Breaking News

కరీంనగర్‌: అతివేగంతో పాటు, కర్ణకఠోర శబ్ధాలతో దూసుకెళ్తున్న ద్విచక్రవాహనాలకు పోలీసులు కళ్లెం వేశారు. పరిమితికి మించిన వేగంతో ప్రయాణిస్తూ తోటి వాహనదారులను భయబ్రాంతులకు గురిచేయడంతో పాటు విపరీతమైన శబ్ధ కాలుష్యానికి కారణమవుతున్న 16 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకొని వాహనదారులకు జరిమానాలు విధించారు. * * బెల‍్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల‍్లంపల్లిలోని సివిల్‌ కోర్టు ముఖద్వారం ఎదుట హోంగార్డు నారాయణ మంగళవారం ఉదయం ఆత‍్మహత్యాయత‍్నం చేశాడు. ఏడు సంవత‍్సరాలుగా హోంగార్డులకు పోస్టింగ్‌ ఇవ‍్వలేదని, విధుల‍్లోకి తీసుకోకుండా పోలీసు విభాగం అన్యాయం చేస్తోందని ఆవేదన వ‍్యక‍్తం చేస్తూ తెలంగాణ హోంగార్డుల సంఘం అధ‍్యక్షుడు నారాయణ మంగళవారం ఆత‍్మహత్యాయత‍్నం చేశాడు. * * చర‍్ల: ఖమ‍్మం జిల్లా చర‍్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు వద్ద మంగళవారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు ఆ ఇద్దరిని అరెస్టుచేశారు. తనిఖీ చేయగా వారి వద్ద మెడికల్ కిట్లు ఉన్నట్లు గుర్తించారు. వారు మావోయిస్టు మిలీషియా సభ‍్యులని తేలడంతో వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కోర్టులో హాజరుపరిచేందుకు తరలించామని చర్ల పోలీసులు వెల్లడించారు. * * వరంగల్‌: వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని నర్సంపేటలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తె దుర‍్మరణం చెందారు. తండ్రి, కుమార్తె వెళుతున‍్న ద్విచక్రవాహనాన్ని వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో వారు అక‍్కడికక‍్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు సేకరిస‍్తున్నారు * * కురవి: తేనెటీగల దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లిలో సోమవారం వెలుగుచూసింది. స్థానిక మామిడి తోటలో కాయలు కోయడానికి వచ్చిన కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామానికి చెందిన వారిగా తెలుస్తోంది. * * కరీంనగర్‌: జిల్లా కేంద్రంలోని బుట్టిరాజారాం కాలనీలో శనివారం వేకువజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలో ప్రతీ ఇంటిని తనిఖీ చేశారు. 31 బైక్‌లు, 8 ఆటోలు, 9 సిలిండర్లు, 3 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా పలువురు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. * * హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం గత నెల 22న నిర్వహించిన పాలిసెట్ - 2017 ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని కాలేజీ, రూసా కార్యాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వాణిప్రసాద్ పాల్గొన్నారు. ఏప్రిల్ 22న జరిగిన ప‌రీక్ష‌కు 1,28,118 మంది విద్యార్థులు హాజరయ్యారు. * * నిజామాబాద్‌ జిల్లా వర్నిలో వింత చోరీ వెలుగుచూసింది. పట్టణ శివారులోని భారత్‌ గ్యాస్‌ గోడౌన్‌లో దొంగలుపడి సిలిండర్లు ఎత్తుకెళ్లారు. నిన్న సాయంత్రమే గోడౌన్‌కు వచ్చిన 250 గ్యాస్‌ సిలిండర్లలో శుక్రవారం రాత్రి 204 సిలిండర్లు చోరీకి గురయ్యాయి. శనివారం ఉదయం గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ శేఖర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. * * హైదరాబాద్‌: మిర్చి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కపట ప్రేమను చూపుతున్నాయని లోక్‌సత్తా పార్టీ తెలంగాణ ధ్వజ మెత్తింది. కేంద్రం తాజాగా ప్రకటించిన రూ.5వేలు ఏ మూలకూ సరిపోవని, అదనంగా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మరో రూ.5వేలు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈమేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జన్నేపల్లి శ్రీనివాసరెడ్డి గురువారం ప్రకటన విడుదల చేశారు. * * కడెం: నిర్మల్‌ జిల్లా కడెం మండల కేంద్రంలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, అక్రమంగా నిల్వ ఉంచిన రూ.20 వేల విలువ గల గుట్కా, మద్యం ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నల్లబెల్లం, దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అజార్, రమేష్ అనే ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. * * నారాయణపూర్‌: యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్‌ మండల కేంద్రంలో మావోయిస్టు పోస్టుర్లు కలకలం రేపుతున్నాయి. మండల కేంద్రంతో పాటు వావిళ్లపల్లి, జనాగం గ్రామాల్లో పోస్టర్లు వెలవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కేసీఆర్‌ నియంత పాలన నశించాలి, లంచగొండి ఎమ్మెల్యే ఖబడ్దార్‌ అంటూ పోస్లర్లపై రాసి ఉంది. * * రంగారెడ్డి: బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాయల్‌ కాలనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్‌ వేస్టేజ్‌ గోదాములో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. * * అమెరికాలో ఓ చిన్న విమానం నాటకీయరీతిలో నడిరోడ్డుపై కూలిపోయింది. వాషింగ్టన్‌ లోని ముకిల్‌టియోలో మంగళవారం ఓ చిన్న విమానం రద్దీగా ఉన్న నడిరోడ్డుపై కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు ఎగిశాయి. అదృష్టం బాగుండి ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. విమానం ఇంజన్‌లో సాంకేతికలోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్‌ సురక్షితంగా తప్పించుకున్నాడు. * * యాదగిరిగుట్ట మండలం బాహుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈస్ట్‌ మారెడ్‌పల్లికి చెందిన వల్లపు ఎల్లయ్య బైక్‌పై వరంగల్‌ వైపు వెళ్తున్నారు. బాహుపేట వద్దకు రాగానే ఎల్లయ్య వాహనాన్ని గుర్తు తెలియని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో పుల్లయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ రెండు ప్రమాదాలు జరిగిన ప్రదేశాలను యాదగిరిగుట్ట పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ–2 నాగిరెడ్డి తెలిపారు. * * టేకులపల్లి: మహిళా సర్పంచ్ కుమారుడు ఓ విద్యార్థినిని ప్రేమ పేరుతో నమ్మించి, వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తే ముఖం చాటేస్తున్న ప్రియుడి ఇంటి ముందు బాధితురాలు ఆందోళనకు దిగింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడులో బుధవారం వెలుగుచూసింది. * * హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సాయంత్రం 4 గంటలకు పదోతరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 14 నుంచి 30 వరకు ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 5.35 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తులు చేసుకోగా దాదాపు ఐదు లక్షల మంది హాజరయ్యారు. ఈ నెల 5న ఫలితాలు విడుదల చేయాలనుకున్నా రెండు రోజుల ముందుగానే ఫలితాలు వెల్లడిస్తున్నారు. * * హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని శ్రీకర్‌ ఆస్పత్రిలో సోమవారం అర్థరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రోగులు, ఆస్పత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలార్పడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదం సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదని పలువురు వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని అధికారులు వేరువేరు ఆస్పత్రులకు తరలించారు. * * కరీంనగర్‌: అదిలాబాద్‌ వన్‌టౌన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సీఐ, ఎస్సై, ఏఎస్సైలను సస్పెండ్‌ చేస్తూ.. కరీంనగర్‌ రేంజ్‌ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్‌ తగాదాలో తలదూర్చారనే సమాచారంతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు జిల్లా ఎస్పీ ఎం. శ్రీనివాస్‌ నివేదిక ఆధారంగా సీఐ సత్యనారాయణ, ఎస్సై బి. అనిల్, ఏఎస్సై జి. అప్పారావులను సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం కరీంనగర్‌ రేంజ్‌ డీఐజీ సి. రవివర్మ ఆదేశాలు జారీచేశారు. * * కోదాడ: ఐపీఎల్‌ -10 సందర్భంగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ. 25 వేల నగదుతో పాటు ఓ బైక్‌, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. * * తిప్పర్తి(నల్లగొండ): వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో.. బస్సులో ఉన్న 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. * * బోధన్‌ మండలం తెగడపల్లి గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి(12) ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. దీంతో గట్టిగ కేకలు వేస్తూ బాలిక అక్కడే కుప్పకూలిపోయింది. ఇది గుర్తించిన చుట్టుపక్కల వారు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ నుంచి హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం బాలిక మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. * * కామేపల్లి: ప్రమాదవశాత్తు బావిలోపడి ఓ కానిస్టేబుల్‌ మృతిచెందిన సంఘటన ఖమ్మం జిల్లా కామేపల్లిలో జరిగింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో గుగులోతు రామకృష్ణ (39) కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గ్రామ శివారులోని వ్యవసాయ బావి వైపు మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందాడు. ఈయన స్వగ్రామం తల్లాడ. రెండున్నరేళ్లుగా కామేపల్లిలో పనిచేస్తున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. * * మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా సింగరేణి ఉపరితల బొగ్గుగని కేంద్రంలో మంగళవారం మధ్యాహ‍్నం బంకర్‌ కూలి ఇద్దరు కార్మికులు మృతిచెందారు. లారీలో బొగ్గు నింపుతుండగా.. అక్కడే పనులు చేస్తున్న పవన్‌ (31), రఘుపాల్‌రెడ్డి(32) అనే కార్మికులపై బంకర్‌ కూలింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తోటి కార్మికులు వెంటనే స్పందించి మృతదేహాలను వెలికి తీశారు. * * సూర్యాపేట: ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సూర్యాపేట మండలం రాజానాయక్‌తండా శివారులో శనివారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో వారిని అంబులెన్స్‌ల సాయంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. * * భువనగిరి: వేగంగా వెళ్తున్న కారులో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్‌ వాహనాన్ని వదిలి బయటకు దూకేశాడు. ఈ ప్రమాదంలో సాంట్రో కారు పూర్తిగా కాలిబూడిదైంది. ఈ సంఘటన యాదాద్రి జిల్లా భువనగిరి శివారులోని నల్లగొండ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడానికి యత్నించే లోపే కారు పూర్తిగా కాలిపోయింది. * * మహబూబ్‌నగర్‌: జిల్లాలోని దేవరకద్ర మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు చేపట్టిన దాడుల్లో పెద్దఎత్తున రేషన్‌ బియ్యం పట్టుబడ్డాయి. లబ్దిదారులకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయనే సమచారంతో రగంలోకి దిగిన అధికారులు మండల కేంద్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న 620 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఓ లారీ, బొలెరో వాహానాలను సీజ్‌ చేశారు. * * పెద్దపల్లి: ఇద్దరు భార్యలు కలిసి భర్తను హతమార్చిన సంఘటన జిల్లాలోని కమాన్‌పూర్‌లో గురువారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగి తిరుమలయ్య(65)ను ఆయన ఇద్దరు భార్యలు గొడ్డలితో నరికి చంపారు. తిరుమలయ్య అతని ఇద్దరు భార్యలు మదునమ్మ, ఐలమ్మలను గత కొన్నేళ్లుగా తీవ్రంగా హింసిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. * * హైదరాబాద్: ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓంకార్ నగర్‌లోని ఓ సెల్‌ఫోన్‌ దుకాణంలో గురువారం రాత్రి దొంగతనం జరిగింది. స్థానిక శ్రీనివాస్ మొబైల్ షాప్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి క్యాష్‌ బాక్స్‌లో ఉన్న రూ.50 వేల నగదుతోపాటు లక్ష రూపాయల విలువ చేసే ఫోన్లు ఎత్తుకెళ్లారు. దుకాణంలో అమర్చిన సీసీ కెమెరాలో చోరీ చిత్రాలు నమోదయ్యాయి. బాధితుడు ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. * * యాదాద్రి: పక్కింటి వారు తిట్టారనే మనస్థాపంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన యాదాద్రి జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో మంగళవారం జరిగింది. స్థానికంగా ఉండే లక్ష్మమ్మ అనే మహిళకు పక్కింటి వారికి విబేధాలు వచ్చాయి. దీంతో పక్కింటి వారు తిట్టడంతో ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. * * నిజామాబాద్ : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి యాసంగి పంటకు నీటిని విడుదల చేశారు. ఇరిగేషన్ అధికారులు గురువారం ఉదయం నీటిని విడుదల చేశారు. కాకతీయ కెనాల్ ద్వారా 6 వేల క్యూసెక్కులు, లక్ష్మీ కెనాల్ ద్వారా 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీటి విడుదలతో రైతులు నారుమడులు పోసేందుకు సిద్ధమవుతున్నారు. * * హుజూర్‌నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పోలీసులు బైక్ దొంగల ముఠాను పట్టుకున్నారు. గురువారం ఉదయం సీఐ వి. నర్సింహారెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు చెందిన 8 మంది సభ్యుల ముఠా గత కొంతకాలంగా ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతోంది. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు గురువారం ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 22 బైక్‌లను స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు పంపారు. * * భువనగిరి: యాదాద్రి జిల్లా భువనగిరిలోని బ్యాంకుల వద్ద పింఛనుదారులు నిరసన తెలిపారు. స్థానిక ఆంధ్రా బ్యాంకు వద్ద ప్రభుత్వ పింఛను దారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు రూ. 10 వేలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయగా రూ. 4 వేలే ఇస్తున్నారని నిరసన తెలిపారు. గంటలకొద్దీ క్యూలైన్లలో తాము నిలబడలేమని, ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. * * వరంగల్: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 226 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి గురువారం కోర్టుకు హాజరు పరిచారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిలో 12 మందికి 2 రోజుల జైలుశిక్ష విధిస్తూ.. న్యాయస్థానం తీర్పు నిచ్చింది. దీంతో పాటు మద్యం రాయుళ్లకు రూ. 3.52 లక్షల జరిమానాలు విధించింది. * * మిర్యాలగూడ: గ్యాంగ్ స్టర్ నయీం కేసుకు సంబంధించి 25 మంది నిందితులను పోలీసులు ఈరోజు మిర్యాలగూడ కోర్టు ఎదుట హాజరుపరిచారు. చర్లపల్లి జైల్లో ఉన్న నిందితులను పలు కేసుల్లో విచారణ నిమిత్తం ఈ రోజు మిర్యాలగూడ కోర్టుకు తీసుకొచ్చారు. వారిలో నయీం భార్య, సోదరి, అత్త ఉన్నారు. విచారణ అనంతరం తిరిగి వారిని చర్లపల్లికి తరలించారు. * * కాఠ్మాండు: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరానికి దగ్గర్లోని ఒక హిమనీనద సరస్సులోని నీటిని గణనీయంగా తగ్గించామని నేపాల్‌ ప్రకటించింది. వాతావరణంలో మార్పుల వల్ల హిమనీనదాలు వేగంగా కరుగుతున్నాయి. ఆ నీరంతా కట్టలు తెంచుకుని కిందకు ప్రవహిస్తే మహావిపత్తు సంభవిస్తుంది. * * మేడ్చెల్‌: మేడ్చల్ జిల్లా కీసర మండలం కుందన్‌పల్లి చౌరస్తాలో మంగళవారం ఉదయం ఒక లారీ బీభత్సం సష్టించింది. వేగంగా వెళుతున్న లారీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడమే కాక ఎదురుగా వెళుతున్న స్కూటర్‌ను డీకొని పక్కనున్న ఎన్‌వీఆర్‌ పెట్రోల్‌ బంక్‌లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో స్కూటర్‌పై వెళుతున్న యూనస్, ఖాజా అనే యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వారిని 108లో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. * * నిజామాబాద్‌: బోధన్‌లోని నిజాం దక్కన్‌ సుగర్స్‌ కంపెనీ కార్మికులు, అఖిలపక్షం నేతలు మంగళవారం బోధన్‌ బంద్‌ నిర్వహిస్తున్నారు. దక్కన్‌ సుగర్స్‌ లే ఆఫ్‌ ఎత్తివేయాలని, కంపెనీని పునరుద్ధరించాలని కోరుతూ కంపెనీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ బంద్‌ చేపట్టారు. బంద్‌లో అన్ని కార్మిక సంఘాల వారు, కంపెనీ కార్మికులు, టీడీపీ, సీపీఐ, సీపీఎం తదితర పక్షాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. * * శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం తప్పింది. ఫ్లయిట్‌లో పంపించేందుకు ఓ ఏజెంట్ కార్గో ఏరియాకు తీసుకువచ్చిన కెమికల్స్ బాక్సు నుంచి పొగలు వెలువడ్డాయి. గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. * * జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో శుక్రవారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీస్ కమీషనర్ కమల్‌హాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో 100 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. అనుమానం ఉన్న ప్రతి ఇంటినీ జల్లెడ పట్టారు. సరైన పత్రాలు లేని 8 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. * * చేర్యాల(సిద్ధిపేట జిల్లా): చేర్యాల సమీపంలో దూల్మిట్ట క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో మద్దూరు సాక్షి విలేకరి సత్యం గౌడ్(28) మృతిచెందాడు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న సత్యంను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. * * హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖ పరిధిలో పోలీస్ కానిస్టేబుల్ (సివిల్/ఏఆర్/ఎస్‌ఏఆర్/టీఎస్‌ఎస్‌పీ), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్)లో కానిస్టేబుల్ (పురుష), అగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్ పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రం బుక్‌లెట్లు, ప్రాథమిక కీను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) మంగళవారం విడుదల చేసింది. www.tslprb.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని బోర్డు చైర్మన్ డాక్టర్ జె.పూర్ణచంద్రరావు తెలిపారు. * * నారాయణపూర్: యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలకేంద్రంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు ఇళ్లు, ఒక నగల దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనాస్థలానికి క్లూస్ టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. * * కారేపల్లి: కల్తీ మద్యం తయారు చేస్తున్న వారిని తీసుకెళ్తున్న ఆటో బోల్తా పడటంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఆ సమయంలో ఆటోను నడుపుతున్నది పోలీస్ కానిస్టేబుల్ కావటం గమనార్హం. వివరాలివీ.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పోలీసులు సోమవారం ఉదయం రేలకాయలపల్లి జైత్రాం తండా, జీత్యా తండాలపై దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా కల్తీ మద్యం తయారు చేస్తున్నారనే ఆరోపణలతో ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. * * యదాద్రి: భువనగిరిలో శనివారం తెల్లవారుజామున లారీ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌ చౌరస్తాలోని బస్టాండ్‌ వద్ద జనంపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీలో శనివారం తెల్లవారుజామున నుంచి పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సౌత్‌జోన్‌ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో కామటిపుర, బార్కాస్‌, వట్టేపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 21 మంది రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు, నాలుగు ఆయుధాలు, 65 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. * * హైదరాబాద్‌: నగరంలోని ఇందిరాపార్క్‌ వద్ద రేపు (ఆదివారం) ఉదయం 10 గంటలకు రైతు దీక్ష చేపట్టనున్నారు. ఈ రైతు దీక్షలో తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌, రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొననున్నారు. తెలంగాణ ఏర్పాడ్డాక తొలిసారి కోదండరామ్‌ దీక్షకు దిగుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం రైతు సమస్యలు పట్టించుకోవడం లేదని కోదండరామ్‌ దీక్షకు దిగుతున్నట్టు సమాచారం. * * వాజేడు: స్కూల్ పిల్లలను తరలిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వాజేడు మండలం జగన్నాథపురంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామం నుంచి వాజేడు పాఠశాలకు వెళ్తున్న స్కూల్ పిల్లల ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. * * పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎన్టీపీసీ(నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్) 7 యూనిట్‌ లో ఉత్పత్తి నిలిచి పోనుంది. ఈ అంశాన్ని అధికారులు తెలిపారు. ఏడో యూనిట్ వార్షిక మరమ్మత్తుల కోసం శుక్రవారం నుంచి ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీని వల్ల 500ల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచి పోనుంది. * * మునగాల(నల్గొండ): మునగాల మండలం ఇంద్రానగర్ వద్ద జాతీయ రహదారిపై గురువారం ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బీభ్సతం సృష్టించింది. వడ్ల లోడుతో ముందుగా సూర్యాపేట వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను గౌతమి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ మీద ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * కరీంనగర్ జిల్లా: రేణికుంట బ్రిడ్జి సమీపంలో రాజీవ్ రహదారిపై బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఓ బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో బైక్‌లో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనతో ఆ మార్గంలో ఒక కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * మిర్యాలగూడ (నల్గొండ జిల్లా): మిర్యాలగూడ పట్టణంలోని ఓ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణానికి చెందిన మారం శ్రీనివాస్(45) అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. భార్యాబిడ్డలతో కలిసి హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. రియల్‌ ఎస్టేట్‌లో నష్టాలు రావడంతో అప్పులపాలై బలవన్మరణానికి పాల్పడ్డాడు. * * శాన్ ఫ్రాన్సిస్కో : అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేగింది. శాన్ ఫ్రాన్సిస్కోలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు విద్యార్థులు గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా పలువురు విద్యార్థులు కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈక్విటీ జూన్ జోర్డాన్ స్కూల్ సిటీ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీ హైస్కూల్ బయట ఈ కాల్పులు జరిగాయి. * * గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజేష్(14) అనే విద్యార్థి మృతి చెందాడు. స్కూలుకు వెళ్లటానికి రోడ్డు పక్కన నిల్చున్న సమయంలో అటుగా వస్తున్న టాటా ఏస్ వాహనం అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలైన రాజేష్‌ను నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. మార్గమధ్యంలోనే ప్రాణాలొదిలాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. * * కరీంనగర్‌: హుజారాబాద్‌లో మంగళవారం తెల్లవారుజామున నుంచి పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరానగర్‌, బుడగ జంగాల కాలనీల్లో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ జరిపారు. కార్డెన్‌ సర్చ్‌లో భాగంగా సరైన పత్రాలు లేని వాహనాలను ఆపి తనిఖీలు చేపట్టారు. * * అబ్దుల్లాపూర్‌మెట్ : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాచారం గ్రామంలోని సాయిప్రియ కెమికల్ పరిశ్రమలో మంగళవారం ఓ బాయిలర్ పేలి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. మృతుడు బిహార్‌కు చెందిన శివ చాంద్‌బీన్(31)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. * * మరిపెడ(వరంగల్‌): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన వరంగల్‌ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్‌ సాయంతో ఆస్పత్రికి తరలించగా అందులో ఒకరి పరిస్థతి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. * * నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో ఆదివారం అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో ఒక లారీ కాలిపోయింది. ఆదిలాబాద్ వైపు నుంచి నిర్మల్ వెళ్తున్న నిమ్మకాయల లోడ్ లారీలో నేరడిగొండ వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.అవి వేగంగా లారీ అంతటా వ్యాపించటంతో అప్రమత్తమైన లారీ డ్రైవర్, క్లీనర్ కిందికి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు.అనంతరం లారీ అగ్నికి ఆహుతయింది. కారణాలు తెలియాల్సి ఉంది. లారీడ్రైవర్ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. * * చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సుమారు రెండు వారాలుగా ఆసుపత్రికే పరిమితమయ్యారు. ఆమె చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రి డాక్టర్లు ముఖ్యమంత్రి కోలుకుంటున్నారని.. మరికొంత కాలం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పాలన కుంటుపడకుండా తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయచర్యలపై ఏఐఏడీఎంకే నేతలు దృష్టి పెట్టినట్లు సమాచారం. * * హైదరాబాద్: నాంపల్లిలో అన్ని ఆధునిక హంగులతో పోలీస్స్టేషన్ నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నరసింహరెడ్డి తెలిపారు. శనివారం ఉదయం పోలీస్స్టేషన్ కొత్త భవనానికి నాయిని నర్సింహారెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతోపాటు నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి, ఇతర పోలీసులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. * * ఐక్యరాజ్యసమితి: కర్బన ఉద్గారాలను తగ్గించుకునే ఒప్పందంపై మెజారిటీ దేశాలు సంతకాలు చేయడంతో నవంబర్‌ 4 నుంచి ప్యారిస్‌ ఒప్పందం అమల్లోకి వస్తుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ బాన్‌ కీ మూన్‌ వెల్లడించారు. దీన్నోక చిరస్మరణీయ ఘటనగా అవర్ణించారు. * * హైదరాబాద్ : మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురిని మల్కాజిగిరి సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా కీసరకు చెందిన యు.బలరాం, కృష్ణ, నర్సింహ అనే వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బొమ్మ పిస్టళ్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. * * కథలాపూర్(కరీంనగర్) : ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు అక్కడే ఉన్న హుండీని ఎత్తుకుపోయారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం కలిగోట గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం అర్థరాత్రి సత్యనారాయణ స్వామి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు గర్భగుడిలో విలువైన వస్తువులు ఏమీ లేకపోవటంతో హుండీని పెకిలించుకు పోయారు. శుక్రవారం ఉదయం గమనించిన పూజారి గ్రామ పెద్దలకు సమాచారం అందించారు. ఈ మేరకు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. * * కౌడిపల్లి: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారం గేటు వద్ద రాస్తారోకో జరిగింది. సలబాత్తపూర్ పంచాయతీని కొత్తగా ఏర్పాటు చేస్తున్న చిలిప్‌చేడ్ మండలంలో కాకుండా కౌడిపల్లి మండలలోనే కొనసాగించాలని ఆ పంచాయతీ ప్రజలు డిమాండ్ చేశారు. సుమారు 30 నిమిషాల పాటు రాస్తారోకో జరగడంతో మెదక్-నర్సాపూర్ రహదారిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. * * సిద్ధిపేట(మెదక్ జిల్లా) : సిద్ధిపేట మండలకేంద్రం గణేశ్ నగర్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికంగా నివాసముంటున్న శ్రీశైలం, పదయ్య, నర్సింహులు అనే ముగ్గురి ళ్లలో చోరీకి పాల్పడ్డారు. మూడిళ్లలో కలిపి 2 తులాల బంగారం, రూ.10 వేల నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. * * కొణిజర్ల(ఖమ్మం జిల్లా) : కొణిజర్ల మండలకేంద్రంలోని ఎండీఓ ఆఫీసు వద్ద గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. అదే సమయంలో అటుగా వచ్చిన మరో లారీ వచ్చి ఈ రెండు లారీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురికి గాయాలయ్యాయి. ఇదేవిధంగా కొణిజర్ల పోలీస్‌స్టేషన్ సమీపంలో లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఖమ్మం తరలించారు. * * కొత్తకోట(మహబూబ్‌నగర్) : మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటలో ఓ మహిళ దారుణంగా హత్యకు గురైంది. మండల కేంద్రంలోని వడ్డెవాడ సమీపంలోని ముళ్ల పొదల్లో ఓ మహిళ(50) మృత దేహం పడి ఉండగా గురువారం ఉదయం స్థానికులు కనుగొన్నారు. ఎక్కడో చంపి ఇక్కడ పడేసి ఉంటారని భావిస్తున్నారు. ఆమె స్థానికురాలు కాదని చెబుతున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవాల్సి ఉంది. * * హైదరాబాద్ : ముగ్గురు యువకులు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన ఘటనలో గాయపడిన చిన్నారి సంజన బ్రెయిన్ డెడ్ కాలేదని కామినేని ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రసాదరావు వెల్లడించారు. అయితే ఆమె పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. బుధవారం హైదరాబాద్లో ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రసాదరావు విలేకర్లతో మాట్లాడుతూ... చిన్నారి సంజన పరిస్థితి విషమంగానే ఉందన్నారు. * * శంషాబాద్(రంగారెడ్డి) : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆరేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడింది. హైదరాబాద్ కొత్తపేటకు చెందిన అరవింద్‌రావు దంపతులు తమ కూతురు నవ్య(6)తో కలసి బంధువులకు వీడ్కోలు చెప్పేందుకు మంగళవారం రాత్రి ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో చిన్నారి నవ్య డిపార్చర్ రైలింగ్ పైనుంచి కిందపడి పోయింది. తలకు తీవ్ర గాయాలుకాగా చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. వెంటనే జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. * * కీసర(రంగారెడ్డి) : డంపింగ్ యార్డు కారణంగా చెరువు నీరు కలుషితం అవుతోందంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వివరాలివీ.. రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాల సమీపంలో జీహెచ్‌ఎంసీ డంపింగ్ యార్డు ఉంది. ఈ యార్డు నుంచి వెలువడే వ్యర్థ జలాలు పక్కనే ఉన్న చెరువులో కలుస్తున్నాయి. సాగు నీరు కలుషితమవుతోందంటూ కొన్ని రోజులుగా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ఇదే విషయమై ఒక్కటైన గ్రామస్తులు బుధవారం ఉదయం చెత్తను తీసుకువచ్చే జీహెచ్‌ఎంసీ వాహనాలను అడ్డుకున్నారు. * * హైదరాబాద్ : కూకట్‌పల్లి జేఎన్‌టీయూ పరిపాలన విభాగంలో భారీగా మార్పులు, చేర్పులు చేస్తూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారు. డెరైక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్‌గా ఉన్న ఈశ్వరప్రసాద్‌ను సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూ ప్రిన్సిపాల్‌గా నియమించారు. అడ్మిషన్స్ డెరైక్టర్‌గా మంజూర్ హుస్సేన్‌ను, ఎగ్జామినేషన్స్ కంట్రోలర్‌గా తార కల్యాణి, బిక్స్ డెరైక్టర్‌గా లక్ష్మణరావు, డీయూఎఫ్‌ఆర్‌గా చెన్నకేశవరెడ్డిని నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. * * బాల్కొండ(నిజామాబాద్ జిల్లా) : ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 2 లక్షల 4 వేల 939 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్ధ్యం 90.313 టీఎంసీలు కాగా ప్రస్తుతం 89.763 టీఎంసీల నీరు ఉంది. కాకతీయ కెనాల్‌కు 5 వేల క్యూసెక్కులు, సరస్వతీ కెనాల్‌ఖు 1000 క్యూసెక్కులు, లక్ష్మీ కెనాల్‌కు 300 క్యూసెక్కులు, ఎస్కేప్ రెగులేటర్‌కు 3 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. మొత్తం 74,939 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. * * కరీంనగర్ : ప్రమాదవశాత్తు మూడు ఎలుగు బంట్లు వ్యవసాయ బావిలో పడి మరణించాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం శ్రీరాములపేటలో సోమవారం చోటు చేసుకుంది. ఆ విషయాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించారు. దీంతో గ్రామస్తులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని... ఎలుగు బంట్లను బావిలో నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. * * హైదరాబాద్ : పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్న ఓ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. కుషాయిగూడ నాగార్జుననగర్ కాలనీకి చెందిన ఇందుభార్గవి(19), చాంద్ అలీ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారి వివాహానికి పెద్దలు అంగీకరించకపోవటంతో రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. అనంతరం తమకు ప్రాణాహాని ఉందని, బంధువుల నుంచి రక్షణ కల్పించాలంటూ మంగళవారం కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు. * * కెరామెరి(ఆదిలాబాద్ జిల్లా) : కెరామెరి మండలం కెలికే గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గౌరూభాయ్(60), బ్యీసన్(30) అనే తల్లీ కొడుకులు ప్రమాదవశాత్తూ తమ పొలంలో కరెంటు షాక్ తగిలి మృతిచెందారు. ఈ సంఘటన నిన్ననే జరిగినా ఆలస్యంగా బయటపడింది. తల్లీకొడుకు మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. * * హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు కనిపించటం కలకలం రేపింది. లక్నో వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడి లగేజిని తనిఖీ చేయగా మూడు బుల్లెట్లు బయటపడ్డాయి. దీంతో భద్రతా సిబ్బంది అతడిని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. * * మహబూబ్‌ నగర్: మహబూబ్‌ నగర్ జిల్లా మరికల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృత్యువాతపడ్డారు. శనివారం ఉదయం రెండు లారీలు వేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో రెండు లారీల డ్రైవర్లు క్యాబిన్‌లోనే ప్రాణాలు విడిచారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో రాయిచూర్ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని వాహనాలను పక్కకు తొలగించేందుకు యత్నిస్తున్నారు. క్షతగాత్రులను మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. * * ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బాసరలో వేంచేసి ఉన్న సరస్వతీ మాత సన్నిధిలో దసరా ఉత్సవాలు మొదలయ్యాయి. మొదటిరోజు శైలిపుత్రిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తోంది. శనివారం వేకువజాము నుంచి భక్తులు దర్శనం కోసం క్యూకట్టారు. భైంసాపట్టణానికి చెందిన వ్యాపారవేత్త జి.రమేష్ కుటుంబసభ్యులు అమ్మవారికి రెండు తులాల బంగారు గొలుసును సమర్పించుకున్నారు * * కరీంనగర్ : ఎగువ ప్రాంతాల నుంచి వరదతో కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు జలాశయం పూర్తిస్థాయిలో నిండింది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 920 అడుగులు కాగా.. ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం కొనసాగుతోంది. జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి 16,000 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో.. 8 గేట్లు ఎత్తి 16,000 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. కాకతీయ కాలువకు మరో 2, 000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. * * డిచ్‌పల్లి: వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టిన ఘటనలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టడంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జాం అయింది. * * కరీంనగర్ : లోయర్ మానేరు డ్యామ్‌కు వరద తగ్గుముఖం పట్టింది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 920 అడుగులు, నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా గురువారం ఉదయం ఎనిమిది గంటలకు 919.40 అడుగులు, 23.51 టీఏంసీల నీరు ఉంది. డ్యామ్‌కు ఇన్‌ఫ్లో 10,800 క్యూసెక్కులు ఉండగా.. కాకతీయ కెనాల్ ద్వారా 5,000 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. * * శంషాబాద్ : పిల్లర్ కోసం తీసిన గుంటలో పడి బాలుడు మృతిచెందిన సంఘటన శంషాబాద్ మిషన్‌కంపౌడ్ సమీపంలోని శీనయ్య వెంచర్‌లో గురువారం వెలుగుచూసింది. స్థానిక శీనయ్య వెంచర్‌లో కార్మికులుగా పనిచేస్తున్న హరీష్, యాదమ్మ దంపతుల ఆరేళ్ల కుమారుడు బాలు పిల్లర్ గుంటలో పడి మృతిచెందాడు. శ్రీనయ్య వెంచర్‌లో పిల్లర్‌ల కోసం గుంటలు తవ్వారు. అందలో వర్షపు నీరు చేరడంతో ప్రమాదవశాత్తు బాలుడు అందులో పడి మృతిచెందాడు. * * ధర్మసాగర్(వరంగల్) : వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ధర్మసాగర్ సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న కేశబోయిన దేవేందర్(34) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో రాత్రి ప్యాసింజర్‌ను దించి ఇంటికి తిరిగి వస్తుండగా.. ఆటో బోల్తా కొట్టడంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటాన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. * * పెద్దమందడి(మహబూబ్‌నగర్) : వేగంగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన ఘటనలో బస్సు డ్రైవర్, క్లీనర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా పెద్దమందడి మండలం మోజెర్ల స్టేజీ సమీపంలో 44వ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. * * హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లి మూసాపేటలో బుధవారం వేకువజామున దారుణం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు స్నేహితులను వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో బైక్ వెనుక కూర్చున్న హరికృష్ణ(28) అనే యువకుడు మృతిచెందాడు. స్నేహితుని మరణాన్ని జీర్ణించుకోలేని రమేష్(28) భరత్‌నగర్ రైలు పట్టాలపై ఆత్మహత్యచేసుకున్నారు. హరికృష్ణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాగా రమేష్ శ్రీశ్రీ హోలిస్టిక్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. * * హైదరాబాద్ : భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని నీటి ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తింది. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.30 అడుగులకు వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 200.658 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు బుధవారం వెల్లడించారు. * * నిజాంసాగర్(నిజామాబాద్ జిల్లా) : నిజామాబాద్ జిల్లాలోని నిజామ్‌సాగర్‌కు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి నిజాంసాగర్‌కు 1.16లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 19 గేట్లు ఎత్తివేసి 1.03 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. * * మెదక్ : మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం చిల్వర వద్ద మంగళవారం రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. * * చెన్నై: చెన్నైలో ఓలా క్యాబ్ డ్రైవర్ ఓ మహిళా డాక్టర్పై లైంగికదాడికి ప్రయత్నించాడు. మరో ఇద్దరితో కలసి ఆమెను బలవంతంగా కారులో తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కారు వెనుక వాహనంలో వెళ్తున్న ఓ వ్యక్తి డాక్టర్ అరుపులు విని చేజ్ చేసి స్థానికులతో కలసి ఆమెను రక్షించాడు. * * శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 200 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా(ఏఐ-559) విమానం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నిలిపేశారు. ఉదయం 6.40 వెళ్లాల్సిన విమానం ఇప్పటికీ బయలుదేరకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఇంత జరుగుతున్నా ఎయిర్ ఇండియా అధికారులు మాత్రం తమకేం బాద్యత లేనట్లు వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. * * ఖమ్మం : రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. దాదాపు అన్ని చెరువులు, కుంటల్లో నీరు ప్రమాదస్థాయికి చేరుకుంది. ఖమ్మం జిల్లా చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు బుధవారం ఉదయం ప్రాజెక్ట్ పదిగేట్లను ఎత్తివేసి... 23,730 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. * * కరీంనగర్ : ఎస్సారెస్సీ ప్రధాన కాలువకు గండిపడటంతో.. వందల ఎకరాల్లో పంట నీట మునిగింది. కరీంనగర్ జిల్లా మానాల సమీపంలో గల ఎస్సారెస్సీ ప్రధాన కాలువకు మంగళవారం రాత్రి భారీ గండి పడింది. దీంతో పెగడపల్లి, గొల్లపల్లి మండలాల పరిధిలోని చెరువులన్ని నిండిపోయాయి. సుద్దపల్లిలోని కొయ్యచెరువు, రాఘవపట్నంలోని మొగుళ్ల చెరువుకు గండి పడటంతో.. వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. * * హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాల్లో కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్న ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య విద్య సీట్లకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకూ వెబ్ ఆప్షన్ల నమోదుకు గడువు ఉంటుందని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ కరుణాకరరెడ్డి తెలిపారు. * * శంషాబాద్ : దుబాయ్ వెళుతున్న అహ్మద్ అనే వ్యక్తి నుంచి మంగళవారం ఉదయం భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహించగా అహ్మద్ వద్ద భారీగా విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. నిందితుని అదుపులోకి తీసుకుని విచారణచేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * హైదరాబాద్ : ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేసంలో ఆయన పాల్గొనున్నారు. ముఖ్యమంత్రి తోపాటు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కూడా ముఖ్యమంత్రి బృందంతో పర్యటించనున్నారు. * * హైదరాబాద్‌: నాంపల్లిలోని టీఎన్‌జీవో కార్యాలయంలో సోమవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీలో పనిచేస్తున్న సుమారు 700 మంది నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగులను తెలంగాణకు బదిలీ చేయాలంటూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పెట్రోల్‌ డబ్బాలతో టీఎన్‌జీవో కార్యాలయంలోకి ఉద్యోగులు వెళ్లడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. * * దుగ్గొండి(వరంగల్) : ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో.. బైక్‌పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. * * తిర్యాని: స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఆశ్రమ పాఠశాల విద్యార్థి వాగులో మునిగి మృతి చెందాడు. అదిలాబాద్ జిల్లా తిర్యాని మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న కె. లక్ష్మణ్‌రాహూల్(12) ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి సమీపంలోని వాగులో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. * * చొప్పదండి: కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలంలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. భూపాలపట్నంకు చెందిన మునిగాల అంజయ్య (48) అప్పులబాధతో గ్రామశివారులోని పశువుల కొట్టం వద్ద ఉరివేసుకొని బలవన్మరణం చెందాడు. స్థానిక రైతులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. గ్రామంలో 4.38 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా గత కొన్నేళ్లుగా వ్యవసాయంలో నష్టాలు రావడంతో రూ.5లక్షలకు పైగా అప్పులయ్యాయి. వాటిని తీర్చే మార్గం లేక మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. * * హైదరాబాద్ : తెలంగాణ విమోచన దినం నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో జాతీయ జెండా ఎగరేసేందుకు బీజేపీ ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి యత్నించారు. అందులోభాగంగా ఆయన వాహనంలో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే కిషన్రెడ్డి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు... కిషన్రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. * * మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తిని రేవెన్యూ డివిజన్ చేయాలంటూ కల్వకుర్తి MLA అయిన చల్లా వంశీచంద్ రెడ్డి చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి అరెస్ట్ చేసారు. * * చర్ల: ఖమ్మం జిల్లా తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉదృతి పెరిగింది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన 9 గేట్లను 2 అడుగుల మేర ఎత్తారు. 8400 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు నుంచి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 73.6 మీటర్లుగా ఉంది. * * నల్గొండ : నల్గొండ జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టులో నీటి మట్టం బుధవారం 47.59 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టులోకి 29,373 క్యూసెక్కుల నీరు వస్తుండగా..9,929 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు నుంచి అధికారులు బయటికి వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 21.30 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు. * * నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా దోమకొండలో ఓ బాలుడు ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ తగిలి మరణించాడు. వివరాలు ఇలా ఉన్నాయి... వివేక్ (16) అనే బాలుడు బుధవారం వేకువజామున ప్రమాదవశాత్తూ కరెంటు షాక్‌కు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని రుద్ర ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాద్దిసేపటికే మరణించాడు. * * నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్ర శివారులో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఇద్దరికి మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డారు. బస్సు ముందు భాగం మాత్రం దెబ్బతిన్నది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. * * యాలాల: రంగారెడ్డి జిల్లా యాలాల శివారులో ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ మండలం హుస్నాపూర్ గ్రామానికి చెందిన వెంకటయ్య, యోగి జీవనోపాధి కోసం వచ్చి రంగారెడ్డి జిల్లాలో స్థిరపడ్డారు. * * కరీంనగర్: కరీంనగర్ జైలు నుంచి ఇద్దరు దొంగలు పరారీ అయ్యారు. వీరి కోసం కరీంనగర్ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జైలు నుంచి పరారైన వారు మహారాష్ట్ర పార్సీ గ్యాంగ్కు చెందిన జితేందర్, యోగేశ్లుగా గుర్తించారు. * * హైదరాబాద్: పాతబస్తీ భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తలాబ్‌కట్ట, అమన్ నగర్ ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్‌నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన దృవపత్రాలు లేని 83 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. * * శంషాబాద్ (హైదరాబాద్‌): శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రంయలో తనిఖీలు నిర్వహిస్తున్న కస్టమ్స్ అధికారులు అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 320 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద అక్రమ బంగారం గుర్తించిన ఎయిర్‌పోర్ట్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. * * నార్కెట్‌పల్లి(నల్లగొండ): వేగంగా వెళ్తున్న కారు, లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి శివారులోని 65వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. * * ములుగు: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు నీటిగుంటలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ములుగు మండలం బండారుపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏడాదిన్నర చిన్నారి తల్లిదండ్రులు పనులు చూసుకుంటుండగా.. చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందు ఉన్న నీటిగుంటలో పడి మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. * * కోరుట్ల: మోటర్ పెట్టడానికి వ్యవసాయ బావి దగ్గరకు వెళ్లిన రైతు ప్రమాదవశాత్తు విద్యుధ్ఘాతానికి గురై మృతి చెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాంరెడ్డి(45) ఈ రోజు ఉదయం మోటర్ ఆన్ చేయడానికి వెళ్లాడు. అయితే షార్ట్ సర్క్యూట్ కావడంతో కరెంట్ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. * * పంజగుట్ట: మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ నిమ్స్‌ ఆసుపత్రి ఓపీలో రెప్పపాటులో రూ. 40 వేలు చోరీ చేసింది. అక్కడే విధుల్లో ఉన్న ఓ మహిళా గార్డు ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం ... నాంపల్లికి చెందిన గౌసియా బేగం (32) బుధవారం మధ్యాహ్నం నిమ్స్‌ ఆసుపత్రి ఓపీ వద్దకు వచ్చింది. * * మహేశ్వరం: వేగంగా వెళ్తున్న లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టిన ఘటనలో క్లీనర్ మృతిచెందగా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం రావిర్యాల ఔటర్ రింగ్‌ రోడ్డుపై గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పెద్ద అంబర్‌పేట్ నుంచి వస్తున్న లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టింది. * * తాండూరు(రంగారెడ్డి): కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ఎం. మాణిక్‌రావు(86) నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాణిక్‌రావును కుటుంబ సభ్యులు నిమ్స్ ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందారు. * * దమ్మపేట: దుక్కి దున్నుతున్న ట్రాక్టర్‌పై విద్యుత్ స్తంభం విరిగిపడటంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లిలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లకావత్ చిట్టయ్య(35), ధారావత్ మహేష్(22)లు ట్రాక్టర్ సాయంతో దుక్కిదున్నతున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం విరిగిపడింది. దీంతో ట్రాక్టర్ పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. * * హైదరాబాద్: జిల్లాల పునర్విభజన విషయంలో అధికార టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను కలసి తమ అభ్యంతరాలను తెలిపారు. మంగళవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిలు సచివాలయంలో సీఎస్‌ను కలసి వినతి పత్రం అందజేశారు. * * హైదరాబాద్ : దసరా నుంచి కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు అన్నీ ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. జిల్లా కలెక్టర్లతో ఆయన ఈ విషయమై సమావేశమయ్యారు. కొత్త జిల్లాల్లో పనిభారాన్ని బట్టి పరిపాలనా విభాగాలు ఉండాలని తెలిపారు. అధికారుల సర్దుబాట్లు, కొత్త ఉద్యోగుల నియామకాలు జరగాలని సూచించారు. * * సంగారెడ్డి: మెదక్ జిల్లా పటాన్‌చెరు ఇస్నాపూర్ వద్ద సోమవారం అర్థరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. వేగంగా వచ్చిన ట్యాంకర్ లారీ ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో బైక్‌పై వెళుతున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. * * మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సివిల్ జడ్జి నాగరాజు ఇంట్లో దొంగలు పడి బీభత్పం సృష్టించారు. జడ్జి కుటుంబసభ్యులు ఊరు వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగింది. ఇరుగుపొరుగువారు ఇచ్చిన సమాచారం మేరకు మిర్యాలగూడ పోలీసులు క్లూస్ టీమ్‌తో చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. జడ్జికి సమాచారం ఇచ్చారు. * * నల్గొండ : భువనగిరిలో గ్యాంగ్స్టర్ నయీం అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై స్థానిక ఆర్డీవో శనివారం విచారణ జరపనున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 1700 మంది బాధితులు ఇప్పటికే ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. నల్గొండ జిల్లా బొమ్మాయిపల్లిలోని లక్ష్మీనరసింహ వెంచర్లో 1700 మందికి చెందిన ప్లాట్లను నయీం తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. * * హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-2 రాత పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2015 డిసెంబర్ 30న 439 పోస్టుల భర్తీకి జారీ అయిన నోటిఫికేషన్ కింద ఇప్పటికే 5,64,431 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, మరో 593 పోస్టుల భర్తీకి ప్రస్తుత అనుబంధ నోటిఫికేషన్ కింద మరో లక్షన్నర మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. * * హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య మరో వివాదం తలెత్తింది. సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న 21 మంది తెలంగాణ ఇంజినీర్లు తమను ఏపీ జెన్ కో అధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమపై జెన్ కో అధికారులు పరిమితికి మించిన పనిభారం మోపుతున్నారని పేర్కొటూ.. మూడు రోజులుగా తెలంగాణ ఇంజనీర్లు విధులకు హాజరవడం మానేశారు. * * వరంగల్ ఎంజీఎం: వరంగల్ జిల్లా కేంద్రంలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. స్థానిక లేబర్ కాలనీకి చెందిన సంధ్య అనే మహిళకు మొదటికాన్పులో ముగ్గురు ఆడ శిశువులు పుట్టారు. ఈ సంఘటన వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో శనివారం చోటుచేసుకుంది. శనివారం ఉదయం 8 గంటల సమయంలో ఆసుపత్రి వైద్యులు మహిళకు సర్జరీ చేసి ముగ్గురు శిశువులను బయటకు తీశారు. ముగ్గురూ ఆరోగ్యంగా ఉన్నారు. * * హైదరాబాద్: ఇటీవల పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన గ్యాంగ్‌స్టర్ నయీం ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. శేషన్న ప్రధాన అనుచరుడు సోమన్నఇచ్చిన సమాచారం మేరకు నగరంలోని కుషాయిగూడలో సిట్ అధికారులు గురువారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నయీం అనుచరులు శ్రీనివాస్, లక్ష్మణ్‌లను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని తమ కార్యాలయానికి తరలించారు. నయీంకు సంబంధించిన మరింత అదనపు సమాచారం కోసం సిట్ అధికారులు వారిని విచారిస్తున్నారు. * * కరీంనగర్: నేడు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె కరీంనగర్ జిల్లాలో సంపూర్ణంగా కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాలయాలు సంపూర్ణంగా బంద్ పాటిస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జిల్లాలో 11 డిపోలలో మొత్తం 980 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. * * నల్లగొండ: దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నేపథ్యంలో యాదగిరిగుట్టలో కార్మిక సంఘాలు సమ్మెలో పాల్పంచుకున్నాయి. ఆర్టీసీ కార్మకులు కూడా ఈ సమ్మెలో పాల్గొనడంతో.. యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోకు చెందిన 105 బస్సులు డిపోలోపలే ఉండిపోయాయి. దీంతో యాదగిరిగుట్టకు వచ్చే భక్తులు, ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ వాహనదారులు తమకు ఇష్టం వచ్చిన రీతిలో ప్రయాణికుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. * * యాదగిరిగుట్ట : నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని సాయిబాబా మందిరంలో వినాయకుడి రూపంలో అల్లం దర్శనమివ్వడంతో.. స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలకు ముందు ఇలా జరగడం శుభ పరిణామమని భక్తులు భావిస్తున్నారు. స్థానిక సాయి ఆలయంలో అన్నదానం కోసం కొనుగోలు చేసిన అల్లంలో పార్వతి పుత్రుడి ప్రతిమ రూపంలో ఉన్న అల్లం లభించిందని ఆలయ సిబ్బంది తెలిపారు. ఈ వార్త తెలిసిన ప్రజులు పెద్ద ఎత్తున అల్లం వినాయకుడిని దర్శించుకోవడానికి తరలి వస్తున్నారు. * * నల్లగొండ: నల్లగొండ జిల్లా దామరచర్లలో దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు గురువారం రట్టు చేశారు. అందుకు సంబంధించి నలుగురు వ్యక్తులకు పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక కిరాణా దుకాణంలో నకిలీ నోట్లు మారుస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని... తమదైన శైలిలో విచారించారు. * * హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురంలో సుష్మా థియేటర్ వద్ద బ్లాక్లో టికెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 50 సినిమా టికెట్లతోపాటు రూ. 2 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీసుస్టేషన్కు తరలించారు. * * హైదరాబాద్‌ జిల్లాలో 49,903 పింఛన్లకు కోత పడనుంది. ప్రభుత్వం చేపట్టిన లెఫ్‌ ఎవిడెన్స్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ బుధవారంతో ముగియడం నిజమైన పింఛన్‌దారుల లెక్కతేల నుంది. 36,512మంది వెరిఫికేషన్‌ చేయించుకోకపోగా, వెరిఫికేషన్‌ ప్రక్రియలో పాల్గొన్నా వేలిముద్రలు సరిపోలకపోవడం, ఆధార్‌తో లింకు కలువని 11,392 మందికి పింఛన్లు నిలిచిపోనున్నాయి. ఆధార్‌ లింకు మ్యాచ్‌ కాని వా రు మళ్లీ కొత్తగా ఆధార్‌ నమోదు చేసుకోవాల్సి ఉంది. * * మెదక్ : మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ వద్ద గురువారం వ్యాన్ను స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి... వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. * * ఖమ్మం: జిల్లాలో భారీగా ఎస్సైలు బదిలీ అయ్యారు. జిల్లాలోని దాదాపు 58 మంది ఎస్సైలకు స్థానచలనం కల్పిస్తూ జిల్లా ఎస్పీ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఎస్సైలుగా విధులు నిర్వహిస్తున్నవారితోపాటు... కొత్తగా ఎస్సై ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి కూడా ఈ బదిలీల్లో పోస్టింగ్ ఇస్తున్నట్లు ఎస్పీ ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. * * హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన బాట చేపట్టాయి. అందులోభాగంగా గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు కళాశాలల బంద్కు సదరు యాజమాన్యం పిలుపు నిచ్చింది. * * లాస్‌ఏంజిలెస్: అంగారక గ్రహం ఉపరితలంపై ఉన్న పరిస్థితులను భూభాగంపై సృష్టించి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా జరిపిన అరుదైన ప్రయోగం విజయవంతంగా ముగిసింది. ఈ మేరకు నాసా అమెరికాలోని హవాయి రాష్ట్రంలో అంగారక గ్రహం పరిస్థితుల్లో మానవుడి మనుగడ సాధ్యమా అన్న అంశంపై పరిశోధన నిర్వహించింది. ఆరుగురి బృందంతో ఏడాది క్రితం ప్రారంభించిన ఈ ప్రయోగం సోమవారం ముగిసింది. * * నేడు ఐసెట్ ప్రవేశాలకు కొనసాగుతున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ - 50,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు నేడు వెరిఫికేషన్ - ఎన్సీసీ కేటగిరిలో 30,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ * * హైదరాబాద్: స్విస్ ఛాలెంజ్ పై నేడు హైకోర్టులో విచారణ * * హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ కోసం 1969లో జరిగిన ఉద్యమంలో పాల్గొని పోలీస్ కాల్పుల్లో గాయపడ్డ హైదరాబాద్ వాసి పగడాల పరంధామకు రూ.10 లక్షల ఆర్థికసాయం అందించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. 1969 ఏప్రిల్ 4న సికింద్రాబాద్ జనరల్ బజార్‌లో జరిగిన కాల్పుల్లో పరంధామ ఛాతిలో, కుడి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. * * లాస్ ఎంజెల్స్: లాస్ ఎంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎలాంటి కాల్పుల ఘటనలు చోటుచేసుకోలేదని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఒక పెద్ద శబ్దం మాత్రమే వచ్చి దాన్ని ఎయిర్ పోర్ట్ సిబ్బంది కాల్పులుగా భ్రమపడ్డారని చెప్పారు. అమెరికాలోని లాస్ ఎంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాల్పులు చోటుచేసుకున్నాయని తొలుత కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. * * విశాఖపట్నం: రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం సూచించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని వెల్లడించింది. * * హైదరాబాద్: తమ డిమాండ్లను తీర్చి, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఎన్‌ఎంలూ మంత్రి నివాసం ముట్టడికి యత్నించారు. సోమవారం ఉదయం మణికొండలోని మంత్రి లక్ష్మారెడ్డి ఇంటి వద్దకు భారి ఎత్తున చేరుకున్న ఏఎన్‌ఎంలు ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి సమ్మె విరమించి వస్తే సమస్య సరిష్కారానికి కృషి చేస్తానని హామి ఇచ్చారు. * * బిర్కూర్ : నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండల కేంద్రంలోని తిరుమల దేవస్థానంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు శనివారం ఉదయం వరుణయాగం నిర్వహించారు. దేవస్థానం ఆవరణంలోని గణపతి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. * * న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో 118 మందితో కూడిన భారీ బృందాన్ని పంపిస్తే కేవలం రెండు పతకాలు మాత్రమే దక్కడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది. వచ్చే మూడు ఒలింపిక్స్‌లలో పతకాలు కొల్లగొట్టేందుకు సమగ్ర కార్యాచరణ పథకాన్ని అమలు చేసేందుకు టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. * * హైదరాబాద్‌సిటీ: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపించారు. రాజేంద్రనగర్ పరిధిలోని గగన్‌పహాడ్ వద్ద హైదరాబాద్-బెంగుళూరు జాతీయరహదారిపై రవాణాశాఖాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 10 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. తనిఖీలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. * * మియామి: అతను చెవిటి వ్యక్తి. సంకేత భాషలోనే ఎవరితోనైనా ముచ్చటిస్తాడు. వేగంగా వాహనాన్ని నడుపుతున్నాడనే సాకుతో అతన్ని ఓ జవాను వెంబడించాడు. ఇద్దరి మధ్య 13 కిలోమీటర్ల పాటు హోరాహోరీగా ఛేజింగ్ జరిగింది. చివరకు అతను తన ఇంటికి సమీపంలో వాహనాన్ని ఆపాడు. వాహనం దిగిన అతన్ని జవాను తుపాకీతో కాల్చాడు. సంఘటనా స్థలంలోనే అతను కుప్పకూలాడు. అమెరికాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దుమారం రేపుతోంది. * * అహ్మదాబాద్: ఓ సీనియర్ జర్నలిస్టు ఏకంగా పత్రికా కార్యాలయంలోనే దారుణంగా హత్యకు గురయ్యాడు. కార్యాలయంలో కూర్చుని వార్తాకథనం రాస్తుండగా దుండగులు ఆయనను కిరాతకంగా పొడిచి చంపారు. నెత్తుటి మడుగులో ఉన్న ఆయన మృతదేహాన్ని మంగళవారం పోలీసులు గుర్తించారు. గుజరాత్ సౌరాష్ట్ర ప్రాంతంలోని జునాగఢ్ పట్టణంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. * * హిమాయత్‌నగర్‌: రోడ్డు, రవాణా భద్రతా బిల్లు, ఆర్టీఏ, ట్రాఫిక్‌ పోలీసుల వేధింపులకు నిర సనగా సెప్టెంబర్‌ 2న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఆటోడ్రైవర్ల సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నాయకులు తెలిపారు. హిమాయత్‌నగర్‌లోని ఎఐటియుసి భవన్‌లో సోమవారం బంద్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో లక్ష్మయ్య పాల్గొన్నారు. * * పంజగుట్ట: గణేష్‌ ఉత్సవాలను గతంలో మాదిరిగానే నిర్వహించుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసినా పోలీసు అధికారులు నిబంధనల పేరుతో వేధించడం తగదని భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ప్రతినిధులు అన్నారు. గణేష్‌ నిమజ్జనంతో కాలుష్యం వెలువడటం లేదని పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు నివేదిక ఇచ్చిందని, ఎత్తు విషయంలో జోక్యం చేసుకోబోమని హైకోర్టు పేర్కొన్నా ఎత్తు తగ్గించాలని ఒత్తిడి చేయడం దారుణమన్నారు. * * హైదరాబాద్: మాజీ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డిని కరీంనగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మావోయిస్టు, గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీమ్ తరహాలోనే మోహన్‌రెడ్డి అరాచకాలకు పాల్పడేవాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గ్యాంగ్‌స్టార్‌ నయీం ముఠాతో సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు. నిన్న రాత్రి (సోమవారం) 8 గంటలకు మోహన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. * * ఇస్తాంబుల్ : ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన 12 ఏళ్ల ఆత్మాహుతి బాంబర్.. టర్కీలో ఉగ్రవాద దాడి చేసి, 51 మంది ప్రాణాలు బలిగొన్నాడు. ఓ పెళ్లిని లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 69 మంది గాయపడ్డారు. వారిలో 17 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ దాడికి పాల్పడింది 12 ఏళ్ల కుర్రాడేనని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తెలిపారు. * * ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేసినిరోడ్డు రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇది గుర్తించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. * * కోయంబత్తూర్: తన ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను హతమార్చింది. తొలి ప్రయత్నంలో పాముల ద్వారా కాటు వేయించాలని ప్రయత్నించి అది విఫలం కావడంతో సుఫారీ ఇచ్చి అతడిని హత్య చేయించింది. ఈ ఘటన తమిళనాడులోని పట్టనంపుదూర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళకు కృష్ణ అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉంది. * * దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా మొదటి స్థానానికి చేరుకుంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో కోహ్లి సేన టాప్ ర్యాంకులో నిలిచింది. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ లో ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోవడంతో టీమిండియా మొదటి ర్యాంకు సొంతం చేసుకుంది. 3-0తో సిరీస్ ను శ్రీలంక క్లీన్ స్వీప్ చేయడంతో మొదటి ర్యాంకులో ఉన్న ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది. * * హైదరాబాద్: స్థానికేతర ఉద్యోగులు తమను ఇబ్బంది పెడుతున్నారంటూ తెలంగాణ సచివాలయంలో రెండో రోజు ఆర్థిక శాఖ ఉద్యోగులు బుధవారం తమ నిరసనలు తెలిపారు. ఉన్నతాధికారుల వద్ద పీఎస్లుగా పని చేస్తున్నవారిని తప్పించాలని వారు డిమాండ్ చేశారు. అందులోభాగంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును టీ. ఉద్యోగుల సంఘం నేతలు కలిశారు. * * హైదరాబాద్‌: హయత్‌నగర్ మండలం పసుమాముల బీసీ హాస్టల్ విద్యార్థి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి... సదరు బీసీ హాస్టల్లో ఉంటూ రాకేశ్ అనే విద్యార్థి కలుషిత నీరు తాగి తీవ్ర అనారోగ్యం పాలైయ్యాడు. దీంతో హాస్టల్ సిబ్బంది అతడిని ఎల్బీ నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రెండు రోజులుగా చికిత్స పొందుతు బుధవారం రాత్రి మరణించాడు. * * నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం దుర్కి గ్రామంలో డయేరియాతో గంగవ్వ (50) అనే మహిళ గురువారం మృతి చెందింది. గ్రామంలో డయేరియా ప్రబలింది. దీంతో సమాచారం అందుకున్న జిల్లా వైద్యాధికారులు గ్రామంలో మూడు రోజులు వైద్యశిబిరం నిర్వహించారు.అయితే గంగవ్వ ఈ రోజు మరణించింది. దాంతో బోధన్ ఆర్డీవో సుధాకర్ రెడ్డి గురువారం దుర్కి గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులకు అందుతున్నసేవలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. * * హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం మహముద్ అలీ అధ్యక్షతన మంత్రులు కడియం శ్రీహరి, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. జిల్లాల ఏర్పాటుపై అన్ని వర్గాల నుంచి వచ్చే ప్రతిపాదనలు చర్చించి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. * * హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీం కేసు దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. సిట్ అధికారిగా ఐజీ నాగిరెడ్డిని ప్రభుత్వం నియమించింది. అడిషనల్ ఎస్పీ, ఇద్దరు డీఎస్సీలు సహా 8మందితో ఏర్పాటు అయిన సిట్ బృందానికి నాగిరెడ్డి నేతృత్వం వహిస్తారు. * * పంజగుట్ట: న్యాయస్థానంలోనే న్యాయవాదిపై దాడి చేసిన వ్యక్తిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు... నగరానికి చెందిన దీక్ష అమోల్, బాలకృష్ణ అమోల్‌ భార్యాభర్తలు. దీక్ష తన భర్త అయిన బాలకృష్ణపై గృహహింస కేసు పెట్టగా ఎర్రమంజిల్‌ కోర్టులో మంగళవారం కేసు విచారణకు వచ్చింది. కూకట్‌పల్లికి చెందిన న్యాయవాది వసంత్‌రావు దేశ్‌పాండే కేసు వాదిస్తుండగా, తీవ్ర ఆగ్రహానికి గురైన బాలకృష్ణ న్యాయవాదిని చొక్కా పట్టుకుని బయటకు లాక్కొచ్చి దాడి చేశాడు. * * కరీంనగర్(పెద్దపల్లి) : కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో చేరాలనుకునే విద్యార్థుల కోసం రెండో విడత కౌన్సెలింగ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు పెద్దపల్లి ఐటీఐ ప్రిన్సిపాల్‌ సురేందర్‌ తెలిపారు. 11 నుంచి 20 తేదీల్లో అభ్యర్థులు దరఖాస్తులు అందజేయాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో దరఖాస్తు ఫారాలు లభిస్తాయన్నారు. అభ్యర్థులకు ఈ నెల 24, 28, 30 తేదీల్లో కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు. * * గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరులు, బంధువుల నివాసాల్లో రెండో రోజు కొనసాగుతున్న పోలీసుల సోదాలు * * నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఈ నేపథ్యంలో నేటి మధ్యాహ్నాం 2.00 గంటలకు అరకులోని ఎన్టీఆర్ గ్రౌండ్స్లో ఆదివాసీ దినోత్సవం జరగనుంది.ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి రావెల కిషోర్ బాబు పాల్గొనున్నారు. * * మెదక్: మెదక్ జిల్లా ఆంధోల్ మండలం కిచ్చన్నపల్లి వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. క్రూజర్ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వాసుపత్రిలో ప్రాధమిక చికిత్స తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. * * నల్గొండ: చిట్యాల మండలo వేలిమినేడు గ్రామ శివార్లో గుర్తు తెలియని మహిళ మ్రుతదేహము లభ్యమైంది. ఈ మహిళ చనిపోయి 2 రోజులు అయి ఉండవచ్చని ఎస్.ఐ. శివకుమార్ అనుమానము వ్యక్తము చేశారు. * * కరీంనగర్(పెద్దపల్లి): కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామంలోని VRO గౌస్ పాషా అక్కడి రైతు నుండి 20 వేలు లంచం తీసుకుంటుండగా ACB కి పట్టుబడ్డాడు. * * హైదరాబాద్ : జీవో 123పై సోమవారం హైకోర్టు డివిజన్ బెంచ్లో విచారణ జరిగింది. భూ నిర్వాసితులు, రైతు కూలీల రక్షణ కోసం తీసుకునే చర్యలను తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ ద్వారా కోర్టుకు సమర్పించింది. నిబంధనల ప్రకారమే నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తున్నామని... వ్యవసాయ కూలీలను ఆదుకుంటామని అడ్వకేట్ జనరల్ (ఏజీ) ఆ అఫిడవిట్లో విన్నవించారు. * * ఇస్లామాబాద్ లో జరిగిన సార్క్ హోంమంత్రుల సదస్సుకు భారత జర్నలిస్టులను అనుమతించని పాకిస్తాన్ వారిని కనీసం ప్రవేశ ద్వారం వద్ద కూడా ఉండనివ్వలేదని వెల్లడైంది. సార్క్ దేశాల ప్రముఖులను పాక్ హోంమంత్రి నిసార్ ప్రవేశ ద్వారం వద్ద ఆహ్వానిస్తున్నపుడు భారత జర్నలిస్టులు అక్కడే ఉన్నారు. భారత హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ రాగానే పాక్ జర్నలిస్టులు ఫోటోలు తీసేందుకు సన్నద్ధమవుతుండగా వీరూ వెళ్లారు. అయితే అక్కడ నుండి వెళ్లిపోవాలని, గేటు బయట నిలబడేందుకూ కూడా భారత్ జర్నలిస్టులకు అనుమతి లేదని పాక్ అధికారులు తేల్చి చెప్పారు. * * నేడు ఆగష్టు 6న తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జయంతి * * ఇవాళ ఇస్రో, తెలంగాణ ఇరిగేషన్ శాఖ మధ్య ఎంవోయూ అత్యాధునిక టెక్నాలజీతో తెలంగాణ జలవనరుల సమాచార వ్యవస్థ జలాశయాల్లో నీటి నిల్వలను ఉపగ్రహంతో విశ్లేషించనున్న తెలంగాణ * * శంషాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో శనివారం ఉన్నతాధికారులు హైఅలెర్ట్ ప్రకటించారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకులు నేపథ్యంలో నిఘా వర్గాలు ఎయిర్ పోర్టు అధికారులను అప్రమత్తం చేశారు. * * పెబ్బేరు(మహబూబ్‌నగర్): రైతులు పెట్టిన విషం గుళికలు తిని దాదాపు 40 జింకలు చనిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొందరు రైతులు కృష్ణా నదిలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. పంటను పురుగుల బారి నుంచి రక్షించుకునేందుకు మొదళ్ల వద్ద శుక్రవారం రాత్రి విషం గుళికలను చల్లారు. సమీపంలోని అటవీప్రాంతం నుంచి వచ్చిన జింకలు గడ్డి మేసుకుంటూ వచ్చి గడ్డితోపాటు గుళికలను కూడా తినేశాయి. దీంతో అ విష ప్రభావానికి లోనై దాదాపు నలబై జింకలు చనిపోయాయి. * * వాయువ్య బంగాళఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఉ.ఒడిశా, ప.బెంగాల్, జార్ఖండ్ తీరాలను ఆనుకుని అల్పపీడనం అల్పపీడన ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఒడిశా, కోస్తాంధ్ర మీదుగా ద.తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కోస్తా తీరం వెంబడి గంటకు 45-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక: వాతావరణ కేంద్రం * * మ్మం: ఛత్తీస్‌గఢ్ దంతేవాడ జిల్లాలో శుక్రవారం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. దంతేవాడ - బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన సర్సఫాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఆ విషయాన్ని పసిగట్టిన మావోయిస్టులు... పోలీసులపై కాల్పులకు దిగారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులకు దిగారు. * * ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లెందులోని ఓపెన్‌కాస్టు సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇల్లెందు పట్టణంలోని ప్రధాన రహదారిపై అధిక వేగంతో వెళ్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ లారీ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోగా మరో లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. * * కరీంనగర్ : ఎస్సీ వర్గీకరణ బిల్లు వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అందులోభాగంగా శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైల్వేస్టేషన్లో వారు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్లో ఆగి ఉన్న సింగరేణి ప్యాసింజర్ రైలును వారు నిలిపివేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో భారీగా ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. * * హైదరాబాద్: ఈ నెల 8 నుంచి తెలంగాణలోని 11 విశ్వవిద్యాలయాల్లో నిరవధికంగా బంద్ పాటించనున్నట్లు తెలంగాణ వర్సిటీ నాన్ టీచింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కంచి మనోహర్, సెక్రెటరీ జనరల్ మహిపాల్ రెడ్డి బుధవారం పేర్కొన్నారు. రాష్ట్ర్రంలో అతిపెద్దదై ఉస్మానియాతో పాటు ఇతర వర్సిటీల్లో ప్రతి నెల 1న వేతనాలు, ఫించన్లు రావడం లేదన్నారు. సీమాంధ్రుల పాలనలో కూడా వేతనాలకు ఇలాంటి దుస్థితి ఎన్నడూ ఏర్పడలేదన్నారు. * * హైదరాబాద్: ప్రత్యేక హైకోర్టు ఉద్యమంలో పాల్గొన్న న్యాయవాదులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు నోటీసులివ్వడానికి నిరసనగా గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయాలని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నిర్ణయించింది. జేఏసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి నేతృత్వంలో న్యాయవాదులు బుధవారం సమావేశమయ్యారు. * * వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 48 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు... అలాగే తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. * * కరీంనగర్: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కాన్వాయ్‌కి బుధవారం తృటిలో ప్రమాదం తప్పింది. కాన్వాయ్‌లోని ఓ వాహన డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేయడంతో వెనకున్న టీఆర్‌ఎస్ నాయకుల వాహనాలు ఒకదానివెంట మరొకటి వరసగా ఢీకొన్నాయి. దీంతో సదరు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి ఈటల రాజేందర్ బుధవారం మెట్‌పల్లి వచ్చారు. * * కరీంనగర్(ముకరంపుర): జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ప్రభుత్వ నిర్ణయం ఊరటనిచ్చింది. పదేళ్లుగా కీలకంగా పనిచేస్తున్న ఫీల్డ్‌అసిస్టెంట్లను రెగ్యులరైజ్‌ చేయాలని, వేతనాలు పెంచాలన్న డిమాండ్‌తో చేపట్టిన ఆందోళనలకు సర్కార్‌ ఎట్టకేలకు దిగివచ్చింది. ప్రస్తుతం నెలవారీగా ఇస్తున్న వేతనం రూ.6240నుంచి రూ.10 వేలకు పెంచింది. * * మణుగూరు :ఖమ్మం జిల్లా మణుగూరు సమీపంలో మంగళవారం స్కూలు బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. విప్పల సింగారం నుంచి జీఎం ఆఫీసు రోడ్డులో వస్తున్న హోలీ ఫ్యామిలీ స్కూల్ బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోయి... అదుపుతప్పి బస్సు కాల్వలోకి దూసుకెళ్ల్లింది. అందులోని ఐదుగురు విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. * * చండీగఢ్: వాళ్లంతా దివ్యాంగులు. కొందరికి చూపులేదు, ఇంకొందరు బుద్ధిమాంద్యులు.. అందరూ చిన్నపిల్లలే. అంతసేపు హాయిగా ఆడుకున్నవాళ్లుకాస్తా మధ్యాహ్నం భోజనం తిన్నతర్వాత వాంతులు చేసుకోవడం మొదలుపెట్టారు. నిమిషాల్లోనే పరిస్థితి చేయిదాటిపోయింది. పిల్లలు ఒకొక్కరిగా రాలిపోయారు. పంజాబ్ లోని కపుర్తలా జిల్లా కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం కనిపించిన దృశ్యాలివి. * * పురవి: వరంగల్‌ జిల్లా పురవి మండల కేంద్రంలో ఉన్న ఆంధ్రాబ్యాంకులో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. రాత్రి సమయంలో బ్యాంకు తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దుండగులు కౌంటర్‌ గదిలో సీసీ కెమెరాలను కత్తిరించారు. సోమవారం ఉదయం సిబ్బంది బ్యాంకును తెరవడంతో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పురవి సీఐ శ్రీనివాస్‌, ఎస్సై రామకృష్ణ అక్కడకు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. * * నేడు ఎంసెట్-3 షెడ్యూల్ విడుదల చేసే అవకాశం జేఎన్టీయూ వీసీ లేదా రిజిస్ట్రార్కు కన్వీనర్ బాధ్యతలు ఎంసెట్-2 విద్యార్థులకు పాత రిజిస్ట్రేషన్ పై కొత్త హాల్టికెట్లు * * ఇవాళ ప్రారంభంకానున్న రూపాయికే నల్లా కనెక్షన్ పథకం గ్రేటర్ హైదరాబాద్లో పేదలకు రూపాయికే వాటర్ కనెక్షన్ * * వరంగల్: వరంగల్ జిల్లా ధర్మాసాగర్ జలాశయంలో ఆదివారం గల్లంతైన కానిస్టేబుల్ పొలిమారి సృజన్(25)మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు. ఆదివారం మిత్రులతో కలిసి ఈతకు వెళ్లిన సృజన్ ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. * * మహారాష్ట్ర: పుణెలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిపోవడంతో తొమ్మిది మంది కార్మికులు మృతిచెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు యత్నిస్తున్నారు. * * వరంగల్ : వరంగల్ నగరంలోని ఆర్టీఏ జంక్షన్లో బస్సు... ముందు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను నగరంలోని ఆసుపత్రికి తరలించారు. * * హైదరాబాద్ : ఎంసెట్ - 2 పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ... మంత్రులు కడియం, లక్ష్మారెడ్డి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. శుక్రవారం మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి విద్యార్థి సంఘాలు యత్నించాయి. ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. * * న్యూఢిల్లీ: పార్లమెంటులో ఓ కోతి హల్ చల్ చేసింది. అరగంటపాటు అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది. దాన్ని బందించేందుకు ప్రయత్నం చేసిన చివరకు వారికి దొరకకుండా దానంతట అదే దర్జాగా ప్రధాన ద్వారం గుండా బయటకు వెళ్లింది. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం ఎంపీలు, జర్నలిస్టులు చదువుకునేందుకు ఏర్పాటుచేసిన పార్లమెంటు రీడింగ్ హాల్ లోకి ఓ కోతి ప్రవేశించింది. * * కరీంనగర్‌: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో ఏఈకికు రెండేళ్ల జైలుశిక్ష, రూ.పదివేల జరిమానా విధిస్తూ బుధవారం ఏసీబీ కోర్టు తీర్పు వెలువరిచింది. 2008లో గంగాధరలో విద్యుత్‌ శాఖ ఏఈగా పనిచేస్తున్న బండారు అజయ్‌కుమార్‌ గంగాధరకు చెందిన అంకం శంకరయ్య అనే పవర్‌లూం కార్మికుడికి విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు అదే ఏడాది జనవరి 18న రూ.6వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. * * వరంగల్ : వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా కేసముద్రం మండలం రాజీవ్ నగర్ తండా సమీపంలో గురువారం చోటుచేసుకుంది. తండా నుంచి కేసముద్రం వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో.. కారు నడుపుతున్న రమేష్ పండిట్ రాథోడ్ (42) అక్కడికక్కడే మృతి చెందాడు. * * హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన కేసు విచారణను డివిజన్ బెంచ్ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. హైకోర్టు విభజనపై తెలంగాణ ప్రభుత్వ రివ్యూ పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది. హైదరాబాద్లోనే రెండు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయాలని టీ.సర్కార్ తన పిటిషన్లో కోరింది. గత తీర్పును పునసమీక్షించాలన్న పిటిషన్పై తీర్పును ఉమ్మడి హైకోర్టు రిజర్వ్లో ఉంచిన విషయం తెలిసిందే. దాంతో కేసును విచారించిన డివిజన్ బెంచ్.. తాను తీర్పును ప్రకటించలేనని, విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు ప్రకటన * * నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం కోమలంచ గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భూమా రమేశ్ (35) అనే రైతు కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. పొలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు ఫ్యూజు అమరుస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గ్రామస్తుల సహాయంతో అతడి మృతదేహాన్ని ఇంటికి తరలించారు. * * కరీంనగర్: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం జిల్లెల క్రాసింగ్ వద్ద ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిమ్మాపూర్ మండలానికి చెందిన మహ్మద్ రిజ్వాన్ (32) అక్కడికక్కడే మృతిచెందగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడ్ని సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. * * తిమ్మాపూర్‌ : రవాణాశాఖకు సంబంధించిన ఆన్‌లైన్‌ సేవలపై మీ సేవా కేంద్రాలు, ఈ సేవా కేంద్రాల నిర్వాహకులు, ఉద్యోగులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు కరీంనగర్‌ డీటీసీ వినోద్‌కుమార్‌ తెలిపారు. రోజుకు మూడు బ్యాచ్‌ల చొప్పున జిల్లాలోని నిర్వాహకులకు బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఆన్‌లైన్‌ సేవలకు దరఖాస్తు చేసుకునే వి«ధానం నేర్చుకునేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. * * హైదరాబాద్ : హెచ్ఎండీఏ పనులపై ఉన్నతాధికారులతో నేడు కేటీఆర్ భేటీ. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, సుందరీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష * * హైదరాబాద్ : నేడు, రేపు ఏఎఫ్ఆర్సీ భేటీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరహాలో వైద్య ఫీజుల పెంపుపై చర్చ * * కీసర : రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాలలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కమాన్ వద్ద పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోలో తరలిస్తున్న 9 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోతోపాటు ఎస్కార్ట్గా బైకుపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. * * నారాయణపేట: అన్నం పెట్టే రైతులపై దాడి చేసిన ఏ ప్రభుత్వం నిలబడలేదని, మల్లన్న సాగర్ నిర్వాసితులపై లాఠీచార్జి జరిపించిన కేసీఆర్ ప్రభుత్వానికి పోయేకాలం దాపురించిందని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం అప్పంపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. * * మెదక్‌: మల్లన్నసాగర్‌ నిర్వాసితులపై ఆదివారం జరిగిన పోలీసుల లాఠీచార్జీకి నిరసనగా అఖిలపక్షం ఈరోజు మెదక్‌ జిల్లా బంద్‌ చేపట్టింది. ఉదయాన్నే కాంగ్రెస్‌, తెదేపా, భాజపా, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన నేతలు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై నేతలు మండిపడ్డారు. జనజీవనంపై బంద్‌ ప్రభావం పాక్షికంగా ఉంది. చాలా చోట్ల ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. బంద్‌ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. * * హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో జాతీయ రహదారిపై ఏబీవీపీ రాస్తారోకో చేపట్టింది. ఎన్నికల సందర్భంగా తెరాస ఇచ్చిన కేజీ టు పీజీ ఉచిత విద్య హామీని వెంటనే నెరవేర్చాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళనతో జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. * * లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రైలుప్రమాదం సంభవించింది. భదోహిలో కాపలా లేని రైల్వేగేట్‌ వద్ద ఈరోజు ఉదయం పట్టాలు దాటుతున్న స్కూల్‌ బస్సును రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 19 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. * * విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఛత్తీస్గఢ్ నుంచి తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయిని చెప్పింది. తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. * * ఇబ్రహీంపట్నం: కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్‌లోని ఆలయంలో చోరీ జరిగింది. స్థానిక పెద్దమ్మ ఆలయంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి అమ్మవారి నగలను అపహరించుకు పోయారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. నాలుగు తులాల బంగారు ఆభరణాలతో పాటు వెండి సామాగ్రి చోరీకి గురైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. * * తాండూరు : రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా తాండూరు - వికారాబాద్‌ల మధ్యలో ఉన్న కందమెల్లి వాగు పొంగిపొర్లుతుంది. దాంతో తాండూరు - హైదరాబాద్‌ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గురువారం అర్ధరాత్రి నుంచి వాగు పొంగిపొర్లుతుంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. * * నల్లగొండ: స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఆటో ఢీకొన్ని చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కేతెబోయిన కావ్య (3) ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో కావ్య తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. * * కరీంనగర్‌ క్రైం: బెజ్జంకి ఏఎస్సై వహిద్‌ పాషాపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ ఎస్పీ జోయల్‌డేవిస్‌ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని పేర్కొంటూ బెజ్జంకి పీఎస్‌లో పనిచేస్తున్న ఓ మహిళ హోంగార్డ్‌ ఫిర్యాదుచేసింది. ఈమేరకు విచారించిన ఎస్పీ వాహిద్‌ పాషాను సస్పెండ్‌చేశారు. * * కరీంనగర్‌ జిల్లా మద్యం డిపో పరిధిలో ఉన్న 41 మద్యం దుకాణాలు, 5 బార్లను మెదక్‌ జిల్లా సిద్దిపేటలో కొత్తగా ప్రారంభంకానున్న మద్యం డిపోకు బదిలీచేస్తూ బుధవారం రాత్రి ఎకైసజ్‌శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గంభీరావుపేట మండలం పరిధిలోని 9 దుకాణాలు, సిరిసిల్ల ఎకై ్సజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని 15 మద్యం దుకాణాలు, 3 బార్లు, వేములవాడ ఎకై ్సజ్‌ ఠాణా పరిధిలోని 17 మద్యం దుకాణాలు, 2 బార్లను బదిలీ చేశారు. ఆగస్టు 1 నుంచి వీటికి సిద్దిపేట డిపో నుంచి మద్యం సరఫరా చేస్తారు. ఈ మేరకు జగిత్యాల ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌క * * జమ్ము: అమర్నాథ్ యాత్రకు వెళుతున్న యాత్రికులకు కష్టాలు కొనసాగుతునే ఉన్నాయి. జమ్మూకశ్మీర్ లో అశాంతికర పరిస్థితుల నేపథ్యంలో మరోసారి యాత్రికులను అధికారులు అడుగు కూడా వేయనివ్వడం లేదు. * * సిరిసిల్ల: సిరిసిల్ల మండలం సర్ధాపూర్‌ శివారులో 7వ పోలీస్‌ బెటాలియన్‌ ఏర్పాటుకు 120 ఎకరాల భూమిని కేటాయించారు. ఈమేరకు సిరిసిల్ల ఆర్డీవో ఆఫీస్‌లో సోమవారం డివిజన్‌ సర్వేయర్‌ శ్రీనివాస్‌తో సంబంధించిన హద్దులను నిర్ధారించారు. ఇప్పటికే పోలీస్‌ బెటాలియన్‌ కోసం 120 ఎకరాల స్థలాన్ని శాటిలైట్‌ ద్వారా సర్వే నిర్వహించి కేటాయించారు. క్షేత్రస్థాయిలో భూమి కేటాయింపులను కలెక్టర్‌ నీతుప్రసాద్‌ పరిశీలించారు. * * పార్లమెంట్లో మోదీ, రాజ్‌నాథ్, జైట్లీతో విడివిడిగా భేటీకానున్న కేసీఆర్ * * ఢిల్లీ: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు పార్లమెంటు ముందుకు రానున్న 16 బిల్లులు వచ్చే నెల 12 వరకు జరగనున్న వర్షాకాల సమావేశాలు * * వరంగల్: బైక్ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలోని నార్లాపూర్ వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. మేడారానికి చెందిన సిద్ధబోయిన ఆనందరావు (35) బైక్ పై వెళ్తుండగా.. నార్లాపూర్ వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆనందరావు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. * * కరీంనగర్: ఆలయంలోకి చొరబడిన దుండగులు స్వామివారి విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేటలో శనివారం వెలుగు చూసింది. గ్రామ శివారులోని సీతారామ ఆలయంలో ఉన్న స్వామివారి విగ్రహాన్ని గత రాత్రి కొందరు దుండగులు ధ్వంసం చేశారు. శనివారం ఉదయం ఆ విషయాన్ని గమనించిన స్థానికులు 63వ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. * * తిమ్మాపూర్ (కరీంనగర్) : పురుగులమందు తాగి భార్యాభర్తలు మృతిచెందిన సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గురువారం చోటుచేసుకుంది. కాల్వ శ్రీరాంపుర్ మండలానికి చెందిన ప్రభాకర్(37), తేజస్వి(34) దంపతులు కరీంనగర్‌లోని మారుతీనగర్‌లో నివాసముంటూ.. బంగారం పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో గురువారం తిమ్మాపూర్‌కు వెళ్లిన దంపతులు ఆలయ సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. * * హైదరాబాద్: వీధి కుక్కల దాడిలో నలుగురు చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన హైదరాబాద్ లోని ఎల్బీనగర్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న చిన్నారుల పై వీధికుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు కాగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు కుక్కలను తరిమికొట్టి చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. * * కరీంనగర్ జిల్లా జమ్మికుంట్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తి ధర క్వింటాలుకు రిఆకర్డుస్థాయిలో రూ.6,470 పలికింది. దాంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంట దిగుబడి తగ్గినందువల్ల ధర పెరిగిందని రైతులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం ఈ ధర పలికిందని వారంటున్నారు. * * హైదరాబాద్: ప్రైవేటు విద్యాసంస్థల దోపడీ విధానాన్ని వ్యతిరేకిస్తూ గురువారం తెలంగాణ విద్యాసంస్థల బంద్‌ కొనసాగుతుంది. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్‌ కొనసాగతుంది. ఈ సందర్భంగా విద్యా రంగంలో ప్రైవేటు విద్య నానాటికీ పెరిగిపోతోందని, అది సామాన్యుడికి అందుబాటులో లేదని సంఘాలు ఆరోపించాయి. విద్యారంగంలో ప్రభుత్వ ప్రాధాన్యాన్ని బలోపేతం చేయాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీ అమలు చేయాలని డిమాండ్‌ చేశాయి. * * హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కెన్యాకు చెందిన దంపతుల నుంచి కేజీన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా దుబాయి నుంచి ఈ రోజు ఉదయం హైదరాబాద్ వచ్చిన వీరి వద్ద బంగారం ఉండటాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అయితే వారి వద్ద బంగారానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో దంపతులను అదుపులోకి తీసకుని, బంగారాన్ని సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం.12 లో గురువారం ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంటిని నిర్మించేందుకు రాళ్లను బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * హైదరాబాద్: హైదరాబాద్ కూకట్ పల్లిలో తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆకస్మిక పర్యటన నిర్వహించారు. రోడ్లు, నీటి సరఫరా, బస్టాండ్ తదితర ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. రాత్రి 11 గంటలనుంచి 2:30 గంటల వరకు కేటీఆర్ తనిఖీలు కొనసాగాయి. ఈ సందర్భంగా రోడ్లపై వాననీరు నిల్వ ఉండటం పట్ల జీహెచ్ఎంసీ సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి రమ‍్య మృతికి కారణమైన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు. * * భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కాస్త తగ్గింది. నీటిమట్టం బుధవారం ఉదయం 49.5 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. మంగళవారం సాయంత్రం నీటిమట్టం 52.4 అడుగులకు చేరిన విషయం తెలిసిందే. రాత్రికి రాత్రి నీటి మట్టం తగ్గడంతో అధికారులు, ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. * * కేంద్ర ప్రభుత్వ నైపుణ్యం, మెలకువల శిక్షణలో భాగంగా నిరుద్యోగ దళిత యువతకు అడ్వాన్స్‌ కంప్యూటర్‌ హర్డ్‌వేర్‌, కోర్‌ నెట్‌వర్కింగ్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఎంసీపీ ఎడ్యూకేషన్‌ సోసైటీ డైరెక్టర్‌ ఎంఆర్‌ చెన్నప్ప తెలిపారు. డిప్లొమా లేదా బిటెక్‌, పీజీ పూర్తి చేసి, 18 నుంచి 45 లోపు వయసున్నవారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు లక్డికాపూల్‌లోని జెన్‌ వొకేషనల్‌ కాలేజీలో ఈ నెల 14న నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు. * * చండీగఢ్‌: ప్రొ కబడ్డీని ఆస్వాదిస్తున్న అభిమానులను అలరించేందుకు మరో మెగా ఈవెంట్‌ రాబోతోంది. నవంబర్‌ 3న చండీగఢ్‌ వేదికగా ప్రపంచకప్‌ కబడ్డీ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలు 3 నుంచి 17 వరకు జరుగుతాయి. చండీగఢ్‌లోని 14 వేదికల్లో ఈ పోటీలు నిర్వహిస్తామని పంజాబ్‌ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ చెప్పారు. 14 దేశాలు పోటీపడే ఈ ప్రపంచకప్‌లో పురుషులు, మహిళలు విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. పురుషుల విభాగంలో విజేతగా నిలిచిన జట్టుకు రూ.2 కోట్లు, రన్నరప్‌కు రూ.కోటి నగదు బహుమతిగా ఇస్తారు. మహిళల్లో * * కరీంనగర్ : జిల్లావ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. మహదేవ్‌పూర్ మండలంలో పెద్దంపేట, సర్వాయిపేట, వంకెన వాగులు పొంగిపొర్లుతుండడంతో 17 గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ధర్మపురి వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. సింగరేణి రామగుండం రీజియన్‌లో నాలుగు ఓపెన్ కాస్ట్ బొగ్గుపనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. * * హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు మంగళవారం ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి కోల్కతా వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కోల్కతా వెళ్లే 120మంది ప్రయాణికులు ఉదయం అయిదు గంటల నుంచి పడిగాపులు పడుతున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా విమానాల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులు గంటల కొద్ది విమానాశ్రయంలో తిప్పలు పడాల్సి వస్తున్న విషయం తెలిసిందే. * * హైదరాబాద్ : హైదరాబాద్లోని నాగ్పూర్ జాతీయ రహదారిపరై ఆర్టీఏ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఏడు ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేశారు. అలాగే సరైన పత్రాలు లేని రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. * * హైదరాబాద్ : నగరంలోని గోల్కొండ సక్కుబాయినగర్ ప్రాంతంలో మంగళవారం మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సదరు మహిళను దుండగులు అత్యాచారం చేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పరిసర ప్రాంతాల్లోని స్థానికులను పోలీసులు విచారిస్తున్నారు. * * హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం ఓ విమానాన్ని ఎయిర్ పోర్ట్ అధికారులు అత్యవసరంగా ల్యాండ్ చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి సౌదీ అరేబియా బయల్దేరిన విమానంలో ఓ ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఆ ప్రయాణికుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. * * హైదరాబాద్ సిటీ : డీసీఎం వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 22.45 క్వింటాళ్ల గంజాయిని హయాత్‌నగర్ పోలీసులు సోమవారం ఉదయం పట్టుకున్నారు. ఈ సంధర్భంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి నగరానికి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ముందస్తు సమాచారంతో హయాత్‌నగర్ పోలీసులు అబ్దుల్లామెట్ వద్ద కాపు కాశారు. గంజాయి లోడుతో వచ్చిన డీసీఎం వ్యానును ఆపి అందులోని 22.45 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంధర్భంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. * * సికింద్రాబాద్ : నగరంలోని తుకారంగేటు పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్తీలో సోమవారం ఉదయం చిన్న గొడవ జరగడంతో ఆగ్రహించిన మల్లేష్ అనే వ్యక్తి చంద్రకళ అనే మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ప్రయత్నించి మంటలను ఆర్పారు. అప్పటికే ఆమె శరీరం చాలావరకూ కాలిపోయింది. వెంటనే ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మల్లేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. చంద్రకళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. * * కరాచి: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ సిరీస్ నిర్వహణకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ మేరకు ఇరు క్రికెట్ బోర్డుల మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. ఎడిన్‌బర్గ్‌లో ఐసీసీ సభ్య దేశాల సమావేశం సందర్భంగా పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్, బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ముఖాముఖి సిరీస్ గురించి చర్చించినట్లు తెలిసింది. రెండు దేశాల ప్రభుత్వాల అనుమతి లభిస్తే ఈ సీజన్‌లోనే తటస్థ వేదికల్లో సిరీస్ నిర్వహించాలని బోర్డు పెద్దలు యోచిస్తున్నారు. * * హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా పి.సర్దార్‌సింగ్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మెదక్‌జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన ఈయన గతంలో మహారాష్ట్రలోని మహాత్మగాంధీ అంతరాష్ట్రీయ విశ్వవిద్యాలయంలో ఫైనాన్స్‌ ఆఫీసర్‌గా, జాయింట్‌ రిజిస్ట్రార్‌, డిప్యూటీ రిజిస్ట్రార్‌గా పనిచేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఇందిర కళా సంగీత విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌గా సేవలందించారు. * * దామరచర్ల: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం ఇర్కిగూడెం వద్ద కృష్ణాతీరంలో పార్వతీదేవి ఆలయ నిర్మాణానికి గాను తవ్వకాలు నిర్వహిస్తుండగా పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది. కృష్ణానదీ తీరంలో పార్వతీదేవి ఆలయ నిర్మాణానికి తెలంగాణ సర్కార్ రూ. 5లక్షలు మంజూరు చేసింది. దాంతో ఈ రోజు ఉదయం నిర్మాణ పనులు ప్రారంభించారు. * * నల్లగొండ: నల్లగొండ జిల్లాలో శుక్రవారం రాత్రి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఓ వ్యక్తి నుంచి రూ.6.30 లక్షలను దొంగలు దోచుకెళ్లిన ఘటన వేములపల్లి మండలం అన్నపురెడ్డిగూడెంలో చోటుచేసుకుంది. స్థానిక పెట్రోల్ బంక్లో క్యాషియర్గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి శుక్రవారం రాత్రి క్యాష్ తీసుకుని ఇంటికెళ్తుండగా దొంగలు దాడికి పాల్పడ్డారు. వెంకటేశ్వర్లును తీవ్రంగా గాయపరచిన దొంగలు అతని వద్ద ఉన్న రూ.6.30 లక్షలను తీసుకుని ఉడాయించారు. దీంతో బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు * * కరీంనగర్ : నేదునూరులో జెన్కో పవర్ప్లాంట్ పనులు వెంటనే చేపట్టి నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. లేకుంటే భూములును తిరిగి రైతులకు అప్పగించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. గురువారం కోదండరామ్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరులో జెన్కో పవర్ ప్లాంట్ కోసం సేకరించిన భూములను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక రైతులతో కోదండరామ్ సమావేశమయ్యారు. * * మేడ్చల్: ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ.. ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మేడ్చల్ చెక్‌పోస్ట్ వద్ద శుక్రవారం జరిగింది. చెక్‌పోస్ట్ వద్ద ఉన్న సెల్‌టవర్ ఎక్కిన యువకుడు తన ప్రియురాలితో పెళ్లి జరిపించాలని లేకపోతే ఇక్కడి నుంచి దూకేస్తానని బెదిరిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతన్ని కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. * * హైదరాబాద్: జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ స్ప్రింట్స్‌లో తెలంగాణ కుర్రాడు అబ్దుల్ నజీబ్ ఖురేషీ మెరిశాడు. గురువారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన 100 మీటర్ల పరుగులో నజీబ్ రజత పతకం గెలుచుకున్నాడు. 10.63 సెకన్లతో అతను రెండో స్థానంలో నిలిచాడు. షమీర్ మోన్ (మణిపూర్-10.60 సె.) స్వర్ణ పతకం సాధించగా, అనిరుధ గుంజాయ్ (మహారాష్ట్ర-10.66 సె.)కు కాంస్యం దక్కింది. * * హైదరాబాద్ : తెలంగాణ అడ్వకేట్ల మహాధర్నా ఇందిరాపార్క్ వద్ద శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఈ మహాధర్నాలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా అడ్వకేట్లు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అయితే ఈ ధర్నాలో పాల్గొనేందుకు వెయ్యి మంది అడ్వకేట్లకు మాత్రమే అనుమతి ఉందని పోలీసులు తెలిపారు. ఈ మహాధర్నా నేటి సాయంత్రం 4.30 గంటలకు ముగియనుంది. * * రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండల పరిధిలోని జవహర్‌నగర్‌ సీఆర్‌పీఎఫ్‌ గ్రూప్‌ సెంటర్‌లో జులై 1వ తేదీ నుంచి నిర్వహించనున్న మినిస్టీరియల్‌ హెడ్‌కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 27 వేల మంది హాజరవుతారు. జవహర్‌నగర్‌ గ్రూప్‌ సెంటర్‌కు వచ్చే అభ్యర్థులకు ప్రత్యేకంగా బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు సీఆర్‌పీఎఫ్‌ డీఐజీపీ జి.వి.ఎన్‌.గిరిప్రసాద్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ 10వ నంబర * * హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగుల విభజనపై ఏర్పాటుచేసిన కమల్నాథన్ కమిటీ గురువారం మరోసారి సమావేశమైంది. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ఉద్యోగుల విభజన అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది. * * ఖమ్మం: ఎగువ నుంచి వస్తున్న వరదతో ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 9 అడుగులకు చేరుకుంది. అశ్వారావుపేట వద్ద పెద్దవాగు ప్రాజెక్టు నిండింది. దీంతో రెండు గేట్లు ఎత్తి 14,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే, అశ్వాపురం మండలంలో విడువని వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కిన్నెరసాని ప్రాజెక్టు కూడా జలకళను సంతరించుకుంది. కొత్తగూడెం, మణుగూరు, సత్తుపల్లిల్లోని ఓపెన్‌కాస్ట్ గనుల్లో వర్షం కారణంగా ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. * * హైదరాబాద్‌: నగరంలోని హుమాయన్‌నగర్‌లో విషాదం నెలకొంది. ఐదేళ్ల చిన్నారి ఆడుకుంటూ విద్యుత్‌ తీగ తగిలి మృతి చెందింది. శ్రీకాకుళంకు చెందిన హరిత భర్త చనిపోవడంతో కుమార్తె తనుజతో పాటు నగరానికి వచ్చి హుమాయన్‌ నగర్‌లో ఉంటోంది. తనుజ తల్లితో వెళ్తుండగా తెగిపడిన విద్యుత్‌ తీగ తగిలి అక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు బాలికను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. * * నల్లగొండ: ఎగువ నుంచి వస్తున్న మూసీ వరదతో నల్లగొండ జిల్లా భువనగిరి-పోచంపల్లి మధ్య మంగళవారం ఉదయం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఆ మార్గంలో ఉన్న బీబీనగర్ మండలం బట్టుగూడెం వంతెనపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. * * హైదరాబాద్: ఏఐసీసీ పరిశీలకుడు శ్రీనివాసన్ నేతృత్వంలో గాంధీభవన్లో కాంగ్రెస్ వర్క్షాప్ సోమవారం ప్రారంభమైంది. ఈ వర్క్షాప్లో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, నేతల వలసలను అడ్డుకోవడంతో పాటు ప్రచార కార్యక్రమాలపై నేతలు ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ముఖ్యనేతలు హాజరయ్యారు. * * బూర్గంపాడు: అప్పుల బాధ తాళలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గాదె సైదిరెడ్డి(41) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత రెండేళ్లుగా పంట దిగుబడి సరిగ్గా లేకపోవడంతో.. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోయాయి. అప్పులు తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. * * మిర్యాలగూడ: ముందు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వస్తున్న క్రేన్ ఢీకొట్టిన ఘటనలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం జస్తి వీరప్పగూడెం పరిధిలోని భల్లునాయక్‌తాండాలో సోమవారం చోటుచేసుకుంది. తాండా నుంచి మిర్యాలగూడ వెళ్తున్న ఆటోను బావులు తీయడానికి ఉపయోగించే క్రేన్ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న 8 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు 108 సాయంతో వారిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. * * రామడుగు: ఆర్టీసీ బస్సు చార్జీలు, విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ శనివారం కాంగ్రెస్‌ నాయకులు రామడుగులో ధర్నా నిర్వహించారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు అంజనేయులు గౌడ్‌, శంకర్‌, శ్రీనివాసగౌడ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు. * * జగిత్యాల(కరీంనగర్) : పలు దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉంటూ తప్పించుకు తిరుగుతున్న ఓ పాత నేరస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 20 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ. 2వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజేంద్రప్రసాద్ వివరాలు వెల్లడించారు. * * హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీ పీసీసీ శనివారం నిరసన కార్యక్రమాలకు దిగింది. అందులో భాగంగా హైదరాబాద్ విద్యుత్ సౌధ కార్యాలయాన్ని కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. రోడ్డుపై బైఠాయించి, పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పాడడంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, శ్రీశైలం గౌడ్, ఇతర నేత * * యాదాద్రి జిల్లా: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవాలయం పేరుతో యాదాద్రి జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగా భువనగిరి జిల్లా కేంద్రంగా యాదాద్రిని పేరుతో జిల్లా ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. * * యాదాద్రి జిల్లా: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవాలయం పేరుతో యాదాద్రి జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగా భువనగిరి జిల్లా కేంద్రంగా యాదాద్రిని పేరుతో జిల్లా ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. * * కరీంనగర్‌ విద్యా విభాగం : జిల్లాలో జరుగుతున్న ఎస్సెస్సీ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షల్లో భాగంగా గురువారం జరిగిన సామాన్యశాస్త్రం పేపర్‌-1లో మాల్‌ప్రాక్టీసుకు పాల్పడుతున్న ముగ్గురు విద్యార్థులను డిబార్‌ చేశారు. మొత్తం 42 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఈపరీక్షకు మొత్తం 3962 మంది హాజరుకావాల్సి ఉండగా, 3379 మంది హజరైనట్లు డీఈవో శ్రీనివాస చారి తెలిపారు. * * హైదరాబాద్ : ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దందాను అరికట్టాలంటూ వివిధ విద్యార్థి సంఘాల వారు గురువారం ఆందోళనలు చేపట్టారు. బోడుప్పల్‌లోని భాష్యం స్కూల్‌తోపాటు శంషాబాద్‌లోని ఎస్సార్ డీజీ స్కూల్ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ సంఘాల ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందిపెట్టేలా ఉన్న ఫీజుల మోతను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. * * హైదరాబాద్ : రంగారెడ్డి మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలో ఉన్న అనాథ బాలల ఆశ్రమం కృషిహోంలో ఉండే ఇద్దరు బాలురు కనిపించకుండాపోయారు. అనాథ గృహంలో ఆశ్రయం పొందుతున్న ఎన్.సాయిలు(13), మహేష్(10) అనే బాలురు బుధవారం ఉదయం టిఫిన్ చేసిన అనంతరం నుంచి కనిపించకుండా పోయారు. దీంతో నిర్వాహకులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవటంతో రాత్రి పోలీసులను ఆశ్రయించారు. కృషిహోం ట్యూటర్ ఎండీ సుమేర్ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. * * రెంజల్(నిజామాబాద్) : నిజామాబాద్ జిల్లా రెంజల్‌లో వేటగాళ్ల తుపాకీ తూటాకు జాతీయ జంతువు జింక బలైంది. రెంజల్ మండలం తాడిబిలోలి గ్రామ సమీపంలో బుధవారం రాత్రి గురు తెలియని వ్యక్తులు జింకను కాల్చి చంపారు. గురువారం ఉదయం జింక కళేబరాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఎస్సై ప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. జింకను వేటగాళ్లే చంపి ఉంటారని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. * * హైదరాబాద్: న్యాయమైన పరిహారం ఆందోళన చేస్తున్న మల్లన్నసాగర్ ముంపు బాధితులకు బీజేపీ మద్దతు తెలపనుంది. బుధవారం సాయంత్రం తొగుట మండలం ఏటిగడ్డకిష్టాపూర్, వేములగట్టు గ్రామాల్లో ఆ పార్టీ నాయకులు ధర్నా చేపట్టనున్నారు. ఈ ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్తోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు. ప్రాజెక్టు ముంపు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తగినంత సాయం అందించాలని బీజేపీ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేయనున్నారు. * * ధారూర్ : రంగారెడ్డి జిల్లా ధారూర్ మండలంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఎడతేరపి లేకుండా వాన కురుస్తుంది. దీంతో జిల్లాలోనే కొటిపల్లి జలాశయం నీటి మట్టం ఒక్క రోజులోనే ఏడడుగులు పెరిగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 24 అడుగులు కాగా మంగళవారం ఉదయం 5 అడుగుల నీరు మాత్రమే ఉంది. రాత్రి కురిసిన వర్షానికి 12 అడుగులకు చేరుకుంది. ధారూర్ మండల కేంద్రంలో 72.50 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. ఈ నీరుతో పంట సాగు చేసుకోవచ్చని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. * *
bottomleft17.jpg

