మరీ ఎక్కువగా వత్తిడి పెట్టడం వల్ల, 2004 ఎన్నికల్లో టీచర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కక్షకట్టినట్లు బాబు ఓటమికి కారణం అయ్యారని అంటారు. (అప్పట్లో టీచర్లు కొద్దిమంది అయినా గ్రామాల్లో ఉండేవారు, వారి మాటకి విలువ ఉండేది. ఓటింగ్ యంత్రాలు కొత్తగా వచ్చాయి కాబట్టి వాటిని వినియోగించడం తెలియని ఓటర్లకి సహాయం చేసే పేరుతో, చాలామంది టీచర్లు కాంగ్రెస్ కి ఓటు నొక్కారు అని అంటారు.) చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రి అయిన వైఎస్, ప్రభుత్వ ఉద్యోగులని అల్లుళ్ళ మాదిరిగా చూడడం మొదలు పెట్టారు. వాళ్ళు పనేమీ చేయాల్సిన అవసరం లేకుండా చేసారు. చంద్రబాబు హయాంలో బోధనేతర పనుల్లో మునిగిన చాలామంది టీచర్లు, వైఎస్ వచ్చాక వ్యాపారాలు ఇతర వ్యాపకాల్లో బిజీగా అయిపోయారు. చిట్స్, ఫైనాన్స్, ఇతర వ్యాపారాలు చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం మొదలయ్యాక, ఆ ఉద్యమం పేరుతో టీచర్లు స్కూల్ కి డుమ్మా కొట్టడం కూడా బాగా జరిగింది. అంటే సుమారు 13 ఏళ్లుగా టీచర్లపై ఎలాంటి వత్తిడి లేదు, పర్యవేక్షణా లేదు. తెలంగాణ వచ్చాక విద్య మీద దృష్టి పెట్టిన కెసిఆర్, టీచర్లతో ఒకింత కఠినంగానే ఉన్నారు. మీరు కోరినంత జీతం ఇస్తున్నాం, మేము చెప్పినట్లు పనిచేయడం మీ బాధ్యత అని స్పష్టంగా చెబుతున్నారు. ప్రభుత్వ స్కూళ్ళని మెరుగుపరచే క్రమంలో ప్రభుత్వం చేపట్టిన పాఠశాలల విలీనాన్ని అడ్డుకున్న ఉపాధ్యాయ సంఘాలని కెసిఆర్ ఏమాత్రం కేర్ చెయ్యలేదు. ఇక తాజాగా, ప్రభుత్వ టీచర్లు అందరూ, తమ ఆస్తుల వివరాలు డిక్లేర్ చేయాలని ఆదేశాలు జారీ చేసారు. ప్రతి టీచర్, తమ పేరు మీద, తమ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న స్థిరచరాస్తుల వివరాలు జనవరి 10లోపు ప్రభుత్వానికి అందచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అలా చేయకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. టీచర్లు ఆస్తులు ప్రకటించాలని చంద్రబాబు ప్రభుత్వం 1998లో జారీ చేసిన జిఓని కేసిఆర్ ప్రభుత్వం ఇప్పుడు అమలుచేయాలని నిర్ణయించింది. ఈ జిఓ అమలు వల్ల స్కూల్స్ బాగుపడతాయని కానీ, టీచర్లు సరిగ్గా చదువు చెబుతారని కానీ ఆశించలేము. ఈ జిఓ అమలు ప్రభుత్వ చిత్తశుద్ధిని సూచిస్తోంది.. అంతే.

మోది వేసిన వలలో చిక్కుకున్న ప్రతిపక్షాలు

16/12/2016: ఒక విద్యార్థి, తనకి అన్నీ వచ్చు అన్న అహంకారంతో సరిగా చదవకుండా పరీక్షలకి సిద్ధం అయ్యాడు. తీరా పరీక్షల షెడ్యూల్ వచ్చాక, తను ఏమీ ప్రిపేర్ కాలేదని, ఇప్పుడు ఎగ్జామ్స్ జరిగితే తాను ఫెయిల్ అవడం ఖాయమని అర్థం అయింది. అప్పుడా విద్యార్థి, పరీక్షలు జరగాలని కోరుకుంటాడా, వాయిదా పడాలని కోరుకుంటాడా..? వాయిదా పడాలనే కదా.. పరీక్షలు నిర్వహించే వ్యక్తి ఆ విద్యార్థికి బంధువు అయితే, తాను కూడా పరీక్షలు వాయిదా వేద్దామనే చూస్తారు కదా. ఇప్పుడా విద్యార్థి ప్లేసులో నరేంద్రమోది ని ఊహించుకోండి. ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా తాను అన్నీ కంట్రోల్ చేయగలననే అహంకారంతో, మోది పెద్ద నోట్ల రద్దుని ప్రకటించేశారు. అది ప్రకటించాక కానీ, దాన్ని అమలు చేయడం ఎంత కష్టమో అర్థం కాలేదు. రోజుకో నిర్ణయం, గంటకో రూల్ తో RBI, ఆర్ధిక శాఖ కిందామీదా పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ సమావేశాలు జరిగితే చాలా కష్టం. కాబట్టి పార్లమెంట్ సజావుగా జరగడం మోది కి సహజంగానే ఇష్టం ఉండదు (ఆయనకి పార్లమెంట్ మీద నమ్మకమే లేదన్నది వేరే సంగతి). ఈ పరిస్థితుల్లో మోది ని ఇరుకున పెట్టాలి అంటే పార్లమెంట్ సరిగ్గా జరగాలి. కానీ, ప్రతిపక్షాలు ఏం చేసాయి? మోది కోరుకున్నట్లే..పార్లమెంట్ ని స్తంభింపచేసాయి. శీతాకాల సమావేశాలు మొత్తం వాష్ అవుట్ అయిపోయేలా ప్రతిపక్షాలు మూర్ఖంగా వ్యవహరించాయి. మోది ని రక్షించాయి. సభ సజావుగా జరగడానికి ప్రభుత్వం వైపు ఎలాంటి చొరవ తీసుకోలేదు. కనీసం ప్రతిపక్షాలు అయినా సభ జరగడానికి ప్రయత్నం చేయాల్సి ఉంది. అలా చేయకుండా అవి కూడా మోది విసిరిన వలలో చిక్కి, మోది ని రక్షించాయి.

ఉపగ్రహ అనుగ్రహంతోనే ప్రాణాలు దక్కాయి

16/12/2016: మనకు చిన్న చిన్న అడ్డంకులు కలిగించే వాళ్లను ఉపగ్రహాలతో పోల్చడం ఆనవాయితీ. కానీ ఇప్పుడదే ఉపగ్రహాలు మన ప్రాణాలు కాపాడుతున్నాయి. అంతరిక్ష రంగంలో భారత్ విజయపతాక ఎగరేస్తున్న ఇస్రో.. ఇప్పుడు ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణనష్టాన్ని నివారిస్తోంది. ఇస్రో ప్రయోగించిన రెండు శాటిలైట్లు.. వార్థా తుపాను తీవ్రత అంచనాకు సాయపడ్డాయి. అవి పంపించిన ఇమేజ్ ల సాయంతోనే వాతావరణ కేంద్రం తుపాను గమనాన్ని విశ్లేషించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ముందుగా అప్రమత్తం చేసింది. దీంతో పెద్ద ముప్పు తప్పింది. తమిళనాడులో చెన్నైతో పాటు తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలకు తుపాను ముప్పుంది. దీంతో వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు మొత్తం పదివేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తర్వాత తుపాను రావడం.. భారీగా ఆస్తినష్టం జరగడం అంతా అయిపోయింది. కానీ విలువైన ప్రాణాలు దక్కాయి. శాటిలైట్లు పంపించిన హై రిజల్యూషన్ ఇమేజెస్ సాయంతో అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేయగలిగారు. దీంతో పదివేల మంది ప్రజలు ప్రాణాలు దక్కించుకున్నారు. గత కొంతకాలంగా ప్రకృతి విపత్తుల్లో దేశంలో ప్రాణనష్టం తక్కువగానే ఉంది. ఇక ఆస్తినష్టాన్ని కూడా నివారించే ఉపాయాలు కనుగొనాల్సి ఉంది.

రేవంత్ పోరాటం కాంగ్రెస్ కు కలిసొస్తుందా..?

16/12/2016: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే చాలా నాటకీయంగా జరిగింది. ఇచ్చింది మేమే తెచ్చింది మేమే అంటూ ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ కు భంగపాటు మిగిలింది. చివరి నిమిషం వరకూ అసలు రాష్ట్రం వస్తుందో.. రాదో అన్న నిరాశతో.. అవసరమైతే పార్టీని విలీనం చేస్తానని సోనియాకు మొక్కిన కేసీఆర్ తంతే బూరల గంపలో పడ్డారు. ఆరోజు నుంచి ఇప్పటివరకూ కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ను చూసి కుళ్లుకుంటూనే ఉన్నారు. కానీ ఫలితం మాత్రం ఏమీ లేదు. ఇప్పుడు ఏపీ టీడీపీ చీఫ్ కళావెంకట్రావు కూతురి పెళ్లిలో కూడా ఇదే డిస్కషన్. రేవంత్ పోరాటంపై మొదలైన చర్చ.. చివరకు కాంగ్రెస్ దగ్గరికే వచ్చి ఆగింది. రేవంత్ ను చూసిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్ని అంశాలపై నువ్వే పోరాడితే.. మావాళ్లకు ఇష్యూలు మిగలవని జోక్ చేశారు. తర్వాత మల్లు భట్టివిక్రమార్కతో పయ్యావుల.. మా రేవంత్ జెట్ స్పీడ్ మీరు అందుకోలేరని సవాల్ చేశారు. అక్కడే చమత్కారం మొదలైంది. ఉద్యమం సమయంలో కాంగ్రెస్, టీడీపీ కృషిని టీఆర్ఎస్ కొట్టేసిందని, ఇప్పుడు కూడా రేవంత్ పోరాటం అంతిమంగా కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తుందని భట్టి అన్నారట. వెంటనే స్పందించిన రేవంత్.. మన కష్టం పక్కవాడికి ఇవ్వడానికి టీడీపీ.. కాంగ్రెస్ కాదని కౌంటర్ ఇచ్చారట.

సీన్ రివర్స్ః పాత నోట్లకు డిమాండ్

15/12/2016: రూ.500, రూ.1000 విలువ గల పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో అనేక చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దును చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించిన తర్వాత పాత నోట్లను డిపాజిట్ చేసేందుకు ప్రజలంతా బ్యాంకుల ముందు క్యూ కట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రూ.500, రూ.1000 నోట్లను బ్లాక్ మనీ రూపంలో కలిగి ఉన్నవారు వాటిని మార్చుకునేందుకు 20-30 శాతం కమిషన్లు ముట్టచెప్పి మరీ కొత్త నోట్లు పొందారు. అయితే ఇపుడు సీన్ రివర్స్ అయింది. పాత నోట్లను పొందేందుకు సుమారు 5-10% కమీషన్ ముట్టచెప్తున్నారట! ఎందుకంటే మళ్లీ బ్లాక్ మనీ ప్రాబ్లం!! అనేక కంపెనీలు, బడా వ్యాపారవేత్తలు తమ ఖాతా పుస్తకాల్లో వివిధ రకాలకు మొత్తం ఖర్చు అయినట్లు చూపిస్తుంటారు. అయితే వీటిని సదరు అవసరానికంటే... లంచాలు ఇచ్చేందుకు, ఇతరత్రా ఖర్చులు చేసేందుకు ఉపయోగిస్తుంటారు. అయితే ఇపుడు అలా చూపించిన మొత్తాలను బ్యాంక్ ఖాతాల్లో చూపించుకోవాల్సి ఉంటుంది. అయితే అందుకు పాత నోట్లే ఉపయోగించాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం-ఆర్బీఐ ఇటీవల కొత్త నోట్లు, పాత నోట్ల డిపాజిట్ల వివరాలను ఇవ్వాలని బ్యాంకర్లను ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో రద్దైన రూ.500, రూ.1000 నోట్లలోనే సదరు ఖాతాల నిధులను చూపించాలి. అంటే పాత నోట్ల ద్వారానే డిపాజిట్లు చేయాలి. దీంతో పాత నోట్లను పొందేందుకు సదరు వ్యాపారవేత్తలు సెర్చింగ్ మొదలుపెట్టారట. ఈ క్రమంలోనే పాత నోట్లను ఇచ్చే వారి కోసం వెతుకులాట మొదలైంది. అయితే తమవద్ద ఉన్న రూ.500, రూ.1000 నోట్లను దాదాపు అందరూ మార్చేసుకోవడంతో ఇపుడు ఆ నోట్లు దొరకడం లేదు. దీంతో సదరు నోట్లను అందించిన వారికి 5-10 కమిషన్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు పలువురు ఆఫర్లు పెడుతున్నారు. మొత్తంగా సీన్ రివర్స్ అయి పాత నోట్లకు డిమాండ్ చేయడం ఆసక్తికరం!

పెళ్లికూతురు పెద్ద మనసు

15/12/2016: పెళ్లంటే భూదేవంత అరుగు.. ఆకాశమంత పందిరి వేసి.. అందరూ అదిరిపడేలా ఎవరి శక్తికి మించి వాళ్లు చేసే ఖర్చు. కానీ మహారాష్ట్రలో ఓ యువతి మాత్రం వినూత్నంగా ఆలోచించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. పెళ్లి ఖర్చుతో పేదలకు ఇళ్లు కట్టించింది. మధ్యతరగతి వాళ్లు పెళ్లి చేస్తేనే కోట్లు ఖర్చవుతోంది. ఇక శ్రీమంతుల గురించి చెప్పక్కర్లేదు. శ్రీమంతుల ఇంట్లో పిల్లలు కూడా సెపరేట్ గా ఉంటారు. చిన్నప్పట్నుంచీ గోల్డెన్ స్పూన్ తో పెరగడం వల్ల వారికి కష్టాలంటే ఏంటో తెలీదు. కానీ మహారాష్ట్ర పెళ్లికూతురు మాత్రం తాను డిఫరెంట్ అని నిరూపించుకుంది. మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాకు చెందిన శ్రేయ మునోద్ శ్రీమంతుల బిడ్డ. ఈ అమ్మాయికి మరో శ్రీమంతుడితో పెళ్లి కుదిరింది. అయితే పెళ్లి ఖర్చు వృథాగా చేయడమెందుకని ఆలోచించిన పెళ్లికూతురు తన మనసులో మాట పేరెంట్స్ కు చెప్పింది. అత్తింటివారు కూడా ఒప్పుకోవడంతో మార్గం సుగమమైంది. ఇంతకీ పెళ్లికూతురు ఏం చేసిందంటే.. తన పెళ్లి సింపుల్ గా చేసుకుంది. పెళ్లికి ఎంత ఖర్చు పెట్టాలనుకున్నారో ఆ సొమ్ముతో పేదలకు ఇళ్లు కట్టించింది. మొత్తం 120 మందికి ఇళ్లు కట్టించాలనుకున్నా.. ప్రస్తుతానికి 90 మందికి పూర్తయ్యాయి. ఇప్పుడా 90 మందికి ఇంటి తాళాలు కూడా పెళ్లి వేదికపైనే ఇవ్వడం మరో విశేషం.

అద్దెకు పెళ్లికూతుళ్లు!

15/12/2016: బొగ్గు మాఫియా, ఇసుక మాఫియా, మిల్క్ మాఫియా, ఆయిల్ మాఫియా, స్పెక్ట్రమ్ మాఫియా, అన్ని మాఫియాలూ మనకు తెలుసు. కానీ మనం కనీవినీ ఎరుగని మరో మాఫియా ఇప్పుడు కోరలు చాస్తోంది. ఏకంగా ఇంటెలిజెన్స్ ఆపరేషన్లో బుక్కైపోయింది. అదే మ్యారేజ్ మాఫియా. మ్యారేజ్ బ్యూరో పేరుతో ఓ చిన్న ఆఫీస్ అద్దెకు తీసుకోవడం. తమకు పెద్ద నెట్ వర్క్ ఉందని గొప్పలు చెబుతూ పేపర్లు, టీవీల్లో ప్రకటనలు ఇవ్వడం. నమ్మి వచ్చినవాళ్ల దగ్గర వేలల్లో రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయడం. తర్వాత నట్టేట ముంచడం. ఇదీ మ్యారేజ్ మాఫియా తంతు. పెళ్లికాని ప్రసాదులకు వలేస్తున్న మ్యారేజ్ బ్యూరోలు.. అద్దెకు పెళ్లికూతుళ్లను తీసుకొస్తున్నాయి. తమ ఆఫీస్ లో పనిచేసే అమ్మాయిల్ని, లేదంటే అడ్డాకూలీల్ని రోజవారీ అద్దెకు పెళ్లికూతుళ్లుగా తీసుకొచ్చి.. పార్కుల్లో పెళ్లిచూపులు పెడుతున్నాయి. అంతా అయిపోయింది. సంబంధం ఖాయం అనుకునే సమయంలో పెళ్లికూతురితో ఏదో కారణంతో నో చెప్పించేసి.. తమ రిజిస్ట్రేషన్ డబ్బులు వెనకేసుకుంటున్నాయి. కేవలం అబ్బాయిల విషయంలోనే కాదు.. చిన్నవయసులో భర్త చనిపోయి కోట్లున్న అమ్మాయిలతోనూ ఇలాగే ఆడేసుకుంటున్నాయి బ్యూరోలు. హైదరాబాద్ పోలీసుల వలలో చిక్కిన బ్యూరోల బాగోతం చూసి ఖాకీలే విస్తుబోతున్నారు.

ఇండియన్స్ సహనానికి మోడీ సెల్యూట్

09/12/2016: పెద్దనోట్లు రద్దయ్యాక దేశంలో నగదు కష్టాలు రోజరోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. అయినా జనం ఓపికగా నెల రోజులుగా క్యూలైన్లో వేచి ఉండి వచ్చిన కాస్త నగదుతో సర్జుకుంటున్నారు. నల్లధనం అంతం చేయాలనే కేంద్రం పట్టుదలకు సహకరిస్తున్నందుకు మోడీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారతీయులు స్వతహాగా సహనశీలురు అంటున్న మోడీ.. ఇప్పుడు కీలక సమయంలో మరోసారి తమ స్పెషాలిటీ చూపించారన్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న పేదలు, మధ్యతరగతి ప్రజలకు మోడీ సెల్యూట్ చేశారు. ఎవరెన్ని విధాలా రెచ్చగొట్టే ప్రయత్నం ప్రజలు ఓపిగ్గా ఉండటం మామూలు విషయం కాదన్నారు. ప్రజల ఇబ్బంది తనకూ బాధగానే ఉందన్న మోడీ.. బ్లాక్ మనీ అరికట్టడానికి తప్పదన్నారు. భారతీయులకే ఇదే చివరి క్యూ కావాలని ఆశించారు. అందుకే ఇక బ్లాక్ మనీ అంతం చేసి.. దేశ ప్రజలకు కానుకగా ఇస్తామన్నారు. దేశంలో చరిత్రాత్మక అవకాశం వచ్చిందన్నారు మోడీ. అందుకే పేద ప్రజలకు లబ్ధి కలిగేలా వ్యవహరిస్తామన్నారు. అక్రమార్కులు సంపాదించిన నల్లడబ్బును పేదల ఖాతాల్లో వేస్తామని చెప్పారు మోడీ. పార్లమెంటులో నోట్లపై సమాధానం చెప్పడానికి మోడీకి ఛాన్స్ రాకపోవడంతో ట్విట్టర్ ద్వారా జనానికి టచ్ లోకి వచ్చారు.

తప్పు మీద తప్పు చేస్తున్న ఆర్బీఐ

09/12/2016: ఈ ఆర్బీఐకి అసలేమైంది. ప్రపంచవ్యాప్తంగా సమర్థవంతమైన కేంద్ర బ్యాంకుగా ఎన్నో అవార్డులు అందుకున్న ఆర్బీఐ ప్రతిష్ఠ.. నోట్ల రద్దు ఎపిసోడ్ లో మసకబారుతోంది. నోట్ల రద్దుపైనా తప్పుడు అంచనాలు వేసి ఏటీఎంలు ఇంకా పనిచేయడం లేదని ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో జమైన మొత్తంపై ఆర్బీఐ వేసిన లెక్కలపై సామాన్యులకు కాదు ఏకంగా బ్యాంకులకే అనుమానం వస్తోంది. ఈ నెల రోజుల్లో 11.5 లక్షల కోట్లు జమైందని ఆర్బీఐ చెప్పింది. కానీ ఇంత మొత్తం వచ్చిందా అని ఎస్బీఐ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇంటర్ బ్యాంక్ డిపాజిట్లు, విత్ డ్రా కరెన్సీతో పాటు ముఖ్యంగా కొత్తనోట్లు, చెలమణీలో ఉన్న నోట్లు అన్నీ లెక్కేశారేమోనని అనుకుంటున్నారు. ఏ లెక్కల్ని పరిగణనలోకి తీసుకోవాలో తెలియక మార్కెట్ వర్గాలు అయోమయంలో పడిపోయాయి. ఆర్బీఐ లెక్కలపై సూటిగా స్పందించడానికి నిరకారించిన ఎస్బీఐ ఛైర్మన్ అరుంధతీ భట్టాచార్య.. అనుమానాలు మాత్రం వ్యక్తం చేశారు. 10నుంచి 15 శాతం డబుల్ లెక్కింపు జరిగే ఉంటుందని భావిస్తున్నారు. ఎస్బీఐ వరకు మొత్తం డిపాజిట్లు నవంబర్ పదో తేదీ నాటికి మూడున్నర లక్షల కోట్లు డిపాజిట్ అయ్యాయి.

గాలి వారి డాబు పెళ్లి వెనుక గుట్టు వీడినట్లేనా?

08/12/2016: పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న సంచలన నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ఉన్న నల్ల కుబేరులు.. బడా పారిశ్రామికవేత్తలు ఉలిక్కిపడటమే కాదు.. వారా షాక్ నుంచి బయటకు వచ్చేందుకు కొంత టైం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. నోట్ల రద్దు ఎపిసోడ్ నేపథ్యంలో.. నగదు చెల్లింపుల కోసం జనాలు పడిన పాట్లు అన్నిఇన్ని కావు. ఇలాంటివేళ.. డబ్బు గురించి అస్సలు లెక్క పెట్టకుండా రూ.వందల కోట్లతో ఘనంగా పెళ్లి చేసి సంచలనంగా సృష్టించారు మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి. నోట్ల రద్దు వేళ కూడా ఆయన ఏ మాత్రం వెరవకుండా అంత గ్రాండ్ గా పెళ్లి చేయటం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారటమే కాదు.. కోట్లాది మంది ఆ పెళ్లి గురించి.. అక్కడ చేసిన ఏర్పాట్ల గురించి కథలు.. కథలుగా చెప్పుకునే పరిస్థితి. అంత వైభవంగా చేసిన పెళ్లి వేడుక.. ఇప్పుడు గాలి జనార్దన్ నెత్తి మీదకు తీసుకొచ్చిందన్న మాట వినిపిస్తోంది. గాలి వారింట పెళ్లి అంత వైభవంగా జరగటానికి కారణం ఏమిటి? భారీగా అయిన పెళ్లి ఖర్చు మొత్తాలకు సంబంధించిన చెల్లింపులు ఎలా చేశారన్న సందేహాలకు సమాధానం దొరికినట్లే. మధ్యవర్తుల సాయంతో గాలి తన వద్దనున్న పాత నోట్లను భారీగా మార్చారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ నోట్లను మార్చేందుకు సాయం చేసిన రెవెన్యూ అధికారి డ్రైవర్ కు గాలి అనుచర వర్గం నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో మనస్తాపం చెందిన డ్రైవర్ రమేష్ గౌడ సూసైడ్ చేసుకున్నాడు. అతను రాసినట్లుగా చెబుతున్న సూసైడ్ నోట్ పుణ్యమా అని గాలి వారింట జరిగిన డాబు పెళ్లికి సంబంధించి కీలక విషయం బయటకు వచ్చినట్లుగా భావిస్తున్నారు. 20 శాతం కమీషన్ కు గాలి దాదాపు రూ.100 కోట్ల మేర మార్చినట్లుగా తెలుస్తోంది. మరీ.. విషయంలో విచారణ అధికారులు ఏం చేస్తారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

బెడ్ రెస్ట్ లో ఉన్నా.. బాధ్యత మర్చిపోని సుష్మా

08/12/2016: విదేశాంగ మంత్రిగా సుష్మాస్వరాజ్ పేరు ప్రఖ్యాతులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. భారతదేశంలో కంటే విదేశాల్లో ఆమె ఎక్కువ పాపురల్ అవుతున్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ట్విట్టర్ ద్వారా వెంటనే స్పందిస్తారని పేరు తెచ్చుకుంటున్నారు. ఈజిప్ట్ మహిళకు మెడికల్ వీసా మంజూరు చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. సుష్మాస్వరాజ్ ట్వీట్ కు స్పందించడం పెద్ద గొప్పేమీ కాదు. కానీ ఇప్పుడు సుష్మా ఆస్పత్రిలో బెడ్ రెస్ట్ లో ఉన్నారు. ఇలాంటి సమయంలో కాదు జనం కోసం స్పందించడం చిన్న విషయం కాదని సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అధిక బరువున్న మహిళ అనారోగ్య సమస్యను అర్థం చేసుకుని స్పందించిన సుష్మా.. మనసున్న నేతగా అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఈజిప్ట్ అలెగ్జాండ్రా నగరానికి చెందిన ఇమాన్ అహ్మద్ అనే 36 ఏళ్ల మహిళ.. వయసుకు మించి 500 కిలోల బరువుంది. ఎలిఫెంటియాసిస్ ప్రభావంతో ఈమె ఇలా అయింది. బేరియాట్రిక్ సర్జరీ కోసం ముంబై రావాలని వీసాకు అప్లై చేస్తే దొరకలేదు. దీంతో ఆమె కు ట్రీట్ మెంట్ ఇవ్వాల్సిన డాక్టర్ ముఫ్ఫీ లక్డావాలా సుష్మకు ట్వీట్ చేశారు. వెంటనే స్పందించిన ఇమాన్ అహ్మద్ కు మెడికల్ వీసా ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ విషయం తన దృష్టికి తీసుకొచ్చినందుకు డాక్టర్ కు కృతజ్ఞతలు చెప్పారు. తాము థాంక్స్ చెప్పాల్సింది పోయి. .సుష్మే తమకు థాంక్స్ చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని డాక్టర్ చెబుతున్నాడు. చికిత్స పూర్తవగానే.. తప్పకుండా సుష్మను కలుస్తానంటోంది ఇమాన్ అహ్మద్.

ప్రకటించింది కొండంత.. దొరికింది గోరంత..

08/12/2016: స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకంలో వింతలు బయటికొస్తున్నాయి. సాధారణంగా ప్రకటించిన సొమ్ము కంటే ఎక్కువ ఉండాల్సిందిపోయి.. చెప్పిన దాంట్లో వందో వంతు కూడా లేదని అధికారులు ఉసూరుమంటున్నారు. అసలు జనాలు ఎందుకు అబద్ధాలు చెబుతున్నారో ఎవరికీ ఆర్థం కావడం లేదు. సూరత్ వ్యాపారి షా.. మొన్నీమధ్యే పదమూడు వేల కోట్ల రూపాయలున్నాయని చెప్పి.. అది తనది కాదని తానో బినామీనని చెప్పాడు. ఇప్పుడు హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో లక్ష్మణరావు అనే వ్యాపారి కూడా పదివేల కోట్లు సంపద ప్రకటించి.. చివరకు ఇంట్లో వెతికితే లక్షన్నరే దొరికింది. బీఎల్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో లక్ష్మణరావు, ఆయన భార్య రమాదేవి డైరక్టర్లుగా ఉన్నారు. 2014 మార్చి 31న వాళ్లు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద తమ వివరాలు ఫైల్ చేశారు. ఆ లెక్క ప్రకారం వారి ఆస్తి లక్షన్నరే. కానీ స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం కింద పదివేల కోట్లున్నాయని ప్రకటించారు. మొదటి విడత పన్ను కింద 1125 కోట్లు కట్టాలని నోటీస్ పంపిస్తే పన్ను కట్టలేదు. దీంతో సోదాలు జరిపిన ఐటీ అధికారులకు నీరసం వచ్చింది. నాలుగు కంపెనీల్లో బోర్డ్ ఆఫ్ డైరక్టర్ గా ఉన్న లక్ష్మణరావు.. ఓ కంపెనీకే బ్యాలెన్స్ షీట్ చూపడం అనుమానాలు రేకెత్తిస్తోంది. నిజంగా తక్కువ డబ్బుందా.. లేదంటే ఈయన కూడా ఎవరికైనా బినామీనా అనే కోణంలో సోదాలు కొనసాగుతున్నాయి.

కన్నీరుమున్నీరైన సూపర్ స్టార్

07/12/2016: ఒకప్పుడు జయ గెలిస్తే.. తమిళనాడును దేవుడు కూడా కాపాడలేడని స్టేట్ మెంట్ ఇచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్.. ఇప్పుడు అమ్మను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగును నింపిన జయ ఇక లేదని విలపించారు. తన కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన రజనీ కాంత్.. భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. జయ బద్ధ శత్రువులు డీఎంకే నేతలు కూడా సంతాపం తెలిపారు. స్టాలిన్, కనిమొళి వచ్చి అన్నాడీఎంకే శ్రేణులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జయలలిత భౌతిక కాయానికి నివాళులు అర్పించి ఆమె తమిళనాడుకు చేసిన సేవల్ని కొనియాడారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు జయకు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ నేత ఖుష్బూ, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, నడిగర్ సంఘం అధ్యక్షుడు, నటుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, సినీనటులు కోవైసరళ, టీ.రాజేందర్ అమ్మకు ఆఖరి వందనం సమర్పించారు.

తెలుగు నేతలతో అమ్మకు సంబంధాలు

07/12/2016: జయ రాజకీయ జీవితంలో తెలుగు గవర్నర్ల పాత్ర చాలా ఉంది. జయ ఫస్ట్ టైమ్ సీఎం అయినప్పుడు మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి అక్కడ గవర్నర్ గా ఉన్నారు. కానీ వీరిదద్రికీ అస్సలు పడేది కాదు. ఇద్దరూ అధికార దర్పాన్ని చూపించాలని చూసి.. ఉప్పు, నిప్పులా ఉండేవాళ్లు. ఇక మొన్నటివరకు తమిళనాడు గవర్నర్ గా ఉన్న రోశయ్యతో అమ్మకు మంచి సంబంధాలుండేవి. కీలక విషయాల్లో రోశ్యయ సలహాలు కూడా తీసుకునేవాళ్లని సమాచారం. రోశయ్య పదవీకాలం పొడిగింపుపై జయ ప్రధానికి లేఖ రాయడమే వారి అనుబంధానకి నిదర్శనం. ఇక రోశయ్య తర్వాత విద్యాసాగర్రావు మరో తెలుగు వ్యక్తి.. తమిళనాడుకు ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్నారు. జయ ఆస్పత్రిలో చేరినప్పట్నుంచీ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ.. కేంద్రానికి సమాచారం చేరవేస్తూ వచ్చారు. వీరితో పాటు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తో జయకు విడదీయరాని అనుబంధం ఉంది. హీరో, హీరోయిన్లుగా గతంలో ఉండే స్నేహం తర్వాత బలపడింది. వీరిద్దరి స్నేహానికి గుర్తుగానే తెలుగు గంగ సాకారమైంది.

అమ్మ ఇంటికి అమ్మపేరు

07/12/2016: జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశంలోని అత్యంత విలాసవంతమైన భవనాల్లో అదొకటి. చెన్నై నడిబొడ్డున అత్యద్భుతంగా కనిపించే పోయస్ గార్డెన్ చుట్టూ రజనీకాంత్ వంటి ఇతర ప్రముఖుల ఇళ్లూ ఉన్నప్పటికీ పోయస్ గార్డెన్ ప్రభ వేరు. పోయస్ గార్డెన్ కు వేద నిలయం అని పేరు పెట్టారు జయ. తన తల్లి అసలు వేదవల్లి కావడంతో ఆ పేరును తన ఇంటికి పెట్టుకున్నారామె. కాగా ప్రస్తుతం 24 వేల చదరపు అడుగుల్లో ఉన్న ఆ ఇంటిని జయ 1967లోనే ఆమె రూ.1.32 లక్షలకు కొనుగోలు చేశారు. ఇప్పుడు దాని విలువ 100 కోట్లు పైనే. 'వేద నిలయం'లోకి మహామహులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ప్రత్యేక కార్యక్రమం ఉంటే తప్పితే, మంత్రులకూ ఈ భవనంలోకి ప్రవేశం లభించదు. ముఖ్య నేతలు, విశ్వాసపాత్రులైన ఐఏఎ్‌సలు సైతం ఈ ఇంటి లోపల ఎలా ఉంటుందో తెలియదని చెబుతుంటారు. వేద నిలయం సమీపంలోనే వినాయకుడి చిన్న గుడి వంటిది ఉంటుంది. జయ ఇంటి బయటకు వచ్చినప్పుడు, లోపలికి వెళ్లేటప్పుడు ఇక్కడి విఘ్నేశ్వరునికి మొక్కి వెళ్తారు. వేద నిలయం నుంచి సచివాలయానికి ఆమె కారులో వెళ్తుంటే ప్రతిరోజూ దారిలో వందలాది మంది రోడ్డు పక్కన నిల్చుని ఆమెకు తమ మొర వినిపించాలని ప్రయత్నిస్తుంటారు. అధికారుల ద్వారా ఆమె వారి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తుంటారు.

కాంగ్రెస్ కు చుక్కలు చూపిస్తున్న హ్యాకర్లు

02/12/2016: గడిచిన రెండు రోజులుగా కాంగ్రెస్ పార్టీకి హ్యాకర్లు చుక్కలు చూపిస్తున్నారు. నిన్నటికి నిన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెందిన ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసిన కలకలం ఒక కొలిక్కి రాక ముందే.. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ట్విట్టర్ అకౌంట్ ను హ్యాకర్లు హ్యాక్ చేసేశారు. ఇష్టం వచ్చినట్లుగా రాసేసిన రాతలతో రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ ను నింపేయగా.. దాన్ని పార్టీకి చెందిన సాంకేతిక సిబ్బంది తొలగించారు. దీనిపై ఇప్పటికే పలు జోకులు సోషల్ మీడియాలో హడావుడి చేస్తూ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేశారు. అభ్యంతరకరమైన ట్వీట్లను పోస్ట్ చేశారు. అంతేకాదు.. పార్టీని కూల్చేందుకు అవసరమైన సమాచారం తమ దగ్గర బోలెడంత ఉన్నట్లుగా పేర్కొన్న హ్యాకర్లు.. కాంగ్రెస్ పార్టీ పంపిన ఈమొయిళ్లు మొత్తం బయటపెడతామని హెచ్చరించారు. తమతో పెట్టుకోవద్దన్న వారు.. క్రిస్మస్ రోజున మరోసారి అకౌంట్ ను హ్యాక్ చేస్తామని చెప్పటం గమనార్హం. ఇదిలా ఉండగా..తమ అకౌంట్ ను హ్యాక్ చేసిన ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని పార్టీ నిర్ణయించినట్లు చెబుతున్నారు. అద సమయంలో.. పార్లమెంటులో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. తాజా పరిణామాలతో డిజిటల్ భద్రత ఏమేరకు ఉందన్న సందేహాల్ని పార్టీ వ్యక్తం చేస్తోంది. ఇది సరిపోదన్నట్లుగా రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ ను మరోసారి హ్యాక్ అయినట్లుగా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పటం మరింత సంచలనంగా మారింది.చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ అన్న టైపులో.. యువరాజా వారి ట్విట్టర్ ఖాతాను వరుసగా హ్యాక్ కావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు.

మమ్మల్ని చూసి కుళ్లుకుంటున్నారు

02/12/2016: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ.. ఇండియా టాప్ టెల్కోలపై నిప్పులు చెరిగారు. జియో నెట్ వర్క్ కు సహకరించకుండా వ్యూహాత్మకంగా నష్టం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. తాము సామాన్యులకు సేవలందిస్తామని అంబానీ స్పష్టం చేశారు. దేశీయ టెలికాం మార్కెట్లో జియోతో రిలయన్స్ సంచలనం సృష్టించింది. డిసెంబర్ 31వరకు ఫ్రీ జియో ఆఫర్ ను ఇప్పుడు మార్చి 31వరకు పొడిగించారు. జియో వెల్కమ్ న్యూఇయర్ ఆఫరని దీనికి పేరు పెట్టారు. ఆ తర్వాత కూడా దేశీయ కాల్స్ ను పూర్తి ఉచితంగా అందిస్తామని ముకేష్ ప్రకటించారు. మరోవైపు జియో దూకుడుపై టాప్ టెల్కోలు బెంబేలెత్తుతున్నాయి. ఇప్పటికే ట్రాయ్ కు కంప్లైంట్ ఇచ్చిన టెల్కోలు అంతటితో తగ్గకుండా తాము టవర్లివ్వమని మొదట భీష్మించాయి. ఆ తర్వాత సహకరిస్తామని టవర్స్ అప్ గ్రేడ్ చేశాయి. కానీ ఇప్పటికీ జియో వాయిస్ కాల్స్ చాలావరకు బ్లాక్ అవుతున్నాయన్న విమర్శలున్నాయి. జియో సక్సెస్ అయిన తరుణంలో ఉద్యోగులు, కస్టమర్స్ తో ముకేష్ మీటింగ్ అరేంజ్ చేశారు. మొత్తం ఐదు కోట్ల మంది జియో వినియోగదారులున్నారన్న ముకేష్.. త్వరలోనే వీరి సంఖ్య మరింత పెంచుకుంటామంటున్నారు. ముకేష్ సీరియస్ కావడం చూస్తుంటే.. భవిష్యత్ లో జియో దూకుడు ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు.

180 రోజులు.. నోటు పాట్లు

01/12/2016: ముందుంది మంచి కాలం.. అంటే ఏంటో అనుకున్నారు జనం.. కానీ ఇప్పుడు తెలుస్తోంది. ముందుంది ముంచే కాలం అని. నోట్ల దెబ్బకు విలవిల్లాడుతున్న జనానికి ప్రభుత్వం తెర వెనుక చేస్తున్న మంత్రాంగం తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. నోటు కష్టాలు యాభై రోజులే అని మోడీ చెప్పారు. కానీ అసలు నిజం వేరే ఉంది. కేంద్రం ప్లాన్ ప్రకారం పూర్తిస్థాయిలో 500 నోట్లు అమల్లోకి వచ్చి, నోటు కష్టాలు తీరడానికి ఆరు నెలలు పడుతుంది. 2017 జూన్.. ఇదీ కేంద్రం విధించుకున్న డెడ్ లైన్. మరి ఎక్స్ ట్రా షిఫ్టుల్లో ప్రింటింగ్ జరుగుతోంది. నగదు కొరతలేదు. ప్రజలకు సదా సేవ చేస్తున్నాం. అని చెప్పే మాటలన్నీ బూటకమేనా. అంటే వ్యూహాత్మకం అనుకోవాలి. జనాన్ని ఎలాగైనా డిజిటల్ దారిలోకి మళ్లించడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం బలవంతంగా ట్రై చేయడానికే నోట్ల సమస్య ఉద్దేశపూర్వకంగా సృష్టించింది. ప్రజలు మంచిగా చెబితే వినరు కాబట్టి.. నోట్లు లేకపోతే చచ్చినట్లు ఆన్ లైన్లో లావాదేవీలు జరుపుతారు. అప్పుడు ఎంచగ్గా టాక్సులు వసూలు చేయొచ్చు. .ఇదీ అసలు ఉద్దేశం. మరోవైపు నల్లదొరలకు షాక్ ఇవ్వడానికే కొత్త 500నోట్లు లేట్ చేస్తున్నారనే వాదన ఉంది. ఇప్పుడు ఎక్కువ మొత్తంలో 2వేల నోట్లు విడుదల చేసి, అవి నల్లదొరలు స్టోర్ చేసుకునేలా చేశారు. రేపు సడెన్ గా 2వేల నోటు రద్దు చేసి.. కేవలం 500 నోట్లే చెల్లుతాయంటున్నారు. దాంతో చచ్చినట్లు నల్లదొరలు డిపాజిట్ల కోసం కష్టపడక తప్పదు. కేంద్రం ప్లాన్ చూస్తుంటే.. పిల్లికి చెలగాటం.. ఎలుక్కి ప్రాణసంకటంలా ఉంది. నల్లడబ్బు వెలికితీయడం కోసం ఏకంగా సామాన్యుల జీవితాలతో, దేశ ఆర్థిక వ్యవస్థతోనే కేంద్రం జూదమాడుతోందని, పర్యవసానాలు ఎలా ఉంటాయో ఈ కసరత్తు పూర్తయ్యాకే తెలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఖానాపూర్ కాదు కవితాపూర్

01/12/2016: తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవితకి.. ఎవరికీ దక్కని గౌరవం దక్కింది. ఓ జిల్లాకు నేత పేరు పెట్టొచ్చు. వీధులకూ పెట్టొచ్చు. కావాలంటే రాష్ట్రమంతా నేతల విగ్రహాలు కట్టించొచ్చు. ఇవన్నీ మనం చూసినవే. కానీ ఏకంగా ఓ ఊరి ప్రజలే స్వచ్ఛందంగా తమ ఊరి పేరును కవితాపూర్ గా పెట్టుకోవడం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కవిత మొదట్నుంచీ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా ఉన్నారు. బతుకమ్మకు ఏకంగా బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మలు ఆడొచ్చారు. ఢిల్లీలో గులాబీ గళం వినిపిస్తున్నారు. కేసీఆర్ దీక్ష చేస్తున్నప్పుడు హిందీ ఛానెళ్లకు అనర్గళంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ ఇంతకీ కవిత ఏం చేసి ప్రజల మనసుల గెలుచుకున్నారో.. తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కడతామన్నారు. కట్టారా. చంద్రబాబు అమరావతి నిర్మిస్తాం అన్నారు. నిర్మించారా. మోడీ విదేశాల నుంచి నల్లధనం తెచ్చి మన అకౌంట్లలో వేస్తామన్నారు. వేశారా. లేదే. అలాగే కవిత కూడా ఓ గ్రామంలో జనాలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామన్నారు. అంతే దానికే వాళ్లు ఫ్లాటైపోయారట. కవిత నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పరిధిలోని ఖానాపూర్ గ్రామపంచాయితీ శ్రీరాంసాగర్ ముంపు గ్రామం. వరదలొచ్చినప్పుడల్లా బిక్కుబిక్కుమంటూ బతకాల్సిందే. తమ కష్టాన్ని గ్రామస్తులు కవితతో మొరపెట్టుకుంటే.. ఆమె ఇళ్లకు హామీ ఇచ్చారు. అంతే వాళ్లంతా కలిసి తమ గ్రామం పేరు కవితాపూర్ గా మారుస్తున్నట్లు.. ఏకంగా ఊరి ఎంట్రన్స్ లో బ్యానరే పెట్టేశారు.

అమ్మో ఒకటో తారీఖు

24/11/2016: నవంబర్ 8న పెద్ద నోట్లు రద్దయ్యాయి. అప్పట్నుంచి నోటు కష్టాలు కొనసాగుతున్నాయి. చాలాచోట్ల బ్యాంకులు చేతులెత్తేశాయి. ఇప్పుడు బ్యాంకుల్ని కొత్త భయం వెంటాడుతోంది. జీతాలిచ్చే ఒకటో తేదీ దగ్గరపడింది. ఏటీఎంల దగ్గర ఇదే పరిస్థితి కొనసాగితే.. కరెన్సీ సంక్షోభం ముదరడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ బ్యాంకులకు ఆందోళన అక్కర్లేదని ఆర్బీఐ భరోసా ఇస్తోంది. ఇప్పటికే మూడో వంతు ఏటీఎంల్లో సాఫ్ట్ వేర్ మార్చేశామని, జీతాల తేదీ నాటికి అన్ని ఏటీఎంలు రెడీ చేస్తామని ధీమాగా చెబుతోంది. కానీ ఇప్పటివరకూ ఆర్బీఐ నిర్వాకం చూసినవారెవరికీ.. ఈప్రకటనపై నమ్మకం కలగడం లేదు. ఇప్పటికే బ్యాంకుల్లో నగదు లేక సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. కరెన్సీ సరఫరాకు యుద్ధ విమానాలు వినియోగిస్తున్నా.. పరిస్థితి చక్కబడటం లేదు. ఒకటో తేదీన బ్యాంకుల ముందు క్యూలు ఏ లెవల్లో ఉంటాయో తలుచుకుంటునే.. బ్యాంకు సిబ్బందికి హార్ట్ ఎటాక్ వచ్చేస్తుంది. కానీ ఆర్బీఐ మాత్రం తమను నమ్మమంటోంది. రీకాలిబ్రేషన్ తర్వాత ఏటీఎంల్లో గతంలో కంటే అధిక మొత్తంలో నగదు పడుతుందని, క్యూలతో సమస్యే లేదని అంటోంది. 2 రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందని చెప్పి.. రెండు వారాలైనా కష్టాలు తీర్చని ఆర్బీఐ.. ఇప్పుడు ఏటీఎంలన్నీ బాగుచేస్తామనడం కాస్త వింతగానే ఉంది. ఇప్పటికీ దేశలో 90 శాతం ఏటీఎంలు పనిచేయడం లేదు. కానీ ఆర్బీఐ చెబుతున్న లెక్కలు వేరేగా ఉన్నాయి. మొత్తం మీద ఒకటో తేదీ వస్తే కానీ.. నిజానిజాలు బయటపడే అవకాశం లేదు.

