Breaking News

కరీంనగర్‌: అతివేగంతో పాటు, కర్ణకఠోర శబ్ధాలతో దూసుకెళ్తున్న ద్విచక్రవాహనాలకు పోలీసులు కళ్లెం వేశారు. పరిమితికి మించిన వేగంతో ప్రయాణిస్తూ తోటి వాహనదారులను భయబ్రాంతులకు గురిచేయడంతో పాటు విపరీతమైన శబ్ధ కాలుష్యానికి కారణమవుతున్న 16 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకొని వాహనదారులకు జరిమానాలు విధించారు. * * బెల‍్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల‍్లంపల్లిలోని సివిల్‌ కోర్టు ముఖద్వారం ఎదుట హోంగార్డు నారాయణ మంగళవారం ఉదయం ఆత‍్మహత్యాయత‍్నం చేశాడు. ఏడు సంవత‍్సరాలుగా హోంగార్డులకు పోస్టింగ్‌ ఇవ‍్వలేదని, విధుల‍్లోకి తీసుకోకుండా పోలీసు విభాగం అన్యాయం చేస్తోందని ఆవేదన వ‍్యక‍్తం చేస్తూ తెలంగాణ హోంగార్డుల సంఘం అధ‍్యక్షుడు నారాయణ మంగళవారం ఆత‍్మహత్యాయత‍్నం చేశాడు. * * చర‍్ల: ఖమ‍్మం జిల్లా చర‍్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు వద్ద మంగళవారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు ఆ ఇద్దరిని అరెస్టుచేశారు. తనిఖీ చేయగా వారి వద్ద మెడికల్ కిట్లు ఉన్నట్లు గుర్తించారు. వారు మావోయిస్టు మిలీషియా సభ‍్యులని తేలడంతో వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కోర్టులో హాజరుపరిచేందుకు తరలించామని చర్ల పోలీసులు వెల్లడించారు. * * వరంగల్‌: వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని నర్సంపేటలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తె దుర‍్మరణం చెందారు. తండ్రి, కుమార్తె వెళుతున‍్న ద్విచక్రవాహనాన్ని వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో వారు అక‍్కడికక‍్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు సేకరిస‍్తున్నారు * * కురవి: తేనెటీగల దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లిలో సోమవారం వెలుగుచూసింది. స్థానిక మామిడి తోటలో కాయలు కోయడానికి వచ్చిన కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామానికి చెందిన వారిగా తెలుస్తోంది. * * కరీంనగర్‌: జిల్లా కేంద్రంలోని బుట్టిరాజారాం కాలనీలో శనివారం వేకువజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలో ప్రతీ ఇంటిని తనిఖీ చేశారు. 31 బైక్‌లు, 8 ఆటోలు, 9 సిలిండర్లు, 3 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా పలువురు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. * * హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం గత నెల 22న నిర్వహించిన పాలిసెట్ - 2017 ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని కాలేజీ, రూసా కార్యాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వాణిప్రసాద్ పాల్గొన్నారు. ఏప్రిల్ 22న జరిగిన ప‌రీక్ష‌కు 1,28,118 మంది విద్యార్థులు హాజరయ్యారు. * * నిజామాబాద్‌ జిల్లా వర్నిలో వింత చోరీ వెలుగుచూసింది. పట్టణ శివారులోని భారత్‌ గ్యాస్‌ గోడౌన్‌లో దొంగలుపడి సిలిండర్లు ఎత్తుకెళ్లారు. నిన్న సాయంత్రమే గోడౌన్‌కు వచ్చిన 250 గ్యాస్‌ సిలిండర్లలో శుక్రవారం రాత్రి 204 సిలిండర్లు చోరీకి గురయ్యాయి. శనివారం ఉదయం గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ శేఖర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. * * హైదరాబాద్‌: మిర్చి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కపట ప్రేమను చూపుతున్నాయని లోక్‌సత్తా పార్టీ తెలంగాణ ధ్వజ మెత్తింది. కేంద్రం తాజాగా ప్రకటించిన రూ.5వేలు ఏ మూలకూ సరిపోవని, అదనంగా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మరో రూ.5వేలు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈమేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జన్నేపల్లి శ్రీనివాసరెడ్డి గురువారం ప్రకటన విడుదల చేశారు. * * కడెం: నిర్మల్‌ జిల్లా కడెం మండల కేంద్రంలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, అక్రమంగా నిల్వ ఉంచిన రూ.20 వేల విలువ గల గుట్కా, మద్యం ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నల్లబెల్లం, దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అజార్, రమేష్ అనే ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. * * నారాయణపూర్‌: యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్‌ మండల కేంద్రంలో మావోయిస్టు పోస్టుర్లు కలకలం రేపుతున్నాయి. మండల కేంద్రంతో పాటు వావిళ్లపల్లి, జనాగం గ్రామాల్లో పోస్టర్లు వెలవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కేసీఆర్‌ నియంత పాలన నశించాలి, లంచగొండి ఎమ్మెల్యే ఖబడ్దార్‌ అంటూ పోస్లర్లపై రాసి ఉంది. * * రంగారెడ్డి: బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాయల్‌ కాలనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్‌ వేస్టేజ్‌ గోదాములో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. * * అమెరికాలో ఓ చిన్న విమానం నాటకీయరీతిలో నడిరోడ్డుపై కూలిపోయింది. వాషింగ్టన్‌ లోని ముకిల్‌టియోలో మంగళవారం ఓ చిన్న విమానం రద్దీగా ఉన్న నడిరోడ్డుపై కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు ఎగిశాయి. అదృష్టం బాగుండి ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. విమానం ఇంజన్‌లో సాంకేతికలోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్‌ సురక్షితంగా తప్పించుకున్నాడు. * * యాదగిరిగుట్ట మండలం బాహుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈస్ట్‌ మారెడ్‌పల్లికి చెందిన వల్లపు ఎల్లయ్య బైక్‌పై వరంగల్‌ వైపు వెళ్తున్నారు. బాహుపేట వద్దకు రాగానే ఎల్లయ్య వాహనాన్ని గుర్తు తెలియని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో పుల్లయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ రెండు ప్రమాదాలు జరిగిన ప్రదేశాలను యాదగిరిగుట్ట పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ–2 నాగిరెడ్డి తెలిపారు. * * టేకులపల్లి: మహిళా సర్పంచ్ కుమారుడు ఓ విద్యార్థినిని ప్రేమ పేరుతో నమ్మించి, వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తే ముఖం చాటేస్తున్న ప్రియుడి ఇంటి ముందు బాధితురాలు ఆందోళనకు దిగింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడులో బుధవారం వెలుగుచూసింది. * * హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సాయంత్రం 4 గంటలకు పదోతరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 14 నుంచి 30 వరకు ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 5.35 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తులు చేసుకోగా దాదాపు ఐదు లక్షల మంది హాజరయ్యారు. ఈ నెల 5న ఫలితాలు విడుదల చేయాలనుకున్నా రెండు రోజుల ముందుగానే ఫలితాలు వెల్లడిస్తున్నారు. * * హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని శ్రీకర్‌ ఆస్పత్రిలో సోమవారం అర్థరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రోగులు, ఆస్పత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలార్పడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదం సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదని పలువురు వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని అధికారులు వేరువేరు ఆస్పత్రులకు తరలించారు. * * కరీంనగర్‌: అదిలాబాద్‌ వన్‌టౌన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సీఐ, ఎస్సై, ఏఎస్సైలను సస్పెండ్‌ చేస్తూ.. కరీంనగర్‌ రేంజ్‌ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్‌ తగాదాలో తలదూర్చారనే సమాచారంతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు జిల్లా ఎస్పీ ఎం. శ్రీనివాస్‌ నివేదిక ఆధారంగా సీఐ సత్యనారాయణ, ఎస్సై బి. అనిల్, ఏఎస్సై జి. అప్పారావులను సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం కరీంనగర్‌ రేంజ్‌ డీఐజీ సి. రవివర్మ ఆదేశాలు జారీచేశారు. * * కోదాడ: ఐపీఎల్‌ -10 సందర్భంగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ. 25 వేల నగదుతో పాటు ఓ బైక్‌, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. * * తిప్పర్తి(నల్లగొండ): వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో.. బస్సులో ఉన్న 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. * * బోధన్‌ మండలం తెగడపల్లి గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి(12) ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. దీంతో గట్టిగ కేకలు వేస్తూ బాలిక అక్కడే కుప్పకూలిపోయింది. ఇది గుర్తించిన చుట్టుపక్కల వారు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ నుంచి హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం బాలిక మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. * * కామేపల్లి: ప్రమాదవశాత్తు బావిలోపడి ఓ కానిస్టేబుల్‌ మృతిచెందిన సంఘటన ఖమ్మం జిల్లా కామేపల్లిలో జరిగింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో గుగులోతు రామకృష్ణ (39) కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గ్రామ శివారులోని వ్యవసాయ బావి వైపు మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందాడు. ఈయన స్వగ్రామం తల్లాడ. రెండున్నరేళ్లుగా కామేపల్లిలో పనిచేస్తున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. * * మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా సింగరేణి ఉపరితల బొగ్గుగని కేంద్రంలో మంగళవారం మధ్యాహ‍్నం బంకర్‌ కూలి ఇద్దరు కార్మికులు మృతిచెందారు. లారీలో బొగ్గు నింపుతుండగా.. అక్కడే పనులు చేస్తున్న పవన్‌ (31), రఘుపాల్‌రెడ్డి(32) అనే కార్మికులపై బంకర్‌ కూలింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తోటి కార్మికులు వెంటనే స్పందించి మృతదేహాలను వెలికి తీశారు. * * సూర్యాపేట: ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సూర్యాపేట మండలం రాజానాయక్‌తండా శివారులో శనివారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో వారిని అంబులెన్స్‌ల సాయంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. * * భువనగిరి: వేగంగా వెళ్తున్న కారులో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్‌ వాహనాన్ని వదిలి బయటకు దూకేశాడు. ఈ ప్రమాదంలో సాంట్రో కారు పూర్తిగా కాలిబూడిదైంది. ఈ సంఘటన యాదాద్రి జిల్లా భువనగిరి శివారులోని నల్లగొండ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడానికి యత్నించే లోపే కారు పూర్తిగా కాలిపోయింది. * * మహబూబ్‌నగర్‌: జిల్లాలోని దేవరకద్ర మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు చేపట్టిన దాడుల్లో పెద్దఎత్తున రేషన్‌ బియ్యం పట్టుబడ్డాయి. లబ్దిదారులకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయనే సమచారంతో రగంలోకి దిగిన అధికారులు మండల కేంద్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న 620 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఓ లారీ, బొలెరో వాహానాలను సీజ్‌ చేశారు. * * పెద్దపల్లి: ఇద్దరు భార్యలు కలిసి భర్తను హతమార్చిన సంఘటన జిల్లాలోని కమాన్‌పూర్‌లో గురువారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగి తిరుమలయ్య(65)ను ఆయన ఇద్దరు భార్యలు గొడ్డలితో నరికి చంపారు. తిరుమలయ్య అతని ఇద్దరు భార్యలు మదునమ్మ, ఐలమ్మలను గత కొన్నేళ్లుగా తీవ్రంగా హింసిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. * * హైదరాబాద్: ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓంకార్ నగర్‌లోని ఓ సెల్‌ఫోన్‌ దుకాణంలో గురువారం రాత్రి దొంగతనం జరిగింది. స్థానిక శ్రీనివాస్ మొబైల్ షాప్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి క్యాష్‌ బాక్స్‌లో ఉన్న రూ.50 వేల నగదుతోపాటు లక్ష రూపాయల విలువ చేసే ఫోన్లు ఎత్తుకెళ్లారు. దుకాణంలో అమర్చిన సీసీ కెమెరాలో చోరీ చిత్రాలు నమోదయ్యాయి. బాధితుడు ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. * * యాదాద్రి: పక్కింటి వారు తిట్టారనే మనస్థాపంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన యాదాద్రి జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో మంగళవారం జరిగింది. స్థానికంగా ఉండే లక్ష్మమ్మ అనే మహిళకు పక్కింటి వారికి విబేధాలు వచ్చాయి. దీంతో పక్కింటి వారు తిట్టడంతో ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. * * నిజామాబాద్ : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి యాసంగి పంటకు నీటిని విడుదల చేశారు. ఇరిగేషన్ అధికారులు గురువారం ఉదయం నీటిని విడుదల చేశారు. కాకతీయ కెనాల్ ద్వారా 6 వేల క్యూసెక్కులు, లక్ష్మీ కెనాల్ ద్వారా 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీటి విడుదలతో రైతులు నారుమడులు పోసేందుకు సిద్ధమవుతున్నారు. * * హుజూర్‌నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పోలీసులు బైక్ దొంగల ముఠాను పట్టుకున్నారు. గురువారం ఉదయం సీఐ వి. నర్సింహారెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు చెందిన 8 మంది సభ్యుల ముఠా గత కొంతకాలంగా ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతోంది. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు గురువారం ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 22 బైక్‌లను స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు పంపారు. * * భువనగిరి: యాదాద్రి జిల్లా భువనగిరిలోని బ్యాంకుల వద్ద పింఛనుదారులు నిరసన తెలిపారు. స్థానిక ఆంధ్రా బ్యాంకు వద్ద ప్రభుత్వ పింఛను దారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు రూ. 10 వేలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయగా రూ. 4 వేలే ఇస్తున్నారని నిరసన తెలిపారు. గంటలకొద్దీ క్యూలైన్లలో తాము నిలబడలేమని, ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. * * వరంగల్: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 226 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి గురువారం కోర్టుకు హాజరు పరిచారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిలో 12 మందికి 2 రోజుల జైలుశిక్ష విధిస్తూ.. న్యాయస్థానం తీర్పు నిచ్చింది. దీంతో పాటు మద్యం రాయుళ్లకు రూ. 3.52 లక్షల జరిమానాలు విధించింది. * * మిర్యాలగూడ: గ్యాంగ్ స్టర్ నయీం కేసుకు సంబంధించి 25 మంది నిందితులను పోలీసులు ఈరోజు మిర్యాలగూడ కోర్టు ఎదుట హాజరుపరిచారు. చర్లపల్లి జైల్లో ఉన్న నిందితులను పలు కేసుల్లో విచారణ నిమిత్తం ఈ రోజు మిర్యాలగూడ కోర్టుకు తీసుకొచ్చారు. వారిలో నయీం భార్య, సోదరి, అత్త ఉన్నారు. విచారణ అనంతరం తిరిగి వారిని చర్లపల్లికి తరలించారు. * * కాఠ్మాండు: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరానికి దగ్గర్లోని ఒక హిమనీనద సరస్సులోని నీటిని గణనీయంగా తగ్గించామని నేపాల్‌ ప్రకటించింది. వాతావరణంలో మార్పుల వల్ల హిమనీనదాలు వేగంగా కరుగుతున్నాయి. ఆ నీరంతా కట్టలు తెంచుకుని కిందకు ప్రవహిస్తే మహావిపత్తు సంభవిస్తుంది. * * మేడ్చెల్‌: మేడ్చల్ జిల్లా కీసర మండలం కుందన్‌పల్లి చౌరస్తాలో మంగళవారం ఉదయం ఒక లారీ బీభత్సం సష్టించింది. వేగంగా వెళుతున్న లారీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడమే కాక ఎదురుగా వెళుతున్న స్కూటర్‌ను డీకొని పక్కనున్న ఎన్‌వీఆర్‌ పెట్రోల్‌ బంక్‌లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో స్కూటర్‌పై వెళుతున్న యూనస్, ఖాజా అనే యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వారిని 108లో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. * * నిజామాబాద్‌: బోధన్‌లోని నిజాం దక్కన్‌ సుగర్స్‌ కంపెనీ కార్మికులు, అఖిలపక్షం నేతలు మంగళవారం బోధన్‌ బంద్‌ నిర్వహిస్తున్నారు. దక్కన్‌ సుగర్స్‌ లే ఆఫ్‌ ఎత్తివేయాలని, కంపెనీని పునరుద్ధరించాలని కోరుతూ కంపెనీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ బంద్‌ చేపట్టారు. బంద్‌లో అన్ని కార్మిక సంఘాల వారు, కంపెనీ కార్మికులు, టీడీపీ, సీపీఐ, సీపీఎం తదితర పక్షాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. * * శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం తప్పింది. ఫ్లయిట్‌లో పంపించేందుకు ఓ ఏజెంట్ కార్గో ఏరియాకు తీసుకువచ్చిన కెమికల్స్ బాక్సు నుంచి పొగలు వెలువడ్డాయి. గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. * * జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో శుక్రవారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీస్ కమీషనర్ కమల్‌హాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో 100 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. అనుమానం ఉన్న ప్రతి ఇంటినీ జల్లెడ పట్టారు. సరైన పత్రాలు లేని 8 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. * * చేర్యాల(సిద్ధిపేట జిల్లా): చేర్యాల సమీపంలో దూల్మిట్ట క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో మద్దూరు సాక్షి విలేకరి సత్యం గౌడ్(28) మృతిచెందాడు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న సత్యంను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. * * హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖ పరిధిలో పోలీస్ కానిస్టేబుల్ (సివిల్/ఏఆర్/ఎస్‌ఏఆర్/టీఎస్‌ఎస్‌పీ), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్)లో కానిస్టేబుల్ (పురుష), అగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్ పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రం బుక్‌లెట్లు, ప్రాథమిక కీను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) మంగళవారం విడుదల చేసింది. www.tslprb.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని బోర్డు చైర్మన్ డాక్టర్ జె.పూర్ణచంద్రరావు తెలిపారు. * * నారాయణపూర్: యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలకేంద్రంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు ఇళ్లు, ఒక నగల దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనాస్థలానికి క్లూస్ టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. * * కారేపల్లి: కల్తీ మద్యం తయారు చేస్తున్న వారిని తీసుకెళ్తున్న ఆటో బోల్తా పడటంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఆ సమయంలో ఆటోను నడుపుతున్నది పోలీస్ కానిస్టేబుల్ కావటం గమనార్హం. వివరాలివీ.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పోలీసులు సోమవారం ఉదయం రేలకాయలపల్లి జైత్రాం తండా, జీత్యా తండాలపై దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా కల్తీ మద్యం తయారు చేస్తున్నారనే ఆరోపణలతో ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. * * యదాద్రి: భువనగిరిలో శనివారం తెల్లవారుజామున లారీ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌ చౌరస్తాలోని బస్టాండ్‌ వద్ద జనంపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీలో శనివారం తెల్లవారుజామున నుంచి పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సౌత్‌జోన్‌ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో కామటిపుర, బార్కాస్‌, వట్టేపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 21 మంది రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు, నాలుగు ఆయుధాలు, 65 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. * * హైదరాబాద్‌: నగరంలోని ఇందిరాపార్క్‌ వద్ద రేపు (ఆదివారం) ఉదయం 10 గంటలకు రైతు దీక్ష చేపట్టనున్నారు. ఈ రైతు దీక్షలో తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌, రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొననున్నారు. తెలంగాణ ఏర్పాడ్డాక తొలిసారి కోదండరామ్‌ దీక్షకు దిగుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం రైతు సమస్యలు పట్టించుకోవడం లేదని కోదండరామ్‌ దీక్షకు దిగుతున్నట్టు సమాచారం. * * వాజేడు: స్కూల్ పిల్లలను తరలిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వాజేడు మండలం జగన్నాథపురంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామం నుంచి వాజేడు పాఠశాలకు వెళ్తున్న స్కూల్ పిల్లల ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. * * పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎన్టీపీసీ(నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్) 7 యూనిట్‌ లో ఉత్పత్తి నిలిచి పోనుంది. ఈ అంశాన్ని అధికారులు తెలిపారు. ఏడో యూనిట్ వార్షిక మరమ్మత్తుల కోసం శుక్రవారం నుంచి ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీని వల్ల 500ల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచి పోనుంది. * * మునగాల(నల్గొండ): మునగాల మండలం ఇంద్రానగర్ వద్ద జాతీయ రహదారిపై గురువారం ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బీభ్సతం సృష్టించింది. వడ్ల లోడుతో ముందుగా సూర్యాపేట వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను గౌతమి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ మీద ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * కరీంనగర్ జిల్లా: రేణికుంట బ్రిడ్జి సమీపంలో రాజీవ్ రహదారిపై బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఓ బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో బైక్‌లో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనతో ఆ మార్గంలో ఒక కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * మిర్యాలగూడ (నల్గొండ జిల్లా): మిర్యాలగూడ పట్టణంలోని ఓ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణానికి చెందిన మారం శ్రీనివాస్(45) అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. భార్యాబిడ్డలతో కలిసి హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. రియల్‌ ఎస్టేట్‌లో నష్టాలు రావడంతో అప్పులపాలై బలవన్మరణానికి పాల్పడ్డాడు. * * శాన్ ఫ్రాన్సిస్కో : అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేగింది. శాన్ ఫ్రాన్సిస్కోలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు విద్యార్థులు గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా పలువురు విద్యార్థులు కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈక్విటీ జూన్ జోర్డాన్ స్కూల్ సిటీ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీ హైస్కూల్ బయట ఈ కాల్పులు జరిగాయి. * * గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజేష్(14) అనే విద్యార్థి మృతి చెందాడు. స్కూలుకు వెళ్లటానికి రోడ్డు పక్కన నిల్చున్న సమయంలో అటుగా వస్తున్న టాటా ఏస్ వాహనం అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలైన రాజేష్‌ను నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. మార్గమధ్యంలోనే ప్రాణాలొదిలాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. * * కరీంనగర్‌: హుజారాబాద్‌లో మంగళవారం తెల్లవారుజామున నుంచి పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరానగర్‌, బుడగ జంగాల కాలనీల్లో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ జరిపారు. కార్డెన్‌ సర్చ్‌లో భాగంగా సరైన పత్రాలు లేని వాహనాలను ఆపి తనిఖీలు చేపట్టారు. * * అబ్దుల్లాపూర్‌మెట్ : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాచారం గ్రామంలోని సాయిప్రియ కెమికల్ పరిశ్రమలో మంగళవారం ఓ బాయిలర్ పేలి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. మృతుడు బిహార్‌కు చెందిన శివ చాంద్‌బీన్(31)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. * * మరిపెడ(వరంగల్‌): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన వరంగల్‌ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్‌ సాయంతో ఆస్పత్రికి తరలించగా అందులో ఒకరి పరిస్థతి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. * * నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో ఆదివారం అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో ఒక లారీ కాలిపోయింది. ఆదిలాబాద్ వైపు నుంచి నిర్మల్ వెళ్తున్న నిమ్మకాయల లోడ్ లారీలో నేరడిగొండ వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.అవి వేగంగా లారీ అంతటా వ్యాపించటంతో అప్రమత్తమైన లారీ డ్రైవర్, క్లీనర్ కిందికి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు.అనంతరం లారీ అగ్నికి ఆహుతయింది. కారణాలు తెలియాల్సి ఉంది. లారీడ్రైవర్ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. * * చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సుమారు రెండు వారాలుగా ఆసుపత్రికే పరిమితమయ్యారు. ఆమె చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రి డాక్టర్లు ముఖ్యమంత్రి కోలుకుంటున్నారని.. మరికొంత కాలం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పాలన కుంటుపడకుండా తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయచర్యలపై ఏఐఏడీఎంకే నేతలు దృష్టి పెట్టినట్లు సమాచారం. * * హైదరాబాద్: నాంపల్లిలో అన్ని ఆధునిక హంగులతో పోలీస్స్టేషన్ నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నరసింహరెడ్డి తెలిపారు. శనివారం ఉదయం పోలీస్స్టేషన్ కొత్త భవనానికి నాయిని నర్సింహారెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతోపాటు నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి, ఇతర పోలీసులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. * * ఐక్యరాజ్యసమితి: కర్బన ఉద్గారాలను తగ్గించుకునే ఒప్పందంపై మెజారిటీ దేశాలు సంతకాలు చేయడంతో నవంబర్‌ 4 నుంచి ప్యారిస్‌ ఒప్పందం అమల్లోకి వస్తుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ బాన్‌ కీ మూన్‌ వెల్లడించారు. దీన్నోక చిరస్మరణీయ ఘటనగా అవర్ణించారు. * * హైదరాబాద్ : మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురిని మల్కాజిగిరి సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా కీసరకు చెందిన యు.బలరాం, కృష్ణ, నర్సింహ అనే వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బొమ్మ పిస్టళ్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. * * కథలాపూర్(కరీంనగర్) : ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు అక్కడే ఉన్న హుండీని ఎత్తుకుపోయారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం కలిగోట గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం అర్థరాత్రి సత్యనారాయణ స్వామి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు గర్భగుడిలో విలువైన వస్తువులు ఏమీ లేకపోవటంతో హుండీని పెకిలించుకు పోయారు. శుక్రవారం ఉదయం గమనించిన పూజారి గ్రామ పెద్దలకు సమాచారం అందించారు. ఈ మేరకు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. * * కౌడిపల్లి: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారం గేటు వద్ద రాస్తారోకో జరిగింది. సలబాత్తపూర్ పంచాయతీని కొత్తగా ఏర్పాటు చేస్తున్న చిలిప్‌చేడ్ మండలంలో కాకుండా కౌడిపల్లి మండలలోనే కొనసాగించాలని ఆ పంచాయతీ ప్రజలు డిమాండ్ చేశారు. సుమారు 30 నిమిషాల పాటు రాస్తారోకో జరగడంతో మెదక్-నర్సాపూర్ రహదారిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. * * సిద్ధిపేట(మెదక్ జిల్లా) : సిద్ధిపేట మండలకేంద్రం గణేశ్ నగర్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికంగా నివాసముంటున్న శ్రీశైలం, పదయ్య, నర్సింహులు అనే ముగ్గురి ళ్లలో చోరీకి పాల్పడ్డారు. మూడిళ్లలో కలిపి 2 తులాల బంగారం, రూ.10 వేల నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. * * కొణిజర్ల(ఖమ్మం జిల్లా) : కొణిజర్ల మండలకేంద్రంలోని ఎండీఓ ఆఫీసు వద్ద గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. అదే సమయంలో అటుగా వచ్చిన మరో లారీ వచ్చి ఈ రెండు లారీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురికి గాయాలయ్యాయి. ఇదేవిధంగా కొణిజర్ల పోలీస్‌స్టేషన్ సమీపంలో లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఖమ్మం తరలించారు. * * కొత్తకోట(మహబూబ్‌నగర్) : మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటలో ఓ మహిళ దారుణంగా హత్యకు గురైంది. మండల కేంద్రంలోని వడ్డెవాడ సమీపంలోని ముళ్ల పొదల్లో ఓ మహిళ(50) మృత దేహం పడి ఉండగా గురువారం ఉదయం స్థానికులు కనుగొన్నారు. ఎక్కడో చంపి ఇక్కడ పడేసి ఉంటారని భావిస్తున్నారు. ఆమె స్థానికురాలు కాదని చెబుతున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవాల్సి ఉంది. * * హైదరాబాద్ : ముగ్గురు యువకులు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన ఘటనలో గాయపడిన చిన్నారి సంజన బ్రెయిన్ డెడ్ కాలేదని కామినేని ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రసాదరావు వెల్లడించారు. అయితే ఆమె పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. బుధవారం హైదరాబాద్లో ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రసాదరావు విలేకర్లతో మాట్లాడుతూ... చిన్నారి సంజన పరిస్థితి విషమంగానే ఉందన్నారు. * * శంషాబాద్(రంగారెడ్డి) : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆరేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడింది. హైదరాబాద్ కొత్తపేటకు చెందిన అరవింద్‌రావు దంపతులు తమ కూతురు నవ్య(6)తో కలసి బంధువులకు వీడ్కోలు చెప్పేందుకు మంగళవారం రాత్రి ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో చిన్నారి నవ్య డిపార్చర్ రైలింగ్ పైనుంచి కిందపడి పోయింది. తలకు తీవ్ర గాయాలుకాగా చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. వెంటనే జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. * * కీసర(రంగారెడ్డి) : డంపింగ్ యార్డు కారణంగా చెరువు నీరు కలుషితం అవుతోందంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వివరాలివీ.. రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాల సమీపంలో జీహెచ్‌ఎంసీ డంపింగ్ యార్డు ఉంది. ఈ యార్డు నుంచి వెలువడే వ్యర్థ జలాలు పక్కనే ఉన్న చెరువులో కలుస్తున్నాయి. సాగు నీరు కలుషితమవుతోందంటూ కొన్ని రోజులుగా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ఇదే విషయమై ఒక్కటైన గ్రామస్తులు బుధవారం ఉదయం చెత్తను తీసుకువచ్చే జీహెచ్‌ఎంసీ వాహనాలను అడ్డుకున్నారు. * * హైదరాబాద్ : కూకట్‌పల్లి జేఎన్‌టీయూ పరిపాలన విభాగంలో భారీగా మార్పులు, చేర్పులు చేస్తూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారు. డెరైక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్‌గా ఉన్న ఈశ్వరప్రసాద్‌ను సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూ ప్రిన్సిపాల్‌గా నియమించారు. అడ్మిషన్స్ డెరైక్టర్‌గా మంజూర్ హుస్సేన్‌ను, ఎగ్జామినేషన్స్ కంట్రోలర్‌గా తార కల్యాణి, బిక్స్ డెరైక్టర్‌గా లక్ష్మణరావు, డీయూఎఫ్‌ఆర్‌గా చెన్నకేశవరెడ్డిని నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. * * బాల్కొండ(నిజామాబాద్ జిల్లా) : ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 2 లక్షల 4 వేల 939 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్ధ్యం 90.313 టీఎంసీలు కాగా ప్రస్తుతం 89.763 టీఎంసీల నీరు ఉంది. కాకతీయ కెనాల్‌కు 5 వేల క్యూసెక్కులు, సరస్వతీ కెనాల్‌ఖు 1000 క్యూసెక్కులు, లక్ష్మీ కెనాల్‌కు 300 క్యూసెక్కులు, ఎస్కేప్ రెగులేటర్‌కు 3 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. మొత్తం 74,939 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. * * కరీంనగర్ : ప్రమాదవశాత్తు మూడు ఎలుగు బంట్లు వ్యవసాయ బావిలో పడి మరణించాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం శ్రీరాములపేటలో సోమవారం చోటు చేసుకుంది. ఆ విషయాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించారు. దీంతో గ్రామస్తులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని... ఎలుగు బంట్లను బావిలో నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. * * హైదరాబాద్ : పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్న ఓ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. కుషాయిగూడ నాగార్జుననగర్ కాలనీకి చెందిన ఇందుభార్గవి(19), చాంద్ అలీ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారి వివాహానికి పెద్దలు అంగీకరించకపోవటంతో రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. అనంతరం తమకు ప్రాణాహాని ఉందని, బంధువుల నుంచి రక్షణ కల్పించాలంటూ మంగళవారం కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు. * * కెరామెరి(ఆదిలాబాద్ జిల్లా) : కెరామెరి మండలం కెలికే గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గౌరూభాయ్(60), బ్యీసన్(30) అనే తల్లీ కొడుకులు ప్రమాదవశాత్తూ తమ పొలంలో కరెంటు షాక్ తగిలి మృతిచెందారు. ఈ సంఘటన నిన్ననే జరిగినా ఆలస్యంగా బయటపడింది. తల్లీకొడుకు మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. * * హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు కనిపించటం కలకలం రేపింది. లక్నో వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడి లగేజిని తనిఖీ చేయగా మూడు బుల్లెట్లు బయటపడ్డాయి. దీంతో భద్రతా సిబ్బంది అతడిని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. * * మహబూబ్‌ నగర్: మహబూబ్‌ నగర్ జిల్లా మరికల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృత్యువాతపడ్డారు. శనివారం ఉదయం రెండు లారీలు వేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో రెండు లారీల డ్రైవర్లు క్యాబిన్‌లోనే ప్రాణాలు విడిచారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో రాయిచూర్ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని వాహనాలను పక్కకు తొలగించేందుకు యత్నిస్తున్నారు. క్షతగాత్రులను మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. * * ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బాసరలో వేంచేసి ఉన్న సరస్వతీ మాత సన్నిధిలో దసరా ఉత్సవాలు మొదలయ్యాయి. మొదటిరోజు శైలిపుత్రిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తోంది. శనివారం వేకువజాము నుంచి భక్తులు దర్శనం కోసం క్యూకట్టారు. భైంసాపట్టణానికి చెందిన వ్యాపారవేత్త జి.రమేష్ కుటుంబసభ్యులు అమ్మవారికి రెండు తులాల బంగారు గొలుసును సమర్పించుకున్నారు * * కరీంనగర్ : ఎగువ ప్రాంతాల నుంచి వరదతో కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు జలాశయం పూర్తిస్థాయిలో నిండింది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 920 అడుగులు కాగా.. ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం కొనసాగుతోంది. జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి 16,000 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో.. 8 గేట్లు ఎత్తి 16,000 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. కాకతీయ కాలువకు మరో 2, 000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. * * డిచ్‌పల్లి: వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టిన ఘటనలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టడంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జాం అయింది. * * కరీంనగర్ : లోయర్ మానేరు డ్యామ్‌కు వరద తగ్గుముఖం పట్టింది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 920 అడుగులు, నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా గురువారం ఉదయం ఎనిమిది గంటలకు 919.40 అడుగులు, 23.51 టీఏంసీల నీరు ఉంది. డ్యామ్‌కు ఇన్‌ఫ్లో 10,800 క్యూసెక్కులు ఉండగా.. కాకతీయ కెనాల్ ద్వారా 5,000 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. * * శంషాబాద్ : పిల్లర్ కోసం తీసిన గుంటలో పడి బాలుడు మృతిచెందిన సంఘటన శంషాబాద్ మిషన్‌కంపౌడ్ సమీపంలోని శీనయ్య వెంచర్‌లో గురువారం వెలుగుచూసింది. స్థానిక శీనయ్య వెంచర్‌లో కార్మికులుగా పనిచేస్తున్న హరీష్, యాదమ్మ దంపతుల ఆరేళ్ల కుమారుడు బాలు పిల్లర్ గుంటలో పడి మృతిచెందాడు. శ్రీనయ్య వెంచర్‌లో పిల్లర్‌ల కోసం గుంటలు తవ్వారు. అందలో వర్షపు నీరు చేరడంతో ప్రమాదవశాత్తు బాలుడు అందులో పడి మృతిచెందాడు. * * ధర్మసాగర్(వరంగల్) : వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ధర్మసాగర్ సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న కేశబోయిన దేవేందర్(34) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో రాత్రి ప్యాసింజర్‌ను దించి ఇంటికి తిరిగి వస్తుండగా.. ఆటో బోల్తా కొట్టడంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటాన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. * * పెద్దమందడి(మహబూబ్‌నగర్) : వేగంగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన ఘటనలో బస్సు డ్రైవర్, క్లీనర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా పెద్దమందడి మండలం మోజెర్ల స్టేజీ సమీపంలో 44వ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. * * హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లి మూసాపేటలో బుధవారం వేకువజామున దారుణం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు స్నేహితులను వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో బైక్ వెనుక కూర్చున్న హరికృష్ణ(28) అనే యువకుడు మృతిచెందాడు. స్నేహితుని మరణాన్ని జీర్ణించుకోలేని రమేష్(28) భరత్‌నగర్ రైలు పట్టాలపై ఆత్మహత్యచేసుకున్నారు. హరికృష్ణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాగా రమేష్ శ్రీశ్రీ హోలిస్టిక్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. * * హైదరాబాద్ : భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని నీటి ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తింది. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.30 అడుగులకు వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 200.658 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు బుధవారం వెల్లడించారు. * * నిజాంసాగర్(నిజామాబాద్ జిల్లా) : నిజామాబాద్ జిల్లాలోని నిజామ్‌సాగర్‌కు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి నిజాంసాగర్‌కు 1.16లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 19 గేట్లు ఎత్తివేసి 1.03 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. * * మెదక్ : మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం చిల్వర వద్ద మంగళవారం రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. * * చెన్నై: చెన్నైలో ఓలా క్యాబ్ డ్రైవర్ ఓ మహిళా డాక్టర్పై లైంగికదాడికి ప్రయత్నించాడు. మరో ఇద్దరితో కలసి ఆమెను బలవంతంగా కారులో తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కారు వెనుక వాహనంలో వెళ్తున్న ఓ వ్యక్తి డాక్టర్ అరుపులు విని చేజ్ చేసి స్థానికులతో కలసి ఆమెను రక్షించాడు. * * శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 200 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా(ఏఐ-559) విమానం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నిలిపేశారు. ఉదయం 6.40 వెళ్లాల్సిన విమానం ఇప్పటికీ బయలుదేరకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఇంత జరుగుతున్నా ఎయిర్ ఇండియా అధికారులు మాత్రం తమకేం బాద్యత లేనట్లు వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. * * ఖమ్మం : రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. దాదాపు అన్ని చెరువులు, కుంటల్లో నీరు ప్రమాదస్థాయికి చేరుకుంది. ఖమ్మం జిల్లా చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు బుధవారం ఉదయం ప్రాజెక్ట్ పదిగేట్లను ఎత్తివేసి... 23,730 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. * * కరీంనగర్ : ఎస్సారెస్సీ ప్రధాన కాలువకు గండిపడటంతో.. వందల ఎకరాల్లో పంట నీట మునిగింది. కరీంనగర్ జిల్లా మానాల సమీపంలో గల ఎస్సారెస్సీ ప్రధాన కాలువకు మంగళవారం రాత్రి భారీ గండి పడింది. దీంతో పెగడపల్లి, గొల్లపల్లి మండలాల పరిధిలోని చెరువులన్ని నిండిపోయాయి. సుద్దపల్లిలోని కొయ్యచెరువు, రాఘవపట్నంలోని మొగుళ్ల చెరువుకు గండి పడటంతో.. వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. * * హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాల్లో కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్న ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య విద్య సీట్లకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకూ వెబ్ ఆప్షన్ల నమోదుకు గడువు ఉంటుందని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ కరుణాకరరెడ్డి తెలిపారు. * * శంషాబాద్ : దుబాయ్ వెళుతున్న అహ్మద్ అనే వ్యక్తి నుంచి మంగళవారం ఉదయం భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహించగా అహ్మద్ వద్ద భారీగా విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. నిందితుని అదుపులోకి తీసుకుని విచారణచేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * హైదరాబాద్ : ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేసంలో ఆయన పాల్గొనున్నారు. ముఖ్యమంత్రి తోపాటు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కూడా ముఖ్యమంత్రి బృందంతో పర్యటించనున్నారు. * * హైదరాబాద్‌: నాంపల్లిలోని టీఎన్‌జీవో కార్యాలయంలో సోమవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీలో పనిచేస్తున్న సుమారు 700 మంది నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగులను తెలంగాణకు బదిలీ చేయాలంటూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పెట్రోల్‌ డబ్బాలతో టీఎన్‌జీవో కార్యాలయంలోకి ఉద్యోగులు వెళ్లడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. * * దుగ్గొండి(వరంగల్) : ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో.. బైక్‌పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. * * తిర్యాని: స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఆశ్రమ పాఠశాల విద్యార్థి వాగులో మునిగి మృతి చెందాడు. అదిలాబాద్ జిల్లా తిర్యాని మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న కె. లక్ష్మణ్‌రాహూల్(12) ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి సమీపంలోని వాగులో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. * * చొప్పదండి: కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలంలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. భూపాలపట్నంకు చెందిన మునిగాల అంజయ్య (48) అప్పులబాధతో గ్రామశివారులోని పశువుల కొట్టం వద్ద ఉరివేసుకొని బలవన్మరణం చెందాడు. స్థానిక రైతులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. గ్రామంలో 4.38 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా గత కొన్నేళ్లుగా వ్యవసాయంలో నష్టాలు రావడంతో రూ.5లక్షలకు పైగా అప్పులయ్యాయి. వాటిని తీర్చే మార్గం లేక మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. * * హైదరాబాద్ : తెలంగాణ విమోచన దినం నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో జాతీయ జెండా ఎగరేసేందుకు బీజేపీ ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి యత్నించారు. అందులోభాగంగా ఆయన వాహనంలో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే కిషన్రెడ్డి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు... కిషన్రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. * * మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తిని రేవెన్యూ డివిజన్ చేయాలంటూ కల్వకుర్తి MLA అయిన చల్లా వంశీచంద్ రెడ్డి చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి అరెస్ట్ చేసారు. * * చర్ల: ఖమ్మం జిల్లా తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉదృతి పెరిగింది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన 9 గేట్లను 2 అడుగుల మేర ఎత్తారు. 8400 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు నుంచి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 73.6 మీటర్లుగా ఉంది. * * నల్గొండ : నల్గొండ జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టులో నీటి మట్టం బుధవారం 47.59 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టులోకి 29,373 క్యూసెక్కుల నీరు వస్తుండగా..9,929 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు నుంచి అధికారులు బయటికి వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 21.30 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు. * * నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా దోమకొండలో ఓ బాలుడు ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ తగిలి మరణించాడు. వివరాలు ఇలా ఉన్నాయి... వివేక్ (16) అనే బాలుడు బుధవారం వేకువజామున ప్రమాదవశాత్తూ కరెంటు షాక్‌కు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని రుద్ర ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాద్దిసేపటికే మరణించాడు. * * నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్ర శివారులో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఇద్దరికి మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డారు. బస్సు ముందు భాగం మాత్రం దెబ్బతిన్నది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. * * యాలాల: రంగారెడ్డి జిల్లా యాలాల శివారులో ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ మండలం హుస్నాపూర్ గ్రామానికి చెందిన వెంకటయ్య, యోగి జీవనోపాధి కోసం వచ్చి రంగారెడ్డి జిల్లాలో స్థిరపడ్డారు. * * కరీంనగర్: కరీంనగర్ జైలు నుంచి ఇద్దరు దొంగలు పరారీ అయ్యారు. వీరి కోసం కరీంనగర్ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జైలు నుంచి పరారైన వారు మహారాష్ట్ర పార్సీ గ్యాంగ్కు చెందిన జితేందర్, యోగేశ్లుగా గుర్తించారు. * * హైదరాబాద్: పాతబస్తీ భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తలాబ్‌కట్ట, అమన్ నగర్ ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్‌నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన దృవపత్రాలు లేని 83 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. * * శంషాబాద్ (హైదరాబాద్‌): శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రంయలో తనిఖీలు నిర్వహిస్తున్న కస్టమ్స్ అధికారులు అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 320 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద అక్రమ బంగారం గుర్తించిన ఎయిర్‌పోర్ట్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. * * నార్కెట్‌పల్లి(నల్లగొండ): వేగంగా వెళ్తున్న కారు, లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి శివారులోని 65వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. * * ములుగు: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు నీటిగుంటలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ములుగు మండలం బండారుపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏడాదిన్నర చిన్నారి తల్లిదండ్రులు పనులు చూసుకుంటుండగా.. చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందు ఉన్న నీటిగుంటలో పడి మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. * * కోరుట్ల: మోటర్ పెట్టడానికి వ్యవసాయ బావి దగ్గరకు వెళ్లిన రైతు ప్రమాదవశాత్తు విద్యుధ్ఘాతానికి గురై మృతి చెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాంరెడ్డి(45) ఈ రోజు ఉదయం మోటర్ ఆన్ చేయడానికి వెళ్లాడు. అయితే షార్ట్ సర్క్యూట్ కావడంతో కరెంట్ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. * * పంజగుట్ట: మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ నిమ్స్‌ ఆసుపత్రి ఓపీలో రెప్పపాటులో రూ. 40 వేలు చోరీ చేసింది. అక్కడే విధుల్లో ఉన్న ఓ మహిళా గార్డు ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం ... నాంపల్లికి చెందిన గౌసియా బేగం (32) బుధవారం మధ్యాహ్నం నిమ్స్‌ ఆసుపత్రి ఓపీ వద్దకు వచ్చింది. * * మహేశ్వరం: వేగంగా వెళ్తున్న లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టిన ఘటనలో క్లీనర్ మృతిచెందగా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం రావిర్యాల ఔటర్ రింగ్‌ రోడ్డుపై గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పెద్ద అంబర్‌పేట్ నుంచి వస్తున్న లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టింది. * * తాండూరు(రంగారెడ్డి): కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ఎం. మాణిక్‌రావు(86) నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాణిక్‌రావును కుటుంబ సభ్యులు నిమ్స్ ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందారు. * * దమ్మపేట: దుక్కి దున్నుతున్న ట్రాక్టర్‌పై విద్యుత్ స్తంభం విరిగిపడటంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లిలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లకావత్ చిట్టయ్య(35), ధారావత్ మహేష్(22)లు ట్రాక్టర్ సాయంతో దుక్కిదున్నతున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం విరిగిపడింది. దీంతో ట్రాక్టర్ పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. * * హైదరాబాద్: జిల్లాల పునర్విభజన విషయంలో అధికార టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను కలసి తమ అభ్యంతరాలను తెలిపారు. మంగళవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిలు సచివాలయంలో సీఎస్‌ను కలసి వినతి పత్రం అందజేశారు. * * హైదరాబాద్ : దసరా నుంచి కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు అన్నీ ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. జిల్లా కలెక్టర్లతో ఆయన ఈ విషయమై సమావేశమయ్యారు. కొత్త జిల్లాల్లో పనిభారాన్ని బట్టి పరిపాలనా విభాగాలు ఉండాలని తెలిపారు. అధికారుల సర్దుబాట్లు, కొత్త ఉద్యోగుల నియామకాలు జరగాలని సూచించారు. * * సంగారెడ్డి: మెదక్ జిల్లా పటాన్‌చెరు ఇస్నాపూర్ వద్ద సోమవారం అర్థరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. వేగంగా వచ్చిన ట్యాంకర్ లారీ ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో బైక్‌పై వెళుతున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. * * మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సివిల్ జడ్జి నాగరాజు ఇంట్లో దొంగలు పడి బీభత్పం సృష్టించారు. జడ్జి కుటుంబసభ్యులు ఊరు వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగింది. ఇరుగుపొరుగువారు ఇచ్చిన సమాచారం మేరకు మిర్యాలగూడ పోలీసులు క్లూస్ టీమ్‌తో చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. జడ్జికి సమాచారం ఇచ్చారు. * * నల్గొండ : భువనగిరిలో గ్యాంగ్స్టర్ నయీం అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై స్థానిక ఆర్డీవో శనివారం విచారణ జరపనున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 1700 మంది బాధితులు ఇప్పటికే ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. నల్గొండ జిల్లా బొమ్మాయిపల్లిలోని లక్ష్మీనరసింహ వెంచర్లో 1700 మందికి చెందిన ప్లాట్లను నయీం తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. * * హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-2 రాత పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2015 డిసెంబర్ 30న 439 పోస్టుల భర్తీకి జారీ అయిన నోటిఫికేషన్ కింద ఇప్పటికే 5,64,431 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, మరో 593 పోస్టుల భర్తీకి ప్రస్తుత అనుబంధ నోటిఫికేషన్ కింద మరో లక్షన్నర మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. * * హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య మరో వివాదం తలెత్తింది. సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న 21 మంది తెలంగాణ ఇంజినీర్లు తమను ఏపీ జెన్ కో అధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమపై జెన్ కో అధికారులు పరిమితికి మించిన పనిభారం మోపుతున్నారని పేర్కొటూ.. మూడు రోజులుగా తెలంగాణ ఇంజనీర్లు విధులకు హాజరవడం మానేశారు. * * వరంగల్ ఎంజీఎం: వరంగల్ జిల్లా కేంద్రంలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. స్థానిక లేబర్ కాలనీకి చెందిన సంధ్య అనే మహిళకు మొదటికాన్పులో ముగ్గురు ఆడ శిశువులు పుట్టారు. ఈ సంఘటన వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో శనివారం చోటుచేసుకుంది. శనివారం ఉదయం 8 గంటల సమయంలో ఆసుపత్రి వైద్యులు మహిళకు సర్జరీ చేసి ముగ్గురు శిశువులను బయటకు తీశారు. ముగ్గురూ ఆరోగ్యంగా ఉన్నారు. * * హైదరాబాద్: ఇటీవల పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన గ్యాంగ్‌స్టర్ నయీం ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. శేషన్న ప్రధాన అనుచరుడు సోమన్నఇచ్చిన సమాచారం మేరకు నగరంలోని కుషాయిగూడలో సిట్ అధికారులు గురువారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నయీం అనుచరులు శ్రీనివాస్, లక్ష్మణ్‌లను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని తమ కార్యాలయానికి తరలించారు. నయీంకు సంబంధించిన మరింత అదనపు సమాచారం కోసం సిట్ అధికారులు వారిని విచారిస్తున్నారు. * * కరీంనగర్: నేడు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె కరీంనగర్ జిల్లాలో సంపూర్ణంగా కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాలయాలు సంపూర్ణంగా బంద్ పాటిస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జిల్లాలో 11 డిపోలలో మొత్తం 980 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. * * నల్లగొండ: దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నేపథ్యంలో యాదగిరిగుట్టలో కార్మిక సంఘాలు సమ్మెలో పాల్పంచుకున్నాయి. ఆర్టీసీ కార్మకులు కూడా ఈ సమ్మెలో పాల్గొనడంతో.. యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోకు చెందిన 105 బస్సులు డిపోలోపలే ఉండిపోయాయి. దీంతో యాదగిరిగుట్టకు వచ్చే భక్తులు, ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ వాహనదారులు తమకు ఇష్టం వచ్చిన రీతిలో ప్రయాణికుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. * * యాదగిరిగుట్ట : నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని సాయిబాబా మందిరంలో వినాయకుడి రూపంలో అల్లం దర్శనమివ్వడంతో.. స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలకు ముందు ఇలా జరగడం శుభ పరిణామమని భక్తులు భావిస్తున్నారు. స్థానిక సాయి ఆలయంలో అన్నదానం కోసం కొనుగోలు చేసిన అల్లంలో పార్వతి పుత్రుడి ప్రతిమ రూపంలో ఉన్న అల్లం లభించిందని ఆలయ సిబ్బంది తెలిపారు. ఈ వార్త తెలిసిన ప్రజులు పెద్ద ఎత్తున అల్లం వినాయకుడిని దర్శించుకోవడానికి తరలి వస్తున్నారు. * * నల్లగొండ: నల్లగొండ జిల్లా దామరచర్లలో దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు గురువారం రట్టు చేశారు. అందుకు సంబంధించి నలుగురు వ్యక్తులకు పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక కిరాణా దుకాణంలో నకిలీ నోట్లు మారుస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని... తమదైన శైలిలో విచారించారు. * * హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురంలో సుష్మా థియేటర్ వద్ద బ్లాక్లో టికెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 50 సినిమా టికెట్లతోపాటు రూ. 2 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీసుస్టేషన్కు తరలించారు. * * హైదరాబాద్‌ జిల్లాలో 49,903 పింఛన్లకు కోత పడనుంది. ప్రభుత్వం చేపట్టిన లెఫ్‌ ఎవిడెన్స్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ బుధవారంతో ముగియడం నిజమైన పింఛన్‌దారుల లెక్కతేల నుంది. 36,512మంది వెరిఫికేషన్‌ చేయించుకోకపోగా, వెరిఫికేషన్‌ ప్రక్రియలో పాల్గొన్నా వేలిముద్రలు సరిపోలకపోవడం, ఆధార్‌తో లింకు కలువని 11,392 మందికి పింఛన్లు నిలిచిపోనున్నాయి. ఆధార్‌ లింకు మ్యాచ్‌ కాని వా రు మళ్లీ కొత్తగా ఆధార్‌ నమోదు చేసుకోవాల్సి ఉంది. * * మెదక్ : మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ వద్ద గురువారం వ్యాన్ను స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి... వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. * * ఖమ్మం: జిల్లాలో భారీగా ఎస్సైలు బదిలీ అయ్యారు. జిల్లాలోని దాదాపు 58 మంది ఎస్సైలకు స్థానచలనం కల్పిస్తూ జిల్లా ఎస్పీ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఎస్సైలుగా విధులు నిర్వహిస్తున్నవారితోపాటు... కొత్తగా ఎస్సై ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి కూడా ఈ బదిలీల్లో పోస్టింగ్ ఇస్తున్నట్లు ఎస్పీ ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. * * హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన బాట చేపట్టాయి. అందులోభాగంగా గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు కళాశాలల బంద్కు సదరు యాజమాన్యం పిలుపు నిచ్చింది. * * లాస్‌ఏంజిలెస్: అంగారక గ్రహం ఉపరితలంపై ఉన్న పరిస్థితులను భూభాగంపై సృష్టించి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా జరిపిన అరుదైన ప్రయోగం విజయవంతంగా ముగిసింది. ఈ మేరకు నాసా అమెరికాలోని హవాయి రాష్ట్రంలో అంగారక గ్రహం పరిస్థితుల్లో మానవుడి మనుగడ సాధ్యమా అన్న అంశంపై పరిశోధన నిర్వహించింది. ఆరుగురి బృందంతో ఏడాది క్రితం ప్రారంభించిన ఈ ప్రయోగం సోమవారం ముగిసింది. * * నేడు ఐసెట్ ప్రవేశాలకు కొనసాగుతున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ - 50,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు నేడు వెరిఫికేషన్ - ఎన్సీసీ కేటగిరిలో 30,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ * * హైదరాబాద్: స్విస్ ఛాలెంజ్ పై నేడు హైకోర్టులో విచారణ * * హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ కోసం 1969లో జరిగిన ఉద్యమంలో పాల్గొని పోలీస్ కాల్పుల్లో గాయపడ్డ హైదరాబాద్ వాసి పగడాల పరంధామకు రూ.10 లక్షల ఆర్థికసాయం అందించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. 1969 ఏప్రిల్ 4న సికింద్రాబాద్ జనరల్ బజార్‌లో జరిగిన కాల్పుల్లో పరంధామ ఛాతిలో, కుడి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. * * లాస్ ఎంజెల్స్: లాస్ ఎంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎలాంటి కాల్పుల ఘటనలు చోటుచేసుకోలేదని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఒక పెద్ద శబ్దం మాత్రమే వచ్చి దాన్ని ఎయిర్ పోర్ట్ సిబ్బంది కాల్పులుగా భ్రమపడ్డారని చెప్పారు. అమెరికాలోని లాస్ ఎంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాల్పులు చోటుచేసుకున్నాయని తొలుత కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. * * విశాఖపట్నం: రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం సూచించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని వెల్లడించింది. * * హైదరాబాద్: తమ డిమాండ్లను తీర్చి, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఎన్‌ఎంలూ మంత్రి నివాసం ముట్టడికి యత్నించారు. సోమవారం ఉదయం మణికొండలోని మంత్రి లక్ష్మారెడ్డి ఇంటి వద్దకు భారి ఎత్తున చేరుకున్న ఏఎన్‌ఎంలు ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి సమ్మె విరమించి వస్తే సమస్య సరిష్కారానికి కృషి చేస్తానని హామి ఇచ్చారు. * * బిర్కూర్ : నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండల కేంద్రంలోని తిరుమల దేవస్థానంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు శనివారం ఉదయం వరుణయాగం నిర్వహించారు. దేవస్థానం ఆవరణంలోని గణపతి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. * * న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో 118 మందితో కూడిన భారీ బృందాన్ని పంపిస్తే కేవలం రెండు పతకాలు మాత్రమే దక్కడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది. వచ్చే మూడు ఒలింపిక్స్‌లలో పతకాలు కొల్లగొట్టేందుకు సమగ్ర కార్యాచరణ పథకాన్ని అమలు చేసేందుకు టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. * * హైదరాబాద్‌సిటీ: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపించారు. రాజేంద్రనగర్ పరిధిలోని గగన్‌పహాడ్ వద్ద హైదరాబాద్-బెంగుళూరు జాతీయరహదారిపై రవాణాశాఖాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 10 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. తనిఖీలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. * * మియామి: అతను చెవిటి వ్యక్తి. సంకేత భాషలోనే ఎవరితోనైనా ముచ్చటిస్తాడు. వేగంగా వాహనాన్ని నడుపుతున్నాడనే సాకుతో అతన్ని ఓ జవాను వెంబడించాడు. ఇద్దరి మధ్య 13 కిలోమీటర్ల పాటు హోరాహోరీగా ఛేజింగ్ జరిగింది. చివరకు అతను తన ఇంటికి సమీపంలో వాహనాన్ని ఆపాడు. వాహనం దిగిన అతన్ని జవాను తుపాకీతో కాల్చాడు. సంఘటనా స్థలంలోనే అతను కుప్పకూలాడు. అమెరికాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దుమారం రేపుతోంది. * * అహ్మదాబాద్: ఓ సీనియర్ జర్నలిస్టు ఏకంగా పత్రికా కార్యాలయంలోనే దారుణంగా హత్యకు గురయ్యాడు. కార్యాలయంలో కూర్చుని వార్తాకథనం రాస్తుండగా దుండగులు ఆయనను కిరాతకంగా పొడిచి చంపారు. నెత్తుటి మడుగులో ఉన్న ఆయన మృతదేహాన్ని మంగళవారం పోలీసులు గుర్తించారు. గుజరాత్ సౌరాష్ట్ర ప్రాంతంలోని జునాగఢ్ పట్టణంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. * * హిమాయత్‌నగర్‌: రోడ్డు, రవాణా భద్రతా బిల్లు, ఆర్టీఏ, ట్రాఫిక్‌ పోలీసుల వేధింపులకు నిర సనగా సెప్టెంబర్‌ 2న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఆటోడ్రైవర్ల సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నాయకులు తెలిపారు. హిమాయత్‌నగర్‌లోని ఎఐటియుసి భవన్‌లో సోమవారం బంద్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో లక్ష్మయ్య పాల్గొన్నారు. * * పంజగుట్ట: గణేష్‌ ఉత్సవాలను గతంలో మాదిరిగానే నిర్వహించుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసినా పోలీసు అధికారులు నిబంధనల పేరుతో వేధించడం తగదని భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ప్రతినిధులు అన్నారు. గణేష్‌ నిమజ్జనంతో కాలుష్యం వెలువడటం లేదని పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు నివేదిక ఇచ్చిందని, ఎత్తు విషయంలో జోక్యం చేసుకోబోమని హైకోర్టు పేర్కొన్నా ఎత్తు తగ్గించాలని ఒత్తిడి చేయడం దారుణమన్నారు. * * హైదరాబాద్: మాజీ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డిని కరీంనగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మావోయిస్టు, గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీమ్ తరహాలోనే మోహన్‌రెడ్డి అరాచకాలకు పాల్పడేవాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గ్యాంగ్‌స్టార్‌ నయీం ముఠాతో సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు. నిన్న రాత్రి (సోమవారం) 8 గంటలకు మోహన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. * * ఇస్తాంబుల్ : ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన 12 ఏళ్ల ఆత్మాహుతి బాంబర్.. టర్కీలో ఉగ్రవాద దాడి చేసి, 51 మంది ప్రాణాలు బలిగొన్నాడు. ఓ పెళ్లిని లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 69 మంది గాయపడ్డారు. వారిలో 17 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ దాడికి పాల్పడింది 12 ఏళ్ల కుర్రాడేనని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తెలిపారు. * * ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేసినిరోడ్డు రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇది గుర్తించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. * * కోయంబత్తూర్: తన ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను హతమార్చింది. తొలి ప్రయత్నంలో పాముల ద్వారా కాటు వేయించాలని ప్రయత్నించి అది విఫలం కావడంతో సుఫారీ ఇచ్చి అతడిని హత్య చేయించింది. ఈ ఘటన తమిళనాడులోని పట్టనంపుదూర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళకు కృష్ణ అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉంది. * * దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా మొదటి స్థానానికి చేరుకుంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో కోహ్లి సేన టాప్ ర్యాంకులో నిలిచింది. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ లో ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోవడంతో టీమిండియా మొదటి ర్యాంకు సొంతం చేసుకుంది. 3-0తో సిరీస్ ను శ్రీలంక క్లీన్ స్వీప్ చేయడంతో మొదటి ర్యాంకులో ఉన్న ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది. * * హైదరాబాద్: స్థానికేతర ఉద్యోగులు తమను ఇబ్బంది పెడుతున్నారంటూ తెలంగాణ సచివాలయంలో రెండో రోజు ఆర్థిక శాఖ ఉద్యోగులు బుధవారం తమ నిరసనలు తెలిపారు. ఉన్నతాధికారుల వద్ద పీఎస్లుగా పని చేస్తున్నవారిని తప్పించాలని వారు డిమాండ్ చేశారు. అందులోభాగంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును టీ. ఉద్యోగుల సంఘం నేతలు కలిశారు. * * హైదరాబాద్‌: హయత్‌నగర్ మండలం పసుమాముల బీసీ హాస్టల్ విద్యార్థి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి... సదరు బీసీ హాస్టల్లో ఉంటూ రాకేశ్ అనే విద్యార్థి కలుషిత నీరు తాగి తీవ్ర అనారోగ్యం పాలైయ్యాడు. దీంతో హాస్టల్ సిబ్బంది అతడిని ఎల్బీ నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రెండు రోజులుగా చికిత్స పొందుతు బుధవారం రాత్రి మరణించాడు. * * నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం దుర్కి గ్రామంలో డయేరియాతో గంగవ్వ (50) అనే మహిళ గురువారం మృతి చెందింది. గ్రామంలో డయేరియా ప్రబలింది. దీంతో సమాచారం అందుకున్న జిల్లా వైద్యాధికారులు గ్రామంలో మూడు రోజులు వైద్యశిబిరం నిర్వహించారు.అయితే గంగవ్వ ఈ రోజు మరణించింది. దాంతో బోధన్ ఆర్డీవో సుధాకర్ రెడ్డి గురువారం దుర్కి గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులకు అందుతున్నసేవలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. * * హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం మహముద్ అలీ అధ్యక్షతన మంత్రులు కడియం శ్రీహరి, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. జిల్లాల ఏర్పాటుపై అన్ని వర్గాల నుంచి వచ్చే ప్రతిపాదనలు చర్చించి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. * * హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీం కేసు దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. సిట్ అధికారిగా ఐజీ నాగిరెడ్డిని ప్రభుత్వం నియమించింది. అడిషనల్ ఎస్పీ, ఇద్దరు డీఎస్సీలు సహా 8మందితో ఏర్పాటు అయిన సిట్ బృందానికి నాగిరెడ్డి నేతృత్వం వహిస్తారు. * * పంజగుట్ట: న్యాయస్థానంలోనే న్యాయవాదిపై దాడి చేసిన వ్యక్తిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు... నగరానికి చెందిన దీక్ష అమోల్, బాలకృష్ణ అమోల్‌ భార్యాభర్తలు. దీక్ష తన భర్త అయిన బాలకృష్ణపై గృహహింస కేసు పెట్టగా ఎర్రమంజిల్‌ కోర్టులో మంగళవారం కేసు విచారణకు వచ్చింది. కూకట్‌పల్లికి చెందిన న్యాయవాది వసంత్‌రావు దేశ్‌పాండే కేసు వాదిస్తుండగా, తీవ్ర ఆగ్రహానికి గురైన బాలకృష్ణ న్యాయవాదిని చొక్కా పట్టుకుని బయటకు లాక్కొచ్చి దాడి చేశాడు. * * కరీంనగర్(పెద్దపల్లి) : కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో చేరాలనుకునే విద్యార్థుల కోసం రెండో విడత కౌన్సెలింగ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు పెద్దపల్లి ఐటీఐ ప్రిన్సిపాల్‌ సురేందర్‌ తెలిపారు. 11 నుంచి 20 తేదీల్లో అభ్యర్థులు దరఖాస్తులు అందజేయాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో దరఖాస్తు ఫారాలు లభిస్తాయన్నారు. అభ్యర్థులకు ఈ నెల 24, 28, 30 తేదీల్లో కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు. * * గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరులు, బంధువుల నివాసాల్లో రెండో రోజు కొనసాగుతున్న పోలీసుల సోదాలు * * నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఈ నేపథ్యంలో నేటి మధ్యాహ్నాం 2.00 గంటలకు అరకులోని ఎన్టీఆర్ గ్రౌండ్స్లో ఆదివాసీ దినోత్సవం జరగనుంది.ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి రావెల కిషోర్ బాబు పాల్గొనున్నారు. * * మెదక్: మెదక్ జిల్లా ఆంధోల్ మండలం కిచ్చన్నపల్లి వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. క్రూజర్ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వాసుపత్రిలో ప్రాధమిక చికిత్స తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. * * నల్గొండ: చిట్యాల మండలo వేలిమినేడు గ్రామ శివార్లో గుర్తు తెలియని మహిళ మ్రుతదేహము లభ్యమైంది. ఈ మహిళ చనిపోయి 2 రోజులు అయి ఉండవచ్చని ఎస్.ఐ. శివకుమార్ అనుమానము వ్యక్తము చేశారు. * * కరీంనగర్(పెద్దపల్లి): కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామంలోని VRO గౌస్ పాషా అక్కడి రైతు నుండి 20 వేలు లంచం తీసుకుంటుండగా ACB కి పట్టుబడ్డాడు. * * హైదరాబాద్ : జీవో 123పై సోమవారం హైకోర్టు డివిజన్ బెంచ్లో విచారణ జరిగింది. భూ నిర్వాసితులు, రైతు కూలీల రక్షణ కోసం తీసుకునే చర్యలను తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ ద్వారా కోర్టుకు సమర్పించింది. నిబంధనల ప్రకారమే నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తున్నామని... వ్యవసాయ కూలీలను ఆదుకుంటామని అడ్వకేట్ జనరల్ (ఏజీ) ఆ అఫిడవిట్లో విన్నవించారు. * * ఇస్లామాబాద్ లో జరిగిన సార్క్ హోంమంత్రుల సదస్సుకు భారత జర్నలిస్టులను అనుమతించని పాకిస్తాన్ వారిని కనీసం ప్రవేశ ద్వారం వద్ద కూడా ఉండనివ్వలేదని వెల్లడైంది. సార్క్ దేశాల ప్రముఖులను పాక్ హోంమంత్రి నిసార్ ప్రవేశ ద్వారం వద్ద ఆహ్వానిస్తున్నపుడు భారత జర్నలిస్టులు అక్కడే ఉన్నారు. భారత హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ రాగానే పాక్ జర్నలిస్టులు ఫోటోలు తీసేందుకు సన్నద్ధమవుతుండగా వీరూ వెళ్లారు. అయితే అక్కడ నుండి వెళ్లిపోవాలని, గేటు బయట నిలబడేందుకూ కూడా భారత్ జర్నలిస్టులకు అనుమతి లేదని పాక్ అధికారులు తేల్చి చెప్పారు. * * నేడు ఆగష్టు 6న తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జయంతి * * ఇవాళ ఇస్రో, తెలంగాణ ఇరిగేషన్ శాఖ మధ్య ఎంవోయూ అత్యాధునిక టెక్నాలజీతో తెలంగాణ జలవనరుల సమాచార వ్యవస్థ జలాశయాల్లో నీటి నిల్వలను ఉపగ్రహంతో విశ్లేషించనున్న తెలంగాణ * * శంషాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో శనివారం ఉన్నతాధికారులు హైఅలెర్ట్ ప్రకటించారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకులు నేపథ్యంలో నిఘా వర్గాలు ఎయిర్ పోర్టు అధికారులను అప్రమత్తం చేశారు. * * పెబ్బేరు(మహబూబ్‌నగర్): రైతులు పెట్టిన విషం గుళికలు తిని దాదాపు 40 జింకలు చనిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొందరు రైతులు కృష్ణా నదిలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. పంటను పురుగుల బారి నుంచి రక్షించుకునేందుకు మొదళ్ల వద్ద శుక్రవారం రాత్రి విషం గుళికలను చల్లారు. సమీపంలోని అటవీప్రాంతం నుంచి వచ్చిన జింకలు గడ్డి మేసుకుంటూ వచ్చి గడ్డితోపాటు గుళికలను కూడా తినేశాయి. దీంతో అ విష ప్రభావానికి లోనై దాదాపు నలబై జింకలు చనిపోయాయి. * * వాయువ్య బంగాళఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఉ.ఒడిశా, ప.బెంగాల్, జార్ఖండ్ తీరాలను ఆనుకుని అల్పపీడనం అల్పపీడన ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఒడిశా, కోస్తాంధ్ర మీదుగా ద.తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కోస్తా తీరం వెంబడి గంటకు 45-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక: వాతావరణ కేంద్రం * * మ్మం: ఛత్తీస్‌గఢ్ దంతేవాడ జిల్లాలో శుక్రవారం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. దంతేవాడ - బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన సర్సఫాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఆ విషయాన్ని పసిగట్టిన మావోయిస్టులు... పోలీసులపై కాల్పులకు దిగారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులకు దిగారు. * * ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లెందులోని ఓపెన్‌కాస్టు సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇల్లెందు పట్టణంలోని ప్రధాన రహదారిపై అధిక వేగంతో వెళ్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ లారీ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోగా మరో లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. * * కరీంనగర్ : ఎస్సీ వర్గీకరణ బిల్లు వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అందులోభాగంగా శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైల్వేస్టేషన్లో వారు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్లో ఆగి ఉన్న సింగరేణి ప్యాసింజర్ రైలును వారు నిలిపివేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో భారీగా ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. * * హైదరాబాద్: ఈ నెల 8 నుంచి తెలంగాణలోని 11 విశ్వవిద్యాలయాల్లో నిరవధికంగా బంద్ పాటించనున్నట్లు తెలంగాణ వర్సిటీ నాన్ టీచింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కంచి మనోహర్, సెక్రెటరీ జనరల్ మహిపాల్ రెడ్డి బుధవారం పేర్కొన్నారు. రాష్ట్ర్రంలో అతిపెద్దదై ఉస్మానియాతో పాటు ఇతర వర్సిటీల్లో ప్రతి నెల 1న వేతనాలు, ఫించన్లు రావడం లేదన్నారు. సీమాంధ్రుల పాలనలో కూడా వేతనాలకు ఇలాంటి దుస్థితి ఎన్నడూ ఏర్పడలేదన్నారు. * * హైదరాబాద్: ప్రత్యేక హైకోర్టు ఉద్యమంలో పాల్గొన్న న్యాయవాదులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు నోటీసులివ్వడానికి నిరసనగా గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయాలని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నిర్ణయించింది. జేఏసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి నేతృత్వంలో న్యాయవాదులు బుధవారం సమావేశమయ్యారు. * * వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 48 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు... అలాగే తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. * * కరీంనగర్: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కాన్వాయ్‌కి బుధవారం తృటిలో ప్రమాదం తప్పింది. కాన్వాయ్‌లోని ఓ వాహన డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేయడంతో వెనకున్న టీఆర్‌ఎస్ నాయకుల వాహనాలు ఒకదానివెంట మరొకటి వరసగా ఢీకొన్నాయి. దీంతో సదరు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి ఈటల రాజేందర్ బుధవారం మెట్‌పల్లి వచ్చారు. * * కరీంనగర్(ముకరంపుర): జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ప్రభుత్వ నిర్ణయం ఊరటనిచ్చింది. పదేళ్లుగా కీలకంగా పనిచేస్తున్న ఫీల్డ్‌అసిస్టెంట్లను రెగ్యులరైజ్‌ చేయాలని, వేతనాలు పెంచాలన్న డిమాండ్‌తో చేపట్టిన ఆందోళనలకు సర్కార్‌ ఎట్టకేలకు దిగివచ్చింది. ప్రస్తుతం నెలవారీగా ఇస్తున్న వేతనం రూ.6240నుంచి రూ.10 వేలకు పెంచింది. * * మణుగూరు :ఖమ్మం జిల్లా మణుగూరు సమీపంలో మంగళవారం స్కూలు బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. విప్పల సింగారం నుంచి జీఎం ఆఫీసు రోడ్డులో వస్తున్న హోలీ ఫ్యామిలీ స్కూల్ బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోయి... అదుపుతప్పి బస్సు కాల్వలోకి దూసుకెళ్ల్లింది. అందులోని ఐదుగురు విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. * * చండీగఢ్: వాళ్లంతా దివ్యాంగులు. కొందరికి చూపులేదు, ఇంకొందరు బుద్ధిమాంద్యులు.. అందరూ చిన్నపిల్లలే. అంతసేపు హాయిగా ఆడుకున్నవాళ్లుకాస్తా మధ్యాహ్నం భోజనం తిన్నతర్వాత వాంతులు చేసుకోవడం మొదలుపెట్టారు. నిమిషాల్లోనే పరిస్థితి చేయిదాటిపోయింది. పిల్లలు ఒకొక్కరిగా రాలిపోయారు. పంజాబ్ లోని కపుర్తలా జిల్లా కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం కనిపించిన దృశ్యాలివి. * * పురవి: వరంగల్‌ జిల్లా పురవి మండల కేంద్రంలో ఉన్న ఆంధ్రాబ్యాంకులో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. రాత్రి సమయంలో బ్యాంకు తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దుండగులు కౌంటర్‌ గదిలో సీసీ కెమెరాలను కత్తిరించారు. సోమవారం ఉదయం సిబ్బంది బ్యాంకును తెరవడంతో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పురవి సీఐ శ్రీనివాస్‌, ఎస్సై రామకృష్ణ అక్కడకు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. * * నేడు ఎంసెట్-3 షెడ్యూల్ విడుదల చేసే అవకాశం జేఎన్టీయూ వీసీ లేదా రిజిస్ట్రార్కు కన్వీనర్ బాధ్యతలు ఎంసెట్-2 విద్యార్థులకు పాత రిజిస్ట్రేషన్ పై కొత్త హాల్టికెట్లు * * ఇవాళ ప్రారంభంకానున్న రూపాయికే నల్లా కనెక్షన్ పథకం గ్రేటర్ హైదరాబాద్లో పేదలకు రూపాయికే వాటర్ కనెక్షన్ * * వరంగల్: వరంగల్ జిల్లా ధర్మాసాగర్ జలాశయంలో ఆదివారం గల్లంతైన కానిస్టేబుల్ పొలిమారి సృజన్(25)మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు. ఆదివారం మిత్రులతో కలిసి ఈతకు వెళ్లిన సృజన్ ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. * * మహారాష్ట్ర: పుణెలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిపోవడంతో తొమ్మిది మంది కార్మికులు మృతిచెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు యత్నిస్తున్నారు. * * వరంగల్ : వరంగల్ నగరంలోని ఆర్టీఏ జంక్షన్లో బస్సు... ముందు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను నగరంలోని ఆసుపత్రికి తరలించారు. * * హైదరాబాద్ : ఎంసెట్ - 2 పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ... మంత్రులు కడియం, లక్ష్మారెడ్డి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. శుక్రవారం మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి విద్యార్థి సంఘాలు యత్నించాయి. ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. * * న్యూఢిల్లీ: పార్లమెంటులో ఓ కోతి హల్ చల్ చేసింది. అరగంటపాటు అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది. దాన్ని బందించేందుకు ప్రయత్నం చేసిన చివరకు వారికి దొరకకుండా దానంతట అదే దర్జాగా ప్రధాన ద్వారం గుండా బయటకు వెళ్లింది. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం ఎంపీలు, జర్నలిస్టులు చదువుకునేందుకు ఏర్పాటుచేసిన పార్లమెంటు రీడింగ్ హాల్ లోకి ఓ కోతి ప్రవేశించింది. * * కరీంనగర్‌: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో ఏఈకికు రెండేళ్ల జైలుశిక్ష, రూ.పదివేల జరిమానా విధిస్తూ బుధవారం ఏసీబీ కోర్టు తీర్పు వెలువరిచింది. 2008లో గంగాధరలో విద్యుత్‌ శాఖ ఏఈగా పనిచేస్తున్న బండారు అజయ్‌కుమార్‌ గంగాధరకు చెందిన అంకం శంకరయ్య అనే పవర్‌లూం కార్మికుడికి విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు అదే ఏడాది జనవరి 18న రూ.6వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. * * వరంగల్ : వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా కేసముద్రం మండలం రాజీవ్ నగర్ తండా సమీపంలో గురువారం చోటుచేసుకుంది. తండా నుంచి కేసముద్రం వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో.. కారు నడుపుతున్న రమేష్ పండిట్ రాథోడ్ (42) అక్కడికక్కడే మృతి చెందాడు. * * హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన కేసు విచారణను డివిజన్ బెంచ్ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. హైకోర్టు విభజనపై తెలంగాణ ప్రభుత్వ రివ్యూ పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది. హైదరాబాద్లోనే రెండు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయాలని టీ.సర్కార్ తన పిటిషన్లో కోరింది. గత తీర్పును పునసమీక్షించాలన్న పిటిషన్పై తీర్పును ఉమ్మడి హైకోర్టు రిజర్వ్లో ఉంచిన విషయం తెలిసిందే. దాంతో కేసును విచారించిన డివిజన్ బెంచ్.. తాను తీర్పును ప్రకటించలేనని, విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు ప్రకటన * * నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం కోమలంచ గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భూమా రమేశ్ (35) అనే రైతు కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. పొలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు ఫ్యూజు అమరుస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గ్రామస్తుల సహాయంతో అతడి మృతదేహాన్ని ఇంటికి తరలించారు. * * కరీంనగర్: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం జిల్లెల క్రాసింగ్ వద్ద ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిమ్మాపూర్ మండలానికి చెందిన మహ్మద్ రిజ్వాన్ (32) అక్కడికక్కడే మృతిచెందగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడ్ని సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. * * తిమ్మాపూర్‌ : రవాణాశాఖకు సంబంధించిన ఆన్‌లైన్‌ సేవలపై మీ సేవా కేంద్రాలు, ఈ సేవా కేంద్రాల నిర్వాహకులు, ఉద్యోగులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు కరీంనగర్‌ డీటీసీ వినోద్‌కుమార్‌ తెలిపారు. రోజుకు మూడు బ్యాచ్‌ల చొప్పున జిల్లాలోని నిర్వాహకులకు బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఆన్‌లైన్‌ సేవలకు దరఖాస్తు చేసుకునే వి«ధానం నేర్చుకునేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. * * హైదరాబాద్ : హెచ్ఎండీఏ పనులపై ఉన్నతాధికారులతో నేడు కేటీఆర్ భేటీ. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, సుందరీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష * * హైదరాబాద్ : నేడు, రేపు ఏఎఫ్ఆర్సీ భేటీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరహాలో వైద్య ఫీజుల పెంపుపై చర్చ * * కీసర : రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాలలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కమాన్ వద్ద పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోలో తరలిస్తున్న 9 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోతోపాటు ఎస్కార్ట్గా బైకుపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. * * నారాయణపేట: అన్నం పెట్టే రైతులపై దాడి చేసిన ఏ ప్రభుత్వం నిలబడలేదని, మల్లన్న సాగర్ నిర్వాసితులపై లాఠీచార్జి జరిపించిన కేసీఆర్ ప్రభుత్వానికి పోయేకాలం దాపురించిందని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం అప్పంపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. * * మెదక్‌: మల్లన్నసాగర్‌ నిర్వాసితులపై ఆదివారం జరిగిన పోలీసుల లాఠీచార్జీకి నిరసనగా అఖిలపక్షం ఈరోజు మెదక్‌ జిల్లా బంద్‌ చేపట్టింది. ఉదయాన్నే కాంగ్రెస్‌, తెదేపా, భాజపా, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన నేతలు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై నేతలు మండిపడ్డారు. జనజీవనంపై బంద్‌ ప్రభావం పాక్షికంగా ఉంది. చాలా చోట్ల ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. బంద్‌ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. * * హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో జాతీయ రహదారిపై ఏబీవీపీ రాస్తారోకో చేపట్టింది. ఎన్నికల సందర్భంగా తెరాస ఇచ్చిన కేజీ టు పీజీ ఉచిత విద్య హామీని వెంటనే నెరవేర్చాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళనతో జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. * * లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రైలుప్రమాదం సంభవించింది. భదోహిలో కాపలా లేని రైల్వేగేట్‌ వద్ద ఈరోజు ఉదయం పట్టాలు దాటుతున్న స్కూల్‌ బస్సును రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 19 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. * * విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఛత్తీస్గఢ్ నుంచి తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయిని చెప్పింది. తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. * * ఇబ్రహీంపట్నం: కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్‌లోని ఆలయంలో చోరీ జరిగింది. స్థానిక పెద్దమ్మ ఆలయంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి అమ్మవారి నగలను అపహరించుకు పోయారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. నాలుగు తులాల బంగారు ఆభరణాలతో పాటు వెండి సామాగ్రి చోరీకి గురైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. * * తాండూరు : రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా తాండూరు - వికారాబాద్‌ల మధ్యలో ఉన్న కందమెల్లి వాగు పొంగిపొర్లుతుంది. దాంతో తాండూరు - హైదరాబాద్‌ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గురువారం అర్ధరాత్రి నుంచి వాగు పొంగిపొర్లుతుంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. * * నల్లగొండ: స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఆటో ఢీకొన్ని చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కేతెబోయిన కావ్య (3) ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో కావ్య తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. * * కరీంనగర్‌ క్రైం: బెజ్జంకి ఏఎస్సై వహిద్‌ పాషాపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ ఎస్పీ జోయల్‌డేవిస్‌ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని పేర్కొంటూ బెజ్జంకి పీఎస్‌లో పనిచేస్తున్న ఓ మహిళ హోంగార్డ్‌ ఫిర్యాదుచేసింది. ఈమేరకు విచారించిన ఎస్పీ వాహిద్‌ పాషాను సస్పెండ్‌చేశారు. * * కరీంనగర్‌ జిల్లా మద్యం డిపో పరిధిలో ఉన్న 41 మద్యం దుకాణాలు, 5 బార్లను మెదక్‌ జిల్లా సిద్దిపేటలో కొత్తగా ప్రారంభంకానున్న మద్యం డిపోకు బదిలీచేస్తూ బుధవారం రాత్రి ఎకైసజ్‌శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గంభీరావుపేట మండలం పరిధిలోని 9 దుకాణాలు, సిరిసిల్ల ఎకై ్సజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని 15 మద్యం దుకాణాలు, 3 బార్లు, వేములవాడ ఎకై ్సజ్‌ ఠాణా పరిధిలోని 17 మద్యం దుకాణాలు, 2 బార్లను బదిలీ చేశారు. ఆగస్టు 1 నుంచి వీటికి సిద్దిపేట డిపో నుంచి మద్యం సరఫరా చేస్తారు. ఈ మేరకు జగిత్యాల ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌క * * జమ్ము: అమర్నాథ్ యాత్రకు వెళుతున్న యాత్రికులకు కష్టాలు కొనసాగుతునే ఉన్నాయి. జమ్మూకశ్మీర్ లో అశాంతికర పరిస్థితుల నేపథ్యంలో మరోసారి యాత్రికులను అధికారులు అడుగు కూడా వేయనివ్వడం లేదు. * * సిరిసిల్ల: సిరిసిల్ల మండలం సర్ధాపూర్‌ శివారులో 7వ పోలీస్‌ బెటాలియన్‌ ఏర్పాటుకు 120 ఎకరాల భూమిని కేటాయించారు. ఈమేరకు సిరిసిల్ల ఆర్డీవో ఆఫీస్‌లో సోమవారం డివిజన్‌ సర్వేయర్‌ శ్రీనివాస్‌తో సంబంధించిన హద్దులను నిర్ధారించారు. ఇప్పటికే పోలీస్‌ బెటాలియన్‌ కోసం 120 ఎకరాల స్థలాన్ని శాటిలైట్‌ ద్వారా సర్వే నిర్వహించి కేటాయించారు. క్షేత్రస్థాయిలో భూమి కేటాయింపులను కలెక్టర్‌ నీతుప్రసాద్‌ పరిశీలించారు. * * పార్లమెంట్లో మోదీ, రాజ్‌నాథ్, జైట్లీతో విడివిడిగా భేటీకానున్న కేసీఆర్ * * ఢిల్లీ: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు పార్లమెంటు ముందుకు రానున్న 16 బిల్లులు వచ్చే నెల 12 వరకు జరగనున్న వర్షాకాల సమావేశాలు * * వరంగల్: బైక్ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలోని నార్లాపూర్ వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. మేడారానికి చెందిన సిద్ధబోయిన ఆనందరావు (35) బైక్ పై వెళ్తుండగా.. నార్లాపూర్ వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆనందరావు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. * * కరీంనగర్: ఆలయంలోకి చొరబడిన దుండగులు స్వామివారి విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేటలో శనివారం వెలుగు చూసింది. గ్రామ శివారులోని సీతారామ ఆలయంలో ఉన్న స్వామివారి విగ్రహాన్ని గత రాత్రి కొందరు దుండగులు ధ్వంసం చేశారు. శనివారం ఉదయం ఆ విషయాన్ని గమనించిన స్థానికులు 63వ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. * * తిమ్మాపూర్ (కరీంనగర్) : పురుగులమందు తాగి భార్యాభర్తలు మృతిచెందిన సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గురువారం చోటుచేసుకుంది. కాల్వ శ్రీరాంపుర్ మండలానికి చెందిన ప్రభాకర్(37), తేజస్వి(34) దంపతులు కరీంనగర్‌లోని మారుతీనగర్‌లో నివాసముంటూ.. బంగారం పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో గురువారం తిమ్మాపూర్‌కు వెళ్లిన దంపతులు ఆలయ సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. * * హైదరాబాద్: వీధి కుక్కల దాడిలో నలుగురు చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన హైదరాబాద్ లోని ఎల్బీనగర్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న చిన్నారుల పై వీధికుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు కాగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు కుక్కలను తరిమికొట్టి చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. * * కరీంనగర్ జిల్లా జమ్మికుంట్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తి ధర క్వింటాలుకు రిఆకర్డుస్థాయిలో రూ.6,470 పలికింది. దాంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంట దిగుబడి తగ్గినందువల్ల ధర పెరిగిందని రైతులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం ఈ ధర పలికిందని వారంటున్నారు. * * హైదరాబాద్: ప్రైవేటు విద్యాసంస్థల దోపడీ విధానాన్ని వ్యతిరేకిస్తూ గురువారం తెలంగాణ విద్యాసంస్థల బంద్‌ కొనసాగుతుంది. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్‌ కొనసాగతుంది. ఈ సందర్భంగా విద్యా రంగంలో ప్రైవేటు విద్య నానాటికీ పెరిగిపోతోందని, అది సామాన్యుడికి అందుబాటులో లేదని సంఘాలు ఆరోపించాయి. విద్యారంగంలో ప్రభుత్వ ప్రాధాన్యాన్ని బలోపేతం చేయాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీ అమలు చేయాలని డిమాండ్‌ చేశాయి. * * హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కెన్యాకు చెందిన దంపతుల నుంచి కేజీన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా దుబాయి నుంచి ఈ రోజు ఉదయం హైదరాబాద్ వచ్చిన వీరి వద్ద బంగారం ఉండటాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అయితే వారి వద్ద బంగారానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో దంపతులను అదుపులోకి తీసకుని, బంగారాన్ని సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం.12 లో గురువారం ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంటిని నిర్మించేందుకు రాళ్లను బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * * హైదరాబాద్: హైదరాబాద్ కూకట్ పల్లిలో తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆకస్మిక పర్యటన నిర్వహించారు. రోడ్లు, నీటి సరఫరా, బస్టాండ్ తదితర ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. రాత్రి 11 గంటలనుంచి 2:30 గంటల వరకు కేటీఆర్ తనిఖీలు కొనసాగాయి. ఈ సందర్భంగా రోడ్లపై వాననీరు నిల్వ ఉండటం పట్ల జీహెచ్ఎంసీ సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి రమ‍్య మృతికి కారణమైన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు. * * భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కాస్త తగ్గింది. నీటిమట్టం బుధవారం ఉదయం 49.5 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. మంగళవారం సాయంత్రం నీటిమట్టం 52.4 అడుగులకు చేరిన విషయం తెలిసిందే. రాత్రికి రాత్రి నీటి మట్టం తగ్గడంతో అధికారులు, ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. * * కేంద్ర ప్రభుత్వ నైపుణ్యం, మెలకువల శిక్షణలో భాగంగా నిరుద్యోగ దళిత యువతకు అడ్వాన్స్‌ కంప్యూటర్‌ హర్డ్‌వేర్‌, కోర్‌ నెట్‌వర్కింగ్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఎంసీపీ ఎడ్యూకేషన్‌ సోసైటీ డైరెక్టర్‌ ఎంఆర్‌ చెన్నప్ప తెలిపారు. డిప్లొమా లేదా బిటెక్‌, పీజీ పూర్తి చేసి, 18 నుంచి 45 లోపు వయసున్నవారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు లక్డికాపూల్‌లోని జెన్‌ వొకేషనల్‌ కాలేజీలో ఈ నెల 14న నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు. * * చండీగఢ్‌: ప్రొ కబడ్డీని ఆస్వాదిస్తున్న అభిమానులను అలరించేందుకు మరో మెగా ఈవెంట్‌ రాబోతోంది. నవంబర్‌ 3న చండీగఢ్‌ వేదికగా ప్రపంచకప్‌ కబడ్డీ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలు 3 నుంచి 17 వరకు జరుగుతాయి. చండీగఢ్‌లోని 14 వేదికల్లో ఈ పోటీలు నిర్వహిస్తామని పంజాబ్‌ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ చెప్పారు. 14 దేశాలు పోటీపడే ఈ ప్రపంచకప్‌లో పురుషులు, మహిళలు విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. పురుషుల విభాగంలో విజేతగా నిలిచిన జట్టుకు రూ.2 కోట్లు, రన్నరప్‌కు రూ.కోటి నగదు బహుమతిగా ఇస్తారు. మహిళల్లో * * కరీంనగర్ : జిల్లావ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. మహదేవ్‌పూర్ మండలంలో పెద్దంపేట, సర్వాయిపేట, వంకెన వాగులు పొంగిపొర్లుతుండడంతో 17 గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ధర్మపురి వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. సింగరేణి రామగుండం రీజియన్‌లో నాలుగు ఓపెన్ కాస్ట్ బొగ్గుపనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. * * హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు మంగళవారం ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి కోల్కతా వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కోల్కతా వెళ్లే 120మంది ప్రయాణికులు ఉదయం అయిదు గంటల నుంచి పడిగాపులు పడుతున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా విమానాల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులు గంటల కొద్ది విమానాశ్రయంలో తిప్పలు పడాల్సి వస్తున్న విషయం తెలిసిందే. * * హైదరాబాద్ : హైదరాబాద్లోని నాగ్పూర్ జాతీయ రహదారిపరై ఆర్టీఏ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఏడు ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేశారు. అలాగే సరైన పత్రాలు లేని రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. * * హైదరాబాద్ : నగరంలోని గోల్కొండ సక్కుబాయినగర్ ప్రాంతంలో మంగళవారం మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సదరు మహిళను దుండగులు అత్యాచారం చేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పరిసర ప్రాంతాల్లోని స్థానికులను పోలీసులు విచారిస్తున్నారు. * * హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం ఓ విమానాన్ని ఎయిర్ పోర్ట్ అధికారులు అత్యవసరంగా ల్యాండ్ చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి సౌదీ అరేబియా బయల్దేరిన విమానంలో ఓ ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఆ ప్రయాణికుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. * * హైదరాబాద్ సిటీ : డీసీఎం వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 22.45 క్వింటాళ్ల గంజాయిని హయాత్‌నగర్ పోలీసులు సోమవారం ఉదయం పట్టుకున్నారు. ఈ సంధర్భంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి నగరానికి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ముందస్తు సమాచారంతో హయాత్‌నగర్ పోలీసులు అబ్దుల్లామెట్ వద్ద కాపు కాశారు. గంజాయి లోడుతో వచ్చిన డీసీఎం వ్యానును ఆపి అందులోని 22.45 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంధర్భంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. * * సికింద్రాబాద్ : నగరంలోని తుకారంగేటు పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్తీలో సోమవారం ఉదయం చిన్న గొడవ జరగడంతో ఆగ్రహించిన మల్లేష్ అనే వ్యక్తి చంద్రకళ అనే మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ప్రయత్నించి మంటలను ఆర్పారు. అప్పటికే ఆమె శరీరం చాలావరకూ కాలిపోయింది. వెంటనే ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మల్లేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. చంద్రకళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. * * కరాచి: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ సిరీస్ నిర్వహణకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ మేరకు ఇరు క్రికెట్ బోర్డుల మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. ఎడిన్‌బర్గ్‌లో ఐసీసీ సభ్య దేశాల సమావేశం సందర్భంగా పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్, బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ముఖాముఖి సిరీస్ గురించి చర్చించినట్లు తెలిసింది. రెండు దేశాల ప్రభుత్వాల అనుమతి లభిస్తే ఈ సీజన్‌లోనే తటస్థ వేదికల్లో సిరీస్ నిర్వహించాలని బోర్డు పెద్దలు యోచిస్తున్నారు. * * హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా పి.సర్దార్‌సింగ్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మెదక్‌జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన ఈయన గతంలో మహారాష్ట్రలోని మహాత్మగాంధీ అంతరాష్ట్రీయ విశ్వవిద్యాలయంలో ఫైనాన్స్‌ ఆఫీసర్‌గా, జాయింట్‌ రిజిస్ట్రార్‌, డిప్యూటీ రిజిస్ట్రార్‌గా పనిచేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఇందిర కళా సంగీత విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌గా సేవలందించారు. * * దామరచర్ల: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం ఇర్కిగూడెం వద్ద కృష్ణాతీరంలో పార్వతీదేవి ఆలయ నిర్మాణానికి గాను తవ్వకాలు నిర్వహిస్తుండగా పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది. కృష్ణానదీ తీరంలో పార్వతీదేవి ఆలయ నిర్మాణానికి తెలంగాణ సర్కార్ రూ. 5లక్షలు మంజూరు చేసింది. దాంతో ఈ రోజు ఉదయం నిర్మాణ పనులు ప్రారంభించారు. * * నల్లగొండ: నల్లగొండ జిల్లాలో శుక్రవారం రాత్రి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఓ వ్యక్తి నుంచి రూ.6.30 లక్షలను దొంగలు దోచుకెళ్లిన ఘటన వేములపల్లి మండలం అన్నపురెడ్డిగూడెంలో చోటుచేసుకుంది. స్థానిక పెట్రోల్ బంక్లో క్యాషియర్గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి శుక్రవారం రాత్రి క్యాష్ తీసుకుని ఇంటికెళ్తుండగా దొంగలు దాడికి పాల్పడ్డారు. వెంకటేశ్వర్లును తీవ్రంగా గాయపరచిన దొంగలు అతని వద్ద ఉన్న రూ.6.30 లక్షలను తీసుకుని ఉడాయించారు. దీంతో బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు * * కరీంనగర్ : నేదునూరులో జెన్కో పవర్ప్లాంట్ పనులు వెంటనే చేపట్టి నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. లేకుంటే భూములును తిరిగి రైతులకు అప్పగించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. గురువారం కోదండరామ్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరులో జెన్కో పవర్ ప్లాంట్ కోసం సేకరించిన భూములను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక రైతులతో కోదండరామ్ సమావేశమయ్యారు. * * మేడ్చల్: ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ.. ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మేడ్చల్ చెక్‌పోస్ట్ వద్ద శుక్రవారం జరిగింది. చెక్‌పోస్ట్ వద్ద ఉన్న సెల్‌టవర్ ఎక్కిన యువకుడు తన ప్రియురాలితో పెళ్లి జరిపించాలని లేకపోతే ఇక్కడి నుంచి దూకేస్తానని బెదిరిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతన్ని కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. * * హైదరాబాద్: జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ స్ప్రింట్స్‌లో తెలంగాణ కుర్రాడు అబ్దుల్ నజీబ్ ఖురేషీ మెరిశాడు. గురువారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన 100 మీటర్ల పరుగులో నజీబ్ రజత పతకం గెలుచుకున్నాడు. 10.63 సెకన్లతో అతను రెండో స్థానంలో నిలిచాడు. షమీర్ మోన్ (మణిపూర్-10.60 సె.) స్వర్ణ పతకం సాధించగా, అనిరుధ గుంజాయ్ (మహారాష్ట్ర-10.66 సె.)కు కాంస్యం దక్కింది. * * హైదరాబాద్ : తెలంగాణ అడ్వకేట్ల మహాధర్నా ఇందిరాపార్క్ వద్ద శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఈ మహాధర్నాలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా అడ్వకేట్లు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అయితే ఈ ధర్నాలో పాల్గొనేందుకు వెయ్యి మంది అడ్వకేట్లకు మాత్రమే అనుమతి ఉందని పోలీసులు తెలిపారు. ఈ మహాధర్నా నేటి సాయంత్రం 4.30 గంటలకు ముగియనుంది. * * రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండల పరిధిలోని జవహర్‌నగర్‌ సీఆర్‌పీఎఫ్‌ గ్రూప్‌ సెంటర్‌లో జులై 1వ తేదీ నుంచి నిర్వహించనున్న మినిస్టీరియల్‌ హెడ్‌కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 27 వేల మంది హాజరవుతారు. జవహర్‌నగర్‌ గ్రూప్‌ సెంటర్‌కు వచ్చే అభ్యర్థులకు ప్రత్యేకంగా బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు సీఆర్‌పీఎఫ్‌ డీఐజీపీ జి.వి.ఎన్‌.గిరిప్రసాద్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ 10వ నంబర * * హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగుల విభజనపై ఏర్పాటుచేసిన కమల్నాథన్ కమిటీ గురువారం మరోసారి సమావేశమైంది. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ఉద్యోగుల విభజన అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది. * * ఖమ్మం: ఎగువ నుంచి వస్తున్న వరదతో ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 9 అడుగులకు చేరుకుంది. అశ్వారావుపేట వద్ద పెద్దవాగు ప్రాజెక్టు నిండింది. దీంతో రెండు గేట్లు ఎత్తి 14,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే, అశ్వాపురం మండలంలో విడువని వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కిన్నెరసాని ప్రాజెక్టు కూడా జలకళను సంతరించుకుంది. కొత్తగూడెం, మణుగూరు, సత్తుపల్లిల్లోని ఓపెన్‌కాస్ట్ గనుల్లో వర్షం కారణంగా ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. * * హైదరాబాద్‌: నగరంలోని హుమాయన్‌నగర్‌లో విషాదం నెలకొంది. ఐదేళ్ల చిన్నారి ఆడుకుంటూ విద్యుత్‌ తీగ తగిలి మృతి చెందింది. శ్రీకాకుళంకు చెందిన హరిత భర్త చనిపోవడంతో కుమార్తె తనుజతో పాటు నగరానికి వచ్చి హుమాయన్‌ నగర్‌లో ఉంటోంది. తనుజ తల్లితో వెళ్తుండగా తెగిపడిన విద్యుత్‌ తీగ తగిలి అక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు బాలికను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. * * నల్లగొండ: ఎగువ నుంచి వస్తున్న మూసీ వరదతో నల్లగొండ జిల్లా భువనగిరి-పోచంపల్లి మధ్య మంగళవారం ఉదయం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఆ మార్గంలో ఉన్న బీబీనగర్ మండలం బట్టుగూడెం వంతెనపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. * * హైదరాబాద్: ఏఐసీసీ పరిశీలకుడు శ్రీనివాసన్ నేతృత్వంలో గాంధీభవన్లో కాంగ్రెస్ వర్క్షాప్ సోమవారం ప్రారంభమైంది. ఈ వర్క్షాప్లో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, నేతల వలసలను అడ్డుకోవడంతో పాటు ప్రచార కార్యక్రమాలపై నేతలు ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ముఖ్యనేతలు హాజరయ్యారు. * * బూర్గంపాడు: అప్పుల బాధ తాళలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గాదె సైదిరెడ్డి(41) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత రెండేళ్లుగా పంట దిగుబడి సరిగ్గా లేకపోవడంతో.. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోయాయి. అప్పులు తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. * * మిర్యాలగూడ: ముందు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వస్తున్న క్రేన్ ఢీకొట్టిన ఘటనలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం జస్తి వీరప్పగూడెం పరిధిలోని భల్లునాయక్‌తాండాలో సోమవారం చోటుచేసుకుంది. తాండా నుంచి మిర్యాలగూడ వెళ్తున్న ఆటోను బావులు తీయడానికి ఉపయోగించే క్రేన్ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న 8 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు 108 సాయంతో వారిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. * * రామడుగు: ఆర్టీసీ బస్సు చార్జీలు, విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ శనివారం కాంగ్రెస్‌ నాయకులు రామడుగులో ధర్నా నిర్వహించారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు అంజనేయులు గౌడ్‌, శంకర్‌, శ్రీనివాసగౌడ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు. * * జగిత్యాల(కరీంనగర్) : పలు దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉంటూ తప్పించుకు తిరుగుతున్న ఓ పాత నేరస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 20 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ. 2వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజేంద్రప్రసాద్ వివరాలు వెల్లడించారు. * * హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీ పీసీసీ శనివారం నిరసన కార్యక్రమాలకు దిగింది. అందులో భాగంగా హైదరాబాద్ విద్యుత్ సౌధ కార్యాలయాన్ని కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. రోడ్డుపై బైఠాయించి, పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పాడడంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, శ్రీశైలం గౌడ్, ఇతర నేత * * యాదాద్రి జిల్లా: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవాలయం పేరుతో యాదాద్రి జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగా భువనగిరి జిల్లా కేంద్రంగా యాదాద్రిని పేరుతో జిల్లా ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. * * యాదాద్రి జిల్లా: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవాలయం పేరుతో యాదాద్రి జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగా భువనగిరి జిల్లా కేంద్రంగా యాదాద్రిని పేరుతో జిల్లా ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. * * కరీంనగర్‌ విద్యా విభాగం : జిల్లాలో జరుగుతున్న ఎస్సెస్సీ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షల్లో భాగంగా గురువారం జరిగిన సామాన్యశాస్త్రం పేపర్‌-1లో మాల్‌ప్రాక్టీసుకు పాల్పడుతున్న ముగ్గురు విద్యార్థులను డిబార్‌ చేశారు. మొత్తం 42 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఈపరీక్షకు మొత్తం 3962 మంది హాజరుకావాల్సి ఉండగా, 3379 మంది హజరైనట్లు డీఈవో శ్రీనివాస చారి తెలిపారు. * * హైదరాబాద్ : ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దందాను అరికట్టాలంటూ వివిధ విద్యార్థి సంఘాల వారు గురువారం ఆందోళనలు చేపట్టారు. బోడుప్పల్‌లోని భాష్యం స్కూల్‌తోపాటు శంషాబాద్‌లోని ఎస్సార్ డీజీ స్కూల్ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ సంఘాల ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందిపెట్టేలా ఉన్న ఫీజుల మోతను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. * * హైదరాబాద్ : రంగారెడ్డి మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలో ఉన్న అనాథ బాలల ఆశ్రమం కృషిహోంలో ఉండే ఇద్దరు బాలురు కనిపించకుండాపోయారు. అనాథ గృహంలో ఆశ్రయం పొందుతున్న ఎన్.సాయిలు(13), మహేష్(10) అనే బాలురు బుధవారం ఉదయం టిఫిన్ చేసిన అనంతరం నుంచి కనిపించకుండా పోయారు. దీంతో నిర్వాహకులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవటంతో రాత్రి పోలీసులను ఆశ్రయించారు. కృషిహోం ట్యూటర్ ఎండీ సుమేర్ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. * * రెంజల్(నిజామాబాద్) : నిజామాబాద్ జిల్లా రెంజల్‌లో వేటగాళ్ల తుపాకీ తూటాకు జాతీయ జంతువు జింక బలైంది. రెంజల్ మండలం తాడిబిలోలి గ్రామ సమీపంలో బుధవారం రాత్రి గురు తెలియని వ్యక్తులు జింకను కాల్చి చంపారు. గురువారం ఉదయం జింక కళేబరాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఎస్సై ప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. జింకను వేటగాళ్లే చంపి ఉంటారని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. * * హైదరాబాద్: న్యాయమైన పరిహారం ఆందోళన చేస్తున్న మల్లన్నసాగర్ ముంపు బాధితులకు బీజేపీ మద్దతు తెలపనుంది. బుధవారం సాయంత్రం తొగుట మండలం ఏటిగడ్డకిష్టాపూర్, వేములగట్టు గ్రామాల్లో ఆ పార్టీ నాయకులు ధర్నా చేపట్టనున్నారు. ఈ ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్తోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు. ప్రాజెక్టు ముంపు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తగినంత సాయం అందించాలని బీజేపీ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేయనున్నారు. * * ధారూర్ : రంగారెడ్డి జిల్లా ధారూర్ మండలంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఎడతేరపి లేకుండా వాన కురుస్తుంది. దీంతో జిల్లాలోనే కొటిపల్లి జలాశయం నీటి మట్టం ఒక్క రోజులోనే ఏడడుగులు పెరిగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 24 అడుగులు కాగా మంగళవారం ఉదయం 5 అడుగుల నీరు మాత్రమే ఉంది. రాత్రి కురిసిన వర్షానికి 12 అడుగులకు చేరుకుంది. ధారూర్ మండల కేంద్రంలో 72.50 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. ఈ నీరుతో పంట సాగు చేసుకోవచ్చని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. * *
bottomleft17.jpg