middletop7.gif

ఫిల్మ్స్

పీటర్‌ డైరెక్షన్‌.. లాల్‌ యాక్షన్‌

09/05/2017: మగధీర, అత్తారింటికి దారేది, 1 నేనొక్కడినే.. ఇటీవల విడుదలైన ‘బాహుబలి’తో పాటు పలు చిత్రాలకు ఫైట్‌ మాస్టర్‌గా చేసారు పీటర్‌ హెయిన్స్‌. మన హీరోల చేత ఆయన హాలీవుడ్‌ స్థాయి పోరాటాలు చేయించారు. స్టంట్‌ మాస్టర్‌గా సౌత్‌లో తిరుగులేని క్రేజ్‌ సాధించిన పీటర్‌ హెయిన్స్‌ మనసిప్పుడు దర్శకత్వం వైపు మళ్లిందా? అంటే అవుననే అంటున్నాయి మాలీవుడ్‌ సినిమా వర్గాలు. స్టంట్స్‌కి చిన్న బ్రేక్‌ చెప్పి, దర్శకుడిగా యాక్షన్‌ చెప్పాలనే ఆలోచనలో పీటర్‌ ఉన్నారనే టాక్‌ వినిపిస్తోంది. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ హీరోగా పీటర్‌ హెయిన్స్‌ ఓ సినిమాకి దర్శకత్వం వహించాలనుకుంటున్నారట. మోహన్‌లాల్‌ నటించిన ‘పులి మురుగన్‌’ (తెలుగులో ‘మన్యం పులి’) చిత్రానికి పీటర్‌ పోరాటాలు సమకూర్చారు. ఈ చిత్రంలో నిజమైన పులితో తీసిన పోరాట దృశ్యాలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. అద్భుతమైన ఫైట్స్‌ అందించిన పీటర్‌కు ‘పులి మురుగన్‌’తో జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇటీవల ఓ కథను ఆయన మోహన్‌లాల్‌కు వినిపించారట. కథ నచ్చడంతో పీటర్‌ దర్శకత్వంలో నటించేందుకు మోహన్‌లాల్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు భోగట్టా.

హాలీవుడ్‌లో ఉత్తమ విలన్‌!

09/05/2017: టాలీవుడ్‌.. కోలీవుడ్‌.. శాండల్‌వుడ్‌.. మాలీవుడ్‌.. బాలీవుడ్‌... ఈ అన్ని వుడ్‌ల వారు హాలీవుడ్‌ చిత్రాలు చూసి, ఇన్‌స్పైర్‌ అవుతుంటారు. కొందరు దర్శకులు అప్పుడప్పుడు ఆ సినిమాల్లోని సీన్స్‌ని ఆదర్శంగా చేసుకుని, తీస్తుంటారు కూడా. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయినట్లనిపిస్తోంది. మన ఇండియన్‌ సినిమాని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని ఓ హాలీవుడ్‌ చిత్రం రూపొందించారట. సినిమా పేరు ‘ది హీరో’. బ్రెట్‌ హాలే దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ‘ఉత్తమ విలన్‌’లా ఉందట. టాలీవుడ్, కోలీవుడ్‌లో రెండేళ్ల కిందట విడుదలైన కమల్‌ హాసన్‌ ‘ఉత్తమ విలన్‌’ గుర్తుండే ఉంటుంది. కమల్‌ స్వయంగా కథ అందించి, నటించిన ఈ చిత్రానికి రమేశ్‌ అరవింద్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టేకింగ్‌ హాలీవుడ్‌ రేంజ్‌లో ఉందనే ప్రశంసలూ దక్కాయి. ఈ ఏడాది జనవరి 21న ‘ది హీరో’ చిత్రాన్ని ‘సన్‌ డ్యాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ప్రదర్శించారు. ఈ సినిమాలో మన ‘ఉత్తమ విలన్‌’ షేడ్స్‌ ఉన్నాయన్నది కొందరి అభిప్రాయం. జూన్‌ 9న సినిమా విడుదలకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

రొమాంటిక్‌ జగన్నాథమ్‌

09/05/2017: ద్యావుడా... ఇదేం పని? స్కూటరేసుకుని మార్కెట్‌కి వెళ్లామా? కూరగాయలు తెచ్చుకుని, వంట చేశామా? అన్నట్లు ఉండే జగన్నాథమ్‌ ఇలా సూటూ బూటూ వేసుకోవడం ఏంటి? వేర్‌ ఈజ్‌ ది పంచ్‌ కట్టు జగన్నాథా? అని ‘దువ్వాడ జగన్నాథమ్‌’లోని ఈ కొత్త స్టిల్‌ చూసి అనుకుంటున్నారా? మనోడు వంటోడే అయినా లోపల ఇంకా ఏదో ఉంది. ఆ యాంగిల్‌ ఏంటి? అనేది సినిమాలో చూస్తారు. ఆ పాత్ర తాలూకుదే ఈ స్టిల్‌. పంచె కట్టులో పసందుగా కనిపించిన జగన్నాథమ్‌ సూటూ బూటులో సూపర్బ్‌గా ఉన్నాడు కదూ. ఈ లేటెస్ట్‌ స్టిల్‌ను సోమవారం విడుదల చేశారు. ఓ రొమాంటిక్‌ సాంగ్‌కి సంబంధించిన ఈ ఫొటోలో అల్లు అర్జున్, పూజా హెగ్డే కెమిస్ట్రీ బాగుంది కదూ. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటలను త్వరలో విడుదల చేయనున్నారు. సినిమాని జూన్‌ 23న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ‘దిల్‌’ రాజు– శిరీష్‌ నిర్మిస్తున్నారు.

ఎమీ ముందు చూపు

08/05/2017: ఒకప్పటి కథానాయికల్లో చాలా మందికి సంపాదించడం తెలుసు గానీ దాన్ని కూడబెట్టుకోవడం తెలియలేదు. ఈ తరం హీరోయిన్లు అలా కాదు. వీరు ఈ రెండూ విషయాల్లోనూ బాగా ఆరితేరారు. సంపాదించడానికి ఎన్ని దారులు వెతుకుతారో, దాన్ని మరిన్ని రెట్లు పెంచుకునే మార్గాలను అనుసరిస్తారు. నటి ఎమీజాక్సన్‌నే తీసుకుంటే, మదరాసుపట్టణం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఈ ఇంగ్లీష్‌ భామ ఆదిలో కాస్త తడబడింది. మదరాసుపట్టణం చిత్రం విజయం సాధించినా, ఈ అమ్మడిని ఇక్కడి సినీ వర్గాలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో మళ్లీ తనను పరిచయం చేసిన దర్శకుడు విజయ్‌నే తాండవం చిత్రంలో విక్రమ్‌తో రొమాన్స్‌ చేసే అవకాశం కల్పించారు. ఆ చిత్రం నిరాశ పరిచినా ఎమీజాక్సన్‌కు మాత్రం బాలీవుడ్‌ ఆఫర్‌ వచ్చింది. వినైతాండి వరువాయా చిత్ర హిందీ రీమేక్‌ ఎక్‌ దీవానాలో నటించి బాగా ప్రాచుర్యం పొందింది. ఆ తరువాత స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దృష్టిని ఆకర్షించింది. ఫలితం ఐ వంటి బ్రహ్మాండ చిత్రంలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. అందులో తనదైన అందాలతో ప్రేక్షకుల్ని కనువిందు చేసింది. ఆపై ఈ బ్యూటీకి జయాపజయాలతో పనిలేకుండా పోయింది. తెలుగులోనూ తనదైన ముద్ర వేసుకున్న ఎమీజాక్సన్‌ కోలీవుడ్‌లో ధనుష్, ఉదయనిధిస్టాలిన్‌ వంటి యువ హీరోలతోనూ జత కట్టేసింది. తాజాగా సూపర్‌స్టార్‌తో నటించిన 2.ఓ చిత్రం విజయం కోసం ఆశగా ఎదురు చూస్తోంది. ఇదిలా ఉంటే తమిళం, తెలుగు, హిందీ అంటూ ఎడా పెడా చిత్రాల్లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తూ కూడబెడుతున్న డబ్బును స్థిరాస్తులుగా మార్చే ప్రయత్నంలో పడింది. ఇప్పటికే తన తల్లి మార్క్‌రీటాతో కలిసి లండన్‌లో ఒక రెస్టారెంట్‌ కొనుగోలు చేసి దాని నిర్వహణ బాధ్యతలను చేపట్టిన ఈ భామ ఇటీవల చెన్నైలో ఒక అధునాతన బంగ్లా కొనుగోలు చేసింది. అంతకు ముందు షూటింగ్‌లకు లండన్‌ నుంచి వచ్చి నటించి వెళ్లిపోయేది. ఇప్పుడు చెన్నైలోనే మకాం పెట్టి నిర్మాతలకు కాస్త భారం తగ్గించింది. తాజాగా ముంబైలో సొంతంగా ఇల్లు కొనుగోలు చేసే పనిలో పడిందట. అందుకు అందమైన ప్రదేశంలో అధునాతన భవనం కోసం ప్రయత్నాలు చేస్తోందని సినీవర్గాల సమాచారం. మొత్తం మీద తన సంపాదనను ఎమీ స్థిరాస్తులుగా మార్చుకుంటుందన్న మాట.

అనుష్కకు ఏటీఎం

06/05/2017: ఏటీఎం అంటే ఎనీటైమ్‌ మనీ అనో, ఎనీటైమ్‌ మర్డర్‌ అనో అనుకోకండి. దానిని ఎనీటైమ్‌ మ్యారేజ్‌ అని కూడా అనొచ్చు. ఇప్పుడర్థం అయ్యిందనుకుంటా అనుష్క పెళ్లి వార్త గురించి ఎప్పుడైనా ప్రకటన రావచ్చునని. ఈ విషయంలో ఆమె కుటుంబ సభ్యులు చాలా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారట. అందుకే అనుష్క కొత్త చిత్రాలను అంగీకరించడం లేదని సమాచారం. అంతే కాదు గతంలో యోగా టీచర్‌ అయిన ఈ బ్యూటీ త్వరలో యోగా శిక్షణ ఇన్‌స్టిట్యూట్‌ నెలకొల్పాలని భావిస్తున్నారని సమాచారం. అనుష్క ఈ పేరు ఇప్పుడు అభినయానికి మారుపేరుగా మారింది. అద్భుత చిత్రాలకు చిరునామాగా నిలిచిందని కూడా చెప్పవచ్చు. అరుంధతితో ప్రారంభమైన అనుష్క హవా నేటికీ అప్రహతంగా కొనసాగుతోంది. అరుంధతి, రుద్రమదేవి వంటి చిత్రాల తరువాత బాహుబలి–2 ఈ అభినేత్రి నటనకు పరాకాష్ట అనడం అతిశయోక్తి కాదేమో. ఆదిలో అందాలప్రదర్శనకు పరిమితమైన ఈ యోగా సుందరి ఆ తరువాత అభినయానికి కేరాఫ్‌గా మారారు. ఆ మధ్య ఓం నమో వేంకటేశాయ చిత్రంలో భక్తురాలిగా కూడా తనదైన నటనతో మెప్పించారు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించేస్థాయికి చేరుకున్న అనుష్క తాజాగా తన అభిమానులకు షాక్‌ ఇవ్వనున్నారా? ప్రస్తుతం సినీ వర్గాల్లో హల్‌చల్‌ చేస్తున్న టాక్‌ ఇదే. నటి అనుష్క ప్రస్తుతం టాలీవుడ్‌లో భాగమతి మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. వాటిని త్వరత్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారట. అంతే కాదు ఇప్పటికే కోలీవుడ్‌లోని తన సహాయకులను పని నుంచి నిలిపివేశారనే ప్రచారం జోరందుకుంది. ఇదంతా చూస్తే ఏవరైనా ఏమి ఊహించుకుంటారు. ఎస్‌. ఈ ముద్దుగుమ్మకు వివాహ గడియలు దూసుకొస్తున్నాయట.

ఫ్యాషన్ రంగంలోకి స్టార్ హీరోయిన్

06/05/2017: హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోతున్న స్టార్ వారసురాలు సోనమ్ కపూర్, ఫ్యాషన్ ఐకాన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ స్టైల్స్ అప్పుడప్పుడు వివాదాస్పదమవుతున్నా.. ఫ్యాషన్ దివాగా సోనమ్ కు మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాదు ఇటీవల నీర్జా సినిమాతో నటిగానూ మంచి మార్కులు సాధించింది. ఈ సినిమాకు జాతీయ అవార్డును సైతం అందుకున్న సోనమ్, వ్యాపార రంగంలోకి అడుగుపెడుతుంది. లేటెస్ట్ స్టైల్స్ ను బాలీవుడ్ కు పరిచయం చేసిన సోనమ్, ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెడుతుంది. తన సోదరి రియా కపూర్ తో కలిసి రేసన్ అనే ఫ్యాషన్ బ్రాండ్ ను లాంచ్ చేస్తోంది. ఈ నెల 12నుంచి ఈ బ్రాండ్ ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. అన్ని షాపర్ స్టాప్ స్టోర్స్ లో ఈ బ్రాండ్ ను అందుబాటులోకి తెస్తున్నారు. హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయిన సోనమ్ బిజినెస్ ఉమెన్ ఆకట్టుకుంటుందేమో చూడాలి.

తరుణ్‌ లుక్‌ అందరికీ నచ్చుతుంది – నాగార్జున

06/05/2017: ‘‘ఇది నా లవ్‌స్టోరి టైటిల్‌ బాగుంది. టీజర్‌ చాలా ఫ్రెష్‌గా ఉంది. తరుణ్‌ లుక్‌ అందరికీ నచ్చుతుంది. ఈ చిత్రం పెద్ద హిట్‌ అయ్యి తనకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ టీమ్‌కి నా అభినందనలు’’ అని నాగార్జున అన్నారు. అభిరామ్‌ సమర్పణలో రామ్‌ ఎంటర్‌టైనర్స్‌ బ్యానర్‌పై రమేష్, గోపి దర్శకత్వంలో ఎస్‌.వి ప్రకాష్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ఇది నా లవ్‌స్టోరి’. తరుణ్, ఓవియా జంటగా నటించారు. ప్రస్తుతం పోస్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం అక్కినేని నాగార్జున ఆవిష్కరించారు. ‘‘నాగార్జునగారి ప్రోత్సాహం మా అందరిలో కొత్త ఉత్సాహన్ని నింపింది. కన్నడంలో ఘనవిజయం సాధించిన ఓ చిత్రాన్ని తెలుగులో ‘ఇది నా లవ్‌స్టోరి’గా రిమేక్‌ చేశాం. ఒక అమ్మాయిని ఎంతకాలం ప్రేమించామన్నది కాదు, ఎంతగా ప్రేమించామన్నదే ముఖ్యం అన్న కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశాం. తరుణ్, ఓవియా అద్భుతంగా నటించారు. సినిమాను త్వరలోనే విడుదల చేస్తాం’’ అన్నారు ఎస్వీ ప్రకాష్‌.

బాహుబలి 2పై బ్యాన్ తప్పదా..?

05/05/2017: ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు నమోదు చేస్తున్న బాహుబలి 2 రిలీజ్ కోసం పాకిస్తాన్ సినీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. అంతేకాదు అక్కడి ప్రేక్షకులు బాహుబలి 2ను పాక్లో రిలీజ్ చేయాలంటే సోషల్ మీడియలో పెద్ద ఎత్తున మేసేజ్లు కూడా పెడుతున్నారు. దీంతో బాహుబలి నిర్మాతలు కూడా పాక్ రిలీజ్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. భారత్లో తెరకెక్కిన చాలా సినిమాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్ల లోనూ రిలీజ్ అవుతుంటాయి. షారూఖ్ లాంటి స్టార్ హీరోలకు పాకిస్తాన్లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే బాహుబలి రిలీజ్పై పాక్ సెన్సార్ బోర్డ్ ఎలా స్పందిస్తుందో అన్న అనుమానం కలుగుతుంది. హిందుత్వాన్ని ప్రమోట్ చేసే సన్నివేశాలున్న సినిమాలను పాక్లో రిలీజ్ చేసేందుకు అక్కడి సెన్సార్ బోర్డ్ అంగీకరించదు. గతంలో ఈ కారణంగానే సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయ్జాన్ సినిమాపై పాక్ బ్యాన్ విధించింది. అయితే బాహుబలి సినిమా కావాలంటూ పాకిస్తాన్ యువతే కోరుతుండటంతో ఈ సినిమాపై సానుకూలంగా స్పందిస్తారనే ఆశిస్తున్నారు. మరి బాహుబలి పాక్లో రిలీజ్ అవుతుందా..? లేక బ్యాన్ బారిన పడుతుందా తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ప్రతి నాయకిగా శ్రియ

05/05/2017: నరకాసురన్‌కు నటి శ్రియ విలన్‌గా మారనుందా? ఈ ప్రశ్నకు కోలీవుడ్‌లో అవుననే సమాధానమే వస్తోంది. శ్రియకు మళ్లీ అవకాశాలు పెరుగుతున్నాయి. చారిత్రాత్మక కథా చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలో బాలకృష్ణకు జంటగా నటించి మంచి మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీ, టాలీవుడ్‌లో మరోసారి అదే హీరోతో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కోలీవుడ్‌లో శింబుతో ‘అన్బానవన్‌ అసరాధవన్‌ అడంగాధవన్‌’ చిత్రంలో రొమాన్స్‌ చేస్తోంది. కాగా తాజాగా ప్రతినాయకిగా మారడానికి ఏ మాత్రం సంకోచించకుండా నరకాసురన్‌ అనే చిత్రంలో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. వివరాల్లోకెళ్లితే ఇటీవల చిన్న చిత్రంగా విడుదలై చాలా పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం దృవంగళ్‌ పదునారు. దీనికి సృష్టికర్త నవ దర్శకుడు కార్తీక్‌నరేన్‌. తొలి చిత్రంతోనే శభాష్‌ అనిపించుకున్న ఈ వర్ధమాన దర్శకుడు తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రం పేరే నరకాసురన్‌. ఇందులో అరవిందస్వామి ప్రధాన పాత్ర పోషించనున్నారు. యవ కథానాయకుడిగా టాలీవుడ్‌ యువ నటుడు నాగచైతన్య నటించడానికి అంగీకరించినా, ఇప్పుడు ఆయన వైదొలగినట్లు టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. కారణం ఆయన త్వరలో తన ప్రేయసి సమంతను వివాహమాడబోతుండడమేనని సమాచారం. ఆయన పాత్రలో మరో టాలీవుడ్‌ నటుడి కోసం వేట మొదలైందని తెలుస్తోంది. ఇందులో ప్రతినాయకిగా శ్రియ నటించనున్నారట. కథ వినగానే తన పాత్ర తెగ నచ్చేయడంతో విలనీయం ప్రదర్శించడానికి శ్రియ సిద్ధం అనేసిందట. మరో విషయం ఏమిటంటే ఆ చిత్ర కథ నచ్చడంతో ప్రముఖ దర్శకుడు గౌతమ్‌మీనన్‌ తానే నిర్మించడానికి ముందుకు వచ్చారట.అయితే చిత్ర దర్శకుడు కార్తీక్‌నరేన్‌ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకోనున్నారని తెలిసింది. చిత్ర షూటింగ్‌ ఆగస్ట్‌లో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.

నా స్వేచ్ఛకు అడ్డొస్తే కట్ చేస్తా!

03/05/2017: నటుడుగా కమలహాసన్‌ గురించి కొత్తగా చెప్పాల్సిందేమి ఉండదు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన వారసురాళ్లు శ్రుతీహాసన్, అక్షరహాసన్‌ కూడా తండ్రి బాటలోనే పయనిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా నటి శ్రుతీహాసన్‌ గురించి చెప్పేతీరాలి. ఎవరేమనుకున్నా తాను అనుకున్నది చేసి తీరే మనస్తత్వం శ్రుతిది. అదే విధంగా తన భావాలను నిర్భయంగా వెల్లడించడానికి ఏమాత్రం సంకోచించని వ్యక్తిత్వం ఈ బ్యూటీది. ఐరెన్‌ లెగ్‌ ముద్ర నుంచి గోల్డెన్‌ లెగ్‌లా ఎదిగిన శ్రుతీహాసన్‌ ఇప్పుడు బహుభాషా నటి. అంతే కాదు నటి, గాయని, సంగీతదర్శకురాలు అంటూ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇలాంటి నటి గురించి వ్యక్తిగతంగా పలు వదంతులు ప్రచారంలో ఉండడం గమనార్హం. ఆ మధ్య నటుడు సిద్ధార్థ్‌ తదితర నటులతో షికార్లు, ఆ తరువాత మనస్పర్థలు అంటూ పుకార్లు హల్‌చల్‌చేశాయి. తాజాగా లండన్‌కు చెందిన మైఖెల్‌కోర్‌ సెల్‌తో చెట్టాపట్టాల్‌ అంటూ ప్రచారం జోరందుకుంది. ఏ విషయం గురించి అయినా చాలా బోల్డ్‌గా రియాక్ట్‌ అయ్యే శ్రుతీ తన ప్రేమాయణం గురించి మాత్రం గుంబనంగానే ఉంటూ వచ్చారు. అలాంటిది ఇటీవల ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన భేటీలో తనతో సంబంధాలు ఉన్నవారిని పక్కన పెట్టడం గురించిన ప్రశ్నకు స్పందిస్తూ తన స్వేచ్ఛకుగానీ, వ్యక్తిగత విషయాల్లో గానీ ఎవరూ జోక్యం చేసుకోకూడదని తాను భావిస్తానన్నారు. అలా చేస్తే వారెవరైనా, ఎంతటి వారైనా తన జీవితంలో నుంచి తొలగించేస్తానని క్లియర్‌ కట్‌గా చెప్పేశారు. అయితే తాజా బాయ్‌ఫ్రెండ్‌ మైఖెల్‌ కోర్‌సెల్‌ గురించి మాత్రం శ్రుతీహాసన్‌ ప్రస్తావించకపోవడం గమనార్హం.

శతమానం... తెలుగు సినిమాకు గర్వకారణం

17/04/2017: ‘‘తెలుగు సినిమాకు జాతీయస్థాయిలో గుర్తింపు రావడం గర్వంగా ఉంది. ‘దిల్‌’రాజు, సతీశ్‌ వేగేశ్నల కృషితో ‘శతమానం భవతి’కి జాతీయ అవార్డు లభించింది. తెలుగు చిత్రసీమకు అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చిన ఈ చిత్రబృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే, తోటి నిర్మాతను గౌరవించిన అల్లు అరవింద్‌గారిని అభినందిస్తున్నా’’ అన్నారు మెగాస్టార్‌ చిరంజీవి. శర్వానంద్‌ హీరోగా సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు నిర్మించిన ‘శతమానం భవతి’కి అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ పురస్కారం వచ్చిన సందర్భంగా అల్లు అకాడమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ తరపున చిత్రనిర్మాత, దర్శకుడు, హీరోలను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సన్మానించారు. చిరంజీవి చేతుల మీదుగా ఈ సన్మానం కార్యక్రమం జరిగింది. ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ – ‘‘జీవితంలో గొప్ప ఘనత సాధించిన సమయంలోనే... పెద్ద అండ (భార్య)ను కోల్పోయాను. నా సన్నిహితులైన అరవింద్‌గారికి ఆ బాధ ఎలాంటిదో తెలుసు. జాతీయ పురస్కారం కంటే 15ఏళ్లుగా అరవింద్‌గారి వంటి మంచి వ్యకితో స్నేహాన్ని గొప్పదిగా భావిస్తున్నా’’ అన్నారు. నందమూరి కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ – ‘‘మా ఆవిడ ‘శతమానం భవతి’ చూసి, ‘అప్పుడప్పుడూ ఇలాంటి సినిమాలు చెయ్యొచ్చు కదా’ అనడిగింది. నేనూ ఇలాంటి మంచి కుటుంబ కథాచిత్రం చేయాలనుకుంటున్నా’’ అన్నారు. ‘‘ప్రేక్షకులకు మంచి చిత్రాలు అందించాలనే ‘దిల్‌’ రాజు తపనే అవార్డు రావడానికి కారణమైంది’’ అన్నారు అల్లు అరవింద్‌. ‘‘నేషనల్‌ అవార్డు రావడం నా కెరీర్‌లో ఫస్ట్‌టైమ్‌. నా జీవితంలో సంతోషకరమైన క్షణమిది’’ అన్నారు శర్వానంద్‌. ఈ వేదికపై ‘రుద్రవీణ’కు నర్గిస్‌దత్‌ నేషనల్‌ అవార్డు వచ్చిన సంగతిని గుర్తు చేస్తూ, అది తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చిన అవార్డుగా భావించానన్నారు చిరంజీవి. అల్లు అర్జున్, నాని, అల్లు శిరీష్‌ పాల్గొన్నారు.

నటనకు అవకాశం ఉంటే చాలు..

15/04/2017: పాత్రకు తగ్గట్టు అభినయించడమే కాదు, అందుకు తగ్గట్టుగా తనను మలచుకోవడానికి శ్రమించే నటి అనుష్క.అందుకే అగ్రనాయకిగా రాణిస్తున్నారని చెప్పవచ్చు.ఆదిలో అందాలారబోతకే ప్రాధాన్యం ఇచ్చిన ఈ యోగా సుందరి ఆ తరవాత నటనకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారు. అరుంధతి చిత్రంలో తన నట విశ్వరూపాన్ని చూపించారనే చెప్పాలి. ఆ తరువాత రుద్రమదేవి, బాహుబలి వంటి చిత్రాల్లో పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. ప్రస్తుతం బాహుబలి– 2లో మరోసారి బ్యూటీ నట విజృంభణను చూడబోతున్నాం. అదే విధంగా మధ్యలో ఇంజి ఇడుప్పళగి(తెలుగులో జీరోసైజ్‌) చిత్ర పాత్ర కోసం సుమారు 90 కిలోల బరువును పెంచుకుని నటించారు. అంత సాహసం మరో నటి చేస్తుందని చెప్పలేం.అదే విధంగా నటిగా మంచి ఇమేజ్‌ను సంపాదించుకున్న అనుష్క వేదం చిత్రంలో వేశ్యగా నటించారు. ఆ సమయంలో ఆ పాత్రను పోషించవద్దని, ఇమేజ్‌ బాధిస్తుందని చాలా మంది భయపెట్టారట.అయినా పాత్ర మీద నమ్మకంతో ధైర్యంగా నటించారు. ఆ పాత్ర తన ఇమేజ్‌ను ఏమాత్రం డ్యామేజ్‌ చేయలేదని ఇటీవల చెన్నైకి వచ్చిన అనుష్క పేర్కొన్నారు. అదే విధంగా పాత్ర మంచిదా? చెడ్డదా? అన్నది తనకు ముఖ్యం కాదని, నటనకు అవకాశం ఉందా?అన్నదే తాను చూస్తానని అనుష్క అన్నారు. ప్రస్తుతం భాగమతి అనే మరో స్త్రీ ప్రధాన ఇతి వృత్తంతో కూడిన చిత్రంలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ కోసం ఒక మెగా అవకాశం ఎదురు చూస్తోందనే ప్రచారం జోరుగా సాగుతోంది.అన్నట్టు ఆ మధ్య బొద్దుగా మారిన ఈ చక్కనమ్మ బొమ్మాళి మళ్లీ చిక్కి అందాలను మెరుగేసుకున్నారు.

ఆ హీరోయిన్‌కు చాలా సిగ్గంటా!

14/04/2017: నాకు చాలా సిగ్గేస్తోందబ్బా అంటున్నారు నటి కాజల్‌ అగర్వాల్‌. ఏంటీ అబ్బా చా అనాలనిపిస్తోందా? మీరు ఏమైనా అనుకోండి. కాజల్‌ మాత్రం సిగ్గుతో పాటు, చాలా కష్టపడిపోతున్నారట. ఇంతకీ కాజల్‌ చెప్పొచ్చేదేమిటనేగా మీరు తెలుసుకోవాలనుకుంటోంది. అమ్మడు దక్షిణాదిలో నటించడం మొదలెట్టి దశాబ్దం దాటిపోయింది. ఇన్నాల్టికి ప్రేమ సన్నివేశాల్లో నటించడానికి చాలా సిగ్గేస్తోంది అంటున్నారు. ఆ సంగతేమిటో చూద్దాం రండి. సినిమాల్లో ముద్దు సన్నివేశాల్లో, ప్రేమ సన్నివేశాల్లో నటించడాన్ని ఒకప్పుడు ఎక్కువగా చర్చించుకునే వారు. అలాంటి సన్నివేశాల్లో నటించడానికి కథానాయికలు సంశయించేవాళ్లు. అయితే అది రానురాను సర్వసాధారణంగా మారిపోయ్యింది. ఇప్పడు ఈత దుస్తుల్లో నటించడానికి కూడా అభ్యంతరం ఉండడం లేదు. అలాంటి సన్నివేశాలను ప్రేక్షకులు సాధారణంగా భావిస్తున్నారు. అయితే లిప్‌లాక్‌ సన్నివేశాలు, కథానాయకులతో సన్నిహితంగా నటించే సన్నివేశాల్లో నటించడానికి కథానాయికలు పడే కష్టం మాటల్లో చెప్పడం కష్టం. షూటింగ్‌ స్పాట్‌లో లైట్స్‌మేన్ల నుంచి ప్రొడక్షన్‌ వాళ్ల వరకూ పలువురు ఉంటారు. దర్శకులు, చాయాగ్రహకులు మా నటన ఎలా ఉంటుందోనని గుచ్చిగుచ్చి చూస్తుంటారు. అలాంటప్పుడు పొట్టిలంగా ఓణీలు లాంటివి ధరించి లిప్‌లాక్‌ సన్నివేశాలు, హీరోలతో ప్రేమ సన్నివేశాలల్లో సన్నిహితంగా నటించడం నాకు మాత్రం చాలా సిగ్గేస్తుంది. కొన్ని సందర్భాల్లో సాధారణ జనం షూటింగ్‌ చూడడానికి వస్తుంటారు. వారి ముందు అలాంటి సన్నివేశాల్లో నటించడం సాధారణ విషయం కాదు. నేను మాత్రం చాలా కష్టపడతాను. నేను ఈ రంగంలో అడుగు పట్టి పదేళ్లు దాటింది. ప్రముఖ నటులందరితోనూ కలిసి నటించాను. ప్రస్తుతం తమిళంలో అజిత్‌కు జంటగా వివేకం, విజయ్‌తో ఒక చిత్రం చేస్తున్నాను. తెలుగులో రానాతో కలిసి నేనే రాజా నేనే మంత్రి చిత్రంలో నటిస్తున్నాను. ఇకపై నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనే నటించాలని నిర్ణయించుకున్నానంటున్న కాజల్‌ ఇంతకు ముందు నేను పక్కాలోకల్‌ అంటూ ఐటమ్‌ సాంగ్‌లో ఎలా ఇరగదీసిందో మరి. చెప్పడానికే నీతులు అని పెద్దోళ్లు ఊరికే అనలేదు మరి.

చిరంజీవి లాంటి అన్నయ్య నాకుంటే...

14/04/2017: మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యామిలీపై తాను చేసిన వ్యాఖ్యలకు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ క్షమాపణ చెప్పారు. తనపై చిరంజీవి సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని పేర్కొన్నారు. ‘చిరంజీవి లాంటి అన్నయ్య నాకుంటే నేను మాట్లాడిన మాటలకి కొట్టేవాడిని. నాగబాబు మాటలతో వదిలేశాడు. ఆయనకు నిజంగా క్షమాపణ చెబుతున్నా’ని వర్మ ట్వీట్‌ చేశారు. నాగబాబు తనయుడు, హీరో వరుణ్‌ తేజ్‌ కూడా ఆయన క్షమాపణ చెప్పారు. ‘వరుణ్‌ తేజ్‌.. మీ నాన్న గురించి నాపై చేసిన కామెంట్లు చదివాను. నువ్వు చెప్పింది కరెక్ట్. నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీ ఇద్దరికీ క్షమాపణలు చెబుతున్నాన’ని ట్విటర్‌ లో పేర్కొన్నారు. ఖైదీ నెం. 150 సినిమా ప్రీ లాంచ్ వేడుకలో నాగబాబు.. రాంగోపాల్‌ వర్మ, యండమూరి వీరేంద్రనాథ్‌ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడడంతో వివాదం మొదలైంది. నాగబాబు వ్యాఖ్యలపై వర్మ ట్విటర్‌ వేదికగా కామెంట్లు చేశారు.

పవన్ మూవీకి నో చెప్పిన బ్యూటీ!

20/12/2016: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ మూవీలో ఆఫర్‌ను మలయాళీ ముద్దుగుమ్మ నివేదా థామస్ రిజెక్ట్ చేసింది. అదేంటీ.. అగ్రహీరో మూవీలో ఛాన్స్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు కానీ ఆమె నో చెప్పడానికి కారణం లేకపోలేదు. 'జెంటిల్‌మన్' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, తొలి మూవీతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. అయితే తమిళంలో హిట్ మూవీ వేదలంను తెలుగులో పవన్ కల్యాణ్ రీమేక్ చేయడానికి సన్నద్ధమయ్యాడు. పవన్ సరసన కీర్తి సురేష్, శృతిహసన్ పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. తమిళ రీమేక్ మూవీలో పవన్ చెల్లిలి క్యారెక్టర్ లో నివేదా థామస్ కనిపించనుందని వదంతులు వచ్చాయి. ఈ విషయంపై నివేదా థామస్ స్పందించారని.. స్టార్ హీరో సరసన హీరోయిన్ గా జతకట్టేందుకు ఎవరైనా ఇష్టపడతారని, చెల్లిలి పాత్ర చేసేందుకు నాకు ఇష్టం లేదు అని చెప్పేసిందని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. మరోవైపు పవన్ కాటమరాయుడు మూవీ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాటమరాయుడు తర్వాతే వేదలం రీమేక్ పై పవన్ దృష్టి సారించనున్నాడు.

రానా అసలు పారితోషకాలే తీసుకోడంట

19/12/2016: ఈ రోజుల్లో హీరోలు పారితోషకాల విషయంలో చాలా పక్కాగా ఉంటున్నారు. సినిమా రిలీజయ్యాక చూసుకుందాం అనుకుంటే.. ఆ తర్వాత రిజల్ట్ ఎలా అయినా ఉండొచ్చు. చేతిలో డబ్బులు పడొచ్చు. పడకపోవచ్చు. కాబట్టి పారితోషకాల విషయంలో చాలామంది హీరోలు ముందే అంతా పక్కాగా సెటిల్ చేసుకుంటుంటారు. ఇలాంటి తరుణంలో టాలీవుడ్లో అసలు ముందు పారితోషకమే తీసుకోకుండా సినిమాలు చేసే హీరో ఒకరున్నారట. ఆ హీరో మరెవరో కాదు.. రానా దగ్గుబాటి. తాను రెమ్యూనరేషన్ తీసుకోకుండానే సినిమాలు పూర్తి చేస్తున్నానని.. సినిమా రిజల్ట్ చూశాకే డబ్బులు తీసుకుంటున్నానని చెప్పాడు రానా. అలా ఎందుకో అతడి మాటల్లోనే తెలుసుకుందాం పదండి. ‘‘కొత్త కొత్త సినిమాలు చేయాలన్నది నా లక్ష్యం. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలు చేయాలంటే నా దగ్గర పది కథలున్నాయి. కానీ నా దారి వేరు. చాలా ప్రత్యేకంగా ఉంటుంది. బాహుబలి.. ఘాజీ లాంటి సినిమాలు ఎప్పుడో కానీ రావు. ‘ఘాజీ’ తీయడం పెద్ద రిస్క్‌. కొత్త సినిమా చూపించాలనే తపనతో నిర్మాత ముందుకొచ్చినప్పుడు నటుడిగా నేను సపోర్టివ్వాలి. అందుకే పారితోషికం గురించి మాట్లాడలేదు. ఆ మాటకొస్తే నేను చేసే ప్రతి సినిమాకూ రిలీజ్ తర్వాత లాభాలొస్తే వాటా తీసుకుంటాను. నేనసలు సినిమా మొదలయ్యే ముందు రెమ్యూనరేషన్ గురించే మాట్లాడను. కొత్త తరహా సినిమాలు తీయడం రిస్క్‌. నిర్మాత ఆ రిస్క్‌ తీసుకోవడానికి రెడీ అయినప్పుడు నేను ఆర్టిస్టుగా ముందుకు రావాలి. ఘాజికి అడ్వాన్సేమీ తీసుకోకుండా ఐదు నెలల డేట్లిచ్చాను. నిర్మాతలు చాలా హ్యాపీ’’ అని రానా తెలిపాడు.

రామ్ చరణ్ ఎంత లక్కీయో..

19/12/2016: కలిసొచ్చే కాలం వస్తే.. కలెక్షన్ల మోత ఎలా మోగించవచ్చో 'ధృవ' చూపిస్తోంది. రెండో వీకెండ్లో ఈ సినిమాకు భలేగా కలిసొచ్చింది. మామూలుగా అయితే రెండో వారానికి ధృవ పనైపోవాలి. ఎందుకంటే డిసెంబరు 16న సూర్య సినిమా 'ఎస్-3' రావాల్సింది. అది పక్కా మాస్ మసాలా సినిమా. 'ధృవ' క్లాస్ టచ్ ఉన్న థ్రిల్లర్. మాస్ ఏరియాల్లో ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో ఆదరణ లేదు. 'ఎస్-3' యధావిధిగా రిలీజై ఉంటే ధృవకు పెద్ద దెబ్బ పడేది. ఈ విషయంలో అల్లు అరవింద్ బాగానే జాగ్రత్త పడ్డాడు. 'ధృవ'కు కలిసొచ్చిన మరో విషయం ఏంటంటే.. 'ఎస్-3' ఖాళీ చేయడంతో ఈ వీకెండ్లో రిలీజైన రెండు చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపించట్లేదు. ఉన్నంతలో 'నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్' పరిస్థితి మెరుగ్గా ఉంది కానీ.. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పెద్దగా ప్రభావం చూపించట్లేదు. అసలే చిన్న సినిమాలు.. పైగా టాక్ బ్యాడ్ గా ఉండటంతో ఈ వీకెండ్లోనూ 'ధృవ' బాక్సాఫీస్ లీడర్ అయింది. రెండో వారాంతంలోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. తొలి వారంలో ఈ చిత్రం రూ.41 కోట్ల దాకా షేర్.. రూ.64 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసింది. రెండో వారాంతం అయ్యేసరికి 'ధృవ' షేర్ రూ.50 కోట్లకు చేరువగా వస్తుందని భావిస్తున్నారు. ఇలా అన్నీ కలిసి రాకపోతే 'ధృవ' కచ్చితంగా లాస్ వెంచరే అయ్యేది. కానీ ఇప్పుడు బ్రేక్ ఈవెన్ గ్యారెంటీ అనిపిస్తోంది. మొత్తానికి 'ధృవ' సేఫ్గా బాక్సాఫీస్ జర్నీని పూర్తి చేస్తున్నట్లే.

అంత దుమారం రేగుతుందనుకోలేదు-రెజీనా

15/12/2016: ఒక హీరోయిన్ తన చేతి వేలికి ఉంగరం తొడిగి ఉన్న ఒక ఫొటో పెట్టి.. నా లైఫ్లో ఇది బిగ్ మూమెంట్ అని కామెంట్ చేస్తే ఎవరైనా ఏమనుకుంటారు? ఎంగేజ్మెంట్ అయిపోయిందనే కదా? రెజీనా విషయంలో జనాలు అలాగే భావించారు. ఐతే రెజీనా ఆ మెసేజ్ పెట్టిన కొన్ని గంటల్లోనే డెలీట్ చేసినా సరే.. జరగాల్సిందంతా జరిగిపోయింది. పెద్ద దుమారమే రేగింది. ఐతే అప్పుడు అంత రచ్చ చేసిన రెజీనా.. ఇప్పుడేమో అంతా సరదాకే చేశా.. ఆ వ్యవహారం అంత పెద్ద దుమారం రేపుతుందని ఊహించలేదు అంటూ కామెడీలు చేస్తోంది. ''ఆ రోజేదో సరదాగా మెసేజ్ పెట్టాను. అది అంత దుమారం రేపుతుందని భావించలేదు. సోషల్మీడియా ద్వారా నా అభిమానులకు చిన్న షాక్ ఇవ్వాలని త్వరలో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నానని పోస్ట్ చేశాను. రియాక్షన్ లా ఉంటుందో చూద్దామనుకుంటే నిప్పంటించిన అడవిలా పెద్ద కలకలాన్నే సృష్టించింది అని చెప్పింది రెజీనా. ఇక నిజమైన పెళ్లి సంగతేంటని రెజీనాను అడిగితే.. నాకు ఏ విషయంలోనూ ముందుగా ప్రణాళిక ఉండదు. అయినా ఏదైనా విధిని బట్టే జరుగుతుంది. పెళ్లి ఎప్పుడు జరగాలని రాసిపెట్టి ఉంటే అప్పుడే జరుగుతుంది. ఎప్పుడు జరిగినా నాది ప్రేమ వివాహమే అవుతుంది'' అని స్పష్టం చేసింది రెజీనా. ప్రేమ పెళ్లే చేసుకుంటా అంటూనే.. తనకు ప్రేమ వ్యవహారాలు నడిపేంత ఖాళీ అసలేమాత్రం లేదని.. ప్రస్తుతానికి తన దృష్టంతా సినిమాలపైనే అని రెజీనా చెప్పడం విశేషం.

షాకింగ్.. సింగం-3 మళ్లీ వాయిదా?

15/12/2016: సూర్య సినిమా 'ఎస్-3' డిసెంబరు 16 నుంచి 23కు వాయిదా పడటం వల్ల ఎంత గందరగోళం నెలకొందో.. ఎన్ని సినిమాల రిలీజ్ డేట్లు అటు ఇటు అయ్యాయో తెలిసిందే. అయ్యిందేదో అయ్యిందని అందరూ సర్దుకున్నారు. ఇప్పుడు మళ్లీ పిడుగు లాంటి వార్త బయటికి వచ్చింది. ఈ సినిమా డిసెంబరు 23న కూడా విడుదల కావడం అనుమానమేనట. డిసెంబరు 30కి లేదంటే మరో తేదీకి వాయిదా వేస్తారట. ఇంకా దీని గురించి అధికారిక సమాచారం బయటికి రాలేదు కానీ. వాయిదా మాత్రం పక్కా అంటున్నారు. గురువారమే దీని గురించి నిర్మాత జ్నానవేల్ రాజా అనౌన్స్మెంట్ చేసే అవకాశాలున్నాయి. ఇంతకీ 'సింగం-3' వాయిదా పడటానికి కారణమేంటి అంటే.. తమిళంలో ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 'ఎ' సర్టిఫికెట్ జారీ చేయడమేనట. సినిమాలో వయొలెన్స్ ఎక్కువగా ఉండటంతో సెన్సార్ బోర్డు 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చిందట. ఐతే తమిళంలో 'యు' సర్టిఫికెట్ వచ్చిన సినిమాలకు పన్ను మినహాయింపు ఉంటుందన్న సంగతి తెలిసిందే. దీంతో తమ సినిమాను రివైజ్డ్ కమిటీకి పంపాలని భావిస్తోందట చిత్ర బృందం. ఆ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పడుతుంది కాబట్టి.. డిసెంబరు 23న సినిమా వచ్చే అవకాశాలు లేవట. ఇదే నిజమైతే.. వంగవీటి, సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమాలకు భలే కలిసొస్తున్నట్లే. ఐతే తర్వాతి వారం షెడ్యూల్ అయిన సినిమాలకు మాత్రం తలనొప్పే. 30న అప్పట్లో ఒకడుండేవాడు, ఇంట్లో దెయ్యం నాకే భయం సినిమాలు రిలీజ్ కావాల్సి ఉన్నాయి.

పొట్ట కనిపించకుండా రకుల్ ట్రిక్

15/12/2016: టాలీవుడ్ లో ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉన్న రకుల్ ప్రీత్ సింగ్. లేటెస్ట్ గా కీర్తి సురేష్ నుంచి పోటీ ఉన్నా.. ఇప్పటికి నంబర్ వన్ రకులే. అలాంటి రకుల్ కూడా గ్లామర్ షో కోసం కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తోందట. ఆ సంగతి రకులే స్వయంగా చెప్పింది. ధృవలో రకుల్ స్కిన్ షోనే మెయిన్ అట్రాక్షన్. కానీ గ్లామర్ ఒలికించడం అంత వీజీ కాదంటోంది రకుల్. ఓ పాటలో మొత్తం నావెల్ షో చేయాల్సి వచ్చినప్పుడు చాలా కష్టపడిందట. ఏం తిన్నా ఎక్కడ పొట్ట కనిపిస్తుందోనని, జాగ్రత్తగా నాలుగు రోజులు పాటు పొట్టను మాడ్చేసిందట. ఏదో అప్పుడప్పుడు పుచ్చకాయ ముక్కలతో సరిపెట్టుకుందట. అందుకే రకుల్ నేవల్ షో చేసిన ఆ సాంగ్ థియేటర్స్ లో ఆడియన్స్ తో విజిల్ వేయిస్తోంది. హీరోయిన్స్ కు ఏ భాషలో అయినా అంత ఇంపార్టెన్స్ ఉండదన్న రకుల్.. మంచి కథలో భాగమైతే అదే గుర్తింపు వస్తుందని వాస్తవం చెబుతోంది. ఉన్నంతలో తన క్యారెక్టర్ కు న్యాయం చేయడమే తనకు తెలుసని, తన వల్ల సినిమా పోయిందనే ఇమేజ్ రాకూడదని రకుల్ కోరుకుంటోంది.