మోడీ, కేసీఆర్ ల మధ్య ఏంటా సీక్రెట్ డీల్?

24/11/2016: పెద్ద నోట్ల యవ్వారంలో పెద్దలంతా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం నుంచి ముందే ఇన్ఫర్మేషన్ అందడంతో ఆయన తన వద్ద ఉన్న నల్లధనమంతా చక్కబెట్టేశారని ఇప్పటికే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తాజాగా తెలంగాణ సీఎం పైనా కాస్త అటూఇటూగా అవే ఆరోపణలు వస్తున్నాయి. చంద్రబాబులా కేసీఆర్ కు ముందుగా సమాచారం అందకపోవడంతో ఆయన తొలుత షాక్ తిన్నారని.. ఆ క్రమంలోనే అసంతృప్తి వ్యక్తంచేయడంతో మోడీ నుంచి పిలుపు అందుకున్నారని చెబతున్నారు. దీంతో ఢిల్లీ వెళ్లి తన నల్లధనానికి భరోసా సాధించకు వచ్చారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. టీ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈరోజు కేసీఆర్ పై మండిపడ్డారు. కేసీఆర్ ను అతిపెద్ద అవినీతిపరుడిగా ఆయన అభివర్ణించారు. ఆయన వద్ద ఎంత బ్లాక్ మనీ ఉందో త్వరలోనే తెలుస్తుందని చెప్పారు. నల్లధనాన్ని మార్చుకునే క్రమంలోనే ప్రధాని మోదీని కేసీఆర్ కలిశారని... మోదీ, కేసీఆర్ ల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. విదేశాల నుంచి నల్లధనాన్ని తీసుకువస్తానని చెప్పిన మోదీ విఫలమయ్యారని... ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే పెద్ద నోట్లను రద్దు చేశారని విమర్శించారు. నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. కేసీఆర్ నల్లధనం త్వరలోనే వెల్లడవుతుందని చెప్పిన జీవన్ రెడ్డి అది ఎప్పుడు ఎలా అన్నది చెప్పలేదు. జీవన్ రెడ్డి గతంలోనూ కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేతలంతా కేసీఆర్ ను విమర్శిందుకు మొహమాటపడుతున్నా జీవన్ మాత్రం దూకుడు చూపుతున్నారు.

ఆ డబ్బు తీసుకుంటే.. పథకాలు హుళక్కే..!

14/11/2016: పెద్ద నోట్ల రద్దుతో నల్లకుబేరులు బ్లాక్ ను వైట్ చేసేందుకు మార్గాలు వెతుకున్నారు. ఇప్పటికే జన్ ధన్ ఖాతాల పేదలకు కమీషన్లు ఆశచూపి.. వారి ఖాతాల్లో డబ్బు జమచేస్తున్నారు. దీంతో జన్ ధన్ ఖాతాదారులకు ఎసరు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అనవసరంగా కమిషన్ కోసం ఆశపడితే.. భవిష్యత్తులో సంక్షేమ పథకాలకు అనర్హులౌతారని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటిదాకా డబ్బుల్లేని జన్ ధన్ ఖాతాల్లో ఉన్నట్లుండి వేలకు వేలు జమ కావడాన్ని ఆర్బీఐ నిశితంగా గమనిస్తోంది. అటు ఐటీ అధికారులు కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ను డేగకళ్లతో వాచ్ చేస్తున్నారు. ఎవరిపై అనుమానం వచ్చినా.. బ్యాంక్ అకౌంట్ ను సీజ్ చేసి చెక్ చేసే ఛాన్సుంది. కాబట్టి జన్ ధన్ ఖాతాదార్లూ జర భద్రమంటున్నారు అధికారులు.

చికెన్ మార్కెట్ కు నోటు దెబ్బ

14/11/2016: పెద్ద నోట్ల దెబ్బ చికెన్ మార్కెట్ కూ తగిలింది. ప్రతి ఆదివారం రద్దీగా కనిపించే మాంసం దుకాణాలు బోసిపోయి కనిపించాయి. పెద్ద నోట్లు లేకపోవడంతో జనాలు చికెన్ షాపుల వైపు చూళ్లేదు. ఇక 2వేల నోటు ఉన్నవాళ్లకు చిల్లర సమస్య ఎదురైంది. మాంసం దుకాణాలతో పాటు చేపల కొట్లు కూడా వెలవెలబోయాయి. ఆదివారం హైదరాబాద్ లో ఏ సెంటర్లో చూసినా రోడ్డుమీదే చికెన్, చేపల విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. అలాంటిది ఈ ఆదివారం పూర్తిగా భిన్నమైన పరిస్థితి కనిపించింది. అసలు చాలా చోట్ల విక్రేతలు కూడా రాలేదు. మా దగ్గరా డబ్బుల్లేవని వాళ్లు చెబుతున్నారు. 500, వెయ్యి నోట్లను రద్దు చేయడంతో తమ జీవితాలే తలకిందులయ్యాయని సామాన్యులు వాపోతున్నారు. చిల్లర ఖర్చుకు డబ్బుల్లేక జనాలు బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరుతున్నారు.

నోటు దెబ్బకు పెళ్లిళ్లు హుష్

14/11/2016: శుభమా అని పెళ్లి జరుగుతుంటే.. మోడీకి మూడొచ్చి పెద్ద నోట్ల రద్దు చేశారు. అంతే పెళ్లి పందిళ్లు రణరంగమయ్యాయి. కట్నం కోసం అల్లుళ్లు, చిల్లర తేలేక మామలు నారా హైరానా పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో రెండు చోట్ల పెళ్లి జరగదేమోనన్న భయంతో ఇద్దరు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. బుర్ర లేకుండా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సామాన్యులు నానా అగచాట్లు పడుతున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును అవసరం కోసం విత్ డ్రా చేసుకుంటే కూడా.. బ్లాక్ మనీ అంటే ఎక్కడ చావాలని సామాన్యులు నిలదీస్తున్నారు. ట్యాక్సులు గుంజడానికే నల్లధనం పేరుతో డ్రామా ఆడుతున్నారని మండిపడుతున్నారు. సామాన్యులకు తోడు రాజకీయ నేతలు నిరసన తెలుపుతున్నారు. మోడీ పుణ్యమాని పెళ్లిళ్లు ఆగిపోతున్నాయని వైసీపీ లీడర్ భూమన కరుణాకర్ రెడ్డి సైటైరేశారు. పెళ్లిపందిట్లో ఉండాల్సిన చుట్టాలంతా.. గ్రూపులు గ్రూపులుగా బ్యాంకులు, ఏటీఎంల ముందు పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లకుబేరులకు ముందే సమాచారం అందిందన్న ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని భూమన డిమాండ్ చేశారు. మోడీ ఏం ఆశించి పెద్ద నోట్లు రద్దు చేశారో.. ఆ లక్ష్యం అసలు నెరవేరలేదన్నారు. కానీ సామాన్యులు మాత్రం అల్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణకు భారీగా నష్టం?

12/11/2016: ఏదైనా ప‌రిణామంపై వెంట‌నే స్పందించేయ‌కుండా...ఒకింత విశ్లేషించి, ఘాటుగా స్పందించే తెలంగాణ ముఖ్య‌మంత్రి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పెద్దనోట్ల రద్దు ప్రభావంపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ న‌ర‌సింహ‌న్‌తో భేటీ అయిన కేసీఆర్...కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో తెలంగాణకు భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని గవర్నర్ తో చెప్పినట్లు తెలిసింది. గంటన్నరకు పైగా సాగిన భేటీలో రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రభావం, రాష్ట్రాల‌కు కేంద్రం చెల్లించాల్సిన పన్నుల వాటా తగ్గింపు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సంద‌ర్భంగా వివిధ రంగాల‌కు చెందిన వివ‌రాల‌ను కేసీఆర్ గ‌ణాంకాల‌తో స‌హా వివ‌రించార‌ని చెప్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఏడాది మ‌ధ్య‌లో రాష్ట్ర ప్ర‌భుత్వానికి చెల్లించాల్సిన ప‌న్నుల వాట‌ను నిలిపివేసిన ప్ర‌ధాన‌మంత్రి మోడీ ఒక్క‌రేన‌ని కేసీఆర్ అసంతృప్తి వ్య‌క్తం చేస‌న‌ట్లు స‌మాచారం. నోట్ల ర‌ద్దు ప్ర‌భావం రాష్ట్రంపై భారీగా ఉంటుందని గవర్నర్‌కు తెలిపిన సీఎం కేసీఆర్ గత రెండురోజుల్లోనే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంలో 90 శాతం పడిపోయిందని కంప్లైంట్ చేశారు. నెలకు రూ.1000 నుంచి రూ.2000 కోట్ల వరకు న‌ష్టం వాటిల్లే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ కుదేలైందని, రోజుకు మూడువేలకు పైగా లావాదేవీలు జరిగే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నోట్ల రద్దు తరువాత బుధవారం 150, గురువారం 300 రిజిస్ట్రేషన్లే జరిగాయని కేసీఆర్‌ పేర్కొన్నారు. సగటున నెలకు రూ.300-320 కోట్ల ఆదాయం వచ్చేదని, ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు. రవాణరంగంపైనా తీవ్ర ప్రభావం పడిందని, ముఖ్యంగా చిన్న కార్ల క్రయవిక్రయాలపై ప్రభావం చూపిందని గ‌వ‌ర్న‌ర్‌కు కేసీఆర్ వివ‌రించారు. ద్విచక్రవాహనాల క్రయవిక్రయాలు ఎక్కువగా నగదు లావాదేవీల ద్వారానే జరుగుతాయని చెప్పిన కేసీఆర్ రోజుకు సగటున 3 వేల వాహనాల క్రయవిక్రయాలు జరిగేవని, బుధవారం 1700, గురువారం 1100 వాహనాలు మాత్రమే అమ్మకాలు జరిగి, ఆదాయం 50% పడిపోయిందని వివరించారు. ఎక్సైజ్ ఆదాయం కూడా తగ్గే అవకాశం కనిపిస్తున్నదని, లగ్జరీ, గూడ్స్ తదితర అమ్మకాలు పడిపోయాయని చెప్పారు. రాష్ట్రంలో చిన్న వ్యాపారాలదే పెద్దవాటా అని, ఎక్కువ వ్యాపారాల్లో నగదు లావాదేవీలే జరుగుతాయని, నగదు చెలామణిపై ఆంక్షలు విధించడంతో ఇబ్బంది కలుగుతుందని సీఎం కేసీఆర్ వివరించారు. ఈ నేప‌థ్యంలోనే త‌మ‌కు రావాల్సిన వాటి గురించి కూడా గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద ఓ మాట చెప్పేసి పెట్టిన‌ట్లు సమాచారం. కేంద్రం నుంచి మినహాయింపులు, సవరణల కోసం ఎదురుచూస్తున్నామని, కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటాను ఇప్పించాలని గవర్నర్‌ను సీఎం కోరారు. దేశచరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన 42% వాటాను బాగా తగ్గించిందని చెప్పారు. రాష్ట్రానికి ఏటా రూ.13,995 కోట్లు పన్నుల్లో వాటా రావాల్సి ఉందన్నారు. ఇది 14 వాయిదాల్లో నెలకు రూ.997 కోట్లు చొప్పున రావాల్సి ఉందన్నారు. మొదటి ఆరునెలలు పూర్తిగా ఇచ్చి, ఈ నెల రూ.585 కోట్లు మాత్రమే ఇచ్చారని కేసీఆర్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. రూ.412 కోట్లు తగ్గించారని, వాటాల్లో మార్పులు చేర్పులు బడ్జెట్ రూపొందించినప్పుడే చేస్తారు తప్ప మధ్యలో చేయరని, దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ ఇలా వాటా తగ్గించలేదని, మోడీ ప్రభుత్వమే ఇలా చేసిందని గ‌వ‌ర్న‌ర్‌తో కేసీఆర్ త‌న అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేసినట్లు సమాచారం. ఇలా ఆర్థిక సంవంత్సరం మధ్యలో పన్నుల్లో వాటా తగ్గించడం వల్ల రాష్ట్రాల‌కు చాలా ఇబ్బందులు ఎదురవుతాయని, అనుకున్న కార్యక్రమాల అమలు కష్టమవుతుందని గవర్నర్‌కు వివరించినట్లు తెలిసింది.

మోడీకి 3.5 లక్షల మంది టాటా చెప్పేసారు

12/11/2016: రూ.500, 1000 రూపాయల నోట్ల రద్దు నిర్ణయం ప్రధాని నరేంద్ర మోడీకి కూడా స్వయంగా నష్టం కలిగించింది. ఆ నిర్ణయం వల్ల ఆయనకున్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ లో లక్షల మంది ఆయన్ను వీడుతున్నారు. ప్రధాని మోడీ ట్విట్టర్ ఖాతాను భారీ సంఖ్యలో అభిమానులు అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కరెన్సీ రద్దు చేయడం, రద్దు చేసిన కరెన్సీ స్థానంలో అంతకంటే ఎక్కువ విలువైన నోట్లు విడుదల చేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆయన ఖాతాను వీడుతున్నట్టు ప్రకటించారు. ఇప్పటి వరకు సుమారు 3.5 లక్షల మంది ఆయన్ను అన్ ఫాలో చేశారట. అయితే కరెన్సీని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది? అన్నదానిపై ఆయన వివరణ ఇచ్చిన అనంతరం మళ్లీ ఖాతాను అనుసరిస్తున్నవారి సంఖ్య పెరుగుతున్నట్టు తెలుస్తోంది. వీరంతా మళ్లీ మోడీ ఫ్యాన్ క్లబ్ లో చేరుతారని.. మోడీ నిర్ణయం ఫలితాలు అందివ్వడం మొదలుపెట్టాక వీరితో పాటు కొత్తవారూ వస్తారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు మోడీ దెబ్బకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా 4 వేల రూపయాల చిల్లర కోసం బ్యాంకుకు రావాల్సి వచ్చింది. ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ లో ఉన్న ఎస్ బీఐ శాఖకు ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, రూ.4 వేల పాతనోట్ల మార్పిడి కోసం ఇక్కడికి వచ్చాను అని సమాధానమిచ్చారు.

బ్యాంకులకు వద్దంటే డబ్బు

12/11/2016: మామూలు రోజుల్లో బ్యాంకుల్లో డిపాజిట్ చేయించడానికి సిబ్బందికి టార్గెట్లు పెట్టి. మేనేజర్లు నానా హైరానా పడేవారు. కానీ పెద్ద నోట్ల మార్పిడితో ఆ కష్టాలు తీరిపోయాయి. ఇప్పుడు జనాలు వద్దన్నా వచ్చి మరీ డబ్బు డిపాజిట్ చేస్తున్నారు. తెలంగాణలోనే ఒక్కరోజులో 15వేల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి. పాత నోట్లు ఇళ్లలో పెట్టుకుంటే ముప్పు తప్పదని గ్రహించిన జనం.. రెండున్నర లక్షల డిపాజిట్ పరిమితి దాటితే ట్యాక్స్ పడుతుందని తెలిసినా ఎక్కడా తగ్గలేదు. ముఖ్యంగా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ , ఎంప్లాయిస్ వీళ్లెవరూ ట్యాక్స్ కు వెనుకాడలేదు. ఎంత ట్యాక్సైనా పర్లేదు తమ దగ్గరున్న డబ్బు వృథా కాకూడదన్న తపన వీరిలో కనిపించింది. తెలంగాణలో చిన్న బ్యాంకుల నుంచి పెద్ద బ్యాంకుల వరకూ అన్ని బ్యాంకులపై కాసుల వర్షం కురిసింది. ఈ దెబ్బతో ఎక్కడెక్కడో మూలన పేరుకుపోయిన నగదు కూడా వ్యాపార స్రవంతిలోకి వచ్చేస్తుందని బ్యాంకులు చెబుతున్నాయి. లాకర్లలో మూల్గిన డబ్బులు కూడా కట్టులు తెంచుకుని బయటికి వచ్చేసింది. నోట్ల మార్పిడిలో డిపాజిట్ కు లిమిట్ లేకపోవడం, విత్ డ్రాయల్ కు లిమిట్ ఉండటం కూడా ఈ పరిస్థితికి కారణమని భావిస్తున్నారు. మొత్తం మీద డిసెంబర్ 30 వరకు బ్యాంకులన్నీ ఫుల్లుగా డబ్బుతో ఖుషీ చేయనున్నాయి.

కేసీఆర్ మరో సారి 'ఆంధ్రా' ప్రేమ చూపించారు

11/11/2016: తెలంగాణ సీఎం మరోసారి హైదరాబాద్ అందరిదీ అన్నారు. క్షత్రియ సమ్మేళనంలో మాట్లాడిన సీఎం .. స్థిరపడ్డవారే హైదరాబాద్ కు మరింత వన్నె తెచ్చారన్నారు. వలసదారుల్ని తామెప్పుడూ చిన్నచూపు చూడలేదని, ఇదంతా ప్రత్యర్థుల దుష్ప్రచారమేనని కొట్టిపారేశారు. ఉద్యమ సమయంలో కూడా ఆంధ్రా నేతలపైనే తప్ప ఆంధ్రా ప్రజలపై కోపం లేదని చెప్పినట్లు గుర్తుచేశారు. అందరినీ ఆదరించే గొప్ప సంస్కృతి హైదరాబాద్ లో ఉందన్న కేసీఆర్.. అన్ని వర్గాల ప్రజల ఆదరణతోనే హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదుగుతోందన్నారు. హైదరాబాద్ లో జాతి, మత, కుల, ప్రాంత భేదాలకు తావు లేదన్నారు. ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా, సుఖసంతోషాలతో జీవిస్తున్నారని గుర్తుచేశారు. పొట్టకూటి కోసం వచ్చిన వాళ్లతో పేచీ లేదు. పొట్ట కొట్టే వాళ్లతోనే పంచాయితీ అని కేసీఆర్ మరోసారి ఉద్యమం సందర్భంగా చెప్పిన మాటల్న గుర్తుచేశారు. వలసదారులు హైదరాబాద్ కు ఎన్నో కొత్త వ్యాపారాలు పరిచయం చేశారని, వారంతా దోపిడీదారులు కాదని స్పష్టం చేశారు.

పెద్ద నోట్లపై వీళ్ల మాటలు వినాల్సిందే

11/11/2016: పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ మిత్రపక్షాలు, ప్రతిపక్షాలు తమదైన శైలిలో స్పందించాయి. బీజేపీ మిత్రపక్షమైన శివసేన తన అధికారిక పత్రిక సామ్నా ఈ రోజు సంపాదకీయంలో హఠాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోడీ తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్యులు ఇక్కట్టు పడుతున్న మాట వాస్తవమని పేర్కొంది. మోడీ నిర్ణయం విజయవంతమైందో లేదో కాలమే నిర్ణయిస్తుందని పేర్కొంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై సర్జికల్ దాడుల అనంతరం సరిహద్దులలో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు జరుగుతుండగా మోడీ నల్లధనంపై జరిపిన ఈ రెండో సర్జికల్ దాఢి ఫలితం తేలాలంటే వేచి చూడాలని పేర్కొంది. అయితే ఈ నిర్ణయం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులలో పడ్డానని పేర్కొంది. అక్రమ వ్యాపారాలు, అవినీతి పోవాలంటే ముందుగా మైండ్ సెట్ మారాల్సి ఉంటుందన్నారు. అంత వరకూ అక్రమార్కుల, నల్లకుబేరుల ఆటకట్టించడం సాధ్యం కాదని సామ్నా సంపాదకీయం పేర్కొంది. మరోవైపు అమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ పరిణామాన్ని రాజకీయ కోణంలో చూస్తూ స్పందించారు. రూ. 1000 నోట్ల స్థానంలో రూ. 2000 నోట్లు ఎందుకు తెస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. నోట్ల రద్దుతో అవినీతిని ఎలా నిర్మూలించగలమని కేజ్రివాల్ ప్రశ్నించారు. నోట్ల రద్దు విషయాన్ని వారం రోజుల ముందే బీజేపీ తన సహచరులకు తెలిపిందని పేర్కొన్నారు. వారు ఇప్పటికే డబ్బును పెట్టుబడుల్లోకి మార్చుకున్నారని ఆరోపించారు. కాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ ఈ విషయంలో స్పందించి వివాదంలో చిక్కుకున్నారు. పెద్ద నోట్ల రద్దు వ్యవసాయ రంగంపై, వివాహ శుభకార్యాలు జరుపుకునే వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంటూ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం గురించి మాట్లాడే హక్కు ఇసుమంతైనా కాంగ్రెస్ కు లేదని పలువురు నెటిజట్లు ట్వీట్ చేశారు. అలాగే వివాహాది కార్యక్రమాలకు అయ్యే ఖర్చు ఎక్కౌంటబుల్ అయితే నష్టమేమిటని ప్రశ్నించారు.

మోడీ ఆపరేషన్ మామూలుగా సాగలేదు

11/11/2016: రూ.500, రూ.1000 నోట్లను నిషేధిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం సమయంలో ఏం జరిగిందనే వార్తలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఒకే ఒక్క పరిణామం దేశం మొత్తాన్ని కుదిపేస్తుండగా...మోడీ మాత్రం తాపీగా తన పని కానిచ్చేశారు. ఈ క్రమంలో ఏం జరిగిందంటే... మంగళవారం రాత్రి దేశం మొత్తం నివ్వెరపోయేలా మొన్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కనీసం కేబినెట్ సహచరులకు కూడా తెలియకుండా….ఇంత పెద్ద నిర్ణయాన్ని ఆయన ఎప్పుడు తీసుకున్నారు? ఎలా తీసుకున్నారు? ప్రకటించే వరకూ ఎవరికీ తెలియకుండా ఈ రహస్యాన్ని రహస్యంలాగే ఎలా ఉంచారు అనేది అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది. అసలు ఈ నిర్ణయానికి చాలా రోజుల కిందటే అంకురార్పణ జరిగిందట. కేబినెట్ సమావేశాలకు సెల్ ఫోన్లను తీసుకు రావడంపై కొద్దిరోజుల కిందట నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మంత్రులకు, వారి పర్సనల్ సెక్రటరీలకు వర్తమానం ఆందించారు. అక్కడికి ఒక అంకం అయిపోయింది. ఇక మంగళవారం నాడు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రులకు కూడా తెలియదు. కేబినెట్ ప్రారంభం కావడానికి పది నిముషాల ముందే వారికీ సమాచారం అందింది. సమావేశం ప్రారంభం కాగానే మోడీ వారికి నల్ల ధనంపై సర్జికల్ దాడుల విషయాన్ని వెల్లడించారు! వారు ఆశ్చర్యం నుంచి తేరుకోకముందు….ఈ నిర్ణయాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తెలియజేయడానికి వెళ్లారు. వెడుతూ వెడుతూ తాను తిరిగి వచ్చే వరకూ మంత్రులెవరూ మీటింగ్ హాల్ నుంచి బయటకు వెళ్లవద్దని ఆదేశించారు!! అంతే ఇక విషయం బయటకు పొక్కే అవకాశమే లేకుండా పోయింది. ఇక్కడ కేబినెట్ భేటీ జరగుతున్న సమయంలోనే మరో పక్క ఆర్బీఐ బోర్డ భేటీ కూడా జరిగింది. రాష్ట్రపతికి విషయం తెలియజేసి తిరిగి వచ్చిన మోడీ వెంటనే టెలివిజన్ లో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అంతకు ముందు త్రివిధ దళాల చీఫ్ లతో ప్రధాని భేటీ కావడంతో దేశ భద్రత, సరిహద్దుల్లో పరిస్థితి, సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించి కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. అయితే మోడీ నల్లకుబేరులే లక్ష్యంగా బ్లాక్ మనీ పై సర్జికల్ దాడి చేశారు. పెద్ద నోట్ల రద్దు విషయాన్ని ప్రకటించేశారు. అయితే ఈ ఎపిసోడ్ విత్త మంత్రి అరుణ్ జైట్లీ, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, మరి కొద్ది మంది ఉన్నత స్థాయి అధికారులకు మాత్రమే ఈ విషయం చూచాయిగా తెలుసుననని మీడియా కథనం. పెద్ద నోట్ల రద్దు రహస్యం ముందుగా బయటకు పొక్కితే నల్ల కుబేరులు తమ నల్ల సొత్తును హవాలా మార్గం ద్వారా డిపాజిట్లు చేసి ఉండేవారు. ముఖ్యంగా బంగారం, రియల్ ఎస్టేట్ రంగాలలో పెట్టుబడులుగా పెట్టేసి ఉండేవారని ముంబైకి చెందిన ఒక ఇన్వెస్ట్ మెంట్ మేనేజ్ మెంట్ సంస్థ పేర్కొంది. కేబినెట్ లోని చాలా మంది మంత్రులకు ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించడానికి ముందు నిర్వహించిన కేబినెట్ సమావేశంలో మాత్రమే పెద్ద నోట్ల రద్దు విషయం తెలిసిందని ఒక ఆంగ్ల దినపత్రిక పేర్కొంది. సరిగ్గా ఢిల్లీలో కేబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలోనే అక్కడికి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ముంబైలో ఆర్బీఐ అధికారులు బ్యాంకులకు పెద్ద నోట్ల రద్దు విషయాన్ని వివరిస్తున్నారని ఆ పత్రిక పేర్కొంది. అంతకు ముందు బ్యాంకుల హెడ్స్ ను ఆర్బీఐకి పిలిపించి సీల్ చేసి ఉన్న నగదు ఛెస్ట్ {డబ్బాల వంటివి} వారికి అందించిన ఆర్బీఐ వాటిలో కొత్త రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయని మాత్రమే చెప్పింది. రాత్రి తమ నుంచి ఆదేశాలు వచ్చే వరకూ వాటిని ఓపెన్ చేయరాదని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు విషయాన్ని ప్రకటించిన తరువాత మాత్రమే బ్యాంకులు తమకు చేరిన నగదు ఛెస్ట్ లను తెరిచాయి. అప్పడు మాత్రమే వాటికి కొత్త 500 రూపాయల నోట్ కూడా ఉందని తెలిసింది. ఇది దేశంలో నల్లధనానికి చెక్ పెట్టే మహాయజ్ణం ప్రారంభానికి ముందు రహస్యంగా జరిగిన ఆపరేషన్.

ఏటీఎంల్లో ఇక నుంచి రూ.50నోట్లు?

10/11/2016: రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో సామాన్యులు నానాపాట్లు పడుతున్నారు. తమ వద్ద ఉన్న పెద్ద నోట్లు మార్చుకునేందుకు బ్యాంకులకు పోటెత్తుతున్నారు. ఈ రోజు నుంచి ప్రభుత్వం కొత్త నోట్లు జారీ చేస్తుండడంతో జనాలకు కొంత ఊరట లభించింది. ప్రజల వద్ద ఉన్న పెద్ద నోట్లకు ప్రతిగా వారి చేతుల్లో రూ.2000 లేదా రూ.100 నోట్లు పడుతున్నాయి. చిక్కంతా ఇక్కడే వచ్చింది. చిల్లర అందుబాటులో లేకపోవడం అందరికీ ఇబ్బందిగా మారిపోయింది. చిన్న నోట్లకు గిరాకీ పెరిగిపోవడంతో ఆర్‌బీఐ ఓ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. అన్ని ఏటీఎం సెంటర్లలో 50రూపాయల నోట్లు అందుబాటులోకి వచ్చేలా ప్లాన్ రూపొందిస్తోంది. రూ.100 నోట్ల సంఖ్యను పెంచిన ఆర్‌బీఐ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రూ.50 నోట్లను కూడా ఇక నుంచి ఏటీఎంల్లో అందుబాటులోకి తేవాలని నిర్ణయించున్నట్లు సమాచారం. అయితే నిబంధన ప్రకారం రోజుకు 2వేల రూపాయలు మాత్రమే డ్రా చేయాలట. ఆర్‌బీఐ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే చాలామంది కష్టాలు తీరనున్నాయి. ఇదిలా ఉంటే, రూ.500, రూ.1000 నోట్లే కాక భవిష్యత్ లో మరిన్ని నోట్లను రీడిజైన్ చేస్తామని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. నల్లధనం అరికట్టేందుకే కాక పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకే పెద్ద నోట్లను రద్దు చేశామని వివరించారు.

ట్రంప్ మంచి అధ్యక్షుడు కాలేరా?

10/11/2016: శుభమా అని ఆయన అధ్యక్షుడైతే ఇవేం అపశకునం మాటలు అనుకుంటున్నారా. కానీ, తప్పదు. చరిత్ర చెప్పిన సత్యాలను ఇలాంటి సందర్భంలో కాకపోతే ఇంకెప్పుడు మననం చేసుకుంటాం. ఎన్నో ప్రతికూలతలను అధిగమించి.. కొండను ఢీకొట్టి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అందుకున్న ట్రంప్ ది నిర్ద్వంద్వంగా గొప్ప విజయమే. ఇంత గొప్ప విజయం సాధించిన ఆయన అధ్యక్షుడిగా సక్సెస్ కాలేరా అంటే సందేహించాల్సిందే. ఆయన గొప్ప అధ్యక్షుడిగా నిరూపించుకుంటే మాత్రం చరిత్రను తిరగరాసినట్లే. కారణం... గొప్ప వ్యాపారవేత్తలుగా ఉంటూ అమెరికా అధ్యక్షులైనవారెవరూ ప్రెసిడెంట్ గా సక్సెస్ కాలేదు. అమెరికన్ వరస్ట్ ప్రెసిడెంట్స్ లిస్టుల్లో టాప్ లో ఉన్నారే కానీ.. బెస్టు ప్రెసిడెంట్స్ లిస్టుల్లో చోటు సంపాదించుకోలేకపోయారు. ఇప్పుడు ట్రంప్ కూడా బిజినెస్ మేన్ కావడంతో ఆయన చరిత్రను నిజం చేస్తారా తిరగరాస్తారా అన్నది చూడాలి. అమెరికా అధ్యక్షుల్లో ఆల్ టైం గ్రేట్ ఎవరంటే అయిదారు పేర్లు వినిపిస్తాయి. జఫర్సన్, లింకన్, రూజ్ వెల్ట్, విల్సన్, ట్రూమన్ ఇలా కొన్ని పేర్లు చెబుతారు. 1900 తరువాత కాలంలో అధికారంలోకి వచ్చిన వారిలో జార్జి బుష్, వారన్ హార్డింగ్, బుచానన్, ఆండ్రూ జాన్సన్ వంటివారంతా వ్యాపారవేత్తలే. అయితే.. వివిధ కారణాల వల్ల జనం వారిని గొప్ప నేతలుగా గుర్తించలేదు. హూవర్, కూలిడ్జ్, బుస్, హార్డింగ్ వంటివారూ విఫల అధ్యక్షులే. వ్యాపారంలో పట్టిందల్లా బంగారమే అన్నంతగా విజయాలు సాధించిన హార్డింగ్ అధ్యక్షుడిగా మాత్రం అట్టర్ ప్లాఫ్. అమెరికాలోని వరస్ట్ ప్రెసిడెంట్లలో ఆయనొకరుగా పేరు తెచ్చుకున్నారు. అమెరికా ప్రెసిడెంట్లుగా పనిచేసినవారిలో ఇంతవరకు 21 మంది లాయర్లు, 8 మంది జనరల్స్, మరికొందరు ఇంజినీర్లు, ప్రొఫెసర్లు, ఒకరు నటుడు, మిగిలినవారు వ్యాపారవేత్తలు ఉన్నారు. కాగా అమెరికా అధ్యక్షులిగా పనిచేసినవారిలో ఆండ్రూ జాన్సన్ వస్త్రవ్యాపారం, హార్డింగ్ మీడియా వ్యాపారం, హూవర్ మైనింగ్, జిమ్మీకార్టర్ వ్యవసాయరంగంలో వ్యాపారాలు చేయగా జార్జిబుష్ సీనియర్ ది చమురు వ్యాపారం. వీరంతా తమతమ రంగాల్లో తిరుగులని వ్యాపారవేత్తలుగా నిరూపించుకున్నారు. అయితే... వీరితో పాటు మరో అమెరికా అధ్యక్షుడు కూడా వ్యాపారవేత్తగా ప్రసిద్ధుడే. ఆయన ట్రూమన్. అయితే... వ్యాపారంలో ఆయన తీవ్ర నష్టాలు చవి చూశారు. ఫెయిల్యూర్ బిజినెస్ మన్ అన్న పేరుంది. ఆయన మాత్రం అధ్యక్షుడిగా బాగా రాణించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు సృష్టించి గొప్ప అధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే.. ట్రంప్ విషయానికొస్తే ఆయన గొప్ప వ్యాపారవేత్తే అయినా నష్టాలు చవిచూసిన సందర్భాలూ ఉన్నాయి. దీంతో అధ్యక్షుడిగా ఆయన పెర్మార్మెన్సు ఎలా ఉంటుందో ముందుముందు చూడాలి.

సమస్యల సుడిగుండంలో సామాన్యుడు

10/11/2016: డబ్బులున్నా అవి చిత్తుకాగితాలే. మార్చుకోవడానికి పాత నోట్లున్నా.. మార్చుకునే పరిస్థితి లేదు. అత్యవసర పరిస్థితుల్లో కూడా డబ్బు లావాదేవీలు జరగని పరిస్థితి. నల్లధనం నియంత్రణకు కేంద్రం తీసుకున్న హఠాత్ నిర్ణయం.. సామాన్యుడి జీవితాన్ని స్తంభింపజేసింది. కేంద్రం మూడు రోజుల పాటు ఎన్నో వెసులుబాట్లు ఇచ్చింది. కానీ ఆచరణలో అవేవీ కనిపించడం లేదు. పెట్రోల్ బంకుల్లో మూడు రోజుల పాటు పాత నోట్లు చెల్లుతాయన్నారు. కానీ ఏ బంక్ లోనూ పాత నోట్లు తీసుకోవడం లేదు. కనీసం మంగళవారం అర్థరాత్రి వరకైనా ఏటీఎమ్ లు పనిచేస్తాయనుకున్నారు. కానీ ప్రధాని ప్రెస్ మీట్ ముగిసిన మరుక్షణమే అన్నీ బంద్ అయ్యాయి. ప్రభుత్వ సంస్థలు కూడా ప్రైవేట్ సెక్టార్ మాదిరిగా సామాన్యుడి అవసరాలతో ఆడుకుంటున్నాయి. మెట్రో నగరాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాత నోట్లు తీసుకుంటారనుకోవడం అత్యాశే అవుతుంది. అతిపెద్ద నిర్ణయం తీసుకున్న తర్వాత రెండు రోజులు బ్యాంకులు పనిచేయవని చెప్పడంతోనే.. కేంద్రం సరైన కసరత్తు చేయలేదని స్పష్టమౌతోంది. ఈపాటికే అన్ని బ్యాంకులకు కొత్త నోట్లు ఆర్బీఐ సప్లై చేసి ఉండాలి. ఆ తర్వాతే నిర్ణయం ప్రకటించాలి. కానీ అక్రమార్కులకు చేతులు, కాళ్లు కట్టేయాలనే ఆత్రంతో.. సామాన్యుడి నోట్లో కూడా కేంద్రం మట్టి కొట్టిందన్న విషయం చాలామందికి ఆలస్యంగా అర్థమవుతోంది.

జానారెడ్డిపై వేటు?

07/11/2016: కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఉంటూ కూడా కీల‌క‌మైన స‌మ‌యాల్లో అధికార పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ సొంత పార్టీకి నష్టం కలిగిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ లీడర్ కె.జానారెడ్డి తప్పులను ఇక పార్టీ భరించే స్థితిలో లేనట్లు తెలుస్తోంది. జానా తీరుపై ఎప్పటినుంచో అసంతప్తి ఉన్నా కూడా ఆయన పెద్దరికాన్ని దృష్టిలో పెట్టుకుని లోలోన తిట్టుకోవడమే తప్ప అధిష్ఠానం వరకు తీసుకెళ్లిన సందర్భాలు తక్కువ. కానీ... ఇటీవల కాలంలో జానా జానతనం నానాటికీ ఎక్కువవతుండడంతో అధిష్ఠానానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేయాలన్న ఆలోచన ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రీసీంటుగా ఏఎమ్మార్పీ ప్రాజెక్టు ద్వారా 50 వేల ఎక‌రాల‌కు నీరు తేవడంపై జానా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ ప్రాజెక్టు వెనుక టీఆరెస్ ప్రభుత్వ కృష్టి ఉందని ఆయన మీడియా ఎదుట వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ కు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో మొద‌టి నుంచి జానాపై ఆగ్రహంగా ఉన్న వ‌ర్గం, జానాకు వ్యతిరేక వ‌ర్గం నేత‌లు ఆయ‌న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళ‌న‌ల‌తో ప్రజామ‌ద్దతు కూడ‌గ‌డుతుంటే.. మ‌రోవైపు ఆ ప్రయ‌త్నాల‌కు జానారెడ్డి తూట్లు పొడుస్తున్నార‌ని సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌లు మండిప‌డుతున్నారు. టీఆరెస్ ప్రభుత్వాన్ని పొగడడం మానుకోవాలని ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా జానా మారకపోవడంతో సీనియర్ నేతలు కొందరు సోనియమ్మ దృష్టికి సంగతంతా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో జానాపై ఈసారి యాక్షన్ తప్పదన్న ప్రచారం జరుగుతోంది. జానాపై ఫిర్యాదులో ముఖ్యంగా మూడు అంశాలను పేర్కొంటున్నట్లు సమాచారం. గ్రేటర్ ఎన్నిక‌లకు ముందు రూ.5ల‌కే భోజ‌నం ప‌థ‌కం బాగుంద‌ని ప్రశంసించడం.. గ్యాంగ్ స్టర్ న‌యీంను ఎన్ కౌంటర్ చేసినందుకు ప్రభుత్వాన్ని, పోలీసుల్ని అభినందించడం... ప్రాజెక్టుల రీడిజైనింగ్ విష‌యంలోనూ ప్రభుత్వానికే అనుకూలంగా మాట్లాడడం, ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంతో కష్టపడి రూపొందించిన ప‌వ‌ర్‌పాయింట్ ప్రజెంటేష‌న్‌కు గైర్హాజరుకావడం.. తాజాగా ఏఎమ్మార్పీ ప‌థ‌కం విష‌యంలో ప్రభుత్వాన్ని అభినందించడం వంటివి ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఐటీ వార్‌లో బెంగ‌ళూరుపై గెలిచిన హైద‌రాబాద్‌

07/11/2016: దేశంలో ఐటీకి కేరాఫ్‌గా ఉన్న బెంగ‌ళూరు వెనుక‌బ‌డి పోతోందా? అదే స‌మ‌యంలో హైద‌రాబాద్ పుంజుకుంటోందా? భ‌విష్య‌త్తులో ఇండియ‌న్ సిలికాన్ వ్యాలీగా హైద‌రాబాద్ అవ‌త‌రిస్తోందా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ఇటీవ‌ల ప్ర‌పంచ బ్యాంకుతో క‌లిసి కేంద్ర వాణ‌జ్య శాఖ నిర్వ‌హించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ) స‌ర్వేలో బెంగ‌ళూరు 13వ ప్లేస్‌లో నిలిచిపోగా.. ఏపీ, తెలంగాణ‌ ఫ‌స్ట్‌లో ఉన్నాయి. అయితే, ఏపీ ఇప్పుడిప్పుడే డెవ‌లప్ అవుతోంది కాబ‌ట్టి.. తెలంగాణలో ఐటీ భారీ ఎత్తున విస్త‌రించే ఛాన్స్ క‌నిపిస్తోంది. పెట్టుబ‌డులు, ఉద్యోగాల క‌ల్ప‌న ఇక్క‌డ ఎక్క‌వ‌గా జ‌ర‌గ‌నుంది. దీంతో బెంగ‌ళూరు ప్లేస్ ఇక‌, హైద‌రాబాద్ వ‌శం కానుంద‌ని స‌మాచారం. ఇక‌, బెంగ‌ళూరు విష‌యానికి వ‌స్తే.. దేశంలో ఐటీకి ఈ న‌గ‌రం కేరాఫ్‌. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత సంస్థ‌ల‌న్నీ ఇక్క‌డ త‌మ కార్య‌క‌లాపాలు ప్రారంభించాయి. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలోని ఏన‌గ‌రంలోనూ జ‌ర‌గ‌నంత ఐటీ బిజినెస్ ఇక్క‌డి నుంచే జ‌రుగుతోంది. అదేవిధంగా పెట్టుబ‌డులు కూడా భారీ ఎత్తున వ‌స్తున్నాయి. దీంతో ఐటీ ఎగుమ‌తుల విష‌యంలో బెంగ‌ళూరు ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంది. కానీ, ఇప్పుడు ఈవోడీబీ స‌ర్వే ఇచ్చిన ర్యాంకు ఫ‌లితంగా రానున్న రోజుల్లో మాత్రం బెంగ‌ళూరుపై పెను ప్ర‌భావం ప‌డుతుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇక‌, ఈ ర్యాంకు వెనుక విష‌యం చూస్తే.. ఆ రాష్ట్రం చేసుకున్న స్వ‌యంకృతంగా క‌నిపిస్తోంది. ప్ర‌తి ప‌నికీ అధికారులు, మంత్రులు చేతులు చాప‌డం, వాటాలు వేసుకోవ‌డం చేస్తుండ‌డంతో ఐటీ సంస్థ‌ల‌కు చిరాకు పుడుతోంద‌ట‌. ఇక‌, ఈ క్రమంలో అనుమ‌తుల‌కు కూడా భారీ ఎత్తున ఆల‌స్యం జ‌రుగుతోంద‌ని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వ‌స్తున్నాయి. ఇక‌, న‌గ‌రంలో మౌలిక స‌దుపాయాలు క‌ల్పించ‌డంలోనూ ప్ర‌భుత్వ విఫ‌ల‌మ‌వుతోంది. ట్రాఫిక్ పెద్ద స‌మ‌స్య‌గా ప‌రిణ‌మిస్తోంది. దీంతో ఇంత‌కుముందు వ‌ర్క్ ఫ్రం హోం అనే మాట తిర‌గ‌బ‌డి వ‌ర్క్ ఫ్రం ట్రాఫిక్ అని ఐటీ ఉద్యోగుల నోట వినిపిస్తోంది. దీంతోనే బెంగ‌ళూరు ఐటీలో వెనుక‌బ‌డింద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ విష‌యానికి వ‌స్తే.. తెలంగాణ‌లో అవినీతి లేద‌నే చెప్ప‌చ్చు. అదేవిధంగా ప్ర‌భుత్వం ఐటీకి పెద్ద పీట వేస్తోంది. ఐటీ మంత్రి కేటీఆర్ దేశ విదేశాలు తిరిగి మ‌రీ పెట్టుబ‌డులు ఆహ్వానిస్తున్నారు. సింగ‌ల్ విండో ప‌ద్ధ‌తిలో అనుమ‌తులు ఇస్తున్నారు. ఈ క్ర‌మంలో రానున్న రోజుల్లో హైద‌రాబాద్‌లో ఐటీ విస్త‌రించ‌డం, కేరాఫ్‌గా మార‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అయితే, ఇక్క‌డ కూడా ట్రాఫిక్ స‌మ‌స్య‌లు ఉన్నాయి. చిన్న‌పాటి వ‌ర్షానికే రోడ్లు జ‌ల‌మ‌యం అవుతున్నాయి. మ‌రి వీటినుంచి ప్ర‌భుత్వం బ‌య‌ట‌ప‌డితేనే ఐటీ రంగం ఇక్క‌డ అభివృద్ధి చెందుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

భారీ ఆఫర్స్‌ ప్రకటించిన గో-ఎయిర్‌

హైద్రాబాద్‌, నవంబర్‌ 5,2016 (సలాం తెలంగాణ): చౌక ధరల విమానయాన సంస్థ గో-ఎయిర్‌..11వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్లను ప్రకటించింది. ప్రారంభ విమాన టికెట్‌ ధరను రూ.611గా నిర్ణయించింది. ఈ నెల 8 లోపు బుకింగ్‌ చేసుకున్న టికెట్లకు మాత్రమే ఈ తగ్గింపు ఆఫర్‌ వర్తించనున్నది. ఈ ఆఫర్‌ కింద బుకింగ్‌ చేసుకున్న ప్రయాణికులు జనవరి 11 నుంచి ఏప్రిల్‌ 11 లోపు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చునని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఆఫర్‌కోసం సంస్థ లిమిటెడ్‌ సీట్లను మాత్రమే కేటాయించింది. వీటితోపాటు కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా టికెట్‌ బుకింగ్‌ చేసుకున్న వారిలో 11వ వ్యక్తికి ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే 111వ కస్టమర్‌కు ¬టల్‌ లెమన్‌ ట్రీలో 40 శాతం రాయితీకి ఉండే అవకాశం కల్పించిన సంస్థ..1111వ కస్టమర్‌కు జంట రిటర్ను టికెట్లతోపాటు రెండు రాత్రులు, మూడు రోజుల పాటు ¬టల్‌లో ఉచిత వసతిని కల్పించనున్నది. 11 మంది ప్రయాణి కులు చేతి గడియారాలను గెలుచుకునే అవకాశం కూడా కల్పించింది. ఈ ఆఫర్‌ కింద బుకింగ్‌ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకున్న వారికి ఎలాంటి చెల్లింపులు జరుపలేమని కంపెనీ స్పష్టంచేసింది.

