Breaking News

కరీంనగర్‌: అతివేగంతో పాటు, కర్ణకఠోర శబ్ధాలతో దూసుకెళ్తున్న ద్విచక్రవాహనాలకు పోలీసులు కళ్లెం వేశారు. పరిమితికి మించిన వేగంతో ప్రయాణిస్తూ తోటి వాహనదారులను భయబ్రాంతులకు గురిచేయడంతో పాటు విపరీతమైన శబ్ధ కాలుష్యానికి కారణమవుతున్న 16 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకొని వాహనదారులకు జరిమానాలు విధించారు. * * బెల‍్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల‍్లంపల్లిలోని సివిల్‌ కోర్టు ముఖద్వారం ఎదుట హోంగార్డు నారాయణ మంగళవారం ఉదయం ఆత‍్మహత్యాయత‍్నం చేశాడు. ఏడు సంవత‍్సరాలుగా హోంగార్డులకు పోస్టింగ్‌ ఇవ‍్వలేదని, విధుల‍్లోకి తీసుకోకుండా పోలీసు విభాగం అన్యాయం చేస్తోందని ఆవేదన వ‍్యక‍్తం చేస్తూ తెలంగాణ హోంగార్డుల సంఘం అధ‍్యక్షుడు నారాయణ మంగళవారం ఆత‍్మహత్యాయత‍్నం చేశాడు. * * చర‍్ల: ఖమ‍్మం జిల్లా చర‍్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు వద్ద మంగళవారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు ఆ ఇద్దరిని అరెస్టుచేశారు. తనిఖీ చేయగా వారి వద్ద మెడికల్ కిట్లు ఉన్నట్లు గుర్తించారు. వారు మావోయిస్టు మిలీషియా సభ‍్యులని తేలడంతో వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కోర్టులో హాజరుపరిచేందుకు తరలించామని చర్ల పోలీసులు వెల్లడించారు. * * వరంగల్‌: వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని నర్సంపేటలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తె దుర‍్మరణం చెందారు. తండ్రి, కుమార్తె వెళుతున‍్న ద్విచక్రవాహనాన్ని వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో వారు అక‍్కడికక‍్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు సేకరిస‍్తున్నారు * * కురవి: తేనెటీగల దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లిలో సోమవారం వెలుగుచూసింది. స్థానిక మామిడి తోటలో కాయలు కోయడానికి వచ్చిన కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామానికి చెందిన వారిగా తెలుస్తోంది. * * కరీంనగర్‌: జిల్లా కేంద్రంలోని బుట్టిరాజారాం కాలనీలో శనివారం వేకువజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలో ప్రతీ ఇంటిని తనిఖీ చేశారు. 31 బైక్‌లు, 8 ఆటోలు, 9 సిలిండర్లు, 3 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా పలువురు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. * * హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం గత నెల 22న నిర్వహించిన పాలిసెట్ - 2017 ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని కాలేజీ, రూసా కార్యాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వాణిప్రసాద్ పాల్గొన్నారు. ఏప్రిల్ 22న జరిగిన ప‌రీక్ష‌కు 1,28,118 మంది విద్యార్థులు హాజరయ్యారు. * * నిజామాబాద్‌ జిల్లా వర్నిలో వింత చోరీ వెలుగుచూసింది. పట్టణ శివారులోని భారత్‌ గ్యాస్‌ గోడౌన్‌లో దొంగలుపడి సిలిండర్లు ఎత్తుకెళ్లారు. నిన్న సాయంత్రమే గోడౌన్‌కు వచ్చిన 250 గ్యాస్‌ సిలిండర్లలో శుక్రవారం రాత్రి 204 సిలిండర్లు చోరీకి గురయ్యాయి. శనివారం ఉదయం గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ శేఖర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. * * హైదరాబాద్‌: మిర్చి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కపట ప్రేమను చూపుతున్నాయని లోక్‌సత్తా పార్టీ తెలంగాణ ధ్వజ మెత్తింది. కేంద్రం తాజాగా ప్రకటించిన రూ.5వేలు ఏ మూలకూ సరిపోవని, అదనంగా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మరో రూ.5వేలు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈమేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జన్నేపల్లి శ్రీనివాసరెడ్డి గురువారం ప్రకటన విడుదల చేశారు. * * కడెం: నిర్మల్‌ జిల్లా కడెం మండల కేంద్రంలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, అక్రమంగా నిల్వ ఉంచిన రూ.20 వేల విలువ గల గుట్కా, మద్యం ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నల్లబెల్లం, దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అజార్, రమేష్ అనే ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. * * నారాయణపూర్‌: యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్‌ మండల కేంద్రంలో మావోయిస్టు పోస్టుర్లు కలకలం రేపుతున్నాయి. మండల కేంద్రంతో పాటు వావిళ్లపల్లి, జనాగం గ్రామాల్లో పోస్టర్లు వెలవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కేసీఆర్‌ నియంత పాలన నశించాలి, లంచగొండి ఎమ్మెల్యే ఖబడ్దార్‌ అంటూ పోస్లర్లపై రాసి ఉంది. * * రంగారెడ్డి: బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాయల్‌ కాలనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్‌ వేస్టేజ్‌ గోదాములో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. * * అమెరికాలో ఓ చిన్న విమానం నాటకీయరీతిలో నడిరోడ్డుపై కూలిపోయింది. వాషింగ్టన్‌ లోని ముకిల్‌టియోలో మంగళవారం ఓ చిన్న విమానం రద్దీగా ఉన్న నడిరోడ్డుపై కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు ఎగిశాయి. అదృష్టం బాగుండి ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. విమానం ఇంజన్‌లో సాంకేతికలోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్‌ సురక్షితంగా తప్పించుకున్నాడు. * * యాదగిరిగుట్ట మండలం బాహుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈస్ట్‌ మారెడ్‌పల్లికి చెందిన వల్లపు ఎల్లయ్య బైక్‌పై వరంగల్‌ వైపు వెళ్తున్నారు. బాహుపేట వద్దకు రాగానే ఎల్లయ్య వాహనాన్ని గుర్తు తెలియని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో పుల్లయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ రెండు ప్రమాదాలు జరిగిన ప్రదేశాలను యాదగిరిగుట్ట పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ–2 నాగిరెడ్డి తెలిపారు. * * టేకులపల్లి: మహిళా సర్పంచ్ కుమారుడు ఓ విద్యార్థినిని ప్రేమ పేరుతో నమ్మించి, వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తే ముఖం చాటేస్తున్న ప్రియుడి ఇంటి ముందు బాధితురాలు ఆందోళనకు దిగింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడులో బుధవారం వెలుగుచూసింది. * * హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సాయంత్రం 4 గంటలకు పదోతరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 14 నుంచి 30 వరకు ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 5.35 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తులు చేసుకోగా దాదాపు ఐదు లక్షల మంది హాజరయ్యారు. ఈ నెల 5న ఫలితాలు విడుదల చేయాలనుకున్నా రెండు రోజుల ముందుగానే ఫలితాలు వెల్లడిస్తున్నారు. * * హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని శ్రీకర్‌ ఆస్పత్రిలో సోమవారం అర్థరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రోగులు, ఆస్పత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలార్పడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదం సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదని పలువురు వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని అధికారులు వేరువేరు ఆస్పత్రులకు తరలించారు. * * కరీంనగర్‌: అదిలాబాద్‌ వన్‌టౌన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సీఐ, ఎస్సై, ఏఎస్సైలను సస్పెండ్‌ చేస్తూ.. కరీంనగర్‌ రేంజ్‌ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్‌ తగాదాలో తలదూర్చారనే సమాచారంతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు జిల్లా ఎస్పీ ఎం. శ్రీనివాస్‌ నివేదిక ఆధారంగా సీఐ సత్యనారాయణ, ఎస్సై బి. అనిల్, ఏఎస్సై జి. అప్పారావులను సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం కరీంనగర్‌ రేంజ్‌ డీఐజీ సి. రవివర్మ ఆదేశాలు జారీచేశారు. * * కోదాడ: ఐపీఎల్‌ -10 సందర్భంగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ. 25 వేల నగదుతో పాటు ఓ బైక్‌, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. * * తిప్పర్తి(నల్లగొండ): వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో.. బస్సులో ఉన్న 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. * * బోధన్‌ మండలం తెగడపల్లి గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి(12) ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. దీంతో గట్టిగ కేకలు వేస్తూ బాలిక అక్కడే కుప్పకూలిపోయింది. ఇది గుర్తించిన చుట్టుపక్కల వారు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ నుంచి హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం బాలిక మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. * * కామేపల్లి: ప్రమాదవశాత్తు బావిలోపడి ఓ కానిస్టేబుల్‌ మృతిచెందిన సంఘటన ఖమ్మం జిల్లా కామేపల్లిలో జరిగింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో గుగులోతు రామకృష్ణ (39) కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గ్రామ శివారులోని వ్యవసాయ బావి వైపు మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందాడు. ఈయన స్వగ్రామం తల్లాడ. రెండున్నరేళ్లుగా కామేపల్లిలో పనిచేస్తున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. * * మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా సింగరేణి ఉపరితల బొగ్గుగని కేంద్రంలో మంగళవారం మధ్యాహ‍్నం బంకర్‌ కూలి ఇద్దరు కార్మికులు మృతిచెందారు. లారీలో బొగ్గు నింపుతుండగా.. అక్కడే పనులు చేస్తున్న పవన్‌ (31), రఘుపాల్‌రెడ్డి(32) అనే కార్మికులపై బంకర్‌ కూలింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తోటి కార్మికులు వెంటనే స్పందించి మృతదేహాలను వెలికి తీశారు. * * సూర్యాపేట: ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సూర్యాపేట మండలం రాజానాయక్‌తండా శివారులో శనివారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో వారిని అంబులెన్స్‌ల సాయంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. * * భువనగిరి: వేగంగా వెళ్తున్న కారులో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్‌ వాహనాన్ని వదిలి బయటకు దూకేశాడు. ఈ ప్రమాదంలో సాంట్రో కారు పూర్తిగా కాలిబూడిదైంది. ఈ సంఘటన యాదాద్రి జిల్లా భువనగిరి శివారులోని నల్లగొండ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడానికి యత్నించే లోపే కారు పూర్తిగా కాలిపోయింది. * * మహబూబ్‌నగర్‌: జిల్లాలోని దేవరకద్ర మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు చేపట్టిన దాడుల్లో పెద్దఎత్తున రేషన్‌ బియ్యం పట్టుబడ్డాయి. లబ్దిదారులకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయనే సమచారంతో రగంలోకి దిగిన అధికారులు మండల కేంద్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న 620 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఓ లారీ, బొలెరో వాహానాలను సీజ్‌ చేశారు. * * పెద్దపల్లి: ఇద్దరు భార్యలు కలిసి భర్తను హతమార్చిన సంఘటన జిల్లాలోని కమాన్‌పూర్‌లో గురువారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగి తిరుమలయ్య(65)ను ఆయన ఇద్దరు భార్యలు గొడ్డలితో నరికి చంపారు. తిరుమలయ్య అతని ఇద్దరు భార్యలు మదునమ్మ, ఐలమ్మలను గత కొన్నేళ్లుగా తీవ్రంగా హింసిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. * * హైదరాబాద్: ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓంకార్ నగర్‌లోని ఓ సెల్‌ఫోన్‌ దుకాణంలో గురువారం రాత్రి దొంగతనం జరిగింది. స్థానిక శ్రీనివాస్ మొబైల్ షాప్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి క్యాష్‌ బాక్స్‌లో ఉన్న రూ.50 వేల నగదుతోపాటు లక్ష రూపాయల విలువ చేసే ఫోన్లు ఎత్తుకెళ్లారు. దుకాణంలో అమర్చిన సీసీ కెమెరాలో చోరీ చిత్రాలు నమోదయ్యాయి. బాధితుడు ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. * * యాదాద్రి: పక్కింటి వారు తిట్టారనే మనస్థాపంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన యాదాద్రి జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో మంగళవారం జరిగింది. స్థానికంగా ఉండే లక్ష్మమ్మ అనే మహిళకు పక్కింటి వారికి విబేధాలు వచ్చాయి. దీంతో పక్కింటి వారు తిట్టడంతో ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. * * నిజామాబాద్ : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి యాసంగి పంటకు నీటిని విడుదల చేశారు. ఇరిగేషన్ అధికారులు గురువారం ఉదయం నీటిని విడుదల చేశారు. కాకతీయ కెనాల్ ద్వారా 6 వేల క్యూసెక్కులు, లక్ష్మీ కెనాల్ ద్వారా 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీటి విడుదలతో రైతులు నారుమడులు పోసేందుకు సిద్ధమవుతున్నారు. * * హుజూర్‌నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పోలీసులు బైక్ దొంగల ముఠాను పట్టుకున్నారు. గురువారం ఉదయం సీఐ వి. నర్సింహారెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు చెందిన 8 మంది సభ్యుల ముఠా గత కొంతకాలంగా ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతోంది. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు గురువారం ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 22 బైక్‌లను స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు పంపారు. * * భువనగిరి: యాదాద్రి జిల్లా భువనగిరిలోని బ్యాంకుల వద్ద పింఛనుదారులు నిరసన తెలిపారు. స్థానిక ఆంధ్రా బ్యాంకు వద్ద ప్రభుత్వ పింఛను దారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు రూ. 10 వేలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయగా రూ. 4 వేలే ఇస్తున్నారని నిరసన తెలిపారు. గంటలకొద్దీ క్యూలైన్లలో తాము నిలబడలేమని, ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. * * వరంగల్: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 226 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి గురువారం కోర్టుకు హాజరు పరిచారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిలో 12 మందికి 2 రోజుల జైలుశిక్ష విధిస్తూ.. న్యాయస్థానం తీర్పు నిచ్చింది. దీంతో పాటు మద్యం రాయుళ్లకు రూ. 3.52 లక్షల జరిమానాలు విధించింది. * * మిర్యాలగూడ: గ్యాంగ్ స్టర్ నయీం కేసుకు సంబంధించి 25 మంది నిందితులను పోలీసులు ఈరోజు మిర్యాలగూడ కోర్టు ఎదుట హాజరుపరిచారు. చర్లపల్లి జైల్లో ఉన్న నిందితులను పలు కేసుల్లో విచారణ నిమిత్తం ఈ రోజు మిర్యాలగూడ కోర్టుకు తీసుకొచ్చారు. వారిలో నయీం భార్య, సోదరి, అత్త ఉన్నారు. విచారణ అనంతరం తిరిగి వారిని చర్లపల్లికి తరలించారు. * * కాఠ్మాండు: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరానికి దగ్గర్లోని ఒక హిమనీనద సరస్సులోని నీటిని గణనీయంగా తగ్గించామని నేపాల్‌ ప్రకటించింది. వాతావరణంలో మార్పుల వల్ల హిమనీనదాలు వేగంగా కరుగుతున్నాయి. ఆ నీరంతా కట్టలు తెంచుకుని కిందకు ప్రవహిస్తే మహావిపత్తు సంభవిస్తుంది. * * మేడ్చెల్‌: మేడ్చల్ జిల్లా కీసర మండలం కుందన్‌పల్లి చౌరస్తాలో మంగళవారం ఉదయం ఒక లారీ బీభత్సం సష్టించింది. వేగంగా వెళుతున్న లారీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడమే కాక ఎదురుగా వెళుతున్న స్కూటర్‌ను డీకొని పక్కనున్న ఎన్‌వీఆర్‌ పెట్రోల్‌ బంక్‌లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో స్కూటర్‌పై వెళుతున్న యూనస్, ఖాజా అనే యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వారిని 108లో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. * * నిజామాబాద్‌: బోధన్‌లోని నిజాం దక్కన్‌ సుగర్స్‌ కంపెనీ కార్మికులు, అఖిలపక్షం నేతలు మంగళవారం బోధన్‌ బంద్‌ నిర్వహిస్తున్నారు. దక్కన్‌ సుగర్స్‌ లే ఆఫ్‌ ఎత్తివేయాలని, కంపెనీని పునరుద్ధరించాలని కోరుతూ కంపెనీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ బంద్‌ చేపట్టారు. బంద్‌లో అన్ని కార్మిక సంఘాల వారు, కంపెనీ కార్మికులు, టీడీపీ, సీపీఐ, సీపీఎం తదితర పక్షాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. * * శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం తప్పింది. ఫ్లయిట్‌లో పంపించేందుకు ఓ ఏజెంట్ కార్గో ఏరియాకు తీసుకువచ్చిన కెమికల్స్ బాక్సు నుంచి పొగలు వెలువడ్డాయి. గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. * * జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో శుక్రవారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీస్ కమీషనర్ కమల్‌హాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో 100 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. అనుమానం ఉన్న ప్రతి ఇంటినీ జల్లెడ పట్టారు. సరైన పత్రాలు లేని 8 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. * * చేర్యాల(సిద్ధిపేట జిల్లా): చేర్యాల సమీపంలో దూల్మిట్ట క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో మద్దూరు సాక్షి విలేకరి సత్యం గౌడ్(28) మృతిచెందాడు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న సత్యంను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. * * హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖ పరిధిలో పోలీస్ కానిస్టేబుల్ (సివిల్/ఏఆర్/ఎస్‌ఏఆర్/టీఎస్‌ఎస్‌పీ), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్)లో కానిస్టేబుల్ (పురుష), అగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్ పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రం బుక్‌లెట్లు, ప్రాథమిక కీను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) మంగళవారం విడుదల చేసింది. www.tslprb.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని బోర్డు చైర్మన్ డాక్టర్ జె.పూర్ణచంద్రరావు తెలిపారు. * * నారాయణపూర్: యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలకేంద్రంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు ఇళ్లు, ఒక నగల దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనాస్థలానికి క్లూస్ టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. * * కారేపల్లి: కల్తీ మద్యం తయారు చేస్తున్న వారిని తీసుకెళ్తున్న ఆటో బోల్తా పడటంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఆ సమయంలో ఆటోను నడుపుతున్నది పోలీస్ కానిస్టేబుల్ కావటం గమనార్హం. వివరాలివీ.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పోలీసులు సోమవారం ఉదయం రేలకాయలపల్లి జైత్రాం తండా, జీత్యా తండాలపై దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా కల్తీ మద్యం తయారు చేస్తున్నారనే ఆరోపణలతో ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. * * యదాద్రి: భువనగిరిలో శనివారం తెల్లవారుజామున లారీ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌ చౌరస్తాలోని బస్టాండ్‌ వద్ద జనంపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీలో శనివారం తెల్లవారుజామున నుంచి పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సౌత్‌జోన్‌ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో కామటిపుర, బార్కాస్‌, వట్టేపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 21 మంది రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు, నాలుగు ఆయుధాలు, 65 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. * * హైదరాబాద్‌: నగరంలోని ఇందిరాపార్క్‌ వద్ద రేపు (ఆదివారం) ఉదయం 10 గంటలకు రైతు దీక్ష చేపట్టనున్నారు. ఈ రైతు దీక్షలో తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌, రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొననున్నారు. తెలంగాణ ఏర్పాడ్డాక తొలిసారి కోదండరామ్‌ దీక్షకు దిగుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం రైతు సమస్యలు పట్టించుకోవడం లేదని కోదండరామ్‌ దీక్షకు దిగుతున్నట్టు సమాచారం. * * వాజేడు: స్కూల్ పిల్లలను తరలిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వాజేడు మండలం జగన్నాథపురంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామం నుంచి వాజేడు పాఠశాలకు వెళ్తున్న స్కూల్ పిల్లల ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. * * పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎన్టీపీసీ(నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్) 7 యూనిట్‌ లో ఉత్పత్తి నిలిచి పోనుంది. ఈ అంశాన్ని అధికారులు తెలిపారు. ఏడో యూనిట్ వార్షిక మరమ్మత్తుల కోసం శుక్రవారం నుంచి ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీని వల్ల 500ల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచి పోనుంది. * * మునగాల(నల్గొండ): మునగాల మండలం ఇంద్రానగర్ వద్ద జాతీయ రహదారిపై గురువారం ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బీభ్సతం సృష్టించింది. వడ్ల లోడుతో ముందుగా సూర్యాపేట వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను గౌతమి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ మీద ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * కరీంనగర్ జిల్లా: రేణికుంట బ్రిడ్జి సమీపంలో రాజీవ్ రహదారిపై బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఓ బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో బైక్‌లో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనతో ఆ మార్గంలో ఒక కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * మిర్యాలగూడ (నల్గొండ జిల్లా): మిర్యాలగూడ పట్టణంలోని ఓ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణానికి చెందిన మారం శ్రీనివాస్(45) అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. భార్యాబిడ్డలతో కలిసి హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. రియల్‌ ఎస్టేట్‌లో నష్టాలు రావడంతో అప్పులపాలై బలవన్మరణానికి పాల్పడ్డాడు. * * శాన్ ఫ్రాన్సిస్కో : అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేగింది. శాన్ ఫ్రాన్సిస్కోలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు విద్యార్థులు గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా పలువురు విద్యార్థులు కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈక్విటీ జూన్ జోర్డాన్ స్కూల్ సిటీ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీ హైస్కూల్ బయట ఈ కాల్పులు జరిగాయి. * * గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజేష్(14) అనే విద్యార్థి మృతి చెందాడు. స్కూలుకు వెళ్లటానికి రోడ్డు పక్కన నిల్చున్న సమయంలో అటుగా వస్తున్న టాటా ఏస్ వాహనం అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలైన రాజేష్‌ను నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. మార్గమధ్యంలోనే ప్రాణాలొదిలాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. * * కరీంనగర్‌: హుజారాబాద్‌లో మంగళవారం తెల్లవారుజామున నుంచి పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరానగర్‌, బుడగ జంగాల కాలనీల్లో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ జరిపారు. కార్డెన్‌ సర్చ్‌లో భాగంగా సరైన పత్రాలు లేని వాహనాలను ఆపి తనిఖీలు చేపట్టారు. * * అబ్దుల్లాపూర్‌మెట్ : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాచారం గ్రామంలోని సాయిప్రియ కెమికల్ పరిశ్రమలో మంగళవారం ఓ బాయిలర్ పేలి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. మృతుడు బిహార్‌కు చెందిన శివ చాంద్‌బీన్(31)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. * * మరిపెడ(వరంగల్‌): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన వరంగల్‌ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్‌ సాయంతో ఆస్పత్రికి తరలించగా అందులో ఒకరి పరిస్థతి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. * * నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో ఆదివారం అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో ఒక లారీ కాలిపోయింది. ఆదిలాబాద్ వైపు నుంచి నిర్మల్ వెళ్తున్న నిమ్మకాయల లోడ్ లారీలో నేరడిగొండ వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.అవి వేగంగా లారీ అంతటా వ్యాపించటంతో అప్రమత్తమైన లారీ డ్రైవర్, క్లీనర్ కిందికి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు.అనంతరం లారీ అగ్నికి ఆహుతయింది. కారణాలు తెలియాల్సి ఉంది. లారీడ్రైవర్ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. * * చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సుమారు రెండు వారాలుగా ఆసుపత్రికే పరిమితమయ్యారు. ఆమె చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రి డాక్టర్లు ముఖ్యమంత్రి కోలుకుంటున్నారని.. మరికొంత కాలం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పాలన కుంటుపడకుండా తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయచర్యలపై ఏఐఏడీఎంకే నేతలు దృష్టి పెట్టినట్లు సమాచారం. * * హైదరాబాద్: నాంపల్లిలో అన్ని ఆధునిక హంగులతో పోలీస్స్టేషన్ నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నరసింహరెడ్డి తెలిపారు. శనివారం ఉదయం పోలీస్స్టేషన్ కొత్త భవనానికి నాయిని నర్సింహారెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతోపాటు నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి, ఇతర పోలీసులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. * * ఐక్యరాజ్యసమితి: కర్బన ఉద్గారాలను తగ్గించుకునే ఒప్పందంపై మెజారిటీ దేశాలు సంతకాలు చేయడంతో నవంబర్‌ 4 నుంచి ప్యారిస్‌ ఒప్పందం అమల్లోకి వస్తుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ బాన్‌ కీ మూన్‌ వెల్లడించారు. దీన్నోక చిరస్మరణీయ ఘటనగా అవర్ణించారు. * * హైదరాబాద్ : మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురిని మల్కాజిగిరి సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా కీసరకు చెందిన యు.బలరాం, కృష్ణ, నర్సింహ అనే వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బొమ్మ పిస్టళ్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. * * కథలాపూర్(కరీంనగర్) : ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు అక్కడే ఉన్న హుండీని ఎత్తుకుపోయారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం కలిగోట గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం అర్థరాత్రి సత్యనారాయణ స్వామి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు గర్భగుడిలో విలువైన వస్తువులు ఏమీ లేకపోవటంతో హుండీని పెకిలించుకు పోయారు. శుక్రవారం ఉదయం గమనించిన పూజారి గ్రామ పెద్దలకు సమాచారం అందించారు. ఈ మేరకు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. * * కౌడిపల్లి: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారం గేటు వద్ద రాస్తారోకో జరిగింది. సలబాత్తపూర్ పంచాయతీని కొత్తగా ఏర్పాటు చేస్తున్న చిలిప్‌చేడ్ మండలంలో కాకుండా కౌడిపల్లి మండలలోనే కొనసాగించాలని ఆ పంచాయతీ ప్రజలు డిమాండ్ చేశారు. సుమారు 30 నిమిషాల పాటు రాస్తారోకో జరగడంతో మెదక్-నర్సాపూర్ రహదారిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. * * సిద్ధిపేట(మెదక్ జిల్లా) : సిద్ధిపేట మండలకేంద్రం గణేశ్ నగర్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికంగా నివాసముంటున్న శ్రీశైలం, పదయ్య, నర్సింహులు అనే ముగ్గురి ళ్లలో చోరీకి పాల్పడ్డారు. మూడిళ్లలో కలిపి 2 తులాల బంగారం, రూ.10 వేల నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. * * కొణిజర్ల(ఖమ్మం జిల్లా) : కొణిజర్ల మండలకేంద్రంలోని ఎండీఓ ఆఫీసు వద్ద గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. అదే సమయంలో అటుగా వచ్చిన మరో లారీ వచ్చి ఈ రెండు లారీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురికి గాయాలయ్యాయి. ఇదేవిధంగా కొణిజర్ల పోలీస్‌స్టేషన్ సమీపంలో లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఖమ్మం తరలించారు. * * కొత్తకోట(మహబూబ్‌నగర్) : మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటలో ఓ మహిళ దారుణంగా హత్యకు గురైంది. మండల కేంద్రంలోని వడ్డెవాడ సమీపంలోని ముళ్ల పొదల్లో ఓ మహిళ(50) మృత దేహం పడి ఉండగా గురువారం ఉదయం స్థానికులు కనుగొన్నారు. ఎక్కడో చంపి ఇక్కడ పడేసి ఉంటారని భావిస్తున్నారు. ఆమె స్థానికురాలు కాదని చెబుతున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవాల్సి ఉంది. * * హైదరాబాద్ : ముగ్గురు యువకులు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన ఘటనలో గాయపడిన చిన్నారి సంజన బ్రెయిన్ డెడ్ కాలేదని కామినేని ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రసాదరావు వెల్లడించారు. అయితే ఆమె పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. బుధవారం హైదరాబాద్లో ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రసాదరావు విలేకర్లతో మాట్లాడుతూ... చిన్నారి సంజన పరిస్థితి విషమంగానే ఉందన్నారు. * * శంషాబాద్(రంగారెడ్డి) : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆరేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడింది. హైదరాబాద్ కొత్తపేటకు చెందిన అరవింద్‌రావు దంపతులు తమ కూతురు నవ్య(6)తో కలసి బంధువులకు వీడ్కోలు చెప్పేందుకు మంగళవారం రాత్రి ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో చిన్నారి నవ్య డిపార్చర్ రైలింగ్ పైనుంచి కిందపడి పోయింది. తలకు తీవ్ర గాయాలుకాగా చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. వెంటనే జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. * * కీసర(రంగారెడ్డి) : డంపింగ్ యార్డు కారణంగా చెరువు నీరు కలుషితం అవుతోందంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వివరాలివీ.. రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాల సమీపంలో జీహెచ్‌ఎంసీ డంపింగ్ యార్డు ఉంది. ఈ యార్డు నుంచి వెలువడే వ్యర్థ జలాలు పక్కనే ఉన్న చెరువులో కలుస్తున్నాయి. సాగు నీరు కలుషితమవుతోందంటూ కొన్ని రోజులుగా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ఇదే విషయమై ఒక్కటైన గ్రామస్తులు బుధవారం ఉదయం చెత్తను తీసుకువచ్చే జీహెచ్‌ఎంసీ వాహనాలను అడ్డుకున్నారు. * * హైదరాబాద్ : కూకట్‌పల్లి జేఎన్‌టీయూ పరిపాలన విభాగంలో భారీగా మార్పులు, చేర్పులు చేస్తూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారు. డెరైక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్‌గా ఉన్న ఈశ్వరప్రసాద్‌ను సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూ ప్రిన్సిపాల్‌గా నియమించారు. అడ్మిషన్స్ డెరైక్టర్‌గా మంజూర్ హుస్సేన్‌ను, ఎగ్జామినేషన్స్ కంట్రోలర్‌గా తార కల్యాణి, బిక్స్ డెరైక్టర్‌గా లక్ష్మణరావు, డీయూఎఫ్‌ఆర్‌గా చెన్నకేశవరెడ్డిని నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. * * బాల్కొండ(నిజామాబాద్ జిల్లా) : ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 2 లక్షల 4 వేల 939 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్ధ్యం 90.313 టీఎంసీలు కాగా ప్రస్తుతం 89.763 టీఎంసీల నీరు ఉంది. కాకతీయ కెనాల్‌కు 5 వేల క్యూసెక్కులు, సరస్వతీ కెనాల్‌ఖు 1000 క్యూసెక్కులు, లక్ష్మీ కెనాల్‌కు 300 క్యూసెక్కులు, ఎస్కేప్ రెగులేటర్‌కు 3 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. మొత్తం 74,939 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. * * కరీంనగర్ : ప్రమాదవశాత్తు మూడు ఎలుగు బంట్లు వ్యవసాయ బావిలో పడి మరణించాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం శ్రీరాములపేటలో సోమవారం చోటు చేసుకుంది. ఆ విషయాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించారు. దీంతో గ్రామస్తులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని... ఎలుగు బంట్లను బావిలో నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. * * హైదరాబాద్ : పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్న ఓ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. కుషాయిగూడ నాగార్జుననగర్ కాలనీకి చెందిన ఇందుభార్గవి(19), చాంద్ అలీ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారి వివాహానికి పెద్దలు అంగీకరించకపోవటంతో రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. అనంతరం తమకు ప్రాణాహాని ఉందని, బంధువుల నుంచి రక్షణ కల్పించాలంటూ మంగళవారం కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు. * * కెరామెరి(ఆదిలాబాద్ జిల్లా) : కెరామెరి మండలం కెలికే గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గౌరూభాయ్(60), బ్యీసన్(30) అనే తల్లీ కొడుకులు ప్రమాదవశాత్తూ తమ పొలంలో కరెంటు షాక్ తగిలి మృతిచెందారు. ఈ సంఘటన నిన్ననే జరిగినా ఆలస్యంగా బయటపడింది. తల్లీకొడుకు మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. * * హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు కనిపించటం కలకలం రేపింది. లక్నో వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడి లగేజిని తనిఖీ చేయగా మూడు బుల్లెట్లు బయటపడ్డాయి. దీంతో భద్రతా సిబ్బంది అతడిని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. * * మహబూబ్‌ నగర్: మహబూబ్‌ నగర్ జిల్లా మరికల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృత్యువాతపడ్డారు. శనివారం ఉదయం రెండు లారీలు వేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో రెండు లారీల డ్రైవర్లు క్యాబిన్‌లోనే ప్రాణాలు విడిచారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో రాయిచూర్ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని వాహనాలను పక్కకు తొలగించేందుకు యత్నిస్తున్నారు. క్షతగాత్రులను మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. * * ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బాసరలో వేంచేసి ఉన్న సరస్వతీ మాత సన్నిధిలో దసరా ఉత్సవాలు మొదలయ్యాయి. మొదటిరోజు శైలిపుత్రిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తోంది. శనివారం వేకువజాము నుంచి భక్తులు దర్శనం కోసం క్యూకట్టారు. భైంసాపట్టణానికి చెందిన వ్యాపారవేత్త జి.రమేష్ కుటుంబసభ్యులు అమ్మవారికి రెండు తులాల బంగారు గొలుసును సమర్పించుకున్నారు * * కరీంనగర్ : ఎగువ ప్రాంతాల నుంచి వరదతో కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు జలాశయం పూర్తిస్థాయిలో నిండింది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 920 అడుగులు కాగా.. ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం కొనసాగుతోంది. జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి 16,000 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో.. 8 గేట్లు ఎత్తి 16,000 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. కాకతీయ కాలువకు మరో 2, 000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. * * డిచ్‌పల్లి: వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టిన ఘటనలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టడంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జాం అయింది. * * కరీంనగర్ : లోయర్ మానేరు డ్యామ్‌కు వరద తగ్గుముఖం పట్టింది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 920 అడుగులు, నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా గురువారం ఉదయం ఎనిమిది గంటలకు 919.40 అడుగులు, 23.51 టీఏంసీల నీరు ఉంది. డ్యామ్‌కు ఇన్‌ఫ్లో 10,800 క్యూసెక్కులు ఉండగా.. కాకతీయ కెనాల్ ద్వారా 5,000 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. * * శంషాబాద్ : పిల్లర్ కోసం తీసిన గుంటలో పడి బాలుడు మృతిచెందిన సంఘటన శంషాబాద్ మిషన్‌కంపౌడ్ సమీపంలోని శీనయ్య వెంచర్‌లో గురువారం వెలుగుచూసింది. స్థానిక శీనయ్య వెంచర్‌లో కార్మికులుగా పనిచేస్తున్న హరీష్, యాదమ్మ దంపతుల ఆరేళ్ల కుమారుడు బాలు పిల్లర్ గుంటలో పడి మృతిచెందాడు. శ్రీనయ్య వెంచర్‌లో పిల్లర్‌ల కోసం గుంటలు తవ్వారు. అందలో వర్షపు నీరు చేరడంతో ప్రమాదవశాత్తు బాలుడు అందులో పడి మృతిచెందాడు. * * ధర్మసాగర్(వరంగల్) : వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ధర్మసాగర్ సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న కేశబోయిన దేవేందర్(34) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో రాత్రి ప్యాసింజర్‌ను దించి ఇంటికి తిరిగి వస్తుండగా.. ఆటో బోల్తా కొట్టడంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటాన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. * * పెద్దమందడి(మహబూబ్‌నగర్) : వేగంగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన ఘటనలో బస్సు డ్రైవర్, క్లీనర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా పెద్దమందడి మండలం మోజెర్ల స్టేజీ సమీపంలో 44వ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. * * హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లి మూసాపేటలో బుధవారం వేకువజామున దారుణం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు స్నేహితులను వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో బైక్ వెనుక కూర్చున్న హరికృష్ణ(28) అనే యువకుడు మృతిచెందాడు. స్నేహితుని మరణాన్ని జీర్ణించుకోలేని రమేష్(28) భరత్‌నగర్ రైలు పట్టాలపై ఆత్మహత్యచేసుకున్నారు. హరికృష్ణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాగా రమేష్ శ్రీశ్రీ హోలిస్టిక్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. * * హైదరాబాద్ : భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని నీటి ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తింది. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.30 అడుగులకు వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 200.658 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు బుధవారం వెల్లడించారు. * * నిజాంసాగర్(నిజామాబాద్ జిల్లా) : నిజామాబాద్ జిల్లాలోని నిజామ్‌సాగర్‌కు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి నిజాంసాగర్‌కు 1.16లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 19 గేట్లు ఎత్తివేసి 1.03 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. * * మెదక్ : మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం చిల్వర వద్ద మంగళవారం రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. * * చెన్నై: చెన్నైలో ఓలా క్యాబ్ డ్రైవర్ ఓ మహిళా డాక్టర్పై లైంగికదాడికి ప్రయత్నించాడు. మరో ఇద్దరితో కలసి ఆమెను బలవంతంగా కారులో తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కారు వెనుక వాహనంలో వెళ్తున్న ఓ వ్యక్తి డాక్టర్ అరుపులు విని చేజ్ చేసి స్థానికులతో కలసి ఆమెను రక్షించాడు. * * శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 200 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా(ఏఐ-559) విమానం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నిలిపేశారు. ఉదయం 6.40 వెళ్లాల్సిన విమానం ఇప్పటికీ బయలుదేరకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఇంత జరుగుతున్నా ఎయిర్ ఇండియా అధికారులు మాత్రం తమకేం బాద్యత లేనట్లు వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. * * ఖమ్మం : రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. దాదాపు అన్ని చెరువులు, కుంటల్లో నీరు ప్రమాదస్థాయికి చేరుకుంది. ఖమ్మం జిల్లా చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు బుధవారం ఉదయం ప్రాజెక్ట్ పదిగేట్లను ఎత్తివేసి... 23,730 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. * * కరీంనగర్ : ఎస్సారెస్సీ ప్రధాన కాలువకు గండిపడటంతో.. వందల ఎకరాల్లో పంట నీట మునిగింది. కరీంనగర్ జిల్లా మానాల సమీపంలో గల ఎస్సారెస్సీ ప్రధాన కాలువకు మంగళవారం రాత్రి భారీ గండి పడింది. దీంతో పెగడపల్లి, గొల్లపల్లి మండలాల పరిధిలోని చెరువులన్ని నిండిపోయాయి. సుద్దపల్లిలోని కొయ్యచెరువు, రాఘవపట్నంలోని మొగుళ్ల చెరువుకు గండి పడటంతో.. వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. * * హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాల్లో కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్న ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య విద్య సీట్లకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకూ వెబ్ ఆప్షన్ల నమోదుకు గడువు ఉంటుందని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ కరుణాకరరెడ్డి తెలిపారు. * * శంషాబాద్ : దుబాయ్ వెళుతున్న అహ్మద్ అనే వ్యక్తి నుంచి మంగళవారం ఉదయం భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహించగా అహ్మద్ వద్ద భారీగా విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. నిందితుని అదుపులోకి తీసుకుని విచారణచేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * హైదరాబాద్ : ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేసంలో ఆయన పాల్గొనున్నారు. ముఖ్యమంత్రి తోపాటు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కూడా ముఖ్యమంత్రి బృందంతో పర్యటించనున్నారు. * * హైదరాబాద్‌: నాంపల్లిలోని టీఎన్‌జీవో కార్యాలయంలో సోమవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీలో పనిచేస్తున్న సుమారు 700 మంది నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగులను తెలంగాణకు బదిలీ చేయాలంటూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పెట్రోల్‌ డబ్బాలతో టీఎన్‌జీవో కార్యాలయంలోకి ఉద్యోగులు వెళ్లడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. * * దుగ్గొండి(వరంగల్) : ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో.. బైక్‌పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. * * తిర్యాని: స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఆశ్రమ పాఠశాల విద్యార్థి వాగులో మునిగి మృతి చెందాడు. అదిలాబాద్ జిల్లా తిర్యాని మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న కె. లక్ష్మణ్‌రాహూల్(12) ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి సమీపంలోని వాగులో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. * * చొప్పదండి: కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలంలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. భూపాలపట్నంకు చెందిన మునిగాల అంజయ్య (48) అప్పులబాధతో గ్రామశివారులోని పశువుల కొట్టం వద్ద ఉరివేసుకొని బలవన్మరణం చెందాడు. స్థానిక రైతులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. గ్రామంలో 4.38 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా గత కొన్నేళ్లుగా వ్యవసాయంలో నష్టాలు రావడంతో రూ.5లక్షలకు పైగా అప్పులయ్యాయి. వాటిని తీర్చే మార్గం లేక మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. * * హైదరాబాద్ : తెలంగాణ విమోచన దినం నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో జాతీయ జెండా ఎగరేసేందుకు బీజేపీ ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి యత్నించారు. అందులోభాగంగా ఆయన వాహనంలో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే కిషన్రెడ్డి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు... కిషన్రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. * * మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తిని రేవెన్యూ డివిజన్ చేయాలంటూ కల్వకుర్తి MLA అయిన చల్లా వంశీచంద్ రెడ్డి చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి అరెస్ట్ చేసారు. * * చర్ల: ఖమ్మం జిల్లా తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉదృతి పెరిగింది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన 9 గేట్లను 2 అడుగుల మేర ఎత్తారు. 8400 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు నుంచి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 73.6 మీటర్లుగా ఉంది. * * నల్గొండ : నల్గొండ జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టులో నీటి మట్టం బుధవారం 47.59 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టులోకి 29,373 క్యూసెక్కుల నీరు వస్తుండగా..9,929 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు నుంచి అధికారులు బయటికి వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 21.30 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు. * * నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా దోమకొండలో ఓ బాలుడు ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ తగిలి మరణించాడు. వివరాలు ఇలా ఉన్నాయి... వివేక్ (16) అనే బాలుడు బుధవారం వేకువజామున ప్రమాదవశాత్తూ కరెంటు షాక్‌కు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని రుద్ర ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాద్దిసేపటికే మరణించాడు. * * నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్ర శివారులో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఇద్దరికి మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డారు. బస్సు ముందు భాగం మాత్రం దెబ్బతిన్నది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. * * యాలాల: రంగారెడ్డి జిల్లా యాలాల శివారులో ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ మండలం హుస్నాపూర్ గ్రామానికి చెందిన వెంకటయ్య, యోగి జీవనోపాధి కోసం వచ్చి రంగారెడ్డి జిల్లాలో స్థిరపడ్డారు. * * కరీంనగర్: కరీంనగర్ జైలు నుంచి ఇద్దరు దొంగలు పరారీ అయ్యారు. వీరి కోసం కరీంనగర్ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జైలు నుంచి పరారైన వారు మహారాష్ట్ర పార్సీ గ్యాంగ్కు చెందిన జితేందర్, యోగేశ్లుగా గుర్తించారు. * * హైదరాబాద్: పాతబస్తీ భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తలాబ్‌కట్ట, అమన్ నగర్ ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్‌నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన దృవపత్రాలు లేని 83 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. * * శంషాబాద్ (హైదరాబాద్‌): శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రంయలో తనిఖీలు నిర్వహిస్తున్న కస్టమ్స్ అధికారులు అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 320 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద అక్రమ బంగారం గుర్తించిన ఎయిర్‌పోర్ట్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. * * నార్కెట్‌పల్లి(నల్లగొండ): వేగంగా వెళ్తున్న కారు, లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి శివారులోని 65వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. * * ములుగు: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు నీటిగుంటలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ములుగు మండలం బండారుపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏడాదిన్నర చిన్నారి తల్లిదండ్రులు పనులు చూసుకుంటుండగా.. చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందు ఉన్న నీటిగుంటలో పడి మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. * * కోరుట్ల: మోటర్ పెట్టడానికి వ్యవసాయ బావి దగ్గరకు వెళ్లిన రైతు ప్రమాదవశాత్తు విద్యుధ్ఘాతానికి గురై మృతి చెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాంరెడ్డి(45) ఈ రోజు ఉదయం మోటర్ ఆన్ చేయడానికి వెళ్లాడు. అయితే షార్ట్ సర్క్యూట్ కావడంతో కరెంట్ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. * * పంజగుట్ట: మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ నిమ్స్‌ ఆసుపత్రి ఓపీలో రెప్పపాటులో రూ. 40 వేలు చోరీ చేసింది. అక్కడే విధుల్లో ఉన్న ఓ మహిళా గార్డు ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం ... నాంపల్లికి చెందిన గౌసియా బేగం (32) బుధవారం మధ్యాహ్నం నిమ్స్‌ ఆసుపత్రి ఓపీ వద్దకు వచ్చింది. * * మహేశ్వరం: వేగంగా వెళ్తున్న లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టిన ఘటనలో క్లీనర్ మృతిచెందగా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం రావిర్యాల ఔటర్ రింగ్‌ రోడ్డుపై గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పెద్ద అంబర్‌పేట్ నుంచి వస్తున్న లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టింది. * * తాండూరు(రంగారెడ్డి): కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ఎం. మాణిక్‌రావు(86) నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాణిక్‌రావును కుటుంబ సభ్యులు నిమ్స్ ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందారు. * * దమ్మపేట: దుక్కి దున్నుతున్న ట్రాక్టర్‌పై విద్యుత్ స్తంభం విరిగిపడటంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లిలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లకావత్ చిట్టయ్య(35), ధారావత్ మహేష్(22)లు ట్రాక్టర్ సాయంతో దుక్కిదున్నతున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం విరిగిపడింది. దీంతో ట్రాక్టర్ పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. * * హైదరాబాద్: జిల్లాల పునర్విభజన విషయంలో అధికార టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను కలసి తమ అభ్యంతరాలను తెలిపారు. మంగళవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిలు సచివాలయంలో సీఎస్‌ను కలసి వినతి పత్రం అందజేశారు. * * హైదరాబాద్ : దసరా నుంచి కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు అన్నీ ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. జిల్లా కలెక్టర్లతో ఆయన ఈ విషయమై సమావేశమయ్యారు. కొత్త జిల్లాల్లో పనిభారాన్ని బట్టి పరిపాలనా విభాగాలు ఉండాలని తెలిపారు. అధికారుల సర్దుబాట్లు, కొత్త ఉద్యోగుల నియామకాలు జరగాలని సూచించారు. * * సంగారెడ్డి: మెదక్ జిల్లా పటాన్‌చెరు ఇస్నాపూర్ వద్ద సోమవారం అర్థరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. వేగంగా వచ్చిన ట్యాంకర్ లారీ ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో బైక్‌పై వెళుతున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. * * మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సివిల్ జడ్జి నాగరాజు ఇంట్లో దొంగలు పడి బీభత్పం సృష్టించారు. జడ్జి కుటుంబసభ్యులు ఊరు వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగింది. ఇరుగుపొరుగువారు ఇచ్చిన సమాచారం మేరకు మిర్యాలగూడ పోలీసులు క్లూస్ టీమ్‌తో చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. జడ్జికి సమాచారం ఇచ్చారు. * * నల్గొండ : భువనగిరిలో గ్యాంగ్స్టర్ నయీం అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై స్థానిక ఆర్డీవో శనివారం విచారణ జరపనున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 1700 మంది బాధితులు ఇప్పటికే ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. నల్గొండ జిల్లా బొమ్మాయిపల్లిలోని లక్ష్మీనరసింహ వెంచర్లో 1700 మందికి చెందిన ప్లాట్లను నయీం తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. * * హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-2 రాత పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2015 డిసెంబర్ 30న 439 పోస్టుల భర్తీకి జారీ అయిన నోటిఫికేషన్ కింద ఇప్పటికే 5,64,431 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, మరో 593 పోస్టుల భర్తీకి ప్రస్తుత అనుబంధ నోటిఫికేషన్ కింద మరో లక్షన్నర మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. * * హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య మరో వివాదం తలెత్తింది. సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న 21 మంది తెలంగాణ ఇంజినీర్లు తమను ఏపీ జెన్ కో అధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమపై జెన్ కో అధికారులు పరిమితికి మించిన పనిభారం మోపుతున్నారని పేర్కొటూ.. మూడు రోజులుగా తెలంగాణ ఇంజనీర్లు విధులకు హాజరవడం మానేశారు. * * వరంగల్ ఎంజీఎం: వరంగల్ జిల్లా కేంద్రంలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. స్థానిక లేబర్ కాలనీకి చెందిన సంధ్య అనే మహిళకు మొదటికాన్పులో ముగ్గురు ఆడ శిశువులు పుట్టారు. ఈ సంఘటన వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో శనివారం చోటుచేసుకుంది. శనివారం ఉదయం 8 గంటల సమయంలో ఆసుపత్రి వైద్యులు మహిళకు సర్జరీ చేసి ముగ్గురు శిశువులను బయటకు తీశారు. ముగ్గురూ ఆరోగ్యంగా ఉన్నారు. * * హైదరాబాద్: ఇటీవల పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన గ్యాంగ్‌స్టర్ నయీం ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. శేషన్న ప్రధాన అనుచరుడు సోమన్నఇచ్చిన సమాచారం మేరకు నగరంలోని కుషాయిగూడలో సిట్ అధికారులు గురువారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నయీం అనుచరులు శ్రీనివాస్, లక్ష్మణ్‌లను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని తమ కార్యాలయానికి తరలించారు. నయీంకు సంబంధించిన మరింత అదనపు సమాచారం కోసం సిట్ అధికారులు వారిని విచారిస్తున్నారు. * * కరీంనగర్: నేడు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె కరీంనగర్ జిల్లాలో సంపూర్ణంగా కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాలయాలు సంపూర్ణంగా బంద్ పాటిస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జిల్లాలో 11 డిపోలలో మొత్తం 980 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. * * నల్లగొండ: దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నేపథ్యంలో యాదగిరిగుట్టలో కార్మిక సంఘాలు సమ్మెలో పాల్పంచుకున్నాయి. ఆర్టీసీ కార్మకులు కూడా ఈ సమ్మెలో పాల్గొనడంతో.. యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోకు చెందిన 105 బస్సులు డిపోలోపలే ఉండిపోయాయి. దీంతో యాదగిరిగుట్టకు వచ్చే భక్తులు, ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ వాహనదారులు తమకు ఇష్టం వచ్చిన రీతిలో ప్రయాణికుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. * * యాదగిరిగుట్ట : నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని సాయిబాబా మందిరంలో వినాయకుడి రూపంలో అల్లం దర్శనమివ్వడంతో.. స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలకు ముందు ఇలా జరగడం శుభ పరిణామమని భక్తులు భావిస్తున్నారు. స్థానిక సాయి ఆలయంలో అన్నదానం కోసం కొనుగోలు చేసిన అల్లంలో పార్వతి పుత్రుడి ప్రతిమ రూపంలో ఉన్న అల్లం లభించిందని ఆలయ సిబ్బంది తెలిపారు. ఈ వార్త తెలిసిన ప్రజులు పెద్ద ఎత్తున అల్లం వినాయకుడిని దర్శించుకోవడానికి తరలి వస్తున్నారు. * * నల్లగొండ: నల్లగొండ జిల్లా దామరచర్లలో దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు గురువారం రట్టు చేశారు. అందుకు సంబంధించి నలుగురు వ్యక్తులకు పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక కిరాణా దుకాణంలో నకిలీ నోట్లు మారుస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని... తమదైన శైలిలో విచారించారు. * * హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురంలో సుష్మా థియేటర్ వద్ద బ్లాక్లో టికెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 50 సినిమా టికెట్లతోపాటు రూ. 2 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీసుస్టేషన్కు తరలించారు. * * హైదరాబాద్‌ జిల్లాలో 49,903 పింఛన్లకు కోత పడనుంది. ప్రభుత్వం చేపట్టిన లెఫ్‌ ఎవిడెన్స్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ బుధవారంతో ముగియడం నిజమైన పింఛన్‌దారుల లెక్కతేల నుంది. 36,512మంది వెరిఫికేషన్‌ చేయించుకోకపోగా, వెరిఫికేషన్‌ ప్రక్రియలో పాల్గొన్నా వేలిముద్రలు సరిపోలకపోవడం, ఆధార్‌తో లింకు కలువని 11,392 మందికి పింఛన్లు నిలిచిపోనున్నాయి. ఆధార్‌ లింకు మ్యాచ్‌ కాని వా రు మళ్లీ కొత్తగా ఆధార్‌ నమోదు చేసుకోవాల్సి ఉంది. * * మెదక్ : మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ వద్ద గురువారం వ్యాన్ను స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి... వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. * * ఖమ్మం: జిల్లాలో భారీగా ఎస్సైలు బదిలీ అయ్యారు. జిల్లాలోని దాదాపు 58 మంది ఎస్సైలకు స్థానచలనం కల్పిస్తూ జిల్లా ఎస్పీ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఎస్సైలుగా విధులు నిర్వహిస్తున్నవారితోపాటు... కొత్తగా ఎస్సై ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి కూడా ఈ బదిలీల్లో పోస్టింగ్ ఇస్తున్నట్లు ఎస్పీ ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. * * హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన బాట చేపట్టాయి. అందులోభాగంగా గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు కళాశాలల బంద్కు సదరు యాజమాన్యం పిలుపు నిచ్చింది. * * లాస్‌ఏంజిలెస్: అంగారక గ్రహం ఉపరితలంపై ఉన్న పరిస్థితులను భూభాగంపై సృష్టించి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా జరిపిన అరుదైన ప్రయోగం విజయవంతంగా ముగిసింది. ఈ మేరకు నాసా అమెరికాలోని హవాయి రాష్ట్రంలో అంగారక గ్రహం పరిస్థితుల్లో మానవుడి మనుగడ సాధ్యమా అన్న అంశంపై పరిశోధన నిర్వహించింది. ఆరుగురి బృందంతో ఏడాది క్రితం ప్రారంభించిన ఈ ప్రయోగం సోమవారం ముగిసింది. * * నేడు ఐసెట్ ప్రవేశాలకు కొనసాగుతున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ - 50,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు నేడు వెరిఫికేషన్ - ఎన్సీసీ కేటగిరిలో 30,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ * * హైదరాబాద్: స్విస్ ఛాలెంజ్ పై నేడు హైకోర్టులో విచారణ * * హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ కోసం 1969లో జరిగిన ఉద్యమంలో పాల్గొని పోలీస్ కాల్పుల్లో గాయపడ్డ హైదరాబాద్ వాసి పగడాల పరంధామకు రూ.10 లక్షల ఆర్థికసాయం అందించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. 1969 ఏప్రిల్ 4న సికింద్రాబాద్ జనరల్ బజార్‌లో జరిగిన కాల్పుల్లో పరంధామ ఛాతిలో, కుడి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. * * లాస్ ఎంజెల్స్: లాస్ ఎంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎలాంటి కాల్పుల ఘటనలు చోటుచేసుకోలేదని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఒక పెద్ద శబ్దం మాత్రమే వచ్చి దాన్ని ఎయిర్ పోర్ట్ సిబ్బంది కాల్పులుగా భ్రమపడ్డారని చెప్పారు. అమెరికాలోని లాస్ ఎంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాల్పులు చోటుచేసుకున్నాయని తొలుత కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. * * విశాఖపట్నం: రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం సూచించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని వెల్లడించింది. * * హైదరాబాద్: తమ డిమాండ్లను తీర్చి, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఎన్‌ఎంలూ మంత్రి నివాసం ముట్టడికి యత్నించారు. సోమవారం ఉదయం మణికొండలోని మంత్రి లక్ష్మారెడ్డి ఇంటి వద్దకు భారి ఎత్తున చేరుకున్న ఏఎన్‌ఎంలు ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి సమ్మె విరమించి వస్తే సమస్య సరిష్కారానికి కృషి చేస్తానని హామి ఇచ్చారు. * * బిర్కూర్ : నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండల కేంద్రంలోని తిరుమల దేవస్థానంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు శనివారం ఉదయం వరుణయాగం నిర్వహించారు. దేవస్థానం ఆవరణంలోని గణపతి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. * * న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో 118 మందితో కూడిన భారీ బృందాన్ని పంపిస్తే కేవలం రెండు పతకాలు మాత్రమే దక్కడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది. వచ్చే మూడు ఒలింపిక్స్‌లలో పతకాలు కొల్లగొట్టేందుకు సమగ్ర కార్యాచరణ పథకాన్ని అమలు చేసేందుకు టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. * * హైదరాబాద్‌సిటీ: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపించారు. రాజేంద్రనగర్ పరిధిలోని గగన్‌పహాడ్ వద్ద హైదరాబాద్-బెంగుళూరు జాతీయరహదారిపై రవాణాశాఖాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 10 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. తనిఖీలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. * * మియామి: అతను చెవిటి వ్యక్తి. సంకేత భాషలోనే ఎవరితోనైనా ముచ్చటిస్తాడు. వేగంగా వాహనాన్ని నడుపుతున్నాడనే సాకుతో అతన్ని ఓ జవాను వెంబడించాడు. ఇద్దరి మధ్య 13 కిలోమీటర్ల పాటు హోరాహోరీగా ఛేజింగ్ జరిగింది. చివరకు అతను తన ఇంటికి సమీపంలో వాహనాన్ని ఆపాడు. వాహనం దిగిన అతన్ని జవాను తుపాకీతో కాల్చాడు. సంఘటనా స్థలంలోనే అతను కుప్పకూలాడు. అమెరికాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దుమారం రేపుతోంది. * * అహ్మదాబాద్: ఓ సీనియర్ జర్నలిస్టు ఏకంగా పత్రికా కార్యాలయంలోనే దారుణంగా హత్యకు గురయ్యాడు. కార్యాలయంలో కూర్చుని వార్తాకథనం రాస్తుండగా దుండగులు ఆయనను కిరాతకంగా పొడిచి చంపారు. నెత్తుటి మడుగులో ఉన్న ఆయన మృతదేహాన్ని మంగళవారం పోలీసులు గుర్తించారు. గుజరాత్ సౌరాష్ట్ర ప్రాంతంలోని జునాగఢ్ పట్టణంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. * * హిమాయత్‌నగర్‌: రోడ్డు, రవాణా భద్రతా బిల్లు, ఆర్టీఏ, ట్రాఫిక్‌ పోలీసుల వేధింపులకు నిర సనగా సెప్టెంబర్‌ 2న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఆటోడ్రైవర్ల సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నాయకులు తెలిపారు. హిమాయత్‌నగర్‌లోని ఎఐటియుసి భవన్‌లో సోమవారం బంద్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో లక్ష్మయ్య పాల్గొన్నారు. * * పంజగుట్ట: గణేష్‌ ఉత్సవాలను గతంలో మాదిరిగానే నిర్వహించుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసినా పోలీసు అధికారులు నిబంధనల పేరుతో వేధించడం తగదని భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ప్రతినిధులు అన్నారు. గణేష్‌ నిమజ్జనంతో కాలుష్యం వెలువడటం లేదని పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు నివేదిక ఇచ్చిందని, ఎత్తు విషయంలో జోక్యం చేసుకోబోమని హైకోర్టు పేర్కొన్నా ఎత్తు తగ్గించాలని ఒత్తిడి చేయడం దారుణమన్నారు. * * హైదరాబాద్: మాజీ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డిని కరీంనగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మావోయిస్టు, గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీమ్ తరహాలోనే మోహన్‌రెడ్డి అరాచకాలకు పాల్పడేవాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గ్యాంగ్‌స్టార్‌ నయీం ముఠాతో సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు. నిన్న రాత్రి (సోమవారం) 8 గంటలకు మోహన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. * * ఇస్తాంబుల్ : ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన 12 ఏళ్ల ఆత్మాహుతి బాంబర్.. టర్కీలో ఉగ్రవాద దాడి చేసి, 51 మంది ప్రాణాలు బలిగొన్నాడు. ఓ పెళ్లిని లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 69 మంది గాయపడ్డారు. వారిలో 17 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ దాడికి పాల్పడింది 12 ఏళ్ల కుర్రాడేనని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తెలిపారు. * * ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేసినిరోడ్డు రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇది గుర్తించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. * * కోయంబత్తూర్: తన ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను హతమార్చింది. తొలి ప్రయత్నంలో పాముల ద్వారా కాటు వేయించాలని ప్రయత్నించి అది విఫలం కావడంతో సుఫారీ ఇచ్చి అతడిని హత్య చేయించింది. ఈ ఘటన తమిళనాడులోని పట్టనంపుదూర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళకు కృష్ణ అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉంది. * * దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా మొదటి స్థానానికి చేరుకుంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో కోహ్లి సేన టాప్ ర్యాంకులో నిలిచింది. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ లో ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోవడంతో టీమిండియా మొదటి ర్యాంకు సొంతం చేసుకుంది. 3-0తో సిరీస్ ను శ్రీలంక క్లీన్ స్వీప్ చేయడంతో మొదటి ర్యాంకులో ఉన్న ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది. * * హైదరాబాద్: స్థానికేతర ఉద్యోగులు తమను ఇబ్బంది పెడుతున్నారంటూ తెలంగాణ సచివాలయంలో రెండో రోజు ఆర్థిక శాఖ ఉద్యోగులు బుధవారం తమ నిరసనలు తెలిపారు. ఉన్నతాధికారుల వద్ద పీఎస్లుగా పని చేస్తున్నవారిని తప్పించాలని వారు డిమాండ్ చేశారు. అందులోభాగంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును టీ. ఉద్యోగుల సంఘం నేతలు కలిశారు. * * హైదరాబాద్‌: హయత్‌నగర్ మండలం పసుమాముల బీసీ హాస్టల్ విద్యార్థి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి... సదరు బీసీ హాస్టల్లో ఉంటూ రాకేశ్ అనే విద్యార్థి కలుషిత నీరు తాగి తీవ్ర అనారోగ్యం పాలైయ్యాడు. దీంతో హాస్టల్ సిబ్బంది అతడిని ఎల్బీ నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రెండు రోజులుగా చికిత్స పొందుతు బుధవారం రాత్రి మరణించాడు. * * నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం దుర్కి గ్రామంలో డయేరియాతో గంగవ్వ (50) అనే మహిళ గురువారం మృతి చెందింది. గ్రామంలో డయేరియా ప్రబలింది. దీంతో సమాచారం అందుకున్న జిల్లా వైద్యాధికారులు గ్రామంలో మూడు రోజులు వైద్యశిబిరం నిర్వహించారు.అయితే గంగవ్వ ఈ రోజు మరణించింది. దాంతో బోధన్ ఆర్డీవో సుధాకర్ రెడ్డి గురువారం దుర్కి గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులకు అందుతున్నసేవలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. * * హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం మహముద్ అలీ అధ్యక్షతన మంత్రులు కడియం శ్రీహరి, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. జిల్లాల ఏర్పాటుపై అన్ని వర్గాల నుంచి వచ్చే ప్రతిపాదనలు చర్చించి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. * * హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీం కేసు దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. సిట్ అధికారిగా ఐజీ నాగిరెడ్డిని ప్రభుత్వం నియమించింది. అడిషనల్ ఎస్పీ, ఇద్దరు డీఎస్సీలు సహా 8మందితో ఏర్పాటు అయిన సిట్ బృందానికి నాగిరెడ్డి నేతృత్వం వహిస్తారు. * * పంజగుట్ట: న్యాయస్థానంలోనే న్యాయవాదిపై దాడి చేసిన వ్యక్తిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు... నగరానికి చెందిన దీక్ష అమోల్, బాలకృష్ణ అమోల్‌ భార్యాభర్తలు. దీక్ష తన భర్త అయిన బాలకృష్ణపై గృహహింస కేసు పెట్టగా ఎర్రమంజిల్‌ కోర్టులో మంగళవారం కేసు విచారణకు వచ్చింది. కూకట్‌పల్లికి చెందిన న్యాయవాది వసంత్‌రావు దేశ్‌పాండే కేసు వాదిస్తుండగా, తీవ్ర ఆగ్రహానికి గురైన బాలకృష్ణ న్యాయవాదిని చొక్కా పట్టుకుని బయటకు లాక్కొచ్చి దాడి చేశాడు. * * కరీంనగర్(పెద్దపల్లి) : కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో చేరాలనుకునే విద్యార్థుల కోసం రెండో విడత కౌన్సెలింగ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు పెద్దపల్లి ఐటీఐ ప్రిన్సిపాల్‌ సురేందర్‌ తెలిపారు. 11 నుంచి 20 తేదీల్లో అభ్యర్థులు దరఖాస్తులు అందజేయాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో దరఖాస్తు ఫారాలు లభిస్తాయన్నారు. అభ్యర్థులకు ఈ నెల 24, 28, 30 తేదీల్లో కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు. * * గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరులు, బంధువుల నివాసాల్లో రెండో రోజు కొనసాగుతున్న పోలీసుల సోదాలు * * నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఈ నేపథ్యంలో నేటి మధ్యాహ్నాం 2.00 గంటలకు అరకులోని ఎన్టీఆర్ గ్రౌండ్స్లో ఆదివాసీ దినోత్సవం జరగనుంది.ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి రావెల కిషోర్ బాబు పాల్గొనున్నారు. * * మెదక్: మెదక్ జిల్లా ఆంధోల్ మండలం కిచ్చన్నపల్లి వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. క్రూజర్ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వాసుపత్రిలో ప్రాధమిక చికిత్స తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. * * నల్గొండ: చిట్యాల మండలo వేలిమినేడు గ్రామ శివార్లో గుర్తు తెలియని మహిళ మ్రుతదేహము లభ్యమైంది. ఈ మహిళ చనిపోయి 2 రోజులు అయి ఉండవచ్చని ఎస్.ఐ. శివకుమార్ అనుమానము వ్యక్తము చేశారు. * * కరీంనగర్(పెద్దపల్లి): కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామంలోని VRO గౌస్ పాషా అక్కడి రైతు నుండి 20 వేలు లంచం తీసుకుంటుండగా ACB కి పట్టుబడ్డాడు. * * హైదరాబాద్ : జీవో 123పై సోమవారం హైకోర్టు డివిజన్ బెంచ్లో విచారణ జరిగింది. భూ నిర్వాసితులు, రైతు కూలీల రక్షణ కోసం తీసుకునే చర్యలను తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ ద్వారా కోర్టుకు సమర్పించింది. నిబంధనల ప్రకారమే నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తున్నామని... వ్యవసాయ కూలీలను ఆదుకుంటామని అడ్వకేట్ జనరల్ (ఏజీ) ఆ అఫిడవిట్లో విన్నవించారు. * * ఇస్లామాబాద్ లో జరిగిన సార్క్ హోంమంత్రుల సదస్సుకు భారత జర్నలిస్టులను అనుమతించని పాకిస్తాన్ వారిని కనీసం ప్రవేశ ద్వారం వద్ద కూడా ఉండనివ్వలేదని వెల్లడైంది. సార్క్ దేశాల ప్రముఖులను పాక్ హోంమంత్రి నిసార్ ప్రవేశ ద్వారం వద్ద ఆహ్వానిస్తున్నపుడు భారత జర్నలిస్టులు అక్కడే ఉన్నారు. భారత హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ రాగానే పాక్ జర్నలిస్టులు ఫోటోలు తీసేందుకు సన్నద్ధమవుతుండగా వీరూ వెళ్లారు. అయితే అక్కడ నుండి వెళ్లిపోవాలని, గేటు బయట నిలబడేందుకూ కూడా భారత్ జర్నలిస్టులకు అనుమతి లేదని పాక్ అధికారులు తేల్చి చెప్పారు. * * నేడు ఆగష్టు 6న తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జయంతి * * ఇవాళ ఇస్రో, తెలంగాణ ఇరిగేషన్ శాఖ మధ్య ఎంవోయూ అత్యాధునిక టెక్నాలజీతో తెలంగాణ జలవనరుల సమాచార వ్యవస్థ జలాశయాల్లో నీటి నిల్వలను ఉపగ్రహంతో విశ్లేషించనున్న తెలంగాణ * * శంషాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో శనివారం ఉన్నతాధికారులు హైఅలెర్ట్ ప్రకటించారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకులు నేపథ్యంలో నిఘా వర్గాలు ఎయిర్ పోర్టు అధికారులను అప్రమత్తం చేశారు. * * పెబ్బేరు(మహబూబ్‌నగర్): రైతులు పెట్టిన విషం గుళికలు తిని దాదాపు 40 జింకలు చనిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొందరు రైతులు కృష్ణా నదిలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. పంటను పురుగుల బారి నుంచి రక్షించుకునేందుకు మొదళ్ల వద్ద శుక్రవారం రాత్రి విషం గుళికలను చల్లారు. సమీపంలోని అటవీప్రాంతం నుంచి వచ్చిన జింకలు గడ్డి మేసుకుంటూ వచ్చి గడ్డితోపాటు గుళికలను కూడా తినేశాయి. దీంతో అ విష ప్రభావానికి లోనై దాదాపు నలబై జింకలు చనిపోయాయి. * * వాయువ్య బంగాళఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఉ.ఒడిశా, ప.బెంగాల్, జార్ఖండ్ తీరాలను ఆనుకుని అల్పపీడనం అల్పపీడన ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఒడిశా, కోస్తాంధ్ర మీదుగా ద.తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కోస్తా తీరం వెంబడి గంటకు 45-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక: వాతావరణ కేంద్రం * * మ్మం: ఛత్తీస్‌గఢ్ దంతేవాడ జిల్లాలో శుక్రవారం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. దంతేవాడ - బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన సర్సఫాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఆ విషయాన్ని పసిగట్టిన మావోయిస్టులు... పోలీసులపై కాల్పులకు దిగారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులకు దిగారు. * * ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లెందులోని ఓపెన్‌కాస్టు సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇల్లెందు పట్టణంలోని ప్రధాన రహదారిపై అధిక వేగంతో వెళ్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ లారీ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోగా మరో లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. * * కరీంనగర్ : ఎస్సీ వర్గీకరణ బిల్లు వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అందులోభాగంగా శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైల్వేస్టేషన్లో వారు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్లో ఆగి ఉన్న సింగరేణి ప్యాసింజర్ రైలును వారు నిలిపివేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో భారీగా ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. * * హైదరాబాద్: ఈ నెల 8 నుంచి తెలంగాణలోని 11 విశ్వవిద్యాలయాల్లో నిరవధికంగా బంద్ పాటించనున్నట్లు తెలంగాణ వర్సిటీ నాన్ టీచింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కంచి మనోహర్, సెక్రెటరీ జనరల్ మహిపాల్ రెడ్డి బుధవారం పేర్కొన్నారు. రాష్ట్ర్రంలో అతిపెద్దదై ఉస్మానియాతో పాటు ఇతర వర్సిటీల్లో ప్రతి నెల 1న వేతనాలు, ఫించన్లు రావడం లేదన్నారు. సీమాంధ్రుల పాలనలో కూడా వేతనాలకు ఇలాంటి దుస్థితి ఎన్నడూ ఏర్పడలేదన్నారు. * * హైదరాబాద్: ప్రత్యేక హైకోర్టు ఉద్యమంలో పాల్గొన్న న్యాయవాదులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు నోటీసులివ్వడానికి నిరసనగా గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయాలని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నిర్ణయించింది. జేఏసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి నేతృత్వంలో న్యాయవాదులు బుధవారం సమావేశమయ్యారు. * * వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 48 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు... అలాగే తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. * * కరీంనగర్: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కాన్వాయ్‌కి బుధవారం తృటిలో ప్రమాదం తప్పింది. కాన్వాయ్‌లోని ఓ వాహన డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేయడంతో వెనకున్న టీఆర్‌ఎస్ నాయకుల వాహనాలు ఒకదానివెంట మరొకటి వరసగా ఢీకొన్నాయి. దీంతో సదరు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి ఈటల రాజేందర్ బుధవారం మెట్‌పల్లి వచ్చారు. * * కరీంనగర్(ముకరంపుర): జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ప్రభుత్వ నిర్ణయం ఊరటనిచ్చింది. పదేళ్లుగా కీలకంగా పనిచేస్తున్న ఫీల్డ్‌అసిస్టెంట్లను రెగ్యులరైజ్‌ చేయాలని, వేతనాలు పెంచాలన్న డిమాండ్‌తో చేపట్టిన ఆందోళనలకు సర్కార్‌ ఎట్టకేలకు దిగివచ్చింది. ప్రస్తుతం నెలవారీగా ఇస్తున్న వేతనం రూ.6240నుంచి రూ.10 వేలకు పెంచింది. * * మణుగూరు :ఖమ్మం జిల్లా మణుగూరు సమీపంలో మంగళవారం స్కూలు బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. విప్పల సింగారం నుంచి జీఎం ఆఫీసు రోడ్డులో వస్తున్న హోలీ ఫ్యామిలీ స్కూల్ బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోయి... అదుపుతప్పి బస్సు కాల్వలోకి దూసుకెళ్ల్లింది. అందులోని ఐదుగురు విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. * * చండీగఢ్: వాళ్లంతా దివ్యాంగులు. కొందరికి చూపులేదు, ఇంకొందరు బుద్ధిమాంద్యులు.. అందరూ చిన్నపిల్లలే. అంతసేపు హాయిగా ఆడుకున్నవాళ్లుకాస్తా మధ్యాహ్నం భోజనం తిన్నతర్వాత వాంతులు చేసుకోవడం మొదలుపెట్టారు. నిమిషాల్లోనే పరిస్థితి చేయిదాటిపోయింది. పిల్లలు ఒకొక్కరిగా రాలిపోయారు. పంజాబ్ లోని కపుర్తలా జిల్లా కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం కనిపించిన దృశ్యాలివి. * * పురవి: వరంగల్‌ జిల్లా పురవి మండల కేంద్రంలో ఉన్న ఆంధ్రాబ్యాంకులో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. రాత్రి సమయంలో బ్యాంకు తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దుండగులు కౌంటర్‌ గదిలో సీసీ కెమెరాలను కత్తిరించారు. సోమవారం ఉదయం సిబ్బంది బ్యాంకును తెరవడంతో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పురవి సీఐ శ్రీనివాస్‌, ఎస్సై రామకృష్ణ అక్కడకు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. * * నేడు ఎంసెట్-3 షెడ్యూల్ విడుదల చేసే అవకాశం జేఎన్టీయూ వీసీ లేదా రిజిస్ట్రార్కు కన్వీనర్ బాధ్యతలు ఎంసెట్-2 విద్యార్థులకు పాత రిజిస్ట్రేషన్ పై కొత్త హాల్టికెట్లు * * ఇవాళ ప్రారంభంకానున్న రూపాయికే నల్లా కనెక్షన్ పథకం గ్రేటర్ హైదరాబాద్లో పేదలకు రూపాయికే వాటర్ కనెక్షన్ * * వరంగల్: వరంగల్ జిల్లా ధర్మాసాగర్ జలాశయంలో ఆదివారం గల్లంతైన కానిస్టేబుల్ పొలిమారి సృజన్(25)మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు. ఆదివారం మిత్రులతో కలిసి ఈతకు వెళ్లిన సృజన్ ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. * * మహారాష్ట్ర: పుణెలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిపోవడంతో తొమ్మిది మంది కార్మికులు మృతిచెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు యత్నిస్తున్నారు. * * వరంగల్ : వరంగల్ నగరంలోని ఆర్టీఏ జంక్షన్లో బస్సు... ముందు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను నగరంలోని ఆసుపత్రికి తరలించారు. * * హైదరాబాద్ : ఎంసెట్ - 2 పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ... మంత్రులు కడియం, లక్ష్మారెడ్డి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. శుక్రవారం మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి విద్యార్థి సంఘాలు యత్నించాయి. ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. * * న్యూఢిల్లీ: పార్లమెంటులో ఓ కోతి హల్ చల్ చేసింది. అరగంటపాటు అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది. దాన్ని బందించేందుకు ప్రయత్నం చేసిన చివరకు వారికి దొరకకుండా దానంతట అదే దర్జాగా ప్రధాన ద్వారం గుండా బయటకు వెళ్లింది. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం ఎంపీలు, జర్నలిస్టులు చదువుకునేందుకు ఏర్పాటుచేసిన పార్లమెంటు రీడింగ్ హాల్ లోకి ఓ కోతి ప్రవేశించింది. * * కరీంనగర్‌: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో ఏఈకికు రెండేళ్ల జైలుశిక్ష, రూ.పదివేల జరిమానా విధిస్తూ బుధవారం ఏసీబీ కోర్టు తీర్పు వెలువరిచింది. 2008లో గంగాధరలో విద్యుత్‌ శాఖ ఏఈగా పనిచేస్తున్న బండారు అజయ్‌కుమార్‌ గంగాధరకు చెందిన అంకం శంకరయ్య అనే పవర్‌లూం కార్మికుడికి విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు అదే ఏడాది జనవరి 18న రూ.6వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. * * వరంగల్ : వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా కేసముద్రం మండలం రాజీవ్ నగర్ తండా సమీపంలో గురువారం చోటుచేసుకుంది. తండా నుంచి కేసముద్రం వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో.. కారు నడుపుతున్న రమేష్ పండిట్ రాథోడ్ (42) అక్కడికక్కడే మృతి చెందాడు. * * హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన కేసు విచారణను డివిజన్ బెంచ్ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. హైకోర్టు విభజనపై తెలంగాణ ప్రభుత్వ రివ్యూ పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది. హైదరాబాద్లోనే రెండు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయాలని టీ.సర్కార్ తన పిటిషన్లో కోరింది. గత తీర్పును పునసమీక్షించాలన్న పిటిషన్పై తీర్పును ఉమ్మడి హైకోర్టు రిజర్వ్లో ఉంచిన విషయం తెలిసిందే. దాంతో కేసును విచారించిన డివిజన్ బెంచ్.. తాను తీర్పును ప్రకటించలేనని, విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు ప్రకటన * * నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం కోమలంచ గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భూమా రమేశ్ (35) అనే రైతు కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. పొలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు ఫ్యూజు అమరుస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గ్రామస్తుల సహాయంతో అతడి మృతదేహాన్ని ఇంటికి తరలించారు. * * కరీంనగర్: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం జిల్లెల క్రాసింగ్ వద్ద ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిమ్మాపూర్ మండలానికి చెందిన మహ్మద్ రిజ్వాన్ (32) అక్కడికక్కడే మృతిచెందగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడ్ని సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. * * తిమ్మాపూర్‌ : రవాణాశాఖకు సంబంధించిన ఆన్‌లైన్‌ సేవలపై మీ సేవా కేంద్రాలు, ఈ సేవా కేంద్రాల నిర్వాహకులు, ఉద్యోగులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు కరీంనగర్‌ డీటీసీ వినోద్‌కుమార్‌ తెలిపారు. రోజుకు మూడు బ్యాచ్‌ల చొప్పున జిల్లాలోని నిర్వాహకులకు బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఆన్‌లైన్‌ సేవలకు దరఖాస్తు చేసుకునే వి«ధానం నేర్చుకునేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. * * హైదరాబాద్ : హెచ్ఎండీఏ పనులపై ఉన్నతాధికారులతో నేడు కేటీఆర్ భేటీ. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, సుందరీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష * * హైదరాబాద్ : నేడు, రేపు ఏఎఫ్ఆర్సీ భేటీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరహాలో వైద్య ఫీజుల పెంపుపై చర్చ * * కీసర : రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాలలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కమాన్ వద్ద పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోలో తరలిస్తున్న 9 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోతోపాటు ఎస్కార్ట్గా బైకుపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. * * నారాయణపేట: అన్నం పెట్టే రైతులపై దాడి చేసిన ఏ ప్రభుత్వం నిలబడలేదని, మల్లన్న సాగర్ నిర్వాసితులపై లాఠీచార్జి జరిపించిన కేసీఆర్ ప్రభుత్వానికి పోయేకాలం దాపురించిందని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం అప్పంపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. * * మెదక్‌: మల్లన్నసాగర్‌ నిర్వాసితులపై ఆదివారం జరిగిన పోలీసుల లాఠీచార్జీకి నిరసనగా అఖిలపక్షం ఈరోజు మెదక్‌ జిల్లా బంద్‌ చేపట్టింది. ఉదయాన్నే కాంగ్రెస్‌, తెదేపా, భాజపా, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన నేతలు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై నేతలు మండిపడ్డారు. జనజీవనంపై బంద్‌ ప్రభావం పాక్షికంగా ఉంది. చాలా చోట్ల ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. బంద్‌ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. * * హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో జాతీయ రహదారిపై ఏబీవీపీ రాస్తారోకో చేపట్టింది. ఎన్నికల సందర్భంగా తెరాస ఇచ్చిన కేజీ టు పీజీ ఉచిత విద్య హామీని వెంటనే నెరవేర్చాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళనతో జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. * * లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రైలుప్రమాదం సంభవించింది. భదోహిలో కాపలా లేని రైల్వేగేట్‌ వద్ద ఈరోజు ఉదయం పట్టాలు దాటుతున్న స్కూల్‌ బస్సును రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 19 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. * * విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఛత్తీస్గఢ్ నుంచి తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయిని చెప్పింది. తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. * * ఇబ్రహీంపట్నం: కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్‌లోని ఆలయంలో చోరీ జరిగింది. స్థానిక పెద్దమ్మ ఆలయంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి అమ్మవారి నగలను అపహరించుకు పోయారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. నాలుగు తులాల బంగారు ఆభరణాలతో పాటు వెండి సామాగ్రి చోరీకి గురైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. * * తాండూరు : రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా తాండూరు - వికారాబాద్‌ల మధ్యలో ఉన్న కందమెల్లి వాగు పొంగిపొర్లుతుంది. దాంతో తాండూరు - హైదరాబాద్‌ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గురువారం అర్ధరాత్రి నుంచి వాగు పొంగిపొర్లుతుంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. * * నల్లగొండ: స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఆటో ఢీకొన్ని చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కేతెబోయిన కావ్య (3) ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో కావ్య తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. * * కరీంనగర్‌ క్రైం: బెజ్జంకి ఏఎస్సై వహిద్‌ పాషాపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ ఎస్పీ జోయల్‌డేవిస్‌ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని పేర్కొంటూ బెజ్జంకి పీఎస్‌లో పనిచేస్తున్న ఓ మహిళ హోంగార్డ్‌ ఫిర్యాదుచేసింది. ఈమేరకు విచారించిన ఎస్పీ వాహిద్‌ పాషాను సస్పెండ్‌చేశారు. * * కరీంనగర్‌ జిల్లా మద్యం డిపో పరిధిలో ఉన్న 41 మద్యం దుకాణాలు, 5 బార్లను మెదక్‌ జిల్లా సిద్దిపేటలో కొత్తగా ప్రారంభంకానున్న మద్యం డిపోకు బదిలీచేస్తూ బుధవారం రాత్రి ఎకైసజ్‌శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గంభీరావుపేట మండలం పరిధిలోని 9 దుకాణాలు, సిరిసిల్ల ఎకై ్సజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని 15 మద్యం దుకాణాలు, 3 బార్లు, వేములవాడ ఎకై ్సజ్‌ ఠాణా పరిధిలోని 17 మద్యం దుకాణాలు, 2 బార్లను బదిలీ చేశారు. ఆగస్టు 1 నుంచి వీటికి సిద్దిపేట డిపో నుంచి మద్యం సరఫరా చేస్తారు. ఈ మేరకు జగిత్యాల ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌క * * జమ్ము: అమర్నాథ్ యాత్రకు వెళుతున్న యాత్రికులకు కష్టాలు కొనసాగుతునే ఉన్నాయి. జమ్మూకశ్మీర్ లో అశాంతికర పరిస్థితుల నేపథ్యంలో మరోసారి యాత్రికులను అధికారులు అడుగు కూడా వేయనివ్వడం లేదు. * * సిరిసిల్ల: సిరిసిల్ల మండలం సర్ధాపూర్‌ శివారులో 7వ పోలీస్‌ బెటాలియన్‌ ఏర్పాటుకు 120 ఎకరాల భూమిని కేటాయించారు. ఈమేరకు సిరిసిల్ల ఆర్డీవో ఆఫీస్‌లో సోమవారం డివిజన్‌ సర్వేయర్‌ శ్రీనివాస్‌తో సంబంధించిన హద్దులను నిర్ధారించారు. ఇప్పటికే పోలీస్‌ బెటాలియన్‌ కోసం 120 ఎకరాల స్థలాన్ని శాటిలైట్‌ ద్వారా సర్వే నిర్వహించి కేటాయించారు. క్షేత్రస్థాయిలో భూమి కేటాయింపులను కలెక్టర్‌ నీతుప్రసాద్‌ పరిశీలించారు. * * పార్లమెంట్లో మోదీ, రాజ్‌నాథ్, జైట్లీతో విడివిడిగా భేటీకానున్న కేసీఆర్ * * ఢిల్లీ: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు పార్లమెంటు ముందుకు రానున్న 16 బిల్లులు వచ్చే నెల 12 వరకు జరగనున్న వర్షాకాల సమావేశాలు * * వరంగల్: బైక్ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలోని నార్లాపూర్ వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. మేడారానికి చెందిన సిద్ధబోయిన ఆనందరావు (35) బైక్ పై వెళ్తుండగా.. నార్లాపూర్ వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆనందరావు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. * * కరీంనగర్: ఆలయంలోకి చొరబడిన దుండగులు స్వామివారి విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేటలో శనివారం వెలుగు చూసింది. గ్రామ శివారులోని సీతారామ ఆలయంలో ఉన్న స్వామివారి విగ్రహాన్ని గత రాత్రి కొందరు దుండగులు ధ్వంసం చేశారు. శనివారం ఉదయం ఆ విషయాన్ని గమనించిన స్థానికులు 63వ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. * * తిమ్మాపూర్ (కరీంనగర్) : పురుగులమందు తాగి భార్యాభర్తలు మృతిచెందిన సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గురువారం చోటుచేసుకుంది. కాల్వ శ్రీరాంపుర్ మండలానికి చెందిన ప్రభాకర్(37), తేజస్వి(34) దంపతులు కరీంనగర్‌లోని మారుతీనగర్‌లో నివాసముంటూ.. బంగారం పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో గురువారం తిమ్మాపూర్‌కు వెళ్లిన దంపతులు ఆలయ సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. * * హైదరాబాద్: వీధి కుక్కల దాడిలో నలుగురు చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన హైదరాబాద్ లోని ఎల్బీనగర్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న చిన్నారుల పై వీధికుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు కాగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు కుక్కలను తరిమికొట్టి చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. * * కరీంనగర్ జిల్లా జమ్మికుంట్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తి ధర క్వింటాలుకు రిఆకర్డుస్థాయిలో రూ.6,470 పలికింది. దాంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంట దిగుబడి తగ్గినందువల్ల ధర పెరిగిందని రైతులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం ఈ ధర పలికిందని వారంటున్నారు. * * హైదరాబాద్: ప్రైవేటు విద్యాసంస్థల దోపడీ విధానాన్ని వ్యతిరేకిస్తూ గురువారం తెలంగాణ విద్యాసంస్థల బంద్‌ కొనసాగుతుంది. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్‌ కొనసాగతుంది. ఈ సందర్భంగా విద్యా రంగంలో ప్రైవేటు విద్య నానాటికీ పెరిగిపోతోందని, అది సామాన్యుడికి అందుబాటులో లేదని సంఘాలు ఆరోపించాయి. విద్యారంగంలో ప్రభుత్వ ప్రాధాన్యాన్ని బలోపేతం చేయాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీ అమలు చేయాలని డిమాండ్‌ చేశాయి. * * హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కెన్యాకు చెందిన దంపతుల నుంచి కేజీన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా దుబాయి నుంచి ఈ రోజు ఉదయం హైదరాబాద్ వచ్చిన వీరి వద్ద బంగారం ఉండటాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అయితే వారి వద్ద బంగారానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో దంపతులను అదుపులోకి తీసకుని, బంగారాన్ని సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం.12 లో గురువారం ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంటిని నిర్మించేందుకు రాళ్లను బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * హైదరాబాద్: హైదరాబాద్ కూకట్ పల్లిలో తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆకస్మిక పర్యటన నిర్వహించారు. రోడ్లు, నీటి సరఫరా, బస్టాండ్ తదితర ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. రాత్రి 11 గంటలనుంచి 2:30 గంటల వరకు కేటీఆర్ తనిఖీలు కొనసాగాయి. ఈ సందర్భంగా రోడ్లపై వాననీరు నిల్వ ఉండటం పట్ల జీహెచ్ఎంసీ సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి రమ‍్య మృతికి కారణమైన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు. * * భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కాస్త తగ్గింది. నీటిమట్టం బుధవారం ఉదయం 49.5 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. మంగళవారం సాయంత్రం నీటిమట్టం 52.4 అడుగులకు చేరిన విషయం తెలిసిందే. రాత్రికి రాత్రి నీటి మట్టం తగ్గడంతో అధికారులు, ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. * * కేంద్ర ప్రభుత్వ నైపుణ్యం, మెలకువల శిక్షణలో భాగంగా నిరుద్యోగ దళిత యువతకు అడ్వాన్స్‌ కంప్యూటర్‌ హర్డ్‌వేర్‌, కోర్‌ నెట్‌వర్కింగ్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఎంసీపీ ఎడ్యూకేషన్‌ సోసైటీ డైరెక్టర్‌ ఎంఆర్‌ చెన్నప్ప తెలిపారు. డిప్లొమా లేదా బిటెక్‌, పీజీ పూర్తి చేసి, 18 నుంచి 45 లోపు వయసున్నవారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు లక్డికాపూల్‌లోని జెన్‌ వొకేషనల్‌ కాలేజీలో ఈ నెల 14న నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు. * * చండీగఢ్‌: ప్రొ కబడ్డీని ఆస్వాదిస్తున్న అభిమానులను అలరించేందుకు మరో మెగా ఈవెంట్‌ రాబోతోంది. నవంబర్‌ 3న చండీగఢ్‌ వేదికగా ప్రపంచకప్‌ కబడ్డీ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలు 3 నుంచి 17 వరకు జరుగుతాయి. చండీగఢ్‌లోని 14 వేదికల్లో ఈ పోటీలు నిర్వహిస్తామని పంజాబ్‌ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ చెప్పారు. 14 దేశాలు పోటీపడే ఈ ప్రపంచకప్‌లో పురుషులు, మహిళలు విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. పురుషుల విభాగంలో విజేతగా నిలిచిన జట్టుకు రూ.2 కోట్లు, రన్నరప్‌కు రూ.కోటి నగదు బహుమతిగా ఇస్తారు. మహిళల్లో * * కరీంనగర్ : జిల్లావ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. మహదేవ్‌పూర్ మండలంలో పెద్దంపేట, సర్వాయిపేట, వంకెన వాగులు పొంగిపొర్లుతుండడంతో 17 గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ధర్మపురి వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. సింగరేణి రామగుండం రీజియన్‌లో నాలుగు ఓపెన్ కాస్ట్ బొగ్గుపనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. * * హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు మంగళవారం ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి కోల్కతా వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కోల్కతా వెళ్లే 120మంది ప్రయాణికులు ఉదయం అయిదు గంటల నుంచి పడిగాపులు పడుతున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా విమానాల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులు గంటల కొద్ది విమానాశ్రయంలో తిప్పలు పడాల్సి వస్తున్న విషయం తెలిసిందే. * * హైదరాబాద్ : హైదరాబాద్లోని నాగ్పూర్ జాతీయ రహదారిపరై ఆర్టీఏ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఏడు ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేశారు. అలాగే సరైన పత్రాలు లేని రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. * * హైదరాబాద్ : నగరంలోని గోల్కొండ సక్కుబాయినగర్ ప్రాంతంలో మంగళవారం మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సదరు మహిళను దుండగులు అత్యాచారం చేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పరిసర ప్రాంతాల్లోని స్థానికులను పోలీసులు విచారిస్తున్నారు. * * హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం ఓ విమానాన్ని ఎయిర్ పోర్ట్ అధికారులు అత్యవసరంగా ల్యాండ్ చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి సౌదీ అరేబియా బయల్దేరిన విమానంలో ఓ ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఆ ప్రయాణికుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. * * హైదరాబాద్ సిటీ : డీసీఎం వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 22.45 క్వింటాళ్ల గంజాయిని హయాత్‌నగర్ పోలీసులు సోమవారం ఉదయం పట్టుకున్నారు. ఈ సంధర్భంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి నగరానికి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ముందస్తు సమాచారంతో హయాత్‌నగర్ పోలీసులు అబ్దుల్లామెట్ వద్ద కాపు కాశారు. గంజాయి లోడుతో వచ్చిన డీసీఎం వ్యానును ఆపి అందులోని 22.45 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంధర్భంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. * * సికింద్రాబాద్ : నగరంలోని తుకారంగేటు పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్తీలో సోమవారం ఉదయం చిన్న గొడవ జరగడంతో ఆగ్రహించిన మల్లేష్ అనే వ్యక్తి చంద్రకళ అనే మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ప్రయత్నించి మంటలను ఆర్పారు. అప్పటికే ఆమె శరీరం చాలావరకూ కాలిపోయింది. వెంటనే ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మల్లేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. చంద్రకళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. * * కరాచి: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ సిరీస్ నిర్వహణకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ మేరకు ఇరు క్రికెట్ బోర్డుల మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. ఎడిన్‌బర్గ్‌లో ఐసీసీ సభ్య దేశాల సమావేశం సందర్భంగా పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్, బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ముఖాముఖి సిరీస్ గురించి చర్చించినట్లు తెలిసింది. రెండు దేశాల ప్రభుత్వాల అనుమతి లభిస్తే ఈ సీజన్‌లోనే తటస్థ వేదికల్లో సిరీస్ నిర్వహించాలని బోర్డు పెద్దలు యోచిస్తున్నారు. * * హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా పి.సర్దార్‌సింగ్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మెదక్‌జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన ఈయన గతంలో మహారాష్ట్రలోని మహాత్మగాంధీ అంతరాష్ట్రీయ విశ్వవిద్యాలయంలో ఫైనాన్స్‌ ఆఫీసర్‌గా, జాయింట్‌ రిజిస్ట్రార్‌, డిప్యూటీ రిజిస్ట్రార్‌గా పనిచేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఇందిర కళా సంగీత విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌గా సేవలందించారు. * * దామరచర్ల: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం ఇర్కిగూడెం వద్ద కృష్ణాతీరంలో పార్వతీదేవి ఆలయ నిర్మాణానికి గాను తవ్వకాలు నిర్వహిస్తుండగా పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది. కృష్ణానదీ తీరంలో పార్వతీదేవి ఆలయ నిర్మాణానికి తెలంగాణ సర్కార్ రూ. 5లక్షలు మంజూరు చేసింది. దాంతో ఈ రోజు ఉదయం నిర్మాణ పనులు ప్రారంభించారు. * * నల్లగొండ: నల్లగొండ జిల్లాలో శుక్రవారం రాత్రి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఓ వ్యక్తి నుంచి రూ.6.30 లక్షలను దొంగలు దోచుకెళ్లిన ఘటన వేములపల్లి మండలం అన్నపురెడ్డిగూడెంలో చోటుచేసుకుంది. స్థానిక పెట్రోల్ బంక్లో క్యాషియర్గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి శుక్రవారం రాత్రి క్యాష్ తీసుకుని ఇంటికెళ్తుండగా దొంగలు దాడికి పాల్పడ్డారు. వెంకటేశ్వర్లును తీవ్రంగా గాయపరచిన దొంగలు అతని వద్ద ఉన్న రూ.6.30 లక్షలను తీసుకుని ఉడాయించారు. దీంతో బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు * * కరీంనగర్ : నేదునూరులో జెన్కో పవర్ప్లాంట్ పనులు వెంటనే చేపట్టి నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. లేకుంటే భూములును తిరిగి రైతులకు అప్పగించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. గురువారం కోదండరామ్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరులో జెన్కో పవర్ ప్లాంట్ కోసం సేకరించిన భూములను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక రైతులతో కోదండరామ్ సమావేశమయ్యారు. * * మేడ్చల్: ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ.. ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మేడ్చల్ చెక్‌పోస్ట్ వద్ద శుక్రవారం జరిగింది. చెక్‌పోస్ట్ వద్ద ఉన్న సెల్‌టవర్ ఎక్కిన యువకుడు తన ప్రియురాలితో పెళ్లి జరిపించాలని లేకపోతే ఇక్కడి నుంచి దూకేస్తానని బెదిరిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతన్ని కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. * * హైదరాబాద్: జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ స్ప్రింట్స్‌లో తెలంగాణ కుర్రాడు అబ్దుల్ నజీబ్ ఖురేషీ మెరిశాడు. గురువారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన 100 మీటర్ల పరుగులో నజీబ్ రజత పతకం గెలుచుకున్నాడు. 10.63 సెకన్లతో అతను రెండో స్థానంలో నిలిచాడు. షమీర్ మోన్ (మణిపూర్-10.60 సె.) స్వర్ణ పతకం సాధించగా, అనిరుధ గుంజాయ్ (మహారాష్ట్ర-10.66 సె.)కు కాంస్యం దక్కింది. * * హైదరాబాద్ : తెలంగాణ అడ్వకేట్ల మహాధర్నా ఇందిరాపార్క్ వద్ద శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఈ మహాధర్నాలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా అడ్వకేట్లు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అయితే ఈ ధర్నాలో పాల్గొనేందుకు వెయ్యి మంది అడ్వకేట్లకు మాత్రమే అనుమతి ఉందని పోలీసులు తెలిపారు. ఈ మహాధర్నా నేటి సాయంత్రం 4.30 గంటలకు ముగియనుంది. * * రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండల పరిధిలోని జవహర్‌నగర్‌ సీఆర్‌పీఎఫ్‌ గ్రూప్‌ సెంటర్‌లో జులై 1వ తేదీ నుంచి నిర్వహించనున్న మినిస్టీరియల్‌ హెడ్‌కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 27 వేల మంది హాజరవుతారు. జవహర్‌నగర్‌ గ్రూప్‌ సెంటర్‌కు వచ్చే అభ్యర్థులకు ప్రత్యేకంగా బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు సీఆర్‌పీఎఫ్‌ డీఐజీపీ జి.వి.ఎన్‌.గిరిప్రసాద్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ 10వ నంబర * * హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగుల విభజనపై ఏర్పాటుచేసిన కమల్నాథన్ కమిటీ గురువారం మరోసారి సమావేశమైంది. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ఉద్యోగుల విభజన అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది. * * ఖమ్మం: ఎగువ నుంచి వస్తున్న వరదతో ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 9 అడుగులకు చేరుకుంది. అశ్వారావుపేట వద్ద పెద్దవాగు ప్రాజెక్టు నిండింది. దీంతో రెండు గేట్లు ఎత్తి 14,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే, అశ్వాపురం మండలంలో విడువని వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కిన్నెరసాని ప్రాజెక్టు కూడా జలకళను సంతరించుకుంది. కొత్తగూడెం, మణుగూరు, సత్తుపల్లిల్లోని ఓపెన్‌కాస్ట్ గనుల్లో వర్షం కారణంగా ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. * * హైదరాబాద్‌: నగరంలోని హుమాయన్‌నగర్‌లో విషాదం నెలకొంది. ఐదేళ్ల చిన్నారి ఆడుకుంటూ విద్యుత్‌ తీగ తగిలి మృతి చెందింది. శ్రీకాకుళంకు చెందిన హరిత భర్త చనిపోవడంతో కుమార్తె తనుజతో పాటు నగరానికి వచ్చి హుమాయన్‌ నగర్‌లో ఉంటోంది. తనుజ తల్లితో వెళ్తుండగా తెగిపడిన విద్యుత్‌ తీగ తగిలి అక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు బాలికను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. * * నల్లగొండ: ఎగువ నుంచి వస్తున్న మూసీ వరదతో నల్లగొండ జిల్లా భువనగిరి-పోచంపల్లి మధ్య మంగళవారం ఉదయం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఆ మార్గంలో ఉన్న బీబీనగర్ మండలం బట్టుగూడెం వంతెనపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. * * హైదరాబాద్: ఏఐసీసీ పరిశీలకుడు శ్రీనివాసన్ నేతృత్వంలో గాంధీభవన్లో కాంగ్రెస్ వర్క్షాప్ సోమవారం ప్రారంభమైంది. ఈ వర్క్షాప్లో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, నేతల వలసలను అడ్డుకోవడంతో పాటు ప్రచార కార్యక్రమాలపై నేతలు ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ముఖ్యనేతలు హాజరయ్యారు. * * బూర్గంపాడు: అప్పుల బాధ తాళలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గాదె సైదిరెడ్డి(41) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత రెండేళ్లుగా పంట దిగుబడి సరిగ్గా లేకపోవడంతో.. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోయాయి. అప్పులు తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. * * మిర్యాలగూడ: ముందు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వస్తున్న క్రేన్ ఢీకొట్టిన ఘటనలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం జస్తి వీరప్పగూడెం పరిధిలోని భల్లునాయక్‌తాండాలో సోమవారం చోటుచేసుకుంది. తాండా నుంచి మిర్యాలగూడ వెళ్తున్న ఆటోను బావులు తీయడానికి ఉపయోగించే క్రేన్ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న 8 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు 108 సాయంతో వారిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. * * రామడుగు: ఆర్టీసీ బస్సు చార్జీలు, విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ శనివారం కాంగ్రెస్‌ నాయకులు రామడుగులో ధర్నా నిర్వహించారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు అంజనేయులు గౌడ్‌, శంకర్‌, శ్రీనివాసగౌడ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు. * * జగిత్యాల(కరీంనగర్) : పలు దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉంటూ తప్పించుకు తిరుగుతున్న ఓ పాత నేరస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 20 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ. 2వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజేంద్రప్రసాద్ వివరాలు వెల్లడించారు. * * హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీ పీసీసీ శనివారం నిరసన కార్యక్రమాలకు దిగింది. అందులో భాగంగా హైదరాబాద్ విద్యుత్ సౌధ కార్యాలయాన్ని కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. రోడ్డుపై బైఠాయించి, పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పాడడంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, శ్రీశైలం గౌడ్, ఇతర నేత * * యాదాద్రి జిల్లా: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవాలయం పేరుతో యాదాద్రి జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగా భువనగిరి జిల్లా కేంద్రంగా యాదాద్రిని పేరుతో జిల్లా ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. * * యాదాద్రి జిల్లా: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవాలయం పేరుతో యాదాద్రి జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగా భువనగిరి జిల్లా కేంద్రంగా యాదాద్రిని పేరుతో జిల్లా ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. * * కరీంనగర్‌ విద్యా విభాగం : జిల్లాలో జరుగుతున్న ఎస్సెస్సీ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షల్లో భాగంగా గురువారం జరిగిన సామాన్యశాస్త్రం పేపర్‌-1లో మాల్‌ప్రాక్టీసుకు పాల్పడుతున్న ముగ్గురు విద్యార్థులను డిబార్‌ చేశారు. మొత్తం 42 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఈపరీక్షకు మొత్తం 3962 మంది హాజరుకావాల్సి ఉండగా, 3379 మంది హజరైనట్లు డీఈవో శ్రీనివాస చారి తెలిపారు. * * హైదరాబాద్ : ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దందాను అరికట్టాలంటూ వివిధ విద్యార్థి సంఘాల వారు గురువారం ఆందోళనలు చేపట్టారు. బోడుప్పల్‌లోని భాష్యం స్కూల్‌తోపాటు శంషాబాద్‌లోని ఎస్సార్ డీజీ స్కూల్ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ సంఘాల ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందిపెట్టేలా ఉన్న ఫీజుల మోతను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. * * హైదరాబాద్ : రంగారెడ్డి మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలో ఉన్న అనాథ బాలల ఆశ్రమం కృషిహోంలో ఉండే ఇద్దరు బాలురు కనిపించకుండాపోయారు. అనాథ గృహంలో ఆశ్రయం పొందుతున్న ఎన్.సాయిలు(13), మహేష్(10) అనే బాలురు బుధవారం ఉదయం టిఫిన్ చేసిన అనంతరం నుంచి కనిపించకుండా పోయారు. దీంతో నిర్వాహకులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవటంతో రాత్రి పోలీసులను ఆశ్రయించారు. కృషిహోం ట్యూటర్ ఎండీ సుమేర్ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. * * రెంజల్(నిజామాబాద్) : నిజామాబాద్ జిల్లా రెంజల్‌లో వేటగాళ్ల తుపాకీ తూటాకు జాతీయ జంతువు జింక బలైంది. రెంజల్ మండలం తాడిబిలోలి గ్రామ సమీపంలో బుధవారం రాత్రి గురు తెలియని వ్యక్తులు జింకను కాల్చి చంపారు. గురువారం ఉదయం జింక కళేబరాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఎస్సై ప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. జింకను వేటగాళ్లే చంపి ఉంటారని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. * * హైదరాబాద్: న్యాయమైన పరిహారం ఆందోళన చేస్తున్న మల్లన్నసాగర్ ముంపు బాధితులకు బీజేపీ మద్దతు తెలపనుంది. బుధవారం సాయంత్రం తొగుట మండలం ఏటిగడ్డకిష్టాపూర్, వేములగట్టు గ్రామాల్లో ఆ పార్టీ నాయకులు ధర్నా చేపట్టనున్నారు. ఈ ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్తోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు. ప్రాజెక్టు ముంపు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తగినంత సాయం అందించాలని బీజేపీ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేయనున్నారు. * * ధారూర్ : రంగారెడ్డి జిల్లా ధారూర్ మండలంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఎడతేరపి లేకుండా వాన కురుస్తుంది. దీంతో జిల్లాలోనే కొటిపల్లి జలాశయం నీటి మట్టం ఒక్క రోజులోనే ఏడడుగులు పెరిగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 24 అడుగులు కాగా మంగళవారం ఉదయం 5 అడుగుల నీరు మాత్రమే ఉంది. రాత్రి కురిసిన వర్షానికి 12 అడుగులకు చేరుకుంది. ధారూర్ మండల కేంద్రంలో 72.50 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. ఈ నీరుతో పంట సాగు చేసుకోవచ్చని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. * *
bottomleft17.jpg