న‌మో వెంక‌టేశాయ‌.. రొమాన్సుకు డోకా లేదు

09/12/2016: మామూలుగా భ‌క్తి చిత్రాలంటే భ‌క్తి చిత్రాలే. కానీ రాఘ‌వేంద్ర‌రావు మాత్రం భ‌క్తి చిత్రాల్లోనూ త‌న‌దైన శైలిలో ర‌సిక‌త చూపించాడు. అన్న‌మ‌య్య‌.. శ్రీరామ‌దాసు.. పాండురంగ‌డు లాంటి సినిమాల్లోనూ ర‌సిక‌త పాళ్లు బాగానే క‌నిపిస్తాయి. రాఘ‌వేంద్ర‌రావు మార్కు స్ప‌ష్టంగా ద‌ర్శ‌న‌మిస్తుంది. తాజాగా ‘ఓం న‌మో వెంక‌టేశాయ’ సినిమాలోనూ రొమాన్సుకు ఢోకా లేద‌ని అర్థ‌మ‌వుతోంది. రెండో హీరోయిన్‌గా తీసుకున్న ప్ర‌గ్యా జైశ్వాల్‌కే ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్లున్నాడు ద‌ర్శ‌కేంద్రుడు. ఆల్రెడీ ఈ మ‌ధ్య రిలీజైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లోనే లైట్‌గా అందాల విందు చేసింది ప్ర‌గ్యా. తాజాగా నాగార్జున‌తో ప్ర‌గ్యా ఉన్న పోస్ట‌ర్ చూస్తుంటే.. రొమాన్స్ బాగానే ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇప్ప‌టిదాకా ‘న‌మో వెంక‌టేశాయ’ సినిమాలో నాగార్జున లుక్స్ ఆధ్యాత్మిక కోణంలోనే క‌నిపించాయి. తొలిసారి ఈ పాత్ర తాలూకు రొమాంటిక్ యాంగిల్ ఆవిష్క‌రించారు. ప్ర‌గ్యాను వాటేసుకుని త‌న‌దైన శైలిలో రొమాన్స్ పండిస్తున్నాడు నాగ్ కొత్త పోస్ట‌ర్లో. మ‌రోవైపు అనుష్క మాత్రం సినిమాలో ప‌ద్ధ‌తిగానే క‌నిపించేలా ఉంది. మ‌రో హీరోయిన్ విమ‌లా రామ‌న్ పాత్ర ఏంట‌న్న‌ది ఇంకా వెల్ల‌డి కాలేదు. ఆమె లుక్స్ కూడా ఇంకా బ‌య‌టికి రాలేదు. వెంక‌టేశ్వ‌ర‌స్వామి వీర భ‌క్తుల్లో ఒక‌డైన హ‌థీరాం బాబా జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న ‘ఓం న‌మో వెంక‌టేశాయ’ వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.

మహేష్-కొరటాల మూవీ రిలీజ్ డేట్ ఇదే..

08/12/2016: మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్లో రాబోయే రెండో సినిమాకు ఇంకా రెగ్యులర్ షూటింగే మొదలవలేదు. అప్పుడే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సెప్టెంబరు 22న ప్రేక్షకుల ముందుకు తేనున్నట్లు ప్రకటించారు. 'శ్రీమంతుడు' తర్వాత మహేష్-కొరటాల కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు 'భరత్ అనే నేను' అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇందులో మహేష్ ముఖ్యమంత్రి పాత్ర పోషించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. కొరటాల గత సినిమాల్లో మాదిరే ఇందులోనూ సామాజిక అంశాలకు పెద్ద పీట వేస్తారట. ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి ఆరు నెలల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే సెప్టెంబరు 22న ఈ సినిమా విడుదలవుతుంది. కొరటాల గత సినిమా 'జనతా గ్యారేజ్' ప్రారంభోత్సవ సమయంలోనే రిలీజ్ డేట్ ఇచ్చారు కానీ.. షెడ్యూళ్లు కొంచెం డిస్టర్బ్ కావడంతో ఆ డేట్‌ను అందుకోలేకపోయారు. మరి మహేష్ సినిమా విషయంలో కొరటాల ఏం చేస్తాడో చూడాలి. మరోవైపు మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న సినిమా ఏప్రిల్ ప్రథమార్ధంలో వచ్చే అవకాశముంది. అంటే ఐదు నెలల వ్యవధిలో మహేష్ రెండు సినిమాలతో పలకరించబోతున్నాడన్నమాట. బహుశా హీరోగా మహేష్ కెరీర్లో ఇంత తక్కువ వ్యవధిలో రెండు సినిమాలు రావడం ఇదే తొలిసారేమో.

ఎన్టీఆర్ మళ్లీ 'నాన్నకు ప్రేమతో' టైపులో..

08/12/2016: కెరీర్లో తొలి ఆరేడేళ్లు ఒక రకంగా కనిపించాడు జూనియర్ ఎన్టీఆర్. 'యమదొంగ' సినిమాలో అతణ్ని చూసి జనాలంతా ఒక్కసారిగా షాకైపోయారు. తెలుగులో ఏ స్టార్ హీరో లేనంత లావుగా ఉన్న ఎన్టీఆర్.. ఒక్కసారిగా బక్కచిక్కిపోయి కనిపించేసరికి జనాలు గుర్తుపట్టలేకపోయారు. ఆ తర్వాత 'కంత్రి' సినిమాలోనూ అలాగే బక్కచిక్కి కనిపించాడు. తర్వాత తర్వాత కొంచెం లావై ఐడియల్‌గా తయారయ్యాడు. 'యమదొంగ' తర్వాత తారక్‌లో లుక్ పరంగా అంతటి మేకోవర్ కనిపించింది 'నాన్నకు ప్రేమతో' సినిమాలోనే. ఈ సినిమా కోసం తన అవతారం పూర్తిగా మార్చేశాడు తారక్. ముందు అతడి లుక్ చూస్తే ఏదోలా అనిపించింది కానీ.. తర్వాత జనాలు బాగానే అలవాటు పడ్డారు. యూత్‌లో చాలామంది ఆ లుక్‌ను ఫాలో అయిపోయారు. 'నాన్నకు ప్రేమతో' తర్వాత 'జనతా గ్యారేజ్‌'లో మామూలుగానే కనిపించాడు ఎన్టీఆర్. ఐతే ఇప్పుడు మళ్లీ బాబీ సినిమాకు తన లుక్ పూర్తిగా మార్చేస్తున్నాడట. 'జనతా గ్యారేజ్' సినిమా తర్వాత దాదాపు మూడు నెలలు విరామం తీసుకున్న తారక్.. ఈ మధ్య ఓ ఫంక్షన్లో గుబురు గడ్డంతో వెరైటీగా కనిపించాడు. అప్పటికే బాబీ సినిమాకు ఓకే చెప్పేసిన తారక్.. అందుకోసమే కొత్త లుక్ మార్చుకునే ప్రయత్నంలో పడ్డాడట. ప్రస్తుతం ప్రత్యేకంగా ఒక మేకప్ ఆర్టిస్టును పెట్టుకుని లుక్ మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాడట తారక్. కొంచెం బాడీ కూడా తగ్గించుకోబోతున్నాడట. మొత్తానికి 'నాన్నకు ప్రేమతో' తర్వాత ఆ స్థాయిలో మరోసారి మేకోవర్ ఉండబోతోందని సమాచారం. మరి ఈ శుక్రవారం బాబీ సినిమా ప్రారంభోత్సవంలోనే తారక్ కొత్త లుక్‌తో కనిపిస్తాడేమో చూడాలి.

దిల్ రాజుకు ఇచ్చేసి నాని సైడైపోయాడు

07/12/2016: క్వాలిటీ విషయంలో రాజీ పడకుండానే శరవేగంగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ ఏడాది ఆల్రెడీ నాని సినిమాలు మూడు రిలీజైపోయాయి. అంతా అనుకున్నట్లు కూడా జరిగితే నాలుగో సినిమా కూడా రిలీజైపోయేది కానీ.. కొన్ని కారణాల వల్ల 'నేను లోకల్' ఈ ఏడాది రిలీజయ్యేలాగా కనిపించట్లేదు. ఐతే ఈ సినిమా విషయంలో నాని పనైతే ఏమీ మిగల్లేదు. ఈ సినిమా షూటింగ్ కేవలం మూడు నెలల్లో పూర్తయిపోవడం విశేషం. షూటింగ్ ఇంకా కొంత పెండింగ్ ఉండటం వల్లే సినిమా ఆలస్యమవుతోందన్న ప్రచారానికి తెరదించుతూ.. ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. సూర్య సినిమా 'ఎస్-3' డిసెంబరు 23కు వాయిదా పడటం వల్లే 'నేను లోకల్'ను వాయిదా వేయాల్సి వస్తోంది. సినిమా పూర్తి చేసి నిర్మాత దిల్ రాజుకు అప్పగించేసిన నాని.. తన తర్వాతి సినిమా మీదికి వెళ్లిపోయాడు. శివ నిర్వాణ అనే కొత్త దర్శకుడితో నాని చేయబోయే కొత్త సినిమా ఆల్రెడీ ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ బుధవారమే ఆరంభమవుతోంది. ప్రి ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని.. పక్కా ప్రణాళికతో ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా నాని తనదైన శైలిలో వేగంగా పూర్తి చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. డీవీవీ దానయ్య నిర్మించే ఈ చిత్రంలో నివేదా థామస్ కథానాయిక. ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు. కోన వెంకట్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాయడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరిస్తుండటం విశేషం.

ధనుష్‌ సినిమాలో కాజోల్?

02/12/2016: బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ కాజోల్ దక్షిణాదిన ఒకే ఒక్క సినిమా చేసింది. అదే.. మెరుపు కలలు. ఐతే ఒక్క సినిమానే చేసినా ఆమె వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. ఓ వాన పడితే ఆ కొండ కోన హాయి.. అంటూ సాగే ఆమె పాట ఇప్పటికీ ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంటుంది. 'దిల్వాలే దుల్హానియా లే జాయేంగే' రీజనల్ వెర్షన్స్‌తోనూ కాజోల్ సౌత్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఐతే 'మెరుపు కలలు' సినిమాతో కాజోల్‌కు దక్షిణాదిన మంచి పేరొచ్చినా.. ఆ తర్వాత మళ్లీ ఆమె ఇంకో సినిమా చేయలేదు. ఐతే చాలా ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఆమె ఇప్పుడు ఓ తమిళ సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. తమిళ స్టార్ హీరో ధనుష్ కొత్త సినిమా 'వీఐపీ-2'లో కాజోల్ ఓ కీలక పాత్ర పోషించనుందట. ఈ చిత్రానికి ధనుష్ మరదలైన సౌందర్య దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సౌందర్య.. కాజోల్‌కు కథ చెప్పి, ఆమె పాత్ర గురించి వివరించగా తాను ఈ పాత్ర చేస్తానని చెప్పిందట. నిజంగా కాజోల్ ఈ పాత్ర చేస్తే ఆ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తుండటం విశేషం. అమలా పాల్.. మాంజిమా మోహన్‌లతో పాటు మరో కథానాయికకూ ఇందులో స్థానం ఉంది. ధనుష్-అమల జంటగా నటించిన 'వీఐపీ' రెండేళ్ల కిందట సూపర్ హిట్టయింది. ఆ చిత్రం తెలుగులో 'రఘువరన్ బీటెక్' పేరుతో రిలీజైంది. 'వీఐపీ-2'ను అదే పేరుతో తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు.

'ఖైదీ' ఆడియో కోసం కొత్త టెక్నాలజీ

02/12/2016: ఈసారి సంక్రాంతి సినిమాలు చాలా ముందు చూపుతో వ్యవహరిస్తున్నాయి. విడుదలకు నెల రోజుల ముందే షూటింగ్ పూర్తి చేసుకుని.. నెమ్మదిగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రమోషన్ విషయంలోనూ పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగుతున్నాయి. ఐతే బాలయ్య సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి'తో పోలిస్తే చిరంజీవి సినిమా 'ఖైదీ నెంబర్ 150' ప్రమోషన్ పరంగా కొంచెం వెనుకబడి ఉందన్నది వాస్తవం. 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఆడియో వేడుకను తిరుపతిలో ఈ నెల 16న అంగరంగ వైభవంగా చేయడానికి ఇప్పట్నుంచే సన్నాహాలు జరుగుతున్నాయి. అతిరథ మహారథులు ఆ వేడుకకు హాజరు కాబోతున్నారు. ఐతే 'ఖైదీ నెంబర్ 150' ఆడియో వేడుకను కూడా భారీ స్థాయిలోనే చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇంకా ఆడియో డేట్ ప్రకటించలేదు కానీ.. ఫంక్షన్ మాత్రం గ్రాండ్‌గానే చేస్తారట. మెగా ఫ్యామిలీ హీరోలందరూ ఈ వేడుకకు హాజరవుతారు. పవన్ కళ్యాణ్ విషయంలోనే సందేహాలున్నాయి. ఈ ఆడియో వేడుకలోనే టాలీవుడ్‌కు ఓ కొత్త టెక్నాలజీని పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. ఆ టెక్నాలజీ పేరు. డి హోలోగ్రామ్. 'ఖైదీ నెంబర్ 150' ట్రైలర్‌తో పాటు ప్రోమో సాంగ్స్‌ను ఈ టెక్నాలజీ ద్వారానే ఆడియో వేదిక మీద ప్రదర్శిస్తారట. ప్రేక్షకులకు ఇదొక సరికొత్త అనుభూతిని పంచుతుందని అంటున్నారు. దాని ప్రత్యేకత ఏంటో మాటల్లో చెప్పడం కాదు కానీ.. ఆ రోజే నేరుగా చూడాలని చెబుతోంది 'ఖైదీ నెంబర్ 150' టీమ్. ఈ టెక్నాలజీ టాలీవుడ్లో వాడనుండటం ఇదే తొలిసారట.

డిసెంబరు 10న ఎన్టీఆర్ సినిమా లాంచ్?

01/12/2016: మూడు నెలల సస్పెన్సుకు తెరపడ్డట్లే. జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ఏదో స్పష్టత వచ్చేసినట్లే. పవర్ డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర దర్శకత్వంలోనే హీరోగా తన 27వ సినిమాను చేయబోతున్నాడట తారక్. ఈ చిత్రం డిసెంబరు 10న.. శనివారం నాడు ప్రారంభోత్సవం జరుపుకోబోతున్నట్లు తాజా సమాచారం. డిసెంబరు 9న 'ధృవ' హంగామాను చూడబోతున్న సినీ జనాలు.. మరుసటి రోజు ఫోకస్ ఎన్టీఆర్ మూవీ మీద పెట్టాల్సిందే.ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. అనేక తర్జన భర్జనల తర్వాత బాబీ స్క్రిప్టుకే పచ్చజెండా ఊపాడు ఎన్టీఆర్. వక్కంతం వంశీతో మొదలుపెట్టి.. పూరి జగన్నాథ్.. అనిల్ రావిపూడి.. హరి.. లింగుస్వామి.. ఇలా గత మూడు నెలల్లో ఎన్టీఆర్ కొత్త సినిమా దర్శకుడంటూ చాలామంది పేర్లు వినిపించాయి. చివరగా అనిల్ రావిపూడి, బాబీల మధ్య పోటీ నెలకొంది. ఈ పోటీలో బాబీనే గెలిచాడు. అతను రవితేజ కోసం తయారు చేసిన కమర్షియల్ స్క్రిప్టు ఎన్టీఆర్కు బాగా నచ్చిందని సమాచారం. తన అన్నయ్య కళ్యాణ్ రామ్ కోసం ఓ సినిమా చేయాలన్న కమిట్మెంటే ఎన్టీఆర్ను బాబీకి ఓటేసేలా చేసింది. అనిల్ రావిపూడికి దిల్ రాజుతో కమిట్మెంట్ ఉండటం వల్ల అతను తన తర్వాతి సినిమాను ఆయనకే చేయాల్సి ఉంది.

చిరంజీవి కోసమే చరణ్ త్యాగం

01/12/2016: డిసెంబర్ 9న ధృవ విడుదల కావడం పట్ల మెగా అభిమానులు అసంతృప్తితో వున్నారు. ఎలాంటి సెలవులు లేని డ్రై సీజన్లో ఇంత భారీ చిత్రాన్ని విడుదల చేయాల్సిన అవసరం ఏంటనేది అభిమానుల ప్రశ్న. కనీసం క్రిస్మస్ టైమ్లో విడుదల చేసినా ఎంతో కొంత లాభం వుంటుందని ఫాన్స్ అంటున్నా కానీ తన నిర్ణయంలో మార్పు లేదని తేల్చేసాడు చరణ్. క్రిస్మస్కి విడుదల చేసినట్టయితే, సంక్రాంతి టైమ్కి ధృవ రిలీజ్ అయి కనీసం మూడు వారాలు కూడా పూర్తి కాదు. అదే డిసెంబర్ 9న విడుదల చేస్తే, సంక్రాంతి టైమ్కి ధృవ రన్ పూర్తయిపోతుంది కాబట్టి సంక్రాంతికి ధృవ తొలగించడానికి బయ్యర్లు అడ్డు చెప్పరు. ఈ లాజిక్ ఆలోచించి ధృవని అన్ సీజన్లో విడుదల చేస్తున్నారట. దీని వల్ల తన సినిమాకి కాస్త నష్టం జరిగినా కానీ తన తండ్రి సినిమాకి తన సినిమా ఎలాంటి ఆటంకం కాకూడదని చరణ్ ఫిక్సయ్యాడట. ఖైదీ నంబర్ 150 చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చరణ్ ప్రస్తుతం తనకి విజయాలు లేకపోయినా కానీ తండ్రి కోసం ఈ త్యాగం చేస్తున్నాడట. అన్ని రకాలుగా ప్రామిసింగ్గా కనిపిస్తోన్న సినిమాని ఇలా బ్యాడ్ టైమ్లో విడుదల చేయడం పట్ల ఫాన్స్ మాత్రం అసంతృప్తిగానే వున్నారు. మరి చరణ్ తీసుకుంటోన్న రిస్క్ ఫలించి ధృవ ఇలాంటి టైమ్లో కూడా ఘన విజయం సాధిస్తుందో లేదో చూడాలిక.

ముగ్గురు హీరోయిన్లకూ మూడినట్లే..

24/11/2016: ఆరేడేళ్ల పాటు తెలుగు సినీ పరిశ్రమను ఏలారు కాజల్ అగర్వాల్.. తమన్నా భాటియా.. సమంత రూత్ ప్రభు. 2010 తర్వాత వీళ్ల హవా మామూలుగా లేదు. తెలుగు స్టార్ హీరో సినిమా అంటే.. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు కథానాయికగా ఉండాల్సిందే. ఈ ముగ్గురూ దాదాపుగా స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేశారు. స్టార్లతో ఒకటికి మించి సినిమాల్లో నటించారు. ఐతే ఈ మధ్య ఉన్నట్లుండి ఈ ముగ్గురి హవా తగ్గిపోయింది. ఒకరి తర్వాత ఒకరు నెమ్మదిగా సైడైపోతున్నారు. స్టార్లు చేస్తున్న.. చేయబోయే కొత్త సినిమాల్లో ఈ ముగ్గురిలో ఎవరికీ చోటు దక్కట్లేదు. ఈ ముగ్గురికీ క్రేజ్ పూర్తిగా పడిపోయిందని లేదు కానీ.. వేర్వేరు కారణాల వల్ల వీరికి ఛాన్సులు దక్కట్లేదు. సమంత పెళ్లి మూడ్లోకి వచ్చేశాక ఆమెను ఎవరూ కన్సిడర్ చేస్తున్నట్లు లేరు. తమన్నా తమిళ సినిమాల పైకి దృష్టి మళ్లించింది. కాజల్.. వరుస ఫ్లాపులతో వెనుకబడిపోయింది. మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ పీక్స్ అందుకోగా.. కీర్తి సురేష్.. పూజా హెగ్డే లాంటి క్యూట్ హీరోయిన్లు రేసులోకి వచ్చారు. రకుల్ ప్రీత్ కోసం ఇప్పుడు స్టార్ హీరోలే వెయిటింగ్ లో ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కీర్తి.. పవన్ కళ్యాణ్ సరసన ఛాన్స్ కొట్టేసింది. మహేష్ బాబుతో కూడా అవకాశం దక్కేలా ఉందంటున్నారు. మరోవైపు పూజా హెగ్డే.. బన్నీతో సినిమా చేస్తోంది. పవన్ కళ్యాణ్ తర్వాతి సినిమాకూ కన్సిడర్ చేస్తున్నారట. మరోవైపు మేఘా ఆకాశ్ అనే కొత్తమ్మాయి దూసుకొస్తోంది. మొత్తానికి పాత నీరు పోవడం.. కొత్త నీరు రావడం ఒకేసారి జరుగుతున్నాయి. కాబట్టి టాలీవుడ్లో కాజల్-తమన్నా-సమంతల శకం దాదాపుగా ముగిసినట్లే కనిపిస్తోంది.

'గౌతమీపుత్ర శాతకర్ణి' కోసం ప్రత్యేక అతిథి

24/11/2016: గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని పరిశీలిస్తే.. తెలుగుదేశం, బీజేపీల మధ్య బంధం సడలినట్లుగా కనిపిస్తుంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటున్నారు. ప్రత్యేక హోదా విషయంలో రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. ఐతే బయటికి పరిస్థితి ఎలా ఉన్నా.. తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు, భాజపా అగ్రనేత వెంకయ్య నాయుడు అత్యంత సన్నిహితులన్న మాట వాస్తవం. పార్టీలు వేరైనా వీళ్లిద్దరిదీ అవినాభావ సంబంధం. ఈ నేపథ్యంలోనే వెంకయ్య నాయుడు.. చంద్రబాబు నాయుడి వియ్యంకుడైన నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'గౌతమీపుత్ర శాతకర్ణి' కోసం ప్రత్యేక అతిథిగా వస్తున్నారు. డిసెంబరు 16న 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఆడియో వేడుక తిరుపతి వేదికగా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతన్నాయి. ఇందుకోసం భారీ వేదికను సిద్ధం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు వెంకయ్య నాయుడు కూడా ముఖ్య అతిథులుగా రానున్నారు. ఇంకా చాలామంది రాజకీయ.. సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరవుతారట. తెలుగు సినీ పరిశ్రమలోనే నభూతో అన్న రీతిలో ఈ వేడుక చేయబోతున్నారట. అభిమానులు కూడా ఈ వేడుకను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. వారం ముందే.. అంటే డిసెంబరు 9న 'గౌతమీపుత్ర శాతకర్ణి' ట్రైలర్‌ను ప్రపంచవ్యాప్తంగా 100 థియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శించబోతుండటం విశేషం. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

కుర్రోడిని చిక్కుల్లో పడేసిన సమంత

24/11/2016: సౌత్ ఇండియాలో చాలామంది స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని.. ఒక్క సూపర్ స్టార్ రజినీకాంత్‌కు మాత్రమే సాధ్యమైన రికార్డును ఈ మధ్యే అందుకుంది సమంత. ట్విట్టర్లో ఆమె ఫాలోవర్ల సంఖ్య 3 మిలియన్ మార్కును దాటింది. సమంత ట్విట్టర్లోకి వచ్చిన నాలుగేళ్లకే ఈ ఘనత సాధించడం మరో విశేషం. మరి సమంత ట్విట్టర్లో అంత ఫేమస్ ఎందుకైంది అంటే.. ఆమె చేసే వ్యాఖ్యలు.. రకరకాల అంశాలపై ఆమె స్పందించే తీరు వల్లే. గతంలో మహేష్ బాబు '1 నేనొక్కడినే' సినిమా గురించి సమంత చేసిన వ్యాఖ్యలు ఎంత పెద్ద దుమారం రేపాయో తెలిసిందే. ట్విట్టర్లో ఇలాంటి చిలిపి వేషాలు చాలానే వేస్తుంటుంది సామ్. ఇలాంటి వాటి వల్లే ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఫాలోవర్లూ పెరిగారు. తాజాగా మరోసారి సమంత తన చిలిపితనాన్ని ప్రదర్శించింది. తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌ను ఆమె ఇరకాటంలో పడేసింది. ఈ కుర్రాడు తాజాగా ఓ అమ్మాయితో రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడంటూ వార్తలొచ్చాయి. ఈ వార్తలపై అతను స్పందిస్తూ.. "నాకు ఎంగేజ్మెంటా.. హహహ.. నేను సింగిల్.. ఇంకా యంగ్" అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఐతే ఇంతలో సమంత ఎంటరైంది. అనిరుధ్‌ కామెంట్ మీద రెస్పాండవుతూ.. "కానీ ఆ అమ్మాయి చాలా స్వీట్ కదా.. ఏమైంది?" అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసింది. దీంతో జనాల్లో మళ్లీ అనిరుధ్ మీద సందేహాలు మొదలయ్యాయి. అతడికి ఏదో వ్యవహారం అయితే ఉందని మాత్రం జనాలకు క్లారిటీ వచ్చేసింది. మొత్తానికి సూటిగా ఏదీ చెప్పకుండానే చేయాల్సిందల్లా చేసేసింది సామ్. సమంత దెబ్బకు ఏం మాట్లాడాలో తెలియక సైలెంటైపోయాడు అనిరుధ్.

శాతకర్ణి ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదే..

12/11/2016: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బాలకృష్ణ వందో సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి' సరిగ్గా ఇంకో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేయనుంది. ఈ సినిమాకు మొదట్నుంచి మంచి పబ్లిసిటీ తేవడంలో క్రిష్ బాగానే సక్సెస్ అయ్యాడు. ప్రి లుక్.. ఫస్ట్ లుక్.. టీజర్.. అన్నీ కూడా ఆసక్తి రేకెత్తించాయి. ఈ సినిమా ఆన్ లొకేషన్ పిక్స్ కూడా చర్చనీయాంశమయ్యాయి. ఇక తర్వాత అస్త్రాన్ని బయటికి తీస్తున్నాడు క్రిష్. 'గౌతమీపుత్ర శాతకర్ణి' ట్రైలర్ రిలీజ్కు ముహూర్తం కుదిరింది. డిసెంబరు 9న ఈ ట్రైలర్ లాంచ్ చేస్తారని సమాచారం. ఈ ట్రైలర్ రిలీజ్ కోసం సన్నాహాలు భారీగానే చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వంద లొకేషన్లలో 'శాతకర్ణి' ట్రైలర్ ఒకేసారి లాంచ్ కాబోతుండటం విశేషం. ఇందుకోసం థియేటర్లను కూడా ఎంపిక చేశారు. బాలయ్యకిది వందో సినిమా కాబట్టి వంద థియేటర్లలో ట్రైలర్ లాంచ్ అన్నమాట. గతంలో 'బాహుబలి' ట్రైలర్ కూడా ఇలాగే థియేటర్లలో రిలీజ్ చేశారు. ఐతే ఆ ట్రైలర్ కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ప్రదర్శితమవగా.. 'గౌతమీపుత్ర శాతకర్ణి' ట్రైలర్ మాత్రం అమెరికా, బ్రిటన్ సహా చాలా దేశాల్లో లాంచ్ కాబోతోంది. బాలయ్య పెట్టించే ఒక ప్రత్యేక ముహూర్తంలో ట్రైలర్ లాంచ్ చేస్తారట. ట్రైలర్ రిలీజ్ చేసిన వారం రోజులకు.. అంటే డిసెంబరు 16న 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఆడియో వేడుకను అంగరంగ వైభవంగా చేయబోతున్నారు.

నానికి పోటీ ఇచ్చే హీరోయినొచ్చింది

12/11/2016: నాని ఎలాంటి నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అతడి పక్కన మామూలు హీరోయిన్లను పెడితే తేలిపోతారు. కాస్తో కూస్తో నటన వస్తే తప్ప అతడి పక్కన నెట్టుకురావడం కష్టం. అదే సమయంలో హీరోయిన్ అన్నాక గ్లామర్ కూడా ఉండాలి. ఉన్నంతలో మంచి హీరోయిన్లనే పట్టుకొస్తున్నారు కానీ.. అన్ని రకాలుగా అతడికి దీటైన హీరోయిన్లను పట్టుకురావడం కొంచెం కష్టమే అవుతోంది దర్శక నిర్మాతలకు. ఐతే నేను లోకల్ సినిమాలో మాత్రం నానికి సరైన జోడీనే కుదిరినట్లుంది. తాజాగా రిలీజైన ఈ సినిమా టీజర్ చూస్తే ఈ విషయం ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. నేను లోకల్ టీజర్లో నాని ఎక్స్ప్రెషన్లో అదరగొట్టేసిన మాట వాస్తవం. ఐతే నాని హావభావాల గురించి.. అతడి నటన గురించి కొత్తగా చెప్పేదేముంది. అది మామూలు విషయమే. ఇక్కడ కీర్తి ఎక్స్ప్రెషన్లే ప్రత్యేకం. ఆమెలాగా హావభావాలతో చంపేసే హీరోయిన్లు చాలా కొద్దిమందే ఉంటారు. కళ్లతో మ్యాజిక్కే చేసేస్తుంది కీర్తి. రజినీ మురుగన్.. తొడారి లాంటి సినిమాలతో ఇప్పటికే తమిళ ప్రేక్షకుల మతి పోగొట్టిన కీర్తి.. నేను శైలజతో తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఓ మోస్తరుగా మెప్పించింది. ఐతే ఆ సినిమాలో ఆమెది మూడీ క్యారెక్టర్. నేను లోకల్లో అలా కాకుండా యాక్టివ్ క్యారెక్టరే ఉన్నట్లుంది. ఇందులో నానికి దీటుగా స్క్రీన్ ప్రెజెన్స్తో ఆకట్టుకుంటే కీర్తి తెలుగులోనూ బిజీ అయిపోవడం ఖాయం.

వినాయక్ తర్వాతి హీరో ఎవరో తెలుసా?

11/11/2016: ఈ మధ్య ట్రాక్ రికార్డు కొంచెం దెబ్బ తిన్నా.. వి.వి.వినాయక్ తెలుగులో టాప్ లీగ్ డైరెక్టర్లలో ఒకడు. ఎక్కువగా స్టార్లు.. సూపర్ స్టార్లతోనే పని చేస్తుంటాడు మాస్ డైరెక్టర్. మధ్యలో తనను దర్శకుడిగా పరిచయం చేసిన బెల్లంకొండ సురేష్ కోసం అతడి కొడుకు శ్రీనివాస్ తో ఒక సినిమా చేశాడు. ఆ తర్వాత నాగార్జున కోరిక మేరకు అఖిల్ ను లాంచ్ చేశాడు. ఈ రెండు సినిమాలకు ముందంతా వినాయక్ వరుసగా స్టార్లతోనే పని చేశాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో 'ఖైదీ నెంబర్ 150' చేస్తున్నాడు. ఐతే ఈ సినిమా తర్వాత వినాయక్ ఓ మీడియం రేంజ్ హీరోతో సినిమా చేస్తాడని వార్తలొస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు.. గోపీచంద్. 'సాహసం శ్వాసగా సాగిపో'తో నిర్మాతగా పరిచయమవుతున్న మిర్యాల రవీందర్ రెడ్డి.. వినాయక్-గోపీచంద్ కాంబినేషన్లో సినిమా తీయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఓ రచయిత ఈ కాంబినేషన్లో సినిమా కోసం స్క్రిప్టు రెడీ చేస్తున్నాడు. 'ఖైదీ నెంబర్ 150' తర్వాత వినాయక్.. ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయొచ్చని వార్తలొచ్చాయి. అది 'అదుర్స్-2' అయితే బాగుంటుందని సలహాలిచ్చారు. ఐతే వినాయక్ సొంతంగా స్క్రిప్టు రాయలేడు. రచయితల మీద ఆధారపడాలి. టైం పడుతుంది. ఐతే ఎన్టీఆర్ అంత కాలం వెయిట్ చేయలేని పరిస్థితుల్లో ఉండటంతో ఈ కాంబినేషన్ వర్కవుట్ కాలేదు. ఈలోపు గోపీచంద్ డేట్లతో మిర్యాల రవీందర్ రెడ్డి సంప్రదించడం.. వేరే స్క్రిప్టు వర్కవుట్ కావడంతో సినిమా ఓకే అయినట్లు సమాచారం. ప్రస్తుతం గోపీచంద్ 'ఆక్సిజన్' సినిమాను హోల్డ్ లో పెట్టి.. సంపత్ నంది సినిమా చేస్తున్నాడు.

హ్రితిక్ రోషన్ బలం

10/11/2016: బాలీవుడ్ సూపర్ స్టార్ హ్రితిక్ రోషన్ మరియు రాకేష్ రోషన్ కాంబినేషన్ లో వస్తోన్న భారీ ఆక్షన్ థ్రిల్లర్ "కాబిల్" . ఈ చిత్రానికి తెలుగు టైటిల్ "బలం" అని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం సోషల్ మీడియా లో విడుదల చేసింది. గతం లో క్రిష్, క్రిష్ 3, కోయి మిల్ గయా, కహో నా ప్యార్ హై వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మళ్ళీ బలం తో తెలుగు ప్రేక్షకుల ముందు కు రాబోతోంది. ఈ చిత్రం లో హ్రితిక్ రోషన్ సరసన యామీ గౌతమ్ హీరోయిన్ గా నటిస్తోంది. రాకేష్ రోషన్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ చిత్రం పై భారీ ఆశలు ఉన్నాయి. "ఒక విన్నూత్న ఆక్షన్ డ్రామా కి అంతర్లీనంగా ఉండే ఒక చక్కటి లవ్ స్టోరీ ఈ "బలం". ఈ చిత్రం హిందీ ట్రైలర్ కు యూట్యూబ్ లో రికార్డు బ్రేకింగ్ స్థాయి లో కేవలం 48 గంటల్లో 25 లక్షల వ్యూస్ వచ్చాయి. బలం పై అంచనాలు ఎలా ఉన్నాయో చెప్పటానికి ఇదొక ఉదాహరణ", అని చిత్ర బృందం తెలిపింది. ఆంధ్రా, నిజాం ఏరియా హక్కులను రాజశ్రీ సంస్థ దక్కించుకోగా, కర్ణాటక హక్కులను యాష్ రాజ్ సంస్థ దక్కించుకుంది. మళయాలం హక్కులను ప్రఖ్యాత నటుడు మోహన్ లాల్ దక్కించుకున్నారు. సంజయ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తం గా జనవరి 26 2017 న విడుదల అవుతుంది. గతం లో హ్రితిక్ నటించిన క్రిష్ చిత్రాలు మరియు ధూమ్ 2 చిత్రం తెలుగు లో విశేష ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. హ్రితిక్ కి ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణా లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం తో, తెలుగు లో కూడా భారీ విడుదల కు నిర్మాతలు సిద్ధ పడుతున్నారు.

సెక్సీ హీరోయిన్‌కు చిల్ల‌ర‌ క‌ష్టాలు

10/11/2016: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇచ్చిన క‌రెన్సీ స్ట్రైక్స్ దేశాన్ని షేక్ చేస్తోంది. సామాన్యుల నుంచి సెల‌బ్ర‌టీల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ అల్లాడిపోతున్నారు. ఎప్పుడు ఎలాంటి అవ‌స‌రం వ‌చ్చినా.. రూ.500, రూ.1000 నోట్ల‌తో చెల‌రేగిపోయిన వారంతా నిన్న రూ.100 , రూ.50 నోట్ల కోసం వెతుకులాట ప్రారంభించారు. మ‌రికొంద‌రు ఈ చిన్నినోట్లు ల‌భించ‌క ప‌నులు వాయిదా వేసుకున్నారు. ఇంకొంద‌రు తెలిసినోళ్ల ద‌గ్గ‌ర అప్పు చేశారు. ఇక‌, ఇప్పుడు తాను కూడా అలా అప్పు చేయాల్సి వ‌చ్చింది ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి బిపాసా బ‌సు వెల్ల‌డించారు. బిపాసాకి నిన్న రూ.100 కోసం నానా తిప్ప‌లు ప‌డింద‌ట‌! ఎందుకోగానీ ఉన్న‌ట్టుండి బుధ‌వారం ఆమె మ‌న‌సు కోడిగుడ్ల మీద‌కి మ‌ళ్లింద‌ట! కోడిగుడ్ల‌తో అదిరిపోయే క‌ర్రీ చేయించుకోవాల‌ని బిపాసా రెడీ అయింది. అయితే, ఇంట్లో గుడ్లు లేవు. దీంతో ఆమె స‌మీపంలోని దుకాణానికి బాయ్‌ని పంపించిన గుడ్లు తెప్పించుకోవాల‌నుకుంది. అయితే, ఆమె ద‌గ్గ‌ర కేవ‌లం రూ.500, రూ.1000 నోట్లు త‌ప్ప మ‌రేమీలేవు. దీంతో షాక్‌కి గురైన బిపాసా ఏంచేయాలిరా దేవుడా అనుకుంద‌ట‌. ఈ క్రమంలో బిపాసా.. త‌న ఫ్రెండ్ రాకీ స్టార్‌కి ఫోన్ చేసి.. చిల్ల‌ర తెప్పించుకుని వాటితో కోడిగుడ్లు కొని తెప్పించుకుంద‌ట‌. ఇలా.. తాను ఎన్నో కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తినా.. మోడీ ఇచ్చిన షాక్‌తో ఒక్క‌సారిగా బికారి అయిపోవాల్సి వ‌చ్చింద‌ని బిపాసా ఆందోళ‌వ్య‌క్తం చేశారు. . ఇదే విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్‌లో బిపాసా పోస్టు చేసింది. ‘కోడిగుడ్లు కొనుగోలు చేసేందుకు ఇప్పుడే రాకీ స్టార్‌ దగ్గర్నుంచి చిల్లర డబ్బులు అప్పు తీసుకున్నా. మొదటి రోజు ఇలా గడిచింది’ అంటూ వ్యాఖ్యానించింది.

బాహుబలి-2లో కొత్త కుర్రాడు

07/11/2016: ‘బాహుబలి: ది కంక్లూజన్’లో బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనటులు కనిపిస్తారని అప్పట్లో పెద్ద ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని తర్వాత తేలింది. రెండో భాగంలో చెప్పుకోదగ్గ కొత్త పాత్రలు ఏమీ ఉండవని.. ఒకవేళ ఉన్నా వాటిలో పేరున్న కొత్త నటీనటులెవరూ నటించరని బాహుబలి యూనిట్ వర్గాల నుంచి సమాచారం వచ్చింది. ఐతే తాజాగా ఈ సినిమాలో స్వాతి నాయుడు అనే కొత్తమ్మాయి నటిస్తున్న సంగతి బయటికి వచ్చింది. ఆమెది చిన్న పాత్రే కానీ.. కీలకమైందే అని తెలిసింది. కాగా ఈ సినిమా ద్వారామరో కొత్త ముఖం ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఆ కొత్త ముఖం పేరు.. సిద్ధార్థ్ నాయుడు. ‘బాహుబలి’ సినిమాలో నటించాలని మూడేళ్లుగా ప్రయత్నం చేస్తున్నాడు ఈ సిద్ధార్థ్ నాయుడు. గతంలోనే ఈ కుర్రాడిని ‘బాహుబలి: ది బిగినింగ్’ కోసం పరిశీలించారట. అతడి ప్రొఫైల్ బాహుబలి మేకర్స్ దగ్గరికి చేరిందట. కానీ తొలి భాగంలో అవకాశం దక్కలేదు. ఐతే ఆ తర్వాత సిద్థార్థ్ మళ్లీ ప్రయత్నం చేయగా.. రెండో భాగంలో ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. బాహుబలి కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నాడు సిద్ధార్థ్. తనది చిన్న పాత్రే అయినా.. ప్రాధాన్యం ఉన్నదే అని.. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనడం గొప్ప అనుభవమని సిద్ధార్థ్ చెప్పాడు. ప్రభాస్ తనను డార్లింగ్ డార్లింగ్ అంటూ ప్రేమగా పిలిచేవాడని అతను ఎగ్జైట్ అయ్యాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ‘రోగ్’ సినిమాలోనూ సిద్ధార్థ్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమా.. బాహుబలి-2 విడుదలయ్యాక తనకు అవకాశాలు వరుస కడతాయని సిద్ధార్థ్ నాయుడు ఆశిస్తున్నాడు.

దిల్ రాజు సినిమా గుండెలు పిండేస్తుందట

07/11/2016: కొత్త వాళ్లకు అవకాశాలిచ్చి ప్రోత్సహించడంలో దిల్ రాజు ఎప్పుడూ ముందుంటాడు. తన బేనర్లో చాలామంది కొత్త దర్శకుల్ని.. టెక్నీషియన్లను.. నటీనటుల్ని పరిచయం చేశాడు రాజు. అంతే కాక ఇండస్ట్రీలో ఎవరైనా మంచి సినిమా తీసి.. రిలీజ్ విషయంలో ఇబ్బందులు పడుతుంటే.. దిల్ రాజుకు చూపించి ఆయన సపోర్ట్ తీసుకుంటూ ఉంటారు. అలా గత కొన్నేళ్లలో కొన్ని చిన్న సినిమాలకు దిల్ రాజు మంచి తోడ్పాటు అందించాడు. ఈ కోవలోనే ఆయన యాకూబ్ అలీ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఓ చిన్న చిత్రాన్ని టేకప్ చేశాడు. దీనికి ‘వెళ్లిపోమాకే’ అని పేరు మార్చి.. తన బేనర్ ద్వారా రిలీజ్ చేస్తున్నాడు. ఈ మధ్య ‘పెళ్లి చూపులు’ అనే చిన్న సినిమాను ప్రమోట్ చేసినట్లుగా ‘వెళ్లిపోమాకే’ను కూడా ప్రమోట్ చేయడానికి దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ‘పెళ్లిచూపులు’ సినిమాను ఇండస్ట్రీలోని చాలామంది ప్రముఖులకు.. మీడియా వాళ్లకు వరుసగా ప్రివ్యూలు వేశారు. రెండు వారాల పాటు ఈ కార్యక్రమం నడిచింది. దీని వల్ల ముందే ఈ సినిమా చాలా బాగుందన్న టాక్ బయటికి వచ్చింది. ప్రి రిలీజ్ పాజిటివ్ రివ్యూలు సినిమాకు బాగా కలిసొచ్చాయి. ‘వెళ్లిపోమాకే’ విషయంలోనూ అలాగే చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ జనాలకు ప్రివ్యూలు వేస్తున్నారు. వాళ్లు సినిమా గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. ‘7/జి బృందావన కాలనీ తరహాలో ‘వెళ్లిపోమాకే’ కూడా గుండెలు పిండేసే లవ్ స్టోరీ అని.. ఎంతో ఇంటెన్సిటీ ఉన్న ఈ సినిమా ప్రేక్షకులపై బలమైన ముద్ర వేస్తుందని టాక్ వస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ సినిమా గురించి చర్చ మొదలైంది. మున్ముందు ఈ పాజిటివ్ టాక్ మరింత పెరిగే అవకాశాలున్నాయి. సినిమాను బాగా ప్రమోట్ చేసి.. ఆ తర్వాత రిలీజ్ చేయాలని దిల్ రాజు భావిస్తున్నాడు.

పవన్‌తో ఎవరా ఇద్దరు?

07/11/2016: నాలుగు నెలల వ్యవధిలో మూడో సినిమా మొదలుపెట్టేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. త్రివిక్రమ్ దర్శకత్వం వహించే ఈ సినిమా వచ్చే నెలలోనే సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఈ లోపు నటీనటుల ఎంపిక మీద దృష్టిపెట్టనున్నారు. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన రెండు సినిమాల్లో లాగే ఇందులో కూడా ఇద్దరు హీరోయిన్లు నటిస్తారట. ఆ హీరోయిన్లెవరన్నది ఇంకా తేలలేదు. ఐతే ఈ సినిమాకు హీరోయిన్ల ఎంపిక అంత సులువుగా తెగే వ్యవహారంలాగా లేదు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో హీరోయిన్ల కొరత బాగా ఉంది. ముఖ్యంగా స్టార్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం చాలా కష్టమైపోతోంది. ఉన్న స్టార్ హీరోయిన్లు తక్కువమంది. కొత్తవాళ్లను తీసుకుందామంటే స్టార్ హీరోల స్టేచర్‌కు సరిపోతారా లేదా అన్న డౌటు. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లలో సమంత.. ఇప్పటికే త్రివిక్రమ్ గత మూడు సినిమాల్లోనూ కథానాయికగా నటించింది. మళ్లీ ఆమెతో అంటే మొనాటనీ వచ్చేస్తుంది. ఈ సినిమాకు ఆమె ఒక కథానాయికగా నటిస్తోందని ప్రచారం జరిగింది కానీ.. సమంతే స్వయంగా అది అబద్ధమని తేల్చేసింది. ఇక కాజల్.. ఆల్రెడీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో నటించింది. వెంటనే ఆమెతో పవన్ సినిమా చేయడేమో. తమన్నా ఈ మధ్య ఎక్కువగా తమిళ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ‘కెమెరా మన్ గంగతో రాంబాబు’లో పవన్-తమన్నా జోడీ అంతగా కుదిరినట్లు కనిపించలేదు. ఇక శ్రుతి హాసన్‌ను చూద్దామంటే ఆల్రెడీ ‘కాటమరాయుడు’లో చేస్తోంది. ఇక స్టార్ స్టేటస్ ఉన్నవాళ్లలో మిగిలిన ఛాయిస్ రకుల్ ప్రీత్ సింగే. ఆమె తీరిక లేకుండా సినిమాలు చేస్తోంది. డేట్లు కేటాయించడం కష్టమే. నయనతార.. నీశన్ దర్శకత్వంలో పవన్ చేయబోయే సినిమాలో కథానాయిక అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో త్రివిక్రమ్ పవన్ కోసం ఒకరికి ఇద్దరు హీరోయిన్లను ఎక్కడి నుంచి పట్టుకొస్తాడో చూడాలి.

చితక్కొట్టడం ఇష్టమంటున్న బ్యూటీ

05/11/2016: గ్లామర్‌ తో పాటూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు అలవోకగా పోషించేస్తూ బాలీవుడ్‌ లో దూసుకుపోతోంది ఆలియా భట్‌. యువ నటీమణుల్లో ఈమెకు ఉన్నంత క్రేజ్‌ మరొకరికి లేదనడంలో సందేహం లేదు. ఇప్పటికే మసాలా సినిమాల్లో చేయాలనుంది అంటూ పక్కా కమర్షియల్‌ మూవీలపై మనసులో మాట బయటపెట్టిన ఈ 'హైవే' స్టార్‌ తాజాగా యాక్షన్‌ సినిమాలపై మనసుపారేసుకుందట. ఈ విషయాన్ని అమ్మడు స్వయంగా వెల్లడించింది. తనకు తెరపై యాక్షన్‌ సన్నివేశాల్లో నటించడమంటే చాలా ఇష్టమని.. తెరపై ఎవరినైనా చితక్కొడుతుంటే చూసుకోవాలని ఉందంటోంది ఆలియా.'డియర్‌ జిందగీ', 'బద్రీనాథ్‌ కీ దుల్హానియా' చిత్రాలతో బిజీగా ఉన్న ఆలియాభట్‌.. త్వరలోనే 'డ్రాగన్‌' అనే యాక్షన్‌ చిత్రంలో నటించనుంది. ఈ చిత్రం గురించే పలు విషయాలు చెప్పిన ఆలియా తెరపై తనకు పోరాటాలు చేయడమంటే మహా ఇష్టమని చెప్పుకొచ్చింది. 'డ్రాగన్‌'లో తనపై యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయో లేదో కచ్చితంగా చెప్పలేనన్న ఈ చిన్నది తన పాత్ర ఎలా ఉంటుందో కూడా తనకింకా తెలియదని వ్యాఖ్యానించింది. బాలీవుడ్‌లో మహిళలు యాక్షన్‌ చేసే సినిమాలు తక్కువగా వస్తాయి. కాబట్టి నేను పూర్తిస్థాయి యాక్షన్‌ సినిమా చేయాలంటే నాకోసం ఎవరైనా ప్రత్యేకంగా కథ రాయాల్సిందే అని అంటోంది ఆలియా. యాక్షన్‌ సీన్స్‌ ను తన బాడీ లాంగ్వేజ్‌ మ్యాచ్‌ కాకపోయినా తెరవిూద ఒకర్ని చితక్కొడుతుంటే ఎలా ఉంటుందో చూసుకోవాలని ఉందని తెలిపింది ఆలియాభట్‌.

అంత బరువుతో ఆడిపాడిందట!

05/11/2016: బాలీవుడ్‌ లీడింగ్‌ బ్యూటీల్లో అనుష్కశర్మ ఒకరు. తాను ఎంచుకున్న ప్రతి పాత్ర వైవిధ్యంగా ఉండాలని ఆశిస్తుందామె. 'ఎన్హెచ్‌', 'పీకే', 'సుల్తాన్‌'లతో సత్తా చాటిన అనుష్క 'యే ది ల్‌ హై ముష్కిల్‌'లోనూ అద్భుతంగా నటించింది. భావోద్వేగాల సన్నివేశాల్లో ఆమె నటనను అంతా ప్రశంసిస్తున్నారు. యాక్టింగ్‌ సంగతి పక్కనపెడితే ఈ సినిమాలో పెళ్లి సాంగ్‌ కోసం అమ్మడు వేసుకున్న దుస్తుల బరువే హాట్‌ టాపిక్‌ గా మారింది. ఈ పాటలో అనుష్క ఏకంగా ఇరవై కేజీల బరువున్న దుస్తులు, నగలు ధరించింది. 'చన్నా మేరియే' పాట కోసం ఈ లేడీ సుల్తాన్‌ ధరించిన లెహెంగా బరువు పదిహేడు కేజీలట. డ్రస్‌ కు మ్యాచ్‌ అయ్యే నగలు మూడు కేజీల బరువట. ఈ కాస్ట్యూమ్‌ ను ప్రముఖ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా డిజైన్‌ చేశాడు. లెహెంగా, దుపట్టాలను స్వరోస్కీ, జర్దోసీ, విలువైన రాళ్లు, అద్దాలతో అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఈ పాట చిత్రీకరణ నాలుగు రోజుల పాటూ సాగింది. నృత్యంలో భాగంగా రెండు అంతస్థులు కలిపి ముప్ఫై నలభై మెట్లు ఎక్కి దిగిందట. రీటేక్‌ లు తీసుకుంటున్నప్పుడైతే ఆమెను చూసి దర్శకుడు కరణ్‌ జోహార్‌ కూడా జాలిపడిపోయాడట. ఇంత బరువున్న దుస్తులూ, నగలు ధరించి నృత్యం చేయడం కష్టమే అయినా అనుష్క పాటలో ఎంతో ఉత్సాహంగా కనిపించింది.

తప్పుకున్నాడా.. లేక తప్పించారా

05/11/2016: ఒకప్పటి క్లాసిక్స్ ను ఇప్పటి ట్రెండుకు అనుగుణంగా రీమేక్ చేసే ప్రయత్నాలు అరుదుగా జరుగుతుంటాయి టాలీవుడ్లో. ఆ కోవలోనే ‘భక్త కన్నప్ప’ను రీమేక్ చేయాలన్న ఆలోచన ఒకరికి ఇద్దరు చేస్తున్నారు. అందులో ఒకరు ఒకప్పటి కన్నప్ప కృష్ణం రాజు అయితే.. ఇంకొకరు తనికెళ్ల భరణి. కృష్ణంరాజు ఎప్పట్నుంచో ప్రభాస్ హీరోగా ‘భక్త కన్నప్ప’ను రీమేక్ చేయాలని.. ఆ సినిమాకు తనే దర్శకత్వం కూడా చేయాలని అంటూ వస్తున్నారు కానీ.. అది కార్యరూపం దాల్చలేదు. ఐతే ఇంతలో తనికెళ్ల భరణి.. మంచు విష్ణు హీరోగా తాను ‘భక్త కన్నప్ప’ తీయబోతున్నట్లు అప్పట్లో ప్రకటించాడు. విష్ణు కూడా ఈ సంగతి ధ్రువీకరించాడు. ఐతే మధ్యలో ఏమైందో ఏమో కానీ.. తాను ‘భక్త కన్నప్ప’ సినిమాకు దర్శకత్వం వహించట్లేదని తేల్చేశారు భరణి. అలాగని ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు మాత్రం చెప్పలేదు భరణి. ఈ సినిమాకు కథ మాత్రం తాను అందిస్తున్నానని.. అక్కడి వరకు తాను పరిమితమవుతున్నానని భరణి తెలిపాడు. మరి భరణి దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడా.. లేక తప్పించారా అన్నది తేలాల్సి ఉంది. ఈ రోజుల్లో ‘భక్త కన్నప్ప’ మీద సినిమా తీస్తే వర్కవుటవుతుందా అన్న సందేహాలు కలుగుతుంటే.. ఈ సినిమా కోసం రెండు వర్గాలు పోటీ పడటం ఆశ్చర్యం కలిగించింది. కానీ ఇప్పుడు ఆ రెండు వర్గాలు ఆ సినిమా దిశగా ముందడుగు వేస్తున్నట్లుగా అనిపించట్లేదు.

పూరి జగన్నాథ్ షాకిచ్చాడు

05/11/2016: పూరి జగన్నాథ్ తర్వాతి సినిమా ఏదనే విషయంలో కొన్ని రోజులుగా సస్పెన్స్ నడుస్తోంది. పూరి తర్వాతి సినిమాలో హీరో అంటూ ముందు జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబుల పేర్లు వినిపించాయి కానీ.. ‘ఇజం’ రిజల్ట్ చూశాక వాళ్లతో పూరి సినిమా చేసే అవకాశాలే లేవని తేలిపోయింది. ఇలాంటి టైంలో పూరి ఎవరితో సినిమా చేస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎప్పట్లాగే బ్యాంకాక్‌కు వెళ్లి తన తర్వాతి సినిమాకు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని వచ్చిన పూరి.. తన తర్వాతి సినిమా ఎవరితో అన్నది సన్నిహితుల దగ్గర వెల్లడించాడు. తాజా సమాచారం ప్రకారం పూరి తన తర్వాతి సినిమాను ‘రోగ్’ హీరో ఇషాంత్‌తోనే చేయబోతున్నాడట. ‘రోగ్’ ఇంకా విడుదలే కాలేదు కానీ.. అతడితోనే రెండో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాడట పూరి. నాగశౌర్యతో పాటు కొందరు యువ కథానాయకుల్ని పెట్టి చిన్న స్థాయి మల్టీస్టారర్ చేయాలన్న ఆలోచనను కూడా ప్రస్తుతానికి పక్కనబెట్టేసిన పూరి.. తన సొంత నిర్మాణ సంస్థలో ఇషాంత్ హీరోగా సినిమా చేయడానికే డిసైడయ్యాడట. ‘రోగ్’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబరులో విడుదలకు సిద్ధం చేసి.. ఆ తర్వాత ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్తాడట. ‘అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి’ తరహాలో కుటుంబ అంశాలున్న ప్రేమకథ ఇదని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయట.

ప్రేమమ్‌ భామ పెళ్లే చేసుకోదట

04/11/2016: పెళ్లి చేసుకోను అనే హీరోయిన్ల లిస్ట్ లో మరొకరు చేరారు. ఓవైపు పెళ్లి చేసుకున్న వారు విడిపోతూ కలకలం సృష్టిస్తుంటే మరో పక్క అసలు పెళ్లే వద్దు అని సంచలన కలిగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందనిపిస్తోంది. ఇంతకు ముందు నటి శ్రుతిహాసన్ పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కంటాను అని ప్రకటించి అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. ఇప్పుడు అప్ కమింగ్ యాక్ట్రెస్ సాయిపల్లవి తాను పెళ్లే చేసుకోనని చెబుతోంది. మలయాళం చిత్రం ప్రేమమ్‌తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన ఈ కేరళా కుట్టి అంతకు ముందు కంగనారనౌత్ నటించిన హిందీ చిత్రం ధామ్ ధూమ్‌లో చిన్న పాత్రలో మెరిసింది. మెడిసిన్ చదివిన సాయిపల్లవి మంచి డాన్సర్ కూడా. కొన్ని ఛానెళ్ల డాన్స్ పోటీల్లోనూ పాల్గొన్న సాయి పల్లవి.. ప్రేమమ్ మూవీతో సౌతిండియా యూత్ హార్ట్ థ్రోబ్ గా మారిపోయింది. గతంలో మణిరత్నం దర్శకత్వంలో నటించే లక్కీచాన్‌‌స వచ్చినట్లే వచ్చి మిస్ అయింది. ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్‌కు జంటగా ఫిదా అనే చిత్రంలో నటిస్తున్నారు.

లేటు వయసులో గాట్టిగా కొట్టింది

04/11/2016: త్రిషకి ఇంకా సినిమాలేంటి, శుభ్రంగా పెళ్లి చేసుకుని రిటైర్‌ అయిపోక అని అనుకున్న వాళ్ల నోళ్లని మూయించేసింది 'కోడి'తో. త్రిష కథానాయికగా రూపొందిన ధనుష్‌ చిత్రం 'కోడి' కోలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద హల్‌చల్‌ చేస్తోంది. ఇందులో త్రిష చేసిన నెగెటివ్‌ క్యారెక్టర్‌ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. నటిగా తన సత్తా ఏంటనేది త్రిష ఈ చిత్రంతో నిరూపించింది. ముదురుగా అయిపోయిందంటూ అన్నవాళ్లతోనే తనకి ఇంకా నాలుగేళ్లయినా నటించే మేటర్‌ వుందని అనిపిస్తోంది. ఇదే సినిమా తెలుగులోకి 'ధర్మయోగి' పేరుతో అనువాదమైంది కానీ సరైన పబ్లిసిటీ లేని కారణంగా మనవాళ్లు పట్టించుకోవడం లేదు. తమిళంలో కార్తీ కాష్మోరా కంటే దీనికే ఎక్కువ వసూళ్లు వస్తున్నాయి. త్రిషకి చాలా కాలం తర్వాత ఒక హిట్‌తో పాటు, పేరు కూడా రావడంతో ఇకపై అవకాశాలు పెరిగినా ఆశ్చర్యం లేదు. తన ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లి వెనక్కి వచ్చిన తర్వాత త్రిష కెరియర్‌ కాస్త నెమ్మదించింది. దానికి తోడు పరాజయాలు కూడా ఆమెని వేధించాయి. అయితే అదృష్టం 'కోడి' రూపంలో దొరకడంతో త్రిష ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి.

న‌వంబ‌ర్ 9న మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ `ధృవ` పాట‌లు విడుద‌ల‌

03/11/2016: మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో, స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రెస్టిజియ‌స్ మూవీ `ధృవ` ఈ స్టైలిష్ క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌, మ‌రో నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని హై బ‌డ్జెట్‌, టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. ఇప్పుడు హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్ షూటింగ్ హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతుంది. సినిమా చిత్రీక‌ర‌ణ‌తో పాటు స‌మాంత‌రంగా సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రంలో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌న‌పించ‌నున్నారు. సినిమా ఫ‌స్ట్ లుక్ నుండి ఆడియెన్స్‌లో క్రేజ్ నెల‌కొంది. ఈ సినిమాకు హిప్ హాప్ ఆది సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పాట‌ల‌ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా న‌వంబ‌ర్ 9న నేరుగా మార్కెట్లోకి విడుద‌ల చేస్తున్నారు. అలాగే సినిమా విడుద‌ల‌కు ముందు అభిమానులు, ప్రేక్ష‌కుల న‌డుమ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను నిర్వ‌హించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ మొదటి వారం లో సినిమా విడుదల అవుతుంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ మొదటి వారం లో సినిమా విడుదల అవుతుంది. రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు న‌టించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌- పి.య‌స్‌.వినోద్‌, మ్యూజిక్ - హిప్ హాప్ ఆది, ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, ఆర్ట్ - నాగేంద్ర, ఎడిటర్ - నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.వై. ప్రవీణ్ కుమార్, ప్రొడ్యూసర్స్ - అల్లు అరవింద్, ఎన్‌.వి.ప్ర‌సాద్‌, దర్శకుడు - సురేందర్ రెడ్డి.

'రామకృష్ణ' లెకపోతే మెగా 'స్టార్'

03/11/2016: మెగా.. నందమూరి ఫ్యామిలీల హీరోలు కలిసి ఓ సినిమా చేయడం అన్నది ఊహకందని విషయం. ఐతే ఎ.ఎస్.రవికుమార్ చౌదరి ఈ కాంబినేషన్లో సినిమా తీయడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. నందమూరి కళ్యాణ్ రామ్, సాయిధరమ్ తేజ్‌లతో మల్టీస్టారర్ కోసం ఓ స్క్రిప్టు తయారు చేస్తున్నాడు రవికుమార్. ఐతే మొన్నటిదాకా ఈ ప్రాజెక్టు పక్కా అనే అనుకున్నారు కానీ.. 'ఇజం' ప్రమోషన్ల సందర్భంగా ఈ సినిమా ఇంకా కన్ఫమ్ కాలేదని కళ్యాణ్ రామ్ చెప్పడంలో సందేహాలు రేగాయి. ఐతే ఈ సినిమా ఉంటుందో లేదో కానీ.. దీనికి టైటిల్ ఫిక్స్ చేసి.. ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించడం కూడా జరిగిపోయింది. తాజాగా ఫిలిం ఛాంబర్లో రిజిస్టరైన టైటిళ్లలో 'రామకృష్ణ' అనే టైటిల్ కూడా ఉంది. కళ్యాణ్ రామ్-సాయిధరమ్‌ల సినిమాను ప్రొడ్యూస్ చేస్తుందని భావిస్తున్న క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థే ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేయించడం విశేషం. ఐతే ఇదే బేనర్ 'స్టార్' అనే మరో టైటిల్ కూడా రిజిస్టర్ చేయించడం విశేషం. ఒకవేళ మల్టీస్టారర్ సినిమా పట్టాలెక్కని పక్షంలో సాయిధరమ్‌-రవికుమార్ చౌదరి కాంబినేషన్లో ఈ 'స్టార్' సినిమా తెరకెక్కవచ్చేమో అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సాయిధరమ్.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'విన్నర్' చేస్తుండగా.. కళ్యాణ్ రామ్ తన తర్వాతి సినిమాను కన్ఫమ్ చేయకుండా ఖాళీగా ఉన్నాడు. మరి నందమూరి-మెగా కాంబినేషన్ సెట్టవుతుందో లేదో చూడాలి.

రూ.100 కోట్లు క్లబ్‌ లో కరణ్‌ పిక్చర్‌

నవంబర్‌ 02,2016 (సలాం తెలంగాణ): విడుదలకు ముందే వివాదాస్పదంగా మారిన 'యే దిల్‌ హై ముష్కిల్‌' చిత్రం హిట్‌గా నిలిచింది. దీపావళి కానుకగా గత శుక్రవారమే విడదలైన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్లక్లబ్‌లో చేరిపోయింది. ఇండియాలో ఈ చిత్రం రూ.76 కోట్లకు పైగా వసూలు చేయగా విదేశాల్లో 6.55 మిలియన్‌ డాలర్లు కైవసం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.121.21 కోట్ల బిజినెస్‌ చేసి 2016లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఆరో చిత్రంగా నిలిచినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ పేర్కొంది. చాలాకాలంగా మంచి హిట్‌ కోసం వేచి చూస్తున్న రణ్‌బీర్‌ కపూర్‌కు ఈ చిత్ర విజయం మంచి బూస్ట్‌ నిచ్చింది. రణ్‌బీర్‌తో పాటూ ఐశ్వర్యకూ ఈ సక్సెస్‌ కీలకమే. ఇక సినిమా విషయానికొస్తే లీడ్‌ రోల్స్‌ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటి తరానికి తగ్గట్టుగా తీర్చిదిద్దిన కథాంశం కావడంతో ఆడియన్స్‌ 'యే దిల్‌ హై ముష్కిల్‌'ను బాగా రిసీవ్‌ చేసుకున్నారు.

ఔను...వాళ్లిద్దరికి ఎంగేజ్‌ మెంట్‌ ఫిక్సయింది..

హైద్రాబాద్‌, నవంబర్‌ 2, (సలాం తెలంగాణ): అక్కినేని ఫ్యాన్స్‌ కి నిజంగా ఇది శుభవార్తనే. కొన్నాళ్ళుగా అక్కినేని ఫ్యామిలీలో జరగనున్న శుభకార్యం కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు అఖిల్‌ ఎంగేజ్‌ మెంట్‌ డేట్‌ ఫిక్స్‌ అయిందనేది 100% గుడ్‌ న్యూస్‌ అనే చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా చైతూ-సమంత ప్రేమాయణంతో పాటు అఖిల్‌- శ్రేయ భూపాల్‌ ప్రేమ వివాహంకు సంబంధించి అనేక వార్తలు వచ్చాయి. దీనిపై పూర్తి క్లారిటీ లేక అభిమానులు తర్జన భర్జన పడ్డారు. ఇక అఫీషియల్‌ గా అఖిల్‌ ఎంగేజ్‌ మెంట్‌ డేట్‌ ఫిక్స్‌ చేసి ఇన్విటేషన్‌ కార్డ్‌ ని రిలీజ్‌ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. త్వరలో వీరి ఇంట్లో పెళ్లి బాజాలు కూడా మ్రోగనున్నాయి. ఇక పెళ్ళి విషయానికి వస్తే అఖిల్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ పై ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపుతున్నట్టు సమాచారం. వారి ఇంట జరగనున్న తొలి పెళ్లికి మాత్రం వేదిక కావడం లేదు. ఎందుకంటే? అఖిల్‌ అక్కినేని తన పెళ్లిని డెస్టినేషన్‌ వెడ్డింగ్‌గా చేసుకోవాలని భావించాడట. ఇదే నిర్ణయాన్ని తన తండ్రి నాగార్జునకు చెప్పిన అతగాడు? తన పెళ్లి వేడుకను ఎన్‌ కన్వెన్షన్‌ నుంచి వేరే చోటికి మార్చేశాడు. ఆ వేదిక ఎక్కడుందో తెలుసా?.. ఇటలీ రాజధాని రోమ్‌లో ఆ వేడక జరగనుందట. ఫ్యాషన్‌ డిజైనర్‌ శ్రియా భూపాల్‌తో ప్రేమలో పడ్డ అఖిల్‌? ఆ విషయాన్ని తన తండ్రి చెవిన వేయడంతో పాటు తన కుటుంబం నుంచి అంగీకారం సాధించాడు. అదే సమయంలో శ్రియా కూడా తన కుటుంబం నుంచి అనుమతి సంపాదించింది. ఇక అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య కూడా తాను ప్రేమించిన ప్రముఖ హీరోయిన్‌ సమంతతో పెళ్లికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇద్దరు కుమారుల పెళ్లిళ్లకు ఓకే చెప్పేసిన నాగార్జున తన చిన్న కుమారుడు అఖిల్‌ పెళ్లిని తొలుత నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. కుమారుడి కోరిక మేరకు అఖిల్‌ పెళ్లిని రోమ్‌ నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆయన కార్యరంగం సిద్ధం చేశారు. ఈ పెళ్లికి ఇప్పటికే ఏర్పాట్లు మొదలైనట్లు సమాచారం. ఈ పెళ్లికి వివిధ దేశాలకు చెందిన సుమారు 600 మంది అతిథులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

కొత్త హీరోలతో...లో బడ్జెట్‌ లో పూరీ

హైద్రాబాద్‌, నవంబర్‌ 2, (సలాం తెలంగాణ): టాలీవుడ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌. 'ఇజం'తో మంచి సక్సెస్‌ను కొట్టిన పూరి మరో సారి తన టాలెంట్‌ ను నిరూపించుకునేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సారి స్టార హీరోలతో కాకుండా కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడు. వాళ్లతో కలిసి ఓ రొమాన్టిక్‌ మూవీని తెరకెక్కించాలనుకుంటున్నాడు ఈ డైరెక్టర్‌. ప్రస్తుతం అందుకు సంబందించిన కథ రాసే పనిలో ఉన్నాడట పూరి. వీలైనంత త్వరగా దీన్ని కంప్లీట్‌ చేసి? సినిమాను సెట్స్‌ విూదకు వెళ్లునున్నాడట. అంతేకాదు ఈ సినిమా తక్కువ బడ్జెట్‌ లో ఉండబోతున్నట్లు కూడా సమాచారం.

హారర్ లుక్ తోనూ అదరగొడుతున్న భామ

02/11/2016: క్వాంటికో టీవీ సిరీస్ తో యూఎస్ లో మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న ప్రియాంక చోప్రా ఇప్పుడు 'బేవాచ్" మూవీ కోసం విలన్ గా మారిపోయింది. తొలి సినిమాలోనే ప్రతినాయకి పాత్ర పోషించడం అంత ఈజీ కాదు. కానీ, మన 'బర్ఫీ" విషయంలో ఇదంతా చాలా సులువుగా జరిగిపోయింది. పండగకి కూడా ఇంటికి వచ్చే తీరిక లేకపోవడంతో న్యూయార్క్ లోనే దీపావళిని సెలబ్రేట్ చేసుకుంది పీసీ. ఇంత బిజీగా ఉన్న ఈ సొగసరి తన 'బేవాచ్" సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర పోజ్ ను ట్వీట్టర్ ద్వారా షేర్ చేసుకుంది. బ్లాక్ స్లిట్ డ్రస్.. గన్..లతో గబ్బిలాన్ని పోలినట్టున్న ఈ భామ పిక్చర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎర్రటి పెదాల చివరి నుంచి రక్తం కారుతున్న ఈ ఫొటో సినిమాలో పీసీ ఎంతటి క్రూరత్వం ప్రదర్శిస్తుందో చెప్పకనే చెప్పేస్తోంది. ఈ అందాల హారర్ చిత్రాన్ని హాలోవీన్ సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రియాంక ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. 'బేవాచ్" మూవీ టైటిల్ కింద ''ముందడుగేయండి, చెడ్డవాళ్లుగానే ఉండండి"" అనే ట్యాగ్ లైన్ పీసీ పిక్చర్ కు అతికినట్టు సరిపోయింది. హాలీవుడ్ తొలి మూవీలోనే విలన్ రోల్ పట్టేసిన పీసీ 'ఐత్రాజ్" అనే హిందీ సినిమాలోనూ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించి మెప్పించింది. హాలీవుడ్ లోనూ అదే హిస్టరీ రిపీట్ చేసేందుకు అమ్మడు ఉత్సాహపడిపోతోంది. క్వాంటికో సిరీస్ తో ఎలాగూ అందర్నీ ఆకట్టుకుంది. తాజాగా 'బేవాచ్'తోనూ మన 'డాన్" గాళ్ హాలీవుడ్ నూ షేక్ చేస్తుందని ఆమె ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

రజినీ ట్రిపుల్ ధమాకా

02/11/2016: ‘కబాలి’గా నిరాశ పరిచాడు సూపర్ స్టార్ రజినీకాంత్. అయినప్పటికీ ఆయన తర్వాతి సినిమా మీద అంచనాలేమీ తక్కువగా లేవు. ఎందుకంటే ఈసారి రజినీ సినిమా చేస్తోంది శంకర్‌తో. పైగా ‘రోబో’కు సీక్వెల్. అందులోనూ ఇండియన్ సినిమా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రూ.350 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు శంకర్. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న విశేషం బయటికి వచ్చినా జనాలు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. తాజా సమచారం ప్రకారం ఈ సినిమాలో రజినీ మూడు రకాల అవతారాల్లో కనిపిస్తాడట. రోబో తొలి భాగంలోనూ రజినీ మూడు అవతారాల్లో దర్శనమిస్తాడు. సైంటిస్టు వశీకరన్.. మంచి రోబో.. చెడ్డ రోబో. ఐతే ‘2.0’లో మూడు వేర్వేరు క్యారెక్టర్లు చేస్తున్నాడట రజినీ. వశీ.. చిట్టిలతో పాటు ఒక కొత్త రోబో కనిపిస్తుందట ఈ చిత్రంలో. ఆ రోబోను చిట్టికి డూప్‌గా విలన్ అయిన అక్షయ్ కుమార్ తయారు చేస్తాడట. ఈ రోబో విన్యాసాలు కళ్లు చెదిరేలా ఉంటాయని.. ఈ క్యారెక్టర్ సినిమాకు హైలైట్ అవుతుందని అంటున్నారు. ఇప్పటికి ‘2.0’ షూటింగ్ 70 శాతానికి పైగా పూర్తయింది. నవంబరు 20న దీని ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ ఏడాది ఆఖరుకు టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుందని భావిస్తున్నారు. ఐతే గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పనులు భారీగా చేయాల్సి ఉండటంతో వచ్చే ఏడాది ద్వితీయార్దంలోనే సినిమా రిలీజవుతుంది.

అల్ల‌రోడితో అమ‌లాపాల్‌

01/11/2016: తెలుగులో అమ‌లాపాల్ మెరిసింది త‌క్కువే. రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, నాగ‌చైత‌న్య లాంటి హీరోల‌తో జ‌ట్టు క‌ట్టినా అమ‌లాపాల్‌కి పెద్దగా క‌లిసొచ్చింది లేదు. త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో మాత్రం అమ‌లాపాల్‌కి ఇప్ప‌టికీ డిమాండ్ ఉంది. ద‌ర్శ‌కుడు విజ‌య్‌తో పెళ్లి పెటాకుల‌య్యాక సినిమాల‌పై మ‌రింత శ్ర‌ద్ద పెట్టింది అమ‌లాపాల్‌. ఇప్పుడు టాలీవుడ్‌పైనా ఫోక‌స్‌పెంచింది. తాజాగా అమ‌లాపాల్ కి ఇటునుంచి కూడా అవ‌కాశాలు వెళ్తున్న‌ట్టు టాక్‌. న‌రేష్ క‌థానాయ‌కుడిగా అనీష్ కృష్ణ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. అలా ఎలాతో ద‌ర్శ‌కుడిగా త‌న‌ని తాను నిరూపించుకొన్నాడు అనీష్‌. ఇప్పుడు ఓ మ‌ల‌యాళీ చిత్రాన్ని న‌రేష్ కోసం రీమేక్ చేస్తున్నాడు. స్క్రిప్టు వ‌ర్క్ పూర్త‌య్యింది. డిసెంబ‌రులో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఇందులో క‌థానాయిక‌గా అమ‌లాపాల్ అయితే బాగుంటుంద‌ని చిత్ర‌బృందం భావించింది. అమ‌ల‌తో సంప్ర‌దింపులు కూడా జ‌రుపుతోంది. ఒకట్రెండు రోజుల్లో స్ప‌ష్ట‌మైన స‌మాచారం వెల్ల‌డ‌య్యే అవ‌కాశం ఉంది. న‌రేష్ ప‌రిస్థితేం బాలేదు. వ‌రుస‌గా ఫ్లాపులు చుట్టుముడుతున్నాయి. న‌రేష్ సినిమా అంటే క‌థానాయిక‌లు కూడా భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది. అందుకే టాలీవుడ్ అంతా వెదికీ వెదికీ.. చివ‌రికి అమ‌లాపాల్ ద‌గ్గ‌ర‌కు వెళ్లింది చిత్ర‌బృందం. న‌రేష్ న‌టిస్తున్న ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది.

కీర్తీ పాపకు కూడా గుడి కట్టేస్తున్నారంటగా

01/11/2016: భారత్‌లో అధికారికంగా ఎన్ని మతాలున్నా.. అనధికారికంగా ఉన్న మతాలు మూడు. అవి.. సినిమాలు, రాజకీయాలు, క్రికెట్‌. తమకు నచ్చిన సినిమా హీరోనైనా, రాజకీయ నాయకుడినైనా, క్రికెటర్‌నైనా ఆకాశానికి ఎత్తేస్తారు.. తేడా వస్తే పాతాళానికి తొక్కేస్తారు. ముఖ్యంగా సినిమా హీరోల విషయంలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. హీరోయిన్లకు కెరీర్ టైమ్ తక్కువైనా.. ఫ్యాన్స్ గుండెల్లో మాత్రం గుడి కట్టుకునేలా ముద్రేసే ఛాన్స్ వాళ్లకుంటుంది. గతంలో ఇండియాలో.. ముఖ్యంగా సౌతిండియాలో హీరోయిన్లను నెత్తిన పెట్టుకుని చూసుకున్న ఫ్యాన్స్ కు కొదువేలేదు. కానీ ఈరోజుల్లో సినిమా పిచ్చి అంత పీక్స్ లో లేదని భావించేవాళ్లు.. ఈ న్యూస్ వింటే అవాక్కవాల్సిందే. మన పొరుగు రాష్ట్రం తమిళనాడులో అయితే ఈ అభిమానం హద్దులు దాటుతుంటుంది. వారు సినిమా తారలను దేవతలుగా భావిస్తారు. అందుకే సినిమా హీరోయిన్లకు గుళ్లు కూడా కట్టిస్తూ ఉంటారు. గతంలో ఖష్బూను పిచ్చిగా అభిమానించిన తమిళులు ఆమెకు ఓ గుడ్డి కట్టేసి తమ భక్తిని చాటుకున్నారు. ఆ తర్వాత బొద్దు గుమ్మలు నమిత, హన్సికలకు కూడా గుళ్లు కట్టారు. తాజాగా ఆ జాబితాలోకి యువ హీరోయిన్‌ నేను శైలజ ఫేమ్‌ కీర్తీ సురేష్‌ చేరింది. థొడరి మూవీతో ఇటీవలె తమిళ తెరకు పరిచయమైన ఈ బ్యూటీ అనతి కాలంలోనే నాలుగు సినిమాలు చేసేసింది. అక్కడి అగ్రహీరోలతో కూడా జోడీ కడుతున్న ఈ ముద్దుగుమ్మ తమిళ తంబీలకు తెగ నచ్చేసింది. ఇంకేముంది ఖుష్బూ, నమిత, హన్సికలతో సమానంగా కీర్తికి కూడా గుడి రెడీ అయిపోతోంది.