డబుల్‌ బెడ్‌ రూమ్‌..కాదు ట్రబుల్‌ - ఆరు లక్షల దరఖాస్తులకు... పూర్తయినవి 502

హైద్రాబాద్‌, నవంబర్‌ 5,2016 (సలాం తెలంగాణ): తెలంగాణా సర్కార్‌కు డబుల్‌ బెండ్‌ రూం ఇళ్ల నిర్మాణం గుదిబండగా మారింది. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 6,08,325 దరఖాస్తులు వచ్చాయి. ఇందుకుగాను 2016-17 ఆర్థిక సంవత్సరంలో 2.72,596 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. ఇందులో భాగంగా 39,569 ఇళ్లకు టెండర్లు ఆహ్వానించగా 10,088 ఇళ్లకు టెండర్లు దాఖలు చేశారు. టెండర్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లు కేవలం 2,428 ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పనులు చేపట్టారు. ఇందులో ఇప్పటి వరకు 502 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం కొసమెరుపు. ఈ ఆర్థిక సంవత్సరం గడువు మరో మూడు మాసాల్లోగా ముగియనుండడంతో 2.62 లక్షల ఇళ్ల నిర్మాణం సందిగ్ధంలో పడింది. ఇళ్ల నిర్మాణ వ్యయం భారీగా పెరగడంతో కాంట్రా క్టర్లు ఎవరూ ముందుకు రావడంలేదంటూ అధికా రులు లబోదిబోమంటున్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు 560 చ. అడుగుల విస్తీర్ణంలో హాల్‌, కిచెన్‌తో పాటు డబుల్‌ బెడ్‌రూం, బాల్కని లక్ష్యంగా నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. అయితే పట్టణ ప్రాంతాలో ఒక్కొక్క డబుల్‌ బెడ్‌రూం ఇంటి నిర్మాణానికి రూ. 5.30 లక్షలు, గ్రావిూణ ప్రాంతాల్లో రూ. 504 లక్షల వ్యయంతో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అయితే చద రపు అడుగు నిర్మాణానికి కేవలం రూ. 900 మాత్రమే కేటాయించడంతో తమకు ఏ మాత్రం గిట్టుబాటుకాదని కాంట్రాక్టర్లు ఎవరుకూడా ముం దుకు రావడంలేదు. సిమెంటు, స్టీల్‌తో పాటు ఇసుక ధరలు భారీ ఎత్తున పెరగడంతో ప్రభుత్వం అంచనా విలువతో ఏ ఒక్క ఇంటి నిర్మాణం కూడా చేపట్టే అవకాశం లేదని పలువురు కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు.. సీఎం ఒత్తిడి మేరకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రెండు, మూడు పర్యాయాలు టెండర్లు పిలిచినా ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో అధికారులు తలలుపట్టుకుంటు న్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం తమ చావుకొచ్చిందని అధికారులు అందోళన చెందుతున్నారు. వచ్చే రెండున్నరేళ్లలో దాదాపుగా 8 లక్షల డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఇళ్లులేని నిరుపేదలు పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసే వీలుందని పార్టీ నేతలు ఆందోళనలుచెందుతున్నారు. ఇళ్ల నిర్మాణ అంచనా వ్యయాన్ని పెంచాలని, లేకుంటే స్టీల్‌, సిమెంట్‌ ధరలను నియంత్రించడంతో పాటు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక ఇచ్చేందుకు సీఎం నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తున్నారు. ఒక్కొక్క ఇంటికి సుమారు 10టన్నుల సిమెంట్‌ అవసరం కానుంది. ప్రస్తుతం సిమెంట్‌ ధరలు బహిరంగ మార్కెట్లో రూ.330-350 విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌ మహానగరం పాలక సంస్థ పరిధిలో 12వేల ఇళ్లను నిర్మించేందుకు నిర్ణయించారు. ఇందుకుగాను 4986 ఇళ్లకు టెండర్లు పిలువగా 508 ఇళ్లకు మాత్రమే టెండర్‌ను పూర్తి చేశారు. మహబూబాబాద్‌లో 625, జయశంకర్‌-భూపాలపల్లిలో 400 ఇళ్లకు, భువనగిరి-యాదాద్రి జిల్లాలో 800 ఇళ్లకు టెండర్లు పిలవగా ఒక్కరుకూడా ముందుకురాలేదు. మెడ్చెల్‌లో ఇప్పటివరకు ఇక్క ఇంటి నిర్మాణానికి కూడా టెండర్లు ఆహ్వానించలేదు. అలాగే రంగారెడ్డి జిల్లాలో 716 ఇళ్లకు టెండర్లు ఆహ్వానించగా ఒక్క ఇంటి నిర్మాణానికి కూడా కాంట్రాక్టర్లు ముందుకురాలేదు.

ఎన్‌టీఆర్‌కు గుడి....ఎక్క‌డో తెలుసా

05/11/2016: మ‌న‌సుండాలే కానీ మార్గాలు అనేకం- అనేది త‌ర‌చు మ‌నం వినే డైలాగ్‌. ఇప్పుడు ఇలాంటి కామెంట్‌నే అభిమానం ఉండాలే కానీ ఏమైనా చేయొచ్చ‌ని నిరూపిస్తున్నాడు చిత్తూరుకు చెందిన సీనియ‌ర్ ఎన్‌టీఆర్ వీరాభిమాని ఒక‌రు. ఎన్‌టీఆర్‌కు విగ్ర‌హం ఏర్పాటు చేయ‌డ‌మే కాకుండా ఓ గుడిని కూడా ఈయ‌న నిర్మించారంటే.. ఆ వీరాభిమానాన్ని ఎంతని మ‌నం అంచ‌నా వేయ‌గ‌లం. వాస్త‌వానికి మ‌న తెలుగు రాష్ట్రాల్లో నేత‌ల‌కు గుడులు క‌ట్టేసంప్ర‌దాయం లేదు. త‌మిళ‌నాడులో మాత్ర‌మే సీఎం జ‌య స‌హా మాజీ సీఎం ఎంజీఆర్ వంటివారికి గుడులు ఉన్నాయి. జ‌యకు కట్టిన గుడిలో ఇప్ప‌టికీ పూజ‌లు పున‌స్కారాలు కూడా జ‌రుగుతున్నాయ‌ట‌. మ‌రి చిత్తూరు ప్రాంతం త‌మిళ‌నాడుకు ప‌క్క‌నే ఉంటుంది కాబ‌ట్టి ఆ వాస‌న‌లు అంటుకున్నాయో ఏమో తెలీదు కానీ, చిత్తూరులోని పీ. శ్రీనివాసులు అనే వ్య‌క్తి సీనియ‌ర్ ఎన్‌టీఆర్‌కు పెద్ద ఎత్తున గుడి క‌ట్టించారు. అయితే, ఈయ‌న‌గారేమీ పెద్ద బిజినెస్ మ్యానో, ఇండ‌స్ట్రియ‌లిస్టో అనుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్టే. శ్రీనివాసులు ఓ వృద్ధుడు. ఈయ‌న‌కు ప్ర‌భుత్వం నెల‌నెలా అందించే వృద్ధాప్య పింఛ‌న్‌తోపాటు చిన్న‌పాటి బ‌డ్డీ కొట్టే ఆధారం. అయిన‌ప్ప‌టికీ.. మ‌నం పైన చెప్పుకొన్న‌ట్టు.. మ‌న‌సుండాలి.. టైపులో ఎన్‌టీఆర్‌పై ఈయ‌న‌కు వెల‌క‌ట్ట‌లేని వీరాభిమానం ఉంది. త‌న‌కున్న కొద్దిపాటి ఆర్థిక వెసులుబాటుతోనే చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలంలోని కంచనపల్లె గ్రామంలో ఎన్‌టీఆర్‌కి టెంపుల్ క‌ట్టాడు. అంతేకాదు, అక్క‌డ ఎన్‌టీఆర్ విగ్ర‌హానికి పూజ‌లు చేసేందుకు కూడా అన్నీ రెడీ చేసేసుకున్నాడు. అయితే, ఆయ‌న‌కు ఇక్క‌డే ఆర్థిక స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయ‌ట‌. నిత్యం పూజ‌లు చేయాలంటే రోజూ ఖ‌ర్చుతో ప‌ని ఉంద‌ని, ఆర్థికంగా త‌న‌కు అంత స్తోమ‌త లేద‌ని త‌న స‌న్నిహితుల వ‌ద్ద శ్రీనివాసులు వాపోతున్నాడ‌ట‌. సో.. ఆయ‌న‌కు ఎవ‌రైనా ఆర్థికంగా సాయం చేస్తే.. త‌న కోరిక తీరుతుంద‌న్న‌మాట‌. మ‌రి ఎవ‌రైనా దాత‌లు శ్రీనివాసులు కోరిక‌ను తీరుస్తారో లేదో చూడాలి !!

రేషన్‌ డీలర్ల అక్రమాలకు చెక్‌ - అందుబాటులోకి రానున్న ఈ పాస్‌ విధానం..

హైద్రాబాద్‌, నవంబర్‌ 4,2016 (సలాం తెలంగాణ): రేషన్‌ సరుకులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు సరుకుల పంపిణీ మాన్యువల్‌ పద్ధతిన జరగగా.. డిసెంబర్‌ నుంచి ఈ-పాస్‌ మిషన్ల ద్వారా అందజేయనుంది. ఈ మిషన్‌లో లబ్ధిదారుల వివరాలు పూర్తిగా నమోదై ఉంటాయి. వారిలో ఎవరైనా ఒకరు వస్తే.. వేలిముద్ర తీసుకొని సరుకులు ఇస్తారు. తీసుకున్న సరుకుల వివరాలు, ఎంత పరిమాణమన్నది రశీదు రూపంలో వస్తుంది. వివరాలు పౌరసరఫరాల ప్రధాన కార్యాలయంలో ఉన్న సర్వర్‌లో ఎప్పటికప్పుడు నమోదవుతాయి. ఒకవేళ సరుకులు మిగిలిపోతే వెంటనే తెలిసిపోతుంది. దీనివల్ల రేషన్‌డీలర్ల అక్రమాలు అరికట్టడంతోపాటు బోగస్‌ లబ్ధిదారులను ఏరివేసే వీలుంటుంది. ఇప్పటికే ఈ విధానం హైదరాబాద్‌లో సక్సెస్‌ కావడం, ప్రతినెలా భారీగా సరుకులు మిగిలిపోతుండడంతో డిసెంబర్‌ నుంచి అన్ని జిల్లాల్లో ఈ-పాస్‌ను అమలు చేసేందుకు శరవేగంగా చర్యలు తీసుకుంటున్నారు రేషన్‌ దుకాణాల ద్వారా నిత్యావసర సరకుల పంపిణీ ఇక విూదట ఈ-పాస్‌ విధానంలో చేయనున్నారు. దీంతో బోగస్‌ కార్డుల ఏరివేతతో పాటు రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడనుంది. ఈ పాస్‌ యంత్రాల్లో డిస్‌ప్లే, స్కానర్‌, కీప్యాడ్‌లను తూనికల యంత్రాలకు అనుసంధానం చేసి లబ్ధిదారులు, రేషన్‌డీలర్ల వేలిముద్రలను సేకరించి నిక్షిప్తం చేస్తారు. లబ్ధిదారుడికి ఎంత పరిమాణంలో సరుకులు పంపిణీ చేస్తున్నది వివరాలతో కూడిన ప్రింట్‌తో పాటు సరుకులు అందజేస్తారు. ఆహార భద్రత కార్డుల ద్వారా ప్రతి లబ్ధిదారుడికి ఆరుకిలోల బియ్యం చొప్పున.. కిలో ఒక రూపాయికే నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తుంది. బియ్యంతో పాటు రాయితీపై కిరోసిన్‌, చక్కెర, గోధుమలు పామాయిల్‌, కందిపప్పు లాంటి నిత్యావసర సరకులు కూడా అందజేస్తుంది. ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం రాయితీపై అందజేస్తున్న సరుకులు రేషన్‌డీలర్లు, అధికారులు, వ్యాపారులు కుమ్ముక్కు కావడంతో పక్కదారి పడుతున్నాయి. బోగస్‌ రేషన్‌కార్డుదారులను జాబితాల నుంచి తొలగించడానికి ప్రభుత్వం చేపట్టిన ఎలక్ట్రానిక్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (ఈ-పాస్‌) డిసెంబర్‌ ఆఖరు నుంచి జిల్లాలో అమలు కానుంది.దీంతో అర్హులైన వారికే రేషన్‌ సరుకులు అందే అవకాశం ఉంది. బినామి లబ్ధిదారుల పేరుతో డీలర్లు రేషన్‌ సరుకులను అక్రమంగా తరలించే అవకాశం ఉండదు.పట్టణాలు, గ్రామాల్లోని రేషన్‌ దుకాణాల్లో లబ్ధిదారుల వేలిముద్రలను బయోమెట్రిక్‌ పద్ధతిలో సేకరించి ఈ పద్ధతిని అమలు చేస్తారు. జిల్లాలో వచ్చేనెల ఆఖరు వరకు లబ్ధిదారుల వేలి ముద్రలు తీసుకుని దీన్ని అమలు చేస్తారు. డిసెంబరు నెలాఖరు వరకు ఈవిధానాన్ని అమలు చేయడానికి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని అన్ని రేషన్‌ దుకాణాల్లో ఈ-పాస్‌ యంత్రాలను అందుబాటులోకి తేనున్నారు. ఏటీఎం స్వైప్‌ మిషన్‌ను పోలిన బయోమెట్రిక్‌ యంత్రాన్ని ఎలక్ట్రానిక్‌ తూకం మిషన్‌ను డీలర్లకు అందజేసి లబ్ధిదారుడి వివరాలు వాటికి అనుసంధానం చేస్తారు. చౌకధరల దుకాణాల్లో గతనెలలో నిల్వ ఉన్న సరుకులు, ఈనెలలో సరఫరా అయిన సరుకుల వివరాలను నమోదు చేస్తారు.ఈపాస్‌ యంత్రాల్లో డిస్‌ప్లే, స్కానర్‌, కీబోర్డు లను తూనికల యంత్రానికి అనుసంధానం చేసి ప్రతి లబ్ధిదారుల నుంచి రెండు వేలిముద్రలు సేకరించి నిక్షిప్తం చేస్తారు. లబ్ధిదారుల వేలిముద్రలను పరిగణలోకి తీసుకుని సదరు లబ్ధిదారుడికి ఎంత మొత్తంలో సరుకులు పంపిణీ చేస్తున్నది వివరాలతో కూడిన ప్రింట్‌ను సరకులతో పాటు అందజేస్తారు. ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే జరగడంతో రేషన్‌ సరుకుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడనుంది. ఆహార భద్రత కార్డులలో పేర్లు నమోదైన అందరు లబ్ధిదారుల వేలి ముద్రలు సేకరిస్తారు. సరుకుల కోసం కార్డులో పేరు నమోదైన కుటుంబసభ్యులు ఎవరూ వచ్చినా పొందే వెసులుబాటును కల్పిస్తారు.

సింగరేణి వారసత్వ ఉద్యోగులకు ఓకే?..

హైద్రాబాద్‌, నవంబర్‌ 4,2016 (సలాం తెలంగాణ): సింగరేణి కార్మికులకు శుభవార్త. 15 ఏండ్ల తరువాత సింగరేణి సంస్థ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి సింగరేణి బోర్డు అంగీకరించింది. 2016 అక్టోబర్‌ 11 నాటికి 48 నుంచి 58 ఏళ్ల వయసు కార్మికులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వారసత్వ ఉద్యోగాలు కార్మికుల కుమారులు లేదా అల్లుడు లేదా సోదరుడు పొందేందుకు అర్హులుగా నిర్ణయించారు. వారసత్వ ఉద్యోగాలు పొందేందుకు 18 నుంచి 35 ఏండ్ల మధ్య వయస్సు ఉండాలని బోర్డు తెలిపింది.

ఆర్కే క్షేమంగా ఉన్నాడట

04/11/2016: మావోయిస్టు అగ్రనేత ఆర్కే అజ్ఞాతంపై మిస్టరీ వీడింది. ఆర్కే క్షేమంగానే ఉన్నారని విప్లవ రచయితల సంఘం నాయకుడు వరవరరావు ప్రకటించారు. ఆర్కే కోసం అమాయక ఆదివాసీలను వేధిస్తున్నారని ఈ తీరును తాము ఖండిస్తున్నామని తెలిపారు. పోలీసులు వెంటనే కూంబింగ్ నిలిపివేయాలని వరవరరావు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. దీంతో ఆర్కే అదృశ్యంపై పదిరోజులకు పైగా కొనసాగిన సస్పెన్స్ కు తెరపడింది. అయితే ఈ పరిణామంపై ఏపీ డీజీపీ సాంబశివరావు ఘాటుగా స్పందించారు. తమ వద్ద ఆర్కే లేడని ఇన్నాళ్లు వాదించిందే నిజమని తేలిపోయిందన్నారు. ఇకనైనా ఇలాంటి అసత్య ఆరోపణలను మానుకోవాలన్నారు. గత 20ఏళ్లుగా ఇలాంటి అసత్య ఆరోపణలకు పాల్పడుతున్నారని మరోసారి ఆర్కే విషయంలో అదే నిరూపించారని డీజీపీ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్కే ఎక్కడున్నాడో తమకు చెప్పాలని, అతనిపై అనేక కేసులు ఉన్నాయని డీజీపీ తెలిపారు. ఏఓబీలో ఎన్ కౌంటర్ తర్వాత నుంచి ఆర్కే అదృశ్యంపై సస్పెన్స్ కొనసాగిన సంగతి తెలిసిందే. తన భర్త కనిపించడం లేదంటూ ఆర్కే సతీమణి శిరీష్ హైకోర్టును ఆశ్రయించారు. ఏవోబీ ఎన్ కౌంటర్ తరువాత నుంచీ తన భర్త ఆర్కే ఆచూకీ తెలియడం లేదని, ఆయన పోలీసుల అదుపులోనే ఉన్నాడని పేర్కొన్న శిరీష్ ఆయనను కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదోపవాదాలు విని ఏపీ పోలీసులను కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలో తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది.

కేసీఆర్‌ స్పీడ్‌ కు కోర్టు బ్రేకులు

హైద్రాబాద్‌, నవంబర్‌ 3,2016 (సలాం తెలంగాణ): ప్రస్తుత సచివాలయాన్ని కూల్చేసి, దాని స్థానంలో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. కేవలం వాస్తు దోషాలను కారణంగా చూపుతూ వందలాది కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారని అధికార పక్షంపై విపక్షాలన్నీ ఒంటికాలిపై లేచాయి. అన్ని విపక్షాల్లా కేవలం ఆరోపణలు చేసి కూర్చునేందుకు ససేమిరా అన్న జీవన్‌ రెడ్డి సర్కారు స్పీడుకు బ్రేకులేసేందుకు రంగంలోకి దిగిపోయారు. టీ కాంగ్రెస్‌కే చెందిన మరో సీనియర్‌ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డితో కలిసి జీవన్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను కాసేపటి క్రితం విచారించిన హైకోర్టు ధర్మాసనం తెలంగాణ సర్కారుకు షాకిచ్చే నిర్ణయాన్ని వెలువరించింది. రాష్ట్ర సచివాలయ పునర్నిర్మాణం నిర్ణయాన్ని పది రోజుల పాటు వాయిదా వేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను పది రోజుల పాటు వాయిదా వేసిన కోర్టు. ఆలోగా తన నిర్ణయంపై సమగ్ర నివేదకను అందజేయాలని కేసీఆర్‌ సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో తొలి సర్కారును ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో పలు అంశాలపై ఇప్పటికే హైకోర్టు మొట్టికాయలు వేసింది. అయినా ఏమాత్రం వెనక్కు తగ్గని కేసీఆర్‌ తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన సచివాలయ పునర్నిర్మాణం దిశగా అడుగులు వేశారు. సచివాలయంలోని ప్రస్తుత నిర్మాణాలన్నింటిని కూలదోసేసి వాటి స్థానంలో కొత్తగా సచివాలయాన్ని నిర్మించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం సచివాలయంలోని ప్రభుత్వ విభాగాలను హైదరాబాదులోని వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ సమయంలో జీవన్‌రెడ్డి పిటిషన్‌ పై స్పందించిన కోర్టు కేసీఆర్‌ సర్కారు స్పీడుకు బ్రేకులేసింది. అయితే పదిరోజుల్లోగా తన వాదనను వినిపించేందుకు కోర్టు నుంచి లభించిన అవకాశాన్ని కేసీఆర్‌ సర్కారు ఎలా వినియోగించుకుంటుందన్న విషయంపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ సాగుతోంది. కోర్టును సంతృప్తిపరిచే రీతిలో తన వాదనను వినిపించేందుకు ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం.

ప్రగతి రథ చక్రానికి అష్టకష్టాలు

03/11/2016: ఆర్టీసీ బస్సు చక్రాన్ని ప్రగతి రథ చక్రంగా చెబుతారు. ఏదైనా మారుమూల పల్లెకు ఆర్టీసీ బస్సు వేస్తే చాలు.. కొన్నాళ్ల తర్వాత ఆ గ్రామం రూపురేఖలే మారిపోతాయి. ఇది ఏదో గొప్ప కోసం చెబుతున్న మాట కాదు. చాలా గ్రామాల ప్రజలు అనుభవపూర్వకంగా ఒప్పుకునే నిప్పు లాంటి నిజం. అలా చాలా గ్రామాల భాగ్యరేఖల్ని మార్చిన ఆర్టీసీ.. ఇప్పుడు తానే ఆపసోపోలు పడుతోంది. తెలంగాణ ఆర్టీసీకి ఆర్థిక సంక్షోభం ముంచుకొచ్చింది. కనీసం కార్మికులకు వేతనాలు చెల్లించలేని స్థితికి చేరుకుంది. దీపావళి సమయంలో బోనస్ ల సంగతి పక్కనపెడితే.. దసరా, దీపావళి రెండు పండుగల వచ్చిన అక్టోబర్ నెల జీతం ఇంతవరకూ కార్మికులకు అందలేదు. యాజమాన్యం ఆర్థిక కష్టాలు సాకు చెబుతున్నా.. కార్మికులు మాత్రం చాలా అసంతృప్తిగా ఉన్నారు. వాళ్లలో అసంతృప్తి పెరిగితే సామాన్య ప్రయాణికులే ఇబ్బంది పడాల్సి వస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఓ విడత వేతన సవరణ బకాయిలు బాకీపడ్డ ఆర్టీసీ.. ఇప్పుడు నెల జీతం కూడా ఇవ్వలేని స్థితికి చేరింది. శుక్ర, శని వారాల్లో జీతాలిస్తామని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నా.. బకాయిల సంగతి మాత్రం చెప్పడం లేదు. గతంలో సీఎం కఆర్ ఆర్టీసీని ఒడ్డున పడేసేందుకు ఎన్నో సంస్కరణళు ప్రతిపాదించారు. కానీ అవేవీ ఆర్టీసీని ఆదుకోవడం లేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తేనే తమ కష్టాలు గట్టెక్కుతాయని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రేమలో పడిన మైసూర్ ప్యాలెస్ ఏనుగు..

03/11/2016: ప్రేమ పవర్ చెప్పే ఉదంతం ఇది. ప్రేమలో పడాలే కానీ మనిషే కాదు.. జంతువులు సైతం.. ఏడబాటును తట్టుకోలేవని చెప్పే ఉదంతమిది. సంచలనంగా మారిన ఈ ఉదంతం వింటే.. ప్రేమ దోమ కుడితే మనిషే కాదు.. జంతువులు కూడా సిత్రంగానే ప్రవర్తిస్తాయా? అన్న సందేహం కలగక మానదు. అప్పటివరకూ బుద్ధిగా ఉంటూ.. మావటి చెప్పినట్లుగా వినే మైసూర్ ప్యాలెస్ లోని ఏనుగు ప్రేమ దోమ కుట్టిన తర్వాత ఎలా మారిందో తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. హాట్ టాపిక్ గా మారిన ఈ లవ్ స్టోరీ లోకి వెళితే.. ప్రతి ఏటా దసరా సందర్భంగా మైసూర్ ప్యాలెస్లో జరిపే ఉత్సవాలు ఎంత భారీగా.. ఘనంగా నిర్వహిస్తారో తెలిసిందే. ఈ ఏడాది సైతం అదే తీరులో ఉత్సవాల్ని నిర్వహించారు. ఇందులో భాగంగా చేపట్టే జంబూ సవారీ కోసం అర్జున అనే మగ ఏనుగును ప్యాలెస్కు తీసుకొచ్చారు. అదే ప్యాలెస్లో 20 ఏళ్ల రాజీ అనే ఆడ ఏనుగు ఉంది. ఎలా మొదలైందో కానీ.. అర్జున.. రాజీల మధ్య ప్రేమ ఏపిసోడ్ మొదలైంది. ఉత్సవాల సందర్భంగా ఈ రెండింటి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. ఉత్సవాల అనంతరం మగ ఏనుగు అర్జునను తీసుకొని వెళ్లిపోయారు. అంతే.. ఆడ ఏనుగు రాజీ మగ ఏనుగు ఎడబాటును భరించలేకపోయింది. అర్జున వెళ్లిన తర్వాత రెండు రోజుల పాటు ఆహారం తీసుకోవటానికి నో అంటే నో చెప్పేసింది. అంతేకాదు.. తన దగ్గరకు ఎవరైనా వస్తున్నా అస్సలు ఒప్పుకోవటం లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్యాలెస్ ఆవరణలో పరుగులు పెట్టింది.దాన్ని కంట్రోల్ చేయటానికి మావటి ఎంత ట్రై చేసినా ఫలితం లేకపోయింది. నిత్యం తన ఆలనా పాలనా చూసుకునే మావటిపైన దాడి చేయటానికి వెనుకాడలేదు. రాజీ ప్రవర్తనలో వచ్చిన మార్పును గుర్తించిన అతగాడు.. దాన్నించి తప్పించుకొని బతుకుజీవుడా అని అనుకునే పరిస్థితి. చివరకు ప్యాలెస్లోని మావటిలంతా కలిసి.. రెండు గంటల పాటు చెమటలు చిందిస్తే కానీ.. రాజీ కంట్రోల్ కాలేదట. ప్రియుడి కోసం ఆగమాగం చేస్తున్న రాజీ ప్రేమకథకు ఎలాంటి ముగింపు కార్డు పడుతుందో చూడాలి.

కామన్‌ మ్యాన్‌ లా మారిపోయిన సీఎం

భోపాల్‌, నవంబర్‌ 2, (సలాం తెలంగాణ): మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌? ఇటీవల వెల్లడైన బెస్ట్‌ సీఎం ర్యాంకుల్లో రెండో స్థానంలో నిలిచారు. చౌహాన్‌లో అంత సత్తా ఏముందనేగా విూ డౌటు? యూపీఏ సర్కారు హయాంలోనూ మధ్యప్రదేశ్‌ సీఎంగా వ్యవహరించిన చౌహాన్‌ మచ్చలేని నేతగా ప్రసిద్ధులు. 2005లో మధ్యప్రదేశ్‌ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన నేటికీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఒక్క మధ్యప్రదేశ్‌నే కాకుండా యావత్తు భారత దేశాన్ని కుదిపేసిన వ్యాపం కుంభకోణం? చౌహాన్‌కు మరక అంటించలేకపోయిందంటే ఆయన ఎంత నిజాయతీపరుడో ఇట్టే చెప్పేయొచ్చు. బీజేపీకి చెందిన ఈ సచ్ఛీల రాజకీయవేత్త? నేటి ఉదయం వ్యవహరించిన తీరు మరోమారు ఆయనను వార్తల్లోకి ఎక్కించింది.మొన్న భోపాల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న 8 మంది ఉగ్రవాదులు అక్కడ సెంట్రీ విధుల్లో ఉన్న హెడ్‌ కానిస్టేబుల్‌ రమాశంకర్‌ యాదవ్‌ను చంపేసి పరారయ్యారు. విషయం తెలుసుకున్న చౌహాన్‌? పోలీసులను రంగంలోకి దించారు. నేరుగా సీఎంఓ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వేగంగా కదిలిన పోలీసులు తప్పించుకుని పారిపోయిన ఉగ్రవాదులను తెల్లవారేసరికి భోపాల్‌ శివారుల్లోనే మట్టుబెట్టారు. వెరసి మధ్యప్రదేశ్‌లో ఉగ్రవాదుల ఆటలు ఇక చెల్లబోవని ఆ రాష్ట్ర పోలీసులు గట్టి సందేశాన్నే పంపారు. ఇదిలా ఉంటే? ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన రమాశంకర్‌ సింగ్‌ కుటుంబం తీవ్ర వేదనలో కూరుకుపోయింది. తీరని వేదనలోనే ఆ కుటుంబం రమాశంకర్‌ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకుంది.అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌? సీఎం ¬దాలో ఆ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి పెద్ద దిక్కులా రమాశంకర్‌ కుటుంబ సభ్యులను ఓదార్చారు. రమాశంకర్‌ కుటుంబానికి అక్కడికక్కడే రూ.10 లక్షల మేర ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అంతేకాకుండా రమాశంకర్‌ కుమార్తె వివాహానికి రూ.5 లక్షల మేర సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. సదరు కుటుంబం నివసిస్తున్న కాలనీని రమాశంకర్‌ పేరు పెడతామని ప్రకటించారు. అంతటితో ఆగని చౌహాన్‌? అప్పటికప్పుడు సామాన్యుడిగా మారిపోయారు. రమాశంకర్‌ పాడెను మోసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ చర్య ద్వారా ఆయన రమాశంకర్‌ కుటుంబానికి ఏ కష్టమొచ్చినా ఆదుకునేందుకు తాను ఉన్నానన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన కానిస్టేబుల్‌ పాడెను మోసిన చౌహాన్‌? నిజంగా ఉత్తమ ముఖ్యమంత్రే కదా.

పడి లేస్తున్న ట్రంప్‌.... ఇండియన్స్‌ పైనే హిల్లరీ ఆశలన్నీ

న్యూయార్క్‌, నవంబర్‌ 2, (సలాం తెలంగాణ): ఇంకో వారం రోజుల్లో ఆ దేశ అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న వేళ? పరిస్థితులు తారుమారవుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్‌ బరిలోకి దిగగా, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా ఆ దేశ రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజంగా ఎదిగిన డొనాల్డ్‌ ట్రంప్‌ పోటీకి దిగారు. ఇప్పటికే వెలువడ్డ ఒపీనియన్‌ పోల్స్‌, పలు సంస్థలు నిర్వహించిన సర్వేల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్‌ తన ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ కంటే భారీ ఆధిక్యంలో ఉన్నారు. అయితే తాజాగా అమెపై ఎఫ్‌బీఐ దర్యాప్తునకు వారెంట్ల జారీ, వికీలీక్స్‌లో ఆమెకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగు చూసిన నేపథ్యంలో ఆమె ప్రభావం భారీ ఎత్తున తగ్గిపోతోంది. హిల్లరీ కంటే ఎంతో వెనుకబడ్డ ట్రంప్‌ ప్రస్తుతం ఆధిక్యంలోకి వచ్చేశారు. ఏబీసీ న్యూస్‌తో కలిసి అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక చేసిన సర్వేలో హిల్లరీని వెనక్కు నెట్టేసిన ట్రంప్‌ ఆధిక్యంలోకి వచ్చేశారు. ఈ సర్వేలో హిల్లరీకి 45 శాతం ఓట్లు పడతాయని తెలియగా, ట్రంప్‌కు ఆమె కంటే ఒక శాతం అధికంగా 46 శాతం ఓట్లు పడతాయని తేలింది. దాదాపుగా ఐదు శాతం మేర ఓట్ల ఆధిక్యంలోకి దూసుకొచ్చిన హిల్లరీ? కేవలం రెండంటే రెండు ఆరోపణలతో ఒక్కసారిగా ట్రంప్‌ కంటే వెనుకబడిపోయారు. ఎఫ్‌బీఐ దర్యాప్తు ఇంకా ప్రారంభం కాలేదు. అంతేకాకుండా వికీలీక్స్‌ వెల్లడించిన వివరాలు సత్యమని తేలలేదు. అప్పుడే జనాదరణలో బాగా వెనుకబడ్డ హిల్లరీకి ఎన్నికల్లో పరాభవం తప్పదన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది.అయితే అక్కడి ఎన్నికల్లో ప్రవాస భారతీయులు ఏ వైపు మొగ్గు చూపితే? ఆ వర్గానిదే విజయమన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ దిశగా లెక్కలు తీస్తే? ప్రవాస భారతీయులంతా హిల్లరీ వెనుకే నిలబడ్డట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రవాస భారతీయుల్లోని ఈ భావన పదిలంగా ఉన్నంత కాలం హిల్లరీ గెలుపునకు వచ్చిన ఢోకా ఏవిూ లేదన్న భావన కూడా వ్యక్తమవుతోంది. అయితే హిల్లరీపై వచ్చిన రెండు ఆరోపణల ప్రభావం ప్రవాస భారతీయుల విూద పడితే మాత్రం హిల్లరీ చేదు అనుభవాన్ని చవిచూడక తప్పదన్న వాదన కూడా వినిపిస్తోంది. వెరసి ఎన్నికలు సవిూపించే దాకా ఆధిక్యంలో కొనసాగిన హిల్లరీ? రెండంటే రెండు విషయాలతోనే వెనుకబడిన వ్యవహారంపై ఇప్పుడు సర్వత్రా చర్చకు తెర లేసింది.

అమ్మాయిల వేదనలకు చెక్‌ పెట్టే ఇయర్‌ ఫోన్స్‌..

బెంగుళూర్‌, నవంబర్‌ 2, (సలాం తెలంగాణ): తమ ఫ్రెండ్‌ పడ్డ ఇబ్బంది మరొకరు పడకూడదనుకున్నారు. ఆ అమ్మాయి ఒక్కరితే కాదు.. దేశంలో చాలా మంది అమ్మాయిలు పడుతున్న వేదనలకు చెక్‌ పెడదామనుకున్నారు. అంతే అప్పటి నుంచి అదే పనిలో పడ్డారు. ఏడాది పాటు కష్టపడ్డారు. వాళ్ల కష్టానికి తగిన ప్రతిఫలమొచ్చింది. స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకునే పనిలో భాగంగా వారు తయారు చేసిన పరికరం ఇప్పుడు అందరి ప్రశంసలు పొందుతోంది. ఇయర్‌ ఫోన్స్‌ లా ఉన్న ఈ డివైస్‌.. స్మార్ట్‌ ఫోన్‌ కు .. బ్రెయిన్‌ కు మధ్య వారధిగా పని చేస్తోంది. బ్రెయిన్‌ లో జరిగే అసాధారణమైన చర్యలను రికార్డు చేసి వెంటనే కంప్యూటర్‌ కు పంపే ఎలక్ట్రోసెఫలోగ్రామ్‌ ను ఈ పరికరం పోలి ఉంటుందంటున్నారు విద్యార్థులు. బెంగుళూరుకు చెందిన ఇంజినీరింగ్‌ స్టూడెంట్స్‌ జార్జ్‌ మాథ్యూ, నితిన్‌ వసంత్‌, అతుల్‌ బి రాజ్‌, ఫాసుయా అమల్హ్‌ ఈ పరికరాన్ని కనుగొన్నారు. ఇయర్‌ ఫోన్స్‌ మాదిరి ఉండే వీటిని చెవుల్లో పెట్టుకుంటారు. అది మనలోని భావోద్వేగాలను వెంటనే రీడ్‌ చేసి.. ఫోన్‌ లో యాప్‌ కు చేరుస్తుంది. అలా అది మన స్నేహితులకు, బంధువులకు సమాచారాన్ని చేరవేస్తుంది. అలా వారు ఎక్కడున్నది.. ఎలా ఉన్నది ఈజీగా తెలుసుకోవచ్చు అంటున్నారు ఈ విద్యార్థులు. ఇండియన్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ లోని ది సెంటర్‌ ఫర్‌ న్యూరోసైన్స్‌ డిపార్ట్‌ మెంట్‌ లో ఈ ప్రయోగం జరిగింది. కొత్తగా వచ్చిన రాపిడ్‌ ఫొటో టైపింగ్‌ బోర్డ్స్‌, త్రీడీ ప్రింటింగ్‌, కార్బన్‌ నానో ట్యూబ్స్‌ ను ఉపయోగించి ఈ పరికరాన్ని తయారు చేశారు.

వచ్చే ఎన్నికలకు సిద్ధం చేసేలా గులాబీ ప్లాన్‌

హైద్రాబాద్‌, నవంబర్‌ 2, (సలాం తెలంగాణ): అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయింది. మరో రెండున్నరేళ్లలో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో.. ఇప్పటినుంచే ఫ్యూచర్‌ ప్లాన్‌ ప్రిపేర్‌ చేసుకుంటోంది.. టీఆర్‌ఎస్‌. అక్రమాలకు అవకాశం లేకుండా.. సంక్షేమ పథకాలను అర్హులకే అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలా ఉండేలా కేడర్‌ ను నాయకత్వం సిద్ధం చేస్తోంది.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అధికారం ఖాయమంటున్న టీఆర్‌ఎస్‌ నాయకత్వం.. ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. మేనిఫెస్టో హావిూలతో పాటు.. మరిన్ని పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం.. వాటి అమలు తీరుపై దృష్టి పెంచింది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారఖ్‌, హాస్టళ్లలో సన్న బియ్యం, పెన్షన్లు, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పథకాల ఫలాలు.. అర్హులకే అందేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.అసెంబ్లీ ఎన్నికలకు రెండున్నరేళ్లు సమయం ఉండడంతో.. ఆలోపు పార్టీని పటిష్టం చేసేలా అధినేత కేసీఆర్‌ చర్యలు మొదలు పెట్టారు. త్వరలోనే పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు, పొలిట్‌ బ్యూరో, అనుబంధ సంఘాల కమిటీలను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. పార్టీ కమిటీల ప్రకటన తర్వాత ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి.. సంక్షేమ పథకాలు అర్హులకే అందేలా బాధ్యతలు అప్పగించనున్నారు. వచ్చే ఎన్నికల నాటికి.. కేడర్‌ అంతా జనంలోనే ఉండేలా దిశానిర్దేశం చేయనున్నారు.సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు.. అధినేత సహా కేడర్‌ అంతా జనంలోనే ఉంటే పార్టీకి మేలు చేస్తుందని నేతలంటున్నారు. అలాగే.. డిసెంబర్‌ లో బహిరంగ సభ తర్వాత.. పథకాల అమలు మరింత స్పీడప్‌ చేయాలని.. అధినేత కేసీఆర్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది.

11రోజులు.. 35వేల బుల్లెట్లు.. ఇదీ సైన్యం సత్తా

02/11/2016: సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన నాటి నుంచి సరిహద్దులు కాల్పుల మోతతో దద్దరిల్లుతున్నాయి. పాక్ బరితెగింపుకు.. బీఎస్ఎఫ్ దీటుగా బదులిస్తోంది. అక్టోబర్ 19 నుంచి పాక్ పదేపదే కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ.. మన జవాన్లను కవ్విస్తోంది. దాయాదులకు దీటుగా మన సైన్యం కూడా భారీగా కాల్పులు జరుపుతోంది. ఇప్పటివరకు సరిహద్దు కాల్పుల్లో 15 మంది పాక్ రేంజర్లు హతమయ్యారు. గత 11 రోజుల్లో 35వేల బుల్లెట్లు కాల్చారంటే.. మన సైన్యం ఎంత భీకరంగా పోరాడుతుందో తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా తాము ఉలిపికట్టెలమేనని, భారతే బరితెగిస్తోందని పాక్ విడ్డూరంగా మాట్లాడుతోంది. బీఎస్ఎఫ్ కాల్పుల కోసం వివిధ రకాల ఆయుధాలు వినియోగిస్తున్నారు. ఎంఎంజీలు, ఎల్ఎంజీలు, రైఫిళ్లు వాడుతున్నారు. 300 దీర్ఘశ్రేణి మోటార్ షెల్స్ కాల్చారు. ఇవి దాదాపుగా ఐదారు కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదిస్తాయి. అలాగే తక్కువ దూరం వెళ్లగల మోర్టార్ షెల్స్ 2వేల దాకా ఫైర్ చేశారు. ఇవి 900 మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయి. సరిహద్దు కాల్పుల్లో ఎక్కువ శాతం జమ్మూ సెక్టార్లో.. అది రాత్రి సమయంలోనే జరుగుతున్నాయి. పాక్ రేంజర్ల కాల్పులు ద్వారా ఉగ్రవాద చొరబాట్లకు వీలు కల్పిస్తున్నారు. అందుకే మనం జవాన్లు అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ సరిహద్దుల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. గత పదకొండు రోజుల్లో పాకిస్థాన్ 60 సార్లు కవ్వింపు చర్యలకు పాల్పడింది.

200 కోట్లు బూడిద పాలు చేయ‌నున్న కేసీఆర్‌

02/11/2016: తాను త‌ల‌చిన ప‌ని ఆరు నూరైనా జ‌రిగి తీరాల్సిందేన‌ని భావించే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇపుడు శ‌ర‌వేగంగా క‌దులుతున్న నిర్ణ‌యం ఒక‌టి పార్టీ నేత‌ల‌కు ప‌ద‌వులు పంపిణీ చేయ‌డం అయితే మ‌రొక‌టి తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి కొత్త భవనాల నిర్మాణం. అంగ‌రంగ వైభ‌వంగా ఉండ‌బోయే నూత‌న సెక్ర‌టేరియ‌ట్ కోసం కేసీఆర్ అత్యంత దూకుడుతో ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలో సాగుతున్న పెద్ద ఎత్తున చ‌ర్చ‌లో తాజాగా వ‌చ్చి చేరిన టాపిక్ పాత భవనాల కూల్చివేత. త‌ద్వారా అవుతున్న న‌ష్టం. అన్ని వ‌ర్గాల్లో ఉన్న ఈ చ‌ర్చలో తేలుతున్న దాని ప్ర‌కారం దాదాపు నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న తెలంగాణ సచివాలయం పాత భవనాల వెల ప్రస్తుత ధరలను బ‌ట్టి చూస్తే 200 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. ప్ర‌స్తుతం కూల్చివేయ‌నున్న అన్ని భ‌వనాల్లో ఒక్క హెరిటేజ్ భ‌వ‌నాలు త‌ప్ప అన్నీ భేషుగ్గా ప‌నిచేసే స్థితిలో ఉన్నాయి. అందుకే ఈ భ‌వ‌నాల కూల్చివేత ఖర్చు తెర‌మీద‌కు వ‌స్తోంది. ప్ర‌స్తుత స‌చివాల‌యంలోని భవనాలతో పాటు మంత్రులు, అధికారుల ఛాంబర్లకు చేసిన డెకొరేషన్, కార్డుబోర్డుతో చేసిన సిబ్బంది ఛాంబర్లకు కూడా వెల కట్టి ప‌లువురు విశ్లేషిస్తున్నారు. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం నాలుగు భవనాలను (ఎ,బి,సి.డి బ్లాకులు) ఉపయోగించుకుంటోంది. సీ-బ్లాకును ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి పేషీ, సాధారణపరిపాలనా శాఖ (జిఎడి) అవసరాలకోసం ఉపయోగిస్తున్నారు. ‘డి’ బ్లాకును 2000సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా నిర్మించారు. అప్పట్లో దీనికి 40 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. ‘డి’ బ్లాకులో ప్రస్తుతం తెలంగాణ మంత్రులకు, వివిధ శాఖల అధికారులకు కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఎ,బి బ్లాకులను హోంశాఖతో సహా వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల కోసం వినియోగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఉపయోగిస్తున్న సచివాలయ భవనాలను (ఎ,బి,సి,డి బ్లాకులు) మొత్తాన్ని ఖాళీ చేసి కూల్చివేయాల్సి ఉంటుంది. తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న ఐదు భవనాలు (జె, హెచ్-నార్త్, హెచ్-సౌత్, కె, ఎల్ బ్లాకులు) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది. ఏపీ ప్రభుత్వ ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖలకు చెందిన ఇతర కార్యదర్శులు వారి సిబ్బంది కోసం ఏపీ ప్రభుత్వం వినియోగించుకుంటోంది. ఏపీ ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాలు, వివిధ శాఖలన్నీ విజయవాడ, గుంటూరు, అమరావతి తరలిపోవడంతో ఈ భవనాలు ఖాళీ అయ్యాయి. నామమాత్రంగా కొన్ని శాఖలు, కొద్దిమంది సిబ్బంది మాత్రమే ఈ భవనాలను వినియోగించుకుంటున్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత దాదాపు ఐదున్నర లక్షల చదరపు అడుగుల వైశాల్యమున్న ఈ భవనాలు ఏపీ ప్రభుత్వ అధీనంలోనే నేటికీ ఉన్నాయి. వీటిని తమకు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆలోచనల మేరకు అన్నీ సజావుగా సాగితే కొత్త భవనాన్ని ఏడాదిలోగా నిర్మించాలని, సిద్ధం అవుతోంది. తెలంగాణ ప్ర‌భుత్వం కొత్తగా ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పది అంతస్థులతో ఇప్పుడున్న డి-బ్లాకు స్థలంలో కొత్తగా అధునాతన భవనం నిర్మించాలని భావిస్తున్నారు. అంతవరకు మంత్రులు, ఉన్నతాధికారుల ఛాంబర్ల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ స‌ర్కారు ఆధీనంలో ఉన్న భవనాలు తెలంగాణకు అప్పగిస్తే తాత్కాలిక అవసరాల కోసం ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఇటీవల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిసి అభ్యర్థించారు. ఏపీ ప్రభుత్వ అధీనంలో ఉన్న సచివాలయ భవనాలు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తే, ఈ భవనాల్లోకి తాత్కాలికంగా తెలంగాణ సచివాలయాన్ని మార్చాలని భావిస్తున్నారు. ఒక వేళ ఈ భవనాలు ఏపీ ప్రభుత్వం తమ అధీనంలోనే ఉంచుకోవాలని నిర్ణయిస్తే బూర్గుల రామకృష్ణారావు భవన్ (బిఆర్‌కె భవన్)తో పాటు మరో ఐదు భవనాల్లోకి సచివాలయ కార్యాలయాలను, మంత్రుల ఛాంబర్లను మార్చాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ శాఖలు యథాతథంగా పనిచేస్తున్నాయి. ఏ శాఖకు కూడా ‘షిఫ్టింగ్’కు సంబంధించి అధికారికంగా సమాచారం అందించలేదు. కార్యాలయాల షిఫ్టింగ్ కోసం వౌఖికంగా మాత్రమే సిబ్బందికి పదిరోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. దాంతో సిబ్బంది తమ ఫైళ్లు, ఇతర సామాగ్రిని మూటకట్టుకుని తదుపరి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తంగా కేసీఆర్ నిర్ణ‌యం అమ‌ల్లోకి వ‌స్తే...200 కోట్లు నిజంగా బూడిద‌లో పోసిన ప‌న్నీరు అవుతుంద‌నేది కాద‌నలేని నిజం అనేది స్థూలంగా తేలుతున్న నిజం.