middletop7.gif

హైదరాబాదు వార్తలు

మిర్చి రైతును నట్టేట్లో ముంచిన కేంద్రం: పల్లా రాజేశ్వర్‌ రెడ్డి

10/05/2017: హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం మిర్చి రైతును నట్టేట్లో ముంచిందని శాసన మండలిలో ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి మండిపడ్డారు.మిర్చి కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఢిల్లీలో నిలదీయకుండా రాష్ట్ర బీజేపీ నాయకులు గల్లీలో రాద్ధాంతం చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం మార్కెట్లో కొన్ని పార్టీలు చేసిన కుట్రలో తాము పాల్గొనలేకపోయామన్న బాధతోనే మిర్చి మార్కెట్ల వద్ద బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మిర్చి రైతుల సమస్యను పూర్తిగా అర్థం చేసుకోకుండానే రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి విమర్శలు చేయడం సరికాదన్నారు.

రేప్‌ కేసులో ఎమ్మెల్సీ కొడుకు?

09/05/2017: హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని నగరంలో ఓ యువతిపై జరిగిన రేప్‌ కేసులో ఓ ఎమ్మెల్సీ కొడుకు ఉన్నట్టు తెలుస్తోంది. కొంపల్లికి చెందిన ప్రీతమ్‌రెడ్డి అనే వ్యక్తి.. పబ్‌లో పరిచయంతో యువతి(23)ని తన ఇంటికి పిలిపించుకొని శనివారం (ఈనెల 6న) అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను గదిలో బంధించి అదే ప్రాంతంలో ఉంటున్న తన స్నేహితులు స్నేహిత్‌రెడ్డి, ఆరవ్‌రెడ్డిలను తీసుకొచ్చి వారి కోరిక తీర్చాలని బలవంతం చేశాడు. ఎలాగో అలా ఆ యువతి అక్కడ్నుంచి బయటపడి ఫిర్యాదు చేయడంతో పోలీసులు సోమవారం ప్రీతమ్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ప్రీతమ్‌రెడ్డి తీసుకువచ్చిన స్నేహితుల్లో ఒకరిని ఎమ్మెల్సీ తనయుడిగా భావిస్తున్నారు. అయితే పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు. వారిని పట్టుకొనేందుకు పోలీసులు రెండు బృందాలను ఏర్పాటు చేశారు.

ప్రజలే గుణపాఠం చెబుతారు: కోదండరాం

08/05/2017: హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ పాలనాతీరులో మార్పురాకుంటే ప్రజలే తగిన గుణపా ఠం చెబుతారని రాజకీ య జేఏసీ చైర్మన్, తెలంగాణ విద్యావం తుల వేదిక (టీవీవీ) గౌరవ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం అన్నారు. ఆదివారం ఓయూ క్యాంపస్‌లోని ఇంజనీరింగ్‌ కళాశాల ఈసీఈ ఆడిటోరియంలో జరిగిన టీవీవీ హైదరాబాద్‌ జిల్లా మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన కేసీఆర్‌ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలను విస్మరించడంతో పాటు రైతులు, నిరుద్యోగులు, దళితులు, చివరకు ప్రతిపక్షాలనూ లెక్కచేయకుండా నియం తృత్వ పాలన కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

క్రైం సీరియల్ చూసి.. దారుణం!

05/05/2017: హైదరాబాద్ : టీవీలలో వచ్చే క్రైం సీరియళ్లు యువత మీద దారుణమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన ఓ యువకుడు.. తమ పక్కింట్లో ఉండే బాలుడిని నమాజ్‌కు వెళ్తుండగా కిడ్నాప్ చేసి అతడిని హతమార్చాడు. దాదాపు రెండు వారాల క్రితం జరిగిన ఈ ఘటనలో ఆధారాలు తాజాగా బయటపడ్డాయి. చాంద్రాయణగుట్టకు చెందిన ఉరూజుద్దీన్ అనే బాలుడు ఏప్రిల్ 22వ తేదీ ఉదయం ఇంట్లోంచి వెళ్లి, రాత్రయినా తిరిగి రాలేదు. దాంతో అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా విచారించినప్పుడు చివరిసారిగా తాము పక్కింట్లో ఉండే మునీర్‌తో అతడిని చూశామని చెప్పారు. దాంతో అతడిని అదుపులోకి తీసుకోగా.. అతడి కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమ రెండు కుటుంబాలు చాలా సన్నిహితంగా ఉంటాయని, అలాంటప్పుడు తమవాడి మీద ఎందుకు అనుమానించి తమను వేధిస్తారని తిరగబడ్డారు. దాంతో పోలీసులు కాస్త నెమ్మదించారు. కానీ ఈలోపు మునీర్ ముంబై పారిపోయేందుకు ప్రయత్నించగా, అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో మళ్లీ విచారించారు. దాంతో అసలు విషయం తెలిసింది. ఆరోజు నమాజ్‌కు వెళ్తున్న ఉరూజుద్దీన్‌ను తానే కిడ్నాప్ చేశానని, అయితే కిడ్నాప్ చేసిన తర్వాత ఏం చేయాలో తెలియక గొంతు నులిమి చంపేశానని అంగీకరించాడు. అతడు పారిపోయేందుకు ప్రయత్నించినా వెంటపడి మరీ తీసుకెళ్లాడు. మృతదేహాన్ని ఓ మురికి కాల్వలో పడేసినట్లు చెప్పాడు. సీసీటీవీ ఫుటేజిలో కూడా ఉరూజుద్దీన్‌ను మునీరే తీసుకెళ్లినట్లు స్పష్టంగా రికార్డయింది. దాంతో పోలీసులు మునీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తాను క్రైం సీరియళ్లు ఎక్కువగా చూస్తానని, అందుకే ఈ ఆలోచన వచ్చిందని పోలీసులకు మునీర్ చెప్పాడు.

విమర్శిస్తే ఊరుకునేది లేదు: దత్తన్న

03/05/2017: హైదరాబాద్‌: మిర్చి రైతుల ఇబ్బందులు తీర్చలేక కేంద్రాన్ని విమర్శిస్తే ఊరుకోబోమని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ రాష్ట్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. పత్తి వద్దు మిర్చి ముద్దు అని స్వయంగా సీఎం కేసీఆరే ప్రచారం చేశారని ఆయన గుర్తు చేశారు. ఆయన ప్రచారం కారణంగా మిర్చి సాగు పెరిగి దిగుబడి ఎక్కువ వచ్చిందని అన్నారు. మిర్చి కొనుగోలు కేంద్రాలు ప్లాన్ చేయక పోవడం వల్ల రైతులు వ్యాపారుల చేతుల్లో నలిగి పోయారని ధర దక్కక మిర్చిని తగుల బెడుతున్నారని మంత్రి తెలిపారు. అందుకు కేంద్ర ప్రభుత్వమే కారణమని నిందిస్తే ఊరుకునేది లేదన్నారు. వాణిజ్య పంటల ధరలతో కేంద్రానికి సంబంధం ఉండదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అందజేసిన మొదటి నివేదికలో స్పష్టత లేదు..ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని విమర్శించారు. ప్రభుత్వం తమ వైఫల్యాలను కేంద్రంపై నెట్టడం సరి కాదని తెలిపారు. ఇంతగా గొడవలు జరుగుతున్నా రాష్ట్ర సర్కారు ఎవరిపై అయినా చర్యలు తీసుకుందా అని ప్రశ్నించారు. అయినా మార్కెట్ ఇంటర్ వెన్షన్ ఫండ్ కింద మిర్చి పంటను కొనాలని కేంద్ర ప్రభుత్వం కోరిందని వివరించారు.

11 ఏళ్లకే 12వ తరగతి పాస్‌!!

17/04/2017: హైదరాబాద్‌: నైనా జైస్వాల్‌.. గుర్తుంది కదా.. అతిపిన్న వయసులోనే అద్భుతాలు సృష్టించి ఔరా అనిపించింది. కేవలం 16 ఏళ్లకే పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసి.. ఆసియాలోనే ఈ ఘనత సాధించిన చిచ్చర పిడుగు అనిపించుకుంది. ఇప్పుడు ఆమె సోదరుడు అగస్త్య జైస్వాల్‌ కూడా అక్కకు తగ్గ తమ్ముడనిపించుకుంటున్నాడు. కేవలం 11 ఏళ్లకే 12వ తరగతి ఉత్తీర్ణుడై రికార్డు సృష్టించాడు. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలోగల సెయింట్‌ మేరిస్‌ జూనియర్‌ కాలేజిలో చదువుతున్న అగస్త్య జైస్వాల్‌ ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరాన్ని 63 శాతం మార్కులతో పాసయ్యాడు. రాష్ట్రంలో అతి చిన్న వయసులో ఈ ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా తన కుమారుడు నిలిచాడని అగస్త్య తండ్రి అశ్వినీకూమార్‌ వెల్లడించారు. తొమ్మిదేళ్ల వయసులో పదోతరగతిని పూర్తిచేసిన రికార్డు కూడా ఆగస్త్య పేరుమీదే ఉంది. దీని కోసం ఎలాంటి అనుమతి తీసుకోలేదని, ఎందుకంటే ఇంటర్మీడియట్‌ బోర్డు వారికి సబ్జెక్టులు, ఏ మీడియంలో రాస్తున్నారు, సెకండ్‌ ల్యాంగ్వేజీ ఏంటి అనేది తెలిపితే సరిపోతుందన్నారు. వయసు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా బోర్డు పరీక్ష రాసేవారిని పదో తరగతి డేటా ఆధారంగా తీసుకుంటారని, అందుకే ఎటువంటి అనుమతులు లేకుండానే ఇంటర్‌ పరీక్షలు రాశాడని, ఉత్తీర్ణుడు కావడం గర్వంగా ఉందని అశ్వినీకుమార్‌ తెలిపారు.

కాటమరాయుడు’పై దివ్యాంగుల ఆగ్రహం

15/04/2017: హైదరాబాద్: దివ్యాంగుల మనోభావాలను కించపరిచినా, ప్రయత్నించినా.. అటువంటి వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్‌ బి.శైలజ హెచ్చరించారు. సోమవారం జోగులాంబ జిల్లాకు చెందిన పలువురు దివ్యాంగులు వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్‌ను కలిసి ‘కాటమరాయుడు’ సినిమాలో వికలాంగులను కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందచేశారు. స్పందించిన డైరెక్టర్‌ శైలజ ‘కాటమరాయుడు’ సినిమా డైరెక్టర్‌ను విచారించి నోటీసులు పంపుతామని హామీ ఇచ్చారు. కాటమరాయుడు సినిమా చూసి వివరాలు తనకు తెలియచేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. అనంతరం దివ్యాంగుల సేవా సంఘం అధ్యక్షుడు చంటి మాట్లాడుతూ.. వెంటనే కాటమరాయుడు సినిమా నిలిపివేయాలని, దివ్యాంగులపై చేసిన అనుచిత వ్యాఖ్యల చిత్రీకరణను తొలగించాలని, సినిమా యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వినతిపత్రం అందచేసిన వారిలో దివ్యాంగుల సేవా సంఘం ఉపాధ్యక్షుడు కె.జయంతుడు, కార్యదర్శి నాగరాజు, పలువురు దివ్యాంగులు ఉన్నారు.

ఢిల్లీ నుంచి బెట్టింగ్‌ రేషియో

15/04/2017: ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల నేపథ్యంలో అఫ్జల్‌గంజ్‌ ప్రాంతంలో బెట్టింగ్స్‌ నిర్వహిస్తున్న ఇద్దరు బుకీలను తూర్పు మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.3.84 లక్షల నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. అఫ్జల్‌గంజ్‌ ప్రాంతానికి చెందిన గజానంద్‌ ఉపాధ్యాయ, బేగంబజార్‌కు చెందిన అతడి స్నేహితుడు సందీప్‌ టక్‌ తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు బుకీలుగా మారారు. ఐపీఎల్‌ మ్యాచ్‌ల నేపథ్యంలో ఫోన్ల ద్వారా పరిచయస్తులు, స్నేహితుల నుంచి పందాలు అంగీకరిస్తున్నారు. ఈ బెట్టింగ్‌ నిర్వహణలో రేష్యోగా పిలిచే అప్‌డేట్స్‌ అత్యంత కీలకం. ఏ స్థాయిలో ఏ జట్టుపై ఎంత రెట్టింపు ఆఫర్‌ ఇవ్వాలి? ఎంత మొత్తం అదనంగా చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకోవాలి అంశాలు ఇందులో ఉంటాయి. దేశవ్యాప్తంగా వీటి వివరాలు ఎప్పటికప్పుడు ఫోన్‌ ద్వారా తెలిపేందుకు ఢిల్లీకి చెందిన బుంటి భాయ్‌తో ఒప్పందం చేసుకుని నెలకు రూ.నాలుగు వేలు చొప్పున చెల్లించేవారు. దేశ వ్యాప్తంగా ఉన్న బుకీలకు బుంటి భాయ్‌ లాంటి వాళ్ళు రేష్యోలు చెప్పేందుకు ఒప్పందం కుదుర్చుకుని డబ్బు తీసుకుంటుంటారు. కేవలం రూ.లక్ష లోపు పందాలను మాత్రమే గజానంద్, సందీప్‌ అంగీకరిస్తారు. పందెం రాయుళ్లు అంతకంటే ఎక్కువ మొత్తం బెట్టింగ్‌ కాయాలని కోరితే... వారిని కింగ్‌ కోఠి ప్రాంతానికి చెందిన లడ్డూ కచువకు పరిచయం చేసి కమీషన్‌ తీసుకునేవారు. గురువారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌కు సంబంధించి వీరి దందాపై సమాచారం అందుకున్న ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌కుమార్‌ నేతృత్వంలో ఎòౖÜ్సలు ఎ.సుధాకర్, కె.శ్రీనివాస్, ఎస్‌.సైదాబాబు దాడులు నిర్వహించి నిందితులు గజానంద్, సందీప్‌లను అరెస్టు చేశారు. పరా>రీలో ఉన్న నిందితులు బుంటి భాయ్, లడ్డూ కోసం గాలిస్తున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును స్థానిక పోలీసులకు అప్పగించారు.

క్యాంప్ ఆఫీస్ లో వారసుడి హల్చల్

15/12/2016: సీఎం కేసీఆర్ కు కుటుంబ ముఖ్యమంత్రిగా పేరుంది. మరే సీఎం చేయని తరహాలో ఆయన తన కుటుంబానికి చాలా ప్రాధాన్యమిస్తారు. అధికార నివాసంలో పూజలు కూడా సకుటుంబ సపరివార సమేతంగా చేస్తారు. మనవడంటే కేసీఆర్ కు ఎంతిష్టమో ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది. గతంలో కూడా సెక్రటేరియట్లో కేసీఆర్ మనవడు హల్చల్ చేశాడు. ఒకసారైతే ఏకంగా సీఎం కాన్వాయ్ లో మిత్రులతో కలిసి సెక్రేటేరియట్ కు రావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఏం చేసినా మనవడిని కేసీఆర్ నెత్తినే పెట్టుకుంటారు. ఎంతైనా తాత కదా. అందుకే ఇప్పుడు మరోసారి అదే జరిగింది. అధికార కార్యక్రమాల్లో మళ్లీ సీఎం మనవడు హల్చల్ చేశాడు. క్యాంప్ ఆఫీస్ లో ఉబర్ బైక్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి హాజైరన కేసీఆర్ మనవడు హిమాంశ్ బ్యాటరీ వాహనాన్ని నడిపి సందడి చేశాడు. సీఎం సమక్షంలో వాహనం నడపండ అందర్నీ ఆకట్టుకుంది. కేసీఆర్ ఫ్యామిలీని ఇంత ఇన్వాల్వ్ చేయడం అధికారులకు ముచ్చటగా ఉందేమో కానీ.. కొంతమంది తెలంగాణవాదులు మాత్రం విమర్శిస్తున్నారు. ఇంతగా కుటుంబసబ్యులు అధికార కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదని హితవు చెబుతున్నారు.

తెలంగాణపై పవన్ ఫోకస్కు ఇదే నిదర్శనం

07/11/2016: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా కార్యకలాపాలు చేపడుతున్న పవన్ తెలంగాణలో కూడా పార్టీ నిర్మాణంపై దృష్టిసారించారు. ఈ క్రమంలో కీలక నియామకాలు చేపట్టినట్లు జనసేన పార్టీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. జనసేన సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడం పై దృష్టి సారించామని, ఇందులో భాగంగా బొంగునూరి మహేందర్ రెడ్డి, నేమూరి శంకర్ గౌడ్,పి.హరిప్రసాద్ లకు కీలక బాధ్యతలు అప్పగించామని పవన్ పేరుతో విడుదల అయిన ప్రకటన వెలువడింది. పార్టీ ఆవిర్భావ సమయంలో ఉపాధ్యక్షునిగా నియమితులైన మహేందర్ రెడ్డి తెలంగాణలో జనసేన పార్టీ రాజకీయ కార్యక్రమాలను సమన్వయం చేస్తారు. నేమూరి శంకర్ గౌడ్ జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జి గా బాధ్యతలు నిర్వహిస్తారు. సీనియర్ పాత్రికేయుడు పి.హరిప్రసాద్ ను పార్టీ మీడియా విభాగ బాధ్యునిగా నియమించామని వివరించారు. ఈ సందర్భంగా వారి వివరాలను సైతం జనసేన తెలియజేసింది. మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలోని డిపోచంపల్లిలో జన్మించి హైదరాబాద్ లో వ్యాపారవేత్తగా స్థిరపడ్డారని పేర్కొంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని బోరబండ నివాసి అయిన నేమూరి శంకర్ గౌడ్ కూడా వ్యాపార రంగం లో స్థిరపడ్డారని వివరించారు. తాను స్థాపించిన కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో చురుకైన కార్యకర్తలుగా పనిచేసిన వీరిద్దరూ తనతోపాటే రాజకీయ,సేవ కార్యక్రమాల్లో పయనిస్తున్నారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. గత పద్నాలుగు సంవత్సరాలుగా వీరి అకుంఠిత దీక్ష, సేవా కార్యక్రమాల పట్ల అపేక్ష రాజకీయాలపై గౌరవాన్ని చూసిన తరువాత, జనసేన పార్టీకి బాధ్యుతాయుతమైన క్రియాశీలక నేతలుగా ఎంపిక చేశామని పవన్ వివరించారు. సీనియర్ పాత్రికేయుడైన పి.హరిప్రసాద్ గత మూడు దశాబ్దాలుగా నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా పని చేస్తున్నారని పవన్ ప్రశంసించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో క్షేత్రస్థాయి నుంచి రిపోర్టర్,సబ్ ఎడిటర్ చీఫ్ సబ్ ఎడిటర్,న్యూస్ ఎడిటర్,ఎడిటర్ హోదాలో పనిచేసిన పి.హరిప్రసాద్ అనుభవం పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నామని వివరించారు. ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియాలో విశేష అనుభవం ఉన్న పి.హరిప్రసాద్ సేవలను వినియోగించుకోవాలని జనసేన పార్టీ మీడియా విభాగానికి హెడ్ గా నియమించామన్నారు. ఈ నియామకాలతో తెలంగాణపై పవన్ ప్రత్యేక దృష్టి సారించినట్లుగా విశ్లేషణలు వెలువడుతున్నాయి.

నాకిది స్పెషల్‌ బర్తడే

హైద్రాబాద్‌, నవంబర్‌ 4,2016 (సలాం తెలంగాణ): గవర్నర్‌ నరసింహన్‌ జన్మదిన వేడుకలు రాజ్‌భవన్‌లో ఘనంగా జరిగాయి. శుక్రవారం రాజ్‌ భవన్‌ కు వెళ్లిన సీఎం కేసీఆర్‌ గవర్నర్‌ ను కలుసుకుని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎంతో తో పాటు స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విషెస్‌ తెలిపారు. తాను 70 ఏళ్లుగా బర్త్‌ డే జరుపుకుంటున్నప్పటికీ ఇంత ఆనందంగా ఎన్నడూ లేనని తెలిపారు గవర్నర్‌. ఈ పుట్టిన రోజును జీవితంలో మర్చిపోలేనని తెలిపారు. మొత్తం రాష్ట్రమంతా ఇక్కడే ఉన్నట్లుందన్నారు. తాను రాష్ట్రాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, నాయకులు రాజ్‌భవన్‌కు వెళ్లి శుభాకాంక్షాలు తెలుపడంతో గవర్నర్‌ సంతోషం వ్యక్తం చేశారు.నరసింహన్‌ 70వ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు తెలుగు రాష్ట్రాల సీఎంలు. బర్త్‌ డే వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలని గవర్నర్‌ నిర్ణయంచటంతో? రాజ్‌ భవన్‌ కు వెళ్లిన కేసీఆర్‌, చంద్రబాబు? నర్సింహన్‌ కు శుభాకాంక్షలు చెప్పారు. ముందుగా రాజ్‌ భవన్‌ కు వెళ్లిన బాబు.. కేక్‌ కట్‌ చేసి గవర్నర్‌ ను శాలువాతో సన్మానించారు. రాజ్‌ భవన్‌ లో గవర్నర్‌ తో భేటీ అయిన కేసీఆర్‌? భవనాల తరలింపుపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాలకు అచ్చి రాని ఉచిత విద్యుత్‌ ...

హైద్రాబాద్‌, నవంబర్‌ 3,2016 (సలాం తెలంగాణ): తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు అలా మేలు కలుగున్నట్టు లేదు. వ్యవసాయ రంగంపై నీతి ఆయోగ్‌ విడుదల చేసిన ర్యాంకుల్లో ఏపీ 7, తెలంగాణ 8వ ర్యాంకు సాధించాయి. జాబితాలో టాప్‌ 5లో నిలిచిన రాష్ట్రాలన్నీ బీజేపీ అధికారంలో ఉన్నవే అనేది రాజకీయ కోణం. రైతు కోణంలోంచి చూస్తే, ఈ ఐదు రాష్ట్రాల్లోనూ ఉచిత విద్యుత్‌ విధానం అమల్లో లేదు. రైతు రుణమాఫీ జరగలేదు. అటు ఉచిత్‌ విద్యుత్తుకు, ఇటు రుణమాఫీకి వేల కోట్ల భారాన్ని మోస్తున్న తెలుగు రాష్ట్రాలు మాత్రం టాప్‌ 5లో చోటు దక్కించుకోలేదు. ఉచిత విద్యుత్‌ పథకం అమల్లో ఉన్న మరో రాష్ట్రం పంజాబ్‌ పరిస్థితి మరీ దయనీయమని నీతి ఆయోగ్‌ నివేదిక తేల్చింది. అక్కడా బీజేపీ సంకీర్ణ ప్రభుత్వమే ఉంది. ఎవరి కోసమైతే ఆ నిధులను ఖర్చుచేస్తున్నారో వారికైనా మేలు జరగాలి. కానీ . జాబితాలో మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్రలో ఉచిత విద్యుత్‌ పథకం లేదు. అక్కడ రైతులకు విద్యుత్‌ బిల్లులపై సబ్సిడీ ఇస్తారు. టాప్‌ 5 లో ఉన్న మిగతా నాలుగు రాష్ట్రాల్లోనూ ఉచిత విద్యుత్‌ అమల్లో లేదు. పైగా రైతుల రుణాలను మాఫీ చేయలేదు. అయినా అక్కడి రైతులు మన కంటే బాగున్నారని నీతి ఆయోగ్‌ జాబితా చెప్తోంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ లోనే ఉచిత విద్యుత్‌ విధానం అమల్లోకి వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ కొనసాగుతోంది. దీనిపై ప్రభుత్వాలు వేల కోట్ల భారాన్ని మోస్తున్నాయి. అలాగే 2014 ఎన్నికల్లో రుణమాఫీ హావిూ ఇచ్చినందున ఇటు కేసీఆర్‌ సర్కార్‌, అటు చంద్రబాబు ప్రభుత్వం రైతు రుణమాఫీని అమలు చేస్తున్నాయి. అయితే ఒకేసారి రుణమాఫీ చేయక పోవడం వల్ల చాలా మంది రైతులకు మంచికి బదులు చెడే జరిగింది. కొత్త అప్పులు దొరకడం కూడా చాలా మంది రైతులకు కష్టమైపోయింది.

మావోయిస్టుల బంద్‌ - భద్రతాదళాల అప్రమత్తం

హైదరాబాద్‌, నవంబర్‌ 02,2016 (సలాం తెలంగాణ): ఏవోబీ ఎన్కౌంటర్‌ కు నిరసనగా గురువారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా, చత్తీస్గఢ్‌, మహారాష్ట్రల్లో బంద్‌ కు మావోలు పిలుపునిచ్చారు. ఉగ్రసంస్థలు దాడి జరిపే అవకాశమున్నట్లుగా నిఘాసంస్థలు హెచ్చరించాయి. దీంతో ముందస్తున్న చర్యల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర సరిహద్దుల్లో బలగాలను భారీగా మోహరించారు. తూర్పు అటవీప్రాంతంలో పోలీసులు కూబింగ్‌ తో జల్లెడపడుతున్నారు. గురువారం నాడు మవోయిస్టులు తలపెట్టిన ఐదు రాష్ట్రాల బంద్‌ కు భద్రతాదళాలు సంసిద్దమయ్యాయి. వివాఖ ఏజెన్సీలోకి వచ్చే వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. తమకు చెప్పకుండా ప్రజాప్రతినిధులు పర్యటించవద్దని పోలీసులు సూచించారు. మన్యంలోని 11 మండలాలతోపాటు మైదాన ప్రాంతంలోనూ ప్రజాప్రతినిధులను, తాజా, మాజీ నాయకులను, అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ సమయంలో ఏం జరుగుతుందోనని ఏజెన్సీ ప్రజలు భయాందోళనల మధ్య గడుపుతున్నారు. కాగా మధ్యప్రదేశ్‌ లోని భోపాల్‌ లో జరిగిన సిమి ఉగ్రవాదుల ఎన్‌ కౌంటర్‌ తో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఏపీలో ఉత్తరాంధ్ర ఏజెన్సీ, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరుతోపాటు తెలంగాణలోని కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భద్రాచలం ఏజెన్సీలలో పోలీసులు అప్రమత్తమయ్యారు. బంద్‌ సందర్భంగా మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉండడంతో రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే మావోయిస్టు సానుభూతిపరులుగా ముద్రపడిన వారిపై పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. వారి కదలికలు.. సమాచార వ్యవస్థను ఎప్పుటికప్పుడు గమనిస్తున్నట్లు సమాచారం. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మన్యంలో అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ప్రజలకు భద్రత కల్పించేందుకు అదనపు బలగాలను రంగంలోకి దింపారు. మన్యంలోని కీలక మార్గాల్లో వాహనాల రాకపోకలు, ప్రయాణీకుల కదలికలపైనా నిఘా ఉంచారు. అనుమానితులు కనిపిస్తే ఆరా తీస్తున్నారు. మొత్తానికి ఎఒబి ప్రాంతంలో భయానక పరిస్థితి ఏర్పడింది. ఏక్షణాన ఎటువంటి సంఘటనలు జరుగుతాయోనని అక్కడి గిరిజనులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. పోలీసుల దాడులను అడ్డుకునేందుకు మిగిలివున్న దళ సభ్యులు ఏ క్షణమైనా దాడి చేస్తారన్న అనుమానాలు కూడా పోలీసులకు ఉంది.

హైద్రాబాద్‌ లో క్యాబ్‌ లకు పెరుగుతున్న ఆదరణ

హైద్రాబాద్‌, నవంబర్‌ 2,2016 (సలాం తెలంగాణ): క్యాబ్‌ లకు అదరణ పెరుగుతోంది. వర్షం, ట్రాఫిక్‌, డిమాండ్‌ ఉన్న సమయాల్లోనూ నేరుగా ఇంటి ముంగిటకే క్యాబ్‌ సేవ లు అందుతున్నాయి. కుటుంబ సమేతంగా కానీ, వ్యక్తిగతంగా ప్రయాణం చేయాలనుకునే సదరు ప్రయాణి కుడు క్యాబ్‌ బుక్‌ చేసుకుంటే చాలు నిమిషాల వ్యవధిలో సంబంధిత గమ్యస్థానాలకు చేర్చుతూ ఆకట్టుకోవడమే డిమాండ్‌కు ప్రధాన కారణం. తక్కువ ధరతో ఎలాంటి ఇబ్బందుల్లేని ప్రయాణానికి ఐటీ ఉద్యోగులకే కాకుండా అన్ని వర్గాల ప్రజలు మొగ్గు చూపుతుండడంతో క్యాబ్‌ కళ సంతరించుకుంటుంది. రంగారెడ్డి జిల్లా రవాణాశాఖాధికారి పరిధిలో గతేడాది జనవరి నుంచి నవంబరు మధ్య 1600 క్యాబ్‌లు రిజిస్ట్రేషన్‌ జరగగా, ఈ ఏడాది పది నెలల వ్యవధిలో 4000లకుపైగా రిజిస్ట్రేషన్లు జరిగాయంటే క్యాబ్‌లకు ఆదరణ అంతా ఇంతా కాదని చెప్పవచ్చు. ఐటీలో విప్లవాత్మకమైన మార్పు లు, బీఎస్‌-4 వాహనాలు, పాత వాహనాల స్థానంలో క్యాబ్‌లకు ప్రాధాన్యత ఇవ్వడమే కారణమని రవాణాశాఖాధికారి ప్రవీణ్‌రావు తెలిపారు.ఐటీ భూమ్‌తో ప్రత్యక్షంగా లక్షలాది మంది ఉద్యోగాలు పొందితే నాణానికి రెండోవైపు అన్నట్లుగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈక్రమంలోనే నిరుద్యోగులు స్వయం ఉపాధి బాట పడుతున్నారు. నిరుద్యోగులకు సైతం రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు మొగ్గు చూపుతుండడం, 8.9- 10.5శాతం వడ్డీరేటు మాత్రమే వసూలు చేస్తుండడంతో ఫైనాన్స్‌లో వాహనా లు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు.

ఇరవై వేలకు చిన్నారిని అమ్మేశారు..