middletop7.gif

బిజినెస్

బ్యాంకులు బాగుపడితే వాటాల విక్రయం: కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ

09/05/2017: టోక్యో: మొండిబకాయిలతో కుంగుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితి కొంత మెరుగైన తర్వాత ప్రభుత్వం వాటిల్లో కొంత మేర వాటాలు విక్రయించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వెల్లడించారు. డిఫాల్టర్లపై కఠిన చర్యలు తీసుకునేలా రిజర్వ్‌ బ్యాంక్‌కు మరిన్ని అధికారాలు దక్కిన నేపథ్యంలో నిరర్ధక ఆస్తుల సమస్యకు పరిష్కారమార్గం లభించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాంకుల మూలధన అవసరాలను తీర్చేందుకు ఇప్పటికే ఒక పథకం అమలవుతోందని, మరిన్ని నిధులు కావాల్సి వస్తే ఆ అంశమూ పరిశీలించగలమన్నారు. ‘అయితే, బ్యాంకుల పరిస్థితులు మెరుగుపడితే వాటిల్లో వాటాలను 52 శాతానికి తగ్గించుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇప్పటికే ప్రకటించాము. ఈ రకంగా వచ్చే నిధులను బ్యాంకుల మూలధన అవసరాలకు ఉపయోగించుకోవచ్చు’ అని సోమవారం జరిగిన సీఐఐ–కోటక్‌ ఇన్వెస్టర్ల సదస్సులో పాల్గొన్న సందర్భంగా జైట్లీ చెప్పారు. వసూలుకావాల్సిన మొండిబకాయిల్లో సింహభాగం మొత్తం .. కేవలం కొన్ని ఖాతాలకు మాత్రమే పరిమితమైందని, అయితే పరిమాణం భారీగా ఉండటంతో బ్యాంకుల ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.

జోరుగా వెండి, బంగారం ధరలు

17/04/2017: న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక అనిశ్చితి నేపథ్యంలో ఈ విలువైన లోహానికి డిమాండ్‌ పుంజుకుంది. బులియన్‌ మార్కెట్‌లో దేశీయంగా పసిడి ధరలు మళ్లీ రూ.30వేల స్థాయికి వైపు కదులుతున్నాయి. గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం జిగేల్‌మంటుండటంతో దేశీయంగానూ ఆ ప్రభావం పడింది. స్తానిక బంగారం వర్తకుల డిమాండ్‌ దీనికి తోడవ్వడంతో దేశీయంగా పది గ్రా. బంగారం ధర రూ. 29,950 స్థాయిని తాకింది. మరో విలువైన మెటల్‌ వెండి కూడా ఇదే బాటలో పయనిస్తోంది. కిలో వెండి ధర రూ.100 లాభపడి రూ.43వేల వద్ద స్థిరంగా ఉంది. వివాహ సీజన్‌, స్థానిక రీటైల్‌ వ్యాపారస్తుల డిమాండ్‌ కారణంగా బంగారం ధరలు, పరిశ్రమదారులు, నాణేల ఉత్పత్తిదారుల డిమాండ్‌ నేపథ్యంలో వెండి ధరలు పైకి ఎగబాకుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. శనివారం దేశరాజధానిలో 99.9 శాతం స్వచ్ఛత, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం 10 గ్రాముల ధరలు వరుసగా రూ రూ.29,950 , రూ 29,800గా నమోదయ్యాయి. గత నాలుగు రోజులలో రూ.660లు లాభపడింది. అయితే, సావరీన్‌ ఎనిమిది గ్రాముల బంగారం ధర రూ.24,500 వద్ద స్థిరంగా ఉంది. అటు ఏంసీఎక్స్‌ మార్కెట్‌ లో పుత్తడి పది గ్రా. 193 లాభపడి రూ. 29,422 వద్ద ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఔన్సుబంగారం 0.09 శాతం 1,287.80 డాలర్లు పలుకుతోంది. గురువారం న్యూయార్క్‌లోని కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) బంగారం 0.8 శాతం(10 డాలర్లు) పెరిగి 1,288 డాలర్లను అధిగమించింది.

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు

17/04/2017: ఇన్వెస్ట్‌ చేయడమంటే.. ఏదో ఒక సాధనంలో పెట్టుబడి పెట్టేయడం కాదు. సరైన సాధనాన్ని ఎంచుకోవాలి. రిస్కును తగ్గించుకునేందుకు చాలా మంది యువత కూడా తక్కువ రిస్కుండే ఫిక్సిడ్‌ డిపాజిట్లు, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్లు వంటి వాటిలో అత్యధికంగా ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. దీనివల్ల అధిక రాబడులు దక్కించుకునే అవకాశాలను కోల్పోతారు. రిటైర్మెంట్‌ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఈక్విటీ మార్కెట్స్‌ వంటి సాధనాలే సరైనవి. ఉదాహరణకు వార్షిక ప్రాతిపదికన పీపీఎఫ్‌ పదిహేనేళ్ల కాలానికి 8.3 శాతం రాబడులే అందించగా.. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ అదే వ్యవధిలో 14.7 శాతం రాబడినిచ్చింది. పన్ను ప్రయోజనాలూ ముఖ్యమే.. మనం పెట్టే పెట్టుబడులు మన సంపద పెరుగుదలకు ఉపయోగపడటంతో పాటు పన్ను ప్రయోజనాలు కూడా అందించేలా చూసుకోవాలి. ఏడాదికి రూ.1.5 లక్షలు సరిగ్గా ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా గణనీయంగా పన్ను మినహాయింపులు పొందవచ్చన్నది చాలా మందికి తెలీదు (గరిష్ట ట్యాక్స్‌ రేటు 34.61 శాతంగాను, సెక్షన్‌ 80సీ కింద లభించే పన్ను మినహాయింపులను పరిగణనలోకి తీసుకుంటే). ట్యాక్స్‌ పేయర్లు పన్ను పోటును తగ్గించుకునేందుకు ప్రభుత్వం.. పీపీఎఫ్, జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌) పోస్టాఫీస్‌ డిపాజిట్, అయిదేళ్ల బ్యాంకు డిపాజిట్, జీవిత బీమా, ఈక్విటీ ఆధారిత సేవింగ్స్‌ స్కీము (ఈఎల్‌ఎస్‌ఎస్‌) మొదలైన సాధనాలెన్నో అందుబాటులో ఉంచింది. వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవడం కాకుండా రిస్కులు, రివార్డులు బేరీజు వేసుకుని చూసుకోవాలి. ఇక్కడే ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఉపయోగపడుతుంది. ఈఎల్‌ఎస్‌ఎస్‌ .. మిగతావాటితో పోటీ... ముందుగా.. గరిష్టంగా రూ. 1.5 లక్షలు ఇన్వెస్ట్‌ చేసేందుకు పన్ను ఆదా ప్రయోజనాలు కల్పించే సాధనాల మధ్య కొన్ని వ్యత్యాసాలు పరిశీలిద్దాం (అదనంగా రూ. 50,000 దాకా మినహాయింపుని అందించే ఎన్‌పీఎస్‌ కలపకుండా). ఉదాహరణకు మీరు ప్రతీ సంవత్సరం రూ. 1.5 లక్షలు చొప్పున రెండు దశాబ్దాలు ఇన్వెస్ట్‌ చేశారనుకుందాం. అంటే అప్పటికి మీరు ఇన్వెస్ట్‌ చేసిన మొత్తం రూ. 30 లక్షలకు చేరుతుంది. వేల్యూరీసెర్చ్‌ సంస్థ అంచనాల ప్రకారం గడిచిన ఇరవై ఏళ్లుగా పీపీఎఫ్‌లో ఇంత మొత్తం ఇన్వెస్ట్‌ చేసి ఉంటే 2015 నాటి గణాంకాల ప్రకారం 9.59 శాతం రాబడి తో రూ. 82.14 లక్షలు అయ్యేది. ఇది చాలా పెద్ద మొత్తమే! కానీ వడ్డీ రేట్లు తగ్గుతున్న నేపథ్యంలో ఇదే స్థాయి రాబడులు కొనసాగకపోవచ్చు. అదే.. ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ వార్షిక సగటు రాబడులను పరిగణనలోకి తీసుకుంటే... మీరు ఇన్వెస్ట్‌ చేసిన రూ. 30 లక్షలు.. ఏకంగా 2.74 కోట్లయ్యేది. ఇది పీపీఎఫ్‌కి మూడు రెట్లు అధికం. అంటే 19.81 శాతం రాబడి అన్నమాట. గడిచిన ఇరవై ఏళ్ల వ్యవధిలో స్టాక్‌ మార్కెట్‌ రెండు సంక్షోభాలు ఎదుర్కొన్న తర్వాత కూడా ఈ స్థాయి రాబడులు అందుకోగలగడం గమనార్హం. కనుక ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఇన్వెస్ట్‌ చేసి ఉంటే కోటీశ్వరులు కావడంతో పాటు పన్నులు కూడా ఆదా చేసుకుని ఉండేవారని చెప్పవచ్చు. లాకిన్‌ వ్యవధి ప్రయోజనాలు.. పెట్టే పెట్టుబడులపై రాబడులతో పాటు లాకిన్‌ వ్యవధి చూసుకోవడమూ ముఖ్య మే. బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్లు మొదలైన వాటికి లాకిన్‌ వ్యవధి అయిదేళ్లుగా ఉండగా, ఎన్‌ఎస్‌సీకి 6 ఏళ్లు, పీపీఎఫ్‌కు 15 ఏళ్లు (ఆరేళ్ల తర్వాత పాక్షిక విత్‌డ్రాయల్‌ సదుపాయం ఉంది)గా ఉంది. అదే ఈఎల్‌ఎస్‌ఎస్‌కయితే యూనిట్ల కేటాయింపు తేదీ నుంచి మూడేళ్ల వ్యవధి మాత్రమే. అయితే, ఈ వ్యవధి ముగియగానే రిస్కు పెరిగిపోతుందేమోనని డబ్బు అవసరం లేకపోయినా.. చాలా మంది ఇన్వెస్టర్లు తమ యూనిట్స్‌ను అమ్మేస్తుంటారు. మళ్లీ ఆ డబ్బును తీసుకెళ్లి ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్‌ చేయాల్సిందే కదా! కాబట్టి లాకిన్‌ వ్యవధి అయిపోయినా డబ్బు నిజంగానే అవసరం అయ్యేంత వరకూ.. ఈఎల్‌ఎస్‌ఎస్‌ నిధులను అందులోనే ఇన్వెస్ట్‌ చేయడం కొనసాగించడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఎప్పుడు.. ఎంత మొత్తంతో మొదలుపెట్టాలి.. చాలా మంది జనవరి–మార్చి మధ్య పన్ను లెక్కలేసుకోవడం మొదలుపెడతారు. పన్ను పోటును తప్పించే ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాల కోసం హడావుడి పడుతుంటారు. ఇలా ఏడాది చివర్న ఎకాయెకిన రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెట్టేందుకు పరుగులు తీయకుండా .. ప్రతి నెలా కొంత కొంతగా.. అంటే రూ. 12,500 చొప్పున ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తూ వెడితే, చివరికి రూ. 1.5 లక్షల టార్గెట్‌ సులువుగా చేరుకోవచ్చు. దీనివల్ల 3 ప్రయోజనాలు ఉన్నాయి. ఆఖరి 2–3 నెలల్లో ఆర్థిక ఒత్తిడులు తగ్గించుకోగలగడం మొదటిది. ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకోగలగడం రెండోది. ఇక మూడోదేమిటంటే.. ప్రతి నెలా ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ఫండ్‌ యూనిట్స్‌ను వేర్వేరు రేట్లలో కొనుక్కోవచ్చు. మార్కెట్‌ తగ్గినప్పుడు ఎక్కువ యూనిట్లు దక్కించుకోవచ్చు. తద్వారా లాభాలను మరింతగా పొందే అవకాశం దక్కించుకోవచ్చు. క్లుప్తంగా రెండు పిట్టలను ఒకే దెబ్బతో తెచ్చిపెట్టగలిగే సాధనం ఈఎల్‌ఎస్‌ఎస్‌. ఇటు పన్నుపరంగాను, అటు పెట్టుబడిపరంగాను ప్రయోజనాలు కల్పిస్తుంది. పైపెచ్చు ఒకటి కొంటే మూడు ఫ్రీ డిస్కౌంటు ఆఫర్‌లాగా కూడా పనిచేస్తుంది. పన్ను పరిధిలోకి వచ్చే రూ. 1.5 లక్షల మొత్తానికి మినహాయింపు పొందవచ్చు. ఇక ఈ పెట్టుబడిపై డివిడెండు రూపంలో వచ్చే ఆదాయానికి, పూర్తి మొత్తంపై వచ్చే రాబడికి కూడా మినహా యింపు ఉంటుంది. ఇలా సిస్టమాటిక్‌ పద్ధతిలో పన్ను మినహాయింపు పొం దేందుకు చేసే ఇన్వెస్ట్‌మెంట్‌తో భవిష్యత్‌లో సంపదను కూడా పెంచుకోవచ్చు. రిటైర్మెంట్‌ తర్వాత అవసరాలకు తగినన్ని ఆర్థిక వనరులు లేకపోవడమనేది పదవీ విరమణకు దగ్గర్లో ఉన్న వారికి ఆందోళనకరమే. ఇలాంటి సమస్య రాకూడదంటే... యుక్తవయసు నుంచే సరైన ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలను ఎంచుకోవటమొక్కటే తగిన మార్గం. సదరు సాధనం పన్ను ప్రయోజనాలతో పాటు అటు అధిక రాబడులు సైతం ఇవ్వగలగాలి. ఈక్విటీ ఆధారిత సేవింగ్స్‌ స్కీము (ఈఎల్‌ఎస్‌ఎస్‌) ఈ కోవకి చెందినదే. ఈ అంశాలను మరింతగా రిశీలిస్తే...

జియో దెబ్బకు రేటు తగ్గించిన వొడాఫోన్

09/12/2016: రిలయెన్స్ జియో ఫ్రీ సర్వీస్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. దీంతో దేశీయ టెలికాం దిగ్గజాలు కూడా దిగి వస్తున్నాయి. తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఒకదాని తర్వాత ఒకటి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ మేల్కోగా.. ఇప్పుడు వొడాఫోన్ కూడా ఆఫర్ ఇచ్చింది. డబుల్ డాటా ప్లాన్ ను వొడాఫోన్ ఎనౌన్స్ చేసింది. ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న అన్ని ప్లాన్స్ పై 4జీ డేటాు ఫ్రీగా అందిస్తోంది. దీంతో 50 శాతం రేట్లు తగ్గనున్నాయి. గతంలో 255 రీఛార్జ్ కు 2జీ బీ ఫోర్జీ డాటా ఇస్తోంది. కానీ అది ఇప్పటివరకూ 1 జీబీ మాత్రమే. అలాగే 459 రీఛార్జ్ పై 6 జీబీ 4జీ డేటా ఇస్తోంది. 559 రీఛార్జ్ తో 8 జీబీ 4జీ డేటా, 999 ప్లాన్లో 20 జీబీ, 1999 ప్లాన్లో 40 జీబీ డేటా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్స్ అన్నింటికీ 28 రోజులు వ్యాలిడిటీ ఉంది. దీంతో కస్టమర్లు ఎగిరి గంతేస్తున్నారు. తమ వినియోగదారులకు సూపర్ 4జీ డేటా అనుభవం అందిస్తున్నామని వొడాఫోన్ ప్రకటించింది. అయితే జియో దెబ్బకు అన్ని టెలికాం కంపెనీలు ప్లాన్స్ తగ్గిస్తున్నా.. ఈ ఆఫర్లు ఎంతకాలం ఉంటాయనేది మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది.

గోదాముల్లో ముక్కిపోతున్న కార్లు

24/11/2016: పెద్ద నోట్ల రద్దుతో ఆటోమొబైల్ పరిశ్రమకు పెద్ద దెబ్బ పడింది. దాదాపు లక్ష కార్లు గోదాముల్లో ముక్కిపోతున్నాయి. సేల్స్ ఒక్కసారిగా పడిపోవడంతో.. డీలర్లకు దిక్కుతోచడం లేదు. సాధారణంగా డీలర్లు ముందుగానే స్టాకు తెచ్చి పెట్టుకుంటారు. కానీ అనుకున్న మేరకు వ్యాపారం జరగకపోవడంతో.. కార్లు ఏం చేయాలో తెలియక అల్లాడిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కార్ డీలర్ షిప్ లు 230 ఉన్నాయి. నోట్ల రద్దుకు ముందు తెలగాణలో 40వేల కార్లు, ఏపీలో 25వేల కార్లు అమ్ముడుపోయేవి. కానీ ఇప్పుడు సగానికి సగం సేల్స్ పడిపోయాయి. కొంటున్న వాళ్లు కూడా ఈ నెల 24వరకు జీవితపన్ను పాతనోట్లతో కట్టొచ్చన్న ప్రకటనతో వస్తున్నారు. ఆ తేదీ తర్వాత తామంతా ఈగలు తోలుకోవాలని డీలర్లు ఆందోళన చెందుతున్నారు. గోదాముల్లో ఎక్కువ రోజులు కార్లు ఉంచకూడదు. వాడకుండా ఎక్కువ రోజులుంటే కార్లు రిపేర్ కు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓవైపు వ్యాపారం జరగక, మరోవైపు కొత్త కార్లను మెయింటైన్ చేయలేక డీలర్లకు తల ప్రాణం తోకకొస్తోంది. సాధారణంగా రిపేర్ వస్తే కార్లు షెడ్డుకెళతాయి. కానీ పెద్ద నోట్ల రద్దుతో కొత్త కార్లను కూడా షెడ్లో పెట్టాల్సి వస్తోందని డీలర్లు వాపోతున్నారు. డీలర్లతో పాటు తెలుగు రాష్ట్రాల రవాణా శాఖల ఆదాయనికీ భారీగా గండిపడింది. డిసెంబర్లో ఇదే పరిస్థితి కొనసాగితే రవాణా సంక్షోభం తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

ఈ మెమొరీ కార్డు చాలా రేటు గురూ..!

12/11/2016: మెమోరీ కార్డు ఎంతుంటుంది. మహా అయితే వెయ్యి, ఐదు వేలు. కానీ శాంసంగ్ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన మెమొరీ కార్డు రేటు వింటే కళ్లు తిరగాల్సిందే. అక్షరాలా 13వేల రూపాయలు. ఏంటీ అంత స్పెషల్ అనుకుంటున్నారా. చాలా స్పెషలే నండీ. మొబైల్స్ లో ఫోటోలు, వీడియోలు, పాటలు స్టోర్ చేసుకోవడానికి మెమొరీ యూజ్ చేస్తాం. ఫోన్ మెమొరీ అయిపోతే మెమొరీ కార్డ్ కొనుక్కుంటాం. ఫోన్ మెమొరీ తక్కువ ఉన్న ఫోన్స్ కు మెమొరీ కార్డే ప్రాణం. కాబట్టి ఈ కాలంలో మెమొరీ కార్డ్ కు చాలా ప్రాధాన్యత ఉంది. ఫోన్ మెమొరీ తక్కువ ఉన్నా.. ఎక్స్ పాండబుల్ మెమొరీ ఎక్కువ ఉన్న ఫోన్లకు గిరాకీ ఎక్కువ. అందుకే అలాంటి వారి కోసం శాంసంగ్ 256 జీబీ మెమొరీ కార్డ్ రిలీజ్ చేసింది. డిసెంబర్ నుంచి అమెజాన్లో అందుబాటులోకొస్తుంది. ఇందులో 24 గంటల నిడివి ఉండే హెచ్ డీ వీడియోలు కూడా దాచుకోవచ్చు. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం డ్యూయెల్ డ్రైవ్ కొత్త మోడల్ కూడా విడుదల చేసింది. ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా శాంసంగ్ కొత్త మెమొరీ కార్డ్ పైనేచర్చ నడుస్తోంది.

శాంసంగ్ వాషింగ్ మెషీన్లు పేలుతున్నాయ్

07/11/2016: శాంసంగ్ గెలాక్సీ ఫోన్లే కాదు.. వాషింగ్ మెషీన్లు కూడా పేలుతున్నాయ్! అది కూడా ఎక్కడో కాదు అగ్రరాజ్యం అమెరాలోనట! ఇంకేముంది.. హుటాహుటిన స్పందించిన శాంసంగ్ కంపెనీ వాటిని వెనక్కి తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పాటు నగదు తిరిగి ఇచ్చేందుకు కూడా అంగీకరించింది. విషయం చూద్దాం.. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీ అయిన శాంసంగ్.. ప్రపంచ వ్యాప్తంగా అనేక ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ను మార్కెట్ చేస్తోంది. ఫోన్లు, వాషింగ్ మెషీన్లు, టీవీలు, సిస్టమ్ ఇలా ఎన్నో రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను మార్కెట్ చేస్తోంది. అయితే, ఇటీవల కాలంలో శాంసంగ్ గెలాక్సీ ఫోన్లు చార్జింగ్ పెడుతున్న సమయంలో పేలిపోతుండడం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వివాదానికి దారితీసింది. దీంతో ఆయా ఫోన్లను కంపెనీ వెనక్కి తీసుకుంది. ఇక ఇప్పుడు శాంసంగ్ వాషింగ్ మెషీన్లు పేలుతున్నాయనే కంప్లయింట్లు అమెరికాలో వెల్లువెత్తుతున్నాయి. శాంసంగ్ టాప్లోడ్ వాషింగ్ మెషీన్లు పేలుతున్నాయని వినియోగదారులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెషీన్లు పేలినపుడు బాంబు పేలినంత పెద్ద శబ్దం వచ్చిందని బాధిత వినియోగదారులు ఒకరు వివరించారు. తీవ్రమైన వైబ్రేషన్ రావడం లేదా వాషింగ్ మెషిన్ పైన వుండే టాప్ భయంకరమైన శబ్దంతో పేలిపోవడమోజరుగుతోందంటూ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ పేలుళ్లతో దవడ, భుజాలు విరిగిపోవడం లాంటి తీవ్ర గాయాలు అయినట్టు దాదాపు 733 కేసులు నమోదయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన శాంసంగ్ హుటాహుటిన దాదాపు 30 లక్షల మెషీన్లను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. 2011లో విక్రయించిన 34 మోడళ్ల మొత్తం 2.8 మిలియన్ల వాషింగ్ మెషీన్లను వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ మెషీన్లను కొనుగోలు చేసిన వారు ఫ్రీగా రిపేరు చేయించుకోవచ్చని, లేదా నగుదును మొత్తం తిరిగి తీసుకోవచ్చని తెలిపింది. లేదంటే మరో శాంసంగ్ మెషీనతో ఎక్సేంజ్ చేసుకుంటే స్పెషల్ రాయితీ అందిస్తున్నట్టు ప్రకటించింది. ఇక వినియోగదారులకు క్షమాపణలు సైతం చెప్పడం గమనార్హం.

జీఎస్టీతో లాభమా.. నష్టమా..?

05/11/2016: చాన్నాళ్ల తర్జనభర్జనల తర్వాత జీఎస్టీ కౌన్సిల్ పన్నురేట్లు ప్రకటించింది. చూడటానికి పైకంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. నిత్యావసరాలను తక్కువ పన్నురేటులోకి తెచ్చామని, విలాసవంతమైన వస్తువులపై కూడా ఇప్పుడున్న వ్యాట్ కంటే తక్కువ పన్నే పడుతుందని అరుణ్ జైట్లీ తియ్యగా సెలవిచ్చారు. కానీ నిజంగా సామన్యుడిపై కేంద్రం ప్రేమ కురిపించిందా.. ? జీఎస్టీ శ్లాబుల్లో మర్మమేంటి..? జిడిపిలో 50 శాతం మించి వాటా ఉన్న సర్వీసుల రంగంపై మాత్రం పన్నుల భారం పెరగనుంది. ప్రస్తుతం 15 శాతం ఉన్న సర్వీసుల పన్ను ఏకంగా 18 శాతానికి చేరనుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం భగ్గుమనే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. నిజానికి ఇప్పుడున్న సర్వీసు టాక్స్‌ 14 శాతం మాత్రమే. దానిపై 0.5 శాతం స్వచ్ఛ్‌ భారత సెస్‌, మరో 0.5 శాతం కృషి కల్యాణ్‌ సెస్‌ మరో 0.5 శాతం కూడా కలిపి దీనిని 15 శాతానికి చేర్చారు. ఇప్పుడిది ఏకంగా 18 శాతానికి పెరుగుతోంది. అన్ని రకాల సర్వీసులకు ఒకటే పన్ను రేటు... 18 శాతం ఉంటుందని చెబుతున్నారు. దీనివల్ల ప్రజలపై భారం భారీగా పెరిగే అవకాశం ఉంది. ఆర్‌బిఐ కూడా జిఎ్‌సటి వల్ల స్వల్పకాలంలో ద్రవ్యోల్బణంపై ఒత్తిడి ఉంటుందని గతంలోనే హెచ్చరించింది. సరుకుల రవాణా కూడా సర్వీసుల పన్ను పరిధిలోకి వస్తుంది. రవాణా చార్జీలు పెరిగితే సహజంగానే సరుకుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు నిత్యం ఉపయోగించే వస్తువుల్లో అత్యధిక శాతం వస్తువులను జిఎ్‌సటి నుంచి మినహాయిస్తున్నట్టుగా ప్రభుత్వం చెబుతున్నా, రవాణా చార్జీలు పెరిగితే ఈ సరుకుల ధరలు కూడా పెరుగుతాయి. వస్తు వినియోగ సంస్కృతి విస్తరించడంతో దేశంలో రకరకాల సర్వీసులకు కూడా డిమాండ్‌ పెరుగుతోంది. హోటల్స్‌, రెస్టారెంట్లు, ఆన్‌లైన్‌ పేమెంట్స్‌, ట్రావెల్‌ సర్వీసులు, క్యాబ్‌ సర్వీసులు, మొబైల్‌ రీచార్జ్‌, బీమా ప్రీమియం చెల్లింపులు, డ్రై క్లీనింగ్‌, కొరియర్‌, కేబుల్‌, డిటిహెచ్‌, క్యాటరింగ్‌, క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు చెల్లింపులు, అపార్ట్‌మెంట్ల నిర్మాణం, స్టాక్‌ బ్రోకింగ్‌, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్సులు, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌.. ఇలా చెప్పుకొంటూ వెలితే ఈ జాబితాలో 100కు పైగా సర్వీసులు తేలుతాయి. అత్యధిక శాతం సామాన్యులు నిత్యం వినియోగించుకొనేవే. వీటిపై పన్ను రేటు పెరగడం వల్ల ప్రజల జేబులు ఖాళీ కావడం తధ్యం. కొన్ని రకాల సర్వీసులనైనా పన్నుల భారం నుంచి మినహాయిస్తే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా, కనీస పన్ను 5 శాతం పరిధిలోకి వచ్చే వస్తువుల జాబితాను కూడా ఖరారు చేయాల్సి ఉంది. ఆ జాబితా వెల్లడైతేనే ద్రవ్యోల్బణంపై ప్రభావాన్ని మరింత స్పష్టంగా అంచనావేయడానికి అవకాశం ఉంటుంది.

బంగారం దిగుమతుల టారిఫ్ పెంపు

01/11/2016: న్యూఢిల్లీ: పసిడి దిగుమతుల టారిఫ్‌ను ప్రభుత్వం సోమవారం పెంచింది. 10 గ్రాములకు ప్రస్తుత టారిఫ్ 410 డాలర్ల నుంచి 414 డాలర్లకు పెరిగింది. ఇక వెండి టారిఫ్‌ను సైతం కేజీకి 576 డాలర్ల నుంచి 577 డాలర్లకు ఎగసింది. ధరలో ఎటువంటి అవకతవకలూ లేకుండా కస్టమ్స్ సుంకం విధించడానికి బేస్ ధరగా టారిఫ్ రేటు ఉంటుంది. పసిడిపై విధించే దిగుమతి సుంకానికి బేస్‌గా ఇప్పటివరకూ 410 డాలర్లను తీసుకొంటుండగా, వచ్చే 15 రోజులకూ 414 డాలర్ల బేస్‌తో సుంకాన్ని విధిస్తారు. అంతర్జాతీయ ధరకు అనుగుణంగా సాధారణంగా పక్షం రోజులకు ఒకసారి ఈ ధర నిర్ణయం ఉంటుంది.

ఇండియాకు చైనా వార్నింగ్

28/10/2016: చైనా ఉత్ప‌త్తుల‌ను భార‌త్ లో నిషేధించాల‌న్న ప్ర‌చారం భారీగా పెరుగుతుండ‌డంతో చైనా మండిప‌డుతోంది. తాజాగా ఆ దేశం ఏకంగా హెచ్చ‌రిక‌లే జారీ చేసింది. త‌మ వ‌స్తువుల‌ను భార‌త్‌లో నిషేధిస్తే ఇరుదేశాల సంబంధాలపై ప్రభావం చూపడ‌మే కాకుండా, పరస్పర పెట్టుబడులను సైతం ఇది దెబ్బతీస్తుందని హెచ్చ‌రించింది. ఢిల్లీలోని చైనా రాయబారి జీ లియాన్ దీనిపై తాజాగా స్పందించారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టాలనుకున్న త‌మ దేశ‌ కంపెనీలపై ఈ అంశం ప్రభావం చూపుతుంద‌ని అన్నారు. భార‌త్, చైనా ప్రజలు ఇది కోరుకోవడం లేద‌ని.. ఒక వేళ నిషేధం విధిస్తే రెండు దేశాల సంబంధాల‌పై తీవ్ర ప్ర‌భావం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. దక్షిణాసియాలో చైనాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన భార‌త్ ఆ దేశ వ‌స్తువుల‌ను దిగుమ‌తి చేసుకోవ‌డంలో అంద‌రికంటే ముందుంది. అయితే.. కొద్దిరోజులుగా సోష‌ల్ మీడియాతో భార‌తీయులు చైనా ట‌పాసుల‌ను బ‌హిష్క‌రించాల‌ని పిలుపునిస్తున్నారు. ఒక్క ట‌పాసులే కాదు అన్ని ర‌కాల చైనా వ‌స్తువుల‌నూ బ్యాన్ చేయాలంటూ ఆన్ లైన్ పిటీష‌న్లూ ప‌డుతున్నాయి. దీంతో ఆందోళ‌న చెందుతున్న చైనా ఇక లాభం లేద‌ని బెదిరింపుల‌కు దిగుతోంది. కాగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం ఏ ర‌కంగా జ‌రుగుతున్నా కూడా భార‌త ప్ర‌జ‌లు మాత్రం దీనిపై భిన్న ర‌కాలుగా స్పందిస్తున్నారు. ట‌పాసులకు వ‌చ్చేసరికి ఈసారి చైనా క్రాక‌ర్సు భారీగా త‌గ్గిపోయినప్ప‌టికీ మొబైల్ ఫోన్లు వంటివి మాత్రం చైనా బ్రాండ్లే ఎక్కువ‌గా అమ్ముడుతుపోతున్నాయి. షియామీ సంస్థ‌కు చెందిన రెడ్ మీ ఫోన్లకు ఆన్ లైన్ మార్కెట్లో విప‌రీత‌మైన గిరాకీ ఉంటోంది. అమ్మ‌కానికి పెట్టిన నిమిషాల్లోనే అవుట్ ఆఫ్ స్టాక్ అన్న బోర్డులు క‌నిపిస్తున్నాయి. నిమిషాల్లోనే ల‌క్ష‌లాది ఫోన్ల‌ను కొంటున్న ప్ర‌జ‌లు చైనా ఉత్త‌త్తుల‌ను నిషేధించాల‌ని చేస్తున్న డిమాండ్ల వెనుక ఉన్న అవ‌గాహ‌న ఎంతో తెలియ‌డం లేదు. త‌మ వ‌స్తువుల‌ను నిషేధించాల‌న్న ప్ర‌చారం వ‌ల్ల ఇప్ప‌టికేమీ ప్ర‌భావం లేక‌పోయినా భ‌విష్య‌త్తులో ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్న ఉద్దేశంతోనే చైనా కాస్త క‌టువుగా బెదిరింపుల‌కు దిగుతోంది.

ఫ్లిప్‌కార్ట్‌కు మరో షాక్‌! - మరో ముఖ్య అధికారి ఔట్‌ - కొనసాగుతున్న మేధో వలస

26/10/2016: కీలకమైన పండుగల సీజన్‌లో దేశంలోనే అతిపెద్ద ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ అయిన ఫ్లిప్‌కార్ట్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ నుంచి ఉన్నతస్థాయి మేధో అధికారుల వలస కొనసాగుతున్నది. ఈ ఏడాది చివరినాటికి సంస్థ ప్రధాన ఆర్థిక అధికారి (సీఎఫ్‌వో) సంజయ్‌ బవేజా ఫ్లిప్‌కార్ట్‌ను వీడి వెళ్లనున్నారు. ఆయన రాజీనామా విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది. కీలకమైన పండుగల సీజన్‌ ఉండటం, ఈ నేపథ్యంలో అమెరికా రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ నుంచి బిలియన్‌ డాలర్ల (రూ. 6600 కోట్ల) పెట్టుబడులు రాబట్టేందుకు ఫ్లిప్‌కార్ట్‌ ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. టాటా కమ్యూనికేషన్‌ సంస్థను వీడి 2014 సెప్టెంబర్‌లో బవేజా ఫ్లిప్‌కార్ట్‌లో చేరారు. రాబోయే డిసెంబర్‌ 31 ఆయన సంస్థలో పనిచేసే చివరిరోజని, ఆయన స్థానంలో కొత్త సీఎఫ్‌వోను నియమించే ప్రయత్నాలు మొదలయ్యాయని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. ఇటీవలికాలంలో ఫ్లిప్‌కార్ట్‌ నుంచి కీలకమైన ముఖ్య అధికారులు వెళ్లిపోవడం గమనార్హం. సంస్థ కామర్స్‌, అడ్వర్టైజింగ్‌ చీఫ్‌గా ఉన్న ముఖేష్‌ బన్సల్‌ ఇప్పటికే రాజీనామా చేశారు. ఆయన బాటలోనే చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ అంకిత్‌ నగోరి కూడా నడిచారు. అయితే, నగోరి క్రీడారంగంలో సొంత వెంచర్‌ను స్థాపించేందుకు ఫ్లిప్‌కార్ట్‌ కు రాజీనామా చేయగా.. ఆయన సంస్థలో ఫ్లిప్‌కార్ట్‌ సహా స్థాపకులైన సచిన్‌, బిన్నీ బన్సల్‌ పెట్టుబడులు పెట్టడం గమనార్హం. ఇక, ఫ్లిప్‌కార్ట్‌ చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌ పునిత్‌ సోనీ, వైస్‌ ప్రెసిడెంట్‌ మనీష్‌ మహేశ్వరీ గత ఏప్రిల్‌లో సంస్థకు రాజీనామా చేసి.. తమ దారి తాము చూసుకున్నారు.

టాటా తదుపరి చైర్మన్ ఎవరు..?

25/10/2016: ముంబై: టాటా గ్రూపు చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తప్పించడంతో ఖాళీ కానున్న పదవికి తగిన సమర్థులు ఎవరు? అన్న ఆసక్తికరమైన ప్రశ్నపై ఇప్పుడు పరిశ్రమ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. అయితే, పెప్సీకో సీఈవో ఇంద్రానూయి, వొడాఫోన్ మాజీ సీఈవో అరుణ్‌శరీన్, నోయెల్ టాటా, టీసీఎస్ సీఈవో, ఎండీ ఎన్ చంద్రశేఖరన్, టాటా గ్రూపునకే చెందిన ఇషాంత్ హుస్సేన్, బి.ముత్తురామన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. టాటా గ్రూపు కంపెనీల హోల్డింగ్ సంస్థ టాటాసన్స్ తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటా వ్యవహరించనున్నప్పటికీ... కొత్త చైర్మన్ ఎంపిక పూర్తి కావడం ఆలస్యం ఆయన నూతన వారసుడికి బాధ్యతలు అప్పగించి తన పదవి నుంచి తప్పుకోనున్నారు. పరిశీలనలో ఉన్న పేర్లు ఇవీ... టాటా గ్రూపు నూతన చైర్మన్ ఎంపిక ప్రక్రియ వచ్చే రెండు వారాల్లో ప్రారంభం అవుతుందని... మూడు నుంచి నాలుగు నెలలు ఇందుకు సమయం పడుతుందని ఎంపిక కమిటీ సన్నిహిత వర్గాల సమాచారం. అయితే, ఇప్పటికే పలు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా ఇద్దరి విషయంలో రతన్ టాటా చాలా సానుకూలతతో ఉన్నట్టు తెలుస్తోంది. వారు నోయెల్ టాటా, ఇంద్రానూయి. నోయెల్ టాటా తమ కుటుంబంలో వ్యక్తి కాగా, ఇంద్రానూయి పనితీరు రతన్ టాటాను ఆకట్టుకుంది. ముఖ్యంగా నోయెల్‌కు ఎక్కువ అవకాశాలున్నాయని, బయటి వ్యక్తి కంటే తమ కుటుంబంలో భాగమైన వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించవచ్చని ఆ వర్గాలు అంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన కంపెనీలతో విస్తరించిన టాటాగ్రూపును నడిపించేందుకు లోకల్ వ్యక్తి కాకుండా అంతర్జాతీయంగా పేరున్న వ్యక్తి అయితే బాగుంటుందన్నది టాటా గ్రూపు ఆలోచనగా తెలుస్తోంది. అలా చూసుకుంటే ఇంద్రానూయి ఈ విషయంలో ముందుంటారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆశ్చర్యం నుంచి అర్ధాంతరంగా.. సైరస్ మిస్త్రీ 1968, జూలై 4న జన్మించారు. లండన్ ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్-టెక్నాలజీ అండ్ మెడిసిన్ నుంచి సివిల్ ఇంజినీరింగ్ పట్టా(గ్రాడ్యుయేషన్) పొందారు. తర్వాత లండన్ బిజినెస్ స్కూల్ నుంచి మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. 1991లో తండ్రి స్థాపించిన షాపూర్‌జీ పలోంజీ గ్రూప్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. కాగా, రతన్ స్థానంలో వారసుడిని ఎంపిక చేయటానికి నియమించిన కమిటీలో డెరైక్టర్ హోదాలో మిస్త్రీ కూడా అప్పుడు సభ్యుడే. అనూహ్యంగా కమిటీ మిస్త్రీనే నియమించింది. ఇక తొలగింపు నిర్ణయం తీసుకున్న బోర్డు సమావేశంలోనూ మిస్త్రీ పాల్గొన్నారు. ఆరుగురు సభ్యులు వేటు వేసేందుకు అనుకూలంగా ఓటేయగా... ఒక్క మిస్త్రీ మాత్రమే ప్రతిఘటించినట్లు సమాచారం. ఇది కూడా ఆయనకు ఒక విధంగా అనూహ్య సంఘటనే. 150 ఏళ్ల టాటా సామ్రాజ్య చరిత్రలో(1868లో ఆవిర్భావం) 1932లో నౌరోజీ సక్లత్‌వాలా తర్వాత టాటా గ్రూపునకు సారథ్యం వహించిన టాటాల కుటుంబేతర వ్యక్తి మిస్త్రీయే. అంతేకాదు! ఇప్పటివరకూ టాటా సన్స్‌కు ఆరుగురు చైర్మన్లుగా వ్యవహరించగా.. అతితక్కువ కాలం పదవిలో కొనసాగింది కూడా మిస్త్రీయే. మొత్తం తొమ్మిది మంది టాటా సన్స్ డెరైక్టర్ల బోర్డులో, అదేవిధంగా ఇతర గ్రూప్ కంపెనీల్లో కూడా డెరైక్టర్‌గా మిస్త్రీ కొనసాగనున్నారు. ప్రస్తుతం టాటా గ్రూప్‌లో 7 లక్షల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. 100కు పైగా విభిన్న వ్యాపారాలను నిర్వహిస్తోంది. పదవీ విరమణ తర్వాత రతన్ టాటా గౌరవ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

జియోను ఏడిపించినందుకు రూ3,050 కోట్ల జరిమానా?

24/10/2016: దిగ్గజ టెలికాం ఆపరేటర్లకు షాకిస్తూ ట్రాయ్‌ సంచలన సిఫార్సు చేసింది. రిలయన్స్‌ జియోకు ఉద్దేశపూర్వకంగా ఇంటర్‌ కనెక్టివిటీని కల్పించేందుకు నిరాకరిస్తున్నారని పేర్కొంటూ ఎయిర్‌టెల్‌, ఐడియా, వొడాఫోన్‌పై 3,050 కోట్ల రూపాయల జరిమానా విధించాలని టెలికం శాఖకు సిఫార్సు చేసింది. లైసెన్సు కండీషన్లు, సేవల నాణ్యతా నిబంధనలను ఈ మూడు కంపెనీలు పాటించడం లేదని ట్రాయ్‌ పేర్కొంది. వీటి కారణంగా ఆర్‌జియోకు కేటాయించిన ఇంటర్‌ కనెక్ట్‌ పాయింట్ల వద్ద సమస్యలు ఏర్పడి కాల్స్‌ ఫెయిల్యూర్లు భారీగా జరగుతున్నాయని తెలిపింది. ఆర్‌జియోకు పోర్టులు కేటాయించేందుకు ఈ కంపెనీలు తిరస్కరించడం పోటీని పరిమితం చేయడమేనని, ఈ చర్య వినియోగదారులకు వ్యతిరేకమైనదని ట్రాయ్‌ విమర్శించింది. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌కు ఒక్కొక్క కంపెనీకి 1,050 కోట్ల రూపాయల చొప్పున, ఐడియాకు 950 కోట్ల రూపాయల చొప్పున జరిమానా విధించాలని సిఫార్సు చేసింది. ఈ మూడు కంపెనీల లైసెన్సులు రద్దు చేయాలని కానీ వినియోగదారులకు ఏర్పడే అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ పని చేయడంలేదని తెలిపింది. తమ నెట్‌వర్క్‌ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌లో 75 శాతం కాల్స్‌ ఫెయిల్‌ అవుతున్నాయని, ఇందుకు ఈ కంపెనీలు తగినన్ని పోర్టులు కేటాయించకపోవడమే కారణమని ఆర్‌జియో చేసిన ఫిర్యాదుపై ట్రాయ్‌ విచారణ జరిపింది. మరోవైపు ట్రాయ్‌ సిఫార్సులపై వొడాఫోన్‌, ఐడియా, ఆర్‌జియో స్పందించలేదు.

రాత్రంతా ఎయిర్ టెల్ నరకం చూపించిందా!

22/10/2016: టెలికాం మార్కెట్లో రిలయన్స్ జియో ప్రకంపనలు సృష్టిస్తున్న సమయంలో.. మార్కెట్ లీడర్ గా ఉన్న ఎయిర్ టెల్ కు అనుకోని అవాంతరం ఎదురవడం చర్చనీయాంశంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నంబర్ వన్ టెలికాం కంపెనీ ఎయిర్ టెల్. అటు ఏపీ, ఇటు తెలంగాణలో ఎయిర్ టెల్ కు పెద్దసంఖ్యలో యూజర్లున్నారు. అటు కాల్ మార్కెట్లోనూ, ఇటు నెట్ మార్కెట్లోనూ ఎయిర్ టెల్ కు తిరుగులేదు. ఐడియా గట్టిపోటీ ఇస్తున్నా.. ఎయిర్ టెల్ మాత్రం మొదటిస్థానాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. నెట్ వర్క్ విషయంలో కూడా ఎయిర్ టెల్ ఇంతవరకూ ఎప్పుడూ సమస్యలు ఎదుర్కోలేదు. కొత్తగా ఓపెన్ నెట్ వర్క్ అంటూ వినియోగదారుల్ని మరింతగా ఆకట్టుకుంటోంది. అయితే ప్రస్తుతం నడుస్తున్న 4జీ యుగంలో నెట్ ఒక్క నిమిషం ఆగినా ఎవరూ భరించలేకపోతున్నారు. అలాంటిది ఏకంగా ఒక రోజంతా నెట్ రాకపోతే పరిస్థితి ఏంటి. ఎయిర్ టెల్ వినియోగదారులకు ఈ పరిస్థితి అనుభవంలోకి వచ్చింది. గురువారం ఉదయం నుంచి బాగా నెమ్మదించిన ఎయిర్ టెల్ నెట్ వర్క్.. అర్థరాత్రి సమయంలో మొత్తం నిలిచిపోయింది. దీంటో నెట్ కనెట్టవక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కస్టమర్ సర్వీస్ సెంటర్లు కూడా సరిగ్గా రిప్లై ఇవ్వకపోవడంతో.. వారు మరింత ఆగ్రహించారు. ఎయిర్ టెల్ కూడా ఇలా చేస్తుందనుకోలేదని మండిపడ్డారు. మొత్తం మీద శుక్రవారం ఉదయానికి సమస్య సాల్వ్ కావడంతో ఎయిర్ టెల్ ప్రకటన ఇచ్చింది. వినియోగదారులకు కలిసిన అసౌకర్యానికి క్షమించమని కోరింది. అయితే వినియోగదారులకు ఆగ్రహం వస్తే ఎలా ఉంటుందో.. ఎయిర్ టెల్ కు ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చిందని, మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటుందని మార్కెట్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

మూడో అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్గా భారత్!

20/10/2016: న్యూఢిల్లీ: భారత్ 2026 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్ గల దేశంగా అవతరిస్తుందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అంచనా వేసింది. ఒక దేశానికి వచ్చే వెళ్లే విమాన ప్రయాణికుల సంఖ్యనే ఇక్కడ ఏవియేషన్ మార్కెట్‌గా పరిగణలోకి తీసుకున్నాం. ఐఏటీఏ ప్రకారం.. ప్రపంచంలో అతి పెద్ద ఏవియేషన్ మార్కెట్ గల దేశాల్లో ఇండియా 9వ స్థానంలో ఉంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. 2029 నాటికి చైనా అమెరికాను వెన క్కు నెట్టి అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్ గల దేశంగా అవతరించనుంది. ఇక మనం 2026 నాటికి యూకేను వెనక్కు నెట్టి మూడో స్థానంలో నిలువనున్నాం. టాప్-10లోకి ఇండోనేసియా అడుగుపెట్టనుంది. ఇండియాలోని విమాన ప్రయాణికుల సంఖ్య 2035 నాటికి 44.2 కోట్లకు చేరనుంది. ఇదే సమయంలో ప్రస్తుతం 380 కోట్లుగా ఉన్న మొత్తం అంతర్జాతీయ విమాన ప్రయాణికుల సంఖ్య 720 కోట్లకు పెరగనుంది. విమాన ప్రయాణికుల రద్దీ 23 శాతం వృద్ధి న్యూఢిల్లీ: దేశీ విమాన ప్రయాణికుల రద్దీ సెప్టెంబర్‌లో 23.4 శాతంగా నమోదయ్యింది. వివిధ విమానయాన కంపెనీలు ఈ నెలలో మొత్తంగా 82.3 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. ఇండిగో 40 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానంలో జెట్ ఎయిర్‌వేస్ (16.2 శాతం), ఎయిర్ ఇండియా (14.7 శాతం), స్పైస్‌జెట్ (12.5%) వంటి తదితర కంపెనీలు ఉన్నాయి. ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ గణాంకాల ప్రకారం.. గతేడాది ఇదే నెలలో నమోదైన విమాన ప్రయాణికుల సంఖ్య 66.66 లక్షలుగా ఉంది. ఇక జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో విమానయానం చేసిన వారి సంఖ్య గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 5.9 కోట్ల నుంచి 7.2 కోట్లకు పెరిగింది. నేడు రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ విధి విధానాలు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రీజినల్ కనెక్టివిటీ స్కీమ్(ఉడాన్)కి సంబంధించిన తుది పూర్తి విధివిధానాలు శుక్రవారం వెల్లడికానున్నాయి. ఇదే జరిగితే సామాన్యులు రూ.2,500లతోనే (గంట ప్రయాణానికి) విమానయానం చేయవచ్చు. విమానయానాన్ని సామాన్యులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ ఏడాది జూలై 1న రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ ముసాయిదాను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. పౌరవిమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు ఈ నెల 21న ఈ స్కీమ్‌కు సంబంధించిన తుది ప్రకటన చేసే అవకాశముంది.

ఆస్టన్ మార్టిన్ ‘డీబీ11’ @రూ.4.27 కోట్లు

20/10/2016: చెన్నై: బ్రిటిష్ సూపర్ కార్ బ్రాండ్ ‘ఆస్టన్ మార్టిన్’ తాజాగా ‘డీబీ11’ను చెన్నైలో ఆవిష్కరించింది. దీని ధర రూ.4.27 కోట్లుగా ఉంది. ఆస్టన్ మార్టిన్ తన ‘డీబీ11’కి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రోడ్‌షోలను నిర్వహించింది. కాగా కంపెనీ ఈ మోడల్‌ను తొలిగా ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 86వ ఇంటర్నేషనల్ జెనీవా మోటార్ షో ప్రదర్శించింది. ‘డీబీ11’లో 5.2 లీటర్ ట్విన్ టర్బో చార్జ్‌డ్ వీ-12 ఇంజిన్‌ను అమర్చారు. కంపెనీ నుంచి వస్తోన్న తేలికపాటి, దృఢమైన, అత్యంత శక్తివంతమైన కారు ఇదే. ‘డీబీ11’ కార్ల విక్రయాలు ఈ ఏడాది చివరి త్రైమాసికంలో ప్రారంభమవుతాయి.