మావోయిస్టుల టీ కప్పులో తుపాను

01/11/2016: ఏవోబీ ఎన్ కౌంటర్ తో మావోయిస్టులకు కలిగిన నష్టం అంతాఇంతా కాదు. తుపానులా అది ఏవోబీలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు, క్యాడర్ ను తుడిచిపెట్టేసింది. మావోయిస్టులను అతలాకుతలం చేసిన తుపాను టీ కప్పులో పుట్టిందట. మత్తు మందు కలిపిన టీ పొడితో తయారుచేసిన చాయ్ ను తాగడం వల్ల అంతా దొరికిపోయారని తెలుస్తోంది. పౌర హక్కుల సంఘాల నేతలు తాజాగా చేస్తున్న ఆరోపణలు అందుకు ఊతమిస్తున్నాయి. అంతేకాదు... ఒక కేంద్ర కమిటీ సభ్యుడు ఈ పని చేశారని... ఆయన కోవర్టుగా మారి దెబ్బకొట్టారని వినిపిస్తోంది. కొన్ని నెల‌లుగా పోలీసులు ఆర్కేను ప‌ట్టుకునేందుకు స‌రైన అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్నారు. పోలీసుల‌కు ఆ అవ‌కాశం ఓ కేంద్ర క‌మిటీ స‌భ్యుడి రూపంలో వచ్చిందని చెబుతున్నారు. అనారోగ్యంతో ఉన్న ఆయన్ను పోలీసులు కోవర్టుగా మార్చుకున్నారు. ఆర్కేతో అత‌ను త‌ర‌చుగా ట‌చ్‌లో ఉండ‌టం పోలీసుల‌కు క‌లిసివ‌చ్చింద‌ని పౌర‌హ‌క్కుల నేత‌లు ఆరోపిస్తున్నారు. టీపొడిలో మ‌త్తుమందు క‌లిసింద‌ని, ఆ రోజు ప్లీన‌రీలో పాల్గొన్న మావోయిస్టు నేత‌లంతా ఆ చాయ్ తాగ‌డం వ‌ల్లే అంతా మ‌త్తులోకి వెళ్లిపోయార‌ని ఆదివాసీ హక్కులు, సంస్కృతి పరిరక్షణ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి దామోదర్‌ తిలక్ ఆరోపిస్తున్నారు. ఆహారంలో అయితే అంత‌మందిని ఒకేసారి తినేలా చేయ‌డం సాధ్యం కాద‌ని పౌర‌హ‌క్కుల నేత‌లు ఆరోపిస్తున్నారు. అడ‌విలో అంద‌రికి సులువుగా చేరేది, అంద‌రూ కాద‌న‌లేనిదీ.. ఒక్క చాయ్ మాత్రమేన‌ని.. అందులోనే మత్తు కలిసిందని చెబుతున్నారు. ఆర్కే చుట్టూ కిలోమీట‌ర్ల మేర మూడంచెల భ‌ద్రతా వ్యవ‌స్థ ఉంటుంది. వారు కూడా మ‌త్తు మందు క‌లిపిన చాయ్ తాగి ఉంటార‌ని అనుమానిస్తున్నారు. వారు మ‌త్తులోకి జారుకోవ‌డం వ‌ల్లే ప్లీన‌రీ స‌మావేశంలో ఉన్న వారిని అప్రమ‌త్తం చేయ‌లేక‌పోయార‌ని అనుమానిస్తున్నారు. అందుకే, ఇంత భారీ నష్టం కలిగిందని మావోయిస్టు నేతలు అనుమానిస్తున్నారు.

కేంద్రంపై కేజ్రీవాల్ దిమ్మ‌తిరిగే ఆరోప‌ణ‌లు

01/11/2016: కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్న ఢిల్లీ సీఎం, ఆప్ నేత అర‌వింద్‌ కేజ్రీవాల్‌.. తాజాగా దిమ్మ‌తిరిగే ఆరోప‌ణ‌లు చేశారు. న్యాయ‌వ్య‌వ‌స్థ‌తో కేంద్రం ఆడుకుంటోంద‌ని కేజ్రీ తీవ్ర స్థాయిలో కేంద్రంపై ధ్వ‌జ‌మెత్తారు. న్యాయ‌మూర్తుల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయ‌ని సంచ‌ల‌నం సృష్టించారు. కొంద‌రు న్యాయ‌మూర్తుల‌పై కేంద్రం క‌న్నేసింద‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే వీరిపై కేంద్రం నిఘా పెట్టింద‌ని, ఫోన్ల‌ను ట్యాప్ చేస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల ఇద్ద‌రు జ‌డ్జిలు మాట్లాడుకుంటుండ‌గా తాను విన్న‌ట్టు ఆయ‌న చెప్పారు. ఇదే క‌నుక నిజ‌మైతే, దేశంలో న్యాయ వ్య‌వ‌స్థ‌పై ఇది తీర‌ని దాడి అవుతుంద‌ని కేజ్రీ విమ‌ర్శంచారు. ''ఫోన్లో మాట్లాడొద్దు, అవి ట్యాప్ అవుతున్నాయి'' అంటూ ఇద్దరు జడ్జీలు మాట్లాడుకోవడం తాను విన్నానని, ఇలా జడ్జీల ఫోన్లను ట్యాప్ చేయడం సరికాదని కేజ్రీవాల్ చెప్పారు. ఆ జ‌డ్జిల మాట‌లు నిజ‌మైతే.. ఇక న్యాయ వ్య‌వ‌స్థ‌కు స్వాతంత్య్రం ఎక్క‌డ ఉంటుంద‌ని ప్ర‌శ్నించారు. ఎవరైనా జడ్జి ఏదైనా తప్పు చేసినా, అప్పుడు కూడా వాళ్ల ఫోన్లు ట్యాప్ చేయకూడదని.. సాక్ష్యాలు సేకరించడానికి ఇంకా చాలా రకాల మార్గలున్నాయని చెప్పారు. కాగా, కేజ్రీ ఆరోప‌ణ‌ల‌పై న్యాయ శాఖ మంత్రి ర‌విశంక‌ర ప్ర‌సాద్ తీవ్రంగా స్పందించారు. కేజ్రీ ఆరోప‌ణ‌లు నిజం కాద‌న్నారు. దేశంలో ఎప్పుడూ ఇలా జ‌ర‌గ‌లేద‌ని చెప్పారు. త‌మ ప్ర‌భుత్వం న్యాయ‌మూర్తుల‌కు అత్యున్న‌త గౌర‌వం ఇస్తుంద‌ని, వారి ఫోన్ల‌ను ట్యాప్ చేయాల్సిన అవ‌స‌రం ఏంట‌ని ప్ర‌శ్నించారు. కాగా, కేజ్రీ గ‌తంలోనూ మోడీ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఏదేమైనా కేజ్రీ తాజా ఆరోప‌ణ‌లు ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా పెద్ద సంచ‌ల‌నంగా మారాయి.

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కారు షికారు కన్ఫర్మ్?

01/11/2016: తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తరువాత టీఆరెస్ ను, కేసీఆర్ ను నిర్హీతిగా విమర్శించిన కాంగ్రెస్ నేత ఎవరైనా ఉన్నారంటే అది ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి డి.కె. అరుణ ఒక్కరే అని చెప్పాలి. మిగతా నేతలు మైకులు పట్టుకుని మాటలు విసిరినా అందులో ఏదో మొహమాటం, మరేదో భయం కనిపించేవి. అరుణ మాత్రం టీఆరెస్ ను దునుమాడడంలో ఎక్కడా వెనక్కు తగ్గలేదు. అలాంటి అరుణ ఇప్పుడు కారెక్కబోతున్నారన్న వార్తలు కొద్దిరోజులుగా ప్రచారమవుతున్నా తాజాగా నిజామాబాద్ ఎంపీ కవిత కూడా అదే మాట చెప్పడంతో అరుణ కారు షికారు దాదాపు కన్ఫర్మని తెలుస్తోంది. మాజీ మంత్రి డీకే అరుణ త్వర‌లోనే అధికార పార్టీలో చేర‌తార‌ని నిజామ‌బాద్ ఎంపీ కవిత ప్రక‌టించారు. ఆమె ఇప్పటికే పార్టీలో చేరాల్సి ఉంద‌ని, కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల చేర‌లేక‌పోయార‌ని ఆమె మీడియాతో వెల్లడించ‌డం తెలంగాణ కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం రేపింది. వాస్తవానికి ద‌స‌రాకు ముందు వ‌ర‌కు డీకే – క‌విత మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డిచింది. అరుణ‌ను అరుంధతి సినిమాలో బొమ్మాళితో క‌విత‌ పోలిస్తే.. కేసీఆర్‌ను ప‌శుప‌తితో అరుణ పోల్చారు. వారిద్దరి మ‌ధ్య నువ్వా – నేనా అన్నట్లుగా మాటల యుద్దం సాగింది. మరోవైపు గ‌ద్వాల‌ను జిల్లాను చేయాలంటూ డీకే అరుణ ఎన్నిసార్లు డిమాండు చేసినా టీఆరెస్, కేసీఆర్‌ పట్టించుకోలేదు. చివరకు ఆమె రాజీనామా లేఖ‌ను కూడా ఇచ్చారు. అయితే... అనూహ్యంగా కొత్త జిల్లాల జాబితాలో గ‌ద్వాల‌ను చేర్చడంతో ఆమె త‌న రాజీనామా ఆలోచ‌న‌ను వెన‌క్కి తీసుకున్నారు. అక్కడి నుంచి రాజకీయం మలుపు తిరిగింది. అరుణను పార్టీలోకి తేవడానికే గద్వాలను జిల్లా చేశారన్న విమర్శలు కూడా వచ్చాయి. అయితే నిత్యం టీఆరెస్ తో కొట్టాడిన అరుణ నిజంగానే పార్టీ మారుతారా అన్నది ఆమె చెబితేనే తెలియాలి. క‌విత చేసిన వ్యాఖ్యలు వ్యూహత్మకంగా చేసిన‌వా.. లేక ఆమెను ఇరుకున పెట్టేందుకు రాజ‌కీయ ఎత్తుగ‌డ‌తో చేసిన‌వా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమ‌వుతున్నాయి. మరోవైపు అరుణ వంటి నేత విషయంలో కవిత స్థాయిలో వదంతులు సృష్టించకపోవచ్చన్న వాదనా ఉంది. ఏదేమైనా అరుణ దీనిపై స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది.

గోవాలో కోహ్లీ అనుష్క..

01/11/2016: టీమిండియా స్టార్ బ్సాట్స్ మన్ విరాట్ కోహ్లి తన ప్రియురాలు అనుష్క శర్మతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాడు. విశాఖపట్నంలో న్యూజిలాండ్ చివరి వన్డే మ్యాచ్ అయిపోగానే కోహ్లీ గోవా వెళ్లిన కోహ్లీ.. అనుష్కతో సరదాగా గడిపాడు. ఇండియన్ సూపర్ లీగ్లో భాగంగా ఎఫ్ సీ గోవా, ఢిల్లీ డైనమోస్ మధ్య జరిగిన మ్యాచ్ వీక్షిస్తూ ఇద్దరూ ఉత్సాహంగా గడిపారు. ఎఫ్ సీ గోవా సహ యజమాని అయిన కోహ్లి టీమ్ జెర్సీలో మెరిశాడు. అనుష్క తెలుపు రంగు సల్వార్ సూట్ లో సింపుల్ గా ఉంది. చాలా కాలం తర్వాత కోహ్లి-అనుష్క కలిసి బహిరంగంగా కనబడడంతో వీరిని చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు. ఐఎస్ఎల్ మ్యాచ్ సందర్భంగా వీరితో కలిసి ఫొటోలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. కోహ్లి, అనుష్క చిరునవ్వుతో ఫ్యాన్స్ తో ఫొటోలకు ఫోజులిచ్చారు. న్యూజిలాండ్ తో జరిగిన ఐదు వన్డేల సిరీస్ ను టీమిండియా 3-2తో గెలిచింది. విశాఖపట్నంలో జరిగిన చివరి వన్డేలో విజయం సాధించి ధోనిసేన సిరీస్ దక్కించుకుంది. సిరీస్ గెలిచిన ఉత్సాహంతో ఉన్న కోహ్లీ.. అనుష్కతో కలిసి ఫుల్ గా ఖుషీ చేశాడు.

‘క్షణాల్లో ఎంతటి నొప్పినైనా తగ్గిస్తుంది’

01/11/2016: సిడ్నీ: భయంకరమైన నొప్పి నుంచి బయటపడాలంటే అత్యవసరంగా పనిచేసే సెడెటివ్‌ మాత్రలు వేసుకోవాల్సిందే. అవి పనిచేయాలంటే కూడా కొంత సమయం పడుతుంది. వెంటనే పనిచేసే మాత్రల గురించి పరిశోధకులు నిరంతరం ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు నిర్వర్తిస్నున్న విషయం తెల్సిందే. సెడెటివ్‌ మాత్రల తయారీలో పాము విషాన్ని విరివిగా ఉపయోగిస్తారు. నొప్పికి పాము విషమే మంత్రంగా పనిచేస్తుందికనుక ఎలాంటి పాము విషయం బాగా పనిచేస్తుందనే విషయమై ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్‌ డాక్టర్‌ బ్య్రాన్‌ ఫ్రై పరిశోధనలు జరిపి విజయం సాధించారు. ‘కిల్లర్‌ ఆఫ్‌ ది కిల్లర్స్‌’గా వ్యవహరించే పాముకు ప్రపంచ పాముల్లోనే అత్యంత పొడౖÐð న విష గ్రంధులు ఉన్నాయని, ఇవి నిరంతరం శ్రవిస్తూనే ఉంటాయని, ఈ పాము విషాన్ని వినియోగించినట్లయితే మానువుల్లో నొప్పులు క్షణకాలంలో మటు మాయం అవుతాయని డాక్టర్‌ బ్య్రాన్‌ తెలిపారు. మూతి, తోక ఎరుపు రంగుతో ఉండి మిగతా శరీర భాగమంతా నీలి చారలతో ఈ పాము చూడముచ్చటగా∙ఉంటుందని ఆయన చెప్పారు. దీని శరీరం మొత్తం పొడువులో పావు భాగాన్ని విషపు గ్రంధులు ఆవరించి ఉంటాయని ఆయన తెలిపారు. కింగ్‌ కోబ్రానే కాకుండా ఖడ్గమృగాలను సైతం చంపే శక్తి ఈ పాము విషానికి ఉందని, శత్రువులను క్షణాల్లో మట్టి కరిపించేందుకు ఈ పాము విషానికి వేగంగా పనిచేసే గుణం ఉందని ఆయన తెలిపారు. ఆగ్నేయాసియాలో కనిపించే ఈ పాములు ఇప్పుడు దాదాపు 80 శాతం అంతరించి పోయాయని, కేవలం 20 శాతం మాత్రమే మనుగడ సాగిస్తున్నాయని ఆయన తెలిపారు. తాను ఈ పాములను రెందుసార్లు మాత్రమే చూశానని కూడా చెప్పారు. దీన్ని విషాన్ని సేకరించి ఔషధంగా తయారు చేస్తే అది నొప్పి ప్రభావాన్ని మానవుడికి కలిగించే సోడియం ఛానళ్లను క్షణాల్లో మొద్దుబారుస్తుందని చెప్పారు. ఆయన చైనా, అమెరికా, సింగపూర్‌కు చెందిన నిపుణులతో కలసి జరిపిన ఈ పరిశోధనా విషయాలను ‘టాక్సిన్‌’ పత్రికలో ప్రచురించారు.

వందల కోట్లను మూడు కంటైనర్లలో పెట్టి..

28/10/2016: మరే రాష్ట్రంలో లేని విధంగా తమిళనాడుకు చెందిన బ్యాంకులకు సంబంధించిన డబ్బును తరలించే ప్రక్రియ ప్రతిసారీ వార్తాంశంగా మారుతోంది. ఆ మధ్యన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు కంటైనర్లను తనిఖీ చేయటం.. అందులో భారీ ఎత్తున డబ్బు ఉండటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే.. ఆ డబ్బు బ్యాంకుకు సంబంధించిందని.. దాన్ని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తరలించే ప్రక్రియలో అధికారులు తనిఖీలు నిర్వహించి నిలిపివేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే.. ఈ ఉదంతంపై పలు సందేహాలు వెల్లువెత్తాయి. వేటికి సమాధానం దొరకని పరిస్థితి. ఇదిలా ఉండగా.. కొద్ది నెలల క్రితం తమిళనాడుకు చెందిన సేలంలో వివిధ బ్యాంకులకు చెందిన భారీ మొత్తాన్ని రైల్లో తరలించే ప్రయత్నంలో.. రైలుకు కన్నం వేసి మరీ.. భారీ ఎత్తున చోరీ చేయటం.. ఈ ఉదంతంలో భాగస్వామ్యులైన నిందితుల్ని ఇప్పటివరకూ అదుపులోకి తీసుకోకపోవటం తెలిసిందే. తాజాగా.. బ్యాంకులకు చెందిన భారీ మొత్తాన్ని సురక్షితంగా తరలించే ప్రయత్నంలో అధికారులు భిన్నంగా వ్యూహరచన చేసినట్లుగా కనిపిస్తోంది. ఎప్పటిమాదిరి గుట్టుగా కాకుండా.. ఓపెన్ గా అందరికి తెలిసేలా.. డబ్బు కంటైనర్లను తరలించటం గమనార్హం. మూడు భారీ కంటైనర్ల నిండా కరెన్సీని నింపి కోయంబత్తూరు నుంచి రిజర్వ్ బ్యాంకుకు తరలించారు. ఇందులో భాగంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు కంటైనర్లకు ముందు వెనుక ఆరు కార్లతో భారీ భద్రతా సిబ్బంది రక్షణగా నిలిచారు.అంతేకాదు.. తమ ప్రయాణంలో భాగంగా మధ్యాహ్నం భోజనం వేళలో.. రోడ్ల మీదనే కరెన్సీ ఉన్న కంటైనర్లను అధికారులు నిలిపివేశారు. కళ్ల ముందు వందల కోట్లు రూపాయిలున్న కంటైనర్లు కనిపించటంతో ప్రజలు పెద్ద ఎత్తున వాటిని ఆసక్తిగా చూసే పరిస్థితి. అయితే.. కంటైనర్లకు దగ్గరకు రాకుండా ఉండేందుకు ఏకంగా యాభై మంది పోలీసులు రక్షణగా నిలిచిన వైనం స్థానికులను అమితంగా ఆకర్షించింది. గుట్టుగా కంటే కూడా ఓపెన్ గా తరలించిన కంటైనర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా గమ్యస్థానానికి చేరటం గమనర్హాం. చూస్తుంటే.. కొన్ని విషయాల్లో ఓపెన్ గా ఉండటం సేఫ్ కూడా అన్నట్లు లేదు..?

కేసీఆర్ దీవాలీ ధమాకా

28/10/2016: గులాబీ విశ్వరూప ప్రదర్శనకు రంగం సిద్ధమైంది. టీఆర్‌ఎస్‌ సంస్థాగతంగా బలహీనమనే విమర్శలకు చెక్‌ పెట్టే విధంగా చర్యలు ఉండబోతున్నాయి. తెలంగాణ నూతన రాష్ట్రం కావటం, రాష్ట్ర విభజన సమస్యల నేపథ్యంలో సీఎంగా కేసీఆర్‌ ఇన్నాళ్లు ప్రభుత్వ కార్యకలాపాలపై ఎక్కువ దృష్టి పెడుతూ వస్తున్నారు. పాలనలో తనదైన ముద్రతో ముందుకు సాగుతున్నారు. వచ్చే డిసెంబర్‌ 2 నాటికి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతుండటం, మరో రెండున్నరేళ్లలో సాధారణ ఎన్నికలు ఉండటంతో తాజాగా సీఎం కేసీఆర్‌ సొంత పార్టీ నిర్మాణ పటిష్టతకు పూనుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ అంశం కంటే, ప్రభుత్వ పనితీరు కీలకమైన అంశంగా మారుతుందనే అంచనాతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టీఆర్‌ఎస్‌ సంస్థాగతంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఆయన భావిస్తున్నారు. పాలన మాదిరిగానే ఇకపై పార్టీని కొత్త పుంతలు తొక్కించి అందరితో ఔరా అనిపిస్తారని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు చెబుతున్నారు. రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 10 నుంచి 31కి పెరిగినప్పటికీ, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుల సంఖ్య పరిమితంగా ఉండాలనేది కేసీఆర్ ఆలోచన. ఈసారి పొలిట్‌బ్యూరో సభ్యుల సంఖ్య ఆరు లేదా తొమ్మిదిగా ఉంటుందని సమాచారం. జిల్లాల పార్టీ కార్యవర్గాల కూర్పు బాధ్యతను సీఎం కేసీఆర్‌ ఆయా జిల్లాల మంత్రులు, కీలక ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నేతలకు అప్పగించారు. వీలైనంత వరకు జిల్లా కార్యవర్గాలు, అనుబంధ సంఘాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూడాలని వారికి సూచించారు. ప్రతి జిల్లా కార్యవర్గంలో 24 మంది ఉండాలని సీఎం నిర్దేశించారు. అందులో ఒక అధ్యక్షుడు, ఒక ఉపాధ్యక్షుడు, ఐదుగురు చొప్పున ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, ఏడుగురు ఎగ్జిక్యూటివ్‌ మెంబర్స్‌ ఉండాలని చెప్పారు. దీపావళి తర్వాత జిల్లాల వారీగా లేదా అన్ని జిల్లాల పార్టీ కార్యవర్గాలకు ఒకేసారి సమావేశాన్ని ఏర్పాటుచేసి తగిన దిశానిర్దేశం చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. కొత్త కార్యవర్గాల ఆధ్యర్యంలోనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో టీఆర్‌ఎస్‌ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే ప్లీనరీకి వారిని సన్నద్ధం చేస్తారు.

సిద్ధాంత బలం లేకే కమ్యూనిజం, మావోయిజం కట్టె కాలిపోయింది

28/10/2016: దేశంలో ఉన్న మిగతా రాజకీయ పార్టీలు, నాయకుల విషయంలో ఎలా ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీలు, నాయకులు అంటే మాత్రం ప్రజలకు కాస్త గౌరవం ఉండేది. అది కూడా వాళ్ళు ఇప్పటి వరకూ అధికారంలోకి రాని రాష్ట్రాల్లో కాస్తంత ఎక్కువ గౌరవం ఉండేది. ఓట్లు వేసి అధికారం అప్పగించకపోయినా, మన కోసం పోరాడుతున్నారన్న ప్రజల సానుభూతి కూడా అందుకు ఓ ప్రధాన కారణం. అధికారంలోకి వచ్చే విషయం ఎలా ఉన్నా ఓ దశాబ్ధం క్రితం వరకూ కూడా కమ్యూనిస్టుల ఓట్ షేర్‌ ఎప్పుడూ స్థిరంగా ఉండేది. అయితే ఒకటి రెండు ఎమ్యెల్యే స్థానాల కోసం స్వార్థ రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం, బిజెపిని విమర్శించే క్రమంలో మత రాజకీయాలను ప్రోత్సహించడం లాంటి చర్యలతో ఎక్కువ మంది ప్రజలకు దూరమయ్యారు. మావోయిస్టుల ఎన్‌కౌంటర్స్ విషయంలో కూడా కమ్యూనిస్టులకు ఓ స్పష్టమైన విధానం అంటూ ఏమీ ఉండదు. ఎక్కడ ఎన్‌కౌంటర్ జరిగినా…. రెగ్యులర్ రాజకీయనాయకుల్లాగే, కనీస సమాచారం కూడా తెలుసుకోకుండానే ఖండించడం మాత్రం చేస్తూ ఉంటారు. ఆ ఎన్‌కౌంటర్ బూటకమని విమర్శలు చేయడం లాంటివి మాత్రం గత కొన్ని దశాబ్ధాలుగా చేస్తూనే ఉన్నారు. ఎన్‌కౌంటర్ బూటకమా? కాదా? అన్న విషయం పక్కన పెడితే మావోయిస్టుల విషయంలో పోలీసుల చర్యలు, ప్రతిచర్యలు ఎలా ఉండాలో వీళ్ళు చెప్పగలరా? మావోయిస్టులు ఎటాక్ చేసినప్పుడు మాత్రమే పోలీసులు కౌంటర్ ఎటాక్ చెయ్యాలా? లేక వాళ్ళ ఆచూకీ తెలిసినప్పుడు పోలీసులే ఎటాక్ చెయ్యొచ్చా? చట్టసమ్మతమా? కాదా? అన్న విషయం పక్కన పెట్టినా కనీసం ప్రజామోదం ఉండే సిద్ధాంతాలను వీళ్ళు ఏమైనా చెప్పగలరా? పోలీసులు దొంగదెబ్బ తీసి మావోయిస్టులను చంపేశారని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడేస్తూ ఉన్నారు. మరి మావోయిస్టులు చేస్తోంది ఏంటి? వాళ్ళు కూడా దొంగదెబ్బలే కదా కొడుతోంది. అలాంటప్పుడు అన్నీ తెలిసిన ప్రజలు ఎలా ఆలోచించాలి? ఆ ప్రజల ఆలోచనలు మొద్దుబారిపోయాయని, స్పందించడం లేదని మావోయిస్టు సానుభూతిపరులు నిందారోపణలకు దిగడమెందుకు? అసలు సామాన్య ప్రజలు ఎవరైనా సరే మావోయిస్టులకు ఎందుకు సపోర్ట్ చేయాలి? ఆ ప్రజల కోసం మావోయిస్టులు చేసిందేంటి? మరీ ముఖ్యంగా ఈ దశాబ్ధకాలంలో మావోయిస్టుల వళ్ళ ప్రజలకు ఒనగూరిన ఓ గొప్ప ప్రయోజనం ఏంటో చెప్పమనండి. కమ్యూనిస్టులకు కూడా ఈ ప్రశ్న వర్తిస్తుంది. గత పదేళ్ళలో వాళ్ళు చేసింది కూడా ఏమీ లేదు. అందుకే ప్రజలకు దూరమయ్యారు. ఇప్పుడు మాత్రం ప్రజలు స్పందించడం లేదని వాపోతున్నారు. ఇక కమ్యూనిస్టు పార్టీల నాయకుల సిద్ధాంతాలు ఏ స్థాయికి దిగజారుతున్నాయో చెప్పడానికా అన్నట్లుగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ కొత్త రాజకీయ సిద్ధాంతాన్ని చెప్పుకొచ్చారు. కుల సంఘాలు రాజకీయంగా ఎదగాలట. ఆ కుల సంఘాలు రాజకీయంగా ఎదిగినప్పుడే అద్భుతాలు ఏవో సాధ్యమవుతాయని ఆయన చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. మిగతా రాజకీయ పార్టీలన్నింటికీ కూడా అధికారమే పరమావధి అన్న ఓ సిద్ధాంతమన్నా తగలడింది. అసలూ ఏ సిధ్ధాంతమూ లేని పార్టీలు మాత్రం కమ్యూనిస్టులు ఒక్కరేనేమో. మనతో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాను సమర్ధించడం, మత రాజకీయాలు అని మాట్లాడుతూ బిజెపి కంటే ఎక్కువగా వీళ్ళే మత రాజకీయాలు చేస్తూ ఉండడం, ఒకటి రెండు ఎమ్యెల్యే సీట్ల కోసం కక్కుర్తి పడి సిద్ధాంతాలను గాలికొదిలేసి రెగ్యులర్ పార్టీలతో పొత్తుల కోసం అంగలార్చడం, ఎన్‌కౌంటర్లు జరిగినప్పుడు వాటిని ఖండించడంలాంటివి తప్పితే కమ్యూనిస్టులు ఆచరిస్తున్న వేరే సిద్ధాంతాలేంటో ఆ పార్టీల కార్యకర్తలకు కూడా తెలియదు. ఇంతకు ముందు కొంత కాలం వరకూ పెట్రోల్ రేట్లు, కరెంట్, బస్ ఛార్జీలు పెరిగినప్పుడు మాత్రం కాస్త హడావిడి చేసి జనాల మెప్పుపొందేవారు. ఇప్పుడు అలాంటి ఆందోళనలకు కూడా తిలోదకాలిచ్చేసి పూర్తిగా ప్రజలకు దూరమయిపోయారు. ఇక ఆ ప్రజలు ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఎందుకు చేయాలి?

తొలిసారి జీసస్ సమాధి తెరిచారు

28/10/2016: జెరూసలెం: చరిత్రలో తొలిసారి ఏసుక్రీస్తు సమాధిని తెరిచారు. ఆయన సమాధిపై మూసి ఉంచిన చలువరాయిని తొలగించారు. ఈ సమాధి చుట్టూ నిర్మించిన చర్చిని పునరుద్ధరించే చర్యల్లో భాగంగా సమాధిపై ఉన్న రాయిని పలువురు చర్చి మతపెద్దల సమక్షంలో పరిశోధకులు అతి జాగ్రత్తగా తొలగించారు. క్రీస్తును సమాధి చేసిన తర్వాత క్రీ.శ.1555 నుంచి ఈ పవిత్ర చలువరాతిని ఏనాడు కదిలించలేదు. అయితే, తాజాగా చర్చిని పునరుద్ధరించే భారీ ప్రాజెక్టు పనుల్లో భాగంగా పరిశోధకులు తొలిసారి దీనిని తెరిచారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఫ్రెడ్రిక్ హైబర్ట్ మాట్లాడుతూ 'క్రీస్తును ఉంచి సమాధి పైభాగాన్ని కప్పి ఉంచిన చలువరాతిని బయటకు తీశాం. దాని కింద ఉన్న వస్తువులు చూసి మేం చాలా ఆశ్చర్యపోయాం' అని చెప్పారు. 'చాలా సుదీర్ఘకాలంగా జరిగిన విశ్లేషణ అనంతరం క్రీస్తు సమాధిపై ఉంచిన అసలైన చలువరాయిని ఎట్టకేలకు ఇప్పుడు అందరం ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. దీని కిందే క్రీస్తును ఉంచారు' అని కూడా ఆయన తెలిపారు. క్రీస్తును సమాధి చేసిన ఈ ప్రాంతంలో పెద్ద చర్చిని నిర్మించగా దాని మధ్యలో సమాధి చుట్టూ ఒక చిన్న నిర్మాణం ఉంది. దీనిని ఎడిక్యుల్ అంటారు. అతి సుందరంగా నిర్మించిన ఇందులో ఒకసారి అగ్ని ప్రమాదం సంభవించడంతో 1808, 1810 మధ్య పునరుద్ధరించారు. ఆ సమయంలో నేషనల్ టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ ఏథెన్స్ పరిశోధకులు ఆ పనులు పూర్తి చేశారు. కాగా, తాజాగా మరోసారి పునరుద్ధరించనున్నారు.

ఈ సారి కూడా ఛాన్స్ ఉంటే.. విడాకులే..

26/10/2016: రాజ్యాంగ నిబంధనలు అగ్రరాజ్యాధినేత బరాక్ ఒబామా వైవాహిక బంధాన్ని కాపాడాయా? మూడో సారి కూడా బరిలో నిలబడే అవకాశం ఉంటే కనుక ఆయన ఇంట్లో గొడవ ప్రారంభమైపోయి ఉండేదా? మనకైతే తెలీదు కానీ ఒబామా మాత్రం అవుననే అంటున్నారు. ఈ దఫా కూడా అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం తనకు గానీ ఉంటే మిషెల్ విడాకులు ఇచ్చేసి ఉండేదని చెప్తున్నారు. సరదాగానే లెండి. జిమీ కిమెల్ లైవ్ షోలో పాల్గొన్న ఒబామా, సతీమణి మిషెల్ కు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని చెప్తూ డైవోర్స్ పై ఇలా సరదా వ్యాఖ్య చేసి నవ్వులు పూయించారు. ఎనిమిది సంవత్సరాలు టైట్ సెక్యూరిటీతో కాలం వెళ్లదీస్తున్న మిషెల్ స్వేచ్ఛ కోసం పరితపిస్తున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కార్ అద్దాలు కిందకు దించి తల బయటకు పెట్టి ప్రయాణించేందుకు వేచి చూస్తున్నానని అన్నారు. ఓ సాధారణ అమెరికన్ లా జీవించాలనుకుంటున్నానని చెప్పారు. అమెరికా అధినేతకే కాక ప్రథమ మహిళకు, వారి కుటుంబానికి భారీ భద్రత ఉంటుంది. వారి ప్రతీ అడుగునూ సెక్యూరిటీ అధికారులు నిర్దేశిస్తారంటే అతిశయోక్తి కాదేమో. అందుకే ఆంక్షల నుంచి విముక్తి పొంది స్వేచ్ఛగా తిరిగేందుకు మిషెల్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇదిలా ఉంటే, జిమీ కిమెల్ లైవ్ షోలో ఒబామా చాలా ఉల్లాసంగా కనిపించారు. తమ ప్రత్యర్ధి డొనాల్డ్ ట్రంప్ పైనా స్పందించారు. ఆయన ప్రసంగాలు చూసి చాలా సార్లు నవ్వానని యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు జవాబు చెప్పారు. తనపై వ్యతిరేకంగా వచ్చిన ట్వీట్లనూ గట్టిగా చదివి వినిపించారు. వీటిలో ట్రంప్ పోస్ట్ చేసిన ట్వీట్ కూడా ఉంది. "అధినేత ఒబామా అమెరికా చరిత్రలో పదవిని వీడుతున్న అత్యంత వరస్ట్ అధ్యక్షుడు కావచ్చు" అన్నది ట్రంప్ ట్వీట్. దీన్ని గట్టిగా చదివిన ఒబామా, నవ్వేస్తూ.. "ఏదైతేనేం. అధినేతగానే పదవిని వీడుతున్నా" అని వ్యాఖ్యానించారు. ఒబామా వచ్చే ఏడాది జనవరి 20 వరకూ పదవిలో కొనసాగుతారు. తర్వాత హిల్లరీ క్లింటన్ లేదా డొనాల్డ్ ట్రంప్ అధినేతగా పగ్గాలు స్వీకరిస్తారు.

ఫీజు బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని కేసీఆర్ కు టీడీపీ డెడ్ లైన్!

26/10/2016: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విపక్షాల విమర్శల పదును పెరుగుతోంది. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వ వైఫల్యంపై ఇప్పటికే తీవ్ర విమర్శలువస్తున్నాయి. నవంబర్ 26 లోగా ఫీజు బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని టీడీపీ డెడ్ లైన్ విధించింది. లేకపోతే లక్ష మందితో సీఎం క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తామని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ హెచ్చరించారు. లక్షల మంది విద్యార్థుల చదువుకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ప్రతిపక్షాలు చాలా కాలంగా విమర్శిస్తున్నాయి. ఫీజు బకాయిలు ఇవ్వకపోతే కాలేజీలను నడిపేది ఎట్లా అని యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. వాటి ఆందోళనలో న్యాయం ఉంది. ఈ అంశంపై టీడీపీ మంగళవారం ఎల్ బి నగర్ లో మహాధర్నా నిర్వహించింది. కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. కేసీఆర్ విషయంలో టీడీపీ వైఖరి కరుకుదేలినట్టు కనిపిస్తోంది. ఆయనపై రమణ సెటైర్లు వేశారు. బతుకమ్మ పేరుతో కోట్లు ఖర్చు చేసి తన కూతురు కవితను కేసీఆర్ విదేశాలకు పంపారని రమణ విమర్శించారు. ఈసారి విదేశాలకు పంపారు. వచ్చే ఏడాది చంద్రమండలంలో బతుకమ్మ ఆడవమ్మా అని పంపుతారేమో అని చెణుకులు విసిరారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో నిర్లక్ష్యం చేస్తే వారి భవిష్యత్తుతో ఆడుకోవడమే అని టీడీపీ నేతలు దుయ్యబట్టారు. ఇలా చేస్తే ఫలితం అనుభవించాల్సి వస్తుందని కేసీఆర్ ను హెచ్చరించారు. ఫీజు బకాయిల్లో ప్రస్తుతానికి 300 కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వం ఒకవిధంగా ప్రయివేటు కాలేజీల యజమానులను బతిమిలాడుకుంది. ఇటీవల జరిగిన సమావేశంలో విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఈ ప్రతిపాదన చేశారు. ప్రస్తుతానికి కాలేజీల యమజానులు సరేనన్నారు. కానీ మిగతా బకాయిలు బకాయిలు చెల్లించడంలో జాప్యం చేస్తే ఇబ్బందులు తప్పకపోవచ్చు.

10 రోజుల్లో సచివాలయం ఖాళీ… కేసీఆర్ సర్కార్ హుకుం

26/10/2016: ఏపీ సచివాలయ ఉద్యోగులు హాయిగా అమరావతిలో పనిచేసుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ సచివాలయ ఉద్యోగులకు అనుకోని ఇబ్బంది వచ్చి పడింది. చక్కగా ఉన్న భవనాలను కూల్చి అద్భుతమైన కొత్త భవనాన్ని కట్టించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు చకచకా సన్నాహాలు చేస్తోంది. 10 రోజుల్లో సచివాలయ ప్రాంగణంలోని కార్యాలయాలను ఖాళీ చేయాలని సోమవారం నాడు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంజినీరింగ్ విధులతో కూడిన కొన్ని శాఖల కార్యాలయాలను వాటి ప్రధాన ఆఫీసుల భవనాల్లోకి మారుస్తారట. మిగిలిన వాటిని బూర్గుల రామకృష్ణారావు భవనంలోకి మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ప్రధాన కార్యదర్శి ఆగమేఘాల మీద ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ ఆఫీసుల తరలింపు పనుల పర్యవేక్షణ బాధ్యతలను 9 మంది అధికారులకు అప్పగించారు. ఏయే శాఖల ఆఫీసులను ఎక్కడికి తరలించాలి, వాటి ఫైళ్లు ఇతరత్రా విషయాలపై వీరు తగిన పర్యవేక్షణ, ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. బూర్గుల భవనంలో ఇప్పటికే చాలా ఆఫీసులున్నాయి. సచివాలయంలోని ఇన్ని శాఖల ఉద్యోగులు కూర్చోవడానికి అక్కడ స్థలం ఉందా అనేది అంతుపట్టడం లేదు. అక్కడ అందరికీ వీలుకాకపోతే ఇతర భవనాల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి ఎలాగూ సచివాలయానికి వెళ్లడం అనేది పట్టించుకోరు. నెలకు ఒకటిరెండు సార్లు వెళ్లడం కూడా అరుదే. కాబట్టి సీఎంవోను కొత్తగా నిర్మించిన ఆధునిక క్యాంప్ ఆఫీసుకు తరలించాలని నిర్ణయించారు. అంతవరకూ ఇబ్బంది లేదు. మిగతా కార్యాలయాల విషయమే సందిగ్ధంగా ఉంది. మొత్తానికి 10 రోజుల తర్వాత హైదరాబాదులోని సెక్రటేరియట్ బోసి పోయి కనిపిస్తుంది. పేరుకే సెక్రటేరియట్. రెండు రాష్ట్రాల ఆఫీసులూ తరలిపోయిన తర్వాత కేవలం సెక్యూరిటీ సిబ్బంది మాత్రం కనిపిస్తారేమో. ఉమ్మడి రాజధానిలో ఏపీకి కేటాయించిన భవనాలను తమకు అప్పగించేలా చూడాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ ను కోరింది. ఏపీ ప్రభుత్వం కూడా ఓకే అంటుందనే నమ్మకంతో కొత్త భవనాల నిర్మాణానికి సిద్ధమవుతోంది. దీనికి వందల కోట్ల రూపాయలు ఖర్చు కాబోతున్నాయి.

గాలి జ‌నార్ద‌న్ గురించి తెలియ‌ని నిజాలు..