త్రిష రహస్య వ్యాపారం లీక్‌

01/11/2016: 'ధర్మయోగి' చిత్రంలో చేసిన నెగెటివ్‌ క్యారెక్టర్‌కి త్రిషకి ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఇంకెంతకాలం నటిగా కొనసాగుతుందనేది అనుమానమే. ఎందుకంటే ఇప్పటికే యువ హీరోల సరసన పెద్దదానిలా కనిపిస్తోంది కనుక ఆమెని సైన్‌ అప్‌ చేయడానికి ఎవరూ ఎక్కువ ఆసక్తి చూపించడం లేదు. ఈ దశలో సినిమాల తర్వాత తన కెరియర్‌ ఏంటనే దానిపై త్రిష దృష్టి పెట్టిందట. ఎప్పట్నుంచో స్టార్‌ హోటల్‌ చెయిన్‌ ఒకటి మొదలు పెట్టాలనే ఆలోచన వున్న త్రిష ఆ దిశగా అడుగులు వేస్తోందట. తన తండ్రి ఒక స్టార్‌ హోటల్‌లో పని చేసేవారట. అప్పట్నుంచే తనకి అలాంటి హోటల్‌ ఒకటి కట్టాలని వుండేదట. కానీ నటిగా బిజీగా వుండడంతో ఇంతకాలం ఆ కల సాకారం చేసుకోలేకపోయింది. ఇప్పుడెలాగో కెరియర్‌ చివరి దశకి చేరుకుంది కనుక ఇక దాని మీద దృష్టి పెడితే మేలని భావిస్తోంది. ఇప్పటికే ప్రణాళిక సిద్ధమైందని కొందరు, ఆల్రెడీ హోటల్‌ నిర్మాణం మొదలైందని కొందరు చెప్పుకుంటున్నారు. త్రిష మాత్రం తన రహస్య వ్యాపారం గురించి ఎన్ని లీకులు బయటకి వచ్చినా దాని గురించి తెలియనట్టే వ్యవహరిస్తోంది. ఒకేసారి గ్రాండ్‌గా అనౌన్స్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేద్దామని చూస్తోందో లేక సక్సెస్‌ అయిన తర్వాత ఆ హోటల్‌ తనదేనని చెప్పాలని చూస్తోందో కానీ త్రిష తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ గురించి సైలెంట్‌గానే ఉంటోంది.

ఎక్స్‌పోజింగ్‌ చేయమని ఆమెని ఎవరడుగుతారండీ?

01/11/2016: ప్రేమమ్‌లో శృతిహాసన్‌ క్యారెక్టర్‌ పెద్దగా గుర్తుండి ఉండకపోవచ్చు కానీ మలయాళంలో అదే పాత్ర చేసిన సాయి పల్లవికి మాత్రం మల్లూ జనాలు గుండెల్లోనే గుళ్లు కట్టేసారు. త్వరలో శేఖర్‌ కమ్ముల సినిమాతో ఫిదా చేయడానికి వస్తోన్న సాయి పల్లవి గురించి ఈమధ్య కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇటీవల ఏదో సినిమాలో ఎక్స్‌పోజింగ్‌ చేయమని అడిగితే నో చెప్పిందని, దాంతో ఆమెని తీసేసారని గుసగుసలాడుకున్నారు. ఈ పుకార్లని ఆమె కొట్టి పారేసింది. తనని ఎవరూ అలా కోరలేదని, ఇవి ఎవరో కల్పించిన వదంతులే తప్ప నిజం లేదని ఆమె చెప్పింది. అయినా ప్రేమమ్‌ చూసిన సాయి పల్లవితో ఎక్స్‌పోజింగ్‌ చేయించాలని ఎవరు మాత్రం ప్రయత్నిస్తారు? ఆ సినిమాతో ఆమె పట్ల అందరికీ ఒక గౌరవ భావం ఏర్పడిపోయింది. నిజంగా సాయి పల్లవికే ఇమేజ్‌ మార్చుకుందామనే కోరిక వున్నా కానీ జనం తిప్పి కొట్టేస్తారనడంలో సందేహం లేదు. సినిమాల గురించి, పబ్లిక్‌ ఇమేజ్‌ గురించి ఏమాత్రం అవగాహన ఉన్న వాళ్లయినా ఇలాంటి సాహసానికి ఒడికట్టరు. సౌందర్య, నిత్య మీనన్‌ తరహాలో ఎప్పటికీ క్లీన్‌ ఇమేజ్‌తోనే రిటైర్‌ అయిపోవాల్సిందే తప్ప సాయి పల్లవిని హాట్‌గా చూసే అవకాశం అయితే లేదు. ఆమె కొట్టి పారేయడం కాదు కానీ నిజంగానే ఈ వార్తలు నమ్మశక్యంగా లేవు. ఇంతకీ సాయి పల్లవి నేచురల్‌ గ్లామర్‌కి మన వాళ్లు మలయాళ ప్రేక్షకుల మాదిరిగా ఫిదా అవుతారా లేదా అనేది చూడాలి. అదే జరిగితే ఆమె టాలీవుడ్‌లోను బిజీ అయిపోవడం ఖాయం.

హీరోల డ్యాన్సులపై కోట వాయించేశాడు

01/11/2016: ఏ విషయమైనా.. ముక్కుసూటిగా.. మొహమాటం లేకుండా మాట్లాడటం కోట శ్రీనివాసరావు శైలి. గతంలో ఎన్నో విషయాలపై మాటల తూటాలు పేల్చాడు కోట. తాజాగా ఆయన హీరోల డ్యాన్సులపై తనదైన శైలిలో కామెంట్ చేశారు. అలాగే హీరోలు గడ్డాలు పెంచడంపైనా విమర్శలు గుప్పించాడు. ఈ విషయాలపై ఆయన వాదన ఏంటంటే.. ''నాటిక అంటే ఇలా ఉండాలి.. నటన అంటే అలా ఉండాలి అని ప్రాథమికంగా కొన్ని లక్షణాలుంటాయి. డ్యాన్సులైనా అంతే. కథక్.. కూచిపుడి.. భరతనాట్యం లాంటి నృత్యాలకూ నిబంధనలుంటాయి. కానీ ఇప్పుడు సినిమాల్లో వస్తున్న డ్యాన్సులు చూడండి. హీరోయిన్ ముందు హీరో గెంతుతూ ఉంటాడు. కిందపడి కొట్టుకుంటుంటాడు. అదేమంటే ఫ్లోర్ డ్యాన్సులంటారు. మామూలుగా మన ఇళ్ళల్లో అమ్మాయిల ముందు అబ్బాయిలు గెంతుతారా.. గెంతరు కదా. పద్ధతిగా.. హుందాగా ఉంటారు. కానీ సినిమాల్లో అలా ఎందుకుంటారో? అలాగే ప్రతి పాటకూ బ్యాగ్రౌండ్లో 50 మంది డ్యాన్సర్లుంటారు. ఇంతమంది ఎందుకో అర్థం కాదు. ఒకప్పుడు హీరో జైలు పాలైతే మాసిన గడ్డంతో చూపించేవాళ్లు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ గడ్డంతో కనిపిస్తున్నారు. ముఖమంతా గడ్డముంటే మేకప్ ఎలా వేస్తారు? మళ్లీ ముంబయి నుంచి మేకప్ వాళ్లను పిలిచి రోజు పది వేలిస్తారు. ఒకప్పుడు ఎవరైనా గడ్డం పెంచితే.. ఏంట్రా పిచ్చోడిలా గడ్డం గీయమని పెద్దోళ్లు అనేవాళ్లు. కానీ ఇప్పుడు అలా చెబితే వినేవాళ్లు ఎవరూ లేరు" అని కోట అసహనం వ్యక్తం చేశారు.

ప్రియాంక పెద్ద దొంగ అనేసిన కంగనా

01/11/2016: నటిగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నా తన నోటి దురుసుతో కావాల్సినంత చెడ్డ పేరు కూడా సంపాదించుకుంది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. ఈ మధ్య హృతిక్ రోషన్ను ఉద్దేశించి 'సిల్లీ ఎక్స్'అంటూ ఆమె చేసిన కామెంట్ ఎంత పెద్ద దుమారం రేపిందో తెలిసిందే. హృతిక్ గురించే కాదు. ఇంకా చాలామంది బాలీవుడ్ సెలబ్రెటీల గురించి సెన్సేషనల్ కామెంట్లు చేసింది కంగనా. తాజగా ఆమె దృష్టి ప్రియాంక చోప్రా మీద పడింది. ఈ మధ్య అమెరికన్ టీవీ షో 'క్వాంటికో"తో ప్రియాంక ఇంటర్నేషనల్ లెవెల్లో బాగా పేరు సంపాదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేహా ధూపియా నిర్వహించే టాక్ షోకు వచ్చిన కంగనకు ప్రియాంక మీద ఓ ప్రశ్నఎదురైంది. ఇండియన్ హీరోయిన్ల స్థాయిని ఇంటర్నేషనల్ రేంజికి తీసుకెళ్లిన ప్రియాంకకు నువ్వు ఎలాంటి అవార్డు ఇస్తావు అని కంగనను నేహా ధూపియా అడిగితే.. 'ప్రపంచంలోనే అతి పెద్ద దొంగ" అవార్డు ఇస్తానంటూ కామెంట్ చేసి సంచలనం సృష్టించింది కంగనా. అంతే కాక ప్రియాంకది దొంగ నవ్వు అని కూడా కంగనా వ్యాఖ్యానించింది. మరి కంగనా సరదాకు ఈ వ్యాఖ్యలు చేసిందో.. లేక ఉద్దేశపూర్వకంగానే ఇలా మాట్లాడిందో తెలియదు. దీనిపై ప్రియాంక ఏమని స్పందిస్తుందో చూడాలి. 'ఫ్యాషన్' నిమాలో కలిసి నటించిన ప్రియాంక, కంగనా మంచి స్నేహితుల్లాగే కనిపిస్తారు రెండేళ్ల కిందట కంగనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు రాగా.. ప్రియాంక నటించిన 'మేరీ కోమ్' కూడా ఓ అవార్డు దక్కింది. ఆ సందర్భంగా వీళ్లిద్దరూ కలిసి పార్టీ ఇవ్వడం విశేషం.

ఎన్టీఆర్ ఆఫీస్ - ఇచ్చట అన్నిర‌కాల‌ క‌థ‌లు విన‌బ‌డును

01/11/2016: ఓ స్టార్ హీరోకి క‌థ చెప్ప‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఆయ‌న అస‌లు టైమ్ ఇస్తేనే కదా? స్టార్ హీరోల క‌ళ్లెప్పుడూ పెద్ధ పెద్ధ ద‌ర్శ‌కుల‌పైనే ఉంటాయి. లేదంటే ఓ సీడీ చేతికిచ్చి.. `సేమ్ టూ సేమ్ దించేద్దాం` అంటాడంతే. హీరో ద‌ర్శ‌కుల వెంట ప‌డ‌డం.. క‌థ‌లు చెప్పండి అంటూ ఆఫ‌ర్లు ఇవ్వ‌డం, కొత్త ద‌ర్శ‌కుల‌కూ ఫోన్లు చేసి క‌థ‌లున్నాయా అని అడ‌గ‌డం.. ఈమ‌ధ్య కాలంలో వింతే. ఆ వింత‌ని నిజం చేస్తున్నాడు ఎన్టీఆర్‌. జ‌న‌తా గ్యారేజ్ త‌ర‌వాత ఎన్టీఆర్‌కి కాన్ఫిడెన్స్ తో పాటు కాస్త కన్ఫ్యూషన్ పెరిగింది. అందుకే ఏ క‌థ‌తో వెళ్లాలి? ఏ ద‌ర్శ‌కుడ్ని న‌మ్మాలి అనే విష‌యంలో ఇంకా నిర్ణ‌యం తీసుకోలేక‌పోతున్నాడు. ఈమ‌ధ్య కాలంలో ఎన్టీఆర్ వినిన‌న్ని క‌థ‌లు… త‌న కెరీర్ మొత్తం మీద విన‌లేదేమో?? త‌న‌కు ప‌రిచ‌యం ఉన్న ప్ర‌తీ ద‌ర్శ‌కుడ్నీ పిలిచి `క‌థ‌లుంటే చెప్పు` అంటూ ఆఫ‌ర్ ఇవ్వ‌డం ఆశ్చ‌ర్య ప‌రిచే విష‌య‌మే. పాతిక సినిమాలు చేసిన‌ పూరి జ‌గ‌న్నాథ్ నుంచి.. నిన్న మొన్నోచ్చిన‌ అనిల్‌రావిపూడి వ‌ర‌కూ ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్టీఆర్‌కి ఎనిమిదిమంది ద‌ర్శ‌కులు క‌థ‌లు వినిపించారు. ఫిల్మ్‌న‌గ‌ర్‌లోని ఎన్టీఆర్ ఆఫీస్ ఇప్పుడు ద‌ర్శ‌కుల రాక‌పోక‌ల‌తో కిట‌కిట‌లాడిపోతోంది. ఇంత‌మంది ద‌ర్శ‌కులు వ‌చ్చినా…. ఇంకా ది బెస్ట్ ఆప్ష‌న్స్ ఏమున్నాయా అని చూస్తున్నాడ‌ట‌. ఆనంద‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే… ఎన్టీఆర్ ప్ర‌యారిటీ ఇప్పుడు ద‌ర్శ‌కుడు కాదు.. క‌థ‌! ఎవ‌రు మంచి క‌థ చెబితే… వాళ్ల‌తో ప్రొసీడ్ అవ్వాల‌ని చూస్తున్నాడ‌ట‌. ప్రేమ‌మ్ ద‌ర్శ‌కుడు చందూ మొండేటికీ ఎన్టీఆర్ క‌థ‌చెప్ప‌మంటూ ఫోన్ చేశాడ‌ని టాక్‌. పాత ప‌రిచ‌యాల కొద్దీ సురేంద‌ర్ రెడ్డినీ క‌లిశాడ‌ని చెబుతున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ క‌థ‌లు వినే మూడ్‌లో ఉన్నాడిప్పుడు. చెప్ప‌లేం… ఏ క‌థ ఎన్టీఆర్‌ని డిస్ట్ర‌బ్ చేస్తుందో. అప్ప‌టి వ‌ర‌కూ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఓపిక ప‌ట్టాల్సిందే.

పూరీ పులిహోరకి పడేదెవరు?

28/10/2016: స్టార్ హీరోలతో వరుసపెట్టి సినిమాలు తీసిన పూరి జగన్నాథ్ ఇప్పుడు దొరికిన హీరోతోనే సినిమాలు తీసుకుంటున్నాడు. తను కథ చెప్తే చిరంజీవి, మహేష్ ఇద్దరూ కూడా కాదని, అవునని చెప్పలేదు. పూరి చెప్పిన కథ బాలేదని చిరంజీవి తర్వాత మీడియాతో చెప్తే, అదేదో నాకే చెప్పొచ్చుగా అంటూ అతనికి రోషం పొడుచుకు వచ్చింది. మహేష్కి జనగణమన చెప్తే అతను వినేసి ఏం చెప్పకుండా సైలెంట్ అయిపోయాడట. ఏదీ తేల్చకుండా నా టైమ్ వేస్ట్ చేస్తున్నాడంటూ మహేష్ మీద కూడా గుస్సా అయ్యాడు పూరీ. మరోవైపు ఎన్టీఆర్ కూడా 'ఇజం' రిలీజ్ అయిన దగ్గర్నుంచీ పూరీకి దొరక్కుండా తిరుగుతున్నాడట. అదే పనిగా పులిహోర కథలు తయారు చేసి, తనకి ఇష్టమొచ్చినట్టు సినిమాలు తీసుకుంటోన్న పూరి జగన్నాథ్తో పని చేయడానికి ఈ టైమ్లో స్టార్ హీరోలు ఆసక్తి చూపించడం లేదు. ఇజం సినిమాకి పెట్టించిన ఖర్చు చూసి ఇక చిన్న హీరోలు కూడా అతనితో సాహసించే అవకాశాల్లేవు. అందుకేనేమో బాలీవుడ్ వెళ్లిపోతానంటూ పూరిజగన్నాథ్ మన హీరోల్ని బెదిరిస్తున్నాడు. బాలీవుడ్లో మాత్రం ఇలా విషయం లేని సినిమాలు జనాల నెత్తిన రుద్దితే ఊరుకుంటారా? కనీసం ఇక్కడైనా పూరి జగన్నాథ్ గత వైభవం దృష్ట్యా ఎవరూ ఏమీ అనడం లేదు కానీ బాలీవుడ్ క్రిటిక్స్ అయితే ఇజం లాంటి సినిమాలకి చమడాలు వలిచేస్తారు.

అఖిల్ పాపకు ఎంత కష్టమో

28/10/2016: తెలుగులో ఓ పెద్ద ఫ్యామిలీ నుంచి వారసుడిని హీరోగా పరిచయం చేస్తుంటే అతడి rnపక్కన కథానాయికగా నటించానికి హీరోయిన్లు జడుసుకుంటారు. ఎందుకంటే సినిమాలో rnఫోకస్ మొత్తం ఆ హీరో మీదే ఉంటుంది కాబట్టి.. హీరోయిన్‌ని పక్కకు rnనెట్టేస్తారు. హీరోయిన్ చాలా వరకు నామ్ కే వాస్తే అయిపోతుంది. నేహా శర్మ rn(చిరుత), కార్తీక (జోష్)లతో పాటు ఇలాంటి హీరోయిన్లు చాలామంది కనిపిస్తారు. rn‘అఖిల్’ సినిమా హీరోయిన్ సాయేషా పరిస్థితి కూడా ఇలాగే అయింది. ఆ సినిమా rnఫ్లాప్ అయినా సరే.. అఖిల్‌కు పేరొచ్చింది కానీ.. సాయేషా మాత్రం పూర్తిగా rnపక్కకు వెళ్లిపోయింది. దీంతో ఆ సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయింది rnసాయేషా. rnఐతే తెలుగులో ఎలాంటి ఫలితాన్నందుకున్నా.. హిందీలో అజయ్ దేవగణ్ లాంటి స్టార్rn హీరో సరసన నటించే అవకాశం దక్కడంతో ‘శివాయ్’ సినిమా మీద భారీ ఆశలే rnపెట్టుకుంది సాయేషా. ఐతే ఈ సినిమా ట్రైలర్ చూసినపుడే జనాలకు ఏదో తేడా rnకొట్టింది. దీనికి తోడు రిలీజ్ డే కంటే ముందే ‘శివాయ్’కు నెగెటివ్ టాక్ rnమొదలైపోయింది. కమల్.ఆర్.ఖాన్ అనే కామెడీ క్రిటిక్ ఈ సినిమా గురించి rnదారుణమైన వ్యాఖ్యలు చేశాడు. అతడి మాటలు లైట్ తీసుకుందామనుకున్నా.. ముందు rnరోజు మీడియా వాళ్లకు ప్రివ్యూలు వేయడంతో వాళ్లంతా కూడా రివ్యూలు ఇచ్చేశారు.rn 1-1.5 మధ్య రేటింగులిస్తున్నారు ఈ సినిమాకు. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాrn గురించి దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. ఐతే ఇందులోని యాక్షన్ rnసన్నివేశాలు, విజువల్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయట. హీరోయిన్ సాయేషాకు ఈ rnసినిమా వల్ల ఒరిగే ప్రయోజనం ఏమీ లేదని.. ఆమెకు బాలీవుడ్ కూడా ఒక భారీ rnఫ్లాప్‌తో స్వాగతం పలుకుతోందని అంటున్నారు.

త్రిష సీఎం డ్రీమ్స్

28/10/2016: చెన్నై చిన్నది త్రిష సీఎం పదవిపై కన్నేసింది. కలలు కనండి.. ఆ కలలు నెరవేర్చుకోండి అన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూక్తిని ఈ సుందరి అక్షరాలా పాటిస్తోంది. నిరంతర శ్రమతో దక్షిణాదిలో అగ్రనటిగా ఎదిగిదిన త్రిష.. ఇప్పుడు సెడన్ గా పాలిటిక్స్ పై దృష్టి సారించింది. స్వరాష్ట్రం తమిళనాడులో అమ్మ జయలలితను చూసి స్ఫూర్తి పొంది ఉంటుందని టీనగర్లో సెటైర్లు పడుతున్నాయి. అయితే అసలు సంగతి తెలిసిన తర్వాత అందరూ లైట్ తీసుకున్నారు. ఎందుకంటే త్రిష ధనుష్ కు జోడీగా నటించిన కోడి మూవీ త్వరలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో త్రిష పొలిటీషియన్ గా నటించింది. సరైనోడులో ఎమ్మెల్యేగా క్యాథరీన్ ఇగదీసిన నేపథ్యంలో.. ఇప్పుడు త్రిష పొలిటీషియన్ గా ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందనేది మూవీ థియేటర్స్ కు వచ్చాకే తెలుస్తుంది. కోడి మూవీ ప్రమోషన్లో భాగంగా ఇంటర్వ్యూలు ఇచ్చిన త్రిష.. సీఎం జయలలిత క్యారెక్టర్ చేయాలనుందని మనసులో మాట బయటపెట్టిందట. కోడి మూవీ క్యారెక్టర్ తాలూకు ప్రభావం ముద్దుగుమ్మపై బాగానే పడిందని కోలీవుడ్ కోడై కూస్తోంది. పైగా ఇప్పటికే త్రిష ముదురు భామ కావడం, గ్లామర్ పాత్రలు వచ్చే అవకాశాలు తగ్గిపోవడంతో.. లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తోంది. ఇక సీఎం క్యారెక్టర్ చేస్తే.. పవర్ ఫుల్ పాత్రలతో కొంతకాలం బండి లాగించాలనే ఆలోచన ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక తమిళనాడు సీఎం జయలలితకు, త్రిష కు ఓ లింక్ కూడా కలిసిందండోయ్. అదేంటంటే జయ చదువుకున్న చెన్నై చర్చ్ పార్క్ స్కూల్లోనే త్రిష కూడా చదువుకుంది. మరి త్రిష ఆన్ స్క్రీన్ సీఎం క్యారెక్టర్ చేస్తుందా.. లేదంటే రియల్ లైఫ్ లో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తుందా.. అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

కాట‌మ‌రాయుడు సెట్‌లో గొడ‌వ‌…ప‌వ‌న్ అప్ సెట్‌

26/10/2016: ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో యవ్వారం కాస్త తేడాగానే ఉంటుంది. ప‌వ‌న్ మెల్ట్ అయితే… ఆ ద‌ర్శ‌కుడి ప‌ని న‌ల్లేరుపై న‌డ‌కే. తేడా వ‌స్తే.. అంతే సంగ‌తులు. ప‌వ‌న్ మూడ్‌ని బ‌ట్టి న‌డుచుకోవ‌డం ఏ ద‌ర్శ‌కుడికైనా క‌త్తిమీద సాము. స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సెట్లో ప‌వ‌న్‌కీ.. ఆ సినిమా కెమెరామెన్‌కీ త‌ర‌చూ గొడ‌వ‌ల‌య్యేవి. అందుకే.. షూటింగ్ మొద‌లైన కొన్ని రోజులకే సాంకేతిక నిపుణుల్లో మార్పులూ చేర్పులూ జ‌రిగాయి. సేమ్ టూ సేమ్ కాట‌మ‌రాయుడు సెట్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతోంద‌న్న‌ది ఇన్‌సైడ్ న్యూస్‌. సోమ‌వారం హైద‌రాబాద్‌లో కాట‌మ‌రాయుడు షూటింగ్ జ‌రిగింది. సెట్లో ద‌ర్శ‌కుడు డాలీకీ, ప‌వ‌న్‌కీ మ‌ధ్య ఏదో విష‌య‌మై… చిన్న గొడ‌వ వ‌చ్చింద‌ట‌. ద‌ర్శ‌కుడి వైఖ‌రిపై అలిగిన ప‌వ‌న్‌.. సెట్లోంచి హుటాహుటిన వెళ్లిపోయాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప‌వ‌న్ లేక‌పోవ‌డంతో… షూటింగ్ కాసేపు ఆగిపోయింద‌ని, ఆ త‌ర‌వాత ప‌వ‌న్ లేని సీన్లు తీసుకోవాల్సిచ్చిందని తెలుస్తోంది. ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న శ‌ర‌త్ మ‌రార్ ప‌వ‌న్‌కి అత్యంత స‌న్నిహితుడు. ద‌ర్శ‌కుడికీ, ప‌వ‌న్‌కీ వాద‌న జ‌రుగుతున్న‌ప్పుడు సెట్లో శ‌ర‌త్ మ‌రార్ కూడా ఉన్నాడ‌ట‌. అయితే.. ప‌వ‌న్‌ని ఎదిరించే ధైర్యం లేక కామ్‌గా ఉండిపోయాడ‌ని, ఆ త‌ర‌వాత ప‌వ‌న్‌ని స‌ర్దిచెప్పే ప‌నిలో లీన‌మ‌య్యాడ‌ని తెలుస్తోంది. వ‌ప‌న్ అలిగి వెళ్లిపోవ‌డంతో కాస్త టెన్ష‌న్ ప‌డిన డాలీ.. ఆ త‌ర‌వాత కుదురుకున్నాడ‌ని, ఈ రోజు షూటింగ్ య‌ధావిధిగా జ‌రిగింద‌ని తెలుస్తోంది. డిసెంబ‌రు నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాల‌ని ప‌వ‌న్ టార్గెట్‌గా పెట్టుకొన్నాడు. ఈలోగా ఇలా చిరుబుర్రులు ఆడి.. అలిగి వెళ్లిపోతుంటే… డిసెంబ‌రు నాటికి పూర్త‌వ్వ‌డం అసాధ్య‌మే.

రాజమౌళిని మంచు లక్ష్మి తిట్టేసిందట

26/10/2016: ‘బాహుబ‌లి’లో శివ‌గామి పాత్ర‌కు అతిలోక సుంద‌రి శ్రీదేవిని రాజ‌మౌళి అడిగాడ‌ని తెలుసు. ఈ విష‌యం రాజ‌మౌళి కూడా ఒప్పుకున్నాడు. త‌ర్వాత ట‌బును కూడా ఓ ద‌శ‌లో క‌న్సిడ‌ర్ చేసిన‌ట్లు వార్త‌లొచ్చాయి. అందులో వాస్త‌వ‌మెంతో తెలియ‌దు. కానీ ఈ పాత్ర‌కు త‌న‌ను కూడా రాజ‌మౌళి సంప్ర‌దించాడంటూ కొత్త విషయం చెప్పింది మంచు ల‌క్ష్మీప్ర‌స‌న్న‌. ఆలీ హోస్ట్ చేసే ఒక టీవీ ఛానెల్ కార్య‌క్ర‌మంలో మంచు ల‌క్ష్మి ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించింది. శివ‌గామి పాత్ర‌కు మిమ్మ‌ల్ని అడిగార‌ట నిజ‌మా అని అడిగితే.. అది రూమ‌ర్ కాద‌ని వాస్త‌వ‌మ‌ని చెప్పింది ల‌క్ష్మి. మ‌రి ఆ పాత్ర‌ను ఆమె ఎందుకు కాదందో త‌న మాట‌ల్లోనే తెలుసుకుందాం ప‌దండి. ‘‘శివ‌గామి పాత్ర‌కు న‌న్ను అడ‌గ‌డం రూమ‌ర్ కాదు. నిజమే. రాఘ‌వేంద్ర‌రావుగారి అబ్బాయి ప్ర‌కాష్ నాకు ఫోన్ చేసి ఆ పాత్ర ఆఫ‌ర్ చేశాడు. ఐతే వెంట‌నే నో చెప్పాను. శివ‌గామి పాత్ర న‌చ్చ‌క ఇలా చెప్ప‌లేదు. ప్ర‌భాస్ కు అమ్మ‌గా న‌టించ‌డం అనే ఆలోచ‌న నాకు న‌చ్చ‌లేదు. ఆ ఆలోచ‌నే ఊహించ‌లేను. సినిమాలో నాకు అమ్మ ఫీలింగ్ కాకుండా ఇంకో ఫీలింగ్ వ‌స్తే క‌ష్టం. ప్ర‌కాష్ కు నో చెబుతూ రాజ‌మౌళిని కూడా రెండు మాట‌లు అన్నాను. న‌న్ను ప్ర‌భాస్ అమ్మ‌గా ఎలా ఊహించుకున్నారో అని. ఐతే నా కంటే ముందు శ్రీదేవి.. ట‌బుల‌ను కూడా ఈ పాత్ర‌కు అడిగార‌ట‌. వాళ్ల లీగ్ లో న‌న్ను చేర్చినందుకు చాలా హ్యాపీ. రాజ‌మౌళి గారు ఇంకేదైనా పాత్ర ఆఫ‌ర్ చేస్తే నేను త‌ప్పకుండా చేస్తాను. ఐతే శివ‌గామి పాత్ర‌కు నా వాయిస్ ఉండుంటే వేరేగా ఉండేది. న‌న్ను కేవ‌లం వాయిస్ ఇవ్వ‌మంటే మాత్రం ఇచ్చేదాన్ని. కానీ ప్ర‌భాస్ త‌ల్లిగా నటించ‌డం మాత్రం నా వ‌ల్ల కాదు’’అని ల‌క్ష్మి చెప్పింది.

మహేష్ సినిమాకు మైండ్ బ్లోయింగ్ ప్రైస్

26/10/2016: హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా మార్కెట్ వాల్యూ పెరిగిపోతూ ఉంటుంది మహేష్ సినిమాకు. 1 నేనొక్కడినే, ఆగడు లాంటి డిజాస్టర్ల తర్వాత కూడా శ్రీమంతుడు ఏ స్థాయిలో బిజినెస్ చేసింది.. ఎలాంటి కలెక్షన్లు రాబట్టిందో తెలిసిందే. దాని తర్వాత వచ్చిన 'బ్రహ్మోత్సవం' మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. అయినా ఆ ఎఫెక్ట్ మహేష్ తర్వాతి సినిమా మీద పడుతున్నట్లు కనిపించట్లేదు. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ చేయబోయే తర్వాతి సినిమాకు రూ.90 కోట్ల దాకా బడ్జెట్ పెట్టేస్తున్నారు. ఈ సినిమాకు బిజినెస్ కూడా ఓ రేంజిలో జరగబోతోందని తెలుస్తోంది. ముందుగా ఈ సినిమాకు శాటిలైట్ డీల్ ఓకే అయిపోయింది. 'శ్రీమంతుడు'తో బాగా సొమ్ము చేసుకుని.. 'బ్రహ్మోత్సవం'తో బాగా దెబ్బ తిన్న జీ తెలుగు ఛానెలే మహేష్-మురుగ సినిమాను కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రూ.16 కోట్లు పలికినట్లు సమాచారం. టాలీవుడ్లో ఇదే రికార్డు. బాహుబలికి సైతం రెండు భాగాలకు కలిపి రూ.31 కోట్లు రేటు పలికినట్లు వార్తలొచ్చాయి. ఆ లెక్కన ఒక్కో పార్టుకు రూ.15.5 కోట్లు పలికినట్లు. మహేష్ కొత్త సినిమా ఆ రేటును కూడా అధిగమించింది. ఈ చిత్ర ఆడియో టెలికాస్ట్ హక్కుల కోసం కూడా జీ తెలుగు రూ.2 కోట్ల దాకా వెచ్చించినట్లు సమాచారం.

మగధీరను కొట్టబోతున్న లెజెండ్

26/10/2016: ఈ రోజుల్లో ఒక సినిమా 50 రోజులు ఆడటమే గగనం అయిపోతోంది. వంద రోజులు ఆడితే ఆశ్చర్యపోతున్నాం. అలాంటిది ఒక సినిమా ఇప్పుడు వెయ్యి రోజుల ప్రదర్శన పూర్తి చేసుకోబోతోంది. ఆ సినిమా ఏదో ఈపాటికే ఓ ఐడియా వచ్చేసి ఉంటుంది కదా. అదేనండీ.. లెజెండ్. ఎమ్మిగనూరులోని ఒక థియేటర్లో.. ప్రొద్దుటూరులోని అర్చన థియేటర్లో ఈ చిత్రం 500 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. 500 డేస్ తర్వాత ఎమ్మిగనూరు థియేటర్ 'లెజెండ్"కు టాటా చెప్పేసినా ప్రొద్దుటూరులో మాత్రం ఈ సినిమా ఇంకా దిగ్విజయంగా ఆడేస్తోంది. ఇప్పటికే 950 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది. త్వరలోనే అర్చనలో వెయ్యి రోజుల థియేట్రికల్ రన్ పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో 950 డేస్ టు 1000 డేస్ పోస్టర్ కూడా రిలీజ్ చేయడం విశేషం. అర్చన థియేటర్ లీజ్ ప్రొప్రెయిటర్ ఓబుల్ రెడ్డి 'లెజెండ్ డైరెక్టర్ బోయపాటి శ్రీనును కలిసి ఈ పోస్టర్ రిలీజ్ చేశాడు. త్వరలోనే ఈ థియేటర్లో 'లెజెండ్" వెయ్యి రోజుల వేడుక కూడా జరగబోతోంది. దానికి బోయపాటి హాజరు కానున్నాడు. సౌత్ ఇండియాలో అత్యధిక రోజులు ఆడిన సినిమా 'మగధీర"నే. ఆ చిత్రం కర్నూలులోని ఒక థియేటర్లో వెయ్యి రోజులు ఆడింది. 'లెజెండ్" సినిమా ఆ రికార్డును బద్దలు కొట్టబోతోంది. ఐతే ఈ రోజుల్లో ఓ సినిమా వెయ్యి రోజులు ఆడుతోందంటే.. దానికి ఏమాత్రం విలువ ఉందన్నదే ఇక్కడ ప్రశ్నార్థకం.

అనుష్క గురించి కరణ్ జోహార్ చెప్పిన సీక్రెట్

26/10/2016: బాలీవుడ్లో యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్లది ప్రత్యేకమైన వ్యవహారం. వాళ్లు ఒక నటుడిలో లేదా ఒక నటిలో టాలెంట్ చూశారంటే చాలు. వెంటనే తమ సంస్థలోనే కనీసం మూడు సినిమాలు చేసేలా ఒప్పందాలు చేసేసుకుంటారు. అనుష్క శర్మ, రణ్వీర్ సింగ్, వాణీ కపూర్.. ఇలా యశ్ రాజ్ ఫిలిమ్స్తో ఒప్పందాలు చేసుకుని ఆ తర్వాత మంచి రేంజికి వెళ్లిన తారలు చాలామందే కనిపిస్తారు. ఐతే వీళ్లలో తనకు అనుష్క శర్మ మీద మాత్రం సరైన అభిప్రాయం లేదని.. ఆ అమ్మాయికి అంత పెద్ద సంస్థలో అవకాశం దక్కడం నచ్చలేదని అంటున్నాడు ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్. 'రబ్ నే బనాదె జోడీ" సినిమా నుంచి అనుష్కను తప్పించడానికి అప్పట్లో చాలానే ప్రయత్నించానంటూ షాకింగ్ విషయం వెల్లడించాడు కరణ్. ''ఎందుకో కానీ నాకు అనుష్కను చూసినపుడు సరైన అభిప్రాయం కలగలేదు. ఆమెకు ఆదిత్య చోప్రా 'రబ్ నె బనాదె జోడీ" లాంటి పెద్ద సినిమాలో ఛాన్సివ్వడం నచ్చలేదు. అందుకే ఆమె వద్దని గట్టిగా చెప్పాను. ఇంకెవరైనా ప్రముఖ హీరోయిన్ని తీసుకోమన్నాను. కానీ ఆదిత్య నా మాట వినలేదు. ఆమెతోనే సినిమా చేశాడు. ఐతే ఆ సినిమాలో.. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో అనుష్క నటన చూశాక నా అభిప్రాయం మారింది. ఆమె టాలెంటేంటో నాకు అర్థమైంది. ఆమె కెరీర్ను నాశనం చేయాలనుకున్నందుకు చాలా బాధపడ్డాను. ఇప్పుడు 'యే దిల్ హై ముష్కిల్" సినిమాకు నేనే అనుష్కకు ఛాన్సిచ్చాను. ఆమె టాలెంట్ స్వయంగా చూశాను"" అని ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కరణ్ వెల్లడించాడు.

ఇది విన్నారా... 'కాష్మోరా'తో బిస్కెట్‌ వేసారంట!

26/10/2016: కార్తీ 'కాష్మోరా' చిత్రం ట్రెయిలర్‌ చూసి ఇది మరో 'బాహుబలి'లా ఉందే అంటూ జనం ఊగిపోతున్నారు. ఈ సినిమా ట్రెయిలర్‌కి యూట్యూబ్‌లో యాభై లక్షలకి పైగా వ్యూస్‌ వచ్చాయంటేనే ఇది ఎంతగా జనాల దృష్టిని ఆకర్షించిందనేది అర్థమవుతోంది. కాష్మోరా ట్రెయిలర్‌లో వార్‌ సెటప్‌, కార్తీ గుండు గెటప్‌, రాణిగా నయనతార లుక్‌ ఇవన్నీ అంచనాలని పెంచేసాయి. సినిమా మొత్తం బాహుబలి మాదిరిగా ఇదే సెటప్‌తో ఉంటుందని సినీ ప్రియులు ఫిక్స్‌ అయిపోయారు. ఈ శుక్రవారం విడుదలకి సిద్ధమవుతోన్న ఈ చిత్రం కోసం ఆబగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇండస్ట్రీ నుంచి వినిపిస్తోన్న రిపోర్ట్స్‌ బట్టి 'కాష్మోరా'లో ఆ పీరియడ్‌ సెటప్‌ కేవలం అరగంట మాత్రమే ఉంటుందని తెలిసింది. మిగతా సినిమా అంతా సగటు హారర్‌ కామెడీ మాదిరిగానే సాగుతుందట. ఆ అరగంటలోనే అంచనాలకి తగినంత ఎక్సయిట్‌మెంట్‌ అందిస్తే ఓకే కానీ లేదంటే ఇప్పుడు ఏర్పడ్డ అంచనాలకి ఈ కాష్మోరా తీవ్రంగా నిరాదరణకి గురయ్యే అవకాశాలున్నాయి. హైప్‌ కోసం రాంగ్‌ ప్యాకేజింగ్‌ చేసిన చాలా చిత్రాలకి అలాంటి అనుభవాలే ఎదురైన నేపథ్యంలో విడుదలకి రెండు రోజులు ముందయినా తిమ్మిని బమ్మిని చేసి చూపించకుండా వున్నది వున్నట్టు చూపించడానికి నిర్మాతలు పూనుకోవాలి. లేదంటే రీసెంట్‌గానే కబాలి చిత్రానికి ఎలా చుక్కెదురైందో చూసాం కదా.

అది చూసి చైతూ భయపడిపోయాడట

26/10/2016: ఒక సినిమా గురించి విడుదలకు ముందు పాజిటివ్ బజ్ రాకపోయినా పర్వాలేదు.. కానీ నెగెటివ్ ప్రచారం జరిగితే ఎవరైనా కంగారు పడిపోతారు. 'ప్రేమమ్" రీమేక్ విషయంలో ఎంత నెగెటివ్ ప్రచారం జరిగిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ రీమేక్ గురించి అనౌన్స్మెంట్ వచ్చిన రోజు నుంచి దీని గురించి సోషల్ మీడియాలో ఓ రేంజిలో ట్రోలింగ్ జరుగుతూ వచ్చింది. అందులోనూ 'ఎవరే' పాట వీడియో రిలీజ్ చేసినప్పుడైతే ట్రోలింగ్ పీక్స్కు వెళ్లిపోయింది. నాగచైతన్య, శ్రుతి హాసన్లను నివిన్ పౌలీ, సాయిపల్లవిలతో పోలుస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెటైర్లు వేశారు నెటిజన్లు. ఈ ట్రోలింగ్ అదీ చూసి తాను చాలా భయపడ్డానని చైతూ వెల్లడించాడు. ''ప్రేమమ్ సినిమా రీమేక్ అన్నపుడు కొంత నెగెటివిటీ కనిపించింది. కానీ అదేం పట్టించుకోకుండా కాన్ఫిడెంట్గా షూటింగ్ మొదలుపెట్టాం. ఔట్ పుట్ మీద నమ్మకంతో ఉన్నాం. కానీ 'ఎవరే" పాట రిలీజ్ చేశాక సోషల్ మీడియాలో ట్రోలింగ్ చూస్తే మరీ దారుణంగా అనిపించింది. నాకు భయమేసింది. డైరెక్టర్ చందూతో మాట్లాడాను. మనం తప్పు చేస్తున్నామా.. ఈ సినిమా కంప్లీట్గా మిస్ ఫైర్ అవుతుందా అని కంగారు పడ్డాను. ఐతే చందూ మాత్రం ఈ సినిమా మీద కాన్ఫిడెంట్గా ఉన్నాడు. మరోవైపు శ్రుతి హాసన్ ఎపిసోడ్ విషయంలోనూ నాకు సందేహాలు కలిగాయి. మిగతా రెండు ఎపిసోడ్లు ప్రేక్షకులకు నచ్చుతాయన్న భరోసా ఉండేది. కానీ శ్రుతి ఎపిసోడ్ వాళ్లకు నచ్చదేమో అనుకున్నా. కానీ రీరికార్డింగ్ పూర్తయ్యాక ఈ ఎపిసోడ్ మీద గురి కుదిరింది. సౌండ్ యాడ్ చేశాక దాని రేంజే మారిపోయింది" అని చైతూ తెలిపాడు.

బాహుబలి-1 భయం.. బాహుబలి-2 బిందాస్

26/10/2016: తెలుగులో అసలే సీక్వెల్స్ బాగా ఆడిన చరిత్ర లేదు. దీనికి తోడు ‘బాహుబలి’ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీకి కొనసాగింపుగా సినిమా అంటే ఎంత ప్రెజర్ ఉంటుందో అంచనా వేయొచ్చు. కానీ రాజమౌళి మాత్రం ‘బాహుబలి: ది కంక్లూజన్’ విషయంలో టెన్షనే పడలేదంటున్నాడు. ఈ సినిమా విషయంలో ఎగ్జైట్ అవుతున్నా తప్ప టెన్షన్ పడట్లేదన్నాడు. ‘బాహుబలి: ది బిగినింగ్’తో పోలిస్తే ‘బాహుబలి: ది బిగినింగ్’కే కష్టం ఎక్కువని.. కానీ తొలి భాగానికే తామందరం ఎక్కువ టెన్షన్ పడ్డామని చెప్పాడు. దీనికి కారణం వివరిస్తూ.. ‘‘బాహుబలి: ది బిగినింగ్ చేస్తున్నపుడు చాలా భయాలుండేవి. ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తుందో.. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో.. ఇంత పెట్టుబడి పెడుతున్నాం ఏమవుతుందో అని భయపడే వాళ్లం. ఐతే ప్రేక్షకుల రెస్పాన్స్ చూశాక చాలా సంతోషం వేసింది. రెండో పార్ట్ విషయంలో మరింత ఎగ్జైట్మెంట్‌తో పని చేశాం. నిజానికి ‘ది బిగినింగ్’తో పోలిస్తే.. ‘ది కంక్లూజన్’లో కష్టం ఎక్కువుంది. భారీతనం ఉంది. అయినా ఇప్పుడు రిలాక్స్డ్‌గా ఉన్నాం. పైగా నటీనటులు.. టెక్నీషియన్లు అందరితోనూ బాగా అలవాటైపోయింది. అందరూ కాన్ఫిడెన్స్‌తో పని చేస్తున్నారు’’ అని రాజమౌళి తెలిపాడు. ఇక బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న ఇంత పాపులర్ అవుతుందని.. దాని కోసం జనాలు ఇంత ఆతృతతో ఎదురు చూస్తారని.. తాను ఊహించలేదని రాజమౌళి చెప్పాడు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లే బాహుబలి-2 సిద్ధమవుతోందని.. ప్రేక్షకుల్ని మరోసారి మెప్పిస్తామని ఆత్మవిశ్వాసంతో ఉన్నామని రాజమౌళి ధీమా వ్యక్తం చేశాడు.

పెళ్లిచూపులు రైట్స్ ఎవరు కొన్నారో తెలుసా?

25/10/2016: ఈ ఏడాది తెలుగులో మోస్ట్ సర్ప్రైజింగ్ హిట్ ఏదంటే 'పెళ్లిచూపులు' సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా సెట్స్ మీద ఉన్నంత వరకు ఎవరికీ పట్టలేదు. సినిమా పూర్తయ్యాక కూడా ఎవరూ పట్టించుకోలేదు. కానీ అనుకోకుండా సురేష్ బాబు లైన్లోకి వచ్చాడు. ఇండస్ట్రీ జనాల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. పాజిటివ్ బజ్ మధ్య రిలీజై అనూహ్యమైన వసూళ్లతో అదరగొట్టింది. విడుదల తర్వాత పలు భాషల నుంచి ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం పోటీ నెలకొంది. హిందీ హక్కులు ఆల్రెడీ అమ్ముడైపోయాయి. ప్రముఖ నిర్మాత వశు భగ్నాని పెళ్లిచూపులు హిందీ హక్కులు సొంతం చేసుకున్నాడు. తాజాగా 'పెళ్లిచూపులు' తమిళ రీమేక్ డీల్ కూడా పూర్తయింది. ప్రముఖ దర్శక నిర్మాత గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ హక్కులు సొంతం చేసుకోవడం విశేషం. ఆయనే ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. దర్శకుడు.. హీరో హీరోయిన్ల సంగతి ఇంకా కన్ఫమ్ కాలేదు. త్వరలోనే వెల్లడి కావచ్చు. అటు హిందీ.. ఇటు తమిళం రీమేక్ రైట్స్ రెండూ మంచి రేటుకే వెళ్లినట్లు సమాచారం. కేవలం కోటిన్నర బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం రూ.20 కోట్లకు పైగా థియేట్రికల్ షేర్ కలెక్ట్ చేయడం విశేషం. శాటిలైట్ రైట్స్.. రీమేక్ రైట్స్ కూడా కలుపుకుంటే తెలుగు సినిమా చరిత్రలోనే పెట్టుబడి మీద అత్యధిక రెట్లు వసూలు చేసిన సినిమాల జాబితాలో ముందు వరుసలో నిలుస్తుంది 'పెళ్లిచూపులు'.

క‌ర‌ణ్ జోహార్‌కు రూ.320 చెక్‌తో షాక్ ఇచ్చాడు

25/10/2016: ఏ దిల్ హై ముష్కిల్ మూవీకి క‌ష్టాలు త‌ప్ప‌డం లేదా? ఈ మూవీ నిర్మాత‌, ద‌ర్శ‌కుడు క‌ర‌ణ్ జోహార్‌కు రోజు రోజుకు కొత్త ఇబ్బందులు వ‌స్తున్నాయా ? ఎన్నో ప్ర‌యాస‌లు ప‌డి మూవీని విడుద‌ల చేసినా.. దానిని ఆడియ‌న్స్ హిట్ చేసే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదా? పాక్ విష‌యంలో మ‌నోళ్లు గ‌ట్టి పంతంతోనే ఉన్నారా? అంటే ఇప్పుడు ఔన‌నే ఆన్స‌రే వ‌స్తోంది. ఈ మూవీలో హీరోగా ఫ‌వాద్ ఖాన్ అనే పాక్ న‌టుడిని తీసుకున్నాడు క‌ర‌ణ్‌. అయితే, ఆ త‌ర్వాత ఉరీ ఘ‌ట‌న‌తో పాక్‌పై భార‌త్‌లో ఆగ్ర‌హ జ్వాల‌లు ఎగిశాయి. దీంతో పాక్ క‌ళాకారుల‌ను దేశంలోనే ఉండ‌నివ్వ‌కూడ‌దంటూ ఓ వ‌ర్గం ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే క‌ర‌ణ్ జోహార్ మూవీ ఏ దిల్ హైముష్కిల్‌పైనా స‌స్పెన్స్ నీడ‌లు క‌మ్ముకున్నాయి. ముంబై స‌హా హైద‌రాబాద్ వంటి ముఖ్య న‌గ‌రాల్లో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ మూవీని విడుద‌ల చేయ‌కూడ‌ద‌ని మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ సేన హుకుం జారీ చేసింది. ఈక్ర‌మంలో కేంద్రంతో మాట్లాడిన క‌ర‌ణ్‌.. మూవీ రిలీజ్‌కి లైన్ క్లియ‌ర్ చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా మూవీ విడుద‌ల‌య్యే ప్రాంతాల్లో భ‌ద్ర‌త క‌ల్పిస్తామ‌ని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో హ‌మ్మ‌య్య అని ఊపిరి పీల్చుకున్నాడు క‌ర‌ణ్‌. అయినా కూడా త‌న మిత్రుల సూచ‌న మేర‌కు ఈ మూవీని తీయ‌డానికి ఉన్న ప‌రిస్థితులు, ఇది విడుద‌ల కాక‌పోతే వ‌చ్చే న‌ష్టాలు వంటి వాటిని వివ‌రిస్తూ.. ఓ వీడియో విడుద‌ల చేశాడు. దీనిని చూసి ఆడియ‌న్స్ ఫ్లాట్ అయిపోతార‌ని క‌ర‌ణ్ భావించాడు. కానీ, అనుకున్న‌ది ఒక్క‌టి అయింది ఒక్క‌టి అన్న‌ట్టుగా ఉంది క‌ర‌ణ్ ప‌రిస్థితి. ఈ వీడియోను చూసిన కరణ్ చీమా అనే వ్యాపారవేత్త రూ. 320తో ఓ చెక్కును, ఓ లెట‌ర్‌ను కూడా జోహార్స్ ప్రొడక్షన్ హౌస్ కు పంపాడు. ఆ లెట‌ర్‌లో.. మీరు విడుదల చేసిన వీడియోను చూసి చాలా బాధ పడ్డా. మీరు, మీ సినిమాలో పని చేసిన వారు నష్టపోకూడదనే ఉద్దేశంతో రూ. 320 చెక్ పంపిస్తున్నా (రెండు టికెట్ల ఖరీదు). ఒక బిజినెస్ మ్యాన్ గా మరో బిజినెస్ మ్యాన్ బాధ ఏమిటో నాకు తెలుసు. పాక్ నటులున్న‌ మీ సినిమాను నేను చూడదలుచుకోలేదు. కానీ, మీరు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే చెక్ పంపిస్తున్నా. పాక్ నటులను పెట్టుకుంటే పాకిస్థాన్ లో కూడా బిజినెస్ జరుగుతుంది. అందువల్ల లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందనేది మీ ఉద్దేశం. కానీ, పాకిస్థాన్ వల్ల మన దేశంలోని వేలాది మంది నిత్యం క్షోభ అనుభవిస్తున్నారు! అని చీమా ఆ లెట‌ర్‌లో రాశాడు. దీంతో క‌ర‌ణ్ ఈ లెట‌ర్ చూసి షాక్ అయ్యాడ‌ట‌. మ‌రి ఎన్నో వివాదాల‌కు కేంద్రంగా మారిన ఈ మూవీ రిలీజ్ అయ్యాక రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

పాపం రష్మి సరదా తీర్చేసిందట

25/10/2016: గుంటూర్‌ టాకీస్‌తో వచ్చిన గుర్తింపుని క్యాష్‌ చేసేసుకోవడానికి వెనకా ముందు చూడకుండా సినిమాలు ఒప్పేసుకున్న జబర్దస్త్‌ బ్యూటీ రష్మి గౌతమ్‌కి మళ్లీ అలాంటి సినిమానే రాలేదు. కనీసం తన చిత్రాలని జనం పట్టించుకోను కూడా పట్టించుకోవడం లేదు. అయితే సినిమా రంగంలో ఎలాగైనా నిలదొక్కుకోవాలని, వచ్చిన ఊపుని వాడేసుకోవాలని రష్మి చాలా ట్రై చేస్తోంది. తన సినిమాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడితే సొంత డబ్బులు సైతం వదిలించుకోవడానికి ఆమె వెనకాడ్డం లేదు. తను వచ్చెనంట చిత్రం అలాగే రిలీజ్‌కి తంటాలు పడుతోంటే రష్మి తన భుజాల మీదకి తీసుకుని ఎదురు డబ్బులు పెట్టి రిలీజ్‌ అయ్యేలా చూసుకుందట. ఖచ్చితంగా ఈ జాంబీ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తుందని రష్మి భావించింది. కానీ ఈ సినిమాని పట్టించుకునే వాళ్లే లేకపోవడంతో కనీసం పోస్టర్‌ ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సినిమాకి తీసుకున్న పారితోషికంతో పాటు సొంత డబ్బు కూడా పెట్టిన రష్మికి ఇప్పుడు వాటిలో పైసా తిరిగివచ్చే సూచనలే లేవు. కనీసం శాటిలైట్‌ రైట్స్‌ అమ్ముకుందామన్నా ఇంత ఘోరమైన పరాజయం పాలైన సినిమాని ఎవరు మాత్రం కొంటారు? కేవలం నటనకే పరిమితమై, మిగతాది నిర్మాతల తిప్పలకే వదిలేసినట్టయితే కనీసం ఫ్లాప్‌తో పోయేది. ఇప్పుడు ఉన్నదీ పోయి, వచ్చిందీ పోయి పాపం సరదా బాగానే తీరిపోయింది.

వర్మ ఆయన్నీ వదిలేట్లు లేడుగా..

25/10/2016: నిజ జీవిత కథాంశాలతో.. పాత్రలతో సినిమాలు చేయడం వర్మకు అలవాటు. ఈ క్రమంలో ఎన్ని వివాదాలు ఎదురైనా ఆయన పట్టించుకోడు. 'రక్తచరిత్ర' టైంలో ఆ కథాంశం గురించి, అందులోని పాత్రల గురించి ఎన్ని వివాదాలు చెలరేగాయో తెలిసిందే. అయినా వర్మ వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత కూడా ఇలాంటి సినిమాలే ట్రై చేస్తున్నాడు. డిసెంబర్లో రాబోతున్న 'వంగవీటి' కూడా వివాదాస్పద సినిమానే. అందులోని పాత్రలపై వివాదాలు చెలరేగడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు వర్మ కొత్త సినిమా 'సర్కార్-3'లోనూ కొన్ని నిజ జీవిత క్యారెక్టర్లు దర్శనివ్వబోతున్నాయి. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి లండన్లో సెటిలైన విజయ్ మాల్యాను పోలిన 'మైకేల్ వాల్యా' అనే క్యారెక్టర్ 'సర్కార్-3'లో ఉన్న సంగతి ఇప్పటికే వెల్లడైంది. తాజాగా మరో నిజ జీవిత పాత్రకూ ఇందులో చోటుందని తెలిసింది. ఆ పాత్రకు స్ఫూర్తి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కావడం విశేషం. ఈ పాత్రను మనోజ్ బాజ్పేయి చేస్తున్నాడు. ఆ క్యారెక్టర్ పేరు.. గోవింద్ దేశ్ పాండే. ఆల్రెడీ ఈ క్యారెక్టర్లో మనోజ్ లుక్ కూడా బయటికి వచ్చింది. కేజ్రీవాల్ తరహలోనే మెడకు మఫ్లర్ చుట్టుకుని కనిపిస్తున్నాడు మనోజ్ ఇందులో. ఐతే కేజ్రీవాల్ పాత్రను వర్మ ఎలా చూపిస్తాడన్నది ఆసక్తికరం. ఇటీవలే ఇండియన్ ఆర్మీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్పై వర్మ విమర్శలు గుప్పించాడు. ఆయన ఒక కోతి అన్నాడు. హిందు-ముస్లింకు పుట్టిన క్రాస్ బ్రీడ్ కేజ్రీవాల్ అన్న తరహాలో మాట్లాడాడు. ఈ నేపథ్యంలో గోవింద్ దేశ్ పాండే పాత్రను నెగెటివ్గానే చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ధనుష్ హాలీవుడ్ సినిమాకు పంచ్ పడింది

25/10/2016: పెద్ద బ్యాగ్రౌండ్ ఏమీ లేకుండా తమిళ సినిమాల్లో అడుగుపెట్టి గొప్ప నటుడిగా పేరు సంపాదించాడు ధనుష్. ఆ తర్వాత అతడి ప్రతిభ టాలీవుడ్, బాలీవుడ్కూ విస్తరించింది. రాన్జానా, షమితాబ్ లాంటి సినిమాలతో బాలీవుడ్లోనూ తనదైన ముద్ర వేశాడు ధనుష్. ఈ మధ్యే ఓ ప్రెస్టీజియస్ హాలీవుడ్ ప్రాజెక్టు అతడి తలుపు తట్టింది. 'ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫాకిర్' పేరుతో ఓ హాలీవుడ్ నిర్మాణ సంస్థ ధనుష్ హీరోగా ఇంటర్నేషనల్ మూవీని కొన్ని నెలల కిందటే అనౌన్స్ చేసింది. ఇది ఒక ఫ్రెంచ్ రచయిత రాసిన పుస్తకం ఆధారంగా తెరకెక్కాల్సిన సినిమా. ఈ సినిమాకు ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా సెట్స్ మీదికి వెళ్లాల్సి ఉంది. ఐతే ప్రి ప్రొడక్షన్ దశలోనే ఉన్నట్లుండి దీని దర్శకుడు మర్జానే సత్రాపి ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుని షాకిచ్చాడు. కారణాలేంటో తెలియదు కానీ సత్రాపి ధనుష్ సినిమా నుంచి వైదొలిగాడు. ఐతే ఈ సినిమాను ఆపే ప్రసక్తే లేదంటోంది నిర్మాణ సంస్థ. స్క్రిప్టు పని పూర్తయిన నేపథ్యంలో మరో దర్శకుడితో ఈ సినిమా చేయాలని భావిస్తోంది. దీంతో సినిమా అనుకున్న సమయానికి సెట్స్ మీదికి వెళ్లకపోవచ్చు. విశేషం ఏంటంటే ఈ చిత్రంలో ఉమాతుర్మన్, ఆలెగ్జాండ్రా డడారియా లాంటి ప్రముఖ హాలీవుడ్ తారలు కీలక పాత్రలు పోషించనున్నారు.

ఇజం బయ్యర్లు మునిగినట్లేనా?

25/10/2016: గత శుక్రవారం భారీ అంచనాల మధ్య రిలీజైంది నందమూరి కళ్యాణ్ రామ్-పూరి జగన్నాథ్ల 'ఇజం'. కానీ టాక్ అంచనాలకు తగ్గట్లుగా రాలేదు. అయినప్పటికీ ముందు నుంచి హైప్ ఉండటం.. భారీగా రిలీజ్ చేయడంతో ఓపెనింగ్స్కు ఢోకా లేకపోయింది. తొలి రోజే రూ.3 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే హైయెస్ట్ ఫస్ట్ డే గ్రాసర్గా నిలిచింది. టాక్ ఏమంత బాలేకున్నా తర్వాతి రెండు రోజుల్లో కూడా కలెక్షన్లు బాగా వచ్చాయి. మొత్తం మూడు రోజుల ఫస్ట్ వీకెండ్లో ఈ సినిమా రూ.8 కోట్ల దాకా షేర్ రాబట్టింది. గ్రాస్ రూ.13 కోట్లు దాటింది. నైజాంలో రూ.2.5 కోట్లు.. సీడెడ్లో రూ.1.1 కోట్లు.. ఆంధ్రాలో అన్ని ఏరియాలూ కలిపి రూ.3 కోట్లు షేర్ రాబట్టింది 'ఇజం'. ఓవర్సీస్ పెర్ఫామెన్స్ పూర్గా ఉంది. అక్కడ రూ.30 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. కర్ణాటక.. ఇతర ఏరియాలు కలిపి కోటి దాకా షేర్ వసూలైంది. మొత్తంగా లెక్క రూ.8 కోట్లు తేలింది. ఐతే సినిమాకు పాజిటివ్ టాక్ లేదు కాబట్టి సోమవారం నుంచి కలెక్షన్లలో డ్రాప్ గ్యారెంటీ. కానీ ఆ డ్రాప్ ఏ స్థాయిలో ఉంటుందన్నది కీలకం. ఎలా చూసినా 'ఇజం' బయ్యర్లకు నష్టాలు తప్పేలా లేవు. ఎందుకంటే ఈ చిత్రానికి రూ.20 కోట్ల దాకా బిజినెస్ జరిగినట్లు వార్తలొచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా రూ.15 కోట్ల మార్కు దాటినా అద్భుతమే అన్నట్లుంది. మరి బయ్యర్ల పరిస్థితి ఏంటో?

అశ్విన్‌తో ప్రేమలో పడిందా?

24/10/2016: మొండోడు.. దేనికీ భయపడడు.. ఈ రెండు లక్షణాలకు తోడు ప్రేమ ఉన్నోడు.. ఇటువంటి వ్యక్తితో ప్రేమలో పడితే బాగుంటుందని కొందరు అమ్మాయిలు కోరుకుంటారు. తమన్నాకు అలాంటోడు దొరికాడు. కానీ, తన ఈడూ జోడూ ఉన్న అబ్బాయి కాదు, 60 ఏళ్ల అశ్విన్ తాత. ఆ అశ్విన్ తాతయ్య ఎవరో కాదు, హీరో శింబు. ఇదంతా తమిళ సినిమా ‘అన్బానవన్ అసురాదవన్ అడంగాదవన్’ సంగతి. ‘‘అరవై ఏళ్ల తాతయ్యతో ఇరవై ఐదేళ్ల అమ్మాయి ప్రేమలో పడిందా? లేదా? సినిమా చూసి తెలుసుకోండి. ఈ జోడీ మాత్రం చరిత్ర సృష్టించడం ఖాయం’’ అంటున్నారు చిత్ర దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్. ఈ సినిమాలో శింబు మూడు పాత్రల్లో కనిపించనున్నారు. అందులో అశ్విన్ తాత పాత్ర ఒకటి. ఈ తాతగారితో తమన్నా చేసే సందడి భలేగా ఉంటుందట. శ్రీయ మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

ప్రీరిలీజ్ బిజినెస్‌లో దూసుకెళ్తున్న గౌతమీపుత్ర శాతకర్ణి

24/10/2016: నందమూరి బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి. బాలయ్య నటిస్తోన్న వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’పై ప్రారంభం నుండి చర్చ జరుగుతూనే ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లోనూ దూసుకెళ్తోంది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న గౌతమీ పుత్ర శాతకర్ణికి సంబంధించి ఇప్పటికే దాదాపు డిస్ట్రిబ్యూషన్ హక్కులు అమ్ముడైపోయాయి. నైజాం ప్రాంత హక్కులను హీరో నితిన్‌కు చెందిన గ్లోబల్ సినిమాస్ 11.25 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. గుంటూరు ప్రాంత హక్కులను ఎస్.పిక్చర్స్ సుమారు 4.50 కోట్ల రూపాయలకు , ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి సీడెడ్ హక్కులను 9 కోట్ల రూపాయలకు దక్కించుకున్నారు. కృష్ణా జిల్లా హక్కులను 3.60 కోట్ల రూపాయలకు బేకరీ ప్రసాద్ , నెల్లూరు హక్కులను భరత్ 1.98 కోట్లకు సొంతం చేసుకున్నారు. సాటిలైట్ హక్కులను మాటీవి 9 కోట్లకు సొంతం చేసుకోగా, ఓవర్సీస్ హక్కులను 9పీఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ 8 కోట్లకు సొంతం చేసుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2017న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చారిత్రక నేపథ్యంలో సాగే శాతకర్ణి జీవిత కథతో రూపొందుతోన్న ఈ సినిమాను, క్రిష్, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

బాహుబలి-2లో కొత్త హీరోయిన్

24/10/2016: 'బాహుబలి: ది కంక్లూజన్'లో సూర్య ఓ కీలక పాత్ర చేస్తాడని.. బాలీవుడ్ హీరోయిన్ ఒకరు నటిస్తారని.. ఇలా రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఐతే వాటన్నింటినీ రాజమౌళి బృందం ఖండించింది. దాదాపుగా తొలి భాగంలో నటించిన వాళ్లతోనే రెండో భాగాన్ని కొనసాగిస్తోంది. ఐతే ఒక కొత్త హీరోయిన్ మాత్రం 'బాహుబలి-2'లో ఒక కీలక పాత్ర చేస్తోందన్నది తాజా కబురు. ఆ అమ్మాయి పేరు ప్రియా నాయుడు. ఈ అమ్మాయిది బెంగళూరు. ఆల్రెడీ కృష్ణవంశీ సినిమా 'నక్షత్రం' ప్రియ ఒక క్యారెక్టర్ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుండగా తన గురించి రాజమౌళికి తెలిసిందట. ఆమెకు సంబంధించిన రషెస్ చూసి.. తనకు 'బాహుబలి: ది కంక్లూజన్'లో ఒక పాత్ర ఇచ్చాడట రాజమౌళి. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'బాహుబలి-2"లో పాత్రంటే మామూలు విషయం కాదు. అది చిన్న పాత్ర అయినా సరే.. వచ్చే పేరు ఎంతో ఉంటుంది. అందుకే ఆ పాత్ర చేయడానికి రెడీ అయిపోయింది ప్రియా నాయుడు. 'బాహుబలి: ది కంక్లూజన్' షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఇప్పటికే వార్ ఎపిసోడ్ మొత్తం అవగొట్టేశాడు రాజమౌళి. ఇంకో నెల రోజుల్లో టాకీ పార్ట్ మొత్తం అయిపోవచ్చని సమాచారం. గ్రాఫిక్స్.. విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి. అవన్నీ కూడా పూర్తి చేసి విడుదల తేదీకి కొన్ని వారాల ముందే ఫస్ట్ కాపీ చేతికి తీసుకోవాలన్న లక్ష్యంతో సాగుతున్నాడు రాజమౌళి. 2017 ఏప్రిల్ 28న ఈ చిత్రం తెలుగు.. హిందీ.. తమిళం.. మలయాళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకొస్తుంది.

రష్మి సినిమా వచ్చింది.. తెలుసా అసలు?

24/10/2016: తెలుగులో ఫస్ట్ ఎవర్ జాంబీ సినిమా అంటూ ‘తను వచ్చెనంట’ సినిమా గురించి కొన్ని నెలల కిందటప్రచారం మొదలైనపుడు జనాలు బాగానే ఆసక్తి చూపించారు. పైగా అప్పటికి ‘గుంటూరు టాకీస్’ రిలీజై రష్మి గౌతమ్ మాంచి ఊపులో కనిపించింది. కానీ తర్వాత తర్వాత ఈ సినిమా పెద్దగా వార్తల్లో లేదు. ఈ మధ్య పెద్దగా ప్రమోషన్ లేకుండానే రిలీజ్ డేట్ ఇచ్చేశారు. ఈ శుక్రవారమే ఇంకో మూణ్నాలుగు సినిమాలతో పోటీ పడుతూ థియేటర్లలోకి దిగింది ‘తను వచ్చెనంట’. ఐతే ఈ సినిమా వచ్చిన సంగతే జనాలకు తెలియలేదు. సరే.. విడుదలకు ముందు బజ్ ఉందా లేదా అన్నది పక్కనబెడితే.. సినిమా బాగుంటే ఆటోమేటిగ్గా జనాలు ఆ సినిమా గురించి చర్చించుకునేవాళ్లు. కానీ ‘తను వచ్చెనంట’లో ఏ ప్రత్యేకతా లేకపోయింది. జాంబీ పేరు చెప్పి.. మళ్లీ రొటీన్ హార్రర్ కామెడీనే వడ్డించారు. సినిమా ఆద్యంతం బోరింగ్ గా సాగిపోయింది. రష్మి అందాల విందు కోసం వెళ్లినవాళ్లకు కొంచెం గిట్టుబాటైంది తప్ప.. సినిమా ఓవరాల్ గా ఎలాంటి ఇంపాక్ట్ వేయలేకపోయింది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్లు.. ‘గుంటూరు టాకీస్’ తర్వాత తనకు కొంచెం క్రేజ్ వచ్చింది కదా అని చేతికొచ్చిన సినిమానల్లా ఒప్పేసుకుంటోంది రష్మి. ఆమె లాస్ట్ మూవీ ‘అంతం’ కూడా ఒక వృథా ప్రయత్నమే. ఆ సినిమాకు కూడా ఆమె అందాలే పెట్టుబడి అయ్యాయి. ఆమెను ముందు పెట్టే సినిమాను ప్రమోట్ చేశారు. తీరా సినిమా చూస్తే తల బొప్పి కట్టింది. మరి రష్మి ఇకనైనా జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటుందో.. ఇలాగే ఆఫర్ చేసిన ప్రతి సినిమానూ ఒప్పుకుంటూ వెళ్తుందో చూడాలి.

పవన్ కళ్యాణ్ సినిమాకు తమన్..?

24/10/2016: ప్రతి హీరో ఒక్కో టైంలో ఒక్క సంగీత దర్శకుడిని ప్రిఫర్ చేస్తుంటాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఎక్కువగా రమణ గోగులతో పని చేసేవాడు. ఆ తర్వాత మణిశర్మతో కొన్ని సినిమాలు చేశాడు. ఆపై ఎక్కువ సినిమాలు చేసింది దేవిశ్రీ ప్రసాద్‌తోనే. గత ఏడాదే అనూప్ రూబెన్స్‌తో తొలిసారి ‘గోపాల గోపాల’కు వర్క్ చేశాడు. ఇప్పుడు అనూప్ రూబెన్స్‌తోనే ‘కాటమరాయుడు’ చేస్తున్నాడు పవన్. ఐతే ఇప్పటిదాకా పవన్.. ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌కు మాత్రం అవకాశం ఇవ్వలేదు. అతనే తమన్. ఐతే తమన్ కూడా త్వరలోనే పవన్‌తో వర్క్ చేయబోతున్నట్లు సమాచారం. తమిళంలో ‘జిల్లా’ లాంటి బ్లాక్‌బస్టర్ తీసిన టీఎన్ నీశన్ దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం నిర్మాణంలో పవన్ ఓ సినిమాకుకమిటైన సంగతి తెలిసిందే. ఈ మధ్యే ఆ సినిమా ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. ఐతే రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు కానీ.. ఈలోపు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికపై దృష్టిపెట్టారు. ఈ సినిమాకు నయనతారను హీరోయిన్‌గా అనుకుంటుండగా.. తమన్‌ను సంగీత దర్శకుడిగా సెలక్ట్ చేసినట్లు సమాచారం. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ పని చేసిన తమన్‌కు తొలిసారి పవన్‌తో చేసే ఛాన్స్ దక్కుతోంది. మరి ఆ అవకాశాన్ని తమన్ ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటాడో... ఎలాంటి ఔట్ పుట్ ఇస్తాడో చూడాలి.

తెలుగులో ‘బలం’గా వస్తున్న హృతిక్ రోషన్ ‘కాబిల్’

24/10/2016: మొహంజాదారో తర్వాత వస్తున్న హృతిక్ రోషన్ సినిమా కాబిల్. హ‌ృతిక్, రాకేష్ రోషన్ కాంబినేషన్‌లో వస్తోన్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘కాబిల్’ . ఈ సినిమాను తెలుగులో ‘బలం’ అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. గతంలో కహో నా ప్యార్ హై, కోయి మిల్ గయా, క్రిష్, క్రిష్ 3 వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మళ్ళీ ‘బలం’తో తెలుగు ప్రేక్షకుల ముందు కు రాబోతోంది. ఈ మూవీలో హృతిక్ రోషన్తోపాటు యామీ గౌతమ్ హీరోయిన్ గా నటిస్తోంది. సంజయ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తం గా జనవరి 26 2017 న విడుదల అవుతుంది. గతం లో హృతిక్ నటించిన క్రిష్ చిత్రాలు మరియు ధూమ్ 2 చిత్రం తెలుగు లో విశేష ఆదరణ పొందాయి. హృతిక్‌కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో తెలుగు లో కూడా భారీ విడుదలకు నిర్మాతలు సిద్ధ పడుతున్నారు. ఈ సినిమా మొదటి ట్రైలర్ మరియు లుక్ దీపావళి కానుకగా విడుదల అవుతుంది.

ధర్మయోగి ది లీడర్ అంటున్న తమిళ స్టార్ ధనుష్..!

22/10/2016: రఘువరన్‌ బి.టెక్‌’ చిత్రంతో తెలుగులోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న హీరో ధనుష్‌ తాజాగా ‘రైల్‌’ చిత్రంతో ఓ డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చారు. ఈ దీపావళికి మరో డిఫరెంట్‌ మూవీతో ధనుష్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన ‘కోడి’ చిత్రంలో తొలిసారి ధనుష్‌ ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రం ‘ధర్మయోగి'(ది లీడర్‌) పేరుతో తెలుగులో విడుదల కానుంది. శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యువ నిర్మాత సి.హెచ్‌.సతీష్‌కుమార్‌ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలోని పాట‌ల‌ను హైద‌రాబాద్‌లో శుక్ర‌వారం విడుద‌ల చేశారు. హీరో ధ‌నుష్ పాట‌ల సీడీని విడుద‌ల చేశారు. నిర్మాత సి.హెచ్‌.సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ – ”ధనుష్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన ‘కోడి’ చిత్రంపై చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. తెలుగులో ధనుష్‌కి వున్న ఫాలోయింగ్‌ అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ధర్మయోగి’ పేరుతో విడుదల చేస్తున్నాం. ఈ చిత్రంలో ధనుష్‌ చేసిన రెండు క్యారెక్టర్స్‌ పూర్తి విభిన్నంగా వుంటాయి. ఈ చిత్రంలో త్రిష, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా, తమిళ్‌ స్టార్‌ హీరో విజయ్‌ తండ్రి ఎస్‌.ఎ.చంద్రశేఖర్‌ ఓ ప్రత్యేక పాత్రను చేయడం విశేషం. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘కబాలి’ చిత్రానికి సంగీతాన్ని అందించిన సంతోష్‌ నారాయణన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి దీపావళి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగులో 500కి పైగా థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్నాం. త్రిష ఈ సినిమా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో చేస్తోంది. ఈ చిత్రం పెద్ద హిట్‌ అయి మా విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌కి మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను” అన్నారు. ఆర్పీ ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ “ధ‌నుష్ కొల‌వెరి పాట‌తో క్రేజ్ సంపాదించుకున్నారు. ఆయ‌న ముంబై వెళ్తే జీ వాళ్లు అర‌పూట అక్క‌డివారికి సెల‌వులు ఇచ్చారు. అదీ ధ‌నుష్ స్టామినా. ఆయ‌న సౌత్ ఇండియ‌న్ స్టార్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది“ అని అన్నారు. దామోద‌ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ “ధ‌నుష్ సినిమా అన‌గానే స్ట్ర‌యిట్ సినిమా అనే ఫీలింగ్ వ‌చ్చేస్తుంది. ఆయ‌న సినిమాలు ఇక్క‌డ కూడా అంతే క‌లెక్ట్ చేస్తున్నాయి“ అని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో సురేష్ కొండేటి, రాజ్ మాదిరాజుతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: వెంకటేష్‌ ఎస్‌., ఎడిటింగ్‌: ప్రకాష్‌ మబ్బు, సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, సమర్పణ: శ్రీమతి జగన్మోహిని, నిర్మాత: సి.హెచ్‌.సతీష్‌కుమార్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌.

నాగచైతన్య ఈ ఏడాదిని ఎలా ముగిస్తాడో..!