స్మార్ట్ఫోన్ రారాజులకు చైనీస్ బ్రాండ్ల దెబ్బ

19/10/2016: భారత్లో స్మార్ట్ఫోన్ రారాజులు శాంసంగ్, మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్ల మార్కెట్ షేరుకు దెబ్బకొడుతూ చైనీస్ కంపెనీలు దూసుకెళ్లాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో చైనీస్ స్మార్ట్ఫోన్ ప్లేయర్లు లెనోవో, షియోమి, వివో, ఓపోలు మార్కెట్లో భారీ అమ్మకాలు చేపట్టి, టాప్-10 స్థానాల్లో నిలిచాయని హాంగ్కాంగ్ ఆధారిత మార్కెట్ రీసెర్చర్ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. గత క్వార్టర్లో 27శాతమున్న చైనీస్ బ్రాండ్ల మార్కెట్ షేరు ఈ క్వార్టర్లో 32శాతానికి ఎగిసిందని పేర్కొంది. అదేవిధంగా సెప్టెంబర్లో లాంచ్ చేసిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సర్వీసులతో ఆ ఇండస్ట్రీస్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఎల్వైఎఫ్ మార్కెట్లో నెంబర్ 4 స్థానానికి ఎగబాకినట్టు కౌంటర్ పాయింట్ వెల్లడించింది. మరోవైపు పండుగల సీజన్ నేపథ్యంలో భారత్లో స్మార్ట్ఫోన్ షిప్మెంట్లూ భారీగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది స్మార్ట్ఫోన్ షిప్మెంట్స్ 35 మిలియన్ యూనిట్లు రికార్డు మార్కును తాకినట్టు వెల్లడైంది. అంటే ఈ షిప్మెంట్లు దాదాపు 21శాతం పెరిగాయి. ఇదంతా పండుగ సీజన్ కాలంలో రీటైలర్ల నుంచి వస్తున్న డిమాండేనని కౌంటర్ పాయింట్ వివరించింది. మొట్టమొదటిసారి భారత్లో 30 మిలియన్ స్మార్ట్ఫోన్లు విక్రయాలు జరిగాయని కౌంటర్పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ నీల్ షా తెలిపారు. ఈ ఏడాది ప్రథమార్థంలో మందకొండిగా సాగిన స్మార్ట్ఫోన్ అమ్మకాలు, ద్వితీయార్థంలో పండుగ సీజన్లో భారీగా పుంజుకుంటున్నాయని ఆనందం వ్యక్తంచేశారు. దీపావళి ఈ అమ్మకాలను మరింత పెంచుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఉచితమైన వాయిస్, డేటా వంటి సంచలనమైన ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వచ్చిన జియో సర్వీసులతో, ఎల్వైఫ్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ మార్కెట్ షేరు 6.7శాతానికి ఎగిసినట్టు కౌంటర్పాయింట్ తెలిపింది. మార్కెట్ రారాజులు శాంసంగ్, మైక్రోమ్యాక్స్లు తీవ్ర ఇరకాటంలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆ సంస్థ పేర్కొంది. దీంతో ఆ సంస్థలు మార్కెట్ షేరు సెప్టెంబర్ క్వార్టర్లో 21.6శాతం, 9.8 శాతం కోల్పోయినట్టు వెల్లడించింది. అయినప్పటికీ ఈ రెండు టాప్ స్థానాల్లోనే ఉన్నాయి. రెడ్మి నోట్3 మోడల్ అద్భుతమైన ప్రదర్శనతో షియోమి నంబర్ 6 స్థానంలోకి వచ్చింది. వివో, ఓపోలు 7, 8 స్థానాలను దక్కించుకున్నాయి.

మేక్ మైట్రిప్ చేతికి ‘ఐబిబో’..

19/10/2016: న్యూఢిల్లీ: ఆన్‌లైన్ పర్యాటక సేవల సంస్థ మేక్‌మైట్రిప్ తన ప్రత్యర్థి సంస్థ ఐబిబోను కొనుగోలు చేయనుంది. ఈక్విటీ రూపంలో ఈ డీల్ జరగనుంది. దీంతో ఈ విభాగంలో మేక్‌మై ట్రిప్ ప్రధాన సంస్థగా అవతరించనుంది. ఐబిబోను దాని వాటాదారులైన దక్షిణాఫ్రికాకు చెందిన నాస్పర్స్, చైనాకు చెందిన టాన్సెంట్ హోల్డింగ్స్ మేక్ మైట్రిప్‌కు విక్రయించేందుకు ముందుకు రాగా, దీనికి ప్రతిగా మేక్ మై ట్రిప్ ఆయా సంస్థలకు తాజా వాటాలను జారీ చేయనుంది. ఈ మేరకు మేక్ మై ట్రిప్ ఓ ప్రకటన విడుదల చేసింది. డీల్ పూర్తయితే ఐబిబో పూర్తిగా మేక్ మైట్రిప్ పరం అవుతుంది. అదే సమయంలో నాస్పర్స్, టాన్సెంట్ హోల్డింగ్స్ కలసి మేక్ మై ట్రిప్‌లో 40 శాతం వాటాను కలిగి ఉంటారు. ఇందుకు అనుగుణంగా మూలధన నిధులను సైతం అందించనున్నట్టు మేక్ మైట్రిప్ సంస్థ తెలిపింది. మేక్ మైట్రిప్ గతంలో సీట్రిప్ డాట్ కామ్‌కు జారీ చేసిన కన్వర్టబుల్ నోట్స్‌ను సాధారణ ఈక్విటీ కిందకు మార్చనున్నట్టు దీంతో ఈ సంస్థకు 10 శాతం వాటా ఉంటుందని వెల్లడించింది. మేక్‌మైట్రిప్ వాటాదారులతోపాటు నియంత్రణ సంస్థల అనుమతి అనంతరం ఈ డీల్ డిసెంబర్‌లోపు పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. మేక్ మై ట్రిప్ నాస్‌డాక్ లిస్టెడ్ కంపెనీ. కాగా, తాజా డీల్ నేపథ్యంలో కంపెనీ షేరు ధర మంగళశారం ఇంట్రాడేలో దాదాపు 50% ఎగసి 31 డాలర్లను తాకడం గమనార్హం.

రూపాయికే షియామీ స్మార్ట్ ఫోన్!

17/10/2016: న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ దీపావళి అమ్మకాల్లో భాగంగా వినియోగదారులకు సర్ ప్రైజింగ్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూపాయికే రెడ్ మీ 3ఎస్ ప్రైమ్ స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దీపావళి సందర్భంగా షియోమీ అక్టోబర్ 17-19 మధ్య ఫ్లాష్ అమ్మకాలు నిర్వహించనుంది. ఇందుల్లో భాగంగా రెడ్ మీ 3ఎస్ స్మార్ట్ ఫోన్ ను రూపాయికే విక్రయించనుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫ్లాష్ అమ్మకాలు ప్రారంభమవుతాయి. అయితే ముందుగా ఎంఐ డాట్ కామ్, ఎంఐ స్టోర్ యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలి. రూపాయికి 30 రెడ్ మీ 3ఎస్ ప్రైమ్ స్మార్ట్ ఫోన్లు అమ్మకానికి ఉంచుతామని షియోమీ వెల్లడించింది. రూపాయికి ఫోన్ కోలుగోలు చేసిన తర్వాత రెండు గంటల్లో సొమ్ము చెల్లించాలని, లేకుంట్ ఆర్డర్ రద్దవుతుందని షియోమీ తెలిపింది. రెడ్ మీ 3ఎస్ ప్రైమ్ ఫీచర్లు 5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే మెటల్ బాడీ 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్ 32 జీబీ ఇంటర్నల్ మెమరీ 128 జీబీ ఎక్స్ పాండబుల్ మెమరీ 13 ఎంపీ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 4100 ఎంఏహెచ్ బ్యాటరీ

'ఐ ఫోన్ 7 ' హైదరాబాద్ ముంగిట్లో

08/10/2016: హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టిస్తున్న ఆపిల్ కొత్త మోడల్ ఐ ఫోన్ 7 ఇపుడు హైదరాబాద్ ముంగిట్లో కొలువు దీరనుంది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ పండగ సీజన్ లో హైదరాబాదీలను ఆకట్టుకునేందుకు అక్టోబర్ 7 నగర మార్కెట్లోకి ప్రత్యేకంగా లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సాయంత్రం 7 గంటలకు అప్ట్రానిక్స్, అపెక్స్ స్టోర్లలో ఎక్స్ క్లూజివ్ గా లిమిటెడ్ స్టాక్ ను అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. సమీపంలోఈ స్టోర్లలో సంప్రదించి తమ తాజా డివైస్ ఐ ఫోన్ 7 ను సొంతం చేసుకోవాలని కోరింది. అలాగే అప్ ట్రానిక్స్ తన ఫేస్ బుక్ పేజ్ లో ఐ ఫోన్ లాంచింగ్ విషయాన్ని ప్రకటించింది. మరిన్ని వివరాల కోసం http://aptronixindia.com/store/service-centers సందర్శించాలని కోరింది. కాగా ఇటీవల ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన సూపర్ ఐ ఫోన్ 7 , ఐఫోన్ 7 ప్లస్ స్మార్ట్ఫోన్లు, నేడు భారత వినియోగదారుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

పాన్ మసాలా ప్రమోషన్కు జేమ్స్బాండ్

08/10/2016: సాధారణంగా ఏ బ్రాండ్ అయినా ప్రమోట్ చేయడానికి అక్కడి లోకల్ స్టార్స్ను తీసుకుంటారు. కాస్త పెద్ద బ్రాండ్ అయితే బాలీవుడ్ స్టార్స్ని ట్రై చేస్తారు. కానీ ఇండియాకు చెందిన ఓ పాన్ మసాలా కంపెనీ వారు మాత్రం ఏకంగా తమ బ్రాండ్ ప్రమోషన్కు హాలీవుడ్ స్టార్ హీరోనే దించేశారు. అది కూడా జేమ్స్బాండ్ సీరిస్తో అంతర్జాతీయంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పీర్స్ బ్రోస్నన్తో ఇండియన్ పాన్ మసాలాను ప్రమోట్ చేయిస్తున్నారు. శుక్రవారం ఉదయం అన్ని జాతీయ పత్రికల్లో వార్తలతో పాటు ఓ యాడ్ కూడా ప్రముఖంగా ఆకర్షించింది. వరుస బాండ్ చిత్రాలతో అలరించిన మాజీ జేమ్స్బాండ్ పీర్స్ బ్రోస్నన్ చేతిలో ఇండియాలో తయారైన పాన్ మసాలా డబ్బా ఉన్న ఈ యాడ్ అందరినీ ఆకట్టుకుంటోంది. గతంలో సైఫ్ అలీఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్స్ ప్రమోట్ చేసిన ఈ బ్రాండ్కు ప్రస్తుతం ఈ హాలీవుడ్ స్టార్ అంబాసిడర్గా వ్యవహరించేందుకు అంగీకరించారు. బాండ్ ప్రచారం పాన్ మసాలాకు ఇంటర్నేషనల్ ఫేం తీసుకు వస్తుందేమో చూడాలి.

బ్యాంకులది ఒడిదుడుకుల బాటే! - అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నివేదిక

07/10/2016: వాషింగ్టన్: భారత్ బ్యాంకులది ఒడిదుడుకుల బాటేనని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. లాభాలు తగ్గడం, మొండిబకాయిల బరువు దీనికి కారణంగా వివరించింది. ‘గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ’ పేరుతో ఐఎంఎఫ్ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. మొండిబకాయిల గురించి ప్రత్యేక, అదనపు, సకాల చర్యలు అవసరమని సూచించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌యూ) రుణాల్లో స్థూల మొండిబకాయిలు 2014-15లో 5.32% (రూ.2.67 లక్షల కోట్ల) ఉంటే ఈ పరిమాణం 2015-16లో 9.32%కి (రూ.4.76 లక్షల కోట్లు) పెరగడం ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. గత 12 నెలల్లో 39 లిస్టెడ్ బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు 96% పెరిగాయి. 2016 జూన్ నాటికి రూ.6.3 లక్షల కోట్ల స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్ భారత్ బ్యాం కింగ్‌కు సంబంధించి సంస్థ విడుదల చేసిన నివేదికలో ముఖ్యాంశాలు... ⇔ ఎన్‌పీఏలతో ఇందుకు సంబంధించి అదనపు ప్రొవిజనింగ్ (కేటాయింపులు) బ్యాంకింగ్‌కు భారంగా మారతాయి. దీనితో వ్యవస్థకు మరింత అధిక మొత్తంలో మూలధనం అవసరం అవుతుంది. ⇔ సమస్య పరిష్కార దిశలో కార్పొరేట్ దివాలా చట్టాల సంస్కరణల పటిష్ట అమలు అవసరం. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్‌మెంట్, ఈక్విటీకి రుణ మార్పిడి, సమగ్ర, పారదర్శక నియమ నిబంధనల అమలు ముఖ్యం. ⇔ కార్పొరేట్ రుణ ఒత్తిడులను ఎదుర్కొనే ఒక ప్రత్యేక యంత్రాంగమూ మొండిబకాయిల సమస్య పరిష్కారంలో కీలకం. ⇔ భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు వర్ధమాన దేశాల్లోనూ మొండిబకాయిల సమస్య ఉంది. ఆయా దేశాల్లో బ్యాంకింగ్ పర్యవేక్షణ పటిష్టత అవసరం. అలాగే ప్రపంచవ్యాప్తంగా సమస్య తీవ్రమవకుండా నిరోధించే క్రమంలో వ్యవస్థలు, సెంట్రల్ బ్యాంకుల మధ్య సమన్వయ అవసరం ఎంతో ఉంది. ⇔ స్థిరమైన రాజకీయ వాతావారణ పరిస్థితి భారత్‌కు లాభిస్తున్న అంశాల్లో కీలకమైనది. ⇔ పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపై దృష్టి సమస్య పరిష్కారంలో కీలకం.

లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు

06/10/2016: ముంబై : లాభాల స్వీకరణతో నిన్నటి ట్రేడింగ్లో నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్లో లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 97.21 పాయింట్ల లాభంలో 28,318వద్ద, నిఫ్టీ 27.85 పాయింట్ల లాభంలో 8,771 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో బ్యాంకింగ్,ఐటీ, రియల్ ఎస్టేట్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. దీంతో బ్యాంకు నిఫ్లీ 0.42 శాతం, ఎన్ఎస్ఈలో పీఎస్యూ బ్యాంకు ఇండెక్స్ 0.6 శాతం పడిపోయాయి. ఇదే సమయంలో ఆయిల్, గ్యాస్ షేర్లలో కొనుగోలు మద్దతు కొనసాగింది. బ్యాంకింగ్ కంపెనీల్లో యాక్సిస్ బ్యాంకు 2.6 శాతం నష్టపోతూ టాప్ లూజర్గా ట్రేడ్ అవుతోంది. రిలయన్స్, భారతీ ఎయిర్టెల్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, ఎల్ అండ్ టీ, అరబిందోలు టాప్ గెయినర్లుగా లాభాలు పండిస్తుండగా.. యాక్సిస్ బ్యాంకు, సిప్లా, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సెన్సెక్స్ సూచీలో నష్టాలు గడిస్తున్నాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ కొంత బలహీనంగా ప్రారంభమైంది. బుధవారం ముగింపుకు ఆరు పైసల నష్టంతో 66.56గా ఓపెన్ అయింది. డిసెంబర్లో ఫెడ్ రేట్ పెంపు అంచనాలు పెరగడంతో ఇతర కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ బలపడుతూ వస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు డాలర్ బలపడుతుండటంతో బంగారం ధరలు నేలచూపులు చూస్తున్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 124 రూపాయల నష్టంతో రూ.29,923గా నమోదవుతోంది.

ఆటోమేషన్తో ఉద్యోగాలకు ఎసరు - భారత్‌లో 69 శాతంగా ఉంటుంది - ప్రపంచ బ్యాంకు

06/10/2016: వాషింగ్టన్: ఆటోమేషన్‌తో భారత్‌లో 69 శాతం ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. ఇది చైనాలో 77 శాతంగా ఉంటుందని తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సంప్రదాయ ఆర్థిక విధానాలను టెక్నాలజీ పూర్తిగా మార్చేస్తుందని పేర్కొంది. వృద్ధిని పెంచుకునేందుకు మౌలిక రంగంలో మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహించాలని సూచించింది. అయితే, భవిష్యత్తు ఆర్థిక విధానాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి మౌలిక సదుపాయాలు అవసరమో ఆలోచన చేయాల్సి ఉందని పేర్కొంది. ‘ప్రపంచాన్ని టెక్నాలజీ సమూలంగా మార్చేస్తుందనే విషయం మనకు తెలిసిందే. అయితే, సంప్రదాయ ఆర్థిక విధానమైన వ్యవసాయం, తక్కువ స్థాయిలో తయారీ రంగం నుంచి పూర్తి స్థాయి పారిశ్రామిక దేశంగా మారిపోవడం అన్నది అన్ని వర్ధమాన దేశాలకు సాధ్యమయ్యేది కాదు’ అని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్‌కిన్ అన్నారు. వాషింగ్టన్‌లోని బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్‌లో పేదరికంపై జరిగిన చర్చా కార్యక్రమం సందర్భంగా జిమ్‌కిన్ ఈ అంశాలను వెల్లడించారు. కిమ్ ఏం చెప్పారంటే... ప్రపంచ బ్యాంకు పరిశోధన ప్రకారం ఆటోమేషన్ (మనుషులు చేసే పనిని యంత్రాలతో చేయించుకోవడం) వల్ల భారత్‌లో 69 శాతం, చైనాలో 77 శాతం, ఇథియోపియాలో 85 శాతం ఉద్యోగాలకు ముప్పు ఉంది. ఇదే గనుక వాస్తవ రూపం దాలిస్తే ఈ దేశాలు అధిక సంఖ్యలో ఉద్యోగాలను కోల్పోతాయి. ఈ దృష్ట్యా ఆర్థికాభివృద్ధికి అందుబాటులో ఉన్న మార్గాలను అర్థం చేసుకుని అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలి. యాంత్రీకరణ, టెక్నాలజీలు సంప్రదాయ పారిశ్రామిక తయారీని దెబ్బతీశాయి. దీంతో మాన్యువల్ ఉద్యోగాలపై ప్రభావం పడింది. దీనికి ఏ దేశం కూడా అతీతం కాదు. భారత్‌లో చైల్డ్ స్టంటింగ్ (చిన్నారుల్లో ఎదుగుదల లోపం) 38.7 శాతంగా ఉంది. వీరంతా భవిష్యత్తు తరానికి ప్రతీకలు. వారిలో 40 శాతం మంది ప్రపంచ డిజిటల్ ఆర్థిక రంగంలో పోటీ పడలేకున్నారు. పక్కనే ఉన్న చైనా మాత్రం చైల్డ్ స్టంటింగ్‌ను చాలా కనిష్ట స్థాయికి తగ్గించిందని కిమ్ పేర్కొన్నారు.

ఇంటర్నెట్ లేకున్నా ఓలా బుకింగ్

05/10/2016: హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాబ్ అగ్రిగేటర్ ఓలా తాజాగా ఆఫ్‌లైన్ ఫీచర్‌ను జోడించింది. దీనితో ఇంటర్నెట్ లేనప్పటికీ స్మార్ట్‌ఫోన్ నుంచి క్యాబ్‌ను బుక్ చేయవచ్చు. బుక్ వయా ఎస్‌ఎంఎస్ అన్న ఆప్షన్‌పై క్లిక్ చేయగానే కస్టమర్ మొబైల్ నుంచి లొకేషన్‌తో కూడిన వివరాలతో ఒక మెసేజ్ ఓలాకు వెళ్తుంది. వెంటనే కస్టమర్‌కు సమీపంలో ఉన్న మైక్రో, మినీ, ప్రైమ్, లగ్జరీ క్యాబ్‌ల వివరాలతో ఒక ఎస్‌ఎంఎస్ వస్తుంది. కస్టమర్ తనకు నచ్చిన క్యాబ్‌ను ఎంచుకోవచ్చు. ఎంపిక చేసుకోగానే డ్రైవర్, క్యాబ్ వివరాలతో మరో ఎస్‌ఎంఎస్ వస్తుంది. అటు డ్రైవర్‌కూ కస్టమర్ సమాచారం, జీపీఎస్ లొకేషన్ సైతం ఎస్‌ఎంఎస్ ద్వారా వెళ్తుంది. ఇంటర్నెట్ ఉంటే రైడ్ వివరాలు, జీపీఎస్ ట్రాకింగ్, ఎస్‌వోఎస్ బటన్ వంటి ఫీచర్లు వినియోగించుకోవచ్చు. ఓలా ఆఫ్‌లైన్ బుకింగ్ సౌకర్యం ప్రస్తుతం ప్రధాన నగరాల్లో ఉంది. దశలవారీగా మొత్తం 102 నగరాలు, పట్టణాలకు విస్తరిస్తామని ఓలా ఒక ప్రకటనలో తెలియజేసింది.

భారత జీడీపీ ఇకముందు బలంగానే - ఈ ఏడాది 7.6%.. వచ్చే ఏడాది 7.7% - ప్రపంచ బ్యాంకు అంచనా

05/10/2016: వాషింగ్టన్: భారత జీడీపీ ఇక ముందూ జోరుగానే ఉంటుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. 2016లో 7.6 శాతం, 2017లో 7.7 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. వ్యవసాయ రంగం పుంజుకోవడం, ఉద్యోగుల వేతన సవరణలు వినియోగానికి ఊతమిస్తాయని... ఎగుమతుల నుంచి సానుకూల తోడ్పాటుతో పాటు ప్రైవేటు పెట్టుబడులు మధ్య కాలానికి కోలుకోవడం వంటివి వృద్ధికి మద్దతునిస్తాయని తెలియజేసింది. ఈ మేరకు దక్షిణాసియా ఆర్థిక రంగంపై ప్రపంచ బ్యాంకు తాజాగా ద్వైవార్షిక నివేదికను విడుదల చేసింది. భారత్‌లో పేదరికాన్ని వేగంగా తగ్గించటం, అన్ని వర్గాలనూ వృద్ధిలో భాగస్వాముల్ని చేయడం వంటి అనేక సవాళ్లున్నాయని బ్యాంకు తన నివేదికలో ప్రస్తావించింది. దక్షిణాసియా ప్రాంతం ప్రపంచ అభివృద్ధి కేంద్రంగానే కొనసాగుతుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. చైనా మందగమనం, ఉద్దీపనలపై అనిశ్చితి తదితర వెలుపలి ఒత్తిళ్లలను సైతం తట్టుకుని నిలబడిందని పేర్కొంది. స్వల్ప కాలంలో సమస్యలు స్వల్ప కాలంలో వృద్ధి రేటును మందగింపజేసే సమస్యలను కూడా నివేదిక ప్రస్తావించింది. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి నెలకొనడం, కమోడిటీ ధరల ఒడిదుడుకులు, ప్రపంచ వాణిజ్యంపై బ్రెగ్జిట్ ప్రభావం, చైనా ఆర్థిక రంగం మరింత నిదానించడం వంటివి ఆర్థిక రంగం కోలుకోవడాన్ని మరింత ఆలస్యం చేస్తాయని ప్రపంచ బ్యాంకు తెలిపింది. రెండేళ్లు ఇదే స్థాయిలో: ఐఎంఎఫ్ భారత్ జీడీపీ విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మరింత సానుకూలతను వ్యక్తం చేసింది. గత అంచనాలను పెంచింది. భారత జీడీపీ వృద్ధి వేగంగా పెరుగుతోందని, 2016, 2017 సంవత్సరాల్లో 7.6 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ తెలిపింది. ఐఎంఎఫ్ ఈ ఏడాది జూలైలో ప్రకటించిన వృద్ధి రేటు అంచనాల కంటే తాజా అంచనాలు 0.2 బేసిస్ పాయింట్లు ఎక్కువ కావడం గమనార్హం.

ఒక్కరోజు అమ్మకాలు.. రూ. 1400 కోట్లు!

05/10/2016: న్యూఢిల్లీ : ఆన్‌లైన్ అమ్మకాలలో స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్లు పెడుతున్నారంటే చాలు.. మనవాళ్లు విచ్చలవిడిగా కొనేస్తారన్న విషయం మరోసారి రుజువైంది. ఐదు రోజుల పాటు ప్రత్యేక ఆఫర్లతో మోతెక్కిస్తున్న ఈ కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్.. ఇలాంటి సంస్థలన్నీ కూడా బ్రహ్మాండమైన వసూళ్లు సాధిస్తున్నాయి. అందులోనూ ఫ్లిప్‌కార్ట్ మొదటిరోజు అమ్మకాలు రికార్డు బద్దలుకొట్టాయి. ప్రారంభం రోజునే ఏకంగా రూ. 1400 కోట్ల అమ్మకాలను నమోదు చేసి ఫ్లిప్‌కార్ట్ ఈ రేసులో దూసుకుపోయింది. పోటీదారుల కంటే నాలుగు అడుగులు ముందే నిలిచింది. గత సంవత్సరం సాధించిన అమ్మకాల కంటే రెట్టింపునకు పైగా ఈసారి అమ్మకాలు సాగాయని తెలుస్తోంది. వాస్తవానికి ఈసారి వెయ్యి కోట్ల రూపాయల వరకు అమ్మకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకుడు, సీఈఓ బిన్నీ బన్సల్ చెప్పారు. తొమ్మిదేళ్ల క్రితం ఆన్‌లైన్‌లో కేవలం పుస్తకాల అమ్మకాలతో వ్యాపారం ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్ తొలిసారి ఒక్క రోజులో వెయ్యి కో్ట్ల మార్కును దాటి రికార్డు సాధించింది. ఒక్క రోజులోనే గ్రాస్ అమ్మకాలు ఇంత స్థాయిలో ఉండటం ఇప్పటి వరకు మరే భారతీయ ఈ-టైలర్‌కు సాధ్యం కాలేదని అంటున్నారు. దసరా, దీపావళి సీజన్ సందర్భంగా మొత్తం అందరూ కలిసి ఐదురోజుల అమ్మకాల్లో దాదాపు రూ. 12 వేల కోట్లు సాధిస్తారని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఏడాది ఇదే సీజన్‌లో మొత్తం అమ్మకాలు కేవలం రూ. 7 కోట్లు మాత్రమే. దీన్ని బట్టి చూస్తే భారతీయ రీటైల్ మార్కెట్ బాగా పుంజుకుందని అర్థమవుతోంది.

తొలిరోజే అదరగొట్టిన స్నాప్ డీల్ సేల్స్

04/10/2016: న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్డీల్ పండుగ సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రారంభించిన 'అన్బాక్స్ దీపావళి సేల్' తొలిరోజు అదరగొట్టిందట. ఈ ఆఫర్ ద్వారా కంపెనీ విక్రయాలు తొమ్మిది రెట్లు ఎగిశాయని స్నాప్డీల్ ప్రకటించింది. స్నాప్డీల్ ప్లాట్ఫామ్పై అమ్మకాలు నిర్వహించే 37మంది విక్రయదారుల టర్నోవర్ రూ.1 కోట్లకు పైగా క్రాస్ అయినట్టు వెల్లడించింది. కేవలం ఇదంతా తొలిరోజే నమోదుకావడం విశేషం. ప్రతిరోజు నమోదవుతున్న అమ్మకాల కంటే కనీసం తొమ్మిది రెట్లు తమ విక్రయాలు ఎగిసినట్టు స్నాప్డీల్ ఓ ప్రకటనలో తెలిపింది. వీటిలో 80 శాతం ఆర్డర్స్ మొబైల్స్ నుంచి వస్తున్నట్టు పేర్కొంది. 2 టైర్,3 టైర్ నగరాల్లో ముందస్తు బుకింగ్స్ దాదాపు 20 శాతం పెరిగాయని, ఇతర మెట్రోలు మిజోరాం, మేఘాలయ, గోవా, హిమాచల్ప్రదేశ్, జమ్మూ అండ్ కశ్మీర్ ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగానే ఆర్డర్స్ వస్తున్నట్టు వెల్లడించింది. మల్టిపుల్ ఫ్యాషన్ బ్రాండ్స్లోని ఫుట్వేర్ ఉత్పత్తుల్లో ఆకర్షించే డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయని, తొలిరోజే లక్షకు పైగా ఫుట్వేర్ పేర్స్ అమ్ముడు పోయినట్టు స్నాప్డీల్ పేర్కొంది. మొబైల్ ఫోన్లలో రెడ్మి నోట్3, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 5ఎస్, మి మ్యాక్స్, లీఎకో లీ మ్యాక్స్2లు టాప్ సెల్లింగ్ ఉత్పత్తులుగా నిలిచినట్టు వెల్లడించింది. ఎయిర్ కండీషర్లు, కిచెన్ ఉపకరణాలు, ప్రెషర్ కుక్కర్స్, కెమెరాలు, ల్యాప్టాప్స్ వంటివి కూడా ఎక్కువగా విక్రయించినట్టు స్నాప్డీల్ ఆ ప్రకటనలో తెలిపింది.

పెరగనున్న టాటా కార్ల ధరలు

03/10/2016: న్యూఢిల్లీ: పెరిగిన ముడి సరుకుల వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు కీలకమైన పండుగల సమయంలో కార్ల ధరలను పెంచే ఆలోచనల్లో టాటా గ్రూప్ ఉంది. కార్ల ధరలను పెంచనున్నామని, దీనిపై తాము దృష్టి సారించామని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల విభాగం ప్రెసిడెంట్ మయాంక్ ప్రతీక్ తెలిపారు. పండుగల సీజన్‌లో కార్ల ధరల పెంపు ఉంటుందని చూచాయగా చెప్పారు. ఉత్పాదక వ్యయాలు పెరగడమే ధరల పెంపునకు కారణంగా పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని సంస్థలు ధరలు పెంచాయని, తాము కూడా చాలా కాలంగా ధరలను సవరించని విషయాన్ని ప్రతీక్ పేర్కొన్నారు. టాటా మోటార్స్ రూ.2.15 లక్షలు-16.3 లక్షల శ్రేణిలో నానో, టియాగో, ఏరియా తదితర మోడళ్లను విక్రయిస్తోంది.

పండుగ సీజన్లో ఈ-కామర్స్ దిగ్గజాల షాక్

03/10/2016: న్యూఢిల్లీ : పండుగ సీజన్ను క్యాష్ చేసుకుని భారీగా ప్రకటనలు ఇచ్చేసుకునే ఉత్పత్తిదారులకు ఈ-కామర్స్ దిగ్గజాలు స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్ షాకిచ్చాయి. దీపావళికి ముందు తమ ప్లాట్ఫామ్పై ప్రొడక్ట్ ప్రకటన ఇచ్చేవారికి భారీగా రేట్లను పెంచేశాయి.అక్టోబర్ 2 నుంచి 6వ తేదీ వరకు జరుగబోయే 'అన్బాక్స్ దీపావళి సేల్స్' ప్రోగ్రామ్ కింద అన్ని రకాల ఉత్పత్తులపై కాస్ట్ ఫర్ క్లిక్(సీపీఏ)లను స్నాప్డీల్ రెట్టింపు చేసింది. అదేవిధంగా ఫ్లిప్కార్ట్ సైతం ప్రొడక్ట్ లిస్టింగ్ యాడ్(పీఎల్ఏ) రేట్లను 50 శాతం పెంచేసింది. 'బిగ్ బిలియన్ డే సేల్' కింద లైఫ్స్టైల్, గృహోపకరణాలు, మొబైల్స్, ఎలక్ట్రానిక్ వంటి వస్తువులకు ఈ ప్రకటన ఖర్చులు భారం పడనుంది.మరో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మాత్రం తాను నిర్వహించబోయే 'గ్రేట్ ఇండియన్ సేల్' నేపథ్యంలో ప్రకటన రేట్లలో ఎలాంటి మార్పులు చేపట్టలేదు.పెద్ద ఉత్పత్తుల బ్రాండులు తమ అడ్వర్టైజింగ్లను కోసం భారీ మొత్తంలో ఖర్చుచేసైనా సరే మీడియా ద్వారా ప్రకటనలు ఇచ్చేసుకుంటారని,కానీ చిన్న వర్తకులపైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పండుగ సీజన్లో ఉండే రద్దీకి అనుకూలంగా ఈ రేట్లను పెంచామని, టీవీ, ఇతర మీడియాలు కూడా ఈ సమయంలో ప్రకటన రేట్లను పెంచుతాయని ఫ్లిప్కార్ట్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ రామకృష్ణ చెప్పారు. ప్రకటనదారులు దానికి సన్నద్దమయ్యే ఉంటారని పేర్కొన్నారు.

నిస్సాన్ నుంచి ‘డాట్సన్ రెడిగో స్పోర్ట్’

30/09/2016: న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన దిగ్గజ వాహన కంపెనీ ‘నిస్సాన్’ తాజాగా తన ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ ‘రెడిగో’లో లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ ‘డాట్సన్ రెడిగో స్పోర్ట్’ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.3.49 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. ఈ కొత్త వేరియంట్‌లో రియర్ పార్కింగ్ సెన్సార్, బ్లాక్ ఇంటీరియర్స్, బ్లూటూత్ ఆధారిత మ్యూజిక్ సిస్టమ్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, స్పోర్టీ రూఫ్ స్పాయిలర్ అండ్ గ్రాఫిక్స్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. తాజా కొత్త వేరియంట్‌కు ఒలింపిక్స్ పతక విజేత సాక్షి మలిక్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారని తెలిపింది. కాగా కంపెనీ జూన్ నెలలో రెడిగో మోడల్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది.

జియోకి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు - సీఓఏఐ

30/09/2016: న్యూఢిల్లీ: దొడ్డిదారిలో వచ్చిన ఆపరేటర్ (బ్యాక్ డోర్ ఆపరేటర్) అంటూ తమపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలన్న రిలయన్స్ జియో డిమాండ్‌ను సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీఓఏఐ) డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ తోసిపుచ్చారు. అలాగే, సీఓఏఐ నిబంధనలను మార్చాలన్న డిమాం డ్‌ను సైతం తిరస్కరించారు. బ్యాక్‌డోర్ ఆపరేటర్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారమని, వీటిపై మాథ్యూస్ క్షమాపణలు చెప్పాలని, లేకుంటే న్యాయపరమైన చర్యలు చేపడతామని జియో బుధవారం ప్రకటన జారీ చేసింది.

ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ గా మళ్లీ జిమ్ యాంగ్ కిమ్

29/09/2016: వాషింగ్టన్: ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా మళ్లీ జిమ్ యాంగ్ కిమ్ నియమితుల య్యారు. ఈయన పదవీ కాలం వచ్చే ఏడాది జూలై 1 నుంచి ప్రారంభమౌతుంది. కాగా జిమ్ యాంగ్ కిమ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా ఐదేళ్లపాటు కొనసాగుతారు. ‘బ్యాంక్ అధ్యక్షుడిగా వరుసగా రెండవసారి ఎన్నిక కావడం ఎంతో ఆనందంగా ఉంది. దీన్ని గొప్ప గౌరవంగా భావిస్తాను. అంతర్జాతీయంగా పేదరిక నిర్మూలనకు అవిశ్రాంతంగా శ్రమిస్తాను’ అని కిమ్ పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లందరూ కిమ్‌ను ఏకగ్రీవంగా ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. కాగా కిమ్ 2012లో బ్యాంక్ ప్రెసిడెంట్‌గా నియమితులైనప్పుడు 2030 నాటికి పేదరికాన్ని నిర్మూలించడం, వర్ధమాన దేశాల్లోని వ్యక్తుల ఆదాయాన్ని పెంచడం అనే రెండు లక్ష్యాలను బ్యాంకుకు నిర్దేశించారు.

దొడ్డిదారి ఆపరేటర్ వ్యాఖ్యలపై మండిపడ్డ జియో.. - ఆ మాటలు కోర్టు ధిక్కరణే

29/09/2016: న్యూఢిల్లీ: బ్యాక్ డోర్ ఆపరేటర్ (దొడ్డిదారిలో వచ్చిన) అంటూ రిలయన్స్ జియోను ఉద్దేశించి సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీఓఏఐ) చేసిన వ్యాఖ్యలపై జియో మండిపడింది. ఈ ఆరోపణలను సుప్రీంకోర్టు ఇప్పటికే తోసిపుచ్చిందని, ఇలాంటి వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని జియో ఓ ప్రకటనలో పేర్కొంది. రిలయన్స్ జియో బ్యాక్ డోర్ ఆపరేటర్ అని, మరో సంస్థను ముందుంచి లెసైన్స్‌ను సంపాదించిందంటూ సీఓఏఐ చేసిన ఆరోపణలను తప్పుబట్టింది. ‘సీఓఏఐ డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ ప్రకటన అక్రమమైది. అపఖ్యాతి పాల్జేసేది. సుప్రీం ఆదేశాలను ధిక్కరించేది’ అని జియో పేర్కొంది. దీనిపై ఇప్పటికే మాథ్యూస్ నుంచి క్షమాపణలు కోరామని తెలిపింది.

శామ్ సంగ్ ఆన్8 స్మార్ట్ ఫోన్ @ రూ.15,900

28/09/2016: న్యూఢిల్లీ: శామ్‌సంగ్ కంపెనీ కొత్తగా గెలాక్సీ ఆన్8 స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందిస్తున్నామని శామ్‌సంగ్ కంపెనీ తెలిపింది. అక్టోబర్ 2 నుంచి ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే విక్రయోత్సవాల్లో ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చని శామ్‌సంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్(మొబైల్ బిజినెస్) మనుశర్మ పేర్కొన్నారు. ధర రూ.15,900. ఆండ్రాయిడ్(మార్ష్‌మల్లో) ఓఎస్‌పై పనిచేసే ఈ డ్యూయల్ సిమ్ ఫోన్‌లో 5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఆమోలెడ్ డిస్‌ప్లే, 3 జీబీ ర్యామ్, 1.6 గిగాహెర్ట్స్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలు ఉన్నాయని వివరించారు.

ప్రభుత్వ రంగ బ్యాంకుల బలోపేతం- జైట్లీ

28/09/2016: ముంబై: ఒత్తిడిలో ఉన్న మొండి బకాయిల సమస్య పరిష్కరించుకునేలా త్వరలోనే ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ)లను బలోపేతం చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. అవినీతి నిరోధక చట్ట సవరణలకు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదం లభిస్తుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. మంగళవారం ముంబైలో జరిగిన ఎస్‌బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకనమిక్ సదస్సులో జైట్లీ మాట్లాడుతూ... పీఎస్‌బీల ఆరోగ్య స్థితి ఆందోళన కలిగించే విషయంగా పేర్కొన్నారు. ఇతరులతో పోటీపడి పని చేసేలా పీఎస్‌బీలకు అవకాశం ఇవ్వాల్సి ఉందన్నారు. పీఎస్‌బీలకు ప్రభుత్వ ఉద్యోగులే అడ్డుగా పేర్కొన్నారు. అలాగే, అవినీతి నిరోధానికి సంబంధించిన ప్రస్తుత చట్టం (పీసీఏ 1988) సైతం వారిని వాణిజ్య కోణంలో నిర్ణయాలు తీసుకునేలా చేస్తోందని వివరించారు. చట్ట సవరణతో మార్పు వస్తుందన్నారు. గ్రామీణ భారతం, మౌలికరంగాలను పైకి తీసుకురావడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, ఈ రెండు రంగాల్లో పెట్టుబడుల లోటు భారీ స్థాయిలో ఉందన్నారు.

3జీ స్మార్ట్ ఫోన్ల కు ఇక గుడ్బై..

28/09/2016: హైదరాబాద్ : భారత్‌లో 3జీ స్మార్ట్‌ఫోన్లకు కాలం చెల్లనుందా? మొబైల్ తయారీ కంపెనీలు వీటికి బై బై చెప్పనున్నాయా? ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. మొబైల్ కంపెనీలన్నీ దాదాపు కొత్తగా విడుదల చేస్తున్న అన్ని స్మార్ట్‌ఫోన్లనూ 4జీలో తీసుకు వస్తున్నాయి. 90 రోజులపాటు ఉచిత సర్వీసులతో జియో ఇస్తున్న వెల్‌కమ్ ఆఫర్‌తో 4జీ హ్యాండ్‌సెట్లకు విపరీత డిమాండ్ ఏర్పడింది. దీంతో 3జీ హ్యాండ్‌సెట్లకు డిమాండ్ లేకుండా పోయింది. అటు విక్రేతలు సైతం 4జీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇంకేముంది కొన్ని కంపెనీలు 3జీ మొబైల్స్ తయారీకి గుడ్‌బై చెప్పేశాయి. మరికొన్ని వీటిని అనుసరించడం ఖాయంగా కనపడుతోంది. అటు డేటా చార్జీలు గణనీయంగా పడిపోవడంతో కస్టమర్లు 4జీకి సై అంటున్నారు. అనతి కాలంలోనే.. ప్రభుత్వ రంగ ఎంటీఎన్‌ఎల్ 2008 డిసెంబరులో 3జీ సేవలను ప్రారంభించింది. ప్రైవేటు రంగంలో ఎయిర్‌టెల్ 2011 జనవరిలో ఈ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మిగిలిన టెల్కోలు 3జీ సేవలను ప్రారంభించాయి. ఈ ఎనిమిదేళ్లలో దేశవ్యాప్తంగా 3జీ సేవలు ఇంకా విస్తరించకముందే అప్పుడే 4జీ వేగం పుంజుకుంది. రిలయన్స్ జియో ఇందుకు ఆజ్యం పోసింది. 4జీ మొబైళ్ల ధర 3జీ స్థాయికి వచ్చి చేరింది. రూ.3 వేల నుంచి ఇవి లభిస్తున్నాయి. ఈ స్థాయిలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అటు జియో వెల్‌కమ్ ఆఫర్ కస్టమర్లను ఊరిస్తోంది. 3జీ హ్యాండ్‌సెట్లు ఉన్నవారు సైతం మరో స్మార్ట్‌ఫోన్‌ను 4జీలో తీసుకుంటున్నారు. అమెజాన్ స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో 4జీ వాటా 80 శాతానికి ఎగిసింది. ఆరు నెలల క్రితం ఇది 40 శాతమేనని కంపెనీ కేటగిరీ మేనేజ్‌మెంట్ డెరైక్టర్ నూర్ పటేల్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. తమ స్టోర్లలో అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్లలో 90 శాతం 4జీ మోడళ్లేనని బిగ్ సి చైర్మన్ బాలు చౌదరి చెప్పారు. 4జీ నెట్‌వర్క్ లేని ప్రాంతాలకు చెందిన కస్టమర్లు మాత్రమే 3జీ మోడళ్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే 3జీలో కొత్త ఫోన్లు రావడం లేదని లాట్ మొబైల్స్ వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్ల విషయంలో 3జీ మోడళ్లకు కాలం చెల్లినట్టేనని వర్తకులు అంటున్నారు. దిగొస్తున్న ధరలు..: రిలయన్స్ జియో లైఫ్ బ్రాండ్‌లో 4జీ స్మార్ట్‌ఫోన్లను రూ.2,999ల నుంచే విక్రయిస్తోంది. దీంతో మార్కె ట్ ఒక్కసారిగా షేక్ అయింది. మిగిలిన కంపెనీలూ అందుబాటు ధరలో ఫోన్లను తీసుకురాక తప్పలేదు. దిగ్గజ కంపెనీ అయిన శామ్‌సంగ్ ఇటీవలే రూ. 4,699లకే జడ్2 మోడల్‌ను విడుదల చేసింది. లెనోవో, ప్యానాసోనిక్, జడ్‌టీఈ, ఇంటెక్స్, లావా, కార్బన్, ఇన్‌ఫోకస్, జోలో, ఐబాల్ తదితర కంపెనీలు రూ.5 వేలలోపు ధరలో 4జీ స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టాయి. మార్కెట్లో ఉన్న డిమాండ్ నేపథ్యంలో మొబైల్ రిటైల్ చైన్ సంస్థ బిగ్ సి సైతం రూ. 2,999లకే ఎక్స్‌క్లూజివ్‌గా 4జీ హ్యాండ్‌సెట్‌ను తీసుకొస్తోంది. లాట్ మొబైల్స్ సైతం ఇదే బాటలో ఉంది. ఇక నుంచి 4జీ మాత్రమే.. కొత్తగా ఫోన్లు కొనేవారు 4జీ మోడళ్లనే ఎంచుకుంటున్నారని ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పంకజ్ మొహింద్రూ తెలిపారు. అటు 3జీ కస్టమర్లు సైతం 4జీకి మళ్లుతున్నారని ప్యానాసోనిక్ మొబిలిటీ బిజినెస్ హెడ్ పంకజ్ రానా అన్నారు. ప్రస్తుతం నెలకొన్న మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో భారత్‌లో కేవలం 4జీ మోడళ్లనే విడుదల చేయాలని తయారీ కంపెనీలు నిర్ణయించాయి. శామ్‌సంగ్ ఖాతా లో ప్రస్తుతం 25 మోడళ్లున్నాయి. ఇందులో 3 మాత్రమే 3జీ ఫోన్లు. మిగిలినవన్నీ 4జీయే. కొన్ని నెలలుగా శామ్‌సంగ్ కొత్తగా విడుదల చేస్తున్న ఫోన్లన్నీ పూర్తిగా 4జీ మోడల్లే ఉంటున్నాయి. లెనోవో-మోటరోల, వన్ ప్లస్, వివో సైతం శామ్‌సంగ్‌ను అనుసరిస్తున్నాయి. 3జీ విభాగం నుంచి వైదొలగనున్నట్టు ఒప్పో, హెచ్‌టీసీ ప్రకటించాయి కూడా.

హీరో కొత్త ‘అచీవర్ 150’ - ప్రారంభ ధర రూ.61,800 - ప్రీమియం విభాగంపై దృష్టి

27/09/2016: గుర్గావ్: దేశీ దిగ్గజ టూవీలర్ల తయారీ కంపెనీ ‘హీరో మోటోకార్ప్’ తాజాగా తన ప్రీమియం బైక్ ‘అచీవర్ 150’లో అప్‌డేట్ వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ కొత్త బైక్.. డ్రమ్ బ్రేక్స్, డిస్క్ బ్రేక్స్ అనే రెండు ఆప్షన్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. డ్రమ్ బ్రేక్స్ వేరియంట్ ధర రూ.61,800గా, డిస్క్ బ్రేక్స్ వేరియంట్ ధర రూ.62,800గా ఉంది. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. 100 సీసీ, 125 సీసీ విభాగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతోన్న హీరో ఈ కొత్త బైక్ ద్వారా ప్రీమియం విభాగంలోనూ తన సత్తా చాటాలని భావిస్తోంది. కాగా కొత్త ‘అచీవర్ 150’ బైక్‌లో బీఎస్-4 నియంత్రణలకు అనువైన ఐ3ఎస్ టెక్నాలజీతో కూడిన ఇంజిన్‌ను పొందుపరిచామని కంపెనీ పేర్కొంది.

ఆ ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి - రూ.9,900 కోట్లు రాబట్టాలి... - టెలికం మంత్రికి జస్టిస్ బీసీ పటేల్ లేఖ

27/09/2016: న్యూఢిల్లీ: రిలయన్స్ జియోకు ఇంటర్‌కనెక్షన్ కల్పించకుండా లెసైన్స్ నిబంధనలను ఉల్లంఘించిన భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, జరిమానా కింద రూ.9,900 కోట్లు వసూలు చేయాలని ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీసీ పటేల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు టెలికం శాఖ మంత్రి మనోజ్‌సిన్హాకు లేఖ రాశారు. ఆపరేటర్ల చర్యలు స్పష్టంగా నిబంధనల ఉల్లంఘనేనని జస్టిస్ పటేల్ అన్నారు. ఈ విషయంలో టెలికం శాఖ కఠిన చర్యలు తీసుకునే అవకాశాన్ని అవి తమ చర్యల ద్వారా కల్పించాయని, ఒక్కో ఆపరేటర్‌పై విడివిడిగా రూ.3,300 కోట్ల చొప్పున జరిమానా విధించాలని కోరారు. ఈ అంశాన్ని పూర్తిగా అధ్యయనం చేసి చూడగా వినియోగదారుడి వ్యతిరేక, పోటీ వ్యతిరేక చర్యలను ఆపరేటర్లు అనుసరించినట్టు తెలుస్తోందని, వీటికి వెంటనే అడ్డుకట్ట వేయాలన్నారు. కస్టమర్ల పోర్టబిలిటీ దరఖాస్తులను సైతం సరైన కారణం లేకుండా తోసిపుచ్చాయన్నారు. ఇందుకు సంబంధించి మీడియా కథనాలను ఆయన ఉదహరించారు. న్యాయ చింతన కలిగిన ఈ దేశ పౌరుడిగా తాను ఈ పరిణామాలను చూస్తూ మౌనంగా ఉండిపోదలచుకోలేదని.. ఈ మూడు టెలికం ఆపరేటర్ల చర్యలు చట్ట వ్యతిరేకమని, లెసైన్స్ నిబంధనలను ఉల్లంఘించాయని జస్టిస్ పటేల్ లేఖలో పేర్కొన్నారు. సత్వరమే కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు జరిమానా విధించాలని టెలికం శాఖను కోరారు. కాల్ డ్రాప్స్ డేటా బహిర్గతం రిలయన్స్ జియో కాల్ డ్రాప్స్ డేటాను తన వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచింది. తన నెట్‌వర్క్ నుంచి వెళ్లే కాల్స్‌కు ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా తగినన్ని ఇంటర్‌కనెక్షన్ పాయింట్లను ఇవ్వడం లేదంటూ జియో మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఈ అంశంపై ట్రాయ్‌కు కూడా ఫిర్యాదు చేసింది. ఇది నిజమేనని ట్రాయ్ పరిశీలనలోనూ తేలింది. ఈ నేపథ్యంలో జియో సెప్టెంబర్ 22వ తేదికి సంబంధించి కాల్‌డ్రాప్స్ డేటాను వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈ ఒక్కరోజే 15 కోట్ల కాల్స్‌కు గాను 12 కోట్ల కాల్స్ ఫెయిల్ అయినట్టు పేర్కొంది. 6.13 కోట్ల కాల్స్ ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌కు వెళ్లే ప్రయత్నంలో 4.8 కోట్ల కాల్స్ (78.4 శాతం) ఫెయిల్ అయ్యాయి. వొడాఫోన్ నెట్‌వర్క్‌కు 4.69 కోట్ల కాల్స్‌కు గాను 3.95 కోట్ల కాల్స్ (84.1 శాతం) ఫెయిల్ అయ్యాయి. ఐడియా నెట్‌వర్క్‌కు వెళ్లే 4.39 కోట్ల కాల్స్‌లో 3.36 కోట్ల కాల్స్ విఫలం అయినట్టు ఈ డేటా ఆధారంగా జియో తెలిపింది.

జియోను తలదన్నేలా బీఎస్ఎన్ఎల్

22/09/2016: న్యూఢిల్లీ: టెలికం సంస్థల మధ్య కాంపిటేషన్ వార్ మొదలైంది. బీఎస్ఎన్ఎల్ ఈ వార్ను డిక్లేర్ చేసింది. జియోకు తానేమి తక్కువ కాదంటూ దూసుకొస్తోంది. కొత్త ఏడాది నుంచి తాము కూడా ఉచిత వాయిస్ కాల్స్ అందించడమే కాకుండా తక్కువ టారిఫ్ లతో వినియోగదారులకు సేవలందిస్తామంటూ బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఉచిత వాయిస్ కాల్స్ , తక్కువ ధరకే ఇంటర్నెట్ ప్యాకేజ్ లు అంటూ మొబైల్ రంగంలోకి దూసుకొచ్చి ఇతర టెలికం సంస్థలకు అనూహ్యంగా రిలయన్స్ జియో షాకిచ్చిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు అన్ని నెట్ వర్క్ లపై ప్రభావం పడింది. తమ వద్ద ఉన్న కస్టమర్లను జియోవైపు వెళ్లనీయకుండా ఆయా సంస్థలు తీవ్రతంటాలు పడుతున్నాయి. ఆఫర్లను మార్చుకుంటున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం జియోకు ధీటుగా వస్తున్నానంటూ ప్రకటించేసింది. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉచిత వాయిస్ కాల్స్ ఇచ్చేందుకు ముందుకొస్తోంది. దీంతో జియో ఆగమనం తర్వాత దానికి పోటీగా దూసుకొస్తున్న మరో టెలికం సంస్థగా బీఎస్ఎన్ఎల్ మారనుంది. అంతేకాదు జియో కేవలం 4జీ ఫోన్లకు మాత్రమే ఉచిత వాయిస్ కాల్స్ సౌకర్యాన్ని అందిస్తుండగా బీఎస్ఎన్ఎల్ మాత్రం 2జీ, 3 జీ ఫోన్లకు ఈ సౌకర్యం అందించనుందట. 'మేం ప్రస్తుత మార్కెట్లో జియో పనితీరును పూర్తిగా పరిశీలన చేస్తున్నాం. మేం కూడా వచ్చే కొత్త ఏడాది నుంచి అత్తి తక్కువ టారిఫ్ లు కొత్త కొత్త ఆఫర్లతోపాటు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఫ్రీ వాయిస్ కాల్స్ ఇస్తాం' అని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ చెప్పారు. 'జియోకంటే తక్కువ రేట్ కే ఈ ప్లాన్ అందించనున్నాం. ఇది కేవలం రూ.2 నుంచి రూ.4 ఉండొచ్చు' అని ఆయన చెప్పారు. కేరళ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఒడిషా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ లలో బీఎస్ఎన్ఎల్కు అతి పెద్ద మార్కెట్ ఉంది. ఈ ప్రాంతాల్లో జనవరి నుంచి తొలుత జీరో వాయిస్ టారిఫ్ ప్లాన్స్ అందించనున్నట్లు ఈ ప్లాన్ లోకి ప్రవేశించేందుకు కూడా అతితక్కువ మొత్తంలోనే రుసుము వసూలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం జియో ప్లాన్ లోకి ప్రవేశించాలంటే రూ.149 చెల్లించాలి. కానీ బీఎస్ఎన్ఎల్ మాత్రం ప్రవేశ రుసుం రూ.2 నుంచి రూ.4మాత్రమే వసూలు చేస్తుందట. బీఎస్ఎన్ఎల్ మొబైల్ వినియోగదార్లతోపాటు ఇంటి వద్ద బ్రాడ్ బ్యాండ్ సేవలు ఉపయోగించుకుంటున్నవారికి కూడా ఈ ప్లాన్ అందిస్తామని శ్రీవాత్సవ చెప్పారు. బీఎస్ఎన్ఎల్ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో ఇక ఎయిర్ టెల్ ప్లస్, వోడాఫోన్, ఐడీయాలపై మరింత ప్రభావం పడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

జపాన్ కేంద్ర బ్యాంక్ కీలక నిర్ణయం

21/09/2016: టోక్యో: జపాన్ బ్యాంక్ తన ద్రవ్య పరపతి విధానంలో ఊహించని నిర్ణయం తీసుకుంది . ప్రస్తుతం అమల్లో ఉన్న నెగిటివ్ ఇంటరెస్ట్ రేటును యథాతథంగా అమలు చేసేందుకు బుధవారం నిర్ణయించింది. మంగళవారం మొదలైన రెండు రోజుల బీవోజే పరపతి సమీక్ష సమావేశంలో ప్రస్తుత -0.1 శాతం చొప్పున అమలు చేయడానికి నిర్ణయించింది. సాధ్యమైనంత త్వరగా 2 శాతం ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని చేరుకోవాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. "ఈల్డ్ కర్వ్ కంట్రోల్" పథకం కింద దాదాపు 10 సంవత్సరాల దీర్ఘకాల ప్రభుత్వ బాండ్లు కొనుగోలు చేయడానికి, తద్వారా సున్నా శాతంగా ఉన్న ద్రవ్యోల్బణాన్నిఅధిగమించాలని యోచిస్తోంది. అలాగే ప్రస్తుతం అమలు చేస్తున్న స్టిములస్‌ ప్యాకేజీకి అదనంగా మరింత భారీ సహాయక ప్యాకేజీని ప్రకటించింది. సెక్యూరిటీల కొనుగోలు ద్వారా ప్యాకేజీని అమలు చేయనుంది. భారీ ఉద్దీపన కార్యక్రమం కింద సమగ్ర దీర్ఘకాలిక వడ్డీ రేట్లు లక్ష్యంగా స్వీకరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థకు 800 బిలియన్‌ యెన్‌ల నిధులను ఫిక్స్‌డ్‌ రేటుకే అందించేందుకు నిర్ణయించింది. మరోవైపు బీవోజే కీలక నిర్ణయం నేపథ్యంలో డాలరు మారకపు విలువతో పోలిస్తే జపనీస్‌ కరెన్సీ యెన్‌ కోలుకుంది. దాదాపు 2 శాతానికి పైగా లాభపడింది.

మొబైల్ కనెక్షన్.. 2 నిమిషాల్లో!

20/09/2016: హైదరాబాద్ : కొత్తగా సిమ్ కావాలంటే ఫొటో, సరైన ధ్రువీకరణ పత్రాలు కావాల్సిందే. టెలికం కంపెనీకి చెందిన ఎక్స్‌క్లూజివ్ ఔట్‌లెట్‌కు వెళ్లినట్టయితే ఒకట్రెండు రోజుల్లో సిమ్ యాక్టివేట్ అవుతుంది. అదే చిన్న ఏజెంట్ల దగ్గరికెళితే అదనంగా మరో రోజు వేచి చూడాల్సిందే. ఇలాంటి ఆలస్యానికి, పత్రాలకు చెక్ పెడుతూ టెలికం కంపెనీలు ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ (ఈ-కేవైసీ) విధానాన్ని అమలు చేస్తున్నాయి. టెలికం కంపెనీ ఔట్‌లెట్‌కు కేవలం ఆధార్ కార్డును తీసుకెళితే చాలు. రెండు మూడు నిమిషాల్లోనే సిమ్ యాక్టివేట్ చేస్తారు. ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ జియో ఈ-కేవైసీని ఇప్పటికే అమలులోకి పెట్టాయి. టెలినార్ పైలట్ ప్రాజెక్టును పూర్తి చేసి అధికారికంగా ప్రకటించేందుకు రెడీ అయింది. ఈ-కేవైసీ అమలుతో దేశంలోని బ్యాంకులు, టెలికం కంపెనీలు రానున్న అయిదేళ్లలో రూ.10,000 కోట్లు ఆదా చేస్తాయని ఒక అధ్యయనంలో తేలింది. ఇలా పనిచేస్తుంది.. ఎలక్ట్రానిక్ విధానంలో ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయడమే ఈ-కేవైసీ. టెలికం ఔట్‌లెట్‌కు కస్టమర్లు ఎటువంటి ఫొటో కాపీలు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఔట్‌లెట్లో ఉన్న సిబ్బందికి కస్టమర్ తన ఆధార్ కార్డు నంబరు ఇవ్వాలి. పాయింట్ ఆఫ్ సేల్‌గా వినియోగిస్తున్న ప్రత్యేక ట్యాబ్లెట్ పీసీ, స్మార్ట్‌ఫోన్‌లో ఈ నంబరును టైప్ చేయగానే కస్టమర్ వివరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. మరో పరికరంలో కస్టమర్ తన వేలి ముద్ర ఇవ్వాలి. ఆధార్ వివరాలతో వేలి ముద్ర సరితూగగానే ధ్రువీకరణ పూర్తి అవుతుంది. మొత్తంగా 2-3 నిమిషాల్లోనే సిమ్ యాక్టివేషన్ పూర్తి కావడం విశేషం. ఈ విధానంలో సిమ్ కోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు లోనయ్యే అవకాశమే లేదు. రిటైలర్లకు పనిభారం తగ్గుతుంది. మొబైల్ రిటైల్ చైన్ సంస్థలైన బిగ్ సి, లాట్ మొబైల్స్‌లు తమ స్టోర్లలో జియో కస్టమర్ల కోసం ఈ-కేవైసీని అమలులోకి తెచ్చాయి. పక్కదారి పట్టదు.. ఇప్పటి వరకు ఉన్న సిమ్ యాక్టివేషన్ విధానంలో పారదర్శకత లోపించింది. ఒకరి పేరుతో మరొకరికి సిమ్‌లు ఇచ్చిన సంఘటనలు కేవలం పలు పోలీసు కేసులు నమోదైన ఘటనల్లోనే బయటపడుతున్నాయి. అదేవిధంగా తప్పుడు పత్రాలతో సిమ్‌లు తీసుకున్నా నిరోధించే వ్యవస్థ లేదు. ప్రస్తుత ఈ-కేవైసీ విధానంలో సిమ్‌ల జారీ పక్కదారి పట్టే అవకాశమే లేదు. ఆధార్ కార్డులో ఉన్న వివరాలను సరిచూసుకున్నాకే మొబైల్ సిమ్‌ను యాక్టివేట్ చేస్తారు. కస్టమర్ల వ్యక్తిగత సమాచారం పూర్తిగా భద్రంగా ఉంటుంది. భారీగా తగ్గనున్న వ్యయం.. ఇటీవలి ఒక అధ్యయనం ప్రకారం ఈ-కేవైసీ అమలుతో దేశంలోని బ్యాంకులు, టెలికం కంపెనీలు రానున్న అయిదేళ్లలో రూ.10,000 కోట్లు ఆదా చేస్తాయి. పాత విధానంలో ప్రతి కొత్త కనెక్షన్‌కు టెలికం కంపెనీలు టాప్ మెట్రోల్లో సుమారు రూ.145-175 దాకా ఖర్చు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా జూలై నాటికి 78 కోట్ల జీఎస్‌ఎం కనెక్షన్లు ఉన్నాయి. జూన్‌లో 35 లక్షలు, జూలైలో 20 లక్షల పైచిలుకు కొత్త కస్టమర్లు నమోదయ్యారు. అంటే ఏ స్థాయిలో కంపెనీలకు వ్యయం అవుతుందో ఇట్టే ఊహించవచ్చు. రిటైలర్ల నుంచి యాక్టివేషన్ కేంద్రాలకు దరఖాస్తుల రవాణా, ఉద్యోగుల వ్యయం కంపెనీలకు ఇక నుంచి ఉండదు. అటు కస్టమర్‌కు సైతం ధ్రువీకరణ పత్రాల ఖర్చు ఉండదు. ఇక డిజిటల్ ఇండియా లక్ష్యానికి ఈ-కేవైసీ మద్దతు ఇస్తుందని ఎయిర్‌టెల్ ఇండియా సీఈవో గోపాల్ విట్టల్ వ్యాఖ్యానించారు.

ఉద్యోగులను తీసేస్తున్న ట్విట్టర్

20/09/2016: న్యూఢిల్లీ : భారతదేశంలో తమ అభివృద్ధి కార్యకలాపాలు ఇక చాలించాలని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ నిర్ణయించుకుంది. దాంతో బెంగళూరులోని ట్విట్టర్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో పనిచేస్తున్న వాళ్లు ఉద్యోగాలు హరీమనే పరిస్థితి ఏర్పడింది. అయితే, ఎంతమంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇస్తున్నదీ ఇంకా ట్విట్టర్ ప్రకటించలేదు. తమ వ్యాపార సమీక్షలో భాగంగా, బెంగళూరు డెవలప్‌మెంట్ సెంటర్‌లో ఇంజనీరింగ్ కార్యక్రమాలను ఆపేయాలని తాము నిర్ణయించుకున్నామని ట్విట్టర్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంతకాలం తమకు విలువైన సేవలు అందించిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని, వారిని గౌరవప్రదంగా తమ కంపెనీ నుంచి పంపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పింది. అయితే భారత దేశాన్ని మాత్రం ట్విట్టర్ యూజర్లు, భాగస్వాములు, ప్రకటనకర్తలకు మంచి వ్యూహాత్మక మార్కెట్‌గా కంపెనీ ఇప్పటికీ భావిస్తోందని అంటోంది. ప్రపంచంలో శరవేగంగా పెరుగుతున్న మార్కెట్లలో ఇండియా ఒకటని, అందువల్ల ఇక్కడ తమ ఆడియన్స్‌ను విస్తృతం చేసుకోడానికి, యూజర్ల ఎంగేజ్‌మెంట్ పెంచడానికి, ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోడానికి కావల్సిన కీలక చర్యలలో పెట్టుబడులు పెడుతూనే ఉంటామని కంపెనీ చెప్పింది. బెంగళూరుకు చెందిన జిప్‌డయల్ మొబైల్ సొల్యూషన్స్ అనే మొబైల్ మార్కెటింగ్, ఎనలిటిక్స్ కంపెనీని గత సంవత్సరం ట్విట్టర్ కొనుగోలు చేసింది. దాంతో ఇక్కడ ఇంజనీరింగ్ కేంద్రాన్ని నెలకొల్పింది. అయితే ఫేస్‌బుక్ లాంటి ప్రత్యర్థుల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కోవడం, ఆ విషయంలో పెద్దగా పురోగతి కనబర్చలేకపోవడంతో ట్విట్టర్ ఆర్థిక ఫలితాలు కూడా దారుణంగా పడిపోయాయి.

ఉద్యోగాలకు కోతపెడుతున్న మైక్రోసాఫ్ట్

19/09/2016: లండన్ : టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. లండన్‌లోని తన స్కైప్ కార్యాలయాన్ని మూసేస్తోంది. దాంతో సుమారు 400 మంది తమ ఉద్యోగాలు కోల్పోనున్నారు. కొన్ని ఇంజనీరింగ్ పొజిషన్లను కలిపేందుకు మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దాంతో చాలామంది స్కైప్ ఉద్యోగులపై వేటు పడేప అవకాశం కనిపిస్తోంది. అయితే, ప్రస్తుతానికి కేవలం లండన్‌లో ఉన్న కార్యాలయాన్ని మాత్రమే మూసేశామని.. రెడ్మండ్, పాలో ఆల్టో, వాంకూవర్ సహా యూరప్‌లోని పలు కార్యాలయాలను తెరిచే ఉంచుతున్నట్లు స్కైప్ చెబుతోంది. అయితే స్కైప్‌ను మైక్రోసాఫ్ట్ టేకోవర్ చేసినప్పటి నుంచి క్రమంగా అందులోని పాత ఉద్యోగులను తొలగించి, తమ సొంత ఉద్యోగులను నియమిస్తోందని కొందరు మాజీ ఉద్యోగులు తమ పేరు బయట పెట్టొద్దంటూ చెప్పారు. ఒకప్పుడు ఉచిత వీడియో కాలింగ్ అంటే కేవలం స్కైప్ మీద మాత్రమే ఆధారపడేవాళ్లు. కానీ ఇప్పుడు దానికి ఆదరణ తగ్గింది. వాట్సప్, ఫేస్‌బుక్ మెసెంజర్ లాంటివి రావడంతో పాటు వీడియో కాలింగ్ యాప్స్ కూడా చాలా వచ్చేశాయి. దాంతో ఎప్పటినుంచో స్కైప్‌కు అలవాటు పడినవాళ్లు కూడా క్రమంగా దానికి దూరమవుతున్నట్లు సమాచారం.

ఎయిర్‌ టెల్‌ వల్ల రోజుకు 2 కోట్ల కాల్‌డ్రాప్‌లు!

19/09/2016: న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ల మధ్య ఇంటర్‌కనెక్షన్ వివాదం మరింతగా ముదురుతోంది. ఎయిర్‌టెల్ కస్టమర్లతో తమ మొబైల్ వినియోగదారులు కనెక్ట్ అయ్యేందుకు వీలుగా తగినన్ని ఇంటర్‌కనెక్ట్ పాయింట్ల(పీఓఐ)ను కల్పించకపోవడంవల్ల రోజుకు 2 కోట్లకుపైగా కాల్స్ ఫెయిల్ అవుతున్నాయని జియో ఆరోపించింది. తమకు అవసరమైన పోర్ట్‌లలో నాలుగోవంతును మాత్రమే ఎయిర్‌టెల్ అందుబాటులో ఉంచిందని.. తన మార్కెట్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తూ, పోటీ కంపెనీలను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని పేర్కొంది. అయితే, జియో తాజా ఆరోపణలను ఎయిర్‌టెల్ ఖండిం చింది. అదనపు పీఓఐల విషయంలో జియో కావాలనే రాద్ధాంతం చేస్తోందని.. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ(ఎంఎన్‌పీ) విజ్ఞప్తులను అడ్డుకుంటున్నట్లు చేస్తున్న ఆరోపణల్లోనూ వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఎంఎన్‌పీపై నిబంధనల ప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని తెలిపింది. కాగా, ఇంటర్‌కనెక్ట్ పోర్ట్‌లను కల్పించేందుకు కఠినమైన షరతులను విధిస్తోందని.. దీనివల్ల అదనపు పోర్ట్‌లను వినియోగించుకోవడానికి వీలవడంలేదని జియో పేర్కొంది. మొబైల్ వినియోగదారులకు ఉచిత వాయిస్‌కాల్స్ ప్రయోజనాన్ని అందించాలన్న తమ ప్రయత్నాలకు గండికొట్టడంద్వారా ఎయిర్‌టెల్ గుత్తాధిపత్యానికి పాల్పడుతున్నట్లు కూడా ఆరోపణలు గుప్పించింది. రిలయన్స్ జియోకు అవసరమైన ఇంటర్‌కనెక్ట్ పాయింట్లను అందుబాటులో ఉంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎయిర్‌టెల్ ప్రకటించిన మర్నాడే జియో తాజా ఆరోపణలు చేయడం గమనార్హం. ప్రస్తుత టెలికం కంపెనీలు తమకు తగిన పీఓఐలను కల్పించకపోవడంవల్ల భారీగా కాల్‌డ్రాప్‌లకు కారణమవుతున్నాయని.. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కు జియో ఫిర్యాదు చేయడం తెలిసిందే. దీనిపై టెల్కోలు, జియో ప్రతినిధులతో ఇటీవలే ట్రాయ్ సంప్రదింపుల భేటీని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్, బీఎస్‌ఎన్‌ఎల్‌లు... జియోకు అవసరమైన పీఓఐలు కల్పిస్తామంటూ ప్రకటించాయి కూడా.

స్పెక్ట్రమ్ వేలం కోసం...రూ.15వేల కోట్లు జమ - టెల్కోల్లో రిలయన్స్ జియో ముందంజ.. - రూ.6,500 కోట్లు డిపాజిట్

17/09/2016: న్యూఢిల్లీ: అక్టోబర్ 1నాటి మెగా స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు ఏడు టెలికం కంపెనీలు రూ.15వేల కోట్లను ధరావతు సొమ్ము (ఈఎండీ) కింద కేంద్రానికి జమ చేసినట్టు తెలుస్తోంది. గతేడాది స్పెక్ట్రమ్ వేలం సమయంలో వచ్చిన ధరావతు సొమ్ము రూ.20,435 కోట్లు కంటే ఇది తక్కువగా ఉండడం గమనార్హం. అయితే, స్పెక్ట్రమ్ స్థాయికి, ధరావతు సొమ్ముకు పోల్చి చూడరాదని టెలికం శాఖ వర్గాలు పేర్కొన్నాయి. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం రిలయన్స్ జియో అత్యధికంగా రూ.6,500 కోట్లు జమ చేసింది. వొడాఫోన్ రూ.2,800 కోట్లు, ఐడియా సెల్యులార్ రూ.2,000 కోట్లు, ఎయిర్‌టెల్ రూ.1,900 కోట్లు డిపాజిట్ చేశాయి. మిగిలిన మొత్తం టాటా టెలీ, ఆర్‌కామ్, ఎయిర్‌సెల్ నుంచి వచ్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కంపెనీలు ఏ బ్యాండ్‌లో, ఏ సర్కిల్‌లో బిడ్లు వేయనున్నదీ ధరావతు సొమ్ము సూచిస్తుంది. జియో ఎక్కువగా డిపాజిట్ చేయడంతో మిగిలిన కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న వేలంలో రూ.5.63 లక్షల కోట్ల రూపాయల విలువైన రేడియో తరంగాలను కేంద్రం వేలం వేయనుంది. 700, 800, 900, 1,800, 2,100, 2,300 మెగాహెడ్జ్ బ్యాండ్‌లలో స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకునేందుకు టెలికం కంపెనీలు పోటీ పడనున్నాయి. వీటిలో 700 మెగాహెడ్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రమ్ వేలానికి రావడంఇదే మొదటిసారి. ఒక్క ఈ బ్యాండ్ స్పెక్ట్రమ్‌పైనే రూ.4 లక్షల కోట్ల మేరకు బిడ్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కాగా, టెలినార్, బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ ఈ వేలంలో పాల్గొనడం లేదు. స్పెక్ట్రమ్, ఇతర లెవీల ద్వారా టెలికం శాఖ నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.98,995 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది.

ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ ధర తగ్గింది! - రూ.22,000 వరకూ తగ్గింపు

16/09/2016: న్యూఢిల్లీ: ఐఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి శుభవార్త. టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘యాపిల్’ తాజాగా తన ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ హ్యాండ్‌సెట్ల ధరలను రూ.22,000 వరకూ తగ్గించింది. కొత్త మోడల్ మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత పాత మొబైల్ ఫోన్ల ధరలు తగ్గటమనేది పరిశ్రమలో కొత్తేమి కాదు. పరిశ్రమ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఐఫోన్ 6ఎస్ (128 జీబీ వేరియంట్) ఇప్పుడు రూ.60,000లకు లభ్యమౌతున్నట్లు తెలుస్తోంది. దీని ధర ఇదివరకు రూ.82,000గా ఉంది. అంటే ఐఫోన్ 6ఎస్ ధర రూ.22,000 తగ్గింది. ఇక ఐఫోన్ 6ఎస్ ప్లస్ (128 జీబీ వేరియంట్) ధర కూడా ఇదే స్థాయిలో కిందకు పడినట్లు వినికిడి. దీని ధర రూ.70,000లుగా ఉంది. ఇక 64 జీబీ వెర్షన్ ఐఫోన్ ఎస్‌ఈ ఇక నుంచి రూ.44,000కు అందుబాటులో ఉండనుంది. దీని ధర ఇదివరకు రూ.49,000గా ఉంది. అయితే కంపెనీ ఈ ధరల తగ్గింపు విషయమై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా కంపెనీ కొత్తగా ఆవిష్కరించిన ఐఫోన్ 7, 7 ప్లస్ ఫోన్లను వచ్చే నెల 7న భారత్‌లో ప్రవేశపెట్టనుంది. దీని ప్రారంభ ధర రూ.60,000గా ఉంది. చట్టాల్ని అతిక్రమిస్తున్న యాపిల్, గూగుల్: జపాన్ టోక్యో: అమెరికా టెక్నాలజీ దిగ్గజ కంపెనీలైన యాపిల్, గూగుల్‌లు స్మార్ట్‌ఫోన్ యాప్ మార్కెట్‌కు సంబంధించి అసంబద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని జపాన్ ఆరోపించింది. ఇవి వాటి డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా మొబైల్ యాప్స్‌ను విక్రయించడం కోసం అనుచిత చర్యలకు పాల్పడుతున్నాయని జపాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ‘యాపిల్, గూగుల్ కంపెనీలు యాప్ మార్కెట్‌లో వాటికున్న గుత్తాధిపత్యం ద్వారా యాప్ డెవలపర్లకు నియంత్రణలను విధిస్తున్నాయి. రెండు యాప్‌ల మధ్య వర్చ్యువల్ కరెన్సీ వినియోగాన్ని నిలిపివేశాయి. డెవలపర్లకు ఆమోదయోగ్యమైన కొన్ని పేమెంట్ విధానాలను నిరోధించాయి. ఇలాంటి చర్యలు జపాన్ చట్టాలను అతిక్రమించేలా ఉన్నాయి’ అని వివరించింది. యాపిల్ ట్యాక్స్ (యాపిల్ అప్లికేషన్ ద్వారా ఎలాంటి లావాదేవీ నిర్వహించినా.. ఆ లావాదేవీ మొత్తంలో 30 శాతాన్ని సుంకం కింద కంపెనీ తీసుకుంటోంది), రిఫండ్, యాప్ ధర నిర్ణయం (ఒక యాప్ ధర 125 యెన్‌లు ఉంటే.. దాన్ని తప్పనిసరిగా 120 యెన్‌లకు లేదా 130 యెన్‌లకు విక్రయించాలి) వంటి పలు అంశాలపై కూడా ప్రధానంగా దృష్టి కేంద్రీకరించామని పేర్కొంది. ఈ విషయాలన్నీ స్థానిక మీడియాలో వెల్లడయ్యాయి.