హైద్రాబాద్‌, నవంబర్‌ 2,2016 (సలాం తెలంగాణ): రాజధాని నగరంలో దారుణం జరిగింది. మూడోసారి ఆడపిల్ల పుట్టడంతో ఆ శిశువును 20 వేలకు అమ్మకానికి పెట్టారు తల్లిదండ్రులు. సైదాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి ఘటన జరిగింది. బంధువులు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం మైనంపల్లి గ్రామానికి చెందిన రమావత్‌ కృష్ణ, సుజాతలు సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఉంటున్నారు. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలున్న వీరికి 4 రోజుల క్రితం మరో ఆడపిల్ల పుట్టింది. ఈసారి కూడా అమ్మాయి పుట్టడంతో భార్య, భర్తలు గొడవ పడ్డారు. చివరకు ఆ శిశువును అమ్మాలని నిర్ణయించుకున్నారు. సింగరేణికాలనీ ఘణపురం గుడిసెలో నివసించే ఓ వ్యక్తికి 20 వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకొని కొంత నగదు తీసుకున్నారు. ఇదే టైమ్‌ లో సుజాత మేనత్త సక్రు రాకతో విషయం బయటపడింది. స్థానికుల సాయంతో విషయాన్ని పోలీసులకు చెప్పింది సక్రు. సైదాబాద్‌ పోలీసులు కృష్ణ, సుజాతలను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు

గ్రేటర్‌ లో 30కు పెరిగిన సర్కిల్స్‌

హైద్రాబాద్‌, నవంబర్‌ 2,2016 (సలాం తెలంగాణ): జిహెచ్‌ఎంసి పరిధిలో ప్రస్తుతమున్న 18 సర్కిళ్లను 30కి పెంచుతూ పాలక మండలి, అధికారులు పంపిన ప్రతిపాదనకు సర్కారు ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌ రెవెన్యూ జిల్లా పరిధిలో 98 మున్సిపల్‌ వార్డులు, పదేళ్ల క్రితం గ్రేటర్‌లో విలీనమైన 12 మున్సిపాల్టీల్లో ఉన్న మరో 52 డివిజన్లతో కలిపి మొత్తం 150 వార్డులున్నాయి. అయితే గ్రేటర్‌ అయిన కొత్తలో వీటిని 18 సర్కిళ్లుగా కొనసాగించగా, పూర్వ కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌ వీటిని 24కు పెంచారు. ఉన్న సర్కిళ్లనే ఏ, బి అంటూ ఆయన రెండుగా విభజించారు. సర్కిల్‌ 1 నుంచి 18వరకు కొన్నింటిల్లో ఏ, బిగా కొనసాగుతున్న సర్కిళ్లు ఇపుడు ఏ,బి,సిలుగా ఏర్పడనున్నాయి. దీంతో గతంలో ఒక్క సర్కిల్‌గా ఉన్న ప్రాంతం ఇపుడు మూడు సర్కిళ్లుగా ఏర్పడి పరిధి చిన్నగా కానుందిపరిపాలన సౌలభ్యం నిమిత్తం 30 సర్కిళ్లకు పెంచుతూ ప్రతిపాదనలు పంపిన జిహెచ్‌ఎంసి 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం అధికారికంగా 18, అనధికారికంగా కొనసాగుతున్న 24 సర్కిళ్లను ముప్పైకి పెంచాలని కోరుతూ కౌన్సిల్‌, స్థాయి సంఘం అనుకూల తీర్మానాలను సర్కార్‌ ఆమోదించింది. ఈ అంశంపై గతంలోనే ప్రసాదరావు కమిటీ చేసిన సిఫార్సులు, నియమించుకోవల్సిన సిబ్బంది వివరాలను సైతం జిహెచ్‌ఎంసి సర్కారుకు పంపింది.. దీంతో ఈ మూడు సర్కిళ్లకు ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు, ముగ్గురు అసిస్టెంటు మెడికల్‌ ఆఫీసర్లతో పాటు ముగ్గురు టౌన్‌ప్లానింగ్‌ అసిస్టెంటు సిటీ ప్లానర్లను కూడా నియమించనున్నారు. అంతేగాక, ట్యాక్సు, మోటేషన్‌ వంటి ఇతరత్ర కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు సర్కిళ్ల వారీగా చీఫ్‌ వ్యాలుయేషన్‌ ఆఫీసర్లను ఉన్న ఆస్తిపన్ను ఖాతాలకు పన్ను వసూలు, కొత్త అసెస్‌మెంట్లు వంటివి చేపట్టేందుకు ట్యాక్సు ఇన్‌స్పెక్టర్లు, బిల్‌ కలెక్టర్లను కొత్త సర్కిళ్లకు నియమించేందుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది. కానీ ఇప్పటికే డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంటు మెడికల్‌ ఆఫీసర్లలో కొందరు ఓ సర్కిల్‌కు పూర్తి స్థాయిలో, మరో సర్కిల్‌కు ఇన్‌ఛార్జిలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

రెండో విడత ఇళ్లకు ఓకే

హైద్రాబాద్‌, నవంబర్‌ 2, (సలాం తెలంగాణ): జీహెచ్‌ ఎంసీపరిధిలో రెండో విడత డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి ఓకే చెప్పింది ప్రభుత్వం. నగరంలోని 32 ప్రాంతాల్లో 15 వేల 519 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను కట్టించనుంది. ఇందుకోసం 1298 కోట్ల విడుదలకు ప్రభుత్వం శాఖాపరమైన అనుమతులను మంజూరు చేసింది. హైదరాబాద్‌ లోని 12 ప్రధాన ప్రాంతాల్లో 8 వేల 476 ఫ్లాట్లను సెల్లార్‌ ప్లస్‌ తొమ్మిది అంతస్తులతో నిర్మిస్తారు. ఒక్కో ఫ్లాటు నిర్మాణానికి అదనంగా అయ్యే సొమ్మును జీహెచ్‌ఎంసీ భరిస్తుంది. డబుల్‌ బెడ్‌ రూం ఫ్లాట్లను నిర్మించడానికి అవసరమయ్యే నిధులను గృహనిర్మాణ శాఖ మంజూరు చేస్తుంది.

అల్వాల్ లో కారు బీభత్సం

01/11/2016: హైదరాబాద్: నగరంలోని అల్వాల్ లో సోమవారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా కారులో వెళ్తున్న యువకులు ఎదురుగా వస్తున్న మూడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కారులో ఉన్న వ్యక్తులు మద్యం సేవించి ఉన్నారని, మద్యం మత్తులో కారును నడపటం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. కారులోని వ్యక్తులతో పాటు ఇద్దరు ద్విచక్ర వాహనదారులకు ఈ ఘటనలో గాయాలయ్యాయి. వారు ప్రస్తుతం సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సిద్దిపేట నుంచి కారులో నగరానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

శ్రీ వేంకటేశ్వరస్వామి ఏక వింశతి 21 వ బ్రహ్మోత్సవాలు చందానగర్‌ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో....

28/10/2016: హైదరాబాద్, సలాం తెలంగాణ: శ్రీ వేంకటేశ్వరస్వామి ఏక వింశతి 21 వ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని చందానగర్‌ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం నాడు కాలసర్ప దోష నివారణ నివారణ కోసం మహా యాగ్ఞం చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ఆధ్వర్యంలో ఈ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా ఎంపి లు కల్వకుంట్ల కవిత, కొండ విశ్వేశ్వర్‌ రెడ్డి, తెలంగాణ సాంఘీక సంక్షేమ మండలి చైర్‌ పర్సన్‌ రాగం సుజాత నాగేందర్ యాదవ్‌, ఎంఎల్‌ఎ లు శేరిలింగంపల్లి అరికెపూడి గాంధీ, ఉస్నభాద్‌ సతీష్‌ గౌడ్‌, కార్పోరేటర్లు రాగం నాగేందర్‌ యాదవ్‌, బొబ్బ నవతా రెడ్డి, మేక రమేష్‌, నాయకులు బిల్డర్స్‌ అసోషియేషన్‌ ప్రెసిడెంట్‌ మిరియాల రాఘవ రావు, గుర్రపు రవీందర్‌ రావు, బద్దం కొండల్‌ రెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి, శ్రీనివాస్ ముదిరాజ్‌, మేకల కృష్ణ యాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

తెలంగాణకు ఏపీ సచివాలయం ఇవ్వట్లేదా?

28/10/2016: కొత్త సచివాలయాన్ని నిర్మించి తీరాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తాను అనుకున్నట్లుగా కొత్త సచివాలయాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వసతుల లేమి కారణంగా తెలంగాణ సచివాలయాన్ని కూలగొట్టి.. ఆ స్థానంలో అత్యాధునిక స్థాయిలో సరికొత్త సచివాలయాన్ని సిద్ధం చేయాలని ఆయన భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నా.. కేసీఆర్ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. కొత్త సచివాలయం పేరుతో భారీ ఖర్చుకు తెర తీయటంపై విపక్షాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. వసతుల పేరు పైకి చెబుతున్నా.. వాస్తు సరిగా లేదన్న కారణంగానే.. సచివాలయాన్ని కూలగొట్టేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. అయితే.. కొత్త సచివాలయ నిర్మాణంలో భాగంగా తెలంగాణ సచివాలయాన్ని.. ఏపీ సచివాలయ భవనంలోకి మార్చాలన్న ప్రతిపాదన గతంలో వచ్చింది. దీనికి సంబంధించిన కసరత్తు కొంత జరిగింది కూడా. ఏపీ సచివాలయంలోని శాఖలన్నింటినీ.. ఏపీ రాజధాని అమరావతిలోని వెలగపూడిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక సచివాలయంలోకి మార్చేసిన నేపథ్యంలో.. ఆ భవనాలన్నీ ఖాళీగా ఉన్నాయి. దీంతో.. ఆ భవనాల్ని తమకు అప్పగించేస్తే.. తెలంగాణ సచివాలయంలోని శాఖలన్నింటినీ ఒక్కసారిగా మార్చటంతో పాటు.. అందరికి అనువుగా ఉంటుందని భావించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ చేత ఏపీ ముఖ్యమంత్రికి రాయబారాన్ని పంపటం.. దీనికి సానుకూలంగా ఏపీ సీఎం చంద్రబాబు స్పందించటం జరిగిపోయాయి. అయితే. ఈ మధ్యలో చోటు చేసుకున్న పరిణామాలతో.. తమ సచివాలయ భవనాన్ని తెలంగాణ సర్కారుకు అప్పగించే విషయంలో ఏపీ సర్కారు నాన్చటంతో తెలంగాణ సర్కారు పునరాలోచనలో పడింది. ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించింది. మొదట్లో అనుకున్నట్లుగా.. తెలంగాణ సచివాలయంలోని శాఖల్ని.. నగరంలోని వేర్వేరు భవనాల్లోకి మార్చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 90 శాతం శాఖల కార్యదర్శులు సచివాలయానికి సమీపంలోని బూర్గుల రామకృష్ణారావు భవనంలోకి మారాలని నిర్ణయించారు. సీఎంవో.. సాధారణ పరిపాలనతో సహా.. కీలక విభాగాలన్నింటినీ బీఆర్కే భవనంలోకి మార్చనున్నారు. సాగునీటి పారుదల.. పంచాయితీరాజ్.. రోడ్డు.. రహదారుల శాఖ లాంటి ఇతర శాఖల్ని నగరంలోని వివిధ భవనాల్లోకి మార్చేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక.. తెలంగాణ సచివాలయ భవనాన్ని శాఖలు ఖాళీ చేయాల్సిన తేదీల్ని ఫిక్స్ చేసినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా నవంబరు 10 నాటికి తెలంగాణ సచివాలయం మొత్తంగా ఖాళీ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి పనులు వేగంగా సాగుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో శాఖల మార్పుకు అవసరమైన ఫైళ్లను ప్యాకేజ్ చేసే పనిని కూడా కాంట్రాక్టు సంస్థలకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. తాజా పరిణామం చూస్తుంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థనకు విరుద్ధంగా.. ఏపీ ముఖ్యమంత్రి తమ సచివాలయ భవనాన్ని తెలంగాణకు అప్పగించకూడదన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.

మీసాలకు రంగేసుకోవడం తప్ప నాయిని ఇంకేం చేయట్లే

26/10/2016: రాజకీయ వారసత్వం ఏదీ లేనప్పటికీ అతి తక్కువ కాలంలో తెలంగాణ పొలటికల్ ముఖ చిత్రంపై తనముద్రను వేసుకున్న టీడీపీ కార్యనిర్వహక అద్యక్షుడు, శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి బలం..పంచ్లు, పకడ్బందీగా చేసే విశ్లేషణ. సందర్భం ఏదైనా అందుకు తగినట్లు బలమైన ఆధారాలతో కామెంట్లు చేసే రేవంత్ తాజాగా హోంగార్డుల ఆందోళన విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిపై సానుభూతితో కూడిన విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తున్న హోంగారుల వద్దకు వచ్చి ఆంధ్రరాష్ట్రంలో మీ బతుకులు చితికిపోయాయని, ఉపాధి హామీ కూలీలకంటే తక్కువ జీతాలు వస్తున్నాయని, మున్సిపాలిటీలో చెత్త ఎత్తేసే కార్మికుల కంటే మీ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని మొసలి కన్నీళ్లు కార్చారని, తెలంగాణ రాష్ట్రంలో హోంగారులను దినసరి ఉద్యోగుల నుంచి పర్మినెంట్ ఉద్యోగులుగా మారుస్తామని హామీ ఇచ్చారని రేవంత్ గుర్తు చేశారు. ప్రస్తుతం హోంగార్డులు అడుగుతున్నది కూడా కేసీఆర్ హామీ ఇచ్చిన విషయాన్నేనని స్పష్టం చేశారు. హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, హోంగార్డులను పిలిచి వారితో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని రేవంత్ సూచించారు. నాయిని గతంలో ఎంతో గౌరవంగా బ్రతికారని, కార్మికుల పక్షాన నిలబడి పోరాటాలు సాగించారని, అయితే ప్రస్తుతం ఆయన దోరణి దీనికి భిన్నంగా ఉందని రేవంత్ అభిప్రాయపడ్డారు. హోంమంత్రి నాయిని వద్ద టోపి మాత్రమే ఉందని, లారీ మాత్రం కేసీఆర్ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. గతంలో గౌరవంగా బ్రతికిన నర్సన్న ఇప్పుడు దొరగారి గులాంగిరి చేసూ తోక ఊపుకుంటూ తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. ''నర్సన్నా మీసాలకు రంగేసుకుంటే సరిపోదు కొంచెం పౌరుషం కూడా ఉండాలి. హోంగార్డులకు కూడా న్యాయం చేయలేకపోతే ఇక హోంమంత్రిగా నువ్వెందుకు" అని విమర్శించారు. కానిస్టేబుళ్ల నియామకాలలో కూడా హోంగార్డులకు రిజర్వేషన్ ఉందని అలాంటప్పుడు వారిని రెగ్యులరైజ్ చేయడం వల్ల నష్టమేమిటని ప్రశ్నించారు.

మీకూ సానియా, సింధూ పుట్టొచ్చు కదా!

25/10/2016: హైదరాబాద్ : "ఆడ పిల్లలని తెలిస్తే అబార్షన్ చేయించుకోవడం నేరమే కాకుండా... ఆడవారై ఉండి ఆడపిల్లల పట్ల అన్యాయం చేసిన వారవుతారు..ఏమో..! మీ కడుపులో ఒక సానియా...మరో సింధు లేదా సాక్షినో పుట్టొచ్చు కదా.! ఆడపిల్లల్ని రక్షించుకుందాం...చదివించుకుందాం...!'' అంటూ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా గర్భిణిలకు లేఖ రాశారు. "బేటీ బచావో...బేటీ పడావో'' ప్రచారంలో భాగంగా ఆరోగ్యలక్ష్మి పథకం లబ్దిదారులైన సుమారు ఆరువేల మంది గర్భిణిలకు ఆయన లేఖ రాశారు. హైదరాబాద్ లో ఆడపిల్లల జనాభా తక్కువగా ఉందని, 2001 లెక్కల ప్రకారం ప్రతి వెయ్యిమంది మగపిల్లలకు 918మంది ఆడపిల్లలే ఉన్నారన్నారు. నిజానికి వెయ్యి మంది ఆడపిల్లలు పుట్టి ఉండాలి కదా..! కానీ పుట్టడం లేదని, కాదు...మనమే పుట్టనివ్వడం లేదని, స్కానింగ్ ద్వారా గర్భంలో ఉన్నది ఆడపిండమా? మగ పిండమా..? అని తెలుసుకుని ఆడపిల్లలను అబార్షన్ ద్వారా చంపేస్తున్నామని, గర్భస్థ ఆడపిండాన్ని హత్య చేయడం చట్టప్రకారం నేరమన్నారు. అవకాశం ఇస్తే ఆడపిల్లలు అన్నింటా రాణిస్తారని, అందుకు మన హైదరాబాద్ అమ్మాయి సానియా మీర్జానే ఒక నిదర్శనమన్నారు. అదేవిధంగా రియో ఒలింపిక్స్ లో సింధు, సాక్షి, దీప అనే ముగ్గురు అమ్మాయిలు పతకాలు గెలుచుకుని దేశానికి కీర్తితో పాటు ప్రపంచస్థాయికి తీసుకెళ్లి అందరితో జేజేలు పలికించారన్నారు. మీ కడుపులో కూడా అలాంటి ఆణిముత్యాలు పుట్టొచ్చు కదా...! ఆలోచించండి అంటూ కలెక్టర్ లేఖ రాశారు.

అమెరికాలో తెలుగోళ్లు ఇద్దరు చనిపోయారు

25/10/2016: తెలుగు రాష్ట్రాల్లో తరచూ చోటు చేసుకునే రోడ్డు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్న విషాద ఘటనలు తెలిసిందే. ఇదే తీరులోనూ అమెరికాలోనూ తెలుగు వారు తరచూ రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న ఉదంతాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. తాజాగా అలాంటి విషాద ఘటన ఒకటి చోటు చేసుకుంది. అమెరికాలోని లూయిస్ విల్లీలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రవాసాంధ్రులు మరణించినట్లుగా తెలుస్తోంది. అమెరికన్ మీడియా సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ దారుణ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వివరాల్ని చూస్తే.. ఆదివారం రాత్రి వేళ లూయిస్ విల్లీలోని నార్త్ బెండ్ రోడ్డు మీద రాము (35).. రాజశేఖర్ రెడ్డి (25).. వెంకట్ ప్రశాంత్ (27).. అన్వేష్ (24) లు ప్రయాణిస్తున్నారు. వేగంగా వెళుతున్న కారును ముందుగా ఉన్న భారీ టర్నింగ్ ను అంచనా వేయటంలో జరిగిన పొరపాటుతో భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. కారును నడుపుతున్న రాము.. భారీ టర్నింగ్ విషయంలో చేసిన పొరపాటు ఈ యాక్సిడెంట్ కు కారణంగా చెబుతున్నారు. వేగంగా వెళుతున్నకారు... టర్నింగ్ ను అంచనా వేయటంలో రాము చేసిన‌ పొరపాటుతో అదుపు తప్పింది. దీంతో వేగంగా వెళుతున్న కారు పలుమార్టు పల్టీలు కొట్టి.. ఒకచెట్టును డీ కొట్టింది. దీంతో.. కారు ముందు భాగంలో ఉన్న రాము.. రాజశేఖర్ లు.. వెనుక కూర్చున్న అన్వేష్ తీవ్రంగా గాయపడి కారులో ఇరుక్కుపోయారు. కారు వెనుక భాగంలో కూర్చున్న ప్రశాంత్ కారు డోరు ఓపెన్ కావ‌టంతో కిందపడి అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. బాధితుల్ని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజశేఖర్ మరణించారు. మిగిలిన ఇద్దరికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పినట్లుగా తెలుస్తోంది.

అమితాబ్.. సచిన్ లు ఉరికే భూములు కొనలేరు

25/10/2016: రైతుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ రాష్ట్ర ఉద్యమవేత్త.. తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం దీక్ష చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలిసారి హైదరాబాద్ లో చేపట్టిన భారీ దీక్షకు మద్దతుగా పలువురు మేధావులు.. పలు వర్గాలకు చెందిన ప్రముఖులు హాజరు కావటమే కాదు.. తమ సంఘీభావాన్ని తెలపటం గమనార్హం. దీక్ష సందర్భంగా కోదండరాంతో పాటు.. పలువురు వక్తలు మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా పలు విమర్శలు చేశారు. ప్రజలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రత్యామ్నాయ పాలన ఉంటుందని తాను అనుకున్నానని.. కానీ రైతుల ఆత్మహత్యలు చూసిన తర్వాత తనలాంటి వారు సిగ్గు పడాల్సివస్తోందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేస్తే.. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మరింత ఘాటుగా కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వ పాలన పిచ్చి తుగ్లక్ పాలన కంటే అధ్వాన్నంగా ఉందని వ్యాఖ్యానించారు. చుక్కా రామయ్య లాంటి వారు సైతం తెలంగాణ సర్కారు తీరును తప్పుపట్టటం.. ఆవేదన వ్యక్తం చేయటం గమనార్హం. ఇదిలా ఉంటే.. దీక్ష క్రమంలో ఐకాస కొన్ని అంశాలపై తీర్మానాల్ని ఆమోదించారు. ఇలా ఆమోదించిన తీర్మానంలో బిగ్ బీగా సుపరిచితులైన అమితాబ్.. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ లాంటి వారి పేర్లు ప్రస్తావన రావటం ఆసక్తికరంగా మారింది. రైతుల ప్రయోజనాలపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యల గురించి ప్రస్తావించిన ఈ తీర్మానంలో ఇద్దరు ప్రముఖుల పేర్ల ప్రస్తావన ఎందుకు వచ్చిందన్న విషయాన్ని చూస్తే.. భూముల్ని ఎవరు పడితే వారు.. కారణం చెప్పకుండా.. వ్యవసాయం చేయకుండా కొనుగోలు చేయలేరన్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ ఉత్తరప్రదేశ్ లో.. సచిన్ టెండూల్కర్ మహారాష్ట్రలో ఉరికే భూములు కొనాలంటే కొనలేరని.. వారు భూమిని దున్నుతాం.. వ్యవసాయం చేస్తామని చెబితే మాత్రమే భూముల్ని కొనగలుగుతారని.. తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని.. విచ్చలవిడిగా భూసేకరణ ఆపాలని డిమాండ్ చేశారు. భూమిని ఎవరు పడితే వారు.. వ్యవసాయేతర అవసరాల కోసం కొనుగోలు చేయటం ఉండదన్న అంశాన్ని చెప్పే క్రమంలో అమితాబ్..సచిన్ ప్రస్తావన తీసుకురావటం విశేషం. సాధారణంగా ఉద్యమ తీర్మానాల్లో ప్రముఖల పేర్ల ప్రస్తావన ఉండదు. అందుకు భిన్నంగా కోదండరాం మాష్టారి దీక్ష తీర్మానంలో ఉండటం అందరి దృష్టిని ఆకర్షించేలా చేసిందని చెప్పాలి.

‘కానిస్టేబుల్’ రాత పరీక్షకు 99.64 % మంది హాజరు

24/10/2016: హైదరాబాద్: కానిస్టేబుల్, ఫైర్‌మెన్ పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించినరాత పరీక్షకు రికార్డు స్థాయిలో 99.64 శాతం మంది అభ్యర్థులు హాజరై పరీక్ష రాశారు. తెలంగాణ పోలీసు శాఖ పరిధిలో పోలీసు కానిస్టేబుల్(సివిల్/ఏఆర్/ఎస్‌ఏఆర్/టీఎస్‌ఎస్‌పీ), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్‌పీఎఫ్)లో కానిస్టేబుల్(పురుష), అగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) నిర్వహించిన ఈ రాత పరీక్షకు మొత్తం 81,357 మంది అభ్యర్థుల్లో 81,070 మంది హాజరయ్యారు. రికార్డు స్థాయిలో 99.64 శాతం హాజరు నమోదైంది. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 9,281 పోస్టుల భర్తీకి ఈ పరీక్షను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 153 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ జె.పూర్ణచంద్ర రావు తెలిపారు. మూడు నెలల్లో ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు.

బిల్ కలెక్టర్ @ ఆరు కోట్లు - ఏసీబీ దాడుల్లో చిక్కిన జీహెచ్‌ఎంసీ ఉద్యోగి

22/10/2016: హైదరాబాద్: ఏసీబీ వలలో మరో భారీ తిమింగలం చిక్కింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో పనిచేస్తూ ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నాడన్న ఫిర్యాదుపై ఓ బిల్ కలెక్టర్‌కు చెందిన నివాసాలపై శుక్రవారం ఏసీబీ అధికారులు ఏకధాటిగా దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లో 5 బృందాలు, సిద్దిపేట జిల్లా నంగునూరులో 3 బృందాలు ఒకేసారి దాడులు నిర్వహించి సుమారు రూ. 2.98 కోట్ల విలువచేసే అక్రమ ఆస్తులున్నట్లు కనుగొన్నారు. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం అవి సుమారు రూ. 6 కోట్ల విలువ చేస్తాయని అధికారులు తెలిపారు. జీహెచ్‌ఎంసీ అబిడ్‌‌స సర్కిల్ 9లో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న మడప నర్సింహారెడ్డి కూకట్‌పల్లిలోని హెచ్‌ఎంటీ శాతవాహననగర్‌లో నివాసం ఉంటున్నారు. 1987లో బిల్ కలెక్టర్‌గా విధుల్లో చేరిన నర్సింహారెడ్డి తక్కువ కాలంలోనే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఆర్జించారని, ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో ఏసీబీ అధికారులు నిఘా వేసి ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లోని నర్సింహారెడ్డి ఇంటితోపాటు స్వగ్రామమైన నంగునూరు, సిద్దిపేటలోని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హెచ్‌ఎంటీ శాతవాహననగర్‌లోని ఆయన నివాసంలో ఉదయం 6 గంటలకు ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో అధికారులు సోదాలు నిర్వహించగా.. 61 వేల నగదుతో పాటు శాతవాహనగర్‌లోని జీ ప్లస్ త్రీ, కల్యాణ్‌నగర్‌లో జీ ప్లస్ వన్, బాలానగర్‌లో జీ ప్లస్ టూ, కూకట్‌పల్లిలో జీ ప్లస్ టూ అంతస్తుల భవనాలు, 7 ఖాళీస్థలాలు ఉన్నట్లు గుర్తించారు. అందులో నిజాంపేటలో మూడు, కేపీహెచ్‌బీ కాలనీలో ఒకటి, కల్యాణ్‌నగర్‌లో మరొకటి, నంగునూరులో 2 ఉన్నారుు. నంగునూరులో 33 ఎకరాల వ్యవసాయ భూమి, చేర్యాలలో ఎకరం భూమి కలిగి ఉన్నట్లు గుర్తిం చారు. అదేవిధంగా రెండు కిలోల బంగారు ఆభరణాలు, 3.745 కేజీల వెండి వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, మారుతి స్విఫ్ట్ కారు, రెండు ట్రాక్టర్‌లు, మోటార్‌సైకిల్‌తో పాటు బ్యాంక్‌లో 16 లక్షల నగదు, 10 ఇన్సూరెన్స్ పాలసీల్లో పది లక్షల విలువచేసే బాండ్లు కూడా ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. దాడుల్లో పాల్గొన్న వారిలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌లు విజయభాస్కర్‌రెడ్డి, వెంకటేశ్వరరావు, మంజుల, లక్ష్మి, ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. (తప్పక చదవండీ: జీహెచ్ఎంసీ ఉద్యోగి అక్రమ ఆస్తులు రూ.3కోట్లు!) కక్షతోనే ఫిర్యాదు సిద్దిపేటలోని వ్యవసాయ భూమి విషయంలో నెలకొన్న వివాదంతో తనపై కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్న బంధువులు ఏసీబీకి తప్పుడు ఫిర్యాదులు చేశారని బిల్ కలెక్టర్ మడప నర్సింహారెడ్డి పేర్కొన్నారు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, ఎప్పటికప్పుడు ఆదాయపు పన్నులు కూడా చెల్లిస్తున్నట్లు తెలిపారు.

పేకాటాడుతూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు

22/10/2016: బాన్సువాడ: పేకాట ఆడుతూ టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగింది. తాడ్కోల్ రోడ్డులోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారాన్ని పోలీసులు రట్టు చేశారు. వీరు పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే కె. గంగాధర్, ఉప సర్పంచ్ తో సహా 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1.06 లక్షల నగదు, 10 సెల్ ఫోన్లు, 4 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభినట్టు స్థానిక సీఐ శ్రీనివాస రెడ్డి తెలిపారు.

కేటీఆర్ సారూ.. ఇప్పటికైనా మేల్కొంటారా?

22/10/2016: అడుగడుగునా గుంతలు, కోసుకుపోయిన రోడ్లు, పెద్ద పెద్ద రాళ్లు, రప్పలు.. కళ్లను కమ్మేసే దుమ్ము, శ్వాస ఆడకుండా చేసే ధూళి.. ఇదీ విశ్వనగరం హైదరాబాద్ లోని రహదారుల దుస్థితి. మొన్న కురిసిన వర్షాలతో నగరంలోని రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. దీనికి తోడు మెట్రో పనులు.. ఇక చెప్పేదేముంది.. నగరంలోని రోడ్లు నరకానికి నకళ్లుగా మారాయి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా వాహనదారులు ప్రాణాలనే కోల్పోవాల్సి వస్తోంది. గుంతల కారణంగా రోడ్డు మీదకు రావాలంటేనే నగరవాసులు హడలిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలవుతున్నాయి. రోడ్లపై ఏర్పడిన గుంతలు పూడ్చని కారణంగా ఇప్పటికే సుమారు ఎనిమిది మంది చనిపోగా.. శుక్రవారం మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు(కేపీహెచ్ బీ) ఎస్‌ఎస్‌ కాలనీకి చెందిన అరుణ్ కుమార్‌(25) ఎంటెక్‌ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం హఫీజ్‌ పేట నివాసి సోమశేఖర్‌(32)తో కలిసి ద్విచక్రవాహనంపై మూసాపేట వైపు వెళ్తున్నాడు. కూకట్‌ పల్లి వై జంక్షన్‌ సమీపంలోకి రాగానే ఎదురుగా రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే ప్రయత్నం చేశారు సోమశేఖర్. దీంతో, అదుపు తప్పిన బైక్ కిందపడింది. ఈ ఘటనలో వెనుక కూర్చున్న అరుణ్ కుమార్ తలకు బలమైన దెబ్బ తగలడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన సోమశేఖర్ ను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అధ్వానపు రోడ్లే విద్యార్థి మృతికి కారణమని మండిపడుతున్నారు. రోడ్లు గుంతలమయంగా మారినప్పటికీ, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. తాజా ఘటనతో వాహనదారులు రోడ్డుపైకి రావాలంటే భయాందోళన చెందుతున్నారు. వాహనదారులే కాదు పాదచారులు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్లపై నడవాల్సిన దుస్థితి ఏర్పడింది. హైదరాబాద్ ను విశ్వనగరంగా మారుస్తామని చెబుతన్న ప్రభుత్వం… ముందు ఈ రోడ్లు బాగు చేయడంపై దృష్టి పెడితే బాగుంటుందని నగరవాసులు కోరుతున్నారు. హైదరాబాద్ అభివృద్ది పై ప్రత్యేక దృష్టి పెట్టిన మున్సిపల్ శాఖామాత్యులు కేటీఆర్.. అంతకన్నా ముందు రోడ్లను బాగు చేస్తే చాలని నగరవాసులు కోరుకుంటున్నారు. చిన్నపాటి వర్షాలకు గుంతలు పడే రోడ్లు కాకుండా.. చాలాకాలం పాటు దెబ్బతినకుండా ఉండేలా రోడ్లు వేయించాలని నగర జనం డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని ప్రాణాలు పోకముందే ఆయన మేల్కొంటే చాలా సంతోషమంటున్నారు. మరి కేటీఆర్ సార్.. నగరవాసులు మొరను ఆలకిస్తారో లేదో చూడాలి.

జిల్లాలు సరే.. రికార్డులేవి..?

22/10/2016: దసరా సందర్భంగా తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. తెలంగాణలోనే అతిపెద్ద పరిపాలనా సంస్కరణగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కొత్త జిల్లాలతో పాలన ప్రజలకు మరింత చేరువవుతోందంటున్నారు. జిల్లాలకు అనుగుణంగా కొత్త పోస్టులు కూడా ప్రకటించేశారు. ఇదంతా బాగానే ఉన్నా.. కొత్త జిల్లాల్లో పాలన మాత్రం అనుకున్నతం తేలికగా అయ్యే పనిలా కనిపించడం లేదు. కొత్త కలెక్టరేట్లు ఓపెన్ చేసినంత వేగంగా.. రికార్డులు అందుబాటులోకి రాలేదు. రికార్డులన్నీ ఓ కాపీ పాతజిల్లా కేంద్రంలో ఉంచి.. మరో కాపీ కొత్త జిల్లా కేంద్రానికి తేవాలని సర్కారు ఆదేశించినా.. ఆ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దీంతో కొత్త జిల్లాల్లో కలెక్టర్లకు ఏ రికార్డులు ఎక్కడున్నాయో తెలియడం లేదు. ఎవరైనా వచ్చి అర్జీలు, వినతులు ఇస్తే.. దానికి సంబంధించిన పాత రికార్డులు దొరకడం లేదు. దీంతో పాలనలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కలెక్టర్లు రెగ్యులర్ గా ఆఫీసులకు వస్తున్నా.. పనులు మాత్రం పెండింగ్ లోనే ఉంటున్నాయి. రికార్డుల తరలింపుకు కనీసం పదిరోజులైనా పడుతుందని చెబుతున్నారు. త్వరగా రికార్డులు అందుబాటులోకి రాకపోతే.. పనులన్నీ కొండలా పేరుకుపోతాయని కలెక్టర్లు ఆందోళన చెందుతున్నారు.

పోలీసుల సేవలు చిరస్మరణీయం - నాయిని

21/10/2016: హైదరాబాద్ : పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని తెలంగాణ పోలీస్ శాఖ శుక్రవారం ఉదయం గోషా మహల్ పోలీస్ స్టేడియంలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ, పోలీస్ అధికారులు ...పోలీస్ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అనంతరం పోలీస్ శాఖ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు అవార్డులు అందించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ పోలీసుల సేవల చిరస్మరణీయమన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పోలీసు శాఖలో అనేక మార్పులు తెచ్చామన్నారు. ఎండనకా..వాన అనకా పనిచేసేది పోలీసులేనని అన్నారు. ఈ ఏడాది 470మంది పోలీసులు అమరులయ్యారన్నారు. పోలీసుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఈ ఏడాది విధినిర్వహణలో అమరులైన హోంగార్డులకు రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు డీజీపీ అనురాగ శర్మ తెలిపారు.

టీఆర్ఎస్ ది దౌర్భాగ్యపు పాలన - టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

20/10/2016: హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వ దౌర్భాగ్యపు పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్ నగరాన్ని డల్లాస్, లండన్, న్యూయార్క్‌లాంటి విశ్వ నగరాలకు సాటిగా తీర్చిదిద్దుతానని ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్ నగరానికి రోడ్లు, మంచినీరు, విద్యుత్ అందిస్తే చాలని ఆయన అన్నారు. మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో మునిసిపాలిటీలలో, ప్రత్యేకించి హైదరాబాద్‌లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు దెబ్బతిన్నాయని విమర్శించారు. బుధవారం రాత్రి శేరిలింగంపల్లిలో రోడ్లు, రెండుపడకల ఇళ్లు, ఇతర సమస్యలపై మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ అధ్యక్షతన జరిగిన నిరసనసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ మెట్రోరైలు అలైన్‌మెంట్ మారుస్తామంటూ కేసీఆర్ దాని నిర్మాణాన్ని ఆలస్యం చేశారని విమర్శించారు. కేసీఆర్ అబద్ధాల మనిషి: జైపాల్‌రెడ్డి సీఎం కేసీఆర్ మాటల మనిషి మాత్రమే అని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ వంటి అబద్ధాల మనిషిని ఎక్కడా చూడలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి ఆర్‌పీ కుంతియా, ఏఐసీసీ ఎస్సీసెల్ చైర్మన్ కొప్పుల రాజు, ఎమ్మెల్యేలు డీకే అరుణ, వంశీచంద్‌రెడ్డి, మాజీ మం త్రు లు సబితా, గడ్డం ప్రసాద్‌కుమార్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.

మెడికో పీజీ విద్యార్థిని శ్రావణి ఆత్మహత్య

20/10/2016: హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ మెడికో పీజీ విద్యార్థిని శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. మత్తుమందు కలిపి ఉన్న సెలైన్‌ను ఎక్కించుకుని విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. జాంబాగ్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో శ్రావణి బలవన్మరణానికి పాల్పడింది. మెడికో విద్యార్థిని శ్రావణి స్వస్థలం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ గా పోలీసులు గుర్తించారు. శ్రావణి మృతిపై అనుమానాస్పద కేసు నమోదు చేసినట్టు అఫ్జల్‌గంజ్‌ సీఐ అంజయ్య తెలిపారు. ప్రేమ వ్యవహారమే శ్రావణి ఆత్మహత్యకు గల కారణామని పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రావణి మోతాదుకు మించి అనస్థీషియా (మత్తుమందు) తీసుకుందని చెప్పారు. విద్యార్థి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగిస్తామన్నారు. ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా శ్రావణి.. తన కుటుంబ సభ్యులకు ఎస్‌ఎంఎస్‌తో సమాచారమిచ్చినట్టు సీఐ పేర్కొన్నారు.

ఒంటికి నిప్పంటించుకుని ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

19/10/2016: హైదరాబాద్‌/మియాపూర్‌, సలాం తెలంగాణ: ‘అమ్మా నేను హాస్టల్‌లో ఉండలేను. ఈ కళాశాలలో చదవలేను. ఇంటికి వచ్చేస్తా. ప్లీజ్‌’ అంటూ తల్లికి ఏడుస్తూ ఫోన్‌ చేసిన ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థిని తర్వాత కాసేపటికే ఆత్మహత్య చేసుకుంది. పుస్తకాలు, దుప్పట్లు, దుస్తులు కుప్పలుగా పోసి అందులో కూర్చుని నిప్పటించుకుంది. దసరా సెలవుల అనంతరం రెండు రోజుల క్రితమే కళాశాల హాస్టల్‌కు వచ్చిన విద్యార్థిని.. మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు హాస్టల్‌ నుంచి తన తల్లికి ఫోన్‌చేసింది. ఇక్కడ ఉండలేక పోతున్నానంటూ మాట్లాడింది. తోటి విద్యార్థినులు భోజనానికి వెళ్లగా రూంలో ఒంటరిగావున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని కళాశాల నిర్వాహకులు, విద్యార్థులు చెబుతున్నారు. ఈ విద్యార్థినిని నిజామాబాద్‌ జిల్లా మచర్ల గ్రామం ఆర్మూర్‌ మండలానికి చెందిన సంతో్‌షరెడ్డి, లత దంపతుల కుమార్తె సాత్విక(16)గా గుర్తించారు. ఆమె మియాపూర్‌ బొల్లారం రోడ్డులోని ఓ కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాల హాస్టల్‌లో ఉంటూ ఇంటర్‌ మొదటి సంవత్సరం(ఎంపీసీ) చదువుతోంది. సాత్విక శరీరం గుర్తుపట్టనంతగా కాలిపోయిన తర్వాత నిర్వాహకులు, తోటి స్నేహితులు చూశారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు. స్వాతి.. చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందా? నిప్పంటిచుకోవడానికి అగ్గిపెట్టె మాత్రమే వాడిందా? పెట్రోల్‌, కిరోసిన్‌, అగ్గిపెట్టె లాంటివి లోపలికి ఎలా వచ్చాయి. మృతదేహం గుర్తుపట్టనంత కాలే వరకు ఎవరూ ఎందుకు గుర్తించలేదు? అనే వాటిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఆరు ఆస్పత్రులపై ‘ఫైర్’ విచారణ! - అగ్నిమాపక శాఖ అదనపు డీజీ లక్ష్మీప్రసాద్

19/10/2016: హైదరాబాద్: రాష్ట్రంలో ఆరు ఆస్పత్రులు ఫైర్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించినట్లు తనిఖీల్లో తేలడంతో వాటిపై చట్టపర విచారణ చేపట్టామని రాష్ట్ర అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ శాఖ అదనపు డెరైక్టర్ జనరల్ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. అగ్నిప్రమాదాల నుంచి రక్షణ కోసం ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన సదుపాయాలపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 68 ఆస్పత్రులను తనిఖీ చేసి, నిరభ్యంతర పత్రాలు (ఎన్‌వోసీ) జారీ చేశామన్నారు. భువనేశ్వర్‌లోని ఎస్‌యూఎం ఆస్పత్రిలో సోమవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 24 మంది మృత్యువాత పడిన ఘటనపై ఆయన స్పందించారు. రాష్ట్రంలో చాలా సురక్షిత పరిస్థితి ఉందని, ఇప్పటి వరకు ఎలాంటి పెద్ద దుర్ఘటన జరగలేదన్నారు. దీపావళి రోజున టపాసులు కాల్చే సమయంలో పాటించాల్సిన సురక్షిత పద్ధతులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన మంగళవారం తన కార్యాలయంలో పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాలను నిలువరించవచ్చన్నారు. పెద్దవాళ్ల సమక్షంలోనే చిన్నపిల్లలు టపాసులు పేల్చాలన్నారు. గత దీపావళి రోజున రాష్ట్రంలో 30 చోట్ల అగ్నిప్రమాదాలు జరిగాయన్నారు. చైనా టపాసుల విక్రయాలపై నిషేధముందని, ఎవరైనా విక్రయిస్తే వారి లెసైన్స్‌ను రద్దు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డెరైక్టర్ నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.

నయీం కేసు దర్యాప్తు ఎలా సాగుతోంది? - పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయండి - రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖలకు హైకోర్టు ఆదేశం

19/10/2016: హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ అరాచకాలపై సాగుతున్న దర్యాప్తునకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, హోంశాఖను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నయీమ్ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిం చారు. నయీమ్ అనేక అరాచకాలకు పాల్పడ్డాడని.. పలువురు రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారులకు నయీమ్‌తో సంబంధాలు ఉన్నాయని కోర్టుకు విన్నవించారు. నయీమ్ కేసుల విచారణకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని, అయితే ఆ దర్యాప్తునకు సంబంధించిఏ వివరాలు కూడా తెలియడం లేదని పేర్కొన్నారు. సీబీఐకి అప్పగించాలన్న పిటిషనర్ ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన పలువురితో నయీమ్‌కు సన్నిహిత సంబంధాలున్నట్లు వార్తలు వచ్చాయని, అందువల్ల ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషనర్ కోరారు. నయీమ్‌తో చాలా మంది పోలీసులకు సంబంధాలుండడం వల్ల దర్యాప్తు తీరుపై ప్రజల్లో సందేహాలు ఉన్నాయని వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ.. దర్యాప్తు వివరాలు బహిర్గతం కానంత మాత్రాన దర్యాప్తు సక్రమంగా జరగనట్లు కాదని, దర్యా ప్తు ఎలా సాగుతోందో తెలుసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. సిట్ నివేదికతో కీలక మలుపు! సాక్షి, యాదాద్రి: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో సిట్ సమర్పించిన నివేదికలో పలువురు అధికార పార్టీ నేతలు, పోలీసు ఉన్నతాధికారుల పేర్లను సిట్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరుగుతోంది. నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత పోలీసులు అతడి బినామీలు, కుటుంబ సభ్యులతోపాటు పలువురు నిందితులను విచారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అక్రమాలతో పాటు నయీమ్‌తో సంబంధాలున్న వారి పేర్లు బయటపడ్డాయి. దీనికి సంబంధించి సిట్ అధికారులు నెలరోజుల క్రితమే 156 పేజీల వాంగ్మూలాల (రిమాండ్ నోట్)ను భువనగిరి కోర్టుకు సమర్పించారు. అందులో శాసనమండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, టీఆర్‌ఎస్ నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, డీఎస్పీ మద్దిలేటి శ్రీనివాస్‌రావు, సీఐలు వెంకట్‌రెడ్డి, బూర రాజగోపాల్‌తో పాటు మస్తాన్‌వలీ, గండికోట వెంకటయ్య, సాయి మనోహర్, మలినేని శ్రీనివాస్‌రావు తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని సిట్ అధికారులు త్వరలో విచారించే అవకాశం ఉందని సమాచారం. ఇక నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం పులిజాలకు చెందిన మధుకర్‌రెడ్డి పేరు కూడా సిట్ నివేదికలో ఉన్నట్లు తెలిసింది.

వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తే అనర్థమే - జేఏసీ చైర్మన్ కోదండరాం

18/10/2016: హైదరాబాద్: వ్యవసాయాన్ని వదులుకుంటే ఆహార సంక్షోభంతో అనర్థం తప్పదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం హెచ్చరించారు. రైతు సమస్యలపై ఈ నెల 23న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద జరిగే రైతు దీక్ష పోస్టర్‌ను జేఏసీ, రైతు జేఏసీ నేతలతో కలసి సోమవారం ఆయన ఆవిష్కరించారు. కోదండరాం మాట్లాడుతూ సరళీకరణ విధానాలతో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతును ఆదుకోవాలనే పట్టింపు ప్రభుత్వానికి లేదని విమర్శించారు. పారిశ్రామికాభివృద్ధికి సమాంతరంగా వ్యవసాయరంగానికి చేయూతనందించాలని సూచించారు. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన సమాజంలో అశాంతి, అస్థిరత తలెత్తుతాయని హెచ్చరించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై చేతివృత్తులు కూడా ఆధారపడి ఉన్నాయనే అంశాన్ని పాల కులు విస్మరిస్తున్నారని అన్నారు. చెరువుల్లోకి నీరు రావడంతో రైతులు గొర్రెలు కోసుకుంటూ, సంతోషంగా ఉన్నారని ప్రభుత్వం చేస్తున్న వాదన సరైందికాదని కోదండరాం అన్నారు. నీళ్లు రావడం వల్ల ఉత్పత్తి పెరుగుతుందని, ఆదాయం పెరగకుండా సంతోషం ఎక్కడిది? రైతు అందాల్సిన ఆదాయం గురించి ప్రభుత్వం తీసుకుం టున్న చర్యలేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలను అరికట్టి, మేలైన విత్తనాలను అందించకుండా, సాగుకు అవసరమైన పెట్టుబడిని సమకూర్చకుండా, ఎరువులను సకాలంలో ఇవ్వకుండా, మార్కెట్‌లో దోపిడీని అరికట్టకుండా, ఆదాయం పెరగకుండా రైతు సంతోషంగా ఎలా ఉంటాడని కోదండరాం ప్రశ్నించారు. ప్రాధాన్యరంగమైన వ్యవసాయానికి ఒక విధానాన్ని, నకిలీ విత్తనాలను అరికట్టడానికి విత్తనచట్టాన్ని తీసుకురావడంలో ప్రభుత్వానికి పట్టింపులేదని విమర్శించారు. రైతులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్రంలో రైతుకు సగటున 94 వేల రూపాయల అప్పుందన్నారు. రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమీ లేవని విమర్శించారు. కావేరి, పయనీర్, మోన్‌శాంటో, నూజివీడు వంటి పెద్దపెద్ద కంపెనీలు నకిలీ విత్తనాల సరఫరా చేసినా కేసులు పెట్టడం లేదన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా ఒకరిద్దరు అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే ఏటా రైతులు నష్టపోతారని ఆయన హెచ్చరించారు. విత్తనాలు, ఎరువుల్లో కల్తీ అతిపెద్ద కుంభకోణమని రైతు జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ జలపతిరావు విమర్శించారు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకుంటే వ్యవసాయం దెబ్బతింటుందని హెచ్చరించారు. సమావేశంలో రైతు జేఏసీ నేతలు కన్నెగంటి రవి, పిట్టల రవీందర్, ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

18న సగం సిటీకి నీళ్లు బంద్‌

17/10/2016: హైదరాబాద్: కృష్ణా ఫేజ్‌–3 పైపులైన్లకు ముందస్తు మరమ్మతుల కారణంగా ఈనెల 18న (మంగళవారం) నగరంలో పలు ప్రాంతాలకు నీటిసరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి ప్రకటించింది. దీంతో బీఎన్‌ రెడ్డినగర్, ఎల్బీనగర్, ఆటోనగర్, వనస్థలిపురం, సరూర్‌నగర్, అల్కాపురి, దిల్‌సుఖ్‌నగర్, ఆర్‌జీకె. బండ్లగూడ, బాలాపూర్, బాబానగర్, రియాసత్‌నగర్, బార్కాస్, డీఆర్‌డీఎల్, డీఎంఆర్‌ఎల్, మిధాని, చాంద్రాయణగుట్ట, ఉప్పల్, బీరప్పగడ్డ, కైలాస్‌గిరీ, ఎన్న్ఎఫ్‌సీ, మైలార్‌దేవ్‌పల్లి, మధుబన్, పీడీపీ, హైదర్‌గూడ, రాజేంద్రనగర్, ఉప్పర్‌పల్లి, సులేమాన్ నగర్, ఎంఎం పహాడీ, అత్తాపూర్, చింతల్‌మెట్, బుద్వేల్,మెహిదీపట్నం, కార్వాన్‌, లంగర్‌హౌజ్, కాకతీయనగర్, హుమయూన్‌ నగర్, తాళ్లగడ్డ, ఆసిఫ్‌నగర్, ఎంఈఎస్, గంధంగూడ, ఓయూకాలనీ, టోలిచౌకి, మల్లేపల్లి, విజయనగర్‌కాలనీ, రెడ్‌హిల్స్, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్, నాంపల్లి, లక్డికాపూల్, సెక్రటేరియట్, జియాగూడ, ఆళ్లబండ, గోడెఖీఖబర్, ప్రశాసన్‌ నగర్, గచ్చిబౌలి, లాలాపేట, చాణక్యపురి, గౌతంనగర్‌ ప్రాంతాలకు నీటిసరఫరా ఉండదని ప్రకటించింది. మరమ్మతులు పూర్తయిన 12 గంటల్లోగా సరఫరా పునరుద్ధరిస్తామన్నారు.

‘యాదాద్రి’ ప్లాంటుపై పునర్విచారణ! - జెన్‌కోకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదేశం

17/10/2016: హైదరాబాద్: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) నిర్మించ తలపెట్టిన 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం మళ్లీ బహిరంగ విచారణ నిర్వహించాలని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ విద్యుత్ కేంద్రానికి సంబంధించి జెన్‌కో రూపొందిన ‘పర్యావరణ ప్రభావంపై అంచనా (ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్/ ఈఐఏ)’ నివేదికలో తీవ్ర లోపాలుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త ఈఐఏ నివేదికను రూపొందించాలని, దాని ఆధారంగా ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం మరోమారు బహిరంగ విచారణ నిర్వహించాలని స్పష్టం చేసింది. గత ఆగస్టు 29న జరిగిన ‘పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ)’ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అలాగే ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులపై తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ మేరకు సమావేశానికి సంబంధించిన మినిట్స్ కాపీని సవరించి మళ్లీ విడుదల చేసింది. గతంలో ప్రకటించిన మినిట్స్‌లో బహిరంగ విచారణ నిర్ణయాన్ని పొందుపరచలేదు. ఈ నేపథ్యంలో తాజాగా చేర్చి సవరించిన మినిట్స్ కాపీని విడుదల చేసింది. కాపీ పేస్ట్ నివేదిక ఇతర ప్రాజెక్టుల నివేదికల నుంచి సమాచారాన్ని తస్కరించి (కాపీ పేస్ట్) ఈ నివేదికను జెన్‌కో రూపొందించిందని, ప్రాజెక్టుకు సంబంధం లేని ఎన్నో అంశాలను ఈ నివేదికలో చొప్పించినట్లు నిపుణుల కమిటీ నిర్ధారించింది. కథ మళ్లీ మొదటికి కమిటీ అక్షింతల నేపథ్యంలో జెన్‌కో కొత్తగా ఈఐఏ నివేదిక రూపొందించి దాని ఆధారంగా బహిరంగ విచారణ నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతుల కోసం జెన్‌కో చేస్తున్న ప్రయత్నాలు మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. అధికారుల తప్పిదాలతో ప్లాంట్ నిర్మాణంలో మరింత ఆలస్యం జరుగుతోంది.

బాలికను బలిగొన్న మూఢాచారం - మత గురువు సూచన మేరకు 68 రోజుల పాటు ఉపవాసం

08/10/2016: హైదరాబాద్: వ్యాపారంలో నష్టాలు చవిచూసిన ఓ తండ్రి మూఢ నమ్మకం 13 ఏళ్ల బాలిక నిండు ప్రాణాలను బలిగొంది.. లాభాలు వస్తాయన్న పిచ్చి నమ్మకం కన్న కూతురిని 68 రోజుల పాటు ఉపవాసం ఉంచేలా చేసింది.. పచ్చి మంచినీళ్లూ అందని స్థితిలో కడుపులో పేగులు ఎండిపోయి, కిడ్నీలు పాడైపోయి, ఇతర అవయవాలూ దెబ్బతిని ఆ బాలిక నరకం అనుభవించింది. ఆ యాతనతోనే చివరికి కన్నుమూసింది. సికింద్రాబాద్‌లోని కుండల మార్కెట్ సమీపంలో జరిగిన ఈ ఘటన బాలల హక్కుల సంఘం ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఆచారం కోసం.. సికింద్రాబాద్‌కు చెందిన లక్ష్మీచంద్ మనీష్ సమదరియా స్థానికంగా బంగారు నగల వ్యాపారం చేస్తుంటాడు. ఆయనకు ఆరాధన అనే 13 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె సికింద్రాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది. కొద్ది నెలల కింద లక్ష్మీచంద్ తన వ్యాపారంలో బాగా నష్టపోయాడు. దాంతో చెన్నైకు చెందిన ఓ మత గురువును ఇంటికి ఆహ్వానించి వ్యాపార నష్టాల గురించి వివరించాడు. ఆ మత గురువు లక్ష్మీచంద్ కుమార్తెను 68 రోజుల పాటు ఉపవాసం ఉంచితే వ్యాపారంలో అభివృద్ధి చెందుతావని అతడికి సూచించారు. దీంతో ఏ మాత్రం ఆలోచించకుండా ఆరాధనతో 68 రోజుల పాటు ఉపవాసం చేయించారు. వారి ఆచారం ప్రకారం ఇలా ఉపవాసం ఉండే వారు కేవలం మంచినీళ్లను మాత్రమే తీసుకోవాలి. అది కూడా సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం మధ్యలో మాత్రమే నీళ్లు తాగాలి. మిగతా సమయంలో తాగకూడదు. ఇలా మొదలు పెట్టిన 68 రోజుల ఉపవాసం ఈ నెల 3వ తేదీకి ముగిసింది. కానీ అప్పటికే ఆరాధన డీహైడ్రేషన్‌కు గురై, శరీరంలో కిడ్నీలు సహా పలు అవయవాలు పూర్తిగా దెబ్బతినడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి.. మరణించింది. దీనిపై స్థానికుల నుంచి సమాచారం అందుకున్న బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధారావు, గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆరాధన తండ్రి మూఢాచారంతో ఆమెను 68 రోజులు ఉపవాసం ఉంచారని వారు పేర్కొన్నారు. ఆమె డీహైడ్రేషన్‌కు గురై, శరీరంలోని అన్ని అవయవాలు పూర్తిగా పాడవడంతో మరణించినట్లు కిమ్స్ వైద్యులు ధ్రువీకరించినట్లు తెలిపారు. దీంతో గుట్టుచప్పుడు కాకుండా ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారని ఆరోపించారు. అభం శుభం తెలియని బాలికను మూఢాచారానికి బలి చేసిన తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ తరహా ఉపవాసాలు, మతాచారాల కారణంగా ఎంతో మంది బలవుతున్నారనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు కూడా మూడేళ్ల క్రితం ‘సంతార(చనిపోవడానికి)’ చేసే ఆచరణలను కొట్టివేసిందని చెప్పారు.

భద్రకాళీ అమ్మవారికి సీఎం మొక్కులు

08/10/2016: హైదరాబాద్‌: భద్రకాళి అమ్మవారి మొక్కును చెల్లించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరంగల్‌ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా తయారు చేయించిన స్వర్ణ కిరీటాన్ని అమ్మవారికి సమర్పించనున్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా మొక్కిన మొక్కులన్నీ చెల్లించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం కేబినెట్‌ సమావేశం అనంతరం క్యాంపు కార్యాలయంలో అమ్మవారికి ప్రత్యేకంగా తయారు చేయించిన స్వర్ణ కిరీటాన్ని సీఎం పరిశీలించారు. 11 కిలోల 700 గ్రాముల బంగారంతో జీఆర్‌టీ జువెల్లర్స్‌ ఈ కిరీటం తయారు చేశారు. రూ.3.70 కోట్ల విలువైన ఈ కిరీటాన్ని ఆదివారం ముఖ్యమంత్రి సతీ సమేతంగా వరంగల్‌ భద్రకాళి అమ్మవారికి సమర్పిస్తారు. శనివారం రాత్రికే సీఎం వరంగల్‌కు వెళ్లేలా ప్రణాళిక ఖరారైంది. కిరీటాన్ని పరిశీలించిన వారిలో సీఎం సతీమణి శోభ, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, మిషన్‌ భగీరథ చైర్మన్‌ ప్రశాంత్‌రెడ్డి, టీఎస్‌ఎండీసీ చైర్మన్‌ సుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్, ముఖ్యమంత్రి సలహాదారు కేవీ రమణాచారి తదితరులు ఉన్నారు.

బతుకమ్మ తెలంగాణకు తలమానికం

07/10/2016: అంబర్‌పేట: ఆడబిడ్డల ప్రాముఖ్యతను తెలియజేసే పండుగ బతుకమ్మ పండుగ అని మాజీ కేంద్రమంత్రి , బీజేపీ జాతీయ నాయకురాలు దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. గురువారం రాత్రి బీజేపీ శాసన సభాపక్ష నాయకుడు జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో అంబర్‌పేట మున్సిపల్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడి సందడి చేశారు కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

తలసాని తులాభారం

07/10/2016: రాంగోపాల్‌పేట్‌: మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పుట్టిన రోజు సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న అనంతరం తులాభారం నిర్వహించారు. బంగారంతో (బెల్లం) తులాభారం నిర్వహించి అమ్మవారికి పూజలు చేశారు.

సీఎం.. సూపర్‌మాన్ అనుకుంటున్నారు - జిల్లాల ఏర్పాటుపై టీఆర్‌ఎస్ సర్కార్‌కు ప్రశ్నలు సంధించిన బీజేపీ

06/10/2016: హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తనను తాను తెలంగాణ సూపర్‌మాన్‌గా భావించి.. అన్నీ తానే చేయాలని అనుకుంటున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది. ఆయన నిర్ణయాల వల్ల రాష్ట్రం ఏమై పోతుందోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొంది. కొత్త జిల్లాల ఏర్పాటులో దుందుడుకుగా, తొందరపాటుతో తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎలాంటి ప్రజాహితం కనిపించడం లేదని ధ్వజమెత్తింది. బుధవారం బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు విలేకరులతో మాట్లాడుతూ, ఏ ప్రాతిపదికన జిల్లాల విభజన చేస్తున్నారో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్లు, అధికారుల సాధికార కమిటీ ఎన్ని జిల్లాల ఏర్పాటుపై నివేదికను ఇచ్చిందో తెలపాలన్నారు. తాజాగా ఆ పార్టీ నేత కేశవరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీకున్న చట్టబద్ధత ఏమిటని ప్రశ్నించారు.

‘సీఎం అదృష్ట సంఖ్య కోసం జిల్లాలా?’

06/10/2016: హైదరాబాద్: జిల్లాల సంఖ్య ప్రజల అవసరాలు తీర్చడానికా లేక సీఎం కేసీఆర్ అదృష్ట సంఖ్య కోసమా అని టీటీడీపీ ప్రశ్నించింది. జిల్లాల విభజన పిప్పర్‌మెంట్ల పంపకాలను తలపిస్తోందని ఎద్దేవా చేసింది. తెలంగాణ ప్రజల బతుకు మారుస్తామని అధికారంలోకి రాగానే వాస్తు పేరుతో బంగ్లాలు, కలర్ల పేరుతో కార్లు మారుస్తూ, ఇప్పుడు అదృష్టసంఖ్య పేరుతో 20,26,27,30,33 జిల్లాలు అంటూ రోజుకో ప్రకటన చేస్తూ తుగ్లక్ పాలనను మరిపిస్తున్నారని ధ్వజమెత్తింది. బుధవారం ఆ పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. శాస్త్రీయ విధానం లేకుండా, రాజకీయ అవసరాలు, కుట్రలు, కుతంత్రాలతో ప్రత్యర్థులను దెబ్బతీయాలనే లక్ష్యంతో సీఎం వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి: మోత్కుపల్లి తెలంగాణ పోరాట యోధురాలు ఆరుట్ల కమలాదేవి పేరు మీద ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. ఈ డివిజన్ ఏర్పాటుకు సహకరించాలని హైపవర్ కమిటీ చైర్మన్ కేశవరావుకు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి లేఖలు పంపుతున్నట్లు చెప్పారు.

నేటి నుంచే 'ట్రాఫిక్‌' డిస్కౌంట్‌

05/10/2016: హైదరాబాద్: ట్రాఫిక్‌ ఉల్లంఘనులకు పాల్పడి..పెద్ద మొత్తంలో జరిమానాలు బకాయిపడ్డ వాహనదారులకు గొప్ప రిలీఫ్‌. జరిమానాలో 50 శాతం రాయితీ ఇచ్చేందుకు ట్రాఫిక్‌ పోలీస్‌ విభాగం ముందుకొచ్చింది. ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి జరిమానా బకాయి మొత్తాన్ని సగానికి తగ్గించుకోవడానికి అవకాశం కల్పించే ‘ట్రాఫిక్‌ మెగా లోక్‌ అదాలత్‌’ బుధవారం నుంచి ప్రారంభంమైంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి గుర్తించుకోవాల్సిన అంశాలివీ... ఎన్నాళ్ళు, ఎక్కడ? బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజుల పాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గోషామహల్‌లోని పోలీసుస్టేడియం ప్రాంగణంలో. ట్రాఫిక్‌ విభాగం పది కౌంటర్లు ఏర్పాటు చేసింది. ఎవరు రావచ్చు? హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఏ కమిషనరేట్‌ నుంచి జారీ అయిన ఈ–చలాన్‌లు అయినా ఈ లోక్‌ అదాలత్‌ ద్వారా తగ్గింపు పొందవచ్చు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన కేసుల్లో మాత్రం తగ్గింపు లేదు. ఏమేమి తీసుకురావాలి? వాహనయజమానే రావాల్సిన అవసరం లేదు. వారి తరఫున ఎవరైనా హాజరుకావచ్చు. వచ్చేప్పుడు ఈ–చలాన్‌ ప్రింట్‌ ఔట్, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కాపీ/నెంబర్, ఆధార్‌ కార్డ్‌ (తప్పనిసరి కాదు), వాహనచోదకులు సెల్‌ఫోన్‌ నెంబర్‌ తీసుకురావాలి. ఈ మెగా లోక్‌ అదాలత్‌లో జరిమానా బకాయిలు చెల్లించిన వాహనచోదకులు కచ్చితంగా రసీదు తీసుకోవాలి. ఈ–చలాన్‌ స్టేటస్‌ తెలుసుకోండిలా: వాహనచోదకులు తమ వాహనంపై జారీ అయి ఉన్న పెండింగ్‌ ఈ–చలాన్‌ వివరాలు నగర ట్రాఫిక్‌ పోలీసు వెబ్‌సైట్‌ (www.htp.gov.in), సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసు వెబ్‌సైట్‌ (www.ctp.gov.in) లతో పాటు (Hyderabad Traffic Live, Telangana EChallan, Telangana Traffic Police) మొబైల్‌ యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారానూ తెలుసుకోవచ్చు.

అధికారి వేధింపులతో ఆత్మహత్యాయత్నం

05/10/2016: హైదరాబాద్ : ఉన్నతాధికారి వేధింపులు మితిమీరి పోయాయంటూ ఓ ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించాడు. మల్కాజిగిరి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మున్సిపల్ కార్యాలయం ఎంటమాలజీ విభాగం అధికారి సింథియా తమను అకారణంగా వేధిస్తున్నారంటూ ఉద్యోగులు తమ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఓ ఉద్యోగి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు ఆర్పిన తోటి వారు తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. అసిస్టెంట్ ఎంటమాలజీ ఆఫీసర్ సింథియాను వెంటనే విధుల నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. గతంలో కూడా శివకుమార్ అనే ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించాడని వారు తెలిపారు.

డెడ్‌బాడీ తరలింపు ఇక ఈజీ - అందుబాటులోకి ‘ఫోరెన్సిక్‌ కార్ప్స్‌క్యారియర్‌’ ఎలాంటి ఇబ్బందులు లేని పోస్టుమార్టం పరీక్షల కోసం దేశంలో తొలిసారిగా నగర కమిషనరేట్‌లో ఏర్పాటు ప్రారంభించిన సీపీ మహేందర్‌రెడ్డి

04/10/2016: హిమాయత్‌నగర్‌: హత్య, ఆత్మహత్య, అనుమానాస్పద మృతి, రోడ్డు ప్రమాదం... ఈ తరహా ఉదంతాలు జరిగినప్పుడు, గుర్తు తెలియని మృతదేహాలు లభించినప్పుడు డెడ్‌బాడీలను పోస్టుమార్టం పరీక్షలకు తరలించడానికి పోలీసులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. వీటిని తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌లు సుముఖంగా లేకపోవడమే ప్రధాన సమస్యగా మారుతోంది. దీనికి పరిష్కారంగా నగర పోలీసు విభాగం ‘ఫోరెన్సిక్‌ కార్ప్స్‌ క్యారియర్‌’ పేరుతో రూపొందించిన వాహనాన్ని నగర పోలీసు కమిషనర్‌ ఎం.మహేందర్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. దేశంలో మరే ఇతర కమిషనరేట్‌లోనూ ఇప్పటి వరకు ఈ తరహా వెహికిల్స్‌ అందుబాటులో లేవు. ప్రాథమికంగా ఓ వాహనం ఏర్పాటు నగర కమిషనరేట్‌ పరిధిలో మృతదేహాల తరలింపు కోసం సిద్ధం చేసిన ఒక ‘ఫోరెన్సిక్‌ కార్ప్స్‌ క్యారియర్‌’ను సోమవారం ట్రాఫిక్‌ కమిషనరేట్‌ వద్ద అదనపు సీపీలు జితేంద్ర (ట్రాఫిక్‌), స్వాతిలక్రా (నేరాలు), వీవీ శ్రీనివాసరావు (శాంతిభద్రతలు), మురళీకృష్ణ (పరిపాలన)లతో కలిసి నగర కమిషనర్‌ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్వాల్‌ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మృతదేహాల తరలింపు కోసం ఎస్‌హెచ్‌ఓలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ వాహనం అందుబాటులోకి రావడంతో ఆ సమస్య తీరిందన్నారు. ఈ వాహనం 24 గంటలూ అందుబాటులో ఉంటుందని, డిమాండ్‌ను బట్టి వాహనాల సంఖ్యను పెంచుతామన్నారు. ఈ వెహికల్‌లో డ్రైవర్‌తో పాటు శవాన్ని తరలించేందుకు ఇద్దరు సిబ్బంది ఉంటారన్నారు. కదిలించిన అనేక ఘటనలు... చట్ట ప్రకారం మెడికో లీగల్‌ కేసులతో పాటు ఎఫ్‌ఐఆర్‌ నమోదైన మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించడం తప్పనిసరి. అలా చేయకుంటే అనేక చట్ట పరమైన ఇబ్బందులు రావడంతో పాటు కేసుల దర్యాప్తు సైతం సరైన దిశలో సాగదు. వీటన్నింటికీ మించి మృతులకు సంబంధించిన ఇన్సూరెన్స్‌ తదితరాలు క్లైమ్‌ చేసుకోవాలంటే ఎఫ్‌ఐఆర్‌తో పాటు పోస్టుమార్టం పరీక్ష నివేదిక తప్పనిసరి. ఇలాంటి మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రులకు తరలించడానికి పోలీసులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరోపక్క గత కొన్ని రోజులుగా మృతదేహాలను మృతుల కుటుంబ సభ్యులు మోసుకెళ్లడం వంటివి మీడియాలో రావడం నగర పోలీసు విభాగాన్ని కదిలించాయి.

సుపారీ హత్య - వ్యక్తిని కత్తులతో పొడిచి చంపిన దుండగులు

04/10/2016: బహదూర్‌పురా: ఆస్తి తగాదాల నేపథ్యంలో దుండగులు ఓ వ్యక్తిని కత్తులతో అతికిరాతకంగా పొడిచి చంపారు. హుస్సేనీఆలం పోలీస్‌ స్టేషన్ పరిధిలో సోమవారం ఈ హత్య జరిగింది. ఇన్స్పెక్టర్‌ శ్యాంసుందర్‌ కథనం ప్రకారం... మూసాబౌలికి చెందిన మీర్జా ఖలీల్‌ బేగ్‌ (50) ప్రింటింగ్‌ ప్రెస్‌ ఉద్యోగి. ఇతని ఖదీర్‌బేగ్‌ అనే సోదరుడున్నాడు. వీరి కుటుంబానికి ఓ ఇల్లు ఉంది. ఖలీల్‌బేగ్‌కు చెప్పకుండానే సోదరుడు ఖదీర్‌బేగ్‌ ఆ ఇంటిని ముజుబుల్లా షరీఫ్‌ అనే వ్యక్తికి విక్రయించాడు. విషయం తెలుసుకున్న ఖలీల్‌ బేగ్‌ నన్ను సంప్రదించకుండా.. నా ఇల్లు ఎలా కొన్నావని షరీఫ్‌తో గొడవ పడ్డాడు. ఇంటి విషయమై వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో షరీఫ్‌... ఖలీల్‌బేగ్‌ను హత్య చేయించాలని నిర్ణయించాడు. కొందరికి సుపారీ ఇచ్చి రంగంలో దింపాడు. సోమవారం ఉదయం 10 గంటలకు ఐదురుగు దుండగులు మూసాబౌలీలో ఖలీల్‌ బేగ్‌ను కత్తులతో పొడిచి అతిదారుణంగా చంపేశారు. హతుడి కుటుం బసభ్యుల ఫిర్యాదు మేరకు హుస్సేనీఆలం పోలీసులు ఏడుగురు వ్యక్తుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్య జరిగిన ప్రాంతంలో సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి ఐదుగురు ఈ హత్యలో పాల్గొనట్టు గుర్తించామని, ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు. హత్య జరిగిన ప్రాంతం సమస్యాత్మక ప్రాంతం కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మూసాబౌలి చౌరస్తాలో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు.