22/10/2016: తనకు ఎలాంటి సినిమాలు సెట్టవుతాయో తెలియక కొంత కాలం పాటు తికమకలో ఉన్నాడు నాగచైతన్య. ఆ కన్ఫ్యూజన్ లోనే కొన్ని ఫ్లాపుల్ని ఎకౌంట్ లో వేసుకున్నాడు. అయితే ప్రేమమ్ హిట్ తర్వాత తన జానర్ ఎలా ఉండాలో చైతూకు అర్ధమైనట్టుంది. అందుకే ఇకపై మంచి ప్రేమ కథా చిత్రాలకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట. మాస్ హీరో ఇమేజ్ కు కాలం చెల్లిపోయింది. ఇప్పుడున్న కాలంలో ఈ సినిమాలకు ఆదరణ లేదు. ఫాలోయింగ్ అంతకంటే లేదు. రియలిస్టిక్ సినిమాలు, మంచి కథనం ఉండే సినిమాలకే ప్రేక్షకులు టిక్కెట్ కొంటున్నారు. కాబట్టి, చైతూ ఈ మాస్ సినిమాలపై దృష్టి పెట్టకపోవడమే బెటర్. దీన్ని ఈ యంగ్ హీరో కూడా త్వరగానే అర్ధం చేసుకున్నాడు. ప్రేమమ్ తో 20 కోట్ల షేర్ కలెక్ట్ చేసి డీసెంట్ హిట్ ను ఖాతాలో వేసుకున్న నాగచైతన్య, త్వరలో సాహసం శ్వాసగా సాగిపో అంటూ గౌతమ్ మీనన్ తెరకెక్కించిన సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. నవంబర్ 11న ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమా కూడా హిట్ పడిందంటే, ఇక ఈ యంగ్ హీరో కెరీర్ స్పీడ్ అందుకున్నట్టే. ఆల్రెడీ యంగ్ హీరోలందరూ దూసుకుపోతున్న నేపథ్యంలో చైతన్య కూడా స్పీడ్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూవీలో చైతన్య సరసన మంజిమా మోహన్ రొమాన్స్ చేస్తుండగా, సింగర్ బాబా సెహగల్ ఒక కీలక పాత్ర చేయడం విశేషం.

తెలుగు సినిమా ప్రేక్షకులకి శుభవార్త

22/10/2016: ఫ్యామిలీతోనో, ఫ్రెండ్స్ తోనో సరదాగా సినిమాకి వెళితే, తెర మీద అసలు సినిమా కన్నా ముందు “ఈ నగరానికి ఏమైంది, ఓవైపు నుసి, మరోవైపు పొగ” అంటూ ఒక ప్రకటన, “ఆనందాన్ని ఎవరు కోరుకోరు కానీ ఎంత మూల్యానికి” అని ఇంకో ప్రకటన వచ్చేవి. పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరం అనే సందేశం ఇవ్వడం మంచిదే అయినా, ఆ ప్రకటనలు రూపొందించిన తీరు, వాటికి డబ్బింగ్ చెప్పిన తీరు ప్రేక్షకుల్ని విసిగించేది. ఈ బాధ భరించక తప్పదు అని అర్థం అయిన ప్రేక్షకులు ఈ ప్రకటనల మీద జోకులు వేస్తూ, సెటైర్లు వేస్తూ కాలక్షేపం చేసేవారు. ప్రేక్షకులకి ఇప్పుడా బాధ తప్పింది. పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరం అనే ప్రకటనలు ఆపలేదు కానీ, కొత్త ప్రకటనలు వచ్చాయి. ఈ ప్రకటనల్లో మాజీ క్రికెటర్, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ కనిపిస్తున్నారు. ద్రావిడ్ మీద చేసిన మూడు ప్రకటనలని కొత్తగా థియేటర్స్ లో వేస్తున్నారు. మొత్తానికి ఈ నగరానికి ఏమైంది అనే ప్రకటనలనుంచి ప్రేక్షకులకు విముక్తి లభించింది. కేంద్ర ప్రభుత్వం దగ్గర కోట్లాది రూపాయల డబ్బు ఉంది. ఆ డబ్బుతో మంచి ప్రకటనలు చేయించవచ్చు కదా. తుకాసి క్వాలిటీతో ఈ యాడ్స్ ఎందుకు? అయినా, తెలుగులో నేరుగా యాడ్స్ చేయలేరా? ఢిల్లీ స్థాయిలో హిందీలో చేసినవి డబ్బింగ్ చేసి జనం మీద రుద్డకపోతే. ఈ ప్రభుత్వాల పనులన్నీ ఇలాగే ఏడుస్తాయి. ఏం చేద్దాం?

రవితేజకు ప్రస్తుతం సినిమాలు చేసే మూడ్ లేదు

22/10/2016: ఒకప్పుడు ఏడాదికి కనీసం రెండు రిలీజులుండేలా చూసుకునేవాడు మాస్ రాజా రవితేజ. తెలుగు హీరోలందరూ రవితేజను చూసి నేర్చుకోవాలని టాలీవుడ్లో అంతర్గతంగా చర్చలు జరిగేవి. మిగతా హీరోలు ఒక్కో సినిమాకు ఏడాది రెండేళ్లు వెచ్చిస్తుంటే రవితేజ మాత్రం నాలుగైదు నెలల్లో ఒక సినిమా పూర్తి చేసి పడేసేవాడు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే ఇంకో సినిమాకు స్క్రిప్టు రెడీ అయిపోయేది. ఒకేసారి రెండు సినిమాలు కూడా చేసేవాడు. అలాంటిది హీరో అయ్యాక తన కెరీర్లోనే ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఏడాది పాటు ఖాళీగా ఉండిపోయాడు మాస్ రాజా. ‘బెంగాల్ టైగర్’ తర్వాత దిల్ రాజు-వేణు శ్రీరామ్ ప్రారంభోత్సవం జరుపుకుని కూడా ఆగిపోయింది. ఆ తర్వాత సుధీర్ వర్మతో అని.. ఇంకో కొత్త దర్శకుడితో అని చర్చలు నడిచాయి. చివరికి బాబీ దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమాకు అంతా రెడీ అన్నట్లే కనిపించింది. కానీ ఆ సినిమా కూడా ఆగిపోయింది. ఇలాంటి తరుణంలో రవితేజకు అత్యంత ఆప్తుడు.. అతడికి హీరోగా లైఫ్ ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్ చెబుతున్న మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. రవితేజకు ప్రస్తుతం సినిమాలు చేసే మూడ్ లేదు అనేశాడు పూరి. మీ మిత్రుడు రవితేజతో సినిమా ఎప్పుడు అని అంటే.. ‘‘చేయాలనే ఉంది. మేమిద్దం కలిసి సినిమా చేసి చాలా రోజులైంది. కానీ రవితేజకు ప్రస్తుతం సినిమాలు చేసే మూడ్ లేదు. అతను ప్రపంచమంతా చుట్టేస్తున్నాడు. ‘పూరి సినిమాలు మానేయ్.. విదేశాలు చుట్టొద్దాం’ అంటుున్నాడు. మేమిద్దరం 15 ఏళ్ల పాటు నిర్విరామంగా పని చేశాం’’ అన్నాడు పూరి. అంటే పూరి చెబుతున్న మాటల్ని బట్టి మాస్ రాజా ఇప్పుడిప్పుడే మళ్లీ షూటింగుకి వచ్చేలా కనిపించట్లేదే!

హాట్‌: వూర నాటు కాజల్

22/10/2016: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తెలుగమ్మాయి కాకపోయినా.. పదహారణాల తెలుగమ్మాయిలా ఉంటుంది. ముఖ్యంగా తేజ డైరక్ట్ చేసిన కాజల్ ఫస్ట్ మూవీ లక్ష్మీ కళ్యాణం చూశాక జనాలంతా.. కాజల్ మాయలో పడిపోయారు. పల్లెటూరి మరదలి పిల్ల పాత్రలో కాజల్ అదరగొట్టింది. రీసెంట్ గా గోవిందుడు అందరివాడేలే మూవీలో కూడా లంగాఓణీల్లో కనిపించి యూత్ ను రెచ్చగొట్టింది. ఇప్పుడు మరోసారి తేజ డైరక్షన్లో నటిస్తున్న కాజల్.. దగ్గుబాటి రానా సరసన హీరోయిన్ గా చేస్తోంది. తమిళనాడు కరైకుడిలో ప్రస్తుతం తేజ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీలో కూడా కాజల్ బొండుమల్లెపూలు, బొడ్డు కింద చీరతో దర్శనమిస్తోంది. అసలే సన్నజాజి తీగ లాంటి కాజల్ నడుము.. ఈ గెటప్ లో మరింత బాగా కనిపిస్తోందని యూత్ లొట్లేస్తున్నారు. తేజ మూవీస్ లో లేడీ క్యారెక్టర్లన్నీ ఇలాగే కనిపిస్తాయని మనకు తెలిసినా.. కాజల్ ను ఈ గెటప్ లో చూస్తుంటే మాత్రం ఆ కిక్కే వేరుగా ఉందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. షూటింగ్ లోనే యూత్ ను రెచ్చగొడుతున్న కాజల్.. మూవీలో మరిన్ని అందాలు వడ్డించడం ఖాయమని అంచనాలు వేసుకుంటున్నారు.

టీచర్ గా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్..!

21/10/2016: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు 2016 మర్చిపోలేని ఏడాదిగా నిలిచిపోతుంది. నాన్నకు ప్రేమతో సినిమాతో 50 రోజుల వేడుకు జరుపుకున్న తారక్, జనతాగ్యారేజ్ ను కూడా 50 రోజుల సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ తర్వాత నెక్స్ట్ ఏ సినిమా చేస్తాడా అని అభిమానులు ఎదురుచూస్తుంటే, జూనియర్ మాత్రం ఫ్యామిలీ తో టైమ్ స్పెండ్ చేస్తూ రెస్ట్ తీసుకుంటున్నాడు. ఫ్యామిలీతో పాటు బ్యాంకాక్ వెళ్లి కొన్ని రోజులు రిలాక్స్ అయిన ఎన్టీఆర్, ఇప్పుడు ఇంటికి తిరిగొచ్చేశాడు. అయితే ఇప్పుడు కూడా తన కొడుకు అభయ్ రామ్ తో టైమ్ స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. కొడుక్కి తనే స్వయంగా దగ్గరుండి అ, ఆ, ఇ ఈ అంటూ తెలుగు అక్షరాలను దిద్దిస్తున్నాడట. ఫ్యామిలీకి టైమ్ కేటాయించి చాలా రోజులవడంతో, కుటుంబాన్ని వదిలి జూనియర్ అసలు బయటికే రావట్లేదట. సినిమాల విషయానికొస్తే, నెక్స్ట్ ఎన్టీఆర్ ఏ సినిమా చేయబోతున్నాడన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. పూరీ జగన్నాథ్ తో సినిమా చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీపావళి లోపు తారక్ ఏమేం సినిమా చేస్తున్నాడన్నదానిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. వక్కంతం వంశీ తో సినిమా స్టార్ట్ అవ్వాల్సి ఉన్నా, ఏవో కారణాల వల్ల ఆఖరి నిముషంలో ఆ సినిమాను పక్కన పెట్టేశాడు తారక్. ఏ సినిమా చేసినా అది ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లోనే ఉండబోతుందని సమాచారం.

కేసీఆర్ ని కూడా వదలడం లేదు..!

21/10/2016: ఎం.ఎస్ ధోని చిత్రం బంపర్ హిట్ కొట్టాక సినీ పరిశ్రమ అంతా జీవిత చరిత్రలను తెరకెక్కించే పనిలో పడింది. ఆ దిశగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జీవిత చరిత్రను ఒక సినిమాగా మలచాలని చూస్తున్నారు సినీ ప్రముఖులు. అయితే ఇక్కడ వీరందరికీ సుదీర్థమైన వీరి చరిత్రను ఎలా మొదలెట్టాలి ఎలా ఎండ్ చేయాలన్న దానిపైనే తికమక పడుతున్నారు. మొత్తానికి టాలీవుడ్ దర్శక నిర్మాత అయిన మధుర శ్రీధర్ ముందుకు వచ్చి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా, రధసారథిగా వ్యవహరించిన ఓ శక్తిగా మూడే మూడక్షరాల కె.సి.ఆర్ చరిత్రను సినిమాగా రూపొందించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సందర్భంగా మధుర శ్రీధర్ మాట్లాడుతూ.. తెలంగాణా ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకొని అందులో పాల్గొన్న కుటుంబంలోంచి వచ్చిన నేను 1969 నాటి విషయాలు, ఈనాటి తెలంగాణ ఉద్యమ ప్రత్యక్ష పోరాటాలు చూసి నాలోని దర్శకుడు బయటకు వచ్చాడు. ఆ దిశగా తెలంగాణ ఉధ్యమానికి ధీటుగా జరిపిన కొందరి ప్రపంచ నాయకుల చరిత్రలపై పరిశోధనలు చేసాను. మహాత్మా గాంధి, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా వంటి గొప్ప నాయకుల జీవితాలకు ఏమాత్రం తీసిపోని విధంగా కెసిఆర్ జీవితం ఉంటుంది. అందుకనే కేసీఆర్ జీవితాన్ని తెరకెక్కించాలని దర్శకుడిగా నిర్ణయం తీసుకున్నాను..అని తెలిపాడు. అయితే 2017 జూన్ 2 న తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం రోజు తన దర్శకత్వంలో షూటింగ్ మొదలుపెట్టి, 2018 ఫిబ్రవరి 17న కెసిఆర్ పుట్టినరోజుకి సినిమాను పూర్తి చేసి విడుదల చేస్తానన్నాడు శ్రీధర్. కాగా కెసీఆర్ జీవితానికి తెలంగాణ ఉద్యమానికి విడదీయరాని సంబంధం ఉన్న విషయం తెలిసిందే. ఉద్యమానికి ఊపిరిలా ఆయన చేసిన నిరాహార దీక్ష ఒక్కటే ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావానికి కీలకంగా మారిన అంశంగా చెప్పవచ్చు. ఆ తర్వాత, అప్పటి నుండి కెసిఆర్ కేంద్రంగా జరిగిన ఉద్యమాలు, తెలంగాణ వ్యాప్తంగా జరిపిన ప్రజా ఉద్యమాలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావానికి కీలకంగా నిలిచినవని చెప్పవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే కెసిఆర్ లేకుండా తెలంగాణ ఉద్యమం లేదు. ఉద్యమంలో కెసిఆర్ తప్పుకుండా ఉన్నాడు. అంటే ఉద్యమమే కెసిఆర్, కెసిఆరే ఉద్యమం అనవచ్చు.

నయన్ బాయ్ ఫ్రెండ్.. ఆమెను కాదని

21/10/2016: రెండు మూడేళ్లుగా కోలీవుడ్లో నయనతారకు ఎదురే లేదు. రెండేళ్ల వ్యవధిలో నాలుగు హిట్లు కొట్టేసి సౌత్ ఇండియా మొత్తంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది నయన్. తమిళంలో ఆమెకసలు పోటీనే లేకుండా పోయింది. మిగతా హీరోయిన్లు ఆమెకు అసలు పోటీ ఇచ్చే పరిస్థితుల్లోనే లేరు. ఐతే ఇప్పుడు సీన్ మారుతోంది. నయన్ లాగే మలయాళ గడ్డ నుంచి వచ్చిన కీర్తి సురేష్ ప్రస్తుతం మామూలు జోరుమీద లేదు. ఈ ఏడాది ఆరంభంలోనే ‘రజినీ మురుగన్’ రూపంలో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న కీర్తికి.. తాజాగా ‘రెమో’ రూపంలో మరో హిట్ వచ్చింది. డివైడ్ టాక్ తో మొదలైన ఈ సినిమా కూడా చివరికి హిట్ అనిపించుకోవడంతో కీర్తికి లక్కీ గర్ల్ అన్న ట్యాగ్ వచ్చేసింది. ఆల్రెడీ విజయ్ లాంటి సూపర్ స్టార్ తో కలిసి ‘భైరవ’ అనే సినిమాలో చేస్తున్న కీర్తికి.. ప్రస్తుతం మరిన్ని పెద్ద అవకాశాలు అందుతున్నాయి. తాజాగా సూర్య కొత్త సినిమాకు కూడా ఆమే కథానాయికగా ఎంపికైంది. ఈ చిత్రానికి నయన తార లేటెస్ట్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ దర్శకుడు. ముందు దీనికి నయనతారనే హీరోయిన్ అనుకున్నారు. విఘ్నేష్ కూడా ఆమె పట్లే ఆసక్తి చూపించాడు. కానీ తర్వాత ఏం జరిగిందో ఏమో.. సడెన్ గా కీర్తి లైన్లోకి వచ్చింది. కీర్తి ఫామ్ చూసి.. సూర్య-విఘ్నేష్ ఇద్దరూ ఆమెకే ఓటేశారు. విఘ్నేష్ స్వయంగా నయనతారను కాదని కీర్తిని ఓకే చేశాడంటే ఆమె హవా ఏ సథాయిలో నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే కీర్తి.. నయనను పక్కకు నెట్టేసి కోలీవుడ్ క్వీన్ గా అవతరించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే కామెంట్

21/10/2016: మన హీరోను మన వాళ్లు పొగడ్డం మామూలే. అలా కాకుండా మరో భాషకు చెందిన నటుడు మన హీరోను పొగిడితే.. అతడి ఎనర్జీని తాను మ్యాచ్ చేయలేనని చెబితే అంతకంటే ఆ హీరో అభిమానులకు కిక్కిచ్చే విషయం మరొకటి ఉండదు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రస్తుతం అలాంటి కిక్కే అనుభవిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయే సినిమా 'టెంపర్'. అందులో యంగ్ టైగర్ పెర్ఫామెన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఓ పదేళ్లు దాటాక కూడా ఇందులో ఎన్టీఆర్ నటన చూసి గొప్పగానే చెప్పుకుంటారు. ఇలాంటి పెర్ఫామెన్స్ తాను అయితే ఇవ్వలేనని చెప్పేశాడట బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్. ఇంతకీ అభిషేక్ 'టెంపర్' గురించి ఎందుకు మాట్లాడాడు అంటే.. 'టెంపర్' కథతో హిందీ సినిమా చేయాలని అనుకున్నాడట పూరి. ఈ కథను అభిషేక్‌కు వినిపిస్తే.. ఎన్టీఆర్‌లా తాను భావోద్వేగాలు పండించలేనని.. ఆ కథతో తాను సినిమా చేయలేనని చేతులు జోడించేశాడట. పూరి చెప్పిన ఈ మాట విని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. అంతా బాగుంది కానీ.. అసలు పూరికి 'టెంపర్' కథను హిందీలో చేయడానికి మరో హీరో దొరకలేదా అన్నదే డౌటు. అభిషేక్ నట ప్రతిభ గురించి కొత్తగా చెప్పేదేముంది. బాలీవుడ్లో బ్యాడ్ యాక్టర్స్‌లో ఒకడిగా గొప్ప పేరే సంపాదించుకున్నాడు. మరి అలాంటి వాడు 'టెంపర్' స్టోరీ చేయగలడని పూరి ఎలా అనుకున్నాడో? ఏ అక్షయ్ కుమార్ లాంటి వాడినో తీసుకుంటే కదా 'టెంపర్'కు న్యాయం చేయగలడు.

నేనా అప్పుల్లో మునిగిపోయానా-కళ్యాణ్

21/10/2016: ఇజం సినిమా బడ్జెట్ రూ.25 కోట్లని.. ఐతే బిజినెస్ రూ.20 కోట్లకే జరిగిందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకుముందు ‘ఓం 3డీ’ సినిమాతో గట్టి దెబ్బ తిన్న నందమూరి కళ్యాణ్ రామ్.. మరోసారి పెద్ద రిస్కే చేశాడని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఐతే ఇందులో వాస్తవం లేదంటున్నాడు కళ్యాణ్ రామ్. ‘ఇజం’ సినిమాకు కొంచెం బడ్జెట్ ఎక్కువైన మాట వాస్తవమే కానీ.. ప్రచారం జరుగుతున్నంత కాదని.. తాను మరీ అంత ప్రమాదంలో ఏమీ లేదని ఓ ఇంటర్వ్యూలో నందమూరి హీరో చెప్పాడు. ‘‘ఇజం సినిమాకు మరీ ఎక్కువ ఖర్చు పెట్టేయలేదు. బడ్జెట్ కొంచెం అటు ఇటు అయి ఉండొచ్చు. కొంత ఇబ్బంది వచ్చి ఉండొచ్చు. కానీ మన కెరీర్ కోసం.. మన కోసం అది పెద్ద మొత్తం కాదు. ఐతే నా గురించి వినిపిస్తున్న రూమర్లు వాస్తవం కాదు. కళ్యాణ్ రామ్ అయిపోయాడు.. అప్పుల్లో మునిగిపోయాడు.. ఇలాంటివన్నీ ఊహాగానాలే. నేను అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇంకో సినిమా ఎలా చేయగలను’’ అని కళ్యాణ్ రామ్ ప్రశ్నించాడు. చాలా వరకు సొంత బేనర్లో సినిమాలు చేస్తుండటానికి కారణమేంటని అడిగితే.. ‘‘బయట చేయాలని నాకూ ఉంటుంది. ఒక దర్శకుడు మంచి సబ్జెక్ట్ తెస్తాడు. నేను టెంప్ట్ అయిపోయి సొంత బేనర్లో చేస్తుంటా. కొన్నిసార్లు రిస్క్ నేనే భరిద్దాం అని కూడా అనిపిస్తుంది. ఇకపై సీరియస్‌గా బయటి సినిమాలు చేయడంపై దృష్టిపెడతా’’ అని కళ్యాన్ రామ్ చెప్పాడు.

ఉదయభాను నన్ను అపార్థం చేసుకుంది - సునీత

21/10/2016: వివాదాలకు దూరంగా ఉండే సింగర్ సునీత అనుకోని రీతిలో ఒక వివాదంలో చిక్కుకున్నారు. బోల్డ్ గా మాట్లాడేసే యాంకర్ ఉదయభానును ఆమె అవమానించినట్లుగా నడుస్తున్న రచ్చ మరో మలుపు తీసుకుంది. చూసేందుకు సుకుమారంగా కనిపించే సునీత.. ఎంత ధైర్యవంతురాలో ఆమెను వ్యక్తిగతంగా తెలిసిన వారందరికి తెలుసు. నిండైన ఆత్మవిశ్వాసంతో పాటు.. మొహమాటం లేకుండా మాట్లాడేయటం.. సూటిగా ఉన్నది ఉన్నట్లు చెప్పేయటంతో పాటు.. ముసుగులో గుద్దులాటలకు ఆమె చాలా దూరం. ఈ మధ్య మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో యాంకర్ ఉదయభాను మాట్లాడుతూ.. తనను ఒక ప్రముఖ సింగర్ అవమానించారని చెప్పుకొచ్చారు. సింగర్ సునీత పేరును నేరుగా ప్రస్తావించని ఆమె.. ఒక ప్రముఖ సింగర్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ అంశంపై సునీత ఒక మీడియాసంస్థతో ఓపెన్ గా మాట్లాడేశారు. యాంకర్ ఉదయభాను ప్రస్తావించిన సింగర్ ను తానేనని.. ఆమెను తాను అవమానించలేదని చెబుతూ.. అసలేం జరిగిందో తెలుసా? అంటూ అసలు విషయం ఇదేనంటూ.. ''ఉదయభాను నన్ను అపార్థం చేసుకుంది. నేను ఆమెను అవమానించలేదు. ఆమె వచ్చిన ప్రోగ్రాం పూర్తిగా నాదే. ఆమెను నేను ఆహ్వానించలేదు. ఆర్గనైజర్లు పిలిచారు. అలా వచ్చినప్పుడు స్టేజ్ మీదకు రమ్మని ఆహ్వానించలేను కదా. ఇక.. ఆమె స్టేజ్ మీదకు వచ్చేటప్పుడు స్యాడ్ మ్యూజిక్ ప్లే చేసినట్లు చెప్పారు. కానీ.. ఆ విషయం నాకు గుర్తు లేదు. నిజానికి ఆ షో తర్వాత తను ఎక్కడైనా కనిపిస్తే నేనే వెళ్లి పలుకరించేదాన్ని. కానీ.. ఆమె మాత్రం పలుకరించేది కాదు. ఆమె ఎందుకలా ఉండేదో అర్థమయ్యేది కాదు. ఆమె ఇంటర్వ్యూతో తనకు నా మీద కోపానికి కారణం ఏమిటోతెలిసింది. అయినా.. చిన్న విషయాన్ని మనసులో పెట్టుకొంది" అని అసలు విషయాన్ని వివరంగా చెప్పుకొచ్చారు. నిజానికి ఒక సెలబ్రిటీ.. మరో సెలబ్రటీతో గ్యాప్ విషయంలో ఇంత ధైర్యంగా మాట్లాడటం సునీతకు మాత్రమే సాధ్యమవుతుందేమో.

అనుష్కకు కల్యాణ ఘడియలు?

20/10/2016: మూడు పదుల వయసు పైబడిన నటీమణులకు ఇంటా బయట పెళ్లి ఒత్తిడి పెరగడం సర్వసాధారణం. 34 ఏళ్ల నటి అనుష్కకు అలాంటి తాకిడి ఉంటుందనడం అనూహ్యమేమీ కాదు. ఉన్నత విద్యను పూర్తి చేసిన అనుష్క ఆదిలో యోగా శిక్షణ పొంది, తర్వాత యోగా టీచర్‌గా పలువురికి శిక్షణ ఇచ్చారు. అలాంటి బ్యూటీని విధి నటిని చేసింది. అనుష్క 2005లో వెండితెరకు పరిచయం అయ్యారు. అలా తొలి రోజుల్లో అందాలారబోస్తూ అవకాశాలు పెంచుకుంటూ వచ్చిన అనుష్కకు అరుంధతి చిత్రం ఆమె నట దిశను ఒక్కసారిగా మార్చేసింది. స్టార్ నాయకిగా తమిళం, తెలుగు భాషల్లో అగ్రనాయకిగా రాణిస్తున్నారు. ఈ రెండు భాషల్లో అగ్రనాయకులందరితోనూ డ్యూయెట్లు పాడేసి ఆ సరదాను తీర్చుకున్నారు. ప్రస్తుతం తమిళంలో ఎస్-3 చిత్రంలో సూర్యతోనూ, ద్విభాషా చిత్రం బాహుబలి-2, హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం భాగమతి, భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయలో నటిస్తున్నారు. వీటిలో ఎస్-3 చిత్రం డిసెంబర్‌లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. బాహుబలి-2 వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఇలా ఉండగా అనుష్క కొత్త చిత్రాలను అంగీకరించడం లేదనే ప్రచారం జోరందుకుంది. కారణం ఈ అమ్మడి కి కల్యాణ ఘడియలు దూసుకొస్తున్నాయని సమాచారం. నటిగా ప్రశంసలు అందుకుంటున్న అనుష్క వ్యక్తిగతంగా పలు వదంతులను ఎదుర్కొంటున్నారన్నది గమనార్హం. నటుడు ఆర్యతో ప్రేమకలాపాలంటూ అప్పట్లో గాసిప్స్ హల్‌చల్ చేశాయి. ఇక ఒక తెలుగు నటుడితో డేటింగ్ అంటూ ప్రచారం హోరెత్తింది. ఇటీవల వివాహితుడైన నిర్మాతను పెళ్లాడబోతున్నట్టు ప్రచారం కలకలం పుట్టించింది. కాగా వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టే విధంగా అనుష్క కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూడడంలో వేగం పెంచినట్లు తాజా సమాచారం. అదే విధంగా హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్తతో అనుష్క పెళ్లిని నిశ్చయించినట్లు సినీ వర్గాల టాక్. బాహుబలి-2 విడుదల తరువాత అనుష్కకు డుండుండుం...పీపీపీనేననే గుసగుసలు వినిపిస్తున్నాయి.

మోడర్న్ పిశాచి!

20/10/2016: అవతారం చూస్తే అమ్మవారి మోడర్న్ లుక్ అన్నట్టుంది కదూ! మహిమలు గల మహిషాసుర మర్దిని కాదు.. ప్రతీకార జ్వాలతో రగులుతున్న పిశాచి అట. త్రిష కొత్త సినిమా ఫస్ట్ లుక్ ఇది. ఈ మోడర్న్ పిశాచి పగ ఎవరిపై అనేది త్రిష చెబితేనే తెలుస్తుంది. ఆర్.మాదేశ్ దర్శకత్వంలో త్రిష ముఖ్యతారగా నటిస్తున్న హారర్ సినిమా ‘మోహిని’. ఎనిమిది చేతుల్లో ఎనిమిది ఆయుధాలు.. పక్కనే కపాలాలు.. తలపై విచిత్రమైన కిరీటం.. ఈ సినిమాలో త్రిష ఫస్ట్ లుక్‌ను విభిన్నంగా విడుదల చేశారు. నవంబర్ మొదటి వారంలో పాటల్ని, క్రిస్మస్‌కి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘మోడర్న్ హారర్ కామెడీ సినిమా ఇది. మహిళల దూకుడుకి చిహ్నంగా వివిధ ఆయుధాలతో త్రిష ఫస్ట్ లుక్‌ని డిజైన్ చేశాం. ఓ యాక్షన్ సీక్వెన్స్ మినహా 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. బ్యాంకాక్‌లో మిగిలిన యాక్షన్ సీక్వెన్స్‌ని షూట్ చేస్తాం. ‘హ్యారీ పోటర్’ సినిమాకి పనిచేసిన వి.ఎఫ్.ఎక్స్. నిపుణులు మా చిత్రానికి పని చేస్తున్నారు’’ అన్నారు.

ఎన్టీఆర్‌లా నటించడం కష్టమన్నాడు - పూరి

20/10/2016: ‘‘ఫస్ట్ కాపీ చూసిన తర్వాత.. ‘మీకు కోపం వచ్చినా సరే.. మీ కెరీర్‌లో బెస్ట్ సినిమా ఇదండీ’ అన్నారు నాతో కల్యాణ్‌రామ్. ‘అంతకంటే సంతోషం ఏముంటుంది’ అన్నాను. నిజాయితీ ఉన్న సినిమా ఇది’’... అని పూరి జగన్నాథ్ అన్నారు. ఆయన దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించి, నిర్మించిన ‘ఇజం’ రేపు రిలీజవుతోంది. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ చెప్పిన విశేషాలు... పదిహేనేళ్లుగా కంటిన్యూగా సినిమాలు చేసింది నేను, రవితేజ మాత్రమే. ఇప్పుడు తను సినిమా చేసే మూడ్‌లో లేడు. ట్రావెలింగ్‌లో ఉన్నాడు. ప్రపంచమంతా తిరుగుతున్నాడు. నన్ను కూడా సినిమాలు మానేసి తనతో రమ్మంటున్నాడు. (నవ్వుతూ..) మనిద్దరం సినిమా చేద్దామంటే వస్తాడా? చెప్పండి! అవినీతిపై యుద్ధం చేసే ఓ విలేకరి కథే ‘ఇజం’. మనిషి ఉన్నంత వరకూ సమాజంలో అవినీతి అనేది ఉంటుంది. పదేళ్ల క్రితమే ఈ కథ రాశాను. అయితే.. ఈ పదేళ్లలో అవినీతి తీరు మారింది. ఆ మార్పులకు అనుగుణంగా కథను మార్చాను. ‘వికీలీక్స్’ అసాంజ్ స్ఫూర్తితో హీరో క్యారెక్టర్ రాశాను. నేను తీసిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’కి, ఈ కథకీ సంబంధం లేదు. కల్యాణ్‌రామ్‌తో ఈ సినిమా చేయడానికి కారణం ఏంటంటే.. జర్నలిస్టుగా నటించే వ్యక్తిలో నిజాయితీ కనిపించాలి. బేసిక్‌గా ఆయనలో ఆ నిజాయితీ ఉంది. సెకండాఫ్‌లో ఫర్ఫార్మెన్స్ ఇరగదీశాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్తమ నటుడు పురస్కారం కల్యాణ్‌రామ్‌కే వస్తుందని నా నమ్మకం. జావేద్ భాయ్‌గా జగపతిబాబు, అతడి కూతురిగా హీరోయిన్ అదితీ ఆర్య నటన బాగుంటుంది. హిందీ నుంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ, ముంబై వెళ్లి డిస్కషన్స్ చేసి, సినిమా సెట్ కావడానికి ఐదు నెలలు పడుతుంది. ఈలోపు తెలుగులో ఓ సినిమా తీసేయొచ్చు. హిందీలో ‘టెంపర్’ రీమేక్ చేద్దామని అభిషేక్ బచ్చన్‌కి చూపించాను. ‘ఎన్టీఆర్‌లా నటించడం కష్టం. ఆయన చేసిన ఫర్ఫార్మెన్స్ నేను చేయలేను’ అన్నాడు. సమాజంలో క్రమశిక్షణ లేదనే బాధతో ‘జన గణ మన’ కథ రాశాను. మహేశ్‌బాబుకు కథ చెప్పాను. బాగా నచ్చిందన్నారు. కానీ, ఆ తర్వాత రిప్లై ఇవ్వలేదు. ఆ కథతో ఎప్పుడు సినిమా తీస్తానో? ఎవరితో తీస్తానో? చెప్పలేను. అంత ఎందుకు.. పవన్‌కల్యాణ్‌కి ‘పోకిరి’, మరొకరికి ‘ఇడియట్’ కథలు నచ్చలేదు. ప్రతి సినిమాకీ ఓ టైమ్ రావాలి. నా దగ్గర పదేళ్లకు సరిపడా కథలున్నాయి. నిర్మాత సీఆర్ మనోహర్ కుమారుడు ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తున్న ‘రోగ్’ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ఈ డిసెంబర్‌లో విడుదల చేస్తాం. ఎన్టీఆర్‌తో సినిమాపై ఓ వారంలో స్పష్టత వస్తుంది. మంచి ఎంటర్‌టైనింగ్ సినిమా అది.

తేజ సినిమాలో ఆమె పాత్ర ఏంటంటే..

20/10/2016: నటనకు సంబంధించిన విషయాలతో కంటే తరచుగా ఏదో ఒక వివాదంతోనే వార్తల్లో నిలుస్తూ ఉంటుంది కేథరిన్ థ్రెసా. షూటింగ్ సందర్భంగా ఈమె బిహేవియర్ బాగోదంటూ గతంలో కొన్ని కంప్లైంట్లు వచ్చాయి. వివాదాలు చెలరేగాయి. ఐతే గతంలో జరిగిన వివాదాలన్నీ పక్కనబెట్టేస్తే.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ సందర్భంగానూ మరోసారి తన యాటిట్యూడ్ చూపించడంతో ఆ సినిమా నుంచి ఫైర్ అయిపోయింది. ఆమెను టాలీవుడ్ నుంచి బ్యాన్ చేయాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తుండటం విశేషం. ఐతే మున్ముందు ఆమెకు అవకాశాలు దక్కడం సందేహమే కానీ.. ఆల్రెడీ డాషింగ్ డైరెక్టర్ తేజ.. కేథరిన్‌కు ఓ అవకాశం ఇచ్చాడు. రానా దగ్గుబాటి-కాజల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కేథరిన్ కూడా ఓ కీలక పాత్ర చేస్తోంది. ఈ చిత్రంలో ఆమె పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి క్యారెక్టర్ కేథరిన్ ఇప్పటిదాకా చేయలేదట. ఈ పాత్ర గురించి చెప్పగానే ఆమె ఓకే అనేసినట్లు సమాచారం. కేథరిన్ ఆల్రెడీ ‘సరైనోడు’ సినిమాలో అందమైన ఎమ్మెల్యే పాత్రలో కనిపించింది. ఆ సినిమాకు ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐతే తేజ పాత్ర ఇలా రొమాంటిగ్గా ఉండే అవకాశం లేదు. పవర్ ఫుల్ ఎమ్మెల్యే అంటున్నారు కాబట్టి.. వైవిధ్యంగానే ఉంటుంది. ఆమెది నెగెటివ్ క్యారెక్టర్ కూడా అయి ఉండొచ్చు. ఐతే పాత్ర సంగతి పక్కనబెడితే.. కేథరిన్ అందరి దగ్గరా యాటిట్యూడ్ చూపించినట్లు తేజ దగ్గర చూపిస్తే మాత్రం కష్టం. ఆయనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరి.

ఇలియానా ఇంత ఓపెనేంటండీ బాబూ..

20/10/2016: బాలీవుడ్ వెళ్లాక బాగా బోల్డ్ అయిపోయింది ఇలియానా. బికినీలు.. లిప్ లాక్లు.. ఇంటిమేట్ సీన్లు.. హాట్ హాట్ ఫొటోషూట్లు.. ఇలా ఆమె ఏ రేంజిలో రెచ్చిపోయిందో చూస్తూనే వస్తున్నాం. ఐతే తన బోల్డ్నెస్ ఆమె కేవలం అప్పీయరెన్స్ వరకే పరిమితం చేయలేదు. తన మాటల్లో కూడా ఇదే బోల్డ్నెస్ చూపించేస్తోంది. ఇప్పటికే ముంబయి వెళ్లాక అనేక సంచలన వ్యాఖ్యలు చేసింది ఇలియానా. ఇటీవలే తన ఎద సౌందర్యం గురించి కూడా ఓపెన్గా మాట్లాడింది. తనకీ సౌందర్యం తక్కువంటే జనాలు ఎలా కామెంట్లు చేసింది.. తాను ఎలా బాధపడింది.. ఆ తర్వాత ఎలా మానసిక స్థైర్యం పెంచుకున్నది వివరించింది. తాజాగా తన మరో మైనస్ గురించి కూడా ఇలియానా ఓపెన్గా మాట్లాడేసింది. తన స్కిన్ కలర్ చాలా పూర్ అని ఆమె చెప్పింది. తనను తాను ఫెయిర్ అనుకోనని స్టేట్మెంట్ ఇచ్చింది. తాను వాస్తవానికి నల్లని అమ్మాయినని.. చాలామంది హీరోయిన్లతో పోలిస్తే రంగు తక్కువని ఇలియానా చెప్పింది. ఐతే సినీ పరిశ్రమలో చాలామంది అమ్మాయిలు నల్లగా ఉన్నా.. తమ ఆకర్షణతో ఆకట్టుకున్నారని.. ఆ కోవలోకే తానూ వస్తానని ఇలియానా చెప్పింది. అసలు శరీర రంగు అన్నది పెద్ద విషయం కాదని.. ముఖంలో కళ ముఖ్యమని.. అలాగే ఆత్మసౌందర్యం అన్నది అన్నిటికంటే ప్రధానమైన విషయం అని ఇలియానా సెలవిచ్చింది. ఇల్లీ ఇలా తన మైనస్లు ఒక్కోదాని గురించే ఇలా ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చేయడం గొప్ప విషయమే.

డోనరుడి ప్రేమకథ!

19/10/2016: సుమంత్, పల్లవీ సుభాష్ జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో వై.సుప్రియ, సుధీర్ పూదోట నిర్మిస్తున్న చిత్రం ‘నరుడా..! డోనరుడా..!’. మల్లిక్‌రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఏ ఉద్యోగం లేని హైదరాబాదీ కుర్రాడు పరిస్థితుల దృష్ట్యా డబ్బు కోసం స్పెర్మ్ డోనర్‌గా మారతాడు. ఆ తర్వాత ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఏ ఉద్యోగం చేస్తున్నావని అమ్మాయి అడిగితే చెప్పుకోలేడు. ఈ వీర్యదాత ప్రేమకథ ఎటువంటి మలుపులు తీసుకుందనేది ఆసక్తికరం’’ అన్నారు. తనికెళ్ల భరణి, సుమన్ శెట్టి కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి మాటలు: కిట్టూ విస్సాప్రగడ, సాగర్ రాచకొండ, కెమేరా: షానియల్ డియో, సంగీతం: శ్రీచరణ్ పాకాల.

విశాల్‌ కు విలన్‌ గా ఆర్య?

19/10/2016: నటుడు విశాల్‌కు ఆర్యకు మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అరే ఒరే అని పిలుచుకునేంత మిత్రుత్వం వారిది. అలాంటిది ఆర్య విశాల్‌కు విలన్‌గా మారడం ఏమిటన్న సందేహం కలగవచ్చు. అయితే రియల్ జీవితంలో మిత్రులైన వీరు రీల్ జీవితంలో శత్రువులుగా మారనున్నారన్నది కోలీవుడ్‌లో వినిపిస్తున్న తాజా సమాచారం. వివరాల్లోకెళితే విశాల్ ప్రస్తుతం కత్తిసండై చిత్రాన్ని పూర్తి చేసి మిష్కిన్ దర్శకత్వంలో తుప్పరివాలన్ చిత్రంలో నటిస్తున్నారు. కత్తిసండై చిత్రాన్ని దీపావళికి విడుదల చేయనున్నట్లు ముందు ప్రకటించినా, నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తికాకపోవడంతో విడుదలను నవంబర్‌కు వాయిదా వేశారు. కాగా తుప్పరివాలన్ చిత్రం పూర్తి చేసిన తరువాత విశాల్ నవదర్శకుడు పీఎస్.మిత్రన్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇందులో నటి సమంత నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఇరుంబు కుదిరై అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలిసింది. ఇది ఇంతకు ముందు మహానటుడు శివాజీగణేశన్ నటించిన చిత్రం టైటిల్ అన్నది గమనార్హం. ఇందులో విశాల్‌కు విలన్‌గా ప్రముఖ నటుడిని ఎంపిక చేయాలని భావించిన దర్శక నిర్మాతలు నటుడు ఆర్య అయితే బాగుంటుందని ఆయన్ని విలన్‌ను చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆర్యకు తమిళంలో హీరో ఇమేజ్ ఉన్నా ఆయన ఇప్పటికే మలయాళం, తెలుగు భాషల్లో ప్రతినాయకుడిగా నటించారన్నది గమనార్హం. అయితే ఆర్య విశాల్‌కు విలన్ అవుతారా? లేదా?అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇకపోతే ఈ క్రేజీ చిత్రానికి సంగీతాన్ని యువన్ శంకర్‌రాజా, చాయాగ్ర హణం జార్జ్ సీ.విలియమ్స్ అందించనున్నారు.

మోహినిగా త్రిష, దెయ్యమా..? దేవతా..?

19/10/2016: సీనియర్ హీరోయిన్ త్రిష ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి పీటల దాకా వెళ్లి వెనక్కి వచ్చిన ఈ బ్యూటి రీ ఎంట్రీ మరింత జోరు చూపిస్తోంది. విజయాలు సాధించటంలో వెనకపడుతున్నా... అందాలతో ఆకట్టుకోవటంలో మాత్రం కుర్ర హీరోయిన్ లకు కూడా పోటీ వస్తోంది. ఇటీవల హార్రర్ జానర్ లో తెరకెక్కిన అరణ్మనై 2, నాయకీ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది త్రిష. ఈ రెండు సినిమాలు ఆశించిన స్ధాయి ఫలితాలు ఇవ్వకపోయినా మరోసారి అదే జానర్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. మోహిని పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో టైటిల్ రోల్ లో నటిస్తోంది ఈ చెన్నై బ్యూటి. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. విఠలాచార్య సినిమాల్లో దెయ్యాలు వేసే తరహా స్కిన్ టైట్ డ్రెస్ లో తలపై కిరీటం, ఎనిమిది చేతులలో ఆయుధాలు.. చూస్తుంటే.. ఈజిప్ట్ దేవతలా కనిపిస్తోంది. ఎక్కువ భాగం లండన్ లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాకు ఆర్ మాదేష్ దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా త్రిష కెరీర్ కు మంచి బ్రేక్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాతో పాటు ధనుష్ హీరోగా తెరకెక్కిన కోడి సినిమాలోనూ నటిస్తోంది ఈ బ్యూటి. మరి ఈ సినిమాలైనా త్రిషకు బ్రేక్ ఇస్తాయేమో చూడాలి.

ఊహించని దారిలో...

19/10/2016: పవన్‌కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు ముచ్చటగా మూడో చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ‘వై దిస్ కొలవెరి డీ..’ ఫేమ్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ‘జల్సా’తో ప్రేక్షకుల్ని ఫుల్ ఖుషీ చేసిన పవన్, త్రివిక్రమ్‌లు.. ‘అత్తారింటికి దారేది’తో భారీ విజయంతో పాటు భారీ వసూళ్లు సాధించారు. ఈ రెండూ సగటు తెలుగు చిత్రాల తరహాలోనే ఉంటాయి. ఈసారి మాత్రం సరికొత్త దారిలో ప్రయాణించాలని నిర్ణయం తీసుకున్నారట. రెగ్యులర్ ఫార్మాట్‌లో కాకుండా ప్రేక్షకులకు కొత్త చిత్రం అందించాలనుకుంటున్నారట. అటు పవన్.. ఇటు త్రివిక్రమ్.. ఈ చిత్రం గురించి మాట్లడడం లేదు. సంగీత దర్శకుడు అనిరుధ్ మాత్రం కన్ఫర్మ్ చేసేశారు. ‘‘త్రివిక్రమ్ ‘అఆ’కి సంగీతం అందించే చాన్స్ నాకే వచ్చింది. మిస్ చేసుకున్నా. పవన్ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందబోయే తాజా చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం కాబోతున్నా. ఎవరూ ఊహించనంత కొత్తగా ఉంటుందీ సినిమా’’ అని అనిరుధ్ చెప్పారు. ఈ చిత్రానికి ‘దేవుడే దిగి వచ్చినా’ టైటిల్ పరిశీలనలో ఉందట.

ముందే ‘బాహుబలి’ ఖాతాలో 500 కోట్లు

18/10/2016: హిందీ సినిమాలకు దేశవ్యాప్తంగా మార్కెట్ ఉంటుంది. అందులోనూ ఖాన్‌ల సినిమాలంటే ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ వాళ్ల సినిమాలు కూడా ఒక రీజనల్ మూవీ ముందు దిగదుడుపే అనిపిస్తున్నాయి. ఆ సినిమా మన ‘బాహుబలి’యే కావడం విశేషం. ఇండియాలో ఇప్పటిదాకా మరే సినిమాకు లేని స్థాయిలో దీనికి బిజినెస్ జరుగుతుండటం విశేషం. ఇంకా విడుదలకు ఆరు నెలలు సమయం ఉండగానే అన్ని ఏరియాల్లోనూ బిజినెస్ ఓ కొలిక్కి వచ్చేయడం.. దాదాపు రూ.500 కోట్లు నిర్మాతల ఖాతాలో పడేలా కనిపిస్తుండటం విశేషం. కేవలం హిందీ.. తమిళం శాటిలైట్ రైట్స్ ద్వారా మాత్రమే ‘బాహుబలి’ రూ.100 కోట్లకు పైగా సంపాదించడం విశేషం. ఇంకా తెలుగు.. మలయాళం రైట్స్ అమ్ముడుపోవాల్సి ఉంది. మొత్తంగా శాటిలైట్ హక్కుల ద్వారా రూ.150 కోట్లు రావడం గ్యారెంటీ. ఇక థియేట్రికల్ రైట్స్ ద్వారా ఈజీగా రూ.350 కోట్లు వచ్చేలా కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క నైజాం ఏరియాకే ‘బాహుబలి’ హక్కులు దాదాపు రూ.50 కోట్లు పలికినట్లుగా వార్తలొస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఏరియాలూ కలిపితే ఓ 70-80 కోట్లు బాహుబలి నిర్మాతల ఖాతాలో పడటం ఖాయం. ఇక ఇండియాలోని మిగతా రాష్ట్రాల్లో.. ఓవర్సీస్ లో తెలుగు వెర్షన్ కనీసం రూ.50-60 కోట్లయినా సంపాదించి పెట్టడం ఖాయం. మొత్తంగా తెలుగు వెర్షన్ మాత్రమే రూ.200 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక హిందీ హక్కులు ఈజీగా రూ.100 కోట్ల మార్కును దాటేస్తాయి. తమిళం.. మలయాళం హక్కులు కలిపితే ఇంకో వంద కోట్ల వరకు వర్కవుట్ కావచ్చు. ఇక ఆడియో.. మర్చండైజ్.. ఇతర హక్కులన్నీ కలిపితే ఎంత లేదన్నా రూ.50 కోట్లు రావచ్చు. అలా మొత్తంగా విడుదలకు ముందే రూ.500 కోట్ల దాకా ‘బాహుబలి’ నిర్మాతలకు తెచ్చిపెడుతుందని అంచనా.

కాబోయే అత్తకు విందిచ్చిన నయన

18/10/2016: కోడలికి పేరు, ఆస్తిపాస్తులు ఎంత ఉన్నా అత్తమామలకు మర్యాదలు చేయాల్సిందే. ఇది సనాతన సంప్రదాయం. ఇక ప్రియుడు ఎంత ప్రేమించినా ఆయన అమ్మ అనుమతి లభిస్తేనే ఆ జంట భవిష్యత్ బంగారుబాటగా మారుతుంది. ఈ విషయాన్ని నటి నయనతార గ్రహించినట్లున్నారు. తనకు కాబోయే అత్తగారిని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో పడ్డారని కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు. విషయంలోకి వెళితే సంచలన తారగా వాసికెక్కిన నయనతార శింబు, ప్రభుదేవాల తరువాత తాజాగా యువ దర్శకుడు విఘ్నేశ్‌శివ ప్రేమలో పడినట్లు ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. నానూ రౌడీదాన్ చిత్రం షూటింగ్ సమయంలోనే ఆ దర్శక నటిల మధ్య ప్రేమ చిగురించిందన్నది ప్రచారంలో ఉంది. ఏ కార్యక్రమానికైనా నయనతార, విఘ్నేశ్‌శివ కలిసి హాజరవుతూ వార్తల్లోకెక్కుతున్నారు. అంతే కాదు అలాంటి కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరింత సంచలనం కలిగిస్తుండడం విశేషం. కాగా వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారనే ప్రచారం జరుగుతోంది.దీన్ని ధ్రువపరచే విధంగా ఇటీవల ఒక సంఘటన జరిగినట్లు సమాచారం. దర్శకుడు విఘ్నేశ్‌శివ తల్లిదండ్రులిద్దరూ పోలీస్ అధికారులుగా పని చేశారట. ముఖ్యంగా ఆయన తల్లి రౌడీలకు స్వప్నసింహంగా ఉండేవారట. ఎంద రో రౌడీల ఆటకట్టించిన ఆమె గురించి తెలిసి నయనతారే కంగుతిన్నారట. అలాంటిది ఎట్టకేలకు తను ప్రియుడు తల్లిని పరిచయం చేయడంతో వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతోందని సమాచారం. దాన్ని మరింత పెంచుకోవడానికి నయనతార ఇటీవల విఘ్నేశ్‌శివ తల్లిని తన ఇంటికి ఆహ్వానించి మంచి విందునిచ్చారని ప్రచారం జరుగుతోంది. నయన్ స్వయంగా తానే వంట చేసి కాబోయే అత్తకు వడ్డించారట. ఇదే ఇప్పుడు మీడియాలో టాక్ ఆఫ్ ది టాక్‌గా మారిన అంశం. మొత్తం మీద అత్త కోసం నయనతార వంటింటి బాట పట్టారన్న మాట.

అతడితో డేటింగ్ చేయడం లేదు - శృతి హాసన్

18/10/2016: బాలీవుడ్ తారలు రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ విడిపోయి దాదాపు 10 నెలలు గడిచింది. తర్వాత అతడు పలువురు హీరోయిన్లతో ప్రేమాయణం సాగించినట్టు గాసిప్స్ వచ్చాయి. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నుంచి కంగనా రౌనత్ వరకు పలువురి పేర్లు వినిపించాయి. తాజాగా మరోపేరు తెరపైకి వచ్చింది. విలక్షణ నటుడు కమలహాసన్ తనయ శృతి హాసన్ తో రణబీర్ కపూర్ డేటింగ్ చేస్తున్నట్టు గాసిప్స్ గుప్పుమన్నాయి. వీరిద్దరూ కలిసి వాణిజ్య ప్రకటనలో నటించారు. అప్పటినుంచి వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని ఊహాగానాలు వచ్చాయి. దీనిపై శృతి హాసన్ స్పందించింది. తనకు, రణబీర్ కు మధ్య ప్రేమాయణం నడుస్తుందని వచ్చిన వార్తలను కొట్టిపారేసింది. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చిచెప్పింది. 'మిడ్ డే' ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఇలాంటి రూమర్లు ఎలా పుట్టిస్తారో అర్థంకాదు. రణబీర్ తో డేటింగ్ చేస్తున్నానడడం హాస్యాస్పదం'గా ఉందని అంది. సినిమాలతో బిజీగా ఉన్నానని, రూమర్లపై స్పందించే తీరిక తనకు లేదని చెప్పింది.

వారి స్వర్గంలో చిచ్చు మొదలైందా?

18/10/2016: రణ్బీర్ కపూర్-కత్రినా కైఫ్, సిద్ధార్ధ్ మల్హోత్రా-అలియా భట్ బ్రేకప్లు బాలీవుడ్నే కాక సినీ ప్రియులనూ ఆశ్చర్యపరిచాయి. సల్మాన్ ఖాన్ - లులియా వంటూర్, అనుష్క శర్మ-విరాట్ కోహ్లిలు కూడా ఇదే ట్రాక్లో ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. వీరికి తోడుగా మరో హైఫై బ్రేకప్ను బీ టౌన్ రుచి చూడనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఎవరబ్బా అంతటి ప్రముఖ కపుల్ అనేగా మీ సందేహం? అదే చెప్పబోతున్నాం.. ఆన్స్క్రీన్, ఆఫ్స్క్రీన్ల్లోనూ మంచి రొమాంటిక్ జోడీగా పేరుతెచ్చుకున్న 'బాజీరావ్ మస్తానీ'.. దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్ల మధ్య విబేధాలు వచ్చాయని సమాచారం. దీపిక తీరు రణ్వీర్లో అసంతృప్తి రాజేస్తోందట. ఈ విషయాన్ని సన్నిహితుల వద్ద చెప్పుకుని చాలా బాధపడ్డాడట మన 'బాజీరావ్'. 'మస్తానీ' తనను చాలా నిర్లక్ష్యం చేస్తోందని తెగ ఫీలైపోయాడట. దీపిక సక్సెస్ను రణ్వీర్ కూడా సెలబ్రేట్ చేసుకుంటుంటాడు. ప్రియురాలికి కావాల్సిన దానికంటే ఎక్కువ సపోర్టే ఇస్తుంటాడు. సాధారణంగా ఏదైనా కార్యక్రమంలో ఇద్దరూ కనిపించారంటే ఆమె పట్ల చాలా కేర్ తీసుకుంటాడు. ఈ విషయం అతడి చర్యల్లోనే కాదు.. చూపుల్లోనూ తెలిసిపోతుంది. ఇక దీపు తొలి హాలీవుడ్ మూవీపైనా అతడు చాలా హడావిడే చేశాడు. సోషల్మీడియాలో ఆమెను మెచ్చుకుంటూ పలు మెసేజ్లు పెట్టాడు. అయితే రణ్వీర్ ఎగ్జైట్మెంట్కు దీపిక చాలా సాధారణంగా స్పందించిందట. ఈ రెస్పాన్సే అతడిని విపరీతంగా బాధపెట్టిందట. తన కొత్త సినిమా 'బేఫికర్' గురించి మెచ్చుకుంటూ మాట్లాడుతుందని అనుకున్న అతడికి ఆమె మౌనమే సమాధానమైందని సమాచారం. దీంతో తాను దీపిక గురించి తెగ ఇదై పోతున్నా, ఆమె మాత్రం ఏలాంటి ఫీలింగ్ చూపించడం లేదని రణ్వీర్ వాపోతున్నాడట. ఈ విషయాన్ని మీడియా మిత్రులు ఆరా తీయగా 'పీకూ' స్టార్ నోరు విప్పలేదు. రణ్వీర్ ప్రతినిధి మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చాడు. వీరి స్వర్గంలో చిచ్చు మొదలైందన్న విషయం తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

కళ్యాణ్ రామ్ అంత మాట ఎలా అనేశాడో..

18/10/2016: దశాబ్దంన్నర నుంచి హీరోగా కొనసాగుతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. అతడి కెరీర్లో హిట్లు చాలా తక్కువే. ఫ్లాపులు మాత్రం ఎక్కువ. ఐతే అతను కొట్టిన రెండు హిట్లూ మాత్రం మామూలువి కావు. అప్పట్లో వచ్చిన ‘అతనొక్కేడే’.. గత ఏడాదే వచ్చిన ‘పటాస్’.. ఈ రెండూ కూడా ఇండస్ట్రీకి పెద్ద షాకే ఇచ్చాయి. పెద్ద సినిమాల స్థాయిలో విజయం సాధించాయి. తన కొత్త సినిమా ‘ఇజం’ వీటి సరసన చేరుతుందని కళ్యాణ్ రామ్ కాన్ఫిడెంటుగా ఉన్నాడు. అయితే ఆ కాన్ఫిడెన్స్ వరకు ఓకే కానీ.. ‘ఇజం’ సినిమానే తన కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అవుతుందని చెబుతుండటమే కొంచెం ఆశ్చర్యం కలిగిస్తోంది. మొన్నే పూరి జగన్నాథ్ తో కలిసి ‘ఇజం’ చూశానని.. ఇది తన కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అనడంలో సందేహమే లేదని కళ్యాణ్ రామ్ చెప్పాడు. ఆల్రెడీ ఆడియో వేడుకలో కూడా తాను పని చేసిన దర్శకుల్లో పూరి ది బెస్ట్ అని కాంప్లిమెంట్ ఇచ్చాడు కళ్యాణ్. ఐతే ఒక సినిమా విడుదలకు సిద్ధమైనపుడే అది నా బెస్ట్ అనడం సహజం. ఐతే కళ్యాణ్ రామ్ అందరిలాగా కాదు. నిజాయితీగా.. సిన్సియర్ గా స్టేట్మెంట్లు ఇస్తాడు. కాబట్టి ‘ఇజం’ గురించి అతను ఇలా అనడానికి సినిమా మీద అతడికున్న కాన్ఫిడెన్స్ కారణం కావచ్చు. ఐతే గత కొన్నేళ్లలో పూరి ట్రాక్ రికార్డు చూస్తే చాలా దారుణంగా ఉంది. ‘టెంపర్’ హిట్టు కొట్టినా అది అతడి సొంత కథ కాదు. పూరి స్వయంగా వండి వార్చిన సినిమాలు చాలా వరకు తేలిపోయాయి. ఇక పూరి చివరి రెండు సినిమాలు జ్యోతిలక్ష్మీ.. లోఫర్.. గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మరి అతనొక్కడే.. పటాస్ ల కంటే మించి పూరి బెస్ట్ మూవీని కళ్యాణ్ రామ్ కు అందించాడంటే ఇప్పటికైతే నమ్మకం కలగట్లేదు. మరి ‘ఇజం’ సత్తా ఎంతో ఈ శుక్రవారం చూద్దాం.

క‌ళ్యాణ్ రామ్ భ‌య‌ప‌డితే.. పూరి ఏం చేశాడు?

17/10/2016: ద‌శాబ్దంన్న‌ర నుంచి హీరోగా కొన‌సాగుతున్నాడు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్. అలాంటి వాడు షూటింగ్ అంటే భ‌య‌ప‌డ‌తాడా.. సెట్లోని జ‌నాల్ని చూసి కంగారు ప‌డ‌తాడా..? ‘ఇజం’ షూటింగ్ సంద‌ర్భంగా అలాగే జ‌రిగింద‌ట‌. అప్పుడు డైరెక్ట‌ర్ పూరి ఏం చేశాడో క‌ళ్యాణ్ రామ్ మాట‌ల్లో తెలుసుకుందాం ప‌దండి. ‘‘ఇజం తొలి రోజు షూటింగ్‌లో 500 మంది జూనియర్ ఆర్టిస్టులతో సీన్ చేయాల్సి వచ్చింది. నేను కంగారుపడి.. షూటింగ్ వాయిదా వేద్దామని పూరి గారితో అన్నాను. ఆయ‌న నాతో ‘ఆర్ యూ కాన్ఫిడెంట్ ఆర్ నాట్?’ అని అడిగారు. ‘యస్..’ అన్నాను. ‘అదే స్క్రీన్ మీద‌ చూపించండి’ అన్నారు. వెంట‌నే సీన్ చేసేశా. ఇప్పటివరకూ నేను చేసిన సీన్స్‌లో బెస్ట్ సీన్ అది’’ అని క‌ళ్యాణ్ రామ్ చెప్పాడు. ఇజం సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేయ‌డంపై మాట్లాడుతూ.. ‘‘తెలుగు హీరోలందరిలో చివరగా సిక్స్‌ప్యాక్ చేసింది నేనే అనుకుంటా. కాబ‌ట్టి దాని గురించి నేను మాట్లాడితే బాగోదు. పూరి గారు కథ చెప్పినప్పుడు హీరో మెంటల్‌గానే కాక ఫిజికల్‌గానూ కూడా స్ట్రాంగ్‌గా ఉంటేనే క్యారెక్టర్ బాగుంటుంద‌ని.. స‌న్న‌బ‌డాల‌ని అన్నారు. 86 కేజీల నుంచి 74 కేజీలకు త‌గ్గాను. నాకు ఫిష్ ఇష్టం లేక‌పోయినా మూడు నెలలు సిక్స్‌ప్యాక్ కోసం అదే తిన్నాను’’ అని క‌ళ్యాణ్ రామ్ చెప్పాడు.

'నా సినిమా హిట్టయినా.. ఫ్లాపైనా నేను పట్టించుకోను'

17/10/2016: ప్రేమమ్ సినిమా రిజల్ట్ ఆనందం కంటే కూడా తనకు పెద్ద రిలీఫ్ ఇచ్చిందని అంటోంది శ్రుతి. మామూలుగా తన సినిమాల జయాపజయాల గురించి తాను పెద్దగా పట్టించుకోనని.. కానీ ‘ప్రేమమ్’ మాత్రం దానికి భిన్నమని శ్రుతి చెప్పింది. ఈ సినిమాకు ముందు తాను చేయబోయే పాత్ర గురించి జరిగిన నెగెటివ్ ప్రచారమే అందుకు కారణమని శ్రుతి అంది. నిజానికి ఆ ప్రచారాన్ని తాను పెద్దగా పట్టించుకోకపోయినా.. సినిమా విషయంలో, తన పాత్ర విషయంలో ఏదైనా తేడా జరిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆమె వ్యాఖ్యానించింది. ‘‘నా సినిమా హిట్టయినా.. ఫ్లాపైనా నేను పెద్దగా పట్టించుకోను. సినిమా విడుదల కావడాన్ని నేను ఒక పుట్టిన రోజులాగా భావిస్తా. బర్త్ డే రోజుకు మనం ఒక ఏడాది పెద్దవాళ్లయిపోయినట్లే.. ఒక సినిమా విడుదలవగానే మన జాబితాలోకి ఇంకో సినిమా పడుతుంది. బాధ్యత పెరుగుతుంది. ఒక సినిమా హిట్టయినా.. మనం చేసిన పాత్రకు మంచి పేరొచ్చినా మరింత బాధ్యతగా ఉండాలని అర్థం. అందుకే సినిమా హిట్టయితే పెద్దగా ఎగ్జైట్ అయిపోను. అదే సమయంలో సినిమా ఫ్లాప్ అయినా బాధపడను. కాకపోతే ‘ప్రేమమ్’ విషయంలో ఏం జరిగిందో నాకు తెలుసు. అప్పట్లో అదే పనిగా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. నేను ఫోన్ చేసి కూడా ఇక్కడి వాళ్లను అడిగాను. అసలేం జరుగుతోందని. అందుకే సినిమా విడుదల తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ రావడం చూసి చాలా రిలీఫ్‌గా అనిపించింది. నా పాత్ర అంత బాగా వచ్చిందంటే అందుకు మొత్తం క్రెడిట్ దర్శకుడు చందూ మొండేటికే దక్కుతుంది. అతను నా పాత్ర మీద అంత కేర్ తీసుకున్నాడు’’ అని శ్రుతి చెప్పింది.

దర్శకత్వం చేస్తానంటున్న సప్తగిరి

17/10/2016: కమెడియన్‌గా అరంగేట్రం చేసి.. హీరో అవతారం కూడా ఎత్తేస్తున్నాడు సప్తగిరి. త్వరలో అతను దర్శకత్వం కూడా చేయాలనుకుంటున్నాడట. ఇది అత్యాశేమీ కాదని.. తాను ఇండస్ట్రీలోకి వచ్చిందే అసిస్టెంట్ డైరెక్టర్‌గా అని చెబుతున్నాడు సప్తగిరి. ‘‘ప్రస్తుతానికి కమెడియన్‌గా ఎంజాయ్‌ చేస్తున్నా. భవిష్యత్తులో కథలు రాయాలని, దర్శకత్వం చేయాలనే ఆశలున్నాయి. ఎలా రాసిపెట్టి ఉందో చూడాలి. నేను ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్‌గానే అడుగుపెట్టాను. ఎ ఫిల్మ్ బై అరవింద్, బొమ్మరిల్లు, పరుగు లాంటి సినిమాలకు పని చేశాను. ‘పరుగు’ టైంలో దర్శకుడు భాస్కర్ నాతో ఆ సినిమాలో ఒక పాత్ర చేయించారు. అలా అనుకోకుండా నటుడిగా మారిపోయాను. ప్రస్తుతం నటుడిగా తీరిక లేకుండా ఉన్నా. భవిష్యత్తులో దర్శకుడిగా మారదామనుకుంటున్నా’’ అని సప్తగిరి చెప్పాడు. ఇక ‘ప్రేమకథా చిత్రమ్’ ద్వారా నటుడిగా తన కెరీర్‌ను మలుపు తిప్పింది మారుతియే అని చెప్పిన సప్తగిరి.. తనకు ముందు కాన్ఫిడెన్స్ ఇచ్చింది మాత్రం రవితేజే అని చెప్పాడు. ‘‘నా తొలి సినిమా పరుగు. ఆ తర్వాత అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేస్తూనే.. అడపాదడపా చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాను. క్రమంగా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్లో అవకాశాలు తగ్గిపోయాయి. మళ్లీ బతుకు జట్కా బండి అనుకుంటున్న తరుణంలో ‘కందిరీగ’లో అవకాశం వచ్చింది. ఓ ఫైట్‌లో ఒక్క నిమిషం మాత్రమే కనిపిస్తాను. ‘యాటికిరా బోయేది.. నాకాడ మూడు ఆప్షన్లున్నాయి..’ అంటూ ఓ డైలాగ్ ఉంటుంది నాకు. ఆ సినిమా చూశాక రవితేజ గారు రమ్మని కబురు పంపించారు. ‘తమ్ముడూ బాగా చేశావ్‌. నీది మామూలు బాడీలాంగ్వేజ్‌ కాదు. ఆ స్పాంటేనిటీ.. టైమింగ్‌ అద్భుతం’ అని పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు. నా టాలెంట్ ఏంటో నాకు తెలిసిన సందర్భమది. నటుడిగా నిలబడగలనని అప్పుడే అనిపించింది. ఆ తర్వాత ‘ప్రేమకథా చిత్రమ్’తో నా కెరీర్ మలుపు తిరిగింది’’ అని సప్తగిరి చెప్పాడు.

దుమ్మురేపుతున్న 'ధృవ' టీజర్

17/10/2016: మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజా చిత్రం 'ధృవ' టీజర్ ఆన్ లైన్ లో దూసుకుపోతోంది. దసరా కానుకగా మంగళవారం విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. యూట్యూబ్ లో ఈ టీజర్ ను ఇప్పటి వరకు 30 లక్షల మందిపైగా వీక్షించారు. విడుదలైన 24 గంటల్లోపే ఈ టీజర్ కు 10 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాకుండా పెద్ద సంఖ్యలో దీన్ని షేర్ చేశారు. 'నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవడో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది.. నా శత్రువును సెలెక్ట్ చేసుకున్నా..' అంటూ రాంచరణ్ చెప్పిన డెలాగ్ అభిమానులకు ఆకట్టుకుంటోంది. ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్ 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమిళ హిట్ సినిమా ‘తని ఒరువన్’కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాంచరణ్ సరసన రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

వైరల్ వీడియో - శృతి హాసన్ 'బిచ్'

15/10/2016: 'బిచ్.. చాల మంది జీనియస్ మైండ్స్ మమల్నిలా సంబోధిస్తాయి. మీకంటూ స్థానంలేక.. ఆ ఒక్క పదంతో మా స్థానాన్ని ఖరారు చేస్తారు. బిచ్ అంటే ఎవరు? బిచ్ ఓ మల్టీ టాస్కర్.. మిమ్మల్ని పట్టించుకునే తీరిక ఉండదు. బిచ్ ఓ ఉపాధ్యాయురాలు.. వ్యవస్థకు వ్యతిరేకంగా ఉంటుంది. బిచ్ హార్మోన్లతో నిండిన అమ్మాయి. ఇన్ దట్ వే.. ఎస్.. ఐయామ్ ఎ బిచ్' అంటూ శ్రుతి హాసన్ రూపొందించిన 'బి ద బిచ్' వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సమాజంలో మహిళలపై కొనసాగుతున్న వివక్షను ప్రశ్నిస్తూ శృతి రూపొందించిన ఈ వీడియోను 'Unblushed' సిరీస్ లో భాగంగా నెటిజన్ల ముందుకు తీసుకొచ్చారు. యూట్యూబ్ చానెల్ 'బ్లష్'లో 'బి ద బిచ్' విడుదలైన కొద్ది గంటల్లోనే లక్షలకొద్దీ హిట్స్ సాధించింది. ప్రముఖ దక్షిణాది నటీనటులంతా శృతికి తమ సంఘీభావం తెలుపుతూ వీడియోను పొగుడుతున్నారు. 'Unblushed' సిరీస్ లో భాగంగా ఇంతకు ముందు రాధిక ఆప్టే, కల్కి కొచ్లిన్, నిమ్రత్ కౌర్ లాంటి హీరోయిన్లూ, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ నటులూ గళం విప్పారు. సంచలనాల శృతి 'బిచ్' వీడియో మీకోసం...

వామ్మో.. వర్మ.. సీఎంను అంత మాట అనేశాడే

08/10/2016: ట్విట్టర్ పుణ్యమా అని తమ మనసులోని మాటల్ని స్వేచ్ఛగా చెప్పే అవకాశం ప్ర‌తి ఒక్క‌రికి ల‌భించేసింది. ఎవరినైనా సరే.. ఏమైనా అనేసే పరిస్థితి. కాకపోతే శ్రుతి మించిదే ఇదే మాటలు కేసులు.. జైళ్ల వరకూ వెళ్లటాన్ని మర్చిపోలేం. ఇక.. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ చెలరేగిపోయే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఎవరి మీదనైనా కోపం వస్తే ఆయన పెట్టే పోస్టులు ఎంత తీవ్రంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరమే లేదు. తాను విమర్శించేది ముఖ్యమంత్రా.. మరొకరా? అన్నది చూసుకోకుండా దుమ్ము దులిపేసే అలవాటున్న వర్మ.. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ కేజ్రీవాల్ ను ఎవరూ అననంత ఘాటుగా విమర్శలు చేశారని చెప్పాలి. పాక్ అక్రమిత కశ్మీర్ లో భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడులకు ఆధారాలు చూపాలని అడిగిన తీరును తీవ్రంగా ఖండించిన వర్మ..తన మాటలతో కేజ్రీవాల్ ను హనుమంతుడి సోదరుడు సుగ్రీవుడు.. ముష్రారఫ్ క్రాస్ బీడ్ గా అభివర్ణించటం గమనార్హం. అంతేకాదు.. జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్ పై సర్జికల్ దాడులు చేయాలని వ్యాఖ్యానించారు. కేజ్రీ ధరించే మఫ్లర్ చూసి అతను కోతిలా ఉన్నాడని అనుకునేవాడినని.. భారత సైన్యం మీద చేసిన కామెంట్లు చూసిన తర్వాత.. నిజంగానే తాను కోతినని కేజ్రీవాల్ నిరూపించుకున్నారంటూ ఫైర్ అయ్యారు. అప్ పార్టీని.. పాప్ పార్టీగా పిలవాలన్న వర్మ.. ‘‘పి’’ను పాకిస్థాన్ గా అభివర్ణించిన ఆయన ‘పి..ఆప్’ను పాపంగా చెబుతూ.. పాపపు పార్టీగా పిలవాలంటూ విరుచుకుపడ్డారు.

జాగ్వార్.. ఏక్ దిన్ కా సుల్తాన్

08/10/2016: త‌మ‌న్నా-ప్ర‌భుదేవా జంట‌గా న‌టించిన ‘అభినేత్రి’ సినిమాకు శుక్ర‌వారం.. తొలి రోజు హైద‌రాబాద్ మొత్తం 40 షోలు కూడా లేవు. ప్ర‌కాష్ రాజ్ సినిమా ‘మ‌న‌వూరి రామాయ‌ణం’ ప‌రిస్థితి మ‌రింత దారుణం. ఆ సినిమాకు తొలి రోజు ఓ 30 షోలు మాత్ర‌మే ప‌డుతున్నాయి హైద‌రాబాద్‌లో. కానీ గురువారం క‌న్న‌డ కుర్రాడు నిఖిల్ కుమార్ సినిమా ‘జాగ్వార్’ మాత్రం పెద్ద స్థాయిలో రిలీజైంది. మ‌న ద‌గ్గ‌ర మీడియం రేంజి హీరో సినిమా స్థాయిలో విడుద‌లైంది ఈ చిత్రం. తొలి రోజు 30 పైగా స్క్రీన్లలో దాదాపు 80 షోలు ప‌డ్డాయి. హైద‌రాబాద్ అనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే ప‌రిస్థితి. టాక్ ఎలా ఉన్న‌ప్ప‌టికీ గురువారం పోటీ లేక‌పోవ‌డంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా బాగానే వ‌చ్చాయి. ఐతే ‘జాగ్వార్’ సంద‌డి ఒక్క రోజుకే పరిమితం కాబోతోంది. శుక్ర‌వారం నాలుగు సినిమాలు రిలీజ‌వుతుండ‌టంతో స్క్రీన్లు త‌గ్గిపోతున్నాయి. అలాగే జ‌నాలు కూడా ఈ సినిమాను ప‌ట్టించుకునే అవ‌కాశం లేదు. అస‌లే మ‌న హీరో కాదు. పైగా సినిమాకు డివైడ్ టాక్ వ‌చ్చింది. ఆ నాలుగు సినిమాల్లో ఏది చూడాల‌ని తేల్చుకోవ‌డ‌మే క‌ష్టంగా ఉంటే ఇక ‘జాగ్వార్‌’ను ఎక్క‌డ పట్టించుకుంటారు. కాబ‌ట్టి ‘జాగ్వార్’ ఏక్ దిన్ కా సుల్తాన్ కాబోతున్నాడ‌న్న‌మాటే. విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ అందించిన ఈ సినిమాకు మిత్రుడు ఫేమ్ మ‌హ‌దేవ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

బాయ్ ఫ్రెండ్ తో ఆ హీరోయిన్ మళ్లీ!

08/10/2016: ముంబై : బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రేమలో ఉందని, బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేస్తోందని కొన్ని రోజుల కిందట వదంతులు ప్రచారమయ్యాయి. అయితే ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఫంక్షన్ కు సోనాక్షి సిన్హా హాజరయింది. ఇదే ఈవెంట్లో ఆమె బాయ్ ఫ్రెండ్ బంటీ సాజ్డే కూడా పాల్గొన్నాడు. దీంతో అందరిదృష్టి వీరిపై పడింది. స్పోర్ట్ అండ్ టాలెంట్ మేనేజ్ మెంట్ కంపెనీకి యజమాని అయిన బంటీతో బొద్దుగుమ్మ సోనాక్షికి కొన్ని నెలల కిందట పరిచయం ఏర్పడింది. అయితే రెండు నెలల కిందట వీరిద్దరూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. తాజాగా మరోసారి సోనాక్షి తన బాయ్ ఫ్రెండ్ బంటీ సాజ్డేతో కలిసి ఓ కార్యక్రమానికి హాజరైందని బాలీవుడ్ ఇండస్ట్రీ టాక్. సోనాక్షి బ్లూ బాడీవేర్ లో కనిపించగా, బంటీ గ్రే టీషర్ట్ ధరించినట్లు ఫొటోలో కనిపిస్తుంది. ప్రియుడు ఉంటే విదేశీ బీచ్ లలో హాయిగా సేదతీరాలని ఉందని గతంలో పలుమార్లు సోనాక్షినే ప్రస్తావించింది. దీంతో ఆమె ప్రేమలో ఉందని ఇండస్ట్రీ కోడై కూసింది. ఆగస్టులో ఇదే విషయంపై వదంతులు రావడంతో.. మా ఇంట్లో వాళ్లకు తెలిసేలా చేసినందుకు థ్యాంక్స్ అంటూనే అందులో నిజం లేదంటూ చమత్కరించిన విషయం తెలిసిందే. సోనాక్షి ప్రస్తుతం ఫోర్స్ 2 మూవీలో నటిస్తుంది. జాన్ అబ్రహాం, తాహిర్ షా, ఇందులో కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

ఈ గ్యాంగ్ మాస్ గురూ...