జియోకి ఎయిర్ టెల్ అదనపు ఇంటర్ కనెక్ట్ పాయింట్స్

14/09/2016: న్యూఢిల్లీ: రిలయన్స్ జియోకి అదనపు ఇంటర్‌కనెక్ట్ పాయింట్ల ఏర్పాటు చేసేందుకు భారతి ఎయిర్‌టెల్ అంగీకరించింది. తాము ఏర్పాటుచేసే పోర్ట్‌లు జియో 1.5 కోట్ల మంది కస్టమర్ల కాల్స్‌ని సపోర్ట్ చేస్తాయని ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో తెలిపింది.. జియో యూజర్లు ఎయిర్‌టెల్ యూజర్లకు ఫోన్ చేసుకోవచ్చు. తాజా చర్యతో ప్రస్తుత పోర్టుల సంఖ్య 3 రెట్లు పెరుగుతుందని ఎయిర్‌టెల్ పేర్కొంది. ఐడియా, ఎయిర్‌టెల్ వంటి టెలికం కంపెనీలు తమకు ఇంటర్‌కనెక్ట్ పోర్ట్‌లను సక్రమంగా ఇవ్వడం లేదంటూ ఇటీవల ముకేశ్ అంబానీ ఆరోపించిన విషయం తెలిసిందే. దీని కారణంగా అప్పుడు జియో 5 కోట్ల కాల్స్ ఫెయిల్ అయ్యాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి ట్రాయ్ రంగంలోకి దిగింది. దీంతో ఐడియా సోమవారం జియోకి అదనపు ఇంటర్‌కనెక్ట్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

పావు శాతం రేట్ల కోత చాన్స్! - రిటైల్ రుణాలవైపు బ్యాంకుల మొగ్గు... - ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య

12/09/2016: ముంబై: బ్యాంకులు త్వరలో పావు శాతం మేర వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం దిగిరానున్న నేపథ్యంలో రేట్ల కోతకు ఆస్కారం లభిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. మరోపక్క, దేశీ బ్యాంకింగ్ రంగం మొండిబకాయిల(ఎన్‌పీఏ) సమస్య నుంచి కోలుకోవడం అనేది ఆర్థిక వ్యవస్థ పనితీరుతో ముడిపడి ఉంటుందన్నారు. వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో వార్తా ఏజెన్సీలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ అంశాలను ప్రస్తావించారు. ‘ఇటీవల రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదలకు బేస్ ఎఫెక్ట్ ప్రధాన కారణం. అయితే, ఈ ప్రభావం మెల్లగా తొలగనుండటంతో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టేందుకు వీలుంది. వెరసి బ్యాంకుల వడ్డీరేట్ల తగ్గుదలకు దోహదం చేయనుంది’ అని భట్టాచార్య తెలిపారు. ఆర్‌బీఐ గత ఏడాదికాలంగా కీలక పాలసీ రేటు(రెపో)ను 1.5 శాతం మేర తగ్గించినప్పటికీ.. రుణ రేటు తగ్గింపునకు సంబంధించి ఈ మొత్తం ప్రయోజనంలో దాదాపు సగాన్ని మాత్రమే బ్యాంకులు తమ కస్టమర్లకు బదలాయించిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం లక్ష్యం కష్టసాధ్యమే... ప్రభుత్వం నిర్దేశించిన 4 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం కష్టసాధ్యమైనదేనని ఎస్‌బీఐ చీఫ్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో గడిచిన 60 ఏళ్లలో దేశంలో ఆహార ద్రవ్యోల్బణం చాలా అరుదుగా మాత్రమే 6 శాతం దిగువకు వచ్చిందని, మరోపక్క, మనది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమేనన్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. వచ్చే ఐదేళ్లపాటు వార్షిక ప్రాతిపదికన ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని 4 శాతం(2 శాతం అటూఇటుగా)గా ప్రభుత్వం నిర్దేశించిన సంగతి తెలిసిందే. అయితే, ఆర్‌బీఐ లక్ష్యం 5 శాతంగా ఉంది. మొండిబకాయిలపై..: ఇప్పటివరకూ పోగుపడిన మొండిబకాయిలను(ఎన్‌పీఏ) తగ్గించుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని.. అయితే, కొత్తగా ఎన్‌పీఏలు జతవుతూనే ఉంటాయని కూడా ఆమె పేర్కొన్నారు. ‘రానున్న కాలంలో దాదాపు రూ.40 వేల కోట్ల ఎన్‌పీఏలకు ఆస్కారం ఉందని మేం ఇప్పటికే అంచనా వేశాం. ఇందులో 8,000-9,000 కోట్ల విలువైన రుణాలు ఇప్పటికే ఈ జాబితాలో చేరాయి. ఈ సమస్యనుంచి పూర్తిగా గట్టెక్కాలంటే ఆర్థిక వ్యవస్థ పూర్తిస్థాయిలో పుంజుకోవాల్సి ఉంటుంది. ఇందుకు దీర్ఘకాలమే పట్టొచ్చు. అయితే, ఐదేళ్లలోపే ఎకానమీ మళ్లీ పరుగులు తీస్తుందని భావిస్తున్నా’ అని ఎస్‌బీఐ చీఫ్ అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ రుణాలు భారం.. కార్పొరేట్ రుణాలకు సంబంధించి ఆర్‌బీఐ తాజా ప్రతిపాదనలతో బ్యాంకులు రిటైల్ రుణాలవైపు అధికంగా మొగ్గుచూపే అవకాశం ఉందని భట్టాచార్య పేర్కొన్నారు. రిటైల్ రుణ విభాగంలో ఎలాంటి సమస్యలూ(బబుల్) లేవని స్పష్టంచేశారు. పెద్దస్థాయి కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చే రుణం నిర్ధిష్ట పరిమితిదాటితే బ్యాంకులు తప్పకుండా అదనపు కేటాయింపులు(ప్రొవిజనింగ్) చేయాలని ఆర్‌బీఐ గత నెలలో విడుదల చేసిన ముసాయిదా నిబంధనల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో ఎన్‌పీఏలు 14.5 శాతానికి ఎగబాకి ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో ఆర్‌బీఐ తాజా నిబంధనలకు తెరతీసింది. ‘ఈ నిబంధనల కారణంగా రుణగ్రహీతలతో పాటు బ్యాంకులకు కూడా భారం పెరుగుతుంది. ఆర్‌బీఐ చర్యలతో బ్యాంకులు రిటైల్ రుణాలవైపు అధికంగా దృష్టిపెట్టేందుకు ఆస్కారం ఉంది. ఇక మా రిటైల్ రుణ విభాగం గతేడాది 20 శాతం మేర వృద్ధి చెందింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనూ ఇదేస్థాయి వృద్ధి నమోదైంది. మొండిబకాయిల పెరుగుదల సంకేతాలేవీ లేవు. మరోపక్క, దేశ జీడీపీతో పోలిస్తే బ్యాంకుల మొత్తం రిటైల్ రుణాలు 10 శాతం కంటే తక్కువే. ఇతర వర్ధమాన దేశాలతోపోలిస్తే ఇదే అత్యంత కనిష్టం. ఈ నేపథ్యంలో రానున్నకాలంలో ఈ విభాగంలో భారీ రుణ వృద్ధికి అవకాశాలు ఉన్నాయి’ అని ఎస్‌బీఐ చీఫ్ వ్యాఖ్యానించారు.

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

12/09/2016: ముంబయి: ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దేశీయ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. మార్కెట్‌ ఆరంభంలో సెన్సెక్స్‌ 546 నష్టంతో మొదలవగా.. నిఫ్టీ 8,700 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఈ ఏడాది బ్రెగ్జిట్‌ తర్వాత ఇదే అత్యంత ఆరంభ పతనమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం నిఫ్టీ 400 పాయింట్లకు పైగా, సెన్సెక్స్‌ 120 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో యురోపియన్‌ యూనియన్‌ కూటమి నుంచి బ్రిటన్‌ వైదొలిగిన విషయం తెలిసిందే. బ్రెగ్జిట్‌ ప్రభావం ప్రపంచ మార్కెట్లతో పాటు భారత్‌పైనా తీవ్రంగా పడింది. జూన్‌ 24న బ్రెగ్జిట్‌ ఫలితాల నాడు.. మన మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్‌ 600 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 181 పాయింట్లు కోల్పోయింది.

బాబా 'జీన్స్' కమింగ్ సూన్..

10/09/2016: హరిద్వార్ : పతంజలి బ్రాండ్స్తో మార్కెట్లో దూసుకెళ్తున్న రాందేవ్ బాబా, బట్టల సామ్రాజ్యాన్ని కూడా స్థాపించనున్నారట. మల్టీ కోర్ "స్వదేశీ" కన్సూమర్ గూడ్స్లో బట్టల ఉత్పత్తులను ప్రారంభించనున్నారు. పరిధాన్ పేరుతో ఈ సామ్రాజ్యాన్ని స్థాపించి, జీన్స్, ఆఫీసులకు అనుగుణమైన బట్టలను అందించనున్నారు. అదేవిధంగా గ్లోబల్గా కూడా తన సత్తా చాటాలని రాందేవ్ ప్లాన్ చేస్తున్నారు. బంగ్లాదేశ్, ఆఫ్రికాలో మొదట ప్లాంట్లను స్థాపించి, అనంతరం యూరప్, యూఎస్లో తన బిజినెస్లను విస్తరించనున్నట్టు రాందేవ్ చెబుతున్నారు. పురుషులకు, మహిళలకు ఇద్దరకూ అనువైన బట్టలను తయారుచేయనున్నామని రాందేవ్ తెలిపారు. కేవలం భారతీయ సంప్రదాయ దుస్తులనే కాక, జీన్స్ లాంటి మోడ్రన్ దుస్తులు కూడా తయారుచేయనున్నట్టు ప్రకటించారు. దేశీ జీన్స్ పేరుతో మార్కెట్లోకి ప్రవేశించబోతున్నామని తెలిపారు. లుథియానాలోని మంచి తయారీదారులు ఉన్నారని, ఇతర చేనేత సెంటర్లు ఈ దుస్తులను డిజైన్ చేయనున్నట్టు చెప్పారు. హరిద్వార్ శివార్లో విశాలమైన ప్రాంగణంలో రాందేవ్ తన స్నేహితుడు ఆచార్య బాలకృష్ణన్తో కలిసి ఓ సంస్థను నిర్వర్తిస్తున్నారు. ఇదేమాదిరి బంగ్లాదేశ్లో పతంజలి ఉత్పత్తుల తయారీకి మిశ్రమ ప్యాక్టరీని ఏర్పాటుచేయనున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే నేపాల్ మార్కెట్లో తాము ప్రవేశించామని, బంగ్లాదేశ్ అనంతరం ఆఫ్రికా మార్కెట్ లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. దేశీయ మార్కెట్ పరిస్థితులతో సరితూగే ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మొదట తమ వ్యాపారాల వృద్ధి చేపడతామని రాందేవ్ ఆశాభావం వ్యక్తంచేశారు. స్టేజ్2 అనంతరం యూరప్, అమెరికా వంటి అభివృద్ధి చెందిన మార్కెట్లలో బహుళ జాతీయ కంపెనీలతో పోటీకి సిద్ధమవుతామని ప్రకటించారు. హెర్బల్ టూత్ పేస్టులు మొదలుకుని, నూడుల్స్, హెల్త్ డ్రింక్స్ వంటి వివిధ రకాల ఉత్పత్తుల వరకు మొత్తం 800 పైగా ప్రొడక్ట్స్ పతంజలి బ్రాండ్పై మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్లో పాగా వేసుకున్న కంపెనీలకు పతంజలి ఉత్పత్తులు వణుకు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక మెషిన్లోనే రూ.2 లక్షల డిపాజిట్ - అందుబాటులోకి తెచ్చిన ఎస్‌బీఐ

10/09/2016: హైదరాబాద్: ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ తమ క్యాష్ డిపాజిట్ మెషిన్లలో (సీడీఎం) నగదు డిపాజిట్ పరిమితిని రూ. 2,00,000కు పెంచింది. ప్రస్తుతం ఇది రూ.49,900గా ఉంది. క్యాష్ డిపాజిట్ మెషీన్లు/క్యాష్ పాయింట్లలో ఏటీఎం డెబిట్ కార్డు, ఎస్‌ఎంఈ ఇన్‌స్టా డిపాజిట్ కార్డ్‌ల ద్వారా తమ అకౌం ట్లలో నగదు జమ చేసుకునే ఖాతాదారులకు ఇది ఉపయోగకరంగా ఉండగలదని ఎస్‌బీఐ తెలిపింది. అలాగే, ఇకపై ఈ మెషిన్ల ద్వారా కూడా లోన్ అకౌంటు, రికవరింగ్ డిపాజిట్ అకౌంట్లు, పీపీఎఫ్ అకౌంట్లలో నగదు డిపాజిట్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.

ఐసీఐసీఐలో ఇక రోబోటిక్స్! - ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ చందా కొచర్

09/09/2016: ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం- ఐసీఐసీఐ బ్యాంక్ ఆటోమేషన్ విప్లవానికి నాంది పలికింది. 2017 మార్చి నాటికి బ్యాంకింగ్ లావాదేవీల్లో 20 శాతం ఆటోమేషన్ ద్వారా జరగాలన్నది బ్యాంక్ లక్ష్యం. ఇందులో భాగంగానే ‘సాఫ్ట్‌వేర్ రోబోటిక్స్’ లేదా ‘రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్’ను గురువారం ముంబైలో బ్యాంకు ఎండీ, సీఈఓ చందా కొచర్ ప్రారంభించారు.

వచ్చే నెల 7 నుంచి భారత్లో ఐఫోన్ 7 సేల్

09/09/2016: న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజ కంపెనీ యాపిల్ తాజాగా మార్కెట్‌లో ఆవిష్కరించిన ‘ఐఫోన్ 7’ స్మార్ట్‌ఫోన్స్ అక్టోబర్ 7 నుంచి భారతీయులకు అందుబాటులోకి రానున్నాయి. వీటి ప్రారంభ ధర రూ.60,000గా ఉంది. కంపెనీ బుధవారం శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఒక కార్యక్రమంలో ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ అనే రెండు స్మార్ట్‌ఫోన్స్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, చైనా వంటి దేశాల ప్రజలకు ఈ స్మార్ట్‌ఫోన్స్ సెప్టెంబర్ 16 నుంచే అందుబాటులోకి వస్తున్నాయి. అయితే మనం మరో 3 వారాలు వీటి కోసం ఆగాల్సిందే. ఈ కొత్త ఐఫోన్స్‌లో 32 జీబీ, 128 జీబీ, 256 జీబీ అనే మూడు స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి. ఐఫోన్ 7 స్క్రీన్ పరిమాణం 4.7 అంగుళాలు, ఐఫోన్ 7 ప్లస్ స్క్రీన్ పరిమాణం 5.5 అంగుళాలుగా ఉంది. ఐఫోన్ 6, 6ప్లస్, 5ఎస్ ఉండవా? చౌక ధరలకు యాపిల్ పాత మొబైల్ హ్యాండ్‌సెట్స్‌ను కొనుగోలు చేస్తున్న వారు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. వీరికి కంపెనీ పెద్ద షాక్ ఇవ్వనుంది. యాపిల్ తాజాగా ఐఫోన్ 7 ఆవిష్కరణ తర్వాత తన ఇండియా వెబ్‌సైట్ నుంచి ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్, ఐఫోన్ 5ఎస్ మోడళ్లను తొలగిం చింది. అంటే కంపెనీ భారత్‌లో ఐఫోన్ 7 విక్రయాల ప్రారంభం తర్వాత వీటిని తన పోర్ట్‌ఫోలియో నుంచి తొలగించే అవకాశముంది. దీంతో భారతీయ వినియోగదారులకు మొత్తంగా మూడు ఐఫోన్ మోడల్స్ (ఐఫోన్ 7/7ప్లస్, ఐఫోన్ 6ఎస్/6ఎస్ ప్లస్, ఐఫోన్ ఎస్‌ఈ) మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఐఫోన్ 7 ఆవిష్కరణ అనంతరం ఐఫోన్ 5ఎస్‌ను కంపెనీ తన పోర్ట్‌ఫోలియో నుంచి తొలగిస్తుందని అందరం ఊహించాం. కానీ ఐఫోన్ 6 హ్యాండ్‌సెట్స్‌ను కూడా తీసేస్తుండటం ఆశ్చర్యం కలిగించే అంశం.

టీసీఎస్ సంచలన ప్రకటనతో ఐటీ ఢమాల్

08/09/2016: ఐటీ సెక్టార్ అభివృద్ధికి సంబంధించి ఐటీ మేజర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సంచలన వ్యాఖ్యలు ఐటీ రంగాన్ని మరింత కుదిపేస్తున్నాయి. క్యూ 2 లో ఫలితాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చనే అనుమానాలు వ్యక్తం చేసింది. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, ఇన్సూరెన్స్‌ సేవల(బీఎఫ్‌ఎస్‌ఐ) విభాగంలో ప్రతికూలతలు నమోదవుతున్నట్టు ముంబై కి చెందిన ఐటీ దిగ్గజం టీసీఎస్ వెల్లడించింది. ఈ ప్రభావం ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికం(జూలై-సెప్టెంబర్‌)లో కనిపించనున్నట్లు హెచ్చరించింది. దీంతో మదుపర్లు భారీ అమ్మకాలతో గురువారం నాటి మార్కెట్ లో ఫ్రంట్ లైన్ ఐటీ రంగ షేర్లు భారీగా నష్ట పోతున్నాయి. ప్రధానంగా టీసీఎస్ షేర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. సుమారు 6.4 శాతం పతనమై ఆరునెలల కనిష్టానికి చేరింది. మరో ఐటీ మేజర్ విప్రో షేర్ కూడా ఇదే కోవలోకి చేరింది. భారీ అమ్మకాల ఒత్తిడితో 52 వారాల కనిష్టాన్ని నమోదు చేసింది. ఆగష్టు 2016 డేటా ఆధారంగా వరున నష్టాలు ఊపందుకుంటున్నాయనీ, ఆర్థిక సేవలు, బీమా (బిఎఫ్ఎస్ఐ) సేవల పరిణామల కారణంగా ప్రధానంగా కంపెనీ కస్టమర్ల వృద్ధిలో ఒక హెచ్చరిక గుర్తించబడిందని బీఎస్ కి అందించిన ఒక ప్రకటనలో తెలిపింది . అమెరికా ప్రాజెక్టులపై ఈ ప్రభావం కనిపిస్తోదని టీసీఎస్‌ పేర్కొంది. ఈ ప్రకటన స్టాక్ ప్రతికూల ప్రభావం చూపించిందనీ, తదుపరి 2-3 త్రైమాసికాల్లో టీసీఎస్ అండర్ ఫెర్ ఫార్మర్ గా ఉండనుందనీ మార్కెట్ నిపుణుడు అవినాష్ గోరాష్కర్ వ్యాఖ్యానించారు. ఇది ఊహించిన పరిణామమేని, మొత్తానికి ఐటీ రంగానికి ప్రతికూలమేనన్నారు. మరోవైపు బ్రెగ్జిట్ ఉదంతం నేపథ్యంలో కొన్ని ప్రాజెక్టులు క్యాన్సిల్‌ కావడం, ఆలస్యంకావడం తదితర సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్‌, మెండ్‌ ట్రీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు క్యూ 1 ఆర్థిక ఫలితాలు కూడా ఐటీ రంగాన్ని దెబ్బతీశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, ఒరాకిల్‌ ఫైనాన్షియల్‌ నేలచూపులు చూస్తున్నాయి.

ఐఫోన్7పై యాపిల్ ముందస్తు వార్నింగ్

08/09/2016: ఐఫోన్7, ఐఫోన్ 7ప్లస్ ఫోన్లను లాంచ్ చేసిన ఒక్కరోజుకే యాపిల్ ఆసక్తికరమైన హెచ్చరికలు చేసింది. ఐఫోన్ 7, ఐఫోన్7 ప్లస్ జెట్ బ్లాక్ వేరియంట్ను చాలా జాగ్రత్తగా వాడాలని ముందస్తు వార్నింగ్ ఇచ్చింది. ఈ వేరియంట్ త్వరగా గీతలు(స్క్రాచ్లు) పడే అవకాశాలున్నాయంటూ హెచ్చరించిన యాపిల్, గీతలు పడకుండా ఉండేందుకు ఈ వేరియంట్కు కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కంపెనీ వెబ్సైట్లో కొత్త ఐఫోన్7 పేజీలో ఈ విషయాలను యాపిల్ వెల్లడించింది. మెరిసే గాడ్జెట్లపై ఎక్కువగా ఆసక్తిచూపే స్మార్ట్ఫోన్ ప్రియుల కోసం ఈ జెట్ బ్లాక్ ఐఫోన్7ను తీసుకొచ్చినట్టు తెలిపింది. ఇతర యాపిల్ అనాడిజైట్ ఉత్పత్తులతో లాగా దీని పైభాగం సమానంగా ఉన్నప్పటికీ, చాలా హార్డ్గా ఉంటుందని యాపిల్ తెలిపింది. తక్కువ రాపిడిలో వాడినప్పుడు ఎక్కువ ప్రకాశవంతంగా వెలుగొందుతుందని పేర్కొంది. ఐఫోన్ జాగ్రత్తపరుచుకోవడానికి తాము ప్రతిపాదించే వాటిని ఈ ఫోన్కు వాడితే, ఐఫోన్7 జెట్ బ్లాక్ వేరియంట్ను గీతల బారినుంచి తప్పించవచ్చని వెల్లడించింది. ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ కొత్త జెట్ బ్లాక్ వేరియంట్లు 128జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉండనున్నాయి. అదేవిధంగా గోల్డ్, సిల్వర్, రోజ్ గోల్డ్ రంగుల్లో కూడా యాపిల్ ఈ ఫోన్లను తీసుకొచ్చింది. కొత్త బ్లాక్ వేరియంట్ కేవలం 32జీబీ స్టోరేజ్ ఆప్షన్లోనే అందుబాటులో ఉండనుంది. శాన్ఫ్రాన్సిస్కోలోని ఓ ప్రత్యేక ఈవెంట్గా యాపిల్ ఈ ఫోన్లను ఆవిష్కరించింది. అక్టోబర్ 7 నుంచి భారత్లో విక్రయాలు ప్రారంభంకానున్నాయి. వీటి ప్రారంభ ధర ఇండియాలో రూ.60,000గా కంపెనీ నిర్ణయించింది.

ఐఫోన్ కు ఎదురేలేదు!

07/09/2016: న్యూయార్క్: ఎంత పోటీ ఉన్నా ఆపిల్ ఐఫోన్ కు తిరుగులేదని మరోసారి రుజువైంది. మార్కెట్ లోకి ఎన్ని స్మార్ట్ ఫోన్లు వస్తున్నా ఐఫోన్ కు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తాజా గణింకాలు ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశాయి. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయిన స్మార్ట్ ఫోన్ గా ఐఫోన్ 6ఎస్ నిలిచింది. 2016 ద్వితీయ త్రైమాసికంలో అత్యధికంగా 1.42 కోట్ల(14.2 మిలియన్లు) ఐఫోన్ 6ఎస్ అమ్ముడైనట్టు మార్కెట్ అధ్యయన సంస్థ స్ట్రాటజీ ఎనలిటిక్స్ వెల్లడించింది. మొత్తం స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఇది 4 శాతమని తెలిపింది. 2 శాతం వాటాతో ఐఫోన్ 6 రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 85 లక్షల ఐఫోన్ 6 అమ్ముడయ్యాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్7 మూడో స్థానం(83 లక్షలు) దక్కించుకుంది. గతేడాదితో పోల్చుకుంటే స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ఒక శాతం పెరిగాయి. నిరుడు ద్వితీయ త్రైమాసికంలో 33 కోట్ల స్మార్ట్ ఫోన్లు అమ్ముడుపోగా, ఈ ఏడాది 34 కోట్లు సేల్ అయ్యాయి.

ఆండ్రాయిడ్ నోగట్తో ఎల్జీ ఫోన్ వచ్చేసింది!

07/09/2016: గూగుల్ కొత్త ఆండ్రాయిడ్ వెర్షెన్ 7.0 నోగట్ సాప్ట్వేర్తో తొలి స్మార్ట్ఫోన్ వచ్చేసింది. ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్జీ, వీ20 పేరుతో ఈ ఫోన్ను ఆవిష్కరించింది. శాన్ఫ్రాన్సిస్కో ఈవెంట్గా ఈ ఫోన్ను ఎల్జీ లాంచ్ చేసింది. నోగట్ ఇప్పటికే ఉచిత అప్గ్రేట్గా నెక్షస్ బ్రాండ్లోని కొన్ని గూగుల్ ఫోన్లలో అందుబాటులో ఉంది. అయితే నోగట్ మొదట ఇన్స్టాల్ చేసిన ఫోన్ వీ20నే కావడం విశేషం. గతేడాది ప్రవేశపెట్టిన వీ10 విజయవంతం కావడంతో, ఎల్జీ లేటెస్ట్ గూగుల్ ఆండ్రాయిడ్ సాప్ట్వేర్తో వీ20 ఫోన్ను కంపెనీ తీసుకొచ్చింది. డ్యూయల్ డిస్ప్లే సిస్టమ్తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. రెండో డిస్ప్లే ఫోన్కి టాప్లో ఉంటుంది. రెండో డిస్ప్లే మొదటి దానికంటే ఎక్కువ ప్రకాశవంతంగా, పెద్ద ఫాంట్తో ఉండనుంది. కెమెరా సిస్టమ్ను ముందస్తు దానికంటే మరింత సామర్థ్యంతో ఈ మోడల్ను అప్గ్రేడ్ చేశారు. వినియోగదారులు ఎవరైతే ఫోటోలు, వీడియోలు తీసి షేర్ చేస్తుంటారో వారికి ఆకర్షణీయంగా ఉండనుందని కంపెనీ ఆశాభావం వ్యక్తంచేస్తోంది. అదేవిధంగా 32 బిట్ హై-ఫై క్వాడ్ డాక్ ఫీచర్తో తీసుకొచ్చిన ప్రపంచపు తొలి స్మార్ట్ఫోన్ కూడా తమదేనని ఎల్జీ ప్రకటించింది. మెరుగైన ఆడియో, నాయిస్ ఫిల్టరింగ్ను కలిగిఉంటుందని ఎల్జీ పేర్కొంది. స్పష్టమైన, సంక్షిప్తమైన శబ్దాలను ఎల్జీ వీ20 అందించగలదని తెలిపింది. ఫాస్ట్ ప్రాసెసర్లు, పెద్ద డిస్ప్లేలు మాత్రమే కాక, బెస్ట్ క్వాలిటీ ఆడియోను అందించేందుకు కృషిచేశామని కంపెనీ చెప్పింది. గ్లోబల్గా వీ20 ఫోన్ ఈ నెల నుంచి అందుబాటులోకి రానుంది. డార్క్ గ్రే, సిల్వర్, పింక్ రంగుల్లో ఈ ఫోన్ లభ్యంకానుంది. రెండు వారాల్లో కంపెనీ పూర్తి వివరాలను వెల్లడిచనుంది. ఎల్జీ వీ20 ఫీచర్లు... 5.7 అంగుళాల క్యూహెచ్డీ మెయిన్ డిస్ప్లేతో రెండో డిస్ప్లే క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్ 820 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 2 టీబీ వరకు విస్తరణ మెమెరీ డ్యూయల్ కెమెరాస్(16 ఎంపీ స్టాండర్డ్, 8 ఎంపీ వైడ్-యాంగిల్) 3200 ఎంఏహెచ్ బ్యాటరీ

రూ.29తో నెలంతా ఇంటర్నెట్ - ఎయిర్టెల్

07/09/2016: హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ ఎయిర్‌టెల్ నెలంతా ఇంటర్నెట్ పేరుతో రూ.29 విలువ గల ప్రీపెయిడ్ డేటా ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. 30 రోజుల కాల పరిమితి గల ఈ ప్యాక్ కింద 75 ఎంబీ 2జీ/3జీ/4జీ డేటా అందుకోవచ్చు. అందుబాటు ధరలో ఎంట్రీ లెవెల్ ప్యాక్‌తో ఎక్కువ రోజులు ఆన్‌లైన్‌లో ఉండాలని కోరుకునే వారి కోసం దీనిని అందుబాటులోకి తెచ్చినట్టు కంపెనీ తెలిపింది.

సొంత బ్రాండులో గూగుల్ మరో డివైజ్

06/09/2016: సొంత బ్రాండుతో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్ను సొంతం చేసుకోవాలనుకుంటున్న గూగుల్, మరో పిక్సెల్ డివైజ్ను కూడా లాంచ్ చేయడానికి సిద్దమవుతుందట. పిక్సెల్, పిక్సెల్ ఎక్స్ఎల్ పేర్లతో అక్లోబర్ 4న రెండు స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయబోతున్న గూగుల్, అనంతరం కొన్ని వారాల్లోనే కంపెనీ కొత్త పిక్సెల్ టాబ్లెట్నూ వినియోగదారుల ముందుకు తీసుకురానున్నట్టు తెలుస్తోంది. 2013లో లాంచ్ చేసిన నెక్షస్ 7 డివైజ్లకు రిప్లేస్గా ఈ టాబ్లెట్ను తీసుకొస్తున్నట్టు సమాచారం. ఈ కొత్త గూగుల్ టాబ్లెట్, నెక్సస్ స్మార్ట్ఫోన్ల మాదిరిగానే పిక్సెల్ సిరీస్ డివైజ్ రీబ్రాండెడ్ రూపంలో రానుంది. 4జీబీ ర్యామ్తో ఈ డివైజ్ను హువాయ్ తయారుచేస్తున్నట్టు తెలుస్తోంది. గూగుల్ హువాయ్ 4 జీబీ ర్యామ్తో ఏడు అంగుళాల టాబ్లెట్ను ఈ ఏడాది ముగింపుకు ముందే లాంచ్ చేయబోతుందని ఫోన్ లీకర్, అమెరికన్ బ్లాగర్ ఈవన్ బ్లాస్ ట్వీట్ చేశారు. అయితే దీనికి సంబంధించిన మిగతా ఏ వివరాలను ఆయన తెలుపలేదు. ఈ చైనీస్ దిగ్గజం హువాయ్, గూగుల్తో పనిచేయడం మొదటిసారేమి కాదు. గతేడాదే నెక్షస్ 6పీ డివైజ్లను హువాయ్ తయారుచేసింది. అయితే ప్రస్తుతం కొత్తగా రూపొందించబోతున్న పిక్సెల్ టాబ్లెట్ ఇప్పడున్న వాటికంటే పెద్దదిగా ఉండబోతుందట. మొత్తం మెటల్ బాడీతో, ఎక్కువ రెజుల్యూషన్ 1440పీ స్క్రీన్తో ఇది యూజర్ల ముందుకు రాబోతుంది. కొన్ని నెలల క్రితమే ఆవిష్కరించిన తాజా వెర్షన్ ఆండ్రాయిడ్ నోగట్తో ఈ టాబ్లెట్ పనిచేయనుంది. ఈ టాబ్లెట్కు ముందు మార్కెట్లోకి వచ్చే రెండు పిక్సెల్ స్మార్ట్ఫోన్లు.. మార్లిన్, సెయిల్ఫిష్ కోడ్నేమ్తో రాబోతున్నాయి. నెక్షస్ 5ఎక్స్, నెక్షస్ 6పీలను అవి రీప్లేస్ చేయబోతున్నాయి. 5, 5.5 అంగుళాల పరిమాణంలో తాకే తెర ఉండే ఈ ఫోన్ల అంతర్గత స్టోరేజీ సామర్థ్యం 32 జీబీ, 128 జీబీగా ఉంటుందట.

ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్... - బాధ్యతలు అప్పగించిన రఘురామ్ రాజన్

06/09/2016: ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) 24వ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత గవర్నర్ రఘురామ్ రాజన్ ఆదివారం తన పదవీ బాధ్యతలను ఉర్జిత్ పటేల్‌కు అప్పగించి ఆర్‌బీఐలో మూడేళ్ల ప్రయాణాన్ని ముగించారు. కాగా, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజన్‌కు గౌరవపూర్వకంగా శనివారం వీడ్కోలు విందు(డిన్నర్)ను ఏర్పాటు చేసింది. దీనికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో పాటు ఆర్థిక శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ద్రవ్యోల్బణం కట్టడికి తాము ప్రారంభించిన చర్యలను ఉర్జిత్ కొనసాగించగలరని రాజన్ విశ్వాసం వ్యక్తం చేశారు. వీడ్కోలు నేపథ్యంలో ఫారెక్స్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘గడిచిన మూడేళ్లుగా ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధానానికి సంబంధించి ఉర్జిత్ చాలా కీలకంగా పనిచేశారు. రానున్నకాలంలో ద్రవ్యోల్బణం లక్ష్యాలను సాధించే విషయంలో ఆయన పరపతి విధాన కమిటీ(ఎంపీసీ)కి సమర్థంగా దిశానిర్ధేశం చేయగలరన్న సంపూర్ణ విశ్వాసం ఉంది’ అని రాజన్ వ్యాఖ్యానించారు. కాగా, ఆదివారం నుంచే పటేల్ పదవీకాలం మొదలైనప్పటకీ నేడు సోమవారం వినాయక చవితి సెలవు నేపథ్యంలో 6న ఆయనకు గవర్నర్ రోజువారీ కార్యకలాపాల్లోకి అడుగుపెట్టే తొలి రోజు కానుంది. ద్రవ్యోల్బణం దిగొస్తుంది...: 2017 మార్చికల్లా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 5 శాతానికి తగ్గించాలన్నది ఆర్‌బీఐ లక్ష్యం కాగా, ప్రస్తుతం ఇది 6 శాతానికి పైగానే(జూలైలో) ఉండటాన్ని రాజన్ ప్రస్తావిస్తూ... రానున్న నెలల్లో కచ్చితంగా దిగొస్తుందని అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయికి(2 శాతం అటూఇటుగా) కట్టడి చేయాని ఆర్‌బీఐకి ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించడం తెలిసిందే. మరోపక్క, వడ్డీరేట్లను రాజన్ తగ్గించడం లేదంటూ విమర్శించినవాళ్లకు ఇప్పుడు కొత్త గవర్నర్ ఉర్జిత్ పటేల్‌పై అంచనాలు చాలా పెరిగాయి. మరోపక్క, ఆఖరి పాలసీ సమీక్ష(ఆగస్టు)లో రాజన్ పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా 2015 నుంచి చూస్తే రాజన్ కీలకమైన రెపో రేటును 1.5 శాతం తగ్గించగా.. బ్యాంకులు మాత్రం తమ రుణరేట్ల తగ్గింపులో ఈ ప్రయోజనాన్ని దాదాపు సగం మేరకు మాత్రమే తమ కస్టమర్లకు బదలాయించడం గమనార్హం. ప్రధానంగా కుప్పలుగా పేరుకుపోతున్న మొండిబకాయిల(ఎన్‌పీఏ)తో బ్యాంకుల లాభదాయకత ఘోరంగా దెబ్బతినడమే దీనికి కారణంగా నిలుస్తోంది. ప్రభుత్వం రంగ బ్యాంకులు 2015-16లో ఎన్‌పీఏల కారణంగా ఏకంగా రూ.17,999 కోట్ల నికర నష్టాలను చవిచూడటం దీనికి నిదర్శనం. ఇదే కాలంలో స్థూల ఎన్‌పీఏలు రూ.6 లక్షల కోట్లకు వీటిపై ప్రొవిజనింగ్ రూ.1.8 లక్షల కోట్లకు(87 శాతం పెరిగింది) ఎగబాకింది.

నల్లధనంపై కొరడా తప్పదు! - స్వచ్ఛంద వెల్లడికి 30 వరకే గడువు - లేదంటే కఠిన చర్యలే - ప్రధాని మోదీ స్పష్టీకరణ

03/09/2016: న్యూఢిల్లీ: ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా నల్లధనాన్ని వెల్లడించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ‘తెలిసో తెలియకో ఎవరివద్దయినా నల్లధనం ఉంటే... ఈ నెల 30 లోగా దాన్ని వెల్లడించి బయటపడండి. గడువు ముగిసిన తర్వాత కచ్చితంగా తీవ్ర చర్యలు ఉంటాయి. దానికి నన్నెవరూ నిందించొద్దు’ అని మోదీ స్పష్టం చేశారు. ఒక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం(ఐడీఎస్) కింద నల్లధనం ఉన్నవాళ్లు తమ ఆస్తులను ప్రకటించేందుకు జూన్ 1 నుంచి ఈ నెల 30 వరకూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. వెల్లడించిన నల్లధనంపై పన్నుతో పాటు 45 శాతం జరిమానా చెల్లించడం ద్వారా చట్టబద్ధమైన ఆస్తులుగా మార్చుకునేందుకు వీలుంది. కాగా, కేంద్రంలో తమ సర్కారు కొలువుదీరిన తర్వాత నల్లధనాన్ని వెలికితీసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేస్తూ తొలి నిర్ణయాన్ని తీసుకున్న విషయాన్ని మోదీ గుర్తుచేశారు. ‘ప్రస్తుతం సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. సుప్రీంకోర్టు దీన్ని పర్యవేక్షిస్తోంది. అదేవిధంగా భారత్ నుంచి విదేశాలకు నల్లధనాన్ని తరలించకుండా మా ప్రభుత్వం చట్టాలను తీసుకొచ్చింది. దీంతో భవిష్యత్తులో విదేశాల్లో నల్లధనం పోగుపడే అవకాశాల్లేకుండా చేశాం. అంతేకాదు దేశీయంగా కూడా ఈ సమస్యకు అడ్డుకట్టవేయడానికి చట్టాలనూ సవరించాం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థకు గడ్డుకాలం తొలగింది... భారత ఆర్థిక వ్యవస్థ దుర్భరమైన పరిస్థితుల నుంచి ఇప్పుడు గట్టెక్కిందని మోదీ చెప్పారు. ప్రైవేటు రంగంలో పెట్టుబడుల మందగమనం... ఎకానమీ కుంటుపడటానికి గత యూపీఏ ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. అయితే, ఆర్థిక వ్యవస్థను మెరుగ్గా చూపించేందుకు తాము అడ్డదారుల్లో వెళ్లాలనుకోవడం లేదని తేల్చిచెప్పారు. ప్రైవేటు పెట్టుబడులు ఇంకా పుంజుకోవడం లేదు. ఇదంతా గత సర్కారు పుణ్యమేనంటూ మోదీ పేర్కొన్నారు. తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో(2016-17, క్యూ1) స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు మళ్లీ మందగించి 7.1 శాతానికి తగ్గిన సంగతి తెలిసిందే. గతేడాది ఇదే క్వార్టర్‌లో వృద్ధి 7.5 శాతంగా నమోదైంది. వ్యవసాయం, మైనింగ్, నిర్మాణ రంగాల పేలవ పనితీరు దీనికి కారణంగా నిలిచింది. గడిచిన 2015-16 పూర్తి ఏడాదికి జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతానికి ఎగబాకడం ద్వారా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. ఈ విషయంలో చైనా వెనక్కినెట్టింది కూడా.

‘జియో’ను ఎదుర్కోవడం ఎలా..? - కొత్త వ్యూహాల్లో టెల్కోలు... వినూత్నమైన ప్లాన్ల ప్రకటన

03/09/2016: న్యూఢిల్లీ: రిలయన్స్ జియో తన ప్రివ్యూ ఆఫర్‌తో టెలికం రంగంలోని దిగ్గజ కంపెనీలకు చుక్కలు చూపెడుతోంది. వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కాకమునుపే పరిస్థితి ఇలా ఉందంటే.. జనవరిలో పూర్తిస్థాయిలో జియో మార్కెట్‌లోకి అడుగుపెడితే? దీనికి సమాధానమివ్వడం కొంత కష్టమే. జియో ప్రివ్యూ ఆఫర్ దెబ్బకు ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థలు ఇప్పటికే ఉన్న డేటా ప్యాక్స్‌కు అదనపు డేటాను అందిస్తున్నాయి. కొత్త యూజర్లను ఆకట్టుకోవడం పక్కన ఉంచితే.. ఉన్నవారిని జారిపోకుండా చూసుకోవడానికి తెగ శ్రమిస్తున్నాయి. దీంతో టెల్కోలు ఇప్పటికే డేటాతోపాటు ఉచిత కాల్స్‌తో కూడిన వినూత్నమైన ఆఫర్లనూ ప్రకటిస్తున్నాయి. టెల్కోలు.. హ్యాండ్‌సెట్స్ కంపెనీలతో కలసి ప్రకటించే బండిల్ ఆఫర్ల జోరు పెరుగుతుందని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు. మెగా సేవర్ ప్యాక్స్ ధర మరింత తగ్గొచ్చు! ప్రస్తుతం ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ కంపెనీలు వాటి ప్రి-పెయిడ్ ఇంటర్నెట్ ప్యాక్స్‌పై అధిక డేటాను అందిస్తున్నాయని యూబీఎస్ పేర్కొంది. తమ లెక్కల ప్రకారం సాంప్రదాయ ప్లాన్స్‌తో పోలిస్తే మెగా సేవర్ ప్యాక్స్ త్వరలో 35-40 శాతం మరింత తక్కువ ధరకే అందుబాటులో రావొచ్చని తెలిపింది. ‘రిలయన్స్ జియో రాకతో 4జీ డేటా వినియోగం బాగా పెరుగుతుంది. దీనికి తక్కువ డేటా చార్జీలతో కూడిన ప్లాన్స్, చౌక ధరల 4జీ హ్యాండ్‌సెట్స్ వంటి అంశాలు కారణంగా నిలుస్తాయి’ అని వివరించింది. ఉచిత కాలింగ్‌తో బండిల్ ప్లాన్స్? జియో సేవలు త్వరలో ప్రారంభం కానుండటంతో ఎయిర్‌టెల్ సహా ఇతర కంపెనీలు డేటా చార్జీలను తగ్గించే అవకాశముందని జేపీ మోర్గాన్ అభిప్రాయపడింది. టెల్కోలు డేటాతోపాటు ఉచిత కాలింగ్ ఫీచర్‌తో కూడిన బండిల్ ప్లాన్స్ అందించొచ్చని పేర్కొంది. జియోతో పోటీపడటానికి ఇతర కంపెనీలు ఎలాంటి ఆఫర్లను ప్రకటిస్తాయో చూడాల్సి ఉందని వివరించింది. కాగా టెల్కోలు ప్రస్తుతం రూ.9 నుంచి (20 ఎంబీ, 28 రోజుల వ్యాలిడిటీ) డేటా ప్లాన్స్‌ను అందిస్తున్నాయని క్రెడిట్ సూచీ పేర్కొంది. దీనికి మార్కెట్‌లోకి కొత్త సంస్థ అడుగుపెట్టడం కారణం కావొచ్చని అభిప్రాయపడింది. ఎయిర్‌టెల్ వ్యూహాలు మెరుగు రిలయన్స్ జియో సేవల ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకొని ఎయిర్‌టెల్ వ్యవహరిస్తోన్న విధానాలు మెరుగ్గా వున్నాయని యూబీఎస్ పేర్కొంది. టారిఫ్ ధరలను తగ్గించకుండా అదనపు డేటా అందించడం, రూ.1,498 ముందస్తు చెల్లింపుతో రూ.51లకే 1 జీబీ డేటా వంటి ప్లాన్స్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. కస్టమర్లను నిలుపుకోవడానికి ఇలాంటి చర్యలు దోహదపడతాయని తెలిపింది. వీటి వ ల్ల డేటా వినియోగం కూడా పెరుగుతుందని పేర్కొంది. జియోని నిలువరిస్తాయా? రిలయన్స్ జియోని ప్రస్తుత దిగ్గజ టెల్కోలు ఎలా ఎదుర్కొంటాయనేది ఆసక్తికరంగా మారిందని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. జియో ఇప్పటికే రూ.50లకే 1 జీబీ డేటా వంటి పలు వినూత్నమైన ఆఫర్లను ప్రకటించింది. ‘సంస్థ ప్రివ్యూ ఆఫర్ కింద ఉచిత సిమ్‌తో 4 నెలలు అపరిమిత డేటా, వాయిస్ సేవలను అందిస్తోంది. దీనికి మార్కెట్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. వచ్చే రెండేళ్లలో జియో యూజర్ల సంఖ్య 3.5 కోట్లకు చేరొచ్చు’ అని వివరించింది. దీని దెబ్బకి ఇతర టెల్కోల డేటా వినియోగం వృద్ధి 70% నుంచి 50 శాతానికి తగ్గొచ్చని పేర్కొంది. నాణ్యమైన టెలికం సేవలు కావాలి: సర్వే న్యూఢిల్లీ: రిలయన్స్ జియో దెబ్బకి టెలికం కంపెనీలు టారిఫ్ ధరలపై ప్రధానంగా దృష్టికేంద్రీకరించాయి. అందులో భాగంగానే టారిఫ్ ధరలను తగ్గిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తక్కువ టారిఫ్ ధరలు మంచిదేనని, వీటితోపాటు టెల్కోలు మెరుగైన సేవలను అందిస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ విషయం ‘లోకల్‌సర్కిల్’ అనే ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యింది. సర్వే ప్రకారం.. టెల్కోల డేటా సర్వీసులు చాలా పేలవంగా ఉన్నాయని 43 శాతం మంది పేర్కొన్నారు. ఇక వాయిస్ సేవలు సంతృప్తికరంగా లేవని 27 శాతం మంది తెలిపారు. కాల్ డ్రాప్స్ విషయానికి వస్తే.. 53 శాతం మంది వారి ఆపరేటర్‌కు యావరేజ్ రేటింగ్‌ను ఇచ్చారు. ఇక టెలికం సంబంధిత సమస్యలను చక్కబెట్టడానికి నియంత్రణ సంస్థ ట్రాయ్ తగినంత కృషి చేయలేదని దాదాపు 77 శాతం మంది అభిప్రాయపడ్డారు. డౌన్‌లోడింగ్ వ్యయం ఎక్కువగా ఉందని 53 శాతం పేర్కొన్నారు.

'గెలాక్సీ నోట్ 7' షాకింగ్ న్యూస్

02/09/2016: ప్రముఖ ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ తాజా వెర్షన్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్ 7కు సంబంధించి షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. బ్యాటరీ లో తలెత్తిన వైఫల్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా విక్రయించిన ఈ మోడల్ ఫోన్లన్నింటినీ త్వరలోనే రీకాల్ చేయాలని శాంసంగ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. సౌత్ కొరియాకు చెందిన యాన్ హాప్ న్యూస్ అందించినసమాచారం ప్రకారం బ్యాటరీలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఈ వారాంతంలో వీటిని వెనక్కి పిలవాలనే నిర్ణయం తీసుకున్నట్టు సమచారం. అటు తమ వినియోగదారుల భద్రత తమకు అత్యంత ముఖ్యమనీ, వారికి ఎలాంటి ఇబ్బందీ రానివ్వకూడదనే ఉద్దేశంతోనే ఫోన్లన్నీ రీకాల్ చేయనున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని శాంసంగ్ ప్రతినిది ఒకరు వ్యాఖ్యానించారు. అయితే ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి శాంసంగ్ నిరాకరించింది. క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని...వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. తమ వినియోగదారులకు అత్యధిక నాణ్యత ఉత్పత్తులు అందించడంలో సంపూర్ణ నిబద్ధతతో ఉన్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. చార్జింగ్ పెట్టినపుడు ఈ ఐరిస్ స్కానర్ శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్లు పేలుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈక్విటీపైనా ప్రభావం చూపింది. దీనిపై శాంసంగ్ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, ఈ ఫోన్లను పరీక్షిస్తున్నామని, తమ కస్టమర్లకు అత్యంత క్వాలిటీతో కూడిన ఉత్పత్తులను మాత్రమే తాము అందిస్తామని వెల్లడించింది. మొత్తం షిప్పింగ్ చేసిన ఫోన్లలో 0.1 శాతం యూనిట్లలో మాత్రమే సమస్యలకు ఆస్కారముందని శాంసంగ్ మరో అధికారి తెలిపారు. ప్రతి సంవత్సరం, బ్యాటరీ పేలుళ్ల ప్రమాదాలు నమోదవుతున్నప్పటికీ, ఇంత తక్కువ వ్యవధిలో ఇదే మొదటి సారి అని షిన్హాన్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ విశ్లేషకుడు హా జూన్-డూ,వ్యాఖ్యానించారు. కాగా, భారత్ సౌత్ కొరియా, అమెరికాలో ఆగస్ట్ లో రూ. 65 వేల ధరతో గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లో లాంచ్ చేసింది. అయితే అదనపు భద్రతా తనిఖీల కారణంగా కస్టమర్లకు ఫోన్ల రవాణా ఆలస్యమైనట్టు తెలుస్తోంది.

రిలయన్స్ పరిహారం ఇవ్వాల్సిందే! - ఏడేళ్లుగా ఓఎన్‌జీసీ గ్యాస్‌ను రిలయన్స్ తోడుకుంది...

01/09/2016: న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీతో గ్యాస్ వివాదంలో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్)కు ఎదురుదెబ్బ తగిలింది. కేజీ బేసిన్‌లో ఓఎన్‌జీసీకి చెందిన బ్లాక్‌ల నుంచి రిలయన్స్ ఆర్‌ఐఎల్ గత ఏడేళ్లుగా గ్యాస్‌ను తోడేసుకున్నట్లు జస్టిస్ ఏపీ షా కమిటీ తేల్చిచెప్పింది. ఇందుకుగాను ఓఎన్‌జీసీకి నష్టపరిహారాన్ని ఆర్‌ఐఎల్ చెల్లించాలని బుధవారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు సమర్పించిన సమగ్ర నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు తలెత్తకుండా తీసుకోవాల్సిన సూచనలను కూడా నివేదికలో కమిటీ పొందుపరిచింది. కేజీ బేసిన్‌లో ఆర్‌ఐఎల్ తమ బ్లాక్‌ల నుంచి అక్రమంగా గ్యాస్‌ను తరలించేస్తోందంటూ ఓఎన్‌జీసీ ఆరోపణలు చేయడంతో కేంద్రం ఈ వివాదంపై ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ అజిత్ ప్రకాశ్ షా నేతృత్వంలో ఏక సభ్య కమిటీని నియమించడం తెలిసిందే. కేజీ బేసిన్‌లో ఓఎన్‌జీసీకి ఉన్న గోదావరి-పీఎంఎల్, కేజీ-డీడబ్ల్యూఎన్-98/2 బ్లాక్‌లు ఆర్‌ఐఎల్‌కు ఉన్న కేజీ-డీ6 ప్రధాన క్షేత్రం పక్కనే ఉన్నాయి. వీటి నుంచి 2009, ఏప్రిల్ 1 నుంచి 2015, మార్చి 31 మధ్య కాలంలో ఆర్‌ఐఎల్ కేజీ-డీ6కు 11.122 బిలియన్ ఘనపు మీటర్ల మేర గ్యాస్ తరలిపోయినట్లు స్వతంత్ర అధ్యయన సంస్థ డీఅండ్‌ఎం గతేడాది నవంబర్‌లో ఇచ్చిన నివేదికలో పేర్కొంది. అప్పటి సహజ వాయువు రేట్ల(యూనిట్‌కు 4.2 డాలర్లు) ప్రకారం దీని విలువ 1.7 బిలియన్ డాలర్లు(సుమారు రూ.11,055 కోట్లు)గా లెక్కగట్టింది. తమ బ్లాక్‌ల నుంచి ఆర్‌ఐఎల్ క్షేత్రాలకు గ్యాస్ తరలిపోతోందని 2013లో గుర్తించిన ఓఎన్‌జీసీ.. దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకొని పరిహారం ఇప్పించాలని కేంద్రాన్ని కోరింది. అయితే, తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఓఎన్‌జీసీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు ఈ వివాదంపై స్వతంత్ర కన్సల్టెంట్ సంస్థ నివేదిక ఇచ్చిన ఆరు నెలల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి నిర్దేశించింది. అయితే, పీఎస్‌సీ ప్రకారమే తాము నడుచుకున్నామని, కేజీ-డీ6 బ్లాక్ పరిధిలోనే బావుల తవ్వి ఉత్పత్తి చేపట్టినట్లు ఆర్‌ఐఎల్ చెబుతూవస్తోంది. నెలరోజుల్లో తగిన నిర్ణయం: ప్రధాన్ నివేదికలో అంశాలపై మాట్లాడేందుకు నిరాకరించిన జస్టిస్ షా... అన్ని అంశాలతో సమగ్రంగా దీన్ని కేంద్రానికి ఇచ్చినట్లు చెప్పారు. పెట్రోలియం శాఖ భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలను కూడా ఇందులో సూచించామన్నారు. ‘గ్యాస్ తరలింపు అంశంపై జస్టిస్ షా సమగ్ర నివేదికను ఇచ్చారు. నెల రోజుల్లో దీనిపై పెట్రోలియం శాఖ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుంది’ అని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. కాగా, ఇదే అంశానికి సంబంధించి స్వతంత్ర సంస్థ డీఅండీఎం ఇచ్చిన నివేదిక(ఇది కూడా ఓఎన్‌జీడీ గ్యాస్ ఆర్‌ఐఎల్ బావుల్లోకి తరలిపోయిందని తేల్చింది) మాదిరిగానే షా కమిటీ కూడా తరలింపు జరిగినట్లు తేల్చిందా అన్న ప్రశ్నకు ప్రధాన్ అవుననే సమాధానమిచ్చారు. ఉత్పత్తి పంపకం కాంట్రాక్టు(పీఎస్‌సీ) ప్రకారం గ్యాస్ తరలింపు కారణంగా తలెల్తే ఆర్థిక, న్యాయపరమైన అంశాలన్నింటినీ షా కమిటీ నివేదికలో వివరించిందని, తాము దీన్ని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత బయటపెడతామని ఆయన వెల్లడించారు.

ప్రీపెయిడ్ కు ఎయిర్టెల్ కొత్త ప్లాన్లు - 6 నెలలు, ఏడాదికి కొత్త ప్యాకేజీలు

30/08/2016: హైదరాబాద్: టెలికం రంగ కంపెనీ ఎయిర్‌టెల్ డేటా చార్జీలను గణనీయంగా తగ్గించింది. ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం మెగా సేవర్ ప్యాక్ కింద ఏడాది పాటు 1జీబీ 4జీ డేటాను రూ.51 చొప్పున అందిస్తామని పేర్కొంది. అయితే ఈ ప్యాక్ కోసం ముందుగా వారు రూ.1,498 చెల్లించి 1జీబీ 4జీ/3జీ డేటా ప్లాన్ తీసుకోవాలి. ఆ తరవాత ఏడాదిపాటు ఎన్నిసార్లయినా రూ.51 చెల్లించి 1జీబీ 3జీ/4జీ డేటాను రీఛార్జ్ చేయించుకోవచ్చు. అలాగే రూ.748 చెల్లించి 1జీబీ 4జీ/3జీ డేటా ప్యాక్ తీసుకున్న వారు... ఆ తరవాత 6 నెలల పాటు రూ.99 చొప్పున ఎన్నిసార్లయినా 1జీబీ 3జీ/4జీ డేటా ప్యాక్‌లు తీసుకోవచ్చు.

ఆడి ‘ఏ6 మ్యాట్రిక్స్’లో పెట్రోల్ వేరియంట్ - ధర రూ.52.75 లక్షలు

30/08/2016: న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘ఆడి’ తన ‘ఏ6 మ్యాట్రిక్స్ 35 టీఎఫ్‌ఎస్‌ఐ’ సెడాన్ కారు మోడల్‌లో తాజాగా పెట్రోల్ వేరియంట్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.52.75 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. ఇందులో 1.8 లీటర్ పెట్రోల్ ఇం జిన్, 7 స్పీడ్ ట్రాన్స్‌మిషన్, అడ్వాన్స్‌డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలేషన్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ డిస్‌ప్లే వంటి ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఇది 0-100 కిలోమీటర్ల వేగాన్ని 7.9 సెకన్లలో అందుకుంటుందని తెలిపింది.

బంగారం.. రెండు వారాలు ఆగండి! - కొంత వెనక్కు తగ్గవచ్చంటున్న నిపుణులు

29/08/2016: ముంబై/న్యూయార్క్: పసిడికి సంబంధించి వచ్చే రెండు వారాలూ వేచిచూసే ధోరణి అవలంబించడం మంచిదన్నది నిపుణుల సూచన. అమెరికా ఫెడ్ ఫండ్ రేటును (ప్రస్తుత శ్రేణి 0.25-0.50 శాతం) పెంచే విషయంలో నెలకొన్న సందిగ్ధత... పసిడిపైనా పడుతుందన్నది వారి వాదన. మొత్తంమీద పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 1,340 డాలర్ల దిగువకు పడిపోవడం వెనకడుగును సూచిస్తోందని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇది మద్దతు స్థాయి కావటం వల్ల ఇక్కడి నుంచి పసిడి పెరుగుతుందా? లేక మరింత కిందకు జారుతుందా? అన్నది ఫెడ్ ఫండ్ రేటుపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. 0.25 శాతం నుంచి ఫెడ్ ఫండ్ రేటు పెరిగితే... క్రమంగా ఔన్స్ బంగారం 1,000 డాలర్ల దిగువకు జారిపోతుందన్న విశ్లేషణలకు భిన్నంగా ఈ ఏడాది ప్రారంభం నుంచీ భారీగా పెరిగి ఒక దశలో 1,370 డాలర్లకు చేరిన సంగతి గమనార్హం. వారంలో పసిడి కదలికలు... కాగా శుక్రవారంతో ముగిసిన వారంలో పసిడి ధర భారీగానే పడింది. అంతర్జాతీయ మార్కెట్ నెమైక్స్‌లో పసిడి ధర ఔన్స్‌కు వారం వారీగా చూస్తే 21 డాలర్లు పడి 1,324 డాలర్ల వద్ద ముగిసింది. వెండి కూడా నష్టాలతో 18.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక దేశీయంగా ప్రధాన బులియన్ మార్కెట్‌లో పసిడి 99.9 స్వచ్ఛత ధర 10 గ్రాములకు వారం వారీగా రూ.335 తగ్గి రూ.31,385 వద్ద ముగిసింది. 99.5 స్వఛ్చత ధర సైతం అంతే స్థాయిలో తగ్గి రూ.31,235కు దిగింది. (డాలర్ మారకంలో రూపాయి విలువ 67.06) ఒత్తిడి ఉంటుంది... సెప్టెంబర్‌లో ఫెడ్ ఫండ్ రేటు నిర్ణయం, ఆర్థిక వ్యవస్థ అందుకు తగిన విధంగా ఉందని ఫెడ్ చైర్మన్ ప్రకటన పసిడి ధరపై ఒత్తిడిని పెంచుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌కు 1,285-1,300 శ్రేణికి పడిపోయే అవకాశాలూ లేకపోలేదు. - ఫృద్వీరాజ్ కొఠారీ, ఎండీ, రిద్దిసిద్ధి బులియన్స్ దేశంలో రూ.30 వేల పైనే... డాలర్ ఇండెక్స్ పెరగవచ్చు. ఇది పసిడిపై ఒత్తిడిని పెంచే అంశమే. అయితే రానున్న పెళ్లిళ్ల సీజన్ పసిడికి దేశీయంగా కొంత పటిష్టతను చేకూర్చే అంశం. భారత్‌లో పసిడి ట్రేడింగ్ సమీప కాలంలో రూ.30,000-రూ.30,500 శ్రేణిలో ఉండవచ్చు. - నవీన్ మాథూర్, ఏంజిల్ బ్రోకింగ్

గోవా ఎయిర్పోర్టు ప్రాజెక్టు జీఎంఆర్ చేతికి - ప్రాజెక్టు విలువ సుమారు రూ. 3,300 కోట్లు

27/08/2016: హైదరాబాద్ : మౌలిక రంగ దిగ్గజం జీఎంఆర్ ఇన్‌ఫ్రా తాజాగా గోవాలో విమానాశ్రయ ప్రాజెక్టును దక్కించుకుంది. ఉత్తర గోవాలోని మోపాలో చేపట్టే ఈ ప్రాజెక్టు విలువ సుమారు రూ. 3,300 కోట్లుగా ఉంటుందని అంచనా. బీవోవోటీ (బిల్డ్, వోన్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్) ప్రాతిపదికన దీన్ని నిర్మించాల్సి ఉంటుంది. జీవీకే గ్రూప్, వోలప్టాస్ డెవలపర్స్, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎస్సెల్ ఇన్‌ఫ్రా తదితర సంస్థలు కూడా పోటీపడినప్పటికీ .. ఫైనాన్షియల్ బిడ్డింగ్‌లో జీఎంఆర్ విజేతగా నిల్చింది. శుక్రవారం ఇందుకు సంబంధించిన బిడ్లను తెరిచారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆదాయాల్లో ప్రభుత్వంతో పంచుకునే వాటాకు సంబంధించి ఎయిర్‌పోర్ట్ అథారిటీ 32.31 శాతం, ఎస్సెల్ ఇన్‌ఫ్రా 27 శాతం కోట్ చేయగా.. జీఎంఆర్ 36.99 శాతం కోట్ చేసింది. రుణ సమీకరణ ద్వారా ఈ ప్రాజెక్టుకు కావాల్సిన నిధులను జీఎంఆర్ సమకూర్చుకోనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈక్విటీ షేర్లు, ఈక్విటీ ఆధారిత సాధనాలు, డిబెంచర్లు మొదలైన వాటి జారీ ద్వారా రూ. 2,500 కోట్ల దాకా సమీకరించనున్నట్లు కంపెనీ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 14న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ప్రతిపాదనకు షేర్‌హోల్డర్ల అనుమతి కోరనున్నట్లు పేర్కొంది. జీఎంఆర్ ఇన్‌ఫ్రా ఇప్పటికే హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. గోవాలో రెండో విమానాశ్రయం.. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సెప్టెంబర్ రెండో వారంలో మోపా విమానాశ్రయ ప్రాజెక్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. దక్షిణ గోవాలో ఇప్పటికే దబోలిమ్ ఎయిర్‌పోర్ట్ ఉండగా.. రాష్ట్రంలో ఇది రెండో విమానాశ్రయం కానుంది. నేవీ నిర్వహణలో ఉండే దబోలిమ్ ఎయిర్‌పోర్టులో పౌర విమానాల రాకపోకలకు సంబంధించి పలు నియంత్రణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రెండో విమానాశ్రయం ప్రతిపాదన తెరపైకొచ్చింది. సుమారు 2,271 ఎకరాల్లో .. తొలుత వార్షికంగా తొంభై లక్షల ప్రయాణికుల సామర్ధ్యంతో మోపా విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. సుమారు 149 ఎకరాల్లో ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యూయలింగ్ సెంటర్లు, కార్ పార్కింగ్ మొదలైనవి ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఏవియేషన్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను కూడా నెలకొల్పాల్సి ఉంటుంది. 2019 నాటికల్లా ఎయిర్‌పోర్ట్ తొలిదశ అందుబాటులోకి రాగలదని అంచనా. తొలి దశలో 44 లక్షల మంది ప్రయాణికుల సామర్ధ్యంతో విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. 2045 నాటికి 1.31 కోట్ల మంది ప్రయాణికుల సామర్ధ్యం ఉండేలా దీన్ని తీర్చిదిద్దనున్నారు. గ్రీస్ ఎయిర్‌పోర్టుకూ బిడ్డింగ్? గ్రీస్‌లోని హెరాక్లియోన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అభివృద్ధి ప్రాజెక్టు కోసం కూడా జీఎంఆర్ బిడ్డింగ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గ్రీస్‌లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో రెండోదైన ఈ ఎయిర్‌పోర్టు బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు వీలు కల్పించేలా పౌర విమానయాన శాఖ నుంచి ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్‌ను కూడా కంపెనీ పొందినట్లు సమాచారం. అంతర్జాతీయంగా జీఎంఆర్ ఇప్పటికే ఫిలిప్పీన్స్‌లోని మక్టాన్ సెబు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును నిర్వహిస్తోంది. టర్కీ ఇస్తాంబుల్ విమానాశ్రయంలో వాటాలను కొన్నాళ్ల క్రితం విక్రయించి వైదొలగింది. మాల్దీవుల్లోని మాలే అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ అంశం వివాదంలో ఉంది.

భారత్లో సోనీ సొంత ప్లాంటు

27/08/2016: హైదరాబాద్ : ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం సోనీ సొంత తయారీ కేంద్రాన్ని భారత్‌లో నెలకొల్పాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ తమిళనాడులో థర్డ్ పార్టీకి చెందిన ప్లాంటులో ఉపకరణాలను అసెంబుల్ చేస్తోంది. సొంత ప్లాంటు ఏర్పాటుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాలను పరిశీలిస్తున్నట్టు సోనీ ఇండియా ఎండీ కెనిచిరో హిబి తెలిపారు. దక్షిణప్రాంత సేల్స్ మేనేజర్ జి.రాజేశ్, హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ అభిజిత్‌తో కలసి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. 22-55 అంగుళాల ప్యానెళ్లను ఇప్పటికే భారత్‌లో అసెంబుల్ చేస్తున్నట్టు చెప్పారు. రానున్న రోజుల్లో మరింత పెద్ద సైజు ప్యానెళ్ల అసెంబ్లింగ్ చేపడతామన్నారు. స్మార్ట్‌ఫోన్లను దేశీయంగా తయారీ చేసే అవకాశాన్ని అధ్యయనం చేస్తున్నట్టు పేర్కొన్నారు. మీడియాతో ఆయనింకా ఏమన్నారంటే.. పండుగల సీజన్‌లో.. గతేడాదితో పోలిస్తే రానున్న పండుగల సీజన్‌లో అమ్మకాల్లో 40 శాతం వృద్ధిని ఆశిస్తున్నాం. మార్కెటింగ్‌కుగాను రూ.150 కోట్లు కేటాయించాం. సీజన్‌లో ఎంపిక చేసిన మోడళ్లపై కచ్చిత బహుమతి ఉంటుంది. అన్ని విభాగాల్లోనూ కొత్త మోడళ్లు కస్టమర్ల ముందుకు రానున్నాయి. ఎస్‌ఎల్‌ఆర్ కెమెరాలకు గిరాకీ ఏటా 20 శాతం పెరుగుతోంది. వెడ్డింగ్ మార్కెట్ ఇందుకు దోహదం చేస్తోంది. సోనీ ఆదాయం 2015-16తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20 శాతం వృద్ధి ఆశిస్తున్నాం. ప్రధాన మార్కెట్లలో ఒకటైన తెలుగు రాష్ట్రాల వాటా కంపెనీ ఆదాయంలో 15 శాతముంది. మాతృసంస్థకు సోనీ ఇండియా టాప్-5 మార్కెట్లలో ఒకటి. రెండు మూడేళ్లలో దీనిని టాప్-3కి తీసుకెళతాం. ప్రీమియం స్మార్ట్‌ఫోన్లే.. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్లలో 90% రూ.5-10 వేల ధరలో లభించేవే. ఇన్నోవేషన్‌కు సోనీ పెట్టింది పేరు. ముఖ్యంగా కెమెరా, డిస్‌ప్లే, బ్యాటరీ లైఫ్, కస్టమర్ల అనుభూతిలో కంపెనీ ఉత్పాదనలు ఎప్పుడూ ముందుంటాయి. పరిశోధన, అభివృద్ధికి భారీగా వ్యయం చేస్తున్నాం. అందుకే మా ఉత్పత్తులు ఖరీదైనవి. స్మార్ట్‌ఫోన్ల విషయంలో రూ.20 వేలు ఆపై విభాగంలోనే పోటీ పడతాం. ఈ సెగ్మెంట్‌లో కంపెనీ మొబైళ్లకు మంచి ఆదరణ ఉంది. ఇటీవల విడుదల చేసిన ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌కు డిమాండ్ ఉంది. ఇక ల్యాప్‌టాప్‌ల వ్యాపారం నుంచి సోనీ తప్పుకోవడం ఒక కస్టమర్‌గా చింతిస్తున్నాను.

బీజేపీ ఎంపీ స్వామి తాజాగా ఏం చేశారో తెలుసా?

27/08/2016: న్యూఢిల్లీ: ఎపుడూ ఆరోపణలు, విమర్శలు, వివాదాలతో వార్తల్లో నిలిచే బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తాజాగా మరో అంశంపై స్పందించి ఆసక్తికరంగా మారారు. ఆస్క్ మీ బ్రాండ్ కింద ఇ కామర్స్ వ్యాపారం నిర్వహించే గెట్ ఇట్ ఇన్ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన వేలమంది ఉద్యోగుల రక్షణ కోసం నడుం కట్టారు. 'ఆస్క్ మీ' మూతపడడంతో రోడ్డున పడ్డ నాలుగువేలమంది ఉద్యోగులకు బాసటగా నిలిచిన స్వామి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) కు లేఖ రాశారు. ఇది భవిష్యత్తులో కోర్టు విచారణకు రానున్నందున ఈ విషయంలో అత్యవసర జోక్యం అవసరమని మంత్రిత్వ శాఖ కార్యదర్శి తపన్ రేకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని అత్యవసర కేసుగా పరిగణించాల్సిన అవసరముందని ఆయన హెచ్చరించడం విశేషం ఆగస్టు 31 తరువాత వ్యర్థమవుతుంది కనుక, తక్షణమే స్పందించాలని కోరారు. సంస్థ ను మూసివేయవద్దని కంపెనీ డైరెక్టర్లను కోరాలన్నారు. వేలమంది ఉద్యోగులను వదిలేయడం కాకుండా ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు. మలేషియా విదేశీ సంస్థ ఆస్ట్రో లిమిటెడ్ కు చెందిన 95శాతం వాటా కొనుగోలుకు సాయం చేయాలని రాశారు. కాగా అస్క్ మీ లో మేజర్ వాటాను కలిగిన మలేషియా సంస్థ చేతులెత్తేయడంతో ఉద్యోగులకు గత రెండు నెలలుగా జీతాలు అందని పరిస్థితి. తీవ్రమైన రుణభారం తదితర సమస్యలతో కంపెనీ ప్రమాదంలో పడింది. దీనిపై గెట్ ఇట్ సంస్థ జోక్యంగా చేసుకోవాల్సిందని ఎంసీఏకు లేఖ రాసింది. అప్పులను చెల్లించకుండా ఆస్ట్రోదేశంనుంచి వెళ్లడానికి వీల్లేదని కోరిన సంగతి తెలిసిందే.

రాజన్ ‘వంటకాలు’ ట్రై చేస్తారా! - ఆర్‌బీఐ గవర్నర్ సేవలకు గుర్తింపుగా 2 ప్రత్యేక వంటకాలు...

26/08/2016: బెంగళూరు: ఆర్‌బీఐ గవర్నర్‌గా మూడేళ్లపాటు పాలసీ విధానాన్ని వండి ‘వడ్డి’ంచి తనదైన ముద్రవేసిన రఘురామ్ రాజన్‌ను బెంగళూరుకు చెందిన ఫుడ్ చైన్ సంస్థ ‘జంగ్రీ’ వెరైటీ వంటకాలతో గౌరవిస్తోంది. ఆర్‌బీఐ చీఫ్‌గా రాజన్ విశిష్టసేవలకు గుర్తింపుగా రెండు ప్రత్యేక డిష్(ఒకటి స్వీట్, మరొకటి హాట్)లను వడ్డిస్తోంది. ఉలుందు కోజుకట్టాయ్, కోవా కోజుకట్టాయ్ పేర్లతో లిమిటెడ్ ఎడిషన్‌గా ఈ వంటకాలు అందుబాటులో ఉంటాయని జంగ్రీ తెలిపింది. ‘రాజన్‌తో అనుబంధం ఉన్న రెండు రాష్ట్రాలకు సంబంధించిన వంటకాలివి. ఉలుందు కోజు కట్టాయ్ రేటు రూ.100 కాగా, కోవా కోజు కట్టాయ్ రూ.150కి లభిస్తుంది. నేటి(26) నుంచి సెప్టెంబర్ 2 వరకూ(రాజన్ పదవీకాలం ముగింపు రోజు) మాత్రమే ఈ వంటాకాలు అందుబాటులో ఉంటాయి’ అని జంగ్రీ పేర్కొంది. డాక్టర్ రఘురామ్ రాజన్ ఆర్‌బీఐ గవర్నర్‌గా అటు సామాన్య ప్రజలతో పాటు తమలాంటి ఎంట్రప్రెన్యూర్స్‌కు అనుకూలంగా కీలక నిర్ణయాలతో ఎంతగానో ప్రభావితం చేశారని.. దీనికి గౌరవసూచకంగా ఈ ప్రత్యేక వంటకాలను ప్రవేశపెట్టినట్లు జంగ్రీ సహ వ్యవస్థాపకుడు ఆశిష్ కాల్యా పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా పాలసీ చర్యలను తీసుకోవడంతోపాటు బ్యాంకుల్లో పేరుకుపోతున్న మొండిబకాయిలకు అడ్డుకట్టవేయడం ఇతరత్రా అనేక కీలక సంస్కరణలను రాజన్ తన పదవీకాలంలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మరోపక్క, కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలతో కూడా ఆయన వార్తల్లో నిలిచారు. ‘రాక్‌స్టార్’ రాజన్‌గా పేరొందిన ఆయన స్థానంలో ప్రస్తుత డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను కేంద్రం ఆర్‌బీఐ చీఫ్‌గా ఎంపిక చేయడం తెలిసిందే. ఇంతకీ ఈ వంటకాల సంగతేంటే... ఉలుందు కోజుకట్టాయ్ అనేది రాజన్ పుట్టిన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక వంటకాన్ని నమూనాగా తీసుకొని జంగ్రీ రూపొందించింది. ఇక కోవా కోజుకట్టాయ్ అనేది రాజన్ పూర్వీకులతో సంబంధం ఉన్న తమిళనాడు తీపి వంటకం నుంచి రూపొందించారు.

జియో సిమ్ కోసం కస్టమర్ల క్యూ.. - దేశవ్యాప్తంగా అనూహ్య డిమాండ్

26/08/2016: హైదరాబాద్: యాపిల్ ఫోన్ల కోసం క్యూలు కట్టడం ఇప్పటి వరకు విదేశాలకే పరిమితమైంది. ఇప్పుడు రిలయన్స్ జియో ప్రవేశంతో ఆ ట్రెండ్ భారత్‌లోనూ ప్రస్ఫుటమవుతోంది. అయితే ఇక్కడ దర్శనమిస్తున్న క్యూలైన్లు మొబైల్ ఫోన్ల కోసం కాదు. జియో ఇచ్చే ఉచిత సిమ్‌ల కోసం. సిమ్ చేతికొచ్చిందా జియో ప్రివ్యూ ఆఫర్‌తో 90 రోజులపాటు అపరిమిత డేటా, కాల్స్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ఇంకేముంది దేశవ్యాప్తంగా ఉన్న రిలయన్స్ డిజిటల్, డిజిటల్ ఎక్స్‌ప్రెస్ మినీ స్టోర్లు, లైఫ్ మొబైల్ స్టోర్ల ముందు భారీ క్యూ లైన్లు స్వాగతం పలుకుతున్నాయి. 4జీ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచిత సిమ్‌తోపాటు ప్రివ్యూ ఆఫర్‌ను వర్తింపజేస్తుండడంతో కస్టమర్లతో ఈ స్టోర్లు కిటకిటలాడుతున్నాయి. నల్ల బజారులో రూ.2 వేలకు..: ప్రివ్యూ ఆఫర్ కింద 4జీ డేటా, వాయిస్ ఓవర్ ఎల్‌టీఈ కాల్స్, 10 రకాల జియో ప్రీమియం యాప్స్‌ను అపరిమితంగా వినియోగించుకోవచ్చు. తొలుత రిలయన్స్ ఉద్యోగులు, వారి బంధువులకు.. ఆ తర్వాత లైఫ్ స్మార్ట్‌ఫోన్ కొన్న కస్టమర్లకు 90 రోజులపాటు ప్రివ్యూ ఆఫర్‌ను కంపెనీ ప్రకటించింది. లైఫ్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ కొనుక్కోకపోయినా కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులందరికీ ప్రివ్యూ ఆఫర్‌ను విస్తరించింది. ప్రస్తుతం 4జీ స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి కస్టమర్ ప్రివ్యూ ఆఫర్‌కు అర్హులు. దీంతో దేశవ్యాప్తంగా కస్టమర్లు సిమ్‌ల కోసం ఎగబడ్డారు. వినియోగదార్లు ఒకేసారి స్టోర్లను చుట్టుముట్టడంతో సిమ్‌ల కొరత కూడా తలెత్తింది. కొందరు కస్టమర్లు ఇదే అదనుగా రూ.1,500-2,000లకు సిమ్‌లను తిరిగి విక్రయిస్తున్నట్టు సమాచారం. సిమ్‌లు పక్కదారి పట్టకుండా అసలైన కస్టమర్లకే చేరేలా కంపెనీ కసరత్తు చేస్తోంది. క్యూ కట్టిన కంపెనీలు.. హైదరాబాద్‌లో 50 లక్షలకుపైగా 4జీ మొబైల్ వినియోగదార్లు ఉన్నారు. గురువారం ఒక్కరోజు బిగ్ సి స్టోర్లలో 2,500లకుపైగా, లాట్ మొబైల్స్ ఔట్‌లెట్లలో అదే స్థాయిలో 4జీ స్మార్ట్‌ఫోన్లు అమ్ముడయ్యా యి. 4జీ ఫోన్ కొన్న వినియోగదార్లకు ఈ స్టోర్లలో అప్పటికప్పుడు సిమ్‌ను జారీ చేస్తున్నారు. ఇక జియో బండిల్ ఆఫర్‌ను అందించేందుకు మొబైల్ ఫోన్ కంపెనీలు క్యూ కట్టాయి. జియోతో తొలుత శామ్‌సంగ్, ఎల్‌జీ.. తర్వాత జియోనీ, కార్బన్, లావా, ఆసస్, టీసీఎల్, ఆల్కటెల్, ప్యానాసోనిక్, మైక్రోమ్యాక్స్, యూ వంటి బ్రాండ్లు చేతులు కలిపాయి. ఈ స్థాయిలో బండిల్ ఆఫర్ రావడం దేశంలో ఇదే తొలిసారి. శామ్‌సంగ్ తాజాగా రూ.4,590లకే జెడ్2ను ప్రవేశపెట్టి సంచలనం సృష్టించింది. జియో సేవల నేపథ్యంలో ఫీచర్ ఫోన్ కస్టమర్లను ఆకట్టుకోవడానికే ఈ ధరలో జెడ్2ను తీసుకొచ్చింది.