సెల్ఫీ సరదా.. ఇద్దరు విద్యార్థులు మృతి

03/10/2016: శంషాబాద్ : సెల్ఫీ సరదా రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలో ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన 12 మంది విద్యార్థుల బృందం సోమవారం ఉదయం మానసాహిల్స్ సమీపంలోనినీటి గుంతల వద్దకు చేరుకుంది. అందులో ముగ్గురు ఈత కొట్టేందుకు గుంతలోకి దిగారు. సెల్‌ఫోనులో సెల్ఫీ తీసుకునేందుకు యత్నించారు. ఈ ప్రయత్నంలో ముగ్గురూ నీట మునిగారు. దీంతో తోటివారు ఒకరిని రక్షించగలిగారు. జుబేద్, షోయబ్ అనే ఇద్దరు మాత్రం మునిగిపోయారు. స్థానికుల సాయంతో వారి మృతదేహాలను వెలికితీశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని 8 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మాత్రం భయంతో పరారయ్యారని చెబుతున్నారు.

‘ఎఫ్‌సీసీ’..దేశంలోనే మొట్టమొదటి వాహనం

03/10/2016: హైదరాబాద్ : ఏదైనా ప్రమాద సంఘటన జరిగినప్పుడు స్పాట్‌లోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేలా సౌకర్యాలతో ఉన్న వాహనం హైదరాబాద్ పోలీసులకు అందుబాటులోకి రానుంది. ఈ వాహనాన్ని సోమవారం సాయంత్రం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రారంభించనున్నారు. ‘ఫోరెన్సిక్ కార్ప్స్ క్యారియర్’గా పిలిచి ఈ వాహనంలో స్ట్రెచర్స్, మృతదేహాన్ని కప్పి ఉంచే నల్లటి కవర్లు,వైద్యులు వాడే గ్లవ్స్ వంటివిఅందుబాటులో ఉంటాయి. దేశంలోనే మొట్టమొదటి సారిగా తెలంగాణ పోలీసు శాఖకు ఈ సౌకర్యం సమకూరిందని అధికారవర్గాలు చెబుతున్నాయి.

జూబ్లీహిల్స్లో డ్రంక్ అండ్ డ్రైవ్ - 14 మందిపై కేసు నమోదు

01/10/2016: హైదరాబాద్ : జూబ్లీహిల్స్లో శనివారం తెల్లవారుజామున పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాగి వాహనం నడుపుతున్న 14 మందిపై కేసులు నమోదు చేశారు. వారికి చెందిన10 కార్లతోపాటు 4 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించి... కోర్టులో హజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.

నగరంలోని ఆర్మీ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం

30/09/2016: హైదరాబాద్ : నగరంలోని పలు ఆర్మీ ప్రాంతాల్లో భద్రతను ఉన్నతాధికారులు కట్టుదిట్టం చేశారు. కంటోన్మెంట్, ఏవోసీ గేట్ తదితర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. ఆర్మీ పాసులున్న వారికి మాత్రమే ఆయా మార్గాల్లో అనుమతి ఇస్తున్నారు. ఆర్మీ పాస్లు లేని వాహనాలు వేరే మార్గంలో వెళ్లాలని ఆర్మీ సిబ్బంది సూచిస్తున్నారు. ఉడీ ఘటనకు ప్రతీకారంగా భారత ఆర్మీ పాక్ అక్రమిత కాశ్మీర్లోని పాక్ మిలిటెంట్ల స్థావరాలపై సునిసిన దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో నేపథ్యంలో ఆర్మీ ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు.

సాఫ్ట్ వేర్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం

30/09/2016: హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్డు నెం -12 లోని బహుళ అంతస్తుల భవనంలో సాప్ట్వేర్ కార్యాలయంలో శుక్రవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. భద్రత సిబ్బంది వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లలో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది... మంటలార్పుతున్నారు. అయితే ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు భవనం వద్దకు చేరుకున్నారు. బిల్డింగ్లో చిక్కుకున్న శ్రీవిద్య అనే అమ్మాయిని, మరో అబ్బాయిని పోలీసులు రక్షించారు. ఈ ఘటనతో తీవ్ర ఆందోళనతో ఉన్న వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరికొన్ని ఫైరింజన్లు ఘటన స్థలానికి తీసుకు వస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు భవన యజమానులు తీసుకోలేదని పోలీసులు తెలిపారు. ఇదే ఘటన ఉదయం 10 గంటల తర్వాత అయితే నాలుగో అంతస్థులోని ఉద్యోగులు కిందకి రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవలసి వచ్చేదని పోలీసులు తెలిపారు. ఇలాంటి భవన నిర్మించేటప్పుడు నాలుగువైపులా ఫైరింజన్లు తిరిగేలా ఉండాలని... కానీ ఇక్కడ అలాంటి అవకాశమే లేదని పోలీసులు చెప్పారు. అగ్నిప్రమాదంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పంట కోతకు నేనూ వస్తా! - ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామస్తులతో సీఎం కేసీఆర్

29/09/2016: సంగారెడ్డి: ‘‘ప్రభుత్వం మీ వెంట ఉంది. తెలంగాణలో తొలి ఫలాలను అందుకోబోతున్నారు. అందరికీ ఆదర్శంగా నిలవాలె. రాష్ట్రానికి మార్గం జూపాలె. ఊరు.. ఊరంతా సైన్యంలా కదిలి మొక్కజొన్న, సోయాబీన్ పంట కోత పనులు ఏకకాలంలో చేపట్టాలె. చేను కోతలో నేను కూడా పాల్గొని పంట కోస్తా..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మెదక్ జిల్లా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామస్తులతో అన్నారు. ప్రజలంతా కలసి సంఘటిత శక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ‘‘పంట కోత పని పూర్తి కాగానే వెంటనే రబీ విత్తనాలు వేద్దాం. మల్లసారి ఏడాదికి మూడు పంటలు తీసే స్థితికి మనం రావాలి. అంతా కలిసి మెలిసి ఉందాం. కలిసి ఊరు, సాగు పనులు చేసుకుందాం’’ అని చెప్పారు. గతంలో సిద్దిపేట ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో చిన్నకోడూరు మండలం సలేంద్రి గ్రామంలో తన ఆధ్వర్యంలో గ్రామస్తులంతా కలసి వరికోత పనులు పూర్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. బుధవారం ఎరవ్రల్లిలో కొత్తగా నిర్మించిన ఫంక్షన్ హాల్‌లో తన దత్తత గ్రామాలైన ఎరవ్రల్లి, నర్సన్నపేట గ్రామాల ప్రజలతో సీఎం సమావేశమయ్యారు. మల్లన్నసాగర్ పంచాయితీ ఇక తెగిపోరుుందని, మరో రెండేళ్లలో రిజర్వాయర్‌ను పూర్తిచేసి గోదావరి జలాలను అందిస్తామని చెప్పారు. 365 రోజుల పాటు ఇక్కడికి గోదావరి జలాలు తెచ్చి ఎప్పడూ పచ్చని కాంతులు ఉండేలా చూస్తానని హామీ ఇచ్చారు. ‘‘ఈ ఏడాది వరదలొస్తయని నేను ముందే జెప్పిన. అన్నట్లే వచ్చినయ్. నీళ్లు నిలబడ్డయ్. ఇంతకుముందు చేబర్తి చెరువు మత్తడి దుంకి కూడవెళ్లిలో పడి గోదాట్లో కలిసేది. ఇప్పుడు మనం ఎక్కడికక్కడ నీళ్లు నింపుకుంటున్నం. దేశానికి పట్టిన 20 ఏండ్ల ఎల్‌నినో పీడ విరగడైంది. వచ్చేదంతా లానినో హవానే. 12 ఏండ్ల పాటు కరువు ఉండదు’’ అని పేర్కొన్నారు. సాగు లేనివారికి గేదెలు, కోళ్లు వ్యవసాయం లేనివారికి పాడి గేదెలు, ఊరు కోళ్లు కొనుగోలు చేసి ఇప్పిస్తామని గ్రామస్తులకు సీఎం హామీనిచ్చారు. ‘‘నచ్చిన గేదెలను చూసుకుని బయానా ఇచ్చి వస్తే జేసీ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తాం. పశువుల గడ్డి కోసం విత్తనాలను అధికారులు సరఫరా చేస్తారు. ఈ అవకాశాన్ని వెంటనే ఉపయోగించుకోండి. గ్రామాల్లో అప శబ్దాలు వద్దు. పంచాయితీలు, గొడవలకు ఇకపై స్వస్తి పలుకుదాం. మనల్ని జూసి ఇతర గ్రామాల ప్రజలు నేర్సుకోవాలె.. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామంలో ఉండే చిన్నరాజన్నకు వచ్చిన ఆలోచన నేడు ఆ గ్రామాన్ని ఒక్కతాటిపై నడిపిస్తంది. వారివి మనకంటే మంచి భూములేం కావు. వ్యవసాయం చేస్తూ దర్జాగా బతుకుతుండ్రు. బ్యాంకుల్లో కోట్ల రూపాయల డిపాజిట్లున్నారుు. అక్కడ ఇండ్లలో మహిళలదే ఆర్థిక పెత్తనం. అభివృద్ధికి ఇది కూడా ఓ కారణం. రష్యాలో 90 శాతం విమానాలను మహిళలే నడిపిస్తరు. వారికి అవకాశమిస్తే ఏదైనా చేయగలరు. ఇందిరాగాంధీ ప్రధానిగా మెప్పించారు’’ అని మహిళా శక్తిని సీఎం కొనియాడారు. అన్ని సౌకర్యాల తర్వాతే ఇళ్లలోకి వెళ్దాం ‘‘మన రెండు గ్రామాల చుట్టూ 4 చెరువులు, కుంటలున్నయ్. అవి పూర్తిగా నిండినయ్. ఇంకా రెండు గ్రామాల్లో 70కి పైగా బోర్లేసుకుందాం. ‘గడా’ నుంచి కానీ, ఎమ్మె ల్యే అభివృద్ధి నిధి నుంచి గానీ నిధులు మంజూరు జేస్తా. వెంటనే బోర్లు వేసి కనెక్షన్లు ఇప్పించండి’’ అని రెండు గ్రామాలకు ప్రత్యేకాధికారిగా ఉన్న జేసీ వెంకట్రామిరెడ్డిని సీఎం ఆదేశించారు. ‘‘నీటిని బోర్ల ద్వారా నేరుగా వాడాలా? లేక సంపులు నిర్మించాలా? అనే విషయాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్‌రావు నిర్ణరుుస్తారు’’ అని చెప్పారు. ‘‘డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం కొంత ఆలస్యం జరిగింది. అరుునా సరే ఇండ్లపై ట్యాంకులు నిర్మించి నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేసుకుని పూర్తిస్థారుు సౌకర్యాలు సమకూరిన తర్వాతే ఇండ్లలోకి వెళ్దాం. పెద్ద పండగ చేసుకుందాం. పండుగకు నేను కూడా వస్తా’’ అని చెప్పారు. ఎరవ్రల్లిలో మాదిరే నర్సన్నపేటలో కూడా ఫంక్షన్‌హాల్‌ను నిర్మించుకుందామన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, గడా ఓఎస్డీ హనుమంతరావు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో పరువుహత్య కలకలం

29/09/2016: హైదరాబాద్‌లో పరువుహత్య కలకలం వీడియోకి క్లిక్ చేయండి హైదరాబాద్ : హైదరాబాద్‌లోనూ పరువు హత్యల సంస్కృతి మొదలైంది. నగరానికి శివార్లలో ప్రశాంతంగా ఉండే వనస్థలిపురం ప్రాంతం తెల్లవారుజామునే ఉలిక్కి పడింది. ఇక్కడి సచివాలయ నగర్‌ ప్రాంతంలో ఉండే లలిత్ ఆదిత్య (28) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గత సంవత్సరం నవంబర్ 9వ తేదీన సుశ్రుత అనే అమ్మాయిని అతడు ప్రేమవివాహం చేసుకున్నాడు. ఈ హత్య వెనుక ఆమె తరఫు బంధువుల హస్తం ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. తమ అమ్మాయిని లలిత్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడం వల్లే వాళ్లు ఈ హత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో ఉన్న టాటా సుమోలో వచ్చిన కొంతమంది ముందుగా ఇనుప రాడ్లతో లలిత్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టి, ఆ తర్వాత కత్తులతో పొడిచి చంపారు. గత కొంత కాలంగా లలిత్ ఆదిత్య కుటుంబ సభ్యులకు, అతడి భార్య తరఫు బంధువులకు వివాదం జరుగుతోంది. లలిత్ గుజరాత్‌లోని ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ తరచు హైదరాబాద్ వచ్చి వెళ్తుంటాడు. లలిత్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడిని యశ్వంత్గా గుర్తించిన పోలీసులు... అతన్ని అదుపులోకి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ హత్యను సుపారీ గ్యాంగ్తో చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సుపారీ గ్యాంగ్ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే వనస్థలిపురం ప్రాంతంలో ఇటీవల కొంత కాలం క్రితం వరకు చైన్ స్నాచింగుల కలకలం ఎక్కువగా ఉంది. అది కొంతవరకు తగ్గిందని అనుకుంటే.. ఈలోపు ఈ హత్య జరిగింది.

ఏసీబీ కోర్టుకు రేవంత్‌రెడ్డి

29/09/2016: హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో టీడీపీ నేత రేవంత్‌రెడ్డి, ఉదయ్‌సింహాలు ఈ రోజు ఏసీబీ కోర్టులో విచారణకు హాజరయ్యారు. నగరంలోని పాతబస్తీ ఏసీబీ కోర్టులో వీరిద్దరు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో విచారణ నిమిత్తం కోర్టులో హాజరు కావాల్సిందిగా రేవంత్, ఉదయ్ సింహాలకు గత నెలలో ఏసీబీ సమన్లు జారీచేసింది. కాగా, ఈ కేసులో విచారణ అక్టోబర్ 24కు వాయిదా పడింది. ఎ1 రేవంత్, ఎ3 ఉదయసింహ విచారణకు హాజరు కాగా, ఎ2 సెబాస్టియన్ మాత్రం హాజరు కాలేదు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తగినంత బలం లేకపోయినా అభ్యర్థిని గెలిపించుకునేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌కు లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన రేవంత్‌రెడ్డిని అప్పట్లో ఏసీబీ వర్గాలు అరెస్టుచేశాయి. తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. తాజాగా ఈ కేసును మళ్లీ విచారిస్తుండటంతో రేవంత్ తదితరులు కోర్టుకు హాజరయ్యారు.

పూడ్చేసిన శవాన్ని మళ్లీ బైటకి తీసి..

28/09/2016: హైదరాబాద్(అత్తాపూర్‌): కూతురు మృతిపై తండ్రి అనుమానం వ్యక్తం చేయడంతో ఖననం చేసిన వుృతదేహాన్ని మళ్లీ బైటకి తీసి పోస్ట్‌మార్టం నిర్వహించిన సంఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్ స్పెక్టర్‌ వి.ఉమేందర్‌ కథనం ప్రకారం.. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని బుద్వేల్‌ ఇంద్రనగర్‌ కాలనీకి చెందిన నవనీత(25), థామస్‌ భార్యాభర్తలు. నవనీత స్వీపర్‌గా విధులు నిర్వర్తించేది. అయితే ఈ నెల 15న నవనీత ఇంట్లో నిద్రలోనే మృతి చెందింది. సహజ మరణంగానే భావించిన కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా నవనీత తండ్రి నర్సింహ తన కూతురు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మంగళవారం మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు. కేసు దర్యాప్తులో ఉంది.

ఆన్‌లైన్‌లో అందాలను వర్ణిస్తూ..

28/09/2016: హైదరాబాద్: టెక్నాలజీని అందిపుచ్చుకున్న వ్యభిచార దందా ముఠాలు హైటెక్‌ వ్యభిచారం మొదలుపెట్టాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు అందమైన అమ్మాయిల ఫొటోలను ఆయా వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేసి, వారి శరీరాకృతిని వర్ణిస్తూ పూర్తి వివరాలు నిక్షిప్తం చేయడంతో పాటు కాంటాక్ట్‌ నంబర్లు ఇస్తూ నిర్వాహకులు బిజినెస్‌ చేస్తున్నారు. ఈజీ పద్ధతిన డబ్బు సంపాదించే మార్గం కావడంతో నగరానికి చెందిన కొందరు నిర్వాహకులు ఆన్‌లైన్‌ వ్యభిచార దందాను భారీ స్థాయిలో ప్రారంభించారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న సమాచారంతో కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ ఆదేశాల మేరకు ఎస్‌ఓటీ అదనపు డీసీపీ రాంచంద్రారెడ్డి నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. ఫోన్‌కాల్స్‌ ఆధారంగా ఉప్పల్‌ ఠాణా పరిధిలో ముగ్గురు నగరవాసులతో కూడిన ఓ వ్యభిచార ముఠాను అరెస్టు చేశారు. ఇద్దరు బాధిత మహిళలకు విముక్తి కల్పించారు. తాజాగా మంగళవారం న్యూఢిల్లీకి చెందిన నిర్వాహకురాలిని రామంతాపూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు బాధిత మహిళలను వ్యభిచార కూపం నుంచి విముక్తి కల్పించారు. నిందితుల వద్ద 11 సెల్‌ఫోన్లు, ఒక కారు. రూ.32 వేలు స్వాధీనం చేసుకున్నారు. లొకంటో.కామ్‌ వేదికగా.. న్యూఢిల్లీకి చెందిన ప్రచిశర్మ, కాజల్‌శర్మలు లొకంటో.కామ్‌లో అందమైన ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తూ ఈ దందా చేశారు. వీరు తమ బాయ్‌ఫ్రెండ్‌ ఢిల్లీకే చెందిన జావేద్‌ అన్సారీ సహాకారంతో నగరంలోనూ వ్యభిచార దందా ప్రారంభించారు. న్యూఢిల్లీ నుంచి తనకున్న పరిచయాలతో ప్రాచీ శర్మ కాల్ గరల్స్‌ను హైదరాబాద్‌కు రప్పించి వివిధ హోటళ్లలో వసతి కల్పించి దందా చేసేది. గంటలను బట్టి రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు చేసింది. ఇందులో 50 శాతం నగదు ఆమె తీసుకొని, హోటల్‌ ఖర్చులు మినహాయించి మిగతావి కాల్ గరల్స్‌కు కాల్ గరల్స్‌కు ఇచ్చేది. ఇదే విధంగా నగరానికి చెందిన రంజిత్, నగేశ్, రవివర్మ సహాకారంతో మెహిదీపట్నంలోని రేతిబౌలికి చెందిన డి.ప్రభాకర్‌ హైటెక్‌ వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు రామాంతాపూర్‌లోని వ్యభిచార గృహంపై దాడి చేసి నిందితులను అరెస్ట్‌ చేశారు. వీరిచ్చిన సమాచారం ఆధారంగానే ఢిల్లీకి చెందిన ప్రచిశర్మను మంగళవారం అరెస్టు చేశారు. ఢిల్లీ, హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు బాధిత మహిళలకు విముక్తి కల్పించారు.

నాలుగేళ్లు కలిసుండి పెళ్లికి నిరాకరించాడు

28/09/2016: నాగోలు: ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, చీటింగ్‌ కేసులు నమోదైన సంఘటన ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట మండలం ఉప్పునుంతల గ్రామానికి చెందిన ఓ యువతి (33)కి నల్లగొండ జిల్లా నుతనకల్‌ సిల్పకుంటలకు చెందిన బి.సతీష్‌కుమార్‌తో ఫోన్లో పరిచయం ఏర్పడింది. సతీష్‌కుమార్‌ ఎల్‌బీనగర్‌ గుంటిజంగయ్యనగర్‌లో నివాసముంటూ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సతీష్‌ ఆమెతో నాలుగేళ్లు కలిసున్నాడు. తీరా వివాహం చేసుకోవాలని ఆమె కోరగా సతీష్‌ తప్పించుకొని తిరుగుతున్నాడు. అంతేకాకుండా తక్కువ కులమంటూ దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు సోమవారం రాత్రి ఎల్‌బీనగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది.

నగరంలో 16 మంది మంత్రగాళ్ల అరెస్టు

28/09/2016: చాంద్రాయణగుట్ట:దెయ్యాలు, భూతాల పేరుతో అమాయక ప్రజలను దోపిడీ చేస్తున్న 16 మంది మంత్రగాళ్లను దక్షిణ మండలం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రజల మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకొని మంత్రతంత్రాలు చేస్తున్న అడ్డాలపై పోలీసులు మంగళవారం కార్డన్ సెర్చ్‌ నిర్వహించారు. ఇందులో 13 మంది పాత మంత్రగాళ్లు ఉండగా.. ముగ్గురు కరడుగట్టిన మంత్రగాళ్లు ఉన్నారు. సంతోష్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని డిస్కో బాబా, కంచన్ బాగ్‌ పరిధిలోని ఫయాజ్‌ మహ్మద్‌ అన్సారీ, ఛత్రినాక పోలీస్‌ స్టేషన్ పరిధిలో బండి రామకృష్ణ, డి.యాదయ్య, మహ్మద్‌ రసూల్‌ఖాన్, నితిన్, షేక్‌ ఇక్రముద్దీన్, భవానీనగర్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలో సయ్యద్‌ అన్వర్‌(42), షాకీర్‌ అలీ(50), అబ్దుల్‌ మాజీద్, సమహా మసూర్‌ అలియాస్‌ చుమ్మా చావూస్, మొఘల్‌పురాకు చెందిన బల్వీర్‌ సింగ్‌(75), ముఖేష్‌కుమార్‌(33), సంజయ్‌ కుమార్‌(33), ఎం.ఎ.రహీం(45), ఖైసర్‌(22)లను అరెస్ట్‌ చేశారు. కాగా ఇందులో కరడుగట్టిన ముగ్గురు మంత్రగాళ్లపై పీడీ యాక్ట్‌ నమోదు చేసేందుకు నగర పోలీస్‌ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపుతామని ఈ సందర్భంగా డీసీపీ తెలిపారు. ఈ రోజుల్లో కూడా మంత్రాలను నమ్మడం సరైంది కాదని ఆయన ప్రజలకు సూచించారు. దక్షిణ మండలం అదనపు డీసీపీ కె.బాబురావు, సంతోష్‌నగర్‌ ఏసీపీ వి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరూ ఇద్దరే... హఫీజ్‌బాబానగర్‌కు చెందిన ఫయాజ్‌ అన్సారీ మత పెద్ద ముసుగులో మంత్రాలు చేస్తున్నాడు. అరబ్‌ దేశాలలో ఉద్యోగాలు చేసే వారి కుటుంబాలు ఎంచుకొని వారి ఇళ్లలోని పిల్లలకు దెయ్యాలు పట్టాయంటూ నమ్మించి మంత్రాలు చేయడం ఇతని నైజం. ఇంట్లో ఎక్కువగా అల్లరి చేసే పిల్లలను గుర్తించి, వారికి దెయ్యాలు సోకాయని బాగు చేస్తానంటూ చిన్నారులను చిత్రహింసలకు గురి చేస్తాడు. ఒకరిద్దరు మహిళలను కూడా ఇతడు లోబర్చుకున్నాడని పోలీసులు వెల్లడించారు. టప్పా చబుత్రాకు చెందిన యునాని వైద్యుడు అన్వరుల్లాఖాన్ అలియాస్‌ డిస్కో బాబా గుప్త నిధులు తీస్తానంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. తన వద్ద ఉన్న ఇత్తడి బిస్కెట్లు, ఆర్టిఫిషియల్‌ రాళ్లను బంగారం బిస్కెట్లు, వజ్రాలు అంటూ నమ్మించి మోసం చేయడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. రియాసత్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ ఇఫే్తకార్‌ హుస్సేన్ అనే వ్యక్తి ఇంట్లో గుప్త నిధులు తీస్తానంటూ నమ్మించి రూ.38 లక్షలు వసూలు చేశాడు. ఇతనిపై నగరంలోని ఆసిఫ్‌నగర్, హబీబ్‌నగర్, కుల్సుంపురా, షాయినాయత్‌ గంజ్‌ తదితర పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

డీజీపీని కలసిన గద్దర్

28/09/2016: హైదరాబాద్: ప్రజాకవి గద్దర్ డీజీపీ అనురాగ్‌శర్మను మంగళవారం పోలీసు ప్రధాన కార్యాలయంలో కలిశారు. 1997లో తనపై జరిగిన కాల్పుల ఘటనపై పునర్విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఈ మేరకు డీజీపీకి ఒక వినతిపత్రం అందజేశారు. 1997లో సికింద్రాబాద్ అల్వాల్‌లోని తన నివాసంలో గద్దర్‌పై గ్రీన్‌కోబ్రా పేరిట గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పులకు పాల్పడింది నయీమ్ ముఠానేనని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ ఘటనపై విచారణ నిమిత్తం అప్పటి డీజీపీ హెచ్.జె.దొర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశారు. కానీ దర్యాప్తులో కాల్పులకు పాల్పడిన వ్యక్తులెవరనేది తెలియలేదు. ఇటీవల గ్యాంగ్‌స్టర్ నయీమ్ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. గ్రీన్‌కోబ్రా, బ్లాక్ కోబ్రాల పేరిట నయీమ్ అరాచకాలు సృష్టించినట్లు అనేక బాగోతాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనపై జరిగిన కాల్పుల ఘటనపై పునర్విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందని గద్దర్ డీజీపీని కోరారు.

92 పైసలకే రూ.10 లక్షల బీమా

27/09/2016: రైలు ప్రయాణానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారా....ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్‌ ద్వారా టిక్కెట్‌లు బుక్‌ చేసుకుంటున్నారా... అయితే టిక్కెట్‌తో పాటే ప్రయాణ బీమాను సైతం నమోదు చేసుకోవడం మరిచిపోవద్దు. రైల్వేశాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ బీమా సదుపాయం వల్ల ప్రయాణంలో ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యానికి గురైనా రూ. 10 లక్షల వరకు బీమా మొత్తం లభిస్తుంది. కేవలం 92 పైసల ప్రీమియం చెల్లింపుతో ఈ బీమా సదుపాయాన్ని పొందవచ్చు. ఈ నెల 1నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్‌ ద్వారా టిక్కెట్‌లు బుక్‌ చేసుకొనే సమయంలో టిక్కెట్‌ రిజర్వేషన్‌ బుక్‌ అయిన వెంటనే 92 పైసల ప్రీమియం చెల్లిస్తే చాలు. రైల్వేశాఖ అమల్లోకి తెచ్చిన బీమా పరిధిలో చేరిపోతారు. ట్రైన్‌ ఎక్కే సమయం నుంచి గమ్యస్థానానికి చేరుకొని ట్రైన్‌ దిగే వరకు బీమా వర్తిస్తుంది. ఒక టిక్కెట్‌పై ఎంతమంది ప్రయాణికులు బుక్‌ అయితే అంతమందికి ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. ఈ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 10 లక్షల మందికి పైగా ప్రయాణికులు బీమా కోసం నమోదు చేసుకోవడం గమనార్హం. లక్షలాది మందికి ప్రయోజనం... తరచుగా ఎక్కడో ఒక చోట రైలుప్రమాదాలు, బోగీల దహనం, రైలెక్కబోతూ,దిగబోతూ ప్రమాదవశాత్తు జారి కిందపడిపోవడం వంటి సంఘటనలు ఆందోళన కలిగిస్తూనే ఉంటాయి. ప్రమాద దుర్ఘటనల్లో రైల్వేశాఖ స్వతహాగా పరిహారం చెల్లిస్తున్నప్పటికీ ప్రయాణికులు సైతం స్వయంగా బీమా చేసుకోవడం వల్ల భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది. ఐదేళ్లలోపు చిన్నారులు మినహా అన్ని వయస్సుల ప్రయాణికులు ఈ బీమా పరిధిలోకి వస్తారు. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్‌ ద్వారా రిజర్వేషన్‌ టిక్కెట్‌లు తీసుకొనే వాళ్లకు ఇది వర్తిస్తుంది. కనీస టిక్కెట్‌ చార్జీలతో కానీ, గరిష్ట చార్జీలతో కానీ నిమిత్తం లేకుండా ఆన్‌లైన్‌లోనే టిక్కెట్‌ బుక్‌ చేసుకొన్న వెంటనే ‘ఇన్సూరెన్స్‌’ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ప్రయాణికులు తమ ఖాతాలోంచి 92 పైసలు సదరు బీమా సంస్థ ఖాతాలోకి బదిలీ చేయాలి. వెంటనే ప్రయాణికుల మొబైల్‌ ఫోన్‌కు ఎస్సెమ్మెస్‌ వస్తుంది. బీమా వివరాలు ఈ మెయిల్‌కు చేరుతాయి. బీమా ఎంపిక చేసే సమయంలో ఒక టిక్కెట్‌ పీఎన్‌ఆర్‌ నెంబర్‌పైన ఎంత మంది ప్రయాణికులు ఉంటే అంతమందికి బీమా ప్రీమియం చెల్లించాలి. బీమా మొత్తాన్ని చెల్లించవలసి వస్తే ఎవరికి అందజేయాలో తెలిపే నామిని వివరాలను కూడా నమోదు చేయాలి. 40 శాతం ఆన్‌లైన్‌ రిజర్వేషన్లే.. దక్షిణమధ్య రైల్వేలో ప్రతి రోజు 10 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగిస్తారు. వీరిలో 40 శాతానికి పైగా ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్‌ ద్వారా రిజర్వేషన్‌లు నమోదు చేసుకుంటారు. ఈ ఆన్‌లైన్‌ ప్రయాణికులు ‘ఇన్సూరెన్స్‌’ ప్రీమిం చెల్లిస్తే ఈ పథకం వర్తిస్తుంది. మొత్తం 17 బీమా కంపెనీలో ఈ పథకం కోసం పోటీ పడగా 3 కంపెనీలకు మాత్రమే అవకాశం లభించింది. శ్రీరాం జనరల్‌ ఇన్సూ్యరెన్స్, రాయల్‌ సుందరం, ఐసీఐసీఐ లాంబార్డ్‌ కంపెనీలు మాత్రమే ప్రస్తుతం ఐఆర్‌సీటీసీకి అనుసంధానమై ఉన్నాయి. ప్రమాదం జరిగితే... దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగితే 4 నెలలోపు బీమా సొమ్మును రాబట్టుకోవాలి. 15 రోజుల్లోపు ఈ ప్రక్రియ ముగిస్తారు. ప్రమాదం జరిగిన నాలుగు నెలలు దాటిన తరువాత వెళితే సదరు బీమా పథకం వర్తించదు. ప్రయాణికులు ఏ ప్రమాదం వల్ల గాయపడ్డారో, చనిపోయారో తెలిపే ఆధారాలను బీమా క్లెయిమ్‌ చేసుకొనే సమయంలో అందజేయాలి. సంఘటన వివరాలను తెలియజేసే ఎలాంటి ఆధారాలనైనా పరిగణనలోకి తీసుకొని బీమా మొత్తాన్ని చెల్లిస్తారు. ప్రమాదంలో మరణించినా, శాశ్వత అంగవైకల్యానికి గురైనా రూ.10 లక్షలు లభిస్తుంది. పాక్షిక అంగవైకల్యానికి గురైతే రూ.7.5 లక్షలు చెల్లిస్తారు. తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చేరితే రూ.2 లక్షలు లభిస్తుంది. మృతులకు బీమా మొత్తంతో పాటు, రవాణా ఖర్చుల కోసం రూ.10 వేల వరకు చెల్లిస్తారు. ప్రమాద ఘటనల్లో రైల్వేశాఖ చెల్లించే పరిహారానికి, బీమాకు ఎలాంటి సంబంధం ఉండదు.

ఆనందానికి అడ్డుగా ఉన్నాడని భర్తనే..

27/09/2016: హయత్‌నగర్‌: వ్యక్తి మృతదేహాన్ని బైక్‌పై అనుమానాస్పదంగా తరలిస్తూ పట్టుబడిన కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని బాలుడితో కలిసి భార్యే అతడిని చంపి.. మృతదేహాన్ని మాయం చేసేందుకు యత్నించినట్టు తేల్చారు. బాలుడితో పాటు మహిళను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిం చారు. వనస్థలిపురం ఏసీపీ భాస్కర్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం... కోదాడ మార్కెట్‌ కమిటీలో ఉద్యోగిగా పనిచేసిన మెండెం పుల్లయ్య, ప్రవల్లిక దంపతులకు ఇద్ద రు పిల్లలు. ఆరు నెలల క్రితం వరుసకు మేనల్లుడయ్యే ఓ బాలుడితో ప్రవల్లిక ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. పుల్లయ్యకు ఈ విషయం తెలిసి బాలుడిని హెచ్చరించాడు. అయినా బాలుడు ప్రవల్లిక వద్దకు రావడం మానలేదు. దీంతో పుల్లయ్య భార్యాపిల్లలను తీసుకుని నగరానికి వచ్చి ఎల్బీనగర్‌ మైత్రినగర్‌లో ఉంటున్నాడు. ఈ నెల 22న పుల్లయ్య ఇంట్లో లేని సమయంలో ఆ బాలుడు వచ్చా డు. 23న ఇంటికి వచ్చిన పుల్లయ్యకు భార్యతో బాలు డు కనిపించాడు. కోపం కట్టలు తెంచుకున్న అతను ఇద్దరినీ కొట్టి.. బాలుడిని తన ఇంటి నుంచి పంపేశాడు. అనంతరం బయటకు వెళ్లి మద్యం తాగి వచ్చాడు. రాత్రి మద్యం మత్తులో ఉన్న పుల్లయ్యను ప్రవల్లిక, బాలుడు కలిసి కొట్టి.. తలను గోడకేసి బాది చంపేశారు. మృతదేహాన్ని ఏం చేయాలో పాలుపోక 24వ తేదీ రాత్రి వరకు వేచి చూశారు. 25న ఆసుపత్రిలో ఉన్న తమ బంధువులను చూసి వస్తామని పక్కింటి వ్యక్తి దగ్గర బైక్‌ తీసుకున్నారు. రాత్రి 11 గంటలకు నిర్జన ప్రదేశంలో మృతదేహాన్ని పడేద్దామని బైకు మధ్యలో పెట్టుకొని బాలుడు, ప్రవల్లిక బయలుదేరారు. మృతదేహం కాళ్లు వేలాడుతూ కనిపించడంతో పెద్దఅంబర్‌పేట వద్ద పెట్రోలింగ్‌ పోలీసులు బైక్‌ను ఆపారు. విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. 108 సిబ్బందిని పిలిపించగా బైకు మధ్యలో ఉన్న వ్యక్తి మృతి చెందినట్లు తేలింది. దీంతో పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. ప్రవల్లికతో పాటు బాలుడిని తమదైన శైలిలో విచారించగా.. తామే హత్య చేశామని చెప్పారు. దీంతో నిందితులను సోమవారం రిమాండ్‌కు తరలించారు.

కవిత కోసమే రూ. 15 కోట్లు ఇస్తున్నారా? - కాంగ్రెస్ నాయకురాలు నేరెళ్ల శారద

27/09/2016: హైదరాబాద్: బతుకమ్మ పండుగ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ. 15 కోట్లు కేవలం సీఎం కేసీఆర్ కూతురు కవిత కోసమే కేటాయించారా అని టీపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో ఆమె మాట్లాడుతూ కేవలం కేసీఆర్ బిడ్డకోసం, రాజకీయ అవసరాల కోసం కాకుండా బతుకమ్మ పండుగ సంస్కృతిని కాపాడటానికి ప్రజల సొమ్మును ఖర్చు చేస్తే బాగుంటుందన్నారు. కేసీఆర్ కూతురు కవిత ఎక్కడ బతుకమ్మ ఆడితే అక్కడ నిధులు కేటాయించడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ. 15 కోట్లు ఏయే గ్రామాలకు ఎంత కేటాయించారో, ఆ నిధులతో బతుకమ్మ పండుగ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ నిధులను అన్ని గ్రామ పంచాయతీలకు నేరుగా కేటాయించాలని కోరారు.

‘రాహుల్‌పై దాడి సిగ్గుచేటు’

27/09/2016: హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపూర్‌లో జరిగిన దాడిని ప్రతిపక్ష నేత కె.జానా రెడ్డి, శాసనమండలిలో ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. రాహుల్‌పై దాడి సిగ్గుచేటని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి చోటులేదని పేర్కొన్నారు. దాడులకు పాల్పడటం మంచిది కాదని అన్నారు. దాడి చేసిన వారిని గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీతాపూర్‌లో గాడ్సేకు గుడి కట్టారని, రాహుల్‌పై దాడికి ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలే కారణం కావచ్చని పొంగులేటి ఆరోపించారు.

నోరు తెరిచిన రోడ్డు

22/09/2016: హైదరాబాద్: భారీ వర్షాలకు హైదరాబాద్‌లో పురాతన పైపులైన్లు ధ్వంసమై అడుగుకో అగాథం ఏర్పడుతోంది. బుధవారం ఓ వ్యక్తి బైక్‌పై ఎన్టీఆర్ గార్డెన్ ముందుకు రాగానే ముందు టైరు రోడ్డుపై చిన్న గోతిలో పడి ఆయన కిందపడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న వాళ్లు ఆయన్ను పైకి లేపారు. ఆ తర్వాత అక్కడ చూడగా రోడ్డుపై చిన్న రంధ్రం కనిపించింది. బండరాయి పెడితే సరిపోతుందనుకున్నారు. కానీ కాసేపటికే ఆ గొయ్యి కాస్తా మృత్యుబిలంగా పెద్దయింది. లోపలికి చూస్తే వరద ఉధృతంగా ప్రవహిస్తోంది! సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై బారికేడ్లు పెట్టి ట్రాఫిక్‌ను పక్కకు మళ్లించారు. విషయం తెలుసుకొని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. జేసీబీ సాయంతో రోడ్డును పైనుంచి తొలగించి చూడగా 6 మీటర్ల వెడల్పు, 25 అడుగుల లోతున మహాబిలం ఏర్పడింది. ఈ పైప్‌లైన్ మరమ్మతులకు వారంరోజుల సమయం పడుతుందని జలమండలి అధికారులు తెలిపారు. గతంలో పంజాగుట్ట, లోయర్ ట్యాంక్‌బండ్, ఇందిరాపార్క్ వద్ద నాలాల పైన ఉన్న భూభాగం కుంగి భారీ అగాథాలు ఏర్పడ్డాయి. ప్రధాన నగరంలో సుమారు 40 నాలాలు భూగర్భం నుంచి ప్రవహిస్తుండగా.. సుమారు 1,500 కిలోమీటర్ల మేర వరదనీటి కాల్వ వ్యవస్థ ఉంది. వీటి ఉనికిని కచ్చితంగా పసిగట్టే టెక్నాలజీ జీహెచ్‌ఎంసీ, జలమండలికి వద్ద లేదంటే అతిశయోక్తి కాదు!

టీడీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలి - రేవంత్

22/09/2016: హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి, ఆయా స్థానాల్లో ప్రజాతీర్పు కోరాలని సీఎం కేసీఆర్‌ను టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు న్యాయవ్యవస్థ ముందుకు రావడం శుభపరిణామమన్నారు.ఎమ్మెల్యేల అనర్హతలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు సీఎంకు చెంపపెట్టు వంటిదన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో స్పీకర్ కార్యాలయాన్ని రాజకీయపార్టీలను చీల్చే వేదికగా మార్చుకున్న సమయంలో హైకోర్టు ఈ తీర్పునివ్వడం మంచి పరిణామమన్నారు. టీడీపీ ఎన్నికల గుర్తుపై గెలిచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని గతంలోనే స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. దీనిని పక్కన పెట్టి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖ ఆధారంగా టీడీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు స్పీకర్ బులిటెన్ విడుదల చేశారన్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించి మంత్రిగా ప్రమాణం చేసిన తలసాని శ్రీనివాసయాదవ్‌పై వేటు వేయాలని గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేశామన్నారు. రాజ్యాంగ బద్ధంగా పనిచేయాల్సిన గవర్నర్, స్పీకర్ రాజకీయాలకు లోబడి రాజ్యాంగవ్యవస్థను నిర్లక్ష్యం చేశారన్నారు. అందుకే తాము న్యాయస్థానం తలుపు తట్టాల్సి వచ్చిందన్నారు. తమ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో 90 రోజుల లోపు ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని పేర్కొందన్నారు. స్పీకర్లు రాజ్యాంగానికి అతీతులు కారని, స్పీకర్ తీసుకునే నిర్ణయాలు రాజ్యాంగానికి లోబడి ఉంటే ఎవరూ ప్రశ్నించే అవకాశముండదని చె ప్పారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమవుతాయన్నారు.

ప్రాజెక్టులకు పెరుగుతున్న వరద ఉధృతి

22/09/2016: హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో అన్ని జిల్లాల్లో చెరువులు, వాగులు పొంగిపోర్లుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో చెరువులకు గండ్లు పడడంతో గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు జలదిగ్భంధంలో చిక్కుకున్నారు.. నల్లగొండ జిల్లాలో పులిచింతల ప్రాజెక్టుకు గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం 54.34 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 48.5 మీటర్లగా ఉంది. నీటి నిల్వ 24.4 టీఎంసీలు ఉండగా ఇన్ఫ్లో 10వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. మరోవైపు జిల్లాలో కేతపల్లి మూసీ కుడికాల్వకు గండి పడింది. కొత్తపల్లి గ్రామశివారులో నీరు వృథాగా పోతుంది. ఖమ్మంజిల్లాల్లో తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి తీవ్రంగా ఉండడంతో ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తి 18 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు.

భారీ వర్షాలు.. రంగారెడ్డిలో స్కూళ్లకు సెలవు

21/09/2016: హైదరాబాద్ : మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా నగరంలో పలు ప్రాంతాల్లో బుధవారం స్కూళ్లకు సెలవు ప్రకటించారు. బాలానగర్, కుత్బుల్లా పూర్, మల్కాజ్ గిరి, శేరిలింగంపల్లి మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం. రఘునందన్ రావు ఆదేశాలు జారీ చేశారు. పల్లపు ప్రాంతాలు, రోడ్లన్నీ జలమయం కావడం, బుధవారం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావారణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

హైదరాబాద్‌లో జలవిలయం

21/09/2016: హైదరాబాద్ : ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు కురుస్తుండటంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాలలో నీళ్లు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రవాహ వేగానికి మనుషులు కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉందని ఒక పాఠకుడు 'సాక్షి.కామ్ వెబ్‌సైట్'కు ఫోన్ చేసి చెప్పారు. అల్వాల్ జోషినగర్ ప్రాంతంలో ఉన్న చిన్నరాయని చెరువు నుంచి నీళ్లు వేగంగా వస్తున్నాయని.. వాటి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. ఉదయం నుంచి తాను అధికారులకు ఫోన్లు చేస్తూనే ఉన్నానని, 2-3 గంటల్లో సమస్య పరిష్కారం అవుతుందని వాళ్లు చెబుతున్నా నీటి ప్రవాహం ప్రతి గంటకూ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదని ఆయన వివరించారు. భారీ వర్షం హైదరాబాద్‌ను అతలాకుతలం చేసింది. దాదాపుగా భాగ్యనగరం మొత్తం నీటమునిగింది. రోడ్లపై మోకాల్లోతు వర్షపునీరు నిలిచింది. కూకట్‌పల్లి-హైటెక్‌సిటీ రైల్వేబ్రిడ్జి దగ్గర కూడా భారీగా వరద నీరు చేరింది. అటు వైపు వెళ్లే వాహనాల్లోకి ఆ నీరు పోవడంతో.... అవి మొరాయించాయి. దీంతో వాహనాలు అక్కడికక్కడే ఆగిపోయాయి. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు నగరంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమ‌య్యాయి. వర్షాలతో హుస్సేన్ సాగర్‌లోకి భారీగా నీరు చేరడంతో అధికారులు ఎప్పటికప్పుడు నీటిని బయటకు వదులుతున్నారు. రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. దీంతో ప్రజలు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. పంజాగుట్ట, ఎర్రగడ్డ, కూకట్ పల్లి, బేగంపేట్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో కూడళ్ల వద్ద రోడ్లపై వర్షం నీరు చేరింది. అర్థరాత్రి నుంచి చాలాచోట్ల ప్రధాన మార్గాల్లో వాహనాలు నిలిచిపోయాయి. ప్రజలు వర్షపునీటిలోనే రాత్రంతా జాగారం చేస్తూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. అటు రాజేంద్రనగర్, గచ్చిబౌలి, మెహిదీపట్నం, నాంపల్లి, అబిడ్స్‌తోపాటు పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, బాలానాగర్, సనత్ నగర్, అమీర్ పేట్, మలక్ పేట్, చాదర్ ఘాట్, దిల్ షుక్ నగర్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వాన పడింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయిలో నిండింది. రాత్రి కురిసిన వర్షానికి కూకట్ పల్లి బాలానగర్ నాలాల నుంచి భారీగా వరదనీరు సాగర్ లోకి చేరుతుండడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. కుత్బుల్లాపూర్, అల్వాల్, కూకట్ పల్లి, దోమల్ గూడ, నల్లకుంటతోపాటు దిగువ ప్రాంతాల్లోని కాలనీల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పురాతన భవనాలు, లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లో నివసించేవారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని కమిషనర్ అధికారులను అదేశించారు. రాత్రి నుంచి జీహెచ్ఎంసి సిబ్బంది, అత్యవసర సహాయక సిబ్బంది వాన‌నీటిని ఎప్పటికప్పుడు నాలాల్లోకి మళ్లించేందుకు ప్రయత్నాలు చేశారు. మెట్రో మార్గంలో రోడ్డుపై ఉన్న డివైడర్ల కారణంగా పంజాగుట్ట, అమీర్ పేట్, బేగంపేట్, ఎర్రగడ్డతో పాటు పలుచోట్ల రోడ్లపై భారీగా నీరు నిలిచింది.

బస్సు కన్నా నడకే నయం.. ట్రాఫిక్ జామ్ జామ్

21/09/2016: హైదరాబాద్ : భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా జామ్ అయింది. ఎర్రగడ్డ నుంచి కూకట్‌పల్లి వరకు ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది. కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోయాయి. దాంతో ప్రజలు బస్సుల్లోంచి దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇలా వెళ్తే అయినా కాస్త ముందున్న బస్సులోకి వెళ్లొచ్చని, దాంతో త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. ఉదయాన్నే కార్యాలయాలకు వెళ్లాల్సిన వారికి ఈ ట్రాఫిక్ జామ్ నరకం చూపిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు రాత్రి కురిసిన వర్షాలకు మరింతగా దెబ్బతిన్నాయి. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహన రాకపోకలు స్తంభించాయి. మూసాపేట వద్ద రోడ్డు చెరువును తలపిస్తుండడంతో వాహనాలు అటూ ఇటూ నిలిచిపోయాయి. కూకట్‌పల్లి, మియాపూర్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లకడీకాపూల్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై ఏర్పడిన గోతుల కారణంగా వాహనచోదకులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

బొంతు రామ్మోహన్‌ అధ్యక్షతన జరిగిన జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం

20/09/2016: హైదరాబాద్: ‘నగరంలో మౌలిక సౌకర్యాల పరిస్థితి దారుణంగా ఉంది. రోడ్లు కనీసం నడవడానికి కూడా వీల్లేకుండా ధ్వంసమయ్యాయి. నాలాలు ఆక్రమణకు గురయ్యాయి. దీంతో వర్షం వచ్చినప్పుడల్లా అవి పొంగిపొర్లి లోతట్టు ప్రాంతాలు నీటమునుగుతున్నాయి. పారిశుధ్యం అధ్వానంగా మారుతోంది. దోమలు దండెత్తుతున్నాయి. డెంగీ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయి...తక్షణమే స్పందించండి. ఈ సమస్యలకు పరిష్కారం చూపండి. నాలాలలపై కబ్జాలను సీరియస్‌గా తీసుకోవాలి..’ అని నగర కార్పొరేటర్లు ముక్తకంఠంతో గళమెత్తారు. సోమవారం మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అధ్యక్షతన జరిగిన జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశంలో నాలాలతోపాటు అధ్వాన్నపు రహదారులు, డెంగీ కే సులు, పారిశుధ్య కార్యక్రమాలపై సభ్యులు తమ వాణి వినిపించారు. సదరు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్‌ చేశారు. నగరంలోని నాలాలన్నీ ఆక్రమణలకు గురైనందునే వరదనీరు వెళ్లే మార్గం లేక నాలాలు పొంగిపొర్లుతూ మృత్యుమార్గాలుగా మారాయన్నారు. నిబంంధనలను ఉల్లంఘించి నాలాల వెంబడి భవన నిర్మాణాలకు అనుమతులిస్తుండటంవల్ల సమస్యలు తీవ్రమవుతున్నాయన్నారు.నగరం మరో చెన్నయ్‌లా మారకుండా ఉండాలంటే అనుమతులిచ్చేముందు సంబంధిత విభాగాలన్నింటి మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. పరిస్థితులిలా ఉంటే బంగారు తెలంగాణ ఎలా అవుతుందని ప్రశ్నించారు. వరదనీరు, డ్రైనేజీ కలగలసి పారుతుండటాన్ని నిరోధించాలని కోరారు. శివార్లలో సివరేజి బాధ్యతలు పూర్తిగా జలమండలికి అప్పగించాలని కోరారు. బల్కాపూర్‌ నాలావల్ల తీవ్ర సమస్యలు ఎదురువుతున్నాయని, ఈ సమస్య పరిష్కారానికి కార్పొరేటర్లందరితో సమావేశం నిర్వహించాలని కోరారు. పాతబస్తీలోని నాలాల సమస్యలపై ఒక కమిటీ వేయాలని ఎంఐఎం సభ్యులు కోరారు. నాలాలు, రోడ్ల సమస్యలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించాలని ఉప్పల్‌ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ ప్రభాకర్‌ సూచించారు. మురికినాలా ఒక్కటే మొత్తం భారం మోయలేనందున అదనపు వరదకాలువల అవసరం ఉందని ఎమ్మెల్యే బలాలా సూచించారు. సరూర్‌నగర్‌ చెరువు నీటిని మూసీకి తరలించే చర్యలు చేపట్టాలని స్థానిక కార్పొరేటర్లు కోరారు. చేపలచెరువు కబ్జాదారులను ఖాళీ చేయించాలన్నారు. గ్రేటర్‌లోని పనులన్నీ కొందరు కాంట్రాక్టర్లే చేపడుతున్నందున పనుల్లో నాణ్యత ఉండటం లేదని, వారే నగరాన్ని నాశనం చేస్తున్నారని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఒక్కో కాంట్రాక్టర్‌కు అప్పగించే పనులకు పరిమితి ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

పాక్‌కు తప్పదు గుణపాఠం

20/09/2016: పాక్‌కు తప్పదు గుణపాఠం అబిడ్స్‌: ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాకిస్థాన్‌కు తుది ఘడియలు సమీపిస్తున్నాయని ఎమ్మెల్యే రాజాసింగ్‌ లోధా పేర్కొన్నారు. కాశ్మీర్‌లో భారత్‌ జవాన్లపై జరిపిన దాడిని నిరసిప్తూ పురానాపూల్‌ చౌరస్తాలో ఎమ్మెల్యే రాజాసింగ్‌ లోథా ఆధ్వర్యంలో పాకిస్తాన్‌ ప్రధానమంత్రి నవాబ్‌ షరీఫ్‌ దిష్టిబొమ్మను తగలపెట్టారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

బీటెక్‌ చదివి ఇదేం పని...

20/09/2016: నాగోలు: బీటెక్‌ పూర్తి చేసిన యువకుడు జాబ్‌ అన్వేషణలో కన్సల్టెన్సీకి డబ్బు చెల్లించలేక అక్రమ మార్గాన్ని ఎంచుకొని కటకటాల పాలయ్యాడు. సోమవారం ఎల్బీనగర్‌ ఠాణాలో ఎడీసీపీ తఫ్సీర్‌ ఇగ్బాల్‌ తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొరిటికల్‌ గ్రామానికి చెందిన మిర్యాల రవికుమార్‌ అలియాస్‌ రవి(22) నల్లగొండలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశాడు. ఉద్యోగ ప్రయత్నంపై నగరానికి వచ్చి నాగోల్‌లోని సాయినగర్‌లో అద్దెకుంటున్నాడు. పలు ప్రాంతాల్లో ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు. దీంతో జాబ్‌ కన్సల్టెన్సీల్లో సంప్రదించగా డబ్బు ఇస్తే జాబ్‌ ఇప్పిస్తామని చెప్పారు. తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పగా వారు డబ్బు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఎలాగైన డబ్బు సంపాదించాలని అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈనెల 16న రాత్రి 8 గంటలకు రాక్‌టౌన కాలనీ ప్రధాన రహదారిపై మన్సూరాబాద్‌ సాయిసప్తగిరి కాలనీకి చెందిన కె.సుజాత తన స్కూటీపై స్నేహితురాలి కోసం వేచి ఉండగా... వెనుక నుంచి వచ్చిన రవి ఆమె మెడలో ఉన్న 2 తులాల బంగారు గొలుసు తెంచుకొని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల18న రాత్రి చాణక్యపురి కాలనీలో ఇదే తరహా స్నాచింగ్‌ చేసేందుకు రవి తిరుగుతుండగా... పోలీసులకు అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. విచారించగా అతని దగ్గర ఇంతకు మునుపు చేసిన స్నాచింగ్‌ గొలుసు దొరికింది. దీంతో అదుపులోకి తీసుకుని అతని నుంచి రెండు తులాల గొలుసును రికవరీ చేశారు. రవి గతంలో చైతన్యపురి పరిధిలోని అల్కాపురి దగ్గర ఓ మహిళ మెడలో గొలుసు స్నాచింగ్‌ చేయగా అది రోల్డ్‌ గోల్డ్‌ అవటంతో బాధితురాలు ఫిర్యాదు చేయలేదని సమాచారం. సమావేశంలో ఎల్బీనగర్‌ ఏసీపీ వేణుగోపాల్‌రావు, సీఐ కాశిరెడ్డి, డీఐ బి.విఠల్‌రెడ్డి, ఎస్‌ఐ కాశీవిశ్వనాథ్, డీఎస్‌ఐ రవీందర్, వెంకటేశ్వర్లు, విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మోస్ట్‌వాంటెడ్‌ జాబితాలో.. ఆ ఇద్దరూ మిస్సింగ్‌! - యూఎన్‌ జాబితాలో..కనిపించని భత్కల్, షఫీ ఆర్మర్‌

19/09/2016: హైదరాబాద్: విషవృక్షంగా విస్తరిస్తున్న ఉగ్రవాదాన్ని తమవంతుగా అడ్డుకోవడానికి ఐక్యరాజ్య సమితి (యూఎన్‌) సమాయత్తమవుతోంది. దీని కోసం సభ్యదేశాలకు తమకు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న ఉగ్రవాదుల జాబితా అందించమని ఇటీవల కోరింది. భారత్‌ ఇచ్చిన జాబితాలో దేశానికి, నగరానికి మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) వ్యవస్థాపకుడు రియాజ్‌ భత్కల్, ఐసిస్‌కు అనుబంధంగా అన్సార్‌ ఉల్‌ తవ్హిద్‌ ఫి బిలాద్‌ అల్‌ హింద్‌ (ఏయూటీ) ఏర్పాటు చేసిన షఫీ ఆర్మర్‌ పేర్లు ఆ జాబితాలో లేవని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఇది నిర్లక్ష్యమా? వ్యూహంలో భాగమా? అనేది అర్థంకాక విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. సిటీకీ అవే అత్యంత ప్రమాదకరం... హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాలకూ ప్రస్తుతం ముప్పు ‘రెండు’రకాలుగా పొంచి ఉంది. ఇందులో ప్రధానమైనది ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) కాగా, రెండోది ఐసిస్‌. ఇటీవల ఎనిమిది నెలల కాలంలోనే హైదరాబాద్‌లో ఐసిస్‌కు చెందిన రెండు ప్రధాన మాడ్యుల్స్‌ చిక్కాయంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐఎం, ఐసిస్‌కు చెందిన గజఉగ్రవాదులు రియాజ్‌ భత్కల్, షఫీ ఆర్మర్‌ పేర్లను యూఎన్‌కు ఇచ్చిన జాబితాలో చేర్చకపోవడం వెనుకా వ్యూహం దాగి ఉండచ్చని అధికారులు చెప్తున్నారు. అత్యంత రహస్య ఆపరేషన్లు చేస్తున్న సందర్భంలోనూ ఇలాంటి చర్యలు తీసుకుంటారని అభిప్రాపడుతున్నారు. భత్కల్‌ ఎందరికో మోస్ట్‌వాంటెడ్‌... 2007 ఆగస్టు 25, 2013 ఫిబ్రవరి 21న రాజధాని నగరం జంట పేలుళ్లతో దద్దరిల్లింది. మొదటిది గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌ల్లో జరగ్గా... రెండోది దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చ్‌ సెంటర్, 107 బస్టాప్‌లో చోటు చేసుకున్నాయి. ఈ రెండింటిలోనూ రియాజ్‌ భత్కల్‌ది కీలక పాత్ర. కర్ణాటకలోని భత్కల్‌ ప్రాంతానికి చెందిన ఇతడు స్థానిక యువతను ఆకర్షించి విధ్వంసాల సృష్టించాడు. 2005 నుంచి దేశ వ్యాప్తంగా 19 పేలుళ్లకు పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, ఫరీదాబాద్, వారణాసి కోర్టుల్లో, జైపూర్, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీ పేలుళ్లతో పాటు రామ్‌పూర్‌ సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌పై దాడి, సూరత్‌లో పేలుళ్లకు కుట్రల్లోనూ వాంటెడ్‌. ప్రస్తుతం ఇతను పాకిస్థాన్‌లోని కరాచీలో తలదాచుకున్నాడు. అక్కడ నుంచే హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు కుట్రపన్నుతున్న ఇతడికి ఆ దేశ ఆర్మీ, ఐఎస్‌ఐ భద్రత కల్పిస్తోంది. ఆర్మర్‌తో ఆషామాషీ కాదు... ఐసిస్‌కు అనుబంధంగా ఏయూటీని ఏర్పాటు చేసిన షఫీ ఆర్మర్‌ సైతం మామూలోడు కాదు. హైదరాబాద్‌కు సంబంధించి ఇప్పటి వరకు పట్టుబడిన ఐసిస్‌ ఉగ్రవాదులు, సానుభూతిపరుల వెనుక ఇతడే ఉన్నాడు. 2014లో శంషాబాద్‌ విమానాశ్రయంలో పట్టుబడిన సల్మాన్‌ మొయినుద్దీన్‌ నుంచి తాజాగా పాతబస్తీలో చిక్కిన ఇబ్రహీం యజ్దానీ మాడ్యుల్‌ వరకు అందరినీ ఇతడే ఆ బాటపట్టించాడు. ప్రస్తుతం సిరియా కేంద్రంగా వ్యవహారాలు నడిపిస్తున్న షఫీ ఆర్మర్‌ అక్కడ అమెరికా జరిపిన డ్రోన్‌ దాడుల్లో తాను చనిపోయినట్లు అనేకసార్లు వదంతులు వ్యాపించజేశాడు. నిఘా వర్గాల దృష్టి మళ్లించడానికే ఈ పంథా అనుసరించినట్లు అధికారులు చెప్తున్నారు. కర్ణాకటలోని ఉత్తర కన్నడ జిల్లా భత్కల్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ షఫీ ఆర్మర్‌ భారత్‌లో ఐఎస్‌ కార్యకలాపాలకు ఇన్‌చార్జ్‌గా ఉన్నాడు. కొన్నేళ్ల క్రితం తన అన్న సుల్తాన్‌ ఆర్మర్‌తో కలిసి దేశం దాటేశాడు. ఐఎస్‌కు అనుబంధంగా ‘అన్సార్‌ ఉల్‌ తౌహిద్‌’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. సిరియాలో అమెరికా సేనలు చేసిన దాడుల్లో సుల్తాన్‌ చనిపోగా... షఫీ మాత్రం భారత్‌ టార్గెట్‌గా ఐఎస్‌ను విస్తరించే పనిలో పడ్డాడు.

నయీమ్ భార్యకు రెండు రోజుల కస్టడీ

17/09/2016: హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ భార్య హసీనా, ఫహీమ్ భార్య సాజిదా షాహీన్‌లను సోమవారం నుంచి రెండు రోజుల పాటు నార్సింగి పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ ఉప్పర్‌పల్లి కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

నయీమ్ గురువుగా భావించేవాడు - టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య

17/09/2016: హైదరాబాద్: ‘‘నయీమ్ 1986లో రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో ఉన్నప్పట్నుంచే నా వద్దకు వచ్చేవాడు. విద్యార్థి సంఘాలతో కలసి చేసే ఉద్యమాలకు నేను నాయకత్వం వహించేవాడిని. అప్పట్నుంచే నయీమ్ నాకు శిష్యుడయ్యాడు. నన్ను గురువుగా భావించేవాడు. కానీ ఆ తర్వాత కార్యక్రమాలకు నాకు సంబంధం లేదు. గుడికి పోయే వాళ్లు ఎవరు, ఏంటని చూడనట్టే.. సమస్యలపై నా దగ్గరికి వచ్చే వాళ్లను కూడా నేను వ్యక్తిగత విషయాలు అడగను’’ అని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. గ్యాంగ్‌స్టర్‌గా నయీమ్ చేసే దందాలు, సెటిల్‌మెంట్లు, ఇతర నేరాలతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల గొంతు నొక్కే కుట్రలో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వం తనను ఇరికించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. నయీమ్‌తో సంబంధాలున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ ఉద్యమాన్ని అణచివేసేందుకే గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో తనకు సంబంధాలున్నాయంటూ దుష్ర్పచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘డబ్బులు సంపాదించాలంటే నాకు అడ్డదారులు తొక్కాల్సిన అవసరమేముంది? ముఖ్యమంత్రులే నాకు క్లోజ్. చెన్నారెడ్డి నుంచి చంద్రబాబు నాయుడు వరకు ప్రతి ఒక్కరితో నాకు సన్నిహిత సంబంధం ఉంది. పిలిచి మంత్రిని చేస్తానంటేనే నేను వెళ్లలేదు. బీసీల ఉద్యమం కోసం 40 ఏళ్లుగా పని చేస్తున్నాను. నాకు సెటిల్‌మెంట్లు, అక్రమాలు చేయాల్సిన అవసరం లేదు. నయీమ్‌తో ఎలాంటి లావాదేవీలు నాకు లేవు’’ అని స్పష్టంచేశారు. రాష్ట్రానికి తండ్రిగా ఉండాల్సిన సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని, తనకు గిట్టని వారిని అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నన్ను సీఎంగా చూడాలనుకున్నాడు ‘‘నయీమ్ నన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాడు..’’ అని కృష్ణయ్య ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇది అటు రాజకీయవర్గాల్లో, ఇటు పోలీసు వర్గాల్లో సంచలనంగా మారింది. అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ చట్టం నుంచి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తి తనను సీఎంగా చూడాలనుకున్నారని ఎమ్మెల్యే చెప్పడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. సిట్టింగ్ జడ్జితో విచారించాలి నయీమ్ కేసును సీబీఐతో లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధీనంలోని సిట్ వల్ల న్యాయం జరగదని, వేల కోట్లకు సంబంధించిన ఈ కేసులో 98 శాతం మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారన్నారు. రాజకీయ కుట్రతోనే నయీమ్‌తో తనకు సంబంధాలు అంటగడుతున్నారన్నారు. నయీమ్‌తో దందాలు చేసినట్లు ఆధారాలు చూపిస్తే విమర్శలు చేసే వారికి సమాధానం చెబుతానన్నారు. ఇతర ఎమ్మెల్యేల మాదిరి తాను టీఆర్‌ఎస్‌లో చేరలేదనే కుట్ర పన్నారని ఆరోపించారు.

హైదరాబాద్ లో వర్షపు నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు

16/09/2016: హైదరాబాద్(లింగంపల్లి), సలాం తెలంగాణ: పట్టణం లోని లింగంపల్లి రైల్వే బ్రిడ్జి క్రింద వర్షపు నీటిలో చిక్కుకున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్. ఈ బస్సులో విద్యార్థులు ఉన్నారు.

నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌పై 23 క్రేన్ల ఏర్పాటు.

16/09/2016: హైదరాబాద్: ► పోలీసు నిఘా నీడలో ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాలు....హుస్సేన్ర్‌ పరిసర ప్రాంతాల్లో సుమారు 800 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు నిమజ్జనోత్సవాన్ని సమీక్షించడం కనిపించింది. ► షీటీమ్‌లు మఫ్టీ డ్రెస్‌లో ట్యాంక్‌బండ్‌పై సంచరించారు. ► ఖైరతాబాద్‌ గణనాథుడు గతంలో ఎన్నడూలేని విధంగా మధ్యాహ్నమే నిమజ్జనం కావడంతో ట్యాంక్‌బండ్‌పై జనం సందడి గతంతో పొల్చుకుంటే కొంత తగ్గింది. ► పలు ప్రైవేటు ఆస్పత్రులు భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. ► పోలీసు కంట్రోల్‌ రూమ్‌ నుంచి గాంధీనగర్‌ ఇన్స్ పె క్టర్‌ ఎ. సంజీవరావు నిమజ్జనోత్సవం సందర్భంగా ఇటు పోలీసులకు భక్తులకు పలు సూచనలు చేయడం కనిపించింది.. ► వరంగల్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి తదితర జిల్లాల నుంచి పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. ► ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6 వరకు అప్పర్‌ ట్యాంక్‌బండ్‌లో సుమారు 844 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. ► గణేష్‌ నిమజ్జనానికి తరలి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ అధికారులు ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద నుంచి నగరం నలుమూలలకు గణేష్‌ నిమజ్జనం స్పెషల్‌ బస్సులను నడిపారు. ► భక్తుల కోసం జలమండలి అధికారులు ఎన్టీఆర్‌ స్టేడియం, అశోక్‌నగర్‌ మెయిన్‌ రోడ్డులో ప్రత్యేకంగా ఉచిత వాటర్‌ ప్యాకెట్లు, మంచినీరు అందించే ఏర్పాట్లు చేశారు.

15 వేల కెమెరాలతో నిమర్జనం నిఘా

16/09/2016: హైదరాబాద్: గణేశ్‌ నిమజ్జనం నేపథ్యంలో గురువారం నగరంపై పోలీసు విభాగం డేగకన్ను వేసింది. ఊరేగింపు మార్గాలతో పాటు ఆ చుట్టపక్కల ప్రాం తాలు, రహదారుల, హుస్సేన్‌సాగర్‌ చుట్టూ పర్యవేక్షణకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయా మార్గంలో ఇప్పటికే ఉన్న ట్రాఫిక్, కమ్యూనిటీ సీసీ కెమెరాలకు తోడు తాత్కాలిక ప్రాతిపదికన అదనంగా కెమెరాలు ఏర్పాటు చేశారు. శోభాయాత్రం జరిగే రూట్‌లో అణువణువూ రికార్డు అయ్యేలా చర్యలు తీసుకుంటూ సీసీ, పీటీజెడ్, వైఫై తదితర ఆధునిక కెమెరాలు ఏర్పాటు చేశారు. మొత్తమ్మీద 12 వేల శాశ్వత సీసీ కెమెరాలకు తోడు మరో 3 వేల అదనపు కెమెరాలు ఏర్పాటు చేసి.. వీటినీ బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో (సీసీసీ) అనుసంధానించారు. దీంతో పాటు స్థానిక పోలీసుస్టేషన్, ఏసీపీ, డీజీపీ కార్యాలయాల్లోనూ, ఎంపిక చేసిన అధికారులు తమ సెల్‌ఫోన్‌ ద్వారానూ దృశ్యాలను చూసేలా ఏర్పాటు చేశారు. మరోపక్క లింకేజ్‌ను డీజీపీ కార్యాలయానికి సైతం ఇచ్చి అక్కడ కూడా ఓ మినీ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. వీటిని డీజీపీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. హుస్సేన్‌సాగర్, ఎంజే మార్కెట్, చార్మినార్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ అనుకోని సవాళ్లు ఎదురైతే ఎదుర్కోవడానికి నిఘా కొనసాగించారు. సీసీసీలో ఉండే మ్యాప్‌ల ద్వారా ఊరేగింపు రూట్‌తో పాటు చుట్టుపక్కల మార్గాలనూ అధ్యయనం చేస్తూ నిఘా కొనసాగించారు. నగర పోలీసు కమిషనర్‌ ఎం.మహేందర్‌రెడ్డి, అదనపు సీపీ వీవీ శ్రీనివాసరావు, ఐజీలు చారు సిన్హా, ఎంకే సింగ్‌ ఇక్కడే మకాం వేసి పరిస్థితుల్ని ఆద్యంతం పర్యవేక్షించారు. హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి గురువారం సాయంత్రం సీసీసీని సందర్శించారు. ఇక్కడి నుంచి నిమజ్జనం ఊరేగింపు, ట్యాంక్‌బండ్‌ వద్ద నిమజ్జనం జరుగుతున్న తీరును పరిశీలించారు.