07/10/2016: నిర్మాతలుగా, డిస్ట్రిబ్యూటర్స్‌గా పలు విజయవంతమైన చిత్రాలు అందించినవేలాయుధం అండ్ బ్రదర్స్‌లో ఒకరి వారసుడు అయిన బాలాజీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. యాషిక పిక్చర్స్ ద్వారా ఇండియాలో సినిమాలు విడుదల చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఇంగ్లీష్ మూవీ ‘బ్లాక్ అండ్ వైట్ ది డాన్ ఆఫ్ అస్సాల్ట్’ను ‘మాస్ గ్యాంగ్’ పేరుతో తెలుగులో ఈ నెలలో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను, పోస్టర్స్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ- ‘‘యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు మా చిత్రం నచ్చేలా ఉంటుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ విడుదల చేస్తున్నాం’’ అని చెప్పారు. యాషిక పిక్చర్స్ భాగస్వాములు ఆనంద్, నటరాజన్ పాల్గొన్నారు.

ధోని రూ. 60 కోట్లు.. సచిన్ ఎంత?

07/10/2016: ముంబై: 'ఎంఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ' హిందీ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి వారంలో రూ. 100 కోట్లు పైగా వసూళ్లు రాబట్టింది. సుశాంత్ రాజ్ ఫుత్ హీరోగా నటించిన ఈ సినిమాలో 'మిస్టర్ కూల్' మహేంద్ర సింగ్ ధోని జీవితాన్ని అచ్చుగుద్దినట్టుగా తెరకెక్కించారు. అయితే తన జీవితకథ ఆధారంగా సినిమా తీసేందుకు అంగీకారం తెలపడానికి ధోని రూ. 60 కోట్లు పుచ్చుకున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ధోని ఒక్కడి మీదే కాకుండా పలు క్రికెటర్ల జీవితకథల ఆధారంగా ఇంతకుముందు సినిమాలు వచ్చాయి. ఇమ్రాన్ హష్మీ హీరోగా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ బయోపిక్ తెరకెక్కింది. ఈ సినిమాకు అజహరుద్దీన్ డబ్బులు తీసుకున్నట్టు వార్తలు రాలేదు. తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా 'సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్' రూపొందించారు. ఈ సినిమాకు సంబంధించి రెండు టీజర్లు కూడా విడుదలయ్యాయి. ఈ సినిమాకు సచిన్ ఎంత మొత్తం తీసుకున్నాడోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే సచిన్ ఒక్క పైసా కూడా తీసుకోలేదట. మైదానంలో బయట కూడా 'హీరో'నని సచిన్ నిరూపించుకున్నాడని అభిమానులు, సన్నిహితులు పేర్కొన్నారు.

అలాంటి సినిమాలు ఎక్కడ అంటున్న శ్రుతి

07/10/2016: హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం అంత ఈజీ కాదని చెప్పేసింది శ్రుతి హాసన్. ఎప్పుడూ మహిళలకు ప్రాధాన్యమున్న పాత్రలు.. సినిమాల గురించి డిబేట్లు పెడుతుంటారని.. కానీ అలాంటి సినిమాలు రావడం చాలా అరుదని శ్రుతి అంది. కహానీ.. క్వీన్ లాంటి సినిమాలు ఎన్ని వస్తున్నాయని ఆమె ప్రశ్నించింది. ‘‘మనం ఒక లవ్ స్టోరీ చేస్తుంటే అందుకు తగ్గట్లుగా పాత్రలో ఇమిడిపోవాలి. నటించాలి. లేదంటే మనం ఆ పాత్రకు నప్పని విధంగా కనిపిస్తాం. తేలిపోతాం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే పాత్రలు ఎంచుకుంటా. నా కెరీర్లో నాకు రకరకాల పాత్రలు వచ్చాయి. ఐతే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు.. యాక్షన్ ఫిల్మ్స్‌కు కూడా నన్ను అడిగారు. కానీ మనకున్న సామాజిక-రాజకీయ పరిస్థితుల్లో అలాంటి పాత్రలు.. సినిమాలు చేయడం చాలా కష్టం. మనం ఎప్పుడూ కహానీ.. క్వీన్ లాంటి సినిమాల గురించి మాట్లాడుతుంటాం. లేడీ క్యారెక్టర్ల విషయంలో ఇవి తెచ్చిన మార్పు గురించి చెబుతుంటాం. కానీ ఆ తర్వాత ఎన్ని కహానీలు వచ్చాయి. ఎన్ని క్వీన్స్ వచ్చాయి. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా మాత్రమే వస్తాయి. అమ్మాయిల్ని అర్థం చేసుకోవడమే కష్టం అంటే.. అమ్మాయిల సినిమాలతో మెప్పించడం ఇంకా కష్టం’’ అని శ్రుతి తెలిపింది. తాను ఇంతకుముందు చేసిన రీమేక్ మూవీ ‘గబ్బర్ సింగ్’ విషయంలోనూ తన పాత్రకు సంబంధించి సందేహాలు వ్యక్తం చేశారని.. ఇప్పుడు ‘ప్రేమమ్’లో మలార్ పాత్ర గురించి కూడా ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయని.. కానీ అలాంటి వాటిని పట్టించుకోనని శ్రుతి తెలిపింది. మలయాళంలో లాగే తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది.

మతం మారిన అనుపమ పరమేశ్వరన్!

06/10/2016: టైటిల్ చూసి షాకయ్యారా? మీరనుకుంటున్నట్లుగా మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నిజ జీవితంలో మతం మారడాల్లాంటివేమీ చేయలేదు. కాకపోతే సినిమా కోసమే రెలిజన్ ఛేంజ్ చేసుకుంది. మంచి హైప్‌తో వస్తున్న 'ప్రేమమ్'పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా నాగచైతన్యకు మంచి విజయాన్ని ఇస్తుందని అనుకుంటున్నారు. హీరో సంగతి పక్కనపెడితే ఈ సినిమాలో కథానాయికల్లో ఒకరైన అనుపమ హిందూ యువతిగా కనిపిస్తోంది. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం మాతృకలో హీరోహీరోయిన్లు క్రిస్టియన్లు. మన దగ్గరకు వచ్చేసరికి నేటివిటీకి అనుగుణంగా లీడ్‌ స్టార్స్ మతం మారిపోయింది. మలయాళం, తెలుగు 'ప్రేమమ్'ల మధ్య వ్యత్యాసాలపై తాజాగా మాట్లాడిన అనుపమ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. స్థానికతను బట్టి తెలుగులో చిన్నపాటి మార్పులు జరిగాయని సినిమాలోని భావం మాత్రం యథాతథంగా ఉందని పేర్కొంది. తనకు డబ్బు ప్రధానం కాదని మంచి పాత్ర దొరికితే చాలని చెప్పుకొచ్చింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలంటే ఇష్టమన్న అనుపమ త్రివిక్రమ్‌ తనకు గురువు లాంటి వారని వ్యాఖ్యానించింది. ఆయన నుంచి 'అ ఆ'లో అవకాశం రాగానే వెంటనే సంతకం చేసేసినట్లు తెలిపింది. ఇదంతా చూస్తుంటే అనుపమ మంచి మాటకారి అనే విషయం స్పష్టమవుతోంది. పరిశ్రమ దృష్టిని తనవైపు తిప్పుకునేందుకు అమ్మడు తనవంతు యత్నాలు ప్రారంభించిందని తెలిసిపోతోంది.

వెంకీ కోసం నిత్య అంత త్యాగం చేస్తోందా?

06/10/2016: నిత్యామీనన్‌ను చూస్తే రెగ్యులర్ హీరోయిన్ ఫీచర్లు అస్సలు కనిపించవు. హైట్ తక్కువ.. పైగా లావుగా ఉంటుంది. గ్లామర్ కోణం తక్కువే. అయినా తన యాక్టింగ్ టాలెంట్‌తో బాగానే నెట్టుకొచ్చేస్తోంది ఈ మలయాళ కుట్టి. హైట్ విషయంలో చేసేదేమి లేదు కానీ.. కనీసం స్లిమ్‌గా ఉండేందుకు ట్రై చేయొచ్చు కదా అని ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. తనకు వచ్చే పాత్రలు నటనను చూసి రావాలి కానీ.. ఫిజిక్ చూసి కాదని తనదైన శైలిలో బదులిచ్చింది నిత్య. తనకు నచ్చింది తింటానని.. ఫుడ్ విషయంలో రిస్ట్రిక్షన్స్ పెద్దగా పెట్టుకోనని కూడా ఆమె కుండబద్దలు కొట్టింది ఓసారి. అలా అన్న నిత్య.. ఇప్పుడు మాత్రందానికి భిన్నంగా చేస్తోంది. విక్టరీ వెంకటేష్ సరసన ఆమె ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వం వహించనున్న సినిమా ఇది. ఈ చిత్రం కోసం నిత్య తన లుక్ మార్చుకుంటోందట. పాత్రకు తగ్గట్లుగా కొంచెం సన్నగా కనిపించాల్సిందే అని దర్శకుడు తేల్చి చెప్పడంతో ఆమె బరువు తగ్గే పనిలో పడిందట. ఇందుకోసం ఫుడ్ తగ్గించి.. కచ్చితమైన డైట్ పాటిస్తోందట. ఈ సినిమాలో నిత్య లుక్ చూసి షాకవ్వాల్సిందేనట. బహుశా పాత్ర డిమాండ్ చేసేసరికి నిత్య తనను తాను మార్చుకోవడానికి రెడీ అయిందేమో. విశేషం ఏంటంటే.. కెరీర్ ఆరంభంలో వెంకీ లాంటి పెద్ద వయస్కుడితో తాను నటించనంటూ స్టేట్మెంట్ ఇచ్చిన నిత్య.. ఇప్పుడు తనకు కాస్త వయసు పెరిగే సరికి అభిప్రాయం మార్చుకుంది. అదే పెద్ద వయస్కుడితో నటించడానికి ఓకే చెప్పింది.

దసరాకు అన్నీ చిన్న సినిమాలే బాస్

06/10/2016: దసరా సినిమాల సందడికి సమయం దగ్గరపడింది. రెండు రోజుల వ్యవధిలో ఐదు సినిమాలు రిలీజవుతున్నాయి. అందులో గురువారం వచ్చే 'జాగ్వార్' సంగతి పక్కనబెట్టేద్దాం. ఆ సినిమాతో మన ప్రేక్షకులు పెద్దగా కనెక్టవ్వకపోవచ్చు. ఆ సినిమాను పక్కనబెడితే.. శుక్రవారం నాడు రాబోతున్న నాలుగు సినిమాలకూ ఓ ప్రత్యేకత ఉంది. ఇవి అన్నీ కూడా నిడివి పరంగా చిన్న సినిమాలే. ఈ రోజుల్లో లెంగ్త్ ఎక్కువైతే ప్రేక్షకులకు నచ్చట్లేదు. సినిమాకు అది నెగెటివ్ పాయింట్ అయిపోతోంది. అందుకే తక్కువ నిడివితో సినిమాలు క్రిస్ప్ గా ఉండేలా చూసుకుంటున్నారు. శుక్రవారం సినిమాలన్నీ కూడా ఈ కోవలోనివే. మలయాళ 'ప్రేమమ్' నిడివి 2 గంటల 33 నిమిషాలుంటే.. తెలుగు 'ప్రేమమ్' నిడివి 2 నిమిషాల 16 నిమిషాలే కావడం విశేషం. దసరాకు రాబోతున్న వాటిలో అతి పెద్ద నిడివి ఇదే. సునీల్ మూవీ 'ఈడు గోల్డ్ ఎహే" సైతం సరిగ్గా ఇంతే నిడివితో రాబోతోంది. మిగతా రెండు సినిమాలు ఇంకా చిన్నవి. తమన్నా-ప్రభుదేవాల హార్రర్ కామెడీ మూవీ లెంగ్త్ను 2 గంటల 7 నిమిషాలకు పరిమితం చేశారు. ప్రకాష్ రాజ్ 'మనవూరి రామాయణం" నిడివి అయితే రెండు గంటలు కూడా లేదు. 1 గంట 52 నిమిషాల్లో లాగించేశాడు ప్రకాష్ రాజ్. ఐతే కన్నడ కుర్రాడు నిఖిల్ కుమార్ 'జాగ్వార్" మూవీ నిడివి మాత్రం 2 గంట 33 నిమిషాలుంది. ఐతే ఈ చిత్రాన్ని మన ప్రేక్షకులు పెద్దగా పట్టించుకునే అవకాశాలు లేవు కాబట్టి దాని నిడివి ఎంత ఉన్నా పెద్ద విషయం కాదు.

సమంతకు నేను... నాకు సమంత

06/10/2016: ‘‘సమంతతో ప్రేమ సంగతి ముందు నాన్నకు చెప్పా. ‘నాకు ఎప్పుడో తెలుసు. నువ్ ఇప్పుడు చెప్పావ్’ అన్నారు. తర్వాతే అమ్మకు చెప్పా. నా స్నేహితులకు ముందే తెలుసు. ప్రేమలో బహుమతులేవీ ఇచ్చుకోలేదు. తనకు నేను.. నాకు తను.. పెద్ద బహుమతి’’ అన్నారు నాగచైతన్య. ఆయన హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘ప్రేమమ్’ రేపు విడుదలవుతోంది. సమంతతో ప్రేమ, ‘ప్రేమమ్’ సినిమా గురించి నాగచైతన్య చెప్పిన విశేషాలు.. నాన్న (నాగార్జున)కు దర్శకుడు చందూ వీరాభిమాని. నాన్నకు ఓ కథ చెప్పగా.. ‘బిజీగా ఉన్నా. ఓ సినిమా చేసి రా’ అన్నారు. ఈ గ్యాప్‌లో నేను చందూను పట్టుకున్నా. స్ట్రయిట్ సినిమా చేయాలనుకున్నాం. కానీ, అప్పుడు ‘దోచేయ్’ ఫ్లాప్ కావడంతో నేనే ‘ప్రేమమ్’ రీమేక్ చేద్దామని చెప్పా. తర్వాత చందూతో స్ట్రయిట్ సినిమా చేస్తా. మలయాళ ‘ప్రేమమ్’ ఓ కల్ట్ క్లాసిక్. ఆ సోల్ తీసుకుని మన నేటివిటికి తగ్గట్లు మార్చాం. స్కూల్, కాలేజ్, కెరీర్.. మొత్తం మూడు ప్రేమకథలున్నాయి. మూడో ప్రేమకథలో చాలా మార్పులు చేశాం. త్రివిక్రమ్‌గారు చందూకి సలహాలు ఇచ్చారు. ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశా. సాంగ్స్, ట్రైలర్ విడుదల చేసిన తర్వాత సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమైంది. సడన్‌గా ఎందుకలా స్పందించారో తెలీదు. ‘ప్రేమమ్’ కంటే బాగా తీయాలని ప్రయత్నించలేదు. ఆ సినిమాను చెడగొట్టకుండా తీశాం. తెలుగులో సినిమా రన్‌టైమ్ తక్కువే. స్పీడుగా వెళ్తుంది. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో కేవలం సినిమాల గురించే మాట్లాడాలని నిర్ణయించుకున్నా. అందువల్ల.. ప్రేమ, పెళ్లి అంశాలపై ఎవరు అడిగినా స్పందించలేదు. ఎవరైనా లిమిట్ దాటితే అప్పుడు మాట్లాడాలనుకున్నా. నేనూ, సమంత మీడియాలో మాపై వస్తున్న వార్తల గురించి మాట్లాడుకుంటాం. మరీ అంత ప్రాముఖ్యం ఇవ్వమంతే. మాకంటూ వ్యక్తిగత జీవితం ఉండాలని మా అభిప్రాయం. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నేను చేస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ పల్లెటూరితో పాటు సిటీ నేపథ్యంలో జరుగుతుంది. కొత్త దర్శకుడు కృష్ణ దర్శకత్వంలో నటించబోయేది థ్రిల్లర్ మూవీ. నేనూ, నాన్న షాకయ్యాం! అఖిల్ తన లవ్ గురించి చెప్పగానే నేనూ, నాన్న షాకయ్యాం. చిన్న వయసైనా చాలా బోల్డ్‌గా చెప్పేశాడు. నాకంటే ముందే అఖిల్ పెళ్లి ఉంటుంది. వచ్చే ఏడాది నా నిశ్చితార్థం, పెళ్లి జరుగుతాయి. పెళ్లి తర్వాత కూడా సమంత సినిమాల్లో నటిస్తుంది. హిందీ ‘2 స్టేట్స్’ చూశాను. నేను, సమంత ఆ సినిమా చేయబోతున్నామని వార్త వచ్చింది. కానీ, మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు.

విజయదశమికి రాయల్ లుక్!

05/10/2016: నందమూరి బాలకృష్ణ, శ్రీయ జంటగా క్రిష్ దర్శకత్వంలో జాగర్లమూడి సాయిబాబు, వై.రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఇప్పటికే విడుదలైన బాలకృష్ణ ‘శాతకర్ణి’, శ్రీయ ‘వశిష్ఠిదేవి’ ప్రీ లుక్స్‌కి మంచి స్పందన లభించింది. విజయదశమి కానుకగా ఈ నెల 9న బాలకృష్ణ రాయల్ లుక్, 11వ తేదీ ఉదయం 8 గంటలకు టీజర్ విడుదల చేయనున్నారు. ప్రారంభోత్సవం రోజునే చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తామని తెలిపారు. అదే విధంగా జనవరి 12న విడుదల చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. అనుకున్న తేదీకి విడుదల చేయాలని శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. మేజర్ టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయిందని నిర్మాతలు తెలిపారు. హేమ మాలిని, కబీర్ బేడీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వంద రోజులు.. వంద సినిమాలు..!! నేటి నుంచి ప్రొద్దుటూరు (కడప జిల్లా) అర్చన థియేటర్‌లో జనవరి 11 వరకూ బాలకృష్ణ నటించిన 99 సినిమాలను ప్రదర్శించనున్నారు. 100వ రోజైన జనవరి 12న బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విడుదల కానుంది. ఆ చిత్రం ప్రదర్శనతో వంద రోజులు.. వంద చిత్రాలు పూర్తవుతాయి. ఓ హీరో వంద చిత్రాలను వరుసగా ఒక్కో రోజు, ఒకే థియేటర్లో ప్రదర్శించడం తెలుగులో ఇదే తొలిసారి అని ఈ సినీ ఉత్సవాలు నిర్వహిస్తున్న అభిమానులు చెబుతున్నారు. ఈ ప్రదర్శనలు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కనున్నాయట!

పవన్ హీరోగా 'దేవుడే దిగి వస్తే'..?

05/10/2016: పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబందించి మరో ఇంట్రస్టింగ్ వార్త టాలీవుడ్ సర్కిల్స్ వినిపిస్తోంది. అ..ఆ.. సక్సెస్ తరువాత ఇంత వరకు సినిమా మొదలు పెట్టని త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కోసం కథ రెడీ చేస్తున్నాడట. ఈ సినిమాకు దేవుడే దిగి వస్తే అనే టైటిల్ను పరిశీలుస్తున్నారు. ఇప్పటికే దేవుడు కాన్సెప్ట్తో త్రివిక్రమ్, ఖలేజా సినిమాను తెరకెక్కించగా, పవన్, గోపాల గోపాల సినిమాలో దేవుడిగా నటించాడు. తాజాగా మరోసారి ఇద్దరు కలిసి దేవుడు కాన్సెప్ట్తో సినిమా చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాను త్రివిక్రమ్ గత చిత్రాలను నిర్మించిన రాధకృష్ణ 100 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. పవన్ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాటమరాయుడు షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేసిన పవర్ స్టార్, వెంటనే మరో సినిమాను లైన్లో పెట్టాలని భావిస్తున్నాడు.

విక్రమ్ కోసం హాలీవుడ్ సినిమా?

05/10/2016: జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రయోగాలు కొనసాగించే హీరో విక్రమ్. తన క్యారెక్టర్ల కోసం అతను చేసే సాహసాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో కష్టపడి చేసిన ‘ఐ’ ఆశించిన ఫలితాన్నివ్వకున్నా అతను వెకక్కి తగ్గలేదు. లేటెస్టుగా ‘ఇంకొక్కడు’లో హిజ్రా తరహాలో ఉండే విలన్ పాత్ర చేశాడు. ఈ సినిమా పర్వాలేదనిపించింది. తమిళ.. తెలుగు భాషల్లో కలిపి రూ.100 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసింది. ప్రస్తుతం అతను ఒకప్పటి తన బ్లాక్ బస్టర్ మూవీ ‘సామి’కి సీక్వెల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇంతలో విక్రమ్ హీరోగా ఓ హాలీవుడ్ మూవీని రీమేక్ చేయబోతున్నట్లు కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యే రిలీజై బ్లాక్‌ బ్టర్ హిట్టయిన థ్రిల్లర్ మూవీ ‘డోంట్ బ్రీత్’ను విక్రమ్ హీరోగా తమిళంలో రీమేక్ చేస్తారట. ఓ తమిళ నిర్మాత రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఒకప్పుడైతే ఏదైనా హాలీవుడ్ మూవీ నచ్చితే సైలెంటుగా కాపీ కొట్టేసేవాళ్లు మన ఫిలిం మేకర్స్. ఈ మధ్య ఇంటర్నేషనల్ మూవీస్ కు కూడా రీమేక్ రైట్స్ తీసుకుంటున్నారు. బాలీవుడ్ వాళ్లు మొదలుపెట్టిన ఈ ట్రెండును సౌత్ వాళ్లు కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఈ కోవలోనే ‘డోంట్ బ్రీత్’ హక్కుల్ని కొనడానికి చూస్తున్నారట. ఒరిజినల్ లో స్టీఫెన్ లాంగ్ పోషించిన పాత్రకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ పాత్రనే విక్రమ్ చేస్తాడంటున్నారు. మరి ఈ వార్తలో నిజమెంతో చూడాలి.

త్రిష రెచ్చిపోయినట్లుందిగా..

05/10/2016: త్రిష గతంలో కొన్ని గ్లామర్ క్యారెక్టర్లు చేసింది కానీ.. మరీ రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసింది లేదు. కానీ కెరీర్ చరమాంకంలో మాత్రం ఆమె తనకు తాను పెట్టుకున్న హద్దుల్ని చెరిపేస్తున్నట్లుంది. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘కళావతి’ సినిమాలో త్రిష ఏ రేంజిలో రెచ్చిపోయిందో తెలిసిందే. ఈ మధ్య ‘నాయకి’ లాంటి హార్రర్ సినిమాలో సైతం త్రిష క్లీవేజ్ షో చేయడం విశేషమే. లేటెస్టుగా ఆమె చేస్తున్న ‘కోడి’లో సైతం కొంచెం గ్లామర్ టచ్ ఉన్న పాత్రే చేస్తున్నట్లుంది. ఈ సినిమాలో ధనుష్ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. అందులో ఊర మాస్‌గా కనిపిస్తున్న పాత్రకు జోడీగా నటిస్తోంది త్రిష. ఈ మధ్యే ‘కోడి’ పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. అందులో ధనుష్, త్రిషల కెమిస్ట్రీ బాగానే కుదిరినట్లు కనిపిస్తోంది. ఇద్దరూ కలిసి నీటిలో సరసాలాడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. త్రిష గ్లామర్ డోస్ కొంచెం పెంచినట్లే ఉంది. చరమాంకంలో త్రిషకు దక్కిన పెద్ద ప్రాజెక్టు ఇది. ఈ సినిమా ఎలా ఆడుతుందన్నదాన్ని బట్టే త్రిష కెరీర్ ఆధారపడి ఉంది. ఈ సినిమా తేడా వస్తే త్రిష కథ ముగిసినట్లే అవుతుంది. అందుకే త్రిష కూడా కట్టుబాట్లు తీసి పక్కనబెట్టినట్లుంది. ఈ చిత్రం తెలుగులో ‘ధర్మయోగి’ పేరుతో విడుదలవుతోంది. ధనుష్ నిర్మాణంలో ఇంతకుముందు ‘ఎదిర్ నీచిల్’ అనే సినిమా తీసిన దురై సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. దీపావళి కానుకగా అక్టోబరు 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.

సునీల్ విల‌న్ క్యారెక్ట‌ర్ చేస్తున్నాడ‌ట‌

05/10/2016: క‌మెడియ‌న్‌గా స్టార్ స్టేట‌స్ సంపాదించాక హీరో అయ్యాడు సునీల్. ఇప్పుడు అత‌డి దృష్టి విల‌న్ పాత్ర‌ల మీదికి మ‌ళ్లుతోంది. వ‌చ్చే ఏడాది తాను విల‌న్ అవ‌తార‌మెత్త‌నున్న‌ట్లు తెలిపాడు సునీల్. ఐతే సునీల్ విల‌న్‌గా క‌నిపించేది తెలుగులో మాత్రం కాద‌ట‌. ‘‘నేను విల‌న్ అవుదామ‌నే ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను. మోహ‌న్ బాబు గారు.. కోట శ్రీనివాస‌రావు గార్ల‌లాగా విల‌న్ పాత్ర‌లు చేయాలి అనుకున్నాను. కానీ కుద‌ర‌లేదు. ఐతే వ‌చ్చే సంవ‌త్స‌రం విల‌న్‌గా న‌టిస్తాను. ఐతే అది తెలుగు సినిమాలో మాత్రం కాదు. వేరే భాష‌లో విల‌న్ పాత్ర చేయ‌బోతున్నాను. తెలుగులో విల‌న్‌గా చేస్తే మ‌న ప్రేక్ష‌కులు యాక్సెప్ట్ చేయ‌రు. నాకు కామెడీ ఇమేజ్ ఉంది కాబ‌ట్టి విల‌న్ పాత్ చేస్తే చూడ‌క‌పోవ‌చ్చు. అందుక‌నే వేరే భాష‌లో విల‌న్‌గా న‌టించాల‌నుకుంటున్నా’’ అని సునీల్ తెలిపాడు. ఇక క‌మెడియ‌న్‌గా ఉన్న‌ప్ప‌టికీ.. హీరోగా మార‌క వ‌చ్చిన తేడా గురించి సునీల్ చెబుతూ.. ‘‘నేను యాక్టింగ్ చేస్తున్నా. హీరో అనే పేరు త‌ప్పితే పెద్ద‌గా తేడా ఏమీ లేదు. క‌మెడియ‌న్‌గా రోజూ 5 సినిమాలు చేసేవాడిని. హీరోగా ఏడాదికి నాలుగు సినిమాలు చేయాలనుకుంటున్నా. హీరో అయ్యాక ఖాళీ దొరుకుతోంది. నా కుటుంబ స‌భ్యుల‌తో గ‌డుపుతున్నా. వాళ్లు చాలా హ్యాపీ’’ అన్నాడు.

చైతూ కోసం ప‌దిమంది నిర్మాత‌లొచ్చార‌ట‌

04/10/2016: ‘కార్తికేయ’ లాంటి సెన్సేష‌న‌ల్ హిట్‌తో టాలీవుడ్లోకి అడుగుపెట్టాడు యువ ద‌ర్శ‌కుడు చందూ మొండేటి. అలాంటి సినిమాతో వ‌చ్చిన‌వాడు.. రెండో సినిమాగా రీమేక్‌ను ఎంచుకోవ‌డం ఆశ్చ‌ర్య‌మే. ఐతే ముందు తాను కూడా రీమేక్ విష‌యంలో అంత ఆస‌క్తిగా లేన‌ని చెప్పాడు చందూ. అస‌లు ‘ప్రేమ‌మ్’ రీమేక్ ఎలా మొద‌లైందో.. తెలుగు వెర్ష‌న్ విష‌యంలో తానేం మార్పులు చేశానో ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు చందూ. అత‌నేమ‌న్నాడంటే.. ‘‘నేను, నాగ‌చైత‌న్య వేర్వేరుగా ‘ప్రేమ‌మ్’ సినిమా చూశాం. ఇద్ద‌రికీ బాగా న‌చ్చింది. మా నిర్మాత ఈ సినిమాను ఇష్ట‌ప‌డ్డాడు. కొన్ని రోజుల వ్య‌వ‌ధిలోనే దాదాపు ప‌ది మంది నిర్మాత‌లు ‘ప్రేమ‌మ్’ రీమేక్ కోసం చైతూను సంప్ర‌దించారు. అప్పుడే ఈ రీమేక్‌ను కొంచెం సీరియ‌స్‌గా తీసుకున్నాం. నేను రీమేక్ సినిమా చేయాలా అనే కొంచెం సందేహంలో ఉన్న‌ప్ప‌టికీ స్క్రిప్ట్ వ‌ర్క్ మొద‌లుపెట్టాక అవ‌న్నీ తొల‌గిపోయాయి. ‘ప్రేమ‌మ్’ ఒరిజిన‌ల్‌లో చాలా మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల రెఫ‌రెన్సులుంటాయి. ఆ సినిమా అక్క‌డి నేటివిటీతో సాగుతుంది. కాబ‌ట్టి నేను స్క్రిప్టు మొత్తాన్ని రీరైట్ చేయాల్సి వ‌చ్చింది. మ‌న నేటివిటీకి త‌గ్గ‌ట్లు మార్పులు చేయాల్సి వ‌చ్చింది. స్క్రిప్ట్ వ‌ర్క్ మొద‌లుపెట్టిన ప‌ది రోజుల‌కు.. కొన్ని సీన్లు రీరైట్ చేశాక నా చేతిలో మంచి స్క్రిప్ట్ ఉంద‌న్న న‌మ్మ‌కం క‌లిగింది. మ‌ల‌యాళ వెర్ష‌న్‌తో పోల్చకుండా చూస్తే ‘ప్రేమ‌మ్’ ఒక మంచి ఎంట‌ర్టైన‌ర్’’ అని చందూ మొండేటి కాన్ఫిడెంట్‌గా చెప్పాడు.

శ్రీదేవి కూతురి ఎంట్రీ మూవీ ఇదే..

04/10/2016: అతిలోక సుంద‌రి శ్రీదేవి పెద్ద కూతురు జాహ్న‌వి తెరంగేట్రం గురించి రెండేళ్ల ముందు నుంచి చ‌ర్చ న‌డుస్తోంది. ఆమె పేరును ముడిపెడుతూ చాలా కాంబినేష‌న్లు.. చాలా సినిమాల పేర్లు వినిపించాయి. ఐతే అవేవీ కార్య‌రూపం దాల్చ‌లేదు. ఐతే ఎట్ట‌కేల‌కు జాహ్న‌వి తెరంగేట్రం చేయ‌బోయే సినిమా ఖాయ‌మైన‌ట్లు స‌మాచారం. ప్రముఖ ద‌ర్శ‌కుడు డేవిడ్ ధావ‌న్ కొడుకైన యంగ్ హీరో వ‌రుణ్ ధావ‌న్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా ప‌రిచ‌యం కాబోతోంద‌ట జాహ్న‌వి. ఆమె తొలి సినిమా పేరు.. ‘సిద్ధత్‌’. ‘2 స్టేట్స్’ లాంటి సూప‌ర్ హిట్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన అభిషేర్ వ‌ర్మ‌న్ ఈ చిత్రాన్ని రూపొందించ‌బోతున్నాడు. క‌ర‌ణ్ జోహార్.. సాజిద్ న‌డియాడ్ వాలా లాంటి బ‌డా నిర్మాత‌లిద్ద‌రూ క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తార‌ట‌. ఈ సినిమా వ‌చ్చే ఏడాది మ‌ధ్య‌లో సెట్స్ మీదికి వెళ్తుంద‌ట‌. ఈ సినిమా స్క్రిప్టు మీద ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెడుతున్నార‌ట‌. ఇందుకోసం చాలా స‌మ‌యమే వెచ్చిస్తున్నారు. ‘సిద్ధ‌త్’ సినిమా గురించి ఇంత‌కుముందే ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. అప్పుడు ఇందులో వ‌రుణ్ స‌ర‌స‌న ఆలియా భ‌ట్‌ను హీరోయిన్‌గా చెప్పుకున్నారు. ఐతే ఈ స్క్రిప్టు గురించి తెలుసుకుని.. త‌మ కూతురి అరంగేట్రానికి బాగుంటుంద‌ని బోనీ కపూర్, శ్రీదేవి క‌ర‌ణ్ జోహార్‌ను అప్రోచ్ అయ్యార‌ట. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఒక‌ప్ప‌టి అందాల తార మాధురీ దీక్షిత్ నటించ‌బోతుండ‌టం విశేషం.

ఖైదీ కబురు

04/10/2016: చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’. తమిళంలో విజయవంతమైన ‘కత్తి’కి రీమేక్‌గా రూపొందుతోంది. కాజల్‌ కథానాయిక. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. డెబ్బై శాతం చిత్రీకరణ పూర్తయింది. సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఖాయమని మరోమారు రామ్‌చరణ్‌ ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ ‘‘సామాన్యుడి కోసం పోరాటం చేసిన ఓ ఖైదీ కథ ఇది. తమిళంలో ప్రేక్షకుల మెప్పు పొందిన ‘కత్తి’కి మనదైన వాతావరణాన్ని జోడించి తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. నాన్న తెరపై కనిపించే విధానం చాలా బాగుంటుంది. ప్రచార చిత్రాలకి మంచి స్పందన లభించింది. ఇటీవలే డబ్బింగ్‌ కార్యక్రమాలు మొదలయ్యాయి. సంక్రాంతిని పురస్కరించుకొని వచ్చే జనవరిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. బాలీవుడ్‌ నటుడు తరుణ్‌ అరోరా ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రహణం: రత్నవేలు.

ది కన్‌క్లూజన్‌ కోసం భల్లాల దేవుడు సిద్ధమవుతున్నారు..

04/10/2016: ది కన్‌క్లూజన్‌ కోసం భల్లాల దేవుడు సిద్ధమవుతున్నారు.. దగ్గుబాటి రానా ఈ పాత్రలో ఒదిగిపోవడానికి తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. కోచ్‌ కునాల్‌ గిర్‌ పర్యవేక్షణలో వర్కౌట్‌ షెడ్యూల్స్‌ను తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. దీనికోసం 31ఏళ్ల రానా నిత్యం రెండున్నరగంటలు కసరత్తులు చేస్తున్నారు. ఆయన షెడ్యూల్‌ కూడా భిన్నంగా ఉండడంతో కార్డియో, వెయిట్‌ ట్రెయినింగ్‌ల్లో వివిధ రకాలుగా శిక్షణ తీసుకుంటున్నారు. ఇప్పటికే బాహుబలి: ది కన్‌క్లూజన్‌ యాక్షన్‌ పార్ట్‌ను దాదాపు ఆయన పూర్తి చేశారు. మరో ఐదు రోజుల షూటింగ్‌ మిగిలివుంది. బాహుబలి కంటే బాహుబలి: ది కన్‌క్లూజన్‌లో మరింత ఫిట్‌గా కనిపించనున్నాడు ఈ యువహీరో. బాహుబలిలో రానా 108-110 కిలోల మధ్య బరువు ఉండేవాడు.. రెండో భాగంలో పాత్రకు అనుగుణంగా బరువు తగ్గాల్సి వచ్చింది. దీంతో కసరత్తులు చేసి 92-93 కిలోలకు చేరుకున్నారు. కునాల్‌ పర్యవేక్షణలో డైట్‌ రానా డైట్‌ను కోచ్‌ కునాల్‌గిర్‌ డిజైన్‌ చేశారు. ప్రతి రెండున్నర గంటలకోసారి రానా పోషకాహారం తీసుకుంటున్నారు. దీనిలో ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండేట్లు చూసుకుంటున్నారు. నూనెతో తయారుచేసిన పదార్థాలను పూర్తిగా దూరంపెట్టారు. తన శరీర సౌష్టవ ప్రగతిని కోచ్‌తో కలిసి నిత్యం పర్యవేక్షించుకుంటున్నాడు మన భల్లాలదేవుడు. ఈ సందర్భంగా తీసిన ఓ ఫొటోను రానా తన ట్విట్టర్‌ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. దీనికి సంబంధించిన కథనాన్ని ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించగా ఆ క్లిప్పింగ్‌ను కూడా రానా ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

ఆలియా కాదయా..శ్రీదేవి తనయ!

04/10/2016: అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాహ్నవి త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తారనే వార్తలు ప్రేక్షకులకు ఎప్పుడో బోర్ కొట్టేశాయి. మొన్నటికి మొన్న మహేశ్‌బాబు హీరోగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న తెలుగు, తమిళ సినిమాలో హీరోయిన్‌గా ముందు జాహ్నవి కపూర్‌ను సంప్రదించారని గాసిప్‌లు హల్‌చల్ చేశాయి. లేటెస్ట్ బాలీవుడ్ అప్‌డేట్ ఏంటంటే నిజంగానే జాహ్నవి త్వరలో మేకప్ వేసుకోనుందట. వరుణ్ ధావన్ హీరోగా ప్రముఖ హిందీ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ ‘శిద్దత్’ అనే సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో నాయికగా ఆలియా భట్ నటిస్తుందని వార్తలొచ్చాయి. కానీ, కరణ్ జోహార్ శ్రీదేవి కుమార్తెను పరిచయం చేయాలనుకుంటున్నారట. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో ఆలియాను ఇంట్రడ్యూస్ చేశారు జోహార్. యంగ్ టాలెంట్‌ను ఇంట్రడ్యూస్ చేయడంలో కరణ్ స్పెషలిస్ట్. అందుకే, శ్రీదేవి అంగీకరించారట. ఇదిలా ఉంటే, ఆదివారం జరిగిన ‘మీర్జ్యా’ ప్రీమియర్ షోలో పాల్గొన్న జాహ్నవి పైనే అందరి కళ్లూ. ఫిజిక్ చూస్తుంటే, హీరోయిన్‌గా అరంగేట్రం చేయడానికి జాహ్నవి రెడీ అవుతోందనిపిస్తోంది కదూ...!

సంఘమిత్రలో దీపిక నటిస్తుందా?

03/10/2016: బాలీవుడ్ టాప్ కథానాయికల్లో దీపికాపడుకొనే ఒకరు. చాలా మంది ఉత్తరాది బ్యూటీస్‌లానే ఈ అమ్మడికి కోలీవుడ్‌పై ఓ కన్ను. తమిళ చిత్రాల్లో నటించాలన్న ఆశను సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన మోషన్ ఫార్మాట్‌లో తెరకెక్కిన యానిమేషన్ త్రీడీ చిత్రంతో తీర్చుకున్నారు. అయితే ఆ ఒక్క చిత్రంతో ఒక్కడి దర్శక నిర్మాతలకు దీపికపై మోజు తీరలేదు. ఆ తరువాత చాలా మంది ఈ ముద్దుగుమ్మను కోలీవుడ్ తెరపై చూపించాలని ప్రయత్నించి విఫలం అయ్యారు. ప్రస్తుతం ఆంగ్ల చిత్రంలో నటిస్తున్న దీపికాపడుకోనే హిందీ చిత్రాలకే కాల్‌షీట్స్ సర్దుబాటు చేయలేని పరిస్థితి. ఇలాంటి స్థితిలో నటి కుష్భు భర్త, దర్శకుడు సుందర్.సీ ఈ అమ్మడిని తన చిత్రంలో నటింపజేసే పనిలో ఉన్నట్లు తాజా సమాచారం. ఈయన సంఘమిత్ర అనే బ్రహ్మాండ చిత్రాన్ని తెరపై ఆవిష్కరించడానికి సన్నాహాలు చేస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇందుకు బాహుబలి చిత్రం స్థాయిలో చారిత్రక కథను ఎంచుకున్నట్లు సమాచారం. శ్రీతెనాండాళ్ ఫిలింస్ సంస్థలో వందో చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రంలో మొదట ఇళయదళపతిని హీరోగా నటింపజేసే ప్రయత్నాలు జరిగాయి. కథ విన్న ఆయన చాలా బాగుందని కితాబిచ్చారు గానీ, ఈ చిత్రానికి అవసరం అయిన కాల్‌షీట్స్ కేటాయించలేనని చేతులెత్తేశారు. ఆ తరువాత సూర్య పేరు చర్చల్లోకి వచ్చింది. తాజాగా టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, జయంరవి, ఆర్య ఈ చిత్రంలో నటించడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా ఇది తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందనున్నట్లు సమాచారం. అందువల్ల మూడు భాషలకు తగ్గ నాయకిని సంఘమిత్ర కోసం ఎంపిక చేయాలన్న ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు, అందుకు నటి దీపికాపడుకొనే అయితే బాగుంటుందన్న భావనతో ఆమెతో సంప్రదిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. మరి ఆ బ్యూటీ సంఘమిత్రలో భాగం అవుతారా?అన్నదే చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ చిత్రంలోని తారాగణం గురించి దర్శకుడు సుందర్.సీ నోరుమెదపడం లేదు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తానని అంటున్నారు.

సూపర్‌స్టార్ తరువాత శివకార్తికేయనేనా?

03/10/2016: సూపర్‌స్టార్ తరువాత శివకార్తికేయనే అంటున్నారు. ఎవరలా అంటున్నది? ఏమాకథ? అలాగైతే విశ్వనాయకుడు, ఇళయదళపతి, అజిత్ లాంటి వారి పరిస్థితి ఏమిటి? అనేగా మీ ప్రశ్నలు. ఏదేమైనా వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ నటుడు శివకార్తికేయన్. తను ఈ స్థాయికి ఎదుగుతాడని ఆయనే ఊహించి ఉండకపోవచ్చు. రజనీమురుగన్ చిత్ర విజయం తరువాత శివకార్తికేయన్ రేంజే మారిపోయింది. నిర్మాతలు ఎంత భారీ బడ్జెట్‌తోనైనా ఆయనతో చిత్రాలను నిర్మించడానికి సిద్ధపడుతున్నారు. బయ్యర్లదీ అదే పరిస్థితి. శివకార్తికేయన్ చిత్రాలను భారీ మొత్తంతో కొనుగోలు చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు.ప్రస్తుతం అంత క్రేజ్‌ను సంపాదించుకున్న చిత్రం రెమో. శివకార్తికేయన్‌కు జంటగా ఆయన లక్కీ నాయకి కీర్తీసురేశ్ నటించిన ఈ చిత్రంలో శివకార్తికేయన్ అందమైన అమ్మాయిగా కూడా మెరవనున్నారు. సతీష్, దర్శకుడు కేఎస్.రవికుమార్, నటి శరణ్య, యోగిబాబు ముఖ్య పాత్రల్ని పోషించిన ఈ చిత్రానికి నవదర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు. అనిరుధ్ సంగీతాన్ని, పీసీ.శ్రీరామ్ చాయాగ్రహణం అందించిన రెమో చిత్రాన్ని 24 ఏఎం సంస్థ అధినేత ఆర్‌డీ.రాజా నిర్మించారు. ఈ చిత్రం ఏడో తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. కాగా తొలిసారిగా జపాన్ లో విడుదల కానున్న శివకార్తికేయన్ చిత్రం ఇదే. విశేషం ఏమిటంటే రజనీకాంత్ మినహా ఏ ఇతర హీరోల చిత్రాలు జపాన్‌లోని యోకోయమ, టోక్యో ఏరియాల్లోనే ప్రదర్శింపబడతాయట. అలాంటిది శివకార్తికేయన్ రెమో రజనీకాంత్ చిత్రాలకు దీటుగా యోకోయమ, టోక్యో ఏరియాలతో పాటు నగోయా ఏరియాలోనూ ప్రదర్శింపబడనుందట. రెమో చిత్ర జపాన్ విడుదల హక్కులను మెడ్రాస్ మూవీస్ సంస్థ పొందిందట.

యప్ టీవీకి బ్రాండ్ అంబాసిడర్‌గా...

03/10/2016: పదమూడు భాషలు.. సుమారు 900లకు పైగా ఇండియన్ టీవీ చానళ్లు.. లైవ్ టీవీ ఎనీటైమ్ ఎనీవేర్ స్లోగన్‌తో స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్.. ఇలా ఇంటర్నెట్ వీక్షకులకు లైవ్ టీవీ చూసే అవకాశం కల్పిస్తోంది యప్ టీవీ. ఆన్‌లైన్ చానల్స్ ప్రొవైడర్లలో అగ్రగామిగా దూసుకు వెళ్తున్న యప్ టీవీకి సూపర్‌స్టార్ మహేశ్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. నేడు హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో జరగనున్న కార్యక్రమంలో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నారు.

ముందు ఎవరితో?

03/10/2016: మహేశ్‌బాబుతో మూడో సినిమా కోసం దర్శకుడు పూరి జగన్నాథ్ ‘జన గణ మణ’ అనే టైటిల్ ఎప్పుడో రిజిస్టర్ చేయించారు. మహేశ్-పూరి కలయికలో వచ్చిన ‘పోకిరి’, ‘బిజినెస్‌మేన్’.. రెండూ హిట్టే. దాంతో ‘జన గణ మణ’ ప్రకటించినప్పట్నుంచే అంచనాలు మొదలయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించిన పనులు చేస్తూనే మరోవైపు ఎన్టీఆర్‌తో సినిమా కోసం కూడా పూరి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్‌తో ఆయన తీసిన ‘ఆంధ్రావాలా’ ఆశించిన విజయం ఇవ్వలేదు. కానీ, ఎన్టీఆర్-పూరిలు ‘టెంపర్’తో టార్గెట్ రీచ్ అయ్యారు. పూరి మార్క్ హీరోయిజంలో ఎన్టీఆర్ యాక్టింగ్ ప్రేక్షకులకు నచ్చింది. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇజం’ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 5న ఆడియో, 20న సినిమా రిలీజ్. ఈ నేపథ్యంలో మహేశ్‌బాబు, ఎన్టీఆర్.. ఇద్దరితోనూ తదుపరి సినిమాలు చేయబోతున్నట్టు ఆదివారం పూరి చెప్పారు. ముందు ఎవరితో చేస్తారు? అనేది ఇక్కడి ప్రశ్న. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ నటిస్తున్నారు. ఆ తర్వాత కొరటాల శివ లైన్‌లో ఉన్నారు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత చిన్న ఎన్టీఆర్ మరో సినిమా అంగీకరించలేదు. సో, ముందు మొదలయ్యేది ఎన్టీఆర్ సినిమానేనా? వెయిట్ అండ్ సీ!

మూడు భాషల్లో గోపీచంద్

03/10/2016: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా సుధీర్‌బాబు హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ ఈ చిత్రం నిర్మించనుంది. స్వతహాగా బ్యాడ్మింటన్ క్రీడాకారుడైన సుధీర్‌బాబు గోపీచంద్ పాత్రకు కరెక్టుగా న్యాయం చేస్తాడన్నది చిత్రబృందం ఆలోచన. ఈ చిత్రాన్ని ఏక కాలంలో తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో నిర్మించనున్నారు. తమిళంలో అనువదించి, విడుదల చేస్తారు. ఈ సినిమాలో ఎంతో కీలకమైన గోపి తల్లి సుబ్బరావమ్మ పాత్రలో సీనియర్ నటి రేవతి నటించనున్నారని ఫిలింనగర్ టాక్. ఇదిలా ఉంటే గోపీచంద్, సుధీర్‌బాబు మంచి స్నేహితులు. తన జీవిత చరిత్రకు సుధీర్‌బాబు యాప్ట్ అని పలు సందర్భాల్లో గోపీచంద్ పేర్కొన్నారు.

ఆ హీరోయిన్ మేక‌ప్ కోసం ఆరుగురు

03/10/2016: బాలీవుడ్లో మోస్ట్ సెక్సీయెస్ట్ హీరోయిన్ల లిస్టు తీస్తే అందులో సోనమ్ కపూర్ పేరు కచ్చితంగా ఉంటుంది. తొలి సినిమా ‘సావరియా’లో ఆమెను చూసి చాలా ట్రెడిషనల్ అనుకున్నారు కానీ.. ఆమెలోని కొత్త కోణాలు తర్వాత తర్వాతే తెలిశాయి. తన హాట్ హాట్ అందాల్ని ఓ రేంజిలో ఆరబోస్తూ బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది సోనమ్. ఐతే ఇప్పుడు ఇంత సెక్సీగా కనిపిస్తున్న సోనమ్.. ఒకప్పుడు మాత్రం చాలా అసహ్యంగా ఉండేదట. ఆ మాట ఎవరో చెప్పట్లేదు. స్వయంగా సోనమే అంటోంది. అసలు తనను చూసి.. ఈ అమ్మాయికి పెళ్లే కాదేమో అని కూడా కామెంట్లు చేసేవాళ్లని ఆమె చెప్పుకొచ్చింది. ‘‘నా టీనేజీలో నేను ఏమంత అందంగా ఉండేదాన్ని కాదు. అబ్బాయిల కంటే పొడుగుండేదాన్ని. పైగా లావు కూడా ఎక్కువ. అందులోనూ నా రంగు కూడా తక్కువే. దీంతో ఎక్కడికైనా వెళ్లాలన్నా సిగ్గుగా అనిపించేది. ఫ్యామిలీ ఫంక్షన్లకు వెళ్లినపుడు అసలీ ఈ అమ్మాయికి పెళ్లి అవుతుందా.. అని గుసగుసలాడేవాళ్లు కూడా. అందుకే బాలీవుడ్లోకి వచ్చే ముందు చాలా ఆలోచించాను. నన్ను నేను మార్చుకున్నాను. తిండి కంట్రోల్ చేసి తగ్గాను’’ అని సోనమ్ చెప్పింది. ఇక ఇప్పుడు కూడా తానేమీ పెద్ద అందగత్తెను కాదని.. అందరు హీరోయిన్ల లాగే తనకు కూడా మేకప్ అవసరం చాలా ఉంటుందని ఆమె అనడం విశేషం. ‘‘చాలామంది అమ్మాయిలు ఉదయం నిద్రలేవగానే తమ ముఖాన్ని చూసుకొని ఫీలవుతుంటారు. హీరోయిన్లలా అందంగా లేమే అని బాధపడుతుంటారు. ఐతే నిద్ర నిద్రలేవగానే హీరోయిన్లు కూడా సాధారణ అమ్మాయిల్లానే ఉంటారు. దానికి నేనూ మినహాయింపు కాదు. నేను ఓ కార్యక్రమం కోసం బయటికి వెళ్లాలంటే.. గంటన్నర పాటు మేకప్‌ వేసుకోవాల్సిందే. నా మేకప్‌ కోసమే ఆరుగురు పనిచేస్తారు’’ అని వెల్లడించిందామె.

స‌రైనోడుకు అవార్డొచ్చింది

03/10/2016: అవార్డు వ‌చ్చేంత ప్ర‌త్యేక‌త ఏముంది స‌రైనోడులో అని సందేహం రావ‌చ్చు. ఎందుకంటే ఇది రొటీన్ మాస్ మ‌సాలా సినిమా మ‌రి. ఐతే ఇక్క‌డ వ‌చ్చిన అవార్డు కంటెంట్‌కు కాదు. క‌లెక్ష‌న్ల‌కు. ఇటీవ‌లే రామోజీ ఫిలిం సిటీలో ఇండీవుడ్ ఫిల్మ్‌ కార్నివాల్‌లో ఓ వేడుక నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ఇండియ‌న్ ఫిల్మ్ బిజినెస్ అవార్డ్స్ పేరుతో పుర‌స్కారాలు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు ఫిల్మ్ అవార్డును ‘స‌రైనోడు’ సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ హీరోగా బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కించిన ఈ సినిమా రూ.75 కోట్ల దాకా వ‌ర‌ల్డ్ వైడ్ షేర్.. రూ.120 కోట్ల దాకా గ్రాస్ క‌లెక్ట్ చేసింది. తెలుగు వెర్ష‌న్ మాత్రమే రూ.70 కోట్ల‌కు పైగా షేర్ సాధించ‌డం విశేషం. డివైడ్ టాక్‌తో మొద‌లైన‌ప్ప‌టికీ క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించిందీ సినిమా. ఐతే అవార్డులు ప్ర‌క‌టించే స‌మయానికే ‘స‌రైనోడు’ సినిమాను ‘జ‌న‌తా గ్యారేజ్’ దాటేసింది. రూ.80 కోట్లకు పైగా షేర్.. రూ.135 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూలు చేసి ఈ ఏడాదికి హైయెస్ట్ తెలుగు గ్రాస‌ర్‌గా నిలిచింది. ఇంకా థియేట్రిక‌ల్ ర‌న్ పూర్తి కాని నేప‌థ్యంలో అవార్డులకు ఆ సినిమాను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌ట్లుగా లేరు.ఏదేమైనా మామూలుగా కంటెంట్ విష‌యంలోనే అవార్డులుంటాయి. ఇలా క‌లెక్ష‌న్ల‌కు కూడా అవార్డులివ్వ‌డం విశేష‌మే.

దిల్ రాజుతో దిల్ రాజుకే పోటీ

03/10/2016: ఈ ఏడాది సంక్రాంతికి వ‌చ్చిన నాలుగు సినిమాల్లో రెండింటి డిస్ట్రిబ్యూష‌న్ హ‌క్కులు దిల్ రాజే సొంతం చేసుకున్నాడు. అందులో ఒక‌టి ‘డిక్టేట‌ర్’ అయితే.. ఇంకోటి ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. ఐతే రాజు ముందు ‘డిక్టేట‌ర్’ హ‌క్కులు తీసుకున్నాక.. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ రైట్స్ కూడా కొన‌డంతో బాల‌కృష్ణ నొచ్చుకున్నట్లుగా వార్త‌లొచ్చాయి. డిక్టేట‌ర్ నైజాం డిస్ట్రిబ్యూష‌న్ రైట్స్ రాజు నుంచి వెన‌క్కి తీసుకుని వేరే బ‌య్య‌ర్‌కు ఇచ్చాడు ద‌ర్శ‌క నిర్మాత శ్రీవాస్‌. దీంతో సంక్రాంతికి దిల్ రాజు వెర్స‌న్ దిల్ రాజు చూసే అవ‌కాశం లేక‌పోయింది. కానీ వ‌చ్చే సంక్రాంతికి మాత్రం దిల్ రాజు త‌న‌తో త‌నే పోటీ ప‌డ‌బోతున్నాడు. ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెంబ‌ర్ 150’ నైజాం హ‌క్కుల్ని రాజే సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. అందుకోసం భారీ పెట్టుబ‌డే పెట్టాడ‌ట. ఐతే సంక్రాంతికి దిల్ రాజు నుంచి మరో సినిమా వ‌స్తోంది. అదే ‘శ‌త‌మానం భ‌వ‌తి’.ఇది దిల్ రాజే నిర్మిస్తున్న చిత్రం. చిరు సినిమా జ‌న‌వ‌రి 13న రిలీజైతే.. ‘శ‌త‌మానం భ‌వ‌తి’ మ‌రుస‌టి రోజే థియేట‌ర్ల‌లోకి వ‌స్తుంది. ఐతే రేంజ్ ప్ర‌కారం చూస్తే రెండు సినిమాల మ‌ధ్య అంత‌రం చాలా ఉంటుంది. కాబ‌ట్టి ఒక‌దానికి ఒక‌టి పోటీ కాద‌ని దిల్ రాజు భావిస్తున్నాడు. మ‌రోవైపు ‘గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి’.. ‘ఓం న‌మో వెంక‌టేశాయ’ కూడా సంక్రాంతికే రాబోతున్న నేప‌థ్యంలో థియేట‌ర్ల స‌మ‌స్య త‌లెత్త‌క మాన‌దు. నైజాంలో మెజారిటీ థియేట‌ర్లు రాజు చేతిలోనే ఉంటాయి. మ‌రి రాజు వాటిని త‌న సినిమాల‌కే ఉంచుకుంటాడా.. మిగ‌తా రెండు సినిమాల‌కు ఏమాత్రం కేటాయిస్తాడు అన్న‌ది ఆస‌క్తిక‌రం.

రాశి ఖన్నా.. ఇదేం ఊపు బాబోయ్

01/10/2016: రాశి ఖన్నా నక్క తోక తొక్కినట్లే ఉంది. ఉన్నట్లుండి ఆమె కెరీర్ మాంచి రైజింగ్‌కు వచ్చేస్తోంది. ఓవైపు తెలుగులో క్రేజీ ప్రాజెక్టులు ఒక్కొక్కటే సొంతమవుతుంటే.. మరోవైపు కోలీవుడ్ కూడా ఆమెను రారమ్మని పిలుస్తోంది. కొన్ని రోజుల కిందటే రాశి తన తొలి తమిళ ప్రాజెక్టు సైన్ చేసిన సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ హీరోగా కార్తీక్ క్రిష్ అనే దర్శకుడు రూపొందించే ఆ సినిమా పేరు.. సైతాన్ కా బచ్చా. ఈ వార్త బయటికి వచ్చిన కొన్ని రోజులకే రాశి రెండో తమిళ సినిమా కూడా ఓకే చేసింది. తెలుగులోకి అనువాదమైన హార్రర్ మూవీ ‘డిమాంటి కాలనీ’కి దర్శకత్వం వహించిన అజయ్ జ్నానముత్తు దర్శకత్వంలో అధర్వ హీరోగా తెరకెక్కబోయే సినిమాకు రాశి కథానాయికగా ఎంపికైంది. గత ఏడాది రాశి కెరీర్ ఏమంత ఊపులో లేదు. కానీ ‘బెంగాల్ టైగర్’లో అందాలు ఆరబోశాక ఆమె ఫేట్ మారింది. రాశిలోని గ్లామర్ కోణం వరుసగా అవకాశాలు తెచ్చిపెడుతోంది. ఈ ఏడాది ‘సుప్రీమ్’తో మాంచి హిట్టు ఖాతాలో వేసుకున్న రాశి... తాజాగా ‘హైపర్’తో ప్రేక్షకుల్ని పలకరిస్తోంది. మాస్ రాజా రవితేజతో ‘బెంగాల్ టైగర్’ తర్వాత మరోసారి జత కట్టబోతున్న రాశికి.. ఇంకో రెండు మూడు క్రేజీ ప్రాజెక్టుల్లోనూ చోటు దక్కేలా ఉంది. చూస్తుంటే మున్ముందు రాశి ఖన్నా రేంజే మారిపోయేలా ఉంది.

తమన్నా మీద నిర్మాత కంప్లైంట్ చేశాడు

01/10/2016: తమన్నా చాలా కోఆపరేటివ్ అంటుంటారు దర్శక నిర్మాతలు. ఆడియో వేడుకల్లో ఆమెను ఎలా పొగిడేస్తుంటారో చాలా సార్లు చూశాం. మొన్నటికి మొన్న ‘అభినేత్రి’ ఆడియో వేడుకలోనూ ప్రతి ఒక్కరూ ఆమె మీద ప్రశంసలు కురిపించారు. ఆమె ఎంత కమిటెడో.. టాలెంటెడో.. దర్శక నిర్మాతలకు ఆమె ఎంతగా సహకారం అందిస్తుందో చెప్పుకొచ్చారు. అలాంటి తమన్నా గురించి ఓ తమిళ నిర్మాత ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఫిర్యాదు చేశాడు. ఆ నిర్మాత పేరు ఆర్.కె.సురేష్. తమన్నా తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘ధర్మదురై’ అనే సినిమాలో కథానాయికగా నటించింది. ఆ సినిమా ఈ మధ్యే రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. కానీ ఏం జరిగిందో ఏమో కానీ.. తమన్నా ఈ సినిమా ప్రమోషన్లకే హాజరవలేదు. ఆ సినిమా హిట్టయినా సరే.. దాని గురించి మాట్లాడలేదు. విడుదలకు ముందు కూడా ఈ సినిమా ప్రస్తావన తీసుకురాలేదు. ఐతే ఆ సినిమాకు అంత దూరంగా ఉన్న తమ్మూ.. ఈ మధ్యే ‘అభినేత్రి’ తమిళ వెర్షన్ ‘దేవి’ ప్రమోషన్ల కోసం మాత్రం చెన్నై వెళ్లింది. ఈ సినిమాను ప్రమోట్ చేసింది. దీంతో ‘ధర్మదురై’ నిర్మాత ప్రొడ్యూసర్ కౌన్సిల్‌ను ఆశ్రయించాడు. వేరే సినిమా ప్రమోషన్లకు వచ్చి.. తమ సినిమా విషయంలో మాత్రం వివక్ష ప్రదర్శించిన తమన్నాపై చర్యలు తీసుకోవాలని కోరాడు. దీంతో ప్రొడ్యూసర్ కౌన్సిల్.. తమన్నా వివరణ కోరబోతున్నట్లు సమాచారం. మరి తమ్మూ ఏమంటుందో చూడాలి. బహుశా పారితోషకం విషయంలోనే ఆమెకు, నిర్మాతకు ఏదైనా తేడా వచ్చి ఉంటుందని తెలుస్తోంది. ఈ మధ్య ‘నాయకి’ విషయంలో త్రిష కూడా ఇలాగే చేసిన సంగతి తెలిసిందే.

మహేష్ సినిమా ఆ రోజు ఎలా వస్తుందబ్బా?

30/09/2016: మహేష్ బాబు సినిమా అంటే జనాల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. అందుకే అతడి సినిమా మొదలు కాకముందే దాని గురించి రకరకాల వార్తలు వస్తుంటాయి. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న కొత్త సినిమా గురించి కూడా ఇప్పటికే రకరకాల వార్తలు వినిపించాయి. తాజాగా వినిపించిన కబురేంటంటే.. ఈ చిత్రాన్ని 2017 ఏప్రిల్ 28న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. పోకిరి కూడా పదేళ్ల కిందట ఏప్రిల్ 28నే విడుదలై ప్రకంపనలు రేపింది. ఆ సెంటిమెంటును దృష్టిలో ఉంచుకుని మహేష్-మురుగ సినిమాను కూడా అదే రోజు విడుదల చేయాలనుకుంటున్నారన్నది ఈ వార్త సారాంశం. ఈ చిత్ర యూనిట్ వర్గాలు కూడా ఇదే మాట అన్నాయి. కానీ వీళ్లందరూ ఓ విషయం మరిచిపోయారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న బ్రహ్మాండం బద్ధలయ్యే సినిమా వస్తోంది. అదే.. బాహుబలి: ది కంక్లూజన్. ముందు ఏప్రిల్ 17కు అనుకున్న ఈ సినిమా.. ఆ తర్వాత ఏప్రిల్ 28వ తేదీని ఫిక్స్ చేసుకుంది. ఈ డేట్ విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంది బాహుబలి టీం. బాలీవుడ్లో పెద్ద సినిమాలకు సంబంధించి ఒకసారి రిలీజ్ డేట్ ప్రకటించాక మళ్లీ మారిస్తే చాలా ఇబ్బందువుతుంది. ‘బాహుబలి: ది బిగినింగ్’ విషయంలో ఇలాగే మార్చడంతో కరణ్ జోహార్ చాలా సీరియస్ అయ్యాడు. కాబట్టి రెండో భాగం విషయంలో అలాంటిదేమీ జరక్కపోవచ్చు. కాబట్టి మహేష్ సెంటిమెంటు గురించి ఆలోచించే పరిస్థితి ఉండకపోవచ్చు. ‘శ్రీమంతుడు’ సినిమాను ‘బాహుబలి: ది బిగినింగ్’ కోసం వాయిదా వేసుకున్నట్లే.. మురుగదాస్ సినిమా కోసం కూడా ఇంకో డేట్ చూసుకోవాల్సిందే.

బ్రహ్మికి భారీ సినిమా దక్కింది

30/09/2016: మూడు దశాబ్దాలకు పైగా సాగుతోంది బ్రహ్మానందం నట ప్రస్థానం. ఈ సుదీర్ఘ కెరీర్లో రెండేళ్ల ముందు వరకు ఆయన హవా నడుస్తూ వచ్చింది. అప్పుడప్పుడూ కెరీర్ కొంచెం డల్ అయినా.. మళ్లీ పుంజుకుని ఆధిపత్యం చలాయించాడు బ్రహ్మి. 2005 ప్రాంతంలో అనూహ్యంగా రైజ్ అయిన బ్రహ్మి.. కెరీర్లోనే పతాక స్థాయిని అందుకున్నాడు. శ్రీను వైట్ల, త్రివిక్రమ్ లాంటి దర్శకులు బ్రహ్మిని ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఆ తర్వాతి కాలంలో బ్రహ్మి ఏ రేంజిలో హవా నడిపించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ రెండేళ్ల నుంచి బ్రహ్మి టైం ఏమంత బాగా లేదు. వరుసగా ఆయన క్యారెక్టర్లు తేలిపోయాయి. పెద్ద సినిమాలు తగ్గిపోయాయి. ఒకప్పుడు ఓ పెద్ద సినిమాలో బ్రహ్మి లేకుంటే ఆశ్చర్యపోయేవాళ్లం. కానీ ఇప్పుడు ఆయన ఉంటే ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. ఈ ఏడాది సోగ్గాడే చిన్నినాయనా, సరైనోడు లాంటి ఒకటీ అరా పెద్ద సినిమాల్లో మాత్రమే కనిపించాడు బ్రహ్మి. ఇలాంటి టైంలో బ్రహ్మికి ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో చోటు దక్కింది. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’లో బ్రహ్మి ఓ క్యారెక్టర్ చేస్తున్నాడట. వినాయక్ సినిమాల్లో బ్రహ్మి గ్యారెంటీగా ఉండాల్సిందే. ఆయన నుంచి మంచి కామెడీ రాబట్టుకున్న ట్రాక్ రికార్డు వినాయక్‌కు ఉంది. నిజానికి ఒరిజినల్ ‘కత్తి’ చూస్తే.. తెలుగులో బ్రహ్మికి ఇవ్వడానికి పాత్ర ఏమీ కనిపించదు. ఐతే తెలుగు వెర్షన్ కోసం ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ రాయించి.. బ్రహ్మితో చేయించారట. ఈ రోజుల్లో బ్రహ్మి కోసం ఇలా ప్రత్యేకంగా పాత్ర.. ట్రాక్ రాయించడం విశేషమే. మరి ఈ పాత్ర ఆ సినిమాకు ఏమాత్రం ఆకర్షణ అవుతుందో చూడాలి.

పవన్ తమ్ముళ్లు వీళ్లే..!

30/09/2016: సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాతో అభిమానులకు షాక్ ఇచ్చిన పవన్, తన నెక్ట్స్ ప్రాజెక్ట్ను రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు సినిమాను ప్రారంభించిన పవన్ కళ్యాణ్ కీలక పాత్రలకు నటీనటుల ఎంపికను కూడా పూర్తి చేశాడు. తమిళ సూపర్ హిట్ సినిమా వీరంకు రీమేక్గా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్కు ముగ్గురు తమ్ముళ్లు ఉంటారు. అయితే ఈ పాత్రల్లో ఎవరు కనిపించనున్నారన్న చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. ఫైనల్గా ఈ ముగ్గురు తమ్ముళ్ల పాత్రలకు నటీ నటుల ఎంపిక పూర్తయ్యింది. ఇప్పటికే గబ్బర్సింగ్ సినిమాలో పవన్ సోదరుడిగా నటించిన అజయ్ ఒక తమ్ముడిగా నటిస్తుండగా, కమల్ కామరాజు, శివబాలజీలు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను శరత్ మరార్ నిర్మిస్తున్నాడు.

చిక్కుల్లో మిల్కీబ్యూటీ తమన్నా

30/09/2016: నటీనటులు వివాదాల్లో ఇరుక్కోవడం అన్నది సాధారణమైన విషయమే. అయితే ఒక్కోసారి ఒక్కో విధంగా ప్రవర్తించడం చిక్కుల్లో పడేస్తుంది. నటుడు అజిత్, నటి నయనతార లాంటి వారు ఒక నిర్ణయాన్ని తీసుకుంటే దానికి కట్టుబడి నడుచుకుంటున్నారు. అందువల్ల వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉదాహరణకు అజిత్ గానీ, నయనతారగానీ చిత్ర ప్రచార కార్యక్రమాలలో పాల్గొనబోమని చిత్రాలను అంగీకరించే ముందే సదరు దర్శక నిర్మాతలకు చెప్పేస్తారు. వారు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనక పోయినా తప్పు పట్టరు. నటి త్రిష తాను నటించిన నాయకి చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనలేదనే ఆరోపణలను మూట కట్టుకున్నారు. తాజాగా మిల్కీబ్యూటీ తమన్నా అలాంటి నిందనే ఎదుర్కొంటున్నారు. నిజానికి ఈ భామ కోలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. దీంతో వరుసగా అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఇటీవల విజయ్‌సేతుపతికి జంటగా నటించిన ధర్మదురై చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ చిత్రానికి సంబంధించిన ఎలాంటి ప్రచార కార్యక్రమంలోనూ తమన్నా పాల్గొనలేదు. అలాంటి ది ఇటీవల తాను తాజాగా నటించిన దేవి చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొనడం ధర్మదురై చిత్ర నిర్మాత సురేశ్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది. ఆయన ఈ మిల్కీబ్యూటీపై మండిపడుతున్నారు. అంతటితో ఆగకుండా నడిగర్‌సంఘం కార్యదర్శి విశాల్‌కు తమన్నాపై పిర్యాదు చేశారు. విషయం ఏమిటంటే తమన్నా ఇప్పుడు విశాల్‌కు జంటగా కత్తిసండై చిత్రంలో నటిస్తున్నారు. మరి ఆయన ధర్మదురై చిత్ర నిర్మాత ఫిర్యాదుపై ఎలా స్పందిస్తారన్నదే ఆసక్తిగా మారింది.

మన సినిమా లేకపోతే.. పాక్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ చాప చుట్టేస్తుంది

29/09/2016: యురీలో ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్‌-పాకిస్తాన్‌ల సంబంధాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సినీ రంగాన్నీ ఈ ఎఫెక్ట్‌ తాకింది. మా దేశం నుంచి వెళ్లిపోండి అంటూ ఎంఎన్‌ఎస్‌ భారత్‌లోని పాక్‌ ఆర్టిస్టులకు హుకుం జారీ చేసింది. అటు కూడా ఇదే రేంజ్‌లో రెస్పాన్స్‌ వచ్చింది. భారత్‌ సినిమాలను దేశంలో నిషేధించాలంటూ పాకిస్తాన్‌లో కొందరు కోర్టుకెక్కారు. వారు ఆశించినట్టే కోర్టులు భారత చిత్రాలను బ్యాన్‌ చేస్తే పాక్‌ తీవ్రంగా నష్టపోతుంది. అక్కడి సినీ ఇండస్ట్రీ చాప చుట్టేసుకునే పరిస్థితి తలెత్తుతుంది. ఎందుకంటే అక్కడ మన సినిమాల వల్లే 70శాతం బిజినెస్‌ నడుస్తోంది. ఇండియన్‌ ఫిల్మ్‌ లేకపోతే పాక్‌ సినీ ఇండస్ట్రీలో సందడే ఉండదు. బాలీవుడ్‌ మూవీ లేకపోతే పరిస్థితి ఏంటన్న విషయమై అక్కడి సినీ పరిశ్రమ ప్రముఖులు విస్త త వివరణలు ఇచ్చారు. బాలీవుడ్‌, హాలీవుడ్‌ చిత్రాల వల్లే తమ పరిశ్రమలో బూమ్‌ వచ్చిందని ప్రముఖ ఎగ్జిబిటర్‌, డిస్ట్రిబ్యూటర్‌ నదీమ్‌ మంద్వివాలా చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉన్న కాస్త సంబంధాలు కూడా తెగిపోకూడదని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. బాలీవుడ్‌ సినిమాలపై తాత్కాలిక నిషేధం తట్టుకోగలిగినా అది పర్మినెంట్‌ అయితే మాత్రం తమ చిత్రసీమకు కోలుకోలేని దెబ్బ అని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌ సినీ పరిశ్రమ నిలదొక్కుకోవాలంటే ఏడాదికి 50 నుంచి 60 సినిమాలు తీయాలి. అంత సీన్‌ అక్కడి ఇండస్ట్రీకి లేదు. 30 సినిమాలు తీయడానికే కిందా మీదా పడిపోతుంటారు. బాలీవుడ్‌ చలవతోనే పాక్‌ థియేటర్లు కళకళలాడుతున్నాయి. పంపిణీ దారులు లాభాలు గడిస్తున్నారు. గతంలో ఇలాగే పాకిస్తాన్‌లో బాలీవుడ్‌ సినిమాలను నిషేధించారు. దీంతో డీవీడీల అమ్మకాలు, కేబుల్‌ వ్యవస్థ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాయి. తర్వాత పరిస్థితి మారడం ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడడంతో మన సినిమాలకు అక్కడ ఆదరణ లభించింది. దీంతో కొందరు థియేటర్స్‌ కట్టుకున్నారు. ఇప్పుడు గనుక మన సినిమాలను నిషేధిస్తే అక్కడి సినిమా హాళ్లు వెలవెలబోతాయి. తమ చిత్రాలను ఆడించేద్దామన్నా ఫలితం ఉండదు. దీంతో షోలను కుదించుకోవాల్సి వస్తుందని ప్రముఖ సినీ విమర్శకుడు ఒమైర్‌ అలావీ వివరించారు. మొత్తంగా బాలీవుడ్‌ను బ్యాన్‌ చేస్తే పాక్‌ చిత్రసీమ కుదేలైపోతుందన్న హింట్‌ ఇచ్చారాయన.

కరీనా కపూర్‌ ఓ సెల్ఫీ రాణి

29/09/2016: ట్రెండ్స్‌ వస్తుంటాయి. పోతుంటాయి. కానీ సెల్ఫీ ట్రెండ్‌ మాత్రం రోజు రోజుకీ ముదిరిపోయింది. ఈ ధోరణి జిడ్డులా అంటుకోవడం.. దాన్ని వదిలించుకునేందుకు జనాలకూ ఆసక్తి లేకపోవడంతో ఎక్కడున్నా సరే సెల్ఫీ క్లిక్‌ల సౌండ్‌ వినిపిస్తోంది. సెల్ఫీలేంటే పడి చచ్చేవారిలో మన బాలీవుడ్‌ బెబో కరీనా కపూర్‌కు ఫస్ట్‌ ప్లేస్‌ కట్టబెట్టేయొచ్చు. ఎందుకంటే తనను తాను ఆమె 'సెల్ఫీ క్వీన్‌'గా పేర్కొంది. ప్రతీ ఐదు నిమిషాలకో సారి సెల్ఫీ తీసుకుంటే గానీ ఆమెకు మనశ్శాంతి ఉండదట. 'వోగ్‌ బీఎఫ్‌ఎఫ్స్‌'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ''నేనో సెల్ఫీ క్వీన్‌ని. ఎల్లప్పుడూ నన్ను నేను ఫొటోలు తీసుకుంటూనే ఉంటా. ప్రతీ 5-10 నిమిషాలకో సారి ఇది జరిగిపోతుంటుంది'' అని చెప్పుకొచ్చింది కరీనా. తన కెరీర్‌ గురించీ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. లైఫ్‌ను ముందుగానే ప్లాన్‌ చేసుకోలేదట ఈ 'కీ&కా' స్టార్‌. తన మనసు చెప్పిందే చేసిందట. బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ నటిగా గుర్తింపు తెచ్చుకున్న కరీనా డిసెంబర్‌లో ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. ప్రస్తుతం ఆమె 'వీర్‌ డి వెడ్డింగ్‌' చిత్రంలో నటిస్తోంది.

థియేటర్ల కోసం కొట్టేసుకుంటారేమో..