25/10/2016: దీర్ఘ కాలం జైలు జీవితం అనుభ‌వించిన త‌ర్వాత గాలి తీరులో కాస్త మార్పు క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ.. ఆయ‌న ఒక‌ద‌శ‌లో ఎంత‌లా చెల‌రేగిపోయారో అంద‌రికి తెలిసిందే. తాను ఆడిందే ఆట‌గా.. పాడిందే పాట‌గా వ్య‌వ‌హ‌రించే గాలి జ‌నార్ధ‌న‌రెడ్డి కొద్దికాలంగా కామ్‌గా ఉంటున్నారు. కూతురు పెళ్లికి విడుద‌ల చేసిన వెరైటీ శుభ‌లేఖ‌తో మ‌రోసారి మీడియాలో బాగా ఫోక‌స్ అయిన గాలి.. వ‌చ్చిన ప్ర‌చారానికి మొద‌ట్లో హ్యాపీకి గురైనా.. ఆ వెంట‌నే అలెర్ట్ కావ‌టం.. త‌న స‌న్నిహితుడు శ్రీరాముల చేత మీడియా ముందుకు వ‌చ్చేలా చేసి.. తాము మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబీకుల‌మ‌ని.. త‌మ ఇంట్లో జ‌రిగే పెళ్లి మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఇంట్లో పెళ్లి మాదిరే ఉంటుంద‌ని వ్యాఖ్యానించి విస్మ‌యానికి గురి చేశారు. గాలి జ‌నార్ధ‌న్ కుమార్తె త‌న‌కు కూతురు లాంటిద‌ని చెప్పిన మాజీ మంత్రి శ్రీరాముల విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. గాలి జ‌నార్ధ‌న్ రెడ్డికి సంబంధించిన అంశాల‌పై చ‌ర్చ మొద‌లైంది. రాజ‌కీయాల్లో ధ‌న‌బ‌లంతో ఎంత‌లా విరుచుకుప‌డొచ్చ‌న్న విష‌యాన్ని గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి త‌న చేత‌ల్లో చేసి చూపించార‌ని చెప్పాలి. నిబంధ‌న‌ల్ని నీళ్ల‌కు వ‌దిలేసి.. అవినీతితో అంద‌రిని కొనేసి గాలి.. రాజ‌కీయాన్ని ర‌క్ష‌ణ క‌వ‌చంలా చేసుకొని ఎంత‌లా ఆరాచ‌కాల‌కు పాల్ప‌డ్డార‌న‌టానికి గాలి ఉదంతం నిలువెత్తు నిద‌ర్శ‌నంగా చెప్పాలి. మైనింగ్ వ్యాపారంతో వేలాది కోట్లు వెన‌కేసిన గాలి.. త‌ర్వాతికాలంలో సీబీఐ అరెస్ట్ చేయ‌టంతో.. జైల్లో సుదీర్ఘ కాలం గ‌డిపి బెయిల్ మీద‌కు వ‌చ్చిన ఆయ‌న‌కు సంబంధించిన చాలామందికి తెలీని కొన్ని అంశాలు చూస్తే.. * క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో అత్యంత కీల‌క‌వ్య‌క్తిగా ఎదిగాడు గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి. అక్ర‌మ మైనింగ్ వ్యాపారంతో పెద్ద ఎత్తున వెన‌కేసుకున్న గాలి.. స్వ‌త‌హాగా విన‌యంగా వ్య‌వ‌హ‌రిస్తూ క‌నిపిస్తారు. సౌమ్యంగా మాట్లాడే తీరున్న గాలి త‌న‌ను తాను విజ‌య‌న‌గ‌ర సామ్రాజ్యాధిప‌తి శ్రీకృష్ణ దేవ‌రాయ‌లుతో పోల్చుకునే వార‌ని చెబుతారు. * అక్ర‌మ మైనింగ్ వ్య‌వ‌హారంపై సీబీఐ అధికారులు ఆయ‌న ఇంటిపై దాడి చేసిన‌ప్పుడు ఆయ‌న విలాసం ఏ స్థాయిలో ఉంటుందో ప్ర‌పంచానికి తెలిసింది. 2011లో ఆయ‌న ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఇంట్లోనే ఇండోర్ స్విమ్మింగ్ పూల్‌.. 70ఎంఎం స్త్ర్కీన్ తో థియేట‌ర్‌.. మ‌సాజ్ పార్ల‌ర్‌.. స‌క‌ల స‌దుపాయాల‌తో కూడిన‌మూడు భ‌వంతులుఆయ‌న సొంతం. అర‌కిలోమీట‌రు దూరం నుంచే భ‌ద్ర‌త‌ను ప‌ర్య‌వేక్షించేందుకు కెమేరాలు ఉండేవి. * గాలి ఇంట్లో బంగారం వినియోగం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిందే. కంచాలు మొద‌లు.. యాష్ ట్రే వ‌ర‌కూ అన్నీ బంగార‌మే. ఇంట్లో సామాను మొత్తాన్ని క‌లిపితే 30 కేజీల బంగారంగా తేల్చారు. దీనికి అద‌నంగా 15 కేజీల బంగారు సింహాస‌నాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సింహాస‌నంలో 2.2 కోట్ల రూపాయిల విలువైన వ‌జ్రాలు పొదిగిన‌ట్లుగా అధికారులు గుర్తించారు. ఇవి కాక‌.. ఇంట్లోని పూజ గ‌దిలోనూ విగ్ర‌హాల‌ను బంగారంతో ప్ర‌త్యేకంగా త‌యారు చేయించారు. పూజ‌గ‌దిలో వాడే గంట బ‌రువు కిలో వ‌ర‌కూ ఉంటుంద‌ని.. దాన్ని కూడా బంగారంతోనే చేసిన‌ట్లుగా చెబుతారు. ఇక‌.. ఆయ‌న ధ‌రించే బెల్ట్ సైతం బంగారమే. * అన్నింటికి మించి ఆయ‌న వేసుకునే చొక్కాలు త‌క్కువ అంటే ల‌క్ష రూపాయిల ఖ‌రీదుతో ఉండేవ‌ని చెబుతారు. ప్ర‌తి చొక్కాలో ఎంతోకొంత బంగారంతో చేసి ఉండాల్సిందేన‌ని చెబుతారు. ఇక‌.. ఆయ‌న వాడే ఫోన్ ను సైతం త‌న స్థాయికి త‌గ్గ‌ట్లుగా మార్పులు చేసిన‌ట్లు చెబుతారు. * అక్ర‌మ మైనింగ్ తో గాలి బ్ర‌ద‌ర్స్ సంపాదించిన సొమ్ము రూ.5వేల కోట్లుగా చెబుతారు. అయితే.. ఇంత సంపాదించినా.. ఇన్నిరాజ‌భోగాలు అనుభ‌వించినా వారిపాపం మాత్రం బాగానే పండింది. సీబీఐ పుణ్యామా అని జైల్లో ఉండాల్సి వ‌చ్చింది. దీనికి కార‌ణం అనంత‌పురం.. బ‌ళ్లారికి మ‌ధ్య‌నున్న స‌రిహ‌ద్దుల్లోని సుంక‌ల‌మ్మ దేవాల‌యాన్ని మైనింగ్ లో భాగంగా కూల్చ‌టంతో శాపం త‌గిలి.. పాపం పండి.. కేసుల్లో ఇరుకున్నార‌ని చెబుతారు.

ఆర్కే ఎస్కేప్‌...మ‌న‌వ‌డు ఎన్‌కౌంట‌ర్‌

25/10/2016: ఏవోబీ ప్రాంతంలో జ‌రిగిన తాజా ఎన్‌కౌంట‌ర్ నుంచి మావోయిస్టు అగ్ర‌నేత రామ‌కృష్ణ(ఆర్కే) ఎస్కేప్ అయిన‌ట్టు తెలుస్తోంది. అయితే, అదే స‌మ‌యంలో ఆయ‌న మ‌న‌వ‌డు, కీల‌క నేత మున్నా పోలీసు తూటాల‌కు బ‌లైన‌ట్టు స‌మాచారం. మొత్తానికి చాలా కాలంగా ఆర్కేను మ‌ట్టుబెట్టాల‌ని ఏపీ పోలీసులు ఎన్ని ప‌థ‌కాలు ప‌న్నుతున్నా ఆయ‌న మాత్రం త‌ప్పించుకుంటుండ‌డం గ‌మ‌నార్హం. ఇక, విషయంలోకి వెళ్తే.. గత కొంత కాలంగా స్తబ్తుగా ఉన్న మావోయిస్టులు తిరిగి త‌మ ప‌ట్టును పెంచుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే తాజా వ్యూహాల‌పై చ‌ర్చించేందుకు ఆంధ్ర‌, ఒరిస్సా స‌రిహ‌ద్దు లో చిత్రకొండ పనసపుట్టు వ‌ద్ద‌ మావోయిస్టులు ఆదివారం ప్లీన‌రీ నిర్వ‌హించారు. ఈ స‌మాచారాన్ని ప‌సిగ‌ట్టిన స్పెష‌ల్ పార్టీ పోలీసులు స‌హా గ్రే హౌండ్స్ బ‌ల‌గాలు భారీ ఎత్తున విరుచుకుపడ్డారు. అట‌వీప్రాంతంలో సుమారు 9 కిలో మీట‌ర్లు కాలిన‌డ‌క‌న చేరుకుని మావోయిస్టుల‌ను మ‌ట్టుబెట్టారు. ఈ దాడుల్లో భారీ ఎత్తున మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల మెరుపుదాడిని ఊహించ‌ని మావోయిస్టులు త‌మ ఆయుధాల‌తో సిద్ధ‌మ‌య్యేలోగానే పెద్ద ఎత్తున పోలీసులు విరుచుకుప‌డ్డారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 24 మంది మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఇక‌, ఈ ఎన్‌కౌంట‌ర్‌లో మృతి చెందిన మావోల‌ను గుర్తించేందుకు పోలీసులు గ‌తంలో లొంగిపోయిన మాజీ మావోస్టుల‌ను రంగంలోకి దింపారు. మాజీలు చెప్పిన ఆన‌వాళ్ల ప్ర‌కారం విశాఖ ఏరియా కార్యదర్శిగా వ్యవహరిస్తున్న గాజర్ల రవి అలియాస్ గణేష్, చలపతి, దయ, రాజన్న, బెంగాల్ సుధీర్, అశోక్,మల్లేష్ తదితరులు తాజా ఎన్‌కౌంట‌ర్లో ప్రాణాలు కోల్పోయార‌ని విశాఖ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. ఇక‌, ఈ ఎన్‌కౌంట‌ర్ నుంచి మావోయిస్టు కీల‌క నేత ఆర్కే తృటిలో త‌ప్పించుకున్న‌ట్టు స‌మాచారం. అయితే, ఆయ‌న మ‌న‌వ‌డు, మావోయిస్టు కార్య‌క‌లాపాల్లో ఇటీవ‌ల యాక్టివ్‌గా ఉన్న మున్నాను పోలీసులు కాల్చి చంపారు. ఇక‌, ఈ ఎన్‌కౌంట‌ర్ మృతుల్లో 18మంది పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నట్లు ఎస్పీ చెప్పారు. ఈ ఎన్‌కౌంట‌ర్ మావోయిస్టుల‌కు పెద్ద దెబ్బ‌గా ఆయ‌న పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

సారు ని కుడా వదలట్లేదు గా!

25/10/2016: రాజకీయాలు చాలా కరుకుగా ఉంటాయని.. రాజకీయాల్లో బంధాలు.. అనుబంధాలు లాంటివి ఎంతమాత్రం ఉండవని.. కేవలం లెక్కలు.. అప్పటికి కలిగే ప్రయోజనాలు తప్పించి మరెలాంటి భావోద్వేగాలు ఉండవని పలువురు చెబుతుంటారు. ఇలాంటి వాటికి ఎలాంటి వారైనా మినహాయింపు ఎంతమాత్రం కాదన్న మాటను రాజకీయ విశ్లేషకులు తరచూ చెబుతుంటారు. వారి అభిప్రాయం ఎంత నిజమన్న విషయం తాజాగా మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది. తెలంగాణ సర్కారు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల విషయంపై తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ కు సమానంగా ఉద్యమం చేసిన.. తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం తాజాగా తెలంగాణ ప్రభుత్వ తీరుకు నిరసనగా దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన.. తెలంగాణ ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భూముల సేకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని నిశితంగా విమర్శించిన కోదండరాం.. రైతుల సమస్యల మీద తాము ఎన్నో సలహాలు.. సూచనలు చేసినా ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదని.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ ఫైర్ అయ్యారు. ఇదిలా ఉంటే.. కోదండరాం మాష్టారు చేపట్టిన దీక్షపై తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. కోదండరాం కాంగ్రెస్ ఎజెండాను మోస్తున్నట్లుగా ఆరోపించారు. ప్రాజెక్టుల విషయంలో కోదండరాం ద్వంద విధానాల్ని పాటిస్తున్నారని.. మల్లన్నసాగర్ వద్ద రైతుల్ని రెచ్చగొడుతూ దీక్షలు చేశారని.. ఇక్కడ రైతుల పేరుతో దీక్ష చేస్తున్నారని.. ఈ దీక్షల్లో వేటిని నమ్మాలో తమకు అర్థం కావటం లేదని విమర్శించారు. అధికారంపై ఆశతో కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టుల్ని అడ్డుకోవాలని చూస్తుంటే.. ఉద్యమనేత కోదండరాం వాటికి మద్దతు పలకటం బాధ కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. కోదండరాం కాంగ్రెస్ ఎజెండాను మోస్తున్నట్లుగా హరీశ్ చెప్పిన వ్యాఖ్యతోనే అసలు పంచాయితీ అంతా. తమను దెబ్బ తీసేలా ప్రయత్నించే ఎవరినైనా.. రాజకీయ నేత అస్సలు ఉపేక్షించరు. కోదండరాం మాష్టారి లాంటి వ్యక్తి కమిట్ మెంట్ తెలిసినా.. తమ ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే దీక్షల్ని హరీశ్ లాంటివారు అస్సలు తట్టుకోలేరు. అందుకే.. ఆయన కోదండరాం వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా.. కాంగ్రెస్ మాటల్ని అప్పజెబుతున్నారన్నట్లుగా ఆరోపించటం కనిపిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి కోదండరాం మాష్టార్ని కాంగ్రెస్ ఎజెండా మోస్తున్నట్లుగా విమర్శిస్తున్నారు. మరి.. మొదటి ఒకటిన్నర సంవత్సరం తెలంగాణ అధికారపక్షంపై ఒక్క చిన్న మాట కూడా అనకుండా ఉన్నారు. మరి.. ఆ ఏడాదిన్నర కాలంలో కోదండరాం టీఆర్ఎస్ ఎజెండా మోసినట్లుగా అనుకోవాలా? ఇలాంటి అభిప్రాయాన్ని హరీశ్ లాంటి వారు ఆమోదిస్తారా..?

బాబు సిగ్న‌ల్ ఇస్తేనే ఆ ఇద్ద‌రికి కేసీఆర్ కేబినెట్‌లో బెర్త్‌

25/10/2016: ఈ హెడ్డింగ్ చూసి ఇదేంటి? అని నోరెళ్ల‌బెడుతున్నారా? చంద్ర‌బాబంటే ఉప్పు నిప్పుక‌న్నా ఘోరంగా మండిప‌డే కేసీఆర్‌కు బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం ఏంటి? ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే.. ఈయ‌న మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డ‌మేంటి? అని అనుకుంటున్నారా? ఇక్క‌డే ఉంది లాజిక్కంతా! ప్ర‌స్తుతం అటు తెలంగాణ‌, ఇటు ఏపీలోనూ జంపింగ్‌లు పెరిగిపోయారు. దీంతో వారిని సంతృప్తి ప‌రిచేందుకు వాళ్ల‌కు మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పించ‌క‌త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో టీడీపీ, కాంగ్రెస్‌ నుంచి వ‌చ్చి టీఆర్ఎస్ కారెక్కిన ముఖ్య నేత‌ల‌కు కేబినెట్‌లో చోటు ఇచ్చే అంశం పెద్ద చ‌ర్చ‌కు దారితీస్తోంది. టీడీపీ నుంచి వ‌చ్చి కారెక్కిన ఎర్ర‌బెల్లి, కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డితో పాటు టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, వ‌రంగ‌ల్ వెస్ట్ ఎమ్మెల్యే దాస్యం విన‌య్‌భాస్క‌ర్ త‌దిత‌రులు కేసీఆర్ మంత్రివ‌ర్గంలో చోటు కోసం ఆశిస్తున్నారు. అయితే వీరిలో ఎర్ర‌బెల్లి, గుత్తా జంపింగ్‌లు కావ‌డంతో కేసీఆర్ ఒకింత ఆలోచిస్తున్నారు. ఇదే విష‌యంలో గ‌తంలో టీడీపీ నుంచి వ‌చ్చి చేరిన త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌కి మంత్రి ప‌ద‌వి ఇచ్చి అటు తెలంగాణ టీడీపీ నేత‌ల నుంచి పెద్ద ఎత్తున కేసీఆర్ విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. ఇక‌, రేవంత్ రెడ్డి ఏకంగా దీనిపై కోర్టుకు కూడా ఎక్కారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో తాజాగా మ‌రింత మంది జంపింగ్‌ల‌ను కేబినెట్‌లోకి తీసుకుంటే మ‌రిన్ని త‌ల‌నొప్పులు వ‌స్తాయ‌ని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే, ఇదే స‌మ‌యంలో ఏపీలోనూ సేమ్ సీన్ కొన‌సాగుతోంది. అక్క‌డ వైకాపా నుంచి వ‌చ్చిన జంపింగ్‌లు మంత్రి ప‌ద‌వులు కోరుకుంటున్నారు. ఈ క్ర‌మంలో వారిని చంద్ర‌బాబు త‌న మంత్రి వ‌ర్గంలోకి తీసుకుంటే తాను కూడా టీడీపీ నుంచి వ‌చ్చిన వారికి మంత్రి ప‌ద‌వులు ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యార‌ట కేసీఆర్. ఇలా చేస్తే.. ఎలాంటి త‌ల‌నొప్పులూ వ‌చ్చే ఛాన్స్ ఉండ‌ద‌ని భావిస్తున్నారు. ఈ మేర‌కు ఇప్పుడు పెద్ద ఎత్తున క‌థ‌నాలు వ‌స్తున్నాయి. బాబు సిగ్న‌ల్ ఇస్తే..(అంటే.. ఏపీలో సైకిలెక్కిన వైకాపా ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వులు ఇస్తే).. తెలంగాణ‌లో ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌, గుత్తాల‌కు కేసీఆర్ మంత్రి ప‌ద‌వులు ఇచ్చే ఛాన్స్ ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదీ క‌థ‌!

సైరస్ మిస్ట్రీకి టాటా టాటా

25/10/2016: నాలుగేళ్ల క్రితం ఏరికోరి తెచ్చుకున్నారు. చిన్నవయసులోనే వ్యాపార మెలకువలు వంట బట్టించుకున్నాడని కితాబిచ్చారు. ఓ రకంగా ఆయన ఎంపిక దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగంలో ఆశ్చర్యం కలిగించింది. ఎంత ఆకస్మికంగా టాటా ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టారో.. అంతే సడెన్ గా ఉద్వాసకూ గురయ్యారు. ఆయన మరెవరో కాదు సైరస్ మిస్త్రీ. సైరస్ మిస్త్రీ అల్లాటప్పా వ్యక్తి కాదు. దేశంలోనే రియల్ ఎస్టేట్ దిగ్జం షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ వారసుడు. టాటా గ్రూప్ లో అతిపెద్ద వ్యక్తిగత వాటాదారు షాపూర్జీనే. అలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తిని ఉన్నపళంగా తొలగించారంటే చాలా బలమైన కారణం ఉండాలి. కారణం ఏంటో పైకి చెప్పకపోయినా.. ఇన్ సైడర్లు మాత్రం షాకింగ్ నిజాలు చెబుతున్నారు. ఎప్పటిలాగే ప్రశాంతంగా టాటా సన్స్ బోర్డు మీటింగ్ మొదలైంది. అజెండాలో కూడా పెట్టకుండా ఉన్నట్లుండి సైరస్ మిస్త్రీ ఉద్వాసన అంశాన్ని అదనపు అంశంగా చేర్చారు. దీనిపై షాక్ కు గురైన సైరస్.. నిబంధనల ప్రకారం 15 రోజుల ముందే నోటీసివ్వాలన్నారు. అయితే న్యాయసలహా తీసుకున్నామన్న బోర్డు.. ఆ కాపీ ఇవ్వడానికి కూడా నిరాకరించింది. సైరస్ ను తప్పించి, నాలుగు నెలలకు తాత్కాలిక సారథిగా రతన్ టాటాను నియమించింది. సైరస్ ను తప్పించడానికి ఆయన టాటాయేతర వ్యక్తి కావడమే ప్రధాన కారణమని ఊహాగానాలు హల్చల్ చేసినా అది నిజం కాదంటున్నారు ఇన్ సైడర్లు. కేవలం సైరస్ చూస్తున్న రెండు కంపెనీలు లాభాల్లో ఉండి, మిగతా గ్రూప్ కంపెనీలు నష్టాల్లో ఉండటం, లాభాపేక్ష రహిత వ్యాపారాల విక్రయించాలన్న మిస్త్రీ నిర్ణయాలే కొంపముంచాయని చెబుతున్నారు. ఏడాది నుంచి రతన్, సైరస్ మధ్య ఉన్న విభేదాలు.. ఇప్పుడు మిస్ట్రీ ఉద్వాసనతో ఓ రూపం తీసుకున్నాయి. అయితే తన తొలగింపుపై బాంబే హైకోర్టుకు వెళ్లాలని సైరస్ నిర్ణయించడంతో.. ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

ఏపీ భవనాలన్నీ మాకు అప్పగించండి - గవర్నర్‌కు మంత్రివర్గ తీర్మానాన్ని అందించిన సీఎం కేసీఆర్

24/10/2016: హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు, సచివాలయంలోని బ్లాక్‌లను తిరిగి తెలంగాణకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం చేసిన తీర్మాన ప్రతిని గవర్నర్‌కు స్వయంగా అందజేశారు. సచివాలయంలో ఏపీకి కేటాయించిన బ్లాకుల్లో ఆ ప్రభుత్వ కార్యకలాపాలు నడవట్లేదని, ఇప్పటికే ఏపీ కార్యాలయాలు అమరావతికి తరలి వెళ్లాయని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో తమ అవసరాల దృష్ట్యా వృథాగా ఉంటున్న ఏపీ బ్లాక్‌లను తమకు అప్పగించాలని కోరారు. ఏపీ అధీనంలో ఉన్న అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం ముఖ్యమంత్రి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో అరగంట సేపు భేటీ అయ్యారు. కొత్త సచివాలయ నిర్మాణం, పాత సచివాలయం తరలింపు అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. సమ్మతించిన ఏపీ సర్కారు!: సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలను తెలంగాణకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం కూడా సంకేతాలిచ్చింది. దీంతో గవర్నర్ ఆమోదించిన వెంటనే ఈ ప్రక్రియ మొదలవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెలాఖరున కొత్త సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఏపీ ఆఫీసుల అప్పగింతకు ఆమోదం లభించడం లాంఛనమే అన్నట్లు తెలంగాణ ప్రభుత్వం రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసుకుంది. దీపావళి తర్వాత నవంబర్ మొదటి వారంలో సచివాలయంలో ఉన్న సీఎం కార్యాలయంతో పాటు మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌వోడీల ఆఫీసులన్నీ తాత్కాలిక భవనాలకు తరలిస్తారు. వారం రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని, ఆ తర్వాత కూల్చివేత పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. నవంబర్ 26న కొత్త సచివాలయం నిర్మాణానికి పునాది రాయి వేసేందుకు ముహూర్తం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా పనులను వేగవంతం చేసేందుకు సంబంధిత అధికారు లు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం

24/10/2016: కాలిఫోర్నియా: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం కాసినో నుంచి తిరిగొస్తున్న ఓ టూరిస్ట్‌ బస్సు... ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13మంది ప్రాణాలు కోల్పోగా, 31మంది గాయపడ్డారు. గాయపడినవారిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా కాలిఫోర్నియాలోని పామ్‌ స్ప్రింగ్స్‌ వద్ద ఈ ఘటన జరిగింది. బస్సు డ్రైవర్‌ కూడా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా... ట్రక్కు డ్రైవర్‌ గాయలతో బయటపడ్డాడు. యూఎస్ఏ హాలీడేకు చెందిన ఈ టూరిస్ట్‌ బస్సు... రెడ్ ఎర్త్‌ కాసినో నుంచి లాస్‌ ఏంజెల్స్‌ తిరిగెళ్తూ ఉండగా ప్రమాదం సంభవించింది. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బస్సు అద్దాలు పగులగొట్టి, నిచ్చెనల సాయంతో బాధితులను రక్షించారు. మృతుల్లో ఎక్కువమంది బస్సు ముందు భాగంలో కూర్చున్నవారే. ప్రాణాలు కోల్పోయినవారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ దుర్ఘటనపై రవాణా భద్రతా సంస్థ విచారణ చేపట్టింది.

‘దటీజ్ మోడీ’ అంటూ సంబరపడిపోతున్న దంపతులు..! ఇంతకీ మోడీ ఏం చేశారంటే..

24/10/2016: నరేంద్ర మోడీ. ఆ పేరే ఓ సంచలనం. ప్రస్తుత రాజకీయ నాయకుల్లో అత్యంత జనాదరణ కలిగిన లీడర్ ఎవరంటే మోడీ అని చెప్పకతప్పదు. అంతలా ఆయన జనాల్లో తనదైన ముద్రను వేశారు. ఆయన చేసే పనులు కూడా అలానే ఉంటాయి. సాధారణ ప్రజల్లో చెరగని ముద్ర వేస్తాయి. తాజాగా మరోసారి మోడీ తన స్పెషాలిటీని చాటుకున్నారు. ఓ దంపతుల కోరిక తీర్చి వారిలో ఆనందాన్ని నింపారు. వివరాల్లోకి వెళితే… సాక్ష్యాత్తు ప్రధానమంత్రే ఓ దంపతులకు పుట్టిన చిన్నారికి నామకరణం చేశారు. ఆ పాపకి స్వయంగా పేరు పెట్టి శుభాకంక్షలు తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్‌ జిల్లాకు చెందిన భరత్‌ సింగ్‌, విభా దంపతులకు గత ఆగస్టు 13న పాప పుట్టింది. సాధారణంగా ఏ ఇంట్లో అయినా పిల్లలు పుడితే… వారికి కుటుంబసభ్యులో, బంధువులో పేరు పెడతారు. కానీ, ఆ దంపతులు మాత్రం తమకు పుట్టిన చిన్నారికి ఏకంగా ప్రధానే పేరు పెట్టాలని తలచారు. అనుకున్నదే తడవుగా ‘మా పాపకి పేరు పెట్టండి’ అంటూ ప్రధానికి లేఖ రాశారు. వారి ముచ్చట కాదనలేకపోయిన ప్రధాని మోడీ స్వయంగా ఆ జంటకు ఫోన్ చేసి.. ఆ చిన్నారికి ఒక మంచి పేరు పెట్టారు. భరత్ సింగ్ దంపతులకు మోడీ అంటే చాలా అభిమానం. దీంతో తమ పాపకు మోడీనే పేరు పెట్టాలని నిర్ణయించిన వారు చిన్నారి పుట్టిన రోజే ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు. ఆ తర్వాత వారి పనిలో నిమగ్నమయ్యారు. ఇంతలో ఊహించని విధంగా.. సరిగ్గా వారం రోజుల తర్వాత ఆగస్టు 20న భరత్‌ సింగ్‌ కు పీఎంవో నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. ‘ప్రధాని మీతో మాట్లాడాలనుకుంటున్నారు’ అని చెప్పడంతో భరత్‌ సింగ్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సాక్షాత్తు ప్రధాని ఓ సామాన్యుడికి ఫోన్ చేయడమా? అంటూ ఎగిరిగంతేశాడు. భరత్‌ తో మాట్లాడిన మోడీ.. అభినందనలు తెలిపారు. దాదాపు రెండున్నర నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడిన మోడీ.. పుట్టిన పాపకు ఆ దంపతులిద్దరి పేర్లలోని మొదటి అక్షరాలు కలిసేలా ‘వైభవి’ అని అని పేరు పెట్టారు. సాక్షాత్తు ప్రధానే ఫోన్‌ చేసి తమ కుమార్తెకు పేరు పెట్టడంతో భరత్‌ దంపతుల ఎంతో సంబరపడ్డారు. ఈ విషయాన్ని గ్రామస్థులకు చెబితే… వాళ్లు నమ్మలేదు. పైగా కహానీలు చెప్పొద్దని అని ఎగతాళి చేశారు. దీంతో ఏ నెంబర్‌ నుంచైతే తనకు ఫోన్‌ కాల్‌ వచ్చిందో ఆ నెంబర్‌ కు మళ్లీ ఫోన్‌ చేసి.. ప్రధాని పేరు పెట్టిన విషయాన్ని లేఖ ద్వారా అందించాలని భరత్ సింగ్ దంపతులు కోరారు. ఈ నేపథ్యంలో స్పందించిన పీఎంవో కార్యాలయం.. ప్రధాని సంతకం చేసిన లేఖను పంపింది.. ఆ లేఖ ఆగస్టు 30న రిజిస్టర్ పోస్ట్ లో చేరింది. ఆ లెటర్ చూశాక గానీ వైభవి తల్లిదండ్రుల మాటలు నమ్మలేదు గ్రామ ప్రజలు. ‘వైభవి కలలను మీరు నిజం చేయండి, ఆమే మీ శక్తి’ అంటూ లేఖ ద్వారా భరత్ సింగ్ దంపతులకు మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ పాపకు నామకరణం చేశారన్న వార్త అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘మోడీ పేరు పెట్టిన పాప‘ అంటూ చిన్నారితో ఉన్న భరత్ సింగ్ దంపతుల ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

‘అన్న’లకు భారీ ఎదురుదెబ్బ.. ఎన్ కౌంటర్ లో 23మంది మృతి..!

24/10/2016: అసలే వారి ప్రాబల్యం తగ్గుతోంది. రాను రాను వీక్ అయిపోతున్నారు. ఇంతలో మరో భారీ ఎన్ కౌంటర్ మావోయిస్టులను కోలుకోలేని దెబ్బతీసింది. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, పోలీసు బలగాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 23మంది మావోయిస్టులు చనిపోయినట్టు సమాచారం. మృతుల్లో ముగ్గురు మావో అగ్రనేతలు ఉన్నట్టు తెలుస్తోంది. గాజర్ల రవి, చలపతి, దయ, రాజన్న, బెంగాల్ సుధీర్, అశోక్, మున్నాలను పోలీసులు గుర్తించారు. మావోయిస్టు అగ్రనేత కొడుకే మున్నా అని సమాచారం. గాజర్ల రవి అలియాస్ ఉదయ్ మల్కన్‌గిరి, కోరాపుట్, విశాఖ ఏరియా కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు. మావోల కాల్పుల్లో ఓ పోలీసు అధికారి గాయపడ్డారు. చనిపోయిన వారిలో స్థానిక గిరిజనులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, సెంట్రల్ కమిటీ సభ్యుడు గాదర్ల అశోక్, మరో అగ్రనేత గణేష్ కాల్పుల నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. ఒడిశా సరిహద్దులోని అటవీప్రాంతం చిత్రకొండ, జెంత్రీ మధ్యలో విశాఖ జిల్లా ముంచుంగిపుట్టి నుంచి బూసుపుట్టి ఏరియాకు 10 కిలోమీటర్ల దూరంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఏవోబీలో మావోయిస్టుల ప్లీనరీ జరుగుతుందన్న పక్కా సమాచారం అందడంతో నిన్న సాయంత్రం ఏపీ పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు అడవిలో 9 కిలోమీటర్లు నడిచివెళ్లారు. సెల్‌ సిగ్నల్స్‌ ను నిలిపివేసిన అనంతరం ఆపరేషన్ ప్రారంభించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు ఎన్‌కౌంటర్ జరిగింది. ఘటనా స్థలంలో నాలుగు ఏకే 47 తుపాకులు, ఏడు ఎస్.ఎల్.ఆర్ లు, 303 రైఫిళ్లు 15, ల్యాండ్‌మైన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను, మావోయిస్టుల మృతదేహాలను హెలికాప్టర్‌ లో మైదాన ప్రాంతానికి తరలిస్తున్నారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఎన్‌కౌంటర్‌తో సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పక్కా సమాచారంతో ఏపీ, ఒడిశా, కేంద్ర బలగాలతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించినట్టు ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. ఇప్పటికే మావోయిస్టుల ప్రాబల్యం తగ్గుతున్న నేపథ్యంలో ఈ ఎన్‌కౌంటర్ మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బగానే చెప్పుకోవచ్చు.

బ్యాంకులపై పాక్ సైబర్ ఎటాక్స్?

22/10/2016: స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ వంటి 19 బ్యాంకుల డెబిట్ కార్డుల సమాచారం అంతర్జాతీయ నేరగాళ్ల చేతికి చిక్కిందనే వార్త ఓ వైపు భయాందోళనకు గురి చేస్తుండగానే, బ్యాంకులకు కేంద్రం మరో హెచ్చరిక చేసింది. బ్యాంకులపై పాక్ సైబర్ నేరగాళ్లు దాడులు జరిపే అవకాశాలున్నాయని, అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర సైబర్ భద్రతా సంస్థ ఓ నోటీసు జారీచేసింది. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే నోడల్ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్-ఇండియా చేసిన హెచ్చరికలతో తాజాగా ఈ నోటీసులు బ్యాంకులకు అందాయి. పాకిస్తాన్కు చెందిన సైబర్ క్రిమినల్స్, బ్యాంకుల సమాచారాన్ని, ఇన్ఫ్రాక్ట్ర్చర్ను టార్గెట్ చేశారని అన్ని బ్యాంకులకు కేంద్ర సైబర్ భద్రతా సంస్థ తెలిపింది. ఈ సైబర్ భద్రతా ఏజెన్సీ, కేంద్ర సెంట్రల్ బ్యాంకు ఆర్బీఐతో కలిసి పనిచేస్తోంది. ఈ గురువారమే భారతీయ బ్యాకింగ్లో అతిపెద్ద భద్రతా ఉల్లంఘన జరిగిందని, ఈ ఉల్లంఘనతో 32 లక్షల అకౌంట్ల డెబిట్ కార్డుల సమచారం నేరగాళ్ల చేతికి వెళ్లిందని తేలింది. డెబిట్ కార్డుల దొంగతనంపై స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ వంటి వివిధ బ్యాంకులకు కేంద్రం నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. దీనిపై పూర్తివివరాలతో కూడిన రిపోర్టును తమకు అందజేయాలని ఐటీ మంత్రిత్వశాఖ బ్యాంకులను ఆదేశించింది. ఈ క్రమంలోనే మరోమారు పాకిస్తాన్ సైబర్ అటాకర్ల నుంచి కూడా బ్యాంకులకు ముప్పు ఉందని, అప్రమత్తంగా ఉండాలని తాజా నోటీసులు జారీచేసింది. ఉడీ ఘటన జరిగిన అనంతరం నెలకొన్న పరిణామాలు నేపథ్యంలో పాకిస్తాన్ భారత్పై సైబర్ అటాక్స్కు పాల్పడుతోంది.

పురుడు పోస్తారనుకుంటే.. ప్రాణాలు తీశారు!

22/10/2016: కొడంగల్ రూరల్: ఓ ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి తల్లీబిడ్డలు బలయ్యారు. పురుడు పోస్తారనుకొని వస్తే.. ఏకంగా ప్రాణాలు తీశారు. ఈ ఘటన శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కోస్గిలో చోటుచేసుకొంది. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం పర్సాపూర్‌కు చెందిన శ్యామప్ప, మల్లమ్మ దంపతుల రెండో కుమార్తె సావిత్రమ్మ(20)ను మహబూబ్‌నగర్ జిల్లా దామరగిద్ద మండలం దేశాయిపల్లికి చెందిన గొల్ల నీలప్పకు ఇచ్చి రెండేళ్ల క్రితం వివాహం చేశారు. గర్భిణి అయిన సావిత్రమ్మను ప్రసవం కోసం తల్లిదండ్రులు కోస్గిలోని బాలాజీ నర్సింగ్ హోంలో గురు వారం రాత్రి చేర్చారు. వైద్యులు అందుబాటులో లేకపోవడం.. పురిటినొప్పులు ఎక్కువై రెండు గంటల పాటు నరకయాతన అనుభవించింది. సాధారణ డెలివరీ చేయడం కోసం నర్సులు చేసిన ప్రయత్నాలు వికటించాయి. చివరకు మగశిశువును బయటికి తీశారు. అప్పటికే శిశువు మృతి చెందాడు. కొద్దిసేపటికి సావిత్రమ్మ కూడా మృతి చెం దిం ది. సావిత్రమ్మ పరిస్థితి విషమంగా ఉం దం టూ ఆస్పత్రి యాజమాన్యం జిల్లా ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌ను సిద్ధం చేసింది. తమపై నింద రాకుండా ఉండేందుకు ప్రయత్నించింది. అప్పటికే సావిత్రమ్మ మృతి చెం దిన విషయం బయటికి పొక్కడంతో మృతురాలి బంధువులు, గ్రామస్తులు ఆస్పత్రి వద్ద పెద్దఎత్తున గుమిగూడారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో యాజమాన్యం ఆస్పత్రికి తాళం వేసి పరారైంది. మృత శిశువును ఆస్పత్రి ఎదు ట ఉంచి బంధువులు ఆందోళనకు దిగారు. నర్సుల చికిత్స వల్లే తల్లీబిడ్డ మృతి.. నైపుణ్యం లేని నర్సుల చికిత్స వల్లే తల్లీబిడ్డ మృతి చెందారని జిల్లా ఉప వైద్యాధికారిణి సౌభాగ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం ఆస్పత్రిలో వివరాలను సేకరించారు. ఆస్పత్రి నిర్వహిస్తున్న పలు రికార్డులను ఆమె తనిఖీ చేశారు. కొన్నింటిని ఆమె తమ వెంట తీసుకెళ్లారు. పోస్టుమార్టం రిపోర్టు, ఆస్పత్రి రికార్డుల పరిశీలనలతో పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు తెలిపారు. రాజీకి పోలీసుల యత్నం ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఘటనపై పోలీ సుల వైఖరిని పలువురు విమర్శించారు. నారాయణపేట సీఐ చంద్రశేఖర్‌రెడ్డి బాధితులు, యాజమాన్యంతో రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. విషయం జిల్లా వైద్య శాఖాధికారులకు తెలియడంతో నాటకీయ పరిణామాల మధ్య మృతురాలి తండ్రి శ్యామప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

పాక్ గూఢచారి పట్టుబడ్డాడు

22/10/2016: పాకిస్తాన్కు గూఢచారిగా వ్యవహరిస్తున్న వారు ఒక్కరినొక్కరుగా పట్టుబడుతున్నారు. ఆగస్టు నెల మొదట్లో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఓ గూఢచారి రాజస్తాన్లో పట్టుబడగా.. నిన్న జమ్మూకశ్మీర్లో సాంబ సెక్టార్లో మరోవ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని దగ్గర్నుంచి రెండు పాకిస్తానీ సిమ్ కార్డులు, భద్రతా దళాలు మోహరించి ఉన్న చిత్రపట్టాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇతని జమ్మూ జిల్లాకు చెందిన అర్నియా ప్రాంత నివాసి బోద్రాజ్గా గుర్తించారు. అతిపెద్ద గూఢచర్య నెట్వర్క్లో ఇతను కూడా ఓ భాగమేమో అనే అనుమానంతో భద్రతా దళాలు విచారణ చేస్తున్నాయి. ఆగస్టులో రాజస్తాన్లో అదుపులోకి తీసుకున్న పాక్ గూఢచారి నుంచి కూడా బోర్డర్ ప్రాంత చిత్ర పటాలు, పలు ఫోటోగ్రాఫ్లను పోలీసులు స్వాధీన పరుచుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం పాక్ గూఢచారిని అరెస్టు చేసిన రోజునే కథువా జిల్లా హిరానగర్ సెక్టార్‌లో భారత్ పోస్టులపై పాకిస్తానీ రేంజర్లు దాడులు జరిపారు. ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్న బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ ఏడుగురు పాకిస్తానీ రేంజర్లను హతమార్చింది. అయితే ఈ దాడిలో ఎవరూ చనిపోలేని పాకిస్తాన్ పేర్కొంటోంది. నిన్న జరిగిన ఈ సంఘటనతో బీఎస్ఎఫ్ పోస్టులపై పాకిస్తాన్ ఎక్కువగా గురిపెట్టినట్టు తెలుస్తోంది. గత నెల కశ్మీర్లోని ఉడీ ఆర్మీ బేస్పై దాడులు జరిపి 19మంది మన జవాన్లను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. వెంటనే పాకిస్తాన్కు షాక్గా నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం నిర్దేశిత దాడులు నిర్వహించింది. 30 నుంచి 50 మంది ఉగ్రవాదులను ఈ దాడిలో చనిపోయినట్టు భారత ఆర్మీ పేర్కొంది. కానీ ఆ దాడులపై పాకిస్తాన్ మళ్లీ దుష్ఫచారమే చేయడం ప్రారంభించింది. అవి అసలు సర్జికల్ స్ట్రైక్సే కావని, తరుచూ సరిహద్దు ప్రాంతాల్లో జరిగే కాల్పులేనని పేర్కొంది.

కెసీఆర్ పై సినిమా తీయడానికి పోటా పోటీ..!

22/10/2016: త్వరలోనే తాను కెసీఆర్ పై సినిమా తీయబోతున్నానంటూ రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. సినిమా పేరును ఆర్.సీ.కే అంటూ కేసీఆర్ పేరును తిరగేసి పెట్టాడు. కెసీఆర్ లోని ఎవరూ చూడని కొత్త కోణాల్ని తాను తెరపై ఆవిష్కరించబోతున్నానని, ఆయన తెలంగాణాకు దీపికా పదుకొనే అందం కలగలిసిన తెలంగాణా బ్రూస్ లీ అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేసి మరీ ప్రకటించాడు. ఇప్పటికే వర్మ చాలా సినిమాల్ని ప్రకటించినా, వాటిలో తెరకెక్కినవి చాలా తక్కువ మాత్రమే. అందువల్ల ఇది ఎప్పుడు తెరకెక్కుతుందో కన్ఫామ్ గా చెప్పలేం కానీ, ఆ ఆలోచనైతే మాత్రం మనోడికి ఉంది అని అర్ధమయ్యేలా చేశాడు. మరోవైపు నిర్మాతలు మథుర శ్రీధర్ రెడ్డి, రాజ్ కందుకూరి కూడా తాము కేసీఆర్ బయోపిక్ తీయబోతున్నామంటూ ప్రకటించడం టాక్ ఆఫ్ తెలంగాణాగా మారింది. పోరాట సమయం నుంచి, ప్రత్యేక రాష్ట్ర సాధన వరకూ కేసీఆర్ చేసిన పోరాటం అందరికీ తెలిసిందే. ఆ కారణంగానే ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ భీభత్సంగా పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఇలాంటి టైమ్ లో ఆయన బయోపిక్ తీస్తే జనాదరణ దక్కడం కన్ఫామ్. ఈ రీజనే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మను, మథుర శ్రీధర్ ను ఆలోచింపచేసింది. అయితే ఈ సినిమా నిజంగానే వీళ్లు తీయాలనుకుంటున్నారా లేక రాజకీయ నాయకులు బినామీలతో ఈ సినిమా తీయించే ప్లాన్ చేస్తున్నారా అన్న దానిపై చర్చ జరుగుతోంది. సినీ సర్కిల్స్, పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే హాట్ టాపిక్.

ఆ ఐదుగురి ఆస్తులతో 18సార్లు ఒలింపిక్స్ నిర్వహించవచ్చట.!

22/10/2016: ముఖేష్ అంబానీ. పరిచయం అక్కర్లేని పేరు. భారత దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్.ఐ.ఎల్)సంస్థ అధిపతి అయిన ముఖేష్ అంబానీ లెక్కలేనంత సంపాదించారు. ఏటేటా ఆయన ఆస్తులు పెరుగుతూనే ఉన్నాయి. అందుకే ఆయన మన భారత్ లోనే సంపన్నుడిగా నిలిచారు. ఈ బిజినెస్ మెన్ మరో ఘనత సాధించారు. వరుసగా తొమ్మిదో ఏడాది కూడా దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో తొలి స్థానంలో నిలిచారు ముఖేష్ అంబానీ. ఇక పోతే ఆయన సంపద ఏకంగా ఓ దేశ జీడీపీతో సమానం కావడం గమనార్హం. 22.7 బిలియన్ డాలర్ల (రూ.లక్షన్నర కోట్లు)తో ఆయన ఈస్టోనియా(ఉత్తర యూరప్ లోని దేశం) జీడీపీతో సమానమైన సంపద కలిగి ఉన్నారని ఫోర్బ్స్ వెల్లడించింది. ఇక రెండో స్థానంలో 16.9బిలియన్‌ డాలర్లతో సన్‌ ఫార్మా అధినేత దిలీప్‌ సంఘ్వీ నిలిచారు. 15.2 బిలియన్‌ డాలర్లతో హిందుజా కుటుంబం మూడో స్థానంలో, 15 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో అజీం ప్రేమ్‌ జీ నిలిచారు. ఇది మొజాంబిక్‌ దేశ స్థూల జాతీయోత్పత్తితో సమానం. 13.90 బిలియన్‌ డాలర్ల ఆస్తితో పల్లోంజీ మిస్త్రీ అయిదో స్థానంలో నిలిచారు. మన దేశంలోని తొలి ఐదుగురు సంపన్నుల ఆస్తి మొత్తం కలిపితే 1,230సార్లు మంగళ్‌ యాన్‌ చేసి రావచ్చట. తొలి అయిదుగురి ఆస్తులు కలిస్తే అది 83.7 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో అయితే రూ.5.59 లక్షల కోట్లు. ఇక వీరి వద్ద ఉన్న మొత్తంతో 18సార్లు రియో ఒలింపిక్స్‌ నిర్వహించవచ్చని ఫోర్బ్స్ పత్రిక తెలిపింది. టాప్ వందమంది భారతీయులతో కూడిన అత్యంత సంపన్నుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో చోటు సంపాదించేందుకు కనీస సంపద 1.25 బిలియన్ డాలర్లను కటాఫ్‌ గా నిర్ణయించింది. గతేడాది ఈ కటాఫ్ 1.1 బిలియన్ డాలర్లుగా ఉంది. 2015లో టాప్ 10లో నిలిచిన కుబేరులే ఈ ఏడాది కూడా అటు ఇటు మార్పులతో నిలిచారు. మొత్తంగా ఈ బిజినెస్ మెన్ల ఆస్తుల వివరాలు వింటుంటే.. కళ్లు తిరిగిపోతున్నాయి కదూ.

తెలంగాణకు తెల్ల రుమాలు ఊపిన చంద్రబాబు

22/10/2016: అనాది కాలం నుంచి తెల్ల జెండాకు ఉన్న అర్థం ఒకటే. అది శాంతి, సంధి ఒప్పందానికి సంకేతం. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు కూడా తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాలకు తెల్ల జెండా కాకపోయినా తెల్ల రుమాలు చూపిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలతో ఏమాత్రం గొడవ పెట్టుకునే ఉద్దేశం తనకు లేదనిఆయన ప్రకటించారు. ఈ మేరకు గవర్నరు నరసింహన్ తో చెప్పారు. విజయవాడలో గవర్నర్ను కలిసిన చంద్రబాబు పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా వీరి మధ్య హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన సచివాలయం భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే అంశంపై చర్చ జరిగింది. భవనాలు అప్పగించేందుకు చంద్రబాబు అంగీకరించినట్టు తెలుస్తోంది. గవర్నర్తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు… పక్క రాష్ట్రంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్తామన్నారు. పొరుగు రాష్ట్రంతో గొడవ పెట్టుకుంటే సమయం వృథా అవుతుందన్నారు. మొదటి నుంచి తాను చాలా స్పష్టంగా ఉన్నానని గొడవల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. అందుకే కేంద్రం హోదా బదులు ప్యాకేజ్ ఇచ్చేందుకు సిద్ధపడగా అందుకు అంగీకరించామన్నారు. తమిళనాడుకు కూడా తెలుగుగంగ ద్వారా నీటిని విడుదల చేస్తామని చంద్రబాబు చెప్పారు. హరీష్ రావు విమర్శలను చంద్రబాబు వద్ద ప్రస్తావించగా రకరకాలుగా మాట్లాడుతుంటారని తనకు ఎవరితోనూ గొడవలు పెట్టుకునే ఉద్దేశం లేదని చెప్పారు. కాగా ఏపీ పర్యటనకు వచ్చిన ఉమ్మడిరాష్ట్రాల గవర్నరుతో చంద్రబాబు గంటన్నరపాటు ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. నదీ జలాలల పంపకం విషయంలో ఘర్షణ వాతావరణం రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఇబ్బందేనన్న మాటకు తాను కట్టుబడి ఉన్నానని సీఎం వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే విషయంపైనా గవర్నర్తో చర్చించినట్లు చంద్రబాబు చెప్పారు. ఈ సందర్భంగా గవర్నరు నెపమంతా మీడియాపై వేసేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదాలు లేవని.. మీడియానే అనవసరపు వివాదాన్ని రేకెత్తిస్తోందని అన్నారు. కాగా చంద్రబాబు, గవర్నరు మధ్య మంత్రివర్గ విస్తరణ అంశం కూడా చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. ఓటుకు నోటు కేసు వంటి విషయాల్లో దెబ్బతిన్న చంద్రబాబు తెలంగాణతో పూర్తిగా రాజీకే ప్రయత్నిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఈ క్రమంలో ఆయన రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారన్న విమర్శలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తెల్ల రుమాలు ఇప్పుడు చర్చనీయమవుతోంది.