జియో వల్ల ప్రభుత్వానికి రాబడి లేదు - వాణిజ్య రేడియో తరంగాలను ఉచిత సేవలకు వాడేస్తోంది - సెల్యులర్ ఆపరేటర్ల తాజా ఆరోపణ

23/08/2016: న్యూఢిల్లీ: రిలయన్స్ జియోపై యుద్ధాన్ని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) తీవ్రతరం చేసింది. ‘జియో సంస్థ బీటా టెస్ట్ పేరుతో వాణిజ్య సేవల కోసం కేటాయించిన స్పెక్ట్రమ్‌ను వినియోగిస్తూ ఉచిత డేటా, వాయిస్ సేవలు అందిస్తోంది. దీనివల్ల ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రావడం లేదు’ అంటూ సీఓఏఐ ప్రధానమంత్రి కార్యాలయానికి సోమవారం మరో లేఖ రాసింది. బీటా టెస్ట్‌ల పేరుతో జియో వినియోగిస్తున్న డేటా... 15-20 ఏళ్ల నుంచి సేవలు అందిస్తున్న మిగిలిన ఆపరేటర్ల ఉమ్మడి స్పెక్ట్రమ్ వినియోగంతో సమాన స్థాయిలో ఉందని లేఖలో వివరించింది. వాణిజ్య సేవల కోసం ఆదాయ పంపిణీ ప్రాతిపదికన కేటాయించిన స్పెక్ట్రమ్‌ను వినియోగిస్తుండడంతో... వీటిపై ఎలాంటి ఆదాయం లేనందున ప్రభుత్వానికి ఎలాంటి వాటా రావడం లేదని పేర్కొంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 25 నుంచి 30 లక్షల మంది ఉద్దేశపూర్వకంగా ఉచిత డేటా, వాయిస్ సేవలను ఒకే ఆపరేటర్ నుంచి వినియోగిస్తున్నట్టు సీఓఏఐ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. పరీక్షల (టెస్ట్) పేరుతో అనధికారిక వాణిజ్య సేవలు అందిస్తుండడంతో దీనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ‘జియో సంస్థ లక్షల మంది టెస్ట్ యూజర్లకు ఇప్పటికీ అక్రమంగా ఉచిత నిమిషాలను సొంత నెట్‌వర్క్ పరిధిలోనే ఇచ్చుకోదలచుకుంటే అది వారికి సంబంధించిన అంశం. ఈ బూటకపు ట్రాఫిక్‌కు ఇతర ఆపరేటర్లు సైతం సబ్సిడీపై నెట్‌వర్క్ వనరులు కల్పించాలని ఆశించడం సరికాదు’ అని సీఓఏఐ స్పష్టం చేసింది. టారిఫ్ ప్లాన్ల సమాచారాన్ని ట్రాయ్‌కు సమర్పించకుండానే వాణిజ్య సేవలు ప్రారంభించడం, హ్యాండ్‌సెట్ విలువకు సమానమైన పలు రకాల బండిల్డ్ సేవలను (డేటా, టాక్‌టైమ్, ఎస్‌ఎంఎస్‌లు) ఉచితంగా అందించడం ద్వారా స్థూల ఆదాయ సర్దుబాటు రుసుం, ఇతర పన్నుల ఎగవేత వంటి పలు అంశాలు ప్రస్తుతం తెరమీదకు వచ్చాయని పేర్కొంది. కాగా, ప్రధాన టెలికం ఆపరేటర్లు జియో నుంచి వచ్చే కాల్స్, ఎస్‌ఎంఎస్‌లకు తమ నెట్‌వర్క్‌లకు అనుసంధానాన్ని కల్పించేందుకు నిరాకరించడం ద్వారా లెసైన్స్ ఒప్పందాలను ఉల్లంఘించాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని ముఖేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ జియో సైతం ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. జియోకి మారిపోండిఉద్యోగులకు ఆర్‌ఐఎల్ సూచన ‘‘ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న ఇతర నెట్‌వర్క్‌ల మొబైల్ కనెక్షన్లను పక్కన పెట్టండి. వాటికి బదులుగా అధిక వేగంతో కూడిన రిలయన్స్ జియో 4జీ కనెక్షన్లకు తక్షణం మారిపోండి’’ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ 40వేల మందికిపైగా ఉన్న తన ఉద్యోగులను కోరింది. ఈ మేరకు ఆర్‌ఐఎల్ హెచ్‌ఆర్ విభాగం తన ఉద్యోగులకు లేఖలు పంపింది. కార్పొరేట్ కనెక్షన్లను జియోకు మార్చుకుంటున్నామని తెలియజేసేందుకు సంతోషిస్తున్నామని పేర్కొంది. అయితే, జియో సేవలపై ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా తదితర కంపెనీలతో కూడిన సీఓఏఐ ప్రభుత్వానికి అదే పనిగా ఫిర్యాదు చేస్తున్న తరుణంలో ఆర్‌ఐఎల్ నుంచి ఈ ఆదేశాలు వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఆర్‌ఐఎల్ ఉద్యోగుల కోసం ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఆపరేటర్లకు చెందిన సీయూజీ సేవలను వినియోగిస్తోంది.

స్మార్ట్ఫోన్ మార్కెట్లో కొత్త హీరోలు! - వివో, ఒప్పొ, జియోనీ దూకుడు

23/08/2016: స్మార్ట్‌ఫోన్ యూజర్లలో మార్పొస్తోంది. ఎక్కువ ఫీచర్లు, తక్కువ ధరకుతోడు ఫిర్యాదులు లేని బ్రాండ్లకు సై అంటున్నారు. ఈ అంశమే ఇప్పుడు చైనా కంపెనీలైన వివో, ఒప్పొ, జియోనీలకు కలిసొచ్చింది. ఫలితం!! వీటి మార్కెట్ వాటా వేగంగా పెరుగుతోంది. మార్చితో పోలిస్తే జూన్ త్రైమాసికంలో ఇవి తమ వాటాను 21 నుంచి 27 శాతానికి పెంచుకున్నాయి. చైనాలో మాదిరిగా భారత్‌లోనూ వీటి వ్యూహం ఫలితంగా ఎప్పటి నుంచో మార్కెట్ లీడర్లుగా కొనసాగుతున్న కంపెనీల పునాదులకు బీటలు పడుతున్నాయి. జెట్ స్పీడ్‌లో చైనా బ్రాండ్లు.. వివో, ఒప్పొ, జియోనీ, హువావే, లెనోవో వంటి చైనా కంపెనీ లు భారతీయ స్మార్ట్‌ఫోన్ యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఒప్పొ, వివో సంస్థలు ప్రపంచ టాప్-5 మొబైల్ హ్యాం డ్‌సెట్స్ కంపెనీల్లో స్థానం పొందాయి. ఇవి దేశంలోని టాప్-3 స్మార్ట్‌ఫోన్ కంపెనీలైన శాంసంగ్, మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్‌కు గట్టి పోటీనిస్తున్నాయి. దీనికి స్టోర్లలో బ్రాండింగ్, రిటైల్ మార్జిన్ చెల్లింపులు, ఫీచర్లు, నాణ్యత వంటి అంశాలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. రూ.25 వేలు, ఆపైన ధరలో ఉన్న చైనా కంపెనీల మోడళ్లను కూడా కస్టమర్లు ఆదరిస్తున్నారని మొబైల్స్ రిటైల్ చైన్ టెక్నోవిజన్ చెబుతోంది. జూన్ త్రైమాసికంలో వివో 201%, జియోనీ 99, ఒప్పొ 42, లెనోవో 23, షావొమీ 23% వృద్ధి చెందాయని కౌంటర్ పాయింట్ చెబుతోంది. వాటా 27 శాతానికి జంప్.. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వివో, ఒప్పొ, జియోనీ, లెనోవో సంస్థల దేశీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వాటా పెరిగింది. జనవరి-మార్చితో పోలిస్తే ఏప్రిల్-జూన్‌లో ఈ కంపెనీల మార్కెట్ వాటా 21 శాతం నుంచి 27 శాతానికి ఎగసింది. దీనికి ఆయా కంపెనీల రిటైల్ మార్కెటింగ్ వ్యూహాలు, బ్రాండింగ్ విధానాలు బాగా అనుకూలించాయి. వివో ఐపీఎల్ స్పానర్‌గా వ్యవహరించింది. ఇక ఒప్పొ ఐసీసీ టీ20 వరల్డ్ కప్, బిగ్‌బాస్, ఐపీఎల్‌లకు స్పాన్సర్‌షిప్స్ డీల్స్‌ను కలిగి ఉంది. అలాగే ఈ కంపెనీలు రిటైలర్లకు ఆఫర్ చేస్తోన్న మార్జిన్ చెల్లింపులు 5-6 శాతం శ్రేణిలో ఉన్నాయి. ఇవి మిగతా ప్రధాన కంపెనీలు ఆఫర్ చేసే విలువ కన్నా ఎక్కువ. క్రెడిట్‌పైన మొబైళ్లను సరఫరా చేస్తుండడంతో ఈ కంపెనీల ఉత్పత్తుల అమ్మకాలపైనే చిన్న రిటైలర్లు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ప్రధాన కంపెనీల వాటా దిగువకు.. దేశీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లీడర్‌గా ఉన్న కొరియా దిగ్గజం శాంసంగ్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. చైనా కంపెనీల దెబ్బకు దీని మార్కెట్ వాటా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 29 నుంచి 25.6%కి తగ్గింది. ఇక దేశీ కంపెనీ మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్‌లూ భారీ పతనాన్నే చూస్తున్నాయి. మైక్రోమ్యాక్స్ వాటా 17 శాతం నుంచి 14 శాతానికి దిగిరాగా... ఇంటెక్స్ వాటా 10% నుంచి 8.5%కి పరిమితమైంది. రూ.20,000లోపు ధర విభాగంలో వివో, ఒప్పొ, జియోనీ కంపెనీలదే హవా అని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సీనియర్ టెలికం అనలిస్ట్ తరుణ్ పాఠక్ తెలిపారు. వ్యూహాత్మకంగా చైనా బ్రాండ్లు.. చైనా కంపెనీలు దేశంలో వాటి దీర్ఘకాలిక లక్ష్యాలకు అనువుగా పెట్టుబడి పెడుతున్నాయి. ఇవి ప్రధానంగా కస్టమర్ సర్వీసులపై దృష్టి కేంద్రీకరించాయని ఆల్ ఇండియా మొబైల్ రిటైల్ అసోసియేషన్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. వివో, ఒప్పొ, జియోనీ సంస్థలు ప్రొడక్ట్ నాణ్యతలో రాజీపడటం లేదన్నారు. ఈ కంపెనీల మోడళ్లపై కస్టమర్ల ఫిర్యాదులు లేవని టెక్నోవిజన్ ఎండీ సికందర్ చెప్పారు. పైగా అధిక ఫీచర్లున్న మోడళ్లు తక్కువ ధరకు వస్తున్నాయన్నారు. చైనా కంపెనీలు హై ఎండ్ ఫీచర్లతో కూడిన ఫోన్లను అందుబాటు ధరల్లో యూజర్లకు అందిస్తున్నాయని గార్ట్‌నర్ ఇండియా రీసెర్చ్ డెరైక్టర్ అన్సూల్ గుప్తా పేర్కొన్నారు.

‘సింధు’కు ఫిక్కీలో జీవితకాల సభ్యత్వం

22/08/2016: హైదరాబాద్: ఒలింపిక్స్‌లో పతకం సాధించి దేశానికి వన్నె తెచ్చిన బ్యాడ్మిం టన్ క్రీడాకారిణి పీవీ సింధుకు జీవిత కాల సభ్యత్వం ఇచ్చేందుకు ఫిక్కీ మహిళా విభాగం (ఎఫ్‌ఎల్‌వో) హైదరాబాద్ చాప్టర్ ముందుకు వచ్చింది. సింధు తెలుగు వారందరికీ గర్వకారణమని హైదరాబాద్ చాప్టర్ చైర్‌పర్సన్ పద్మ ఆర్ పేర్కొన్నారు. సింధు తమ సంఘం జీవితకాల సభ్యురాలైనందుకు గర్విస్తున్నామని... ఆమెను సత్కరించేందుకు కార్యక్రమానికి ఏర్పాటు చేయనున్నట్టు పద్మ ఓ ప్రకటనలో వెల్లడించారు.

హోదా ఎక్కువ.. జీతం తక్కువ - బ్యాంకుల్లో కింది వారికే ఎక్కువ జీతాలు ఉన్నత స్థాయి ఉద్యోగులకు తక్కువే

17/08/2016: ముంబై: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో (పీఎస్‌బీలు) వేతన విధానం సరిగా లేదని రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. జీతాలైతే ఉన్నత స్థాయిలో ఉన్న వారికి తక్కువగాను, దిగువన ఉన్న వారికి ఎక్కువగాను ఉన్నాయన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి ప్రతిభ గల వారిని ఆకర్షించేందుకు ఇదే పెద్ద ప్రతిబంధకమని ఆయన అభివర్ణించారు. అలాగే, మౌలికరంగ ప్రాజెక్టులకు రుణాలను విస్మరించరాదని సూచించారు. ఫిక్కీ, బ్యాంకుల ఆధ్వర్యంలో ముంబైలో మంగళవారం జరిగిన జాతీయ బ్యాంకర్ల సదస్సులో రాజన్ పలు అంశాలపై తనదైన శైలిలో సూటిగా మాట్లాడారు. ఇలా అయితే ఎలా...? ‘పీఎస్‌బీలలో దిగువ స్థాయిలో అధిక వేతనాలు చెల్లించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఉన్నత స్థాయిలో వారికి మాత్రం వేతనాలు తక్కువగా ఉన్నాయి. ఎంతో మంది ప్రజల కోసం ఈ ఉద్యోగం చేస్తున్నామని మీరు భావించాలి. కానీ, దీనివల్ల అత్యున్నత నైపుణ్యం ఉన్నవారిని ఆకర్షించడం కష్టం’ అని రాజన్ అన్నారు. ‘నాక్కూడా తక్కువగానే వేతనం ఇస్తున్నారంటూ’ ఆయన చమత్కరించారు. పీఎస్‌బీల షేర్ల ధరలు తక్కువగా ఉన్నందున దాన్నో అవకాశంగా భావించి ఉద్యోగులకు ప్రైవేటు రంగం మాదిరి షేర్లను (ఈ సాప్స్) కేటాయించాలని సూచించారు. ఇచ్చేది కొద్ది మొత్తమైనా అది వారికి ఎంతో ప్రేరణ ఇచ్చి పనితీరు మెరుగుపరచడం ద్వారా బ్యాంకుల విలువను భారీగా పెంచుతుందన్నారు. అదే సమయంలో దిగువ స్థాయిలో మంచి వేతన స్కేళ్లు ఉండడం కూడా ఓ మంచి అవకాశంగా పేర్కొన్నారు. ‘మూడో తరగతిలో ఇంజనీర్లు, ఎంబీఏ అర్హతులున్న వారిని ఉద్యోగులుగా పొందుతున్నాం. మీరున్నది గుమస్తా ఉద్యోగానికి కాదు. మరింత విలువ సృష్టించడానికి... అని వారికి సూచించడం ద్వారా అవకాశాలను విస్తరించుకోవడంపై దృష్టి పెట్టాలి’ అని బ్యాంకర్లకు రాజన్ సూచించారు. ఈ రంగం మొత్తానికి ఒకే వేతన విధానం కాకుండా భిన్న విధానాలను అమలు చేయాలని సూచించారు. కాగా, రఘురామ్ రాజన్ 2015 జూలైలో రూ.1,98,700 వేతనంగా అందుకున్నారు. ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య 2015-16లో పొందిన వేతనం రూ.31.1 లక్షలు. ప్రైవేటు రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎండీ ఆదిత్యపురి అందుకున్న వేతనం మాత్రం రూ.9.7 కోట్లు. మౌలికరంగ రుణాలూ ముఖ్యమే పీఎస్‌బీలు మౌలికరంగ ప్రాజెక్టుల రుణాలు ఇవ్వకపోవడంపై రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. తక్కువ వ్యయం గల కాసా (కరెంట్, సేవింగ్స్ ఖాతా) డిపాజిట్లను పెంచుకోవడం ద్వారా బ్యాంకులు మౌలికరంగ ప్రాజెక్టులకు రుణాలు అందించాలని సూచించారు. మౌలిక రంగం వైపు నుంచి అధిక మొత్తంలో ఎన్‌పీఏల సమస్య ఉన్న విషయాన్ని పేర్కొంటూ... ఈ విషయంలో నిర్వహణ పనితీరును మెరుగుపరుచుకుని, సరైన మూలధన నిర్మాణంపై దృష్టి పెట్టాలని సూచించారు. రిటైల్ రుణాలపై కూడా రిస్క్ ఉంటుందని... కొంత కాలానికి అది బయటకు వస్తుందన్నారు. పీఎస్‌బీల్లో ఉన్నత స్థాయి నియామకాల్లో ప్రభుత్వ పాత్ర తగ్గాలని, పాలనాపరమైన నిర్ణయాలను స్వేచ్ఛగా తీసుకునేలా బ్యాంకు బోర్డులను బలోపేతం చేయాలని రాజన్ సూచించారు. పీఎస్‌బీల బోర్డుల నుంచి ఆర్‌బీఐ తన ప్రతినిధులను సైతం ఉపసంహరించుని నియంత్రణ పాత్రకే పరిమితం కావాలని అభిప్రాయపడ్డారు. బ్యాంకుల్లో ఉన్నత స్థాయి ఉద్యోగులను నియమించే అధికారం బ్యాంకు బోర్డు బ్యూరోలకే కల్పించాలన్నారు. సైబర్ నేరాలు పెరిగిపోయిన దృష్ట్యా బ్యాంకులు తమ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ పరీక్షలు ఓ మార్గం బ్యాంకులు కొన్ని క్యాంపస్‌లలో రిక్రూట్‌మెంట్లు నిర్వహించకుండా కోర్టు తీర్పులు అడ్డుపడుతున్నందున... ఈ విషయమై బ్యాంకులు పిటిషన్లు దాఖలు చేయవచ్చని సూచించారు. మరో మార్గంలో బ్యాంకులు ఉద్యోగ ప్రవేశ పరీక్షల విధానాన్ని ఆన్‌లైన్‌లో చేపట్టడం ద్వారా ఈ ప్రక్రియను సులభతరం చేయాలని... తద్వారా ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చదివిన వారు సైతం పరీక్ష రాసేందుకు వీలుంటుందన్నారు. అలాగే స్థానికులను భర్తీ చేసుకోవడం ద్వారా అవకాశంగా మల్చుకోవాలని సూచించారు.

యూనిటెక్కు మరోసారి షాకిచ్చిన సుప్రీం

17/08/2016: న్యూఢిల్లీ: ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ యూనిటెక్ లిమిటెడ్ కు మరోసారి సుప్రీంకోర్టు షాకిచ్చింది. నోయిడాలో ఫ్లాట్స్ కొనుగోలు చేసిన వారికి పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. గుర్గావ్ విస్తా ప్రాజెక్టుకు సంబంధించి 34 మంది బాధితులకు సుమారు 15 కోట్ల రూపాయలను రిఫండ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఐదు కోట్ల మధ్యంతర నష్టపరిహారాన్ని రెండు వారాల్లోగా చెల్లించాలని యునిటెక్ మేనేజ్-మెంటును ఆదేశించింది. మిగిలిన మొత్తాన్ని సెప్టెంబర్ చివరి నాటికి చెల్లించాలని తీర్పు చెప్పింది. కాగాపరిహారం చెల్లించాలని లేదంటే జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని సంస్థ డైరెక్టర్లను ధర్మాసనం గతనెలలోనే హెచ్చరించింది. యూనిటెక్ గ్రూప్ కు చెందిన నోయిడా , గుర్గావ్ ప్రాజెక్టులలో కొనుగోలు చేసిన వారికి ఫ్లాట్లను స్వాధీనం చేయడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో బాధితులు నేషనల్ కన్జ్యూమర్ డిస్పూట్స్ రిడ్రెస్సల్ కమిషన్ (ఎన్ సీడీఆర్ సీ)ను ఆశ్రయించారు. దీనిపై విచారించిన కమిషన్ నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేయడంపై సీరియస్-గా స్పందించిన కోర్టు యూనిటెక్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిహారం చెల్లించడానికి ఆగస్టు 12 వరకు గడువు ఇవ్వడంతోపాటు, జైలుకెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే తాజా యూనిటెక్ తమ దగ్గర డబ్బులు ల్లేవని సుప్రీంముందు నిస్పహాయతను వ్యక్తం చేసింది. అయితే యూనిటెక్ నుంచి సొమ్మును వాపసు కోరుతున్నవారి వివరాలు సమర్పించాలని ఫ్లాట్ కొనుగోలుదారులను శుక్రవారం బెంచ్ కోరిన సంగతి తెలిసిందే.

సంగీత ప్రియులకు ఇంటెక్స్ కొత్త ఫోన్

13/08/2016: సంగీత ప్రియుల కోసం ఇంటెక్స్ నుంచి కొత్త స్మార్ట్ఫోన్ వచ్చేసింది. ఇంటెక్స్ ఆక్వా మ్యూజిక్ పేరుతో రూ.9,137కు ఈ ఫోన్ను శుక్రవారం భారత మార్కెట్లోకి కంపెనీ విడుదల చేసింది. డ్యుయల్ స్పీకర్స్ ఈ ఫోన్కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ఫోన్ ద్వారా ఉన్నతమైన సంగీత అనుభవాన్ని కస్టమర్లకు అందిస్తామని కంపెనీ చెబుతోంది. 21 భారత భాషలను సపోర్టు చేసేలా ఇంటెక్స్ ఆక్వా మ్యూజిన్ను రూపొందించారు. ప్రీలోడెడ్గా వివిధ యాప్స్ను ఇంటెక్స్ దీనిలో పొందుపరిచింది. ఈ ఫోన్ ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు స్టోర్లలో అందుబాటులో ఉంచనున్నట్టు కంపెనీ పేర్కొంది. ఇంటెక్స్ ఆక్వా మ్యూజిక్ ఫీచర్లు.. 5.5 అంగుళాల హెచ్డీ(720x1280 పిక్సెల్స్) డిస్ప్లే 1.3గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో 4జీ సపోర్టు 2 జీబీ ర్యామ్ 16 జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్ 32 జీబీ వరకు విస్తరణ మెమరీ 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా డ్యుయల్ సిమ్ 3400 ఎంఏహెచ్ బ్యాటరీ గ్రే, సిల్వర్ కలర్స్లో ఈ ఫోన్ లభ్యం

ఎయిర్ టెల్ మరో బంపర్ ఆఫర్

11/08/2016: రిలయన్స్ జియో పోటీని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా భారతి ఎయిర్ టెల్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. బ్రాడ్ బ్యాండ్, డీటీహెచ్ కస్టమర్ల కోసం బుధవారం మరో కొత్త పథకాన్ని ప్రకటించింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ నుంచి ఎదురవుతున్న ముప్పు ను తట్టుకొనే చర్యల్లో భాగంగా తాజాగా భారతీ ఎయిర్టెల్ తన ప్రతి పోస్ట్ పెయిడ్ బ్రాడ్ బ్యాండ్ లేదా డీటీహెచ్ వినియోగదారులకు 5 జీబీ అదనపు డేటాను అందించనుంది. ఎయిర్ టెల్ ల్యాండ్ లైన్ లో అపరిమిత ఉచిత కాలింగ్ ప్రయోజనం తో పాటు, వినియోగదారులకు ఇప్పుడు ఉచిత అదనపు డేటా ప్రయోజనాలు కల్పిస్తోంది. వారికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు బ్రాడ్బ్యాండ్ వినియోగదారులను ధన్యవాదాలు చెప్పారు భారతి ఎయిర్టెల్ (భారతదేశం) సీఈఓ హేమంత్ కుమార్ గురుస్వామి. 'మై హోం రివార్డ్స్' పథకం కింద ఈ అఫర్ ను అందుబాటులోకి తెచ్చినట్టు ప్రకటించారు.

స్పైస్‌జెట్‌ స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్‌ - రూ.399 ప్రాథమిక ఛార్జీలతో దేశీయ విమాన టిక్కెట్లు

10/08/2016: దిల్లీ: విమాన ప్రయాణికులకు స్వాతంత్య్ర దినోత్సవ కానుకను అందిస్తోంది ప్రముఖ బడ్జెట్‌ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌. రూ. 399 ప్రారంభ బేస్‌ ఫెయిర్‌(ప్రాథమిక ఛార్జీలు)తో దేశీయ విమాన టికెట్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఆగస్టు 11 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉండనుంది. ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు ప్రయాణించే వారికి ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. అహ్మదాబాద్‌-ముంబయి, అమృత్‌సర్‌-శ్రీనగర్‌, బెంగళూరు-చెన్నై, బెంగళూరు-కొచ్చి, కోయంబత్తూర్‌-హైదరాబాద్‌, జమ్ము-శ్రీనగర్‌, ముంబయి-గోవా తదితర దేశీయ మార్గాలకు ఈ ఆఫర్‌ను అందించనున్నారు. దీని ప్రకారం.. బెంగళూరు-చెన్నైకు రూ. 399 బేస్‌ ఫెయిర్‌ అయితే.. అన్ని ఛార్జీలు కలిపి టికెట్‌ ధర రూ. 1,137గా ఉండనుంది. అయితే ఈ ఆఫర్‌ కింద ఎన్ని సీట్లను కేటాయించారన్న విషయాన్ని మాత్రం స్పైస్‌జెట్‌ వెల్లడించలేదు. ఇక విదేశీ మార్గాలకు కూడా రూ. 2,999 ప్రారంభ బేస్‌ ఫెయిర్‌తో ఆఫర్‌ ప్రకటించింది. దీని ప్రకారం.. దుబాయి-దిల్లీ మధ్య బేస్‌ ఫెయిర్‌ రూ. 2,999 ప్రాథమిక ఛార్జీ అయితే.. అన్ని ఛార్జీలు కలిపి టికెట్‌ ధర రూ. 8,424గా ఉండనుంది. సాధారణంగా జులై-సెప్టెంబర్‌ మధ్య విమాన ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉంటుంది. దీంతో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తుంటాయి సదరు విమానయాన సంస్థలు.

పెట్రోల్‌ వెర్షన్‌లో ఇన్నోవా క్రిస్టా

09/08/2016: దిల్లీ: దేశరాజధాని దిల్లీలో డీజిల్‌ వాహనాలపై నిషేధం విధించిన నేపథ్యంలో ఆటోమొబైల్‌ సంస్థలు ప్రత్యామ్నాయాల దిశగా ప్రయత్నాలు చేపట్టాయి. ఇందులో భాగంగానే జపాన్‌కు చెందిన ప్రముఖ సంస్థ టొయోటా తాజాగా విడుదల చేసిన ఇన్నోవా క్రిస్టాలో పెట్రోల్‌ వెర్షన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 19.63లక్షలు(ఎక్స్‌ షోరూం దిల్లీ)గా నిర్ణయించింది. దిల్లీలోనే గాక.. దేశవ్యాప్తంగా ఈ పెట్రోల్‌ వెర్షన్‌ క్రిస్టా కార్లు అందుబాటులో ఉండనున్నట్లు సంస్థ తెలిపింది. మంగళవారం నుంచి ఈ కార్ల బుకింగ్‌ ప్రారంభమవుతుండగా.. ఆగస్టు చివరి నాటికి కార్లను డెలివరీ చేయనున్నారు. ఈ సందర్భంగా టొయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌ డైరెక్టర్‌ రాజా మాట్లాడుతూ.. 2005లో ఇన్నోవా కార్లను పెట్రోల్‌, డీజిల్‌ వెర్షన్లలో విడుదల చేశామన్నారు. అయితే పెట్రోల్‌ కార్లకు డిమాండ్‌ తగ్గిపోవడంతో 2012 నుంచి వాటిని తయారుచేయలేదన్నారు. ఇటీవల డీజిల్‌ వాహనాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించడంతో వినియోగదారులు తిరిగి పెట్రోల్‌ వెర్షన్‌పై ఆసక్తి కనబరుస్తున్నారని.. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్‌ వెర్షన్‌ను విడుదల చేశామన్నారు. ఈ ఏడాది మేలో ఇన్నోవా క్రిస్టా డీజిల్‌ వెర్షన్‌ను విడుదల చేసింది టొయోటా. అవి ఇప్పటికే 24వేల కార్లు అమ్ముడయ్యాయి.

మీ బ్యాంకులో గౌరవం ఉందా? - చార్టర్ ఆఫ్ కస్టమర్ రైట్స్‌ను విడుదల చేసిన ఆర్‌బీఐ

08/08/2016: బ్యాంకు ఖాతాదారుకూ హక్కులుంటాయా? అవును... నిజమే!! ఈ మేరకు రిజర్వు బ్యాంకు ‘చార్టర్ ఆఫ్ కస్టమర్ రైట్స్’ను కూడా విడుదల చేసింది. కాకపోతే ఇవి తమకు నిజంగా దక్కుతున్నాయా? లేదా? అనేది చూసుకోవాల్సింది ఖాతాదారులే. దక్కని పక్షంలో ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయొచ్చు కూడా. ఆర్‌బీఐ జారీ చేసిన ఈ నిబంధనల్లో ఖాతాదారులకు ఐదు ప్రాథమిక హక్కులున్నాయి. ఒకవేళ బ్యాంకు ఏదైనా హక్కు విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఆర్‌బీఐలోని కస్టమర్ సర్వీసెస్ డివిజన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. సంబంధిత బ్యాంకుపై కఠినంగా వ్యవహరించే అధికారాలు ఆర్‌బీఐకి ఉన్నాయి. పక్షపాత వైఖరి పనికిరాదు... ఖాతాదారులను వారి ప్రాంతం, వర్ణం, కులం, లింగం, శారీరక సామర్థ్యం, వయసు ఆధారంగా పక్షపాతంతో చూడకూడదు. కాకపోతే ఖాతాదారులకు భిన్నమైన రకాలున్న వడ్డీరేట్లతో పథకాలను మాత్రం ఆఫర్ చేయొచ్చు. అంటే సీనియర్ సిటిజన్స్‌కు అదనపు వడ్డీ ఆఫర్ చేయడం లాంటివన్న మాట. పారదర్శకత, నిజాయితీ... బ్యాంకు పత్రాల్లో ఉన్న భాష ఓ పట్టాన అర్థం కావడం లేదనుకోండి. అర్థమయ్యేలా మార్చాలని కోరవచ్చు. ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం బ్యాంకులు అన్ని రకాల పత్రాలను సాధారణ వ్యక్తులు సైతం సులభంగా అర్థం చేసుకునే విధంగా రూపొందించాలి. ఈ విషయంలో జవాబుదారీ బ్యాంకులదే. పథకం, ఖాతాదారుడి బాధ్యతలు, రిస్క్ గురించి స్పష్టంగా తెలియజేయాలి. అలాగే, ముఖ్యమైన నిబంధనలు, షరతుల గురించి కూడా చెప్పాలి. కమీషన్ల కోసం అంటగ డితే తప్పే! కమిషన్ల కోసం ఖాతాదారులకు పనికిరాని ఉత్పత్తులను అంటగట్టకూడదు. ఉదాహరణకు వృద్ధులకు యూనిట్ లింక్డ్ పాలసీలను సూచించకూడదు. ఎందుకంటే వాటిలో రిస్క్ ఎక్కువుంటుంది. ఆ వయసులో వారు దాన్ని భరించటం కష్టం. కస్టమర్ల అవసరాలు తెలుసునని వాటికి సరిపోయే పథకాలను మాత్రమే సూచించాలి. గోప్యత తప్పనిసరి... ఖాతాదారుల సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంది. అంటే ఖాతాదారుల సమాచారాన్ని టెలిమార్కెటింగ్ కంపెనీలకు ఇవ్వకూడదన్న మాట. అలాగే ఇతర ప్రయోజనాల కోసం కూడా వాడుకోకూడదు. ఈ సమాచారాన్ని వేరే సంస్థలకు అందించడం వల్ల ఆయా కంపెనీలు కస్టమర్ల వివరాల ఆధారంగా వారికి తమ ఉత్పత్తులను మోసపూరిత పద్ధతిలో విక్రయించకుండా ఉండేందుకు ఆర్‌బీఐ ఈ నిబంధన తీసుకొచ్చింది. విక్రయంతో బాధ్యత తీరిపోదు... బ్యాంకులు మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ ఉత్పాదనలను మార్కెటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. సొంత పథకాలు గానీ, ఇతర సంస్థల పథకాలు గానీ విక్రయించేసి చేతులు దులుపుకోవడమంటే కుదరదు. తమవైపు తప్పిదం జరిగితే చెల్లించే పరిహారం, సమస్యవస్తే పరిష్కార విధానం, ఇతర నిబంధనల గురించి కూడా తెలియజేయాలి.

వడ్డీ రేట్లలో కోత ఉంటుందా..? - ఆర్‌బీఐ విధానంపై మిశ్రమ అంచనాలు

08/08/2016: న్యూఢిల్లీ : ఆర్‌బీఐ మంగళవారం నాటి పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో మార్కెట్, పారిశ్రామిక, బ్యాంకింగ్ వర్గాలు మరోసారి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం అధిక స్థాయిల్లో కొనసాగుతున్నందున కీలక వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయకపోవచ్చని కొంతమంది బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. వర్షపాతం ప్రభావాన్ని పూర్తిగా పరిశీలించి గానీ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకోదని వారు భావిస్తున్నారు. అయితే కొన్ని సానుకూల కారణాల వల్ల వడ్డీ రేట్ల తగ్గుదలకు అవకాశం వుందని మరికొందరు బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. గవర్నర్‌గా రఘురామ్ రాజన్‌కు ఇదే చివరి సమీక్ష కానుంది. సెప్టెంబర్ 4న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. అలాగే పాలసీ నిర్ణయాన్ని ఆర్‌బీఐ గవర్నర్ స్వతంత్రంగా తీసుకోబోయే చివరి సమీక్షా సమావేశం కూడా ఇదే. తదుపరి సమీక్ష అక్టోబర్ 4 నాటికి వడ్డీ రేట్ల నిర్ణయానికి కేంద్రం తీసుకొచ్చిన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ తన పని ప్రారంభిస్తుందని అంచనా వేస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితం చేయడంపై ఆర్‌బీఐ దృష్టి సారిస్తుందని ఆశిస్తున్నట్టు కేంద్రం గత వారమే ప్రకటించిన విషయం తెలిసిందే. రాజన్ దేవుడు... నేను దెయ్యమా..? బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మరోసారి రాజన్‌ను టార్గెట్ చేశారు. మీడియాను కూడా విడిచిపెట్టలేదు. రాజన్‌ను దేవుడిగా, తనను దెయ్యంగా మీడియా చిత్రీకరించిందని విమర్శించారు. ‘రాజన్ వెళితే స్టాక్ మార్కెట్లు కుప్పకూలతాయని మీడియా చెప్పింది. కానీ మార్కెట్లు ఏమీ కుప్పకూలడం లేదు. పైగా పెరుగుతున్నాయి. వడ్డీ రేట్లను పెంచుతూ ఆర్థిక వ్యవస్థకు రాజన్ హాని చేస్తున్నారు. చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలు బ్యాంకుల నుంచి రుణాలు పొందలేకున్నాయి. నేను దెయ్యం అయితే, ఈ వ్యక్తి దేవుడు. మనల్ని రక్షించడానికి బయటి నుంచి వచ్చాడు’ అని స్వామి విరాట్ హిందుస్తాన్ సమావేశంలో అన్నారు. అధిక స్థాయిలో ద్రవ్యోల్బణం.. వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. కూరగాయల ధరలు అధిక స్థాయిలో ఉన్నాయి. ఖరీఫ్ పంటలు మార్కెట్లోకి వచ్చి ధరలు తగ్గడానికి మరికొన్ని నెలలు పడుతుంది. - అరుంధతీ భట్టాచార్య, చైర్‌పర్సన్, ఎస్‌బీఐ 50 పాయింట్ల మేర కోతకు అవకాశం.. స్థూల ఆర్థిక పరిస్థితులను చూస్తే ఆర్‌బీఐ 50 బేసిస్ పాయింట్ల కోత విధించవచ్చు. బ్రిటన్ సహా చాలా దేశాల్లో రేట్లు తగ్గుముఖం పట్టాయి. సాధారణం కంటే అధిక వర్షపాతం, ప్రభుత్వ సెక్యూరిటీల రేట్లు తక్కువగా ఉండడం, అధిక విదేశీ మారక నిల్వలు, బాండ్ ఈల్డ్ తక్కువగా ఉండడం, కరెంటు ఖాతా, ద్రవ్యలోట్లు పరిమితుల్లోనే ఉండడం వల్ల 50 పాయింట్ల కోతకు అవకాశం ఉంది. - రాణా కపూర్, ఎండీ, యస్‌బ్యాంక్ 25 పాయింట్ల మేర కోత.. ఈ సమీక్షలో ఆర్‌బీఐ 25 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గిస్తుందని భావిస్తున్నాం. వర్షపాతం బాగుంటే ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ఖరీఫ్‌లో పప్పు ధాన్యాల సాగు గతేడాదితో పోలిస్తే 39% ఎక్కువగా ఉంది. - బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్.

సెల్‌కాన్ 4జీ మొబైల్ రూ.6,666

08/08/2016: హైదరాబాద్ : సెల్‌కాన్ మొబైల్స్ డైమండ్ సిరీస్‌లో భాగంగా క్యూ4జీప్లస్ పేరుతో డ్యుయల్ సిమ్ మొబైల్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.6,666. డైమండ్ సిరీస్‌లో భాగంగా కంపెనీ లోగడ 4జీ ప్లస్ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురాగా, దీనికి మంచి ఆదరణ రావడంతో అదనపు ఫీచర్లు, హంగులు జోడించి క్యూ4జీ ప్లస్‌ను ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ వెర్షన్ సాఫ్ట్‌వేర్ ఆధారంగా పనిచేస్తుంది. 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజీ, 4ఎక్స్‌కార్టెక్స్ ఏ53 మీడియాటెక్ ప్రాసెసర్, 5 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 2,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 మెగా పిక్సల్ రియర్ కెమెరా తదితర సదుపాయాలు ఉన్నాయి. 4జీ సాంకేతికతతో ఇంటర్నెట్ విని యోగం అనూహ్యంగా పెరుగుతుందని భావిస్తున్నట్టు మొబైల్ ఆవిష్కరణ సందర్భంగా సెల్‌కాన్ సీఎండీ వై గురు తెలిపారు. ఈ నేపథ్యంలో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రానున్న నెలల్లో మరిన్ని 4జీ మొబైల్స్‌ను ఆవిష్కరించనున్నట్టు చెప్పారు.

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు

06/08/2016: ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. జీఎస్‌టీ బిల్లు నిన్న మార్కెట్లను మురిపించలేకపోయినప్పటికీ ఈరోజు సూచీలు లాభాల బాట పట్టాయి. ఉదయం నుంచి మంచి జోరు మీదున్న మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 369 పాయింట్లు లాభపడి 28078 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 132 పాయింట్లు లాభపడి 8683 పాయింట్లకు చేరుకుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 66.78 వద్ద కొనసాగుతోంది. నేటి మార్కెట్లో ఎన్‌ఎస్‌ఈలో గ్రాసిమ్‌, హీరో మోటోకార్ప్‌, హిందాల్కో, అంబుజా సిమెంట్స్‌, బజాజ్‌ ఆటో తదితర కంపెనీల షేర్లు లాభపడ్డాయి. టెక్‌ మహీంద్రా, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, సన్‌ ఫార్మా, భారతి ఎయిర్‌టెల్‌ తదితర కంపెనీలు నష్టపోయాయి.

ధరలు పెంచేసిన హ్యుందయ్‌

06/08/2016: దిల్లీ: హ్యుందయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 16 నుంచి హ్యుందయ్‌ అన్ని మోడల్‌ కార్లపై దాదాపు రూ.15వేలు పెంచనున్నట్లు తెలిపింది. రూపాయి విలువ పడిపోవడంతో పాటు, ఉత్పాదక వ్యయం పెరుగుతున్నందున కార్ల ధరలు పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ధరల పెరుగుదల ఆయా మోడల్స్‌పై రూ.3వేల నుంచి రూ.15వేల వరకు ఉంటుందని హ్యుందయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాకేశ్‌ శ్రీవాత్సవ తెలిపారు. ఈ నెల 16 నుంచి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయన్నారు. మారుతి సుజుకి ఇటీవల కార్ల ధరలు దాదాపు రూ.20వేల దాకా పెంచుతున్నట్లు ప్రకటించిన కొద్ది రోజుల్లోనే హ్యుందయ్‌ కూడా ధరలు పెంచేసింది.

ఇక అమెజాన్‌ సొంత కార్గో విమానాలు

06/08/2016: సియాటెల్‌: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇక నుంచి వస్తువులను తన సొంత కార్గో విమానం ‘ప్రైమ్‌ ఎయిర్‌’ బ్రాండ్‌ ద్వారా రవాణా చేయనుంది. ఇప్పటికే 40కి పైగా విమానాల ద్వారా అమెజాన్‌ వస్తువులను డెలివరీ చేస్తోంది. సరకు రవాణా వ్యవస్థ మరింత విస్తృతం చేసే దిశగా అడుగులు వేస్తూ సొంత కార్గో విమానాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు సంస్థ తెలిపింది. ఒక్క 2015లో అమెజాన్‌ బిలియన్‌కు పైగా పార్సిల్స్‌ను డెలివరీ చేసింది. కాగా, ప్రముఖ కొరియర్‌ సంస్థ ఫెడెక్స్‌ అంతకు మూడేళ్ల ముందే అన్ని పార్సిల్స్‌ను డెలివరీ చేయటం గమనార్హం. అమెజాన్‌ 2013లో సరకు డెలివరీకి సంబంధించి సమస్యలు ఎదుర్కొంది. ముఖ్యంగా క్రిస్మస్‌ సందర్భంగా అనేక మంది అమెజాన్‌ ద్వారా వస్తువులను కొనుగోలు చేశారు. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమానాల ద్వారా సరకును వినియోగదారులకు సకాలంలో అందించలేకపోయింది. దీంతో అప్పటి నుంచి డెలివరీ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా అమెజాన్‌ అట్లాస్‌ ఎయిర్‌కు చెందిన 40కి పైగా బోయింగ్‌ విమానాలను అద్దెకు తీసుకుని సరకు రవాణాకు వినియోగిస్తోంది. తాజాగా సొంత కార్గో విమానాన్ని ఏర్పాటు చేసుకుంది.

న్యూ కలర్ డిజైన్తో ఐఫోన్ 7 ప్లస్..!

05/08/2016: యాపిల్ కొత్త ఐఫోన్7 కోసం వేచిచూసే యూజర్లకు శుభవార్త. ఈ ఏడాది యాపిల్ మార్కెట్లోకి తీసుకొచ్చే డివైజ్లు రెండు కావంట. ముచ్చటగా మూడు ఐఫోన్7లతో యాపిల్ తన ఫ్యాన్స్ను అలరించబోతుందట. యాపిల్ ఈ ఏడాది లాంచ్ చేయబోయే డివైజ్లు ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ 7 ప్రో లని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. అయితే మూడో ఫోన్, ఐఫోన్ 7 ప్లస్ ఎలా ఉండబోతుందా తెలుసా..? డ్యూయల్ రేర్ కెమెరా అమరికతో, కొత్త బ్లూ కలర్ డిజైన్లో యూజర్లను ఈ ఫోన్ అలరించనుందని రిపోర్టులు తెలుపుతున్నాయి. ప్రముఖ యూట్యూబర్ లెవిస్ హిల్సెంటీగర్ ఈ ఐఫోన్ 7 ప్లస్కు సంబంధించిన వీడియోను తన చానెల్ అన్బాక్స్ థెరపీలో పోస్ట్ చేశారు. కాగా ఈవారం మొదట్లోనే చైనాలో యాపిల్ ఐఫోన్ల లాంచ్ పార్టనర్, చైనీస్ టెలికాం దిగ్గజం చైనా యూనికామ్ కూడా బ్లూ కలర్ ఐఫోన్ 7 వేరియంట్ గురించి టీజ్ చేసింది. యాపిల్ నుంచి రాబోతున్న కొత్త డివైజ్ గురించి రిపోర్టులు ఒక్కోటి ఒక్కో మాదిరిగా వెల్లడిస్తున్నాయి. దీంతో యాపిల్ ఈ ఏడాది ప్రవేశపెట్టబోయే ఐఫోన్లు ఎన్ని అన్నది సందేహంగా మారింది. మరోవైపు ఐఫోన్ 10 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా న్యూ రీ-డిజైన్డ్ ఐఫోన్ 7ను 2017లోనే యాపిల్ ప్రవేశపెడుతుందని కంపెనీ అనలిస్టు క్రియేటివ్ స్ట్రాటజీ ప్రెసిడెంట్ టిమ్ బజరిన్ చెప్పారు. చిన్న చిన్న మార్పులతో ఐఫోన్ 6ఎస్ఈ పేరుతో ఈ ఏడాది కొత్త ఐఫోన్ మార్కెట్లోకి వస్తుందని ఓ జర్మన్ వెబ్సైట్ కూడా పేర్కొంది. అంతకుముందటి రిపోర్టులు కూడా ఐఫోన్ 7 ప్రో డివైజే డ్యూయర్ రేర్ కెమెరాతో రాబోతుందని వెల్లడించాయి. దీంతో ఈ ఫోన్ పై సందేహాలు మరింత ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే ఎల్జీ, హియోమి వంటి స్మార్ట్ఫోన్ తయారీదారులు తమ ఫోన్లను డ్యూయల్ కెమెరాతో మార్కెట్లోకి తీసుకొచ్చాయి.

సాఫ్ట్ వేర్ టెస్టింగ్ సర్వీసుల్లో సిగ్నిటి హవా

03/08/2016: హైదరాబాద్: గ్లోబల్ బీపీవో, ఐటీ ఔట్‌సోర్సింగ్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ సంస్థ ‘నెల్సన్‌హాల్’.. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ సర్వీసెస్‌కు సంబంధించి ఇటీవల రూపొందించిన నివేదిక ప్రకారం ‘సిగ్నిటి టెక్నాలజీస్’ ప్యూర్-ప్లే మార్కెట్ విభాగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే డిజిటల్, కన్సల్టింగ్ వంటి మార్కెట్ విభాగాల్లోనూ టాప్‌లో నిలిచినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్యోగుల పరంగా చూస్తే.. రెండో అతిపెద్ద ప్యూర్-ప్లే సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ సర్వీసెస్ కంపెనీగా ఆవిర్భవించామని పేర్కొంది.

లాభాల బూమ్ తో హెచ్సీఎల్ షేర్లు జంప్

03/08/2016: దేశీయ నాలుగో అతిపెద్ద ఐటీ సర్వీసుల ఎగుమతిదారు హెచ్సీఎల్ టెక్నాలజీస్ అన్ని కొలమానాలో విశ్లేషకుల అంచనాలను అధిగమించింది. బుధవారం ప్రకటించిన 2016-17 జూన్తో ముగిసిన తొలి త్రైమాసిక లాభాల్లో కంపెనీ 6 శాతం ఎగిసి, రూ.2,047 కోట్లగా నమోదుచేసింది. రెవెన్యూలు సైతం 6.3 శాతం పెంచుకుని రూ.11,336 కోట్లగా రికార్డు చేసింది. అయితే హెచ్సీఎల్ కేవలం రూ.1,860 కోట్ల లాభాలను మాత్రమే ఆర్జిస్తుందని విశ్లేషకులు అంచనావేశారు. విశ్లేషకుల అంచనాలు అధిగమించి హెచ్సీఎల్ లాభాలు రికార్డు చేయడంతో, నేటి ట్రేడింగ్లో ఆ కంపెనీ షేర్లు మెరుపులు మెరిపిస్తున్నాయి. 7 శాతం మేర దూసుకెళ్తున్నాయి. డాలర్ రెవెన్యూలోనూ దేశీయ టాప్ ఐటీ కంపెనీలో కెల్లా హెచ్సీఎల్ కంపెనీనే మెరుగైన ప్రదర్శన కనబర్చింది. ఈ కంపెనీ డాలర్ రెవెన్యూలు 6.5 శాతం ఎగిసి, క్వార్టర్ ఆన్ క్వార్టర్కు రూ. 1,691 మిలియన్ డాలర్లుగా రికార్డు అయ్యాయి. రెవెన్యూ, మార్జిన్ గైడెన్స్తో ఆర్థిక సంవత్సరం 2017లో కంపెనీ వృద్ధి అంచనాలను పెంచేసింది. స్థిరమైన కరెన్సీతో రెవెన్యూ వృద్ది 12-14 శాతం ఉంటుందని హెచ్సీఎల్ టెక్ అంచనావేస్తోంది. ఈ వృద్ధి డాలర్లో 11.2 శాతం నుంచి 13.2 శాతం ఉంటుందని పేర్కొంది. ఆపరేటింగ్ మార్జిన్లు 19.5 శాతం నుంచి 20.5 శాతం మధ్యలో ఎగుస్తాయని హెచ్సీఎల్ తెలిపింది. మెరుగైన ఆర్థిక ఫలితాలతో హెచ్సీఎల్ ఒక్క షేరుకు 6 రూపాయల డివిడెంట్ ప్రకటించింది. ఆగస్టు 19 నుంచి ఈ డివిడెంట్ చెల్లించనున్నట్టు తెలిపింది.

రెడ్‌మి 3ఎస్ వచ్చేస్తోంది!

02/08/2016: చైనా యాపిల్‌గా పేరొందిన షియోమి రెడ్‌మి సిరీస్‌లో మరో కొత్త ఫోన్ వచ్చేస్తోంది. తొలుత రెడ్‌మి 1ఎస్, తర్వాత 2ఎస్‌లను రిలీజ్ చేసిన ఈ సంస్థ.. తాజాగా రెడ్‌మి 3ఎస్ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఈ కొత్త ఫోన్ బుధవారమే భారతీయ మార్కెట్లలోకి వచ్చేస్తోంది. ఈ కొత్త ఫోన్ ధర రూ. 10వేల లోపే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే కంపెనీ మాత్రం దీని ధర ఎంతో ఇంకా చెప్పలేదు. రెడ్‌మి సిరీస్‌లో 2, 2ప్రైమ్ తర్వాత వస్తు్న్న ఈ ఫోన్‌ను తొలుత చైనా మార్కెట్లో విడుదల చేశారు. ఫోన్ ఫీచర్లు ఇవీ.. ప్రాసెసర్ - క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 430 ర్యామ్ - 2 జీబీ స్క్రీన్ - 5 అంగుళాల డిస్‌ప్లే వెనక కెమెరా - 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా - 5 మెగాపిక్సెల్ బ్యాటరీ - 4100 ఎంఏహెచ్ ఇంటర్నల్ మెమొరీ - 16 జిబి ఆండ్రాయిడ్ వెర్షన్ - 5.1 లాలిపాప్

బ్రాంచ్ల మూతకు ఎస్బీఐ ప్లాన్

02/08/2016: ముంబై : దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తన బ్రాంచులను తగ్గించుకునే ప్రణాళికను రచిస్తోంది. తన గ్రూపు నుంచి 30 శాతం బ్రాంచులను పునర్ నిర్మించుకోవడం లేదా మూసివేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ మెకిన్సే సూచన మేరకు ఎస్బీఐ ఈ మేరకు అడుగులు వేయనున్నట్టు సమాచారం. బ్రాంచ్ అప్టిమైజేషన్కు మెకిన్సేను సలహాదారుగా నియమించామని ఎస్బీఐ ఎండీ రాజ్నీష్ కుమార్ స్పష్టంచేశారు. అయితే బ్రాంచుల సైజు తగ్గించడంపై మాత్రం వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు. బ్రాంచ్ల, ఏటీఎమ్ల అప్టిమైజేషన్ కోసం, వినియోగదారులకు మెరుగైన అనుభవాలు అందించడానికి మెకిన్సేతో కలిశామని కుమార్ వెల్లడించారు. యాక్సేంచర్ ఫైనాన్సియల్ సర్వీసులతో కూడా తాము కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు. బ్రాంచుల అప్టిమైజేషన్ చర్యలో భాగంగా, ఎస్బీఐ ఇటీవలే తన 400 బ్రాంచులను మూసివేయడం లేదా పునర్ నిర్మించుకోవడం చేసింది. దీంతో బ్యాంకు తన వ్యయాలను తగ్గించుకుంది. కొత్త బ్రాంచులను కలుపుకోవడాన్ని యేటికేటికి తగ్గిస్తూ వస్తున్న ఎస్బీఐ..గతేడాది కేవలం 451 బ్రాంచులనే జోడించుకుంది. ప్రస్తుతం ఈ బ్యాంకు 16,784 బ్రాంచులు కలిగిఉంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంతో ముగిసే లోపు ఐదు అనుబంధ బ్యాంకుల, భారతీయ మహిళా బ్యాంకు విలీన ప్రక్రియతో మరో 6,978 బ్రాంచులు తనలో కలుపుకోనుంది అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియతో వ్యయాలు కచ్చితంగా తగ్గుతాయని కుమార్ తెలిపారు. లేకపోతే విలీనాన్ని తామెందుకు ప్రతిపాదిస్తామన్నారు. బ్రాంచుల కొత్త ఫార్మాట్ కోసం బ్యాంకు యోచిస్తోందని వెల్లడించారు. 133 ఇన్ టచ్ బ్రాంచులను సెల్ఫ్ సర్వీసు మోడ్ లో వివిధ రకాల ఆన్లైన్ సేవలు అందించడానికి ఎస్బీఐ ప్రారంభించింది. ఒక్కసారి విలీన ప్రక్రియ పూర్తయితే కంపెనీ రూ.37లక్షల కోట్ల అసెట్ బేస్తో, 24వేల బ్రాంచులు, 58వేల ఏటీఎమ్లుగా బ్యాంకు ఆవిర్భవించనుంది. .

శాంసంగ్ గెలాక్సీకి పోటీగా ఎల్జీ ఫోన్

01/08/2016: శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ గెలాక్సీ నోట్7 కు పోటీగా దక్షిణ కొరియా దిగ్గజం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇంక్ సెప్టెంబర్ లో కొత్త ప్రీమియం స్మార్ట్ఫోన్ ను మార్కెట్లోకి తీసుకురాబోతుంది. గతేడాది అక్టోబర్లో మార్కెట్లోకి వచ్చిన వీ10 ఫోన్ల విజయంతో, వీ20 డివైజ్ను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఎల్జీ వెల్లడించింది. ఈ కొత్త డివైజ్లు కంపెనీని నిరాశపరుస్తున్న అమ్మకాల నుంచి బయటపడేస్తాయని.. శాంసంగ్ గెలాక్సీ నోట్7కు పోటీగా నిలబడతాయని ఆశాభావం వ్యక్తంచేస్తోంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్లో గూగుల్ తాజా వెర్షన్ నోగట్తో రాబోతున్న మొదటి ప్రొడక్ట్ ఇదే కాబోతుందని తెలిపింది. అయితే ఈ వీ20 డివైజ్ ఎలా ఉండబోతుంది..ఏ రేంజ్ మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతున్నారు.. ప్రత్యేకతలు ఏ విధంగా ఉండబోతున్నాయనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఎల్జీకి ప్రత్యర్థులుగా ఉన్న స్మార్ట్ఫోన్ రారాజులు శాంసంగ్, యాపిల్లు తమ కొత్త డివైజ్లను త్వరలోనే మార్కెట్లోకి ఆవిష్కరించబోతున్నారు. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ తన తర్వాతి గెలాక్సీ స్మార్ట్ఫోన్ను బుధవారం మార్కెట్లోకి తీసుకురాబోతుండగా.. యాపిల్ ఇంక్ తన కొత్త ఐఫోన్ను సెప్టెంబర్లో ప్రవేశపెట్టనుంది. ఎల్జీ కలిగిఉన్న రెండు ప్రీమియం ఫోన్ సిరీస్లు, మార్చిలో లాంచ్ చేసిన జీ5 ఫోన్, ఆశించిన దానికంటే తక్కువ స్థాయిలో అమ్మకాలు నమోదుచేసి కంపెనీని నిరాశపర్చాయి. దీంతో ఈ దక్షిణ కొరియా దిగ్గజం వరుసగా ఐదో త్రైమాసికం ఏప్రిల్-జూన్ కాలంలో కూడా నిర్వహణ నష్టాలనే నమోదుచేసింది. వీ10 డివైజ్ విజయంతో, కొత్త ప్రొడక్ట్ ను మార్కెట్లోకి ఆవిష్కరిస్తామని ఎల్జీ ప్రకటించింది. ఈ కొత్త ప్రొడక్ట్, మూడో త్రైమాసికంలో తమ ప్రదర్శనను మెరుగుపరుస్తుందని ఆశాభావం వ్యక్తంచేస్తోంది.

మార్కెట్లోకి రానున్న రెండు భారీ ఐపీవోలు

01/08/2016: న్యూదిల్లీ: ఈ వారం మార్కెట్లోకి రెండు భారీ ఐపీవోలు రానున్నాయి. దాదాపు రూ.1,100 కోట్లు సమీకరణే లక్ష్యంగా ఇవి మార్కెట్లోకి వస్తున్నాయి. దిలిప్‌ బిల్డ్‌కాన్‌ ఆగస్టు 1-3 మధ్యలో, ఎస్‌.పి.అపెరల్స్‌ ఆగస్టు 2-4 మధ్యలో మార్కెట్లోకి రానున్నాయి. ఈ మేరకు రెండు సంస్థలు బీఎస్‌ఈకి సమాచారం అందించాయి. ఇన్ఫ్రా రంగానికి చెందిన దిలీప్‌ బిల్డ్‌కాన్‌ ఐపీవో దాదాపు రూ.430 కోట్లు విలువైన 10,227,273 షేర్లను మార్కెట్లోకి తీసుకొస్తోంది. దీనికి దాదాపు రూ.214-219 మధ్యలో ఆఫర్‌ ధరను నిర్ణయించారు. రూ.219 ధరలో రూ.654 కోట్లు సమీకరిస్తుందని సమాచారం. వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు, రుణాలను తీర్చేందుకు ఈ మొత్తాన్ని వినియోగించనుంది. దీనికి లీడ్‌ మేనేజర్లుగా యాక్సిస్‌ క్యాపిటల్‌, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌, జేఎం ఫైనాన్షల్స్‌లను నియమించారు. ఇక మరో సంస్థ ఎస్‌.పి. అపెరల్స్‌ దాదాపు తొమ్మిది లక్షలకు పైగా షేర్లను ఐపీవోలో విక్రయిస్తోంది. విలువ దాదాపు రూ.215 కోట్లుగా అంచనా వేసింది. రూ.258-268 మధ్య దీని ధర రేంజిని నిర్ణయించారు. అత్యధిక ధరవద్ద ఈ ఇష్యూ దాదాపు రూ.456కోట్లు సమీకరించనుంది. దీనిని మోతీలాల్‌ వోస్వాల్‌ అడ్వైజర్స్‌, సెంటీరియమ్‌ క్యాపిటల్‌ నిర్వహిస్తోంది. 2016లో ఇప్పటి వరకు దాదాపు 14ఐపీవోలు మార్కెట్‌లోకి వచ్చాయి.

ఆరు అత్యాధునిక విమానాలపై భారత్‌ దృష్టి

01/08/2016: న్యూదిల్లీ: యుద్ధవిమానాల్లో ఇంధనం నింపే ఆరు ఎయిర్‌బస్‌ 330 ఫ్లైట్‌ రీఫిల్లింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌(ఎఫ్‌ఆర్‌ఏ)లను వ్యూహాత్మకంగా నేరుగా కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటిని మల్టీరోల్‌ ట్యాంకర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లు అని కూడా అంటారు. భారత సైన్యానికి ఈ తరహా విమానాల అవసరం ఎక్కువగా ఉంది.. వీటి రాకతో యుద్ధక్షేత్రాల్లో మన వైమానక దళానికి అదనపు శక్తి లభించినట్లే. ఇప్పటికే దీనికోసం రెండు సార్లు గ్లోబల్‌ టెండర్లను పిలవగా అవి విఫలమయ్యాయి. దీంతో రూ.9000 కోట్లు విలువ చేసే ఈ డీల్‌ అటకెక్కింది. వీటి ఖరీదు ఎక్కువగా ఉండటం.. తయారీదారుల పేర్లను మార్చిన అంశంపై సీబీఐ కేసు నడుస్తుండటంతో మరింత జాప్యం జరిగింది. దీనిపై జూన్‌ చివర్లో ఎయిర్‌ బస్‌ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ బిడ్‌లో లీస్ట్‌ 1 వచ్చినవారు విరమించుకోవడంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వం వాయు సేన అవసరాలను దృష్టిలోపెట్టుకొని దీనిపై దృష్టి సారించింది. ఇప్పటి వరకు వాయుసేనలో 2003-04లో వాయుసేన కొనుగోలు చేసిన ఇల్యూషన్‌ 78 మిడ్‌ రీఫిల్లింగ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లు మాత్రమే సేవలు అందిస్తున్నాయి.

ఆటోమేషన్‌.. లక్షల ఉద్యోగాలు హాంఫట్‌ - ఐటీ కొత్త ఉద్యోగాల్లో ఏటా 10 శాతం కోత

01/08/2016: హైదరాబాద్‌: సమాచార సాంకేతిక (ఐటీ) రంగంలో ఆటోమేషన్‌ ప్రభావం ప్రారంభ, మధ్యస్థాయి మేనేజర్‌ ఉద్యోగాలపై ఎక్కువగా ఉంటుందని ఇన్ఫోసిస్‌ మాజీ ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌ఓ), మానవ వనరుల విభాగాధిపతి టీవీ మోహన్‌దాస్‌ పాయ్‌ తెలిపారు. ఐటీ రంగం ఏటా కొత్తగా ఇచ్చే ఉద్యోగాల్లో 10 శాతం వరకు ఆటోమేషన్‌ వల్ల కోత పడుతుందన్నారు. దీనిని సంఖ్యా పరంగా విశ్లేషిస్తే, ప్రస్తుతం ఏటా 2-2.5 లక్షల మందికి ఐటీ రంగంలో కొత్తగా ఉద్యోగాలు లభిస్తున్నాయని పాయ్‌ గుర్తు చేశారు. ఆటోమేషన్‌ వల్ల ఏడాదికి 25,000-50,000 వరకు కొత్త ఉద్యోగాల కల్పన తగ్గిపోతుందని ఆయన వివరించారు. కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) పరిజ్ఞానం ప్రవేశ పెట్టడం వల్ల, మధ్యస్థాయి మేనేజర్ల పోస్టులపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 45 లక్షల మంది ఐటీ నిపుణులుంటే, ఇందులో 10 శాతం (4.5 లక్షల) మంది మధ్యస్థాయి మేనేజర్లే అని తెలిపారు. వీరిలో సగం (2.25 లక్షల) మంది వచ్చే పదేళ్లలో తమ ఉద్యోగాలు కోల్పోతారని అంచనా వేశారు. మధ్యస్థాయి మేనేజర్ల వార్షిక వేతనం ఏడాదికి రూ.30-70 లక్షల మధ్య ఉంటుందని, ఈ ఖర్చు తగ్గించుకునేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయని పాయ్‌ వెల్లడించారు. ఐటీ ఇంజినీర్లు ఏం చేయాలి? కొత్త ఉద్యోగాలు తగ్గుతుండటంతో పాటు, ప్రస్తుత పోస్టులకూ ముప్పు వస్తున్న నేపథ్యంలో, ఐటీ రంగంలోకి ప్రవేశించే ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులు మెరుగైన నైపుణ్యం అలవరచుకోవాలని పాయ్‌ సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంపై గట్టి పట్టు ఉండాలని, లేకపోతే, ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు అంతకంతకూ తగ్గిపోతాయని స్పష్టం చేశారు. వివిధ సాంకేతికతలపై పరిజ్ఞానం పెంచుకున్న వారి కోసం ఐటీ సంస్థలు చూస్తున్నాయని, ప్రత్యేక నైపుణ్యం, కష్టించే తత్వం, అనుభవం ఉన్న వారికే ఉద్యోగాలు ఇచ్చేందుకు ఇష్టపడుతున్నాయని పాయ్‌ పేర్కొన్నారు. అందువల్ల డిగ్రీ (బీటెక్‌)తో సరిపెట్టక, పోస్టు గ్రాడ్యుయేషన్‌ (పీజీ) చేయాలని విద్యార్థులకు సూచించారు. * ప్రస్తుతం బీటెక్‌ అంటే 10వ తరగతితో సమానమని, 30 ఏళ్ల పాటు వృత్తి జీవితంలో కొనసాగాలనుకుంటే కనుక, పీజీ చేయాల్సిందే అని పాయ్‌ తేల్చి చెప్పారు.

నేడు బ్యాంకు ఉద్యోగుల సమ్మె - పాల్గొంటున్న 10 లక్షల మంది సిబ్బంది - దాదాపు 80 వేల శాఖలు బంద్

29/07/2016: హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం, ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ చర్యలు మొదలైన వాటిని వ్యతిరేకిస్తూ బ్యాంకుల ఉద్యోగులు దేశవ్యాప్తంగా నేడు (శుక్రవారం) సమ్మెకు దిగనున్నారు. గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులతో పాటు మొత్తం 40 పైగా ప్రభుత్వ రంగ, పాత తరం ప్రైవేట్ రంగ బ్యాంకులకు చెందిన సుమారు 10 లక్షల మంది పైచిలుకు ఉద్యోగులు ఇందులో పాల్గొంటున్నారు. దీంతో ఆయా బ్యాంకుల కార్యకలాపాలు స్తంభించనున్నాయి. అయితే, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ తదితర కొత్త తరం బ్యాంకులు యథాప్రకారం పనిచేస్తాయి. కీలకమైన తొమ్మిది యూనియన్లలో సభ్యత్వమున్నవారంతా సమ్మెకు దిగుతున్నట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ (ఏఐబీఈఏ) కార్యదర్శి బీఎస్ రాంబాబు తెలిపారు. ‘ప్రభుత్వ రంగ బ్యాంకులు, పాత తరం ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులకు చెందిన సుమారు 80,000 పైచిలుకు శాఖల్లోని ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొంటున్నారు’ అని ఆయన వివరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే దిశగా బ్యాంకింగ్ రంగంలో నిర్హేతుక సంస్కరణల అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రాంబాబు విమర్శించారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐలో అయిదు బ్యాంకుల విలీనాన్ని (ఎస్‌బీహెచ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్) ఆయా బ్యాంకుల ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. అలాగే ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ చర్యలు, బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు మొదలైన వాటిని కూడా వ్యతిరేకిస్తూ యూనియన్లు ఈ నెల 12, 13న రెండు రోజుల స్ట్రయిక్ తలపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, అప్పట్లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల కారణంగా దాన్ని వాయిదా వేసుకున్నాయి. తాజాగా ఈ నెల 29న (నేడు) సమ్మె నిర్వహిస్తున్నాయి. అసంబద్ధ సంస్కరణలొద్దు .. మరోవైపు, పరిస్థితి తీవ్రతను అన్ని వర్గాల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే శుక్రవారం సమ్మె తలపెట్టినట్లు ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు. వారాంతమైనప్పటికీ బ్యాంకులకు వరుస సెలవులు ఉండబోవని, శనివారం యథాప్రకారంగానే పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తలపెట్టిన అసంబద్ధ బ్యాంకింగ్ సంస్కరణలకు వ్యతిరేకంగానే ఈ సమ్మె తలపెట్టినట్లు చెప్పారు. ఐడీబీఐ బ్యాంక్‌లో వాటాలను 49 శాతం కన్నా తక్కువకి తగ్గించుకోవాలనే నిర్ణయాల ద్వారా దాన్ని ప్రభుత్వం ప్రైవేటీకరించే ప్రయత్నాలు చేస్తోందని, ఉద్యోగులు దీన్ని వ్యతిరేకిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే ఒకవైపు ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేస్తూ.. మరోవైపు కొత్త బ్యాంకుల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థలకి లెసైన్సులు ఇవ్వడం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగాన్ని సమూలంగా తుడిచిపెట్టేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన అమలు చేస్తున్న సంస్కరణలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని వెంకటాచలం పేర్కొన్నారు. ఎగవేతదారులను శిక్షించాలి.. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండిబకాయిల భారం రూ. 5,39,995 కోట్లకు చేరిందని వెంకటాచలం తెలిపారు. డిఫాల్టర్లు ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన మొత్తాలు సుమారు రూ. 58,792 కోట్ల మేర ఉందని పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వం గానీ, రిజర్వ్ బ్యాంక్ గానీ మొండిబకాయిలను రాబట్టేందుకు చర్యలు తీసుకోవడం లేదని, కనీసం డిఫాల్టర్ల పేర్లను కూడా ప్రచురించడం లేదని ఆయన పేర్కొన్నారు. బ్యాంకులను ముంచెత్తుతున్న మొండి బకాయిలను రాబట్టేందుకు సరైన చర్యలు చేపట్టకపోగా ఎగవేతదారులు మొదలైన వారికి మినహాయింపులు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెంకటాచలం విమర్శించారు. ఉద్దేశపూర్వక ఎగవేతదారులను నేరస్తులుగా ప్రకటించి, కఠినంగా శిక్షించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు.

ఒరాకిల్ భారీ డీల్

29/07/2016: ఒరాకిల్ భారీ డీల్ ప్రపంచ డేటా బేస్ విపణిలో సింహభాగాన్ని ఆక్రమిస్తున్న సాప్ట్వేర్ దిగ్గజం ఒరాకిల్, క్లౌడ్ సాప్ట్ వేర్ కంపెనీ నెట్సూట్ను భారీ మొత్తంలో కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ డీల్ విలువ 9.3 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.62,407కోట్లు)గా వెల్లడించింది. వేగవంతంగా పెరుగుతున్న క్లౌడ్ మార్కెట్లో తన బిజినెస్లను విస్తరించడానికి ఈ డీల్ కుదుర్చుకున్నట్టు తెలిపింది.ఈ కొనుగోలు డీల్తో నెట్సూట్ షేర్లు ఒక్కసారిగా 18.6శాతానికి ఎగిసి, అంతర్జాతీయంగా ప్రీమార్కెట్ ట్రేడింగ్లో 108.64 డాలర్లుగా రికార్డు అయ్యాయి. అదేవిధంగా ఒరాకిల్ షేర్లు సైతం 1.6శాతం పెరిగి, ప్రీమార్కెట్ ట్రేడింగ్లో 41.3డాలర్లుగా నమోదయ్యాయి. ఈ అగ్రిమెంట్ ప్రకారం నెట్సూట్ ఒక్క షేరుకు ఒరాకిల్ 109 డాలర్లను చెల్లించనుంది.ఒరాకిల్, నెట్సూట్ రెండు సంస్థలు మార్కెట్ ప్లేస్ లో దీర్ఘకాలం కలిసి పనిచేస్తాయని ఒరాకిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ హర్డ్ తెలిపారు. సాప్ట్ వేర్ దిగ్గజంగా ఉన్న ఒరాకిల్తో ఈ డీల్ కుదుర్చుకోవడం, తమ క్లౌడ్ సొల్యూషన్లు చాలా పరిశ్రమలకు, దేశాలకు విస్తరిస్తాయని నెట్సూట్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాచ్ నెల్సన్ ఆశాభావం వ్యక్తంచేశారు. ఒరాకిల్ లో జాయిన్ అవ్వడం చాలా గర్వంగా భావిస్తున్నామని, తమ నూతనావిష్కరణలు పెంచుకుంటామని తెలిపారు. తన ప్రత్యర్థులు ఎస్ఏపీ ఎస్ఈ, మైక్రోసాప్ట్ కార్పొరేషన్ లకు పోటీగా ఒరాకిల్ క్లౌడ్ బేస్డ్ మోడల్ లపై తన బిజినెస్ లను మరల్చాలని కంపెనీ వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒరాకిల్, నెట్సూట్ను కొనుగోలు చేయబోతుందని పేర్కొంది. 1998లో నెట్సూట్ను స్థాపించారు. క్లౌడ్ కంప్యూటింగ్ రెవల్యూషన్లో నెట్సూట్ ముందంజలో ఉంది.ఇంటర్నెట్ ద్వారా బిజినెస్ అప్లికేషన్లు అందించడంలో ఈ కంపెనీనే మొదటిది. క్లౌడ్ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచడానికి ఒరాకిల్ ఇప్పటికే టెక్స్టురా, ఓపవర్ వంటి కంపెనీలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

పుంజుకుంటున్న యాపిల్

27/07/2016: ప్రపంచ వ్యాప్తంగా తన ప్రాభవం కోల్పోతూ ఒబ్బందులు పడుతున్న ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కు కాస్త ఊరట లభించినట్టే కనిపిస్తోంది. అవును .. జూన్ తో ముగిసిన త్రైమాసికంలో అంచనాలకు మించి యాపిల్ ఆదాయంలో రాణించింది. ప్రధానంగా యాపిల్ ప్రధాన ఉత్పత్తి అయిన ఐ ఫోన్ అమ్మకాలు కూడా నిపుణలు అంచనాలకు అందకుండాపోయాయి. క్వార్టర్ 3 లో యాపిల్ ఐ-ఫోన్‌ సేల్స్ భారీగా పెరిగాయట. వాల్‌ స్ట్రీట్‌ పండితులు సైతం ఊహించలేని స్థాయిలో విక్రయాలను నమోదు చేసింది. దాదాపు 40.4 మిలియన్ ఐ ఫోన్ల అమ్మకాలు జరిగినట్టు నివేదికలు తెలిపాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో తో పోలిస్తే 15 శాతం క్షీణించినప్పటికీ ఎనలిస్టుల అంచనాలను మించి అమ్మకాలు సాగించిందని ఈ పరిశోధన సంస్థ వివరించింది. యాపిల్ త్రైమాసిక నికర లాభం, 27 శాతం తగ్గి 7.8 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అలాగే నికర ఆదాయం 42.36 బిలియన్ డాలర్లుగా నమోదు చేసింది. అయితే విశ్లేషకులుయాపిల్ ఆదాయాన్ని 42. 09 బిలియన్ డాలర్లుగా అంచనావేశారు. దీంతో మంగళవారం నష్టాలతో ముగిసిన యాపిల్ షేర్ బుధవారం ఓపెనింగ్ లోనే 7శాతం లాభాలను నమోదు చేసింది. యాప్ స్టోర్, ఐక్లౌడ్ తమకు మంచి ఫలితాలిచ్చిందని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లుకా మాస్ట్రీ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఐఫోన్ 6 అమ్మకాలు బ్లాక్ బ్లస్టర్గా నిలిచాయన్నారు. ఈ ఏడాది విడుదల చేసిన చవకైన 10సెం.మీ ఐ ఫోన్ ఎస్ఈ కొనుగోలుదారుల స్థాయిని విస్తరించిందని యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. అయితే సంస్థకు చైనా ప్రధాన నిరుత్సాహపరిచేదిగా ఉందని మూర్ ఇన్సైట్స్ అండ్ స్ట్రాటజీ విశ్లేషకుడు పాట్రిక్ మోర్హెడ్ చెప్పారు. తాము ఊహించిన దాని కంటే మెరుగైన ఫలితాలుసాధించిందని కస్టమర్ డిమాండ్ కూడా అంచనాలను మించిందని పేర్కొంది. 2007 లో గాడ్జెట్ విడుదల నుంచి మొదటిసారి పడిపోయిందనీ, ఐఫోన్ అమ్మకాలు గత త్రైమాసికంలో 16.3 శాతం క్షీణించాయని తెలిపింది. కాగా చైనాలో ఐ ఫోన్ అమ్మకాలపై నిషేధం యాపిల్ కు పెద్ద దెబ్బ. అసలే కష్టాల్లో ఉన్న సంస్థపై ఇది మరింత ప్రభావాన్ని చూపింది.అయితే అక్కడి రెగ్యులేటరీ సంస్థతో చర్చలు జరుపుతున్నామని సంస్థ తెలిపింది.

అమెజాన్ సూపర్ ఆఫర్

26/07/2016: ముంబై: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన వినియెగదారులకోసం మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైమ్ మెంబర్ షిప్ ప్రోగ్రాం ను మంగళవారం ప్రకటించింది. దేశంలో 100కు పైగా నగరాల్లో తన సేవలు అందిస్తున్న అమెజాన్ ప్రధాన సభ్యత్వం కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. రూ 499 వార్షిక చందాతో దీన్ని యూజర్లకు పరిచయం చేస్తోంది. నిర్దేశిత రూ.999 ఫీజులో 60రోజుల ప్రారంభ ఫ్రీ ఆఫర్ తో పాటు, రూ. 500 డిస్కౌంట్ ఇస్తోంది. దీని ద్వారా ఆర్డర్ చేసిన రెండు మూడురోజుల్లోనే ఆయా ఉత్పత్తులు వినియోగదారుల చెంత చేరనున్నాయి. అంతేకాదు ప్రైమ్ సభ్యులకు అదనంగా ప్రత్యేక అవకాశాలు,స్పెషల్ డీల్స్ ను అందించనున్నట్టు ఒక ప్రకనటలో తెలిపింది. మినిమం కొనుగోలు నిబంధన లేకుండా ఈ అవకాశాన్ని ప్రైమ్ మెంబర్స్ అన్ లిమిటెడ్ ఫాస్ట్ ఫ్రీ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. ఇది తమ వ్యాపార వృద్ధి మరింత తోడ్పాటు అందిస్తుందని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు అన్ లిమిటెడ్ ఫ్రీ సర్వీసుతోపాటు ప్రైమ్ డెలీవరీని అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. సభ్యత్వం పొందిన తమ ప్రధాన సభ్యులు 20 నగరాల్లో 10,000 పైగా ఉత్పత్తులపై రూ .50 పైగా రాయితీతో అదే రోజు, ఉదయం లేదా షెడ్యూల్ డెలివరీని ఎంచుకోవచ్చని ప్రకటించింది.