29/09/2016: ఎవరికి వాళ్లు దసరానే కావాలంటూ రిలీజ్‌ డేట్లు ఇచ్చేశారు. ప్రమోషన్లు కూడా గట్టిగా చేసేస్తున్నారు. ఏకంగా ఐదు సినిమాలు దసరా రేసులో నిలుస్తున్నాయి. ఒకేసారి ఐదు సినిమాలు రావడం కొత్తేమీ కాదు కానీ.. అందులో అవి చిన్నా చితకా సినిమాలైతే ఎవరూ పట్టించుకోరు. కానీ ఈ దసరాకు రాబోయే ఐదు సినిమాలూ చెప్పుకోదగ్గవే. ఓ మోస్తరు, పెద్ద స్థాయి సినిమాలే. ప్రస్తుత ట్రెండులో సినిమాలకు లాంగ్‌ రన్‌ ఉండట్లేదు. ఓపెనింగ్స్‌ మీదే ప్రధానంగా ఆధార పడుతున్నారు. ఇందుకోసం ఎక్కువ థియేటర్లలో రిలీజ్‌ చేసుకుని ఆరంభ వసూళ్లను పెంచుకుంటున్నారు. కానీ దసరాకు ఉన్న పోటీ చూస్తుంటే అందరికీ ఇబ్బంది తప్పేలా లేదు. ఆల్రెడీ దసరా వీకెండ్‌కు ముందు వారం 'హైపర్‌' విడుదలవుతోంది. మరీ డిజాస్టర్‌ అయితే తప్ప ఆ సినిమాకు రెండో వారానికి కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే థియేటర్లు ఉంచాల్సి ఉంటుంది. అవి పోగా మిగిలిన థియేటర్లను ఐదు సినిమాలకు పంచడం అంటే చాలా చాల కష్టం. ఉన్నవాటిలో ఎక్కువ సంఖ్యలో 'ప్రేమమ్‌' సినిమాకు పోతాయనడంలో సందేహం లేదు. మిగతా థియేటర్లను నాలుగు సినిమాలు పంచుకోవాలి. మనవూరి రామాయణం, ఈడు గోల్డ్‌ ఎహే, అభినేత్రి, జాగ్వార్‌ సినిమాలకు తలో మంఊడొందల థియేటర్లు దొరికితే ఎక్కువేమో. ఐతే ఎవరికి వారు థియేటర్ల కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ప్రకాష్‌ రాజ్‌ బడా డిస్ట్రిబ్యూటర్‌ అభిషేక్‌ చేతుల్లో తన సినిమాను పెట్టేశాడు. 'అభినేత్రి'కి కోన వెంకట్‌ అండ ఉంది. 'ఈడు గోల్డ్‌ ఎహే' సినిమాకు అనిల్‌ సుంకర బ్యాకప్‌ ఉంది. 'జాగ్వార్‌' టీమ్‌ ఇక్కడి పొలిటీషియన్ల ద్వారా థియేటర్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. మరి వీరిలో ఎవరి ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో.. ఎవరికెన్ని థియేటర్లు దొరుకుతాయో చూడాలి.

మహేష్ మూవీ వాయిదా పడుతుందా..?

29/09/2016: సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2017 వేసవిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అది కూడా మహేష్ కెరీర్లో బిగెస్ట్ హిట్స్లో ఒకటిగా నిలిచి పోకిరి రిలీజ్ డేట్ అయిన ఏప్రిల్ 28ననే ఈ సినిమాను కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు అదే సమయానికి మహేష్ మూవీ రిలీజ్ అవుతుందా.. లేదా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి 2ను కూడా అదే రోజు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో మహేష్ తన సినిమాను వాయిదా వేసుకోక తప్పేలా లేదు. గతంలో కూడా బాహుబలి తొలి భాగం రిలీజ్ సమయంలో తన శ్రీమంతుడు సినిమాను నెల రోజుల పాటు వాయిదా వేశాడు మహేష్. మరి మరోసారి అదే బాటలో వాయిదా వేస్తాడా..? లేక బాహుబలి కన్నా ముందే థియేటర్లలోకి వస్తాడా..? చూడాలి.

ఈగ-2 తీయాల్సిందే అంటున్న నాని

28/09/2016: నాని కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోయే సినిమా ‘ఈగ’. అలాగే రాజమౌళి సినిమాల్లో కూడా ‘ఈగ’ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ సినిమా సీక్వెల్ గురించి అప్పుడప్పుడూ ఊహాగానాలు తెరమీదికి వస్తుంటాయి. ఓ సందర్భంలో రాజమౌళి కూడా ‘ఈగ’కు సీక్వెల్ తీస్తే బాగానే ఉంటుందని మాట్లాడాడు. ఐతే ఈ దిశగా ఎప్పుడూ కాంక్రీట్‌గా అడుగులు పడింది లేదు. ఐతే నాని మాత్రం ఏదో ఒక రోజు ‘ఈగ’ సీక్వెల్ తీయాల్సిందే అంటున్నాడు. సీక్వెల్లో తనకు ఛాన్సిచ్చినా ఇవ్వకున్నా ఈ సినిమాకు సీక్వెల్ రావాలని మాత్రం తాను కోరుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు నాని. ‘‘ఈగ-2 గురించి ఎప్పుడూ వార్తలు చదువుతూనే ఉంటా. అది నిజమైతే బాగుంటుందని అనుకుంటుంటా. కానీ ఆ ప్రాజెక్టు విషయంలో ఇప్పటిదాకా ఏ అప్ డేట్ లేదు. రాజమౌళి గారిని ఎప్పుడు కలిసినా ఈగ-2 గురించి అడుగుతూనే ఉంటా. ‘ఈగ’ సినిమాకు ఓ అభిమాని.. దానికి సీక్వెల్ రావాలని కోరుకుంటా. ఐతే ‘ఈగ’ ఫస్ట్ పార్ట్‌లో నా పాత్ర చనిపోతుంది కాబట్టి టెక్నికల్‌గా చూసుకుంటే సీక్వెల్లో నాకు చోటు ఉండకూడదు. అయినప్పటికీ ‘ఈగ’ సీక్వెల్ తీయాలని నా కోరిక. ఐతే ఈ విషయంలో ఏ నిర్ణయమైనా రాజమౌళి గారే తీసుకోలేదు. నేనైతే ఆ ప్రాజెక్టు విషయంలో చాలా ఆసక్తితో ఉన్నా’’ అని నాని చెప్పాడు. ఐతే ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ‘ఈగ’ లాంటి సినిమా కూడా ఆయన స్థాయికి ఇప్పుడు చిన్నదే. బాహుబలి-2 తర్వాత మరో భారీ ప్రాజెక్టు దిశగా సన్నాహాలు చేసుకుంటున్నాడు జక్కన్న. మరి నాని కోరికను నెరవేరుస్తాడో లేదో?.

ధోని సినిమా ఉన్నదున్నట్లుగానే..

28/09/2016: బాలీవుడ్లో బయోపిక్స్ హవా సాగుతోంది కొన్నేళ్లుగా. ఈ కోవలోనే ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధారంగా 'ఎం.ఎస్.ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ' సినిమా రాబోతోంది. ఐతే బయోపిక్స్ అనగానే ఉన్నదున్నట్లు తీస్తే అంత కిక్కుండదని.. కొంచెం మసాలా జోడించడానికి ప్రయత్నిస్తుంటారు ఫిలిం మేకర్స్. 'బాగా మిల్కా బాగ్' నుంచి 'అజహర్' వరకు కొంత వరకు వాస్తవాల వక్రీకరణ జరిగిన మాట వాస్తవం. అసలు విషయాల్ని కొంచెం ఎక్కువ చేసి చూపించారు ఆ సినిమాల్లో. హీరో పాత్రల్ని వాస్తవానికంటే గొప్పగా చూపించే ప్రయత్నం జరిగింది. ఐతే 'ఎం.ఎస్.ధోని' సినిమాలో మాత్రం అలాంటిదేమీ జరగలేదని అంటున్నాడు హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్. ధోని జీవితాన్ని తాము ఉన్నదున్నట్లుగా చూపించినట్లు అతను తెలిపాడు. ''ధోనికి లేని గొప్పదనాన్ని ఆపాదించాలని.. అతడి జీవితాన్ని ఎక్కువ చేసి చూపించాలని మేం ప్రయత్నించలేదు. దేనికీ గ్లామర్ కోణాన్ని ఆపాదించలేదు. ధోని పుట్టడం దగ్గర్నుంచి 2011 ప్రపంచ కప్ వరకు మేం ప్రతి విషయాన్ని ఉన్నదున్నట్లుగా చూపిస్తున్నాం'' అని సుశాంత్ తెలిపాడు. ఇక ధోని పాత్ర చేసే క్రమంలో తాను ధోనితో మరీ ఎక్కువేమీ మాట్లాడలేదని.. ఎక్కువ ఇన్ పుట్స్ ఏమీ తీసుకోలేదని.. అతడితో కేవలం మూడు సార్లు మాత్రమే మాట్లాడానని సుశాంత్ చెప్పాడు. ''ఈ సినిమా విషయంలో నాకు ధోని తన క్రికెటింగ్ స్టయిల్.. మేనరిజం గురించి ఏమీ చెప్పలేదు. ఈ సినిమా అనుకున్నాక నేను ధోనితో మాట్లాడింది మూడే మూడుసార్లు. ఒకసారి తన సినిమా చేస్తున్నందుకు ఎలా ఫీలవుతున్నాడో అడిగాను. ఇంకోసారి అతడి మనస్తత్వం ఎలా ఉంటుందో.. ఏ పరిస్థితుల్లో ఎలా స్పందిస్తాడో తెలుసుకోవడానికి 250 దాకా ఊహాజనితమైన ప్రశ్నలు అడిగాను. మూడోసారి స్క్రిప్టులో రాసిన కొన్ని సంఘటనల గురించి అతడితో మాట్లాడాను'' అని సుశాంత్ తెలిపాడు. ధోని స్వతహాగా వికెట్ కీపర్ కావడంతో మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరె ఆధ్వర్యంలో తాను క్రికెట్ శిక్షణ తీసుకున్నట్లు సుశాంత్ తెలిపాడు. 13 నెలల పాటు తన శిక్షణ సాగినట్లు అతను వెల్లడించాడు.

రాజమౌళి, ఎన్టీఆర్‌ ఆ జ్నాపకాల్లోకి వెళ్లిపోయారు

28/09/2016: దర్శకుడిగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి సామర్థ్యం గురించి.. నటుడిగా ఎన్టీఆర్‌ ప్రతిభ గురించి.. వీళ్లిద్దరికీ ఉన్న ఫాలోయింగ్‌ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఇద్దరూ సరిగ్గా 15 ఏళ్ల కిందట తమ ఘన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన 'స్టూడెంట్‌ నెం.1' విడుదలై 15 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆ ఇద్దరూ పాత జ్నాపకాల్లోకి వెళ్లిపోయారు. ముందుగా రాజమౌళి స్పందిస్తూ.. దర్శకుడిగా అరంగేట్రం చేసి 15 ఏళ్లయిందని.. ఎడిటింగ్‌ అసిస్టెంటుగా చేరి 25 ఏళ్లు పూర్తయిందని.. ఇది వినడానికి చాలా ఏళ్లయినట్లు అనిపించినా.. తనకు అలాంటి ఫీలింగ్‌ లేదని అన్నాడు. 'స్టూడెంట్‌ నెం.1' షూటింగ్‌ టైంలో తాను, ఎన్టీఆర్‌ ఒకే గదిలో ఉన్నామని.. తాను 9 గంటలకే పడుకుంటే ఎన్టీఆర్‌ 12 వరకు టీవీ చూసేవాడని.. అది కూడా స్విస్‌ యాసలో వచ్చే వ్యవసాయ కార్యక్రమాలు చూసేవాడని.. అది తలుచుకుంటే ఇప్పటికీ తనకు కోపం వస్తుందని రాజమౌళి గుర్తు చేసుకున్నాడు. ఇక 'స్టూడెంట్‌ నెం.1' సక్సెస్‌ గురించి చెబుతూ.. ఆ క్రెడిట్‌ అంతా స్క్రిప్ట్‌ రైటర్‌ ప థ్వీ తేజకు.. సంగీత దర్శకుడు కీరవాణికే దక్కుతుందని రాజమౌళి అన్నాడు. తారక్‌ చిన్నవాడే అయినా కొన్ని సన్నివేశాల్లో చాలా బాగా చేశాడని.. ఇంటర్వెల్‌ సీన్లో మినహాయిస్తే తన దర్శకత్వంలో అప్పటికి అంత పరిణతి కనిపించదని రాజమౌళి వినమ్రంగా చెప్పాడు. తాము విజయయాత్రకు వెళ్లినపుడు 19 ఏళ్ల ఎన్టీఆర్‌ను చూడ్డానికి జనాలు ఎంతో ఆసక్తి ప్రదర్శించినట్లు జక్కన్న చెప్పాడు. మరోవైపు ఎన్టీఆర్‌ సైతం 'స్టూడెంట్‌ నెం.1' జ్నాపకాల్లోకి వెళ్లిపోయాడు. ఇప్పుడు రాజమౌళి దేశంలోనే అత్యంత గౌరవం సంపాదించుకున్న దర్శకుల్లో ఒకడని.. అయినప్పటికీ తమ ఇద్దరి మధ్య స్నేహం ఇప్పటికీ అదే మాదిరి కొనసాగుతోందని ఎన్టీఆర్‌ అన్నాడు. తాను అప్పుడు 19 ఏళ్ల కుర్రాడినని.. ఇప్పుడు ఓ బిడ్డకు తండ్రినని చెప్పాడు. తమ ఈ ప్రయాణం ఎప్పటికీ మరిచిపోలేదని కూడా ఎన్టీఆర్‌ అన్నాడు.

రామ్ చరణ్.. కొత్త యాంగిల్ చూడబోతున్నామా

28/09/2016: రామ్ చరణ్ సినీ రంగంలోకి వచ్చి తొమ్మిదేళ్లయింది. ఈ తొమ్మిదేళ్లలో తొమ్మిది సినిమాలు చేశాడు. పదో సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఐతే ఇన్నేళ్లలో రామ్ చరణ్ హిట్లు చూశాడు. బ్లాక్ బస్టర్లూ కొట్టాడు. ఐతే నటుడిగా మాత్రం అనుకున్న స్థాయిలో పేరు సంపాదించలేకపోయాడన్నది ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిన సత్యం. డ్యాన్సులు.. ఫైట్లలో అదరగొడతాడు. స్టైల్ కూడా బాగుంటుంది. కానీ నటన విషయంలో చరణ్ సాధించాల్సింది ఇంకా ఉంది. మగధీర, ఆరెంజ్, గోవిందుడు అందరివాడేలే.. లాంటి సినిమాల్లో తన యాక్టింగ్ స్కిల్స్ చూపించినప్పటికీ.. నటుడిగా పేరు తెచ్చుకోవాలంటే ఇంకా పెర్ఫామ్ చేయాల్సిందే. తెలుగులో వారసత్వంతో వచ్చేవాళ్లు స్టార్ కావడం ఈజీ. కానీ నటుడిగా పేరు సంపాదించడం కష్టం. ఐతే చరణ్ ఇప్పుడు ఎంచుకున్న ప్రాజెక్టులు చూస్తుంటే.. అతడి నటనలోని కొత్త కోణాలు బయటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘ధృవ’ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు చరణ్. సుక్కు సినిమాలంటే నటులకు పరీక్షే. అతడి పాత్రల్ని పండించాలంటే మామూలు నటన సరిపోదు. ‘ఆర్య-2’తో అల్లు అర్జున్, ‘100 పర్సంట్ లవ్’తో నాగచైతన్య, ‘1 నేనొక్కడినే’తో మహేష్ బాబు, ‘నాన్నకు ప్రేమతో’తో ఎన్టీఆర్.. తమను తాము సరికొత్తగా ఆవిష్కరించుకున్నారు. తమ నటనలోని కత్త కోణాల్ని బయటపెట్టారు. ఇప్పుడు చరణ్ కూడా తనలోని కొత్త యాంగిల్ చూపించాల్సిందే. దీని తర్వాత చరణ్ చేయబోయే సినిమా కూడా అతడికి సవాలే. అతను మణిరత్నంతో సినిమా చేయడం దాదాపు ఖాయం. మణిరత్నంతో పని చేయడమంటేనే ఒక నటుడికి సర్టిఫికెట్ లాంటిది. ఆర్టిస్టుల నుంచి అద్భుతమైన నటన రాబట్టుకుంటాడు మణి. కాబట్టి చరణ్ ఆ సినిమాతోనూ బాగా పేరు సంపాదించే అవకాశముంది. మొత్తానికి తాను చేయబోయే రెండు ఫ్యూచర్ ప్రాజెక్టులతో రామ్ చరణ్ ఇమేజ్ మారిపోయే అవకాశాలున్నాయి.

ధోనీతో...డేటింగ్ చేసింది...నేనొక్కదాన్నేనా!

28/09/2016: ఇండియన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ, సౌత్ హీరోయిన్ రాయ్ లక్ష్మి మధ్య అప్పట్లో ఏం జరిగింది? ముంబయ్ మీడియాలో ఇప్పుడిదే హాట్ టాపిక్. ధోనీ జీవితంపై తీసిన సినిమా ‘ఎం.ఎస్. ధోని- ద అన్‌టోల్డ్ స్టోరీ’లో రాయ్ లక్ష్మితో అతడి రిలేషన్‌షిప్ గురించి ఉంటుందా? లేదా? అనే చర్చ జరుగుతోంది. ఈ చర్చకు కారణం ఏంటంటే.. ‘చెన్నై సూపర్‌కింగ్స్’ ఐపీయల్ టీమ్‌కి ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు, రాయ్ లక్ష్మి ఆ టీమ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. అప్పట్లో ఇద్దరూ డేటింగ్ చేసుకున్నారు. ధోనీ మాజీ గర్ల్‌ఫ్రెండ్ ప్రియాంక గురించి ‘ఎం.ఎస్. ధోని’ ప్రచార చిత్రాల్లో చూపించడంతో, తాజాగా మళ్ళీ రాయ్ లక్ష్మి ప్రస్తావన కూడా వస్తోంది. ‘అకిరా’లో రాయ్ లక్ష్మి అతిథి పాత్రలో తళుక్కుమన్నారు. హిందీలో హీరోయిన్‌గా పరిచయమవుతున్న ‘జూలీ2’ త్వరలో విడుదల కానుంది. అయితే, మీడియా మాత్రం రానున్న ఈ సినిమాల గురించి కాక గతాన్ని గుర్తు చేయడం ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రాయ్ లక్ష్మి చెప్పిన సంగతులు.. ధోనీ, నేనూ ఎప్పుడూ పెళ్లి చేసుకోవాలనుకోలేదు. ఆ ఆలోచన కూడా రాలేదు. ఏడాది కంటే తక్కువ రోజులే రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. మా ఇద్దరి అభిప్రాయాలూ కలవలేదు. దాంతో విడిపోయాం. ఎనిమిదేళ్ల క్రితమే ఆ అధ్యాయం ముగిసింది. ఆ తర్వాత అతడితో టచ్‌లో లేను. అయినా, ధోనీ నాతో మాత్రమే డేటింగ్ చేయలేదు. నా తర్వాత చాలామంది అమ్మాయిలతో డేటింగ్ చేశాడు. చాలామందితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. ఆ జాబితా చాలా పెద్దదే. ఆ సంగతులు ఎలా ఉన్నా, అతని జీవిత కథా చిత్రం అంటే అమ్మాయిలు, డేటింగ్ మాత్రమే కాదు కదా. ఈ సినిమాలో ధోనీ జీవిత ముఖ్య ఘట్టాలు చూపిస్తారనుకుంటున్నా. అందులో నా ప్రస్తావన లేదనే అనుకుంటున్నా. ఒక క్రికెటర్‌తో సినిమా హీరోయిన్ డేటింగ్ కథ ఏంటో? తెలుసుకోవాలని అందరిలో ఆసక్తి ఉంటుంది. నావైపు నుంచి కథేంటో తెలుసుకోవాలని కొందరు ప్రయత్నించారు. కానీ, నేనేమీ చెప్పలేదు. ఏ అమ్మాయీ మరొకరి మాజీ గర్ల్ ఫ్రెండ్ అనిపించుకోవాలని కోరుకోదు.ఇప్పుడు ధోనీ పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నాడు. ఓ పాప కూడా పుట్టింది. అందుకే, ఇకపై ధోనీ గురించి అడిగితే, ‘క్రికెటర్‌గానే తెలుసు. వ్యక్తిగత పరిచయం లేదు’ అని చెబుతా.

ధోని సినిమా అరుదైన రికార్డు

27/09/2016: బాలీవుడ్లో హంగామా అంతా ఖాన్ సినిమాల చుట్టూనే తిరుగుతుంటుంది. సినిమాల బిజినెస్ విష‌యంలో అయినా.. హైప్ ప‌రంగా అయినా.. క‌లెక్ష‌న్ల రికార్డుల్లో అయినా వాళ్ల సినిమాలో టాప్‌లో ఉంటాయి. ఐతే ఇప్పుడు ఓ చిన్న హీరో న‌టించిన సినిమా ఖాన్‌ల సినిమాల‌కు స‌వాలు విసురుతోంది. వాళ్ల సినిమాల‌కు దీటుగా హైప్ సంపాదించి.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌కంప‌న‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఆ సినిమానే.. ‘ఎం.ఎస్‌.ధోని.. ది అన్ టోల్డ్ స్టోరీ’. యూట్యూబ్ వ్యూస్ విష‌యంలో ఎం.ఎస్‌.ధోని ఎలా దుమ్ముదులిపిందో తెలిసిందే. ఇండియాలో అత్యంత వేగంగా కోటి వ్యూస్ సంపాదించుకున్న ట్రైల‌ర్ ధోని సినిమానే. ఇప్పుడిక ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధిక దేశాల్లో విడుద‌ల‌వుతున్న ఇండియ‌న్ సినిమాగానూ ‘ఎం.ఎస్‌.ధోని రికార్డు సృష్టించ‌బోతోంది. ఈ చిత్రం ఏకంగా 60 దేశాల్లో విడుద‌ల‌వుతుండ‌టం విశేషం. ఇప్ప‌టిదాకా ఏ ఇండియ‌న్ సినిమా కూడా 50కి పైగా దేశాల్లో రిలీజ‌వ్వ‌లేదు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మొత్తం 4500 స్క్రీన్ల‌లో ధోని సినిమా హ‌ల్ చ‌ల్ చేయ‌బోతోంది. మామూలుగా ఖాన్‌ల సినిమాలు మాత్రమే ఇంత భారీగా విడుద‌ల‌వుతాయి. ధోని మీద జ‌నాల‌కు ఏ స్థాయిలో అభిమాన‌ముందో.. అత‌డి క‌థ తెలుసుకోవాల‌ని ఎంత ఆస‌క్తితో ఉన్నారో ఇప్పుడు అంద‌రికీ అర్థ‌మ‌వుతోంది. ఎ వెడ్న‌స్ డే, స్పెష‌ల్ చ‌బ్బీస్‌, బేబీ లాంటి మంచి థ్రిల్ల‌ర్లు తీసిన నీర‌జ్ పాండే ‘ఎం.ఎస్‌.ధోని’ని రూపొందించాడు. ధోని పాత్ర‌లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ న‌టించాడు.

న‌యీం గురించి వ‌ర్మ చెప్పిన సీక్రెట్‌

27/09/2016: నేను రౌడీల‌కే రౌడీ.. డాన్‌ల‌కే డాన్‌.. విల‌న్ల‌కే విల‌న్ అంటుంటాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఆయ‌న సంగ‌తి తెలియ‌క ఇప్పుడు గ్యాంగ్ స్ట‌ర్ న‌యీముద్దీన్‌ అనుచ‌రులు ఆయ‌న్ని బెదిరిస్తున్నార‌ట‌. న‌యీం ఎన్‌కౌంట‌ర్ అయిన కొన్ని రోజుల్లోనే అత‌డి మీద సినిమా తీయ‌బోతున్నాన‌ని.. అది మూడు భాగాలుగా ఉంటుంద‌ని వ‌ర్మ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ ప్ర‌క‌ట‌న చేసిన కొన్ని రోజుల‌కే న‌యీం సినిమా టైటిల్ లోగో త‌యారు చేయించ‌డంతో పాటు లేటెస్టుగా థీమ్ సాంగ్ కూడా రిలీజ్ చేశాడు వ‌ర్మ‌. ఐతే ఈ సినిమా తీస్తాన‌న్నందుకు త‌న‌కు బెదిరింపు కాల్స్ వ‌చ్చిన‌ట్లు వ‌ర్మ తాజాగా వెల్ల‌డించాడు. దీంతో పాటు న‌యీం గురించి స‌మాచారం తెలుసుకునే క్ర‌మంలో త‌న‌కు తెలిసిన ఆస‌క్తిక‌ర విష‌యాల్ని కూడా వ‌ర్మ ట్విట్ట‌ర్లో పంచుకున్నాడు. ‘‘నాకు న‌యీం గ్రూప్ నుంచి బెదిరింపు కాల్స్ వ‌స్తున్నాయి. కానీ నేను నయీంల‌కు నయీమ్ అని వాళ్లు తెలుసుకోవాలి. ప్ర‌స్తుతం నేను ముంబ‌యిలో ఉన్నా. న‌యీంతో కలిసి జైల్లో గ‌డిపిన వ్య‌క్తిని క‌లిశాను. న‌యీంతో స‌న్నిహిత సంబంధాలున్న ఐదుగురు పోలీసుల్ని.. అత‌డితో క‌లిసి మూడేళ్లు ప‌ని చేసిన ఇద్ద‌రు నక్స‌లైట్ల‌ను కూడా క‌లిశాను. నేర ప్ర‌పంచం గురించి నాకున్న మొత్తం అవ‌గాహ‌న ప్ర‌కారం చూస్తే క‌రాచిలో ఉన్న వ్య‌క్తితో న‌యీం చాలా చాలా క్లోజ్ అని తెలిసి నిజంగా ఆశ్చర్య‌పోయా’’ అని వ‌ర్మ అన్నాడు. ఇక్క‌డ‌ వ‌ర్మ చెబుతున్న క‌రాచి వ్య‌క్తి దావూద్ ఇబ్ర‌హీం అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదేమో.

తెలుగులోనే కాదు.. తమిళంలోనూ డిజాస్టరే

27/09/2016: లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు క్రేజ్ పెరుగుతున్న టైంలో త్రిష లాంటి స్టార్ హీరోయిన్ లీడ్ రోల్ చేయడంతో ‘నాయకి’ సినిమా మీద జనాల్లో ఒకప్పుడు బాగానే ఆసక్తి కలిగింది. దీని పోస్టర్లు అవీ కూడా బాగానే అనిపించాయి. కానీ ఎక్కడో తేడా వచ్చి సినిమాను గాలికి వదిలేశారు. కొన్నాళ్ల పాటు ఈ సినిమా వార్తల్లోనే లేదు. ప్రమోషన్ లేకుండా ఉన్నట్లుండి రెండు నెలల కిందట తెలుగులో రిలీజ్ చేశారు ఈ సినిమాను. సినిమా కూడా సాదాసీదాగా ఉండటంతో వచ్చింది తెలియదు.. వెళ్లింది తెలియదు అన్నట్లయింది పరిస్థితి. మరోవైపు తమిళంలో అయితే అనుకోని కారణాల వల్ల ‘నాయగి’ విడుదలకే నోచుకోలేదు. అడ్డంకులన్నీ అధిగమించి.. ఈ నెల 16న ‘నాయగి’ని తమిళంలో రిలీజ్ చేశారు. అక్కడ కూడా రిజల్ట్ భిన్నంగా ఏమీ లేదు. ముందే తెలుగు వెర్షన్ కు సంబంధించి టాక్ కూడా స్ప్రెడ్ అయిపోవడం.. త్రిష ఈ సినిమాను అసలేమాత్రం పట్టించుకోకుండా వదిలేయడంతో తమిళ వెర్షన్ కు ఓపెనింగ్సే లేవు. రివ్యూలు.. మౌత్ టాక్ కూడా బ్యాడ్ కావడంతో సినిమా అక్కడా డిజాస్టర్ అయింది. మొత్తానికి ఈ సినిమా మొదలైనపుడు ఏదో అనుకుంటే.. చివరికి ఇంకేదో అయింది. ఈ సినిమా విడుదల కావడానికి రెండు రోజుల ముందు.. తాను ప్రమోషన్ కు రాకపోవడానికి సరైన కారణాలే ఉన్నాయని చెప్పింది త్రిష. అవేంటో తర్వాత చెబుతానని ట్వీట్ చేసింది. మరి ఆ కారణాలేంటో కానీ.. త్రిష పట్టించుకోకపోవడం వల్ల ఈ సినిమాకు కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. నిర్మాత దారుణంగా నష్టపోయాడు.

జీవీతో జెనీలియా రీఎంట్రీ

27/09/2016: నటి జెనీలియాను దక్షిణాది సినిమా అంత సులభంగా మరచిపోదు. కారణం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి అంతగా తనదైన ముద్ర వేసుకున్నారిక్కడ. తమిళంలో సచిన్, సంతోష్ సుబ్రమణియన్ లాంటి చాలా తక్కువ చిత్రాల్లో నటించినా, తెలుగులో పలు చిత్రాలు చేశారు. నటిగా మంచి లైమ్‌టైమ్‌లో ఉండగానే హిందీ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి పెళ్లాడి సంసార జీవితంలో సెటిల్ అయ్యారు. అలా నటనకు దూరం అయిన జెనీలియా సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యారన్నది తాజా సమాచారం. అదీ కోలీవుడ్‌లో నటించనున్నారు. ఇప్పటి వరకూ కుర్ర హీరోయిన్లతో నటిస్తున్న జీవీ.ప్రకాశ్‌కుమార్ ఇప్పుడు జెనీలియాతో రొమాన్స్ చేయనున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న జీవీ.ప్రకాశ్‌కుమార్ చేతిలో ప్రస్తుతం పలు చిత్రాలు ఉన్నాయి. వాటిలో బ్యూస్‌టీ, కడవుల్ ఇరుక్కాన్ కుమారు చిత్రాలు త్వరలో విడుదలకు ముస్తాబవుతున్నాయి. కాగా తాజాగా రామ్‌బాలా దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. సంతానం హీరోగా నటించిన సూపర్‌హిట్ చిత్రం దిల్లుక్కు దుడ్డు చిత్రం ద్వారా మెగాఫోన్ పట్టిన దర్శకుడు రామ్‌బాలా అన్నది గమనార్హం. ఈయన దర్శకత్వంలో జీవీ నటించనున్న చిత్రాన్ని స్టీఫెన్ నిర్మించనున్నారు. ఇందులో జీవీకి జంటగా నటి జె నీలియా నాయకిగా నటించనున్నట్లు సమాచారం. కాగా ఇందులో హాస్య భూమికను వైగై పులి వడివేలు నటించడం మరో విశేషం. 2011 శాసనసభ ఎన్నికల తరువాత వడివేలు నటనకు దూరం అయిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఎలి అనే చిత్రంలో హీరోగా నటించినా ఆ చిత్రం ఆయన్ని నిరాశపరిచింది. చాలా గ్యాప్ తరువాత వడివేలు తన పాత బాణీకి మారారు. విశాల్ హీరోగా నటిస్తున్న కత్తిసండై చిత్రంలో హాస్య పాత్రతో రీఎంట్రీ అయ్యారు. తాజాగా జీవీ చిత్రంలో నటించనున్నారన్న మాట. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

నాగ్ కొత్త సినిమాలో ఏఎన్నార్ గెస్ట్ రోల్..?

27/09/2016: స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. చనిపోయి చాలా కాలం అవుతున్నా.. ఏఎన్నార్ సినిమాలో ఎలా నటిస్తారని ఆలోచిస్తున్నారా..? ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఏఎన్నార్ను మరోసారి వెండితెర మీద చూపించేందుకు రెడీ అవుతున్నారు అక్కినేని టీం. గ్రాఫిక్స్ సహాయంతో రూపొందించనున్న నాగేశ్వరరావు పాత్ర దాదాపు మూడు నిమిషాల పాటు కనిపించనుందట. ప్రస్తుతం కన్నడలో తెరకెక్కిన నాగభరణం సినిమాలో కూడా చనిపోయిన విష్ణువర్థన్ హీరోగా కనిపిస్తున్నారు. అదే తరహాలో ఓం నమోవేంకటేశాయలో ఏఎన్నార్ కనిపించనున్నారు. ఇప్పటి వరకు యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించకపోయినా అక్కినేని అభిమానులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు.

అవును అతణ్ని ప్రేమిస్తున్నా..

27/09/2016: అవును నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. అని నటి శ్వేతాబసు స్పష్టం చేశారు. బహుభాషానటిగా శ్వేతాబసు గురించి చిత్ర పరిశ్రమలో తెలియని వారుండరు. తమిళంలో రారా, చందమామ తదితర చిత్రాల్లో నాయకిగా నటించిన ఈ భామ తెలుగు, హిందీ చిత్రాల్లోనూ నటించి గుర్తింపు పొందారు. ఇక ఆ మధ్య వ్యభిచార కేసులో పోలీసులకు పట్టుబడి పెద్ద కలకలం సృష్టించిన శ్వేతాబసు కోర్టు ఉత్తర్వులతో కొంత కాలం స్త్రీ సంక్షేమ ఆశ్రమంలో గడిపారు. అనంతరం బయటపడ్డ శ్వేతాబసు అవకాశాల వేటలో పడ్డారు. అయితే చాలా మంది అయ్యో పాపం అన్నారే కానీ అవకాశాలివ్వలేదు. దీంతో మీ సింపతీ నాకొద్దు అంటూ ముంబైకి మకాం మార్చిన ఈ అమ్మడు అక్కడ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ వద్ద సహాయకురాలిగా చేరారు. ఆయనతో కథా చర్చల్లో పాల్గొంటున్న శ్వేతాబసుకు వారి కార్యాలయానికి వచ్చిన మరో దర్శకుడు రోహిత్ మిట్టల్‌తో పరిచయం ప్రేమగా మారిందట. వీరిద్దరి ప్రేమ వ్యవహారం గురించి ప్రచారం హల్‌చల్ చేస్తున్నా పట్టించుకోని శ్వేత తాజాగా అవును నేను దర్శకుడు రోహిత్ మిట్టల్ ప్రేమించుకుంటున్నాం అని బహిరంగంగా వెల్లడించారు. గత రెండేళ్లుగా తాము ప్రేమించుకుంటున్నామనీ, ఒక కార్యక్రమంలో తనకు రోహిత్ పరిచయం అయ్యాడని అది ప్రేమకు దారి తీసిందని తెలిపారు. రెండేళ్లుగా తామిద్దరం ప్రేమలో సంతోషంగా ఉన్నామని, పెళ్లి గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనీ శ్వేతాబసు పేర్కొన్నారు.

తమ్ముడు 25 ఫ్లాపులిచ్చినా సూపర్ స్టారే

22/09/2016: ‘ఏ జవానీ హై దివానీ’ సినిమా సాధించిన విజయం చూశాక.. రణబీర్ కపూర్ ముగ్గురు ఖాన్‌లకు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎదుగుతాడని.. సూపర్ స్టార్ అవుతాడని అంచనా వేశారు బాలీవుడ్ జనాలు. కానీ ఆ సినిమా తర్వాత వరుస ఫ్లాపులతో బాగా దెబ్బ తిన్నాడు రణబీర్. బేషారమ్, బాంబే వెల్వెట్ సినిమాలు పెద్ద డిజాస్టర్లు కాగా.. గత ఏడాది వచ్చిన ‘తమాషా’ సినిమా మంచి టాక్ తెచ్చుకుని కూడా ఆడలేదు. దీంతో రణబీర్ రేసులో బాగా వెనుకబడిపోయాడు. ఐతే తన తమ్ముడు ఎన్ని ఫ్లాపులిచ్చినా సరే.. సూపర్ స్టారే అంటోంది కరీనా కపూర్. రణబీర్ కొత్త సినిమా ‘ఏ దిల్ హై ముష్కిల్’ సూపర్ హిట్ అవుతుందని.. అతను మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. ‘‘ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ హిట్లు ఫ్లాపులు ఉంటాయి. నా సినిమాలూ కొన్ని ఫ్లాప్‌ అయ్యాయి. నా తొలి సినిమానే ఆడలేదు. అయినా నేను నిలబడలేదా? జయాపజయాలు ఓ నటుడి స్టార్‌ డమ్‌కు అడ్డు కావు. బాలీవుడ్‌ బెస్ట్ యాక్టర్లలో రణ్‌బీర్‌ ఒకడు. అతను హిందీ చిత్రసీమకు సూపర్‌స్టార్‌. అతను 25 ఫ్లాపులిచ్చినా సరే.. సూపర్‌స్టారే. అవేవీ అతని ఇమేజ్‌ను తగ్గించలేవు. ‘ఏ దిల్‌ హై ముష్కిల్‌’ చిత్రం కచ్చితంగా రణబీర్‌కు సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ సినిమా చాలా బావుంటుందని అనుకుంటున్నా. కరణ్‌ జోహార్‌ తీసినఈ సినిమా కోసం చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నా. రణ్‌బీర్‌, కరణ్‌ ఇద్దరూ నాకు సోదరులే. ఈ సినిమా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని చెప్పింది ఇంకొన్ని నెలల్లో ప్రసవించబోతున్న కరీనా.

పవన్ నిర్మాతల లిస్టులోకి మాజీ ముఖ్యమంత్రి

22/09/2016: పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు మొదలవుతుంది.. ఎప్పుడు పూర్తవుతుంది.. ఎప్పుడు విడుదలవుతుంది.. అనే ప్రశ్నలకు జవాబులు చెప్పేవాళ్లే లేరిప్పుడు. తన సినిమాల విషయంలో అందరినీ అయోమయంలోకి నెట్టేస్తున్నాడు పవన్. మూడు నెలల కిందట ప్రారంభోత్సవం జరుపుకున్న కొత్త సినిమాను ఇప్పటిదాకా సెట్స్ మీదికి తీసుకెళ్లలేదు. ఇదిగో అదిగో అంటూ కాలం గడిచిపోతోంది. మరోవైపు పవన్ కోసం వెయిట్ చేస్తున్న నిర్మాతల లిస్టు మాత్రం పెరిగిపోతోంది. ఓవైపు దాసరి నారాయణరావు.. మరోవైపు ఎస్.రాధాకృష్ణ లైన్లో ఉన్నారు. ఇప్పుడు మరో నిర్మాత రేసులోకి వచ్చాడు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి.. పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా తీస్తానంటున్నాడు. కుమారస్వామి ఒకప్పుడు రాజకీయాలతో పాటు సినీ నిర్మాణంలోనూ కొనసాగాడు. చెన్నాంబిక ఫిలిమ్స్ పేరిట సినిమాలు నిర్మించాడు. డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాడు. ఆ తర్వాత రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయిన కుమారస్వామి.. తాజాగా తన కొడుకును హీరోగా పరిచయం చేస్తూ ‘జాగ్వార్’ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా తెలుగులోనూ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో కుమారస్వామి మాట్లాడుతూ.. ఇకపై వరుసగా సినిమాలు నిర్మించాలనుకుంటున్నానని.. తెలుగులోనూ ప్రొడ్యూస్ చేస్తానని.. ముందుగా జగపతి బాబు హీరోగా ఓ సినిమాను నిర్మిస్తానని.. పవన్ కళ్యాణ్‌తో కూడా ఓ సినిమా ఉంటుందని వెల్లడించాడు. ఇంకా కొంతమంది తెలుగు స్టార్లతో సినిమాలు తీయాలనుకుంటున్నట్లు కుమారస్వామి చెప్పాడు.

నాని ని ఢీకొడుతున్నాడు.. నిలుస్తాడా?

22/09/2016: తెలుగులో మంచి మార్కెట్ ఉన్న తమిళ హీరోలు చాలామందే ఉన్నారు. ఆ జాబితాలో చేరాలని చాలా ఏళ్ల పాటు ప్రయత్నించాడు తమిళ స్టార్ హీరో ధనుష్. అతడి ప్రయత్నం గత ఏడాది ఫలించింది. ‘వేల ఇల్ల పట్టదారి’ తెలుగు వెర్షన్ ‘రఘువరన్ బీటెక్’ పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై సూపర్ హిట్టయింది. దీంతో ఆ తర్వాత ధనుష్ నటించిన పాత, కొత్త సినిమాలన్నింటినీ తెలుగులోకి తెచ్చేశారు. కానీ ఏది కూడా ఆడలేదు. ఇప్పుడు అతడి ఆశలు ‘రైల్’ మీదే ఉన్నాయి. తమిళంలో ‘తొడారి’ పేరుతో తెరకెక్కిన సినిమాకు తెలుగు వెర్షన్ ఇది. ధనుష్‌కు ‘వేల ఇల్ల పట్టదారి’ తర్వాత తమిళంలోనూ హిట్లు లేవు. ఈ నేపథ్యంలో ‘తొడారి’ మీద చాలా ఆశతో ఉన్నాడు. ఈ సినిమాతో అటు తమిళంలో.. ఇటు తెలుగులో హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. తెలుగులోకి అనువాదమైన ప్రేమఖైదీ.. గజరాజు లాంటి సినిమాలు తీసిన ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన సినిమా ‘రైల్’. నేను శైలజ ఫేమ్ కీర్తి సురేష్ ధనుష్‌కు జోడీగా నటించింది. మొత్తం రెండున్నర గంటల సినిమా దాదాపుగా రైల్లోనే నడుస్తుంది. గురువారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఐతే నాని సినిమా ‘మజ్ను’ మంచి అంచనాల మధ్య విడుదలవుతున్న నేపథ్యంలో దానికి పోటీగా విడుదలవుతున్న ‘రైల్’ ఏమాత్రం ఉనికిని చాటుకుంటుందన్నది సందేహం. ‘రైల్’కు పెద్దగా ప్రమోషన్ కూడా చేయలేదు. ధనుష్ ఇటు వైపే చూడలేదు. కొన్ని వారాలుగా సరైన సినిమాలు లేని నేపథ్యంలో ‘రైల్’కు థియేటర్లయితే బాగానే దొరికాయి. మరి కంటెంట్ ఉన్న సినిమాలాగే కనిపిస్తున్న ‘రైల్’ ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.

గోదావరి పాప సూర్య సినిమాలో

22/09/2016: శేఖర్ కమ్ముల ‘గోదావరి’ సినిమా చూసిన వాళ్లకు లీడ్ హీరోయిన్ కమలిని ముఖర్జీ ఎంతగా గుర్తుండిపోతుందో.. అందులో సుమంత్ మరదలిగా కనిపించిన నీతూ చంద్ర కూడా అలాగే గుర్తుంటుంది. ఈ సినిమాలో నీతూను చూసి చాలా ట్రెడిషనల్ అనుకున్నారు కానీ.. ఆమెలోని మరో యాంగిల్ ఏంటో బాలీవుడ్ సినిమాలు చూపించాయి. ఈ అమ్మడు అప్పట్లో వీర లెవెల్లో ఎక్స్‌పోజింగ్ చేసి.. ‘సెక్స్ బాంబ్’ అనే పేరు తెచ్చుకుంది. ఆమె చేసిన ఓ ఫొటో షూట్ కూడా కలకలం రేపింది. ఐతే అందాలన్నీ కావాల్సిన స్థాయిలో ఉన్నప్పటికీ.. ఎక్స్‌పోజింగ్‌కు అడ్డు చెప్పకుండా ఆమెకు సరైన స్థాయిలో అవకాశాలు రాలేదు. గత రెండు మూడేళ్లుగా ఎక్కడా కనిపించట్లేదు నీతూ. సౌత్ ఇండియన్ సినిమాలకైతే పూర్తిగా దూరమైపోయింది. ఇలాంటి టైంలో ఆమెకు ఓ బంపర్ ఆఫర్ తగిలింది. సౌత్ స్టార్ సూర్య కొత్త సినిమా ‘ఎస్-3’లో నీతూ ఓ ఐటెం సాంగ్ చేస్తోంది. ఆల్రెడీ ఈ పాట చిత్రీకరణ కూడా పూర్తయింది. సినిమాకు ఆ పాట హైలైట్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమాలో అనుష్క, శ్రుతి హాసన్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వాళ్లు సరిపోరని నీతూతో ఐటెం సాంగ్ చేయించడం విశేషమే. డిసెంబరు 16న తమిళ, తెలుగు భాషల్లో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది ‘ఎస్-3’. సింగం సిరీస్‌లో తొలి రెండు భాగాలు తీసిన హరినే ఈ చిత్రాన్ని కూడా రూపొందించాడు. రెండో భాగం కొంత వరకు విదేశాల్లో సాగితే.. ఈ సినిమా మెజారిటీ పార్ట్ ఫారిన్లోనే ఉంటుందట. హారిస్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతాన్నందించాడు. సూర్య.. అతడి కజిన్ జ్నానవేల్ రాజా నిర్మించారు.

ఫ్యాషన్‌ దుస్తులు ధరిస్తేనే గౌరవం ఇస్తారు

22/09/2016: చాలామంది సినీతారలు వెండితెరపైనే కాదు.. ప్రచార కార్యక్రమాలకు వెళ్లినా.. విహారయాత్రలకు వెళ్లినా ఫ్యాషన్‌ దుస్తులతోనే తళుక్కుమంటారు. మేకప్‌ లేకుండా బయటకొచ్చేందుకు ఇష్టపడరు. సినీ తారలైనంత మాత్రాన బయట కూడా గ్రాండ్‌గా కనిపించాలా? అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అలా కనిపిస్తేనే.. ఫ్యాషన్‌ దుస్తులు ధరిస్తేనే ప్రజలు గౌరవం ఇస్తారంటోంది సన్నీ లియోనీ. ‘‘సెలబ్రిటీలు మంచి వ్యక్తులా? కాదా? అన్నది అనవసరం. సెలబ్రిటీలు వేసుకునే దుస్తులను బట్టే ప్రజలు ఓ నిర్ణయానికి వస్తుంటారు. అది మానవుడి నైజం. మనమంతా ఎదుటివారి వస్త్రధారణను బట్టే వారిని అంచనా వేస్తుంటాం. నేను ఫ్యాషన్‌ దుస్తులు ధరించినప్పుడు ఎవరేమనుకుంటున్నారో తెలుసుకోవడం నాకు ఇష్టం’’ అని చెప్పింది సన్నీ. ‘‘నా విషయానికి వస్తే ఫ్యాషన్‌ అనేది చాలా ముఖ్యం. ఏ రోజు ఏ మూడ్‌లో ఉన్నానో నేను ధరించే దుస్తులే వ్యక్తపరుస్తాయి. ప్రపంచం మనల్ని ఓ కంట కనిపెడుతుంటుంది. అందుకే ఎప్పుడూ అందంగా.. ఆహ్లాదంగా కనిపించాలి’’ అని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది ఈ సుందరి.

పెద్దల స్థానం మార్చడమే కంగన లక్ష్యమట

21/09/2016: బాలీవుడ్‌ 'క్వీన్' కంగన రనౌత్.. హీరో స్థాయిలో తాను నటించిన సినిమాను బ్లాక్‌బస్టర్‌గా మార్చగల దిట్ట. ఈ టాలెంటెడ్ నటి ఇటీవల హృతిక్‌ రోషన్‌తో వివాదం వల్ల కొన్ని నెలల పాటూ వార్తల్లో నానింది. ఇటీవలే ఫెమినిజంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు తప్పనిసరి పరిస్థితుల్లో స్పందించి మనసులో వేదనను వెళ్లగక్కింది. ‘‘మనల్ని అవమానపరిచేవారు ఎక్కడైనా ఉంటారు. వారందరినీ దాటుకొని, విమర్శలు పట్టించుకోకుండా ముందుకు సాగాలి. నా గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోను. నా జీవితం ఉన్నది నా కోసం మాత్రమే. నా వెనక జరిగే విషయాల గురించి తల పగలకొట్టుకోవడం నాకిష్టం ఉండదు. నాలో పోటీతత్వం ఎక్కువ. బాలీవుడ్‌కి వచ్చిన తొలినాళ్లలో పరిశ్రమలోని ప్రధాన వ్యక్తులను ఎదుర్కొన్నాను. నిజానికి పరిశ్రమలోని పెద్ద మనుషుల్ని తొలగించి వారి స్థానాన్ని వేరేవాళ్లతో భర్తీ చేయించాలన్నదే నా లక్ష్యం’’ అని గుక్కతిప్పుకోకుండా చెప్పేసింది. ఈ విధంగా బీటౌన్‌లోని కొందరిపై తనలోని ఆవేదన, ఆవేశం, కోపాన్ని వెళ్లగక్కింది కంగనా. కంగనాను ఈ విధంగా రెస్పాండ్ అవడానికి కారణమెవరో? అని చర్చ కూడా ప్రారంభమైపోయింది. బాలీవుడ్ యాక్షన్ హీరో హృతిక్ రోషన్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ రకంగా మాట్లాడి ఉంటుందని బీటౌన్ జనాలు అంటున్నారు.

ఔను.. ఇంద్రగంటికి ప్రమోషన్ వచ్చింది

21/09/2016: టాలీవుడ్లో మరో రసవత్తర కాంబినేషన్‌కు రంగం సిద్ధమైంది. సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరున్న ఇంద్రగంటి మోహనకృష్ణ.. తొలిసారి టాలీవుడ్లో ఓ పెద్ద ఫ్యామిలీ హీరోతో సినిమా చేయబోతున్నాడు. అక్కినేని యువ కథానాయకుడు నాగచైతన్య హీరోగా తన తర్వాతి సినిమాను రూపొందించబోతున్నాడు. ఈ కాంబినేషన్ గురించి కొన్ని రోజుల ముందు నుంచే వార్తలు వస్తుండగా.. ఇప్పుడు స్వయంగా ఇంద్రగంటే ఈ సినిమాను కన్ఫమ్ చేశాడు. ఇటీవలే మనమంతా, జ్యో అచ్యుతానంద లాంటి మంచి సినిమాలతో పలకరించిన సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించబోతుండటం విశేషం. ఇది ఇంద్రగంటి స్టయిల్లో సాగే ప్రేమకథ అని చెబుతున్నారు. ఇంద్రగంటి మొదట్నుంచి కొత్తవాళ్లు.. చిన్న హీరోలతోనే సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది అల్లరి నరేష్‌తో ఆయన తీసిన 'బందిపోటు' పెద్ద డిజాస్టర్ అయింది. దీంతో ఆయన కెరీర్‌ డోలాయమానంలో పడింది. ఇలాంటి టైంలో తనను హీరోగా చేసిన మోహనకృష్ణకు నాని లైఫ్ ఇచ్చాడు. తనతో జెంటిల్‌మన్ సినిమా చేశాడు. ఆ సినిమా హిట్టయి ఇంద్రగంటిని నిలబెట్టింది. ఆ ఊపులో పెద్ద అవకాశమే సంపాదించాడు ఇంద్రగంటి. 'దోచేయ్' తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న చైతూ.. దసరాకు 'ప్రేమమ్'తో పలకరించబోతున్నాడు. అతడి మరో సినిమా 'సాహసం శ్వాసగా సాగిపో' కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఓపక్క కళ్యాణ్ కృష్ణతో ఓ సినిమా.. మరోవైపు కృష్ణ అనే కొత్త దర్శకుడితో మరో సినిమా కమిటైన చైతూ.. ముచ్చటగా మూడో సినిమాను కూడా లైన్లో పెట్టేశాడు.

దిల్ రాజు సూపర్ డీల్

21/09/2016: గత రెండేళ్లలో దిల్ రాజు జోరు కొంచెం తగ్గింది. భారీ సినిమాలు నిర్మించలేదు. మీడియం బడ్జెట్ సినిమాలే.. అవి కూడా ఒకదాని తర్వాత ఒకటి తీశాడు. కానీ ఈ ఏడాది ‘సుప్రీమ్’తో సూపర్ హిట్ కొట్టాక రాజు జోరు పెరిగింది. ఒకేసారి మూడు ప్రాజెక్టులు లైన్లో పెట్టాడు. అందులో ఒకటైన ‘ఫిదా’ ఆల్రెడీ సగానికి పైగా పూర్తయింది. శేఖర్ కమ్ముల శరవేగంగా ఈ సినిమాను పూర్తి చేస్తున్నాడు. మరోవైపు సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘శతమానం భవతి’ షూటింగ్ కూడా మొదలైపోయింది. సంక్రాంతి రిలీజ్ టార్గెట్ పెట్టుకుని పని చేస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్-హరీస్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కబోయే భారీ సినిమా వచ్చే నెలలోనే సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమాలు పూర్తవకముందే వీటికి సంబంధించి ఓ బంపర్ బిజినెస్ డీల్ పూర్తి చేశాడు దిల్ రాజు. ఈ మూడు చిత్రాల ఓవర్సీస్ హక్కుల్ని కలిపి రూ.18.5 కోట్ల మొత్తానికి అమ్మాడట. ఇది కచ్చితంగా మంచి డీలే. మామూలుగా అయితే బన్నీ-హరీష్ సినిమా ఓవర్సీస్ హక్కులు రూ.10 కోట్లకు అటు ఇటుగా పలుకుతాయి. మిగతా రెండు సినిమాలకు కలిపి రూ.8 కోట్ల దాకా రావడం అంటే మంచి డీల్ అన్నమాటే. శేఖర్ కమ్ముల సినిమా అంటే యుఎస్ లో మంచి డిమాండ్ ఉంటుంది. శర్వానంద్ కు కూడా అక్కడ ఓ మోస్తరు ఫాలోయింగ్ ఉంది. మొత్తంగా మూడు సినిమాలూ ఓవర్సీస్ లో వర్కవుట్ అయ్యేవే కావడంతో దిల్ రాజుకు మంచి ఆఫర్ ఇచ్చినట్లున్నాడు బయ్యర్. ఈ మూడు సినిమాలూ ఐదు నెలల వ్యవధిలో విడుదలవుతాయి.

నాన్న వల్ల నష్టపోయా - సోనమ్‌ కపూర్‌

21/09/2016: స్టార్‌ కిడ్‌ స్టేటస్‌తో బాలీవుడ్‌లో సోనమ్‌ కపూర్‌ వెలిగిపోతుందనుకున్నారు. కానీ సీన్‌ రివర్స్‌ అయింది. ఈ బాలీవుడ్‌ ఫ్యాషనిస్టాకు ఛాన్సులు దొరకడం గగనమైపోయింది. సల్మాన్‌ ఖాన్‌తో చేసిన 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' మినహా చెప్పుకోదగ్గ బ్లాక్‌ బస్టర్‌ అమ్మడి కెరీర్‌లో పడలేదు. 'నీరజ' కథలో మెప్పించినా చేతిలో ఉన్న ప్రాజెక్టులు తక్కువే. సల్మాన్‌తో హిట్‌, నీరజ ఈ మధ్య దక్కినవే. ఈ విషయమై సోనమ్‌ లేటెస్ట్‌గా స్పందించింది. తన కెరీర్‌ ఇలా ఉండడానికి ''మా నాన్నే కారణం'' అంటోంది. అనిల్‌ కపూర్‌ తనయ కావడం వల్లే అనేక ఛాన్సులు చేతికందకుండా పోయాయని సోనమ్‌ చెప్తోంది. ఈ కారణం చేతే సల్మాన్‌ కూడా తనతో నటించనని తెగేసి చెప్పాడని, ఆఖరికి ఎలాగోలా ఒప్పుకున్నాడని చెప్పుకొచ్చింది. సల్మాన్‌ అలా అనడానికి గల రీజన్‌నూ వెల్లడించింది ఈ బ్యూటీ. ''అనిల్‌ కపూర్‌ నా క్లోజ్‌ ఫ్రెండ్‌. అతడి కుమార్తెతో నేనెలా రొమాన్స్‌ చేయగలను? అది చాలా కష్టం'' అన్నాడట సల్లూ భాయ్‌ తనతో జోడీ కడుతోంది సోనమ్‌ అని తెలీగానే. ఇక స్టార్‌ కొరియోగ్రాఫర్‌, డైరక్టర్‌ ఫరాఖాన్‌తో సోనమ్‌ ఫ్యామిలీకి మంచి సాన్నిహిత్యం ఉంది. సోనమ్‌ తల్లి సునీత, ఫరా బెస్ట్‌ ఫ్రెండ్స్‌. అయినప్పటికీ ఫరాఖాన్‌ తనకు ఛాన్స్‌ ఇవ్వలేదని, కుటుంబ నేపథ్యం తన కేరీర్‌కు ఏమాత్రం హెల్ప్‌ అవ్వలేదని చెప్పింది సోనమ్‌.

ప్రేమ‌మ్ రిలీజ్.. నాగ్ త‌ప్పులో కాలేశాడు

21/09/2016: అక్కినేని నాగార్జున ఈ త‌రం తండ్రిలా క‌నిపిస్తాడు. కొడుకుల కెరీర్లో విష‌యంలో కానీ.. వారి వ్య‌క్తిగ‌త జీవితాల గురించి కానీ.. ఆయ‌న అతిగా జోక్యం చేసుకోడు. చైతూ, అఖిల్‌ల‌కు ఫుల్ ఫ్రీడ‌మ్ ఇస్తాడు. వాళ్లిద్ద‌రూ త‌మ‌కు న‌చ్చిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటానంటే అడ్డు చెప్ప‌లేదు నాగ్. ఇక సినిమాల ఎంపిక విష‌యంలోనూ వారిదే నిర్ణ‌యం. ముఖ్యంగా చైతూ సినిమాల విష‌యంలో నాగ్ పూర్తిగా అత‌డికి స్వేచ్ఛ ఇచ్చిన‌ట్లు క‌నిపిస్తాడు. చైతూ లేటెస్ట్ మూవీ ‘ప్రేమ‌మ్ ఆడియో వేడుక సంద‌ర్భంగా నాగ్ మాట్లాడిన తీరు చూస్తే ఈ సినిమాతో ఆయ‌న‌కు పెద్ద‌గా అవ‌గాహ‌న లేద‌ని స్ప‌ష్ట‌మవుతోంది. ‘ప్రేమమ్’ సినిమా రిలీజ్ డేట్ గురించి నాగార్జున‌కు ఐడియా లేద‌ట‌. అలాగే ఈ సినిమా టైటిల్ విష‌యంలోనూ నాగ్ మొన్న‌టిదాకా అయోమ‌యంలోనే ఉన్నాడ‌ట‌. ‘ప్రేమ‌మ్’ రిలీజ్ డేట్ గురించి చెబుతూ.. అక్టోబ‌రు 9న రిలీజ‌వుతుంద‌ని అనుకుంటా అన్నాడు నాగ్. సెన్సార్ అయితే ఆ రోజే రిలీజ‌వుతుంద‌ని చెప్పాడు. ఆ త‌ర్వాత నిర్మాత నాగార్జున ద‌గ్గ‌రికొచ్చి క్లారిటీ ఇవ్వ‌డంతో అభిమానుల‌కు సారీ చెప్పి అక్టోబ‌రు 7న రిలీజ్ అని ప్ర‌క‌టించాడు నాగ్. ఇక ‘ప్రేమ‌మ్ అంటే అర్థ‌మేంటో త‌న‌కు కూడా మొన్న‌టిదాకా తెలియ‌ద‌ని.. అది సంస్కృత ప‌ద‌మ‌ని.. ప్రేమ‌మ్ అంటే ప్రేమ అని అర్థ‌మ‌ని ఈ మ‌ధ్యే తాను తెలుసుకున్నాన‌ని నాగ్ వెల్ల‌డించాడు. ఏఎన్నార్ జ‌యంతి కావ‌డంతో తాను ఇంకా చాలా కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల్సి ఉంద‌ని.. అలాగే న‌మో వెంక‌టేశాయ షూటింగ్ కోసం పెద్ద డైలాగ్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంద‌ని చెప్పి హ‌డావుడిగా ఆడియో వేడుక నుంచి వెళ్లిపోయాడు నాగ్.

సౌందర్య రజనీకాంత్ చిత్రపటాలు దహనం

21/09/2016: సూపర్‌స్టార్ రజనీకాంత్ రెండో కూతురు, సినీ దర్శకురాలు సౌందర్యరజనీకాంత్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ఆమె చిత్ర పటాలను దహనం చేయడంతో ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. వివరాల్లోకెళితే సౌందర్యరజనీకాంత్‌ను భారత దేశం యానిమల్ వెల్ఫేర్ బోర్డు అంబాసిడర్‌గా నియమించిన విషయం తెలిసిందే. సౌందర్యరజనీకాంత్ ఆ బాధ్యతలను చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ తిరుచ్చిలో వీరవిళైయాట్టు మీట్పు కళగం నిర్వాహకులు మంగళవారం ఆందోళనకు దిగారు.సౌందర్యరజనీకాంత్ చిత్ర పటాలను దహనం చేసి ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. అయితే అక్కడి పోలీసులు సౌందర్య రజనీకాంత్ చిత్ర పటాలు దహనం చేయడాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వీరవిళైయాట్టు మీట్పు కళకం నిర్వాహకుడు రాజేశ్ మాట్లాడుతూ సౌందర్య రజనీకాంత్‌ను యానిమల్ వెల్ఫేర్ బోర్డు అంబాసిడర్‌గా నియమించడాన్ని జల్లికట్టును ఆదరించేవాళ్లు, తమిళ ప్రజల మనసులను తీవ్రంగా గాయపరిచిందన్నారు. జల్లికట్టు నిషేధానికి కారణంగా నిలిచిన యానిమల్ వెల్ఫేర్ బోర్డుకు అంబాసిడర్‌గా సౌందర్య రజనీకాంత్‌ను ఎంపిక చేయడం ఖండించతగ్గ విషయంగా పేర్కొన్నారు. అంతే కాకుండా తమిళ చిత్రాల్లో నటించి డబ్బు సంపాదించుకున్న కొందరు నటీనటులు జల్లికట్టుకు వ్యతిరేకంగా మాట్లాడడం గర్హనీయం అన్నారు. నటుడు రజనీకాంత్ మురట్టుకాళై చిత్రంలో జల్లికట్టు అంబోతుతో పోరాడి గెలిచినట్లు నటించి తమిళ ప్రజల మనసులో చోటు సంపాదించుకున్నారన్నారు. రజనీకాంత్ ఈ విషయంలో కలగజేసుకుని యానిమల్ వెల్ఫేర్ బోర్డు అంబాసిడర్‌గా నియమితులైన తన కూతురు సౌందర్యరజనీకాంత్‌ను ఆ బాధ్యతనుంచి వైదొలిగేలా చేయాలని లేని పక్షంలో ఆయనకు వ్యతరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నట్లు పేర్కొన్నారు.

రెండు సార్లు సమంత పెళ్లి

21/09/2016: నటి సమంత రెండు సార్లు పెళ్లికి సిద్ధమవుతున్నారా? ఈ ప్రశ్నకు సినీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఇలా రెండు సార్లు పెళ్లి చేసుకోవడం అరుదేమోగానీ కొత్తేమీకాదు. చెన్నై చిన్నది సమంత లవ్‌లో పడి అందులో సక్సెస్ అయిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌లో తన తొలి రీల్ హీరో నాగచైతన్యనే రియల్ లైఫ్‌లో హీరో కాబోతున్నారు. ఈ ప్రేమజంట పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు పచ్చ జెండా ఊపారు. ఇక ముహూర్తాలే తరువాయి అన్న పరిస్థితి నెలకొంది. వచ్చే ఏడాది తమ పెళ్లి ఉంటుందని నటుడు నాగచైతన్య ఇటీవల చెన్నైలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే చాలా మంది ప్రేమకు సమస్యలు తలెత్తుతుంటాయి. నాగచైతన్య, సమంతల పెళ్లికి సందిగ్ధం నెలకొందట. నిజానికి అదేమీ సమస్యకాదు. నాగార్జున కుటుంబం హిందువు కాగా సమంతది క్రిస్టియన్ కుటుంబం. ఇప్పుడు ఏ మత సంప్రదాయాన్ని అనుసరించి పెళ్లి జరిపించాలన్న చిన్న చర్చ తెరపైకి వచ్చిందని సమాచారం. నాగచైతన్య కుటుంబం హిందూ సంప్రదాయబద్ధంగా పెళ్లి నిర్వహించాలన్న అభిప్రాయాన్ని, సమంత కుటుంబం క్రిస్టియన్ మత సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో కాస్త అయోమయ పరిస్థితి నెలకొందని సమాచారం. అయితే రెండు మతాల సంప్రదాయాలను గౌరవిస్తూ రెండు సార్లు నాగచైతన్య, సమంతల పెళ్లి నిర్వహిస్తే బాగుంటుందన్న సన్నిహితుల సలహాలను పాటించడానికి ఇరు కుటుంబాలు సమ్మతించినట్లు తెలిసింది. ముందుగా నాగచైతన్య సొంత ఊరు హైదరాబాద్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపి,ఆ తరువాత సమంత సొంత ఊరు చెన్నైలో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం రెండోసారి పెళ్లి నిర్వహించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

డిసెంబర్లో సింగం 3

20/09/2016: దక్షిణాదిలో సీక్వల్స్గా రిలీజ్ అయిన సినిమాలు సక్సెస్ అవ్వటం చాలా అరుదు. అలాంటి అరుదైన సక్సెస్ను సొంతం చేసుకున్న హై టెంపో యాక్షన్ డ్రామా సింగం. సూర్య హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కిన సింగం, సింగం 2 సినిమాలు తమిళ్తో పాటు తెలుగు లోనూ ఘనవిజయం సాధించాయి. అదే ఊపులో ఇప్పుడు సింగం 3ని తెరకెక్కించారు. త్వరలో షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా సంఛలనాలు నమోదు చేస్తోంది. సూర్య సరసన మరోసారి అనుష్క హీరోయిన్గా నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో శృతిహాసన్ కనిపించనుంది. తొలి రెండు భాగాలకు సంగీతం అందించిన దేవీ శ్రీ ప్రసాద్కు బదులుగా మూడో భాగానికి హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు. తమిళ్తో పాటు తెలుగులోనూ భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే నిర్మాణాంతర కార్యక్రమాలను కూడా పూర్తి చేసి నవంబర్లో ఆడియోను డిసెంబర్ 16న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

బాలీవుడ్‌లో మరో బ్రేకప్

20/09/2016: బాలీవుడ్లో మరో ప్రేమజంట కటీఫ్ చెప్పారు. యువ హీరోహీరోయిన్లు సిద్ధార్థ మల్హోత్రా, అలియా భట్ ప్రేమబంధం ముగిసినట్టు సమచారం. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన ఈ ప్రేమపక్షులు చాలాకాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. సిద్ధార్థ, అలియా ప్రేమ గురించి పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఇటీవల వీరిద్దరూ ప్రేమకు గుడ్ బై చెప్పి, వారి కెరీర్లపై దృష్టిసారించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా సిద్ధార్థ, అలియా దూరంగా ఉంటున్నట్టు సమాచారం. డ్రీమ్ టీమ్ టూర్ సందర్భంగా వీరిద్దరూ దూరంగా ఉన్నారని, మాట్లాడుకోవడం కూడా తక్కువని బాలీవుడ్ వర్గాలు చెప్పాయి. సిద్ధార్థ సినిమా కెరీర్కు సంబంధించిన విషయాలు మినహా వ్యక్తిగత జీవితం గురించి మీడియాతో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాడు. ఇక అలియా కూడా ప్రేమ వ్యవహారానికి ముగింపు చెప్పి, పూర్తిగా సినిమాలపై దృష్టిపెట్టాలని నిర్ణయించుకుంది. ఇద్దరూ ప్రేమికులుగా గాక, స్నేహితులుగా ఉండాలని భావిస్తున్నారు.

ఏయ్ అబ్బాయ్...గౌరవించడం నేర్చుకో!

19/09/2016: తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో వివాహ బంధాన్ని తెగ తెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటి నుంచీ అమలాపాల్ మీద చాలా విమర్శలొస్తున్నాయ్. అత్తామామలకు ఆమె తీరు నచ్చకపోవడంవల్లే ఇదంతా జరిగిందన్నది కొందరి అభిప్రాయం. విజయ్‌లాంటి వ్యక్తిని వదులుకోవడం అమలాపాల్ చేస్తున్న పెద్ద తప్పన్నది మరి కొందరి ఒపీనియన్. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికే అమలాపాల్‌కి అవకాశాలు రానివ్వకుండా చెన్నై చిత్రసీమలో పావులు కదుపుతున్నారనే టాక్ ఉంది. ఇక, పుండు మీద కారం చల్లినట్లు, ‘విడాకులు తీసుకున్న మహిళలు ఎప్పుడూ హాట్‌గా, నాటీగా ఉంటారు’ అని ఓ ఆకతాయి సోషల్ మీడియాలో అమలా పాల్‌ని కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌ని అమలాపాల్ లైట్‌గా తీసుకోలేదు. ‘‘ఏయ్ అబ్బాయ్.. నీ యాంబిషన్ రాంగ్ డెరైక్షన్‌లో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ప్లీజ్.. మహిళలను గౌరవించడం నేర్చుకో’’ అని సదరు ఆకతాయికి కాస్త ఘాటుగానే కౌంటర్ రిప్లై ఇచ్చారు. కానీ, తాను విజయ్ నుంచి ఎందుకు విడిపోవాలనుకుంటున్నారో మాత్రం చెప్పలేదు. విడాకులు తీసుకోవడమనేది వ్యక్తిగత విషయం కాబట్టి స్పందించడం లేదనుకోవచ్చు. మరోవైపు విజయ్ కూడా ఈ విషయం గురించి నోరు విప్పడంలేదు. రచ్చ చేసుకోకుండా సెలైంట్‌గా విడిపోవాలనుకుని ఉంటారు.

నిఖిల్ హార్డ్‌వర్క్ స్పష్టంగా కనిపిస్తోంది - కేటీఆర్

19/09/2016: ‘‘భాషతో నిమిత్తం లేకుండా ప్రతిభ ఎక్కడ ఉన్నా అందర్నీ ప్రోత్సహించే అద్భుతమైన సంస్కృతి తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. సాంగ్స్, ట్రైలర్స్‌లో నిఖిల్‌కుమార్ హార్డ్‌వర్క్ కనిపిస్తోంది. తెలుగు, కన్నడ చిత్ర రంగాల్లో మరో ధృవతార రాబోతోందనడానికి ఇప్పటివరకూ చూసిన ప్రచార చిత్రాలే ఉదాహరణ. తాతయ్య, తండ్రి పేరుని నిఖిల్ నిలబెడతాడని, అతనికి ప్రేక్షకాదరణ లభిస్తుందని ఆశిస్తున్నాను’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ సీయం హెచ్.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘జాగ్వార్’. ఈ చిత్రాన్ని ఎ.మహదేవ్ దర్శకత్వంలో శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మించారు. ఎస్.ఎస్.తమన్ స్వరపరిచిన పాటల సీడీలను, థియేట్రికల్ ట్రైలర్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు. రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన పీవీ సింధుకి ఈ వేదికపై దేవేగౌడ పది లక్షల రూపాయల చెక్ అందజేశారు. దేవేగౌడ మాట్లాడుతూ - ‘‘నా మనవడు నిఖిల్‌కుమార్‌ని ఆశీర్వదించడానికి కేటీఆర్, టీయస్సార్, ఇతర ప్రముఖులు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా క్రెడిట్ అంతా టీమ్‌కు చెందుతుంది. గతేడాది నుంచి నిఖిల్‌కి శిక్షణ ఇస్తున్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన నిఖిల్ ఈ ఫిల్మ్ ఫీల్డ్‌ని ఎలా ఎంపిక చేసుకున్నాడో తెలీదు. ఫైట్స్ అవీ చేయడం చాలా టఫ్ టాస్క్. నిఖిల్ ఎంత కష్టపడ్డాడో స్వయంగా చూశాను. సక్సెస్ అవుతాడని ఆశీర్వదిస్తున్నాను. ప్రతి భారతీయుడూ టీవీల్లో సింధు మ్యాచ్ చూశారు. నేనూ మ్యాచ్ చూసి థ్రిల్ అయ్యా’’ అన్నారు. నిఖిల్‌కుమార్ మాట్లాడుతూ - ‘‘వండర్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చిన తమన్‌కి థ్యాంక్స్. దర్శకుడు మహదేవ్ ఏడాదిన్నర నుంచి చాలా కష్టపడుతున్నారు. అక్టోబర్ 6న సినిమా విడుదలవుతోంది’’ అన్నారు. కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ - ‘‘నిఖిల్‌కుమార్ ఓ ముడి వజ్రం. సాన పెడితే అద్భుతంగా ప్రకాశిస్తాడు. సినిమా చూశా. అద్భుతంగా ఉంది. రాజమౌళి అంతటి ప్రతిభావంతుడు అతని శిష్యుడు మహదేవ్ అని నమ్ముతున్నా. ఈ సినిమాతో తానేంటో రుజువు చేసుకుంటాడు’’ అన్నారు. ‘‘నిఖిల్‌కుమార్ సౌతిండియన్ సూపర్‌స్టార్ కావాలని మనస్ఫూరిగా కోరుకుంటున్నాను’’ అన్నారు బ్రహ్మానందం. జగపతిబాబు మాట్లాడుతూ - ‘‘గడ్డం నెరిసిన కొద్దీ గ్లామర్ వస్తోందంటున్నారు. రంగు వేసుకోవలసిన, గడ్డం గీసుకోవలసిన అవసరం లేదు. హ్యాపీగా ఉంది. బ్యాడ్ అయిన కొద్దీ గుడ్ జరుగుతోంది. సో, బ్యాడ్ విలన్‌గా ఉండిపోతాను. తెలుగు, కన్నడ అని కాకుండా నిఖిల్‌కుమార్‌ని మన ప్రేక్షకులు వెల్కమ్ చేసిన విధానం నాకు నచ్చింది. కుమారస్వామి బెస్ట్ సీయం అని అక్కడ అందరూ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆయన సీయం కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. నిర్మాతలు డి.సురేశ్‌బాబు, దామోదర ప్రసాద్, సి.కల్యాణ్, ఎం.ఎల్.కుమార్ చౌదరి, అశోక్ కుమార్, దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, పారిశ్రామికవేత్త రఘురామరాజు, నటులు అలీ, రఘుబాబు, హీరోయిన్ దీప్తి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

డేర్ డెవిల్ అదా..!

19/09/2016: పిట్టగోడ మీద నిలబడటమంటేనే పెద్ద సాహసం. ఇక.. యోగా చేస్తే? ప్రాణాలతో చెలగాటమాడినట్లే. గుండె నిండా ధైర్యం ఉన్నవాళ్లే ఆ సాహసం చేయగలుగుతారు. అలాంటివాళ్లను ‘డేర్ డెవిల్’ అనాల్సిందే. ఇప్పుడు చాలామంది అదా శర్మను ఇలానే అంటున్నారు. దానికి కారణం పిట్టగోడ మీద ఆమె చేసిన యోగానే. యోగా అంటే విశాలమైన ప్రాంతంలో చేస్తారు. దాదాపు ఒక్క అడుగు వెడల్పు ఉన్న పిట్టగోడ మీద అదా యోగా చేశారు. ఎందుకీ రిస్క్ అనుకుంటున్నారా? హిందీలో ‘కమాండో 2’ అనే చిత్రంలో నటిస్తున్నారామె. ఈ చిత్రంలో రిస్కీ ఫైట్స్ చేస్తారు. దానికోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. పిట్టగోడ మీద చేసే రిస్కీ ఫైట్స్ కోసమే ఇలా యోగా ప్రాక్టీస్ చేశారు. చేసే పని మీద ఎంతో ప్రేమ, అంకితభావం ఉంటేనే ఈ రేంజ్‌లో రిస్క్ తీసుకుంటారు. పిట్టగోడ మీద తాను చేసిన విన్యాసాలను షూట్ చేసి, ఆ వీడియో, ఫొటోలను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు అదా శర్మ. పిల్లలెవరైనా తనను ఆదర్శంగా తీసుకుని, ట్రై చేస్తారేమోనని భావించారేమో... ‘ఇంట్లో ఇలాంటివి ట్రై చేయొద్దు’ అని పేర్కొన్నారు. ఈ పిట్టగోడ ఉన్నది 24వ అంతస్తులో. అక్కణ్ణుంచి కింద చూస్తేనే కళ్లు తిరుగుతాయ్. దమ్మున్న వాళ్లు చేస్తారేమో కానీ... యోగా ఎవరు చేస్తారమ్మా?... అదా.. అదరగొట్టేశావ్!

లైంగిక వేధింపులకు గురయ్యాను!