లోకేష్‌కు క‌విత కౌంట‌ర్

22/10/2016: ఈ మాట‌న్న‌ది ఎవ‌రా అని అనుకుంటున్నారా? సాక్షాత్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ గారాల ప‌ట్టి, నిజామాబాద్ ఎంపీ క‌విత‌. ఆమెకేంటి లోకేష్‌ని అంత‌మాట అనే ప‌ని? అని మ‌ళ్లీ ప్ర‌శ్నా.. అయితే, ఇది చ‌ద‌వాల్సిందే. రెండు రోజుల కింద‌ట చంద్ర‌బాబు కుటుంబ ఆస్తులు, అప్పుల వివ‌రాల‌ను టీడీపీ జాతీయ కార్య‌ద‌ర్శి హోదాలో లోకేష్ వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా దేశంలో మేం త‌ప్ప ఎవ‌రూ ప్ర‌తి ఏటా ఆస్తులు ప్ర‌క‌టించుకోవ‌డం లేద‌ని అన్నారు. అంత‌టితో ఆగ‌కుండా .. తెలంగాణలోని కేసీఆర్ ప్ర‌భుత్వం బంగారు తెలంగాణ ధ్యేయంతో రాష్ట్రంలోని 10 జిల్లాల‌ను 31 జిల్లాలుగా విస్త‌రించింది. దీనిపైనా లోకేష్ పొలిటిక‌ల్ కామెంట్ల‌తో విరుచుకుపడ్డారు. జిల్లాల విభ‌జ‌న వెనుక పొలిటిక‌ల్ ప్ర‌యోజ‌నాలు త‌ప్ప మ‌రేమీలేవ‌ని అన్నారు. అయితే, తెలంగాణ స‌హా కేసీఆర్ స‌ర్కారుపై ఈగైనా వాల‌నివ్వ‌ని క‌విత‌.. లోకేష్ కామెంట్ల‌పై ఫైరైపోయారు. గ‌తంలోనూ టీఆర్ ఎస్ ఎన్నిక‌ల గుర్తు కారు డొక్కుద‌ని, పాత‌ప‌డిపోయింద‌ని లోకేష్ చేసిన కామెంట్ల‌పై క‌విత విరుచుకుప‌డ్డారు. పంచ‌రైన సైకిల్ లోకేష్‌దేన‌ని, దానిమీద లోకేష్‌తో పాటు ఒక్క‌రికి త‌ప్ప ఇంకెవ‌రికీ చోటు ఉండ‌ద‌ని, త‌మ ది ఓల్డ్ కారైనా గోల్డ్ అని ఎంత‌మందినైనా ఎక్కించుకుని ర‌య్య‌న దూసుకుపోవ‌డ‌మే దానికి తెలుస‌ని ఆమె ఎద‌రు విమ‌ర్శ‌లు చేశారు. ఇప్పుడు కూడా అదే త‌ర‌హాలో శుక్ర‌వారం హైద‌రాబాద్‌లోని ప్రెస్ క్ల‌బ్‌లో మీడియాతో మాట్లాడిన క‌విత‌.. లోకేష్‌పై స‌టైర్ల‌తో విరుచుకుప‌డ్డారు. ఆస్తుల వివరాల వెల్లడి విషయంలో తమకు ఎవరి సలహాలు అవసరం లేదని ఆమె అన్నారు. చంద్రబాబు నాయుడులా తాము అడ్డగోలుగా సంపాదించలేదని, తాము ఎవరికి లెక్కలు చూపించాలో వారికే లెక్కలు చూపిస్తామని అన్నారు. కొత్త జిల్లాలపై లోకేష్ వ్యాఖ్యలు ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దృష్టి పెడితే బాగుటుందని... ఏపీ పాలన గురించి తాము మాట్లాడితే బాగుండదని కవిత సూచించారు. మ‌హిళ‌ల‌కు మంత్రి వ‌ర్గంలో చోటు ఇవ్వ‌క‌పోయినా.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని మ‌హిళ‌ల‌ను గౌర‌వంగానే చూసుకుంటున్నార‌ని అన్నారు. మొత్తానికి లోకేష్ పాలిటిక్స్ విష‌యంలో కవిత ఏపీకే ప‌రిమితం అవ్వాల‌ని కామెంట్ చేయ‌డం ఆస‌క్తిగా మారింది.

ఉచ్చులో ఇరుక్కుంటున్న పాక్ ప్ర‌ధాని!

21/10/2016: భార‌త్ నిర్వ‌హించిన స‌ర్జిక‌ల్ దాడులు పాకిస్థాన్ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ ప‌ద‌వికే ఎస‌రుపెట్టేలా క‌నిపిస్తున్నాయి. దాడుల అనంత‌రం భార‌త్‌పై పాక్ విరుచుకుప‌డిపోవాల‌ని స‌గ‌టు పాకిస్థానీ కోరుకుంటాడు. కానీ, అందుకు భిన్నంగా ప్ర‌ధాని ష‌రీఫ్ తీరు ఉండ‌టంతో అక్క‌డి ప్ర‌జ‌లు జీర్ణించ‌కోలేక‌పోతున్నారు. ఇంకోప‌క్క‌, ఇమ్రాజ్ ఖాన్ కూడా విమ‌ర్శ‌ల తీవ్ర‌త పెంచేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ష‌రీఫ్‌తోపాటు కుటుంబ స‌భ్యుల‌పై అవినీతి ఆరోప‌ణ‌లు పెరిగిపోయాయి. ఇదే విష‌య‌మై సుప్రీం కోర్టు కూడా నోటీసులు జారీ చేసింది. న‌వాజ్ ష‌రీఫ్ ప్ర‌ధాన‌మంత్రిలో కొన‌సాగేందుకు అన‌ర్హుడు అంటూ ఓ పిటీష‌న్ దాఖ‌లైంది. ఆయ‌న అవినీతి పెరిగిపోయింద‌నీ, కుటుంబ స‌భ్యులు కూడా ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నీ, పాల‌న గాడి త‌ప్పుతోంద‌నీ, ష‌రీఫ్‌పై ప్ర‌జ‌ల్లో భ‌రోసా త‌గ్గిపోతోందంటూ పిటిషన్ దాఖ‌లైంది. అయితే, ఆయ‌న‌తోపాటు కొడుకులూ అల్లుడికి కూడా నోటీసులు జారీ కావ‌డం విశేషం. మొత్తానికి, న‌వాజ్ ష‌రీఫ్‌కు ప‌ద‌వీ గండం చాలా ద‌గ్గ‌ర్లోనే ఉంద‌నే ప‌రిస్థితి పాక్‌లో నెల‌కొంటోంది. పాక్ సైన్యం ఆలోచ‌న‌లకు అనుగుణంగానే పాక్ సుప్రీం కోర్టు ప‌నిచేస్తుంద‌ని అంటారు. ష‌రీఫ్ విష‌యంలో సైన్యం కూడా గుర్రుగా ఉన్న నేప‌థ్యంలో సుప్రీం కోర్టు ద్వారా అత‌డిపై ఒత్తిడి పెంచే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని చెప్పొచ్చు. ప్ర‌స్తుతం న‌వాజ్‌పై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోప‌ణ‌ల‌కు ప‌నామా పేప‌ర్స్ బేస్ అయినా.. అస‌లు కార‌ణం భార‌త్ నిర్వ‌హించిన స‌ర్జిక‌ల్ దాడుల‌ని తెలుస్తూనే ఉంది. నిజానికి, మ‌న ప్ర‌ధాని పాకిస్థాన్ వెళ్లిన‌ప్ప‌టి నుంచే ష‌రీఫ్ మీద పాక్‌లో భార‌త్ వ్యతిరేకులకు ఒళ్లుమండ‌టం మొద‌లైంది. న‌రేంద్ర మోడీ అనూహ్యంగా పాక్ వెళ్ల‌డం, ష‌రీఫ్‌తో క‌ల‌సి మిఠాయిలు పంచుకోవ‌డం, ష‌రీఫ్ త‌ల్లి ఆశీస్సులు తీసుకోవ‌డం.. ఇవ‌న్నీ స‌గ‌టు పాకిస్థానీ జీర్ణించుకోలేనివి క‌దా! భార‌త్‌కు అనుకూలంగా ష‌రీఫ్ వ్య‌వ‌హ‌రిస్తున్నారూ అనే ఒక ఇమేజ్ అక్క‌డే మొద‌లైంది. స‌ర్జిక‌ల్ దాడుల త‌రువాత ఆ అభిప్రాయం మ‌రింత పెరిగింద‌నే చెప్పాలి. పాక్ ఆక్రమిత భూభాగంలోకి భార‌త సైన్యం ప్రవేశించి దాడులు చేసినా కూడా ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ ఎలాంటి చ‌ర్య‌లూ చేప‌ట్ట‌లేద‌న్న అభిప్రాయం పాక్ ప్ర‌జ‌ల్లో బ‌లంగా ఉంది. దీంతోపాటు, పాక్ సైన్యం, ఐ.ఎస్‌.ఐ.లు కూడా ప్ర‌ధానిపై అసంతృప్తితో ఉన్న‌ట్టు బ‌హిరంగంగానే ప్ర‌క‌టిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధానిపై అన‌ర్హ‌త వేటు వేయాలంటూ దాఖ‌లైన పిటీష‌న్‌పై పాక్ సుప్రీం కోర్టు మున్ముందు ఎలా వ్య‌వ‌హ‌రిస్తుందో చూడాలి.

11రోజుల పెళ్లి.. 550 కోట్ల ఖర్చు

21/10/2016: మైనింగ్ మాఫియా స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న గాలి జనార్థన్ రెడ్డి.. కూతురి పెళ్లికి చేస్తున్న ఆర్భాటం చూస్తుంటే ఎవరికైనా కళ్లు తిరగాల్సిందే. గాలి జైల్లో ఉన్న సమయంలో ఆయన టాయిలెట్ కూడా బంగారుమయమని మీడియాలో వస్తే చాలామంది అబ్బా మరీ గ్యాస్ కొడుతున్నారనుకున్నారు. కానీ ఇప్పుడు కూతురి పెళ్లి చేస్తున్న తీరు చూస్తే అది నిజమేనని పిస్తోంది. వరుడు సినిమాలో ఐదురోజుల పెళ్లి చూసే చాలా మంది అబ్బురపడ్డారు. కానీ ఇప్పుడు గాలి కూతురు పెళ్లి దాదాపు 11 రోజుల పాటు జరగబోతోంది. కనీవినీ ఎరుగని రీతిలో ఈ పెళ్లికి 550 కోట్లకు పైగానే ఖర్చు చేయాలని గాలి ప్లాన్ చేశారు. రీసెంట్ గా కూతురి ఎంగేజ్ మెంట్ ఘనంగా చేసిన గాలి.. పెళ్లి ఆహ్వానపత్రిక కూడా వినూత్నంగా డిజైన్ చేశారు. ఎవరూ చేయని విధంగా పెళ్లి పత్రికలో ఎల్ ఈడీ వీడియోతో అందర్నీ ఆహ్వానించారు. గతంలో జీవీకే మనవడు పెళ్లికి 120 కోట్లు ఖర్చైంది. లక్ష్మీ మిట్టల్ కూతురి పెళ్లికి 200 కోట్లు పైగానే ఖర్చైంది. అలాగే సహారా చీఫ్ సుబ్రతారాయ్ కుమారుల పెళ్లికి కూడా 550 కోట్లు ఖర్చైందని మీడియాలో వార్తులు హల్చల్ చేశాయి. ఇప్పుడు వాటన్నిటి తలదన్నే విధంగా తన కూతురు పెళ్లి చేయాలని గాలి డిసైడయ్యారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ తారలంతా పెళ్లికి వస్తున్నారు. ప్రధాన పార్టీల రాజకీయ నేతలంతా వివాహానికి హాజరవుతున్నారు. డైలాగ్ కింగ్ సాయి కుమార్ డైరక్షన్లో పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బెంగళూరులోని మెయిన్ ప్యాలెస్ వేదికగా గాలి కూతురి పెళ్లి జరగనుంది. గాలి జనార్థన్ రెడ్డి కూతురు బ్రహ్మణి వివాహం హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త విక్రం దేవారెడ్డి కుమారుడు రాజీవ్ రెడ్డితో నవంబరు 16వ తేదీన జరగనుంది.

యాదాద్రి బుద్ధుడు

21/10/2016: రాష్ట్ర విభజన జరిగిన తర్వాత యాదగిరిగుట్టకు మహర్దశ పట్టింది. యాదగిరి గుట్టను తిరుమల తరహాలో యాదాద్రిగా తీర్చిదిద్దాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు కొత్తగా యాదాద్రి జిల్లా కూడా ఏర్పాటైంది. అయితే యాదాద్రికి.. హుస్సేన్ సాగర్ బుద్ధుడికి మధ్య చాలా దగ్గరి సంబంధం ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి విగ్రహం ఏర్పాటయ్యేవరకు అందరికీ చార్మినారే గుర్తుచ్చేది. కానీ బుద్ధ విగ్రహం పెట్టిన తర్వాత చార్మినార్ తో పాటు హుస్సేన్ సాగర్ బుద్ధుడు కూడా అందరికీ గుర్తొస్తున్నాడు. హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం తయారైన రాయి యాదాద్రి నుంచే వచ్చింది. అప్పటి ఏపీ సీఎం ఎన్టీఆర్ మదిలో వచ్చిన ఆలోచన మేరకే బుద్ధ విగ్రహం ఏర్పాటైంది. అప్పట్లో బుద్ధుడి విగ్రహాన్ని మలచడానికి మంచి రాయి కోసం అన్వేషించారు. కానీ ఎక్కడా సరైన రాయి దొరకలేదు. అప్పుడు పాత నల్గొండ జిల్లా భువనగిరి మండలం రాయగిరి సమీపంలోని వేంకటేశ్వర గుట్టలో అనువైన రాయి ఉందని గుర్తించారు. రాయిని తొలిచే పని 1985లో మొదలైంది. గుట్ట నుంచి తొలిచిన 17 మీటర్ల పొడవు, 320 టన్నుల భారీ రాయిని హైదరాబాద్ తీసుకొచ్చారు. అప్పట్లో రాయగిరి నుంచి భాగ్యనగరానికి రాయి తీసుకురావడానికి.. 192 చక్రాల భారీ వాహనంపై 1988లో తరలించారు. ప్రముఖ శిల్పి గణపతి స్థపతి ఆధ్వర్యంలో 40 మంది శిల్పులు ఎంతో శ్రమకోర్చి బుద్ధుడి విగ్రహాన్ని తీర్చిదిద్దారు. అలా తయారైన బుద్ధుడ్ని 1992లో హుస్సేన్ సాగర్లో ప్రతిష్ఠించారు. అప్పట్నుంచి హుస్సేన్ సాగర్ బుద్ధుడు హైదరాబాద్ నగరానికి తలమానికంగా మారాడు.

ఫీజు బకాయిలు 530 కోట్లు - ఇంకా విడుదల కాని 2015-16 నిధులు - పాసవుట్ విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వని కళాశాలలు

21/10/2016: హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు భారీగా పేరుకుపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులను ప్రభుత్వం ఇప్పటికీ పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడం, ఇందుకు ప్రతిగా కోర్సులు పూర్తయిన విద్యార్థుల సర్టిఫికెట్లు ఇచ్చేందుకు కాలేజీలు నిరాకరిస్తుండటంతో విద్యార్థులు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. కంపెనీలు ఇం టర్వ్యూలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావా లని పేర్కొంటుండగా కళాశాలల తీరుతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 2015-16 విద్యాసంవత్సరంలో వివిధ సంక్షేమశాఖల్లో రూ.530 కోట్లు రీయింబర్స్‌మెంట్ నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. ట్రెజరీల్లోనే బ్రేక్... పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి 2015-16 వార్షిక సంవత్సరంలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన దాదాపు పూర్తయింది. బ్యాంకు ఖాతాలు సరిపోలక పోవడం, దరఖాస్తుల్లో పొరపాట్లతో దాదాపు 10% దరఖాస్తులు ఇంకా కళాశాలల యూజర్ ఐడీల్లో పెండింగ్‌లో ఉన్నాయి. పరిశీలన పూర్తయిన దరఖాస్తులు సంక్షేమ శాఖ అధికారుల లాగిన్ నుంచి ట్రెజరీ అధికారుల ఖాతాకు బదలాయిం చారు. అనంతరం సంక్షేమాధికారులు దరఖాస్తుల సమర్పణకు టోకెన్ నంబర్లూ పొందారు. ఈ ప్రక్రియ 5 నెలల క్రితమే ముగిసినా... నిధులు ఇప్పటికీ విడుదల కాలేదు. ట్రెజరీల్లో నిధుల విడుదలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో రీయింబర్స్‌మెంట్ విడుదల కాలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఫీజు బకాయిల కోసం ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ఒత్తిడి తీవ్రం చేయడంతో ఒకట్రెండు రోజుల్లో రూ.300 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని సర్కారు ఇటీవల హామీ ఇచ్చింది. ఇందుకు కళాశాలల యాజమాన్యాలు సమ్మతించినప్పటికీ నిధులు ఇప్పటికీ విడుదల కాలేదు. సంక్షేమ శాఖల వారీగా ఫీజు బకాయిలు..(రూ. కోట్లలో) శాఖ బకాయిలు ఎస్సీ 74.50 బీసీ 208.00 ఎస్టీ 82.05 మైనార్టీ 84.15 ఈబీసీ 81.22 వికలాంగ 0.15 మొత్తం 530.07

గ్రూపు-2 దరఖాస్తుల్లో సవరణకు అవకాశం - టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో తిరస్కరణ జాబితా

21/10/2016: హైదరాబాద్: వచ్చే నెల 11, 13 తేదీల్లో గ్రూపు-2 పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తు ఫారాల్లోని తప్పులను ఈనెల 22లోగా సవరించుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. తప్పులు దొర్లిన వారి ప్రతిపాదిత తిరస్కరణ జాబితాను తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొంది. అభ్యర్థుల పేరు, తండ్రి పేరు, ఫొటో, సంతకం, అర్హత వివరాలు, జెండర్ తదితర వివరాల్లో పొరపాట్లు చేసిన వారి పేర్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపింది. వారంతా వాటిని సవరించుకునేందుకు తమ వెబ్‌సైట్‌లో ‘కరెక్ట్ దేర్ డిటేల్స్’ లింక్ సహాయంతో తప్పులను సవరించుకోవాలని సూచించింది.

10 వేల కోట్లతో గురుకులాల అభివృద్ధి

20/10/2016: హైదరాబాద్: ‘‘ఆశ్రమ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు మూడేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తాం. ఈ నిధులతో అన్ని సొసైటీల పరిధిలోని గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు, పూర్తిస్థాయి వసతులు కల్పిస్తాం. అత్యున్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించేలా ఈ పాఠశాలలను తీర్చిదిద్దుతాం’’ అని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. బుధవారం తెలంగాణ పోలీస్ అకాడమీలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే ‘స్కూల్ లీడర్స్ కన్వెన్షన్-2016’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీ టు పీజీ ఉచిత విద్య కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో విస్తృతంగా గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఇప్పటికే 240 ఆశ్రమ పాఠశాలలను ప్రారంభించగా.. వచ్చే ఏడాది మరో 210 పాఠశాలలను అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రస్తుతం అన్ని సొసైటీ పాఠశాలల్లో 4.5 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని చెప్పారు. ఒక్కో పాఠశాలను పూర్తి సౌకర్యాలతో నెలకొల్పేందుకు రూ.20 కోట్లు ఖర్చవుతుందని, ఏడాదిపాటు నిర్వహణకు రూ.3 కోట్లు వెచ్చించాలన్నారు. కొత్త వాటితో కలిపి రాష్ట్రంలో 700 గురుకుల పాఠశాలలను సకల వసతులతో తీర్చిదిద్దేందుకు రూ.10 వేల కోట్లు అవసరమన్నారు. వీటిల్లో పూర్తిస్థాయి ఉద్యోగులను భర్తీ చేస్తామని, ఈ మేరకు 14 వేల ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి కడియం ప్రకటించారు. డిజిటల్ బోధనకు సిద్ధం: గురుకుల పాఠశాలల్లో డిజిటల్ బోధన చేపట్టనున్నట్లు కడియం వివరించారు. ఈ మేరకు డిజిటల్ తరగతుల ఏర్పాటుకు కార్యచరణ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల సొసైటీలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు సొసైటీ లీగ్‌ను ప్రవేశపెడుతున్నామన్నారు. చాలా గురుకులాల్లో ప్రిన్స్‌పాల్స్ స్థానికంగా ఉండడం లేదని కడియం అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలల్లోని పిల్లలను సొంత బిడ్డల్లా చూసుకోవాలని.. పనిచేసే గురుకులంలో ప్రిన్స్‌పల్ కోసం ఏర్పాటు చేసిన క్వార్టర్లో నివాసం ఉండాలని స్పష్టం చేశారు. వార్షిక పరీక్షల్లో విద్యార్థి ఉత్తీర్ణత కాకుంటే అందుకు సదరు ప్రిన్స్‌పాల్ బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో వివిధ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శులు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, లక్ష్మణ్, శేషకుమారి తదితరులు పాల్గొన్నారు.

అమెరికన్ ఓటర్లు రికార్డు బ్రేక్ చేశారు!

20/10/2016: వాషింగ్టన్ : అమెరికా చరిత్రలో మొదటిసారి అధ్యక్ష ఎన్నికల కోసం రికార్డు స్థాయిలో రిజిస్టర్ ఓటర్లు పెరిగారు. 200 మిలియన్లకు పైగా అమెరికన్లు ఈ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు రిజిస్టర్ చేపించుకున్నట్టు డెమొక్రాటిక్ పొలిటికల్ డేటా సంస్థ టార్గెట్స్మార్ట్ తెలిపింది. నేషనల్ రిజిస్ట్రేషన్ ప్రకారం అమెరికా ప్రస్తుతం 200,081,377 మంది రిజిస్ట్రర్ ఓటర్లు కలిగి ఉన్నట్టు టార్గెట్స్మార్ట్ సీఈవో టామ్ బోనియర్ చెప్పారు. గత ఎనిమిదేళ్లలో దాదాపు 50 మిలియన్కు పైగా కొత్త రిజిస్ట్రర్ ఓటర్లు పెరిగినట్టు ఈ డేటాలో వెల్లడైనట్టు జిన్హువా ఏజెన్సీ రిపోర్టు చేసింది. ప్రస్తుత అధ్యక్షుడు ఒరాక్ ఒబామా మొదటిసారి వైట్హోస్కు గెలిచినప్పుడు అంటే 2008లో కేవలం 146.3 మిలియన్ రిజిస్ట్రర్ ఓటర్లు మాత్రమే అమెరికా కలిగి ఉంది. డెమొక్రాటిక్కు మద్దతుగా 42.6 శాతం కొత్త ఓటర్లు రిజిస్ట్రర్ చేయించుకోగా, రిపబ్లికన్ పార్టీకి మద్దతు తెలుపుతూ 29 శాతం, స్వతంత్ర అభ్యర్థులకు సపోర్టుగా మరో 28.4శాతం కొత్త ఓటర్లు నమోదైనట్టు టార్గెట్స్మార్ట్ వెల్లడించింది. మొదటిసారి 200 మిలియన్ ఓటర్ల మైలురాయిని చేధించామని బోనియర్ తెలిపారు. వీరిలో ఎక్కువ శాతం మంది డెమొక్రాటిక్ అభ్యర్థికి మొగ్గుచూపుతున్నట్టు ఆయన తెలిపారు. అయితే ఈ ఏడాది మొదట్లో ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం 2016 ఎలక్టోరేట్ ఎక్కువగా జాతి, సాంస్కృతిపరంగా వైవిధ్యభరితంగా సాగనుందని పేర్కొంది. 31 శాతం ఓట్లు అల్పసంఖ్యాక వర్గాల నుంచి వస్తాయని ఆ సంస్థ అంచనావేసింది. 2012లో ఆ ఓట్లు 21శాతంగా ఉన్నాయి. అయితే నవంబర్ 8న జరిగే ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరుగుతుందా అనేది చెప్పడంలో కొంచెం కష్టతరమైతున్నట్టు పేర్కొంది. అధ్యక్ష ఎన్నికల చరిత్రలో 2008లో మొదటిసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. 131.4 మిలియన్ ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారు. అదే 2012కి వచ్చేసరికి ఓటర్లు శాతం 129.2 మిలియన్లకు పడిపోయింది. రెండు దశాబ్దాల క్రితం వరకు కనీసం 200 మిలయన్ ఓటింగ్ వయసు జనాభానే అమెరికాలో లేరు. కానీ ప్రస్తుతం రిజిస్ట్రర్ యూజర్లే 200 మిలియన్ గరిష్ట స్థాయికు ఎగబాకారు.

కాపాడబోయి కాల్చిచంపిన పోలీసులు

20/10/2016: మతిస్థిమితం సరిగా లేని తన భార్య ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందని, పరిస్థితులను అదుపులోకి తేవడానికి వెంటనే మెంటల్ హెల్త్ ఆఫీసర్లను సౌత్ ఆస్టిన్ అపార్ట్మెంట్ కు పంపించాలంటూ ఓ భర్త పోలీసులకు ఫోన్ చేశాడు. అక్కడికి వెళ్లిన పోలీసులు కాపాడబోయి కాల్చిచంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీకా షేగ్ జేస్టర్ అనే మహిళకు మతిస్థిమితం సరిగా లేదు. ఆమె భర్త, జేస్టర్ కలిసి సమ్మర్ వాలే అపార్ట్ మెంట్స్ లో నివాసముంటున్నారు. గతకొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేక ఇబ్బందిపడుతున్న జేస్టర్ ప్రమాదకర పరిస్థితులో ఉందంటూ ఆమె భర్త పోలీసులకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన ఆ వ్యక్తి అపార్ట్ మెంట్ కు మెంటల్ హెల్త్ ఆఫీసర్ తో పాటు, ఇద్దరు పోలీసులు వెళ్లారు. తన భార్య గన్ పట్టుకుని ఉందని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని ఆయన వారికి సూచించాడు. పరిస్థితిని తమ ఆధీనంలోకి తేవడానికి మెంటల్ హెల్త్ ఆఫీసర్, ఇతర ఇద్దరు ఆఫీసర్లు తమ వ్యూహాలను మార్చారు. కానీ వారిని గుర్తించిన ఆ మహిళ వారిపై గన్ను గురిపెట్టింది. తనను షూట్ చేయమని, చంపమని గొడవచేసింది. తుపాకీని ఆమె చేతుల్లోంచి తీసేయడానికి శతవిధాల ప్రయత్నించిన పోలీసులు చివరికి వారికి తెలియకుండానే ఎన్కౌంటర్ చేశారు. గన్తో దగ్గరికొస్తున్న ఆమెపై పోలీసులు కాల్పులు జరిపారు. కిందపడిన ఆమె తీవ్రంగా గాయపడింది. గన్ పట్టుకుని పరుగెడుతున్న ఆమెను నిరాయుధారులుగా మార్చాబోయే క్రమంలో పలుమార్లు షూట్ చేయాల్సి వచ్చింది. తీవ్ర గాయాలు పాలైన జేస్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. అయితే ఈ ఘటనపై తీవ్ర చర్చ రేగుతోంది. దురదృష్టకరంగా పౌరులను కనీసం 762 సార్లు కాల్చిచంపుతున్నారని వాషింగ్టన్ పోస్ట్ అనాలిసిస్ పేర్కొంది. మానసిక ఆరోగ్యం బాగాలేని వారినే ఎక్కువగా చంపుతున్నట్టు పేర్కొంది. 2016లో ఈ దురదృష్టకరమైన షూటింగ్స్, 179 మంది మతిస్థిమితం లేని వారిపైనా జరిగినట్టు తేల్చింది. మతిస్థిమితం కోల్పోయిన వారిపై ఎలా ప్రవర్తించాలో తెలియకే పోలీసులు ఇలా ప్రవర్తిస్తున్నారని, సరియైన ట్రైనింగ్ ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఈ రిపోర్టు గుర్తించింది.

దూసుకుపోయిన హిల్లరీ...

20/10/2016: లాస్ వెగాస్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనే సందిగ్ధంలో ఉన్న ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేసే బిగ్ డిబేట్లలో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ దూసుకుపోయింది. గంటన్నర పాటు ఆవేశకావేశాలు, వాదప్రతివాదాలు, వ్యక్తిగత విమర్శలు, ఎత్తిపొడుపులు, వ్యంగ్య వ్యాఖ్యలు, భావోద్వేగాలు, భిన్న హావభావాలతో రసవత్తరంగా సాగిన మూడు బిగ్ డిబేట్‌లలో హిల్లరీ, రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. సీఎన్‌ఎన్/ఓఆర్‌సీ సర్వే వెల్లడించిన ఫలితాల ప్రకారం ► తొలి చర్చలో హిల్లరీ విజయం సాధించారని 62% ఓటర్లు పేర్కొనగా, 27% మాత్రం ట్రంప్‌దే విజయమని తెలిపారు. ► రెండో బిగ్ డిబేట్లో హిల్లరీకి 57 శాతం, ట్రంప్‌కు 34 శాతం మద్దతు పలికారు. ► మూడో బిగ్ డిబేట్లో హిల్లరీకి 52 శాతం, ట్రంప్కు 39శాతంమద్దతు పలికారు. నవంబర్ 8న ఓటర్లు ఎలక్టర్స్‌ను ఎన్నుకుంటే, డిసెంబర్‌లో ఎలక్టర్స్.. అధ్యక్ష అభ్యర్థులకు ఓటు వేస్తారు. 2017 జనవరి ప్రథమార్ధంలో కాంగ్రెస్.. ఎలక్టర్స్ ఓట్లను లెక్కించి, అధికారికంగా గెలిచిన అభ్యర్థుల (అధ్యక్ష, ఉపాధ్యక్ష) పేర్లను ప్రకటిస్తుంది. కానీ, వాస్తవానికి నవంబర్ 8న అభ్యర్థుల జయాపజయాలు తెలిసిపోతాయి. 2017, జనవరి 20న అమెరికా 45వ అధ్యక్ష, 48వ ఉపాధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేస్తారు.

కొంపముంచిన కేంద్రం - నీటిని నాలుగు రాష్ట్రాలకు పంచాలన్న రాష్ట్ర విజ్ఞప్తి బుట్టదాఖలు

20/10/2016: హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపిణీలో జరిగిన అన్యాయాన్ని సవరించాలని రెండున్నరేళ్లుగా తెలంగాణ విజ్ఞపి చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేసింది. కృష్ణా జలాల పునఃకేటాయింపుల అవసరాన్ని నొక్కి చెబుతూ 2014లో కేంద్రానికి విన్నవించుకున్నా స్పందించ లేదు. అంతర్‌రాష్ట్ర నదీ వివాదాల చట్టం మేరకు ఏ రాష్ట్రమైన ఫిర్యాదు చేసిన ఏడాదిలో పరిష్కారం చూపాలని.. లేకుంటే అవే అంశాలతో ట్రిబ్యునల్‌కు సిఫార్సు చేయాలని స్పష్టంగా ఉన్నా అలాంటి చర్యలేవీ తీసుకోలేదు. రెండేళ్ల కిందటే మొర తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే 2014 జూలై 14న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. కృష్ణా జలాల కేటాయింపుల్లో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలు, పంపకాల్లో అసమానతలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం ఉన్నా నీటి కేటాయింపులు కేవలం 35 శాతం ఉన్నాయి. తెలంగాణలోని 62.5 శాతం ఆయకట్టు ప్రాంతాన్ని లెక్కలోకి తీసుకుంటే కేటాయింపులు ఏమాత్రం సరిపోవు. ఏపీలో పరీవాహక ప్రాంతం 31.5 శాతం, ఆయకట్టు 37.5 శాతం ఉన్నా మొత్తం జలాల్లో 60 శాతానికి పైగా నీటి కేటాయింపులు జరిపారు. మొత్తం జలాల్లో ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 298.96 టీఎంసీల నీటిని కేటాయించారు. పరీవాహకం, ఆయకట్టును లెక్కలోకి తీసుకుంటే తమకు కేటాయింపులు పెరగాలని తెలంగాణ కోరింది. ఇదే సమయంలో నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టాకు అవసరానికి మించి నీటి కేటాయింపులు జరిపారని, గతంలో జరిగిన ఒప్పందాల మేరకు తెలంగాణలోని ఆర్డీఎస్‌కు, రాయలసీమలోని సుంకే శులకు సమాన కేటాయింపులు జరపాల్సి ఉంది. అయినా ఆర్డీఎస్‌కు 12 టీఎంసీలు కేటాయించి, సుంకేశులకు 39 టీఎంసీలు కేటాయించారని వివరించింది. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులకు 77 టీఎంసీల నీటి కేటాయింపులు చేయాలన్నా ట్రిబ్యునల్ పట్టించుకోలేదని, దీంతో పునఃసమీక్ష చేసి కేటాయింపులు జరపాలని, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని అభ్యర్థించింది. రాష్ట్రం చేసిన అభ్యర్థనపై సెక్షన్(4) ప్రకారం కేంద్రం ఏడాదిలోగా స్పందించాల్సి ఉన్నా కేంద్రం మిన్నకుండిపోయింది. పైగా నీటి కేటాయింపుల వివాదం ఏపీ, తెలంగాణకు మాత్రమే పరిమితం చేయాలంటూ ట్రిబ్యునల్‌కు అఫిడవిట్ ఇచ్చింది. రాజకీయ ఒత్తిళ్లూ కారణమే.. కృష్ణా నదీ జలాల్లో పునఃకేటాయింపులు జరపరాదని కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం కృష్ణా పునఃపంపకాలను వ్యతిరేకించగా.. ఇక కర్ణాటక నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న అనంతకుమార్, సదానందగౌడలు కేంద్రం వద్ద విస్తృత లాబీయింగ్ చేశారు. దీనికి తోడు కేంద్ర జల వనరుల శాఖలో మహారాష్ట్రకే చెందిన గంగవార్ అనే అధికారి జాయింట్ కమిషనర్‌గా ఉండటం, కేంద్రం తరఫున వాదనలు వినిపిస్తున్న ఖాద్రి అనే న్యాయవాది సైతం మహారాష్ట్రకు చెందినవారే కావడం.. ఇవన్నీ కేంద్ర నిర్ణయాన్ని ప్రభావితం చేశాయని రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు.

మాజీ క్రికెటర్ సిద్ధూకు కాంగ్రెస్ భారీ ఆఫర్

20/10/2016: జలంధర్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆవాజ్-ఏ-పంజాబ్ వ్యవస్థాపకుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూకు కాంగ్రెస్ నుంచి భారీ ఆఫర్ వచ్చిందన్న వార్త అక్కడ సంచలనమైంది. సిద్దూ కాంగ్రెస్ పార్టీకి మద్ధతు తెలిపితే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఆయన సన్నిహితులు మీడియాకు తెలిపారు. అయితే కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ మాత్రం ఈ విషయంపై కాస్త అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనూ కాంగ్రెస్ లో చేరాలని వచ్చిన ఆఫర్ ను సిద్ధూ తిరస్కరించగా, తాజాగా డిప్యూటీ సీఎం పోస్ట్ అంటూ ఆయనకు మళ్లీ ఆఫర్ వచ్చింది. సిద్ధూ తమ పార్టీకి మద్ధతు ఇవ్వడం కాదు ఏకంగా ఆయన నెలకొల్పిన ఆవాజ్-ఏ-పంజాబ్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా అమరిందర్ సింగ్ పేరు పరిశీలించినా, ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆవాజ్-ఏ-పంజాబ్ తో ఆమ్ ఆద్మీ పార్టీ సంప్రదింపులు జరుపుతోందని ఊహగానాలు వస్తున్న నేపథ్యంలో సిద్ధూ అక్కడ భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. ఉత్తరప్రదేశ్ తో పోల్చితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ లోనే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో సిద్ధూను ఎలాగైనా తమ పార్టీకి మద్దతిచ్చేలా చేసుకోవడంతో పాటు డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు.

పట్టుబడ్డ 44 మంది లష్కరే ముష్కరులేనా?

19/10/2016: శ్రీనగర్: ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా పట్టణంలో ఆర్మీ, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా మొదటిసారి పెద్ద ఎత్తున కార్డెన్ సెర్చ్ నిర్వహించింది. గంటలపాటు సాగిన ఈ దాడుల్లో పలు ఇండ్ల నుంచి పెద్ద ఎత్తున పెట్రోల్ బాంబులు, పాకిస్థాన్, చైనా జాతీయ జెండాలు లభించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలు 44 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నాయి. కాగా, ప్రస్తుతం ఆ యువకులను విచారిస్తోన్న బారాముల్లా పోలీసులకు పాకిస్థానీ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా హెచ్చరికలు జారీచేసింది. ప్రతీకారం తప్పదని ఉగ్రవాదులు బెదిరించే ప్రయత్నం చేసినట్లు బారాముల్లా పోలీసులు మీడియాకు తెలిపారు. బారాముల్లా చరిత్రలోనే మొదటిసారిగా సోమవారం రాత్రి భద్రతా బలగాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. ఖ్వాజీ హమన, గనాయి హమన్, తవీద్ గంజ్, జామియా సహా 10 కీలకమైన ప్రాంతాల్లో ప్రతి ఇంటినీ జల్లెడపట్టాయి. దాదాపు 700 ఇళ్లల్లో సోదాలు చేశామని, పెట్రోల్ బాంబులు, పాక్, చైనా జెండాలు స్వాధీనం చేసుకున్నామని, 44 మందిని అదుపులోకి తీసుకున్నామని రక్షణ శాఖ అధికార ప్రతినిధి మనీశ్ కుమార్ చెప్పారు. పెల్లెట్ దెబ్బలు తిన్న ఆందోళనకారులను కూడా పరామర్శించినట్లు చెప్పారు. లష్కరే హెచ్చరికల నేపథ్యంలో 44 మంది యువకులను విచారిస్తున్న ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆ యువకులు నిజంగా ఉగ్రవాదులేనా? లేక సాధారణ పౌరులా అన్నది తెలియాల్సిఉంది.

సౌదీ ప్రిన్స్ కు మరణశిక్ష

19/10/2016: సౌదీ చరిత్రలోనే తొలిసారి ఓ యువరాజుకు మరణశిక్ష అమలుచేశారు. టర్కీ బిన్ సౌద్ అల్ కబీర్ అనే సౌదీ యువరాజు తోటి సౌదీని అకారణంగా చంపినందుకు గాను అతనికి రియాద్లో మరణశిక్ష విధించారు. 2012లో తన మిత్రుడైన అదిల్ అల్-మహ్మద్తో ఘర్షణ జరిగిన అనంతరం యువరాజు ఆగ్రహంతో అతణ్ణి కాల్చిచంపాడని అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇలాంటి కఠిన నిర్ణయాన్ని తీసుకున్నామని పేర్కొంది. అయితే ఆ యువరాజుకు మరణశిక్ష ఎలా విధించారో తెలియరాలేదు. కత్తితో శిరచ్ఛేదనం చేసి సౌదీ యువరాజుకు మరణశిక్ష అమలుచేశారని తెలుస్తోంది. రాజ కుటుంబసభ్యుడికి మరణశిక్ష అమలుచేయడం సౌదీ అరేబియాలోనే ఓ అరుదైన ఘటనగా నిల్చింది. ఇలాంటి ఓ ప్రముఖ కేసులలో ఫైసల్ బిన్ ముసైద్ అల్ సౌద్ కూడా తన అంకుల్ కింగ్ ఫైసల్ను 1975లో హత్య చేసిన ఘటన ఒకటి. కాగ, ఈ ఏడాదిలో ఇప్పటికే ఆ దేశంలో మరణశిక్షకు గురైనా వారి సంఖ్య వందల్లో ఉన్నట్టు సౌదీ అరేబియా చెబుతోంది.

జాతీయ కబడ్డీ ఆటగాడి భార్య ఆత్మహత్య

19/10/2016: న్యూఢిల్లీ: జాతీయ కబడ్డీ ఆటగాడు రోహిత్‌ కుమార్ చిల్లర్‌ భార్య లలిత సోమవారం రాత్రి పడమర జిల్లా అశోక్‌ మొహల్లా నంగ్లోయ్‌ ప్రాంతంలోని తన తండ్రి నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఒంటరిగా ఉండటంతో పాటు భర్తతో విభేదాల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. ఆమె రాసిన ఆత్మహత్య లేఖలో బలవంతంగా ఒంటరిగా ఉండటంతో పాటు, ఇటీవల నగరంలో జరిగిన కబడ్డీ ప్రీమియర్‌ లీగ్‌ సందర్భంగా ఆటగాడైన తన భర్త రోహిత్‌ను చూసేందుకు వెళ్లగా జరిగిన పరిణామాలకు అసంతృప్తితో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ (డీసీపీ) విజయ్‌ కుమార్‌ తెలిపారు. గతేడాది మార్చిలో లలిత.. చిల్లర్‌ను రెండో వివాహం చేసుకుంది. అయితే ఆమె ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోంది. లేఖలో తన భర్త ఆనందం కోసమే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె పేర్కొంది. సమాచారాన్ని రోహిత్‌కు తెలియజేయగా, ఆయన ముంబైలో ఉన్నాడని డీసీపీ పేర్కొన్నారు.

పాక్ పై దాడికి భారీ క్షిపణులు రెడీ!

19/10/2016: న్యూఢిల్లీ : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేదికగా రక్షణ రంగంలో భారత్, రష్యా కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో ఇరు దేశాలు కలిసి ప్రమాదకరమైన క్షిపణులను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. పాక్పై దాడిచేయడానికి అవసరమైన 600 కిలోమీటర్ల ప్లస్ రేంజ్లోని తర్వాతి తరం బ్రహ్మోస్ భారీ క్షిపణిలను రష్యా సహకారంతో భారత్ సిద్ధం చేస్తోంది. న్యూఢిల్లీ, మాస్కో ఇరు నగరాలు సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేస్తున్నాయి. కచ్చితమైన టార్గెట్లో ఈ క్షిపణులు దాడులు చేయనున్నాయి. పాకిస్తాన్లో ఏ ప్రాంతంలోనైనా దాడిచేసే శక్తి ప్రస్తుతం తయారుచేసే క్షిపణులకు ఉంటుంది. ఈ ఏడాది జూన్లో అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థ(ఎంటీసీఆర్)లో న్యూఢిల్లీ భాగమైంది. ఎంటీసీఆర్లో భాగమైన తర్వాత రష్యా, భారత్లు సంయుక్తంగా తయారుచేసే అతిపెద్ధ బ్రహ్మోస్ క్షిపణిని ఇదే, భారత్కూ ఇదే మొదటి అత్యంత ముఖ్యమైన ప్రయోజనం. పర్వత ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద స్థావారాలను ధ్వంసం చేయగలిగే శక్తి బ్రహ్మోస్కు ఉంటుంది. ప్రస్తుతం రూపొందుతున్న బ్రహ్మోస్ క్షిపణులన్నీ 300కిలోమీటర్ల రేంజ్లోనివే. పాకిస్తాన్ లోపలికి చొచ్చుకునిపోయి లక్షిత దాడులు చేయడానికి ఇవి కొంచెం కష్టతరంగా మారుతున్నాయి. దీంతో తర్వాతి తరం బ్రహ్మోస్ క్షిపణుల తయారీకిను భారత్ పూనుకుంది. తర్వాతి తరం బ్రహ్మోస్తో పోలిస్తే ఎక్కువ రేంజ్లోని బాలిస్టిక్ క్షిపణులను భారత్ ఇప్పటికే కలిగిఉంది. కానీ బ్రహ్మోస్ మాత్రమే నిర్ధేశిత లక్ష్యాలను విజయవంతంగా కూల్చేయగలవు. గోవాలో జరిగిన ద్వైపాక్షిక సమిట్లో భారత్, రష్యాలకు రక్షణ ఒప్పందాలపై కీలకమైన ఒప్పందాలు జరిగినట్టు తెలిసింది. ఈ ఒప్పందాల్లో భాగంగా ఇరు దేశాలు క్షిపణుల భారీ డీల్స్నే కుదుర్చుకున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా వెల్లడించారు. బ్రహ్మోస్ క్షిపణులను మరింత అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. ఐదో తరం ఎయిర్క్రాప్ట్ల తయారీకి ఇరుదేశాలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. ఉడీ ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ దేశాల మధ్య ఏర్పడిన సరిహద్దు ప్రకంపనాలతో ఆ దేశానికి భారత్ గట్టి షాకే ఇస్తోంది. ఉగ్రవాదాన్ని ఏరివేసే క్రమంలో పాకిస్తాన్తో యుద్ధం వచ్చినా తాము సిద్ధమేనంటూ సిగ్నల్స్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఈ భారత్ భారీ క్షిపణుల తయారుచేస్తోంది.