లడ్డూను దక్కించుకున్న ముస్లిం

16/09/2016: చాంద్రాయణగుట్ట: వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన బియ్యం వ్యాపారి కాలేద్‌ ఖులేదీ మతసామరస్యాన్ని చాటి చెప్పాడు. వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా చాంద్రాయణగుట్ట కుమ్మర్‌వాడీ ప్రాంతంలో జై దుర్గా భవానీ యూత్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి చేతిలో ఉంచిన 21 కిలోల లడ్డూకు గురువారం వేలం పాట నిర్వహించగా, స్థానిక బియ్యం వ్యాపారి కాలేద్‌ ఖులేదీ రూ.41 వేలకు వేలంపాడి గణనాథుడి లడ్డూను దక్కించుకున్నాడు. మతాలకతీతంగా కాలేద్‌ లడ్డూ కొనుగోలు చేయడం పట్ల చాంద్రాయణగుట్ట వాసులు హర్షం వ్యక్తం చేశారు.

ఇక ప్రభుత్వంపై పోరాటమే - క్షేత్రస్థాయి పోరాటానికి పీసీసీ కసరత్తు

16/09/2016: హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీల వైఫల్యం, ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయి పోరాటానికి పీసీసీ కసరత్తు చేస్తోంది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్న క్రమంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో నెల కొన్న పరిస్థితిపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈమేరకు రైతులు, యువత, విద్యార్థులు, దళితులు, మైనారిటీలకు టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీల అమలు, వైఫల్యం తది తరాలపై సమగ్ర అధ్యయనం చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొందరికి బాధ్యతలు అప్పగించారు. లక్ష లోపు పంట రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేస్తామని చెప్పి, ఇప్పటిదాకా కేవలం రెండు విడతలే చేయడంపై రైతుల అభిప్రాయాలను సేకరించనుంది. దళితులకు మూడెకరాల భూమి హామీ అమలుపై గ్రామాల్లో పరిస్థితులను తెలుసుకోనుంది. కేజీ టు పీజీ దాకా ఉచిత నిర్బంధ విద్య, లక్ష ఉద్యోగాల కల్పన, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితరాలపైనా నివేదికను తెప్పించుకోనుంది. అనంతరం అంశాల వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలని ఉత్తమ్ యోచి స్తున్నారు. ఇతర పార్టీలను, వివిధ ప్రజా సంఘాలను క్షేత్రస్థాయి సమరంలో భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి వ్యూహరచన చేస్తున్నారు. జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్తగా తలెత్తే సమస్యలు, ప్రభుత్వ కదలికలను బట్టి కార్యాచరణపై దృష్టి కేంద్రీకరించాలని భావిస్తున్నారు.

మధురాపురి కాలనీలో ఉచిత వైద్య శిబిరం

14/09/2016: హైదరాబాద్(మధురాపురి కాలనీ), సలాం తెలంగాణ: నగరంలోని దిల్ షుక్ నగర్ లోని మధురాపురి కాలనీ లో మంగళవారం రోజున ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం సాయి సంజీవిని హాస్పిటల్ వారు నిర్వహించారు. ఈ శిబిరానికి అనేక మంది వచ్చి చికిత్స పరిక్షలు చేయించుకున్నారు. అలాగే చాలా మంది రక్తదానం చేసారు.

‘విమోచన’పై దూకుడు పెంచిన బీజేపీ - సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్‌ కు పదును

14/09/2016: హైదరాబాద్: సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా జరపాలన్న డిమాండ్‌పై రాష్ట్ర బీజేపీ దూకుడును మరింతగా పెంచుతోంది. హైదరాబాద్ స్టేట్ విమోచన ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్‌తో కొంత కాలంగా బీజేపీ వివిధరూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ రోజు సమీపిస్తుండడంతో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల స్వరాన్ని, సవాళ్ల పర్వాన్ని ఒక్కసారిగా పెంచింది. తిరంగా యాత్ర పేరుతో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. గతంలో టీఆర్‌ఎస్ ఉద్యమ పార్టీగా ఉన్నపుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని డిమాండ్ చేసి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ మాట మరువడాన్ని ప్రజల్లో ఎత్తిచూపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. రాజకీయంగా కూడా పార్టీ రాష్ట్రంలో బలపడేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందనే నమ్మకంతో బీజేపీ నాయకత్వం ఉంది. సెప్టెంబర్ 17న వరంగ ల్‌లో నిర్వహించనున్న బహిరంగసభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొంటారు. ప్రభుత్వమే టార్గెట్‌గా కార్యక్రమాలు... హైదరాబాద్ విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్ ద్వారా టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టి, సర్కారు వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా రాష్ర్టవ్యాప్తంగా, ము ఖ్యంగా నిజాంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం జరిగిన ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలను చేపడుతోంది. 1948 సెప్టెంబర్ 17న జరిగింది విలీనమా, విమోచనమా, విద్రోహమా అన్న దానితో సంబంధం లేకుండా ఈ ఉత్సవాలను ప్రభుత్వమే నిర్వహించాలని బీజేపీ అంటోంది. నిజాం వ్యతిరేక పోరాటంలో ప్రాధాన్యతను సంతరించుకున్న ప్రాంతాలు, చరిత్రలో స్థానం సంపాదించుకున్న ఘటనలు, వ్యక్తులను గుర్తుచేసుకునేలా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాల గురించి పార్టీపరంగా ప్రచారం చేసేందుకు మహిళా మోర్చా, మైనారిటీ మోర్చా, ఎస్సీ, ఎస్టీ, యువజన మోర్చాలను రంగంలోకి దింపింది.

పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి

14/09/2016: హైదరాబాద్‌ : పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన హయత్‌నగర్ మండలం కోహెడలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. దీంతో తనకు రూ.5 లక్షల నష్టం జరిగిందని గొర్రెల యజమాని కన్నీరుమున్నీరు అవుతున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.

శివకుమార్ అంటే ఐ‘డర్’

12/09/2016: హైదరాబాద్: చైనా బైక్స్‌ పేరుతో దేశ వ్యాప్తంగా 60 మందికి పైగా టోకరా వేసిన శివకుమార్‌ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘరానా మోసగాడిని సీసీఎస్‌ పోలీసుల శనివారం అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. హయత్‌నగర్‌ సమీపంలోని పెద్ద అంబర్‌పేటలో ఉన్న గోడౌన్‌ను సీజ్‌ చేసిన అధికారులు అందులో ఉన్న బైక్స్‌ను స్వాధీనం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క ఈ ఘరానా మోసగాడు అనేక మంది యువతులనూ వంచించినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కోణంలో తమకు ఫిర్యాదులు రాలేదని, వస్తే నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని సీసీఎస్‌ అధికారులు పేర్కొంటున్నారు. ఐడర్‌ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి అదే బ్రాండ్‌తో బైక్స్‌ తయారు చేసి విక్రయించాలని శివకుమార్‌ ప్రయత్నాలు చేశాడు. చైనాకు చెందిన ద్విచక్ర వాహనాల తరహాలోనే ఇవీ ఉంటాయని ప్రచారం చేసుకున్నాడు. అయితే ఇలాంటి వాహనాల తయారీకి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. తానే స్వయంగా హైదరాబాద్‌లో కొన్ని వాహనాలు తయారు చేయించి ప్రదర్శించాడు. మొత్తం 15 మోడల్స్‌లో 110 సీసీ నుంచి 650 సీసీ సామర్థ్యం కలిగిన వాహనాలు ఉంటాయని, వీటి ధర రూ.49 వేల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుందని నమ్మబలికాడు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌ మహరాష్ట్ర, గోవాలతో పాటు దేశ వ్యాప్తంగా 60 మంది నగదు చెల్లించి డీలర్‌షిప్స్‌ తీసుకున్నారు. ఈ నయవంచకుడు కొందరు యువతులకూ ప్రేమ పేరుతో వల వేసి వారినీ వంచించాడు. ఆయా యువతులతో సన్నిహితంగా ఉన్న సమయాల్లో వారికి తెలియకుండా వీడియోలు, ఫొటోలు తీసేవాడు. వీటిని చూపించి ఆ యువతులను బెదిరించే వాడని, అలా తన డీలర్ల వద్దకు వారిని పంపుతూ ఆ దృశ్యాలు చిత్రీకరించే వాడని తెలిసింది. రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వరకు డిపాజిట్లుగా, మరికొంత మొత్తం బైక్స్‌ కోసం అడ్వాన్స్‌గా చెల్లించే డీలర్లు చివరకు మోసపోయామని తెలుసుకునే వారు. తాము చెల్లించిన నగదు తిరిగి ఇవ్వమంటే ‘దృశ్యాలు’ ఉన్నాయంటూ వారినీ బ్లాక్‌మెయిల్‌ చేసే వాడని తెలుస్తోంది. ఇతడి కార్యాలయంలో సోదాలు చేసిన పోలీసులకు రెండు ఈ తరహాకు చెందిన సీడీలు లభించాయని సమాచారం. పోలీసులు మాత్రం తమకు ఈ వ్యవహారాలపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని స్పష్టం చేస్తున్నారు. ఇతడిపై ఇప్పటికే జూబ్లీహిల్స్, కాచిగూడ, మీర్‌చౌక్, సరూర్‌నగర్‌ ఠాణాల్లో కేసులు నమోదై ఉండగా... తాజాగా సీసీఎస్‌ పోలీసులు నమోదు చేశారు. శివకుమార్‌ మాటలు నమ్మిన అనేక మంది డీలర్లు కొన్ని నెలలుగా షోరూమ్స్, కార్యాలయాలు, సిబ్బందిని సిద్ధం చేసుకున్నారు. అప్పటి నుంచి వాటి అద్దెలు, వారికి జీతాలు చెల్లిస్తున్నారు. చివరకు ఇప్పుడు మోసపోయామని తెలియడంతో లబోదిబోమంటున్నారు.

భారీ అగ్ని ప్రమాదం 20 లక్షల ఆస్తినష్టం

12/09/2016: మారేడుపల్లి: సికింద్రాబాద్‌ కార్ఖానా విక్రంపురి కాలనీ లో ఓ ప్లాజాలో బారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపింగ్‌ మాల్స్‌ లో మంటలు వ్యాపించడంతో రూ. 20 లక్షల అస్తి నష్టం వాటిల్లింది. కార్ఖానా పోలీసులు తెలిపిన మేరకు.. కార్ఖానా లోని పూజా ప్లాజాలో ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ఈజీ బై షోరూంలో షార్ట్‌సర్కూ్యట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. స్థానికంగా ఉన్న వారు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే ఈజీబై షోరూం లో బారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించినప్పటికి దట్టమైన పొగలు వ్యాపించడంతో లోనికి వెళ్లడం కష్టంగా మారింది..దీంతో షోరూం అద్దాలను ద్వంసం చేసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సంఘటనా స్థలం వద్ద కు ఐదు ఫైర్‌ ఇంజన్లతో మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పక్కన ఉన్న దుకాణాల్లోకి మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పక్కనే ఉన్న అన్ స్కిన్ షోరూం స్వల్పంగా దగ్ధమైంది. షోరూంలో దుస్తులతో పాటు కాస్మొటిక్స్‌ ఉండటంతో మంటలను ఆదుపులోకి తీసుకు రావడానికి చాలా సమయం పట్టింది. సుమారు ఇరవై లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాద ఘటనతో స్థానికంగా ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. స్టోర్‌ మేనేజర్‌ రవి కుమార్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లక్షలు పలుకుతున్న 'అల్లాహ్‌' పొట్టేలు

12/09/2016: హైదరాబాద్: పహాడీషరీఫ్‌ షాహిన్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ రఫియుద్దీన్‌ అనే వ్యక్తి పది రోజుల క్రితం జడ్చర్లలో 130 పొట్టేళ్లను కొనుగోలు చేశాడు. కాగా ఇందులో ఒక పొట్టేళ్లు చర్మంపై అరబ్‌ భాషలో అల్లాహ్‌ అని రాసినట్లుగా మచ్చ రూపంలో ఉండడాన్ని గుర్తించి దానిని ప్రత్యేకంగా అవ్ముకానికి పెట్టాడు. త్యాగానికి ప్రతీకైన బక్రీద్‌లో పొట్టేలు రూపంలో దేవుడు ఉన్నాడని భావిస్తున్న వారు దీనిని కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు ఈ పొట్టేలుకు రూ. 2.5 లక్షలు వెచ్చించేందుకు పలువురు వుుందుకు వచ్చారని, అయితే దీనిని అమ్మాలా...? వద్దా...? ఇంకా నిర్ణయించుకోలేదని రఫియుద్దీన్‌ తెలిపారు.

కొత్తపేట అమ్మవారిగుడిని దీకొన్న ఆటో....

10/09/2016: హైదరాబాద్(కొత్తపేట), సలాం తెలంగాణ: శనివారం తెల్లవారుజామున 5:30 గంటల సమయములో ఆటో ట్రాలీ కొత్తపేట లోని అమ్మవారిగుడిని డీకొట్టింది. దాంతో అమ్మవారిగుడి గోడలు ధ్వంసమయ్యాయి.

నిమజ్జన కోలాహలం

10/09/2016: హైదరాబాద్: నిమజ్జనోల్లాసంతో హుస్సేన్‌ సాగర్‌ తీరం కళకళలాడుతోంది. పూజలందుకున్న గణపయ్యలు గంగ ఒడికి చేరుతున్నారు. శోభాయాత్రలో యువత నృత్యాలతో సందడి చేస్తోంది.

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఎంఐఎం నేత

10/09/2016: హైదరాబాద్: శనివారం తెల్లవారుజామున నగరంలోని బంజారాహిల్స్ క్యాన్సర్ ఆస్పత్రి వద్ద నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఎంఐఎం నేత పట్టుబడ్డారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తరఫున రాజేంద్రనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన జావీద్ మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో జావీద్ అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు.

ఎంపీడీవోలకు బదులు ఓఎస్డీలు - కొత్త మండలాల్లో నియమించనున్న సర్కారు - జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎస్ రాజీవ్‌శర్మ వీడియో కాన్ఫరెన్స్

10/09/2016: హైదరాబాద్: కొత్తగా ఏర్పడే మండలాల్లో మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవోల)కు బదులుగా.. ప్రత్యేక అభివృద్ధి అధికారుల (ఓఎస్డీ)ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త మండలాల్లో ప్రస్తుతం మండల పరిషత్‌లు లేనందున వారిని ఓఎస్డీ (డెవలప్‌మెంట్)లుగా నియమించి, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించనుంది. ఇందుకు అవసరమైన అధికారులను గుర్తించి ప్రతిపాదనలు రూపొందిం చాలని పంచాయతీరాజ్ కమిషనర్‌ను ఆదేశించింది. ఇక కొత్త జిల్లాలకు అవసరమయ్యే ఉద్యోగుల వివరాలు, సిబ్బంది ప్రతిపాదనలను అన్ని శాఖల అధికారులు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించింది. ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి ఆర్థిక శాఖలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై శుక్రవారం అన్ని శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సన్నద్ధంగా ఉండండి కొత్తగా ఏర్పడే మండలాలు, డివిజన్‌లన్నింటిలో అక్టోబర్ 11న దసరా నుంచే కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉండాలని అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లను రాజీవ్‌శర్మ ఆదేశించారు. ముఖ్యం గా తొలి రోజున అన్ని మండలాల్లో రెవెన్యూ, వ్యవసాయం, విద్య, పోలీస్, పంచాయతీరాజ్ శాఖలు కొలువు దీరుతాయి. దీంతో ఈ ఐదు శాఖలు వెంటనే తమ సిబ్బంది ప్రతిపాదనలు రూపొందించాలని, ముందుగానే పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. కొత్త జిల్లాల్లో ప్రాధాన్యతలకునుగుణంగా అక్కడి ప్రజలకు మెరుగైన సేవలందించే ఏ ర్పాట్లు చేయాల స్పష్టం చేశారు. కొత్త జిల్లాల్లో ఉన్న ప్రత్యేకతలు, భౌగోళిక, సామాజిక పరిస్థితులను బట్టి ఆయా శాఖలకు సరిపడే సిబ్బంది నియామకం జరగాలన్నారు. అన్ని వివరాలతో.. ప్రతి శాఖ పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సిబ్బంది వివరాలు, సిబ్బంది నమూనా, కార్యాలయాల గుర్తింపు, వాహనాల వివరాలు, ఉద్యోగుల సర్దుబాటు తదితర వివరాలన్నీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సీఎస్ సూచించారు. కొత్తగా అవసరమయ్యే పోస్టుల వివరాలను పంపడంతోపాటు తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగుల జాబితాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతమున్న ఉద్యోగుల వివరాలు, సిబ్బంది ప్రతిపాదనలను స్పష్టంగా అప్‌లోడ్ చేయాలని.. ఉద్యోగుల ఆధార్ నంబర్లను సైతం అనుసంధానం చేయాలని స్పష్టం చేశారు. ఆధార్ కార్డు లేని ఉద్యోగులు కొత్తగా కార్డు తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రదీప్ చంద్ర, రంజీవ్ ఆర్ ఆచార్య, ఎస్‌కే జోషి, ముఖ్య కార్యదర్శులు బి.పి.ఆచార్య, రామకృష్ణారావు, సోమేష్‌కుమార్, అదర్ సిన్హా, సునీల్‌శర్మ, రాజీవ్ త్రివేదీ, సీఎంవో అధికారులు శాంతికుమారి, స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

గులాబీ నేతపై నయీమ్ ‘కత్తి’?

10/09/2016: హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో అంటకాగిన రాజకీయ నాయకులకు కేసుల ముప్పు పొంచి ఉందా? టీడీపీ, కాంగ్రెస్ నాయకులపై కేసులు పెట్టే ముందు తమ పార్టీకి చెందిన వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని టీఆర్‌ఎస్ అధినాయకత్వం భావిస్తోందా? పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి. ఎన్‌కౌంటర్‌లో నయీమ్ హతమై నెల రోజులు గడిచిపోయాక కూడా సిట్ నేతృత్వంలో ఇంకా అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసుల విచారణలో నయీమ్ అనుచరులు వెల్లడిస్తున్న అంశాలు పలువురు రాజకీయ నేతలు, కొందరు పోలీసు అధికారుల మెడకు చుట్టుకునేలా ఉన్నాయి. అయితే టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీతో కలసి నడిచిన వారికంటే వివిధ పార్టీల నుంచి గులాబీ గూటికి చేరిన నాయకులకే నయీమ్‌తో ఎక్కువగా సంబంధాలున్నాయని ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. నయీమ్‌తో సంబంధాలు నెరిపి బినామీలుగా వ్యవహరించిన వారు కొందరు అధికార పార్టీలో పదవుల్లో ఉన్నారు. ఇప్పుడు అందరి దృష్టి వారిపైనే కేంద్రీకృతమై ఉంది. ఇలా పార్టీ మారి టీ ఆర్‌ఎస్‌లో చేరిన ఓ ఎమ్మెల్సీపై వేటు పడడం ఖాయమని పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది. వారంతా భయంభయంగా.. ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో పలువురు నాయకులు ప్రస్తుతం వివిధ హోదాల్లో ఉన్నారు. వీరికి గతంలోనే నయీమ్‌తో సంబంధాలు ఉన్నాయనేందుకు అతడి డైరీలో ఆధారాలు లభించాయని చెబుతున్నారు. ఇప్పుడు పేరుకు తమ పార్టీలో ఉన్నా.. నయీమ్‌తో సంబంధాలు ఏర్పడింది, కొనసాగించింది ఇతర పార్టీల్లో ఉన్నప్పుడేనని, అందువల్ల వారి కోసం పార్టీకి చెడ్డపేరు ఎందుకు తెచ్చుకోవాలన్న చర్చ కూడా జరిగిందంటున్నారు. ఇందులో భాగంగానే నల్లగొండ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్సీతో రాజీనామా చేయించాలన్న అంశంపై చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ నెల 20న అసెంబ్లీ, మండలి సమావేశాలు మొదలు కానున్న నేపథ్యంలో అంతకుముందే సదరు ఎమ్మెల్సీతో రాజీనామా చేయిస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రాజీనామా చేయించడం వల్ల తమ పార్టీకి వచ్చే చెడ్డపేరు ఏమీ ఉండదన్న అంశంపైనా పార్టీ నేతలు విశ్లేషించారని అంటున్నారు. మరోవైపు నయీమ్‌తో సంబంధాలున్నాయని ప్రచారం జరిగిన పలువురు నాయకులు ఒకింత భయం భయంగానే గడుపుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును కలిసి తమ తప్పేమీ లేదని వివరించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. ఇటీవల బాగా ప్రచారం జరిగిన ఓ ఎమ్మెల్సీ.. సీఎం కేసీఆర్‌ను కలిశారని, తన గురించి చెప్పుకున్నారని వినికిడి. మరో ఎమ్మెల్సీ కూడా సీఎంను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడ్డారని అంటున్నారు. ముందు సొంతింటి నుంచే.. నయీమ్ కేసులో సంబంధాలున్న వివిధ పార్టీల నేతలపై కేసులు నమోదు చే సేందుకు ముందుగా సొంతింటిని చక్కదిద్దాలన్న చర్చ టీఆర్‌ఎస్‌లో జరిగింది. గ్యాంగ్‌స్టర్‌తో అంటకాగి, ఆర్థికంగా లాభం పొందిన వారెవరైనా పార్టీలో ఉంటే ముందుగా వారిపై కేసులు పెట్టి, ఆ తర్వాత ఇతర పార్టీల నేతలపై చర్యలకు దిగాలన్న చర్చ జరిగినట్లు సమాచారం. ఇప్పటికే తమ పార్టీలో ఎవరెవరికి, ఏ స్థాయిలో సంబంధాలున్నాయన్న అంశంపై గులాబీ అధినేత ఓ స్పష్టతకు వచ్చారని, ఆయన ఇచ్చే గ్రీన్‌సిగ్నల్ కోసమే పోలీసులు ఎదురు చూస్తున్నారని సమాచారం. కొద్ది రోజుల కిందట టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రి పేరు తెరపైకి రావడం, అధికార పార్టీ కావాలనే తమపై నిందలు వేస్తోందని ఆయన ఈ ప్రచారాన్ని తిప్పికొట్టారు. నేపథ్యంలోనే ప్రభుత్వం ఒక అడుగు వెనుకకు వేసిందంటున్నారు. ఏ పక్షం నుంచి విమర్శలు రాకుండా చర్యలు తీసుకునే పనిలో టీఆర్‌ఎస్ ఉందని, ఈ నెలాఖరులోగా కొందరిపై వేటు పడడం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

నెలలో పెళ్లి.. ఎంత పని చేసింది!

10/09/2016: చందాగనర్‌: అమ్మా.. అని పిలుస్తూనే వృద్ధురాలి నగలపై పనిమనిషి కన్నేసింది... అదను కోసం ఎదురు చూసింది.. అన్నం తింటున్న ఆమెపై దాడి చేసి కత్తితో గొంతు కోసి చంపేసింది. అనంతరం మృతురాలి మెడలోని బంగారు నగలు, చేతి గాజులు తస్కరించింది. పోలీసులు పట్టుకోవడానికి రావడంతో కత్తితో పొట్టలో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. మానవత్వం మంటగలిసిన ఈ దారుణ ఘటన చందానగర్‌ ఠాణా పరిధిలో శుక్రవారం జరిగింది. సీఐ తిరుపతిరావు కథనం ప్రకారం... శేరిలింగంపల్లి లక్ష్మీ విహార్‌ ఫేజ్‌ –2లో 95 నెంబర్‌ గల ఇంట్లో నివాసముండే శ్రీనివాస్, సునీత దంపతులు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు. శ్రీనివాస్‌ తల్లి ఉమాదేవి (65) ఇంట్లోనే ఉంటోంది. వీరి పక్కింటి పనిమనిషి వసుంధర లక్ష్మి(21) రోజూ ఉమాదేవిని అమ్మా.. అని పలకరిస్తూ కబుర్లు చెప్పేది. వృద్ధురాలి ఒంటిపై ఉన్న నగలు కాజేయాలని ఆమె పథకం వేసింది. శుక్రవారం ఉదయం శ్రీనివాస్, సునీత దంపతులు ఆఫీసుకు వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఉమాదేవి మధ్యాహ్నం 1.50కి భోజనం చేస్తోంది. అదే సమయంలో పనిమనిషి తలుపు తట్టింది. ఉమాదేవి వెళ్లి తలుపు తీసి.. మళ్లీ అన్నం తింటోంది. ముందే వేసుకున్న పథకం ప్రకారం ఆమెతో మాట్లాడుతున్నట్టు నటిస్తూనే అన్నం తింటున్న వృద్ధురాలిపై వసుంధర లక్ష్మి దాడి చేసి కత్తితో గొంతుకోసింది. వృద్ధురాలి అరుపులు విని 94 నెంబర్‌ ఇంట్లో ఉండే రామ్మోహన్ వచ్చి చూడగా ఇంటికి గడియపెట్టి ఉంది. తలుపులు తెరిచేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడంతో ఆయన వెంటనే పోలీసులకు, ఉమాదేవి కుమారుడు శ్రీనివాస్‌కు సమాచారం ఇచ్చాడు. పది నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు వంటగదిలో వసుంధరలక్ష్మి తచ్చాడుతూ కనిపించింది. పోలీసులు ఇంట్లోకి వస్తే వారిపై చల్లేందుకు కారంపొడి పట్టుకొని కిటికీ వద్ద నిలుచుంది. అదే సమయంలో ఇంటికి చేరుకున్న శ్రీనివాస్‌ అనుమతితో పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా వృద్ధురాలు ఉమాదేవి రక్తపుమడుగులో పడి ఉంది. అప్పటికే ఆమె మెడలోని నగలను, గాజులను కాజేసిన పనిమనిషి వసుంధరలక్ష్మి వాటిని దేవుడి గదిలో దాచింది. తన ను పట్టుకోవడానికి వస్తున్న పోలీసులను చూసి కూరగాయలు కోసే కత్తితో పొట్టలో పొడుచుకుంది. పోలీసులు అంబులెన్స్‌లో ఇద్దరినీ స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ఉమాదేవి మృతి చెందింది. నిందితురాలు చికిత్స పొందుతోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల రోజుల్లో పెళ్లి .. లక్ష్మీ విహార్‌ ఇంటి నెం. 69లో ఉండే కర్నూలు జిల్లాకు చెందిన అనుపమ ఇంట్లో వసుంధరలక్ష్మి నాలుగేళ్లుగా పని చేస్తూ ఇక్కడే ఉంటోంది. నెల రోజుల్లో పెళ్లి చేస్తామని, తమ కూతురిని ఊరుకు పంపాలని అనుపమను వసుంధరలక్ష్మి తల్లి కోరగా.. తనకు పని మనిషి దొరకగానే పంపిస్తామని చెప్పింది. శుక్రవారం ఉదయం 8.30కి అనుపమ ఉద్యోగానికి వెళ్తూ కొత్త పనిమనిషి దొరికిందని, వారం రోజుల్లో నిన్ను మీ ఊరుకు పంపిస్తానని వసుంధర లక్ష్మికి తెలిపింది. అంతలోనే ఈ దారుణానికి ఒడిగట్టింది.

వేధింపులపై వాట్సాప్‌లో ఫిర్యాదు చేయండి

09/09/2016: పంజగుట్ట: పిల్లలపై ఎలాంటి వేధింపులు జరిగినా వెంటనే స్పందించేందుకు బాలల హక్కుల సంఘం వాట్సాప్‌ సేవలు అందుబాటులోకి తెచ్చింది. బాల కార్మికులు, వీధిబాలలు, స్కూల్‌లో వేధింపులు, అత్యాచారాలు, కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేసినా 9491292424 నంబరుకు వాట్సాప్‌ చేస్తే వెంటనే స్పందిస్తామని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షులు అచ్యుతరావు తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సంఘం అధ్యక్షురాలు అనూరాధా రావు, స్లేట్‌ స్కూల్‌ విద్యార్ధులతో కలిసి వాట్సాప్‌ నెంబర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...ఈ నంబర్‌ 24 గంటలు అందుబాటులో ఉంటుందని, ఫిర్యాదు దారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో రేఖారాణి, నటరాజ్‌ భట్, వెంకటరమణ, సిరి చిన్మయి, సాయి చరిత, శరత్, గణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

నా కొడుకు చంపేస్తున్నాడు..

09/09/2016: నాంపల్లి: ఉన్న ఒక్కగానొక్క కుమారుడిని అల్లారుముద్దుగా పెంచి పెద్దచేశాడు.. బాగానే సంపాదించాడు.. అయితే ఇప్పుడు ఆ ముసలి తండ్రి కుమారుడికి భారమయ్యాడు.. దీంతో నానాకష్టాలు పెట్టాడు.. చిత్రహింసలకు గురిచేశాడు.. తాగే నీటిలో మలమూత్రాలు వేసి అతని ముఖం మీద చల్లారు అతని కొడుకు, కోడలు.. ఈ ఒక్క సంఘటన చాలు తన తండ్రిని ఆ వ్యక్తి ఎలా చూసుకుంటున్నాడో.. చివరికి తట్టుకోలేక కన్నీటితో మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించాడు.. నన్ను బతకనివ్వండి అంటూ వేడుకున్నాడు.. వరంగల్‌ జిల్లా లింగాల ఘనపురం మండలం, కుందారం గ్రామానికి చెందిన వల్లాల రాములు (85) వ్యవసాయం చేస్తూ గొర్రెలు పెంచి బాగానే సంపాదించాడు. ఇతనికి వెంకయ్య అనే కుమారుడు ఉన్నారు. కుమారుడికి అంజమ్మ అనే మహిళతో వివాహం చేశారు. 13 ఎకరాల పొలం, వంద గొర్రెలున్నాయి. వద్ధాప్యం రావడంతో పనిచేయడం కష్టమైంది. కళ్లు సరిగా కనబడవు. కర్రల సాయం లేందే నడవలేడు. దీంతో తండ్రి భారమయ్యాడని భావించాడు. ఆస్తిపై కన్ను పడింది. దీంతో సంపాదించిన సొమ్మంతా కొడుకు లాగేసుకున్నారు. తండ్రిని ఇంటి నుంచి గెంటివేశారు. బయటకు వెళ్లనందుకు నానా చిత్రహింసలకు గురిచేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పెన్షన్ కూడా అందడం లేదు. ఈ విషయమై స్థానిక డీఎస్పీ, తహసీల్దార్, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో భిక్షాటన చేసుకుంటూ నగరానికి వచ్చాడు. ప్రస్తుతం నా జీవితం గాలిలో దీపంగా మారింది. జీవించే హక్కును కల్పించాలని రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ కు ఫిర్యాదు చేశారు. ఇంటి నుంచి గెంటివేసిన కొడుకు, కోడలుపై చర్యలు తీసుకోవాలని, అనాధగా మిగిలిపోయిన తనకు ఆశ్రయం కల్పించాలని కోరారు.

గణేష్‌ ఉత్సవాలతో అంతా అప్రమత్తం

09/09/2016: నగర పోలీసు విభాగం ప్రతి ఏటా అనేక ఉత్సవాలు, సందర్భాలకు బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తుంది. అయితే అన్నింటికంటే గణేష్‌ ఉత్సవాలు, ఆఖరి రోజు జరిగే సామూహిక నిమజ్జనం అత్యంత కీలకమైనవి. ఈ నేపథ్యంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అన్ని విభాగాలూ రంగంలోకి దిగాయి. నగర పోలీసు కమిషనర్‌ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎవరికి వారు తమ బాధ్యతల్ని నిర్వర్తించడంపై దృష్టిపెట్టారు. శాంతిభద్రతల విభాగం అధికారులు స్థానికంగా ఉన్న మండపాలు, నిమజ్జన ఊరేగింపు జరిగే మార్గాలపై దృష్టి పెట్టగా., ప్రత్యేక విభాగాలు ఇతర అంశాలపై చర్యలు తీసుకుంటున్నాయి. గణేష్‌ మండపాలతో పాటు నిమజ్జనం ఊరేగింపు నేపథ్యంలో డీజేలు, పరిమితికి మించి శబ్ధం చేసే సౌండ్‌ సిస్టమ్స్‌ వెలుస్తుంటాయి. వీటి కారణంగా కొన్నిసార్లు ఘర్షణలు చోటు చేసుకుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు డీజే, సౌండ్‌ సిస్టమ్స్‌ ఏర్పాటు చేసేవారితో సమావేశమయ్యారు. మండపాల వద్ద, ఊరేగింపులోను పరిమితికి మించిన శబ్ధం చేసే సౌండ్‌ సిస్టమ్స్‌తో పాటు డీజేలు ఏర్పాటు చేయవద్దని స్పష్టం చేశారు. టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ ఎన్‌.కోటిరెడ్డి, సౌత్‌జోన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.యాదగిరి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో దీనికి సంబంధించి కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వుల్ని నిర్వాహకులకు తెలియజేశారు. వీటిని అతిక్రమిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోపక్క మండపాలతో పాటు ఊరేగింపులో ఈవ్‌టీజింగ్‌ ఇతర వేధింపులు లేకుండా చూడటంపై సీసీఎస్‌ ఆధీనంలోని ‘షీ–టీమ్స్‌’ చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ప్రత్యేక బృందాలు మండపాల వద్దకు వెళ్లి నిర్వాహకులకు అవగాహన కల్పిస్తున్నాయి. మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా అవగాహన కల్పించడానికి షీ–టీమ్స్‌ ఇటీవల రూపొందించిన పాటల సీడీలను మండపాల వద్ద పంపిణీ చేస్తున్నారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ఈ బృందాలు పోకిరీల కోసం మాటువేసి ఉంటున్నాయి.

ఇన్నోవా కొనుకున్నరవితేజ

09/09/2016: హైదరాబాద్: సినీ హీరో రవితేజ తాను కొత్తగా కొనుగోలు చేసిన వాహనం ఇన్నోవా క్రిస్టల్‌ రిజిస్ట్రేషన్‌ కోసం గురువారం ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయానికి స్వయంగా వచ్చారు. రవాణాశాఖ నిబంధనల ప్రకారం ఫీజు చెల్లించి తనకు నచ్చిన ‘టీఎస్‌ 09 ఈపీ 2628’ నెంబర్‌పై వాహనం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. జేటీసీ రఘునాథ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పర్యవేక్షించారు.

రాష్ట్రమంతటా గ్రేటర్‌ కోనేర్ల ఫార్ములా

08/09/2016: రాయదుర్గం: గణనాథుల నిమజ్జనం కోసం గ్రేటర్‌లో ఏర్పాటు చేస్తున్న కోనేర్ల నిర్మాణ ఫార్ములాను రాష్ట్రమంతటా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పేర్కొన్నారు. వినాయక ప్రతిమల నిమజ్జనం కోసం నగరంలో 10 కోనేర్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో రాయదుర్గం మల్కం చెరువు వద్ద పూర్తయిన మొదటి కోనేరును శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు సాయిబాబా, హమీద్‌పటేల్‌లతో కలిసి మేయర్‌ బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్, ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, అధికారులు... ప్రజలతో కలిసి నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మేయర్‌ విలేకర్లతో మాట్లాడుతూ హైకోర్టు ఆదేశం, సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం మేరకు మంత్రి కేటీఆర్‌ పర్యవేక్షణలో ఈ కోనేర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. వీటిని ప్రజలు అందరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం గ్రేటర్‌లో 10 కోనేర్ల నిర్మాణం చేపట్టామని, వచ్చే ఏడాది మరో 30–40 చెరువుల వద్ద నిమజ్జన కోనేర్లు నిర్మిస్తామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, చెరువులు కలుషితం కాకుండా చూడాలనే ఉద్దేశంతో కేరళ, బెంగళూర్‌లలో గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం కోసం అనుసరిస్తున్న ఫార్ములాను నగరంలో అమలు చేస్తున్నామన్నారు. ఈ కోనేర్లలో 7–8 ఫీట్ల గణనాథులను నిమజ్జనం చేయడానికి అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. పర్యావరణ స్పృహతో చాలాచోట్ల మట్టి గణపతులనే ప్రతిష్టించారని, భవిష్యత్తులో మొత్తం మట్టి గణనాథులనే వినియోగించేలా కృషి చేస్తామన్నారు. రూ. 6.95 కోట్ల వ్యయంతో.. జీహెచ్‌ఎంసీ ఇరిగేషన్‌ ఎస్‌ఈ వై.శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రూ.6.95 కోట్ల వ్యయంతో ఈ కోనేర్ల నిర్మాణం చేపట్టామన్నారు. కోనేర్లు 43(ఇంట్‌)43 చదరపు మీటర్ల పొడవు, వెడల్పు.. 4 మీటర్ల లోతుతో నిర్మించామని చెప్పారు. కోనేరులో రెండు వేల విగ్రహాలు నిమజ్జనం చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రతి కోనేరులో స్వచ్ఛమైన నీటినే వాడాలని ఆదేశించడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి కోనేర్లలో నింపుతున్నామన్నారు. ఎప్పటికప్పుడు విగ్రహాలు తొలగించి, నీటిని పంపింగ్‌ ద్వారా డ్రైనేజీలోకి వదిలి కోనేరులో శుభ్రమైన నీటిని నింపుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ వెస్ట్‌ జోన్‌ కమిషనర్‌ బి.వి.గంగాధర్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్‌ వి.వి.మనోహర్, ఈఈ మోహ¯ŒSరెడ్డి, డీఈ కిష్టప్ప, ఏఈ కనకయ్య, శానిటరీ సూపర్‌వైజర్‌ జలంధర్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

విమాన ప్రయాణంలో పుట్టిన శిశువు..

08/09/2016: బంజారాహిల్స్‌: విమాన ప్రయాణంలో పుట్టిన శిశువు జూబ్లీహిల్స్‌ అపోలో క్రెడిల్‌లో సంపూర్ణ ఆరోగ్యంగా ఉందని అపోలో క్రెడిల్‌ చీఫ్‌ న్యూనటాలజిస్ట్‌ డాక్టర్‌ సీవీఎస్‌ లక్ష్మి తెలిపారు. బుధవారం ఆస్పత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె ఆ వివరాలు వెల్లడించారు. ఆగస్టు 14న సెబు పసిఫిక్‌ ఎయిర్‌ విమానంలో దుబాయ్‌ నుంచి మనీలాకు ఫిలిప్పీన్స్‌కు చెందిన 32 ఏళ్ల హలీదా అనే గర్భిణి వెళుతున్నారు. ఈక్రమంలో ఆమెకు పురిటి నొప్పులు రావడంతో విమానాన్ని హైదరాబాద్‌లో అత్యవసరంగా దించారు. ఎనిమిది నెలలకే ఆమె ఆడ శిశువును ప్రసవించింది. వెంటనే అపోలో మెడికల్‌ సెంటర్‌ ఎయిర్‌పోర్ట్‌ టీమ్‌ ఆమెను అపోలో క్రెడిల్‌కి తరలించారు. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్న శిశువుకు కృత్రిమ శ్వాసను అందించి శ్వాస మార్గాన్ని పరిరక్షించారు. ప్రస్తుతం ఆ శిశువు ఆరోగ్యంగా ఉందని డాక్టర్‌ లక్ష్మి తెలిపారు. తల్లి హాలిదా ఆనందంతో వైద్యులను ప్రశంసించారు. తల్లి ఆరోగ్యం మెరుగుపడిందని డాక్టర్‌ ప్రమీలా శేఖర్‌ తెలిపారు.

ఆ లడ్డూ..ఎందుకు పెట్టనట్టు!

08/09/2016: ఖైరతాబాద్‌: ఖైరతాబాద్‌ గణపతి మహా ప్రసాదం ఈ ఏడాది భక్తులకు ‘చేరువ’యింది. ఏటా 50 అడుగుల ఎత్తులో లంబోదరుడి చేతిలో దర్శనమిచ్చే ప్రసాదం ఈ ఏడాది పాదాల చెంతనే ఉంచారు. 500 కిలోల లడ్డూను చేతితో తాకుతూ నమస్కరిస్తూ ముందుకు సాగుతున్న భక్తుల మదిలో ఓ వైపు ఆనందం ఉన్నా.. గణపతి చేతిలో లడ్డూను ఎందుకు పెట్టలేదనే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి సురుచి ఫుడ్స్‌ అధినేత మల్లిబాబు ఈ ఏడాది మహా గణపతికి 500 కేజీల లడ్డూను ప్రసాదంగా సమర్పించేందుకు సోమవారం ఉదయం తీసుకువచ్చారు. పూజ ల అనంతరం లడ్డూను గణపతి చేతిలో అమర్చేందుకు క్రేన్‌ను సిద్ధం చేశారు. క్రేన్‌కు లడ్డూను అమర్చారు. క్రేన్‌ ఆపరేటర్‌కు సిగ్నల్‌ అందడంతో లడ్డూను పైకి లేపి వినాయకుడి చేతిలో పెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. అంత వరకూ గాలిలో ఉన్న మహా ప్రసాదాన్ని చూస్తున్న భక్తులకు అక్కడ ఏం జరుగుతుందో తెలియలేదు. ఏమైందో లడ్డూ ప్రసాదం గణపతి చేతిలోకి బదులు పాదాల చెంతకు చేరింది. ఎందుకిలా జరిగింది..? అని కమిటీ ప్రతినిధుల్ని అడిగితే మౌనమే సమాధానమైంది. ఎల్‌ఈడీ ఛత్రం లేదు.. ఏటా వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునేందుకు వీలుగా లడ్డూపై ఎల్‌ఈడీ ఛత్రాన్ని అమర్చేవారు. కానీ ఈసారి మహా గణపతి పాదాల చెంత ఉంచిన 500 కిలోల లడ్డూకు కేవలం పాలిథిన్‌ కవర్‌ మాత్రమే కప్పి వదిలేశారు. ప్రహసనం.. ప్రసాద వితరణ ఖైరతాబాద్‌ గణపతి లడ్డూ ప్రసాదమంటే భక్తులకు మహా క్రేజ్‌. మూడేళ్లుగా ప్రసాదం పంపిణీ ప్రహసనంగా మారుతోంది. ఈ ప్రసాదానికి సాయుధ పోలీసుల కాపాలా ఉంచాల్సి వస్తోంది. ప్రసాదం పంచే రోజు భక్తుల రద్దీని అదుపుచేయలేని పరిస్థితులూ ఉన్నాయి. దీంతో ప్రసాద వితరణ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ఏడాది ప్రసాదం సైజు తగ్గిపోవడానికి, చేతిలో ఏర్పాటు చేయకపోవడానికి ఇదీ ఓ కారణమని చెబుతున్నారు. పంపిణీపై లేని క్లారిటీ.. మహా నైవేద్యానికి తొలి ఐదు రోజులు పూజ తప్పనిసరి అని, తరువాతే ప్రసాద పంపిణీ అని ఉత్సవ కమిటీ చెబుతోంది. పంపిణీ ఎప్పుడు ఎక్కడ అనే విషయాలపై స్పష్టత మాత్రం ఇవ్వలేదు. ఉత్సవ కమిటీ ప్రకటన కోసం ప్రసాదాన్ని ఆశిస్తున్న భక్తులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కొసమెరుపు.. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ఖైరతాబాద్‌కు చెందిన శ్రీధర్‌ అనే భక్తుడు 15 కేజీల లడ్డూను మహా గణపతికి సమర్పించారు. ఈ నైవేద్యాన్ని ఖాళీగా ఉన్న లంబోదరుడి చేతిలో ఉంచారు.

గుట్కా వేసుకుని ఈతకు వెళ్లడంతో..

07/09/2016: అత్తాపూర్‌: చెరువులో ఈతకోడుతూ ప్రమాదవశాత్తు మునిగిపోయి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ ఉమెందర్‌ తెలిపిన వివరాల ప్రకారం... రాజేంద్రనగర్‌కు చెందిన మురళీ(28) కుమార్‌(27), స్నేహితులు. సోమవారం స్థానిక పత్తికుంట చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. గుట్కాతినే అలవాటు ఉన్న మురళీ నోట్లో గుట్కాపెట్టుకోని నీటిలోకి దిగి ఈత కొడుతూ ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతి చెందాడు. రాజేంద్రనగర్‌ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జడ వేయలేదని విద్యార్థిని ఆత్మహత్య

07/09/2016: చైతన్యపురి: తల్లి జడ వేయలేదని మనస్తాపంతో ఓ ఇంటర్‌ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.... కర్మన్ ఘాట్‌ క్రాంతినగర్‌కు చెందిన రాములు స్థానికంగా హోటల్‌ నిర్వహిస్తున్నాడు. అతని కూతురు భాగ్యలక్ష్మీ (17) శ్రీసాయి కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. మంగళవారం ఆమె తన తల్లి విజయలక్ష్మిని జడవేయమని కోరగా వేరే పని ఉన్నందున వేయలేదు. దీంతో అలిగిన భాగ్యలక్ష్మి కాలేజీకి వెళ్లకుండా భాగ్యలక్ష్మి ఇంట్లోనే ఉంది. తండ్రి హోటల్‌కు వెళ్లగా తల్లి, సోదరుడు జిల్లెలగూడలోని బంధువుల ఇంటికి వెళ్లడంతో తలుపు గడియ వేసుకుని కిటికీ గ్రిల్స్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి తిరిగి వచ్చి తల్లి తలుపుకొట్టినా తీయకపోవడంతో స్థానికుల సహాయంతో గడియ విరగొట్టి లోపలికి వెళ్లి చూడగా భాగ్యలక్ష్మి ఉరి వేసుకుని చనిపోయి కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కరువుపై ఇంత నిర్లక్ష్యమా? - ప్రభుత్వ తీరుపై ప్రొఫెసర్ కోదండరాం మండిపాటు

07/09/2016: హైదరాబాద్: రాష్ట్రంలో కరువు తీవ్రం గా ఉన్నా ప్రభుత్వం కనీస ఉపశమన చర్యలు తీసుకోవడం లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. కరువులో రైతుల దుస్థితి-పంట రుణాలు అం శంపై తెలంగాణ రైతు జేఏసీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం రౌండ్‌టే బుల్ సమావేశం నిర్వహించింది. ఇందులో కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రంలోని 38 మండలాల్లో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయగా కరువు తీవ్రంగా ఉందని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని తేలిందన్నారు. జూన్ మొదటిపక్షంలో కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా పంటలు వేశారని, ఆ తర్వాత వర్షాలు సక్రమంగా లేక పంటలు పూర్తిగా ఎండిపోయాయన్నారు. అయినా వ్యవసాయశాఖ పట్టించుకోవడం లేదన్నారు. గ్రామాలవారీగా సాగైన పంటలు, వాటిలో ఎండిన పంటలు, రైతులకు జరిగిన నష్టంపై పూర్తి నివేదిక తయారు చేయాలన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదు... గతేడాది పంట నష్టానికి ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదని కోదండరాం విమర్శించారు. రూ.లక్ష దాకా పంట రుణాలను ఒకేసారి మాఫీ చేస్తామని హామీ ఇచ్చి 4 విడతలుగా మాఫీ చేస్తామన్న సర్కారు మళ్లీ మాటమార్చిందన్నారు. దీంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చిందని, ప్రభుత్వం పాత రుణాలను మాఫీ చేసి, కొత్తగా బ్యాంకు రుణాలను ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం కరువు, రైతు సమస్యలపై చర్చించి ఉపశమన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే మార్గాలను అధ్యయనం చేస్తున్నామన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రైతులను ఆదుకోవాలంటూ బాపూ ఘాట్ వద్ద మౌన దీక్ష చేస్తానన్నారు. భూసేకరణలోనూ అన్యాయం... భూసేకరణలోనూ ప్రభుత్వం స్పష్ట త లేకుండా రైతులకు అన్యాయం చేస్తోందని కోదండరాం అన్నారు. భూములను భూసేకరణ చట్టం-2013 చట్ట ప్రకారం సేకరిస్తారో లేక జీవో123 ప్రకారం చేస్తారో స్పష్టం చేయాలన్నారు. పంట రుణాలను మాఫీ చేసి, కొత్తవి ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సారంపల్లి మల్లారెడ్డి కోరారు. ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, జేఏసీ సమన్వయకర్త పిట్టల రవీందర్, తెలంగాణ మాల మహానాడు నాయకులు భైరి రమేశ్, జేఏసీ నేత మాదు సత్యంగౌడ్, రైతు సంఘం నేతలు అంజిరెడ్డి, జగపతిరావు, సుజయ, కె.రవి పాల్గొన్నారు.

‘ఆస్తి కోసమే సాహితిని హతమార్చారు’

06/09/2016: హైదరాబాద్ : నగరంలోని బోడుప్పల్లో 17 ఏళ్ల సాహితి అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెను ఆస్తి కోసం మేనత్త, మేనమామ హత్య చేశారని సాహితి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మేడిపల్లికి చెందిన సాహితి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి నానమ్మతో కలిసి ఉంటోంది. అయితే మేనమామ నివాసానికి వచ్చిన సాహితి గతరాత్రి బాత్రూమ్లో జారిపడి మృతి చెందినట్లు ఆమె మేనత్త చెప్పటం పలు అనుమానాలకు తావు ఇస్తోంది. అంతేకాకుండా గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా మరో పదిరోజుల్లో సాహితికి మైనార్టీ తీరునున్న నేపథ్యంలో ఆ‍స్తి కోసమే హతమార్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నలుగురు కానిస్టేబుళ్లు.. సీఐ కొడుకు అరెస్టు

06/09/2016: హైదరాబాద్: ఓ వాచ్మెన్పై దాడి చేసిన కేసులో నలుగురు పోలీసులను, మరో పోలీసు అధికారి కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. స్వచ్చందంగా వారు తాము చేసిన తప్పును అంగీకరించారు. సైదాబాద్లోని కరన్ బాగ్ ప్రాంతంలో బీడీఆర్ టవర్స్ అనే అపార్ట్మెంట్లో చిట్యాల అమృత్ అనే వ్యక్తి వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. దీని పక్కనే వికారాబాద్ స్పెషల్ బ్రాంచ్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వేణుగోపాల్రాజ్ కుమారుడు అంబటి పృథ్వీరాజ్ కూడా ఉంటున్నాడు. అతడు పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నట్లు తెలిసింది. అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ అమృత్‌తో అతడు తరచు గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలోనే పృథ్వీరాజు.. వాచ్‌మెన్‌ అమృత్‌తో 31వ తేదీ రాత్రి గొడవ పడ్డాడు. అపార్ట్‌మెంట్‌ నుంచి వెళ్లిపోవాలని బెదిరించాడు. పృథ్వీ బెదిరించినా అమృత్ వెళ్లలేదు. దీంతో అతడు వెళ్లి తన తండ్రితో చెప్పడంతో భూరంతపల్లి శివరాజ్, చాకలి మల్లేశ్, ఉప్పరి రవి కుమార్, అంతిగిరిపల్లి రాజ్కుమార్ అనే నలుగురు పోలీస్ కానిస్టేబుళ్లు అమృత్ ఉంటున్న అపార్ట్ మెంట్ వద్దకు వచ్చి అతడిపై దాడి చేశారు. ఈడ్చుకెళ్లి కొట్టుకుంటూ స్టేషన్కు తీసుకెళ్లి మరోసారి కొట్టి విడిచిపెట్టారు. అతడి భార్య యాదమ్మ అడ్డుపడటంతో ఆమెపై కూడా చేయిచేసుకున్నట్లు తెలిసింది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డయ్యాయి. ఇది కాస్త వెలుగులోకి రావడంతో తీవ్ర స్థాయిలో సదరు పోలీసు అధికారి కుమారుడిపై విమర్శలు తీవ్ర స్థాయిలో వచ్చాయి. ఈ నేపథ్యంలో కేసు నమోదుచేసుకున్న పోలీసులు మొత్తం ఐదుగురుని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

ఢిల్లీ వెళ్లిన మంత్రి హరీశ్ రావు

06/09/2016: హైదరాబాద్: తెలంగాణ భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం ఉదయం ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద దేశవ్యాప్తంగా గుర్తించిన 99 సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధుల కోసం కేంద్రం ‘నాబార్డ్’తో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకోనుంది. ఈ ఒప్పంద కార‍్యక్రమానికి జలవనరుల సమన్వయ కమిటీ సభ్యుడి హోదాలో పాటు టీ.సర్కార్ తరపున హరీశ్ రావు హాజరు అవుతున్నారు. దేశవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 99 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్రం నిధులు సమకూర్చనున్న ఈ పథకంలో రాష్ట్రానికి చెందిన కొమురం భీం, గొల్లవాగు, ర్యాలీవాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెం వాగు, ఎస్సారెస్పీ-2, దేవాదుల, జగన్నాథ్‌పూర్ , భీమా, వరద కాల్వలు (మొత్తం 11 ప్రాజెక్టులు) ఉన్నాయి. అలాగే కృష్ణానది యాజమాన్య బోర్డు వైఖరిపై ఆయన ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని హరీశ్ ఈ సందర్భంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా మంత్రి వెంట అధికార బృందం కూడా ఢిల్లీ వెళ్లింది.

'నయీంతో నాకెలాంటి సంబంధాలు లేవు'

06/09/2016: హైదరాబాద్‌: మల్‌రెడ్డి రంగారెడ్డి తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని కిషన్‌రెడ్డి సవాలు విసిరారు. రాజకీయ లబ్దికోసమే మల్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గ్యాంగ్స్టర్ నయీంతో తనకెలాంటి సంబంధాలు లేవని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కాగా, అంతకుముందు మల్‌రెడ్డి రంగారెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..మంచిరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నయీం ప్రధాన అనుచరుడు శ్రీహరితో కలిసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నయీం కేసులో శ్రీహరిని అరెస్ట్ చేసిన పోలీసులు మంచిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని రంగారెడ్డి ప్రశ్నించారు. శ్రీహరితో కలిసి ఎమ్మెల్యే రూ.300 కోట్లు సంపాదించాడని ఆయన ఆరోపించారు. ఆదిభట్లలోని భూ కబ్జా విషయాలు బయటకొస్తాయనే భయంతోనే మంచిరెడ్డి పార్టీ మారారన్నారు. ఎమ్మెల్యే అవినీతిపై ఇబ్రహీంపట్నం చౌరస్తాలో బహిరంగ చర్చకు సిద్ధమని రంగారెడ్డి సవాల్ విసిరారు.

సీఎంను ఏకవచనంతో సంభోదిస్తే..

06/09/2016: హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ను ఏకవచనంతో సంభోదిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. గద్వాల, జనగామ గురించి అఖిలపక్షంలో ఎందుకు మాట్లాడలేదని కాంగ్రెస్‌ నేతలను నిలదీశారు. జిల్లాల విభజన శాస్త్రీయంగానే జరుగుతుందని తలసాని స్పష్టం చేశారు.

ఆన్‌లైన్‌లో ఉద్యోగుల వివరాలు - శాఖలవారీగా సర్దుబాటు, కేటాయింపు

03/09/2016: హైదరాబాద్: కొత్త జిల్లాలు కొలువుదీరక ముందే ఉద్యోగుల విభజన పూర్తి చేయాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగులు, సిబ్బంది వివరాలు పొందుపరిచేందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ఆన్‌లైన్ ఫార్మాట్‌ను తయారు చేసింది. సర్దుబాటు ఎలా ఉండాలో నిర్దేశిస్తూ.. ఉద్యోగుల కేటాయింపు వివరాలన్నీ ఆన్‌లైన్‌లోనే పొందుపరచాలని అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశాలు జారీ చేశారు. కొత్త జిల్లాలకు అవసరమయ్యే సిబ్బంది, మౌలిక వసతుల కల్పనపై సీఎస్ ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ సచివాలయంలో వరుసగా రెండో రోజు సమావేశమైంది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 12 విభాగాలతో సీఎస్ సమీక్షించారు. వ్యవసాయం, పశు సంవర్థకం, మార్కెటింగ్, విద్య, ప్రణాళిక, విద్యుత్ తదితర శాఖల్లో ఉద్యోగుల సర్దుబాటుపై చర్చించారు. విద్యా శాఖ పరిధిలో డిప్యూటీ డీఈ వోలు, అసిస్టెంట్ డెరైక్టర్లను కొత్త జిల్లాల్లో ఇన్‌చార్జీ డీఈవోలుగా నియమించాలని నిర్ణయిం చారు. తర్వాత సీనియారిటీ క్రమంలో వారికి ప్రమోషన్లు ఇచ్చే పద్ధతిని అనుసరించనున్నారు. ఒకే గొడుగు కింద విద్యా శాఖ విభాగాలు విద్యాశాఖ పరిధిలో ప్రస్తుతం విడివిడిగా ఉన్న సర్వశిక్ష అభియాన్, ఆర్‌ఎంఎస్‌ఏ, మోడల్ స్కూళ్లన్నీ ఇకపై డీఈవో పరిధిలోకి తీసుకు రావాలని నిర్ణయించారు. దీంతో ఉద్యోగుల కొరత తీరుతుందని, సర్దుబాటు సమస్య పరిష్కారమవుతుందని చర్చించారు. మండల స్థాయిలోనూ ఇదే తీరుగా విద్యా సంబంధిత యూనిట్లను విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ శాఖలోనూ ఇప్పుడున్న జాయింట్ డెరైక్టర్లను రీజనల్ డెరైక్టర్లుగా నియమించనున్నారు. వీరి స్థానంలో డిప్యూటీ డెరైక్టర్లను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులుగా సర్దుబాటు చేయనున్నారు. దసరా నుంచే కొత్త జిల్లాలు మనుగడలోకి వస్తాయని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. కేవలం నలభై రోజుల గడువు మాత్రమే ఉండటంతో ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. అందులో భాగంగానే ఉద్యోగుల తుది కేటాయింపులకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని అన్ని శాఖలకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ముందుగా రెండు రోజుల పాటు నిర్దేశించిన శాఖల వారీ సమావేశాలను శనివారం కూడా కొనసాగించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధితో పాటు నీటిపారుదల శాఖ, మున్సిపల్ శాఖ, పబ్లిక్ హెల్త్, రహదారులు భవనాలు తదితర శాఖల పరిధిలో ఉన్న ఇంజనీరింగ్ విభాగాలపై నేడు సమీక్ష జరపనున్నారు. ఇంజనీరింగ్ విభాగాలు కొన్నింటిని విలీనం చేసే అవకాశమున్నందున, అదే కోణంలో ఉద్యోగుల కేటాయింపు ప్రతిపాదనలతో హాజరుకావాలని సీఎస్ ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులకు సూచించారు.

నగరంలో నిలిచిన ఆర్టీసీ బస్సులు - ప్రశాంతంగా సార్వత్రిక సమ్మె - తీవ్ర ఇబ్బందులుపడ్డ ప్రయాణికులు

03/09/2016: హైదరాబాద్: నగరంలో సార్వత్రిక సమ్మె శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. సంఘటిత, అసంఘటిత రంగాలకు చెందిన కార్మిక సంఘాలు కేంద్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారీ ర్యాలీలు, ప్రదర్శనలు చేపట్టాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు సంపూర్ణ మద్దతునివ్వడంతో నగరంలోని అన్ని డిపోల్లో బస్సులు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. సుమారు 3,500 బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. ఎంజీబీఎస్, జేబీఎస్‌ల నుంచి దూరప్రాంతాలకు వెళ్లే బస్సులు కూడా ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వివిధ ప్రాంతాలకు వెళ్లే వారిపై ప్రైవేటు వాహనదారులు నిలువుదోపిడీకి పాల్పడ్డారు. ఆటో కార్మిక సంఘాలు బంద్ ప్రకటించినప్పటికీ చాలాచోట్ల ఆటోరిక్షాలు యథావిధిగా నడిచాయి. బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఎంఎంటీఎస్ రైళ్లు కిటకిటలాడాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రతిరోజు నడిచే 121 సర్వీసులతో పాటు మరో 14 రైళ్లు అదనంగా నడిపారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో సమ్మె ప్రభావం కనిపించింది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. చాలాచోట్ల స్కూళ్లకు ముందుగానే సెలవు ప్రకటించారు. నిరసనల హోరు... బాగ్‌లింగంపల్లి నుంచి ఇందిరాపార్కు వరకు అన్ని ప్రధాన కార్మిక సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహిం చాయి. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు పెద్దఎత్తున నినాదా లు చేశారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ తదితర సంఘాలన్నీ ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. నాంపల్లిలోని గగన్‌విహార్‌లో జరిగిన నిరసన సభలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్, టీఎన్జీవోస్ గౌరవ అధ్యక్షులు దేవీప్రసాద్, అధ్యక్షులు కారెం రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొని ఉద్యోగుల నిరసనకు మద్దతు ప్రకటించారు. పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని, కాంట్రిబ్యూటరీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మె పెద్ద ఎత్తున విజయవంతమైందని పేర్కొన్నారు. జిల్లాల్లోనూ సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. మరోవైపు కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె ఏపీలో ప్రశాంతంగా ముగిసింది.

సిటీ క్వీన్స్ వీరే..

02/09/2016: హైదరాబాద్: మిస్‌ క్వీన్‌ హైదరాబాద్‌–2016 పోటీలు గురువారం రాత్రి బేగంపేటలోని ఓ క్లబ్‌లో నిర్వహించారు. విజేత సంజనా చౌదరి, మొదటి రన్నరప్‌ అక్షిత(కుడి),రెండో రన్నరప్‌గా షారోన్‌ ఎన్నికయ్యారు.

గణేష్ విగ్రహాల ధరలకు రెక్కలు

02/09/2016: హైదరాబాద్: వినాయక నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తుండటంతో నగరంలో పండుగ కళ కనిపిస్తోంది. వైవిధ్య రూపాల్లో. ఆకట్టుకొనే రంగుల్లో తీర్చిదిద్దిన వినాయకులు రకరకాల భంగిమలు. అనేక అవతరాల్లో మార్కెట్‌లో సందడి చేస్తున్నాడు. మరో మూడు రోజుల్లో కొలువుదీరనుండటంతో బొజ్జగణపయ్య చిన్న విగ్రహాలు మొదలుకొని భారీ విగ్రహాల వరకు వేలాదిగా అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు విగ్రహాల కొనుగోలుకోసం ధూల్‌పేట్‌కు తరలి వస్తున్నారు. గత రెండు నెలలుగా విగ్రహాల తయారీలో నిమగ్నమైన ధూల్‌పేట్‌ కళాకారులు ఒకవైపు విగ్రహాలకు తుదిమెరుగులు దిద్దుతూనే మరోవైపు విక్రయాలకు సిద్ధం చేస్తున్నారు. కాగా గత సంవత్సరం కంటే ఈ ఏడాది గణనాధుల ధరలు బాగా పెరిగాయి. గతంలో రూ.10 వేలకు లభించిన విగ్రహాన్ని ఈ ఏడాది రూ.15 వేలకు విక్రయిస్తున్నారు. కళాకారుల జీతాలు, ముడిసరుకు ధరలు, రవాణా ఖర్చులు, గోడౌన్‌ల అద్దెలు భారీగా పెరిగినందునే విగ్రహాల ధరలు పెంచాల్సి వచ్చిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ధరల కారణంగా దీంతో కోరుకున్న విగ్రహాలను కొనుగోలు చేయలేకపోతున్నామని మండపాల నిర్వాహకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏటా సృజనాత్మకతకు పదునుపెడుతూ అద్భుతమైన విగ్రహాలను రూపొందించే ధూల్‌పేట కళాకారులు ఈ ఏడాది కూడా వివిధ రకాల ఆకృతులలో అందమైన విగ్రహాలను తయారు చేశారు. రూ.2 వేల నుంచి రూ.2 లక్షలకు పైగా విలువైన విగ్రహాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. విభిన్నంగా, వినూత్నంగా విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. శివాజీగా, శ్రీకృష్ణుడిగా, తిరుపతి వెంకటేశ్వరుడిగా, రాధా సమేతుడైన గోపాలుడిగా ఆకట్టుకుంటున్నాడు. అర్ధనారీశ్వరుడి సమక్షంలో కొలువైన బొజ్జ గణపయ్య, అంగరక్షకులు, సేవకుల సమక్షంలో మందిరంలో కొలువైన దేవదేవుడు, షిరిడీ సాయిబాబా, ముంబయి గణేశుడిగా, మూషికవాహనుడు, స్పైడర్‌మెన్‌గా, ప్రధాని నరేంద్రమోదీ ధరించే తలపాగా తరహాలో అలంకృతుడై... నవరాత్రి ఉత్సవాల్లో కొలువుదీరేందుకు సిద్ధమయ్యాడు. ధూల్‌పేట్‌ నుంచి ఏటా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒరిస్సా, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాలకు విగ్రహాలను ఎగుమతి చేస్తున్నారు. ఈ ఏడాది ఆస్ట్రేలియాకు కూడా వినాయక విగ్రహాలను ఎగుమతి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సుమారు 200 కార్ఖానాల్లో విగ్రహాలను అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. గత ఏడాది 18 అడుగుల విగ్రహం ధరS రూ.65వేలు ఉండగా, ఈసారి ఏకంగా రూ.85 వేలకు పెరిగింది. 16 అడుగుల విగ్రహాలకు రూ.70 వేల వరకు చెబుతున్నారు. గత సంవత్సరం రూ. 45 వేలకు లభించిన భారీ విగ్రహాలు ఈ సారి రూ.60 వేలకు పెంచడంతో కొనుగోలుదారులు బిత్తరపోతున్నారు. 15 అడుగు విగ్రహాన్ని కొనేందుకు వచ్చిన వారు 10 అడుగులతో సరిపెట్టుకుంటున్నారు.

‘షీ–టీమ్స్‌’ షార్ట్‌ ఫిల్మ్స్ విడుదల

02/09/2016: హిమాయత్‌నగర్‌: నగరంలో పోలీస్‌ శాఖతో సంబంధం లేకుండా జరిపిన సర్వేలో 76 శాతం మంది మహిళలు ‘షీ టీమ్స్‌’ వల్ల ధైర్యంగా జీవిస్తున్నామని తెలిపారని నగర కమిషనర్‌ మహేందర్‌రెడ్డి అన్నారు. మహిళలకు ‘షీ టీమ్స్‌’పై మరింత అవగాహన కల్పించేందుకు లిటిల్‌ మ్యూజిక్‌ ఫౌండేషన్‌ మ్యుజిషీయన్‌ రామాచారి, షార్ట్‌ఫిల్మ్‌ డైరెక్టర్‌ జయభారత్, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ వంశీ నటించి, నిర్మించిన మూడు షార్ట్‌ ఫిల్మ్స్ ను గురువారం బషీర్‌బాగ్‌లోని పోలీస్‌ కమిషనరేట్‌లో కమిషనర్‌ మహేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. తొలి సీడీని అడిషనల్‌ కమిషనర్‌ క్రైమ్‌ స్వాతిలక్రా, అడిషనల్‌ సీపీ అడ్మిన్‌ మురళీకృష్ణ, ట్రాఫిక్‌ కమిషనర్‌ జితేందర్, ఎస్‌బీ జాయింట్‌ కమిషనర్‌ ప్రమోద్‌కుమార్, అడిషనల్‌ డీసీపీలు అవినాష్‌మహంతి, రంజన్‌లకు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ... నగరంలో మహిళల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం నగర వ్యాప్తంగా రెండేళ్ల క్రితం 100 షీటీమ్స్‌ను ప్రారంభించిందన్నారు. అప్పటి నుంచి నేటి వరకు షీటీమ్స్‌ బస్టాప్‌లు, సినిమా థియేటర్‌లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ తదితర ప్రాంతాల్లో మఫ్టీలో తిరుగుతూ నిఘాను ఏర్పాటు చేసి వీడియో రికార్డింగ్‌ సహాయంతో ఈవ్‌టీజర్స్‌ను పట్టుకున్నారన్నారు. నగరంలోని మహిళలకు ‘షీ టీమ్స్‌’ అభయహస్తంగా పని చేస్తున్నాయన్నారు. మొదటి రెండుసార్లు తప్పుచేసిన వారికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇస్తున్నామని, మళ్లీ వారు తప్పు చేస్తే జైలుకు పంపుతున్నామన్నారు. షీటీమ్స్‌పై స్త్రీలకు మరింత అవగాహన కల్పించేందుకు ఈ వీడియోలు, ఆడియోలు రూపొందించారన్నారు. స్వాతిలక్రా మాట్లాడుతూ... నిమిషం నిడివి గల ఈ మూడు వీడియోలు అన్ని సినిమా థియేటర్స్‌లో ప్రదర్శిస్తామని, ఆడియో క్లిప్పింగ్‌లు ప్రతీ ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ప్లే అవుతాయన్నారు. వేధింపులకు గురయ్యేవారు నిర్భయంగా తమను వేధించేవారిపై షీటీమ్స్‌కు ఫిర్యాదు చేయొచ్చని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్వాతిలక్రా భరోసా ఇచ్చారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్‌ నంబర్‌లకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ‘షీ టీమ్స్‌’ ఏసీపీ కవిత పనితీరును మొచ్చుకుంటూ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి జ్ఞాపికను అందచేశారు. ఈ షార్ట్‌ఫిల్‌్మలకు సహకారం అందించిన రామాచారి, జయభారత్, వంశీలను సత్కరించారు.