19/09/2016: యుక్త వయసులో తానూ లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పుకొచ్చారు నటి తాప్సీ. ఇప్పటివరకూ తాను చాలా ధైర్యవంతురాలిని అంటూ చెప్పుకొచ్చిన ఈ ఢిల్లీ బ్యూటీ తన నిజజీవితంలోని మరో కోణాన్ని తాజాగా పేర్కొన్నారు. అది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా సంచలనం కలిగిస్తోంది. తాప్సీకిప్పుడు తమిళం, తెలుగు భాషల్లో అవకాశాలు లేవు. హిందీలో బిగ్‌బీ అమితాబ్‌తో నటించిన పింక్ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. అందులో ఈ భామ అత్యాచారానికి గురైన అమ్మాయిగా నటించారు. ఈ పాత్ర గురించి ఇప్పటికే చాలాసార్లు ప్రచారం చేసుకున్న తాప్సీ.. తాజాగా ఈ పాత్రకు, తన నిజ జీవితానికి చాలా పోలికలు ఉన్నట్టు పేర్కొన్నారు. అదేమిటో చూద్దాం. ''నేను డిల్లీలో పెరిగాను. ఏదైనా ఉత్సవాల సమయంలో జనాల కూటమి అధికంగా ఉంటుంది. అలాంటి సమయాల్లో అబ్బాయిలు అమ్మాయిలను అల్లరి చేస్తారు. కానిచోట్ల గిల్లుతూ అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. లైంగిక వేధింపులకు పాల్పడతారు. చాలా శాడిజం ప్రదర్శిస్తారు. అలాంటి క్లిష్టపరిస్థితులను నేనూ ఎదుర్కొన్నాను. ద్వంద్వార్థాలతో హింసిస్తుంటారు. వారి చూపులు కూడా చాలా క్రూరంగా ఉంటాయి. అందుకే అలాంటి చోట్లకు వెళ్లవద్దని, అలాంటి దుస్తులు ధరించవద్దని, అణిగిమణిగి ఉండాలని ఇంట్లో పెద్దలు హితవు పలికేవారు. అప్పట్లో లైంగిక వేధింపులను ఎదిరించకపోవడం నేను చేసిన తప్పు అని ఇప్పుడు అనిపిస్తోంది'' అని నటి తాప్సీ పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకూ ఈ విషయాల గురించి నోరు విప్పని ఈ అమ్మడు ఇప్పుడు వీటిని బహిర్గతం చేయడంలో ఆంతర్యం ఏమిటనే భావాన్ని సినీవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

కొంచెం లైట్ గురూ!

17/09/2016: ఒక మామూలు డ్రెస్ వేసుకోవడానికి ఎంత టైమ్ పడుతుంది? మహా అయితే రెండు, మూడు నిముషాలు. ప్యాంటు, చొక్కా అయితే అంత టైమ్ కూడా పట్టకపోవచ్చు. చీర అంటే కనీసం ఐదు నిముషాలైనా పడుతుంది. అదే కొంచెం గ్రాండ్‌గా డ్రెస్ చేసుకోవాలంటే మాత్రం మినిమమ్ అరగంటైనా కేటాయించాల్సిందే. ఇప్పుడీ లెక్కలు ఎందుకంటే... ఇటీవల విడుదలైన ‘మొహెంజొ దారో’ సినిమాలో వేసుకున్న ఒక్కో కాస్ట్యూమ్ కోసం పూజా హెగ్డే 25 నిముషాలపైనే వెచ్చించారట. ఆ విషయం గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ- ‘‘నేను నెక్ట్స్ చేయబోయే సినిమాలో హాయిగా జీన్స్, టీ షర్ట్స్ ఉంటే బాగుంటుందనుకుంటున్నా. అవైతే వేసుకోవడానికి చాలా ఈజీ. సెకన్లలో రెడీ అయిపోవచ్చు. ‘మొహెంజొ దారో’ నన్ను కొంచెం కష్టపెట్టింది. వేసుకున్న డ్రెస్, పెట్టుకున్న నగలు అన్నీ బరువుగా ఉండేవి. ఒక్కో కాస్ట్యూమ్‌కి ఎక్కువ టైమ్ కేటాయించాల్సి వచ్చింది. అయినా నేను ఎంజాయ్ చేశాను. ఎందుకంటే, ఇలాంటి సినిమాలు ఎప్పుడో కానీ రావు. నటిగా మంచి పేరు తెచ్చిపెట్టిన చిత్రం. కానీ, ఇమ్మీడియట్‌గా ఇలాంటి సినిమా అంటే కష్టమవుతుంది. అందుకే తేలికగా ఉండే క్యారెక్టర్, లైట్‌గా ఉండే కాస్ట్యూమ్స్ అయితే బాగుంటుందనుకుంటున్నా’’ అన్నారు. తెలుగులో ‘ఒక లైలా కోసం’, ‘ముకుంద’ తర్వాత వేరే చిత్రాలు కమిట్ కాలేదీ బ్యూటీ. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డి.జె. దువ్వాడ జగన్నాథమ్’లో కథానాయికగా నటించనున్నారు. ఈ సినిమాలో ఆమె కోరుకుంటున్నట్లుగా బబ్లీ క్యారెక్టర్ అయ్యుంటుంది.

కొత్త సినిమాలపై క్లారిటీ ఇచ్చిన సమంత

17/09/2016: అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలు మొదలైన దగ్గర నుంచి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొత్త సినిమాలకు సైన్ చేయటం లేదు. త్వరలో పెళ్లి పీటలెక్కుతున్న కారణంగానే కొత్త సినిమాలకు అంగీకరించటం లేదన్న ప్రచారం జోరుగా జరుగుతున్న నేపథ్యంలో, తను సినిమాలు ఎందుకు అంగీకరించటం లేదో స్పష్టత ఇచ్చింది. మంచి పాత్రలు రానందు వల్లే సినిమాలు ఒప్పకోవటం లేదని సమంత తెలిపింది. 'దక్షిణాది సినీరంగంలో హీరోయిన్లుకు అర్థవంతమైన పాత్రలు దొరకటం ఎంత కష్టమో ఇప్పుడిప్పెడే అర్ధమవుతోంది. కేవలం మంచి పాత్రలు రాని కారణంగా ఇంత వరకు ఏ సినిమాను అంగకీరించలేదు. ఈ విషయం చెప్పటం నాకేంతో బాధ కలిగిస్తోంది.' అంటూ ట్వీట్ చేసింది. జనతా గ్యారేజ్ తో సూపర్ హిట్ కొట్టిన సమంత ఆ సినిమా తరువాత ఇంత వరకు ఒక్క సినిమా కూడా అంగీకరించలేదు.

రాయుడు ఎప్పుడొస్తాడు?

16/09/2016: పవన్‌ కల్యాణ్‌ త్వరలోనే ‘కాటమరాయుడు’గా తెరపైకి రానున్నాడు. ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ తరవాత పవన్‌ చేస్తున్న చిత్రమిది. మొన్నామధ్యే లాంఛనంగా మొదలైంది. పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల ‘కాటమరాయుడు’పై దృష్టి పెట్టే సమయం రాలేదు. ఇప్పుడు పవన్‌ ‘కాటమరాయుడు’ సెట్లో అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 20న ‘కాటమరాయుడు’ రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవ్వనుంది. 24 నుంచి పవన్‌ కల్యాణ్‌ చిత్రీకరణలో పాల్గొంటాడని సమాచారం. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై శరత్‌ మరార్‌ నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తోంది. ఫ్యాక్షన్‌ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. 2017 ప్రథమార్ధంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

ఎలాంటి రోల్స్‌కైనా రెడీ!

14/09/2016: ‘‘ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చాను. హీరోగా ఇమేజ్ చట్రంలో బందీ కాకుండా నటుడిగా మంచి పేరు, దర్శక- నిర్మాతల హీరో అనిపించుకోవాలనుంది. ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆదరిస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేయడా నికి నేను రెడీ’’ అన్నారు సాగర్. ఆయన హీరోగా దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన ‘సిద్ధార్థ’ ఈ నెల 16న విడుదలవుతోంది. సాగర్ చెప్పిన సంగతులు... ♦ ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’లో చిన్న పాత్ర చేసి తప్పు చేశాననిపించింది. ప్రేక్షకులు నా నుంచి అలాంటి పాత్రలు ఆశించడం లేదని అర్థమైంది. అదే నన్ను ‘సిద్ధార్థ’ వైపు నడిపించింది. ఈ మేకోవర్ కోసం ఏడాది కష్టపడ్డా. యాక్షన్ సీన్స్ కష్టమైనా ఇష్టపడి చేశా. రిజల్ట్‌పై కాన్ఫిడెంట్‌గా ఉన్నా. ♦ గౌతమ బుద్ధుడిగా మారిన ‘సిద్ధార్థ’ మనకు తెలుసు. మా ‘సిద్ధార్థ’ లక్ష్యం ఏంటి? అతనేం చేశాడనేది సినిమా చూసి తెలుసుకోవాలి. అనంతపురం ఫ్యాక్షన్ నేపథ్యంలో నడిచే ఓ ఎన్నారై యువకుడి ప్రేమకథ. ♦ మా చిత్ర దర్శకుడు కేవీ దయానంద్‌రెడ్డి గతంలో పవన్‌కల్యాణ్ టీమ్‌లో పదిహేనేళ్లు పనిచేశారు. ప్రతి విషయంలోనూ ఆయనకు మంచి పట్టుంది. నాకు ఇండస్ట్రీలో మంచి స్థానం ఏర్పడాలని పరు చూరి బ్రదర్స్, సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్‌రెడ్డి, మణిశర్మ, దయా నంద్ వంటి స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ ఎంతో ప్రేమతో చేసిన చిత్రమిది. ♦ ఓ సినిమా జనాల్లోకి వెళ్లాలంటే.. మూవీ మేకింగ్, ప్లానింగ్, ప్రేక్షకులకు ఏయే అంశాలు నచ్చుతాయనే అంశాలపై అవగాహన ముఖ్యం. మా చిత్ర నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ అటువంటి వ్యక్తే. మా ఇద్దరి భావాలూ కలిశాయి. నా తదుపరి సినిమా ‘హరి’లో పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తాను. కిరణ్‌కుమార్ గారి రామదూత క్రియేషన్స్, అవ్యక్ ఫిల్మ్స్ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభమవుతుంది.

నాని కోసం ఎన్టీఆర్ పాట?

14/09/2016: మన కథానాయకులు, నాయికలు తమ చిత్రాలకు కొత్త హైప్ తీసుకొచ్చేందుకు పాటలు పాడేందుకు ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ ట్రెండ్ ఇటీవల ఎక్కువైంది. అయితే ఓ హీరో కోసం మరో స్టార్ హీరో పాట పాడుతుండడం విశేషమనే చెప్పాలి. నాని హీరోగా త్రినాథరావు దర్శకత ్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘నేను లోకల్’. ఇందులో కీర్తి సురేశ్ కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో హీరో జూనియర్ ఎన్టీఆర్ ఓ పాట పాడనున్నారని ఫిలింనగర్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. గతంలో తన చిత్రాలు ‘యమ దొంగ’, ‘అదుర్స్’, ‘రభస’, ‘నాన్నకు ప్రేమతో’లో పాటలు పాడిన ఎన్టీఆర్, కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ కోసం ఆ మధ్య కన్నడంలోనూ ఓ పాట పాడారు. ఆ పాటలన్నీ బాగా ఫేమస్ అయ్యాయి. ఇప్పుడు ‘నేను లోకల్’ కోసం మరోసారి తను సింగర్‌గా మారనున్నారని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్, ‘దిల్’ రాజులతో ఉన్న స్నేహం వల్లే తారక్ మళ్ళీ ఇలా సింగర్ అవతారమెత్తుతున్నారని తెలుస్తోంది.

బన్నీ, ఎన్టీఆర్, పవన్ లను దాటిన నాని

14/09/2016: వరుస సక్సెస్లతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని సోషల్ మీడియాలో కూడా సత్తా చాటుతున్నాడు. తన సినిమాల అప్ డేట్స్ను రెగ్యులర్గా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకునే నేచురల్ స్టార్, సోషల్ మీడియాలో మైల్ స్టోన్ను అందుకున్నాడు. పది లక్షల మంది ఫాలోవర్స్ను సొంతం చేసుకున్న ఈ సహజ నటుడు అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. టాప్ స్టార్లుగా పేరున్న అల్లు అర్జున్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ల కన్నా నాని ఫాలోవర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మజ్నుఈ నెల 23న రిలీజ్కు రెడీ అవుతోంది . అను ఇమ్మాన్యూల్, ప్రియా శ్రీలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నాని సహాయ దర్శకుడిగా కనిపించనున్నాడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో దర్శక ధీరుడు రాజమౌళి అతిథి పాత్రలో నటిస్తుండటంతో సినిమా మీద అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

పాంచ్ పటాకాగా చెన్నై చిన్నది

12/09/2016: చెన్నై చిన్నది త్రిష పాంచ్ పటాకాగా పేలనున్నారన్నది తాజా సమాచారం. కమలహాసన్, అజిత్, విజయ్, విక్రమ్ వంటి అగ్రనాయకులందరితోనూ నటించిన నటి త్రిష ఒక దశలో పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. నిర్మాత, వ్యాపాత వేత్త వరుణ్‌మణియన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన త్రిషకు అది వివాహనిశ్చితార్థంతోనే ఆగిపోయిన విషయం విదితమే.వ్యక్తిగత జీవితంలో అలాంటి బ్రేక్ పడినా వృత్తిపరంగా మాత్రం బ్రేకులు లేని బండిలా యమా స్పీడ్ అందుకుంది.అప్పటి వరకూ అందచందాలతోనే సరిపెట్టుకున్న త్రిషకు ఆ తరువాత నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు వరించడం విశేషం. ఆ మధ్య నాయకి అనే హార ర్ కథా చిత్రంలో ద్విపాత్రాభినం చేసిన ఈ భామ తాజాగా ఆ తరహా కథతోనూ మోహిని అనే చిత్రం చేస్తున్నారు. ఇదే తరహాలో మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన త్రిష తాజాగా మరో విభిన్న కథా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. విశేషం ఏమిటంటే ఇప్పటి వరకూ ఒకటీ, రెండు పాత్రల్లోనే నటించిన ఈ బ్యూటీ ఈ చిత్రంలో ఏకంగా ఐదు పాత్రల్లో నటించనున్నారట. ఇందులో రెండు పాత్రల కోసం తన బరువును మరింత తగ్గించుకుని నటించనున్నారట. ఇకపోతే ఈ చిత్రం కోసం త్రిష కోటి రూపాయలను పారితోషికంగా పుచ్చుకోనున్నారట. అంతేకాదు కాస్ట్యూ మ్స్ కోసం మరో 25 లక్షలు తీసుకుంటున్నారట. ఇందులో నాజర్, ఆనందరాజ్ ముఖ్యపాత్రలు పోషించనున్నారని తెలిసింది. ఇంతకు ముందు శరత్‌కుమార్ హీరోగా రహస్య పోలీస్ చిత్రాన్ని తెరకెక్కించిన ఇళవరసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.ప్రస్తుతం మోహినీ చిత్రం కోసం లండ న్‌లో ఉన్న త్రిష ఆ చిత్రాన్ని పూర్తి చేసి పంచ పాత్రల చిత్రంలో నటించనున్నట్లు సమాచారం.

‘జ్యో అచ్యుతానంద’ కలెక్షన్స్ అదుర్స్

12/09/2016: ‘జ్యో అచ్యుతానంద’ సినిమా అమెరికాలో మంచి కలెక్షన్లు రాబడుతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల దిశగా దూసుకెళుతోంది. మొదటి మూడు రోజుల్లోనే కలెక్షన్లు కోటిన్నర రూపాయలు దాటేశాయి. ఈనెల 8న విడుదలైన ఈ సినిమా అమెరికాలో మొదటి మూడు రోజుల్లో రూ. 1.82 కోట్లు కలెక్షన్లు సాధించినట్టు సినీ విమర్శకుడు, ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. గురువారం 30,864, శుక్రవారం 90,539, శనివారం 149,927 డాలర్లు వసూలు చేసినట్టు తెలిపారు. ఆదివారం కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేశారు. అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా ముఖ్యపాత్రల్లో నటించారు. క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ తో విడుదలైన ‘జ్యో అచ్యుతానంద’కు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి స్పందన వస్తోంది.

దీపిక అలిగిందట

12/09/2016: తొలి సినిమాతోనే షారుక్‌ ఖాన్‌లాంటి సూపర్‌స్టార్‌ సరసన నటించే ఛాన్స్‌ కొట్టేసింది దీపికా పదుకొణె. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో దీపికాకు వెనక్కి తిరిగి చూసుకునే పనే లేకుండాపోయింది. వరుస విజయాలతో బాలీవుడ్‌ అగ్ర నటిగా కొనసాగుతూ.. ఏకంగా హాలీవుడ్‌కు వెళ్లిపోయింది. ఇదంతా షారుక్‌తో నటించడం వల్లే సాధ్యమైందన్న విషయం అందరికి తెలిసిందే. అందుకే షారుక్‌తో నటించే అవకాశం వస్తే.. తనెప్పుడు కాదనదు. ఇది వరకు ‘ఓం శాంతి ఓం’.. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’.. ‘హ్యాపీ న్యూయర్‌’ చిత్రాల్లో నటించింది. అయితే తాజాగా ఓ దర్శకుడు షారుక్‌ సరసన నటించమని అడిగి.. ఇప్పుడు మరో నటిని ఎంపిక చేస్తున్నాడని తెలిసి బాధపడుతోందట. ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ దర్శకత్వంలో షారుక్‌ ఖాన్‌ ‘బంధువా’ చిత్రంలో నటించనున్నాడు. మొదట్లో షారుక్‌కి జోడిగా దీపికాను తీసుకుందామనుకున్నారు. అయితే అప్పుడు దీపికా హాలీవుడ్‌ చిత్రం ‘ట్రిపుల్‌ ఎక్స్‌’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉండటంతో డేట్స్‌ కుదర్లేదట. దాంతో దర్శకుడు దీపికా బదులు కత్రినా కైఫ్‌ను తీసుకోవాలని యోచిస్తున్నారట. అధికారికంగా ప్రకటించకపోయినా.. కత్రినానే ఖరారు చేశారని బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే.. ఇప్పుడు దీపికా తన హాలీవుడ్‌ షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకొని ఖాళీగా ఉందట. దీంతో తను నటించేందుకు సిద్ధంగా ఉన్నా.. తనని అడగకుండా మరొకరిని ఎంపిక చేస్తున్నందుకు దీపికా దర్శకుడు ఆనంద్‌పై అసంతృప్తిగా ఉందంటున్నారు. మరి దర్శకుడు దీపిక అలక చూసైనా ఆమెని తీసుకుంటాడో... కత్రినానే ఖరారు చేస్తాడో చూడాలి.

లెక్క తర్వాత తేలుస్తారు!

10/09/2016: మహేశ్‌బాబు అభిమానులకు, ప్రేక్షకులకు దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఓ ప్రామిస్ చేస్తున్నారు. అందరికీ కొత్త మహేశ్‌ను చూపిస్తానంటున్నారు. మహేశ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్ ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలో చిత్రీకరణ జరుగుతోంది. గతంలోనే మహేశ్-మురుగదాస్ ఓ చిత్రం చేయాలనుకున్నారట. ఇప్పటికైనా కుదిరినందుకు మురుగదాస్ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘మహేశ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎప్పుడూ బాగుంటుంది. కానీ, ఈసారి ప్రేక్షకులు విభిన్నమైన మహేశ్‌ను చూస్తారు’’ అని మురుగదాస్ తెలిపారు. సుమారు వంద కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారనీ, మహేశ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రమిదనీ ప్రచారం జరుగుతోంది. ఇదే విషయం గురించి మురుగదాస్‌ని అడగ్గా... ‘‘చిత్రీకరణ ప్రారంభమైంది ఇప్పుడే కదా. అప్పుడే బడ్జెట్ గురించి చెప్పడం కష్టమే. ఆ లెక్క తర్వాత తేలుతుంది. దర్శకుడిగా మంచి చిత్రం ప్రేక్షకులకు ఇవ్వాలని ప్రయత్నిస్తాను. ఎప్పుడూ స్క్రిప్టే బడ్జెట్‌ను నిర్ణయిస్తుంది’’ అని చెప్పారు. రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. తమిళ వెర్షన్‌కి మహేశ్‌బాబు స్వయంగా డబ్బింగ్ చెప్పనున్నారట. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు ఎస్.జె.సూర్య ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.

జ్యో... అచ్యుత... ఆనంద... జో...

10/09/2016: నటుడిగా మొదలై ‘ఊహలు గుసగుసలాడే’తో దర్శకుడిగా విస్తరించిన కెరీర్ అవసరాల శ్రీనివాస్‌ది. సాహిత్యం, సంగీతం మీద అభిరుచితో ఆయన దర్శకుడిగా రెండో ప్రయత్నం చేశారు. జో... అచ్యుతానంద జో జో ముకుంద! అన్నమయ్య కీర్తన అని తెలియకుండానే దశాబ్దాలుగా తెలుగునాట జనం నోట నిలిచిన లాలిపాట. అలాంటి కమ్మటి లాలిపాట లాంటి సినిమా తీయాలనుకున్నారేమో, దర్శక - నిర్మాతలు వెరైటీగా ‘జ్యో అచ్యుతానంద’ అంటూ ముందుకొచ్చారు. ఇది నిజానికి, ‘జ్యో’త్స్న (రెజీనా) అనే అమ్మాయికీ, అన్నదమ్ములు ‘అచ్యుత’ రామారావు (నారా రోహిత్), ‘ఆనంద’వర్ధనరావు (నాగశౌర్య)లకీ మధ్య నడిచే కథ. వాళ్ళ పేర్లలోని మొదటి కొన్ని అక్షరాలు కలిపితే ‘జ్యో అచ్యుతానంద’. సినిమా మొదలయ్యేసరికే అన్నదమ్ములు ఇద్దరికీ పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి. తండ్రి పోవడంతో, తల్లి (సీత)తో కలసి, అందరూ ఒకే ఇంట్లో ఉంటుంటారు. అన్నయ్య ఓ కంపెనీలో హెచ్.ఆర్. మేనేజర్‌గా పెద్ద ఉద్యోగి. తమ్ముడు మెడికల్ రిప్రంజెటేటివ్‌గా కష్టపడుతున్న చిరుద్యోగి. ఈ అన్నదమ్ములకు పెద్దగా పడదు. కారణం ‘జ్యో’ అని పిలుచుకొనే జ్యోత్స్న (రెజీనా). ఎవరా ‘జ్యో’ అన్నది భార్యల అనుమానం. ఫ్లాష్‌బ్యాక్‌లో ఆరేళ్ళ క్రితానికి వెళితే దంతవైద్యం చదువుతున్న హీరోయిన్ ఈ అన్నదమ్ముల ఇంట్లో పై వాటాలో అద్దెకు దిగుతుంది. పై చదువులకు అమెరికా వెళ్ళాలనుకుంటున్న ఆ అమ్మాయిని పోటాపోటీగా అన్నదమ్ములిద్దరూ ప్రేమిస్తారు. ప్రేమలో తమ్ముడి మీద పై చేయి సాధించడానికి అన్న పెయైత్తులూ వేస్తాడు. అది వికటిస్తుంది. ఇద్దరిలో ఎవరినీ ప్రేమించ ట్లేదంటూ హీరోయిన్ అమెరికా వెళ్ళిపోతుంది. ఇక, వర్తమానానికి వస్తే సెకండాఫ్‌లో హీరోయిన్ మళ్ళీ ఈ ఇంటికొస్తుంది. పెళ్ళయిన అన్నదమ్ము లతో ఆడుకోవడం మొదలెడుతుంది. తర్వాతేమైందన్నది మిగతా సిన్మా. సినిమాలు, పాత్రలపై ధ్యాసలో శారీరక స్పృహను వదిలేసిన నారా రోహిత్ డైలాగ్ డెలివరీ బలంతో నెట్టుకొచ్చారు. నాగశౌర్య సహజంగా ఉన్నారు. క్లెమాక్స్ సీన్ లాంటి చోట్ల ఉద్వేగపూరిత నటన చూపెట్టారు. పాత్రలో క్లారిటీ తక్కువైనా, రెజీనా ఉన్నంతలో బాగా చేశారు. మిగిలిన అందరిదీ సందర్భోచిత నటన. ‘ఊహలు గుసగుసలాడే’ కెమేరామన్ వెంకట్ ఈసారీ ముద్ర వేశారు. ఇక శ్రీకల్యాణ్ రమణ అనే కొత్త పేరుతో వచ్చిన కల్యాణీమాలిక్ బాణీల్లో ‘ఒక లాలన’ (గానం శంకర్ మహదేవన్) లాంటివి పదేపదే వినాలనిపిస్తాయి. ‘సువర్ణ’ పాట మాస్‌ను మెప్పిస్తుంది. ‘ఊహలు గుసగుసలాడే’, ‘మనమంతా’ లాంటి అభిరుచి గల చిత్రాలు నిర్మిస్తూ వస్తున్న సాయి కొర్రపాటి ఆ ధోరణికి తగ్గట్లే చేసిన తాజా సమర్పణ ఇది. తోబుట్టువుల మధ్య ఉండే ఈర్ష్య, అసూయలనే కామన్ పాయింట్ ఆసక్తికరమే. అయితే, ఒకే అమ్మాయి కోసం ఇద్దరి పోటీ అనే పదునైన కత్తిని దర్శకుడు పట్టుకున్నారు. విభిన్నంగా తీయాలనే ప్రయోగస్పృహా పెట్టుకున్నారు. ఆ క్రమంలో ఒకే అంశం రెండు పాత్రల దృష్టి నుంచి రెండు రకాలుగా రావడమనేది పావుగంట సా..గినా, ఫస్టాఫ్ సరదాగానే గడిచిపోతుంది. అసలు కథ నడపాల్సిన సెకండాఫ్‌లోనే చిక్కంతా. దృష్టి అంతా అన్నదమ్ముల పాత్రలు, బలవంతపు ఎమోషన్లు, అనవసరమైన ఫైట్ల మీదకు మళ్ళించేసరికి ట్రాక్ మారింది. ఈ క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ సినిమా సకుటుంబంగా చూడదగ్గదే! సాధారణ కమర్షియల్ హీరో సినిమాల్లా కాకుండా, పాత్రల మధ్య నడిచే కథగా ముందుకు సాగడం మరికొంత రిఫ్రెషింగ్ ఫీలింగ్! దర్శక - రచయిత సెన్సాఫ్ హ్యూమర్ చాలా చోట్ల డైలాగ్‌‌సగా నవ్విస్తుంది. ఆలోచించి మరీ రాయడంతో, ఒక్కోసారి ఆలోచించే వ్యవధి ఇవ్వకుండా ఒకదాని మీద మరొకటి వచ్చి పడే డైలాగ్ పంచ్‌లు ఉక్కిరిబిక్కిరీ చేస్తాయి. కెమేరా వర్క్, ఒకట్రెండు పాటలు గుర్తుంటాయి. కానీ, అన్నదమ్ముల అనుబంధాన్ని ఆది నుంచి చూపకపోవడం, అప్పటికప్పుడు తెచ్చిపెట్టిన ఉద్వేగాల క్లైమాక్స్, సెకండాఫ్‌లో సాఫీగా సాగని ‘జ్యో’ పాత్ర ప్రయాణం, ఆమె నిశ్చితార్థానికీ - ఆఖరికి అదీ వద్దనుకోవడానికీ కారణం లేకపోవడం లాంటివీ మర్చిపోవడం కష్టమే. వెరసి, ఫస్టాఫ్‌లో ‘జ్యో’ అచ్యుతానందగా మొదలై, సెకండాఫ్‌లో ‘జో...జో’ అచ్యుతానందగా అనిపిస్తుంది. యువత, ముఖ్యంగా నవ దంపతులు లీనమయ్యే అంశాలతో, డైలాగ్‌లతో అర్బన్ ఆడియన్స్ మల్టీప్లెక్స్ మూవీ గుర్తుంటుంది! - రెంటాల జయదేవ చిత్రం: ‘జ్యో అచ్యుతానంద’, పాటలు: భాస్కరభట్ల, కెమేరా: వెంకట్ సి. దిలీప్, ఎడిటింగ్: కిరణ్ గంటి, కథ - మాటలు - స్క్రీన్‌ప్లే - దర్శకత్వం: అవసరాల శ్రీనివాస్

కొత్తగా మనసు పారేసుకుందట

09/09/2016: ఈ మధ్యకాలంలో నటీనటులంతా సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఎప్పటికప్పుడు వాళ్లు ఏం చేస్తున్నది ఫొటోలు.. వీడియోల ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. వారి పాపులారిటీని పెంచుకుంటున్నారు. ఒక్కొసారి పుకార్లు.. విమర్శలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో కొందరు సెలబ్రెటీలు సోషల్‌మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలూ ఉన్నాయి. అయితే బాలీవుడ్‌ నటి కత్రినాకైఫ్‌కి మాత్రం సామాజిక మాధ్యమాల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగట్లేదట. బాలీవుడ్‌ అగ్రతారల్లో ఒకరైన కత్రినాకైఫ్‌.. తన పదమూడేళ్ల కెరీర్‌లో ఎన్నో విజయాలు అందుకుంది. అలాగే చాలా మంది అభిమానులనూ సొంతం చేసుకుంది. అయినప్పటికీ సోషల్‌మీడియాకి దూరంగా ఉంటూ వచ్చింది. అయితే కొద్ది నెలల క్రితమే ఫేస్‌బుక్‌లో ఖాతా తెరిచిన ఈ భామ.. సామాజిక మాధ్యమాలపై ఇప్పటి వరకు తనకున్న దృక్పథం మారిందంటోంది. ‘‘ప్రైవసీ అనేది మనం ఫీలయినదాన్ని బట్టి ఉంటుంది. ఒకప్పుడు అభిమానులకు ఏదైనా చెప్పాలనుకుంటే సినిమాల ద్వారా చెప్పొచ్చు అని భావించేదాన్ని. కానీ సోషల్‌మీడియాలోకి అడుగుపెట్టాక నా ఆలోచన మారింది. ఇందులో ఏది ఇబ్బంది కలిగించేలా అనిపించలేదు. అంతేకాకుండా ఈ ఫ్లాట్‌ఫాం నాకు చాలా బాగా నచ్చింది’’ అని చెప్పుకొచ్చింది కత్రినా.

ముహూర్తం కుదిరింది... ఒక్క జంటకే!

09/09/2016: కథానాయిక సమంతతో నాగచైతన్య, ఫ్యాషన్ డిజైనర్ శ్రీయా భూపాల్‌తో అఖిల్ ప్రేమలో ఉన్నారనే సంగతి తెలిసిందే. తనయుల పెళ్లి గురించి గురువారం నాగార్జునను ప్రశ్నించగా - ‘‘డిసెంబర్ 9న అఖిల్ నిశ్చితార్థం జరుగుతుంది. ‘సమంతతో ప్రేమలో ఉన్నాను. త్వరలో పెళ్లి చేసుకుంటాను’ అని చైతూ చెప్పాడు.కానీ, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో చెప్పలేదు. బహుశా.. వచ్చే ఏడాది ఉండొచ్చు.అఖిల్ స్పష్టంగా చెప్పడంతో నిశ్చితార్థం ఫిక్స్ చేశాం. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో సినిమా పూర్తయ్యాక వచ్చే ఏడాది పెళ్లి’’ అని నాగ్ అన్నారు. త్వరలో ఎంగేజ్‌మెంట్ పనులు ప్రారంభిస్తారా? అని అడిగితే, ‘‘అఖిల్ నిశ్చితార్థం ఏర్పాట్లు అమ్మాయి తరఫు వాళ్లే చూసుకుంటున్నారు. పెళ్లి బాధ్యలైతే చైతూ, అఖిల్‌కే వదిలేశా. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఇద్దరి సినిమాలపై నేను దృష్టి పెట్టాను’’ అన్నారు.

నిమజ్జన వేడుకల్లో సూపర్ స్టార్ కొడుకు

09/09/2016: ముంబై తరువాత అదే స్థాయిలో వినాయక చవితి ఉత్సవాలు హైదరబాద్ మహా నగరంలోనే జరుగుతాయి. అందుకే బాలీవుడ్ తారలలానే తెలుగు సినీ ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొంటుంటారు. అయితే ఇంట్లో, మండపాల్లో పూజల వరకు ఓకె కానీ నిమజ్జన వేడుకల్లో ఇలాంటి స్టార్లు ఎప్పుడు కనిపించరు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ మాత్రం నిమజ్జనానికి కూడా స్వయంగా వెళ్లాడు. ఇటీవల ఫ్యామిలీతో కలిసి దుబాయ్ ట్రిప్ ముగించుకొని వచ్చిన మహేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చవితిని ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాడు. పూజా కార్యక్రమాలు పూర్తయిన తరువాత మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం చెన్నై వెళ్లిపోయాడు మహేష్. దీంతో నిమజ్జనం బాధ్యతలు తీసుకున్న గౌతమ్, తానే స్వయంగా దుర్గమ్మ చెరువుకు గణేష్ విగ్రహాన్ని తీసుకెళ్లి నిమజ్జనం చేశాడు. వినాయక ప్రతిమను గౌతమ్ నిమజ్జనం చేస్తుండగా తీసిన ఫోటో, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

డివైడ్ టాక్ వచ్చినా స్థిరంగా కలెక్షన్లు!

08/09/2016: దక్షిణాది టాప్ డైరెక్టర్ మురగదాస్‌ తెరకెక్కించిన తాజా బాలీవుడ్ సినిమా 'అకీరా'. సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన ఈ లేడి ఒరియంటెడ్‌ సినిమా ఇటు ప్రేక్షకుల నుంచి, అటు విమర్శకుల నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లు సాధిస్తోంది. ప్రారంభంలో ఈ సినిమాకు బాగా నిరాశాపూరితంగా వసూళ్లు దక్కినా.. ఆ తర్వాత క్రమంగా పెరుగుతుండటం గమనార్హం. సెప్టెంబర్ 2న విడుదలైన ఈ సినిమా మంగళవారం కూడా చెప్పుకోదగినస్థాయిలో వసూళ్లు రాబట్టింది. మొత్తంగా ఐదు రోజుల్లో రూ. 22.45 కోట్లను ఈ సినిమా తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడం, సోనాక్షి, మురగదాస్ కు మంచి ఇమేజ్ ఉండటం ఈ సినిమా థియేటర్లవైపు ప్రేక్షకులను నడిపిస్తోంది. 'అకీరా' తొలిరోజు కేవలం రూ. 5.15 కోట్లు సాధించి నిరాశపరచగా, రెండోరోజు రూ. 5.30 కోట్లు వసూలు చేసింది. మూడోరోజు వసూళ్లు గణనీయంగా పెరిగి.. రూ.6.20 కోట్లు రాబట్టింది. ఇక సోమవారం రూ. 3.40 కోట్లు రాబట్టగా, మంగళవారం రూ. 2.40 కోట్లు రాబట్టిందని, మొత్తంగా భారత్ లో ఈ సినిమా రూ. 22.45 కోట్లు రాబట్టిందని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో తెలిపారు. రూ. 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మొత్తానికి సేఫ్ ప్రాజెక్టు అయ్యే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. మురగదాస్‌కు సోనాక్షి సిన్హాతో ఇది రెండో సినిమా. అక్షయ్‌కుమార్‌, సోనాక్షి జంటగా ఆయన తీసిన 'హాలీడే: ఏ సోల్జర్‌ ఈజ్‌ నెవర్‌ ఆఫ్‌ డ్యూటీ' సినిమా మంచి విజయాన్ని సాధించింది. అంతకుముందు ఆయన అమీర్‌ఖాన్‌తో తీసిన 'గజనీ' సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

ఖైదీతో ఆటా పాటా?

08/09/2016: దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఖైదీ నంబర్ 150’. వీవీ వినాయక్ దర్శకత్వంలో శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో హీరో రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కేథరిన్ ఐటెమ్ సాంగ్ చేయనున్నారని తాజా సమాచారం. వాస్తవానికి చిరూ సరసన తమన్నా ఐటెమ్ సాంగ్ చేయనున్నారని ఓ వార్త వినిపించింది. ‘తమన్నాతో కలిసి డ్యాన్స్ చేయాలని ఉంది’ అంటూ గతంలో చిరు ఓ ఫంక్షన్‌లో చెప్పారు కూడా. దాంతో అందరూ ఐటెమ్ సాంగ్ చేసే అవకాశం తమన్నాకే ఉంటుందనుకున్నారు. కానీ, ఎవరి ఊహలకూ అందని విధంగా సీన్లోకి సడెన్‌గా కేథరిన్ పేరు వచ్చింది. త్వరలో చిరు, కేథరిన్ పాల్గొనగా హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో పాటను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.

ప్రేమ కథా చిత్రంగా కడవుల్ ఇరక్కాన్ కుమారు

08/09/2016: టాస్మాక్ సన్నివేశాలు లేని చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం కడవుల్ ఇరుక్కాన్ కుమారు. టాస్మాక్‌ను ప్రత్యేకంగా పేర్కొనడానికి కారణం లేకపోలేదు. ఇప్పుడు వస్తున్న చాలా చిత్రాలు మద్యం సన్నివేశాలు లేకుండా ఉండడం లేదు. ఇక అసలు విషయం దర్శకుడు రాజేశ్ చిత్రాల్లో ఇలాంటి సన్నివేశాలు లేని చిత్రమే లేదు. అలాంటిది ఆయన తాజా చిత్రమే కడవుల్ ఇరుక్కాన్ కుమారు. అమ్మా క్రియేషన్స్ టి.శివ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా నిక్కీగల్రాణి, ఆనంది నటిస్తున్నారు. జీవీకి స్నేహితుడిగా ఆర్‌జే.బాలాజీ, ముఖ్యపాత్రలో ప్రకాశ్‌రాజ్ నటిస్తున్న ఈచిత్రం గురించి దర్శకుడు రాజేశ్ తెలుపుతూ సరోజ చిత్రం తరువాత రోడ్డు ప్రయాణంలో సాగే మించి రొమాంటిక్ ప్రేమ కథా చిత్రం కడవుల్ ఇరుక్కాన్ కుమారు చిత్రం అని తెలిపారు. ఇందులో ప్రేమ, కామెడీ, సెంటి మెంట్ అంటూ ఆబాలగోపాలం చూసి ఆనందించే జనరంజక అంశాలు ఉంటాయన్నారు. ఇది రోడ్డు జర్నీ నేపథ్యంలో సాగే చిత్రం కావడంతో అధిక భాగం షూటింగ్‌ను ప్రధాన రోడ్లపైనే నిర్వహించామని తెలిపారు.అందుకు చెన్నై, పాండిచ్చేరి, గోవా ప్రాంతాల్లో జనసంచారం లేని రోడ్లలో షూటింగ్ జరిపినట్లు చెప్పారు. తన గత చిత్రాల్లో టాస్మాక్ సన్నివేశాలు అధికంగా ఉంటాయనే అపవాదు ఉందన్నారు. అయితే ఈ చిత్రంలో అలాంటి సన్నివేశం ఒక్కటి కూడా ఉండదని ఇది క్లీన్ యూ సర్టిఫికెట్ చిత్రంగా ఉంటుందని అన్నారు. చిత్ర ఫస్ట్‌లుక్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు రాజేశ్ చెప్పారు.

బుల్లి తెరపై మెగాస్టార్..?

08/09/2016: పదేళ్ల పాటు తెరకు దూరమైన మెగా స్టార్ చిరంజీవి ఇప్పుడు తన 150 సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా పూర్తయిన ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు చిరు. అదే సమయంలో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ విషయంలో కూడా భారీగా ఫ్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే సినీ రంగంతో పాటు రాజకీయాల్లో కూడా తనదైన మార్క్ చూపించిన మెగాస్టార్ ఇప్పుడు మరో రంగంలో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడట. తెలుగు బుల్లితెర టిఆర్పిలలో సరికొత్త రికార్డ్లు సృష్టించిన ఓ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించేందుకు మెగాస్టార్ అంగీకరించాడన్న టాక్ వినిపిస్తోంది. ఉత్తరాదిలో ఘనవిజయం సాధించిన కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమాన్ని మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో తెలుగులోను రూపొందిచారు. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమానికి ఇన్నాళ్లు కింగ్ నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరించాడు. అయితే త్వరలో ప్రారంభం కానున్న నాలుగో సీజన్లో మెగాస్టార్ చిరంజీవి హోస్ట్గా అలరించనున్నాడట. ఈ విషయంపై మెగా క్యాంప్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం భారీగా ప్రచారం జరుగుతోంది. డిసెంబర్లో ప్రసారం కానున్న ఈ కార్యక్రమానికి సంబందించిన ప్రకటన త్వరలోనే వెలువడనుందన్న టాక్ వినిపిస్తోంది.

రెండిచ్చినా నో అంటున్నా శ్రుతి

08/09/2016: ఒక్కోసారి కొన్ని విషయాలు ఎలా జరిగినా ఇతరులను సంతోషంలో ముంచేస్తాయి. తాజాగా నటి శ్రుతిహాసన్ విషయంలోనూ అలాంటి సంఘటనే జరిగిందని సమాచారం. శ్రుతి చాలా బోల్డ్. అది వ్యక్తిగతం కావచ్చు, వృత్తిపరమైన అంశం కావచ్చు, ఇంకేమైనా కావొచ్చు. పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కంటానని బహిరంగంగానే చెప్పేంత ధైర్యవంతురాలు శ్రుతిహాసన్. కథానాయకిగా టాప్ పొజిషన్‌లో ఉన్నా మరోవైపు ఐటమ్ సాంగ్ చేయడానికీ ఏ మాత్రం వెనుకాడరు. అయితే అందుకు పారితోషకం మాత్రం భారీగానే డిమాండ్ చేస్తారు. దీన్ని దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతగా భావించవచ్చు. ఇటీవల ఒక సింగిల్ సాంగ్‌కు రెండు కోట్లు పారితోషికం చెల్లిస్తానన్నా నో అని ఖరాఖండిగా చెప్పేశారట. దీంతో తమిళ వర్గాలు శ్రుతి నిర్ణయాన్ని స్వాగతించడంతో పాటు చాలా సంతోషిస్తున్నాయట. దీనికీ, వారికీ సంబంధం ఏమిటనేగా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం. శ్రుతిహాసన్ సింగిల్ సాంగ్ చేయనని చెప్పింది ఒక కన్నడ చిత్రానికట.కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తన కొడుకు నిఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ కన్నడం, తెలుగు భాషల్లో ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాగ్వుర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీప్తీసాతి నాయకిగా నటిస్తున్నారు. తన కొడుకు తొలి చిత్రం కావడంతో భారీగా రూపొందించాలని కుమారస్వామి నిర్ణయించుకున్నారట. ఇందులో ఒక ప్రత్యేక సాంగ్‌లో నటి శ్రుతిహాసన్ నటిస్తే మరింత ప్రచారం లభిస్తుందన్న ఆలోచనతో ఆమెను సంప్రదించి అందుకు రెండు కోట్లు పారితోషికం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు, అయినా శ్రుతిహాసన్ నో అన్నట్లు సినీ వర్గాల సమాచారం. ఇక తమిళ వర్గాల సంతోషానికి కారణం తమిళనాడుకు, కర్ణాటకకు మధ్య కావేరి నీటి సమస్య చాలా కాలంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో శ్రుతిహాసన్ కన్నడ చిత్రంలో నటించడానికి నిరాకరించడం ఇక్కడి వారికి ఆనందాన్ని కలిగించడానికి కారణం అనే ప్రచారం జరుగుతోంది.అయితే శ్రుతిహాసన్ ఆ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేయననడానికి అసలు కారణం ఏమిటో తెలియదు గానీ, ఆ పాటలో ఇప్పుడు మిల్కీబ్యూటీ తమన్నా మెరవనున్నారు.

'ప్రేమమ్' విడుదల తేదీ ఖరారు

07/09/2016: అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన 'ప్రేమమ్' విడుదల తేదీ ఖరారయ్యింది. మలయాళంలో సంచలన విజయం సాధించిన 'ప్రేమమ్' సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర టీం తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. చైతన్య సరసన శృతి హాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెప్టెంబరు 20వ తేదీన ఆడియో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన 'ఎవరే' పాట యూత్ను విశేషంగా ఆకట్టుకుంటోంది.

అరవిందస్వామి, తమన్నా జంటగా..

07/09/2016: అరవిందస్వామి, తమన్నా జంటగా తమిళంలో ఓ సినిమా తెరకెక్కనుంది. తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన 'శతురంగ వేట్టై' అనే థ్రిల్లర్‌ మూవీకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తీయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈజీ మనీకి అలవాటుపడి గ్యాంబ్లింగ్కు పాల్పడుతూ జీవించే ఓ వ్యక్తి కథే 'శతురంగ వేట్టై'. త్రివిక్రమ్ 'అఆ' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సినిమాటోగ్రాఫర్‌ నటరాజన్‌ సుబ్రమణ్యం ఆ సినిమాలో హీరోగా నటించారు. ఇప్పుడు అరవిందస్వామి, తమన్నాలు ప్రధాన పాత్రల్లో ఆ చిత్రానికి సీక్వెల్ తీయనున్నారు. ఇటీవల వార్తల్లో నిలిచిన ఓ రియల్ ఇన్సిడెంట్ను తెరపై చూపించనున్నారట. 'తనీ ఒరువన్‌' హిట్ తర్వాత అరవింద్‌ స్వామి తిరిగి ఫామ్లోకి వచ్చాడు. అరవిందస్వామికి జోడీగా తమన్నా నటిస్తుందనే వార్త ఆసక్తిని కలిగిస్తోంది. అయితే ఈ సినిమా విషయమై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.

విఘ్నేష్‌ శివ దర్శకత్వంలో సూర్య

07/09/2016: సినిమా తెరకెక్కే వరకూ చిత్ర పరిశ్రమలో అంతా భ్రమే. చిత్ర ప్రారంభమై ఆదిలోనో, అర్ధభాగంలోనో ఆగిపోయిన చిత్రాలు చాలా ఉన్నాయి. అందుకే సినిమా పరిశ్రమను మాయా ప్రపంచం అంటారు. ఇక విషయానికి వస్తే నటుడు సూర్య ప్రస్తుతం సింగం చిత్రానికి రెండవ సీక్వెల్ ఎస్-3ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.అయితే తదుపరి చిత్రం ఏమిటన్న విషయంపై గందరగోళం నెలకొంది. కొన్ని రోజుల క్రితం తన తదుపరి చిత్రం కబాలి ఫేమ్ రంజిత్ దర్శకత్వంలో ఉంటుందని తెలిపారు. ఆ తరువాత కొంభన్, మరుదు చిత్రాల దర్శకుడితో చిత్రం చేయనున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా నయనతార ప్రియుడిగా ప్రచారంలో ఉన్న విఘ్నేశ్‌శివ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. విజయ్‌సేతుపతి, నయనతార జంటగా నటించిన నానుమ్‌రౌడీదాన్ చిత్రానికి దర్శకత్వం వహించిన విఘ్నేశ్‌శివ ఆ తరువాత మరో చిత్రం చేయలేదు. నిర్మాత ఏఎం.రత్నం సంస్థలో చిత్రం చేయబోతున్నట్లు ఇందులో విజయ్‌సేతుపతి, నయనతార, త్రిష నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తరువాత నయనతార తన ప్రియుడి కోసం తానే స్వంతంగా చిత్ర నిర్మాణం చేపట్టనున్నట్లు టాక్ స్ప్రెడ్ అయ్యింది.ఇందులో హీరోగా నటించడానికి నటుడు అజిత్‌కు రోజుకు కోటి ఇవ్వడానికి సిద్ధం అన్నట్లు మీడియాలో ప్రచారం జరిగింది. అదే విధంగా నటుడు విజయ్ కాల్‌షీట్స్ కూడా స్వయానా నయనతారనే అడిగినట్లు, అజిత్, విజయ్ ఇతర చిత్రాలతో బిజీగా ఉండడంతో ఇక చివరి ప్రయత్నంగా సూర్యను నటించమని కోరినట్లు కోడంబాక్కమ్ వర్గాల సమాచారం. సూర్య వర్గం అందుకు ముందు సంశయించినా ఈ తరువాత సూర్య గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఈ చిత్రాన్ని సూర్య తన కుటుంబ నిర్మాణ సంస్థ అయిన స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మించనున్నట్లు తెలిసింది. ఇందులో కథానాయకిగా నయనతార నటిస్తారా? లేదా?అన్నది మాత్రం సస్పెన్స్‌గా ఉంచారు. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.

మన్మథుడికి జోడీగా తమన్నా

07/09/2016: మన్మథుడితో తమన్నా జోడీ కడుతున్నారు. మన్మథుడు అంటే నాగార్జున అనుకునేరు. తమిళ హీరో శింబు. ఆన్‌స్క్రీన్ ‘మన్మథ’, ‘వల్లభ’ సినిమా లతో పాటు ఆఫ్‌స్క్రీన్ నయనతార, హన్సిక వంటి హీరోయిన్లతో ప్రేమాయణాలు నడిపిన శింబు మన్మథుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడీ హీరోకి జంటగా ‘అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్’ (ఎఎఎ) సినిమాలో తమన్నా నటిస్తున్నారు. ఆమెకు శింబుతో తొలి సినిమా ఇది. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ఆల్రెడీ శ్రీయా ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పుడు తమన్నాని నాయికగా తీసుకున్నారు. ఈ ఇద్దరూ కాకుండా మరో హీరోయిన్ కూడా ఉంటారట. ముగ్గురు నాయికలు నటిస్తున్న సినిమాలో తమన్నా ఎందుకు నటిస్తున్నారంటే కథే కారణం అంటున్నారు దర్శకుడు. ‘‘సినిమాలో మెయిన్ ట్విస్ట్‌కి తమన్నా క్యారెక్టరే కారణం. వెరీ ఇంపార్టెంట్ రోల్’’ అని దర్శకుడు తెలిపారు. కథ విని తమిళ సినిమాల్లో ఇప్పటివరకూ ఇంత డిఫరెంట్, ఫ్రెష్, కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్ రాలేదని తమన్నా అప్రిషియేట్ చేశారని దర్శకుడు పేర్కొన్నారు.

అష్టా చమ్మా రోజులు గుర్తొచ్చాయి - హీరో నాని

07/09/2016: ‘‘విరించి వర్మ ‘ఉయ్యాలా జంపాలా’ కథను ఫస్ట్ నాకే చెప్పాడు. అప్పట్నుంచి మా స్నేహం కొనసాగుతోంది. ఆ సినిమా ఎంత హిట్ అయ్యిందో, ‘మజ్ను’ అంతకన్నా హిట్ అవుతుంది’’ అని హీరో నాని పేర్కొన్నారు. నాని, అనూ ఇమ్మాన్యుయెల్, ప్రియాశ్రీ ముఖ్య తారలుగా విరించి వర్మ దర్శకత్వంలో పి.కిరణ్, గోళ్ల గీత నిర్మించిన చిత్రం ‘మజ్ను’. గోపీ సుందర్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని నాని విడుదల చేసి హీరో రాజ్ తరుణ్‌కు ఇచ్చారు. నిర్మాతలు సుధాకర్ రెడ్డి, ‘దిల్’ రాజు, అనీల్ సుంకర ట్రైలర్ విడుదల చేశారు. నాని మాట్లాడుతూ-‘‘మజ్ను’ అంటే బాధలో ఉండే కథ కాదు. సమస్యల్లో ఉండే ప్రేమికులను మజ్ను అంటుంటాం. ఈ చిత్ర కథాంశం అలాంటిదే. నాకు మళ్లీ ‘అష్టా చమ్మా’ రోజులు గుర్తుకు తెచ్చిన చిత్రమిది’’ అన్నారు. ‘‘మనం ప్రేమలో ఉన్నప్పుడు అది ఎన్ని రోజులు నిలిచి ఉంటుంది అనే కన్‌ఫ్యూజన్. మనం ఎవరినైనా ఇష్టపడుతున్నప్పుడు అది ఇష్టమా ప్రేమా... అనే కన్‌ఫ్యూజన్ కూడా ఉంటుందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది’’ అని విరించి వర్మ చెప్పారు. ‘‘నా కెరీర్‌లో బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారని నాని చెప్పడం నాకు నిజంగా హ్యాపీ’’ అని గోపీ సుందర్ తెలిపారు. ఈ వేడుకలో పి.కిరణ్, గోళ్ల గీత, దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ, మారుతి, హను రాఘవపూడి, కల్యాణ్ కృష్ణ, అవసరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

లారెన్స్ మళ్లీ ఆదుకున్నాడు

07/09/2016: చెన్నై: ప్రముఖ నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. పలువురికి గుండె శస్త్ర చికిత్సలకు ఆర్థికసాయం అందిస్తున్న లారెన్స్ సోమవారం అభినేష్ అనే మరో చిన్నారి గుండె ఆపరేషన్‌కు సాయం అందించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యంగానే ఉన్నట్లు సమాచారం. లారెన్స్ పలు సినిమాలతో పాటు పలు రకాల సామాజిక సేవలు నిర్వహిస్తూ వికలాంగ, అనాథాశ్రమాలను నెలకొల్పిన సంగతి తెలిసిందే. అదే విధంగా పలువురిని దత్తత తీసుకుని వారి సంరక్షణ బాధ్యతలను స్వీకరించారు. లారెన్స్ తన కన్నతల్లిపైగల అపార ప్రేమకు చిహ్నంగా ఒక గుడిని కట్టిస్తున్నారు. త్వరలో ఆ గుడిలో తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా లారెన్స్ గుండె శస్త్ర చికిత్సకు ఆర్థిక సాయం అందించిన వారి సంఖ్య అభినేష్‌తో 130కి చేరుకుంది.

‘జనతా గ్యారేజ్’ కు వసూళ్ల వర్షం

07/09/2016: జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్’ అమెరికాలో దూసుకుపోతోంది. రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అమెరికాలో ఈ సినిమా వసూళ్లు రూ. 10 కోట్లు దాటాయి. సోమవారం నాటికి రూ. 10.30 కోట్లు కలెక్షన్లు సాధించిందని ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. డివైడ్ టాక్ వచ్చినా ‘జనతా గ్యారేజ్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుండడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఓపెనింగ్ కలెక్షన్లు సాధించింది. నాలుగురోజుల్లోనే రూ. 50 కోట్ల మార్క్‌ను అధిగమించి టాలీవుడ్‌లో 'బాహుబలి' తర్వాత అత్యంత వేగంగా రూ. 50 కోట్లు కలెక్ట్‌ చేసిన సినిమాగా 'జనతా గ్యారేజ్‌' రికార్డు సృష్టించింది. కలెక్షన్లు నిలకడగా ఉండడంతో ‘జనతా గ్యారేజ్’ రూ.100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలున్నాయని ట్రేడ్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.

చిరు సరసన మెగా చాన్స్ కొట్టేసింది!

06/09/2016: మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘ విరామం తర్వాత టాలీవుడ్లో హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'ఖైదీ నెం.150'. తొలుత ఈ మూవీ టైటిల్ పై ఎంతో కసరత్తు జరిగింది. కత్తిలాంటోడు అని కొన్ని రోజులు మూవీ యూనిట్ ప్రచారం కూడా చేసినా.. చివర్లో 'ఖైదీ నెం.150'కి ఫిక్స్ అయ్యారు. ఈ మూవీలో చిరు సరసన నయనతార, అనుష్క అని ప్రచారం జరిగినా చివరికి 'చందమామ' కాజల్ అగర్వాల్ ఆ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం మరో వార్త హల్ చల్ చేస్తోంది. ఈ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం దర్శకుడు వి.వి.వినాయక్ దక్షిణాది హీరోయిన్ కేథరిన్ ట్రెసాను సంప్రదించగా ఆమె ఒకే చెప్పేసింది. చిరుతో కలిసి స్టెప్పులు వేసే అవకాశాన్నిఏ హీరోయిన్ మాత్రం వదులుకుంటుంది. మెగాస్టార్ మూవీ అనగానే దాదాపు మూడు నెలల కిందటే కేథరిన్ ఈ మూవీలో సాంగ్ కోసం సంతకం చేసిందట. తాజాగా ఈ విషయాన్ని మూవీ యూనిట్ వారు వెల్లడించారు. అయితే ఈ సాంగ్ ఇంకా షూట్ చేయలేదట. తమిళ మూవీ ఒరిజినల్ 'కత్తి' లో ఈ పాట లేదని సమాచారం. తమిళ కత్తి రీమేక్ అయినప్పటికీ టాలీవుడ్ ఆడియన్స్ కోసం మూవీ యూనిట్ చిన్న చిన్న మార్పులు చేస్తోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే చిరు, కేథరిన్ లపై సాంగ్స్ చిత్రీకరణ జరగనుందన్న వార్త ఈ మూవీకి సంబంధించి తాజా అప్ డేట్. చిరుకు ఠాగూర్ లాంటి మెగా హిట్ ఇచ్చిన వి.వి.వినాయక్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా, లైకా ప్రొడక్షన్స్ తో కలిసి చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహిరస్తున్న విషయం తెలిసిందే.

దీపావళికి ముక్కోణపు పోటీ

06/09/2016: దీపావళి, సంక్రాంతి వంటి పెద్ద పండుగల సమయాల్లో అగ్ర హీరోల సినిమాలు తెరపైకి రావడం అన్నది మామూలు విషయమే. ఆ సందర్భాల్లో అధిక సెలవు దినాలు రావడం, ప్రేక్షకులు సినిమాలు చూడడానికి ఆసక్తి చూపడం ఒక కారణం కావచ్చు. కాగా ఈ దీపావళి సందర్భంగా పలు చిత్రాలను తెరపైకి తీసుకురావడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే అందులో చివరికి ఎన్ని చిత్రాలు విడుదలవుతాయన్నది కచ్చితంగా తెలియకపోయినా మూడు చిత్రాలు మాత్రం పోటీలో నిలవనున్నాయి. వాటిలో మంచి స్నేహితులు, నడిగర్ సంఘం కార్యదర్శి, కోశాధికారి చిత్రాలు చోటు చేసుకోవడం ఆసక్తిగా మారనుంది. ఆ వివరాల్లోకెళ్లితే నటుడు, నడిగర్‌సంఘం కార్యదర్శి విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న కత్తిసండై, నడిగర్ సంఘం కోశాధికారి కార్తీ హీరోగా నటిస్తున్న కాష్మోరా చిత్రాలతో పాటు ధనుష్ నటించిన కొడి చిత్రం దీపావళికి తెరపైకి రావడం ఖరారైంది. విశాల్‌తో నటి తమన్నా తొలిసారిగా జత కడుతున్న చిత్రం కత్తిసండై. చాలా కాలం తరువాత వడివేలు హాస్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మరో కామెడి నటుడు సూరి నటిస్తున్నారు. సురాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మద్రాస్ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై ఎస్.నందగోపాల్ నిర్మిస్తున్నారు. కాగా కార్తీ, నయనతార, శ్రీదివ్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం కాష్మోరా. గోకుల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందిస్తున్నారు. డ్రీమ్ వారియర్ ఫిలింస్ పతాకంపై ఎస్‌ఆర్.ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. ఇక మూడో చిత్రం కొడి. ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో త్రిష, అనుపమ పరమేశ్వరన్‌లు నాయికలుగా నటించారు. ఎస్‌ఆర్.సెంథిల్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ధనుష్ వుండర్‌బార్ ఫిలింస్, ఎస్కేప్ ఆర్టిస్ట్ మోషన్ పిక్చర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వీటితో పాటు దీపావళికి తెరపైకి రావడానికి సూర్య నటిస్తున్న ఎస్-3 చిత్రం, కమలహాసన్ నటించి దర్శకత్వం వహించిన విశ్వరూపం-2 చిత్రాలతో పాటు మరి కొన్ని చిన్న బడ్జెట్ చిత్రాల దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇన్ని భారీ చిత్రాలు ఒకేసారి విడుదలకు థియేటర్లు సరిపోవు గనుక అప్పటికి ఏఏ చిత్రాలు ముందుకొస్తాయో వేచి చూడాల్సిందే. మొత్తం మీద ఈ సారి దీపావళి అధిక చిత్రాలతోనే సందడి చేయనుండడం గమనార్హం.

నయనను అధిగమించేనా?

06/09/2016: అందాల భామలు నయనతార, త్రిషల మధ్య నువ్వా? నేనా? అన్నంతగా కోల్డ్‌వార్ నడిచింది. అయితే అది ఒకప్పటి కథ. ఇప్పుడు వారిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. అలాంటిది తాజాగా ఈ బ్యూటీస్ మధ్య మరోసారి పోటీ నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. నయనతార, త్రిష ఇద్దరూ సంచలన తారలే. ఇద్దరూ ప్రేమలో పడి పెళ్లి వరకూ వెళ్లి ఆగిపోయినవారే. ఈ అందగత్తెల మధ్య మరో పోలిక ఏమిటంటే ఇటీవల ఇద్దరూ హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలకు మారారు. అదే విధంగా నయనతార నటించిన ఆ తరహా చిత్రం అన్భే నీ ఎంగే(తెలుగులో అనామిక)చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక త్రిష నటించిన నాయకి తెలుగులో విడుదలై ఆమెకు నిరాశనే మిగిల్చింది. తమిళంలో త్వరలో తెరపైకి రానుంది. అయితే ఆ తర్వాత నయనతార నటించిన మాయ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. ఇప్పుడు త్రిష కూడా మాదేశ్ దర్శకత్వంలో మరో హారర్ కథా చిత్రం చేస్తున్నారు. ఇకపోతే ఆ అమ్మడు కోలీవుడ్‌లో అగ్రకథానాయకులందరితోనూ జత కట్టారు. ఒక్క సూపర్‌స్టార్‌తో తప్ప. ఆయనతో నటించే అవకాశం రాలేదన్న నిరాశను, నటించాలన్న ఆశను తను చాలా సార్లు బహిరంగంగానే వెల్లడించారు. మూడు పదుల వయసు దాటిన త్రిషకు త్వరలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించాలనే కోరిక తీరే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఆ ఆశకు తన నెచ్చలి నయనతార గండి కొట్టే అవకాశం లేకపోలేదనే టాక్ మరో పక్క వినిపిస్తోంది. కబాలి చిత్రంతో ఆల్ రికార్డులను బద్దలు కొట్టిన రజనీకాంత్ తాజాగా శంకర్ దర్శకత్వంలో 2.ఓ చిత్రాన్ని పూర్తి చేయడానికి సిద్ధం అవుతున్నారు. కాగా తదుపరి కబాలి-2ను చేయబోతున్న విషయం ఇప్పటికే కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన అల్లుడు ధనుష్ వుండర్‌బార్ ఫిలింస్ సంస్థ నిర్మించనున్న ఆ చిత్రానికి దర్శకుడు ర ంజిత్ కథను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. కాగా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌కు జంటగా అమలాపాల్ నటించనున్నట్లు ఇంతకు ముందు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆ పాత్రకు నయనతార అయితే బాగుంటుందని చిత్ర వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం వరుస విజయాలతోనూ, చేతి నిండా చిత్రాలతోనూ బిజీగా ఉన్న నయనతార కాల్‌షీట్స్ కుదరక పోతే త్రిషకు అవకాశం దక్కనుంది. నయన్ ఇప్పటికే సూపర్‌స్టార్‌తో చంద్రముఖి, కుచేలన్, శివాజీ చిత్రాల్లో జతకట్టారు. తాజాగా నాలుగోసారి నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నయనతారను అధిగమించాలంటే త్రిష లక్కుపైనే ఆధారపడి ఉందంటున్నారు కోలీవుడ్ వర్గాలు.

కళ్యాణ్‌రామ్‌ ‘ఇజం’ టీజర్‌ విడుదల

06/09/2016: హైదరాబాద్‌: కళ్యాణ్‌రామ్‌ హీరోగా పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇజం’ చిత్రం టీజర్‌ విడుదలైంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ జర్నలిస్టు పాత్రలో, సిక్స్‌ప్యాక్‌తో కనిపించనున్నారు. 2015లో మిస్‌ ఇండియా కిరీటం గెలుచుకున్న అదితి ఆర్య ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై కళ్యాణ్‌రామ్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్‌రెడ్డి, అలీ, వెన్నెల కిషోర్‌ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దసరాకు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

పెళ్లి గురించి ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెబుతా! - తనయుల పెళ్లిపై నాగార్జున స్పందన

06/09/2016: హైదరాబాద్‌: తన కుమారులు నాగచైతన్య, అఖిల్‌ జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకోవడం సంతోషమే అని నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా వారి పెళ్లిపై నాగ్‌ మరోసారి స్పందించారు. సోమవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడారు. తనయుల పెళ్లి విషయం గురించి ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెబుతానని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అక్టోబర్‌లో నాగచైతన్య-కల్యాణ్‌కృష్ణ.. అఖిల్‌-విక్రమ్‌కుమార్‌ల కాంబినేషన్‌లో చిత్రాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. తనకు ‘నిన్నేపెళ్లాడతా’ చిత్రమంటే చాలా ఇష్టమని, అలాంటి స్క్రిప్ట్‌నే కల్యాణ్‌కృష్ణ తయారు చేశారని, చైతన్య ఆ చిత్రం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు కల్యాణ్‌కృష్ణకు ధన్యవాదాలు తెలిపారు. అక్టోబర్‌ చివరినాటికి ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందని.. సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఇక ‘సోగ్గాడే-2 బంగార్రాజు’ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని నాగార్జున స్పష్టం చేశారు.

అవసరాల డైరెక్షన్లో నాని

03/09/2016: అష్టాచమ్మ సినిమాతో యంగ్ హీరో నాని, నటుడు కం దర్శకుడు అవసరాల శ్రీనివాస్ల కెరీర్ ఒకేసారి మొదలైంది. ఈ సినిమా తరువాత నాని హీరోగా సెటిల్ అవ్వగా, అవసరాల శ్రీనివాస్ మాత్రం కామెడీ పాత్రలు చేస్తూనే దర్శకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉన్నాడు. ఇప్పటికే రెండు సినిమాలు పూర్తి చేసిన అవసరాల దర్శకుడిగా మరిన్ని సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం తన దర్శకత్వంలో రూపొందిన జ్యో అచ్యుతానంద సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న అవసరాల శ్రీనివాస్.. ఆ తరువాత నాని హీరోగా ఓ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. వరుస సక్సెస్లతో నాచురల్ స్టార్గా ఎదిగిన నాని కూడా అవసరాలతో కలిసి పనిచేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నమైన సినిమాలు చేసే ఈ ఇద్దరి కాంబినేషన్పై ఇండస్ట్రీ వర్గాల్లో కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

సెప్టెంబర్ స్పెషల్ గురూ!

03/09/2016: అఖిల్ రెండో సినిమాకి దర్శకుడు ఎవరు? అనే ఉత్కంఠకు తెర పడింది. ‘మనం’తో అక్కినేని కుటుంబంతో పాటు అభిమానులకు మధురమైన చిత్రం అందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సిసింద్రీ సినిమా చేయనున్నారు. అలాగే, ఈ సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్ని నాయనా’తో అక్కినేని నాగార్జునకి సూపర్ హిట్ అందించిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేయనున్నారు. త్వరలో ఈ రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్లనున్నాయని నాగార్జున ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘సెప్టెంబర్ రాక్స్ ఫర్ మి. నా స్టార్ డెరైక్టర్స్ కల్యాణ్ కృష్ణతో నాగచైతన్య, విక్రమ్ కుమార్‌తో అఖిల్ సినిమాలు చేయబోతున్నారు. త్వరలో ఇవి సెట్స్‌కి వెళతాయి’’ అని నాగ్ పేర్కొన్నారు. కొత్త కథలను ఎంపిక చేయడంలోనూ, కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడంలోనూ నాగార్జున ఎప్పుడూ ఓ అడుగు ముందుంటారు. కొత్తకు పట్టం కడుతూ ఆయన చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం విజయాలు సాధించాయి. ‘మనం’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలు ఆ కోవలోనివే. ఈ రెండిటితో పాటు ‘ఊపిరి’తో వరుస విజయాలు సాధించిన నాగార్జున జోరుగా ‘నమో వెంకటేశాయ’లో నటిస్తున్నారు. అదే జోరు మీద కుమారుల కోసం సినిమాలు సెట్ చేసే పనిలో పడ్డారాయన.

సిక్స్ ప్యాక్ జర్నలిస్ట్

03/09/2016: మాటల్లో వగరు.. చూపుల్లో పొగరు.. ఫైట్స్‌లో పవరు.. పూరి జగన్నాథ్ హీరోల్లో అన్నీ సూపరు. పూరి స్టైలే సపరేటు. ఆ స్టైల్ నందమూరి కల్యాణ్‌రామ్‌కి బాగా సూటైనట్లు కనిపిస్తోంది. కళ్లలో కసి.. నోట్లో సిగరెట్.. సిక్స్‌ప్యాక్ బాడీతో చాలా కొత్తగా కనిపిస్తున్నారాయన. కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తూ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘ఇజం’. అదితీ ఆర్య హీరోయిన్. ప్యాచ్‌వర్క్ మినహా చిత్రీకరణ పూర్తయింది. విజయ దశమికి చిత్రాన్ని విడుదల చేయాలను కుంటున్నారు. పూరి మాట్లాడుతూ - ‘‘జర్నలిస్టుగా కల్యాణ్‌రామ్ ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. హీరోగా కల్యాణ్‌రామ్‌కు, దర్శకుడిగా నాకు ఓ డిఫరెంట్ సినిమా అవుతుంది. ఇటీవల స్పెయిన్‌లో జరిగిన భారీ షెడ్యూల్‌తో షూటింగ్ దాదాపుగా పూర్తయింది’’ అన్నారు. జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ల భరణి, పోసాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కళ: జానీ, కూర్పు: జునైద్, కెమేరా: ముఖేశ్, సాహిత్యం: భాస్కరభట్ల, సంగీతం: అనూప్ రూబెన్స్.

చరణ్ని లైట్ తీసుకుంటున్నారు

03/09/2016: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ సినిమా తనీ ఒరువన్కు రీమేక్గా రూపొందుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. చరణ్ కూడా బ్రూస్ లీ బాధ నుంచి అభిమానులను బయటికి తీసుకువచ్చేందుకు ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. అయితే దసర బరిలో భారీ రిలీజ్కు ప్లాన్ చేస్తున్న చరణ్కు ఇప్పుడు గట్టి పోటి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ప్రేమమ్ సినిమాను దసరకే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డేట్ ప్రకటించకపోయినా దసర రిలీజ్ మాత్రం కన్ఫామ్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇక భారీ బడ్జట్తో తెరకెక్కుతున్న కన్నడ సినిమా జాగ్వర్ను అదే పేరుతో అక్టోబర్ 6న రిలీజ్ చేయనున్నారు. ప్రభుదేవ, సోనూసూద్, కోన వెంకట్లు సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం అభినేత్రిని కూడా అదే రోజు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. జాగ్వర్, అభినేత్రి డబ్బింగ్ సినిమాలే అయినా భారీ బడ్జెట్ సినిమాలు కావటంతో తెలుగు మార్కెట్ మీద కూడా సీరియస్గా దృష్టి పెడుతున్నారు. చరణ్ ధృవ రిలీజ్ అవుతున్నా, థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ భారీ పోటి చరణ్ సినిమా మీద ఎంత వరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి.

అక్కినేని వారసులు క్లారిటీ ఇచ్చారు

02/09/2016: యంగ్ హీరో అఖిల్ తన రెండో సినిమాపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు. అఖిల్ సినిమా రిజల్ట్తో ఆలోచనలో పడ్డ ఈ యువ కథానాయకుడు రెండో సినిమా ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే చాలా మంది దర్శకులతో చర్చలు జరిపిన అక్కినేని యంగ్ హీరో గతంలో హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు. అయితే నిర్మాణపరమైన సమస్యల కారణంగా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. తాజాగా మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు అఖిల్. ఇదే విషయాన్ని నాగార్జున కూడా కన్ఫామ్ చేశాడు. అఖిల్ రెండో సినిమాకు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడని ప్రకటించిన నాగ్, నాగచైతన్య.., సొగ్గాడే చిన్నినాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటించనున్నాడని ప్రకటించాడు. త్వరలోనే ఈ రెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్లనున్నాయి.

అక్కడ దుమ్మురేపుతున్న 'జనతా గ్యారేజ్'!

02/09/2016: భారీ అంచనాల నడుమ విడుదలైన జూనియర్‌ ఎన్టీఆర్‌ తాజా సినిమా 'జనతా గ్యారేజ్‌' ప్రస్తుతం థియేటర్లలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ సినిమాకు ప్రేక్షకుల్లో మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా.. తొలిరోజు కలెక్షన్లు భారీగా ఉన్నట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు, కేరళతో పాటు ప్రపంచవ్యాప్తంగా రెండు వేలకు పైగా థియేటర్లలో 'జనతా గ్యారేజ్‌' ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ సినిమా అమెరికాలో దుమ్మురేపుతోంది. వారం మధ్యలో (బుధవారం) విడుదలైనా జనతా గ్యారేజ్‌ అగ్రరాజ్యంలో అద్భుతంగా ఆడుతోందని, హిందీ పెద్ద సినిమాలను తలదన్నేలా ఈ సినిమాకు కలెక్షన్లు ఉన్నాయని బాలీవుడ్‌ ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్ ట్విట్టర్‌లో తెలిపారు. అమెరికాలో ఈ సినిమా సెన్సేషనల్‌ ప్రారంభ వసూళ్లను సాధిస్తున్నదని, ప్రస్తుతం అందుతున్న సమాచారం బట్టి మొదటి రోజు కలెక్షన్లు రూ. 3.76 కోట్లు వచ్చినట్టు చెప్పారు.

రాజకీయాల్లోకి నయన?

01/09/2016: రాజకీయాల్లోకి నయన? తారల రాజకీయ రంగప్రవేశం అన్నది సర్వసాధారణ అంశంగా మారింది. చిత్ర రంగానికి చెందిన పలువురు ముఖ్యమంత్రులుగా ఏలిన చరిత్ర మనది. ముఖ్యంగా తమిళచిత్ర పరిశ్రమకు,రాజకీయాలకు విడదీయరాని అనుబంధాలున్నాయన్నది నిర్విదాంశం.ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలిత కూడా తారగా ఒక నాడు ఏలిన వారేనన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం పలువురు సినీ ప్రముఖులు శాసనసభ్యులు, లోకసభ సభ్యులు, మంత్రులుగా ప్రజాసేవలో రాణిస్తున్నారు. మరికొందరు రాజకీయ దాహంతో ఉన్నారు. నిన్నగాక మొన్న నటి నమిత అన్నాడీఎంకే పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ప్రస్తుతం నంబర్‌వన్ నాయకిగా వెలుగొందుతున్న నయనతారకు రాజకీయమోహం పుట్టిందనే ప్రచారం జోరందుకుంది. పలు ఎదురు దెబ్బలను తట్టుకుని నటిగా అగ్రస్థానంలో రాణిస్తున్న నయన్ బాణీనే వేరు. ఎవరేమనుకున్నా, తనకంటూ ఒక పాలసీని ఏర్పరచుకుని ఆ దారిలో పయనిస్తున్న ఈ సంచలన నటి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. మాయ చిత్రంతో లేడీ ఒరియెంటెడ్ చిత్రాల నాయకిగానూ ప్రూవ్ చేసుకున్న నటి నయనతార. ఆ విధంగా కోలీవుడ్‌లో అగ్రనాయకిగా వెలిగిపోతున్న నయనతారకూ తాజాగా రాజకీయ మోహం కలిగినట్లు ప్రచారం జరుగుతోంది. చాపకింద నీరులా నయన తన రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నయనను రాజకీయాల్లోకి స్వాగతిస్తున్నట్లు ప్రచారానికి తెర లేచింది. దానికి ఆజ్యం పోసేలా ఇటీవల ఒక సంఘటన జరిగింది. ఇతర చిత్రాల ప్రమోషన్‌కే కాదు తాను నటించిన చిత్రాల ప్రచారం కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు నయన్. దీనిని ఒక నిబంధనగా చిత్రాలను అంగీకరించే ముందే ఆయా దర్శక నిర్మాతలకు చెప్పేస్తారు. అలాంటిది ఇటీవల అధికార పార్టీ స్పోర్ట్స్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అదీ ఒక తారగా తళుకుబెళుకు దుస్తులతో ఎలాంటి హంగామా లేకుండా, పూర్తిగా కట్టుబొట్టు మార్చి సాదాసీదాగా రావడంతో అక్కడ ఉన్న వాళ్లే గుసగుసలాడుకోవడం విశేషం. దీంతో నయనతార రాజకీయరంగ ప్రవేశానికి వేళాయే అనే మాటలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

సూర్యతో ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు

01/09/2016: నటుడు సూర్య ఈ మధ్య ఎక్కువగా ఇద్దరు లేక ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేసేస్తున్నారు. సింగం, సింగం-2, సింగం-3గా ప్రస్తుతం తెరకెక్కుతున్న ఎస్-3, ఇటీవల విడుదలైన 24 చిత్రాల్లో ఇద్దరు భామలతో ర