‘జేబ్’ నుంచి చెల్లించండి..! - వీసాఫ్ట్ నుంచి పేమెంట్ అప్లికేషన్..

26/07/2016: హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బ్యాంకింగ్ టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ వీసాఫ్ట్ ‘జేబ్’ పేరిట వినూత్న అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది. మార్కెట్లో అందుబాటులో ఉన్న మొబైల్ పేమెంట్ సొల్యూషన్స్‌కు పూర్తి భిన్నంగా... వాలెట్ నుంచి కాకుండా చెల్లింపులు బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు నేరుగా బదిలీ చేయటమే దీని ప్రత్యేకత. లావాదేవీ సైతం వెంటనే పూర్తవుతుంది. ఇక డబ్బులు స్వీకరించేవారికి యాప్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. బ్యాంకు ఖాతా ఉంటే చాలు. ఈ యాప్ విషయమై వీసాఫ్ట్ ఇప్పటికే పలు బ్యాంకులతో చర్చిస్తోంది. ఆగస్టులో జేబ్ సేవలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్లు సంస్థ చైర్మన్ మూర్తి వీరఘంట తెలిపారు. సీవోవో శ్రీనివాస్ ద్రోణంరాజుతో కలిసి సోమవారమిక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు. కస్టమర్ తనకున్న అన్ని బ్యాంకు ఖాతాలను జేబ్ యాప్‌కు అనుసంధానించవచ్చని చెప్పారు. లావాదేవీలకయ్యే ఖర్చు చాలా తక్కువన్నారు. ఇవీ జేబ్ ప్రత్యేకతలు.. యాప్ నమోదుకు ఆధార్, మొబైల్ నంబరు, బ్యాంకు ఖాతా నంబరు లేదా ఈ-మెయిల్ ఐడీ వంటి వర్చువల్ అకౌంట్ అవసరం. వీటి ఆధారంగా నగదు స్వీకరించవచ్చు, చెల్లించవచ్చు. నగదు చెల్లించే సమయంలో ఎంత మొత్తం బదిలీ చేయాలి? ఎవరికి చెల్లించాలి? అనేది యాప్ అడుగుతుంది. స్వీకరించే వ్యక్తి తాలూకు ఆధార్, మొబైల్, బ్యాంకు ఖాతా నంబరు ఇవ్వాలి. లేదా క్యూఆర్ కోడ్ ఉంటే స్కాన్ చేయొచ్చు. ఎందుకు చెల్లిస్తున్నారో అడుగుతుంది. పిన్ ఇచ్చి ఓకే చెప్పగానే స్వీకర్త ఖాతాకు క్షణాల్లో నగదు వెళ్తుంది. స్వీకర్తకు స్మార్ట్‌ఫోన్ లేకపోయినా వారి బ్యాంకు ఖాతా కు డబ్బులు పంపించొచ్చు. నగదు వచ్చినట్టు స్వీకర్త మొబైల్‌లో సందేశం వస్తుంది. ఇక యాప్‌లోని క్యాలెండర్ ద్వారా రానున్న రోజుల్లో చేయాల్సిన చెల్లింపుల తేదీలను నమోదు చేసుకోవచ్చు. సొంత క్యాంపస్‌లు: వీసాఫ్ట్‌కు అట్లాంటాలో 200 మంది, హైదరాబాద్‌లో 800, రాజమండ్రిలో 200 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో 2,500 మంది సిబ్బంది పనిచేసే వీలున్న సొంత కేంద్రాన్ని నెలకొల్పుతామని మూర్తి వీరఘంట వెల్లడించారు. అలాగే వైజాగ్‌లో 1,200 మంది సీటింగ్ సామర్థ్యంతో రూ.40 కోట్లతో డెలివరీ సెంటర్‌ను నిర్మిస్తున్నట్టు చెప్పారు. రాజమండ్రి కార్యాలయాన్ని విస్తరిస్తామన్నారు. విస్తరణకుగాను త్వరలో రూ.200 కోట్లకుపైగా నిధులు సమీకరిస్తామని వెల్లడించారు. తాము అభివృద్ధి చేసిన జేబ్ యాప్ రానున్న రోజుల్లో ఏటీఎం కార్డుల్ని భర్తీ చేస్తుందని చెప్పారాయన. 1996లో ప్రారంభమైన వీసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా 2,600 ఫైనాన్షియల్ సంస్థలకు సేవలందిస్తోంది.

షిర్డీ సాయి చిత్రంతో... లిమిటెడ్ ఎడిషన్ వాచీ - ధర రూ.3-4 లక్షలుండే అవకాశం

26/07/2016: హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఖరీదైన వాచీల తయారీలో ఉన్న స్విస్ కంపెనీ ‘సెంచురీ టైమ్స్ జెమ్స్’ భారతీయ దేవుళ్లను వాచీల్లో ప్రతిష్ఠించే పనిలో పడింది. ఇప్పటికే తిరుపతి వెంకటేశ్వర స్వామి చిత్రంతో కూడిన వాచీని ప్రవేశపెట్టి ఇక్కడి కస్టమర్లను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా షిర్డీ సాయినాథుని చిత్రంతో వాచీని అభివృద్ధి చేస్తున్నట్టు తెలిసింది. మార్కెట్లోకి రావటానికి కొన్నాళ్లు పట్టొచ్చని రోడియో డ్రైవ్ మార్కెటింగ్ ప్రతినిధి సంజీవ్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు వెల్లడించారు. ధర రూ.3-4 లక్షలు ఉండే అవకాశం ఉందన్నారు. లిమిటెడ్ ఎడిషన్‌లో భాగంగా మొత్తం 2,000 వాచీలను మాత్రమే సెంచురీ ద్వారా తయారు చేయిస్తామన్నారు. సెంచురీ వాచీలను ప్రమోట్ చేసేందుకు ప్రతి నగరంలో ఒక ప్రముఖ ఆభరణాల సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంటామని అన్నారు. వాచీల విక్రయంలో ఉన్న బెంగళూరుకు చెందిన రోడియో డ్రైవ్ భాగస్వామ్యంతో సెంచురీ భారత్‌లో ప్రవేశించింది. వాచీల ధర రూ.3 లక్షలు-2 కోట్ల వరకు ఉంది. బాలాజీ వాచీలు 32 అమ్మకం.. సెంచురీ టైమ్స్ జెమ్స్ 2013లో వెంకటేశ్వరుడి చిత్రంతో కూడిన వాచీని ఆవిష్కరించింది. ఇప్పటి వరకు 32 అమ్ముడయ్యాయి. వీటిలో 18 వాచీలను తెలుగు రాష్ట్రాలకు చెందిన కస్టమర్లు ద క్కించుకున్నారు. 11 వాచీలు కర్నాటక, 3 వాచీలు తమిళనాడుకు చెందిన వారు కొనుగోలు చేశారు. విడుదలైనప్పుడు ధర రూ.27 లక్షలుంటే, ఇప్పుడు రూ.29 లక్షలుంది. లిమిటెడ్ ఎడిషన్‌లో భాగంగా 333 వాచీలనే రూపొందించారు. డయల్‌ను మెటాలిక్ తెలుపు రంగులో అందంగా తీర్చిదిద్దారు. డయల్ వెనుకవైపు గోపురం ఆకారాన్ని ఉంచారు. 18 క్యారట్ల రెడ్ గోల్డ్‌ను వాచీ తయారీకి వాడారు. 34 పచ్చలు, 34 కెంపులు, 13 వజ్రాలు వాచీకి అందాన్ని తెచ్చిపెట్టాయి. వాచీల విక్రయ ఆదాయంలో కొంత మొత్తాన్ని టీటీడీకి చెందిన బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రిసర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ద డిసేబుల్డ్‌కు ఇస్తున్నారు.

ఇళ్ల కొనుగోలుకు హైదరాబాద్, విజయవాడ బెస్ట్!

25/07/2016: ఇళ్ల కొనుగోలుకు హైదరాబాద్, విజయవాడలు అత్యుత్తమమని ప్రముఖ రియల్టీ కన్సల్టెంట్ జేఎల్‌ఎల్ ఇండియా ఒక నివేదికలో సూచించింది. ‘క్రియేటింగ్ వెల్త్ విత్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్’ పేరుతో జేఎల్‌ఎల్ విడుదలచేసిన నివేదికలో రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనుగోలుకు దేశంలో కొన్ని కీలక ప్రాంతాలను సిఫార్సు చేసింది. దక్షిణాదిన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, విజయవాడలను సంస్థ సూచించింది. సంస్థ సూచించిన మరికొన్ని ప్రాంతాల్లో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్, లక్నో, చండీఘర్, జైపూర్, డెహ్రాడూన్, భువనేశ్వర్, కోల్‌కతా, గౌహతి, రాంచీ, అహ్మదాబాద్, ముంబై, నాగ్‌పూర్‌లు ఉన్నాయి. చదరపు అడుగుకు రూ.2,500-రూ.5000 శ్రేణి ఉత్తమం చదరపు అడుగుకు రూ.2,500 నుంచి రూ.5,000 వరకూ పెట్టుబడి అత్యుత్తమమనీ నివేదికలో సూచించింది. అటు పెట్టుబడిపరంగా, ఇటు ధర పెరగడానికి ఈ శ్రేణి తగిన స్థాయి అని నివేదిక వివరించింది. ప్రదేశం కీలకం... ఏ స్థాయి వద్ద హౌసింగ్‌లో పెట్టుబడి పెట్టాలన్న అంశంపై నివేదిక నిర్దిష్ట ప్రమాణాలను ప్రస్తావించింది. కొనుగోలు విషయంలో ‘ప్రదేశం ఎక్కడ’ అనే విషయం కీలకమని తెలిపింది. అక్కడ మంచి మౌలిక సదుపాయాలు ఉండాలనీ, రవాణా వ్యవస్థ బాగుండాలనీ, ఆ ప్రాంతం వృద్ధికి తగిన పరిస్థితులూ కీలకమని జేఎల్ ఇండియా చైర్మన్ అండ్ కంట్రీ హెడ్ అనూజ్ పురి ఈ సందర్భంగా పేర్కొన్నారు. టైర్ 1 ,టైర్ 2 నగరాల్లో పెట్టుబడులు బాగుంటాయనీ వివరించింది. ఇక ఇన్వెస్టరు రియల్టీ అమ్మకాలు జరపాల్సి వస్తే... తగిన లాభాలకు తగిన సమయం కీలకమనీ విశ్లేషించింది. తాము సూచించిన ప్రమాణాలకు లోబడిన కొనుగోళ్లకు ధర వచ్చే మూడేళ్లలో వార్షికంగా 15 శాతం పెరుగుతుందని అంచనావేసింది. ఒక అసెట్‌ను దాదాపు ఎవ్వరూ గరిష్ట స్థాయి వద్ద అమ్మి సొమ్ము చేసుకోలేరనీ, అలాగే కనిష్ట స్థాయి వద్ద ఎవ్వరూ కొనుగోలు చేయలేరన్న విషయాన్ని గుర్తెరగాలని కూడా నివేదిక పేర్కొంది.

వెరిజోన్ చేతికి యాహూ?

23/07/2016: లండన్ : యాహూ ఇంటర్నెట్ ఆస్తులను కోనుగోలుకు ప్రముఖ వైర్ లెస్ దిగ్గజం వెరిజోన్ సంస్థ అంతాసిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. మొదటినుంచీ గట్టి పోటీదారుడుగా భావిస్తున్న వెరిజోన్ చివరకి యాహూ ను కైవసం చేసుకోనుంది. ఈ క్రమంలో ఈ రెండు సంస్థల మధ్య చర్చలు మరింత సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. సుమారు రూ. 33 వేల 575 కోట్లకు (5 బిలియన్ డాలర్లు) యాహూ ఇంటర్నెట్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు రంగం సిద్దమైనట్టు ఇరు కంపెనీల సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రక్రియ ముగించనున్నట్టు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థలు వచ్చే వారం రోజుల్లోపే ఈ డీల్ ప్రకటించే అవకాశం ఉందని అంచనా. అయితే వెరిజోన్ యాహూ కోర్ ఇంటర్నెట్ వ్యాపారానికి మాత్రమే పరిమితమనీ, ఈ ఒప్పందంలో యాహూ రియల్ ఎస్టేట్ ఆస్తులు, పేటెంట్లు లాంటి ఇతర ఆస్తులు ఉండవని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. నాన్ కోర్ మేధో సంపత్తి ఆస్తుల అమ్మకం విడిగా విక్రయించబడుతుందని తెలిపారు. మరోవైపు వెరీజోన్ తప్ప మరి ఏ కంపెనీ యాహూ ఆస్తులను కొనుగోలు చేయలేదని రీకాన్ ఎనలిస్ట్ రోజర్ ఎ ట్నెర్ వ్యాఖ్యానించారు.అయితే వెరిజోన్ అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. దీనిపై స్పందించడానికి నిరాకరించినట్టు సమాచారం. 140 మిలియన్లకు పైగా యూజర్లతో ఉన్న వెరిజోన్ ..మీడియా, ప్రకటనల వ్యాపారం కొనుగోలు కోసం ఎడ్వర్టైజింగ్ టెక్నాలజీ ప్లాట్ ఫాంని రూపొందించాలనే యోచనలో యాహూ పై కన్నేసింది. డిజిటల్ ప్రకటనల మార్కెట్లో పోటీ పెరగనుందనీ, 200 మిలియన్ యాహూయూజర్లతో వెరిజోన్ ప్రకటనల బేస్ మరింత పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఈ సంవత్సరం యాహూ షేర్లు ఇప్పటివరకు 18 శాతానికిపైగా వృద్ధి చెందాయి కాగా మిగతా బిడ్డర్స్ లో పెట్టుబడిదారులు సమాఖ్య (కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టర్స్), బైన్ క్యాపిటల్ ,బెర్క్ షైర్ హాత్వే చైర్మన్ వారెన్ బఫ్ఫెట్, ప్రయివేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ, ఎల్లో పేజెస్ మాతృ సంస్థ వైపి హోల్డింగ్స్ పేర్లు ప్రముఖంగా నిలిచిన సంగతి తెలిసిందే.

తప్పు ఒప్పుకున్న శాంసంగ్

23/07/2016: కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ తప్పును ఒప్పుకుంది. తాము ప్రకటించినట్టుగా గెలాక్సీ సిరీస్ లో వస్తున్న ఎస్ 7 ఆక్టీవ్ ఫోన్ వాటర్ ప్రూఫ్ కాదని, కొన్ని లోపాలున్నాయని అంగీకరించింది. తాము నిర్వహించిన పరీక్షల్లో గెలాక్సీ 7 యాక్టివ్ స్మార్ట్ ఫోన్లు విఫలమయ్యాయని ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే దీన్ని సరిచేసే సామర్థ్యం తమ దగ్గరున్నట్టు తెలిపింది. దీనికి సంబంధించి చాలా కొద్ది ఫిర్యాదులు తమకు అందాయని పేర్కొంది. వారంటీ పీరియడ్ లో ఉన్న ఫోన్లకు రిప్లేస్ మెంట్ చేస్తున్నట్టు ప్రకటించింది సీఎన్ఈటీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించినపుడు టచ్ స్క్రీన్ పనిచేయలేదని, గ్రీన్ లైన్స్ వచ్చాయని, ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడంతోపాటు.. పవర్ బటన్ పనిచేయలేదు. కెమెరా లెన్స్ పై నీళ్లు తదితర సమస్యలు తలెత్తినట్టు శాంసంగ్ వివరించింది. అయితే తాను రిలీస్ చేసిన అన్ని ఫోన్లలో లోపాలు లేవని, చాలా తక్కువ వాటిలో చాలా స్వల్పలోపాలు తలెత్తాయని చెబుతున్న శాంసంగ్ ఎన్ని యూనిట్లలో ఈ లోపాలున్నాయనేది స్పష్టం చేయలేదని ఎన్ గాడ్జెట్ రిపోర్ట్ చేసింది. కాగా ఎస్ 7 ఆక్టివ్ ఫోన్‌ నీటిలో కూడా పనిచేస్తుందనీ(వాటర్‌ రెసిస్టెంట్‌), ఐపీ68 సర్టిఫికేట్ ఉందనీ కంపెనీ ప్రచారం చేసుకుంది. అయితే కన్జ్యూమర్‌ రిపోర్ట్స్‌ అనే సంస్థ నిర్వహించిన పరీక్షల్లో ఈ స్మార్ట్ ఫోన్ వాటర్ రెసిస్టెంట్ గా లేదని తేలింది. నీటిలో ఉంచినపుడు స్క్రీన్ పై గ్రీన్ షేడ్స్ కనిపించినట్లు, కెమెరాపై బుడగలను గుర్తించినట్టు ఇటీవల నివేదించిన సంగతి తెలిసిందే.

మీ పాన్ వివరాలివ్వండి.. - 7 లక్షల మందికి త్వరలో ఐటీ శాఖ లేఖలు - పాన్ రహిత భారీ లావాదేవీలపై కన్ను - పన్ను ఎగవేతలకు అడ్డుకట్టే లక్ష్యం..

22/07/2016: న్యూఢిల్లీ: పన్ను ఎగవేతల నిరోధం దిశగా ఆదాయపు పన్ను శాఖ మరో కీలక అడుగు వేయనుంది. భారీ విలువగల ఆర్థిక లావాదేవీల నిర్వహణ లేదా తమ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో రూ.10 లక్షలకన్నా అధికంగా ఉన్న 7 లక్షల మంది అసెసీల నుంచి వారి పాన్ వివరాలను ప్రత్యేకంగా సేకరించనుంది. త్వరలో వీరికి ఆదాయపు పన్ను శాఖ లేఖలు రాయనున్నట్లు ఆర్థికమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రకటన ప్రకారం, యాన్యువల్ ఇన్‌ఫర్మేషన్ రిటర్న్స్ (ఏఐఆర్) కింద పలు అధిక విలువ ఆర్థిక లావాదేవీలు ఆదాయపు పన్ను శాఖ దృష్టికి వచ్చాయి. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో రూ.10 లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్లు, రూ.30 లక్షలు ఆపైన స్థిరాస్తి కొనుగోళ్లు, అమ్మకాలు వంటివి ఇందులో ఉన్నాయి. అయితే వీటిలో పలు లావాదేవీలు పాన్‌తో అనుసంధానం కాకపోవడాన్ని ఆదాయపు పన్నుశాఖ గుర్తించింది. నల్లధనం వివరాలు తెలియజేసి, 45 శాతం పన్ను చెల్లింపుల ద్వారా ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు పొందే వెసులుబాటును కల్పిస్తూ 4 నెలలు అమల్లో ఉండే ఒక కీలక పథకాన్ని జూన్ 1న కేంద్రం ప్రారంభించిన నేపథ్యంలోనే ఐటీ శాఖ తాజా చొరవ తీసుకోవడం గమనార్హం. 90 లక్షల పాన్ రహిత లావాదేవీల గుర్తింపు... 2009-10 నుంచి 2016-17 మధ్య పాన్ లేకుండా భారీ ఆర్థిక లావాదేవీలు దాదాపు 90 లక్షలు జరిగినట్లు అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో ఐటీ శాఖ గుర్తించింది. ఇందులో ఇప్పటికి 14 లక్షల లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించి, అందులో సందేహాస్పదమైన 7 లక్షల లావాదేవీలను వెలికితీసింది. పాన్ వివరాలు సమర్పించాలని వీరికి త్వరలో లేఖలు రాయాలని నిర్ణయించింది. అలాగే లేఖలు పంపుతున్న వారి సౌలభ్యం నిమిత్తం వారు తగిన సమాచారం ఇవ్వడం కోసం ఒక ఈ-పోర్టల్‌ను అభివృద్ధి చేసినట్లు కూడా అత్యున్నత స్థాయి వర్గాలు తెలి పాయి. పంపే లేఖలో ఒక యునిక్ ట్రాన్జాక్షన్ సీక్వెన్స్ నంబర్ ఉంటుంది. లేఖ అందుకున్న వ్యక్తులు తమ ఈ- ఫైలింగ్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయిన తర్వాత, ఈ నంబర్ సహాయంతో తమ లావాదేవీలకు తమ పాన్ వివరాలను జతచేసే వీలుంటుంది. అలాగే ఈ-పోర్టల్ ద్వారానే తమ సమాధానాన్ని కూడా తెలియజేయవచ్చు.

ఐటీసీ లాభం 2,385 కోట్లు క్యూ1లో 10 శాతం వృద్ధి

22/07/2016: న్యూఢిల్లీ: దేశీ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ ఈ ఏడాది మార్చితో ముగిసిన తొలి త్రైమాసికంలో (2016-17, క్యూ1) స్టాండ్ అలోన్ ప్రాతిపదికన రూ.2,385 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కిందటేడాది ఇదే కాలంలో లాభం రూ.2,166 కోట్లతో పోలిస్తే 10 శాతం వృద్ధి నమోదైంది. ఇక మొత్తం ఆదాయం 8.3 శాతం వృద్ధితో రూ. 12,233 కోట్ల నుంచి రూ.13,253 కోట్లకు పెరిగింది. వ్యాపారంలో పలు సవాళ్లు, ఎఫ్‌ఎంసీజీ రంగంలో డిమాండ్ మందగమనం, సిగరెట్ల పరిశ్రమపై ప్రభుత్వ నియంత్రణల ప్రభావం ఉన్నప్పటికీ స్థిరమైన పురోగతిని సాధించినట్లు ఐటీసీ పేర్కొంది. కంపెనీకి ప్రధాన ఆదాయ వనరైన సిగరెట్ల వ్యాపారం ఆదాయం క్యూ1లో రూ. 8,231 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే క్వార్టర్‌లో ఈ ఆదాయం రూ. 7,734 కోట్లతో పోలిస్తే 6.4 శాతం వృద్ధి చెందింది. ఇతర విభాగాలను చూస్తే... ⇒ సిగరెట్లు సహా మొత్తం ఎఫ్‌ఎంసీజీ, ఇతరత్రా విభాగాల ఆదాయం క్యూ1లో 9.5 శాతం పెరిగి రూ. 2,385 కోట్లుగా నమోదైంది. ⇒ హోటళ్ల వ్యాపార ఆదాయం మాత్రం స్వల్పంగా 0.16 శాతం తగ్గి రూ. 287 కోట్లకు పరిమితమైంది. ⇒ అగ్రి బిజినెస్ ఆదాయం 20.15 శాతం ఎగసి రూ. రూ.2,325 కోట్ల నుంచి రూ. 2,794 కోట్లకు వృద్ధి చెందింది. ⇒ పేపర్ బోర్డ్స్, పేపర్, ప్యాకేజింగ్ వ్యాపార ఆదాయం 1.57 శాతం క్షీణించి రూ. 1,322 కోట్లకు తగ్గింది. ⇒ ఫలితాల నేపథ్యంలో గురువారం బీఎస్‌ఈలో ఐటీసీ షేరు స్వల్ప నష్టంతో రూ.251 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక కంపెనీ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సీఈఓగా దేవేశ్వర్‌కు చివరి ఏజీఎం.. ఐటీసీ 105వ వాటాదారుల వార్షిక సమావేశాన్ని శుక్రవారం నిర్వహించనుంది. ప్రస్తుతం కంపెనీ చైర్మన్, సీఈఓగా వ్యవహరిస్తున్న యోగేష్ చందర్ దేవేశ్వర్ చివరిసారిగా సీఈఓ హోదాలో ఏజీఎంలో మాట్లాడనున్నారు. సీఈఓగా ఆయన పదవీకాలం 2017 ఫిబ్రవరి 4తో పూర్తికానుంది. యువతరానికి అవకాశమివ్వటం కోసం మరోవిడత సీఈఓ బాధ్యతలను చేపట్టకూడదని యోగేశ్వర్ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. అయితే, చైర్మన్‌గా మాత్రం ఆయన కొనసాగుతారు. సిగరెట్ల వ్యాపారమే ప్రధానంగా కొనసాగుతున్న తరుణంలో 1996లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వచ్చిన యోగేశ్వర్... విభిన్న రంగాల్లోకి కంపెనీని విస్తరించి ఎఫ్‌ఎంసీజీ దిగ్గజంగా మార్చారు. ఆయన సారథ్యం చేపట్టేనాటికి ఐటీసీ వార్షికాదాయం రూ.5,200 కోట్లు కాగా, ఇప్పుడు రూ.50 వేల కోట్లకు చేరింది. ఇక వార్షిక స్థూల లాభం రూ.452 కోట్ల నుంచి 33 రెట్లు ఎగబాకి రూ.14,958 కోట్లకు పెరిగింది.

హైబ్రిడ్ టెక్నాలజీతో..మహీంద్రా స్కార్పియో - ధర రూ. 14 లక్షలు

21/07/2016: న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ వాహన కంపెనీ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ (ఎం అండ్ ఎం) తాజాగా తన ప్రముఖ స్కార్పియో మోడల్‌లో కొత్త మైల్డ్ హైబ్రిడ్ వెర్షన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.9.74-14.01 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ ముంబై) ఉంది. కంపెనీ ఇందులో తొలిసారిగా ‘ఇన్‌టెలి-హైబ్రిడ్’ అనే హైబ్రిడ్ టెక్నాలజీని పొందుపరిచింది. దీని వల్ల ఇంధన వినియోగం 7% మేర తగ్గుతుందని కంపెనీ పేర్కొంది. 2.2 లీటర్ ఎం-హక్ ఇంజిన్ కలిగిన స్కార్పియో ఎస్4, ఎస్4 ప్లస్, ఎస్4 ప్లస్ 4డబ్ల్యూడీ, ఎస్6 ప్లస్, ఎస్8, ఎస్10-2డబ్ల్యూడీ (మాన్యువల్ ట్రాన్స్‌మిషన్), ఎస్10-4డబ్ల్యూడీ (మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) వేరియంట్లలో ఈ హైబ్రిడ్ టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది. వాయిస్ మేసేజింగ్ సిస్టమ్ ఉన్న తొలి దేశీ ఎస్‌యూవీ ఇది. 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన సీఆర్‌డీఈ ఇంజిన్‌ను తొలిసారిగా దీనిలోనే ఉపయోగించారు.

నిజం! రజనీ సెలవు తీసుకొచ్చాడు - బెంగళూరు స్టార్టప్‌లకు ఫ్రైడే హాలిడే

21/07/2016: ‘‘మిగతా హీరోలు సెలవు చూసుకుని వస్తారు. రజనీకాంత్ వస్తే సెలవే వస్తుంది’’ ఇదీ సినిమాలపై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న జోక్. 22న శుక్రవారం రజనీ కాంత్ ‘కబాలి’ సినిమా విడుదలవుతోంది. తరవాత పరిస్థితి ఏమోగానీ... విడుదలకు ముందు మాత్రం కొత్త రికార్డులు రాస్తోంది. బ్రాండింగ్‌కు ప్రొడ్యూసర్లు కొత్త పుంతలు తొక్కటంతో ఇపుడు ‘కబాలి’ చుట్టూ పెద్ద వ్యాపారమే జరుగుతోంది. ఆ వివరాలే ఈ కథనం... ⇒ చెన్నైలో 3 రోజుల టిక్కెట్లు మొత్తం ముందే బుక్ అయిపోయాయి. ఇదేమీ విశేషం కాకపోయినా... తమకు టికెట్లు దొరకడం లేదని, దొరికినా ఎక్కువ రేట్లు పెట్టాల్సి వస్తోందని ప్రేక్షకులు పోలీస్ కేసులు పెట్టడం గమనార్హం. ఇక దుబాయ్, జపాన్, మలేషియా, లండన్‌ల్లో ఉన్న పలువురు రజినీ అభిమానులు కబాలి తొలి రోజు తొలి ఆట చూడ్డానికి రికార్డ్ స్థాయిలో చెన్నైకి వస్తున్నారు. ⇒ ఫైవ్ స్టార్ హోటళ్లలో స్పెషల్ షోలు వేసే విదేశీ సంస్కృతి కబాలితో ఇండియాకూ వచ్చేసింది. బెంగళూరులోని నాలుగు ఫైవ్‌స్టార్ హోటళ్లు-జేడబ్ల్యూ మారియట్, లలిత్ అశోక్, రాయల్ ఆర్చిడ్, క్రౌన్ ప్లాజాల్లో 3 రోజుల పాటు, రోజుకు 4 ఆటలు చొప్పున కబాలి సినిమా చూపిస్తున్నాయి. టికెట్ ధర రూ.1,300- రూ.1,400 రేంజ్‌లో ఉంది. ⇒ చెన్నై, బెంగళూరుల్లోని పలు స్టార్టప్‌లు శుక్రవారం సెలవు ప్రకటించాయి. ఫ్రెష్ డెస్క్, గో బంపర్, ద సోషల్‌పీపుల్ వంటి స్టార్టప్‌లు ఈ జాబితాలో ఉన్నా యి. ఓయేత్రీడాట్‌కామ్ ఏకంగా 2 ఐనాక్స్ స్క్రీన్లనే బుక్ చేసింది. తమ ఉద్యోగులతో పాటు తమ వెబ్‌సైట్‌లో షాపింగ్ చేసిన వారికీ సినిమా చూపిస్తామంటోంది. బెంగళూరు కాంగ్రెస్ ఎమ్మేల్యే మునిరత్న నాయుడు తమ పార్టీ కార్యకర్తల కోసం 4 హాళ్లలో టికెట్లు బుక్ చేశారు. ⇒ కబాలి సినిమాకు అఫీషియల్ ఎయిర్‌లైన్ పార్ట్‌నర్‌గా వ్యవహిరిస్తున్న ఎయిర్ ఏసియా... ఒక విమానాన్ని కబాలి పోస్టర్లు, స్టిక్కర్లతో అలంకరించింది. ఈ విమానం వైజాగ్, బెంగళూరు, న్యూఢిల్లీ, గోవా, పుణే, చంఢీగర్, జైపూర్, గౌహతి, ఇంఫాల్, కోచి తదితర రూట్లలో నడుస్తుంది. కబాలి ఫస్ట్ షో చూడాలనుకునే వారికోసం బెంగళూరు నుంచి చెన్నైకు ప్రత్యేక విమానం కూడా నడుపుతోందీ సంస్థ. ⇒ కేరళకు చెందిన ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ... 5, 10, 20 గ్రాముల్లో కబాలి వెండి నాణేలను అందుబాటులోకి తెచ్చింది. రజనీకాంత్ కబాలి మార్క్‌తో ఈ వెండి నాణేలను, ఒక పెండెండ్‌ను కూడా అందిస్తోంది. ⇒ ధోర్, ఐరన్-మ్యాన్ వంటి సూపర్ హీరోల తరహాలో సింగపూర్‌కు చెందిన కార్బన్ కాపీ కలెక్టిబుల్స్ సంస్థ కబాలి ప్రతిమలను తయారు చేస్తోంది. ఒక్కోటి రూ.1,000 వరకూ ధర ఉండే వీటిని రిటైల్ అవుట్‌లెట్లు, కంపెనీ వెబ్‌సైట్, అమెజాన్‌డాట్‌ఇన్‌లో కొనుగోలు చేయొచ్చు. ⇒ ఎయిర్‌టెల్ కంపెనీ కబాలి పైకవర్‌తో సిమ్‌లు విక్రయిస్తోంది. క్యాడ్‌బరీ కంపెనీ ‘సూపర్‌స్టార్ కా 5 స్టార్’ పేరుతో చాక్లెట్లను అమ్ముతోంది. సిమ్ కవర్లు, టీ షర్ట్‌లు, కీ చెయిన్‌లు వెల్లువలా మార్కెట్లోకి వచ్చేశాయి.

డాటా ప్యాక్ లకు సవాల్ విసురుతున్న జియో?

19/07/2016: డాటా ప్యాక్ లకు సవాల్ విసురుతున్న జియో? 97 రూపాయ‌ల‌కే 10జీబీ 4జీ డేటా అంటూ అటు మొబైల్ వినియోగదారులను తన వైపు తిప్పుకున్న రిలయన్స్ జియో సేవలు ..ఇటు టెలికాం దిగ్గజాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మొబైల్‌ సంస్థలు ప్రకటిస్తున్న ఆఫర్లు మీద ఆఫర్లు దీనికి నిదర్శనం. ఎందుకంటే త్రీజీ టూజీ స్పీడ్, ఫోర్ జీ ... త్రీజీ స్పీడ్ పేరుతో స్మార్ట్ ఫోన్ వినియోగదారులపై రేట్లు బాదేస్తున్న కంపెనీలు అకస్మాత్తుగా ఈ చర్యకు పూనుకున్నాయి.. వినియోగదారులనుంచి విపరీతంగా చార్జీలు గుంజుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ... సరికొత్త ఆఫర్ తో జియో సిమ్ లు రంగంలోకి వచ్చాయి . డాటా పాక్ లకు సవాలు విసురుతున్న ఈ సిమ్ ల హవా ఇప్పటికే వీటి ప్రారంభమైనా కమర్షియల్ గా ఈ ఆగస్టులోనే లాంచ్ అయ్యేందుకు రడీ అవుతోంది రిలయన్స్ జియో. ఈ నేపథ్యంలో రిలయన్స్‌ జియో నుంచి పోటీని తట్టుకోవడానికే మొబైల్‌ సంస్థలన్నీ ఆఫర్లు మీద ఆఫర్లుమీద ప్రకటిస్తున్నాయి. ప్రీపెయిడ్‌ వినియోగదారులకు 2జీ, 3జీ, 4జీ డేటా ప్యాక్‌లపై అదనపు డేటా ఇవ్వనున్నట్లు ఎయిర్‌టెల్‌, ఐడియా ప్రకటించేశాయి. టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ 67శాతం , మరో ప్రముఖ మొబైల్‌ నెట్‌వర్క్‌ ఐడియా సైతం 45 శాతం అదనపు డేటాను అందించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు జూన్‌లో జీఎస్‌ఎం వినియోగదార్లు 35 లక్షల మంది జతచేరారని, వీరితో కలిపి మొత్తం కనెక్షన్ల సంఖ్య 77.69 కోట్లకు చేరినట్లు సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ (కోయ్‌) తెలిపింది. 6 సంస్థలకు ఈ సంస్థ ప్రాతినిథ్యం వహిస్తున్న కోయ్ తాజా జాబితాను విడుదల చేసింది. ఇందులో భారతీ ఎయిర్‌టెల్‌కు కొత్తగా సమకూరిన 14 లక్షల మందితో కలిసి మొత్తం కనెక్షన్ల సంఖ్య 25.57 కోట్లకు చేరినట్లు పేర్కొంది. ఐడియాకు 6.89 లక్షలు, వొడాఫోన్‌కు 7.02 లక్షలు, ఎయిర్‌సెల్‌కు 6.72 లక్షలు, టెలినార్‌కు 32,256 కనెక్షన్లు కొత్తగా జతచేరినట్టు ప్రకటించింది. అరకొర డాటా తో వినియోగదారుల నుంచి డబ్బులు పిండుకుంటున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో జీయో సిమ్ లు సంచలనంగా మారాయి. దీనితోపాటుగా జియో నెట్ వర్క్ ఉపయోగించే సిడిఎమ్ వినియోగదారులకు మాత్రమే పరిమితమైన జియో సేవలు తాజాగా శాంసంగ్ స్మార్ట్ ఫోన్లలో అందుబాటులోకి తెచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఆయా కంపెనీలకు మరింత గుబులు మొదలైంది. మరి దిగ్గజ కంపెనీలకు సైతం సవాలు విసురుతున్న రిలయన్స్ జియో... వినియోగదారులను ఆకట్టుకుంటుందా? డాటా కష్టాలకు చెక్ పెడుతుందా? వేచి చూడాల్సిందే...

ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు శుభవార్త

18/07/2016: ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ వినియోగదారులకు శుభవార్త! 2జీ, 3జీ, 4జీ డేటా ప్యాక్‌లపై 67శాతం అదనపు డేటా ఇవ్వనున్నట్లు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. ఇప్పటి వరకు రూ.655తో రీఛార్జి చేయించుకుంటే 3జీబీ డేటా వచ్చేది. దాన్ని 5జీబీకి పెంచారు. చిన్న డేటా ప్యాక్‌లపై కూడా అదనపు డేటా సౌకర్యాన్ని ఎయిర్‌టెల్‌ అందిస్తోంది. 25తో రీఛార్జి చేయించుకుంటే 100 ఎంబీకి బదులు 145 ఎంబీ, రూ.145 రీఛార్జితో 440 ఎంబీకి బదులు 580 ఎంబీ డేటాను ఇస్తోంది. సవరించిన టారిఫ్‌లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. మరో ప్రముఖ మొబైల్‌ నెట్‌వర్క్‌ ఐడియా సైతం ఇటీవల తమ వినియోగదారులకు అదనపు డేటా సౌకర్యం కల్పించింది. 2జీ, 3జీ, 4జీ ప్యాక్‌లపై 45 శాతం అదనపు డేటాను అందించనున్నట్లు ప్రకటించింది.రిలయన్స్‌ జియో నుంచి పోటీని తట్టుకోవడానికే ఇలా మొబైల్‌ సంస్థలన్నీ ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో జియో సేవలు అందుబాటులోకి రానున్నాయన్న వార్తల నేపథ్యంలో మొబైల్‌ ఆపరేటర్లు ఇలా వరుస ఆఫర్లు ప్రకటిస్తున్నారు.

రూపాయికే షియోమీ ఫోన్లు - పవర్‌బ్యాంకులు, బ్లూటూత్‌ స్పీకర్లు కూడా - ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా సూపర్‌ ఆఫర్‌

16/07/2016: దిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఉత్పత్తుల సంస్థ షియోమీ భారత్‌లో అడుగుపెట్టి రెండేళ్లు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా వినియోగదారులకు సూపర్‌ ఆఫర్‌ అందిస్తోంది షియోమీ. ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జులై 20 నుంచి మూడు రోజుల పాటు ఫ్లాష్‌ డీల్స్‌ను నిర్వహించనుంది. ఇందులో భాగంగా కేవలం ఒక్క రూపాయికే ఫోన్లు, పవర్‌బ్యాంక్‌లు లాంటి వస్తువులను ఇవ్వనుంది. తొలి రోజు 10 షియోమీ ఎంఐ 5 ఫోన్లు, 100 పవర్‌బ్యాంకులు, రెండో రోజు 10 రెడ్‌మీ నోట్‌3 ఫోన్లు, 100 ఎంఐ బ్యాండ్‌లు, ఆఖరి రోజున 10 ఎంఐ మ్యాక్స్‌ ఫోన్లు, 100 ఎంఐ బ్లూటూత్‌ స్పీకర్లను ఫ్లాష్‌సేల్‌కు ఉంచింది. ఇందుకోసం యూజర్లు ముందుగా రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మూడు రోజుల్లో ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఫ్లాష్‌సేల్‌ ఉంటుందని సంస్థ తెలిపింది. జులై 19లోగా రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వివరాలను ఫేస్‌బుక్‌ ద్వారా షేర్‌ చేస్తామని షియోమీ పేర్కొంది. ఈ సేల్‌తో పాటు.. మరిన్ని ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. 2014 జూన్‌లో ఎంఐ3 ఫోన్‌ను విడుదల చేసి భారత మార్కెట్లోకి ప్రవేశించింది షియోమీ. కొద్ది కాలంలోనే వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంది. మార్కెట్లోకి అడుగుపెట్టిన ఏడాదిన్నర కాలంలోనే 30లక్షల ఫోన్ల అమ్మకాలు జరిపింది.

ఐడియా ఆఫర్ అదుర్స్

16/07/2016: న్యూఢిల్లీ : టెలికాం సెక్టార్ లో సంచలనం సృష్టిస్తూ రంగప్రవేశం చేయబోయేందుకు సిద్ధమవుతున్న రిలయన్స్ జియో పోటీని తట్టుకునేందుకు మిగతా టెలికాం సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. మొన్న హ్యాపీ అవర్స్ డేటాతో ఎయిర్ టెల్ వినియోగదారుల ముందుకి రాగ.. నిన్న డేటా ప్యాక్ రేట్లలో 45శాతం కోత విధిస్తున్నట్టు ఐడియా సెల్యులార్ ప్రకటించింది. దేశంలోనే మూడో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ గా ఉన్న ఐడియా తన ప్రీపైడ్ కస్టమర్లకు ఈ ఆఫర్ ను అందిస్తున్నట్టు తెలిపింది. తమ ఖాతాదారులను నిలబెట్టుకునేందుకు, కొత్త వారిని ఆకర్షించేందుకు ఐడియా ఈ సేవలను ఆవిష్కరించింది. 175 మిలియన్ యూజర్లు కలిగి ఉన్న ఐడియా సెల్యులార్, తన 4జీ, 3జీ, 2జీ యూజర్లకు 1జీబీ డేటాలో 45 శాతం డేటా రాయితీని అందించనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఇన్ని రోజులు మూడు రోజుల 75ఎంబీ డేటాకు రూ.19 లు చార్జ్ చేసేవారు. అయితే ఈ 45శాతం ఆఫర్ కింద అదే చార్జ్ మీద 110ఎంబీ డేటాను ఇకనుంచి కస్టమర్లు పొందుతారు. అదేవిధంగా 4జీ/3జీ డేటా ప్యాక్ లో రూ.22లకు 65ఎంబీ డేటాను మూడు రోజుల పాటు వినియోగదారులు పొందేవారు. ప్రస్తుతం ఈ చార్జ్ కింద 90ఎంబీ డేటాను వినియోగదారులు వాడుకోవచ్చు. దీంతో 38శాతం ఎక్కువ డేటా సౌకర్యాన్ని కస్టమర్లకు అందుతాయి. రూ.8 నుంచి రూ.225 ల మధ్య విస్తృతమైన సాచెట్ డేటా ప్యాక్స్ ను కూడా ఐడియా ప్రకటించింది. ఈ డేటా ప్యాక్ ఆఫర్లు అన్ని సర్కిల్స్ లో శుక్రవారం నుంచి అందుబాటులో ఉంటాయని ఐడియా తెలిపింది. గురువారమే ఎయిర్ టెల్ కూడా తన ప్రీపైడ్ కస్టమర్లకు ఉదయం 3 గం.ల నుంచి 5 గంటలకు వరకు వినియెగించే డేటాలో 50 శాతం తిరిగి ఆఫర్ చేస్తోంది. ఈ సమయంలో చేసుకున్న కంటెంట్ డౌన్ లోడ్ పై 50 డేటా బ్యాక్ ఆఫర్ చేస్తున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

భారీగా తగ్గనున్న ఇంటర్నెట్ డేటా ధరలు.. ఇక 1 జీబీ 25 రూపాయలకే.

15/07/2016: కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా మిషన్‌లో బాగంగా ప్రజలందరికీ ఇంటర్‌నెట్‌ను తక్కువ ధరకే అందించాలని టెలికాం రెగ్యు లెటరీ ట్రాయ్‌ భావిస్తోంది. అందుకోసం వై ఫై ద్వారా బ్రాడ్ బాండ్ నెట్ వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు అన్వేషణ ప్రారంభించింది. ఇందులో బాగంగా ప్రజా వై-ఫై నెట్ వర్క్ ద్వారా బ్రాడ్ బాండ్ యాక్సెస్ ను విస్తరించేందుకు ప్రజల అభిప్రాయాలను ట్రాయ్ కోరుతోంది. నియంత్రణాపరమైన అడ్డంకులు, లైసెన్సింగ్ పరిమితులు, వ్యాపార విధానాలు వంటి వాటిపైన ప్రజాభిప్రాయాలను ఆగస్టు 10లోపు తెలియజేయొచ్చని ట్రాయ్ పేర్కొంది. డేటా వేగాన్ని పెంచాలని, ఇప్పడున్న ఇంటర్నెట్‌ ధరలను 90 శాతం వరకు తగ్గించి తక్కువ ధరలకే వై-ఫై యాక్సెస్ సదుపాయాలను కల్పించాలని ట్రాయ్ యోచిస్తోంది. ట్రాయ్ సిఫార్సులు కనుక అమలైతే వై-ఫై నెట్ వర్క్ ద్వారా అందించే ఎంబీ ధర కేవలం 2పైసలే అవుతుంది. ప్రస్తుతం 2జీ, 3జీ, 4జీ సెల్యులార్ నెట్ వర్క్ లపై ఎంబీ ధర 23పైసలుగా ఉంది. దీంతో మొబైల్ డేటాతో పోలిస్తే, వై-ఫై ద్వారా అందించే డేటా చార్జీలు ఒకింట పది వంతులు తగ్గుతాయని ట్రాయ్ పేర్కొంటోంది. ప్రజా వై-ఫై నెట్ వర్క్స్ ను చిన్నస్థాయి వ్యాపారవేత్తలు వినియోగించుకునేలా ఈ హాట్ స్పాట్ ను నెలకొల్పవచ్చని ట్రాయ్ తెలిపింది. గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు కూడా వై-ఫై నెట్ వర్క్ ను విస్తరించేందుకు వాణిజ్య పరమైన విధానాలను ప్రజలు సూచించవచ్చని ట్రాయ్ కోరుతోంది. కేంద్ర మూడో పార్టీ ప్రామాణీకరణ ఎక్కడ అవసరమో అక్కడ “హబ్-బేస్డ్ మోడల్” కోసం కూడా ట్రాయ్ ప్రజల సలహాలను అభ్యర్థిస్తోంది.

జులై 29న బ్యాంకుల సమ్మె

14/07/2016: చెన్నై: పబ్లిక్‌, ప్రైవేటు రంగ బ్యాంకు ఉద్యోగులు జులై 29న సమ్మె చేయడానికి నిర్ణయించినట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ) వెల్లడించింది. కేంద్రం ప్రజా వ్యతిరేకంగా బ్యాంకు పాలసీల్లో చేస్తున్న సంస్కరణలకు వ్యతిరేకంగా జులై 29 రోజున ఉద్యోగులంతా సమ్మె చేయనున్నట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా 9 ట్రేడ్‌ యూనియన్స్‌ కలిసిన యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంకింగ్‌ యూనియన్స్‌లోని పది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నారు. పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయొద్దని, బ్యాంకింగ్‌ సెక్టార్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వద్దని, ఇంకా పలు డిమాండ్లతో ఈ సమ్మె చేస్తున్నారు.

8 అంగుళాలతో లావా వాయిస్‌కాలింగ్‌ ట్యాబ్‌

14/07/2016: దిల్లీ: బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న ప్రముఖ మొబైల్‌ ఉత్పత్తుల సంస్థ లావా ఇప్పుడు ట్యాబ్‌ మార్కెట్‌లోనూ విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే.. వాయిస్‌ కాలింగ్‌ సదుపాయంతో సరికొత్త ట్యాబ్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. లావా ఎక్స్‌80 పేరుతో విడుదలైన ఈ ట్యాబ్‌ ధర రూ. 9,999గా నిర్ణయించింది. దేశంలోని అన్ని రిటైల్‌ స్టోర్లలో ఈ ట్యాబ్‌లు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ తెలిపింది. లావా ఎక్స్‌80 ఫీచర్లు * 8 అంగుళాల డిస్‌ప్లే * 1.3 గిగాహెడ్జ్‌ క్వాడ్‌కోర్‌ ఇంటెల్‌ ఆటమ్‌ ప్రాసెసర్‌ * ఆండ్రాయిడ్‌ 4.4 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ * 1 జీబీ రామ్‌ * 16 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ * 5 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా * 3.2 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా * 3జీ వాయిస్‌ కాలింగ్‌ సదుపాయం * 4200 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

పొలారిస్‌ నుంచి సరికొత్త బైక్‌

14/07/2016: ముంబయి: పొలారిస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సరికొత్త బైక్‌ను విడుదల చేసింది. ఇండియన్‌ స్కౌట్‌ లైన్‌అప్‌లో మరో మోడల్‌ తీసుకొచ్చింది. స్కౌట్‌ 60 పేరుతో విడుదల చేసిన ఈ బైక్‌ ధర ముంబయిలో రూ.11.99 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఈ ‘ఆల్‌-న్యూ2016 ఇండియన్‌ స్కౌట్‌ 60’ బైక్‌ను థండర్‌ బ్లాక్‌, ఇండియన్‌ మోటర్‌సైకిల్‌ రెడ్‌, పెర్ల్‌ వైట్‌ మూడు రంగుల్లో తయారుచేశారు. త్వరలోనే బైక్‌ మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఈ బైక్‌లో 60 క్యుబిక్‌ ఇంచ్‌ ఇంజిన్‌, 5 స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌, 78 హార్స్‌పవర్‌ ఇంజిన్‌, 88.8ఎన్‌ఎం టార్క్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి. స్కౌట్‌ 60ని మొదట ముంబయి మార్కెట్లో విడుదల చేస్తున్నామని.. ఇది బైక్‌ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోందని పొలారిస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పంకజ్‌ దుబే వెల్లడించారు.

కెన్యాలో అపోలో మరిన్ని సేవలు - కెన్యటా నేషనల్‌ హాస్పిటల్‌తో ఒప్పందం

13/07/2016: హైదరాబాద్‌: ఆరోగ్య సంరక్షణ రంగంలో కెన్యాతో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి అపోలో హాస్పిటల్స్‌ రెండు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. కీలక (మూడో దశ) ఆరోగ్య సేవల్లో స్థానిక నైపుణ్యాలను పెంచడానికి కెన్యటా నేషనల్‌ హాస్పిటల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ సంయుక్త ఎండీ సంగీతా రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి అయిన కెన్యటా నేషనల్‌ హాస్పిటల్‌ చాలా కాలంగా కెన్యాలో సేవలందిస్తోంది. ఒప్పందంలో భాగంగా కెన్యా డాక్టర్లు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది భారత్‌లోని అపోలో ఆసుపత్రులలో శిక్షణ పొందుతారు. అపోలో ఆసుపత్రుల్లోని ప్రత్యేక డాక్టర్లు కెన్యటా నేషనల్‌ ఆసుపత్రుల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను, శిక్షణ తరగతులను నిర్వహిస్తారు. ప్రత్యేక విషయాలపై ప్రసంగాలు చేస్తారు. ఆఫ్రికాలోని 16 దేశాల్లో సేవలందిస్తున్న ఎయిర్‌టెల్‌ ఆఫ్రికాతో కూడా అపోలో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఆఫ్రికాలోని ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా చందాదారులకు అపోలో డాక్టర్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటారు. అవసరమైనప్పుడు వెంటనే ప్రత్యేక డాక్టర్ల నుంచి వ్యక్తిగత సమస్యలపై సలహాలు పొందొచ్చు. ‘ఆస్క్‌-అపోలో’ పేరుతో ఇంటర్నెట్‌, మొబైల్‌ ద్వారా ఈ సేవలను అపోలో అందిస్తుంది. ఎయిర్‌టెల్‌ ఆఫ్రికాతో కుదుర్చుకున్న ఒప్పందం ఆఫ్రికాలోని ఆరోగ్య సంరక్షణ రంగంలో కొత్త ఒరవడి సృష్టించగలదని సంగీతా రెడ్డి తెలిపారు.

అన్ని కంపెనీలకూ ఒకే నిబంధనలు - ప్రపంచవ్యాప్తంగా అమలుకు ఐసీఎస్‌ఐ కృషి

13/07/2016: హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార హద్దులు చెరిగిపోయి.. కార్పొరేట్‌ కంపెనీల కార్యకలాపాలు విస్తరిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా కంపెనీల కోసం ఉమ్మడి కంపెనీ పాలన నిబంధనలను (కామన్‌ కార్పొరేట్‌ గవర్నెన్స్‌ కోడ్‌) రూపొందించడానికి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ) నడుం బిగించింది. వ్యాపారం చేయడాన్ని సులభం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) చేయడానికి ఇటువంటి నిబంధనలు తీసుకురావాలన్న ఆలోచన ఐసీఎస్‌ఐకి వచ్చిందని, దాన్ని ఆచరణలో పెడుతున్నామని ఐసీఎస్‌ఐ ప్రెసిడెంట్‌ మమతా బినానీ తెలిపారు. ఇతర దేశాల్లోని ఐసీఎస్‌ఐ తరహా సంస్థలతో కలిసి ఉమ్మడి కంపెనీ పాలన నియమావళిని రూపొందించే ప్రక్రియను ప్రారంభించామని, ఈ నియమావళిని తయారు చేయడానికి 3-6 ఏళ్ల సమయం పడుతుందన్నారు. ‘ఏప్రిల్‌లో ఈ అంశంపై అంతర్జాతీయ రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. దీనికి జర్మనీ వంటి ఏడు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఐక్యరాజ్య సమితి (యూఎన్‌ఓ)తో చర్చలు జరుపుతున్నాం. దీనిపై పరిశ్రమలు, ప్రభుత్వ విభాగాల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నా’మని అన్నారు. ఉమ్మడి కంపెనీ పాలన నియమావళిపై చర్చించేందుకు 2016, డిసెంబరు 9,10 తేదీల్లో అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేస్తున్నామని, దీనికి దేశ, విదేశాల నుంచి 2,000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని బినానీ వివరించారు. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ సమావేశ మందిరం (హెచ్‌ఐసీసీ)లో ఈ సదుస్సు జరగనుంది. సంవత్సరంలో ఒక రోజును ‘అంతర్జాతీయ కార్పొరేట్‌ గవర్నెన్స్‌ డే’గా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిని కోరుతున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో ‘యువ కౌశల్‌’ విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలకు మద్దతు ఇచ్చి వారిని యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మార్చే లక్ష్యంతో ‘యువ కౌశల్‌’ పేరుతో యూత్‌ స్కిల్స్‌ డేను హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో శుక్రవారం (జులై 15) ఐసీఎస్‌ఐ నిర్వహించనుంది. డిగ్రీ, ఆపై విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు పాల్గొనవచ్చు. తమ ఆలోచనను అక్కడి న్యాయ నిర్ణేతల ముందు ప్రదర్శించవచ్చు. ఆ ఆలోచన వ్యాపార యోగ్యంగా ఉండే.. దాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి మద్దతు ఇస్తారు. ఎంపికైన ఆలోచనలకు బహుమతులు కూడా కుంటాయి. టి-హబ్‌, హైదరాబాద్‌ మేనేజిమెంట్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఎంఏ) తదితర సంస్థలకు చెందిన ప్రతినిధులు ఆలోచనలను ఎంపిక చేస్తారు. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఐసీఎస్‌ఐ నిర్వహిస్తోంది. తమ ఆలోచనలను ప్రదర్శించాలనుకునే వారు www.youthskillfest.com సందర్శించాలని ఐసీఎస్‌ఐ తెలిపింది. యూత్‌ స్కిల్‌ ఫెస్ట్‌ను ప్రకటించడానికి బినానీ ఇక్కడకు వచ్చారు. దుబాయ్‌లో తొలి అంతర్జాతీయ చాప్టర్‌ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఐసీఎస్‌ఐకి 69 చాప్టర్లు ఉన్నాయి. విదేశాలకు కూడా కార్యకలాపాలను విస్తరించే వ్యూహంలో భాగంగా దుబాయ్‌లో తొలి చాప్టర్‌ను ఐసీఎస్‌ఐ త్వరలో ప్రారంభించబోతోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4 లక్షల మంది విద్యార్థులు ఐసీఎస్‌ఐ కోర్సును పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 45 వేల మంది ఐసీఎస్‌ఐని పూర్తి చేసి కంపెనీల్లో కార్యదర్శుగా పని చేస్తున్నారు. లేదా సొంత ప్రాక్టిస్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌ చాప్టర్‌లో 8,000 మంది విద్యార్థులు, 1,500 సభ్యులు ఉన్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న వారు కూడా ఐసీఎస్‌ఐ కోర్సును పూర్తి చేయడానికి వీలుగా కామర్స్‌ కాలేజీలతో కలిసి ఆయా కాలేజీల్లో స్టడీ కేంద్రాలను ఐసీఎస్‌ఐ ఏర్పాటు చేస్తోంది. ఇటువంటి స్టడీ కేంద్రాలను ఏర్పాటు చేయడం 9 నెలల క్రితం ప్రారంభించామని.. ఆసక్తి ఉన్న కాలేజీలు ముందుకు వస్తే ఆయా కాలేజీల్లో వీటిని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని మమతా బినానీ తెలిపారు. ఎక్స్‌లెన్స్‌ కేంద్రం దసరాకు ప్రారంభం! శిక్షణ, పరిశోధన కార్యకలాపాలు చేపట్టడానికి కార్పొరేట్‌ గవర్నెన్స్‌పై హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఎక్స్‌లెన్స్‌ కేంద్రాన్ని ఐసీఎస్‌ఐ ఏర్పాటు చేస్తోంది. రూ.10 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రాన్ని దసరాకు ప్రారంభించే వీలుంది. దక్షిణాదిలో ఇదే తొలి ఎక్స్‌లెన్స్‌ కేంద్రమని ఐసీఎస్‌ఐ కేంద్ర కౌన్సిల్‌ సభ్యుడు వి.ఆహ్లాదరావు, హైదరాబాద్‌ చాప్టర్‌ ఛైర్మన్‌ మహాదేవ్‌ తిరునగరి తెలిపారు.

ఎల్‌ & టీ ఇన్ఫో మెరుపులు - తొలిరోజే 1.23 రెట్ల స్పందన - రేపటితో ముగియనున్న ఇష్యూ

12/07/2016: ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు విశేష స్పందన లభించింది. ఐపీఓ తొలిరోజున స్టాక్‌ ఎక్స్ఛేంజీల వద్ద లభ్యమవుతోన్న సమాచారం మేరకు ఇష్యూకు మదుపర్ల నుంచి 1.23 రెట్లు అధికంగా బిడ్‌లు దాఖలయ్యాయి. ఇష్యూకు గాను 1,22,50,000 షేర్లను కంపెనీ జారీ చేయగా.. 1,51,22,100 షేర్లకు బిడ్‌లు వచ్చాయి. అర్హులైన సంస్థాగత మదుపర్లు (క్యూఐబీ) విభాగంలో 1.76 రెట్లు, రిటైల్‌ మదుపర్లు విభాగంలో 1.38 రెట్లు, సంస్థాగతయేతర మదుపర్ల నుంచి 0.19 రెట్లు చొప్పున స్పందన వచ్చింది. తొలిరోజే ఈ ఐపీఓకు 1.66 లక్షల దరఖాస్తులు వచ్చాయి. రేపటి వరకు కొనసాగనున్న ఈ ఇష్యూకు మరింత స్పందన వచ్చే అవకాశం కనిపిస్తోంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు షేర్లను జారీ చేయడం ద్వారా కంపెనీ ఇప్పటికే రూ.373 కోట్లు సమీకరించిన విషయం తెలిసిందే. కంపెనీ బలాబలాల గురించి చూస్తే.. ఆరో అతిపెద్ద ఐటీ సంస్థ: నాస్‌కామ్‌ లెక్కల ప్రకారం.. ప్రస్తుతం ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ దేశంలో ఆరో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ. ప్రపంచంలో అగ్రగామి 20 ఐటీ కంపెనీల్లో ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ చోటు దక్కించుకుంది. మౌలిక రంగ దిగ్గజం ఎల్‌ అండ్‌ టీ దీనికి మాతృసంస్థ కావడం గమనార్హం. ఐటీ విభాగంలో ఎల్‌ అండ్‌ టీ గ్రూప్‌నకు 94.9 శాతం వాటా ఉంది. ఐపీఓ అనంతరం ఇది 84.6 శాతానికి తగ్గుతుంది. ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ గత ఆర్థిక సంవత్సరంలో రూ.922.17 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అలాగే కార్యకలాపాల ఆదాయం రూ.6,143.02 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 22.46 శాతం అధికం. 2016 మార్చి ముగిసేనాటికి కంపెనీ ఆస్తులు విలువ రూ.32,380 కోట్లు. కంపెనీ వద్ద 258 ఖాతాదారులు (క్లయింట్లు) ఉన్నారు. ఇందులో 49 ఫార్చ్యూన్‌ 500 కంపెనీలు ఉన్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా 44 విక్రయ కార్యాలయాలు, 22 పంపిణీ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీలో 20,000 ఉద్యోగులు పనిచేస్తున్నారు. అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌, నిర్వహణ, ఔట్‌సోర్సింగ్‌, ఎంటర్‌ప్రైజ్‌ సొల్యూషన్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌ సేవలు, టెస్టింగ్‌, డిజిటల్‌ సొల్యూషన్లు, ప్లాట్‌ఫామ్‌ ఆధారిత సొల్యూషన్లు వంటి సేవలను కంపెనీ అందిస్తోంది.

బ్యాంకు ఉద్యోగుల సమ్మె లేనట్లే! - నిలిపివేతకు దిల్లీ హైకోర్టు ఆదేశం

12/07/2016: హైదరాబాద్‌: అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ), అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం (ఏఐబీఓఏ) తలపెట్టిన రెండు రోజుల సమ్మెను నిలిపివేయాలని దిల్లీ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) అనుబంధ బ్యాంకులు దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై స్పందిస్తూ.. సోమవారం ఈ మేరకు ఆదేశించిందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (ఎస్‌బీఐ) తెలిపింది. ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీన నిర్ణయానికి వ్యతిరేకంగా 12, 13 తేదీల్లో (నేడు, రేపు) సమ్మె చేయాలని ఏఐబీఈఏ, ఏఐబీఓఏలు ప్రతిపాదించాయి. 12న అసోసియేట్‌ బ్యాంకు ఉద్యోగులు, 13న అన్ని ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేయాల్సి ఉంది. అయితే.. ఈ రెండు తేదీల్లో ప్రతిపాదించిన సమ్మెను నిలిపివేయాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది.

విధానాల రూపకల్పనలో ఎఫ్‌టాప్సీది కీలక పాత్ర - శత జయంత్యుత్సవాలను ప్రారంభించిన గవర్నర్‌ నరసింహన్‌

05/07/2016: హైదరాబాద్‌: వందో సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ అండ్‌ ఆంధ్రప్రదేశ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టాప్సీ) శత జయంత్యుత్సవాలు నిర్వహించనుంది. శత జయంత్యుత్సవాలను తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ ప్రారంభించారు. ఎఫ్‌టాప్సీ వంద సంవత్సరాల చిహ్నాన్ని (లోగో), మార్పులు చేసిన వెబ్‌సైటును, ప్రచార కార్యక్రమానికి సంబంధించిన లఘు చిత్రాన్ని ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎఫ్‌టాప్సీ శత జయంత్యుత్సవాలు ప్రారంభించడం తనకెంతో గర్వకారణంగా ఉందని, ఎఫ్‌టాప్సీ ప్రయాణంలో పాలుపంచుకున్న వారందరికీ ఇది మరిచిపోలేని రోజని గవర్నర్‌ పేర్కొన్నారు. ‘హైదరాబాద్‌ (డెక్కన్‌) చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌గా 1917లో దీన్ని ప్రారంభించారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని పరిశ్రమలు, వాణిజ్యం, సేవల రంగాలకు కీలకమైన సంస్థగా ఉంది. వ్యాపార, పారిశ్రామిక వర్గాల ప్రతినిధిగా ప్రభుత్వ విధానాల రూపకల్పనలో కీలకపాత్ర పోషిస్తోంది. సమావేశాలను నిర్వహిస్తూ.. విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తోంది. ఇంత కీలకమైన సంస్థ వందో సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థల అభివృద్ధికి ఎఫ్‌టాప్సీ చేసిన కృషిని గుర్తు చేసుకోవాలన్నా’రు. శతజయంత్యుత్సవాల సందర్భంగా అనేక కార్యక్రమాలు జరుగతాయని, వీటిలో సామర్థ్యాలు, నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని గవర్నర్‌ కోరారు. మరిన్ని సంవత్సరాలపాటు విజయాలతో ఫెడరేషన్‌ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌టాప్సీ ప్రెసిడెంట్‌ రవీంద్ర మోదీ, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గౌర శ్రీనివాస్‌, శత జయంత్యుత్సవాల కమిటీ ఛైర్మన్‌ అనిల్‌ రెడ్డి వెన్నం తదితరులు మాట్లాడారు.

జోస్ ఆలుక్కాస్ రంజాన్ ఆఫర్లు - ప్రతి కొనుగోలుపై బహుమతి

04/07/2016: హైదరాబాద్: ప్రముఖ జ్యూయలరీ చెయిన్, జోస్ ఆలుక్కాస్ రంజాన్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌లను అందిస్తోంది. తమ షోరూమ్‌ల్లో ప్రత్యేక లైట్ వెయిట్ బంగారు, వజ్రాభరణాలు లభిస్తాయని జోస్ ఆలుక్కాస్ ఒక ప్రకటనలో తెలిపింది. రంజాన్ సందర్భంగా ప్రతి కొనుగోలుపై బహుమతులు ఇస్తున్నామని జోస్ ఆలుక్కాస్ గ్రూప్ చైర్మన్ జోస్ ఆలుక్కా పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ ల్యాబ్ సర్టిఫై చేసిన వజ్రాభరణాల కలెక్షన్ రూ.4,000 నుంచే లభిస్తాయని, రంజాన్ ప్రత్యేక డైమండ్ నెక్లెస్ రూ.1,25,000కు అందిస్తున్నామని తెలిపారు. వినియోగదారులు తమ పాత బంగారాన్ని సరికొత్త డిజైన్‌లకు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చని వివరించారు.

సెంట్రల్ బ్యాంకుల నుంచి ఎక్కువ ఆశించొద్దు - రాజన్

04/07/2016: బాసెల్ (స్విట్జర్లాండ్): సెంట్రల్ బ్యాంకుల నుంచి మరీ ఎక్కువగా ఆశించడం సరికాదని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. సెంట్రల్ బ్యాంకులు సైతం తమ అమ్ములపొదిలో ఇంకా ఆయుధాలున్నాయంటూ పేర్కొనడాన్ని ఆయన తప్పు బట్టారు. స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో జరిగిన సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల ప్యానల్ చర్చా కార్యక్రమంలో రాజన్ ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం విషయంలో సెంట్రల్ బ్యాంకులు నేర్చుకున్న అనుభవాలను పంచుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్ మాట్లాడుతూ... అభివృద్ధి చెందిన దేశాలు సంప్రదాయ విధానాలను విడిచిపెట్టి.. అదే సమయంలో వర్థమాన దేశాలు మాత్రం పరపతి విధానం, ఆర్థిక విధానాల విషయంలో సంప్రదాయంగానే కొనసాగాలని కోరుకోవడాన్ని తప్పుబట్టారు. ప్రస్తుతం అమలుచేస్తున్న విధానాలు ఫలితాలు ఇవ్వని పరిస్థితిలో అభివృద్ధి చెందిన దేశాలు పడిపోయాయని చెప్పుకొచ్చారు. ‘సంప్రదాయ సిద్ధాంతాలకు అనుగుణంగా నడవడం మంచిదే. కానీ ప్రస్తుతమున్న వాతావరణంలో ఇది అంతగా ఆచరణయోగ్యం కాదు. కనుక కొత్త పరిష్కారాలతో ముందుకు రావాలి. వాతావరణం ఎంతో మారింది కానీ, ఆర్థికపరమైన వాతావరణం కాదు’ అని అన్నారు.

లెనోవో 'వైబ్ కె 5' ఓపెన్ అమ్మకాలు నేటినుంచే

04/07/2016: చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లెనోవో త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ 'వైబ్ కె 5' ఓపెన్ అమ్మకాలను సోమవారం నుంచి ప్రారంభించింది. ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన ఈ స్మార్ట ఫోన్ ను తొలిసారి ఓపెన్ అమ్మకాల ద్వారా అందుబాటులోకి వచ్చింది. భారతదేశంలో ఆసక్తి వున్న వినియోగదారులు, ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి అవసరం లేకుండానే అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. రూ.6,999 ధ‌ర‌కు ఈ స్మార్ట్‌ఫోన్ ల‌భ్యం కానుంది. ఎల్టీఈ క్యాట్ 4 మద్దతుతో 150యంబీసీఎస్ డౌప్ లోడ్ వేగం, 50యంబీపీఎస్ అప్ లోడ్ వేగంతో పనిచేస్తుంది. ఇప్పటికే లక్ష మొబైళ్ల అమ్మకాలు చేపట్టినట్టు కంపెనీ ప్రకటించింది. ఇండియాలో తమకు వైబ్ కె5 మంచి ఆదరణ లభిస్తోందని లెనోవా ఇండియా తెలిపింది. లెనోవో వైబ్ కె5 ఫీచ‌ర్లు... 5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ 1.2 జీహెచ్‌జ‌డ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 415 ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌ 16 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 32 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 4జీ 13 మెగాపిక్సెల్, రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 2750 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 15 గంటల టాక్ టైమ్ 150 గ్రాముల బరువు

ఆగస్టు 1 నుంచి చిన్న నగరాలకూ విమానాలు! - 200-800 కిలోమీటర్లకేప్రాంతీయ విమానయానం - గంట ప్రయాణ ఛార్జీ రూ.2,500

02/07/2016: దేశంలోని చిన్న నగరాల ప్రజలకూ విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ‘విమానయాన ప్రాంతీయ అనుసంధాన ముసాయిదాను’ కేంద్ర పౌరవిమానయాన మంత్రి అశోక్‌గజపతి రాజు శుక్రవారం ఇక్కడి తన కార్యాలయంలో విడుదల చేశారు. దీనిపై 3 వారాల వరకు సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. తర్వాత నోటిఫై చేస్తారు. ఆగస్టు 1 నుంచి అమలు చేయాలన్నది ప్రభుత్వ యోచన.అన్నీ అనుకూలిస్తే అదేతేదీ నుంచి మరిన్ని చిన్న నగరాలకు విమానాలు ఎగిరే అవకాశం ఉంది. ఇప్పటివరకు విమానాలు నడవని, వారానికి కనీసం ఏడుకంటే తక్కువ విమానాలు నడిచే విమానాశ్రయాలను వినియోగంలోకి తేవాలన్నది ఈ విధాన లక్ష్యం. ఈ పథకం కింద ఇప్పటివరకు విమానాలు నడవని, సర్వీసులు తక్కువగా నడుస్తున్న విమానాశ్రయాల నుంచి 200-800 కిలోమీటర్ల పరిధిలోని నగరాలకు వెళ్లి, వచ్చే విమానాలకు సాయం (వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌) అందించాలన్నది ప్రతిపాదన. ఇక్కడకు నడిచే విమానాల్లో కనిష్ఠంగా 9, గరిష్ఠంగా 40 సీట్లను ఇలాంటి విమానాశ్రయాలకు కేటాయించాల్సి ఉంటుంది. గంట (సుమారు 500 కిలోమీటర్ల) ప్రయణానికి రూ.2,500 గరిష్ఠ ఛార్జీగా నిర్ణయిస్తారు. హెలీకాప్టర్‌లో అయితే 30 నిమిషాల ప్రయాణానికి రూ.2500 గరిష్ఠ ధరను నిర్ణయించారు. 200 కిలోమీటర్లకు తక్కువ, 800 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ఉన్న విమానాశ్రయాల మధ్య నడిచే సర్వీసులకు ఈ పథకం వర్తించదు. ఏటా రూ.500 కోట్లు కేటాయించే రీజినల్‌ కనెక్టివిటీ ఫండ్‌లో 80 శాతం వాటా కేంద్రప్రభుత్వానిది అయితే, 20 శాతం రాష్ట్రప్రభుత్వాలు భరించాలి. పదేళ్ల పాటు ఈ విధానాన్ని అమలు చేయాలని అనుకున్నా, తొలుత మూడేళ్లపాటు అమలు చేయాలని ప్రతిపాదించారు. ఇలాంటి విమానాశ్రయాల నుంచి నడిచే విమానాల్లో తొలి ఏడాదే 90% సీట్లు భర్తీ అయితే మాత్రం వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ను ఏటా కొంతమేర తగ్గిస్తూ వస్తారు. సర్వీసులు తక్కువగా నడుస్తున్న 16 విమానాశ్రయాలు, సర్వీసులే నడవని 394 విమానాశ్రయాలకు ఇది మేలు చేస్తుందని భావిస్తున్నారు. ఇటువంటి విమానాశ్రయాల్లో విక్రయించే విమాన ఇంధనం (ఏటీఎఫ్‌)పై 2 శాతం మాత్రమే ఎక్సైజ్‌ సుంకం వసూలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు 1% వ్యాట్‌ మాత్రమే వసూలుచేయాలని కేంద్రం నిబంధన విధించింది. ఈ సర్వీసుల కోసం విమానయాన సంస్థలకు రివర్స్‌ బిడ్డింగ్‌ నిర్వహిస్తారు. ఎవరు అతితక్కువ ధర కోట్‌ చేస్తే, వారికి ఆ మార్గం కేటాయిస్తారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లోని కడప, పుట్టపర్తి విమానాశ్రయాల నుంచి లేదా ఆ నగరాలకు సర్వీసులు నడిపినా కేంద్రం నుంచి సబ్సిడీలు లభిస్తాయి. వారానికి కనీసం 3 విమానాలు నిర్వహించాలి: ఈ పథకంలోకి వచ్చిన విమానయాన సంస్థలు వారానికి కనీసం 3 విమానాలు నడపాలి. సేవాపన్నును యేడాదిపాటు కేవలం 1 శాతమే ఉంటుంది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక, ఈ పన్ను విధానాన్ని సమీక్షిస్తారు. ఈ తరహా విమానాశ్రయాలకు భద్రత, అగ్నిమాపక సేవలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించాల్సి ఉంటుంది. ల్యాండింగ్‌, పార్కింగ్‌ ఛార్జీలు ఉండవు. రూట్‌ నావిగేషన్‌ ఛార్జీలపై కూడా రాయితీ కల్పించారు. గ్రౌండ్‌హ్యాండ్లింగ్‌ను విమానయాన సంస్థలే సొంతంగా నిర్వహించుకొనే వెసలుబాటు కల్పించారు. ఏ రాష్ట్రం ముందుకొచ్చినా సహకరిస్తాం రాష్ట్రం ముందుకొస్తే అక్కడ ఈ పథకాన్ని అమలు చేస్తామని అశోక్‌గజపతి రాజు వెల్లడించారు. ప్రస్తుతం విమానాశ్రయాలు నిరుపయోగంగా ఉన్న ప్రాంతాల్లో, ఎక్కడ ప్రయాణికుల నుంచి అధిక గిరాకీ ఉందనుకుంటే, అక్కడ సేవలు మొదలుపెట్టాలని చెప్పారు. ఎలాంటి ఖర్చుపెట్టకుండానే 30 విమానాశ్రయాల నుంచి ఇప్పటికప్పుడు విమానాలు నడపొచ్చని తెలిపారు. ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న 394 విమానాశ్రయాల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి బొబ్బిలి, దొనకొండ, ఏలూరు, పుట్టపర్తి ఉన్నాయి. తెలంగాణలో ఆదిలాబాద్‌, ఆలూరు, బసంత్‌నగర్‌, దుండిగల్‌, హకీంపేట్‌, సిర్పూర్‌, నాదర్‌గుల్‌, నాగార్జునసాగర్‌, నల్గొండ, వరంగల్‌ ఉన్నాయి. వీటిలో ఎన్నింటిని మనుగడలోకి తీసుకురావాలన్న అంశం రాష్ట్ర ప్రభుత్వాలు చూపే చొరవపై ఆధారపడి ఉంటుందని అశోక్‌గజపతి రాజు చెప్పారు. ఏ ప్రాంతంలో ప్రయాణికుల అవసరాలు అధికంగా ఉన్నాయో గమనించి, అక్కడి విమానాశ్రయాలను మనుగడలోకి తీసుకొచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుందని తెలిపారు. తిరుపతి నుంచి త్వరలో అంతర్జాతీయ సర్వీసులు తిరుపతి విమానాశ్రయం నుంచి త్వరలో అంతర్జాతీయ విమానాలు నడుపుతామని తెలిపారు. ఇప్పటికే కస్టమ్స్‌ విభాగం ఏర్పాటుకు అనుమతులు వచ్చాయని, కేంద్రహోంశాఖ కూడా మిగతా భద్రతా చర్యలకు ఆమోదముద్ర వేసిందన్నారు. సాధ్యమైనంత త్వరలో అంతర్జాతీయ కనెక్టింగ్‌ విమానాలు మొదలు పెడతామన్నారు. విదేశాలకు వెళ్లేంతమంది ప్రయాణికులుంటే, తిరుపతి నుంచే నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసులు మొదలుపెడతామన్నారు. పౌరవిమానయానశాఖ కార్యదర్శి ఆర్‌ఎన్‌చౌబే పాల్గొన్నారు.

సోనీ ఫ్యాన్స్ కు చేదు వార్త!