మంత్రి పీఏనని.. రూ. 85లక్షలు స్వాహా..

01/09/2016: బంజారాహిల్స్‌: తాను ఓ మంత్రి పీఏనని, మెడికల్‌ సీటు ఇప్పిస్తానని డబ్బు తీసుకొని మోసం చేసిన కేటుగాడిని బంజారాహిల్స్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా చెర్కుపల్లి గ్రామానికి చెందిన మేకల రఘురాంరెడ్డి అలియాస్‌ రఘుమారెడ్డి తాను ఓ మంత్రి పీఏనని బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 14లోని అమృతా ఎన్‌క్లేవ్‌లో నివసించే సయ్యద్‌ అతర్‌ హుస్సేన్‌(20)ను పరిచయం చేసుకున్నాడు. తనకు మెడికల్‌ కాలేజీల యాజమాన్యాలతో సంబంధాలున్నాయని, గతంలో చాలా మందికి ఎంబీబీఎస్‌ సీట్లు ఇప్పించానని నమ్మబలికాడు. అతర్‌ హుస్సేన్‌కు మెడికల్‌ సీటు ఇప్పిస్తానని రూ. 85 లక్షలు వసూలు చేశాడు. సీటు రాకపోవడంతో బాధితుడు నిలదీయగా అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ చివరకు ముఖం చాటేశాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితు అతర్‌ హుస్సేన్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు రఘురాంరెడ్డిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

నకిలీ సర్టిఫికెట్లు లక్నో నుంచి తెస్తారిలా!

01/09/2016: హిమాయత్‌నగర్‌: ప్రముఖ యూనివర్సిటీల పేరిట నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ఇద్దరిని నారాయణగూడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోషల్‌ మీడియా ద్వారా వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేసి పట్టుకున్నారు. నిందితులను బుధవారం రిమాండ్‌కు తరలించారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. సీఐ భీమ్‌రెడ్డి కథనం ప్రకారం...లక్నోకు చెందిన అర్పిత్‌జైన్‌ అదనపు డిగ్రీ కోసం ఎదురు చూసే విద్యార్థులకు నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తుంటాడు. అర్పిత్‌జైన్‌కు ఇంటర్నెట్‌ ద్వారా అమన్‌గుప్తా, కరీంనగర్‌ జిల్లాకు చెందిన చాంద్‌పాషా పరిచయం అయ్యారు. అతడితో ముఠా కట్టిన వీరిద్దరూ నగరంలో నకిలీ సర్టిఫికెట్ల విక్రయానికి పూనుకున్నారు. ఇందులో భాగంగా అమన్‌గుప్తా, చాంద్‌పాషా కలిసి రెండు నెలల క్రితం హిమాయత్‌నగర్‌లో ‘ఇంటెలిజెంట్‌ మైండ్స్‌’ పేరిట స్టడీ సెంటర్‌ ఏర్పాటు చేశారు. జాబ్‌ కోసం ఇంటర్నెట్‌లో దరఖాస్తు పెట్టుకున్న వారిని గుర్తించి వారికి ఫోన్‌ చేస్తారు. అదనపు డిగ్రీ కావాలంటే తమ కార్యాలయానికి వచ్చి సంప్రదించాలని చెప్తారు. తమను కలిసిన వారికి బీఏ, బీకాం, ఎంకాం, ఎంసీఏ తదితర సర్టిఫికెట్లు మీకు నచ్చిన యూనివర్సిటీ నుంచి ఇప్పిస్తామని నమ్మబలుకుతారు. పరీక్ష రాస్తే రూ.60 వేలు, రాయకపోతే రూ.70 వేలు అని చెప్పి.. ఆ మేరకు వసూలు చేస్తారు. అనంతరం వారి వివరాలు లక్నోలో ఉన్న అర్పిత్‌కు చేరవేస్తారు. అతడు వారు కోరిన విధంగా ఉస్మానియా యూనివర్సిటీ, బుందేల్‌ ఖండ్, అంబేద్కర్‌ యూనివర్సిటీ, జేఎన్‌టీయూ తదితర వర్సిటీ పేరిట నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి కొరియర్‌ ద్వారా పంపిస్తాడు. సోషల్‌ మీడియా ద్వారా ఈ సమాచారం అందుకున్న నారాయణగూడ పోలీసులు మంగళవారం రాత్రి ‘ఇంటెలిజెంట్‌ మైండ్స్‌’ సంస్థపై దాడి చేయగా ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన 10 సర్టిఫికెట్లు, బుందేల్‌ఖండ్‌ యూనివర్సిటీకి చెందిన మూడు సర్టిఫికెట్లు దొరికాయి. అమన్‌గుప్తా, చాంద్‌పాషాపై కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు అర్పిత్‌జైన్‌ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని ఇన్‌స్పెక్టర్‌ భీమ్‌రెడ్డి చెప్పారు.

ఎయిర్‌హోస్టస్‌ కేసులో నిందితుడి అరెస్టు

01/09/2016: అత్తాపూర్‌: ఎయిర్‌హోస్టస్‌పై అఘాయిత్యానికి యత్నించిన నిందితుడిని రాజేంద్రనగర్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ ఉమేందర్‌ కథనం ప్రకారం... ఉప్పర్‌పల్లి హ్యాపిహోమ్స్‌ ప్రాంతానికి చెందిన యువతి (24) ఓ ఎయిర్‌లైన్‌ సంస్థలో ఎయిర్‌హోస్టస్‌. సోమవారం అర్దరాత్రి మందులు కొనుగోలు చేయడానికి డెయిరీ ఫామ్‌ సమీపంలోని పీవీ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్‌ నెంబర్‌ 216 వద్దకు వచ్చింది. షాపులు మూసి వేయడంతో రోడ్డు పక్కన ఒంటరిగా నిలబడి ఉన్న ఆమె వద్దకు క్యాబ్‌ (క్వాలీస్‌ కారు) వచ్చి ఆగింది. డ్రైవర్‌ ఆమెకు మాయమాటలు చెప్పి తన కారులో ఎక్కించుకున్నాడు. ఔటర్‌రింగ్‌రోడ్డు... కిషన్‌గూడ మీదుగా శంషాబాద్‌ హిమాయత్‌సాగర్‌కు తీసుకొచ్చి అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించి అరవడంతో సెన్‌ఫోన్‌ను లాక్కొని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ మార్గంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడు వాడిన క్యాబ్‌ ( నెం. ఏపీ 09ఎక్స్‌ 2865)ను గుర్తించారు. నిందితుడు కిస్మత్‌పూర్‌ గ్రామానికి చెందిన కారు డ్రైవర్‌ మీర్జా అహ్మద్‌బేగ్‌ అలియాస్‌ ఇమ్రాన్‌ను గండిపేటలో బుధవారం అరెస్ట్‌ చేశారు. విచారణ అనంతరం రిమాండ్‌కు తరలించారు.

పన్నుల ఎగవేత నివారణకే జీఎస్టీ - కేసీఆర్

30/08/2016: హైదరాబాద్: జీఎస్టీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. పార్టీలకు అతీతంగా ఇప్పటికే 9 రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించాయని తెలిపారు. ఈ బిల్లును ఆమోదించేందుకు శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మంగళవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో జీఎస్టీ బిల్లును ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పన్నుల ఎగవేతను తగ్గించడానికే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు తెచ్చినట్టు చెప్పారు. జీఎస్టీ వల్ల ఏ రాష్ట్రానికైనా ఇబ్బంది కలిగితే ఐదేళ్లు ఆ నష్టాన్ని భరిస్తామని కేంద్రం స్పష్టంగా చెప్పిందని వెల్లడించారు. పెట్రో ఉత్పత్తులు, ఎక్సైజ్ పై జీఎస్టీ ప్రభావం ఉందన్నారు.

నీళ్లు లేవు..నియామకాలూ లేవు

30/08/2016: దోమలగూడ: నిధులు..నీళ్లు..నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆశించిన ప్రయోజనాలు నెరవేరడం లేదని పలువురు వక్తలు అన్నారు హౌసింగ్‌ బోర్డులో తొలగించిన ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు రెగ్యులర్‌ చేయాలని కోరుతూ గృహ నిర్మాణ సంస్థ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు వద్ద ఉద్యోగులు రిలే నిరాహారదీక్షలు నిర్వహించారు. దీక్షలకు టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య, మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్, మాజీ ఎమ్మెల్సీ డాక్టరు నాగేశ్వర్, సీపీఐ నేత గుండా మల్లేష్, బీజేపీ నాయకులు చింతా సాంబమూర్తి, టీజేఏసీ కో చైర్మన్‌ వెంకట్‌రెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్లు లేవు, నియామకాలు లేవని, ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నారని అన్నారు. కాంట్రాక్టర్ల కడుపులు నింపేందుకు ఉద్యోగుల పొట్టగొడుతున్నారన్నారు. జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పాలనలో కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు, నిరుద్యోగులకు నిరాశే మిగిలిందన్నారు. రాష్ట్రం ఏర్పాౖటెన తర్వాత సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ పేపరు మిల్లు, బోధన్‌ షుగర్‌ ఫ్యాక్టరీ తదితర కంపెనీలు మూతపడి వందలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు.

మాకు దిక్కెవరు?

30/08/2016: గచ్చిబౌలి: కూతురుకు మాదాపూర్‌లోని అమెజాన్‌ కార్యాలయంలో ఇంటర్వ్యూ ఉండటంతో ఆమెను అక్కడ వదలి తిరిగి వెళుతున్నాడు గంగినేని వెంకన్న.. అయితే మృత్యువు ఆయనను బస్సు రూపంలో వెంటాడింది.. కేపీహెచ్‌బీకి వెళుతుండగా మార్గమధ్యలో చిరెక్‌ స్కూల్‌ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. హెల్మెట్‌ పెట్టుకున్నా బస్సుచక్రం మీద నుంచి వెళ్లడంతో హెల్మెట్‌ పగిలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ హృదయ విదారక సంఘటన సోమవారం జరిగింది. పెద్దముప్పారం వరంగల్‌ జిల్లాకు చెందిన గంగినేని వెంకన్న బొల్లారంలోని ఎంఎస్‌ఎల్‌ కంపెనీలో రెండు నెలలుగా పనిచేస్తున్నాడు. కేపీహెచ్‌బి 4వ ఫేజ్‌లో భార్య సరిత, కూతుళ్లు ప్రియాంక, సారిక, మౌనికతో నివాసముంటున్నాడు. ప్రియాంక పెళ్లి చేయగా ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేయాల్సి ఉంది. వెంకన్న మృతితో స్థానికంగా విషాదఛాయలు నెలకొన్నాయి. తన భర్త మృతితో తాము దిక్కులేనివారమయ్యామని, మమ్మల్నెవరు ఆదుకుంటారని మృతుడి భార్య సరిత గుండెలవిసేల విలపించింది. మధ్యాహ్నం వరకు మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లోనే ఉన్న తన భర్త మృతదేహాన్ని చూపించకుండానే ఉస్మానియాకు తరలించారని వాపోయింది. రేపు వస్తే రూ.20 వేలు ఇస్తామని చెప్పారని, పేదలకు న్యాయం చేయడమంటే ఇదేనా అని ప్రశ్నించింది. పాఠశాల ఎదుట ఆందోళన స్కూల్‌ బస్సు ఢీ కొని మృతి చెందిన గంగినేని వెంకన్న కుటుంబ సభ్యులు, బందువుల సోమవారం రాత్రి కొండాపూర్‌లోని చిరెక్‌ స్కూల్‌ ముందు ధర్నా నిర్వహించారు. దీంతో బొటానికల్‌ గార్డెన్, మసీబండ వరకు ట్రాఫిక్‌ స్తంభించింది. గచ్చిబౌలి పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. పోలీసులు నచ్చచెప్పడంతో బాధితులను శాంతించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. యాజమాన్యం దిగి రాకపోతే మంగళవారం కూడా స్కూల్‌ ముందు ధర్నా నిర్వహిస్తామని బంధువులు తెలిపారు. మూడవ కూతురు ఎంబీఎ మొదటి సంవత్సరంలో చేరేందుకు కౌన్సిలింగ్‌కు వెళ్లిందని బంధువులు తెలిపారు.

ఏడు జిల్లాలకు భారీ వర్షసూచన

30/08/2016: హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. మంగళవారం, బుధవారాల్లో ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

మంత్రి ఉన్నంతసేపే ఆస్పత్రిలో బెడ్‌షీట్లు

29/08/2016: గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో రంగు బెడ్‌షీట్ల తొలగింపు అంశంపై ఆస్పత్రి పాలనా యంత్రాంగం విచారణ చేపట్టింది. వైద్యమంత్రి లక్ష్మారెడ్డి ఆస్పత్రిలో నూతనంగా సమకూరిన మంచాలు, పరుపులు, రంగు బెట్‌షీట్లను శనివారం ప్రారంభించారు. కార్యక్రమం ముగిసి మంత్రి అక్కడి నుంచి వెళ్లిన వెంటనే ఆర్థోపెడిక్‌ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బెడ్‌షీట్లు, దిండ్లను అక్కడి సిబ్బంది తొలగించారు. ఈ విషయమై మీడియాలో కథనాలు ప్రచురితం కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ జేవీరెడ్డి ఆధ్వర్యంలో ఆర్‌ఎంఓ, నర్సింగ్‌ సూపరింటెండెంట్, ఏడీలతో త్రిసభ్య కమిటీని నియమించారు. ఈసందర్భంగా సూపరింటెండెంట్‌ జేవీరెడ్డి మాట్లాడుతూ.. బెడ్‌షీట్లను తొలగించిన విషయం వాస్తమేనని, అయితే వార్డులో ఉన్న ఆరుగురు రోగుల్లో ఐదుగురు డిశ్చార్జి అయ్యారన్నారు. ఉన్న ఒక్కరినీ వేరే వార్డుకు తరలించాలని నిర్ణయించారని, ఈక్రమంలో డిశ్చార్జి అయిన ఒక రోగి దిండును తనతోపాటే తీసుకువెళ్లడాన్ని గమనించి సిబ్బంది అడ్డుకున్నారని, మిగిలినవి కూడా అపహరణకు గురవుతాయనే అనుమానంతో బెడ్‌షీట్లు, దిండ్లు తొలగించారని ప్రాధమిక విచారణలో వెల్లడైందని వివరించారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని త్రిసభ్య కమిటీని ఆదేశించామని, కమిటీ అందించే వివరాల మేరకు పూర్తిస్థాయి నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు.

సీఎం ఒక్కరోజు హాస్టల్‌లో గడపాలి

29/08/2016: దోమలగూడ : పెరిగిన ధరలకనుగుణంగా రాష్ట్రంలోని దాదాపు 20 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థుల మెస్‌చార్జీలు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆర్‌ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల మెస్‌ చార్జీలు పెంచాలని కోరుతూ బీసీ సంక్షే మ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద హాస్టళ్ల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ధర్నాకు మద్దతు తెలిపిన కృష్ణయ్య మాట్లాడుతూ.. తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థుల మెస్‌ చార్జీలను పెంచక పోవడం శోచనీయమన్నారు. నాలుగేళ్ల క్రితం నిర్ణయించిన ధరలనే ఇప్పటికీ అమలు చేస్తున్నారన్నారు. దీంతో హాస్టళ్ల విద్యార్థులకు నాసిరకం భోజనం అందుతోందన్నారు. మనసున్న ముఖ్యమంత్రిగా ఒక రోజు హాస్టల్‌లో గడిపితే వారి బాధలు తెలుస్తాయని, ఆతర్వాత వారి సంక్షేమానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆయన విజ్ఞతకే వదిలి వేస్తామన్నారు. రాష్ట్రంలో దాదాపు రెండు వేల బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లు, 530 కళాశాల విధ్యార్థుల హాస్టళ్లు ఉన్నాయని, వాటికి సొంత భవనాలు, కనీస వసతులు లేక తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. సచివాలయంలో 9 భవనాలలో ఏడు కొత్తవే అయినా.. వాటిని కూలగొట్టి కొత్తవి నిర్మించాలని ప్రభుత్వం భావి స్తోందని, వాటికి బదులుగా హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో బీసీ నాయకులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్, గుజకృష్ణ, ర్యాగరమేష్, కుల్కచర్ల శ్రీనివాస్, నీల వెంకటేష్, విక్రంగౌడ్, కృష్ణయాదవ్, రాంబాబు, విష్ణు, నవనీత్, అంజియాదవ్, గజేంద ర్, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

జోరుగా నకిలీ సర్టిఫికెట్లు దందా

29/08/2016: హైదరాబాద్: ముగ్గురు సూత్రధారులు... ఇద్దరు ఏజెంట్లు... మరో ఇరువురు సహాయకులు... ఇలా ఏడుగురు వేర్వేరు ముఠాలు ఏర్పాటు చేసి నకిలీ సర్టిఫికెట్ల దందా ప్రారంభించారు. ఎస్సెస్సీ నుంచి ఇంజినీరింగ్‌ వరకు వివిధ విద్యార్హత పత్రాలను తయారు చేసి అమ్మేస్తున్నారు. వీరి గుట్టును రట్టు చేసిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆదివారం ఆరుగురిని అరెస్టు చేసినట్లు డీసీపీ బి.లింబారెడ్డి వెల్లడించారు. నల్లగొండ జిల్లా నుంచి వచ్చి కర్మన్‌ఘాట్‌ ప్రాంతంలో స్థిరపడిన వి.దినకర్‌రెడ్డి అలియాస్‌ దినేష్‌ రెడ్డి అలియాస్‌ దిన్ను రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. ఈ రకంగా వచ్చే ఆదాయంతో తృప్తిపడని ఇతగాడు నకిలీ సర్టిఫికెట్ల దందా సైతం ప్రారంభించాడు. వరంగల్‌ జిల్లా నుంచి వచ్చిన కొత్తపేటలోని మోహన్‌నగర్‌లో స్థిరపడిన మార్కెటింగ్‌ ఉద్యోగి సి.సునీల్‌రెడ్డిని ఏజెంట్‌గా ఏర్పాటు చేసుకున్నాడు. మరోపక్క దిల్‌సుఖ్‌నగర్‌లో గాయత్రి ఎడ్యుకేషనల్‌ అకాడెమీ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న ఎ.రామారావు సైతం ఇదే దందా ప్రారంభించి ఖమ్మం జిల్లా నుంచి వచ్చి నాగోల్‌లో స్థిరపడిన బి.మనోజ్‌ను ఏజెంట్‌గా ఏర్పాటు చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన జియాఉల్‌ హసన్‌ సైతం నకిలీ విద్యార్హత పత్రాలు తయారు చేసి నగరంలో విక్రయించడం ప్రారంభించాడు. దినకర్, రామారావులు తమ ఏజెంట్ల ద్వారా నకిలీ సర్టిఫికెట్లు అవసరమైన వారిని గుర్తించే వారు. కొన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లను స్కాన్‌ చేయడం ద్వారా కంప్యూటర్‌లో సా‹ఫ్ట్‌కాపీల రూపంలో భద్రపరిచే వాడు. ఏజెంట్లు తీసుకువచ్చిన వివరాలను ఫొటోషాప్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా సాఫ్ట్‌కాపీల్లో పొందుపరిచి ప్రింట్స్‌ తీసేవారు. వీటిపై ఉంచాల్సిన హెలోగ్రామ్స్‌తో పాటు స్టాంపుల్ని స్థానికంగానే తయారు చేయించే వారు. దినకర్‌రెడ్డికి వరంగల్‌కు చెందిన రాఘవ, రామారావుకు అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన మోహన్‌లాల్‌ వీటిని తయారు చేసి ఇచ్చే వారు. ఉస్మానియా వర్శిటీ, ఆంధ్రా యూనివర్శిటీ, జేఎన్‌టీయూ, శ్రీధర్‌ యూనివర్శిటీ (బెంగళూరు), ఛత్రపతి షానుజీ యూనివర్శిటీ (కాన్పూర్‌) తదితర విద్యా సంస్థలు, యూనివర్శిటీల పేర్లతో నకిలీ సర్టిఫికెట్లు ఉండేవి. హసన్‌ ఉత్తరప్రదేశ్‌లోనే సర్టిఫికెట్ల సిద్ధం చేసి తీసుకువచ్చి అమ్మేవాడు. ఎస్సెస్సీ, ఇంటర్మీడియల్, డిగ్రీ, ఇంజినీరింగ్, డిప్లమో సర్టిఫికెట్లను అవకాశం, అవసరాన్ని బట్టి రూ.40 వేల నుంచి రూ.70 వేలకు విక్రయించే వారు. ఏజెంట్లకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు కమీషన్‌ ఇచ్చే వారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.బల్వంతయ్య నేతృత్వంలో ఎస్సైలు బి.శ్రవణ్‌ కుమార్, కేఎస్‌ రవి, పి.చంద్రశేఖర్‌రెడిడ తమ బృందాలతో ఆదివారం వలపన్ని మోహన్‌లాల్‌ మినహా మిగిలిన ఆరుగురినీ పట్టుకున్నారు. వీరి నుంచి 450 నకిలీ సర్టిఫికెట్లు, 92 బోగస్‌ రబ్బర్‌ స్టాంపులు, ల్యాప్‌టాప్, కంప్యూటర్లు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు వీరి నుంచి సర్టిఫికెట్ల ఖరీదు చేసిన వారినీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం నల్లకుంట పోలీసులకు అప్పగించారు. ఈ నిందితుల్లో కొందరు గతంలోనే ఇదే తరహా కేసుల్లో పోలీసులకు చిక్కారు.

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సింధు

27/08/2016: హైదరాబాద్‌: రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన పీవీ సింధు శనివారం ఉదయం నగరంలోని లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న సింధు.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సింధు మీడియాతో మాట్లాడుతూ.. ఏటా మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటానని, ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే మరోసారి వస్తానని మొక్కుకున్నాని తెలిపారు. విజయం సాధించినందున మళ్లీ అమ్మవారిని దర్శించుకున్నానని చెప్పారు.

డోరేమాన్‌ గణేష్‌

27/08/2016: హైదరాబాద్(నాచారం): ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చిన్నారులకు డోరేమాన్‌ పేరు వినిపిస్తే చాలు టీవీలకు అతుక్కుపోతారు. ఈ ఏడాది ఆ రూపంలోనే గణపయ్య పూజలందుకోనున్నాడు. నాచారం బాబానగర్‌కు చెందిన సూర్య శుభకర విఘ్నవినాయక అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ ఏడాది డోరేమాన్‌ గణేషుడు రూపుదిద్దుకుంటున్నాడు. 2008 నుంచి ప్రతి ఏటా ఒక్కోథీమ్‌తో పార్వతీ తనయుడ్ని తీర్చిదిద్దుతూ భక్తుల మన్ననల్ని పొందుతోంది ఈ అసోషియేషన్‌.

ఏపీ టు హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్

27/08/2016: హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి నగరానికి గంజాయిని రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని సౌత్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడి నుంచి 40 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కీలక నిందితుడు పరారీలో ఉన్నాడు. అదనపు డీసీపీ ఎన్‌.కోటిరెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం... తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం ప్రాంతానికి చెందిన సీహెచ్‌ రాజా వెల్డింగ్‌ వర్కర్‌. ఆ రకంగా వచ్చే ఆదాయం సరిపోక ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఇతడికి తుని ప్రాంతానికి చెందిన అనంత రమేష్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటికే గంజాయి వ్యాపారంలో ఉన్న రమేష్‌ తాను అందించే ‘సరుకు’ను చెప్పిన చోటుకు చేర్చితే ఒక్కో ట్రిప్‌కు రూ.10 వేల చొప్పున చెల్లిస్తానని రాజాకు చెప్పాడు. దీనికి అంగీకరించిన రాజాకు 40 కేజీల గంజాయిని 20 ప్యాకెట్లలో పార్శిల్‌ చేసి.. వాటిని రెండు ప్లాస్టిక్‌ సంచుల్లో పెట్టి బుధవారం అందించాడు. ఈ గంజాయిని హైదరాబాద్‌ తీసుకెళ్లాలని, అక్కడికి చేరిన తర్వాత ఎవరికి ‘సరుకు’ డెలివరీ చేయాలో చెప్తానని అన్నాడు. దీంతో రాజా గంజాయి సంచులతో శుక్రవారం ఎంజీబీఎస్‌లో బస్సు దిగాడు. అప్పటికే ఈ అక్రమ రవాణాపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.యాదగిరి నేతృత్వంలోని బృందం వలపన్ని నిందితుడిని అరెస్టు చేసింది. కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం సీసీఎస్‌ ఆధీనంలోని యాంటీ నార్కొటిక్‌ సెల్‌కు అప్పగించారు.

జర్నలిస్టుల నిరసనలపై కేటీఆర్ ఆగ్రహం - ఉనికి చాటుకునేందుకే ధర్నాలు, నిరసనలు - త్వరలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం

27/08/2016: హైదరాబాద్: మాట్లాడి పరిష్కరించుకునే సమస్యలను ఆందోళనల దాకా తీసుకెళ్లడం ఏమిటని జర్నలిస్టు నేతలపై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉనికి చాటుకునే ఆరాటంతో ధర్నాలు, నిరసనలు చేయటం ఇకనైనా మానుకోవాలని సూచించారు. తాము చేసే సంక్షేమ కార్యక్రమాలను ఇప్పటికైనా గుర్తించాలన్నారు. రాష్ట్రంలోని జర్నలిస్టులకు న్యాయం చేస్తామని, హెల్త్‌కార్డులు, అక్రిడిటేషన్లు, పెన్షన్లు, ఇళ్ల స్థలాల సమస్యల పరి ష్కారంపై సమాచార శాఖ కమిషనర్‌తో మాట్లాడి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్, భాషా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యం లో శుక్రవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్‌లో ఫొటోగ్రాఫర్స్‌కు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘కొన్ని పత్రికలు సభ్యత, సం స్కారం మరిచి పోతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కొంత మంది అదేపనిగా చేస్తున్న చౌకబారు విమర్శలకు ప్రాధాన్యత ఇస్తున్నా యి. వాటిని స్వీయ సెన్సార్ లేకుండా యథాతథంగా ప్రచురిస్తున్నారు. పత్రికలకు ఇది ఏమాత్రం తగదు’ అని చెప్పారు. సీఎం కేసీఆర్‌పై ఎవరేం మాట్లాడినా ఎడిటింగ్ లేకుం డా మెయిన్ పేజీలో పెడతారని, అదే పొరుగు రాష్ట్ర పాలకులపై హైకోర్టు మొట్టికాయలు వేసినావాటికి ప్రాధాన్యత ఇవ్వరని ఆక్షేపిం చారు. కేసీఆర్‌ను ఇతరులు తిడితే యథాతథంగా ప్రచురించే సంస్కృతికి కొన్ని పత్రికలు వచ్చేశాయన్నారు. ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఇప్పటికీ బాలారిష్టాలు అధిగమించే దశలోనే ఉన్నాయని, ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న తెలంగాణలో కొన్ని సమస్యలుం టాయని, వాటిని అర్థం చేసుకోవాలని జర్నలి స్టులను కోరారు. ఉద్యమం చూడని ఓ పెద్దాయన పదవీ విరమణ తర్వాత పాలకులపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. జస్టిస్ చంద్రకుమార్ ఎవరు..? ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ జస్టిస్ చంద్రకుమార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు చంద్ర కుమార్ ఎవరని ప్రశ్నించారు. ఉద్యమంలో ఆయన పాత్రే లేదని, జర్నలిస్టుల గురించి ఆయనకు ఏం తెలుసన్నారు. జస్టిస్ అన్న విష యం మరచి ఆయన మాట్లాడటం తగదన్నారు. తమ జోలికి రావొద్దని, వస్తే బాగోదని ఆయనకు తెలియజేస్తున్నామని చెప్పారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. బెస్ట్ న్యూస్ పిక్చర్ కింద మహబూబ్‌నగర్ జిల్లా సాక్షి ఫొటోగ్రాఫర్ వడ్ల భాస్కర్‌కు మొదటి బహుమతి దక్కింది. హైదరాబాద్ సాక్షి ఫొటోగ్రాఫర్ ఠాకూర్ సన్నీసింగ్‌కు మూడో బహుమతి లభించింది. అనంతరం వారిని సత్కరించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ, ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్, కాంత్రి కిరణ్, పల్లె రవి తదితరులు పాల్గొన్నారు.

డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకం సామాజిక బాధ్యత - సిమెంటు కంపెనీల ప్రతినిధులతో మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి భేటీ

27/08/2016: హైదరాబాద్: పేదలకు నాణ్యతతో కూడిన విశాలమైన రెండు పడక గదుల ఇళ్లు (డబుల్ బెడ్‌రూం) నిర్మిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర మంత్రులు కె.తారకరామారావు, ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి సామాజిక బాధ్యతగా సిమెంటు కంపెనీలు తోడ్పాటునివ్వాలని వారు కోరారు. దీనికి సంబంధించి మంత్రులు శుక్రవారం సచివాలయంలో సిమెంటు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో 2.72లక్షల ఇళ్ల నిర్మాణానికి సుమారు 27లక్షల మెట్రిక్ టన్నుల సిమెంటు అవసరమని మంత్రులు వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే లక్షా ఎనిమిది వేల ఇళ్లను నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. జిల్లాలో నిర్మించే రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించామని..గతంలో మాదిరిగా బిల్లుల చెల్లింపులో జాప్యం ఉండబోదని మంత్రులు హామీ ఇచ్చారు. చర్చల అనంతరం బస్తా సిమెంటును రూ.230కి అమ్మేందుకు సిమెంటు కంపెనీల ప్రతినిధులు అంగీకరించారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా సిమెంటును సరఫరా చేస్తామన్నారు. అనంతరం స్టీల్ కంపెనీల ప్రతినిధులతోనూ మంత్రులు భేటీ అయ్యారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లకు గాను సుమారు 4.1లక్షల మెట్రిక్ టన్నుల స్టీలు అవసరమని మంత్రులు తెలిపారు. ధరపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు. మంత్రులతో జరిగిన సమావేశంలో 30 సిమెంటు కంపెనీల ప్రతినిధులతో పాటు.. వీఎస్పీ, టాటా, సెయిల్ తదితర స్టీల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. గృహ నిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి అశోక్ కుమార్, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి, టీఎస్‌ఎండీసీ ఎండీ ఇలంబర్తి, గనుల శాఖ డైరక్టర్ సుశీల్ కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు రాజీవ్ స్వగృహ ఇళ్లు రాజీవ్ స్వగృహ పథకం కింద నిర్మించి.. ఖాళీగా ఉన్న ఇళ్లను ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘం ప్రతినిధులు.. గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో శుక్రవారం సచివాలయంలో సమావేశమయ్యారు. బండ్లగూడ, పోచారంలో స్వగృహ పథకం కింద నిర్మించిన మూడు వేల ఇళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. యూనిట్ ధరను నిర్ణయించాలని.. ఉద్యోగ సంఘాల నుంచి అందిన ప్రతిపాదనలు సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి తెలిపారు.

నెలాఖరు నుంచి అసెంబ్లీ - లేదా సెప్టెంబర్ 17 నుంచి సమావేశాలు - గణేశ్ నవరాత్రుల దృష్ట్యా సర్కారు మల్లగుల్లాలు

26/08/2016: హైదరాబాద్: గణేశ్ నవరాత్రుల దృష్ట్యా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ నెల 30 నుంచి లేదా సెప్టెంబర్ 17వ తేదీ నుంచి సమావేశాలు నిర్వహించే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. జీఎస్టీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించేందుకు వీలైనంత త్వరగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే నిర్ణయించారు. ఈ మేరకు సన్నాహాలు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 8 నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో ఏపీ కంటే ముందే జీఎస్టీ బిల్లును ఆమోదించి పంపేందుకు వీలుగా ఈ నెలాఖరునే సమావేశాలు ప్రారంభించాలనే ప్రతిపాదన వచ్చింది. కేవలం మూడు రోజుల పాటు సమావేశాలు జరిపి, తొలి రోజునే జీఎస్టీ బిల్లును ఆమోదించాలని యోచిస్తోంది. మరోవైపు గణేశ్ నవరాత్రుల దృష్యా భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు ఇబ్బందులు తలెత్తకుండా... నిమజ్జనోత్సవం ముగిశాక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసే ప్రత్యామ్నాయాన్ని కూడా సర్కారు పరిశీలిస్తోంది. దీనికి సంబంధించి పోలీసు విభాగం నుంచి అందిన సూచనలను అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. మొత్తంగా ఈ నెల 30వ తేదీ నుంచిగానీ లేదా సెప్టెంబర్ 17వ తేదీ నుంచిగానీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి తీసుకునే తుది నిర్ణయం మేరకు తేదీ ఖరారవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు జీఎస్టీ బిల్లును ఆమోదించాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సెప్టెంబర్ తొలివారంలో బిల్లును ఆమోదించి పంపిస్తామని ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖకు సమాచారమిచ్చాయి. జీఎస్టీ బిల్లుకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా వీలైనంత తొందరగా సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ శాసనసభ సమావేశాల్లోనే దేవాదాయ శాఖ చట్ట సవరణ బిల్లు, ఎస్టీ, మైనారిటీల స్థితిగతులపై సుధీర్ కమిషన్, చెల్లప్ప కమిషన్ ఇచ్చిన నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

వెన్నెదొంగతో రియో స్టార్

26/08/2016: హైదరాబాద్ నగరంలో గురువారం కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. గోపికలతో కలిసి వెన్నెదొంగలు బృందావనంలో విహరించారు. గచ్చిబౌలి శాంతిసరోవర్‌ గ్లోబల్‌ పీస్‌ ఆడిటోరియంలో బ్రహ్మకుమారీస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవంలో రియో స్టార్‌ పీవీ సింధు పాల్గొంది. చిన్నికృష్ణులను ఎత్తుకుని ముద్దు చేస్తూ ఆమె సందడి చేసింది.

దొంగతనంలో వీడి రూటే సెపరేటు

26/08/2016: బంజారాహిల్స్‌: ఈ–కామర్స్‌ వెబ్‌సైట్‌ తయారు చేస్తానని సాఫ్ట్‌వేర్‌ సంస్థల నిర్వాహకులను పిలిపించి వాళ్ల సెల్‌ఫోన్లతో ఉడాయిస్తున్న యువకుడిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం నగరంలోని శ్రీనగర్‌ నివాసి చేగొండి చంద్రశేఖర్‌(25) భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీఈ పూర్తి చేశాడు. కొద్ది రోజులు శోభ డెవలపర్స్‌లో సివిల్‌ ఇంజినీర్‌గా పని చేశాడు. జల్సాలకు అలవాటుపడ్డ ఇతను ఉద్యోగం ద్వారా వచ్చే డబ్బులు సరిపోక సరికొత్త చీటింగ్‌తో చోరీలకు శ్రీకారం చుట్టాడు. తాను ఈ–కామర్స్‌ వెబ్‌సైట్‌ క్రియేట్‌ చేస్తానని నమ్మబలికి సాఫ్ట్‌వేర్‌ సంస్థల నిర్వాహకులను పిలిపిస్తాడు. ఈ నెల 17న టాంజీనియా టెక్‌సొల్యూషన్స్‌ అధినేత రవితేజకు ఫోన్లో వల వేశాడు. ఓ రెస్టారెంట్‌కు పిలిచి వెబ్‌సైట్‌ గురించి మాట్లాడాడు. భోజనం తర్వాత తన ఫోన్‌ పని చేయడం లేదని, ఒక్కసారి మీ ఫోన్‌ ఇస్తే కాల్‌ చేసుకొని ఇచ్చేస్తానని తీసుకున్నాడు. ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు నటిస్తూ అక్కడి నుంచి ఉడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిఘా వేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఇదే విధంగా సునీల్‌కుమార్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను జూబ్లీహిల్స్‌లోని సెలబ్రేషన్స్‌ హోటల్‌లో, మోజం అనే సాఫ్ట్‌వేర్‌ సంస్థ అధినేతను స్పైసీ అవెన్యూ హోటల్‌లో చంద్రశేఖర్‌ మోసం చేశాడు. నిందితుడు గతంలో వైజాగ్‌లో కూడా ఇలాగే ల్యాప్‌టాప్‌తో ఉడాయించినట్లు విచారణలో వెల్లడైంది. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జాబుల జాడే లేదు

23/08/2016: ముషీరాబాద్‌: తెలంగాణ వస్తే ఇంటికొక ఉద్యోగమని, బాబు వస్తే జాబు వస్తుందని హామీలిచ్చిన కేసీఆర్, చంద్రబాబు గద్దెనెక్కి 27 నెలలు గుడుస్తున్నా ఉద్యోగాల జాడ లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య అన్నారు. నిరుద్యోగులు ఐక్యంగా ఉద్యమిస్తేనే ప్రభుత్వాలు దిగివస్తాయన్నారు. సోమవారం ముషీరాబాద్‌లోని కషీష్‌ ఫంక్షన్‌హాల్‌లో ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల నిరుద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉద్యోగాలు భర్తీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల్లో ఊదరగొట్టిన చంద్రబాబు టీచర్‌ పోస్టులు మినహా ఏ ఒక్క పోస్టునూ భర్తీ చేయలేదన్నారు. ఏపీలో 1.45లక్షల ఖాళీలు ఉండగా, 10వేల ఉద్యోగాల భర్తీకి మంత్రి వర్గం నిర్ణయించడం దారుణమన్నారు. గ్రూప్‌ – 1,2,3 పోస్టులను పాత పద్దతిలోనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిధులు కాంట్రాక్టర్లకు, నీళ్లను సముద్రానికి, నియామకాలను గాలికి వదిలేసిందన్నారు. ఇప్పటి వరకు కేవలం 3వేల ఇంజనీరింగ్‌ పోస్టులు, పోలీస్‌ ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్లు విడుదల చేశారన్నారు. గ్రూప్‌ – 2 సర్వీస్‌ ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. సంస్కరణలు ఉద్యోగ భర్తీలో కాకుండా రాజకీయాల్లో ప్రవేశపెట్టాలన్నారు. కార్యక్రమంలో గుజ్జకృష్ణ, శ్రీనివాస్‌గౌడ్, సయ్యద్‌ పాల్గొన్నారు.

అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మృతిపై అనుమానాలు

23/08/2016: భాగ్యనగర్‌ కాలనీ: సినీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సోమవారం సీఐ పురుషోత్తమ యాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లాకు చెందిన విక్రమ్‌ చైతన్య (32) మూసాపేటలోని రెయిన్‌బో విస్తాలో గత ఏప్రిల్‌ నుంచి తల్లి విజయకుమారి, తమ్ముడు వివేక్‌తో కలిసి ఉంటూ డైరెక్టర్‌ సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. స్నేహితులతో కలిసి మద్యం తాగి ఆదివారం రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చాడు. తాను ఉంటున్న ఇంటి రెండో అంతస్తుపై నుంచి కిందపడి చైతన్య మృతి చెంది ఉండగా.. రాత్రి 2 గంటలకు సెక్యూరిటీ గార్డు గమనించి మృతుడి తల్లికి తెలియజేశాడు. మద్యం మత్తులో రెండో అంతస్తుపై నుంచి పడిపోయాడా లేక ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నాడా? అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

మనదిక రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా

23/08/2016: హైదరాబాద్‌: జిల్లాల పునర్విభజనలో హైదరాబాద్‌ జిల్లాను యథాతథంగా ఉంచారు. వాస్తవంగా హైదరాబాద్‌ జిల్లాలో రంగారెడ్డి జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి రెండుగా విభజించాలని మొదట అధికార యంత్రాంగం ప్రతిపాదనలు చేసింది. కానీ విపక్షాల వ్యతిరేకతతో ఈ ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద హైదరాబాద్‌ జిల్లా పాత ప్రాంతాలతోనే చెక్కుచెదరకుండా ఉండడం విశేషం. ఇక సికింద్రాబాద్‌(లష్కర్‌) కేంద్రంగా జిల్లాను ప్రకటిస్తారన్న ఆశ నిరాశ అయింది. మహానగరంలో రెవెన్యూ జిల్లాలు – కలెక్టర్ల పాత్ర పూర్తి నామమాత్రమే అయినప్పటికీ, రెవెన్యూ సరిహద్దులను మార్చొద్దని ఎంఐఎం పార్టీ ఏకగ్రీవంగా తీర్మాణించి ప్రభుత్వానికి నివేదించింది. దీంతో జిల్లాల విభజన కోసం రాసుకున్న మార్గదర్శకాలకు భిన్నంగా హైదరాబాద్‌ అతిపెద్ద జిల్లాగానే ఉంది. జిల్లా పరిధిలో అదనంగా మరో రెవెన్యూ డివిజన్‌తోపాటు రెండు మండలాలను పెంచాలనే యంత్రాంగం ప్రతిపాదనలకు కూడా బ్రేక్‌ పడింది. దీంతో హైదరాబాద్‌ జిల్లాలో పాతగా ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్‌ రెవెన్యూ డివిజన్లతో సహా 16 మండలాలు యథాతథంగా ఉన్నాయి. జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా అలాగే ఉన్నాయి. పెరగని రెవెన్యూ డివిజన్లు, మండలాలు హైదరాబాద్‌ జిల్లాలో కొత్తగా రెవెన్యూ డివిజన్లు, మండలాలు కూడా పెరగలేదు. జిల్లా జనాభా దాదాపుగా 40 లక్షల వరకు ఉంది. మండలాల పరిధిలో కూడా జనాభా అధికంగా ఉంది. రెండు, మూడు మండలాలు మినహాయించి మిగతా మండలాల్లో జనాభా 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లాల పునర్విభజనలో భాగంగా అదనంగా ఒక రెవెన్యూ డివిజన్‌తో పాటు రెండు మండలాలను కొత్తగా> పెంచాలని జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు చేసింది. జిల్లాల పునర్విభజనలో హైదరాబాద్‌కు స్థానం దక్కక పోవటంతో కొత్త రెవెన్యూ డివిజన్, మండలాలకూ మోక్షం లభించలేదని తెలుస్తున్నది. 1.50 లక్షల జనాభాకు ఒక మండలం ఉండాలన్న ప్రభుత్వ ఆలోచనను పరిగణనలోకి తీసుకున్నట్లయితే...తర్వాతనైనా మండలాల పెంపునకు అవకాశం ఉండగలదన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇది ఎంత మేరకు సాధ్యమవుతుందనే అంశం సర్కారు నిర్ణయంపై ఆధారపడి ఉండనుంది.

ఇషాచావ్లా సందడి

23/08/2016: గన్‌ఫౌండ్రీ : గోషామహల్‌ ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌(టీటీఐ)లో హీరోయిన్‌ ఇషాచావ్లా సందడి చేసింది. మద్యం తాగి వాహనాలు నడపవద్దని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం గోషామహల్‌లోని ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌కై దళారులను ఆశ్రయించకుండా నేరుగా డ్రైవింగ్‌ టెస్ట్‌లో పాల్గొనాలని సూచించారు. తాను సైతం మొదటిసారి డ్రైవింగ్‌ టెస్ట్‌లో ఫెయిలయ్యానని, రెండవసారి మాత్రం ఏకాగ్రతతో డ్రైవింగ్‌ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించి డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందినట్లు తెలిపారు.ట్రాఫిక్‌ డీసీపీ ఎ.వి. రంగనాథ్‌ మాట్లాడుతూ... నేటితరం పిల్లలకు స్కూల్‌ లాంటి ఇంటినుంచే ట్రాఫిక్‌ నిబంధనలను తెలియజేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందన్నారు. రాబోయే రోజుల్లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్, హెల్మెట్‌ లేని, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ చేసే వాహనదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ఆధార్‌కార్డ్‌ను వెంట ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వ్యాపారవేత్త అనిల్, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ నరహరి తదితరులు పాల్గొన్నారు.

ఫేస్‌బుక్‌ ... మత్తెక్కించి దోచేస్తాడు

23/08/2016: పంజగుట్ట: ఫేస్‌బుక్‌ ద్వారా స్నేహం చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఓ కేటుగాడిని పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రూ. 3 లక్షల విలువైన 10 తులాల బంగారు నగలు, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు. సోమవారం పంజగుట్ట ఠాణాలో పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వర రావు, ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... మెహిదీపట్నం హుడా కాలనీకి చెందిన రియాజ్‌ అహ్మద్‌ అలియాస్‌ మహ్మద్‌ యాహ ఉల్‌ హసన్‌ అలియాస్‌ అకిత్‌ (32) ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నాడు. ఇతను ఫేస్‌బుక్‌లో కొద్దిగా అమాయకంగా కనిపిస్తున్న వారి ఫొటోలు ఎంపిక చేసుకుని ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపిస్తాడు. వారు యాక్సెప్ట్‌ చేయగానే వారి ఫొటోలకు మంచి కామెంట్లు, లైక్‌లు కొట్టడంతో పాటు ఆన్‌లైన్‌లో చాటింగ్‌ చేస్తూ ఫోన్‌ నెంబర్లు తీసుకుంటాడు. ఫోన్లు చేసి పరిచయం మరింత పెంచుకుం టాడు. తర్వాత ఒక్కసారి పర్సనల్‌గా కలిసి మాట్లాడుకుందామని పిలుస్తాడు. మాటల్లో పెట్టి వారితో మత్తు పదార్థాలు కలిపిన మంచినీళ్లు, కూల్‌డ్రింక్స్‌ తాగిస్తా డు. మత్తు వచ్చి పడిపోగానే వారి వద్ద ఉన్న బంగారు నగలు, పర్సులు, ఫోన్, ల్యాప్‌టాప్‌ తీసుకొని ఉడాయిస్తాడు. ఈ విధంగా నగరంలోని పంజగుట్ట, గచ్చిబౌలి, జవహర్‌నగర్, నేరేడ్‌మెట్‌ ఠాణాల పరిధిలో మొత్తం నలుగురిని దోచుకున్నాడు. ఈ ఘటనలపై ఆయా ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. కాగా, చోరీ సొత్తును నిందితుడు సోమవారం విక్రయిస్తుండగా పంజగుట్ట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.ఫేస్‌బుక్‌లో అపరిచితులు ఎవరైనా ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపితే దాన్ని యాక్సెప్ట్‌ చేయరాదని, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సూచించారు. విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌కుమార్, క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీనారాయణ రెడ్డి పాల్గొన్నారు.

సింధూను అభినధించడానికి మంత్రులే క్యూ కట్టిన వేళ...

22/08/2016: హైదరాబాద్ : సాధారణంగా మంత్రులను ఎవరైనా కలవాలంటే వాళ్ల పేషీల దగ్గర, ఇళ్ల దగ్గర క్యూలో నిలబడాల్సి ఉంటుంది. కానీ, సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో అరుదైన దృశ్యం కనిపించింది. రియో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మిటన్ సింగిల్స్ విభాగంలో రజత పతకం సాధించిన పీవీ సింధు, ఆమెను తీర్చిదిద్దిన కోచ్ పుల్లెల గోపీచంద్ ఇద్దరూ బ్రెజిల్ నుంచి వస్తున్నారు. వాళ్లకు స్వాగతం పలికేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు క్యూలో నిలబడ్డారు. విమానాశ్రయంలో సాధారణంగా విదేశాల నుంచి వచ్చేవాళ్ల కోసం 'ఇంటర్నేషనల్ అరైవల్స్' ద్వారం ఉంటుంది. సింధు, గోపీ తదితరులను మాత్రం ప్రత్యేకంగా అత్యవసర ద్వారం మీదుగా తీసుకొచ్చారు. సింధు తండ్రి పీవీ రమణ స్వయంగా లోపలకు వెళ్లి.. వాళ్లను తొడ్కొచ్చారు. విమానం దిగిన విషయం, సింధు వస్తున్న విషయం తెలియగానే అప్పటివరకు లాంజ్‌లో కూర్చున్న మంత్రులంతా ఒక్కసారిగా అప్రమత్తమై.. ఆ ద్వారం వెలుపల ఒకరి తర్వాత ఒకరు వరుసగా నిల్చుని చేతుల్లో పూలబొకేలు పట్టుకున్నారు. అత్యంత పటిష్ఠమైన భద్రత నడుమ బయటకు వచ్చిన సింధు అతి కొద్దిమంది ప్రముఖుల నుంచి మాత్రమే బొకేలు తీసుకుంది. సీఆర్పీఎఫ్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు కూడా ఆమెకు భద్రతావలయం ఏర్పాటుచేసి, ఆమెను త్వరత్వరగా ఓపెన్ టాప్ బస్సు వద్దకు తీసుకెళ్లిపోయారు.

ఎయిర్‌పోర్టులో సింధుకు ఘనస్వాగతం

22/08/2016: హైదరాబాద్ : ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించి మువ్వన్నెల పతాకాన్ని వినువీధిలో సగర్వంగా ఎగరేసిన పీవీ సింధు, ఆమె కోచ్ గోపీచంద్‌లకు శంషాబాద్లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఉదయం 9 గంటల సమయంలో విమానాశ్రయంలో దిగిన పీవీ సింధుకు స్వాగతం పలికేందుకు ముందుగానే ఆమె తల్లిదండ్రులు పీవీ రమణ, విజయలతో పాటు తెలంగాణ క్రీడా శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, నాయిని నరసింహారెడ్డి, వి.హనుమంతరావు, మేయర్ బొంతు రామ్మోహన్, ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మరో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని నాని, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఇంకా పలువురు క్రీడా, అధికార, అనధికార ప్రముఖులు శంషాబాద్ చేరుకున్నారు. ముంబై నుంచి ప్రత్యేకంగా తెప్పించిన డబుల్ డెక్కర్ ఓపెన్ టాప్ బస్సును పూలదండలతో అలంకరించారు. బస్సు మొత్తాన్ని చివరి నిమిషంలో కూడా పోలీసు శునకాలతోను, మెటల్ డిటెక్టర్లతోను క్షుణ్ణంగా తనిఖీ చేయించారు. గోపీచంద్ అకాడమీ నుంచి వచ్చిన పలువురు విద్యార్థులు కూడా తమ తోటి క్రీడాకారిణి సింధును సాదరంగా స్వాగతించారు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆమె ప్రముఖుల నుంచి బొకేలు అందుకుని.. తన కోసం సిద్ధంగా ఉన్న ఓపెన్ టాప్ బస్సు ఎక్కింది. చాలామంది ఆమెకు స్వయంగా పూల బొకేలు, దండలు చేతికి ఇవ్వలేకపోవడంతో.. ఓపెన్ టాప్ బస్సు ఎక్కిన తర్వాత కూడా కింది నుంచి పైకి వాటిని విసిరారు. వాటిని ఆమె అందిపుచ్చుకుని, అక్కడి నుంచే వారికి అభివాదాలు తెలిపారు.

‘పెళ్లి చూపులు’ చూసిన మంత్రి కేటీఆర్‌

17/08/2016: హైదరాబాద్‌: చిన్న సినిమాగా విడుదలైన ప్రేక్షకుల ఆదరణను పొందిన చిత్రం ‘పెళ్లి చూపులు’. చక్కటి కథ, సున్నితమైన వినోదం, సమపాళ్లలో భావోద్వేగాలను రంగరించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అందర్నీ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన నటీనటులతో నిర్మించిన ‘పెళ్లి చూపులు’ వినోదంతో పాటు సందేశాత్మకంగా ఉందని కితాబిచ్చారు. స్టార్టప్‌ సంస్కృతిని ప్రోత్సహించే దృక్పథంతో పాటు యువత జీవితంలో తమ కాళ్లపై తాము నిలబడాలన్న సందేశంతో ఈ సినిమా బహుళ ప్రజాదరణ పొందుతుండటం మంచి పరిణామమన్నారు. నిర్మాత సురేష్‌బాబు ఇలాంటి సినిమాలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. మంచి కథ, విలువలు, సందేశాలు ఉన్న చిత్రాలను ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుందని చెప్పారు. విజయ్‌ దేవరకొండ, రీతూవర్మ, నందు, అభయ్‌ కురువిల్లా తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. వివేక్‌సాగర్‌ స్వరాలు సమకూర్చారు.

ఇక యంత్రాలతోనే క్లీనింగ్‌ - నగర పారిశుధ్యానికి ఆధునిక వాహనాలు

17/08/2016: హైదరాబాద్: ఇకముందు మనుషులు మ్యాన్‌హోళ్లలో దిగకుండా చేస్తామని, మెకనైజ్డ్‌ విధానాలతోనే మ్యాన్‌హోళ్లను శుభ్రం చేసే విధానాలు అవలంభిస్తామని మున్సిపల్‌ మంత్రి కేటీ ఆర్‌ స్పష్టం చేశారు. ఇటీవల మ్యాన్‌హోల్‌లో దిగి నలుగురు మృతి చెందడాన్ని ప్రస్తావిస్తూ, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం ఇక్కడి పీపుల్స్‌ప్లాజాలో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో కొత్తగా 176 స్వచ్ఛ ఆటో టిప్పర్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 25 రెఫ్యూజి క్యాంపాక్టర్లు, 18 కొత్త స్వీపింగ్‌ యంత్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యాన్‌హోల్‌లో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా జలమండలి ఇప్పటికే ప్రకటించగా, మృతుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం కూడా ఇస్తామని స్పష్టం చేశారు. నగరంలోని కోటి మంది జనాభా కోసం పాటుపడుతున్న జీహెచ్‌ఎంసీ, జలమండలి కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం భరోసాగా ఉంటుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ పేరుకు మహానగరమైనప్పటికీ కాలుష్యాన్ని వెదజల్లుతున్న చెత్తవాహనాలు.. వాహనాల నుంచి రోడ్లపై పడుతున్న చెత్త వంటి సమస్యలు ఉన్నాయని ఈ సమస్యల పరిష్కారానికి, పారిశుధ్య కార్యక్రమాల సమర్థ నిర్వహణకు 15 ఏళ్లకు పైబడిన కాలం చెల్లిన వాహనాలన్నింటినీ తొలగించి, వాటిస్థానంలోlఅధునాతన వాహనాలు సమకూరుస్తున్నామన్నారు. భవిష్యత్తులో బహిరంగ ప్రదేశాల్లో డంపర్‌ బిన్లు లేకుండా చేయాలనేది లక్ష్యమన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మేయర్‌ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డా.జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాజకీయనాయకుడు కావాలని..

17/08/2016: జీడిమెట్ల: ప్రజా ప్రతిఘటన పేరుతో పలువురిని బెదిరించి డబ్బులు డిమాండ్‌ చేస్తున్న ఓ సూడో నక్సలైట్‌ను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ ఎ.చంద్రశేఖర్‌ కథనం ప్రకారం.. వరంగల్‌ జిల్లా నెల్లుకుదురు మండలం దోడ్లాడ గ్రామానికి చెందిన వేపాకుల శ్రీనివాస్‌(44) తొర్రూరులో ఇంటర్‌ చదివే క్రమంలో రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌లో సభ్యుడు. అప్పట్లో బెదిరింపులకు పాల్పడుతుండడంతో పోలీసులు శ్రీనివాస్‌ను బైండోవర్‌ చేశారు. అనంతరం 1995లో సొంత గ్రామమైన దొడ్లాడలో కాంగ్రెస్‌ పార్టీ తరపున వార్డు మెంబర్‌గా పోటీ చేసి ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. అనంతరం సొంత గ్రామంలోనే టీడీపీ వర్గీయులు శ్రీనివాస్‌పై దాడి చేయడంతో హైదరాబాద్‌కు మకాం మార్చాడు. అమీర్‌పేటలో ఉంటూ డబ్బుకోసం ‘ప్రజా ప్రతిఘటన’ పేరుతో సీతారాంరెడ్డి అనే వ్యక్తితో కలిసి పలువురిని బెదిరించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సిటీ టాస్క్‌పోర్స్‌ పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి బయటకు వచ్చాక దొడ్లాడ, బ్రహ్మణ కొత్తపల్లిలో ఎంపీటీసీగా పోటీచేసి గెలిచాడు. ఎంపీపీ అవ్వాలనే కోరికతో భారీగా అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేక తిరిగి హైదరాబాద్‌కు మకాం మార్చి 2007లో బోడుప్పల్, మహేశ్వరం, బడంగ్‌పేట్‌ పరిధిలో వెంకటేశ్వర రావు అనే వ్యక్తితో కలిసి పలువురు రియల్టర్లను బెదిరించాడు. ఈ క్రమంలో పోలీసులు వీరిద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్‌లో తన ఆటలు సాగవని భావించిన శ్రీనివాస్‌ 2009లో రాజమండ్రి సమీపంలోని రాజానగరంలోను, 2010లో కాకినాడలోను బెదిరింపుల కేసులో జైలుపాలయ్యాడు. గత ఏడాది సిద్ధిపేటకు చెందిన ఇద్దరు అన్నదమ్ముల పంచాయితీలో అన్నకు వత్తాసుగా తమ్ముడిని బెదిరించిన కేసులో జైలు పాలయ్యా డు. ఈ ఏడాది జూన్‌లో ఏలూరు అంబికా దర్బార్‌బత్తి పరిశ్రమ యజమానిని రూ.15 లక్షలు డిమాండ్‌ చేసి మరలా జైలు పాలయ్యాడు. జులైలో బెయిల్‌పై బయటకు వచ్చిన శ్రీనివాస్‌ యాదగిరిగుట్టలో ఒక గదిని అద్దెకు తీసుకుని కొన్ని సిమ్‌కార్డులు కొనుగోలు చేసి షాపూర్‌నగర్‌కు చెందిన బియ్యం వ్యాపారిని రూ.10 లక్షలు డిమాండ్‌ చేశాడు. బాధితుడు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా సెల్‌ నెంబర్‌ అధారంగా శ్రీనివాస్‌ హన్మకొండలో ఉన్నట్టు గుర్తించి అరెస్టు చేశారు. మంగళవారం శ్రీనివాస్‌ను జీడిమెట్ల పోలీసులు రిమాండుకు తరలించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సైలు సైదిరెడ్డి, లింగ్యా నాయక్‌ను సీఐ అభినందించారు.

నగర చెరువులకు బాక్టీరియా థెరపీ!

17/08/2016: హైదరాబాద్: మురుగు, వ్యర్థాలు, రసాయనాలు కలసి కాలుష్య కాసారాలైన చెరువులకు ‘బ్యాక్టీరియా చికిత్స’ అందించేందుకు సర్కారు విభాగాలు రంగం సిద్ధంచేస్తున్నాయి. గృహ, వాణిజ్య, పారిశ్రామిక వాడల నుంచి వెలువడుతోన్న ఘన,ద్రవ వ్యర్థజలాల కలయికతో దశాబ్దాలుగా మురుగుకూపాలుగా మారిన చెరువులకు పూర్వపు స్థాయిలో మహర్దశనందించేందుకు జలమండలి, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ విభాగాలు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రయోగాత్మకంగా జలగం వెంగళరావు పార్క్, బంజారా పాండ్, రాజేంద్రనగర్‌ చెరువుల్లో ఈ చికిత్స విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇటీవలే పెన్నార్‌ ఎన్విరో, బ్లూ ప్లానెట్‌ ల్యాబ్స్‌ సంస్థలు సంయుక్తంగా చేపట్టనున్న ఈ ప్రయోగం వివరాలను ఆయా సంస్థల నిపుణులు ఇటీవలే అధికారులకు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. బ్యాక్టీరియా చికిత్సతో సత్ఫలితాలు.. కలుషిత జలాలు చేరడం వల్ల చెరువుల్లో పేరుకుపోతున్న జీవ, రసాయన వ్యర్థాలను తినే ‘మైక్రో ఆర్గానిజం కల్చర్‌ బ్యాక్టీరియా’తో మురుగునీటిని శుద్ధిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా, జపాన్‌ తదితర దేశాల్లోనే ఈ విధానం అమల్లో ఉంది. చెరువుల్లో కలిసిన ఆర్గానిక్‌ వ్యర్థాలను ఈ బ్యాక్టీరియా ఆహారంగా స్వీకరించి క్రియారహితంగా మారుతుంది. సూపర్‌బగ్‌ తరహాలో పనిచేస్తుంది. ఈ విధానం పర్యావరణానికి కూడా హానికలిగించదని జలమండలి వర్గాలు తెలిపాయి. ఈ బ్యాక్టీరియా పౌడర్‌ రూపంలో ఉంటుంది. దీన్ని చెరువులో చల్లుతారు. ఈ బ్యాక్టీరియా పనితీరుపై సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు జలమండలి, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులకు ఇటీవల పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ ప్రయోగాత్మకవిధానం అమలు విషయంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిపుణుల సలహాలను కూడా స్వీకరించనున్నారు. పౌడర్‌ బ్యాక్టీరియా... తెల్లటి పౌడర్‌ రూపంలో ఉన్న మిశ్రమంలో ఈ బ్యాక్టీరియా దాగి ఉంటుంది. దీనిని ఆయా చెరువుల్లోని వ్యర్థజలాలపై పెద్ద మొత్తంలో చల్లుతారు. దీంతో బ్యాక్టీరియా క్రియాశీలమై మురుగునీటిలోని జీవ, రసాయన ఘన వ్యర్థాలను ఆహారంగా స్వీకరిస్తుంది. సంక్లిష్ట కర్భన పదార్థాలను సరళ పదార్థాలుగా విడగొడుతుంది. ఆతరవాత ఇది క్రియారహితంగా మారుతుంది. మురుగు ప్రవాహంలో కొట్టుకుపోతుంది. దీని జీవితకాలం తక్కువగానే ఉంటుంది. ఈ బ్యాక్టీరియా పర్యావరణానికి మేలు చేస్తుందే తప్ప కీడు చేయదని నిపుణులు చెబుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇది తిరిగి చైతన్యవంతం అయ్యే వీలులేదని తెలిపారు. ఉపయోగాలివీ... ► ఆయా చెరువుల్లోని మురుగునీటిలో ఉన్న జీవసంబంధ ఘన వ్యర్థాలను తొలగించి నీటిని శుద్ధిచేస్తుంది. ► నీటిలో ఉండే హానికారక రసాయనాలు,ఘన వ్యర్థాలు, మురుగు అవశేషాలు నిర్వీర్యమౌతాయి ► మురుగు ప్రవాహానికి ఆటంకాలు తొలగుతాయి ► ఆధునిక బ్యాక్టీరియా టెక్నాలజీ ఆధారంగా ఘన వ్యర్థాలను శుద్ధిచేయవచ్చు ► శుద్ధిచేసిన వ్యర్థజలాల్లో బిఓడి,సిఓడి స్థాయిలను ప్రమాణాల ప్రకారం ఉండేలా చూడవచ్చు. ►ఈ చికిత్సా విధానం ద్వారా ఆయా చెరువుల చుట్టూ ఉన్న ఆవరణ వ్యవస్థను పరిరక్షించవచ్చు.

సిమ్‌కార్డుల గుట్టు తేలేనా?

17/08/2016: హైదరాబాద్: నయీమ్ కేసు దర్యాప్తు వేగం అందుకుంది. ఇన్నాళ్లు భూ డాక్యుమెంట్లు, ఇళ్లపై దృష్టిపెట్టిన పోలీసులు ఇప్పుడు సాంకేతిక సాక్ష్యాలు సేకరించే పనిలో పడ్డారు. పుప్పాలగూడ అల్కాపురి టౌన్‌షిప్‌లోని నయీమ్ ఇంటితో పాటు వంట మనిషి ఫర్హా నా పేరిట తిరుమల గార్డెన్‌లో ఉన్న 4 అంతస్తుల బిల్డింగ్, అంజలీ గార్డెన్‌లో ఉన్న మరో ఇంటి నుంచి లభించిన మొత్తం 700 సిమ్‌కార్డులపై విచారణను వేగవంతం చేశారు. ఆయా నెట్‌వర్క్‌ల సిమ్‌కార్డులతో ప్రత్యేక పోలీసు బృందం ఆయా కంపెనీలకు వెళ్లింది. ఆ సిమ్‌కార్డులన్నీ ఎవరి పేరిట ఇచ్చారు? చిరునామాలేంటి? అన్న వివరాలతోపాటు కాల్ డేటా జాబితాను సేకరిస్తున్నారు. తప్పుడు చిరునామాలతో.. : చాలా సిమ్‌కార్డులను తప్పుడు చిరునామాలతో తీసుకున్నట్టుగా పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. కొన్ని హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు చెందినవారి ఆధార్ కార్డులు సమర్పించినట్టు గుర్తించారు. సిమ్‌కార్డులపై పూర్తిస్థాయి దర్యాప్తుతో కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు. అలాగే కొన్ని కాల్‌డేటా వివరాలను డాక్యుమెంటేషన్ రూపంలో రెడీ చేస్తున్నారు. వారిద్దరికీ మరో ఆరు రోజుల కస్టడీ.. అల్కాపురి కాలనీలోని నయీమ్ ఇంట్లో పట్టుబడ్డ ఫర్హానా, అఫ్సాలను 12 రోజుల పోలీసు కస్టడీ ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను రాజేంద్రనగర్‌లోని ఉప్పర్‌పల్లి న్యాయస్థానం మంగళవారం విచారించింది. తెలంగాణతో పాటు 5 రాష్ట్రాల్లో ఆస్తులున్నాయని, మరిన్ని వివరాలు సేకరించేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వాదించారు. అయితే న్యాయమూర్తి 6 రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు బుధవారం ఉదయం చర్లపల్లి జైలు నుంచి వారిద్దరిని కస్టడీలోకి తీసుకోనున్నారు. వీరిని రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, గోవా, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఏపీలోని నయీం ఆస్తులను గుర్తించేందుకు తీసుకువెళ్లనున్నారు. సమీరుద్దీన్ కస్టడీకి పిటిషన్ పోలీసులు సోమవారం అరెస్టు చేసిన నయీమ్ డ్రైవర్ సమీరుద్దీన్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ హయత్‌నగర్ న్యాయస్థానంలో మంగళవారం పోలీసులు పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిసింది. నల్లగొండకు చెందిన మహ్మద్ రియాజుద్దీన్ కుమారుడు మహ్మద్ సమీరుద్దీన్ ఏడాది క్రితం నుంచే నయీమ్, అతని అల్లుడైన ఫహీంల వద్ద పని చేసేవాడు. సమీరుద్దీన్‌ను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.

నయీంతో సిటీ మాజీమంత్రి చెట్టపట్టాలు?

13/08/2016: హైదరాబాద్ : నయీం కేసులో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ గ్యాంగ్‌స్టర్‌తో సంబంధాలు ఉన్నాయంటూ ఇప్పటికే కొందరు పోలీసు ఉన్నతాధికారులు, పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ మాజీ మంత్రి పేరు తెరపైకి వచ్చింది. ఆయనకు నయీంతో సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈగ్యాంగ్‌స్టర్‌తో కలిసి ఎన్నో భూ దందాలు, సెటిల్‌మెంట్లు చేసినట్లు వార్తలొస్తున్నాయి. డైరీలో ఈ అంశాలను నయీం ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తుండగా... ఆ మంత్రి ఎవరై ఉంటారన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. పోలీసు శాఖలో వివిధ స్థాయిల్లోని దాదాపు 42 మంది అధికారులు నయీంకు సహకరించినట్లు సమాచారం. వారిలో ఎక్కువమంది ఉన్నతాధికారులే ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ జాబితాలో 18మంది ఐపీఎస్ అధికారులు ఉన్నారని... వీరిలో సర్వీసులో ఉన్నవారు 9 మంది, రిటైరైనవారు 9 మంది ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మిగిలివారు కింది కేడర్‌ అని సమాచారం. డీసీపీ, ఏసీపీలుగా ఉన్నవారి నుంచి ఉన్నతస్థాయి వరకు నయీంకు తోడూ.. నీడగా నిలిచినట్లు సమాచారం. నక్సల్స్‌ వ్యవహారాలపై నిఘా పెట్టే స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌లో పనిచేసి రిటైర్‌ అయిన వారిలో ఆరుగురు ఎస్పీ కేడర్‌ అధికారులకు నయీంతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు కూడా కేసీఆర్‌కు ఇచ్చిన నివేదికలో ఉందని వార్తలు వచ్చాయి. అయితే, నయీం వ్యవహారంలో పీకల్లోతు మునిగిపోయిన కొందరు తమ పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు ప్రభుత్వంలో ఉన్నవారి పేర్లను బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.