ఏపీ ఆఫీసులు ఖాళీ చేయాలి - గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన సీఎం కేసీఆర్

18/10/2016: హైదరాబాద్: కొత్త సచివాలయం నిర్మాణంపై గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చర్చించారు. కొత్త సచివాలయాన్ని ప్రస్తుతమున్న చోటే నిర్మించే ఆలోచనను ఆయనతో పంచుకున్నారు. సోమవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో ఆయన దాదాపు అరగంటసేపు సమావేశమయ్యారు. సచివాలయ నిర్మాణంతో పాటు భూ సేకరణ చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్‌పైనా ఈ సందర్భంగా చర్చ జరిగినట్టు తెలిసింది. కొత్త జిల్లాల ఏర్పాటు, పాలన సౌలభ్యానికి వీలుగా ప్రభుత్వం చేపట్టిన పునర్వ్యవస్థీకరణకు ప్రజల నుంచి వచ్చిన స్పందన తదితరాలపైనా చర్చ జరిగింది. కొత్త సచివాలయ నిర్మాణానికి నవంబర్‌లో పునాది రాయి వేయాలని సీఎం భావిస్తున్నారు. దాంతో సచివాలయంలోని కార్యాలయాలన్నిటినీ తాత్కాలికంగా మరో చోటికి తరలించటం అనివార్యమైంది. ఇదే ప్రాంగణంలో ఏపీకి చెందిన కార్యాలయాలు కూడా ఉన్నాయి. కొత్త నిర్మాణానికి వీలుగా వాటిని సైతం ఖాళీ చేయించాలని, వాటికి తాత్కాలికంగా మరో చోట వసతి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాకపోతే ఇది విభజనతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశం కావటంతో ముందస్తుగా విషయాన్ని గవర్నర్‌కు సీఎం నివేదించినట్లు తెలుస్తోంది. సచివాలయంలో ఉన్న భవనాలను ఖాళీ చేయాలని, ప్రత్యామ్నాయ భవనాలను సమకూరుస్తామని ప్రతిపాదిస్తూతెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఏపీ సీఎస్‌కు లేఖ రాసింది. దీంతోపాటు భూ సేకరణకు సంబంధించి ప్రస్తుతమున్న జీవోలకు బదులు చట్టం తేవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రివర్గం ఆమోదంతో ఆర్డినెన్స్ రూపంలో ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. గవర్నర్‌తో భేటీలో ఈ అంశమూ చర్చకు వచ్చినట్టు తెలిసింది. ప్రత్యామ్నాయ భవనాల పరిశీలన సచివాలయంలోని కార్యాలయాలను తాత్కాలికంగా తరలించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ సోమవారం సచివాలయానికి దగ్గరగా ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవన్‌ను పరిశీలించారు. సీఎం కార్యాలయంతో పాటు కీలక విభాగాలను ఇందులోకి మార్చే అవకాశాలను సమీక్షించారు. దీంతోపాటు అరణ్య భవన్, ఎర్రమంజిల్‌లోని ఆర్ అండ్ బీ కార్యాలయం, జలసౌధ, హిమాయత్‌నగర్‌లోని గృహ నిర్మాణ శాఖ భవన్‌లోకి సంబంధిత శాఖలను తరలించాలని నిర్ణయించారు. మిగతా శాఖల కార్యాలయాలను బీఆర్‌కే భవన్‌లోని ఏయే బ్లాక్‌లకు తరలించాలనే ప్రణాళికను రూపొందిస్తున్నారు.

రోహిత్ వేముల వీడియో బహిర్గతం

18/10/2016: హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో ఆత్మహత్యకు పాల్పడిన పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ వేముల దళితుడేనని అతడి స్నేహితులు స్పష్టం చేశారు. తాను దళితుడినని రోహిత్ స్వయంగా చెప్పుకున్న వీడియోను సోమవారం ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. రోహిత్ దళితుడు అనేందుకు ఆధారాలు లేవని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్‌ఆర్‌డీ) శాఖ నియమించిన ఏక సభ్య కమిషన్ నిర్ధారించిన నేపథ్యంలో ఈ వీడియో బయటపెట్టారు. వీడియోలో ఏముందంటే... 'నా పేరు రోహిత్ వేముల. నేను గుంటూరుకు చెందిన దళితుడిని. అందరికీ జై భీమ్. 2010 నుంచి హెచ్‌సీయూలో విద్యార్థిగా ఉన్నాను. సోషల్ సైన్స్ లో పీహెచ్ డీ చేస్తున్నాను. సోషల్ సైన్స్, సామాజిక అంశాలపై ఉన్న ఆసక్తితో నా సబ్జెక్ట్ ను బయోటెక్నాలజీ నుంచి సోషియాలజీకి మార్చుకున్నాను. నేను జూనియర్ రీసెర్చ ఫెలోషిప్ సాధించాను. సోషల్ సైన్స్ స్ స్కూల్ లో జనరల్ కేటగిరిలో సీటు తెచ్చుకున్నాను. నాతో పాటు ఐదుగురు దళిత విద్యార్థులను సస్పెండ్ చేయాలని యూనివర్సిటీ నిర్ణయించింది. మమ్మల్ని హాస్టల్ నుంచి బయటకు గెంటివేశారు. క్యాంపస్ లోని బహిరంగ ప్రదేశాలు, హాస్టల్ పరిసరాలు, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద మేము కనబడితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని మాకు పంపిన నోటీసుల్లో యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. నేను రోజుకూలీ చేసుకునే కార్మికుడి కొడుకును. మా అమ్మ నన్ను పెంచింది' రోహత్ దళితుడు అనేందుకు ఈ వీడియో సాక్షమని అతడి స్నేహితుడు, అంబేద్కర్ విద్యార్థి సంఘం సభ్యుడు మున్నా సాన్నాకీ అన్నారు. గతవారం ఈ వీడియోను కనుగొన్నామని చెప్పారు. రోహిత్ కులంపై తలెత్తున్న పశ్నలకు సమాధానంగా ఈ వీడియోకు బయటకు విడుదల చేశామన్నారు.

ఐఫోన్7లో మనకు తెలియని మరో కొత్త ఫీచర్!

18/10/2016: న్యూయార్క్ : మీరు కొత్తగా కొనుకున్న ఐఫోన్7లో హోమ్ బటన్ పనిచేయడం లేదా..? అయితే ఏమాత్రం ఆందోళన పడకండి. దానికి ఓ పరిష్కారం ఉందట. ఓ వర్చ్యువల్ బటన్ను(దాగిఉన్న హోమ్ బటన్) ఆపిల్ సంస్థ ఐఫోన్7లో పొందుపరిచిందట. ఫిజికల్ హోమ్ బటన్ పనిచేయడం ఆగిపోయినప్పుడు, వెంటనే ఈ వర్చ్యువల్ బటన్ ఆన్ అయిపోతుందట. అయితే ఈ వర్చ్యువల్ హోమ్ బటన్ ఎక్కడ ఉంటుందా అనేదే సందేహమా.. ఈ బటన్ను ఐఫోన్7 ఫోన్ల స్క్రీన్ కింద భాగంలో ఆ సంస్థ అమర్చిందని ఆపిల్-ట్రాకింగ్ వెబ్సైట్ మ్యాక్రూమర్స్ వెల్లడించింది. ఐఫోన్7 హోమ్ బటన్ను ఈ ఏడాదే కొత్తగా రీడిజైన్ చేశారు. ఈ కొత్త హోమ్ బటన్ ఫింగర్ప్రింట్ సెన్సార్, అదనపు ఒత్తిడితో దీన్ని ఆన్ చేయవచ్చు. బటన్ను యూజర్లు నొక్కినప్పుడు ఇది వైబ్రేట్ అవుతుంది. అదేవిధంగా ఆ బటన్ యాక్టివేట్ అయినట్టు యూజర్లకు వెంటనే తెలిసిపోతుందని ఫార్చ్యూన్ రిపోర్టు చేసింది.ఈ ఫీచర్ టెక్నికల్గా దాగిఉంటుందని, ఫిజికట్ బటన్ పనిచేయనప్పుడు, ఇది ఆన్ అవుతుందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. పాత పద్ధతులకు స్వస్తి చెబుతూ హోమ్ బటన్లో మార్పులు తీసుకురావాలని ఆపిల్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఐఫోన్ నుంచి తర్వాత రాబోతున్న గ్లాస్ వేరియంట్ల కోసం హోమ్ బటన్లో ఆపిల్ మార్పులు తెస్తున్నట్టు సమాచారం. చిన్నచిన్నగా ఫిజికల్ హోమ్ బటన్ల వాడకాన్ని ఆపిల్ సంస్థ తొలగిస్తుందని టాక్.

‘దేవాదాయం’.. ఇక పోలీసు అధీనం! - ఆలయాల్లో అక్రమాల అడ్డుకట్టకే..

18/10/2016: హైదరాబాద్: దేవాదాయం.. ఇక పోలీసుల అధీనం కానుంది. దేవాలయాల్లో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా దేవాదాయశాఖను పోలీసు విజిలెన్స్ పరిధిలోకి తెచ్చేదిశగా అడుగులు వేస్తోంది. దేవాదాయ శాఖకు ప్రత్యేక విజిలెన్స్ విభాగమున్నా, సంబంధిత అధికారులు కమిషనర్ కార్యాలయానికే పరిమితం కావటం, నామమాత్రంగా తని ఖీలు జరుపుతూ బాధ్యులపై చర్యలు తీసుకోకపోతుండటంతో అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. స్వామివారి ప్రసాదం సరుకులను, భక్తులిచ్చిన కైంకర్యాలను కూడా స్వాహా చేసేస్తున్నారు. దీంతో పోలీసు విజిలెన్స్ ద్వారా తనిఖీ చేయిస్తేనే పరిస్థితి మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుండటంతో దీనిపై మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఆక్రమణల తొలగింపునూ పోలీసు పర్యవేక్షణలో చేపట్టేవిధంగా నిబంధనలు మార్చడంపై సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ నెల 27న జరిగే మంత్రివర్గ ఉప సంఘం భేటీలో చర్చించాల్సిన అంశాలపై దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సోమవారం ప్రభుత్వ సలహాదారు రమణాచారి, దేవాదాయశాఖ కార్యదర్శి శివశంకర్, ఆర్‌జేసీలు శ్రీనివాసరావు, కృష్ణవేణిలతో చర్చించారు. వేతన నిధికి రూ.102 కోట్లు అవసరం ఆలయ ఉద్యోగులు, అర్చకులకు వేతనాలు చెల్లించేందుకు ఏర్పాటు చేసే కేంద్రనిధికి రూ.102 కోట్లు అవసరమవుతాయన్న అంచనాకు వచ్చి అధికారులు మంత్రి ముందు లెక్కలుంచారు. ఆలయ సిబ్బంది పెంపు తదితర అంశాలనూ ఎజెండాలో ఉంచాలని నిర్ణయించారు.

రాజకీయ లబ్ధి కోసమే జిల్లాల విభజన - చాడ

17/10/2016: న్యూఢిల్లీ: రాజకీయ లబ్ధి కోస మే ప్రభుత్వం జిల్లాలను విభజించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. విభజించి పాలించే రాజకీయాలను కేసీఆర్ అవలంబిస్తున్నారన్నారు. ఢిల్లీలోని సీపీఐ కేంద్ర కార్యాలయంలో రెండు రోజులపాటు జరిగిన జాతీయ కార్యవ ర్గ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, ప్రతిపక్షాలను దెబ్బతీసే కుట్రలో భాగంగానే జిల్లాలను విభజించారన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా జిల్లాలను ఏర్పాటు చేయడంవల్ల ఉపయోగమేంటని ప్రశ్నించా రు. మాటలు ఎక్కువ చేతలు తక్కువ అన్నట్లు కేసీఆర్ పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని కేవలం ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారని, ఎక్కడా మంజూరు చేయడం లేదని విమర్శించారు.

అంతరిక్షంలో చైనా పాగా - చరిత్రాత్మక ప్రయోగం

17/10/2016: బీజింగ్: సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించే దిశగా చైనా కీలక ముందడుగు వేసింది. గోబీ ఎడారిలోని జిక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి సోమవారం ఉదయం మానవ సహిత షెంజో-1 స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షనౌకను విజయవంతంగా ప్రయోగించింది. తద్వారా జింగ్ హైపింగ్(50), చెండ్ డాంగ్(37) అనే ఇద్దరు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపింది. లాంగ్ మార్చ్-2ఎఫ్ వాహక రాకెట్ ద్వారా కక్షలోకి ప్రవేశించే ఈ ఇద్దరు వ్యోమగాములు..24 గంటల తర్వాత చైనా సొంత అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్-2కు చేరుకుంటారు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ అంతరిక్ష కేంద్రంలో 30 రోజులు ఉండనున్న జింగ్, డాంగ్ లు రకరకాల ప్రయోగాలు చేయనున్నారు. ఈ చరిత్రాత్మక ప్రయోగం ద్వారా చైనా.. మానవసహిత అంతరిక్ష పరిశోధన చేపట్టిన మూడో దేశంగా నిలిచింది. ఇంతకు ముందు ఆ జాబితాలో అమెరికా, రష్యాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం మనుగడ ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) మరో ఏడేళ్లలో.. అంటే 2024 నాటికి రిటైర్ కానుంది. అమెరికా, రష్యా, కెనడా, జపాన్, 11 దేశాల యురోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా నిర్మించిన ఐఎస్ఎస్ కు దీటుగా కొత్త కేంద్రాన్ని నిర్మించాలనుకున్న చైనా.. 2011లో తియాంగాగ్-1 అంతరిక్ష కేంద్రాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. గత నెలలో(సెప్టెంబర్ 15న) తియాంగాగ్- 2 కేంద్రాన్ని కూడా ఏర్పాటుచేసుకుంది. సోమవారం నాటి ప్రయోగంలో అంతరిక్షంలోకి వెళ్లిన ఇద్దరు వ్యోమగాములు తియాంగ్-2కు చేరుకుంటారు. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో నిర్ణీత కక్ష్యలో పరిభ్రమించే ఈ ప్రయోగశాలలో సాగు,ప్రాథమిక చికిత్స, ఇతర ప్రయోగాలు చేపట్టనున్నారు. 2022 నాటికి (కనీసం 10 ఏళ్లు పనిచేయగల) పూర్తిస్థాయిలో పనిచేసే అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనున్నారు. అక్కడి నుంచి మార్స్, మూన్ లకు సంబంధించి అనేక పరిశోధనలు చేస్తారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రస్తుతం భారత్ కు వచ్చిన చైనై అధ్యక్షుడు జిన్ పింగ్ స్పేస్ మిషన్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన సైంటిస్టులకు అభినందనలు తెలిపారు. తమ దేశం చేపట్టిన అంతరిక్ష ప్రయోగాల్లో దీనికొక మైలురాయిగా అభివర్ణించారు. ఈ మేరకు చైనా సెంట్రల్ మిలటరీ కమిషన్(సీఎం సీ) ముఖ్య అధికారి చాంగ్ లాంగ్ అధ్యక్షుడి సందేశాన్ని చదివి వినిపించారు. ఇద్దరు వ్యోమగాముల్లో జింగ్ హైపింగ్ కు ఇప్పటికే పలుమార్లు అంతరిక్షయానం చేసిన అనుభవం ఉండగా, చెండ్ గాండ్ కు మాత్రం ఇదే మొదటి ప్రయాణం. ప్రమాదకరమే అయినా అంతరిక్షంలో ప్రయోగాలు నిర్వహించడానికి ఉవ్విళ్లూరుతున్నట్లు చెప్పారాయన. ఇక ఐఎస్ఎస్ స్థానంలో అమెరికా, రష్యా, జపాన్, కెనడా, యురోపియన్ దేశాలు నిర్మించతలపెట్టిన ఐఎస్ఎస్2.0పై ఇంకా స్పష్టతరావాల్సిఉంది.

పాకిస్థాన్ లో 27 మంది దుర్మరణం

17/10/2016: ఇస్లామాబాద్: పాకిస్థాన్ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 27 మంది దుర్మరణం చెందారు. 65 మంది గాయపడ్డారు. పంజాబ్ ప్రావిన్స్ రెండు బస్సులు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రహీం యార్ ఖాన్ జిల్లాలోని ఖాన్పూర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. కరాచీ నుంచి బాహల్పూర్ కు వెళుతున్న బస్సు, ఫైసలాబాద్ నుంచి సాదిఖాబాద్ కు వెళుతున్న పరస్పరం ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చెల్లాచెదరుగా పడిన మృతదేహాలు, క్షతగాత్రుల ఆక్రందనలతో ఘటనా స్థలంగా బీతావహంగా ఉందని రహీం యార్ ఖాన్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు.

ట్రంప్ పార్టీ కార్యాలయంపై బాంబు దాడి

17/10/2016: వాషింగ్టన్: మరో 22 రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో 'రాజకీయ ఉగ్రవాదం'గా పరిగణిస్తోన్న దుశ్చర్య అమెరికాలో కలకలం రేపింది. అధ్యక్ష స్థానం కోసం పోటీపడుతోన్న డోనాల్డ్ ట్రంప్ ప్రాతినిథ్యం వహిస్తోన్న రిపబ్లికన్ పార్టీ కార్యాలయంపై శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు బాంబు దాడి చేశారు. ఉత్తర కరోలినాలోని రిపబ్లికన్ పార్టీ ఆఫీసుపై గుర్తు తెలియని దుండగులు బాంబు దాడి జరిపారని, కిటికీ గుండా ఆఫీసులోపలికి బాంబులు విరిసారని, పేలుడు ధాటికి ఆఫీసులోని ఫర్నీచర్ తోపాటు ప్రచార సామాగ్రి కూడా కాలిపోయిందని ప్రకటించిన పోలీసులు.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు. ఘటనా స్థలానికి అతి సమీపంలోని ఓ మూసి ఉన్న షెట్టర్ పై 'నాజీ రిపబ్లికన్లారా.. ఇక్కడి నుంచి వెళ్లిపొండి. లేకుంటే..' అని రాసిఉన్నట్లు పోలీసులు చెప్పారు.

‘‘కేసీఆర్’’ ఇంటి గృహప్రవేశం ముహుర్తం ఫిక్స్

17/10/2016: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇల్లు కట్టుకుంటున్నారా? ఎక్కడా? అలాంటి సమాచారం ఇప్పటివరకూ లేదే? అలాంటిది ఏకంగా గృహప్రవేశం వరకూ వెళ్లిపోయారే? లాంటి ప్రశ్నలు అక్కర్లేదు. ఎందుకంటే.. ప్రస్తుతానికి కేసీఆర్ ఇల్లే కానీ.. ఎప్పటికీ కాదన్నది అసలు విషయం. మరి.. అలాంటప్పుడు కేసీఆర్ ఇల్లు అని ఎలా అంటారన్న డౌట్ రావొచ్చు. దానికి ఒక రీజన్ ఉంది. ఇప్పటికే బ్రహ్మాండమైన వసతులతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అధికారిక నివాసం ఉంది. అయితే.. కేసీఆర్ కు ఉన్న వాస్తు నమ్మకాల కారణంగా.. ఆ ఇంట్లో ఉండటం ఆయనకు సుతారం ఇష్టం లేదు. ఈ నేపథ్యంలో ఇంటిని మార్చేందుకు ఆయన చాలానే ప్రయత్నాలు చేశారు. కానీ.. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో.. ఇక లాభం లేదనుకొని కొత్తగా ఇంటినే కట్టించేశారు. బేగంపేటలో ఐఏఎస్ భవనాలు ఖాళీ చేయించి మరీ.. 8.9 ఎకరాల స్థలంలో భారీ భవంతిని నిర్మించేందుకు అనుమతులు ఇచ్చేశారు. భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ భవనాన్ని ఈ ఏడాది మార్చి 5న శంకుస్థాపన చేశారు. యుద్ధప్రాతిపదికన నిర్మాణం చేస్తున్న ఈ ఇంటి పని దాదాపుగా పూర్తి అయ్యింది. మొదట్లో ఈ ఇంటిని దసరా రోజున ప్రారంభించాలని అనుకున్నారు. అయితే.. పనులు మిగిలిపోవటం.. దసరా రోజున కొత్త జిల్లాల ఏర్పాటు ఉండటంతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. తాజాగా.. ఈ ఇంటి గృహప్రవేశానికి సంబంధించిన ముహుర్తాన్ని డిసైడ్ చేశారు. వచ్చే నెల 24న సీఎం అధికార నివాసంలో గృహప్రవేశాన్ని నిర్ణయించారు. ఇల్లు కమ్ ఆఫీసు రెండూ ఉండే ఈ భవంతి మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఒకేసారి వెయ్యి మందితో కలిసి మీటింగ్ పెట్టుకునే సామర్థ్యం దీని సొంతం. అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న ఈ ఇంటి పనులు చివరికి వచ్చేసినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఫినిషింగ్ టచ్ లు ఇస్తున్న ఈ ఇంటిని వచ్చే నెల రెండో వారానికి మొత్తంగా పూర్తి చేస్తారన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

భారత్ లో 70 లక్షల ఉద్యోగాలు కట్!

17/10/2016: న్యూఢిల్లీ: ప్రస్తుతం చదువుకుంటున్న, ఇప్పటికే చదువులు పూర్తిచేసిన చాలామంది కల.. జాబ్.. జాబ్.. జాబ్! యువజనం అత్యధికంగా ఉన్న భారతదేశంలో వీళ్లందరికీ ఉద్యోగాలు దొరుకుతాయా? అసలు ఇండియాలో ఇప్పుడున్న ఉద్యోగాలెన్ని? పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతోందా? ఫలానా ఏడాదిలోగా ఆయా రంగాల్లో ఇంతమంది ఉద్యోగులను తొలగించబోతున్నారని ఇటీవల వెలువడుతున్న వార్తలు వాస్తవాలేనా? నిజంగానే ఉద్యోగాలు ఊడిపోతున్నాయా? నిరుద్యోగం కల్లోలం సృష్టించేరోజులు రాబోతున్నాయా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం ఎదురవుతోంది. భారతదేశంలోని (2011 లెక్కల ప్రకారం) 121 కోట్ల జనాభాలో 50 శాతంమంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. సంఘటిత(organised sector), అసంఘటిత (unorganised sector) రంగాలు రెండింటిలో కలిపి ఉద్యోగాల సంఖ్య 47 కోట్లు. అయితే ప్రస్తుతం వ్యవసాయ, రిటైల్, నిర్మాణ రంగాలతోపాటు కాంట్రాక్ట్ ఉద్యోగులు, నిర్మాణ కార్మికులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఆయా రంగాల్లో రోజుకు 550 ఉద్యోగాలు కనుమరుగవుతున్నాయి. ఆ లెక్కన 2050నాటికి దేశంలో 70 లక్షల ఉద్యోగాలు మటుమాయం కానున్నాయి. అప్పటికి (2050నాటికి) మనదేశ జనాభా 180 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఢిల్లీకి చెందిన సామాజిక సంస్థ ప్రహర్ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఇలాంటి కళ్లు చెదిరే విషయాలెన్నో వెలుగులోకి వచ్చాయి. ఆ సంస్థ ఆదివారం తన రిపోర్టును విడుదలచేసింది. లేబర్ బ్యూరో (2016 ప్రారంభంలో) విడుదలచేసిన గణాంకాల ప్రకారం 2015 సంవత్సరంలో దేశంలో కేవలం 1.35 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది. అదే 2013లో 4.19 లక్షలు, 2009లో 9 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ 'దేశంలో పౌరుల జీవన ప్రమాణాలు పెరగాల్సిందిపోయి తరగిపోతున్నాయని, ఉద్యోగాలు సృష్టించే ప్రక్రియ చాలా మందగించింది'అని అద్యయనంలో పేర్కొన్నారు. రోజుకు 550 ఉద్యోగాలు మాయం అవుతున్న విషయాన్ని లేబర్ బ్యూరో కూడా నిర్ధారించిందని ప్రహర్ రిపోర్టు తెలిపింది. కొత్త ఉద్యోగాలు కల్పించుకునే అవకాశం ఉన్న రంగాల్లో తీవ్ర మాంధ్యం ఏర్పడటమే నిరుద్యోగం పెరుగుదలకు కారణమని వివరించింది. 'ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం 1994లో (దేశజనాభాలో) 60 శాతం మంది వ్యవసాయ రంగంలోనే ఉపాధి ఉండేది. కానీ 2013 నాటికి అది 50 శాతానికి పడిపోయింది. వ్యవసాయం తర్వాత 40 శాతం ఉద్యోగాలను కలిగిఉన్న చిన్న, మధ్యతరగతి పరిశ్రమల రంగం.. మల్టీనేషన్ కంపెనీల రాకతో కుదేలయ్యేపరిస్థితి నెలకొంది. పెద్ద పెద్ద పరిశ్రమల్లో ఉద్యోగాలు చేస్తున్నవారి కంటే నాలుగు రెట్లు ఎక్కువ మంది చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో పనిచేస్తుండటం గమనార్హం'అని రిపోర్టులో పేర్కొన్నారు.. ఉద్యోగాల కల్పన కోసం భారత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన 'మేక్ ఇన్ ఇండియా' వారోత్సవాల్లో పలు మల్టీ నేషన్ కంపెనీల నుంచి దాదాపు 225 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించింది. వచ్చే ఐదేళ్లలో ఆయా పెట్టుబడులకు సంబంధించిన క్షేత్రస్థాయి పనులు ప్రారంభం అవుతాయి. కానీ తద్వారా 60 లక్షల కొత్త ఉద్యోగాలైనా లభిస్తాయా లేదా అనేది చెప్పలేమని ప్రహర్ రిపోర్టు పేర్కొంది. భారతదేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పునర్జీవనం కల్పిస్తే తప్ప పరిస్థితులు చక్కబడవని, ఆమేరకు ప్రభుత్వాలు దృష్టిసారించాలని సామాజిక అధ్యయన సంస్థ సూచించింది. 21వ శతాబ్దపు ఇండియాకు స్మార్ట్ సిటీలకన్నా స్మార్ట్ విలేజ్ల అవసరం ఉందని అబిప్రాయపడింది.

అర్ధరాత్రి ఓ ఇంట్లో చోరీకి యత్నించిన ఎస్సై - అదే సమయంలో ఇంటి యజమాని రావడంతో పట్టుబడిన వైనం

15/10/2016: హైదరాబాద్: అతనో పోలీస్.. దొంగలను పట్టుకోవడమేమోగానీ తానే దొంగగా మారాడు. అర్ధరాత్రి సమయంలో ఎవరూ లేని ఓ ఇంట్లో చొరబడ్డాడు. అందినకాడికి దోచుకెళదామనుకున్నాడు. కానీ అడ్డంగా దొరికిపోయాడు. ఇతను ఓ ఎస్సై.. పేరు మహేందర్‌రెడ్డి. ఉగ్రవాది వికారుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసుకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లో ఈ ఎస్సై సభ్యుడు కూడా. కానీ చోరీకి ప్రయత్నించి దొరికిపోయాడు. హైదరాబాద్‌లో మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అల్మాస్‌గూడలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. అల్మాస్‌గూడలోని శ్రీశ్రీహోమ్స్‌లో నివాసం ఉంటున్న శివప్రసాద్ దసరా పండుగ కోసం తమ స్వస్థలం కరీంనగర్‌కు వెళ్లారు. తిరిగి గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత అల్మాస్‌గూడలోని తన ఇంటికి వచ్చారు. అయితే అప్పటికే ఇంటి తాళం పగలగొట్టి ఉంది. సందేహం వచ్చిన శివప్రసాద్.. 100 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో వెంటనే మీర్‌పేట్ సీఐ రంగస్వామి సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. వారు ఇంట్లోకి వెళ్లి మెల్లగా పరిశీలించడం మొదలుపెట్టగా.. మహేందర్‌రెడ్డి ఇంట్లో తాపీగా తిరుగుతూ కనిపించాడు. దీంతో అతడిని పట్టుకుని ప్రశ్నించారు. తొలుత మహేందర్‌రెడ్డి పొంతన లేని సమాధానాలు చెప్పాడు. తాను గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారినని బుకారుుంచాడు. మరి అర్ధరాత్రి ఈ ఇంట్లో ఏం పని అని నిలదీస్తే ఇష్టం వచ్చిన సమాధానాలు చెప్పాడు. దీంతో అతడిని అరెస్టు చేసి.. చోరీకి ప్రయత్నించినట్లుగా కేసు నమోదు చేసినట్లు మీర్‌పేట్ సీఐ రంగస్వామి తెలిపారు. పోలీసులు మహేందర్‌రెడ్డి గురించి ఆరా తీయగా .. అతను ఎస్సై అని తేలింది. గుర్రంగూడకు చెందిన మహేందర్‌రెడ్డి 2009లో ఎస్సైగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఉగ్రవాది వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన సిట్‌లో సభ్యుడిగా ఉన్నాడు.

అసవరమైతే మళ్లీ సర్జికల్ దాడులు చేస్తాం - ఆర్మీ

న్యూఢిల్లీ : ''నియంత్రణ రేఖను మన సైన్యం దాటింది.. అవతలకు వెళ్లి మరీ సర్జికల్ దాడులు నిర్వహించింది.. అవసరమైతే మరోసారి ఇలాంటి దాడులు చేస్తుంది''... అని రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘానికి భారత సైన్యం ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. సర్జికల్ దాడులకు సాక్ష్యాలు చూపించాలంటూ కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ఆర్మీ తొలిసారిగా కొందరు ఎంపీలకు ఈ మొత్తం విషయమై వివరాలు తెలియజేసింది. సర్జికల్ దాడులు జరిగిన తర్వాత డీజీఎంఓ రణ్‌బీర్ సింగ్ మీడియాతో మాట్లాడిన తర్వాత తొలిసారిగా ఈ అంశంపై ఆర్మీ స్పందించడం విశేషం. భారత సైన్యం వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ స్వయంగా వచ్చి.. కమాండో ఆపరేషన్ వివరాలు చెప్పారు. నియంత్రణ రేఖ వెంబడి కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, జమ్ము కశ్మీర్‌లో కొన్ని లక్ష్యాలపై దాడులు చేయనున్నారని స్పష్టమైన సమాచారం వచ్చిన తర్వాతే మన సైన్యం దాడులకు దిగిందన్నారు. సర్జికల్ దాడులు ఒక్కసారే చేస్తున్న చర్య అని, అయితే భవిష్యత్తులో కూడా అవసరమైతే మరోసారి దాడులు చేయాల్సి ఉంటుందని భారతీయ డీజీఎంఓ పాకిస్థానీ డీజీఎంఓకు చెప్పారని కూడా లెఫ్టినెంట్ జనరల్ రావత్ వివరించారు. వాస్తవానికి ఈ భేటీ జరుగుతుందని ఒకసారి.. మళ్లీ వాయిదా పడిందని ఇంకోసారి చెప్పడంతపో కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. దాంతో లెఫ్టినెంట్ జనరల్ రావత్ స్వయంగా వచ్చి.. ఎంపీలను కలిసి మొత్తం వివరాలు వాళ్లకు తెలిపారు. ఆపరేషన్ ఎలా సాగిందో వివరించి, ఉగ్రవాద శిబిరాలకు ఎంత నష్టం వాటిల్లిందో కూడా చెప్పారు. ఆపరేషన్‌లో పాల్గొన్న భారతీయ సైనికులంతా సురక్షితంగా తిరిగి వచ్చారని కూడా తెలిపారు. ఆత్మరక్షణ చర్యలలో భాగంగానే ఈ ఆపరేషన్ నిర్వహించామని అన్నారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ మీద ఉగ్రవాద దాడితో పాటు ఉడీ ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాదులు మరింత రెచ్చిపోతున్నారనే వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయాన్ని సమగ్రంగా చర్చించి.. ఆ తర్వాతే ఈ ఆపరేషన్‌కు ప్లానింగ్ మొత్తం చేశామన్నారు. అయితే సునిశిత వివరాలను మాత్రం ఎంపీలకు తెలియజేయలేదు. లెఫ్టినెంట్ జనరల్ రావత్ చెప్పిన విషయాలతో స్థాయీసంఘంలోని చాలా మంది సభ్యులు సంతృప్తి చెందడంతో.. ఇక ఎవరూ ప్రశ్నలు మాత్రం వేయలేదని సంఘం చైర్మన్ బీసీ ఖండూరీ తెలిపారు.

ఇన్ఫోసిస్ ఉద్యోగులకు దీపావళి ధమాకా

15/10/2016: బెంగళూరు : దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్, అంచనాలు మించి లాభాలు ఆర్జించడంతో తన ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించింది. టాప్ ఎగ్జిక్యూటివ్లకు, అత్యద్భుతంగా పనితీరు కనబరిచిన ఉద్యోగులకు భారీగా పరిహారాలను పెంచేసింది. కీలకమైన మేనేజర్ స్థాయిలో ఉన్న ఎనిమిది మందికి వేతన ప్యాకేజీలను సవరించింది. వీరిలో సీఎఫ్వో ఎండీ రంగనాథ్, ప్రెసిడెంట్స్ మోహిత్ జోషి, సందీప్ డాడ్లానీ, రాజేష్ కే మూర్తి, రవికుమార్ ఎస్, జనరల్ కౌన్సిల్, చీఫ్ కంప్లీయన్స్ ఆఫీసర్ డేవిడ్ కెనెడీ, హెచ్ఆర్ హెడ్ కృష్ణమూర్తి శంకర్, కంపెనీ సెక్రటరీ మణికాంత్ ఏజేఎస్లకు పరిహారాలను పెంచింది. నవంబర్ 1 నుంచి ఈ పరిహారాలు అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. ఎక్కువగా ఈ పరిహారాలు స్టాక్ ఆప్లన్లు, వేరియబుల్ పరిహారాల కింద కంపెనీ మంజూరుచేసింది. సవరించిన వేతనాలు ప్రకారం ఈ ఎనిమిది ఎగ్జిక్యూటివ్లకు స్థిరమైన పరిహారం కింద రూ.24 కోట్లు, వేరియబుల్ పరిహారం కింద రూ.20 కోట్లు వరకు పొందనున్నారు. అదనంగా 2016 ఆర్థిక నిర్వహణలో భాగంగా రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్(ఆర్ఎస్యూలు) 2.45 లక్షలు, స్టాక్ ఆప్షన్లు 5.02 లక్షలు నవంబర్ 1 నుంచి వీరికి కంపెనీ మంజూరు చేయనుంది. అదేవిధంగా 425 మంది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఉద్యోగులకూ 906,275 ఆర్ఎస్యూలు, 943,810 స్టాక్ ఆప్షన్లను కంపెనీ మంజూరుచేసింది. ఇవి నాలుగు సంవత్సరాల వరకు అందుబాటులో ఉంటాయి. ఇక సూర్య సాప్ట్వేర్‌ సిస్టమ్స్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ డి.ఎన్‌. ప్రహ్లాద్‌ను బోర్డులోకి స్వతంత్ర డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈయన ఇన్ఫోసిస్‌ సహవ్యవస్థాపకుడు ఎన్‌.ఆర్‌. నారాయణమూర్తికి దగ్గరి బంధువని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నియామకం అక్టోబరు 14, 2016 నుంచే అమల్లోకి వస్తుంది.

ఘనంగా జిల్లాల సంబురాలు - రాష్ట్రావతరణ తరహాలో జరపాలి.. కేబినెట్ భేటీలో నిర్ణయం - అన్ని జిల్లాలు ఒకే సమయంలో ప్రారంభించాలి

08/10/2016: హైదరాబాద్: రాష్ట్రావతరణ వేడుకల తరహాలో జిల్లాల ఆవిర్భావ సంబురాలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో పాత జిల్లాలు సహా మొత్తం 31 జిల్లాల ఏర్పాటుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. కొత్త జిల్లాల ప్రారంభం, జిల్లాల పేర్లు, కేకే నేతృత్వంలోని హై పవర్ కమిటీ ఇచ్చిన నివేదికపైనే భేటీలో ప్రధాన చర్చ జరిగినట్లు తెలిసింది. కొత్తగా ఏర్పాటు కాబోయే జిల్లాల సరిహద్దుల విషయంలో ఆయా జిల్లాల స్థానిక మంత్రులు ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు. ఒకే ముహూర్తానికి ప్రారంభం కొత్తగా ఏర్పడబోయే జిల్లాలన్నింటినీ ఒకే సమయంలో ప్రారంభించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ఒకట్రెండు రోజుల్లో ముహూర్తాన్ని ఖరారు చేయనున్నారు. కొత్త జిల్లాల్లో మొదట పోలీసు బలగాల పరేడ్, తర్వాత జాతీయ పతాకావిష్కరణ, ఆ వెంటనే కలెక్టర్ కార్యాలయ ప్రారం భం ఉంటుంది. కలెక్టర్లు బాధ్యతలు తీసుకున్న అనంతరం బహిరంగ సభల్లో మంత్రులు పాల్గొననున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనేలా ప్లాన్ చేసుకోవాలని సీఎం సూచించారు. జిల్లాల పరిధిలోని కొత్త రెవెన్యూ డివిజన్లు, మండల కార్యాలయాలు, కొత్త పోలీసు స్టేషన్లను ఎమ్మెల్యేలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నేతలు పాల్గొనాలని, ఈ అంశంపై మంత్రులు తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కొత్త జిల్లాల పరిధిలోకి వెళ్లడానికి కొన్ని మండలాలు, గ్రామాల ప్రజలు నిరాకరిస్తున్నారన్న అంశంపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ఆయా జిల్లాల మంత్రులు కలెక్టర్లతో సమన్వయం చేసుకుని నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. మొత్తంగా 31 జిల్లాలను ఏర్పాటు చేయడానికి ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినా తుది నోటిఫికేషన్‌లో వెల్లడిస్తామని మంత్రులతో సీఎం అన్నారు. మరోవైపు అలంపూర్ నియోజకవర్గాన్ని గద్వాల నియోజకవర్గంలోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అలంపూర్, రాజోలి మండలాలను ప్రతిపాదిత వనపర్తి జిల్లాలో ఉంచాలన్న ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు. మక్తల్, మాగనూరు, కృష్ణా మండలాలను మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంచాలని నిర్ణయించారు. కొత్త జిల్లాల పేర్లపై చర్చ కొత్త జిల్లాల పేర్లపైనా కేబినెట్‌లో చర్చించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్, సురవరం ప్రతాప్‌రెడ్డి, రాజు బహదూర్ వెంకట్రామిరెడ్డి, వెంకటస్వామి, మహేంద్రనాథ్, పీవీ నరసింహారావు, రాజన్న, భద్రాద్రి, జోగులాంబ, కొమురం భీం పేర్ల ఖరారుపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇప్పటికే భూపాలపల్లికి ప్రొఫెసర్ జయశంకర్, సిరిసిల్లకు రాజన్న, గద్వాలకు జోగులాంబ, ఆసిఫాబాద్‌కు కొమురం భీం పేర్లు ఖరారు చేసినట్లు సీఎం ప్రకటించారు. మిగతా జిల్లాల పేర్లపై ఆలోచించాలని, తెలంగాణ ఆత్మగౌరవం, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ప్రముఖుల పేర్లపై ఆలోచనలు చేయాలన్నారు. ఎస్సీ గురుకులాలకు సీఎం కితాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. రెసిడెన్షియల్ స్కూళ్ల విధానంపై పదేళ్ల నుంచి బాగా స్పందన వస్తోందని, రాష్ట్రానికి, గురుకులాలకు ఆదర్శంగా ఉన్న ఎస్సీ గురుకులాలను సీఎం అభినందించారు. మైనార్టీలు అధికంగా ఉన్నచోట ఎక్కువగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి, వాటిని విజయవంతం చేయాలన్న అంశంపై చర్చించారు. మైనారిటీ గురుకులాల కార్యదర్శి షఫీ ఉల్లాను సీఎం అభినందించారు. ఎస్సీ గురుకులాల సక్సెస్ వెనుక ఎస్సీ, ఎస్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కృషి ఎంతో ఉందని, ఆయన బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. అవసరమైతే బీసీ, గురుకులాలను ఆయనకే అప్పజెప్పాలన్న అభిప్రాయాన్ని సీఎం వ్యక్తంచేశారు. బంగారు తెలంగాణ భవిష్యత్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లోనే ఉందని పేర్కొన్నారు.

వీడియోలో అడ్డంగా దొరికేసిన ట్రంప్

08/10/2016: వాషింగ్టన్ : శ్వేతసౌధంలో రాజ్యం ఏలాలన్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఆశలు గల్లంతయ్యేలా ఉన్నాయి. 2005 సంవత్సరంలో ఆయన మహిళల గురించి దారుణంగా కామెంట్ చేసిన వీడియో ఒకటి తాజాగా బయటపడింది. దాంతో ఆయన క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అయినా కూడా ఓటర్లు.. ముఖ్యంగా మహిళలు శాంతించే పరిస్థితి కనిపించడం లేదు. వాషింగ్టన్ పోస్ట్ పత్రిక దాదాపు 11 ఏళ్ల క్రితం నాటి ఆ వీడియోను సంపాదించింది. ''నేను వాళ్లను ఇప్పుడు ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టాను.. కేవలం ముద్దే.. నేను వేచి చూడలేదు. నువ్వు స్టార్ అయినప్పుడు వాళ్లు నిన్ను ముద్దు పెట్టుకోనిస్తారు'' అని ట్రంప్ అన్నట్లు ఆ వీడియోలో ఉంది. మహిళలను ముద్దుపెట్టుకోవడం, అసభ్యంగా తాకడం, వాళ్లతో లైంగిక కార్యకలాపాలలో పాల్గొనడం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ మైక్రోఫోన్‌లో రికార్డయ్యాయి. బిల్లీ బుష్‌తో మాట్లాడుతున్నట్లుగా ఈ వీడియో ఉంది. అయితే ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఒక ప్రైవేటు సంభాషణ అని ట్రంప్ అన్నారు. గోల్ఫ్‌ కోర్స్‌లో బిల్ క్లింటన్ తనకంటే ఇంకా చాలా దారునంగా మాట్లాడారని చెప్పారు. అయితే.. తన మాటలకు ఎవరైనా బాధపడితే మాత్రం తాను క్షమాపణలు కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యలపై ట్రంప్ ప్రత్యర్థి, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తీవ్రంగా మండిపడ్డారు. ''ఇది దారుణాతి దారుణం ఇలాంటి వ్యక్తి అధ్యక్షుడు అవ్వడానికి మనం అంగీకరించలేం'' అని ఆమె చెప్పారు. ఇలాంటి ప్రవర్తన హేయమని డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి సెనేటర్ టిమ్ కైన్ అన్నారు. ట్రంప్ సొంత పార్టీ వాళ్లు కూడా ఆయన క్షమాపణలను ఏమాత్రం అంగీకరించడం లేదు. ఇద్దరు అమ్మాయిలకు తాతగా.. ట్రంప్ మహిళల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసి, ఇప్పుడు క్షమాపణలు చెప్పినా తాను వాటిని అంగీకరించలేనని రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీపడిన జెబ్ బుష్ చెప్పారు. ప్రతినిధుల సభ స్పీకర్ పాల్ ర్యాన్ కూడా మహిళలపై ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహిళలు ఎవరైనా వాళ్ల గురించి ఇలాంటి మాటలు మాట్లాడకూడదని, ఎప్పుడూ అలా చేయకూడదని రిపబ్లికన్ పార్టీ జాతీయ కమిటీ చైర్మన్ రీన్స్ ప్రీబస్ చెప్పారు.