02/07/2016: భారత్ లో సోనీ మొబైల్ ఫ్యాన్స్ కు ఆ కంపెనీ చేదు వార్త వినిపించింది. ఇకపై భారత్, చైనా, అమెరికా మార్కెట్లపై తక్కువ దృష్టి సారించాలని ఇన్వెస్టర్ల సమావేశంలో ఆ కంపెనీ నిర్ణయించింది. ఈ దేశాల్లో సంతృప్తికరమైన రీతిలో అమ్మకాల వృద్ధి నమోదు చేయకపోవడంతో, ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. భారత్, చైనా, అమెరికాల్లో స్మార్ట్ ఫోన్ అమ్మకాల వృద్ధి కేవలం 0.3 శాతం మాత్రమే ఉంటుందని సోనీ అంచనావేస్తోంది. దీంతో ఈ ప్రాంతాల్లో సోని వ్యాపారాలపై "డీఫోకస్" చేయాలని నిర్ణయించినట్టు రిపోర్టు వెల్లడించాయి. దీంతో స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో ముందంజలో ఉన్న ఈ దేశాల్లో సోనీ స్మార్ట్ ఫోన్లను మాత్రం చేదు అనుభవమే ఎదురైనట్టు తెలుస్తోంది. చైనా, భారత్, అమెరికాలతో పాటు బ్రెజిల్ లో సైతం సోనీ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు క్షీణించాయి. సీఏజీఆర్(కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు) స్మార్ట్ ఫోన్ వృద్ధి ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఫోకస్ చేయాలని సోనీ టార్గెట్ గా పెట్టుకుంది. ఎక్కడైతే పుష్టికరమైన పరపతి ఉండి, లాభాలను మెరుగుపరుచుకోగలదో ఆ ప్రాంతాల్లో మాత్రమే సోనీ ఇక ఫోకస్ చేయనుంది. ఉత్పత్తుల బేధంతో వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని, అధిక ఆధారిత విలువ విభాగాల్లో ఎక్కువగా ఫోకస్ చేయాలని కంపెనీ భావిస్తున్నట్టు రిపోర్టుల్లో వెల్లడైంది. ఆసియా(జపాన్ తో కలిపి), యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఎక్కువగా దృష్టిపెట్టాలని నిర్ణయించినట్టు రిపోర్టులు వెల్లడించాయి. అదేవిధంగా లాటిన్ అమెరికా, ఇతర ఆసియా పసిఫిక్ దేశాల్లో నమోదయ్యే స్థిరమైన వృద్ధిని అలాగే కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సోనీ ముందటి ఫ్లాగ్ షిప్ ఎక్స్ పీరియా జడ్ సీరిస్ లను రిప్లేస్ చేస్తూ ఎక్స్ పీరియా ఎక్స్ సీరిస్ మొబైల్స్ ఈ ఏడాది మొదట్లో మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

లాభాల్లో పసిడి, కరెన్సీ, ఈక్విటీ మార్కెట్లు

01/07/2016: ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలతో భారత ఈక్విటీ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. చాలాకాలం తరువాత సెన్సెక్స్ 27 వేల పాయింట్లకు పైన, నిఫ్టీ 83 వేలకు పాయింట్లకు పైన స్థిరంగా నిలబడటం మదుపర్లకు ఉత్సాహాన్నిస్తోంది. 218 పాయింట్ల లాభంతో 27,217 దగ్గర సెన్సెక్స్ స్థిరంగా ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 8,345 దగ్గర ట్రేడవుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ కొనుగోళ్ల మద్దతు కనిపిస్తోంది. హెల్త్ కేర్, ఆటోమొబైల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సెక్టార్ లో బైయింగ్ ట్రెండ్ నెలకొంది. అలాగే గ్లోబల్ చమురు ధరలు మరింత పుంజుకున్నాయి. కాగా కరెన్సీ, బులియన్ మార్కెట్లు సాధారణంగా వ్యతిరేక దిశలో ఉంటాయి. కానీ ఈ మార్కెట్లు రెండూ పాజిటివ్ వుండడం విశేసం. ఇటీవల బాగా బలపడుతున్న రూపాయి విలువ కూడా మార్కెట్ కు సంపూర్ణ మద్దతినిస్తోంది. కరెన్సీ మార్కెట్లో డాలర్ తో పోలిస్తే రూపాయి 0.08 పైసల లాభంతో 67.44 దగ్గర రూపాయి విలువ ఉంది. బంగారం కూడా దాదాపు మూడువందల రూపాయలు లాభంతో 31 వేల రూపాయల దగ్గర స్థిరంగా ఉంది.

షియోమి అతిపెద్ద స్మార్ట్ ఫోన్ నేడే లాంచ్

30/06/2016: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల సంస్థ షియోమి తన కొత్త స్మార్ట్ ఫోన్ "మి మ్యాక్స్"ను నేడు భారత మార్కెట్లోకి విడుదలచేయనుంది. అదేవిధంగా ఎమ్ఐయూఐ 8 ను గ్లోబల్ గా లాంచ్ చేయనుంది. న్యూఢిల్లీ ఈవెంట్ గా ఈ ఫోన్లను కంపెనీ ఆవిష్కరించనుంది. షియోమి మి మ్యాక్స్ ను ఈ ఏడాది మేలోనే చైనాలో ఆవిష్కరించింది. 6.44 అంగుళాల ఫుల్ హెచ్ డీ 342పీపీఐ డిస్ ప్లే కల్గిన ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీ అన్ని ఫోన్లలో కల్లా అతి పెద్ద స్మార్ట్ ఫోన్. మొత్తం మెటల్ బాడీతో, డార్క్ గ్రే, గోల్డ్, సిల్వర్ రంగుల్లో మి మ్యాక్స్ ను భారత మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. మి మ్యాక్స్ ను మూడు వేరియంట్లలో చైనాలో ఆవిష్కరించారు. 1. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 1.8జీహెచ్ జడ్ హెక్సా కోర్ స్నాప్ డ్రాగన్ 650 ప్రాసెసర్.. ధర: దాదాపు రూ.15,000 3. జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 1.8 జీహెచ్ జడ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 652 ప్రాసెసర్ .. ధర: దాదాపు రూ.17,000 3. 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్... ధర: దాదాపు రూ.20,500 అయితే గతంలో మాదిరిగా కేవలం ఒక్క వేరియంట్ నే కంపెనీ భారత్ మార్కెట్లోకి తీసుకొస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. షియోమి మి మ్యాక్స్ ఫీచర్లు... 6.44 అంగుళాల డిస్ ప్లే హెక్సా కోర్ ప్రాసెసర్ 1080x1920 పిక్సెల్స్ రెసుల్యూషన్ ఆండ్రాయిడ్ 6.0.1 ఓఎస్ 3 జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ 16 మెగాపిక్సెల్ వెనుక కెమెరా 5 మెగా పిక్సెల్ ముందు కెమెరా 4850 ఎంఏహెచ్ డ్యూయల్ సిమ్, 4జీ ఎల్ టీఈ సపోర్టు 203 గ్రాముల బరువు

ఆఫ్రికా కంపెనీ చేతికి నియోటెల్‌! - విక్రయించనున్న టాటా కమ్యూనికేషన్స్‌ - విలువ రూ.2904 కోట్లు

29/06/2016: దిల్లీ: టాటా కమ్యూనికేషన్స్‌ తన ఆఫ్రికా అనుబంధ సంస్థ నియోటెల్‌ను విక్రయించనుంది. లిక్విడ్‌ టెలికాం అనే ఆఫ్రికా టెలికాం గ్రూప్‌ ఆ మేరకు నియోటెల్‌ను 6.55 బిలియన్‌ దక్షిణాఫ్రికా ర్యాండ్‌(దాదాపు రూ.2904 కోట్లు)లకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాటా కమ్యూనికేషన్స్‌ తెలిపింది. టాటా కమ్యూనికేషన్స్‌ 2009లో నియోటెల్‌లో 68.5 శాతం నియంత్రిత వాటాను కొనుగోలు చేసింది. ఎకోనెట్‌ వైర్‌లెస్‌ గ్లోబల్‌కు లిక్విడ్‌ టెలికాంలో మెజారిటీ వాటా ఉంది. కాగా, ‘నియోటెల్‌, టాటా కమ్యూనికేషన్స్‌ వాటాదార్లతో పాటు, నెక్సస్‌ కనెక్షన్‌ ఆధ్వర్యంలోని మైనారిటీ వాటాదార్లకు లిక్విడ్‌ టెలికాంకు 6.55 బిలియన్‌ దక్షిణాఫ్రికా రాండ్‌ (428 మిలియన్‌ డాలర్లు)లను చెల్లిస్తుంద’ని బీఎస్‌ఈకిచ్చిన సమాచారంలో టాటా కమ్యూనికేషన్స్‌ వెల్లడించింది. అయితే నియోటెల్‌లో టాటా కమ్యూనికేషన్స్‌కున్న వాటాకు లిక్విడ్‌ టెలికాం నుంచి 293 మిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.1992 కోట్లు) పొందనుంది. మరో పక్క, లిక్విడ్‌ టెలికాం ఈ కొనుగోలు కోసం రాయల్‌ బఫోకెంగ్‌ హోల్డింగ్స్‌ అనే దక్షిణాఫ్రికా సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ప్రకారం రాయల్‌ బఫోకెంగ్‌కు నియోటెల్‌లో 30 శాతం వాటా ఉంటుందని అందులో తెలిపింది. ఈ లావాదేవీకి అన్ని కార్పొరేట్‌, ఇతర నియంత్రణ సంస్థల అనుమతులు రావాల్సి ఉందని తెలిపింది. ఒప్పందం నిజరూపం దాలిస్తే ఆఫ్రికాలోనే అతిపెద్ద బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌, బీ2బీ టెలికాం ప్రొవైడర్‌ ఏర్పడినట్లు అవుతుంది. ఆఫ్రికా వ్యాప్తంగా ఉన్న లిక్విడ్‌ ఆఫ్రికాకు చెందిన 24,000 కి.మీ. నెట్‌వర్క్‌ను ఒకే దగ్గర నుంచి(సింగిల్‌ యాక్సెస్‌ పాయింట్‌ ద్వారా) వినియోగించుకోవడానికి వీలవుతుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా నుంచి కెన్యా దాకా 12 దేశాల్లో వ్యాపించి ఉన్న ఈ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాలని లిక్విడ్‌ టెలికాం భావిస్తోంది. నియోటెల్‌ తదుపరి అభివృద్ధికి లిక్విడ్‌ టెలికాం సరైన భాగస్వామి అని చెప్పవచ్చని టాటా కమ్యూనికేషన్స్‌ ఎండీ, సీఈఓ వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలోనే తన అనుబంధ సంస్థ నియోటెల్‌లో మెజారిటీ వాటాను దక్షిణాఫ్రికాకే చెందిన వొడాకామ్‌కు విక్రయించాలని టాటా కమ్యూనికేషన్స్‌ ప్రయత్నించింది. అయితే నియంత్రణ పరమైన సంక్లిష్టతలు, ఇతర కొన్ని కారణాల వల్ల అది ఫలించలేదు. ఆ సమయానికి ఒప్పందం విలువ రూ.3200 కోట్లుగా ఉండడం గమనార్హం.

మారుతి స్విఫ్ట్ 2017 ఇదే!

28/06/2016: బాలెనో, బ్రెజా మోడళ్లు భారత్ లో సక్సెస్ కావడంతో కొత్త తరహా స్విఫ్ట్ మోడల్ ను ప్రవేశపెట్టేందుకు మారుతీ సుజుకీ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. తాజాగా ఆన్ లైన్ లో మారుతీ సుజుకీ 2017 మోడల్ ఇదేనంటూ కొత్త డిజైన్, న్యూ లుక్ తో స్విఫ్ట్ దర్శనమిస్తోంది. కాగా, వచ్చే ఏడాది మారుతీ దీనిని విడుదల చేస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాలెనో లానే కొద్ది మార్పులతో స్విఫ్ట్ ను మార్కెట్ లో ప్రవేశపెట్టేందుకు కంపెనీ ప్లాన్ ను సిద్ధంచేసుకున్నట్లు సమాచారం. పాత మోడల్ లో కంటే కొత్త మోడల్ దాదాపు 100 కేజీల బరువు తగ్గనుంది. దీంతో మైలేజ్ కూడా గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. చూద్దాం.. 2017లో స్విఫ్ట్ ఎలా ఉండబోతోందో.

మాటతో పనిచేసే కెమేరా - లైఫ్‌ నుంచి ఎర్త్‌2 స్మార్ట్‌ఫోన్‌ - ధర రూ.20,999

28/06/2016: హైదరాబాద్‌: లైఫ్‌ బ్రాండ్‌పై స్మార్ట్‌ ఫోన్లను విక్రయిస్తున్న రిలయన్స్‌ రిటైల్‌ సంస్థ, ఈ శ్రేణిలో ఎర్త్‌2 పేరిట మరో అధునాతన 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ముంబయిలోని రిలయన్స్‌ డిజిటల్‌ విక్రయశాలలో ఆవిష్కరించింది. మాటతో కెమేరాను సెల్ఫీ, సాధారణ విభాగంలోకి మార్చవచ్చని, స్మైల్‌, సెల్ఫీ, కాప్చర్‌ అంటూ ఫొటోలు తీయగలగడం ఎర్త్‌2లోని ప్రత్యేకత అని రిలయన్స్‌ రిటైల్‌, పరికరాల విభాగాధ్యక్షుడు సునీల్‌ దత్‌ తెలిపారు. స్మార్ట్‌+ ప్రమాణాలతో కెమేరా, తెర, భద్రతా అంశాలు, సెన్స్‌ వంటివి ఫొటోలు, వీడియోల చిత్రీకరణ, చూడటంలో అనుభూతిని పెంచుతాయని వివరించారు. డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమేరాల్లో ఉండే ఫేస్‌ డిటెక్షన్‌ ఆటో ఫోకస్‌ సదుపాయం అమర్చిన 13 మెగాపిక్సెల్‌ కెమేరాలు ముందు-వెనుక ఉంటాయని, 0.1 సెకన్ల వ్యవధిలో ఫొటో తీయవచ్చని తెలిపారు. 5 అంగుళాల 2.5 డి గొరిల్లా గ్లాస్‌3 తెర, 3జీబీ ర్యామ్‌, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌, 32జీబీ అంతర్గత మెమొరీ, 2,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌తో హెచ్‌డీ వీడియో కాలింగ్‌ చేసుకునే వీలుంది. పిన్‌, రెటీనా, వేలిముద్ర ద్వారా తెరను అన్‌లాక్‌ చేసుకోవచ్చు. ఇతరులు చూడకుండా ఫొటోలు, వీడియోలను ఎన్‌క్రిప్ట్‌ చేసి, గ్యాలరీలో భద్రపరచుకునే వీలున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.20,999. దేశమంతటా ప్రసారం: ఈ ఖరీదైన ఫోన్‌ ఫీచర్లను వివరిస్తూ, బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా నటించిన టీవీ ప్రచార చిత్రాన్ని సిటీ డైరెక్టర్‌ పునీత్‌ మల్హోత్రా ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని 900 నగరాలలోని 20,000 మంది రిటైల్‌ వ్యాపారులు, పంపిణీదారులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించారు.

పౌండ్ విలువ మళ్లీ పతనం

27/06/2016: లండన్: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలంటూ బ్రెగ్జిట్ ఫలితాలు వెలువడ్డాక మొదలైన ఆ దేశ కరెన్సీ పౌండ్ విలువ పతనం ఇంకా కొనసాగుతోంది. బ్రెగ్జిట్ ఫలితాలు వెలువడ్డాక రికార్డు స్థాయిలో 31 ఏళ్ల కనిష్టానికి 10 శాతం పడిపోయిన పౌండ్ విలువ.. సోమవారం ఆసియా మార్కెట్లలో మరింత పతనమైంది. డాలర్లలో పౌండ్ మారకం విలువ 1.3365 వద్ద ట్రేడ్ అయ్యింది. అంటే ఒక పౌండుకు 1.34 డాలర్లు మాత్రమే వస్తాయన్న మాట. గత శుక్రవారంతో పోలిస్తే పౌండ్ విలువ 3 శాతం తగ్గినట్టు బీబీసీ వెల్లడించింది. ఇక యూరోతో పోలిస్తే 1.2147తో ట్రేడ్ అయ్యింది. ఆసియా ఆర్థిక మార్కెట్లలో స్థిరత్వం కోసం అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. జపాన్ ప్రధాని షింజో అబె శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించారు. కరెన్సీ మార్కెట్లు స్థిరంగా ఉండేందుకు అవసరమైనన్ని చర‍్యలు తీసుకుంటామని జపాన్ ఆర్థిక మంత్రి టరో అసో చెప్పారు. కాగా కొన్ని నెలల్లో పౌండ్ విలువ మరింత పతనమవుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

భయపడొద్దు - రాజన్

25/06/2016: న్యూఢిల్లీ: బ్రెగ్జిట్ నేపథ్యంలో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆర్‌బీఐ తగిన చర్యలు తీసుకుంటుందని గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. తొలుత ఇన్వెస్టర్లలో ఆందోళన ఉన్నా... భారత్ మూలాలు పటిష్ఠంగా ఉన్న దృష్ట్యా తిరిగి దేశానికి పెట్టుబడులు వస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇతర దేశాలతో పోటీపడేందుకు ఏ దేశమూ తమ కరెన్సీ విలువను తగ్గించకూడదని సూచించారు. ‘‘కీలక పరిస్థితుల్లో ఏ దేశమూ రక్షణాత్మక చర్యలు తీసుకోకూడదు. మేమైతే అంతర్జాతీయ, దేశీ మార్కెట్లన్నిటినీ పరిశీలిస్తున్నాం. లిక్విడిటీ సమస్య రాకుండా చూస్తాం’’ అని బాసెల్ నుంచి ఒక టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ రాజన్ చెప్పారు. ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్ నుంచి విదేశాలకు తరలిపోయే నిధులు తక్కువే ఉంటాయని పేర్కొన్నారు.

భగ్గుమన్న పసిడి

24/06/2016: ముంబై: విశ్లేషకుల అంచనా వేసినట్టుగానే 'బ్రెగ్జిట్' ప్రభావంతో ప్రపంచ మార్కెట్లన్నీ భారీగా పతమవుతున్నాయి. బ్రిటన్ ఈయూ నుంచి వైదొలగడానికి రెఫరెండం అనుకూలంగా ఉందన్న వార్తలతో దాదాపు గ్లోబల్ మార్కెట్లన్నీ కుదేలైనాయి. ఈ నేపథ్యంలో భారతీయ మార్కెట్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల పైగా కోల్పోగా, నిఫ్టీ ఎనిమిదివేలకు దిగువన ట్రేడ్ అవుతుంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగనుందన్న వార్తల ప్రభావంతో అటు వివిధ కరెన్సీ మార్కెట్లపై నెగెటివ్ గా ఉండగా ... బులియన్ మార్కెట్ ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నిన్న నష్టాల్లో ఊగిసలాడిన పుత్తడి ధరలు శుక్రవారం పరుగులు పెడుతూ దూసుకుపోతున్నాయి. ఒకప్పటి బూం తర్వాత మళ్లీ తొలిసారి 31 వేలను దాటి రాకెట్ లా నింగిలోకి దూసుకుపోతున్నాయి. ఆరుశాతానికి పైగా లాభపడి మూడేళ్ల గరిష్ట స్తాయికి చేరుకుంది. ఎంఎసీఎక్స్ మార్కెట్ లో పసిడి10 గ్రా. 31 రూ. లక పైన స్థిరంగా ఉంది. 1794 రూపాయలు లాభపడి 31,708 దగ్గర ట్రేడవుతూ మదుపర్లను మురిపిస్తోంది. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 89 పైసలు పడిపోయింది. డాలర్ తో రూపాయి విలువ 68.11గా ఉంది.

కుప్పకూలిన స్టాక్ మార్కెట్

24/06/2016: ముంబై: 'బ్రెగ్జిట్' ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ భారీగా పతనమవుతోంది. అన్ని సూచీలు నిలువునా కుప్పకూలాయి. ఈ ఉదయం మార్కెట్ ప్రీ-ఓపెన్ సెషన్ లో బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 634 పాయింట్లు పడిపోయింది. ఓపెన్ సెషన్ లో 940 పాయింట్ల వరకు పతనమైంది. తర్వాత 10.5 గంటల సమయంలో వెయ్యి పాయింట్లకు పైగా పతనమైంది. ప్రస్తుతం 1000-900 పాయింట్ల మధ్య ఊగిసలాడుతోంది. ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 280 పాయింట్లు పైగా నష్టపోయింది. నిఫ్టీ 8 వేల పాయింట్ల దిగువన ట్రేడ్ అవుతోంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగనుందన్న వార్తలతో స్టాక్ మార్కెట్ తీవ్రంగా స్పందించింది. 'బ్రెగ్జిట్' ప్రభావంతో స్టాక్ మార్కెట్ లో తీవ్ర ఒడిదుడుకులు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అన్ని సూచీలు నేల చూపులు చూస్తున్నాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 89 పైసలు పడిపోయింది. డాలర్ తో రూపాయి విలువ 68.17గా ఉంది. జపాన్ స్టాక్ మార్కెట్ కూడా 8 శాతం పతనమైంది. దీంతో 10 నిమిషాల పాటు జపాన్ స్టాక్ మార్కెట్ ను నిలిపివేశారు.

మార్కెట్లోకి హువాయ్‌ హానర్‌ 5సీ

23/06/2016: దిల్లీ: ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ హువాయ్‌ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లోకి విడుదలైంది. హానర్‌ 5సీ పేరుతో విడుదల చేసిన ఈ మోడల్‌ ధర రూ.10,999గా కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్‌ ఈ-కామర్స్‌ సైట్లు ఫ్లిప్‌కార్ట్‌, హెచ్‌ఐహానర్‌.కామ్‌ ద్వారా అందుబాటులో ఉంటాయి. మొదటి ఫ్లాష్‌ సేల్‌ జూన్‌ 30న ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఫోన్‌ కోసం బుధవారం నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఫోన్‌కు 15నెలల వారెంటీ, మొదటి నెలలో స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ వారెంటీ కూడా ఉంది. ఫోన్‌ ప్రత్యేకతలు * 5.2 అంగుళాల తెర * 1.7 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌ * 2 జీబీ ర్యామ్‌ * 16 జీబీ అంతర్గత మెమొరీ * 13 ఎంపీ వెనుక కెమెరా * 8 ఎంపీ ముందు కెమెరా * 4జీ సదుపాయం * ఆండ్రాయిడ్‌ 6.0 * 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

వరల్డ్స్ థినెస్ట్ ల్యాపీ ..రేటెంతో తెలుసా?

22/06/2016: ప్రపంచంలోని అత్యంత పలుచనైన ల్యాపీ భారత్ లోకి వచ్చేసింది. అమెరికాకు చెందిన ప్రముఖ పర్సనల్ కంప్యూటర్ల సంస్థ హెచ్ పీ అత్యంత పలుచైన ల్యాప్ టాప్ ను భారత్ లో ఆవిష్కరించింది. ఈ ల్యాపీ మందం 10.4 ఎంఎం. స్పెక్ట్రమ్ 13 పేరుతో ప్రవేశపెట్టిన ఈ ల్యాపీ ప్రారంభ ధర రూ.1,19,990 గా కంపెనీ నిర్ణయించింది. శనివారం నుంచి అమ్మకాలు చేపట్టనున్నట్టు ప్రకటించింది. 12 అంగుళాల మ్యాక్ బుక్, 13 అంగుళాల మ్యాక్ ఎయిర్ కంటే ఇది చాలా పలుచైనదని కంపెనీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ల్యాపీని ఏప్రిల్ లోనే హెచ్ పీ ఆవిష్కరించింది. కార్బన్ ఫైబర్, అల్యూమినియంతో రూపొందిన ఈ ల్యాపీ బరువు 1.11 కేజీ. మ్యాక్ బుక్ బరువు (0.92) కంటే కొంచెం ఎక్కువున్నా, మ్యాక్ బుక్ ఎయిర్ బరువు 1.35 కేజీ కంటే తక్కువేనని కంపెనీ చెప్పింది. ప్రీమియం రేంజ్ లో కొత్త లోగోతో స్పెక్ట్రమ్ 13 ల్యాపీని కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. స్పెక్ట్రమ్ 13 ల్యాపీ ఫీచర్లు... 13.3 అంగుళాల ఫుల్ హెచ్ డీ డ్ల్యూఎల్ఈడీ-బాక్లిట్ ఐపీఎస్ డిస్ ప్లే డ్యూయల్ స్పీకర్స్ 4 సెల్ 38 డబ్ల్యూహెచ్ఆర్ లి- అయాన్ బ్యాటరీ ఇంటెల్ కోర్ ఐ5/ఐ7 సీపీయూ 8 జీబీ ర్యామ్ 512జీబీ ఎస్ఎస్ డీ స్టోరేజ్ మూడు యూఎస్ బీ టైప్-సీ పోర్ట్స్

తగ్గిన పసిడి ధర

21/06/2016: దిల్లీ: డిమాండు లేమితో సోమవారం పసిడి ధర తగ్గింది. రూ.150 తగ్గడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29,650కి చేరింది. కీలక సమయాల్లో నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దీని ధర తగ్గిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1.4శాతం తగ్గి 1,280.47 యూఎస్‌ డాలర్లకు చేరింది. వెండి సైతం పసిడి దారిలోనే పయనించింది. రూ.160 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.41,200కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు చేయకపోవడంతో దీని ధర తగ్గిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు వెండి ధర 17.36 యూఎస్‌ డాలర్లుగా ఉంది.

‘హాల్ ఆఫ్ షేమ్’ బ్యాంకుల్లో ఎస్‌బీఐ - క్లస్టర్ బాంబుల తయారీ కంపెనీలకు రుణం

20/06/2016: న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ‘హాల్ ఆఫ్ షేమ్’ బ్యాంకుల జాబితాలోకి భారత్ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఎక్కింది. ఈ జాబితాలోకి ఎక్కిన ఏకైక భారత్ బ్యాంకు కేవలం ఎస్‌బీఐ కావడం గమనార్హం. క్లస్టర్ బాంబుల తయారీ కంపెనీలకు రుణాలను ఇచ్చినందుకుగానే ఈ ‘షేమ్’ జాబితాలో ఎస్‌బీఐ చేరింది. అంతర్జాతీయంగా క్లస్టర్ బాంబు తయారీ కంపెనీలకు బిలియన్ డాలర్ల రుణాలు ఇచ్చిన 158 బ్యాంకులు, ఆర్థిక సంస్థల పేర్లతో పీఏఎక్స్ అనే డచ్ గ్రూప్ ఒక నివేదిక రూపొందించింది. ఈ జాబితాలో జేపీ మోర్గాన్, బార్క్‌లేస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, క్రెడిట్ సూసీ వంటి సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ఏడు క్లస్టర్ బాంబుల తయారీ కంపెనీలకు 2012 జూన్-2016 ఏప్రిల్ మధ్య 28 బిలియన్ల అమెరికా డాలర్లను రుణంగా అందించాయి. స్థానిక చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానే తమ రుణ విధానం ఉంటుందని ఎస్‌బీఐ పేర్కొనగా, అంతర్జాతీయంగా నిషేధం ఉన్నప్పటికీ ఈ కంపెనీలకు రుణ మంజూరీలు జరిగినట్లు పీఏఎక్స్ 275 పేజీల నివేదికలో తెలిపింది. కాగా ఈ కంపెనీలకు రుణాలిచ్చిన దేశాల జాబితా(బ్యాంకులు)లో తొలుత అమెరికా(74) నిలిచింది. వరుసలో చైనా (29), దక్షిణ కొరియా (26) ఉన్నాయి. అమెరికాకు చెందిన ఆర్బిటర్ ఏటీకేకు ఎస్‌బీఐ రుణం ఇచ్చింది.

స్పైస్ జెట్ ట్యాక్సీ ఆఫర్..

20/06/2016: ముంబై : విమాన ప్రయాణికులు ఎయిర్ పోర్టుకు చేరుకోగానే ట్యాక్సీ కోసం వెతుకులాడుతుంటారు. అలా వెతికే అవసరం లేకుండా విమాన టిక్కెట్ కొనుగోలు చేసినప్పుడే, ట్యాక్సీ ని కూడా బుక్ చేసుకునే సదుపాయం కల్పించనుంది స్పైస్ జెట్. ఈ వినూత్నమైన ఆఫర్ ను విమాన ప్రయాణికుల ముందుకు స్పైస్ జెట్ త్వరలోనే ప్రవేశపెట్టబోతోంది. దీనికోసం క్యాబ్ అగ్రిగేటర్ "మై టాక్సీఇండియా (ఎంటీఐ)" తో ఒప్పందం కుదుర్చుకుంది. స్పైస్ జెట్ మొత్తం దేశంలో 41 గమ్యస్థానాలకు,300 డైలీ విమానాలను నడుపుతోంది. దానిలో ఆరు ఇంటర్నరేషనల్ విమానాలు ఉన్నాయి. టైర్ 2, టైర్ 3 సిటీల నుంచి కస్టమర్లను అధికంగా ఆకట్టుకోవడానికి, రెవెన్యూలను పెంచుకోవడానికి స్పైస్ జెట్ ఈ ఆఫర్ ను ప్రయాణికుల ముందుకు తీసుకురాబోతుంది. ఈ ఆఫర్ తో ప్రయాణికులు గమ్యస్థానానికి చేరుకోగానే ట్యాక్సీ అందుబాటులో ఉంటుంది. అప్పుడు వెతుకునే అవసరం లేకుండానే ప్రయాణికులు ప్రశాంతంగా గమ్యస్థానాలకు చేరిపోయే వీలుంటుంది. ట్యాక్సీ అవసరమైన వారు టిక్కెట్ కొనుగోలు సమయంలోనే ట్యాక్సీని బుక్ చేసుకోవచ్చని స్పైస్ జెట్ ప్రెసిడెంట్ అమిత్ శ్రీవాత్సవ్ తెలిపారు. ఈ ఆఫర్ ను త్వరలోనే ప్రవేశపెడతామన్నారు. టైర్ 2, టైర్ 3 సిటీల్లో మధ్యతరగతి వినియోగదారులను ఎక్కువగా ఆకట్టుకోవడానికి ఈ సర్వీసు ఉపయోగపడుతుందని శ్రీవాత్సవ్ పేర్కొన్నారు. ఎంటీఐ ట్యాక్సీ అగ్రిగేటర్ గా 2013నుంచి తన సేవలు అందిస్తోంది. 119 సిటీల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. 454 పైగా క్యాబ్ ఆపనేటర్లను ఈ సంస్థ కలిగి ఉంది.

హోలోగ్రామ్‌ ఫోన్లు!

18/06/2016: ప్రస్తుతం త్రీడీ సినిమాలు.. గేమ్స్‌కు ఉన్న క్రేజే వేరు. త్రీడీ టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్‌లు వస్తున్నాయి. త్రీడీ గేమ్‌ యాప్‌లు వస్తున్నాయి. ఇలా టెక్‌ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్న త్రీడీ టెక్నాలజీని సమీప భవిష్యత్తులో మర్చిపోవాల్సిందేనట. ఎందుకంటే..? త్రీడీకి మించిన హోలోగ్రామ్‌ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లోకి అడుగుపెట్టనున్నాయి. త్రీడీ వీడియోలు.. ఫొటోలు వీక్షించాలంటే ప్రత్యేకంగా కళ్లజోడు ధరించాలి. కానీ.. హోలోగ్రామ్‌ ఫోన్ల స్క్రీన్‌ నుంచి వెలువడే కాంతిని గాలిలోకి ప్రొజెక్ట్‌ చేస్తూ.. ఆ కాంతిపైనే 360 డిగ్రీల కోణంలో వీడియోలను చూడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అన్నట్లు.. ఇటీవల సూర్య నటించిన ‘24’ చిత్రం గుర్తిందిగా. అందులో శాస్త్రవేత్త శివకుమార్‌ ఓ సందర్భంలో తన ప్రాజెక్టును గాల్లో ప్రొజెక్ట్‌ చేస్తూ.. దాని చుట్టూ తిరుగుతూ వీక్షిస్తుంటాడు. అలాంటిదే హోలోగ్రామ్‌ టెక్నాలజీ అంటే. ఇప్పటికే ఆ సాంకేతికతతో పనిచేసే కొన్ని పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ.. దాన్ని చేతిలో ఇమిడిపోయే ఫోన్లలోకి తీసుకురావాలంటే మాత్రం కొన్నాళ్లు పట్టే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సాంకేతికత ప్రీ-రీసెర్చ్‌ దశలో ఉందని ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ జెడ్‌టీఈ మొబైల్స్‌ ప్రతినిధి వైమాన్‌ లామ్‌ తాజాగా వెల్లడించారు. హోలోగ్రామ్‌ టెక్నాలజీని మొబైళ్లలో అందుబాటులోకి తేవాలంటే.. ఫోన్‌ ఇమేజ్‌ ప్రాసెసింగ్‌ సామర్థ్యం.. అధిక స్క్రీన్‌ రిజల్యూషన్‌.. కాంతి విడుదల సామర్థ్యం ఉండాల్సి ఉంటుంది. ఈ సదుపాయాలన్నింటితోపాటు.. బ్యాటరీ టెక్నాలజీని కూడా మెరుగుపడాల్సి ఉంటుందని.. ప్రాసెసింగ్‌ వేగం సెకనుకు 150,000 మిలియన్‌ కంప్యుటేషన్స్‌ అవసరమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే.. ఈ ఫోన్లతో కాల్స్‌ చేసుకోవాలంటే 5జీ వేగం ఉన్న నెట్‌వర్క్‌ సామర్థ్యం కావాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ హోలోగ్రామ్‌ స్మార్ట్‌ఫోన్లకు వీడియో కాల్‌ చేస్తున్న వ్యక్తితో ఎదురెదురుగా నిలబడి మాట్లాడుతున్నట్లు అనుభూతి పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లోకి ఎప్పుడొస్తాయో చూడాలి.

స్మార్ట్ ఫోన్ ధరలు సగానికి దిగొస్తాయట?

17/06/2016: న్యూఢిల్లీ: ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలని ఆలోచిస్తున్నారా? అయితే కొంచెం ఆగండి. ఎందుకంటే.. త్వరలోనే స్మార్ట్ ఫోన్ ధరలు దాదాపు సగానికి పడిపోనున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. రాబోయే ఒక నెలలోనే కార్ల విలువ కంటే వేగంగా వీటి ధరలు పడిపోయే అవకాశం ఉందని చెబుతోంది. యూకే కు చెందిన మ్యూజిక్ మ్యాగ్ పై.కామ్ ఈ నివేదికను గురువారం వెల్లడి చేసింది. ఒక నెలలోనే స్మార్ట్ ఫోన్ ధరలు దిగి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. మార్కెట్లోకి విడుదలైన ఏడాదికి కార్ల విలువ 20 శాతం పడిపోతే... స్మార్ట్ ఫోన్ల విలువ కేవలం ఒక నెలలో 65 శాతం పడిపోయిందని రిపోర్ట్ చేసింది. మరోవైపు మిగతా యాండ్రాయిడ్ డివైస్ లతో పోలిస్తే.. ఐ ఫోన్ విలువ కొంచెం మెరుగ్గా ఉండొచ్చని పేర్కొంది. అత్యాధునిక సాంకేతికవిలువలతో కూడిన మంచి, వేగవంతమైన సుపీరియర్ మోడల్స్ అందుబాటులోకి రావడం ఈ పరిణామానికి దోహదపడిందని చెప్పింది. ఒక నిర్దిష్టమైన ఫోన్ మోడల్ కు సంబందించిన ప్రజాదరణపై కూడా ఇది ప్రభావితం చూపిస్తుందని, తత్ఫలితంగా దాని విలువ పడిపోవడం , డిమాండ్ తగ్గడం సంభవిస్తుందని ఈ నివేదిక నిర్ధారించింది.

30000 పైకి - ఒక్కరోజే రూ.580 పెరిగిన పసిడి

17/06/2016: దిల్లీ: పసిడి, వెండి ధరల పరుగు కొనసాగుతోంది. మేలిమి బంగారం 10 గ్రాములు రూ.30,000 అధిగమించగా, వెండి కిలో రూ.42,000కు చేరింది. అంతర్జాతీయ కారణాలు, దేశీయంగా ఆభరణాల విక్రేతల కొనుగోళ్లు ధరలు బాగా పెరిగేందుకు కారణమయ్యాయని చెబుతున్నారు. వరుసగా ఏడో రోజూ ధర పెరగడంతో, ఈ ఏడాదిలో ఇప్పటివరకు పసిడి ధర 23 శాతం ప్రతిఫలాన్ని ఇచ్చింది. * దేశ రాజధాని దిల్లీ బులియన్‌ విపణిలో గురువారం ఒక్క రోజే మేలిమి బంగారం (999 స్వచ్ఛత) 10 గ్రాముల ధర రూ.580 పెరిగి, రూ.30,250కి చేరింది. ఆభరణాల బంగారం (916 స్వచ్ఛత) సెవరు (8 గ్రాములు) రూ.200 పెరిగి, రూ.23,300కు చేరింది. ఇదేబాటలో వెండి కిలో ధర రూ.700 పెరిగి రూ.42,050కు చేరింది. ఇది 5 వారాల గరిష్ఠస్థాయి. * 10 గ్రాముల మేలిమి బంగారం ముంబయి బులియన్‌ విపణిలో రూ.30,400కు, వెండి కిలో రూ.670 పెరిగి రూ.42,340కు చేరాయి. * హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.30,000, వెండి కిలో రూ.41,500కు చేరాయి. కలిసొచ్చిన అమెరికా, ఐరోపా పరిణామాలు అమెరికాలో వడ్డీరేట్లు పెరిగితే, వివిధ దేశాల నుంచి పెట్టుబడులను అక్కడి వ్యాపార సంస్థలు వాపసు తీసుకోవడంతో పాటు, డాలర్‌కూ గిరాకీ అధికమవుతుందని అంచనా వేశారు. కానీ ఉద్యోగ నియామకాల్లో వృద్ధి లేనందున, వడ్డీరేట్ల పెంపు ఇప్పుడే లేదని మంగళ, బుధవారాల్లో నిర్వహించిన సమావేశానంతరం యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ జనెట్‌ యెలెన్‌ ప్రకటించడంతో, ఆ అంచనాలు ఫలించలేదు. దీనికి తోడు ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ తప్పుకునేందుకు (బ్రెగ్జిట్‌) ఆ దేశ ప్రజలు సుముఖంగా ఉన్నారనే వార్తలతో అనిశ్చితి నెలకొంది. వడ్డీరేట్ల పెంపును అమెరికా ఫెడ్‌ వాయిదా వేసేందుకు ఇదీ ఒక కారణమైంది. ఫలితంగా ఈక్విటీ మార్కెట్లు నష్టాల పాలవుతాయనే ఆందోళనతో స్టాక్స్‌ విక్రయించి, ఆ డబ్బులను విలువైన లోహాల (పసిడి, వెండి)పై పెట్టుబడులకు మళ్లించడంతో, వీటి ధరలు ప్రియమయ్యాయి. అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర గురువారం ఒకదశలో 1309.89 డాలర్లకు చేరింది. 2014 ఆగస్టు తరవాత ఈ స్థాయి ధర ఇప్పుడే వచ్చింది. అయితే రాత్రి 11.30 గంటల సమయానికి మళ్లీ 1285 డాలర్లకు దిగివచ్చింది. ఫ్యూచర్స్‌లో రూ.31,000 దాటినా, దిగివచ్చింది అంతర్జాతీయ పరిణామాల వల్ల పసిడి ధర మరింత పెరుగుతుందనే అంచనాలతో, నష్టభయాన్ని సైతం భరించే కొందరు పెట్టుబడిదారులు (స్పెక్యులేటర్లు) అధికంగా కొనుగోళ్లకు ఆర్డర్లు పెట్టడంతో, దేశీయ ఫ్యూచర్స్‌ విపణిలో పసిడి ధర మరింత అధికమై రూ.31,000 దాటేసింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో గురువారం ఉదయం రూ.30,500 వద్ద ఆరంభమైన ఆగస్టు కాంట్రాక్టు గరిష్ఠంగా రూ.31,245కు చేరినా, రాత్రి 11.30 గంటలకు మళ్లీ రూ.30,444కు దిగివచ్చింది. అక్టోబరు కాంట్రాక్టు గరిష్ఠ ధర రూ.31,506 కాగా, రాత్రికి రూ.30,676కు క్షీణించింది. డిసెంబరు కాంట్రాక్టు గరిష్ఠంగా రూ.31,680 పలికినా, చివరకు రూ.30,876 వద్ద ముగిసింది.

సెబీ సంచలన నిర్ణయం

16/06/2016: ముంబై: మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ 19 సంస్థలపై నిషేధాన్ని ధృవీకరిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. స్టాక్‌ ఎక్స్ఛేంజీల యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదించిన కేసులో ఈ నిర్ణయం తీసుకుంది. మనీలాండరింగ్‌,పన్నుఎగవేసిన కేసులో ఇంకా విచారణ కొనసాగుతున్నందున 19 సంస్థలు/వ్యక్తులపై నిషేధాన్ని ధ్రువీకరిస్తున్నట్లు సెబీ బుధవారం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. జూన్ 29, 2015 నాటి మధ్యంతర ఉత్తర్వులు తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు అమలులో ఉంటాయి సెబి ఒక ప్రకటనలో వెల్లడించింది. గత ఏడాది జారీ చేసిన తాత్కాలిక ఉత్తర్వుల్లో నాలుగు కంపెనీలు, ప్రస్తుత19 సంస్థలు సహా 235 ఇతర సంస్థల పై నిషేధం విధించింది. సెక్యూరిటీల మార్కెట్ నుంచి నగదు బదిలీ ద్వారా రూ 614 కోట్ల అక్రమ లాభాలు ఆర్జించినట్టు పేర్కొంది. ఎకో ఫ్రెండ్లీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్క్‌, ఎస్టీమ్‌ బయో ఆర్గానిక్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఛానెల్‌ నైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, హెచ్‌పీసీ బయోసైన్సెస్‌ కంపెనీ షేర్లలో అవకతవకలు జరిగాయని సెబీ ఆరోపణ. జనవరి 1, 2013 - డిసెంబరు 31, 2014 మధ్య ఈ షేర్ల ట్రేడింగ్‌ లో షేర్ల పరిమాణం భారీగా పెరిగింద. కృత్రిమ ప్రాధాన్యత కేటాయింపులు, ఫేర్ల ధర, పరిమాణాన్ని పెంచడం ద్వారా అక్రమ లాభాలను ఆర్జించి స్టాక్ మార్కెట్ ను దుర్వినియోగం చేసిన ఆరోపణలపై సెబీ ప్రాథమిక విచారణలో అక్రమాలు వెలుగు చూశాయి. మరోవైపు ఈ వ్యవహారంలో తదుపరి విచారణ కొనసాగుతుందని సెబీ అధికారి వెల్లడించారు. కాగా, గతేడాది జూన్‌లో వెలువరచిన తాత్కాలిక ఆదేశాలను సవరించడం లేదా వెనక్కి తీసుకోవడానికి ఎలాంటి కారణమూ కనిపించలేదని సెబీ పూర్తి స్థాయి సభ్యుడు రాజీవ్‌ కుమార్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. దీంతో సెబీ ఈ కంపెనీలపై నిషేధాన్ని ధ్రువీకరించింది. 19 సంస్థలు/వ్యక్తుల్లో మధుకర్‌ దూబే, సతేంద్ర కుమార్‌, కోర్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌, మేఫెయిర్‌ ఇన్ ఫో సొల్యూషన్స్, చేతన్‌ ప్రకాశ్‌, అసిఫా జమాల్‌, ప్రకాశ్‌ గుప్తా, అభిషేక్‌ గుప్తాలున్నారు.

ఎస్‌ఎంఎస్‌ వయా ఫేస్‌బుక్‌ మెసెంజర్‌!

15/06/2016: కాలిఫోర్నియా: ఫేస్‌బుక్‌కి చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌మెసెంజర్‌ ద్వారా ఇక ఏ ఫోన్‌కైనా టెక్ట్స్‌ ఎస్‌ఎంఎస్‌ పంపించుకోగలం. కొత్తగా వస్తోన్న అప్‌డేట్‌ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్‌ వినియోగదారులందరికీ ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. దీని ద్వారా ఆండ్రాయిడ్‌ యూజర్లు ఎవరైనా.. ఎవరికైనా మెసెంజర్‌ ద్వారా ఎస్‌ఎంఎస్‌ పంపించుకోవచ్చు. ఫేస్‌బుక్‌ మెసేజింగ్‌ ప్రొడక్ట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డేవిడ్‌ మార్కస్‌ సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 2013లోనూ ఒకసారి ఫేస్‌బుక్‌ సంస్థ ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే దీనికి పెద్దగా ఆదరణ లభించకపోవడంతో వెనక్కి తీసుకుంది. ఇప్పుడు దీనికి మరికొన్ని కొత్త హంగులద్ది మళ్లీ విడుదల చేస్తోంది. ఇలా పంపించుకునే ఎస్‌ఎంఎస్‌లో వీడియో క్లిప్‌లు, ఎమోజీలు, ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం(లొకేషన్‌) తదితరాల్ని ఎస్‌ఎంఎస్‌ ద్వారా పంపించుకునే వీలు కల్పిస్తోంది. ఈ విషయమై డేవిడ్‌ మార్కస్‌ మాట్లాడారు. ‘చాలా ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌లు.. తొలినాళ్లలో ఉన్న ఎస్‌ఎంఎస్‌లు, తర్వాత వాటి పరిణామ క్రమంలో వచ్చిన మార్పుల్ని వాడుకలో ఉంచడం లేదు. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది సరైన నిర్ణయమని భావిస్తున్నాం’ అని తెలిపారు.

వాచ్‌ ఓఎస్‌ 3.0

15/06/2016: ఫిట్‌నెస్‌పై చాలామందికి శ్రద్ధ పెరిగింది. వ్యాయామాలు చేస్తూ ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి వాళ్ల కోసం రోజువారిగా మనం చేసే పనులకు ఎన్ని కెలొరీలు ఖర్చు అయ్యాయో చెప్పే ఫిట్‌నెస్‌ ట్రాకర్లు ఎన్నో వచ్చాయి. అవన్నీ మామూలుగా పరుగెత్తే వాళ్ల కోసం. మరి కాళ్లు లేని.. వీల్‌ఛైర్‌కి పరిమితమైన వారి మాటేంటి? అలాంటి వారికోసమే యాపిల్‌ వాచ్‌ ఓఎస్‌ 3.0ని తీసుకొస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన యాపిల్‌ వాచ్‌.. ఫిట్‌నెస్‌ ట్రాకర్లు మామూలుగా ఉన్న వ్యక్తులు నడవడం లేదా పరిగెత్తడం వల్ల ఎన్ని కేలరీల శక్తి ఉపయోగించుకున్నారో లెక్కవేసి చెప్పేవి. అయితే ఇవి వీల్‌ఛైర్‌లో ఉండే వాళ్ల రిపోర్టు తయారు చేసేది కాదు. దీంతో పలువురు ఇచ్చిన వినతుల మేరకు ఈ కొత్త అప్‌డేట్‌ని తీసుకొస్తున్నట్లు యాపిల్‌ సంస్థ వెల్లడించింది. ఈ యాపిల్‌ వాచ్‌ఓఎస్‌ 3.0 వీల్‌ఛైర్‌లో ఎంత వేగంతో.. ఎంత దూరం ప్రయాణించాం. దానికోసం ఎన్ని కెలోరీల శక్తి ఖర్చయిందో లెక్క వేస్తుందట. అంతేకాకుండా ఇందులో ‘ఎస్‌ఓఎస్‌’ అనే ఫీచర్‌ని కూడా ఇవ్వబోతుందట. దీంతో అత్యవసర సమయంలో ఆటోమెటిక్‌గా కాల్‌ వెళ్లిపోతుంది. ఈ వాచీ ఓఎస్‌ని ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేయనున్నట్లు యాపిల్‌ తెలిపింది.

అసుస్‌ నుంచి సరికొత్త నోట్‌బుక్‌లు

15/06/2016: దిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ అసుస్‌ రెండు సరికొత్త నోట్‌బుక్‌లను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. మెయిన్‌స్ట్రీమ్‌ సిరీస్‌లో ఏ540, ఆర్‌558యూఆర్‌ పేరుతో ల్యాప్‌టాప్‌లను ఆవిష్కరించింది. అసుస్‌ ఏ540 ధర రూ. 20,990, ఆర్‌558 ధర రూ. 43,990గా నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న మెయిన్‌స్ట్రీమ్‌ ల్యాప్‌టాప్‌లకు అప్‌డేటెడ్‌ వెర్షన్లలో వీటిని రూపొందించారు. రెండింటిలోనూ యూఎస్‌బీ టైప్‌ సీ కనెక్టివిటీ ఉంది. ఆర్‌558 మోడల్‌లో ఆల్ట్రాఫాస్ట్‌ మెమోరీ, గ్రాఫిక్స్‌ తదితర ఫీచర్లున్నాయి. ఏ540 నోట్‌బుక్‌ బరువు 2కేజీల కన్నా తక్కువగా ఉంటుంది. ఇంటర్నల్‌ ఆప్టికల్‌ డ్రైవ్‌ ఫీచర్‌తో దీన్ని తీసుకొచ్చారు. అయితే నోట్‌బుక్‌ల పూర్తి ఫీచర్ల, అందుబాటు తేదీలను అసుస్‌ ఇంకా వెల్లడించలేదు.

జిగేల్‌ మనిపించే ‘డీల్స్‌’

14/06/2016: ఇటీవల ప్రపంచాన్ని నివ్వెరపర్చే డీల్స్‌ మానవ మేథస్సు, సృజనాత్మకత విలువను చెబుతున్నాయి. అత్యధికంగా ఒకరిద్దరి ఆలోచనలతో రూపుదిద్దుకున్న కంపెనీలు బిలియన్‌డాలర్లు పలుకుతున్నాయి. ఒక్క ఆలోచన జీవితాన్ని మార్చేస్తుందనడానికి ఇదే నిలువెత్తు ఉదాహరణ. సోషల్‌ మీడియా దిగ్గజాలైన గూగుల్‌.. ‘యూట్యూబ్‌’ను, ఫేస్‌బుక్‌.. వాట్సాప్‌ను కొనుగోలు చేయడమే అందుకు నిదర్శనం. తాజాగా మైక్రోసాఫ్ట్‌.. ‘లింక్డ్‌ఇన్‌’ను 22.6 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ. 1,70,000కోట్ల)కు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించి కార్పొరేట్‌ ప్రపంచాన్ని విస్మయపరిచింది. అలాంటి కోవలోనే ఇటీవల జరిగిన కొన్ని డీల్స్‌ను పరిశీలిద్దాం.. యూట్యూబ్‌ను కొనుగోలు చేసిన గూగుల్‌ ‘యూట్యూబ్‌’ గ్లోబల్‌ వీడియో షేరింగ్‌ వెబ్‌సైట్‌. ప్రస్తుత కాలంలో ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. పేపాల్‌లో పనిచేసిన ముగ్గురు వ్యక్తులు 14 ఫిబ్రవరి 2005లో ‘యూట్యూబ్‌’ను ప్రారంభించారు. ప్రారంభించిన ఏడాదిలోనే ‘యూట్యూబ్‌’కు వస్తున్న స్పందనను, వీడియో షేరింగ్‌ భవిష్యత్‌ను పసిగట్టిన గూగుల్‌.. 2006 నవంబర్‌లో 1.65 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసి అప్పట్లో కార్పొరేట్‌ ప్రపంచాన్ని నివ్వేరపరిచింది. వాట్సాప్‌ను కొనుగోలు చేసిన ఫేస్‌బుక్‌ వాట్సాప్‌ ప్రముఖ మొబైల్‌ మెసేంజర్‌ యాప్‌. యాహూలో పనిచేసిన బ్రియాన్‌ యాక్టన్‌.. ఉక్రెయిన్‌కు చెందిన జాన్‌ కౌమ్‌ ఇద్దరు వ్యక్తులు 2009లో ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే ప్రపంచవాప్తంగా వాట్సాప్‌కు ఆదరణ పెరిగిపోయింది. ప్రారంభించిన నాలుగేళ్లలోనే వాట్సాప్‌ యాక్టివ్‌ యూజర్స్‌ 400 మిలియన్లకు చేరుకున్నారు. దీంతో.. 19 ఫిబ్రవరి 2014న దాదాపు లక్షా 18 వేల 200 కోట్ల(19 బిలియన్‌ డాలర్లు) రూపాయలతో వాట్సాప్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే.. ఇందులో కొంత నగదు రూపంలో మరికొంత ఫేస్‌బుక్‌ స్టాక్‌ రూపంలో జరిగింది. ఇది అప్పట్లో అంతర్జాతీయ ఇంటర్నెట్‌ చరిత్రలోనే బిగ్‌ డీల్‌గా రికార్డు సృష్టించింది. ఒకప్పుడు ఫేస్‌బుక్‌లో ఉద్యోగం కోసం.. ప్రయత్నించిన బ్రియాన్‌.. జాన్‌ కౌమ్‌లు తయారుచేసిన వాట్సాప్‌ను భారీ మొత్తం వెచ్చించి ఫేస్‌బుక్‌ కొనుగోలు చేయడం విశేషం. కంపాక్‌ను కొనుగోలు చేసిన హెచ్‌పీ 1982లో ప్రారంభమైన కంపాక్‌ కంప్యూటర్‌ కార్పొరేషన్‌.. కొద్ది రోజుల్లోనే ప్రపంచంలోనే అత్యధికంగా పీసీలను సప్లై చేసే స్థాయికి చేరుకుంది. ఒకానొక దశలో హెచ్‌పీని అధిగమించింది. అయితే.. 2002లో‘హెచ్‌పీ’ పీసీల విక్రయాలను పెంచుకునేందుకు కాంపాక్‌ను విలీనం చేసుకుంది. అందుకోసం.. 25 బిలియన్‌ డాలర్లు వెచ్చించింది. ఆటోనమీని కొనుగోలు చేసిన హెచ్‌పీ యూకేకు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ అటోనమీని 1996లో ప్రారంభించారు. కొద్దిరోజుల్లోనే యూకేలో అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ సంస్థగా అవతరించింది. 2011లో హెచ్‌పీ.. అటోనమీని 11.7 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. ఇవేకాక.. కంప్యూటర్‌లు.. కంప్యూటర్‌ పరికరాలను.. సాఫ్ట్‌వేర్‌ను అమ్మే సన్‌ మైక్రోసిస్టమ్స్‌ను ఒరాకిల్‌ 2010లో 7.4 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. మోటోరోలా మొబిలిటీని గూగుల్‌ 2011లో దాదాపు 12.5 బిలియన్‌ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే.. గూగుల్‌ నుంచి మొబైల్‌ హ్యాండ్‌సెట్లకు సంబంధించిన రైట్స్‌ను లెనోవాకు 2.91 బిలియన్‌ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. స్కైప్‌.. నోకియాను కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్‌ వీడియో ఛాటింగ్‌.. వాయిస్‌ కాల్స్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన స్కైప్‌ను 8.5 బిలియన్‌ డాలర్లు వెచ్చించి సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కొనుగోలు చేసింది. అంతేకాదు.. మొబైల్స్‌ రంగంలో చరిత్ర సృష్టించిన నోకియాను 7.5 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసి ఆశ్చర్యపరిచింది. గతంలో కూడా మైక్రోసాఫ్ట్‌ ఫేస్‌బుక్‌లో.. యమ్మీర్‌ అనే సంస్థలోనూ పెట్టుబడులు పెట్టింది. తాజాగా.. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ దిగ్గజం లింక్డ్‌ఇన్‌ను 26.2 బిలియన్‌ డాలర్ల (రూ. 1,70,000 కోట్లు)కు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొనుగోలు వ్యవహారం పూర్తిగా నగదు రూపంలో జరగనున్నట్లు చెప్పి విస్మయపరిచింది. ఈ కొనుగోలు సోషల్‌ నెట్‌వర్కింగ్‌లో మైక్రోసాఫ్ట్‌ పాత్రను పెంచుతుందనడంలో మాత్రం సందేహం లేదు.

ముంచుకొస్తున్న డెడ్‌లైన్లు ....

13/06/2016: మీరు విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టం వాడుతున్నారా..? కంప్యూటర్‌ను విండోస్‌ 10కు ఇంకా అప్‌గ్రేడ్‌ చేసుకోలేదా..? అయితే మీ ముందు మైక్రోసాఫ్ట్‌ ఓ డెడ్‌లైన్‌ పెట్టింది. ఫేస్‌బుక్‌ ఖాతాదారులైతే.. మరో డెడ్‌లైన్‌ మీ ముందు ఉన్నట్లే. యాహూ పాత వెర్షన్‌ మెసెంజర్‌ వాడుతుంటే.. ఆగస్టు 5లోగా దానికి గుడ్‌బై చెప్పేసి కొత్త యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందే! ప్రస్తుతం ఈ మూడు ప్రముఖ సంస్థలు టెక్‌ప్రియుల ముందు డెడ్‌లైన్లు పెట్టాయి. అసలా గడువులెందుకు? వాటిని పట్టించుకోకుంటే నష్టమేంటి..? ఇప్పుడైతే ఉచితం.. లేదంటే పైకం పడుద్ది అత్యాధునిక ఫీచర్లతో గతేడాది జూలై 29న విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టం మార్కెట్‌లోకి వచ్చింది. అప్పటి నుంచి విండోస్‌ 7, విండోస్‌ 8.1 వినియోగదారులు విండోస్‌ 10కు ఉచితంగా అప్‌గ్రేడ్‌ చేసేకునే సదుపాయాన్ని మైక్రోసాఫ్ట్‌ కల్పిస్తోంది. ఆ ఆఫర్‌ తొలి ఏడాది వరకే వర్తిస్తుంది. అంటే.. వచ్చే నెల 29 నాటికి ఆ గడువు ముగుస్తుంది. దీంతో ‘‘జూలై 29లోగా మీ ఓఎస్‌ను ఉచితంగా అప్‌గ్రేడ్‌ చేసుకోండి. ఆ తర్వాత అప్‌డేట్‌ చేసుకోవాలనుకుంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది’’ అంటూ విండోస్‌ వినియోగదారులకు కొద్ది రోజులుగా మైక్రోసాఫ్ట్‌ అలర్ట్‌లు పంపుతోంది. ఫేస్‌బుక్‌ ఖాతాదారులకు ఓ డెడ్‌లైన్‌ ‘‘ఛాటింగ్‌ కోసం తమ మెసెంజర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి’’ అంటూ ఇంతకుముందు ఫేస్‌బుక్‌ తన వినియోగదారులను కోరింది. తాజాగా మరో డెడ్‌లైన్‌ పెట్టింది. ‘‘అటోసింక్‌ ఫీచర్‌ ద్వారా ఫోన్‌ నుంచి ఫేస్‌బుక్‌ ఖాతాలోకి అప్‌లోడ్‌ అయిన ఫొటోలను అన్నింటినీ కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకోండి. లేదంటే ఆ ఫొటోల కోసం జూలై 7లోగా ‘మూమెంట్స్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందే. ఆ గడువు దాటితే ఫొటోలన్నీ(అటోసింక్‌ ద్వారా అప్‌లోడ్‌ అయినవి) పూర్తిగా డిలీట్‌ చేసేస్తాం’’ అంటూ ఫేస్‌బుక్‌ తమ ఖాతాదారులకు నోటిఫికేషన్లు.. ఈమెయిళ్లు పంపుతోంది. దీనిపై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. తమకు తెలియకుండానే అటోసింక్‌ ద్వారా వేల ఫొటోలు ఫేస్‌బుక్‌లోకి అప్‌లోడ్‌ అయ్యాయంటూ ట్విట్టర్‌లో గగ్గోలు పెడుతున్నారు. పాత మెసెంజర్‌కు ఆగస్టు 5లోగా గుడ్‌బై చెప్పండి 1998లో వచ్చిన యాహూ మెసెంజర్‌కు ఆ సంస్థ ఆగస్టు 5న గుడ్‌బై చెప్పనుంది. గతేడాది డిసెంబర్‌లో సరికొత్త ఫీచర్లతో విడుదల చేసిన కొత్త యాప్‌కు వినియోగదారులంతా మారాలని యాహూ కోరుతోంది. ఆగస్టు 5 తర్వాత పాత మెసెంజర్‌లోకి లాగిన్‌ అయ్యేందుకు.. ఛాటింగ్‌ చేసేందుకు వీలుండదని డెడ్‌లైన్‌ విధించింది. మెసేజింగ్‌.. మెయిలింగ్‌.. న్యూస్‌.. సెర్చ్‌ తదితర విభాగాల్లో మెరుగైన సదుపాయాలను కొత్త యాప్‌లో అందిస్తున్నామని తెలిపింది.

భారత్‌ సూపర్‌ పవర్‌గా ఎదుగుతోంది - రాజ్‌నాథ్‌ సింగ్‌

11/06/2016: లఖ్‌నవూ : రాబోయే కాలంలో మన దేశం సూపర్‌ పవర్‌గా ఎదుగుతుందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. చెర్బాగ్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరాల్లో చైనా, అమెరికాలతో పోల్చుకుంటే భారత్‌కే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయన్నారు. గతంలో అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక వ్యవస్థ 8.4శాతం వృద్ధి రేటును సాధించిందని చెప్పారు. ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వం హయాంలో జీడీపీ, వృద్ధి రేట్లు బాగా పడిపోయిన విషయాన్ని రాజ్‌నాథ్‌ సింగ్‌ గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ రెండేళ్లలో ఆర్థిక వ్యవస్థ పుంజుకుందని వృద్ధి రేటు 7.6శాతానికి చేరుకుందని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థకు రైల్వే చాలా ముఖ్యమైన రంగమని దాన్ని తీర్చిదిద్దడానికి లక్షల కోట్లు పెట్టుబడి పెట్టామన్నారు. ఆ అభివృద్ధి ఫలాలు అందితే.. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రయాణికులకు ఉన్న సౌకర్యాలన్నీ ఇక్కడి ప్రజలకు ఉంటాయని చెప్పారు.

లావా నుంచి ఎక్స్‌ 81 స్మార్ట్‌ఫోన్‌

10/06/2016: ఇంటర్నెట్‌డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తుల సంస్థ లావా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్‌ సిరీస్‌లో లావా ఎక్స్‌81 పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.11,499గా కంపెనీ వెల్లడించింది. ఈనెల 13 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ వినియోగదారులకు లభ్యం కానుంది. లావా గోల్డ్‌ కలర్‌ వేరియంట్‌ ఎక్స్‌81ను వచ్చే నెలలో విడుదల చేయనుంది. ఫోన్‌ ఫీచర్లు.. * 5 అంగుళాల తాకే తెర * ఆండ్రాయిడ్‌ 6.0 మార్షల్లో సిస్టమ్‌ * 1.3 గిగాహెడ్జ్‌ క్వాడ్‌కోర్‌ ప్రొసెసర్‌ * 3జీబీ ర్యామ్‌ * 13 మెగాపిక్సల్‌ రేర్‌ కెమెరా * 5 మెగాపిక్సల్‌ ముందు కెమెరా * 16 జీబీ అంతర్గత మెమొరీ * మెమరీ కార్డు ద్వారా 64జీబీ వరకు పెంచుకునే సదుపాయం * 2700ఎంఏహెడ్‌ బ్యాటరీ సదుపాయం * 4జీ సదుపాయం

పక్కా వ్యూహంతోనే పావులు కదుపుతున్న అమెజాన్‌ - స్నాప్‌డీల్‌, ఫ్లిప్‌కార్ట్‌లతో హోరాహోరీ

10/06/2016: దేశీయ ఇ కామర్స్‌ రంగంపై పట్టుబిగించేందుకు అమెరికా ఇ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వ్యూహాత్మకంగా భారీ పెట్టుబడులను ప్రకటించింది. చైనాలో ఇ కామర్స్‌ విపణిపై అక్కడి ఆలీబాబా గ్రూప్‌ పట్టు సాధించడంతో, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌పై అమెజాన్‌ దృష్టి కేంద్రీకరించింది. దేశీయ రిటైల్‌ విపణి 600 బిలియన్‌ డాలర్లు (రూ.39.60 లక్షల కోట్లు)తో పోలిస్తే, ఆన్‌లైన్‌ రిటైలింగ్‌ (ఇటైలింగ్‌) పరిణామం రూ.30,000 కోట్లు చాలా తక్కువే అయినా, శరవేగంగా వృద్ధి చెందుతోంది. ఇటైలింగ్‌లో కీలకపాత్ర యువతదే కనుక, వారిని ఆకర్షించే ఉత్పత్తులపై రాయితీలు ఇస్తూ, ఇ కామర్స్‌ పోర్టళ్లు ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా అమ్మకాల పరిమాణం పెరిగినా, ఈ సంస్థలకు భారీ నష్టాలు తప్పడం లేదు. 2014-15లో అధిక రాయితీలు ప్రకటించడంతో ఫ్లిప్‌కార్ట్‌కు రూ.2,000 కోట్లు, అమెజాన్‌ ఇండియాకు రూ.1764 కోట్లు, స్నాప్‌డీల్‌కు రూ.1328 కోట్ల మేర నష్టాలు వచ్చాయని అంచనా. అయితే పెట్టుబడిదార్లు సమకూర్చే నిధులతో ఈ సంస్థలు నెగ్గుకు వస్తున్నాయి. ఇవీ గణాంకాలు దేశీయ పోర్టళ్లు ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌కు తాజా నిధులు కష్టమైన తరుణంలో అమెరికా దిగ్గజం తమ భారత అనుబంధ అమెజాన్‌ డాట్‌ ఇన్‌లోకి భారీ పెట్టుబడులను గుమ్మరించేందుకు సిద్ధమైంది. 2013లోనే అమెజాన్‌ డాట్‌ ఇన్‌ ఆరంభమైన సంగతి విదితమే. 2007 నుంచీ విక్రయాలు సాగిస్తున్న దేశీయ దిగ్గజ సంస్థ అయిన ఫ్లిప్‌కార్ట్‌, 2010 నుంచీ అమ్మకాలు సాగిస్తున్న స్నాప్‌డీల్‌తో ఢీ అంటే ఢీ అనే స్థాయికి మూడేళ్ల వ్యవధిలోనే చేరింది. మార్కెట్‌ వాటా ఫ్లిప్‌కార్ట్‌కు అధికంగా ఉన్నా, అమెజాన్‌ కూడా దూసుకుపోతోంది. * ఏప్రిల్‌లో స్నాప్‌డీల్‌ 3.50 కోట్ల ఉత్పత్తులను విక్రయిస్తే, ఫ్లిప్‌కార్ట్‌ 4 కోట్లు అమ్మింది. అమెజాన్‌ కూడా 3.50 ఉత్పత్తులను సరఫరా చేసిందని అంచనా. * ఫ్లిప్‌కార్ట్‌ వినియోగదారులు, ఆ పోర్టల్‌లోని ఉత్పత్తులు చూసేందుకు- కొనుగోలు చేసేందుకు ఒక వారంలో సగటున 18 నిమిషాల సమయాన్ని వెచ్చిస్తుంటే, అమెజాన్‌లో ఆ సగటు 16.9 నిమిషాలకు చేరిందని చెబుతున్నారు. దేశీయ సంస్థలకు ‘విలువ’ తగ్గుతున్న నేపథ్యంలో.. వినియోగదారుల సంఖ్య, సరకు సరఫరా చేసేందుకు నమోదైన వ్యాపారులతో పాటు అమ్మకాల పరిమాణం, పోర్టల్‌ (బ్రాండ్‌)పై కొనుగోలుదార్లకు ఉండే విశ్వాసానికి అనుగుణంగా ఇ కామర్స్‌ సంస్థల విలువను అంచనా వేస్తున్నారు. దీని ఆధారంగా, వాటా ఇవ్వడం లేదా కొంతకాలం తరవాత ప్రతిఫలం పొందే హామీపై పెట్టుబడిదార్ల నుంచి నిధులను సమీకరించగలుగుతున్నాయి. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఫ్లిప్‌కార్ట్‌నే తీసుకుంటే, దీని విలువ (వాల్యుయేషన్‌)ను పెట్టుబడిదార్లు గతంలో కంటే తగ్గిస్తున్నందున, ఆశించిన విధంగా నిధులు సమకూర్చుకోవడం సంస్థకు కష్టంగా మారింది. ఫ్లిప్‌కార్ట్‌ తన విలువను 15 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.లక్ష కోట్లు)గా చెబుతుంటే, ఆ విలువ ప్రకారం పెట్టుబడులు పెట్టేందుకు కనీసం 15 మంది పెట్టుబడిదారులు నిరాకరించారనే వార్తలు వస్తున్నాయి. స్నాప్‌డీల్‌ 5 బిలియన్‌ డాలర్లు (రూ.33,000 కోట్లు)కు కూడా ఇదే పరిస్థితి ఎదురైందనీ చెబుతున్నారు. ఫలితంగా ఉద్యోగుల తొలగింపు, కొత్తగా ఉద్యోగ ఆఫర్లు ఇచ్చి, నియామకాలు ఆలస్యం చేయడం, వేతన మొత్తాలు తగ్గించడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. * కార్యకలాపాల కోసం ఇప్పటివరకు ఫ్లిప్‌కార్ట్‌ 3.2 బిలియన్‌ డాలర్లు (రూ.21,100 కోట్లు), స్నాప్‌డీల్‌ 1.7 బిలియన్‌ డాలర్లు (రూ.11,200 కోట్లు) సమీకరించాయని అంచనా. ఇప్పటివరకు అమెజాన్‌ 2 బి.డాలర్లు పెట్టుబడి పెట్టగా, మరో 3 బి.డాలర్లు (మొత్తం రూ.33,000 కోట్లు) పెడుతోంది. అంటే ఇరు సంస్థల కంటే కూడా అధిక మొత్తం అవుతుంది. అమెజాన్‌కూ నష్టాలు అమెరికాతో పాటు బ్రిటన్‌, జపాన్‌, జర్మనీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, చైనా, భారత్‌లలో అమెజాన్‌ వ్యాపారం నిర్వహిస్తోంది. విదేశాల్లో 2015లో 7.4 బిలియన్‌ డాలర్ల వ్యాపారంపై సంస్థకు 91 మిలియన్‌ డాలర్ల (రూ.600 కోట్లు) నష్టం వచ్చింది. ఏ దేశంలో లాభం/నష్టం వచ్చిందో వెల్లడించలేదు. ఈ నిధులతో ఏం చేస్తుంది? మనదేశ నిబంధనల ప్రకారం అమెజాన్‌ నేరుగా ఉత్పత్తులు విక్రయించలేదు. వ్యాపారులు సరఫరా చేసే ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు ‘మార్కెట్‌ప్లేస్‌’గా మాత్రమే ఉంటోంది. స్థానిక ప్రజల అభిరుచులు, కొనుగోళ్లకు అనుగుణంగా ఉత్పత్తుల నిల్వ, సరఫరాకు గోదాములను, మరింత త్వరగా, సమర్థంగా సరకు అందించడం కోసం సాంకేతికత కోసం డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. అమెరికా తరహాలో ఇంటర్నెట్‌, క్రెడిట్‌కార్డుల ద్వారా చెల్లింపులు మనదేశంలో తక్కువ కనుక, కొనుగోలుదారుకు వస్తువు అందించి నగదు స్వీకరించే (క్యాష్‌ ఆన్‌ డెలివరీ) పద్ధతిని సులువుగా చేసుకునే మార్గాలు అన్వేషిస్తోంది.

అనుబంధ బ్యాంకుల విలీనంతో..త్వరలోమెగాఎస్బీఐ! - ప్రతిపాదనను ఆమోదిస్తామని చెప్పిన ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ

07/06/2016: న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో ఐదు అనుబంధ బ్యాంకులు సహా భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంఐ) విలీన ప్రక్రియ ఖాయమని కేంద్రం స్పష్టం చేసింది. దీన్ని త్వరలో ఆమోదించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంచేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని పటిష్ఠపరచటం, వాటి మొండి బకాయిల సమస్యల్ని పరిష్కరించటం, వాటికి సాధికారత కల్పించటం లక్ష్యాలుగా కేంద్రం పనిచేస్తున్నట్లు చెప్పారాయన. సోమవారమిక్కడ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల సీఎండీలతో బ్యాంకింగ్ రంగ త్రైమాసిక పనితీరును ఆయన సమీక్షించారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హాతో సహా పలువురు సీనియర్ అధికారులతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎప్పటిలోగా ఎస్‌బీఐ విలీన ప్రక్రియకు ఆమోద ముద్ర వేస్తారు?’’ అని అడిగిన ప్రశ్నకు జైట్లీ సమాధానమిస్తూ... ‘త్వరలో ఈ నిర్ణయం తీసుకుంటామని భావిస్తున్నాం’ అన్నారు. విలీనమైతే... అంతర్జాతీయ బ్యాంకుగా!! విలీన ప్రతిపాదనలో ఉన్న బ్యాంకుల్లో భారతీయ మహిళా బ్యాంకుతో పాటు ఎస్‌బీఐకి చెందిన 5 అనుబంధ బ్యాంకులు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్‌లు ఉన్నాయి. వీటిల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్‌లు స్టాక్‌మార్కెట్‌లో లిస్టయ్యాయి. 2008లో ఎస్‌బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రను తొలిసారిగా విలీనం చేసుకుంది. రెండేళ్ల తరువాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ విలీనమైంది. ప్రస్తుతం ఎస్‌బీఐ బ్యాంక్ బ్యాలెన్స్‌షీట్ పరిమాణం రూ.28 లక్షల కోట్లు. ఈ విలీనాలు పూర్తయితే 50 కోట్ల కస్టమర్లతో ఎస్‌బీఐ బ్యాంకు పరిమాణం రూ.37 లక్షల కోట్లకు చేరుతుంది. రుణ సమీకరణ వ్యయం బాగా తగ్గుతుందని ఇప్పటికే ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. మొత్తంమీద ఈ విలీనం జరిగితే 22,500 బ్రాంచీలు, 58,000 ఏటీఎంల నెట్‌వర్క్‌తో ఎస్‌బీఐ అంతర్జాతీయ స్థాయి బ్యాంకుగా మారుతుంది. ప్రస్తుతం ఎస్‌బీఐకి 36 దేశాల్లో 191 విదేశీ కార్యాలయాలున్నాయి. దేశంలో 16,500 బ్రాంచీలున్నాయి. విలీన ప్రక్రియకు రూ.3,000 కోట్లు ఖర్చవుతుందని భట్టాచార్య తెలిపారు. అయితే ఉద్యోగ సంఘాలు ఈ ప్రతిపాదనకు తీవ్ర అభ్యంతరం చెబుతున్నాయి. బ్యాంకుల విలీనాలే ప్రభుత్వం విధానం: సమావేశం సందర్భంగా విలేకరులతో మాట్లాడిన జైట్లీ... బ్యాంకింగ్‌లో విలీనమే ప్రభుత్వ విధానమన్నారు. బడ్జెట్‌లోనూ ఇదే విషయాన్ని చెప్పామని గుర్తుచేశారు. ‘‘తొలి ప్రాధాన్యత మొండిబకాయిల సమస్య పరిష్కారమే. ఆ తర్వాతే విలీనాలను పరిశీలిస్తాం. మొండిబకాయిలకు భారీ ప్రొవిజనింగ్ కేటాయించాల్సి రావడం వల్ల దాదాపు 12 బ్యాంకులకు రూ.18,000 కోట్ల నష్టాలొచ్చాయి. కాబట్టి బడ్జెట్‌లో కేటాయించిన రూ.25,000 కోట్ల మూలధనానికి అదనంగా మరింత ఇవ్వటానికి మేం సిద్ధంగా ఉన్నాం. మొత్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.1.40 లక్షల కోట్ల నిర్వహణా లాభాలను ఆర్జించాయి. ఇది బ్యాంకింగ్ సత్తాకు నిదర్శనం. మొండిబకాయిల సమస్యపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చేసే సిఫారసులను కేంద్రం పరిశీలిస్తుంది’’ అని జైట్లీ వివరించారు. త్వరలో అమల్లోకి రానున్న దివాలా చట్టం మొండి బకాయిల సమస్య పరిష్కారంలో కీలకపాత్ర పోషిస్తుందని ఆయన తెలియజేశారు. కేబినెట్ నోట్ సిద్ధం! ఉన్నతస్థాయి వర్గాల సమాచారం ప్రకారం- ఎస్‌బీఐ విలీన ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే కేబినెట్ నోట్ సిద్ధమైంది. ఈ నెల చివర్లో కేబినెట్ చర్చించి సానుకూల నిర్ణయం తీసుకునే వీలుంది. లిస్టయిన ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల విలీన ప్రతిపాదన కూడా కొన్నాళ్లుగా అధికార వర్గాల పరిశీలనలో ఉంది. న్యూ ఇండియా అస్యూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియెంటల్ ఇన్సూరెన్స్, యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్‌లు ఇందులో ఉన్నాయి.