కృష్ణా పుష్కరాలకు1065 ప్రత్యేక బస్సులు - యాభైశాతం అదనపు ఛార్జీల వసూలు - ఆర్టీసీ హైదరాబాద్‌ జోన్‌ ఈడీ వేణు వెల్లడి

11/08/2016: కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన పుష్కరఘాట్లకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు టీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్‌ జోన్‌ కార్యనిర్వాహక సంచాలకులు వేణు వెల్లడించారు. ఈ బస్సులకు యాభైశాతం అదనపు ఛార్జీలు ఉంటాయన్నారు. బుధవారం సాయంత్రం ఎంజీబీఎస్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఆర్టీసీ అధికారులతో కలిసి మాట్లాడారు. ఈనెల 12 నుంచి 23వరకు పుష్కరాలను పురస్కరించుకుని భక్తుల సౌలభ్యం కోసం 1065 బస్సులను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. పుష్కరఘాట్లకు 6-13 కిలోమీటర్ల వరకు ఆటోలు, ఇతర వాహనాలను ట్రాఫిక్‌రద్దీ దృష్యా అనుమతించడం లేదని, అయితే భక్తుల సౌలభ్యం కోసం నేరుగా అక్కడికే బస్సులు నడుస్తాయన్నారు. ఆటోలు, కార్లు, ఇతర వాహనాల్లో వచ్చే భక్తులను ఘాట్‌ల వద్దకు ఉచితంగా తీసుకెళ్లేందుకు ఆర్టీసీ ఆయా చోట్ల మరో 60 బస్సులను ఏర్పాటుచేసిందన్నారు. టీఎస్‌ఆర్టీసీ ఇప్పటివరకు 84 ప్రత్యేక బస్సులు కేటాయించగా వాటిలో 550 సీట్లను భక్తులు ఇప్పటికే రిజర్వేషన్‌ చేసుకున్నారని తెలిపారు. మొత్తం 5వేల మంది సిబ్బందిని పుష్కరాల విధుల కోసం వినియోగిస్తున్నట్లు ఈడీ తెలిపారు. బస్సులు అధిక శాతం గ్రేటర్‌ జోన్‌ నుంచే నడుపుతున్నట్లు తెలిపారు. టిక్కెట్‌ ధరలు చూస్తే.. ఎంజీబీఎస్‌ నుంచి విజయవాడ, శ్రీశైలంకు గరుడ ప్లస్‌ పెద్దలకు రూ.870, పిల్లలకు రూ.660 తీసుకుంటారు. గరుడ బస్సులకు పెద్దలకు రూ.820, పిల్లలకు రూ.620, రాజధాని బస్సులకు రూ.710, రూ.540, అలానే సూపర్‌ లగ్జరీకి రూ.540, రూ.270 ధర నిర్దేశించారు. డీలక్స్‌ బస్సులైతే విజయవాడకు పెద్దలకు రూ.460, పిల్లలకు రూ.230, శ్రీశైలానికి రూ.380, రూ.190గా ఉంది. ఎక్స్‌ప్రెస్‌లకు కూడా ధరల్లో వ్యత్యాసం ఉంది. ఇక బీచుపల్లికి గరుడ ప్లస్‌ పెద్దలకు రూ.540, పిల్లలకు రూ.410, నాగార్జునసాగర్‌కు రూ.520, రూ.400గా నిర్దేశించారు. గరుడ బస్సులకు బీచుపల్లికి పెద్దలకు రూ.510, పిల్లలకు రూ.390, నాగార్జునసాగర్‌కు రూ.490, రూ.380గా ధర ఉంది. రాజధాని, సూపర్‌లగ్జరీ, డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ బస్సులకు కూడా వేర్వేరు ధరలు ఉన్నాయి. బస్సులకు ఏవైనా మరమ్మతులు సంభవించినట్లైతే తక్షణమే బాగుచేసేందుకు మల్లేపల్లి, సాగర్‌, వాడపల్లి, మిట్టపల్లి, పెద్దవూర, శ్రీశైలం తదితర ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు.

ఏసీబీ వలలో కమర్షియల్ టాక్స్ ఆఫీసర్

11/08/2016: హైదరాబాద్‌సిటీ: అవినీతి నిరోధక శాఖాధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. నల్గొండ జిల్లా కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సయ్యద్ బాషా హుస్సేన్ రూ.లక్ష లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కాడు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో గ్రానైట్ లోడ్‌తో వెళ్తున్న 2 లారీలను పట్టుకుని 2 రోజులైనా వాటిపై ఎలాంటి కేసు నమోదు చేయకుండా ఉంచి రూ.లక్ష లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోనికి దిగిన నల్గొండ ఏసీబీ అధికారులు హుస్సేన్ లంచం తీసుకుంటుండగా పట్టుకుని అరెస్ట్ చేశారు. వనస్థలిపురంలో నివాసముంటున్న భాషా ఇంటిపై మహబూబ్‌నగర్ ఏసీబీ డీఎస్పీ రామదాసు అతని బృందం కలిసి బుధవారం అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు. ఆయన ఇంట్లో రూ.7 లక్షల నగదు, 500 గ్రాముల బంగారం, 4 కిలోల వెండితో పాటు పలు భూ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. హుస్సేన్పై కేసు నమోదు చేసిన అధికారులు విచారిస్తున్నారు.

‘నీటి’ లెక్క... లేదు పక్కా! - నీటి మీటర్ల ఏర్పాటులో నిర్లక్ష్యం

10/08/2016: హైదరాబాద్: గ్రేటర్‌ పరిధిలో అన్ని నల్లాలకు నీటిమీటర్ల ఏర్పాటు విషయంలో జలమండలి క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వీడడంలేదు. ప్రతి నీటి చుక్కను శాస్త్రీయంగా లెక్కగట్టడం ద్వారా వినియోగదారులకు బిల్లుల మోత లేకుండా చూసేందుకు బోర్డు యాజమాన్యం మీటర్లను తప్పనిసరిచేసింది. కానీ వీటి ఏర్పాటు విషయంలో వినియోగదారుల్లో ఉన్న అపోహలను తొలగించి వారికి అవగాహన కల్పించడంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న లైన్‌మెన్లు, మీటర్‌ రీడర్లు విఫలమవుతున్నారు. మీటర్లు లేకపోవడంతో ప్రస్తుతం డాకెట్‌ సరాసరి పేరుతో అశాస్త్రీయంగా జారీ అవుతున్న బిల్లులతో వినియోగదారులకూ బిల్లుల మోత మోగుతుండడం గమనార్హం. 1.60 లక్షల నల్లాలకే మీటర్లు.. గ్రేటర్‌ పరిధిలో 8.76 లక్షల నల్లా కనెక్షన్లుండగా..ఇందులో 1.60 లక్షల నల్లాలకు మాత్రమే మీటర్లున్నాయి. మిగతా నల్లాలకు మీటర్లు ఏర్పాటు చేసేందుకు మున్సిపల్‌ మంత్రి కేటీఆర్, జలమండలి మేనేజింగ్‌ డైరెక్టర ఎం.దానకిశోర్‌ల ఆదేశాల మేరకు ఇటీవల జలమండలి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తోంది. ఇందులోభాగంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మీటర్‌ రీడర్లు, లైన్‌మెన్లు వినియోగదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి మీటర్ల ఏర్పాటుపై అవగాహన కల్పించడంతోపాటు మీటర్లు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా నోటీసులు జారీ చేయాల్సి ఉంది. అయితే ఈ విషయంలో పలువురు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు కేవలం 43,328 మంది వినియోగదారులకు మాత్రమే నోటీసులివ్వడం గమనార్హం. ఇక మీటర్లు ఏర్పాటు చేసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన 1150 మంది వినియోగదారులకు వీటి ఏర్పాటుకు సహకరించే విషయంలోనూ అదే ధోరణి ప్రదర్శిస్తుండడంతో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహానగరం పరిధిలో అన్ని నల్లాలకు నీటిమీటర్లు ఏర్పాటు చేయకపోవడంతో నెలకు జలమండలి ఖజానాకు రూ.12 నుంచి రూ.15 కోట్ల వరకు నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా.

ఆర్టీసీకి ఏప్రిల్‌లో భారీ ఫిట్‌మెంట్‌!

10/08/2016: ముషీరాబాద్‌: ఆర్టీసీ బస్సుల్లో ప్రస్తుతం 60 నుంచి 65 వరకు ఉన్న ఓఆర్‌ను 80 నుంచి 85 వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్మికులపై ఉందని తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (టీఎంయూ) గౌరవ అధ్యక్షులు, మంత్రి హరీష్‌రావు అన్నారు. మంగళవారం బస్‌ భవన్‌ ఆవరణలో టీఎంయూ విజయోత్సవ సభ నిర్వహించారు. కార్యక్రమానికి హోంమంత్రి నాయిని, రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, డిప్యూటి స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ, ఆర్టీసీ ఎండీ రమణారావు, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ప్రభాకర్‌రావు, టిఎంయు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశ్వధ్దామరెడ్డి, థామస్‌రెడ్డి, తిరుపతి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ ఆర్టీసీలో కాంట్రాక్ట్‌ వ్యవస్థను రద్దు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. 44 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చి ఆర్టీసీ కార్మికుల మన్ననలు పొందారని, 85 శాతం ఓఆర్‌ సాధించి వచ్చే ఏప్రిల్‌లో భారీ ఫిట్‌మెంట్‌ను సాదిద్ధామన్నారు. అప్పటివరకు ప్రజా ప్రతినిధులు కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా కృషి చేస్తామన్నారు. ప్యాసింజర్‌ ఆటోలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతుల ఉసురు తగులుతుంది కాంగ్రెస్‌ పార్టీకి రైతుల ఉసురు తగులుతుందని మంత్రి హరీష్‌రావు అన్నారు. లోకమంతా ఒక దారి అయితే కాంగ్రెస్‌ పార్టీది మరో దారని ఎద్దేవా చేశారు. ఖమ్మంలో కాంగ్రెస్‌ నేతలు సీపీఎం అనుబంధ యూనియన్‌కు ఆర్టీసీ ఎన్నికల్లో మద్దతు తెలిపారన్నారు. అధికారంలో ఉన్నపుడు కుర్చీలు, పదవుల కోసం కొట్లాడుకునే నాయకులు ప్రస్తుతం అభివృధ్ది పనులకు అడ్డుతగులుతూ కోర్టుల్లో కేసులు వేస్తున్నారని ఆరోపించారు.

ఆ భయంతోనే దళితులపై ప్రేమ - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్

09/08/2016: హైదరాబాద్: గో సంరక్షణ పేరుతో దేశంలో పలు చోట్ల దళితులపై ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంస్థల దాడులతో ఉత్తర భారతంలో బీజేపీ పునాదులు కదులుతున్నాయని.. ఆ భయంతోనే మోదీకిదళితులపై ప్రేమ పుట్టుకొచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్ విమర్శించారు. హైదరాబాద్‌లోని తార్నాకలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గోసంరక్షణ పేరుతో దళితులపై జరుగుతున్న దాడిని మోదీ ఖండించడం హర్షణీయం అన్నారు. అయితే గుజరాత్‌లో దళితులపై దాడి జరిగినప్పుడు ప్రధాని ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నిం చారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లలో త్వరలో ఎన్నికలు ఉండడంతో మోదీకి దళితులు గుర్తొచ్చారని చెప్పారు. ఇప్పటికైనా దేశ వ్యాప్తంగా దళితులపై జరిగిన దాడుల సంఘటనలపై విచారణ జరిపి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు గుర్రాల సంతోష్‌రెడ్డి తదితరులున్నారు.

ఆర్నెల్ల కింద నుంచే ‘ఆపరేషన్ నయీమ్..’!

09/08/2016: హైదరాబాద్: మాజీ నక్సలైట్, గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఆగడాలకు అడ్డుకట్ట వేసేం దుకు ఆరు నెలల కిందే ‘ఆపరేషన్ నయీమ్’ మొదలైంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు హెచ్చరికలు చేసిన నయీమ్, అతడి ముఠా పనిపట్టాలని ప్రభుత్వం ఆదేశించడంతో.. పోలీసు శాఖ పక్కా వ్యూహాన్ని అమలు చేసింది. ముందు నయీమ్ అనుచరులు లొంగిపోయేలా చూసింది. అతడికి సహకరిస్తున్న, అతనితో సంప్రదింపుల్లో ఉన్న ప్రజాప్రతినిధులను గుర్తించి.. వారిని గట్టిగా హెచ్చరించింది. నయీమ్‌తో సంబంధాలున్న పోలీ సు ఉన్నతాధికారులకు ఆపరేషన్ వివరాలు తెలియకుండా జాగ్రత్త పడింది. ఈ క్రమంలో మెదక్, నల్లగొండ జిల్లాలకు చెందిన నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను నయీమ్ నేరుగా బెదిరించినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. మెదక్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లి, ఆయనతోనే గొడవపడి అంతు చూస్తాననడం... నియోజకవర్గంలో తిరగొద్దంటూ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని హెచ్చరించడం..మరో ఎమ్మెల్యేకు ఫోన్‌చేసి బూతులు తిట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. దీంతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వందల సంఖ్యలో భూ సెటిల్‌మెంట్లు చేయడం, భూముల యజమానులను బెదిరిం చి తక్కువ ధరకే లాక్కోవడం వంటి ఫిర్యాదులు లెక్కకు మించి వచ్చాయి. మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలనే హెచ్చరించడంతో నయీమ్‌ను మట్టుబెట్టాలని ప్రభుత్వం పోలీ సు శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. సన్నిహితుల లొంగుబాటుతో ఛత్తీస్‌గఢ్‌కు... భువనగిరి ప్రాంతంలో నయీమ్‌తో కలసి సెటిల్‌మెంట్లు చేసేవాళ్లను లొంగిపోవాల్సిందిగా పోలీసులు ఆదేశించడంతో నయీమ్ హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు మకాం మార్చాడు. అక్కడ నక్సలైట్లను రూపుమాపేందుకు నయీమ్ ఉపయోగపడతాడని ఇక్కడి కొందరు పోలీసు అధికారులు చెప్పడంతో.. ఛత్తీస్‌గఢ్ ఉన్నతాధికారులు అతనికి ఆశ్రయమిచ్చారు. దీంతో నయీమ్ అక్కడి పోలీసు ఉన్నతాధికారుల సహాయంతో కాంట్రాక్టర్‌గా అవతారమెత్తాడు. కొన్ని పను లు కూడా చేశాడు. తర్వాత కొన్నాళ్లకు హైదరాబాద్ చేరుకున్న నయీమ్... ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి బెదిరించడం, వ్యాపారులను హెచ్చరించడం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో అతడిని ఎలాగైనా పట్టుకోవాలన్న ఉద్దేశంతో పక్కా ఆపరేషన్‌కు పోలీసులు రూపకల్పన చేశారు.అతడి సెల్ నంబర్లు, ఎప్పుడు ఎక్కడ ఉంటున్నదీ గుర్తించారు. కొద్ది రోజులుగా షాద్‌నగర్-హైదరాబాద్ మధ్య తిరుగుతున్నట్లు తెలుసుకున్నారు. రెండు ప్రాంతాల్లోని నయీమ్ ఇళ్లపై వారంగా నిఘా పెట్టారు. అతడి కార్యకలాపాలు, వాటికి సంబంధించిన ఆధారాలను పూర్తిస్థాయిలో కనిపెట్టేందుకు ఆదివారం నుంచే రహస్యంగా వెంబడించడం ప్రారంభించారు. అయితే సోమవారం పోలీ సుల కదలికలను గుర్తించిన నయీమ్ కాల్పులకు దిగాడు. పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో నయీమ్ హతమయ్యాడు. ఎమ్మెల్యేకు బుల్లెట్‌ప్రూఫ్ వాహనం సాధారణంగా అయితే ముఖ్యమంత్రి, హోంమంత్రితోపాటు జెడ్ కేటగిరీలో ఉన్న వాళ్లకే బుల్లెట్‌ప్రూఫ్ వాహనం సమకూరుస్తారు. కానీ నయీమ్ బెదిరింపుల నేపథ్యంలో ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డికి పోలీసు శాఖ బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చడంతో పాటు భద్రత ఏర్పాటు చేసింది. ‘‘నయీమ్, అతడి ముఠా కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డబ్బు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కుతున్నదీ, ఎంత మందిని ఇబ్బంది పెడుతున్నదీ తెలిసింది. అధికార పార్టీలో కొందరితో సంబంధాలు పెట్టుకుని వారి కోసం సెటిల్‌మెంట్లు చేసినట్లు తేలింది. కొందరు ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడం, వ్యాపారంలో వచ్చిన లాభాల్లో వాటాలు ఇవ్వాలని మరికొందరిని బెదిరించడం వంటివి మా దృష్టికి వచ్చాయి. కొందరు పోలీసు అధికారులతోనూ అతడికి ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. దాంతో నయీమ్‌ను పట్టుకునేందుకు రహస్యంగా ఆపరేషన్ చేపట్టాం’’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.

హైదరాబాద్‌లో భూగర్భ రైలు!

09/08/2016: హైదరాబాద్ : భాగ్యనగరంలో తొలి భూగర్భ రైల్వే మార్గానికి అడుగులు పడుతున్నాయి. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా ఉందానగర్ రైల్వే స్టేషన్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు దీన్ని నిర్మించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ మేరకు సాధ్యాసాధ్యాలపై సర్వే చేసి నివేదిక అందజేయాల్సిందిగా ‘రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీసెస్ (రైట్స్)’ను రైల్వే శాఖ ఆదేశించింది. దీనికి సంబంధించి కొద్దిరోజుల్లో ఆ సంస్థ నివేదికను అందజేయనుంది. హైదరాబాద్ నగరానికి దాదాపు 23 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని చాలా కాలంగా రైల్వే భావిస్తోంది. నగరంలో ట్రాఫిక్ చిక్కులకు కొంతమేర పరిష్కారంగా గతంలో నిర్మించిన ఎంఎంటీఎస్ ప్రాజెక్టు ఫలక్‌నుమా స్టేషన్‌తో నిలిచిపోయింది. శివారు ప్రాంతాలను ఎంఎంటీఎస్ పరిధిలోకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు రెండో దశను కూడా రైల్వే ప్రారంభిం చింది. ఇప్పటికే పనులు కూడా మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఫలక్‌నుమా నుంచి విమానాశ్రయం వరకు కారిడార్ ఏర్పాటుకు నిర్ణయించిన రైల్వే.. ప్రాజెక్టుకు రూ.200 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. విమానాశ్రయానికి చేరువగా కాచిగూడ-మహబూబ్‌నగర్ రైలు మార్గంపై ఉన్న ఉందానగర్ స్టేషన్ మీదుగా దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అక్కడినుంచి విమానాశ్రయం ఆరున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయి తే విమానాశ్రయం వరకు రైల్వే లైను ఏర్పాటు చేయడాన్ని జీఎంఆర్ సంస్థ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. భవిష్యత్తులో విమానాశ్రయాన్ని విస్తరిస్తామని, ఇందుకు అదనపు టెర్మినళ్లు, రన్‌వే అవసరం ఉంటుందని, వీటిని దృష్టిలో ఉంచుకుని కొంత స్థలాన్ని సిద్ధంగా ఉంచుకున్నామని చెబుతోంది. రైల్వే లైన్ ఏర్పాటు వల్ల భవిష్యత్తులో విస్తరణ సాధ్యం కాదని సర్వేలో తేలితే.. ఎట్టి పరిస్థితిలో ఎంఎంటీఎస్ లైన్ ఏర్పాటుకు అంగీకరించబోమని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం.. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన రాష్ట్రప్రభుత్వం ద్వారా జీఎంఆర్‌తో మాట్లాడించి ఆమోదం వచ్చే లా ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పటికీ జీఎంఆర్ అంగీకరించకపోతే భూగర్భ లైన్ నిర్మించి ఎంఎంటీఎస్‌తో విమానాశ్రయాన్ని అనుసంధానించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానితో ఆదివారం నగరానికి వచ్చిన ప్రభు.. ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన సందర్భంలో దీనిపై చర్చించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. జీఎంఆర్‌తో మాట్లాడినా ఫలితం రాలేదు. ఇప్పుడు మరోమారు మాట్లాడినా సానుకూల ఫలితం వచ్చే అవకాశం లేదని, భూగర్భ ట్రాక్ నిర్మాణం తప్పదనే అభిప్రాయాన్ని రైల్వే అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

'పక్కా సమాచారంతోనే స్కెచ్'

08/08/2016: హైదరాబాద్: పక్కా సమాచారంతోనే గ్యాంగ్ స్టర్ నయీంను గ్రేహౌండ్స్ పోలీసులు చుట్టుముట్టారని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో నయీం గ్యాంగ్ షాద్ నగర్ చేరుకుందని చెప్పారు. మిలీనియం టౌన్ షిప్ లోని ఇంటిని పోలీసులు చుట్టుముట్టినప్పుడు నయీం గన్ మెన్ ముందుగా కాల్పులు జరిపాడని వెల్లడించారు. ఎన్కౌంటర్ కు సంబంధించిన పూర్తి వివరాలను డీజీపీ కాసేపట్లో వెల్లడించే అవకాశముంది. అయితే నయీంతో పాటు ఎవరైనా హతమయ్యారా, ఎవరైనా అరెస్ట్ చేశారా అనే విషయాలు వెంటనే వెల్లడి కాలేదు. ఇంకా ఎన్ కౌంటర్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. నయీం ముఠాకు చెందిన పలువురు కొద్ది రోజుల క్రితం పోలీసుల ఎదుట లొంగిపోయారు. హత్య కేసులతో పాటు భూ దందా, సెటిల్మెంట్లు కేసులు కూడా నయీంపై ఉన్నాయి.

మెమోరీ కార్డ్‌ కోసం కిడ్నాప్‌

08/08/2016: బంజారాహిల్స్‌: తమ్ముడు తీసుకున్న మెమోరీ కార్డ్‌ తిరిగి ఇవ్వలేదని అతడి అన్నను కిడ్నాప్‌ చేసి తీవ్రంగా గాయపర్చాడో యువకుడు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని ఎన్బీ నగర్‌ నివాసి సీహెచ్‌ కృష్ణ ఆటో డ్రైవర్‌. ఇతని తమ్ముడు శ్రీకాంత్‌కు అదే ప్రాంతంలో నివసిస్తున్న బాబర్‌ స్నేహితుడు. ఇటీవల బాబర్‌ మెమోరీ కార్డ్‌ను శ్రీకాంత్‌ తీసుకుని తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడు. అందులో తన కుటుంబానికి చెందిన ముఖ్యమైన ఫొటోలు ఉన్నాయని బాబర్‌ చెప్పినా శ్రీకాంత్‌ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి దాటాక బాబర్‌ ఎన్బీ నగర్‌లోని శ్రీకాంత్‌ ఇంటికి వచ్చి అతని అన్న కృష్ణను బలవంతంగా తన ఆటోలో ఎక్కించుకొని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 51 వైపు తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో తీవ్రంగా కొట్టాడు. రాయితో తలపై కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు కృష్ణ తప్పించుకొని కొద్ది దూరం పారిపోయి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి బాధితుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు బాబర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

‘గాంధీ’ సెల్లార్‌లో పాపను వదిలేసిన మహిళ

08/08/2016: గాంధీ ఆస్పత్రి: ఏడాదిన్నర వయసుగల పాపను సెల్లార్‌లో వదిలి వెళ్లిన ఘటన ఆదివారం గాంధీ ఆసుపత్రిలో జరిగింది. ఆస్పత్రి అధికారులు, పోలీసుల కథనం ప్రకారం... గాంధీ ఆస్పత్రిలో లిఫ్ట్‌ సూపర్‌వైజర్‌గా పని చేసే భరత్‌ ఆదివారం ఉదయం 10 గంటలకు తన బైక్‌ను పార్కింగ్‌ చేసేందుకు సెల్లార్‌లోకి వెళ్లాడు. అక్కడ చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తూ కనిపించింది. చుట్టుపక్కల పాప సంబంధీకులెవరూ కనిపించకపోవడంతో ఆస్పత్రి అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఆర్‌ఎంఓ బబిత నేతృత్వంలో చిన్నారిని పీఐసీయూకు తరలించి వైద్యసేవలందించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. ఓ మహిళ ఈ చిన్నారిని ఎత్తుకొని ప్రధాన భవనంలోకి ప్రవేశించి మెట్లు మీదుగా సెల్లార్‌లోకి దిగినట్లు నమోదైంది. అయితే దృశ్యాల్లో స్పష్టత లేకపోవడంతో మహిళను గుర్తించలేకపోయారు. చిన్నారికి కాళ్లు, చేతులు వంకరగా ఉన్నాయి. పోలియో సోకిందనే కారణంతో చిన్నారిని ఇక్కడ వదిలేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా పాపను గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

20 పాములకు విముక్తి

08/08/2016: ముషీరాబాద్‌: నాగ పంచమి సందర్భంగా పాములను పట్టే వారి నుంచి అటవీ శాఖ సహకారంతో వివిధ ఎన్‌జీఓ సభ్యులు దాదాపు 20 తాచు పాములను అటవీశాఖకు అప్పగించారు. నగరంలోని హయత్‌నగర్, చింతలబస్తీ, కాచి గూడ, కామారెడ్డి, వరంగల్‌ తదితర ప్రాంతాలలో ఈ పాములను రక్షించారు. పాములను కొద్ది రోజుల ముందే పట్టుకుని కోరలు పీకి బంధిస్తారని ఎన్‌జీవో నిర్వాహకులు మహేష్‌ అగర్వాల్, అవినాష్‌ తెలిపారు. నాగ పంచమి రోజు పాములను బయటకు తీయడంతో ఇన్ని రోజులు దాహంతో ఉన్న పాములు పాలు పోయగానే వాటిని తాగుతాయని తెలిపారు. ఈ విధంగా పాములను హింసకు గురిచేస్తున్న వారిని గుర్తించి, వారి వద్ద నుంచి పాములను స్వాధీనం చేసుకుని మళ్లీ అడవుల్లోకి వదిలివేసినట్లు తెలిపారు. భక్తులకున్న విశ్వాసాన్ని ఇలా సొమ్ముచేసుకుంటారన్నారు.

కమలంలో జోష్‌..!

08/08/2016: హైదరాబాద్‌: నగర భాజపాలో ప్రధాని మోదీ పర్యటన కొత్త ఉత్సాహాన్ని నింపింది. తెలంగాణ సాధనలో ప్రధాన పాత్ర పోషించినా.. కేవలం ఒక ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేల విజయంతో సరిపెట్టుకున్న పార్టీకి ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నిరుత్సాహం ఎదురైంది. ప్రస్తుతం ప్రధాని పర్యటన పార్టీకి దిశానిర్దేశం చేసింది. ఆదివారం ఎల్‌బీ స్టేడియంలో భాజపా బూత్‌ స్థాయి కార్యకర్తలతో నిర్వహించిన ‘మహా సమ్మేళనం’ విజయవంతమైంది. 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నేతల ప్రసంగాలు కార్యోన్ముఖులను చేశాయి. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాజపా పాత్రతో పాటు.. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి అందుతున్న సాయాన్ని నేతలు కార్యకర్తలకు వివరించారు. ఇంటింటికీ వెళ్లి కేంద్ర పథకాలను వివరించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పటిష్టతకు ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. తెరాసలోకి ప్రతిపక్ష పార్టీలనుంచి వలసలు ఉన్నా.. భాజపా నుంచి ఒక్కరు కూడా అటువైపు చూడలేదని..ఇదే మన బలం, చిత్తశుద్ధి అంటూ స్పష్టంచేశారు. పంచపాండవుల్లా విజయం సాధించిన అయిదుగురు శాసనసభ్యులకు కార్యకర్తలు అండగా ఉంటే.. ఇక్కడా విజయం సాధ్యమనే సంకేతాలిచ్చి కేడర్‌లో ఉత్సాహాన్ని నింపారు. ఇదే సమయంలో ప్రధాని, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు, లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి, నాగం ప్రసంగాలు పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తినిచ్చాయి. కార్యక్రమం కొనసాగిందిలా : * ఎల్‌.బి.స్టేడియం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు భారీగా శ్రేణుల రాకతో నిండిపోయింది. తర్వాత ఎవరినీ అనుమతించక పోవడంతో వందలాదిమంది బయటే నిల్చున్నారు. * ప్రధాని మోదీ సా.5.46 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా ఎల్బీ స్డేడియానికి చేరుకున్నారు. * 5.49 గంటలకు వేదికపైకి చేరుకుని కార్యకర్తలకు అభివాదం చేశారు. పలువురు మోదీని శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డా.లక్ష్మణ్‌ ప్రసంగించారు. * సాయంత్రం 6.14 గంటలకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ రెండు నిమిషాలు మాత్రమే ప్రసంగించారు. * 6.16కు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పదిహేను నిమిషాలు ప్రసంగించారు. యూపీఏ పదేళ్ల పాలనలో లోపాలను ఎత్తిచూపారు. చివర్లో ‘జై తెలంగాణ.. జై హింద్‌’ అంటూ ముగించారు. * సాయంత్రం 6.30కు ప్రధాని మోదీ ప్రసంగాన్ని మొదలు పెట్టారు. ‘హమ్‌ సబ్‌ ఏక్‌ హై’ అంటూ అందరితో నినాదాలు చేయించారు. రాత్రి 7.20 గంటలకు ముగించారు. చేనేతకు మద్దతుగా చరవాణుల్లోని ఫ్లాష్‌ లైట్‌ను ఆన్‌ చేయమని సూచించినప్పుడు.. సభికుల నుంచి విశేష స్పందన వచ్చింది. *7.23కు మోదీ ఎల్బీ స్టేడియం నుంచి రోడ్డు మార్గాన విమానాశ్రయానికి బయలుదేరారు. * నినాదాలతో ఎల్బీ స్టేడియం మార్మోమోగింది. ‘జై జై మాత.. భారత మాత’ అంటూ నినదించారు. మోదీ అడుగు పెట్టగానే ‘జై జై మోదీ’ అంటూ ఘనంగా స్వాగతం పలికారు. * ‘సోదర, సోదరీమణులకు నమస్కారం.. తెలంగాణకు వందనాలు’ అంటూ తెలుగులో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. * ప్రధాని వేదికపై ఉన్నంత సేపు చేనేత కార్మికులు నేసిన శాలువాను మెడలో వేసుకున్నారు. * జనగాంను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని ఆ ప్రాంతంలో విధించిన 144 సెక్షన్‌ను ఎత్తి వేయాలంటూ కార్యకర్తలు ప్లకార్డులను ప్రదర్శించారు. * నేతల ప్రసంగాల్లో పాకిస్తాన్‌ ప్రస్తావన తేగానే కార్యకర్తలంతా ‘జై జై మాత.. భారత్‌మాత’ అంటూ నినాదాలు చేశారు. * గోషామహల్‌ శాసనసభ్యుడు రాజాసింగ్‌ రాగానే ఆయనతో కరచాలనం చేయడానికి, సెల్ఫీలు దిగేందుకు కొందరు కార్యకర్తలు వరుస కట్టారు. * యువ మోర్చా కార్యకర్తలు ప్రత్యేక టీషర్టులు ధరించి సేవలందించారు.

ఇస్రోతో ఎంవోయూ కుదుర్చుకున్న తొలి రాష్ట్రం - హరీష్

06/08/2016: హైదరాబాద్ : ఇస్రోతో ఎంవోయూ కుదుర్చుకున్న తొలి రాష్ట్రం తెలంగాణ అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావు వెల్లడించారు. శనివారం హైదరాబాద్లో తెలంగాణ నీటిపారుదల శాఖ, ఇస్రో మధ్య ఎంవోయూ కుదిరింది. అందులోభాగంగా మంత్రి హరీష్ రావు, ఇస్రో చైర్మన్ కిరణ్కుమార్ ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.... నీటిపారుదలశాఖ వేగంగా పారదర్శకంగా పని చేయడానికి ఇస్రో సేవలు అవసరమని హరీష్రావు స్పష్టం చేశారు. ఇస్రో అత్యాధునిక టెక్నాలజీ ద్వారా తెలంగాణ జలవనరుల సమాచార వ్యవస్థ జలాశయాల్లో నీటి నిల్వలను ఉపగ్రహంతో విశ్లేషించనుంది.

అన్నీ తానై... భారీ మోసాలకు స్కెచ్‌ !

06/08/2016: హైదరాబాద్: నేషనల్‌ కన్జ్యూమర్‌ రైట్స్‌ కమిషన్, ఆలిండియా యాంటీ కరెప్షన్‌ కమిషన్, అభయబీ4యూ ఛానల్స్‌ న్యూస్‌ ఇన్‌చార్జ్, సీఐడీ డీఎస్పీ... ఇన్ని అవతారాలు ఎత్తి భారీ మోసానికి కుట్న పన్నిన ఓ వ్యక్తిని సైబరాబాద్‌ ఈస్ట్‌ పరిధిలోని మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన ఎంవీఎల్‌ నాగేశ్వరరావు మల్కాజిగిరిలోని శివపురికాలనీలో స్థిరపడ్డాడు. రూ.5 వేలు వెచ్చించి న్యూఢిల్లీలో నేషనల్‌ కన్జ్యూమర్‌ రైట్స్‌ కమిషన్, ఆలిండియా యాంటీ కరెప్షన్‌ కమిషన్‌ పేర్లతో రెండు సంస్థల్ని ఎన్‌జీఓల పేరుతో రిజిస్టర్‌ చేయించాడు. వీటి ద్వారా వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం, అధికారుల అవినీతిపై ప్రచారం చేస్తామని దరఖాస్తుల్లో పేర్కొన్నారు. ఆ రెండు సంస్థలకూ తానే జాతీయ అధ్యక్షుడిగా ప్రచారం చేసుకున్న నాగేశ్వరరావు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి పోస్టులు ఇస్తానంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలువురికి ఎర వేశాడు. సాధారణ సభ్యత్వానికి రూ.1500 ధర నిర్ణయించాడు. తన సంస్థల్లో రెండేళ్ల కాలపరిమితో ఉండే వివిధ హోదాల్లో పోస్టులు ఇవ్వడానికి రూ.30 వేల నుంచి రూ.2 లక్షల వరకు రేట్లు నిర్ణయించాడు. ఇలా రెండు రాష్ట్రాల్లోనూ సభ్యుల్ని నియమించడం ద్వారా ప్రతి రెండేళ్లకూ రూ.5 కోట్లు చొప్పున దండుకోవాలని పథకం వేశాడు. అలాగే యాంటీ కరెప్షన్‌ కమిషన్‌ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి డబ్బు దండుకోవాలని కుట్రపన్నాడు. దీంతో పాటు ‘తెలుగు ప్రపంచం’ పేరుతో మరో సంస్థను రిజిస్టర్‌ చేయించిన నాగేశ్వరరావు రెండు రాష్ట్రాల్లోనూ దుకాణాలు, వ్యాపార సంస్థలకు తెలుగు బోర్డులు ఏర్పాటు చేసే బాధ్యతల్ని ప్రభుత్వాలు తనకు ఇచ్చాయని ప్రచారం చేసుకున్నాడు. అలానే అలిండియా కన్జ్యూమర్‌ రైట్స్‌ పేరుతో మాస పత్రికను ముద్రించాలని రిజిస్ట్రేషన్‌ కూడా చేయించాడు. తన వద్ద సభ్యులుగా, వివిధ హోదాల్లో చేరిన వారికి తన రెండు సంస్థల పేర్లతో ఉన్న స్టిక్కర్లను రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు విక్రయించే వాడు. అభయ ఛానల్‌ న్యూస్‌ ఇన్ చార్జీ బీ4యూ న్యూస్‌ ఛానల్‌ హెడ్‌గా, ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ కోశాధికారిగా, సీఐడీలో డీఎస్పీగా... ఇలా వివిధ రకాలైన నకిలీ ఐడీ కార్డులు తయారు చేసుకున్న నాగేశ్వరరావు వీటిని వినియోగించి బెదిరించడం ప్రారంభించాడు. ఇతడి వ్యవహారాలపై విశ్వసనీయ సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

'నాకు, నా చెల్లికి మధ్య చిచ్చు పెట్టాడు'

06/08/2016: నేరేడ్‌మెట్(హైదరాబాద్): వరుసకు అక్కాచెల్లెళ్లైన ఇద్దరు యువతులు రామకృష్ణాపురం చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. డీసీపీ రాంచంద్రారెడ్డి, నేరేడ్‌మెట్ సీఐ జగదీష్‌చందర్ కథనం ప్రకారం... రామకృష్ణాపురం చెరువులో శుక్రవారం ఇద్దరు యువతుల మృతదేహాలు తేలియాడుతుండగా పోలీసులు వెలికి తీయించారు. చెరువు గట్టుపై బండ రాయి కింద సూసైడ్ నోట్‌లు లభించాయి. వాటి ఆధారంగా మృతుల్లో ఒకరు సౌమ్య రాజేశ్వరి (సుమారు 20), మౌనిక (సుమారు 19)గా గుర్తించారు. ఆకివీడుకు చెందిన సౌమ్య రాజేశ్వరి తల్లిదండ్రులు చనిపోవడంతో ఘట్‌కేసర్‌లోని హాస్టల్లో ఉంటూ చైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతోంది. మౌనిక కుషాయిగూడలో నివాసముంటోంది. ఈమె నాగార్జున అనే యువకుడ్ని ప్రేమిస్తోంది. అతడితో ప్రేమ విఫలం కాగా... కామేష్ అనే వ్యక్తి మౌనికను వేధిస్తున్నాడు. సౌమ్య గురువారం మౌనిక ఇంటికి వచ్చింది. ఇద్దరూ కలిసి రాత్రి 7 గంటలకు రామకృష్ణాపురం చెరువు వద్దకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, కామేష్ వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్ లో మౌనిక పేర్కొంది. తనకు, తన చెల్లెలికి మధ్య కామేష్ చిచ్చుపెట్టాడని అందులో రాసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామేష్ ను కఠినంగా శిక్షించాలని బాధితుల తరపు వారు డిమాండ్ చేస్తున్నారు.

మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ 156 వ షోరూం ను చందానగర్ లో ప్రారంభించారు

06/08/2016: హైదరాబాద్, సలాం తెలంగాణ: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ 156 వ షోరూం ను చందానగర్ లో ఆగష్టు 5న ప్రారంభించారు. ప్రముఖ సినీ నటి తమ్మన్నా భాటియా, MLA శేర్లింగంపల్లి అరికెపుడి గాంధీ ఈ షోరూం ను ప్రారంభించారు.

అవకతవకల ‘మిషన్’ను ప్రారంభించొద్దు

05/08/2016: హైదరాబాద్: అవకతవకలు, అబద్ధాలతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వ్యక్తిగత ప్రచారం చేసుకుంటున్న మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించొద్దని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రధాని ఈ నెల 7న మెదక్ జిల్లా గజ్వేల్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయనకు ఉత్తమ్ గురువారం లేఖ రాశారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పూర్తి చేసిన పథకానికి మిషన్ భగీరథగా కేసీఆర్ పేరు మార్చి ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సుజల స్రవంతి ప్రాణహిత-చేవెళ్ల పథకంలో భాగంగా హైదరాబాద్‌కు 30 టీఎంసీల నీటిని తరలించేందుకు తమ ప్రభుత్వం 2008లో భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సుజల స్రవంతి పేరుతో ఈ పథకాన్ని చేపట్టిందని ఉత్తమ్ వివరించారు. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటిని అందించడానికి ఎల్లంపల్లి జలాశయం నుంచి మొదటి దశలో 10 టీఎంసీలు తరలించేందుకు రూ. 3,350 కోట్లతో 2008లోనే పనులు ప్రారంభించిందన్నారు. భూసేకరణ, పైపులైన్ల నిర్మాణం, ప్రాజెక్టుల నిర్మాణానికి హడ్కో రూ. 1,564 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,955.83 కోట్లు ఖర్చు చేసిందన్నారు. మార్గమధ్యలోని అన్ని గ్రామాలకు తాగునీటిని అందించడం కూడా ఈ ప్రాజెక్టులో భాగమేనన్నారు. గజ్వేల్ మీదుగా చేపట్టిన ఈ పనులన్నీ 2015లోనే పూర్తయ్యాయన్నారు. అందువల్ల ఈ ప్రాజెక్టును ప్రధానిగా ప్రారంభించడం సరికాదని ఉత్తమ్ హెచ్చరించారు. ఈ విషయంలో కావాలంటే బీజేపీ రాష్ట్రశాఖ నుంచి కూడా వివరాలు తీసుకోవాలని సూచించారు. కాగా, రాష్ట్రానికి తొలిసారి వస్తున్న సందర్భంగా ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలను, ఆ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలను, హక్కులను అమలుచేసేలా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కోరారు. జాతీయ నేతలను అవమానించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

నగరంలో ఓవర్ నైట్ సెలబ్రిటీ వెంకటయ్య

05/08/2016: రాజేంద్రనగర్‌: జాతీయ స్థాయిలో ఉత్తమ పారిశుద్ధ్య కార్మికుడిగా ఎంపికైన రాజేంద్రనగర్‌ గగన్‌పహాడ్‌కు చెందిన వెంకటయ్యకు రాష్ట్ర పురపాలక, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ రూ.1,11,116 చెక్కును అందజేశారు. దక్షిణ మండల జీహెచ్‌ఎంసీ కార్యాలయం నుంచి రూ.లక్ష, ఖర్చులకు మరో రూ.10 వేల చెక్కులను గురువారం అందించారు. శుక్రవారం సాయంత్రం వెంకటయ్య ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయనతో పాటు రాజేంద్రనగర్‌ సర్కిల్‌ శానిటరీ సూపర్‌వైజర్‌ ఆంజనేయులు వెళ్తున్నారు. విమాన టిక్కెట్లను గురువారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ కార్పొరేటర్‌ శ్రీనివాస్‌రెడ్డి వారికి అందజేశారు. తాను విమానంలో ప్రయాణిస్తానని కలలో కూడా అనుకోలేదని వెంకటయ్య అన్నారు. అభినందనలు మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ సర్కిల్‌ కార్యాలయంలో గురువారం వెంకటయ్యను సత్కరించారు. ఢిల్లీ వెళ్లేందుకు ప్రయాణ ఖర్చుల కోసం రూ.25 వేలు అందజేశారు. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆయనను అభినందించారు. అంతా కలగా ఉంది.. గత మూడు రోజులుగా తనకు అంతా కలగా ఉందని వెంకటయ్య ‘సాక్షి’తో చెప్పారు. అందరూ తనను అభినందిస్తున్నారని... టీవీలు, పేపర్లలో తన ఫొటో కనిపిస్తోందని..కుటుంబ సభ్యులతో పాటు చుట్టు పక్కల వారు, బంధువులు అభినందిస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఎల్బీనగర్‌ లో రకుల్‌

05/08/2016: మన్సూరాబాద్‌: అందాల తార రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గురువారం ఎల్‌బీనగర్‌లో సందడి చేశారు. లక్ష్మీ పద్మవంశీ హ్యాండ్లూమ్స్, టెక్ట్స్‌టైల్స్‌ మార్కెట్‌ (ఎల్‌పీటీ) ట్రస్ట్‌ ఆద్వర్యంలో నూతనంగా నిర్మించిన ఎల్‌పీటీ మార్కెట్‌ను ఆమెతో పాటు ప్రముఖ దర్శకుడు ఎన్‌.శంకర్‌ ప్రారంభించారు. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో జాతీయ ర హదారిపై ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ట్రస్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షులు జెల్ల బిక్షమ్, ఉపాధ్యక్షులు పద్మశ్రీ గజం గోవర్థన్, ప్రధాన కార్యదర్శి కొంగరి లక్ష్మీనారాయణ, కోశాధికారి చెరుపల్లి నర్సింహ, సంయుక్త కార్యదర్శి గండూరి శంకర్, శాశ్వత సభ్యులు గోశిక యాదగిరి, సభ్యులు జెల్ల నర్సింహ, పిల్లలమర్రి అశోక్, రాపోలు రవి, నామని అయోధ్య, జెల్ల గణేష్, గంజి కైలాసం, మహంకాళి శ్రీనివాస్, పున్న శ్రీశైలం, పెద్ది జగదీష్, కోమటి సత్యనారాయణ, పున్న రమణ విశ్వనాథ్, కోట కృష్ణ, తిరందాసు హనుమంతు, పున్న దశరథ తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్‌ వయా సోషల్‌ మీడియా!

05/08/2016: హైదరాబాద్: సిటీలో జరుగుతున్న మాదకద్రవ్యాల దందాలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సింథటిక్‌ డ్రగ్‌గా పిలిచే ఎల్‌ఎస్డీ విక్రయం కోసం సాద్‌ మహ్మద్‌ అనే విద్యార్థి సోషల్‌ మీడియా ను వేదికగా చేసుకున్నాడు. వాట్సాప్, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ల ద్వారా కస్టమర్లతో సంప్రదింపులు జరిపాడని టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ లింబారెడ్డి గురువారం వెల్లడిం చారు. పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బోయిన్‌పల్లి ప్రాంతంలో ముగ్గురిని పట్టుకుని బోల్ట్స్ గా పిలిచే 32 ఎల్‌ఎస్డీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. స్నేహితులతో కలిసి దందా... తన స్నేమితుడైన న్యూ బోయిన్‌పల్లి వాసి మహ్మద్‌ ముబీనుద్దీన్‌తో కలిసి దందాకు శ్రీకారం చుట్టాడు. ఇద్దరూ కలిసి గోవా నుంచి ఒక్కో బోల్ట్‌ రూ.500 చొప్పున ఖరీదు చేసుకుని వచ్చే వారు. వీటిని నగరంలోకి కొందరు విద్యార్థులతో పాటు మరికొందరికి రూ.1700 నుంచి రూ.2 వేలకు (ఒక్కొక్కటి) విక్రయించే వారు. ఓ సందర్భంలో వీరి వద్ద ఎల్‌ఎస్డీ ఖరీదు చేసిన న్యూ బోయగూడకు చెందిన విద్యార్థి నిఖిల్‌ రోయిచ్‌ ఈ ముఠాలో చేరి విక్రయాలకు సహకరిస్తున్నాడు. తన ‘కస్టమర్లు’, స్నేహితులతో వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసిన సాద్‌ దాంతో పాటు ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ ద్వారానూ ఎల్‌ఎస్డీ క్రయవిక్రయాల లావాదేవీలు నెరపేవాడు. మే నెల్లో కసోల్‌ వెళ్లిన సాద్‌ అక్కడ నుంచి డ్రగ్స్‌ తెచ్చి విక్రయించాడు. ఇతడు కొన్ని సందర్భాల్లో మాదాపూర్‌కు చెందిన ప్రతీక్‌ బెజ్జం నుంచీ ఎల్‌ఎస్డీ ఖరీదు చేశాడు. వలపన్ని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌... ఈ త్రయం వ్యవహారాలపై వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎల్‌.రాజావెంకటరెడ్డికి సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో ఎస్సైలు ఎం.ప్రభాకర్‌రెడ్డి, పి.మల్లికార్జున్, ఎల్‌.కిషోర్, ఎల్‌.భాస్కర్‌రెడ్డి తమ బృందాలతో గురువారం బోయిన్‌పల్లిలోని డైమండ్‌ పాయింట్‌ హోటల్‌ వద్ద వలపన్నారు. అక్కడకు వచ్చిన సాద్, ముబీనుద్దీన్, నిఖిల్‌లను అరెస్టు చేశారు. వీరి వద్ద విక్రయానికి సిద్ధంగా ఉన్న 32 బోల్ట్స్‌ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రతీక్‌ కోసం గాలిస్తున్నారు. కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం సీసీఎస్‌ అధికారులకు అప్పగించార వినియోగం నుంచి విక్రయం దాకా... సికింద్రాబాద్‌ పరిధిలోని బోయిన్‌పల్లికి చెందిన విద్యార్థి సాద్‌ మహ్మద్‌. ఇతడు నాలుగో తరగతిలో ఉండగానే తండ్రి దూరం కావడంతో తల్లితో కలిసి మేనమామ వద్ద ఉంటున్నాడు. ఇంటర్మీడియట్‌ చదువుతుండగా డానియల్‌ అనే స్నేహితుడి ద్వారా గంజాయి సేవించడానికి అలవాటుపడ్డాడు. ఆపై రాఘవేంద్ర అలియాస్‌ రాఘవ ద్వారా ఎల్‌ఎస్డీ బోల్ట్స్ కు బానిసయ్యాడు. తరచూ గోవాతో పాటు హిమాచల్‌ప్రదేశ్‌లోని కసోల్‌ వెళొచ్చే సాద్‌ అక్కడి నుంచి ఈ డ్రగ్‌ను ఖరీదు చేసేవాడు. ఈ ఎల్‌ఎస్డీకి నగరంలో మంచి డిమాండ్‌ ఉందని గుర్తించిన సాద్‌ వినియోగించడంతో పాటు ‘కస్టమర్ల’కు విక్రయించడం సైతం ప్రారంభించాడు. డిజైన్‌ మధ్యలో డ్రగ్‌... లినర్జిక్‌ యాసిడ్‌ డై థైలామెడ్‌ (ఎల్‌ఎస్డీ) మాదకద్రవ్యం వాస్తవానికి ఘనరూపంలో కనిపించే ద్రావణం. కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో దీన్ని బ్లాటింగ్‌ పేపర్‌పై పూతలా ఏర్పాటు చేస్తారు. ఇలా పూత ఏర్పాటుకు ముందు ఆ కాగితంపై ఓ డిజైన్‌ రూపొందిస్తారు. కంప్యూటర్‌ సహాయంతో అలాంటి డిజైన్‌ ఉన్న కాగితాలను ఒకే సైజులో, పెద్ద సంఖ్యలో తయారు చేస్తారు. ఈ కాగితాలపై ఎల్‌ఎస్డీ పూసే విధానం పూతరేకు చుట్టల తయారీని పోలి ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. పూతరేకులపై పంచదార ఎలా వేస్తారో... బ్లాటింగ్‌ పేపర్‌పై ఎల్‌ఎస్‌డీ ద్రావణాన్ని అదేవిధంగా పూస్తారు. ఈ కాగి తాన్ని మామూలుగా చూస్తే ఓ డిజైన్‌ తో కూడిందిగా మాత్రమే కనిపిస్తుంది.

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నగర విద్యార్థి మృతి

05/08/2016: హైదరాబాద్: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్న నగరవాసి రాచమల్ల విక్రమ్‌గౌడ్(24) అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లో నివాసముండే విక్రమ్ నగరంలోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తిచేశాడు. కొద్దికాలంపాటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన అతను గతేడాది డిసెంబర్ 31న కాలిఫోర్నియాలోని సిలికాన్‌వ్యాలీ యూనివర్సిటీలో ఎంఎస్ చేసేందుకు వెళ్లాడు. హైదరాబాద్‌కే చెందిన మరో ఆరుగురు విద్యార్థులతో కలసి కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. గత శుక్రవారం నలుగురు స్నేహితులతో కలసి సినిమాకు వెళ్లాడు. అర్ధరాత్రి 2.30 సమయంలో వీరంతా తిరిగి వస్తుండగా కారుకు అడ్డంగా గుర్తు తెలియని వ్యక్తి రావడంతో సడన్ బ్రేక్ వేయగా.. కారు పల్టీలు కొట్టడంతో వెనక సీట్‌లో కూర్చున్న విక్రమ్ అక్కడికక్కడే మృతిచెందగా.. మిగతా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విక్రమ్ మృతదేహం శుక్రవారం ఉదయం నగరానికి రానుంది. విక్రమ్ మరణంతో అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన కొడుకు శవమయ్యాడని తెలిసి విక్రమ్ తల్లిదండ్రులు కృష్ణగౌడ్, అనుపమ కన్నీరుమున్నీరవుతున్నారు. ఎంఎస్ పూర్తికాగానే మళ్లీ నగరానికి వచ్చి ఉద్యోగం చేయాలని విక్రమ్ కలలు కన్నాడని ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు.

ఆలయంలో ఆశ్రయం...ప్రసాదమే ఆహారం!

04/08/2016: చిలకలగూడ: ఆమె కోట్ల రూపాయలకు అధిపతి.. కానీ దేవుని ప్రసాదంతో కడుపు నింపుకోవాల్సిన దైన్య స్థితి. చిన్నతనంలో తన చేతి గోరుముద్దలు తిన్న బిడ్డలు... వృద్ధాప్యంలో ఆదరించకపోవడంతో పదిహేనేళ్లుగా ఆలయం చెంతనే ఆశ్రయం పొందుతోంది. కష్టాలు భరించలేని ఆ తల్లి చివరకు తనకు రావాల్సిన ఆస్తి కోసం కొడుకులు ఉంటున్న అపార్ట్‌మెంట్‌ ముందు ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. ఆమె మెట్టుగూడకు చెందిన కిమాబాయి పునేరియా (72). బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్‌ మెట్టుగూడకు చెందిన ద్వారకదాసు, కిమాబాయి పునేరియాలు భార్యాభర్తలు. వీరికి నలుగురు కొడుకులు, నలుగురు కుమార్తెలు. తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తితోపాటు వ్యాపారంలో రూ.కోట్ల విలువైన చర, స్థిరాస్థులను సంపాదించిన ద్వారకదాసు 2001లో మృతిచెందాడు. అప్పటికే భార్య కిమాబాయితో పాటు బిడ్డలకూ ఆస్తిని సమానంగా పంచి పెట్టాడు. భర్త మరణంతో కిమాబాయికి సమస్యలు మొదలయ్యాయి. ఒత్తిడి చేసి ఆస్తిని చేజిక్కించుకున్న కుమారులు ఆనక అమ్మ ముఖం చూసేందుకు నిరాకరించారు. కుమారులతో పాటు వారి కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక ఆ తల్లి యాదగిరిగుట్టకు వెళ్లి దైవసేవలో గడుపుతోంది. భక్తులు పెట్టే ప్రసాదంతో కడుపు నింపుకుంటోంది. కుమారులు జల్సాలు చేస్తుంటే...రూ.కోట్లకు అధిపతినైన తానెందుకు కష్టాలు పడాలని భావించింది. తన ఆస్తి ఇవ్వాలని కోరుతూ మెట్టుగూడలో కుమారులు ఉంటున్న అపార్ట్‌మెంట్‌ ముందు బుధవారం సాయంత్రం ధర్నాకు దిగింది. ‘నా ఆస్తి ఇస్తే... ఇటువంటి కుమారుల చేతిలో బాధ పడుతున్న తల్లుల కోసం ఏర్పాటు చేసే వృద్ధాశ్రమం, అనాథ శరణాలయాలకు విరాళంగా అందజేస్తానని కిమాబాయి మీడియాకు తెలిపింది. «సన్నిహితుల సలహాతో ధర్నా విరమించి... కుమారులపై చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్ని ఆస్తులపై వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉందని... కొంతమంది కావాలనే తమ తల్లితో కలిసి ఈ విధంగా చేస్తున్నారని ఆమె కుమారులు తెలిపారు.

పూరి ఆకాష్‌ సందడి

04/08/2016: బంజారాహిల్స్‌: ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ తనదైన శైలిలో సందడి చేశారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌లో సాఫ్ట్‌ బూట్‌ టెక్నాలజీస్‌ 16వ వార్షిక ఆత్మీయ సమ్మేళనానికి ఈ యువ హీరో ముఖ్య అతిథిగా విచ్చేశారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లతో కలిసి సందడి చేశారు. కేక్‌ కట్‌ చేశారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు యువతులు పోటీపడ్డారు. కార్యక్రమంలో భాగంగా ఉద్యోగుల ఆట, పాటలు అలరించాయి. ఈ కార్యక్రమంలో సంస్థ ఎమ్‌డీ విజయ్‌భాస్కర్, డైరెక్టర్‌ నారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

నగర రోడ్లపై సీఎం దృష్టి

04/08/2016: హైదరాబాద్: అడుగుకో గుంతతో అధ్వాన్నంగా మారిన నగర రహదారుల దుస్థితిపై సీఎం కేసీఆర్‌ సీరియస్‌గా దృష్టి సారించారు. ఇటీవలి కాలంలో రోడ్ల గురించి ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన బుధవారం నగర రహదారులు, ట్రాఫిక్‌ తదితర సమస్యలపై జీహెచ్‌ఎంసీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రోడ్లతో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీర్చిదిద్దేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తొలిదశలో పైలట్‌ ప్రాజెక్టుగా వంద కిలోమీటర్ల మేర ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ట్రాఫిక్‌ ఫ్రీగా వెళ్లేందుకు సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. నివేదిక అందగానే సదరు మార్గాల్లో దీర్ఘకాలం మన్నికగా ఉంటే వైట్‌టాపింగ్‌ రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. కాగా నగరంలోని ఆయా మార్గాల్లో దాదాపు 60 కి.మీ.ల మేర నిర్వహించిన సమగ్ర అధ్యయన నివేదికలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. పనుల్ని త్వరితంగా చేపట్టేందుకు వాటిని పరిగణనలోకి తీసుకోనున్నారు. వాటితోపాటు మరో 40 కి.మీ.ల మేర కూడా సమగ్ర అధ్యయనం నిర్వహించి వైట్‌టాపింగ్‌ రోడ్ల పనులు చేపట్టనున్నారు. సమావేశం సందర్భంగా జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ దిగువ అంశాలను కూడా సీఎం దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. వైట్‌ టాపింగ్‌ రోడ్ల వ్యయం ఇలా... ∙ వైట్‌టాపింగ్‌ లేన్‌ కి.మీ.కు అయ్యే వ్యయం.. జీహెచ్‌ఎంసీ అంచనా : రూ. 45 లక్షలు ∙ మన్నిక సమయం: 15 – 20 సంవత్సరాలు ∙ నిర్వహణ వ్యయం: 15 ఏళ్ల వరకు అవసరం లేదు. ∙ సిమెంట్‌ ఉత్పత్తిదారులు సమాఖ్య(సీఎంఏ) అంచనా: రూ. 51 లక్షలు బీటీ రోడ్ల వ్యయం ఇలా... ∙ లేన్‌ కి.మీ.కు బీటీ రోడ్డుకు చేస్తున్న ఖర్చు : రూ. 30 లక్షలు ∙ ఐదేళ్లకోమారు వంతున బీటీ నిర్వహణ కయ్యే ఖర్చులు 15 ఏళ్లకు : రూ. 37.50 లక్షలు ∙ 15 సంవత్సరాలకు వైట్‌టాపింగ్‌కు జీహెచ్‌ఎంసీ/సీఎంఏ అంచనా మేరకు :రూ.45/51లక్షలు ∙ బీటీ రోడ్లు నిర్వహణ ఖర్చులతో కలుపుకొని 15 సంవత్సరాలకు..: రూ. 67.50 లక్షలు ∙ వైట్‌ టాపింVŠ వేస్తే ఆదా అయ్యే వ్యయం 50 శాతం/ 32 శాతం(సీఎంఏ అంచనా) ∙ భూగర్భ కేబుళ్లు, విద్యుత్‌ లైన్ల తరలింపు తదితర పనులు కాకుండా ఇది కేవలం రోడ్డు నిర్మాణ ఖర్చు. ∙ వైట్‌టాపింగ్‌ పనులకు కి.మీ. రోడ్డుకు నిర్మాణం , క్యూరింగ్‌తో కలిపి కనిష్టంగా 3 రోజులు, గరిష్టంగా 5 రోజులు సమయం పడుతుంది. దీనివల్ల ఎక్కువ రోజులు ట్రాఫిక్‌ మళ్లించాల్సిన పని ఉండదు. ∙ ఒకసారి రోడ్డు వేశాక తిరిగి తవ్వకూడదు. – జీహెచ్‌ఎంసీలో మొత్తం రోడ్లు : 9059.20 కి.మీ. వదరనీటి కాలువలు : 1555.22 కి.మీ. – శివార్లలో భూగర్భ డ్రైనేజీ : 123.22 కి.మీ.(జలమండలి) – కోర్‌సిటీలో భూగర్భ డ్రైనేజీ : 6000 కి.మీ.(జలమండలి) – విద్యుత్‌ కేబుళ్లు: 2000 కి.మీ.

స్వామిరారా.. సినిమాను మరిపించే దొంగలు

04/08/2016: రాంగోపాల్‌పేట: నగరంలో కాస్త విరామం తర్వాత సూడో పోలీసులు అలజడి చేశారు. సికింద్రాబాద్‌లోని మహంకాళి ఠాణా పరిధిలో బుధవారం ఉదయం పంజా విసిరిరారు. బ్రౌన్‌షుగర్‌ అక్రమ రవాణా అనుమానమంటూ తనిఖీలు చేసి చెన్నైకి చెందిన వ్యాపారి నుంచి రూ.7.5 లక్షలు తస్కరించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నేరం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే సూడో పోలీసుల ‘డెన్‌’ ఉందనే అనుమానంతో ఆరా తీస్తున్నారు. తమిళనాడులోని చెన్నై సమీపంలో ఉన్న సేలంకు చెందిన జ్యువెలరీ వ్యాపారి గోపీనాథ్‌ అక్కడ వెండి ఆఖరణాలు తయారు చేసుకువచ్చి, నగరంలో వ్యాపారస్తులకు విక్రయిస్తుంటారు. చెన్నై–హైదరాబాద్‌ మధ్య వెండి ధరలో రూ.మూడునాలుగొందల వ్యత్యాసం ఉంటోంది. దీంతో ఇక్కడే వెండి ఖరీదు చేసుకుని వెళ్లే గోపీనాథ్‌... ఆభరణాలు, వస్తువులు తయారు చేసి మళ్లీ నగరానికే తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. దీనికోసం వారానికి ఓ రోజు హైదరాబాద్‌ రావడం పరిపాటి కావడంతో బస చేయడానికి సుభాష్‌రోడ్‌లో ఒక చిన్న గది అద్దెకు తీసుకున్నాడు. గది సమీపంలోనే ఘటన... ఎప్పటిలానే సేలం నుంచి ప్రైవేట్‌ బస్సులో వచ్చిన గోపీనాథ్‌ బుధవారం ఉదయం 8.30 గంటలకు లక్డీకపూల్‌లో దిగాడు. రెండు బ్యాగులతో వచ్చిన ఆయన అక్కడ నుంచి ఆటోలో సుభాష్‌రోడ్‌కు చేరుకున్నాడు. తాను నివసించే గది సమీపంలోనే బటర్‌ఫ్లై బేకరీ వద్ద ఆటో దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే సైకిళ్లపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గోపీనాథ్‌ను ఆపి తాము పోలీసులమని పరిచయం చేసుకున్నారు. మీ బ్యాగులో మాదకద్రవ్యమైన బ్రౌన్‌షుగర్‌ ఉన్నట్లు సమాచారం వచ్చిందంటూ బెదిరించారు. తనిఖీలు చేయాలంటూ బ్యాగు తెరిచి చూపించాలని ఆదేశించారు. దీంతో గోపీనాథ్‌ అలానే చేయగా... ఒక దాంటో ఉన్న 25 కేజీల వెండి ఆభరణాలు, మరో బ్యాగ్‌లో రూ.20 లక్షల నగదు ఉన్నాయి. ఓపక్క తనిఖీలు చేస్తున్నట్టు నటిస్తున్న ఆ ద్వయం అదును చూసుకుని బాధితుడి దృృష్టి మరల్చింది. బ్యాగ్‌లో ఉన్న రూ.20 లక్షల నుంచి రూ.7.50 లక్షలు తస్కరించింది. ఆపై యథావిధిగా గోపీనా«థ్‌ను పంపేసింది. తన రూమ్‌కు వెళ్ళాక విషయం గుర్తించిన బాధితుడు మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ దర్యాప్తు చేపట్టారు. వివిధ కోణాల్లో దర్యాప్తు... ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న మహంకాళి పోలీసులు ఘటనాస్థలికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలోనే సైకిళ్లపై వస్తున్న ఇద్దరు అనుమానితుల్ని గుర్తించారు. ఆ ఇద్దరిలో ఒకరు 50 ఏళ్లు, మరొకరు 40 ఏళ్ల వయస్కులని పోలీసులు అంచనా వేశారు. వీరు ఎక్కువ దూరం నుంచి సైకిల్‌ పైన రాలేరని, ఆ సమీపంలోనే వీరి డెన్‌ ఉంటుందని అనుమానిస్తూ ఆరా తీస్తున్నారు. మరోపక్క ఈ నేరం ఉదయం జరగడం, అప్పుడో గోపీనాథ్‌కు సేలం నుంచి రావడంతో ఆయనకు తెలిసిన వారి ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

హీరోలకు ఐటెం పాటలే నచ్చుతాయి

03/08/2016: హైదరాబాద్: తెలుగు సినీ రంగంలో నాకున్న మ్యూజికల్‌ హిట్స్‌ ఏ దర్శకుడికీ లేవని, అందుకు కారణం గొప్ప సంగీత దర్శకులు దొరకడమేనని మాజీ కేంద్రమంత్రి, దర్శకరత్న, రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత డాక్టర్‌ దాసరి నారాయణ రావు అన్నారు. యువకళావాహిని ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్రభారతిలో ఎస్‌ కొండలరావు అధ్యక్షతన దర్శకరత్న డాక్టర్‌ దాసరి నారాయణ రావుకు స్వరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇప్పుడు రికార్డ్‌ డ్యాన్స్‌ల సంగీతమే హీరోలకు సంగీతమై కూర్చుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదుర్తి సుబ్బారావు నా అభిమాన దర్శకుడన్నారు. గాయనీ శారద తన అభిమాని చెప్పారు. ప్రజానటి జమున , సినీ నటుడు డాక్టర్‌ కైకాల సత్యనారాయణ, కోడి రామకృష్ణ మాట్లాడుతూ చలన చిత్ర రంగానికి మేస్త్రీ దాసరి అన్నారు. శారద ఆకునూరి బృందంచే ఇది మేఘసందేశమో దాసరి చలనచిత్ర సంగీత విభావరి ఆకట్టుకుంది.Sకార్యక్రమంలో ప్రముఖ నటులు జీవీ నారాయణ రావు, లయన్‌ వైకే నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

ఎలుక చంపింది..సిగరెట్‌ కాపాడింది..!

03/08/2016: చిలకలగూడ : చిలకలగూడ పాత పోలీస్‌స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి పురాతన భవనం కూలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా ఈ ఘటనలో ఎలుకల మందు పెట్టబోయి ఒకరు ప్రాణాలు కోల్పోగా, సిగరెట్‌ కోసం వెళ్లి మరొకరు ప్రాణాలు కాపాడుకున్నారు. వివరాల్లోకి వెళితే..కూలిపోయిన భవనంలో కొనసాగుతున్న అక్బర్‌ చికెన్‌ షాపులో భవానీనగర్‌కు చెందిన మహ్మద్‌వాజిద్‌ (29) చిలకలగూడకు చెందిన రెహమాన్‌ పని చేసేవారు. సోమవారం రాత్రి ఇద్దరు కలిసి షాపును శుభ్రం చేశారు. యజమాని అదేశాల మేరకు వాజిద్‌ ఎలుకల మందు పెట్టేందుకు లోపలకు వెళ్లగా,అక్బర్‌ దుకాణం ఎదుట నిల్చున్నాడు. రహమాన్‌ సిగరెట్‌ కోసం బయటకు వెళ్లాడు. అదే సమయంలో భవనం కుప్పకూలడంతో శిథిలాల కింద చిక్కుకున్న అక్బర్, వాజిద్‌ మృతిచెందగా, సిగరెట్‌ కోసం వెళ్లిన రెహమాన్‌ ప్రాణాలతో భయటపడ్డాడు. కాగా అంతకు కొన్ని నిమిషాల ముందే అదే రహదారిలో పలహారంబండి ఊరేగింపు వెళ్లిన తర్వాత ఈ ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది.