జయలలిత వారసత్వాన్ని ఆశిస్తున్న దీప - అపోలో ఆసుపత్రిలో కలుసుకునే యత్నం

08/10/2016: చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ వారసురాలిని తానేనంటూ తెరపైకి వచ్చారు ఆమె అన్న కుమార్తె దీప. జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తరుణంలో దీప ఉదంతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి జయలలిత స్వయానా సోదరుడైన జయకుమార్, విజయలక్ష్మిని వివాహం చేసుకుని జయలలితతోపాటు పోయెస్‌గార్డెన్‌లో ఉండేవారు. దీప ఆ ఇంట్లోనే పుట్టింది. ఆ తర్వాత అన్నాచెల్లెళ్ల మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో ఆయన పోయెస్ గార్డెన్ వదిలి చెన్నై టీనగర్‌లో కాపురం పెట్టారు. 1995లో జయకుమార్ మృతి చెందగా జయలలిత ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు. 2013లో వదిన చనిపోయినపుడు జయలలిత వెళ్లలేదు. ఇటీవలే జరిగిన మేనకోడలు దీప వివాహానికీ హాజరు కాలేదు. దీంతో వధూవరులే జయలలిత ఇంటికి వెళ్లి ఆశీర్వాదం పొంది వచ్చారు. ఈ సందర్భంగా వధూవరులకు అత్త హోదాలో జయలలిత ఒక ఫ్లాట్‌ను కానుకగా ఇచ్చినట్లు సమాచారం. దీప వైవాహిక జీవితం కొన్నాళ్లు సజావుగా సాగినా ఆ తరువాత భర్తతో విభేదాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. భర్తకు దూరమై, తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా మిగిలిన దీప అత్త జయలలితకు చేరువకావాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటీవల జయ ఇంటి వద్ద గంటసేపు నిరీక్షించినా అనుమతి రాలేదు. ‘పోయెస్‌గార్డెన్‌లోని ఈ ఇల్లు మా నానమ్మ (జయలిత తల్లి సంధ్య) నాకు రాసిచ్చింది. దస్తావేజులు కూడా ఉన్నాయి. మా ఇంట్లోకి వెళ్లనీయకుండా అడ్డుకునేందుకు మీరు ఎవరు?’ అంటూ ఈ సందర్భంగా సెక్యూరిటీ అధికారులతో ఘర్షణ పడ్డారు. మా నాన్న కుటుంబీకులు అత్తకు దగ్గర కావడం గార్డెన్‌లోని కొందరికి ఇష్టం లేదని దీప పరుషవ్యాఖ్యలు కూడా చేసినట్లు తెలిసింది. జయను కలిసేందుకుఆగస్టులో మరోసారి ప్రయత్నించి విఫలమయ్యారు. ‘అత్తా... కలుస్తా’ అంటూ రాసిన ఉత్తరాలకు కూడా బదులు రాలేదు. జయలలితే స్వయంగా తనను రాజకీయ వారసురాలిగా ప్రకటించాలని ఆశిస్తూ దీప తన ప్రయత్నాలు కొనసాగించారు. ఇది గమనించి వారి కుటుంబ మిత్రుడైన ఒక బీజేపీ సీనియర్ నేత దీపను సున్నితంగా వారించారు. వారసత్వంకోసం ఓపిక పట్టాల్సిందిగా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. లండన్‌లో ఉన్నత విద్యనభ్యసించిన దీపకు ఆయన అమెరికాలో ఒక ఉద్యోగం చూసి పెట్టారు. ఇంతలో జయ అనారోగ్యానికి గురై అపోలో ఆసుపత్రిలో చేరడంతో దీప తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆసుపత్రిలో తన అత్తను చూసేందుకు అవకాశం కల్పించాలన్న విజ్ఞప్తులను అన్నాడీఎంకే నేతలు పట్టించుకోలేదు. దీంతో తనకు తానుగానే అపోలో వద్దకు చేరుకుని లోనికి వెళ్లే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. సీఎం జయలలిత సుదీర్ఘకాలం అపోలో ఆసుపత్రిలోనే ఉండాలని అపోలో వైద్యులు ప్రకటించడంతో దీప తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేస్తుందని అంచనా వేస్తున్నారు.

ఉద్రిక్తతలు తొలగించుకోవాలి - కిర్బీ

07/10/2016: వాషింగ్టన్: కశ్మీర్ వివాదం పరిష్కారానికి భారత్, పాకిస్తాన్ రెండు వైపుల నుంచి చొరవచూపాలని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ అభిప్రాయపడ్డారు. ఇరుదేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తపరిస్థితిని తొలగించుకోవాలని తాము కోరుకుంటున్నామని శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. సమస్య పరిష్కారానికి దేశాల మధ్య అర్థవంతమైన చర్చలు జరగాల్సి ఉందని అన్నారు. యూఎస్ కాంగ్రెస్లో పాకస్తాన్ను టెర్రరిస్టు దేశంగా ప్రకటించే బిల్లు ప్రస్తావన గురించి మాట్లాడుతూ.. అలాంటి ప్రత్యేకమైన బిల్లు ఏదీ తాన దృష్టికి రాలేదని కిర్బీ తెలిపారు. అదేసమయంలో చట్టసభల్లో తీసుకోబోయే నిర్ణయాలపై తాను కామెంట్ చేయబోనని అన్నారు. పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతికి చిక్కే అవకాశాలపై పాత్రికేయుల ప్రశ్నకు సమాధానంగా.. పాక్ ఆయుధసంపత్తికి సంబంధించిన భద్రతా వ్యవహారంపై తాను నమ్మకంగా ఉన్నానని కిర్బీ అన్నారు.

‘మహా బతుకమ్మ’కు భారీ ఏర్పాట్లు

07/10/2016: హైదరాబాద్: నగరంలో మహా బతుకమ్మ ఉత్సవాలకు జీహెచ్‌ఎంసీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఎల్బీ స్టేడియం, ట్యాంక్‌ బండ్‌ లపై మహా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించనున్నారు. గురువారం ట్యాంక్‌ బండ్‌ పై ఉత్సవ ఏర్పాట్లను జీహెచ్‌ఎంసి కమిషనర్‌ డా.బి.జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ట్యాంక్‌ బండ్‌పై ఉత్సవ వాతావరణం కనిపించేలా విద్యుత్‌ దీపాలతో ఆకర్షనీయంగా తీర్చిదిద్దుతున్నారు. బతుకమ్మల నిమజ్జనానికి ప్రత్యేకంగా కొలనులను ఏర్పాటుచేస్తున్నారు. ఈనెల 8న ఎల్బీస్టేడియంలో, 9న ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు గాను 1060 మంది పారిశుధ్య కార్మికులు, 95 మంది ఎస్‌ఎఫ్‌ఏలతో కూడిన 11 బతుకమ్మ యాక్షన్‌ టీమ్‌లను ఏర్పాటు చేశారు. గిన్నీస్‌ రికార్డు సాధన లక్ష్యంగా ఎల్బీస్టేడియంలో నిర్వహించే మహా బతుకమ్మతో గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించాలని జీహెచ్‌ఎంసీ యోచిస్తోంది. మహా బతుకమ్మకు నగరంలోని పదివేల మంది స్వయం సహాయక బృందాల మహిళలు హాజరుకానున్నారు. ట్యాంక్‌బండ్‌తో పాటు సరూర్‌నగర్, ఐడీఎల్‌ చెరువు, హస్మత్‌పేట్‌ చెరువు, ప్రగతీనగర్‌ చెరువు, సున్నం చెరువు, గంగారం చెరువు, దుర్గం చెరువు, పల్లెచెరువు, పెద్ద చెరువు తదితర ప్రాంతాల్లో బతుకమ్మ పండుగను నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్‌ పేర్కొన్నారు. బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, రోడ్ల మరమ్మతులు, ప్రత్యేక లైటింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నగరంలోని దాదాపు 100ప్రాంతాల్లో భారీ బతుకమ్మలను ఏర్పాటు చేశా>రు. బతుకమ్మ పండుగ ఔనత్యాన్ని తెలిపే హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. నగరం వివిధ మతాలు, సాంస్కృతి సాంప్రదాయాలకు నిలయమని, నగర ఔనత్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిఒక్కరూ సహకరించాలని కమిషనర్‌ నగరవాసులను సూచించారు. నిమజ్జనానికి ప్రత్యేక కొలనులు నగరంలో గణేష్‌ విగ్రహాల నిమజ్జనానికి గాను ప్రత్యేకంగా నిర్మించిన కొలనులను బతుకమ్మల నిమజ్జనానికి ఉపయోగించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించినట్లు కమిషనర్‌ తెలిపారు. హుస్సేన్ సాగర్‌ జలవిహార్‌ సమీపంలోని నిమజ్జన కొలను వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. బతుకమ్మల నిమజ్జనానికి కొలనును స్వచ్ఛమైన నీటితో నింపాలని, కొలను చుట్టూ బతుకమ్మలు అడే విధంగా మైదానాన్ని చదును చేయడంతో పాటు లైటింగ్, మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్, అడిషనల్‌ కమిషనర్‌ రవికిరణ్, శంకరయ్య, చీఫ్‌ ఇంజనీర్‌ సుభాష్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

పాక్ ప్రభుత్వ సైట్లపై భారత హ్యాకర్ల సైబర్ స్ట్రైక్స్

07/10/2016: న్యూఢిల్లీ : భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్‌తో విరుచుకుపడితే.. తాము సైబర్ స్ట్రైక్స్‌తో విధ్వంసం సృష్టిస్తామంటున్నారు భారత హ్యాకర్లు. పాకిస్థానీ ప్రభుత్వ నెట్‌వర్క్‌లోకి సమర్థంగా ప్రవేశించిన హ్యాకర్లు వాళ్ల కంప్యూటర్లు, డేటా మొత్తాన్ని లాక్ చేసేస్తున్నారు. దాంతో ఏం చేయాలో తెలియక పాక్ సైబర్ నిపుణులు తల పట్టుకుంటున్నారు. చివరకు తమ కంప్యూటర్లను అన్‌లాక్ చేస్తే భారీ మొత్తం ఇస్తామని భారత హ్యాకర్లకు వాళ్లు ఆఫర్లు ఇచ్చినా.. దేశభక్తి మెండుగా ఉన్న ఈ హ్యాకర్లు ససేమిరా అంటూ వాళ్ల ఆఫర్లను తిరస్కరించారు. ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన తర్వాత ఇటీవల పాకిస్థానీ హ్యాకర్లు కొందరు భారతీయ సైట్లలో కొన్నింటిని హ్యాక్ చేసి, వాటిలో తమ దేశభక్తి గీతాలను పోస్ట్ చేయడంతో భారతీయ హ్యాకర్లకు ఒళ్లు మండింది. పాక్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు.. పాక్ ప్రభుత్వ సైట్లేవీ అసలు పనిచేయకుండా చేసేశారు. వాళ్ల నెట్‌వర్క్ మొత్తాన్ని ఆపేసేందుకు రాన్సమ్‌వేర్‌ను చొప్పించారు. 'తెలంగాణ సైబర్ వారియర్' అనే పేరుతో ఉన్న ఒక హ్యాకర్ కూడా ఇలా పాకిస్థానీ ప్రభుత్వ సైట్లను హ్యాక్ చేసినవారిలో ఉన్నట్లు తెలిసింది. అసలు పాకిస్థాన్ సైబర్ స్పేస్ మొత్తాన్నే సర్వనాశనం చేసే శక్తి కూడా భారతీయ హ్యాకర్లకు ఉందని కొందరు అంటున్నారు.

పోలీసు శాఖను వ్యూహాత్మకంగా పునర్వ్యవస్థీకరించాలి - కేసీఆర్

06/10/2016: హైదరాబాద్: తెలంగాణలో నేరం చేసి బయటకు పోలేమన్న పరిస్థితి నేరస్తులకు కలగాలని, ఆ లక్ష్యంతో వ్యూహాత్మకంగా పోలీసు శాఖ పునర్వ్యవస్థీకరణ జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. నేరాలు తగ్గాలని, ప్రజలకు భరోసా కలగాలని, ఎక్కడ అవసరమైతే అక్కడికి నిమిషాల్లో చేరుకునేలా పోలీసు శాఖ సిద్ధంగా ఉండాలన్నారు. అన్ని రకాల నేరాలను అదుపు చేయగలిగేలా పోలీస్ వ్యవస్థను తీర్చిదిద్దాలన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా రాష్ట్ర పోలీసు శాఖ పునర్వ్యవస్థీకరణపై బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. కొత్తగా వచ్చే జిల్లాలు, డివిజన్లు, మండలాల ఆధారంగా పోలీసు శాఖ కూడా తమ కార్యాలయాలు దసరా రోజే ప్రారంభించాలని ఈ సందర్భంగా ఆదేశించారు. కొత్త పోలీస్‌స్టేషన్ల నుంచి కొత్త కమిషనరేట్ల దాకా అన్నీ సిద్ధం కావాలన్నారు. హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, సీనియర్ పోలీసు అధికారులు మహేందర్ రెడ్డి, మహేశ్ భగవత్, సందీప్ సుల్తానియా, సుధీర్, నాగిరెడ్డి, అకున్ సబర్వాల్, సీఎంవో ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, శాంతికుమారి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. అవసరమైన ప్రతిచోటా హెలిప్యాడ్ భవిష్యత్ అవసరాలు, పరిణామాలను అంచనా వేస్తూ పోలీసు శాఖ పునర్వ్యవస్థీకరణ జరగాలని సీఎం పేర్కొన్నారు. అవసరమైన ప్రతిచోటా హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని, భవిష్యత్తులో హెలికాప్టర్ల ద్వారా గస్తీ నిర్వహించాల్సి వచ్చినా సిద్ధంగా ఉండేలా వ్యవస్థను తయారు చేసుకోవాలన్నారు. కొత్తగా నాలుగు పోలీసు కమిషనరేట్లు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ కమిషనరేట్లతోపాటు కొత్తగా కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట, రామగుండం పోలీసు కమిషనరేట్లను ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కమిషనరేట్ల పరిధిలోని జిల్లా కేంద్రాల్లో డీసీపీలను, డివిజన్ కేంద్రాల్లో ఏసీపీలను నియమించాలని ఆదేశించారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడే పరిపాలన విభాగాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 25 సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయాలు, 28 పోలీస్ సర్కిల్ కార్యాలయాలు, 86 కొత్త పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయాలని, వాటిలో అవసరమైన సిబ్బందిని నియమించాలని సూచించారు. రాష్ట్రంలో కొత్తగా 119 మండలాలు వచ్చే అవకాశం ఉందని, వీటిలో ఇప్పటికే 33 చోట్ల పోలీస్ స్టేషన్లున్నారుు కాబట్టి.. కొత్తగా 86 స్టేషన్లు ప్రారంభం కావాలన్నారు. ఇంతకుముందు కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు శాఖాపరంగా చేపట్టిన చర్యలను అధ్యయనం చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్లు-జనాభా నిష్పత్తిలో మనమే మెరుగు నేరాల అదుపులో, అసాంఘిక శక్తులను అరికట్టడంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు మంచి పేరు వచ్చిందని సీఎం చెప్పారు. పోలీస్ కమిషనరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాలు, సబ్ డివిజన్, సర్కిల్ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ల సంఖ్య పెరుగుతున్నందున పోలీస్ స్టేషన్లు-జనాభా విషయంలో దేశ సగటు కన్నా తెలంగాణ మెరుగ్గా ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా 125 కోట్ల జనాభాకు 12,806 పోలీసు స్టేషన్లున్నాయని, ప్రతీ 97 వేల జనాభాకు ఒక పోలీస్ స్టేషన్ ఉందని వివరించారు. తెలంగాణలో పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా పోలీస్ స్టేషన్ల సంఖ్య భారీగా పెంచుతున్నందున ప్రతీ 50 వేల మందికి ఒక స్టేషన్ అందుబాటులో ఉంటుందన్నారు. తెలంగాణ జనాభా 3.60 కోట్లుంటే 709 పోలీస్ స్టేషన్లు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. దీంతో శాంతిభద్రతల పర్యవేక్షణ మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యాలయాల నిర్మాణాలకు రూ.2 వేల కోట్లు కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుతోనే సరిపోదని, అవి సమర్థంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఏడాదిలోగా జిల్లా కార్యాలయాలతో పాటు మండల స్థారుు కార్యాలయాల నిర్మాణం పూర్తి కావాలని స్పష్టంచేశారు. ఇందుకోసం వెంటనే ప్రతిపాదనలు తయారు చేయాలని, వచ్చే బడ్జెట్లో ఆఫీసుల నిర్మాణం కోసం రూ.2 వేల కోట్లు కేటారుుస్తామని ప్రకటించారు. పోలీసు కార్యాలయాలను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా, ఇతర కార్యాలయాలను ఆర్‌అండ్‌బీ ద్వారా నిర్మిస్తామని వెల్లడించారు. దసరా నాడే జిల్లా కేంద్రాల్లో అన్ని శాఖల కార్యాలయాలు ప్రారంభం కావాలన్నారు. హైపవర్ కమిటీ నివేదిక తర్వాత తుది రూపు కె.కేశవరావు నాయకత్వంలో ఏర్పాటైన హైపవర్ కమిటీ ఇచ్చే నివేదిక తర్వాత ఏ జిల్లాలో ఏయే మండలాలు, ఏ డివిజన్లు ఉంటాయనే విషయంలో స్పష్టత వస్తుందని సీఎం చెప్పారు. నివేదిక వచ్చిన తర్వాత డివిజన్లు, మండలాల విషయంలో మార్పుచేర్పులు చేయాలని సూచించారు. కాగా శుక్రవారం(7వ తేదీ) మధ్యాహ్నం 2 గంటలకు సీఎం నేతృత్వంలో సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది.

అవును.. మా సైన్యం చావుదెబ్బ తింది - పాక్ పోలీసు

06/10/2016: శ్రీనగర్ : తమ ఉన్నతాధికారితో మాట్లాడుతున్నానని భావించిన పాకిస్థానీ పోలీసు అధికారి సర్జికల్ స్ట్రైక్స్ గురించిన వాస్తవాన్ని తన నోటితోనే వెల్లడించాడు. పాక్ సైనికుల్లో కూడా ఐదుగురు మరణించారని వెల్లడించాడు. భారత దేశానికి చెందిన ఒక జాతీయ మీడియా చానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ విషయం వెల్లడైంది. ఐజీ ముస్తాక్ పేరుతో గులాం అక్బర్‌కు పాత్రికేయుడు మనోజ్ గుప్తా ఫోన్ చేశారు. ''సర్.. అది రాత్రి సమయం. సుమారు 3 నుంచి 4 గంటల వరకు పట్టింది. అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు జరిగింది. అప్పటివరకు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి'' అని అక్బర్‌ ఫోన్లో చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని మీర్పూర్ రేంజికి చెందిన స్పెషల్ బ్రాంచి ఎస్పీ అయిన గులాం అక్బర్ ఆ దాడుల గురించి మొత్తం వివరాలన్నీ పూసగుచ్చినట్లు వివరించారు. పాకిస్థానీ సైనికులకు ఏం చేయాలో దిక్కు తోచలేదని.. దాంతో ఐదుగురు సైనికులు మరణించారని కూడా ఆయన వెల్లడించారు. చనిపోయిన ఉగ్రవాదుల మృతదేహాలను కూడా పాక్ సైన్యం వెంటనే అక్కడినుంచి తొలగించిందని, అయితే ఎంతమంది ఉగ్రవాదులు మరణించారో మాత్రం తెలియదని గులాం అక్బర్ అన్నారు. దాడులు జరిగిన ప్రాంతాల పేర్లు కూడా తెలిపారు. ఫలానా ప్రాంతాల్లో దాడులు జరిగాయంటూ ఎస్పీ అక్బర్ చెప్పిన ప్రాంతాలన్నీ ఇంతకుముందు తాము దాడులు చేసినట్లుగా భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్‌ సింగ్ చెప్పిన ప్రాంతాలేనని కూడా తేలింది. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పాకిస్థానీ సైన్యం ఆ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పట్టిందని చెబుతూ.. ఉగ్రవాదులు సరిహద్దులు దాటి భారతదేశంలోకి ప్రవేశించడానికి పాకిస్థాన్ సైన్యం సాయం చేస్తోందని కూడా ఆయన వివరించారు. 'ఆర్మీయే వాళ్లను తీసుకొస్తుంది.. అది వాళ్ల చేతుల్లోనే ఉంది' అని అన్నారు. జీహాదీల విషయాలను స్థానిక పోలీసులకు కూడా తెలియనివ్వకుండా పాక్ సైన్యం కాపాడుతుంది కాబట్టి ఎంత మంది ఉగ్రవాదులు మరణించారో మాత్రం తనకు తెలియదని అన్నారు.

కాల్‌సెంటర్ కేంద్రంగా.. రూ. 500 కోట్ల దోపిడీ!

06/10/2016: థానె : గడిచిన ఏడాది కాలంలో అమెరికన్ పౌరులు దాదాపు రూ. 500 కోట్ల మేర దోపిడీకి గురయ్యారు. అది కూడా ఎక్కడి నుంచో తెలుసా.. మన దేశంలోని ఒక కాల్ సెంటర్ నుంచి!! అవును.. థానెలోని మీరారోడ్డు కాల్‌సెంటర్ స్కాం వెల్లడిస్తున్న భయంకర వాస్తవమిది. ఇప్పటివరకు బయటపడింది కూడా చాలా చిన్నదే కావచ్చని, ఇందులో మరింత పెద్ద మొత్తం ఉండి ఉండొచ్చని పోలీసు కమిషనర్ పరమ్ వీర్ సింగ్ తెలిపారు. కేవలం అమెరికాలోనే కాక.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పౌరులు కూడా ఈ దోపిడీ బాధితులు కావచ్చని అంటున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో 70 మందిని అరెస్టు చేశారు. అక్రమ కాల్‌సెంటర్లకు చెందిన మరో 630 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. స్కాం ఎలా జరిగిందంటే... కాల్ సెంటర్ల ఉద్యోగులు తమను తాము అమెరికా ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ అధికారులుగా చెప్పుకొంటూ.. పన్నులు ఎగ్గొట్టినందుకు అరెస్టుచేస్తామని బెదిరించి, అలా చేయకుండా ఉండాలంటే 500 నుంచి 3000 డాలర్ల వరకు చెల్లించాలని బెదిరించేవారు. దాంతో దిక్కుతోచని ఆ పౌరులు వీళ్లు చెప్పిన ఖాతాలకు ఆ మొత్తాన్ని పంపేవాళ్లు. ఈ స్కాంపై అమెరికాకు చెందిన పలు ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. ఈ గ్యాంగు సభ్యుల్లో కొంతమంది అమెరికాలో కూడా ఉన్నారు. వాళ్లే అక్కడివాళ్ల వివరాలు ఇచ్చి వీళ్లకు సాయం చేసేవారని తెలిసింది. ముందుగానే పన్ను ఎగ్గొడుతున్న విషయం తెలుసుకుని వీళ్లు ఫోన్ చేసేవారు. ఒకేసారి ఏకంగా 10 వేల డాలర్లు డిమాండ్ చేసి.. చివరకు అవతలివాళ్ల సామర్థ్యాన్ని బట్టి ఎంతో అంతకు సెటిల్ చేసేవారు. ఎలా పట్టుబడ్డారు.. మూడు అక్రమ కాల్‌సెంటర్లపై థానె పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారు. మీరా రోడ్డులోని ఏడు అంతస్తుల డెల్టా బిల్డింగులో రోజుకు మూడు షిఫ్టుల చొప్పున 24 గంటలూ నడిచే ఈ కాల్‌సెంటర్ల గుట్టు అప్పుడే బయటపడింది. కాల్ సెంటర్ల యజమానులు ఎలాగోలా తప్పుకొన్నారు. అయితే హైదర్ అలీ అయూబ్ మన్సూరీ అనే ఒక డైరెక్టర్‌ను మాత్రం పోలీసులు అరెస్టుచేశారు. అసలైన యజమానుల కోసం గాలింపు విస్తృతంగా సాగుతోంది. హరిఓం ఐటీపార్క్, యూనివర్సల్ ఔట్‌సోర్సింగ్ సర్వీస్, ఆస్వాల్ హౌస్ అనే ఈ మూడు కాల్ సెంటర్లలో ఒక్కోదాంట్లో రోజుకు దాదాపు కోటి నుంచి కోటిన్నర వరకు సంపాదిస్తున్నారు. ప్రాక్సీ సెర్వర్ నుంచి వాయిస్ ఓవర్ ఇంటర్‌నెట్ ప్రోటోకాల్ (వీఓఐపీ) కాల్ చేయడంతో ఎక్కడినుంచి చేస్తున్నారో ఎవరికీ తెలిసేది కాదు. తన ఇంటిమీద దాడి జరగకుండా ఉండేందుకు ఒక వ్యక్తి ఏకంగా 60వేల డాలర్లు సమర్పించుకున్నాడు. వీళ్ల దగ్గర నుంచి 852 హార్డ్ డిస్కులు, హై ఎండ్ సెర్వర్లు, డీవీఆర్లు, ల్యాప్‌టాప్‌లు, కోటి రూపాయల విలువైన పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఏడు అంతస్తులలో పైదాంట్లో శిక్షణ ఇచ్చేవారు. మిగిలిన ఒక్కో ఫ్లోర్‌లో దాదాపు వంద వరకు ఇంటర్‌నెట్ కనెక్షన్లున్నాయి.

ఫేస్‌బుక్‌లో మరో సరికొత్త ఆప్షన్

05/10/2016: న్యూయార్క్ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్.. తన మెసెంజర్ యాప్ కోసం ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సోషల్ మీడియా ద్వారా చాటింగ్ చేసేటపుడు ఉండే ఎన్‌క్రిప్షన్ సదుపాయం ఇప్పటివరకు వాట్సప్‌లో మాత్రమే ఉండగా, ఇకమీదట అలాంటి అవకాశం ఫేస్‌బుక్ మెసెంజర్‌లోనూ ఉంటుంది. 'సీక్రెట్ కన్వర్సేషన్స్' అనే ఫీచర్‌ను టాగిల్ కీ లా ఉపయోగించుకోవచ్చు. అంటే వాట్సప్‌లో అయితే మనం కావాలనుకున్నా, వద్దనుకున్నా కూడా ఎన్‌క్రిప్షన్ ఆటోమేటిగ్గా జరిగిపోతుంది. కానీ మెసెంజర్‌లో మాత్రం మనం కావాలనుకున్న వాటికి మాత్రమే అది ఉంటుంది. అయితే.. ఇక్కడో మెలిక కూడా ఉంది. ఒకసారి మనం ఆటోమేటిక్ ఎన్‌క్రిప్షన్ ఆన్ చేసుకుంటే.. మెసెంజర్‌లో ఉన్న దాదాపు వంద కోట్ల మంది యూజర్లు కూడా ప్రతి మెసేజికి ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి కొత్త వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకుంటే ఈ సమస్య ఉండబోదని, కొత్త మెసేజి స్క్రీన్ మీద కుడిచేతి వైపు పైన 'సీక్రెట్' అనే కీ కనపడుతుందని, దాన్ని ట్యాప్ చేస్తే సరిపోతుందని ఫేస్‌బుక్ వర్గాలు అంటున్నాయి. అయితే సందేశాలు పంపేవాళ్లు, అందుకునేవాళ్లు కూడా కొత్త వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

పాక్, భారత్ల జంటకు పెళ్లయ్యేనా?

05/10/2016: భారత్-పాక్ల మధ్య ఎంత వైరం ఉందో అంతకన్నా ఎక్కువ బంధుత్వాలే ఉన్నాయి! దాయాది దేశమైన పాక్తో భారత్లోని అనేక మంది సంబంధాలు పెట్టుకుంటూనే ఉన్నారు. ఇక్కడ అమ్మయి లేదా అబ్బాయి అక్కడ అబ్బాయి లేదా అమ్మయిలు పెళ్లిళ్లు చేసుకుంటూనే ఉన్నారు. హైదరాబాద్కి చెందిన బ్యాట్మింటన్ స్టార్ సానియా మీర్జా.. పాక్ క్రికెటర్ షోయబ్ను ఏరికోరి వివాహం చేసుకుంది. ఇక, పంజాబ్, కశ్మీర్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వారు పాక్తో వివాహ సంబంధాలు కలుపుకొంటూనే ఉన్నారు. వాస్తవానికి పాక్-భారత్కి మధ్య సరిహద్దు వివాదం గడిచిన 69 ఏళ్లుగా ఉంది. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య యుద్ధం కూడా జరిగింది. కశ్మీర్ విషయంలో ఇరు దేశాలూ ఎప్పటికప్పుడు పోట్లాడుకుంటూనే ఉన్నాయి. ఇక, వీటికి ఉగ్రవాదం వచ్చి చేరడంతో పరస్పరం నిప్పులు కురిపించుకుంటున్నాయి. తాజాగా ఉరీ ఉగ్రఘటన పాక్,భారత్ల మధ్య అగాధం మరింత పెంచింది. ఇరు దేశాల మధ్య దాడుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో భారత్ జరిపిన సర్జికల్ ఫైట్తో పాక్ దిమ్మతిరిగిపోయింది. అంతేకాకుండా పాకిస్థాన్లో జరిగే సార్క్ సదస్సును బహిష్కరించడం ద్వారా ఆదేశాన్ని భారత్ అంతర్జాతీయంగా ఏకాకిని చేసింది. ఈ పరిణామాలు ఇరు దేశాల్లోనూ కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. అయితే, ఇప్పుడు భారత్-పాక్ యుద్ధం మాటేమో కానీ, తమకు ప్రాణసంకటంగా పరిణమించిందని వాపోతున్నాడు రాజస్థాన్కు చెందిన ఓ వరుడు! మరి విషయం ఏం చూద్దామా? రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన నరేష్ తెక్వానికి, పాకిస్థాన్లోని సింధు ప్రావిన్స్కు చెందిన ప్రియా బచానీకి కొద్దిరోజుల క్రితం పెళ్లి నిశ్చయమైంది. నవంబర్ 8న పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. అయితే ఉరీ, సర్జికల్ దాడులు జరగడం వల్ల రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొరవడ్డాయి. ఈ ప్రభావం ప్రియ వీసాపై కూడా పడింది. పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చేందుకు ప్రియాతో పాటు 15 మంది కుటుంబ సభ్యులు మూడు నెలల క్రితం వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇంతవరకూ ఎలాంటి స్పందన లేదు. కరాచీలో ప్రియా కుటుంబం నివాసముంటోంది. పెళ్లి తేదీ సమీపిస్తుండటంతో వారంతా ఆందోళనలో ఉన్నారు. పెళ్లిని వాయిదా వేసుకునే యోచనలో ఉన్నారు. వరుడి ఇంట్లో మాత్రం పెళ్లికి సంబంధించి 80శాతం ఏర్పాట్లు పూర్తయ్యాయి. కానీ ప్రియాకు వీసా రాకపోవడంతో పెళ్లిపై నరేష్కు దిగులు పట్టుకుంది. మరి ఎప్పట్లాగా విదేశాంగ మంత్రి సుష్మా ఎంటరైతేకానీ, వీరికి వివాహం జరిగేలా లేదని అంటున్నారు బంధువులు. ఏం జరుగుతుందో చూడాలి.

అరుణ‌కు లాభం చేసిన కేటీఆర్

05/10/2016: 27 జిల్లాల ఏర్పాటుకే క‌రాఖండీగా డిసైడైన తెలంగాణ‌ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కాంగ్రెస్ సీనియ‌ర్ ఎమ్మెల్యే డీకే అరుణ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ గద్వాల జిల్లా ఏర్పాటుకు సానుకూలంగా స్పందించడం వెనుక ఆస‌క్తిక‌ర కార‌ణాలు ఉన్నాయంటున్నారు. డీకే అరుణ తాను అనుకున్నది సాధించారా? లేక కొన్ని అనుకోని, తప్పనిసరి పరిస్థితుల్లో జిల్లా ఏర్ప‌డిందా అనే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుండ‌గా దీనికి ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం వ‌స్తోంది. సీఎం కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ వ‌ల్లే డీకే అరుణ ఆకాంక్ష నెర‌వేరింద‌ని చెప్తున్నారు. గద్వాలను జిల్లా చేయాలంటూ డీకే అరుణ చాలాకాలంగా పోరాటం చేస్తున్నారు. స్థానికంగా ఆందోళ‌న‌లు చేయ‌డంతో పాటు హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద దీక్ష చేశారు. పైగా గద్వాలను జిల్లా చేసేందుకు తానే అడ్డంకి అని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తే శాసనసభ సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తానంటూ అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ కూడా పంపించారు. డికె అరుణ పోరాటం ఫలితంగానే గద్వాల జిల్లా ఏర్పాటుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్న అభిప్రాయాన్ని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఒకవేళ గద్వాల జిల్లా ఏర్పాటు చేయకపోయినా రాజకీయంగా మరింత పోరాటం చేస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు ఆమెకు అవకాశం ఉండేదని పార్టీ నాయకులు కొందరు అంటున్నారు. కాగా ముఖ్యమంత్రి కేసఈఆర్ సానుకూలంగా స్పందించడానికి వేరే కారణం కూడా ఉందని ఇతర పార్టీల నాయకులు చెబుతున్నారు. త‌న కుమారుడు కేటీఆర్ ప్రాతినిథ్యం సిరిసిల్ల జిల్లా చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నందున, గద్వాల జిల్లా ఏర్పాటుకూ సానుకూలంగా స్పందించారన్న ప్రచారం జరుగుతున్నది. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేసి గద్వాలకు అంగీకరించకపోతే అరుణ మరింత ఆందోళనకు దిగే అవకాశం ఉంటుందని, గద్వాల ప్రజలు కూడా ఆమెకు మద్దతుగా నిలుస్తారని ముఖ్యమంత్రి భావించి అందుకు అంగీకరించారని చెబుతున్నారు. మొత్తంగా కేటీఆర్ వ‌ల్ల అరుణ‌కు మేలు జ‌రిగింద‌నేది ఈ చ‌ర్చ‌ల యొక్క సారాంశం.

సర్జికల్ స్ట్రైక్స్ వీడియోల విడుదలకు ఆర్మీ ఓకే

05/10/2016: న్యూఢిల్లీ : పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించిన వీడియో ఫుటేజిని విడుదల చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని భారత ఆర్మీ తేల్చి చెప్పేసింది. ఇక ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధానమంత్రే. అసలు సర్జికల్ స్ట్రైక్స్ ఏవీ జరగలేదంటూ పాకిస్థాన్ మీడియా దుష్ప్రచారం చేయడం, భారతదేశంలో కూడా కొందరు నాయకులు దానికి వత్తాసు పాడటం లాంటి ఘటనల నేపథ్యంలో వీడియోలను విడుదల చేసి పక్కా సాక్ష్యాలు బయటపెట్డమే మేలని ఆర్మీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్ లాంటివాళ్లు సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించిన ఆధారాలు బయటపెట్టాలని అంటున్నారు. దీనిపై తీవ్ర రాజకీయ దుమారం సైతం రేగింది. వాస్తవానికి సైనిక రహస్యాలను బయటపెట్టడం అనేది ఇప్పటివరకు ఎప్పుడూ లేదు. త్రివిధ దళాలకు సంబంధించిన ఆపరేషన్లు ఏవైనా సరే.. వాళ్లు చేశామని చెప్పడం తప్ప.. అందుకు సంబంధించిన ఆధారాలు చూపించిన దాఖలాలు లేవు. అయినా సరే, ఇప్పుడు ఆ వీడియో బయటపెడితే ఇటు దేశంలో ప్రశ్నిస్తున్నవాళ్లతో పాటు పాకిస్థాన్‌ నోరు కూడా మూయించినట్లు అవుతుందని ఆర్మీవర్గాలు భావిస్తున్నాయి. మొత్తం ఆపరేషన్ అంతటినీ మానవరహిత విమానాల సాయంతో షూట్ చేయడంతో పాటు ఆ దృశ్యాలను ప్రధానమంత్రి, మరికొందరు ఉన్నతాధికారులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా రాత్రంతా మేలుకొని మరీ చూసిన సంగతి తెలిసిందే. ఆ విషయాలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్‌సింగ్ ఒక్కరే అధికారికంగా బయటకు వెల్లడించారు. అక్కడి పరిస్థితి ఇప్పటికీ ఇంకా 'లైవ్'గానే ఉందని, అయినా కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయని ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా అన్నారు. ఇప్పుడు పరిస్థితి ఇంకా చాలా సున్నితంగా ఉందని, అందువల్ల దీనిపై ఎలాంటి విషయాలూ తాను చెప్పడం సరికాదని ఆయన తెలిపారు. 1962 నాటికి, ఇప్పటికి పరిస్థితులు చాలా మారాయని, భారత సైన్యంలోని త్రివిధ దళాలు ఎలాంటి ఎదురుదాడులైనా చేయడానికి సర్వసన్నద్ధంగా ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్ ప్రశ్నతో ‘నయీం పొలిటికల్ గ్యాంగ్’ షాక్

04/10/2016: గ్యాంగ్ స్టర్ నయీం కేసు తెలంగాణ నేతలను ఇప్పటికే చెమటలు పట్టిస్తోంది. ఈ తరుణంలో కేసు ద‌ర్యాప్తు విష‌యంపై తొలిసారిగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట్లాడడం మరింత సంచలనంగా మారింది. ఈ కేసులో నిందితులు ఎంత‌టివారైనా వ‌దిలేది లేద‌ని, ఇప్ప‌టికే ప‌లుమార్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే! కానీ, తొలిసారిగా సీఎం కేసీఆర్ న‌యీం కేసులో నోరువిప్పారు. న‌ల్ల‌గొండ జిల్లా నేత‌ల‌తో సీఎం కేసీఆర్ స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా న‌యీంతో అధికార పార్టీ నేత‌లు అంట‌కాగారంటూ ప్ర‌తిపక్ష నేత‌లు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ప‌లువురు నేత‌లు సీఎం దృష్టికి తీసుకువ‌చ్చారు. వీటిపై స్పందించిన సీఎం న‌యీంను పెంచి పోషించిన వాళ్ల సంగ‌తేంది? అని ఎదురు ప్ర‌శ్నించిన‌ట్లు తెలిసింది. అంటే ప‌రోక్షంగా ఈ కేసులో ఎవ‌రినీ వ‌దిలేది లేద‌ని స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చార‌ని పార్టీ నేత‌లు అంటున్నారు. సీఎం ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డంతో ప్ర‌తిప‌క్షంలో ఉన్న న‌యీం అనుచ‌ర నేత‌లు ఉలిక్కిప‌డుతున్నారు. ఇప్ప‌టికే న‌యీంతో త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని కొంద‌రు నేత‌లు విలేక‌రుల సమావేశాలు పెట్టి ఖండించారు. ఈలోపు హైద‌రాబాద్‌తోపాటు రాష్ట‌వ్యాప్త వ‌ర్షాలు, వినాయ‌క చ‌వితి, నిమ‌జ్జ‌నం, ద‌స‌రా సెల‌వులు రావ‌డంతో కేసు కాస్త మంద‌కొడిగా సాగుతోంది. తాజాగా సీఎం ఎవ‌రినీ వ‌దిలేది లేదంటూ చేసిన వ్యాఖ్యానాలు వీరికి మళ్లీ చెమటలు పట్టిస్తున్నాయి. నయీం పొలిటికల్ గ్యాంగ్ లోని చాలామంది నేత‌ల ఫోన్లు, క‌ద‌లిక‌లపై సిట్ బృందం నిరంతం నిఘా పెట్టింది. ఇప్ప‌టికే వీరిలో చాలామంది గ‌న్ లైసెన్సులు ర‌ద్దు అయ్యాయి. వీరికి ఏ క్ష‌ణాల్లోనైనా నోటీసులు అంద‌నున్న నేప‌థ్యంలో బొత్తిగా మీడియా ముందుకు రావ‌డం లేదు. ఎలాంటి హ‌డావిడి లేకుండా.. కుటుంబ స‌భ్యుల మ‌ధ్యే స‌మ‌యం గ‌డుపుతున్నారు. దేనికైనా రెడీగా ఉండాలని చాలామంది డిసైడైనట్లు టాక్.

కర్ణాటకకు డెడ్ లైన్ ఇచ్చేసిన సుప్రీం

04/10/2016: కావేరీ జలాల రగడ కొద్ది రోజులుగా సా..గుతున్న సంగతి తెలిసిందే. తమిళనాడుకు కావేరీ జలాల్ని ఇవ్వాలంటూ అత్యున్నత న్యాయస్థానం కర్ణాటకకు ఆదేశాలు జారీ చేయటం.. అందుకు ఆ రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేయ‌డం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు తామిచ్చిన ఆదేశాల్ని ఎందుకు అమలు చేయరంటూ సుప్రీంకోర్టు... కర్ణాటక ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే.. సుప్రీం ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేయకూడదన్న నిర్ణయంతో పాటు.. కావేరీ న‌దీ జ‌లాల‌పై తమ వాదనను సానుకూలంగా వినాలంటూ కర్ణాటక అసెంబ్లీ సుప్రీంకోర్టును విన్న‌విస్తూ ఓ తీర్మానం చేసింది. మీరు భారత దేశంలో భాగం అంటూ మండిపడిన సుప్రీం.. తమిళనాడుకు కావేరీ జలాల్ని ఇచ్చి తీర్చాల్సిందేనని తేల్చి చెప్పింది. అయితే.. సుప్రీం ఆదేశాల్ని కర్ణాటక ప్రభుత్వం పెడ చెవిన పెట్టింది. ఈ తీరుపై తాజాగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇచ్చేసింది. కావేరీ జలాల విడుదల విషయానికి సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేస్తూ.. తామిస్తున్న ఆదేశాల్ని అడుగడుగునా కర్ణాటక సర్కారు ఉల్లంఘించటాన్ని తప్పు పట్టింది. తమిళనాడుకు ఎంత నీరు వదిలారు? అసలు నీటిని వదిలారా? లేదా? లాంటి పూర్తి సమాచారాన్ని తమకు వెల్లడించాలని.. ఈ ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల లోపు కర్ణాటక ప్రభుత్వం తమకు సమాచారం అందించాలని పేర్కొంది. తాజాగా తామిచ్చినడెడ్ లైన్ ను ధిక్కరిస్తే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

31 జిల్లాలు - ముసాయిదాలోని 17తో పాటు సిరిసిల్ల, జనగామ, గద్వాల, ఆసిఫాబాద్‌ జిల్లాల ఏర్పాటు

04/10/2016: స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో, రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. వ్యవస్థలో మార్పులు రాలేదు. పేదలు పేదలుగానే ఉన్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడే చక్కని అవకాశం తెలంగాణ రాష్ట్రానికి కలిగింది. పరిపాలన విభాగాలు చిన్నగా ఉండాలి. అవి మంచి ఫలితాలిస్తాయనడానికి మండల వ్యవస్థే ఉదాహరణ. రాష్ట్రానికి మంచి ఆదాయవనరులున్నాయి. వీటిని తెలివిగా ఉపయోగించుకొని రాష్ట్రం నుంచి పేదిరికాన్ని తరిమికొట్టాలి. 2022 నాటికి తెలంగాణ బడ్జెట్‌ రూ. 5 లక్షల కోట్లకు చేరుతుంది. అప్పటికి తెలంగాణ ప్రాజెక్టులు పూర్తవుతాయి. విద్యుత్‌ప్లాంట్ల నిర్మాణం, మిషన్‌ భగీరథ, రహదారుల నిర్మాణాలు పూర్తిస్థాయిలో జరుగుతాయి. ఆ తర్వాత పెద్దగా పనులుండవు. మన చేతిలో భారీగా డబ్బు ఉంటుంది. దీనిని పేదరిక నిర్మూలనకే వినియోగిస్తాం - ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణలో ఇప్పటికే ప్రకటించిన ముసాయిదాలోని 17 కొత్త జిల్లాలతో పాటు అదనంగా జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్‌ జిల్లాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోనికి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. దసరా నుంచి 21 కొత్త జిల్లాల ప్రారంభానికి సమాయత్తమవ్వాలని సూచించారు. సీఎం తాజా నిర్ణయం ప్రకారం మొత్తం 31 జిల్లాలు కానున్నాయి. ఆది, సోమవారాల్లో చర్చల తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. దీని ప్రకారం వరంగల్‌ జిల్లాలో 5, కరీంనగర్‌ జిల్లాలో4, మహబూబ్‌నగర్‌ జిల్లాలో4, ఆదిలాబాద్‌లో4 మెదక్‌లో 3, రంగారెడ్డిలో3, నల్గొండలో 3, నిజామాబాద్‌లో2, ఖమ్మంలో 2, హైదరాబాద్‌లో ఒకటి చొప్పున కొత్త జిల్లాలు ఏర్పడనున్నాయి. చిన్న జిల్లాల ద్వారానే అభివృద్ధి సాధ్యమని, సంక్షేమ కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ సులభతరమవుతుందని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇందుకోసం జిల్లాలు, డివిజన్లు, మండలాల సంఖ్య పెరిగినా అభ్యంతరం లేదని సీఎం తెలిపారు. ప్రతీ జిల్లాలో సగటున మూడు లక్షల కుటుంబాలుండేలా జిల్లాలను పునర్య్వవస్థీకరిస్తున్నామని తెలిపారు. సోమవారం కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌ జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్‌పర్సన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ల అధ్యక్షులు, పార్టీల జిల్లా అధ్యక్షులతో జిల్లాల పునర్య్వవస్థీకరణపై సమావేశం నిర్వహించారు. పార్టీ పార్లమెంటరీ నాయకుడు కె.కేశవరావు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘‘దసరా రోజున ప్రారంభమయ్యే కొత్త జిల్లాలతో ప్రజలంతా సంతోషంగా పండుగ జరపాలి. జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్‌ జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలపై వెంటనే కసరత్తు చేపట్టాలి. రెండు మూడు రోజుల్లో ప్రతిపాదనలు తయారు చేయాలి. వాటికి అనుగుణంగా కార్యాచరణ జరగాలి. * ఆదిలాబాద్‌ జిల్లాలో కొత్తగా 16 మండలాలు ఏర్పాటు చేయాలి. మొత్తం మండలాలను జిల్లాలకు విభజించాలి. ఆదిలాబాద్‌ జిల్లాలో 20, కొమురం భీమ్‌ జిల్లాలో 14, ఆసిఫాబాద్‌ జిల్లాలో 12,