ఏటీఎం ఆధారిత ఈ ఫైలింగ్ కు శ్రీకారం

06/06/2016: కాగితం రహిత పాలనను విస్తరించేందుకు ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ (ఐటీ) ఏటీఎం ఆధారిత ఈ ఫైలింగ్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ట్యాక్స్ చెల్లింపుదారుడికి ఏటీఎం ద్వారా ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ (ఈవీసీ) అందుతుంది. ఈ నెల మూడో తేదీన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సౌకర్యాన్ని ప్రారంభించింది. త్వరలోనే మిగతా బ్యాంకులు కూడా ఈ విధానాన్ని అమలు చేస్తాయని ఐటీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. నెట్ బ్యాంకింగ్ సౌకర్యం లేని వారికోసం ఐటీ శాఖ బ్యాంకు అకౌంట్ ఆధారిత ధ్రువీకరణ వెసులుబాటును గత నెలలో ప్రారంభించింది. ఆధార్ నంబరు సాయంతో వన్‌టైంపాస్‌వర్డ్ ద్వారా ఐటీశాఖ అధికారిక ఈ -ఫైలింగ్ పోర్టల్‌లో హెచ్‌టీటీపీ://ఇన్‌కం ట్యాక్స్‌ఇండియాఈఫైలింగ్.జీవోవీ.ఇన్‌ను సందర్శించవచ్చు. చెల్లింపుదారుడు పేపర్ ఆధారిత ఐటీఆర్‌ను బెంగుళూరు కేంద్రమైన సెంట్రల్ ప్రొసెసింగ్ సెంటర్‌కు తపాలా ద్వారా పంపే సుదీర్ఘ ప్రక్రియను నిలువరించేందుకు ఈ విధానం ఉపకరించనుంది. జీతాలు, ఇంటి ఆస్తులు, ఇతర ఆదాయ వనరులు కలిగి ఉన్న ఎవరైనా ఐటీఆర్-1ను ఫైల్ చేయొచ్చు. వ్యాపారం, ఇతరేతర వృత్తి ద్వారా ఆదాయం పొందని వ్యక్తులు, అవిభాజ్య హిందూ కుటుంబాలు(హెచ్‌యుఎఫ్) ఐటీఆర్-2ని ైఫైల్ చేసుకునేందుకు అర్హులు. అలాగే వ్యాపారం, వృత్తి, విదేశీ ఆస్తులు లేని వ్యక్తులు, హెచ్‌యుఎఫ్‌లు ఐటీఆర్-2ఏను ఫైల్ చేసుకోవచ్చు.

మార్కెట్లోకి బీఎండబ్ల్యూ 520ఐ

06/06/2016: ఇంటర్నెట్‌డెస్క్‌: బీఎండబ్ల్యూ 5సిరీస్‌లో పెట్రోల్‌ వేరియంట్‌ కారును భారత్‌లో విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూం ధర రూ.54 లక్షల వరకు ఉంది. దీంతో బీఎండబ్ల్యూ 520ఐ కారు అభిమానులు ఇప్పుడు పెట్రోల్‌, డీజిల్‌ వేరియంట్లను ఎంపిక చేసుకోవచ్చు. ఈ కారు లగ్జరీ లైన్‌ డిజైన్‌లో 520ఐ మోడల్‌ కార్‌ను పూర్తిగా దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటికే ఉన్న డీజిల్‌ వేరియంట్‌తో పోల్చుకుంటే డిజైన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ కారుకు చిన్న డ్యూయల్‌ ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌, కిడ్నీగ్రిల్‌ వంటి ఉన్నాయి.

మార్కెట్లోకి ఫోక్స్‌వ్యాగన్‌ ఎమియో

06/06/2016: ఇంటర్నెట్‌డెస్క్‌: జర్మనీ కార్ల తయారీ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్‌ సబ్‌-కాంపాక్ట్‌ సెడాన్‌ మార్కెట్లోకి అడుగుపెట్టింది. తన కొత్త మోడల్‌ ఎమియోను భారత మార్కెట్లో విడుదల చేసింది. ముంబయి ఎక్స్‌షోరూంలో దీని ప్రారంభ ధర రూ.5.14 లక్షలు. భారత్‌ కోసం.. భారత్‌లో తయారు చేసిన కారుగా దీనిని ఫోక్స్‌వ్యాగన్‌ పేర్కొంటోంది. ఈ కారు ప్రస్తుతం కేవలం పెట్రోల్‌ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. ఫోక్స్‌వ్యాగన్‌లో ఉండే ట్రెండ్‌లైన్‌, కంఫర్ట్‌లైన్‌, హైలైన్‌ రకాల్లో వీటిని విక్రయిస్తారు. వీటి ధర రూ.5.14లక్షల నుంచి ప్రారంభమై రూ.6.91లక్షల వరకు ఉంటుంది. కారులో ఫోక్స్‌వ్యాగన్‌ 1.2లీటర్‌ ఎంపీఐ త్రీలీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చారు. దీనిని ఇప్పటికే పోలో కారులో ఉపయోగిస్తున్నారు. ఇది మొత్తం మీద 110 ఎన్‌మ్‌ పీక్‌ టార్క్‌ వద్ద 74బీహెచ్‌పీ హార్స్‌పవర్‌ను విడుదల చేస్తుంది.

వీడియోకాన్‌ నుంచి స్మార్ట్‌ఫోన్‌

02/06/2016: న్యూదిలీ: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ వీడియోకాన్‌ సరికొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. క్రిప్టన్‌3 వీ50జేజీ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్‌ ధర రూ.10,000గా కంపెనీ ప్రకటించింది. రెండు రంగుల్లో వినియోగదారులకు లభ్యం కానుంది. ఫోన్‌ ఫీచర్లు.. * 5 అంగుళాల తాకే తెర * 1.3 గిగాహెడ్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రొసెసర్‌ * 2జీబీ రామ్‌ * ఆండ్రాయిడ్‌ 6.0 మార్ష్‌మెల్లో * 13 మెగాపిక్సల్‌ రేర్‌ కెమెరా * ఎల్‌ఈడీ ఫ్లాష్‌లైట్‌ * 5 మెగాపిక్సల్‌ ముందు కెమెరా * 16జీబీ అంతర్గత మెమరీ * 64 జీబీ వరకు మెమరీ కార్డ్‌ ద్వారా పెంచుకునే సదుపాయం * 3000ఎంఏహెచ్‌ బ్యాటరీ సదుపాయం * 4జీ సదుపాయం * డ్యూయల్‌సిమ్‌

ఎల్‌అండ్‌టీలో 1500 ఆఫర్‌ లెటర్లు వెనక్కి - నిరాహారదీక్ష చేస్తున్న విద్యార్థులు

30/05/2016: చెన్నై: ఉద్యోగాలిస్తామంటూ విద్యార్థులను ఎంపికచేసుకుని.. తీరా నియామకం సమయానికి చేతులెత్తేస్తున్నాయి ఇటీవల కొన్ని కంపెనీలు. మొన్నటికి మొన్న విద్యార్థుల నియామకాన్ని ఫ్లిప్‌కార్ట్‌ వాయిదా వేయగా.. తాజాగా ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ కూడా తమ ఆఫర్‌ లెటర్లను వెనక్కి తీసుకుంది. దీంతో విద్యార్థులు నిరాహార దీక్ష చేపట్టారు. ఇటీవల తమిళనాడులోని కొన్ని కళాశాలల నుంచి విద్యార్థులను ఎంపిక చేసిన ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌.. వారికి ఆఫర్‌ లెటర్లు జారీ చేసింది. అయితే ఆ ఆఫర్‌ లెటర్లు రద్దు చేస్తున్నట్లు ఎల్‌అండ్‌టీ నుంచి తమకు మెయిల్స్‌ వచ్చినట్లు విద్యార్థులు ఆరోపించారు. కంపెనీకి కావాల్సిన సామర్థ్యం విద్యార్థుల్లో లేకపోవడంతో ఆఫర్‌ లెటర్లను రద్దుచేస్తున్నట్లు ఎల్‌అండ్‌టీ ఆ మెయిల్స్‌లో పేర్కొంది. దీంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము లోన్లు తీసుకుని చదివామని, ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఉండగా.. ఇప్పుడు ఉద్యోగం ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకుంటే తమ పరిస్థితి ఏంటని వాపోయారు. లోన్లు తిరిగి కట్టమంటూ బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరుగుతోందని వారు వాపోయారు. తమ కళాశాలల్లో ఒక ఉద్యోగానికి ఎంపికైతే.. మరో ప్లేస్‌మెంట్‌కు లేదా మరో కంపెనీ ఇంటర్వ్యూకు హాజరయ్యే అవకాశం లేదని.. ఇప్పుడు తామంతా ఎల్‌అండ్‌టీ నుంచి ఎంపికై కూడా ఉద్యోగాలు లేకుండా ఉన్నామని చెబుతున్నారు. సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కొందరు విద్యార్థులు సోమవారం నుంచి నిరాహార దీక్ష చేపట్టారు. ఉద్యోగ నియామకాల విషయంలో ఇటీవల ఫ్లిప్‌కార్ట్‌పై కూడా ఆరోపణలు వచ్చాయి. ఐఐఎం, ఐఐటీల నుంచి తమను ఎంపిక చేసుకున్న ఫ్లిప్‌కార్ట్‌.. తర్వాత నియామకాలను వాయిదా వేసిందని విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.

ఓలాలో లగ్జరీ కార్లు

28/05/2016: ముంబయి: ప్రముఖ టాక్సీ సంస్థ ఓలా.. ఇకపై లగ్జరీ కార్లలో రైడ్లకు అవకాశం కల్పిస్తోంది. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు మెర్సిడెస్‌, ఆడీ, బీఎండబ్యూ, ఫార్యూనర్‌ లాంటి లగ్జరీ కార్లతో తమ సేవలను విస్త్రతం చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ కార్లలో కిలోమీటర్‌కు రూ. 19చొప్పున ఛార్జ్‌ చేయనున్నట్లు ఓలా తెలిపింది. ప్రస్తుతం దక్షిణ ముంబయిలో మాత్రమే ఈ సేవలు ప్రారంభించగా.. త్వరలోనే మిగతా ప్రాంతాల్లోనూ లగ్జరీ రైడ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. తమ వినియోగదారుల్లో ఎగ్జిక్యూటివ్స్‌, ప్రొఫెషనల్స్‌ ఎక్కువగా ఉండటంతో వారి అవసరాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓలా ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే కిలోమీటర్‌కు రూ. 6తో ఓలా చవకైన రైడ్లను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.

రిలయన్సే రారాజు - 56 భారత కంపెనీల్లో అగ్రస్థానం - ఫోర్బ్స్‌ ప్రపంచ అతిపెద్ద నమోదిత సంస్థల జాబితా

27/05/2016: న్యూయార్క్‌: ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరోసారి తన ప్రత్యేకత నిరూపించుకుంది. ఫోర్బ్స్‌ తాజాగా ప్రకటించిన 2000 అతిపెద్ద, శక్తిమంత నమోదిత సంస్థల్లో భారత్‌ నుంచి అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో అమెరికాకు చెందిన 586 కంపెనీలకు స్థానం దక్కగా.. 56 భారత సంస్థలకు ప్రాతినిధ్యం లభించింది. 2016 ఫోర్బ్స్‌ ‘గ్లోబల్‌ 2000’ పేరిట విడుదలైన ఈ జాబితాలో అమెరికా, చైనా కంపెనీల హవా కొనసాగింది. తొలి 3 స్థానాల్లోనూ చైనా బ్యాంకులే నిలిచాయి. నివేదిక వివరాలు ఇలా.. * జాబితాలోని మొదటి పది కంపెనీల్లో ఒక్కటి మినహా అన్నీ చైనా, అమెరికాలవే. జపాన్‌కు చెందిన టయోటా మోటార్‌ పదో స్థానంలో నిలిచింది. * గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా భారత్‌ నుంచి 56 కంపెనీలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. భారత్‌ నుంచి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన అగ్రస్థానాన్ని కొనసాగించింది. 50.6 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.3.3 లక్షల కోట్లు) మార్కెట్‌ విలువ, 91.5 బిలియన్‌ డాలర్ల ఆస్తులతో.. గతేడాదితో పోలిస్తే కంపెనీ ర్యాంకు 142 నుంచి 121కి మెరుగుపడింది. * స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (149వ ర్యాంకు) 23.3 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ (దాదాపు రూ.1.5 లక్షల కోట్లు)తో ఆ తర్వాతి స్థానం దక్కించుకుంది. * భారత్‌ నుంచి జాబితాలో ఓఎన్‌జీసీ (220వ ర్యాంకు), ఐసీఐసీఐ బ్యాంకు (266), హెచ్‌డీఎఫ్‌సీ (275), ఐఓసీ (371), టీసీఎస్‌ (385), ఎన్‌టీపీసీ (400), భారతీ ఎయిర్‌టెల్‌ (453), యాక్సిస్‌ బ్యాంక్‌ (484), ఇన్ఫోసిస్‌ (590), బీపీసీఎల్‌ (650), విప్రో (755), టాటా స్టీల్‌ (1178), అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (1993)లు ఉన్నాయి. * కోల్‌ ఇండియా (465), ఎల్‌ అండ్‌ టీ (505), ఐటీసీ (781), కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ (899), ఎం అండ్‌ ఎం (901), హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ (943) స్థానాల్లో నిలిచాయి. * 2016 జాబితాలో 63 దేశాల కంపెనీలకు ప్రాతినిధ్యం లభించింది. వీటి ఆదాయం దాదాపు 35 ట్రిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.35 లక్షల డాలర్లు). వీటి మొత్తం మార్కెట్‌ విలువ 44 ట్రిలియన్‌ డాలర్లు కావడం గమనార్హం.

మూడోవంతు ఏటీఎంలు పనిచేయడం లేదు: ఆర్‌బీఐ

ముంబయి: మూడోవంతు ఏటీఎంలు పనిచేయడం లేదని తమ బృందం నిర్వహించిన సర్వేలో తేలిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌ ఎస్‌ఎస్‌ ముంద్రా తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా వీటిని నిర్వహించకపోతే, చర్యలు తప్పవని బ్యాంకులను ఆయన హెచ్చరించారు. ఆర్‌బీఐ బృందం దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో, భిన్న బ్యాంకులకు చెందిన 4,000 ఏటీఎంలు పరిశీలించిందని, వీటిల్లో దాదాపు 3వ వంతు పనిచేయడం లేదని గుర్తించినట్లు తెలిపారు. ఇంకా పలు నిబంధనలు పాటించడం లేదని తేలిందన్నారు. గత ఫిబ్రవరి గణాంకాల ప్రకారం దేశంలోని 56 వాణిజ్య బ్యాంకులు 1.97 లక్షల ఏటీఎంలు నిర్వహిస్తున్నాయి.

ఇ-బైక్‌లకు గిరాకీ సృష్టిద్దాం! - విద్యార్థులపై తయారీ సంస్థల ఆశలు- కొత్త మోడళ్ల ఆవిష్కరణపై దృష్టి

వేసవి సెలవులు ముగిసి, పాఠశాలలు, కళాశాలలు తెరిచే సమయం దగ్గరవుతోంది. ఇంకో రెండు, మూడు వారాల్లో విద్యాసంస్థలన్నీ పునఃప్రారంభమౌతాయి. ఈ వాహనాలు నడిపేందుకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ అవసరం లేనందున, విద్యార్థులు, మహిళలు వినియోగిస్తున్నారు. అందువల్ల విద్యార్థులను ఆకట్టుకునేలా కొత్త మోడళ్లను విడుదల చేసేందుకు తయారీ సంస్థలు హడావుడి పడుతున్నాయి. రీఛార్జబుల్‌ బ్యాటరీతో నడిచే ఎలక్ట్రానిక్‌ బైక్‌ (ఇ- బైక్‌) లను తయారు చేసే సంస్థల్లో హీరో ఎలక్ట్రిక్‌, బీపీజీ, బీఎస్‌ఏ మోటార్స్‌, టీవీఎస్‌, యో బైక్స్‌ తయారు చేసే ఎలక్ట్రోథెర్మ్‌ ఇండియా, ఎకో వెహికల్స్‌, ఏస్‌ మోటార్స్‌.. తదితరాలున్నాయి. నగరాలు, పట్టణాల్లో వాయు కాలుష్యానికి పరిష్కారం చూపుతూ, సులువైన ప్రయాణానికి ఎంతో అనుకూలమైనవిగా ఇ- బైక్‌లకు పేరున్నా, కొన్ని తరగతుల వినియోగదార్లకే ఇవి దగ్గరయ్యాయి. కళాశాలలకు, ట్యూషన్లకు వెళ్లేందుకు విద్యార్థు´లు ఇ- బైక్‌లను అధికంగా వినియోగిస్తున్నారు. తమ చిన్నారులను విద్యాసంస్థలకు తీసుకెళ్లేందుకు, ఇంటికి తెచ్చేందుకు మహిళలు కూడా వీటిని వినియోగిస్తున్నారు. ఏటా విద్యా సంస్థలు తెరిచే సమయం దగ్గర పడేకొద్దీ ఇ బైక్‌ల అమ్మకాలు పెరుగుతూ ఉండటాన్ని తయారీ సంస్థలు గమనిస్తున్నాయి. అందుకు అనువుగా కొత్త మోడళ్లను సిద్ధం చేస్తున్నాయి. ఇదే తరహాలో ఈ సారి కూడా ఆయా సంస్థలు అమ్మకాలను పెంచుకనేందుకు ప్రయత్నిస్తున్నాయి. అధునాతన సదుపాయాలు: తాము యువతీ యువకులను దృష్టిలో పెట్టుకొని, తేలికగా ఉండే ఇ- బైక్‌లను ఆకర్షణీయ డిజైన్లతో రూపొందిస్తున్నట్లు హీరో ఎలక్ట్రిక్‌ సీఈఓ సోహిందర్‌ గిల్‌ పేర్కొన్నారు. తమ ఇ- బైక్‌లు నడపడానికి ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’ అవసరం లేదని, దీంతో ఇవి యువతరాన్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని ఆయన వివరించారు. ఈ వాహనంపై వెళ్లిన విద్యార్థి ఎక్కడ ఉన్నదీ తల్లితండ్రులు తెలుసుకునేందుకు అనువుగా జీపీఎస్‌ పరిజ్ఞానాన్నీ దీనికి జోడిస్తున్నారు. జీపీఎస్‌ ట్రాకింగ్‌తో కూడా ‘ఎలక్ట్రిక్‌ క్రజ్‌’ ఇ బైక్‌ను హీరో ఎలక్ట్రిక్‌ తయారు చేసింది. స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఎప్పటికప్పుడు ఈ వాహనం ఎక్కడి ఉన్నదీ తెలుసుకోవచ్చు. ఇదే తరహా సదుపాయాలను ఇతర సంస్థలు సైతం ఆవిష్కరిస్తున్నాయి. ఏటా లక్ష వాహనాల అమ్మకం దేశవ్యాప్తంగా ఏటా దాదాపు లక్ష వరకు ఇ బైక్‌ల అమ్మకాలు సాగుతున్నాయని అంచనా. కొన్నేళ్లుగా ఎటువంటి ప్రగతి లేకుండా ఈ అమ్మకాలు స్థిరంగా ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇ బైక్‌లకు కొన్ని ప్రత్యేకతలున్నా, వాటికి ఉన్న పరిమితుల వల్ల పెద్ద సంఖ్యలో అమ్మకాలు సాధ్యం కావటం లేదని అంటున్నారు. ఇ బైక్‌లను ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 40- 45 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణం చేయగలవు. బంకుల్లో పెట్రోలు పోయించినట్లుగా, వీటికి ఎక్కడ బడితే అక్కడ ఛార్జ్‌ చేయడం కుదరడం లేదు. బ్యాటరీ ఛార్జింగ్‌ డిపోలు ఏర్పాటు చేయడమే దీనికి పరిష్కారం. వేగం కూడా పరిమితం. దీనివల్ల వీటికి ‘మాస్‌’ మార్కెట్‌ ఏర్పడలేదు. ఈ వాహనాలకు ఎంతో ముఖ్యమైన బ్యాటరీ ఖరీదు అధికంగా ఉండటం బలమైన నిరోధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం కొంతమేరకు రాయితీ ఇచ్చి ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించటానికి పూనుకుంది. కానీ ఈ పథకం సక్రమంగా అమలు కావటం లేదని అంటున్నారు. మూడేళ్ల క్రితం ‘నేషనల్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ మిషన్‌ ప్లాన్‌’ కింద కేంద్ర ప్రభుత్వం ఇ వాహనాలను ప్రోత్సహించాలని చూసినా, పెద్దగా ప్రభావం చూపలేదు. వాయుకాలుష్యంపై అందరిలో భయం ఏర్పడుతున్నందున, భవిష్యత్తు ఇ బైక్‌లదే అనిపరిశ్రమ వర్గాలు విశ్వసిస్తున్నాయి. అందుకే భిన్నమైన డిజైన్లు, ప్రత్యేకతలతో వినియోగదార్లను ఆకట్టుకునేందుకు తయారీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.

గూగుల్‌ నుంచి టచ్‌సెన్సిటివ్‌ జాకెట్‌ - లెవైస్‌తో కలిసి సంయుక్తంగా విడుదల - స్మార్ట్‌ఫోన్‌ని ఆపరేట్‌ చేసేందుకు వీలు

కాలిఫోర్నియా: ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్‌ ప్రముఖ డెనిమ్‌ దుస్తుల తయారీ సంస్థ లెవైస్‌తో కలిసి ఓ టచ్‌ సెన్సిటివ్‌ జాకెట్‌ని విడుదల చేసింది. గతేడాదే ఈ విషయాన్ని గూగుల్‌ వెల్లడించినా.. ఇప్పుడు ఆ జాకెట్‌ని విడుదల చేసింది. కాలిఫోర్నియాలోని మౌంటెన్‌ వ్యూలో జరిగిన వార్షిక సదస్సులో గూగుల్‌ గ్లోబల్‌ ప్రొడక్ట్‌ ఇన్నొవేషన్‌ హెడ్‌ పాల్‌ దిలింగర్‌ దీన్ని పరిచయం చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జాకెట్‌ని పలు రకాలుగా తాకడం ద్వారా ఎవరికి వారు తమ స్మార్ట్‌ ఫోన్‌ని ఆపరేట్‌ చేసుకోవచ్చు. సైకిల్‌ తొక్కేవారిని దృష్టిలో ఉంచుకుని ఈ జాకెట్‌ని రూపొందించారు. సైకిల్‌ తొక్కేటప్పుడు ఫోన్‌ వాడేందుకు వీలుకాదు. అలాంటి సమస్యకు పరిష్కారంగా దీన్ని తయారు చేశారు. ఇంకా ఇది వాటర్‌ ప్రూఫ్‌ జాకెట్‌. మాసిపోతే వాషింగ్‌ మెషీన్‌లో వేసి ఉతికేయవచ్చు కూడా. ప్రయోగాత్మకంగా కొన్ని జాకెట్లను త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఆ తర్వాత 2017లో దీన్ని లెవీ.కామ్‌, లెవైస్‌ స్టోర్‌ల్లో అందుబాటులోకి తెస్తారు. ఒక ఎలక్ట్రానిక్‌ స్మార్ట్‌ ట్యాగ్‌ని యాక్టివేట్‌ చెయ్యడం ద్వారా ఆ జాకెట్‌, మొబైల్‌ల మధ్య వైర్‌లెస్‌ కనెక్షన్‌ ఏర్పడుతుందని తద్వారా అది పనిచేస్తుందని టెక్‌ నిపుణులు భావిస్తున్నారు.

రిలయన్స్ జియో నుంచి కొత్త ఫోన్

చెన్నై: ఈ ఏడాది 4 జీ సేవలను ప్రారంభించనున్న నేపథ్యంలో రిలయన్స్ జియో కొత్త రకం హ్యాండ్‌సెట్‌ను అందుబాటులోకి తేనుంది. ఎల్‌వైఎఫ్ విండ్ 4 పేరుతో, రూ.6,799 ధరతో కొత్త మొబైల్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ఓ ప్రకటనలో సంస్థ తెలిపింది. డ్యూయల్ సిమ్, 4,000ఎంఏహెచ్ బ్యాటరీ, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమొరీ, డీటీఎస్ టెక్నాలజీ, 5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే,వెనుక 8 ఎంపీ, ముందు 2 ఎంపీ కెమెరా, లాంగ్ టర్మ్ వాయిస్ ఓవర్ కాలింగ్ సౌకర్యాలను అందించనుంది. రిలయన్స్ జియో ఇటీవల 4 జీ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎల్‌వైఎఫ్ హ్యాండ్‌సేట్ల ధర ప్రస్తుతం రూ. 5,599 నుంచి 19,499 గా ఉంది.

విజయ్ మాల్యాకు మన్మోహన్ గ్యారంటీ!

పిలిభిత్ : వేల కోట్ల రూపాయల మేర అప్పులు ఎగ్గొట్టి బ్రిటన్‌లో హాయిగా తలదాచుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు గ్యారంటీగా ఎవరున్నారో తెలుసా.. మన్మోహన్ సింగ్‌!! అవును.. మీరు చదివింది నిజమే. కానీ ఈ మన్మోహన్ సింగ్ మాత్రం మన మాజీ ప్రధానమంత్రి కాదు. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌కు చెందిన ఓ చిన్నకారు రైతు. విజయ్ మాల్యా తీసుకున్న అప్పుల్లో ఒకదానికి ఈ రైతు గ్యారంటర్‌గా ఉన్నట్లు గుర్తించిన బ్యాంకు.. ఈయన ఖాతాను ఫ్రీజ్ చేయించింది. ఇదేంటని అడిగితే, మాల్యా అప్పు తిరిగి చెల్లించేవరకు ఖాతా, దాని వల్ల వచ్చే ప్రయోజనాలు ఉండవని చెప్పారు. మన్మోహన్‌ సింగ్‌కు 8 ఎకరాల భూమి ఉంది. అతడికి బ్యాంక్ ఆఫ్ బరోడాలో రెండు ఖాతాలున్నాయి. ఆ రెండింటినీ ఫ్రీజ్ చేయాలని ముంబై హెడ్ ఆఫీసు నుంచి స్థానిక బ్రాంచికి ఆదేశాలు వచ్చాయి. ఇదెలా జరిగిందో తనకు తెలియదని, అసలు మాల్యా ఎవరో, ఆయన అప్పులేంటో కూడా తెలియదని, జీవితంలో ఎప్పుడూ ముంబై నగరం ముఖం చూడలేదని ఈ మన్మోహన్ వాపోయాడు. ఖాతాలు లేవు కాబట్టి కనీసం గ్యాస్ సబ్సిడీ కూడా అతడికి అందట్లేదు. కనీస మద్దతు ధర రావాలంటే బ్యాంకు ఖాతా ఉండాలని, అది లేదు కాబట్టి తన గోధుమ పంటను ప్రైవేటు వ్యాపారులకు కారుచవగ్గా అమ్మాల్సి వచ్చిందని చెప్పాడు. ఇప్పుడు వేయబోయే వరిపంటకు కూడా సబ్సిడీ వచ్చే అవకాశం ఏ కోశానా లేదు. ఇతర బ్యాంకులు కూడా అతడికి కొత్త ఖాతా ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక మన్మోహన్ సింగ్ తల పట్టుకుని కూర్చున్నాడు.

యాపిల్‌ అధిపతి టిమ్‌కుక్‌ హైదరాబాద్‌లో సుడిగాలి పర్యటన...

యాపిల్‌ అధిపతి టిమ్‌కుక్‌ హైదరాబాద్‌లో సుడిగాలి పర్యటన చేశారు. కేవలం మూడు గంటల్లోపే పర్యటనను ముగించుకున్నా తొలి పర్యటనలోనే తనదైన ముద్ర వేశారు. పాల్గొన్న అన్నిచోట్లా సరదాగా గడిపారు. ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఐటీ మంత్రి కేటీఆర్‌లతో కలిసి యాపిల్‌ టెక్నాలజీ కేంద్రాన్ని ప్రారంభించి.. సాయంత్రం గోల్కొండలో చక్కర్లు కొట్టేంత వరకూ 55 ఏళ్ల టిమ్‌ కుక్‌ అలుపులేకుండా పయనించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని.. అందుకు కావలసిన భూమి, మౌలిక వసతులను అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం నుంచి హామీని సైతం పొందారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న పారిశ్రామిక విధానానికి ఆయన కితాబునిచ్చారు. ఇంక్యుబేటర్‌, టి-హబ్‌లో యాపిల్‌ను భాగస్వామ్యం చేసే విషయాన్ని పరిశీలిస్తామని ఈ సందర్భంగా కుక్‌ మాటిచ్చారు. అటుపైన జి.నారాయణమ్మ ఇంజినీరింగ్‌ కాలేజీకి చెందిన విద్యార్థినులతో ముఖాముఖిలోనూ పాల్గొన్నారు. ఆ తర్వాత గోల్కొండ కోటలో కాసేపు వ్యాహ్యాళికెళ్లారు. చివరగా మళ్లీ తెలంగాణకు వస్తానంటూ వీడ్కోలు చెప్పి మరీ వెళ్లారు. ‘ఇక్కడి వారి తీరు, ఆతిథ్యం, భారత సంస్కృతి, హైదరాబాద్‌ నాకెంతో నచ్చాయి. ఎంతో నేర్చుకున్నాను. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ అసమాన దేశం. ఇక్కడకు రావడం మాకెంతో గౌరవంగా ఉంది. జీవిత కాల స్నేహితులు దొరికారు. తెలంగాణతో విడదీయలేని బంధం ఏర్పడింది. యాపిల్‌కు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు సంతృప్తిని కలిగిస్తున్నాయి. హైదరాబాద్‌లో యాపిల్‌ కేంద్రం పురోభివృద్ధి సాధిస్తుందని విశ్వసిస్తున్నాను. - టిమ్‌కుక్‌, యాపిల్‌ సీఈఓ ‘మ్యాప్‌ల అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్‌ నగరాన్ని ఎంచుకుని యాపిల్‌ మమ్మల్ని గౌరవించింది. ఈ కేంద్రం స్థానికంగా వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. తెలంగాణ సానుకూల విధానాలు, ఇక్కడున్న మౌలిక సదుపాయాలు, నిపుణుల లభ్యతకు యాపిల్‌ రాక ఒక నిదర్శనం. హైదరాబాద్‌ విశ్వనగరంగా దినదినాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం హర్షణీయం. - కె.చంద్రశేఖర్‌రావు, తెలంగాణ ముఖ్యమంత్రి ‘మౌలిక, విద్యా సదుపాయాల పరంగా దేశంలో హైదరాబాద్‌ మెరుగైన నగరం. అంకుర కంపెనీలకు హైదరాబాద్‌ కేంద్ర బిందువు కానుంది. టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి హైదరాబాద్‌ను యాపిల్‌ ఎంచుకోవడంపై టిమ్‌ను అభినందిస్తున్నాను. ఇక్కడ సొంత ప్రాంగణాన్ని నెలకొల్పడానికి ముందుకు వస్తే భూమి, ఇతర సదుపాయాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం. భారత్‌లో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటే హైదరాబాద్‌ను, తెలంగాణాను పరిశీలించాలని కోరుతున్నాను. టి-హబ్‌లో యాపిల్‌ పాలుపంచుకోవాలని కోరుతున్నాను’. - కె.టి.రామారావు, తెలంగాణ ఐటీ మంత్రి

భారతీయ బ్యాంకింగ్‌ చరిత్రలో అతిపెద్ద నష్టం

న్యూదిల్లీ: భారతీయ బ్యాంకింగ్‌ చరిత్రలోనే అతిపెద్ద నష్టాన్ని ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నమోదు చేసింది. 2016 మార్చితో ముగిసే నాలుగో త్రైమాసికం నాటికి రూ.5,367.14 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. గత సంవత్సరం ఈ బ్యాంక్‌ ఇదే సమయంలో దాదాపు రూ.306 కోట్ల లాభాన్ని చవిచూసింది. బ్యాంకు నిర్వహణ వ్యయాలు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. గత ఏడాది దాదాపు 3834.19 కోట్ల నుంచి రూ.10,485.23 కోట్లకు చేరుకున్నాయి. బ్యాంకు నిరర్థక ఆస్తుల విలువ రూ.55,818.33 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయంలో అలాంటి ఆస్తుల విలువ రూ. 25,694.86 మాత్రమే. దీంతో అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ మూడో త్రైమాసిక ఫలితాలు భారతీయ బ్యాంకింగ్‌ చరిత్రలోనే అతిపెద్ద నష్టాలను నమోదు చేశాయి.

హైదరాబాద్‌లో యాపిల్ ఇన్నోవేషన్‌ సెంటర్‌..

నానక్ రామ్ గూడలోని వేవ్ రాక్ బిల్డింగ్ లో దాదాపు రెండున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో యాపిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఆరంభం కానుంది. హైదరాబాద్ ఇండియాకే ఐటీ హబ్ గా మారుతోంది. మంత్రి కేటీఆర్ హాయంలో ప్రవేశ పెట్టిన నూతన ఐటీ పాలసీ దిగ్గజ సంస్థలను ఆకర్షిస్తోంది. దీంతో భాగ్యనగరాన్ని కేంద్రంగా చేసుకునేందుకు భారీ సంస్థలు క్యూ కడుతున్నారు. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ల బాటలో మరో కిలికితురాయి చేరనుంది. హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకున్న విశ్వవిఖ్యాత ఐటీ దిగ్గజం యాపిల్‌ ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఇందుకోసం యాపిల్‌ అధినేత టిమ్‌కుక్‌ గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో ఆయన యాపిల్‌ సాంకేతిక ఆవిష్కరణ కేంద్రాన్ని ప్రారంభిస్తారని సమాచారం. నానక్ రామ్ గూడలోని వేవ్ రాక్ బిల్డింగ్ లో దాదాపు రెండున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ డెవలప్ మెంట్ సెంటర్ ఆరంభం కానుంది. తొలుత 1000 మందితో ఆరంభించి.. వచ్చే ఏడాదికల్లా సుమారు 4500 మందికి హైదరాబాద్‌ కేంద్రంలో ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. యాపిల్‌ సంస్థ అమెరికాలోని తమ ప్రధాన కార్యాలయం ఆవల ఏర్పాటుచేస్తున్న కీలక సాంకేతికాభివృద్ధి కేంద్రం ఇదేనంటున్నారు. ఇప్పటికే డెవలప్ మెంట్ సెంటర్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. యూరోప్‌లోని అనేక ప్రాంతాలతో పాటు, భారత్‌లోనూ బెంగళూరు, పుణె తదితర చాలా నగరాలను పరిశీలించాక యాపిల్‌ సంస్థ తుదకు హైదరాబాద్‌ను అనువైన స్థలంగా ఎంచుకుంది. చైనాకు ప్రాధాన్యమిస్తూ వచ్చిన యాపిల్‌ సంస్థ తాజాగా భారత్‌లో మార్కెట్‌పై దృష్టిసారించింది. హైదరాబాద్‌లో సాంకేతికాభివృద్ధి సంస్థ ఏర్పాటు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. మా ఈ ప్రక్రియకు మద్దతుగా నిలిచే స్థానికులకు కూడా ఈ కేంద్రంలో చోటుంటుంది అని ఇటీవల యాపిల్‌ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనటం గమనార్హం. ఇక గతేడాది భారత్ లో ఆపిల్ అమ్మకాలు 6 వేల 800 కోట్లు దాటాయి. భారత్ లో తమకు భారీ స్థాయిలో ఆదరణ దక్కుతుండటంతో హైదరాబాద్ లో సంస్థ ఏర్పాటుకు ఆపిల్ ముందుకొచ్చింది.

నాలుగో తరం మోటో జీ వచ్చేసింది

దిల్లీ: మోటో జీ సిరీస్‌లో భాగంగా రెండు నాలుగో తరం 4జీ మొబైళ్లను మంగళవారం భారత విపణిలోకి మోటరోలా విడుదల చేసింది. ఇందులో మోటో జీ4 ప్లస్‌ ప్రారంభ ధర రూ.13,499. మోటో జీ4 ధరను నిర్ణయించాల్సి ఉంది. పెద్ద తెర, మెరుగైన కెమేరా, ఫింగర్‌ప్రింట్‌ సెన్సాల్‌ వంటి ప్రత్యేకతలతో మోటో జీ4.. షియామీ, మైక్రోమ్యాక్స్‌, లెనోవో మొబైళ్లతో పోటీపడనుంది. ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. మోటో జీ4 ప్లస్‌లో రెండు రకాలు నేటి నుంచి లభించనున్నాయని.. మోటో జీ4 వచ్చే నెలలో అందుబాటులోకి రానున్నట్లు సంస్థ తెలిపింది. 5.5 అంగుళాల తెర, 1.5 గిగాహెర్ట్జ్‌ అక్టాకోర్‌ ప్రాసెసర్‌, 2జీబీ ర్యామ్‌, 16జీబీ అంతర్గత నిల్వ సామర్ధ్యం, 13 మెగాపిక్సెల్‌ వెనుక కెమేరా, 5 మెగాపిక్సెల్‌ ముందు కెమేరా మోటో జీ4 ప్రత్యేకతలు. మోటో జీ4 ప్లస్‌లో 16 మెగాపిక్సెల్‌ వెనుక కెమేరాతో పాటు ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ అదనంగా ఉన్నాయి.

16 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరాతో సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌ సిరీస్‌..!

టోక్యో : ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌ సిరీస్‌లో తొలి ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ అల్ట్రా పేరుతో ఉన్న ఫోన్‌ని సంస్థ తన గ్లోబల్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అయితే దాని ధర, ఏయే దేశాల్లో అందుబాటులోకి రానుంది తదితర విషయాల్ని మాత్రం వెల్లడించలేదు. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఈ ఫోన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఫోన్‌ ఫీచర్లు ఇలా... * ఆరు అంగుళాల హెచ్‌డీ తాకే తెర * 1080×1920 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ * ఆండ్రాయిడ్‌ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్‌ సిస్టం * 3జీ ర్యామ్‌ * 16 జీబీ అంతర్గత మెమొరీ * ఎస్డీ కార్డుతో మెమొరీని 200 జీబీ వరకు పెంచుకునే సదుపాయం * 21.5 మెగాపిక్సెల్‌ రేర్‌ కెమేరా * ఎల్‌ఈడీ ఫ్లాష్‌ * 16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమేరా * ఫ్రంట్‌ ఫ్లాష్‌ * 2700 ఎంఏహెచ్‌ బ్యాటరీ * తెలుపు, నలుపు, బంగారు రంగుల్లో ఫోన్‌ లభ్యం * 190 గ్రాముల బరువు

రూ 9999కే ల్యాప్ టాప్‌!!!!!!!

యువత…విద్యార్ధులకు, చిన్న ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌. మీ అవ‌స‌రాల‌కు లాప్ టాప్ కావాల‌నుకుంటే దాని రేటు ఎక్కువ‌ని మీరు బాధ‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఓ స‌రికొత్త లాప్ టాప్ చాలా త‌క్కువ ధ‌ర‌కు అందుబాటులోకి వ‌చ్చేసింది. పేరున్న ఐ బాల్ కంపెనీ స‌రికొత్త లాప్ టాప్ ప్రొడ‌క్ట్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. దీని ధర 9,999 రూపాయల మాత్రమే. ఈ కంపెనీ నుంచి వచ్చిన తొలి లాప్‌టాప్‌ ఇదే కావటం విశేషం. కాంప్‌బుక్‌ పేరుతో దీన్ని విడుదల చేశారు. ప్రపంచంలోనే ఇది చవక లాప్‌టాప్‌ అని ఓ అంచనా. త‌క్కువ ఆదాయ వ‌ర్గాల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ లాప్ టాప్ రూపొందించిన‌ట్టు ఐబాల్ ప్ర‌క‌టించింది. ఈ కొత్త లాప్ టాప్ ఫీచ‌ర్లు: – విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ – కాంప్‌బుక్‌లో రెండు వేరియంట్లు – 11.6 అంగుళాల స్ర్కీన్‌ ఎక్సెలెన్స్ రేటు 9,999 – 14 అంగుళాల స్ర్కీన్‌ ఎక్సెంప్లెయిర్ రేటు 13,999

ఆలస్యం ఖరీదు రూ.లక్షన్నర కోట్లపైనే! - సమయానికి పూర్తికాని మౌలిక ప్రాజెక్టులు

ఒక దేశ వృద్ధికి దన్నుగా.. అభివృద్ధికి వెన్నుగా.. నిలిచేది మౌలిక రంగమే. వృద్ధి రేటు ఉరకలెత్తాలంటే మెరుగైన మౌలిక వసతులు ఉండాల్సిందే. అందుకే మన దేశం మౌలిక ప్రాజెక్టులకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది. ఈ దిశగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అనునిత్యం శ్రమిస్తోంది. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు అనుమతులకు నోచుకోలేక రూ.లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు మరుగున పడి మూలుగుతున్నాయి. ఏళ్లూ పూళ్లూ గడుస్తున్నా కొన్నింటి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న మాదిరిగానే ఉండగా మరికొన్ని నత్త నడకన నడుస్తున్నాయి. దీనితో అంచనా వ్యయాలు పెరిగి పోతూ ఆర్థిక వ్యవస్థపై పెనుభారాన్ని మోపుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 1,071 ప్రాజెక్టుల అంచనా వ్యయం అదనంగా రూ.1.6 లక్షల కోట్లు పెరగడమే ఇందుకు నిదర్శనం. ఈ లెక్కలు చెప్పింది సాక్షాత్తు కేంద్ర గణాంకాల శాఖే సుమా...! భారం పెరుగుతోంది కారణం ఏదైతేనేమీ అనేక ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాలేకపోతున్నాయి. అనేక అవాంతరాలతో అర్ధంతరంగా మరికొన్ని నిలిచి పోతున్నాయి. అనుమతులు లభించక కొన్ని, న్యాయరపమైన చిక్కులతో ఇంకొన్ని, నిధుల అలభ్యతతో మరికొన్ని ప్రాజెక్టుల గడువును అంతకంతా పెంచుకుంటూ పోతున్నారు. ఫలితం అంతే స్థాయిలో అంచనా వ్యయాలు పెరిగిపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థపై మోయలేని భారాన్ని మోపుతున్నాయి. దేశాభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. కేంద్ర గణాంకాలశాఖ 1,071 కేంద్ర ప్రాజెక్టుల పురోగతిని సమీక్షిస్తోంది. వీటిలో కనీసం రూ.150 కోట్లు ఆపైన విలువ ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 341 ప్రాజెక్టుల గడువును అదనంగా పొడిగించారు. ఈ ప్రాజెక్టుల వాస్తవ అంచనా వ్యయాన్ని రూ.5,43,616 కోట్లుగా ప్రభుత్వం లెక్క కట్టింది. అయితే ఇప్పుడు వీటిని పూర్తి చేయాలంటే రూ.6,60,111 కోట్లు కావాలని గణాంకాల శాఖ చెబుతోంది. అంటే అదనంగా రూ.1,16,495 కోట్లను ఇందుకు వెచ్చించాలన్నమాట. 1,071 ప్రాజెక్టులు.. రూ.14 లక్షల కోట్లు గణాంకాలశాఖ సమాచారం ప్రకారం 1,071 ప్రాజెక్టుల వాస్తవ అంచనా వ్యయం రూ.12,66,248.36 కోట్లు. ప్రస్తుతం వీటిని పూర్తి చేయాలంటే రూ.14,26,985.93 కోట్లు అవసరమవుతాయని అంచనా. వాస్తవ అంచనా వ్యయం కంటే ఇది రూ.1,60,737.57 కోట్లు (12.69%) ఎక్కువ. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.5,66,058.05 కోట్లను ఈ ప్రాజెక్టులపై ఖర్చు చేశారు. అంటే సవరించిన అంచనా వ్యయంలో దీని వాటా 40 శాతానికి సమానం. అధిక వృద్ధి రేటుకు ‘మౌలిక’ మంత్రం రెండంకెల వృద్ధి రేటును సాధించాలన్న ప్రభుత్వం కల నెరవేరాలంటే మౌలిక ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావాల్సిందే. ఇందుకు అడ్డుగా నిలుస్తున్న అవరోధాలను తొలగించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేయాలి. కేవలం పెట్టుబడులు తరలి వచ్చినంతనే ప్రాజెక్టులు పూర్తికావనే విషయాన్ని గుర్తించి.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు ఎదుర్కొంటున్న సమస్యలకు మూలాల్లోకి వెళ్లి చికిత్స చేయాలి. అప్పుడే ప్రాజెక్టులు త్వరిగతిన పూర్తి కావడంతోపాటు, దేశ ఆర్థిక ప్రగతి వెల్లి విరుస్తుంది. ఆలస్యానికి ఇవీ కారణాలు.. * భూసేకరణలో జాప్యం * పర్యావరణ అనుమతుల ఆలస్యం * ముడిసరుకు సరఫరాలో సమస్యలు * నిధుల అలభ్యత * కార్మికుల కొరత * న్యాయపరమైన చిక్కులు * మావోయిస్టుల సమస్య

మేలో అమ్ముకుంటే నష్టమే..

ముంబై : స్టాక్‌ మార్కెట్లలో అందరూ సార్వత్రికంగా విశ్వసించే ఒక సిద్ధాంతం ఉంది. మేలో అమ్ముకుని బయటపడు అన్నదే అది. సాధారణంగా స్టాక్‌మార్కెట్లలో మే నెలలో ఆటుపోట్లు భారీగా ఉండడమే ఇందుకు కారణం. కాని ఈ సారి ఆ సిద్ధాంతం తిరగబడే అవకాశం ఉన్నదని నిపుణులంటున్నారు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం వల్ల సమీప భవిష్యత్తులో ఆటుపోట్లున్నా స్థూలంగా మే నెల సానుకూలంగానే ఉండవచ్చునన్నది వారి అంచనా. ఇందుకు జియోజిత బిఎన్‌పి పారిబా రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ ఒక వాదం తెర పైకి తెచ్చారు. గత ఆరేళ్ళలో మే నెల నుంచి అక్టోబరు నెల మధ్య కాలంలో స్టాక్‌మార్కెట్లు సగటున 7.33 శాతం రాబడులు అందించాయని, అంటే ఈ సమయం పాజిటివ్‌ రిటర్న్‌లకు భరోసా ఇస్తుంది గనుక మే నెలలో తప్పుకో అన్న సూత్రం పాటిస్తే నష్టపోవలసివస్తుందని ఆయన తేల్చి చెప్పారు. సాధారణంగా మార్కెట్లలో మే-అక్టోబరు నెలల మధ్య కాలంలో ఆటుపోట్లు అధికంగా ఉంటాయని, కాని భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉండడం, వర్షపాతం కూడా సానుకూలంగా ఉంటుందన్న అంచనాల నడుమ స్వల్ప ఆటుపోట్లున్నా ఈ సమయంలో రాబడులు పాజిటివ్‌గానే ఉండవచ్చునని ఆయన అంచనా వేస్తున్నారు. గత 11 సంవత్సరాల్లో మే నెలలో సెన్సెక్స్‌ కదలికలు గమనించినా ఆరు సంవత్సరాలు రాబడులు పాజిటివ్‌గా ఉన్నందువల్ల ఈ ఏడాది మాత్రం మే నెలలో అమ్ముకో సిద్ధాంతం వినాశకరం కావచ్చునని మనీపామ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నిర్దోష్‌ గౌర్‌ అన్నారు. ఒక వేళ మే నెలలో స్టాక్‌మార్కెట్లు పతనం అవుతాయన్న సిద్ధాంతాన్నే విశ్వసించినా ఈ ఏడాది మాత్రం నష్టాలు పరిమితంగానే ఉండవచ్చునని ట్రేడ్‌స్మార్ట్‌ ఆన్‌లైన్‌ డైరెక్టర్‌ విజయ్‌ సింఘానియా అంటున్నారు. ఈ నెలలో ఇప్పటివరకు ట్రేడింగ్‌లో ఆటుపోట్లున్నప్పటికీ సెన్సెక్స్‌ ప్రస్తుతం 0.62 శాతం లాభాలతో ట్రేడవుతున్నట్టు మార్కెట్‌ గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ నెల తొలి ట్రేడింగ్‌ రోజున (రెండో తేదీ) సెన్సెక్స్‌ 25,436.97 పాయింట్ల వద్ద ఉండగా గురువారం నాటికి 353 పాయింట్ల లాభంతో 25,790.22 పాయింట్ల వద్ద నిలిచింది.

హైదరాబాద్‌ విపణిలోకి హోండా బీఆర్‌-వి

హైదరాబాద్‌: మధ్యశ్రేణి స్పోర్ట్స్‌ వినియోగ వాహనాల(కాంపాక్ట్‌ ఎస్‌యూవీ)కు దేశీయంగా పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని హోండా కొత్త వాహనం బీఆర్‌-వి ని విపణిలోకి తీసుకొచ్చింది. బుధవారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ సంస్థ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జ్ఞానేశ్వర్‌ రాష్ట్ర మార్కెట్‌లోకి విడుదల చేశారు. దేశీయ విపణిలో తమ వాటా పెంచుకోవడానికి ఈ కొత్త వాహనం దోహదపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మరిన్ని కొత్త మోడళ్లను తెచ్చి వినియోగదారులను పెంచుకోవాలనే వూహ్యంతో ముందుకెళ్తున్నట్లు ఆయన తెలిపారు. ఏడుగురు కూర్చోవడానికి వీలుగా ఉండే ఈ కారు 3 రకాల్లో లభిస్తుంది. పెట్రోల్‌ కారు ధర రూ.8.91 నుంచి రూ.11.11లక్షలు, డీజిల్‌ కారు ధర రూ.9.99 నుంచి రూ.12.90లక్షలు, ఆటోమేటిక్‌ రకం ధర రూ.11.99లక్షలుగా నిర్ణయించినట్లు సంప్థ వెల్లడించింది.

పరుగులు తీసే పసిడి - దుబాయ్‌ వాహన ప్రదర్శనలో రూ.6.6 కోట్ల కారు

దుబాయ్‌: ఎత్తైన ఆకాశహర్మ్యాలు, ఖరీదైన జీవనశైలి వంటి వాటికి దుబాయ్‌ పెట్టింది పేరు. పర్యాటకులకు స్వర్గధామమైన ఈ నగరంలో జరుగుతున్న వాహన ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంటోంది. 2016 ఆటోమెకానికా దుబాయ్‌ (దుబాయ్‌ వాహన ప్రదర్శన)లో కొలువుతీరిన నిస్సాన్‌ ఆర్‌35 జీటీ-ఆర్‌ మోడల్‌ కారు.. వీక్షకులను కట్టి పడేస్తోంది. ఏంటీ దీని ప్రత్యేకత అని అనుకుంటున్నారా? సాధారణ కార్లకు భిన్నంగా దీన్ని పసిడి పూతతో రూపొందించడమే. కుల్‌ రేసింగ్‌ సంస్థ ప్రదర్శించిన ఈ కారుకు ‘గాడ్జిల్లా’గా నామకరణం చేశారు. దీని విలువ 1 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.6.6 కోట్లు) కావడం విశేషం. ఆర్టిస్‌, కుల్‌ రేసింగ్‌లతో పాటు కార్ల నిపుణుడు తకాహికో ఇజావాలు దీన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. 3.8 లీటర్‌ వీ6 ట్విన్‌ టర్బో 545 హెచ్‌పీ ఇంజిన్‌, అదనపు హార్స్‌పవర్‌, టార్క్‌లతో గాడ్జిల్లాను తయారు చేశారు. ఏరో డైనమిక్‌ ఫీచర్లు, బలమైన నిర్మాణాలు నిస్సాన్‌ ఆర్‌35 జీటీ-ఆర్‌ ప్రత్యేకతలు. 6-స్పీడ్‌ డ్యూయల్‌ క్లచ్‌ ట్రాన్స్‌మిషన్‌ సహాయంతో చోదకులు రేస్‌ కారు స్పీడ్‌ను అందుకోవచ్చు. సరి, బేసి సంఖ్యల గేర్లకు వేర్వేరు వెట్‌ క్లచ్‌లను ఏర్పాటు చేశారు.

మలేసియా కంపెనీ తెనగాకు - జీఎంఆర్‌ ఎనర్జీలో 30% వాటా- విలువ రూ.1,860 కోట్లు - రుణ భారాన్ని తగ్గించుకోవడానికే - నిర్వహణ, నిర్మాణంలో 4,600 మె.వా

హైదరాబాద్‌: జీఎంఆర్‌ ఎనర్జీకి చెందిన ఎంపిక చేసిన ఆస్తుల్లో మలేషియాకు చెందిన తెనగా సంస్థ 30 శాతం వాటా సొంతం చేసుకోనుంది. జీఎంఆర్‌ ఎనర్జీ ఆస్తుల్లో వాటాను 30 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.1,860 కోట్లు) తెనగాకు జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విక్రయించనుంది. తెనగా నేషనల్‌ బెర్‌హడ్‌ చేసిన ప్రాథమిక మూలధన పెట్టుబడి (కేపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌) ప్రతిపాదనకు జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా మేనేజిమెంట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ఇంధన వ్యాపారంలో వాటా విక్రయం ద్వారా లభించే నిధులను ఏకీకృత కార్పొరేట్‌ రుణ భారాన్ని తగ్గించుకోవడానికి జీఎంఆర్‌ వినియోగిస్తుంది. తద్వారా కంపెనీ ఆస్తులు, అప్పుల పట్టిక బలోపేతం అవుతుంది. జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాకు ఏకీకృత రుణ భారం రూ.43,000 కోట్లకు పైగా ఉంది. జీఎంఆర్‌ ఎనర్జీ: 2,300 మెగావాట్ల సామర్థ్యం కలిగిన వివిధ విద్యుత్‌ ప్లాంట్లను జీఎంఆర్‌ ఎనర్జీ నిర్వహిస్తోంది. వీటిలో ఎంకో (వరోరా) 600 మె.వా, కమలాంగ 1,050 మె.వా, వేమగిరి 388 మె.వా తదితరాలు ఉన్నాయి. నిర్మాణ దశలో మరో 2,330 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో అప్పర్‌ కర్నాలి జల విద్యుత్‌ ప్రాజెక్టు (900 మె.వా), అలకనందా జల విద్యుత్‌ ప్రాజెక్టు (300 మె.వా), కమలాంగ యూనిట్‌-4 (350 మె.వా)లు ఉన్నాయి. తెనగా స్థాయి ఇదీ: మలేసియాలో తెనగా అతిపెద్ద విద్యుత్‌ కంపెనీ. విద్యుదుత్పత్తి, విద్యుత్‌ సరఫరా, పంపిణీ తదితర విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 10,818 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన యూనిట్లు ఈ కంపెనీకి ఉన్నాయి. ఈ భాగస్వామం ద్వారా ప్రపంచ స్థాయి విద్యుత్తు కంపెనీని జీఎంఆర్‌ దేశీయ విపణిలోకి తీసుకొస్తున్నట్లవుతుంది. ‘భారత్‌ స్థిరమైన, ఆకర్షణీయమైన వృద్ధిపథంలో పయనిస్తోందని, ఈ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్‌ రంగంలోని దిగ్గజాల సహకారం అవసరం’ అని ఈ సందర్భంగా జీఎంఆర్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ జి.ఎం.రావు తెలిపారు. తెనగా వ్యూహాత్మక భాగస్వామిగా చేరడంపై తమకు సంతోషంగా ఉందని జీఎంఆర్‌ ఎనర్జీ ఛైర్మన్‌ జీబీఎస్‌ రాజు వెల్లడించారు. దాదాపు 10 రోజుల క్రితమే జీఎంఆర్‌ ఎనర్జీలో 30 శాతం వాటాను దాదాపు రూ.1,500 కోట్లకు విదేశీ వ్యూహాత్మక భాగస్వామికి జీఎంఆర్‌ విక్రయిస్తున్నట్లు మార్కెట్‌ పసిగట్టింది. మలేసియా కంపెనీకి జీఎంఆర్‌ ఎనర్జీ ఆస్తుల్లో వాటాను విక్రయిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో బీఎస్‌ఈలో జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా షేరు ధర 0.81 శాతం పెరిగి రూ.12.47 వద్ద ముగిసింది.

మాల్యా కేసులో.. మరింత లోతుగా సెబీ విచారణ!

దిల్లీ: విజయ్‌ మాల్యా కేసులో సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ) మరింత లోతుగా విచారించనుంది. యూబీ గ్రూప్‌లోని ఇతర కంపెనీలు, వాటి ప్రమోటర్ల ఆర్థిక లావాదేవీలను క్షుణ్నంగా తనిఖీ చేయనున్నట్లు ఉన్నతాధికారి వెల్లడించారు. అలాగే కార్పొరేట్‌ వ్యవహారాలశాఖ, దీని పరిశోధనా విభాగం ఎస్‌ఎఫ్‌ఐఓ(సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌)తోపాటు ఇతర ప్రభుత్వ సంస్థలు కూడా ఈ విషయంపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. యూబీ గ్రూప్‌ అనుబంధ సంస్థ మంగళూరు కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌(ఎంసీఎఫ్‌ఎల్‌) పెట్టుబడుల్లో అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో తేలడమే ఇందుకు నేపథ్యం. బెంగళూరు బేవరేజెస్‌లో ఎంసీఎఫ్‌ఎల్‌ రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఆ తరువాత ఎంసీఎఫ్‌ఎల్‌ను జువారీ ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ కొనుగోలు చేసింది. ఎంసీఎఫ్‌ఎల్‌ పెట్టుబడులపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించేందుకు ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ను ఆ సంస్థ బోర్డు నియమించింది. ఈ ఆర్థిక లావాదేవీల్లో అకతవకలు చోటు చేసుకోవడంతోపాటు, నిధులు దారి మళ్లినట్లు ఆడిటింగ్‌ సంస్థ గుర్తించింది. అలాగే యునైటెడ్‌ బ్రూవరీస్‌కు ఎంసీఎఫ్‌ఎల్‌ ఇచ్చిన రూ.16.68 కోట్ల అడ్వాన్సులపై కూడా సంస్థ ఆడిట్‌ నిర్వహించింది. ఈ నిధులు ఇంకా ఎంసీఎఫ్‌ఎల్‌కు వసూలు కావాల్సి ఉంది. ఒకప్పుడు యునైటెడ్‌ బ్రూవరీస్‌కు అనుబంధ సంస్థ అయిన బెంగళూరు బేవరేజెస్‌ ప్రస్తుతం ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమవుతోంది.

మార్కెట్లో మైక్రోమ్యాక్స్‌ కొత్తఫోన్‌

దిల్లీ: ప్రముఖ భారతీయ ఫోన్ల తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్‌ కాన్వాస్‌ ఎక్స్‌పీ 4జీ పేరుతో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.7,499. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో స్నాప్‌డీల్‌లో కమింగ్‌ సూన్‌ ట్యాగ్‌తో అమ్మకానికి సిద్ధమైంది. మే10 నుంచి దీని అమ్మకాలు ప్రారంభమవుతాయని సంస్థ తెలిపింది. ఫీచర్లు ఇలా... * 5 అంగుళాల తాకే తెర * 1280×720 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ * 1గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌ * 3జీబీ ర్యామ్‌ * ఆండ్రాయిడ్‌ 5.1 లాలీపాప్‌ ఆపరేటింగ్‌ సిస్టం * 8 మెగాపిక్సెల్‌ రేర్‌ కెమేరా * 2 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమేరా * 4జీ ఎల్‌టీఈ సపోర్ట్‌ * 2000 ఎంఏహెచ్‌ బ్యాటరీ * 10 ప్రాంతీయ భాషల సపోర్ట్‌ * 16జీబీ అంతర్గత మెమొరీ

వహ్వా.. విండోస్‌ 10! - 30 కోట్ల డివైజ్‌ల్లో ఆపరేటింగ్‌ సిస్టం

వాషింగ్టన్‌ : మైక్రోసాఫ్ట్‌ సంస్థ తాజా ఆపరేటింగ్‌ సిస్టం విండోస్‌10 ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల డివైజ్‌ల్లో డౌన్‌లోడ్‌ అయ్యింది. మైక్రోసాఫ్ట్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఆపరేటింగ్‌ సిస్టంని ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, ఎక్స్‌బాక్స్‌ వన్‌ కన్సోల్స్‌... తదితరాల్లో వాడుకోడానికి వీలుగా రూపొందించినట్లు చెప్పింది. దీనిపై మైక్రోసాఫ్ట్‌ విండోస్‌, డివైజెస్‌ విభాగం కార్పొరేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ యూసఫ్‌ మెహదీ మాట్లాడారు. ఇళ్లు, చిన్న వ్యాపారాలు, సంస్థలు, పాఠశాలలు.. తదితరాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా విండోస్‌ 10 ఉందని చెప్పారు. వారంతా దాన్ని చాలా త్వరగా వాడుకలోకి తెచ్చుకున్నారని తెలిపారు. ఇప్పటి వరకు తమ పాత ఆపరేటింగ్‌ సిస్టమ్‌లు వేటికీ ఇంత మంచి స్పందన రాలేదని చెప్పారు. అయితే దీని ఫ్రీ అప్‌డేట్‌ సౌకర్యం జులై 29తో ముగుస్తుందన్నారు. ఆ తర్వాత దీన్ని ఎవరైనా అప్‌డేట్‌ చేసుకోవాలంటే 110 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. కొత్తగా వచ్చే డివైజ్‌ల్లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలన్నా దీన్ని కొనుక్కోవలసి ఉంటుందన్నారు.

ఎన్‌టీపీసీ సూపర్‌ థర్మల్‌ ప్లాంటు - రెండో దశ రామగుండంలోనే ...

నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ) తెలంగాణాలో ప్రతిపాదించిన 4,000 మెగావాట్ల సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ రెండో దశను కూడా కరీంనగర్‌ రామగుండంలోనే ఏర్పాటు చేస్తున్నారు. రామగుండంలో ఎన్‌టీపీసీకి ఇప్పటికే 2,600 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రం ఉంది. ఇక్కడే 10 మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా తెలంగాణాలో 4,000 మెగావాట్ల సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను ఎన్‌టీపీసీ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ ప్లాంటును ఏర్పాటు చేయడానికి నల్గొండ జిల్లా దామరచర్ల తదితర ప్రాంతాలను ఎన్‌టీపీసీ పరిశీలించింది. చివరకు సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ మొదటి దశను (2శ్రీ800 మెగావాట్ల యూనిట్లను) రామగుండంలో ఇప్పుడున్న విద్యుదుత్పత్తి ప్లాంట్‌ వద్దే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రామగుండంలోని విద్యుత్‌ ప్లాంట్‌కు దాదాపు 6,000 ఎకరాల స్థలం ఉంది. కొత్త విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఇక్కడ తగినంత స్థలం ఉంది. అందువల్ల మొదటి దశతోపాటు రెండో దశను (3శ్రీ800 మెగావాట్లు యూనిట్లను) కూడా రామగుండంలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. 635 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న మొదటి దశ యూనిట్లకు పర్యావరణ అనుమతులు, పెట్టుబడుల అనుమతులు లభించాయి. దాదాపు రూ.9,000 కోట్ల పెట్టుబడితో సూపర్‌ థర్మల్‌ పపర్‌ ప్లాంట్‌ మొదటి దశ యూనిట్లను నిర్మిస్తున్నారు. భూమి చదును పనులు ప్రారంభం కాగా, విద్యుదుత్పత్తి పరికరాలను సరఫరా చేయడానికి అల్‌స్తోమ్‌, భెల్‌ కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చారు. 2019 అక్టోబరు నాటికి మొదటిదశ (1,600 మెగావాట్ల సామర్థ్యం) ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంది. రెండో దశకు సంబంధించి ఇంజినీరింగ్‌ ప్లాన్‌ పత్రాలను సిద్ధం చేస్తున్నారు. 2,400 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకొల్పడానికి ఎన్‌టీపీసీకి దాదాపు రూ.12,000 కోట్లు అవసరం అవుతాయి. పర్యావరణ, పెట్టుబడుల అనుమతులు, విద్యుత్‌ పరికరాలకు ఆర్డర్లు మొదలైనవి పూర్తయి రెండో దశ సిద్ధం కావడానికి దాదాపు నాలుగేళ్లు పట్టే అవకాశం ఉంది. ఏటా 80 లక్షల టన్నుల బొగ్గు అవసరం ఈ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు మొదటి దశకు ఒడిశాలోని మందాకినీ-బి బొగ్గు గనుల నుంచి బొగ్గును రైలు మార్గంలో సరఫరా చేస్తారు. ఏడాదికి 8 మిలియన్‌ టన్నుల బొగ్గు అవసరం అవుతుంది. ఎల్లంపల్లి రిజర్వాయర్‌ నుంచి నీరు అందుతుంది. ఏడాదికి 3.44 మిలియన్‌ టన్నుల బూడిద ఉత్పత్తి అవుతుంది. ఈ బూడిదను పూర్తిగా వినియోగించుకోవడానికి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రామగుండంలో 2,600 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రంతోపాటు విశాఖపట్నం సమీపంలో 2,000 మెగావాట్ల సింహాద్రి ప్లాంట్‌ ఎన్‌టీపీసీకి ఉంది. త్వరలో వాణిజ్య ఉత్పత్తి : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కుంట మండలంలో 1,000 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టును ఎన్‌టీపీసీ ఏర్పాటు చేస్తోంది. ఇది ప్రపంచంలోనే ఒకే చోటు ఉన్న అతిపెద్ద సౌర విద్యుత్‌ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి గత ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో ఎన్‌టీపీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీఎస్‌పీడీసీఎల్‌తో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం కూడా కుదిరింది. ఈ ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా దేశీయంగా అభివృద్ధి చేసిన సౌర మాడ్యూళ్లతో 250 మెగా వాట్ల (5శ్రీ50 ఎండబ్ల్యూపీ) సామర్థ్యాన్ని ఎన్‌టీపీసీ సిద్ధం చేసింది. ఒప్పందం కుదర్చుకున్న కొద్ది నెలల్లోనే ప్రయోగాత్మకంగా ఉత్పత్తిని ప్రారంభించింది. త్వరలోనే వాణిజ్య పరంగా సౌర విద్యుత్‌ ఉత్పత్తిని చేపడతారు. గ్లోబల్‌ బిడ్డింగ్‌ విధానం ద్వారా మిగిలిన 750 మె.వా పీవీ సామర్థ్యాన్ని రెండు దశలో ఏర్పాటు చేస్తారు.

రూ.4 కోట్ల లంబోర్గిని కారు

ముంబయి: ఇటలీ కార్ల తయారీ సంస్థ లంబోర్గిని సరి కొత్త వాహనాన్ని దేశీయ విపణిలోకి తీసుకొచ్చింది. హురాకన్‌ ఎల్‌పీ 610-4 స్పైడర్‌గా పిలిచే ఈ వాహనం ధర రూ.3.89 కోట్లు(ఎక్స్‌షోరూం, దిల్లీ)గా నిర్ణయించినట్లు సంస్థ వెల్లడించింది. 610 అశ్విక సామర్థ్యం కలిగిన ఈ కారు 3.4 సెకన్లలో గంటకు100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గంటకు గరిష్ఠంగా 324 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనుంది. 1.18 మీటర్ల ఎత్తు, 4.46 మీటర్ల పొడవు, 1.92 మీటర్ల వెడల్పు ఉన్న ఈ కారు బరువు 1,542 కిలోలని సంస్థ తెలిపింది. దిల్లీలో విక్రయ కేంద్రాన్ని కూడా సంస్థ ప్రారంభించింది. లంబోర్గిని దక్షిణ-తూర్పు ఆసియా అధిపతి సెబాస్టియన్‌ హెన్రీ మాట్లాడుతూ.. భారత్‌ తమకు ఎంతో ముఖ్యమైన విపణి అని, భవిష్యత్తులో విక్రయాలు ఆశాజనకంగా ఉంటాయన్నారు. గతంలో ఎంతో ఆదరణ పొందిన ‘గల్లార్డో స్పైడర్‌’ స్థానంలో కొత్త హురాకన్‌ను ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు.

మార్కెట్లోకి.. ఆక్వా లయన్స్‌ 3జీ

దిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తుల సంస్థ ఇంటెక్స్‌ ఆక్వా సిరీస్‌లో బడ్జెట్‌లో మరో స్మార్ట్‌ ఫోన్‌ విడుదల చేసింది. ఆక్వా లయన్స్‌ 3జీ పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.4,990గా కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్‌ ఐపీఎల్‌ ఫ్యాన్స్‌ కోసం ప్రత్యేకంగా విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది. గుజరాత్‌ లయన్స్‌ టీం పేరు మీదుగా ఈ ఫోన్‌కు ఆక్వా లయన్స్‌ అని పేరు పెట్టింది. గుజరాత్‌ లయన్స్‌కు ఇంటెక్స్‌ కంపెనీ యజమాని. ఫోన్‌ ఫీచర్లు.. * 5 అంగుళాల తెర * 1.2 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌ * 2 ఎంపీ ముందు కెమెరా * 5ఎంపీ వెనుక కెమెరా * 1జీబీ ర్యామ్‌ * ఆండ్రాయిడ్‌ 5.1 * 8జీబీ స్టోరేజీ * 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

పిల్లల కోసం ‘మి బన్నీ’

దిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ షియోమీ చిన్నారుల కోసం సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. మి బన్నీ పేరుతో చైనాలో విడుదల చేసిన ఈ స్మార్ట్‌వాచ్‌ ధరను 299 యువాన్లు (సుమారు రూ.3వేలు)గా ప్రకటించింది. దీనిని ఎంఐ.కామ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసుకోవచ్చు. ఈ కిడ్స్‌ స్మార్ట్‌వాచ్‌ ద్వారా తల్లిదండ్రులు పిల్లలను ట్రాక్‌ చేయవచ్చు. ఇందులో జీపీఎస్‌ కనెక్టివిటీ, వైఫై సదుపాయం ఉంటాయి. సిమ్‌ కూడా ఉంటుంది. వాయిస్‌ కాల్స్‌ చేయవచ్చు. ఈ డివైజ్‌లో ఆరుగురు కుటుంబసభ్యుల నెంబర్లు సేవ్‌ చేసుకొని వారితో మాట్లాడవచ్చు. స్మార్ట్‌వాచ్‌కు అనుసంధానమైన యాప్‌ ద్వారా తల్లిదండ్రులు తమ ఫోన్‌ నుంచి స్మార్ట్‌వాచ్‌కు కాల్‌ చేయవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్‌వాచ్‌ ద్వారా యాప్‌లో సురక్షితమైన ప్రాంతాన్ని మార్క్‌ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఇల్లు, ఇంటి పరిసరాలు, పాఠశాల, పాఠశాలకు వెళ్లి వచ్చే దారి. ఈ ప్రాంతాలు కాకుండా పిల్లలు వేరే ప్రాంతంలోకి వెళ్తే వెంటనే తల్లిదండ్రులకు నోటిఫికేషన్‌ మెసేజ్‌ వస్తుంది. ఈ సదుపాయం ద్వారా పిల్లల చేతికి ఈ స్మార్ట్‌వాచ్‌ పెడితే వారు ఎక్కడున్నా సులువుగా గుర్తించవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌ ఆండ్రాయిడ్‌ 4.2 లేదా ఐఓఎస్‌ 8 దాని తర్వాత వచ్చిన ఓఎస్‌లలో పనిచేస్తుంది. 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ వాచ్‌ ఆరు రోజుల పాటు ఛార్జింగ్‌ ఉంటుంది. నీలం, గులాబీ రంగుల్లో ఈ స్మార్ట్‌వాచ్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు.

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 150 పాయింట్లకుపైగా నష్టపోగా, నిఫ్టీ 50 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

4 మిలియన్ల నిస్సాన్‌ వాహనాలు రీకాల్‌

న్యూయార్క్‌: ప్రముఖ కార్ల తయారీదారుల సంస్థ నిస్సాన్‌ దాదాపు 4 మిలియన్ల వాహనాలను రీకాల్‌ చేసింది. నిస్సాన్‌ కార్ల సీట్‌ బెల్ట్‌లో లోపం కారణంగా ప్రమాదాలు సంభవించినపుడు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్క అమెరికాలోనే 3.2 మిలియన్‌ వాహనాలను నిస్సాన్‌ కంపెనీ వెనక్కి తీసుకోవటం గమనార్హం. 2016-17 సంవత్సరానికి చెందిన నిస్సాన్‌ మాక్సిమా, 2013-16 మధ్యలో విడుదల చేసిన నిస్సాన్‌ అల్టిమా, ఎన్‌వీ200, సెంట్రా, 2013-17 నిస్సాన్‌ పాథ్‌ఫిండర్‌, 2014-16 నిస్సాన్‌ నెన్‌వీ200 టాక్సీ మోడల్‌ కార్లతో పాటు పలు వాహనాలను రీకాల్‌ చేసింది. ఎయిర్‌బ్యాగ్‌లో సమస్యలు కారణంగా వాహనదారులు కంపెనీకి ఫిర్యాదు చేశారు. దీంతో వాహన సమస్యలను పరిష్కరించేందుకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా సర్వీస్‌ చేయనుంది. వీటితో పాటు 2013-16లో ఉత్పత్తి చేసిన నిస్సాన్‌ సెంట్రాస్‌ కార్లను సైతం వెనక్కి పిలుస్తోంది.

ఈ కామర్స్‌ స్టోర్లకు పెద్ద చిక్కే! - డిస్కౌంట్లను నిలుపుదల చేస్తున్న స్టోర్లు

దిల్లీ: ఫ్లిప్‌కార్ట్‌.. స్నాప్‌డీల్‌.. అమెజాన్‌.. భారత్‌లో ఈ కామర్స్‌ దిగ్గజాలు. ఇలాంటి ఆన్‌లైన్‌ స్టోర్లు ఇప్పటి వరకు భారీగా డిస్కౌంట్‌లు గుప్పిస్తూ.. పోటాపోటీగా ఆఫర్లు ప్రకటిస్తూ... వినియోగదారుల్ని ఆకర్షించేశాయి. మూడు పువ్వులు, ఆరు కాయలుగా వ్యాపారాల్ని అభివృద్ధి చేసేసుకున్నాయి. అయితే ఇకపై ఇలాంటి పప్పులు ఉడికేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ కామర్స్‌ వ్యాపారాలకు కొత్తగా నిబంధనలు వచ్చాయి. వాటి ప్రకారం.. ఒక స్టోర్‌లో ఒక ఉత్పత్తిపై ఎంత ధర ఉందో మరో ఆన్‌లైన్‌ స్టోర్‌లోనూ దాదాపుగా అంతే ధర ఉండాలి. ధరల మధ్య ఎక్కువ వ్యత్యాసం ఉండొద్దని, ఆఫర్లతో అసలు ధరలపై ప్రభావం చూపొద్దని ఈ కామర్స్‌ రెగ్యులేటర్‌ నిబంధనలు పెట్టింది. దీంతో ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ ఇండియా, స్నాప్‌డీల్‌ లాంటి పెద్ద ఈకామర్స్‌ వెబ్‌సైట్లన్నీ డిస్కౌంట్‌ సేల్స్‌ని దాదాపుగా నిలుపుదల చేస్తున్నాయి. ఎలాంటి జరిమానాలూ పడకుండా ముందస్తు జాగ్రత్త వహిస్తున్నాయి. ప్రణాళికల ప్రకారం ఇచ్చే సేల్స్‌నీ నిలుపుదల చేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ ‘యాప్‌ ఓన్లీ సేల్‌’ని మే మొదటి వారం నుంచి నిలిపి వేస్తోందని సమాచారం. అలాగే అమెజాన్‌, స్నాప్‌డీల్‌లూ వారి ‘వన్‌ డే సేల్‌’ ఈవెంట్లను అర్థంతరంగా రద్దు చేసుకున్నాయి. దీంతో కొనుగోళ్లు తగ్గుతాయేమోనని అటు ఆన్‌లైన్‌ స్టోర్లు, భారీ ఆఫర్లు ఇక ఉండబోవేమోనని ఇటు వినియోగదారులు డీలా పడుతున్నారు.

ఐఫోన్‌ అమ్మకాలు పడిపోయాయ్‌..!

శాన్‌ఫ్రాన్సిస్‌కో: అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ యాపిల్‌ గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటోంది. యాపిల్‌ ప్రముఖ ఉత్పత్తి అయిన ఐఫోన్‌ అమ్మకాలు ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. 2007లో ఐఫోన్‌ విడుదల చేసినప్పటి నుంచి సేల్స్‌ ఇంతగా పడిపోవడం ఇదే తొలిసారి అని కంపెనీ వెల్లడించింది. అలాగే 13ఏళ్లలో యాపిల్‌ సంస్థ రెవెన్యూ తగ్గడం కూడా ఇదే ప్రథమం అని తెలిపింది. స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి ఎన్నో రకాల ఫోన్లు, కొత్త మోడల్స్‌ వస్తుండడంతో ఐఫోన్‌ మార్కెట్‌ పెంచుకోవడానికి యాపిల్‌ ఇబ్బంది పడుతోంది. అమెరికా తర్వాత ఐఫోన్‌కు అతి పెద్ద మార్కెట్‌ అయిన చైనాలో ముఖ్యంగా ఐఫోన్‌ సేల్స్‌ పడిపోతున్నాయి. చైనాలో ఇప్పటికే 25 శాతం అమ్మకాలు పడిపోగా, భవిష్యత్తులో మరో 25 శాతం కూడా పడిపోయే అవకాశం ఉందని మార్గెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీంతో యాపిల్‌కు గట్టి దెబ్బ తగిలినట్లైంది. ఇటీవల ముగిసిన త్రైమాసికంలో 51.19 మిలియన్ల ఐఫోన్లు అమ్ముడుపోగా, గత ఏడాది ఇదే త్రైమాసికంలో 61.17 మిలియన్ల ఫోన్లు అమ్ముడైనట్లు సంస్థ తెలిపింది. సంస్థ రెవెన్యూ కూడా తగ్గినట్లు చెప్పింది. మార్చి 26కు ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరంలో 10.5 బిలియన్‌ డాలర్ల ఆదాయం రాగా, గత ఆర్థిక సంవత్సరంలో 13.6బిలియన్ల డాలర్ల రెవెన్య