శంషాబాద్ చేరుకున్న వలస కార్మికుడి మృతదేహం

03/08/2016: హైదరాబాద్ : మలేషియాలో అనారోగ్యంతో చనిపోయిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వలస కార్మికుడి మృతదేహం బుధవారం శంషాబాద్‌కు చేరుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనుడు దేవ్‌సింగ్ జూన్ 10వ తేదీన ఉపాధి కోసం మలేషియా వెళ్లాడు. మాయమాటలు చెప్పి నగదు తీసుకుని మలేషియా పంపిన ఏజెంట్ రాజేందర్..అనంతరం అతడిని పట్టించుకోలేదు. దీంతో అక్కడికి వెళ్లిన దేవ్‌సింగ్ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు. స్థానికంగా అతడిని పట్టించుకునే వారు లేకపోవటంతో అక్కడే చనిపోయాడు. రాజేందర్ ఫీజు చెల్లించకపోవటంతో ఆస్పత్రిలోనే అతడి మృతదేహం ఉండిపోయింది. దీంతో రాజేందర్ కుటుంబసభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి... మలేషియాలోని తెలంగాణ ఎన్నారై సంక్షేమ సంఘంతో మాట్లాడింది. ఎన్నారై సంక్షేమ సంఘం వారు రంగంలోకి దిగి రాజేందర్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. అందులోభాగంగా రాజేందర్ మృతదేహం బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అనంతరం రోడ్డు మార్గం ద్వారా అతడి మృతదేహన్ని స్వగ్రామానికి తరలిస్తున్నారు. అందుకోసం అధికారులు ఏర్పాటు చేశారు.

నగరంలోని డేంజర్ స్పాట్స్ - సిటీలో 46 ప్రాంతాల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు

02/08/2016: హైదరాబాద్: బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో చిన్నారి రమ్యతో పాటు ఆమె కుటుంబంలో మరో ఇద్దరు ప్రాణాలు తీసిన ప్రాంతం బ్లాక్‌ స్పాటే. ఆ ప్రాంతంలో పది రోజుల వ్యవధిలో దీంతో పాటు మరో రెండు యాక్సిడెంట్స్‌ చోటు చేసుకున్నాయి. అయితే వాటిలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. నగరంలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించడానికి సన్నాహాలు చేస్తున్న నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు బ్లాక్‌స్పాట్స్‌పై దృష్టి పెట్టారు. తరచు ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను గుర్తించి, కారణాలను అధ్యయనం చేయడంతో పాటు నివారణ చర్యలకు కసరత్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నగరంలోని 25 ట్రాఫిక్‌ ఠాణాల పరిధిలో నిర్వహించిన స్టడీలో 46 నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారుతున్న బ్లాక్‌స్పాట్స్‌(డేంజర్‌ స్పాట్స్‌) ఉన్నట్లు గుర్తించారు. రెండేళ్ళ గణాంకాలతో స్టడీ... సిటీలో బ్లాక్‌స్పాట్స్‌గా పరిగణించే ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించడానికి ట్రాఫిక్‌ పోలీసులు శాంతిభద్రతల విభాగం అధికారుల సహాయం తీసుకున్నారు. గడిచిన రెండేళ్ళ వ్యవధిలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల జాబితాలను సేకరించి అధ్యయనం చేశారు. ఒకే ప్రాంతం, స్టెచ్‌లో రెండు కంటే ఎక్కువ యాక్సిడెంట్స్‌ చోటు చేసుకున్న ప్రాంతాలను గుర్తించారు. వీటిలో యాదృచ్ఛికంగా జరిగిన వాటిని మినహాయించారు. ఇంజినీరింగ్‌ సహా ఇతర లోపాల వల్ల చోటు చేసుకున్న ప్రమాదాలకు ప్రాధాన్యం ఇస్తూ ఆయా ప్రాంతాలను గుర్తించారు. 18 ఠాణాల పరిధిలో ‘జోన్స్‌’... నగర ట్రాఫిక్‌ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 25 ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. వీటిలో కేవలం ఏడింటి పరిధిలో మాత్రమే బ్లాక్‌స్పాట్స్‌ లేవని తేలింది. మిగిలిన 18 ట్రాఫిక్‌ ఠాణాల పరిధిలోనూ తరచుగా ప్రమాదాలు చోటు చేసుకునే బ్లాక్‌స్పాట్స్‌ ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వీటిలోనూ మూడు పోలీసుస్టేషన్ల పరిధిలో నాలుగేసి, పదింటి పరిధిలో మూడేసి చొప్పున యాక్సిడెంట్స్‌ స్పాట్స్‌ ఉన్నట్లు ట్రాఫిక్‌ విభాగం అధికారులు గుర్తించారు. ప్రధానంగా ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌లో (ఐఆర్‌ఆర్‌) విస్తరించిన ఉన్న ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్లు పరిధుల్లోనే బ్లాక్‌స్పాట్స్‌ ఎక్కువగా ఉంటున్నాయని తేలింది. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలు చోటు చేసుకోవడానికి కారణాలనూ స్థానిక అధికారుల సాయంతో అధ్యయనం చేశారు. అంతా కలిసి పని చేయాలని: ‘రోడ్డు భద్రత కోణంలో హైదరాబాద్‌ను సేఫ్‌ సిటీగా మార్చడం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. దీనికోసం కేవలం ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం అధికారులే కాకుండా మిగిలిన విభాగాలతోనూ కలిసి పని చేయాలని నిర్ణయించాం. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ప్రణాళికలు సిద్ధం చేయడానికే బ్లాక్‌స్పాట్స్‌తో పాటు కారణాలను అధ్యయనం చేశాం. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసుల బాధ్యతగా చిన్న చిన్న మార్పులు చేపట్టడంతో పాటు విధుల్లో ఉండే సిబ్బంది సంఖ్యను పెంచుతున్నాం. ఇంజినీరింగ్‌ సహా ఇతర లోపాలను గుర్తించిన చోట్ల వాటిని సరిచేయాలని కోరుతూ ఆయా విభాగాలకు నివేదికలు అందిస్తున్నాం. ఉన్నతాధికారులతో జరిగే ఉమ్మడి సమావేశాల్లో సిఫార్సుల అమలు స్థితిగతుల్ని పరిశీలించే ఏర్పాట్లు జరిగాయి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, అవసరమైన అనుమతులు లేకుండా తవ్వకాలు, మరమ్మతులు చేపట్టవద్దని ఇప్పటికే స్పష్టం చేశాం’ – ఏవీ రంగనాథ్, ట్రాఫిక్‌ డీసీపీ

స్వైన్‌ ఫ్లూ కలకలం

02/08/2016: హైదరాబాద్: నగరంలో మళ్లీ స్వైన్‌ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. నిన్న,మొన్నటి వరకు కలరా, డెంగీ, మలేరియా వంటి జ్వరాలతో సతమతమైన సిటీజన్లు తాజాగా స్వైన్‌ఫ్లూతో బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా బోయగూడకు చెందిన రేవతి(4) తీవ్రమైన జ్వరం, తలనొప్పి, జలుబు వంటి సమస్యలతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు సోమవారం ఆమెను గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు అనుమానిత స్వైన్‌ఫ్లూ కేసుగా నమోదు చేసుకుని చికిత్స అందిస్తున్నారు. బాలిక నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ కో సం ఐపీఎంకు పంపారు. ప్రస్తుతం వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల రుస్తున్న ఎడతెరపి లేని వర్షాలు, చలిగాలుల కారణంగా వాతావరణంలో హెచ్‌1ఎన్‌1 స్వైన్‌ఫ్లూ కారక వైరస్‌ బలపడుతోంది. ఇది ఒకరి నుంచి ఒకరికి సులభంగా విస్తరించే అవకాశం ఉండటంతో బస్తీవాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఎవరికి వారు వ్యక్తిగత శుభ్రత పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. నిజాలు.. నివారణలు.. ► తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వైరస్‌ గాలిలోకి ప్రవేశిస్తుంది. ► ఇలా ఒకసారి బయటికి వచ్చిన వైరస్‌ వాతావరణంలో రెండుగంటలకుపైగా జీవిస్తుంది. ► గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు, ఊబకాయులకు వ్యాపించే అవకాశం ఉంది. ► సాధారణ ఫ్లూ జ్వరాలు వచ్చే వ్యక్తిలో కన్పించే లక్షణాలన్నీ స్వేన్‌ఫ్లూ బాధితుల్లో కనిపిస్తాయి. ► ముక్కు కారడం, దగ్గు, గొంతునొప్పి, తుమ్ములు, కళ్లవెంట నీరుకారడం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. ► ముక్కుకు మాస్కు ధరించండంతో పాటు తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. ► వీలైనంత ఎక్కువ సార్లు నీళ్లు తాగాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. ► జన సముహ ప్రాంతాలకు వెళ్లక పోవడమే ఉత్తమం. తీర్ధయాత్రలు, ప్రయాణాలు రద్దు చేసుకోవాలి. ► బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. ఇతరులకు షేక్‌హ్యాండ్‌ ఇవ్వడం, కౌగిలించుకోవడం చేయరాదు. ► చిన్న పిల్లలతో సహా ఎవరినీ ముద్దు పెట్టుకోకూడదు.

ప్రేమ.. కట్నం ముందు నిలవలేదు!

02/08/2016: బంజారాహిల్స్‌: ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ యువకుడు మూడు నెలలు గడవకముందే కట్నం కోసం భార్యను వేధించి పుట్టింటికి పంపేశాడు. దీంతో న్యాయం చేయాలని బాధిత యువతి సోమవారం జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ సమీపంలోని ఎల్లూరు గ్రామానికి చెందిన గాడుదుల లింగమ్మ, శివయ్య దంపతులు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 45లోని అంబేద్కర్‌నగర్‌ బస్తీలో గుడిసె వేసుకొని ఉంటున్నారు. వీరి కుమార్తె కృష్ణవేణి ఫిలింనగర్ మాగంటి కాలనీకి చెందిన కొడలూరి శ్రీకాంత్‌ ప్రేమించుకున్నారు. ఏప్రిల్‌ 29న పెద్ద అంగీకారంతో ఓ మహిళా మండలి నేతృత్వంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన రెండు రోజులకే శ్రీకాంత్‌ తన అసలు రూపం బయటపెట్టాడు. కట్నం తెస్తే గానీ కాపురం చేయనని భార్యకు చుక్కలు చూపించాడు. శ్రీకాంత్‌కు అతని తల్లి కూడా తోడైంది. అంతా కలిసి కృష్ణవేణిని చిత్రహింసలకు గురి చేశారు. వారు బయటకు వెళ్లేటప్పుడు ఆమెను ఇంట్లో బంధించి, సాయంత్రం వచ్చి తాళాలు తీసేవారు. రెండెకరాల పొలం, రెండు లక్షల నగదు, బంగారం తీసుకొస్తేనే కాపురానికి రా అంటూ ఇటీవల కృష్ణవేణిని భర్త పుట్టింటికి పంపేశాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులతో కలిసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది.

74 కి.మీ. ప్రయాణం.. పది గంటల సమయం! - హైదరాబాద్‌ బస్సుల రికార్డు ప్రయాణ సమయం

02/08/2016: హైదరాబాద్: సమయం మధ్యాహ్నం 2 గంటలు... ‘బీహెచ్‌ఈఎల్-ఎల్‌బీనగర్’ ఆర్డినరీ సిటీ బస్సు బీహెచ్‌ఈఎల్‌లో బయలుదేరింది. ట్రిప్పు పూర్తి చేసుకుని తిరిగి బీహెచ్‌ఈఎల్‌కు చేరుకునే సరికి రాత్రి 12 గంటలయింది. రాను.. పోనూ కలిపి 74 కిలోమీటర్ల దూరం. బస్సు వెళ్లిరావటానికి పడుతున్న సమయం 10 గంటలు. నగరంలో ట్రాఫిక్ సమస్యకు అద్దంపడుతున్న ఉదంతమిది. మెట్రో రైలు పనులు... వారం రోజులుగా భారీ వానలు... నగరంలో రోడ్లు గుంతలమయమై... వాహనదారులకు నిత్య నరకం చూపిస్తున్నాయి. ఇవేవీ పట్టనట్టు జీహెచ్‌ఎంసీ అలసత్వం ప్రదర్శించడంతో రహదారులపై బండి కదలడం గగనమైపోతోంది. దీనిపై ఆర్టీసీ సంస్థాగతంగా నిర్వహించిన ఓ సర్వే విస్తు కలిగించే విషయాలను వెల్లడించింది... ఒకే ట్రిప్పుతో ముగుస్తున్న డ్యూటీ.. ప్రస్తుతం నగరంలోని 28 డిపోల పరిధిలో 3,800 సిటీ బస్సులున్నాయి. మహేశ్వరం, మేడ్చల్ మినహా మిగతా డిపోల బస్సులు ఎక్కువగా నగరం పరిధిలో దూర ప్రయాణం చేస్తున్నాయి. వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల పరిస్థితి దారుణంగా మారింది. రోజులో సగటున 85 వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని కోల్పోవాల్సి వస్తోందని సర్వేలో తేలింది. పటాన్‌చెరు-హయత్‌నగర్, బీహెచ్‌ఈఎల్-ఎల్‌బీనగర్ లాంటి ఎక్కువ దూరం ప్రయాణించే రూట్లలో ఒక బస్సు కేవలం ఒకే ట్రిప్పునకు పరిమితమవుతోంది. డ్రైవర్ డ్యూటీలోకి వచ్చి తొలి ట్రిప్పు పూర్తి చేసి వచ్చేసరికి డ్యూటీ సమయం పూర్తవటమే కాకుండా అదనంగా గంటో, గంటన్నరో పనిచేసినట్టవుతోంది. రోజుకు నష్టం... అర కోటి.. నిత్యం 85 వేల కిలోమీటర్ల ప్రయాణ దూరాన్ని కోల్పోవాల్సి రావటంతో టికెట్ రూపంలో ఆర్టీసీకి భారీ నష్టం వాటిల్లుతోంది. సిబ్బంది ఎక్కువ పనిగంటలు హాజరవుతుండటంతో అదనపు మొత్తం చెల్లించాల్సి వస్తోంది. దేశవ్యాప్తంగా ఎక్కువ మైలేజీ ఇచ్చే బస్సులుగా మన ఆర్టీసీకి మంచి పేరుంది. సగటున లీటరుకు 5 నుంచి 5.4 కి.మీ. మేర తిరుగుతాయి. కానీ వారం రోజులుగా అది 3.5 కి.మీ.కు పడిపోయింది. ఇక జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సులైతే కేవలం 2.5 కి.మీ.కే పరిమితమయ్యాయి. దీంతో ఇంధన ఖర్చు.. భారీ గుంతలతో బస్సులు దెబ్బతిని మరమ్మతు ఖర్చులు రెట్టింపయ్యాయి. ఇలా అన్నీ కలిపి సంస్థకు రూ.50 లక్షలకు పైగా రోజువారీ నష్టం వస్తోంది. నగరంలో పది లక్షల కార్లున్నాయి. రోడ్లపై గోతుల వల్ల వాటి గమనం బాగా మందగిస్తోంది. ఇక 1.25 ల క్షల ఆటోలు, 28 ల క్షల ద్విచక్ర వాహనాలు సమస్యను జఠిలం చేశాయి. దీంతో బస్సుల ప్రయాణ సమయం 3 రెట్లవుతోంది. ఏమైంది సమన్వయం..!: మెట్రో పనుల నేపథ్యంలో ట్రాఫిక్, జీహెచ్‌ఎంసీ, జలమండలి, మెట్రో విభాగాలతో కలిపి ఓ సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. ఇది నగరంలో పర్యటించి ఏయే ప్రాంతాల్లో రోడ్లు ఏయే విభాగాల వల్ల పాడయ్యాయో గుర్తించాలి. ఆ మేరకు కొత్త రోడ్ల ఖర్చును ఆ విభాగం భరించాలి. కానీ ఇది ఎక్కడా అమలు కావటం లేదు. గుంతల రోడ్లకు మోక్షం రావటం లేదు. ఇంత జరుగుతున్నా ఆర్టీసీ యాజమాన్యం సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం లేదు. అలాగని ప్రభుత్వమూ ఏమీ పట్టించుకోవడం లేదు.

జనంపైకి దూసుకెళ్లిన లారీ.. ఇద్దరు మృతి

01/08/2016: మియాపూర్‌: హైదరాబాద్‌లోని మియాపూర్‌ వద్ద జాతీయరహదారిపై ఓ లారీ అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం కూకట్‌పల్లి నుంచి బీహెచ్‌ఎల్‌ వెళ్తున్న లారీ మదీనగూడ వద్ద రాగానే రోడ్డుపక్కన ఉన్న ఓ నర్సరీలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరుమల్లి ప్రాంతానికి చెందిన ఆదినారాయణ, శ్రీనివాస్‌ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్‌ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగుంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ రమేశ్‌ కొత్వాల్‌ తెలిపారు.

ప్చ్.. ‘తెలంగాణ’ కనిపిస్తలేదు! - కొత్త సచివాలయ డిజైన్లను తిరస్కరించిన సీఎం

01/08/2016: హైదరాబాద్: కొత్తగా నిర్మించబోయే సచివాలయం కోసం ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ రూపొందించిన నమూనాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తిరస్కరించారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ సచివాలయమైన సౌత్‌బ్లాక్, నార్త్ బ్లాక్ భవన నమూనాల తరహాలో తెలంగాణ కొత్త సచివాలయం కోసం కొన్ని నెలల క్రితం ఆయన డిజైన్‌లు రూపొందించి స్వయంగా సీఎంకు అందజేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ నమూనాలు ఎక్కడా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా లేవని భావించిన ముఖ్యమంత్రి తాజాగా వాటిని తిరస్కరిం చారు. వాటిని తెలంగాణ సంప్రదాయరీతులకు తగ్గట్టుగా మార్చి కొత్త నమూనాలు రూపొందించాలని, వాస్తుపరంగా కూడా మరికొన్ని మార్పులు చేయాలని సూచించారు. దీంతో ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ కొత్త నమూనాల రూపకల్పనలో ఉన్నారు. కొత్త సచివాలయానికి ‘గుమ్మటం’ డిజైన్ సాధారణంగా సీఎం కేసీఆర్ గుమ్మటాలతో కూడిన నిర్మాణాలను ఇష్టపడతారు. అవి దక్కన్ నిర్మాణ శైలికి దగ్గరగా ఉంటాయి. టీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్, ఇటీవల తెలంగాణ సచివాలయానికి కొత్తగా నిర్మించిన ప్రధాన ద్వారం సెక్యూరిటీ కార్యాలయ భవనం నమూనాలు దీనికి నిదర్శనం. కొత్త సచివాలయ భవనం ప్రధాన బ్లాకుకు కూడా గుమ్మటం డిజైన్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఇక సచివాలయంలో సీఎం బ్లాక్ అన్నింటికంటే ఎత్తుగా ఉండటంతోపాటు, అందులో ముఖ్యమంత్రి కూర్చునే కార్యాలయం నైరుతి దిశలో ఉండేలా చూడాలని ఆయన సూచించారు. రెండు బ్లాకులు పెంచటం గాని లేదా సీఎం బ్లాకు 11 అంతస్తులతో నార్త్, 9 అంతస్తులతో సౌత్ బ్లాకులు ఉండేలా చూడాలని ఆయన సూచించినట్టు సమాచారం. విభాగాధిపతులు సహా 55 విభాగాల కార్యాలయాలు ఒకే చోట ఉండేలా చూడాలని ఆయన పేర్కొన్నారు. మొత్తం విభాగాల సంఖ్య, ఉద్యోగుల సంఖ్య, అవసరమైన వైశాల్యం... తదితర వివరాలను ఇటీవలే రోడ్లు భవనాల శాఖ అధికారులు హఫీజ్ కాంట్రాక్టర్‌కు అందజేశారు. నాలుగు రోజుల క్రితం ఆయన కార్యాలయం నుంచి వచ్చిన ప్రతినిధులు ఆర్‌అండ్‌బీ అధికారులతో సమావేశమయ్యారు. అంతకు నెల ముందు హఫీజ్ కూడా వచ్చి అధికారులతో మాట్లాడి వెళ్లారు. అసెంబ్లీ, మండలికి స్థలాల వేట ఉన్నచోటనే కొత్త సచివాలయం నిర్మించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. అసెంబ్లీ, శాసనమండలి భవనాలకు వేరేచోట స్థలం వెదకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకోసం జీఏడీ ఆధ్వర్యంలో కొన్ని స్థలాలను కూడా పరిశీలించారు. ఎర్రమంజిల్‌లో నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ పాత కార్యాలయ భవనాలున్న ప్రాంగణం అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవలే ఆర్‌అండ్‌బీకి కొత్త భవనం అందుబాటులోకి రావటంతో పాత హెరిటేజ్ భవనం ఖాళీగా ఉంది. పాత భవనాలను తొలగిస్తే దాదాపు పదెకరాల స్థలం అందుబాటులోకి వస్తుంది. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇంతకాలం తర్వాత.. తొలుత ఎర్రగడ్డలోని ఛాతీ వ్యాధుల ఆసుపత్రిని నగర శివారు ప్రాంతానికి తరలించి అక్కడ కొత్త సచివాలయంతోపాటు అసెంబ్లీ, శాసనమండలి భవనాలను నిర్మించాలని భావించారు. కానీ దానిపై తీవ్ర విమర్శలు రావటంతోపాటు కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ప్రస్తుతం సచివాలయం ఉన్న చోటనే పాత భవనాలు తొలగించి నిర్మించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి నాలుగైదు నెలల క్రితమే హఫీజ్ కాంట్రాక్టర్ నమూనాలు రూపొందించి సీఎంకు అందజేశారు. ఆ నమూనాలను సీఎం కార్యాలయం కూడా బహిర్గతం చేసింది. త్వరలో ఏపీ సచివాలయం ఖాళీ అవుతున్నందున దసరా సందర్భంగా కొత్త సచివాలయ భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక హఫీజ్ కాంట్రాక్టర్ రూపొందించిన నమూనాల ప్రకారమే పనులు మొదలవుతాయని భావిస్తున్న తరుణంలో సీఎం వాటిని తిరస్కరించటం గమనార్హం. ఆ నమూనాలు యూరోపియన్, రోమన్ శైలిని ప్రతిబింబిస్తున్నాయని సీఎం భావిస్తున్నారు.

తీవ్రవాదుల కంటే ప్రమాదకారులు - కాంగ్రెస్ నేతలపై కర్నె ధ్వజం

29/07/2016: హైదరాబాద్: తెలంగాణను ఎండబెట్టిన కాంగ్రెస్ నాయకులు మల్లన్నసాగర్ రైతుల పట్ల కపట ప్రేమ చూపిస్తున్నారని, వాళ్లు తీవ్రవాదుల కన్నా ప్రమాదకారులని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. గురువారం ఆయనిక్కడ మాట్లాడుతూ.. ముంపు గ్రామాల ప్రజల సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని విపక్షాలు రెచ్చగొడుతన్నాయిని, ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు పూర్తై తమకు రాజకీయంగా పుట్టగతులు ఉండవనే భయంతోనే అడ్డుకోడానికి కుట్రలు చేస్తున్నాయని కర్నె ఆరోపించారు.

దొంగతనానికి వచ్చి వాళ్లే లాస్...

29/07/2016: హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని మొఘల్‌కా నాలా, విజయ్‌నగర్‌ కాలనీలకు చెందిన మహ్మద్‌ ఫాజిల్‌ (లైట్‌ మెకానిక్‌), మహ్మద్‌ షోబ్‌ (ఆటోడ్రైవర్‌) బంధువులు. వీరికి ఎంఎం పహాడ్‌కు చెందిన డ్రైవర్‌ మహ్మద్‌ జహీర్‌ చిన్ననాటి స్నేహితుడు. హైదర్‌గూడకు చెందిన షకీల్‌ ఈ ముగ్గురికీ కామన్‌ ఫ్రెండ్‌ కావడంతో తరచుగా అతడి ఇంటికి వెళ్లి కలిసేవారు. షకీల్‌ ఇంటి సమీపంలో ఓ టీవీ షోరూమ్‌ గోడౌన్‌ ఉంది. ఈ ముగ్గురి కళ్లూ అందులోని సొత్తుపై పడ్డాయి. ఆ గోదామును కొల్లగొట్టి సొమ్ము చేసుకోవాలని పథకం వేశారు. రెక్కీ పూర్తి చేసుకున్న చోర మిత్రులు.. ఈనెల 22 అర్ధరాత్రి ముహూర్తం నిర్ణయించుకున్నారు. చోరీ చేసిన సొత్తు ఎత్తుకు పోవడానికి ఓ కారు ఉండే బాగుంటుందని భావించారు. ముగ్గురిలో ఒకడైన జహీర్‌కు 2015లో ఆసిఫ్‌నగర్‌లో బైక్‌ చోరీ చేసిన అనుభవం ఉండడంతో అతడే ముఠాకు నేతృత్వం వహించాడు. వాహనాన్ని తీసుకురావాల్సిన బాధ్యతను మిగిలిన ఇద్దరూ షోబ్‌కు అప్పగించారు. దీంతో ఇతగాడు తన సోదరుడికి చెందిన కారును తీసుకుని మిగిలిన ఇద్దరినీ ఎక్కించుకున్నాడు. ఆ గోదాము వద్దకు వెళ్లిన ఈ త్రయం దాని తాళాలు పగులకొట్టి అందులోని 25 ఎల్‌ఈడీ టీవీలను ఎత్తుకు పోయింది. వీటిని విక్రయించడం కోసం ప్రయత్నాలు ప్రారంభించగా.. సమాచారం వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌కు అందింది. ఇన్‌స్పెక్టర్‌ ఎల్‌.రాజా వెంకటరెడ్డి నేతృత్వంలోని బృందం గురువారం వలపన్ని పరారీలో ఉన్న షోబ్‌ మినహా మిగిలిన ఇద్దరినీ అరెస్టు చేసింది. వీరి నుంచి చోరీ సొత్తు టీవీలతో పాటు చోరీకి వినియోగించిన కారునూ రికవరీ చేశారు. ఆ ఎల్‌ఈడీ టీవీల విలువ రూ.3 లక్షలు కాగా.. కారు విలువ రూ.4 లక్షలు కావడంతో ‘చోర ద్వయానికి’ చుక్కలు కనిపించాయి. ఇక్కడికే రూ.లక్ష నష్టం రాగా.. భవిష్యత్తులో బెయిల్‌ ఖర్చులు, శిక్ష ‘బోనస్‌’గా మారనన్నాయి.

ఎంసెట్ పేపర్ లీక్ చేసింది నిషాద్ - సీఐడీ

28/07/2016: హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 ప్రశ్నపత్రంను ప్రింటింగ్ ప్రెస్ నుంచి షేక్ నిషాద్ లీక్ చేశాడని సీఐడీ అధికారులు నిర్ధారించారు. ముంబైలో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. నిషాద్ లో పాటు అతడి అనుచరుడు గుడ్డూను కూడా సీఐడీ అధికారులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారంతో సంబంధంతో ఉందని అనుమానిస్తున్న రిజోనెన్స్ వి మెడికల్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు వెంకట్రావును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేశారు. ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో రూ. 50 కోట్లు చేతులు మారినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి రూ.75 లక్షలు తీసుకున్నట్టు తెలుస్తోంది. 72 మంది విద్యార్థులకు ప్రశ్నాపత్రం లీక్ చేసినట్టు సీఐడీ అధికారులు ఆధారాలు సంపాదించారు. ఈ లీకేజీకి ప్రధాన సూత్రధారుడైన బ్రోకర్ రాజగోపాల్ రెడ్డితో పాటు ముఠా సభ్యులు రమేశ్, తిరుమల్, విష్ణును ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కాగా, ఎంసెట్-2 పరీక్షను రద్దు చేయొద్దని పరీక్ష రాసిన విద్యార్థులు కోరుతున్నారు.

‘బావర్చి హోటల్‌’ సీజ్‌ - మునిసిపల్‌ అధికారుల దాడి - పరిశుభ్రత లోపించడంతో మూసివేత

28/07/2016: బోడుప్పల్‌: పరిశుభ్రత పట్టని ఓ హోటల్‌ను పీర్జాదిగూడ మున్సిపల్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఉప్పల్‌ డిపో వద్ద ఉన్న బావర్చి హోటల్‌పై మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణమోహన్‌రెడ్డి, శానిటరీ అధికారులు కలిసి బుధవారం ఆకస్మిక దాడి నిర్వహించారు. వివరాలు.. బావర్చి హోటల్‌ వెనుక వైపు గల మ్యాన్‌హోల్‌ నుంచి విపరీతమైన దుర్వాసన వస్తోందని స్థానికులు మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం మున్సిపల్‌ కమిషనర్, శానిటరీ అధికారులు బావర్చి హోటల్‌ వెనుక ఉన్న మ్యాన్‌హోల్‌ను పరిశీలించగా మురుగునీరు, చెత్తా చెదారంతో నిండిపోయి ఉంది. అధికారులు సదరు హోటల్‌లోని కిచెన్‌ను పరిశీలించారు. కిచెన్‌ అపరిశుభ్రంగా ఉంది. ప్లాస్టిక్‌ డబ్బాల్లో కుళ్లిపోయిన చెత్తాచెదారం ఉంది. దోమలు, ఈగలు ఎగురుతున్నాయి. ఇలాంటి అపరిశుభ్ర వాతావరణంలో వండిని ఆహార పదార్థాలు తింటే ప్రజలు అనారోగ్యం పాలవడం ఖాయమని భావించిన అధికారులు హోటల్‌ను సీజ్‌ చేశారు. దాడిలో శానిటరీ ఇంజినీర్‌ సుక్రుతారెడ్డి, ఏఈ శ్రీనివాస్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

మయూరినగర్ లో హరితహారం..

28/07/2016: హైదరాబాద్, సలాం తెలంగాణ: తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం లో బాగంగా బుధవారం మయూరినగర్ లోని కేంద్రీయ విహార లో ghmc సిబ్బంది అసోసియేషన్ సబ్యులతో కలిసి మియాపూర్ కార్పొరేటర్ మేకా రమేష్ గారు మొక్కలు పంపిణి చెయ్యడం జరిగింది.

జైల్లో వేసైనా ప్రాజెక్టులు కడతాం - అడ్డుకుంటామంటే చూస్తూ ఊరుకోం - తలసాని

27/07/2016: హైదరాబాద్ : ‘‘ప్రాజెక్టులు అడ్డుకుంటామంటే లోపలేసి తీరుతాం. ఇప్పుడు అరెస్టులు చేసి వదిలేస్తున్నాం. రేపు కేసులు పెట్టి జైలుకు కూడా పంపిస్తాం. ప్రభుత్వం చేతు లు కట్టుకుని కూర్చోదు. తాటాకు చప్పుళ్లకు భయపడం.ఆరునూరైనా ప్రాజెక్టులు నిర్మించి తీరుతాం’’ అని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రతిపక్షాలను హెచ్చరించారు. సచివాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టులు కట్టొద్దా, రైతులు బాగుపడొద్దా? అని ప్రశ్నించారు. టీడీపీ డబుల్ గేమ్ ఆడుతోందన్నారు. ఏపీలో బందరు పోర్టుకు 5వేల ఎకరాలన్నార ని, విజయనగరం ఎయిర్‌పోర్టు అంశం వివాదంగా మారిందని.. అక్కడొక డ్రామా ఇక్కడొక డ్రామానా అని నిలదీశారు. మేజర్ ప్రాజెక్టులను నిర్మించాల్సి వస్తే కొంత నష్టం ఉంటుందని, బాధితులకు ఇబ్బంది ఉంటుందన్నారు. కానీ వారందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు డ్రామా కంపెనీలు ఏ ర్పాటు చేసుకొని నాట కాలాడుతున్నాయని.. వారికి రైతుల గురించి మాట్లాడే అర్హత ఎక్కడుందన్నారు. బీజేపీ కూడా ఇక్కడొక డ్రామా.. మరోచోట మరో డ్రామా ఆడుతోందన్నారు. ఇలా చేస్తే ఆ పార్టీలు 20 ఏళ్లు అడ్రస్ లేకుండా పోతాయన్నారు. ప్రజలు చిల్లర రాజకీయ నాయకుల భ్రమలో పడొద్దని.. మల్లన్నసాగర్ రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. రైతులపై లాఠీచార్జి అనేది చెదరగొట్టే ప్రయత్నమేనని.. కక్షగట్టి ఎవరినీ కొట్టలేదన్నారు. కాంగ్రెస్‌లో ఉన్న 15 మందిలో ప్రతిఒక్కరూ సీఎం అభ్యర్థులే కనుక ఆ పార్టీలో మనిషికో విధా నం ఉంటుందని ఎద్దేవా చేశారు. కోదండరాం ఏ పార్టీకీ చెందినవారు కాదని, ఆయన ప్రజాప్రతినిధి కూడా కాదని.. ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం లేదని వ్యాఖ్యానించారు. అయితే ఆయనకు మాట్లాడే స్వేచ్ఛ ఉంద న్నారు. ఇక రైతులను లక్ష్యంగా చేసుకొని లాఠీచార్జి చేయడంపై పరిశీలిస్తామన్నారు.

కెమెరా ఆర్డర్‌ చేస్తే.. ఇటుక ముక్కలొచ్చాయ్‌!

27/07/2016: అల్వాల్‌: ఆన్‌లైన్‌లో కెమెరా ఆర్డర్‌ చేస్తే ఇటుక, రాళ్లు డెలివరీ అయ్యాయి. రిసాలబజార్‌ సాయినగర్‌ నివాసి ప్రేమ్‌కుమార్‌ కుమార్తె ఏంజిల్‌ విట్‌నెస్‌ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ కంపెనీ అమెజాన్‌లో ఉద్యోగం చేస్తోంది. రూ. 35 వేల విలువ చేసే కెమెరాను తాను పని చేసే అమెజాన్‌ వెబ్‌సైట్‌లో ఈ నెల 20న బుక్‌ చేసింది. ఈ నెల 24న ఆమెకు పార్శిల్‌ వచ్చింది. విప్పిచూస్తే ఖాళీ కెమెరా బాక్స్‌.. బ్యాగు అందులో ఇటుక, రాళ్లు దర్శనమిచ్చాయి. దీంతో కంగుతిన్న ఏంజిల్‌ అల్వాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డెలవరీ బాయ్‌కి ఫోన్‌ చేస్తే స్విచ్ఛాప్‌ వస్తోంది.

‘మల్టీ’ టాస్క్‌! - ఎంఎంటీఎస్‌ స్టేషన్లలో బహుళ అంతస్థుల భవనాలు

27/07/2016: ఎంఎంటీఎస్‌ స్టేషన్లు ఇక వాణిజ్య భవన సముదాయాలుగా అవతరించనున్నాయి. రవాణాతో పాటు సినిమాలు, ఎంటర్‌టైన్‌మెంట్, షాపింగ్‌ కేంద్రాలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. రైలు ప్రయాణికులతో పాటు సందర్శకులకు చక్కటి వినోదం, షాపింగ్‌ సదుపాయాన్ని అందజేయనున్నాయి. ప్రయాణికుల టిక్కెట్లపై వచ్చే ఆదాయం మాత్రమే కాకుండా... రైల్వే స్థలాలను వాణిజ్య కార్యకలాపాలకు లీజుకు ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించాలని దక్షిణ మధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంట నగరాల్లోని రైల్వే స్థలాలపై సమగ్ర సర్వే చేసిన రైల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ వీటి అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించింది. నగరంలోని ప్రధాన ఎంఎంటీఎస్‌ రైల్వే స్టేషన్లకు ఆనుకొని ఉన్న స్థలాల లీజుతో ఏటా రూ.250 కోట్లకు పైగా ఆదాయం లభించగలదని అంచనా వేసింది. అధికారులు ఈ దిశగా కార్యాచరణకు సన్నద్ధమవుతున్నారు. అంతా లీజు బేరమే... ఒక్కొక్క రైల్వే స్టేషన్‌లో దక్షిణ మధ్య రైల్వేకు అందుబాటులో ఉన్న స్థలాన్ని గుర్తించి వ్యాపార సంస్థలకు 45 ఏళ్లకు లీజుకు ఇవ్వాలని రైల్వే ల్యాండ్స్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ సూచిం చింది. దేశవ్యాప్తంగా రైల్వే స్థలాలపై సర్వేలు నిర్వహించి, వాటి అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించే ఈ సంస్థ (రైల్వేకు అనుబంధంగా పని చేస్తుంది.) ప్రతినిధుల బృందం ఇటీవల నగరంలో విస్తృతంగా పర్యటించింది. నిత్యం పర్యాటకులు, సందర్శకులతో రద్దీగా ఉండే నెక్లెస్‌ రోడ్డు, సంజీవయ్య పార్కు రైల్వేస్టేçషన్‌లతో పాటు, బేగంపేట్, ఖైరతాబాద్, లకిడీకాపూల్‌ ఎంఎంటీఎస్‌ స్టేషన్‌లలోని రైల్వే స్థలాలను వాణిజ్య సముదాయాలుగా అభివృద్ధి చేయవచ్చునని సూచించింది. రైల్వే ల్యాండ్స్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అందించినlవివరాల ప్రకారం సంజీవయ్య పార్కు స్టేషన్‌కు ఆనుకొని సుమారు ఎకరా స్థలం ఉంది. దీన్ని లీజుకు ఇవ్వడం ద్వారా ఏటా రూ.45 కోట్లు లభిస్తుంది. నెక్లెస్‌ రోడ్డు స్టేషన్‌ వద్ద ఉన్న ఎకరంపై మరో రూ.60 కోట్లు ఆర్జించవచ్చు. బేగంపేట్‌ రైల్వేస్టేషÙన్‌ ప్రాంతంలో 2 వేల గజాలు ఉంది. ఖైరతాబాద్, లకిడీకాపూల్‌ స్టేషన్‌లలో ఒకటిన్నర ఎకరం ఉన్నట్లు అంచనా. ఒక్కో స్టేషన్‌లో రైల్వే స్థలాలను లీజుకు ఇవ్వడం ద్వారా ఏటా రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు లభిస్తుంది. ఈ ఐదు స్టేషన్లలోని స్థలాలను లీజుకు ఇవ్వగలిగితే రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు లభించగలదని రైల్వే ల్యాండ్స్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రాథమిక అంచనా. రెండో దశలో సనత్‌ నగర్, హైటెక్‌ సిటీ, లింగంపల్లి, బోరబండ, నేచర్‌క్యూర్‌ తదితర స్టేషన్లను ఆనుకొని ఉన్న స్థలాలను వాణిజ్యపరంగా అభివృద్ధి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

ఆత్మరక్షణకే కాల్పులు - హోంమంత్రి నాయిని

26/07/2016: హైదరాబాద్ : రాజీవ్ రహదారిని ముట్టడించే క్రమం లో ముందుగా మల్లన్నసాగర్ నిర్వాసితులే పోలీసులపై రాళ్లు రువ్వి, కర్రలతో దాడి చేశారని.. దాంతో పోలీసులు ఆత్మరక్షణకోసం లాఠీచార్జి, కాల్పు లు జరిపారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. సోమవారం వీఎస్‌టీలో హరితహారంలో పాల్గొన్న ఆయన విలేకరుల తో మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ తెచ్చిన చట్టం ప్రకారం నష్టపరిహారం ఎకరాకు రూ.2 లక్షలే వస్తుందని, తాము తీసుకువచ్చిన 123 జీవో వల్ల ఎకరాకు రూ.6లక్షలతో పాటు ఇళ్లకు ఇళ్లు.. ఇలా ఏవి నష్టపోతే అవి ఇస్తామని తెలిపారు. ప్రతిపక్షాలకు ఏదీ దొరక్క దీనిపై కావాలని రాద్ధాంతం చేస్తున్నాయన్నారు.

ఎన్ని సార్లయినా జైలుకు.. - ప్రజల కేంద్రంగా అభివృద్ధి సాగాలన్నదే మా లక్ష్యం - కోదండరాం

26/07/2016: హైదరాబాద్: ‘‘ఎన్నిసార్లు పోలీసుస్టేషన్లకు, జైళ్లకు వెళ్లాల్సి వచ్చినా వెనకాడం. మాకు ఏ రాజకీయ ఆకాంక్షాలు లేవు. ప్రజలు కేంద్రంగా అభివృద్ధే సాగాలన్నదే మా లక్ష్యం’’ అని మల్లన్నసాగర్ ఆందోళనలను ఉద్దేశించి టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు డిజైన్ పూర్తి కాకుండానే దౌర్జన్యంగా ఏకంగా పదిహేను, ఇరవై రెవెన్యూ బృందాలు వెళ్లి, సంతకాలు పెట్టాల్సిందిగా ప్రజలను బలవంతం చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక నాయకులు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరిస్తే ఆదివారం లాఠీచార్జి ఘటన జరిగేది కాదన్నారు. ‘ప్రాజెక్టులు కట్టాలనే మేమూ కోరుకుంటున్నాం. అయితే నిపుణులు సూచిస్తున్న ప్రత్యామ్నాయాలను కూడా ప్రభుత్వం పరిశీలించాలని కోరుతున్నాం’ అని అన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ రెండేళ్లలో విద్యుత్ రంగంలో చోటుచేసుకున్న పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు, వాటి లాభానష్టాలను విశ్లేషిస్తూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమన్వయకర్త, టీజేఏసీ అధికార ప్రతినిధి కె.రఘు రచించిన ‘తెలంగాణ విద్యుత్ రంగంలో ఏం జరుగుతున్నది?’ పుస్తకాన్ని కోదండరాం, ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి సోమవారమిక్కడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ఎవరిపై ద్వేషంతోనో, వ్యతిరేకతతోనో ఈ పుస్తకం రాయలేదన్నారు. ‘‘ఇది ఆరంభం మాత్రమే. త్వరలో నీటిపారుదల, తాగునీటి ప్రాజెక్టులపై నివేదికలు విడుదల చేస్తాం. ప్రభుత్వ నిర్ణయాలపై నిష్పక్షపాతంగా చర్చ జరగాలి. మనం మధ్యయుగపు కాలంలో లేం. అప్పట్లో పాలకులు ఇష్టం వచ్చినట్లు చేసుకునేవాళ్లు. రాష్ట్రంలో ప్రజల భాగస్వామ్యంతో పాలన జరగాలని కోరుకుంటున్నాం. అందుకోసం ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తాం. పుస్తకాలు తీసుకొస్తాం’’ అని స్పష్టంచేశారు. హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ డీలర్లకు మేలు చేసేందుకు గత సీమాంధ్ర పాలకులు అమలు చేసిన అభివృద్ధి నమూనా తెలంగాణకు పనికి రాదన్నారు. తెలంగాణ తొలి సీఎంకు ఉండాల్సిన అర్హతలన్నీ కేసీఆర్‌కు ఉన్నాయని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి పేర్కొన్నారు. లక్ష కోట్లతో కొత్త విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో చర్చ జరగడం లేదని పుస్తక రచయిత కె.రఘు పేర్కొన్నారు.

టీడీపీ, సీపీఎం కుట్రల వల్లే.. - మల్లన్నసాగర్ ఘటనపై మంత్రి హరీశ్ ఫైర్

26/07/2016: హైదరాబాద్: మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో హింసాత్మక పరిస్థితులు నెలకొనడానికి టీడీపీ, సీపీఎంల కుట్రలే కారణమని మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయి కోటి ఎకరాలకు సాగునీరందితే తమకు రాజకీయంగా పుట్టగతులు ఉండవనే భయంతోనే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని విమర్శించారు. సోమవారమిక్కడ టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో హరీశ్ మాట్లాడారు. సంగారెడ్డి, హైదరాబాద్ తదితర బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారే రైతులను రెచ్చగొట్టారని, పోలీసులపై, రైతులపై రాళ్లు రువ్వారని అన్నారు. హింసాత్మక ఘటనలను చోటు చేసుకోవడానికి కారణమైన వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారని, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు తిరస్కరించడంతో ప్రతిపక్షాలు సోమవారం తలపెట్టిన బంద్ విఫలమైందన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని విపక్షాలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడతున్నాయని మండిపడ్డారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఎనిమిది గ్రామాలకుగాను ఆరు గ్రామాల రైతులు భూములివ్వడానికి అంగీకరించారని వెల్లడించారు. ఏటిగడ్డ కిష్టాపూర్‌లో ప్రతిపక్షాలు ఇటీవల ఏ టెంట్ కింద దీక్షలు చేశాయో, అదే టెంట్ కింద రైతులు భూములిస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని వివరించారు. మిగిలిన రెండు గ్రామాల్లో కూడా ఒకట్రెండు రోజుల్లో భూసేకరణ సమస్య పరిష్కారమైతే తమ పని అయిపోయినట్లేనని భావించిన టీడీపీ, సీపీఎం నేతలు రాజీవ్ రహదారిపై హింసాత్మక ఘటలకు కుట్రపన్నారన్నారు. ‘‘అధికారులెవరూ ముంపు గ్రామాలకు వెళ్లి భూములివ్వాలని రైతులను అడగడం లేదు. రైతులపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిళ్లు లేవు. 2013 భూసేకరణ చట్టం లేదా 123 జీవోలలో ఏది కావాలనుకుంటే దాని ప్రకారం ప్రకారం భూసేకరణ జరపడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించాక ఇక సమస్య ఎక్కడిది? ప్రభుత్వ సంకల్పానికి సహకరించడానికి బదులు ప్రతిపక్షాలు ప్రాజెక్టులే కట్టకుండా అడ్డుకునే కుట్రలు చేస్తున్నాయి. ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. ఢిల్లీలో ఫిర్యాదులు చేస్తున్నారు’’ అని దుయ్యబట్టారు. ఖమ్మంను ముంచుతున్నారు ‘‘ఇన్ని రిజర్వాయర్లు అవసరమా అని కొందరు మాట్లాడుతున్నారు. అది వారి అవివేకానికి నిదర్శనం. నదులు లేకున్నా ఆంధ్రా ప్రాంతంలో వెలిగొండ, అవుకు తదితర రిజర్వాయర్లు ఎందుకు నిర్మించారో చెప్పాలి. కృష్ణా డెల్టాలో మూడో పంట కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తూ ఖమ్మం జిల్లాలో 8 వందల గ్రామాలను ముంచుతున్నారు. నల్లగొండ జిల్లాలో వందలాది ఎకరాలను ముంచి పులిచింతల ప్రాజెక్టు కట్టారు. తెలంగాణలో కనీసం రెండు పంటలు పండించుకునే ఉద్దేశంతో ప్రాజెక్టులు నిర్మించడం తప్పా?’’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. గోదావరి నదిలో ఇప్పటికే 750 టీఎంసీల నీరు సముద్రం పాలైందని వివరించారు. గోదావరిలో నీళ్లు వచ్చినప్పుడే నిల్వ చేసుకుంటేనే పుష్కలంగా సాగునీరు అందించవచ్చని, అందుకే రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్, టీడీపీ కుట్రలను గుర్తించారని చెప్పారు. ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఆ జిల్లాకే చెందిన నాయకులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎందుకు అడ్డుపడుతున్నారని నిలదీశారు. ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొట్టే ధోరణులను తిప్పికొట్టాలన్నారు. పోలీసులు సంయమనం పాటించాలని ఆదేశించామని, విపక్షాలు కూడా సంయమనం పాటించాలన్నారు. చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని, నిర్వాసితులను ప్రభుత్వం కడుపులో పెట్టకుంటుందని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

బోనమెత్తిన గోల్కొండ

25/07/2016: గోల్కొండ: గోల్కొండ కోటలో ఆదివారం బోనాల సందడితో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆషాడ మాసపు బోనాల సందర్భంగా ఆదివారం అమ్మవార్లకు ఆరవ పూజ జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 2 లక్షల మంది భక్తులు కోటకు తరలివచ్చారు. పోలీసులు ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు బంజార దర్వాజ, రాందేవ్‌గూడ ఫతే దర్వాజ నుంచి గోల్కొండకు వ్చచే భారీ వాహనాలు, బస్సులను అనుమతించలేదు.

ధృవీకరణ పత్రాలు లేకుండానే ఓటర్ ఐడీ

25/07/2016: హైదరాబాద్: ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకున్నా అవసరమైన వారికి ఓటర్‌ ఐడీలు తయారు చేసి ఇస్తున్న ముఠా గుట్టును పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశామని, వీరిలో ఒకరు జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ ఆఫీస్‌లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి అని డీసీపీ బి.లింబారెడ్డి ఆదివారం వెల్లడించారు. ఖమ్మం జిల్లా భద్రాచలం సమీపంలోని వెంకటాపురానికి చెందిన సీహెచ్‌ శ్రీనివాస్‌ 2011లో జీవనోపాధి కోసం నగరానికి వచ్చాడు. కొంతకాలం బేగంపేటలోని ఓ కంపెనీలో పని చేసిన ఇతగాడు... 2012లో మూసాపేటలో ఎస్‌ఎస్‌వీ ట్యాక్స్‌ కన్సల్టెన్సీ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. వ్యాట్‌ రిజిస్ట్రేషన్‌ నుంచి ఐటీ రిటర్న్‌్స వరకు వివిధ పనులు చేశాడు. ఈ విధంగా వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో ‘ప్రత్యామ్నాయ’ మార్గాలు అన్వేషించాడు. ఇదే సమయంలో ఇతడికి ఖైరతాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పని చేస్తున్న డి.రాముతో పరిచయమైంది. వీరిద్దరూ కలిసి ముఠాగా ఏర్పడి అవసరమైన వారికి బోగస్‌ ఓటర్‌ ఐడీలు తయారు చేసి ఇచ్చే దందా ప్రారంభించారు. ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఓటర్‌ ఐడీలు కావాలంటూ తనను సంప్రదించే వారి వివరాలను శ్రీనివాస్‌ ఈ–మెయిల్‌ ద్వారా రాముకు పంపుతాడు. అతడు ఆ వివరాలతో ఓటర్‌ ఐడీ సృష్టించి ఆ రిఫరెన్స్‌ నెంబర్‌ను శ్రీనివాస్‌కు పంపిస్తాడు. దీని ఆధారంగా సదరు వినియోగదారుడు మీ సేవ కేంద్రం నుంచి ఓటర్‌ ఐడీ తీసుకునే వాడు. ఈ రకంగా ఒక్కో ఓటర్‌ ఐడీకి రూ.700 చొప్పున వసూలు చేస్తున్న శ్రీనివాస్‌ అందులో రూ.350 రాముకు ఇస్తున్నాడు. ఈ ద్వయం ఇప్పటి వరకు దాదాపు 450 మందికి బోగస్‌ వివరాలతో ఓటర్‌ ఐడీలు అందించింది. దీనిపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎల్‌.రాజా వెంకటరెడ్డి నేతృత్వంలోని బృందం వలపన్ని ఆదివారం పట్టుకుంది. నిందితుల నుంచి కంప్యూటర్, ధ్రువీకరణపత్రాలు లేకుండా ఓటర్‌ ఐడీ దరఖాస్తులు తదితరాలు స్వాధీనం చేసుకుని కేసును సైఫాబాద్‌ పోలీసులకు అప్పగించింది.

తెలంగాణ వచ్చినా మావి బిక్షపు బతుకులే

25/07/2016: సుందరయ్య విజ్ఞాన కేంద్రం: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం తెలంగాణ కాంట్రాక్టు 2వ ఏఎన్‌ఎంల ఆధ్వర్యంలో బిక్షాటన చేశారు. రాష్ట్రంలో 4వేల మంది 2వ ఎఎన్‌ఎంలు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారని, గత అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక కూడ ఇక మా బతుకులు బిక్షపు బతుకులుగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు ఆర్‌.వాణి, కుమార్, కిరణ్‌మయి, మమత, రజిత, సమత, సబిత తదితరులు పాల్గొన్నారు.

భవంతి కూలిపోయి ఘోర ప్రమాదం - ఫిలింనగర్‌క్లబ్‌ ఘటనలో ఇద్దరు మృతి - మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం

25/07/2016: హైదరాబాద్: నగరానికి చెందిన ఓ కాంట్రాక్టర్‌ వద్ద పనిలో చేరిన 18 మంది కూలీలు అంతా పొరుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లే. కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఏపీ రాష్ట్రాల నుంచి నగరానికి వలస వచ్చారు. మియాపూర్, ఖైరతాబాద్‌ చింతల్‌బస్తీల్లో అద్దెకుంటున్నారు. ఎప్పటిలాగే శనివారం ఉదయం 8.30 గంటలకు ఫిలింనగర్‌ క్లబ్‌ పోర్టికో నిర్మాణ పనుల్లో చేరారు. శనివారం రాత్రి ఇంటికి చేరకుండా పనుల్లో మునిగిపోయారు.పోర్టికో పని పూర్తయితే ఇంటికి వెళ్లిపోవచ్చుననుకున్నారు. కొందరు కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లోని సొంత ఊళ్లకు వెళ్లాలనుకున్నారు. కానీ క్షణాల్లో ప్రమాదం జరిగింది. అంతా పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా పోర్టికో పిల్లర్లు కూలిపోయాయి. దాంతో శ్లాబ్‌ నేలమట్టమైంది. శ్లాబ్‌పైనే పని చేస్తున్న 10 మంది కూలీల్లో రాయచూరుకు చెందిన మాన్‌శేష్‌ అలియాస్‌ ఆనంద్‌(38), కోల్‌కతాకు చెందిన అనిసూర్‌ షేక్‌(40) అక్కడిక్కడే మృతి చెందారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన శ్రీనివాస్‌(29), కర్ణాటకకు చెందిన శివ(31) తీవ్రం గా గాయపడ్డారు. శ్రీనివాస్‌కు దవడ ఎముకలు విరిగాయి. శివకు తలకు బలమైన గాయాలయ్యాయి. స్వల్పంగా గాయపడ్డ కర్ణాటకకు చెందిన మల్లేశం,సీతారాం, బీరప్ప,పశ్చిమబెంగాల్‌కు చెందిన అజిత్‌ బిశ్వాస్,సాహెబ్‌మండల్, ప్రకా శం జిల్లాకు చెందిన కోటేశ్వర్‌రావుకు చికిత్స చేసి ఇంటికి పంపించారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్, శివలను అపోలో ఆస్పత్రికి తరలించి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. శివకు తల పగలడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

నిజాయితీ చాటుకున్న రైల్వే పోలీసులు

23/07/2016: కాచిగూడ: ప్రయాణికుడు రైల్లో పోగొట్టుకున్న పర్సును తిరిగి అతనికి అప్పగించి కాచిగూడ రైల్వే పోలీసులు తమ నిజాయితీని చాటుకున్నారు. రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ ఆర్‌.లాలియానాయక్‌ కథనం ప్రకారం... వరంగల్‌ జిల్లా గిర్మాజీపేటకు చెందిన టీచర్‌ కె.రాజేశ్వర్‌రావు (48) తన తమ్ముడు వినోద్‌తో కలిసి ఈనెల 21న యశ్వంత్‌పూర్‌ నుంచి కాచిగూడకు యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో వస్తూ పర్సు పోగొట్టుకున్నాడు. రైలు దిగి కూకట్‌పల్లిలోని తమ్ముడి ఇంటికి వెళ్లిపోయారు. రైల్వే పోలీసులు యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీ చేస్తుండగా పర్స్‌ దొరికింది. అందులో రూ. 5,280 నగదు, డ్రైవింగ్‌ లైసెన్స్, ఏటీఎం కార్డు, ఐడీ కార్డు ఉన్నాయి. ఐడీ కార్డు ఆధారంగా బాధితుడు రాజేశ్వర్‌రావుకు ఫోన్‌ చేసి పర్స్‌ దొరికిన విషయాన్ని తెలియపర్చారు. అతడిని పిలిపించి పర్సును అందజేశారు. పర్సుతో పాటు నగదు, విలువైన వస్తువులను తనకు తిరిగి అప్పగించి నిజాయితీ చాటుకున్న రైల్వే పోలీసులను రాజేశ్వర్‌రావు అభినందించాడు.

సాగర్‌.. శ్వాస ఆడుతోంది!

23/07/2016: నగరం నడిబొడ్డున ఉన్న చారిత్రక హుస్సేన్‌సాగర్‌కు కాలుష్యం నుంచి కాస్త ముప్పు తప్పుతోంది. కూకట్‌పల్లి నాలా మళ్లింపు పనులు పూర్తికావడంతో గత మూడు నెలలుగా పరిశ్రమలు వదిలిపెడుతోన్న హానికారక రసాయనాలు ఈ జలాశయంలోకి చేరడం లేదు. దీంతో సాగర్‌లో జీవజాలం మనుగడకు అవసరమైన ఆక్సీజన్‌ మోతాదు క్రమంగా పెరుగుతోంది. మరోవైపు రసాయనాల గాఢత క్రమంగా తగ్గుముఖం పట్టడంతో కెమికల్‌ ఆక్సీజన్‌ డిమాండ్‌ మోతాదు ప్రమాదకర స్థాయి నుంచి సాధారణ స్థాయికి చేరుకోవడం విశేషం. ప్రధానంగా ఏప్రిల్, మే, జూన్‌ మాసాల్లో ఈ పరిణామం స్పష్టంగా కనిపించినట్లు పీసీబీ పరిశీలనలో తేలింది. నీటి నాణ్యత మెరుగు ఇలా... కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం నీటి గాఢత 8.5 యూనిట్లలోపు ఉండాలి. ప్రస్తుతం నెక్లెస్‌రోడ్, లేపాక్షి హ్యాండిక్రాఫ్ట్, బోట్స్‌క్లబ్, సాగరం నడిబొడ్డున ఉన్న బుద్ధవిగ్రహం, మారియట్‌ హోటల్, సంజీవయ్య పార్కు ప్రాంతాల్లో నీటి నాణ్యతను జూన్‌ నెలలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) పరీక్షించింది. ఈ పరిశోధనలో ఆయా ప్రాంతాల్లో నీటి గాఢత 7 నుంచి 8 యూనిట్ల లోపు ఉన్నట్లు తేలింది. గతంలో ఈ మోతాదు పది యూనిట్లకు పైగా ఉండేది. ఇక నీటిలో వివిధ హానికారక మూలకాల చేరికతో గతంలో విద్యుత్‌ వాహకత(ఈసీ) రెండువేల యూనిట్లవరకు ఉండేది. ప్రస్తుతం 1000–1900 యూనిట్లలోపే నమోదైంది. ఇక నీటిలో జీవరాశుల మనుగడకు అవసరమైన కరిగిన ఆక్సీజన్‌ మోతాదు 4 యూనిట్లుగా ఉండాలి. ప్రస్తుతం 3–4 యూనిట్ల మేర ఉంది. ఇక ఫేకల్‌ కోలిఫాం బ్యాక్టీరియా మోతాదు సైతం గతంలో 200 యూనిట్లకు పైగానే నమోదయ్యేది. ప్రస్తుతం వంద యూనిట్ల లోపునకు తగ్గడం విశేషం. రసాయనాల కలయికతో నీటిలో కెమికల్‌ ఆక్సీజన్‌ డిమాండ్‌ గతంలో 200 యూనిట్లకు పైగా ఉండగా...ప్రస్తుతం అధిక గాఢత గల రసాయనాల చేరిక నిలిచిపోవడంతో 100–150∙యూనిట్ల లోపు మాత్రమే ఉంది.

లష్కర్‌ బోనాలుచూసొద్దాం రండి! - ఉత్సవాలు రేపే

23/07/2016: బన్సీలాల్‌పేట: రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఆషాఢ బోనాల జాతర మహోత్సవాలకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం ముస్తాబవుతోంది. ఈ నెల 24,25 తేదీలలో ఉత్సవాలు జరగనున్నాయి. తెలంగాణలోని పది జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర పండగగా జరుపుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, బల్దియా కమిషనర్‌ జనార్దన్‌రెడ్డితో కలిసి ఆలయ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. క్యూలైన్లు పూర్తయ్యాయి. భక్తులతోపాటు సికింద్రాబాద్‌ వాసులకు మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టారు. సుమారు 3 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. నేటి మధ్యాహ్నానికి ఏర్పాట్లు పూర్తి ఆదివారం జరిగే బోనాల మహోత్సవాలకు వారం రోజుల ముందే ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్ణయించారు. 25 రోజుల క్రితం సచివాలయంలో నగర బల్దియా కమిషనర్‌తో మంత్రి తలసాని సమావేశం నిర్వహించారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం తొలి విడతలో రూ.1.35 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. రోడ్ల మరమ్మతులు, మూత్రశాలల నిర్మాణం, వీధి దీపాలు, డ్రైనేజీ మ్యాన్‌హోల్స్‌ మరమ్మతులు తదితర సదుపాయాలను మెరుగు పరిచారు.దశలవారీగా జరుగుతున్న పనులను వేగవంతం చేసి ముగింపు దశకు తీసుకొచ్చారు. శనివారం ఉదయానికి ఏర్పాట్లు కానున్నాయి. మౌలిక వసతులు.. * ఉత్సవాల నిర్వహణలో బల్దియా ప్రధాన భూమిక పోషిస్తోంది. సుమారు రూ.60 లక్షలు వెచ్చించి ఆలయ పరిసర ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు పూర్తయ్యాయి. లష్కర్‌లోని ప్రధాన రహదారులు ఎంజీరోడ్డు, ఆర్పీరోడ్డు ప్రాంతాల్లో డివైడర్లకు, ఫుట్‌పాత్‌లకు రంగులు వేశారు. రాంగోపాల్‌పేట ప్రాంతంలోని నల్లగుట్ట, పాన్‌బజార్‌, కళాసీగూడ ప్రాంతాల్లో సీసీ రోడ్డు పూర్తి చేశారు. * పారుశుద్ధ్య నిర్వహణకు ఆలయ పరిసరాల్లో మూడు షిప్టుల్లో సుమారు 200 మంది చొప్పున కార్మికులు విధులు నిర్వహిస్తారు. * 20మూత్రశాలలను రోజుకు రెండుసార్లు శుభ్రం చేస్తున్నారు. ప్రత్యేకంగా నాలుగు వ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 20 మంది వినియోగించుకునే అవకాశం ఉంది. వీటికితోడు 4అదనంగా వీఐపీలకు ఏర్పాటు చేయనున్నారు. వీటిని ఆలయం వెనుకవైపు, జనరల్‌బజార్‌ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు. * జలమండలి రూ.18 లక్షలతో పనులు చేపట్టింది. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆరు ప్రాంతాల్లో ఉచిత నీటి పంపిణీ శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. మహంకాళి ఆలయం, రోచాబజార్‌, బాటా, అంజలి థిµయేటర్‌, జనరల్‌బజార్‌, దర్గా ప్రాంతాలను గుర్తించారు. వీటితోపాటు ఆలయం వద్ద క్యూలైన్లలో కూడా నీటిని పంపిణీ చేయనున్నారు. * ఆలయ పరిసర ప్రాంతాల్లో శని, ఆది, సోమవారాల్లో మంచినీటి సరఫరా జరుగుతుంది. ంత్రాన్ని దేవాలయం వద్దే ఏర్పాటు చేశారు. * విద్యుత్‌ అధికారులు 4పాత నియంత్రికలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేశారు. * ఆర్‌ అండ్‌ బీ అధికారులు బాటా, రాంగోపాల్‌పేటఠాణా, జనరల్‌బజార్‌, టొబాకో బజార్‌ ప్రాంతాల నుంచి క్యూలైన్ల నిర్మాణం పూర్తి చేశారు. * సాంస్కృతిక కళా బృందాలు తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే కళలను ప్రదర్శించనున్నారు. అందుకోసం ఆర్‌అండ్‌బీ వేదికలను శనివారం ఏర్పాటుచేయనుంది. అందుకోసం కళాసీగూడ, ఎంజీరోడ్డు, జబ్బర్‌కాంప్లెక్స్‌, పాలికబజార్‌ ప్రాంతాలను గుర్తించారు.

వెంగళరావుపార్క్‌ను సందర్శించిన కేటీఆర్‌

23/07/2016: హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఆకస్మిక తనిఖీలు హైదరాబాద్‌లో కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం బంజారాహిల్స్‌లోని జలగం వెంగళరావు పార్క్‌ను స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కులోని సమస్యలను వాకర్స్‌ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో హరితహారం పేరిట చెట్లు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. హరితహారంలో భాగంగా 20 రోజుల్లోనే 15 కోట్లకు పైగా మొక్కలు నాటినట్లు చెప్పారు. మొక్కలు నాటడంతో పాటు సంరంక్షించాలని సీఎం పదే పదే చెబుతున్నారని గుర్తు చేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, అధికారులు మంత్రి వెంట ఉన్నారు.

మిస్సింగ్‌ పోస్టర్లే అతడి పెట్టుబడి - బస్, రైల్వేస్టేషన్లే నిందితుడు శివకుమార్‌ నివాసం - దూర ప్రాంతాలనుంచి బాధితులకు ఫోన్లు

23/07/2016: మిస్సింగ్‌ కేసుల వివరాల ఆధారంగా సంబంధీకులకు ఫోన్లు చేసి, అందినకాడికి దండుకున్న శివకుమార్‌ దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. చెన్నైలో చేసిన తొలి ప్రయత్నం ‘ఫలితాలు’ ఇవ్వడంతో దీనిని దందాగా మార్చుకున్నట్లు విచారణలో వెల్లడించాడు. వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం అరెస్టు చేసిన ఇతడిని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. మరింత లోతుగా విచారించేందుకు న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయిం చారు. బెంగుళూరుకు చెందిన శివకుమార్‌ చెన్నైలో కార్పెంటర్‌గా పనిచేసేవాడు. 2013లో బాంబు బూచి ఫోన్‌ చేసి పోలీసులకు చిక్కిన ఇతను ఆకతాయిగా చేసిన పనిని సంపాదనగా మార్చుకున్నాడు. పోస్టర్లే పెట్టుబడి... చెన్నై రైల్వేస్టేషన్లో మిస్సింగ్‌ పోస్టర్‌ను చూసిన శివకుమార్‌ అందులో పేర్కొన్న నెంబర్‌కు ఫోన్‌ చేసి మీ కుమారుడి ఆచూకీ తనకు తెలుసని నమ్మించి రూ.10 వేలు తన ఖాతాలో డిపాజిట్‌ చేయించుకుని మోసం చేశాడు. ఇది లాభసాటిగా అనిపించడంతో దానిని దందాగా మార్చుకున్నాడు. నిత్య సంచారి అయిన శివకుమార్‌ బస్, రైల్వే స్టేషన్లలోని డార్మెటరీలు లేదా ప్లాట్‌ఫామ్స్‌పై బస చేస్తుంటాడు. దేశ వ్యాప్తంగా ఇత ను 70 మంది నుంచి రూ.లక్షల్లో దండుకున్నట్లు సమాచారం. ఇతని బాధితుల్లో లక్నోకు చెందిన ఆర్మీ అధికారి, విశాఖçపట్నానికి చెందిన వైద్యుడు సైతం ఉన్నారు. డిపాజిట్లన్నీ ‘ఎం–పైసా’ లోనే ... ఇతను బాధితుల నుంచి నగదు డిపాజిట్‌ చేయించుకునేందుకు బోగస్‌ వివరాలతో ఓ బ్యాంకు ఖాతా తెరిచాడు. దీన్ని వోడాఫోన్‌ సర్వీసు ప్రొవైడర్‌ అందించే ‘ఎం–పైసా’ విధానాన్ని వినియోగించుకున్నాడు. బోగస్‌ ఖాతాను దీంతో లింకేజ్‌ చేశాడు. ఈ విధానం ప్రకారం... ఒడాఫోన్‌ షోరూమ్స్‌/అధీకృత ఔట్‌లెట్స్‌లో ఆ మొత్తాన్ని జమ చేస్తే ఆ నగదు నేరు గా ఫోన్‌ వినియోగదారుడు లింక్‌ చేసుకున్న ఖాతాలోకి వెళ్లిపోతుంది. ఇలా అతను బాధితుల నుంచి కనిష్టంగా రూ.వెయ్యి నుంచి గరిష్టంగా రూ.20 వేల వరకు వరకు డిపాజిట్‌ చేయించుకున్నాడు. బాది తులు చిన్న మొత్తమే కదా అని ఫిర్యాదు చేయకపోవడంతో ఏడాదిన్నరగా శివకుమార్‌ ఆటలు సాగాయి. వరుస ఉదంతాలతో టాస్క్‌ఫోర్స్‌ సీరియస్‌... నగరంలో శివకుమార్‌ ‘తొలి లీల’ మహంకాళి ఠాణా పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఆపై కార్ఖానా పరి ధిలో, తాజాగా అబిడ్స్‌లో బయటపడటంతో సీరియస్‌గా తీసుకున్న వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ రంగంలోకి దిగింది. అనేక ప్రయత్నాల అనంతరం ఇమ్లిబన్‌లో వద్ద గురువారం అతడిని అదుపులోకి తీసుకుంది.